AP Special
-
ఏపీ: ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్సీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సీ రామచంద్రయ్యపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. -
సుందర విశాఖ.. ప్రగతి వీచిక
కేజీ రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మహానగరంగా రూపుదిద్దుకున్న విశాఖపట్నం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఓ వైపు కడలికెరటాల సవ్వడులు... మరోవైపు పచ్చదనం పరచుకున్న ప్రకృతి అందాలు... పెట్టని ఆభరణాలుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇటు విస్తరిస్తున్న ఐటీ రంగం... అటు విద్యాసుగంధాలు వెదజల్లుతున్న సరస్వతీ నిలయాలు నగరానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్నాయి. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఫ్లై ఓవర్లు... మల్టీ లెవెల్ కారు పార్కింగ్ సౌకర్యాలు విశేష గౌరవాన్ని ఆపాదిస్తున్నాయి. ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు... ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన జంక్షన్లు నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖ ఉక్కుకర్మాగారం... ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఓడరేవు... నగర సమీపంలో విస్తరిస్తున్న పారిశ్రామిక వాడలు విశాఖకు విశేష గుర్తింపునివ్వగా... గతేడాది మార్చిలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సన్నాహక సదస్సులతో నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ప్రగతి పథంలో నడుస్తూ కార్యనిర్వాహక రాజధానికి కావలసిన అర్హతలన్నీ పుణికిపుచ్చుకుంది. నాలుగేళ్లుగా అభివృద్ధిలో పురోగమిస్తున్న నగరం విస్తరిస్తున్న ఐటీ రంగం ► రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను బీచ్ ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వాటికోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చింది. ఫలితంగా ప్రధాన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన డెవలప్మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేసింది. దానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు కంపెనీకి వెళ్లేందుకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేశారు. ► ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమెజాన్ తదితర ఐటీ, వాటి అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేశాయి. రుషికొండ ఐటీ సెజ్ లో హిల్ నెంబర్–2లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తొలి విడతలో 1000 మందితో ఇన్ఫోసిస్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ► దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2006లో విప్రో క్యాంపస్‌కు 750 మందితో ప్రారంభించేందుకు వీలుగా స్థలాన్ని కేటాయించారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో 300 మందితో ప్రస్థానం మొదలు పెట్టింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో దశలవారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ► వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ని మార్చాలని నిర్ణయించింది. విశాఖలో స్టార్టప్‌ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) సీఈవో సంజీవ్ మల్హోత్రా ప్రకటించారు. ► ఐటీ రంగంలో విశాఖను అభివృద్ధి చేసేందుకు ఇక్కడే ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా.. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకోసిస్టమ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) సహకారంతో పాటు సంయుక్త సర్టిఫికేషన్ కోర్సుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ► అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెగ్.. విశాఖలో కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది. భారత్‌లో ఢిల్లీ తర్వాత వైజాగ్‌లోనే చెగ్ సంస్థ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం. విశేషం. అంతర్జాతీయ సదస్సులకు వేదికగా... ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన అంతర్జాతీయ ఐటీ సదస్సు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సన్నాహక సదస్సులు సూపర్ సక్సెస్ అయ్యాయి. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఇన్ ఇండియా(ఎన్‌ఎఫ్‌ఐసీఐ) 28వ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశంతో పాటు 12వ సర్వ సభ్య సమావేశాలు, జైళ్ల శాఖ ఎనిమిదో జాతీయ సదస్సు, అగ్రిసదస్సు, ఇలా ప్రతి ఒక్కరికీ విశాఖ ఆహ్వానం పలుకుతోంది. డేటా సెంటర్లు.. స్టార్హోటల్స్కు కేరాఫ్ ఐటీ డెస్టినీగా మారుతున్న విశాఖపట్నంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం కలిగించేలా సీఎం వైఎస్ జగన్ తీర్చిదిద్దారు. అందుకే.. ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు తానే స్వయంగా శంకుస్థాపన చేశారు. ► వైజాగ్ టెక్‌పార్క్ కూడా 39,815 మందికి ఉపాధి కల్పించేలా డేటాసెంటర్‌తో పాటు బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీని రూ.21,844 కోట్లతో ఏర్పాటుకు ముందుకొచ్చింది. ► గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎన్టీపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్‌మాల్, టర్బో ఏవియేషన్.. ఇలా.. విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టుల్ని విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపారు. సరికొత్తగా నగర రహదారులు గుంతల మయంగా ఉన్న రహదారులు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సరికొత్తగా రూపు దిద్దుకున్నాయి. నాలుగేళ్లలో మంజూరైన రహదార్లు: 2089 వెచ్చించనున్న నగదు: రూ.547.45 కోట్లు ఇప్పటివరకూ పూర్తయిన రోడ్లు: 1,216 వీటికి అయిన ఖర్చు: రూ. 202.59 కోట్లు పురోగతిలో ఉన్న రహదారులు: 873 వీటికి చేస్తున్న ఖర్చు: రూ.344.86 కోట్లు కొత్తగా వేస్తున్న రహదారుల పొడవు: 27 కి.మీ. వీటికి వెచ్చిస్తున్న మొత్తం: రూ.104 కోట్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్‌బేలు: 20 వీటికి చేసిన ఖర్చు: రూ.462.70 లక్షలు ట్రాఫిక్ కష్టాలకు ఫ్లైఓవర్‌తో చెక్ అత్యంత రద్దీ కూడలిగా ఉన్న ఎన్ఏడీలో ఫ్లైఓవర్ నిర్మాణానికి వీఎంఆర్డీఏ 2016 నుంచి ప్రయత్నిస్తున్నా అప్పటి టీడీపీ ప్రభుత్వం సరైన సహకారం అందించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూతూ మంత్రంగా 2018 చివర్లో పనులు ప్రారంభించారు. కానీ.. ఎన్నికల ముందు నాటికే బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ పనులు భుజానికెత్తుకొని రూ.150 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఎన్ఏడీ జంక్షన్.. నగర కూడళ్లలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. దీనివల్ల పూర్తిగా ట్రాఫిక్ కష్టాలకు తెరపడింది. పర్యాటకం...మరింత ఆకర్షణీయం.. ► గతంలో విశాఖ పేరు వింటేనే ఆర్కే బీచ్, రిషికొండ, భీమిలి బీచ్ ప్రాంతాలు గుర్తుకువచ్చేవి. ఇప్పుడు పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు వీలుగా ప్రభుత్వం 11 కొత్త బీచ్‌లను అభివృద్ధి చేసింది. ► రూ.12.55 కోట్లతో మొత్తం 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలతో ఎప్పటికప్పుడు బీచ్‌లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఏరివేస్తూ శుభ్రం చేస్తున్నారు. ► ఈ 11 బీచ్‌లను అనుసంధానిస్తూ.. కోస్టల్ బీచ్ మాస్టర్ ప్లాన్‌లో జిల్లాలోని 25 బీచ్‌లు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. భీమిలిలోని పాండవుల పంచ బీచ్, అన్నవరం, భీమిలి, నేరెళ్లవలస, ఎర్రమట్టిదిబ్బలు, ఐఎన్ఎస్ కళింగ, మంగమారిపేట, తొట్లకొండ, తిమ్మాపురం, ఎస్ఈజెడ్, రుషికొండ, ఇస్కాన్ టెంపుల్, సాగర్‌నగర్, జూపార్క్, జోడుగుళ్లపాలెం, తెన్నేటిపార్క్, ఆర్కేబీచ్, రాధాకృష్ణ బీచ్, రాక్‌బీచ్, దుర్గా బీచ్, యారాడ, ప్యారడైజ్, అప్పికొండ, అప్పికొండ–2, అప్పికొండ బ్రిడ్జ్ బీచ్‌లు కొత్తగా పర్యాటకుల్ని స్వాగతం పలకనున్నాయి. ఆరోగ్యప్రదాయినిగా కేజీహెచ్ ► గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌ను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లతో ఆధునికీకరంచింది. ► ఐదు దశాబ్దాల క్రితం ఏర్పడిన క్యాజువాలిటీయే ఇప్పటికీ కొనసాగుతుండగా రెండో క్యాజువాలిటీ నిర్మాణానికి కలెక్టర్ డా. ఎ.మల్లికార్జున రూ.30 లక్షలు కేటాయించి చేసి 15 పడకలతో నిర్మించారు. ► సెకెండ్ క్యాజువాలిటీని రౌండ్‌ది క్లాక్ పనిచేసేగా తీర్చిదిద్దారు. రోగుల కోసం రూ.15 లక్షలతో లేబొరేటరీతో పాటు మొబైల్ ఎక్స్‌రే యూనిట్, అల్ట్రా స్కానింగ్ సిద్దం చేశారు. ఆధునిక సౌకర్యాలు,సెంట్రల్ ఎయిర్ కండిషన్, పడకలు, ఆక్సిజన్, ఇతర సదుపాయాలు కల్పించారు. ► కార్డియాలజీ విభాగాన్ని రూ.24 లక్షల సీఎస్సార్ నిధులతో పునర్నిర్మించారు. ఐసీయూ, ఈకో, స్టేర్ కేస్, ఏసీ సదుపాయం, పెయింటింగ్స్, మరుగుదొడ్లు కొత్తగా తీర్చిదిద్దారు. ► విద్యుత్ ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో కేజీహెచ్‌లో 120 కేవీ సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ► ఓపెన్ హార్ట్ సర్జరీకి అవసరమైన పరికరం దశాబ్దం నుంచి పనిచేయకపోవడంతో శస్త్ర చిక్సితలు నిలిచిపోయాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని టెంపరేచర్ కంట్రోల్ మెషిన్ని మంజూరు చేసింది. ► అకస్మాత్తుగా వచ్చే గుండె నొప్పి బారిన పడేవారికోసం రాష్ట్ర ప్రభుత్వం స్టెమి ప«థకాన్ని రూపొందించింది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రుల్లో దీనిని అమలు చేస్తున్నారు. కార్డియాలజీ వైద్యుల సూచన మేరకు సుమారు రూ.30 వేల విలువైన ఇంజక్షన్ కేజీహెచ్‌లో ఉచితంగా రోగులకు అందిస్తున్నారు. రెండింతల అభివృద్ధి...! 2014–19 వరకూ టీడీపీ చేసిన ఖర్చు: రూ.1450 కోట్లు టీడీపీ ఐదేళ్ల హయాంలో చేపట్టిన పనులు: 4450 2019–2023 వరకూ వైఎస్సార్సీపీ చేసిన ఖర్చు: రూ.2490 కోట్లు వైఎస్సార్సీపీ హయాంలో నాలుగేళ్ల కాలంలో చేపట్టిన పనులు: 9920 గడపగడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన పనులు: 708 దీనికోసం వెచ్చిస్తున్న నగదు: రూ. 66 కోట్లు జంక్షన్లు... జిగేల్ ! ► మహావిశాఖ పరిధిలోని జంక్షన్లు కొత్త రూపును సంతరించుకున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారులు కలిసే జంక్షన్లను విశాలంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా కూడళ్ల వద్ద అందరినీ ఆకట్టుకునేలా అభివృద్ధి చేశారు. ► రైల్వేస్టేషన్ జంక్షన్ వద్ద రైల్వే కోచ్‌తో కూడిన జంక్షన్ నగరవాసులతో పాటు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక బస్టాండ్లను కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దారు. -
తరగతి మారిపోయింది
ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది పిల్లలకు అవార్డులు అందించింది. – సాక్షి, అమరావతి నాడు పెచ్చులూడిన స్లాబులు 4 నెర్రలు బారిన గోడలు విరిగిపోయిన బెంచీలు 4 కటిక నేలపై చదువులు వస్తారో రారో తెలియని అయ్యవార్లు మచ్చుకైనా కనిపించని వాష్ రూమ్‌లు కొన్ని చోట్ల పశువులకు నెలవు ఎక్కడో ఒక చోట మాత్రమే టీవీలు సబ్జెక్ట్ టీచర్లు కరువు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదనేలా ప్రభుత్వ తీరు నేడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా నూతన భవనాలు చిన్నారులను ఆకట్టుకునేలా పెయింటింగ్స్ సైన్స్ ల్యాబ్‌లు సరికొత్తగా డెస్‌్కలు, కుర్చీలు, ఇతర పరికరాలు రన్నింగ్ వాటర్‌తో టాయ్లెట్లు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అదనపు తరగతి గదులు, వంటషేడ్లు పరిశుభ్రమైన మంచి నీరు ప్రతి పాఠశాలకూ రక్షణ గోడ ప్రతి తరగతి గది డిజిటలైజేషన్ మొత్తంగా 12 రకాల సదుపాయాలు ఇంగ్లిష్ మీడియం, బైజూస్ పాఠాలు 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ కౌమార దశలోని బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పథకం మొదటి దశలో రూ.3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసింది. -
సంక్షేమం కొనసాగింపు జగన్‌కే సాధ్యం
