AP Special
-
వలస వచ్చినా ఇల్లు ఇచ్చారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. వలస వచ్చినా ఇల్లు ఇచ్చారు 13 సంవత్సరాల క్రితం మా మేన మామ తాతారావుతో నా వివాహం జరిగింది. ఆ తర్వాత బతుకుతెరువు కోసం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామానికి వచ్చాం. మా స్వగ్రామం కృష్ణా జిల్లా మచిలీపట్నం. నా భర్త కేటరింగ్‌తో పాటు వంట మాస్టర్‌గా పని చేస్తారు. నేను నా భర్తకు ఇంటి దగ్గర కేటరింగ్‌కు అవసరమైన సహాయం చేస్తూ ఇంటి పనులు చూసుకుంటాను. ఈ ప్రాంతంలో సొంతిల్లు లేకపోవడంతో ఇద్దరు పిల్లలతో ఇరువాడ బీసీ కాలనీలో అద్దెకు ఉండేవాళ్లం. వచ్చే రూ.9, 10 వేల ఆదాయంలో అద్దెకే రూ.3 వేలు ఇవ్వాల్సి వచ్చేది. మిగిలిన సొమ్ముతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో జగనన్న కాలనీలో ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకున్నాం. సబ్బవరం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకొని ప్రభుత్వం స్థలం ఇచ్చింది. ఇల్లు కట్టుకోవడానికి రూ.1.80 లక్షలు ఇచ్చారు. మేము మరికొంత డబ్బు వెచ్చించి ఇల్లు నిర్మించుకున్నాం. మా కల నెరవేరింది. సొంతింట్లో పిల్లలతో కలిసి ఆనందంగా ఉంటున్నాం. మాకు జగనన్న ఇచ్చిన స్థలమే బహిరంగ మార్కెట్లో రూ.6 లక్షలకు పైగా పలుకుతుంది. మాకు ఇద్దరు పిల్లలు. బాబు వినయ్నాయుడు సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్లుగా అమ్మఒడి ఏటా రూ.15,000 వంతున వస్తోంది. పాప జాహ్నవి అదే పాఠశాలలో 4వ తరగతి. మా సొంతింటి కలను నెరవేర్చిన జగనన్నకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. – పల్లి జానకీదేవీ, ఇరువాడ (సుర్ల నాగేశ్వరరావు, విలేకరి సబ్బవరం) ప్రాణాపాయంలో కొండంత అండ అర్చకత్వం నా వృత్తి. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మూలిపాడు పంచాయతీ శ్రీనివాసపురంలోని శ్రీబాలాజీ రఘునాథస్వామి ఆలయ పూజారిగా పని చేస్తున్నా. దానిపై వచ్చే ఆదాయంతోనే జీవిస్తున్నా. నాకు భార్య, ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు ఇద్దరూ విశాఖపట్నంలో ప్రైవేటు దుకాణాల్లో పని చేస్తున్నారు. కుమార్తెకు వివాహం చేసి అత్తారింటికి పంపించాం. ఏదోలా కాలం గడుపుతున్న నాకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.ఆస్పత్రిలో చూపిస్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు. పెద్ద మొత్తంతో ఖర్చవుతుందని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని గ్రామ పెద్దలు చెప్పడంతో శ్రీకాకుళంలోని జెమ్స్ ఆస్పత్రికి వెళ్లాము. అక్కడ ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. నా భార్య పంకజ డ్వాక్రా మహిళా సంఘం సభ్యురాలు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ఏటా రూ.15,000 వంతున మూడేళ్లుగా అందింది. గతంలో తీసుకున్న డ్వాక్రా రుణానికి సంబందించి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.18,600 ఆమె ఖాతాలో జమయ్యాయి. మేము హాయిగా జీవిస్తున్నాం. – రమేష్ మహంతి, శ్రీనివాసపురం (కొంచాటి ఆనందరావు, విలేకరి, మందస) అమ్మనాన్నలకు భారం కాకుండా చదువు మాది నిరుపేద గిరిజన కుటుంబం. మా నాన్న ఆరిక భాస్కరరావు, అమ్మ కుసుమ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం సంతోషపురం గ్రామంలోని కొండపై పోడు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నా చదువు వారికి పెద్ద భారంగా మారింది. ప్రభుత్వం అందించిన అమ్మ ఒడి పథకం ద్వారా ఇంటర్ వరకు సులువుగా సాగిపోయింది. డిగ్రీ చదవాలంటే పార్వతీపురం వెళ్లాల్సిందే. అంత ఖర్చు ఎలా భరించాలో తెలీక అమ్మానాన్న మొదట భయపడ్డారు. మా ఊరి పెద్దల సూచనతో హాస్టల్లో ఉండి చదువుకుంటే ప్రభుత్వం వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాలు అందిస్తుందని చెప్పడంతో పార్వతీపురం ఎస్వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాను. నాకు విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.40 వేలు అందింది. దాంతో అమ్మనాన్నలకు భారం కాకుండా చదువు సాగిపోతోంది. ఇప్పుడు నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం. డిగ్రీ పూర్తయ్యాక ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాను. కొండపోడు వ్యవసాయం చేస్తున్న మా నాన్నకు వైఎస్సార్ రైతు భరోసా గతేడాదే వర్తించింది. ఈ ప్రభుత్వం లేకపోయుంటే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. – ఆరిక సాయికిరణ్, సంతోషపురం, కురుపాం మండలం (ఆశపు జయంత్‌కుమార్, విలేకరి, పార్వతీపురం రూరల్) -
మహిళల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ సారథ్యంలో వైఎస్సార్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పూర్తి మద్దతు ఉందని, వారి సహకారంతోనే త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. తాడేపల్లిలో గురువారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షులు పోతుల సునీత, రుతు కళ్యాణి నేతృత్వంలో రాష్ట్ర కమిటి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మహిళా సాధికారత అమలు చేసినట్లు తెలిపారు. కులాలు మతాలకు అతీతంగా మహిళా సాధికారతకు సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. మహిళలకు ఉద్దేశించి రూపొందించిన అన్ని పథకాలూ మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికేనని అన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి. దేశ స్థూల ఉత్పత్తి అభివృద్దికి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి అభివృద్దిలో మహిళలు ప్రధాన పాత్ర పోషించాలన్నదనే సీఎం జగన్ ఉద్దేశ్యమని అన్నారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. మొత్తం జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నప్పుడు వారికి 30 శాతం కన్నా 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రధాని కలిసిన ప్రతిసారీ మహిళా సాధికారత, రిజర్వేషన్లు గురించి ప్రస్థావించడంతో కల సాకారమయ్యిందని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళలకు అనేక రకాలుగా వివిధ పథకాల కింద ఆర్థిక తోడ్పాటు అందించారన్నారు. డీబీటీ ద్వారా 3,43,02,005 మహిళా లబ్దిదారులు రూ.95,867 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 30,76,018 మందికి రూ.75,670 కోట్లు ఆర్థిక సహకారం అందించారన్నారు. ఈ గణాంకాలు మహిళలపై జగన్ ప్రభుత్వం చిత్తశుద్దికి అద్దం పడుతున్నాయన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం, ఆరోగ్యం, విద్య, వైద్యం, రక్షణ కోసం వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు, నవరత్నాలు కింద 2023 బజ్డెట్ లో మొత్తం రూ.27697 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద 30 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, స్వేచ్ఛా కార్యక్రమం, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న బడుగు వికాసం మహిళలకు అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తున్నారన్నారు. వైకాపాతోనే కాపులకు న్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేస్తం పథకం కింద సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున 5 సంవత్సరాల్లో రూ.75 వేలు మొత్తం 357844 మంది మహిళల ఖాతాల్లో రూ.2028.77 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. అయితే గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాపులకు ఏమి చేశారో చెప్పలేకపోయారని అన్నారు. వైఎస్సార్ హౌసింగ్ స్కీం కింద 3076018 మహిళలకు ఇళ్ల పట్టాలు అందించారని అన్నారు. అలాగే వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 41770406 మంది మహిళా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసినట్లు తెలిపారు. తల్లీబిడ్డ పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో 55.1 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో దిశ చట్టం పగడ్బంధీగా అమలు చేయడంతో గతంలో కంటే మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. మహిళలపై నేరాలు 2019లో 67.09 శాతం ఉండగా, 2020లో 65 శాతానికి తగ్గినట్ల తెలిపారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ ఎఫ్ హెచ్ఎస్) డేటా ప్రకారం రాష్ట్రంలో మహిళలపై లింగ వివక్ష, హింస 43.04శాతం నుండి 30 శాతానికి తగ్గినట్లు తెలిపారు. జాతీయ స్థాయికి మించి ఏపీలో బాలికల ఎన్రోల్మెంట్ అలాగే మాధ్యమిక విద్యా స్థాయిలో బాలికల ఎన్రోల్మెంట్ జాతీయ స్థాయిలో 79.04 ఉండగా ఏపీలో 84 ఉందన్నారు. దేశంలో కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఏపీ ఉందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళల్లో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గిందని, మహిళా కార్మికులు భాగస్వామ్యం 10.86 శాతం పెరిగిందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళల కోసం రూ.12628 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మహిళలకు వైఎస్సార్సీపీ ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర పార్టీలు ఇవ్వడం లేదని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహిళల సపోర్టుతో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. గతంలో నామినేటెడ్ పోస్టులు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేని వారికి ఈ సారి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో మహిళలు పూర్తి సంతృప్తితో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళలకు జరుగుతున్న మంచి, లబ్దిని జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి వరకు తీసుకెళ్లాలని కోరారు. సమావేశాలకు లబ్ధి పొందుతున్న వారందరికీ అలాగే తటస్థులను ఆహ్వానించాలని సూచించారు. పార్టీ రూపొందించిన బ్రోచర్స్ పంపిణీ చేయాలని కోరారు. కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు, నంద్యాల, కోనసీమ, ఏలూరు, ప్రకాశం. వెస్ట్ గోదావరి, వైఎస్సార్ కడప జిల్లాలకు సంబంధించి మహిళా కమిటీలు ప్రకటించారని, తిరుపతి త్వరలో ప్రకటిస్తారని అన్నారు. క్రిష్ణా, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు , చిత్తూరు, సత్యసాయి, విశాఖ, అన్నమయ్య జిల్లాల కమిటీలు ప్రకటించాల్సి ఉందని అన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఈస్ట్ గోదావరి, విజయనగరం, ఎన్టీఆర్ జిల్లాలు పూర్తి చేయాల్సి ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రతిపక్షాల కుట్రలు తిప్పుకొట్టాలి: ఎమ్మెల్సీ పోతుల సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ మహిళలకు రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ గారు అనేక అవకాశాలు కల్పించాలని చెప్పారు. ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అందేలా పాలన సాగిస్తున్నారని చెప్పారు. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టర్లు మహిళలకే 50 శాతం కేటాయించేలా జగన్ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ,ఇతర పథకాల ద్వారా పెద్ద ఎత్తున మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.. మహిళలకు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అందరికీ చెప్పాల్సిన బాధ్యత మనమీద ఉందన్నారు..జగన్ గారి మీద వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను విమర్శలను తిప్పుకొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. గత చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత హామీలతో అప్పుల పాలైన పొదుపు సంఘాల మహిళలను వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఈ ప్రభుత్వం ఆదుకుందన్నారు.కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడితే, ఆ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. ప్రగతి బాటలో మహిళలు: వరుదు కళ్యాణి వైఎస్సార్ కాంగ్రెస్ మహిళ విభాగం మరో అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా గౌరవంగా జీవిస్తున్నారని అన్నారు. సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా మహిళా సాధికారతతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా దేశంలోనే మందుందని చెప్పారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన సీఎం జగన్ ప్రతి పథకంలోనూ లబ్ధిదారులుగా గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక కార్యక్రమాలతో రాష్ట్రంలో మహిళలు ప్రగతి బాటలో పయనిస్తున్నారని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో 51 శాతం పైగా పదవులు మహిళలకు ఇచ్చి జగన్ గౌరవించారని చెప్పారు. నవరత్నాలు వంటి అనేక పథకాల్లో 90% పైగా మహిళలు లబ్ధిదారులు ఉన్నారని తద్వారా ప్రతి ఇంటిలో మహిళకు అత్యంత ప్రాధాన్యత పెరగడానికి ప్రభుత్వం దోహదం చేస్తుందని ఆమె చెప్పారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర మహిళా విభాగానికి ఉందని పిలుపునిచ్చారు -
ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట
సాక్షి, ఢిల్లీ: ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట పడింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచింది. జాతీయ స్థాయిలో గుంటూరు ఆలిండియా రెండో ర్యాంకు, గ్రేటర్ విశాఖపట్నం ఆలిండియా 4వ ర్యాంక్, విజయవాడ ఆలిండియా 6వ ర్యాంక్, తిరుపతి ఆలిండియా 8వ ర్యాంకు సాధించాయి. అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకుగానూ ఏపీ ఈ అవార్డులను దక్కించుకుంది. పట్టణాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న కృషికి ఈ అవార్డులు ఈ అవార్డులు చిహ్నమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. క్లీన్ ఏపీ (క్లాప్) ప్రోగ్రాం విజయవంతమైందన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించామని, వారంతా తిరిగి విధుల్లో చేరారన్నారు. సమ్మె వల్ల కొంత ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం జరిగిందని మంత్రి ఆదిమూలపు అన్నారు. కాగా, 2022లో కూడా జాతీయ స్థాయిలో అత్యుత్తమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్‌కు ‘సఫాయిమిత్ర సురక్షా సెహెర్’ అవార్డు దక్కింది. సీఎం జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయనడానికి ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడమే నిదర్శనం. ఇదీ చదవండి: ఏపీలో రేపు మూడు కొత్త రైళ్ల ప్రారంభం -
ఇది అందరి ప్రభుత్వం!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మేము వ్యవసాయ కూలీలం. నా భర్త నారాయణమూర్తి ఏడేళ్ల కిందటే చనిపోయారు. నాకున్న ఒక్కగానొక్క కూతురు రేవతికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించా. ఇప్పుడు నేనొక్కర్తినే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ చినరావుపల్లిలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్లలో నా ఒక్కదానికే రూ.2,38,209 ప్రభుత్వ సాయం అందింది. వైఎస్సార్ పింఛన్ కానుక కింద ఇప్పటి వరకు రూ.97,000, వైఎస్సార్ రైతు భరోసాగా రూ.53,500, వైఎస్సార్ ఆసరా (డ్వాక్రా రుణమాఫీ) కింద రూ.28,734, స్వయం సహాయక సంఘం సభ్యురాలిగా ఉన్నందున సున్నా వడ్డీ ప్రయోజనంగా రూ.2,725, వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.56,250 అందుకున్నా. ప్రస్తుతం పెరిగిన వితంతు పింఛన్ రూ.3000 అందుకున్నాను. రెక్కాడితేగానీ డొక్కాడని మా జీవితం ఈ రోజు ఇంత ఆనందంగా ఉందంటే కారణం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలే. ఇలాంటి సంక్షేమాభివృద్ధి పాలన ఎన్నడూ చూడలేదు. ఎప్పటికీ జగనే ముఖ్యమంత్రిగా ఉండాలి. – కొత్తకోట లక్ష్మి, చినరావుపల్లి (పైడి అప్పలనాయుడు, విలేకరి, ఎచ్చెర్ల క్యాంపస్) చదువులకు ఆటంకం లేదిక మాది నిరుపేద కుటుంబం. నా భర్త అబ్బులు పెయింటింగ్ పనులు చేసి కుటుంబపోషణ గావించేవారు. నాకు ఇద్దరు పిల్లలు. బాబు పవన్ రితిక్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల పరిషత్ నంబర్–1 ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుండగా, పాప రిబ్కాజాయ్ రెండో తరగతి చదువుతోంది. నా భర్త ఓ ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమయ్యారు. ఇప్పుడు నేనే ఏదో ఒక పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. పిల్లల చదువు ఎలా అని సతమతమయ్యాం. అదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మా బాబుకు అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వంతున నా బ్యాంకు ఖాతాలో నిధులు జమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సహా పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో పిల్లలు చదువుకుంటున్నారు. పాఠశాల ప్రారంభం రోజునే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, షూస్ తదితర సామగ్రి అందిస్తున్నారు. దీనివల్ల పిల్లల చదువుకు చింతలేదు. మా ఆయనకు ప్రతి నెలా పింఛన్ అందుతోంది. అది ఈ నెల నుంచి రూ.3000కు పెంచారు. నాకు డ్వాక్రా రుణమాఫీ సొమ్ము వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.26 వేలు నా ఖాతాలో జమ అయ్యింది. ఇప్పుడు మా జీవనానికి ఎలాంటి ఇబ్బందులూ లేవు. – యార్లగడ్డ సౌజన్య, రాయవరం (పి.నాగమణి, విలేకరి, రాయవరం) ప్రభుత్వమే ఆదుకుంది.. ఒంటరి, దివ్యాంగురాలైన నాకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వైఎస్సార్ చేయూత, పింఛన్ సొమ్ము ఎంతగానో అండగా నిలుస్తున్నాయి. నాది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు. కొన్నేళ్ల క్రితం భర్త వదిలేసి వెళ్లిపోయాడు. నా ఏకైక కుమార్తె కూడా పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. కూలి పనులు చేసుకొని ఒంటరిగా జీవిస్తున్న నాకు పుండుమీద కారంలా ఓ ప్రమాదంలో కుడికాలు పూర్తిగా పోయింది. అందువల్ల పనులు చేసుకునే అవకాశం కూడా లేకపోయింది. దివ్యాంగురాలిగా కర్ర సాయంతో జీవిస్తున్న నాకు ఆర్థికంగా ఎలాంటి ఆధారం లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ.18,750 వంతున మూడేళ్లుగా ఇప్పటికి రూ.56,250 అందింది. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసినా పింఛన్ మంజూరు కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దివ్యాంగ పింఛన్ కూడా మంజూరైంది. నెలనెలా రూ.3 వేలు వస్తోంది. చేయూత, పింఛన్ సొమ్ములతో ఎవరిపైనా ఆధార పడకుండా జీవనం సాగిస్తున్నా. ప్రస్తుతం చిన్న పాత ఇల్లు ఉంది. మాది పోలవరం ముంపు ప్రాంతం కావడంతో అందరికీ వేరే చోట ఇళ్లు కట్టిస్తున్నారు. ఈ ప్రభుత్వమే లేకుంటే నా జీవితం ఏమయ్యేదో.. నా బతుకు ఎలా గడిచేదో తలచుకుంటేనే భయంగా ఉంటుంది. – కవుజు బేబీ, చింతూరు (మహమ్మద్ షౌఖత్‌అలీ, విలేకరి చింతూరు) -
Jagananna Thodu Scheme: చిరు వ్యాపారులకు నేడు ‘జగనన్న తోడు’
సాక్షి, అమరావతి: ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలుస్తూ, వారి ఇళ్లలో ముందుగానే పండగ సంతోషాలు వెల్లివిరిసేలా వరుసగా 8వ విడత జగనన్న తోడు పథకం అమలుకు సీఎం వైఎస్ జగన్ గురువారం శ్రీకారం చుడుతున్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అంతకుపైన రూ. 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం గురువారం అందిస్తోంది. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను సీఎం వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇదీ ‘జగనన్న తోడు’ పథకం సీఎం వైఎస్ జగన్ నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద వారు నిలదొక్కుకొనేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నారు. రుణాలను సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నారు. ఇలా ఇప్పటికి ఏడు విడతలు రుణాలు, వడ్డీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 8వ విడతగా గురువారం అందిస్తున్న రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు చిరువ్యాపారాలు చేసుకునే 16,73,576 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 3,373.73 కోట్లు. అదే విధంగా ఈ విడతలో అందించే వడ్డీతో కలిపి ఇప్పటివరకు 15.87 లక్షల లబ్ధిదారులకు తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన చిరు వ్యాపారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని ఆరు నెలలకోసారి సీఎం జగన్ ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వీరందరికీ ‘జగనన్న తోడు’ 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు, తోపుడు బండ్లపై వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారు, గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, చేనేత, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఈ పథకం అందిస్తున్నారు. దేశానికే ఆదర్శంగా ఏపీ చిరు వ్యాపారులను ఆదుకోవడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ‘జగనన్న తోడు‘ ద్వారా పూర్తి వడ్డీ రాయితీ (7.32% నుండి 15.85% వరకు) కల్పిస్తోంది జగనన్న ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే, ఏపీలో సీఎం వైఎస్ జగన్ ఏకంగా 16,73,576 మందికి ‘జగనన్న తోడు‘ ద్వారా వడ్డీ లేని రుణాలు అందించారు. దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ కింద ఇప్పటివరకు చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాలు రూ.10,220.47 కోట్లు. రాష్ట్రంలో ‘జగనన్న తోడు‘ ద్వారా అందించిన రుణాలే అక్షరాలా రూ.3,373.73 కోట్లు. దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ కింద చిరు వ్యాపారులకు రీయింబర్స్ చేసిన వడ్డీ రూ. 138.49 కోట్లు కాగా, ‘జగనన్న తోడు‘ ద్వారా మన రాష్ట్రంలో రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.88.33కోట్లు. -
పర్యాటకంలో ‘పీపీపీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అపార పర్యాటక వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం పీపీపీ విధానానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా పర్యాటక సామర్థ్యం ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా సర్వే చేసింది. వీటిల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి పర్యాటక సేవలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. తొలుత అడ్వెంచర్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాల్లో పర్యాటక అనుభూతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రఖ్యాత హోటల్ రంగ సంస్థలు, కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నది. ‘అడ్వెంచర్’కు కేరాఫ్ గండికోట వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాంతాన్ని ఎకో, అడ్వెంచర్ టూరిజానికి చిరునామాగా మార్చేందుకు ఏపీటీడీసీ ప్రణాళికలు రూపొందించింది. గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోటలో ఇప్పటికే అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఎర్రమల కొండలను చీలుస్తూ వేగంగా ప్రవహించే పెన్నానదిలో బోటింగ్ సౌకర్యాలను మెరుగుపర్చనుంది. వీటితో పాటు అంతర్జాతీయ హోటల్ రంగ సంస్థ ఒబెరాయ్ త్వరలో ఏడు నక్షత్రాల హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించనుంది. కృష్ణానదిపై ‘రోప్ వే’ విజయవాడలోని భవానీ ద్వీపం అభివృద్ధిలో భాగంగా రోప్‌వే ప్రాజెక్టును ప్రతిపాదించింది. విజయవాడలోని బెరంపార్కు నుంచి భవానీద్విపంలోకి కృష్ణా నదిపై 1.2 కిలోమీటర్ల ఏరియల్ పాసింజర్ రోప్‌వేను నిర్మించనుంది. దీంతో రాష్ట్రంలో ఆరుచోట్ల పాటు సీప్లేన్, మరో ఫైవ్‌స్టార్‌హోటల్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తున్నది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కన్వెక్షన్ సెంటర్‌తో కూడిన హోటల్ నిర్మాణం, తిరుపతి జిల్లాలోని తుపిలిపాలెం బీచ్‌లో హోటల్ సౌకర్యంతో కూడిన బీచ్ రిసార్టు, నంద్యాల జిల్లాలో వెల్నెస్ టూరిజం, వేసైడ్ ఎమినిటీస్ కల్పనకు టెండర్లు ఆహ్వానించింది. -
గ్రూప్–2 పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ.. దరఖాస్తు గడువును మరో వారం రోజల పాటు పొడిగించింది. వాస్తవానికి బుధవారంతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ తెలిపారు. ప్రిలిమ్స్ నిర్వహణ తేదీలో మార్పు లేదని, ఫిబ్రవరి 25నే పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.inలో చూడవచ్చని పేర్కొన్నారు. చదవండి: Group 2 Preparation Plan: గ్రూప్–2పై గురిపెట్టండిలా! -
సుజల సీమ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి దుర్భిక్ష రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసే దిశగా గత 56 నెలలుగా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. వీటి ద్వారా 2019 నుంచి ఏటా గరిష్టంగా నీటిని తరలిస్తుండటంతో రాయలసీమ సుభిక్షమైంది. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన లక్కవరం ఎత్తిపోతలను పూర్తి చేసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలను సస్యశ్యామలం చేశారు. అవుకు రెండో టన్నెల్‌ను పూర్తి చేసి గాలేరు–నగరి కాలువ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు 20 వేల క్యూసెక్కుల తరలింపునకు మార్గం సుగమం చేశారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. శ్రీశైలంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉన్నా రోజుకు మూడు టీఎంసీలు తరలించి సాగు, తాగునీరు అందించడానికి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపు పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ► చంద్రబాబు అధికారంలో ఉండగా తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి నిల్వ చేయాలనే ఆలోచన కూడా చేయకుండా రైతుల ప్రయోజనాలను కాలరాశారు. వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్‌కు 5వేల క్యూసెక్కులను తరలించేలా తవ్విన తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేయకపోవడంతో 2 వేల క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి నాడు నెలకొంది. బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు కాగా మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున నాలుగైదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి టీడీపీ హయాంలో ఉత్పన్నమైంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక బీసీఆర్ (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్) నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్, వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకూ తెలుగుగంగ ప్రధాన కాలువకు రూ.600 కోట్లు వెచ్చించి లైనింగ్ పనులను సీఎం పూర్తి చేశారు. దీంతో 2019 నుంచి వరుసగా ఏటా వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపగలిగారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేయడంతో 2021–22 నుంచి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ► అవుకు జంట సొరంగాల్లో ఫాల్ట్ జోన్ (పెలుసుమట్టి)లో పనులను చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఒక టన్నెల్లో కాలువ (లూప్)తో సరిపుచ్చారు. గండికోట నిర్వాసితుల పునరావాసాన్ని పట్టించుకోకపోవడంతో నాడు కేవలం నాలుగైదు టీఎంసీలే నిల్వ చేశారు. పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లను గత సర్కారు గాలికి వదిలేసింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించకకుండా, ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపుకొట్టారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అవుకు మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు 10వేల క్యూసెక్కులను తరలించేలా సిద్ధం చేశారు. రెండో సొరంగం ఫాల్ట్ జోన్లో మిగిలిపోయిన పనులను సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తద్వారా గాలేరు–నగరి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి లైన్ క్లియర్ చేశారు. వరద కాలువ సామర్థ్యం పెంపు పనులను శరవేగంగా చేస్తున్నారు. అవుకు మూడో సొరంగం పూర్తి కావస్తోంది. వెయ్యి కోట్లతో గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయిలో 26.85 టీఎంసీలను మూడేళ్లుగా నిల్వ చేసి రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు. పైడిపాలెం (6టీఎంసీలు), వామికొండసాగర్(1.6టీఎంసీలు), సర్వారాయసాగర్ (3.06 టీఎంసీలు)లోనూ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేçస్తున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.600 కోట్లతో పునరావాసం కల్పించి 10 టీఎంసీలను నిల్వ చేశారు. ► దివంగత వైఎస్సార్ పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానంటూ చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను కూడా బాబు పూర్తి చేయలేకపోయారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా ఏ ఒక్క ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా రైతులకు ద్రోహం చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు పనులను చేపట్టారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరిని అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు. ఏటా డిజైన్ సామర్థ్యం కంటే అధికంగా హంద్రీ–నీవా నీటిని తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పానికి తరలించేందుకు మార్గం సుగమం చేశారు. హక్కుల పరిరక్షణ ► విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం అధికారికంగా గుర్తించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించడం ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్ పరిరక్షించారని న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నాగార్జున సాగర్ స్పిల్‌వేలో సగభాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను అధీనంలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడబోమని గట్టి సందేశం ఇచ్చారు. ► శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను సీఎం చేపట్టారు. ఇది పూర్తయితే సీఎం జగన్‌కు ప్రజామద్దతు పెరిగి రాజకీయంగా తనకు నష్టం చేకూర్చుతుందనే ఆందోళనతో బాబు ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడ్డారు. సీఎం ఈ అడ్డంకులన్నిటినీ అధిగమిస్తూ పనులను శరవేగంగా పరుగులెత్తిస్తున్నారు. -
జగనన్న కాలనీలకు స్వాగత ద్వారాలు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద నిరుపేదలకు ప్రభుత్వం గృహ యోగం కల్పిస్తోంది. జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి గేటెడ్ కమ్యూనిటీల రీతిలో తీర్చిదిద్దుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 75 వేల కోట్ల విలువ చేసే స్థలాలను 30.7 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 2.70 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తోంది. కాలనీల్లో మౌలిక వసతులను కల్పించి గేటెడ్ కమ్యూనిటీల్లా రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 25 అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న కాలనీలకు స్వాగత ద్వారాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 5,684 ఆర్చిల నిర్మాణానికి శ్రీకారం 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ+2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సాధారణ ఇళ్లు నిర్మిస్తున్న 5,684 కాలనీలకు ఆర్చ్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇప్పటికే ఈ పనుల కోసం 2,314 ప్రాంతాల్లో టెండర్లను ఖరారు చేయగా వీటిలో 594 కాలనీల్లో పనులు ప్రారంభించారు. పలు కాలనీల్లో వీటి నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ. 32,909 కోట్లతో కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, నీటి సరఫరా తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. -
షరతులతో చంద్రబాబుకు ముందస్తు బెయిల్
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ అప్పటి కమిషనర్ శ్రీ నరేష్ లకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. ఇప్పటి నుంచి వారంలోపు దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని చంద్రబాబు, రవీంద్ర, శ్రీ నరేష్‌లను హైకోర్టు ఆదేశించింది. రూ. లక్షకు రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలంది. ముందస్తు బెయిల్‌పై విడుదలైన తరువాత ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని చంద్రబాబు తదితరులను ఆదేశించింది. అయితే 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని దర్యాప్తు అధికారికి స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ఈ కేసుల గురించి తెలిసిన వ్యక్తిని.. ఆ కేసుల వాస్తవాలను కోర్టుకు గానీ, పోలీసులకు గానీ చెప్పకుండా బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ, వాగ్దానాలు చేయడం గానీ ఎంత మాత్రం చేయడానికి వీల్లేదంది. ఈ కేసులకు సంబంధించి ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయడానికి వీల్లేదని బాబు తదితరులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు బుధవారం తీర్పులు వెలువరించారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడంలేదు.. తాను వెలువరించిన ఈ తీర్పులు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఇవ్వడం లేదని, ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కేవలం ప్రాథమికమైనవేనని, కేవలం ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణకే ఈ అభిప్రాయాలు పరిమితమని న్యాయమూర్తి తన తీర్పుల్లో పేర్కొన్నారు. ఈ తీర్పుల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రభావితం కాకుండా దర్యాప్తును కొనసాగించుకునే స్వేచ్ఛ దర్యాప్తు సంస్థకు ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఇటీవల కొన్ని మీడియా చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా, సాక్షులను బెదిరించేలా మాట్లాడారని, ఈ విషయాన్ని ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పునిచ్చే సమయంలో పరిగణనలోకి తీసుకోవాలన్న సీఐడీ మెమోపై కూడా న్యాయమూర్తి తన తీర్పులో చర్చించారు. లోకేశ్ ఇంటర్వ్యూ ఆధారంగా బాబు ముందస్తు బెయిల్‌ను నిర్ణయించజాలమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. గతంలో పూర్తయిన వాదనలు కావాల్సిన వారి కోసం ఐఆర్ఆర్ అలైన్మెంట్లో మార్పులతో పాటు క్విడ్ ప్రో కోకు పాల్పడినందుకు సీఐడీ కేసు నమోదు చేసి అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి మంత్రులు నారాయణ, లోకేశ్ తదితరులను నిందితులుగా చేర్చింది. అలాగే, ఉచిత ఇసుక పథకం పేరుతో కోట్లాది రూపాయలు ఖజానాకు నష్టం కలిగించినందుకు సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక బాబు సీఎంగా ఉండగా తమ పార్టీకి చెందిన నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చడం వల్ల ఖజానాకు రూ. 1,500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, చంద్రబాబులపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వారు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై వేర్వేరుగా న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ఇటీవల ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలన్నింటిపై బుధవారం మధ్యాహ్నం ఆయన తన తీర్పును వెలువరించారు. ఓటుకు కోట్లు కేసు విచారణ ఏప్రిల్‌కు వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చేర్చాలని, ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ బుధవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవిందకుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందుకువచ్చింది. తెలంగాణ రాష్ట్రం తరఫు న్యాయవాది విచారణ వాయిదా వేయాలని లెటర్ సర్క్యులేట్ చేసిన కారణంగా విచారణ వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఏప్రిల్ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. -
విద్యుత్ డిమాండ్‌కు తగిన ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని, దానికి తగినట్లు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్కో చైర్మన్ కె.విజయానంద్ చెప్పారు. దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థలు, ఉత్పత్తి సంస్థలు కలిసికట్టుగా పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలో బుధవారం జరిగిన సదరన్ రీజనల్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) 210వ ఆపరేషన్ కో ఆర్డినేషన్ సబ్‌కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాది ఎవరూ ఊహించని విధంగా రోజువారీ విద్యుత్ డిమాండ్ 265 మిలియన్ యూనిట్లకు చేరిందని గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు సమైక్యంగా పనిచేయాలని గత ఏడాది ఎస్ఆర్పీసీ నిర్ణయించిందని, ఇదే లక్ష్యంతో ఉత్తమ ఫలితాల సాధన దిశగా చర్చించి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ పదిశాతం పెరుగుతుందని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) అంచనా వేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 2030 వరకు విద్యుత్ డిమాండు పెరుగుదల ఇలాగే ఉంటుందని కేంద్ర ఇంధనశాఖ (పవర్ సెక్టార్) కూడా అంచనా వేసిందన్నారు. అందువల్లే గడువు దాటిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసేయకుండా పకడ్బందీగా మరమ్మతులు చేసి 2030 వరకు విద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలని ఆదేశించిందని చెప్పారు. విద్యుత్ ఉత్పాదన సంస్థలు త్వరితగతిన మరమ్మతులు (ఓవరాయిలింగ్) పూర్తిచేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న ప్లాంట్లను పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీకి కొంత అనుకూలం కృష్ణపట్నంలో 800 మెగావాట్లు, డాక్టర్ ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్లు గత ఏడాది సీవోడీ చేసుకుని వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించడం రాష్ట్రానికి చాలా వరకు కలిసి వచ్చే అంశమని చెప్పారు. గత నెలలో డాక్టర్ ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టడంతో అదనంగా 15 నుంచి 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చిందన్నారు. భవిష్యత్తులో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ అంశం థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సవాల్‌గా మారుతుందని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెంపుదల, సరఫరాలో సమస్యలపై చర్చించి ఉత్తమ పరిష్కార మార్గాలకు అన్వేషించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్ కె.వి.భాస్కర్, ఏపీ జెన్కో డైరెక్టర్లు బాబ్జీ (థర్మల్), సయ్యద్ రఫి (హెచ్ఆర్), ఎస్ఆర్పీసీ 210వ ఆపరేషన్ కో ఆర్డినేషన్ సబ్‌కమిటీ మెంబర్ సెక్రటరీ అసిత్సింగ్, పలువురు ఉన్నతాధికారులు, ఎన్టీపీసీతోపాటు దక్షిణాది రాష్ట్రాల ట్రాన్స్‌కో, జెన్కో ప్రతినిధులు పాల్గొన్నారు. -
నాలుగున్నరేళ్లుగా ప్రజారంజక పాలన
‘పేదవాళ్లు పింఛన్ కావాలన్నా.. రేషన్ కార్డును అడగాలన్నా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయినా వారికి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచీ సంక్షేమ పథకాలు అర్హుల ఇంటి గుమ్మంలోకే వస్తున్నాయి. గ్రాఫిక్స్‌లోనే కనిపించిన అభివృద్ధిని గ్రామ స్థాయిలో చేసి చూపించారు సీఎం వైఎస జగన్. అసత్య హామీలతో ప్రజలను చంద్రబాబు వంచించారు. అన్నం పెట్టే జగన్‌ను కాదని.. సున్నం రాసే బాబుకు జనం ఓటేయరు.’ అంటూ మేథావి వర్గం స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ సంయుక్తంగా ‘జగన్ పాలన–ప్రజా తీర్పు’ అనే అంశంపై బుధవారం విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రజా సదస్సు నిర్వహించాయి. ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – సాక్షి, అమరావతి విద్యా రంగంలో మరో నార్వేలా ఆంధ్రప్రదేశ్ – ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు సీఎం జగన్ రాష్ట్రంలో విద్యా రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. విద్యా రంగంలో ఏపీ మరో నార్వేగా మారుతోంది. తొలిసారిగా విద్యార్థులకు సీఎం జగన్ 6 లక్షల ట్యాబ్‌లు ఇచ్చారు. రూ. 8 వేల కోట్ల విలువైన కంటెంట్‌ను ఉచితంగా ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టే స్థాయికి తెచ్చారు. దేవాలయాలను పునరుద్ధరిస్తున్నారు. ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందించారు. ప్రతి రంగంలోనూ ఏపీ అభివృద్ధిలో ఉంది. కోవిడ్ సమయంలో సీఎం జగన్ చేపట్టిన చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరణాలు తక్కువ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా సీఎం జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి. అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ నెల 4న ఈనాడులో 53, జ్యోతిలో 50 నెగెటివ్ వార్తలు వచ్చాయి. సాక్షి పత్రికలో ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని ప్రతిబింబిస్తూ కథనాలు వస్తున్నాయి. ఏ పార్టీ లక్షణాలు ఏమిటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరంలేదు. వై నాట్ 175 జరిగి తీరుతుంది సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల వైనాట్ వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుంది. సీఎం జగన్ చెప్పిన వై నాట్ 175 జరిగితీరుతుంది. సీఎం జగన్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా పాలన చేస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టిని తీసుకువస్తున్నారు. ఎల్లో మీడియా విషపు రాతలు, ప్రతిపక్షాల కుట్రలు పటాపంచలయ్యేలా ప్రజలు మరోసారి సీఎం జగన్‌కు పట్టం కడతారు. సీఎం జగన్ పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే చంద్రబాబు స్టేలు తెచ్చి వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారు. – సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం సీఎం జగన్ సంస్కరణలు మంచి ఫలితాలనిస్తాయి సంక్షేమం అంటే మంచి జరగడం. సీఎం జగన్ పాలనలో ఇదే జరుగుతోంది. అన్ని వర్గాలకూ పథకాలు అందుతున్నాయి. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా సీఎం పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆరి్థక సూచీలు వృద్ధిలో ఉన్నాయని కేంద్రమే ప్రశంసిస్తోంది. జగన్ చేస్తున్న సంస్కరణలు భవిష్యతులో మంచి ఫలితాలనిస్తాయి. – గీతావిజన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పొక్కులూరి సుబ్బారావు అది దుష్ప్రచారమే బలిసినొడికీ బక్కోడికీ జరుగుతున్న పోరాటం ఇది. బలిసినోళ్ల వైపు చంద్రబాబు ఉంటే.., బక్కోళ్లకు అండగా సీఎం జగన్ ఉన్నారు. బాబు పాలనలో ఆటోడ్రైవర్లపై వేధింపులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వాహన మిత్రతో జగన్ మమ్మల్ని ఆదుకుంటున్నారు. పేదలకు సంక్షేమ ప«థకాలిచ్చి సోమరిపోతులను చేస్తున్నారనేది దు్రష్పచారమే. – ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి వినోద్ బెస్ట్ సీఎం వైఎస్ జగన్ సంక్షేమం, అభివృద్ధి, అనేక సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యలు నభూతో నభవిష్యతి. రెండేళ్లు కోవిడ్‌లో పోయాయి. ఆ తర్వాత రెండేళ్ల నుంచే అసలు పాలన మొదలైంది. ఈ రెండేళ్లలోనే విద్యా రంగంలో రాష్ట్రం కేరళను అధిగమించేలా చేశారు. మరో ఇరవై ఏళ్లు సీఎంగా జగన్‌కు అవకాశం ఇస్తే అమెరికా, సింగపూర్‌లా ఏపీ ఎందుకు అవదు? పాత ముఖ్యమంత్రిలా గ్రాఫిక్స్ చూపించడం లేదు. పోర్టులు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. ఇంటింటికీ డాక్టర్ వస్తున్నారు. ఇది జరుగుతుందని ఎప్పుడైనా ఊహించామా? రేషన్ ఇంటికే వస్తోంది. ఇలాంటి పాలన, ఇలాంటి సీఎం లేకపోతే రాష్ట్రం మరో 75 ఏళ్లు వెనక్కి పోతుంది. – ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ అశోక్ కుమార్ అందరికీ మంచి జరుగుతోంది గత ప్రభుత్వంలో సబ్సిడీ లోన్ అని మూడో వంతు లంచాల రూపంలో తినేశారు. సీఎం జగన్ మమ్మల్ని ప్రతి దేవాలయంలో బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తున్నారు. జగనన్న చేదోడు ద్వారా సాయం చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటిచ్చారు. నాయీ బ్రాహ్మణులకు గతంలో కనీస వేతనాలు కోరినా ఇవ్వలేదు. సీఎం జగన్ గుడిబయట ఉండే నాయీ బ్రాహ్మణులను గుడిలోపలికి తీసుకువచ్చారు. క్షౌరశాలల్లో రూ.20 వేల జీతం ఇస్తున్నారు. – నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు గణపతిరావు, మల్కాపురం కనకారావు సీఎం జగన్ పాలన కోల్పోతే రాక్షస పాలన వస్తుంది సీఎం జగన్ పేదల సంక్షేమం, రాష్టర సమగ్రాభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్నారు. ఆయన క్రిస్టియన్ అయితే అనేక దేవాలయాలను అభివృద్ధి చేస్తారా? సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న జనరంజక పాలనను కోల్పోతే రాక్షస పాలన వస్తుంది. – ప్రొఫెసర్ రాచకొండ ముత్యాలరాజు అభివృద్ధికి ఇదే నిదర్శనం రాష్ట్రంలోని బ్యాంకుల్లో డిపాజిట్లు గతంలోకంటే ఇప్పుడు రూ.85 వేల కోట్లు పెరిగాయి. అభివృద్ధికి ఇదే నిదర్శనం. ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. పరిశ్రమలు పారిపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ ఏటా ప్రథమ స్థానంలో ఉంటుందా? అన్నం పెట్టే జగన్‌కే ప్రజలంతా ఓటేస్తారు. అబద్ధాలు, మోసాలతో సున్నం రాసే చంద్రబాబుకు జనం ఓటేయరు. – బెటర్ ఆంధ్రప్రదేశ్ సంస్థ అధ్యక్షుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎల్లో మీడియాదంతా అసత్య ప్రచారమే చంద్రబాబుని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ఎల్లో మీడియా మొత్తం అసత్య ప్రచారం చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలి. పెత్తందారుల పాలనను రానివ్వకూడదు. సీఎం జగన్ రూపాయి అవినీతి లేకుండా రూ. 2.50 లక్షల కోట్లు ప్రజలకు అందించారు. వాటి ద్వారా మన రాష్ట్ర ఆరి్థక వ్యవస్థ బాగుపడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలొచ్చాయి. రాష్ట్రానికి ఆస్తుల కల్పన జరిగింది. – ఎన్నారై వెంకట్ మేడపాటి ఇప్పుడున్నది ఆరోగ్యవంతమైన సమాజం సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా ముందుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది ఆరోగ్యవంతమైన సమాజం. సీఎం జగన్ నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తున్నారు. వ్యవసాయ రంగానికి భరోసా కల్పిస్తున్నారు. హెల్త్ క్లినిక్‌లు, ఆర్బీకేలతో గ్రామీణులకు మేలు చేస్తున్నారు. – సోషల్ వర్కర్ వెంకటరెడ్డి పేద పిల్లలు విదేశాల్లో చదవడం చిన్న విషయం కాదు సీఎం జగన్ విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలకోర్చి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకొనే పేద పిల్లల కలలను సాకారం చేస్తున్నారు. వారికి అయ్యే ఖర్చంతా చెల్లిస్తున్నారు. పేద పిల్లలు విదేశాల్లో చదవడం చిన్న విషయం కాదు. – విశ్రాంత అధ్యాపకులు రెహమాన్ సాయెబ్ ఏపీ తలెత్తుకొనేలా జగన్ పాలన ఏపీ తలెత్తుకొనేలా సీఎం జగన్ పాలన సాగుతోంది. చంద్రబాబు హయాంలో ఒక్క పోర్టు, ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారు. సీఎం జగన్ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నారు.17 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారు. 2.94 లక్షల ఉద్యోగాలిచ్చారు. కేంద్ర ఈపీఎఫ్ లెక్కల ప్రకారం 16 లక్షల ఉద్యోగాలొచ్చాయి. – సామాజిక కార్యకర్త గూడపురెడ్డి శేఖరరెడ్డి సుపరిపాలనంటే ఇదీ సుపరిపాలన అంటే సీఎం జగన్ అందిస్తున్న పాలన. ప్రతి పేదవాడికీ ఇల్లు ఇస్తున్నారు. కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముంగిటకే తెచ్చారు. గతంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహించారు. – హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధి ముక్కు వెంకటేశ్వరరెడ్డి మదర్ థెరిసా ఆదర్శంగా జగన్ పాలన మదర్ థెరిస్సాను సీఎం జగన్ ఆదర్శంగా తీసుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు నవరత్న పథకాలు అందిస్తున్నారు. పని చేయని వారు పని చేస్తున్న వారిని విమర్శించడం సహజం. – గుంటూరు ఏసీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ పోలే ముత్యం బ్రాహ్మణులకు మేలు చేస్తున్న సీఎం జగన్ రాష్ట్రంలో బ్రాహ్మణులకు సీఎం వైఎస్ జగన్ చాలా మేలు చేస్తున్నారు. వంశ పారంపర్య వ్యవస్థను పునరుద్ధరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కామన్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు. ధూప దీప నైవేద్యాలకు, అర్చకుల వేతనాలను కూడా భారీగా ఇస్తున్నారు. – అర్చకులు ప్రసన్నాంజనేయ కుమారశర్మ -
నేటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మికులు
సాక్షి, అమరావతి: పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు గురువారం నుంచి విధుల్లో చేరేందుకు అంగీకరించారు. నాలుగు రోజుల క్రితం జరిగిన చర్చల్లో అన్ స్కిల్డ్, స్కిల్డ్ వర్కర్లకు ఒకే తరహా వేతనాలు మినహా, మిగిలిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రుల బృందం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం మరోసారి సచివాలయంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. సీవరేజీ మరణాలకు సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా రూ.30 లక్షలు పరిహారం చెల్లింపు, సరండర్ లీవ్ బిల్లులు విడుదల, రెగ్యులర్ కార్మికులకు పీఎఫ్ అకౌంట్ చెల్లింపు, పారిశుద్ధ్య కార్మికులు కానివారి కేటగిరీల మార్పు విషయంలో ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలపై సత్వరమే చర్యలు తీసుకుంటామని గతంలోనే మంత్రుల బృందం హామీ ఇచ్చింది. అలాగే గతంలో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంపును కూడా అంగీకరించింది. కాల్వలు, బాత్రూం క్లీనర్స్, సీవరేజ్, గార్బేజ్ సిబ్బంది, మలేరియా వర్కర్స్ వంటి 10 కేటగిరీల సిబ్బందికి ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేలు వేతనం, రూ.6 వేల అలవెన్సు మొత్తం రూ.21 వేలను ఒకేసారి వేతనంగా ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అండర్ గ్రౌండ్ గ్రైనేజీ కార్మికులు, డ్రైవర్లకు 18,500 వేతనం, రూ.6 వేలు అలవెన్సులు కలిపి రూ.24,500 ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలతో పాటు సమ్మె కాలానికి కూడా కార్మికుల వేతనాలను చెల్లిస్తామన్నారు. ఈ సందర్భంగా కార్మికులపై నమోదైన కేసులను ఎత్తివేయనున్నట్టు ప్రకటించారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి కొత్త బట్టల కొనుగోలుకు రూ.1,000 ఇస్తామన్నారు. 2019 నుంచి మరణించిన కార్మికుల కుటుంబాలు ఎక్స్‌గ్రేషియా పొందేందుకు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని, జీవో ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే రెండు నెలల్లో ఎక్స్‌గ్రేషియా ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని, గురువారం సాయంత్రానికి మినిట్స్ ఇస్తామని మంత్రి బొత్స ప్రకటించారు. చర్చలు సానుకూలంగా జరిగాయని, సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. గురువారం నుంచి కార్మికులు విధుల్లోకి వస్తారన్నారు. జీవో వచ్చాక సమ్మెను విరమిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు ఆనందరావు, వై.వి.రమణ (వైఎస్సార్టీయూసీ), ఎ.రంగనాయకులు (ఏఐటీయూసీ), పి.సుబ్బారాయుడు (ఏఐటీయూసీ), అబ్రహం లింకన్ (ఐఎఫ్టీయూ), జి.ప్రసాద్, కె.ఉమామహేశ్వరరావు (ఏపీసీఐటీయూ), జి.రఘురామరాజు, శ్యామ్ (టీఎన్టీయూసీ), మధుబాబు, ఆంజనేయులు (ఏపీఎంఈడబ్లు్యయూ), జీవీఆర్కేహెచ్ వరప్రసాద్, కె.శ్రీనివాసరావు (ఏఐసీటీయూ) పాల్గొన్నారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చర్చల అనంతరం రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల విజ్ఞప్తి మేరకు పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీల్లో) పని చేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల విధుల స్వభావాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ కమిషనర్లు, సీడీఎంఏ అధికారులు, యూడీఏల వైస్ చైర్మన్లతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఆయా విభాగాల్లో స్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బంది విధులు, అందిస్తున్న వేతనాలపై అధ్యయనం చేసి ఏడు రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు. -
కాకినాడకు మరో కిరీటం
రామాయపట్నం.. మూలపేట.. మచిలీపట్నం పరంపరలో రాష్ట్రంలో మరో పోర్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే మూడు పోర్టులు (కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్, రవ్వ క్యాపిటివ్) ఉన్న కాకినాడ సిగలో త్వరలో మరో పోర్టు చేరనుంది. కాకినాడ సమీపంలోని తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద సుమారు 1,944 ఎకారాల్లో కాకినాడ సెజ్ గేట్‌వే పోర్టు (కే–సెజ్ పోర్టు)ను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మిస్తున్న ఈ పోర్టు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. తొలిదశలో సుమారు రూ.2,123.43 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఏడాదికి 16 మిలియన్ టన్నుల సామర్థ్యం, నాలుగు బెర్తులతో అరబిందో గ్రూపు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. 2023 ప్రారంభంలో మొదలైన ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. పోర్టు నిర్మాణంలో కీలకమైన నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్‌ను నిర్మించడానికి 12 లక్షల టన్నుల రాయిని ఇప్పటివరకు వినియోగించారు. బ్రేక్ వాటర్ నిర్మాణం ఇప్పటికే 45 శాతం మేర పూర్తికాగా మొత్తం ప్రాజెక్టులో పనులు 18 శాతం వరకు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. – సాక్షి, అమరావతి పర్యావరణ అనుమతులు మంజూరు.. 5,886 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కాకినాడ సెజ్ మధ్యలో ఈ పోర్టు నిర్మాణం జరుగుతోంది. మల్టీ ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ జోన్‌గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఈ మధ్యనే కీలక అనుమతులు లభించాయి. ఈ పోర్టు నిర్మాణాన్ని 2025 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పోర్టులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయంలో 2.70 శాతం ప్రభుత్వానికి రానుండగా.. 31–40 ఏళ్ల వరకు 5.40 శాతం, 41–50 ఏళ్ల వరకు 10.80 శాతం వాటా ఏపీ మారిటైమ్ బోర్డుకు సమకూరనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా 3,000 మందికి పరోక్షంగా 10,000 మందికి చొప్పున మొత్తం 13,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టు లావాదేవీలు, పరిశ్రమల రాకతో రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఆదాయం, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని ఆర్థికవేత్తలు స్పష్టంచేస్తున్నారు. మౌలిక వసతులకు భారీ వ్యయం.. ► కే–సెజ్ గేట్‌వే పోర్టును ఇటు కాకినాడతో పాటు అటు అన్నవరం వద్ద జాతీయ రహదారికి రోడ్డు, రైల్వేలైన్ ద్వారా అనుసంధానించనున్నారు. ► సాగరమాల ప్రాజెక్టుకు కింద 40.కి.మీ మేర నాలుగులైన్ల రహదారిని రూ.1,480 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ► అలాగే, ఈ పోర్టును అన్నవరానికి అనుసంధానిస్తూ రూ.300 కోట్లతో 25కి.మీ మేర రైల్వేలైన్‌ను ఏర్పాటుచేయనున్నారు. ► 24 నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా 400/200 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేయడానికి ట్రన్స్కోకు 64 ఎకరాలను కేటాయించారు. 2,000 ఎంవీఏ విద్యుత్‌ను ఉత్పత్తి సామర్థ్యాన్ని తట్టుకునే విధంగా ఈ సబ్‌స్టేషన్‌ను అనుసంధానిస్తున్నారు. ► ఈ సెజ్‌లోని పరిశ్రమల ద్వారా వచ్చే వ్యర్థాలను శుద్ధిచేయడానికి ఒక ఉమ్మడి ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటుచేయడమే కాకుండా ఈ వ్యర్థాలను గొట్టాల ద్వారా 35 కి.మీ దూరంలోని పాయకరావుపేటవరకు తరలించి అక్కడ నుంచి సుమారు రెండు కి.మీ లోతున సముద్రంలో కలపనున్నారు. ► ఇక్కడ యూనిట్లకు అవసరమైన నీటిని పోలవరం కాలువతో పాటు సుముద్రపు నీటిని శుద్ధిచేసుకుని వినియోగించుకునేందుకు డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ► అన్నవరం నుంచి పోలవరం కాలువ ద్వారా 100 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయడంతో పాటు రూ.100 కోట్లతో డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. రూ.50,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఇలా అన్ని మౌలిక వసతులతో పోర్టు అభివృద్ధి చేస్తుండటంతో ఈ పోర్టు పక్కనే దివీస్ భారీ ఫార్మా యూనిట్, రూ.2,000 కోట్లతో లైఫియస్ ఫార్మా పేరుతో పెన్సులిన్ తయారీ యూనిట్‌ను.. రూ.2,000 కోట్లతో క్యూలే ఫార్మా యూనిట్‌ను అరబిందో ఫార్మా ఏర్పాటుచేస్తోంది. వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఈ సెజ్ ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూ,5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ హైడ్రోజన్, టెక్స్టైల్స్, ఆక్వా, స్టీల్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. కాకినాడ సెజ్‌కు ఆనుకుని ఉన్న ఉప్పాడ వద్ద రాష్ట్ర ప్రభుత్వం మినీపోర్టు తరహాలో భారీ ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తుండటంతో ఆక్వా రంగానికి చెందిన పలు సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే నెక్కంటి సీ ఫుడ్స్, దేవీ ఫిషరీస్, సంధ్య ఆక్వా, కాంటినెంటల్ ఫిషరీస్, ఆదివిష్ణు వంటి పలు సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించి 8,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఇందులో అత్యధికమంది మహిళలు.. పైగా స్థానికులే కావడం గమనార్హం. 2025 నాటికి అందుబాటులోకి తెస్తాం.. ఇప్పటికే కీలకమైన బ్రేక్ వాటర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే డ్రెడ్జింగ్ బెర్తుల నిర్మాణ పనులు ప్రారంభించనున్నాం. బ్యాంకులతో రుణాల ద్వారా నిధుల సమీకరణ పూర్తికావడంతో ఇక పనులు వేగవంతం కానున్నాయి. 2025 ద్వితీయ త్రైమాసికం నాటికి పోర్టును పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – ఓం రామిరెడ్డి, ఎండీ, కాకినాడ గేట్‌వే పోర్ట్స్ లిమిటెడ్ మా వాళ్లకు ఉద్యోగాలొస్తాయన్న ఆశ.. నాకున్న నాలుగెకరాల భూమి సెజ్‌కు ఇచ్చాను. ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మాలాంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. మా వాళ్లు బాగుపడతారనే నమ్మకంతో భూమి ఇచ్చాను. అందుకు తగ్గట్లుగానే సెజ్‌లో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాను. పెద్దగా చదువుకోకున్నా భూమి ఇచ్చాననే కారణంతో ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఫ్యాక్టరీలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. – యాదాల చంటిబాబు. ఆవులమంద, పెరుమాళ్లపురం, తొండంగి మండలం ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయి.. గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. గతంలో పట్టించుకునే వారు కాదు. ఇప్పుడు సెజ్‌లో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సెజ్‌కు భూమి ఇచ్చిన వారిలో నేను ఒకడిని. గత పాలనలో కొంతమందిని బెదిరించి భూములు లాక్కున్నారు. అప్పట్లో నాపై అన్యాయంగా 15 కేసులు బనాయించారు. ఈ ప్రభుత్వం వచ్చాక గత డిసెంబరు 26న 12 కేసులు ఎత్తేశారు. మరో 3 కేసులు నాపై పెండింగ్‌లో ఉన్నాయి. – దూలం శ్రీను, గోర్సపాలెం, తొండంగి మండలం -
టీడీపీ కకావికలం.. పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి రాజకీయం అంతా నాటి నుంచి నేటి వరకు డబ్బుతోనే ముడిపడి సాగుతోంది. అభ్యర్థులను డబ్బు మూటలతో తూకం వేస్తుండటం ఆ పార్టీ సీనియర్ నేతలను నివ్వెర పరుస్తోంది. ఒక్కచోట కూడా గెలవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తుండటం పట్ల అత్యధిక నియోజకవర్గాల్లో నేతల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. దీనికి తోడు మాలోకం లోకేశ్ తీరు కలవర పెడుతోంది. ఇప్పటికే కొందరు నేతలు ఆ పార్టీని వీడటం.. త్వరలో గుడ్‌బై చెప్పేందుకు పెద్ద సంఖ్యలో నేతలు సిద్ధపడుతుండటం బాబును ఆందోళనకు గురిచేస్తోంది. నష్ట నివారణ కోసం మధ్యవర్తులను రంగంలోకి దింపినా ఫలితం కనిపించక తండ్రీ కొడుకులు తలలు పట్టుకున్నారు. సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు సమన్వయకర్తల ఎంపికకు డబ్బు మూటలనే ప్రధాన అర్హతగా నిర్ణయించడం ఆ పార్టీలో సీనియర్ నేతలను కలవరపరుస్తోంది. ఆది నుంచి టీడీపీని నమ్ముకున్న వారిని కాదని.. డబ్బు మూటలను చూపుతున్న వారినే సమన్వయకర్తలుగా నియమిస్తుండటంతో సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ఆ పార్టీని వీడారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. సీఎం వైఎస్ జగన్‌తో కలిసి పని చేస్తానని ప్రకటించారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రూ.20 కోట్లు డిపాజిట్ చేసిన వారికే టికెట్ ఇస్తానంటూ చంద్రబాబు తెగేసి చెప్పడంతో మాజీ మంత్రి పీతల సుజాత ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో తనను కాదని పక్కన పెట్టి.. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తుండటంతో ఆ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మవరం సుబ్బారెడ్డి గందరగోళంలో పడ్డారు. డబ్బు మూటలే ప్రాతిపదికగా సమన్వయకర్తలను చంద్రబాబు మార్చేస్తుండటం.. కేశినేని నాని బాటలోనే సీనియర్ నేతలు ఒకరి వెంట ఒకరు పార్టీని వీడుతుండటంతో ‘దేశం’ కకావికలమవుతోంది. ఎన్నికల షెడ్యూలు వెలువడడానికి ముందే పార్టీ బలహీనంగా మారడంతో తెలుగు తమ్ముళ్లలో హాహాకారాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల్లో రోజురోజుకు మద్దతు పెరుగుతుండటంతో ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అత్యధిక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముందుకు రావడం లేదు. దాంతో ఎన్నికల్లో ఉనికి చాటుకోవడం కోసం జనసేనతో పొత్తుకు చంద్రబాబు పాకులాడారు. కానీ.. క్షేత్ర స్థాయిలో టీడీపీ, జనసేన నేతల మధ్య సఖ్యత కుదరక పోవడంతో పొత్తు కుంపట్లను రాజేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన నేత కందుల దుర్గేష్.. తెనాలిలో జనసేన నేత నాదేండ్ల మనోహర్, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. టీడీపీ బలహీనంగా మారడం.. టీడీపీ–జనసేన పొత్తు కుంపట్లను రాజేస్తుండటంతో 2019 ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమికి ఘోర పరాజయం తప్పదనే భావన ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. అన్నమయ్య టీడీపీలో ఆధిపత్య పోరు సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ కీలక నేతల మధ్య గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ నేనే ఉండాలి.. నేనే పోటీ చేయాలి.. అంటూ సొంత ప్రతిష్టను పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ కత్తులు దూసుకుంటున్నారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న తరుణంలో ఉన్నవాళ్లు కూడా జారిపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుందని అధిష్టానం కూడా చోద్యం చూస్తుండడంతో ఎటూ తేల్చుకోలేక క్యాడర్ అయోమయంలో ఉంది. అన్నిచోట్ల ఇదే తంతు ► రాయచోటిలో ఆర్.రమేష్ కుమార్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా.. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడంతో నాలుగో వర్గం ముందుకు వచ్చింది. ► రాజంపేటలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రాజు, గంటా నరహరి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండగా.. జనసేన కలయికతో క్యాడర్ అయోమయంలో పడింది. ► రైల్వేకోడూరులో టీడీపీ నేత కస్తూరి విశ్వనాథనాయుడు, గతంలో పోటీ చేసిన అభ్యర్థి నరసింహప్రసాద్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. గతంలో చిట్వేలిలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. n మదనపల్లెలో దొమ్మలపాటి రమేష్, శ్రీరామ్ చినబాబు వర్గాల మధ్య అంతర్యుద్ధం సాగుతుండగా, తాజాగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా చేరికతో మూడు వర్గాలు అయ్యాయి. ► తంబళ్లపల్లెలో టీడీపీ నేత శంకర్‌యాదవ్‌తో పాటు మరో ఇద్దరు చక్రం తిప్పుతుండటంతో అక్కడ కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. విశాఖ నుంచి ‘గంటా’ జంప్! ఎన్నికలొచ్చిన ప్రతిసారీ నియోజకవర్గాలను మారుస్తున్న టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఏకంగా విశాఖ జిల్లా నుంచే మకాం ఎత్తివేత విజయనగరం జిల్లా నెల్లిమర్లపై కన్ను సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక నియోజకవర్గం తరిమేస్తే.. మరో నియోజకవర్గం.. ఆ నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం.. ఇలా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ నియోజకవర్గాలను మారుస్తూ.. ప్రజలను ఏమారుస్తూ వస్తున్న టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకుని విశాఖ జిల్లా నుంచే మకాం మార్చేస్తున్నారు. ఇప్పటికే పోటీచేసిన నియోజకవర్గాల్లో ఎక్కడా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో.. ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశం లేకపోవడంతో.. జిల్లా నుంచే జంప్ అవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈసారి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నట్టు సమాచారం. నెల్లిమర్లలో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై సర్వే కూడా చేయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజలు నిలదీస్తారనే భయంతో..! ఒకసారి పోటీ చేసిన ఏ నియోజకవర్గంలోనూ తిరిగి పోటీ చేయకపోవడానికి గంటా వైఖరే కారణమన్న విమర్శలున్నాయి. గెలవకముందు అనేక హామీలిచ్చి ఆ తర్వాత మిన్నకుండిపోవడం ఆయనకు అలవాటు. పోటీ చేసిన స్థానంలో మరోసారి పోటీ చేస్తే ఎక్కడ తనను ప్రజలు నిలదీస్తారోననే భయం గంటాను వెంటాడుతోంది. 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా ప్రజలకు కనిపించకుండాపోయారు. కనీసం ఏ ఒక్కరినీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో మళ్లీ గొంతు విప్పారు. ప్రతి ఎన్నికలకు సీటు మార్చే ఇటువంటి నాయకులను పెట్టుకున్న తెలుగుదేశం పారీ్ట.. ఇప్పుడు వైఎస్సార్సీపీ మీద విమర్శలు చేయడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భీమిలిలోనూ గెలిచే పరిస్థితి లేకపోవడంతో.. టీడీపీ నుంచి 1999లో రాజకీయరంగ ప్రవేశం చేసిన గంటా అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత 2004లో చోడవరం ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2009లో అనకాపల్లికి మకాం మార్చి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. 2014లో భీమిలి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. 2019లో విశాఖ ఉత్తరం నుంచి బరిలో నిలిచి గెలిచారు. తాజాగా భీమిలి నుంచి పోటీ చేద్దామని భావించినా.. గతంలో అక్కడి ప్రజలను పట్టించుకోకపోవడంతో పాటు ఏ రంగంలోనూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. మరోవైపు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నేతృత్వంలో భీమిలిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అంతేకాకుండా ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో తాను భీమిలిలో పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన గంటా విజయనగరం జిల్లాపై కన్నేశారు. టికెట్ మాదంటే మాది అనంతపురం టీడీపీలో కత్తిమీద సాములా అభ్యర్థుల ఎంపిక కళ్యాణదుర్గంలో పయ్యావుల అనుచరుడికి టికెటిస్తే ఓడిస్తామంటున్న తమ్ముళ్లు ధర్మవరంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు టికెట్ల కేటాయించకముందే కత్తులు దూసుకుంటున్న తమ్ముళ్లు అనంతపురం టీడీపీలో అభ్యర్థుల్ని ప్రకటించకముందే నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపులుగా విడిపోయి వైరి వర్గాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. టికెట్ మాదంటే మాది అని సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఇంత జరుగుతున్న టీడీపీ అధినాయకత్వం చోద్యం చూస్తుండడంపై పార్టీ శ్రేణులు అసహనంతో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో టీడీపీలో రెండు మూడు గ్రూపులు తమదే టికెట్ అంటూ సోషల్ మీడియాలో ప్రకటించేసుకుంటుండగా.. చివరికి ఎవరికి టికెట్ దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మాకు కాదని టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల వేళ ఉమ్మడి అనంతపురం టీడీపీలో టికెట్ల ఎంపిక అభ్యర్థుల మధ్య చిచ్చు పెడుతోంది. రేసులో ఉన్న నాయకులు గ్రూపులుగా విడిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ఫలానా వారికే టికెట్ అని కొన్ని గ్రూపులు ట్రోల్ చేస్తున్నాయి. కళ్యాణదుర్గంలో ఉమా మహేశ్వరనాయుడికి ఎమ్మెల్యే టికెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన పయ్యావుల కేశవ్‌కు అనుచరుడు. దీంతో ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం కత్తులు నూరుతోంది. మేం 2014లో గెలిచాం.. 2019లో ఓడిన ఉమాకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశి్నస్తోంది. వీళ్లెవరూ కాకుండా బడా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేస్తారనే ఉద్దేశంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది. అతనికి టికెట్ ఇస్తే ఉమా, ఉన్నం వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాల్వ శ్రీనివాసులు ప్రతి నియోజవర్గంలోనూ గ్రూపులు పోషించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సూరి వర్సెస్ శ్రీరాం 2019లో ఎన్నికల్లో ఓడిపోగానే కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీలోకి వెళ్లిన వరదాపురం సూరి మళ్లీ ప్రత్యక్షమయ్యారు. దీంతో పరిటాల శ్రీరాం–సూరి వర్గాల మధ్య ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నువ్వెంతంటే నువ్వెంతంటూ సవాళ్లు విసురుకుంటున్నాయి. ‘పల్లె’త్తు మాట అనను.. పోరు బాటే ఇన్నాళ్లూ తనకే టికెట్ అంటూ ధీమాగా ఉన్న పల్లె రఘునాథరెడ్డి ఇప్పుడు మండిపడుతున్నారు. ఇక్కడ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు టికెట్ అంటూ ప్రచారం జరగడంతో ‘పల్లె’ వర్గం కత్తులు దూస్తోంది. ఇన్నాళ్లూ కనిపించని కిష్టప్పకు ఇప్పుడే ప్రజలు గుర్తుకొచ్చారా? అంటూ మండిపడుతున్నారు. కదిరిలో కందికుంటకు టికెట్ ఇస్తే ఆయనకు మద్దతు ఇచ్చేదే లేదంటూ అత్తర్ చాంద్‌బాషా బహిరంగంగా చెబుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య నలిగిపోవడమెందుకని చాలామంది కార్యకర్తలు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అలకబూనిన పార్ధసారథి పెనుకొండలోనూ తాజాగా సవితమ్మకు టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో బీకే పార్ధసారథి అలకబూనారు. ‘నేను ఎంపీగా వెళ్లను.. నేనూ ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా’ అంటున్నారు. మడకశిరలో రెండువర్గాల మధ్య చిచ్చురేపి తిప్పేస్వామి చలికాచుకుంటున్నారని ఎస్సీ, ఎస్టీలు భావిస్తున్నారు. తాడిపత్రిలో జేసీకి సహకరించం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి కొడుకు అస్మిత్‌రెడ్డికి టికెట్ దాదాపు ఖరారైంది. జిల్లాలో ఏ ఒక్క నేత కూడా జేసీకి మద్దతు ఇవ్వడం లేదు. తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన జేసీ సోదరుల పేరు చెప్పడానికి కూడా ఏ నాయకుడూ ముందుకు రాలేదు. శింగనమలలో పోటీచేసి ఓడిపోయిన బండారు శ్రావణికి ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అవమానం జరిగింది. శ్రావణి తండ్రిపై దాడి చేసినా లోకేశ్ పట్టించుకోలేదు. దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. దళితులపై దాడి చేసినా టీడీపీ అధినాయకులు పట్టించుకోలేదని, మళ్లీ టికెట్ కోసం పాకులాడటం అవమానంగా ఆ వర్గాలు భావిస్తున్నాయి. -
రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటంగా జగనన్న విజన్!
ఢిల్లీ, సాక్షి: దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో.. తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్ర సృష్టించబోతోంది. రిపబ్లిక్ డే కోసం శకటాల ఎంపికలో వైవిధ్యతను కనబర్చింది. రాష్ట్రంలోని పరిస్థితులకు తగ్గట్లే.. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్ శకటం ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌కు సిద్ధమైంది. దేశంలో 62,000 డిజిటల్ క్లాస్ రూమ్‌ల బోధన ద్వారా ఏపీ చరిత్ర సృష్టించింది. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను అందించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లక్ష్యానికి తగ్గట్లుగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని దేశం మొత్తం చాటిచెప్పేలా.. శకటం రూపకల్పన జరిగింది. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన శకటం.. అదీ ఏపీ తరఫున తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సందడి చేయబోతోంది. జనవరి 26వ తేదీన కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా కనువిందు చేయనుంది జగనన్న విజన్‌ను ప్రతిబింబించే ఏపీ శకటం. -
