AP Special
-
విలువైన కోర్టు సమయాన్ని వృథా చేస్తారా?
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి, తిరిగి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతన బకాయిల కోసం పిటిషన్ దాఖలు చేసిన కక్షిదారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయడమే కాక, కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ఖర్చుల కింద రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఆరు వారాల్లో న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా దారవరం గ్రామానికి చెందిన ఎం.అబ్రహంను ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆయన 1991లో లేబర్ కోర్టును ఆశ్రయించారు. లేబర్ కోర్టు అబ్రహం తొలగింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ 1996లో తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగానే తనకు 1997 నుంచి 2002 వరకు వేతన బకాయిలు చెల్లించేలా ఆదేశించాలంటూ అబ్రహం లేబర్ కోర్టులో ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. ఆ వేతన బకాయిలు చెల్లించాలని లేబర్ కోర్టు అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అబ్రహంను ఉద్యోగంలోకి తీసుకోవాలని లేబర్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన తరువాత అతనికి కాల్ లెటర్ పంపామని, ఆయన స్పందించలేదని కోర్టుకు నివేదించారు. పైపెచ్చు 1992లోనే అతను తపాలా శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్న విషయాన్ని దాచిపెట్టారని వివరించారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వ శాఖలో పని చేస్తూనే, మరో వైపు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వేతన బకాయిలు కోరుతున్నారని, దీని వెనుక అబ్రహంకు దురుద్దేశాలున్నాయని వివరించారు. దీంతో వేతన బకాయిలు చెల్లించాలన్న లేబర్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి 2017లో తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అబ్రహం అదే ఏడాది హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌పై ఇటీవల జస్టిస్ నరేందర్ ధర్మాసనం తుది విచారణ జరిపింది. సాంఘిక సంక్షేమ అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అప్పాధరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. అబ్రహం తపాలా శాఖలో పనిచేస్తున్న విషయాన్ని ఆ శాఖ అధికారులు ధ్రువీకరించారన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతన బకాయిలు ఎలా కోరతారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. స్వీయ లాభం పొందే ఉద్దేశంతోనే అబ్రహం ఈ అప్పీల్ దాఖలు చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగంలో చేరకుండా వేతన బకాయిలు ఎలా కోరతారని ప్రశ్నించింది. కోర్టు ప్రక్రియ దుర్వినియోగానికి ఇది మచ్చుతునక అని తెలిపింది. న్యాయ ప్రక్రియ ఉన్నది న్యాయం చేయడానికి, కక్షిదారుల హక్కుల పరిరక్షించడానికి మాత్రమేనంది. కోర్టు అత్యంత విలువైన సమయాన్ని అబ్రహం వృథా చేశారని, ఆయన తీరును మన్నించలేమని స్పష్టం చేసింది. అందువల్ల ఈ అప్పీల్‌ను భారీ ఖర్చులు విధించి మరీ కొట్టేయాలని నిర్ణయించామంది. -
మరో 68,990 మందికి సంక్షేమ ఫలాలు
సాక్షి, అమరావతి : జనం చెంతకే సంక్షేమం.. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి–జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్–జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడం ఎలా? ► అర్హత ఉండి ఆయా పథకాల లబ్ధి పొందని వారు వాటిని అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ► అవసరమైతే వలంటీర్ సేవలు వాడుకోవచ్చు లేదా 1902కి ఫోన్‌చేస్తే వారు తగు సూచనలు ఇస్తారు. ► సచివాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేశాక వెరిఫికేషన్ చేస్తారు. ► ఆ తర్వాత ఆరు నెలలకోసారి సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత.. ► సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ను ప్రదర్శిస్తారు. ► లంచాలకు, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పథకాలను అమలుచేస్తోంది. ► నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పథకాల లబ్ధి చేకూరుస్తోంది. -
కష్ట కాలంలో కొండంత ఆసరా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కష్ట కాలంలో కొండంత ఆసరా భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో అతి కష్టంగా జీవనం గడుపుతున్న సమయంలో ఈ ప్రభుత్వం వల్ల మా జీవితాలే మారిపోయాయి. మాది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రాయపుర అగ్రహారం. నాకు వివాహమై 15 సంవత్సరాలు అవుతోంది. నా భర్త రాము వ్యవసాయంతో పాటు మైక్, లైటింగ్ పనులు చేసేవారు. ఎనిమిదేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. అప్పటికి నాకు ఇద్దరు చిన్న పిల్లలు. అప్పట్లో మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. జగనన్న సీఎం అయ్యాక వితంతు పింఛన్ మంజూరైంది. నాలుగున్నరేళ్లుగా పింఛన్ సొమ్ము ఎంతో ఉపయోగపడుతోంది. ఈ నెల నుంచి రూ.3 వేలు ఇస్తుండడం మరింత సంతోషం కలిగించింది. ప్రస్తుతం పెద్ద పాప గీతిక సబ్బవరం కేజీబీవీ పాఠశాలలో 9వ తరగతి, రెండో పాప దివ్య అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. వారిద్దరూ వసతి గృహంలో ఉండటంతో ఆరి్థక భారం తప్పింది. ఇప్పటికి నాలుగు విడతలుగా అమ్మ ఒడి సొమ్ము రూ.60 వేలు వచ్చింది. నాకు 35 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. రైతు భరోసా కింద నాలుగు విడతలు రూ.13,500 వంతున వచ్చింది. ఐదో ఏట కూడా మొదటి విడత సొమ్ము వచ్చింది. డ్వాక్రా రుణ మాఫీ.. ఆసరా కూడా వచ్చింది. మరో వైపు పశు పోషణ ద్వారా కూడా కొంత ఆదాయం వస్తోంది. సొంత ఇంట్లోనే ఉంటున్నాం. ఈ ప్రభుత్వం వల్ల ఆనందంగా ఉన్నాం. – నక్కెళ్ల సన్యాసమ్మ, రాయపుర అగ్రహారం (సుర్ల నాగేశ్వరావు, విలేకరి, సబ్బవరం) ఇప్పుడు మా సొంతింట్లో ఉన్నాం ముగ్గురు మగ పిల్లలు, భర్తతో కలసి 38 సంవత్సరాలుగా పశ్చిమగోదావరి జిల్లా కైకలూరులో అద్దె ఇళ్లల్లో కాపురం చేశాను. నా భర్త షరీఫ్ వంట మేస్త్రీగా పని చేస్తున్నారు. ఆయన కష్టంతో వచ్చే డబ్బుల్లో సగం అద్దె కోసమే వెచ్చించాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాను. కొద్ది రోజుల తర్వాత ఇంటి స్థలం కేటాయించినట్టు మా వలంటీర్ చెప్పారు. అన్నట్లుగానే పట్టా నా చేతికిచ్చి, స్థలాన్ని చూపించారు. ఇల్లు కట్టుకునేందుకు రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సబ్సిడీతో అందజేశారు. కొంత డబ్బు మేము అదనంగా జత చేసి చక్కటి ఇల్లు కట్టుకున్నాం. వివాహమైన నా కుమారుడి భార్యకు కూడా ఇంటి స్థలం కేటాయించారు. చేయూత పథకం కింద నాకు ఏటా రూ.18,750 వంతున వచ్చింది. ఈ ప్రభుత్వం పుణ్యాన మేం ఆనందంగా జీవిస్తున్నాం. – సయ్యద్ షంసున్నీసా, వైఎస్సార్ గ్రీన్ విలేజ్, కైకలూరు (బి.శ్యామలరాజు విలేకరి, కైకలూరు) ఉన్న ఊళ్లోనే ఉపాధి మాది మారుమూల గిరిశిఖర గ్రామం. నేను, నా భర్త పోలి జీవనోపాధి కోసం ఎన్నో పనులు చేశాం. ఏ పని చేసినా ముగ్గురు పిల్లలుగల మాకు రెండుపూటలా తిండి కూడా కష్టమయ్యేది. బతుకు తెరువు రోజురోజుకూ కష్టంగా మారింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత నాకొక ఆధారంలా కనిపించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నా బ్యాంకు ఖాతాలో రూ.18,750 చొప్పున మూడేళ్లపాటు నగదు జమ చేసింది. ఆ డబ్బుతో మేక పిల్లలను కొనుగోలు చేసి పెంచుతున్నాను. దానినే బతుకు బాటగా మలుచుకున్నాను. ఇప్పుడు నేను కుటుంబానికి ఆసరాగా మారాను. మా సొంతూరైన పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెదరావికోనలోనే బతకలగనన్న నమ్మకం కలిగింది. ఈ పథకం నా జీవితాన్నే మార్చేసింది. పెద్దకొడుకు మత ప్రచారకుడిగా ఉన్నాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు ఇంట్లోనే మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇప్పుడు మా కుటుంబం హాయిగా జీవనం సాగిస్తోంది. – నిమ్మక మూగి, పెదరావికోన, గుమ్మలక్ష్మీపురం మండలం (గంటా పెంటయ్య, విలేకరి, గుమ్మలక్ష్మీపురం) -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..
తిరువూరు: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్‌మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్‌ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీసులో కుర్చీలు విసురుకుంటున్న కార్యకర్తలు ఎస్ఐపై కార్యకర్తల దాడి.. టీడీపీ వర్గవిబేధాల నేపథ్యంలో బుధవారం తిరువూరు పార్టీ కార్యాలయంలో ఘర్షణ పడిన కార్యకర్తలు పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు. రణరంగాన్ని తలపించే రీతిలో కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నిల వర్గీయులు దాడికి తెగపడి కుర్చీలు విసురుకున్నారు. పరిస్థితి అదుపు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టినప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో నాని, చిన్నీల అనుచరులు బీభత్సం సృష్టించారు. చేతికందిన వస్తువుల్ని విసురుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేసే యత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గాయపడిన ఎస్ఐ సతీష్ తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సంఘటనతో భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దాడులకు పాల్పడవద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని పదే పదే కోరినా ఫలితం లేకపోవడంతో లాఠీఛార్జీ చేసి అల్లరిమూకలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు కుర్చీలు విసిరారు. ఈ దాడిలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు బలమైన గాయమైంది. ఎట్టకేలకు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎస్ఐ సతీష్‌ను ఆసుపత్రికి తరలించారు. కవ్వింపు చర్యలకు పాల్పడిన ఇరువర్గాలు.. పార్టీ కార్యాలయంలో పరిస్థితి చేయి దాటుతున్నప్పటికీ ఎంపీ నాని, చిన్ని ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మీడియాతో మాట్లాడేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు సైతం అదుపు చేయలేకపోయారు. తోపులాటలో ఒక మహిళా కార్యకర్తకు సైతం గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటన గురించి ఏమాత్రం సమీక్షించకుండానే గద్దె రామ్మోహన్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు తదితరులు వెళ్ళిపోయారు. దళితుడిని కాబట్టి షటప్, గెటవుట్ అంటారా.. ‘నేనొక దళిత నాయకుడిని. నన్ను షటప్, గెటవుట్ అంటారా. నాలుగు గోడల మధ్య మీరు అంటే సరిపోయిందా. బయటకు వచ్చి అందరి ముందు ఇవే మాటలు అనండ’ని తిరువూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఎస్.దేవదత్తు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేశినేని నాని, ఆయన వర్గీయులు తాను ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయానికి వచ్చి పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని తన వర్గీయులతో కలిసి పక్కనే ఉండగా దేవదత్తు మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన మాటల్లోనే.. ‘దళితుడినైన నేను ఉన్నత విద్యను అభ్యసించి, 15 సంవత్సరాలు వివిధ దేశాల్లో పనిచేసి జ్ఞానం పొందా. నేనేదో సమావేశంలో మాట్లాడబోతుంటే నా ఆఫీసుకే వచ్చి నన్ను షటప్, గెటవుట్ అని కేశినేని నాని అంటారా.. నా ఆఫీసులో నాకు మాట్లాడే హక్కు లేదా? రెండు సార్లు గెలిచిన మీకే హక్కు ఉందా? మీరేనా నియోజకవర్గ నాయకులు. మేము కాదా. మాకు అవకాశం లేదా. మాకు చెప్పుకునే అర్హత లేదా. ఇంకా ఎంతకాలం మీరు దళితులపై ఇలా హీనంగా మాట్లాడతారు. ఏడు నియోజకవర్గాలను గెలిపిస్తామంటున్నారు. ఎక్కడ గెలిపించారు. మీరు మాత్రమే గెలిచారు. తక్కినవి ఓడిపోయారు’. దాడి సంఘటనపై కేసు నమోదు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరువూరు ఎస్ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. తిరువూరు పోలీసుస్టేషన్లో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఇరువర్గాలు దాడికి పాల్పడుతుండగా అదుపు చేయడానికి యత్నించిన ఎస్ఐ సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఎస్ఐపై దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. నిందితులను అరెస్టు చేస్తాం.. తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎస్ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేశాం. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. శాంతిభద్రతలు కాపాడటానికి యత్నించిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేయడం శోచనీయం. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. – కాంతి రాణా టాటా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ -
గంటలో హామీ అమలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పర్యటన సందర్భంగా బుధవారం తనను కలిసిన పలువురు అనారోగ్య బాధితుల పరిస్థితి చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి జగన్ తక్షణ సాయం అందించాలని కలెక్టర్ కృతికా శుక్లాను ఆదేశించారు. సీఎం కార్యక్రమం ముగించుకుని వెళ్లిన గంటలోపే తొమ్మిది మందికి రూ.13 లక్షల ఆర్థిక సాయాన్ని కలెక్టరేట్లో చెక్కు రూపంలో అందజేశారు. వీరిలో 8 మందికి రూ.లక్ష చొప్పున ఇవ్వగా ఒక బాధితుడికి రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.13 లక్షల విలువైన చెక్కులను కలెక్టర్ అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన గంటలోపే సాయం అందడంపై బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. సాయివెంకట్కిరణ్ తల్లికి రూ.లక్ష, కోట సత్యసాయి జన్విర్కు రూ.లక్ష, జి.సుష్మశ్రీ తండ్రికి రూ.లక్ష, పత్తికాయల డేవిడ్ రోషన్‌కు రూ.లక్ష, దూడ రవికుమార్‌కు రూ.లక్ష, గనిశెట్టి రూపాలక్ష్మికి రూ.లక్ష, మర్రిరపూడి విశ్వేశ్వరరావుకు రూ.5 లక్షలు, పటేల కుష్మిత కుమారికి రూ.లక్ష, గనిశెట్టి కనక మహాలక్ష్మికి రూ.లక్ష చొప్పున చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా ► కాకినాడ భానుగుడి తిరుమలశెట్టి వీధికి చెందిన కృష్ణారావు కుమారుడు 41 ఏళ్ల మర్రిపూడి విశ్వేశ్వరరావుకు రూ.5 లక్షలు. ► కాకినాడ రూరల్ మండలం సర్పవరానికి చెందిన శ్రీనివాస్ కుమారుడు ఏడేళ్ల జి.జయసాయి వెంకట కిరణ్ కిడ్నీ చికిత్సకు రూ.లక్ష. ► కరప మండలం వేములవాడకు చెందిన నాగార్జున కుమారుడు కోట సత్య వెంకట సాయి జశి్వక్ వైద్యానికి రూ.లక్ష. ► పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలిక జి.సుష్మశ్రీ వైద్యానికి రూ.లక్ష. ► కాకినాడ గాం«దీనగర్‌కు చెందిన పి.శ్రీనివాస్ కుమారుడు 17 ఏళ్ల పత్తికాయల డేవిడ్ రోషన్ వైద్యం నిమిత్తం రూ.లక్ష. ► యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటకు చెందిన చిట్టిబాబు కుమారుడు 17 ఏళ్ల దూడ రవికుమార్ వైద్యానికి రూ.లక్ష. ► పిఠాపురం మండలం కోలంకకు చెందిన రెండేళ్ల బాలిక గనిశెట్టి రూపాలక్ష్మి వైద్య సహాయానికి రూ.లక్ష. ► కాకినాడ పల్లంరాజు నగర్‌కు చెందిన కులదీప్‌కుమార్ కుమార్తె మూడేళ్ల పటేలా కుష్మిత కుమారికి రూ.లక్ష. ► కరపకు చెందిన 11 సంవత్సరాల బాలిక గనిశెట్టి కనకమహాలక్ష్మి కి రూ.లక్ష. -
ప్రభుత్వ బడికి సరికొత్త శోభ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ రెండో దశ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రెండో దశలో భాగంగా 22,217 పాఠశాలల్లో పనులు చేపట్టిన ప్రభుత్వం.. ఇప్పటికే 2,755 స్కూళ్లలో నూరు శాతం పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చింది. అన్ని పాఠశాలల్లో కొత్త భవనాలతో పాటు తాగునీటి నుంచి ఆట వస్తువుల వరకు నిర్దేశిత 12 వసతులను కల్పిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలోని 44,512 ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం సదుపాయాలు కల్పించి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా నాడు–నేడు మొదటి దశ కింద ఇప్పటికే దాదాపు రూ.3,700 కోట్లతో 15,715 ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. మొదటి దశలో లేని 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇందులో ఇప్పటివరకు 2,755 స్కూళ్లలో పనులు నూరు శాతం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. అలాగే మరో 6,340 స్కూళ్లల్లో టాయిలెట్లు, 4,707 స్కూళ్లల్లో కిచెన్ షెడ్ల నిర్మాణం, మరో 11,840 స్కూళ్లల్లో మేజర్, మైనర్ రిపేర్లను పూర్తి చేసింది. 394 పాఠశాలల్లో పెయింటింగ్, తాగునీటి సదుపాయాలు తప్ప ఇతర అన్ని పనులూ పూర్తయ్యాయి. రెండో దశలో చేపట్టిన పనులకు ఇప్పటికే రూ.3,535.44 కోట్ల బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి. సమున్నతంగా నిలిపేందుకు.. వైఎస్ జగన్ ప్రభుత్వం మొదటి నుంచీ విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలను సమున్నతంగా నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్లతో సహా అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్లలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలతో సహా మొత్తం 44,512 స్కూళ్లను నాడు–నేడు పథకం కిందకు తీసుకువచ్చారు. పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను క్రమపద్ధతిలో, దశలవారీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో నిరంతర నీటి సరఫరాతో పాటు టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి డబుల్ డెస్క్ ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, అదనపు తరగతి గదులు, వంటషెడ్లు, ప్రహరీ వంటి మొత్తం 12 సదుపాయాలను కల్పిస్తున్నారు. -
Fact Check: మీ అబద్ధాలకే లేదు హద్దు
విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండడమే కాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, రైతుల అభ్యున్నతికి పాటుపడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాల్లో స్పష్టమైన మార్పునకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు). దేశానికే ఇవి ఆదర్శంగా నిలుస్తూ రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి.. ఎలాగైనా రైతులకు వీటి సేవలను దూరం చేయాలన్న దుర్మార్గపు పన్నాగంతో నిత్యం వీటిపై బురద జల్లడమే పనిగా ఈనాడు రామోజీరావు పెట్టుకున్నారు. ఏ పల్లెకు వెళ్లినా సకల సౌకర్యాలతో ఆర్బీకేలు స్వాగతం పలుకుతుండడాన్ని.. రైతులు వీటి సేవలను కొనియాడుతుండడాన్ని చూసి రామోజీకి అస్సలు నిద్ర పట్టడంలేదు. ఇలాగైతే తన ఆత్మబంధువు చంద్రబాబుకు అధికారం దక్కడం అసాధ్యం అని భావించే నిత్యం ఏదో ఒక అంశంపై విషం చిమ్ముతున్నారు. అందులో భాగమే తాజాగా ‘ప్రచారానికి లేదు హద్దు.. వసతులు అడగొద్దు’.. అంటూ ఆర్బీకేలపై తన అక్కసును చాటుకుని తన అబద్ధాలకు ఎలాంటి హద్దులేదని అక్షరం అక్షరంలో చెప్పుకున్నారు. ఈ కథనంలో వాస్తవాలేమిటంటే.. –సాక్షి, అమరావతి ఆరోపణ : రైతులను గాలికొదిలేశారు.. వాస్తవం : గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన 10,778 ఆర్బీకేల ద్వారా 14,323 మంది సిబ్బందితో పాటు 1,573 బహుళార్ధ వ్యవసాయ విస్తరణ అధికారులు సేవలందిస్తున్నారు. వీటికి గ్రామ వలంటీర్‌తో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు. గతంలో ఏది కావాలన్నా మండల కేంద్రాలకు పరుగులు తీసేవారు. పగలనకా, రేయనకా నిద్రహారాలు మాని రోజుల తరబడి పడిగాపులు పడేవారు. కానీ, ప్రస్తుతం చూద్దామన్నా ఎక్కడా క్యూలైన్ అనేది కన్పించడంలేదు. వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీరైతుకు అవసరమైన మేరకు సర్టిఫైడ్ చేసిన సాగు ఉత్పాదకాల పంపిణీతో పాటు ఈ–క్రాప్ బుకింగ్, సంక్షేమ పథకాల అమలుతో పాటు ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పరిశోధనా ఫలాలను నేరుగా రైతు క్షేత్రాలకు చేరవేస్తూ రైతుల్లో సామర్థ్యం పెంపుదలకు శిక్షణనిస్తున్నారు. ఆరోపణ : ఆర్బీకేల్లో సౌకర్యాలేవి? వాస్తవం : 526 గ్రామాల్లో ఆర్బీకేలకు సొంత భవనాలుండగా, మిగిలిన 10,252 గ్రామాల్లో ఆర్బీకేలకు రూ.2,260 కోట్ల అంచనాతో కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. తొలుత ఒక్కో భవన నిర్మాణానికి రూ.21.80 లక్షలు అంచనా వేయగా, అదనపు సదుపాయాల కోసం దీనిని రూ.23.94 లక్షలకు పెంచింది. ప్లాన్ ప్రకారం ప్రతీ ఆర్బీకే భవనం వద్ద మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. టాయిలెట్స్ నిర్మాణ పనులు జాప్యం జరిగిన చోట, సిబ్బందికి ఇబ్బందిలేకుండా ఉండేందుకు సచివాలయం, హెల్త్ క్లినిక్, ఆర్బీకే భవనాల సముదాయంలో నిర్మించిన టాయిలెట్‌ను ఆర్బీకే సిబ్బంది వినియోగించేలా ఏర్పాటుచేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 4,239 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. మరో 4,935 భవనాలు వివిధ దశల్లో ఉండగా, భూ వివాదాలు, స్థలాల కొరత, కోర్టు కేసులు వంటి వివిధ కారణాలతో 1,078 భవనాల నిర్మాణం ప్రారంభించలేదు. ఇప్పటివరకు భవనాల నిర్మాణం కోసం రూ.1,014.82 కోట్లు ఖర్చుచేయగా, మౌలిక వసతుల కల్పన కోసం మరో రూ.357 కోట్లు ఖర్చుచేశారు. సాగు ఉత్పాదకాల బుకింగ్‌తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 9,484 ఆర్బీకేల్లో కియోస్క్‌లను.. వీటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటుచేశారు. ఆరోపణ : ఎరువుల లారీ వస్తే సిబ్బందికి ఇబ్బందే.. వాస్తవం : ఆర్బీకేలకు ఎరువుల సరఫరాను పగటిపూట మాత్రమే చేస్తున్నారు. ఏదైనా ప్రత్యేక పరిస్థితులలో లారీల రవాణా ఆలస్యమైతే మరుసటి రోజు ఉదయం అన్లోడ్ అయ్యేలా ఏర్పాట్లుచేసుకోవాలని లారీ డ్రైవర్లకు మార్క్‌ఫెడ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇక ఆర్బీకేల ద్వారా ఎరువు అమ్మకాలను ప్రోత్సహించేందుకు 2020–21లో మాత్రమే నగదు ప్రోత్సహకాలు ప్రకటించారు. ఆ మేరకు మార్క్‌ఫెడ్ ద్వారా చెల్లింపులు చేసేందుకు మార్కెఫెడ్ చర్యలు తీసుకుంది. 2023–24లో జిల్లాకు 8 వేల నుండి 10 వేల వరకు భూసార పరీక్షల నిమిత్తం 26 జిల్లాలకు మట్టి నమూనాల సేకరణ కోసం రూ.54.50 లక్షలు విడుదల చేశారు. ఆరోపణ : నిర్వహణకు నిధులే లేవు? వాస్తవం : 3,830 ఆర్బీకేల అద్దె చెల్లింపు కోసం రూ.43 కోట్లు ఖర్చుచేయగా, 2023–24 ఆర్ధిక సంవత్సరం చివరి వరకు అద్దెల నిమిత్తం మరో రూ.32.98 కోట్లు విడుదల చేశారు. ఇప్పటికే రూ.22.98 కోట్లు నేరుగా భవన యజమానుల ఖాతాలకు జమచేశారు. మిగిలిన రూ.10 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. అలాగే, ఈ ఏడాది మార్చి వరకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా.. 2023–24 ఆర్థిక సంవత్సరం నుండి విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవసరమయ్యే బడ్జెట్‌ను నేరుగా విద్యుత్ శాఖకే కేటాయించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. స్టేషనరీ కోసం ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేశారు. అలాగే, ఇందుకోసం ఖర్చుచేసిన ఆర్బీకే సిబ్బందికి నేరుగా రూ.53.48 లక్షలు విడుదల చేశారు. స్థానికంగా హైస్పీడ్ నెట్వర్క్ ఏది అందుబాటులో ఉంటే ఆ ఇంటర్నెట్ సదుపాయాన్ని ఆర్బీకేల్లో సమకూర్చారు. ఇందుకోసం ఇప్పటికే రూ.23 కోట్లు విడుదల చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, రైతుసేవలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సొంత మొబైల్ డాటాని ఉపయోగించిన సిబ్బందిపై పైసా కూడా భారం పడకుండా ఏర్పాటుచేశారు. ఆరోపణ : రైతుభరోసా పత్రికల పేరిట అదనపు బాదుడు.. వాస్తవం : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు రైతులకు చేరవేసే సంకల్పంతో తీసుకొచ్చిన వైఎస్సార్ రైతుభరోసా మాస పత్రిక అనతి కాలంలోనే రైతుల ఆదరణ పొందింది. 14,300 ప్రతులను వ్యవసాయ శాఖ సొంత నిధులతో ముద్రించి ఆర్బీకేలకు సరఫరా చేస్తోంది. రూ.300 చొప్పున వార్షిక చందా చెల్లించగలిగే రైతులకు నేరుగా వారి ఇంటికి పంపిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించి ఔత్సాహిక రైతులు చందాదారులుగా చేరే కార్యక్రమం చేపట్టారు. ఈ విషయంలో ఎవరిపైనా ఎలాంటి ఒత్తిడి లేదు. ఆర్బీకేల ద్వారా అందించిన సేవలిలా.. అదును దాటక ముందే.. కాదు కాదు.. సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన సాగు ఉత్పాదకాలను బుక్ చేసుకున్న 24 గంటల్లోపే రైతుల ముంగిట్లో వాటిని అందిస్తున్నారు. ♦ ఇలా ఇప్పటివరకు ఆర్బీకేల ద్వారా 34.09 లక్షల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలను రూ.1,027.66 కోట్ల రాయితీతో 58 లక్షల మంది రైతులకు, నాన్ సబ్సిడీ కేటగిరీ కింద రూ.13 కోట్ల విలువైన 1,661 క్వింటాళ్ల పత్తి, మిరప, వరి, మొక్కజొన్న, సజ్జ, సోయాబీన్ తదితర సర్టిఫైడ్ విత్తనాలను 30వేల మంది రైతులకు సరఫరా చేశారు. ♦ఆర్బీకేల ద్వారా ఈ మూడున్నరేళ్లలో రూ.1,312 కోట్ల విలువైన 11.88 లక్షల టన్నుల ఎరువులను 31.54 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. అలాగే, 1.51 లక్షల మంది రైతులకు రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేశారు. ♦ వీటితో పాటు.. ఆక్వా రైతులకు సర్టిఫై చేసిన ఫీడ్, సీడ్, పాడి రైతులకు సంపూర్ణ మిశ్రమ దాణా, పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. టమరోవైపు.. ఆర్బీకేల ద్వారా వైఎస్సార్ రైతుభరోసా కింద 53.53 లక్షల మంది రైతులకు రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 పంటల బీమా పరిహారం, 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల పెట్టుబడి రాయితీ (పంట నష్టపరిహారం), 73.88 లక్షల మంది రైతులకు రూ.1,442.66 కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించగా.. ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటుచేసిన 10,936 వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల కోసం రూ.366.25 కోట్ల సబ్సిడీని అందించారు. .. ఇలా నిర్విరామంగా రైతుల సేవలో నిమగ్నమైన ఆర్బీకేలకు అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు వరించాయి. అలాగే, సకల సౌకర్యాలతో అన్ని విధాలుగా రైతులకు భరోసా కల్పిస్తున్న వీటిపై ఈనాడు అదే పనిగా నిత్యం విషం కక్కడం వెనుక ఉన్న లక్ష్యాలు అందరికీ తెలిసిందే. -
రామాయపట్నం 'రెడీ'
ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర దశ, దిశలను మార్చవచ్చని సీఎం వైఎస్ జగన్ నిరూపించారు. సముద్ర తీరం ఉండాలే కానీ సంపద సృష్టించడం కష్టం కాదనే దిశగా అడుగులు ముందుకు వేశారు. కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో లాజిస్టిక్స్, ఎగుమతులు, దిగుమతుల ద్వారా అద్భుతాలు సృష్టించడానికి మార్గం సుగమం చేస్తున్నారు. ఒక్కో పోర్టు, ఒక్కో ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రావడం ద్వారా తీర ప్రాంత అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం. మన రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ, దానిని సరైన రీతిలో ఉపయోగించుకోవచ్చన్న ఆలోచనే చంద్రబాబు ప్రభుత్వానికి రాలేదు. సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.20,000 కోట్లతో కోస్తా తీరాన్ని అభివృద్ధి చేస్తోంది. ఒకేసారి నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులతో పాటు 10 మినీ పోర్టుల తరహాలో ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించనుంది. రాష్ట్రంలోని 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా ఏపీ మారిటైమ్ బోర్డు అడుగులు ముందుకు వేస్తోంది. ప్రస్తుతం విశాఖలో మేజర్ పోర్టుతో పాటు మరో ఐదు నాన్ మేజర్ పోర్టులు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్‌వాటర్, కాకినాడ యాంకరేజ్, రవ్వ కాపిటివ్పోర్టులున్నాయి. ఇవి కాకుండా ఇంకో నాలుగు పోర్టులను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను రాష్ట్ర ల్యాండ్ లార్డ్ మోడల్లో అభివృద్ధి చేస్తుండగా, కాకినాడ గేట్‌వే పోర్టును పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. రూ.91.18 కోట్లతో చేపట్టిన కాకినాడ యాంకరేజ్ పోర్టు ఆధునికీకరణ పనులు పూర్తి కానుండటంతో పోర్టు సామర్థ్యం పెరగనుంది. రామాయపట్నంలో బల్క్ బెర్త్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఈనెలాఖరు లేదా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు మారిటైమ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2025 నాటికి రాష్ట్రంలో మొత్తం పది పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతం 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులు 300 మిలియన్ టన్నులకు చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లక్షలాది మందికి ఉపాధి లభించడంతో పాటు వ్యాట్, జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. త్వరలోనే తొలి నౌక ఆగమనం మొదలు పెట్టిన 18 నెలల్లోనే రామాయపట్నం పోర్టు వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యిందంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో అభివృద్ధి చేస్తున్న రామాయపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022 జూన్‌లో భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. తొలి దశలో 34.04 ఎంఎంటీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్) సామర్థ్యంతో నాలుగు బెర్తులు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీ పర్పస్) అభివృద్ధి చేయనుండగా, అందులో ఇప్పటికే బల్క్ బెర్త్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ బిల్డింగ్‌ల నిర్మాణ పనులు కూడా పూర్తి కావడంతో త్వరలో తొలి నౌకను తీసుకొచ్చి లంగరు వేయడం ద్వారా వాణిజ్య పరంగా పోర్టును ప్రారంభించడానికి ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేసింది. వచ్చే ఆరు నెలల్లో మిగిలిన మూడు బెర్తులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. 23 ఎకరాల్లో పునరావాస గ్రామ నిర్మాణం రామాయపట్నం పోర్టుకు సమీపంలోని తెంటు గ్రామం వద్ద 23 ఎకరాల్లో పునరావాస గ్రామాన్ని అభివృద్ధి చేసింది. పోర్టు కోసం భూమిని ఇచ్చిన ప్రతి కుటుంబానికి 5 సెంట్ల భూమి చొప్పున 675 మందికి పునరావాసం కల్పించారు. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం సుమారు రూ.160 కోట్లు వ్యయం చేసింది. ఈ గ్రామంలో రహదారులు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలను కల్పించారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, పాఠశాల, వైద్యశాల, కమ్యూనిటీ భవనాలు వంటి అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పించింది. పునరావాస గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.20 కోట్ల వరకు వ్యయం చేసింది. ఇప్పటి వరకు పనులు ఇలా.. ♦ పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్ నిర్మాణం కోసం ఏకంగా ఇప్పటి వరకు 59 లక్షల టన్నుల రాళ్ల వినియోగం. ♦ భారీ ఓడలను సురక్షితంగాతీరానికి తీసుకు వచ్చేలా 7.87 మిలియన్ క్యూబిక్ మీటర్లడ్రెడ్జింగ్, టర్నింగ్ సర్కిల్స్, అప్రోచ్ చానల్ నిర్మాణం. ♦ అప్రోచ్ టెస్టిల్, బల్క్ బెర్త్, కస్టమ్స్ బిల్డింగ్, సెక్యూరిటీ కమ్ రిసెప్షన్ బిల్డింగ్ నిర్మాణం పూర్తి. ♦ శరవేగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు.. పోర్టును జాతీయ రహదారి ఎన్‌హెచ్ 16కు అనుసంధానం చేస్తూ రహదారి పనులు వేగవంతం. ♦ సముద్రంలో చేయాల్సిన పనులు దాదాపు పూర్తి. తీరంలో నిర్మించే భవనాలు, ఇతర నిర్మాణాలు 45 శాతం వరకు పూర్తి. స్వరూపం ఇదీ.. ప్రాజెక్టు వ్యయం : రూ.4,902 కోట్లు తొలి దశలో పోర్టు సామర్థ్యం: 34.04ఎంఎంటీపీఏ పూర్తి స్థాయి సామర్థ్యం: 138.54 ఎంఎంటీపీఏ తొలి దశలో బెర్తులు: 4 (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీ పర్పస్) తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం : 80,000 డీడబ్ల్యూటీ (డెడ్ వెయిట్ టన్నేజ్) పనులు ప్రారంభించినది : 2022 జూన్ 24 కార్యకలాపాలు ప్రారంభం : 2024 జనవరి ప్రారంభించేందుకు చర్యలు సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా హార్బర్ ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే రామాయపట్నం పోర్టులో ఒక బెర్తు పనులు పూర్తి కావడంతో త్వరలో వాణిజ్య పరంగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో ఏపీమారిటైమ్ బోర్డు, వీసీఎండీ ఏపీఐఐసీ రికార్డు సమయంలో .. నిర్మాణ పనులు ప్రారంభమైన 18 నెలల రికార్డు సమయంలోనే రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. బల్క్ బెర్త్ నిర్మాణం, డ్రెడ్జింగ్, బ్రేక్‌వాటర్ పనులు పూర్తి కావడంతో ఓడలను తీసుకురావడానికి అనుమతి కోసం కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్ శాఖకు లేఖ రాశాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే రామాయపట్నం పోర్టులో వాణిజ్య కార్యక్రమాలను ప్రారంభింస్తాం. – పి. ప్రతాప్, ఎండీ రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మా ప్రాంతం మారుతోంది.. దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న రామాయపట్నం పోర్టు నిర్మాణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో వేగంగా సాగుతోంది. ఎన్నో సంవత్సరాలుగా కలగా ఉన్న పోర్టు నిర్మాణం మా కళ్ల ముందటే పూర్తవుతుంటే సంతోషంగా ఉంది. పోర్టు నిర్మాణంతో మా ప్రాంతం వేగంగా అభివృద్ధి అవుతుంది. ఇప్పటికే భూముల వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పోర్టు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాం. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. – రాయిని రామకృష్ణ, చేవూరు గ్రామం సొంత ఊళ్లోనే ఉద్యోగం మా ప్రాంతంలో పోర్టు నిర్మాణం వల్ల యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. నేను ఉళ్లోనే ఉండి ప్రస్తుతం రామాయపట్నం పోర్టులో సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తున్నా. నాలాంటి వందల మంది యువకులు స్థానికంగానే ఉద్యోగం చేస్తున్నారు. దీని వల్ల ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు పోయే ఇబ్బందులు తప్పాయి. అనుకున్న సమయం కంటే పోర్టు నిర్మాణం వేగంగా జరుగుతోంది. పోర్టులో కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు స్థానికంగానే దొరుకుతాయి. – అట్ల సురేష్, రావూరు గ్రామం -
రైల్వేకోడూరులో సాధికార హోరు
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో బడుగు, బలహీన వర్గాల సాధికారత హోరెత్తింది. బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను అభివృద్ధి దిశగా నడిపిస్తున్న తీరును వివరిస్తూ ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. వారికి ప్రతి వీధిలో స్థానిక ప్రజలు హారతులతో స్వాగతం పలికారు. రాజ్ రెసిడెన్సీ నుంచి టోల్గేట్ వరకు కిక్కిరిసిన జనం మధ్య సాగిన ఈ యాత్రలో మహిళలు కదం తొక్కారు. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా యాత్రలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభ వేలాది ప్రజలతో జనసంద్రాన్ని తలపించింది. ఈ సభలో పలువురు నేతలు ప్రసంగిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న పథకాలు, ఈ వర్గాలు సమాజంలో తలెత్తుకొనేలా వారికి అందిస్తున్న చేయూతను వివరించారు. సభ ఆద్యంతం ప్రజలు జై జగన్, జగనే మళ్లీ కావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. పేదవాడి అకౌంటులో సంక్షేమం : ఎంపీ నందిగం సురేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమం ఎప్పటికీ మరు వలేనిదని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. అవినీతి లేని పరిపాలనను అందిస్తున్న సీఎం జగన్ ప్రతి పేదవాడికి అకౌంటులో ఠంచనుగా పథకాల నగదు జమ చేస్తున్నారన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలేనని, చివరకు కుర్చీ, సైకిల్ పార్టీ గుర్తు కూడా ఆయనవి కావని అన్నారు. 14 ఏళ్ల బాబు హయాంలో వచ్చింది వెన్నుపోటు పథకం మాత్రమేనని, ప్రజల సంక్షేమానికి సంబంధించిన పథకాలేవీ లేవని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ప్రజలకు సంక్షేమం అందుతోందని చెప్పారు. సీఎం జగన్ అందిస్తున్న పథకాలు, చేయూతతో బడుగు, బలహీన వర్గాల జీవన విధానం ఎంతో మెరుగు పడిందని, ఇప్పుడు వారు సమాజంలో తలెత్తుకొని ధీమాతో జీవిస్తున్నారని వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పూర్తి స్థాయిలో రాజకీయ హక్కులతోపాటు ఉన్నత పదవులు ఇచ్చారని అన్నారు. టీడీపీ నాయకులు డబ్బుతో ఓటు కొనాలని చూస్తున్నారని, బాబును నమ్ముకుని ఓటు వేస్తే ఒక్క దినం గడవదని తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమం అందించిన సీఎం జగన్‌కు ఓటు వేస్తే ఒక తరం గడుస్తుందన్నారు. 175 సీట్లు గెలిపిద్దాం : అలీ సీఎం వైఎస్ జగన్ సామాజిక సాధికారతను చేతల్లో చేసి చూపించారని ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ చెప్పారు. 2019లో సీఎం జగన్‌కు 151 సీట్లిచ్చామని, ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో 175 సీట్లను సీఎం జగన్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. బడుగులకు న్యాయం : ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని చేతల్లో చేసి చూపించారని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఈ వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, ఆయన ఒరగబెట్టిందేమీ లేదని చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బీసీలకు ఎమ్మెల్యేలు, మంత్రి పదవులిచ్చారని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా అధికారాన్ని అప్పజెప్పారని తెలిపారు. రైల్వే కోడూరును అభివృద్ధి చేస్తున్న సీఎం జగన్ : ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైల్వేకోడూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.1,600 కోట్లు వెచ్చించామన్నారు. రూ. 11 కోట్లతో రైల్వేకోడూరు అండర్ బ్రిడ్జి, 50 కోట్లతో కోడూరు – చిట్వేలి డబుల్‌రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. పెనగ లూరు చిట్వేలి మండలాలకు 235 కోట్లతో సాగు, తాగు నీరందిస్తున్నామని, రూ.150 కోట్లతో ఎన్నో భవనాలు, సీసీరోడ్లు, వాటర్ ట్యాంకులు, రూ. 50 కోట్లతో గుంజన నది ప్రొటెక్షన్‌వాల్ నిర్మించడానికి కృషిచేశామన్నారు. రాబోయే కాలంలో 10 వేల ఉద్యోగాలతో జాబ్‌మేళా నిర్వహించి నిరుద్యోగుల, యువకుల రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్లు రామసుబ్బారెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ టు సింగపూర్