డాబాగార్డెన్స్ (విశాఖపట్నం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయననే సీఎంగా గెలిపించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలు ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించలేవని కుండబద్ధలుగొట్టారు. మరే పాకి సంక్షేమ ఫలాలు అందించే సత్తా లేదన్నారు. సంఘ సంస్కర్త జగన్‌ను గెలిపించుకోవల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనాలతో పాటు అన్ని వర్గాల ప్రజలపై ఉందని తెలిపారు. ఆయన ఆదివారం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం ప్రతిపక్ష పార్టీలు బీసీలను ప్రలోభపెడుతున్నాయని, అటువంటి వాటిని తిప్పికొట్టాలన్నారు. బీసీల కోసం అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని స్పష్టంచేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులున్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సంక్షేమ ఫలాలు అమలుకావడం లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఏ నాయకుడు ప్రవేశపెట్టని, అమలుచేయలేని ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ ప్రవేశపెట్టి దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కృష్ణయ్య చెప్పారు. శాసనసభ స్పీకర్ పదవి బీసీ, శాసనమండలి చైర్మన్ ఎస్సీ వర్గానికి ఇవ్వడమే గాక 18 మంది ఎమ్మెల్సీల్లో 11 సీట్లు బీసీలకు కేటాయించడం చూసి దేశంలోని బీసీలంతా ఆశ్చర్యం వ్యక్తంచేశారన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్ చరిత్రను జగన్మోహన్రెడ్డి తిరగరాశారన్నారు. అందుకు వైఎస్సార్ సీపీ రెండేళ్ల కిందట బీసీ బిల్లు పెట్టిందని, మద్దతుగా 14 రాజకీయ పాల మద్దతు కూడగట్టిందన్నారు. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు. చివరకు పార్లమెంట్లో బీసీ పార్టీలుగా చెప్పుకుంటున్న డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాద్ పార్టీ, బీఎస్పీ, ఆప్నాదళ్, జనతాదళ్ వంటి పాలు కూడా బీసీ బిల్లు పెట్టలేదన్నారు. 50 శాతం నామినేటెడ్ పోస్టులు బీసీలకే.. ఏపీలో 50 శాతం నామినేటెడ్ పోస్టులు వెనుకబడిన వర్గాలకు ఇవ్వడమే గాక, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులకు జగన్ సవాల్ విసిరారని కృష్ణయ్య చెప్పారు. 56 బీసీ కులాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. 193 కార్పొరేషన్లకు సంబంధించి 109 కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగిందన్నారు. మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని సీఎం ఆవిష్కరించారని చెప్పారు. ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే..నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనాలకే అవకాశం కల్పించారన్నారు. రాజ్యసభలో 9 మంది వైఎస్సార్ సీపీ సభ్యులుంటే..అందులో ఐదుగురు బీసీలేనని పేర్కొన్నారు. కాగా, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటూ ఈ నెల 29, 30 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించనున్నట్టు ఆర్.కృష్ణయ్య తెలిపారు. -
మనసున్న ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు అత్యధికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ మాజీ ఎంపీ, ఆచార్య అజ్మీర సీతారాంనాయక్ అన్నారు. గిరిజనులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. ఆదివారం విజయవాడలో ‘గిరిజన శంఖారావం’ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీతారాంనాయక్ మాట్లాడుతూ.. ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయడం గొప్ప విషయమన్నారు. ఏపీలో గిరిజనులకు జరుగుతున్నంత సంక్షేమం, అభివృద్ధి దేశంలో మరెక్కడా అందడం లేదని చెప్పారు. అందుకే ఏపీలోని గిరిజనులు జగన్‌ను దేవుడిగా అభిమానిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పపూలు ఏరుకుని బతికే కుటుంబానికి చెందిన తాను ఉమ్మడి ఏపీలో మొదటి పీహెచ్డీ చేసిన గిరిజన వ్యక్తినని చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో ఉన్నతంగా ఎదుగుతామన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యత ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ రాష్ట్రంలోని గిరిజనులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను మరింతగా పెంచాలనే తపనతో పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గిరిజనుల మాట వినే ప్రభుత్వం ఉందని, దాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. కానీ సీఎం జగన్ రెండు మంత్రివర్గాల్లోనూ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీలుగా గిరిజనులకు అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. అడవులకే పరిమితం అనుకున్న గిరిజన బిడ్డలను సీఎం జగన్ రాజకీయ రంగంలో కూడా చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకొని.. మరింతగా అభివృద్ధి చెందుదామని పిలుపునిచ్చారు. జీపీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు జి.మల్లిఖార్జున నాయక్, జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.రాజునాయక్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే గిరిజన తండాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం.. తదితర సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో పెత్తందారులతో జరుగుతున్న యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా, అగ్రవర్ణ పేదల నాయకుడైన సీఎం జగన్‌ను గెలిపించుకుందామని కోరారు. గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కె.రామలక్ష్మి, జె.లిల్లీ, నెల్లూరు నగర మేయర్ పొట్టూరి స్రవంతి, కదిరి రూరల్ జెడ్పీటీసీ కృష్ణ నాయక్, పలు కార్పొరేషన్ల డైరెక్లర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, గిరిజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ బంజార కళాకారుడు బిక్షు నాయక్ బృందం ప్రదర్శించిన గిరిజన కళారూపాలు ఆకట్టుకున్నాయి. -
అవ్వాతాతల దీవెన మధ్య పెన్షన్ పెంపు సంబరాలు
సాక్షి, అమరావతి: లక్షలాదిమంది అవ్వాతాతలు, వితంతు, చేతి వృత్తిదారుల దీవెనల మధ్య రాష్ట్రమంతటా పెన్షన్ రూ.3,000కు పెంపు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ముందు చెప్పిన మాటను చెప్పినట్లే అమలు చేస్తూ పెన్షన్‌ను రూ.3,000కు పెంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అవ్వాతాతలు జేజేలు కొడుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో తాము ప్రతి నెలా పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి గంటల తరబడి ఆఫీసుల వద్ద క్యూలైన్లలో వేచి ఉండే పద్ధతులను పూర్తిగా మార్చి.. ఇప్పుడు ప్రతి నెలా ఠంఛన్‌గా.. పండుగైనా, ఆదివారమైనా, ఇతర సెలవు రోజయినా వలంటీర్లు తమ ఇంటికే వచ్చి పెన్షన్ డబ్బులు ఇచ్చే విధానం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని మనసారా దీవిస్తున్నారు. ఈ నెల నుంచి పెన్షన్‌ను రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచిన నేపథ్యంలో.. ఒకటోతేదీ నుంచి 8వ తేదీ వరకు మండల, మున్సిపాలిటీల వారీగా స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ లబ్దిదారులతో మమేకమవుతూ పూర్తి పండుగ వాతావరణంలో వేడుకలా పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జనవరి ఒకటోతేదీ నుంచి ఆదివారం (7వ తేదీ వరకు) 700 మండలాలు, మున్సిపాలిటీల్లో ఉత్సవ కార్యక్రమాలు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం 15 మండలాల్లో ఉత్సవాలు కొనసాగాయని, సోమవారం మిగిలిన 24 మండలాల్లో ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. -
కర్నూలు పెద్దాస్పత్రిలో అరుదైన ఆపరేషన్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగంలో మూడు రోజుల్లో ముగ్గురికి మూడు క్లిష్టమైన ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను కార్డియోథొరాసిక్ హెచ్‌వోడీ డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి ఆదివారం వివరించారు. ♦ ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన భాగ్యమ్మ (64)కు గుండెలో మూడు రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి. వయసు, గుండె పరిస్థితి రీత్యా ఆపరేషన్ చేయడం చాలా కష్టం. కానీ ఆమెకు అధునాతన బీటింగ్ హార్ట్ సర్జరీ విధానంలో విజయవంతంగా ఆపరేషన్ చేయడం వల్ల కోలుకుంది. ఆమెకు కాలిలో నరాలు కూడా సరిగా లేకపోవడంతో ఛాతిలో నుంచే నరాలు తీసి వేశాం. ♦ వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన పెద్దిరాజు(47) హార్ట్ ఫెయిల్యూర్‌తో ఆసుపత్రికి వచ్చాడు. అతనికి మైట్రల్ కవాటం చెడిపోయింది. యాంజియోగ్రామ్ చేయగా గుండె రక్తనాళాల్లో రెండు బ్లాక్‌లు గుర్తించాం. ఇప్పుడు అతనికి మైట్రల్ కవాటాన్ని మార్చడంతో పాటు బైపాస్ ఆపరేషన్ చేయాలి. మైట్రల్ కవాటాన్ని ప్లాస్టిక్ కవాటంగా మార్చడమే గాక, కాలి నుంచి సిరలను తీసి రక్తనాళాలకు బైపాస్ చేయడం వంటి ప్రక్రియను ఒకేసారి చేశాం. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అతను కోలుకున్నాడు. పల్మనరి హైపర్ టెన్షన్ అనే సమస్య ఉండటంతో రికవరీ కొంచెం కష్టమైంది. ♦ఎమ్మిగనూరుకు చెందిన సరోజ(30)కు టీబీ. ఊపిరితిత్తుల్లో ఫంగల్ బాల్ చేరి, దగ్గితే రక్తం పడుతుండేది. ఇది ఒక్కోసారి ఎక్కువగా పడితే ప్రాణాపాయం ఏర్పడుతుంది. దీనిని ఆపడం చాలా కష్టం. ఆపరేషన్ చేసి ఆ ఊపిరితిత్తిని తొలగించడమే మార్గం. దీన్ని సైతం విజయవంతంగా నిర్వహించాం. ఇంత పెద్ద ఖరీదైన ఆపరేషన్లు అన్నీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిర్వహించాం’ అని డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
సీఎం జగన్ పాలనలో వైద్యులకు గౌరవం
గుంటూరు మెడికల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యులకు పదోన్నతులు ఇచ్చారని, వేతనాలు పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆదివారం గుంటూరులో ఏపీ డాక్టర్స్ ఇంట్రాక్షన్ మీట్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యుల త్యాగాలను ఎవరూ మర్చిపోలేరన్నారు. ఈ సందర్భంగా ఆమె వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో వైద్యవృత్తికి, వైద్యులకు గౌరవం పెరిగిందన్నారు. దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య వృత్తికి గుర్తింపు తెచ్చారన్నారు. తొలిసారిగా వైద్యులకు యూజీసీ స్కేల్స్ అమలు చేసిన ఘనత డాక్టర్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. దేశానికే ఏపీ ఆదర్శం వైద్యులకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఏడో వేతన స్కేల్‌ను సీఎం జగన్ అమలు చేశారని గుర్తు చేశారు. 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అడిషనల్ డీఎంఈ ప్రమోషన్లు ఇచ్చామని, ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ విధానంతో వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులన్నీ భర్తీ చేస్తున్నామని, ఈక్రమంలో సుమారు 53 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. వైద్యుల రిక్రూట్మెంట్లో దేశానికే ఏపీ ఆదర్శంగా ఉందని తెలిపారు. రోగులు, ప్రజల అవసరాలను బట్టి నూతనంగా నెఫ్రాలజీ వార్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ట్రైబల్ ప్రాంతాల్లో నియామకాలు చేపట్టి అక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్యసేవలు పొందేలా చేశామన్నారు. నాడు–నేడుతో అభివృద్ధి.. నాడు–నేడు కార్యక్రమంతో రాష్ట్రంలో నూతనంగా 17 వైద్య కళాశాలలను రూ.8,500 కోట్లతో ప్రారంభించామన్నారు. వాటిల్లో నేడు ఐదు కళాశాలలు ప్రారంభమైనట్లు చెప్పారు. గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలను రూ.3,820 కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు రూ.17,000 కోట్లతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. వ్యాధులు వచ్చాక చికిత్స అందించే ఆస్పత్రులను బలోపేతం చేయడంతోపాటు, వ్యాధులు రాకుండానే ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. దీన్లో భాగంగా ప్రివెంటివ్ మెడికల్ కేర్ ఏర్పాటు చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా పేదల ఇళ్లకే వైద్యులు వెళ్లి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఇళ్ల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారని పేర్కొన్నారు. -
AP: తీరం మనదే.. వేటా మనదే
జువ్వలదిన్నె సిద్ధం మన మత్స్యకారుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తోంది. ఇన్నాళ్లూ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన మత్స్యకారులు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తూ 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తుది మెరుగులు దిద్దుకుంటున్న నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభానికి ముస్తాబవుతోంది. సాక్షి, అమరావతి: మత్స్యకారులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పనులు శరవేగంగా పూర్తి చేస్తోంది. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వలస వెళ్లాల్సి వస్తోంది. పాదయాత్ర సమయంలో వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వారికి స్థానికంగానే ఉపాధి కల్పించేలా ఫిషింగ్ హార్బర్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. ఈమేరకు రూ.3,520.56 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, రూ.126.91 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జువ్వలదిన్నె హార్బర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావడంతో త్వరలో ప్రారంభించనున్నారు. మరో మూడు హార్బర్ల పనులు 60 నుంచి 70 శాతం పూర్తి కాగా సెప్టెంబర్ నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇక రెండో దశలో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం, మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటికి అదనంగా మత్స్యకారులు బోట్లను నిలుపుకొని చేపలు దింపుకునే విధంగా చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద సమకూరుతుందని, వీటి ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9 వేల కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్లో ఏర్పాటు చేసిన షెడ్లు హార్బర్ ఆధారిత పరిశ్రమలు.. హార్బర్ల ద్వారా మత్స్యకారులు అధికాదాయం పొందే మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద రూ.288.81 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఇక్కడ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డులను ఏపీ మారిటైమ్ బోర్డు నెలకొల్పుతోంది. ఒక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారానే ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద సమకూరనుంది. వచ్చే 30 ఏళ్లలో ఈ హార్బర్ ద్వారా మిలియన్ టన్నుల మత్స్య సంపద లభిస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా హార్బర్ వెలుపల 20 ఎకరాల విస్తీర్ణంలో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, 5 ఎకరాల విస్తీర్ణంలో బోట్ల తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. కొత్త బోట్లకు డిమాండ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లల్లో 10,521 బోట్లను నిలుపుకునే సామర్థ్యం ఉండటంతో కొత్త బోట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడనుంది. 9ఎం ఎఫ్ఆర్పీ రకం, 12 ఎం గిల్ నెట్టర్, 15ఎం ట్రావలెర్, 24ఎం టూనా లాంగ్ లైనర్ లాంటి అత్యాధునిక బోట్లు అవసరం కానున్నాయి. అన్ని హార్బర్ల వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. కూలీల నుంచి యజమానులుగా.. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో ఇన్నాళ్లూ పని కోసం చెన్నై, మంగళూరు వలస కూలీలుగా వెళ్లాం.ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకొని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. ఫిషింగ్ హార్బర్, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15 వేల మందికిపైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా హార్బర్‌ను నిర్మిస్తున్నారు. – కొండూరు అనిల్ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) సురక్షితంగా ఒడ్డుకు బోట్లు ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో ఆటు పోట్లు వల్ల ఈ ఇబ్బంది అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలుపుకోవచ్చు. – పైకం ఆంజనేయులు, ఫైబర్ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నం. పర్యాటక ఏర్పాట్లు పరిశీలిస్తున్నాం మత్స్యకారులు చేపల వేట కోసం కుటుంబాలకు దూరంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం లేకుండా ముఖ్యమంత్రి జగన్ ఏక కాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. కేవలం ఫిషింగ్ హార్బర్లు కట్టి వదిలేయడమే కాకుండా చేపలకు మంచి విలువతో పాటు స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభించేలా హార్బర్ ఆధారిత పరిశ్రమలను పెద్దఎత్తున నెలకొల్పుతున్నాం. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డులతో పాటు ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నె వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు బోట్ బిల్డింగ్ యార్డ్ ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. హార్బర్ల వద్ద పర్యాటక ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో ఏపీ మారిటైమ్‌బోర్డు, వీసీఎండీ ఏపీఐసీసీ. మినీ పోర్టు స్థాయిలో ఇప్పటి వరకు బోట్లు నిలుపుకోవడానికే సరైన సదుపాయాల్లేక అవస్థలు ఎదుర్కొన్నాం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తేవడంతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి. దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50 వేల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ -
చేనేతల బతుకులు ఇప్పుడు ఆనందమయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. చేనేతల బతుకులు ఇప్పుడు ఆనందమయం చేనేతే మా జీవనం. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం శివపురం గ్రామంలో మాకు ఓ మగ్గం ఉంది. దానిపై చీరలు వంటివి నేస్తాం. నేను రోజంతా కష్టపడినా ఆశించిన ఫలితం ఉండేది కాదు. పైగా నూలు, ముడిసరుకులు కొనుగోలు చేయడానికి తప్పనిసరిగా అప్పు చేయాల్సి వచ్చేది. నేసిన సరుకు అమ్ముడయ్యాక అప్పులు తీర్చేవాళ్లం. దానికోసం నానా కష్టాలుపడేవాళ్లం. నాలుగేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మా జీవితాలలో వెలుగులు వచ్చాయి. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఈ ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా రూ. 24 వేలు వంతున ఇచ్చింది. ఆ మొత్తంతో చీరలు నేసేందుకు అవసరమైన నూలు, ముడిసరుకులు కొనుగోలుకు అప్పులు చేసే బాధ తప్పింది. గతేడాది ప్రభుత్వం మాపై దయచూపి మగ్గంపని చేయటానికి అవసరమైన కరెంటు మోటారును సబ్సిడీపై ఇచ్చింది. మోటారు విలువ రూ.18వేలు కాగా అందులో 90శాతం సబ్సిడీ పోను రూ. 1800లు మాత్రం మా వాటాగా చెల్లించి మోటారు తెచ్చుకొన్నాం. అప్పటి నుంచి మగ్గం నేసే పని చాలా సులభతరంగా మారింది. ఇప్పుడు శారీరక శ్రమ తగ్గింది. నా పెద్దకుమార్తె అమృత డిగ్రీ పూర్తి చేసింది. రెండో కుమార్తె గౌతమి బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమెకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఏడాదికి రూ.75 వేల చొప్పున రెండేళ్లకు రూ. లక్షా 50 వేలు అందించింది. నా భార్య గతంలో తీసుకున్న డ్వాక్రా రుణ మాఫీకి సంబంధించి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకూ రూ.40 వేలు అందించింది. జగనన్న ఇళ్ల కాలనీలో స్థలం మంజూరు చేయడంతోపాటు ఆర్థిక సాయం చేయడంతో ఇల్లు కట్టుకున్నాం. గత ప్రభుత్వంలో మేము ఎన్నడూ ఇలాంటి సాయం పొందలేదు. జగనన్నకు మేం రుణపడి ఉంటాము. – ఎస్.మోహన్, శివపురం. గుర్రంకొండ మండలం, అన్నమయ్య జిల్లా (కొందేటి మురళీకృష్ణ. విలేకరి, గుర్రంకొండ) ఏ దిక్కూ లేని నన్ను ప్రభుత్వమే ఆదుకుంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేము 30 సంవత్సరాల క్రితం బతుకుతెరువు నిమిత్తం నా భర్త, కుమార్తె, కుమారుడితో కలసి విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం, బాలచెరువుకు వచ్చేశాం. నా భర్త చిన్న చిన్న కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే విధి మా కుటుంబంపై చిన్న చూపుచూసింది. మా కుటుంబానికి ఆధారమైన నా భర్త సుమారు 20 ఏళ్ల కిందటే మరణించారు. ఆ దుఖంలో ఉండగానే నా పిల్లలు ఇద్దరూ అనారోగ్య సమస్యలతో ఒకరి తరువాత ఒకరు కన్నుమూశారు. మా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో వారికి ఖరీదైన వైద్యం చేయించలేక భర్త, ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్నాను. ఒంటరిగా మిగిలిన నేను గంగవరం పోర్టులో కూలి పనులకు వెళ్లేదాన్ని. వయసు పైబడడంతో అక్కడ పని నుంచి నన్ను తీసేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని సార్లు అర్జీలు పెట్టుకున్నా కనీసం నాకు పింఛన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నా వయసు 73 ఏళ్లు. దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు ఈ ప్రభుత్వం వచ్చాక ఒంటరి మహిళ పింఛన్ మంజూరైంది. నాలుగేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్ పింఛన్ అందజేస్తున్నారు. ఆ పెన్షనే నాకు జీవనాధారం. రేషన్ కార్డు ఉండడంతో ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. డబ్బుల కోసం ఇప్పుడు ఎవరి దగ్గరా చేయి చాచడం లేదు. సంతోషంగా ఉన్నాను. నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయి. ఇక్కడే ఒక చిన్న రేకుల షెడ్డులో అద్దెకు ఉంటున్నాను. నా ఒక్కదాని కోసం ఎందుకని జగనన్న ఇంటి కోసం దరఖాస్తు చేయలేదు. ఈ ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మలో మరచిపోలేను. – కోడ సీతమ్మ, బాలచెరువు, పెదగంట్యాడ మండలం, విశాఖపట్నం జిల్లా (ముప్పిడి శ్రీనివాసరావు, విలేకరి, పెదగంట్యాడ) సర్కారు సాయంతో హాయిగా జీవనం మాది మధ్య దిగువ తరగతి కుటుంబం. నేను, మా ఆయన శ్రీవెంకట కడియార్ కలసి ఏలూరులో కూలిపనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మా బిడ్డను ఉన్నత చదువులు చదివించాలనేది మా కోరిక. కానీ అంతటి ఆర్థిక స్తోమత మాకు లేదు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లల చదువుకు ఇక బెంగ తీరిపోయింది. మా అమ్మాయి ప్రస్తుతం తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అమ్మ ఒడి ద్వారా మాకు ప్రతి ఏటా రూ. 15వేలు వంతున అందుతోంది. ఆ మొత్తంతో బిడ్డ చదువుకోవడానికి ఏం కావాలన్నా సమకూర్చ గలుగుతున్నాం. బడిలో యూనిఫాం ఇస్తున్నారు, షూ, టై, స్కూల్ బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు ఇలా అన్ని అవసరాలనూ ప్రభుత్వమే తీర్చుతోంది. మధ్యాహ్న భోజనం కూడా రుచిగా వడ్డిస్తున్న కారణంగా ఇంటి నుంచి భోజనం పట్టుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. డ్వాక్రా రుణమాఫీ(వైఎస్సార్ ఆసరా) ద్వారా గత నాలుగేళ్లలో రూ.14,500లు నా ఖాతాలో జమయ్యాయి. మాకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500లు చొప్పున వచ్చింది. జగనన్నకు మా కుటుంబం మొత్తం జీవితాంతం రుణపడి ఉంటాం. – గంగుల నాగదుర్గ, ఏలూరు (సీహెచ్ఆర్కే రాజు, విలేకరి ఏలూరు) -
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నిన్నటితో(శనివారం) 41 రోజులు పూర్తి చేసుకున్న సామాజిక సాధికార యాత్రం నేడు 42వ రోజులోకి అడుగుపెట్టింది. ఆదివారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జరుగనుంది. ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. దీనిలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం, మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభకు మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరుకానున్నారు ఇక రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం కోరుకొండ వరకూ బస్సుయాత్ర ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటలకు కోరుకొండ బూరుగపూడి గేట్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సినీ నటులు అలీ తదితరులు పాల్గొనున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పక్కా ప్రణాళిక
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రతి ఒక్కరి కల. దీన్ని సాధిస్తే తమ జీవితానికి, భవిష్యత్తుకు ఇక ఢోకా ఉండదనుకుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అహోరాత్రులు కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఒకేసారి 1.34 లక్షల సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించింది. లంచాలకు, సిఫారసులకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, వేగంగా నియామకాలు చేసి అభ్యర్థుల ప్రశంసలు అందుకుంది. ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రశ్నాపత్రం రూపకల్పన బాధ్యతలు అప్పగించింది. ఇక ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా వివిధ విభాగాల్లో 6,296 పోస్టులను భర్తీ చేసింది. ఇందుకు మొత్తం 78 నోటిఫికేషన్లను ఇచ్చింది. అంతేకాకుండా ఇటీవల గ్రూప్–1, గ్రూప్–2, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటి ద్వారా 1,446 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంతో ఉద్యోగార్థులు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ కొలువును దక్కించుకోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. నిరుద్యోగుల మేలుకు ఎన్నో చర్యలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజల ముంగిటకే తీసుకెళ్లి.. వారి సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే పరిష్కరించేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సచివాలయాల్లో పనిచేయడానికి ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ దేశ చరిత్రలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఒక్క వైద్యశాఖలోనే దాదాపు 55 వేల పోస్టులను భర్తీ చేశారు. ఇందులో వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఎన్నికల ముందు ప్రయోజనం పొందాలనే దురుద్దేశంతో 2018 డిసెంబర్లో 32 నోటిఫికేషన్లు జారీ చేసి వదిలేశారు. వాటి భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఈ పరీక్షలను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నిర్వహించి, పోస్టులను భర్తీ చేసింది. ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ.. నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేయడానికి వీలుగా ఏపీపీఎస్సీతో సమన్వయం చేసుకుంటోంది. నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఎలాంటి వివాదాలకు తావులేకుండా కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గత నాలుగేళ్లల్లో మొత్తం 78 నోటిఫికేషన్లను ఒక్క కోర్టు వివాదం లేకుండా, ఒక్క నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 పోస్టులను భర్తీ చేయడం విశేషం. ఇంత పక్కాగా ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరిగింది లేదు. నాడు అలా.. నేడు ఇలా.. గత టీడీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు ఎప్పుడు జరిగేది, నియామకాలు ఎప్పుడు పూర్తయ్యేదీ అంతా అగమ్యగోచరంగా ఉండేది. అంతేకాకుండా ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌పైనా అనేక వివాదాలు.. కోర్టు కేసులు తలెత్తేవి. ఇలా పలు కారణాలతో నియామక పరీక్షలు నిలిచిపోవడమో లేక రద్దు కావడమో జరిగేది. అలాంటిది గత నాలుగేళ్లల్లో ఏపీపీఎస్సీ 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 ఉద్యోగాలను ఎలాంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా భర్తీ చేసింది. అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి న్యాయ వివాదాల్లో చిక్కుకున్నవాటిని సైతం పరిష్కరించింది. ఆ పోస్టులను భర్తీ చేసి అభ్యర్థులకు న్యాయం చేసింది. ఇలా గ్రూప్–1, గ్రూప్–2 వంటి గెజిటెడ్ పోస్టులతో పాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టుల నియామకాలు చేపట్టింది. -
పెద్దాపురంలో మార్మోగిన సాధికార నినాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా పెద్దాపురంలో బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ ప్రజల సాధికార నినాదం మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిన మేలును ప్రతిబింబిస్తూ శనివారం పెద్దాపురంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన ప్రభంజనమే అయ్యింది. పెద్దాపురం నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సెంటర్ వరకూ సాగింది. బస్సు యాత్ర ముందు భారీ బైక్ ర్యాలీలో యువత కేరింతలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరెత్తిన ప్రతిసారీ కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన సీఎం జగన్: మండలి చైర్మన్ మోషేన్ రాజు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. దళితుడినైన తానే జగనన్న ప్రభుత్వంలో రాజకీయ సమానత్వనికి చిహ్నమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 17 మందిని మంత్రులుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనని అన్నారు. రాజకీయ, సామాజిక, ధన ప్రభావాలు చూడకుండా బడుగులకు పెద్ద పదవులు ఇచ్చిన నేత జగన్ ఒక్కరేనని చెప్పారు. సీఎం జగన్ పాలనలో అన్నింటా బడుగులకు అగ్రస్థానం: ఎంపీ సురేష్ సీఎం వైఎస్ జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రస్థానం లభిస్తోందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. సంక్షేమ పథకాల్లో, రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. పేదలు మరింతగా బాగు పడాలంటే జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని, అందు కోసం ఆయనకు అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ప్రేమ, దయ కలిస్తే జగనన్న: జూపూడి ప్రేమ, దయ కలిస్తే సీఎం వైఎస్ జగనన్న అని, ఆయన సమానత్వం చూపించే వ్యక్తి అని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. అందుకే నేడు సామాజిక సాధికార యాత్ర చేయగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి సీఎం వైఎస్ జగన్ పరిపాలనే కారణమని చెప్పారు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు చెప్పారు. అమ్మ ఒడి, రైతు భరోసా, రుణమాఫీ, పింఛన్లు వంటి కార్యక్రమాలతో సంక్షేమాన్ని ప్రతి గుమ్మం వద్దకు చేర్చారని తెలిపారు. ప్రజలందరూ బాగుండాలనే తపనతో పని చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆరోగ్యం బాగుండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని తపిస్తూ విద్య, వైద్య రంగాలను అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. పేదవారిని గౌరవించి, పథకాలను వారి ఇంటి వద్దకే పంపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అయ్యరక కార్పొరేషన్ చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి, పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. -
ముత్తుకూరులో సామాజిక ప్రభంజనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో శనివారం సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికారత బస్సు యాత్రకు అశేష జనవాహిని జేజేలు పలికింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ముత్తుకూరులోని పాత వాణి థియేటర్ నుంచి జంక్షన్ వరకు మేళతాళాలు, కేరళ డ్రమ్స్, గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ ఓ పండుగలా ర్యాలీ జరిగింది. దారి పొడవునా బడుగు, బలహీన వర్గాలకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జరిగిన మేలును తలచుకుంటూ జై జగన్.. జైజై జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జరిగిన సామాజిక సాధికార సభ జనసంద్రాన్ని తలపించింది. కిలోమీటర్ల పొడవున జనం నిల్చుని నేతల ప్రసంగాలు వింటూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్‌తోనే సామాజిక విప్లవం: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అంబేడ్కర్ కలలు కన్న సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పారు. నవరత్నాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఓసీలు సైతం లబ్ధి పొందారని తెలిపారు. సీఎం జగన్ కార్యక్రమాలతో ఈ వర్గాలు సామాజిక సాధికారత సాధించి, నేడు తలెత్తుకొని తిరగగలుగుతున్నాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేసేందుకు రాక్షస మూకలు మళ్లీ బయల్దేరాయని, వారిని మరోసారి చిత్తుగా ఓడించాలని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ని బతికిస్తే.., చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ బొమ్మ పెట్టుకొనే అర్హత లేదన్నారు. మరోసారి రాష్ట్రంలో సీఎం జగన్‌కు పట్టం కట్టి, మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. తండ్రిని మించిన తనయుడు జగన్: ఎంపీ బీదా మస్తాన్‌రావు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసి, వారిని అభివృద్ధి దిశగా నడిపించారని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు చెప్పారు. రాజ్యసభలో 9 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు ఉంటే వీరిలో ఐదుగురు బీసీలకు అవకాశం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. పేదలకు అత్యంత ఆవశ్యకమైని విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు అవమానాలకు గురిచేస్తే, వైఎస్ జగన్ అన్నిరంగాల్లోనూ పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు వర్గాలకు బంగారు బాట: తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు బంగారు బాటలు వేసిన ఘనత సీఎం వైఎస్ జగనకే దక్కుతుందని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి అన్నారు. గత పాలకులు బడుగు వర్గాలను ఓటు బ్యాంకుగా చేశారని, కానీ, వారి అభ్యున్నతికి కృషి చేసిన సీఎం జగన్ అభినవ అంబేడ్కర్ అని కొనియాడారు. మైనారిటీలకు రూ.26 వేల కోట్లు : రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్‌బాషా సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లలో మైనారిటీల సంక్షేమానికి రూ.26 వేల కోట్లు ఖర్చు చేశారని, గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇంతస్థాయిలో ఖర్చు పెట్టలేదని రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్‌బాషా అన్నారు. తెలుగు, లెక్కలు రాని లోకేశ్ సీఎం కావాలని తాపత్రయపడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండు చోట్ల గ్లాసులు పగలగొట్టుకొన్న పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. రూ.979 కోట్ల మేరకు సంక్షేమ ఫలాలు : మంత్రి కాకాణి సీఎం జగన్ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు సంక్షేమ పథకాల ద్వారా రూ.979 కోట్ల మేర లబ్ధి పొందారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రూ.442 కోట్ల మేరకు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సుమారు 1.10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు. మేలు జరిగితేనే ఓటు వేయమన్నారు : నెల్లూరు మేయర్ స్రవంతి మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటు వేయండంటూ అడిగే ధైర్యం ఈ రాష్ట్రంలో సీఎం జగనన్నకు మాత్రమే ఉందని నెల్లూరు మేయర్ పొట్లూరు స్రవంతి అన్నారు. గిరిజన మహిళనైన తనను మేయర్ సీట్లో కూర్చొబెట్టడమే కాకుండా ఒక ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కూడా జగనన్నే అని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను అభివృద్ధి పరుస్తూ సామాజిక న్యాయాన్ని సాధించిన సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైఎస్సార్సీపీ సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్‌లో షర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర
సాక్షి, అమరావతి: కాంగ్రెస్‌లో షర్మిలమ్మ చేరడం వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహా దారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇక అధికారం కలే అని గ్రహించిన చంద్రబాబు.. దింపుడుకళ్లం ఆశలతో ఈ కుట్రకు పాల్ప డ్డారని మండిపడ్డారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ను చేతిలో పెట్టుకున్న చంద్రబాబు.. తన మనుషుల ద్వారా ఒక వైపు కాంగ్రెస్‌ను.. మరో వైపు బీజేపీని మేనేజ్ చేస్తున్నారని, మీడియా ద్వారా ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఆ కుట్రలో భా గంగానే షర్మిలమ్మ కాంగ్రెస్‌లో చేరికన్నారు. షర్మి లమ్మ సీఎం రమేశ్ విమానంలో వెళ్లడం.. టీడీపీ నేత బీటెక్ రవిని బ్రదర్ అనిల్ కలవడం యాదృచ్ఛికమని తాము అనుకోవడం లేదన్నారు. క్రిస్టియన్ ఓట్లను ప్రభావితం చేయడానికి కుట్రలు చేస్తున్నారంటూ గతంలో ఇదే టీడీపీ నేతలు బ్రదర్ అనిల్‌పై ఏ స్థాయిలో దుమ్మెత్తిపోశారో అందరికీ గుర్తుందన్నారు. టీడీపీ నేత బీటెక్ రవిని ఎయిర్‌పోర్ట్‌లో బ్రదర్ అనిల్ మర్యాదపూర్వకంగా కలవడం వంటి వాటని్నంటినీ పరిశీలిస్తే షర్మిలమ్మ కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నది అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్‌లో ఎవరు చేరినా నష్టం లేదు.. రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి, పార్టీ పెట్టి, తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా ఆపార్టీ లో చేరడం షర్మిలమ్మ ఇష్టమని సజ్జల అన్నారు. అండమాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ఎక్కడైనా పని చేస్తానని ఆమె అన్నారని, రాష్ట్రంలోనే రాజకీయం చేస్తానని ప్రకటించలేదన్నారు. ఒకవేళ రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ నాయకురాలిగానే చూస్తామన్నారు. అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ కలసి కుట్ర.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై కాంగ్రెస్‌కు సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయని సజ్జల పునరుద్ఘాటించారు. వైఎస్ మరణం తర్వాత అప్పట్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుమ్మక్కై జగన్‌పై తప్పుడు కేసులు పెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీని స్థాపించాక కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ ఉపఎన్నికల్లో వైఎస్ జగన్‌ను, వైఎస్ విజయమ్మను ఓడించడం ద్వారా పార్టీని మొగ్గలోనే తుంచేయడానికి అప్పటి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై కుట్ర చేశాయన్నారు. పులివెందుల ఉపఎన్నికలో విజయమ్మపై వివేకాను పోటీకి పెట్టారని గుర్తు చేశారు. ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ 80 శాతం ఓట్లు సాధించి ఘనవిజయం సాధిస్తే.. కడప లోక్‌సభ స్థానం నుంచి జగన్ రికార్డు మెజార్టీతో విజయం సాధించారన్నారు. ఆది నుంచి కాంగ్రెస్‌తోనే చంద్రబాబు.. మహానేత వైఎస్ మరణించినప్పటి నుంచి చంద్రబాబు తెరవెనుక కాంగ్రెస్‌తో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారని సజ్జల ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్‌ను ఎన్నికల్లో నేరుగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. ఆ కుట్రలో భాగంగానే షర్మిల చేరికని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో జరగబోయే డ్రామా అంతా చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరగనుందన్నారు. ప్రజా సమస్యలపై కాకుండా.. ప్రజలకు సంబంధం లేని సంచలనాలు సృష్టించడమే చంద్రబాబు నైజమన్నారు. అభ్యర్థుల మార్పు సహజమే.. ఎన్నికల్లో అభ్యర్థుల మార్పుపై అన్ని పార్టీల్లోనూ సహజ ప్రక్రియేనని సజ్జల ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా సమన్వయకర్తలను మారుస్తున్నారని చెప్పారు. వివిధ వర్గాల ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయం, ప్రజల ఆకాంక్షలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని.. అందరితో చర్చించే అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చుతున్నామని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని.. వ్యక్తిగత కారణాలతోనే కొందరు పార్టీని వీడుతున్నారని స్పష్టం చేశారు. -
విశాఖలో బడుగుల విజయవిహారం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన చేయూతతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు శనివారం విశాఖ తీరంలో విజయ విహారం చేశారు. వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం జగన్ అందించిన పథకాలతో తాము సాధించిన విజయాలను, సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ముందుకు సాగారు. నెడ్‌క్యాప్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో మాధవధార నుంచి కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ వరకూ వందలాది బైకులు, కార్ల ర్యాలీతో యాత్ర సాగింది. జై జగన్.. జై జై జగన్ అంటూ వారికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. కైలాసపురం వద్ద జరిగిన బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం జనసంద్రమే అయింది. సభ ఆద్యంతం ‘జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి’ అంటూ ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. పేదల అభ్యున్నతి జగన్‌తోనే సాధ్యం: డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు పేద ప్రజల అభ్యున్నతి సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, వారిని సాధికారత దిశగా నడిపించిన సీఎం జగన్ ఒక్కరేనని తెలిపారు. ఈ వర్గాలను చంద్రబాబు ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే భావించారని, అధికారంలోకి వచ్చాక అవహేళన చేశారని అన్నారు. ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు మరో మారు మాయల పకీరులా మోసం చేయడానికి వస్తున్నాడన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను, మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అదే రైతులు, అక్కచెల్లెమ్మలను సీఎం వైఎస్ జగన్ ఆదుకొని, వారి కుటుంబాలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పింఛన్లు 3 వేలకు పెంచారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి దేశ చరిత్రలో రికార్డు నెలకొల్పారన్నారు. అసమానతలు రూపుమాపుతున్నసీఎం జగన్ : మంత్రి మేరుగు సీఎం వైఎస్ జగన్ సమాజంలో అసమానతలను రూపుమాపుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అందరూ సమానంగా ఉండాలనేది సీఎం జగన్ ఆలోచనైతే.. దళితులపై దాడులు, బీసీలను తోకలు కత్తిరిస్తానని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆర్ధి కంగా బలోపేతమయ్యాడని చెప్పారు. చంద్రబాబు పాలనలో 12 శాతం ఉన్న పేదరికం సీఎం జగన్ పాలనలో 6 శాతానికి తగ్గిందన్నారు. అంబేడ్కర్ కలలు నిజమవుతున్నాయి: మేయర్ హరి వెంకట కుమారి పేదలు అభ్యున్నతి చెందాలన్న అంబేడ్కర్, జ్యోతిరావు పూలే వంటి మహానుభావులు కన్న కలలను సీఎం వైఎస్ జగన్ నిజం చేస్తున్నారని గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకటకుమారి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు అభివృద్ధి చెందిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ వర్గాలకు చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో రాజకీయంగా సముచిత స్థానం కల్పించారన్నారు. నియోజకవర్గంలో రూ.3467.76 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి: కె.కె.రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రూ.3,467.76 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు తెలిపారు. విశాఖను పారిశ్రామిక, పర్యాటక, విద్యా, వైద్య రంగాల్లో దేశంలోనే అగ్ర నగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. 17 ఎకరాల్లో రూ.500 కోట్లతో ఇనార్బిట్‌మాల్, ఐటీ టవర్, మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇది పూర్తయితే 2 వేల మందికి ఉద్యోగావకాశాలు, కంచరపాలెం ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ప్రాంతంలో ఎఎస్ఎన్ మెఘా మాల్ ద్వారా 1500 మందికి పైగా ఉపాధి పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, కంబాల జోగులు, తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, పెట్ల ఉమాశంకర గణేష్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, కుంభా రవిబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ. రెహా్మన్ తదితరులు పాల్గొన్నారు. -
బందరు తీరంలో.. త్వరలో 'లంగరు'
కృష్ణాజిల్లా మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నం శరవేగంగా వాస్తవ రూపంలోకి వస్తోంది. దక్షిణాసియాకు అత్యంత సమీప ముఖ ద్వారంగా ఉన్న ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభించిన ఏడు నెలల్లోనే కీలకమైన బ్రేక్ వాటర్ పనులను పూర్తిచేయడం ద్వారా ఈ పోర్టు నిర్మాణంపై తన చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటోంది. ప్రత్యక్షంగా.. పరోక్షంగా 25,000 మందికి ఉపాధి క ల్పించే ఈ పోర్టు.. 2025 ఆరంభానికల్లా పూర్తయ్యేలా పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. – సాక్షి, అమరావతి బందరు పోర్టు తొలిదశ కింద రూ.5,254 కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ మే 22, 2023న భూమి పూజచేసి పనులు ప్రారంభించారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించడంతో పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే నార్త్‌బ్రేక్ వాటర్ నిర్మాణం పూర్తికాగా, సౌత్‌బ్రేక్ వాటర్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. అలాగే, రెండు బెర్తుల నిర్మాణ పనులూ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు మన రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా వేయగా.. వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్ బ్లాక్స్, ముడి ఇనుము, కంటైనర్ల ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుందని కూడా అంచనా. ఈ పోర్టు అందుబాటులోకి రావడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించనుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో.. ఇక రాష్ట్రంలో నిర్మిస్తున్న నాలుగు పోర్టుల్లో మచిలీపట్నం పోర్టు నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే.. ఇక్కడ సముద్రంలో ఇసుక మేటలు ఎక్కువగా ఉండడంతో పాటు తీరప్రాంతం కూడా ఇసుకతో ఉండటంతో భారీ కట్టడాల నిర్మాణానికి అనువుగా ఉండదు. ఇందుకోసం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేలను పటిష్టపరుస్తున్నారు. 2,075 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాంతాన్ని ప్రీఫ్యాబ్రికేటెడ్ వర్టికల్ డ్రెయిన్స్ (పీవీడీ) విధానంలో భూమిలోంచి నీటిని తోడి ఆ స్థానంలో మట్టిని పంపి భారీ కట్టడాలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. అదే విధంగా 52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడిపోయడం ద్వారా భారీ ఓడలు నిలుపుకునే విధంగా సముద్రాన్ని డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆ్రస్టేలియా నుంచి అత్యాధునిక డ్రెడ్జింగ్ మిషన్లను తీసుకొస్తున్నారు. ఏడు నెలల కాలంలోనే 12 శాతం నిర్మాణ పనులను పూర్తిచేయడం ద్వారా ఏపీ మారిటైమ్ బోర్డు రికార్డు సృష్టించింది. తండ్రి కోరికను నెరవేరుస్తున్న తనయుడు.. నిజానికి.. మచిలీపట్నం పోర్టు పునరుద్ధరణ అనేది స్థానిక ప్రజల చిరకాల స్వప్నమంటూ 2004 తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని తీసుకెళ్లారు. వారి కోరికను నెరవేర్చే విధంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బందరు పోర్టు నిర్మాణానికి 2008, ఏప్రిల్ 23న శంకుస్థాపన చేశారు. వైఎస్ మరణానంతరం ఈ ప్రాజెక్టు అటకెక్కెంది. 2014 తర్వాత చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా 2019 ఎన్నికలకు కేవలం నెలన్నర ముందు కొబ్టరికాయ కొట్టి మమ అనిపించారు. కానీ, దీనికి భిన్నంగా ప్రసుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు సమకూర్చడం దగ్గర నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం.. సీఎం పదవి చేపట్టిన ఏడాదిలోపే 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలపమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటుచేశారు. రూ.5,254 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు చేయడమే కాకుండా జగన్ సర్కారు నిధులను కూడా సమకూర్చింది. ఆ తర్వాత ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.3,668.83 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించడానికి టెండరు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్‌తో 2023, ఫిబ్రవరి 26న ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన పర్యావరణ అనుమతులు కూడా 2023, ఫిబ్రవరి 28న వచ్చాయి. ఇలా అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించడమే కాక ఆ పనులు వేగంగా జరుగుతుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పోర్టు ఎప్పుడెప్పుడు ఎలా..? ♦ 1590 నుంచి ఎగుమతి దిగుమతులతో మచిలీపట్నం పోర్టు కళకళ.. ♦ 1970 నుంచి నిలిచిపోయిన పోర్టు కార్యకలాపాలు ♦ బందరు వాసుల చిరకాల వాంఛను తీరుస్తూ దివంగత సీఎం వైఎస్ 2008 ఏప్రిల్‌లో శంకుస్థాపన ♦ ఆయన మరణానంతరం అటకెక్కిన పోర్టు పనులు ♦ ఎన్నికలకు నెలన్నర ముందు ఎటువంటి అనుమతులు లేకుండా 2019లో చంద్రబాబు మరోసారి శంకుస్థాపన ♦ దీనికి భిన్నంగా ఇప్పుడు అన్ని అనుమతులతో పనులు ప్రారంభించిన సీఎం జగన్ ♦రూ.11,464 కోట్ల వ్యయంతో 116 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టు నిర్మాణం ప్రారంభం ♦తొలిదశలో రూ.5,254 కోట్ల పెట్టుబడితో పోర్టు పనులకు గత మే 22న శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్ ♦ 2,075 ఎకరాల్లో నాలుగు బెర్తులతో 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ♦ పోర్టును జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 6.5 కి.మీ మేర నాలుగులైన్ల రహదారి నిర్మాణం ♦అలాగే.. ఏడు కి.మీ రైల్వేలైన్ కూడా నిర్మాణం ♦ ఈ పోర్టుతో రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణకు ప్రయోజనం ♦ దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి ప్రాజెక్టు పూర్తి వ్యయం - 11,464 కోట్లు తొలిదశ పోర్టు సామర్థ్యం - 35 ఎంఎంటీపీఏ పూర్తిస్థాయి సామర్థ్యం - 116 ఎంఎంటీపీఏ బెర్తులు - 2,075ఎకరాల్లో నాలుగు బెర్తులతో నిర్మాణం కార్యకలాపాలు ప్రారంభం 2025ప్రారంభం నాటికి భారీ ఓడలు నిలిచేలా నిర్మాణం.. మచిలీపట్నం పోర్టు నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. భారీ ఓడలు నిలిచే విధంగా రాష్ట్రంలోని నాలుగు ఓడ రేవులను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ఓడరేవుల సగటు లోతు 7–8 మీటర్లు ఉండగా, ఇప్పుడు నిర్మిస్తున్న ఈ పోర్టుల్లో 16–18 మీటర్ల లోతు ఉండేలా నిర్మిస్తున్నాం. దీంతో భారీ ఓడలు రావడమే కాకుండా సరుకు రవాణా కూడా పెరుగుతుంది. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారం మొత్తం ఇప్పుడు మచిలీపటా్ననికే వస్తుంది. – రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ, ఏపీ మారిటైమ్ బోర్డు 2025 నాటికి రెడీ.. అన్ని అనుమతులు ముందుగానే తీసుకోవడంతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏడు నెలల్లోనే 12 శాతం పనులు పూర్తిచేశాం. 6.5 కి.మీ కాంపౌండ్ వాల్ నిర్మాణం, నాలుగు బిల్డింగ్లు, జాతీయ రహదారి 216కు అనుసంధానం చేస్తూ 6.5 కి,మీ రోడ్డు అనుసంధానం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు బెర్తులకు సంబంధించి ఈ పైల్స్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. 2025 ప్రారంభం నాటికి ఈ పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నాం. – ఎం. దయాసాగర్, ఎండీ, మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంతోషంగాఉంది.. బందరు ప్రాంత అభివృద్ధి ఈ పోర్టు నిర్మాణంతో సాకారం కానుంది. పోర్టు నిర్మాణానికి నాకున్న భూమిని ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం నాకు కలిగింది. భావితరాల మేలు కోసం మాజీమంత్రి పేర్ని నాని చేసిన కృషి ఫలించింది. – పిప్పళ్ల వెంకటేశ్వరరావు, పోతేపల్లి, బందరు మండలం గర్వంగా ఉంది.. సొంత ఊరు అభివృద్ధికి కీలకమైన బందరు పోర్టు నిర్మాణంలో భాగస్వామి కావడం ఆనందంగాను, గర్వంగాను ఉంది. నేను ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉండేవాడిని. కానీ, ఈ పోర్టు నిర్మాణంలో నా వంతు కృషిచేయాలన్న తలంపుతో మచిలీపట్నంకు బదిలీ చేయించుకున్నా. బందరు పోర్టును జాతీయ రహదారికి అనుసంధానించే పనిలో పాలుపంచుకుంటున్నా. త్వరలో ఈ ప్రాంత ప్రజల కల సాకారం కానుంది. – బి.నాగసూర్య చంద్ర, అసిస్టెంట్ మేనేజర్, రైట్స్ సంస్థ -
వంకరపోయిన వేళ్లకు ఉచితంగా శస్త్రచికిత్స
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ధైర్యంగా సాగు చేస్తున్నా వ్యవసాయమే మా జీవనాధారం. సొంత భూమి లేకున్నా పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం, తూర్పుపాలెం గ్రామంలో వేరే వారి వద్ద నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పదేళ్లుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నా. మాలాంటి కౌలు రైతులకు గత ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదు. అతివృష్టి, అనావృష్టి వంటివి సంభవించినప్పుడు పంట నష్టపోయినా భూ యజమానికి కౌలు చెల్లించాల్సి వచ్చేది. ఇలా నేను చాలా నష్టపోయాను. దీనివల్ల చాలా అవస్థలు పడేవాడిని. చివరకు వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితి వచి్చంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మా బాధలు తీరాయి. కౌలు కార్డుతో రైతు భరోసా సాయం అందుకుంటున్నా. వివిధ దశల్లో రూ.50 వేలకు పైగా సహాయం పొందాను. ఏ దిగులూ లేకుండా ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నా. రైతు భరోసా కేంద్రం ద్వారా అందించే సాంకేతిక సహాయం పొందుతూ ఉత్సాహంగా వ్యవసాయం చేస్తున్నా. నా భార్యకు వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 వస్తోంది. ఈ సొమ్మును కూడా వ్యవసాయ పెట్టుబడికి వినియోగిస్తున్నాం. ఇంత సాయం చేసిన జగనన్నను ఎలా మరచిపోగలం? – గొట్టుముక్కుల ఏసురత్నం, తూర్పుపాలెం (బి.చిట్టిబాబు, విలేకరి, పోడూరు) అప్పుల ఊబి నుంచి బయటపడ్డాం మా ఆయన వీధుల్లో తిరిగి ఉల్లిపాయలు విక్రయిస్తుంటాడు. మంగళగిరి గండాలయపేట కొండపై గుడిసె వేసుకుని మేము జీవిస్తున్నాం. మా ఆయన అరకొర సంపాదనే మా కుటుంబానికి జీవనాధారం. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాం. వారు అత్తారిళ్లల్లో ఉంటున్నారు. ఇప్పుడు మేమిద్దరమే గుడిసెలో ఉంటున్నాం. కొన్నేళ్ల క్రితం నాకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి వెళ్లాం. వైద్యులు కిడ్నీ సమస్య ఉందని చెప్పడంతో ది్రగ్బాంతికి గురయ్యాం. కిడ్నీ సమస్య అంటే చికిత్స ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఏం చేయాలో పాలుపోక సతమతం అయ్యాం. ఆస్పత్రి ఖర్చులు, కుటుంబం గడిచేందుకు అప్పులు చేయాల్సి వచ్చేది. అంతలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ చేయడంతో పాటు ప్రతి నెలా రూ.10 వేలు పెన్షన్ ఇస్తుండడంతో అప్పులు చేయాల్సిన అవసరం రాలేదు. ఆరి్థక ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నాం. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ పెన్షన్ కానుక మాలాంటి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. – గడ్డం లక్షి్మ, గండాలయపేట, మంగళగిరి (ఐ.వెంకటేశ్వరరెడ్డి, విలేకరి, మంగళగిరి) వంకరపోయిన వేళ్లకు ఉచితంగా శస్త్రచికిత్స గతేడాది ఆగస్టులో మా బంధువుతో కలసి మా అబ్బాయి కటారి చరణ్‌కుమార్ విశాఖ జిల్లా భీమిలి నుంచి తగరపువలసకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కుడి చేయి రోడ్డుకు బలంగా తాకడంతో మూడు వేళ్లు బాగా దెబ్బ తిన్నాయి. స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచాను. సరైన వైద్యం అందక వేళ్లు వంకరపోయాయి. తగరపువలస సమీపంలోని చిట్టివలస జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాబు వంగిన చేతి వేళ్లతో ఏమీ రాయలేకపోయేవాడు. వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాయడం ఎలా అని భయపడ్డాం. ప్రైవేటు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స చేయిద్దామంటే శస్త్రచికిత్సకు రూ.లక్ష అడిగారు. కార్పెంటర్ పనులు చేసుకునే నాకు ఇది చాలా పెద్ద మొత్తం. ఈ ప్రభుత్వ పుణ్యమా అని సంగివలస ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నవంబర్ 29న ఉచితంగా శస్త్రచికిత్స చేసి వేళ్ల వంకర సరిచేశారు. అవసరమైతే మరో శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. కొద్ది రోజుల విరామం తర్వాత మళ్లీ స్కూలుకు వెళ్లగలుగుతున్నాడు. చక్కగా రాయగలుగుతున్నాడు. నాలుగేళ్ల క్రితం నా భార్య సత్యవతి ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయింది. అప్పటి నుంచి నా ఇద్దరు పిల్లలకు నేనే ఆధారం. నా కుమారుడికి నాలుగేళ్లుగా అమ్మ ఒడి డబ్బులు కూడా వస్తున్నాయి. నా కుమార్తె నందిని చిట్టివలస హైస్కూల్లో 7వ తరగతి చదువుతోంది. అన్నీ ప్రభుత్వమే ఇస్తున్నందున పిల్లల చదువుకు దిగుల్లేదు. – కటారి భాస్కరరావు, బంగ్లామెట్ట, తగరపువలస (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) -
‘దేశం’లో ధనస్వామ్యం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పేదల కోసమే పుట్టిందంటూ తరచూ చెప్పే చంద్రబాబు ఎన్నికల్లో సీట్లు మాత్రం పెత్తందారులకే కట్టబెడుతున్నారు. ఇందుకోసం మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసి ఆ జెండానే నమ్ముకున్న వారిని పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు. ధనబలం ఉన్న వారికే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇస్తామని, ఇందులో మరో ఆలోచనకే తావులేదని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆయన ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత ఇటీవల చంద్రబాబును కలిసి పార్టీని నిలబెట్టేందుకు తాను ఎంతలా కష్టపడ్డానో చెప్పి ఈసారి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరినప్పుడు ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడం సాధ్యంకాదని ఆయన తెగేసి చెప్పారు. పోటీ చేసేవాళ్లు బయట వాళ్లా, పార్టీ వాళ్లా అనేది ముఖ్యం కాదని డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్లకే సీట్లు ఇస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పార్టీ వ్యూహ రచన సమావేశాల్లోనూ చంద్రబాబు, ముఖ్య నేతలు ఇదే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల అన్వేషణ, ఎంపికలోనూ దీన్నే పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చాలాచోట్ల కొత్త పెత్తందారుల ముఖాలే కనిపిస్తున్నాయి. ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చంద్రబాబు గేట్లు బార్లా తెరిచేశారు. పార్టీ ఫండ్ ఇవ్వండి, సీట్లు తీసుకోండని టీడీపీ సీనియర్లు బడాబాబులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. వలలో పడిన వారిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. బాబు చేసే ఈ ధన యజ్ఞంలో పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న నేతలూ కొట్టుకుపోయే పరిస్థితి దాపురించిందని పార్టీనే నమ్ముకున్న సీనియర్లు వాపోతున్నారు. డబ్బులేదని నానికి ఝలక్.. తమ్ముడికి ఛాన్స్.. ఇక విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని ప్రస్తుతం డబ్బు ఖర్చుచేసే పరిస్థితి లేదని తెలియడంతో చంద్రబాబు ఆయన్ను అవమానకర రీతిలో పక్కన పెట్టేశారు. ఎంపీగా ఉన్నా ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు పిలవడంలేదు. చోటామోటా నేతలతో ఆయన్ను తిట్టిస్తున్నారు. పొమ్మనకుండా పొగబెట్టి పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి సృష్టించారు. నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తానని చంద్రబాబు ఇటీవల స్పష్టంచేశారు. రూ.100 కోట్లకుపైగా డబ్బును ఖర్చుపెట్టేందుకు ఆయన సిద్ధపడడంతో చిన్నికి అవకాశమిచ్చారు. రియల్ ఎస్టేట్‌లో బాగా డబ్బు సంపాదించి, సొంత అన్నతోనే విభేదించిన చిన్ని చివరికి ఆయనకే వెన్నుపోటు పొడిచి సీటు తెచ్చుకున్నారనే ప్రచారం టీడీపీలోనే విస్తృతంగా జరుగుతోంది. గుంటూరు బరిలో విద్యా సంస్థల అధినేత! గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో పార్టీ కోసం ఇప్పటివరకూ పనిచేసిన నేతలను కాదని ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన చంద్రబాబు చేతులు మీదుగా ప్రజలకు పండుగ కానుకలు ఇస్తామని మభ్యపెట్టి తొక్కిసలాటలో ముగ్గురి మృతికి కారణమయ్యారు. అలాగే, గుంటూరు ఎంపీ స్థానం నుంచి భాష్యం విద్యా సంస్థల యజమాని రామకృష్ణను పోటీచేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు బడా బాబుల కోసం చంద్రబాబు గేలం వేస్తున్నారు. ♦ కాకినాడ పార్లమెంట్ స్థానం కోసం మొదటి నుండి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌ను కాదని వ్యాపారవేత్త సానా సతీష్ కు సీటు ఇవ్వాలని చూస్తున్నారు. ♦ తుని అసెంబ్లీ స్థానంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోసిన కృష్ణుణ్ణి నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు సీటు కట్ట బెడుతున్నారు. ♦రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ను తప్పించి ఆర్థికంగా స్థితిమంతుడైన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తనయుడు వెంకటరమణను ఇన్‌ఛార్జిని చేశారు. ♦ అమలాపురం ఎస్సీ రిజర్వు స్థానంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కాదని ఆర్థికంగా ధన బలం ఉన్న అయితాబత్తుల సత్యశ్రీకి సీటు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ చివరికి పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కూడా కాదని కమ్మ సామాజికవర్గానికి చెందిన ధనవంతుడు, కాంట్రాక్టర్ చంద్రమౌళికి సీటు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొంత కుటుంబానికే ఓటు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ పెత్తందారులకే సీట్లు కట్టబెట్టేందుకు చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గండి బాబ్జి స్థానంలో తన కుటుంబానికి చెందిన ‘గీతం’ భరత్‌ను రంగంలోకి దించేందుకు చంద్రబాబు రంగం సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. తెరపైకి ఎన్ఆర్ఐలు ♦ విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కోళ్ల అప్పలనాయుడు కుటుంబాన్ని కాదని ఎన్ఆర్ఐ కొంప కృష్ణను రంగంలోకి దించారు. తనదే సీటని చెప్పుకుంటూ ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ♦ నెల్లిమర్లలో మాజీమంత్రి పతివాడ నారాయణస్వామిని కాదని బంగార్రాజు అనే వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ♦పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కుటుంబాన్ని పక్కనపెట్టి ఎన్ఆర్ఐ గోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. ♦ కృష్ణాజిల్లా గుడివాడలో రావి వెంకటేశ్వరరావు కుటుంబం ఎన్టీఆర్ నాటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉంది. ఇప్పుడు డబ్బులేదనే కారణంతోనే రావిని పక్కకు నెట్టి ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని ఇన్ఛార్జిగా ప్రకటించారు. రాముకున్న అర్హత కేవలం ధన బలం మాత్రమేనని, డబ్బు లేకపోవడంవల్లే తనను దూరం పెట్టారని రావి వెంకటేశ్వరరావు వాపోతున్నారు. -
అత్యవసర సేవలకు ఇబ్బంది రాకూడదనే..
సాక్షి, అమరావతి: బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అందాల్సిన అత్యవసర సేవల్లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కాగా, ఈ చర్యను సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు.. ఎన్నికల ముందు బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో అంగన్వాడీలు సమ్మెకు దిగడాన్ని తప్పుబట్టాయి. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నాయి. వాస్తవానికి దేశంలో అంగన్వాడీలకు ఎక్కువ వేతనాలు ఇచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని, వీరి వేతనాల నిమిత్తం కేంద్రం కేవలం రూ. 1,800 మాత్రమే ఇస్తున్నా మిగతా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపాయి. చాలా రాష్ట్రాల్లో వారికి ఇచ్చే వేతనం రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు మాత్రమే ఉందని చెప్పాయి. కాగా, ఇప్పుడు అంగన్వాడీలను ఇష్టమొచ్చిన మాటలతో రెచ్చగొడుతున్న విపక్ష నేత చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్న 2000వ సంవత్సరంలో ఉద్యోగులను గుర్రాలతో తొక్కించాడన్నది పచ్చి నిజం. మళ్లీ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్ల పాటు వారికి కేవలం రూ. 4 వేలు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత రెండున్నరేళ్లు రూ. 7 వేలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల వేతనాన్ని తెలంగాణతో సమానంగా పెంచుతామని 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే కొద్ది నెలల ముందు హడావుడిగా వారి వేతనాన్ని రూ. 10,500కు పెంచి దానిని అమలు చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అంగన్వాడీల వేతనాన్ని రూ. 11,500కు పెంచి చెల్లిస్తోంది. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది తలెత్తినా ఎప్పుడూ ప్రభుత్వం వెనకడుగు వేయని ప్రభుత్వ పరిస్థితిని అంగన్వాడీలు అర్థం చేసుకోకపోవడం ఏంటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకే ఎస్మా.. అత్యంత బలహీనులకు పౌష్టికాహార పంపిణీ తదితర సేవలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అంగన్వాడీలు ఆరు నెలల పాటు సమ్మె చేయకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నెలలో 25 రోజుల చొప్పున ఏడాదిలో 300 రోజులపాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గత నెల 12 నుంచి సమ్మెకు దిగడంతో ప్రజల్లో అత్యంత బలహీనులైన వారికి పౌష్టికాహార పంపిణీలో అవరోధం ఏర్పడింది. ఇప్పటికే పలుమార్లు వారితో చర్చలు జరిపిన ప్రభుత్వం వారి 11 డిమాండ్లలో 10 ఆమోదించి అమలుకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీ నిలిచిపోయింది. పిల్లల గ్రోత్ మోనిటరింగ్ నిర్వహణ, ఇమ్యూనైజేషన్, ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు ఆగిపోయాయి. సమ్మె కారణంగా 7.5 లక్షల ప్రీ స్కూల్ పిల్లలు అంగన్వాడీలకు రావడం తగ్గిపోయి ప్రస్తుతం రెండు లక్షలే వస్తున్నారు. కొత్తగా పిల్లల నమోదు కూడా ఆగిపోయింది. ప్రతి నెల సుమారు 45 వేల మంది గర్భిణులు, బాలింతలకు సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనార్థం తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఆంధ్రప్రదేశ్ ఎసెన్షియల్ సర్విసెస్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్–1971(ఎస్మా)’ను ప్రయోగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు నెలలపాటు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రోత్సాహకాలిస్తున్న ప్రభుత్వం ఇది.. ♦ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని ఐదేళ్ల కాలంలో అంగన్వాడీ కార్యకర్తలకు సగటున (నెలకు) రూ. 6,950, అంగన్వాడీ సహాయకులకు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున (నెలకు) రూ.3,900 మాత్రమే చెల్లించింది. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలున్నగురేళ్లుగా వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7 వేలు చొప్పున పెంచిన వేతనాలు అందిస్తోంది. అంతేగాక మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పున ఇస్తోంది. ఏడాదికి సుమారు రూ. 27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. -
సమ్మె విరమించండి.. సమస్యలు పరిష్కరిస్తాం
సాక్షి, అమరావతి: మున్సిపల్ కార్మికులు కోరిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కార్మికులు సమ్మె విరమిస్తే పది రోజుల్లో వారి సమస్యలను పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంఘాల ప్రతినిధులతో శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం మరోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నుంచి రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు వి.రవి కుమార్ (వైఎస్సార్టీయూసీ), ఎ.రంగనాయకులు (ఏఐటీయూసీ), కె. ఉమామహేశ్వరరావు (ఏపీసీఐటీయూ), జి.రఘురామరాజు (టీఎన్టీయూసీ), బాబా ఫకృద్దీన్ (ఏపీఎంఈడబ్లు్యయూ), జీవీఆర్కేహెచ్ వరప్రసాద్, కె.శ్రీనివాసరావు (ఏఐసీటీయూ), ఆర్.సత్యం (జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్), ఇ.మధుబాబు (ఏపీ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్) హాజరయ్యారు. చర్చల అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్డ్, అన్ స్కిల్డ్ వర్కర్లకు ఒకే తరహా వేతనాలు మినహా, మిగిలిన అన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించి పది రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు. ఆ హామీలు ఇవీ.. ♦ సీవరేజీ మరణాలకు సుప్రీం కోర్టు ఆదేశానుసారం రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని కార్మికులు కోరారు. సుప్రీం తీర్పును అమలు చేస్తాం. ♦ సరండర్ లీవ్ బిల్లులు విడుదల చేస్తాం ♦ రెగ్యులర్ కార్మికులకు పీఎఫ్ అకౌంట్ చెల్లింపులు చేస్తాం ♦ పారిశుద్ధ్య కార్మికులు కాని వారి కేటగిరీల మార్పుపై ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలపై సత్వరమే చర్యలు తీసుకుంటాం ♦ గతంలో చనిపోయిన కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడానికి అంగీకారం ♦ కోవిడ్ మరణాల ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు మరోసారి దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తాం ♦ కాల్వలు, బాత్రూం క్లీనర్స్, సీవరేజ్, గార్బేజ్ సిబ్బంది, మలేరియా వర్కర్స్ వంటి 10 కేటగిరీల సిబ్బందికి వేతనం, అలవెన్స్ కలిపి రూ.21 వేల వేతనాన్ని ఒకేసారి అందిస్తాం. ప్రస్తుతం ఇస్తున్న 15 వేలు, రూ.6 అలవెన్స్ స్థానంలో మొత్తం కలిపి జీతంగా పరిగణించాలని కార్మికులు కోరారు. అందుకు అంగీకరించాం. ♦ వాటర్ సప్లైలో పని చేస్తున్న నైపుణ్యం గల పొరుగు సేవల కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ నిచ్చి సర్టిఫికెట్లు అందజేస్తాం ♦ మరణించిన పొరుగు సేవల కార్మికుల దహన సంస్కారాలకు ఇస్తున్న ఖర్చులను పెంచుతాం ♦ నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్ల కేటగిరీ సమస్యలను అన్నింటినీ పది రోజుల్లో పరిష్కరిస్తాం. ♦ పొరుగు సేవల నుంచి రిటైర్ అయిన కార్మికులకు రూ.50 వేలు ఇస్తాం. అయితే, వారు సర్వీసును కనీసం 10 ఏళ్లు పూర్తి చేయాలి. ఆపై సర్విసు పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ.2 వేల చొప్పున అదనంగా చెల్లిస్తాం ♦ అన్ స్కిల్డ్ వర్కర్లకు కూడా స్కిల్డ్ వర్కర్లతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. అన్ స్కిల్డ్ వర్కర్లు కూడా చదువుకుని ఐటీఐ వంటి స్కిల్ సర్టిఫికెట్ సాధిస్తే వారికీ స్కిల్డ్ వేతనం అందిస్తాం. ఇందుకోసం వారికి చదువుకునే అవకాశం కూడా కల్పిస్తాం. -
అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు నీచ రాజకీయాలు
సాక్షి అమరావతి: అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు, లోకేశ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశామన్నారు. వారు అత్యవసర సర్విసుల కిందకు వస్తారని, అందుకే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలింతలు, గర్భిణిలకు సేవల్లో ఇబ్బంది రాకూడదనే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ఆహారం ఇవ్వడం అత్యవసర సేవ కాదా? అందుకే అలా చేశాం. వారి డిమాండ్లలో 90 శాతం నెరవేర్చాం. ఒకటి రెండు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల ముందు చెప్పింది అధికారంలోకి రాగానే అమలు చేశాం. ఇప్పుడు ఎన్నికల తర్వాత మిగతా డిమాండ్లు కూడా కచ్చితంగా అమలుచేస్తామనే చెప్పాం. ఇప్పుడే కావాలని వారు అంటున్నారు. ఆ బరువు ఇప్పుడు ప్రభుత్వం మోయలేదు. ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం. ఇంతకంటే పొలైట్‌గా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఉందా?. చంద్రబాబు ఏనాడైనా ఇంత సంయమనంతో ఉన్నాడా? తుపాకులతో కాల్పులు జరిపింది ఎవరు. గుర్రాలతో తొక్కించింది ఎవరు అంటే చంద్రబాబే కనిపిస్తారు. చంద్రబాబు నైజాన్ని పుణికి పుచ్చుకున్న లోకేశ్ మా గురించి సీఎం జగన్ గురించి విమర్శలు చేయడం విడ్డూరం. ఇక అంబటి రాయుడు కొద్దిరోజుల క్రితమే పార్టీలో చేరారు. ఆయన ఏ రీజన్‌తో వచ్చారో, దేనికి రాజీనామా చేశారో అనేది తెలియదు. కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ట్వీట్లో తెలిపారు. పూర్తి వివరాలు తెలిశాక స్పందిస్తాం. -
కృష్ణా తీరాన.. అభివృద్ధి పతాక
ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి ప్రతినిధి, విజయవాడ విజయవాడ.. ఇప్పుడు పేరెన్నికగన్న నగరాలకు దీటుగా రూపుదిద్దుకుంటోంది. ఓ వైపు ఫ్లైఓవర్లు.. మరోవైపు బైపాస్ రహదారుల నిర్మాణంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. వాణిజ్యపరంగా పేరెన్నికగన్న ఈ నగరంలో కేవలం నాలుగేళ్లలోనే ఊహించని అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. నిత్యం కృష్ణానది వరదనీటి ప్రవాహం వల్ల ముంపుతో బాధ పడుతున్న నగరవాసులకు రక్షణ గోడతో పూర్తి స్థాయి ఉపశమనం లభించింది. వరద వస్తే చాలు.. తట్టా బుట్టా చేత పట్టుకుని ఎగువ ప్రాంతానికి పరుగులు తీసే దుస్థితి తప్పింది. నగర నడిబొడ్డున ఠీవీగా నిలిచిన అంబేడ్కర్ విగ్రహం.. అభివృద్ధి అంటే ఇదీ.. అన్నట్లు మనందరికీ చూపిస్తోంది. మెట్రోపాలిటన్ నగరాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రూపు రేఖలు మారిపోయాయి. బెజవాడకు మణిహారం ఫ్లైఓవర్లు.... నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా కొత్తగా నిర్మించిన జంట ఫ్లైఓవర్లు బెజవాడకు మణిహారంగా నిలుస్తున్నాయి. జెంజి సర్కిల్–1 ఫ్లైఓవర్ 48 స్పాన్లతో 1.470 మీటర్ల వెడల్పుతో(అప్రోచ్‌రోడ్డు సహా) 2.27 కిలోమీటర్ల పొడవుతో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించారు. ► రెండోఫ్లైఓవర్ ఏడాదిన్నరలో పూర్తి చేయాలన్నది టార్గెట్. కానీ ఏడాదిలోనే అది అందుబాటులోకి వచ్చింది. దీని పొడవు 1.703 కిమీలు, స్పాన్లు 55, వెడల్పు 12.5 మీటర్లు. నిర్మాణానికి అయిన ఖర్చు రూ.96 కోట్లు. ► దీంతో పాటు బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ వెస్ట్, ఈస్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు పనులకు అడ్డంకిగా నిలిచిన భూసేకరణ సమస్య పరిష్కారమైంది. పశ్చిమం వైపు 2.47 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న సర్వీస్‌రోడ్డుకు రూ. 25కోట్లు ఖర్చు చేస్తున్నారు. తూర్పువైపు పెండింగ్‌లో ఉన్న 860మీటర్ల సర్వీస్‌రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ► బెంజి సర్కిల్‌నుంచి పోరంకి వరకు 6 కిలోమీటర్ల మేర డ్రైనేజీ పనులు రూ. 15కోట్లతో చేపడుతున్నారు. ఇంకా గుణదల ఫ్లైఓవర్, రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ పనులకు మార్గం సుగమం అవుతోంది. ► గన్నవరం విమానాశ్రయం వద్ద హాఫ్ ఫ్లైఓవర్‌ను రూ. 23.77 కోట్లతో నిర్మించారు. హైదరాబాద్ హైవే నిర్మాణానికి అవరోధంగా నిలిచిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, అసంపూర్తి పనులను రూ17కోట్లతో చేపట్టారు. ► గ్రీన్ ఫీల్డ్ హైవే(విజయవాడ–ఖమ్మం)కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. కనకదుర్గ ఫ్లైఓవర్‌కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను ఈ మధ్యనే ప్రారంభించారు. బైపాస్‌లతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ నగరానికి వచ్చే వాహనాలకు ఇక ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వెస్ట్, ఈస్ట్ బైపాస్ నిర్మాణాలు ఉపకరించనున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్కు సంబంధించి 30 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల రహదారి(చిన్న అవుటపల్లి నుంచి– గొల్లపూడి)ని రూ1148 కోట్లతో 2021 ఫిబ్రవరిలో ప్రారంభించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. ► గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 17.88కి.మీ పొడవున రహదారి పనులు, కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన పనులు వేగంగా సాగుతున్నాయి. విజయవాడ తూర్పు వైపు నిర్మించతలపెట్టిన బైపాస్ రోడ్డుకు దాదాపు పూర్తి కావచ్చింది. ► కృష్ణా జిల్లా పొట్టి పాడు నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 49.3 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కృష్ణానదిపైన 3.750 కిలోమీటర్ల పొడవుతో ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. దీనికోసం రూ4607.80కోట్లు వెచ్చించనున్నారు. ముంపు నుంచి ఉపశమనం నగరంలోని కృష్ణానదీతీరవాసులు ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యనుంచి ఉపశమనం కలిగించారు. కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్Š వరకూ రక్షణగోడ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వారధినుంచి పద్మావతి ఘాట్ నుంచి రక్షణ గోడ పనులు సాగుతున్నాయి. మొదటి దశలో రూ.93,22 కోట్లు, రెండో దశలో రూ. 180.24 కోట్లు, మూడో దశలో రూ. 120.81 కోట్లు కలిపి మొత్తమ్మీద రూ394.27 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రిటైనింగ్ వాల్ వెంబడి రెండు దశల్లో రూ.33.39కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు జరగనున్నాయి. గ్రీనరీ, పార్కులు, వాకింగ్, సైకిల్ ట్రాక్‌తో అందంగా తీర్చిదిద్దుతున్నారు. కాలువలపై రూ. 31కోట్లతో ఏడు వంతెనలు నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిమస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఠీవిగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. జనవరి19న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఠీవిగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. జనవరి19న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు. అందాల వాడగా తీర్చిదిద్దాం బెజవాడను అందాల వాడగా తీర్చిదిద్దాం. నగరంలో జలకాలుష్యం తగ్గించేందుకు మూడు ప్ర«ధాన కాలువలను శుభ్రం చేశాం. కెనాల్ బండ్స్‌ను సుందరీకరించాం, ప్లాస్టిక్ వినియోగం తగ్గేలా చేశాం. విజయవాడలో రోడ్లు, గ్రీనరీ, పార్కులను అభివృధ్ది చేశాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, వీఎంసీ ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించాం నగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలిగించేలా ఫ్లైఓవర్లు నిర్మించాం. జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చాం. నగరంలో రోడ్లు, పచ్చదనం చేపట్టాం. కృష్ణానది వెంబడి రక్షణ గోడ నిర్మించాం. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నాం. – ఎస్.ఢిల్లీరావు, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా నగరాభివృద్ధిపై మహానేత చెరగని ముద్ర విజయవాడ నగర అభివృద్ధిపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయన ఐదేళ్ల పాలనలో నగరాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. పేదలకు జేఎన్యూఆర్ఎం కింద గృహాలు నిర్మించి అందజేశారు. నగర శివారులో వైఎస్సార్ కాలనీ నిర్మించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చనమోలు వెంకట్రావు పేరుతో మిల్క్ ప్రాజెక్టు వద్ద ఫ్లై ఓవర్ నిర్మించారు. రైల్వే స్టేషన్ రోడ్డు, గుణదల పడవల రేవును కలుపుతూ 6 కిలో మీటర్ల మేర బీఆర్టీఎస్ రోడ్డు నిర్మించారు. అజిత్‌సింగ్ నగర్ బుడమేరు వరద నివారణకు కట్ట నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో... ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఇళ్లు పేరుతో ఎన్టీఆర్ జిల్లాలో తొలి విడతలో 1.07లక్షల మందికి ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 14,995 ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు చేశారు. కాల్వ గట్లు, ప్రభుత్వ స్థలాల్లో , రోడ్ల పక్కన ఆవాసం ఉంటున్న వారిని తొలగించి వాంబే కాలనీలో ఇళ్లు కేటాయించారు. పటేల్ నగర్ ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, నేతాజీ కాలనీ, రాధానగర్, రాజీవ్‌నగర్, వడ్డెర కాలనీ, నందా వారి కండ్రిక ప్రాంతాల్లో గతంలో కార్పొరేషన్ 13,915 ఇళ్లు నిర్మించి కొన్నింటినే రిజి్రస్టేషన్ చేశారు. టీడీపీలో గ్రాఫిక్స్‌తోనే సరి... టీడీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిపై శీత కన్నేసింది. అమరావతి రాజధాని పేరుతో గ్రాఫిక్స్‌తోనే ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసింది. విజయవాడకు సంబంధించి ప్రధాన ఫ్లై ఓవర్లు, రోడ్లు, ట్రాఫిక్ సమస్య గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ హయాంలో ప్రారంభమైప కనకదుర్గ ఫ్లై ఓవర్ç పూర్తి చేయకుండా కాలం వెళ్లదీసింది. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పూర్తి చేయాలనిగానీ, నగరానికి నలువైపుల నుంచి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రోడ్లను జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలన్న ఆలోచనే చేయలేదు. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్‌తో ప్రజల కళ్లకు గంతలు కట్టారు. ఈవెంట్లతో పబ్బం గడుపుకున్నారు. గత టీడీపీ హయాంలో అభివృద్ధి పేరుతో మాయ చేసిన వైనాన్ని, ఈ ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, వెస్ట్, ఈస్ట్ బైపాస్, నగరంలో రోడ్లు, కాల్వల ప్రక్షాళన, పచ్చదనం వంటి పనులు చేపట్టిన తీరు చూసి నిజమైన అభివృద్ధి అంటే ఇది అని చర్చించుకుంటున్నారు. సరికొత్తగా ఇంద్రకీలాద్రి ఇప్పటికే సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఇంద్రకీలాద్రిపై మరిన్ని అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ ఇటీవలే ప్రారం¿ోత్సవాలు, కొత్తవాటికి శంకుస్థాపన చేశారు. కనకదుర్గానగర్ గోశాల వద్ద రూ. 216.05 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ. 23.145కోట్లతో పూర్తయిన పనులను ప్రారంభించారు. ఆధ్యాత్మిక విహారం కృష్ణా నదిలో జల విహారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నదీ తీరంలోని అలయాలు, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ టెంపుల్ టూరిజంకు రూపకల్పన చేశారు. కృష్ణా నదిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జలవిహారం చేస్తూ 82 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయటం ద్వారా ఎనిమిది ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ సంస్థ చర్యలు తీసుకొంటోంది. ఇందుకోసం దుర్గఘాట్‌నుంచి అమరావతి వరకు ఐదు ప్రదేశాలను కలుపుతూ ఓ సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. ముక్త్యాల నుంచి అమరావతికి నాలుగు ప్రదేశాలను కలుపుతూ ఇంకో సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. జెట్టీలలోనే భోజనం, అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. పిల్లలకోసం ఆట పరికరాలు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, ఓపెన్‌గేమ్స్, ఎడ్వంచర్ గేమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిపాదనలు ఇలా... రెండు యాంత్రీకరణ బోట్లు కొనుగోలుకు : రూ.22 కోట్లు ఏడు ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, సౌకర్యాలకోసం : రూ. 24 కోట్లు రూఫ్ టాప్ సోలార్ పవర్ చార్జింగ్ స్టేషన్ల కోసం: రూ.4 కోట్లు మొత్తం అయ్యే ఖర్చు : రూ .50 కోట్లు -
దేశానికే తలమానికంగా అంబేద్కర్ విగ్రహం: విక్టర్ ప్రసాద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశంలోనే అతి ఎత్తైన 125 అడుగుల డా. బీఆర్.అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు రూ.400 కోట్లతో స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని బడుగు, బలహీనవర్గాలవారు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విజయవాడకే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే అంబేద్కర్ విగ్రహాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిఒక్కరూ కుల, మత, పార్టీలకతీతంగా స్వచ్ఛందంగా తరలిరావాలని ఆయన ఆకాంక్షించారు. అంబేద్కర్ భావజాలంతో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. అందరివాడైన అంబేద్కర్ స్మృతి వనాన్ని అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా డా.బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, స్కై లైటింగ్, ఫౌంటెన్లు, లైబ్రరీ వంటి వాటితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు. గత ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం నిర్మాణం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమన్నారు. అటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, ప్రతి ఒక్కరూ పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో పండగ వాతావరణంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వీటిలో రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు. -
ప్రభంజనంలా సాధికార యాత్ర.. అడుగడుగునా అపూర్వ స్పందన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 41వ రోజు వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. అడగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ నీరాజనం పలికారు. బస్సు యాత్రలో భాగంగా గ్రేటర్ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 26వ వార్డులోని ఎన్జీజీఓస్ కాలనీలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన జీవీఎంసీ స్కూల్‌ను వైఎసార్సీపీ ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం మాధవధార నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీని చేపట్టారు. వేలాది బైక్ లతో సామాజిక సాధికార బస్సుయాత్ర కైలాసపురం వద్ద ఇన్ ఆర్పిట్ మాల్ స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రి మేరుగ నాగార్జున, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగ్గుపల్లి సుభద్ర, గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు హాజరయ్యారు. సీఎం జగన్ సాహసోపేత నిర్ణయాలు: డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలకు రుణాలు, రైతుల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే, జగన్ ఇచ్చిన హామీ మేరకు దఫదఫాలుగా మాఫీ చేస్తున్నారన్నారు. పేదల పిల్లల ఉన్నతస్థాయిలో చదవుకోవాలని నాడు - నేడు ద్వారా అభివృద్ధి పనలు చేస్తున్నారని, అవ్వా , తాతలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ రూ. 3 వేలకు పెంచి అందిస్తున్న ఘనత జగన్ దేనని ఉద్ఘాటించారు. ఆరోగ్య శ్రీ కేవలం రూ. 2 లక్షల పరిమితితో ఆనాడు స్వర్గీయ వైఎస్ ప్రారంభిస్తే, సీఎం జగన్ రూ. 25 లక్షల మేరకు పెంచి ప్రతీ కుటుంబ ఆరోగ్యం పట్ల తన చిత్తశుద్ధిని చాటి సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగి సామాజిక సాధికారత ఫరిడవిల్లుతుందన్నారు. విశాఖ నార్త్ లో వైసీపీ అభ్యర్థి కే కే రాజును వచ్చే ఎన్నికల్లో గెలిపించడంతో ద్వారా జగన్ ను సీఎంగా చేసుకోవాలని ముత్యాల నాయుుడు పిలుపునిచ్చారు. జగన్ పాలనలో సామాజిక సాధికార విప్లవం: మంత్రి మేరుగ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ సామాజిక సాధికారత సాధ్యం కాకపోగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జగన్ పాలనలో సామాజిక సాధికార విప్లవం సాధ్యమైందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అసమానతలు, అవినీతి, అశ్రిత పక్షపాతంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించి రాజ్యాంగ బద్ద హక్కులను కాలరాసారని మండిపడ్డారు. పేదల కడుపులో ఆకలి తీర్చడానికి, చిరునవ్వు కోసం లక్షల కోట్ల రూపాయల వెచ్చిస్తున్న ముఖమంత్రి జగన్ అని ప్రశంసించారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు సీఎం జగన్ ఇస్తే, రాజధాని ప్రాంతంలో వెనుకబడి వర్గాలకు ఇళ్లు కేటాయించాలని సీఎం జగన్ తలపిస్తే కోర్టులకెళ్లి అడ్డుకున్న చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలకు అవసరమా, అతని అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో 12.5 శాతం పేదరికం రాష్ట్రంలో ఉంటే, జగన్ హయాంలో 6 శాతానికి తగ్గిందని దీనికి వైసీపీ ప్రభుత్వ పాలన కాదా అని ప్రశ్నించారు. చంద్రగిరిలో పుట్టి కుప్పంలో పోటీ చేసే చంద్రబాబు, హైదరాబాద్ లో పుట్టిన లోకేశ్ మంగళగిరిలో పోటీ చేస్తున్న బ్రతుకు టీడీపీదైతే, జగన్ వచ్చే ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల నేతల సీట్లు మార్చుతున్నారని విమర్శిస్తుండటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల నేతలు ఎక్కడ పోటీ చేసినా సరే గెలవ గల సత్తాను సీఎం జగన్ ఇచ్చారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో సగం దూరం నడిచి పారిపోయిన లోకేశ్, ప్రజల కష్టాలు తీర్చుతానని చెప్పకుండా ఎర్ర బుక్ పేరుతో వైసీపీ నేతలకు బెదిరింపులు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. సీఎం జగన్ పాలనలో వెనుకబడివ వర్గాలకు గౌరవం: ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాలకు చేయూతనివ్వాలని సంకల్పించారని, రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల ఖర్చు చేసిన ముఖ్యమంత్రి జగన్ తప్పితే మరెవరూ లేరని వ్యాఖ్యానించారు. 133 కులాలు ఉంటే వాటిని క్రోడీకరించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమం అందిస్తున్నారన్నారు. వెనుకబడివ వర్గాలకు సమాజంలో గౌరవం కల్పించాలని జగన్ పరితపించారన్నారు. అధికారం పెద్దలదు కాదని, పేదలదని జగన్ నిరూపించారని, జగన్ పాలనలో పాలకులు ప్రజలకు సేవకులు మాత్రమేనని వివరించారు. జగన్ సాధించిన సాధికారతకు ఇదే నిదర్శనం: గ్రేటర్ విశాఖ మేయర్ హరికుమారి గ్రేటర్ విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ, గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలన చేసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంక్ లుగా మాత్రమే పరిగణించారని, సీఎం జగన్ సముచిత స్థానం కల్పించి కేబినెట్ లో చోటుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ ల పదవులు కట్టెబెట్టి ఆత్మగౌరవం పెంచారని కొనియాడారు. వెనుకబడిన వర్గానికి చెందిన గృహిణిని అయిన తనను విశాఖ వంటి మహా నగారానికి మేయర్ ను చేసారంటే సీఎం జగన్ ఏ స్థాయిలో సామాజిక విప్లవం తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చునన్నారు. నాడు - నేడుతో విద్యా రంగంలోనూ, ఆరోగ్య శ్రీ,, జగనన్న సురక్ష వంటి పథకాలతో ఆరోగ్య రంగంలోనూ పెద్ద ఎత్తున మార్పులు తీసుకువచ్చి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిపారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి గెలిపించాలని హరి కుమారి కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కే కే రాజు మాట్లాడుతూ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిక్షణం ప్రజాహితం కోసం పరితపిస్తుండటాన్ని చంద్రబాబు, ఆయన తోక పార్టీల అధ్యక్షులు ఓర్వలేక కోర్టుల కేసుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు సీఎం జగన్ చేసిన సామాజిక సాధికారతను చెప్పేందుకు బస్సు యాత్ర ద్వారా అన్ని వర్గాల నేతలు ప్రతిపక్షాలకు ధీటుగా వివరిస్తున్నారన్నారు. ఉత్తర నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ. 3427కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనలుు చేపట్టామని, 7 హాస్పిటల్స్, 14 స్కూల్స్ నిర్మాణం చేపట్టామని కే కే రాజు వివరించారు. ఆగస్టు 1న సీఎం జగన్ శంకుస్థాపన చేసిన ఇన్ ఆర్బిటల్ మాల్ నిర్మా్ణం పూర్తియితే స్థానికంగా ఉన్న యువత 15 వేల మందికి, ఎఎంసీ మాల్ ద్వారా 3 వేల మందికి ఉపాధి లభించబోతోందని, విశాఖ నార్త్ నియోజకవర్గంలోనే దాదాపుగా 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే ఎటువంటి వివక్ష లేకుండా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగ్గుపల్లి సుభద్ర మాట్లాడుతూ, దేశంలో గాంధీ, అంబేద్కర్ , ఫూలే కలలు గన్న సమాజాన్ని సాకారం చేసిన నేత జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని గుర్తు చేసారు. టీడీపీ హయాంలో గిరిజన శాఖకు మంత్రి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, జీసీసీ చైర్మన్ వంటి పదవులకు గిరిజనులను నియమించకుండా తీవ్రంగా అవమానించితే, జగన్ సీఎం కాగానే ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ, రాజ్యాంగ పదవుల్లో స్థానం కల్పించి గౌరవమిచ్చారని కొనియాడారు. వైసీపీ మైనార్టీ నాయకుడు ఎస్ ఏ రెహ్మన్ మాట్లాడుతూ, చంద్రబాబు కేబినెట్ విస్తరణ చేసినపుడు లోకేష్‌ను మంత్రిని చేసుకున్నాడని, ఎస్టీలు, ముస్లింలు కనిపించలేదని మండిపడ్డారు.