AP Special
-
సర్కారు దయతో పునర్జన్మ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సర్కారు దయతో పునర్జన్మ మాది రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాను. గుంటూరు రాజీవ్ గాంధీనగర్‌లో నివసిస్తున్న నాకు నలుగురు పిల్లలు. పెద్దమ్మాయి పెళ్లి చేశాను. నా భార్య చాలాకాలం క్రితమే కన్ను మూసింది. ఇద్దరు కొడుకులు చిన్న చిన్న పనులు చేస్తున్నారు. వారి ఆదాయం అంతంతమాత్రమే. చిన్నమ్మాయి చదువు పూర్తయి ఇంటి దగ్గరే ఉంటోంది. దీంతో కుటుంబ పోషణ భారమంతా నా పైనే పడింది. రెండేళ్ల క్రితం ఆటో నడుపుతుండగా అకస్మాత్తుగా గుండెల్లో నొప్పి వచ్చింది. మా అబ్బాయి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ పరీక్షలు నిర్వహించి అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాలని, లేకుంటే ప్రాణాలకే ముప్పని గుండె పగిలిపోయే వార్త చెప్పారు. సుమారు 3 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అసలే అంతంత మాత్రం బతుకులు. ఆ సమయంలో అంత డబ్బు ఎలా అని ఆందోళన చెందా. మాకు తెల్ల రేషన్ కార్డు ఉండడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తారని తెలిసింది. వెంటనే ప్రైవేటు ఆస్పత్రిలో ఆరోగ్యవిుత్రను కలిశాను. వారి సహకారం అందించడంతో ఆపరేషన్ చేసి నాకు పునర్జన్మ ప్రసాదించారు. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత యధావిధిగా ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రస్తుతం నేను అద్దె ఇంట్లో ఉంటున్నా. జగనన్న కాలనీలో మాకు స్థలం కూడా కేటాయించారు. అంతేకాకుండా వైఎస్సార్ వాహనమిత్ర కింద రూ. 10 వేలు చొప్పున ఐదు విడతల్లో 50 వేల వరకు లబ్ధి పొందాను. పేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది. నాలాంటివారికి ఎందరికో ప్రాణభిక్ష పెట్టింది. – రావెల ప్రభాకర్, రాజీవ్‌గాంధీ నగర్, గుంటూరు (ధూపాటి ప్రకాష్, విలేకరి, నెహ్రూనగర్ (గుంటూరు) అప్పు చేయకుండా వ్యవసాయం చేస్తున్నా ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం జగన్నాథపురంలో నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఏటా మిరప పంట సాగు చేస్తాను. ఆ పంట ద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తాను. ప్రతి ఏడాది పెట్టుబడులు పెట్టలేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనేవాడిని. ఎరువులు, పురుగుల మందుల కోసం ఊళ్లో ఆందరి దగ్గర అప్పు చేసేవాడిని. పంట పండిన తర్వాత వాటిని అమ్మి అప్పులు చెల్లించేవాడిని. పంట ద్వారా వచ్చిన డబ్బు దానికే సరిపోయేది. బతకడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం ద్వారా రూ.13,500లు నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమవుతోంది. ఈ ఏడాది కూడా రైతు భరోసా నిధులు పడ్డాయి. ఆ డబ్బులు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి. పంట వేసే సమయంలో ఎరువులు, దుక్కి, నారు కోసం ఇప్పుడు అప్పు చేయాల్సిన అవసరం రాలేదు. ఆర్బీకే ద్వారా విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ధరలకు అందాయి. అంతేకాదు నా కుమారుడికి అమ్మ ఒడిలో భాగంగా ప్రతి ఏటా రూ. 15 వేలు అందుతోంది. మా జీవనం సాఫీగా సాగిపోతోంది. – తంగిరాల ఏసురత్నం, జగన్నాథపురం, తర్లుపాడు మండలం (రామ యోగయ్య విలేకరి, తర్లుపాడు) ఉన్నత విద్యకు గొప్ప ప్రోత్సాహం సాధారణ కుటుంబంలో పుట్టిన నేను ఇంజినీరింగ్ చదువుతానని కలలో కూడా ఊహించలేదు. నేను ఉన్నత విద్య చదువుతున్నానంటే దానికి ఈ ప్రభుత్వమే కారణం. ప్రస్తుతం నేను అవంతి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాను. విశాఖపట్నం నగరం కూర్మన్నపాలెం భరత్‌నగర్‌లో ఉంటున్న మా నాన్న తుమ్మపాల లక్ష్మణ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. కాలేజీ ఫీజు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతగానో ఉపయోగపడింది. ఒక్కో సంవత్సరానికి రూ. 49,500లు చొప్పున రెండు సంవత్సరాలకు 99 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఇది కాకుండా రెండేళ్లుగా జగనన్న వసతిదీవెన పథకం ద్వారా రూ.10 వేల చొప్పున మొత్తం 20 వేలు అందింది. దీంతో ఫీజులు కట్టడానికి అవస్థలు తీరాయి. మా తమ్ముడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పోయిన ఏడాది వరకు అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి. మరిన్ని ఉన్నత చదువులు చదువుకునే వీలు కల్పిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. కష్టపడి చదివే మాలాంటి పేద విద్యార్దులకు ప్రభుత్వం చేస్తున్న సాయం ఎంతో గొప్పది. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి సాయం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పధకాల వల్ల హాయిగా బతుకుతున్నాం. – తుమ్మపాల హేమ, భరత్‌నగర్, కూర్మన్నపాలెం ( పట్నాన కోటిరెడ్డి, విలేకరి, కూర్మన్నపాలెం) -
JAS: పల్లె- పట్టణం తేడా లేకుండా ఉచిత వైద్యం
సాక్షి, విజయవాడ: ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని చేరువ చేసేందుకు ప్రారంభమైన.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. రెండవ దశలో తొలుత గ్రామీణ ప్రాంతాలలో... 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు మొదలవుతాయి. ఆర్నెల్లపాటు సాగే ఈ రెండోదశ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి ముంగిటిలోనే పరిష్కారాన్ని, వైద్య సేవల్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అవసరమైన సందర్భాలలో నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఈ బాధ్యతను పూర్తిగా ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వోలు, ఎఎన్ఎంలకు అప్పగించారు. వారు చికిత్సానంతరం పేషెంట్లకు అవసరమైన కన్సల్టేషన్ సేవలతో పాటు అవసరమైన మందుల్ని కూడా వారికి అంద జేస్తారు. జేఏఎస్ తొలి దశ.. సూపర్‌హిట్ తొలిదశలో నిర్వహించిన కార్యక్రమంలో 12,423 ఆరోగ్య శిబిరాలల్ని నిర్వహించడం ద్వారా 1,64,982 మంది పేషెంట్లను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు తరలించి వారికి ఉచిత వైద్య సేవల్ని అందించారు. తొలిదశ కార్యక్రమంలో సీహెచ్‌వోలు, ఎఎన్ఎంలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలలో 1,45,35,705 ఇళ్ళను సందర్శించి 6.45 లక్షల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తొలిదశ కార్యక్రమంలో నిర్వహించిన 12,423 ఆరోగ్య శిబిరాలలో 60,27,843 మంది ప్రజలు ఓపి సేవలు అందుకోగా, 1,64,982 మంది పేషెంట్లను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి ఉచిత వైద్య చికిత్సను అందించారు. ఈ నేపథ్యంలో రెండో దశను మరింత విస్తృతస్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సర్వ సన్నద్ధమయ్యింది. ►వైద్య ఆరోగ్యసేవల్ని అందించే విషయంలో ఏ ఒక్క గ్రామాన్నీ వదిలి పెట్టరాదన్న లక్ష్యాన్ని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష రెండోదశ కార్యక్రమానికి ఆరు నెలల వ్యవధిని నిర్దేశించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు తొలిదశలో 50 రోజులకు పైగా నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 60 లక్షల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందారు. ►జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా.. పేషెంట్లందరినీ ఆరోగ్య శిబిరాలనుండి సిహెచ్వోలు, ఎఎన్ఎంలు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులలోని ఆరోగ్యమిత్రల ద్వారా నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుటుంది. దీంతో పాటు ఈ ప్రక్రియనంతా యాప్ ద్వారా పరిశీలించి పేషెంట్ల రవాణా, ఇతర ఖర్చుల నిమిత్తం రు.500 లని వారికి వైద్య ఆరోగ్య శాఖ అందజేయనుంది. ఆరు నెలలపాటు రెండో దశ.. జగనన్న ఆరోగ్య సురక్ష తొలిదశ కార్యక్రమం పూర్తి విజయవంతం కావటంతో రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణ ప్రాంతాలలో విస్తరించి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెండో దశ కార్యక్రమాన్ని ఆర్నెల్లపాటు నిర్వహించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు. రెండోదశ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఇళ్లల్లో ఉన్న దీర్ఘకాలిక రోగులు, గర్భవతులు, బాలింతలతో పాటు ప్రసవానంతర శిశు సంరక్షణ సేవలు, అన్ని వయస్సుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవల్ని అందించనున్నారు. ►రెండోదశ కార్యక్రమాన్ని మూడు దశల్లో నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొదటి దశలో వైద్య శిబిరాల వివరాలను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి తెలియజేస్తారు. మొదటి దశలో వాలంటీర్లతో పాటు ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటినీ సందర్శించి రెండోదశ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల వివరాల్ని తెలియజేస్తారు. రెండో దశలో ఆరోగ్యశిబిరాల నిర్వహణ, మూడో దశలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన కేసుల ఫాలోఅప్ సేవల్ని అందజేస్తారు. ఆరోగ్య శిబిరం నిర్వహణా తేదీని ముందు ప్రతి వాలంటీరూ రెండుసార్లు ప్రతి ఇంటికి తిరిగి వివరాలను తెలియజేయాల్సి వుంటుంది. ►మొదటి సారి వైద్య శిబిర నిర్వహణకు 15 రోజుల ముందు, రెండోసారి శిబిర నిర్వహణ తేదీని గుర్తు చేసేందుకు మూడు రోజుల ముందు వాలంటీర్లు ఇళ్ళను సందర్శిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబరాల్ని విలేజ్ హెల్త్ క్లినిక్ లు, పట్టణ వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తారు. మొత్తం మండలాలను సమానంగా విభజించి మంగళవారం తొలి అర్ధభాగంలోనూ, శుక్రవార మిగిలిన ప్రాంతాలలోనూ శిబిరాల్ని నిర్వహిస్తారు. కంద పట్టణ ప్రాంతాలలో వార్డు సచివాలయాలలో ప్రతి బుధవారం ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. ►ఆర్నెల్ల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణాలలోని గ్రామ, వార్డు సచివాలయాలలో వైద్య సేవలందచేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రతి ఆరోగ్య శిబిరంలో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లతో కలిపి కనీసం ముగ్గురు డాక్టర్లు, ఒక పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఆర్నెల్ల వ్యవధిలో 13,495 ఆరోగ్య శిబిరాల్ని నిర్వహిస్తారు. ఇందులో 10,032 శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లో, 3,922 శిబిరాలు పట్టణ ప్రాంతాలలో నిర్వహిస్తారు. జనవరి నెలలోనే 3,583 శిబిరాలను నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇదీ చదవండి: ఊపిరి పోసిన జగనన్న ఆరోగ్య సురక్ష.. కాకినాడలో ఘటన సర్వం సిద్ధం జగనన్న ఆరోగ్య సురక్ష రెండోదశ కార్యక్రమంలో వైద్య సేవలందించేందుకు జనరల్ మెడిసిన్ 543, గైనకాలజిస్ట్ లు645, జనరల్ సర్జన్లు 349, ఆర్థోపెడిషియన్లు 345 మంది, ఇతర స్పెషలిస్టులు 378 మందిని సిద్ధం చేస్తున్నారు.. వీరితో పాటు 2,545 మంది స్పెషలిస్టు డాక్టర్లు, 2743 మంది ఎంబిబిఎస్ డాక్టర్లు కూడా ఈ శిబిరాలలో భాగస్వాములవుతారు. అలాగే కంటి పరీక్షల కోసం మొత్తం 562 మంది పారా మెడికల్ ఆప్తాలమిక్ అసిస్టెంట్లను కూడా సిద్ధమవుతున్నారు. రెండో దశ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలలో గ్రామీణ ప్రాంతాల కోసం 92 రకాల మందులు, పట్టణ ప్రాంతాల కోసం 152 రకాల మందులను సిద్ధం చేస్తున్నారు. ►వీటితో పాటు అత్యవసర వినియోగం కోసం మరో 14 రకాల మందుల్ని, వైద్య పరీక్షల నిర్వహణ కోసం 7 రకాల కిట్లను కూడా సిద్ధంగా ఉంచుతున్నారు.. మూడో దశలో చేపట్టే ఫాలో అప్ సేవలలో ఫ్యామిలీ డాక్టర్, సిహెచ్ఓ, ఎఎన్ఎంలు భాగస్వాములవుతారు. వీరికి అవసరమైన మందుల్ని నేరుగా విలేజ్ క్లినిక్ లకు పంపి.. అక్కడ ఎఎన్ఎం, సిహెచ్ఓలు రోగులకు వారి ఇళ్ల వద్ద అందజేసి ఎలా వాడాలన్నది చెప్తారు. -
ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, విజయవాడ: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఇస్రోకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కాగా, పీఎస్ఎల్వీ-సీ58పై గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పందించారు. ఈ సందర్బంగా రాకెట్ విజయవంతంగా ప్రయోగించినందుకు అభినందనలు చెప్పారు. అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్‌ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహాన్ని కలిగి ఉన్న రెండవ దేశంగా భారతదేశం అవతరించడంపై హర్షం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం రోజున మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో భారతదేశ పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. పీఎస్ఎల్వీ-సీ58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరింది. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని అని ఆకాంక్షించారు. ఇది కూడా చదవండి: పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతం -
AP: పండుగలా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగలా మొదలైంది. తాజాగా పెంచిన మొత్తంతో కలిపి రూ.మూడు వేల చొప్పున ఈనెల పింఛను డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకూ ప్రతినెలా ఇచ్చే రూ.2,750 పెన్షన్ మొత్తాన్ని ఈ జనవరి ఒకటి నుంచి రూ.మూడు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 8వ తేదీ వరకు మండలాల వారీగా ఉత్సవాలు నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలి సిందే. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల నుంచి కొత్తగా మరో 1,17,161 మందికి పింఛన్లు మంజూ రు చేసింది. మొత్తంగా ఈ నెలలో 66.34 లక్షల మందికి రూ.1,968 కోట్లను విడుదల చేసింది. పింఛన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు.. నిజానికి.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా పింఛన్ల మంజూరుకు అప్పటి జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులు పెట్టడాన్ని స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకుంటూ పెన్షన్ మొత్తాన్ని ఏటేటా పెంచుకుంటూ ఈ జనవరి నుంచి రూ.మూడువేల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇలా సీఎం జగన్ తానిచ్చిన మాటను అమలుచేసి చూపించడంతో సోమవారం రాష్ట్రంలో పలు మండలాలు, మున్సిపాలిటీల్లో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడ పెన్షన్ లబ్దిదారులతో మమేకమవుతూ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. వలంటీర్లు కూడా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. -
Guntur: ఆఫీసుపై దాడి.. మంత్రి రజిని సీరియస్ వార్నింగ్
సాక్షి, గుంటూరు: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీసీ మహిళనైన నన్ను దాడులతో భయపెట్టలేరు. ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడి. రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజలు మద్దతు ఉన్నంత వరకూ ఎదుర్కొంటాం. ఈ ఘటన వెనుక ఉన్న వారికీ గుణపాఠం చెబుతాం. చంద్రబాబు, నారా లోకేష్‌కు బీసీలపై కపట ప్రేమ. బీసీ మహిళా మంత్రిగా ఉన్న నా కార్యాలయంపైనే దాడి చేశారు. బీసీలంటే ఎంత చిన్న చూపో అర్థం అవుతుంది. పక్కా ప్రణాళికతో ఇలా దాడి చేశారు. లాఠీఛార్జ్ చేసినప్పటికి దాడి కొనసాగించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడాన్ని ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు జయహో బీసీ అంటారు.. మరొకవైపు బీసీ మంత్రుల ఆఫీసులపై రాళ్లు రువ్వుతారు. గుంటూరులో ఆఫీసులపైన దాడి చేసే సంస్కృతి ఇప్పటి వరకు లేదు. తాము అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులుంటాయో రాత్రి ఘటనతోనే ప్రజలకు చెప్పారు. బీసీ మహిళ పోటీ చేయకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి అని కామెంట్స్ చేశారు. -
అర్ధరాత్రి ఎల్లో బ్యాచ్ ఓవరాక్షన్.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి
సాక్షి, గుంటూరు: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆఫీసు అద్దాలు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించేశారు. వివరాల ప్రకారం.. న్యూ ఇయర్ సందర్భంగా విడదల రజిని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం తెలుగుదేశం, జనసేన నాయకులు ఓవరాక్షన్ చేశారు. మంత్రి విడుదల రజిని కార్యాలయంపై ఎల్లో బ్యాచ్ రాళ్లు విసిరారు. అనంతరం, మంత్రి కార్యాలయంలోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఆఫీసు అద్దాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలను చించేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ, జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే, మంత్రి రజిని ఈరోజు గుంటూరు వెస్ట్‌లో ఏర్పాటు చేసిన తన ఆఫీసును ప్రారంభించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో దాడి జరిగింది. -
నీటినిల్వలో అగ్రగామి ‘కృష్ణా’
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక నీటినిల్వ సామర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణానది అగ్రగామిగా నిలిచింది. అతి పెద్ద నది అయిన గంగ, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటినిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కృష్ణానది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ఎక్కింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతోపాటు అన్ని నదీపరివాహక ప్రాంతాల్లో (బేసిన్లలో) నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణానది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యం 19.65 శాతం కావడం గమనార్హం. గంగా, గోదావరి కన్నా మిన్న.. హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగానది అతి పెద్దది. గంగా బేసిన్లో ఉన్న జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటినిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగ, గోదావరి కంటే కృష్ణానదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో గంగ, గోదావరి రెండు, మూడుస్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదానది నాలుగోస్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నానది బేసిన్లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్ దేశంలో తొమ్మిదోస్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలు మాత్రమే. -
పీఎం స్వనిధిలోనూ అక్కచెల్లెమ్మలదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యున్నత లక్ష్యాల్లో ఒకటైన మహిళా సాధికారత ఈ నాలుగున్నరేళ్ల సుపరిపాలనలో కళ్ల ముందు కనిపిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తున్నారు. చిన్న వ్యాపారులు, సూక్ష్మ పరిశ్రమలకు కేంద్రం అందించే పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకుని, కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవడంలోనూ రాష్ట్ర మహిళలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్రంలోని పీఎం స్వనిధి రుణ గ్రహీతల్లో 74 శాతం మహిళలే. పురుషులు 26 శాతం ఉన్నారు. జాతీయ స్థాయిలో 57 శాతం పురుషులు ఈ రుణాలు తీసుకుంటుండగా, మహిళలు 43 శాతమే ఉన్నారు. ఎస్బీఐ రీసెర్చి నివేదిక ఈ వాస్తవాలను వెల్లడించింది. ఈ రుణాలను చురుగ్గా సద్వినియోగం చేసుకోవడంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో రుణాలను చురుగ్గా ఖర్చు చేస్తున్న లబ్దిదారులు 22 శాతం మంది కాగా, ఏపీలో వీరు 28 శాతమని ఎస్బీఐ రిసెర్చి నివేదిక తెలిపింది. తొలి స్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 32 శాతం మంది చురుగ్గా వ్యయం చేస్తున్నట్లు పేర్కొంది. అతి తక్కువగా పశ్చిమ బెంగాల్లో 17 శాతం మంది, జార్ఖండ్‌లో 18 శాతం మందే చురుగ్గా వ్యయం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. లక్ష్యానికి మించి రుణాలు తొలి దశలో రూ.10 వేల చొప్పున దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి రుణాలివ్వాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ, డిమాండ్ భారీగా ఉండడంతో 2023 డిసెంబర్ నాటికి 63 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం మూడు దశల్లో 88.5 లక్షల రుణాలివ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రంలో తొలి దశలో 2,30,000 మందికి వర్తింపజేయాలని నిర్ణయించగా, ఇప్పుడు ఈ లక్ష్యాన్ని 3,15,000కు పెంచింది. రెండో దశలో 1,34,200 మందికి, మూడో దశలో 18,900 మందికి రుణాలు లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటి వరకు మూడు దశల్లో కలిపి రాష్ట్రంలో 4,02,718 దరఖాస్తులకు రూ.528.85 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రాష్ట్రంలో ఈ రుణాలను 15 రోజుల్లోగా బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. దరఖాస్తుదారుల్లో సగటు వయస్సు 42 సంవత్సరాలుగా ఉంది. ఇదీ పథకం.. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని వీధి వ్యాపారులకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి సమయంలో 2020 జూన్‌లో ‘ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి)’ని ప్రవేశపెట్టింది. వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు ఈ రుణాలు అందజేస్తారు. ఈ పథకం కింద బ్యాంకుల ద్వారా తొలుత రూ.10 వేలు రుణ సాయం చేస్తారు. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించిన వారికి వ్యాపారాభివృద్ధి కోసం రెండో దశలో రూ. 20 వేలు, మూడో దశలో రూ. 50 వేలు మంజూరు చేస్తారు. వీరికి కేంద్రం వడ్డీలో ఏడు శాతం రాయితీ కూడా ఇస్తుంది. -
Fact Check: కట్టకుండానే కట్టేసినట్లు కలరింగా!?
సాక్షి, అమరావతి : అబద్ధాలు ఆడటంలో ఆరితేరిన వారు ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు తర్వాతే ఎవరైనా. అవతలి వాళ్లు నవ్వుకుంటారన్న సిగ్గూఎగ్గూ లేకుండా చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతూ.. నిత్యం వాటినే పారాయణ చేస్తూ తన స్థాయిని తనే బజారుకీడ్చుకుంటున్నారు. తాజాగా.. రాష్ట్రంలో విమానయాన రంగంపై ‘మాటలు మరిచారు.. రెక్కలు విరిచారు’ అంటూ ఎప్పటిలాగే తన సహజసిద్ధ శైలిలో తన విషపుత్రిక ఈనాడులో తన పాండిత్యాన్నంతటినీ రంగరించి రామోజీ విషం కుమ్మరించారు. ఎందుకంటే.. రాష్ట్రంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తూ పలు నగరాలకు సర్వీసులు పెరుగుతుంటే కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ అసత్యాలతో రాష్ట్ర ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ఆపసోపాలు పడ్డారు. నిత్యం ఇలా అశుద్ధ కథనాలు రాస్తుండబట్టే పత్రిక సర్క్యులేషన్ రోజురోజుకీ దారుణంగా పడిపోతోంది. అయినాసరే.. తన బాబును పల్లకీ ఎక్కించేందుకు తన అసత్యాల యజ్ఞాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ ఈనాడును ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఎలుక తోలును ఎంత ఉతికినా.. ఉల్లిపాయను ఎంత ఉడకబెట్టిన వాటి సహజ లక్షణం ఎలా కోల్పోవో రామోజీ శైలి కూడా అంతే. ఈనాడు తాజా కథనంలోని వాస్తవాలు ఏమిటంటే.. ఎలాంటి అనుమతులు లేకుండా బాబు హంగామా.. భూసేకరణ చేయకుండా, పునరావాసం చేపట్టకుండా, కనీసం పౌర విమానయాన శాఖ, రక్షణ రంగం, పర్యావరణం వంటి ఎటువంటి కీలక అనుమతులు లేకుండానే చంద్రబాబునాయుడు భోగాపురానికి శంకుస్థాపన చేసేశారు. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అనుమతులు తీసుకుని 2,203.26 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించే విధంగా జీఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి.. ఒప్పందం కుదుర్చుకునే సమయానికి సేకరించిన భూమి కేవలం 377 ఎకరాలు మాత్రమే. మిగిలిన భూమి మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వమేసేకరించి, 376 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో విశాలమైన రోడ్లు, డ్రైనేజి, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, ప్రార్థన మందిరాలు, కమ్యూనిటీ హాళ్లు వంటివి నిర్మించి మరీ ఈ ప్రభుత్వం ప్రజలను ఆనందంగా తరలించింది. పునరావాసం కోర్టు కేసులు, పర్యావరణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో వేసిన కేసుల్లో పోరాడి మరీ విజయం సాధించింది. నిజానికి.. చంద్రబాబు హయాంలో కేంద్రంలో అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయారు. అలాగే, విమానయాన రంగానికి చెందిన కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడంలోనూ విఫలమయ్యారు. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ, పర్యావరణ శాఖల నుంచి కీలక అనుమతులు సాధించి పనులు మొదలుపెట్టారు. బాబు లాగా అనుమతులు లేకుండా టెంకాయ కొట్టడం కాకుండా అన్ని అనుమతులు వచ్చిన తర్వాత మే 2023లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ మరుక్షణం నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025 నాటికి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. కర్నూలు ఎయిర్పోర్టుదీ అదే కథ.. ఇక కర్నూలు ఎయిర్‌పోర్టుకు కూడా 2017లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు పనులు పూర్తికాకుండానే, ఎన్నికలు వస్తున్నాయంటూ 2019 జనవరిలో హడావిడిగా విమానాశ్రయాన్ని ప్రారంభించారు. కానీ, వాస్తవంగా అప్పటికి రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ వంటి కీలక నిర్మాణ పనులేవీ 30 శాతం కూడా పూర్తికాలేదు. అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ వ్యక్తే ఉన్నప్పటికీ ఈ విమానాశ్రయానికి సంబంధించి కీలక అనుమతులను తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్, బే పార్క్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, నావిగేషన్ ఎక్విప్మెంట్ నిర్మించింది. ఇందుకోసం ఈ ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చుచేసింది. అంతేకాక.. కీలకమైన ఏరోడ్రోమ్ లైసెన్స్, సెక్యూరిటీ క్లియరెన్స్, అనుమతులతో పాటు ఎస్పీఎఫ్ ఫోర్స్‌లను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. 70 శాతం పైగా పనులను ప్రస్తుత ప్రభుత్వమే పూర్తిచేయడంతో ఈ ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టి 2021 మార్చిలో ప్రారంభించింది. తెట్టు వద్ద ఎయిర్‌కార్గో హబ్.. ఇక గత టీడీపీ ప్రభుత్వం నెల్లూరుకు సమీపంలో దగదర్తి వద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రతిపాదిస్తే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మధ్యలో రామాయపట్నం పోర్టుకు అత్యంత సమీపంలో తెట్టు వద్ద ఎయిర్‌పోర్టును నిర్మించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టు పక్కనే భారీ పరిశ్రమలు రానుండటంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు అనువుగా ఉండేలా ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు. ఎయిర్ కార్గొ హబ్‌గా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించడానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను ఈ ప్రభుత్వం చేపట్టింది. త్వరలో అనుమతులన్నీ రాగానే పనులు మొదలుపెట్టే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త నగరాలతో అనుసంధానం.. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వం కంటే ప్రస్తుతం అనేక కొత్త నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ పెరిగితే సర్వీసులు తగ్గిపోయాయి రెక్కలు విరిచేశారు అంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. నిజానికి.. కోవిడ్ దెబ్బతో ట్రూజెట్, జెట్ ఎయిర్వేస్ దివాలా తీయగా, స్పైస్‌జెట్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సర్వీసులను తగ్గించుకున్నాయి. చివరకు ఎయిర్ ఇండియా కూడా నష్టాలను భరించలేక టాటాలకు అప్పగించేసింది. ఇలా కోవిడ్ దెబ్బతో విమాన సర్వీసులు తగ్గితే దానికి కూడా సీఎం జగన్ కారణమనడం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శనం తప్ప మరేమీ కాదు. అలాగే, విశాఖపట్నం నుంచి గత ప్రభుత్వంలో లేని జైపూర్, గోవా, కడప, కోల్‌కత, తిరుపతిలకు కొత్త సర్వీసులు ప్రారంభమైన మాట రామోజీకి తెలియదనుకోవాలా లేక తెలిసినా తెలీనట్లు నటిస్తున్నారని అనుకోవాలా? అలాగే.. విజయవాడ నుంచి షిర్డీ, విశాఖ, షార్జాలకు, తిరుపతి నుంచి బెల్గాం, గుల్బర్గా, షివమొగ్గలకు కొత్తగా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న షార్జాకు నేరుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ద్వారా సర్వీసులను నడుపుతోంది. అదే విధంగా దుబాయ్, బెహ్రెయిన్, కువైట్, శ్రీలంక, సింగపూర్, బ్యాంకాక్‌లకు నేరుగా సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోంది. దీంతోపాటు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు.. ఆస్ట్రేలియా, యూరప్‌లకు విమాన సర్వీసులు నడపడానికి సంప్రదింపులు జరుపుతోంది. రూ.20వేల కోట్లతో తీరప్రాంత అభివృద్ధి.. కేవలం ఎయిర్‌పోర్టులే కాకుండా ప్రతీ 50 కి.మీ.లకు పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండే విధంగా పెద్దఎత్తున తీరప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా నాలుగు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్‌ల్యాండ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.20వేల కోట్లు వెచ్చిస్తోంది. విమానాశ్రయాల అభివృద్ధి.. మరోవైపు.. రాష్ట్రంలో మొత్తం ఏడు విమానాశ్రయాలు ఉండగా అందులో విశాఖతో కలిపి అయిదింటిని ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ► కర్నూలు ఎయిర్‌పోర్టును రాష్ట్ర ప్రభుత్వం, పుట్టపర్తిని శ్రీ సత్యసాయి ట్రస్ట్ నిర్వహిస్తోంది. ► రాజమండ్రి, విజయవాడ, కడప, తిరుపతి విమానాశ్రయాల్లో భారీ విమానాలు దిగేందుకు అనుకూలంగా రన్‌వేలను విస్తరించడంతో పాటు కొత్త టెర్మినల్ బిల్డింగ్‌లను నిర్మిస్తోంది. ► రాజమండ్రి విమానాశ్రయాన్ని రూ.350 కోట్లతో విస్తరణ పనులకు ఇటీవలే కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా శంకుస్థాపన చేశారు. ► అదే విధంగా.. కడప విమానాశ్రయం విస్తరణ కోసం 40 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడంతోపాటు రూ.450 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. ► అలాగే, విజయవాడ టెర్మినల్, రన్‌వే విస్తరణ పనులు దాదాపు పూర్తయి కొత్త సంవత్సరంలో అందుబాటులోకి రానుంది. ► తిరుపతి విమానాశ్రయాన్ని ఆధునీకరించడంతో పాటు అక్కడ విమానాలను రిపేర్ చేసే విధంగా ఎంఆర్ఓ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్నారు. ► కర్నూలు ఎయిర్‌పోర్టులో పైలెట్ శిక్షణా కేంద్రంతో పాటు ఏరోస్పోర్ట్స్ హబ్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. విమాన ప్రయాణికుల వృద్ధి ఇలా.. -
3న కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఈనెల 3న(బుధవారం) కాకినాడలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు. అక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు. -
ప్రభుత్వ సాయం వల్లే ఉన్నత చదువు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ప్రభుత్వ సాయం వల్లే ఉన్నత చదువు నా భర్త తోట గాబ్రియేల్ పాస్టర్‌గా సేవలు అందిస్తున్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కొత్తకొట్టాం గ్రామానికి చెందిన మాకు ముగ్గురు సంతానం. ఇద్దరు పిల్లలకు వివాహాలు చేశాం. మూడో అమ్మాయి ఎవాంజలిన్కు ఉన్నత చదువు చదవాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదివించలేమని భయంగా ఉండేది. ఆ సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా దీవెన పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం ద్వారా నా కుమార్తెను రాజానగరం కైట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీ ఫార్మసీలో జాయిన్ చేశాం. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇప్పటి వరకు రూ.68 వేలు వచ్చింది. కేవలం సీఎం జగన్ ఇచ్చిన ఆర్థిక సాయం కారణంగానే నా కూతురు ఉన్నత చదువు చదవగలుగుతోంది. మరో ఏడాది పూర్తయితే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పాస్టర్‌గా ఉన్న నా భర్తకు నెలకు రూ.5 వేలు చొప్పున సంవత్సరానికి రూ.60 వేలు వస్తోంది. సీఎం సహాయం మా కుటుంబానికి ఎంతో తోడ్పాటునిచ్చింది. – తోట హెప్సిరాణి, కోటనందూరు (ఆలంక కుక్కుటేశ్వరరావు, విలేకరి, కోటనందూరు) వేట నిషేధంలోనూ నిశ్చింత జీవనం గంగమ్మ తల్లే మాకు బతుకు తెరువు. ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్నాం. మాలాంటి వారిని ఏ ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. క్రమం తప్పకుండా ఇచ్చిన హామీలు అమలు చేసిన ఈ ప్రభుత్వం పుణ్యమా అని మాకు ఏడాది పొడవునా భుక్తి లభిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామానికి చెందిన మాకు వేటకు వెళ్తేనే జీవనం గడిచేది. వాతావరణం అనుకూలించకపోయినా.. వేట నిషేధ కాలంలోనూ బతుకు తెరువు కోసం నానా పాట్లు పడేవాళ్లం. ఈ ఏడాది తొలి సారిగా నాకు ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం కింద రూ.10 వేలు ఆర్థిక సాయం నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమయింది. మత్స్యకారుల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకేసి 75 శాతం రాయితీతో బోట్లు, వలలు మంజూరు చేస్తోంది. డీజిల్ సబ్సిడీ అందిస్తోంది. వేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే రూ.10 లక్షలు బీమా సౌకర్యం కలి్పస్తోంది. నాకు ముగ్గురు పిల్లలు. అందరూ చదువుకుంటున్నారు. అందులో చిన్నవాడికి అమ్మ ఒడి కింద మూడేళ్లుగా రూ.15 వేలు వంతున వస్తోంది. మా నాన్న చంద్రయ్యకు వైఎస్సార్ పింఛన్ కానుక అందుతోంది. మా తమ్ముడు దివ్యాంగుడు. అతనికి నెలకు రూ.3 వేలు చొప్పున పింఛన్ వస్తోంది. ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్నాం. – చీకటి దుర్యోధన, డొంకూరు (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్) కలలో కూడా ఊహించని సాయం మేము బతుకు తెరువు కోసం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మానాపురం నుంచి విశాఖ జిల్లా ఆనందపురం మండలం వేములవలస గ్రామానికి 30 ఏళ్ల క్రితం వలస వచ్చాం. భర్త సూర్యనారాయణ సైట్లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నారు. నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఏడాదిన్నర క్రితం నాకు గుండెలో భారంగా ఉండడంతో తనిఖీ చేయించుకోగా వాల్వ్ మూసుకు పోయిందని డాక్టర్లు తెలిపారు. నా నెత్తిన పిడుగు పడినట్టయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స చేస్తారని తెలిసి కొండంత ధైర్యం వచ్చింది. నా కుమారుడితో కలిసి విజయనగరం పెద్దాస్పత్రికి వెళ్లాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచితంగా అన్ని పరీక్షలు చేస్తూ మందులు ఇస్తున్నారు. ఇంతవరకు మందులతో నెట్టుకొచ్చాను. ఇక ఆపరేషన్ తప్పనిసరని, లేకుంటే ప్రాణాలకు ముప్పని గుండె డాక్టర్ చెప్పడంతో మూడు వారాల కిందట విశాఖపట్నంలో కార్పొరేట్ ఆస్పత్రిలో లక్షలు ఖర్చయ్యే బైపాస్ సర్జరీని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. జీవితాంతం మందులు ఉచితంగా ఇస్తారట. కోలుకునే వరకు నెలకు రూ.5 వేల వంతున ఆర్థిక సాయం కూడా చేస్తారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆసరా కింద మూడు విడతలుగా రూ.56,250, సున్నా వడ్డీ కింద రూ.50 వేలు ఆర్థిక సాయం అందింది. నా కుమారుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఉండడంతో మా కోడలు లావణ్య తగరపువలసలోని కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ఉచితంగా చదువుతోంది. నా భర్తకు గతేడాది ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ప్రస్తుతం నలుగురం కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాము. గత ప్రభుత్వ హయాంలో ఇంటి కోసం అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వెంటనే వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇల్లు మంజూరైంది. ప్రభుత్వం నుంచి ఇంతగా సాయం అందుతుందని కలలో కూడా మేము ఊహించలేదు. – కోరాడ జ్యోతి, వేములవలస (మహాంతి శివాజీ, విలేకరి, ఆనందపురం) -
‘వ్యర్థాలతో’ జాతీయ రహదారులు
సాక్షి, అమరావతి: పర్యావరణ కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రయత్నాలు ఆరంభించింది. దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో గుట్టలు, గుట్టలుగా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఈ వ్యర్థాలను దేశంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూమిని ఎత్తు చేసేందుకు ఉపయోగించుకోవాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఇందుకోసం చేపట్టిన పైలట్ ప్రాజెక్టులు విజయవంతమవడంతో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్ కార్పొరేషన్ సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. వ్యర్థాలను జాతీయ రహదారుల నిర్మాణం కోసం సద్వినియోగం చేసుకోవడాన్ని ఎన్హెచ్ఏఐ పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టింది. ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే, ఢిల్లీ–ఎన్సీఆర్ హైవేల నిర్మాణంలో ఈ వ్యర్థాలను ఉపయోగించింది. జాతీయ రహదారుల నిర్మాణం కోసం మార్కింగ్ చేసిన మార్గంలో భూమిని కొంత వరకు ఎత్తు పెంచిన అనంతరం కొత్త రహదారులను నిర్మిస్తారు. ఇందుకోసం ఇప్పటి వరకు మట్టి, కంకరలను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటితోపాటు నగరాలు, పట్టణాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లలోని సాలిడ్ వేస్ట్‌ను ఉపయోగించనున్నారు. కొత్తగా నిర్మించే జాతీయ రహదారుల్లో ఈ వ్యర్థాలను ఉపయోగించాలని ఎన్హెచ్ఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని నగరాలు, పట్టణాల్లోని 2,304 డంపింగ్ యార్డుల్లో ప్రస్తుతం 170 మిలియన్ టన్నుల సాలిడ్ వేస్ట్ అందుబాటులో ఉందని స్వచ్ఛ భారత్ మిషన్ అంచనా వేసింది. దాదాపు 10వేల హెక్టార్ల మేర ఉన్న డంపింగ్ ప్రదేశాల్లో ఆ వ్యర్థాలన్నీ గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని జాతీయ రహదారుల నిర్మాణం కోసం ఎన్హెచ్ఏఐకు అందించాలని స్వచ్ఛ భారత్ మిషన్ ఆదేశించింది. ఇందుకోసం డంపింగ్ యార్డ్ల వద్ద బయోమౌనింగ్ యంత్రాలను ఎన్హెచ్ఏఐ సమకూర్చనున్నది. తద్వారా దేశంలోని వ్యర్థాలను సక్రమ నిర్వహణ, సరైన రీతిలో సద్వినియోగానికి సాధ్యపడుతుందని ప్రభుత్వం కూడా భావిస్తోంది. మరోవైపు పర్యావరణ కాలుష్య సమస్యకు కూడా సరైన పరిష్కారంగా పరిగణిస్తోంది. -
పొలం నుంచి మార్కెట్‌కు..
సాక్షి, అమరావతి: పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేందుకు రైతన్నలు పడుతున్న వెతలకు చెక్ పెట్టే లక్ష్యంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల పరిధిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. మార్కెట్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయంలో ఏఏంసీల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం ఖర్చుచేయగా.. మిగిలిన కొద్దిపాటి సొమ్ములను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసే వారు. దీంతో ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఏఎంసీలకు కొత్తరూపునివ్వడంతో పాటు.. రైతు క్షేత్రాల నుంచి మార్కెట్లకు అనుసంధానించే రోడ్లను నిర్మించాలని సంకల్పించింది. ఇదే లక్ష్యంతో మార్కెటింగ్ సెస్‌ను కాస్త సవరిస్తూ ధాన్యంపై 2శాతం, రొయ్యలపై 1 శాతం, చేపలపై రూ.0.50 శాతం, మిగిలిన అన్నిరకాల నోటిఫైడ్ వ్యవసాయ, లైవ్‌స్టాక్ ఉత్పత్తులపై ఒక శాతం చొప్పున సెస్ పెంపును ప్రతిపాదించింది. ధాన్యం మినహా ఇతర ఉత్పత్తులపై ప్రతిపాదించిన సెస్ వసూలుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత రహదారులకు పెద్దపీట మరోవైపు వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను యార్డులు, మార్కెట్లకు తరలించుకునేందుకు వీలుగా రైతు క్షేత్రాల నుంచి ఏఏంసీలకు, ఏఎంసీల నుంచి మండల, నియోజకవర్గ కేంద్రాలను అనుసంధానిస్తూ అనుబంధ రహదారుల నిర్మాణం, ఏఎంసీలు, యార్డులు, మార్కెట్లు, చెక్ పోస్టులు, యార్డులు, రైతు బజార్లను ఆధునికీకరించడం, కొత్తగా ఏర్పడిన ఏఎంసీలకు భవనాలతో పాటు కొత్త జిల్లాలకు అనుగుణంగా కార్యాలయ భవనాలు నిర్మించాలని సంకల్పించారు. ఈ మేరకు ఏపీ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఏపీఎంఐడీపీ)లో భాగంగా రూ.1072.93 కోట్లతో 11,088 కి.మీ. మేర అంతర్గత రహదారుల నిర్మాణం, మరో 9,123 కి.మీ.మేర రహదారుల మరమ్మతులు, రూ.527 కోట్లతో ఏఎంసీలు, యార్డులు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ప్రభుత్వం పరిపాలనామోదం ఇచ్చింది. నాబార్డు ద్వారా రూ.1,003.94 కోట్ల రుణం మార్కెట్ సెస్ రూపంలో ఏటా రూ.550 కోట్ల ఆదాయం వస్తుండగా, ధాన్యంపై సెస్ పెంపు వల్ల గతేడాది రూ.648 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.708 కోట్లు వసూలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ మొత్తం ఏమాత్రం సరిపోదన్న ఆలోచనతో ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందాలని నిర్ణయించింది. ఆ బా«ధ్యతలను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అప్పగించింది. ఇటీవలే ఈ ప్రాజెక్టు కోసం గిడ్డంగుల సంస్థకు నాబార్డు రూ.1,003.94 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తంలో రూ.861.53 కోట్లతో అనుబంధ రహదారుల నిర్మాణం, రూ.197.76 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కింద 2024–24 ఆర్థిక సంవత్సరంలో రూ.446.20 కోట్లు, 2025–26లో రూ.669.29 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించారు. రైతు సంక్షేమం కోసమే.. పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను కల్లాల నుంచి మార్కెట్లకు తరలించేందుకు అనువైన రహదారుల నిర్మాణంతో పాటు మార్కెట్ కమిటీల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇందుకోసం రూ.1599.92 కోట్ల అంచనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇటీవలే నాబార్డు రూ.1003.94 కోట్ల రుణం మంజూరైంది. ఈ నిధులతో 2024–26 ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టనున్న పనులకు పరిపాలనామోదం ఇచ్చాం. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నాం. మౌలిక వసతుల కల్పన కోసం రుణం తీసుకుంటున్నామే తప్ప, ఈ రుణం కోసం రైతులపై పన్నుల భారం మోపుతున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
ఇదీ.. విశ్వసనీయత
సాక్షి, అమరావతి: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, విశ్వసనీయతను చాటుకుంటూ నూతన ఏడాది సందర్భంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ ద్వారా అందించే పింఛన్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3,000కి పెంచిన నేపథ్యంలో ఊరూవాడా ఉత్సాహంగా వేడుకలకు సిద్ధమైంది. జనవరి 1వ తేదీ నుంచి ఆయా మండలాలవారీగా మొదలయ్యే పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ దాకా పూర్తి పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎక్కడికక్కడ లబ్ధిదారులతో స్వయంగా మమేకమవుతూ ఈ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొననున్నారు. సోమవారం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలు కానుండగా ఈనెల 3వతేదీన సీఎం జగన్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజి గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పెంచిన పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారులకు అందచేయనున్నారు. వలంటీర్లు ఎప్పటి మాదిరిగానే లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు. అయితే ఈసారి రాష్ట్రమంతటా ఒకేసారి కాకుండా నిర్దేశించిన మేరకు ఆయా మండలాలు, మున్సిపాలిటీల వారీగా పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. ఆయా చోట్ల ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొని పంపిణీని ప్రారంభిస్తారు. ఇలా ఈనెల 8వతేదీ వరకు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మొత్తంగా ఒకటో తేదీ నుంచే రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభించి అందరికీ వలంటీర్ల ఆధ్వర్యంలో ఇళ్ల వద్దే పంపిణీ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కొత్త పింఛన్లు 1.17 లక్షలు జనవరి నుంచి కొత్తగా మరో 1,17,161 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేసింది. ఈ నెలలో కొత్తగా జారీ చేసిన వారికి స్థానిక శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు పింఛను మంజూరు పత్రాలను అందజేస్తారు. ఈ నెలలో కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన వారితో కలిపి మొత్తం 66.34 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీకి ప్రభుత్వం రూ.1,968 కోట్లను విడుదల చేసింది. సీఎం లేఖను చదివి వినిపిస్తూ.. ఈ నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని రూ.2,750 నుంచి రూ.3,000కి పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులందరికీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇళ్ల వద్ద పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే సమయంలో సీఎం జగన్ రాసిన లేఖ ప్రతిని వలంటీర్లు వారికి అందజేస్తారు. లబ్ధిదారులకు లేఖ సారాంశం పూర్తిగా అర్ధమయ్యేలా వలంటీర్లే ఆ లేఖను చదివి వినిపించాలని అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నమ్మకాన్ని పెంచుకుంటూ... దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. టీడీపీ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.1,000 మాత్రమే పింఛన్ అందించగా సీఎం జగన్ ప్రభుత్వం నెలకు రూ.2,250 చొప్పున ప్రారంభించి రూ.3,000 దాకా ఏటా పెంచుకుంటూ వచ్చింది. కరోనా గడ్డు కాలంలోనూ పెంపూ ఆగలేదు.. పెన్షన్లూ ఆగలేదు. మొత్తం లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో కూడా పింఛన్లు పెంచడమూ ఆగలేదు.. పంచడమూ ఆగలేదు. ‘అవ్వాతాతల పింఛన్ రూ.3,000 వరకు పెంచుకుంటూ పోతాం...’ అని 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన మాటను ముఖ్యమంత్రి జగన్ తు.చ. తప్పకుండా ఆచరించి చూపారు. ఆత్మ గౌరవంతో పింఛన్లు.. పింఛన్ల కోసం చంద్రబాబు సర్కారు హయాంలో అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న దుస్థితిని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. అవ్వాతాతలకు మనవడిగా, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అన్నగా, తమ్ముడిగా, చేనేత, కల్లుగీత, మత్స్య, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు శ్రేయోభిలాషిగా మానవీయ కోణంలో సీఎం జగన్ సంస్కరణలు చేపట్టారు. ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దే పెన్షన్లను అందిస్తున్నారు. ► గత పాలకుల హయాంలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 2.6 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఒకటో తేదీనే గడప వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. సెలవైనా, పండుగైనా సరై టంచన్‌గా చేతిలో పింఛన్లు పెడుతున్నారు. ► టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే కొత్తగా పెన్షన్లు మంజూరైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండీ ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందకుంటే వారికి మరో అవకాశాన్ని కల్పిస్తూ ఏటా జూన్, డిసెంబర్లలో ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టారు. ► ఇప్పుడు పెన్షన్ల కోసం దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21 రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డులను మంజూరు చేస్తున్నారు. ► టీడీపీ హయాంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన పెన్షన్ మొత్తం రూ.58,000 మాత్రమే కాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆయా లబ్ధిదారులు ఒక్కొక్కరికీ రూ.1,47,500 అందిస్తోంది. గత ప్రభుత్వం కంటే ఇది రూ.89,500 అదనం. ► టీడీపీ హయాంలో దివ్యాంగుల పెన్షన్ కింద ఐదేళ్లలో ఒక్కొక్కరికీ రూ.58,500 మేర మాత్రమే లబ్ధి చేకూర్చగా ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వారికి రూ.1,82,000 అందిస్తోంది. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం ► టీడీపీ సర్కారు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు కాగా ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం 66.34 లక్షల మందికి పింఛన్లను అందచేస్తోంది. పింఛన్లకే రూ.83,526 కోట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్లలో ఏకంగా 29,51,760 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. దీంతో పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 66.34 లక్షలకు చేరుకుంది. ఒక్క పెన్షన్ల కోసమే ప్రభుత్వం ఏటా రూ.23,556 కోట్లు వెచ్చిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల రూపంలో రూ.83,526 కోట్లను అందించినట్లు అధికారులు వెల్లడించారు. పింఛన్ పెరిగిందిలా... – టీడీపీ పాలనలో పెన్షన్ రూ.1,000 మాత్రమే – జూలై 2019 నుంచి పెన్షన్ రూ.2,250కి పెంచిన సీఎం జగన్ – జనవరి 2022న రూ.2,500కు పెన్షన్ పెంపు – జనవరి 2023న రూ.2,750కు పెంపు – జనవరి 2024న రూ.3 వేలకు పెంపు నాడు 400 కోట్లు.. నేడు 1,968 కోట్లు – 2014–19 మధ్య టీడీపీ హయాంలో నెలకు పెన్షన్ల సగటు వ్యయం రూ.400 కోట్లు. – జూలై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,384 కోట్లు – జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,570 కోట్లు – జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు – జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,968 కోట్లు -
AP: రేపటి నుంచి వైఎస్సార్ పెన్షన్ రూ.3000
సాక్షి, అమరావతి: రేపు(సోమవారం) ప్రజలంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. కొత్త ఏడాది నుంచి ఏపీలో పెన్షనర్లకు వైఎస్సార్ పెన్షన్ కానుక మూడు వేలకు పెరగనుంది. పెన్షన్‌దారులకు మూడు వేలు అందనున్నాయి. కాగా, సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో.. అవ్వాతాతలకు మనవడిగా, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అన్నగా, తమ్ముడిగా, చేనేత, కల్లుగీత, మత్స్య, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు శ్రేయోభిలాషిగా జగనన్న ప్రభుత్వం మనసుతో పెంచి ఇస్తున్న.. వైఎస్సార్ పెన్షన్ కానుక, ఠంఛన్‌గా పెన్షన్, పింఛన్ల పెంపు అవ్వాతాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.. అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా నెరవేరుస్తూ!.. ఇకపై ప్రతీ నెలా రూ.3,000 ►రాష్ట్రవ్యాప్తంగా 1 జనవరి, 2024 నుండి 8 రోజులపాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు.. ప్రజా ప్రతినిధులు, శాసన సభ్యులు, గ్రామస్తులు అందరూ ఒకటో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ►3 జనవరి, 2024న కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటూ, పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు సీఎం జగన్ అందజేయనున్నారు. ►దీంతోపాటు కొత్తగా అర్హులైన 1,17,161 మందికి పెన్షన్ కార్డుల పంపిణీ. ►దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ►గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ఠంఛన్‌గా ప్రతీ నెలా ఒకటో తేదీ ప్రొద్దున్నే తలుపు తట్టి, గుడ్ మార్నింగ్ చెప్పి మరీ చిరునవ్వుతో లబ్దిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేత.. అది ఆదివారమైనా, సెలవు రోజైనా సరే.. ►పెన్షన్ పెంపు ద్వారా అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి. ►గత పాలనలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ పెన్షన్ కేటగిరిలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఒక్కో లబ్దిదారుడికి నెలకు అందించిన పెన్షన్ కేవలం రూ.1,000. అయితే, జగనన్న ప్రభుత్వం ఒక్కో లబ్దిదారునికి పెన్షన్ నెలకు రూ. 2,250తో మొదలుపెట్టి పెంచుకుంటూ రూ.3,000 దాకా తీసుకొచ్చింది. ప్రతీ నెలా ఠంచన్‌గా అందిస్తూ.. ►1 జనవరి, 2024 నుండి 66.34 లక్షల పెన్షన్లపై ఏటా చేయనున్న వ్యయం రూ.23,556 కోట్లు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ. 83,526 కోట్ల పైమాటే. పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్. పెన్షన్ పెంపు ఇలా.. జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250లకు పెంపు. జనవరి 2022న రూ.2,500కు పెన్షన్ పెంపు. జనవరి 2023న రూ. 2,750కు పెంపు. జనవరి 2024న రూ.3వేలకు పెంపు. ►పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ►2014-19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. ►జులై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1384 కోట్లు. ►జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1570 కోట్లు. ►జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు. ►జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,968 కోట్లు. ►గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం నెలకు రూ.1000 చొప్పున, ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఖర్చుచేసిన మొత్తం నెలకు రూ.400 కోట్లు మాత్రమే. అదే జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు. గడిచిన ఐదేళ్లలో 55 నెలల్లో కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు 29,51,760. ►ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం నెలకు రూ.3000 చొప్పున 66.34 లక్షల మందికి నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లు. గడచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.83,526 కోట్లు. ►పెన్షన్ లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వ పాలనలో 39 లక్షలు ఉంటే, ఇప్పుడు 66.34లక్షలకు పెంపు: ►గత ప్రభుత్వంలో 2014-19 మధ్య లబ్ధిదారులు 39 లక్షలు. ►2019లో పెన్షన్ లబ్ధిదారులు రూ.52.17 లక్షలు. ►2022లో పెన్షన్ లబ్ధిదారులు రూ.62 లక్షలు. ►2023లో పెన్షన్ లబ్ధిదారులు రూ.64.45 లక్షలు. ►2024లో పెన్షన్ లబ్ధిదారులు రూ.66.34 లక్షలు. పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను చూసుకుంటే.. ►గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటలతరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6లక్షల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఠంచన్‌గా ప్రతినెలా కొటో తేదీనే పొద్దుటే తలుపుతట్టి గుండ్ మార్నింగ్ చెప్పిమరీ చిరునవ్వుతో లబ్ధిదారుల గడపవద్దనే పెన్షన్లు అందిస్తున్నారు. సెలవు, పండుగ రోజులు అయినా పెన్షన్లను అందిస్తున్నారు. ►గత ప్రభుత్వ పాలనలో పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, వీలైనంతమందికి లబ్ధి ఎలా ఎగ్గొట్టాలా అన్ని కుతంత్రాలు, గ్రామానికి ఇంతమందికే లబ్ధి అనే కోటాలు, కోతలు చేసేవారు. ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి అవకాశం వచ్చేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే పెన్షన్లు ఇచ్చే ధోరణి ఉండేది. అందులోనూ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే వృద్ధులు, వికలాంగులు, అన్న కనికరం కూడా లేకుండా వారికిచ్చే పెన్షన్లలో వాటా కొట్టేసేలా గత పాలన ఉండేది. ►నేడు, కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, అశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హులైన ఉండి ఒకవేళ ఏ కారణంచేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో బైయాన్యువల్ శాంక్షన్ల ద్వారా లబ్ధి అందజేస్తున్నారు. ►పెన్షన్ల మంజూరుకోసం మధ్య దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి మరీ, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డుల మంజూరు చేస్తోంది ఈ ప్రభుత్వం. అవ్వాతాతలు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు చేదోడు వాదోడుగా వాలంటీర్, సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. లబ్ధిదారు ఆత్మాభిమానం నిలబడేలా వారికి సేవలు అందిస్తోంది. ►2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన మొత్తం రూ.58,000 ►ఈ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందించిన, అందిస్తున్న మొత్తం రూ.1,47,500. గత ప్రభుత్వంలో కంటే రూ.89,500 అదనం. ►గత ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ అందించిన, అందిస్తున్న లబ్ధి రూ.1,82,000. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం. -
2023 సుభిక్షం.. సంతోషం
మరపురాని సంవత్సరమిది. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా మరో మెట్టు పైకి ఎక్కిన ఏడాదిది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు.. తదితర రంగాల అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేసిన విత్తనం మొలిచి.. మొక్కై ఎదిగి.. వృక్షంగా మారి ఫలాలిచ్చింది. సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు తమ సొంత కాళ్లపై నిలిచి కుటుంబాలను ముందుకు నడుపుతుండటం ఊరూరా.. ఇంటింటా కనిపిస్తోంది. ప్రతి పల్లెలోనూ ప్రగతి వికసిస్తోంది. కొత్త పరిశ్రమలు, పచ్చటి పంటలతో శివారు ప్రాంతాలు కళకళలాడటం సాక్షాత్కరిస్తోంది. నాడు–నేడుతో రూపు మార్చుకున్న పాఠశాలలు, నిమిషాల వ్యవధిలో వైద్యం అందించే విలేజ్ క్లినిక్‌లు, రైతన్నను చేయి పట్టుకుని వడివడిగా నడిపిస్తున్న ఆర్బీకేలు.. ప్రజల జీవన స్థితిగతుల్లో కీలక మార్పులు తేవడం గ్రామ గ్రామాన ఆవిష్కృతమైంది. పిల్లలు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ కావడం సంతోషాన్నిస్తోంది. 31 లక్షల ఇళ్ల పట్టాలు పొందిన అక్కచెల్లెమ్మల్లో 22 లక్షల మంది ఇళ్లు నిర్మించుకోవడంలో నిమగ్నమవడం కళ్లకు కడుతోంది. ఇందులో లక్షలాది మంది గృహ ప్రవేశాలతో సందడి చేయడం ఊరూరా కనిపించింది. పేద ప్రజలు అనారోగ్యం బారినపడితే నేనున్నానంటూ రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయించడానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడం ప్రధానంగా అమితానందాన్నిస్తోంది. ‘హౌస్’ఫుల్ హ్యాపీ ► రాష్ట్రంలోని లక్షలాది మంది పేదింటి అక్కచెల్లెమ్మలకు ఈ ఏడాది సొంతింటి కల నెరవేరింది. ► ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.75 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు విలువ చేసే భూముల్లో పక్కా లే అవుట్లు సిద్ధం చేసి 30.7 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మల పేరిట నివేశన స్థలాలను పూర్తి ఉచితంగా పంపిణీ చేసింది. ► ఆ లే అవుట్లలో 17,005 వైఎస్సార్–జగనన్న కాలనీలు నిర్మిస్తోంది. ఈ కాలనీల్లో 21.75 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతి మంజూరుచేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల చొప్పున సాయం అందిస్తోంది. ► ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,85,829 సాధారణ ఇళ్లు, 1,57,566 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసింది. అక్టోబర్ 12న కాకినాడ జిల్లా సామర్లకోటలో సీఎం వైఎస్ జగన్ స్వయంగా పేదింటి గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ► కేవలం 2023 సంవత్సరంలోనే 4.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ► నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ చకచకా విద్యుత్, కుళాయి, డ్రెయినేజీ కనెక్షన్లు ఇస్తోంది. ప్రజారోగ్యానికి ఆరోగ్యశ్రీ ‘రక్ష’ 2023లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో పలు విప్లవాత్మక కీలక పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని.. ► డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి ఏకంగా రూ.25 లక్షలకు పెంచి.. ఆ మేరకు డిసెంబర్ 18వ తేదీనుంచి ఆరోగ్యశ్రీ కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ ► గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు.. మంచానికి పరిమితం అయిన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు ► రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్) అమలు ► కొన్ని దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలకు పెద్ద ఊరటను కల్పిస్తూ..రూ.85 కోట్లతో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ పరిశోధన ఆస్పత్రి నిర్మాణం. డిసెంబర్ 14న రూ.700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ ప్రారంభం. ► ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా ఆ శాఖలోని నియామకాల కోసం ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు ► 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైద్య శాఖలో 53 వేలకుపైగా పోస్టులు భర్తీ.. ప్రభుత్వ వైద్యశాఖలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తూ ఈ ఏడాది విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలు ప్రారంభం. నవరత్నాలతో నవోదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ‘నవరత్నాలు’ పేరిట సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి అమలు చేస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు, అక్కచెల్లెమ్మల కుటుంబాలకు సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి డైరెక్టు బెటిఫిట్ ట్రాన్సఫర్ (డీబీటీ), పరోక్షంగా (నాన్ డీబీటీ) అందించిన సంక్షేమ సాయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ తమకు అందిçస్తున్న సంక్షేమ పథకాలు వల్లే తాము ఆనందంగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నామని ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రజలకు మేలు చేసేలా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న నవరత్నాలు ద్వారా నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ.2,47,564.36కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.1,67,530.95కోట్లు అందించారు. మొత్తంగా రూ.4,15,095.31కోట్లు లబ్ధిని చేకూర్చడం ఒక రికార్డు. సం‘క్షేమం’గా అన్నదాత ► 2023–24 సీజన్లో 53.53 లక్షల మంది రైతు కుటుంబాలకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.6,147.72 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఈ ఏడాది సాయంతో కలిపి ఈ నాలుగున్నరేళ్లలో రూ.33,209.13 కోట్ల పెట్టుబడి సాయం చేశారు. ► గతేడాది రబీ సీజన్లో విరుచుకుపడ్డ మాండూస్ తుపాన్‌తో పాటు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న 1.54 లక్షల మందికి ఈ ఏడాది రూ.142 కోట్ల మేర పంటల బీమా పరిహారాన్ని జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి ఈ నాలుగున్నరేళ్లలో 22.85 లక్షల మందికి రూ.1976.45 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందించినట్టయింది. ► ఖరీఫ్–2022 సీజన్‌కు సంబంధించి 10.20 లక్షల మంది రైతులకు రూ.1117.21 కోట్ల పంటల బీమా పరిహారాన్ని జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి ఈ నాలుగున్నరేళ్లలో 54.48 లక్షల మందికి రూ.7802.05 కోట్ల మేర బీమా పరిహారం అందజేశారు. ► ఆర్బీకేలకు అనుసంధానంగా నూరు శాతం వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అంచనాతో ఈ ఏడాది కొత్తగా 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి కోసం ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంక్ ఖాతాలకు రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేశారు. ► 28,112 మంది రైతుల నుంచి 337 టన్నుల శనగలు, 9027 మంది రైతుల నుంచి 71,445 టన్నుల మొక్కజొన్న, 312 మంది రైతుల నుంచి 413 టన్నుల పసుపు కొనుగోలు చేశారు. ఇలా ఇప్పటి వరకు రూ.7712 కోట్ల విలువైన 21.55 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ► ఈ ఏడాది రూ.2.31 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 80.76 లక్షల మందికి రూ.1.70 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశారు. 8.28 లక్షల మంది కౌలుదారుల్లో 5.32 లక్షల మందికి రూ.1592.79 కోట్ల రుణాలు మంజూరు చేశారు. నాలుగున్నరేళ్లలో రూ.1.75 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరింది. సస్యశ్యామలం... ► హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూల్, నంద్యాల జిల్లాల్లోని పశి్చమ మండలాల్లో 77 చెరువులను నింపడం ద్వారా సస్యశ్యామలం చేసే లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది. ► గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్‌ను ప్రభుత్వం పూర్తి చేసింది. ► వెలిగొండ ప్రాజెక్టులో మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ.ల పనులను 2021, జనవరి 13 నాటికే పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లలో ఇప్పటికే 7.506 కి.మీ.ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. ► 2013–14 ధరలతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని.. తాజా ధరల మేరకు నిధులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ► తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. – సాక్షి, అమరావతి కరువు తీరేలా కరెంట్ ► నాణ్యమైన, నిరంతర విద్యుత్ పంపిణీకి ప్రభుత్వం విశేష కృషి. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి 14 రకాల విద్యుత్ సేవలు. అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార చార్జీల రూపంలో రూ.304.2 కోట్ల ఆదాయం. స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ. ► ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా రూ.13వేల కోట్ల అభివృద్ధి పనులు. విద్యుత్ ఉత్పత్తిలో దేశీయ యావరేజి కన్నా రాష్ట్రం ఎక్కువ నమోదు. గతేడాదితో పోల్చుకుంటే విద్యుత్‌శాఖకు తక్కువ నష్టాలు. ► డి్రస్టిబ్యూషన్ సెక్టార్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 12 సబ్స్టేషన్లు పూర్తి. కృష్ణ పట్నం యూనిట్లో 800 మెగావాట్లు, డాక్టర్ ఎనీ్టటీపీఎస్ యూనిట్లో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం. దీంతో అందుబాటులోకి 40 మిలియన్ యూనిట్లు. ► నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్లతో మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు. వీటి ద్వారా 5300 మందికి ఉద్యోగాలు. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లతో మరో రెండు వేలమందికి ఉద్యోగాలు. ► మార్చిలో వైజాగ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్(జీఐఎస్)లో ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 ఎంఓయూలు. వీటి విలువ రూ.9.57 లక్షల కోట్లు. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలకు అవకాశం. కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు. ► రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు. రాయలసీమ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి దివంగత కారి్మక నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి పేరు. తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీ సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో వైఎస్సార్సీపీకి ఈఏడాది ప్రజల్లో భారీగా మద్దతు పెరుగుతోంది. దీంతో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ► రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలనూ గెలిచి వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ► శాసనమండలిలో ఖాళీ అయిన 21 స్థానాలకు (ఎమ్మెల్యే కోటా 7, స్థానిక సంస్థల కోటా 9, పట్టభద్రులు 3, ఉపాధ్యాయులు 2) మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 17 స్థానాలను చేజిక్కించుకుని వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు స్థానాల్లో టీడీపీ గెలిచింది. మండలిలో వైఎస్సార్సీపీ బలం 46కు పెరిగింది. ► ప్రతిపక్షాల దు్రష్ఫచారాలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఏప్రిల్ 7 నుంచి 29 వరకు జగనన్నే మా భవిష్యత్తు పేరుతో వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని చేపట్టింది. 1.45 కోట్ల కుటుంబాలతో వైఎస్సార్సీపీ శ్రేణులు మమేకమయ్యాయి. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు చేసిన మేలును వివరించడానికి అక్టోబర్ 25న వైఎస్సార్సీపీ ప్రారంభించిన సామాజిక సాధికార యాత్ర జన నీరాజనాల మధ్య కొనసాగుతోంది. ► మళ్లీ వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించడం కోసం నవంబర్ 9 నుంచి చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి ప్రతి ఇంటా జనం నీరాజనాలు పలుకుతున్నారు. ప్రభుత్వ చదువులకు అందలం రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇచి్చన ప్రాధాన్యం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.దాదాపు 43 లక్షల మంది చదువుకుంటున్న 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం బోధనతో పాటు మనబడి నాడు–నేడు పథకం కింద ప్రభుత్వం సమూల మార్పులు తెచి్చంది. ► 2022–23 విద్యా సంవత్సరంలో ఐఎఫ్‌పీలతో డిజిటల్ బోధన చేపట్టడంతో పాటు, చదువులో రాణించిన ఉత్తమ విద్యార్థులను సత్కరించి ఏపీ ఆదర్శంగా నిలిచింది. ► ఇంటర్, టెన్త్ల్లో ఉత్తమ మార్కులు సాధించిన 22,768 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించి వారికి ‘జగనన్న ఆణిముత్యాలు– స్టేట్ బ్రిలియన్స్ అవార్డు’లను ప్రదానం చేసింది. ► ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 10 మంది విద్యార్థులను అమెరికా పర్యటనకు పంపించారు. వారు ఐక్యరాజ్యసమితి ఎస్డీజీ సదస్సులో ప్రసంగించారు. ప్రపంచ బ్యాంకు, కొలంబియా యూనివర్సిటీలను సందర్శించి వచ్చారు. ► ఈ ఏడాది 1,000 ప్రభుత్వ స్కూళ్లల్లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణకు అనుమతి లభించింది. బాలికల చదువు కోసం ప్రభుత్వం ప్రతి మండలానికి ఓ జూనియర్ కాలేజీని అందుబాటులోకి తెచ్చింది. ► 3 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు టోఫెల్ ప్రైమరరీ, టోఫెల్ జూనియర్ సరి్టఫికేషన్ కోర్సులను ప్రారంభించింది. ► దీక్ష, ఏపీఈ–పాఠశాల డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్ల ద్వారా ఆన్లైన్ పాఠాలు సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పునర్నిర్మించి...పూర్వ వైభవం తెచ్చి..! 2016లో జరిగిన కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లకు అడ్డుగా ఉన్నాయని నాటి టీడీపీ ప్రభుత్వం కూలి్చవేసిన ఆలయాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునఃనిర్మించింది. ఈ ఆలయాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునర్నిర్మించి, 2023 డిసెంబరు 7న ప్రారంభించింది. పునఃనిర్మించిన ఆలయాల్లో 1) దక్షిణాముఖ ఆంజనేయస్వామి ఆలయం 2) సీతమ్మవారి పాదాలు 3) శ్రీసీతారామలక్ష్మణ సమేత దాసాంజనేయస్వామి ఆలయం 4) వీరబాబు ఆలయం 5) విజయవాడ గో సంరక్షణ సంఘం 6) బొడ్డు బొమ్మ 7) ఆంజనేయస్వామి, వినాయకస్వామి వార్ల ఆలయాల తొలిమొట్టు 8)శ్రీ శనైశ్వరస్వామి వారి ఆలయాలు ఉన్నాయి. వీటికి వైఎస్ జగన్ ప్రభుత్వం 2021 జనవరి 8న శంకుస్థాపన చేసి మూడేళ్ల లోపే రూ.3.87 కోట్లతో పనులు పూర్తి చేసింది. పారిశ్రామిక నామ సంవత్సరం రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని సువర్ణ అక్షరాలతో నిలిపి భవిష్యత్ తరాలకు కొండంత అండను అందించింది.. 2023వ సంవత్సరం. వైఎస్ జగన్ ప్రభుత్వం పారిశ్రామిక దిగ్గజాలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ► మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, జిందాల్, భంగర్, ఒబెరాయ్, భజాంకా, దాల్మియా, మిట్టల్, జీఎంరావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతారెడ్డి, సతీష్ రెడ్డి, బీవీఆర్ మోహన్‌రెడ్డి, మషాహిరో యమాగుచి, ‘టెస్లా’ మార్టిన్ ఎబర్‌హార్డ్ తదితర కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు. ► ఈ సమ్మిట్‌లో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఎంవోయూలను ప్రభుత్వం కుదుర్చుకుంది. తద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభించనుంది. భోగాపురం ఎయిర్‌పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టులు నిర్మాణ పనులు ప్రారంభించాయి. ► ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బీఈఎల్, రాడ్స్టాండ్ తదితర దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించాయి. ► బ్లూస్టార్, డైకిన్, డిక్సన్, టీసీఎల్, మునోత్ తదితర అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. ∙బద్వేల్లో ‘సెంచురీ ప్యానల్స్’ ఉత్పత్తిని ప్రారంభించింది. తద్వారా స్థానికంగా 2,500 మందికి ఉపాధి, 20,000 మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తోంది. ► శ్రీసిటీలో కొత్తగా ఆరు కంపెనీలు నిర్మాణ పనులు మొదలు పెట్టగా.. 18 కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయి. పలు ప్రముఖ కంపెనీలు విస్తరణ చేపట్టాయి. -
తుంగభద్రలో నీటి లభ్యత సగంలోపే!
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పుల కారణంగా తుంగభద్ర బేసిన్లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడం వల్ల తుంగభద్ర (టీబీ) డ్యామ్‌లో నీటి లభ్యత ఈ ఏడాది సగానికి పడిపోయింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు డ్యామ్‌లోకి 114.58 టీఎంసీల ప్రవాహం మాత్రమే వచ్చింది. తుంగభద్ర నదిలో వందేళ్ల ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని.. టీబీ డ్యామ్ వద్ద 75 శాతం లభ్యత ఆధారంగా 230 టీఎంసీల లభ్యత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా 1976లో వేసింది. దీన్ని బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ 2010లో ఖరారు చేసింది. కానీ.. రెండు ట్రిబ్యునళ్లు అంచనా వేసిన దాంట్లో సగం నీళ్లు కూడా ఈ ఏడాది టీబీ డ్యామ్‌లోకి చేరకపోవడం గమనార్హం. టీబీ డ్యామ్ చరిత్రలో 2016–17లో వచి్చన 85.71 టీఎంసీలే కనిష్ట ప్రవాహం. ఈ ఏడాది వచ్చింది రెండో కనిష్ట ప్రవాహం. శనివారం నాటికి టీబీ డ్యామ్‌లో 10.29 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 76.91 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. టీబీ డ్యామ్‌లో ఇదే సమయానికి గత పదేళ్లలో సగటున 50.60 టీఎంసీలు నిల్వ ఉండేవి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే గత పదేళ్లలో కనిష్ట నీటి నిల్వ ఉండడం కూడా ఇదే తొలిసారి. టీబీ డ్యామ్ నుంచి కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండడంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తున్నది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో 3 రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తున్నది. ఈ ఏడాది నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో ఆయకట్టులో ఆరు తడి పంటలకు నీటిని సరఫరా చేశారు. 2019–20 నుంచి 2022–23 వరకుటీబీ డ్యామ్‌లోకి భారీగా వరద చేరడంతో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించారు. టీబీ డ్యామ్ చరిత్రలో గతేడాది అంటే 2022–23లో వచి్చన 606.64 టీఎంసీలే గరిష్ట వరద ప్రవాహం కావడం గమనార్హం. -
ముందస్తు బెయిల్ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించాల్సిన వేళ హైకోర్టు అసలు ముందస్తు బెయిల్ ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై కీలక తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 438 కింద ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టుకున్న అధికారం అసాధారణమైనదని తేల్చి చెప్పింది. ఈ అధికారాన్ని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని అసాధారణ కేసుల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అన్నది కొంతవరకు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని ఉపయోగించే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అంటే.. నిందితుడిని విచారించడం, అవసరమైన సాక్ష్యాలను సేకరించడం, దాచిపెట్టిన వాస్తవాలను వెలికి తీయడం వంటి విషయాల్లో దర్యాప్తు సంస్థకు ఆశాభంగం కలిగించడమే. ఇంటరాగేషన్ దశలో నిందితుడు, అనుమానిత వ్యక్తికి ముందస్తు బెయిల్ ద్వారా రక్షణ లభిస్తే, అతను దర్యాప్తు అధికారుల విచారణ నుంచి తప్పించుకోవడంలో విజయవంతమైనట్టే. ముందస్తు బెయిల్‌ను రొటీన్ విధానంలో మంజూరు చేయడానికి వీల్లేదన్నది ఇప్పటికే రూఢీ అయిన న్యాయ సూత్రం. ముందస్తు బెయిల్ వంటి అసాధారణ ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించాల్సిన అసాధారణ పరిస్థితులు ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. 65 ఏళ్ల వృద్ధుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో భారీ భూ కుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వచ్చే వారం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. వరకట్న వేధింపుల కేసులో.. ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త చంద్రశేఖర్‌తోపాటు అతని తండ్రి రామయ్య (65), మరికొందరిపై నెల్లూరు దిశ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రశేఖర్‌కు కింది కోర్టు ముందస్తు బెయిల్, అతని తండ్రి రామయ్యకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కాగా.. బెయిల్‌పై విడుదలయ్యే సమయంలో చంద్రశేఖర్, అతని తండ్రి రామయ్య నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించారంటూ చంద్రశేఖర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ బెయిల్ రద్దు చేయాలంటూ కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కింది కోర్టు చంద్రశేఖర్ బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అంతకు ముందే నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించిన ఆరోపణలపై నెల్లూరు జిల్లా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు చిన్నబజార్ పోలీసులు చంద్రశేఖర్, రామయ్యపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలంటూ చంద్రశేఖర్ సతీమణి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రశేఖర్, అతని తండ్రి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే.. కింది కోర్టు చంద్రశేఖర్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకోగా.. అతని తండ్రి రామయ్య వ్యాజ్యాన్ని మాత్రం కొనసాగించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత చంద్రశేఖర్ భార్య దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ప్రధాన నిందితునిగా ఉన్న చంద్రశేఖర్‌కు కింది కోర్టు ఇప్పటికే పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిందని, అందువల్ల అతని తండ్రి రామయ్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అంతేకాక.. సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించే సమయంలో వరకట్న వేధింపు కేసులో రామయ్య జైలులో ఉన్నారని, అందువల్ల ఆయన నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్ల సమర్పణకు అతన్ని బాధ్యుడిగా చేయడం తగదన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అటు పోలీసులు, ఇటు చంద్రశేఖర్ భార్య కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు పిటిషనర్ రామయ్య వాదనను తోసిపుచ్చారు. నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ రామయ్య ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ.. ముందస్తు బెయిల్ ఎలాంటి సందర్భాల్లో ఇవ్వాలో న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. -
సిగ్గు.. సిగ్గు.. నవ్విపోతారు!
రామోజీకి ‘పచ్చ’ పైత్యం ముదిరిపోయింది. తన బాబు.. చంద్రబాబును ప్రతిపక్ష నేతగా చూడలేక దిగులు పెరిగిపోయింది. ఇప్పటికిప్పుడే ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే ఆత్రం మితిమీరింది. ఏదో విధంగా జనాన్ని ఏమార్చాలనే కుట్ర, కుతంత్రం ప్రతి కథనంలోనూ కనిపిస్తోంది. జనానికి సీఎం వైఎస్ జగన్ దగ్గరవ్వడం జీర్ణించుకోలేక నిత్యం అబద్ధాలు అచ్చేయడం పరిపాటిగా మారింది. గురువారం ‘ఈనాడు’ పత్రిక బ్యానర్ కథనంలో ఇచ్చిన ఫొటోను కాసేపు పరిశీలిస్తే రామోజీ డొల్లతనం ఇట్టే తెలిసిపోతోంది. ఆ ఫొటోలో పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థులందరూ చక్కగా దుప్పట్లు కప్పుకోవడం కనిపిస్తోంది. కొందరైతే అదనంగా తల కింద మరో దుప్పటి పెట్టుకోవడం కూడా కనిపించింది. కేవలం ముగ్గురు విద్యార్థులు దుప్పటి కప్పుకోలేదు. ఆ ముగ్గురికి కూడా దుప్పట్లు ఉన్నాయి. వారు కప్పుకోక పోవడం ప్రభుత్వం తప్పా రామోజీ? ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ప్రగతి మీకు మాత్రమే ఎందుకు కనిపించడం లేదు? చంద్రబాబు ఇచ్చిన దుప్పట్లో దూరుకున్న మీకెలా కనిపిస్తుందిలే..! కర్నూలు (అర్బన్): ప్రజలు ఏమైనా అనుకుంటారన్న ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా లేకుండా నిత్యం తప్పుడు కథనాలతో ‘ఈనాడు’ అబద్ధాలు వండి వారుస్తోంది. కట్టు కథలు అల్లి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో పచ్చ పత్రిక పరువు పోగొట్టుకుంటోంది. ఈ నెల 30న ఈనాడు మొదటి పేజీలో ‘మనసు లేని మామ’ శీర్షికతో ప్రచురించిన కథనంలో కర్నూలు డాక్టర్స్ కాలనీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదని, చలికి విద్యార్థులు గజగజ వణికిపోతున్నారని రాశారు. వాస్తవానికి ఈ పాఠశాలలో అలాంటి పరిస్థితే లేదు. డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మొత్తం 90 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 5న ప్రభుత్వం ఈ పాఠశాలకు వంద దుప్పట్లు సరఫరా చేసింది. వీటిని ఈ నెల 6నే విద్యార్థులకు అందించి, వారికి దుప్పట్లు అందినట్లు సంతకాలను కూడా (అక్విటెన్స్) రిజిస్టర్లో నమోదు చేశారు. కనీసం ఈ విషయాలేవీ తెలుసుకోకుండానే ‘ఈనాడు’ దుర్మార్గంగా ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ప్రజల మనుసుల్లో విషం జొప్పించే యత్నం చేసింది. ఈనాడు తీరు పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లెదుటే వాస్తవం కనిపిస్తుంటే ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా రాస్తారని ఆశ్చర్యపోయారు. అర్ధరాత్రి పూట హాస్టల్ ఫొటోలు తెప్పించుకుని.. ఇలా తప్పుడు రాతలు రాయడం ఏం జర్నలిజం అని హాస్టల్ పరిసర ప్రాంతాల ప్రజలు విస్తుపోతున్నారు. నాడు–నేడు కనిపించలేదా రామోజీ? వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు నడుం బిగించడం తెలిసిందే. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఆయా విద్యా సంస్థల్లో సకల వసతులు కల్పిస్తోంది. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు చేపట్టి, పూర్తి చేసింది. రెండవ దశలో 22,217 పాఠశాలల్లో పనులు ప్రారంభించింది. చాలా వాటిలో పనులు పూర్తయ్యాయి. మరికొన్నింటిలో చివరి దశలో కొనసాగుతున్నాయి. మిగతా స్కూళ్లను మూడో దశలో అభివృద్ధి చేస్తోంది. ఈ విషయం రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్లి చూసినా కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తుంది.. ఒక్క రామోజీకి తప్ప. నాడు–నేడు కింద పనులు జరగని పాఠశాలలను వ్యూహాత్మకంగా ఎంచుకుని ప్రభుత్వంపై ఈనాడు బండలేస్తోంది. ఇప్పుడు చలి కాలం వచ్చిందనే నెపంతో దుప్పట్లు లేవంటూ అవాస్తవాలు వల్లె వేసింది. మాకు 6వ తేదీనే దుప్పట్లు ఇచ్చారు ఈ నెల 6వ తేదీనే మాకు కొత్త దుప్పట్లు అందించారు. పాతవి కొందరు పడేశారు. మరికొందరు వాటిని అలాగే ఉంచుకున్నారు. రాత్రి పడుకునే సమయంలో మాకు ఇచ్చిన దుప్పట్లను తల కింద పెట్టుకొని పడుకున్నాం. చలి పెట్టినప్పుడు కప్పుకుందాం అనుకున్నాం. మా ఫొటోలు ఎవరు తీశారో.. ఎప్పుడు తీశారో మాకు తెలియదు. చలి వేస్తే.. దుప్పట్లు పెట్టుకుని కూడా కప్పుకోకుండా ఎందుకుంటాం? – మనోజ్‌నాయక్, అఖిల్నాయక్, హర్షవర్దన్ నాయక్, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల, డాక్టర్స్ కాలనీ, కర్నూలు అందరికీ దుప్పట్లు పంపిణీ ప్రస్తుతం డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు ఈనెల 5న మాకు వచ్చాయి. ఆ మరుసటి రోజు.. అంటే 6వ తేదీన విద్యార్థులకు అందించాం. ఇంకా పది దుప్పట్లు మిగిలాయి. ఇది అద్దె భవనం. ‘నాడు–నేడు’ ఫేజ్–2 కింద ఈ పాఠశాలకు సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా చూశాం. – ఎస్.శ్రీనివాసకుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి -
పెరిగిన తలసరి ఆదాయం
సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి పెరిగింది. 2022–23లో జాతీయ తలసరి ఆదాయం కన్నా రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 47,518 ఎక్కువగా నమోదైంది. 2022–23లో జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,72,000 ఉండగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,19,518లకు చేరింది. అలాగే గత మూడేళ్లుగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల్లో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య 1.65 లక్షలకు పెరిగినట్లు ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2020–21లో ఆదాయపు పన్ను చెల్లించిన వారి సంఖ్య 19.79 లక్షల ఉండగా 2022–23లో ఆదాయపు పన్ను చెల్లించిన వారి సంఖ్య 21.65 లక్షలకు పెరిగినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. పన్ను లేకపోయినా ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పైసా కూడా ఆదాయపు పన్ను చెల్లించని వారు 2020–21లో 12.55 లక్షల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే, వారి సంఖ్య 2022–23లో 13.04 లక్షలకు పెరిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. భారీగా పెరిగిన ఐటీ రిటర్న్‌లు దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య గత మూడు సంవత్సరాల్లో భారీగా పెరిగినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దేశం మొత్తం మీద 2020–21లో 6.72 కోట్ల మంది ఆదాయపు పన్ను చెల్లించగా 2022–23లో ఆ సంఖ్య 7.40 కోట్లకు పెరిగినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చెల్లించని వారు కూడా ఐటీ రిటర్న్ దాఖలు చేయడం దేశవ్యాప్తంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. 2020–21లో ఆదాయపు పన్ను చెల్లించని వారు 4.84 కోట్ల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే 2022–23లో ఆ సంఖ్య 6.16 కోట్లకు పెరిగినట్లు కేంద్ర మంత్రి వివరించారు. దేశ సగటును మించి.. జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదైంది. 2022–23లో జాతీయ సగటు తలసరి ఆదాయంలో పెరుగుదల రూ. 23,476 ఉండగా.. అదే ఏపీలో రూ. 26,931లకు పెరిగింది. దీంతో దేశ, రాష్ట్ర తలసరి ఆదాయం మధ్య వ్యత్యాసం 2022–23లో రూ. 47,518గా నమోదైంది. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలకు డబ్బులిస్తేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల ద్వారా లబి్ధదారులకు నేరుగా నగదు బదిలీ చేసింది. టీడీపీ హయాంలో 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,54,031తో దేశంలో 17వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. 2022–23 నాటికి రూ. 2,19,518తో 9వ స్థానంలో నిలిచింది. -
తాడి‘కొండంత’ సంబరం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రతో గుంటూరు జిల్లా తాడికొండలో శనివారం సంబరం నెలకొంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారీ్టలు భారీ ఎత్తున హాజరై జైకొట్టారు. బీసీలను సీఎం జగన్ బ్యాక్‌బోన్ కులాలుగా మార్చారని నేతలు కొనియాడారు. సామాజిక సాధికారతను ప్రభుత్వ విధానంగా అమలు చేశారని ప్రశంసించారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికార పదవులు కట్టబెట్టి వారి ఉన్నతికి కృషి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అమలు చేసిన సీఎం జగన్ ఒక్కరే.. సామాజిక సాధికారతకు సీఎం వైఎస్ జగన్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ కొనియాడారు. వైఎస్ కుటుంబం కోసం తన ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేసిన మేకతోటి సుచరితను తాడికొండలో గెలిపించాలని ప్రజలను కోరారు. భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? బీసీల తోకలు కట్ చేస్తానని చంద్రబాబు అవమానించారని గుర్తు చేశారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ గతంలో సామాజిక న్యాయం అనేది నినాదంగా ఉండేదని.. దాన్ని ప్రభుత్వ విధానంగా మార్చివేసిన ఘనత జగనన్నకు దక్కిందన్నారు. బడుగులకు మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులుగా అవకాశం కలి్పంచారని కొనియాడారు. బీసీలు, ఎస్సీల్లో చిచ్చుపెడుతున్న చంద్రబాబు మాయలో పడొద్దని ప్రజలను కోరారు. దళిత మహిళకు హోం మంత్రి పదవిని ఇచ్చారు.. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ దళిత మహిళగా హోం మంత్రి పదవిని ఊహించుకోలేదని, దాన్ని నిజం చేసి చూపించిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. జగనన్న రాత్రికి రాత్రే తనను ఒక స్టార్‌ను చేశారన్నారు. రాష్ట్రంలో తొలి దళిత హోం మంత్రి ఎవరంటే తనపేరే ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. తాడికొండ మాజీ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో సమ సమానత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నామని తెలిపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. పేదరికం ఉండకూడదనుకుంటే సీఎం వైఎస్ జగన్‌ను గెలిపించుకోవాలన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతి పేదవాడి సంక్షేమం కోసమే కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంచి జరిగిందంటే అది ఆయన పుణ్యమేనన్నారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తాడికొండను గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది జగన్ మాత్రమేనన్నారు. 50 వేల మంది పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్, నంబూరు శంకరరావు, తాడికొండ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహా్మనందరెడ్డి పాల్గొన్నారు. -
Fact Check: రైతుకు కాదు.. రామోజీకే విపత్తు
సాక్షి, అమరావతి: వాతావరణ ప్రభావంతో ఏదైనా పంటకు తెగులు సోకినా.. పురుగు వచ్చినా దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే కారణం అన్నట్టుగా ఉంది ఈనాడు రామోజీరావు రాతలు చదువుతుంటే. సర్టిౖఫై చేసిన సాగు ఉత్పాదకాలను ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతుల ముంగిట అందిస్తూ అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా నిత్యం రోత రాతలు రాస్తూ రామోజీ పైశాచికానందం పొందుతున్నారు. నకిలీ సాగు ఉత్పాదకాల బారినపడి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న సంకల్పంతో.. పంపిణీ చేసే ముందు వాటి నాణ్యతను పరీక్షించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌ను తీసుకొచ్చింది. ఈ ల్యాబ్‌ల్లో పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి తీసుకొచ్చేలా ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఉత్పాదకాలను మాత్రమే గ్రామస్థాయిలో రైతులకు పంపిణీ చేస్తోంది. ఈ కారణంగానే నాలుగున్నరేళ్లలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల తాము పంట నష్టపోయామని ఒక్కరంటే ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఇవేమీ పట్టని ఈనాడు వాస్తవాలకు ముసుగేసి.. ‘విత్తనం నుంచే విపత్తు’ అంటూ అడ్డగోలుగా అబద్ధాలతో కథనాన్ని అచ్చేసింది. ఈ కథనంలో పేర్కొన్న అంశాలపై వాస్తవాలు ఇవీ.. ఏటా 50 వేల శాంపిల్స్ పరీక్షిస్తున్నా ఏడుపే రాష్ట్రంలో ఏటా సగటున 1.25 లక్షల లాట్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్‌ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్‌ల ఎరువులు మార్కెట్‌కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్రస్థాయిలో 11 లే»ొరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం 3 చొప్పున ఉండేవి. మార్కెట్లోకి వచ్చే ఎరువుల్లో 25–30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే వారుకాదు. దీంతో మార్కెట్లో నకిలీలు రాజ్యమేలేవి. ఫలితంగా ఏటా రూ.వేల కోట్ల విలువైన పెట్టుబడిని రైతులు నష్టపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలనే లక్ష్యంతోనే రూ.213 కోట్లతో దేశంలో మరెక్కడా లేనివిధంగా జిల్లా స్థాయిలో 10, నియోజకవర్గ స్థాయిలో 127 ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో మరో 20 ల్యాబ్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ల్యాబ్‌లలో చట్టపరంగా సేకరించిన నమూనాలతో పాటు రైతువారీ వ్యాపార సంబంధమైన విత్తనాలు, ఎరువుల నమూనాలు పరీక్షిస్తున్నారు. గతంలో ఏటా అన్నిరకాల శాంపిల్స్ కలిపి 10 వేలు పరీక్షించడమే కష్టంగా ఉండేది. కానీ.. నేడు అగ్రి ల్యాబ్స్ రాకతో ఏటా సగటున 50వేల శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నారు. ఫలితంగా ఎక్కడా నకిలీ విత్తనం, ఎరువు, పురుగు మందుల బారినపడి నష్టపోయామన్న మాటే విన్పించలేదు. ఆర్బీకేల ద్వారా పురుగుల మందుల విక్రయం 2020–21 నుంచి 2021–22 వరకు ఆర్బీకేల ద్వారా రూ.14.01 కోట్ల విలువ చేసే 1,36,443 లీటర్ల పురుగు మందులను 1,50,822 మంది రైతులకు ప్రభుత్వం అందించింది. 2023–24లో రైతులకు అవసరమైన, నాణ్యత పరీక్షించబడిన పురుగు మందులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేసేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ అవసరమైన చర్యలు తీసుకుంది. సీజన్లో మందులు దొరకవనే భయంతో రైతులు విత్తనం వేసేప్పుడే అధిక సంఖ్యలో తీసుకుని నిల్వ చేసుకుంటుంటారు. కాగా.. పురుగుల మందుల వినియోగం పెరగడానికి పలు కారణాలు దోహదం చేస్తుంటాయి. 2022–23 సీజన్లో అధిక వర్షపాతం వలన గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలలో రైతులు పప్పుధాన్యాల పంటల నుండి వాణిజ్య పంటలైన మొక్కజొన్న, పత్తి, మిరప పంటల వైపు మళ్లారు. రాయలసీమ జిల్లాలలో నూనె గింజల పంటల నుండి పండ్ల తోటలు, పత్తి పంటల సాగు వైపు మొగ్గు చూపారు. మిరపలో వచ్చిన నల్లతామర, పత్తి, మొక్కజొన్నలలో పురుగులు, తెగుళ్ల ఉ«ధృతికి అడ్డుకట్ట వేసేందుకు గతం కంటే కాస్త ఎక్కువగానే పురుగు మందులను వినియోగించారు. అయితే.. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో మాత్రమే వినియోగించాలని ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూనే ఉన్నారు. దిగుబడులకు ఢోకా లేదు ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే.. 2019–23 మధ్య 165.40 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే 11.45 లక్షల టన్నుల మేర పెరిగింది. ఇక ఉద్యాన పంటల విషయానికి వస్తే టీడీపీ హయాంలో 2018–19లో 17.40 లక్షల హెక్టార్లలో సాగవగా, 305 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ప్రస్తుతం 18.03 లక్షల హెక్టార్లకు విస్తరించగా.. 368.83 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. అంటే ఏకంగా 63 లక్షల టన్నులకు పైగా ఉద్యాన పంటల దిగుబడులు పెరిగాయి. నిజంగా నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రాజ్యమేలితేæ ఈ స్థాయిలో దిగుబడులు పెరుగుతాయా అన్నది ఒక్కసారి రామోజీ ఆలోచన చేయాలి. ఏటా విస్తృత తనిఖీలు.. నాణ్యత లోపిస్తే క్రిమినల్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఏటా పురుగు మందులు, ఎరువుల దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన తనిఖీల్లో పురుగు మందుల చట్టం 1968 నిబంధనల ప్రకారం సక్రమంగా లేని రూ.5.21 కోట్ల విలువైన 37,998 లీటర్ల పురుగు మందుల అమ్మకాలను నిలిపివేశారు. రూ.కోటి విలువైన 17,073 లీటర్ల పురుగు మందులను స్వా«దీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇంకోవైపు ర్యాండమ్ తనిఖీల్లో భాగంగా ఈ ఏడాది 10,500 పురుగుల మందుల నమూనాలు సేకరించి ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ ద్వారా పరీక్షించాలని లక్ష్యంగా నిర్దేశించారు. డిసెంబర్ నాటికి 8,159 నమూనాలు సేకరించి పరీక్షించగా, కేవలం 55 నమూనాలు మాత్రమే నాసిరకంగా ఉన్నట్టుగా గుర్తించి సంబంధిత కంపెనీలు, డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తయారీదారుల అభ్యర్థన మేరకు 19 నమూనాల పునర్విశ్లేషణ కోసం పంపించారు. మిగిలిన నాసిరకం పురుగు మందుల ఉత్పత్తిదారులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. æనాణ్యత నిర్ధారణ నిమిత్తం నమూనాలను సేకరించి సంబంధిత పరీక్షా కేంద్రాలకు పంపించటం జరిగింది. ఈ విధంగా అగ్రిల్యాబ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 23,714 పురుగులమందుల నమూనాలను పరీక్షించగా, 175 శాంపిల్స్ నాసిరకంగా ఉన్నట్టుగా గుర్తించారు. తయారీదారులు, సరఫరాదారుల అభ్యర్థన మేరకు 82 నమూనాలను కోర్టు ద్వారా పునర్విశ్లేషణ కోసం పంపించారు. ఇప్పటికే 31 నాసిరకం ఉత్పత్తిదారులపై చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మిగిలిన 73 నాసిరకమైన నమూనాలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. పురుగు మందుల చట్టం నియమ నిబంధనల మేరకు కాల పరిమితికి లోబడి నాసిరకం పురుగుల మందుల ఉత్పత్తిదారులపై తగిన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే కేవలం 5 వేల నమూనాలు మాత్రమే తీశారంటూ ఈనాడు అర్థరహితమైన ఆరోపణలు చేసింది. -
వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
సాక్షి, నంద్యాల: సామాజిక సాధికారత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పేదల పక్షపాతి అయిన వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నవనందుల సాక్షిగా శనివారం నంద్యాల పట్టణంలో సామాజిక సాధికార చైతన్యం వెల్లివెరిసింది. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు భారీ ఎత్తున బడుగు, బలహీనవర్గాల ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. మైనారిటీల పక్షపాతి సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు మైనార్టీల ద్రోహి అని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిపడ్డారు. చంద్రబాబు మైనారిటీలపై దేశద్రోహం కేసులు పెడితే, సీఎం వైఎస్ జగన్ వచ్చాక ఆ కేసులను తొలగించారని గుర్తు చేశారు. అంతేకాకుండా మైనారిటీ వ్యక్తిని డిప్యూటీ సీఎం పదవిలో కూర్చోబెట్టి సీఎం జగన్ గౌరవించారని కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి సామాజిక సాధికారిత నినాదంగానే ఉందని, ఒక్క సీఎం జగన్ మాత్రమే దీన్ని విధానంగా మార్చారని ప్రశంసించారు. మనల్ని చేయిపట్టుకుని ముందుకు నడిపిస్తున్న జగన్ వెంటే మనమంతా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 14 ఏళ్లలో ఏం చేశావో చెప్పే ధైర్యముందా బాబూ? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు విస్మరిస్తే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన చరిత్ర సీఎం జగన్‌దని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు. ఎస్సీలను తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుని చంద్రబాబు వదిలేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ఎస్సీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. ఆయన అమలు చేస్తున్న ప్రతి పథకం పేదవాడిని ఉన్నతస్థాయికి తీసుకెళ్తోందన్నారు. పేదల పక్షాన నిలుస్తున్న సీఎంకు మనమంతా అండగా నిలవాలని కోరారు. బడుగు, బలహీనవర్గాలంటే చంద్రబాబుకు చిన్నచూపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే చంద్రబాబుకు ఇప్పటికీ చిన్నచూపేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల నాయకులను సున్నాలతో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి సాధ్యమని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే బీసీలను కరివేపాకులా వాడుకుని వదిలేస్తారన్నారు. తండ్రి అరెస్టయి జైలులో ఉంటే ఢిల్లీకి పారిపోయిన పిరికి పంద లోకేశ్.. సీఎంను పట్టుకుని సైకో అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పక్క పార్టీ నాయకుడిని సీఎంగా చూడాలనుకున్న వ్యక్తి ఈ దేశంలో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ సభలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, ముస్లిం మైనారిటీ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి విలేకరి ‘గురిజా’ మృతిపై వాస్తవాలు నిగ్గుతేల్చాలి
రణస్థలం: శ్రీకాకుళం జిల్లా లావేరు సాక్షి విలేకరి గురిజా దామోదరరావు మృతి బాధాకరమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. రణస్థలంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తన పెదనాన్న గొర్లె శ్రీరాములునాయుడుకు, దామోదరరావు తండ్రి తవిటయ్యతో మంచి అనుబంధం ఉందని, దామోదర్ కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి విభేదాల్లేవని చెప్పారు. విపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాలు తెలీకుండా టీడీపీ నేతలు కళా వెంకటరావు, చంద్రబాబు స్పందించిన తీరు శవాలపై రాజకీయం చేసేలా ఉందని విమర్శించారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరిపి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. ఈ ఘటనపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని, దామోదర్ నాలుగు నెలలు ఎవరితో ఎక్కువ మాట్లాడారో కాల్స్ పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. దామోదర్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి మాట్లాడుతూ కళా వెంకటరావు రాజకీయ లబ్ధి కోసమే దామోదర్ మృతిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ల కిందట కళా వెంకటరావు తన తమ్ముడినే చంపేశాడని కుటుంబ సభ్యులే కేసు పెట్టారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వేధించారంటూ వంగర ఎస్ఐ, కళాతో పాటు ఆయన పీఏపైనా కేసు పెట్టారని గుర్తు చేశారు. టీడీపీ నేతలు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు లావేటిపాలెం వైఎస్సార్సీపీ నేతలు, మృతుడి బంధువులైన లావేరు ఎంపీటీసీ ఇనపకుర్తి సతీష్, ఇనపకుర్తి చంద్రశేఖర్, సగరం విశ్వనాథం మాట్లాడుతూ దామోదర్ ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. టీడీపీ నేత జగ్గన్న దొరకు దామోదర్ రూ.10 లక్షలు అప్పు ఇచ్చాడని, ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు దామోదర్ చెప్పాడని పేర్కొన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కిరణ్‌కుమార్, లంకలపల్లి గోపిపై ఆరోపణలు చేస్తున్నారని, సూసైడ్ లెటర్ కూడా టీడీపీ వాళ్లు పెట్టించి ఉంటారని ఆరోపించారు. -
ఏజెన్సీ ముఖద్వారంలో ‘సామాజిక’ జైత్రయాత్ర
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శనివారం ‘జై జగన్..జైజై జగన్’ నినాదాలతో దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఆద్యంతం ఉత్సాహం, ఉత్తేజంతో సాగింది. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికార పదవులు లభించాయని కొనియాడారు. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. దళితులకు అడుగడుగునా మేలు.. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమం కొనసాగాలంటే మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని కొనియాడారు. జనవరి 1 నుంచి వితంతు, వృద్ధాప్య పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతున్నారని చెప్పారు. రెండు వేళ్లు చూపించే టీడీపీ నేతలకు.. ఇక వృద్ధులు, వితంతువులు మూడు వేళ్లు చూపాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా మేలు జరుగుతోందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఈసారి తనను రాజ్యసభకు పంపుతున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రజల సంక్షేమం కోసం రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశంసించారు. వైద్య విప్లవం తీసుకొచ్చారు.. సీఎం జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి వైద్య విప్లవాన్ని తీసుకొచ్చారని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి కొనియాడారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని ప్రశంసించారు. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ మాట్లాడుతూ.. సీఎం సహకారంతో రూ.2,700 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడు సైకోలా తయారై బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక సాధికారతకు సీఎం జగన్ నిజమైన అర్థం చెప్పారని కొనియాడారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా ఎస్సీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, నవరత్న పథకాల అమలు వైస్ చైర్మన్ ఎ.నారాయణమూర్తి, పార్టీ నేత చింతకాయల సన్యాసిపాత్రుడు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష పాల్గొన్నారు.