విశాఖ సిటీ: ప్రపంచ పర్యాటక పటంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు లభించేలా అంతర్జాతీయ క్రూయిజ్ పర్యాటకం మార్చిలో ప్రారంభమవుతుందని విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు వెల్లడించారు. విశాఖ పోర్టు ఆవిర్భవించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోర్టు అతిథి గృహంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పోర్టు ప్రగతిని వివరించారు. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం ద్వారా విశాఖ ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరుకుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చెన్నై నుంచి విశాఖ మీదుగా సింగపూర్‌కు క్రూయిజ్ నడిపేందుకు లిట్టోరల్ క్రూయిల్ లిమిటెడ్ సంస్థలో ఎంవోయు కుదుర్చుకున్నట్లు తెలిపారు. సుమారు రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారత్, శ్రీలంక, మాల్దీవులకు క్రూయిజ్ సర్విసులు నిర్వహించేందుకు లిట్టోరల్ సంస్థ ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ నుంచి థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్‌లకు కూడా క్రూయిజ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. 80 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా లక్ష్యం పోర్టు గత ఆర్థిక సంవత్సరంలో 74 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ 31వ తేదీ నాటికి 60 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా..వచ్చే మార్చి నాటికి పోర్టు చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో 80 మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. కేవలం ఆదాయార్జనపైనే కాకుండా..జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ.. ఆధునికీకరణ, యాంత్రీకరణ దిశగా అడుగులు వేస్తూ.. నాణ్యతపై దృష్టి పెట్టినట్లు వివరించారు. కార్బన్ రహిత పోర్టుగా.. విశాఖ పోర్టును కార్బన్ రహితంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. దేశంలోనే కేవలం సోలార్ పవర్లో నిర్వహిస్తున్న ఏకైక పోర్టుగా గుర్తింపు పొందిందన్నారు. ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్‌ప్లాంట్‌తో విద్యుత్ అవసరాలలో స్వయం సంమృద్ధిని సాధించగా..మరో 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భారీ స్థాయిలో 5.65 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రైలు, రోడ్డు మార్గాల అభివృద్ధి ♦ శీఘ్ర సరకు రవాణా కోసం రైలు, రోడ్డు మార్గాల అభివృద్ధిపై దృష్టి ♦ ప్రస్తుతం విశాఖ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా 43 శాతం, ♦ రైలు ద్వారా 26 శాతం, పైప్‌లైన్ ద్వారా 21 శాతం, ♦ కన్వేయర్ల ద్వారా 10 శాతం సరకు రవాణా ♦ రైలు ద్వారా 60 శాతం రవాణా చేయాలన్న లక్ష్యంతో విద్యుత్‌లైన్లతో రైలు మార్గం అభివృద్ధి ♦ ఆటంకం లేకుండా పోర్టు నుంచి రోడ్డు మార్గాల ద్వారా సరకు రవాణాకు రూ.501.65 కోట్లతో ప్రత్యేక రోడ్డు అభివృద్ధి ♦ కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ప్రస్తుతమున్న నాలుగు లైన్ల రోడ్డును 10 లైన్లకు విస్తరణ ♦ 20 శాతం సరకు రవాణాకు కోస్టల్ షిప్పింగ్‌కు చర్యలు 2030 నాటికి పూర్తి ల్యాండ్ లార్డ్ పోర్టుగా... ♦ వచ్చే ఐదేళ్లలో పీపీపీ టెర్మినల్స్ ద్వారానే మొత్తం సరకులో 75 శాతాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు ♦ 2030 చివరి నాటికి 100 శాతం కార్గో రవాణా పీపీపీ టెర్మినల్స్ ద్వారానే నిర్వహించాలని లక్ష్యంగా ♦ 2030 నాటికి విశాఖపట్నం పోర్టు పూర్తి ల్యాండ్ లార్జ్ పోర్టుగా మార్పు ♦ అసెట్ లైట్ మోడల్ విధానంలో పీపీపీ పద్ధతిలో మూడు ప్రాజెక్టులకు శ్రీకారం ♦ డబ్ల్యూ క్యూ 7, 8 బెర్తులు ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6 బెర్త్ యంత్రీకరణ పనులు ♦ మరో బెర్త్ ఈక్యూ 6 యంత్రీకరణ పనులను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు రంగం సిద్దం ♦ ఒకవైపు పోర్టు అభివృద్ధిపైనే కాకుండా కాలుష్య నియంత్రణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి ♦ ఇందులో భాగంగా రూ.35 కోట్లతో అల్లూరి సీతారామరాజు జంక్షన్ నుంచి మారియట్ హోటల్ వరకు రోడ్డు అభివృద్ధికి పోర్టు బోర్డు అంగీకారం. ♦ సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు -
తిరుమల నడకదారి భక్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: తిరుమల నడక దారిలో భక్తుల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ, అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎల్‌ఐఐ) అధికారులంతా కలిసి సంయుక్తంగా నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే డబ్లుŠఎల్‌ఐఐ సమర్పించిన ప్రణాళికల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టీటీడీని ఆదేశించింది. భక్తుల రక్షణ కోసం తీసుకునే దీర్ఘకాలిక చర్యలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని టీటీడీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణుల సంచారం భక్తులకు ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి వెంట ఇనుప కంచె ఏర్పాటు చేసేలా టీటీడీ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తిరుపతికి చెందిన బీజేపీ నేత గుడిపల్లి భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా అటవీశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది ఖాసిం సాహెబ్ స్పందిస్తూ నడక మార్గంలో భక్తుల రక్షణకు ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై వైల్ట్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నిపుణుల కమిటీ సమర్పించిన ప్రణాళికలను మెమో రూపంలో కోర్టు ముందుంచామన్నారు. ఆ నివేదికను పరిశీలించాలని కోరారు. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు ఎక్కెడక్కడ అండర్ పాస్‌లు నిర్మించాలి, భక్తుల కోసం ఎక్కడ ఓవర్ పాస్‌లు నిర్మించాలి, ఎక్కడెక్కడ ఫెన్సింగ్ వేయాలన్న విషయంలో డబ్లుŠఎల్‌ఐఐ నివేదికలో స్పష్టత లేదని తెలిపింది. ప్రణాళికల్లో స్పష్టత లేనప్పుడు వాటిని అమలు చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. టీటీడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ, డబ్లుŠఎల్‌ఐఐ నివేదిక అమలుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చెప్పారు. చిరుత దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి టీటీడీ తరఫున రూ.10 లక్షలు, ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు అందజేసినట్టు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, తిరుమల నడకదారిలో వన్యప్రాణుల స్వేచ్చా విహారానికి, భక్తుల రాకపోకలకు వీలుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఎక్కడెక్కడ వాటిని అమలు చేయాలన్న విషయంపై సంయుక్త సమావేశం నిర్వహించాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 14కి వాయిదా వేసింది. -
AP: ‘బొగ్గు’ భయం లేదు.!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు వల్ల రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ నిరాటంకంగా నడిచాయి. విద్యుత్ సంస్థలు సమర్థవంతంగా కరెంటు అందించాయి. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గును సమకూర్చుకుంటున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క రోజు బొగ్గు కోసమే నానా తంటాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతో పాటు, విదేశీ బొగ్గునూ దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో వారానికి సరిపడా నిల్వలు ఉంటున్నాయి. కొరత లేకుండా నిల్వలు వీటీపీఎస్‌కి రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. ప్రస్తుతం 1,24,324 మెట్రిక్ టన్నులు ఉంది. ఆర్టిపీపీకి 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా.. 60,203 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నం ప్లాంటుకు 29 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,66,606 మెట్రిక్ టన్నులు ఉంది. హిందూజాలో 19,200 మెట్రిక్ టన్నులు ఒక రోజుకి వాడుతుండగా, ఇక్కడ 1,04,891 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు మూడు రోజుల నుంచి వారం రోజులకు సరిపోతాయి. ఈ బొగ్గు వాడుతూనే, తర్వాతి రోజుల్లో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది రాకుండా నిత్యం మరింత బొగ్గును రాష్ట్రం దిగుమతి చేసుకుంటోంది. సాధారణంగా 65 నుంచి 75 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) వద్ద 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఈ మేరకు డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టిపీపీ) కోసం 8 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు ఏపీ జెన్కో టెండర్ ఖరారు చేసింది. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి ఈ బొగ్గు వస్తుంది. విదేశీ బొగ్గుతో స్వదేశీ బొగ్గును కలిపి విద్యుత్ ఉత్పత్తికి వాడాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఇప్పటికే 7.5 లక్షల విదేశీ బొగ్గు టెండర్‌ను జెన్కో ఖరారు చేసింది. ఆర్టీపీపీకి 2 లక్షల టన్నులు, వీటీపీఎస్‌కు 3 లక్షల టన్నుల చొప్పున మరో 5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం మరో టెండర్‌ను పిలిచింది. పూర్తి విదేశీ బొగ్గుతో నడిచే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)కు 7.5 లక్షల టన్నుల బొగ్గును సమకూర్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. అవసరాలకు తగ్గట్టు.. రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలన్నది ఏపీ జెన్కో లక్ష్యం. అందుకే విద్యుత్ ఉత్పత్తి పెంచుతూ వస్తోంది. సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక ఉత్పత్తి నమోదు చేస్తూ రాష్ట్ర అవసరాల్లో దాదాపు 40 శాతం విద్యుత్‌ను అందిస్తోంది. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల యూనిట్, ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్లు విద్యుత్ వాణిజ్య ఉత్పత్తి ఈ ఏడాది ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకి 78.677 మిలియన్ యూనిట్ల విద్యుత్ జెన్కో థర్మల్ యూనిట్ల నుంచి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తికి కొరత రాకుండా బొగ్గు సమకూర్చుకుంటున్నాం. – కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎండీ, ఏపీజెన్కో -
సివిల్ వ్యాజ్యాలను విచారించండి
సాక్షి, అమరావతి : భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందున, ఆస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలు వేటినీ తిరస్కరించొద్దని హైకోర్టు బుధవారం రాష్ట్రంలోని అన్నీ సివిల్ కోర్టులను ఆదేశించింది. కక్షిదారులు దాఖలు చేసే అన్ని దావాలపై విచారణ చేపట్టాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. యాజమాన్య హక్కు చట్టం నిబంధనలను ప్రభుత్వం ఇంకా రూపొందించలేదని తెలిపింది. భూ యాజమాన్య హక్కు చట్టంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని సవాలు చేస్తూ కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ), రాష్ట్ర బార్ కౌన్సిల్ తరపున కె.చిదంబరం, ముప్పాళ్ల సుబ్బారావు, జి.సుదర్శన్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు గంటా రామారావు, ఎన్.సుబ్బారావు, న్యాయవాది యలమంజులు బాలాజీ తదితరులు వాదనలు వినిపించారు. భూ యజమాన్య హక్కుల చట్టం ప్రజల హక్కులను హరించే విధంగా ఉందన్నారు. ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చిందంటూ స్థిరాస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలన్నింటినీ సివిల్ కోర్టులు తిరస్కరిస్తున్నాయని, సంబంధిత అధికారుల వద్దకే వెళ్లాలని కక్షిదారులకు చెబుతున్నాయని తెలిపారు. ఇంకా నోటిఫికేషనే ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. భూ యాజమాన్య హక్కుల చట్టం ఇంకా అమల్లోకి రాలేదని చెప్పారు. చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదని, కొంత సమయం పడుతుందని తెలిపారు. నిబంధనలను కూడా రూపొందించాల్సి ఉందన్నారు. టైటిల్ రిజిస్ట్రేషన్ (టీఆర్వో), ల్యాండ్ టైట్లింగ్ అప్పిలేట్ అధికారులను (ఎల్‌టీఏవో) కూడా నియమించాల్సి ఉందన్నారు. కాబట్టి, స్థిరాస్తి దావాలను సివిల్ కోర్టులు తిరస్కరించాల్సిన అవసరం లేదన్నారు. కక్షిదారులు సివిల్ కోర్టులకు వెళ్లకుండా ఎలాంటి నిషేధం లేదని తెలిపారు. కొత్త దావాలను తిరస్కరించవద్దని ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా సివిల్ కోర్టులను కోరుతున్నట్లు చెప్పారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, స్థిరాస్తి దావాలను తిరస్కరించవద్దని సివిల్ కోర్టులను ఆదేశించింది. -
554 గోదాముల నిర్మాణం పూర్తి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)కు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న గ్రామీణ గోదాముల (బహుళ ప్రయోజన కేంద్రాలు – ఎంపీఎఫ్‌సీలు) నిర్మాణంపై ఈనాడు కథనాన్ని మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే తీవ్రంగా ఖండించారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేంత వరకు రైతులు వాటిని నిల్వ చేసుకునేందుకు గ్రామ స్థాయిలో రూ.1,584.61 కోట్లతో 2,536 ఎంపీఎఫ్సీ గోదాములు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. 15 సెంట్ల భూమిలో 500 టన్నులు, 25 సెంట్ల భూమిలో 1,000 టన్నుల సామర్థ్యంతో ఈ గోదాములను నిర్మిస్తున్నామన్నారు. తొలివిడతలో రూ.493.15 కోట్ల అంచనా వ్యయంతో 1,167 గోదాముల నిర్మాణం చేపట్టామని, వీటిలో రూ.166.83 కోట్లతో 8 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు కడప డివిజన్లో అత్యధికంగా 271, గుంటూరు డివిజన్లో 152, విజయవాడ డివిజన్లో 93, విశాఖ డివిజన్లో 38 చొప్పున 554 గోదాముల నిర్మాణం పూర్తయిందన్నారు. జనవరి నాటికి 780 గోదాములు, మార్చి నాటికి మిగిలిన గోదాముల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. పనుల పురోగతిపై చీఫ్ ఇంజనీర్ నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన చోట్ల కలెక్టర్లకు తగిన సూచనలు చేస్తూ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలి విడతలో నిర్మిస్తున్న గోదాముల్లో రూ.7.76 కోట్లతో తేమ శాతం నిర్ధారించే పరికరాలు, కాటాలు, కంప్యూటర్లు ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చినట్లు తెలిపారు. రెండో విడతలో నిర్మించనున్న గోదాముల కోసం స్థలాల ఎంపిక వేగంగా జరుగుతోందన్నారు. వాస్తవం ఇలా ఉంటే కేవలం 350 గోడౌన్లు మాత్రమే పూర్తయినట్టుగా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. -
మందులు డోర్ డెలివరీ..
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు గ్రామానికి చెందిన వి. అప్పలకొండ రెండు వారాల కిందట ఇంటివద్ద కాలుజారి పడిపోవడంతో వెన్నెముక దెబ్బతింది. దీంతో లేచి నడవలేని పరిస్థితి. బీపీ సమస్యతో బాధపడుతున్న తను ఊరిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ వరకూ వెళ్లి మందులు తెచ్చుకోలేని పరిస్థితి. అప్పలకొండ భార్య విలేజ్ క్లినిక్ కు మందుల కోసం వెళ్లింది. భర్త బదులు భార్య మందుల కోసం రావడంతో ఏమైందని కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) అబిగైల్ ఆరా తీశారు. బాధితుడు కదల్లేని స్థితిలో ఉన్నాడని తెలుసుకుని ఇంటి వద్దకే మందులు అవసరమున్నాయని ఎంవో యాప్‌లో నమోదు చేసింది. మరుసటి రోజు నెల రోజులకు సరిపడా మందులు విలేజ్ క్లినిక్‌కు పోస్టల్లో వచ్చాయి. వాటిని సీహెచ్‌వో ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేసింది. మందులను వాడే క్రమాన్ని వివరించింది. ఈ పరిణామంతో అప్పలకొండ సంతోషం వ్యక్తం చేశాడు. ‘కదల్లేని స్థితిలో ఉన్న తనకు ఇంటి వద్దకే అవసరమైన మందులను అందించారు. ప్రయాసలను తగ్గించారు. మాలాంటి వృద్ధులు, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ పెట్టడం గతంలో ఎన్నడూ చూడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని సీహెచ్వోతో తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఇలా ఒక్క అప్పలకొండ మాత్రమే కాదు...గుండె, మూత్రపిండాలు, మెదడు సంబంధిత, క్యాన్సర్ వంటి ధీర్ఘ కాలిక జబ్బులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన బాధితుల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్) కార్యక్రమంలో వీరికి అవసరమైన మందులను వారుంటున్న ఇంటి గుమ్మం వద్దకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సచివాలయాల ద్వారా పౌర సేవలను ఇంటికే చేరువ చేసేలా..వైద్య సేవలను సైతం మరింత దగ్గర చేసింది. ఈ క్రమంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడకపోవడంతో ఆరోగ్యం క్షీణించి, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.ఈ నేపథ్యంలో మందులు సక్రమంగా వాడాలంటే సకాలంలో వారికి చేరువచేయాలని సీఎం జగన్ భావించారు. ఈ సంకల్పంతో దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు జగనన్న సురక్షలో మందుల డోర్ డెలివరీని ప్రారంభించారు. తపాల శాఖ ద్వారా మందులు సరఫరా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందుల డోర్ డెలివరీ కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ మాడ్యూల్‌ను తయారు చేసింది. ఇందులో వ్యాధిగ్రస్తుల వివరాలు, వారికి అవసరమైన మందుల జాబితా పొందుపరిచారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నిర్దేశించిన ప్రణాళిక మేరకు గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను పరిశీలించినప్పుడు వారికి అసరమైన మందులను సూచిస్తారు. వాటిని డోర్ డెలివరీ చేయాలని ఆన్లైన్లో టోకెన్ రూపంలో సిఫారసు చేస్తారు. ఈ సూచన దగ్గరలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు వెళుతుంది. ఆ వెంటనే డాక్టర్ సూచించిన మందులను పార్సిల్ చేసి, తపాల శాఖ ద్వారా విలేజ్ క్లినిక్‌లకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి సీహెచ్‌వోలు వ్యాధిగ్రస్తుల ఇళ్లకు డెలివరీ చేస్తారు. ఇంటి వద్దకే మందులు తెచ్చి ఇచ్చారు – టి. నిక్సాన్, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా పదేళ్లుగా మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకుని వాడుకునే వాడిని. ప్రభుత్వం కొత్తగా ఇంటి వద్దకే మందులు సరఫరా చేస్తున్నారంటూ స్థానిక విలేజ్ క్లినిక్ వాళ్లు మందులు తెచ్చి ఇచ్చారు. ఈ విధానం చాలా బాగుంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఊరటనిచ్చే విధానమిది. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తోంది – అబిగైల్, సీహెచ్‌వో, కొమరవోలు వైఎస్సార్ విలేజ్ క్లినిక్, అనకాపల్లి జిల్లా విలేజ్ క్లినిక్‌లో 105 రకాలు, పీహెచ్సీలో కొన్ని వందల రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకు అవసరమైన మందుల జాబితాను ఆన్లైన్లో సూచించిన వెంటనే పోస్టల్లో మాకు వాటిని పంపుతున్నారు. ఈ మందులను ఇళ్ల వద్దకు వెళ్లి అందించినప్పుడు వారు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. వారి కళ్లల్లో సంతోషం కనిపిస్తుంది. వేగంగా మందుల సరఫరా – డి. మురళీధర్ రెడ్డి, ఎండీ, ఏపీఎంస్ఐడీసీ సకాలంలో మందులు అందక, ఇతర దుకాణాల్లో కొనలేక నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యం. ఈ క్రమంలోనే మందుల డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ రోజుకారోజు వైద్యాధికారుల నుంచి ఆన్లైన్లో వచ్చిన ఇండెంట్లను పరిశీలించి మందులను పార్సిల్ రూపంలో మరుసటి రోజే పోస్ట్ చేస్తున్నాం. సీహెచ్‌వోలు మందులను అందజేసి, ధ్రువీకరణ కోసం ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. -
Andhra Pradesh: ఊరు మారింది
‘‘చంద్రబాబు హయాంలో పింఛన్ కేవలం రూ.1,000 మాత్రమే ఉండేది. గత ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే రూ.2 వేలు చేశారు. ఆ ఎన్నికలే రాకపోతే చంద్రబాబు పింఛన్ మొత్తాన్ని పెంచేవారా?’’ – కాకినాడ సభలో సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ ద్వారా అవ్వా తాతలకు రూ.3,000 చొప్పున పింఛన్‌ను మన రాష్ట్రంలో మాత్రమే అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మాట నిలబెట్టుకుంటూ పింఛన్ మొత్తాన్ని పెంచి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రతి నెలా 66.34 లక్షల మందికి టంఛన్‌గా ఇంటి వద్దే చేతిలో పెడుతున్నామన్నారు. ఇందుకోసం నెలకు రూ.2 వేల కోట్లు వరకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పెన్షన్ మొత్తాన్ని పెంచడమే కాకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూరేలా పెన్షన్ల సంఖ్యను కూడా పెంచామన్నారు. నాడూ నేడూ.. ఇదే రాష్ట్రం, అంతే బడ్జెట్, నిరుపేదలూ అదే సంఖ్యలో ఉన్నా చంద్రబాబు హయాంలో మేలు చేయాలనే ఆలోచన ఎందుకు చేయలేదు? బటన్లు ఎందుకు నొక్కలేదు? ఇవాళ మీ బిడ్డ ఇవన్నీ ఎలా చేయగలుతున్నాడు? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. అవ్వా తాతలకు పింఛన్ మొత్తాన్ని రూ.మూడు వేలకు పెంచుకుంటూ వెళతానంటూ నాడు పాదయాత్రలో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ ముఖ్యమంత్రి జగన్ బుధవారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) క్రీడా మైదానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, వలంటీర్లు, వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, సీఎం జగన్ అభిమానుల ఆధ్వర్యంలో ఈనెల 8వతేదీ వరకు ఈ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాకినాడకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. క్యాలెండర్లో కాదు.. జీవితంలో మార్పు అవ్వాతాతల పెన్షన్ రూ.3,000 వరకూ పెంచుకుంటూ పోతాం అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తు.చ. తప్పకుండా నెరవేరుస్తూ మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు. కొత్త సంవత్సరం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆదాయం, ఆనందం పెరగాలి. మరింత మెరుగైన పరిస్థితుల్లోకి వెళ్లాలి. అలాంటి గొప్ప కార్యక్రమంలో ఇవాళ పాలు పంచుకుంటున్నా. నా వలంటీర్ తమ్ముళ్లు, చెల్లెమ్మలు.. పెన్షన్ తీసుకుంటున్న వీళ్లందరి పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే పెద్ద వయసు వల్ల గానీ, విధిరాత వల్ల గానీ తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో తల్లడిల్లుతున్నారు. అటువంటి 66.34 లక్షల మంది అవ్వాతాతలకు, అభాగ్యులకు, వితంతువులకు మంచి చేస్తూ మన ప్రభుత్వం సామాజిక పెన్షన్‌ను రూ.3,000 చేసింది. ఈ రోజు మనం పెన్షన్ల కోసం ప్రతి నెలా చేస్తున్న ఖర్చు దాదాపు రూ.2 వేల కోట్లు. నెలలో ఒకటో తారీఖు మిగిలిన ప్రపంచానికి సెలవు, పండగ రోజు కావచ్చు కానీ మీ జగనన్న సైన్యం, నా వలంటీర్ తమ్ముళ్లు, చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూసే రోజు. సూర్యోదయానికి ముందే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి అవ్వకు, తాతకు మంచి మనవడిగా, మనవరాలిగా చేయూతనిస్తున్న నా వలంటీర్లకు మాత్రం అది సెలవు రోజు కాదు. వెయ్యితో సరిపుచ్చిన బాబు.. మీ బిడ్డ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు పాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ కూడా అంటే నాలుగు సంవత్సరాల పది నెలల దాకా అవ్వా తాతలకు పెన్షన్ కేవలం రూ.1,000 ఇచ్చిన రోజులను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్నికలు రావడంతో రెండు నెలల ముందు మాత్రమే పెన్షన్ రూ.2 వేలు చేశారు. ఎన్నికలు రాకపోయి ఉంటే చంద్రబాబు పెంచేవారా? ఆలోచన చేయమని ప్రతి అవ్వా తాతను కోరుతున్నా. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పెన్షన్ కింద సగటున కేవలం రూ.58 వేలు మాత్రమే ఇవ్వగా ఇవాళ మీ బిడ్డ పాలనలో నాలుగున్నరేళ్లలో ప్రతి అవ్వాతాత చేతిలో పింఛన్ల కింద రూ.1.47 లక్షలు పెట్టాం. దివ్యాంగులను కూడా పరిగణనలోకి తీసుకుంటే వారి చేతుల్లో కనీసం రూ.1.82 లక్షలు పెట్టాం. నాడు పడిగాపులు, లంచాలు గతానికి ఇప్పటికీ తేడా గమనించండి. నాడు పెన్షన్ కావాలంటే పడిగాపులు కాయాలి. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి. మీది ఏ పార్టీ? అని మొదట ప్రశ్న అడిగేవారు. చాంతాడంత క్యూలో నిలబడాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడిస్తారో తెలియదు. అడుగడుగునా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే కానీ పని జరగని దుస్థితి. నేడు అర్హతే ప్రామాణికం ఈ రోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా అర్హత ఒక్కటే ప్రామాణికంగా అడుగులు వేస్తున్నాం. ప్రతి గ్రామంలో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ మీ కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ఇవాళ ఎక్కడా వివక్ష లేదు. ఎవరూ లంచం అడిగేవాడు లేడు. కులం, మతం, ప్రాంతం, వర్గం, చివరికి ఏ పార్టీ అని కూడా ఎవరూ అడగడం లేదు. అర్హత ఉంటే చాలు. మీ కష్టం.. నా కష్టంగా భావించి ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి చెల్లెమ్మకూ తోడుగా నిలబడే కార్యక్రమం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతోంది. కారణం.. మీ జగన్ ఇవాళ ఇంగ్లిషు మీడియం అంటే మీ జగన్! మంచి చదువులంటేనే మీ జగన్! ట్యాబ్లంటే మీ జగన్! గవర్నమెంట్ బడుల్లో ఐఎఫ్‌పీలు వచ్చాయంటే దానికి కారణం మీ జగన్! గత ప్రభుత్వం కంటే పెన్షన్ 3 రెట్లు పెంచింది ఎవరంటే దానికి కారణం కూడా మీ జగనే. ఇవన్నీ కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు ఆలోచన చేయమని కోరడానికి చెప్పాల్సి వస్తోంది. మీ ఇష్టం.. ఏ గ్రామాన్నైనా తీసుకోండి ఇవాళ రాష్ట్రంలో ఇచ్ఛాపురం నుంచి కుప్పం దాకా ఏ గ్రామాన్నైనా తీసుకోండి. మీ ఇష్టం.. ప్రతి గ్రామంలోనూ మార్పు కనిపిస్తోంది. అడుగు పెడుతూనే ప్రతి గ్రామంలోనూ గతంలో లేని విధంగా మార్పు కనిపిస్తూ గ్రామ సచివాలయం గోచరిస్తుంది. అందులో 10 మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. ప్రతి గ్రామంలోనూ వలంటీర్ వ్యవస్థతోపాటు ఇంటి వద్దకే అందుతున్న రేషన్, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్ కనిపిస్తాయి. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమూ కనిపిస్తుంది. నాడు–నేడుతో గ్రామంలో మారిపోయిన స్కూళ్లు, ఆస్పత్రులతో మన కళ్ల ఎదుటే మార్పులు కనిపిస్తాయి. మెరుగులు దిద్దిన 108, 104 కనిపిస్తాయి. గతంలో 1,050 రోగాలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని ఇవాళ 3,250 ప్రొసీజర్లకు వర్తింపచేస్తూ ప్రతి పేదవాడికి అండగా నిలబడ్డాం. రైతులకు పగటి పూటే ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో అండగా నిలబడుతున్నాం. వసతి దీవెనతో అండగా ఉన్న పరిస్థితులూ కనిపిస్తున్నాయి. పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, స్కూళ్లలో ఐఎఫ్‌పీ తరగతి గదులు కనిపిస్తాయి. కేవలం 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే చోటుచేసుకున్న మార్పులు ఇవన్నీ. మీరే.. మా స్టార్ క్యాంపెయినర్లు సామాన్యులే ప్రచార సారథులు రాజకీయ పార్టీలకు ప్రచార సారథులుగా సర్వ సాధారణంగా ఉద్దండులే ఉంటారు! వైఎస్సార్ సీపీకి మాత్రం నాలుగున్నరేళ్లుగా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లు. ఏ నిర్ణయం తీసుకున్నా సామాన్యుల కోణంలోనే ఆలోచిస్తూ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగితే మీరే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని నిండు మనసుతో చెబుతున్న తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. కుట్రపూరిత పొత్తులు, కుయుక్తులను ఆయన ఎన్నడూ నమ్ముకోలేదు. మాట ఇస్తే నిలబెట్టుకోవాలనే ఆరాటం, విశ్వసనీయత చాటుకోవడమే లక్ష్యంగా వడివడిగా సాగుతున్నారు. మరి ఆ స్టార్ క్యాంపెయినర్లు ఏమంటున్నారో తెలుసుకుందామా? నా పెద్దబిడ్డ జగన్ ఉన్నాడనే ధైర్యం.. కాళ్లరిగేలా తిరిగినా గత ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వలేదు. మీరు వచ్చిన రెండో నెలలోనే పెన్షన్ తీసుకున్నా. ఒకటో తారీఖు తెల్లారేసరికి వలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నా పిల్లలకు కూడా అన్నీ అందుతున్నాయి. ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకుంటున్నా. కొడుకులు చూడకున్నా నాకు పెద్ద బిడ్డ జగన్ ఉన్నాడనే ధైర్యంతో ఉన్నా. కరోనా సమయంలో ఇంటికే బియ్యం ఇచ్చారు. మందులు పంపారు. ఆరోగ్యశ్రీలో పాతిక లక్షల వైద్యం చేస్తున్నారు. ఇంకేం కావాలి మాకు? మీరు మాట తప్పను, మడమ తిప్పను అన్నారు. అలాగే చేస్తున్నారు. ఓపిక ఉన్నంత వరకూ జగన్ బాబుకే ఓటేసి గెలిపించుకుంటా. – వరలక్ష్మి, లబ్ధిదారు, కాకినాడ నిస్సహాయ కుటుంబానికి నవరత్నాల నీడ.. కరోనా సెకండ్ వేవ్‌లో మా ఆయనకు ఆరోగ్యశ్రీలో చికిత్స అందించినా దురదృష్టవశాత్తూ చనిపోయారు. ఎలా బతకాలిరా దేవుడా అని నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో వితంతు పింఛన్ వచ్చింది. కరోనా సమయంలో మరణించిన వారికి ఇచ్చే రూ.50 వేలు కూడా అందాయి. ఆ డబ్బుతో చిన్న షాప్ పెట్టుకుని జీవిస్తున్నా. వివిధ పథకాల ద్వారా సుమారు రూ.1.70 లక్షల దాకా లబ్ధి పొందా. మా అత్తకు పింఛన్ ఇస్తున్నారు. నవరత్నాల పథకాలు మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మీరు ఆ దేవుడి రూపంలో మాకు సాయం చేస్తున్నారు. – కృష్ణవేణి, లబ్ధిదారు, కాకినాడ రూ.400 కోట్లు ఎక్కడ?.. రూ.2 వేల కోట్లు ఎక్కడ? గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ కేవలం 39 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. పెన్షన్ల కోసం నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఇవాళ 66.34 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. కేవలం పెన్షన్ల కోసం నెలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకంతో మొట్ట మొదటి రోజు నుంచే రూ.2,250కి పెన్షన్లను పెంచాడు. ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్లి ఈ రోజు రూ.3,000 వరకూ తీసుకుని పోయాం. నా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులైన నా అన్నదమ్ముల ముఖంలో చిరునవ్వులు చూడాలని కోరుకున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ రూ.1,000 పెన్షన్?.. ఎక్కడ రూ.3,000 పెన్షన్? ఎక్కడ 39 లక్షల పెన్షన్లు?.. ఎక్కడ 66.34 లక్షల పెన్షన్లు? నెలకు 400 కోట్ల రూపాయలు ఎక్కడ? నెలకు రూ.2 వేల కోట్లు ఎక్కడ? ఒక్క పెన్షన్లే కాకుండా ఏ పథకాన్ని తీసుకున్నా గత ప్రభుత్వానికి, మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించాలి. మీ బిడ్డ ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వమని గర్వంగా చెబుతున్నా. పేదల మీద ప్రేమ, వారికి తోడుగా ఉండాలనే తపనతో అడుగులు పడ్డాయి. ప్రతి అడుగులోనూ మార్పు కనిపిస్తోంది. పేదల పట్ల ప్రేమ కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మల పట్ల మంచి అన్నలా ఆప్యాయత కనిపిస్తోంది. -
భవిష్యత్‌పై బెంగ లేదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. భవిష్యత్‌పై బెంగ లేదు ఏడాది వయసులో నాకు పోలియో సోకింది. రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. నా పరిస్థితి చూసి మా అమ్మ, నాన్న చాలా ఆవేదన చెందారు. నా భవిష్యత్తుపై ఆందోళన చెందారు. మా నాన్న పదిహేనేళ్ల క్రితమే కాలం చేశారు. అమ్మ ఒక్కతే కుటుంబ పోషణ చేయడం చూడలేకపోయాను. నాలో పట్టుదల పెరిగి ఏదైనా వ్యాపారం చేసుకుని సొంతంగా ఎలాగైనా జీవించాలని నిర్ణయించుకున్నాను. నా సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా అమ్మకు అందించిన సంక్షేమ పథకాలు నాకు అండగా నిలిచాయి. వాటిని సద్వినియోగం చేసుకుని నా ప్రయాణం పూలబాట వైపు సాగించాను. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలోని ధనరాజల తులసమ్మ ఆలయం సమీపంలో పూజా సామగ్రి, పూలు అమ్ముకునేందుకు చిన్నపాటి బడ్డీ కొట్టు ఏర్పాటు చేసుకున్నాను. మా అమ్మ లక్ష్మమ్మ డ్వాక్రా సంఘ సభ్యురాలు కావడంతో బ్యాంకు లింకేజీ ద్వారా లక్ష రూపాయలు రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించాను. మా అమ్మకు వైఎస్సార్ ఆసరా కింద ఏడాదికి రూ.12 వేల వంతున వచ్చింది. ఆ మొత్తాన్ని కూడా వ్యాపారానికి పెట్టుబడిగా వాడుకుంటున్నాను. వ్యాపారం బాగుంది. నా జీవనానికి ఇప్పుడు ఎలాంటి ఢోకా లేదు. నాకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు. నాకు ప్రతి నెల అందుతున్న దివ్యాంగ పింఛన్ రూ.3 వేలు నా పిల్లల పేరున పొదుపు చేస్తున్నా. భవిష్యత్తుపై బెంగ తీరింది. – దువ్వు జగ్గారావు, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం మండలం (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్) అప్పు చేయకుండా బతుకుతున్నాం మాది కిరాణా వ్యాపారం. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో నేను, మా ఆయనా కలసి వ్యాపారం సాగిస్తున్నాం. 30 ఏళ్లుగా డ్వాక్రా సభ్యురాలిగా ఉండటంతో లక్ష రూపాయలు బ్యాంకు రుణం తీసుకుని వ్యాపారం చేస్తున్నాను. తద్వారా వచ్చిన ఆదాయంతో అతి కష్టమ్మీద రుణం తీర్చాం. మళ్లీ పెట్టుబడికి చాలా ఇబ్బంది పడ్డాం. మళ్లీ అప్పు చేయాలేమోనని సతమతం అవుతున్న సమయంలో ఈ ప్రభుత్వం వచ్చింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటి వరకూ రూ.71 వేలు అందింది. దాంతో పెట్టుబడికి ఇబ్బంది లేకుండా పోయింది. దీంతోపాటు స్త్రీ నిధి నుంచి కూడా రూ.50 వేలు సహాయం అందడంతో కుటుంబానికి ఆధారంగా ఉన్న కిరాణా షాపు నిర్వహణ మరింత సులభమైంది. ఇప్పుడు దానితోనే రొటేషన్ చేస్తూ అప్పు చేయనవసరం లేకుండా వ్యాపారం సాగుతోంది. మా ఏకైక కుమార్తెకు వివాహం అయింది. ఆమెకు కూడా డ్వాక్రా రుణమాఫీ (ఆసరా) వర్తించింది. జగనన్న సాయంతో ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాం. – గన్నమని అచ్చాయమ్మ, డ్వాక్రా మహిళ, మండపాక (కొడమంచిలి కృష్ణ, విలేకరి, తణుకు) ఉన్నత చదువు కల తీరింది మాది పేద కుటుంబం. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం రొంపిల్లి గ్రామం. నా చదువు కోసం, బతుకుదెరువు కోసం విశాఖ నగరానికి వలస వచ్చాం. మా నాన్న శ్రీనివాసరావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అమ్మ సత్యవతి గృహిణి. ఇద్దరు అక్కలకు వివాహమైంది. నేను ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ చదవాలనుకున్నాను. కానీ అంత ఆర్థిక స్తోమత మాకు లేదు. చదువు అంతటితో ఆగిపోతుందేమోనని భయపడ్డాను. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకోవచ్చని స్నేహితులు ప్రోత్సహించారు. దీంతో తగరపువలస వద్ద అనిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేరాను. ఇప్పుడు నాలుగో సంవత్సరం చదువుతున్నాను. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.85 వేలు అందిస్తోంది. వసతి దీవెన పథకం కింద కూడా సాయం అందుతోంది. దీంతో నా చదువు ప్రశాంతంగా సాగిపోతోంది. నాకు ఆరు నెలల క్రితం భరించలేని కడుపు నొప్పి (అపెండిసైటిస్) వచ్చింది. అత్యవసరంగా 24 గంటల్లో ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ కోసం డబ్బులు సమకూర్చే పనిలేకుండా ఆరోగ్యశ్రీ ఆదుకొంది. రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. ఫైనల్ పరీక్షల కోసం చదువుకుంటున్నాను. ఊళ్లో అర ఎకరం పంట పొలం ఉంది. ఏటా రైతు భరోసా కూడా వస్తోంది. – తాడ్డి మణికంఠ, ఆరిలోవ, విశాఖపట్నం (మీసాల కామేశ్వరరావు, విలేకరి, ఆరిలోవ, విశాఖపట్నం) -
అమ్మ అఖిలప్రియా.. అలా డిసైడ్ అయ్యావా?
చంద్రబాబు రాజకీయ ఎత్తులు.. జిత్తుల సంగతి పూర్తిగా అవగతం చేసుకున్న భూమా అఖిల ప్రియ.. తనకు తాను అపరచాణక్యుడిలా ఫీలయ్యే చంద్రబాబుకే షాక్ ఇచ్చారట. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత అనూహ్యంగా మంత్రి అయిన అఖిలప్రియ పేరు కన్నా చెడ్డపేరును ఎక్కువ సంపాదించారు. హత్యలు.. కిడ్నాపులు.. బ్యాంకులను మోసం చేయడం.. రుణాలు ఎగ్గొట్టడం.. బెదిరించడం.. ఇంకా తన తండ్రి అంతరంగికుడు.. ఆప్తమిత్రుడు అయినా ఏవీ సుబ్బారెడ్డి మీద లోకేష్ పాదయాత్రతోనే బహిరంగంగా దాడులు చేయడం వంటి దూకుడు చర్యలతో ఎంత అప్రదిష్టమూటగట్టుకున్నారో ఎవరికీ తెలియదు.. ఆళ్లగడ్డలో మళ్ళీ పోటీ చేసేందుకు ఆమె ఉత్సాహంగా ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేవని టీడీపీ అంటోంది.. ఆమెకు టికెట్ ఇస్తే క్యాడర్ సపోర్ట్ చేయదని .. ఆమె దూకుడు పార్టీకి మరింత చేటు చేస్తుందని పార్టీ పెద్దలు భయపడుతున్నారు. అందుకే ఆమెకు టికెట్ లేకుండా పక్కనబెట్టి. ఆమె సపోర్ట్ తీసుకుని వేరేవాళ్లకు టికెట్ ఇచ్చేలా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తెలుగుదేశం సైతం టిక్కెట్లు ఖరారు చేసేందుకు ఓ వైపు సిద్ధం అవుతూనే చంద్రబాబు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు షెడ్యూల్ రెడీ చేసారు. ఈనెల ఐదున తణుకు, ఏడున కృష్ణాజిల్లా తిరువూరు.. తొమ్మిదిన ఆళ్లగడ్డ , పదకొండున నరసరావుపేటలో భారీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ జనసమీకరణతో .. భారీ వేదికలు ఏర్పాటుతో రూపొందే ఈ సభలకు ఆయా స్థానిక నాయకులూ ఖర్చు చేయాల్సి ఉంటుంది.. బస్సులు.. వేదిక.. సౌండ్ సిస్టం.. రవాణా.. భోజనాలు.. పెద్ద నాయకులకు ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థులు లేదా. టికెట్ కోరుకుంటున్నవాళ్ళు చేయాల్సి ఉంది. ఇది అన్ని చోట్లా ఉన్నదే.. అయితే ఆళ్లగడ్డ సభకు మాత్రం భూమా అఖిల ప్రియ మెలికపెట్టినట్లు తెలిసింది. తనకు టిక్కెట్ ఇస్తామంటేనే ఈ సభ ఖర్చులు తాను పెట్టుకుంటానని. లేకుంటే ఈ సభకు దాదాపు కోటి ఖర్చు చేయలేనని పార్టీ పెద్దలకు చెప్పేసినట్లు తెలిసింది. టిక్కెట్ ఇవ్వనప్పుడు ఈ గడ్డు రోజుల్లో అంత డబ్బును అప్పుతెచ్చి ఎందుకు ఖర్చు చేయాలన్నది ఆమె ఆలోచన అంటున్నారు. ఇప్పటికే కోర్టులు.. కేసులు.. బ్యాంకర్ల నోటీసులతో ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న అఖిల ప్రియా ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఇస్తాను అంటేనే సభా ఖర్చుల బాధ్యత తీసుకుంటాను అని .. లేదంటే లేదని ఆమె పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఆమెకు టిక్కెట్ ఇస్తారా.. ఆమెను పక్కన పెడతారా అన్నది టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.. ఆమె రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. -సిమ్మాదిరప్పన్న -
యనమల సాక్షిగా.. తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
తుని రూరల్: నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా జరుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వేదికపై తెలుగు తమ్ముళ్లు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుని బాహాబాహీకి దిగిన ఘటన సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద చోటు చేసుకుంది. తుని నియోజకవర్గ స్థాయిలో 2024 నూతన సంవత్సర వేడుకలను టీడీపీ నాయకులు సాయి వేదికలో ఏర్పాటు చేశారు. వేదికపై యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, యనమల దివ్య (రామకృష్ణుడి కుమార్తె) ఉండడంతో నాయకులు, కార్యకర్తలు వరుస క్రమంలో వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొంత సమయం తర్వాత దివ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. తొండంగి మండలం నుంచి అనుచరులతో తరలివచ్చిన యనమల రాజేష్.. రామకృష్ణుడిని కలుసుకుని శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూలైన్ తప్పించుకుని వేదిక పైకి వెళుతుండగా.. వరుసగా రావాలంటూ కృష్ణుడి వర్గీయులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన రాజేష్ వర్గీయులు ఒక్కసారిగా చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజేష్, కృష్ణుడి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల వారు పరస్పరం ఘర్షణ పడుతూ కొట్టుకున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు ఇరు వర్గీయులను మందలించి, శాంతింపజేశారు. ఇదీ చదవండి: పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు..మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి -
పూల రంగులు మార్చేయండి
సాక్షి, అమరావతి: పెళ్లిళ్లు.. వేడుకల్లో భారీగా వినియోగించే పూలను ఒకే రంగులోకి మార్చాలంటే టింటింగ్ పద్ధతి మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. ఈ పద్ధతిలో ఒక్కొక్క పువ్వును మాత్రమే రంగు మార్చాల్సి వస్తోంది. ఇలా చేయడం చాలా కష్టతరమైన పని. ఒకేసారి అన్ని పూల రంగును సులువుగా మార్చేందుకు ఇంతవరకు ఎలాంటి పద్ధతి కనుగొనలేదు. ప్రపంచంలోనే తొలిసారి ఈ సమస్యకు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తిరుపతిలో ఉన్న ఉద్యాన పరిశోధన స్థానం ఓ చక్కని పరిష్కారాన్ని కనుగొంది. పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి.. వాటితో విలువ ఆధారిత వస్తువులను తయారు చేసేందుకు పీహెచ్డీ విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా పూల ఇంకులను వినియోగించి ఒకేసారి మనకు నచ్చిన రంగులో భారీ ఎత్తున పూలను ఉత్పత్తి చేసుకునే విధానాన్ని కనుగొన్నారు. ఎలా తయారు చేస్తారంటే.. సేకరించిన పూలను మెత్తగా గ్రైండ్ చేస్తారు. ఆ తర్వాత ప్రకృతి సిద్ధంగా లభించే ద్రవ్యాలను జతచేసి మరోసారి గ్రైండింగ్ చేస్తారు. ఇలా వచ్చిన ద్రవ్యాలను వడగట్టి వాటి సహజతత్వం కోల్పోకుండా శీతలీకరణ చేయడం ద్వారా రంగు ద్రావణాన్ని తయారు చేస్తారు. ఎంపిక చేసిన తెలుపు రంగు పూలపై.. వాటిని కోసేందుకు ముందు ఆ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. స్ప్రే చేసిన వెంటనే పూల రంగు మనకు కావాల్సిన రంగులోకి సహజ సిద్ధంగా మారిపోతుంది. గంటసేపు ఆరిన తరువాత పువ్వుల్ని కోత కోసి నిల్వ చేసుకోవచ్చు. ఈ విధానంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో పూలను కావాల్సిన రంగులోకి మార్చుకునే వెసులుబాటు ఉంది. ప్రయోగం ఇలా.. తిరుమల శ్రీవారి సేవకు ఉపయోగిస్తున్న పూల నుంచి తయారు చేసిన రంగులతో కోతకు సిద్ధంగా ఉన్న తెల్ల రంగు చామంతి పూలపై ప్రయోగించి ఫలితాలను రాబట్టారు. కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటుందని గుర్తించారు. అలాగే పూర్ణిమ రకం చామంతి తోటలోని పూలపై ఇలా తయారు చేసిన పూల రంగును ప్రయోగాత్మకంగా పిచికారీ చేసి వాటి రంగు, తాజాదనాన్ని పరిశీలించారు. ఇది నూరు శాతం సహజసిద్ధంగా తయారవడంతోపాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపలేదని గుర్తించారు. వినియోగదారుల కోరిక మేరకు అవసరమైతే వారు కోరుకున్న సువాసనల కోసం సెంట్‌ను అద్దుకునే వెసులుబాటు సైతం ఉంది. ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి సేవకు ఉపయోగించే పూలను ఉచితంగా సేకరిస్తున్నారు. వాడిన పూలను కొనుగోలు చేస్తే కిలోకు సుమారుగా రూ.10 ఖర్చవుతుంది. వీటి ద్వారా ఒక లీటర్ రంగు తయారీకి రూ.20 నుంచి రూ.50 వరకు ఖర్చవుతుంది. లీటర్ ద్రావణం 15–20 మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. ఒక ఎకరాకు 2 వేల లీటర్ల ద్రావణం అవసరమవుతుంది. మరింత విస్తృతంగా పరిశోధనలు జెక్స్ బెరా (వైట్), రోజా (వైట్) ఇతర రకాల పూలపై కూడా ప్రయోగాలు చేసేందుకు ఉద్యాన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పూల రంగులతో పెన్నుల తయారీపైనా పరిశోధనలు చేస్తున్నారు. రంగుల కోసం ప్రస్తుతం ఏ పూలను వినియోగిస్తున్నారంటే రోజా (మిరాబుల్ రెడ్), డెకరేషన్‌కు ఉపయోగించే బంతి (ఆరంజ్), చామంతి (ఎల్లో), తామర (పింక్, వైట్), ఆర్కిడ్స్ (సోనియా రకం పర్పల్ కలర్)ను ఉపయోగిస్తున్నారు. తోటల్లోని పూలపై స్ప్రే చేసినప్పుడు వాతావరణంలో తేమను బట్టి వాటి రంగులు మారే అవకాశం ఉందని గుర్తించారు. సాఫ్ట్ ల్యాండ్ స్కేపింగ్ ఇండస్ట్రీ, ఫ్లోరిస్ట్స్–బాక్వీ షాప్స్, ఇన్‌స్టంట్‌గా కలర్ చేంజ్ చేసి కస్టమర్ చాయిస్‌కు అనుగుణంగా బాంక్విట్స్ను ఇచ్చేందుకు ఉపయోగించవచ్చు. చాలా ఆనందంగా ఉంది రసాయనాలు కలపకుండా ప్రకృతిలో లభించే పూల నుంచే సహజ సిద్ధమైన రంగులను తయారు చేయవచ్చని నిరూపించాం. తద్వారా ఏక మొత్తంలో ఒకే రంగు పూలను తయారు చేసేందుకు వీలుగా నూతన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భాగస్వామి అయినందుకు చాలా ఆనందంగా ఉంది. – జగదీశ్వరి, పీహెచ్డీ విద్యార్థిని, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, తాడేపల్లిగూడెం పరిశోధన విజయవంతం పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి వాటి ద్వారా విలువ ఆధారిత వస్తువులను తయారు చేసే క్రమంలో పలువురు పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులు చేసిన ఈ తరహా ప్రయోగం సక్సెస్ అయ్యింది. 10 రోజుల్లో 8 వేల లీటర్ల ద్రావణం తయారు చేశాం. ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటివరకు సైడ్ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇతర పూల విషయంలో ఈ తరహా ప్రయోగం చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోననే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. పూలకు సెంట్స్ యాడ్ చేసే విషయంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. – ఆర్.నాగరాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా స్థానం ఫ్లోరీ కల్చర్ ఇండస్ట్రీలో ముందడుగు ఫ్లోరీ కల్చర్ ఇండస్ట్రీలో ఇదో గొప్ప చారిత్రాత్మక ముందడుగుగా పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు ఇలా ఏక మొత్తంలో ఒక రంగు పూలను కావాల్సిన రంగులోకి మార్చుకునే సాంకేతికత ఎక్కడా లేదు. ఈ తరహా ప్రయోగం జరిగినట్టుగా జర్నల్స్‌లో కూడా ఎక్కడా లేదు. కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన పీహెచ్డీ విద్యార్థిని జగదీశ్వరి బృందంకు నా అభినందనలు. – టి.జానకీరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
పట్టణ పేదల సొంతింటి కల సాకారం
సాక్షి, అమరావతి: పట్టణ పేదల కష్టాలు తీరనున్నాయి. వారి సొంతింటి కల సాకారం కాబోతోంది. ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 82,080 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసింది. ఈ నెల 4 నుంచి మరో 73,580 ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో 61,684 యూనిట్ల పంపిణీకి ముహూర్తం నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై అధిక ధరలను మోపగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని తొలగించింది. 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ఫ్లాట్లను కేటాయించింది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు ఆర్థిక భారాన్ని సగానికి తగ్గించి ఇళ్లను అందిస్తోంది. రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలో 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,216 టిడ్కో ఇళ్లను నిర్మిస్తుండగా ఇందులో మొదటి దశలో 1,51,298 వంద శాతం నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 31 లక్షల మంది పేద మహిళలకు ఇప్పటికే ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ 31 లక్షల ఇళ్ల స్థలాలు కాకుండా పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇస్తున్న టిడ్కో ఇళ్లు అదనం. అన్ని మౌలిక వసతులతో లబ్ధిదారులకు.. ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, ఎస్టీపీ వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాకే ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. ప్రస్తుతమున్న నగరాలు, పట్టణాలకు సమీపంలో అనువైన ప్రాంతాల్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లు సరికొత్త పట్టణాలను తలపిస్తుండటం విశేషం. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యూఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ఫ్లాట్లు 10 వేల నుంచి 12 వేల వరకు ఉండడం విశేషం. ఒక్క నెల్లూరు పరిధిలోనే (అల్లిపురం, వెంకటేశ్వరపురం) రెండు చోట్ల మొత్తం 27 వేల ఇళ్లు నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్న 163 ప్రాంతాల్లోని నివాసాలకు ‘వైఎస్సార్ జగనన్న నగరాలు’గా పేరు పెట్టారు. వీటి నిర్వహణకు నివాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటు చేశారు. ఇళ్ల పేరిట పేదలపై చంద్రబాబు బండ టిడ్కో ప్రాజెక్టులో భాగంగా గత చంద్రబాబు ప్రభుత్వం 3,13,832 ఇళ్ల నిర్మాణం తలపెట్టింది. వీటిలో 2019 మే నాటికి 1,90,944 యూనిట్లు పునాది స్థాయిని మాత్రమే దాటాయి. మరో 1,22,888 యూనిట్లు పునాదుల్లోనే మిగిలిపోయాయి. చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,879గా నిర్ణయించడంతోపాటు 63,744 యూనిట్ల నిర్మాణానికి రూ.3,232 కోట్లు వ్యయాన్ని ఖరారు చేశారు. అయితే, ఇందులో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించి రూ.392 కోట్ల ప్రజాధనం ఆదా చేసింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.5 లక్షలు భారం మోపి, 20 ఏళ్లపాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టింది. తద్వారా ప్రతి నెలకు రూ.3,805 భారం మోపింది. ఇక 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల వాటా కింద వసూలు చేసింది. లబ్ధిదారులకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్ వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మూడు కేటగిరీల్లో 2,62,216 టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. నిరుపేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని రూ.1కే కేటాయించి 1,43,600 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.10,339 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చింది. 365 చ.అ ఇళ్లకు 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లకు 74,312 మంది లబ్ధిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని జగన్ ప్రభుత్వం సగానికి తగ్గించింది. అంతేకాకుండా లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ.482.32 కోట్లను కూడా ప్రభుత్వమే చెల్లించింది. రెండు, మూడు కేటగిరీల్లోని లబ్ధిదారులు గత ప్రభుత్వ ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వ చర్యలతో ఆ మొత్తం రూ.4,590 కోట్లకు దిగివచ్చింది. మౌలిక సదుపాయాలకు సైతం గత సర్కారు కేవలం రూ.306 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. వైఎస్ జగన్ సర్కారు రూ.3,237 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. రివర్స్ టెండరింగ్‌లో చ.అడుగుకు నిర్మాణ వ్యయాన్ని రూ.1,692 తగ్గించడంతో పాటు అన్ని పనుల్లోనూ దాదాపు రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. అన్ని కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్‌డీడ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, యూజర్ ఛార్జీలను మినహాయించడంతో లబ్ధిదారులు మొత్తం రూ.5,487.32 కోట్లు మేలు పొందారు. ఇళ్ల పంపిణీ తాజా షెడ్యూల్.. ► జనవరి 4న అనకాపల్లి జిల్లాలో సత్యనారాయణపురం 2,744 గృహాలు. ► 6న గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో 4,192, వెంగళాయపాలెంలో 1,888. ► జనవరి రెండో వారంలో మచిలీపట్నంలో 864, పెద్దాపురంలో 1,584. ►మూడో వారంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15,552, వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో 1,008, మదనపల్లి మున్సిపాలిటీలో 1,872, చిత్తూరు మున్సిపాలిటీలో 2,832. ► నాలుగో వారంలో విజయనగరం జిల్లా సారిపల్లిలో 352, సోనియానగర్‌లో 1,088, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 548, విశాఖ జిల్లా దబ్బందలో 1,920, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 1,248, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో 480, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 192, పలాసలో 912. రెండో దశలో 6,500 ఇళ్లను కూడా పంపిణీ చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 800, పాలకొల్లులో 1,024, తాడేపల్లిగూడెంలో 1,124, కడపలో 9,912, విశాఖపట్నంలోని 11 ప్రాంతాల్లో 6,048. ► ఫిబ్రవరి మొదటి వారంలో పార్వతీపురం మున్సిపాలిటీలో 768 ఇళ్లు. -
ఒకే జిల్లాలో 61వేల కొత్త ఓట్లు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో భారీ సంఖ్యలో కొత్త ఓటర్ల నమోదు జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఓటేయడానికి నవతరం ఉత్సాహంగా ముందుకు వస్తోంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 61,193 ఓట్లను కొత్తగా చేర్చారు. వీటిలో యువతవే 80 శాతం ఉన్నట్లు సమాచారం. మరోపక్క ఇబ్బడిముబ్బడిగా ఉన్న దొంగ ఓట్లను అధికారులు తొలగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాదిగా వచ్చిన ఫారం–6, ఫారం–7, 8లను ఎన్నికల అధికారులు వడపోసి, దొంగ ఓట్లను తొలగించి కొత్త ఓట్ల నమోదును చాలా వరకు పూర్తి చేశారు. ఇప్పటికే 46,116 అక్రమ ఓట్లను తొలగించారు. అన్నీ కలిపి మరో 600 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. వీటిలో కొత్త ఓట్లకు సంబంధించి 400 దరఖాస్తులు ఉన్నాయి. జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. జనవరి 22 నాటికి తుది జాబితా విడుదల చేస్తారు. ఇప్పటివరకు నమోదైన కొత్త ఓట్లలో అత్యధికంగా అద్దంకిలో 12,883 నమోదయ్యాయి. బాపట్లలో 9,967, రేపల్లెలో 9,961, చీరాలలో 9,958, పర్చూరులో 9,385, వేమూరులో 9,039 ఉన్నాయి. ప్రలోభాలకు లొంగకుండా దొంగ ఓట్ల తొలగింపు జిల్లాలో 65 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని పర్చూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్, పలువురు అధికార పార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను గుర్తించి వాటిని తొలగించాలని 65 వేలకు పైగా ఫారం–7 దరఖాస్తులను సమర్పించారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వచ్చిన ఫారం–7 దరఖాస్తులను అధికారులు సమగ్రంగా పరిశీలించి దొంగ ఓట్లను తొలగిస్తున్నారు. దీంతో తమ దొంగ ఓట్ల వ్యవహారం బయటపడుతుందని భావించిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికార పార్టీ దొంగ ఓట్లు చేర్పిస్తోందంటూ ఆరోపణలకు దిగారు. అధికారులకు పదేపదే ఫిర్యాదు చేశారు. కోర్టును ఆశ్రయించారు. జిల్లా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. అయినా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం వేలాది ఫారం–7 దరఖాస్తులను నిశితంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఇప్పటివరకూ 46,116 దొంగ ఓట్లను గుర్తించి, తొలగించింది. వీటిలో అత్యధికంగా పర్చూరు నుంచి 10,468 ఓట్లను తొలగించారు. రేపల్లె పరిధిలో 8,880, చీరాల నుంచి 7,420, అద్దంకిలో 7,207, వేమూరులో 6,295, బాపట్ల నుంచి 5,846 ఓట్లను తొలగించారు. తొలగించిన ఓటర్లలో ఇతరప్రాంతాలకు వలస వెళ్లిన వారు, అక్కడే స్థిరపడిన వారు, చనిపోయిన వారు, రెండు చోట్లా ఓట్లు ఉన్నవారు ఉన్నారు. ఓటు హక్కుతో ఆనందం రాబోయే ఎన్నికల్లో తొలిసారి ఓటేసే ఆవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేస్తాను. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగను. మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు నా వంతు తోడ్పాటు అందిస్తాను. మంచి పాలన అందించేవారికి మద్దతుగా నిలవాలన్నది కోరిక. – పూరేటి సంధ్య, కొప్పెరపాడు, బల్లికురవ మండలం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నా నాకు ఓటు హక్కు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఫీజు రీయింబర్స్ మెంట్‌తో చదువుకున్నాను. పేద, మధ్యతరగతి వారికి అండగా నిలిచే ప్రభుత్వాలకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాను. –ఎం.సాయి పూజిత, బీటెక్ విద్యార్థి, బాపట్ల ప్రజల కోసం పనిచేసే వారికే ఓటు తొలిసారి ఓటుహక్కు రావడం ఆనందంగా ఉంది. పేదలకు అండగా నిలిచి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికే రాబోయే ఎన్నికల్లో నా ఓటు. ఎవరి ప్రలోభాలకూ లొంగకుండా ఓటు వేస్తాను. అందరికీ మంచి జరగాలన్నదే నా కోరిక. – పి. వెంకట నాగ మణికంఠ రెడ్డి, దుండివారిపాలెం, కర్లపాలెం మండలం -
నమ్మకాన్ని కాపాడింది
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ (జేపీవీ)కు ఆదరణ వెలువెత్తుతోంది. ప్రైవేట్ డెయిరీల దోపిడికీ చెక్ పెడుతూ ‘అమూల్’ దూసుకెళుతోంది. నిండా మూడేళ్లు కూడా నిండని అమూల్ పాడి రైతుల నమ్మకాన్ని చూరగొనడంతో పాలు పోసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో పాల సేకరణ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రోజుకు 1.74 లక్షల లీటర్ల పాలను సేకరించిన అమూల్ ప్రస్తుతం ఏకంగా 3.61 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. అమూల్‌కు పాలు పోసే పాడిరైతుల సంఖ్య మూడింతలు పెరిగింది. 1,800 లీటర్ల నుంచి 3.61 లక్షల లీటర్లకు.. రాష్ట్రంలో జగనన్న పాల వెల్లువ ఓ ఉద్యమంలా సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2020 డిసెంబర్లో జేపీవీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు (వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం) జిల్లాల్లో 401 గ్రామాలతో మొదలైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 19 జిల్లాల్లో 4,127 గ్రామాలకు విస్తరించింది. తొలుత ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యేందుకు 24,277 మంది ముందుకు రాగా నేడు అది 3,78,567 మందికి చేరింది. రోజూ పాలుపోసే పాడి రైతులు ప్రారంభంలో 800 మంది ఉండగా నేడు ఏకంగా లక్ష మందికి చేరుకున్నారు. ప్రారంభంలో రోజుకు సగటున 1,800 లీటర్లు పాలు పోయగా ఇప్పుడు ఏకంగా 3.60,808 లీటర్ల సేకరణ జరుగుతోంది. దశాబ్దాల చరిత్ర, విస్తృత నెట్వర్క్ కలిగిన ప్రైవేట్ డెయిరీలు సైతం రోజుకు సగటున 6 లక్షల లీటర్లకు మించి పాలు సేకరించలేని పరిస్థితి నెలకొనగా మూడేళ్ల వయసున్న అమూల్ నిత్యం రాష్ట్రంలో 3.61 లక్షల లీటర్లకు పైగా పాలు సేకరిస్తుండడం అరుదైన రికార్డుగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా గత ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టు గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది జూలై నాటికి 3,475 గ్రామాల పరిధిలో 3.11 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా రోజుకు సగటున 68 వేల మంది 1.74 లక్షల లీటర్ల పాలు పోసేవారు. అలాంటిది డిసెంబర్ 25 నాటికి 4,127 గ్రామాలకు విస్తరించగా ప్రాజెక్టులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య ఏకంగా 3.78 లక్షల మందికి చేరుకుంది. రోజుకు సగటున 3.61 లక్షల లీటర్ల పాలు పోయడంతో ఆర్నెల్లలో సేకరణ రెట్టింపు దాటింది. వృద్ధి రేటు ఏకంగా 197.99 శాతంగా నమోదు కావడం గమనార్హం. నమ్మకం పెరిగిందిలా... అమూల్ ప్రారంభంలో 11 శాతం వెన్న, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో గేదె పాలకు రూ.71.74 చొప్పున చెల్లించింది. 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించగా మూడేళ్లలో ఏడు సార్లు పాల సేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతం గేదె పాలకు లీటర్‌కు రూ.89.76, ఆవు పాలకు రూ.43.69 చొప్పున చెల్లిస్తోంది. పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు సేకరణ ధరలు తగ్గించడం, ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెంచినట్లుగా గిమ్మిక్కులు చేస్తూ పాడి రైతులను ప్రైవేటు డెయిరీలు దోచుకునేవి. అమూల్ మాత్రం ఉత్పత్తి తగ్గినా, పెరిగినా ఒకే రీతిలో ప్రకటించిన ప్రకారం పాల సేకరణ ధరలను చెల్లిస్తోంది. పైగా ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతాన్ని బట్టి లెక్కగట్టి అణాపైసలతో సహా పాలు పోసిన 10 రోజుల్లో నేరుగా పాడిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతాన్ని బట్టి గేదె పాలకు లీటర్‌కు రూ.100, ఆవు పాలకు రూ.50కు పైగా ధర పక్కాగా లభిస్తుండడంతో పాడిరైతుల్లో అమూల్ పట్ల భరోసా ఏర్పడింది. రూ.4.93 కోట్ల బోనస్.. భారీగా రుణాలు ఏడాదిలో కనీసం 180 రోజుల పాటు క్రమం తప్పకుండా పాలుపోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున అమూల్ బోనస్ చెల్లిస్తుండడం పాడిదారులకు భరోసానిస్తోంది. మూడేళ్లలో రాయల్టీ ఇన్సెంటివ్ (బోనస్) కింద రూ.4.93 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. లాభాపేక్ష లేకుండా 2,300 టన్నులకుపైగా నాణ్యమైన ఫీడ్‌ను పంపిణీ చేసింది. అంతేకాకుండా వర్కింగ్ క్యాపిటల్ రూపంలో గేదెలకు రూ.30 వేలు, ఆవులకు రూ.25 వేల చొప్పున ఆర్ధిక చేయూతనివ్వడమే కాకుండా కొత్తగా పాడి కొనుగోలుకు ముందుకొచ్చే రైతులకు గేదెకు రూ.93 వేలు, ఆవులకు రూ.76 వేల చొప్పున స్వయంగా రుణాలందిస్తోంది. ఇప్పటివరకు 12,728 మంది మహిళా పాడి రైతులకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.60.29 కోట్లు అందించారు. 3,090 మంది రైతులకు పాడి కొనుగోలకు రూ.30.01 కోట్లు రుణాలిచ్చారు. జేపీవీ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాలసేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో రూ.680 కోట్లతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. జేపీవీ ప్రారంభ మైనప్పటి నుంచి నేటి వరకు 12.70 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.575.42 కోట్లు పాడి రైతుల ఖాతాల్లో జమ చేసింది. అరుదైన రికార్డు.. జేపీవీ ప్రాజెక్టుకు గ్రామాల్లో అనూహ్య స్పందన లభిస్తోంది. మూడేళ్లలో అనూహ్య పురోగతి సాధించింది. రోజుకు 3.61 లక్షల లీటర్ల పాలను సేకరించడం ఓ అరుదైన రికార్డుగానే చెప్పవచ్చు. ప్రైవేట్ డెయిరీలు ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నాయో, ఎలా నష్టపోతున్నారో పాడి రైతులకు అర్ధమయ్యే రీతిలో చెప్పడంలో అమూల్ విజయవంతం కావడం వల్లే ఇది సాధ్యమైంది. నాలుగు లక్షల లీటర్ల సేకరణను అధిగమించే రోజు దగ్గర్లోనే ఉంది. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీడీడీసీఎఫ్ అణా పైసలతో సహా చెల్లిస్తున్నారు.. జగనన్న పాల వెల్లువ కేంద్రంలో రోజూ 4–5 లీటర్ల గేదె పాలు పోస్తుంటాం. నాణ్యమైన మేత వల్ల పాల నాణ్యత పెరిగింది. ఫ్యాట్ 13, ఎస్ఎన్ఎఫ్ 9 శాతంతో మంగళవారం 4.4 లీటర్ల పాలు పోయగా లీటర్‌కు రూ.102.50 చొప్పున రూ.451 సేకరణ ధర లభించింది. ప్రకటించిన ధర కంటే రూ.56 అదనంగా వచ్చింది. ప్రైవేట్ డెయిరీలకు పాలు పోస్తే లీటర్‌కు రూ.50 రావడం కూడా గగనంగా ఉండేది. ఫ్యాట్ 11, ఎస్ఎన్ఎఫ్ 9 శాతానికి మించి ఇచ్చేవారు కాదు. పాల ఉత్పత్తి అధికంగా ఉన్న సమయంలో ఏదో ఒక సాకుతో కోతలు పెట్టేవారు. ఇప్పుడు ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ ఎంత శాతం ఉంటే ఆ మేరకు లెక్కగట్టి నగదు మా ఖాతాల్లో జమ చేస్తున్నారు. – చిరుమామిళ్ల రాణి, కొంజెర్ల, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా -
AP: ఆరోగ్య సురక్ష రెండోదశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న ఆరోగ్య సురక్ష ’(జేఏఎస్) రెండో దశ అమలుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. నేటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా వారానికి రెండు రోజుల చొప్పున మంగళ, శుక్రవారాల్లో జేఏఎస్‌ను నిర్వహిస్తారు. ఇక పట్టణాలు, నగరాల్లో రెండో దశ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తొలిదశలో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో 50 రోజులపాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సొంత ఊళ్లలోనే 60 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలందించింది. నిరంతరాయంగా కార్యక్రమాన్ని కొనసాగించడంలో భాగంగా రెండో దశను చేపట్టారు.ఆరు నెలల్లో 13,954 శిబిరాలు జేఏఎస్ రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలల్లో 13,954 సురక్ష శిబిరాలు నిర్వహించేలా వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో 10,032, పట్టణాలు, నగరాల్లో 3,922 చొప్పున శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలంలో వారానికి ఒక గ్రామం చొప్పున, మునిసిపాలిటీల్లో వారానికి ఒక వార్డు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను ఆర్నెళ్లలో కవర్ చేసేలా శిబిరాలను నిర్వహిస్తారు. శిబిరాల నిర్వహణకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు మరోసారి వలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి జేఏఎస్–2పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు. ప్రజలకు సొంత ఊళ్లలో స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్ వైద్యులను, కంటి సమస్యల స్క్రీనింగ్ కోసం 562 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను నియమించారు. వైద్య శిబిరాల్లో అవసరమైన అన్ని రకాల మందులను అత్యవసర ఔషధాలతో సహా అందుబాటులో ఉంచుతున్నారు. వైద్య పరీక్షల నిర్వహణకు ఏడు రకాల కిట్లు శిబిరాల్లో అందుబాటులో ఉంటాయి. చేయి పట్టి నడిపిస్తూ.. వైద్య శిబిరాల ద్వారా సొంతూళ్లలో వైద్య సేవలు అందించడమే కాకుండా అనారోగ్య బాధితులను వైద్య పరంగా ప్రభుత్వం చేయి పట్టుకుని నడిపిస్తోంది. జేఏఎస్ శిబిరాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగులను ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ చార్జీల కింద రూ.500 చొప్పున అందచేస్తోంది. రిఫరల్ రోగులను ఆస్పత్రులకు తరలించి అక్కడ ఉచితంగా అన్ని వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. జీజీహెచ్‌లు, ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సురక్ష రిఫరల్ కేసుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం వైద్య పరంగా అండగా నిలుస్తోంది. వీరికి ఉచిత కన్సల్టేషన్లతో పాటు కాలానుగుణంగా ఉచితంగా మందులు అందజేస్తోంది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు జేఏఎస్–2 కార్యక్రమం అమలు పర్యవేక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలవారీగా ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు. లోటుపాట్లు ఉంటే సంబంధిత విభాగాధిపతుల దృష్టికి తెచ్చి సమస్య పరిష్కరానికి చర్యలు చేపడతారు. ప్రజల వద్దకే వైద్యం జేఏఎస్–2 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. మందులు, వైద్య పరీక్షల కిట్లు సరఫరా చేశాం. శిబిరాల నిర్వహణపై జిల్లా యంత్రాంగాలు షెడ్యూల్లు రూపొందించాయి. ఆ మేరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజల వద్దకు చేరుస్తూ జేఏఎస్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
టెన్త్, ఇంటర్లో భారీగా ‘రీ అడ్మిషన్లు’
సాక్షి, అమరావతి: గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ‘రీ అడ్మిషన్’ అవకాశాన్ని భారీ సంఖ్యలో వినియోగించుకున్నారు. సుమారు 1,93,251 మంది తిరిగి ఆయా తరగతుల్లో ప్రవేశాలు పొందారు. వీరికి ఈ విద్యా సంవత్సరంలో చేరిన రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో నూరు శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) సాధనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్ తప్పినవారికి రాష్ట్ర ప్రభుత్వం పునర్ ప్రవేశ అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి, ఆయా విద్యార్థులను తిరిగి ఎన్రోల్ చేశారు. దాంతో 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పిన 1,23,680 మందిలో 1,03,000 మంది, ఇంటర్లో 90,251 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా పరీక్ష తప్పినవారు తిరిగి ఫీజు కట్టి పరీక్షలు రాస్తే (సప్లిమెంటరీ) వారిని ‘ప్రైవేటు’ విద్యార్థులుగా పరిగిణిస్తారు. కానీ.. రీ అడ్మిషన్ తీసున్న వారిని ‘రెగ్యులర్’ విద్యార్థులుగానే పరిగణిస్తారు. ఎక్కువ మార్కులే పరిగణనలోకి.. ఆయా తరగతుల్లో రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఫెయిలైన సబ్జెక్టులు మాత్రమే కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పబ్లిక్ పరీక్షల్లో అన్ని పేపర్లు రాయాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో మార్కులను పరిశీలించి, ఆయా సబ్జెక్టుల్లో ఏ విద్యా సంవత్సరంలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అంతిమంగా లెక్కలోనికి తీసుకుంటారు. ఉదాహరణకు ఓ విద్యార్థి 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫెయిలై, ఇప్పుడు రీ అడ్మిషన్ తీసుకుంటే.. గతేడాది మ్యాథ్స్ పేపర్లో 70 మార్కులు వచ్చాయనుకుంటే.. ఈ ఏడాది పరీక్షల్లో అదే పేపర్ 30 మార్కులే వస్తే.. గత ఏడాది వచ్చిన 70 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే.. అన్ని సబ్జెక్టులు పాసైన రీ అడ్మిషన్ విద్యార్థుల సర్టీఫికెట్లపై ప్రైవేట్/కంపార్ట్మెంటల్/స్టార్ గుర్తు వంటివి లేకుండా ‘రెగ్యులర్’ అని గుర్తింపు ఇస్తారు. వీరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే జగనన్న విద్యాకానుక, అమ్మ ఒడి వంటి అన్ని పథకాలు వర్తింపజేశారు. ఒక్కసారే అవకాశం ఓ విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫెయిలైన వారికి మరుసటి సంవత్సరం మాత్రమే రీ అడ్మిషన్‌తో పాటు అన్ని రెగ్యులర్ ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం కల్పిస్తారు. ఈ విద్యార్థులు రెండో ఏడాదీ ఫెయిలైతే వారికి మరో అవకాశం ఉండదు. వారు ప్రైవేటుగానే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 2022–23లో ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫెయిలై తిరిగి రెగ్యులర్ గుర్తింపు పొందిన 1,93,251 మంది విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరానికి గాను వచ్చే మార్చిలో పరీక్షలు రాయనున్నారు. వీరు ఈ విద్యా సంత్సరంలో అన్ని సబ్జెక్టులు పాసైతే ‘రెగ్యులర్’ సర్టీఫికెట్ అందుకుంటారు. ఫెయిలైతే తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిందే.