AP Special
-
చంద్రబాబుకు బిగ్ షాక్.. కేశినేని నాని సంచలన నిర్ణయం
సాక్షి, విజయవాడ: టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని గట్టి షాక్ ఇచ్చారు. లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో, ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. కాగా, కేశినేని నాని ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు నాయుడు.. పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను’ అని పోస్టు చేశారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG — Kesineni Nani (@kesineni_nani) January 5, 2024 అంతకుముందు, కేశినేని నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘తిరువూరు సభకు నన్ను రావొద్దన్నారు.. నేను వెళ్లడం లేదు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు. అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు. మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది నేను టీడీపీ పార్టీకి ఓనర్‌ను కాదు. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా. తినబోతూ రుచులెందుకు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా. కాలమే అన్నింటిని నిర్ణయిస్తుంది. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడాతారో ప్రజలే నిర్ణయిస్తారు. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటా. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు సరే. కానీ, ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు. ఇండిపెండెంట్‌గా గెలుస్తా.. నేను ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసమే నిలబడ్డా. కానీ, ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. చంద్రబాబుకి నేను వెన్నుపోటు పొడవలేదు. పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమో. పార్టీ పంపించిన ముగ్గురు పెద్దమనుషులు చెప్పిందే నేను పోస్టులో పెట్టా. నాదగ్గరికి ఆ ముగ్గురు వచ్చిపుడు మరో ముగ్గురు సాక్షులు కూడా వచ్చారు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తా. ఆ విషయంలో సందేహం లేదు. రాబోయే ఎన్నికల్లో నేను విజయవాడ నుంచే పోటీచేస్తా. కచ్చితంగా మూడో సారి గెలుస్తా. వసంత కృష్ణప్రసాద్ నేను మంచి స్నేహితులం. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డారు.. నా పార్టీకి నేను కష్టపడ్డా. అలాగని కొండపల్లి ఎన్నికల్లో మేం కలిసి పనిచేయలేదు కదా’ అని కామెంట్స్ చేశారు. -
ప్రజలకు ఏం మేలు చేశావని నీకోసం వస్తారు?
సాక్షి, అమరావతి: ‘‘రా.. కదలిరా అని పిలవగానే నీకోసం జనం ఎందుకు కదలి రావాలి. నువ్వు ఎవరికి ఏం మంచి చేశావని జనం వస్తారు’’ అంటూ చంద్రబాబునాయుడిపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఇప్పుడొచ్చి హైదరాబాద్, బెంగళూరు తరహాలో కనిగిరిని అభివృద్ధి చేస్తానని, పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఎన్నికలు వస్తే నీకు బీసీలు గుర్తు వస్తారు. కానీ వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వవు. సరైన పథకాలు అమలు చేయవు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చి మేనిఫెస్టో మాయం చేశావ్. చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా? బీసీలకు గుర్తుండే ఒక మంచి పథకం అయినా తీసుకొచ్చారా? ఎంత సేపు ఇస్త్రీ పెట్టెలు, మేకలు, గొర్రెలు, కల్లు కార్మికులకు కొడవళ్లు ఇచ్చారు. వీటితో వారి బతుకులు మారాయా? జయహో బీసీ కార్యక్రమం కేవలం ఓట్లు కోసమే కదా? బీసీలతో ఓట్లు వేయించుకుని వాళ్ల బతుకులను మాత్రం మార్చలేదు. విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు పెంచింది నీ పాలనలోనే కదా? నిత్యావసర వస్తువులు నీ హెరిటేజ్ బజార్లలో తక్కువకు ఇస్తున్నావా? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా? నువ్వు, పవన్ కళ్యాణ్ 2014లో అధికారం కోసం ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చారు కదా! ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి. కనీసం ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా?. వైఎస్ జగన్ సీఎం అయ్యాక లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయి. మద్యం తాగమంటూ పేదలను ప్రోత్సహిస్తావా? అందుకేనా బ్రాందీ తక్కువ ధరకు ఇస్తానని.. ఇంటికే సరఫరా అని అంటున్నావు. ఇదేనా నువ్వు పేదలకు చేసే మేలు? ఎన్నికల్లో మీరు అభ్యర్థులను ఎక్కడికైనా మార్చవచ్చు. మేము మారిస్తే తప్పా. జవహర్‌ను కొవ్వూరు నుంచి తిరువూరుకు ఎందుకు మార్చారు? నువ్వు చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు మారావు? నీతులు చెప్పడానికి సిగ్గుండాలి. ఇప్పుడు నువ్వు కొత్త హామీలిస్తూ ప్రజల చెవిలో పూలు పెట్టడానికి రెడీ అయ్యావు.ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని 2014 మేనిఫెస్టోలో చెప్పావు? ఒక్కరికైనా డిపాజిట్ చేశావా? గతంలో నువ్వు ఇచి్చన హామీలు ఒక్కటైనా నెరవేర్చావా?జగన్ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ స్కూళ్లు, రోడ్లు, ప్రైవేటు పరిశ్రమలొచ్చాయి. ఇది అభివృద్ధి కాదా? నిన్నెవరు నమ్ముతారు.. నీ హెరిటేజ్ వస్తువుల అమ్ముకోవడం కోసం రంజాన్ తోఫా తెచ్చావు. సీఎంగా ఉన్నప్పుడు చదువు ప్రభుత్వ బాధ్యత కాదన్నావు. నాడు పేదల చదువును అవహేళన చేసి.. ఇప్పుడు అధికారంలోకి వస్తే విమానాల్లో విదేశాలకు తీసుకెళ్తానంటే నిన్ను ఎవరు నమ్ముతారు. నీకు పవన్‌కు సిగ్గులేదు. గతంలో తిట్టుకుని, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. అది షర్మిల వ్యక్తిగతం.. షర్మిల ఒక రాజకీయ నాయకురాలు. చాలా మంది పార్టీలు మారుతూనే ఉన్నారు. ఆమె పార్టీ పెట్టి.. కాంగ్రెస్‌ను విమర్శించారు. తర్వాత అదే పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. వైఎస్సార్సీపీ వైఎస్ జగన్ నాయకత్వంలో ఏర్పడింది. మేమంతా జగన్ నాయకత్వం చూసి వచ్చాం. నాయకత్వం నచ్చలేదంటే ఉన్నవారుంటారు. వెళ్లే వారు వెళ్తారు. ఎవరితో ప్రయాణం చేయాలి అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. తెలంగాణలో పార్టీ పెట్టేటప్పుడే వద్దని జగన్ చెప్పారు. నా ఇష్టం అన్నపుడు ఇక వారి రాజకీయ ప్రయాణంతో జగన్‌కు ఏ సంబంధం ఉంటుంది? -
వెంకటగిరి.. జన కెరటం
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా వెంకటగిరిలో సామాజిక న్యాయం నినదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు సీఎం జగన్ పాలనలో తాము సాధించిన అభివృద్ధిని ఎలుగెత్తి చాటారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా వ చ్చిన ప్రజలు శుక్రవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. వెంకటగిరిలో ప్రారంభమైన ర్యాలీ పోలేరమ్మ ఆశీర్వాదం అందుకుని డక్కిలి మీదుగా రాపూరుకు చేరుకుంది. యాత్ర వెళ్లిన ప్రతి వీధిలో స్థానిక ప్రజలు నీరాజనాలు పలికారు. దళితుల కోసం రూ. 86 వేల కోట్లు ఖర్చు : ఎంపీ గురుమూర్తి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉన్నతికి సీఎం వైఎస్ జగన్ చేసినంత కృషి దేశంలో మరే ముఖ్యమంత్రీ ఇప్పటివరకు చేయలేదని ఎంపీ గురుమూర్తి చెప్పారు. ఒక్క దళితుల కోసమే సీఎం జగన్ రూ. 86 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. దళితుల పిల్లల చదువుల కోసం ఈ నాలుగున్నరేళ్లలో రూ. 10 వేల కోట్లు, ఈ వర్గాల మహిళల కోసం మరో రూ. 10వేల కోట్లు ఇచ్చారన్నారు. మళ్లీ జగనన్న వస్తేనే సంక్షేమం కొనసాగి, మన జీవితాల్లో మరింతగా వెలుగులు నిండుతాయని చెప్పారు. సీఎం జగన్ అంటేనే ఓ విప్లవం: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ అంటేనే ఓ విప్లవమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. చదువుతోనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని జగనన్న నమ్మి ప్రభుత్వ విద్యా రంగాన్ని అత్యున్నతంగా తీర్చి దిద్దుతున్నారని తెలిపారు. మన పిల్లలు ఈరోజు బెంచీల మీద కూర్చుని, దర్జాగా యూనిఫాం, షూస్ వేసుకుని, టైలు కట్టుకుని.. ఇంగ్లిష్ మీడియం చదువులు చదువుతున్నారన్నారు. ధనవంతుల పిల్లలకు, పేదల పిల్లలకు తేడా లేకుండా చేసిన జగనన్నకు మనం ఎంతగా రుణ పడిపోయామో అర్థం చేసుకోవాలని కోరారు. పేదలకు ఎలాంటి జబ్బులు చేసినా, ఎంత పెద్దవైనా రూ. 25 లక్షల మేర వైద్య సాయం అందిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ కులం, మతం చూడరు.. కేవలం ప్రేమను చూపిస్తాడు: అలీ సీఎం జగన్ కులం, మతం చూడరని, కేవలం ప్రేమనే చూపిస్తారని ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు అలీ అన్నారు. ఎప్పుడూ పేదలకు ఇంకా ఎంతో మంచి చేయాలని తపిస్తున్నారన్నారు. ఎన్నడూ చిరునవ్వు చెదరనివ్వని జగనన్న ప్రజల జీవితాల్లోనూ అదే సంతోషాన్ని చూడాలని సుపరిపాలన చేస్తున్నారని కొనియాడారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడం మనకు చాలా అవసరమని చెప్పారు. జగన్ బటన్ నొక్కితే.. బాబు గొంతు నొక్కుతాడు: నాగార్జున యాదవ్ సీఎం జగన్.. బటన్ నొక్కి నేరుగా పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్ చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం జనం గొంతు నొక్కే కార్యక్రమాలే చేశారని ధ్వజమెత్తారు. 14 ఏళ్లలో ఒక్కసారి కూడా బటన్ ఎందుకు నొక్కలేదని ప్రశి్నంచారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, మేరిగ మురళీధర్, సిపాయి సుబ్రమణ్యం తదితరులు మాట్లాడారు. -
వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
సాక్షి, అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సామాజిక సాధికార నినాదం మార్మోగింది. శుక్రవారం మలికిపురం ప్రధాన రహదారి నుంచి వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరితో ప్రధాన రహదారి నిండిపోయింది. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ‘జై జగన్.. జై వైఎస్సార్సీపీ’ నినాదాలతో హోరెత్తించారు. వీరికి స్థానిక ప్రజలు జేజేలు పలికారు. అనంతరం జరిగిన సామాజిక సాధికార సంభ జన సంద్రాన్ని తలపించింది. హోదా పెంచారు: మోపిదేవి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో పెద్ద పీట వేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గౌరవం ఇచ్చారని, సమాజంలో హోదాను పెంచారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ తెలిపారు. తనతో పాటు బీదా మస్తాన్‌రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపించారంటే బీసీల పట్ల జగన్‌కు ఉన్న ప్రేమను అర్థం చేసుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనార్టీలకు అధికారంలో సముచిత స్థానం ఇచ్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. అంబేడ్కర్, పూలే కన్న కలలను సీఎం జగన్ నిజం చేశారన్నారు. సామాజిక విప్లవం: మంత్రి విశ్వరూప్ సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా బడుగు, బలహీన వర్గాలు ఆర్థి కంగా ఉన్నత స్థితికి ఎదిగేందుకు తోడ్పడ్డారన్నారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాలు ఉన్నత స్థితికి రావాలంటే చదువుతోనే సాధ్యమని జగన్ సంపూర్ణంగా విశ్వసించారని, అందుకే నాడు–నేడులో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్ కానుకను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచారని చెప్పారు. పేదల పక్షాన : మంత్రి చెల్లుబోయిన వేణు రాష్ట్రంలో పేద వర్గాల పక్షాన నిలబడింది సీఎం జగన్ ఒక్కరేనని, ప్రతి సంక్షేమ పథకం లబ్ధిని పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందజేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను బానిసలుగా చూసిన చంద్రబాబుకు, ఈ వర్గాల వారిని అందలం ఎక్కించిన జగన్‌కు మధ్య పాలనను బేరీజు వేసుకుని, వచ్చి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మేలును చూసి చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఓర్చుకోలేక, నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలపై బాబుది కపట ప్రేమ
గుడ్లవల్లేరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల పక్షపాతి అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలా బీసీలను అణగదొక్కారని, ఇప్పుడు వారిపై కపట ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో శుక్రవారం పైపులైన్ల పనులను ప్రారంభించేందుకు వచ్చిన నాని మీడియాతో మాట్లాడారు. అత్యధిక శాతం ఉన్న బీసీలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చంద్రబాబు ఇప్పటికీ చేస్తున్నారని విమర్శించారు. పవన్‌ను భుజాన వేసుకుని బాబు బీసీలను గాలికొదిలేశాడన్నారు. ఏ వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నాడో బాబుకు ఆయా వర్గాలు తప్పకుండా 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతాయన్నారు. బాబు అధికారంలో ఉండగా రాజకీయంగా గానీ, సంక్షేమపరంగా గానీ బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఎన్టీఆర్ బీసీలకు చేసిన సంక్షేమాన్ని తన ఖాతాలో వేసుకుని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడని ఎద్దేవా చేశారు. బాబు హయాంలో కమ్మ, జగన్ హయాంలో బీసీ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణా జిల్లాలో బీసీ అయిన కొలుసు పార్థసారథికే మంత్రిగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. తాను, పేర్ని నాని జిల్లా మంత్రుల అనంతరం బీసీ సామాజిక వర్గం నుంచి జోగి రమేష్ కు సీఎం జగన్ అవకాశం ఇచ్చారని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ పదవి ఓసీ రిజర్వేషన్ అయితే.. చంద్రబాబు ఆనాడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె అనురాధకు అవకాశం ఇచ్చారని, జిల్లాకు ఓసీ రిజర్వేషన్ వచ్చినా బీసీ అయిన ఉప్పాల హారికను మహిళా చైర్‌పర్సన్‌గా చేయడం బీసీల పట్ల జగన్‌కు ఉన్న అంకిత భావానికి నిదర్శనమన్నారు. విజయవాడ మేయర్ ఓసీ రిజర్వేషన్ వస్తే కమ్మ సామాజిక వర్గం నుంచి కోనేరు శ్రీధర్‌ను చంద్రబాబు పెడితే, ఇప్పుడు మాత్రం ఓసీ రిజర్వేషన్ అయినా బీసీ మహిళను మేయర్‌ను చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. -
మిగులుకూ మేలు
‘‘ఈ ప్రభుత్వం.. ప్రజల తరపున మంచి సేవకుడిలా పని చేస్తోంది. అర్హత ఉండి కూడా ఏ కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలకు దూరమైన మిగిలిపోయిన అర్హులకూ లబ్ధి చేకూరుస్తూ ఏటా రెండు దఫాలుగా కార్యక్రమాలను నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంత తోడుగా నిలబడుతోందనేది చెప్పేందుకు ఇది ఒక సందేశంలా నిలుస్తూ ఎంతో సంతృప్తినిస్తోంది’’ – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో మేలు చేయాలనే తపనతో జవాబుదారీతనం, పారదర్శకతతో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. పథకాల కోసం పేదలు ఏ ఇబ్బందీ పడకుండా మిగిలిపోయిన అర్హులకు సైతం ఆర్నెల్లకు ఒకసారి లబ్ధి చేకూర్చుతున్నామని తెలిపారు. అర్హులెవరూ మిస్ కాకూడదన్నదే ఈ ప్రభుత్వ ఆరాటమని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబరు వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని 68,990 మంది మిగిలిపోయిన అర్హుల ఖాతాల్లో రూ.97.76 కోట్లను ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. మళ్లీ దరఖాస్తుకు అవకాశమిస్తూ.. నా నుంచి మొదలుపెడితే కలెక్టర్లు, సచివాలయాల వరకు ప్రతి ఒక్కరికీ ఎంతో సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇది. ఎవరికి ఏ సమస్య వచ్చినా మంచి సేవకుడిలా ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసా కల్పించే కార్యక్రమం ఇది. ఏ కారణం చేతనైనా పొరపాటున ఒక పథకం అర్హులకు అందకుంటే నెల రోజుల సమయం ఇచ్చి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం. దాన్ని వెరిఫై చేసి మిగిలిపోయిన అర్హులకు ఆర్నెల్ల లోపు లబ్ధి చేకూరుస్తున్నాం. ఏటా రెండు దఫాలుగా క్రమం తప్పకుండా జూన్ – జూలైలో ఒకసారి, డిసెంబరు – జనవరిలో మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సమాచారం తెలియక దరఖాస్తు చేసుకోకపోవడం, దరఖాస్తులో ఏదైనా పొరపాట్లు దొర్లడం, కావల్సిన పత్రాలు ఇవ్వక పోవడం, ఆధార్ మిస్ మ్యాచ్ లాంటి పలు కారణాలతో పథకాలకు దూరమైన అర్హులకూ దీని ద్వారా మంచి చేస్తున్నాం. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదన్నదే మా ఆరాటం. వివిధ పథకాలు మిస్ అయిన వారికి లబ్ధి.. అమ్మఒడి పథకానికి అర్హత పొందిన 42.62 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. ఈ పథకానికి సంబంధించి వివిధ కారణాలతో మిస్ అయిన మరో 40,616 మందికి ఇవాళ నగదు జమ చేస్తున్నాం. జగనన్న చేదోడు ద్వారా 3.25 లక్షల మందికి మంచి జరిగింది. వివిధ కారణాల వల్ల పథకాన్ని అందుకోలేకపోయిన మరో 15 వేల మందికి ఇప్పుడు లబ్ధి చేకూరుస్తున్నాం. ఈబీసీ నేస్తం కింద ఇప్పటికే 4.40 లక్షల మందికి మంచి జరగ్గా మిగిలిపోయిన మరో 4,180 మందికి ఇప్పుడు ప్రయోజనం చేకూరుతోంది. వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా అప్పట్లో 2.80 లక్షల మందికి మంచి జరగ్గా ఇప్పుడు మరో 3,030 మందికి మంచి చేస్తున్నాం. మత్స్యకార భరోసా ద్వారా ఇప్పటికే 1.20 లక్షల మందికి మంచి జరగ్గా ఇవాళ మరో 2 వేల మందికి మేలు జరుగుతోంది. కళ్యాణమస్తు – షాదీ తోఫా ద్వారా 29,934 మందికి ఇప్పటికే ప్రయోజనం చేకూరగా ఇప్పుడు మరో 1,912 మందికి లబ్ధి చేకూరుస్తున్నాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3.60 లక్షల మందికి ఇప్పటికే మంచి జరగ్గా ఇవాళ మరో 1,884 మందికి మేలు చేస్తున్నాం. నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరగ్గా ఇవాళ మరో 352 మందికి మంచి చేస్తున్నాం. మరో 1.17 లక్షల కొత్త పెన్షన్లు.. ఇవే కాకుండా కొత్తగా మరో 1,17,161 మందికి పింఛన్లు మంజూరు చేసి వైఎస్సార్ పెన్షన్ కానుక అందిస్తున్నాం. మరో 1,11,321 మందికి కొత్తగా బియ్యం కార్డులను కూడా ఈ నెల నుంచి అందిస్తున్నాం. మరోవైపు 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు, 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలను కూడా అందచేస్తున్నాం. పథకమేదైనా సరే.. అర్హులెవరూ మిస్ కాకూడదు, పేదలు ఇబ్బంది పడకూడదనే ఆరాటంతో ఆర్నెల్లకు ఒకసారి శాచ్యురేషన్ పద్ధతిలో మిగిలిపోయిన అర్హులందరికీ మంచి చేస్తున్నాం. వారు దరఖాస్తు చేసుకునేందుకు వలంటీర్ సేవలను అందుబాటులో ఉంచుతు న్నాం. సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. లేదంటే జగనన్నకు చెబుదాం 1902కి కాల్ చేసినా చాలు.. ఎలా అప్లై చేసుకోవాలి? ఏ పత్రాలు కావాలి? అనే విషయాలను వివరిస్తారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పరిశ్రమలశాఖ (హేండ్లూమ్స్ అండ్ టెక్స్స్టైల్స్) ముఖ్యకార్యదర్శి కె.సునీత, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి, హేండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ ముదావత్ ఎం.నాయక్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కె.విజయ, పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ ఎం.విజయ సునీత తదితరులు పాల్గొన్నారు. ఐదు దఫాల్లో రూ.1,700 కోట్లు 2021లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి క్రమం తప్పకుండా ప్రతి ఆర్నెల్లకు ఒకసారి నిర్వహిస్తున్నాం. ఇలా ఐదు పర్యాయాల్లో దాదాపు రూ.1,700 కోట్లను అర్హత ఉండి పొరపాటున మిస్ అయిన లబ్ధిదారులకు అందచేశాం. సీఎం సతీమణి కోసం నేతన్న చీర ముఖ్యమంత్రి కుటుంబంపై అభిమానంతో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన చేనేతకారుడు మురుగుడు నాగరాజు తాను ప్రత్యేకంగా నేసిన మంగళగిరి పట్టు చీరను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు బహుకరించాడు. ఆ చీరను సీఎం సతీమణి వైఎస్ భారతికి అందచేయాలని కోరాడు. సీఎం సతీమణి వైఎస్ భారతి కోసం నేసిన పట్టు చీరను ముఖ్యమంత్రికి అందిస్తున్న చేనేత కారుడు నాగరాజు ఇంత డీబీటీ మరెక్కడా లేదు.. ఏ ముఖ్యమంత్రీ అమలు చేయనన్ని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మీరు (సీఎం జగన్) శ్రీకారం చుట్టారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ డీబీటీ ద్వారా రూ.2.46 లక్షల కోట్లకుపైగా ప్రజలకు అందించిన దాఖలాలు లేవు. పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసి ఇన్ని పథకాలకు రూపకల్పన చేశారు. ప్రతి గ్రామంలో ఆఖరి కుటుంబం వరకు సంక్షేమం అందాలన్న మీ ఆలోచనకు జేజేలు. మిగిలిపోయిన అర్హులను జల్లెడ పట్టి మరీ లబ్ధి చేకూర్చడం మీ చిత్తశుద్ధికి నిదర్శనం. టంచన్‌గా పింఛన్ ఇవ్వడమే కాకుండా మాట ప్రకారం పెంచిన మీపట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగింది. పేదల కళ్లలో సంతోషం చూడాలన్న మీ తపనను సహించలేక కొందరు విషం చిమ్ముతున్నా ప్రజలు వాస్తవాలను గుర్తించారు. వారి మనసులో మీరు చెరగని ముద్ర వేశారు. సామాజిక న్యాయం, సాధికారత మీవల్లే సాధ్యమని ప్రజలు దృఢంగా నమ్ముతున్నారు. – ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అన్నీ అందుతున్నాయి.. అన్ని పథకాలు అందుతున్నాయి. మా అమ్మకు పెంచిన ఫించన్ రూ.3 వేలు అందాయి. మా ఆటో కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారు. మీరు చల్లగా ఉండాలి. –ఖాజా హుస్సేన్, లబ్ధిదారుడు, కల్లూరు, పాణ్యం నియోజకవర్గం అన్నలా తోడున్నారు.. నాన్న చిన్న బట్టల షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అమ్మ చనిపోయింది. డిగ్రీ పూర్తి చేశా. ఆర్థిక ఇబ్బందులతో పై చదువులకు దూరమయ్యా. ట్యూషన్స్ చెప్పుకుంటూ, టైలరింగ్ ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్నా. వలంటీర్ ద్వారా జగనన్న చేదోడు పథకం గురించి తెలుసుకుని లబ్ధి పొందా. ఆ డబ్బులతో వ్యాపారాన్ని పెంచుకున్నా. మీరు అందించే సాయం మా జీవితాలకు ఎంతో ఉపయోగపడుతోంది. సొంతింటి కల కూడా మీవల్ల నెరవేరింది. త్వరలో గృహ ప్రవేశం కూడా చేస్తాం. ఇది నూతన సంవత్సర కానుకగా భావిస్తున్నా. నాకు అమ్మలేని లోటును అన్నగా మీరు తీరుస్తున్నారు. దిశ యాప్ భరోసాతో ఒంటరిగా బయటికి వెళ్లగలుగుతున్నాం. ఒక్క రూపాయి లంచం లేకుండా అన్నీ అందుతున్నాయి. మిమ్మల్ని మళ్లీ సీఎంగా గెలిపించుకుంటాం. – సాయి ప్రత్యూష, లబ్ధిదారు, శ్రీకాకుళం కాపు నేస్తం ఆదుకుంది దివ్యాంగుడైన నా భర్తకు పింఛన్ ఇస్తున్నారు. ఆయనకు ఏడాది క్రితం హార్ట్ ఎటాక్ రావడంతో ఆరోగ్యశ్రీ కింద లక్ష రూపాయల ఉచిత వైద్యం అందించారు. మాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. కాపు నేస్తం మూడు విడతలు తీసుకున్నా. నాలుగో విడత కరెంట్ బిల్లు సమస్య వల్ల రాలేదన్నారు. వలంటీర్ ద్వారా సచివాలయంలో సంప్రదించడంతో మళ్లీ వచ్చిందని చెప్పారు. ఆ డబ్బులతో కుట్టుమిషన్ కొనుక్కుని జీవనం సాగిస్తున్నా. నాకు అన్ని పథకాలు అందాయి. ఐదేళ్లలో రూ.3.50 లక్షలు మేరకు లబ్ధి పొందా. కాపులను ఏ ప్రభుత్వమూ పట్టించుకోకపోయినా మీరు గుర్తు పెట్టుకుని సాయం చేశారు. మా కాపు అక్కచెల్లెమ్మలు అంతా మీ వెంటే ఉంటారు. మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం. – శాంతిశ్రీ, లబ్ధిదారు, హుకుంపేట, రాజమండ్రి రూరల్ -
ఆపత్కాలంలో ఆరోగ్య ఆసరా
సాక్షి, అమరావతి: సత్యనారాయణ తరహాలోనే రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు దురదృష్టవశాత్తూ ఏదైనా అనారోగ్యం బారినపడితే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి కొండంత అండగా నిలుస్తోంది. రోగులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండానే ఉచితంగా శస్త్రచికిత్సలను, వైద్య సేవలను అందిస్తోంది. అంతేకాకుండా పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులు చికిత్సలు చేయించుకుని మంచానికి పరిమితమైనప్పుడు వారిని విశ్రాంతి సమయానికి ఆర్థికంగా ఆదుకుంటోంది. విశ్రాంతి సమయంలో వారి పోషణ కష్టం కాకుండా ఉండటానికి ఆపత్కాలంలో ఆర్థిక భరోసాను అందిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 డిసెంబర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినప్పటి నుంచి గతేడాది నవంబర్ నెలాఖరు వరకు రోగులకు ప్రభుత్వం రూ.1,309.92 కోట్ల మేర ఆర్థిక సాయం అందించింది. ఈ చిత్రంలోని వ్యక్తి.. టి.సత్యనారాయణ (60). ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం చొప్పరామన్నగూడెంలో ఉంటారు. ఇటీవల గ్రామంలో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేసింది. కొద్ది రోజులుగా ఆయాసం, ఇతర సమస్యలతో బాధపడుతుండటంతో సత్యనారాయణ శిబిరానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు ఆయనకు గుండె సంబంధిత సమస్యలున్నట్టు అనుమానించి పెద్దాస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు సత్యనారాయణను రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆయన గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాలు పూడుకుని పోయినట్టు గుర్తించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా రెండు స్టెంట్లు వేశారు. సత్యనారాయణ రూపాయి కూడా ఖర్చుపెట్టాల్సిన పనిలేకుండా ఉచితంగా చికిత్సలు పూర్తి చేశారు. అంతేకాకుండా వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.4వేలకు పైగా భృతిని ప్రభుత్వం ఆయన బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. ‘వయోభారంతో ఇంటిపట్టునే ఖాళీగా ఉంటున్నా. నా కుమారుడి సంపాదనతో కుటుంబం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు గుండె సమస్య అని తెలిసి చికిత్సకు ఎంత ఖర్చవుతుందోనని చాలా ఆందోళనకు గురయ్యాను. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఆదుకుంది. అంతేకాకుండా విశ్రాంత సమయానికి ఆర్థిక సాయం చేయడంతో అదనపు ఖర్చుల భారం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వం చేసిన ఈ మేలును ఎన్నటికీ మరువలేం’ అని సత్యనారాయణ చెమర్చిన కళ్లతో చెబుతున్నారు. 21.92 లక్షల మందికి ఆర్థిక చేయూత ఆరోగ్యశ్రీ పథకం కింద 1,519 ప్రొసీజర్లలో చికిత్సలు పొందినవారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే సమయంలో వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ప్రభుత్వం అందిస్తోంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే ఈ మొత్తాన్ని ప్రభుత్వం రోగులు/వారి కుటుంబీకుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే గర్భిణులకు ప్రసవానంతరం రూ.5 వేలు చొప్పున సాయం అందజేస్తోంది. ఇలా గత ఏడాది నవంబర్ చివరినాటికి రాష్ట్రవ్యాప్తంగా 21,92,467 మందికి రూ.1,309.92 కోట్ల మేర సాయం అందించింది. ప్రభుత్వం అందజేస్తున్న ఈ సాయం రోగులు పూర్తిగా కోలుకునేందుకు దోహదం చేస్తోంది. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చింది. 2019కు ముందు 1,059 ప్రొసీజర్లు ఉండగా, వీటిని ఏకంగా 3,257కు ప్రభుత్వం పెంచింది. అంతేకాకుండా పథకం కింద వైద్య పరిమితిని కూడా ఇటీవలే ప్రభుత్వం ఏకంగా రూ.25 లక్షలకు చేర్చింది. ఆర్థికంగానూ ఆదుకున్నారు.. నాకు గుండెలో రంధ్రం ఉండటంతో మూడు నెలల క్రితం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆపరేషన్‌కు నా చేతి నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఆపరేషన్ తర్వాత వైద్యులు సుమారు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. విశ్రాంత సమయానికి భృతి కింద డిశ్చార్జి చేసిన రోజే నా బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం రూ.9,500 జమ చేసింది. ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాకుండా కోలుకునే సమయంలోనూ ఆర్థికంగా ఆదుకుంది. ఈ సాయం పౌష్టికాహారం తీసుకోవడానికి, ఇతర నా అవసరాలకు ఎంతో ఉపయోగపడింది. – ఎస్.లలిత, కణేకల్ మండలం, అనంతపురం జిల్లా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా.. వైద్యం పొందిన లేదా ఆపరేషన్ చేయించుకున్న రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి భృతి ఇస్తున్నాం. రోగులు/వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేస్తున్నాం. చికిత్స అనంతరం రోగుల కుటుంబాలు కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం. ఇందుకే ప్రభుత్వం జీవన భృతిని అందిస్తోంది. దీన్ని పొందడంలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే 104 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. వీటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. – బాలాజీ, సీఈవో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
నారా దారి.. అడ్డదారి: పరాకాష్టకు కుట్రలు, కుతంత్రాలు
నిజం చెప్పడు... నేరుగా పోరాడడు.. అవకాశవాదమే కాదు అలవోకగా అబద్ధాలాడేసే నైజం. ఇచ్చిన మాటంటే లెక్కే ఉండదు. ఏరు దాటాక తెప్పని బూడిద చేసి నీట్లో కలిపేసే రకం. అధికారం కోసం దేనికైనా రెడీ. శత్రువుల కాళ్లు పట్టుకోవటానికైనా... మిత్రుల కాళ్లు నరికేయడానికైనా...!! ఎంతసేపూ... తనకు ఎవరు, ఎలా ఉపయోగపడతారనే యావే. బహుశా! ఆధునిక రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నాయకుడెవరినీ చూడలేం. పురాణాల్లోనూ ఇలాంటి పాత్ర కనిపించదు. ఎందుకంటే వాటిలోని పాత్రల లక్షణం ఒక్కటీ ఈయనలో ఉండదు. ఈయనకున్న అవ లక్షణాలు పురాణాల్లోని ఏ ప్రతినాయకుడికీ ఉండవు. కానీ చంద్రబాబులోని ఈ అవలక్షణాలన్నిటికీ విజన్.. చాణక్యం.. అనే ముసుగులేసి ఆయనో ఘనమైన నాయకుడని నమ్మించింది ఓ వర్గం మీడియా. వీళ్ల దృష్టిలో బాబు ఏం చేసినా... అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా... ప్రజాస్వామ్యం కోసమే!!. ఔరా.. ఇంత దౌర్భాగ్యమా?? నిలువెల్లా దుర్మార్గాన్ని, విషాన్ని నింపేసుకున్న 63 కిలోల.. 73 ఏళ్ల చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోవటానికి కుతంత్రాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రజాబలం లేక ఓటమి తరుముకొస్తుండటంతో వాటిని పతాక స్థాయికి చేరుస్తున్నారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన సీఎం జగన్‌ను తను, తన పార్టీ ఏమీ చేయలేమని తెలుసు గనక జనసేన, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలన్నిటినీ కూడగడుతున్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూడా... తనకు అనుకూలంగానే పనిచేసేలా వాటిలోని తన మనుషుల ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. 2019లో చంద్రబాబు ఓడిపోగానే ఆయన ఆదేశాల మేరకు బీజేపీలోకి ఫిరాయించిన సి.ఎం.రమేశ్, సుజనా చౌదరి ఇప్పటిదాకా బాబు–బీజేపీలను కలపటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సి.ఎం.రమేశ్ ఓవైపు ఆ పని చేస్తూనే మరోవైపు బీటెక్ రవిని రంగంలోకి దించడంతోపాటు వైఎస్ షర్మిలకు ప్రత్యేక విమానాలు సమకూర్చి సేవలందిస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌లోకి పంపిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావటంతో టీడీపీ–కాంగ్రెస్ సంబంధాలు మరింత బలపడ్డాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు బనాయించిన నాటి నుంచి హస్తంతో చంద్రబాబు అక్రమ బంధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహకర్తగా తన సామాజిక వర్గానికే చెందిన సునీల్‌ను నియమించి తెరచాటున పనులు చక్కబెడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ ఏ దిశగా వెళ్లినా అది తనకే మేలు చేసేలా బాబు ఏర్పాట్లయితే చేసుకున్నారు. కానీ 90ల నాటి కాలం చెల్లిన ఈ పాచిపోయిన ఐడియాలు ఇప్పుడు పనికొస్తాయా? హఠాన్మరణం తర్వాత కూడా దివంగత వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీకి, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన పార్టీకి ఏపీలో ఎవరు నేతృత్వం వహించినా ప్రజలు మద్దతు ఇవ్వబోరని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు ఎవరెవరిని ఎలా వాడుకుంటున్నారో ఒక్కసారి చూద్దాం... సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటం, గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం గోచరిస్తుండటంతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంపై దింపుడు కళ్లం ఆశలతో అరాచకత్వానికి పాల్పడుతున్నారు. గత ఎన్నికల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో విడిగా పోటీ చేయించిన చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం అర్రులు చాస్తూ జనసేనతో జత కలిశారు. తెలంగాణలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆపార్టీకి ఇం‘ధనం’ సమకూర్చిన చంద్రబాబు ఆ ఎన్నికల్లో ఓడిపోయాక అక్కడ టీడీపీ నేతలందరినీ ‘హస్త’గతం చేశారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తనకు అత్యంత సన్నిహితులైన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి వారిని బీజేపీలోకి పంపి అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం రమేష్ ద్వారా ప్రత్యేక విమానాలను సమకూరుస్తూ కుట్రలకు పదును పెట్టారు. తన శిష్యుడైన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపి నోట్ల కట్టలు వెదజల్లి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టేలా చేసిన చంద్రబాబు ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక మరోసారి ఇం‘ధనం’ సమకూర్చి సీఎం పీఠంపై కూర్చోవడానికి సహకరించారు. కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పని చేస్తున్న సునీల్ కనుగోలు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. చంద్రబాబు చెప్పినట్లు ఆడేందుకు, వ్యూహాల పేరిట బాబు ప్లాన్‌ను అమలు చేసేందుకు ఆయన సదా సిద్ధంగా ఉంటారు. పరాకాష్టకు కుట్రలు, కుతంత్రాలు.. సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారు. వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఆదరణ రోజుకు రోజుకు పెరుగుతోందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కు 25 లోక్‌సభ స్థానాల్లో ఆపార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని టైమ్స్ నౌ లాంటి జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు పూర్తిగా కోల్పోవడంతో టీడీపీ ఉనికి కూడా చాటుకోలేదని ఆ సర్వేలు తేల్చి చెప్పాయి. గత ఎన్నికల కంటే ఘోర పరాజయం తప్పదని పసిగట్టిన చంద్రబాబు అడ్డదారి పట్టారు. అనాదిగా మైనార్టీలు కాంగ్రెస్ వెనుకే ఉంటారన్న ఓ పాచిపోయిన భావనను తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నది ఆయన ఎత్తుగడ. వైఎస్సార్సీపీలో టిక్కెట్ దక్కని వారికి తన శక్తుల ద్వారా కాంగ్రెస్ టికెట్లు ఇప్పించి ఇం‘ధనం’ సమకూర్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది బాబు ప్లాన్. ఒకవైపు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను చీల్చడం.. మరోవైపు బీజేపీ వ్యతిరేక ఓటు వైఎస్సార్సీపీకి దక్కకుండా చేయడం దీని వెనుకున్న మరో ఎత్తుగడ. ఇలా ఓవైపు కాంగ్రెస్‌ను తానే నడుపుతూ స్వార్థానికి వాడుకోవడమే కాకుండా.. ఇంకోవైపు బీజేపీని కూడా తన వైపు తిప్పుకుని అవినీతి కేసుల నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్న తన మనుషులు, తాను సృష్టించిన పాత్రల ద్వారా ఈ ఎత్తుగడలను అమలు చేసే ప్రణాళిక వేశారు. శిథిలమైన కాంగ్రెస్‌తో శూన్యమే.. 2014లో ఇటు రాష్టంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించింది. విభజనతో పూడ్చలేని నష్టాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మిగిల్చింది. తరతరాలపాటు రాష్ట్ర ప్రజానీకాన్ని కోలుకోనివ్వకుండా దెబ్బ తీసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి కనీసం విభజన చట్టంలో కూడా చేర్చకుండా మోసం చేసింది. తద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకునే అవకాశాన్ని కల్పించింది. ఏపీకి తీరని అన్యాయం చేసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 1.17 శాతం ఓట్లు లభించగా నోటాకు 1.28 శాతం ఓట్లు రావడమే అందుకు నిదర్శనం. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇదీ. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శిథిలమైన కాంగ్రెస్ నుంచి చంద్రబాబు ఆశించే ప్రయోజనం ఒనగూరే అవకాశమే లేదని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. హఠాన్మరణం తర్వాత కూడా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన పార్టీకి ఏపీలో ఎవరు నేతృత్వం వహించినా ప్రజలు మద్దతు ఇవ్వరని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జనం మెచ్చిన సీఎం జగన్ సామాజిక న్యాయ పాలన ప్రభంజనంలో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గాలు కొట్టుకుపోవడం తథ్యమని తేల్చి చెబుతున్నారు. -
గోదావరి చెంతన తెలుగు పరవళ్లు
సాక్షి,రాజమహేంద్రవరం/రాజానగరం:: గోదావరి చెంతన.. సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమని ఛత్తీస్‌గఢ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఇక్కడి గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాజరాజనరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా, ఆదికవి నన్నయ భారతాన్ని ఆంధ్రీకరించి వెయ్యేళ్లయిన సందర్భంగా ఈ సభలు నిర్వహిస్తున్నారు. రాజరాజ నరేంద్రుడు, నన్నయ భట్టారక, నారాయణభట్టు వేదికలపై నిర్వహిస్తున్న ఉత్సవాలను గవర్నర్ విశ్వభూషణ్, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ.. సంస్కృతి, రచనలకు కేరాఫ్ అడ్రస్‌గా రాజమహేంద్రవరం విరాజిల్లుతోందన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. కావ్యాలు, పురాణేతిహాసాలను తెలుగు వాళ్లు అనువదించినట్టు ఎవరూ చేయలేదన్నారు. పోతన భాగవతం, అన్నమయ్య కీర్తనల్లోని పదాలు చూస్తే ముచ్చటేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యకారి వారణాసి రామ్‌మాధవ్, మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కవి అందెశ్రీ, జేఎన్టీయూకే వీసీ ప్రసాదరాజు, ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. పూర్ణకుంభ పురస్కారాలు తెలుగు జాతికి పూర్వీకులు అందించిన సేవలను గుర్తించి, వారి వారసులను సత్కరించడం అభినందనీయమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్, శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి అన్నారు. తెలుగు మహాసభల్లో రాజరాజనరేంద్రుని వేదికపై శుక్రవారం సాయంత్రం జరిగిన పూర్ణకుంభ అవార్డుల ప్రదానోత్సవంలో వారు మాట్లాడారు. తెలుగు జాతికి విశిష్ట సేవలందించిన ప్రముఖులు తరిగొండ వెంగమాంబ, కవయిత్రి మొల్ల, తిక్కన సోమయాజి, డొక్కా సీతమ్మ, పరవస్తు చిన్నయసూరి, గుర్రం జాషువా, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, పెద్దింటి దీక్షిత్‌దాసు, ఘంటసాల వెంకటేశ్వరరావు, మండలి వెంకట కృష్ణారావు, సాలూరి రాజేశ్వరరావు, పీబీ శ్రీనివాస్, జంధ్యాల, జమునా రాయలు, బాపు తదితరుల వారసులను అతిథులు సత్కరించారు. విశ్వనాథ గోపాలకృష్ణ, బుచ్చివెంకటపాతిరాజు, జిత్‌మోహన్‌మిత్రా, ఎర్రాప్రగడ రామకృష్ణ, కూచిభోట్ల ఆనంద్, రసరాజు, బాదం బాలకృష్ణ, వంశీ రామరాజు, చెరుకువాడ రంగసాయి, తనికెళ్ల భరణి, గౌతమీ గ్రంథాలయం, నన్నయ భట్టారక పీఠం, చింతలూరు ఆయుర్వేద ఫార్మసీ ప్రతినిధులు కూడా పురస్కారాలు అందుకున్నారు. -
AP: సంక్రాంతి కానుక.. స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే..
అదనపు చార్జీల భారం లేకుండా సాధారణ చార్జీలతోనే సంక్రాంతి పండుగ ప్రత్యేక బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి 18 వరకు మొత్తం 6,795 ప్రత్యేక బస్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నాలుగో ఏడాది సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని ఇతర ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. వీటిల్లో రిజర్వేషన్ల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. – సాక్షి, అమరావతి ప్రత్యేక బస్సుల వివరాలు.. ► ఈ నెల 6 నుంచి 14 వరకు 3,570 సర్వీసులు నిర్వహిస్తారు. తిరుగు ప్రయాణం నిమిత్తం ఈనెల 16 నుంచి 18 వరకు 3,225 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటుచేస్తున్నారు. ► సంక్రాంతికి ముందుగా నిర్వహించే ప్రత్యేక సర్వీసుల విషయానికొస్తే.. హైదరాబాద్ నుంచి 1,600, బెంగళూరు నుంచి 250, చెన్నై నుంచి 40 సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటుచేశారు. ► అలాగే, రాష్ట్రంలో విజయవాడ నుంచి 300, విశాఖపట్నం నుంచి 290, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 70, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 790 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు. ► సంక్రాంతి తరువాత ఈ నెల 16 నుంచి 18 వరకు హైదరాబాద్ నుంచి 1,500, బెంగళూరు నుంచి 495, చెన్నై నుంచి 85 సర్వీసులను రాష్ట్రంలోని ప్రాంతాలకు ఏర్పాటుచేశారు. ► విజయవాడ నుంచి 200, విశాఖపట్నం నుంచి 395, రాజమహేంద్రవరం నుంచి 50, తిరుపతి నుంచి 50, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 700 సర్వీసులు నిర్వహిస్తారు. ► చార్జీలకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్‌పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కానుక ఇదీ.. నిజానికి.. సంక్రాంతి, దసరా పండుగల ప్రత్యేక బస్సు సర్వీసుల్లో అధిక చార్జీలు వసూలు చేయడం రాష్ట్రంలో దశాబ్దాలపాటు అమలవుతూ వచ్చింది. ఒకటిన్నర రెట్లు చార్జీలు అంటే సాధారణ చార్జీలపై 50శాతం అధికంగా చార్జీలు వసూలు చేసేవారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు సాధారణ చార్జీల కంటే రెండుమూడు రెట్లు అధికంగా వసూలు చేసేవి. ఫలితంగా ప్రయాణికులు భారీ ఆర్థిక భారాన్ని వహించాల్సి వచ్చేది. ఈ విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. సాధారణ చార్జీలతోనే పండుగ ప్రత్యేక సర్వీసులను కూడా నిర్వహించాలని నిర్ణయించింది. 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020, జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. అనంతరం పరిస్థితిని సమీక్షించి 2021 నుంచి పండుగ ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నిర్వహిస్తోంది. వరసగా నాలుగో ఏడాదీ ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నిర్వహించాలని నిర్ణయించింది. రిజర్వేషన్లలో 10శాతం రాయితీ.. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా ఆర్టీసీ కల్పించింది. ఒకేసారి రానూపోనూ రిజర్వేషన్ చేసుకుంటే 10శాతం రాయితీ ఇస్తోంది. దీంతో సాధారణ చార్జీల కంటే తక్కువతోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసేందుకు సూపర్వైజర్లను నియమించింది. బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్, 24 గంటలు సేవలు అందించే సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. కాల్ సెంటర్ నంబర్లు 149, 0866–2570005. సద్వినియోగం చేసుకోండి ప్రయాణికులపై భారం పడకూడదనే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది నిర్ణయించింది. సంక్రాంతి ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లూచేసింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. – ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ -
ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌కు కార్మిక శాఖ నోటీసు
పలమనేరు(చిత్తూరు జిల్లా): తాను ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానెల్లో 20 ఏళ్లు విలేకరిగా వెట్టిచాకిరి చేశానని, కనీసం జీతం కూడా ఇవ్వకుండా తనను తొలగించారని, ఈ మేరకు సంస్థపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేశానని ఆర్ఎస్ లోకనాథం అనే వ్యక్తి శుక్రవారం తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... పలమనేరు పట్టణానికి చెందిన ఆర్ఎస్ లోకనాథం 20 ఏళ్లు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్లో పనిచేశారు. ఇటీవల చానల్‌లోని పలువురిని కుదించి పలమనేరు రిపోర్టరే మూడు నియోజకవర్గాలను కవర్ చేయాలని ఆదేశించారు. దీంతో లోకనాథం కారు అద్దెకు తీసుకుని ముఖ్యమైన కార్యక్రమాలను కవర్ చేశారు. ఇందుకు సంబంధించిన అద్దె బిల్లులను బ్రాంచ్ మేనేజర్ పెట్టుకుని డబ్బు డ్రా చేసుకోవడంతో కడుపుమండిన బాధితుడు తమ యాజమాన్యం పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే లోకనాథంపైనే ఆగ్రహం వ్యక్తంచేసి ఆయన్ను విధుల నుంచి తొలగించారు. దీనిపై బాధితుడు తిరుపతిలోని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీఎల్) బాబూనాయక్కు గత నెల 22న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీసీఎల్ గత నెల 30వ తేదీన ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. -
పచ్చ పార్టీకి దొంగఓట్లే పెద్దదన్ను
ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడం... చేసిన పనులు సగర్వంగా చెప్పుకోవడం... తద్వారా ఎన్నికల సమయంలో ఓట్లడగటం నిజమైన నాయకుడి లక్షణం. అదే దొంగ ఓట్లను నమ్ముకోవడం... అధికారంకోసం అడ్డదారులు ఎంచుకోవడం... అందుకోసం కుట్రలు, కుతంత్రాలకు తెరతీయడం... ఎంతటి అక్రమానికైనా వెరవకపోవడం కుటిల నీతికి నిదర్శనం. రెండో కేటగిరీకి చెందినవారే మన పచ్చనేతలు. విజయమే పరమావధిగా దొంగ ఓట్లను ఇష్టానుసారంగా చేరి్పంచేసి వారిద్వారా గెలవడం అలవాటు చేసుకున్నారు. ఇందుకు పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాలే సాక్ష్యం. అక్కడ అధికారుల తనిఖీల్లో వేలాది దొంగఓట్లు బహిర్గతమయ్యాయి. వాటి ద్వారానే గతంలో వారు విజయం సాధించారని ఈ సంఘటన రుజువు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ దొంగ ఓట్లతోనే గత ఎన్నికల్లో గెలుపొందింది. తాజాగా బయటపడ్డ దొంగ ఓట్ల వ్యవహారం చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని అధికారపార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలుదఫాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాటి తొలగింపునకు ఫారం–7 దరఖాస్తులు పెట్టారు. జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టగా పెద్ద ఎత్తున అక్రమ ఓట్లు ఉన్నట్లు తేలింది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఓట్లున్నవారికీ ఇక్కడ ఓట్లుండటం, స్థానికంగా ఒకే నియోజకవర్గంలో రెండు చోట్ల ఓట్లు నమోదు కావడం, చని పోయినవారి ఓట్లు జాబితాలో ఉండటం బయటపడింది. ఈ విధంగా బాపట్ల జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 46,116 దొంగ ఓట్లను అధికారులు తొలగించారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అధికంగా బయటపడ్డాయి. అక్రమ ఓట్ల వల్లే గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు వాటిని తొలగించడం వల్ల రాబోయే ఎన్నికల్లో వారి విజయం ప్రశ్నార్థకంగా మారనుంది. పర్చూరులో పదివేలకు పైగా దొంగ ఓట్లు పర్చూరు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు. 2014లో 10,775 ఓట్లు, 2019లో 1647 ఓట్ల మెజారిటీ వచ్చింది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా 1967, 1991, 2004, 2019లో మాత్రమే పదివేలకుపైబడి మెజార్టీవచ్చింది. మిగిలిన 11 ఎన్నికల్లో 7 వేలకు మించలేదు. తాజాగా అధికారులు ఈ నియోజకవర్గంలో 10,468 దొంగ ఓట్లను తొలగించారు. మరిన్ని దొంగ ఓట్లు బయటపడే అవకాశముంది. దీన్నిబట్టి పర్చూరులో టీడీపీ దొంగ ఓట్లవల్లే గెలుపొందినట్లు తెలుస్తోంది. రేపల్లెలోనూ దొంగ ఓట్ల హవా... రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 2014లో 13,355 ఓట్లు, 2019లో 11,555 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ జరిగిన 15 ఎన్నికల్లో 8 సార్లు 10 వేలకు మించి మెజార్టీ రాగా 7 సార్లు 10వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఓట్ల విచారణ పూర్తికాక ముందే 8,880 దొంగ ఓట్లను గుర్తించారు. ఇంకా మరికొన్ని దొంగ ఓట్లు బయటపడే అవకాశముంది. దొంగ ఓట్ల తొలగింపు రాబోయే ఎన్నికల్లో పచ్చపార్టీపై ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది. అద్దంకిలోనూ అదే తీరు... అద్దంకి నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్(ఐ), వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యరి్థగా పోటీచేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆయనకు 12,991 మెజార్టీ వచ్చింది. 2009, 2019 ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజకవర్గంలో 10 వేలకు మించి మెజార్టీ వచ్చింది. మిగిలిన 12 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సగటున 5 వేలకు మించి మెజార్టీ రాలేదు. తాజాగా ఈ నియోజకవర్గం పరిధిలో అధికారులు 7,207 దొంగ ఓట్లను తొలగించారు. విచారణ పూర్తయితే మొత్తం 8 వేల పైచిలుకు దొంగ ఓట్లను తొలగించే అవకాశముంది. -
సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
సాక్షి, విజయవాడ: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనుంది. జనవరి 6 నుంచి 18 వరకూ ప్రత్యేక బస్సులు నడవనున్నారు. సంక్రాంతికి 6795 స్పెషల్ బస్సులు నడపనుంది. పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకూ ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడపనుంది. ఆర్టీసీ వెబ్సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం కల్పించనున్నారు. రానుపోను టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి 10 శాతం రాయితీ సౌకర్యం ఆర్టీసీ కల్పించనుంది. ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ! -
‘మా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడు’
సాక్షి, తాడేపల్లి: అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం వ్యాప్తంగా పలువురు లబ్దిదారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ‘మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరే’.. అంటూ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడు.. నా పేరు శాంతిశ్రీ అన్నా.. నేను కాపునేస్తం మూడు విడతల్లో తీసుకున్నా అన్నా. నాలుగోసారి మిస్ అయితే వాలంటీర్లు నాకు రాకపోవడానికి కారణం కనుక్కొని మరీ నాలుగో విడత వచ్చేలా చేశారు. ఈ విషయం తెలియడంతో సంక్రాంతి పండగ ముందుగానే వచ్చినట్లు ఆనందం కలిగిందన్నా. నాకు కాపు నేస్తంతో చాలా సహాయం అందుతుంది. ఏ ప్రభుత్వం చేయని విధంగా మా కాపులను మీరు గుర్తుపెట్టుకొని, కాపులకు సాయం చేయాలనే తపనతో మాకు మీరు ఈ పథకాన్ని ఇచ్చారన్నా. కాపులు గురించి ఆలోచించి మీరు మంచి పని చేశారు. కాపు నేస్తం ద్వారా కుట్టుమిషన్ కొనుక్కొని అదే నా జీవన ఉపాధిగా కొనసాగిస్తున్నా అన్నా. నా భర్త వికలాంగుడు అన్నా.. జనవరి 1 తేదీనే వాలంటీర్ మా ఇంటికి వచ్చి మరీ పించన్ డబ్బులు తెచ్చి ఇస్తున్నారు అన్నా. నాకు కొడుకులు లేరన్నా.. నా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడని మా భార్యభర్తలు ఇద్దరం చాలా సంతోషపడుతున్నాం అన్నా. -శాంతి శ్రీ, కాపు నేస్తం లబ్దిదారు (రాజమండ్రి రూరల్ హకుంపేట్ గ్రామం) మా అమ్మ సంతోష ఉంది.. మీరు సల్లంగా ఉండాలి.. నమస్తే జగన్ సర్.. గత రెండు నెలలుగా ఆటో డబ్బులు పడినాయ్ సార్. మూడోసారి పడలేదు.. వాలంటీర్ నాకు రాకపోవడానికి కరెంట్ బిల్లు సమస్య అని చెప్పి.. ఆ సమస్యను తీర్చి మళ్లీ మూడోసారి నాకు డబ్బులు పడేలా చేశారు. మాకు ముందు నుంచి ఈ పథకాలు లేకున్నా.. మీరు మాకు ఈ పథకం ఇస్తున్నందుకు మా ఆటోనడిపేవారందరీ తరఫున ధన్యవాదాలు సర్. మీ ద్వారా మా అమ్మకు పించన్ వస్తుంది. పించన్ మూడు వేల రూపాయలు కావటం వల్ల మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. కాబట్టి సర్.. మీరు సల్లంగా ఉండాలి. - వాహన మిత్ర లబ్దిదారు (ఖాజా హుస్సేన్, పాణ్యం నియోజకవర్గం, కల్లూరు) మీ సాయం.. నా జీవితానికి ఓ మలుపు ముఖ్యమంత్రి జగనన్న గారికి నమస్కరం. నా పేరు సాయి ప్రత్యూష అన్నా.. నేను డిగ్రీ పూర్తి చేశాను. మా అమ్మగారు చిన్న హస్టల్లో పనిచేసేవారు. మా నాన్న గారు చిన్న సామాన్య బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తు మా అమ్మగారు మరణించారు. అలాంటి సమయాలో నేను పైచదువులు చదవాలన్న ఆలోచనను వదులుకున్నా అన్నా. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటం వల్ల టైలరింగ్ వృత్తిని ఎంచుకున్నా. దానికి పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరూ నాకు సాయం చేయలేదన్నా. అలాంటి సమయంలో మా వాలంటీరు స్వయంగా మా ఇంటికి వచ్చి.. ‘జగనన్న చేదోడు’ పథకం కింద టైలర్లకు డబ్బులు ఇస్తున్నారని చెప్పడం జరిగింది. దాని నేను చాలా సంతోషించా. మీరిచ్చే చేదోడు పదివేలతో పెట్టుబడి పెట్టి ఉన్న ఈ చిన్న వ్యాపారాన్ని పెద్దగా తీసుకువెళ్లాలని అనుకున్నా. ఉదయం టైలరిగ్ చేస్తూ.. సాయంత్రం ట్యూషన్ చెబుతూ జీవనం సాగిసున్నా అన్నా. మీరు చేదోడు పథకం ద్వారా ఇచ్చే పదివేల సాయం చాలా చిన్నది కావొచ్చు.. కానీ నా దృష్టిలో నా జీవితానికి ఇదొక మలుపు తిరిగే పాయింట్ అన్నా. మీరు ఇచ్చే ఈ పట్టుబడితో నా కలలు నెరవేర్చుకోవాలనుకుంటున్నా. -సాయి ప్రత్యూష, జగనన్న చేదోడు లబ్ధిదారు, (శ్రీకాకుళం పట్టణం) -
లబ్ధిదారులు ఎవ్వరూ సంక్షేమ పథకాలు మిస్ కావొద్దు: సీఎం జగన్
పాక్షి, తాడేపల్లి: అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింప చేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు. ఈ కార్యక్రమం ద్వారా 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి–జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్–జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు, కింది స్థాయిలో సచివాలయం వరకు ప్రతి ఒక్కరికీ ఇదొక పెద్ద సంతృప్తినిచ్చే కార్యక్రమం. ఎవరికైనా ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దాన్ని పరిష్కరించడం కోసం వారి తరఫున, మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉందని భరోసా కల్పించే కార్యక్రమం. ఎవరైనా ఏ కారణం చేతనైనా పొరపాటున ఏ పథకం అయినా అందకపోతే, అర్హత ఉండి కూడా పథకం అందకపోయిన పరిస్థితి వచ్చినప్పుడు స్కీమ్ అయిపోయిన తర్వాత నెల సమయం ఇచ్చి అప్లికేషన్ పెట్టించి, వెరిఫికేషన్ చేయించి ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ నష్టపోకుండా లబ్ధిని అందజేసే ఒక మంచి కార్యక్రమం. ఇది మనందరికీ ఎంతో సంతృప్తినిస్తూ ప్రభుత్వం తోడుగా నిలబడుతోందని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీని వల్ల జరుగుతుంది. ఈ పథకం ప్రతి 6 నెలలకోసారి క్రమం తప్పకుండా జూన్-జూలైలో ఒకసారి, మళ్లీ డిసెంబర్-జనవరిలో మరోసారి.. ఇలా 6 నెలలకు సంబంధించిన పథకాల్లో అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ది పొందని వారికి తోడుగా నిలుస్తున్నాం. దరఖాస్తు చేసుకోకపోయి ఉండటం, ఏదైనా పొరపాట్లు దొర్లడం వల్ల, కావాల్సిన పత్రాలు ఇవ్వని పరిస్థితులు, ఆధార్-బ్యాంక్ అకౌంటు మిస్ మ్యాచ్ లాంటి ఇతరత్రా కారణాల వల్ల పథకం బెనిఫిట్ రాని పరిస్థితి ఉంటే వాళ్లందరికీ ప్రతి ఆరు నెలలకోసారి పథకాలకు సంబంధించి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తున్నాం. 2021 డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలు పెట్టి ప్రతి ఆరు నెలలకోసారి చేస్తున్నాం. ఈరోజు ఐదోసారి చేస్తున్నాం. అర్హత ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మళ్లీ తోడుగా ఉంటూ నిలబడుతూ దాదాపు రూ.1,700 కోట్లు వారికి అందజేసే కార్యక్రమం. ఈరోజు దాదాపు వివిధ పథకాలకు సంబంధించి 68,990 మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వారికి మళ్లీ అందజేస్తూ రూ.98 కోట్లకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ల బ్యాంకు ఖాతాల్లో అందేట్టుగా చేస్తున్నాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా ఇంతకు ముందు పథకం తీసుకొచ్చినప్పుడు 42.62 లక్షల మంది అర్హత పొందారు. డబ్బులు ఖాతాల్లో పడ్డాయి. మిస్ ఔట్ అయిపోయిన 40,616 మంది ఉంటే వారికి కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, వెరిఫికేషన్ పూర్తి కావడం వారికి మళ్లీ వెనక్కి వచ్చేట్టుగా చేస్తున్నాం. జగనన్న చేదోడులో అప్పట్లో 3.25 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు 15 వేల మంది మిస్ ఔట్ అయిన వారికి ఇస్తున్నాం. ఈబీసీ నేస్తం ద్వారా 4.40 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు 4,180 మందికి లబ్ధి జరిగిస్తున్నాం. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 2.80 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు మళ్లీ 3,030 మందికి ఈరోజు మంచి జరగబోతోంది. మత్స్యకార భరోసా కింద అప్పట్లో 1.20 లక్షల మందికి మంచి జరిగితే ఈరోజు మరో 2 వేల మందికి మంచి జరిగిస్తున్నాం. కళ్యాణమస్తు, షాదీతోఫా ద్వారా అప్పట్లో 29,934 మందికి మంచి జరిగితే 1,912 మందికి మిగిలిపోయిన వారికి మళ్లీ ఈరోజు మంచి జరిగిస్తున్నాం. వైఎస్సార్ కాపు నేస్తం 3.60 లక్షలమందికి అప్పట్లో మంచి జరిగితే, ఇప్పుడు 1884 మందికి మంచి జరిగిస్తున్నాం. నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరిగింది. ఇప్పుడు 352 మందికి మంచి జరిగిస్తున్నాం. వీళ్లే కాకుండా కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం. ఎవరైనా మిగిలిపోయినా, కొత్తవాళ్లెవరైనా దరఖాస్తు చేసుకోవడం, వెరిఫై చేసి మంజూరు చేయడం, మంజూరు చేసిన వారికి ప్రతి 6 నెలలకు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం జరుగుతోంది. మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులు ఈనెల నుంచే వారికి కూడా ఇవ్వడం జరుగుతోంది. 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఏ ఒక్కరూ మిస్ కాకూడదు, పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, శాచురేషన్ పద్ధతిలో వివక్ష, లంచాలకు తావు లేకుండా ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. పథకం అయిన తర్వాత నెల సమయం ఇచ్చి అప్లికేషన్ పెట్టుకొనే వెసులుబాటు కల్పిస్తూ, వాలంటీర్ సేవలు అందుబాటులో ఉంచడం, సచివాలయంలోకి వారే వెళ్లి దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు, 1902కు ఫోన్ చేసినా వాళ్లు గైడెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఒక జవాబుదారీ తనం, ఒక ట్రాన్స్ పరెన్సీ, ఏ ఒక్కరూ మిస్ కాకూడదన్న భావన, తపన, తాపత్రయంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పే సంకేతం. ప్రతి 6 నెలలకోసారి జరిగిస్తూ ప్రజలకు మంచి చేసే విషయంలో మనందరి ప్రభుత్వంతోడుగా ఉందని ఒక మెసేజ్ ఓరియెంటెడ్ గా ఈ కార్యక్రమం పని చేస్తుంది. కలెక్టర్ల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ధ్యాస పెట్టి, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా వాళ్లందరికీ తోడుగా నిలబడి, సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్లందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం. మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరే సాంకేతిక కారణాలతో పథకాలు అందని తమలాంటి వారికి తిరిగి మరో అవకాశం ఇస్తూ సంక్షేమాన్ని అమలు చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కారణాలతో సంక్షేమ పథకాలు మిస్ అయిన తమకు మళ్లీ తిరిగి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, గతంలో ఎవ్వరూ ఇలా సంక్షేమ పథకాలు ఇవ్వలేదని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందని, మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరేనంటూ లబ్ధిదారులు ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. గతంలో దరఖాస్తు చేసుకుంటే సరిగ్గా రాలేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఏదైనా కారణాలతో మిస్ అయిన సంక్షేమ పథకాలు మళ్లీ అమలు చేస్తున్నారని, అర్హత ఉంటే చాలు సిఫార్సు లేకుండానే సంక్షేమాన్ని ఇస్తున్నారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
Fact Check: ‘మీటర్ల’ కొద్దీ అసత్యాలు అల్లేస్తున్నారు!
సాక్షి, అమరావతి: అర్హత ఉన్నవారెవరైనా స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని స్పష్టంగా చెప్పి.. వచ్చిన టెండర్లలో పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి తక్కువ ధర వచ్చేలా రివర్స్ టెండరింగ్ కూడా జరిపి.. అప్పుడు వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌మీటర్లు బిగించే టెండర్‌ను ఖరారుచేసినా ఈనాడు రామోజీరావు పెడబొబ్బలు పెడుతున్నారు. అదేదో ఘోరమైనట్లు తన విషపుత్రిక ఈనాడులో పిచ్చి రాతలు రాసిపారేస్తున్నారు. తమకు అభ్యంతరంలేదని రైతులే చెబుతున్నా స్మార్ట్‌మీటర్లపై ఆ పత్రిక పదే పదే విషం కక్కుతోంది. ఇందులో భాగంగానే ‘స్మార్ట్‌గా మేసేస్తున్నారు’ పేరుతో గురువారం మరోసారి అక్కసు వెళ్లగక్కింది. కానీ, ఎప్పటిలాగే రామోజీ రాతల్లో ఏమాత్రం వాస్తవంలేదని.. అయినా రైతులకు లేని అభ్యంతరం ఆయనకెందుకని ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీ కె. సంతోషరావు, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ఐ.పృధ్వీతేజ్‌లు తెలిపారు. శాస్త్ర, సాంకేతికతపై అవగాహనా లేమితో ఈనాడు కథనం వాస్తవానికి దూరంగా వుందని వారు తెలిపారు. ఈ మేరకు సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. నాణ్యమైన విద్యుత్ కోసమే స్మార్ట్ మీటర్లు.. పూర్వం వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగం జరిగేది. ఆ తర్వాత మోటార్ హార్స్ పవర్ ప్రాతిపదికన వినియోగాన్ని లెక్కించడంతో మీటర్ల వాడకం తగ్గింది. ఆ తర్వాత విద్యుత్ సంస్థలు విడతల వారీగా వినియోగదారులకు కెపాసిటర్లను అందించినప్పటికీ కాలక్రమేణా వాటిని రైతులే తీసేశారు. దీంతో సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వులు (జిఓ ఎంఎస్. 22, తేదీ : 01.09.2020) జారీచేసింది. దీని ప్రకారం.. ఃనాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను ప్రభుత్వం జమచేస్తోంది. ఆ మొత్తాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.12,128.71పై.. పన్నులతో కలిపి రూ.14,455ల వ్యయంతో మీటరు బాక్స్‌తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలను ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా ‘ఆర్డీఎస్ఎస్’ పథకంలో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంలకు సమకూరుతుంది’.. అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రమాదాలను తగ్గించవచ్చు.. అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, మీటరు అమర్చడానికి, అవి పాడైపోకుండా వుండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటుచేస్తున్నాం. ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ జరుగుతుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్‌ను కూడా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని డిస్కంలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన ఓల్టేజ్‌తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. మహారాష్ట్రతో పోలికేంటి? మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్‌ఇడీసీఎల్) సంస్థ పరిధిలో హెచ్‌వీడీఎస్ పథకం కింద వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు వాల్ మౌంటెడ్ ఎస్ఎంసీ మీటరు బాక్సును మాత్రమే రూ.2,100లతో ఏర్పాటుచేశారు. అయితే, మన రాష్ట్రంలో ఏర్పాటుచేస్తున్న ఎస్ఎంసీ మీటరు బాక్సులో అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలు కూడా వుండడంతో మీటరు బాక్సు సైజు సుమారు రెండింతలు వుంటుంది. మహారాష్ట్ర స్మార్ట్ మీటర్లు గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం అమర్చుతున్నారు. ఇక్కడ పూర్తిగా వ్యవసాయ విద్యుత్ ఆధారిత సర్వీసులకు మాత్రమే పెడుతున్నాం. వ్యవసాయ స్మార్ట్ మీటర్ అమర్చడంతో గృహ, వాణిజ్య అవసరాల కోసం అమర్చిన స్మార్ట్ మీటర్లను పోల్చడం సరికాదు. మీటర్లతో అందరికీ మేలు.. మీటర్ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సబ్సిడీ మొత్తం మిగులుతుంది. ఈ మిగులు డబ్బుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. డిస్కంకు జవాబుదారీతనం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్రవ్యాప్తంగా వున్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుతో లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకునే సౌలభ్యం వుంటుంది. అంతేకాక.. సరఫరాలో అంతరాయాలను, ఓల్టేజ్ హెచ్చుతగ్గులను రైతులు, సంస్థ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం వుంటుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియలో అర్హత సాధించిన సంస్థలకే పనులను అప్పగించాం. ఈ ప్రక్రియలో ఎలాంటి గోప్యతకు ఆస్కారం లేదు. విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నామని సీఎండీలు వివరించారు. తెలియకపోతే తెలుసుకోండి.. విద్యుత్ సంస్థల్లో డీబీటీ విధానం కోసం 93 నెలల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. అనుబంధ పరికరాలకు సంబంధించిన టెండరును విక్రాన్ ఇంజనీరింగ్ అండ్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకోవడంతో ఆ సంస్థ అనుబంధ పరికరాలను బాక్సులో అమర్చి సరఫరా చేసి వ్యవసాయ సర్వీసు వద్ద అమర్చుతోంది. అంతేతప్ప అది ఖాళీ బాక్సులు ఇస్తున్నట్లు కాదు. ♦ స్మార్ట్ మీటర్ల టెండర్లను దక్కించుకున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ విక్రాంత్ సంస్థ అమర్చిన అనుబంధ పరికరాలతో కూడిన మీటరు బాక్సులో మీటరు సరఫరా, అమరిక, అనుసంధానం పనులు చేపడుతోంది. ♦ ఈ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత సెంట్రల్ సర్వర్లతో అనుసంధానం అయిన ప్రతి సర్వీసు మీటర్ డేటా ఆన్లైన్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ♦సరఫరాలో అంతరాయాలను, ఓల్టేజ్ హెచ్చుతగ్గులను నివారించడంతో పాటు రైతులు, సంస్థ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం వుంటుంది. ♦ ఒప్పందం ప్రకారం డేటా నమోదైన సర్వీసులకు మాత్రమే ప్రతినెలా బిల్లింగ్ చేయడం జరుగుతుంది. ♦ మీటర్ రీడింగ్‌లో సర్వే, జీఎస్ మ్యాపింగ్, అనుసంధానం, హెచ్ఏఎస్, ఎంఏఎస్, ఎంఎంఎస్, సిమ్‌కార్డ్ రెంటల్, నెట్వర్క్ కాస్ట్, ఆపరేషన్–మెయింటినెన్స్ వంటి సేవలను పొందుపరిచారు. ♦ వ్యవసాయ సర్వీసులు దూరంగా వుండడంవల్ల నెట్వర్క్ హెచ్చుతగ్గులు ఉన్నచోట మీటరు దగ్గరకు వెళ్లి మీటరు డేటా స్వీకరిస్తున్నారు. ∙దీని అంచనా సుమారు 15 శాతంగా నిర్ణయించాం. ఈ అంచనా వ్యయం అధ్యయనం చేసిన తర్వాత నెలకు ఒక మీటరుకు రూ.197.05 పైసలుగా నిర్ణయించాం. -
పట్టణ పేదలకు ఆరోగ్య భరోసా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలన్న లక్ష్యంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నారు. పట్టణ పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని అందించడం కోసం పట్టణ ప్రాథమిక వైద్యాన్ని సీఎం జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది. తద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు పట్టణ ప్రజలు జీజీహెచ్, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేసింది. ఇందుకోసం నగర, పట్టణ ప్రాంతాల్లో 542 డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను వైద్య శాఖ నెలకొల్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, నగర ప్రాంతాల్లో 40 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. వీరికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 73 మున్సిపాలిటీల్లో 259 అర్బన్ హెల్త్ సెంటర్లు మాత్రమే ఉండేవి. ఇవి పేరుకే హెల్త్ సెంటర్లు. ప్రజలకు అందించిన వైద్య సేవలు మాత్రం శూన్యం. వీటిలో ఎటువంటి సౌకర్యాలూ ఉండేవి కావు. చిన్న చిన్న వైద్య పరీక్షలు కూడా చేసే అవకాశం ఉండేది కాదు. అపరిశుభ్ర వాతావరణం, వైద్యులు, వైద్య సిబ్బంది కొరత కారణంగా ప్రజలు వీటివైపు కన్నెత్తి చూసే వారే కాదు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో నగరాలు, పట్టణాల్లో 50 వేల జనాభాకు ఒకటి చొప్పున ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ల సంఖ్యను పెంచారు. ప్రతి 25 వేల మంది జనాభాకు ఒకటి తప్పనిసరిగా ఉండేలా డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా విశాఖ నగరంలో గతంలో 24 ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఇప్పుడు 63కు పెరిగాయి. అదే విధంగా విజయవాడలో 29 ఉండగా ప్రస్తుతం 41 ఉన్నాయి. ఇలా అన్ని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత చేరువగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 47.14 లక్షల ఓపీలు నమోదు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని సౌకర్యాలతో కూడా వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు పట్టణ పేదలకు ప్రయోజనకరంగా ఉన్నాయి. దీంతో ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య వీటిలో 47,14,261 ఓపీలు నమోదయ్యాయి. డిజిటల్ వైద్య సేవల్లో భాగంగా 30.77 లక్షల హెల్త్ రికార్డులను వీటిలోడిజిటలైజేషన్ చేశారు. 8,99,946 మంది టెలీ మెడిసన్ ద్వారా బోధనాస్పత్రుల్లోని హబ్‌లో ఉండే స్పెషలిస్ట్ వైద్యుల సేవలు పొందారు. 42.06 లక్షల ల్యాబ్ టెస్ట్‌లను ఆరోగ్య కేంద్రాల్లో చేశారు. ల్యాబ్ టెస్ట్‌ల ఫలితాలను ఎస్ఎంఎస్ రూపంలో రోగుల మొబైల్ నంబర్లకు పంపుతున్నారు. గర్భిణులకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ సేవలూ అందుబాటులోకి తెచ్చారు ప్రతి ఆరు ఆరోగ్య కేంద్రాలను ఒక క్లస్టర్‌గా చేసి ఒక చోట అల్ట్రా సౌండ్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో మిషన్ కొనుగోలుకు రూ. 2.45 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. అత్యున్నత ప్రమాణాలతో నాడు–నేడు కార్యక్రమం కింద పట్టణ ఆరోగ్య కేంద్రాలన్నింటికీ ప్రభుత్వం సొంత భవనాలను సమకూరుస్తోంది. 188 పాత భవనాలకు మరమ్మతులు చేసింది. మరో 344 కొత్త భవనాలు నిర్మిస్తోంది. వీటిలో 248 భవనాల నిర్మాణం పూర్తయింది. 240 భవనాలను వైద్య శాఖ స్వా«దీనం చేసుకుంది. మిగిలిన భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొత్త భవనం నిర్మాణానికి రూ. 80 లక్షలు, పాత వాటి మరమ్మతులకు రూ.10 లక్షల చొప్పున ఖర్చు పెట్టారు. ఈ భవనాలన్నింటినీ నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్(ఎన్‌క్వా‹Ù) ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఇప్పటికే 11 ఆస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపు కూడా లభించింది. ఓ వైపు పక్కా భవనాలను సమకూర్చుకుంటూనే, తాత్కాలిక భవనాల్లో 542 ఆరోగ్య కేంద్రాల కార్యకలాపాలను 2020–21లోనే వైద్య శాఖ ప్రారంభించింది. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీíÙయన్, ఇతర సిబ్బందిని నియమించారు. అన్ని కేంద్రాల్లో వందశాతం మానవ వనరులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 3,760 మంది ఉద్యోగులను అర్బన్ హెల్త్ సెంటర్లలో కొత్తగా నియమించింది. గతంలో ఓపీ మాత్రమే ఉండగా, ఇప్పుడు ప్రతి ఆరోగ్య కేంద్రంలో పది పడకలతో ఇన్పేòÙంట్ విభాగం ఏర్పాటు చేసింది. 63 రకాల ల్యాబ్ వైద్య పరీక్షలు, 172 రకాల మందులు అందుబాటులో ఉంచింది. -
నాడు.. అవమానం నేడు ఆదరణ
నాడు: టీడీపీ హయాంలో హక్కులు పరిరక్షించాలని వేడుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ తాత్కాలిక సచివాలయం సాక్షిగా చంద్రబాబు బెదిరించారు. హామీలను అమలు చేయాలని విన్నవించుకున్న పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులపై హూంకరించారు. న్యాయమూర్తులుగా బీసీలు పనికి రారంటూ చంద్రబాబు అవహేళన చేశారు. నేడు: వెనుకబడిన వర్గాలను సమాజానికి వెన్నుముకగా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చెప్పిన దానికి మిన్నగా సీఎం జగన్ మంచి చేస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలతో డీబీటీ రూపంలో రూ.2.45 లక్షల కోట్లు అందించగా అందులో బీసీల ఖాతాల్లోనే రూ.1,15,155.02 కోట్లు జమ చేశారు. బీసీ బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం పదవులను బీసీలకే ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించారు. సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతనివ్వడం, రాజ్యాధికారంలో సింహభాగం వాటా, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా బీసీలను ముఖ్యమంత్రి జగన్ సమాజానికి వెన్నుముకలా తీర్చిదిద్దారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బీసీ ముఖ్యమంత్రులకు సైతం సాధ్యం కాని రీతిలో సీఎం జగన్ రాజ్యాధికారంలో సింహభాగం వాటా బలహీన వర్గాలకు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో గత 56 నెలల్లో రూ.2.45 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో బీసీల ఖాతాల్లోనే రూ.1,15,155.02 కోట్లను నేరుగా జమ చేశారని ప్రస్తావిస్తున్నారు. డీబీటీ, నాన్ డీబీటీతో కలిపి పేదలకు రూ.4.12 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరగా అందులో బీసీ వర్గాలే రూ.1,65,476.89 కోట్ల మేర లబ్ధి పొందాయి. విద్యా సాధికారతతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఇవన్నీ బీసీలను సమాజానికి వెన్నుముకలా మార్చేందుకు బాటలు వేశాయని విశ్లేషిస్తున్నారు. పరిపాలనలో సింహభాగం.. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలలో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని సాధించింది. 2019 మే 30న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని గతేడాది ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులున్న మంత్రివర్గంలో ఏకంగా 11 మంది బీసీలకు స్థానం కల్పించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. విద్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం లాంటి కీలక శాఖలను ఆ వర్గాలకే అప్పగించారు. 2014–19 మధ్య చంద్రబాబు తన మంత్రివర్గంలో కేవలం 8 పదవులు మాత్రమే బీసీలకు ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే నలుగురు బీసీలను సీఎం వైఎస్ జగన్ రాజ్యసభకు పంపారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశం కల్పించారు. శాసనమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 29 పదవులు (69 శాతం) దక్కేలా సీఎం జగన్ చర్యలు తీసుకోగా 2014–19 మధ్య చంద్రబాబు ఆ వర్గాలకు కేవలం 18 పదవులు (37 శాతం) మాత్రమే ఇచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు పెద్దపీట టస్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు టీడీపీ నేతలను పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీల రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది. అయితే రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ దాన్ని ఆచరించి చూపారు. ♦ జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జడ్పీలను వైఎస్సార్సీపీ దక్కించుకోగా అందులో బీసీలకు 6 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులు (46 శాతం) కేటాయించారు. ♦మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకుగాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోగా 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకే ఇచ్చారు. ఇందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి. ♦14 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయగా తొమ్మిది చోట్ల మేయర్ పదవులు (64 శాతం) బీసీలకు ఇచ్చారు. ♦ 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకోగా చైర్పర్సన్ పదవుల్లో బీసీలకు 44(53 శాతం) ఇచ్చారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ♦ దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ చేస్తూ సీఎం జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. ♦ రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. ♦ వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ వర్గాల వారికే అవకాశం కల్పించారు. ♦ 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. వైఎస్సార్సీపీ వెంటే బీసీలు.. చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టడం, అనంతరం అధికారంలోకి వచ్చాక బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుండటంతో ఆ వర్గాలు వైఎస్సార్సీపీ వెంటే నడుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్.. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడం దీనికి రుజువుగా నిలిచింది. బీసీల జనాభా అధికంగా ఉన్న కుప్పం కోట కూలిపోయి చంద్రబాబు రాజకీయ పునాదులు పెకలించడానికి ఇదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీసీల అభ్యున్నతి కోసం శాశ్వత కమిషన్, కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో సీఎం జగన్ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి సిద్ధమవడం బీసీ వర్గాల అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందని స్పష్టం చేస్తున్నారు. కుప్పం కోట బీసీలదే..! ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దక్కించుకోవటానికి ముందే.. 1989లోనే బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుంచి పోటీ చేసిన చంద్రబాబు టీడీపీ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ పంచన చేరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి అంటే 1983, 1985 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున బీసీ నేతలే పోటీ చేసి గెలుపొందారు. అక్కడ బీసీల జనాభా అధికం. తన సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయంగా పప్పులు ఉడకవని గ్రహించిన చంద్రబాబు 1989లో కుప్పం నియోజక వర్గానికి వలస వెళ్లి రాజకీయంగా బీసీలకు ద్రోహం చేశారు. అప్పటి నుంచి కుప్పంలోనే పోటీ చేస్తూ వస్తున్నారు. తండ్రి బాటలోనే లోకేశ్ నడుస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీలు అధికం. 2019 ఎన్నికల్లో బీసీ నేతకు వెన్నుపోటు పొడిచి ఆ స్థానంలో పోటీ చేసిన నారా లోకేశ్ ఘోరంగా ఓడిపోయారు. -
శ్రీకాకుళం భాగ్యరేఖ.. మూలపేట పోర్టు
సాక్షి, అమరావతి: వెనుకబడ్డ ఉత్తరాంధ్ర తలరాతను మార్చే మరో పోర్టు వేగంగా రూపుదిద్దుకుంటోంది. వలస జిల్లా పేరు నుంచి ఉపాధి కల్పించే జిల్లాగా శ్రీకాకుళం పేరును మార్చే మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లాకు రెండు వేల కోట్ల రూపాయలకు మించి పెట్టుబడులు రాలేదు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకంగా మూలపేట పోర్టు, మంచినీళ్లపేట, బుడగల్లపాలెం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ. 5,000 కోట్లు పైనే వ్యయం చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల్లో ఒకటైన మూలపేట మన రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాల నుంచి ఎగుమతులు దిగుమతులకు అనువుగా ఉంటుందని.. ఇలాంటి కీలకమైన ప్రదేశంలో మూలపేట ఉందని ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పోర్టు ద్వారా ఐదు రాష్ట్రాల్లోని పరిశ్రమలు తమకు అవసరమైన ముడి సరుకులు దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ఇక్కడ నుంచి మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మూలపేట పోర్టు పనులను ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని అనుమతుల తర్వాత అన్ని అనుమతుల తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించడంతో పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. పోర్టులో కీలకమైన సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణానికి 19.40 లక్షల టన్నులు, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణానికి 2.71 లక్షల టన్నుల బండరాళ్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఇప్పటికే 8.3 లక్షల టన్నుల బండరాళ్లను తరలించారు. ఇదే సమయంలో జనరల్ బెర్త్ నిర్మాణ పనులు, తీర ప్రాంతం పటిష్టం చేయడం, ఎన్‌హెచ్ 16ను అనుసంధానం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో నాలుగు బెర్తులు పోర్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,361.91 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును విశ్వసముద్ర కన్సార్టియం చేపట్టింది. రూ. 2,949.70 కోట్ల వ్యయంతో తొలిదశలో నాలుగు బెర్తుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనను విశ్వసముద్ర అభివృద్ధి చేయనుంది. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్ టన్నులు కాగా తొలిదశలో నాలుగు బెర్తుల నిర్మాణంతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేయనున్నారు. మొత్తం నాలుగు బెర్తుల్లో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గు, ఇంకొకటి కంటైనర్‌తోపాటు ఇతర ఎగుమతి దిగుమతులకు వినియోగించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూలపేట పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణరూపంలో సమీకరిస్తున్నారు. 596 కుటుంబాల తరలింపు పోర్టు నిర్మాణం కోసం విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 596 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరిని ఒక కుటుంబంగా పరిగణించి వారికి కస్త నౌపాడ వద్ద పునరావాస గ్రామం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ. 149 కోట్లు్ల వ్యయం చేస్తోంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద అక్కడ 13 రకాల మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పటికే స్థలాన్ని చదును చేసి విద్యుత్, తాగునీరు కనెక్షన్లను ఏర్పాటు చేయడం పూర్తయింది. త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్‌ను కేటాయించి ఇంటి నిర్మాణాలను ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మూలపేట పోర్టు స్వరూపం ప్రాజెక్టు వ్యయంరూ.4,361.91 కోట్లు తొలి దశ పోర్టు:23.5 ఎంటీపీఏ తుది దశ పోర్టు:83.3 ఎంటీపీఏ తొలి దశలో బెర్తుల సంఖ్య 4 నౌక పరిమాణం:1,20,000 డీడబ్ల్యూటీ అవసరమైన భూమి:1,254.72 ఎకరాలు దక్షిణ బ్రేక్ వాటర్:2,455 మీటర్లు ఉత్తర బ్రేక్ వాటర్: 580 మీటర్లు తీరం రక్షణ:1,000 మీటర్లు డ్రెడ్జింగ్: 15.85 మిలియన్ క్యూబిక్ మీటర్లు అప్రోచ్ చానల్:3.3 కి.మీ నీరు: గొట్టా బ్యారేజీ నుంచి 0.5 ఎంఎల్డీ నీటి సరఫరా రైల్: 10.6 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం రహదారి: ఎన్‌హెచ్16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ. నాలుగులేన్ల రహదారి నిర్మాణం కార్యకలాపాలు ప్రారంభం: అక్టోబర్, 2025 శ్రీకాకుళం ఇక సిరుల జిల్లా ఇంతకాలం శ్రీకాకుళం అంటే వలసలు గుర్తుకు వచ్చేవి. కానీ మూలపేట పోర్టు రాకతో స్థానికులు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేగాక వేరే ప్రాంతం వారికి కూడా ఇక్కడ ఉపాధి కల్పించే సిరుల జిల్లాగా రూపాంతరం చెందుతుంది. కేవలం పోర్టులే కాకుండా వాటిపక్కనే పోర్టు ఆధారిత పరిశ్రమలను ప్రమోట్ చేస్తున్నాం. కొత్తగా వస్తున్న నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లతో రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్రలతో పోటీ పడుతుంది. రెండు లక్షల టన్నుల బరువు ఉండే భారీ ఓడలను తీసుకువచ్చే విధంగా ఈపోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. – కాయల వెంకటరెడ్డి, చైర్మన్ ఏపీ మారిటైమ్ బోర్డు 6 నెలలు ముందుగానే అందుబాటులోకి పోర్టు శంకుస్థాపన జరిగిన 8 నెలల్లో రికార్డు స్థాయిలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే నార్త్ బ్రేక్ వాటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సౌత్ బ్రేక్ వాటర్ పనులు 50 శాతంపైగా పూర్తయ్యాయి. వాస్తవంగా ఈ ప్రాజెక్టును అక్టోబర్ 2025 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా సీఎం ఆదేశాలు మేరకు ఆరు నెలలు ముందుగానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఆ మేరకు ప్రణాళికలను సిద్ధం చేశాం. డ్రెడ్జింగ్ పనుల కోసం ప్రత్యేకంగా రూ. 350 కోట్లతో చైనా నుంచి డ్రెడ్జింగ్ మిషన్ కొనుగోలు చేశాం. త్వరలోనే డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించనున్నాం. –చావల బాబురావు, ఎండీ, మూలపేట పోర్టు భావితరాలకు మేలు చేకూరుతుంది భావితరాలకు మేలు చేకూరుతుందని మూలపేట పోర్టుకు మాభూములు, ఇళ్లు, గ్రామాన్ని ఇచ్చాము. జిల్లా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నందుకు గర్వంగా ఉంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే పని దొరుకుతుంది. – గిన్ని భైరాగి, విష్ణుచక్రం గ్రామం పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది మూలపేట పోర్టు రావడం వల్ల మరికొన్ని అనుబంధ పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తాయి. దీంతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. యువకులకు ఉద్యోగ, ఉపాధి కలిగి వలసనివారణ జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మా భూములను ప్రభుత్వానికి ఇచ్చాము. – కనిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నౌపడ పోర్టుతో భూముల ధరలు పెరిగాయి మూలపేట పోర్టుతో ఈ ప్రాంత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. సెంటు భూమి రూ. 1.50లక్షల నుంచి రూ. 2లక్షలు వరకు పెరిగింది. పోర్టు పూర్తి అయితే ఈ ప్రాంతం అంతా పారిశ్రామిక వాడగా మారుతుంది. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. – కర్రి కాంతారావు, రైతు, నౌపడ -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–కాకినాడ టౌన్–హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ♦ సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07021) రైలు ఈ నెల 11న గురువారం రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07022) ఈ నెల 12న శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ♦ హైదరాబాద్–కాకినాడ టౌన్ (07023) రైలు ఈ నెల 12న శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07024) ఈ నెల 13న శనివారం రాత్రి 10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
ముంపు నుంచి ‘రక్షణ’
వర్షం వచ్చిందంటే చాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఏ క్షణం కృష్ణా నది పొంగుతుందో... ఎక్కడ తమ ప్రాంతానికి వరద వస్తుందో... తమ ఇళ్లు ముంపు బారిన పడతాయో... మళ్లీ మా బతుకులు ఎక్కడ అతలాకుతలంఅవుతాయోనని ఆందోళన చెందేవారు. ఇది ఎన్నో ఏళ్లుగా విజయవాడ నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్య. అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ఎన్నో మారినా ఇక్కడివారి గోడు ఎవరూ పట్టించుకోలేదు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ సమస్యపై దృష్టిసారించారు. అవసరమైన నిధులు మంజూరు చేసి రక్షణగోడ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. వేలాదిమంది ప్రజల చింత తీర్చారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగర ప్రజలకు వరద ముప్పు నుంచి పూర్తి ఉపశమనం కలగనుంది. ఆర్టీసీ బస్టాండు నుంచి యనమలకుదురు వరకు వేలాది మంది ప్రజలకు వరద కష్టాలు తొలగనున్నాయి. ప్రకాశం బ్యారేజినుంచి 5లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు వదిలితే దిగువ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యేవి. ఇప్పుడు 12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినా ఏ ఇబ్బంది లేకుండా రక్షణ గోడ నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు నగరంలోని లోతట్టు ప్రాంతవాసుల ముంపు కష్టాల నుంచి గట్టెక్కిస్తూ కనకదుర్గమ్మ వారధినుంచి కోటినగర్ వరకు రూ. 122కోట్లతో రక్షణగోడ నిర్మించారు. తాజాగా పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మవారధి వరకు రూ. 120.82 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కృష్ణలంకకు రక్షణ కవచం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతం కృష్ణానదికి వరదలు వచ్చినపుడల్లా ముంపుబారిన పడేది. ఇక్కడి కాలనీ వాసులందరినీ ఇతర ప్రాంతాలకు తరలించేవారు. వారం, పదిరోజుల పాటు వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే తలదాచుకునేవారు. ఈ సమస్యను ప్రత్యక్షంగా చూసిన సీఎం వైఎస్ జగన్ రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కనకదుర్గమ్మ వారధి నుంచి కోటి నగర్ వరకు 1.2 కిలో మీటర్ల పొడవునా రూ.122.90 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన దాదాపు 50,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. బ్యారేజీ నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతిసారీ చలసాని నగర్, కృష్ణలంక, గీతానగర్, రాణిగారితోట, బాలాజీ నగర్, ద్వారకా నగర్, భ్రమరాంబపురం వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేవి. రక్షణ గోడ నిర్మాణంతో ఈ ప్రాంత వాసుల కష్టాలు పూర్తిగా తీరాయి. తుది దశకు పనులు ప్రస్తుతం పద్మావతి ఘాట్‌నుంచి కనకదుర్గా వారధి మధ్య కృష్ణానది వెంబడి 1.070 కిలో మీటర్ల పొడవున రూ120.82 కోట్ల నిధులతో రిటైనింగ్ వాల్ మూడో దశ పనులు తుది దశకు చేరాయి. దీనివల్ల కృష్ణలంకలోని రణదీప్ నగర్, గౌతమి నగర్, నెహ్రూనగర్, ద్వారక నగర్లో నివసిస్తున్న 30 వేల మందికి వరద కష్టం తీరింది. స్వరూపం – ఆర్టీసీ బస్టాండ్ నుంచి యనమలకుదురు వరకు రక్షణ గోడ – ఇప్పటివరకూ 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం. – ఇకపై 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు సమస్యే ఉండదు. – కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్ వరకు రూ.122.90 కోట్లతో 1.2 కిలోమీటర్ల పొడవున రక్షణ గోడ నిర్మాణం – తాజాగా పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 1.070 కిలోమీటర్ల పొడవున రూ.120.82 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి. ముంపు సమస్య తీరింది వర్షాకాలం వచ్చిందంటే చాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఏ క్షణాన్నైనా వరద వచ్చేస్తుందేమోనని భయాందోళన చెందేవాళ్లం. వరద ఇళ్లలోకి వస్తుండటంతో ఇళ్లు కాళీ చేసి, కార్పొరేషన్ ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ భయం లేదు. మా కష్టాలు తీరాయి. – మండాది దుర్గ, తారకరామనగర్ మా జీవితాలకు రక్షణ వరద ముంపు సమస్యకు పరిష్కారం దొరకింది. ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ సమస్య పరిష్కరించలేదు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మా వరద కష్టాలను పరిష్కరించి, మా జీవితాలకు రక్షణ కల్పించారు. – వీర్ల సుభద్రాదేవి, తారకరామనగర్ దశాబ్ధాల సమస్య పరిష్కారం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు కూలీ పనులు చేసుకుంటూ, కృష్ణానది కరకట్టపై ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వరద వచ్చినప్పుడల్లా ఇళ్లు కాళీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు ఆ సమస్యలేదు. దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. – బాపనపల్లి కుమార్, ఆటోడ్రైవర్, భూపేష్గుప్తానగర్ రిటైనింగ్ వాల్ పనులు పూర్తయ్యాయి కృష్ణా నది కరకట్ట వెంబడి రిటైనింగ్ వాల్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడోదశలో పద్మావతి ఘాట్‌నుంచి కనకదుర్గా వారధి వరకు రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన పనులు తుది దశకు చేరాయి. దీని ద్వారా విజయవాడ వాసులకు ముంపు కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. . – టి.జె ప్రసాద్, నీటిపారుదలశాఖ ఎస్ఈ, విజయవాడ దశాబ్దాల కల నేరవేర్చారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విజయవాడ నగర వాసుల ముంపు కష్టాలు చూసి, వారి కష్టాలకు చెక్ పెట్టే విధంగా, కృష్ణానది వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఇది కృష్ణలంక ప్రజలకు రక్షణ కవచంగా మారనుంది, దీంతో పాటు నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు వీలుగా రిటైనింగ్ వాల్‌ను అందంగా తీర్చి దిద్దుతున్నారు. దశాబ్దాల కలనేరవేర్చిన ముఖ్యమంత్రికి తూర్పు నియోజక వర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. – దేవినేని అవినాష్, తూర్పునియోజక వర్గ ఇన్‌ఛార్జి కృష్ణాతీరం... ఇక ఆహ్లాదం... నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు వీలుగా ప్రభుత్వం రిటైనింగ్ వాల్ వెంబడి పార్కులు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.38.39 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి, పనులు ప్రారంభించారు. ఇప్పటికే రిటైనింగ్ వాల్ వెంబడి బండ్ పనులు పూర్తయ్యాయి. -
డిజిటల్లో దుమ్ము దులిపేస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వైఎస్సార్ రైతు భరోసా ఛానల్’ దుమ్ము దులిపేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ చానల్ నిరంతరాయంగా వీక్షకుల మన్ననలు పొందుతోంది. రైతాంగానికి కావాల్సిన సలహాలిస్తూ, వ్యవసాయం అనుబంధ రంగాలకు సూచనలు అందించి తోడ్పాటు ఇవ్వడంలో ముందు వరుసలో ఉంది. ఫలితంగా తక్కువ కాలంలోనే రైతులు ఆర్బీకే ఛానల్‌పై అధిక సంతృప్తి కనపరుస్తున్నారు. సొంతగా యూ ట్యూబ్ ఛానెల్ నెలకొల్పి అన్నదాతకు ఆసరాగా నిలబడుతుండడంతో ఏపీ ప్రభుత్వాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అక్కడ కూడా ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నాయి. అన్నపూర్ణగా వెలుగొందుతున్న ఏపీ వ్యవసాయ రంగంలో కాలానికి తగినట్లుగా విప్లవాత్మక మార్పులు రావడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా ఛానల్ అనతి కాలంలోనే అన్నదాతలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారి మన్ననలు చూరగొంటోంది. ప్రారంభించి మూడేళ్లు కూడా పూర్తి కాకుండానే 2.75లక్షల సబ్ స్క్రిప్షన్, 55 లక్షల వ్యూయర్ షిప్‌తో దూసుకుపోతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ‘ఆర్బీకే’ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ యూ ట్యూబ్ ఛానల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేంద్రంతోపాటు పొరుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. ఏపీ స్ఫూర్తితో ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం రైతుల కోసం సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తుండగా.. పలు రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. నీతి ఆయోగ్, ఐసీఎఆర్, ఆర్బీఐ వంటి జాతీయ సంస్థలకే కాదు వరల్డ్‌బ్యాంక్, యూఎన్‌కు చెందిన ఎఫ్ఏఒతోపాటు వివిధ దేశాల ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌తో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఛానల్‌ను సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించారు. ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాగులో వస్తున్న నూతన విధానాలను ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియా ద్వారా రైతులకు చేరువ చేసే లక్ష్యంతో ఆర్బీకే ఛానల్‌ను ఏర్పాటు చేసింది. రైతుల అభ్యుదయ గాథలు, ఆదర్శ రైతుల అనుభవాలను ఆకట్టుకునేలా తీర్చి దిద్ది ప్రసారం చేస్తున్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొనే అధికారిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు రైతులందరికీ తెలిసేలా రైతు గ్రూపులతో ఛానల్ ద్వారా ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహిసున్నారు. ఏ రోజు ఏ శాఖకు చెందిన కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయో? ఆర్బీకేల ద్వారా ప్రసారం చేసున్నారు. ఛానల్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను యూ ట్యూబ్‌లో అప్లోడ్ అవుతుండడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్ ద్వారా రైతులు వీక్షిస్తున్నారు. 1,628 వీడియోలు.. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలు ఆర్బీకే ఛానల్ కోసం ప్రత్యేకంగా గన్నవరం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో మూడేళ్ల క్రితం డిజిటల్ స్టూడియోను ఏర్పాటు చేసింది. డిజిటల్ రంగంలో విశేష అనుభవం కలిగిన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. క్షేత్ర స్థాయిలో ఆదర్శ, అభ్యుదయ రైతులు సాధిస్తోన్న విజయాలపై ఇంటరŠూయ్వలు, డాక్యుమెంటరీలు రూప కల్పన కోసం ప్రత్యేకంగా అవుట్ డోర్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసారు. శాఖల వారీగా అప్లోడ్ చేస్తున్న వీడియోలు, ప్రత్యక్ష ప్రసారాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 599 వ్యవసాయ, 589 ఉద్యాన, 257 పశు సంవర్ధక, 97 మత్స్య, 13 పట్టు శాఖలకు చెందిన వీడియోలతో పాటు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి 73 వీడియోలు కలిపి ఇప్పటి వరకు 1,628 వీడియోలను అప్లోడ్ చేశారు. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలను చేసారు. ఛానల్‌ను 2.75లక్షల మంది సబ్ స్క్రిప్షన్ చేసుకోగా, జనవరి 4వ తేదీ నాటికి అప్లోడ్ చేసిన వీడియోలు, ప్రసారాలను 54,67,079 మంది వీక్షించారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఈ స్థాయి వ్యూయర్ షిప్ లభించడం గొప్ప విషయమని చెబుతున్నారు. ఆర్బీకే ఛానల్ ద్వారా ఎంతో మేలు ‘ఆర్బీకే చానల్’ చాలా బాగుంది. ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేసే వీడియోలను రెగ్యులర్‌గా వీక్షిస్తుంటాను. సీజన్లో విత్తనాలు, ఎరువులు ఏ మేరకు నిల్వ ఉన్నాయి. ఎలా బుక్ చేసుకోవాలి. సాగులో సందేహాలనే కాకుండా.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులు ఎదుర్కొనే సమస్యలకు చక్కని పరిష్కారాలు చూపిస్తున్నారు. ఈ తరహా ప్రయోగం ప్రభుత్వ పరంగా చేపట్టడం నిజంగా ప్రశంసనీయం. –నందం రఘువీర్, మొక్కల జన్యు రక్షక్షుకుని అవార్డు గ్రహీత, పెనమూలురు, కృష్ణ జిల్లా రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ రైతు ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేసే ఈ ఛానల్‌కు వ్యూయర్షిప్ అరకోటి దాటడం నిజంగా గొప్ప విషయం. సాగులో సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తోన్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఛానల్ ద్వారా రైతులకు చేరువ చేస్తున్నాం. రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ చేసుకుంటున్నారు. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
స్పెయిన్ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి
మలికిపురం: స్పెయిన్ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి దిండి రిసార్ట్స్‌లో ఇరు కుటుంబాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన సంజనా కోటేశ్వరి స్పెయిన్‌లో ఉద్యోగం చేస్తోంది. అదే దేశంలో ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న రొసిజ్ఞాని, సంజనా మనసులు కలిశాయి. ఇరుకుటుంబాల నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 3.36 గంటలకు (తెల్లారితే గురువారం) దిండి రిసార్ట్స్‌లో వీరి వివాహం ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. స్పెయిన్ నుంచి వరుడు, వరుడి తల్లిదండ్రులు, మేనత్త, సోదరి, బావతో పాటు 40 మంది బంధువులు ఈ నెల 1న దిండి రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఆ రోజు నుంచి తెలుగు సంప్రదాయాల ప్రకారం వివాహ ఘట్టాలను శాస్త్రోక్తం గా జరిపించారు. పెళ్లికి హాజరైన స్పెయిన్ మహిళలు నిండైన చీరలు, మగవారు కుర్తా పైజమా వంటి సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. వధువు సంజనా కోటేశ్వరి చిన్నాన్న, అంబాజీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో కుంపట్ల అయ్యప్పనాయుడు. ఆయనే స్థానికంగా పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ కానుక సంబరాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ పింఛన్ కానుక సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న రూ.3 వేల పింఛన్ కానుకను రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వలంటీర్లు అందిస్తున్నారు. గురువారం నాటికి 20 లక్షల మంది (34 శాతం) లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. 533 సచివాలయాల పరిధిలో పింఛన్ సంబరాలు జరుగుతున్నాయి. వీటిలో 181 సచివాలయాల పరిధిలో పింఛన్ కానుక సంబరాలు గురువారం ప్రారంభమయ్యాయి. తిరుపతి పోస్టల్ కాలనీలో పింఛన్ పంపిణీని టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఓ పండుగలా నిర్వహించారు. అర్హులైన అవ్వా తాతలు, వితంతువులకు రూ. 3 వేల పింఛన్‌ను ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తదితరులు అందించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ పింఛన్‌ను పంపిణీ చేశారు. -
ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ
సాక్షి, అమరావతి: రానున్న సాధారణ ఎన్నికల సక్రమ నిర్వహణకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు సహా ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న వివిధ విభాగాల అధికారుల ఖాళీల భర్తీతోపాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో అవసరమైన సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) ముఖేష్‌కుమార్ మీనాతో సీఎస్ జవహర్‌రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. అలాగే, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల నిర్వహణతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడు నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న అధికారుల తప్పనిసరి బదిలీ, కొత్తవారికి పోస్టింగులు వంటి వాటిపై కూడా వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు జవహర్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండాల్సిన కనీస సౌకర్యాలకు సంబంధించిన అంశాలపైనా సమీక్షించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు.. ఇక రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. ముఖ్యంగా ఏపీ, ఒడిశా రాష్ట్ర అధికారులతో త్వరలో ఒక సమావేశం నిర్వహించాలని.. దీనిపై ఒడిశా సీఎస్‌తో తాను మాట్లాడతానన్నారు. అలాగే, ఎన్నికలు అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించాల్సిన ప్రక్రియని.. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందని.. ఆ దిశగా సంబంధిత శాఖలన్నీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. 9, 10 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పర్యటన.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై సమీక్షకు కేంద్ర ఎన్నికల సంఘం రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 9న రాష్ట్రానికి రానుందని తెలిపారు. 10న విజయవాడలో సీఎస్, డీజీపీ, సీఈఓ సహా ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్ అండ్ బీ, అటవీ, విద్యా తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలున్నాయని.. వాటిలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ దృష్టికి తీసుకొచ్చి వీటిపై జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీచేయాల్సి ఉందని సీఎస్‌కు చెప్పారు. అలాగే, వివిధ పోలింగ్ కేంద్రాల్లో విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటుచేయాల్సిన సౌకర్యాలపైనా ఆదేశాలివ్వాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించాల్సి ఉందని సీఈఓ చెప్పగా.. వెంటనే తగిన ప్రతిపాదనలు పంపాలని సీఎస్ జవహర్‌రెడ్డి కోరారు. ఇంకా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇతర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గిరిజాశంకర్, అదనపు పీసీసీఎఫ్ విజిలెన్స్ గోపీనాథ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ ఎం. రవిప్రకాశ్, రవాణా శాఖ కమిషనర్ మణీష్కుమార్ ఎస్ఎల్బీసీ కన్వీనర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఆదే విధంగా.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి. రాజశేఖర్, రజత్ భార్గవ, ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కె.భాస్కర్, సీడీఎంఏ కోటేశ్వరరావు తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు. చెక్‌పోస్టులో నిఘా మరింత ముమ్మరం.. రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎం. రవిప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 29 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులున్నాయని, వాటిని పటిష్టంగా నిర్వహించడం ద్వారా డబ్బు, మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో 76 పోలీసు చెక్‌పోస్టులు, 14 అటవీ చెక్ పోస్టులున్నాయని వీటన్నింటి ద్వారా నిఘాను మరింత ముమ్మరం చేయనున్నట్లు ముఖేష్‌కుమార్ చెప్పారు.