కొడుకులా ఆదుకున్నాడు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కొడుకులా ఆదుకున్నాడు.. మాది చాలా నిరుపేద కుటుంబం. భార్యాభర్తలం చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్లం. విశాఖ జిల్లా భీమునిపటా్ననికి చెందిన మాకు ఇద్దరు పిల్లలు. కొడుకు కూలి పనులు చేసుకుంటూ వేరుగా ఉంటున్నాడు. కూతురికి పెళ్లి చేసి పంపాము. మేమిద్దరం జీవనం సాగించడానికి అనారోగ్య సమస్యలతో పాటు వయసు కూడా మీద పడటంతో చాలా ఇబ్బందులు పడేవాళ్లం. రోజులు గడుస్తున్న కొద్దీ బతుకు భారంగా మారడంతో దిక్కుతోచని స్థితికి వచ్చాము. అలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంది. మాలాంటి నిరుపేదలకు కొండంత అండగా నిలబడింది. నాకు చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 వంతున ఇప్పటి వరకు మూడు విడతలుగా రూ.56,250 వచ్చింది. ఆసరా కింద కూడా రూ.20 వేలు వచ్చింది. ఈ సొమ్ముతో మేము ఉంటున్న ఇంటి ముందు చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాము. చుట్టుపక్కల వారు మా వద్దకు వచ్చి టిఫిన్ చేసి వెళతారు. వస్తున్న ఆదాయం మా ఇద్దరికీ చక్కగా సరిపోతోంది. మా ఆయనకు వృద్ధాప్య పింఛన్ కూడా వస్తోంది. ఈ నెల రూ.3 వేలు ఇచ్చారు. ఇప్పుడు మాకు ఎలాంటి ఆందోళన లేదు. హాయిగా ఉన్నాం. మమ్మల్ని పెద్ద కొడుకులా సీఎం జగన్ ఆదుకున్నారు. – బుంగ అన్నపూర్ణ, భీమునిపట్నం (ఎస్.రమణప్రసాద్, విలేకరి, భీమునిపట్నం) ఆనందంగా పంటల సాగు మాది సన్నకారు రైతు కుటుంబం. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో రెండెకరాల పొలం ఉంది. ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో పసుపు, అరటి వేసేవాళ్లం. వ్యవసాయం చేయాలంటేనే ఒకప్పుడు భయం వేసేది. ఎప్పుడూ పెట్టుబడి కోసం అప్పులు చేయడం.. తీరా పంట చేతికొచ్చాక వాటిని తీర్చడం అలవాటుగా మారింది. భార్య నగలు బ్యాంకులో పెట్టి అప్పు తేవాల్సి వచ్చేది. దురదృష్టవశాత్తు ప్రకృతి అనుకూలించకపోతే ఆ ఏడాది అప్పు తీర్చలేక నానా అవస్థలు పడేవాళ్లం. కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. పిల్లలను చదివించుకోవటం ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మాకు వ్యవసాయ పెట్టుబడికి భయం లేకుండా పోయింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 ఇస్తోంది. ఆ డబ్బు సాగు ఖర్చుల కోసం.. ప్రధానంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు ఉపయోగ పడుతోంది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో వ్యయప్రయాసలు తొలిగాయి. ఉన్న ఊళ్లోనే అన్నీ దొరుకుతున్నాయి. కొద్దిపాటి బంగారు నగలు నా భార్య మెడలోనే ఉంటున్నాయి. ఆమె ఇంటిదగ్గర కుట్టు మిషనుపై బట్టలు కుడుతూ కుటుంబానికి తోడ్పాటుగా నిలుస్తోంది. ఆమెకు జగనన్న చేదోడు పథకం కింద ఏటా రూ.పది వేలు అందుతున్నాయి. మా పెద్దబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వాడికి వసతి, విద్యా దీవెన కింద నిధులు జమ అవుతున్నాయి. చిన్నబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. వాడికి అమ్మఒడి కింద ఏటా రూ.15,000 చొప్పున వస్తోంది. వివిధ పథకాల ద్వారా డబ్బులు అందుతుండడంతో అప్పులు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ ఏడాది వరి, పసుపు పంట బాగుంది. మంచి ధర కూడా ఉంది. సంతోషంగా జీవిస్తున్నాం. – కొమ్మారెడ్డి శివప్రసాదరెడ్డి, తూములూరు (బి.ఎల్.నారాయణ, విలేకరి, తెనాలి) ‘పాడి’తో గట్టెక్కాను పాడి పశువులు పెంచుతూ పాల వ్యాపారం చేయడం మా వృత్తి. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో మహిళా స్వయం శక్తి సంఘంలో సభ్యురాలిని. గతంలో పలు సందర్భాలలో రుణం పొందినా, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుతున్న సాయం మాత్రం చాలా ఉపయోగపడుతోంది. ఆసరా కింద ఇప్పటి వరకు రూ.47 వేలకుపైగా నా ఖాతాలో జమ అయింది. దీంతోపాటు బ్యాంకు లోనుకు దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 వంతున ఆర్థిక సాయం అందుతోంది. ఈ మొత్తంతో పాడి గేదెల యూనిట్ ఏర్పాటు చేసుకున్నా. అన్ని ఖర్చులుపోనూ నెలకు రూ.10 వేలకు పైగా మిగులుతోంది. దీంతో నా కుటుంబ పోషణ సులువైంది. నా ఇద్దరు పిల్లలకు పెళ్లి చేశాను. వారిని ఆర్థికంగా నిలబెట్టగలిగానంటే అందుకు నా పాడి వ్యాపారమే కారణం. – గుండుమేను శశిరేఖ, గొల్లపాలెం (తోట సత్యనారాయణ, విలేకరి, మలికిపురం) -
‘జగనన్న మాటే నాకు శిరోధార్యం’
సాక్షి, తాడేపల్లి: ఓ దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నిం చడం నేరమా? అని ఎల్లో మీడియాను నిలదీశారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. నీటి సమస్యలపై అధికారుల్ని నిలదీస్తే.. ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న మాటే తనకు శిరోధార్యమని, ఊపిరి ఉన్నంతవరకూ జగనన్న బాటలోనే నడుస్తానని ఎమ్మెల్యే పద్మావతి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మీడియాతో మాట్లాడుతూ.. నా మాటల్ని ఎల్లోమీడియా వక్రీకరించింది మొన్న నేను ఫేస్బుక్ లైవ్‌లో నీటి కేటాయింపులపై మాట్లాడాను. మా దగ్గర స్థానిక అధికారులు సమస్యల పరిష్కారంపై సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో మాట్లాడాను. అయితే, నా ఆవేదనను ఎల్లోమీడియా పూర్తిగా వక్రీకరించి హైలెట్ చేసింది. నా మాటలు తప్ప వేరే వార్తలేమీ లేనట్టు ఒక రోజంతా పనిగట్టుకుని హైలెట్ చేసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగనన్నకు నేను వ్యతిరేకంగా మాట్లాడినట్లు చిత్రీకరించారు. ఎల్లోమీడియా ఈ విధంగా వ్యవహరించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. మరి, అదే వీడియోలో ‘జగనన్న స్ఫూర్తితోనే మేము ముందుకెళ్తున్నాం..’ అని చెప్పాను కదా..? ఆ మాటల్ని ఎల్లోమీడియా ఎందుకు హైలెట్ చేయలేదు. కొన్ని ఛానెళ్లు ఆ మాటల్ని కట్ చేసి మిగతా విషయాల్ని మాత్రమే ఎందుకు హైలెట్ చేశాయని ప్రశ్నిస్తున్నాను. అధికారుల తీరుపై ఆవేదనతో మాట్లాడా.. మా నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి స్థానిక అధికారులతో నేను చాన్నాళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. కానీ, ఎలాంటి పరిష్కారం లభించనందున.. సీఎం గారికి చెబితేనే ఏ పనైనా అవుతోందని.. లేకుంటే, మా మాటల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించాను. ఆ మాటల్ని కాస్తా.. ఎల్లోమీడియా తమకు అనుకూలంగా నేనేదో సీఎం జగనన్నను తూలనాడినట్లు.. ఆయన్ను ప్రశ్నించినట్లుగా కథనాలు రాశారు. వారి ఛానళ్లుల్లో ప్రసారం కూడా చేశారు. అధికారులపై ఆవేదనతో మాట్లాడాను తప్ప ఎల్లోమీడియా ప్రచారంలో ఉన్న అంశాలేమీ నిజంకాదు. ఎల్లోమీడియా కథనాల్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈనాడు తప్పుడు కథనాన్ని ఖండిస్తున్నాను ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడి దాన్ని ఎవరు మార్చే వీలు ఉండదు కదా..? మరి, ఆ లైవ్‌లో నేనేం మాట్లాడానో.. ఎవరి గురించి ఏం మాట్లాడానో అందరికీ తెలుసు కదా..? అయితే, ఈరోజు ఈనాడు పత్రిక ఏదేదో ఊహించి అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘దళిత మహిళ ప్రశ్నించడమే నేరమా..?’ అనే శీర్షికన కథనం ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీ నేతగా మాట్లాడిన నేను.. ఎవరిని ప్రశ్నించానో.. ఏ అంశంపై నిలదీశాననేది కూడా స్పష్టంగా రాయాలి కదా..? నేను ప్రశ్నించింది అధికారులనే కానీ.. జగనన్నను కాదని మరోమారు స్పష్టం చేస్తున్నాను. జిల్లాస్థాయిలో పరిష్కారం అవ్వాల్సిన సమస్యలపై అధికారులు స్పందించనప్పుడు..జగనన్న దగ్గరకు వెళ్తేనే పనులు అవుతున్నాయని అన్నాను. అందులో తప్పేంటి..?. ఒక వారం రోజుల నీళ్ల కేటాయింపునకూ అధికారులు కుదరదనప్పుడు నాకు బాధ కలిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరికి వారు తమ ప్రాంతాల్లోని సమస్యలు వేగవంతంగా పరిష్కారం కావాలనే తొందరలో అధికారులపైనా కొన్ని వత్తిళ్లు చేయడం సాధారణం. మరి, అలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా హైలెట్ చేసి మా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే ఎల్లో మీడియా పైత్యం ఎంతవరకు సబబు..? సొంతచెల్లెలుగా చూసుకున్న జగనన్న రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలో నేనేదో భారీస్థాయిలో భవిష్యత్తును ఊహించి వచ్చిన మనిషిని కాదు. మేము జగనన్నను 2014 ఎన్నికల ముందు కలిసినప్పుడు.. ఆయనతో మాట్లాడిన రోజే మేమొక స్పష్టతకు వచ్చాం. ప్రజలకు సేవ చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఖచ్చితంగా జగనన్నలాంటి నాయకుడితోనే కలిసి పనిచేయాలనుకున్నాము. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమంలో వారి విజన్‌ను కలిసిన మొదటి రోజునే మేము అర్ధం చేసుకున్నాం కాబట్టి.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జగనన్న తన కుటుంబ సభ్యుల్లాగా.. సొంతచెల్లెలుగా నన్ను చూసుకున్నారు. వారు చెప్పిందే వేదవాక్కుగా పనిచేయడమే తప్ప.. ఏనాడూ వారిని ధిక్కరించే మనస్తత్వం నాదికాదు. ఈ విషయాన్ని మీడియా మొత్తానికి స్పష్టం చేస్తున్నాను. జగనన్న చెబితే పదవి లేకున్నా పార్టీ కోసం పనిచేస్తా నా రాజకీయ భవితవ్యం జగనన్న చేతుల్లోనే ఉంది. ఆయన నన్ను మరలా అదే నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేయమన్నా చేస్తాను. లేదంటే, వేరొకరికి అక్కడ అవకాశమిస్తానన్నా .. నేను అసెంబ్లీ సీటు వదులుకుని పార్టీకి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. అలాంటి నేను వైఎస్ఆర్సీపీని వీడిపోతున్నట్లు.. జగనన్నను వ్యతిరేకిస్తున్నట్లు భిన్న కథనాలు ఎల్లోమీడియాలో రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జగనన్న ఎస్సీలకు చేసిన మేలు దేశచరిత్రలో లేదు ఎస్సీలకు జగనన్న చేసిన మేలు రాష్ట్రంలోనే కాదు. దేశచరిత్రలోనే గుర్తుండిపోయేలా ఆయన మేలు చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేసే నాయకుడిగా జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పదవులు, పనుల్లో 50 శాతం వాటా పొందుతూ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి రావడం అందరూ కళ్లకు కట్టినట్లు చూస్తోన్న నిజం. కనుకనే, ఈరోజు రాష్ట్రంలోని అన్ని వర్గాలూ జగనన్న పరిపాలన పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన చిత్రపటాలు ప్రతీ పేదింట పెట్టుకుని ఆశీర్వదిస్తున్నారు. సమస్యలపై దళిత మహిళ పోరాడకూడదా..? చంద్రబాబును భుజాలపై మోస్తోన్న ఈనాడు పత్రికతో సహా ఇతర ఎల్లోమీడియా ఏం కోరుకుంటున్నాయి..? ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల సమస్యల పరిష్కారం కోసం పనిచేయకూడదనుకుంటున్నాయా..? మా నియోజకవర్గం సమస్యలపై నేను దళిత మహిళగా పోరాడకూడదని మీర నుకుంటున్నారా..? అధికారుల్ని ప్రశ్నిస్తేనే.. మీరు నామీద లేనిపోని కబుర్లు అల్లి విషప్రచారం చేశారే..? జగనన్నకు అపాదిస్తే దళిత మహిళ నోటిని కట్టడి చేయవచ్చనుకున్నారా..? చంద్రబాబు, ఎల్లోమీడియా కట్ట గట్టుకుని వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులుపై, జగనన్న మీద ఎంత విషప్రచారం చేసినా.. మీరు ఆశించేది జరగనే జరగదు. పైగా, మీరెంత తొక్కాలనుకుంటే అంతకంతకు పైస్థాయిలో ఎదుగుతామని తెలుసుకోండి. ఇప్పటికైనా ఈనాడు దినపత్రిక తప్పుడు రాతలు రాయడం మానేయకపోతే దళిత మహిళల ఆగ్రహం ఎలా ఉంటుందో చవిచూస్తారని హెచ్చరిస్తున్నాను.. (అంటూ ఈనాడు దినపత్రికను ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి చింపేశారు) నా జోలికొస్తే కోర్టుకీడుస్తాను చంద్రబాబుకు, ఇతర ఎల్లోమీడియాకు ఒక దళిత మహిళగా నేనొక హెచ్చరిక చేస్తున్నాను. నేను రైట్ పాత్‌లోనే నడుస్తున్నాను. ఊపిరున్నంత వరకు జగనన్న నాయకత్వంలోనే వైఎస్ఆర్సీపీలోనే పనిచేస్తాను. నేను రైట్‌గానే ఆలోచిస్తున్నాను. జగనన్నకు నన్ను దూరం చేయాలనే కుట్రబుద్ధితో ఎవడైనా నా జోలికొస్తే.. ఏ స్థాయి వ్యక్తినైనా కోర్టుకీడ్చి బుద్ధిచెబుతాను. చీడపురుగు చంద్రబాబు దేశం వదిలిపోవాలి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాజకీయానికి దిగజారిపోతున్నాడు. ఆయనకు తోడుగా ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5లు పనిచేస్తూ.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుపై, ఇతర పార్టీ నేతలపై, ప్రభుత్వంపై విషాన్ని కక్కుతున్నారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును నేనొక ప్రశ్న అడుగుతున్నాను. నీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలుండవా..? అలాంటిది, మా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మాకు గొడవలుంటే.. ఎవరి నియోజకవర్గాల్ని వారు అభివృద్ధి చేసుకునే క్రమంలో చిన్నపాటి వివాదాలు పడితే.. మీకేంటి అంత బాధా..? అధికారుల్ని ప్రశ్నించినంతమాత్రానా.. దాన్ని జగనన్నకు అపాదించి నీ ఎల్లోమీడియాలో ప్రచారం చేస్తావా..? నీ కుట్ర బుర్రలో నుంచి వచ్చిన విషపు ఆలోచనేనని మేము గ్రహించాము. జగనన్న రాజకీయ వ్యూహానికి భయపడి నువ్వు ఆంధ్రలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉంటున్నావు. అందుకే, నిన్ను శాశ్వతంగా ఇక్కడ లేకుండా దేశం వదిలిపోయేలా చేయాలని జగనన్నను నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5లాంటి చీడపురుగుల్ని ఏరిపారేయాల్సిన అవసరముందని ప్రజలకు కూడా నేను పిలుపునిస్తున్నాను. -
రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు
సాక్షి, తాడేపల్లి: భారతదేశంలో భూమిపై హక్కులు అనే విధానంపై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 1989లో కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ డీసీ వైద్య ద్వారా కమిషన్ నియమించి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక కోరారని చెప్పారు. ఆ కమిషన్ మన దేశంలో టైటిల్‌కి గ్యారెంటీ ఉండే వ్యవస్థ తీసుకురావాలని సిఫారసు ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తానంతట తానుగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురాలేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తోందని అన్నారు. శిస్తు వసూలు చేసుకోవడానికి 1బీ, అడంగల్ వంటివి మత్రమే తెచ్చారని తెలిపారు. భూమిపై ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాజెక్టులు టేకప్ చేసేలోపు కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా 2019లోనే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రప్రభుత్భం ప్రయత్నించిందని గుర్తుచేశారు. టైటిలింగ్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని, అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించిందని అన్నారు. నీతి ఆయోగ్ సూచనలమేరకు 2019లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపారని తెలిపారు. రెండుసార్లు వెనక్కి వెళ్లొచ్చి.. 2023లో ఆమోదం పొందిందని చెప్పారు. దేశంలోనే సివిల్ కోర్టుల్లోని వివాదాల్లో 66శాతం భూములకు సంబంధించిందేనని చెప్పారు. ఆ 66 శాతంలో లక్ష ఆదాయంలోపు ఉన్నవారి కేసులో 90 శాతం ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం 60 శాతం హత్యలు భూ వివాదాలు వల్ల జరుగుతున్నాయని అన్నారు. దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతుందని, 17 వేల గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల అప్డేషన్, సర్వే జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని, వివాదాలు లేని రికార్డులు తయారవుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో జరుగుతున్న సర్వే గురించి తెలుసుకుంటున్నారని అన్నారు. రికార్డులన్నీ అప్ డేట్ అయ్యాక, సర్వే పూర్తయ్యాక చట్టం నోటిఫై చేస్తామని చెప్పారు. ఇదంతా అయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు చట్టాన్ని ఆగమేఘాలమీద అమలు చేయడం లేదని అన్నారు. అన్నీ చట్ట ప్రకారం జరుగుతాయని, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఎలాంటి రూల్స్ విధించాలో కసరత్తు జరుగుతోందని తెలిపారు. భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన అంశాల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టేకప్ చేసిందని పేర్కొన్నారు. రూల్ ఫ్రెమ్ చేసేటప్పుడు అందరి సలహాలు పాటిస్తామని అన్నారు. న్యాయవాదులు విధులకు హాజరు కావాలని, దేశంలో కంక్లూజివ్ టైటిల్ ఇవ్వడం విశేషమని తెలిపారు. చదవండి: ప్రతి ధర్నాకు ఓ రేటు... అదే వాళ్ల రూటు -
లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు.. అచ్చెన్నాయుడుపై వేటు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నోరు బాగుంటే ఊరు బాగుంటుందని అంటారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిస్థితే అందుకు ఉదాహరణ. పార్టీ లేదు.. బొక్కా లేదు అని, ఆడే బాగుంటే మనకెందుకీ పరిస్థితి అని ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు రాష్ట్ర అధ్యక్షుడే అయినా జిల్లాలో ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న వారు కనీసం ఆయనను సంప్రదించడం లేదు. పైగా అచ్చెన్న పేరు చెప్పుకుని అధిష్టానం వద్దకు వెళ్తే సీటు గల్లంతే అన్న నిర్ణయానికి వచ్చేశారు. మరీ ముఖ్యంగా లోకేష్ ‘అచ్చెన్న అనుచరుడు’ అని ముద్ర ఉన్న వారిని ప్రత్యేకంగా గమనిస్తున్నారని, దీనిపై ఆరా తీసే బాధ్యతను కూడా కళా వెంకటరావు తదితర నేతలకు అప్పగించారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారు అచ్చెన్న ప్రమేయం లేకుండా లోకేష్‌తోనే సంప్రదింపులు జరుపుతున్నారు. చేటు తెచ్చిన మాట.. లోకేష్‌పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఇటీవల చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ప్రజల నుంచి స్పందన రాలేదంటూ ఫోన్ కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు...తనకు సమకాలీనులైన నాయకుల వద్ద లోకేష్‌పై మాట్లాడిన తీరు.. అన్నీ కలిపి ఇప్పుడు ఆయనపై గట్టిగానే ప్రభావం చూపిస్తున్నాయి. పార్టీని, తనను బదనాం చేసిన అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను లోకేష్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు అచ్చెన్నాయుడుపై వేటేస్తే పార్టీకి ఇబ్బంది అని వేచి చూస్తూనే.. వ్యక్తిగతంగా అచ్చెన్నాయుడిని టార్గెట్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీలో అచ్చెన్నాయుడు మాటకు విలువ లేకుండా చేయడంతో పాటు ఆయన అనుచరులుగా పార్టీ టిక్కెట్ ఆశించే వారికి మొండి చేయి చూపే విధంగా లోకేష్ పావులు కదుపుతున్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. దీంతో అచ్చెన్న పేరు చెప్పుకుని టిక్కెట్ అడిగేందుకు ఆశావహులు సాహసించలేకపోతున్నారు. వాస్తవంగా ఈ సారి ఎన్నికల్లో పాతపట్నం, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో టీడీపీలో నెలకున్న అంతర్గత విభేదాల కారణంగా సీట్ల కేటాయింపు విషయంలో నిర్ణయా లు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షు డి హోదాలో అచ్చెన్నాయుడును వెంటబెట్టుకుని అధిష్టానం వద్ద ప్రయత్నాలు సాగించాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. టిక్కెట్ కోసం అచ్చెన్నాయుడు వ్యతిరేక వర్గంగా నిలిచిన లోకేష్ అనుచరులతో పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కళా వెంకటరావుతో టచ్‌లోకి వెళ్తున్నారు. ఆ తర్వాత కూన రవికుమార్ ద్వారా యత్నాలు సాగిస్తున్నారు.. వీరిద్దరూ లోకేష్ తో బాగా టచ్‌లో ఉన్నారు. చెప్పాలంటే అచ్చెన్నకు పోటీగా లోకేషే వీరిని ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. జిల్లాలో ఏం జరిగినా లోకేష్‌కు ఇట్టే సమాచారం ఇస్తున్నారు. అచ్చెన్నతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న నేతలెవరో చెప్పే బాధ్యతను తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీనికంతటికీ తిరుపతి లోకసభ ఉప ఎన్నికల సమయంలో లోకేష్‌పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలే కారణమని చర్చించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు చెప్పిన మనషులకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని, కాస్తో కూస్తో ఎంపీ రామ్మోహన్నాయుడు చెప్పినోళ్లకై నా ప్రాధాన్యత ఇస్తారేమో గాని అచ్చెన్నాయుడు సిఫా ర్సు చేసే వ్యక్తులకు ఛాన్సే లేదని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. దీంతో అచ్చెన్నాయుడుతో కలిసి వెళ్లడానికి, ఆయన సిఫార్సులతో టిక్కెట్ కోసం ప్రయత్నించడానికి జిల్లాలోనే కాదు చుట్టు పక్కల జిల్లాల నుంచి ఏ ఒక్కరూ ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల తర్వాత అచ్చెన్నను పూర్తిగా అణగదొక్కడానికి లోకేష్ ప్రణాళిక సిద్ధం చేశారని పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తోంది. -
కర్నూలుకు కొత్తశోభ
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అవతరించిన తెలుగు రాష్ట్రాల తొలి రాజధాని కర్నూలు.. సీమ ముఖ ద్వారం. విశాఖ, విజయవాడ, గుంటూరు తర్వాత నాలుగో అతి పెద్ద నగరం. కానీ అభివృద్ధిలో వెనుకడుగు. అది నిన్నటి మాట. నేడు కర్నూలు స్వరూపం మారిపోయింది. పాలకుల చిత్తశుద్ధి లేక వెనుకబడిన ఈ ప్రాంతం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నాలుగున్నరేళ్లుగా కర్నూలు నూతన శోభను సంతరించుకుంది. థీమ్ పార్క్‌లు, ఫ్లైఓవర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, రోడ్లు, బ్యూటిఫికేషన్, శానిటేషన్, వీధిదీపాలు.... ఒక్కటి కాదు అన్ని రంగాల్లోనూ, అన్ని రకాలుగా మెట్రోనగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతోంది. క్లీన్‌సిటీగా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెంది స్వచ్ఛతలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. వీధి వ్యాపారులకు కూడా ‘హాకర్స్ జోన్’ ఏర్పాటైంది. –మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి కర్నూలు నాలుగున్నరేళ్లలో మారిన నగర రూపురేఖలు న్యాయ రాజధాని దిశగా అడుగులు లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఆర్సీ సంస్థల ఏర్పాటుతో కళకళ సైన్స్, మ్యూజిక్, కార్టూన్ వంటి 9 థీమ్ పార్క్‌లు ఏర్పాటు షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ స్పోర్ట్స్ అకాడమీలు కార్పొరేషన్లో రూ.720 కోట్లతో అభివృద్ధి పనులు.. రూ.500 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పెద్దాస్పత్రిలో అధునాతన పరికరాలతో పేదలకు మెరుగైన వైద్యం నూతన రహదారులతో రయ్.. రయ్ మంటూ వేగంగా నగరాభివృద్ధి ట్రాఫిక్ కష్టాలు తొలిగేలా ఫ్లై ఓవర్ల నిర్మాణం – తుంగభద్ర పుష్కరాల కోసం శాశ్వతంగా ఘాట్లు క్లస్టర్ యూనివర్శిటీగా రూపుమారిన సిల్వర్‌జూబ్లీ కళాశాల కర్నూలులో అభివృద్ధి పనులు ఇలా.. నాడు–నేడు కింద రూ.34.99కోట్లతో మున్సిపల్ స్కూళ్ల అభివృద్ధి కర్నూలు నగరంలో ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి చేసిన ఖర్చు: రూ.8 కోట్లు 15 వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన అభివృద్ధి ఖర్చు: రూ.45.60 కోట్లు రూ.13.22కోట్లతో డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించారు. రూ.82 కోట్లతో సుంకేసుల నుంచి సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు పైపులైన్ నిర్మించారు. దీంతో నగరవాసులకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరింది. కార్పొరేషన్ పరిధిలోని మునగాలపాడులో రూ. 15కోట్లతో సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించారు. దీంతో కల్లూరు, కార్పొరేషన్ పరిధిలోని కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నారు. రూ.26కోట్లతో నగరపాలక నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. 6.70 కోట్లతో తుంగభద్ర నది వద్ద 7 శాశ్వత పుష్కరఘాట్లు నిర్మించారు. రూ. 8 కోట్లతో వెంకటరమణ కాలనీలో మోడరన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. రూ. 2 కోట్లతో బిర్లాగేట్ వద్ద ‘ఖానా–ఖజానా’ పేరుతో ఈట్‌స్ట్రీట్ నిర్మించారు. నగరశివారులోని రుద్రవరంలో 27 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు రూ. 252కోట్లతో అమృత్ కింద తాగునీటి పథకాలు, 16 ఉపరితల రక్షిత నీటి ట్యాంకులు నిర్మించారు. కర్నూలు మార్కెట్‌యార్డులో రూ.6.50కోట్లతో జంబోషెడ్డు నిర్మిస్తున్నారు. పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.16కోట్లతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ కార్యాలయాన్ని నిర్మించారు. కర్నూలు పురోగతి ఇలా.. ► గడపగడపకు మొదటి దశలో మంజూరైన నిధులు (రోడ్లు, డ్రైనేజీలు, సచివాలయాలకు) రూ.17. 99 కోట్లు ► గడపగడపకు రెండో దశలో మంజూరైన నిధులు రూ.22.53 కోట్లు ► పట్టణ ఆరోగ్య కేంద్రాలు, భవనాలు, యూపీహెచ్సీ మరమ్మతులకు రూ. 14.82.కోట్లు ► నీటి శుద్ధి కేంద్రాలకు రూ. 13.18 కోట్లు ► రెండో దశ నీటి శుద్ధి కేంద్రాలకు రూ.47.93 కోట్లు ► నీటి శుద్ధి కేంద్రానికి (స్పెషల్ ప్రాజెక్ట్) రూ.15.00 కోట్లు ► థీమ్ పార్కులు (స్పెషల్ ప్రాజెక్ట్) రూ.7. 09.కోట్లు ► మంచినీటి సరఫరా , పైప్‌లైన్ పనులు రూ. 82.00కోట్లు జ్యుడీషియల్ సిటీ.. ► లోకాయుక్త ► మానవహక్కుల కమిషన్ ► ఏపీ ఈఆర్సీ ► వక్ఫ్ట్రిబ్యునల్ ► సీబీఐ కోర్టులు ► నేషనల్ లా యూనివర్శిటీ ► స్టేట్ క్వాజీ జ్యుడీషియల్ అండ్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ ► హైకోర్టు, ట్రిబ్యునల్స్ ► మరో 43 అనుబంధ కోర్టులు ► వీటన్నిటి కోసం 150 ఎకరాలు కేటాయింపు ► మొత్తంగా జ్యుడీషియల్ సిటీ నిర్మాణానికి శ్రీకారం ► టీడీపీ అడ్డుపడటంతో ఒక్క హైకోర్టు వ్యవహారం మాత్రం కొలిక్కి రావల్సి ఉంది మార్పు కోసం నిధుల వరద మొత్తం పనులు: 552 తొలిదశ: 219 పనులు పూర్తయినవి ఖర్చు చేసిన నిధులు: 11.64 కోట్లు రెండో దశ: 144 పనులు పూర్తయినవి ఖర్చు చేసిన నిధులు: 10.16 కోట్లు పురోగతిలో ఉన్నవి: 188 పనులు రోడ్లు, మురుగుకాలవల కోసం చేసిన ఖర్చు గుర్తించిన అభివృద్ధి పనులు: 426 ప్రతిపాదిత ఖర్చు: 54.72 కోట్లు పూర్తి చేసినవి: 272 పనులు చేసిన ఖర్చు: 26.16 కోట్లు వీధిదీపాల కోసం చేసిన ఖర్చు కాలనీల్లో ఏర్పాటు చేసిన వీధిలైట్లు: 220 సెంట్రల్ మీడియన్ లైట్లు: 96 వీటి కోసం చేసిన ఖర్చు: 66 లక్షలు పట్టణంలోని మొత్తం పార్కులు: 156 వీటిలో అభివృద్ధి చేసిన పార్కులు: 35 థీమ్ పార్క్ పేరుతో అభివృద్ధి చేస్తున్నవి: 8 పూర్తయినవి: 6 వీటి కోసం చేసిన ఖర్చు: రూ.7.70 కోట్లు శానిటేషన్ డివిజన్ కార్యాలయాల కోసం చేసిన ఖర్చు శానిటేషన్ డివిజన్ కార్యాలయాలు: 16 కొత్తగా నిర్మించినవి: 11 వీటి కోసం చేసిన ఖర్చు: 8.80 కోట్లు కొండారెడ్డి బురుజును ఆధునికీకరించడంతో పాటు పార్క్, లైటింగ్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. ఇందుకోసం రూ.2కోట్లు ఖర్చు చేశారు. అక్కడే షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కృష్ణానగర్, సంతోషనగర్ వద్ద నేషనల్ హైవేపై ఫ్లైఓవర్లు నిర్మించారు. బిర్లాగేట్ నుంచి గుత్తి పెట్రోల్ బంకు వరకూ ఆర్వోబీ నిర్మించారు. నగరంలో ప్రధాన రోడ్లను రూ.65.30కోట్లతో అభివృద్ధి చేశారు. రూ.9.58 కోట్లతో కలెక్టరేట్ ఆధునికీకరణ ► టీడీపీ హయాంలో కర్నూలు నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించకపోగా 2010 ఆగస్టులో పాలకవర్గం గడువు ముగిసింది. ఆ తర్వాత 11 ఏళ్లు పాలకవర్గం లేదు. వైఎస్. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించి 2021 మార్చిలో కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కర్నూలు అభివృద్ధి కోసం రూ.720కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో 1,736 పనులు పూర్తయ్యాయి. ► కలెక్టరేట్,జాయింట్ కలెక్టర్, సీపీఓ కార్యాలయాలు, వీడియో కాన్ఫరెన్స్ హాల్, మినీ కాన్ఫరెన్స్ హాలు, కాన్ఫరెన్స్ హాలు, వ్యవసాయ, సమాచార, పౌరసంబంధాల కార్యాలయాల పనులు పూర్తి. మరో 15శాఖల కార్యాలయాలు త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు. ► స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, థీమ్ పార్క్‌లు ► షటిల్ బ్యాట్మింటన్ ఇండోర్ స్టేడియాలు ► సింథటిక్ టెన్నిస్‌కోర్టులు,క్రికెట్ అకాడమీలు ► మ్యూజిక్పార్క్, సైన్స్‌పార్క్, ► కల్చరల్ పార్క్, ఫ్రూట్ పార్క్, ► గ్లోగార్డెన్, చిల్ర్డన్స్పార్క్లు ► ఒక్కో పార్కు కోసం రూ.1.20 కోట్లు ► చిల్ర్డన్స్ పార్క్ కోసం రూ.1.70 కోట్లు రూ. 65.30కోట్లతో రహదార్లు పురోభివృద్ధి ఆనంద్ టాకీస్ నుంచి కేసీ కెనాల్ అక్విడిక్ట్ వరకూ బ్రిడ్జి!: రూ.3.50కోట్లు బళ్లారి చౌరస్తా నుంచి పెద్దపాడు రోడ్డు వరకూ రోడ్డు నిర్మాణం: 4కోట్లు కర్నూలు పట్టణంలో 9రోడ్లు ఆధునికీకరణకు రూ.9కోట్లు బిర్లా గేట్ నుండి గుత్తి పెట్రోల్ బంకు వరకూ ఆర్వోబీ నిర్మాణం: 18కోట్లు కర్నూలు–సుంకేసుల రోడ్డు: 1.30కోట్లు పీపుల్స్ పార్క్ నుంచి రాజ్ విహార్, కలెక్టరేట్ వరకూ రోడ్డు నిర్మాణం: 9.80కోట్లు (టెండర్ దశలో ఉంది) కర్నూలు–బళ్లారి రోడ్డు విస్తరణ నిర్మాణం: 13.20కోట్లు( పనులు జరుగుతున్నాయి) సఫా కాలేజీ నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకూ రోడ్డు నిర్మాణం: రూ.3.50కోట్లు( పెండింగ్‌లో ఉంది. పూర్తి కావల్సి ఉంది) ఆసుపత్రిలో ఆధునాతన పరికరాలు ► స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం కోసం రూ.120 కోట్లు ► కేతలాబ్ మిషన్ కొనుగోలు కోసం రూ.6కోట్లు మంజూరు ► అకస్మాత్తుగా గుండెనొప్పి బారిన పడినవారి కోసం ‘స్టెమీ ప్రాజెక్టు’ రూపొందించారు. ► కర్నూలు మెడికల్ కాలేజీలో రూ.3.2కోట్లతో ఎగ్జామ్ హాల్ నిర్మిస్తున్నారు. ► రూ. 2.17కోట్లతో కాలిన రోగుల వార్డు నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. ► రూ.12.9కోట్లతో డయాగ్నొస్టిక్ బ్లాక్ నిర్మాణం ► ఈ భవనంపై రూ.3 కోట్లతో మరో రెండు అంతస్తులతో ఐసీయూ నిర్మాణం ► రూ.4.5కోట్లతో బాలికల యూజి, పీజీ హాస్టల్ నిర్మాణ దశలో ఉంది. ► రూ.25 లక్షలతో పుల్లీ ఆటోమేటెడ్ మిషన్ కొనుగోలు ► రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి ► ఎస్ఎన్సియూ, ఎన్ఐసీయూను రూ.70 లక్షలతో ఆధునికీకరిస్తున్నారు. ► రీజినల్ డ్రగ్ టెస్టింగ్ లేబరేటరీని రూ.1.79 కోట్లతో నిర్మిస్తున్న పనులు చివరి దశలో ఉన్నాయి. ► రూ.3.5 కోట్లతో ఆధునిక సిటీ స్కాన్ మిషన్ కొనుగోలు ► 3.5కోట్లతో రెండు న్యూరో మైక్రోస్కోప్స్ కొనుగోలు -
అబద్ధాల గురువు.. బాబుకు దరువు
(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) : ‘ఈనాడు’కు 50 ఏళ్లు. రామోజీకైతే 87. కానీ ఏం లాభం? పత్రికేమో అబద్ధాలకు కేరాఫ్. ఈయనేమో మోసాలకు గురువు. అయినా సిగ్గుండక్కర్లా? 17 ఏళ్లుగా తన ఇన్కమ్ ట్యాక్స్, మార్గదర్శి కేసుల్ని నానబెడుతూ... సాగదీస్తూ... కోర్టులకు అడ్డంపడుతూ వస్తున్న రామోజీ రావు... ‘సాక్షి’లో పెట్టుబడుల కేసుల్ని వాయిదాలతో నెట్టుకొచ్చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేయటమేంటి? మరీ ఇంత పచ్చి అబద్ధాలతో ఈ వయసులో ఏం సాధిస్తావయ్యా రామోజీరావ్!!. చంద్రబాబు కోసం మరీ ఇంత దిగజారిపోవాలా!?. అసలు ఈ కేసుల్లో వైఎస్ జగన్ తరఫున లాయర్లు ఎన్నడైనా కావాలని ఒక్క వాయిదానైనా అడిగారా? ఒక్కసారైనా హాజరుకాకుండా ఉన్నారా? ఎందుకిన్ని అబద్ధాలు? ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు కోర్టు మినహాయింపునిచ్చింది. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు తప్పనిసరిగా ప్రతి వాయిదాకూ హాజరవుతున్నారు. రామోజీ కేసుల్లో కూడా హాజరయ్యేది లాయర్లేగా? మరెందుకు ఈ అరుపులు? ఎన్నికలు వస్తున్నాయనే కదా? గత ఎన్నికల ముందు కూడా ఇంతే. ఈ కేసులు నిరూపణ అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి శిక్ష పడుతుందని పదేపదే రాసి... జనాన్ని భయపెట్టాలని చూస్తే ఏమయింది? మీ అబద్ధాలను నమ్మబోమని మొహమ్మీద ఫెడేల్మని కొట్టి 151 సీట్లతో అఖండ విజయం కట్టబెట్టారు. అయినా బుద్ధి రాలేదా? ఇప్పుడూ అవే రాతలా? ఇంకెన్నాళ్లు రామోజీ!!. అసలు ఈ కేసులేంటి? ఎవరు వేసినవి? ఎప్పటివి? రాష్ట్రంలో ఎల్లో మీడియా అబద్ధాలకు అంతులేకుండా పోతోందని, రెండో కోణాన్ని చూపించే పత్రిక అత్యవసరమని భావించటంతో పుట్టుకొచ్చిన పత్రిక ‘సాక్షి’. పత్రిక భవిష్యత్తుపై నమ్మకం ఉండటంతోనే పలువురు ఇన్వెస్టర్లు దీన్లో పెట్టుబడులు పెట్టారు. వారి నమ్మకం గెలిచింది. ‘సాక్షి’ ఒక మీడియా సంస్థగా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. తమ పెట్టుబడులు అనుకున్నదానికన్నా ఎక్కువ సక్సెస్ అయ్యాయని ఇన్వెస్టర్లు కూడా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు– రామోజీ మాత్రం దీన్ని తట్టుకోలేకపోతున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లూ ఏ కేసులూ లేవు. ఆ పార్టీని వీడటంతోనే కక్ష సాధింపులు మొదలయ్యాయి. తమకు రాజకీయ ప్రత్యర్థిగా అవతరించవచ్చనే భయంతో కాంగ్రెస్... టీడీపీతో చేతులు కలిపి మరీ కుట్రలకు దిగింది. ఇదీ.. బాబు–కాంగ్రెస్ కుట్రకు మూలం అసలు ‘సాక్షి’లోకి వచ్చిన పెట్టుబడులు పెట్టుబడులే కాదని... అదంతా ఆ సంస్థకు వచ్చిన ఆదాయమని, కాబట్టి దానిపై పన్ను కట్టాలంటూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఓ ఐటీ అధికారి ‘సాక్షి’కి అడ్డగోలు నోటీసులిచ్చారు. ఇదే... ఈ కేసుకు మూలం. తమకిలా ఉపకారం చేసినందుకు ఆ అధికారికి తాను అధికారంలోకి రాగానే చంద్రబాబు తగిన కానుక ఇచ్చుకున్నారు. ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి మరీ దానికి సీఈఓను చేశారు. ఈ నోటీసుల్ని ఓ పత్రిక ప్రచురిస్తే... ఆ పత్రిక కథనాన్ని జతచేసి కాంగ్రెస్ నేత శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారు. దాన్ని పిటిషన్‌గా కోర్టు స్వీకరించింది. తమనూ చేర్చాలని టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతి కోరారు. కోర్టు చేర్చింది. నిజానికి అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ కాదు. ఏ మంత్రితోనూ మాట్లాడింది లేదు. నాటి రాజధాని హైదరాబాద్‌లో కూడా ఉండేవారు కాదు. కాంగ్రెస్ బెదిరింపులకు లొంగకపోవటంతో ఎక్కడో బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్‌పై కేసులు పడ్డాయి. కోర్టు తీర్పుతో దర్యాప్తు మొదలయింది. మూకుమ్మడి సోదాలతో భయోత్పాతం ఇక సీబీఐ దర్యాప్తు మొత్తాన్ని తనే నిర్దేశిస్తూ ఎల్లో మీడియా శివాలెత్తింది. నాటి దర్యాప్తు అధికారులు సైతం వందల బృందాలతో వైఎస్ జగన్ ఇల్లు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, ఇన్వెస్టర్ల ఇళ్లు సోదాలు చేసి భయోత్పాతం సృష్టించారు. చివరకు ఏమీ దొరక్క... ఐటీ అధికారి నోటీసులో ఏమయితే పేర్కొన్నారో... దాదాపుగా అవే అంశాలు పేర్కొంటూ 11 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఈడీ కూడా సీబీఐని కాపీ చేసి... అది వేసిన 11 ఛార్జిషీట్లనూ తనూ యథాతథంగా వేసేసింది. అదీ కథ. అంటే అన్నిటికీ మూలం.. బాబు కోసం... ఓ అధికారి ఇచ్చిన ఐటీ నోటీసు. కానీ చివరకు ఏమయిందో తెలుసా? ఆ ఐటీ నోటీసును ఐటీ ట్రిబ్యునల్ కొట్టేసింది. ఆ పెట్టుబడులన్నీ సక్రమమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో... తెలుగుదేశం– కాంగ్రెస్ అధిష్ఠానం కలిసి చేసిన కుట్ర స్పష్టంగా బయటపడింది. పెట్టుబడులు సక్రమమేనని ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునలే చెప్పినపుడు... దాని ఆధారంగా వేసిన ఛార్జిషీట్లు నిలబడతాయా? మరి ఈ కేసులో ఏం ఉందని రామోజీరావు దిగజారి రాస్తున్నారు? చంద్రబాబుకు జీవితాంతం జైలే... స్కిల్ డెవలప్మెంట్ అంటూ సీమెన్స్ కంపెనీకి సంబంధం లేకుండానే ఆ కంపెనీతో నకిలీ ఒప్పందం చేసుకుని... ఏకంగా రూ.241 కోట్లను తన సొంత ఖాతాల్లోకి మళ్లించేసుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు. ఈ కుంభకోణంలో ఇటీవలే 52 రోజులు జైల్లో ఉండి... ఆరోగ్యం బాగాలేదని, పరీక్షలు చేయించుకోవాలని చెప్పి బెయిలు తెచ్చుకున్నాడు. మరోవైపు విజయవాడలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను తమ భూముల మీదుగా మళ్లించి స్కామ్‌కు పాల్పడ్డారనే కేసు కూడా ఈయనపై ఉంది. రాజధాని పేరిట దళితుల అసైన్డ్ భూములను అక్రమంగా హస్తగతం చేసుకున్న కేసు మరొకటి... ఫైబర్‌నెట్ పేరిట తన బినామీ సంస్థ టెరాసాఫ్ట్‌కు అడ్డగోలు కాంట్రాక్టు కట్టబెట్టి నిధులు కాజేసిన కేసు ఇంకొకటి. వీటిలో ఏ ఒక్కకేసు నిరూపణ అయినా... ఏడేళ్లకన్నా ఎక్కువే శిక్ష పడుతుంది. అంటే.. 73 ఏళ్ల చంద్రబాబు ఏ కేసులో నిజం నిరూపణ అయినా జీవితాంతం జైల్లోనే ఉంటారు. మరి ఈ నిజాన్ని మీ పత్రికలో చెప్పరెందుకు రామోజీ? ఎందుకంటే ఆయన మీ.. చంద్రబాబు కాబట్టి!!. అంతేగా? షేరు విలువపై మీరా.. మాట్లాడేది? ‘సాక్షి’ మీడియా సంస్థ 10 రూపాయల విలువైన షేరును రూ.350 చొప్పున ఇన్వెస్టర్లకు విక్రయించిందని, ఇంత ప్రీమియం చెల్లించటమే కుంభకోణమని ప్రతిసారీ రామోజీరావు రాని ఆవేశాన్ని తెచ్చుకుని మరీ ఊగిపోతుంటారు. మరి ‘ఈనాడు’ పత్రిక తన 100 రూపాయల విలువైన షేరును ఏకంగా రూ.5,28.630 చొప్పున విక్రయించింది. పైపెచ్చు ఆ సమయంలో ‘ఈనాడు’ రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉంది. దీనికితోడు పనికిమాలిన పాత సినిమా రీళ్లను రూ.700 కోట్లుగా లెక్కగట్టి అమ్మేసింది. ఇది అసలు ఏ స్థాయి కుంభకోణం? ‘ఈనాడు’ కన్నా మెరుగైన పత్రికను, మెరుగైన డిజైన్, ఆధునిక యంత్రాలతో తీసుకువచ్చినపుడు... షేరును రూ.350కి విక్రయించటం అక్రమమెలా అవుతుంది? పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లంతా సంతోషంగానే ఉన్నారుకదా? ఈ కేసులు గనక లేకుంటే ఏనాడో వారి వాటాలకు పెట్టుబడికన్నా ఎక్కువ విలువ వచ్చి ఉండేది. మరి ఈ వాస్తవాలన్నీ దాచి అబద్ధాల కథనాలెందుకు? ఎన్నికల సమయంలో ఏదో ఒకరకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లాలనుకునే దౌర్భాగ్యపు రాతలు ఇంకెన్నాళ్లు? -
బద్వేల్లో బడుగుల సాధికార పండుగ
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలు సాధికార ఉత్సవం నిర్వహించాయి. సీఎం వైఎస్ జగన్ అందించిన చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధించిన అభివృద్ధిని తెలియజేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వైఎస్సార్సీపీ సోమవారం ఇక్కడ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా పాల్గొన్నారు. యువత కేరింతలు, బాణసంచా, వాయిద్యాలు, జానపద నృత్యాలతో యాత్ర పండుగలా సాగింది. ఆర్థికంగా చేయూతనిచ్చి, రాజకీయ, సామాజిక ప్రాధాన్యతనిచ్చి, ఉద్యోగావకాశాలు కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు అండగా ఉంటామని బడుగు, బలహీన వర్గాలు నినదించాయి. ర్యాలీకి స్థానిక ప్రజలు అడుగడుగునా హారతులు పట్టారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభకు ర్యాలీలో పాల్గొన్న వారితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభలో నాయకులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఇతర వర్గాలకు చేస్తున్న మేలును వివరించారు. ప్రజలు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు చేశారు. ‘జగనే రావాలి.. మళ్లీ జగనే కావాలి’ అంటూ సభ ఆద్యంతం నినాదాలు చేస్తూనే ఉన్నారు. బద్వేల్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం వైఎస్ జగన్‌తోనే నడుస్తామని నేతలు, ప్రజలు మూకుమ్మడిగా ప్రకటించారు. పేదలకు మరింత సంక్షేమం : డిప్యూటీ సీఎం నారాయణస్వామి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయిని పెంచిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. సీఎం జగన్ చేసిన మేలుతో మన కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చాలా చులకనగా చూశారని, హేళన చేసే వారని అన్నారు. కూలివాడి కొడుకు కూలీగానే ఉండాలని ఆలోచించేవాడు చంద్రబాబు అయితే, కూలివాడి కొడుకు కలెక్టర్ కావాలని ఆలోచించి, అందుకు ఏమి చేయాలో అదంతా చేసే వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీ సీఎంలు కూడా సాహసించలేదు: కడప మేయర్ సురేష్ బాబు దేశంలో ఎంతో మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, ఎవరూ పాటించని సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ మాత్రమే చేతల్లో చూపించారని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. జగన్ సీఎం అయ్యాక బ్రహ్మంసాగర్‌కు రూ.600 కోట్లు మంజూరు చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని 17 టీఎంసీలకు పెంచారని తెలిపారు. కలసపాడు, పోరుమామిళ్ల, బి.మఠం మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారన్నారు. ఆడపడుచులకు దేవుడిచ్చిన అన్నయ్య సీఎం జగన్ : మాజీ ఎంపీ బుట్టా రేణుక సీఎం వైఎస్ జగన్ పేదింటి ఆడపడుచులకు దేవుడిచ్చిన అన్నయ్య అని మాజీ ఎంపీ బుట్టా రేణుక చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో వివిధ పథకాల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదును జమ చేస్తున్నారని తెలిపారు. బద్వేలులో రూ.1268.72 కోట్లు : ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బద్వేలు నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ 1,38,763 మందికి రూ.1268.73 కోట్లు నగదు బదిలీ చేశారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చెప్పారు. ఇందులో 88,214 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు రూ.782.72 కోట్లు ఇచ్చారన్నారు. ఈ సంక్షేమం కొనసాగాలంటే జగన్‌ను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ గోపవరం వద్ద రూ.1000 కోట్లతో సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపా«ధి కలి్పస్తున్నారని ఎమ్మెల్యే సుధ చెప్పారు. ఎమ్మెల్సీలు ఇషాక్, రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, జెడ్పీ చైర్మన్ అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. -
AP: ఇదీ మార్పు.. రహదారి రయ్..రయ్..
నాడు ► రాష్ట్రవ్యాప్తంగా రహదార్లు పూర్తిగా నిర్లక్ష్యం ► మరమ్మతుల నిర్వహణను ఏమాత్రం పట్టించుకోని వైనం ► రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లింపు ► 2019 నాటికి రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు ► అప్పుడు భారీ వర్షాలు, మహమ్మారి కోవిడ్ లేదు ► ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధులు రూ.2,953.81 కోట్లు ► ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.591 కోట్లు ► రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు వెచ్చించిన నిధులు రూ.4,325 కోట్లే ► పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.3,160.38 కోట్లు మాత్రమే . ► ఇతరత్రా కలిపి మొత్తంగా 2014 నుంచి 2019 వరకు రోడ్లకు వెచ్చించిన నిధులు రూ.23,792.19 కోట్లు నేడు ► వరుసగా రెండేళ్లు భారీ వర్షాలు, కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రోడ్ల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ► ప్రాధాన్యతా క్రమంలో రహదారుల నిర్మాణం ► ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రహదారులకు మోక్షం ► గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణానికి సత్వర చర్యలు ► రోడ్ల మరమ్మతులకు రూ.4,148.59 కోట్లు ► రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ. 7,340 కోట్లు ► పంచాయతిరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ. 5,443.69 కోట్లు ► జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 25,304 కోట్లు ► మొత్తంగా నాలుగున్నరేళ్లలో వెచ్చించిన మొత్తం రూ.42,236.28 కోట్లు ► మొత్తంగా రోడ్ల నిర్మాణం 7,600 కిలోమీటర్లు -
వ్యవసాయం పండగైంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. వ్యవసాయం పండగైంది నేను మా గ్రామంలో ఎనిమిది ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి పంట పండిస్తున్నా. మాకు సొంతంగా 80 సెంట్ల భూమి ఉంది. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వ్యవసాయం భారమైపోయింది. ఒక దశలో వదిలేద్దామనుకున్నాను. అంతలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడంతో రైతుల దశ మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతును నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని సమయాల్లో అండగా నిలుస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలోనే అని గర్వంగా చెప్పుకోవచ్చు. మాది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామం. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా రూ.63,500, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.1,509, వైఎస్సార్ పంటల బీమా ద్వారా రూ.2,74,592, పంట నష్ట పరిహారం ద్వారా రూ.57,750 ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందింది. ఇంతగా సాయం పొందిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. మా కుటుంబ జీవనం సాఫీగా సాగిపోతోంది. – దునే వీర్రాఘవులు, వెల్ల (నరాల రాధాకృష్ణ, విలేకరి, రామచంద్రాపురం రూరల్) చదువుకు దిగుల్లేదిక మా నాన్న హనుమంతు విజ్ఞేశ్వరరావు షాపులో గుమస్తా. అమ్మ గృహిణి. మాది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. నేను, మా అన్నయ్య ప్రభుత్వం అందిస్తున్న సహాయంతోనే విద్యనభ్యసించగలుగుతున్నాం. నేను పదో తరగతిలో ఉండగా అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి పొందాను. తర్వాత ఇంటర్మీడియట్ రెండేళ్లూ అమ్మ ఒడి తీసుకున్నా. ప్రస్తుతం ఇంజనీరింగ్ (ఇఇఇ) మొదటి సంవత్సరం చదువుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్) కారణంగానే ఇది సాధ్యమైంది. మాలాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. నేను చదువుతున్న ఇంజనీరింగ్ కళాశాలలో ఏటా దాదాపు రూ.70 వేలకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా మాపై భారం పడటం లేదు. ఈ ప్రభుత్వం పుణ్యమా అని రాష్ట్రంలో విద్యా రంగం స్వరూపమే మారిపోయింది. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు భరోసా లభిస్తోంది. స్కూల్ లెవెల్లో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మా లాంటి విద్యార్థుల చదువుకు దిగ్గుల్లేదు. – హనుమంతు హరి, భీమవరం (వీఎస్ సాయిబాబా, విలేకరి, భీమవరం) నెరవేరిన దశాబ్దాల కల మూడు దశాబ్ధాల నుంచి ఏ ప్రభుత్వం మాకు ఇంటి స్థలం ఇవ్వలేదు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయగూడెంలోని రోడ్డు మార్జిన్లో 30 ఏళ్లుగా పూరి గుడిసెలో ఉండేవాళ్లం. రోజు వారీగా కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఇంటి స్థలం ఇప్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. మా గోడు ఎవరూ పట్టించుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వంలో మా పేదోళ్ల గుడిసెలు పీకడానికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులను అడ్డుకుని ప్రతిఘటించాం. అప్పట్లో గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు మాకు అండగా నిలిచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఇళ్ల స్థలాలు ఇచ్చి, గృహాలు మంజూరు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఎవరి సిఫార్సులు లేకుండానే వలంటీర్ మా ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కొద్ది రోజుల్లోనే మాకు ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం పూర్తి కావచ్చింది. నాకు పింఛన్ రూ.3000 వస్తోంది. పెరిగిన పింఛన్‌తో ఎంతో ఊరట లభిస్తోంది. – తమ్మినపూడి రత్నం, సంగాయగూడెం (కాసాని వెంకటేశ్వర్లు, విలేకరి, దేవరపల్లి)