AP Special
-
టీడీపీ నాయకుడు కొలికపూడికి సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను చంపి, ఆయన తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానంటూ టీవీ5 లైవ్ షోలో బహిరంగంగా సుపారీ ప్రకటించిన టీడీపీ నాయకుడు, అమరావతి జేఏసీ కన్వినర్ కొలికపూడి శ్రీనివాసరావును జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఏపీ సీఐడీ అధికారులు నోటీసు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కొలికపూడి నివాసానికి శనివారం ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. సీఐడీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొలికపూడి పరారైనట్టు సమాచారం. కొలికపూడి లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసు అందించారు. ఆయన్ను జనవరి 3న ఏపీ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. దర్శకుడిగా తాను తీసిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్తో రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ, దానికి అనుకూలంగా కొన్ని టీవీ చానల్స్, వార్త పత్రికలు విమర్శలు చేస్తున్నాయని, పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని రామ్‌గోపాల్ వర్మ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్ అయితే ప్రజల్లో టీడీపీ చులకన అవుతుందని భావించి సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీల్లో చర్చలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి సమాజంలో అశాంతి, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని వర్మ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. టీడీపీ అనుయాయుడైన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ5 చానల్ యజమాని బీఆర్ నాయుడు, యాంకర్ సాంబశివరావు తదితరులు నేరపూరిత ఆలోచనలతో కుట్రపూరితంగా ఈ నెల 27న లైవ్‌లో చర్చ పేరుతో బహిరంగంగా సుపారీ ఆఫర్ ఇవ్వడంపై వర్మ ఫిర్యాదు చేశారు. వర్మను చంపి, ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని, తానే వర్మ ఇంటికి వెళ్లి తగలబెడతానని కొలికపూడి శ్రీనివాసరావు టీవీ5 డిబేట్లో పబ్లిక్‌గా చెప్పడాన్ని వర్మ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని పబ్లిక్‌గా కాంట్రాక్ట్ ఇచ్చినట్టు దీని ద్వారా స్పష్టమవుతోందిని వర్మ పేర్కొన్నారు. అదేవిధంగా ‘వర్మ కను గుడ్లు తెస్తే రూ.10 లక్షలు, కాళ్లు నరికి తెస్తే రూ.5 లక్షలు... 9985340280 కాల్ చేసి క్యాష్ తీసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో సుపారీలు ప్రకటించడం గమనార్హం. ‘గురువుగారు మీ ఆఫర్ స్వీకరిస్తున్నాను.. వర్మ తల నరికి తెస్తాను..’ అని షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా దేవభక్తుని జవహర్లాల్ అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు బదులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే వర్మను హత్య చేసేందుకు టీవీ5 లైవ్‌లో సుపారీ ఆఫర్ చేసిన వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. టీవీ డిబేట్లో సుపారీ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు, అందుకు ప్రోత్సహించిన టీవీ5 చానల్ యాంకర్ సాంబశివరావు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎడిటర్ బీఆర్ నాయుడు, టీవీ5 మేనేజ్మెంట్, డైరెక్టర్లు, షేక్ ఫిరోజ్‌తోపాటు మరి కొందరిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505(2), 506(2), రెడ్ విత్ 115, 109, 120(బి) కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. -
భార్య మృతి.. ఆ కొద్ది సేపటికే భర్త కూడా!
చిల్లకూరు(తిరుపతి జిల్లా): కష్టసుఖాల్లో ఇన్నాళ్లూ తనతో పాటు నడిచిన తన అర్ధాంగి మృతిని భర్త తట్టుకోలేకపోయాడు. భార్య మరణించిన కొద్ది సేపటికే తాను ప్రాణాలు విడిచాడు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు దళితవాడలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కడివేడు గ్రామానికి చెందిన పల్లిపాటి నాగూరయ్య(68), రమణమ్మ(60)లు భార్యా భర్తలు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు. వీరందరికి వివాహాలు జరిపించి మనవళ్లు, మనమరాళ్లతో సంతోషంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా, రమణమ్మకు ఇటీవల ఆరోగ్యం దెబ్బతిని మంచానికే పరిమితమైంది. వృద్ధాప్యంలోనూ నాగూరయ్య కూలి పనులకు వెళ్లి.. వచ్చిన డబ్బుకు తోడు ప్రభుత్వం అందించే పింఛన్‌తో ఆమెకు వైద్యం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె శనివారం వేకువజామున ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గమనించిన రమణయ్య.. కుటుంబ సభ్యులను మేల్కొలిపి, తాను ఓ చోట అలా కూర్చుండి పోయాడు. నిద్ర లేచిన దగ్గర్నుంచి ఏమీ మాట్లాడకుండా ఉన్నాడని.. కుమారులు తండ్రి దగ్గరకు వెళ్లి కదిలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచి ఉన్నాడు. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మరణించడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. -
ఏపీలో ఎంఎస్ఎంఈ ఉద్యోగాలు భారీగా పెరిగాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పన ఏటేటా భారీగా పెరుగుతోందని కేంద్ర ఎంఎస్ఎంఈల శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్సింగ్వర్మ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. 2021–22వ ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఎంఎస్ఎంఈల ద్వారా 12,29,335 మందికి ఉద్యోగాలను కల్పించగా.. 2022–23లో ఏకంగా 27,27,273 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కేంద్ర మంత్రి భానుప్రతాప్‌సింగ్ తెలిపారు. ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ 7వ స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. వైఎస్ జగన్ పాలనలోని ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 5.06 లక్షల ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్ఎంఈలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 6,99,881కు పెరిగిందని కేంద్ర మంత్రి భానుప్రతాప్‌సింగ్ తెలిపారు. దేశంలో 2021–22లో 6,222 ఎంఎస్ఎంఈలు మూతపడగా.. ఏపీలో 113 మాత్రమే మూతపడ్డాయని చెప్పారు. 2022–23లో దేశంలో 13,290 ఎంఎస్ఎంఈలు మూతపడగా ఏపీలో 261 మాత్రమే మూతపడ్డాయని వివరించారు. కోవిడ్ కష్ట సమయంలో సైతం ఎంఎస్ఎంఈల కార్యకలాపాలు నిలిచిపోకుండా సీఎం జగన్ రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్సార్ నవోదయం తదితర పథకాలతో చేదోడువాదోడుగా నిలిచారు. అలాగే చంద్రబాబు హయాంలో ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను కూడా సీఎం జగన్ చెల్లించారు. మరో రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలనూ విడుదల చేశారు. సీఎం జగన్ అందిస్తున్న ప్రోత్సాహంతో భారీగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. స్థానికులకు భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. -
పాకలో ఉండేవాళ్లం.. ఇప్పుడు పక్కా ఇంట్లో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పాకలో ఉండేవాళ్లం.. ఇప్పుడు పక్కా ఇంట్లో నా భర్త పోశియ్యకు ముగ్గురు అన్నదమ్ములు. ఉమ్మడిగా మాది కాకినాడ జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో ఉన్న రెండు సెంట్ల స్థలంలో వేసుకున్న తాటాకు ఇంట్లో(పాక)నే అందరితో కలసి ఉండేవాళ్లం. మాకు 2005లో వివాహమైంది. అప్పటి నుంచి ఆ పాకలోనే కాపురం చేశాం. ఈ పాక స్థలాన్నే ఐదు వాటాలుగా పంచుకోవాల్సి ఉంది. భవిష్యత్తులో ఎలా బతకాలో అని నిత్యం భయపడుతూ ఉండేవాళ్లం. సొంత ఇంటి కోసం గతంలో ఎన్నో సార్లు నాయకుల చుట్టూ తిరిగినా స్థలం గానీ, ఇల్లుగానీ మంజూరు కాలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి స్థలం కోసం సచివాలయంలో వినతి పత్రం అందించాం. ఎవరికి ఏ విధమైన లంచాలు ఇవ్వకుండానే ఇంటి స్థలం మంజూరు చేశారు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే రూ.1.80 లక్షల బిల్లులు దశల వారీగా మంజూరు చేశారు. ఇన్నాళ్లకు సొంతింటి కలను సాకారం చేసుకున్నాం. మాకు ఇద్దరు అబ్బాయిలు. ఓ అబ్బాయి లక్ష్మి వెంకటరమణ ఏడో తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్ల నుంచి అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున ఇప్పటి వరకూ రూ.60 వేలు నా ఖాతాలో జమ కావడంతో చదివించుకోడానికి ఇబ్బంది లేకుండా పోయింది. – నాగిరెడ్డి ప్రభావతి, కాపవరం (జీవీవీ సత్యనారాయణ, విలేకరి, కొవ్వూరు) ధైర్యంగా పిల్లల్ని చదివిస్తున్నాం మాది సాధారణ పేద కుటుంబం. మా ఆయన కామేశ్ పెయింటింగ్ వేస్తుంటారు. నేను ఇంటిదగ్గర టైలరింగ్ చేస్తుంటాను. మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరినీ పెద్ద చదువులు చదివించాలనేది మా కోరిక. మేమిద్దరం ఎంతగా కష్టపడినా అరకొర ఆదాయమే వస్తోంది. అది కుటుంబ పోషణకే సరిపోవట్లేదు. ఇక గొప్పగా చదివించేందుకు అయ్యే ఖర్చు మేం పెట్టగలమో లేదో అని భయం వేసేది. మా లాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి వరంలా మారింది. మా పెద్దబ్బాయి నవీన్ ప్రైవేటు స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వాడికి మూడేళ్లుగా అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేల వంతున నా ఖాతాలో జమ కావడంతో మా బిడ్డల చదువుకు ఇబ్బంది తొలగింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని జగనన్న కాలనీ లే అవుట్లో మాకు ఇంటి స్థలం ఇచ్చారు. ప్రభుత్వ సహకారంతో అందులో ఇల్లు నిర్మించుకున్నాం. నాకు జగనన్న చేదోడు పథకం కింద ఏటా రూ.పది వేలు అందుతోంది. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. – అగడపోలు దీప, కొత్తవీధి, నరసన్నపేట (ఎం.రవి, విలేకరి, నరసన్నపేట) రెండు కుటుంబాలను పోషించగలుగుతున్నా బతుకు తెరువు కోసం 20 ఏళ్ల క్రితం విశాఖపట్నం రైల్వే కాలనీ నుంచి మధురవాడకు కుటుంబంతో వచ్చాం. విధి వక్రీకరించడంతో నా భర్త సింహాచలం 2013లో కార్‌షెడ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నాకు గౌరి అపర్ణ, నూకాలమ్మ అనే ఇద్దరు ఆడపిల్లలు. వారి కోసం ఎంత కష్టం అయినా బతకాలనుకున్నాను. విధిలేని పరిస్థితుల్లో కొన్నాళ్లు హౌస్ కీపింగ్, మరి కొన్నాళ్లు వంట పని చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేదాన్ని. ఎన్ని ఇబ్బందులు పడినా కుటుంబాన్ని సక్రమంగా పోషించుకోలేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఎంతటి అత్యవసరమైనా, పనికి సెలవు పెట్టడానికి అవకాశం ఉండేది కాదు. కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నా వడ్డీ కింద రూ.లక్ష, వైఎస్సార్ ఆసరా కింద మూడు దఫాలుగా రూ.30 వేలు వచ్చింది. ఆ మొత్తంతో బండి కొనుక్కుని మా వాంబేకాలనీలోనే పండ్ల విక్రయం మొదలుపెట్టాను. రోజుకు మూడు నుంచి నాలుగు వందల వరకు మిగులుతుంది. నేను సొంతంగా నా కాళ్ల మీద నేను నిలబడి వ్యాపారం చేసుకుంటున్నా. నాకు పెన్షన్ రూ.2,750 వస్తోంది. రేపు రూ.3 వేలు అందుకుంటానని సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో మూడుసార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసినా రాలేదు. ఇప్పుడు ఇంటి స్థలం వచ్చింది. ఇంటి నిర్మాణ ప్రయత్నాల్లో ఉన్నాను. మాకున్న ఆస్తి ఇదే. పెద్ద పాపకు పెళ్లి చేశాను. చిన్న పాప, నేను అద్దె ఇంట్లో ఉంటున్నాము. కొన్నేళ్ల క్రితం మా నాన్న అనారోగ్యంతో మృతి చెందారు. మా అన్నయ్య కూడా మృతి చెందాడు. దీంతో అమ్మ, దివ్యాంగుడైన తమ్ముడు పోషణ భారం కూడా నా మీదే పడింది. రెండు కుటుంబాలను నా పండ్ల బండి వ్యాపారం తోనే పోషిస్తున్నాను. – చుక్క పార్వతి, మధురవాడ, వాంబేకాలనీ (కె.టి.రామునాయుడు, విలేకరి, మధురవాడ) -
గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకు కసరత్తు
సాక్షి, అమరావతి: గోదావరి నదీ జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్ర పరిధిలో గోదావరిలో నీటి లభ్యతను తేల్చి.. జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి అంతరాష్ట్ర నదీ జల వివాదాల (ఐఎస్ఆర్ డబ్ల్యూడీ) చట్టం–1956లో సెక్షన్–3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నవంబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ కోరింది. న్యాయశాఖ అభిప్రాయం ఆధారంగా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర జల్‌శక్తి నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. గోదావరి ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలకు కేటాయించలేదు. నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదరలేదు. కానీ.. జీడబ్ల్యూడీటీ అవార్డు, విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ 714.13 టీఎంసీలు వినియోగించుకోవడానికి అక్రమంగా ఏడు ప్రాజెక్టులను నిర్మిస్తోందని.. దీని వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని అనేకసార్లు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ 2020, అక్టోబర్ 6న నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ ఎత్తిచూపారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త ట్రిబ్యునల్ కోసం ప్రతిపాదన పంపితే న్యాయసలహా తీసుకుని నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అప్పట్లో హామీ ఇచ్చారు. -
వెయ్యేళ్ల పాలనకు శిథిల సాక్ష్యం ఉదయగిరి కోట
రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక స్థలాల్లో ఉదయగిరి కోట ఒకటి. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఉదయగిరి రాజరిక పాలనకు అక్కడ ఉన్న ప్రాకారాలే నిదర్శనం. ఆనాటి కళా నైపుణ్యానికి ఇప్పటికీ కనిపించే ఆలయాలు, కోటలు, ప్రార్థనా మందిరాలే నిదర్శనం. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో సాగిన ఆనాటి రాజరిక పాలనకు ఉదయగిరి దుర్గం శిథిల సాక్ష్యం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎత్తైన ప్రాకారాలు, బురుజులు, రాచరికత ఉట్టిపడే రాజ ప్రాసాదాలు ఒకప్పుడు శత్రు దుర్భేద్యమైన ఉదయగిరి కోట సొంతం. నేడు అదొక శిథిల సౌందర్యం. వెయ్యేళ్ల నాటి పాలనా వ్యవస్థకు మిగిలిన శిథిల సాక్ష్యం. పల్లవ, చోళ, గజపతులు, మహమ్మదీయ రాజుల వాస్తు శిల్ప రీతులతో నిర్మితమైన ప్రార్థనా మందిరాలు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో కూడిన విశేష చరిత్ర ఉదయగిరిది. అలరించే సెలయేర్లు, నీటి బుగ్గలు విభిన్న జాతుల వృక్షాలు, వందలాది అరుదైన వనమూలికలు ఉదయగిరి కొండపై ఉన్నాయి. పదకొండో శతాబ్దంలో పల్లవులు ఉదయగిరిని రాజధానిగా చేసుకుని పాలించారు. ఆ సమయంలోనే శత్రు దుర్భేద్యమైన దుర్గానికి పునాదులు వేశారు. సముద్ర మట్టానికి 3,079 అడుగుల ఎత్తున విశాల భూభాగంలో దీన్ని నిర్మించారు. కోట ముఖద్వారాన్ని గుర్రపు నాడా ఆకారంలో రెండు పెద్ద రాతి శిలల మధ్యన నిర్మించడం ఆనాటి కళా నైపుణ్యానికి నిదర్శనం. దుర్గం శిఖరాగ్ర భాగం 8 కోటలతో వందలాది బురుజులతో నిర్మితమైంది. పెద్దఎత్తున ప్రాకారాలు, గుర్రపుశాలలు, చూడచక్కగా రూపుదిద్దుకున్న రాజ ప్రసాదాలు, రాణి మహళ్లు ఈ దుర్గానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఉదయగిరి కొండపై ఉన్న మసీదులు నవాబుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ప్రకృతి అందాల నడుమ ఉన్న ఉదయగిరి దుర్గం ప్రాచీన కట్టడాలు శిథిలమవుతూ కాలగర్భంలో కలిసి పోతుండడమే బాధ కలిగించే అంశం. ఎందరో రాజులు.. ఎన్నెన్నో యుద్ధాలు.. ఉదయగిరి దుర్గం పదో శతాబ్దానికి పూర్వం బోయవిహారంగా ఉండేది. క్రీస్తు శకం 930లో తూర్పుచాళుక్య చక్రవర్తి విజయాదిత్యుని సేనాని పండ్రంగుడు బోయ విహారాలను కూల్చి శాంతి నెలకొల్పినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1160లో పల్లవరాజు నందివర్మ అమ్మరాజు ఉదయగిరిని పాలిస్తుండగా వెలనాటి చోడరాజు దండెత్తి వచ్చి ఓడించారని చెబుతారు. 1235లో ఉదయగిరి కాకతీయ సామ్రాజ్యంలో చేరి గణపతిదేవుడు చక్రవర్తి ఈ ప్రాంతాన్ని ఏలారు. తరువాత విజయనగర రాజులు దుర్గాన్ని స్వాధీన పరుచుకున్నారు. 1513లో విజయనగరరాజు శ్రీకృష్ణదేవరాయులు ఉదయగిరిపై దండెత్తి 18 నెలల పాటు అవిశ్రాంతంగా పోరాడి 1514 జూన్ 9న కోటను వశపరుచుకున్నారని చరిత్రకారులు చెబుతారు. 1574లో కొండ్రాజు వెంకటరాజు, 1586లో పెనుకొండ వెంకటపతి చక్రవర్తుల ప్రతినిధి మీర్‌జుమ్లా ఈ దుర్గాన్ని వశపరుచుకున్నాడు. ఆ తరువాత ఢిల్లీ సుల్తానుల వశమైంది. ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగి 1836లో ఈ దుర్గం తెల్లదొరల హస్తగతమైంది. పర్యాటకంగా అభివృద్ధి చేయాలి వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని స్థానికులు నాలుగు దశాబ్దాలుగా కోరుకుంటున్నా ఫలితం దక్కలేదు. జిల్లాలో చెప్పుకోదగ్గ చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశం ఉదయగిరి దుర్గం ఒక్కటే. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ఉన్న వనరులను వినియోగించుకోవాలి. పురాతన కట్టడాలను పరిరక్షించి రోడ్లు, షెల్టర్లు తదితర కనీస వసతులు కల్పించి పర్యాటకులను ఆకర్షించగలిగితే ఉదయగిరి అభివృద్ధికి అడుగులు పడతాయి. – ఎస్కే మహమ్మద్‌ఖాజా, విశ్రాంత ఉపాధ్యాయుడు, ఉదయగిరి చారిత్రక గిరిని కాపాడుకోవాలి చారిత్రక ఉదయగిరి దుర్గాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉదయగిరి కోట శిథిలావస్థకు చేరుకుంది. దుర్గంపై ఉన్న ఆనాటి రాజరిక పాలనకు సజీవ సాక్ష్యాలైన కట్టడాలను కాపాడుకోవాలి. వెంకయ్యనాయుడు దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని ఎంతో కృషి చేశారు. ఉదయగిరికి వచ్చిన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం ఇవ్వగా పార్లమెంటులోనూ ప్రస్తావించారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలి. – ఆవుల రోశయ్య యాదవ్, బీజేపీ నాయకుడు, ఉదయగిరి -
‘కాపు కులాన్ని నీకు ఏమైనా అద్దెకు ఇచ్చామా?’
సాక్షి,తాడేపల్లి: కాపు కులాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు. కాపు కులాన్ని ఏమైనా పవన్‌కు అద్దెకు ఇచ్చామా? అంటూ నిలదీశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్లో అడపా శేషు మాట్లాడుతూ.. కాపులను అణచి వేసేందుకు బాబు కుట్ర చేస్తుంటే అందులో పవన్ కళ్యాణ్ భాగస్తుడయ్యాడని ధ్వజమెత్తారు. అడపా శేషు ఇంకా ఏమన్నారంటే.. కాపుల ద్రోహి పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలో కాపు సోదరులకు పవన్ ఏం న్యాయం చేశాడు? వారికి పవన్ చేసిన అన్యాయం గురించి మాట్లాడతాను. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముసుగులో నుంచి పుట్టిందా? లేదా?. దీనికి సమాధానం చెప్పాలి. మాట్లాడితే వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల మీద పవన్‌కళ్యాణ్ చేస్తున్న దాడి గమనించండి. నిజానికి పవన్‌కళ్యాణ్‌కు రాష్ట్రంలో ఇల్లు లేదు. ఓటు లేదు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ ఓటు లేదు. ఇప్పుడు ఆయన భార్య అసలు భారతీయురాలే కాదు. ఆయన రెండో భార్య పిల్లలకు కూడా ఇక్కడ ఓటు హక్కు లేదు.కేవలం చంద్రబాబుకు మేలు చేయడం కోసమే పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్ ఇక్కడకు చుట్టపుచూపుగా వస్తున్నాడు. అందుకే పవన్‌కళ్యాణ్ కాపుల ద్రోహి పవన్ ఆనాడెందుకు ప్రశ్నించలేదు? కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యటించి, టార్గెట్ రాజకీయాలు చేస్తున్నాడు. కాపు ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. దీన్ని గమనించాలి. ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టినట్లు చెప్పే పవన్‌కళ్యాణ్, నాడు వంగవీటి రంగాను హత్య చేసిన తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడం సిగ్గుచేటు. ముద్రగడ పద్మనాభం ఆత్మగౌరవాన్ని రోడ్డుకీడ్చినా కనీసం ప్రశ్నించలేదు.వంగవీటి రంగా గారిని చంపితే.. అది ఫ్యాక్షన్ హత్య అన్నాడు. అదే అక్కడ పరిటాల రవి హత్యను ప్రత్యర్థులు చేసిన హత్య అనడం దారుణం.ఎవరిది ఫ్యాక్షన్ హత్య? పవన్ అలా మాట్లాడడం సరికాదు. కాబట్టి ఆయన మాటలను గమనించమని కోరుతున్నాను. మనకూ ఆత్మ గౌరవం, పౌరుషం ఉంది. రొమ్ము విడిచి చెప్పగలం. కానీ ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం. కాపులపై చంద్రబాబు కుట్ర అటు ఉత్తరాంధ్ర మొదలు ఇటు రాయలసీమ జిల్లాల వరకు మనకు ఎందరో కాపు నాయకులు ఉన్నారు. వారు జిల్లాల్లో ఆధిపత్యం చేస్తుంటే.. దాన్ని అణిచి వేయడం కోసం చంద్రబాబు, పవన్చేత జనసేన పార్టీ పెట్టించి రాజకీయం చేస్తున్నాడు. అందుకే పవన్‌కళ్యాణ్ ఆయా ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నాడు. కాబట్టి కాపు సోదరులు దీన్ని గమనించి, ప్రశ్నించాలని కాపు సోదరులను కోరుతున్నాను. గత మూడు రోజులుగా రాజమండ్రి రూరల్‌లో పవన్ పర్యటిస్తున్నాడు. అక్కడే ఎందుకు? కేవలం కాపు సామాజికవర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే పర్యటించడం ఎందుకు? జనసేన ప్రారంభించిన రోజున కాపు సోదరులకు రాజ్యాధికార సాధన కోసం అందరూ అనుకున్నారు. కానీ కాపులు ఎక్కడా రాజ్యాధికారంలో ఉండకూడదన్నది చంద్రబాబు కుట్ర. అందుకే పవన్‌ను ఆయా చోట్లకు పంపిస్తున్నారు. పవన్.. నీవా కాపులను కాపాడేది! గతంలో మహానేత వైయస్సార్‌గారు మాత్రమే కాపులకు పెద్దపీట వేశారు. వారికి అన్నింటా ప్రాథాన్యత ఇచ్చారు. అదే చంద్రబాబునాయుడు, కాపు సోదరులను ఎక్కడికక్కడ అణిచివేసి, లోపల వేయించాడు. ఇటీవలే నారా లోకేష్ ఒక మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ సీఎం చంద్రబాబు మాత్రమే అన్నారు. కానీ, పవన్ కనీసం దాన్ని కూడా ప్రశ్నించలేదు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగాయి. వాటిని పవన్ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు వారాలబాబు మాదిరిగా రాష్ట్రానికి వారం రోజులకో, నెలకో ఒకసారి వస్తూ పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. ఖమ్మంలో మంత్రి శ్రీ అంబటి రాంబాబుపై ఒక సామాజికవర్గం దాడి చేస్తే.. పవన్ కనీసం పట్టించుకోలేదు. పవన్.. నీవా కాపులను కాపాడేది? నిన్ను నమ్ముకున్న కాపు సోదరులను ఏనాడైనా పట్టించుకున్నావా? వారికి కనీసం టికెట్లు అయినా ఇప్పించావా? వారిని ఎక్కడైనా కనీసం ఆదుకున్నావా? అసలు దేనికి నీ ప్రయాణం? కేవలం చంద్రబాబు ప్రయోజనాలు కాపాడడమేనా? కాపు సోదరులు గుర్తించాలి పవన్.. నీకంటూ రాష్ట్రంలో సొంత నియోజకవర్గం ఉందా? కనీసం ఇల్లైనా ఉందా?. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కాపు సోదరులు పోరాడుతున్నారు. అలాంటి వారిని పవన్‌కళ్యాణ్ తొక్కేస్తున్నాడు. కాబట్టి, కాపు పోదరులు ఒకసారి వాస్తవాలు గుర్తించాలి. కాపులకు ఎవరు కావాలి? సీఎం జగన్ కాపు సోదరులకు రాజకీయ పదవులు ఇవ్వడమే కాకుండా, వారికి ఆర్థిక పరిపుష్టత కూడా కలిగించారు. ఇన్ని పదవులు ఇచ్చిన జగన్‌గారు కావాలా? లేక కాపులను ఏకతాటిపై అమ్మేస్తున్న పవన్‌కళ్యాణ్ కావాలా? ఒక్కసారి ఆలోచించమని కాపు సోదరులను కోరుతున్నాను. ఒక్కసారి కళ్లు తెరవండి. పవన్ అనైతిక రాజకీయాలను నిలదీయండి. టీడీపీలో భాగస్తుడు నువ్వే దైవం, నువ్వే సర్వస్వం అని తిరిగిన జన సైనికులు, వీర నారీమణుల గురించి ఏనాడైనా పట్టించుకున్నావా? వారి గురించి ఏం చెప్పదల్చుకున్నావ్?. వారికి ఒక్క పదవి అయినా ఇచ్చావా? వారి ఆర్థిక స్థితి ఏమిటన్నది పట్టించుకున్నావా?. కనీసం నీ పర్యటనల్లో ఒక్క జన సైనికుడితో అయినా మాట్లాడావా? పార్టీని, కులాన్ని పక్కన పెట్టేసి కేవలం చంద్రబాబునాయుడు పార్టీలో ఒక భాగస్తుడవయ్యావు. అందుకు ఈ ఫోటోలే నిదర్శనం.. (అంటూ టీడీపీ ప్రచురించిన పోస్టర్లు చూపిన అడపా శేషు). అసలు పవన్‌కళ్యాణ్ జనసేన నాయకుడా? లేక తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడా? లేకుంటే మేం చెబుతున్నట్లు చంద్రబాబు దత్తపుత్రుడా?. నిజానికి పవన్‌కళ్యాణ్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. కాపుల అభ్యున్నతిని అడ్డుకుంటున్న సామాజికవర్గ నాయకులను కట్టడి చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. కాపు కులాన్ని అద్దెకు ఇచ్చామా? ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాము ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడితే, ఈరోజు అదే పార్టీని చంద్రబాబుకు, టీడీపీకి ఇస్తున్నావని వారంటే.. కనీసం సమాధానం చెప్పడం లేదు. నీకు కాపు కులాన్ని అద్దెకు ఇచ్చామా? నీవేమైనా పోటుగాడివా? కాపులను ఉద్ధరిస్తారని నిన్ను నమ్మారనుకుంటున్నావా? కాపులకు ఆర్థిక పరిపుష్టి కల్పించి, ఆదుకున్న నాయకుడు జగన్‌గారు మాత్రమే. కోవిడ్ సంక్షోభంలో కూడా వారిని ఆయన ఎంతో ఆదుకున్నారు.అదే పేదల రక్తం తాగిన చంద్రబాబుకు, పవన్ కొమ్ము కాస్తున్నాడు. కాబట్టి ఆలోచించమని కోరుతున్నాను. చంద్రబాబు ఒక్కటైనా చెప్పుకోగలరా? సీఎం జగన్ ఎక్కడికి పోయినా.. అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఊరూరా ప్రతి ఇంట్లో నాడు వైయస్సార్, ఇప్పుడు సీఎం శ్రీ వైయస్ జగన్ వల్ల ప్రయోజనం పొందిన వారున్నారు. అదే లోకేష్ 3 వేల కిలోమీటర్లు తిరిగాడంటున్నారు కదా? కనీసం ఒక్క ఊరిలో అయినా, తన తండ్రి వల్ల ఒక్క మేలు జరిగిందని చెప్పుకోగలరా? కనీసం ఒక్క కుటుంబం అయినా ముందుకొచ్చి, తమకు చంద్రబాబు వల్ల మేలు జరిగిందని చెప్పారా?. కాపులకు నాడు–నేడు వారితోనే మేలు పేదల సంక్షేమం కోసం నాడు వైయస్సార్, ఇప్పుడు జగన్‌గారు ఎంతో చేశారు. ఇంకా చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కుటుంబానికి పేదలంటే మక్కువ. వారికి మేలు చేయడం కోసం ఎక్కడా వెనకడుగు వేయరు. అదే చంద్రబాబు ఏం చేశాడనేది చూస్తే.. పేదల రక్తంతో ఎన్నో రాష్ట్రాలలో తన సామాజిక వర్గానికి కోటలు కట్టించాడు. పవన్‌కళ్యాణ్‌తో అవసరం ఉంటే, ఛార్టర్డ్ ఫ్లైట్ పెట్టించి, పవన్‌కు ఇక్కడకు రప్పిస్తున్నాడు.కాపుల్లో కానీ, ఇతర కులాల్లోని నిరుపేదలను కానీ ఆదుకోవడంలో జగన్‌గారు ఎంతో కృషి చేశారు. పవన్ ఏనాడు ఈ దిశలో పని చేయలేదు. కేవలం చంద్రబాబుకు మేలు చేయడం కోసం కాపు సామాజికవర్గం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. కాపులను ఎవరు గెలిపిస్తున్నారు? వారికి ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారు? వారికి ఎవరు ఎక్కువ పదవులు ఇస్తున్నారు? ఇవన్నీ ఆలోచించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదే సమయంలో పవన్‌కళ్యాణ్ చేస్తున్న అనైతిక రాజకీయాలను ప్రశ్నించమని కోరుతున్నాను. -
ప్రకాశం బ్యారేజ్‌కు 2023లో ప్రపంచ స్థాయి గుర్తింపు
సాక్షి,విజయవాడ: దక్షిణ భారత దేశంలోని పలు కట్టడాలు, ప్రదేశాలు 2023 సంవత్సరంలో ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ ఒకటి. ది ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి(ఐసీఐడీ)ప్రకాశం బ్యారేజ్‌ను 2023లో ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ నిర్మాణంగా ప్రకటించింది. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీఐడీ అధ్యక్షుడు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్(డబ్ల్యూహెచ్‌ఐఎస్) అవార్డును ఆంధ్రప్రదేశ్‌కు అందించారు.ఇప్పటివరకు భారత దేశానికి 14 డబ్ల్యూహెచ్‌ఐఎస్ అవార్డులు రాగా వీటిలో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు అవార్డులు వరించాయి. The International Commission of Irrigation and Drainage (ICID) declared Prakasam Barrage as a World Heritage Irrigation Structure (WHIS).https://t.co/LincAyRUL8 pic.twitter.com/xaU8ldtEkM — South First (@TheSouthfirst) December 30, 2023 ఇదీచదవండి..జగన్ పదునైన ప్రశ్నలు..ఇంకేం ఇద్దరు గప్‌చుప్ -
YSRCP: మూడు అనుబంధ విభాగాలకు సహాధ్యక్షుల నియామకం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అనుబంధ విభాగాలను మరింత విస్తృతం చేసింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో YSRCP మూడు అనుబంధ విభాగాలకు రాష్ట్ర సహాధ్యక్షుల నియామకం జరిగింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సహాధ్యక్షులుగా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, సేవాదళ్ విభాగం రాష్ట్ర సహాధ్యక్షులుగా డా.కట్టి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సహాధ్యక్షులుగా బసిరెడ్డి సిద్ధారెడ్డి నియమితులయ్యారు. సిద్ధారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన సిద్ధారెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనపై నమ్మకముంచి తనకు కీలకమైన బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పార్టీ ప్రచార బాధ్యతలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని సిద్ధారెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఇప్పటికే ఆర్. ధనుంజయ్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బసిరెడ్డి సిద్ధారెడ్డి, YSRCP రాష్ట్ర ప్రచారకమిటీ సహాధ్యక్షులు గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, YSRCP పంచాయతీ రాజ్ విభాగం సహాధ్యక్షులు కట్టి వెంకటేశ్వర్లు, YSRCP సేవాదళ్ విభాగం సహాధ్యక్షులు ఇదీ చదవండి: జగన్ పదునైన ప్రశ్నలు.. ఇంకేం ఇద్దరూ గప్‌చుప్! -
తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం
సాక్షి, తిరుమల: తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్లు సంచారం కలకలం రేపాయి. ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంట్ల కదలికలు నమోదయ్యాయి. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో కదలికలు నమోదయ్యాయి. డిసెంబర్ 13, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కింది. చిరుతతో పాటు ఎలుగుబంట్లు కదలికలు అధికారులు గుర్తించారు. ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నడకమార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా రావాలంటూ టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. నడకమార్గం పక్కనున్న అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడంతో భక్తులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. అవి తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పేర్కొన్నారు. టీటీడీ ఈవోకు ఫారెస్ట్ అధికారులు సమాచారం అందించారు. ఇదీ చదవండి: కృష్ణానది ఒడ్డున కలకలం.. అర్ధరాత్రి క్షుద్ర పూజలు! -
AP: వావ్.. వాట్ ఏ గ్రేట్ మెనూ.. జపాన్ వాసుల కితాబు
యాదమరి(చిత్తూరు జిల్లా): వాట్ ఏ గ్రేట్ మెనూ.. యువర్ సీఎం కేరింగ్ ఈజ్ సూపర్ ఆన్ మిడ్ డే మీల్స్ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై జపాన్ వాసులు ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు.. పాఠశాలలో అమలవుతున్న మెనూ విధానాన్ని పరిశీలించి సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. రోజుకో స్పెషల్ కూరతో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న భోజన విధానంపై ప్రభుత్వ కల్పిస్తున్న సదుపాయాలను వారు కొనియాడారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కె.గొల్లపల్లె ఉన్నత పాఠశాలను జపాన్ దేశస్తులు శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కనకాచారికి జపాన్‌కి చెందిన స్టాన్లీ స్నేహితుడు. కనకాచారి కోరిక మేరకు క్రిస్మస్ వేడుక కోసం స్టాన్లీ అతని జపాన్ స్నేహితులు కోటరో, హిరోమి, ష్కాలర్ ఇక్కడ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా అక్కడి వాతావరణాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేసేదెవరని ఆరా తీశారు. అలాగే పాఠశాలకు కల్పించిన మౌలిక వసతులకు మంత్రముగ్థులై విషయాలన్నీ కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. నాడు-నేడు అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని, దీనివల్ల ఇక్కడి పాఠశాలల స్వరూపం పూర్తిగా మారిపోయిందని కనకాచారి వారికి వివరించారు. దీనికోసం సీఎం జగన్మోహనరెడ్డి మహోద్యమం చేస్తున్నారని, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తీసుకొచ్చి రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆశ్చర్యం చెందినవారు వెంటనే అక్కడ అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. ఇంతటి సదుపాయాలు కల్పిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. పాఠశాల హెచ్ఎం లలితతోపాటు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇదీ చదవండి: మనసున్న సీఎం వైఎస్ జగన్ -
మనసున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, భీమవరం: ఆపన్నులను ఆదుకోవడంలో ముందుండే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం పర్యటనలోనూ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. శుక్రవారం నాటి భీమవరం పర్యటనలో అనారోగ్యంతో, ఇతరత్రా ఇబ్బందులతో బాధ పడుతున్న వారి గోడు విని అప్పటికప్పుడే సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన గుడాల అపర్ణ జ్యోతి, దెందులూరు మండలం శ్రీరామవరంనకు చెందిన కంతేటి దుర్గాభవాని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న భీమడోలు మండలం పూళ్లకు చెందిన అరుగుల లాజర్ తనయుడు, అదే గ్రామానికి చెందిన నూతుల మార్తమ్మ, యలమంచిలి మండలం దొడ్డిపట్లకు చెందిన చిల్లి సుమతి తనయునికి వైద్య సాయం నిమిత్తం ఆర్థిక సాయం, భర్త మృతి చెందిన నరసాపురం 29వ వార్డుకు చెందిన ఎల్లమల్లి అన్నపూర్ణ, ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చెందిన తేతలి గీతలకు పరిహారంగా ఆర్థిక సాయం అందజేశారు. నరసాపురం మండలం ఎల్బీ చర్లకు చెందిన కడలి నాగలక్ష్మికి భూపరిష్కారం నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.ప్రశాంతి, జేసీ ఎస్.రామసుందర్‌రెడ్డిలు తొమ్మిది మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. -
కృష్ణానది ఒడ్డున కలకలం.. అర్ధరాత్రి క్షుద్ర పూజలు!
గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి కృష్ణానది ఒడ్డున అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. మూడు రోజులుగా గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్థలంలో పూజలు జరగడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు రహస్యంగా పూజల్లో పాల్గొనడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పూజలకు ఆయన తన కారులో కాకుండా వేరే కారులో వెళ్లడం పలు అనుమానాలకు దారితీసింది. తాంత్రిక పూజలు తెలిసిన వ్యక్తులు, పూజారులు, హిజ్రాలతో పూజలు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా ప్రచారం కోరుకునే ఉమా పార్టీ నాయకులు, అధికారులతో పాటు ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి రహస్య పూజలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చింది. పూజల అనంతరం గొల్లపూడి సమీపంలో కృష్ణానది మధ్యన లంక ప్రదేశంలో ఉన్న ఆలయంలో కూడా పూజలు చేసినట్లు తెలిసింది. గతంలో కూడా ఇటువంటి తాంత్రిక పూజలు వివిధ ప్రాంతాల్లో ఉమా చేయించారని చెబుతున్నారు. పూజల వ్యవహారం బయట పడటంతో చివరి రోజు పార్టీ నాయకులను భోజనాలకు ఆహ్వానించారు. టీడీపీ నాయకుడి కుమారుడి వివాహం సందర్భంగా శాంతి పూజలని, పితృ దేవతలకు పిండ ప్రదానమని, చంద్రబాబునాయుడు ఆరోగ్యం కోసమని పొంతన లేని సమాధానాలు చెబుతుండటం గమనార్హం. -
జగన్నినాదాలతో హోరెత్తిన అరకు లోయ
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): జగన్నినాదాలతో అరకు లోయ నియోజకవర్గం శుక్రవారం హోరెత్తిపోయింది. హుకుంపేట మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. గిరిజనం ప్రభంజనంలా తరలివచ్చారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. పాడేరు–హుకుంపేట రోడ్డులోని బర్మన్‌గుడ జంక్షన్ నుంచి సభావేదిక వరకు సుమారు వెయ్యి బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుని ఆయన రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన సంక్షేమ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగిందన్నారు. గడప గడపకు సంక్షేమ పథకాలు చంద్రబాబు ప్రభుత్వం అరకులోయ నియోజకవర్గ అభివృద్ధిని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ విమర్శించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఎంతో అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. నవరత్న ప«థకాల ద్వారా నియోజకవర్గంలోని 2.41 లక్షల మందికి రూ.2 వేల కోట్ల వరకు లబ్ధి చేకూరిందని తెలిపారు. అలాగే మారుమూల గ్రామాలతో పాటు అన్ని ప్రధాన గ్రామాలకు రోడ్లు, గెడ్డలపై వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలకు మరో రూ.2 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చుపెడుతోందన్నారు. సెల్ టవర్ల నిర్మాణాలు, తాగునీటి పథకాలు, నాడు–నేడుతో పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధికి రూ.వందలాది కోట్లు వ్యయం చేసిందన్నారు. జగన్ పాలనలోనే సామాజిక న్యాయం సీఎం జగన్ పాలనలోనే గిరిజనుల సమగ్రాభివృద్ధి సాధ్యమైందని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలలక్ష్మి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కొనియాడారు. పాడేరు, పార్వతీపురంల్లో వైద్య కళాశాలలు, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం, కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణాల ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చంద్రబాబు గిరిజనులను చిన్నచూపు చూశారని, రాజ్యాంగ పదవులకు దూరం చేశారని మండిపడ్డారు. గిరిజన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేకపోయారన్నారు. సామాజిక న్యాయం జగన్ పాలనలోనే సాధ్యమైందన్నారు. గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి తనతో సమానంగా చూశారని కొనియాడారు. తన పాలనలో 3.46 లక్షల ఎకరాల అటవీ భూములను గిరిజనులకు పంపిణీ చేశారన్నారు. ఆదివాసీలకు సామాజిక న్యాయం ఆదివాసీలకు సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర కొనియాడారు. ఇదే గిరిజన జాతికి చెందిన తనకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. అరకు నియోజకవర్గాన్ని రూ.ఆరు వేల కోట్లతో ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి చేశారని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అరకు నియోజకవర్గంలో గిరిజనుల సాగులో ఉన్న 49 వేల ఎకరాల అటవీ భూములకు పట్టాలిచ్చి ఎంతో మేలు చేశారని తెలిపారు. చంద్రబాబు గిరిజనులను వాడుకుని వదిలేశారని మండిపడ్డారు. అల్లూరి సీతారామరాజు మాదిరిగా గిరిజనులంతా టీడీపీపై బాణాలు ఎక్కుపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, అరకు లోయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజా రమేశ్, ఎస్టీ కమిషన్ సభ్యులు కొర్రా రామలలక్ష్మి, జంపరంగి లిల్లీ, పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆ పోస్టుల భర్తీ కనిపించలేదా రామోజీ?
‘దున్నపోతు ఈనిందంటే దూడని గాటికి కట్టేయమన్నాడట’ వెనుకటికి ఒక ప్రబుద్ధుడు. ఈనాడు రామోజీరావు తీరు అచ్చం అలానే ఉంది. గత ప్రభుత్వ పాలనలో మూగజీవాలు మృత్యువాత పడుతున్నా... పశువైద్య కేంద్రాల్లో సిబ్బంది కరువైనా... అవసరమైన మందులు అందించకపోయినా... సరైన వైద్యం అందకపోయినా రామోజీ కళ్లకు కనిపించలేదు. ఈనాడు కలాలకు పదును పెట్టలేదు. ఇప్పుడే ఆ శాఖపై అమాంతంగా అభిమానం పుట్టుకొచ్చేసింది. అవాస్తవాలతో జనాన్ని పక్కదారి పట్టించేందుకు కంకణం కట్టుకుంది. లెక్కకు మిక్కిలిగా పోస్టులు భర్తీ చేసి రైతు ముంగిటకే పశువైద్యం తీసుకెళ్తుంటే తట్టుకోలేకపోతోంది. ఈ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంటే కుళ్లుకుంటోంది. ఎక్కడ ప్రజల్లో మంచి పేరొస్తుందేమోనని భయపడిపోతోంది. అదే పనిగా విమర్శిస్తూ... అడ్డగోలు రాతలతో అభాసుపాలు చేయాలని చూస్తోంది. వాస్తవాలకు పాతర వేస్తోంది. రోజుకో అంశంతో అబద్ధపు వార్తలు వండి వారుస్తోంది. పశువైద్యం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కనిపించాలంటే రామోజీ కళ్లద్దాలు మార్పించుకుని చూడాలి. సాక్షి, అమరావతి: గ్రామానికో పశుసంవర్థక సహాయకుడు... రెండు మండలాలకో వెటర్నరీ అంబులెన్స్... గ్రామ స్థాయిలో ఆర్బీకేల ద్వారా పశుగ్రాసం, సర్టిఫై చేసిన నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణా పంపిణీ... పాడి రైతు ముంగిటకే నాణ్యమైన పశువైద్య సేవలు... నియోజకవర్గ స్థాయిలో పశువ్యాధి నిర్థారణ ప్రయోగశాలలు... నాణ్యమైన పాల ఉత్పత్తి లక్ష్యంగా ఆర్బీకేల ద్వారా పశువిజ్ఞాన బడులు... మూగజీవాలకు బీమా రక్షణ... జనరిక్ పశుఔషధ కేంద్రాల ఏర్పాటు... జగనన్న పాలవెల్లువ ద్వారా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పన.. ఇలా గడచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో వచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు ఈ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తద్వారా కేంద్రంతో సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు.. అవార్డులు.. రివార్డులు అందుకుంది. పంజాబ్, రాజస్థాన్, కేరళ వంటి పలు రాష్ట్రాలు ఇక్కడి విధానాలను స్ఫూర్తిగా తీసుకున్నాయి. ఇప్పుడు వాటినే ఆచరిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా... దేశంలో పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా మూగజీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. గతంలో సకాలంలో నాణ్యమైన, అత్యవసర వైద్య సేవలు అందక ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో మూగజీవాలు మృత్యువాతపడేవి. రాష్ట్రంలో 1577 పశువైద్యశాలలు, 323 ప్రాంతీయ పశువైద్యశాలలు, 12 వెటర్నరీ పోలీ క్లీనిక్స్ ద్వారా పశు పోషకులకు చేరువలో అత్యాధునిక పశువైద్యం అందుతోంది. రాష్ట్ర స్థాయిలో 2 సూపర్ స్పెషాలిటీ పశువైద్యశాలల ద్వారా పశువులకూ 24 గంటలు పశువైద్యం అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో 1.66 కోట్ల పశుగణ యూనిట్లు ఉండగా, 1527 పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు విధులు నిర్వíßరి్తస్తున్నారు. ఖాళీగా ఉన్న 264 పశువైద్యుల పోస్టుల నియమకానికి చర్యలు చేపట్టారు. రైతు ముంగిటకే అత్యవసర వైద్యసేవలు ప్రతి నియోజకవర్గానికి రెండు చొప్పున రూ.240.69 కోట్ల వ్యయంతో 340 సంచార పశువైద్య అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతీ అంబులెన్స్‌లో వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 295 స్పెషలిస్ట్ పశువైద్యులతో పాటు 337 పశువైద్య సహాయకులు సేవలందిస్తున్నారు. ప్రతీ వాహనంలో 51 రకాల వైద్యపరికరాలు ఉంచారు. 20 రకాల పేడ సంబంధిత, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా చిన్నపాటి లేబొరేటరీని సమకూర్చారు. ప్రతీ అంబులెన్స్‌లో రూ.30వేల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. వీటి సేవల కోసం 1962తో టోల్ ఫ్రీ నెంబర్‌తో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కచ్చితమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు దేశంలో మరెక్కడా లేనివిధంగా నియోజక వర్గస్థాయిలో రూ.24.14కోట్లతో 154 పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌్సను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతీ లేబొరేటరీలో ఒక టెక్నీషియన్, ఒక అటెండర్ని నియమించింది. వీటి ద్వారా పేడ పరీక్షలు, రక్త పరీక్షలు, పాల పరీక్షలు, మూత్ర పరీక్షలు, చర్మ సంబంధ వ్యాధి పరీక్షలు, యాంటీ బయోటిక్ సెన్సిటివిటీ, జీవక్రియ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామానికో గ్రాడ్యుయేట్ ఉద్యోగి రైతులకు గ్రామస్థాయిలో నాణ్యమైన సేవలందించే సంకల్పంతో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న 1218 గ్రామీణ పశుగణ కేంద్రాలతో పాటు 7396 ఆర్బీకే క్లస్టర్స్ ద్వారా పశువైద్య సేవలందించేందుకు గ్రాడ్యుయేట్ చదివిన పశువైద్య నిపుణులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు విడతల్లో 4652 మంది గ్రాడ్యుయేట్స్‌ను నియమించగా మరో 1896 పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆర్బీకేల్లో ట్రావిస్‌ను ఏర్పాటు చేసి, ప్రథమ చికిత్స అందజేస్తున్నారు. ఆర్బీకేలకు రూ.3వేల విలువైన మందులు, వైద్య పరికరాలు సమకూర్చారు. అత్యధికంగా పశువైద్యులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే అత్యధికంగా పశువైద్యులు సేవలందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 51,772, గుజరాత్లో 36,540, బీహార్‌లో 32,138, తెలంగాణలో 32,127, ఉత్తరప్రదేశ్‌లో 27,480, రాజస్థాన్‌లో 20,821 జీవాలకు ఒక గ్రాడ్యుయేట్ పశువైద్యుడు సేవలు అందిస్తుంటే, మన రాష్ట్రంలో ప్రతీ 17,808 జీవాలకు ఒక వైద్యుడు సేవలు అందిస్తున్నారు. అయినా ఇంకా ఏమీ చేయలేదన్నట్టు ఈనాడు అసత్య కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. పదిమందిలో ఆ పత్రికే చులకనవుతోంది. -
‘అనంత’ ప్రభంజనం
అనంతపురం: 76 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో కేవలం నినాదంగా మాత్రమే ఉన్న ‘సామాజిక సాధికారత’ను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆచరణలో పెట్టి చూపించారని వైఎస్సార్సీపీ నేతలు కొనియాడారు. సామాజిక సాధికారత తమ నినాదం కాదు విధానమని నిరూపించారని ప్రశంసించారు. రాజ్యాధికార పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట వేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. మరోసారి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అనంతపురం నగరంలో శుక్రవారం వైఎస్సార్సీపీ చేపట్టిన ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. దీంతో సభాప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు చంద్రబాబుకు అధికారంలో ఉంటే అగ్రకులాలు, అధికారంలో లేకపోతే వెనుకబడిన కులాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. సామాజిక విప్లవ సృష్టికర్త జగనన్న దేశ చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజిక విప్లవాన్ని సృష్టించారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. సామాజిక న్యాయం అనేది ప్రభుత్వ విధానమని నిరూపించారన్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుంటే నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలవారేనని గుర్తు చేశారు. గతంలో ఇంతటి గౌరవం ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకుందామని పిలుపునిచ్చారు. బలహీనవర్గాలకే సింహభాగం పథకాలు సీఎం వైఎస్ జగన్ పాలనలో సింహభాగం సంక్షేమ పథకాలు బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకే అందుతున్నాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ తెలిపారు. కలగా మారిన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన అభినవ అంబేడ్కర్, అభినవ పూలే.. వైఎస్ జగన్ అని కొనియాడారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్లేనన్నారు. ఆయా వర్గాల్లో చర్చ జరగాలి గతంలో కంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంత మేలు జరిగిందనే విషయంపై ఆయా వర్గాల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బీసీలే తమ పార్టీకి వెన్నెముక అంటూ ఊదరగొట్టే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ వర్గాలకు ఏమీ చేయలేదన్నారు. చంద్రబాబు తన ప్రభుత్వం కమ్మలకు 8, రెడ్లకు 6, కాపులకు 4, బీసీలకు 3, ఎస్సీలకు 2 మంత్రి పదవులు ఇచ్చారని, మైనార్టీ, గిరిజనులకు అసలే ఇవ్వలేదని విమర్శించారు. వైఎస్ జగన్ కేబినెట్లోని 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని గుర్తు చేశారు. బాబును జీవితంలో నమ్మకూడదు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాలకు ఆయనను జీవితంలో నమ్మకూడదని సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావు అన్నారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని వ్యక్తి అని తెలిపారు. మాటతప్పని, మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్ అన్ని వర్గాలకు అండగా నిలిచారన్నారు. పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.45 లక్షల కోట్లు జమ చేశారన్నారు. అందులో సింహభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే అందిందని జూపూడి అన్నారు. సామాజిక న్యాయానికి అర్థం చెప్పారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆకాంక్షించిన సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ నిజం చేశారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక సాధికారతను కల్పించారన్నారు. రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి పేదల ఆర్థిక స్థితిగతులను మార్చేశారని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందన్నారు. సీఎం వైఎస్ జగన్ చొరవతో అనంతపురం నియోజకవర్గంలో రూ.800 కోట్లతో రోడ్లు, కాలువలు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. -
జైలు నుంచే చదువు.. పీజీ గోల్డ్ మెడల్ కైవశం
కోవెలకుంట్ల: జైలు శిక్షపడిన యువ ఖైదీ అక్కడి అధికారుల సహకారం, పట్టుదలతో లా కోర్సు చదివి న్యాయవాద పట్టాతో తన తండ్రిని నిర్దోషిగా నిరూపించేందుకు న్యాయస్థానంలో వాదించి గెలిచిన ఘటనను 20 ఏళ్ల క్రితం స్టూడెంట్ నంబర్ –1 సినిమాలో చూశాం. అదే తరహాలో యావజ్జీవ కారాగార శిక్షపడిన ఓ యువకుడు నిజ జీవితంలో విజయం సాధించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన దూదేకుల నడిపి మాబుసా, మాబున్నీ కుమారుడు మహమ్మద్ రఫీ 2014లో బీటెక్ చదివేవాడు. ఆ సమయంలో ప్రేమ వ్యవహారంలో ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి హత్యకు కారకుడని భావించి ఆ యువకుడిపై పోలీస్‌స్టేషన్‌లో హత్యకేసు నమోదైంది. కోర్టులో విచారణ అనంతరం 2019 జూలై నెలలో రఫీకి జీవితఖైదు విధించారు. అప్పటి నుంచి కడప కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఖైదీలను సైతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అక్కడి జైలు అధికారులు చదువుపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించారు. పది చదివిన వారిని దూర విద్య కోర్సుల ద్వారా పై చదువులకు ప్రోత్సహించారు. శిక్షపడే నాటికే డిగ్రీ పూర్తి చేసిన మహమ్మద్ రఫీకి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, ఇతర జైలు అధికారులు ప్రోత్సాహమందించారు. 2020లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసేందుకు అవకాశం కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు మహమ్మద్ రఫీ ఎంఏ సోషియాలజీలో అడ్మిషన్ పొందాడు. వివిధ రకాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను సమకూర్చుకుని జైలులోనే నాలుగు గోడల మధ్య కష్టపడి చదివాడు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు 2022లో పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని యూనివర్సిటీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎంఏ సోషియాలజీలో మొదటి ర్యాంకుతో గోల్డ్ మెడల్ కైవశం చేసుకున్నాడు. జైలులో ఉంటున్న రఫీకి పీజీ పట్టా గోల్డ్ మెడల్ ప్రదానం చేయాలని యూనివర్సిటీ అధికారులు ఇటీవల జైలు అధికారులకు సమాచారం అందించారు. కోర్టు అనుమతితో నాలుగు రోజులు బెయిల్ మంజూరు కావడంతో గురువారం హైదరాబాద్‌లోని అంబేడ్కర్ యూనివర్సిటీలో వైస్ చాన్స్‌లర్ జగదీశ్ ఆధ్వర్యంలో గోల్డ్‌మెడల్ బహూకరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ తన జీవితం జైలు పాలైనప్పటికీ చదువుపై ఉన్న మమకారంతో పట్టుదలతో పీజీ సాధించానన్నారు. తన తల్లిదండ్రులకు ఈ గోల్డ్‌మెడల్ అంకితం చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాల ద్వారా ప్రజారోగ్యానికి అండగా నిలుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పూర్తయిన అనంతరం.. ఆస్పత్రులకు వెళ్లి ఫాలోఅప్ వైద్య సేవలు పొందడం కోసం రోగుల ప్రయాణాలకయ్యే ఖర్చును కూడా వారికి అందించబోతోంది. కన్సల్టేషన్‌కు రూ.300 చొప్పున.. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే చికిత్సల సంఖ్య(ప్రొసీజర్లు)ను వైఎస్ జగన్ ప్రభుత్వం 3,257కు పెంచింది. అలాగే ఆరోగ్యశ్రీ వైద్య వ్యయ పరిమితిని కూడా రూ.25 లక్షలకు పెంచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత భరోసా కల్పించింది. అంతేకాకుండా 1,500కు పైగా ప్రొసీజర్లలో చికిత్సల తర్వాత వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి గాను రోగులకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద గరిష్టంగా నెలకు రూ.5 వేల వరకు సాయం అందిస్తోంది. ఇప్పుడు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. ఆరోగ్యశ్రీ పథకంలోని గుండె, మెదడు, ఆర్థో, పీడియాట్రిక్స్ విభాగాలకు సంబంధించిన 138 ప్రొసీజర్లలో ఏదైనా చికిత్స చేయించుకున్న తర్వాత.. ఏడాదిలోపు రోగులు 4సార్లు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే రోజే.. ఫాలోఅప్ సేవల కోసం రావాల్సిన తేదీలను వైద్యులు చెబుతుంటారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందేవారంతా నిరుపేద, మధ్యతరగతి ప్రజలే. వీరు ప్రయాణాల ఖర్చులకు వెనుకడుగు వేసి ఫాలోఅప్ వైద్య సేవలపై నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో సమస్య పూర్తిగా నయం కాకపోవడంతో భవిష్యత్‌లో మళ్లీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ 138 ప్రొసీజర్లలో ఏదైనా చికిత్స పొందిన వారికి ప్రయాణ చార్జీలను కూడా ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఒక్కో కన్సల్టేషన్‌కు రూ.300 చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైన మందులూ అందజేత.. ఫాలోఅప్ కన్సల్టేషన్ సమయంలోనే రోగికి అవసరమైన మందులను కూడా ఆస్పత్రిలో అందజేస్తారు. ఏటా ఆరోగ్యశ్రీ కింద చేసే మొత్తం చికిత్సల్లో 10 శాతం మేర కేసుల్లో ఫాలోఅప్ కన్సల్టేషన్లు అవసరం ఉంటాయని వైద్య శాఖ అంచనా వేసింది. ఫాలోఅప్ కన్సల్టేషన్ వైద్య సేవల పొందేందుకు ప్రభుత్వం ఇలా అదనపు సాయం చేయడం వల్ల రోగులు పూర్తి స్థాయిలో కోలుకుంటారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇది ప్రజలకు గొప్ప మేలు చేస్తుందన్నారు. ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టాం.. అవసరం ఉన్న ప్రతి ఒక్క రోగి ఫాలోఅప్ కన్సల్టేషన్ సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. కన్సల్టేషన్‌కు రూ.300 చొప్పున చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమలు చేయడానికి చర్యలు చేపట్టాం. మెడ్కో లాగిన్‌లో ఓ ప్రత్యేక ఆప్షన్ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన వ్యక్తి ఫాలోఅప్ కన్సల్టేషన్‌కు హాజరయ్యాడని నిర్ధారిస్తే.. ఆ రోగి, వారి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో రూ.300 చొప్పున నగదు జమ అవుతాయి. – డీకే బాలాజీ, సీఈవో, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
AP: వలంటీర్లకు ప్రతినెలా అదనంగా రూ.750
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5,000కు అదనంగా మరో రూ.750ను ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నందుకు ఈ ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్టు తెలిపింది. ప్రతి నెలా రూ.750 మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా వేరేగా వలంటీర్లకు అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ కొద్ది రోజుల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ టీఎస్ చేతన్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు జాయింట్ కలెక్టర్లు, జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్చార్జిలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీవోలు, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకుఇంటింటికీ æరేషన్ పంపిణీలో వలంటీర్లను మరింత భాగస్వాములను చేయనున్నారు. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ వలంటీర్లకు కొన్ని ప్రత్యేక విధులను నిర్ధారించింది. వీటిని కూడా రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు తెలియజేశారు. కాగా వలంటీర్లకు రూ.750 అదనపు ప్రోత్సాహకాన్ని ఎప్పటి నుంచో వర్తింపజేస్తామో వేరేగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఇంటింటికీ రేషన్ పంపిణీలో వలంటీర్లకు ప్రత్యేక విధులు.. వలంటీర్లు తమ క్లస్టర్ (గ్రామీణ ప్రాంతాల్లో 50 ఇళ్ల పరిధి, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్ల పరిధి)లో ఇంటింటికీ రేషన్ పంపిణీలో పూర్తి అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ప్రతినెలా ప్రభుత్వం అందజేసే రేషన్ సరుకులను తీసుకునేలా విస్తృత ప్రచారం చేయాలి. రేషన్ వాహనాలు ఇంటింటికీ పంపిణీకి వచ్చే సమయాన్ని ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు తెలియజేయాలి. పంపిణీ జరిగే సమయంలో వలంటీర్లు కూడా ఉండాలి. రేషన్ సరుకులు తీసుకునే క్రమంలో లబ్ధిదారులు వేలిముద్రలు వేయడం తదితర అంశాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అక్కడికక్కడే వాటి పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. తమ పరిధిలో రేషన్ పంపిణీలో ఏవైనా లోపాలు, అవకతవకలు జరిగినట్టు గుర్తిస్తే.. ఆ వివరాలను వెంటనే సంబంధిత వీఆర్వో లేదా డిప్యూటీ తహసీల్దార్లకు తెలియజేయాల్సి ఉంటుంది. -
సరికొత్త దారిలో సర్కారీ చదువులు
ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీల్లోని 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో ఫీజులు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. అయితే ఈ వర్సిటీల్లో చదివించేందుకు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే జగనన్న విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చాం. సీటు తెచ్చుకోండి.. రూ.1.25 కోట్లు మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం. జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదువుతున్నారు. బెస్ట్ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగితే వారి బతుకులతో పాటు రాష్ట్ర రూపురేఖలు మార్చే లీడర్ షిప్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. పెద్ద పెద్ద సంస్థలు మన పిల్లల్ని చేయిపట్టుకుని మరీ పైకి తీసుకుని పోయే అవకాశాలు ఇస్తాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. దేశ భవిష్యత్‌ను, తల రాతను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. దీనిని నేను గట్టిగా నమ్మాను. విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్య దాకా 55 నెలల పరిపాలనలో విప్లవాత్మక అడుగులు వేశాం. ఏకంగా రూ.73 వేల కోట్లు విద్యా రంగానికే ఖర్చు చేశానని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యా రంగంలోనే కాకుండా వైద్య, వ్యవసాయ రంగాల్లో, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలోనూ తీసుకొచ్చామని చెప్పారు. ఇలా ప్రతి రంగంలో మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి జూలై – సెప్టెంబర్ త్రైమాసికం నిధులను కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేశారు. 8,09,039 మంది పిల్లలకు మంచి చేసేలా రూ.7,47,920 మంది తల్లుల ఖాతాల్లో రూ.583 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా 27.61 లక్షల మంది పిల్లల పూర్తి ఫీజులు రూ.11,900 కోట్లు చెల్లిస్తూ తల్లిదండ్రులపై భారం పడకుండా ఒక మేనమామలా ఆదుకున్నానని చెప్పారు. పిల్లలపై బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల భారం పడకూడదని వసతి దీవెన ద్వారా అండగా ఉంటూ రూ.4,275 కోట్లు ఇచ్చామన్నారు. పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలు మరింత ఉన్నత చదువులు చదవాలనే తాపత్రయంతో విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మొత్తంగా రూ.16,175 కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ‘ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ గొప్ప చదువులు, డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు కావాలి. అలా ఆ కుటుంబాల తలరాతలు మారాలనే తపనతో అడుగులు వేస్తున్నాం. 2017–18కి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజులు రూ.1,777 కోట్లను మనందరి ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత విద్యలో సంస్కరణలు ♦ నాడు–నేడుతో బడుల రూపురేఖలను మార్చుతూ ఉన్నత విద్యపై ధ్యాస పెట్టి సంస్కరణలు తీసుకువచ్చి కరిక్యులంలో మార్పులు చేశాం. పిల్లలు ఏం చదువుతున్నారు.. అని ఒక ముఖ్యమంత్రి ధ్యాస పెట్టిన పరిస్థితి మీ జగన్ మామ పాలనలోనే జరిగింది. తొలిసారి డిగ్రీలో కూడా ఆన్లైన్ వర్టికల్స్‌ను తీసుకొచ్చాం. ఏకంగా 10 నెలల ఇంటర్న్‌షిప్‌తో జాబ్ ఓరియంటెడ్ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేశాం. ♦ మన పిల్లలు ప్రపంచంలోని మేటి యూనివర్సిటీలతో పోటీ పడేలా మన రాష్ట్రంలో చదువులుండాలనే తపనతో అంతర్జాతీయంగా ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు, ఎంఐటీ, హార్వర్డ్, ఎల్బీఎస్, ఎల్ఎస్సీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు వచ్చేందుకు హైడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యాం. తద్వారా ఆన్లైన్లో ఆ కోర్సులు తీసుకొస్తూ ఏఐని అనుసంధానం చేస్తూ డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఈ దిశగా అడుగులు వేస్తున్నాం. ♦ పేద విద్యార్థులు మన పిల్లలు.. ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితేనే వేగంగా ఎదగగలుగుతారు. ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలో భాగమైనప్పుడు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ముందు వరుసలో ఉంటాం. పిలిచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఒక పేజీ ఇంగ్లిష్, ఒక పేజీ తెలుగుతో బై లింగ్వల్ టెక్ట్స్ బుక్స్ ద్వారా మెరుగైన చదువు చెప్పిస్తున్నాం. శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉండే.. రూ.15 వేలు ఆన్లైన్లో చెల్లిస్తే తప్ప రాని బైజూస్ కంటెంట్‌ను మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాం. 6వ తరగతి.. ఆపై తరగతి గదుల్లో ప్రతి క్లాస్ రూంలో ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూంలుగా మార్చి డిజిటల్ బోధనను తీసుకువచ్చాం. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు సీబీఎస్ఈతో మొదలై ఐబీ వరకు వెళుతున్న ఈ ప్రయాణం పిల్లలందరినీ గొప్ప వారిగా తీర్చిదిద్దే వరకు సాగుతుంది. 3వ తరగతి నుంచి టోఫెల్ సబ్జెక్ట్‌ను తీసుకువచ్చి క్లాస్ టీచర్ లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేయడం వరకు.. పిల్లల బంగారు భవిష్యత్ కోసం వాళ్ల జగన్ మామ ఎంతో తాపత్రయపడుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నా.. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్టయ్యా నేను పేద కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివాను. నేను ఇంజనీరింగ్ చదవాలనే కోరికతో చిన్నప్పటి నుంచి కలగనేదాన్ని. జగనన్న విద్యా దీవెన ద్వారా ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టకుండా చదువుకుంటున్నాను. మొత్తం ఫీజు మీరే (సీఎం) కట్టారు. వసతి దీవెన ఎంతో ఉపయోగపడింది. మీ వల్ల అందరం బాగా చదువుకోగలుగుతున్నాం. మీ వల్ల నేను మంచి ప్యాకేజీతో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఆ క్రెడిట్ అంతా మీదే సార్. – ప్రిన్స్ ఏంజిల్, బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని, నరసాపురం మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారన్నా నేను జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బీటెక్ చదువుతున్నా. నెల్సన్ మండేలా చెప్పినట్టు విద్య అనే ఒక ఆయుధం మాత్రమే మన భవిష్యత్‌ను మారుస్తుంది అన్న మాటను మీరు నిజం చేశారు. మీరు విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వరల్డ్ క్లాస్ వర్సిటీల్లో మాదిరి సిలబస్ తీసుకొచ్చారు. మహిళా సాధికారత, విద్య.. ఈ రెండు జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయి. మీరు ఈ రెండింటినీ సాధించారు. మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారు. థ్యాంక్యూ సార్. – నవ్యశ్రీ, బీటెక్ విద్యార్థిని, భీమవరం మార్పును గమనించండి ♦ దేశ భవిష్యత్‌ను మార్చగలిగేది చదువు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో రూ.12 వేల కోట్లు కూడా సరిగ్గా ఖర్చు చేయలేని పరిస్థితి. ఈ రోజు మనందరి ప్రభుత్వం రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి. తేడాను మీరే గమనించాలి. చదువు అనేది తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను మార్చాలన్నా, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలన్నా, వెనుకబడిన కులాల తలరాతను మార్చాలన్నా, దేశ భవిష్యత్‌ను మార్చాలన్నా.. ఆ శక్తి కేవలం చదువుకే ఉంది. అందుకే 55 నెలల ప్రయాణంలో విద్యా రంగంలో విప్లవాత్మక అడుగులు వేశాం. ♦ నాడు–నేడుతో బడులు బాగుపడిన తీరుతెన్నులు గమనించాలి. ప్రభుత్వ స్కూళ్లల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టాలని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరుముద్ద మీద ఫోకస్ పెట్టాం. పిల్లలు బాగా చదవాలని, వారిని బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని ప్రభుత్వ బడులను తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు తీసుకువచ్చి రూపురేఖలు మార్చుతున్నాం. ♦ ఒక్క విద్యా రంగంలోనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం. కేవలం 55 నెలల కాలంలోనే ఇన్ని మార్పులు జగన్ చేయగలిగినపుడు గత పాలకులు 14 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయారో మీరే ఆలోచన చేయాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు పరిపాలన గుర్తు తెచ్చుకోండి. -
ఒంటరిగా ఉన్న నన్ను ప్రభుత్వమే ఆదుకుంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పైసా ఖర్చు లేకుండా లక్షల విలువైన చికిత్స గుంటూరు కలెక్టరేట్ ఆవరణలో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ విక్రయిస్తే గానీ కుటుంబ పోషణ జరగదు. దాదాపు 33 ఏళ్లుగా ఇదే నా దినచర్య. నాకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. టీ బండిపై వచ్చే ఆదాయంతోనే పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాను. చిన్నమ్మాయి డీ ఫార్మా పూర్తి చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఉన్నట్టుండి నాకు నరాల సమస్య వచి్చంది. నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. దిక్కుతోచని స్థితిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాం. రోజుకు 5 ఇంజక్షన్లు చొప్పున 5 రోజులపాటు కోర్సు వాడాలని వైద్యులు చెప్పారు. ఇంజక్షన్ల కోసమే రూ.4 లక్షలకు పైగా వెచి్చంచాలని, వైద్యానికి అదనంగా ఖర్చవుతుందని చెప్పారు. అసలే అంతంత మాత్రపు బతుకులు కావడంతో వైద్యానికి అంతమొత్తం చెల్లించుకోలేక దిగులు చెందాం. ఆ సమయంలో సచివాలయ అధికారుల ద్వారా ఆరోగ్య శ్రీ కార్డును తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రను కలవడంతో తక్షణమే స్పందించి ఆరోగ్యశ్రీపై 25 ఇంజక్షన్లకు రూ.1.40 లక్షలు మంజూరు చేశారు. 5 రోజులు 25 ఇంజక్షన్లు చేయడంతో నా ఆరోగ్యం మెరుగు పడింది. ఆరోగ్యశ్రీ ఉండడం వల్లే ఖరీదైన చికిత్స ఉచితంగా చేశారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ చిన్నగా నడవడం ప్రారంభించాను. తర్వాత తిరిగి టీ వ్యాపారం చేసుకుంటున్నాను. – మహ్మద్ బాజీత్ ఖాన్, మహబూబ్ నగర్, ఏటీ అగ్రహారం, గుంటూరు (ఎస్కే సుభాని, విలేకరి, లక్ష్మీపురం గుంటూరు) ఒంటరిగా ఉన్న నన్ను ప్రభుత్వమే ఆదుకుంది నా భర్త అనారోగ్యంతో చాలా కాలం క్రితమే మృతి చెందాడు. నాకు ఒకే కూతురు. ఆమె కూడా చనిపోయింది. అల్లుడు, వారి పిల్లలు దూరంగా వేరే ప్రాంతంలో ఉంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో నేను ఒంటరిగా నివసిస్తున్నాను. కూలి పనులకు వెళ్లి సంపాదించుకునేందుకు వయసు, ఆరోగ్యం సహకరించడం లేదు. ఈ సమయంలో నా అదృష్టం కొద్దీ వైఎస్ జగన్ ప్రభుత్వం రావడంతో దరఖాస్తు చేసిన వెంటనే వృద్ధాప్య పింఛన్ మంజూరైంది. ఆరి్థకంగా ఇతరత్రా ఎలాంటి ఆదాయం లేకపోవడంతో కేవలం పింఛను సొమ్మే నాకు ఆధారంగా మారింది. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లారేసరికి రూ.2,750 నా చేతిలో పెడుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉండడంతో ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చారు. అనారోగ్య సమస్యలు వస్తే ఉచితంగానే మందులు ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి పింఛన్ రూ.3 వేలు ఇస్తారంట. నాలాంటి ఒంటరి మహిళలకు పింఛను సొమ్ము ఎంతో భరోసాగా నిలుస్తోంది. ప్రస్తుతం నేను పూరి గుడిసెలో ఉంటున్నాను. మా ఊరు పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్నందున, నిర్వాసితులందరికీ వేరే చోట ఇళ్లు కట్టిస్తున్నారు. – బిత్తరి సత్యవతి, చింతూరు (మొహమ్మద్ షౌఖత్ అలీ, విలేకరి, చింతూరు) సర్కారు సాయంతో హాయిగా వ్యవసాయం మాది వ్యవసాయాధారిత కుటుంబం. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం యండవల్లి గ్రామంలోని మా పొలంలో వరి, పామాయిల్ పంటలు పండిస్తుంటాను. ప్రతిసారీ పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వచ్చేది. పంటలు సరిగ్గా పండనప్పుడు, పరిస్థితులు అనుకూలించనప్పుడు అప్పు తీర్చలేక మాటలు పడాల్సి వచ్చేది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చాక రైతులకు ఆరి్థక భరోసా కల్పించడం ఊరటనిస్తోంది. గత నాలుగేళ్లుగా ఏడాదికి రూ.13.500 చొప్పున మొత్తం రూ.54 వేలు రైతు భరోసా కింద నా ఖాతాలో జమయ్యాయి. ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టడం ఒక ఎత్తు అయితే, వాటిని అమలు చేయడం మరో ఎత్తు. సీఎం వైఎస్ జగన్ వచ్చాక ఒక్క రూపాయి లంచం, రాజకీయ నేతల సిఫార్సులు లేకుండానే లబ్ధి దారునికే నేరుగా ఫలాలు అందుతున్నాయి. అర్హత ప్రాతిపదికగా నాకు లబ్ధి చేకూరింది. ఇలా ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. ఇప్పుడు ప్రతి రైతు ధైర్యంగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నాడు. రైతు భరోసా కేంద్రాల వల్ల అన్నీ గ్రామంలోనే అందుతున్నాయి. అధికారులు మా చెంతకే వచ్చి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పంట వేసిన నాటి నుంచి పంటలు అమ్ముకునే వరకు అండగా ఉంటున్నారు. ఉద్యానవన పంటల్లో భాగంగా జాజికాయ, జాపత్రి, పామాయిల్లో అంతర పంటలు వేయడంతో ఉద్యానవన శాఖ పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. పలు రాయితీలు కలి్పస్తున్నారు. – గుండ్ర అంబయ్య, యండపల్లి (ఎం.వి.వి.రమణ, విలేకరి, కొత్తపల్లి) -
Fact Check: ఏమిటీ తప్పుడు రాతలు?
సాక్షి, అమరావతి: ప్రజలకు ఏమాత్రం మంచి జరుగుతున్నా చూడలేకపోతోంది ఈనాడు. ముఖ్యంగా రైతులకు మేలు చేస్తుంటే అసలు తట్టుకోలేకపోతోంది ఆ పచ్చ పత్రిక. అందులోను ఆక్వా రంగానికి విద్యుత్ ఎంత ప్రధానమో తెలిసి కూడా ఆ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా చేస్తున్న మేలుకు తప్పుడు రాతల ద్వారా అడ్డుపడుతోంది. అందులో భాగంగానే ‘విద్యుత్ ఇంజనీర్లే విస్తుపోయేలా’ అంటూ కనీస అవగాహన లేకుండా ఓ అబద్ధపు వార్తను శుక్రవారం వండి వార్చింది. గతంలో ధరలకు ప్రస్తుత ధరలకు భారీ వ్యత్యాసం ఉందని, లేబర్ చార్జీలు మెటీరియల్ చార్జీలకంటే ఎక్కువ చూపించారని, ఏపీఈఆర్సీ అనుమతి కూడా తీసుకోలేదని చేతికొచ్చిన అసత్యాలు అచ్చేసింది. ఈ కుట్రపూరిత కథనాన్ని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) తీవ్రంగా తప్పుబట్టింది. ఈ కథనంలో తప్పుల్ని ఆ సంస్థ సీఎండీ కె.సంతోష్‌రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు వాస్తవాలు ఇలా ఉన్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా 220/33 కేవీ అకివీడు సబ్‌స్టేషన్ నుంచి కృష్ణాజిల్లా 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్‌కి అనుసంధానం చేస్తూ విద్యుత్ లైన్లు వేయాలని గతంలోనే ఏపీసీపీడీసీఎల్ ప్రతిపాదించింది. ఈ సబ్‌స్టేషన్ పరిధిలో సుమారు 976 ఆక్వారంగ సంబంధిత పరిశ్రమలున్నాయి. ఇవి నెలకు 30 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఈ సర్విసులకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించడానికి ఈ అనుసంధానం తప్పదని డిస్కం భావించింది. ఈ ఇంటర్ లింకింగ్ లైన్ గతంలో ప్రతిపాదించినప్పటికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) నుంచి విద్యుత్ సరఫరాకి కావలసిన అనుమతుల్లో జాప్యం కారణంగా ఈ ప్రతిపాదనలు ముందుకు వెళ్లలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) అనుమతులు రావడంతో పనుల్లో కదలిక వచ్చింది. ► 132/33 కేవీ చిగురుకోట సబ్‌స్టేషన్ నుంచి వెలువడే 33 కేవీ పోతుమర్రు ఫీడర్పై 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్‌కు ఫీడ్ చేస్తున్నారు. ఇదే ఫీడర్పై 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్, 33/11 కేవీ మూలలంక సబ్‌స్టేషన్ కూడా అనుసంధానమై ఉన్నాయి. దీంతో ఈ ఫీడర్ 20 మెగావాట్ల కంటే ఎక్కువ లోడును నమోదు చేస్తోంది. వేసవి కాలంలో అధిక లోడ్ కారణంగా లోడ్ రిలీఫ్ (ఎల్ఆర్) విధించాల్సి వస్తోంది. అదీకాకుండా ఈ రెండు సబ్స్టేషన్లు ప్రధానంగా ఆక్వాకు విద్యుత్‌ను అందిస్తున్నాయి. 33/11 కేవీ పోతుమర్రు సబ్‌స్టేషన్‌పై 950కి పైగానే ఆక్వా సర్విసులున్నాయి. ఈ రెండు సబ్స్టేషన్లకు 33 కేవీ ప్రత్యామ్నాయ సరఫరా లేదు. అలాగే 132/33 కేవీ చిగురుకోటపై లోడ్ గరిష్టంగా 124 మెగావాట్లుగా నమోదైంది. ఈ ప్రాంతంలో లోడ్ పెరుగుదల సంవత్సరానికి 25 నుంచి 30 శాతంగా ఉంది. అందువల్ల 220/33 కేవీ ఆకివీడు నుంచి కొత్త లైను ఏర్పాటు చేయడం అనివార్యమైంది. ► రెండేళ్ల కిందట ఈ ఇంటర్ లింకింగ్ లైన్ సిమెంట్ పోల్స్‌తో ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పడు మిచాంగ్ తుపాను ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోవడంతోపాటు, సముద్రతీర ప్రాంతానికి దగ్గరగా ఉండడం వలన 33 కేవీ లైన్లు ఎం+ రూపంలో ఉండే మెటల్ టవర్స్‌ను ప్రతిపాదించారు. వీటివల్ల చెట్లు విరిగినా లైన్లకు ఎటువంటి సమస్య కలగదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదు. ఈ టవర్స్ చాలాకాలం మన్నికగా ఉంటాయి. ఉప్పుటేరు కెనాల్‌ను పరిగణలోకి తీసుకుని అధికారులు ఈ ప్రతిపాదనలు చేశారు. ► సిమెంట్ పోల్స్‌కి సంబంధించి లేబర్ ప్రతిపాదనలు వేరుగా, ప్రతి ఎం+ టవర్‌కి సంబంధించి లేబర్ కాస్ట్, టవర్స్ మెటీరియల్ కాస్ట్ కలిపి ప్రతిపాదించడం వలన ఈ రెండు ప్రతిపాదనల మధ్య అంచనాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రతిపాదనలు లేటెస్ట్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్ఎస్ఆర్) డేటా ప్రకారం తయారుచేసి టెండర్ పిలవడం జరిగింది. సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ (ఎస్ఏపీ)లో ప్రతిపాదనలు చేయడం వల్ల లేబర్ కాస్ట్కి సంబంధించి ఎటువంటి దాపరికాలకు ఆస్కారం లేదు. ► యథార్థాలు తెలుసుకోకుండా ఈనాడు పత్రిక వార్తలు ప్రచురించడం సరైన పద్ధతి కాదు. ఈనాడు వార్తను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆక్వా రంగానికి నిరంతరాయ విద్యుత్ చాలా ముఖ్యం. ఏమాత్రం కోతలున్నా.. ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోతాయి. ఆక్వా రైతులకు భారీనష్టం వాటిల్లుతుంది. అలాంటి పరిస్థితి వారికి రాకుండా చేసేందుకు చేపడుతున్న ప్రాజెక్టుపై ప్రజలు, రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేసిన ఈనాడు ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలి. -
ఆనందం.. ఆకాశాన్నంటింది
సాక్షి నెట్వర్క్/అమరావతి: గ్రామాల్లో ‘ఆడుదాంఆంధ్రా’ క్రీడా సంబరం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. క్రీడా మైదానాల్లోకి యువత భారీ సంఖ్యలో దూసుకొస్తున్నారు. నాల్గవ రోజు శుక్రవారానికి 14,396 గ్రామ/వార్డు సచివాలయాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. దాదాపు 96.61 శాతం సచివాలయాల్లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో 100 శాతం సచివాలయాల్లో పోటీలు మొదలయ్యాయి. ఒక్క రోజే 21,488 మ్యాచ్‌లకు షెడ్యూల్ చేస్తే 18,871 మ్యాచ్‌లను పూర్తి చేశారు. ఏలూరు, బాపట్ల, అనంతపురం, కృష్ణా, వైఎస్సార్, తూర్పుగోదావరి, అనకాపల్లి, చిత్తూరు, విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 92 శాతానికిపైగా మ్యాచ్ షెడ్యూల్ పూర్తయింది. మొత్తం .16లక్షల మంది వీక్షకులు హాజరవగా.. మొత్తంగా నాలుగు రోజుల్లో 28.60 లక్షల మంది ఆడుదాం ఆంధ్ర క్రీడలను వీక్షించారు. పల్నాడుకే వన్నె తెచ్చిన క్రీడలు పల్నాడు జిల్లా వ్యాప్తంగా యువత ఆటల పోటీలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పర్యవేక్షించారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో క్రికెట్ పోటీలను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 257 సచివాలయాల పరిధిలో 467 మైదానాల్లో పోటీలు జరిగాయి. ఇక్కడ 666 మ్యాచ్‌లకు గాను 664 మ్యాచ్‌లు నిర్వహించారు. 8,816 మంది క్రీడాకారులు పాల్గొనగా, 32,850 మంది ప్రేక్షకులు వీక్షించారు. క్రీడల నిర్వహణ పై కలెక్టర్ షణ్మోహన్ క్షేత్రస్థాయిలో సమీక్షించారు. తిరుపతి జిల్లాలో 392 సచివాలయాల పరిధిలోని మైదానాల్లో క్రీడలు నిర్వహించారు. 1261 మ్యాచ్‌లకు గాను 1260 మ్యాచ్‌లను నిర్వహించారు. కడపలో కదం తొక్కారు కడప జిల్లా వ్యాప్తంగా క్రీడా పోటీలు సంబరాన్ని తలపిస్తున్నాయి. పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కడపలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీడీఓలు, ఫిజికల్ డైరెక్టర్లు టోర్నమెంట్‌ను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లాలో 500 సచివాలయాల పరిధిలో 690 మ్యాచ్‌లు నిర్వహించారు. స్థానిక ఇండోర్ స్టేడియంతో పాటు పాఠశాల్లో 70 మ్యాచ్‌లు జరిగాయి. విజయవాడలోని కానూరి వీఆర్ సిద్ధార్థ కళాశాలలో జరుగుతున్న పోటీల్లో క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. విజయవంతంగా ఆడుదాం ఆంధ్రా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆడుదాం.. ఆంధ్రా’ ఆటల పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకురావటానికి ఈ ఆటల పోటీలు దోహదపడుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది క్రీడాకారులు వారి పేర్లు నమోదు చేసుకొని క్రీడల్లో పాల్గొంటున్నారు. సచివాలయం స్థాయి నుంచి ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా చక్కని అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రద్యుమ్న, రాష్ట్ర క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ -
రెడ్ బుక్ అంశం: నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు
విజయవాడ: రెడ్‌బుక్ అంశంపై నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెడ్‌బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు సీఐడీ.. లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్నట్లు లోకేష్ వాట్సాప్‌లో సీఐడీకి సమాధానం ఇచ్చారు. లోకేష్‌కు నోటీసులు ఇవ్వడానికి నిన్న(గురువారం) ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు.. లోకేష్ నోటీసులను నేరుగా తీసుకోకపోవడంతో నేడు(శుక్రవారం) ఆయనకు వాట్సప్‌లో పంపించారు. కాగా, లోకేశ్ అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు జనవరి9వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి కేసుల్లో చంద్రబాబుకు రిమాండ్ విధింపును తప్పుబట్టడంతోపాటు కీలక సాక్షులుగా ఉన్న అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌కు నోటీసులు జారీచేయాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. లోకేష్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై న్యాయస్థానం కీలక ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో బెదిరించడం కలకలం రేపింది. చదవండి: నారా లోకేష్‌కు ఎదురుదెబ్బ -
దత్తపుత్రుడు.. ఓ త్యాగాల త్యాగరాజు: సీఎం జగన్
పశ్చిమ గోదావరి, సాక్షి: ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి. మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి. ఈ ఇద్దరు ఇప్పుడు ఏకమై ప్రజల్ని వంచించేందుకు సిద్ధం అయ్యారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కల్యాణ్‌లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. భీమవరంలో ఇవాళ ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ఆ వేదికను ప్రతిపక్ష నేతల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. .. మనసు రాని ఒకాయన పరిపాలనను మనం చూశాం. ఆ పెద్ద మనిషి మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు సీఎంగా పని చేశాడు. ప్రజలకు మంచి చేయాలని అధికారాన్ని ఉపయోగించలేదు. కేవలం తన అవినీతి కోసం మాత్రమే అధికారాన్ని ఉపయోగించాడు. వచ్చిన అవినీతి సొమ్ముతో వాటాదారులైన దుష్టచతుష్టయానికి బిస్కెట్ల వేసినట్లు వేశాడు. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు.. వీళ్లకు తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్లందరూ కూడా అధికారంతో ఏం చేశారంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. ప్రజలు గుర్తు పెట్టుకొనేటట్టుగా పాలన చేయలేదు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంమాత్రమే జరిగాయి. ►మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలల్లో ఎలా చేయగలిగాడు. ఎందుకు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేదని ఆలోచన చేయాలి. వాళ్లు చేసిన పరిపాలన వల్ల వాళ్లు ప్రజల మనసుల్లో లేరు. వారికి విలువలు లేవు. విశ్వసనీయత అంతకన్నా లేదు. వాళ్ల దృష్టిలో అధికారం అంటే కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు. వాళ్లు బాగుపడటం కోసమే. వాళ్లందరినీ కూడా అడగాలని మీ అందరినీ కోరుతున్నా. అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ, వెన్నుపోట్లు పొడిచే వీరి రాజకీయం ఎలా ఉందో నాలుగు మాటల్లో చెబుతా. ►దుష్ట చతుష్టయానికి చెందిన ఈ గ్యాంగ్, ముఠాలో ఇదే భీమవరంలో ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలుపెడతా. ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ మన రాష్ట్రంలో ఉండదు. నాన్ లోకల్. పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన వాడు దేశ చరిత్రలో ఈయన తప్ప ఎవరూ ఉండడు. ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదని చెబుతాడు. తన పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వాడిని ఎవరినీ చూసి ఉండం. ఈయనను తప్ప. దత్తపుత్రుడికి బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటూ ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభూ అనే త్యాగాల త్యాగరాజునుమాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. ►ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగం చేసే ఈ త్యాగాల త్యాగరాజునే చూస్తున్నాం. రియల్ లైఫ్ లో ఈ పెద్దమనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా మూడు నాలుగు సంవత్సరాలైనా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజీ స్టార్. ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను, సంప్రదాయాన్ని మంట గలుపుతూ నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చేయడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులిచ్చేయడం. ఏకంగా కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తున్న ఈ పెద్దమనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు అంటే ఆలోచన చేయమని అడుగుతున్నా. ►నాకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మనకు చెల్లెళ్లు ఉన్నారు. మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వారు నాయకులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయితే, ఇలాంటి వారిని ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడూ చేయడం మొదలు పెడితే మన ఆడ బిడ్డల పరిస్థితి ఏమిటి? మన చెల్లెళ్ల పరిస్థితి ఏమిటి? . ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే వారిని సమాజంలో, రాజకీయాల్లో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా? . ఇలాంటి ఆయన ఏ భార్యతోనూ మూడు నాలుగు సంవత్సరాలు కాపురం చేయలేడు. పొలిటికల్ లైఫ్ లో మాత్రం చంద్రబాబుతో కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందేనని ఏకంగా తన క్యాడర్ కు చెబుతున్నాడు. ►నేను అడుగుతున్నా. ఆలోచన చేయమని మిమ్మల్నందరినీ అడుగుతున్నా. రెండు విషాలు కలిస్తే అమృతం తయారవుతుందా? . నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు గానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా?. ఒకరేమో పిల్లనిచ్చిన మామ, సాక్షాత్తూ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్నిమోసం చేస్తారు. ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తున్న చంద్రబాబు, ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడుతున్న ఈ దత్తపుత్రుడు. వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క పేద కుటుంబం అయినా, పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా? ఎదగగలుగుతుందా? . ఇటువంటి క్యారెక్టర్ లేని, విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ప్రజలకు మంచి జరుగుతుందా?. ►వీరి చరిత్ర మరికొంత వివరంగా చెబుతా. చంద్రబాబు ఈ మనిషి వయసు 75 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాడు. 3 సార్లు సీఎం అయ్యాడు. మరి కేవలం నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీ కొడుతున్నాడు. ఆ మనిషి నోట్లో నుంచి ఏం చెప్పాలి?. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాల కాలంలో గుర్తుపెట్టుకోదగిన మంచి ఏదైనా, ఎవరికైనా,ఎప్పుడైనా ఈ పెద్దమనిషి చేసి ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి, ఓటు వేయాలని అడగాలి. మన అమ్మ ఒడి కంటే మెరుగైన పథకం తాను అమలు చేసి ఉంటే చేశాను అని ఓటు అడగాలి. ►పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కోసం అమలవుతున్న వైయస్సార్ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్ కార్యక్రమం తాను చేసి ఉంటే ఆ ఫలాలను అమలు చేశానని ఓటు అడగాలి. మీ బిడ్డ హయాంలో వైయస్సార్ చేయూత కంటే ఇంకా మెరుగైన స్కీమ్ అమలు చేసి ఉంటే అవి చేశానని ఓటు అడగాలి. 31 లక్షల ఇంటి స్థలాలు నా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. అందులో కడుతున్న ఇళ్లు మరో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇంతకన్నా మెరుగైన కార్యక్రమం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేశాను, ఇంతకన్నా మెరుగైన కార్యకక్రమం చేశాను అని ఓట్లు అడగాలి. మీ బిడ్డ హయాంలో నేరుగా డీబీటీ ద్వారా 2.45 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి పోతోంది. లంచాలు, వివక్ష లేవు. ఇలా తాను కూడా 14 సంవత్సరాలు సీఎంగా ఉంటూ ఎన్ని బటన్లు నొక్కి ఎంత డబ్బులు ప్రజలకు ఇచ్చానని ఈ బాబు ఏ గ్రామంలో అయినా రచ్చబండ దగ్గర నిలబడి చెప్పగలడా? ►ప్రజల బ్యాంకు స్టేట్ మెంట్లు చూపిస్తూ దాన్ని సాక్షిగా పెడుతూ 2014-2019 మధ్య తన ప్రభుత్వం ఏమిచ్చిందో, మనందరి ప్రభుత్వం ఏమిచ్చిందో పోల్చి ఓటు అడగగలడా?. కుప్పంలో అయినా సరే, ఏ ఇంట్లో అయినా సరే తాను వచ్చి ఛాలెంజ్ స్వీకరించి ఓటు అడగగలడా?. చంద్రబాబు అడగలేడు. ఎవరికీ తాను 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేనే లేదు. ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సభ అట. మీరందరూ చూసే ఉంటారు. చంద్రబాబు మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతున్నా. చంద్రబాబును అడుగుతున్నా. మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతున్నా. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం. ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఆ గ్రామంలో, గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్. ►ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి.. ఇది ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇవన్నీ చూస్తే ఎంత కడుపు మండుతుంది. ఎన్ని జలసిల్ మాత్రలు ఇస్తే కడుపుమంట తగ్గుతుంది. అందుకే వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన సంక్షేమం, అభివృద్ధి అనే పెద్ద గీతను చెరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ►బాబు చేయని అభివృద్ధి ప్రజలకు గుర్తు ఉండకూడదు, జగన్ ఇంటింటికీ చేసిన మంచిని ప్రజలు మర్చిపోవాలి ఇందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు. దిక్కుమాలిన కథలు. దిక్కుమాలిన కథనాలు. ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు, రౌండ్ టేబుళ్లు, రకరకాల పార్టీలు, వ్యక్తల రంగ ప్రవేశాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. తోడేళ్లందరూ ఏకమై ఒక్క జగన్ మీద ఏకమై యుద్ధం చేస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. కారణం.. ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు. వీళ్లందరూ కూడా నమ్ముకున్నది వంచనను, మోసాన్ని. ►అన్ని వర్గాలను వంచించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ హామీలతో వస్తున్నాడు. అమలు చేసిన మంచిగానీ, మంచి స్కీములుగానీ ఇవేవీ లేవు కాబట్టే ఏకంగా మోసాలకు, ఈరోజు మేనిఫెస్టో అట.. ఇద్దరూ కలిసి ఇస్తారట. రంగు రంగుల వలలతో ప్రజల్నిమోసం చేసేందుకు వస్తారు. కొత్తగా మరిన్ని వాగ్దానాలతో వస్తున్నాడు. ఆరు గ్యారెంటీలన్నాడు. జగన్ ను ఢీకొట్టలేమని డిసైడ్ చేసుకొని ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రజల్ని మోసం చేయాలని బయల్దేరారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తారట. ఇలాంటి వారిని నమ్మవచ్చా? అని ఆలోచన చేయాలి. ►ఇలాంటి వారిని చూసినప్పుడు వేమన పద్యం గుర్తుకు వస్తుంది. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపేగానీ తెలుపు కాదు.. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా? విశ్వదాభిరామ, వినురవేమ అని. రెండు విషాలు(చంద్రబాబు, పవన్‌ను ఉద్దేశించి..) కలిస్తే అమృతం అవుతుందా? నలుగురు ఒక్కటవుతే కౌరవుల సంఖ్య పెరగుతుంది అంతే.. అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ప్రజలకు వాళ్లు చేసింది ఏమీ లేదు కాబట్టే మోసాల్ని వంచల్ని మాత్రమే నమ్ముకున్నారు. అధికారం కోసం ఎన్ని మోసాలైనా చేస్తారు. వీరి బుద్ధి ఎలాంటిదో గమనించాలని అడుగుతున్నా. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు.