AP Special
-
టీడీపీ ‘ఓటర్ల’ అక్రమాలపై రుజువులతో సహా ఫిర్యాదు
కొండపి (సింగరాయకొండ): తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లను ఎలా నమోదు చేసింది, 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఓటర్ల జాబితాను ఏ విధంగా తారుమారు చేశారనే వాటిపై ఆధారాలతో సహా భారత ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లా కొండపి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. టీడీపీ ఓటర్ల జాబితాలో చేసిన అవకతవకలపై వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించిందని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని చెప్పారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎటువంటి ఆవేదన, సమస్యలు లేవన్నారు. జిల్లాకు బాలినేని అత్యంత విలువైన నాయకుడని, పార్టీలో ఆయన ప్రాధాన్యత ఏ రోజూ తగ్గదని చెప్పారు. సీఎంకు అత్యంత సన్నిహితుడైన బాలినేని వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీచేస్తారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు గెలుపే లక్ష్యంగా 3 జాబితాలను విడుదల చేశామని, త్వరలో నాలుగో జాబితా ఉంటుందని తెలిపారు. మాగుంట ఎన్నికల్లో పోటీ చేయాలంటే చంద్రబాబును తిట్టాలని, రూ.150 కోట్లు ఇవ్వాలని షరతులు పెట్టారని ప్రచారం జరుగుతుందని, ఇది వాస్తవం కాదా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఇది కేవలం మీడియా, టీడీపీ, చంద్రబాబు సృష్టిస్తున్న కథనం మాత్రమేనని చెప్పారు. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో సహజమన్నారు. ‘మా అధినాయకుడిని విమర్శిస్తే తిప్పికొట్టడం ఆయన అనుచరులుగా మా బాధ్యత. ఈ బాధ్యతను పార్టీలోని ప్రతి ఒక్కరు తప్పకుండా నిర్వర్తించాలి్సందే..’ అని ఆయన స్పష్టం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల సమస్యలపై సర్కారు సానుభూతి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అంగన్వాడీల సమస్యలపై సానుభూతితో వ్యవహరిస్తోందనీ, ఆయన ఆదేశాలతో ఇప్పటి వరకు మూడు సార్లు చర్చలు జరిపామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వారికి వీలైనంతవరకూ మేలు చేసేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి చర్చలు జరిపారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల కోర్కెలు అన్యాయమని అనడంలేదని, ప్రభుత్వ ఇబ్బందులను కూడా వారు గుర్తించాలని కోరామని చెప్పారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్నా వారిపై ఎటువంటి ఇబ్బందికర చర్యలు చేపట్టలేదన్న విషయాన్ని గమనించాలని తెలిపారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది పిల్లలకు ఆహారం, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీకి నెల రోజులుగా ఇబ్బంది ఏర్పడిందనీ, వారికి సేవలు అందకపోవడంవల్ల పేద వర్గాలే ఇబ్బంది పడుతున్నాయనీ, పరిస్థితిని అర్థం చేసుకుని సమ్మెను విరమించాలని కోరుతున్నామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... అడిగినవన్నీ ఆమోదించాం.. ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్ కింద అంగన్వాడీ వర్కర్లకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణ యం తీసుకున్నాం. దానిపై వారు మరోసారి ప్రతిపా దించడంతో వర్కర్లకు రూ.1.20లక్షలకు, హెల్పర్లకు రూ.50 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. సర్వీసులో ఉండగా చనిపోతే గతంలో రూ.3వేలే ఇచ్చే వారు. దాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రూ.25 వేలు ఇవ్వాలని కోరగా రూ.20 వేలు ఇస్తామన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు, పదోన్నతుల వయో పరిమితి 40 నుంచి 50 ఏళ్లకు అంగీకరించాం. టీఏ, డీఏలు, హౌస్ రెంట్ అలవెన్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా ఇచ్చేలా ఆమోదించాం. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చేందుకు అంగీకారం తెలిపాం. మిగిలిన డిమాండ్లు కూడా సమ్మె విరమిస్తే ప్రాధాన్యత క్రమంలో తీరుస్తాం. వేతనం పెంపుపై పట్టు తగదు.. చంద్రబాబు హయాంలో అంగన్వాడీలకు ఇచ్చిన వేతనం ఎంత? వైఎస్ జగన్ ఇస్తున్న వేతనం ఎంత? అనేది అంగన్వాడీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2014లో అంగన్వాడీ వర్కర్లకు రూ.4,200, హెల్పర్లకు రూ.2,200, అదే 2016లో రూ.7 వేలు, రూ.4,500 ఇచ్చారు. అధికారంలోకి రాగానే అంగన్వాడీల వేతనం పెంచుతామని పాదయాత్రలో జగన్ హామీ ఇవ్వడంతో ఎన్నికల ఆర్నెల్ల ముందు చంద్రబాబు వేతనాలు పెంచినా... సక్రమంగా అందించలేదు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ అధికారం చేపట్టిన వెంటనే జూలైలో వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలకు వేతనాలు పెంచారు. చంద్రబాబు హయాంలో వర్కర్లకు సగటున నెలకు రూ.6,100 మాత్రమే వస్తే... జగన్ పాలనలో నాలుగున్నరేళ్లుగా రూ.11,500 ఇస్తున్నారు. వేతనాల పెంపునకు గడువు కోరాం ప్రభుత్వానికి ఆర్థిక పరమైన అంశాలను అంచనా వేసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరం వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చాం. 2019 జూలైలో వేతనాలు పెంచాం. కనీసం ఐదేళ్లు గడువు ఇవ్వాలని చెప్పాం. వచ్చే జూలైలో ఆమోదయోగ్యమైన విధంగా వేతనాలు పెంచుతామనీ, సమ్మె విరమించాలని కోరాం. యూనియన్లు ఇప్పటికైనా ఆలోచించాలి. రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నా అంగన్వాడీల సమ్మె విషయంలో సంయమనం పాటించాం. ఎస్మా విషయంలో రాజకీయ పార్టీలు, అంగన్వాడీలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ అజెండాతో రెచ్చగొడుతున్న ప్రతిపక్షాల డైరెక్షన్లో అంగన్వాడీలు వెళితే నష్టపోక తప్పదు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందుకోసం గురువారం నుంచి నోటీసులు ఇస్తోంది. పది రోజుల గడువు ఇచ్చి కొత్త వారిని నియమించుకుంటాం. తెగే వరకు సమస్యను సాగదీయకుండా అంగన్వాడీలు అర్థం చేసుకుని సమ్మె విరమించాలి. -
విశాఖ–గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా
లక్ష్మీపురం/సాక్షి–అమరావతి: మూడు రైలు సర్వీసుల పొడిగింపు ఏపీ ప్రజలకు మేలు చేస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు రైల్వేస్టేషన్లో శుక్రవారం మూడు రైలు సర్వీసులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం–గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు గుంటూరు డివిజన్ వాసులకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇకపై ఈ రైలు గుంటూరు నుంచి ప్రయాణిస్తుందని తెలిపారు. అలాగే నర్సాపూర్–హుబ్లీ–నర్సాపూర్ అమరావతి ఎక్స్‌ప్రెస్, నంద్యాల–రేణిగుంట నంద్యాల ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను కూడా ఆన్లైన్ ద్వారా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. నర్సాపూర్–హుబ్లీ ఎక్స్‌ప్రెస్ కోస్తాంధ్రా నుంచి కర్ణాటక ప్రాంతానికి అదనపు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. నంద్యాల–రేణిగుంట ప్రత్యేక రైలు ద్వారా తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లేందుకు యాత్రికులకు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం రామకృష్ణ, నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు, డివిజన్ ఏడీఆర్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు. పదేళ్లలో నంబర్‌వన్‌గా భారత్ రైల్వే రైల్వే నెట్‌వర్క్‌లో ప్రపంచంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఆయన మాట్లాడారు. ఏపీకి రైల్వే బడ్జెట్ కేటాయింపులను రూ.886 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పెంచామని పేర్కొన్నారు. 41 వందేభారత్ రైళ్లలో ఐదు రైళ్లు ఏపీకి కేటాయించామని చెప్పారు. ఏపీలో 371 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు నిర్మించినట్టు తెలిపారు. రూ.38,600కోట్లతో దేశంలో రైల్వేలైన్ల విద్యుద్దీకరణను పెంచామన్నారు. 2018– 23 మధ్య కాలంలో రైల్వేశాఖ దేశంలో మూడు లక్షలమందికి ఉపాధి అవకాశాలు వివరించారు. -
వర్షాలకు ఇక విరామం..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి మరికొద్ది రోజుల్లోనే ఈశాన్య రుతుపవనాలు ఉపసంహరించుకోనున్నాయి. ఈనెల 15కల్లా వీటి సీజను పూర్తిగా ముగియనుంది. దీంతో వర్షాలకు విరామం దొరకనుంది. ఫలితంగా కొద్దిరోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగనుంది. నిజానికి.. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల సీజనుగా పరిగణిస్తారు. ఏటా అక్టోబరు 18–22 తేదీల మధ్య ఈశాన్య రుతుపవనాలు తమిళనాడులోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత రెండుమూడ్రోజుల్లో రాష్ట్రంలోకి విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు నిర్ణీత సమయాని కంటే వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. కానీ, అరకొర వర్షాలను మాత్రమే కురిపించాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడునెలల్లో రాష్ట్రంలో 287.2 మి.మీల వర్షపాతం నమోదు కావలసి ఉండగా 219 మి.మీల వర్షపాతం మాత్రమే రికార్డయింది. అంటే.. సాధారణం కంటే 24 శాతం తక్కువ వర్షం కురిసిందన్న మాట. కోస్తాంధ్ర కంటే రాయలసీమలో మరింత తక్కువ వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 18 శాతం (322.9 మి.మీలకు గాను 265.8 మి.మీలు), రాయలసీమలో 30 శాతం (236.4కి 164.7 మి.మీలు) చొప్పున లోటు వర్షపాతం రికార్డయింది. ఈ సీజనులో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఏలూరు జిల్లాలో 42 శాతం అధిక వర్షపాతం కురవగా, అత్యల్పంగా నంద్యాల జిల్లాలో 89 శాతం లోటు వర్షపాతం కురిసింది. ఇక కోస్తాంధ్రలోని 18 జిల్లాలకు గాను అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బీఆర్ ఆంబేడ్కర్ కోనసీమ, బాపట్ల, ఏలూరు, కృష్ణా, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాయలసీమలో ఒక్క తిరుపతి మినహా మిగిలి ఏడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే రికార్డయింది. రాక.. పోక ఆలస్యమే.. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ఆగమనం, తిరోగమనం (నిష్క్రమణ) కూడా ఆలస్యంగానే జరగడం విశేషం. ఈశాన్య రుతుపవనాల సీజను డిసెంబర్ ఆఖరుతో ముగియాల్సి ఉన్నా జనవరిలోనూ రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో.. నిర్ణీత సమయానికి దాదాపు పక్షం రోజులు ఆలస్యంగా ఈ రుతుపవనాలు ఉపసంహరించుకుంటున్నాయి. దీంతో.. ఈనెల 15 తేదీ నాటికి ఈశాన్య రుతుపవనాలు ఉపసంహరణతో అవి బలహీనపడతాయని, ఫలితంగా రాష్ట్రంలో ఇప్పట్లో వర్షాలు కురవవని భారత వాతావరణశాఖ శుక్రవారం వెల్లడించింది. కొనసాగనున్న మంచు, చలి.. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు పొగమంచు, చలి కొనసాగనుంది. సాధారణం కంటే కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు 2–4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే, చలి తీవ్రత అంతగా ఉండదని.. పొగ మంచు ప్రభావం మాత్రం ఉంటుందన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. సర్విసు నిబంధనల్లోని క్రమశిక్షణ చర్యలు, వాటిపై అప్పీళ్లు, సమీక్షలకు సంబంధించి ఉద్యోగుల డిమాండ్‌పై సానుకూలంగా స్పందించింది. ఆమేరకు ఏపీఎస్ఆర్టీసీ సర్విసు నిబంధనలు–2023లోని సెక్షన్–5ను సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూలై 25 కంటే ముందు చేపట్టిన చర్యలకు ఈ సవరణ వర్తిస్తుందని పేర్కొంది. ఉద్యోగులపై చర్యలకు సంబంధించి చార్జ్ïÙట్లను డిస్పోజ్ చేసేటప్పుడు ఉమ్మడి జిల్లా డిప్యూటీ సీటీఎంలను కమిటీ సభ్యులుగా చేర్చడం, అప్పీళ్లను డిస్పోజ్ చేసేటప్పుడు రివ్యూ అథారిటీలో ఉమ్మడి జిల్లా రీజనల్ మేనేజర్‌ను సభ్యుడిగా చేర్చడం, ఆ పైస్థాయిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు మెర్సీ పిటిషన్‌ను పరిశీలించేందుకు అనుమతించింది. రెండేళ్లుగా అప్పీళ్లు, రివ్యూ అథారిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులతో ఊరట లభించింది. వారి కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమమైంది. 2023 జులై 25 తరువాత వచ్చిన కేసులకు మాత్రం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వేచి ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల హర్షం సర్విసు నిబంధనలను సవరించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పలు సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వహణ అధ్యక్షుడు జీఏం నాయుడు, ప్రధాన కార్యదర్శి డీఎస్పీ రావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలియజేశారు. -
‘స్కిల్డ్’ క్రిమినల్ చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం చంద్రబాబు అంతులేని అక్రమాలకు ఓ మచ్చు తునక మాత్రమే. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట చంద్రబాబు సాగించిన బాగోతం చూసి యావత్ దేశం అవాక్కయ్యింది. జర్మనీకి చెందిన సీమెన్స్‌కి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో కాగితాలపై ప్రాజెక్టు సృష్టించారు. రూ.370 కోట్ల వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేశారు. సీమెన్స్ పేరుతో జీవో జారీ చేసి తన బినామీ కంపెనీ డిజైన్‌టెక్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా రూ.271 కోట్లు విడుదల చేసి షెల్ కంపెనీల ద్వారా అక్రమార్జనను తన నివాసానికే చేరవేశారు. ఈ అవినీతి నెట్వర్క్ గుట్టును సీఐడీ ఛేదించడంతో చంద్రబాబు అక్రమాలు బట్టబయలయ్యాయి. స్కిల్ స్కామ్ సృష్టికర్త చంద్రబాబేనని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో ఆధారాలతో సహా వెల్లడైంది. దీంతో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్‌షిట్ నమోదు చేసింది. టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. గతేడాది సెపె్టంబరు 9న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది. చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఖైదీ నంబర్ 7691గా చంద్రబాబు 52 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తరువాత అనారోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు సాగించిన స్కిల్ స్కామ్ ఇలా సాగింది.. విద్యా శాఖ స్థానంలో ఏపీఎస్ఎస్డీసీ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టటాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్‌టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కని్వల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమేరకు జీవో జారీ చేశారు. కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. అంతా బాబు ముఠానే.. ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కె.లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా 4 పోస్టులు కట్టబెట్టారు. నేరుగా నిధులు మంజూరు జరిగేలా కుతంత్రం పన్నారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్‌భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు.. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు సీమెన్స్‌కి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90% కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు! గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు! గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. టెండర్లు లేకుండా తన బినామీ కంపెనీకి ప్రాజెక్ట్ కట్టబెట్టేందుకే ఈ ఎత్తుగడ వేశారు. నో రూల్స్... సీమెన్స్– డిజైన్ టెక్ ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్ఎస్డీసీ తరపున నిధులు ఎలా మంజూరు చేస్తామని పీవీ రమేశ్ నోట్ ఫైల్లో పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా నిధులు విడుదల నిబంధనలకు విరుద్ధమని వారించినా చంద్రబాబు లెక్క చేయలేదు. గంటా సుబ్బారావు చెప్పినట్లు నిధులు విడుదల చేయాలని ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, తరువాత ఆ ఫైల్‌ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు. అదే విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతకు పీవీ రమేశ్ తెలియచేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లను మంజూరు చేశారు. 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి సంబంధించి ఆర్థిక, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్–ట్రైనింగ్, సాధారణ పరిపాలన శాఖకు చెందిన మొత్తం 13 నోట్ ఫైళ్లలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేశారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఐదు చోట్ల సంతకాలు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమరి్పంచి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబు బంగ్లాకు రూ.241 కోట్లు చేరవేశారు. కేసులో కీలక నిందితులు ఏ–1 చంద్రబాబు, నాటి ముఖ్యమంత్రి ఏ–2 కింజరాపు అచ్చెన్నాయుడు, నాటి కార్మిక శాఖ మంత్రి ఏ–3 గంటా సుబ్బారావు, నాటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో ఏ–4 కె.లక్ష్మీ నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్, నాటి ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు ఏ–5 నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఓఎస్డీ ఏ–6 అపర్ణ ఉపాధ్యాయుల, ఐఏఎస్, నాటి ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవో ఏ–7 ప్రతాప్ కుమార్, నాటి ఫైనాన్షియల్ ఆఫీసర్, ఏపీఎస్ఎస్డీసీ ఏ–8 సుమన్ బోస్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ ఏ–9 జీవీఎస్ భాస్కర్ ప్రసాద్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ ఏ–10 వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, డిజైన్‌టెక్ ఎండీ ప్రాజెక్ట్ గురించి తెలియదన్న సీమెన్స్ సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్ బోస్‌ను పదవి నుంచి తొలగించింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్ స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. మదింపు బూటకం.. నివేదిక నాటకం ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు సరైందేనంటూ ‘సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) థర్డ్ పార్టీగా మదింపు జరిపి నివేదిక సమర్పించిందంటూ చంద్రబాబు అడ్డగోలుగా వాదించి అడ్డంగా దొరికిపోయారు. తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని, కేవలం ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని ‘సీఐటీడీ’ స్పష్టం చేసింది. వాస్తవానికి అంతకంటే ముందే డిజైన్ టెక్కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది. కొరడా ఝుళిపించిన ఈడీ ఈ స్కామ్‌పై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి అవి ఏఏ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు వెళ్లాయి? తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని గుర్తించింది. రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు ఇప్పటికే నిర్ధారించింది. నాడే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం టీడీపీ హయాంలోనే 2017లోనే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా నాడు ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. బాబు అవినీతి నెట్వర్క్ ఇదిగో.. టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్‌వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు నివాసానికి చేర్చారు. ♦ ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఇలా చంద్రబాబు బంగ్లాకు చేరిపోయాయి. ♦ అమెరికాకు శ్రీనివాస్... దుబాయ్‌కి మనోజ్ అక్రమ నిధులను తరలించిన పాత్రధారులు చంద్రబాబు ఆదేశాలతో విదేశాలకు పరారయ్యారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, మనోజ్ పార్థసాని దుబాయ్‌కు ఉడాయించారు. -
అద్దె బ్యాచ్ దిగింది !
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/తిరుపతి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తోంది. ఎన్నడూ లేని విధంగా నలుగురైదుగురు ఉన్న చోటకెళ్లి టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఆ పార్టీ గెలుస్తోందని అసత్య ప్రచారాలు కల్పిస్తూ ‘చీప్ పాలిట్రిక్స్‌కు’ దిగజారిపోయింది. రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు రచించడం సహజం. ప్రజలకు చేసిన మంచి పనులను ఎన్నికల సమయంలో చెప్పుకోవడం, మరోసారి అధికారంలోకి వస్తే మరింత మంచి చేస్తామని ప్రకటించడం పరిపాటి. అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏవగింపుగా మారింది. ప్రజాభిమానం కోల్పోయి రోజురోజుకూ పాతాళంలోకి దిగజారిపోయిన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మౌత్ పబ్లిíసిటీ పేరుతో అడ్డదారులు తొక్కుతోంది. ప్రతి నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఎల్లో కిరాయి మూకలను అద్దెకు ఏర్పాటు చేసుకుని టీ దుకాణాలు, సెలూన్ల వద్ద తిష్టవేసి అధికార పక్షంపై అసత్య ప్రచారం చేయించుకునే దుస్థితికి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డిని దూషించడమే పనిగా పెట్టుకుని అద్దెబ్యాచ్ పట్టణాల్లో తిరుగుతోంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం సహకారంతో విద్యార్థులను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి కళాశాల నుంచి కొంత మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించినట్లు తెలిసింది. అద్దె బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చి.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వైఎస్సార్సీపీ అభ్యర్థులను టార్గెట్ చేయటంతో పాటు ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్‌పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలని ఆదేశాలిచ్చారు. శిక్షణా తరగతులను మొదటి, రెండు, మూడు బ్యాచ్‌లుగా విభజించి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటి విడతగా నియోజక వర్గానికి ఇద్దరు విద్యార్థుల చొప్పున రంగంలోకి దింపారు. వీరిపైన జిల్లాకు ఒక కో ఆర్డినేటర్‌ని నియమించారు. ఈ ఇద్దరు రోజూ ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు? అక్కడ పరిస్థితులు ఏంటి అనేది జిల్లా కో ఆర్డినేటర్‌కి నివేదిక రూపంలో అందిస్తారు. దానిని అమరావతిలో ఉండే టీం లీడర్‌కి పంపుతారు. దాదాపు 5 వేల మందికి శిక్షణ ఇచ్చి నగర, పట్టణ ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. లోకల్‌గా కొంతమందిని రిక్రూట్ చేసుకుని వారితో సమన్వయం చేసుకుంటూ అద్దె బ్యా చ్ మౌత్ పబ్లిíసిటీ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల నెల్లూరు రూరల్ ప్రాంతంలో అద్దె బ్యాచ్ టీ దుకాణాల వద్ద చేస్తున్న అసత్య ప్రచారాన్ని కొందరు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆ బ్యాచ్ ఆ ప్రాంతాన్ని వదిలి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు, మూడు విడతల్లో మండల, సచివాలయాలు.. మొదటి విడత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు పూర్తయ్యాక మరొక బ్యాచ్ రంగంలోకి దిగుతుంది. సంక్రాంతి తరువాత మండల, సచివాలయ కేంద్రాలను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిసింది. పట్టణాలు, నగరాలు అయితే అద్దె బ్యాచ్ ఎవరనేది ఎవ్వరూ ప్రశ్నించరు. కాబట్టి వారికి ఆ బాధ లేదు. మండల, సచివాలయ కేంద్రాలకు వెళ్లే సమయంలో స్థానిక నాయకుల సహకారంతో రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే స్థానిక నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక నాయకులతో కలిసి పర్యటిస్తారు. ఒక అద్దె వ్యక్తి స్థానికుడు ఒకరు ఉంటారు. అలా ఇద్దరికి ఇద్దరు పర్యటిస్తారు. టీ కొట్లు, చిన్న బంకుల వద్ద కూర్చొని అబద్దపు ప్రచారాలకు పదును పెడుతారు. స్థానిక టీడీపీ కార్యకర్త ప్రభుత్వం గురించో, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గురించో ప్రస్తావన చేస్తారు. అద్దె వ్యక్తి ‘అవునంటన్నా. మా బంధువుకి అలా జరిగిందంట, వైఎస్సార్సీపీ వాళ్లు ఇలా చేశారంట’ అని శృతి కలుపుతాడు. నలుగురు కలిసి ఒక అబద్దాన్ని నిజం చేసేందుకు తీవ్రంగానే కృషి చేయటానికి పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం. మూడో బ్యాచ్‌లో బరి తెగింపుడే ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మూడవ బ్యాచ్ రంగంలోకి దిగే పనిలో ఉంది. ఈ బ్యాచ్ అన్నింటికీ తెగించిన వారికి ప్రస్తుతం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్ వచ్చాక అబద్దాలు ప్రచారం చేయటం కంటే.. స్థానికంగా గొడవలు సృష్టించేందుకే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. మద్యం దుకాణాల వద్ద, లేదా మద్యం సేవించే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్థానికుల మధ్య గొడవలు పెట్టటం లేదా వీరే స్థానికులను రెచ్చగొట్టి విధ్వంసాలకు లాగటమే వీరి స్కెచ్‌గా తెలుస్తోంది. మద్యంపై విషప్రచారం చేయటం, స్థానికులను కొట్టడం, లేదా వారి వద్ద వీరు దెబ్బలు తినటమే ప్రధాన లక్ష్యంగా రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఘోర పరాభవాన్ని గుర్తెరిగే.. గత ఎన్నికల్లో మాదిరిగా ఘోర పరాభవాన్ని గుర్తెరిగే టీడీపీ ఇలాంటి నీతిమాలిన చర్యలకు పూనుకొంటోంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధితో ఆ ప్రభుత్వానికి ప్రజల్లో పరపతి పెరిగింది. మరోసారి కూడా వైఎస్సార్సీపీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఎన్నికల బరిలోకి దిగే ప్రయతాన్ని టీడీపీ చేస్తోంది.అయినా ప్రజల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మౌత్ పబ్లిíసిటీని నమ్ముకొని దానినే కార్యరూపంలోకి తీసుకొచ్చారు. టీ స్టాళ్లు, సెలూన్లే వేదికలు టీడీపీ కిరాయి మూకలు నగరాలు, పట్టణా ల్లోని టీ దుకాణాలు, సెలూన్లను వేదికగా చేసుకుంటున్నాయి. సాధారణ వ్యక్తుల్లా వెళ్లి అక్కడే తిష్ట వేస్తారు. వారి చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉంటుంది. ఆ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వార్త లను చదువుతున్నట్లు నటిస్తారు. వార్త ల సారాంశంపై పక్కనున్న వారితో చర్చ పెడతారు. ఆపై ఇదేం ప్రభుత్వం, ఎక్కడ చూసినా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఎక్కడా రోడ్లు వేయలేదు, అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం అప్పులు చూస్తే కొండలా పెరిగిపోతున్నాయి, సంక్షేమం అంటూ బటన్లు నొక్కి తిరిగి ధరలు పెంచి మన నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారంటూ పెదవి విరుస్తారు. ఇలా ఎల్లో కిరాయి మూ కలు తమ నటనను ప్రదర్శిస్తారు. అంతే కాకుండా లోకల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు టికెట్ రాదని, ఆయన అవినీతి చేశాడని.. టీడీపీలోకి వలసలు జోరుగా జరుగుతున్నాయంటూ భజన ప్రారంభిస్తారు. టీడీపీ, జనసేన జోడీ బాగుంది.. ఉత్తరాంధ్రలో అంతా టీడీపీ, జనసేన కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని, ఈ దఫా ఈ కూటమికే అధికారం వస్తుందని పదేపదే చెబుతారు. ఆ షాపుల వద్ద జనం ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే అక్కడ తిష్ట వేసి ఇలా తమ నటనను ప్రదర్శిస్తారు. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా నేర్పరితనంతో వ్యవహరిస్తారు. -
చంద్రబాబు తప్పించుకోలేరు..‘యావజ్జీవం’ తప్పదు!
‘చంద్రబాబు శాశ్వతంగా జైలు పక్షిగా మారక తప్పదు. ఒకట్రెండ్రోజులు ఆలస్యం కావచ్చు తప్ప, యావజ్జీవ కారాగార శిక్ష మాత్రం పక్కా’ అని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఐపీసీ 409 సెక్షన్ కింద ఒక్కో కేసులో విడివిడిగా యావజ్జీవ కారాగార శిక్ష, పీసీ యాక్ట్ 13(బి) కింద ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.కోటి ఫీజు చెల్లిస్తూ.. ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు తీసుకువచ్చే న్యాయవాదులతో కేసు విచారణను కాస్త జాప్యం చేయగలరేమోగానీ నేరం నుంచి మాత్రం తప్పించలేరని స్పష్టం చేస్తున్నారు.భారీ అవినీతి కుంభకోణాల కుట్రదారు, లబ్దిదారులు.. చంద్రబాబు, ఆయన కుటుంబం, సన్నిహితులు, బినామీలేనని డాక్యుమెంటరీ ఆధారాలు, న్యాయ స్థానాల్లో నమోదు చేసిన కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుపై అభియోగాలతో ఏకీభవిస్తూ ఏసీబీ న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడాన్ని బట్టి చూస్తుంటే.. ఈ ఒక్క కేసు చాలు చంద్రబాబుకు యావజ్జీవ శిక్ష పడటానికి అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.అనారోగ్య కారణాలతో స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ ఇస్తున్నప్పుడు గానీ.. తాజాగా మూడు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ సందర్భంగా గానీ చంద్రబాబు అవినీతి చేయలేదని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. తద్వారా చంద్రబాబు, లోకేశ్‌తోపాటు సహచర కుట్రదారులైన టీడీపీ ప్రభుత్వంలో మంత్రులది కూడా జైలు దారేనన్నది స్పష్టమవుతోంది. స్కిల్ కార్పొరేషన్, ఫైబర్‌నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఎంతగా బరితెగించిందనే విషయం చర్చనీయాంశమైంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్కిల్ కార్పొరేషన్, ఫైబర్‌నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాలకు కర్త, కర్మ, క్రియ గత ముఖ్యమంత్రి చంద్రబాబే అని సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతో వెల్లడి కావడంతో ఆయనకు ఏ రకంగా చూసినా జీవిత ఖైదు తప్పదని న్యాయ నిపుణులు బల్ల గుద్ది చెబుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన సర్వం తానై కుట్ర పన్నారు. అందుకోసం కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేశారు. స్కిల్ ప్రాజెక్ట్, ఫైబర్ నెట్, బినామీల పేరుతో అసైన్డ్ భూములు పొందిన వారికి భూ సమీకరణ ప్యాకేజీ, మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ పన్ను.. జీఎస్టీ ఎత్తివేత, ఉచిత ఇసుక విధానం.. ఇలా అన్ని కుంభకోణాలకు మార్గం సుగమం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం వేర్వేరు జీవోలను జారీ చేసింది. ఆ జీవోకు కూడా కేబినెట్ ఆమోదం లేకపోవడం చంద్రబాబు కుట్రను వెల్లడిస్తోంది. ఆ జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను కూడా మాయం చేయడం గమనార్హం. మాయం చేసిన నోట్ ఫైళ్లను సీఐడీ అధికారులు రిట్రీవ్ చేసి వెలుగులోకి తేవడంతో అన్ని కుంభకోణాల కుట్రలకు కీలక ఆధారాలు లభించాయి. చంద్రబాబు ముఠా గల్లంతు చేసిన అమరావతిలో అసైన్డ్ భూముల రికార్డులను సీఐడీ వెలికి తీసింది. స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్‌లలో కొల్లగొట్టిన నిధులు చంద్రబాబు నివాసానికే చేర్చిన అవినీతి నెట్‌వర్క్‌ను బ్యాంకు ఖాతాల వివరాలతోసహా ఛేదించింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు, క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు కరకట్ట నివాసం పొందడం, హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు దక్కడం, చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట భూ సమీకరణ ప్యాకేజీ పొందడం మొదలైనవన్నీ రికార్డులతో సహా వెలుగులోకి వచ్చాయి. ఈ విధంగా చంద్రబాబు, లోకేశ్, నారాయణల పాత్రను స్పష్టం చేస్తూ పూర్తి డాక్యుమెంటరీ ఆధారాలు లభించాయి. మరోవైపు ఈ కుంభకోణాలన్నింటికి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. అది కూడా 164 సీఆర్సీపీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేయడం చట్ట విరుద్ధమని చెప్పినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదని అప్పటి సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్ వాంగ్మూలాలు ఇచ్చారు. ఫైబర్‌నెట్, స్కిల్ స్కామ్‌లలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేయొద్దని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని కీలక అధికారుల వాంగ్మూలాలు నమోదు చేశారు. షెల్ కంపెనీల ప్రతినిధులు కూడా అప్రూవర్‌గా మారి అదే విషయాన్ని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కన్సల్టెన్సీ కంపెనీ, స్కిల్ స్కామ్‌కు సంబంధించి సీమెన్స్ కంపెనీ కూడా 164 సీఆర్సీపీ కింద వాంగ్మూలాలు నమోదు చేశాయి. ఈ విధంగా అన్ని కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్దిదారు అనేదానికి అటు డాక్యుమెంటరీ ఆధారాలు, ఇటు కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసా«ద్యమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. చంద్రబాబును రిమాండ్‌కు పంపడమే తార్కాణం ఒక్క మెతుకు చూస్తే చాలు అన్నం ఉడికిందో లేదో చెప్పొచ్చు. అలానే చంద్రబాబు పాల్పడ్డ ఇన్ని కుంభకోణాలలో ఒక్క స్కిల్ స్కామ్‌ను పరిశీలిస్తే చాలు.. ఆయన అవినీతి బాగోతం తెలిసిపోతోంది. సీఐడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరు పరిచింది. ఆ సందర్భంగా దాదాపు 10 గంటలపాటు ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత ఆయనకు జ్యుడిషి యల్ రిమాండ్ విధించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సీఐడీ నమోదు చేసిన అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. దాంతోనే చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతోనే ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ఇక సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించ లేదు. ముందస్తు బెయిల్‌పై ఎల్లో మీడియా వక్రీకరణ ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాల కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆ సందర్భంగా కూడా ఆయన అవినీతికి ఆధారాలు లేవని న్యాయస్థానం చెప్ప లేదు. కేసు పూర్వాపరాల్లోకి ఇంకా తాము వెళ్లడం లేదని కూడా స్పష్టం చేసింది. కేవలం షరతులతోనే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. విచారణకు చంద్రబాబు సహకరించాలని.. విచారణకు పిలిస్తే వెళ్లాలని కూడా చెప్పింది. కానీ హైకోర్టు తీర్పుకు వక్రభాష్యం చెబుతూ చంద్రబాబుకు క్లీన్ చిట్ లభించినట్టుగా ఈనాడు, ఇతర ఎల్లో మీడియా హడావుడి చేయడం విస్మయ పరుస్తోంది. సీఐడీ సేకరించిన ఆధారాలతో నేరం రుజువు కావడం ఖాయమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేరం నిరూపితమైన తర్వాత ఒక్కో కేసులో చంద్రబాబుకు యావజ్జీవ జైలు శిక్ష పడుతుందని కూడా తేల్చి చెబుతున్నారు. ఆయనపై సీఐడీ నమోదు చేసిన వివిధ సెక్షన్ల తీవ్రత, కేసుల విచారణ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్న నిపుణులు ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు వీరే ♦ నారా చంద్రబాబునాయుడు ♦ నారా లోకేశ్, పొంగూరు నారాయణ ♦ కింజరాపు అచ్చెన్నాయుడు ♦ దేవినేని ఉమామహేశ్వరరావు ♦ కొల్లు రవీంద్ర, పీతల సుజాత ♦ చింతమనేని ప్రభాకర్ తవ్వేకొద్దీ అవినీతే ♦ స్కిల్ స్కామ్‌లో రూ.241 కోట్లు చంద్రబాబు నివాసానికి చేరాయని సీఐడీ ఆధారాలతోసహా వెలుగులోకి తెచ్చింది. ♦ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌ను నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు తన బినామీ అయిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టేశారు. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ టెండరు అప్పగించారు. నాసిరకం పనులు చేసినాసరే పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా రూ.244 కోట్లు చెల్లించగా అందులో రూ.144 కోట్లు చంద్రబాబు నివాసానికే చేరాయి. ♦ అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట చంద్రబాబు, లోకేశ్, నారాయణ భారీ భూ బాగోతానికి పాల్పడ్డారు. తమ బినామీ అయిన లింగమనేని కుటుంబానికి చెందిన భూములను ఆనుకుని నిర్మించేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారులో క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. కృష్ణా నదికి ఇటూ అటూ కూడా లింగమనేని కుటుంబం, హెరిటేజ్ ఫుడ్స్, నారాయణ విద్యా సంస్థలకు చెందిన 355 ఎకరాల సమీపం నుంచి నిర్మించేలా రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అందుకోసం కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలవకుండా నామినేషన్‌పై కట్టబెట్టారు. అనంతరం అదే అలైన్‌మెంట్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చేలా ముందుగానే షరతు విధించి మరీ రాజధాని మాస్టర్ ప్లాన్ డెవలపర్‌ను నిర్ణయించారు. దాంతో అప్పటి వరకు చంద్రబాబు, లింగమనేని, నారాయణ భూముల మార్కెట్ విలువ మొత్తం రూ.177.50 కోట్లు ఉండగా.. అలైన్మెంట్ ఖారారుతో ఏకంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చెప్పిన దాని ప్రకారమే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచిన తర్వాత అమాంతంగా రూ.2,130 కోట్లకు పెరుగుతుందని స్పష్టమైంది. అంటే అలైన్మెంట్ ఖరారులో అక్రమాలకు పాల్పడి దాదాపు రూ.2 వేల కోట్ల అక్రమ లబ్ధికి పచ్చముఠా కుట్ర పన్నింది. ♦ చంద్రబాబు కనుసన్నల్లో సాగిన అమరావతిలోని అసైన్డ్ భూముల దందా దేశ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీగా రికార్డు సృష్టించింది. సీఎం పదవిని అడ్డుపెట్టుకుని ఏకంగా కేంద్ర అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు. అందుకోసం అమరావతి పరిధిలో అసలు 1954 తర్వాత అసైన్డ్ భూములే ఇవ్వలేదంటూ భూ రికార్డులు తారుమారు చేశారు. అసైన్డ్ భూములను జిరాయితీ భూములుగా రికార్డుల్లో కనికట్టు చేశారు. పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను రాజధాని కోసం ప్రభుత్వం తీసుకుంటుందని రైతులను భయపెట్టారు. అందుకోసం మొదట జీవో నంబర్–1 జారీ చేశారు. ఆ జీవోను బూచిగా చూపిస్తూ తమ ఏజంట్ల ద్వారా 617.70 ఎకరాల అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా హస్తగతం చేసుకున్నారు. అనంతరం అసైన్డ్ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో నంబర్–41 జారీ చేశారు. తద్వారా భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.3,737.30 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు. ప్రభుత్వ భూములను కూడా తమ బినామీల భూములుగా చూపిస్తూ ఏకంగా 328 ఎకరాలను కొల్లగొట్టారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లు విలువైన స్థలాలు పొందారు. ♦ పేరుకు ఉచిత ఇసుక అని చెప్పి.. చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులు మాత్రమే ఉచితంగా ఇసుక కొల్లగొట్టి బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయించేలా చక్రం తిప్పారు. తద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ♦ తమ అస్మదీయ, బినామీ కంపెనీలకు మద్యం కొనుగోళ్ల కాంట్రాక్టులు కట్టబెడుతూ చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న మద్యం దుకాణాలు, బార్లపై ఉన్న ప్రివిలేజ్ ట్యాక్స్.. జీఎస్టీని తొలగిస్తూ చీకటి జీవోలు జారీ చేశారు. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్ల యజమానుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఆరు కేసుల్లోనూ శిక్ష తప్పదు చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీటిలో అత్యంత కీలకమైనది సెక్షన్ 409. ఆ సెక్షన్ కింద నేరం నిరూపితమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇతర సెక్షన్లు సరేసరి. ఈ ఆరు కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్షలు పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికే బాబుకు 73 ఏళ్లు నిండుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓసారి నేరం నిరూపితమై ఒక్కో కేసులో ఐపీసీ 409 సెక్షన్ కింద యావజ్జీవ కారాగార శిక్ష, అవినీతి నిరోధక చట్టం 13(2) కింద గరిష్టంగా పదేళ్ల కారాగార శిక్ష పడితే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ కూడా నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు కూడా ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు. సీఎంగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓమ్ ప్రకాశ్ చౌతాలకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడిన ఉదంతాన్ని ఉదాహరిస్తున్నారు. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. బాబుపై నమోదైన ఐపీసీ సెక్షన్లు ఇవే.. 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37, అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) 409 సెక్షన్ కింద నేరం నిరూపితమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. 13 (2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది. -
కోనసీమ ‘ప్రభ’
సాక్షి, అమలాపురం: కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ప్రభల తీర్థం. ఇది సంక్రాంతి పండుగ వేళ జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. దేశ రాజధాని న్యూఢిల్లీలో గతేడాది అట్టహాసంగా జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటంపై కొలువుదీరిన ఈ ప్రభల తీర్థం భారతీయుల మనస్సులను గెలిచాయి. కోనసీమ ‘ప్రభ’ను నలుదిక్కులా చాటి చెప్పాయి. వివరాల్లోకి వెళితే...డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. తీర్థం జరిగే ప్రాంతంలో గుడి, గోపురాలు ఉండవు. కౌశిక నదిని ఆనుకుని ఉన్న కొబ్బరి తోటలో ఈ తీర్థం జరగడం ఇక్కడి ప్రత్యేకత. తీర్థం జరిగే ప్రాంతం చుట్టూ ఉన్న రెండు నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాలకు చెందిన పదకొండు ప్రభలు ఇక్కడకు వస్తాయి. ఇక్కడ జరిగే ప్రభల తీర్థం లోక కల్యాణార్థం అని భక్తుల విశ్వాసం. పెద్దాపురం సంస్థానా«దీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు (జగ్గన్న) హయాంలో తొలిసారిగా 17వ శతాబ్ధంలో ఈ తీర్థాన్ని ప్రారంభించారని చెబుతారు. మహారాజుకు పరమేశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి ప్రభల తీర్థం నిర్వహించమని కోరారంటారు. అప్పటి నుంచి ఇక్కడ తీర్థం జరుగుతోందని భక్తుల విశ్వాసం. మరో కథలో.. 17వ శతాబ్దంలో పరమ శివభక్తుడు, ఏకసంధాగ్రాహి అయిన విఠలా జగ్గన్న ఇక్కడున్న కౌశిక నది చెంతన శివ పూజ చేసేవారు. ఇందుకు పెద్దాపురం సంస్థానాధీశుడు అభ్యంతరం చెప్పడంతో హైదరాబాద్ నిజాం నవాబును తన ప్రతిభతో మెప్పించి ఇప్పుడు తీర్థం జరిగే జగ్గన్నతోట వద్ద 8 పుట్లు (64 ఎకరాలు) భూమిని దానంగా పొందారని చెబుతారు. ఈ కారణంగానే ఇది జగ్గన్నతోటగా పేరొందిందని నమ్మకం. ప్రభల తీర్థాలు జరిగేదెక్కడంటే.. జగ్గన్నతోటతో పాటు కొత్తపేట సెంటర్, అవిడి డ్యామ్ సెంటర్, కాట్రేనికోన, మామిడికుదురు మండలం కొర్లగుంట వంటి చోట్ల పెద్ద తీర్థాలు జరుగుతాయి. ఇవికాకుండా జిల్లా వ్యాప్తంగా 84 వరకూ తీర్థాలు నిర్వహిస్తారు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తున ప్రభలు ఉంటాయి. ప్రభలు తయారు చేయడాన్ని యజ్ఞంగా భావిస్తారు. తాటి శూలం, టేకు చెక్క, పోక చెట్ల పెంటిలు, మర్రి ఊడలు, వెదురు బొంగులతో మూడు రోజులపాటు శ్రమించి ప్రభలు తయారు చేస్తారు. రంగురంగుల నూలుదారాలు (కంకర్లు), కొత్త వ్రస్తాలతో అందంగా తీర్చిదిద్దుతారు. ప్రభపై పసిడి కుండ ఉంచి చుట్టూ నెమలి పించాలు, జేగంటలు వేలాడదీస్తారు. వరి కంకుల కుచ్చులు, గుమ్మడి, ఇతర కూరగాయలు, పెద్దపెద్ద పూల దండలతో ప్రభకు వేలాడదీస్తారు. వీటిని భక్తులు తమ భుజస్కంధాలపై ఉంచి కిలోమీటర్ల కొద్దీ మోసుకు వస్తారు. కొబ్బరి తోటలు, వరిచేలు, పంట కాలువల మీదుగా సాగే ప్రభల యాత్ర చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. జాతీయస్థాయిలో గుర్తింపు గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివ కేశవ యూత్ సభ్యులు ఈ తీర్థ విశేషాలను ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్ చేశారు. దీంతో మోదీ తీర్థాన్ని అభినందిస్తూ తిరిగి సందేశం పంపించారు. గతేడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్ర ప్రభుత్వ శకటంపై జగ్గన్నతోట తీర్థాన్ని ప్రదర్శించారు. దీంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. గతేడాది ప్రముఖ సినీ నటుడు నాగార్జున నటిస్తున్న ఒక సినిమాలో విజువల్స్ కోసం ప్రభల తీర్థాన్ని చిత్రీకరించారు. యువత ప్రభల తీర్థాలపై పలు లఘు చిత్రాలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ తీర్థానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. దీంతో ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేర దాటిస్తే ఊరుకు మంచిదనేది ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసమని అర్చకుడు చంద్రమౌళి కామేశ్వరశాస్త్రి తెలిపారు. -
Visakhapatnam: 76 కిమీ.. రూ.14వేల కోట్లు..
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ మరింత అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో లైట్‌మెట్రోకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. 76 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయమవుతుందని తెలిపింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను అందించేందుకు కావల్సిన పూర్తి డాక్యుమెంట్లను సిద్ధంచేసే పనిలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. 76.90 కి.మీ. మేర ప్రాజెక్టు.. విశాఖ నగర ప్రజలకు భవిష్యత్తులో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు మెట్రోపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. నెలరోజుల క్రితం సీఎం జగన్ ఆధ్వర్యంలో లైట్‌మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 76.90 కిమీ మేర లైట్‌మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. హెవీ మెట్రోతో పోల్చిచూస్తే.. లైట్ మెట్రో ద్వారా నిర్మాణ వ్యయంలో 20 శాతం, వార్షిక నిర్వహణలో 15 శాతం భారం తగ్గనున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లైట్‌మెట్రో వైపే మొగ్గు చూపింది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఒక మెట్రో రైలు వెళ్తే ఎనిమిది బస్సులు వెళ్లినట్లు సమానం. ఒకసారి వెళ్లే మెట్రోలో 400 మంది ప్రయాణించగలరు. ప్రాజెక్టు గడువు ఎనిమిదేళ్లు.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)–వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు జీఓలో స్పష్టంచేశారు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇక టెండర్లు దక్కించుకున్న సంస్థ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు దక్కించుకున్న మూడేళ్లకు తొలిమార్గంలో ప్రయాణికులకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని జీఓలో స్పష్టంచేశారు. 30 ఏళ్ల పాటు సదరు నిర్మాణ సంస్థకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ద్వారా నిర్వహించాల్సి ఉంటుందని, ఈ సమయంలో ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సదరు సంస్థ ఆర్జిస్తుందని డీపీఆర్‌లో తెలిపారు. 17న కేంద్రానికి డీపీఆర్ ఇక విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కేబినెట్ డీపీఆర్‌ను ఆమోదించినందున లైట్‌మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన జీఓ నెం.161ని ప్రభుత్వం విడుదల చేసింది. జీఓ, డీపీఆర్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పిస్తాం. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కాపీలు అందిస్తాం. వీలైనంత త్వరగా ప్రాజెక్టును ఆమోదింపజేసి టెండర్లకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. లైట్ మెట్రో ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఏపీలో కీలకంగా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలు కూడా కోర్ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. రాబోయే 35–40 ఏళ్లలో నగర ట్రాఫిక్ డిమాండ్‌కి అనుగుణంగా డీపీఆర్ సిద్ధంచేశాం. – యూజేఎం రావు, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ -
సచివాలయాలతో ఉద్యోగ విజయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సచివాలయాలతో ఉద్యోగ విజయం మాది పెద్ద కుటుంబం. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బుడ్డేపుపేట పల్లె గ్రామం మాది. ఇద్దరు అన్నయ్యలు, అక్క, తమ్ముడు, అమ్మా, నాన్న అందరం కలసి ఉండేవాళ్లం. కుటుంబాన్నిపోషించాల్సిన నాన్న పాపయ్య మా అందరినీ విడిచి అనంతలోకానికి వెళ్లిపోయారు. కుటుంబ బాధ్యత అమ్మా, అన్నయ్యలపైనే పడింది. అక్కతో పాటు ఇద్దరు అన్నయ్యలకు పెళ్లైంది. ఇక మిగిలింది నేను. తమ్ముడు. పుట్టినప్పటి నుంచి నా రెండు చేతులు మరుగుజ్జువి కావడంతో బడిలో చాలా మంది నన్ను చూసి జాలి పడేవారు. అది నచ్చని నాకు బాగా చదువుకొని జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. అందుకు మా అమ్మ, అన్నయ్యలు ఎంతగానో ప్రోత్సహించారు. డిగ్రీలో ఉండగానే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ వేటలో పడ్డాను. ఒక్క ఉద్యోగం కూడా దక్కలేదు. 2018లో డిగ్రీ పూర్తి చేసిన నేను రెండేళ్లలో ఎంఎస్సీ ఆర్గానిక్ పూర్తి చేశాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నాకు రూ.3వేలు వికలాంగుల పింఛన్, మా అమ్మకు వితంతు పింఛన్ మంజూరైంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. తొలి ప్రయత్నంలోనే నేను 2020 డిసెంబర్ నెలలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సంపాదించాను. ప్రస్తుతం బూర్జపాడు గ్రామ సచివాలయంలో చేస్తున్న ఉద్యోగం ఎంతగానో సంతృప్తినిస్తోంది. ఈ రోజు నేను సమాజంలో దర్జాగా బతుకుతూ, నా కుటుంబ సభ్యులకు చేదోడు, వాదోడుగా ఉన్నానంటే అందుకు ఈ ప్రభుత్వమే కారణం. – ఉప్పిలి విజయలక్ష్మీ, వెల్ఫేర్ అసిస్టెంట్, బూర్జపాడు (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్) సొంతింటి కల నెరవేరింది పొట్ట కూటి కోసం తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామానికి వలస వచ్చాం. రెండు దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నాం. నా భర్త వెంకటాచలం రమేష్ గ్రానైట్ క్వారీలో పని చేస్తుండగా... నేను ఓ ప్రైవేటు స్కూల్లో పని చేస్తున్నాను. మాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయి సంజయ్ తమిళనాడులో చదువుకొంటున్నాడు. అమ్మాయి సన్మాది బాపట్లలో బీ ఫార్మసీ విద్యనభ్యసిస్తోంది. మా ఇద్దరికీ వచ్చే అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చాం. ఇంటి అద్దె చెల్లించేందుకు నానా ఇబ్బందులు పడ్డాం. మాకు రేషన్ కార్డు ఉండడంతో గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఎవరూ మా మొర ఆలకించలేదు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక నవరత్నాల్లో భాగంగా సచివాలయంలో నివేశన స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నాం. దీంతో బల్లికురవ లేఅవుట్లో సెంటున్నర స్థలంతో పాటు పక్కా ఇల్లు మంజూరైంది. రూ. 1.80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతోపాటు డ్వాక్రా బ్రిడ్జి రుణం రూ. 35 వేలు కలిపి అందమైన ఇంటిని నిర్మించుకొని అందులోనే ఆనందంగా జీవిస్తున్నాం. బతుకు తెరువు కోసం వలస వచ్చిన మా లాంటి వారికి కూడా గూడు కల్పించిన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా అమ్మాయికి తొలుత అమ్మ ఒడి, తరువాత విద్యాదీవెన పథకాల ద్వారా నిధులు మంజూరు కావడంతో అప్పు చేయకుండా ఉన్నత విద్యను చదివించగలుగుతున్నాం. మాలాంటి వారి ఇళ్లల్లో సంతోషాల వెలుగులు పంచుతున్న ముఖ్యమంత్రి మేలు ఎప్పటికీ మరవలేము. – రమేష్ సత్య, బల్లికురవ, బాపట్ల జిల్లా (ఆంజనేయులు, విలేకరి, బల్లికురవ) నిరుపేదల బతుకుల్లో సంక్షేమ వెలుగులు మాది సాధారణ కుటుంబం. మా ఆయన ల్యాబ్ టెక్నీషియన్‌గా రెండు చోట్ల పనిచేస్తున్నారు. ఆయనకొచ్చే ఆదాయం అంతంతమాత్రమే. నేను, నా భర్త, పాప, బాబు కలిసి విశాఖ నగరం సీతంపేటలో సొంతింట్లో నివసిస్తున్నాం. నేను డ్వాక్రా సంఘంలో సభ్యురాలిని కావడంతో గతంలో తీసుకున్న రుణమాఫీకి సంబంధించి వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.16 వేలు వచ్చింది. సున్నా వడ్డీ కింద ఏడాదికి మూడు వేల వంతున ఇప్పటికి మూడు సార్లు జమయ్యింది. మా అబ్బాయికి టెన్త్, ఇంటర్లో అమ్మ ఒడి కింద ఏడాదికి రూ.15వేల వంతున మూడేళ్లు అందుకున్నాము. ఆ తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వాడికి విద్యాదీవెన, వసతిదీవెన అందింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మా లాంటి వారికి ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలుచెయ్యడం చూడలేదు. గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి పథకాలు అందలేదు. ఇపుడు వలంటీర్ ఇంటికి వచ్చి పలానా పథకానికి మీకు అర్హత ఉంది« దరఖాస్తు చెయ్యమని చెబుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన టైమ్‌కు ఠంచన్‌గా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – రెడ్డి కుమారి, సీతంపేట, విశాఖపట్నం (బి.అనితా రాజేష్, రిపోర్టర్, సీతంపేట(విశాఖపట్నం)) -
Andhra Pradesh: అందరికీ ‘ఆరోగ్యం’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య భరోసా కల్పిస్తూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న నేపథ్యంలో పథకం గురించి తెలియని వారు ఏ ఒక్కరూ ఉండటానికి వీల్లేదని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నిరుపేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందనే అవగాహన ఉండాలన్నారు. పథకాన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ అమలు, ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ, ప్రచార కార్యక్రమాలపై ఆరా తీసిన సీఎం జగన్ పలు సూచనలు చేశారు. చేతి నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు.. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉచిత వైద్య సేవలందిస్తూ అత్యంత మానవీయ దృక్పథంతో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు, చికిత్స వ్యయ పరిమితిని విప్లవాత్మక రీతిలో భారీగా పెంచాం. పేద, మధ్య తరగతి ప్రజలెవరూ వైద్యం కోసం చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎక్కడా రాకూడదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండకూడదు. తమకు దగ్గరలోని నెట్వర్క్ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలి. విస్తరించిన ప్రయోజనాలతో కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందిస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు కార్డుల పంపిణీ పూర్తి చేయాలి. జల్లెడ పట్టి గుర్తిస్తూ.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గుర్తించిన అనారోగ్య బాధితులకు చేయూతనిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతోందో నిరంతరం సమీక్షించాలి. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రివెంటివ్ కేర్ అత్యంత ముఖ్యమైన అంశం. ఆరోగ్య సురక్షలో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలను గుర్తించి శిబిరాల ద్వారా అవసరమైన వైద్య సేవలు అందించాలి. ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణాన్ని జల్లెడ పట్టాలి. శాచ్యురేషన్ విధానంలో ఈ ప్రక్రియ జరగాలి. ఏ గ్రామంలో ఎంతమందికి బీపీ, షుగర్లు ఉన్నాయి? ఎంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు? వారికి అందే వైద్యసేవలు ఏమిటి? తదితర అంశాలతో డేటా మ్యాపింగ్ చేపట్టాలి. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు, కాలానుగుణంగా మందులు అందించాలి. ఈ మొత్తం డేటాను ప్రతి ఆర్నెల్లకు ఒకసారి మీ రికార్డుల్లో అప్డేట్ చేయాలి. గ్రామంలో వంద శాతం ఇళ్లు, వ్యక్తులు ఈ ప్రక్రియలో కవర్ కావాలి. సదుపాయాలపై శ్రద్ధ.. ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కార్డు మిస్ అయినా సరే వారికి కూడా ఉచిత వైద్యం అందాలి. ప్రాథమిక వైద్య పరీక్షల్లో గుర్తించిన సమస్యలను నిర్ధారించేందుకు మరోసారి పరీక్షలు చేయాలి. సురక్ష రెండో దశ నిర్వహణ తర్వాత ప్రతి కేసుకు సంబంధించి టెస్ట్‌లు పూర్తి కావాలి. గుండె పోటు బాధితులకు సత్వర వైద్యం కోసం ప్రవేశపెట్టిన స్టెమీ కార్యక్రమం వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి మొదలవ్వాలి. దీనిపై సిబ్బందికి అవగాహన కల్పించాలి. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సదుపాయాలపై ఫోకస్ పెట్టాలి. అవసరమైన అన్ని వసతులను కల్పించాలి. కర్నూలు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ త్వరలో ప్రారంభం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కింద ఇప్పటివరకూ 1,338 శిబిరాలు నిర్వహించి 98,210 మందికి అక్కడే స్పాట్ టెస్ట్‌లు నిర్వహించినట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. 4,27,910 మంది ఓపీ ద్వారా వైద్యసేవలు పొందినట్లు తెలిపారు. సురక్ష తొలి దశ కార్యక్రమం సందర్భంగా నేత్ర పరీక్షలు నిర్వహించి 5,76,493 మందికి కళ్లద్దాల అవసరం ఉందని గుర్తించగా 67 శాతం మందికి ఇప్పటికే పంపిణీ చేసినట్లు చెప్పారు. మిగిలిన వారికి అద్దాల పంపిణీ వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 ఎస్ఎన్సీయూలు, 5 ఎన్ఐసీయూలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి తెలియచేశారు. విశాఖలోని మెంటల్ కేర్ ఆసుపత్రి, విజయవాడ, తిరుపతిలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, రీజనల్ డ్రగ్ స్టోర్స్, తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో పీజీ మెన్స్ హాస్టల్, అనంతపురం జీజీహెచ్‌లో బరŠన్స్ వార్డ్, కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, జీఎంసీ కర్నూలులో ఎగ్జామినేషన్ హాల్‌ను అతి త్వరలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న పాలన.. పల్లెకు పండగొచ్చింది
సాక్షి, అమరావతి: సంక్రాంతి అంటేనే పల్లెకు ప్రత్యేక కళ వస్తుంది. పచ్చని పంట పొలాలు, ఇంటికి చేరిన ధాన్యం రాశులతో రైతన్నలు సంతోషంగా ఉండే సమయంలో ఈ పండుగ వస్తుంది. నాడు కరువు కాటకాలు, కరెంట్ కోతల మధ్య కష్టాలు, అప్పులతో తల్లడిల్లిన కుటుంబాల్లో సంక్రాంతి సంబురాలు అంతగా కనిపించేవి కావు. కానీ, జగనన్న పాలనలో ఊరు మారింది.. సంక్రాంతితో సంబంధం లేకుండా పల్లెకు పండగొచ్చింది. అది ఎలా ఉందంటే.. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని సేవలు గడప వద్దనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయం గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గడప వద్దకే 540కి పైగా ప్రభుత్వ సేవలు అందించేలా 15,004 గ్రామ/ వార్డు సచివాలయాలు ఏర్పాటు, 1,35,819 మంది శాశ్వత ఉద్యోగులు, 2.60 లక్షల నుంది వాలంటీర్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. డా. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో మొత్తం 10,132 విలేజ్ హెల్త్ క్లీనిక్‌లు, ఉచిత వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో సేవలు అందిస్తున్నారు. మనబడి "నాడు-నేడు” కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా ఇంగ్లీషు మీడియం, డిజిటల్ బోధనతో మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ రూ.17,805 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునికీకరణ మూడు దశల్లో.. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు.. బై లింగువల్ టెక్స్ట్ బుక్స్ బైజూస్ కంటెంట్.. జగనన్న గోరుముద్ద. విద్యా కానుక అమలు చేస్తున్నారు. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్టును బలోపేతం చేసే దిశగా, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు 12,979 పంచాయతీల్లో కడుతున్న వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు, అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో అందుబాటులోకి తీసుకువచ్చారు. అంగన్వాడీ కేంద్రం పిల్లలు, గర్భిణీలు, బాలింతల పోషణ, బంగారు భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్ వాడీ కేంద్రాలు.. నాడు-నేడు ద్వారా అంగన్వాడీలో మంచి వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా వేగంగా అడుగులు.. సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ ద్వారా బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. వలంటీర్ల సేవలు దరఖాస్తు చేసుకోవడం నుండి లబ్ది పొందే వరకు లబ్దిదారుల చేయి పట్టుకొని నడిపిస్తూ వారి గడప వద్దనే సేవలు అందిస్తున్న 2.60 లక్షల మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు. చదవండి: ఏపీ ఎన్నికలు 2024: రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ పర్యటన.. వైఎస్సార్సీపీ కేడర్‌తో భేటీ -
ఆరోగ్యశ్రీపై సందేహాలు ఉండకూడదు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, మంత్రి విడదల రజని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్-2పై చర్చించారు. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలనేదానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలంలో మందులు పంపిణీ చేయాలని, ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అవసరమైన వారికి క్యాంప్‌ల ద్వారా వైద్యసేవలు అందించాలని సీఎం సూచించారు. ముందు జాగ్రత్త అనేది చాలా ముఖ్యమని, గ్రామంలో ప్రతి ఇల్లూ మ్యాపింగ్ జరగాలి.. ప్రతి ఆరు నెలలకోసారి డేటా అప్డేట్ చేయాలన్న సీఎం.. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై అధికారులను ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ. 25 లక్షల వరకూ వైద్యసేవలు, ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండకూడదని.. వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో మరోసారి సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ♦ఆరోగ్యశ్రీ వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలి, ఆరోగ్యశ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి ♦ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం. ♦మెగా ఆరోగ్యశ్రీ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టేటస్ వివరించిన అధికారులు ♦నిర్ణీత టార్గెట్‌లోగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలి ♦ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ స్టేటస్ వివరించిన అధికారులు ♦ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ. 25 లక్షల వరకూ వైద్యసేవలు ♦ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండకూడదు ♦ఈ సమాచారం తెలియని వారు ఉండకూడదు ♦నెట్ వర్క్ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలి ♦అవేర్నెస్ అనేది పెంచాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి అనేది బాగా అవేర్నెస్ పెరగాలి ♦జగనన్న ఆరోగ్య సురక్ష అమలు, పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు ♦జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూతనిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం ♦ప్రివెంటివ్ కేర్ అనేది ముఖ్యం, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి క్యాంపుల ద్వారా అవసరమైన వారికి వైద్యసేవలు అందాలి ♦గ్రామాన్ని జల్లెడ పట్టాలి, ప్రతి ఆరునెలలకోసారి ఇది జరగాలి ♦విలేజ్ శాచురేషన్ మోడ్ లో జరగాలి ప్రతి ఇల్లు కవర్ అవ్వాలి ఇదే మన ప్రధాన ధ్యేయంగా ఉండాలి ♦ఏ గ్రామంలో ఎంతమందికి బీపీ, షుగర్ ఉన్నాయి, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారికి అందే వైద్యసేవలు తదితర డేటా మ్యాపింగ్ అనేది జరగాలి ♦బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రివెంటివ్ కేర్ లో భాగంగా చికిత్సలు అందించడం, మందులు ఇవ్వడం, మంచానికి పరిమితమైన వారికి కావాల్సిన మందులు ఇవన్నీ కూడా మ్యాప్ చేయాలి, ♦ప్రతి 6 నెలలకోసారి మీ రికార్డులు అప్డేట్ చేయాలి ♦శాచురేషన్ కాన్సెప్ట్ ఉండాలి, గ్రామంలో 100 శాతం జరగాలి, ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కార్డు మిస్ అయినా వారికి కూడా వైద్యం అందాలి ♦ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఐడెంటిఫై చేసిన వారికి రీకన్ఫర్మేషన్ టెస్ట్‌లు చేయండి ♦సెకండ్ క్యాంప్ తర్వాత ప్రతి కేసుకు సంబంధించి టెస్ట్‌లు పూర్తి కావాలి, టెస్ట్‌లు అవసరముంటే మళ్ళీ తప్పకుండా చేయాలి ♦క్యాంప్‌లపై సీరియస్ గా దృష్టిపెట్టాలి ♦ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని డ్రైవ్ చేయాలి ♦స్టెమీ కార్యక్రమం విలేజ్ క్లీనిక్ దగ్గర నుంచి మొదలవ్వాలి, అవసరమైన ఓరియెంటేషన్ ఇవ్వాలి, పబ్లిక్ అవేర్నెస్పై మరింత ఫోకస్ పెట్టాలి, ♦నూతన మెడికల్ కాలేజీలకు సంబంధించిన స్టేటస్ వివరించిన అధికారులు ♦వాటికి అవసరమైన ఎక్విప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలన్న సీఎం ♦జిల్లాల వారీగా జగనన్న ఆరోగ్య సురక్ష 2 స్టేటస్ వివరించిన అధికారులు, మొత్తం 1338 క్యాంప్‌లు నిర్వహించగా, క్యాంప్‌లలో స్పాట్ టెస్టింగ్ 98,210 మందికి నిర్వహించినట్లు, 4,27,910 మంది ఓపీ ద్వారా వైద్యసేవలు పొందారన్న అధికారులు ♦జేఏఎస్ 1 కంటివెలుగు కళ్ళద్దాల పంపిణీ స్టేటస్ రిపోర్ట్ వివరించిన అధికారులు♦మొత్తం 5,76,493 మందికి కళ్ళద్దాలు అవసరం కాగా, 67 శాతం పంపిణీ జరిగిందని, మిగిలిన కళ్ళద్దాల పంపిణీ కూడా త్వరితగతిన పూర్తిచేయనున్నామన్న అధికారులు ♦వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 ఎస్ఎన్సీయూలు, 5 ఎన్ఐసీయూలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని అధికారుల వెల్లడి, అతి త్వరలో ప్రారంభించనున్న సీఎం ♦విశాఖలో మెంటల్ కేర్ ఆసుపత్రి, విజయవాడ, తిరుపతిలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, రీజనల్ డ్రగ్ స్టోర్స్, తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్‌లో పీజీ మెన్స్ హాస్టల్, అనంతపురం జీజీహెచ్‌లో బర్న్స్ వార్డ్, కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్సి›్టట్యూట్, జీఎంసీ కర్నూలులో ఎగ్జామినేషన్ హాల్ ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయన్న అధికారులు ఇదీ చదవండి: చంద్రబాబుకు షాక్ మీద షాకులు -
‘మాచ్‌ఖండ్’లో రికార్డుస్థాయి విద్యుత్ ఉత్పత్తి
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో 88.627 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. తరచూ జనరేటర్ల మరమ్మతులతో సతమతమయ్యే ఉద్యోగులు, ఏడాది కాలంగా తీవ్రంగా శ్రమించి ఈ ప్రాజెక్టును గాడిలో పెట్టారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యేలా ఈ ప్రాజెక్టులో ఆరు జనరేటర్లు ఉన్నాయి. మూడు జనరేటర్ల నుంచి 51 మెగావాట్లు, మరో మూడు జనరేటర్ల నుంచి 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 66 ఏళ్లుగా ఈ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి జరుగుతున్నా, పురాతన యంత్రాలు కావడంతో పూర్తి స్థాయి ఉత్పత్తి జరగలేదు. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే నీరు డుడుమ, జోలాపుట్టు జలశాయాల్లో ఉన్నప్పటికీ, తరచూ జనరేటర్ల మరమ్మతులతో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగలేదు. ఈ సమస్యలతో స్టేషన్ ఐదుసార్లు షట్‌డౌన్ అయ్యేసరికి దీనిపై ప్రాజెక్టు ఎస్ఈ, డీఈఈలు, ఏఈఈలు దృష్టి పెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో తీవ్రంగా శ్రమించి ప్రాజెక్టును గాడిలో పెట్టారు. దీని ఫలితమే గతేడాది డిసెంబరులో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత ఏడాది డిసెంబర్లో 88.627 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. గడచిన 25 ఏళ్లలో ఇదే అత్యధికం. గత ఏడాది జూన్ నెలలో 79.42 మిలియన్ యూనిట్లు, జూలైలో 84.75, ఆగస్టులో 86.275, సెప్టెంబర్‌లో 69.54, అక్టోబర్‌లో 86.58, నవంబర్‌లో 82.62, డిసెంబర్లో 88.627 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ ఉత్పత్తి జరిగింది. శతశాతం ఉత్పాదన విద్యుత్ ఉత్పత్తిలో మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం పని తీరు ఎంతో ప్రత్యేకం. చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన శత శాతం జరుగుతోంది. నాగార్జునసాగర్, సీలేరు విద్యుత్ కేంద్రాలకు దీటుగా ఉత్పాదకత ఉంటుంది. డిసెంబర్లో రికార్డు స్థాయి ఉత్పత్తి జరగడం సిబ్బంది పనితీరుకు నిదర్శనం. రానున్న రోజుల్లో మరింత మెరుగైన విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తాం. – ఏవీ సుబ్రహ్మణ్యేశ్వరావు, సీనియర్ ఇంజనీర్, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం -
ఉద్యోగులకు బాబు మార్క్ దగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్ల కోసం రాసే డిపార్ట్మెంటల్ టెస్టుల్లో వారు పాసవకుండా గత చంద్రబాబు సర్కారు అడ్డుకుంది. అందుకోసం ప్రత్యేకంగా జీవోను సైతం జారీ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చే దాకా ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన అన్ని డిపార్ట్మెంటల్ టెస్టుల్లోనూ గరిష్టంగా 4 నుంచి 6 శాతం మాత్రమే పాసయ్యారంటే ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబుకున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ ఏటా రెండుసార్లు డిపార్ట్మెంటల్ టెస్టులు నిర్వహిస్తుంది. సరీ్వస్ కమిషన్ ద్వారా భర్తీ చేసిన పోస్టుల్లో చేరిన అభ్యర్థులు ప్రొబేషన్‌లో ఉంటారు. వారి ప్రొబేషన్ పూర్తవ్వాలంటే సరీ్వస్ టెస్ట్ పాసవ్వాలి. ఫెయిలైతే వారు ప్రొబేషన్‌లోనే కొనసాగుతారు. టెస్ట్ పాసైనవారు మాత్రం సీనియారిటీలోకి వెళ్లిపోతారు. అలాగే ఇతర డిపార్ట్మెంట్లలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందేందుకు కూడా డిపార్ట్మెంటల్ టెస్టు పాసవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు సరీ్వసులో సీనియారిటీలోనూ ముందుంటారు. జీవో నం.101తో ఉద్యోగులకు మేలు ప్రభుత్వ ఉద్యోగుల వయసు రీత్యా గతంలో డిపార్ట్మెంటల్ టెస్టులను ఆఫ్‌లైన్‌లో డ్రి స్కిప్టివ్ విధానంలో నిర్వహించేవారు. ఉద్యోగులు నిబంధనల ప్రకారం పుస్తకాలను చదివి, సరైన జవాబులను రాసేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం డిపార్ట్మెంట్ టెస్టును మల్టీపుల్ చాయిస్ విధానంలో మార్చి ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. మైనస్ మార్కు విధానాన్ని తీసుకొచ్చి ప్రతి తప్పు సమాధానానికి 1/3 (0.33 శాతం) మార్కులు కోత విధించారు. దీంతో పెద్ద వయసులో ఉన్న ఉద్యోగులు ఆన్లైన్, మల్టీపుల్ చాయిస్ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఈ విధానంతో 2017–19 సంవత్సరాల మధ్య తాము ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కోల్పోతున్నామని, నెగిటివ్ మార్కుల విధానం రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక డిపార్ట్మెంటల్ పరీక్షల్లో మైనస్ మార్కులను తొలగించాలని అభ్యరి్థస్తూ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సర్వీస్ కమిషన్‌కు అనేక విజ్ఞప్తులు అందజేశాయి. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం ఉద్యోగులకు మేలు చేసేందుకు మైనస్ మార్కుల విధానం రద్దు చేస్తూ జీవో నం.101 జారీ చేసింది. దీంతో ఇప్పుడు డిపార్ట్మెంటల్ టెస్టుల్లో 85 శాతం పైగా ఉత్తీర్ణత సాధించి, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా.. ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకుండా అడ్డుకునేందుకు 2017లో జీవో నం.55ను విడుదల చేసి డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ‘మైనస్ మార్కు’లను అమల్లోకి తెచ్చారు. దాంతో గతంలో ఏటా సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల్లో 60 శాతం మంది ఉత్తీర్ణులైతే.. జీవో నం.55 వచ్చాక ఆ సంఖ్య 4–6 శాతం మించలేదు. కొన్ని విభాగాల డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ఒక్క శాతం కూడా పాసవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జీవోతో దాదాపు ఉద్యోగులు మూడేళ్లపాటు తమ పదోన్నతులు, ఇంక్రిమెంట్ అవకాశాలను కోల్పోయారంటే ఆశ్చర్యం కలుగుతుంది. -
‘క్లీన్‌సిటీ’ల్లో విశాఖకు నాలుగో స్థానం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2023 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట పడింది. జాతీయ స్థాయిలో ఫైవ్‌స్టార్ రేటింగ్స్‌తో నాలుగు కార్పొరేషన్లు ‘క్లీన్‌సిటీ’ అవార్డులను సొంతం చేసుకుని దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలో అత్యుత్తమ నగరాలుగా గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగర పాలక సంస్థలు ఈ అవార్డులు దక్కించుకున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆలిండియా 4వ ర్యాంకు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు 6వ ర్యాంకు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు 8వ ర్యాంకు లభించగా.. హైదరాబాద్ తొమ్మిది, ఇండోర్ మొదటి స్థానంలో నిలిచాయి. అలాగే, ఫాస్ట్ మూవింగ్ సిటీ విభాగంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు 2వ ర్యాంకు లభించింది. ఇక సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గమైన పులివెందులకు ‘క్లీన్ సిటీ ఆఫ్ ఏపీ’ అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ రూపొందించిన సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్, సర్టిఫికేషన్, సిటిజన్ వాయిస్‌కి సంబంధించి 9,500 మార్కులకు గాను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 8,879.25 మార్కులు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే చెత్తరహిత నగరాల్లో ఫైవ్‌స్టార్ రేటింగ్‌ను విశాఖ సాధించింది. మరోవైపు.. ♦ 2021, 2022, 2023 సంవత్సరాలలో గ్రేటర్ విశాఖ బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్, క్లీన్ బిగ్ సిటీ.. విజయవాడ కార్పొరేషన్ ఇండియా క్లీనెస్ట్ సిటీ, క్లీన్ స్టేట్ క్యాపిటల్ జాతీయ అవార్డులను వరుసగా సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాయి. ♦ఇక తిరుపతి నగరం బెస్ట్ స్మాల్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ (2021), సఫాయిమిత్ర సురక్షిత్ ప్రెసిడెంట్ అవార్డు (2022), జాతీయ అవార్డు (2023) దక్కించుకుంది. ♦ పుంగనూరు పురపాలక సంఘం 2021, 2022లో బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ అవార్డును, పులివెందుల 2022లో ఇన్నోవేషన్, బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు, 2023లో స్టేట్ అవార్డును దక్కించుకున్నాయి. పెరిగిన స్టార్ రేటింగ్ నగరాలు.. ఇదిలా ఉంటే.. గతేడాది కంటే ఈసారి ఎక్కువ నగరాలు స్టార్ రేటింగ్ ర్యాంకింగ్‌లో నిలిచాయి. గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్‌లో గతేడాది జీవీఎంసీ, తిరుపతికి మాత్రమే ఫైవ్‌స్టార్ రేటింగ్ వచ్చాయి. ఈసారి విజయవాడ, గుంటూరు, జీవీఎంసీ, తిరుపతి నగరాలూ ఈ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. వీటితోపాటు కర్నూలు, వైఎస్సార్ కడప 3 స్టార్ రేటింగ్‌లోను, బొబ్బిలి, పులివెందుల, రాజమండ్రి 1 స్టార్ రేటింగ్‌లోను నిలిచాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం.. ఢిల్లీలోని భారత్ మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను గురువారం ప్రదానం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హారి్థప్సింగ్ పూరీ చేతుల మీదుగా మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, అధికారులతో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ అవార్డులు అందుకున్నారు. పారిశుధ్యం విభాగంలో సర్వే, టెస్ట్ ప్రాక్టీస్, సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది. దేశవ్యాప్తంగా నాలుగు వేల పట్టణ స్థానిక సంస్థలు పోటీపడగా ఏపీ టాప్–10లో నిలవడం విశేషం. అనంతరం.. ఏపీ భవన్లో విశాఖపట్నం మేయర్ గొలగాని వెంకటకుమారి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తిరుపతి మేయర్ శిరీష యాదవ్, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, అధికారులతో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఆలోచనతోనే సాధ్యం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన విధానంతోనే దక్షిణ భారతదేశంలో ఏపీ టాప్–1గా నిలిచిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమాన్ని వైఎస్ జగన్ రెండు కళ్లుగా చూశారని, అభివృద్ధి అనేది సమస్యగా కాకుండా ఒక అవకాశంగా తీర్చిదిద్దారన్నారు. ఒకటే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఏం జరుగుతుందో రాష్ట్ర విభజన ద్వారా అందరికీ అర్థమైందని చెప్పారు. ఆ పరిస్థితులు ఏపీలో పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి జిల్లాలకు ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుచేసి ఆయా ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పిలుపులో భాగంగా మున్సిపల్ కారి్మకులు ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం, తడి–పొడి చెత్తలను వేరుచేయడం, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను అత్యంత హుందాగా, శ్రద్ధగా చేసినట్లు చెప్పారు. మరోపక్క.. రోడ్లు, పారిశుధ్యం, డ్రెయినేజీలు, మొక్కలు నాటడం, జంక్షన్ల అభివృద్ధి వంటి వాటిని అభివృద్ధి చేయడంవల్లే ఇది సాధ్యమైందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలు.. పట్టణాలు టాప్ ర్యాంకులు సాధించి అవార్డులు అందుకుంటాయని ఆదిమూలపు సురేష్ ధీమా వ్యక్తంచేశారు. -
‘కిసాన్ డ్రోన్స్’ వచ్చేశాయ్
సాక్షి, అమరావతి: సాగులో కూలీల వెతలకు చెక్ పెట్టడమే కాకుండా తగిన మోతాదులో ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయడం ద్వారా సాగు ఖర్చుల్ని తగ్గించే ప్రధాన లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఆర్బీకే స్థాయిలో డ్రోన్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆర్బీకే స్థాయిలోని సీహెచ్‌సీల్లో రైతులు, నిరుద్యోగ యువతకు ఉచితంగా డ్రోన్ పైలట్ శిక్షణ కూడా ఇస్తోంది. ఏపీ బాటలోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. తొలి దశలో దేశవ్యాప్తంగా 2,500 డ్రోన్స్‌ను వినియోగంలోకి తీసుకు రావాలని ఇఫ్కో సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్‌కు 160 డ్రోన్స్ ఇవ్వాలని నిర్ణయించగా.. ఇప్పటికే 70 డ్రోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను అందించింది. మార్చి నెలాఖరు నాటికి మిగిలిన యూనిట్లను కూడా విడుదల చేయనుంది. మహిళలకు ఉచిత శిక్షణ ఏపీకి కేటాయించిన ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయిస్తారు. వీటిని పొందగోరే అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ యువతకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయసు 18–50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 15 రోజుల పాటు చెన్నైలోని దక్ష, మైసూర్‌లోని జనరల్ ఏరోనాటిక్స్ సంస్థల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుండగా.. రూ.15 వేలు అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.35 వేలు ఇఫ్కో భరిస్తుంది. అదే పొదుపు సంఘాల మహిళలకైతే శిక్షణ ఉచితంగానే అందిస్తుంది. శిక్షణ పూర్తికాగానే డ్రోన్ పైలట్ లైసెన్స్ జారీ చేస్తారు. లైసెన్స్ పొందిన అభ్యర్థులకు రూ.15 లక్షల విలువైన డ్రోన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తారు. యూనిట్ అంచనా వ్యయంలో రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్‌పై 2 రోజుల పాటు ఆన్‌ఫీల్డ్ ట్రైనింగ్ కోసం అభ్యర్థులు మరో రూ.16 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 20 వేల ఎకరాల్లో పిచికారీ చేస్తే ఓనర్షిప్ డ్రోన్ పొందిన అభ్యర్థులు కనీసం 20వేల ఎకరాల్లో పిచికారీ చేయడం గానీ.. ఐదేళ్ల పాటు నిర్వహించిన తర్వాత గానీ డ్రోన్, ఎలక్ట్రిక్ వాహనం ఓనర్ షిప్‌ను అభ్యర్థుల పేరిట బదిలీ అవుతుంది. ఎంపికైన అభ్యర్థులు ఈ మేరకుఇఫ్కోతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇఫ్కో ద్వారా 60 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో 10 మంది స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 70 డ్రోన్స్‌తో కూడిన ఎలక్ట్రికల్ వెహికల్స్ చేరుకున్నాయి. మార్చి నాటికి మిగిలిన వారికి సమకూర్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. సూక్ష్మ ఎరువుల వినియోగం పెంచడమే లక్ష్యం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్న సంకల్పంతోనే ఇఫ్కో కిసాన్ డ్రోన్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా, డీఏపీ ఎరువులకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వాటి వినియోగం పెరగాలంటే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. భవిష్యత్‌లో డిమాండ్‌ను బట్టి మరింత మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు డ్రోన్స్ అందుబాటులోకి తీసుకొస్తాం.– టి.శ్రీధర్‌రెడ్డి, ఏపీ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
సుందర గుంటూరు
దాళా రమేష్ బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఒకప్పుడు.. ఎవరైనా గుం‘టూరు’కు వెళ్లాలంటే భయపడేవారు. కారణం అక్కడి రోడ్లు. నడవడానికే భయంకరంగా ఉండేవి. చీకటిపడితే ఏ గోతిలో పడతామో తెలియదు. ముక్కు మూసుకోకుండా నగరంలో తిరగడమూ కష్టమే. గత ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పేరుతో సుమారు 120 కిలోమీటర్లు అస్తవ్యస్తంగా తవ్వేసి కొత్త ప్రభుత్వానికి అప్పగించింది. ఛాలెంజిగా తీసుకున్న వైసీపీ ప్రభుత్వం దాని ప్రాథమిక రిపేరుకే రూ50 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు ఊరట కల్పించింది. ఆ తరువాత గుంటూరు అభివృద్ధిపై దృష్టి పెట్టింది. నూతన సీసీ రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయలతో 537 పనులు ప్రారంభించింది. ఐఏఎస్‌లను మున్సిపల్ కమిషనర్లుగా తీసుకు వచ్చి అభివృద్ధి పట్టాలు ఎక్కించింది. రూ. 163 కోట్లతో పీవీకే నాయుడు మార్కెట్ నగరం నడి రోడ్డున 1.92 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన హంగులతో నగరానికే ఐకానిక్ బిల్డింగ్‌గా గ్రౌండ్, 8 అంతస్తులతో పీవీకే నాయుడు మార్కెట్ నిర్మాణానికి తుది దశలో టెండర్లు. దీని కోసం రూ.163 కోట్లు ఖర్చు. ఆహ్లాదానికి పెద్దపీట ► గాంధీపార్కు పునరుద్ధరణకు రూ.4.50 కోట్లు. ► నగరంలో 22 పార్క్‌ల అభివృద్ధికి రూ.9 కోట్లు. ► నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు, రిజర్వ్ సైట్ల గుర్తింపు. ► వాటిలో ప్లే సెంటర్లు, వాకింగ్ ట్రాక్‌ల అభివృద్ధి. ► నగరంలోని 15 ఐలాండ్ల అభివృద్ధికి రూ.2.56 కోట్లతో అంచనాలు. ఇందులో 8 సెంటర్లు ఇప్పటికే అందుబాటులోకి. ► జగనన్న హరిత వనాలలో భాగంగా 42 కిలోమీటర్ల పచ్చదనానికి రూ.6.24 కోట్ల వెచ్చింపు. ► స్వచ్ఛ సర్వేక్షణ్ పథకంలో నగరాన్ని సుందరీకరణకు రూ.48 లక్షలు ఖర్చు. అద్భుత పనితీరుతో జాతీయ స్థాయి ర్యాంకు కైవశం. పార్కుల కోసం రూ.11.5 కోట్లు సెంట్రల్ డివైడర్లు రూ. 7.64 కోట్లు నూతన రోడ్లు, డ్రైన్లు ఏర్పాటుకు రూ. 491 కోట్లు ఐలాండ్స్ అభివృద్ధి రూ. 3.75 కోట్లు పీవీకే నాయుడు మార్కెట్ రూ. 163 కోట్లు అర్బన్ హెల్త్ సెంటర్లు రూ.19.71 కోట్లు జగనన్న కాలనీలతో కొత్త రూపు ► అర్బన్ పరిధిలోని పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ఏటుకూరు, కొర్నెపాడు, పేరేచర్ల, పొత్తూరు, బుడంపాడు, దామరపల్లి, లాం ప్రాంతాల్లో 1277 ఎకరాల్లో 60 వేల ప్లాట్స్‌తో జగనన్న కాలనీలు. ► గుంటూరు నగరంలో పేరేచర్ల, ఏటుకూరు వద్ద భారీ లేఅవుట్లు. 29,887 మందికి ఇళ్లు మంజూరు. ► తొలి విడతగా 28 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు. అందులో ఇప్పటికే 7 వేలు పూర్తి. ► ఈ ఏడు లే–అవుట్స్‌లో జంగిల్ క్లియరెన్స్ రూ.16.70 లక్షలు. అంతర్గత రోడ్లకు రూ.7.94 కోట్లు. అప్రోచ్ రోడ్లకు రూ.16.95 లక్షలు. సీసీ కల్వర్ట్లకు రూ.1.48 కోట్లు. మేజర్ డ్రెయిన్లకు రూ.21 లక్షలు. ఎల్ఈడీ లైట్లకు రూ.4.80 లక్షల ఖర్చు. దాహం తీరింది తాగునీటి ఎద్దడి సమస్య శాశ్వత పరిష్కారానికి సంజీవయ్యనగర్ వద్ద ట్రాక్ క్రాసింగ్ పూర్తి చేసి ఇంటర్ కనెక్షన్ ఏర్పాటు. నెహ్రూనగర్ రిజర్వాయర్ నుంచి పశ్చిమ నియోజకవర్గానికి 800 డయాపైప్లైన్న్ అందుబాటులోకి. గోరంట్ల కొండ మీద రెండు వాటర్ ట్యాంకుల నిర్మాణానికి రూ.33 కోట్ల ఖర్చు. విలీన గ్రామాలకు ఇది ఊరట. అభివృద్ధి పథంలో జీజీహెచ్ ► రూ. 5కోట్లతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో నిర్మాణ పనులు. ► రూ. 35 లక్షలతో ఎస్ఎన్సీయూ క్లినిక్ నిర్మాణం. ► రూ.25 కోట్లతో పెట్‌సిటీ స్కాన్, రూ.4 కోట్లతో సీటీస్కాన్ ఏర్పాటు. ► సర్విస్ బ్లాక్ నిర్మాణం కోసం రూ. 7.5 కోట్లు మంజూరు. ► రూ.3.5 కోట్లతో ప్రహరీ నిర్మాణం. ► రూ.40 లక్షలతో సీఆర్మ్ వైద్య పరికరం, రూ. 30 లక్షలతో ఏబీజీ వైద్య పరికరాలు, రూ.25 లక్షలతో ఈఎన్టీ మైక్రోస్కోప్, రూ. 40 లక్షలతో ఆపరేషన్ థియేటర్ లైట్లు, రూ.12 కోట్లతో లీనియర్ యాక్సిలేటర్ క్యాన్సర్ వైద్య పరికరాల కొనుగోలు. ► రూ. 40 కోట్లతో గుంటూరు వైద్య కళాశాల వసతి గృహాల్లో భవన నిర్మాణాలు. ► రూ.19.70 కోట్లతో నగరంలో 16 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణం. రోడ్లకు చికిత్స నగరంలోని ప్రధాన రోడ్లతోపాటు దెబ్బతిన్న అంతర్గత రోడ్లను పునరుద్ధరించుకుంటూ వస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.491.79 కోట్లతో తూర్పులో 792, పశ్చిమలో 918, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 150 అభివృద్ధి పనులు చేశారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు తొలివిడతగా నందివెలుగు రోడ్డు, కుగ్లర్ హాస్పిటల్ రోడ్, పెదపలకలూరు రోడ్, ఏటీ అగ్రహారం, డొంక రోడ్లను విస్తరించారు. సమగ్రాభివృద్ధి దిశగా... గుంటూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాం. రోడ్లు, డ్రెయిన్లు, డివైడర్లు, పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. నగరంలోకి రాగానే ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కూడా జాతీయస్థాయిలో ర్యాంకు తీసుకురాగలిగాం. నగరాన్ని హరిత నగరంగా, శుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. – కీర్తి చేకూరి, కమిషనర్, నగరపాలక సంస్థ, గుంటూరు పార్కుల అభివృద్ధి చాలా బాగుంది గుంటూరు నగరంలో పార్కులను అభివృద్ధి చేయడం ఎంతో బాగుంది. గాంధీ పార్క్‌ను కూడా ఆధునికీకరించి పునః ప్రారంభించడంతో పిల్లలను పార్కుకు తీసుకు వెళ్తున్నాను. పార్కులో చాలా రకాల ఆట వస్తువులు పిల్లలు ఆడుకునేందుకు అనువుగా ఉన్నాయి. – పూరి్ణమ (గృహిణి), కొరిటెపాడు అభివృద్ధిని చూస్తున్నాం ప్రస్తుతం గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. రోడ్లు లేని చోట రోడ్లు వేస్తున్నారు. డివైడర్లలో మొక్కలు ఏర్పాటుచేసి పచ్చదనం సమకూర్చడం బా గుంది. గతంలో ఎప్పుడూ ఇటువంటి అభివృద్ధి చూడలేదు. – సిహెచ్. విజయ్‌కుమార్(పాత గుంటూరు) యూజీడీ పేరుతో తవ్వేశారు.. నల్లపాడు రైల్వేస్టేషన్ కి వెళ్లే రోడ్డు ఏళ్ల తరబడి గోతులతో ఉండేది. యూజీడీ పేరుతో రోడ్డు అంతా తవ్వి కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా చేస్తే ప్రస్తుతం తారు రోడ్డు వేయడంతో ఇబ్బంది లేకుండా ఉంది. ఎప్పటి నుండో ఉన్న సమస్య పరిష్కారం చేసిన అధికారులకు, నాయకులకు ధన్యవాదాలు. –గేరా మణెమ్మ, శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ -
జగనన్న ఆరోగ్య సురక్షజనాలకు రక్ష
గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన జి.సుబ్బారావుకు 69 ఏళ్లు. కొద్ది రోజులుగా కంటి చూపు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే సెకండరీ కేర్ ఆస్పత్రికి.. లేదంటే గుంటూరులోని పెద్దాస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లి రావడానికి ప్రయాణచార్జీలు, ప్రయాసల భారం తప్పనిసరి. అయితే ఇవేవీ లేకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష(జేఏఎస్) కార్యక్రమం ద్వారా గ్రామంలోనే సుబ్బారావుకు ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించింది. ఈ నెల ఐదో తేదీన రెండో దశ జేఏఎస్లో భాగంగా గ్రామంలో వైద్య శాఖ సురక్ష వైద్య శిబిరం నిర్వహించింది. ర్యాండమ్ బ్లడ్ షుగర్, రక్తపోటుతో పాటు, విజన్ టెస్ట్‌లను గ్రామంలోనే ఉచితంగా నిర్వహించారు. విజన్ టెస్ట్‌లో గుర్తించిన అంశాల ఆధారంగా చూపు సమస్య నివారణకు ప్రభుత్వమే ఉచితంగా చికిత్స అందించింది. సాక్షి, అమరావతి: సుబ్బారావు తరహాలోనే రాష్ట్రంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి జేఏఎస్ కార్యక్రమం వరంగా మారింది. సమయం, ఓపిక లేని, ఆర్థిక పరిస్థితులు సహకరించని, అదే పనిగా ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకోలేని లక్షలాది మంది ఆరోగ్య సమస్యలను జేఏఎస్ పరిష్కరిస్తోంది. గ్రామ స్థాయిలోనే స్పెషలిస్ట్ వైద్యులు ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తున్నారు. మందులు అవసరమైతే అక్కడికక్కడే ఉచితంగా అందిస్తున్నారు. మెరుగైన చికిత్సలు అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. రిఫరల్ కేసుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభుత్వమే మందులను డోర్ డెలివరీ చేస్తోంది. 4.19 లక్షల మందికి ఉచిత వైద్యం రెండో దశ జేఏఎస్ కార్యక్రమాన్ని ఈ నెల రెండో తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. ఒక జిల్లాలోని మండలాలను రెండుగా విభజించి సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇక పట్టణ, నగరాల్లో బుధవారం శిబిరాలుంటాయి. ఆరు నెలల్లో రాష్ట్రం మొత్తం శిబిరాలు నిర్వహించేలా కార్యాచరణతో ముందుకెళుతున్నారు. కాగా, ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,315 సురక్ష వైద్య శిబిరాలు నిర్వహించగా.. సగటున 319 మంది చొప్పున 4,19,249 మంది స్వగ్రామం, వార్డుల్లోనే చికిత్సలు అందుకున్నారు. నంద్యాల జిల్లాలో 56 శిబిరాలు నిర్వహించగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ సగటున 458 ఓపీలు నమోదు కావడం విశేషం. ఇక ఇప్పటి వరకూ జేఏఎస్–2లో వైద్య సేవలు పొందిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా 4.19 లక్షల మంది సేవలు పొందగా.. వీరిలో 2.19 లక్షల మంది మహిళలు, 1.99 లక్షల మంది పురుషులున్నారు. మూడు వేల మంది స్పెçషలిస్ట్ వైద్యులతో ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెండో దశ ఆరోగ్య సురక్ష నిర్వహించేలా వేగంగా అడుగులు వేస్తున్నారు. జనవరిలో 3,583 శిబిరాలను నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 1,315 శిబిరాలు పూర్తయ్యాయి. ఇక షెడ్యూల్ ప్రకారం గ్రామం/వార్డులో సురక్ష శిబిరం ఏర్పాటుకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు రెండో సారి వలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి జేఏఎస్–2 పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్‌తో పాటు, ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు. ప్రజలకు సొంత ఊళ్లలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్‌లు మూడు వేల మంది వరకూ వైద్యులను, కంటి సమస్యల గుర్తింపునకు స్క్రీనింగ్ చేపట్టడానికి 562 పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను డిప్లాయ్ చేశారు. వైద్య పరీక్షల నిర్వహణకు ఏడు రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను, వందల సంఖ్యలో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. 268 మందికి క్యాటరాక్ట్ సర్జరీలు చేయించాం తొలి ఆరోగ్య సురక్షలో మా పీహెచ్సీ పరిధిలో 111 మందిని తదుపరి వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేశాం. వారిలో 72 మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు పూర్తయ్యాయి. ఇక 306 మందిలో కంటి సమస్యలను గుర్తించాం. వీరిలో 268 మందికి క్యాటరాక్ట్ సర్జరీలు పూర్తయ్యాయి. మిగిలిన వారు పొలం పనుల కారణంగా చికిత్సలు, క్యాటరాక్ట్ సర్జరీలను వాయిదా వేసుకున్నారు. వారికి కూడా వీలైనంత త్వరగా చికిత్సలు పూర్తి చేసేలా ఫాలోఅప్ చేస్తున్నాం. – డాక్టర్ సుశ్మప్రియదర్శిని, మెడికల్ ఆఫీసర్, వత్సవాయి పీహెచ్సీ, ఎన్టీఆర్ జిల్లా ఆరోగ్యశ్రీ కింద స్టంట్ వేశారు గతేడాది మా ఊళ్లో ప్రభుత్వం సురక్ష శిబిరం నిర్వహించింది. ఆయాసం, ఇతర సమస్యలతో బాధపడుతున్న నేను శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యుడికి చూపించుకున్నాను. ఈసీజీ తీశారు. ఈ క్రమంలో గుండెకు సంబంధించి సమస్య ఉన్నట్టు గుర్తించారు. విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్లగా.. రక్తనాళాలు పూడుకుని పోయినట్టు గుర్తించి స్టంట్ వేశారు. – భారతీలక్ష్మి, దబ్బాకుపల్లి, ఎన్టీఆర్ జిల్లా చేయి పట్టి నడిపిస్తూ వైద్య శిబిరాల ద్వారా స్వగ్రామాల్లోనే వైద్య సేవలు అందించడమే కాకుండా అనంతరం కూడా అనారోగ్య బాధితులను వైద్య పరంగా ప్రభుత్వం చేయిపట్టి ముందుకు నడిపించనుంది. జేఏఎస్ శిబిరాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగులను ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తున్నారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ చార్జీల కింద రూ.500 చొప్పున పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో రిఫరల్ రోగులను ఆస్పత్రులకు తరలించి, అక్కడ ఉచితంగా అన్ని వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. జీజీహెచ్‌లు, ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య సురక్ష రిఫరల్ కేసుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వీరికి ఉచిత కన్సల్టేషన్లతో పాటు కాలానుగుణంగా ఉచితంగా మందులు అందజేస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష తొలి దశలో అందించిన సేవలు ఆరోగ్య సిబ్బంది సందర్శించిన గృహాలు 1,45,35,705 నిర్వహించిన వైద్య పరీక్షలు 6,45,06,018 నిర్వహించిన మొత్తం సురక్ష శిబిరాలు 12,423 (రూరల్–10,033, అర్బన్–2,390) శిబిరాల్లో నమోదైన ఓపీలు 60,27,843 తదుపరి వైద్యం కోసం నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫరల్ 1,64,982 మంది -
ఏపీలో 3 రైళ్ల గమ్యస్థానాల పొడిగింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఏపీలోని పలు గమ్యస్థానాలకు అదనపు ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 3 రైళ్ల సర్వీసుల గమ్యస్థానాలను రైల్వేశాఖ పొడిగించింది. వీటిలో గుంటూరు– విశాఖ (22701/22702) రైలు విశాఖ, విజయవాడ,గుంటూరు మీదుగా ప్రయాణిస్తోంది. మిగిలిన 2 రైళ్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమవుతాయని తెలిపారు. వాటిలో నర్సాపూర్–హుబ్లీ (17225/17226) రైలు గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. నంద్యాల–రేణిగుంట (07285/07284) రైలు ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, కంభాలపల్లె స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. ఈ రైళ్ల సర్వీసులను శుక్రవారం కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రజాప్రతినిధుల సమక్షంలో గుంటూరు రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు శుక్రవారం నుంచే ప్రయాణికుల సేవల్లోకి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. -
పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేయండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేయడంతోపాటు వాటిలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను అదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి డీజీపీ, కలెక్టర్లు, వివిధ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. పోలింగ్ స్టేషన్లలో శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక శాఖకు చెందిన పాఠశాలలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు, ఫర్నిచర్, తాగునీరు, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష తొలుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డితో సమావేశమైన జవహర్‌రెడ్డి అక్రమ మద్యం రవాణాను అరికట్టడం, పటిష్టమైన బందోబస్తు, చెక్ పోస్టుల ఏర్పాట్లు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, విచారణలో ఉన్న కేసులకు సంబంధించి త్వరలో చార్జిïÙట్లు దాఖలు చేయడంపై సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రాల వద్ద పటిష్టమై చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు పోలీస్ బలగాలను పెద్దఎత్తున నియమించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను వివరించారు. అడిషనల్ సీఈవో హరేందిరప్రసాద్, అడిషనల్ డీజీ బాగ్చి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్, ఎస్ఈబీ డైరెక్టర్ రవిప్రకాష్ పాల్గొన్నారు. -
19న అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం
సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ స్మృతివవాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తెలిపారు. స్మృతివనం పనులను శ్రీలక్ష్మి గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 18.81 ఎకరాల స్థలంలో రూ.400 కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతివనం, కాంస్య విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా, పాదపీఠం ఎత్తు 85 అడుగులు అని, దీంతో మొత్తం విగ్రహం ఎత్తు 210 అడుగులు ఉంటుందన్నారు. ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం అని తెలిపారు. స్మృతివనంలోని అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ఫుడ్ కోర్టు, చిన్నారులకు ప్లే ఏరియా, గార్డెన్లు, మ్యూజిక్ ఫౌంటెయిన్, వాటర్ ఫౌంటెయిన్లు కూడా సీఎం జగన్ ప్రారంభిస్తారని వివరించారు. స్మృతివనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర పండుగలా నిర్వహిస్తామన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండం ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దారని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ స్మృతివనాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన అంబేడ్కర్ విగ్రహ ప్రారం¿ోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తారని చెప్పారు. -
సచివాలయంలో సంక్రాంతి శోభ
ఏపీ సచివాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కర్రసాము, కత్తి సాము, తప్పెటగుళ్లు, హరిదాసులు, గంగిరెద్దులు, సన్నాయి, మేళతాళాలు, ఎడ్లబళ్లు, మహిళా ఉద్యోగినులు వేసిన రంగవల్లులు సంక్రాంతి శోభ తెచ్చాయి. కూచిపూడి నృత్యకారిణి మల్లిశెట్టి అనూష నాయుడు శిష్య బృందం నృత్యం, భవిరి రవి మిమిక్రీ, సచివాలయ ఉద్యోగులు ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకం అలరించాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి, ఉపాధ్యక్షురాలు ఎన్.సత్యసులోచన, కార్యదర్శి పి.శ్రీకృష్ణ పాల్గొన్నారు. – సాక్షి, అమరావతి -
AP: మరో మహిళా విప్లవం
‘జగనన్న తోడు’ ద్వారా మహిళా సాధికారత, సామాజిక సాధికారతలో మరో విప్లవాన్ని సాధించాం. పథకం ద్వారా లబ్ధి పొందిన మొత్తం 16.73 లక్షల మంది చిరువ్యాపారుల్లో 87.13 శాతం మంది నా అక్క చెల్లెమ్మలే కావడం, అందులోనూ 79.14 శాతం మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉండటం దీనికి నిదర్శనం. పారదర్శకంగా రుణాలిప్పించడంతో పాటు అంతే స్థాయిలో సకాలంలో తిరిగి చెల్లింపులు చేయించ గలుగుతున్నాం. తద్వారా రుణాల రికవరీ 95 శాతానికిపైగా ఉంది. రికవరీ బాగుండటంతో మళ్లీ రుణాలు అందుతున్నాయి. ఇదంతా ఒక చక్రం మాదిరిగా కొనసాగుతోంది. సాధికారత విషయంలో ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. ఇందులో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలది కీలకపాత్ర. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘జగనన్న తోడు’ ద్వారా చిరువ్యాపారులకు ప్రభుత్వం తోడుగా నిలుస్తూ మానవత్వానికి మరో పేరుగా నిలిచిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పథకం దేశానికే దిక్సూచిలా నిలిచిందన్నారు. దేశం మొత్తం మీద ‘పీఎం స్వనిధి’ ద్వారా ఏడు శాతం వడ్డీకి రూ.10,220 కోట్ల రుణాలు ఇవ్వగా ఏపీలో జగనన్న తోడు కింద 16.73 లక్షల మంది చిరువ్యాపారులకు వడ్డీ లేకుండా రూ.3,373 కోట్లు రుణాలు అందజేశామన్నారు. జగనన్న తోడు ద్వారా వరుసగా 8వ విడత చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం ఇస్తూ, పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10,000, అంతకు పైగా కలిపి 3,95,000 మంది చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని కొత్త రుణాలను సీఎం జగన్ అందచేశారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్ కింద 5.81 లక్షల మందికి రూ.13.64 కోట్లను కూడా ప్రభుత్వం అందచేస్తోంది. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఏంమాట్లాడారంటే.. దశాబ్దాల దుస్థితికి పరిష్కారం.. లక్షల మంది చిరు వ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమమిది. చిరువ్యాపారుల బతుకులు ఎలా ఉంటాయో మన కళ్లముందే కనిపిస్తున్నా ఆ కష్టాలను ఎలా కడతేర్చాలని ఎప్పుడూ, ఎవరూ ఇంతలా మనసుపెట్టి, ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోలేదు. నా పాదయాత్రలో ప్రతి జిల్లాలో వారి కష్టాలను చూశా. వ్యాపారం చేసుకోవడానికి కూరగాయలు, పనిముట్లు, ముడిసరుకు కోసం కనీసం వెయ్యి రూపాయిలు పెట్టుబడి అవసరం. రూ.1,000 అప్పు ఇస్తే ప్రైవేట్ వ్యాపారులు అప్పటికప్పుడే వడ్డీ కింద రూ.100 మినహాయించుకుంటారు. ఇలా రూ.10 వడ్డీకి వెయ్యి రూపాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అలా తీసుకుంటే కానీ వారి జీవితాలు ముందుకు సాగని దుస్థితి. దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నా దీనికి పరిష్కారం చూపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మానవత్వానికి చిరునామా.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి గురించి బ్యాంకర్లతో మాట్లాడాం. బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తూ ఎలాంటి హామీ లేకుండా రూ.10 వేలు అప్పు ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం. సకాలంలో తిరిగి చెల్లించేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ వడ్డీ భారం మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ఒక భరోసా కల్పించాం. ఇవన్నీ చేస్తూ ఇవాళ 8వ దఫా కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన ప్రభుత్వం మానవత్వానికి చిరునామాగా నిలిచిందని గర్వంగా చెబుతున్నాం. ఇతరులకూ ఉపాధి చూపుతున్నారు.. చేతి వృత్తిదారులు, ఫుట్‌పాత్ విక్రేతలు, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునేవారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు, గంపలు, బుట్టలపై అమ్మకాలు చేసేవారు, ఆటోలు, సైకిళ్లపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకునేవారు, వివిధ వృత్తుల కళాకారులంతా స్వయం ఉపాధితో తాము జీవించడమే కాకుండా మరికొందరికి కూడా ఉపాది కల్పిస్తున్నారు. ఇలాంటి వారికి జగనన్న తోడు కార్యక్రమం ఉపయోగపడుతుంది. లబ్ధిదారులకు రూ.10 వేలు ఎలాంటి గ్యారంటీ లేకుండా అందించి సకాలంలో చెల్లించిన వారందరినీ ప్రోత్సహిస్తూ ప్రభుత్వం తరపున వడ్డీని వెనక్కి ఇచ్చాం. ఏటా రూ.1,000 చొప్పున ఈ మొత్తాన్ని పెంచుతూ రూ.13,000 వరకూ తీసుకుని వెళ్లేలా పథకాన్ని అమలు చేయడం సంతోషాన్నిస్తోంది. రుణాలైనా.. రీయింబర్స్మెంటైనా రాష్ట్రంలో గొప్ప విప్లవాత్మక అడుగులు పడుతున్నాయన్నది ఒక అంశం కాగా రెండోది మన ప్రభుత్వం దేశానికి దిక్సూచిగా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కేంద్రం 7% వడ్డీకి 58,65,000 మందికి ‘పీఎం స్వనిధి’ పేరుతో రూ.10,220 కోట్ల రుణాలు ఇవ్వగా ఒక్క ఏపీలోనే 16,74,000 మందికి రూ.3,373 కోట్ల మేర వడ్డీలేని రుణాలివ్వగలిగాం. మనం ఎలా చేయగలిగాం? మిగిలిన రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయాయో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి 7%వడ్డీ మొత్తం కింద రూ.138 కోట్లు చెల్లిస్తే ఒక్క ఏపీలోనే చిరు వ్యాపారులకు రూ.88 కోట్లను వడ్డీ రీయింబర్స్మెంట్ కింద తిరిగి అందచేశాం. జీవనోపాధి కల్పిస్తూ అడుగులు.. మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాల రుణాలకు సంబంధించి 18% ఎన్పీఏలుగా ఉంటే మనం వచ్చిన తర్వాత అది 0.3% లోపే ఉంది. పరివర్తన అనేది ప్రతి అడుగులోనూ జరిగింది. అక్కచెల్లెమ్మలు, మహిళా సాధికారత విషయంలో గొప్ప అడుగులు పడుతున్నాయి. వారికి జీవనోపాధి కల్పించేలా అడుగులు వేశాం. అమూల్, రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి వారికి వ్యాపార అవకాశాలు కల్పించడంతోపాటు బ్యాంకులతో అనుసంధానించి రుణాలతో తోడ్పాటు కల్పించాం. వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాల ద్వారా అన్ని రకాలుగా తోడుగా నిలిచి మహిళ సాధికారత దిశగా అడుగులు వేయించగలిగాం. గత నాలుగున్నరేళ్ల పాలనలో చేకూర్చిన లబ్ధి అందుకు నిదర్శనం. ఎలా సాధ్యమైందంటే..? మిగిలిన రాష్ట్రాలకు – మనకు ఎందుకు ఇంత తేడా వచ్చింది? మన ఫెర్ఫార్మెన్స్ (పనితీరు) మిగిలిన రాష్ట్రాల కన్నా ఎందుకని మెరుగ్గా, భిన్నంగా ఉంది? దేశానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఎలా అడుగులు పడ్డాయి? అనేది ఒకసారి గమనిస్తే మన దగ్గర ఉన్న గొప్పవైన సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలే దానికి కారణం. వీటి ద్వారా మనం పారదర్శకంగా రుణాలిప్పించడంతో పాటు అంతే స్థాయిలో సకాలంలో తిరిగి చెల్లింపులు చేయించగలుగుతున్నాం. అందులో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలది కీలకపాత్ర. రుణాల రికవరీ 95 శాతానికిపైగా ఉంది. సాధికారత విషయంలో ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. కొత్త వారికి వడ్డీలేని రుణాలు.. రెన్యువల్ ఇవాళ జగనన్న తోడు 8వ విడతలో మరో 86,084 మంది చిరువ్యాపారులకు రూ.86 కోట్లు వడ్డీ లేని రుణాలుగా అందిస్తున్నాం. వీరితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3.09 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.332 కోట్ల రుణాలను రెన్యువల్ కూడా చేస్తున్నాం. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ.418 కోట్లను 3,95,000 మందికి ఇవాళ కొత్త రుణాలుగా అందిస్తున్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీం ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 5,80,968 మంది లబ్ధిదారులకు వడ్డీ కింద రూ.13.64 కోట్లను తిరిగి వారికి ఇస్తున్నాం. మొత్తంగా ఇవాళ దాదాపు రూ.430 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చుతూ చిరు వ్యాపారులకు మంచి చేస్తున్నాం. ఇప్పటిదాకా రూ.3,373 కోట్లు వడ్డీ లేని రుణాలు జగనన్న తోడు పథకం ద్వారా తాజాగా చేకూరుస్తున్న లబ్ధితో కూడా కలిపి ఇప్పటివరకు 16,73,576 మంది చిరువ్యాపారులకు రూ.3,373 కోట్లు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చాం. దీంతో పాటు వారు కట్టిన వడ్డీలు రూ.88.33 కోట్లను మళ్లీ తిరిగి వెనక్కి ఇచ్చే గొప్ప అడుగులు ఈ నాలుగున్నరేళ్లలో పడ్డాయి. ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందిన వారి వివరాలను గమనిస్తే మొత్తం లబ్దిదారుల్లో 73,072 మంది చిరువ్యాపారులు ఇప్పటికే నాలుగుసార్లు డబ్బులు కట్టి తీసుకున్నారు. 5,10,241 మంది మూడుసార్లు డబ్బులు కట్టి తీసుకున్నారు. 3,98,229 మంది చిరువ్యాపారులు రెండు దఫాలు రుణాలు పొంది వాటిని తిరిగి చెల్లించి మళ్లీ తీసుకున్నారు. గడప గడపలో సంతోషాన్ని చూశాం చిరు వ్యాపారులు, కుల వృత్తులపై ఆధారపడే కుటుంబాలు గతంలో అప్పు తీసుకుంటే ప్రైవేట్ వ్యాపారులు ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టించుకుని రూ.6 నుంచి రూ.10 వడ్డీ వసూలు చేసేవారు. రూ.10,000 రుణానికి రూ.9,000 మాత్రమే ఇచ్చి రూ.వెయ్యి తిరిగి వసూలు చేసేవారు. ఆ పరిస్థ్ధితుల నుంచి ఇప్పుడు ఒక్కొక్కరికీ రూ.10,000 చొప్పున అందచేస్తూ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. వడ్డీ లేని మొత్తాన్ని ఏటా పెంచుతూ ఇప్పుడు రూ.13,000 వరకూ అందిస్తోంది. ఆ కుటుంబాలన్నీ మేం గడప గడపకూ వెళ్లినప్పుడు సంతోషంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపాయి. – బూడి ముత్యాల నాయుడు, డిప్యూటీ సీఎం (పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) ఇన్ని ఆలోచనలు.. మీకెలా సాధ్యం? నేను పూల వ్యాపారం, టైలరింగ్ చేస్తున్నా. మా ఆయన మెకానిక్. కరోనా సమయంలో డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. రూ.10 వేలు అప్పు తీసుకుంటే వెయ్యి తగ్గించుకుని రూ.9,000 మాత్రమే ఇస్తామన్నారు. ఆ సమయంలో వలంటీర్ జగనన్న తోడు గురించి చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నాం. ఎవరి సిఫారసు లేకుండా నా ఖాతాలో రూ.10 వేలు పడ్డాయి. ఆ తర్వాత సకాలంలో తిరిగి కట్టడంతో వడ్డీ వెనక్కి వచ్చింది. ఇది చాలా గొప్ప ఆలోచన. దేశంలో ఎవరూ ఇలాంటి ఆలోచన చేసి ఉండరు. నాకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ కూడా వచ్చింది. గతంలో మా సంపాదనంతా వడ్డీలు కట్టడానికే సరిపోయేది. వైఎస్సార్ చేయూతకు కూడా నేను అర్హత పొందడంతో నేరుగా రూ.18,750 నా ఖాతాలోకి వచ్చాయి. ఇలా మూడు విడతల్లో లబ్ధి పొందా. ఇప్పుడు నాలుగో విడత కూడా వస్తుంది. ఇలా నాకు అన్ని పథకాలు అందడంతో మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. నా కోడలు కాన్పు సమయంలో సిజేరియన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.1.50 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కింద చేరడంతో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. పైగా తిరిగి రూ.5,000 ఓ అన్నలా ఆర్థిక సాయం అందచేశారు. ఇన్ని ఆలోచనలు మీకెలా వస్తున్నాయి అన్నా? మా అమ్మ గతంలో ఫించన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఇప్పుడు వలంటీర్ ఇంటి వద్దే ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. ఈసారి రూ.3,000 పెన్షన్ తీసుకుంది. మిమ్మల్ని నా పెద్ద కుమారుడు అని గర్వంగా చెబుతోంది. నాకు ఇల్లు కూడా వచ్చింది. మీరు కులం, మతం, రాజకీయం చూడకుండా అన్నీ గొప్పగా చేస్తున్నారు. మమ్మల్ని ఇప్పుడు వ్యాపారస్తులుగా గుర్తించి గౌరవిస్తున్నారు. గతంలో పేదలను ఎవరూ గుర్తించలేదు. ఈరోజు మేం బ్యాంకులకు వెళ్లి ధైర్యంగా కూర్చుని లోన్ కావాలని అడుగుతున్నామంటే మీరే కారణం. మీరు సీఎంగా రావడం మా అదృష్టం. మిమ్మల్ని తిరిగి గెలిపించుకుంటాం. – లక్ష్మీదేవి, చిరువ్యాపారి, అనంతపురం మీ చిరునవ్వుతో రాష్ట్రంలో వెలుగులు ఎవరి పూచీకత్తు లేకుండా బ్యాంకులో రూ.10 వేలు ఇచ్చారు. మళ్లీ చెల్లించడంతో వడ్డీ తిరిగి ఇచ్చారు. టైలరింగ్ ద్వారా నెలకు రూ. 6,000కిపైగా సంపాదిస్తున్నా. నాకు అమ్మ ఒడి వస్తోంది. విద్యా దీవెన ఇస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లు ఖాళీ అయ్యాయి. గవర్నమెంట్ స్కూళ్లలో సీట్లు లేవని బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. మీరు మా నుంచి వచ్చారు కాబట్టి ఇన్ని పథకాలు ఇస్తున్నారు. మీరు మాకు దేవుడిచ్చిన గిఫ్ట్. మా గ్రూప్ ద్వారా బ్యాంకులో రూ.10 లక్షలు లోన్ తీసుకున్నాం. వైఎస్సార్ సున్నా వడ్డీ వస్తోంది. ఆసరా ద్వారా రూ.3.60 లక్షలు మా గ్రూప్ మొత్తానికి ఇవ్వగా నాకు రూ.36 వేలు వచ్చాయి. నవరత్నాలలో భాగంగా ఇల్లు కూడా వచ్చింది. మా నాన్నకు హార్ట్ ఎటాక్ రావడంతో రూ.5 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఇంటిల్లిపాదీ బాధపడుతున్న సమయంలో మీరు డాక్టర్ రూపంలో కనిపించారు. ఆరోగ్యశ్రీ కింద వెంటనే ఉచితంగా ఆపరేషన్ చేశారు. నాన్న క్షేమంగా ఇంటికి వచ్చారు. అంతేకాకుండా ఏడాది వరకూ ప్రతి నెలా చెకప్, ఉచితంగా రూ.3,000 మందులు ఇస్తున్నారు. గతంలో వయసు మళ్లిన వారు ఎందుకు బతుకుతున్నామా అని భారంగా గడిపేవారు. ఇవాళ వారంతా ఇంటివద్దే పెన్షన్ ఇస్తున్న మిమ్మల్ని తమ బిడ్డలాగా భావిస్తున్నారు. మా నాన్న కూడా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు జగనన్న నాకు దేవుడని చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే మా ఇంట్లో మేమంతా మీ ఫోటో చూస్తాం. మీరిచ్చిన పథకాల ద్వారా నేను రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు లబ్ధి పొందా. మా అత్తమ్మకు ఆసరా సాయం అందడంతో రెండు ఆవులు కొనుగోలు చేశారు. మా మామకు రైతు భరోసా వస్తోంది. ఏపీలో మీ పథకం అందని ఇల్లంటూ లేదు. ఒక్కొక్కరు నాలుగైదు పథకాలు పొందుతున్నారు. గ్యారెంటీగా ఒక్కో ఇంటికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు దాకా ప్రయోజనం పొందుతున్నారు. ఇంతకంటే ఏం కావాలన్నా? మరెవరూ ఇన్ని పథకాలు అందజేయలేదు. మాకు ఏం కావాలో మీకు తెలుసు. మీ చిరునవ్వుతో ఏపీ వెలిగిపోతుంది. – గౌరి, చిరువ్యాపారి, విజయనగరం రుణమాఫీ మోసంతో చెవి పోగులు పోయాయి.. రోడ్డు పక్కన కాయలు విక్రయిస్తూ జీవిస్తున్నాం. కరోనా సమయంలో వ్యాపారం లేక, అప్పులు ఇచ్చిన వారు నానా మాటలు అంటుంటే చావాలో బతకాలో తెలియని పరిస్ధితి ఎదుర్కొన్నాం. అలాంటప్పుడు జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు అందాయి. ఏటా పెంచుతూ ఇప్పుడు రూ.13,000 ఇచ్చారు. సకాలంలో తిరిగి చెల్లిస్తున్నాం. మాకు వడ్డీ భారం లేకుండా తిరిగి వెనక్కి ఇస్తున్నారు. గతంలో రోడ్డు పక్కన వ్యాపారం చేయడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మీరు అందించిన సాయంతో సొంతంగా షాప్ పెట్టుకుని ఓనర్‌గా నిలబడ్డాం. గత సర్కారు డ్వాక్రా రుణమాఫీ అంటే నమ్మి మోసపోయాం. వడ్డీల మీద వడ్డీ వేసి నోటీసులు పంపారు. నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. దీంతో బంగారం తాకట్టు పెట్టి కట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్నిసార్లు తిరిగినా లోన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం నన్ను చాలా మోసం చేసింది. నాడు చెవిదిద్దులు కూడా లేని నేను ఈరోజు గొలుసు వేసుకున్నానంటే నిజంగా మీ దయవల్లే జగనన్నా! అలాంటిది మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామన్నా! మాకు వేరే సీఎం, వేరే గవర్నమెంట్ ఎందుకన్నా! మాకు మీరుంటే చాలు. నేను ఇక్కడికి వచ్చే ముందు అమ్మా నువ్వు జగన్‌గారితో మాట్లాడాలని మా పాప ముద్దు పెట్టి పంపింది. టెన్త్ చదువుతున్న మా పాప గతంలో సంక్రాంతి సెలవులు వస్తే ఊరికి వెళ్లేది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్‌లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు హోమ్‌వర్క్‌లు చేసి సార్లకు పంపాలట. ఇప్పుడు చదువులు చాలా బాగున్నాయి. నాడు – నేడు ద్వారా స్కూళ్లు ఎంతో బాగున్నాయి. స్కూల్‌కు ఒక్క పూట మానేస్తే ఎందుకు రాలేదని అడుగుతున్నారు. ఆరోగ్యం బాగోలేదంటే తగ్గిందా లేదా అని తరువాత విచారిస్తున్నారు. నా భర్తకు గుండె పోటు రావడంతో ఆరోగ్యశ్రీ కింద రూపాయి ఖర్చు లేకుండా విజయవాడ ఆసుపత్రిలో వైద్యం చేశారు. మా అమ్మమ్మ విజయవాడ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స పొందుతోంది. ఆమె దగ్గర ఎవరూ లేకపోయినా ఆసుపత్రిలో వారే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. మందులు ఇచ్చి కోలుకున్న తర్వాత మాకు ఫోన్ చేసి చెబుతున్నారు. ఇదంతా ఆరోగ్యశ్రీ వల్లే! మా అమ్మమ్మ జగన్‌గారికి చూపించమని తన వీడియో కూడా పంపింది. ఆవిడ తరపున కూడా మీకు ధన్యవాదాలు అన్నా! ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ కాపులను గుర్తించలేదు. మీరు కాపు మహిళలకు సాయం చేస్తున్నారు. ఆ డబ్బులతో చీరల వ్యాపారం చేస్తున్నా. రొటేషన్‌తో రూ.50 వేలకు పెంచగలిగా. నేను అమ్మ ఒడి కూడా తీసుకుంటున్నా. నా భర్తకు పెన్షన్ వస్తోంది. కలెక్టర్ పక్కన కూర్చుని మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. – అడబాల సత్యవతి, చిరువ్యాపారి, కృత్తివెన్ను, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి