fashion designer
-
మనీష్ మల్హోత్రా పింక్ గోల్డ్ డ్రెస్: ‘ఉమ్రావ్ జాన్’ రేఖ మేజిక్ రిపీట్
-
రెట్రో టు మెట్రో..! సరికొత్త స్టైల్‌కి ఐకానిక్‌గా..
పాల మీగడను తలపించే లేత పసుపు రంగువసంతకాలాన్ని మరింత కళగా మార్చేస్తుంది. కాంతిమంతమైన రంగులను వెనక్కి నెట్టేస్తూ ఇండో– వెస్ట్రన్ స్టైల్ అయినా, సంప్రదాయ వేషధారణ అయినా ఈ స్ప్రింగ్ సీజన్లో బటర్ ఎల్లో స్పెషల్ మార్క్ వేస్తోంది.. పాజిటివ్ ఎనర్జీని చుట్టూ నింపడంలోనూ ప్రకృతిలో కొలువుండే ఆహ్లాదాన్ని కళ్లకు కడుతూ మదిని దోచేస్తోంది. రెట్రో స్టైల్‌కి సరైన ఎంపికగా నిలుస్తోంది. కార్పోరేట్ సంస్కృతికి కొత్త అర్ధం చెబుతూ మెట్రో స్టైల్‌తో బెస్ట్ మార్కులు కొట్టేస్తుంది.ఈ వసంత కాలంలోనే కాదు రాబోయే వేసవిలోనూ హాయిగొలిపే రంగుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది బటర్ ఎల్లో. ఈ లేత పసుపు రంగు షేడ్స్ సంప్రదాయ క్లాసిక్ వేర్‌లోనే కాదు బోల్డ్ కాంట్రాస్ట్ కలర్స్‌తోనూ జత కలుస్తుంది. మృదువైన, ప్రకాశవంతమైన రంగుల ఎంపికలో బటర్ ఎల్లో ముందువరసలో ఉంది. లాంగ్ గౌన్లు, స్టైలిష్ కార్పొరేట్ వేర్‌గానే కాదు ఫ్యాషన్ వేదికలపైనా లేత పసుపు రంగు తనదైన ముద్ర వేస్తోంది. చందేరీ, షిఫాన్, జార్జెట్ ఫ్యాబ్రిక్‌లలో బటర్ ఎల్లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటే కాటన్, పట్టులలో రిచ్ లుక్‌తో అబ్బురపరుస్తుంది. కాంట్రాస్ట్ కలర్ ఆలోచనకు ఈ షేడ్‌ను దూరంగా పెట్టవచ్చు. సేమ్కలర్ ఎంబ్రాయిడరీ వర్క్, ఫ్లోరల్ ప్రింట్స్లో తెలుపు, గాఢమైన పసుపు రంగు మోటిఫ్స్, పోల్కా డాట్స్ బటర్ ఎల్లోను మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి. ఇటీవల బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ ముంబైలోని ఫ్యాషన్ ఈవెంట్ బీవోఎఫ్ గాలాలో డిజైనర్ జార్జ్ స్టావ్పోలోస్ రూపొదించిన లేత పసుపు షిఫాన్ గౌను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ లుక్ 1970ల నాటి వింటేజ్ గ్లామర్‌ను తన డ్రెస్సింగ్ ద్వారా చూపింది.. ప్రాచీన అందాన్ని ఆధునికతతో మేళవించినట్టుగా తన డ్రెస్సింగ్ ద్వారా చూపుతూ ఈ సీజన్‌కు తప్పనిసరిగా ఉండవలసిన బటర్ ఎల్లో ప్రాముఖ్యతను చాటింది. (చదవండి: పువ్వులు పంచే అందం..!) -
ఫ్యాషన్ మోజా? ఉందిగా శ్రీజా!
శ్రీజాకు ఊహ తెలిసేనాటికే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్‌కి వెళ్లే వయసులోనే పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిశ్చయించుకుంది. అనుకున్నట్టుగానే ఫ్యాషన్ రంగంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక ఫ్యాషన్ మ్యాగజీన్స్‌లో పనిచేసింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయిన మిథిలా పాల్కర్, మసాబా గుప్తా వంటి ప్రముఖులను కలసి స్టయిలింగ్ నేర్చుకుంది. ఇండివిడ్యువల్ పర్సనాలిటీని హైలైట్ చేసే ఆమె డిజైన్స్, స్టయిలింగ్ ఎంతోమంది పెళ్లికూతుర్లకు నచ్చింది. స్పెషల్ అకేషన్ ఏదైనా స్టయిలిస్ట్‌గా శ్రీజా ఉండాల్సిందే అనిపించుకుంది.కొన్ని నెలల్లోనే బొటిక్‌తో పాటు ‘డ్రేపింగ్ డ్రీమ్స్’ అనే వెడ్డింగ్ ఫ్యాషన్ సర్వీసెస్‌ను స్టార్ చేసింది. వివాహాది శుభకార్యాలకు పెళ్లికూతుర్లకు, అతిథులకు డ్రెస్ డిజైనింగ్, స్టయిలింగ్ చేస్తూ వెడ్డింగ్ స్పెషలిస్ట్‌గా పాపులర్ అయింది. దేశీ బ్రైడల్ దుస్తులకు పర్ఫెక్ట్ బ్రాండ్‌గా స్థిరపడింది. ఆ క్రియేటివ్ కంఫర్ట్‌కి సామాన్యులే కాదు సెలబ్రిటీలూ ముచ్చటపడ్డారు. మిథిలా పాల్కర్, శ్రియా పిల్గొంకర్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను, నిహారిక కొణిదెల, శ్రద్ధా శ్రీకాంత్, సయీ మంజ్రేకర్, హన్సిక, ఆలియా భట్ లాంటి వాళ్లెందరికో శ్రీజా స్టయిలిస్ట్‌గా పనిచేసింది.⇒ జెట్ స్పీడ్‌తో పరుగెట్టే ఫ్యాషన్‌తో పాటే.. తాను పరుగెడుతూ, పడిపోతూ, తిరిగి లేస్తూ.. బ్రైడల్ స్పెషలిస్ట్ట్ అనిపించుకుంది డిజైనర్, స్టయిలిస్ట్ శ్రీజా రాజ్‌గోపాల్. ఫ్యాషన్లపై మోజుగల సెలబ్రిటీలు ఆమె డిజైన్లకు ఫిదా అవుతున్నారు. తన ప్రతిభతో ఫ్యాషన్‌లో మ్యాజిక్ చేసిన ఆమె గురించిన కొన్ని విషయాలు..⇒ పెళ్లిలో పెళ్లికూతురు గిల్టు నగలు ధరించకూడదని చాలామంది నమ్ముతుంటారు. వారి నమ్మకాన్ని గౌరవిస్తూ, ఉన్నవాటితోనే పెళ్లికూతుర్లను అందంగా చూపించా. అదే నా కెరీర్ గ్రోత్‌కు ఫ్లస్ అయింది. – శ్రీజా రాజ్‌గోపాల్ -
నాన్సీ త్యాగీ
లైఫ్‌స్టయిల్ అండ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాన్సీ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)ప్రిపరేషన్ కోసం ఢిల్లీ చేరింది. అక్కడికి వెళ్లాక తెలిసింది తన ప్యాషన్ ఫ్యాషన్ అని. ‘కాల్ మి బే’ సిరీస్ కోసం నటి అనన్య పాండేకి అవుట్ ఫిట్స్ డిజైన్ చేసి బాలీవుడ్‌ని, కాన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్ కోసం గౌన్‌ను డిజైన్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ వరల్డ్‌లోని తన అనుభవాలను, లైఫ్‌స్టయిల్ థింగ్స్‌ని, ఫ్యాషన్ టిప్స్‌ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ @nancytyagi లో షేర్ చేస్తూ సోషల్ మీడియా జర్నీనీ స్టార్ట్ చేసింది. ఆమె చెబుతున్న ఆ సంగతులు, టిప్స్‌కి దేశంలోని స్మాల్ టౌన్ అమ్మాయిలు, మహిళలు బాగా కనెక్ట్ అయ్యి తక్కువ టైమ్‌లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. అందుకే ఆమెను ఫోర్బ్స్.. 2024కు గాను ఇండియా టాప్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రకటించింది. -
ట్రెండ్‌సెట్టర్
‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను’ అనే డైలాగ్ లాగే, ప్రయోగాత్మక డిజైన్స్‌తో పాపులర్ అయి, ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్‌సెట్టర్ స్టయిలిస్ట్‌గా మారిన శ్రుతి మంజరి గురించి కొన్ని విషయాలు..ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు తిరుగుతూ, కొత్తగా ట్రై చేస్తుంటేనే మనలోని ఓల్డ్ వర్షన్ అంతా పోయి, అప్డేట్ అవుతాం. అచ్చం అలాగే ఫ్యాషన్‌లోనూ, కొత్తగా ట్రై చేస్తుంటూనే అప్డేట్ అవుతుంటాం. – శ్రుతి మంజరి.చెన్నైలో పుట్టిపెరిగిన శ్రుతికి చిన్నప్పటినుంచే ఫ్యాషన్ పట్ల మక్కువ ఎక్కువ. కాలేజీ రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ మొత్తం ఫ్యాషన్ మ్యాగజైన్స్కే ఖర్చు చేసేది. తర్వాత ప్రముఖ డిజైనర్ల దగ్గర ఇంటర్న్‌గా చేరి, ఫ్యాషన్‌పై మరింత ప్రావీణ్యం సాధించింది. ఆ సమయంలోనే రకరకాల డ్రెస్సింగ్ స్టయిల్స్‌ను గమనించింది. డిజైనింగ్‌పై దృష్టిపెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే, తనకున్న ఫ్యాషన్ స్పృహ, సృజనే క్వాలిఫికేషన్‌గా, ఒక బొటిక్ ప్రారంభించింది. కొత్త కొత్త డిజైన్స్ రూపొందించి, తనకంటూ ఒక సిగ్నేచర్ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది.ఫ్యాషన్ ఇండస్ట్రీలో సంపాదించిన అనుభవంతో స్టయిలింగ్ చేయటం కూడా స్టార్ట్ చేసింది. అదే ఆమెకు సినీ తారల లుక్స్, స్టయిల్‌ను తీర్చిదిద్దే చాన్స్‌నిచ్చింది. అలా శ్రుతి తొలిసారి ‘బ్యాడ్ గర్ల్’ అనే తమిళ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది. అందులోని ఆమె పనితీరు ఆమెకు మరెన్నో సినిమాల్లోనూ స్టయిలింగ్ చేసే అవకాశాన్నిచ్చింది. అలా శ్రుతి తమిళ చిత్ర పరిశ్రమలో ఒక బిజీ స్టయిలిస్ట్‌గా మారింది. ‘భూమ్’, ‘మోడర్న్ లవ్ చెన్నై’, ‘రఘు తాత’, ‘సొర్గవాసల్’ వంటి ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా పనిచేసింది. కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, సానియా అయ్యప్పన్, కళ్యాణి ప్రియదర్శిని, ప్రియాంకా మోహన్, గౌరి జి.క్రిష్ణన్ వంటి స్టార్స్‌కి కొంతకాలం స్టయిలిస్ట్‌గా పనిచేసింది. -
చివరకు మిగిలేది! ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గుండెలు పగిలే స్టోరీ
ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత మన అందరికి తెలిసిందే. అయినా ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోం. ఆరోగ్యాన్ని మించిన సంపదలేదు..ఆరోగ్యమే ఐశ్వర్యం అన్న పెద్దల మాటను పెడిచెవిన పెట్టి మరీ సంపద వేటలో పరుగులు పెడుతూ ఉంటాం. న్యాయం, అన్యాయం,విలువలన్నీ పక్కన పెట్టేస్తాం. కానీ అనారోగ్యం చుట్టుముట్టినపుడు గానీ ఆరోగ్యం విలువ తెలిసిరాదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏ సిరిసంపదలూ వెనక్కి తీసుకు రాలేని అందనంత దూరం వెళ్లిపోతాం. ఏం పాపం చేశాననీ నాకీ అవస్థ అంటూ అంతులేని ఆవేదనలో కూరుకుపోతాం...అనారోగ్యంతో మరణమనే కత్తి అంచున వేలాడుతున్న వారి అవేదన ఇది. ఆ ఆవేదనలోంచే తోటి మనుషులకు నాలుగు మంచి ముక్కలు చెప్పాలనే ఆలోచన వస్తుంది. నాలాగా మీరు కాకండి, మీరైనా జాగరూకతతో మసలుకోండనే సందేశాన్నిస్తారు. అలాంటి వాటిలో ఒకటి మీరు చదవబోయే మరణ సందేశం...!ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రచయిత్రి "క్రిస్డా రోడ్రిగ్జ్" కేన్సర్‌తో బాధపడుతూ చనిపోయింది. బ్లాగర్ కూడా ఈమెను క్రిస్డా రోడ్రిగ్జ్, కిర్జాయ్డా రోడ్రిగ్జ్ అని కూడా పిలిచేవారు. 40 సంవత్సరాల వయసులో (2018, సెప్టెంబర్ 9న) కడుపు కేన్సర్‌తో ఆమె చనిపోయింది. అయితే చనిపోయే ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ తెలిపేలా ఒక వ్యాసం రాసింది. పది పాయింట్లతో ఆమె రాసిన ఈ వ్యాసం పలువుర్ని కదిలించింది. అనేకమందితో కంటతడి పెట్టించింది. డబ్బు, విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు అన్నీ ఉన్నాయి, కానీ అవేవీ తనను కాపాడలేకపోతున్నాయంటూ హృదయాలు మెలిపెట్టేలా కొన్ని జీవిత సత్యాలను తన వ్యాసంలో పేర్కొంది. ఎన్నో ఖరీదైన బట్టలున్నాయి. కానీ చివరికి ఆస్పత్రిలో బట్టలో తన దేహాన్ని చుడతారు. ఇదే జీవితం. ఈ జీవిత సత్యం చాలామందికి ఇంకా అర్థం కాలేదు. దయచేసి వినయంగా ఉండండి, ఇతరులతో దయగా ఉండండి. చేతనైంత సాయం చేయండి, నలుగురితో శభాష్ అనుపించుకోండి. ఎందుకంటేఅదే కడదాకా నిలిచేది. చివరకు మిగిలేది! అంటూ రాసుకొచ్చింది. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా ఆమె రాసిన పది పాయింట్లు నా గ్యారేజీలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఉంది, కానీ ఇప్పుడు నాకు వీల్‌చైరే ఆధారం.నా ఇంట్లో అన్ని రకాల బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన బూట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు నా శరీరం ఆసుపత్రి అందించిన చిన్న గుడ్డలో చుట్టబడి ఉంది.నా దగ్గర బ్యాంకులో చాలా డబ్బు ఉంది. కానీ ఇప్పుడు ఆ డబ్బుతో ఇపుడేమీ లాభం లేదువిలాసవంతమైన కోట లాంటి భవనం ఉంది. కానీ ఇప్పుడు నేను ఆసుపత్రి బెడ్ మీద నిద్రపోతున్నాను. ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేదాన్ని. మరి ఇప్పుడు ఒక క్లినిక్ నుండి మరొక క్లినిక్‌కు తిరుగుతూ ఆసుపత్రిలోనేను వందలాది మందికి ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేసాను కానీ ఇపుడు, వైద్య రికార్డులే నా సంతకం.నా జుట్టును అందంగా తీర్చిదిద్దుకోడానికి ఏడు రకాల సె లూన్లకు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు - నా తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు.ప్రైవేట్ విమానంలో ఎపుడు కావాలంటే అపుడు, ఎక్కడికైనా ఎగరగలను, కానీ ఇప్పుడు నాకు ఆసుపత్రి గేటు వరకు నడవడానికి ఇద్దరు సహాయకులు అవసరం.చాలా ఆహారం ఉంది. కానీ రోజుకు రెండు మాత్రలు, సాయంత్రం కొన్ని చుక్కల ఉప్పు నీరు ఇపుడిదే నా ఆహారంఈ ఇల్లు, ఈ కారు, ఈ విమానం, ఈ ఫర్నిచర్, ఈ బ్యాంకు, మితిమీరిన కీర్తి ఇవేవీ నాకు అక్కరకు రావు. ఇవేవీ నన్ను శాంతింపజేయవు. ఈ ప్రపంచంలో "మరణం తప్ప నిజమైనది మరేదీ లేదు."అన్నింటికన్నా అతి ముఖ్యమైన విషయం ఆరోగ్యం. ఉన్నదాంతోనే సంతోషంగా ఉండండి. కడుపునిండా భోజనం, పడుకోవడానికి స్థలం ఇంతకంటే ఏం కావాలి ఆరోగ్యంగా ఉండండి అంటూ సందేశాన్నిచ్చింది. డెత్ బెడ్‌పై తన జీవిత దృక్పథాన్ని మార్చుకుంది. భౌతిక ఆస్తుల అశాశ్వతతను వెలుగులోకి తెచ్చింది. ఆరోగ్యం, ప్రాథమిక అవసరాలు ప్రేమ, సంతృప్తి, విశ్వాసం యొక్క అమూల్య మైన విలువను నొక్కి చెప్పింది. డొమినికన్ రిపబ్లిక్కు చెందిన ఆమె న్యూజెర్సీలో ఉండేది. ఫ్యాషన్, స్టైల్, ఫిట్నెస్, పాజిటివిటీ, వెల్నెస్, స్ఫూర్తి లాంటి విషయాలపై రోజువారీ పోస్ట్‌ల ద్వారా అభిమానులతో పంచుకునేది. రోడ్రిగ్జ్ తొలిసారి 2017 నవంబరులో స్టేజ్ 4 స్టమక్ కేన్సర్ సోకినట్టు ప్రకటించింది.ఈ పోరాటంలో కూడా రెగ్యులర్ విషయాలతోపాటు తన అనుభవాలనూ పంచుకునేది. ఇవీ చదవండి: ‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధుకేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు -
ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్
ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్,సంజనా బాత్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. ఇండియాలో సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సంజనా బాత్రా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాదాపు పెళ్లైన అయిదేళ్ల తరువాత తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సంజన బాత్రా , అవ్రాల్ బెరి దంపతులకు అభినందనలు తెలిపారు.గర్భధారణను అత్యంత హృద్యంగాసంజన ,ఆమె భర్త అవ్రాల్ బెరి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో ఒక అద్భుతమైన రీల్‌ను పంచుకున్నారు. ఇందులో వారి పెట్ డాగ్స్‌తో పాటు తాము తల్లిదండ్రులను కాబోతు న్నామనే విషానే అందంగా ప్రకటించారు. అవర్ ప్యాక్ ఈజ్ గ్రోయింగ్ అనే క్యాప్షన్‌తో తమ కుటుంబంలోకి మరో ప్రాణం రాబోతోందనే విషయాన్ని వెల్లడించారు. సంజన ఒక ఫ్లోవీ గౌనులో మెరుస్తూ, తన బేబీ బంప్‌ను అప్యాయంగా పట్టుకుంది. తీగలపై వేలాడుతున్న బేబీ దుస్తులు మరింత అద్భుతంగా కనిపించాయి. సెలబ్రిటీలు,అభిమానులు కాబోయే తల్లిదండ్రులపై ప్రేమను కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Sanjana Batra (@sanjanabatra) ముందుగా అభినందనలు తెలిపినవారిలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఒకరు. ఆమె "అభినందనలు బాచీ" కామెంట్ చేసింది. ఇంకా హీరోయిన్ శిల్పా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇషితా మంగళ్ , ఫ్యాషన్ కన్సల్టెంట్ స్టైలిస్ట్ స్మృతి సిబల్ ,ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ సాక్షి సింధ్వాని తదితరులు లవ్ ఎమోజీలతో తమ సంతోషాన్ని ప్రకటించారు. ముంబైకి చెందిన సంజనా యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది. క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన ఆమెను ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించేలా చేసింది. బ్యూటీ అండ్ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్‌గా పనిచేస్తున్న సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాకు పనిచేసింది. అలా ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులకు ప్రముఖులకు స్టైలింగ్ చేసింది. అలాగే పద్మావత్, గల్లీ బాయ్ వంటి చిత్రాలలో ఆమె చేసిన కృషికి ఆమె ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. వోగ్ ఇండియా, హార్పర్స్ బజార్ ఇండియా, ఎల్లే ఇండియాతో సహా అనేక మ్యాగజైన్లలో స్టైల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంజన బాత్రా , కెన్నెల్ కిచెన్ ఫౌండర్ అవ్రాల్ బెరి పదేళ్ల పరిచయం తరువాత2020లో పెళ్లి చేసుకున్నారు. -
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్‌లుక్స్ వరకు ప్రతిదీ సూపర్‌గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్‌గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్‌తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్‌కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు.అలా చాలామంది బ్రైడల్స్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా మారి, వారి ఫొటో షూట్స్‌కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్‌పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఆ స్టయిలింగ్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్‌తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్‌కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండిమంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందనేది నా నమ్మకం. అందుకే, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడను. బి పాజిటివ్.. బి హ్యాపీ ∙కళ్యాణి కె. -
Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!
పారిస్ ఫ్యాషన్ వీక్ 2025లోభారతీయ ఫ్యాషన్ పరిశ్రమలో ప్రముఖుడైన డిజైనర్ గౌరవ్‌గుప్తా ప్రత్యేక కలెక్షన్‌తో అలరించాడు. ఢిల్లీకి చెందిన ఈ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జీవితంలో జరిగిన అత్యంత విషాదాన్నే థీమ్ గా మల్చుకుని ఫ్యాషన్ వీక్‌లో తన దుస్తులను ప్రదర్శించాడు. భార్య నవ్‌కిరత్ సోధి అగ్ని ప్రమాదాన్నే 'అక్రాస్ ది ఫైర్' థీమ్ గా కోచర్ కలెక్షన్‌ను ప్రదర్శించాడు. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో గౌరవ్ గుప్తా కలెక్షన్‌కు వ్యక్తిగత విషాదం ఎలా ప్రేరణనిచ్చింది తెలుసుకుందాం.ఒక చిన్న కొవ్వొత్తి గౌరవ్, నవ్‌కిరత్ జీవితాలను పెద్ద ప్రమాదంలోకి నెట్టేసింది. ఎనిమిది నెలల క్రితం అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో గౌరవ్ గుప్తా భార్య నవ్‌కిరత్ దాదాపు మరణానికి చేరువైంది. ఆమె శరీరం 55 శాతం కాలిపోయింది. ఆమె బతికే అవకాశం 50 శాతం అని వైద్యులు చెప్పారు. అయినా నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని విజేతగా నిలిచింది. ఈ ప్రమాదంలో మంటలను ఆర్పడానికి ప్రయత్నించి గౌరవ్ కూడా గాయపడ్డాడు. ఢిల్లీలోని అటెలియర్ ధ్వంసమైంది. కొంత ఆస్తినష్టం కూడా జరిగింది. కట్ చేస్తే..మొక్కవోని ధైర్యంతో, అద్భతమైన కలెక్షన్‌తో ప్యాషన్వీక్లో అబ్బుర పర్చారు. ఈ ప్రమాదం కారణంగానే గత సంవత్సరం పారిస్ ఫ్యాషన్ వీక్‌లో గౌరవ్ గుప్తా పాల్గొనలేకపోయాడు. కానీ ఈ సారి వేగంగా పుంజుకని తన స్టైల్‌తో అందరి అంచనాలను మించిపోయాడే. తన జీవితభాగస్వామి నవ్‌కిరత్ సోధి ద్వారా 2025 ఫ్యాషన్ వీక్ పూర్తి న్యాయం చేశాడని ఫ్యాషన్ నిపుణులు కొనియాడటం గమనార్హం. (కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్)ఈ ఈవెంట్లో నవ్‌కిరత్ సోధి ప్రత్యేకంగా నిలిచింది. క్రీమ్-హ్యూడ్ డ్రెప్డ్ కార్సెట్ గౌనులో రన్‌వేపై వాక్ చేసింది. ఈ సమయంలో ఆమె శరీరంపై కాలిన గాయాల తాలూకు మచ్చలు కనిపించినపుడు అందరి కళ్లు గౌరవా భిమానాలతో చెమర్చాయి. నవకిరత్ కేవలం కలెక్షన్‌ను ప్రేరేపించడమే కాదు. ఆమె ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేచి సాధికారత క్షణాలను ప్రపంచానికి చూపించి ప్రశంసలు అందుకుంది. View this post on Instagram A post shared by Gaurav Gupta (@gauravguptaofficial) "ఆమె ఒక పోరాట యోధురాలు . ప్రాణాలతో బయటపడినది... ఆమె ఒక దేవత" అని గౌరవ్ తన అధికారిక పేజీలో షేర్ చేసిన భావోద్వేగ వీడియోలో పేర్కొన్నాడు. నవ్‌కిరత్ సుదీర్ఘ ప్రయాణం తమ జీవితాలను మార్చడమే కాకుండా, ఒక సృజనాత్మక దృష్టిని మిగిల్చిందన్నాడు. View this post on Instagram A post shared by The Wedding Collective (@theweddingcollectiveofficial)దేశీయంగా అంతర్జాతీయ A-లిస్టెడ్ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్‌గుప్తా. తాజా ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్లో తన కలెక్షన్స్‌ను ప్రదర్శించాడు. జర్డోజీ, డబ్కా , నక్షి లాంటి ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎక్కువ. రాహుల్ మిశ్రా ,వైశాలి ఎస్ తర్వాత ఈ కోచర్ వీక్‌లో ప్రజంట్ చేస్తున్న మూడవ డిజైనర్ గౌరవ్ గుప్తా కావడం విశేషం. 2004లో, అతను తన సోదరుడు సౌరభ్ గుప్తాతో కలిసి తన లేబుల్‌ని స్థాపించాడు. తరువాత ఇస్తాంబుల్‌లోని ఒక కంపెనీకి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. చివరికి భారతదేశానికి తిరిగి వచ్చి, 2006లో అధికారికంగా తన లేబుల్‌ను ప్రారంభించాడు.2006లో ఇండియా ఫ్యాషన్ వీక్‌లో "అత్యంత వినూత్న ప్రదర్శన"గా ప్రశంసలందుకున్నాడు.2009లో, తన తొలి స్టోర్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించాడు. ముంబై,హైదరాబాద్, కోల్‌కతా లాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో అతని ఫ్లాగ్షిప్ స్టోర్లున్నాయి.2017లో, భారతదేశపు మొట్టమొదటి AI-ఆధారిత వస్త్రాన్ని రూపొందించడానికి గౌరవ్ వోగ్ IBM కాగ్నిటివ్ సిస్టమ్ వాట్సన్‌తో కలిసి పనిచేశాడు. 2022లో, గౌరవ్ గుప్తా బ్రైడ్ - పెళ్లి దుస్తుల్లోకి ప్రవేశించాడు. లిజ్జో, మేగాన్ థీ స్టాలియన్ , దీపికా పదుకొనే , ప్రియాంక చోప్రా , మేరీ జె. బ్లిగే, జెన్నిఫర్ హడ్సన్, సావీటీ, థాలియా, కైలీ మినోచ్యుల్, వయోలెట్, ఒలిట్వియా, ఒలిట్వియా లాంటివి దేశవిదేశాల్లో ప్రజాదరణ పొందాయి. 2022లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోసం డిజైన్ చేసిన దుస్తులు హైలైట్ అయ్యాయి.2023లో జరిగిన పారిస్ హాట్ కోచర్ వీక్‌లో గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన అద్భుతమైన లెమన్ గ్రీన్ గౌనును అమెరికన్ రాపర్ కార్డి బి,చైనీస్ నటుడు ఫ్యాన్ బింగ్‌బింగ్ ధరించడం విశేషం. ఇదీ చదవండి : పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ -
హోటల్లో అంట్లు కడిగాడు,ఆత్మహత్యాయత్నం..కట్ చేస్తే.. రూ 500 కోట్లు
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రిటైలర్, నగల డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా టాప్ డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన ఈసక్సెస్ అంత ఈజీగారాలేదు. సామాన్య నేపథ్యంనుంచి వచ్చి గ్లోబల్ ఐకాన్‌గా ఎదగడానికి చాలా కష్టాలుపడాల్సి వచ్చింది. విపరీతమైన డిప్రెషన్, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన సోదరి నుంచి 20వేల రూపాయల అప్పుగా తీసుకొని ప్రారంభించిన ప్రయాణం పాతికేళ్ల తరువాత నేడు రూ. 500కోట్లకు చేరింది. సబ్యసాచి అసలు ఎక్కడివాడు, ఆయన కరీర్ మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం రండి!సబ్యసాచి 1974లో ఒక మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించాడు.తల్లిదండ్రులు బంగ్లాదేశీయులు. అతని తండ్రి బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి శరణార్థిగా వలస వచ్చారు. తండ్రి ఉన్ని మిల్లులో ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం కష్టాల్లో పడింది. అపుడు 15 ఏళ్ల వయస్సులో గోవాకు పారిపోయాడు సబ్యసాచి. అక్కడ వెయిటర్‌గా పనిచేశాడు ,గిన్నెలు కడిగాడు. అప్పుడే డిజైనర్ కావాలనే కల కన్నాడు. ఇందుకోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)చదువు కోవాలనుకున్నాడు. కానీ అడ్మిషన్‌కు డబ్బులు లేవన్నారు. అయినా పట్టువీడలేదు. ఎలాగో అలా కష్టపడి అడ్మిషన్ తీసుకున్నాడు. 1999లో అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత కొన్ని నెలల తర్వాత కేవలం ముగ్గురు సిబ్బందితో కోల్‌కతాలో తొలి స్టూడియోను ప్రారంభించాడు. అలా తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదీ సోదరి దగ్గర 20 వేల రూపాయలను అప్పుగా తీసుకొని మరీ. అలా ప్రస్థానం పాకిస్తాన్ ,యుఎఇ, ఇటలీ , దుబాయ్ ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడే తొలి భారత గ్లోబల్ బ్రాండ్ ప్రస్తానానికి పునాది పడింది. ఇక అప్పటినుంచి అన్నీ అవార్డులు, రివార్డులు, ప్రశంసలే తప్ప వెనక్కి తీరిగి చూసింది లేదు.రేయింబవళ్లు కష్టపడి 2002లో లక్మే ఫ్యాషన్ వీక్‌లో తన తొలి కలెక్షన్‌ను ప్రదర్శించి, ఫ్యాషన్ మాస్ట్రోగా మారారు సబ్యసాచి ముఖర్జీ. సింగపూర్‌లో జరిగిన మెర్సిడెస్-బెంజ్ న్యూ ఆసియా ఫ్యాషన్ వీక్‌లో తొలి అంతర్జాతీయ అవార్డు (గ్రాండ్ విన్నర్ అవార్డు) గెలుచుకున్నాడు.డిప్రెషన్, ఆత్మహత్యాయత్నంతాను యుక్తవయసులో డిప్రెషన్‌కు గురయ్యానని, ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు.తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఒక సందర్భంగా సబ్యసాచి వెల్లడించాడు. “నేను నిరాశకు లోనయ్యాను మరియు ఆత్మహత్యకు ప్రయత్నించాను. నేను అపస్మారక స్థితిలో ఉన్నాను. అమ్మ చెంపదెబ్బ కొట్టింది. జలుబు ఎంత సాధారణమో డిప్రెషన్ కూడా అంతే సాధారణం. మీరు డిప్రెషన్లో లేకుంటే, మీరు మామూలుగా లేరు అని అర్థం” అంటూ తన జర్నీని వివరించారు. అంతేకాదు తాను నిరాశను ఎదుర్కోకపోతే, ఫ్యాషన్ దిగ్గజంగా మారడానికి బదులుగా, వేరే కెరీర్ మార్గాన్ని అనుసరించేవాడినని పేర్కొన్నాడు. బహుశా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ వంటి కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. చదవండి: పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్ సింగర్సబ్యసాచి ముఖర్జీ కెరీర్ మైలు రాళ్లుసబ్యసాచి ముఖర్జీ 2001లో ఫెమినా బ్రిటీష్ కౌన్సిల్ యొక్క మోస్ట్ ఔట్‌స్టాండింగ్ యంగ్ డిజైనర్ ఆఫ్ ఇండియా అవార్డుఅసాధారణ డిజైనర్ జార్జినా వాన్ ఎట్జ్డోర్ఫ్తో ఇంటర్న్‌షిప్ కోసం లండన్. 2002లో ఇండియన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న తర్వాత చాలా మీడియా దృష్టిని ఆకర్షించారు. 2003లో తొలి విదేశీ "గ్రాండ్ విన్నర్ అవార్డ్" గెలుచుకున్న తరువాత పారిస్‌లో జీన్-పాల్ గౌల్టియర్ , అజెడిన్ అలైతో వర్క్‌షాప్‌కు దారితీసింది.2004లో మయామి ఫ్యాషన్ వీక్‌లో ‘ ది ఫ్రాగ్ ప్రిన్సెస్ కలెక్షన్,’, భారతీయ వస్త్ర సౌందర్యం ప్రపంచానికి మరింత బాగా తెలిసి వచ్చింది.బ్లాక్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డుప్రపంచవ్యాప్త గుర్తింపు2005లో ది నాయర్ సిస్టర్స్‌ను ప్రారంభించాడు. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీలు, బగ్రూ లాంటి కలెప్రేరణ పొందిన వసంత-వేసవి సేకరణ. అతని క్రియేషన్స్ ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వార్షిక బ్లాక్-టై ఛారిటీ డిన్నర్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించడానికి ఆహ్వానం2006లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో సబ్యసాచి ప్రారంభ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 07 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. న్యూయార్క్, మిలన్ మరియు లండన్ అనే మూడు ప్రధాన ఫ్యాషన్ వారాల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫ్యాషన్ డిజైనర్.సబ్యసాచి న్యూయార్క్ ,లండన్ ఫ్యాషన్ వీక్స్, అలాగే బ్రైడల్ ఆసియా 2007, లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ , 2007లో భారతదేశంలో జరిగిన వోగ్ లాంచ్‌లకు హాజరయ్యాడు. 2008లో నగల కలెక్షన్కూడా షురూ చేశాడు. GAJA బ్రాండ్ సహకారంతో 2016 వోగ్ వెడ్డింగ్ షోలో ప్రారంభమైంది. బాలీవుడ్ నటి నేహా ధూపియాతో 2012లో ఒక క్యాలెండర్‌ను రూపొందించారు, ఆ తరువాతఫ్రెంచ్ లగ్జరీ పాదరక్షలు మరియు దుస్తులు డిజైనర్ క్రిస్టియన్ లౌబౌటిన్తో భాగస్వామిగా పనిచేశాడు.బ్రైడల్ కలెక్షన్‌తో పాపులర్2007లో తన తొలి బ్రైడల్ కలెక్షన్‌ను ఆవిష్కరించాడు,యు తన డిజైన్లతో వివాహ పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించాడు. భారతీయ సంప్రదాయ వస్త్రాలు, చేనేత, చేతితో తయారు చేసిన తనదైన శైలితో డిజైనర్ వెడ్డింగ్ దుస్తులకు పేరుగాంచాడు.హై-ఎండ్ లగ్జరీ ఇండియన్ టెక్స్‌టైల్స్‌ను ఉపయోగించిన తొలివ్యక్గాపేరుతెచ్చకున్నాడు. బంధాని, గోటా వర్క్, బ్లాక్-ప్రింటింగ్ , హ్యాండ్-డైయింగ్ లాంటి వర్క్స్‌తో ట్రెండ్ క్రియేట్ చేశాడు.బాలీవుడ్ సినిమాలకుసబ్యసాచి సంజయ్ లీలా బన్సాలీ చిత్రం బ్లాక్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేశారు. 2005లో ఒక ఫీచర్ ఫిల్మ్‌కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డుతో సహా చిత్రానికి చాలా ప్రశంసలు అందుకున్నాడు. బాబుల్,లాగ చునారి మే దాగ్,రావణ్, గుజారిష్, పా,నో వన్ కిల్డ్ జెస్సికా,ఇంగ్లీష్ వింగ్లీష్,బ్లాక్ లాంటి అనేక సినిమాలకు కాస్ట్యూమ్ డిజైన్స్ అందించారు.ప్రముఖుల వివాహాలు నటి విద్యాబాలన్ ,అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, నిక్ జోనాస్ , ప్రియాంక, అలియా పీవీ సింధు వివాహ దుస్తులను సబ్యసాచి డిజైన్ చేశారు. ఇంకా శ్రీదేవి, కత్రినా కైఫ్, టబు, షబానా అజ్మీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్,శ్రద్ధా కపూర్, సుస్మితా సేన్, కరీనా, నీతా అంబానీ, శ్లోకా, ఇషా, రాధిక అంబానీ సహసబ్యసాచి సెలబ్రిటీ క్లయింట్లే కావడం విశేషం. 25 సంవత్సరాల కృషి తర్వాత, సబ్యసాచి ముఖర్జీ బ్రాండ్ రూ. 500 కోట్ల విలువకు చేరింది. ఈ ఘనతను సాధించిన భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. -
హైలైఫ్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
జియో వరల్డ్‌లో మనీష్ మల్హోత్రా: బాలీవుడ్ తారలు, నీతా వెరీ స్పెషల్
-
మాదాపూర్ : ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
అయ్యారే... లేడీస్ టైలర్..ఈ డిజైన్స్‌కి మగువలు ఫిదా!
ఈ బుజ్జిగాణ్ణి మన రాజేంద్ర ప్రసాద్‌ని పిలిచినట్టు ‘లేడిస్ టైలర్’ అనంటే ఊరుకోడు. ‘ఐ యామ్ ఏ ఫ్యాషన్ డిజైనర్’ అంటాడు. ఎనిమిదేళ్ల వయసులో పిల్లలు ఆటపాటల్లో మునిగిపోయి ఉంటారు కానీ అమెరికాకు చెందిన మాక్స్ అలెగ్జాండర్ మాత్రం కొత్త బట్టలు, సరికొత్త ఫ్యాషన్లు, నూతన ఆలోచనలు అంటూ హడావిడిగా ఉంటాడు. అతి చిన్న ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్న మాక్స్ రూపొందించే దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కీలకమైన వేడుకల్లో అతను తయారు చేసే బట్టలే వేసుకుంటామని కొందరు సెలబ్రెటీలు హటం చేస్తారు. అనగా మంకుపట్టు పడతారు.మాక్స్‌కి నాలుగేళ్ల వయసున్నప్పుడు అతని తల్లి షెర్రీ మాడిసన్స్ అతనికో బొమ్మ ఇచ్చింది. దాని కోసం కస్టమ్ కోచర్ గౌన్ కుట్టాడు మాక్స్. అప్పటి నుండి ఇప్పటిదాకా 100 కంటే ఎక్కువ కస్టమ్ కోచర్ గౌన్లు కుట్టాడు. అతని ఆస్తకిని గమనించి తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. తాను తయారుచేసిన దుస్తులతో అనేక రన్‌వే షోలను నిర్వహించి, ప్రపంచంలో అతి చిన్న వయస్కుడైన రన్ వే ఫ్యాషన్ డిజైనర్‌గా మాక్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. అతను తయారు చేసిన దుస్తుల్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించారు. బట్టలు కుట్టేసి ఇచ్చేయడం మాత్రమే మాక్స్ పని కాదు. అవి వేసుకునేవారు ఏం కోరుతున్నారు, వారి ఇష్టాయిష్టాలు ఏమిటి, ఎలాంటి దుస్తులు సౌకర్యంగా అనిపిస్తాయి, ఎలాంటి రంగులు వారి ఒంటికి నప్పుతాయి వంటి అంశాలన్నీ ఆలోచించి డిజైన్ చేస్తాడు. ఈ కారణంగానే అతను రూ΄÷ందించే బట్టలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతోపాటు పనికిరాని వస్తువులతో కూడా కొత్త రకమైన బట్టలు తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో మాక్స్‌కి మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మరిన్ని కొత్త ఫ్యాషన్లు రూపొందించాలని, అందుకోసం మరింత సాధన చేయాలని అతను అంటున్నాడు. -
వావ్, వావ్..యానివర్సరీ వీక్ అంటే ఇలా, మంచు పూల జల్లుల్లోన (ఫోటోలు)
-
అనుసృజన
అను పెళ్లకూరు.. ఫ్యాషన్ రంగంలో బాగా వినబడే పేరు. ఫ్యాషన్‌పై ఆమెకున్న పిచ్చి పద్దెనిమిదేళ్ల వయసులోనే మిస్ యూఏఈ ఫైనలిస్ట్ కోసం దుస్తులను డిజైన్ చేసే కాంట్రాక్ట్‌ను తెచ్చిపెట్టింది. కేవలం రూ. పదిహేను వేలతో అద్భుతమైన మూడు డిజైన్స్‌ను అందించి, అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు, తన పేరును ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్స్ జాబితాలో చేర్చుకుంది.ఫ్యాషన్‌పై ఉన్న ప్యాషన్‌తో ఇంటర్ అయిపోయిన వెంటనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయింది అను. కానీ, ఆ రంగంలో ఆచరణాత్మక అనుభవం చాలా ముఖ్యమని గ్రహించింది. దాంతో తరగతులకు హాజరవక.. కాలేజ్ డ్రాప్ అవుట్‌గా మిగిలింది. తన అభిరుచిని గైడ్‌గా తలచి, అనుభవాన్ని పాఠాలుగా మలచుకుంది. సోదరుడు సూర్య సహకారంతో ‘ఎస్ అండ్ ఏ (సూర్య అండ్ అను)’ పేరుతో ఓ మల్టీ డిజైనర్ స్టోర్‌ను ప్రారంభించింది. మరోవైపు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టింది. అలా పాపులారిటీ సంపాదించుకోవడంతోపాటు తన డిజైన్స్ సెలబ్రిటీల కంట పడేలా చేసుకుంది. అది వర్కవుట్ అయి.. సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసే చాన్స్ కొట్టేసింది. నిహారిక కొణిదెల, రుహానా శర్మ, వితికా షేరు, రెజీనా కసాండ్రా, ఈషా రెబ్బ, వైష్ణవి చైతన్య వంటి సెలబ్రిటీలందరికీ అను పెళ్లకూరు ఫేవరిట్ డిజైనర్ అయింది. ఆ ప్రోత్సాహంతోనే ‘తనాషా’ పేరుతో సొంత బ్రాండ్‌ను స్థాపించింది. అంతేకాదు, ఇటీవల ప్రతిష్ఠాత్మక బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో ‘స్వర్ణిరహ’ పేరుతో తన లేటెస్ట్ కలెక్షన్స్‌ను ప్రదర్శించి.. ప్రశంసలు అందుకుంది. ఆ ఈవెంట్‌కు గ్లామర్‌ను జోడిస్తూ ప్రఖ్యాత నటీమణులు శ్రియా సరన్, మృణాల్ ఠాకూర్ షో స్టాపర్స్‌గా ర్యాంప్ వాక్ చేశారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక శైలి రెండింటి మేళవింపుగా ఉండే ఆమె డిజైన్స్‌కు స్థానికంగానే కాదు, అంతర్జాతీయంగానూ గుర్తింపు లభించింది. దుబాయ్, శ్రీలంక, సింగపూర్ దేశాల్లో జరిగిన పలు ఫ్యాషన్ షోస్‌లో అను తన డిజైన్స్‌ను ప్రదర్శించింది.అనుభవాన్ని మించిన గురువు ఉండరు. అది నాకు చాలా నేర్పింది. మొదట్లో ఎన్నో సవాళ్లను, ఇంకెన్నో అవమానాలను ఎదుర్కొన్నా. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని నమ్మాను. అదే నిజమైంది.– అను పెళ్లకూరు. -
అద్దాల మిలమిలల్లో పెళ్లికూతురి లుక్ వైరల్
ప్రముఖ స్టైలిస్ట్ ఆకృతి సెజ్పాల్ డ్రీమ్ వెడ్డింగ్ నెట్టింట ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె ధరించిన ముసుగు, లెహంగా అతిథులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా మొత్తం అద్దాలతో తయారు చేసిన లెహెంగాలో వధువు ‘ఆకృతి’ మరింత ఆకర్షణగా నిలిచింది.వధువు ఆకృతి సెజ్పాల్ 3డీ డిజైన్, పూర్తిగా పూలతో చేసిన పెళ్లి కూతురు వేసుకునే మేలి ముసుగులను చూశాం. కానీ పూర్తిగా మిర్రర్ వర్క్‌తో రూపొందించడం విశేషంగా నిలిచింది. లెహెంగాకు తోడుగా ఏమాత్రం క్లాత్ వాడకుండా తయారు చేసిన దుపట్టా కమ్ మేలి ముసుగుతో పెళ్లి కళతో కళకళలాడింది ఆకృతి. ఇంకా స్వీట్హార్ట్-నెక్లైన్ బ్లౌజ్, హెవీ లెహంగా స్కర్ట్, ఓపెన్ హెయిర్‌స్టైల్‌పై పిన్ చేసిన షీర్ దుపట్టాలో అందంగా మెరిసిపోయింది. చోకర్ నెక్‌పీస్, మ్యాచింగ్ జుమ్కీలు, పాపిట బిళ్లతో తన లుక్‌ను మరింత అద్భుతంగా ముస్తాబైంది.< View this post on Instagram A post shared by Itrh (@itrhofficial)br> -
తోట కాని తోట : చిరస్థాయిగా నిలిచిపోయే తోట!
అరటి గెల, గుమ్మడికాయలు, పనస, పైనాపిల్... ఇవన్నీ తోటలో పండుతాయి. డిజైనర్ జెంజుమ్ ఇత్తడి నమూనాలతో ఇంట్లో ఎప్పటికీ నిలిచి ఉండే పండ్లను, కూరగాయలను సృష్టించాడు. ‘ప్రకృతికి, అతని తల్లికి, తన జీవితానికి గుర్తుగా వీటిని సృష్టించాను’ అని చెబుతాడు జెంజుమ్. అరుణాచల్ ప్రదేశ్‌లోని టిర్బిన్ అనే చిన్న గ్రామంలో జన్మించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జెంజుమ్. తన చిన్ననాటి జ్ఞాపకాలను బతికించుకోవాలన్నది అతని తాపత్రయం. వినోదం అందుబాటులో లేని ప్రదేశంలో పెరిగినందున, 1980లలో చిన్న పిల్లవాడిగా అతని తీరిక పనిలో చెట్లు ఎక్కడం, తేనెటీగలను వెంబడించడం, నదుల్లో ఈత కొట్టడం, చేపలు పట్టడం, పర్వతాలలో హైకింగ్ చేయడం వంటివి ఉన్నాయి. ప్రకృతి అతని ఏకైక ఆట స్థలం. ఇప్పుడు ఆ ప్రకృతినే తన తొలి ఆర్ట్ షో ‘అపాసే’ను ప్రదర్శనకు పెట్టాడు, ఇది బెంజుమ్ స్థానిక గాలో మాండలికంలో అక్షరాలా ’వివిధ రకాల పండ్లు’ అని అర్ధం.జ్ఞాపకాల తోట‘‘మా ఊరిలో ప్రతి ఇంటికీ తోట ఉంటుంది. పువ్వులకు బదులుగా వాటిలో కూరగాయలు, పండ్లు పండిస్తాం. రైతు అయిన నా తల్లి ఎప్పుడూ గ్రామంలోనే ఉంటూ తన జీవితమంతా మా తోటలో పండ్లు, కూరగాయలు పండిస్తూ ఉండేది. వాటికి విత్తనాలు నిల్వచేసేది. అక్కడ సమయం గడపడం నా సృజనాత్మక పనిని లోతుగా ప్రభావితం చేసింది. ప్రకృతితో ఈ కనెక్షన్ ఇప్పుడు నా డిజైన్లలోకి విస్తరించింది. ఆ జ్ఞాపకాలను మళ్లీ పునశ్చరణ చేసి, వాటికి ఒక సాక్షాత్కార రూపం ఇవ్వాలన్న నా ప్రయత్నమే ‘అపాసే’’’ అని బెంజుమ్ చెబుతారు. ఇత్తడి ఫ్రూట్స్ఇత్తడితో రూపొందించిన 16 త్రీ–డైమెన్షనల్ ఫ్రూట్ మోడల్ అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క కళారూపం బెంజుమ్ తల్లి తోట నుండి ఒక పండు, కూరగాయలను సూచిస్తుంది. ఈ డిజైన్స్‌తో బెంజుమ్ ప్రదర్శన కూడా నిర్వహించాడు. 12, 44 అంగుళాల అరటి గెల, పైనాపిల్స్, బొప్పాయిలు, జాక్‌ఫ్రూట్స్, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, దానిమ్మపండ్లు – కళాకారుడి పనితీరును వెలుగులోకి తెచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని రూపా అనే చిన్న గ్రామంలో టిబెటన్ మఠాల కోసం సాంప్రదాయ ఇత్తడి వస్తువులను రూ పొందించడంలో నైపుణ్యం కలిగిన స్థానిక కళాకారులు ఉన్నారు. రాష్ట్రంలోని పశ్చిమాన ఉన్న తవాంగ్, ఆసియాలో అతి ప్రాచీనమైన, రెండవ అతిపెద్ద బౌద్ధ ఆశ్రమానికి నిలయం ఉంది. ఆ ఆశ్రమాలను సందర్శించిన బెంజుమ్ నిజమైన పండ్లను అచ్చులుగా ఉపయోగించడం, వాటిని శాశ్వతమైన ఇత్తడి ప్రదర్శనలుగా మార్చడంపై ఆసక్తిని పెంచింది. బెంజూమ్ ఢిల్లీలో నివసిస్తున్నాడు. తన ఢిల్లీ తోటలో బెంజుమ్ మామిడి, బొ΄్పాయి, అవకాడో, సీతాఫలం, అరటి, నిమ్మకాయలు వంటి వివిధ రకాల పండ్లను సీజన్‌ను బట్టి పండిస్తాడు. అయితే అతనికి ఇష్టమైనది నారింజ. ‘‘నారింజ చెట్లు సాధారణంగా ముళ్లతో ఉంటాయి, కానీ చెట్ల వయస్సు పెరిగే కొద్దీ ముళ్ళు తగ్గిపోతాయి. నారింజ పండ్లను కోయడం, స్నేహితులతో కలిసి ఆడుకోవడం, ముళ్ల నుండి వచ్చిన కొద్దిపాటి గాయాలను తీర్చే పండ్ల మాధుర్యం నాకు చిన్ననాటి జ్ఞాపకాలుగా ఉన్నాయి’’ అని బెంజుమ్ గుర్తు చేసుకుంటాడు. కళను బతికించాలి..ఈశాన్య ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే కొద్దిమంది డిజైనర్లు, కళాకారులలో బెంజుమ్ ఒకరు. ‘ప్రక్రియ నెమ్మదిగా ఉంది, కానీ మొత్తానికి ప్రారంభమైంది. ఇప్పుడు ఈ ప్రాంతం నుండి కొత్త తరం యువ కళాకారులు ఉద్భవించడాన్ని నేను గమనించాను. వారిలో ఈ కళ పట్ల అవగాహన పెంచాలి, సృజనాత్మకతను మెరుగుపరచాలి’ అని వివరిస్తాడు బెంజుమ్. బెంజుమ్ ప్రతిభ బట్టలు డిజైన్ చేయడం, సినిమాల్లో నటించడం వరకే కాదు ఇప్పుడు ఈ కళారూపాలతో బిజీ అయిపోతే తిరిగి పెద్ద స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామని అక్కడి వారు అడుగుతుంటారు. బెంజుమ్ నవ్వుతూ ‘ముందు చేస్తున్న పనిపైనే సంపూర్ణ దృష్టి పెడుతున్నాను’ అంటారు జెంజుమ్. -
హైదరాబాద్ : ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన..రెజీనా..ఈషారెబ్బా.. (ఫొటోలు)
-
బుల్లి డిజైనర్ బ్రూక్...
స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఆ అమ్మాయి ఫ్యాషన్ షోగా భావించేది. పోటీదారులకు దుస్తుల డిజైనింగే కాదు స్టయిలింగ్ కూడా చేసేది! ఫ్యాషన్ మీద ఆమెకున్న ఇష్టాన్ని అమ్మ, అమ్మమ్మ కూడా గుర్తించి, ప్రోత్సహించడంతో అతి చిన్న వయసులోనే పలువురు మెచ్చే ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది! బ్రాండ్నీ క్రియేట్ చేసింది! ఆ లిటిల్ స్టయిలిస్టే బ్రూక్ లారెన్ సంప్టర్.బ్రూక్ లారెన్ సంప్టర్ చిన్నప్పటి నుంచి దుస్తులు, నగలు, పాదరక్షలు.. ఏవైబుల్లి డిజైనర్ బ్రూక్...నా సరే తనకిష్టమైనవే వేసుకునేది. బర్త్‌డేలు, పండుగలప్పుడే కాదు మామూలు రోజుల్లోనూ అదే తీరు! ఇంకా చెప్పాలంటే నైట్ గౌన్స్ పట్ల కూడా శ్రద్ధ చూపేది. ఈ తీరును మొదట్లో వాళ్లమ్మ ఎర్రిస్ ఆబ్రీ.. కూతురి మొండితనంగా భావించింది. కానీ రెండేళ్ల వయసు నుంచే బ్రూక్ తనకి స్టయిలింగ్‌లో సలహాలు ఇవ్వటం, ఫ్రెండ్స్ కోసం పిక్నిక్ టేబుల్, ఫ్లవర్ పాట్స్, గిఫ్ట్ బాక్స్‌ను డిజైన్ చేయడం వంటివి చూసి.. కూతురిలో ఈస్తటిక్ సెన్స్, క్రియేటివిటీ మెండు అని గ్రహించింది. బ్రూక్ చూపిస్తున్న ఆసక్తిని ఆమె అమ్మమ్మా గమనించి మనమరాలికి దుస్తులు కుట్టడం నేర్పించింది. దాంతో స్కూల్ నుంచి రాగానే ఫ్యాబ్రిక్‌ని ముందేసుకుని డిౖజñ న్ చేయడం మొదలుపెట్టేది. అలా కేవలం ఐదేళ్ల వయసులోనే బ్రూక్ తన మొదటి ఫ్యాషన్ షోను నిర్వహించింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో రెండు కుట్టుమిషన్లను కొనిపించుకుంది. అమ్మా, అమ్మమ్మను తన అసిస్టెంట్లుగా పెట్టుకుంది. వందకు పైగా డిజైన్స్‌ను క్రియేట్ చేసేసింది. అవి ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2022 చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఎమ్మీ అవార్డు వేడుక కోసం ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, నటి తబితా బ్రౌన్కి బ్రూక్ సంప్టర్ ఒక అందమైన గౌన్‌ను డిజైన్ చేసింది. దీంతో ఎమ్మీ వేడుకల కోసం దుస్తులను డిజైన్ చేసిన అతి పిన్న వయస్కురాలిగా బ్రూక్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు. బార్బీ సంస్థకు బేస్ బాల్ బార్బీ, ఫొటోగ్రాఫర్ బార్బీ అనే రెండు థీమ్ డిజైన్స్‌నూ అందించింది. ఈ మధ్యనే తన పేరు మీద ‘బ్రూక్ లారెన్’ అనే ఫ్యాషన్ బ్రాండ్‌నూ స్థాపించింది. ఇప్పుడు ఆ బ్రాండ్ టర్నోవర్ కోటి డాలర్లకు (రూ.84 కోట్లు) పైమాటే! చిన్నపిల్లల కోసం ఈ బ్రాండ్.. చక్కటి దుస్తులను డిజైన్ చేస్తోంది. ఇవి ఎంత ఫ్యాషనబుల్‌గా కనిపిస్తాయో అంతే కంఫర్ట్గానూ ఉంటాయి. అదే బ్రూక్ ‘బ్రాండ్’ వాల్యూ! కొన్ని నెలల కిందటన్ బ్రూక్ ‘టామ్రాన్ హాల్’ షోలోనూ కనిపించింది. అందులో తన డిజైన్స్, ఫ్యాషన్ పరిశ్రమలో తనకెదురైన అనుభవాలు, సాధించిన విజయాలను వివరించింది. కలను సాకారం చేసుకోవడానికి కావాలసింది పట్టుదల అని, లక్ష్య సాధనలో వయసు ఏ రకంగానూ అడ్డు కాదని నిరూపించింది బ్రూక్ లారెన్. స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో గెలవటం కంటే ఆడియన్స్ నా డిజైన్స్‌ను చూసి, కేరింతలతో ఇచ్చే ప్రశంసలే నాకు ఉత్సాహాన్నిస్తాయి. అందుకే ఆ పోటీల్లో నాతో పాటు నా ఫ్రెండ్స్‌కీ డ్రెసెస్ డిజైన్ చేసేదాన్ని.– బ్రూక్ లారెన్ సంప్టర్ -
ఎంగేజ్మెంట్ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్‌లో అనన్య పాండే : శభాష్ అంటున్న నెటిజన్లు
ఫ్యాషన్ ప్రపంచంలో బాగా వినిపించే పేరు నటి అనన్య పాండే పేరు. ఇటీవల తన కజిన్ సోదరి నిశ్చితార్థ వేడుకలో మరింత ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే సాంప్రదాయ బద్ధంగా డిజైనర్ చీర లేదా గౌను ధరించడానికి బదులుగా, అనన్య 21 ఏళ్ల నాటి పాత డ్రెస్‌ను ఎంచుకుంది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ఇలా ఎందుకు చేసిందంటే..సన్నిహిత బంధువు దియా ష్రాఫ్ నిశ్చితార్థానికి ఆక్వా బ్లూ కలర్ డ్రెస్ అందంగా కనిపించింది. అయితే ఈ డ్రెస్ ఫ్యాషన్ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ప్రఖ్యాత దివంగత డిజైనర్ రోహిత్ బాల్ తన తల్లి భావనా పాండే కోసం తయారు చేసిన ఆక్వా-బ్లూ గోల్డ్ ఎంబ్రాయిడరీ కుర్తా సూట్‌ను ధరించింది.దీనికి సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది అనన్య పాండే. దీంతో నెటిజన్లు ఘనమైన నివాళి. ఈ డ్రెస్ మీకూ చాలా బావుంది అంటూ ప్రశంసించారు.నిజానికి అమ్మలు, అమ్మమ్మల చీరలు, అందమైన లెహంగాలను కూతుళ్లు అపురూపంగా ధరించడం కొత్తేమీ కాదు. కానీ అనన్య పాండే ఒక డిజైనర్ పట్ల గౌరవ సూచకంగా రెండు దశాబ్దాల క్రితం ఆయన డిజైన్ చేసిన సూట్‌ను ధరించడం విశేషంగా నిలిచింది. 2024 అక్టోబరులో లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా, అనన్య రోహిత్ బాల్ కోసం ర్యాంపవాక్ చేసిన ఘనత అనన్య సొంతం చేసుకుంది. ఇక వర్క్ పరంగా చూస్తే CTRL మూవీతో ఆకట్టుకుంది. అలాగే ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్‌లో అతిధి పాత్ర లో కనిపించింది అనన్యపాండే చిత్రనిర్మాత, కరణ్ జోహార్ సారద్యంలో అనన్య నటించిన రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుందని భావిస్తున్నారు.కాగా 2023 నుండి గుండె జబ్బుతో బాధపడుతున్న రోహిత్ బాల్, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిని మాత్రం వదల్లేదు. చివరికి ఆరోగ్య విషమించడంతో ఈ నెల ఆరంభంలో (నవంబర్ 1న) కన్నుమూశారు. ఆయన మరణం ఫ్యాషన్ ప్రపంచానికి తీరటి లోటు అని అభిమానులు ,ప్రముఖులు తమ విచారాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. < View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
ప్రముఖ డిజైనర్ మృతి.. ఇంద్ర హీరోయిన్ ఎమోషనల్!
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ మృతిపట్ల సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే సంతాపం తెలిపారు. అతనితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనలయ్యారు. మీరు అద్భుతమైన డిజైనర్ అని అందరికీ తెలుసని అన్నారు. అంతే కాకుండా మీతో ల యూ హమేషా అనే చిత్రంలో నటించిన రోజులు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. అతన్ని సోనాలి కేవలం డిజైనర్‌గానే కాకుండా సహ నటుడిగా గుర్తు చేసుకున్నారు. వీరిద్దరు కలిసి నటించిన లవ్ యు హుమేషా మూవీ థియేటర్లలో విడుదల కాలేదు.కాగా.. రోహిత్ బాల్‌ను నవంబర్ 1న కన్నుమూశారు. ఆయన 63 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. దీంతో హీరోయిన్ సోనాలి బింద్రే.. రోహిత్ బాల్‌కు నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు. ఆమెతో పాటు నటుడు అర్జున్ రాంపాల్ కూడా దివంగత ఫ్యాషన్ డిజైనర్‌కు నివాళులర్పించారు. రోహిత్ బాల్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. కాగా.. ఆయన జ్ఞాపకార్థం సోమవారం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలోని సాయి ఇంటర్నేషనల్ సెంటర్లో ప్రార్థనా సమావేశం నిర్వహించారు.కశ్మీర్‌కు చెందిన రోహిత్ బాల్ తన గొప్ప డిజైన్లతో బాలీవుడ్లో ప్రసిద్ధి చెందాడు. చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు ఆయన పనిచేశారు. అతని డిజైన్లను పమేలా ఆండర్సన్, ఉమా థుర్మాన్, సిండి క్రాఫోర్డ్, నవోమి కాంప్‌బెల్ లాంటి అంతర్జాతీయ స్టార్స్ సైతం ధరించారు. కాగా.. సోనాలి బింద్రే తెలుగువారికి కూడా సుపరిచితమే. టాలీవుడ్లో ఇంద్ర సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించింది. -
ఫ్యాషన్ డిజైనర్ కార్ టైర్లు కోసేసి.. షాప్ యజమానిని అడిగితే బెదిరింపులు
బంజారాహిల్స్: దుస్తులు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ కారు టైర్లు ధ్వంసం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెల్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో నివసించే ఫ్యాషన్ డిజైనర్ జి.కీర్తిరెడ్డి ఫ్యాబ్రిక్ కొనుగోలు చేసేందుకు బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ర్యాన్‌గ్రడ్జ్ ఫ్యాబ్రిక్ స్టోర్‌కు వచ్చారు. తన కారు టీఎస్ 09 ఈజెడ్ 1221ను ర్యాన్‌గ్రడ్జ్ ఫ్యాబ్రిక్ స్టోర్ ముందు పార్కింగ్ చేసి ఓ షాపులోకి వెళ్లి పది నిమిషాల్లో తిరిగి వచ్చారు. 👉 కారు స్టార్ట్ చేసేందుకు ప్రయతి్నంచగా రెండు టైర్లు పూర్తిగా దెబ్బతిని కనిపించాయి. ఇనుప చువ్వలతో కారు టైర్లను కోసేసి గాలి తీశారని తెలిపారు. సదరు షాపులో పనిచేసే ఉద్యోగి తన కారును ధ్వసం చేశాడని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె పోలీసులను కోరారు. తాను స్టోర్ యజమానికి ఫిర్యాదు చేయగా అసభ్యంగా మాట్లాడటమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. దీనికి కారణమైన షాపు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలిన కోరారు. పోలీసులు ఆ స్టోర్ ఉద్యోగిపై బీఎన్ఎస్ సెక్షన్ 324(4), 125, 351(2), రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యాషన్ స్టైలిష్ట్ మెటర్నిటీ ఫోటో షూట్స్.. అర్థవంతంగా, అద్బుతంగా!
న్యూఢిల్లీకి చెందిన లండన్ ఫ్యాషన్ స్టైలిస్ట్ ప్రేరణ చాబ్రామరికొద్ది రోజుల్లో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఫ్యాషన్ డిజైనర్‌గా, యూట్యూబర్‌గా అభిమానులకు దగ్గరైన ఆమె ఈ సందర్భాన్ని సంతోషాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. అంతేకాదు తన భర్తను కూడా తన ఫాలోవర్లకు పరిచయం చేసింది. అలాగే తను ఎందుకు మెటర్నిటీ ఫోటో షూట్ చేసుకున్నదీ వివరించింది.అసలు మెటర్నీటి ఫోటో షూట్ అవసరమా అని ఆలోచించి చివరికి రెండు రకాలు ఫోటోషూట్ చేసుకున్నాను అంటూ ఇన్‌స్టాలో అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. ఫ్యాషన్ డిజైనర్‌ను కాబట్టి క్రియేటివ్‌గా ఉంటాను, కనుక మెటర్నిటీ ఫోటోషూట్కూడా విభిన్నంగా ఉండాలని ఆలోచించానని ఆమె తెలిపారు. (పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్ అండ్ టిప్స్)‘‘మొదటి ఫోటో షూట్ కోసం పర్పుల్ అండ్ పింక్ కలర్ డ్రెస్ ఎంచుకున్నా..దీన్నే ది పెర్ల్స్ ఆఫ్ జాయ్ అంటాం. త్వరలోనే తల్లికాబోతుండటం ఆనందాన్ని తీసుకొచ్చింది. ఇపుడు అమ్మగామారబోతున్నాను.. దాదాపు కలలో జీవిస్తున్నాను. స్వేచ్ఛకు ప్రతీక అయిన పసుపు రంగులో రెండో ఫోటోషూట్ చేశాను. దీన్ని గోల్డెన్ బ్లూమ్ అంటాం. ఈ సందర్భంగా అమ్మ నాతో ఉండటం ఇంకా సంతోషం’’ అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో ప్రేరణ వెల్లడించింది. -
మెటర్నిటీ ఫోటోషూట్‌తో భర్తను పరిచయం చేసిన ఫ్యాషన్ డిజైనర్
-
'ఖాదీ'.. గాంధీ చూపిన దారే!
ఖాదీ అనేది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వస్త్రంగా ఉంటుంది. ఆ వస్త్రం ధరిస్తే ఓ పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి ఖాదీ వలస పాలన విముక్తికి చిహ్నాంగా నిలిచి అందరిలోనూ స్వరాజ్య కాంక్ష రగిల్చేందుకు కారణమయ్యింది. అందుకు ఊపిరిపోసింది మహాత్మ గాంధీ. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ఖాదీతో ఆయన ఎలా స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికారు?. ఆ ఫ్యాబ్రిక్ నేడు ఫ్యాషన్ ప్రపంచంలో 'జయహో ఖాదీ' అనేలా ఎలా రాజ్యమేలుతుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందాం.!ఖాదీ అనేది పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్. భారతీయుల సంప్రదాయ వస్త్రంగా కీర్తించబడుతోంది. అలాంటి ఈ వస్త్రమే స్వరాజ్య కాంక్షకు ఊపిరిపోసి భారతీయులను వలస పాలకుల విముక్తికై పాటు పడేలా చేసింది. దీనికి శ్రీకారం చుట్టింది మహాత్మాగాంధీనే. 1918లో భారతదేశంలోని గ్రామాలలో నివసించే పేద ప్రజల కోసం ఖాదీ ఉద్యమాన్ని చేపట్టారు. నాడు వారికి ఉపాధి లేకుండా చేసి పొట్టకొడుతున్న విదేశీ వస్తువులకు ముగింపు పలికేలా ఈ ఉద్యమాన్ని చేపట్టారు. నిజమైన స్వాతంత్ర్య కాంక్షకు కావల్సింది మనల్ని బానిసలుగా చేసి బాధపెడుతున్న విదేశీయల వస్తువులున బహిష్కరించి స్వదేశీ వస్తువులకు ప్రాముఖ్యత ఇవ్వడమే అని ఓ గొప్ప పాఠాన్ని బోధించారు.ఆయన ఇచ్చిన ఈ పిలుపు ప్రతి ఒక్కడి భారతీయుడి గుండెల్లో స్వతంత్ర కాంక్ష ఉవ్వెత్తున ఎగిసిపడేలా రగిల్చారు. అలా మొదలైన 'ఖాదీ' హవా..ఇప్పటికీ తన వైభవాన్ని చాటుతూ దేశ విదేశాల ప్రజల మన్నలను అందుకుంది. మన ప్యాషన్ పరిశ్రమలో తనదైన ముద్రతో సత్తా చాటుతుంది. మన భారతీయ డిజైనర్లు దీన్ని కనుమరగవ్వనివ్వకుండా పునరుజ్జీవింప చేశారు. తమదైన సృజనాత్మకతతో ఖాదీతో చేసిన లెహంగాలు, కోట్లు, వంటి లగ్జరియస్ వస్తువులను తీసుకొచ్చి ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడి ధరించేలా రూపొందించారు.ఖనిజో, అనీత్ అరోరా, రినా ధాకా, అనవిలా 11.11 లేబుల్ సహ వ్యవస్థాపకులు షానీ హిమాన్షు అండ్ మియా మోరికావా కొ వంటి దిగ్గజ డిజైనర్లు ఎంతో విలక్షణమైన ఖదీ డిజైన్ల కలెక్షన్లను అందించారు. అలాగే 2019లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో, డిజైనర్ రాహుల్ మిశ్రా తన ఖాదీ సేకరణ ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక రెండేళ్ల క్రితం ఎఫ్‌డీసీఐ ఎక్స్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో, ఫ్రెంచ్ డిజైనర్ మోస్సీ ట్రారే ఖాదీ డిజైన్ని ప్రదర్శించి అందర్ని విస్మయానికి గురిచేశాడు. ఇక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా పేరుగాంచిన సబ్యసాచి ముఖర్జీకి బ్రైడల్ డిజైనర్ మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఆయన ఎన్ని రకాలఫ్యాబ్రిక్లతో డిజైన్ చేసినా.. ఖాదీ సరిసాటి రాదన్నారు. దీనికి మించిన విలాసవంతమైన వస్త్రం ఇంకొటి ఉండదు అంటూ ఖాదీపై తనకున్నా ఆకాశమంతా అభిమానాన్ని చాటుకునన్నారు. ప్రస్తుతం సామాజికి కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు పర్యావరణ స్ప్రుహతో గాంధీ చూపిన దారిపై దృష్టి సారించి..ఖాదీకి పెద్ద పీటవేశారు. ఎందుకంటే..ఖాదీకి పరిమిత విద్యుత్ సరిపోతుంది. అంతేగాదు ఒక మీటరు ఖాదీకి మూడు లీటర్ల నీరు చాలు. అదే మిల్లులో ఉత్పత్తి అయ్యే బట్టకు 55 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అలా స్వతంత్ర పోరాటానికి చిహ్నమైన ఖాదీ ఫ్యాషన్ పరిశ్రమలో తన దైన ముద్రవేసి అందరికీ చేరువయ్యింది. అంతేగాదు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ప్రకారం, 2013-14 ఏడాదిలో ఖాదీ వస్త్రాల ఉత్పత్తి ₹811.08 కోట్లు అయితే, 2023-24లో అది ₹3,206 కోట్లకు చేరుకుంది. ఇక 2022-23 ఏడాదికల్లా ఖాదీ వస్త్రాల ఉత్పత్తి ₹2,915.83 కోట్లుగా ఉండటం విశేషం.(చదవండి: బాపూ సమరం తెరపై చూపుదాం) -
Fashion: లైట్ కలర్స్‌తో.. లగ్జరీ లుక్!
తమ క్రియేటివ్ డిజైన్స్‌తో ఇతరులను అందంగా చూపే ఫ్యాషన్ డిజైనర్లు తమ కోసం వార్డ్ రోబ్‌ను ఎంత ఘనంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ విషయమై హైదరాబాద్‌లో మోడల్స్‌కి, ఫ్యాషన్ షోల కోసం డిజైన్స్ క్రియేట్ చేసే హేమంత్ సిరి ‘లెస్ ఈజ్ క్లాసీ’ అంటూ సింపుల్‌గా ఉండే తన వార్డ్ రోబ్‌ను పరిచయం చేస్తున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి చేనేతలు అంటే బాగా ఇష్టం ఉండేది. దీంతో మా అమ్మ, అమ్మమ్మల చీరలను నాకు అనువుగా డిజైన్ చేసుకునేదాన్ని. నేను డిజైన్ చేసిన దుస్తులను వేసుకున్నవారు అందంగా కనిపించాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. అయితే, నన్ను నేను కూడా బెస్ట్‌గా చూసుకోవాలి. నా విషయానికి వచ్చేసరికి కొన్ని ఎక్స్పర్మెంట్స్తో ΄ాటు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటాను. మోడల్స్‌కి, ఫ్యాషన్ షోస్ కోసం డిజైన్ చేయడంలో ఫ్యాబ్రిక్, కలర్స్ మీద ప్రత్యేక దృష్టి పెడతాను. నాకోసం అయితే ఇండోవెస్ట్రన్ లుక్ ఉండేలా చూసుకుంటాను. కొంచెం ్ర΄÷ఫెషనల్గా ఉండాలి అనుకుంటే హ్యాండ్లూమ్ శారీస్ ఎంచుకుంటాను.లెస్ ఈజ్ క్లాసీ..ఏదైనా ఈవెంట్‌కి వెళ్లాలి అనుకుంటే ముందు నన్ను నేను తెలుపు, క్రీమ్ కలర్ డ్రెస్‌లో ఊహించుకుంటాను. అంతేకాదు, ఆర్గానిక్ కలర్స్, ఆర్గానిక్ ఫ్యాబిక్స్ర్తో సింపుల్‌గా ఫార్మల్ లుక్‌ని ఇష్టపడతాను. హెవీ శారీస్ అయినా సరే సింపుల్‌గా ఉండే బ్లౌజ్‌నే ఉపయోగిస్తుంటాను. లెస్ ఈజ్ క్లాసీ అనిపించేలా ఉంటాను.లగ్జరీ కలర్స్..పేస్టల్ కలర్స్‌లో లైట్ క్రీమ్, పింక్, గోల్డ్.. ఇష్టపడతాను. ఈ రంగులు ఒక లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటాయి. క్రీమ్ లేదా ఐవరీ అంటేనే లగ్జరీ కలర్స్. లైట్ బ్లూ, లైట్ గ్రీన్.. వంటివి డే ఫంక్షన్స్‌కి, లైట్ సిల్వర్, లైట్ క్రీమ్ డ్రెస్సులు, శారీస్ నైట్ ఈవెంట్స్‌కి వాడతాను.ప్రయాణాల్లో సౌకర్యం..ఖ΄్తాన్స్ ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. పలాజోలు, జీన్స్, లైట్, ఫ్లోరల్ కలర్ నీ లెంగ్త్ ఫ్రాక్స్ని ఉపయోగిస్తాను.బొట్టుతో గుర్తింపు..నా పర్సనల్ స్టైలింగ్‌లో బొట్టు సిగ్నేచర్ అయిపోయింది. ముందు స్టికర్స్ వాడేదాన్ని. ఆర్గానిక్ కలర్స్పైన గ్రిప్ వచ్చాక కుంకుమ తయారు చేసుకుని, వాడుతున్నాను. వివాహవేడుకల వంటి ఎంత పెద్ద ఈవెంట్ అయినా సింపుల్ జ్యువెలరీనే ఉపయోగిస్తాను’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!
పర్నియా కురేశీ.. పరిచయానికి చాలా విశేషణాలనే జోడించాలి. ఆమె కూచిపూడి డాన్సర్, ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్, యాక్ట్రెస్, ఆథర్ ఎట్సెట్రా! వివరాలు కావాలంటే కథనంలోకి వెళ్లాల్సిందే! పర్నియా పుట్టింది పాకిస్తాన్లో. పెరిగింది ఢిల్లీలో. చదువుకుంది అమెరికాలో. తండ్రి.. మోయిన్ అఖ్తర్ కురేశీ భారతీయుడు. బిజినెస్‌మన్. తల్లి.. నస్రీన్ కురేశీ పాకిస్తానీ నటి. తండ్రి నుంచి వ్యాపార మెలకువలు, తల్లి నుంచి కళలు వారసత్వంగా అందుకుంది. నాలుగో ఏటనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ మొదలుపెట్టింది. తొలి గురువు తల్లే. తర్వాత రాజా–రాధారెడ్డి దగ్గర కూచిపూడి నేర్చుకుంది. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ‘లా’ చదివింది. లా చదివేటప్పుడే ఫ్యాషన్ రంగంలో ఇంటర్న్‌గా చేరింది. ఆ క్రమంలోనే ఫ్యాషన్ మీద ఆసక్తి పెరిగింది. అకడమిక్స్ కంటే తన క్రియేటివిటీకే ఎక్కువ మార్కులు పడసాగాయి. దాంతో ఫ్యాషన్‌నే సీరియస్‌గా తీసుకుని హార్పర్స్ బజార్, ఎల్ లాంటి ఫ్యాషన్ పత్రికల్లో పనిచేసింది. తర్వాత ఫ్రెంచ్ డిజైనర్ క్యాథరిన్ మలండ్రీనో దగ్గర పీఆర్ ఇంటర్న్‌గా చేరింది. ఇవన్నీ ఆమెలోని ఫ్యాషన్సెన్స్కి మెరుగులు దిద్దాయి. అయితే ఈ మొత్తం ప్రయాణంలో ఆమె ఎక్కడా తన డాన్స్‌ని నిర్లక్ష్యం చేయలేదు. సాధన చేస్తూనే ఉంది. ప్రదర్శనలిస్తూనే ఉంది. ఇండియా తిరిగిరాగానే.. ఫ్యాషన్ రంగంలో ఆమెకు ఇబ్బడిముబ్బడి అవకాశాలు కనిపించాయి. ఆ దిశగా అడుగులు కదిపేలోపే సోనమ్ కపూర్ హీరోయిన్గా నటించిన ‘ఆయశా’కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చాన్స్ వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే ఇక్కడ ఆన్లైన్లో డిజైనర్ వేర్ అందుబాటులో లేదని గ్రహించింది. అందుకే ఆ మూవీ అయిపోగానే, 2012లో Pernia's Pop-Up Shop పేరుతో ఆన్లైన్ స్టోర్‌ని లాంచ్ చేసింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ డిజైనర్స్ డిజైన్ చేసిన దుస్తులు లభ్యమవుతాయి. అంట్రప్రెన్యూర్‌గా మారినా డిజైనింగ్‌ను ఆపలేదు. ఈ దేశ సంస్కృతి, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్నివర్గాల మహిళలకు అన్ని రకాల దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టింది. తన స్టయిలింగ్‌ని కోరుకునే వాళ్లకోసం ‘పర్నియా కురేశీ’ లేబుల్‌ని, ఇండియన్, ఫ్యూజన్ తరహా కావాలనుకునేవారికి ‘"Amaira' ’ లేబుల్‌ని స్టార్ట్ చేసింది. కిడ్స్ వేర్, జ్యూల్రీ డిజైనింగ్లోకీ అడుగుపెట్టింది. పర్సనల్ స్టయిలిస్ట్‌గా కాకుండా బాలీవుడ్ ఈవెంట్స్, రెడ్ కార్పెట్ వాక్ కోసం కోరిన సెలబ్రిటీలకు మాత్రం స్టయిలింగ్ చేస్తోంది.సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల ఫ్యాషన్ షోల్లో మోడల్‌గా ర్యాంప్ మీద మెరుస్తోంది. ‘జాన్ నిసార్’ అనే చిత్రంలోనూ నటించింది. ఫ్యాషన్, స్టయిలింగ్కి సంబంధించిన వివరాలు, సలహాలు, సూచనలతో ‘"Be Stylish, with Pernia Qureshi'’ పేరుతో పుస్తకాన్నీ రాసింది. ‘మా అమ్మ ఇన్ఫ్లుయెన్స్తో క్లాసికల్ డాన్సర్నయ్యాను. నాన్న ఇన్స్పిరేషన్తో అంట్రప్రెన్యూర్నయ్యాను. నా పర్సనల్ ఇంట్రెస్ట్‌తో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్నయ్యాను. ఉత్సుకతతో పుస్తకం రాశాను. చాన్స్ రావడంతో యాక్ట్రెస్నయ్యాను. లైఫ్‌లో నేను పోషించిన, పోషిస్తున్న ఈ రోల్స్ అన్నిటిలోకి నాకు క్లాసికల్ డాన్సర్ రోల్ అంటేనే ఇష్టం. డాన్స్ లేని జీవితాన్ని ఊహించుకోలేను. డాన్స్ ప్రాక్టీస్ లేని షెడ్యూల్ ఉండదు. సక్సెస్ అంటే నా దృష్టిలో చాలెంజెస్‌ని హ్యాండిల్ చేయడమే! దీనికి ఓర్పు, నేర్పులే టూల్స్!’ అంటుంది పర్నియా కురేశీ. (చదవండి: శ్లోకా మెహతా స్టైలిష్ లెహంగాలు రూపొందించిందే ఆ మహిళే..!) -
జస్ట్ రెండు కుట్టు మిషన్లతో.. ఏకంగా వెయ్యి కోట్ల సామ్రాజ్యం!
మనం మనీష్ మల్హోత్రా, రీతూ కుమార్, సబ్యసాచి ముఖర్జీ, అబు జానీ సందీప్ ఖోస్లా, తరుణ్ తహిలియానీ వంటి అగ్రశేణి ఫ్యాషన్ డిజైనర్ల గురించి విన్నాం. వారికంటే ముందే ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఏలి అత్యంత ధనిక ఫ్యాషన్ డిజైనర్ పేరుగాంచిన మహిళ గురించి ఇంతవరకు వినలేదు. జస్ట్ రెండు కుట్టు మిషన్లతో ఏకంగా వెయ్యి కోట్ల ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని సృష్టించి అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్‌గా అవతరించింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 270 స్టోర్లతో వందల కోట్ల విలువైన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అయితే ఆమెను విజయం అంత తేలిగ్గా వరించలేదు. ఎన్నో అవమానాలు, చీత్కారాలు నడుమ నిరాశ నిస్ప్రుహలతో యుద్ధం చేసి విజయతీరాలను అందుకుంది. ఎవరామె అంటే..ఆమె పేరే ది రైజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే. ఆమె అక్టోబర్ 3, 1963న ముంబైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి పుష్పా సావ్లానీకి కుట్టు పనిలో అపారమైన ప్రతిభ ఉంది. అదే ఆమెకు సంక్రమించి..ఫ్యాషన్ డిజైన్ పట్ల మక్కువ ఏర్పరుచుకుంది. ఈ రంగంలో తక్కువ భారతీయ రిటైల్ బ్రాండ్లు ఉన్నాయని గ్రహించి..సరసమైన ధరల్లో లభించేలా డిజైనర్‌వేర్‌లను రూపొందించాలని నిర్ణయించుకుంది. అందుకోసం తండ్రి నుంచి కొద్ది మొత్తం రుణం తీసుకుని తన సోదరితో కలిసి పాశ్చాత్య శైలిలో ఉండే దుస్తుల మాదిరిగా డిజైన్ చేయడం ప్రారంభించారు. వాటిని ప్రధాన బ్రాండ్లకు విక్రయించడం ప్రారంభించారు. అయితే ఆ క్రమంలో ఎన్నో మాల్స్‌లోని బ్రాండ్ల నుంచి గట్టి స్థాయిలో తిరస్కరణలు ఎదురయ్యాయి. చాలా ఎదురదెబ్బలు తినాల్సి వచ్చింది. అయినా సరే తగ్గేదే లే అంటూ ఆత్మవిశ్వాసంతో సాగింది. ఇక లాభం లేదని తానే అనితా డోంగ్రే అని తన పేరుతో స్వంత లేబుల్ ప్రారంభించింది. ఇది అనాధికాలంలోనే ప్రసిద్ధ బ్రాండ్‌గా మారింది. 2015లో ఏఎన్డీ పేరుతో డిజైన్లను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత తన కంపెనీని హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా రీబ్రాండ్ చేసింది. అలా ఏఎన్డీ.. గ్లోబల్ దేశీ, అనితా డోంగ్రే బ్రైడల్ కోచర్, అనితా డోంగ్రే గ్రాస్‌రూట్, అనితా డోంగ్రే పింక్ సిటీ తోసహా పలు విజవంతమైన వెంచర్లతో భారతదేశంపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా ఆమె ప్రస్థానం సాగింది. అంతేగాక నీతా అంబానీ, రాధిక మర్చంట్, ఇషా అంబానీ, శ్లోకా అంబానీ, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, అలియా భట్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే వంటి బాలీవుడ్ అగ్ర తారలకు డిజైనర్‌గా మారింది. ఆమె వ్యక్తిగత జీవితం వచ్చేటప్పటికీ..60 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ అనితా వ్యాపారవేత్త ప్రవీణ్ డోండ్రేని వివాహం చేసుకున్నారు. వారికి యష్ డోంగ్రే అనే కుమారుడు ఉన్నాడు. అతడు బెనైషా ఖరాన్ని వివాహం చేసుకున్నాడు. ఆమె కుటుంబ నేపథ్యం గురించి పెద్దగా మీడియాకి తెలియదు ఎందుకంటే ఆమె కుటుంబం హంగు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంది.సంపద పరంగా..భారతదేశంలో ఆమె కంపెనీకి సంబంధించిన 270కి పైగా స్టోర్లు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆమె రిటైల్ టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లకు చేరుకుందని అనితా డోంగ్రే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే ఆమె ఆదాయం ఇప్పుడు వెయ్యి కోట్లకు మించవ్చని అంచనా. అలాగే ఆమెను ఫోర్బ్స్ భారతదేశంలో అత్యంత ధనిక మహిళా ఫ్యాషన్ డిజైనర్‌గా పేర్కొంది. (చదవండి: 80 ఏళ్ల స్విమ్మర్! ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయం..కానీ..!) -
అన్లైన్ ఫ్యాషన్.. సేవల ఓషన్
శ్రీనగర్‌కాలనీలో నివసించే దివ్య గచ్చిబౌలిలోని బొటిక్‌లో డ్రెస్ స్టిచ్చింగ్ కి ఇచ్చారు.. స్టిచ్చింగ్ పూర్తయ్యాక వాళ్ల ఇంటికి ర్యాపిడో ద్వారా పంపారు. తీరా ఇంటికి వచ్చిన డ్రెస్ ధరించి చూస్తే కొన్ని ఆల్టరేషన్స్ అవసరం అని అర్థమైంది.. బొటిక్ వారిని సంప్రదిస్తే.. తమకు ఆ డ్రెస్‌ని ఇస్తే ఆల్టరేషన్స్ చేసి మరో రెండు రోజుల్లో పంపిస్తామన్నారు. కానీ దివ్య అదే రోజు ఫంక్షన్‌కు వెళ్లాల్సి ఉంది.. మరేం చేయాలి? ‘ఇలాంటి సమస్య మాతో రాదు మేం డ్రెస్‌ని మాత్రమే ఇంటికి పంపం. టైలర్, కుట్టుమిషన్‌తో సహా పంపిస్తాం. ఏవైనా మార్పు చేర్పులు ఉంటే క్షణాల్లో చేసేసి ఇస్తాం’ అంటోంది ఓ ఆన్లైన్ స్టిచ్చింగ్ సంస్థ. అమెరికాలో ఉంటున్న నగరవాసికి సిటీలోని ఓ ప్రముఖ వస్త్ర షోరూమ్‌లో ఓ చీర నచ్చింది. అయితే అది కొని తన దగ్గరకు పంపించినా, ఆ చీరకు మ్యాచింగ్ బ్లౌజ్, సీకో వర్క్ వగైరాల కోసం అమెరికాలో వెదకడానికి సమయంతో పాటు వ్యయం కూడా ఎక్కువే..! మరేం చేయాలి? ‘అంత కష్టం మీకక్కర్లేదు. ఆ షోరూమ్‌లో మీరు కొన్న చీర నేరుగా మాకే వస్తుంది. దానికి అవసరమైన బ్లౌజ్, వర్క్స్ పూర్తి చేసి భద్రంగా అమెరికా చేర్చే బాధ్యత మాదే’ అంటోంది మరో స్టిచ్చింగ్ సంస్థ. ఒకటా రెండా.. దుస్తులు/ఫ్యాబ్రిక్స్ కొనడం, వాటిని కుట్టించడం, అంతేనా.. అందంగా చీర కట్టించడం.. దాకా కాదు ఏ సేవాకు ఆన్లైన్లో అసాధ్యం అంటున్నాయి నగరంలో పుట్టుకొచి్చన పలు ఆన్లైన్ ఫ్యాషన్ బ్రాండ్స్. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆన్లైన్ టైలరింగ్ సేవలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విజృంభిస్తూ.. అనూహ్యమైన రీతిలో దూసుకుపోతున్నాయి. ఈ తరహా ఆన్లైన్ విప్లవాలకు సారథ్యం వహిస్తున్న సంస్థల్లో అత్యధిక భాగం మహిళల ఆధ్వర్యంలోనే ఉండడం విశేషం. యాప్‌లోని మార్కెట్ ప్లేస్ ద్వారా.. ‘పలు చోట్ల పరిమిత విస్తీర్ణంలో ఎక్స్‌క్లూజివ్ బ్రాండెడ్ ఔట్లెట్స్ ఏర్పాటు చేశాం. వీటిలో ఒక డిజైనర్, ఒక కుట్టుమిషన్ వగైరాలు అందుబాటులోకి తెచ్చాం. కస్టమర్లు నేరుగా సంప్రదింపులు చేసి అక్కడే ఆర్డర్స్ ఇచ్చి వెళ్లొచ్చు. చిన్న చిన్న ఆల్టరేషన్స్ కూడా చేయించుకోవచ్చు.. ఇలాంటివెన్నో కస్టమైజ్డ్ డ్రెస్సింగ్‌కు జత చేస్తున్నాం. అలాగే కస్టమర్స్ మా యాప్‌లోని మార్కెట్ ప్లేస్ ద్వారా నగరంలోని పలు షోరూమ్స్ నుంచి కొనుగోలు చేసిన చీరలు, డ్రెస్‌మెటీరియల్స్ మాకు చేరిపోతాయి. వాటికి అవసరమైన హంగులన్నీ జతచేసి తిరిగి కస్టమర్‌కు చేరవేసే బాధ్యత మాది. చీరకు బ్లౌజ్ వగైరాలు కుట్టడం మాత్రమే కాదు, అవసరమైతే చీర కట్టడం కూడా మా సిబ్బందే చేస్తారు.. విభిన్న రకాల శారీ డ్రేపింగ్స్ సైతం చేస్తారు. అంటూ నగరవాసులకు తాము అందిస్తున్న సేవల జాబితాను ‘సాక్షి’కి వివరించారు సుషి్మత. నగరవ్యాప్తంగా దాదాపుగా 80కిపైగా డిజైనర్లు, పదుల సంఖ్యలో షోరూమ్స్‌తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారామె. నగరంలో మాత్రమే కాకుండా బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లోనూ క్లౌడ్ టైలర్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.సాఫ్ట్వేర్ నుంచి డిజైనర్ వేర్ దాకా.. ‘ఐటీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ఏ సంస్థ లేదండీ. అలా చూస్తే ఇప్పుడు అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే’ అంటారు సుషి్మత. మంచి ఆదాయాన్నిచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని, అంతకు మించిన ఆత్మసంతృప్తిని ఆశిస్తూ.. ఓ రెండేళ్ల క్రితం నగరంలో క్లౌడ్ టైలర్ పేరిట టైలరింగ్ సేవల్ని ప్రారంభించా. ఇంటి దగ్గరకే వచ్చి కొలతలు తీసుకుని ఫ్యాబ్రిక్స్ తీసుకెళ్లి, స్టిచి్చంగ్ పూర్తి చేసి తిరిగి ఇంటికే తెచ్చి ఇవ్వడం అనే ఏకైక సేవతో వేసిన తొలి అడుగుకే అద్భుతమైన స్పందన వచి్చంది. దీంతో ఇనుమడించిన ఉత్సాహంతో మా సేవల్ని కూడా విస్తరించాం. – సుష్మిత లక్కాకుల, ఫ్యాషన్ డిజైనర్కుట్టుమిషన్తో సహా పంపిస్తాం.. విదేశాల్లో ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్‌లు చేసిన అనుభవం ఉన్న రుహిసుల్తానా.. నగరానికి వచ్చి ఆన్లైన్ టైలరింగ్ సేవల్ని అర్బన్ సిలాయీ పేరుతో ప్రారంభించారు. అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యారు.. పిక్, స్టిచ్, డెలివర్ అనే కాన్సెప్‌్టతో ఆమె ప్రారంభించిన ఈ సంస్థ పూర్తిగా ఆన్లైన్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ‘ఇప్పుడీ రంగంలో మరికొందరు కూడా ఉన్నారు. అయితే చెప్పిన సమయానికి ఏ మాత్రం తేడా రాకుండా ఖచ్చితత్వంతో ఇచ్చే డెలివరీలో మాకు సాటి లేదు. అదే విధంగా ఇంటికి డ్రెస్ మాత్రమే కాదు ఆల్టరేషన్స్ అవసరమైతే కస్టమర్ కళ్ల ముందే దాన్ని కంప్లీట్ చేయడానికి ఓ మాస్టర్ని కుట్టుమిషన్‌తో సహా పంపిస్తాం’ అంటూ చెప్పారు. బంజారాహిల్స్‌లో ఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నా.. విదేశాల్లో సైతం మాకు కస్టమర్స్ ఉన్నారు. వారికి షిప్పింగ్ ద్వారా సేవలు అందిస్తున్నాం. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనున్నాం. – రుహిసుల్తానా, అర్బన్ సిలాయీ నిర్వాహకురాలు -
Lakshmi Lehr: అదీ స్టయిల్ అంటే! సింపుల్ అండ్ కంఫర్టబుల్ అన్నమాట!
అందుబాటులో ఉన్న వనరులతోనే అద్భుతాలను క్రియేట్ చేసేవాళ్లను నేర్పరులు అంటారు. ఆ కేటగరీలో లక్ష్మీ లెహర్‌ను చేర్చొచ్చు. పర్ఫెక్షన్ కోసం ప్రపంచంలో ఉన్న ద బెస్ట్‌ని ఆర్డర్ చేయదు. కళ్ల ముందున్న వాటితోనే ప్రపంచానికి ద బెస్ట్‌ని చూపిస్తుంది. అందుకే ఆమె సెలబ్రిటీ స్టయిలిస్ట్ అయింది.లక్ష్మీ ముంబై నివాసి. ఫ్యాషన్ డిజైనింగ్ గ్రాడ్యుయేషన్ తర్వాత పలు ఫ్యాషన్ పత్రికల్లో పనిచేసింది. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ప్రముఖ సెలబ్రిటీ స్టయిలిస్ట్ అనాయితా శ్రాఫ్ స్టయిలింగ్ కంపెనీ ‘స్టయిల్ సెల్’లో చేరింది. ఆమె సృజనకు, పనితీరుకు అనాయితా ఇంప్రెస్ అయింది. ఆమె స్థాయి స్టార్ స్టయిలింగ్ అని గ్రహించింది. లక్ష్మీని సెలబ్రిటీ సర్కిల్‌కి పరిచయం చేసింది. ముందుగా.. కరీనా కపూర్ ఎయిర్ పోర్ట్ అపియరెన్స్కి స్టయిలింగ్ చేసింది లక్ష్మీ. ఆ కూల్ లుక్స్‌కి.. కరీనాను క్యాప్చర్ చేయడానికి ఫాలో అయిన పాపరాట్సీ ఫిదా అయిపోయారు.కరీనా ఫ్యాన్స్ అయితే క్రేజీ.. చెప్పక్కర్లేదు. ఆ స్టయిల్ని కరీనా కూడా కంఫర్ట్‌గా ఫీలై.. స్పెషల్ అకేషన్స్‌కి ఆమెను స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది. లక్ష్మీ స్టయిలింగ్‌ని కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, జాన్వీ కపూర్, ఆలియా భట్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, శ్రద్ధా కపూర్, రశ్మికా మందన్నా, సమంత, పూజా హెగ్డేలూ కోరుకున్నారు.ఆ సెలబ్రిటీల క్యాజువల్ లుక్ నుంచి రెడ్ కార్పెట్ వాక్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఎండార్స్మెంట్స్, సినిమా ప్రమోషన్స్, ఫంక్షన్స్, పెళ్లిళ్లు.. అంతెందుకు వాళ్లు గడపదాటాలంటే చాలు లక్ష్మీ వాళ్లను స్టయిలింగ్ చేయాల్సిందే! అంత డిమాండ్‌లో ఉంది ఆమె. సెలబ్రిటీ ఒంటి తీరు, బాడీ లాంగ్వేజ్‌ని బట్టి స్టయిలింగ్ చేస్తుంది లక్ష్మీ. సింపుల్ చేంజెస్తోనే వైబ్రెంట్‌గా కనిపించేలా వాళ్లను మారుస్తుంది. ఫిమేల్ సెలబ్రిటీలే కాదు మేల్ సెలబ్రిటీలూ ఆమెకు ఫ్యాన్సే! వాళ్లలో రితిక్ రోషన్ ముందుంటాడు. తర్వాత సైఫ్ అలీ ఖాన్. ఆ ఇద్దరికీ లక్ష్మీ స్టయిలింగ్ చేస్తోంది.స్టయిల్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్! స్టయిలింగ్ కోసం ప్రపంచ బ్రాండ్స్ అన్నిటినీ వార్డ్‌రోబ్‌లో నింపక్కర్లేదు. ఉన్న రెండు జతలతో కూడా స్టయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మనకు ఏది నప్పుతుంది.. ఏది సౌకర్యంగా ఉంటుందనే స్పృహ ఉండాలి. అంతేకాదు మనమున్న చోటునూ దృష్టిలో పెట్టుకోవాలి. నలుగురిలో కలసిపోయినట్టు ఉంటూనే మన ప్రత్యేకతతో మెరిసిపోవాలి. అదీ స్టయిల్ అంటే! సింపుల్ అండ్ కంఫర్టబుల్ అన్నమాట. నేను స్టయిలింగ్ చేసిన సెలబ్రిటీల్లో నాకు.. కరీనా, జాక్వెలిన్, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్లు అంటే చాలా ఇష్టం! – లక్ష్మీ లెహర్ఇవి చదవండి: ధైర్యసాహసాలు అనగానే మరో ఆలోచనే.. చమేలీ.. ఓ ధీశాలి! -
Kalpana Shah: 'The Whole 9 Yards' దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది..
చీర.. సంప్రదాయ కట్టే! కానీ ఆధునికంగానూ ఆకట్టుకుంటోంది! క్యాజువల్, కార్పొరేట్ నుంచి రెడ్ కార్పెట్ వాక్, స్పెషల్ సెలబ్రేషన్స్ దాకా సందర్భానికి తగ్గ కట్టుతో ‘శారీ’ వెరీ కన్వీనియెంట్ కట్టుగా మారింది! అలా ఆ ఆరు గజాల అంబరాన్ని పాపులర్ చేసిన క్రెడిట్ శారీ డ్రేపర్స్కే దక్కుతుంది! ఆ లిస్ట్‌లో కల్పన షాహ్.. ఫస్ట్ పర్సన్!కల్పనా షాహ్ ముంబై వాసి. ఆమెకిప్పుడు 75 ఏళ్లు. 1980ల్లో బ్యుటీషియన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ సమయంలోనే ఒకసారి తన కమ్యూనిటీలో జరిగిన ఓ ఫంక్షన్‌కి ఆమె హాజరైంది. అప్పుడు ఆ హోస్ట్‌కి చీర కట్టడంలో సాయపడింది. ఆ కట్టు ఆ వేడుకకు హాజరైన ఆడవాళ్లందరికీ నచ్చి కల్పనను ప్రశంసల్లో ముంచెత్తింది. అప్పటి నుంచి ఆమె చీర కట్టునూ తన ప్రొఫైల్‌లో చేర్చింది. అలా 1980ల్లోనే ‘శారీ డ్రేపర్’ అనే ప్రొఫెషన్ని క్రియేట్ చేసింది కల్పన. అది మొదలు ఆమె పేరు సామాన్యుల నుంచి సెలబ్రిటీల స్థాయికి చేరింది. ముంబై ఫ్యాషన్ ప్రపంచమూ కల్పన గురించి విన్నది.ప్రముఖ డిజైనర్స్ అంతా తమ ఫ్యాషన్ షోలకు ఆమెను ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఘాఘ్రా నుంచి దుపట్టాతో డిజైన్ అయిన ప్రతి డిజైనర్ వేర్కి .. మోడల్స్‌ని ముస్తాబు చేయాల్సిందిగా కోరసాగారు. ఆ వర్క్ కల్పనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చీర, చున్నీలను అందంగానే కాదు సౌకర్యంగానూ ఎన్నిరకాలుగా చుట్టొచ్చో.. ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసి మరీ ఎక్స్పర్టీజ్ తెచ్చుకుంది. దాంతో ఆమె నైపుణ్యం ఫ్యాషన్ రంగంలోనే కాదు బాలీవుడ్లో, ఇండస్ట్రియలిస్ట్‌ల క్లోజ్ ఈవెంట్లలోనూ కనిపించి.. అతి తక్కువ కాలంలోనే ఆమెను సెలబ్రిటీ శారీ డ్రేపర్‌గా మార్చింది.ఒకప్పటి టాప్ మోడల్ మధు సప్రే నుంచి బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ వహీదా రహమాన్, అంట్రప్రెన్యూర్స్ నీతా అంబానీ, శోభనా కామినేని, నేటితరం బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోణ్, ఆలియా, కరీనా కపూర్, రశ్మికా మందన్నా, యామీ గౌతమ్, తమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది. వాళ్లందరికీ కల్పనా ఫేవరెట్ శారీ డ్రేపర్. అంతెందుకు మొన్న అంబానీ ఇంట జరిగిన అనంత్, రాధికల పెళ్లి వేడుకల్లో కూడా కల్పన పాల్గొంది.. రాధికా మర్చంట్ ఆత్మీయంగా పిలుచుకున్న శారీ డ్రేపర్‌గా. ఒకట్రెండు వేడుకల్లో రాధికా.. కల్పనచేతే చీర కట్టించుకుని మురిసిపోయింది.ఆథర్‌గా.. చీర కట్టును ప్రమోట్ చేయడానికి కల్పన 2012లో ’The Whole 9 Yards’ పేరుతో ఒక పుస్తకం రాసింది. చీర కట్టుకు సంబంధించి దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది. అంతేకాదు దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా కల్పన.. 24 గంటల మారథాన్ శారీ డ్రేపింగ్‌తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ తన పేరు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 226 రకాల చీర కట్టులను ప్రదర్శించింది. ఆమె మొత్తం 300 రకాలుగా చీరను కట్టగలదు. శారీ డ్రేపింగ్‌లో ‘కల్పన కట్టు’ అనే ప్రత్యేకతను సాధించి.. ఫ్యాషన్ వరల్డ్‌లో చీరకు సెలబ్రిటీ హోదా కల్పించిన కల్పన షాహ్.. నేటికీ శారీ డ్రేపింగ్ మీద శిక్షణా తరగతులు, వర్క్ షాప్స్ నిర్వహిస్తూ చురుగ్గా ఉంటోంది! -
Riya Kapoor: ఖూబ్సూరత్! ఆమె ప్రతిభకు విశేషణం జోడించాలంటే..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల జామ్‌నగర్ ప్రీవెడింగ్ సెలబ్రేషన్ గుర్తుండే ఉంటుంది! ఆ వేడుకలో కళ్లు తిప్పుకోనివ్వని ముస్తాబుతో మెరిసిపోయింది పెళ్లికూతురు. అంతేకాదు ఆ ఈవెంట్‌కి హాజరైన ఆలియా భట్, కరీనా కపూర్ ఖాన్, సోనమ్ కపూర్, నతాశా పూనావాలాలూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. రాధికా మర్చంట్ సహా వాళ్లందరినీ అంత అందంగా తయారుచేసిన స్టయిలిస్ట్ రియా కపూర్! ఆమె నైపుణ్యానికి ఆ సంబరాన్ని మించిన ఉదాహరణ లేదేమో! ఆమె ప్రతిభకు విశేషణం జోడించాలంటే.. ‘గివ్ ఏ గర్ల్ ద రైట్ షూస్ అండ్ షి కెన్ కాంకర్ ద వరల్డ్!’ అని హాలీవుడ్ స్టార్ మార్లిన్ మాన్రో మాట. దాన్ని నిజం చేసి చూపించింది రియా కపూర్.. ప్రొడ్యూసర్, సెలబ్రిటీ స్టయిలిస్ట్ అండ్ ఆంట్రప్రెన్యూర్‌గా.. అని చెప్పాలి!ఇండియాలో ఫ్యాషన్ ఇండస్ట్రీ.. కాలు మోపలేనంత మంది ఉద్దండులతో నిండిపోయుంది. అలాంటి రంగంలోకి ‘డ్రమాటిక్ లిటరేచర్’ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌తో.. ఫ్యాషన్ మీద ఆసక్తి అనే ఒకే ఒక్క క్వాలిఫికేషన్‌తో తల దూర్చి.. తన స్టయిల్‌ను ప్రదర్శించగలిగేంత స్పేస్.. గుర్తింపు పొందగలిగేంత ప్రత్యేకతను సాధించింది రియా కపూర్! ఈ మొత్తం ప్రయాణంలో ఆమెక్కడా తన తండ్రి పరపతిని ఉపయోగించుకోలేదు. తన శక్తినే నమ్ముకుంది! ఇంతకీ వాళ్ల నాన్న ఎవరంటే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్.ఆయనకు రియా రెండో సంతానం. నటి సోనమ్ కపూర్‌కి చెల్లి. వాళ్లమ్మ సునీతా కపూర్ జ్యూలరీ డిజైనర్. ‘మా చిన్నప్పుడు మా అమ్మ, పిన్ని ఇద్దరూ పెయింటింగ్ వేస్తుంటే అదేంటో నాకు తెలిసేది కాదు.. గోడల మీద పెయింట్ వేసినట్టే అనిపించేది. నాకు ఊహ తెలిశాక ఒకసారి మా అమ్మ పెయింట్ చేసిన చిన్న ఫ్రేమ్‌లో ఒక ఇంటర్నేషనల్ జ్యూలరీ బ్రాండ్ లాకెట్‌ను చూశాను. అప్పుడు తెలిసింది మా అమ్మ పెయింటింగ్ వాల్యూ! అప్పటి నుంచి నాకు డిజైనింగ్.. ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది’ అని చెబుతుంది తన స్టయిలింగ్ పునాది ఎక్కడ పడిందో గుర్తుచేసుకుంటూ! అయినా అకడెమిక్‌గా ఆర్ట్స్‌ని ఎంచుకుంది. న్యూయార్క్‌లో ‘డ్రమటిక్ లిటరేచర్’ చదివింది.దానికి తగ్గట్టే తొలుత నిర్మాతగా మారింది ‘ఆయశా’ చిత్రంతో! తర్వాత ఖూబ్సూరత్, వీరే ది వెడింగ్, థాంక్యూ ఫర్ కమింగ్, క్రూ సినిమాలనూ ప్రొడ్యూస్ చేసింది. ఖూబ్సూరత్, వీరే ది వెడింగ్ మూవీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒకరకంగా ఆ సినిమాలతోనే ఆమె స్టయిలింగ్ కెరీర్ కూడా మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ‘ఆయశా’ స్టయిలిస్ట్ అయిన పర్నియా కురేశీకి రియా అసిస్టెంట్‌గా వ్యవహరించింది. ఆ లెక్కన ఆమె తొలి క్లయింట్ తన సోదరి సోనమ్ కపూరే! రియా పూర్తి స్టయిలిస్ట్‌గా మారింది మాత్రం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్‌కి సోనమ్‌ను తీర్చిదిద్ది! అప్పటి నుంచి అక్కకు పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ అయింది.తన బ్యానర్లోని సినిమాల కథానాయికలకూ తనే స్టయిలింగ్ చేస్తోంది. అలా కరీనా కపూర్, భూమి పెడ్నేకర్, టబు, కృతి సనన్ మొదలైన హీరోయిన్లకూ స్టయిలింగ్ చేసింది రియా! ప్రముఖ స్టయిలిస్ట్‌లు అభిలాషా దేవ్నానీ, తాన్యా ఘావ్రీలతోనూ పనిచేసింది. అక్కతో కలసి ‘రిసోన్’అనే ఫ్యాషన్ బ్రాండ్‌నూ స్టార్ట్ చేసింది. అంతేకాదు వీగన్ ఫుట్‌వేర్ బ్రాండ్ ‘ద సీఐఏ స్టోర్’తోనూ కలసి ప్లస్ సైజ్ మహిళల కోసం ‘ఆర్కే’ పేరుతో షూస్‌ని డిజైన్ చేసింది. ఇలా అన్ని రంగాల్లో తన మార్క్ చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది రియా కపూర్!కొత్తగా ఆలోచించడం.. కొత్తగా చేయడం.. ఆ క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడం నాకు చాలా ఇష్టం. నా జర్నీని మోటివేట్ చేసేది అదే! స్టయిల్ అంటే సెలబ్రేటింగ్ ద మూడ్. మన కట్టుబొట్టు ద్వారా మన మూడ్‌ని అవతలి వాళ్లకు కమ్యూనికేట్ చేయడం! ఆత్మను పట్టుకోవడం! ఇంకా చెప్పాలంటే కంఫర్ట్! ఫ్యూచర్ అంతా క్రూయల్టీ ఫ్రీ ఫ్యాషనే! అంటే వీగన్ ఫ్యాషన్! ఈ రంగంలోకి వచ్చే వాళ్లెవరైనా ఫలితాన్ని ఆశించి కాదు.. ఆ ప్రయాణాన్ని నమ్మి రావాలి! – రియా కపూర్ -
ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మ వామికా గబ్బి.. ఇండియా కౌచర్ వీక్ ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
బ్రైడల్ కలెక్షన్స్ తో గ్రాండ్ గా ఎక్స్ ఫో...సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)
-
వయసు ఆపని పరుగు
సాధారణంగా 53 ఏళ్ల వయస్సులో ఉన్న ఫ్యాషన్ డిజైనర్‌ని మీ లక్ష్యాలేమిటి? అంటే.. ప్రపంచమంతా బొటిక్స్ తెరవడమో మరొకటో అంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మారథాన్స్ లను పూర్తి చేయడం అన్నారంటే అది డిజైనర్ నమ్రత జోషిపురా అయి ఉంటారు. అందుకే ఇప్పుడామె బాలీవుడ్ టాప్ డిజైనర్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ మారథాన్ రన్నర్ కూడా. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమంలో తనను తాను ‘సిక్స్ స్టార్ ఫినిషర్‘ అని సగర్వంగా పరిచయం చేసుకున్న ఢిల్లీ డిజైనర్ నమ్రత సాక్షితో పంచుకున్న విశేషాలు...‘స్కూల్లో, కాలేజ్‌లో ఉండగా హాకీ ఆడేదాన్ని. బీకామ్ చేసినా సృజనాత్మక రంగంలోనే భవిష్యత్తు బాగుంటుందని ఫ్యాషన్ డిజైనింగ్లోకి వచ్చాను. ఢిల్లీ నిఫ్ట్‌లో కోర్సు చేస్తున్నపుడు నా టైమ్ పూర్తిగా దానికే కేటాయించాల్సి వచ్చేది. దాంతో ఫిట్నెస్, హాకీ అన్నీ అటకెక్కాయి. అయితే వాకర్స్‌కు బెస్ట్ సిటీ అయిన న్యూయార్క్‌లో ఉన్నప్పుడు సుదూరాలు నడవడం అలవాటై ఫ్యాషన్ రంగంలో బిజీగా ఉంటూనే మినీ మారథాన్ లో పాల్గొన్నా. ఆ క్రమంలోనే ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచంలోని 6 పెద్ద మారథాన్ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా. ఢిల్లీ మారథాన్ తో మొదలుపెట్టి 2018లో లండన్, 2019లో చికాగో, 2021లో బోస్టన్ , 2022 బెర్లిన్ లో తాజాగా టోక్యో మారథాన్స్ పూర్తి చేశాను’ ఆగని పరుగు..‘వెర్టిగో, ఆస్తమా, పోస్ట్ మెనోపాజ్ సమస్యలు నన్ను బాధించేవి. రెండుసార్లు కోవిడ్‌తో బాధపడినప్పటికీ మారథాకు ట్రైనింగ్ షెడ్యూల్‌ను కోల్పోలేదు, అయితే ఢిల్లీలో కాలుష్యం వల్ల ఆరు బయట రన్ కష్టమైంది. ట్రెడ్‌మిల్‌పై 25–30 కిలోమీటర్లు పరిగెత్తడం కష్టతరమైన పని. ఇవి దృష్టిలో పెట్టుకుని శిక్షణలో మార్పులు చేస్తూ వచ్చిన నా కోచ్ నకుల్ బుట్టాకు థ్యాంక్స్ చె΄్పాలి’మహిళ... గుర్తించాలి తన కల...‘తన కప్పు ఖాళీగా ఉంచుకుని పక్కనవారి కప్పుని నిండేలా చేయడం అసాధ్యం. ఇంటికోసం మాత్రమే కాదు. తన పట్ల కూడా మహిళకు బాధ్యత ఉండాలి. శారీరక, మానసిక, భావోద్వేగపరమైన ఆరోగ్యాలు కా΄ాడుకుంటూ వ్యక్తిగత లక్ష్యాలు సాధించుకోవాలి’ఆగను... అలుపెరుగను...‘ఫ్యాషన్ రంగంలో కూడా మరింతగా విస్తరించాలి.. కొత్త స్టోర్స్ ్రపారంభించాలి. నా తదుపరి లక్ష్యం కొన్ని ట్రయల్ రన్నింగ్ ఈవెంట్లు. ఎంతకాలం వీలైతే అంత కాలం పరుగు తీస్తూనే ఉంటా’ అంటున్న నమ్రత తన కలను నెరవేర్చుకోవాలని కోరుకుందాం. – సత్యబాబు -
ఫ్యాషన్ ప్రపంచంలో.. తనదొక సైలెంట్ నేమ్!
రాహుల్ విజయ్.. ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సైలెంట్ నేమ్! అతని స్టయిలింగే కనిపిస్తుంటుంది గొప్ప గొప్ప ఈవెంట్లలో.. పెద్ద పెద్ద పార్టీల్లో! కంప్లీట్ డీటేయిలింగ్తో స్టయిల్ని క్రియేట్ చేస్తాడు క్లాసిక్‌గా! అందుకే ఏ రంగంలోని సెలబ్రిటీలకైనా అతను మోస్ట్ వాంటెడ్ స్టయిలిస్ట్!రాహుల్ విజయ్ పుట్టి, పెరిగింది ఢిల్లీలో. ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఎందరో గ్రాడ్యుయేట్స్లాగే అతనూ హార్పర్స్ బజార్లో ఫ్యాషన్ ఇంటర్న్‌గా చేరాడు. అయితే ఆరేళ్లలో ఫ్యాషన్ ఎడిటర్ స్థాయికి ఎదిగాడు. ఫ్యాషన్ రంగంలో ఎదగడానికి ఢిల్లీ కన్నా ఆర్థిక రాజధాని, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ముంబై అయితే బెస్ట్ అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా ముంబైలో ల్యాండ్ అయ్యాడు.హార్పర్స్ బజార్ ఎక్స్‌పీరియెన్స్‌తో వెంటనే అతనికి అక్కడ ‘ఎల్’లో సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్ కొలువు దొరికింది. ముగ్గురు స్టయిలిస్ట్లున్న టీమ్‌ని లీడ్ చేశాడు. అతనిలోని క్రియేటివిటీ, పనిపట్ల అతనికున్న కమిట్మెంట్.. రెండేళ్లకే ‘జీక్యూ ఇండియా’లో సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్ కుర్చీలో కూర్చోబెట్టాయి.. స్టయిలింగ్ కవర్స్, ఫ్యాషన్ ఎడిటోరియల్స్ బాధ్యతలతో. దీంతోపాటు ఈ దేశపు ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ షో ‘లాక్మే ఫ్యాషన్ వీక్’కి డైరెక్టర్‌గానూ ఉన్నాడు రాహుల్ .. ముగ్గురు క్రియేటివ్ డైరెక్టర్స్‌లో ఒకడిగా!ఓవైపు ఇవన్నీ చేస్తూనే.. సెలబ్రిటీ స్టయిలింగ్లోకీ అడుగుపెట్టాడు రాహుల్.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టికి పర్సనల్ స్టయిలిస్ట్‌గా! పర్సనల్ స్టయిలింగ్‌లో.. ముందుగా క్లయింట్ నేపథ్యం, పర్సనాలిటీ, అభిరుచులు, పాత ఫొటోలు.. వంటివన్నీ స్టడీచేసి ఒక అవగాహన కుదిరాకే స్టయిలింగ్ పట్ల దృష్టిపెడ్తాడు రాహుల్. తను చేసిన ఆ రీసెర్చ్ ప్రకారమే క్లయింట్ డ్రెస్ డిజైనింగ్‌ని డిసైడ్ చేస్తాడు.ఎందుకంత డీటేయిలింగ్ అంటే ‘మన స్టయిల్ని రిఫ్లెక్ట్ చేసేది మన లైఫ్‌స్టయిలే కాబట్టి’అంటాడు. అయితే అతని డిజైనర్స్ లిస్ట్‌లో బ్రాండ్ ఇమేజ్ ఉన్న డిజైనర్సే కాదు అసలు బయటి ప్రపంచానికి తెలియని డిజైనర్స్ కూడా ఉండొచ్చు. ఎక్కువగా కొత్త కొత్త దేశీ డిజైనర్స్నే తన క్లయింట్‌కి ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు. ఆ తీరే సెలబ్రిటీ స్టయిలింగ్‌లో అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.అతని స్టయిల్ క్లాసిక్‌గా ఉంటుందనే కాంప్లిమెంట్నీ ఇస్తోంది. అందుకే మృణాల్ ఠాకుర్, అర్జున్ కపూర్, రాజ్‌కుమార్ రావు, క్రికెటర్ కేఎల్ రాహుల్ లాంటి సెలబ్రిటీలూ రాహుల్ విజయ్‌ని తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా ఎంచుకున్నారు. జగమెరిగిన డిజైనింగ్ హౌసెస్ అండ్ బ్రాండ్స్కీ ఫ్రీలాన్స్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్‌గా తన సృజనాత్మక సేవలను అందిస్తున్నాడు రాహుల్ విజయ్.ఫ్యాషన్ రంగంలో ఉన్నవారు సొంత ఈస్తెటిక్ సెన్స్‌ని డెవలప్ చేసుకోవాలి. 12 ఏళ్ల నా ఫ్యాషన్ ఎడిటోరియల్స్ ఎక్స్‌పీరియెన్స్ ఫ్యాషన్‌కి సంబంధించి భిన్న దృక్ఫథాన్ని అందించింది. ట్రెండ్స్‌ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, వాటిలోంచి మనదైన స్టయిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి వంటి ఎన్నో విషయాలను నేర్పింది. ఇది నా కెరీర్‌కి ముఖ్యంగా పర్సనల్ స్టయిలింగ్లోకి వచ్చాక ఎంతో ఉపయోగపడింది. స్టయిలింగ్ అనేది ఇప్పుడు ఇమేజ్ మేకింగ్‌లా మారింది. అందుకే స్టయిలిస్ట్‌ల పాత్ర రోజురోజుకీ పెరుగుతోంది! – రాహుల్ విజయ్ -
Archana Rao: అశ్వత్థామకు దుస్తులు కుట్టింది
అశ్వత్థామకు మరణం లేదు. మహాభారత కాలం నుంచి కల్కి వచ్చే కాలం వరకూ బతికే ఉండాలి. మరి అతను ఎలా ఉంటాడు? ఆ పాత్ర ధరించింది సాక్షాత్తు అమితాబ్ అయితే అతన్ని అశ్వత్థామలా మార్చే దుస్తులు ఎలా ఉండాలి?తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా రావు ‘కల్కి’ సినిమాకు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్ నిఫ్ట్‌లో, న్యూయార్క్‌లో చదువుకున్న అర్చనా రావు పరిచయం.‘సినిమాకు పని చేయడంలో అసలైన సవాలేమిటంటే పేపర్ మీద గీసుకున్నది తెర మీద కనిపించేలా చేయగలగాలి. అందుకు టీమ్ మొత్తంతో మంచి కోఆర్డినేషన్లో ఉండాలి’ అంటుంది అర్చనా రావు.హైదరాబాద్‌కు చెందిన అర్చనా రావుకు ‘అర్చనా రావు లేబుల్’ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. ఆమె దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు ప్రాడక్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంది. అంటే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్‌లు, బెల్ట్‌లు... అన్నీ హ్యాండ్‌మేడ్. ఆమె సృజన మొత్తంలో తప్పనిసరిగా భారతీయత కనిపిస్తుంది.‘నాకు ఇండియన్ కళాత్మక విలువలంటే ఇష్టం. అవే నన్ను కల్కి సినిమా కాస్టూమ్ డిజైనింగ్‌లో గెలిచేలా చేశాయి. నేడు నా పనికి మంచి ప్రశంసలు అందుతుంటే ఆనందంగా ఉంది’ అందామె.నిఫ్ట్ స్టూడెండ్అర్చనా రావు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఏదో ఒక సృజనాత్మక రంగంలో చదువు కొనసాగించాలనుకున్నా స్పష్టత రాలేదు. ఇంటర్ ముగిసే సమయానికి హైదరాబాద్‌లో నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఏర్పడింది. అందులో క్లాత్ డిజైనింగ్ కోర్సుకు అప్లై చేస్తే సీటు వచ్చింది. ‘కాలేజీలో చేరాక ఇదే నేను చదవాల్సింది అని తెలిసొచ్చింది. మన దగ్గర క్రియేటివిటీ ఉండటం ఒకటైతే చదువు వల్ల తెలిసే విషయాలు ఉంటాయి. నిఫ్ట్‌లో ఒక ఫ్యాబ్రిక్‌కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసింది. ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే ముందు ఫ్యాబ్రిక్‌ని కనిపెట్టాలి. అలా చదువు పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాను. న్యూయార్క్ నగరమే ఒక క్యాంపస్. ఏ మనిషిని చూసినా ఏ వీధిని చూసినా ఫ్యాషన్ కనపడుతూనే ఉంటుంది. నేను మరింత ఎదగడానికి న్యూయార్క్ ఉపయోగపడింది. అయితే నేను అమెరికాలో స్థిరపడాలనుకోలేదు. ఇండియా ఫ్యాషన్ రంగంలో పుంజుకుంటోంది. నా పని ఇక్కడే అని నిశ్చయించుకుని వచ్చేశాను. నా బ్రాండ్ మొదలెట్టాను’ అని తెలిపిందామె.మహానటితో...దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో సందర్భంలో పరిచయం కావడంతో అతను ‘మహానటి’ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమన్నాడు. ‘అప్పటికి నాకు సినిమాలకు కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. కాని నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లకు కాస్ట్యూమ్స్ చేశాను. కథాకాలాన్ని బట్టి 1940ల నాటి ఫ్యాషన్లను, 1980ల నాటి ఫ్యాషన్లను స్టడీ చేయాల్సి వచ్చింది. సినిమాలకు కాస్ట్యూమ్స్ చేయడంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే లైట్ పడితే ఏ రంగు ఎక్కువ మెరుస్తుంది తెర మీద ఏ రంగు మృదువుగా ఉంటుందో తెలుసుకోవడమే. మహానటితో నేను పని తెలుసుకున్నాను. ఆ సినిమాకు నాకు జాతీయ అవార్డు రావడం మరింత సంతోషం’ అందామె.కల్కి సినిమాలో మహామహులకు...‘కల్కి సినిమా మొదలెట్టే ముందు నిర్మాత దగ్గర నాగ్ అశ్విన్ పెట్టిన మొదటి షరతు నన్ను చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఉంచాలని. నా మీద నాగ్ పెట్టుకున్న నమ్మకం అది. నాలుగేళ్ల క్రితం అతను ఈ కథను చెప్పినప్పుడు చాలా పెద్దప్రాజెక్ట్ అని అర్థమైంది. అశ్వత్థామ పాత్ర గురించి చెప్తే ఎవరు చేస్తున్నారు అనడిగాను. అమితాబ్ అన్నాడు. దాంతో నాకు ఎక్కడ లేని నెర్వస్నెస్ వచ్చింది. ఆయనను అశ్వత్థామగా చూపించడం ఎలా? మహాభారత కాలం నుంచి ఆయన జీవించే ఉన్నాడంటే నా మనసులో వచ్చిన భావం మనిషిని చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్టు ఉండాలని. ఆయనకు వాడే దుస్తులను మళ్లీ మళ్లీ పరీక్షకు పెట్టి తయారు చేశాను. ఆయన ముఖానికి శరీరానికి ఉండే కట్లు రక్తం, పసుపు కలిసిపోయి ఏర్పడిన రంగులో ఉంచాను. మొదటిసారి అమితాబ్ నా కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు అది సినిమా అని అక్కడున్నది సినిమా సెట్ అని తెలిసినా రోమాలు నిక్క΄÷డుచుకున్నాయి. ఇక ప్రభాస్ కోసం నేను డిజైన్ చేసిన సూట్‌ను కాలిఫోర్నియాలో తయారు చేయించాం. కమలహాసన్‌కు అయన వ్యక్తిగత డిజైనర్ సహాయంతో కలసి కాస్ట్యూమ్స్ చేశాను. సినిమాలో మూడు ప్రపంచాలుంటాయి. పిరమిడ్ సిటీలో కనిపించే ఆర్మీ కోసం కాస్ట్యూమ్స్‌ని మన దిష్టిబొమ్మల నుంచి ఇన్‌స్పయిర్ అయి చేశాను. కల్కి సినిమాకు అందరం కష్టపడి పని చేశాం. అది ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అందామె. -
విజయవాడ : అదరహో అనిపించిన ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
Tanya Ghavri: స్టయిలింగ్‌లో తనతో పోటీ అంటే.. కొంచెం కష్టమే!
స్టయిలింగ్‌లో తాన్యా ఘావ్రీతో పోటీ అంటే కొంచెం కష్టమే! శాంపుల్‌కి జాన్వీ కపూర్, అనన్య పాండేలను చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది! అందుకే తాన్యాను ఇండియన్ స్టయిలింగ్ ఇండస్ట్రీ డ్రైవింగ్ ఫోర్స్‌గా కొనియాడుతుంటారు.తాన్యా ఘావ్రీ.. మాజీ టెస్ట్ క్రికెటర్ కర్షణ్ ఘావ్రీ కూతురు. ముంబైలో పుట్టిపెరిగింది. ఇంటర్ అయిపోయాక.. చాలామంది విద్యార్థుల్లాగే తాన్యా కూడా చదువుల చౌరస్తాలో నిలబడిపోయింది అయోమయంగా.. ఏ దారిన వెళ్లాలో తెలియక! తన బలాబలాలను బేరీజువేసుకుందోసారి. తనకు క్రియేటివ్ బోన్ ఉన్నట్లు అర్థమైంది. అందుకే ఫ్యాషన్ వైపు మళ్లింది. న్యూయార్క్, పార్సన్స్ ఆఫ్ స్కూల్లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది.ఇండియా తిరిగొచ్చాక ఎస్ఎన్డీటీ (శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాకర్సీ) యూనివర్సిటీలో దుస్తుల తయారీ డిజైన్‌కి దరఖాస్తు పెట్టుకుంది. ఆ కోర్స్ అయిపోగానే అవకాశాలు క్యూ కడతాయనే ఉద్దేశంతో! కానీ చదువైపోయిన రెండున్నరేళ్లకు వచ్చింది ఒక చాన్స్.. ‘ఆయశా’ అనే హిందీ సినిమాకు అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా! ఆ చిత్రానికి స్టయిలిస్ట్ పర్నియా కురేశీ. ఆమెకు సహకారం అందించడమే తాన్యా పని. దానికి ముందు ఆ రెండున్నరేళ్లు.. ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్లో, స్టయిలిస్ట్‌లు అనాయితా ష్రాఫ్, అర్చనా వాలావల్కర్లాంటి వాళ్ల దగ్గర ఇంటర్న్‌షిప్ చేసింది.ఆమె స్టయిలింగ్ జర్నీ మొదలైంది మాత్రం ‘ఆయశా’ సినిమాతోనే! అందులోని కథానాయిక సోనమ్ కపూర్‌కి తాన్యా పనితనం నచ్చింది. తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది. తాన్యా స్టయిలింగ్‌తో సోనమ్ ఫ్యాషన్ ఐకాన్ అయింది. అది గమనించిన ఐశ్వర్యా రాయ్ బచన్.. తనకూ స్టయిలింగ్ చేసిపెట్టమని తాన్యాను కోరింది. ఆ అపురూప సౌందర్యరాశికి అప్ టు డేట్ ఫ్యాషన్‌ని టచప్ చేసి.. అక్కాచెల్లెళ్లు కరిష్మా, కరీనా కపూర్ల దృష్టిలో పడింది తాన్యా. వాళ్ల నుంచీ సేమ్ రిక్వెస్ట్ అందుకుంది. ఫిజిక్‌ని బట్టే ఫ్యాషన్, సౌకర్యాన్ని బట్టే స్టయిల్ అని నమ్మే తాన్యా ఆ సూత్రాన్నే అప్లయ్ చేసి కపూర్ సిస్టర్స్ అపియరెన్స్నే మార్చేసింది.వాళ్ల వయసులో చెరో పదేళ్లు తగ్గించేసింది. ఆశ్చర్యపోయింది కరిష్మా, కరీనాల ఆప్తురాలు మలైకా అరోరా! సీక్రేట్ ఏంటని అడిగింది. తాన్యా అడ్రస్ చెప్పారు వాళ్లు. వెళ్లి వాలింది మలైకా! తాన్యాకు మారు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా తన వెంట రమ్మంది. అప్పటి నుంచి మలైకాకూ స్టయిలింగ్ సర్వీస్ ఇవ్వడం మొదలుపెట్టింది తాన్యా. ఆ డిమాండ్‌ను కత్రినా కైఫ్ కూడా గుర్తించింది. ఉఫ్.. ఇలా చెప్పుకుంటూ పోతే మాధురీ దీక్షిత్, సారా అలీఖాన్, జాన్వీ కపూర్, అనన్యా పాండే, దిశా పాట్నీ, శ్రద్ధా కపూర్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఫ్రీదా పింటోలూ చేరి ఆ జాబితా పెరిగిపోతుంది.తాను ఎస్ఎన్డీటీలో జాయిన్ అయ్యేముందు ఊహించుకున్నట్టే తనను అవకాశాల వెల్లువ ముంచెత్తుతోంది. ఈ అచీవ్మెంట్ వయసు పదిహేనేళ్లు. స్టార్స్‌కి మెరుగులు అద్దుతూనే అంట్రప్రెన్యూర్‌షిప్ గురించీ ఆలోచించింది. పెళ్లిళ్లు, పేరంటాలు, పండగలు, పబ్బాలకు డిజైనర్ దుస్తులను అందించే ‘ధూమ్ ధామ్ వెడ్డింగ్స్’ అనే కంపెనీనీ స్థాపించి అంట్రప్రెన్యూర్గానూ మారింది."నా వర్క్‌ని రొటీన్‌గా ఎప్పుడూ ఫీలవను. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చినట్టు భావిస్తాను. అందుకే వర్క్‌ని బాగా ఎంజాయ్ చేస్తాను. నేనెప్పటికీ మరచిపోలేని ఈవెంట్.. ఆస్కార్ పార్టీ కోసం ఫ్రీదా పింటోకి స్టయిల్ చేయడం. నా పర్సనల్ స్టయిల్ విషయానికి వస్తే జీన్స్, స్కర్ట్స్, షర్ట్స్, బ్లౌజెస్.. ఏ డ్రెస్ అయినా నాకు ఓకే. అయితే ఏదైనా ఓవర్ సైజ్డ్ స్టఫ్నే ఇష్టపడతా. నేను షార్ట్‌గా ఉంటాను కాబట్టి.. షార్ట్ డ్రెస్‌లు వేసుకుని ఓవర్ సైజ్డ్ షర్ట్‌తో కానీ జాకెట్‌తో కానీ నా హైట్‌ని బ్యాలెన్స్ చేస్తా"! – తాన్యా ఘావ్రీ -
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ అరుణా గౌడ్ (ఫొటోలు)
-
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మెరిసింది. ప్రత్యేకంగా రూపొందించిన శారీలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గతేడాదే తొలిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై కనిపించిన ఆలియా.. ఈ ఏడాదిలో తళుక్కున మెరిసింది. అయితే ఈవెంట్లో ఆలియా ధరించిన శారీపైన బీటౌన్‌లో పెద్ద చర్చ మొదలైంది. తన స్టైలిశ్ లుక్‌తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆలియా ధరించిన శారీ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.ఆలియా భట్ ధరించిన ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్‌కు సరిపోయేలా ఈ గ్రీన్ శారీ.. దానికి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా షోలో ప్రత్యేకంగా నిలిచింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన పూల చీరలో అలియా స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. దీంతో ఆమె రెడ్ కార్పెట్ పైకి రాగానే కెమెరాల కళ్లన్నీ ఆలియావైపై ఉన్నాయి. అయితే ఈ చీర రూపొందించడంలో పెద్ద కథ ఉందనే విషయం బయటకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ఆలియా భట్ మాట్లాడింది. ఆలియా చీర వెనుక కథమెట్ గాలా ఈవెంట్లో ప్రపంచ వేదికపై మనదేశ మూలాలను చాటి చెప్పేందుకు భారతీయత ఉట్టిపడేలా శారీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ శారీ కోసం దాదాపు 1965 గంటలు అంటే దాదాపు 80 రోజులు పట్టిందని డిజైనర్ వెల్లడించారు. ఆలియా చీరను రూపొందించేందుకు 163 మంది హస్తకళాకారులు అవిశ్రాంతంగా పనిచేసినట్లు తెలిపారు. అయితే ఈ చీరను ఇటలీలో తయారు చేయడం విశేషం. ఇందులో పాల్గొన్న కళాకారులను తాను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలియా చెప్పింది. ఆరు గజాల చీరతో ఆకట్టుకోవడమే కాదు.. తన మాటలతోనే ఆలియా అక్కడి వాళ్ల మనసులు గెలుచుకుంది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?
మెట్ గాలా( MET Gala ).. అనేది సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్. ఈ కార్యక్రమం ప్రతి మే నెలలో మొదటి సోమవారం నిర్వహిస్తారు. ఈ మెట్ గాలా ఈవెంట్‌ని మ్యాజియం కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం డబ్బు సేకరించేందుకు వినియోగిస్తారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ సెలబ్రెటీలు, ప్రహుఖులు, లెజెండ్లు, అథ్లెట్లు, రాజకీయనాయకుల ఒక రాత్రి అంతా స్టే చేసి మరీ ఈ ఫ్యాషన్ వేడుకను జరుపుకుంటారు.ఈ ఈవెంట్ 1948 నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్లో తెలుగు మహిళ సందడి చేయనుంది. సినిమాలకు సంబంధం లేని ఓ మహిళ ఇందులో పాల్గొనే అవకాశం రావడం విశేషం. ఈ మహిళ మన హైదరాబాదీనే. ఆమె పేరు సుధారెడ్డి. ఆమె ఈ గాలా ఈవెంట్లో మరోసారి తళుక్కుమంటోంది. ఇంతకుమునుపు 2021లో ఇదే గాలా ఈవెంట్లో సందడి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఎవరీమె అంటే..సుధారెడ్డి మన నగరానికి చెందిన బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా. సుధారెడ్డి ఫస్ట్ టైమ్ 2021లో ‘మెట్ గాలా రెడ్ కార్పెట్’పై తళుక్కుమని మెరిశారు. మళ్లీ ఈ ఏడాది మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై మరోసారి మయమరిపించనున్నారు. అంతేగాదు తన ష్యాషన్ డిజైనర్ దుస్తులతో మద్రు వేసేందుకు సుధారెడ్డి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఇద్దరు ప్రముఖ డిజైనర్లను సెలక్ట్ చేసుక్నున్నారు. ఈ మేడాది మే 6న ఈ మెగా ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. అందులో మన తెలుగు మహిళ సుధారెడ్డి అలెగ్జాండర్ మెక్ క్వీన్, తరుణ్ తహిలియానిని డిజైన్ చేసిన దుస్తులను ధరించనున్నారు. బిగ్గెస్ట్ నైట్‌గా ప్రసిద్ధి చెందిన ఈ మెగా గాలా ఈవెంట్‌కి మరోసారి రావడం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ ష్యాషన్ వేడుకలో తన దుస్తులు మరింత ప్రత్యేకంగా ఉండాలని భావిస్తోంది సుధారెడ్డి.ఈసారి ఆమె ఈ ఫ్యాషన్ వేడుకలో భారతీయ సంస్కృతిని టచ్ చేసేలా విభిన్నమైన వస్త్రాలంకరణతో మెరవనుంది. నిజానికి ఈ మెట్ థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవాకనింగ్ ఫ్యాషన్" అంటే..చారిత్రక వస్త్రాలంకరణపై దృష్టి పెట్టేలా చేయడమే ఈ వేడుక ముఖ్యోద్దేశం. ఇక ఈ ఏడాది మెట్ గాలా థీమ్ వచ్చేటప్పటికీ గార్డెన్ ఆఫ్ టైమ్. అందుకు తగ్గట్టుగానే సెలబ్రిటీలు, డిజైనర్లు తమ సొంత ప్రతిభను వెలికితీసి మరీ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ వేడుకలో ఎన్నో రకాల ఫ్యాషన్ డిజైన్‌వేర్‌లు సందడి చేయనున్నాయి. (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
Eka Lakhani: ఇటు ఫ్యాషన్.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీస్‌లో మోస్ట్ వాంటెడ్ తాను!
ఏకా లఖానీ.. డైరెక్టర్స్ కాస్ట్యూమ్ డిజైనర్. స్టార్ బాడీలాంగ్వేజ్‌ని కాదు.. పర్సనాలిటీని బట్టి స్టయిల్ని క్రియేట్ చేసే స్టయిలిస్ట్! అందుకే ఆమె ఇటు ఫ్యాషన్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీస్‌లో మోస్ట్ వాంటెడ్!ఫ్యాషన్ డిజైనర్ కావాలని, సినిమాల్లో పనిచేయాలని ఎప్పుడూ అనుకోలేదు ఏకా లఖానీ. ఇంటర్లో సైన్స్ స్టూడెంట్. మంచి మార్కులతోనే ఇంటర్ పాస్ అయింది. తర్వాత ఏం చేయాలో తెలీలేదు. తనేం చేయగలదో కూడా ఆమెకు ఐడియా లేదు. కానీ ఆ తండ్రికి తెలుసు.. తన కూతురికి మంచి ఈస్తెటిక్ సెన్స్ ఉందని, ఆర్ట్‌లో కానీ.. ఫ్యాషన్ రంగంలో కానీ చక్కగా రాణించగలదని! అందుకే ఆమెను ఆ దిశగా ప్రోత్సహించాడు.ఆ ప్రోత్సాహం ఏకాను తన టాలెంట్‌ని గ్రహించేలా చేసింది. ముంబైలోని ఎస్ఎన్డీటీ (Sreemati Nethabai Damodar Thackersey) విమెన్స్ (women's) యూనివర్సిటీలో చేరింది. అక్కడ డిగ్రీ పూర్తయ్యాక న్యూయార్క్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ కూడా చేసింది. ఆ టైమ్‌లోనే పిలుపు వచ్చింది ప్రముఖ ఫ్యాషన్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ సబ్యసాచీ ముఖర్జీ మణిరత్నం సినిమాకు పని చేస్తున్నాడని.. అతను ఒక అసిస్టెంట్ కోసం చూస్తున్నాడు.. రమ్మని! వచ్చేసింది.. వర్క్ చేసి మణిరత్నంని ఇంప్రెస్ కూడా చేసింది.అది ‘రావణ్’ సినిమా. అక్కడి నుంచి మణిరత్నంతో అసోసియేట్ అవుతూ వస్తోంది మొన్నటి పొన్నియన్ సెల్వన్ వరకు! ‘రావణ్’ చేస్తున్నప్పుడే ఆమె పనితీరు నచ్చి, మెచ్చి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ సంతోష్ శివన్ ఆమెకు తను తీసిన ‘ఊర్మి’కి కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసే చాన్స్ ఇచ్చి ఏకాను మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు.మరి బాలీవుడ్‌కి? ‘నేను చేసిన సౌత్ ఇండియన్ మూవీస్ వర్క్‌తోనే బాలీవుడ్ నన్ను గుర్తించి అక్కడ చాన్సెస్ ఇచ్చింది. అందుకే మణిరత్నం సర్కి సదా కృతజ్ఞురాలిని’ అంటుంది ఏకా లఖానీ. బాలీవుడ్లో ఆమె.. రాజ్‌కుమార్ హిరానీ, కరణ్ జోహర్ లాంటి దర్శకులకు ఆస్థాన కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారింది. ఫ్యాషన్ అండ్ స్టయిల్ అంటే ఈస్తెటిక్స్, ట్రెండ్స్ మాత్రమే కాదు.. కల్చర్, క్లయిమేట్ అండ్ పర్సనాలిటీల పరిశీలన, అవగాహన అండ్ విశ్లేషణ అని ఆమె అభిప్రాయం.అది ఆమె ఆచరణలోనూ కనిపిస్తుంటుంది తన వస్త్రధారణలో అయినా.. సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినా.. సెలబ్రిటీలకు స్టయిల్ని సెట్ చేసినా! ఈ లక్షణమే ‘సంజు’ లాంటి బయోపిక్స్, ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి పీరియాడికల్ డ్రామాస్, ‘షేర్షా’ లాంటి వార్ డ్రామాస్, ‘జుగ్ జుగ్ జియో’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, ‘క్వీన్’ లాంటి వెబ్‌సిరీస్‌కి పనిచేసి ఈరోజు ఆమెను వర్సటైల్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా నిలబెట్టింది. ఆ నైజమే రణ్వీర్ సింగ్, కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్ లాంటి సెలబ్రిటీలకు స్టయిలిస్ట్‌గా ఆపర్చునిటీని తెచ్చిపెట్టింది. ‘ఈ డీటేయిలింగ్ నేర్పింది కూడా మణి సరే’ అంటూ మళ్లీ మణిరత్నంకే క్రెడిట్ ఇస్తుంది ఏకా!డ్రైవింగ్ ఫోర్స్..భిన్న భాషల్లో.. విభిన్నమైన పాత్రలను ఆకళింపు చేసుకుంటూ డిజైన్ చేసే ఆమె కాస్ట్యూమ్స్ యాక్టర్స్‌కి ప్రత్యేక గుర్తింపునే కాదు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ఒరవడినీ సృష్టిస్తున్నాయి. ఆమెనో డ్రైవింగ్ ఫోర్స్‌గా మలస్తున్నాయి. ఏకా లఖానీ అవసరాన్ని అనివార్యం చేస్తున్నాయి. ట్రెండ్స్‌తో ఇన్ప్లుయెన్స్ కాక చేస్తున్న సినిమా స్పిరిట్‌ని గ్రహించి దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్‌ని తయారుచేయాలని మణి సర్ దగ్గర, ఫస్ట్ షాట్‌తోనే ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ ఉండాలని రాజు (రాజ్‌కుమార్ హిరానీ) సర్ దగ్గర, కొత్తగా.. వావ్ అంటూ ఆడియెన్స్ అబ్బురపడే ఫ్యాషన్‌ని చూపించాలని కరణ్ దగ్గర నేర్చుకున్నాను. ఇలా నేను పనిచేసిన ప్రతి డైరెక్టర్, నేను స్టయిల్ చేస్తున్న ప్రతి సెలబ్రిటీ దగ్గర ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ నా పనికి మెరుగులు దిద్దుకుంటున్నాను. ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ పాఠాలకన్నా వర్క్ ద్వారా నేర్చుకుంటున్నదే ఎక్కువ! – ఏకా లఖానీఇవి చదవండి: Nidhi Bhist: మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే..! కానీ ఇప్పుడు నిధి ద బెస్ట్!! -
మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్..
ఇంటి పనులతోనే రోజంతా గడిచిపోతుంటుంది. అభిరుచిని మెరుగుపరుచుకోవాలన్నా సమయమే సరిపోదనిపిస్తుంది. కానీ, కొందరు మాత్రమే ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమతోపాటు మరికొందరికి ఉపాధి అవకాశాలను అందిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు సవిత ఆలంపల్లి. తెలంగాణలోని జహీరాబాద్ వాసి అయిన సవిత కాటన్ ఫ్యాబ్రిక్‌పైన సహజసిద్ధమైన పువ్వులు, ఆకులతో సహజమైన ప్రింట్లను తీసుకువస్తుంది. అదే ఫ్యాబ్రిక్‌ని ఉపయోగిస్తూ మోడ్రన్ డ్రెస్సులను డిజైన్ చేస్తోంది. వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ, బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేసి, సెల్ఫ్ మేడ్ బిజినెస్ ఉమన్‌గా తనని తాను నిరూపించుకుంటుంది. ఆసక్తిని ఉపాధిగా మలుచుకునేందుకు చేసిన ప్రయాణంలో తాను వేసిన అడుగుల గురించి ఆనందంగా వివరించింది.‘‘డిగ్రీ వరకు చదువుకున్న నేను పెళ్లయ్యాక మావారు రామకృష్ణతో కలిసి అమెరికాకు వెళ్లాను. గృహిణిగానే కొన్నాళ్లు ఉండిపోయాను. న్యూయార్క్ ఎఫ్ఐటిలో ఫ్యాషన్ డిజైనింగ్‌కి సంబంధించిన కోర్స్ చేశాను. పదేళ్ల క్రితం ఇండియా వచ్చి బెంగళూరులో స్థిరపడ్డాం. రోజంతా ఇంటిపనులు, పిల్లల పనులు ఉన్నా నా కోసం కొంత సమయాన్ని కేటాయించుకునేదాన్ని.ఫాస్ట్ ఫ్యాషన్‌లో ఉపయోగించే ఫ్యాబ్రిక్ తీవ్రమైన కాలుష్యానికి గురి చేస్తుందని తెలుసుకున్నాను. అప్పటినుంచి నా వంతుగా ఏదైనా చేయాలనుకుని ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. ఫ్లోర్ క్లీనర్స్, సుగంధ ద్రవ్యాలు వంటివి ఇంట్లో తయారు చేస్తుండేదాన్ని. వాటివల్ల ఇంట్లో వాళ్లు కూడా చాలా మెచ్చుకునేవారు. ఎకో ప్రింటింగ్, సస్టెయిన్‌బుల్ ఫ్యాబ్రిక్స్ పైన వర్క్ చేయడం మొదలుపెట్టాను. ప్రకృతి ద్వారా లభించే వస్తువులతో రోజూ ఏదో ఒక ప్రయోగం చేస్తుండేదాన్ని. ఆకులు – పువ్వులు..పూజలు, ఇతర సంప్రదాయ వేడుకలలో పువ్వులు, ఆకులను కూడా ఉపయోగిస్తుంటాం. సాధారణంగా వాటిని ఉడకబెట్టి, టై అండ్ డై చేస్తుంటారు. నేను వాటిని ఎండబెట్టి, కొన్నింటిని తాజాగా ఉన్నప్పుడే ఫ్యాబ్రిక్ మీద చల్లి, దగ్గరగా చుట్టి, కొన్ని రోజులు అలాగే ఉంచి ప్రయోగాలు చేసేదాన్ని. ప్రయత్నాలు చేయగా చేయగా ఫ్యాబ్రిక్‌పైన రకరకాల డిజైన్స్ అమితంగా నన్ను ఆకట్టుకున్నాయి. మోదుగ, శంఖపుష్ప, పారిజాత.. వంటివే కాదు అరుదుగా పూసే పువ్వులనూ సేకరిస్తాను. వాటిని ఎండబెట్టి నిల్వ ఉంచుతాను. మామిడి, జామ, మందార ఆకులనూ డిజైన్‌కు వాడుతుంటాను. ఏ మాత్రం రసాయనాలు లేని ప్రయోగం ఇది.ఇంటి నుంచి స్టూడియో వరకు..రసాయనాలతో పండించే పత్తి కాకుండా వర్షాధార పంటద్వారా వచ్చే కాటన్ ఫ్యాబ్రిక్‌ను కలెక్ట్ చేసి, నా ప్రయత్నాలను ఇంకా విరివిగా చేయడం మొదలుపెట్టాను. సస్టెయిన్‌బుల్ డ్రెస్సులు అంటే చాలావరకు వదులుగా ఉండే దుస్తులు అనుకుంటారు. కానీ, మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్ చేయాలనుకున్నాను.కార్పొరేట్ ఉమెన్‌కు నప్పే విధంగా, అలాగే టీనేజ్ కలెక్షన్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్, ప్రింటింగ్.. డ్రెస్సులు ధరిస్తే ఒంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నామన్న అనుభూతి సొంతం అవుతుంది. ఏడెనిమిదేళ్లుగా సస్టెయినబిలిటీ మీద రకరకాల ప్రయోగాలు చేసి, ఐదేళ్ల క్రితం ‘టింక్టోరియా’ పేరుతో బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేశాను. ఆకులలో ఉండే జీవాన్ని టింక్టోరియా అంటారు.దానిని ఫ్యాబ్రిక్ మీదకు తీసుకురావాలని చేసిన ప్రయత్నం కాబట్టి అదే పేరును నా డిజైన్స్‌కు పెట్టాను. ఇంటినుంచి స్టూడియోదాకా మారేందుకు చేసిన రకరకాల ప్రయోగాల వల్ల ఇప్పుడు నాతోపాటు మరో ఐదుగురు మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాయి. మేమంతా కలిసి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌కు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పని చేస్తుంటాం.అవగాహనకు వర్క్‌షాప్స్..ఎకోప్రింటింగ్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి హైదరాబాద్, బెంగళూరు ఇతర క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్లలో ఉచితంగా వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను. స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాను. అక్కడి వచ్చి, ఆసక్తితో నేర్చుకుంటాను అనేవారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ప్రింటింగ్ ్రపాసెస్ అడుగుతుంటారు. చాలా మందికి ఆకులతోనూ, పువ్వులతోనూ డిజైన్ చేస్తారని తెలియదు. ఈ డిజైన్ ఉతికితే పోతుందేమో అనుకుంటారు. కానీ, సరైన విధంగా చేస్తే రంగు ఏ మాత్రం పోదు.ముందు కుంకుడుకాయ రసంతో ఫ్యాబ్రిక్‌ను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత ఆకులను, పువ్వులను అనుకున్న డిజైన్స్‌లో అమర్చి, దగ్గరగా చుట్టి, ఆవిరిమీద ఉంచుతాం. ఆ తర్వాత బయటకు తీసి, ఒకరోజంతా అలాగే ఉంచుతాం. ఆ తర్వాత పూర్తిగా విప్పి, క్లాత్‌ని శుభ్రం చేస్తాం. సరైన డిజైన్ రావడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. షిబోరి, టై అండ్ డై, కలంకారీ డిజైన్స్‌తోపాటు నేతకారులతో ముందే మాట్లాడి ఫ్యాబ్రిక్ డిజైన్‌లో మోటిఫ్ ప్రింట్స్ వచ్చేలా గైడెన్స్ ఇస్తుంటాను.కొన్ని రకాల ఆకులు, పువ్వుల ప్రింటింగ్‌లో థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. ప్రకృతిపైన ప్రేమ, ఇష్టంతో నన్ను నేను కొత్తగా మార్చుకునే క్రమంలో ఎంచుకున్న మార్గం ఇది. ఇంట్లో వాడాల్సిన కెమికల్స్ స్థానంలో ఏ మాత్రం రసాయనాలు లేని వస్తువులను తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాను. ఈ విధానం వల్ల ఐదారేళ్లలో నాదైన ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను అనిపిస్తుంది’ అని ఆనందంగా వివరిస్తారు సవిత. – నిర్మలారెడ్డిఇవి చదవండి: Devika Manchandani: పాకశాస్త్ర ప్రవీణ! వంటలపై ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే? -
క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి..
నెయిల్ ఆర్ట్ గురించి మనకు తెలిసిందే. ఎన్నో డిజైన్లు మన చూపు తిప్పుకోనివ్వవు. ఆర్టిఫిషియల్ నెయిల్స్ని అతికించి మరీ చూడచక్కని డిజైన్లతో చేసే ఆ అలంకారం వేలి కొసలలో మెరుపులుగా కనువిందు చేస్తుంది. ఇప్పుడు వాటి స్థానాన్ని నెయిల్ జువెలరీ ఆక్రమిస్తోంది. ఫింగర్ క్లారింగ్స్గా ఈ నెయిల్ జ్యువెలరీ ఆధునికమైన టచ్‌తో అందంగా రూపుకడుతుంది. ప్రాచీనకాలంలో రక్షణలో భాగంగా చేరిన ఈ ఆభరణం ఇప్పుడు సొగసైన అలంకార జాబితాలో చేరి ప్రత్యేకతను చాటుతోంది. బంగారు, వెండి, ఇతర లోహాలలోనూ ఈ నెయిల్ జ్యువెలరీ అందుబాటులో ఉంది. సంప్రదాయం, ఆధునికం ఏ వేడుకైనా కొత్తగా వెలిగిపోవాలని కోరుకునే వారికి ఈ నెయిల్ రింగ్స్ సరైన ఎంపిక అవుతాయి. లోహపు డిజైన్లలో ముత్యాలు, రత్నాలు, ఎనామిల్.. వంటివి జతచేసిన డిజైన్ల ఎంపిక మనదైన ప్రత్యేకతను చాటుతుంటుంది. లోహాన్ని బట్టి, డిజైన్‌ను బట్టి ధరలు వందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. చరిత్రలో నెయిల్ జువెలరీ.. ప్రాచీన చైనా, ఈజిప్ట్ రాజులు, రాణుల ఈ నెయిల్ క్లా జ్యువెలరీ విరివిగా ధరించేవారు. పొడవాటి గోర్లు సంపదకు చిహ్నంగా భావించేవారు. వాటి వల్ల శారీర శ్రమæ చేయవలసి అవసరం లేదు. అలా శ్రమ చేయాల్సిన అవసరం లేని వారు, స్థితిమంతులుగా జాబితాలో ఉండేవారు. అంతేకాదు, నెయిల్ గార్డ్‌గా పిలిచే ఈ ఆభరణాన్ని ధరించడం ప్రాచీన చైనీస్ మహిళలు శక్తికి, అందానికి చిహ్నంగా భావించేవారు. నెయిల్ క్లా లేదా గార్డుల తయారీలో సాధారణంగా లోహాలు లేదా సముద్ర తీరాల్లో లభించే ఆల్చిప్పల పెంకులను కూడా ఉపయోగించేవారు. అయితే, ఎక్కువగా బంగారం, వెండి, కాంస్య లేదా పోత పోసిన లోహంతో తయారు చేస్తారు. ముత్యాలు, విలువైన రాళ్లను వాటిలో పొదుగుతారు. వేలిగోళ్ల గార్డు ధరించిన వారి సామాజిక స్థితిని తెలియజేసేది. 3సెం.మీ నుండి దాదాపు 15 సెంటీ మీటర్ల వరకు ఉండేలా డిజైన్ చేయించేవారు. కొన్నిసార్లు చిటికెన వేలు, ఉంగరపు వేలికి సరిపోయేలా డిజైన్ చేయించుకునేవారు. కుడిచేతి, ఎడమ చేతి డిజైన్లు భిన్నంగా ఉండేవి. తమ దేశ సంప్రదాయ ఆభరణాలలో భాగంగా ఉన్నా, రక్షణ కోసం ఉపయోగించేవిగా పేరొందాయి. వారి వారి దేశాల్లోని నాణేలు, జంతువులు, పక్షులు, మొక్కల బొమ్మలను నెయిల్ గార్డ్స్‌పైన డిజైన్ చేయించేవారు. మహారాణి కళ.. జువెలరీ డిజైన్ సృష్టి, ఎంపిక అనేవి మన భావ వ్యక్తీకరణ పట్ల నుండి పుట్టుకు వచ్చిన ఆలోచన. నా డిజైన్స్ ఎక్కువగా బంజారా సంస్కృతికి అద్దం పడతాయి. ఎన్నో ఏళ్లుగా చూసిన వివిధ జాతుల సంస్కృతి, కళలు నా డిజైన్స్‌లో కనిపిస్తాయి. క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ అలంకరణ మహారాణి కళను తీసుకువస్తుంది. – భవ్య రమేష్, జ్యువెలరీ డిజైనర్ -
Shruti Malhotra: ‘ఏదైనా చేయాలి.. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’..
కల ఉన్న చోట కష్టం ఉంటుంది. ‘మరింత కష్టపడతాను’ అంటూ ముందుకువెళ్లాలి. లక్ష్యం ఉన్న చోట సవాలు ఎదురొస్తుంది. సరిౖయెన జవాబు చెప్పి ఆ సవాలును వెనక్కి పంపించాలి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ శృతి మల్హోత్రా. జార్ఖండ్‌లోని రాంచికి చెందిన శృతి ఎన్నో చిన్న బ్రాండ్లను పెద్ద సక్సెస్ చేసింది. సక్సెస్‌కు సరిౖయెన అడ్రస్‌గా పేరు తెచ్చుకుంది. శృతి మల్హోత్రా బాల్యంలోకి వెళితే.. ప్రతిరోజు రాత్రి నలుగురు అక్కాచెల్లెళ్లు వార్తలు వినడానికి రేడియో ముందు కూర్చునేవారు. కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాలను రూల్ నోట్ ΄్యాడ్లో రాసుకునేవారు. మరుసటి రోజు తండ్రితో వాటి గురించి చర్చించేవారు. తండ్రి వాటి గురించి మరిన్ని కొత్త విషయాలు వివరంగా చెప్పేవాడు. శృతి తండ్రి పిల్లలకు తరచుగా చెప్పే మాట.. ‘స్వతంత్రంగా ఉండండి’ ‘పెద్ద కలలు కనడానికి వెనకాడ వద్దు’ ‘ఈ ప్రపంచంలో మీకు అత్యున్నత స్నేహితుడు.. విద్య’ తండ్రి మాటలు అక్షరాలా ఆచరించడం వల్లే పదిమందీ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది శృతి మల్హోత్రా. మిషనరీ స్కూల్ నుంచి దిల్లీ యూనివర్శిటీలో చదువుకోవడం వరకు ‘స్వతంత్రంగా ఉండడం’ అనే లక్షణాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. దీనివల్ల ఆమె చాలామందికి‘రెబెల్’గా కనిపించేది. ‘ఏదైనా చేయాలి. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’ అనే లక్ష్యాన్ని కాలేజీ రోజుల్లోనే నిర్దేశించుకుంది మల్హోత్రా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తయిన తరువాత ఫ్యాషన్ కంపెనీ ‘బెనెటన్’తో ప్రొఫెషనల్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నైకీ, ప్లానెట్ స్పోర్ట్స్‌లో కూడా అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ప్రదర్శించింది. స్థూలంగా చెప్పాలంటే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ జైనింగ్లలో ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. 2007లో ఎథికల్ బ్యూటీబ్రాండ్ ‘ది బాడీ షాప్’లో చేరింది. ఇది తన ప్రయాణ గతిని మార్చేసింది. రిటైల్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్లలో అడుగుడుగునా పురుషాధిక్యత కనిపించే కాలంలో మహిళలు అడుగు వేసి నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ‘వేరే వారి కంటే ఒక మెట్టుకింద ఉండడానికి నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. సవాలుగా తీసుకున్నాను. రెట్టింపు కష్టపడ్డాను’ అంటుంది మల్హోత్రా. ఆ కాలంలో బ్యూటీప్రొడక్ట్స్కు సంబంధించిన రిటైల్ బిజినెస్ ఫార్మసీ, డిపార్ట్మెంటల్ స్టోర్లలో మాత్రమే కనిపించేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జీరో నుంచి ప్రయాణంప్రొరంభించాను’ అంటుంది మల్హోత్రా. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అనే సన్నాయి నొక్కుల నుంచి ‘ఈ రంగంలో పెద్ద పేరున్న మహిళ’ అనే ప్రశంస వరకు శృతి మల్హోత్రా ఎంతో ప్రయాణం చేసింది. ఎన్నో పాఠాలు నేర్చింది. ఎందరికో గుణపాఠాలు చెప్పింది. ‘క్వెస్ట్ రిటైల్’ గ్రూప్ సీయీవోగా ఎంతో పేరు తెచ్చుకుంది. ‘శృతి మల్హోత్రా సీయీవో మాత్రమే కాదు ఎన్నో బ్రాండ్స్‌ను విజయవంతం చేసిన డ్రైవింగ్ ఫోర్స్’ అంటాడు ఫ్యాషన్ కంపెనీ లకొస్టే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీయీవో రాజేష్ జైన్. తన సక్సెస్‌కు కారణం తల్లిదండ్రులు అని చెబుతుంది మల్హోత్రా. చదువు చెప్పించడం నుంచి కలల సాధనలో వెన్నుదన్నుగా నిలవడం వరకు వారి పాత్ర ఎంతో ఉందని చెబుతోంది. ‘వృత్తి జీవితంలో ఎంతోమంది మేల్ కొలీగ్స్‌తో పనిచేశాను. ఎప్పుడూ ఎవరితోటీ సమస్య రాలేదు. పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం లేకపోవడమే అసలు సమస్య. మహిళలకు సమానావకాశాలు కల్పించడం విషయంలో ఎన్నోసార్లు పోరాడాను’ అంటుంది మల్హోత్రా. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది ముఖ్యం’అనేది శృతి మల్హోత్రాకు ఇష్టమైన మాట. ఇవి చదవండి: Sagubadi: మార్కెట్‌ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం.. -
కర్ణికా బుద్ధిరాజా - జషన్ ఘుమాన్ వివాహ వేడుక (ఫోటోలు)
-
చేనేత సాంస్కృతిక వారసత్వం గొప్పది
సాక్షి, యాదాద్రి: మన చేనేత సాంస్కృతిక వారసత్వం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి ముందుకు తీసుకుపోవడంలో చేనేత కళాకారుల సహకారం గొప్పదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. చేనేత రంగంలో గురు, శిష్య సంప్రదాయం ప్రకారం వృత్తి నైపుణ్యాలు తరతరాలుగా అందించడం మంచి సాంప్రదాయమని ప్రశంసించారు. ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త డిజైన్లు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో చేనేత పరిశ్రమకు ఫ్యాషన్ డిజైనర్లు సహకరించాలని కోరారు. ఇందులో శిక్షణ ఒక ముఖ్యమైన అంశమని ఆమె అన్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్పోచంపల్లిని సందర్శించారు. ఇక్కత్ వస్త్రాలు తయారు చేసే చేనేత కళాకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత దేశ వారసత్వంలో ఒక భాగమైన చేనేత వృత్తి గురించి తెలుసుకోవడానికి పోచంపల్లి గ్రామానికి వచ్చి పట్టు చీరలు ఎలా తయారు చేస్తారో చూడడం సంతోషం కలిగిస్తోందని రాష్ట్రపతి చెప్పారు. ఇక్కడి నుంచి తాను ఇంత గొప్ప చేనేత ఇక్కత్ వృత్తి నైపుణ్య జ్ఞానాన్ని తీసుకువెళుతున్నానని అన్నారు. తమ ప్రాంతానికి చెందిన కొందరిని పోచంపల్లికి తీసుకువచ్చి చేనేత వృత్తిని పరిచయం చేయిస్తానని తెలిపారు. యూఎన్‌డబ్ల్యూటీవో (యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) 2021లో పోచంపల్లి గ్రామాన్ని ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ప్రకటించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమానికి చేనేత రంగంలో విశిష్టత కలిగిన అవార్డు గ్రహీతలు వచ్చారంటూ.. చేనేత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతున్న వారిని అభినందించారు. చేనేత రంగం ద్వారా ప్రతిరోజు 35 లక్షల మంది జీవనోపాధి కల్పించుకుంటున్నారని, తెలంగాణాలో నేసిన వ్రస్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని చెప్పారు. పోచంపల్లితో పాటు రాష్ట్రంలోని వరంగల్, సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, పుట్టపాక వస్త్రాలకు జీఐ ట్యాగ్ వచ్చిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు ముగ్గురు చేనేత కళాకారులు కొన్ని ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. అంతకుముందు ఆమె పోచంపల్లిలోని శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కంట్రోల్ యూనిట్‌ను సందర్శించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్‌ను సందర్శించారు. ముడిపట్టు నుంచి పట్టును తీయడం, వ్రస్తాలను తయారు చేయడం లాంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు చరఖాలతో నూలు వడకడాన్ని వీక్షించారు. ప్రత్యేక స్టాళ్లను, ఆచార్య వినోభాబావే ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రపతికి చీరల బహూకరణ చేనేత అవార్డు గ్రహీతలు బోగ సరస్వతి, లోక శ్యామ్‌కుమార్, కూరపాటి వెంకటేశం.. చేనేత రంగంలో తమ వృత్తి నైపుణ్యాలను, ఇబ్బందులను రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా పొట్ట బత్తిని సుగుణ రాష్ట్రపతికి చీరను బహూకరించారు. బోగ సరస్వతి డబుల్ ఇక్కత్ వ్రస్తాన్ని అందజేశారు. వేదికపై రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క.. రాష్ట్రపతికి చీరలను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచనా సాహు, రాష్ట్ర జౌళి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమారెడ్డి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే, రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. స్పృహ తప్పి పడిపోయిన ఏసీపీ భూదాన్ పోచంపల్లి/భువనగిరి క్రైం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్‌పోచంపల్లి పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. హెలీపాడ్ వద్ద విధుల్లో ఉన్న ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన తన పక్కనే ఉన్న ఇంకో అధికారి మీద పడడంతో ఇద్దరూ కింద పడ్డారని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. హెలీకాప్టర్ ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరగడంతో వేరే విధంగా ప్రచారం జరిగిందని వివరణ ఇచ్చారు. హెలీకాప్టర్ ఫ్యాన్ గాలి ఉధృతికి కార్పెట్ పైకి లేవడంతో ఆయన గాయపడినట్టు తొలుత ప్రచారం జరిగింది. కాగా చేతికి గాయమైన ఏసీపీని వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా నూలు డిపో ఏర్పాటు చేయాలి పలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న చేనేత వృత్తికి అండగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15 శాతం నూలు సబ్సిడీని సకాలంలో పొందలేకపోతున్నాం. ఇందుకోసం భూదాన్ పోచంప ల్లిలో నూలు డిపో ఏర్పాటు చేయాలి. తద్వారా వే లాది మంది చేనేతలకు మేలు జరుగుతుంది. డబు ల్ ఇక్కత్, కాటన్, మస్రైస్ వస్త్రాల తయారీ కోసం వందలాది మగ్గాలు నడుస్తాయి. చేనేత కుటుంబాలకు మరింత ఉపా«ధి లభిస్తుంది. – బోగ సరస్వతి సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి పోచంపల్లి కళాకారులకు రంగులు అద్దకం, డిజైన్ల తయారీ, నూతన ప్రక్రియల కోసం శిక్షణ ఇప్పించాలి. చేనేత యువతకు శిక్షణ ఇప్పించడానికి చేనేత సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి. మమ్మల్ని చేనేత కార్మికులుగా కాకుండా చేనేత కళాకారులుగా పిలవాలి. మా వృత్తికి విరమణ లేదు. మాకు అండగా ఉండాలి. – లోక శ్యామ్‌కుమార్ డూప్లికేట్‌ను నియంత్రించాలి టై అండ్ డై చీరలు, వ్రస్తాలను డూప్లికేట్ చేస్తున్నారు. మా వృత్తిని దెబ్బతీసే విధంగా మిల్లుల నుంచి టై అండ్ డై వస్త్రాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో మేము ఉపాధి కోల్పోతున్నాం. ఇక్కత్ బ్రాండ్‌ను కాపాడాలి. చేనేత వృత్తిని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. వస్త్రాల అమ్మకంపై డిస్కౌంట్ ఇవ్వాలి. పోచంపల్లి బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. – కూరపాటి వెంకటేశం -
రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలుసా? గ్లోబల్ సెలబ్రిటీలు ఆమె కస్టమర్లు
సాధించాలన్న పట్టుదల ఉండాలి. వృత్తి పట్ల ప్రేమ,నిబద్ధత ఉండే చాలు..ఎన్నిఅడ్డంకుల్నైనా అధిగమించి విజయ బావుటా ఎగుర వేయొచ్చు. సవాళ్లు ఎన్ని వచ్చినా దారిలో ముళ్లను ఏరి పారేసినట్టు వాటిని అధిగమించి శభాష్ అనిపించు కోవచ్చు. స్ఫూర్తినిచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకున్న అద్భుత మహిళ గురించి తెలుసుకుందాం. కుట్టు మిషన్‌తో ఏం సాధిస్తాంలే అనుకోలేదు. కేవలం రెండే రెండు కుట్టు మిషన్లతో ప్రారంభించి కోట్లకు అధిపతిగా అవతరించిన అనితా డోంగ్రే సక్సెస్ జర్నీ .. తను చేసేపని పట్ల స్పష్టమైన దృక్పథం , అంతకుమించిన నిబద్ధత, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మల్చుకుని తానేంటో అనితా డోంగ్రే నిరూపించుకున్న వైనం స్ఫూర్ది దాయకం. అవమానాల్నికూడా లెక్క చేయకుండా రెండు దశాబ్దాల కృషితో దేశవ్యాప్తంగా 270కి పైగా షాపుల నెట్‌వర్క్‌తో , వందల కోట్ల సంపదతో అనితా డోంగ్రే భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళా ఫ్యాషన్ డిజైనర్‌గా రాణించారు. View this post on Instagram A post shared by Anita Dongre (@anitadongre) అమ్మేప్రేరణ, ఆది గురువు అనితా డోంగ్రే కు ఫ్యాషన్ ప్రపంచ మీద ఆసక్తి ఏర్పడింది తల్లి ద్వారానే. తల్లి ఒక వస్త్ర దుకాణంలో టైలర్‌గా పనిచేసేది.అలాగే తనకు, తన తోబుట్టువులకు తల్లి రూపొందించిన దుస్తులు చూసి ప్రేరణ పొందింది. తల్లిలోని ఇ నైపుణ్యమే అనితను ఫ్యాషన్ డిజైనర్‌గా అద్భుతమైన కెరీర్‌కు పునాదులు వేసింది. అలా 19 ఏళ్ల వయసులో అనితాకు ప్యాషన్ డిజైనర్‌గా అవతరించింది. ఈ క్రమంలోనే వర్కింగ్ విమెన్‌కు అందుబాటు ధరలో దుస్తులను అందించే భారతీయ రీటైల్ కంపెనీ లేదని గుర్తించారు. ఫ్యాషన్ డిజైనర్‌గా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దీనికి బంధువులు, స్నేహితులు నిరుత్సాహపర్చినా, తల్లి మాత్రం వెన్ను తట్టి ప్రోత్సహించింది. అనితా డోంగ్రే సొంత వ్యాపారం 1995లో అనిత ,ఆమె సోదరి కలిసి ఒక చిన్న ఫ్లాట్‌లో పాశ్చాత్య దుస్తులను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో బ్లాండ్లనుంచి గానీ, మాల్స్నుంచి దాకా వీరి ఉత్పత్తులకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు సరికదా ఎద్దేవా చేశారు. కానీ ఆమె మాత్రం నిరాశ పడలేదు. మరింత పట్టుదల పెరిగింది. తన స్వంత కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. AND డిజైన్స్ పేరుతో ప్రారంభించిన బిజినెస్ పెద్దగా సక్సెస్ లేదు. అయినా ఏ మాత్రం తగ్గలేదు. 2015లో ఈ కంపెనీ పేరును హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా మార్చారు. ఇక అంతే అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. తనదైన ప్రత్యేకమైన శైలిలో రూపొందించిన అనిత ఫ్యాషన్ దుస్తులకు విపరీతమైన ప్రజాదరణ లభించింది. రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఘనతకు దక్కిచు కున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతను భారతీయ సాంప్రయదాయం,కళలకు స్టయిల్ జోడించి హైబ్రిడ్ దుస్తులతో తనదైన ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని రూపొందించింది. అలా ఒక చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో రెండు కుట్టు మిషన్లతో ప్రారంభమైం ఇప్పుడు దేశవ్యాప్తంగా 270 అవుట్లెట్లకు విస్తరించింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలోని అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరుగా నిలిచారు అనితా. కంపెనీ విలువ రూ.1400 కోట్లకు పైమాటే. సంపన్న వివాహాల నుండి అంతర్జాతీయ రెడ్ కార్పెట్లగాలాస్ దాకా ప్రతిచోటా మహిళలకోసం అద్భుతమైన సృష్టిని చూడవచ్చు. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్, అంతర్జాతీయ పాప్ గాయని బియాన్స్ నోలెస్ , ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి సెలబ్రిటీలు అనితా డోంగ్రే కస్టమర్లలో ఉన్నారంటే ఆయన క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. AND, గ్లోబల్ దేశీ, గ్రాస్‌రూట్, అనితా డోంగ్రే బ్రాండ్స్‌తో ఆమె వ్యాపారం దూసుకుపోతోంది. వేడుక ఏదైనా సరే.. ఆమె ఫ్యాషన్ స్టయిల్ ఒక ఐకాన్‌గా నిలుస్తుంది. అంతేకాదు ఇటీవల ఆమె పర్యావరణ అనుకూలమైన లాండ్రీ జెల్‌ను లాంచ్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Grassroot by Anita Dongre (@grassrootbyanitadongre) -
టీడీపీ బండారు వ్యాఖ్యలపై శిల్ప రెడ్డి ఫైర్..!
-
అందాల తార శ్రీలీల ధరించిన లంగావోణి ధర తెలిస్తే షాకవ్వుతారు!
శ్రీలీల.. తెలుగు ప్రేక్షకుల మైండ్‌లో రిజిస్టర్ అయిన పేరు.. హార్ట్‌లో ప్రింట్ అయిన రూపు!. మన హద్దుల్లో మనం ఉంటే ఏ ఇబ్బందీ ఉండదు చిత్ర పరిశ్రమ అనేది గౌరవనీయమైన ఇండస్ట్రీనే. హీరోయిన్ అవ్వాలనుకునే తెలుగమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఇదే అని అంటోంది ముద్దగుమ్మ శ్రీలీల. ‘పెళ్లిసందడి’తో తెరంగేట్రం చేసిన ఆమె అటు సినిమాలతో ఇటు తన ఫ్యాషన్ స్టయిల్‌తో అభిమానులను అలరిస్తోంది. శ్రీలీల వార్డ్ రోబ్‌లోని ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఒకట్రెండు ఇక్కడ.. నితికా గుజ్రాల్.. చాలామంది సెలబ్రిటీస్‌కి ఇది ఇష్టమైన బ్రాండ్. ముంబైకి చెందిన నితికా అతి చిన్న వయసులోనే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగింది. అల్లికలు, కుందన్ వర్క్స్‌తో అందమైన డిజైన్స్ రూపొందించడంలో ఆమెది ప్రత్యేక ముద్ర. ఈ డిజైన్స్‌కి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. అయితే వీటి ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. శ్రీలీల ధరించిన నితికా గుజ్రాల్ ధర రూ. 72,500/- మంగత్రాయ్ జ్యూయెల్స్.. అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో మంగత్రాయ్ జ్యూయెల్స్ ఒకటి. 1905లో చంగల్ లాల్ గుప్తా, అతని కుమారుడు దర్పణ్ గుప్తా కలసి ఈ బంగారు అభరణాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సంస్కృతి, సంప్రదాయ డిజైన్స్ తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ప్రతి ఆభరణాన్ని అత్యంత నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు తయారు చేస్తారు. అదే వీరి ప్రత్యేకత. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. --దీపిక కొండి (చదవండి: అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్ ధర ఎంతంటే..?) -
ఎయిర్ ఇండియా ఉద్యోగులకు కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బందికి త్వరలో కొత్త యూనిఫాం రానుంది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ యూనిఫామ్స్‌ను డిజైన్ చేయనున్నారు. 10,000లకుపైగా ఉన్న ఫ్లయిట్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ ఉద్యోగులు 2023 చివరినాటికి నూతన డ్రెస్‌లో దర్శనమీయనున్నారు. ఎయిర్ ఇండియాలో కొనసాగుతున్న ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఇది మరో అడుగు అని సంస్థ తెలిపింది. -
FDCI ICW 2023 Photos: ర్యాంప్‌వాక్‌లో సినీ తారల హోయలు (ఫోటోలు)
-
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ ఫ్యాషన్ డిజైనర్‌గా..
ఫ్యాషన్ డిజైనర్‌కు రెండు కళ్లతో పాటు మూడో కన్ను ఉండాలి. ఆ కన్ను చారిత్రక,సాంస్కృతిక వైభవాన్ని చూడగలగాలి. కాలంతో పాటు నడుస్తూనే ముందు కాలాన్ని చూడగలగాలి. జైపూర్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ హర్ష్ అగర్వాల్‌కు ఈ సామర్థ్యం ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 27 సంవత్సరాల హర్ష్ అగర్వాల్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’తో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు జెండా ఎగరేశాడు.... రెండు సంవత్సరాల క్రితం...ఆరోజు హర్ష్ అగర్వాల్ ఫ్యాషన్ లేబుల్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్‌కు నోటిఫికేషన్ల వరద మొదలైంది. పాపులర్ ఇంగ్లిష్ సింగర్ హారీ స్టైల్స్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’ ధరించి ఉన్న ఫొటోలు అవి. జైపూర్ ఫ్యాషన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతుంది అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ‘ఇలా ఉండాలి. అలా ఉండాలి’ అంటూ చిన్నప్పుడు తన దుస్తులను తానే డిజైన్ చేయించేవాడు హర్ష్. ‘ఎకనామిక్స్ అండ్ బిజినెస్’లో పట్టా పుచ్చుకున్న హర్ష్ వేరే దారిలో ప్రయాణిస్తానని ఊహించలేదు. ‘ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్’ ఇంటర్న్‌షిప్ న్యూయార్క్‌లో చేస్తున్న రోజుల్లో ‘ఫ్యాషన్’ అనే మాట ఎక్కడ వినబడితే తాను అక్కడ ఉండేవాడు. పేరున్న ఫ్యాషన్ డిజైనర్లతో ముచ్చటించేవాడు. ఈ క్రమంలో తనకు సొంతంగా ఏదైనా చేయాలనిపించేది. ఇండియాకు తిరిగివచ్చిన తరువాత...పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి మన చేనేతకళావైభవాన్ని రెండు కళ్లలో పదిలపరుచుకున్నాడు. వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని తల్లి, సోదరితో కలిసి ‘హరగో హ్యాండ్స్’ అనే మెన్స్‌వేర్ లేబుల్‌కు శ్రీకారం చుట్టాడు. ముగ్గురితో మొదలైన ‘హరగో’లో ఇప్పుడు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ టీమ్‌లో టైలర్లు, జూనియర్ డిజైనర్లు, ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. ‘హస్తకళలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకున్నాను. మన దేశానికి తనదైన గొప్ప సాంస్కృతిక, శిల్పకళావైభవం ఉంది. అది చేతివృత్తి కళాకారుల పనిలో ప్రతిఫలిస్తుంది. అలాంటి వారికి సహాయంగా నిలవాలనుకున్నాను’ అంటాడు హర్ష్ అగర్వాల్. ఒక డిజైన్ హిట్ అయిన తరువాత దాని వెంటే పయనించడం అని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లపై వర్క్ చేస్తుంటాడు హర్ష్. ప్రతి రోజు ఒక కొత్త శాంపిల్ రూపొందిస్తాడు. 105 పీస్‌లు రెడీ కాగానే ప్రీ–ఆర్డర్స్ కోసం సోషల్ మీడియా పేజీలలో ప్రకటిస్తాడు. కోవిడ్ కల్లోలం సద్దుమణిగిన తరువాత కొత్త కలెక్షన్ కోసం ఇంటర్నేషనల్ బయర్స్ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. లేబుల్ క్లాతింగ్ రిటైలర్లలో మ్యాచెస్ ష్యాషన్–లండన్, సెసెన్స్(మాంట్రియల్), ఎల్ఎమ్డీఎస్–షాంఘై, బాయ్‌హుడ్–కొరియా...మొదలైనవి ఉన్నాయి. ‘హరగో’కు ఇది టిప్పింగ్ పాయింట్‌గా మారింది. బ్రాండ్ అభిమానుల్లో ఇంగ్లాండ్‌కు చెందిన టెలివిజన్ హోస్ట్, ఫ్యాషన్ డిజైనర్ టాన్ ఫ్రాన్స్ ఉన్నాడు. ‘కొన్ని నెలల క్రితం హర్ష్ బ్రాండ్ గురించి విన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ షో కోసం అతడు డిజైన్ చేసిన దుస్తులు ధరించాను. కొత్తగా, కంఫర్ట్‌గా అనిపించాయి. డిజైనింగ్‌లో హర్ష్‌కు తనదైన నేర్పు ఉంది’ అంటున్నాడు టాన్ ఫ్రాన్స్. హర్ష్ కొత్త కలెక్షన్ డిజైన్ స్కెచ్‌లతో మొదలు కాదు. నేతకళాకారులతో ముచ్చటించిన తరువాత ఒక ఐడియా వస్తుంది. దాన్ని మెరుగులు దిద్దడంపై దృష్టి పెడతాడు. ‘హర్ష్ వర్క్‌లో క్వాలిటీ మాత్రమే కాదు క్లాసిక్ లుక్ కనిపిస్తుంది’ అంటుంది టెక్స్టైల్ ఇనోవేషన్ ప్రాజెక్ట్ ‘అంబ’ ఫౌండర్ హేమ ష్రాఫ్ పటేల్. -
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య.. సూసైడ్‌కి ముందు వీడియో రిలీజ్
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలె ముంబై నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లిన ఆమె గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి సరదాగా భోజనం చేసింది. ఆ మరుసటి రోజు ఉదయం ముస్కాన్ తల్లి వెళ్లి చూడగా ఆమె గదిలో లేదు. ఇళ్లంతా వెతికినా ఎక్కడ కనిపించకపోవడంతో ఇంటి పైనున్న స్టోర్ రూమ్‌కి వెళ్లి చూడగా ముస్కాన్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. చదవండి: నాని30లో హీరోయిన్ శ్రుతి హాసన్.. మరి మృణాల్ సంగతి? దీంతో ఆమెకు కిందికి దింపి ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే ముస్కాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సూసైడ్‌కు కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసిన ముస్కాన్.. ఇదే తన చివరి వీడియో అని చెప్పడం గమనార్హం. 'ఇదే నా లాస్ట్ వీడియో. ఇకపై నేను మీకు కనిపించను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించాను. కానీ రివర్స్‌లో వాళ్లే నన్ను కన్విన్స్ చేసేందుకు చూశారు. నేను చేసే దాంట్లో ఎవరి ప్రమేయం లేదు. దయచేసి ఎవరిని నిందించకండి అంటూ చివర్లో కామెడీతో వీడియోను ముగించింది. చదవండి: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం మీటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. View this post on Instagram A post shared by Muskan Narang (@muskan_narang99) -
పెళ్లికి ముందే విడిపోయిన హీరో.. ఎంగేజ్మెంట్ రద్దు
ఇండస్ట్రీలో ఈమధ్య ప్రేమ-విడాకులు కామన్ అయిపోయాయి. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరికొందరేమో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి కాకుండానే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రేయసికి బ్రేకప్ చెప్పేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఊసరవెల్లి, శక్తి, తుపాకీ సినిమాల్లో నటించిన విద్యుత్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమాండో సీక్వెల్, ఖుదా హాఫీజ్, జంగ్లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన విద్యుత్ కొంతకాలంగా నందితా మహ్తానీ అనే ఫ్యాషన్ డిజైనర్‌తో ప్రేమలో ఉన్నాడు. 2021 సెప్టెంబరులో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారనుకుంటే ఇలా బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చారు. రీసెంట్గా అనన్య కజిన్ పెళ్లికి విడివిడిగా హాజరైన విద్యుత్-నందితా పెడమొహంగా కనిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్రేకప్‌కు సంబంధించిన కొటేషన్స్‌ని షేర్ చేశారు. బీటౌన్ క్యూట్ కపుల్‌గా కనిపించిన ఈ జంట బ్రేకప్ ఫ్యాన్స్‌కు షాకిచ్చినట్లయ్యింది. -
Ruchi Varma: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..
సొంతంగా ఏదైనా సాధించాలనే కల అందరిలోనూ ఉంటుంది. ఆ కల కోసం నిరంతరం శ్రమిస్తేనే అనుకున్న ఫలితాలను అందుకోగలం. కానీ, కుటుంబ బాధ్యతలలో చాలా వరకు కలలు కల్లలుగానే ఉండిపోతాయి. ఉద్యోగం చేస్తున్న రుచివర్మ పరిస్థితి మొదట్లో అలాగే ఉండేది. వ్యాపారం వద్దని అడ్డుకున్న కుటుంబాన్ని మెప్పించింది, కాబోయే తల్లులకు డ్రెస్ డిజైన్స్ పేరుతో రెండున్నర లక్షలతో మొదలు వ్యాపారం మొదలుపెట్టి, రెండేళ్లలో ఏడాదికి 5 కోట్ల టర్నోవర్ చేరుకునేలా కృషి చేసింది. ఉద్యోగం వదులుకున్న పరిస్థితి నుంచి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన తన తపన నేడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ‘‘మాది బీహార్‌లోని దర్భంగా పట్టణం. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న బ్యాంకు ఉద్యోగి, అమ్మ గృహిణి. ముగ్గురు అక్కచెల్లెళ్లం. దర్భంగా నుండి ముంబైకి ఫ్యాషన్ డిజైనర్‌గా నా ప్రయాణం సాగింది. ► అమ్మ కోరుకున్నదని.. ప్రతి తల్లిదండ్రిలాగే మా అమ్మ కూడా మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం ఇంజనీర్లు కావాలని కోరుకునేది. ఆమె కల నెరవేర్చడానికి చాలా ప్రయత్నించాను. కానీ, ఆ కోచింగ్ ఖర్చు భరించడం పెద్ద విషయంగా అనిపించింది. అమ్మనాన్నల గురించి ఆలోచించినప్పుడు నా మనసులో చాలా గందరగోళం ఏర్పడింది. ఇవన్నీ ఆలోచించి నా శక్తి మేరకు ప్రయత్నించి, ఆ కోచింగ్ నుంచి ఆరు నెలల్లో తిరిగి వచ్చేశాను. ► ఫ్యాషన్ పరిశ్రమ వైపు మనసు దర్భంగా భూమి కళలకు ప్రసిద్ధి. మా ఇంటి పక్కన టైలర్‌గా పనిచేసే ఆమె వర్క్ నన్ను బాగా ఆకట్టుకునేది. ఈ విషయం ఇంట్లో చెప్పలేకపోయాను. ధైర్యం తెచ్చుకుని నాకు ఆర్ట్స్ అంటే ఆసక్తి ఉందని, ఇంజినీరింగ్ చదవలేనని నాన్నకు చెప్పాను. నాన్న అంతా గ్రహించి, ఏ చదువు కావాలో దానినే ఎంచుకోమన్నారు. దీంతో నేను నిఫ్ట్‌లో చేరాను. ► ప్రతి నిర్ణయమూ కష్టమే నిఫ్ట్ పరీక్షలో పాసయ్యాక ముంబైకి వెళ్లాలనే నిర్ణయం కష్టమే అయ్యింది. ఒంటరిగానా?! అని భయపడ్డారు. కానీ, కొన్ని రోజుల ప్రయత్నంలో నా ఇష్టమే గెలిచింది. అది నా జీవితాన్ని మార్చింది. కాలేజీ నుంచి వెళ్లి ఓ ఎక్స్పోర్ట్ హౌజ్‌లో జాయిన్ అయ్యాను. అక్కడ మెటర్నిటీ వేర్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. మూడేళ్లపాటు ఆ ఎక్స్పోర్ట్ హౌస్‌లో పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఆఫీసు, ఫ్యాక్టరీ ఒకే చోట ఉండడం వల్ల డిజైనింగ్ కాకుండా ప్రింటింగ్, స్టిచింగ్, శాంపిల్, ప్రొడక్షన్ నేర్చుకున్నాను. ఆ వర్క్ నాకు చాలా ఉపయోగపడింది. ► ఎక్కడో ఏదో లోటు. 2012 లో మొదటి ఉద్యోగం వస్తే 2019 నాటికి, నేను నాలుగు కంపెనీలలో డిజైనర్ నుండి సీనియర్ డిజైనర్ స్థానానికి చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి మాత్రం లభించలేదు. పని పెరుగుతూ వచ్చింది. స్థిర జీతం అలవాటుగా మారింది. కానీ ఎప్పుడూ ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. బాల్యంలో టైలర్ ఆంటీని స్ఫూర్తిగా తీసుకుంటే టెన్త్ క్లాస్ వచ్చేనాటికి ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నా ఆదర్శంగా ఉండేవారు. ‘నేను కూడా నా సొంత బ్రాండ్‌ని ప్రారంభించాలనుండేది. నేను ఉద్యోగం కోసమే ఈ కోర్సు ఎంచుకోలేదు.. ఎలా?’ అనే ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనిచ్చేవి కావు. ► ఇంట్లో వాళ్లు మాట్లాడలేదు... 2019లో ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను. ఉద్యోగం మానేసినట్లు తల్లిదండ్రులు, భర్తకు చెప్పినప్పుడు వారు సంతోషించలేదు. మొదట నా భర్త చాలా నిరాకరించాడు. తరువాత నా తల్లిదండ్రులు కూడా సెటిల్డ్ లైఫ్ ను ఎందుకు వదిలేయాలి అనే మాటలే. ఇంట్లో ఉన్నవాళ్లంతా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వాళ్లే కాబట్టి వాళ్లకు నా బాధ అర్థం కాకుండాపోయింది. నేనే ఓ రోజు నిర్ణయం తీసుకుని ఉద్యోగం వదిలేశాను. ఉద్యోగం మానేసినందుకు నా భర్త కొన్ని రోజులు మాట్లాడలేదు. రీసెర్చ్ వర్క్ చేశాక, వచ్చే 34 నెలల ప్లానింగ్‌ని మా అమ్మనాన్నలకు చెప్పాను, అప్పుడు వాళ్ళు కొద్దిగా కన్విన్స్అయ్యారు. నేను రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. ► చులకనగా మాట్లాడేవారు.. ఈ రంగంలోకి రాకముందే చాలా పరిశోధనలు మొదలుపెట్టాను. మార్కెట్లో ఏ సెక్షన్ కు డిమాండ్ పెరుగుతుందో కనిపించింది. కాబోయే తల్లుల దుస్తుల విషయంలో చాలా లోటు కనిపించింది. ఇంతకు ముందు ఇదే రంగంలో పనిచేశాను కాబట్టి కొంచెం ఆత్మవిశ్వాసం వచ్చి ఈ ప్రొడక్ట్‌ని ఎంచుకున్నాను. అయితే, రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. వన్ మ్యాన్ ఆర్మీలా అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం డిజైనింగ్ వర్క్ మాత్రమే చేశాను. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ లైన్, లోగో డిజైనింగ్, ప్యాకేజింగ్, డెలివరీ ఫైనాన్స్లాంటివన్నీ చేశాను. ఎందుకంటే నా దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ అతిపెద్ద సమస్య ఏర్పడింది. నా అవస్థ చూసి ఎగతాళి చేసినవారున్నారు. చులకనగా మాట్లాడినవారున్నారు. ‘ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్లకు డ్రెస్ డిజైన్స్ ఏంటి?!’ అని నాతో పని చేయడానికి వర్కర్స్ నిరాకరించేవారు. దీంతో పెద్ద ఇబ్బందిని ఎదుర్కొన్నాను. కానీ, నా పట్టుదలను వదిలిపెట్టలేదు. రెండేళ్లలో 2.5 లక్షల వ్యాపారం కోట్లకు కోవిడ్ కాలం అందరికీ కష్టంగా ఉండేది. దీంతో ఆఫ్‌లైన్ పనులు ప్రారంభం కాలేదు. అప్పుడు నా వ్యాపారం ఆఫ్‌లైన్ లో మాత్రమే చేయాలని ఆలోచించాను. ఇది నాకు ప్రయోజనకరంగా మారింది. కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ సైట్స్‌తో మాట్లాడాను. ముందు నా ప్రతిపాదనను వాళ్లు అంగీకరించలేదు. దీంతో నా సొంత సైట్లో ‘ఆరుమి’పేరుతో కాబోయే తల్లుల కోసం చేసిన నా డిజైన్స్ పెట్టాను. ప్రారంభించిన 24 గంటల్లోనే ఆర్డర్లు రావడం మొదలయింది. ఈ రోజు నా బ్రాండ్ అన్ని ఆన్లైన్ మార్కెట్లోనూ సేల్ అవుతోంది’’ అని వివరించే రుచివర్మ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? వధువు ఎవరంటే!
తెలుగు స్టార్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ తనదైన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఒకవైపు పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. ఇదిలా ఉంటే బులితెరపై ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. చదవండి: ఈ స్టార్ యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే! అందుకే తరచూ పెళ్లి రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తుంటాడు ప్రదీప్. తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి వార్తలు తెరపై వచ్చాయి. అయితే గతంలో ఇప్పటికే పలుమార్లు ప్రదీప్ పెళ్లంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ప్రతిసారి ఖండించాడు. కానీ ఈసారి మాత్రం ప్రదీప్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి పేరు, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. నవ్య.. ప్రదీప్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్‌ని, ఆ పరిచయమే స్నేహం, ప్రేమగా మారిందంటున్నారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని, ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంలో ఇరుకుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించి ఇరుకుంటుంబాలు చర్చించుకుంటున్నారట. త్వరలోనే ప్రదీప్ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాడని సన్నిహితవర్గాలంటున్నాయి. అయితే వీరి మతాలు కూడా వేరే అనేది విశ్వసనీయ సమాచారం. మరీ ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ప్రదీప్ నుంచి క్లారిటీ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. నవ్య.. ప్రదీప్‌తో పాటు చాలా మంది సెలబ్రెటీలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుందట. బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) -
వాటిని ఆస్వాదించడంలో హైదరాబాద్ తర్వాతే ఏదైనా: అమిత్ అగర్వాల్
జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై ఆయనో స్టార్.. దేశవ్యాప్తంగా మోడ్రన్ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ట్రెండీ డిజైనర్ అమిత్ అగర్వాల్. నగరం వేదికగా నిర్వహించిన ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొనడానికి ఇటీవల వచ్చిన ఆయన.. గురువారం ‘సాక్షి’తో ముచ్చటించారు. సిటీ అంటే తనకెంతో ఇష్టమని, క్రియేటివిటీ ఉండాలే గాని ఫ్యాషన్ రంగంలో అవకాశాలకు కొదవ లేదని, ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా ఫ్యాషన్ ఔత్సాహికులకు విభిన్నమైన అవకాశాలున్నాయంటున్న అమిత్ ఆలోచనలు. అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి, హైదరాబాద్ ఆస్వాదించడంలో హైదరాబాద్ తర్వాతే.. ►ఫ్యాషన్ అనేది ఒక ప్రాంతానికో, నగరానికో పరిమితమయ్యేది కాదు. సంస్కృతిలో భాగంగా అధునాతన హంగులను ప్రతిబింబిచేది. హైదరాబాద్ వంటి నగరంలో ఫ్యాషన్ ఈ మధ్య వచ్చింది కాదు. ఇక్కడ మొదటి నుంచే అధునాతన జీవన విధానం, ఫ్యాషన్ హంగులకు కేంద్రం. అంతర్జాతీయంగా మారుతున్న మార్పులను ఎప్పటికప్పుడు అవలోకనం చేసుకుంటోంది. కరోనాకు ముందు ఇక్కడ అతిపెద్ద ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నాను. మళ్లీ ఈ మధ్యనే నిర్వహించిన ఫ్యాషన్ షోలో నా డిజైన్స్‌ను ప్రదర్శించాను. ►సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమ, ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా నిర్మాణమవుతున్న సినిమాలు బాలీవుడ్‌కు దీటుగా ఫ్యాషన్ ట్రెండ్లను వాడుకుంటున్నాయి. కొత్త ఐడియాలను ఎప్పటికప్పుడు ఆస్వాదించడంలో నగరం తర్వాతే ఏదైనా. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలను దక్షిణాదిన డబ్ చేసేవారు. ప్రస్తుతం ఇక్కడి సినిమాలు బాలీవుడ్లో రిలీజ్ అవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు, త్రీడీ సినిమాలు అవలీలగా తీసేయడం అభినందనీయం. దక్షిణాదిలో స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి సంస్కృతిని సినిమాల్లో చూపించే విధానం బాగుంటుంది. సౌత్‌లో నిర్మించిన సూపర్ డీలక్స్ చిత్రం నన్నెంతగానో ఆకట్టుకుంది. చదవండి: (హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ) సంస్కృతుల సమ్మేళనమే ‘వైవిధ్యం’.. ►నా జీవితంతో ఫ్యాషన్ విడదీయరాని అనుబంధంగా మారిపోయింది. తక్కువ సమయంలోనే ఫ్యాషన్ నా కెరీర్‌గా నిర్ణయించుకున్నాను. కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి జీవితం సంతృప్తినిచ్చేది ఫ్యాషన్ అనే నమ్ముతాను. డిజైనింగ్‌లో మల్టిఫుల్ కలర్స్ వాడటం ఎంతో ఇష్టం. నా ప్రత్యేకత కూడా. మోల్డింగ్, గ్రిప్పింగ్లో జాగ్రత్తలు తీసుకుంటాను. ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఎవరి ప్రత్యేకత వారిదే. విభిన్నంగా, వినూత్నంగా, సరికొత్తగా డిజైన్లను రూపొందిస్తున్న వారికి అవకాశాలకు కొదవ లేదు. ►కరోనా అనంతరం ఫ్యాషన్ రంగం మరింత అభివృద్ధి చెందింది, అవకాశాలు పెరిగాయి. అధునాతన స్టైల్స్, కలర్ కాంబినేషన్, ఆకట్టుకునే కలర్ మిక్సింగ్ డిజైనర్ భవిష్యత్‌ను నిర్దేషిస్తాయి. ఈ రంగంలో రాణించాలంటే వివిధ ప్రాంతాల సంస్కృతుల సమ్మేళనం, వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో నైపుణ్యం సాధించాలి. అందుకే విభిన్న ప్రాంతాల వేదికలపై అనుభవాన్ని సాధించాలి. అలాంటి వారికి మంచి భవిష్యత్‌తో పాటు అమితమైన ప్రేమ, ఆదరణ లభిస్తుంది. దాని విలువ ఆ స్థాయికి చేరుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. -
చిత్రవిచిత్ర డ్రెస్సులు, ఉర్ఫీ వెనకాల ఉన్నది ఎవరంటే?
అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి లుక్కు మీరిస్తే దడ.. ఆ మీకు దడ.... ఈ పాట ఇప్పుడున్న సెలబ్రిటీలలో ఉర్ఫీ జావెద్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. అవును, ఆమె వేసుకున్న డ్రెస్సులు అలా ఉంటాయి మరి! ఆమె ఫ్యాషన్‌ను మరెవ్వరూ ఫాలో కాలేరు. కొందరు ఆమె డ్రెస్సింగ్ చూసి వారెవ్వా అనుకుంటే మరికొందరికేమో ఇదేం ఫ్యాషన్ అని దడ పుడుతుంది. అది అందమో, అరాచకమో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు జనాలు. వేస్ట్‌లో నుంచి కూడా బెస్ట్ బయటకు తీస్తూ రకరకాల డ్రెస్సులు ట్రై చేసింది ఉర్ఫీ. కాగితాలతో, వైర్లతో, చైన్లతో, అద్దాలతో, గోనె సంచితో ఇలా ఒక్కటేమిటి.. కళ్లకు కనిపించిన దేన్నీ వదిలిపెట్టలేదు. మరి ఇలా ఆమెకు చిత్రవిచిత్ర డ్రెస్సులు డిజైన్ చేసేది ఎవరో తెలుసా? ముంబైకి చెందిన శ్వేత శ్రీవాస్తవ. ఉర్ఫీ బోల్డ్‌గా కనిపిస్తే ఆమె బోల్డ్‌గా మాట్లాడుతుంది. తమ ఆలోచనలను వేసుకునే దుస్తుల ద్వారా వ్యక్తపరుస్తున్నామంటున్నారు. ఏదైనా గాజువస్తువుతో డ్రెస్ చేస్తే ఎలా ఉంటుంది? అని ఉర్ఫీ అడిగితే.. పగిలిన గాజు అద్దంతోనే తయారు చేసేస్తే పోలా అని వత్తాసు పలుకుతుంది శ్వేత. వీళ్లిద్దరి మధ్య 15 ఏళ్ల పరిచయం ఉంది. ఆ చనువుతోనే ఒకరికొకరు కొత్త కొత్త ఐడియాలు చెప్పుకుంటారు. వెంటనే దాన్ని శ్వేత అమల్లోకి తీసుకువస్తే ఆ డ్రెస్ వేసుకుని కెమెరాల ముందుకు వచ్చేస్తుంది ఉర్ఫీ. అలా శ్వేత డిజైన్ చేసిన ఎన్నో డ్రెస్సులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే! వీరి ఫ్యాషన్‌ను మెచ్చుకున్నా, బాలేదని తిట్టిపోసినా అన్నింటినీ ఒకేలా తీసుకున్నారిద్దరూ. ఎవ్వరేమనుకున్నా డోంట్ కేర్ అంటున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) చదవండి: ఆదిరెడ్డి ముఖంపై కాలు పెట్టిన గీతూ విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్లో అశ్లీల వీడియోలు, ఫొటోలు -
చీరపైన బాపూ బొమ్మ
బాపు బొమ్మల అందం గురించి ఎంత వర్ణించినా.. మనవైన చేనేతల ఘనత గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు. ఇక, ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చిన కళా సోయగాలను ఎంత చూసినా తనివి తీరవు. ఆ అందమైన కాంబినేషన్‌ను నారాయణపేట చేనేత చీరల మీదకు వచ్చేలా రూపుకట్టారు హైదరాబాద్ వాసి, ఫ్యాషన్ డిజైనర్ హేమంత్‌సిరి. ఈ కొత్త కాంబినేషన్ గురించి, ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఆమె మాటల్లోనే.. ‘నాలుగేళ్లుగా ప్రతి యేడాది ఆగస్టు నెలలో మన తెలుగురాష్ట్రాల చేనేత కారులతో కలిసి ‘తస్రిక’ పేరుతో ఒక వేడుక నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా గతంలో హ్యాండ్లూమ్స్ని యువత కోసం ఇండోవెస్ట్రన్ డ్రెస్‌లు రూపొందించాను. ఈ క్రమంలోనే నారాయణ పేట చేనేతకారులను కలిసినప్పుడు, వారి డిజైన్స్ చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నారాయణ పేట చీరలు సాధారణంగా ప్లెయిన్లోనే ఉంటాయి. అయితే అందరినీ ఆకర్షించాలంటే వీటిలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు అనిపించింది. దీంతో కిందటేడాది లేపాక్షి డిజైన్స్‌ని నారాయణ పేట్ కాటన్ శారీస్మీదకు తీసుకువచ్చాం. బాపూ స్మరణం ఈ నెలలో బొమ్మల బాపూ వర్ధంతి ఉంది. హ్యాండ్లూమ్ డే కూడా ఈ ఆగస్టు నెలలోనే. బాపూగారిని తలుచుకోగానే మనకు ఆ ముగ్గులు, బొమ్మలు.. మన మదిలో అలా నిలిచిపోతాయి. దీంతో ఈ యేడాది బాపూ బొమ్మలను డిజిటల్ ప్రింట్లుగా నారాయణ పేటæపట్టు చీరల మీదకు తీసుకువచ్చాను. ఆ బొమ్మల రూపును నా డ్రెస్ డిజైన్స్పైకి తీసుకురావాలనే ఆలోచన కొన్నాళ్లుగా ఉంది. కానీ, నారాయణ పేట హ్యాండ్లూమ్స్కైతే మరింత బాగుంటుందని అనుకున్నాను. నారాయణæపేట పట్టు చీరల మీద డిజిటల్ ప్రింట్ల అందం గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకున్నది కూడా దీని వెనక ఉన్న ఉద్దేశ్యం. ఈ బాపూ బొమ్మల కాన్సెప్ట్‌ని ఐఎఎస్ హరిచందన, ఇతర అధికారులు చాలా అభినందించారు. చేనేత కారులకు మార్కెటింగ్ ప్లెయిన్‌గా ఉన్న హ్యాండ్లూమ్స్కి మరిన్ని హంగులు అద్దడం వల్ల ప్రజల్లోకి వీరి చేనేతలు మరింత వేగంగా వెళతాయి. చీరలపై డిజిటల్ ప్రింట్లు సులువుగానూ వేయచ్చు. స్థానికంగా బ్లాక్‌ప్రింట్, డిజిటల్ ప్రింట్ యూనిట్స్‌ని ప్రభుత్వం గానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఏర్పాటు చేయగలిగితే చేనేత కారులకు మరిన్ని అవకాశాలు మెరుగవుతాయి. నారాయణ పేటæ చీరలు అనగానే పెద్దవాళ్లు కట్టుకునేవి అనే అభిప్రాయం ఉండేది. ఆ ఆలోచన మార్చాలనే టీనేజర్స్ కూడా ఇష్టపడేలా పేస్టల్ కలర్స్, మోటిఫ్స్లోనూ మార్పులు తీసుకురావడంపై కృషి జరుగుతోంది. చేనేతకారులకు అవకాశాలు మెరుగవడానికి చేస్తున్న చిరు ప్రయత్నం ఇది’ అని వివరించారు ఈ ఫ్యాషన్ డిజైనర్. – నిర్మలారెడ్డి -
విదిశా టూ విదేశ్.. తొలి భారత ‘మహిళా డిజైనర్’గా ఘనత
భోపాల్: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చేసి చూపించారు ఓ యువతి. రోజుకు రూ.250 సంపాదించేందుకు ఇబ్బందులు పడిన స్థాయి నుంచి దేశం గర్వించే స్థితికి చేరుకున్నారు. తాను ఎంచుకున్న వృత్తినే నమ్ముకుని తన ప్రతిభతో.. విదిశా నుంచి విదేశాలకు భారత కళను తీసుకెళ్లారు. ఆమెనే మధ్యప్రదేశ్‌లోని విదిశా నగరానికి చెందిన వైశాలి షడంగులే. వైశాలి ఎస్ లేబుల్‌తో ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించారు. పారిస్ హాట్ కోచర్ వీక్‌లో తన డిజైన్లను ప్రదర్శించిన తొలి భారతీయురాలిగా నిలిచారు తన విజయంతో భారతీయ వస్త్రాలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్.. వైశాలి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని తన ట్విట్టర్లో షేర్ చేశారు. విదిశా టూ విదేశ్ అంటూ వైశాలిపై ప్రశంసలు కురింపించారు మంత్రి. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పారిస్ హాట్ కోచర్ ఫ్యాషన్ వీక్‌లో తన డిజైన్లను ప్రదర్శించిన తొలి భారతీయురాలిగా నిలిచారని కొనియాడారు. Vaishali from Vidisha to Videsh How her struggle to make Rs 250 led Vaishali Shadangule to become the first Indian female designer to reach the Milan fashion week and Paris Haute Couture Week, putting Indian textiles on global map. pic.twitter.com/CE0P0z3UYi — Piyush Goyal (@PiyushGoyal) July 18, 2022 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు.. 17 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చిన వైశాలి.. హాస్టల్లో ఉంటూ పలు ఉద్యోగాలు చేశారు. ఈ క్రమంలో వస్త్రధారణ ఎలా ఉండాలి, స్టైల్ లుక్ కోసం తన స్నేహితులు, తెలిసినవారికి సూచనలు ఇచ్చేవారు. దీంతో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని కొందరు సూచించారు. కానీ, ఆ పదమే ఆమెకు కొత్త. తన స్నేహితుడి సాయంతో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్కు వెళ్లి వివరాలు సేకరించారు. 2001లో సొంత లేబుల్‌తో మలాద్‌లో చిన్న బొటిక్ తెరిచారు వైశాలి. భారత వస్త్రాలతో ఆధునిక హంగులు జోడించి కొత్త కొత్త డిజైన్లు చేయటంపై దృష్టి సారించారు. విభిన్నమైన వస్త్రాలతో వినియోగదారులను ఆకట్టుకున్న వైశాలి.. మరో రెండు స్టోర్సు తెరిచారు. ఆ తర్వాత తన లేబుల్‌ను వివిధ ఫ్యాషన్ వీక్‌లలో ప్రదర్శించటం ప్రారంభించారు. అదే నా కల.. 2021, జులైలో జరిగిన పారిస్ హాట్ కోచర్ ఫ్యాషన్ వీక్‌లో తన డిజైన్లను తొలిసారి ప్రదర్శించారు వైశాలి. దాంతో భారత వస్త్రాలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారు.‘భారత వస్త్రాలను, డిజైన్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేదే నా కల. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇంటర్నేషనల్ డిజైనర్లను చూస్తాము. వారు మన నైపుణ్యాన్ని, డిజైన్లను ఉపయోగిస్తారు. ఆ డిజైన్లనే మనమెందుకు చేయలేమని ఆలోచిస్తుంటాను.’ అని పేర్కొన్నారు వైశాలి. సోనమ్ కపూర్, కల్కీ కోచ్లిన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు వైశాలి వద్దకు వస్తుంటారు. ఇదీ చదవండి: ఫైటర్ జెట్‌లో ‘బోరిస్’ సెల్ఫీ వీడియో.. నెటిజన్ల పైర్! -
శ్రద్ధా దాస్ చీర, చెవి జుంకాల ఖరీదెంతో తెలుసా?
నాయికా.. ప్రతి నాయికా.. పాత్ర ఏంటి అనేది కాదు.. సినిమాలో ఆ పాత్ర ప్రాధాన్యమెంత అనేదే చూస్తుంది శ్రద్ధా దాస్. అందుకే గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా నటిగా నిలబడింది. ఇన్నేళ్లయినా ఇంకా లైమ్‌లైట్‌లో ఉంది. ఆ పాపులారిటీకి కారణం.. నటన పట్ల ఆమెకున్న ప్యాషన్‌తో పాటు ఆమెను ఫ్యాషనబుల్‌గా చూపిస్తున్న ఈ బ్రాండ్స్ కూడా... జ్యూయెలరీ ఇయర్ రింగ్స్ బ్రాండ్: ది జ్యువెల్ గ్యాలరీ ధర: రూ. 6,600 చీర డిజైనర్: ప్లష్ బై అదితి దేశ్‌పాండే ధర: రూ. 11,000 బ్రాండ్ వాల్యూ: ప్లష్ బై అదితి దేశ్‌పాండే ఫ్యాషన్, సౌకర్యాలను బ్యాలెన్స్ చేసే బ్రాండే ప్లష్ బై అదితి దేశ్‌పాండే. అందుకే ఇది కేవలం అమ్మాయిల ఒంపుసొంపులకు అనుగుణంగా రూపొందించే డిజైన్స్‌కే పరిమితం కాలేదు. ఆధునిక అమ్మాయిల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే దుస్తులను డిజైన్ చేసే సృజనను, కళనూ ఒడిసిపట్టుకుంది. ఆ క్రియేటర్ ఎవరో చెప్పాల్సిన పనిలేదు.. బ్రాండ్ నేమ్‌లోనే ఉంది.. అవును.. ఆమే.. అదితి దేశ్‌పాండే. ఈ డిజైనర్ దుస్తులు ఆన్లైన్లో దొరుకుతాయి. ధరలూ అందుబాటులోనే ఉంటాయి. ది జ్యువెల్ గ్యాలరీ ఇది లండన్, జెనీవా బేస్డ్ జ్యుయెలరీ బ్రాండ్. పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన డిజైన్స్.. దీని ప్రత్యేకత. నాణ్యత, డిజైన్స్‌లో కళాత్మకతే ఈ బ్రాండ్ డిమాండ్‌ను పెంచుతున్నాయి. క్లయింట్స్‌ను క్యూలో నిలబెడుతున్నాయి. సరసమైన ధరలు.. ఆన్లైన్లో అందుబాటు ఈ బ్రాండ్ పట్ల క్రేజ్‌ను పెంచే ఇతర కారణాలు. నేను పుట్టింది, పెరిగింది ముంబైలోనే అయినా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీతో కూడా నా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. అది మా అమ్మమ్మ వాళ్లూరు. రంగురాళ్లకు ప్రసిద్ధి ఆ ఊరు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్లేవాళ్లం. వెళ్లినప్పటి నుంచి తిరిగి ముంబై వచ్చేదాకా ఆ ఊళ్లో మా రంగు రాళ్ల వేట సాగేది. రకరకాల రంగురాళ్లను ఏరుకొచ్చేవాళ్లం. ఆ వేటను లైఫ్‌లో మరచిపోలేను! – శ్రద్ధా దాస్ View this post on Instagram A post shared by @shraddhadas43 చదవండి: తనకన్నా ఆరేళ్లు చిన్నవాడితో ఆరేళ్లు డేటింగ్, పిల్లలు పుట్టాక పెళ్లి రాకెట్రీలో ఆ సీన్ మళ్లీ మళ్లీ చూశానన్న నెటిజన్, హీరో దెబ్బకు ట్వీట్ డిలీట్! -
సక్సెస్ స్టోరీ: జేమ్స్బ్రాండ్
జేమ్స్‌బాండ్ అంటే ఎవరండీ? ‘ఇది రిస్క్ సుమీ’ అని భయపడకుండా దూసుకుపోయేవాడు. పదిరూట్లు కనిపించినా... తనదైన సెపరేట్ రూట్ సృష్టించుకునేవాడు. విజయాలెప్పుడూ తన వెంటపడేలా కనిపించేవాడు. ఈ లక్షణాలు ఉన్న కరణ్‌ను జేమ్స్‌బాండ్ అని పిలుచుకోవచ్చు. అయితే తన పేరునే ‘బ్రాండ్’ చేసుకున్న అతడిని కాస్త సరదాగా జేమ్స్‘బ్రాండ్’ అని పిలుచుకుంటే మరీ బాగుంటుంది... ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ స్కూళ్ళ ముఖం ఎప్పుడూ చూడలేదు కరణ్ తొరాని. అయితేనేం...‘మోస్ట్ ప్రామిసింగ్ ఇండియన్ డిజైనర్’గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. తానే ఒక బ్రాండ్‌గా మారాడు. కరణ్ తొరాని దిల్లీలోని పెరల్ అకాడమీలో ఫ్యాషన్ కోర్స్ చేస్తున్న సమయంలో తండ్రి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. ఫ్యాషన్ డిగ్రీ చేతికి అందగానే ‘ఇలా చేయాలి’ ‘అలా చేయాలి’ అనుకున్న తన కలలకు బ్రేక్ పడింది. చదువు పూర్తయిన తరువాత ఇద్దరు డిజైనర్ల దగ్గర పనిచేశాడు. మనసులో ఉన్న తన కల మాత్రం రోజూ పొద్దుటే హలో చెబుతూనే ఉంది. తన లక్ష్యాన్ని గుర్తు చేస్తూనే ఉంది. దీంతో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లు చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘రిస్క్–టేకర్’ అనే బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు. ఫ్యాషన్ కోర్స్ చేయాలనుకున్నప్పుడు చాలామంది వెనక్కి లాగారు. ‘అది అందరికీ వర్కవుట్ కాదు’ అని నిరుత్సాహ పరిచారు. ‘ఎలాగైనా చేయాల్సిందే’ అని అకాడమీ మెట్లు ఎక్కినప్పుడు ‘రిస్క్–టేకర్’ అనే బిరుదు తగిలించారు. ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ చేయడానికి బయటికి వచ్చినప్పుడు ‘కడుపులో చల్ల కదలకుండా డబ్బు వస్తుంటే ఇప్పుడు ఈ రిస్క్ ఎందుకు!’ అన్నారు. ‘చేయక తప్పదు’ అని మరోసారి అనుకున్నాడు కరణ్. మొదట తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో తాను డిజైన్ చేసిన గార్మెంట్స్ ఇమేజ్‌లను పోస్ట్ చేశాడు. అనూహ్యమైన స్పందన లభించింది. వారాల వ్యవధిలోనే అవి మల్టీ–బ్రాండ్ స్టోర్స్లలోకి వెళ్లాయి. హాట్‌కేకుల్లా అమ్ముడు అయ్యాయి. దీంతో తనలోని ఆత్మవిశ్వాసానికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. బాలీవుడ్ అంటే తనకు వల్లమాలిన ఆసక్తి, అభిమానం. బాలీవుడ్లో స్టార్ ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకోవడానికి కరణ్‌కు ఎంతో కాలం పట్టలేదు. ఫ్యాషన్ ప్రపంచం ‘ఇతడొకడున్నాడు’ అని మన వైపు దృష్టి సారించడానికి, మనలో ‘మనదైన ప్రత్యేకత’ ఉండాలి. మరి కరణ్లోని ప్రత్యేకత గురించి చెప్పడానికి ముందు కాస్త ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... దేశవిభజన సమయంలో కరణ్ పూర్వీకులు పాకిస్థాన్‌లోని సిం«ద్ నుంచి మనదేశానికి వలస వచ్చారు. చిన్నప్పటి నుంచి పూర్వీకుల కథలు వింటూ పెరిగాడు కరణ్. కరణ్ బాల్యం ఎక్కువగా భోపాల్‌లోని అమ్మమ్మ ఇంట్లో గడిచింది. అది ఇల్లు అనడం కంటే మ్యూజియం అంటే బెటర్. ఎందుకంటే ఇంటినలుమూలలలో చిన్న చిన్న దారుశిల్పాలు కనిపించేవి. అమ్మమ్మ వాటిని అంగట్లో కొని తెచ్చేది. రకరకాల చీరలు కనిపించేవి. చందేరి చీర తనను ఎంతో ఇన్స్పైర్ చేసింది. దిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో తండ్రికి ‘సింధి టెంట్‌హౌజ్’ ఉండేది. చిన్నప్పుడు తండ్రితో పాటు ఎన్నో వివాహవేడుకలకు వెళ్లేవాడు. ప్రతి పెళ్లివేడుకకు తనదైన గ్లామర్ గ్రామర్ ఉండేది. ఆ పాఠాలన్నీ తన మదిలో అలా నిలిచిపోయాయి. ఈ జ్ఙాపకాలన్నీ తన సృజనాత్మకతకు పదనుపెట్టాయి. విజువల్ స్టోరీ టెల్లింగ్‌ను తన విజయసూత్రంగా చేశాయి. కరణ్ డిజైన్లలో జ్ఞాపకాలు పలకరిస్తాయి. కథలు చెబుతాయి. మరీ ఎక్కువగా మోడ్రన్‌గా ఉండకుండా, అలా అని తక్కువ కాకుండా గార్మెంట్స్ డిజైన్ చేస్తూ పాతజ్ఞాపకాల కొత్తలోకంలోకి తీసుకెళ్లడంలో చేయి తిరిగిన డిజైనర్ అనిపించుకున్నాడు కరణ్. ‘సైకిల్ ఆఫ్ ఫ్యాషన్’ అనే సూత్రాన్ని గట్టిగా నమ్మాడు. అలనాటి ఫ్యాషన్ ట్రెండ్స్‌ను కొత్త లుక్‌తో తీసుకువచ్చాడు. ఇద్దరు ఉద్యోగులతో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టాడు కరణ్. ఇప్పుడు రెండు వందల మంది ఉద్యోగులు అతడి దగ్గర పనిచేస్తున్నారు! -
రంగురంగుల దుస్తులు.. చినుకులతో కలిసి చిందేయ్యండి
వసంతమాసంలోనే పువ్వుల సింగారం గురించి మాట్లాడుకుంటాం. కానీ, చినుకు సందడి చేసే వర్షాకాలంలోనూ పువ్వుల సందడి ఎంత అందాన్నిస్తుందో మాటల్లో చెప్పలేం.పచ్చని ప్రకృతి చినుకు స్నానం చేస్తుంటే.. పూల సింగారం విహారానికి వస్తే..మబ్బు పట్టిన నింగి నుంచి నేలకు మెరుపు దిగివచ్చినట్టే. మీదైన ముద్ర తెలియాలంటే ఈ కాలం రకరకాల ప్రింట్ల దుస్తులను ఎంపిక చేయండి. రంగురంగులుగా చినుకులతో కలిసి చిందేయ్యండి. రంగుల వర్ణాలు వేడి నుండి చినుకులు ఉపశమనం ఇచ్చేదే ఈ సమయం. కాకపోతే చెత్త రోడ్లు, తడిపాదాలు, ట్రాఫిక్ మనకు రకరకాల పరీక్షలను తీసుకువస్తాయి. కాబట్టి, రుతుపవనాలు మీ స్టైల్‌ను ఎలా తగ్గించబోతున్నాయనే దాని గురించి చింతిస్తున్నట్లయితే ముందుగా, రెయిన్ గేర్ ఎంపిక బెస్ట్ ఎంపిక అంటారు ఇండియన్ డిజైనర్ మసాబా గుప్త. ‘ఈ కాలం ప్రకాశవంతమైన నారింజ, ఎరుపు, పసుపు, గులాబీ, నీలం రంగులు మబ్బుగా ఉండే వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సరైనవి. లైక్రా లేదా పాలిస్టర్ వంటి లైట్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్లను ధరించడం మంచిది. ఎందుకంటే అవి ముడతలు పడకుండానూ, సులభంగా పొడిగా మారడానికి ఉపయోగపడతాయి. బయటకు వెళ్లేటప్పుడు బిగుతుగా ఉండే ఏదైనా బాటమ్‌ను ఎంచుకోండి. కానీ డెనిమ్, కాడ్రాయ్ల నుండి దూరంగా ఉండండి. పలాజోలు కూడా బాటమ్‌గా ఈ కాలం బాగుంటాయి. ►ఈ కాలం లెదర్ చెప్పులు, బ్యాగులకు దూరంగా ఉండండి. బదులుగా, రంగురంగుల బాలేరినా ఫ్లాట్లు, జెల్లీ షూస్, ఫ్లిఫాప్స్, ఫ్లోటర్లు లేదా క్రోక్స్‌ను ఎంచుకోండి. వాటర్‌ప్రూఫ్, టోట్తో చేసిన అధునాతన బ్యాగ్‌లు వాడటం మేలు. ►తేమతో కూడిన వాతావరణం కారణంగా జుట్టు చిట్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి, చక్కని బన్ను లేదా పోనీ టైల్ మంచిది. హాట్ బ్లో డ్రైయింగ్, కర్లింగ్ లేదా స్ట్రెయిటెనింగ్ ఐరన్‌లతో కూడిన హెయిర్స్టైల్స్కు ఈ కాలం దూరంగా ఉండటమే మంచిది. ►మేకప్ విషయానికి వస్తే చాలా తక్కువ చేసుకోవాలి. వాటర్‌ప్రూఫ్ మస్కారాకు బదులు కొద్దిగా పెట్రోలియమ్ జెల్లీతో మీ కనురెప్పలను దిద్దుకోవచ్చు. ముఖం కోసం బ్రౌన్, న్యూడ్ లేదా కాఫీ రంగులో క్లీన్ టోన్లను ఉపయోగించాలి. పీచ్ సూపర్ మ్యాట్ లిప్స్టిక్స్ బాగుంటాయి. ముఖ్యంగా, శుభ్రం చేయడానికి కష్టంగా ఉండే మేకప్‌కు దూరంగా ఉండాలి’ అని తెలియజేస్తున్నారు. కాంతిమంతం ►అబ్స్ట్రాక్ట్ ప్రింట్లు ఉన్న సిల్క్ డ్రెస్సులు, చీరలు ఈ కాలాన్ని మరింత ఉత్తేజితంగా మార్చేస్తాయి. ►చిన్నపాటి గెట్ టుగెదర్ పార్టీలకు ప్రింటెడ్ ఆర్గంజా వంటివి బాగుంటాయి. అయితే, వర్షంలో తడిస్తే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కనుక ఇబ్బందిగా ఉంటుంది. కానీ, డల్‌గా ఉన్న వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చేసే సుగుణం ఈ ప్రింట్లకు ఉంటుంది. ►ఓవర్ కోట్స్, జంప్ సూట్స్ .. సౌకర్యంగా ఉండే ఏ డ్రెస్ అయినా ఏదో ఒక చిన్న ప్రింట్ అయినా ఉన్నవి ఎంచుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు. తేలికైన సిల్క్ ప్రింట్లు ‘వర్షాకాల వివాహాలకు పూల ప్రింట్లు సరైనవి. తేలికగా ఉండే షిమ్మర్ బ్లైజ్, సిల్క్ లెహంగాకు పెద్ద పెద్ద బార్డర్లు లుక్‌కి గ్లామరస్ టచ్‌ని జోడిస్తాయి. అంతేకాదు రంగుల ఎంపికలలో పీచ్, పగడపు రంగులు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి మీదకు చిన్న పొట్లీ వంటి ఆభరణాలు మరింత అందాన్నిస్తాయి’ అంటారు ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి. -
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కారణాలపై విచారణ వేగవంతం
-
హీరోయిన్ సురభి లెహంగా ధర తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే!
‘చలిగాలి చూద్దూ తెగ తుంటరీ.. (జెంటిల్మన్ సినిమా)’ అంటూ యువతను గిలిగింతలు పెట్టిన నటి సురభి పురాణిక్ గుర్తుండే ఉంటుంది.. వరుసగా మూడు సినిమాలు చేసి కాస్త స్లో అయింది. లాక్డౌన్ తర్వాత మళ్లీ బిజీ అయిపోయింది.. కన్నడ, తమిళ సినిమాలతో పాటు తెలుగు తెర మీదా కనిపించబోతోంది. తన యూనిక్ స్టయిల్ కోసం ఈ స్టార్ ఏ బ్రాండ్స్‌ను అనుసరిస్తుందో చూద్దాం.. కీర్తి కదిరె హైదరాబాద్‌కు చెందిన కీర్తి కదిరె సెలబ్రిటీస్‌కు ఫేవరెట్ డిజైనర్. తన పేరు మీదే ఫ్యాషన్ లేబుల్‌ను క్రియేట్ చేసుకుంది. వెడ్డింగ్ కలెక్షన్స్‌కు పెట్టింది పేరు. భారతీయ సంప్రదాయ నేత కళ, ఆధునిక ప్రపంచ పోకడ.. ఈ రెండింటి పర్ఫెక్ట్ మ్యాచ్, మన్నికైన ఫాబ్రికే ఆ బ్రాండ్‌కి వాల్యూ. నాణ్యత, డిజైన్‌ను బట్టే ధరలు. ఆన్లైన్లో లభ్యం. ఫాష్యన్ జ్యూయెలరీ ఇది కూడా హైదరాబాద్‌కు చెందిన బ్రాండే. వ్యవస్థాపకురాలు ఐశ్వర్య. 2017లో ఇన్స్టాగ్రామ్, వాట్సప్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా తన బ్రాండ్ జ్యూయెలరీ సేల్స్‌ను స్టార్ట్ చేసింది. ఇప్పటికీ ఇవే ఆ జ్యూయెలరీ అవుట్ లెట్స్. ఈ అవుట్ లెట్స్లాగే ఈ జ్యూయెలరీ ధరలూ అందుబాటులోనే ఉంటాయి. ఒకరకంగా అదే ఆ బ్రాండ్ వ్యాల్యూ. లెహెంగా సెట్ బ్రాండ్: కీర్తి కదిరె ధర: రూ. 1,28,000 జ్యూయెలరీ: గులాబీ రంగు ముత్యాల సెట్ బ్రాండ్: ఫ్యాషన్ జ్యూయెలరీ వెబ్ సిరీస్ ట్రెండ్ కూడా ఫాలో అవుతున్నాను. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ విషయంలో విజయశాంతే నాకు స్ఫూర్తి. – సురభి పురాణిక్ -
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెల్ల ప్రత్యూష ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒంటరితనం, డిప్రెషన్ కారణంగానే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అత్యంత విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే ఆత్మహత్యపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. సెల్ఫీ వీడియో? ప్రత్యూష తన పరిస్థితిని మొత్తం స్నేహితులకు షేర్ చేసినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేగాక ఓ ప్రముఖ హీరోయిన్‌తో ప్రత్యూష చివరిసారిగా మాట్లాడినట్లు గుర్తించారు. చార్కోల్ గ్రిల్లో కార్బన్ మోనాక్సైడ్ రసాయనాన్ని ఉంచి మంటను రగిలించడం ద్వారా వచ్చే పొగను పీల్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బిల్డింగ్ సెల్లార్‌లోని బెడ్రూమ్లో రెండు గ్రిల్స్‌లో కార్బన్ మోనాక్సైడ్‌ను మండించి సోఫాలో పడుకొని ప్రాణాలు వదిలినట్లు పేర్కొన్నారు. డిప్రెషన్‌తో! ప్రత్యూష నుంచి సుసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘నేను కోరుకున్న జీవితం ఇది కాదు అందుకే వెళ్ళిపోతున్నాను’ అంటూ లేఖలో పేర్కొంది. గత కొంత కాలంగా ప్రత్యూ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్రెషన్ నుంచి బయటకు రాలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రత్యూష నుంచి సుసైడ్ నోట్, పెన్‌డ్రైవ్, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎఫ్ఎస్ఎల్కు శాంపిల్స్‌ను వైద్యులు పంపారు. అపోలో ఆస్పత్రిలో ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. కాగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తన బొటిక్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లిన ఆమె.. శనివారం విగతా జీవిగా కనిపించారు. ఐఆర్ఎస్ కుమార్తె అయిన ప్రత్యూష ఫ్యాషన్ డిజైనర్ రంగంలో రాణిస్తున్నారు. దేశంలో 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఆమె ఒకరు. దాదాపు టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేశారామో. -
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల మృతిపై మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది హీరోయిన్లకు డిజైనర్‌గా వ్యవహరించిన ప్రత్యూష శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె సినీ సెలబ్రెటీలు హీరోయిన్లు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన కూడా తన స్నేహితురాలైన ప్రత్యూష మృతికి నివాళులు అర్పించారు. చదవండి: నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు: కమల్ హాసన్ ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘మై బెస్టీ మై డియరెస్ట్ ఫ్రెండ్. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తన మరణం నన్ను చాలా బాధిస్తోంది. ప్రతి విషయంలో ఎంతో ది బెస్ట్‌గా ఉండేది. ఇక కెరీర్, ఫ్యామిలీ, స్నేహితులు విషయంలోనూ ఉన్నత నిర్ణయాలు తీసుకునేది. అలా అన్ని విషయాల్లో ది బెస్ట్‌గా ఉండే ఆమె కూడా డిప్రెషన్‌కు గురైంది. ఈ సంఘటన తర్వాత కర్మ అనేది మన జీవితకాలం గుండా పయనిస్తుందనేది నిజమనిపిస్తుంది. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఉపాసన భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కాగా ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యూష తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎంతోమంది హీరోహీరోయిన్లకు, సెలబ్రిటీలకు ప్రత్యూష కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. టాలీవుడ్లో శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాదాస్, కాజల్, కీర్తి సురేశ్, కృతి కర్బందా, ఉపాసన, ప్రగ్యా జైస్వాల్, రానా, రామ్ చరణ్‌లకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోయిన్లకు సైతం ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. దీపికా పదుకొనె, పరిణితి చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మాధురి దీక్షిత్, విద్యాబాలన్‌కు కూడా వర్క్ చేశారు. ఆమె డిజైన్ చేసిన డ్రెస్సులను కూడా చాలా మంది సెలబ్రెటీలు ఎండార్స్ కూడా చేశారు. My bestie my dearest friend. Gone too soon - Upset/ Pissed / Sad She had the best of everything, career, friends & family - yet succumbed to depression. Post this incident, truly believe that karmic baggage passes through lifetimes. We pray for her peace. 🙏#rip P pic.twitter.com/1aOXixKh85 — Upasana Konidela (@upasanakonidela) June 11, 2022 -
ప్రత్యూష గరిమెళ్ల రూమ్ లో సూసైడ్ నోట్.. ఏం రాసిందంటే..??
-
Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య
-
Purva Jindal: ఫ్యాషన్ డిజైనర్ నుంచి రైతుగా.. రోజుకు 7 వేలు సంపాదిస్తూ!
‘‘జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలని అనుకుంటే చిన్నపాటి రిస్క్ చేయక తప్పదు. ధైర్యంగా ముందడుగు వేసినప్పుడే అనుకున్నది సాధించగలం’’ అంటోంది పూర్వ జిందాల్. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన పూర్వ.. బీడు భూమిని పంటపొలంగా మార్చి సేంద్రియ కూరగాయలు పండిస్తోంది. తను లక్షలు సంపాదిస్తూ మరికొంత మందికి ఉద్యోగాలిచ్చి ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. రాజస్థాన్‌కు చెందిన పూర్వ జిందాల్ కుటుంబం ఏళ్లుగా వస్త్ర వ్యాపారం రంగంలో రాణిస్తోంది. కుటుంబ నేపథ్యం టెక్స్టైల్స్ బిజినెస్ కావడంతో తండ్రి ఎన్కే జిందాల్ ప్రోత్సాహంతో ముంబైలో ఫ్యాషన్ డిజైనింగ్ లో ఎమ్బీఏ చదివింది. చదువు పూర్తయ్యాక కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో చురుగ్గా పొల్గొనేది. కొన్నాళ్ల తరువాత పూర్వకు కొత్తగా ఏదైనా చేయలన్న ఆలోచన వచ్చింది. ఇదే సమయంలో ఇంట్లో రెండు మూడు కూరగాయ మొక్కల్ని పెంచుతుండేది. పెరట్లో పెరిగిన కూరగాయలతో వండిన కూర చాలా రుచిగా ఉండడం గమనించింది. కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం అవసరమని వైద్యులు చెప్పడంతో..సేంద్రియ పంటలను ఆహారంగా చేర్చుకున్నప్పుడే మంచి ఇమ్యూనిటీ లభిస్తుంది అని గ్రహించింది. ఈ రెండు సంఘటనలతో దుస్తుల డిజైనింగ్‌ను వదిలేసి సేంద్రియ పంటలు పండించాలని నిర్ణయించుకుంది. కానీ కుటుంబంలో ఎవరికీ వ్యవసాయంపై అవగాహన లేదు. తన సర్కిల్లో వ్యవసాయం చేసిన అనుభవం ఉన్నవారు కూడా లేరు. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా సేంద్రియ పంటలు ఎలా పండించాలి? అనేదానికి సంబంధించిన సమాచారం వెతకడం ప్రారంభించింది. అనుభవం ఉన్న రైతులు, వ్యవసాయ రంగ నిపుణుల వద్ద నుంచి సేంద్రియ పంటల గురించిన సమాచారం తెలుసుకుని సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకుంది. తరువాత రాజస్థాన్‌లోని ఔజిరా గ్రామంలో కొంత భూమిని ఐదేళ్ల కాలపరిమితితో కౌలుకు తీసుకుంది. రాళ్లూరప్పలతో నిండిన బంజరు భూమి కావడంతో.. సంప్రదాయ పద్ధతుల్లో శుభ్రం చేసి ఆవుపేడ, సేంద్రియ కంపోస్టును వేసి పంట పొలంగా మార్చింది. దీనిలో బఠాణీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టొమాటో, బంగాళ దుంపలు, శనగలు, చెర్రీలు, ఆకుకూరలను పండించడం ప్రారంభించింది. సేంద్రియ ఎరువులు కావడంతో పంటలన్నీ చీడపీడలు లేకుండా ఏపుగా పెరిగాయి. బాగా పండాయి కూడా. అలా పండిన కూరగాయలన్నింటిని దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మార్కెట్‌కు తరలించి తానే విక్రయిస్తూ రోజుకి ఆరు నుంచి ఏడువేల రూపాయలను ఆర్జిస్తోంది. తన దగ్గర పనిచేసే ఏడుగురు సిబ్బందికి నెలవారి జీతాలు, మిగతా వారికి రోజువారి కూలికి నాలుగు వందల రూపాయల చొప్పున ఇస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఆరోగ్యం అవగాహన.. కుటుంబంలో వ్యవసాయం చేసే తొలి వ్యక్తి తానే కావడంతో పంటలు పండించడంపై అవగాహన వచ్చేంత వరకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది పూర్వ. సాధారణ కూరగాయలకంటే సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు ధర ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడే కాకుండా భవిష్యత్‌లోనూ సేంద్రియ పంటలకు మంచి డిమాండ్ ఉంటుందని భావించి తన పంటలను ‘సాఖి ఆర్గానిక్’ పేరిట విస్తరించింది. వాట్సాప్ ఆర్డర్లను స్వీకరించి నేరుగా కస్టమర్ల ఇంటికే కూరగాయలను డెలివరీ చేస్తోంది. పూర్వ పంటల గురించి తెలిసిన వారంతా ఆమె వద్ద కూరగాయలు కొనడానికి ఆసక్తి కనబరుస్తుండడంతో విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. ఈ ప్రోత్సాహంతో ‘ఆగ్రో టూరిజం’పైన అవగాహన కల్పిస్తోంది. గ్రామాలకు దూరంగా నగరాల్లో నివసించేవారిని నెలలో రెండు రోజులు తన పొలానికి ఆహ్వానించి సేంద్రియ వ్యవసాయం గురించి వివరిస్తోంది. ఇలా వచ్చిన వారికి సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు ఎలా పండిస్తున్నారు, ఈ కూరగాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో వివరిస్తూ వారిలో ఆసక్తి కల్పిస్తోంది. విభిన్న ఆలోచనలకు ధైర్యం తోడైతే సాధించలేనిదంటూ ఏది లేదనడానికి పూర్వ జిందాల్ సేంద్రియ వ్యవసాయమే తార్కాణం. చదవండి: Dragon Fruit: ఒక్కసారి మొక్క నాటితే 20-30 ఏళ్లు పంట.. ఎకరాకు 14 లక్షల ఆదాయం! -
చిట్టి మెదళ్లకు చెట్టు పాఠాలు
చల్లని గాలి కావాలంటే ఏసీ ఉంటే చాలు కదా అనుకుంటారు పిల్లలు. మంచి నీళ్లు కావాలంటే ఫ్రిజ్‌లోంచి వస్తాయి కదా అనుకుంటారు. పండ్లు కావాలంటే మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు కదా అంటారు. పాలు ప్యాకెట్ల నుంచే వస్తాయని అనుకునే రేపటి తరం ‘పర్యావరణం’ అనే పెద్ద పదం గురించి అర్థం చేసుకోవాలంటే వారి బుర్రలకు మొక్కను పరిచయం చేయాల్సిందే! ‘అయితే అందుకు, ఇంట్లో పెద్దలే పూనుకోవాలి’ అంటారు హైదరాబాద్ మణికొండలో ఉంటున్న సోదరీమణులు రాజశ్రీ, నవ్యశ్రీ. చదువుకుంటూ, సొంతంగా ఫ్యాషన్ డిజైనర్స్గా రాణిస్తున్న ఈ అక్కాచెల్లెళ్లు ఈ వేసవిలో ఓ కొత్త ఆలోచన చేశారు. ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ చేసి, చుట్టుపక్కల పిల్లలకు ఇస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. అదే ఆచరణలో పెట్టారు. పిల్లలను ఆకట్టుకునేలా ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ చేయడం మొదలుపెట్టారు. ‘కాస్త ఫ్రీ టైమ్ కేటాయించుకునే చేస్తున్నాం. కానీ, ఒక టాయ్ పూర్తవడానికి వారం రోజులైనా పడుతుంది’ అంటున్నారు. గ్యాడ్జెట్స్‌కు కాస్త దూరంగా! ఎండ అని పిల్లలు ఎక్కువ శాతం ఇంటి పట్టునే ఉంటున్నారు. స్కూళ్ళు లేకపోవడంతో కాస్త పెద్ద పిల్లలు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్ స్క్రీన్లకు తమ కళ్లను అప్పజెప్పేసి వీడియోగేమ్స్‌తో కుదురుగా కూర్చుంటున్నారు. ‘గ్యాడ్జెట్స్‌తో ఉండే పిల్లలకు పర్యావరణం గురించి క్లాసు తీసుకుమంటామంటే వింటారా. మనమే ఇప్పుడు అమ్మో, ఏం ఎండలు.. వేడికి తట్టుకోలేకపోతున్నాం..’, ‘చల్లని గాలి అన్నదే కరువైంది. అన్నీ బిల్డింగ్లే... చెట్లు ఎక్కడ ఉన్నాయి’ అంటూ అల్లాడిపోతున్నాం. మరి పిల్లలకు వాతావరణం గురించి అర్థమయ్యేదెలా..?’ అనిపించింది. మా సొంత ఊరు వరంగల్‌కి వెళ్లినప్పుడు ఈ భావన మరింత బలపడింది. పట్టణాలలో ఉన్న పిల్లలకు చెట్ల గురించి, వాటి పెంపకం గురించి తక్కువ తెలుసు అని. వీటిని కొంతవరకైనా అర్థమయ్యేలా ఆసక్తికరంగా చెప్పడం కోసం ఏం చెయ్యాలా అని ఆలోచించాను’ అని వివరిస్తుంది నవ్యశ్రీ. బొమ్మలతో వివరణ.. ‘పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. కానీ, వాటిలోనూ హానికారకమైనవే ఉన్నాయి. నర్సరీ పిల్లల బుర్రల్లోకి మంచి ఆలోచనలు వచ్చేవిధంగా, అలాగే వారి శరీరానికి, ఆరోగ్యానికి ఏ మాత్రం హాని చేయని బొమ్మలైతే బాగుంటుందనిపించింది. ఈ విషయంగా శోధిస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ ప్లాంట్స్ బొమ్మల ఐడియా బాగా నచ్చింది’ అంటూ తాము ఎంచుకున్న పర్యావరణ కాన్సెప్ట్‌ను తెలియజేసింది రాజశ్రీ. కొబ్బరి చిప్పలు, వెదురు కొమ్మలు, మట్టి కుండలలో చిన్న చిన్న మొక్కల పెంపకం తెలిసిందే. ఐదేళ్ల లోపు పిల్లల శరీరానికి, మనసుకు హత్తుకునేలా చెప్పగలిగేదే ప్లాంటేషన్. అది ఎప్పుడూ ముచ్చటైనదే. ఫ్యాబ్రిక్‌తో మేకింగ్.. ‘టెడ్డీబేర్ క్లాత్‌ను ఉపయోగించి, బొమ్మ ఆకారం వచ్చేలా చేశాను. అందులో కొంత కోకోపిట్ నింపి, తల భాగంలో హెయిర్ ఎలా అయితే ఉంటుంది, అలా గోధుమ గడ్డి పెరిగేలా ఏర్పాటు చేశాను. అక్క వాటికి కళ్లూ, ముక్కు.. వంటివి పెట్టి ఆర్టిస్టిక్‌గా తయారుచేసింది. బొమ్మ తలభాగంలో పైన కొన్ని నీళ్లు చల్లుతూ ఉంటే వారం రోజుల్లో మొలకలు ఏపుగా పెరిగాయి. అప్పుడు మా చుట్టుపక్కల పిల్లలను పిలిచి, చూపించాం. ఎంత ఆనందించారో మాటల్లో చెప్పలేం. రోజంతా ఈ ప్లాంట్ బొమ్మలతోనే గడిపాశారు. ఆ సమయంలో వాతావరణం గురించి, చెట్ల గురించి ఎన్నో విషయాలు మాట్లాడాం. తరవాత వాటిని వారికే ఇచ్చేశాం. వరి, ఇతర చిరుధాన్యాలతోనూ ఇలాంటి బొమ్మలను సిద్ధం చేశాం. వీలున్నప్పుడల్లా చేస్తున్నాం. పాత క్లాత్స్తో తయారు చేసిన ప్లాంట్ టాయ్స్‌ని పిల్లలచేతే తయారుచేయించవచ్చు. ఇందుకు ఈ వేసవి సమయం మరింత అనువైది’’ అని తమ ప్రయత్నం గురించి వివరించింది నవ్యశ్రీ. ఆడుకున్నా మేలే.. పిల్లలకు ఈ బొమ్మలు ఏ మాత్రం హానిచేయవు. పొరపాటున నోట్లో పెట్టుకున్నా ఏ హానీ కలగదు. పైగా గోధుమగడ్డి వంటివి ఆరోగ్యానికి మంచివే. వారి ముందే బొమ్మల హెయిర్(గడ్డి) కత్తిరించి జ్యూస్ చేసి, ఇవ్వచ్చు. పిల్లలు ఈ విధానాన్ని బాగా ఆనందిస్తారు. ఈ ప్లాంట్స్‌తో మొక్కలను ఎలా పెంచవచ్చు, చెట్లు వాతావరణానికి, ఆరోగ్యానికి చేసే మేలేమిటి.. వంటివన్నీ చెప్పవచ్చు. దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు’ కూడా అని వివరిస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. రేపటì పర్యావరణ సమతుల్యతకు ఈ రోజే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అందుకు, పిల్లల్లో మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఎలా పెంచవచ్చో ఇంటి నుంచే మొదలుపెట్టవచ్చు. వాతావరణ కాలుష్యానికి కారకమయ్యే ప్రతీ విషయాన్ని వివరించి, మనం జాగ్రత్తపడటంతో పాటు రేపటితరాన్నీ అప్రమత్తం చేయచ్చు. – నిర్మలారెడ్డి -
Fashion: పలాజో, స్కర్ట్స్, ఓవర్‌కోట్స్, లాంగ్గౌన్స్.. రితు ప్రత్యేకత అదే!
Fashion: వేసవిలో ఎక్కువగా వినిపించే పదం కాటన్. వేడిని తట్టుకొని, మేనికి హాయినిచ్చే సుగుణం ఉన్న ఫ్యాబ్రిక్. సింపుల్‌గా ఉండే కాటన్ని పార్టీవేర్‌గా మార్చుకోలేం. అనుకునేవారికి రితుబెరి కాటన్ కలెక్షన్ సరైన సమాధానం. లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్‌గా పేరొందిన రితుబెరి ఇక్కత్, ఖాదీలతో చేసిన రంగుల హంగామా చూడాల్సిందే! సంప్రదాయ డిజైన్స్లోనే ఆధునికతను చూపడం ఈ డిజైనర్ ప్రత్యేకత. పలాజో, స్కర్ట్స్, ఓవర్‌కోట్స్, లాంగ్గౌన్స్కి రెండు మూడు రంగుల హంగులు అమర్చి చేసే మ్యాజిక్ చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. చేనేతలతో ఎన్ని హంగుల అమరికతో వినూత్నమైన డిజైన్స్ తీసుకురావచ్చో రితుబెరి కలెక్షన్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. క్రింకిల్డ్ ఖాదీ స్కర్ట్స్, ట్రౌజర్స్, ఎంబ్రాయిడీ చేసిన జాకెట్స్, లాంగ్ గౌన్స్.. కాంబినేషన్స్ చూపులను ఇట్టే కట్టిపడేస్తాయి. ఇకత్ రూపాలు ఇన్నన్ని కావు అని కళ్లకు కడతాయి. ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతాయి. విదేశాలలోనూ మన దేశీయ డిజైన్స్ ప్రత్యేకతను చాటే ఈ డిజైనర్ ఢిల్లీ వాసి. భారతదేశంలోని ఫ్యాషన్ పరిశ్రమలో సృజనాత్మకత, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి లాభాపేక్షలేని ‘ది లగ్జరీ లీగ్’ని ప్రారంభించింది. -రితుబెరి, ఫ్యాషన్ డిజైనర్ చదవండి👉🏾Aparna Balamurali: ఈ హీరోయిన్ కట్టిన చీర ధర 95 వేలు.. స్పెషాలిటీ ఏమిటంటే! చదవండి👉🏾Wedding Season Fashion: లెహంగా ఒక్కటే కాదు.. పెళ్లిలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే! -
అరవిరిసిన సోయగం... కళ్లు చెదిరే అందగత్తెలు (ఫొటోలు)
-
Summer Collection: రెక్కలు తొడిగిన ప్రింట్లు
వేసవి వేడిని తట్టుకోవడానికి మన డ్రెస్సింగ్‌లో చాలా మార్పులను కోరుకుంటాం. లైట్ వెయిట్‌తో ఉండాలి. లేత రంగులు ఉండాలి. ఆకట్టుకునే హంగులూ ఉండాలి. ఇవన్నీ కోరుకునే యువత నచ్చేలా.. వారి మనసుకు నచ్చేలా సంప్రదాయ చేనేతలతో ఆధునికత ఉట్టిపడేలా డిజైన్ చేయచ్చు. ‘ఆ ఆలోచన నుంచే రూపుదిద్దుకున్న డిజైనర్ కలెక్షన్ ఇది అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరి. కాలానుగుణంగానే కాదు మారుతున్న నవతరం ఆలోచనలకు తగినట్టుగా డిజైన్స్ మీద దృష్టి పెడతానని వివరించే హేమంత్ సిరి ఇటీవల తను తీసుకువచ్చిన సమ్మర్ కలెక్షన్ గురించి చెబుతూ.. తూనీగ... తూనీగ... ‘‘వేసవి ఆహ్లాద సమయాల్లో మనల్ని చుట్టుముట్టే అందమైన జ్ఞాపకాలలో తేలికైన రెక్కలతో సందడిచేసే తూనీగ ఒకటి. సుతిమెత్త్తని చేనేత మల్ చందేరీ ఫ్యాబ్రిక్ కూడా అలాంటి ఆహ్లాదాన్నే పంచుతుంది. దీనికితోడు తూనీగ రెక్కల్లో ఉండే ముచ్చటైన ట్రాన్స్పరెంట్గా ఉండే లేత రంగులు కూడా ఆకట్టుకుంటాయి. దీని నుంచి స్ఫూర్తి పొంది, మల్చందేరీ ఫ్యాబ్రిక్ మీద వాటర్ కలర్స్‌తో ఆర్టిస్టులు రూపొందించిన పెయింటింగ్స్‌ను డిజిటల్ ప్రింట్లుగా తీసుకొస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చేసిన ఆలోచన నుంచి పుట్టుకొచ్చినదే ఈ ‘డ్రాగన్ ఫ్లై కలెక్షన్’. నవతరం ఇష్టపడేలా హుడీ ప్యాటర్న్స్, జిపర్ ప్యాటర్న్స్, లాంగ్ అండ్ షార్ట్ ఫ్రాక్స్, టాప్స్, కంఫర్టబుల్ కట్స్‌తో డిజైన్ చేసినవి. మొదటిసారి ఈ ప్రత్యేకమైన ప్రింట్స్‌తో తీసుకొచ్చిన కలెక్షన్ ఇది’’ అని వివరించారు ఈ సీజనల్ డిజైనర్. -హేమంత్ సిరి, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
పెళ్లి వేడుకలు.. ఘనమైన అలంకారాలతో.. ప్రాచీన కళకు కొత్త హంగులు
సంప్రదాయ వేడుకల్లో తెలుగింటి వేషధారణకే అగ్రతాంబూలం ఉంటుంది. అయితే, రాచకళ తీసుకు రావాలన్నా, మరిన్ని హంగులు అమరాలన్నా ప్రాచీనకాలం నాటి డిజైన్స్‌కే పెద్ద పీట వేస్తున్నారు నేటి డిజైనర్లు. ‘నవతరం కోరుకుంటున్న హంగులను కూడా సంప్రదాయ డ్రెస్సులకు తీసుకువస్తున్నాం’ అని చెబుతున్నారు వెడ్డింగ్ డ్రెస్ డిజైనర్ భార్గవి అమిరినేని. కాబోయే పెళ్లికూతుళ్లు కోరుకుంటున్న డ్రెస్ డిజైన్స్ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు.. ‘కలంకారీ ప్రింట్స్, బెనారస్, కంచి పట్టులను సంప్రదాయ డిజైన్స్‌కు వాడుతుంటారు. అయితే, నవతరం మాత్రం వీటితోనే ఆధునికపు హంగులను కోరుకుంటున్నారు. ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్‌తోనే వెస్ట్రన్ కట్ కోరుకుంటున్నారు. నెక్, హ్యాండ్ డిజైన్స్ విషయంలోనే కాదు తమ ‘ప్రేమకథ’కు కొత్త భాష్యం చెప్పేలా ఉండాలని పెళ్లి కూతుళ్లు కోరుకుంటున్నారు. అందుకే వివాహ వేడుకలకు మరింత కొత్త హంగులు వచ్చి చేరుతున్నాయి. రంగుల కాంబినేషన్లు మాత్రం వేడుకను బట్టి మారిపోతున్నాయి. వీటిలో పేస్టల్ నుంచి గాఢమైన రంగుల వరకు ఉంటున్నాయి. డబుల్ లేయర్ దుపట్టాలు, లేయర్డ్ స్కర్ట్, టాప్స్.. కూడా వీటిలో ఎక్కువ ఉంటున్నాయి’ అని వివరించారు. వివాహ వేడుకలకు సిద్ధమవ్వాలంటే ఘనమైన అలంకారాలతో గొప్పగా సింగారించాలనుకుంటారు. అందుకు తగినట్టే నేటి వేడుకలకు తరతరాలుగా వస్తున్న ప్రాచీన కళకు కొత్త హంగులను అద్దుతున్నారు. మహారాణి దర్పం పెళ్లి కూతురు వేషధారణలో కంచి పట్టుచీర తప్పక ఉంటుంది. దీనికి కాంబినేషన్ బ్లౌజ్‌తోపాటు కుడివైపున వేసుకునే దుపట్టా కూడా ఓ హంగుగా అమరింది. దుపట్టాను బ్లౌజ్‌కు సరైన కాంబినేషన్ సెట్ అయ్యేలా మెజెంటా కలర్‌ను ఎంచుకొని, గ్రాండ్‌గా మగ్గం వర్క్‌తో మెరిపించడంతో లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. కాస్ట్యూమ్తోపాటు ఆభరణాలు కూడా పాతకాలం నాటివి ఎంపిక చేయడంతో రాయల్ లుక్ వచ్చేసింది. ఈ గెటప్‌కి వడ్డాణం లేదా వెయిస్ట్ బెల్ట్ యాడ్ చేసుకోవచ్చు. దుపట్టాను అవసరం అనుకుంటే వాడచ్చు. లేదంటే, ఎప్పటికీ గుర్తుగా కూడా ఉంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ బ్రోచ్లు కూడా అలంకరణలో వచ్చి చేరుతున్నాయి. కాన్సెప్ట్ బ్లౌజ్ పెళ్లికూతురు డ్రెస్ అనగానే అందరికన్నా ప్రత్యేకంగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది. దీంట్లో భాగంగా పెళ్లికూతురు ధరించే బ్లౌజ్పైన అమ్మాయికి అబ్బాయి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టుగా, అలాగే వారి పేర్లూ వచ్చేలా డిజైన్ చేయడంతో గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఆభరణాల్లో ఉండే పచ్చలు, కెంపులు బ్లౌజ్ డిజైన్లలోనూ వాడుతున్నారు. ఈ బీడ్స్ ధరించే ఆభరణాలకు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటున్నారు. పెద్దంచు మెరుపు సంప్రదాయ లుక్ ఎప్పుడూ అందానికి సిసలైన నిర్వచనంలా ఉంటుంది. పెద్ద అంచు లెహంగా మీదకు ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, దుపట్టా జత చేస్తే చాలు వేడుకలో ఎక్కడ ఉన్నా అందంగా కనిపిస్తారు. అయితే, హాఫ్ శారీ అనగానే గతంలో దుపట్టాలను ఓణీలా చుట్టేసేవారు. ఇప్పుడు ఒకే వైపున వేసుకోవడం కూడా ఫ్యాషన్‌లో ఉంది. డిజైన్స్లోనే కాదు అలంకారంలోనూ వచ్చిన మార్పు మరింత మెరుపునిస్తుంది. కలంకారికి మిర్రర్ ప్రాచీనకాలం నుంచి వచ్చిన మనవైన కళల్లో కలంకారీ ఒకటి. ఇప్పుడు ఈ ఆర్ట్‌పీస్ మరింత ఘనంగా సందడి చేస్తోంది. కలంకారీ క్రాప్టాప్కు మిర్రర్‌తో హ్యాండ్స్, నెక్‌లైన్‌ను డిజైన్ చేయడం ఈ డ్రెస్ స్పెషల్. బ్రొకేడ్ లెహెంగా మీదకు ఈ కలంకారీ బ్లౌజ్ జత చేయడంతో మరింత గొప్పగా అమరింది. – నిర్మలారెడ్డి -
ఖరీదైన ఇల్లు కొన్న ప్రముఖ డిజైనర్, ధర ఎంతంటే..
Manish Malhotra Buys 21 Crore Worth Appartment In Mumbai Bandra: ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హొత్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయినర్స్ సహా పలువురు సెలబ్రిటీలకు అదిరిపోయే దుస్తులు డిజైన్ చేస్తుంటారాయన. బీటౌన్‌లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హొత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే అనేంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బీటౌన్ ఫ్యాషన్ కలల ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ కాస్ట్యూమ్ డిజైనర్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ముంబైలో భారీ మొత్తానికి మనీష్ మల్హొత్ర ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. బాంద్రా వెస్ట్‌లోని భోజ్వనీ ఎన్‌క్లేవ్‌లో సుమారు రూ. 21 కోట్లు పెట్టి కాస్ట్లీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు బీటౌన్ వర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. -
ఆ బ్రాండ్ మీద మోజు పడ్డ హీరోయిన్, ఈ డ్రెస్ ధర లక్ష పైచిలుకే!
మాళవిక మోహనన్ చేసింది రెండు సినిమాలే.. అయినా ప్రేక్షకులకు ఆమె అంటే క్రేజ్ ఓ రేంజ్లో. ఆమెకూ ఓ క్రేజ్.. ఇదిగో ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ పట్ల... కరిష్మా జూల్రీ కరిష్మా మెహ్రా.. పిట్ట కొంచెం కూత ఘనం లాంటి అమ్మాయి. ఇరవై ఏళ్ల వయసుకే సొంతంగా బంగారు ఆభరణాల దుకాణం ప్రారంభించడమే కాదు.. అనతి కాలంలోనే ఆ దుకాణాన్ని ప్రముఖ జ్యూయెలరీ బ్రాండ్‌గా తీర్చిదిద్దింది. ఆ బ్రాండ్ పేరే ‘కరిష్మా జూల్రీ’. ఇక్కడ హాల్‌మార్క్ వెండి, బంగారు ఆభరణాలు లభిస్తాయి. ఈ మధ్యనే తను డిజైన్ చేసిన ట్రావెల్, వెడ్డింగ్ కలెక్షన్స్‌కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామందికి ఈ జూల్రీ జ్యూయెలరీ ఒక ఫేవరెట్ బ్రాండ్. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. కరణ్ తోరానీ న్యూఢిల్లీకి చెందిన కరణ్ తోరానీ.. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో అమ్మమ్మ దగ్గరే గడిపేవాడు. చుట్టూ చేనేత కళతో ఆ ప్రాంతం ఎప్పుడూ అందమైన వస్త్ర ప్రపంచంలా కరణ్‌కు కనిపించేది. ఆ ప్రేరణ తో బాల్యంలోనే పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్నాడు. ఆ లక్ష్యంతోనే న్యూఢిల్లీలో ‘తోరానీస్’ పేరుతో ఒక బొటిక్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే తోరానీ డిజైన్స్ పాపులరై మంచి గుర్తింపు పొందాయి. చాలామంది సెలబ్రిటీస్ కరణ్‌తో ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయించుకుంటారు. ఈ దుస్తుల ధర డిజైన్‌ను బట్టే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. డ్రెస్ డిజైనర్ : కరణ్ తోరానీ ధర: రూ. 1,62,000 జ్యూయెలరీ బ్రాండ్: కరిష్మా జూల్రీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. దుస్తులపై పెద్దగా దృష్టి పెట్టను. కానీ, అందరమ్మాయిల్లాగే నాకూ జ్యూయెలరీ అంటే ఇష్టం. ముఖ్యంగా బోల్డ్ ఇయరింగ్స్ నా ఫేవరెట్. – మాళవిక మోహనన్ -
ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు: డీజే టిల్లు హీరోయిన్
‘మెహబూబా’తో ప్రేక్షకులను తన ప్రేమలో పడేసింది నేహా శెట్టి. ఆమె కూడా లవ్‌లో పడింది... ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో! దీప్తి.. హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ దీప్తి పోతినేని.. 1980ల నాటి ఫ్యాషన్‌ను పునః సృష్టించడంలో సిద్ధహస్తురాలు. అప్పటి పట్టు, ప్యూర్ ఆర్గాంజా, టిష్యూ, కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించే యూనిక్ డిజైనర్ చీరలు దీప్తిని ఎయిటీస్ స్పెషలిస్ట్ డిజైనర్‌గా నిలబెట్టాయి. ఎక్కువగా సంప్రదాయ ఎంబ్రయిడరీనే వాడుతుంటుంది. ఈ మధ్యనే తన పేరు మీదే హైదరాబాద్‌లో ఓ ఫ్యాషన్ హౌస్‌నూ ప్రారంభించింది. డిజైన్‌ను బట్టే ఉంటాయి ధరలు.. వేల నుంచి లక్షల్లో. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. చీర డిజైనర్: దీప్తి ధర: రూ. 38,800 కిషన్‌దాస్ జ్యూయెలర్స్ ఎత్నిక్ అండ్ యాంటిక్ జ్యూయెలరీని రూపొందించడం కిషన్‌దాస్ జ్యూయెలర్స్ ప్రత్యేకత. సుమారు 145 ఏళ్ల కిందట హరికిషన్‌దాస్, అతని కుమారుడు కిషన్‌దాస్.. నిజాం రాజకుటుంబీకులకు ఆస్థాన ఆభరణాల డిజైనర్స్గా పనిచేసేవారట. ఆ వారసత్వాన్నే వారి తర్వాతి తరం వారు అందిపుచ్చుకుని ‘కిషన్‌దాస్ జ్యూయెలర్స్’ పేరుతో బంగారు నగల వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుతం వారి నాలుగోతరం వారసులు నితిన్, ప్రశాంత్‌లు దీనిని కొనసాగిస్తున్నారు. బంగారం, వెండి, యాంటిక్ రత్నాలు, ముత్యాలు, అరుదైన రాళ్లతో రూపొందించే ఈ ఆభరణాలకు క్రేజే కాదు ధర కూడా ఎక్కువే. ఈ నగలు ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి. జ్యూయెలరీ బ్రాండ్: కిషన్‌దాస్ జ్యూయెలర్స్ ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. ‘చిన్నప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్‌లు వేసుకుంటూ మురిసిపోయేదాన్ని. ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు. ఇక మోడలింగ్ చేసే టైమ్‌లో ఫ్యాషన్‌పై అవగాహన పెరిగింది. అందుకే చాలా వరకు నా స్టైలింగ్ మొత్తం నేనే చూసుకుంటా’ – నేహా శెట్టి. -దీపికా కొండి -
ఆలియా వేసుకున్న డ్రెస్ ధర సుమారు లక్షల్లోనే!
బాలీవుడ్ క్యూట్ బ్యూటీ, ఆర్ఆర్ఆర్ సీత అలియా భట్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్లో అలియా యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఆలియా భట్.. పేరునే పరిచయంగా, ప్రతిభనే ఉనికిగా మార్చుకున్న నటి. ఫ్యాషన్‌లోనూ అంతే ప్రత్యేకతను చాటుతోంది... ఈ బ్రాండ్స్‌తో! మాధుర్య క్రియేషన్స్... పేరుకు తగ్గట్టే చక్కటి ఆభరణాలను డిజైన్ చేస్తుందీ సంస్థ. బెంగళూరుకు చెందిన భానుమతి నరసింహన్ స్థాపించిన ‘గిఫ్ట్ ఎ చైల్డ్’ స్వచ్ఛంద సంస్థ కోసం ఈ మాధుర్య క్రియేషన్స్ పనిచేస్తుంది. 2007లో ప్రారంభించిన ఈ సంస్థ, మొదట కేవలం ఆభరణాలనే అందించే వారు. ప్రస్తుతం ఆభరణాలతో పాటు ట్రెడిషనల్ డిజైన్స్‌లో చీరలు, గృహ అలంకరణ సామాగ్రి కూడా ఇక్కడ లభిస్తున్నాయి. ఎక్కువగా హస్తకళలకు ప్రాధాన్యం ఇస్తారు. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. పాయల్ ఖండ్వాలా.. టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో పాయల్ ఖండ్వాలా ఒకటి. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్‌తో లభించే ఈ డిజైన్స్‌కు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. 2012లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ పాయల్ తన పేరు మీదే ‘పాయల్ ఖండ్వాలా’ పేరుతో మొదలుపెట్టిన ఈ ఫ్యాషన్ బ్రాండ్ అంటే ప్రతి ఒక్కరికీ క్రేజే. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. సందర్భానికి తగ్గట్టు స్పెషల్‌గా దుస్తులను డిజైన్ చేయించుకునే వీలు కూడా ఉంటుందిక్కడ. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. పాయల్ ఖండ్వాలా బ్రాండ్ డ్రెస్ ధరలు కుర్తా- రూ. 47,500 పలాజో- రూ. 64,500 దుపట్టా- రూ. 17,500 మాధురి క్రియేషన్స్ బ్రాండ్ జ్యూయెలరీ ధర- రూ. 9,400 'చాలామంది ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రింజ్ ట్రెండ్ అంటే ఇష్టపడతారు కానీ, నాకెందుకో ఆ స్టయిల్ డిజైన్స్ పెద్దగా నచ్చవు. అది తప్ప మిగితా ఫ్యాషన్ ట్రెండ్స్ అన్నింటినీ నేను ఫాలో అవుతా.' అని అలియా తెలిపింది. -
జంతు చర్మాలు ఒలిచి అలంకారం.. ఇదిగో సమాధానం!
‘జంతు చర్మాలు ఒలిచి మనకెందుకు అలంకారం?!’ అంటున్న నవసమాజానికి ‘వీగన్ ఫ్యాషన్’ సమాధానంగా వచ్చేసింది. దీనిలో భాగంగా జంతువుల చర్మంతో కాకుండా మొక్కలు, పండ్ల నుంచి తీసిన గుజ్జుతో బ్యాగ్స్, షూస్, వాలెట్స్, బెల్ట్స్.. తయారు చేస్తున్నారు. డ్రెస్సులను రూపొందిస్తున్నారు. ఈ యేడాది సరికొత్త నిర్ణయంతో వీగన్ వైపు దృష్టి మరల్చి మన ముందుకు వచ్చిన సరికొత్త ఫ్యాషన్ ఇది.. సాధారణంగా జంతుజాలాన్ని చంపి, వాటి చర్మంతో తయారుచేసిన బ్యాగులు, షూస్, బెల్ట్‌ల రూపేనా మార్కెట్లో విరివిగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు హక్కుల కార్యకర్తలు ఈ విధానం పట్ల ఏ మాత్రం సంతోషంగా లేరు. హింస ఒక్కటే కాదు, తోలు యాక్ససరీస్ ఉత్పత్తుల తయారీలో వెలువడే హానికారకాలు పర్యావరణానికి హాని చేస్తాయని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కనుకోవాల్సిందే అనే వాదనలూ పెరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచ దృష్టి వీగన్వైపు మళ్లింది. గ్రేప్ లెదర్ స్నికర్స్ తోలు ఉత్పత్తులతో కాకుండా పర్యావరణానికి హానికరం కాని వ్యర్థాల నుండి తయారుచేసిన లెదర్‌తో రూపొందించిన షూస్. ద్రాక్ష నుంచి, వైన్ వ్యర్థాల నుంచి తయారుచేసిన లెదర్‌తో శాకాహారి స్నికర్స్ను తయారుచేసింది పంగైయా కంపెనీ. కిందేటాడాది నైక్ పినాటెక్స్తో కలిసి పైనాపిల్ నుంచి రూపొందించిన లెదర్‌తో ఎయిర్మ్యాక్స్ స్నికర్స్ను తయారుచేసింది. వ్యర్థాలతో రీసైకిల్ స్నికర్స్ బ్రాండ్ ‘వెజా’ ప్లాస్టిక్ సీసాలను రీ సైకిల్ చేసి, మొక్కొజొన్న ఫైబర్‌తోనూ షూస్ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. (చదవండి: ఎలాన్ మెచ్చిన మన ఎల్లుస్వామి) ఖరీదులోనూ ఘనమైనవే! క్రాస్ బాడీ బ్యాగ్, ట్రావెల్ ఆర్గనైజర్లు, బ్యాక్‌ప్యాక్‌లను వీగన్ ప్రియుల కోసం మూన్ రాబిట్ అందిస్తోంది. ఏ మాత్రం జంతుహింస లేని ఈ బ్యాగుల తయారీ తెలిసినవారు వీటిని సొంతం చేసుకుంటున్నారు. వెజిటబుల్ లెదర్‌తో తయారుచేసిన యాక్ససరీస్ ఖరీదులోనూ ఘనంగానే ఉన్నాయి. వేల రూపాయల్లో ఖరీదు చేసే ఈ వస్తువుల తయారీలో రానున్న రోజుల్లో వచ్చే మార్పులతో అందరికీ అందుబాటులో ఉండనున్నాయి. (హలో గురూ.. జర జాగ్రత్త! అంతా తెలుసు అని కొట్టిపడేయొద్దు.. చిట్కాలివిగో..) ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రాండ్లు అమెరికన్ సోషలైట్ కిమ్ కర్దాషియన్ నుంచి మన బాలీవుడ్ తార దీపికా పదుకొనె వరకు పెటా ఆమోదించిన ‘ఔట్‌హౌజ్’ వీగన్ అలంకార ఉత్పత్తులను వాడుతున్నారు. కంపెనీ డిజైనర్ సాషా గ్రేవాల్ ‘డిజైనర్లుగా మనం ట్రెండ్‌ను సెట్ చేస్తున్నప్పుడు, పర్యావరణం పట్ల స్పృహతో కూడా ఉండాలి. మొదటి ఉత్పత్తి సమయంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ జంతు ఆధారిత ఉత్పత్తులను వాడకూడద’నుకున్న నిర్ణయాన్ని వివరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండెడ్ కంపెనీలన్నీ ఇప్పుడు వీగన్స్ కోసం సరికొత్తగా ఫ్యాషన్వేర్ను తయారుచేస్తున్నాయి. (Health Tips: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే..) గ్లోబల్ ఫౌండేషన్స్ ‘లెయిడ్’ ఫౌండేషన్ సృష్టికర్త డిజైనర్స్టెల్లా మెక్కార్ట్నీ ‘నో–లెదర్, నో–ఫర్’ ప్రతిజ్ఞతో ప్రారంభించి ఈ పని ద్వారా అన్ని వర్గాలకూ చేరవవుతున్నారు. ‘మీ వార్డ్‌రోబ్‌లో మరిన్ని శాకాహార ఉత్పత్తులను చేర్చడానికి మేం అన్నివేళలా పనిచేస్తాం’ అంటున్నారు ప్రపంచ ఫ్యాషన్ డిజైనర్లు. (వయ్యారి భామా.. నీ హంస నడకా! ఇండియన్ సిల్క్ క్వీన్ విజేతలు వీరే!) -
హీరోయిన్ శ్రియ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?
తెలుగు ప్రేక్షకులు ‘ఇష్టం’గా ఆదరించిన హీరోయిన్ శ్రియా శరన్. ఆమె ఇష్టంగా ధరించే బ్రాండ్ అవుట్ ఫిట్స్ ఏంటో చూద్దాం ఇక్కడ... ఆనంద్ కబ్రా డిజైనర్ ఆనంద్ కబ్రాకు చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ అంటే ప్యాషన్. 1997లో లండన్ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాడు. తర్వాత ఇండియా వచ్చి, 2001లో తన పేరు మీదే ముంబైలో ‘ఆనంద్ కబ్రా లేబుల్’ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించాడు. ఇప్పడది సెలబ్రిటీస్ ఫేవరెట్‌గా స్థిరపడిపోయింది. 2006లో హైదరబాద్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌కు తను అందించిన ‘07 కలెక్షన్స్’ మంచి ప్రాచుర్యం పొందాయి. సందర్భానికి తగ్గట్టు దుస్తులను డిజైన్ చేయటంలో ఆనంద్‌కు పెట్టింది పేరు. అందుకే, ఎంతోమంది సెలబ్రిటీలు, తమ రెడ్ కార్పెట్ డ్రెస్‌లను ఆనంద్ కబ్రాతో స్పెషల్‌గా డిజైన్ చేయించుకుంటుంటారు. అయితే, దుస్తుల ధరలు డిజైన్‌ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైన్ వేర్ అందుబాటులో ఉంది. ‘ఖరీదైన దుస్తులు, ఆభరణాలు అందాన్ని పెంచుతాయి. కానీ నిజమైన అందం అంటే ఆరోగ్యమే. మీరు మీలా ఉంటూ.. సరైన జీవన శైలి, ఆహారపుటలవాట్లు పాటిస్తే అందరూ అందంగా కనిపిస్తారు’ – శ్రియా శరన్. శ్రియ కట్టుకున్న చీర డిజైనర్: ఆనంద్ కబ్రా ధర: రూ. 44,000 - దీపిక కొండి -
అనామికా ఖన్నాతో రిలయన్స్ బ్రాండ్స్ జట్టు
న్యూఢిల్లీ: రిలయన్స్ బ్రాండ్స్ (ఆర్బీఎల్) తాజాగా దేశీ ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నాతో చేతులు కలిపింది. ఏకే–ఓకే ఫ్యాషన్ బ్రాండ్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. ఈ జాయింట్ వెంచర్లో ఆర్‌బీఎల్‌కు 60 శాతం అనామికా ఖన్నాకు 40 శాతం వాటాలు ఉంటాయి. ఏకే–ఓకే బ్రాండ్ క్రియేటివ్ డైరెక్టరుగా అనామిక కొనసాగుతారు. 2007లో ఆర్బీఎల్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం అర్మానీ ఎక్సే్చంజ్, బ్రూక్స్ బ్రదర్స్, బర్బరీ, కెనాలీ, డీజిల్ తదితర బ్రాండ్స్‌తో భాగస్వామ్యాలు ఉన్నాయి. దేశీయంగా ఫ్యాషన్ దిగ్గజాలు మనీష్ మల్హోత్రా, రాఘవేంద్ర రాథోడ్ బ్రాండ్స్‌లో కూడా పెట్టుబడులు ఉన్నాయి. 680 స్టోర్లు, 916 షాప్–ఇన్–షాప్స్ ద్వారా విక్రయాలు సాగిస్తోంది. -
ఆమాత్రం దానికి దుస్తులు ఎందుకు వేసుకున్నావ్?.. నెటిజన్ల ఫైర్
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు ట్రోలింగ్‌కు గురవడం సర్వసాధారణమైపోయింది. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఉర్ఫీ జావెద్ సైతం ట్రోలింగ్ బారిన పడింది. లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులతో సందడి చేసే ఈ బిగ్‌బాస్ భామ ఓ కొత్తరకం డ్రెస్సుతో దర్శనమిచ్చింది. ఓపెన్‌కట్ టాప్, పొట్టి స్కర్ట్‌తో బోల్డ్‌గా దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ డిజైనర్ డ్రెస్‌లో ఆమె అందాల ఆరబోతకు అడ్డు లేకుండా పోయింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఉర్ఫీని ఆడేసుకుంటున్నారు. అసలు ఏ బట్టలు వేసుకోవాలనుకున్నావ్..అని ఒకరు ప్రశ్నించగా ‘ఆ మాత్రం దుస్తులు కూడా ఎందుకు వేసుకున్నావ్..’ అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి బట్టలు వేసుకోవడానికి కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉర్ఫీకి ఈ ట్రోలింగ్ కొత్తేమీ కాదు. ప్రియాంక చోప్రా పోనీటైల్ హెయిర్ స్టైల్‌ను కాపీ చేసిందంటూ ఆమెను ట్రోల్ చేశారు. జడ అల్లుకోవడం కూడా కాపీయే అంటే ఈ సమాజం తలదించుకోవాలంటూ ట్రోలింగ్‌కు ఘాటు రిప్లై ఇచ్చింది ఉర్ఫీ జావెద్. చదవండి: అలాంటి అమ్మాయి దొరకాలంటే రాసిపెట్టుండాలి: సన్నీ -
‘ది లెగసీ ఆఫ్ ఇండియన్ వీవ్’ప్రదర్శనకి అతిథిగా ప్రణీత!
ప్రముఖ డిజైనర్ దీప్తి గణేష్ ఆధ్వర్యంలో మద్రాస్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్‌లో 'ది లెగసీ ఆఫ్ ఇండియన్ వీవ్' పేరుతో రూపొందించిన డిజైనర్ దుస్తులను ప్రదర్శన ఈ నెల 26న చెన్నైలో నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో అత్తారింటికి దారేది సినిమా ఫేం ప్రణీత ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా, సరికొత్తదనాన్ని జోడించి రూపొందించిన విభిన్న రీతులతో కూడిన డిజైన్లను షోస్టాపర్‌గా నిలిచి మిగిలిన మోడల్స్‌తో కలిసి ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో దీప్తి గణేష్ మాట్లాడుతూ.. ‘సంప్రదాయ చేనేత కార్మికులు చేతితో రూపొందించిన వాటిని నా డిజైన్లకు ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నాను. వాటికి క్లాసిక్ లుక్స్ తీసుకొచ్చి నేటి తరానికి, కొత్తదనానికి స్వాగతం పలుకుతూ రూపొందిస్తున్నాను. నేటి యువత ఆలోచనలకు అనుగుణంగా నా డిజైన్లు ప్రతిబింబిస్తాయి. మారుతున్న కాలానికి, అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేయడం వల్లనే విజయాన్ని సాధించే వీలుంటుంది’అన్నారు. దీప్తి గణేష్ విషయానికొస్తే.. ఆమె ఒక ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్. సినీ నటులు తమన్నా, రాశి ఖన్నా, సుమ కనకాల, రోజ, జయసుధ తదితరులు చాలా మంది ఆమె డిజైన్ చేసిన దుస్తులను వాడుతారు. -
హర్నాజ్ తళుకులకు ఆమే కారణం.. క్రౌన్ గౌన్ బై షిండే!
ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ వేదికపై విశ్వసుందరి కిరీటంతో మెరిసింది మన హర్నాజ్ సంధు. గ్రాండ్ ఫినాలేలో సిల్వర్ గౌనులో వచ్చి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమెను వరించిన విశ్వసుందరి కిరీటానికే వన్నె తెచ్చినట్టుగా కనిపించింది ఆ గౌను. దీంతో ఇనుమడించిన అందంతో వెలిగిపోయింది హర్నాజ్. మన భారతీయ అందాన్ని ప్రపంచ అందాల వేదికపై చూపు తిప్పుకోనియ్యకుండా చేసింది డిజైనర్ సైషా షిండే. నలభై ఏళ్ల సైషా షిండే ఇండియాలో ఉన్న కొద్దిమంది ట్రాన్స్‌జెండర్ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు. గత పదిహేనేళ్లుగా బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తోంది. ఈ క్రమంలోనే హర్నాజ్ కోరిక మేరకు సిల్వర్ గౌన్‌ను ఎంతో ప్రత్యేకంగా రూపొందించింది సైషా. ఫుల్కారీ ప్యాటర్న్‌కు ఎంబ్రాయిడరీ, స్టోన్స్, సీక్వెన్స్‌లను జోడించి పంజాబీ సంప్రదాయం ఉట్టిపడేలా గౌన్‌ను రూపొందించింది. ముంబైకి చెందిన సైషా షిండే.. ఎనిమిదో తరగతిలో ఉండగా గియన్ని వెర్సేస్ ఫ్యాషన్ షోను టీవీలో చూసింది. ఆ ఫ్యాషన్ షో బాగా నచ్చడంతో..అప్పుడే ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు కూడా ఆ నిర్ణయానికి ఒప్పుకున్నప్పటికీ, ముందు చక్కగా చదువుకోవాలని కండీషన్ పెట్టారు. దానికి తగ్గట్టుగానే చదువుకుంటూ ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిగ్రీ చేసింది. తరువాత మిలాన్ లో ఫ్యాషన్ డిప్లొమా చేసింది. ఫ్యాషన్ షోలలో డిజైనర్‌గా పనిచేస్తోన్న సమయంలో.. మధుర్ భండార్కర్ తీసిన ‘ఫ్యాషన్’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం వచ్చింది. దీంతో సినిమాలో ప్రియాంక చోప్రా ధరించిన డ్రెస్‌లన్నీ షిండే రూపొందించి మంచి డిజైనర్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ల్యాక్మే ఫ్యాషన్ హౌస్’ టీవీ షోలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఆ తరువాత ఆరునెలల ఇంటర్న్‌షిప్ చేసింది. ప్రముఖ డిజైనర్లు పాల్గొనే అమెరికన్ టీవీ సిరీస్ ‘ప్రాజెక్ట్ రన్‌వే’ సీజన్ 14లో పాల్గొని ఆరో స్థానంలో నిలిచింది. ఐశ్వర్యారాయ్, సన్నీలియోన్, కరీనా కపూర్ ఖాన్, కియరా అడ్వాణీ, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనే, తాప్సీ పొన్ను, మాధురీ దీక్షిత్ వంటివారికి డిజైనర్‌గా పనిచేసిన షిండే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాల కోసం పోటీపడే మోడల్స్‌ను మరింత అందంగా కనిపించేలా డ్రెస్‌లు రూపొందించడంలో విశేషం ఏముంది? వీటితోపాటు అనేక ఫ్యాషన్ షోలకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేస్తూ మంచి డిజైనర్‌గా రాణిస్తోంది. ఇలా మారింది సైషా షిండే అసలు పేరు స్వప్నిల్ షిండే. పుట్టినప్పటి నుంచి అబ్బాయిగా పెరిగిన షిండేకు .. అమ్మాయిల్లా తయారవాలని అనిపించేది. ఈ ఇష్టం కూడా ఫ్యాషన్‌ను కెరియర్‌గా ఎంచుకునేందుకు ప్రేరేపించింది. డిగ్రీలో ఉన్నప్పుడే తను అబ్బాయి కాదు అమ్మాయిని అని అర్థమైంది. ఇరవై ఏళ్ల వయసులో తెలిసిన ఆ నిజాన్ని జీర్ణించు కోవడానికి షిండేకు కొన్నేళ్లు పట్టింది. తర్వాత బాగా ఆలోచించుకుని తన నిజమైన రూపంతోనే మిగతా జీవితాన్ని గడపాలనుకుంది. నేను ‘గే’ని కాను .. ట్రాన్స్ ఉమెన్ను అని ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి ప్రకటించింది. ఇక నుంచి తన పేరు స్వప్నిల్ షిండే కాదు సైషా షిండే అని స్పష్టం చేసింది. అప్పటి నుంచి సైషా షిండేగా పిలవబడుతోంది. ఇరవై ఏళ్ల నాటి కల.. ఎన్ఐఎఫ్టీలో సైషా ఫ్యాషన్ డిగ్రీ చదువుతోన్న సమయంలో లారాదత్తా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. అది చూసిన షిండే ‘‘ఇలా మిస్‌యూనివర్స్ కిరీటం దక్కించుకునే విన్నర్‌కు నేను ఏదోక రోజు డ్రెస్ డిజైన్ చేస్తాను’’ అని మనసులో అనుకుంది. అప్పటి కల ఇప్పుడు హర్నాజ్ రూపంలో తీరింది. హర్నాజ్.. తన గ్రాండ్ ఫినాలే డ్రెస్ ఎలా ఉండాలో చెప్పినప్పుడు ఈమె తప్పకుండా విన్నర్ అవుతుందని షిండే అనుకుంది. హార్నాజ్ కోరుకున్నట్లుగా సిల్వర్ గౌన్ రూపొందించింది. ఇప్పుడు ‘మిస్ యూనివర్స్’ గౌన్ రూపొందించినందుకు ఎంతో సంతోషంగానూ గర్వంగానూ ఉందని షిండే సంబరపడిపోతోంది. -
నంబర్ ప్లేట్‌తో తంటా
న్యూఢిల్లీ: ఆమె ఫ్యాషన్ డిజైన్ చదువుతున్న విద్యార్థిని. ఢిల్లీలోని జనక్‌పురి నుంచి నోయిడాకు రోజూ వెళ్లి రావడం కష్టమవుతోందని... ‘నాన్నా నాకో స్కూటీ కొనిపెట్టవు’ అని తండ్రిని కోరింది. ముద్దుల కూతురి కోరిక తీరుస్తూ ‘దీపావళి’ కానుకగా స్కూటర్ కొనిపెట్టారాయన. ఆ అమ్మాయి ఎంతో సంతోషించింది. తర్వాత బండి రిజిస్ట్రేషన్ పూర్తయి ‘నెంబరు రావడం’తో ఆమె బిక్కచచ్చిపోయింది. స్కూటీని బయటకు తీయాలంటేనే సిగ్గుతో చితికిపోతున్నానని, ఇరుగుపొరుగుతో, వీధుల్లో ఎగతాళికి గురవుతున్నానని, అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని వాపోతోంది. ఎందుకంటారా? నెంబరులో ఉన్న సిరీస్ తెచ్చిన తంటా ఇది. ఢిల్లీలోని వాహనాలకు నెంబరు కేటాయించేటపుడు మొదటి రెండు అక్షరాలు DL అని వస్తాయి. తర్వాత ఒక అంకె సంబంధిత జిల్లాను సూచిస్తుంది. ఆపై ఫోర్ వీలర్ అయితే ‘సి’ అక్షరం, టూ వీలర్ అయితే ‘ఎస్’ అక్షరం వస్తుంది. ఆపై వచ్చే రెండు ఆంగ్ల అక్షరాలు సిరీస్‌ను సూచిస్తాయి. ఈ అమ్మాయిది టూ వీలర్ కాబట్టి DL3 SEX (నాలుగు అంకెల నెంబర్) వచ్చింది. దాంతో బండిని బయటికి తీయాలంటేనే భయపడిపోతోంది. చివరకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)ను ఆశ్రయించింది. దీంతో ఆమెకు కేటాయించిన సిరీస్‌ను మార్చి కొత్త నెంబరును ఇవ్వాలని మహిళా కమిషన్ సంబంధిత ఆర్టీవోకు నోటీసు జారీచేసింది. -
గచ్చిబౌలి: ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
సాక్షి, గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో.. ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన ఆర్మీ రిటైర్డ్ అధికారి సుకుమార్ జితేందర్‌నాథ్ మండల్ పెద్ద కూతురు శతాబ్ధి మండల్(32) కొంత కాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసి ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తోంది. 2020 ఆగస్టులో గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. షేరింగ్ ఫ్లాట్‌లో ఉండే డాక్టర్ ప్రియాంక రెడ్డి, గీత మాధురిలు నవంబర్ 28న బయటకు వెళ్లారు. తిరిగి 30న మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. ఫ్లాట్‌లోకి రాగానే దుర్వాసన రావడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. చదవండి: ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరా.. సైజ్ ఎంతో తెలుసా? మాస్టర్ కీతో తలుపులు తెరిచి చూడగా చున్నీతో ఫ్యాన్‌కు చున్నీ తో ఉరి వేసుకొని ఉంది. మృతదేహం కుళ్లి పోయిన స్థితిలో ఉండగా పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తండ్రి సుకుమార్ చిన్న కూతురుతో కలిసి గుజరాత్లో ఉంటున్నారు. పెద్ద కుమార్తె మరణ వార్త విని హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు. మృతదేహన్ని తండ్రికి అప్పగించారు. షేరింగ్ ఫ్లాట్‌లో ఉండేవారు బయటకు వెళ్లిన రోజే శతాబ్ధి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని, కారణాలు వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య సాక్షి, గచ్చిబౌలి: ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బర్చండి గ్రామం, నవరంగాపూర్ జిల్లా, ఒడిశాకు చెందిన దేబాండ రాయ్, బిజాలీ రాయ్ దంపతులు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఇందిరానగర్‌లో నివాసం ఉంటూ వంట పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె దీప్తి రాయ్(17) చందానగర్‌లోని చైతన్యభారతి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో బుధవారం ఉదయం 7 గంటలకు తల్లిదండ్రులు వంట చేసేందుకు బయటకు వెళ్లారు. తిరిగి ఉదయం 11 గంటలకు వచ్చి చూసే సరికి కూతురు దీప్తి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎవరితోను పెద్దగా మాట్లాడేది కాదని, సెల్ ఫోన్‌తోనే గడిపేదని తల్లిదండ్రులు,తోటి విద్యార్థులు తెలిపినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. దీప్తి మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంఎం స్టయిల్స్‌లో రిలయన్స్‌కు 40% వాటాలు
న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టయిల్స్‌లో రిలయన్స్ బ్రాండ్స్ (ఆర్బీఎల్) 40 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇరు సంస్థ లు ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపాయి. ‘ఎంఎం స్టయిల్స్‌లో 40 శాతం మైనారిటీ వాటా కోసం బ్రాండ్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్ మనీష్ మల్హోత్రాతో ఆర్బీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది’ అని పేర్కొన్నాయి. అయితే, డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఇప్పటిదాకా మనీష్ మల్హోత్రా ప్రైవేట్‌గా నిర్వహిస్తున్న ఈ బ్రాండ్‌లో బైటి ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. భారతీయ కళలు, సంస్కృతిపై అపార గౌరవమే మల్హోత్రాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవడానికి కారణమని పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా విస్తరించే క్రమంలో రిలయన్స్‌తో భాగస్వా మ్యం గణనీయంగా తోడ్పడగలదని మల్హోత్రా తెలిపారు. 2005లో ప్రారంభమైన ఎంఎం స్టయిల్స్ బ్రాండ్‌కు హైదరాబాద్ సహా ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో 4 పెద్ద స్టోర్స్ ఉన్నాయి. -
రూ. 900 డ్రెస్‌ను 50 రూపాయలకే కొన్నా: నిహారిక
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్.. నిహారిక కొణిదెల. తెర పరిచయానికి ముందే ఫ్యాషన్ ఐకాన్‌గా గ్లామర్ ప్రపంచానికి ఆమె సుపరిచితం. ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను ప్రతిబింబించే బ్రాండ్సే ఇవి.. కలశ ఫైన్ జ్యూయెల్స్.. కేవలం రూ. 40 పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం ఇప్పుడు కోట్ల సామ్రాజ్యంగా మారింది. బంగారు ఆభరణాల వ్యాపారంలో వీరిది 118 సంవత్సరాల అనుభవం. 1901లో శ్రీచంద్ర అంజయ్య పరమేశ్వర్ పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి, నెలకు రూ. 15 జీతంతో ఓ బంగారు ఆభరణాల దుకాణంలో చేరాడు. తర్వాత నలభై రూపాయలు పోగుచేసి స్వయంగా వ్యాపారం ప్రారంభించాడు. అందమైన ఆభరణాల డిజైన్స్ అందిస్తూ వ్యాపారంలో దినదినాభివృద్ధి సాధించాడు. అప్పటి వరకు ‘చంద్ర అంజయ్య పరమేశ్వర్’ పేరుమీద ఉన్న దుకాణాన్ని ఈ మధ్యనే 2017లో ‘కలశ ఫైన్ జ్యూయెల్స్’గా మార్చారు. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని వారి మూడోతరం, నాలుగోతరం వారసులు నడిపిస్తున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడల్లో బ్రాంచీలు ఉన్నాయి. ప్రత్యూష గరిమెళ్ల.. హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష గరిమెళ్ల.. చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్నది. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. అనంతరం 2013లో హైదరాబాద్‌లో తన పేరుమీదే ఓ బొటిక్ ప్రారంభించింది. అతి సూక్ష్మమైన అల్లికలతో వస్త్రాలకు అందాన్ని అద్దడమే ఆమె బ్రాండ్ వాల్యూ. జర్దోసీ, సీక్వెన్స్, గోటా పట్టి వంటి అల్లికలు ప్రత్యూష డిజైన్స్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. చాలామంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్‌ను చేసింది. ధర కూడా డిజైన్‌ను బట్టే. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ ఈ డిజైన్స్ లభిస్తాయి. బేరం బాగా ఆడతా.. ఒకసారి టెన్త్‌క్లాస్‌లో ఢిల్లీ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఖాన్బజార్లో రూ. 900 డ్రస్‌ను రూ. 50కే కొన్నా. అది కూడా గంటసేపు బేరం ఆడి. ఇప్పుడు బేరం ఆడటం కొంచెం తగ్గించా. – నిహారిక కొణిదెల డ్రెస్ డిజైనర్: ప్రత్యూష గరిమెళ్ల ధర:రూ. 44,800 జ్యూయెలరీ కలశ ఫైన్ జ్యూయెల్స్ ధర:ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
నెటిజన్ల ట్రోల్స్: చై-సామ్ విడాకులకు కారణం ఇతడేనా!?
Chaysam Divorce- Trolls On Preetham Jukalrkar: సమంత- నాగ చైతన్యల మూడేళ్ల వివాహ బంధానికి తెరపడింది. గత కొంతకాలంగా వీరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నా అవి నిజం కాకపోతే బాగుండు అని ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు. కానీ వాటినే నిజం చేస్తూ ఇక వైవాహిక బంధాన్ని కొనసాగలించలేమంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.ఏమాయ చేశావే సినిమా సమయం నుంచి దాదాపు పదేళ్ల పాటు కలిసున్న వీళ్లు భార్యభర్తలుగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే ఈ జంట విడిపోవడానికి అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయా అని పలువురు ఆరా తీస్తున్నారు.చదవండి:ChaySam: 'ఏ మాయ చేశావే' నుంచి 'మజిలీ' వరకు ఈ క్రమంలో ముఖ్యంగా ఫ్యామిలీ మేన్ 2 చిత్రంలో సమంత బోల్డ్ సీన్లో నటించడం వీరి బ్రేకప్‌కు ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో సమంత తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ అనే వ్యక్తి కాళ్లు పెట్టుకుని ఫోటో దిగడం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఎంత క్లోజ్ అయినా అలా ఒకరి మీద కాళ్లు పెట్టుకుని ఫొటో దిగడం అభిమానులకు అంతగా నచ్చలేదు. దీంతో సమంత వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సమంత- నాగ చైతన్య విడాకులకు ప్రీతమ్ జుకల్కరే కారణం అంటూ నెటిజన్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి తోడు విడాకుల గురించి ప్రకటన రాగానే ప్రీతమ్ చేసిన పోస్టులు కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. దీంతో అతని ఇన్‌స్టాగ్రామ్‌కు వెళ్లి పాత పోస్టులకు వెళ్లి మరీ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరికి ప్రీతమ్ ఘాటుగానే బదులిచ్చినా ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. అయితే నిజానికి ప్రీతమ్ సమంతను జీజీ(అక్క)అని పిలుస్తాడు. అయినా నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తుండటంతో చేసేదేమి లేక ప్రీతమ్.. తన కామెంట్ సెక్షన్‌ని డిసేబుల్ చేసేశాడు. చదవండి: హాట్ టాపిక్‌గా మారిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ పోస్టులు -
‘ఏ కలర్స్ అద్దమంటారు’ .. ఓ డిజైనర్ ప్రయాణం
‘‘మేడమ్! మీ వీడియోలు చూశాం. పోయిన వారం హైదరాబాద్‌కి వచ్చాం, మిమ్మల్ని చూసిపోదామని...’’ అని ఏలూరు దగ్గర వేల్పుచర్ల అనే గ్రామం నుంచి ముగ్గురు మహిళలు వచ్చారు. ‘‘మేడమ్! మా అమ్మ ఇలా ఉంటారు’’ అని ఫోన్లో ఫొటో చూపిస్తూ ‘‘అమ్మకు ఏ కలర్ కాంబినేషన్లో చీరలు తీసుకోమంటారు’’ అని ఓ యువతి అడుగుతోంది. ఇంతలో ఆమె భర్త వచ్చి ‘‘గాయత్రీ! వేర్‌హౌస్‌కి వెళ్తున్నాను’’ అని చెప్పి బయలుదేరారు. షోరూమ్ వెనుకగా ఉన్న ప్రింటింగ్ యూనిట్లో ఒక వ్యక్తి ఒక చీరను తెచ్చి బోర్డరు చూపిస్తూ... ‘‘ఏ కలర్స్ అద్దమంటారు’’ అని అడిగి ఆమె ‘పింక్’ అని చెప్పగానే తలూపుతూ వెళ్లిపోయాడు. ‘‘మీ వీడియోలు రోజూ చూస్తుంటాం. అలవాటైపోయింది. మీరు మా ఇంట్లో ఒకరిలా అయిపోయారు’’ అంటూ ఆ మహిళలు గాయత్రితో మాటల్లో పడిపోయారు. ‘‘మమ్మీ! వీడియో అప్ లోడ్ చేశాను. అమ్మమ్మ క్యారియర్ పంపించింది. ఆఫీస్ రూమ్‌లో పెట్టాను’’ అని క్లుప్తంగా చెప్పి మరో ఫ్లోర్‌లోకి వెళ్లి పోయాడు ఓ కుర్రాడు. ఇది... హైదరాబాద్, సైనిక్‌పురిలో ‘గాయత్రీరెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియో’ నిర్వహిస్తున్న ఫ్యాషన్ డిజైనర్ గాయత్రి డైలీ రొటీన్. ఇది ఆమె తనకు తానుగా నిర్మించుకున్న సామ్రాజ్యం. 2008లో ఇంట్లో ఒక మూలగా ఒక టేబుల్‌తో మొదలైన తొలి అడుగు ఇప్పుడు పర్వత శిఖరానికి చేరువలో ఉంది. అన్నీ అమరిన దశ నుంచి జీవితం ఒక్కసారిగా పరీక్ష పెట్టింది. అంతా అగమ్యం. జీవితం తనను ఎటు తీసుకువెళ్తుందో తెలియని అస్పష్టమైన అయోమయమైన స్థితిలో వేసిన మొదటి అడుగు అది. గమ్యం కనిపించకపోయినా సరే... నీ ప్రయాణం ఆపవద్దు అనే ‘సంకల్పం’ మాత్రమే ఆమెకు తోడు. నేను కూడా నీకు తోడుగా వస్తానని భర్త నైతిక మద్దతునిచ్చాడు. ‘కుటుంబాన్ని నడిపించాల్సిన నేను వ్యాపారంలో నష్టపోయాను. నా బాధ్యతను నీ భుజాలకెత్తుకున్నావు. ఈ టైమ్‌లో నేను చేయగలిగింది ఇంతవరకే’ అని మాత్రం చెప్పాడాయన. పదమూడేళ్ల కిందట అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు నెలకు వందమందికి పైగా ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయికి చేరింది. బంధువులను మొహమాట పెట్టి కస్టమర్లుగా మార్చుకోలేదామె. కస్టమర్లను ఆత్మీయ బంధువులుగా మార్చుకున్నారు. మధ్యవర్తులెవరూ లేరు! ‘‘నా కస్టమర్‌కు నేను మంచి క్వాలిటీ ఇవ్వాలి. ధర అందుబాటులో ఉండాలి. అందుకోసం చేనేతకారులున్న ప్రతి గ్రామానికీ వెళ్లాను. ఐదేళ్ల పాటు నిరంతర ప్రయత్నం తర్వాత నేను వారి విశ్వాసం చూరగొనగలిగాను. అప్పటి వరకు చేనేతకారులు వాళ్ల వాళ్ల గ్రామాల్లో షావుకారు చేతిలో ఉండేవారు. షావుకారు నూలు కొనుగోలు కోసం డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటాడు. కాబట్టి చేనేతకారులు నేసిన దుస్తులను షావుకారుకు తప్ప మరెవరికీ ఇవ్వడానికి వీల్లేదనే విరచిత రాజ్యాంగం ఒకటి అమలులో ఉండేది. బయటి వాళ్లు ఎవరైనా సరే ఆ షావుకారు దగ్గర కొనాల్సిందే. ఏ వ్యాపారమైనా సరే... ఉత్పత్తిదారుడికీ– వినియోగదారుడికి మధ్య వారధిగా ఉండే వ్యక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ధర కూడా పెరిగిపోతుంది. నేను ఐదేళ్లు కష్టపడి షావుకారు అనే ఒక మధ్య వ్యక్తిని తొలగించగలిగాను. అలాగే నాకు ఏ కౌంట్ నేత కావాలో, ఏయే కాంబినేషన్లలో కావాలో చేనేతకారులకు ముందుగానే చెప్తాను. ఇంత పోటీలో కూడా నన్ను మార్కెట్లో నిలబెట్టింది. సౌకర్యం విషయంలో ఫ్యాబ్రిక్ ధరించినప్పుడు ఒంటికి హాయిగా అనిపించాలి. మన్నిక విషయంలో పెట్టిన డబ్బు వృథా కాలేదని సంతృప్తి కలగాలి. ఇవే నేను నమ్మిన సూత్రాలు. అనుసరిస్తున్న నియమాలు.’’ అని చెప్పారు గాయత్రి. పిల్లలకు కొంతే ఇవ్వాలి! ‘‘మరో రెండేళ్లకు యాభై ఏళ్లు నిండుతాయి. అప్పటికి షోరూమ్, వేర్ హౌస్, నగరంలో ఉన్న మూడు ప్రింటింగ్ యూనిట్లను ఒక చోటకు చేర్చాలి. ఇప్పటి వరకు దేశంలో అన్ని రకాల వస్త్రకారులను అనుసంధానం చేస్తూ నేను ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌ను నా ఉద్యోగులతో నడిపించాలని, ఇక నా పరుగులు ఆపేయాలనేది కోరిక. భగవంతుడి దయ వల్ల పోగొట్టుకున్న ఆస్తులకంటే ఎక్కువే సంపాదించుకున్నాం. పిల్లలను చదివించాం, జీవితాన్ని మొదలుపెట్టడానికి భరోసాగా కొన్ని ఆస్తులను మాత్రమే వాళ్లకు ఇస్తాం. వాళ్ల జీవితాన్ని వాళ్లే మొదలు పెట్టాలి. అలా చేయకపోతే డబ్బు మీద గౌరవం ఉండదు, జీవితం విలువ తెలియదు. ఇక సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలు కావాల్సిన సమయం వచ్చింది. అది నా ఉద్యోగులతోనే మొదలవుతుంది’’ అని చెప్పేటప్పుడు గాయత్రీరెడ్డిలో జీవితం నేర్పిన పరిణతితోపాటు స్థితప్రజ్ఞత కనిపించింది. అక్షరం నేర్పిన విలువలు ఇల్లు దిద్దుకోవడం, చక్కగా వండి పెట్టుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవడం... ఇదే నా లోకంగా ఉండేది. ఆర్థిక సమస్యలే రాకపోయి ఉంటే నాలో ఇంత శక్తి ఉందని నాకు కూడా ఎప్పటికీ తెలిసేది కాదేమో. అయితే కంచి పరమాచార్య చెప్పినట్లు మనం దేనిని పైకి విసురుతామో అది మనకు అంతకంటే వేగంగా వచ్చి చేరుతుందని నమ్ముతాను. మా వారు మధ్యప్రదేశ్‌లో కాంట్రాక్టులు చేస్తున్నప్పుడు తప్పని సరై నేర్చుకున్న హిందీ ఇప్పుడు నార్త్ ఇండియా పర్చేజ్కి, అక్కడి నుంచి వచ్చిన పనివాళ్లతో మాట్లాడడానికి పనికొస్తోంది. బెంగళూరులో ఉన్నప్పుడు రోజంతా ఏమీ తోచడం లేదని నేర్చుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ఈ రోజు నన్ను విజేతగా నిలబెట్టింది. అంతకంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. పదో తరగతి వరకే చదివిన నేను మా ఇంటి దగ్గరున్న లైబ్రరీలో ఉన్న పుస్తకాల్లో చందమామ నుంచి ఆధ్యాత్మికం వరకు దాదాపుగా చదివేశాను. ఆ అక్షరజ్ఞానం నేర్పిన విలువలే నాకు యూనిట్ నిర్వహణలో ఉపయోగపడుతున్నాయి. – గాయత్రీరెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి -
ఫ్యాషన్ డిజైనర్‌తో ‘తుపాకీ’ విలన్ ఎంగేజ్మెంట్, ఫొటోలు
బాలీవుడ్ నటుడు, ‘కమాండో’ ఫేం విద్యుత్ జమ్వాల్ (40) ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ విషయాన్ని సోమవారం (సెప్టెంబర్ 13న) ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ఫ్యాషన్ డిజైనర్ నందితా మహతానీతో తన నిశ్చితార్థం జరిగిందని చెబుతూ, వారిద్దరూ కలిసున్న ఫోటోలను అతను షేర్ చేశాడు. కాబోయే భార్య నందితా చేతులు పట్టుకుని రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసిన విద్యుత్.. ‘ఇది కమాండో మార్గం.01/09/21’ అని క్యాప్షన్ జోడించాడు. అతను వివాహం చేసుకోబోతున్న నందితా వయసు కూడా 40 ఏళ్లే. ఇదే ఫోటోని ఆమె సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది. కాగా ఈ నటుడు ‘తుపాకీ’ సినిమాతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులకి సుపరిచితుడే. అందులో ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. కాగా ఈ కమాండో హీరో ప్రస్తుతం ‘సనక్’, ‘ఖుదా హఫీజ్ చాప్టర్ II’ వంటి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నాడు. View this post on Instagram A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) -
అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను: సవితారెడ్డి
‘‘జీవితంలో ఏదీ అసాధ్యం కాదు. అన్నీ సుసాధ్యమే. నూటికి నూరుపాళ్లు అనుకున్నది సాధించవచ్చు. నీ కలను నిజం చేసుకోవడానికి నీవే శ్రమించాలి. లక్ష్యాన్ని చేరే వరకు నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. అప్పుడు విజయం నీదై తీరుతుంది. అనారోగ్యం నిన్ను చూసి పారిపోతుంది. ఇందుకు అసలైన నిర్వచనం ఈ సాహసి జీవితం. ‘‘సాహసం చేయకపోతే జీవితంలో అనేక అనుభవాలకు, ఆనందాలకూ దూరంగా ఉండిపోతాం. అందుకే సాహసించాల్సిందే’’ అంటున్న ఈ సాహసి పేరు సవితారెడ్డి. ఆమె ఫ్యాషన్ డిజైనర్, అడ్వెంచరస్ టూరిస్ట్. హైదరాబాద్ కొంపల్లిలో ఉంటారు. మసాబ్ ట్యాంకు నుంచి రాజేంద్రనగర్, హెచ్‌సీయూ, నార్సింగి, రోడ్ నంబర్ 45 నుంచి ఐకియా, ఖాజాగూడల్లో ఉదయం పూట జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో విశాలమైన రోడ్ల మీద సైక్లింగ్ చేస్తూ కనిపిస్తారు. ఈమె గత ఏడాది రెండు కాళ్లకు సర్జరీ చేయించుకున్నారు. ఫిట్నెస్ను తిరిగి సాధించుకోవడానికి సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ కశ్మీర్‌లోని ‘గ్రేట్ లేక్స్ ఆఫ్ కశ్మీర్’ట్రెకింగ్ టూర్‌కి సిద్ధమవుతున్నారు. మహిళకు సెలవేది? ఒక సామాన్యమైన కుటుంబం లో మహిళ జీవితం ఎలా ఉంటుంది? పిల్లల స్కూళ్లకు, కాలేజ్‌లకు సెలవులుంటాయి. భర్త ఆఫీస్‌కి సెలవులుంటాయి. తనకు మాత్రం సెలవు ఉండదు. తనకంటూ ఒక ఆటవిడుపు ఉండాలని కోరుకున్నా సరే సాధ్యపడదు. ఆ మహిళ గృహిణి అయినా ఉద్యోగి అయినా, ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే... ఈ కుటుంబచిత్రమ్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. మహిళలు ఆ రొటీన్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా రెక్కలు తగిలించుకోవాలంటారు సవిత. ఈ విషయంలో హైదరాబాద్ మహిళ ఓ అడుగు ముందుకేసిందని కూడా అన్నారామె. మహిళ తన సంతోషం కోసం ఇంకా ఇంకా గొంతు విప్పాలనేదే నా కోరిక. అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను. మరింత మందిని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు సవిత. దేశమంతా పెరిగాను! సవిత తండ్రి ఎయిర్‌ఫోర్స్ అధికారి కావడంతో ఆమె బాల్యం దేశంలోని అనేక ప్రదేశాల్లో సాగింది. దాదాపుగా ముప్పై ఏళ్ల కిందట ఫ్యాషన్ డిజైనింగ్ ఒక కోర్సు రూపంలో యూనివర్సిటీ కరిక్యులమ్‌లో చేరిన తొలి రోజుల్లో, ఏ మాత్రం ఉపాధికి భరోసా కల్పించలేని ఆ కోర్సులో చేరాలనుకోవడమే పెద్ద సాహసం. అలాంటి రోజుల్లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారామె. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సొంతంగా తన పేరుతోనే ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్ ప్రారంభించారు. ‘‘పాతికేళ్ల పాటు చాలా సీరియెస్‌గా ఫ్యాషన్ ఇండస్ట్రీ కోసం పని చేశాను. నా యూనిట్ చూసుకుంటూ మధ్యలో కార్ ర్యాలీలు, ట్రెక్కింగులతో జీవితాన్ని సంతోషంగా గడిపాననే చెప్పాలి. 2017లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించాను. అయితే అన్ని రోజులూ ఒకేరకంగా ఉండవు కదా! ఆ తర్వాతి ఏడాది కాళ్లు నాకు పరీక్ష పెట్టాయి. మాల్ అలైన్మెంట్ సమస్యతో బౌడ్ లెగ్స్గా మారిపోయాయి. ట్రెకింగ్ కాదు కదా మామూలుగా నడవడం కూడా కష్టమైంది. ఆ క్షణంలో నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధమయ్యాను. హై టిబియల్ ఆస్టియోటమీ సర్జరీ చేయించుకున్నాను. మోకాళ్ల నుంచి మడమల మధ్య ఉండే ఎముకను వంపు తీసి సరిచేసి ప్లేట్ అమర్చి స్క్రూలతో బిగిస్తారన్నమాట. గత ఏడాది ఆగస్టులో ఒక కాలికి, నవంబరులో మరో కాలికి సర్జరీ అయింది. కొంతకాలం వీల్ చెయిర్‌కి పరిమితమయ్యాను. తర్వాత వాకర్‌తో రోజులు గడిచాయి. ఇక ఇప్పుడు నా ఫిట్‌నెస్‌ని తిరిగి తెచ్చుకోవాలి. అందుకే ఈ సైక్లింగ్. వారంలో మూడు రోజులు సైక్లింగ్ రోజుకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు, మరో మూడు రోజులు గంటపాటు వాకింగ్... ఇదీ ఇప్పుడు నా రొటీన్. ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కశ్మీర్లో ట్రెకింగ్‌కి సిద్ధమవుతున్నాను’’ అని చెప్పారు సవిత. ఇంత సాహసం అవసరమా? ‘‘నలభై ఎనిమిదేళ్ల వయసులో ఆ సర్జరీ అవసరమా, మందులతో రోజులు వెళ్లదీయవచ్చు కదా’ అని అడిగే వాళ్లకు నేను చెప్పే సమాధానం ‘అవసరమే’ అని. ఏ వయసులోనైనా మనిషి జీవితం తన చేతుల్లోనే ఉండాలి. అనారోగ్యం కారణంగా మరొకరి మీద ఆధారపడే పరిస్థితిలోకి జారిపోకూడదు. పైగా నలభై ఎనిమిది అంటే... అభిరుచులను కట్టిపెట్టి జీవితాన్ని నిస్సారంగా గడిపే వయసు కాదు. నాకు ఇష్టమైన కార్ ర్యాలీ, ట్రెకింగ్ వంటివేవీ చేయలేనప్పుడు, భారంగా అడుగులేసుకుంటూ రోజులు గడిపే జీవితం నాకు అవసరమా... అనేది నా ప్రశ్న. అందుకే ఈ సర్జరీలో సక్సెస్ రేట్ ఫిఫ్టీ– ఫిఫ్టీ అని తెలిసినప్పటికీ నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడ్డాను. మనం అనుకున్నట్లు జీవించడానికి అనారోగ్యాన్ని అధిగమించడానికి మొదట మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా, ఫిట్‌గా ఉన్నాను. నా డిజైనింగ్ స్టూడియోని నడుపుకుంటున్నాను. నా ట్రెకింగ్ ఇంటరెస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోగలను కూడా’’ అని ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వుతో చెప్పారు సవిత. – వాకా మంజులారెడ్డి -
Half Saree: వేడుక వేళ సంప్రదాయ కళ
మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ కొంచెం వెనకంజ వేసినా.. పండగలు, వ్రతాలు, పెళ్లిళ్లు అంటూ ఇప్పుడిప్పుడే సందడి మొదలయ్యింది. వేడుకల వేళ వైవిధ్యంగా వెలిగిపోవాలంటే లంగా ఓణీ జోడీ కట్టాల్సిందే. ఆధునికపు హంగులు కోరుకునే నవతరమైనా సంప్రదాయ కట్టుతో మెరిసిపోవాల్సిందే! వేడుకల్లో మనదైన మార్క్ కనిపించాలంటే కొంచెం వినూత్నంగా ఆలోచించవచ్చు. ప్లెయిన్ లెహంగా మీద లైట్‌వెయిట్ పట్టు శారీని ఓణీలా కట్టుకోవచ్చు. ముదురు ఎరుపు, పసుపు, పచ్చ, నీలం వంటి రంగుల ఎంపిక, టెంపుల్ జ్యువెలరీతో చక్కని సంప్రదాయ కళ తీసుకురావచ్చు. కంచిబార్డర్ను హాఫ్‌వైట్ గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ జత చేసిన లెహంగా, అంచులు ఎంబ్రాయిడరీ చేసిన ఓణీ, మగ్గం వర్క్ బ్లౌజ్.. ఈ పర్పుల్ కాంబినేషన్ వేడుకకు వన్నెతెస్తుంది. కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్‌కి కంచిబార్డర్ జత చేసి, అదే రంగు మగ్గం వర్క్ బ్లౌజ్, కాంట్రాస్ట్ దుపట్టా వేయడంతో మంచి కళ వచ్చేసింది. వేడుకలకు ఈ కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్లెయిన్ హాఫ్‌వైట్ రాసిల్క్ మెటీరియల్పైన ఎంబ్రాయిడరీ వర్క్ చేసి డిజైన్ చేసిన లెహంగా. మగ్గం వర్క్ చేసిన రెడ్ కలర్ ట్యునిక్, నెటెడ్ దుపట్టాతో సంప్రదాయ కట్టుతోనే ఆధునికపు హంగులు తీసుకురావచ్చు. సంప్రదాయ డ్రెస్సులోనే ఆధునికంగా కనిపించాలనుకుంటే ఫిష్‌కట్ లెహంగాలు సెట్అవుతాయి. ఫ్లోరల్ ప్రింట్ ఉన్న రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన లెహంగా, జర్దోసీ వర్క్ చేసిన షార్ట్ స్లీవ్స్ బ్లౌజ్, నెటెడ్ ఓణీ ముచ్చటైన కాంబినేషన్‌గా ఆకట్టుకుంటుంది. - రజితారాజ్ రావుల డిజైనర్, హైదరాబాద్ -
చేనేత మహిళ.. కలల నేతకు అద్దిన కళ
‘‘ఎన్నో చీరలు మగ్గం మీద నేస్తుంటాం. కానీ, ఒక్క చీర కూడా మేం కట్టుకోలేం. బయట దొరికే వందా, రెండు వందల రూపాయల సిల్క్ చీరలు కొనుక్కుంటాం. మా చేతుల్లో రూపుదిద్దుకున్న చీరల డిజైన్లు ఎంత అందంగా ఉన్నాయో కదా, అని ఒకటికి పదిసార్లు చూసుకుంటాం. కానీ, మేం కట్టుకునే చీరల అందం గురించి ఎన్నడూ పట్టించుకోం. అలాంటిది సిరి మేడమ్ మా చీర మాకే కొనిచ్చారు, మేం కట్టుకునేదాకా ఊరుకోలేదు’’ అంటూ విప్పారిన ముఖాలతో తెలిపారు నారాయణపేట్ చేనేత మహిళలు. ‘‘నెల రోజుల క్రితం తెలంగాణలోని నారాయణ్‌పేట్ చేనేత మహిళలను కలిసి, వారి చీరలు వారే కట్టుకున్నప్పుడు ఆ ఆనందాన్ని ఫొటోలుగా తీయాలనిపించింది. అలా తీసుకున్నాను కూడా. వీరికే ఇంకాస్త కట్టూ బొట్టూ మార్చితే మోడల్స్‌కి ఏ మాత్రం తీసిపోరు అనిపించింది. దాంతో ఈ ఆలోచనను సినిమాటోగ్రాఫర్ రఘు మందాటిని కలిసి, ఈ షూట్ ప్లాన్ చేశాను’’ అని వివరించారు ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరి. హ్యాండ్లూమ్ డే సందర్భంగా నిన్న హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘తాశ్రిక’ పేరుతో చేనేత మహిళల ఫొటో ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా చేనేతల పట్ల తనకున్న మక్కువను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘పుట్టి పెరిగింది అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్‌లో. కళల లేపాక్షి మాకు దగ్గరే. హైదరాబాద్ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. పదహారు ఏళ్లుగా హ్యాండ్లూమ్స్‌తో డిజైన్స్ చేస్తున్నాను. చేనేతలతో యువతరం మెచ్చేలా మోడ్రన్ డ్రెస్సులను రూపొందించి, షోస్ కూడా ఏర్పాటు చేశాను. ఎప్పుడూ చేనేతలతో మమేకమై ఉంటాను కాబట్టి, వారి జీవితాలు నాకు బాగా పరిచయమే. ఆనందమే ముఖ్యం రోజుల తరబడి దారం పోగులను పేర్చుతూ ఒక్కో చీరను మగ్గం మీద నేస్తారు. ఒక్కో చీర 1200 రూపాయల నుంచి ధర ఉంటుంది. కానీ, అవి అంత సులువుగా అమ్ముడుపోవు. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు వారి చేతి వృత్తే ఆధారం. చీర ఖరీదైనదని, వారెన్నడూ వాటిని కలలో కూడా కట్టుకోవాలనుకోరు. సాధారణ రోజుల్లోనే వారి కుటుంబ పరిస్థితులు ఎంత గడ్డుగా ఉంటాయో కళ్లారా చూశాను. అలాంటిది కరోనా సమయంలో చేనేత కుటుంబాల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉపాధి లేక వారంతా ఎలా ఉన్నారో, వారి నేత చీరలన్నీ అలాగే మిగిలిపోయి ఉంటాయనుకొని ఒకసారి కలిసి వద్దామని వెళ్లాను. అక్కడి వారి పరిస్థితులన్నీ స్వయంగా చూశాక, ఆ మహిళల ముఖాల్లో కొంచెమైనా ఆనందం చూడాలనిపించింది. అలాగే, నాదైన కంటితో వారిని ఇంకాస్త కళగా చూపాలనుకున్నాను. నా స్నేహితుల్లో ఉన్న మేకప్, హెయిర్ స్టైలిస్ట్‌లతో మాట్లాడాను. ఈ క్రమంలో వారానికి ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లడం, అక్కడి మహిళలతో మాట్లాడటం, వాళ్ల కుటుంబ సభ్యుల్లో నేనూ ఒకదాన్నయిపోయాను. ఫొటో షూట్‌కి అనువైన ప్లేస్ కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాం. ఒక ప్రాచీన దేవాలయం కనిపించింది. అక్కడే ఫొటో షూట్‌కి ప్లాన్ చేసుకున్నాం. పదిమంది చేనేత మహిళలను తీసుకొని ఉదయం 5 గంటలకే ఆ దేవాలయానికి చేరుకున్నాం. ముందే అనుకున్నట్టు డిజైనర్ బ్లౌజులు, ఆభరణాలు, మేకప్ సామగ్రి అంతా సిద్ధం చేసుకున్నాం. రెండు కళ్లూ సరిపోలేదు ముస్తాబు పూర్తయ్యాక ఆ చేనేత మహిళల ‘కళ’ చూస్తుంటే నాకే రెండు కళ్లు సరిపోలేదు. వారు చూపించిన ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అనిపించింది. జాతీయస్థాయి మోడల్స్‌కి వీరేమాత్రం తీసిపోరు అనిపించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫొటో, వీడియో షూట్ చేశాం. వారి అనుభవాలతో కలిపి డాక్యుమెంటరీ రూపొందించాం. ఈ గ్యాలరీలో ప్రదర్శించిన ఈ మహిళల ఫొటోలతో ఉన్న ఫ్రేమ్‌లు వారి వారి ఇళ్లలో ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ ఫొటోషూట్, డాక్యుమెంటరీ అంతా స్వచ్ఛందంగా పూర్తిచేశాం. నా స్నేహితులు కూడా ఈ పనిలో ఆనందంగా పాలుపంచుకున్నారు. ఈ రంగంలో ఉన్నందుకు చేనేతకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనిపించింది. ఈ మహిళల ముఖాల్లో కనిపించిన కళ వీరి జీవితాల్లోనూ కనిపించాలి. చేనేతలను ఈ తరం మరింతగా తమ జీవనంలో భాగం చేసుకోవాలన్నదే నా ప్రయ త్నం’’ అని వివరించారు డిజైనర్ హేమంత్ సిరి. గ్యాలరీకి వచ్చినవారంతా అబ్బురంగా చేనేత మహిళల ఫొటోలు, డాక్యుమెంటరీని తిలకించడం, అక్కడే ఉన్న చేనేత మహిళలను ఆప్యాయంగా పలకరించడం, కొందరు చీరలు కొనుక్కోవడం, మరికొందరు మీ నుంచి మేమూ చీరల ఆర్డర్స్ తీసుకుంటాం అంటూ ఫోన్ నెంబర్లు అడిగి తీసుకొని వెళ్లడం.. అక్కడ ఉన్నంతసేపూ కళ్లకు కట్టింది. లేపాక్షి దేవాలయ కళను నారాయణ్‌పేట్ కాటన్ చీరల మీద డిజిటల్ ప్రింట్ చేయించి, డిజైన్ చేసిన ప్రత్యేకమైన చీరలు ఇవి. వీటితోనే డాక్యుమెంటరీ, ఫొటో షూట్ చేశాం. ఇందులో 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలు పాల్గొన్నారు. వచ్చిన ఆలోచనలను వెంటనే అమల్లో పెట్టడం, అందుకు తగినట్టుగా నారాయణ్‌పేట్ మహిళలు ఆనందంగా సహకరించిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
షరారా శారీ.. చూపు తిప్పుకోలేరు మరి!
లంగా ఓణీ వేసుకున్న కళ రావాలి.. చీరకట్టుకున్న హుందాతనం కళ్లకు కట్టాలి.. ఇండోవెస్ట్రన్ లుక్ అనిపించాలి.. పూర్తి ట్రెడిషనల్ అని మార్కులు కొట్టేయాలి వీన్నింటికీ ఒకే ఒక సమాధానం షరారా శారీ డ్రెస్. నవతరం అమ్మాయి అయినా సంప్రదాయ వేడుకలకు తగినట్టుగా తయారు కావాలని కోరుకుంటుంది. అందుకు తగిన డ్రెస్‌ను ఎంపిక చేసుకుంటుంది. కానీ, సంప్రదాయ చీరకట్టులో సౌకర్యం ఉండదనుకునేవారికి స్టైల్‌గా సమాధానం చెబుతోంది షరారా శారీ. వందల ఏళ్ల ఘనత షరారాను ఘరారా అని కూడా అంటారు. ఇది పూర్తిగా సంప్రదాయ లక్నో డ్రెస్‌గా కూడా చెప్పుకోవచ్చు. ఈ డ్రెస్ పుట్టినిల్లుగా ఉత్తరప్రదేశ్ నవాబ్‌ల ఇంట 19, 20 శతాబ్దాలలో డెయిలీ డ్రెస్‌గా పేరొందింది. టాప్‌గా షార్ట్ కుర్తీ, బాటమ్‌గా షరారా ప్యాంట్ ధరించి దుపట్టాను తల మీదుగా తీసుకుంటూ భుజాలనిండా కప్పుకుంటారు. నడుము నుంచి మోకాలి వరకు ఫిట్ గా ఉంటూ, మోకాలి నుంచి కింద వరకు వెడల్పుగా, కుచ్చులతోనూ ఉంటుంది. అయితే, ఈ స్టైల్ లోనే చిన్న మార్పు చేసి దుపట్టాను పవిటలా ధరించి లంగా ఓణీ స్టైల్, ఇంకొంచెం ముందుకు వెళ్లి శారీ స్టైల్లో తీసుకువస్తున్నారు. చాలా వరకు ఈ షరారా సూట్స్ సిల్క్ బ్రొకేడ్‌తో డిజైన్ చేసినవి ఉంటాయి. ఈ డ్రెస్ ఇప్పుడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంది. ముఖ్యంగా పండగలు, వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇలా స్టైలిష్ లుక్ ► మన సంప్రదాయ చీరకట్టు స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకోవడానికి షరారా శారీ అమ్మాయిలకు సరైన ఎంపిక అవుతుంది. ► సాయంకాలాలు గెట్ టు గెదర్ వంటి పార్టీలకైతే ప్రిల్స్, ఫ్లోరల్, టాప్ టు బాటమ్ సేమ్ కలర్ షరారా శారీ సెట్ బాగా నప్పుతుంది. వీటికి పెద్దగా ఆభరణాల అలంకరణ అవసరం ఉండదు. ► సంప్రదాయ పండగలు ఎరుపు, పసుపు షరారా డ్రెస్ సరైన ఎంపిక. ► వివాహ వేడుకలకు ఎంబ్రాయిడరీ బ్లౌజ్, సంప్రదాయ ఆభరణాల ఎంపిక సరైన అందాన్ని తీసుకువస్తాయి. ► శరీరాకృతి ఫిట్‌గా ఉన్నవారు ఈ తరహా స్టైల్‌ను ఎంపిక చేసుకుంటే వేడుకలో ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ► టాప్‌గా షార్ట్ కుర్తా వేసుకుంటే ఒక స్టైల్, ఎంబ్రాయిడీ బ్లౌజ్ లేదా స్లీవ్‌లెస్ ట్యునిక్ వేసుకుంటే మరో స్టైల్‌తో ఆకట్టుకుంటుంది షరారా సూట్. ► షరారా ప్యాంట్లా కాకుండా కుచ్చులు ఎంత ఎక్కువగా ఉన్నది ఎంచుకుంటే అంత అందంగా, అచ్చు శారీ కట్టుకున్న విధంగా కనిపిస్తారు. ప్యాంట్ స్టైల్ కావడం, దానికి బెల్ట్ జత చేయడంతో సౌకర్యంగానూ ఉంటుంది. -
శోభపై నార్కోటిక్స్ కేసు.. ఊహించని మలుపులతో ఊరట
ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్ శోభా విశ్వనాథ్‌పై ఈ జనవరిలో నార్కోటిక్స్ కేసు నమోదు అయ్యింది. ఆమె షోరూంలో గంజాయి దొరకడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో ఆరు నెలల విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టారు. పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో ఆమెను పక్కాగా ఈ కేసులో ఇరికించాడు ఓ వ్యక్తి. వివరాళ్లోకి వెళ్తే.. తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్ శోభా విశ్వనాథ్(34).. పదేళ్ల నుంచి చేనేత రంగంలో రాణిస్తోంది. తిరువనంతపురంలో ఆమెకు ఓ చేనేత పరిశ్రమతో పాటు ఓ క్లోతింగ్ స్టోర్ ఉన్నాయి. ఆమె క్లయింట్స్‌లో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక ఆరేళ్లుగా భర్త నుంచి దూరంగా ఉంటున్న ఆమె.. కోర్టులో విడాకుల వాదనలకు హాజరవుతూ వస్తోంది. అయితే జనవరి 21న ఆమె జీవితంలో మరిచిపోలేని ఘటన జరిగింది. కొవలంలో కొత్త బ్రాంచ్ పనుల్లో బిజీగా ఉన్న ఆమెకు తిరువనంతపురం పోలీసుల నుంచి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఆమె అవుట్‌లెట్‌లో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వాళ్లు చెప్పడంతో ఆమె షాక్ తింది. సుమారు 400 గ్రాముల గంజాయి.. దొరకడంతో నార్కోటిక్స్ టీం ఆమెను కేసులో బుక్ చేసి ప్రశ్నించింది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె మానసికంగా కుంగిపోయింది. తాను అమాయకురాలినంటూ సీఎంకు, డీజీపీలకు ఆమె లేఖ రాయడం.. హై ప్రొఫైల్ సెలబబ్రిటీ కావడంతో ఈ కేసు తిరువనంతపురం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు అధికారులు. రెండు నెలల ట్రేస్ తర్వాత.. డీఎస్పీ అమ్మినికుట్టన్ ఆధ్వర్యంలోని బృందం ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇంట్లో పనిమనిషి.. స్టోర్‌లోకి వెళ్లడాన్ని గుర్తించింది ఆ టీం. ఆమెను ప్రశ్నించడంతో వివేక్ అనే వ్యక్తి తనకు గంజాయి ప్యాకెట్లు ఇచ్చి.. షాపులో పెట్టమని చెప్పాడని తెలిపింది. వివేక్ ఒకప్పుడు శోభా దగ్గరే పనిచేశాడు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలతో అతన్ని పని నుంచి తొలగించింది. హరీష్ హరిదాస్ అనే వ్యక్తితో కుమ్మక్కై వివేక్, శోభపై కుట్ర పన్నాడని ఆ తర్వాతే తేలింది. పెళ్లి కాదందనే.. హరీష్ హరిదాస్ యూకే పౌరసత్వం ఉన్న వ్యక్తి. లార్డ్స్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ హరిదాస్ కొడుకు. పైగా డాక్టర్ కూడా. ఏడాది క్రితం శోభకు హరీష్ పెళ్లి ప్రతిపాదన పంపాడు. ఆమె కాదంది.అది మనసులో పెట్టుకునే ఆమె నార్కోటిక్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమెపై ఉన్న ఆరోపణలు కొట్టేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్ నుంచి ఆమె పేరును తొలగించారు. వివేక్ ను అరెస్ట్ చేయగా.. హరిష్ అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
Fashion And Lifestyle: ఫుడ్‌ని ధరిద్దాం..
అరటిపండు, మొక్కజొన్న, ఆరెంజ్, సోయాబీన్, యాపిల్, పైనాపిల్.. ఇవన్నీ తినేవే. ధరించేవి కూడా!! ఫ్యాషన్ ప్రపంచం ఇక ప్రకృతిని ప్రేమించడానికి సిద్ధపడిపోయింది. ప్లాస్టిక్ వృథాను అరికట్టేందుకు, భూమిలో కలిసిపోయే ఫ్యాబ్రిక్‌ను రూపొందించాలనుకుంది. అంతేకాదు, ఆహారపదార్థాల వ్యర్థాల నుంచి తయారు చేసిన ఫ్యాబ్రిక్ సుతిమెత్తగా ఉండి మేనికి హాయిని ఇస్తుంది. ప్రకృతి ప్రేమికులుగా ఫ్యాషన్ ప్రియులు మారిపోతున్నారు. అందుకే డిజైనర్లూ తమ స్టైల్‌ని, మార్కెట్‌నూ మార్చుకుంటున్నారు. అలాంటి డిజైనర్ల లో మధురిమా సింగ్ ఒకరు. పువ్వులు– పండ్లు.. రంగులు దేశీయ చేనేతలకు సేంద్రీయ రంగులతో ప్రయోగాలు చేస్తుంది. కూరగాయల వ్యర్థాలు, వాడిన పువ్వులు, పండ్లు, విత్తనాలు మొదలైన వాటిని సేకరించి, వాటి నుంచి రంగులు తీసి, కాటన్ ఫ్యాబ్రిక్‌పైన అందంగా రూపుకడుతుంది. సంప్రదాయ, సమకాలీన పద్ధతుల్లో కళ్లకు, చర్మానికి హాయిగొలిపేలా మధురిమా షాహి ‘ధూరి’ దుస్తులు ముఖ్యంగా ఈ తరం మహిళ నడకకు హుందాతనాన్ని అద్దుతాయి. ఆహార వ్యర్థాల... ఫ్యాబ్రిక్ అరటి, మొక్కజొన్న, సోయా, పాలు, తామర, ఆరెంజ్, బాంబూ, యూకలిప్టస్ వంటి సహజ ఫైబర్లతో పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్‌ను ‘ధురి’ అనే ఫ్యాషన్ లేబుల్ ద్వారా తయారు చేస్తున్నారు మధురిమా సింగ్. వాటికి సహజసిద్ధమైన రంగులను ఉపయోగించి అందమైన, సౌకర్యవంతమైన డిజైన్స్ రూపొందిస్తున్నారు. ముంబైకి చెందిన ఈ ఫ్యాషన్ డిజైనర్ ఢిల్లీలో ధురి స్టూడియో ఏర్పాటు చేసి, తన ఆలోచనను విరివిగా అమలులోకి తీసుకొచ్చారు. సృజనాత్మక డిజైన్, ప్రకృతి సమతౌల్యత రెండింటికీ మధురిమ న్యాయం చేయాలనుకున్నారు. డిగ్రీ చేసిన మధురిమ ఎక్స్పోర్ట్ కంపెనీలతో పాటు ప్రముఖ డిజైనర్లతో కలిసి పనిచేశారు. ఉద్యోగ అనుభవాలతో డిజైనర్‌గా మారారు. అయితే, తన లేబుల్‌ను పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో తయారైన దుస్తులకే పరిమితం చేశారు. మధురిమా సింగ్ ఫ్యాబ్రిక్, ఫ్యాషన్ డిజైనర్ -
Anita Dongre: ప్రకృతిలో అందంగా ఒదిగిపోయే ఫ్యాషన్
దానిమ్మకాయ తొక్కలను ఉడకబెట్టి చెట్టు బెరడు నుంచి తీసిన ఎరుపును పులిమి, బెల్లం నీళ్లను కలిపి ఓ రంగును తయారు చేయొచ్చని ఎప్పుడైనా ఆలోచించారా..!ఎక్కువ కాలం మన్నదగిన.. ప్రకృతిలో అందంగా ఒదిగిపోయే ఫ్యాషన్ గురించి ప్రస్తావించారా..! ఇప్పుడు మన కొనుగోలు అలవాట్లనూ, ఫ్యాషన్‌ను వినియోగించే విధానాన్ని పునరాలోచనలో పడేసింది కాలం. ఈ ఏడాది వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యల గురించి మనమే మరింత స్పృహతో జీవించడానికి చర్యలు తీసుకోవాలి. అందుకు, ‘సస్టెయినబుల్ ఫ్యాషన్ ’ అనే పదం ఇప్పుడు ఫ్యాషన్ ఇంట సందడి చేస్తోంది. గతకాలపు ఫ్యాషన్‌కు విరుద్ధంగా కాలాలకు అనుకూలంగా ఫ్యాబ్రిక్ డిజైన్ తీసుకురావాల్సిన అవసరం ఉందంటోంది. ఇండియన్ డిజైనర్ అనితా డోంగ్రే తాజా కలెక్షన్ అందుకు అసలైన ఉదాహరణ. సేంద్రీయ పత్తి పర్యావరణానికి అనుకూలమైనదని, మట్టిలో త్వరగా కలిసిపోతుందని మనకు తెలిసిందే. కానీ, ఇన్నాళ్లూ వాటిపై అంతగా దృష్టిపెట్టలేదు. ఇప్పుడిక పూర్తి బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్ క్లాత్స్తో ఫ్యాషన్ ప్రపంచం మెరవనుంది. ‘రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్’ అనే రెట్రో ఫీల్ ఇక ముందు కనిపించబోతోంది. అనితా డోంగ్రే తన తాజా కలెక్షన్ ‘టెన్సెల్ సౌండ్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ దీనిని ప్రతిఫలింపజేస్తుంది. తన డిజైన్లలో ఉపయోగించిన ఫ్యాబ్రిక్ ప్రకృతికి అనుకూలమైనదిగా చాటిచెబుతోంది. ‘ఈ కలెక్షన్ అంతా అడవుల నుంచి సేకరించిన పీచుపదార్థాలతో రూపొందించినవి, ఆకులు, పండ్ల నుంచి తీసిన రంగులతో ప్రింట్లుగా అలంకరించాం. డ్రెస్సులు మాత్రమే కాదు కవర్, ప్యాకేజింగ్ వరకు మా ఉత్పత్తులలో ప్లాస్టిక్‌ని ఉపయోగించకూడదని నిర్ణయం తీసుకున్నాం. ప్యాకేజింగ్‌లోనూ నూరు శాతం రీసైకిల్ కాగితాన్నే ఉపయోగిస్తాం’ అని డిజైనర్లు తెలియజేస్తున్నారు. డిజైనర్ అనావిలా మిశ్రా తన బ్రాండ్ నేమ్‌తో నార చీరలను సృష్టిస్తోంది. 100 శాతం సేంద్రీయ పత్తి నుండి తయారుచేసిన ఫ్యాబ్రిక్ ను తన డిజైన్స్‌కు ఉపయోగిస్తున్నారు. షర్ట్ డిజైన్స్, బ్యాండ్స్, బ్యాగులు పూర్తిగా బయోడిగ్రేడబుల్కి మారిపోయాయి. మెన్స్ బ్రాండ్‌లో పేరెన్నికగన్న బెస్పోక్ రాఘవేంద్ర రాథోడ్ ‘పర్యావణం శ్రేయస్సును అంతా దృష్టిలో పెట్టాల్సిన సమయం ఇది’ అని ప్రస్తావిస్తున్నారు. కరోనా వైరస్ ఫ్యాషన్‌ను మన్నదగిన భవిష్యత్తువైపు అడుగులు వేయిస్తోంది. నిజానికి ఫ్యాషన్ ప్రతి సీజన్ లోనూ కొత్త పోకడలు, శైలులు, సరికొత్త శ్రేణులతో మార్పు చెందుతుంది. మహమ్మారి కారణంగా ప్రజలు ఒక అడుగు వెనక్కి తీసుకొని వారి వినియోగ అలవాట్ల గురించి, పర్యావరణ నష్టం గురించి స్వయంగా తెలుసుకునే అవకాశం ఇకపై ఉంది. అనితా డోంగ్రే ఫ్యాషన్ డిజైనర్ -
Santoshi Shetty: నల్లగా ఉంది ఈమె ఫ్యాషన్ బ్లాగరా అన్నారు
పెద్దపెద్ద భవనాలు నిర్మించి మంచి ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంది! అనుకోకుండా ఫ్యాషన్‌పై దృష్టిమళ్లడంతో ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తన ప్రతిభతో ఫ్యాషన్ స్టార్‌గా ఎదిగి లక్షలమంది ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది సోషల్ స్టార్ సంతోషి శెట్టి. ‘ద స్టైల్ ఎడ్జ్’ పేరిట ఫ్యాషన్ బ్లాగ్‌ను నడుపుతూ.. ఇండియాలోనే మోస్ట్ పవర్‌పుల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది సంతోషి. ముంబైలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సంతోషి చిన్నప్పటి నుంచి చురుకైనది. స్కూలు, కాలేజీల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేది. ఒకపక్క ఫుట్‌బాల్ ఆడుతూనే మరోపక్క ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపించాలనుకునేది. ట్రెండ్‌కు తగ్గట్టు ఉండేందుకు ప్రయత్నించేది. ఆర్కిటెక్చర్లో డిగ్రీ చదివేందుకు కాలేజీలో చేరినప్పటికి.. ఫ్యాషన్‌పై తనకున్న ఇష్టాన్ని వదులుకోలేదు. క్యాంపస్‌లో అందరికన్నా భిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్‌తో ప్రత్యేకంగా కనిపించేది. నాన్న ఫోన్లో అకౌంట్ క్రియేట్ చేసి.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో సంతోషి తక్కువ ధరలో దొరికే వాటితోనే ఫ్యాషనబుల్‌గా ఉండేందుకు ప్రయత్నించేది. డిగ్రీ చదివేటప్పుడు తన స్నేహితులంతా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ గురించి మాట్లాడుతుంటే సంతోషి దగ్గర బేసిక్ నోకియా ఫోన్ మాత్రమే ఉంది. దీంతో నాన్న ఫోనును తీసుకుని అకౌంట్ క్రియేట్ చేసి దానిలో తన డైలీ అప్డేట్స్ ను పోస్టు చేసేది. ఒకపక్క డిగ్రీ చదువుతూనే.. తన ఫ్యాషన్ కు సంబంధించిన విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేస్తుండేది. ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి చదువులో కాస్త వెనకపడ్డప్పటికీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య బాగా పెరిగింది. దీంతో తనని నెటిజన్లు గుర్తిస్తున్నారని తెలిసి సొంత యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది సంతోషి. డిగ్రీ పూర్తిచేసేందుకు కష్టపడుతూనే.. తన సొంత వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్, యూట్యూబ్‌లలో కొత్తకొత్త ఫ్యాషన్ కంటెంట్‌ను పోస్టు చేస్తుండేది. ఫాలోవర్స్ పెరగడంతో డిగ్రీ అవగానే ‘ద స్టైల్ఎడ్జ్’ ఫ్యాషన్ బ్లాగ్‌ను ప్రారంభించి ఫ్యాషన్‌నే కెరీర్‌గా మలుచుకుంది. తన ఫ్యాషన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. 2016లో కాస్మోపాలిటన్ బ్లాగర్‌గానూ, ఎలే బ్లాగర్ ఆఫ్ ది ఇయర్‌గాను నిలిచింది. 2017 లో పల్లాడియం స్పాట్లైట్ ఫ్యాషన్ బ్లాగర్గాను పేరుతెచ్చుకుంది. సోషల్ మీడియా స్టార్‌గా అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ..ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్లలో దాదాపు పదిలక్షలమంది ఫాలోవర్స్‌తో దూసుకుపోతోంది 27 ఏళ్ల సంతోషి. నల్లగా ఉంది ఫ్యాషన్ బ్లాగరా..? ‘‘నేను ఫ్యాషన్‌కు సంబంధించిన వీడియో లు పోస్టు చేసినప్పుడు ప్రశంసల పరిమళాలతోపాటూ విమర్శల ముళ్లూ నన్ను గుచ్చాయి. నా వీడియోలు చూసిన కొందరు ఇంత నల్లగా ఉన్న అమ్మాయి ఫ్యాషన్ బ్లాగర్ ఎలా అయ్యింది? అనే కామెంట్స్, మరికొందరు ఆమె ఫోటోలో ఉన్నదానికంటే నల్లగా ఉంది అని అంటుంటే మనస్సు చివుక్కుమనేది. అయినప్పటికీ నా మీద నమ్మకం ఉంచుకుని ధైర్యంగా రోజూ కాలేజీకి వెళ్లి కష్టపడి చదవడం, అక్కడ ఇచ్చిన ఎసైన్మెంట్స్ శ్రద్దగా పూర్తిచేసేదాన్ని. కొత్తకొత్త కంటెంట్‌తో ఇన్‌స్టాలో వీడియోలు పోస్టు చేసేదాన్ని. ఆ ధైర్యమే ఈరోజు నన్ను మ్యాగజీన్ల కవర్‌పేజీపై నా ఫోటో వచ్చేలా చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాషన్‌షోలకు హాజరవుతూ ఆర్థికంగా నిలదొక్కుకున్నాను. మనల్ని మనం నమ్మితే ఏదైనా సాధించవచ్చు’’ అని చెబుతున్న సంతోషి శెట్టి ఫ్యాషన్ స్టార్. చదవండి: ఏదీ సులభంగా రాదు: జోయా అగర్వాల్ -
నిహారిక: కరోనా బాధితులకు అన్నదానం
-
Komal Pandey: మిడిల్ క్లాస్ నుంచి ఫ్యాషన్ స్టార్‌గా..
సోషల్ మీడియా వేదికగా నేటి యువతరం తమలోని ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ సోషల్ స్టార్లుగా ఎదుగుతూ.. ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. కొందరు మాత్రం ఇలా మెరిసి అలా వెళ్లిపోతుంటారు. కానీ, ఇండియన్ యూట్యూబర్, ఫ్యాషన్ బ్లాగర్, మోడల్, స్టైలిస్ట్, కంటెంట్ క్రియేటర్ ఫ్యాషన్ క్వీన్, ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ‘కోమల్ పాండే’ ఆరేళ్లుగా సోషల్ స్టార్‌గా నిలుస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఫ్యాషనబుల్‌గా ఎలా ఉండాలో వివరిస్తూ... రీయూజబుల్ ఫ్యాషన్‌ను పరిచయం చేస్తూ డిజిటల్ వరల్డ్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల కోమల్ పాండే 1994లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. బి.కామ్ చేసిన కోమల్‌కు చిన్నప్పటినుంచి ఫ్యాషనబుల్‌గా ఉండడమంటే ఎంతో ఇష్టం. దీంతో రోజుకోరకంగా తయారై కాలేజీకి వెళ్లేది. ఆమెను చూసిన ఫ్రెండ్స్ ‘నువ్వు చాలా స్టైలిష్‌గా ఉన్నావు! మోడలింగ్ ట్రై చేయెచ్చు కదా!’ అనేవారు. అయితే ఆ సమయంలో .. బాయ్‌ఫ్రెండ్ తో ప్రేమలో ఉన్న కోమల్... వాళ్ల మాటలు అంతగా పట్టించుకోలేదు. అలా నాలుగేళ్లు గడిచిన తరువాత బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పడంతో ఒక్కసారిగా తన జీవితం మారిపోయింది. లుక్ ఆఫ్ ది డే.. లవ్ బ్రేకప్ను మర్చిపోవడానికి తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగంలోకి తనదైన శైలిలో అడుగులు వేసింది. 2015లో ‘లుక్ ఆఫ్ ది డే’ పేరిట తన ఫ్యాషన్ కెరీర్ ను ప్రారంభించింది. రోజుకోరకంగా తయారై ఇన్ స్టాగ్రామ్‌లో ఫోటోలు పెట్టేది. కోమల్ ఫ్యాషన్ బుల్ ఫోటోలు.. ఇన్‌స్టా ఫాలోవర్స్‌కు నచ్చడంతో ఫాలోవర్స్ సంఖ్య పదివేల నుంచి 50 వేలకు చేరింది. ఈ ప్రోత్సాహంతో కోమల్ ‘‘ది కాలేజీ కోచర్’’ పేరిట బ్లాగ్‌ను ప్రారంభించింది. దీనిలో తక్కువ ఖర్చుతో ఫ్యాషన్, పాకెట్ ఫ్రెండ్లీ స్టైల్, బ్యూటీ, లుక్ బుక్స్, లేటెస్ట్ ట్రెండ్స్‌పై వీడియోలు పోస్టు చేసేది. ఉద్యోగం వదిలేసి.. 2015 నవంబర్‌లో కోమల్ బ్లాగ్‌ను గుర్తించిన ‘పాప్‌క్సో’ చానెల్ కోమల్‌కు పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది. పాప్క్సోలో చేరిన ఏడాదిన్నరలోనే 400 వీడియోలు చేసి కోమల్ మరింత ఫేమస్ అయ్యింది. అప్పుడే కోమల్‌కు ఓ ఆలోచన వచ్చింది. ‘‘నాలో ఇంత టాలెంటు దాగుందా? అయితే నేను ఎందుకు ఒకరి దగ్గర పనిచేయాలి? నా ప్రతిభను నమ్ముకుంటే నేనే బాస్‌గా ఎదుగుతాను!’’ అనుకోని వెంటనే పాప్క్సోలో ఉద్యోగం మానేసింది. అ తరువాత 2017లో తన సొంత యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. యూట్యూబ్ చానల్ల్లో రోజూ రకరకాల ఫ్యాషన్ లపై వీడియోలు రూపొందించి పోస్టుచేసింది.. వాటికి మంచి స్పందన రావడంతో ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. దీంతో ఆదాయం లక్షల్లో వస్తోంది. 2015 నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియా స్టార్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ.. మరోపక్క హనర్, వివో, గార్నియర్, మెబ్లిన్ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘‘నేను చిన్నప్పటి నుంచి స్టైలిష్‌గా, ఫ్యాషనబుల్‌గా ఉండేందుకు ఇష్టపడేదాన్ని. ఆ ఇష్టమే ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. చాలామంది ఫ్యాషన్ అంటే ధనవంతులకే సొంతమనుకుంటారు. అది నిజం కాదు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి ఫ్యాషన్ స్టార్‌గా ఎదిగాను. ఫ్యాషన్‌గా ఉండాలంటే రోజూ కొత్తగా, ట్రెండీగా ఉండేలా ప్రయత్నించాలి. అయితే మీ ఫ్యాషన్ చాలా సింపుల్‌గానూ, సౌకర్యంగానూ ఉండేలా చూసుకోవాలి’’ అని కోమల్ చెప్పింది. -
‘అమ్మ’ను గెలిపించిన మెడికవర్ వైద్యులు
సాక్షి, సిటీబ్యూరో: పుట్టుకతోనే తక్కువ బరువు (550 గ్రాములు)తో జన్మించి..మృత్యువుతో పోరాడుతున్న ఓ శిశువుకు మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. 140 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడారు. ప్రస్తుతం శిశువు బరువు 2.5 కేజీలకు చేరుకోవడంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు చికిత్స సంబంధించిన వివరాలను ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు. నెలలు నిండక ముందే సిజేరియన్ ద్వారా ప్రసవం.. నగరానికి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ గతేడాది నవంబర్ ఆరో తేదీన తొలి కాన్పులో భాగంగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు నెలలు నిండక ముందే నొప్పులు రావడంతో సిజేరియన్ ద్వారా బిడ్డను బయటికి తీయాల్సి వచ్చింది. 24 వారాల ఐదు రోజులకు శిశువు జన్మించింది. ఈ సమయంలో శిశువు బరువు కేవలం 550 గ్రాములే. సాధారణంగా ఇంత తక్కువ బరువుతో జన్మించిన శిశువులు బతకడం చాలా కష్టం. కానీ మెడికవర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు డాక్టర్ మంజుల అనగాని, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె, డాక్టర్ నవిత, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ జనార్దన్‌రెడ్డి, డాక్టర్ శశిధర్, డాక్టర్ రాకేష్‌ల నేతృత్వంలోని వైద్య బృందం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తక్కువ బరువుతో జన్మించిన శిశువును ఎలాగైనా బతికించాలని భావించారు. ఈ మేరకు మూడు రోజుల పాటు వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందించారు. ఆ తర్వాత ఎన్ఐసీయూకు తరలించి సీపీఏపీతో శ్వాసను అందించారు. పుట్టిన రెండో రోజు నుంచే శిశువుకు ఐవీప్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, ట్యూబ్ ద్వారా పాలు అందించారు. ఇదే సమయంలో శిశువుకు జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఫీడింగ్ ఆపేసి..యాంటిబయా టిక్ డోస్‌ను పెంచారు. శిశువు కోలుకున్న తర్వాత నేరుగా పాలు పట్టడంతో పాటు సీపీఏపీ ప్రక్రియను నిలిపివేసి, స్వయంగా శ్వాసతీసుకునే విధంగా చేశారు. ప్రస్తుతం శిశువు 2.5 కేజీల బరువు పెరిగింది. శ్వాస తీసుకోవడంతో పాటు స్వయంగా పాలు తాగుతుంది. గతంతో పోలిస్తే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. దీంతో శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. చికిత్సకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు అయినట్లు ఆస్పత్రి వర్గాల తెలిపాయి. -
చందేరీ సిల్క్ డిజైన్స్.. లైట్ అండ్ బ్రైట్
చూస్తే చూపు తిప్పుకోనివ్వనంత బ్రైట్నెస్ కట్టుకుంటే లైట్ వెయిట్నెస్ అదే, చందేరీ చమక్కు. చందేరీకి అంచుగా బెనారస్ సిల్క్ జత చేరినా.. గద్వాల పట్టు కలిసి నడిచినా ముచ్చటైన డిజైన్‌గా మెరిసిపోతోంది. సంప్రదాయ డ్రెస్ డిజైన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు భార్గవి కూనమ్. హైదరాబాదీ డిజైనర్ భార్గవి వివిధ రకాల చేనేతలతో అందమైన దుస్తులను రూపొందిస్తారు. వివాహ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చే డిజైన్స్‌కు పేరెన్నిక గన్న డిజైనర్ చందేరీ సిల్క్‌తో చేసిన డిజైన్స్ ఇవి. లైట్.. బ్రైట్ కాంబినేషన్లో రూపొందించిన ఈ డిజైన్స్ గురించి మరింత వివరంగా... టచందేరీ సిల్క్ డ్రెస్సులు, శారీస్ ఇప్పుడు ఏ విధంగా ట్రెండ్‌లో ఉన్నాయి? మన దేశీయ చేనేతలు ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. వాటిలో చందేరీకి ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. కోరా సిల్క్ మిక్సింగ్‌తో చందేరీ సిల్క్‌ను నేస్తారు. కలర్స్ బ్రైట్‌గా, స్పేషల్‌గా ఉంటాయి. చిన్న బుటీ, అంచులు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. చేనేతకారులను కలిసి, మాదైన ప్రత్యేక డిజైన్స్ చెప్పి ఈ చీరలను నేయిస్తాం. దీని వల్ల ఏ చీర అయినా, ఫ్యాబ్రిక్ అయినా మరో రెప్లికా అంటూ ఉండదు. మీరు చేసిన కాంబినేషన్స్? చందేరీ లెహంగాలను రూపొందిస్తే ఏవైనా రెండు, మూడు కాంబినేషన్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటాను. బెనారస్, గద్వాల, కంచిపట్టు అంచులు ఉంటాయి. వీటి వల్ల లెహంగా లుక్ గ్రాండ్‌గా మారిపోతుంది. వీటికి సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినవి, ప్లెయిన్ బ్లౌజ్‌లు, గ్రాండ్‌గా అనిపించే పట్టు దుపట్టాలను కాంబినేషన్‌గా ఉపయోగిస్తాం. చందేరీ సిల్క్ దుస్తులు ఏ సీజన్‌కి బాగుంటాయి? ఏ సీజన్‌కైనా బ్రైట్నెస్ తెస్తాయి ఇవి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కావడంతో రాబోయే వివాహ వేడకలకు, వేసవి కాలానికి సౌకర్యంగా, మరింత బాగుంటాయి. | ఎవరెవరికి.. ఏ వయసు వారికి చందేరీ ఫ్యాబ్రిక్ దుస్తులు, చీరలు బాగుంటాయి? అన్ని వయసుల వారికి చందేరీ నప్పుతుంది. అయితే, బ్లౌజ్ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టీనేజ్, యంగేజ్ వారికి చందేరీ ఫ్యాబ్రిక్‌తో ఆకర్షణీయమైన దుస్తులను రూపొందింవచ్చు. వీటిని ఏ కాంబినేషన్లో ధరిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తారు? లెహంగా లేదా శారీ బ్రైట్ కలర్ ఎంచుకుంటే బ్లౌజ్ ప్లెయిన్‌గా ఉండాలి. కొంచెం ఇండోవెస్ట్రన్ టచ్ కూడా దీనికి ఇవ్వచ్చు. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లతో ఆ ప్రయోగం చేయవచ్చు. అయితే, సందర్భం, వేడుకను బట్టి ఇక్కడ ఇచ్చిన డిజైన్స్‌ను ఎంచుకోవచ్చు. -
ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్
ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్. ముంబైలో క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటూ కూడా డ్రెస్ డిజైనర్‌గా కొనసాగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తూ, అవార్డులూ పొందుతోంది. ‘సంతోషంగా ఉండటం వల్లే వ్యాధిని ఓడించగలుగుతున్నాను’ అంటోంది మనాలి. ముంబయికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ మనాలి కిందటి సంవత్సరం క్యాన్సర్ చికిత్సలో భాగంగా 12 కెమోథెరపీలు చేయించుకున్నది. ఇప్పుడు ఆమె మరోసారి తన డిజైనింగ్ నైపుణ్యంతో ప్రజలను ప్రభావితం చేస్తోంది. క్యాన్సర్ రోగులందరికీ జీవితాన్ని వదులుకోకుండా ముందుకు సాగాలని మనాలి తన జీవితం ద్వారా నిరూపిస్తోంది. 2018 ఏప్రిల్‌లో తన గర్భాశయంలో ఏదో తేడా ఉందని మనాలికి అర్ధమైంది. ఈ కారణంగానే ప్రతి నెలా భారీగా రక్తస్రావం జరిగేది. ఆపరేషన్ చేసి, తన గర్భాశయాన్ని తొలగించాలని ఆమె డాక్టర్ని కోరింది. దీంట్లో భాగంగా బయాప్సీ టెస్ట్ చేయడంతో ఆమెకు క్యాన్సర్ ఉందని తేలింది. క్లినికల్ భాషలో, దీనిని ఎండోమెట్రియల్ స్ట్రోమల్ సార్కోమా అంటారు. ప్రతిరోజూ సంతోషంగా.. మనాలికి క్యాన్సర్ ఉందని కుటుంబంలో అందరూ భయపడ్డారు. అదే సమయంలో, ఆమె ఫ్యాషన్ షో కోసం దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ఆమె తల్లిదండ్రులు మనాలికి క్యాన్సర్ అనే విషయం ఆమెకు చెప్పకుండా దాచారు. కాని, వారి విచారకరమైన ముఖాలను చూడటంతో ఆమెకు తన స్థితిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. గతంలో మనాలి కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేదు. అందుకే, అది క్యాన్సర్‌కు దారి తీస్తుందని వారూ గుర్తించలేదు. తన చావో బతుకో ఏదైనా జరగవచ్చని మనాలికి తెలుసు. దీంతో బతికి ఉన్నన్నాళ్లూ తన కుటుంబంతో సంతోషంగా ఉంటూ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా, ప్రతిరోజూ సంతోషంగా గడపాలని కోరుకుంది. ఈ అనారోగ్యం సమయంలో కూడా మనాలి తన ఆలోచనను సానుకూలంగా మార్చుకుంది. ముంబయ్‌లోని సహారా స్టార్ హోటల్లో ఇటీవల జరిగిన లోక్మత్ లైఫ్‌స్టైల్ ఐకాన్ 2020 అవార్డు వేడుకలో ఫ్యాషన్ డిజైనర్ ఐకాన్ 2020 అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మనాలి..‘కుటుంబం, స్నేహితులే నా బలం. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా క్యాన్సర్ నెమ్మదిగా చంపేస్తుంది. జుట్టు పోతుంది, అందం తగ్గుతుంది. అన్నీ తెలుసు. కానీ, మన కల మనల్ని బతికించాలి. లక్ష్యం వైపుగా ప్రయత్నించాలి అనుకున్నాను. అప్పుడే నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. విగ్గు పెట్టుకుంటాను, డిజైనర్ డ్రెస్సులు ధరిస్తాను. అలాగే సంతోషంగా నా జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాను. ఇప్పుడు సమస్య లేదని అనను. కానీ, డిజైనర్‌గా నా పనిని నేను కొనసాగిస్తూనే ఉంటాను. ఫ్యాషన్ షోలలో పాల్గొంటాను. కెరియర్లో ఎదుగుతాను. మూడేళ్లుగా నా పనుల్లో ఎక్కడా అంతరాయం రాకుండా చూసుకున్నాను. క్యాన్సర్ పేషంట్స్‌కు రోగం పట్ల అవగాహన కల్గిస్తూ మరింత సంతృప్తిగా జీవిస్తాను’ అని తెలిపారు మనాలి. క్యాన్సర్ అనగానే బతుకు భయంతో కుంగిపాటుకు లోనయ్యేవారికి మనాలి చెప్పే మాటలు ఉత్తేజాన్ని నింపుతాయి. ఆమె జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది. క్యాన్సర్ చికిత్స సమయంలో..; ఫ్యాషన్ డిజైనర్‌గా అవార్డు అందుకుంటూ.. -
హైటెక్ సిటీ: పబ్ ప్రారంభం సెలబ్రెటీల సందడి..
-
బిగ్‌బాస్: సమంత జ్యువెలరీ ఖరీదెంతో తెలుసా
టాలీవుడ్ టాప్ రేటింగ్ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. పడుచు పిల్లోడు నుంచి పండు ముసలి వరకు వయసుతో సంబంధం లేకుండా షోను వీక్షించేవారే. నాల్గో సీజన్ బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న కింగ్ నాగార్జున షోకు ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పక తప్పదు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా షో నిర్వహణలో ఆయన కూడా ఎప్పూడూ కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ఉంటారు. అయితే దసర పండుగ సందర్భంగా బిగ్‌బాస్ అభిమానులకు, వీక్షకులకు కింగ్ పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా కోడలు అక్కినేని సమంతను షో వ్యాఖ్యతగా బాధ్యతలు అప్పగించాడు. కఠినమైన పాత్రలను సైతం సవాలుగా స్వీకరించే సమంత.. మామ నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా తన మాటల మంత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. చేసిన ఒక్క ఎపిసోడ్‌లోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకొని.. మామకు తగ్గ కోడలు అనిపించుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తొలిసారి హోస్టింగ్‌గా వ్యవహరిస్తుండటంతో లుక్‌పైనా అక్కినేని కోడలు ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయబద్దంగా చీరకట్టులో మైమరిపించింది. సామ్ లుక్‌పై సోషల్ మీడియాలో సైతం పెద్ద చర్చే సాగింది. అయితే ఆమె డిజైనర్ మనోజ్క్ష పడిన కష్టం అంతా ఇంతా కాదు. (నాగ్ వెనుక స్టైలిష్ ఫ్యాషన్ డిజైనర్) వింటేజ్ లుక్‌లో సమంతను సరికొత్తగా చూపించింది ఫ్యాషన్ డిజైనర్ మనోజ్ఞ. రూ.44,800 విలువైన బనారస్ చీరను కట్టించి, ఆమె ఒంటిపై ఒరిజినల్ నగలను వేశారు. నెక్ చోకెర్, ఇయర్ రింగ్స్, త్రిశూల్, బ్యాంగిల్స్ వంటి వాటిని ధరించింది. వీటన్నిటి ఖరీదు సుమారు రూ.35 లక్షల పైమాటే. ఎంతో అందంగా సమంతను తయారు చేయడం వల్ల.. ఆ ఎపిసోడ్‌పై హైప్ బాగా వచ్చింది. సమంత చీర ఖరీదు రూ.44లక్షలు అంటూ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే.. చీర ఖరీదు కేవలం రూ.44,800 అని, జ్యువెలరీ మాత్రం రూ.35 లక్షలంటూ మనోజ్ఞ పేర్కొంది. అంతేకాదు బిగ్‌బాస్ షోకు నాగార్జునకు సైతం ఆమే డిజైనర్‌గా వ్యవహరిస్తోంది. ఓ పక్క మామని, మరో పక్క కోడల్ని హ్యాండిల్ చేస్తూ.. అందరి మన్ననలు సొంతం చేసుకుంది మనోజ్ఞ ఆవునూరి. -
బిగ్‌బాస్: క్లాసిక్ లుక్ వెనుక బాస్ బ్యూటీ!
అక్కినేని నాగార్జున. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఆయనలోని అందం, స్టైల్. ఆయన నడిచినా, నిలబడినా, మాట్లాడుతున్నా..అంతా స్టైల్గానే ఉంటుంది. ఆ స్టైల్‌కి 1990లోనే అమ్మాయిలంతా ఫిదా అవ్వగా..నేటితరం అమ్మాయిలూ ‘అరే నాగ్ భలే ఉన్నాడే’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు విసురుతున్నారు. తాజాగా బిగ్‌బాస్–4 హోస్ట్‌గా చేస్తున్న నాగ్ సరికొత్తగా బుల్లితెరపై మెరుపులు మెరిపిస్తున్నాడు. క్యాజువల్ అండ్ క్లాసిక్ లుక్‌లో వారం వారం తన అభిమానులతో పాటు, అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాడు. నాగ్ అంత స్టైలిష్‌గా ఉండటానికి, ఆయనని అంత స్టైలిష్‌గా తీర్చిదిద్దడం వెనుక స్టైలిష్ ఫ్యాషన్ డిజైనర్ ‘మనోజ్ఞఆవునూరి’ కృషి ఎంతో ఉంది. చిన్న వయసులోనే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున లాంటి వారికి ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసిన ఆమె తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బుల్లితెరపై బిగ్‌బాస్– 4ను తిలకిస్తున్నారా? అందులో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ నటుడు నాగార్జునను గమనించారా? ఆయన ఇదివరటికన్నా మరింత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు కదూ. దీని వెనుక యువ డిజైనర్ ఆవునూరి మనోజ్ఞ ఘనత ఉంది. నాగ్ మరింత స్టైలిష్‌గా కనిపించేలా.. ఆయన లుక్ తళుక్కుమనేలా ఆమె తపిస్తోంది. తెర వెనక ఉండి అందరి ప్రశంసలను అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున లాంటి వారికి స్టైలిష్, ఫ్యాషన్ డిజైనర్‌గా చేయగలిగే స్థాయికి ఎదిగింది. – చైతన్య వంపుగాని నిజామాబాద్‌కు చెందిన మనోజ్ఞ ఆవునూరి ముంబైలోని ‘నిఫ్ట్’ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్‌లో ‘మాస్టర్స్ ఇన్ డిజైనింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్’ కోర్సు పూర్తి చేసింది. నాగార్జున స్టైలిష్, ఫ్యాషన్ డిజైనర్‌గా చేస్తున్న పల్లవి ద్వారా ఈ అవకాశాన్ని ఆమె సొంతం చేసుకుంది. సైరా మూవీ, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లాంటి వాటికి ఇటు చిరంజీవి, అటు నాగార్జునలకు స్టైలిష్‌గా వ్యవహరించారు మనోజ్ఞ. చిరు టు నాగ్ ‘సైరా నరసింహారెడ్డి’ మూవీకి సైతం చిరంజీవికి స్టైలిష్, ఫ్యాషన్ డిజైనర్‌గా చేసింది మనోజ్ఞ. చిరంజీవి కుమార్తె సుస్మితతో కలిసి మనోజ్ఞ డిజైనింగ్ అండ్ స్టైలిష్‌గా చేశారు. చిరు ధరించిన దుస్తులు, లుక్స్ యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా సైరా నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్‌లో నాగ్‌కు స్టైలిష్‌గా చేసేందుకు నాగ్ స్టైలిష్, డిజైనర్ పల్లవి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశమే ఆమెను ఈ విధంగా ముందుకు తీసుకెళ్తోంది. క్యాజువల్ అండ్ క్లాసిక్ లుక్‌లో.. బుల్లితెరపై నాగార్జున సందడిని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్‌బాస్–3తో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన నాగ్ బిగ్‌బాస్– 4తో మరింత మందికి చేరువయ్యా రు. నాగార్జున సినిమాలో కనిపించినా, బయట కనిపించినా ఎప్పుడూ ఆయన ఫిజిక్, డ్రెస్సింగ్, స్టైలిష్ గురించే మాట్లాకుంటుంటారు. బిగ్‌బాస్– 4 సీజన్లో నాగ్ కొత్తగా చూపించేందుకు మనోజ్ఞ ఓ అడుగు ముందుకేశారు. షాపింగ్ మాల్ నుంచి బిగ్‌బాస్ దాకా.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున అందులో వస్తున్న అడ్వర్టైజ్మెంట్స్లో కూడా మంచి యంగ్ లుక్‌తో కనివిందు చేస్తున్నారు. యంగ్ లుక్‌లో టీ షర్ట్, ట్రజర్తో, కార్పొరేట్ లుక్ కోసం సూట్లో, పెళి, ఇతర శుభకార్యాలయాల లుక్ కోసం పైజామా, కుర్తా, షేర్వాణీ వంటి వాటిలో హుందాగా కనిపిస్తూ అందరికీ కనెక్ట్ అవుతున్నారంటే దానికి కారణం మనోజ్ఞయే. మామ, కోడల్ని హ్యాండ్లింగ్ చేస్తూ.. ఓ పక్క నాగ్ని, మరో పక్క ఆయన కోడలు సమంత అక్కినేనిని హ్యాండిల్ చేస్తోంది మనోజ్ఞ. దసరా రోజు ఎపిసోడ్‌కు నాగార్జున షూటింగ్లో ఉన్నందున రాలేకపోయాడు. ఆ ఎపిసోడ్‌ను ఆయన కోడలు సమంత చేసింది. వింటేజ్ లుక్‌లో సమంతను సరికొత్తగా చూపించింది. ఇలా ఓ పక్క మామని, మరో పక్క కోడల్ని హ్యాండిల్ చేస్తూ.. అందరి మన్ననలు సొంతం చేసుకుంది మనోజ్ఞ ఆవునూరి. కాన్ఫిడెన్స్‌తోనే సాధించగలం.. పెద్ద పెద్ద స్టార్స్‌కి స్టైలిష్, డిజైనింగ్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు. ఆ అవకాశం రావాలి అంటే మనం ఎంతో కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్లాలి. ప్యాషన్‌తో ఉంటూ, మన పనిలో డెడికేషన్ కనిపిస్తే అవకాశాలు వస్తుంటాయి. నాగ్ సార్ మంచి స్టైలిష్‌గా ఉంటారు. కానీ.. ఆయన్ని మరింత స్టైలిష్‌గా చూపించాలంటే చాలా కేర్ తీసుకోవాలి, దాని గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. మేం చెప్పింది ఆయన ఒప్పుకోవాలి. ఆయన మనసులో ఉన్నదానికి అనుగుణంగా మేం ముందుకు వెళ్లాలి. బిగ్‌బాస్– 4 సీజన్‌ను క్లాసిక్ అండ్ క్యాజువల్ లుక్‌లో చూపిద్దామని చెప్పగానే ఆయన ఓకే అనేశారు. అందుకే ప్రతి ఎపిసోడ్లో నాగ్ సార్‌ని సరికొత్తగా, గ్లామరస్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యా. – మనోజ్ఞ ఆవునూరి, స్లైలిస్ట్, ఫ్యాషన్ డిజైనర్ -
బాలికలకు ప్రత్యేకం.. డిజైనర్ యూనిఫామ్
ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీకి ఇండియన్ ఫ్యాషన్ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ డిజైనర్ స్కూల్లో చదువుకునే బాలికలకు యూనిఫామ్ రూపకల్పన చేసి మరింత ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడా చిత్రాలు సోషల్ మీడియా వేదిక మీద అందరి ప్రశంసలు పొందుతున్నాయి. రాజస్థాన్ సిటీ జైసల్మేర్‌లో రాజ్‌కుమారి రత్నావతి బాలికల పాఠశాల ఉంది. ఇందులో 400 మంది బాలికలు చదువుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం మూసిఉన్న ఈ పాఠశాల డిసెంబర్లో తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడి బాలికల కోసం సబ్యసాచి ముఖర్జీ కళాత్మకమైన యూనిఫామ్‌లను రూపొందించారు. సబ్యసాచి దేశీయ చేనేతలను తన డిజైన్ల రూపకల్పనలో ఉపయోగిస్తాడని తెలిసిందే. అలాగే ఈ యూనిఫామ్‌లలో మేలిమి చేనేతలను ఉపయోగిస్తూ వాటిపైన సేంద్రీయ రంగులు, బ్లాక్ ప్రింట్‌తో కూడిన అజ్రఖ్ ఆర్ట్‌తో డిజైన్ చేశారు. ఈ కళాత్మకమైన యూనిఫామ్‌లు ధరించిన అమ్మాయిల ఛాయాచిత్రాలను సబ్యసాచి ముఖర్జీ తన ఇన్‌స్ట్రాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. యూనిఫామ్ మీద స్థానిక కళ మోకాలి పొడవున ఏకరీతిగా ఉండే ఫ్రాక్. గుండ్రటి మెడ, త్రీ క్వార్టర్ స్లీవ్స్, మెరూన్ స్లగ్స్తో ఉన్న ఈ యూనిఫామ్‌కి ప్యాచ్ చేసిన రెండు పాకెట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్రాక్స్పైన అజ్రఖ్ ప్రింట్ ఉంటుంది. అజ్రఖ్ అనేది రాజస్థాన్, గుజరాత్ల వారసత్వ కళ. ఇది హరప్పా కాలం నాటిదిగా చరిత్ర చెబుతోంది. సాధారణంగా ఈ ప్రింట్‌ను ఖనిజ, కూరగాయల రంగుతో తయారు చేస్తారు. అజ్రఖ్ ప్రింట్ ఉన్న దుపట్టాలను ఆడ–మగ తేడా లేకుండా ధరిస్తుంటారు. ‘అజ్రఖ్ భారతీయుల శక్తివంతమైన శైలి. మన దేశంలో పిల్లలు కూడా ధరించడానికి అనువుగా దుస్తుల శైలి ఉండాలి. అజ్రఖ్ స్థానిక వారసత్వం. ఇక్కడి కళ ప్రాముఖ్యత ఈ విధంగా పిల్లలకు అర్ధమవుతుంది. స్థానిక కళకు ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే అజ్రఖ్ ఆర్ట్‌ను యూనిఫామ్‌కు వాడుకున్నాను’ అని తెలిపారు సబ్యసాచి. అంతేకాదు ఈ యూనిఫామ్‌కు ‘అజ్రఖ్’ అనే పేరు పెట్టారు. ‘బాతిక్, ఇకత్తో పాటు అంతర్జాతీయంగా గౌరవనీయమైన వస్త్రాల పంధాలోకి అజ్రఖ్ ప్రవేశిస్తుంది. ఇండిగో, మాడర్ రూట్ రంగులతో ముద్రించడంతో కాటన్ క్లాత్ చాలా ఆకర్షణీయంగా మారింది’ అని అజ్రఖ్ కళ గురించి మరింతగా వివరించారు సబ్యసాచి. ఇటీవల సిట్టా అనే లాభాపేక్షలేని సంస్థతో కలిసి పనిచేశారు సబ్యసాచి. కళా నైపుణ్యాలపై శిక్షణ సిట్టా భారతదేశంలోని పేదల విద్య, ఆరోగ్యం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పనిచేస్తుంది. బాలికల విద్య, స్థానిక మహిళలకు సంప్రదాయ కళా నైపుణ్యాలపై అధికారికంగా శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. వీరి సహకారంతో ఈ డిజైనర్ 400 మంది బాలికలకు యూనిఫామ్ రూపకల్పన చేసి ఇచ్చాడు. సంప్రదాయ హస్తకళలను తీసుకొని వాటిని సమకాలీన డ్రెస్సింగ్‌కు తగినట్లుగా యూనిఫామ్‌లను రూపకల్పన చేశారు డిజైనర్ సబ్యసాచి. స్థానిక సహకార కేంద్రం ఉత్పత్తి చేసే అజ్రఖ్ ప్రింట్‌ను ఉపయోగించి పాఠశాల బాలికల కోసం యూనిఫామ్‌లను రూపొందించారు. దీని వల్ల స్థానిక సహకార కేంద్రంలో పనిచేస్తున్నవారికి ఉపాధి పెరిగింది. -
మితిమీరిన వేగం.. నలుగురికి తీవ్ర గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ 29 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ మితిమీరన వేగంతో బీఎండబ్ల్యూ కారును నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో లాజ్‌పత్ నగర్‌లోని అమర్ కాలనీ ప్రాంతంలో జరిగింది. ప్రమాదం అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని ఫ్యాషన్ డిజైనర్ రోష్నిగా గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘నిందితురాలు కారులో ఐస్ క్రీం తినడానికి ప్రయత్నిస్తుండగా పెంపుడు కుక్క ఆమె మీదకు దూకింది. ఆ కంగారులో రోష్ని అనుకోకుండా యాక్సిలరేటర్‌ని తొక్కింది. దాంతో ప్రమాదం జరిగి.. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. ప్రస్తుతం ఆమె బెయిల్ మీద విడుదలయ్యిందని తెలిపారు. -
ఫ్యాషన్ డిజైనర్ భారీ విరాళం..
ముంబై : కరోనా ఉపద్రవం విసిరిన సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తుంటే పలువురు సినీనటులు, సెలబ్రిటీలు తమకు తోచిన సాయంతో ముందుకొస్తున్నారు. మహమ్మారి వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అందరూ ఇళ్లకే పరిమితమవుతుండగా పనిచేస్తేనే పూటగడిచే పేదలకు పలువురు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. కోవిడ్-19తో చిన్నాభిన్నమైన చిరువ్యాపారులు, స్వయం ఉపాధి పొందే చేతివృత్తిదారుల కోసం వైద్య నిధి కింద రూ 1.5 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే తెలిపారు. కరోనా కట్టడికి అనూహ్యంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో చిరు వ్యాపారులపై పెనుప్రభావం చూపుతుందని, ఈ మహమ్మారితో పెరిగే వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ ఫౌండేషన్ ముందుకొస్తుందని ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో ఆమె పేర్కొన్నారు. పేదలు, చిరువ్యాపారులు, చేతివృత్తిదారులు కరోనా బారిన పడితే వారి వైద్య అవసరాల కోసం తమ ఫౌండేషన్ రూ 1.5 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. తమ ఉద్యోగులందరికీ వైద్య బీమా ఉందని, ఎమర్జెన్సీ తలెత్తితే వైద్య నిధి నిధులను వారి కోసం కూడా వెచ్చిస్తామని డిజైనర్ పేర్కొన్నారు. -
ఆయన మొదటి జీతం ఎంతో తెలుసా!
సెలబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ తారలు శ్రీదేవి నుంచి ఇప్పటీ యువ తారల సినిమాలకు ఎన్నో రకాల డిజైనర్ డ్రెస్‌లను అందింస్తూ తేరపై వారి అందాన్ని మరో లెవల్‌కు చేరుస్తారు. అంతేగాక అంతర్జాతీయంగా ఫ్యాషన్ షోలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు మనీష్ మల్హోత్రా. ఇక ఎప్పుడు బిజీగా ఉండే ఆయన తాజాగా హ్యూమన్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ఫ్యాషన్ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ స్థాయికి చేరడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, పంజాబీ కుటుంబంలో జన్మించిన తనకు ఫ్యాషన్ పట్ల, బాలీవుడ్ సినిమాలపై చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేదన్నారు. అంతేగాక డిజైనర్‌గా ఎదగాడానికి ఆయన తల్లి సహాకారం కూడా ఎంతో ఉందని గుర్తుచేసుకున్నారు. డిజైనర్‌గా అగ్రస్థానంలో ఉన్న మనీష్ సినీ పరిశ్రమలో ఫ్యాషన్ డిజైనర్‌గా 30 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. ‘చిన్నప్పటీ నుంచే నాకు ఫ్యాషన్‌తో పాటు బాలీవుడ్ సినిమాలంటే పిచ్చి. నిజం చెప్పాలంటే ఆ పిచ్చే నన్ను ఈ స్థాయికి చేర్చింది. ఇక ఫ్యాషన్‌పై ఇష్టంతో చదువుపై పెద్దగా శ్రద్ద చూపలేదు. ఇక నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఓ పెయింటింగ్ క్లాస్‌కు వెళ్లాను. అది నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ క్లాస్ బాగా నచ్చింది. దానిని నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇక సినిమాలలోని హీరో, హీరోయిన్లు ధరించిన దుస్తులను చూసి మా అమ్మ చీరలు, డ్రెస్‌లతో ప్రయోగాలు చేసేవాడిని’ అని మనీష్ చెప్పారు. ‘అలా నాకు ఫ్యాషన్ పట్ల మరింత ఆసక్తి పెరిగింది. ఎంతగా అంటే.. తరచూ మా అమ్మకు నేను ఫ్యాషన్ గురించి సలహాలు ఇస్తూ ఉండేవాడిని’ అని చెప్పుకొచ్చాడు. కాలేజీలో చేరినప్పుడు బొటిక్‌లో పనిచేస్తూ.. మోడలింగ్ చేయడం ప్రారంభించాను. అలా ఏడాదిన్నారపాటు ఆ బొటిక్‌లో పని చేశా. అప్పుడు నాకు నెలకు రూ.500 జీతం వచ్చేది. దాన్ని నేను చాలా విలువైనదిగా భావించేవాడిని. ఫ్యాషన్ డిజైనింగ్‌లో అధ్యయనం చేయడం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ ఆర్థిక కారణాల వల్ల విదేశాలకు వెళ్లలేకపోయాను. ఇక నా సొంతంగా ఓ స్కూల్ పెట్టి క్లాస్‌లు చెబుతూ.. గంటల తరబడి స్కెచ్ డిజైన్స్ గీస్తూ ఉండేవాడిని’ అంటూ వివరించారు. ఈ క్రమంలో తన 25వ ఏటా జూహీ చావ్లా సినిమాకు డిజైనర్‌గా పనిచేసే అవకాశం వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత 1995లో వచ్చిన అమీర్‌ఖాన్, ఊర్మీళ, జాకీర్ ష్రాఫ్‌ల ‘రంగీలా’ డిజైనర్‌గా పని చేసినందుకు మొదటి ఫీలింఫేర్ ఆవార్డు అందుకున్నట్లు ఆయన చెప్పారు. ‘అలా ఎన్నో సినిమాలకు పని చేస్తూ.. ఫ్యాషన్ షోలో భాగంగా ప్రపంచమంత తిరిగేవాడిని. ఈ నేపథ్యంలో 2005లో నా సొంతంగా ఫ్యాషన్ లాబెల్ను ప్రారంభించాను. అలా ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగాను’ అంటూ ఫ్యాషన్‌పై తనకున్న ఇష్టాన్ని తెలిపారు. ఈ స్థాయికి చేరడంమంటే సాధారణ విషయం కాదని, ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కోని సమస్యలను అదిగమిస్తేనే మనం అనుకున్న స్థాయికి చేరగలమన్నారు. ఇక బాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నాలుగో తరం నటి, నటులతో పనిచేస్తున్న మనీష్ .. ఈ ఏడాదితో పరిశ్రమలో ఫ్యాషన్ డిజైనర్‌గా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఫ్యాషన్ షో ఇచ్చేముందు భయపడతానని తెలిపారు. నేన ఈ స్థాయికి ఎలా వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను.. అనే విషయాలను నేను మర్చిపోలేనని చెబుతూ తన నిరాంబరతను చాటుకున్నాడు మనీష్ మల్హోత్రా. -
తెల్లని దుస్తుల్లో రాజహంసలా..
అహ్మదాబాద్: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. ఒకప్పటి మోడల్, ఫ్యాషన్ డిజైనర్ కూడా. భారత్ పర్యటన సందర్భంగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో వస్తారా లేదానని యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అమెరికా నుంచి అహ్మదాబాద్‌కి వచ్చిన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం నుంచి మెలానియా తనకు ఎంతో ఇష్టమైన తెలుపు రంగు దుస్తుల్లో ఒక రాజహంసలా కిందకి దిగారు. తెల్లని జంప్ సూట్ ధరించి నడుం చుట్టూ ఆకుపచ్చని రంగు సాష్ (ఫ్యాషన్ కోసం ధరించేది) అందంగా చుట్టుకున్నారు. భారత సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా, మన దేశీ టచ్‌తో రూపొందించిన డ్రెస్ ధరించడం అందరినీ ముగ్ధుల్ని చేసింది. జుట్టును లూజ్‌గా వదిలేసి అతి కొద్దిగా మేకప్ వేసుకొని తన సహజ సౌందర్యంతోనే ఆమె మెరిసిపోయారు. స్వయంగా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మెలానియా సాధారణంగా తన దుస్తుల్ని తానే డిజైన్ చేసుకుంటారు. కానీభారత్ పర్యటన కోసం ప్రముఖ ఫ్రెంచ్ అమెరికన్ డిజైనర్ హెర్వ్ పెయిరె డిజైన్ చేసిన సూట్‌ని ధరించారు. పాల నురుగులాంటి తెల్లటి జంప్ సూట్ వేసుకొని, ఆకుపచ్చ రంగు పట్టు మీద బంగారం జరీ ఎంబ్రాయిడీతో చేసిన దుప్పట్టాను చుట్టుకున్నారు. భారత్ వస్త్ర పరిశ్రమకు చెందిన 20 శతాబ్దం నాటి తొలి రోజుల్లో డిజైన్లను ఆకుపచ్చ రంగు దుప్పట్టాపై చిత్రీకరించినట్టుగా హెర్వ్ పెయిర్ తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో వెల్లడించారు. తన మిత్రులు పంపించిన కొన్ని డాక్యుమెంట్లని చూసి అత్యంత శ్రద్ధతో ఆకుపచ్చ రంగు సాష్‌ను తయారు చేసినట్టు తెలిపారు. మెలానియా ధరించిన డ్రెస్‌పై ట్విటర్లో ప్రశంసలే వచ్చాయి. కొందరు హాస్యఛలోక్తుల్ని కూడా విసిరారు. అందానికే అందంలా ఉండే మెలానియా కొంటె కుర్రాళ్ల బారి నుంచి తనని తాను కాపాడుకోవడానికి కరాటే డ్రెస్ తరహాలో దుస్తులు ధరించారని కామెంట్లు చేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ డార్క్ కలర్ సూట్ , పసుపు రంగు టై ధరించారు. మన భారతీయు వాతావరణానికి తగ్గట్టుగా వారి దుస్తుల్ని డిజైన్ చేశారు. -
ఫ్యాషన్ డిజైనర్ నుంచి ఫస్ట్ లేడీ
అయిదు అడుగుల 11 అంగుళాల ఎత్తు, పట్టుకుచ్చులా మెరిసిపోయే జుట్టు, చురుగ్గా చూసే కళ్లు.. అందానికి అందంలా ఉండే పుత్తడి బొమ్మ మెలానియా ట్రంప్. ఇప్పుడు అమెరికా ప్రథమ మహిళ. శ్వేత సౌధానికి మహారాణి. ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనర్, ఆ తర్వాత సూపర్ మోడల్. మోడలింగ్ చేస్తూ అతి పెద్ద ప్రపంచాన్ని చూశారు. ఆరు భాషల్లో మాట్లాడగలరు. స్లొవేనియన్, ఫ్రెంచ్, సెర్బియన్, జర్మన్, ఇటాలియన్, ఇంగ్లిష్ బాగా వచ్చు. కానీ ఇంగ్లిష్ మాతృభాష కాకపోవడంతో తన యాక్సెంట్‌ని ఎక్కడ వెటకారం చేస్తారన్న బెరుకో, సహజంగానే మితభాషి అవడమో కానీ నలుగురులోకి వచ్చి మాట్లాడరు. ఆమె ప్రపంచం ఆమెదే. తను, తన కొడుకు బారన్లే ఆమెకు లోకం. కమ్యూనిస్టు దేశానికి చెందిన ఫస్ట్ లేడీ స్లొవేనియాలో చిన్న పట్టణంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1970 ఏప్రిల్ 26న మెలానియా జన్మించారు. తండ్రి విక్టర్ న్వాస్ కారు డీలర్. తల్లి అమలిజా పిల్లల బట్టల్ని డిజైన్ చేసేవారు. అలా ఆమెకి పుట్టుకతోనే ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడింది. 16వయేటే మోడలింగ్ రంగంలోకి వచ్చారు. ఇటలీలోని మిలాన్‌లో ఒక యాడ్ ఏజెన్సీకి మోడల్‌గా పని చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదువుతూ యూనివర్సిటీ చదువు మధ్యలో ఆపేశారు. మోడలింగ్ మీదనే మొత్తం దృష్టి కేంద్రీకరించారు. 22 ఏళ్లు వచ్చాక మెలానియాకు కెరీర్లో బ్రేక్ వ చ్చింది. స్లొవేనియా మ్యాగజీన్ ‘జానా’లో ‘లుక్ ఆఫ్ ది ఇయర్’ పోటీలో రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె వెనక్కి చూసుకోలేదు. తాను వేసుకొనే డ్రెస్‌లను తానే డిజైన్ చేసుకునేవారు. 2000 ఏడాదిలో బ్రిటన్‌కు చెందిన ‘జీక్యూ’ మ్యాగజీన్ ఫొటోలకు నగ్నంగా పోజులిచ్చారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆ చిత్రాలు బయటికొచ్చి సంచలనమయ్యాయి. ట్రంప్‌తో డేటింగ్, పెళ్లి 1998లో అమెరికాకు వచ్చిన మెలానియాకు ట్రంప్‌తో ఒక పార్టీలో పరిచయమైంది. అప్పటికే రెండో భార్యతో విడాకులు తీసుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. కొన్నేళ్లు ట్రంప్‌తో డేటింగ్ చేశారు. 2005లో ట్రంప్‌తో వివాహమైంది. 2006లో మెలానియాకు కొడుకు బారన్ పుట్టాడు. ట్రంప్ తెంపరితనం, అమ్మాయిలు, వ్యవహారాలు, బహిరంగంగానే వారి పట్ల అసభ్య ప్రవర్తన ఇవన్నీ మెలానియాకు నచ్చినట్టు లేవు. అందుకే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని మెలానియా మధ్యలోనే వదిలేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి మకాం మార్చినపుడూ ఆమె వెంట వెళ్లలేదు. నాడు న్యూయార్క్‌లో కొడుకు చదు వు కోసం ఉండిపోయారట. 2017లో కొడుకుతో కలసి వైట్‌హౌస్‌కు మారారు. వైట్‌హౌస్‌లో వారిద్దరి పడక గదులు వేర్వేరు అంతస్తుల్లో ఉండటం వంటి బెన్నెట్ రాసిన ఫ్రీ మెలానియా పుస్తకంలో బయటకొచ్చి సంచలనమయ్యాయి. -
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మృతి..
పనాజీ : అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత వెండెల్ రోడ్రిక్స్ గోవాలోని కాల్వాలే గ్రామంలోని తన నివాసంలో మరణించారు. రోడ్రిక్స్ బుధవారం రాత్రి తన నివాసంలో కుప్పకూలారని, ఆయన మరణానికి కారణాలు తెలియరాలేదని స్ధానిక డీఎస్పీ గజానన్ ప్రభుదేశాయ్ తెలిపారు. ముంబైలో జన్మించిన రోడ్రిక్స్ (59) 1986 నుంచి 1988 వరకూ అమెరికా, ఫ్రాన్స్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌ను అభ్యసించారు. తొలి లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ ప్లానింగ్‌లో చురుకుగా పాలుపంచుకున్న రోడ్రిక్స్ పలు ఫ్యాషన్ వీక్స్‌లో తన కలెక్షన్స్‌ను ప్రదర్శించారు. తన నైపుణ్యాలతో అందరి మన్ననలు పొందిన రోడ్రిక్స్ మరణం కలిచివేసిందని గోవా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే ట్వీట్ చేశారు. కాగా రోడ్రిక్స్ గుండె పోటుతో మరణించారని, ఆయన మరణం ఫ్యాషన్ పరిశ్రమకు తీరని లోటని ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సునీల్ సేథీ అన్నారు. రోడ్రిక్స్ మృతి తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని, భారత్‌లోని ప్రముఖ డిజైనర్లలో ఆయన ఒకరని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. చదవండి : గోవా రాకుండా సల్మాన్‌పై నిషేధం! -
పట్టుకు సింగారం
ఏ చిన్న వేడుకైనా మగువలు పట్టుచీర ధరించడం వైపే మొగ్గుచూపుతారు. దాని మీదకు సంప్రదాయ బంగారు ఆభరణాలను ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పట్టుచీర మీదకు ధరించడానికి రకరకాల ఫ్యాషన్ జువెల్రీ అందుబాటులోకి వచ్చింది. ఇండోవెస్ట్రన్, వెస్ట్రన్ డ్రెస్సులకు నప్పే ఈ ఆభరణాలు చీరకట్టు మీదకు ఇప్పుడు ఒద్దికగా ఒదిగిపోతున్నాయి. ►సంప్రదాయ చీరకట్టు అయినా ఈ రోజులకు తగినట్టుగా ట్రెండీగా కనపడాలనేది యువతుల ఆలోచన. వీటిలో ఫ్యాషన్ జువెల్రీలో భాగమైన సిల్వర్, కుందన్, పూసలు, రత్నాలతో చేసిన వెస్ట్రన్ డిజైన్‌వేర్ బాగా నప్పుతుంది. వీటిలో పొడవాటి హారాలు, మెడను చుట్టేసే చోకర్స్ ఉంటున్నాయి. ►ఫ్యాషన్ జువెల్రీలో చెప్పుకోదగినది థ్రెడ్ జువెల్రీ. ఇది రకరకాల డిజైన్లలో రంగులలో పట్టుచీరల మీద కొత్తగా మెరుస్తోంది. ఈ ఆభరణాల్లో చీర అంచులు, ప్రింట్ల రంగులను తీసుకొని డిజైన్లు సృష్టిస్తున్నారు. ప్లెయిన్ పట్టుచీర అయితే, దాని మీదకు కాంట్రాస్ట్ లేదా మ్యాచింగ్ కలర్ థ్రెడ్ జువెల్రీ ధరిస్తే అద్భుతంగా ఉంటుంది. ►థ్రెడ్ జువెల్రీతో పాటు చెప్పుకోదగినది టెర్రకోట ఆభరణాలు. ఈ డిజైన్స్ సంప్రదాయపు సొబగులు అద్దడంలో సరైన పాత్ర పోషిస్తున్నాయి. ►సంప్రదాయ పట్టుకు ఈ తరహా ఆభరణాలే ధరించాలనే నియమాలేవీ లేవు. ఫ్యాషన్ జువెల్రీతో లుక్‌లో కొత్త మార్పులు తీసుకోవచ్చు. -
కుచ్చుల బొమ్మలు
పుట్టినరోజు, ఫ్యామిలీ గెట్ టు గెదర్స్, క్రిస్టమస్, న్యూ ఇయర్ ఇలా ఈ నెలలో వచ్చే వేడుకల జాబితా ఎక్కువే. ఈ సందర్భాలలో పిల్లల దుస్తుల విషయంలో అమ్మలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. వేడుక ఏదైనా నలుగురిలో తమ చిన్నారులు మరింతగా వెలిగిపోవాలని కోరుకుంటారు. పిల్లలకు సౌకర్యంతో పాటు గ్రాండ్‌గా ఉండే కుచ్చుల గౌన్లు ఇవి.. సౌకర్యం ముఖ్యం పిల్లలకు ఏ దుస్తులు సౌకర్యంగా ఉంటే ఆ డ్రెస్‌లో ఎక్కువ సేపు ఉంటారు. సాధారణంగా కాటన్, ఖాదీ బట్టలైతే వారి లేత చర్మానికి గుచ్చుకోవు. వీటిని బేస్ చేసుకుంటూ పిల్లల కోసం నెటెడ్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన ఈవెనింగ్ పార్టీవేర్ ఇది. కుచ్చుల వేడుక... వేడుకలో పిల్లలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కనిపించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలు కూడా నలుగురిలో తిరుగుతూ సందడి చేస్తుంటారు. తమ చుట్టూ తాము రౌండ్‌గా తిరగడం అంటే పిల్లలకు చాలా ఇష్టం. అలాంటప్పుడు తాము వేసుకున్న గౌన్ ఎంత ఫ్లెయిర్ వస్తే అంత బాగుంటామనుకుంటారు పేస్టల్ కలర్స్... ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నవి పేస్టల్ కలర్స్. పిల్లలు కూడా ఆ రంగులను ప్లెజంట్‌గా భావిస్తారు. జర్దోసీ వర్క్స్ కొంతవరకు కావాలనుకుంటే చిన్న చిన్న పువ్వులు, కట్ బీడ్స్ వాడుకోవచ్చు. ఇవి పిల్లల చర్మానికి గుచ్చుకోవు. చూడ్డానికీ బాగుంటుంది. ►పిల్లలకు ఎంత తక్కువ యాక్ససరీస్ వాడితే అంత సౌకర్యంగా ఉంటారు. ►జుట్టుకు చిన్న బ్యాండ్, మెడలో పల్చగా ఉండే చిన్న చైన్, చేతికి సన్నని బ్రేస్లెట్ వేస్తే చాలు. ►పిల్లల చర్మానికి హాని కలిగించనవి ఏవైనా బాగుంటాయి. ►చెప్పులు హీల్స్ కాకుండా ప్లాట్‌గా ఉండే షూస్‌ను ఎంచుకుంటే సౌకర్యంగా ఉంటాయి. ►ఇలాంటి డ్రెస్సుల మీదకు ఏ ఇతర యాక్ససరీస్ కూడా అంతగా ఎలివేట్ అవ్వవు. అందుకని ఏ ఇతర హంగులూ అక్కర్లేదు. నిహారిక ఫ్యాషన్ డిజైనర్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్ instagram: Niharika Design Studio -
కౌల్ స్టైల్ ట్యూనిక్... యూనిక్
మహిళలకు చాలా సౌకర్యంగా ఉండే డ్రెస్ కుర్తీ. దీంట్లో ఎన్నో రకాల మోడల్స్ వచ్చాయి. ఎప్పటికప్పుడు డిజైనర్లు ఈ కుర్తీ స్టైల్స్‌లో మార్పులు తీసుకువస్తూనే ఉన్నారు. అలా వచ్చిందే ఈ కౌల్ స్టైల్ కుర్తీ. కౌల్ ట్యునిక్గానూ పిలిచే ఈ కుర్తీకి దుపట్టాను కూడా జత చేయడంతో సరికొత్తగా ముస్తాబయ్యింది. ►ఫిష్, ఫ్రెంచ్ స్టైల్ టెయిల్, లూజ్ హెయిర్.. కేశాలంకరణ ఈ ట్యునిక్స్కి బాగా నప్పుతుంది. ►సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనిపించాలంటే సన్నని గోటా లేస్ ఉన్న దుపట్టాను జత చేసిన ఈ పార్టీవేర్ను ధరిస్తే చాలు. ►సంప్రదాయ, పాశ్చాత్య వేడుకలకు కొత్త హంగులు అద్దుతున్న ఈ స్టైల్‌ను స్త్రీలే కాదు పురుషులూ వేడుకలలో వాడుతున్నారు. సరికొత్తగా ముస్తాబు అవుతున్నారు. ►కౌల్ నెక్ ట్యూనిక్‌కు జరీ లేస్ దుపట్టాను జత చేయడంతో గ్లామరస్‌గా కనిపిస్తోంది. ►ఈ స్టైల్ కుర్తా ఎప్పటి నుంచో బౌద్ధ సన్యాసులు ధరించడం చూస్తుంటాం. సౌకర్యంగా ఉండే ఈ డ్రెస్ ఇప్పుడు కుర్తాగా రూపాంతరం చెంది ఫ్యాషన్ ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. ఈ కుర్తీ మోకాళ్ల కింది భాగం అంచులు మడిచినట్టు, పైకి దోపినట్టుగా ఉంటుంది. కుర్తా మెడ భాగం నుంచి వేలాడుతున్నట్టుగా దుపట్టా జత చేసి ఉంటుంది. స్లీవ్స్, స్లీవ్‌లెస్.. రెండు స్టైల్స్‌లో ఉండే ఈ కుర్తాలు ప్లెయిన్, ప్రింట్ కలర్ కాంబినేషన్‌తో డిజైన్ చేయడం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. దీనికి బాటమ్‌గా సిగరెట్ ప్యాంట్, ట్రౌజర్ జత చేస్తే చాలు. గెట్ టు గెదర్ వేడుకలలో పాల్గొనడానికి సౌకర్యంగా ఉండటంతో పాటు ప్రత్యేకతను చాటుతుందీ డ్రెస్. -
పువ్వులా.. నవ్వులా!
ప్రీ వెడ్డింగ్ షో అని పెళ్లికి ముందు వధూవరులు వీడియో, ఫొటో షూట్లలో పాల్గొనడం, ఆ మధుర జ్ఞాపకాలను పదిల పరుచుకోవడం తెలిసిందే. ఈ ఫొటో షూట్‌కి పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఇండోవెస్ట్రన్ స్టైల్లో దుస్తులు ధరిస్తుంటారు. అందులో ముఖ్యంగా పెళ్లి కూతురు దుస్తులు చూస్తే గౌన్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. పచ్చని ప్రకృతిలో పువ్వులాంటి గౌన్ ధరించిన అమ్మాయి మరింత అందంగా ఆకట్టుకుంటుంది. పెళ్లికూతురు గెటప్ కోసమే కాదు, కాక్టెయిల్ పార్టీలకు, బర్త్ డే పార్టీలకు గౌన్స్టైల్ యువతులకు బాగా నప్పుతుంది. ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన గౌన్లు ఇవి. ►పొరలుపొరలుగా ఉండే పూల రేకలను పోలిన థీమ్ ఈ గౌన్ల సొంతం. ►రంగు రంగుల పూల రేకలు, పచ్చని ఆకులు.. ప్రకృతికి ప్రతిబింబం. అదే థీమ్తోడిజైన్ చేసిన గౌన్లు ఇవి. లైట్ మేకప్ బెస్ట్ ►గౌన్లు హైనెక్‌తో ఉంటే చెవులకు చిన్న స్టడ్స్ పెట్టుకుంటే సరిపోతుంది ►డీప్ నెక్ ఉంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, చోకర్ నెక్లెస్ పెట్టుకోవచ్చు ►జుట్టుకు ఒక ఫ్లోరల్ హెడ్ బ్యాండ్ పెట్టుకున్నా చాలు. లేదంటే పెళ్లి వంటి ఫంక్షన్స్ అయితే హైబన్–లోబన్.. వంటివి ట్రై చేయవచ్చు ►మేకప్ గాడీగా కాకుండా ధరించిన డ్రెస్‌ను బట్టి ఎంపిక చేసుకోవాలి. గౌన్ ముదురు రంగులో ఉంటే మేకప్ లైట్‌గా న్యూడ్ షేడ్స్ వేసుకుంటే బాగుంటుంది ►గౌన్ లేత రంగులో ఉంటే బ్రైట్ మేకప్‌ను వేసుకోవచ్చు ►ఈ గౌన్లకు యాక్ససరీస్ ఎంత తక్కువ ధరిస్తే అంత బాగుంటుంది. – సాగరికారెడ్డి, అభిజ్ఞారెడ్డి ఫ్యాషన్ డిజైనర్స్ అండ్ స్టైలిస్ట్, హైదరాబాద్ ఇన్‌స్ట్రాగ్రామ్: abhignasagarikaofficial -
కట్టు మారిన పట్టు
పట్టు చీరలు వేడుకల సందర్భంలోనే కొనుగోలు చేస్తారు. అలాగే వాటిని సంప్రదాయ వేడుకలకే ధరిస్తారు. సంప్రదాయ వేడుకలతో పాటు గెట్ టు గెదర్, రిసెప్షన్ వంటి ఇండోవెస్ట్రన్ పార్టీలకు కూడా ఇలా రెడీ అవచ్చు. ఇప్పుడు చలికాలం కూడా కాబట్టి సీజన్‌కి తగ్గట్టు చీరకట్టులో మార్పులు చేసుకోవచ్చు. ►బ్లూ బెనారస్ పట్టు చీరకి సిల్వర్ జరీతో ఉండే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేశారు. బ్లౌజ్, మెడలో సిల్వర్ హారం, హెయిర్ స్టైల్.. ఈ చీర కట్టు లుక్‌ని పూర్తిగా మార్చేసింది. ►ఆకుపచ్చ అంచు ఉన్న గులాబీ రంగు కంచి పట్టుచీరకు పూర్తి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంపిక చేసుకోవాలి. అది కూడా పెప్లమ్ బ్లౌజ్ అయితే మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు. ఈ చీరకు వంగపండు రంగు పెప్లమ్ బ్లౌజ్‌ను వాడారు. లైట్ మేకప్, హెయిర్‌ను వదిలేస్తే చాలు స్టైలిష్‌గా కనిపిస్తారు. ఇతరత్రా ఆభరణాలు ధరించనవసరం లేదు. ఈ స్టైల్ ఏ పార్టీకైనా, వేడుకకైనా బాగుంటుంది. ►ఇది బ్లాక్ కలర్ బెనారస్ పట్టు చీర. దీనికి సెల్ఫ్కలర్ హా‹ఫ్ షోల్డర్ బ్లౌజ్‌ని వాడారు. అలాగే కాంట్రాస్ట్ టైని మెడకు అలంకరించారు. దీంతో పట్టు చీర లుక్ పూర్తి స్టైలిష్‌గా మారింది. ►ఆరెంజ్ కలర్ పట్టుచీరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వాడుకోవచ్చు. వెస్ట్రన్ స్కర్ట్మీదకు వాడే టాప్ వేసుకుంటే ప్రెట్టీగా కనిపిస్తారు. దీని మీదకు పిస్తా షేడ్ గ్రీన్ జాకెట్‌ను వేసుకుంటే లుక్ పూర్తిగా స్టైలిష్‌గా మారిపోతుంది. కాక్టెయిల్ పార్టీస్‌కు కూడా నప్పే డ్రెస్ అవుతుంది. ►ప్లెయిన్ పట్టు చీరకి పూర్తి కాంట్రాస్ట్ కలర్లో సైడ్ కట్స్ ఉన్న ఎల్లో లాంగ్ జాకెట్‌ను వాడారు. దీనికి నడుము భాగంలో బెల్ట్‌ను ఉపయోగించారు. ఫిష్ టెయిల్, సైడ్ జడ వేసుకుంటే చాలు మేకోవర్ పూర్తయినట్టే. ►ఇది బ్రైట్ రెడ్ శారీ. సహజంగా పెళ్లి కూతురు డ్రెస్‌గా వాడుతారు. దీనిని ఇండోవెస్ట్రన్ పార్టీలకూ ధరించాలంటే ఇలా జరీ కలర్లో జాకెట్‌ని ధరించాలి. పల్లూని ముందువైపుగా తీసుకొని, కుచ్చిళ్ల పార్ట్‌ని లెహంగా స్టైల్లో అమర్చుకోవాలి. ఈ లెహంగా శారీ విత్ జాకెట్ స్టైల్ డ్రేప్ ఏ వేడుకలోనైనా హైలైట్‌గా నిలుస్తుంది. -
వెన్నంటే రూపాలు
కేన్వాస్ మీదే చిత్రకళ ఉండాలని నియమం ఏముంది? బ్లౌజ్ వెనుక భాగాన్ని కూడా కళాత్మక వేదిక చేయొచ్చు. దేశీయమైన కళను అక్కడ వ్యక్తం చేయవచ్చు. వీపునే ఒక చిత్ర ప్రదర్శనగా మార్చవచ్చు. కలకత్తా లాయర్ పరమఘోష్ ఫ్యాబ్రిక్ డిజైనర్‌గా చేస్తున్న ప్రయోగం ఇది. ఫ్యాషన్ డిజైనర్ అనకుండా ఫ్యాబ్రిక్ డిజైనర్ అనడంలోనే ఉంది ‘పరమ’ ప్రత్యేకత. ఆ స్పెషాలిటీ తెలుసుకోవాలంటే పరమ డిజైన్స్‌ని ఒకసారి పరిశీలించాలి. పరమఘోష్ కలకత్తా వాసి. లా చదువుకుంది. న్యాయవాద వృత్తిలో తీరకలేని పని ఆమెది. కానీ, తనలోని కళాతృష్ణకు జీవం పోయాలనుకుంది. అనుకున్నది సాధించింది. అందమైన కళారూపాలతో చేనేతలను అందంగా తీర్చిదిద్దుతోంది. 2015లో ‘పరమ’ పేరుతో సొంత క్లాతింగ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. న్యాయవాది నుంచి డిజైనర్ వరకు వేసుకున్న ఆమె మార్గం కళాత్మకం. ►స్త్రీ ఔన్నత్యాన్ని చాటే డిజైన్లు చేనేత బ్లౌజులుగా, చీర కొంగు సింగారాలుగా ముచ్చటగొలుపుతుంటాయి. కలకత్తా కాళీ, తల్లీబిడ్డల అనుబంధం , గ్రామీణ మహిళ సింగారం, నృత్యభంగిమలు.. ఒకటేమిటి మానవ మూలాలను పరమ ఘోష్ డిజైన్లు వెలికితీస్తాయి. అందమైన కవిత్వం ఫ్యాబ్రిక్ మీద సహజసిద్ధమైన రంగులతో పెయింటింగ్‌గా, ఎంబ్రాయిడరీగా రూపుదిద్దుకుంటుంది. ►పగటిపూట న్యాయసంబంధిత విషయాలతో పోరాటం చేయడం, రాత్రి సమయాల్లో చేనేతపై మేజిక్ సృష్టించడం. ఇవి రెండూ విరుద్ధమైనవి. దీని గురించి ప్రస్తావిస్తే.. ‘‘మొదట్లో ఈ డిజైన్స్‌తో చేసిన బ్లౌజులు, చీరలు అమ్మకానికి పెట్టలేదు. మా కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు గిఫ్ట్‌గా ఇచ్చేదాన్ని. లేదంటే వాళ్లే కోరి మరీ నాచేత డిజైన్ చేయించుకునేవారు. నేను డిజైన్చేసిన దుస్తులను ధరించి నాకే ఫొటోలు పెట్టేవారు. ఫేస్బుక్లో పోస్ట్ చేసేవారు. అలా నా డిజైన్స్ మరో ప్రపంచానికి చేరువ చేశాయి. పుస్తకాలు, సంగీతం, చిత్రాలు, ప్రదేశాలు, ప్రజలు ఇవన్నీ నన్ను ఆకట్టుకున్న అంశాలే. వీటినే డిజైన్స్‌లో చూపిస్తుంటాను. ►‘ఫ్యాబ్రిక్ పైన కొత్త రాతలు రాయడం అనేది నాకున్న పిచ్చి. మన మూలాల్లో దాగున్న కళను తీసుకురావాలనే ప్రయత్నం. ‘పరమ’ అంటే సంతోషం. ఆ సంతోషాన్ని నలుగురికి పంచాలన్నదే నా తాపత్రయం. ఆ ఆలోచనతోనే ఒక చిన్న స్టార్టప్ వెంచర్‌ని ప్రారంభించాను. దీని ద్వారా నా వ్యక్తిత్వం ప్రతిబింబించడం సంతోషంగా ఉంది.’ ►నా చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లడానికి రోజూ ఏడ్చేదాన్నట. దాంతో మా అమ్మ నన్ను ఆర్ట్ క్లాస్‌కు పంపారు. నాటి నుంచి రంగులకన్నా నా జీవితాన్ని ఏదీ ప్రభావితం చేయలేదు. ఇంద్రధనుస్సు, రంగు రంగుల గాజులు, నా క్రేయాన్స్ పెట్టె, ఒక చిన్న గాజు పాత్ర, సీతాకోకచిలుకలు, కథల పుస్తకాలు.. ఇవే నన్ను అనుసరిస్తూ వచ్చాయి. పెయింటింగ్ నాకు ఊపిరిని ఇచ్చింది. చిత్రాలు, కథలే నన్ను అమితంగా ప్రభావితం చేసేవి.’ ►‘నాలుగేళ్ల క్రితం ‘పరమ’ను బ్రాండ్‌గా పరిచయం చేశాను. ఎనిమిదేళ్లు అందుకు తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. మొదట్లో చాలా భయపడ్డాను. కానీ, రాత్రింబవళ్లు వర్క్ చేశాను. ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశాను. అందుకు మా అమ్మ నాకు సపోర్ట్‌గా ఉన్నారు. క్రియేషన్ పార్ట్‌లో మా ప్యామిలీ మెంబర్స్ ఎవరూ వేలు పెట్టరు. కానీ, బిజినెస్ పార్ట్‌గా మా హజ్బెండ్ హెల్ప్ ఉంటుంది.’ ►స్త్రీ అంటే వంట చేయడం వరకే కాదు అది ఒక పార్ట్ మాత్రమే. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మన చేసే పని ప్రత్యేకమైనదై ఉండాలి. ఆ ప్రత్యేకత నేను ఎంచుకున్న మార్గంలో ఉంది. నా ఆర్ట్ మీద నాకు నమ్మకం ఉంది. అదే నన్ను నిలబెడుతుంది. పరమ ఘోష్ డిజైనర్, కలకత్తా -
నులివెచ్చని కశ్మీరం
కశ్మీరీ పశుమినా షాల్స్ కప్పుకోవడం ఒకప్పటి ఫ్యాషన్. ఒకనాటి భాగ్యవంతుల, మేధావుల ఫ్యాషన్ స్టేట్మెంట్ అది. కశ్మీర్ వస్త్రాన్నీ, ఒరిస్సా–బెంగాల్ డిజైన్లనీ, లద్దాఖ్ గిరిజనుల కళా నైపుణ్యాలనూ కలగలిపి కనుమరుగవుతున్న పశుమినాఫాల్స్కు కొత్త సొబగులద్ది మళ్లీ వాటికి మళ్లీ ప్రాణం పోసింది ఫ్యాషన్ డిజైనర్ ‘స్టాంజిన్ పాల్మో’! రండి... ఆమెను పరిచయం చేసుకుందాం. కశ్మీర్ నుంచి యాపిల్ వస్తోంది, వాల్నట్ వస్తోంది. పశుమినా షాల్ వస్తోంది. ఇవన్నీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరిస్తున్నాయి. కానీ వాటి పేర్లతో మరెన్నో నకిలీలు కూడా రాజ్యమేలుతుంటాయి. ఒకప్పుడు కశ్మీర్ పశుమినా షాల్ ధరించడం అంటే స్టేటస్ సింబల్. రచయితలు తమ రచనల్లో సంపన్న కుటుంబంలోని మహిళ వర్ణనలో కశ్మీరీ పశుమినా షాల్ ఉండేది. ఆ పశుమినా షాల్ తెరమరుగవుతున్న టైమ్‌లో ఓ ఫ్యాషన్ డిజైనర్... కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. పశుమినా మెటీరియల్‌తో ఓవర్ కోట్తోపాటు మరికొన్ని సొబగులద్ది ఈ ఏడాది ముంబయిలో జరిగిన‘లాక్మే ఫ్యాషన్ వీక్’లో ప్రదర్శించింది. ఇరవై ఆరేళ్ల స్టాంజిన్ పాల్మో చేసిన ప్రయోగం కశ్మీర్‌లోని స్థానిక తెగల గిరిజనులకు కొత్త ఉపాధికి మార్గమైంది. స్టాంజిన్ పాల్మో ఢిల్లీ, నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సు చేసింది. సోనాల్ వర్మ వంటి సీనియర్ డిజైనర్‌తోపాటు అనేక మంది డిజైనింగ్ ఎక్స్‌పర్ట్‌ల దగ్గర పని చేసింది. వారితోపాటు విదేశాల్లో జరిగిన ఫ్యాషన్‌షోలలో కూడా పాల్గొన్నది. ఈ క్రమంలో రెండేళ్ల కిందట లధాక్ చేనేత మగ్గాల గురించి తెలిసిన తర్వాత సొంతంగా ప్రయోగాలు మొదలు పెట్టింది. డిజైనింగ్ రంగంలో ‘జిల్జామ్’ బ్రాండ్‌తో తన మార్కును విజయవంతంగా చూపిస్తోంది. ‘‘లధాక్, లే... చేనేత గురించి తెలుసుకునే కొద్దీ... నేను వెతుకుతున్న వజ్రమేదో దొరికినట్లయింది. ‘బిట్వీన్ ద ఎర్త్ అండ్ స్కై’ కాన్సెప్ట్‌తో రూపొందించిన డిజైన్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి’’ అన్నారామె. ‘‘పశుమినా వస్త్రానికి పొట్టేలు, జడల బర్రె, ఒంటెల నుంచి సేకరించిన ఊలును ఉపయోగిస్తారు. కశ్మీర్‌లోని లధాక్‌లో నివసించే గిరిజనులు ఈ నేతలో నిపుణులు. నిజానికి పశుమినా ఫ్యాబ్రిక్‌ను నేను ప్రమోట్ చేశానని ఎవరైనా అంటే అది శుద్ధ అబద్ధం. ‘పశుమినా’ అనే పదమే ఒక బ్రాండ్. ఆ చేనేతలో దాగిన పనితనాన్ని వర్ణించడానికి నాకు మాటలు కూడా రావు. అయితే ఇంత వరకు ఈ ఫ్యాబ్రిక్ గురించి తెలిసిన వాళ్లు తక్కువ. ఇప్పుడు కొత్త తరానికి సరికొత్త రూపంలో పరిచయం చేయగలిగాను. ఇందులో నా పాత్ర ఇంత వరకే. ఇందులో నేను తెచ్చిన కొత్తదనమంతా రెండు–మూడు రకాల కళలను మిళితం చేయడమే. కశ్మీర్లో తయారైన సంప్రదాయ పశుమినా వస్త్రం మీద ఒడిషా, బెంగాల్ సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లను వేయించాను. ఢిల్లీలో ఒడిషా, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడిన కారీగార్ కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్లంతా వాళ్లకు వచ్చిన సంప్రదాయ ఎంబ్రాయిడరీ పనులకు గిరాకీ లేక, ఆటో నడుపుతూ, వాచ్మెన్లుగా జీవిస్తున్నారు. వారి కుటుంబాల్లో ఆడవాళ్లందరికీ ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుంది. వాళ్లకు ఈ పశుమినా శాలువాల మీద ఎంబ్రాయిడరీ చేయించాను. ఈ రకంగా కశ్మీర్ చేనేతను, ఒడిషా ఎంబ్రాయిడరీని దేశమంతటికీ తెలిసేలా చేయగలిగాను. ఇక విదేశాల్లో వీటిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలనేది నా లక్ష్యం. అదే జరిగితే... ఈ వస్త్రాలను నేసే మహిళలకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం వేయగలిగిన దాన్నవుతాను. ఈ వస్త్రాలు ఎంతటి చలినైనా అపగలుగుతాయి. ధరించిన వారికి నులివెచ్చని అనుభూతినిస్తాయి. విదేశాల్లో తయారవుతున్న ఊలుకంటే కశ్మీర్ పశుమినా వస్త్రాలు కంటికి ఇంపుగా కూడా ఉంటాయి. అందుకే మన కళను ఖండాంతరాలు దాటించడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటున్నాను’’ అన్నారు స్టాంజిన్. లధాక్ మహిళలు ఏడాదిలో ఆరు నెలల పాటు వస్త్రాలను నేస్తారు. మిగిలిన ఆరు నెలలు నేతకు వాతావరణం సహకరించదు. ఇప్పటి వరకు వాళ్లకు ఉన్న ఏకైక మార్కెటింగ్ జోన్ పర్యాటకం మాత్రమే. ‘‘ఈ శాలువాలను కశ్మీర్ పర్యటకను వచ్చే పర్యాటకులకు అమ్ముకుంటున్నారు. సంప్రదాయ డిజైన్లకు పరిమితమైన లధాక్, లే మహిళలకు వాళ్ల చుట్టూ ఉన్న అందాలనే వస్త్రాల్లో నిక్షిప్తం చేయగలిగేలా శిక్షణ ఇచ్చాను. ఆల్రెడీ చెయ్యి తిరిగిన వాళ్లు కావడంతో నేనిచ్చిన కొత్త డిజైన్లను త్వరగా ఒంటబట్టించుకున్నారు. కశ్మీర్ మహిళల నేత నైపుణ్యం ఇప్పటి వరకు కశ్మీర్ పర్యటనకు వెళ్లి వచ్చిన వాళ్ల దగ్గర మాత్రమే కనిపించేది. నా ప్రయత్నంలో దేశంలో ప్రతి ఇంటికీ కశ్మీర్ శాలువాను చేర్చగలుగుతాను. అలాగే... ప్రతి ఒక్కరినీ కశ్మీర్‌కు తీసుకెళ్లలేను, కానీ కశ్మీర్‌ను ప్రపంచమంతటికీ విస్తరించగలుగుతాను’’ అన్నారు స్టాంజిన్ ధీమాగా. సాధికార మహిళలు స్టాంజిన్... తన డిజైనింగ్ ప్రయోగం కోసం లధాక్, లేలలో అనేక గ్రామాల్లో పర్యటించారు. ఆ సంగతులను తెలియచేస్తూ ... ‘‘ఆ మహిళలతో మాట్లాడినప్పుడు ఆధునిక ప్రపంచం ఆశ్యర్చపడే విషయాలెన్నో తెలిశాయి. పని చేయడం మాత్రమే కాదు, కుటుంబానికి తమ శ్రమ ఎంత అవసరమో వాళ్లకు తెలుసు, అలాగే కుటుంబానికి తమ అవసరంతోపాటు కుటుంబంలో తమ ప్రాధాన్యత ఎంతో కూడా వాళ్లకు బాగా తెలుసు. వాళ్లకు జీవితం పట్ల ఆందోళన లేదు, వాళ్ల మాటల్లో నిరాశనిస్పృహలు లేవు. ఊలు సేకరణ, ప్రాసెసింగ్‌తోపాటు వడకడం, వస్త్రాన్ని నేయడం వరకు అనేక దశల్లో మహిళల సేవలే కీలకం. ఇప్పుడు నాతో యాభై మంది మహిళలు పని చేస్తున్నారు. తాము తయారు చేసిన షాల్‌ను... జాకెట్, కోట్ రూపంలో చూసుకుని సంతోషిస్తున్నారు. తమ పిల్లలకు వాటిని వేసుకుని మురిసిపోతున్నారు. వాళ్లను చూసినప్పుడు నా బ్రాండ్లను అక్కడి పిల్లలు కూడా ప్రమోట్ చేస్తున్నారనే సంతోషం కలుగుతుంటుంది’’ అన్నారు స్టాంజిన్ పాల్మో. – మంజీర -
అది..రాంచరణ్‌నే అడగండి: సుస్మిత
కొత్తదనాన్ని డిజైన్ చెయ్యడానికి విజన్ ఉన్న డిజైనర్ చాలు. పాతదనాన్ని డిజైన్ చెయ్యడానికి మాత్రంఇమేజ్ని, ఇమాజినేషన్ని కలిపే ప్రతిభ ఉండాలి. కళ్లముందు కనిపించే ఇమేజ్‌ని రెండు శతాబ్దాల వెనకటి ఇమాజినేషన్తోమ్యాచ్ చేసిన అమేజింగ్ డిజైనర్ సుస్మిత. చిన్నప్పుడు నాన్న రెడీ చేయించిన ఈ అమ్మాయి కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా ఇప్పుడు నాన్నను ‘సైరా’ కోసం రెడీ చేసింది! నరసింహారెడ్డిలా నాన్నను ఇమాజిన్ చేసిన ఈ ‘ఇమేజింగ్’ డిజైనర్‌తో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ‘రాధే గోవిందా...’ అంటూ అప్పట్లో ‘ఇంద్ర’ సినిమాలో పాటకు మీ నాన్నగారు వేసుకున్న డ్రెస్సులు ట్రెండీగా ఉన్నాయి. మీకది ఫస్ట్ సినిమా కదా? సుస్మిత : అవును. 2002లో ఆ సినిమా వచ్చింది. పదహారేళ్ల క్రితం ట్రెండ్‌కి తగ్గట్టుగా నాన్నగారి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను. ట్రెండ్‌ని మాత్రమే కాదు.. నాన్న స్టైల్‌కి తగ్గట్టు డిజైన్ చేస్తుంటాను. యాక్చువల్‌గా కాస్ట్యూమ్ డిజైనర్‌గా నాకది ఫస్ట్ మూవీ. కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు మీ డాడీకి స్టయిలింగ్ చేస్తున్నారు. చిన్నప్పుడు ఎప్పుడైనా మీ నాన్నగారు మిమ్మల్ని రెడీ చేసిన సందర్భాలున్నాయా? (నవ్వుతూ). నాన్నగారు మా చిన్నప్పుడు ఫుల్ బిజీగా ఉండేవారు. మాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసే వీలు లేకుండా పోయింది. అయితే మమ్మల్ని ఆయన పూర్తిగా రెడీ చేయకపోయినా మా అమ్మగారు రెడీ చేసిన తర్వాత ‘ఇది బావుంది, ఇలా బాలేదు. మార్చు’ అని చెప్పేవారు. అమ్మకి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. మీ స్టయిలింగ్‌పై మీ నాన్న అభిప్రాయం? నాన్నగారి దగ్గర ఉన్న మంచి విషయం ఏంటంటే.. తన కూతురే కదా అని ఏం చేసినా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చేయరు. కాంప్లిమెంట్ ఎంత బాగా ఇస్తారో, మిమర్శ కూడా అలానే చేస్తారు. బాగా లేకపోతే ‘వేరే ఆప్షన్ చూపించు’ అంటారు. అందుకే నాన్నగారితో వర్క్ చేయడం చాలా బావుంటుంది. ఆయన ఇచ్చే విమర్శ కూడా విలువైనదే. ‘సైరా’లో ఒక 45 లుక్స్ ఉంటాయి. అందులో 6–7 సార్లే చిన్న చిన్న మార్పులు కోరారు. చిరంజీవిగారి కోసం ఎన్ని కాస్ట్యూమ్స్ తయారు చేశారు? నాన్నకే సుమారు 100 నుంచి 120 కాస్ట్యూమ్స్ చేశాం. ఇంకా అమితాబ్‌గారు, నయనతార, తమన్నా కూడా ఉన్నారు. సుదీప్, సేతుపతి, జగపతిబాబు, రవికిషన్లకు ఉత్తరా మీనన్ డిజైన్ చేశారు. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్లే సుమారు 50 మందికి పైగా ఉన్నారు. సాధారణంగా కాస్ట్యూమ్స్ సూట్‌కేసుల్లో తీసుకెళ్తాం. ఈ సినిమా కాస్ట్యూమ్స్ మాత్రం పెద్ద పెద్ద ట్రంకు పెట్టెల్లో డీసీఎం వ్యానులో తీసుకెళ్లేవాళ్లం. కొన్ని కాస్ట్యూమ్స్‌ని మడతపెట్టకూడదు. అలాగే హ్యాంగర్‌కి తగిలించి, జాగ్రత్తగా లొకేషన్‌కి తీసుకెళ్లేవాళ్లం. నాన్నగారి లుక్ చూసి మీ అమ్మగారు ఏమన్నారు? నాన్నగారి తలకట్టు, మీసం అయితే అమ్మకు చాలా నచ్చింది. అమ్మకి ఇది స్పెషల్ సినిమా. ఎందుకంటే నాన్న, నేను, చరణ్, ఈ కంపెనీ సీఈఓ మా పెద్దమ్మ వాళ్ల అమ్మాయి విద్య.. ఇలా అందరం ఈ సినిమాకి పని చేశాం. నేను అనుకున్న విధంగా నగలు ఎవరు డిజైన్ చేస్తారనే సందిగ్ధ సమయంలో మా అమ్మ సురేఖ ‘మంగత్రాయ్’ను సంప్రదించమని చెప్పారు. వెంటనే ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ గుప్తాను కలిశా. నేను గీసిన కొన్ని డిజైన్స్ ఇచ్చా. నేను అనుకున్నట్లు నగలు డిజైన్ చేశారు. చిరంజీవిగారి కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ ఒప్పుకున్నాక ఆయనేమో ఆ షూటింగ్‌కి చరణ్ ‘రంగస్థలం’ షూటింగ్‌కి వెళుతుంటే ఆవిడ చాలా హ్యాపీగా ఫీలయ్యారట.. అవును. ‘ఖైదీ నంబర్ 150’ పూర్తవ్వక ముందే రంగస్థలం మొదలైంది. నాన్న, చరణ్, నేను రెడీ అయి వెళుతుంటే అమ్మకి స్పెషల్ మూమెంట్‌లా అనిపించేది. ‘రంగస్థలం’ పూర్తవ్వకముందే ‘సైరా’ స్టార్ట్ అయింది. ఈసారి మేం ముగ్గురం ఒకే సినిమాకి అంటే ఆవిడకి చాలా ఆనందం అనిపించింది. ఖైదీ నంబర్ 150’ కమర్షియల్ ఫార్మట్. ‘రంగస్థలం’ మీకు అలవాటు లేని డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్. అదో చాలెంజ్ అయితే ‘సైరా’ హిస్టారికల్. ఈ సినిమాలో మీరెలా భాగమయ్యారు? చిరంజీవిగారి పర్సనల్ స్టయిలింగ్, బాడీ లాంగ్వేజ్ తెలిసి ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ అయితే బెస్ట్ అనుకున్నారు. డాడీ పర్సనల్ స్టయిలింగ్ డిపార్ట్మెంట్లో నేనెప్పుడూ ఉంటాను. ‘సైరా’ సినిమాకు అంజు మోడీ అనే డిజైనర్‌ని తీసుకున్నారు. సినిమాకు కావాల్సిన మూడ్, కలర్ పాలెట్ అంతా ఆమె డిజైన్ చేశారు. ఆ తర్వాత ఆమెకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో కంటిన్యూ చేయలేకపోయారు. అప్పుడు నరసింహారెడ్డి పాత్రకు సంబంధించిన డిజైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. నేను కొన్ని డిజైన్ చేశాను. ‘మిగతా లీడ్ రోల్స్‌కి (నయనతార, సుదీప్, తమన్నా, అనుష్క) కూడా నువ్వెందుకు చేయకూడదు?’ అని చరణ్ అడిగాడు. సాధారణంగా పెద్ద స్టార్స్ అందరికీ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు. ఈ సినిమాలో కొన్ని లీడ్ పాత్రలన్నీ ఒకే సింక్‌లో ఉండాలి. వేరు వేరు డిజైనర్స్‌ని ఒక చోటుకి రప్పించి అందరితో ఒకలాంటి స్టయిల్లో చేయించడం ప్రాక్టికల్‌గా కుదరదు. ‘నీకు స్టోరీ మొత్తం తెలుసు. కథకు ఏం కావాలో తెలుసు. వాళ్లకి కూడా నువ్వే డిజైన్ చేయి’ అన్నాడు చరణ్. వాళ్లందరూ పెద్ద పెద్ద స్టార్స్. దాంతో నాకు చిన్నపాటి ప్రెషర్ అనిపించింది. కొన్ని డిస్కషన్స్ తర్వాత చేయగలననిపించింది. కంటిన్యూస్‌గా దాదాపు మూడు సమ్మర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాయి.. (నవ్వుతూ). ‘రంగస్థలం’ షూటింగ్‌ని రాజమండ్రిలో మంచి ఎండల్లో చేశాం. దాదాపు అందరం ట్యాన్ అయిపోయాం. కొందరైతే కళ్లు తిరిగి కూడా పడిపోయారు. అలా ఒక సమ్మర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ‘సైరా’కి వచ్చేసరికి రెండు సమ్మర్లు చూశాం. ఫుల్‌గా ఎండలోనే షూటింగ్ చేశాం. ఫ్యాబ్రిక్‌లో ఎక్కువ ఖాదీ, కాటన్, ఖాదీ సిల్క్ ఉపయోగించాం. ఖాదీ స్క్రీన్ మీద బాగా కనిపిస్తుంది. కంటికి సరిగ్గా అర్థం కాకపోయినా స్క్రీన్ మీద అర్థం అవుతుంది. సరిగ్గా చేయకపోతే ఈజీగా దొరికిపోతాం. చాలా జాగ్రత్తగా చేనేత ఫ్యాబ్రిక్స్ వాడాం. ఇది హిస్టారికల్ సినిమా కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకూ సెట్లోనే ఉండాల్సి వచ్చింది. కష్టమే అయినా ఇలాంటి సినిమాలు చేసినప్పుడు సంతృప్తి ఉంటుంది. నరసింహారెడ్డిగారికి సంబంధించి మనకు అందుబాటులో ఉన్న సమాచారం చాలా తక్కువ కదా... చారిత్రాత్మకంగా కరెక్ట్‌గా ఉంటూ, కమర్షియల్ మీటర్‌ను ఆర్టిస్టిక్‌గా ఎలా బ్యాలన్స్ చేశారు? పరిశోధన బాగా చేశాం. నరసింహారెడ్డిగారి మీద ఎక్కువ సమాచారాన్ని ఎవరూ పేపర్ మీద పెట్టలేదు. కొన్నే ఉన్నాయి. మేం చేసిందేంటంటే.. 1800 కాలంలో ప్రజలు ఎలాంటి బట్టలు వేసుకునేవారు? ఎలాంటి రంగులు వాడేవారు? స్త్రీల చీరకట్టు ఎలా ఉండేది? మగవాళ్ల పంచెకట్టు ఏంటి అనే విషయాలను తీసుకొని డిజైన్ చేశాం. స్వాతం త్య్రోద్యమ సమయంలో నాటి ఉద్యమకారుల్ని ఉహించుకుని నరసింహారెడ్డి ఇలా ఉంటారనే విధంగా 400కి పైగా స్కెచ్‌లు వేసుకున్నా. ఫైనల్‌గా 40 స్కెచ్‌లు ఎంపిక చేసుకుని ఆ లుక్ వచ్చేలా శ్రమించా. కమర్షియల్గానూ ఉండాలి. లేదంటే డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది. అక్కడ నా అనుభవం ఉపయోగపడిందని నేను గర్వంగా చెప్పగలను. స్క్రీన్ మీద ఏది బాగా కనిపిస్తుంది, ఏది ఎబ్బెట్టుగా ఉంటుందో నాకు ఐడియా ఉంది. ప్రతి లుక్‌కి ఓ బ్యాకప్ పెట్టుకున్నాను. ఒక షెడ్యూల్లో ఐదు డ్రెస్ చేంజ్‌లు ఉంటే, ఒకటికి మూడు పెట్టుకునేదాన్ని. చరణ్ మిమ్మల్ని నమ్మి ఈ పని అప్పగించారు.. అయితే ప్రాక్టికల్‌గా పని మొదలుపెట్టాకే మనమీద మనకు పూర్తి నమ్మకం కలుగుతుంది కదా... ఆ నమ్మకం మీకెప్పుడు కలిగింది? ఫస్ట్ షెడ్యూల్లో రెండు మూడు సీన్లు చేసేటప్పటికే నేను క్యారెక్టర్ని అర్థం చేసుకుంటున్నానని తెలిసిపోయింది. బాగా చేయగలం అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే అందరికీ ఎలా వస్తుందా అనే డౌట్ ఉండేది. రషెస్ చూశాక నమ్మకం కలిగింది. కాస్ట్యూమ్స్ మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పించారు? ఇందులో వాడినవన్నీ ఎక్కువ మన దేశంలోనివే. అమితాబ్‌గారికి వాడినవాటిలో కొన్నింటిని ఢిల్లీ నుంచి తెప్పించాం. లేడీస్‌కి మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం చీరలు వాడాము. పాత్రల కాస్ట్యూమ్స్ చూస్తే షాప్‌లో నుంచి తీసుకొచ్చి వేసుకున్నట్టు ఉండదు. ఆ పాత్రలు ఎప్పుడూ కట్టుకునే బట్టల్లానే ఉంటాయి. కాస్ట్యూమ్ ఆథెంటిసిటీ ఈ సినిమాలో వందశాతం ఉంటుంది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎంత సంతృప్తికరంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాను. అందరం మనస్ఫూర్తిగా కష్టపడి చేసిన సినిమా ఇది. చారిత్రాత్మక సినిమాలు చేసేటప్పుడు రంగుల్లో కొన్ని పరిమితులు ఉంటాయి కదా? అవును. ఇది వార్ సినిమా కాబట్టి ఒక బ్రౌన్ కలర్ టోన్ ఉంటుంది. అందుకోసం కొన్ని కలర్స్ వాడకూడదు. ఈ సినిమాలో ప్రాథమిక రంగులేవీ వాడలేదు. (రెడ్, బ్లూ, ఎల్లో) ఏవీ వాడలేదు. అవి స్క్రీన్ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కాస్ట్యూమ్స్ ఎప్పుడూ కథలో కలసిపోవాలని నేను నమ్ముతాను. ఈ రంగులు మామూలుæ కమర్షియల్ సినిమాలకైతే ఫర్వాలేదు. ఇలాంటి సినిమాలకు వాడితే కథలో నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ కలిగిస్తాయి. ఆ పాత్ర ఎలాంటి మూడ్‌లో ఉన్నారో కూడా కాస్ట్యూమ్స్ ద్వారా తెలియజేయాలి. కాస్ట్యూమ్స్ అంటే కెమెరా, దర్శకుడు, ఆర్ట్ డిపార్ట్మెంట్తో సమన్వయం ఉండాలి. ఈగోలు ఉండటం సహజం. వాటిని ఎలా పరిష్కరించుకుంటారు? డైరెక్టర్, ఆర్ట్‌డైరెక్టర్, కెమెరామేన్, కాస్ట్యూమ్స్ ఈ నాలుగింటినీ క్రియేటివ్ డిపార్ట్మెంట్ అంటారు. క్రియేటివ్ డిపార్ట్మెంట్ కలసి పని చేయాలి. నేను అందరితో సింక్‌లో ఉండి చేయాలనుకుంటాను. క్రియేటివ్ డిపార్ట్మెంట్లో ఈగోలు కామన్. చరణ్ నన్ను అక్కగా ఈ సినిమా చేయమనలేదు. ఒక నిర్మాతగా నన్ను డిజైనర్‌గా ఈ సినిమాలో భాగమవ్వమన్నాడు. హోమ్ వర్క్ బాగా చేస్తాను. అది తనకి తెలుసు. ‘ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా’ వరుసగా కెమెరామేన్ రత్నవేలుతో మూడో సినిమా. ఆయన సూచనలు ఉపయోగపడ్డాయి. ఒకవేళ సెట్లో ఎవరితో అయినా అభిప్రాయభేదాలు వస్తే అది ఆ రోజు వరకే. ఎందుకంటే అవి వ్యక్తిగత విభేదాలు కావు. కొన్నిసార్లు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికే టైమ్ పడుతుంది. దర్శకుడు మనసులో ఏముందో అర్థం చేసుకుంటే పని సులువు అవుతుంది. ‘సైరా’ శ్రమతో కూడుకున్న సినిమా అన్నారు. ఎందుకు ఒప్పుకున్నానా అనే సందర్భాలు? అలా అనుకుంటే ఈ ఫీల్డ్‌లో ఉండలేం. నేను చిరంజీవిగారి కూతుర్ని కదా నేను పని చేయడమేంటి? మనం పని చేయించుకోవచ్చు కదా అని పని చేస్తే మనల్ని చూసి పని చేసేవాళ్లు కూడా పాడైపోతారు. వాళ్లను కూడా చెడగొట్టినవాళ్లం అవుతాం. వాళ్లతో పని చేయించాలంటే నేనూ అలానే పని చేయాలి. రాత్రి ఎంతైనా సరే నేను వాళ్ల వెనకే ఉండాలి. నేనే ఉన్నానంటే వాళ్లు కూడా ఉండాల్సిందే. అలా పని పూర్తి చేసేదాన్ని. పని చేస్తూ, చేయిస్తూ ఉంటేనే పని జరుగుతుంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా నేను ఈ పనులన్నీ చేస్తున్నానంటే మీరు కూడా చెయొచ్చు అని మా టీమ్‌లో అమ్మాయిలకు చెబుతుంటాను. ఇదే కష్టపడే సమయం.. ఉపయోగించుకోవాలని చెబుతుంటాను. మీ ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు చేశారు. బయట వాళ్లతో చేయాలనుకోవడం లేదా? ఇక్కడ ఇన్ని అవకాశాలు దొరికాయి. ఇంతకంటే ఎక్కువ చేయలేం. నాకు 9 ఏళ్ల పాప, 7 ఏళ్ల పాప ఉన్నారు. పనిని, ఇంటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువ సినిమాలు చేస్తే ఆ బ్యాలెన్స్ ఖచ్చితంగా పోతుంది. ప్రత్యేకంగా ఎవరైనా యాక్టర్‌కి స్టయిలింగ్ చేయాలనుకుంటున్నారా? అమితాబ్గారితోనే మరో సినిమా చేయాలనుంది. ఆయన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆయన స్థాయికి నేను చాలా చిన్న డిజైనర్‌ని. అయినా గౌరవించారు. ‘నువ్వు చిన్నయినా పెద్దయినా నువ్వు ఒక పని చేస్తున్నావు. దానికి గౌరవం ఇస్తాను. నీ పని నీకు బాగా తెలుసు. నువ్వు అనుకున్న కలర్సే తీసుకురా. వేసుకుంటాను’ అని ఆయన అన్నారు. దాంతో సౌకర్యంగా అనిపించేది. ఏదైనా చెప్పినప్పుడు ఓ కొత్త నటుడిలా చాలా శ్రద్ధగా వింటారు. సినిమాలో అమితాబ్‌గారి క్యారెక్టర్ కీలకమైనది. ఆయనకి 15 నుంచి 18 కాస్ట్యూమ్స్ ఉంటాయి. ‘సైరా’ 1800 కాలం. ఈ సినిమా తర్వాత కొరటాల శివగారి డైరెక్షన్లో మీ నాన్నగారు చేయబోతున్నారు. 1800 నుంచి ఇప్పుడు 2020కి మీరు వర్క్ చేయాలి... యస్. ఇంత వేరియేషన్ అంటే చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. నాకు హీరో పాత్ర వరకూ చెప్పారు. నాన్నగారి పాత్ర కాకుండా కొన్ని ముఖ్యమైన పాత్రలకు కూడా లుక్ డిజైన్ చేయమన్నారు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా కోసం మేం ఒక లుక్‌ని డిజైన్ చేశాం. అదే ఫైనల్ కాదు. ఇంకొన్ని లుక్స్ ఉన్నాయి. మీ వృత్తే కాస్ట్యూమ్ డిజైన్ చేయడం. రోజూ ప్రత్యేకంగా రెడీ అవుతారా? ఒక్కోసారి టైమ్ ఉండదు. దొరికింది వేసుకొని షూటింగ్‌కి పరుగు పెట్టడమే (నవ్వుతూ). డిజైనర్‌గా మారడానికి మీ స్పూర్తేంటి? సినిమాయే నా స్ఫూర్తి. చిన్నప్పటి నుంచి సినిమా చూస్తూనే పెరిగాను. గంటలకొద్దీ షూటింగ్‌లు చూసేదాన్ని. అలా చూస్తూ ఉండిపోగలను. సినిమాకి, ఫ్యాషన్‌కి కలిపేది కాస్ట్యూమ్స్. అందుకే దీన్ని ఎంచుకున్నాను. 150 సినిమాల్లో ఎన్నో పాత్రల్లో చిరంజీవి కనిపించారు. ఆయన లుక్స్‌లో మీ ఫేవరెట్ ఏది? ‘కొదమసింహం’. ఆ సినిమాలో కౌబాయ్ లుక్ భలే ఇష్టం. ‘కొండవీటి దొంగ’ కూడా ఇష్టం. ‘చంటబ్బాయి’ సినిమా నా ఫేవరెట్. నిర్మాణ సంస్థ కూడా ఏర్పాటు చేస్తున్నారు? అవును. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో స్టార్ట్ చేశాను. ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ ట్రెండ్ నడుస్తోంది. నేను డిజిటల్ కంటెంట్ బాగా చూస్తుంటాను. మా ఆయన ఊరికే కంప్లయింట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన్నే ఈ బిజినెస్‌లోకి దించేశాను. ఆయన ఫైనాన్స్ చూసుకుంటారు. కాస్ట్యూమ్ డిజైనర్, ఇద్దరి పిల్లలకు అమ్మగా, ఇప్పుడు నిర్మాతగా ఎలా మ్యానేజ్ చేస్తున్నారు.. ఫ్యామిలీని మిస్సవుతున్న ఫీలింగ్? నేను చెన్నైలో ఉంటాను. ‘సైరా’ కోసం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. పిల్లల్ని అక్కడ వదిలి నేనిక్కడ పని చేయడం కుదరదు. పిల్లలతో వచ్చాను. మా ఆయన చెన్నై టు హైదరాబాద్ ట్రావెల్ చేశారు. అది హెల్ప్ అయింది. ప్యాకప్ అయిన తర్వాత పిల్లలతో ఉండేదాన్ని. నైట్ షూటింగ్ అప్పుడు వాళ్లు స్కూల్‌కి వెళ్లే ముందు కనబడేదాన్ని. అలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేశాను. మా అమ్మ, నా భర్త నా పెద్ద సపోర్ట్. పిల్లల్ని చూసుకోవడానికి అమ్మ ఉన్నారు. వర్క్ పరంగా ఇబ్బందిగా ఉంటే మా ఆయన ఉంటారు. మెడిటేషన్ చేయించకుండానే మెడిటేషన్ చేసినట్టు కూల్ చేసేస్తారు. మీరు ఏ పని చేసినా మీ బ్యాక్‌గ్రౌండ్ తాలూకా ప్రెషర్ కచ్చితంగా ఉంటుంది కదా? మేమెలా పెర్ఫార్మ్ చేస్తాం అనే విషయంలో ఎప్పుడూ ఒక ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రెషర్‌తో పని చేయకూడదు. ఈ ఒత్తిడితో పని చేస్తే ఎక్కడో చోట మిస్ అయిపోతాం. అనుకున్న అవుట్‌పుట్ ఇవ్వలేం. అందుకే ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. మమ్మల్ని అలానే పెంచారు. మీరు అదీ ఇదీ అన్నట్టు పెంచలేదు. అందరిలానే. నేనెప్పుడూ సెలబ్రిటీని అనుకోను. నా సొంతంగా నేనేదైనా సాధించినప్పుడు నేను కూడా సెలబ్రిటీయే అని భావిస్తాను. అప్పటి వరకూ నేను కూడా అందరిలానే వర్కింగ్ మామ్నే. కమర్షియల్, పీరియాడిక్, ఇప్పుడు హిస్టారిక్ సినిమా చేశారు. అన్నింట్లో ఏది ఈజీ.. ఏది టఫ్? ‘సైరా’ చాలా శ్రమతో కూడుకున్న సినిమా. అంత శ్రమ ఉంది కాబట్టి అందులో చాలా చాలెంజ్‌లు ఉన్నాయి. చాలెంజ్‌లు ఎదురైనప్పుడు మన పని మీద ఆసక్తి ఇంకా పెరుగుతుంటుంది. షెడ్యూల్స్ ఎంత చాలెంజింగ్‌గా, క్రేజీగా ఉంటేనే అంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు మనకు చాలా నేర్పిస్తాయి. మరి.. రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు? (నవ్వుతూ) చరణ్‌నే అడగండి. ►ఫ్యాషన్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా రెండేళ్లుగా ఎంత కష్టపడ్డాననేది ఈ సినిమా ద్వారా నిరూపితం కానుంది. ‘యాజ్ ఏ ఫ్యాన్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ద మూవీ’ (ఆనంద బాష్పాలతో). నరసింహారెడ్డి ఎలా ఉంటాడో కూడా తెలియని ప్రపంచానికి ఈ సినిమా ద్వారా స్వయానా నేను నాన్నని డిజైన్ చేసి చూపించబోతున్నా. – గౌతమ్ మల్లాది -
మీ దుస్తులు ధరించే వారంతా బాధపడుతున్నట్లేనా?
ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతిగా అలంకరించుకునే మహిళలు అంతరంగంలో ఎంతో వేదన అనుభవిస్తుంటారని ఓ పోస్ట్ చేశారు. దీని పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి 19వ శతాబ్దం నాటి పనికిమాలిన సూక్తులు చెప్పకండి.. అప్పటి వారికి మహిళలను అర్థం చేసుకునేంత బుర్ర లేదు.. ఇది 21వ శతాబ్దం. మీ కస్టమర్లలో ఎక్కువగా ఉంది మహిళలే ఆ విషయం గుర్తు పెట్టుకొండి అంటూ మండి పడుతున్నారు. ఇంతకు ఆ పోస్ట్‌లో ఏం ఉందంటే.. ఏ మహిళైనా అతిగా అలంకరించుకుని ఉందంటే.. ఆమె గాయపడినట్లు. లోలోన ఆమె మౌనంగా చాలా బాధపడుతుంది. కానీ ప్రపంచం దృష్టిలో తన గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవడం కోసం ఇలాంటి మెరుపులను ధరిస్తుంది. కానీ ఆమె అంతరంగం ఎంతో చీకటిగా, బాధతో నిండి ఉంటుంది. అలాంటి వారిని గమనిస్తే.. మీ విలువైన సమయంలో కొంత ఆమె కోసం కేటాయించండి.. మీ ప్రేమతో వారిని ఓదార్చండి.. ఎందుకంటే కొన్నిసార్లు స్పర్శకు మించింది ఏమి లేదు’ అంటూ సబ్యసాచి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీన్ని సమర్థిస్తూ.. ఓ ప్రఖ్యాత రచయిత లైన్స్‌ను కూడా కోట్ చేశారు. View this post on Instagram #Sabyasachi #ParadiseLost #SabyasachiJewelry #TheWorldOfSabyasachi @sabyasachijewelry A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on Jul 5, 2019 at 8:10am PDT అయితే ఈ పోస్ట్ పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడంబరమైన దుస్తులు, నగలు డిజైన్ చేసే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీ దుస్తులు ధరించే వారంతా బాధపడుతున్నట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. మీ దుస్తులు అమ్మకాల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ప్లే చేయకండి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
చేతులు లేకుంటేనేం..
చేతులు లేకుంటేనేం.. ఆత్మస్థైర్యం, ఏదో సాధించాలనే కసి ఆమెను ముందుకు నడిపించాయి. లా డిగ్రీ అర్హతతో ఉద్యోగం కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమెకు నిరాశే ఎదురైంది. దానికి ఆమె నిరుత్సాహపడలేదు. ఉద్యోగం అని తిరిగితే పనికాదు.. ఇక ఏదో ప్రత్యేకమైన కెరీర్‌ను ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. మోటివేషనల్ స్పీచ్‌లు ఇవ్వడం, రాయడం మొదలు పెట్టింది. కొన్నాళ్లకు ఆ పని కూడా బోర్ కొట్టింది. ఫ్యాషన్ డిజైన్ రంగంవైపుకు అడుగేసింది. అది నచ్చింది. అంతే ఇక ఆమెకు తిరుగులేదు. ఆ రంగంలో తనదైన ముద్రవేసింది. ప్రస్తుతం మెక్సికోలోని గ్వాడలజరాలో విజయవంతమైన ఫ్యాషన్ డిజైనర్‌గా దూసుకెళ్తుంది. ఆమె పేరు అడ్రియానా మాకియస్. పుట్టకతోనే రెండు చేతులు లేవు. అయినా అడ్రియానా ఎప్పుడు బాధపడలేదు. గత నెల మెక్సికోలో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో అడ్రియానా డిజైన్ చేసిన దుస్తులను దివ్యాంగ మోడల్స్ ప్రదర్శించారు. వాటికి ఆదరణ లభించి అడ్రియానాకు మంచి గుర్తింపు లభించింది. ధరించే దుస్తులు వ్యక్తులను డామినేట్ చేయవద్దని, దుస్తులను ధరించే వ్యక్తులు డామినేట్ చేయాలంటుంది అడ్రియానా. అందుకే తాను సౌకర్యవంతమైన, ఫార్మల్ దుస్తులను మాత్రమే డిజైన్ చేస్తానని చెప్పుకొచ్చింది. 41 ఏళ్ల వయసున్న అడ్రియానకు చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రలు కాళ్లతో పనిచేయడం నేర్పించారు. ఇప్పుడు ఆమె ఎవరి సహాయం లేకుండా తన కాళ్లతో తినగలదు.. రాయగలదు.. వంట కూడ చేయగలదు. చివరకు తన డిజైన్స్ దుస్తులు కూడా కుట్టగలదు. 20 ఏళ్ల వయసు వరకు కృత్రిమ చేతులు ఉపయోగించిన అడ్రియాన.. వాటి బరువు వల్ల భుజాల్లో కలిగిన నొప్పితో తీసేసింది. కృత్రిమ చేతులు లేకుండా యూనివర్సిటీకి వెళ్లడం చాలా కష్టంగా ఉండేదని, క్లాస్‌లో షూస్ తీసి రాయడం మరింత కష్టంగా అనిపించేదని చెప్పుకొచ్చింది. ఇక అడ్రియానా జీనియస్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఒక నిమిషంలో కాళ్లతో ఎక్కువ బర్త్‌డే క్యాండిల్స్ వెలిగించిన వ్యక్తిగా గుర్తింపు పొందింది. -
నా పెళ్లి దుస్తులు కూడా నేనే డిజైన్ చేసుకున్నా..
సీతమ్మధార(విశాఖఉత్తర): చదువుకున్నది ఎంబీఏ..ఇష్టమై ఎంచుకున్న రంగం ఫ్యాషన్ డిజైనర్. ఎంబీఏ పూర్తవ్వగానే ఉద్యోగంలో చేరినా మనసుకు నచ్చకపోవడంతో ఉద్యోగానికి విడిచిపెట్టి ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టింది ఎన్‌ఏడీకి చెంది దీప్తి. నేర్చుకున్న వృత్తిని పదిమందికీ ఉచితంగా పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. చిన్నప్పటి నుంచి ట్రెండీగా ఉండడం ఇష్టం..పెరిగిన వాతావరణం ప్రభావమో ఏమో గానీ కొత్త కొత్త ఫ్యాషన్స్‌ను ఫాలో అవడం అలవాటైంది. క్రమంగా ఫ్యాషన్ డిజైనర్‌గా స్థిరపడాలని కోరుకున్నా...కానీ ఈ రంగానికి అంత భవిష్యత్తు ఉండదేమోనని అమ్మానాన్న ఫార్మసీ రంగంవైపు వెళ్లమని సూచించారు. దీంతో యలమర్తి ఫార్మసీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చదవా..తరువాత ఎంబీఏ చేశా.. కొన్నాళ్ల పాటు ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశా..కానీ చిన్నతనం నుంచి బలంగా నాటుకుపోయిన ఫ్యాషన్ రంగాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి క్రియేటివ్ ఫీల్డ్ అయిన ఫ్యాషన్ రంగాన్నే ఎంచుకున్నా...ప్రస్తుతం పది మందికి ఉచితంగా నేర్పించే స్థాయికి ఎదిగా..ప్రస్తుతం ఉన్న రోజుల్లో భార్యాభర్తలిద్దరూ కష్టపడితేనే గానీ హ్యాపీగా జీవించే పరిస్థితి లేదు. నగరాలకు వస్తున్న వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సీరియస్‌గా ఆలోచించా. ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్న అనుభవంతో మహిళలకు ఉపాధి కల్పించేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో ఉంటూనే ఎంతోకొంత ఆదాయం సంపాదించవచ్చు. బీజం పడిందిలా.. ఓ ఫంక్షన్‌కు స్నేహితుడి ఇంటికి వెళ్లా..నేను వేసుకున్న డ్రెస్సే వేరే అమ్మాయి కూడా వేసుకుంది. ఎందుకో గిల్టీగా అనిపించింది. స్పెషల్‌గా ఉండడం చిన్నప్పటి నుంచి ఇష్టం. అందుకే నేను ధరించే దుస్తులే నేనే డిజైన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే కొనసాగిస్తున్నా..2016లో నా పెళ్లి దుస్తులు కూడా నేనే డిజైన్ చేసుకున్నా..ఎన్ఏడీలో మా ఇంట్లోనే మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నా.. -
పెళ్లికి పూలొచ్చాయి
పెళ్ళిళ్లలో పువ్వుల అలంకారాలు వేదికకు అందం తెస్తాయి.పెళ్లికి పూలే నడిచొస్తేప్రాంగణమే పూల పల్లకి అవుతుంది.పెళ్లికి వెళ్లండి..పూలకరించండి. ►ప్రముఖ జాతీయ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి పువ్వుల ప్రింట్లున్న ఫ్యాబ్రిక్స్‌తో వేడుకకు తీసుకొచ్చిన కొత్త హంగుల దుస్తులు. ►రా సిల్క్, నెటెడ్ కాంబినేషన్ లెహెంగా వేడుకకు ఎవర్గ్రీన్ అయితే, దాని మీద పువ్వుల హంగులు కొత్త సింగారాలనుఅద్దుకున్నాయి. ►వివాహ వేడుక అనగానే పట్టు దుస్తుల వైపుగా ఎంపికలు మొదలుపెడతారు. కానీ, ఇలా పువ్వుల విరిబోణిలా కనిపించేదే అరుదైన అందం. ►పువ్వుల ప్రింట్లు ఉన్న నెటెడ్ ఫ్యా్రబ్రిక్ను లెహంగాకు ఎంచుకొని, దానికి ప్లెయిన్ రా సిల్క్ క్రాప్‌టాప్, నెటెడ్ దుపట్టాను ను జత చేస్తే వేడుకలో హైలైట్. ►క్రీమ్ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్లు, ఎంబ్రాయిడరీ చేసిన పువ్వులు కొత్త అందాలను సింగారించుకున్నాయి. ►ఇండోవెస్ట్రన్ స్టైల్ దుస్తులకు పువ్వుల హంగామాలు జత అవ్వాలి. అందుకు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న లెహంగా, క్రాప్‌టాప్ ధరిస్తే చాలు గెట్ టు గెదర్ పార్టీకి గ్రాండ్ లుక్ వస్తుంది. ►పువ్వుల ప్రింట్లు ఉన్న క్రేప్ సిల్క్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహంగా, దానికి పువ్వుల రంగులో నెటెడ్ దుపట్టా, స్లీవ్‌లెస్ బ్లౌజ్ జత చేస్తే వచ్చే అందమే వేరు. ►టాప్ టు బాటమ్ ముదురు నీలం రంగు లంగా ఓణీ ఓ ఆకర్షణ అయితే, దాని మీద ఒదిగిన పువ్వుల జిలుగులు వేడుకలో వేల రెట్లు కాంతులే. ►మఖమల్ క్లాత్ అంటేనే గ్రాండ్నెస్కు సిసలైన చిరునామా. మెరూన్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద బంగారు, వెండి జరీ పువ్వుల వెలుగులు వేడుకంతా సందడి చేస్తూనే ఉంటాయి. -
షౌపెట్... రిచెస్ట్ క్యాట్ గురూ...
పిల్లులందు ఈ పిల్లి వేరయా! అని అనక తప్పదు. ఎందుకంటే పై ఫోటోలో కనిపిస్తున్న పిల్లి ప్రపంచంలోనే అత్యంత ధనికురాలట. జర్మనీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ఫెల్డ్(85) బర్మీస్ జాతికి చెందిన పిల్లిని అపురూపంగా పెంచుకున్నాడు. ఈ పిల్లికి షౌపెట్ అని నామకరణం చేసి.. రాజ భోగాలు అందించారు. 2011లో తన స్నేహితుడి దగ్గరి నుంచి ఇష్టపడి తెచ్చుకుని ఈ మార్జాలనికి ఓ బాడీగార్డును, పనివాళ్లను కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పటికే ఈ పిల్లి పలు కాస్మోటిక్ బ్రాండ్స్ ప్రకటనల్లో, కారు ప్రకటనల్లో కనిపించింది. మోడళ్లు ఫోటోలకు పోజులివ్వడానికి కూడా షౌపెట్ను వాడేవారు. అంతేకాకుండా షౌపెట్పై ప్రేమతో ‘షౌపెట్: ది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఎ హై ఫ్లైయింగ్ ఫ్యాషన్ క్యాట్’అనే పుస్తకాన్ని కూడా కార్ల్ రాశాడు. అందుకే కార్ల్ అనేకమార్లు షౌపెట్ ధనికురాలంటూ సంబోధించేవాడు. ఇక షౌపెట్కు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం. కార్ల్ కూడా దానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పిల్లిగారికి సోషల్ మీడియాలో తెగ క్రేజ్ ఏర్పడింది. అన్నీ సజావుగా జరుగుతున్న సమయంలో కార్ల్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అద్భుతమైన ఫ్యాషన్ డిజైనర్‌ను కోల్పోయామని నెటిజన్లు ట్వీట్లు చేశారు. కాగా మరణానికి ముందే కార్ల్ తనకు ఎంతో ఇష్టమైన పిల్లి బాగోగుల గురించి ఆలోచించారు. తన మొత్తం ఆస్తిని రాసిస్తున్నట్లు గతంలోనే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయన సంపాదించిన ఆస్తిలో 150 మిలియన్ పౌండ్లు(సుమారు రూ.14వేల కోట్లు) ఇప్పుడు ఈ పిల్లికి దక్కనున్నట్లు సమాచారం. మార్జాలమా మజాకానా మరి. -
బ్యాక్ టు బి.సి
సంగీత.. ఫ్యాషన్ డిజైనర్. ఎంతమంది లేరూ! సంగీత.. మోడల్ కూడా. వెరీ కామన్ థింగ్. అయితే డిజైనింగ్, మోడలింగ్ కాదు ఆమె ప్రత్యేకత. అవి రెండూ టైమ్ ఉన్నప్పుడు చేస్తుంటారు సంగీత. టైమ్ అంతా పెట్టి చేస్తున్నది వేరే ఉంది. అదీ డిజైనింగే, అదీ మోడలింగే! అవును. సంగీత ఓ కొత్త తరం పిల్లల్ని డిజైన్ చేస్తున్నారు. ఆ పిల్లల్ని ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి రోల్ మోడల్స్‌గా అందిస్తున్నారు. అందుకు ఆమె ఎంచుకున్న దారి.. ఆటలు! పబ్జీలు, పొకెమాన్ల ఆన్లైన్ ఆటలు కాదు. పచ్చీస్, బారాగట్టా వంటి బీసీ (బిఫోర్ సెల్‌ఫోన్) ఆటలు! అది ప్రైమరీ స్కూలు. పిల్లలకు అక్షరాలు దిద్దిస్తోంది టీచర్. ఓ తొమ్మిదేళ్ల బాలుడికి అక్షరాలు చక్కగా కుదరడం లేదు. తన ప్రి–స్కూల్ కోర్సులో భాగంగా అన్ని క్లాసులనూ పర్యవేక్షించడానికి అప్పుడే ఆ క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన సంగీతా రాజేశ్ కంట పడిందా పిల్లవాడి చేతిరాత. పలక మీద ఇంగ్లిష్‌లో ‘ఏ’ అక్షరాన్ని రాయమన్నారామె. ఆ పిల్లవాడు రాశాడు. అయితే దానిని అక్షరం అనడానికి ఆమె మనసొప్పుకోలేదు. కుదురుగా కూర్చుని అక్షరాలన్నింటినీ చక్కగా రాసి చూపించమన్నారు సంగీతారాజేశ్. ‘‘అప్పుడా పిల్లవాడు ఇచ్చిన సమాధానంతో నా బుర్ర తిరిగిపోయింది’’ అన్నారామె. ‘‘అక్షరాలను గుర్తు పట్టడం వస్తే చాలు కదా మేడమ్, అందంగా, గుండ్రంగా రాయకపోతే ఏమవుతుంది? ఏది రాయాలన్నా కీ బోర్డు మీదనే టైప్ చేస్తాను కదా’’ అన్నాడా కుర్రాడు! మెదడు పరుగులే.. కాళ్ల పరుగుల్లేవు! వీడియో గేమ్‌ల తరాన్ని దాటేశాం. ఈ తరం చేతిలో స్మార్ట్‌ఫోన్ ఆటవస్తువైపోయింది. ఆటలన్నీ అందులోనే. ఆ ఆటలు ఆడేటప్పుడు వాళ్ల మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంటుంది. పిల్లలు హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు. ప్రతి చిన్న విషయానికీ అసహనమే. లిఫ్ట్ పై అంతçస్తు నుంచి కిందికి వచ్చే వరకు కూడా నిరీక్షించలేకపోతున్నారు. కంప్యూటర్ సెకన్లలో రెస్పాండ్ కాకపోతే మౌస్‌ను టపటపా కొడుతున్నారు. క్యూలో తమ వంతు వచ్చే వరకు డిసిప్లిన్‌తో నిలబడటానికీ విసుగే. ఇలాగే పిల్లలు పెరిగి పెద్దయితే సమాజంలో ఇమడలేరు. ఇలాంటి పిల్లలతో తయారయ్యే సమాజంలో మనుషుల మధ్య పరస్పర సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండవు. వీటన్నింటికీ విరుగుడు వాళ్లను కూర్చోబెట్టి ఆటలాడించడమేనంటారు సంగీత. పులీమేక ఆటల్లో జీవితం ఉంటుంది ‘‘అవుట్డోర్ గేమ్స్ శారీరక చురుకుదనాన్ని, మానసిక ఆనందాన్ని ఇస్తాయి. ఇన్డోర్ గేమ్స్ పిల్లల్లో పరిణతిని తెస్తాయి. లైఫ్‌స్కిల్స్ నేర్పిస్తాయి. ఒక టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు దాని మీద నుంచి దృష్టిని పక్కకు పోనివ్వని విధంగా ఏకాగ్రతను అలవరుస్తాయి. వ్యక్తిత్వ వికాసం, నిగ్రహశక్తి, సిచ్యుయేషన్ మేనేజ్మెంట్ వంటివి ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం ఉండదు. అవన్నీ మన ఆటల్లో నిబిడీకృతమై ఉన్నాయి. అందుకే పచ్చీస్, వామనగుంటలు, విమానం (యుద్ధంలో మెళకువలు), పరమపదసోపాన పటం (వైకుంఠపాళీ), పులి– మేక, చదరంగం, బారాగట్టా వంటి ఆటలను అలవాటు చేస్తే పిల్లల్లో మెదడు స్థిమితంగా ఆలోచించడం మొదలు పెడుతుందనిపించింది. ఇప్పుడు పిల్లలు ఎదుర్కొంటున్న అటెన్షన్ డెఫిషియెన్సీకి కూడా అసలైన మందు మన ఇన్డోర్ గేమ్స్‌లో ఉంది’’ అన్నారామె. సంగీత ప్రి స్కూల్ ఎడ్యుకేషన్‌లో కోర్సు చేశారు. ప్రి స్కూల్స్‌కి కరికులమ్ డిజైన్ చేసిన అనుభవం కూడా ఉందామెకి. ఆమె స్వయంగా ‘స్మైల్’ పేరుతో స్పెషల్ చిల్డ్రన్‌కి స్కూల్ నడుపుతున్నారు. పిల్లలు స్కూల్‌కి.. తను ‘ప్రి–స్కూల్’కి తమిళనాడు, మదురై దగ్గర దిండిగల్‌లో పుట్టి పెరిగిన సంగీత డిగ్రీ వరకు అక్కడే చదివారు. పెళ్లి అనంతరం హైదరాబాద్ వచ్చారు. ‘‘పెళ్లయిన తర్వాత పీజీ చేశాను. తొమ్మిదేళ్లపాటు ఇద్దరు పిల్లలతో గృహిణిగా ఉన్నాను. నా పిల్లలను స్కూలుకి పంపించాల్సి వచ్చినప్పుడు ప్రి స్కూల్ ఎడ్యుకేషన్ మీద నా దృష్టి పడింది. నా కెరీర్‌ని స్కూల్లో డెవలప్ చేసుకుంటే పిల్లలతోపాటు వెళ్లి రావచ్చు అనుకున్నాను. ప్రి స్కూల్ కోర్సు చేశాను, కొన్ని కార్పొరేట్ స్కూళ్లతో కలిసి పని చేశాను. ఆ అనుభవంతో సొంతంగా స్కూలు పెట్టాను. స్పెషల్ కిడ్స్‌కి అవసరమైనట్లు డిజైన్ చేశానా స్కూల్‌ని. నార్మల్ కిడ్స్ కోసం ఒక సెక్షన్ ఉండేది. అప్పట్లో దుబాయ్ నుంచి ఒక తల్లి తన పిల్లవాడి కోసం అక్కడ మంచి స్కూల్ లేదని మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడా అబ్బాయి మా దగ్గరే ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయితో మొదలైన స్కూల్ ఇప్పుడు 45 మంది పిల్లలతో నడుస్తోంది. స్కూల్‌ని విస్తరించాలనే ఉద్దేశంతో ఐఎస్బీ కోర్సు చేశాను. కోర్సు చేసిన తర్వాత స్పెషల్ కిడ్స్ కోసం డిజైన్ చేసిన స్కూల్‌ని వ్యాపారపరంగా ఫ్రాంచైజీలు ఇవ్వడానికి నాకు మనసు రాలేదు. ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్లు నేను నడిపినట్లు నడపకపోతే ఆ పిల్లల భవిష్యత్తు మరింత గందరగోళమవుతుంది. అందుకే స్కూలును నా ఆత్మసంతృప్తి కోసమే నడపాలి, వ్యాపారం చేయకూడదనే నిర్ణయానికి వచ్చేశాను’’ అన్నారు. ఆడించడానికి బొమ్మలు చేయించారు ‘‘ఒక సమస్య నా దృష్టిలో పడితే దానికి పరిష్కారం కోసం ఆలోచించడం నాకలవాటు. అది నాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుందా లేదా అనేది తర్వాతి మాట. ముందా పని చేసేస్తాను. అలా మొదలైందే ఈ ఆటబొమ్మల పునః పరిచయం. మన సంప్రదాయ ఆటవస్తువులను పిల్లలకు పరిచయం చేయాలంటే ఆటవస్తువులను తయారు చేయించాలి. వాటికోసం హైదరాబాద్‌లో వడ్రంగులు సరిగ్గా దొరకలేదు. దాంతో తమిళనాడు, కర్ణాటకలోని పల్లెలకు వెళ్లి అక్కడి వడ్రంగుల చేత ఆటవస్తువులను తయారు చేయిస్తున్నాను. పిల్లలకు ఆడటం నేర్పించడానికి స్కూళ్లలో చిన్న చిన్న పోటీలు పెడుతున్నాం. నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే.. ఈ ఆటలు కొన ఊపిరితో ఉన్నాయి. కొన్ని ఇళ్లలో పిల్లలకు అలవాటు చేస్తున్నారు. అయితే అది నూటికి పది మందిలోపే. తొంభై శాతం పిల్లలకు మేము పెడుతున్న వర్క్షాపులతోనే పరిచయమవుతున్నాయి ఈ ఆటలు. మా ఆటవస్తువుల అమ్మకం కోసమే అయితే ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టవచ్చు. నా ఉద్దేశం పిల్లలకు ఆడటం నేర్పించడం. అందుకే స్కూళ్లకు వెళ్లి పిల్లలకు ఆట నేర్పించే పని కూడా మేమే చేస్తున్నాం. పరీక్షలకూ ఆటల ప్రిపరేషన్! ఆటలు నిజాయితీగా ఆడితే తోటి పిల్లలందరూ స్నేహితులవుతారు, మోసపూరితంగా ఆడే వాళ్లను దూరం పెడతారు. మోసం చేసే వాళ్లు తమను తాము తెలివైన వాళ్లమనే భ్రమలో ఉంటారు, కానీ అది ఎక్కువ కాలం నిలవదనే వాస్తవాన్ని ఆటల్లోనే తెలుసుకుంటారు. ఒక పిల్లాడు తాను గెలవడం కోసం ఒక అబద్ధం చెబితే, అది అబద్ధం అని తెలిసినప్పుడు మిగిలిన పిల్లలందరూ ఆ పిల్లవాడిని దొంగను చూసినట్లు చూస్తారు. అది ఆ ఒక్కడికే కాకుండా అప్పుడు ఆటలో ఉన్న వాళ్లందరూ తెలుసుకుంటారు. అలాగే ఈ ఆటలు చదివిస్తాయి కూడా. కొన్ని ఆటలు పూర్తవడానికి రెండు–మూడు గంటల టైమ్ పడుతుంది. అంతసేపూ ఏకాగ్రతతో కూర్చోవడం అలవాటవుతుంది పిల్లలకు. పెద్ద తరగతులకు వెళ్లిన తర్వాత పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే ఒక టాపిక్ మీద అంత టైమ్ ఉండగలగడం వస్తుంది ఈ ఆటలతో. ‘మా వాడికి తెలివి ఉందండీ. చాలా చురుగ్గా ఉంటాడు. కానీ కుదురుగా కూర్చోవడమే కష్టం. ఒక గంట కూర్చోపెట్టలేకపోతున్నాం’ అని బాధపడే తల్లిదండ్రులందరికీ ఈ ఆటలు చక్కటి పరిష్కారం’’ అన్నారు సంగీత. – వాకా మంజులారెడ్డి ఫొటో : శివ మల్లాల మా అమ్మ కోప్పడుతుంటుంది ‘‘స్కూలు, ఆటవస్తువుల పునః పరిచయం వంటివన్నీ నా ఆత్మసంతృప్తి కోసం చేస్తున్నాను. నేను ఉపాధి పొందడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ వైపు మళ్లింది నా ఆలోచన. అందులో దిగిన తర్వాత అదొక బిజినెస్ సైన్స్, చాలా సెన్సిబుల్‌గా మార్కెట్ చేయాలని తెలిసింది. డిజైనింగ్‌లో క్రియేటివిటీతోపాటు చాలా శాస్త్రబద్ధంగా చేయగలుగుతున్నాను. కానీ మార్కెట్ దగ్గర విఫలమయ్యాను. నా ఇంట్రెస్ట్లన్నీ కలగలుపుతూ ఒక పీస్ చేయగలుగుతున్నాను. దానిని అంత ధరకు అమ్మడం ఎలాగో నేర్చుకోవాలిప్పుడు. నేను డిజైన్ చేసిన చీరను ప్రదర్శించడానికి మోడల్స్‌కి డబ్బిచ్చే బడ్జెట్ లేదు నాకు. అందుకే నేనే స్వయంగా ప్రదర్శిస్తూ ఫేస్బుక్ పోస్ట్ చేస్తున్నాను. కాళహస్తిలో కలంకారీ కళాకారుల కష్టాన్ని నా ఫోన్లో షూట్ చేసి వీడియోలు పోస్ట్ చేశాను. ఒక చీర అందంగా తయారు కావాలంటే కోట నుంచి సాదా చీర, కాళహస్తిలో పెన్‌కలంకారీ డిజైన్ వేయడం, రంగులు అద్దడం, మగ్గం మీద పని, టైలర్ అప్లిక్ వర్క్ చేయడం వంటి దశలన్నీ చూపించాను. పదివేల రూపాయల చీర వెనుక ఎంతమంది శ్రమ ఉందో తెలియచేయడంలో, ఆ చీర కొంటే పరోక్షంగా ఎంతమంది ఉపాధి పొందుతారో తెలియచేయడంలో సక్సెస్ అయ్యాను. చీరల గురించి పాఠాలు చెప్పడం మాని వ్యాపారం చేయడం నేర్చుకోమని మా అమ్మ కోప్పడుతుంటుంది’’ అన్నారు సంగీత తన ‘సంగీత ఫ్యాషన్ స్టూడియో’ గురించి చెబుతూ. – సంగీతా రాజేశ్ -
బిగ్‌బాస్ అయ్యాక కాల్ చేస్తానంది.. అంతలోనే
న్యూఢిల్లీ : అప్పటికి గంట నుంచి నా సోదరి నాతో ఫోన్లో మాట్లాడుతుంది. నా కూతురితో మాట్లాడమన్నాను.. బిగ్‌బాస్ అయిపోయాక కాల్ చేస్తానని చెప్పింది. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది అంటూ విలపిస్తున్న ఆ మహిళను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ మాలా లఖానిని అత్యంత దారుణంగా చంపారు దుండగులు. వివరాలు.. మాలా లఖాని అనే మహిళ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తోంది. రాహుల్ అన్వర్(24) అనే యువకుడు మాలా దగ్గర మాస్టర్ టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం ఓ మైనర్ బాలికను వేధించిన కేసులో రాహుల్ జైలు కెళ్లాడు. మాలానే డబ్బు కట్టి రాహుల్‌కి బెయిల్ ఇప్పించింది. బయటకు వచ్చిన రాహుల్ తిరిగి మాల దగ్గర పనికి చేరాడు. తాను డిజైన్ చేసిన ప్రతి డ్రెస్ మీద ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సిందిగా మాలాను డిమాండ్ చేసేవాడు. అందుకు మాలా ఒప్పుకోలేదు. దాంతో కక్ష్య పెంచుకున్న రాహుల్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మాలాను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. ఈ దాడిలో అడ్డువచ్చిన పని మనిషిని కూడా హత్య చేశారు. ఈ దారుణం బుధవారం రాత్రి 10 - 11.30 గంటల మధ్య జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. నా సోదరి రాహుల్‌ని తన కొడుకుగా భావించేది. కానీ డబ్బు కోసం అతను ఇంత దారుణానికి తెగించాడని వాపోయింది మాలా సోదరి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మాలా సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రాహులతో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. -
హత్యకు గురైన ఫ్యాషన్ డిజైనర్..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. సంపన్నులు నివసించే వసంత్ కుంజ్ ప్రాంతంలో ఫ్యాషన్ డిజైనర్ మలా లఖాని ఆమె ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. లఖాని, ఆమె సెక్యూరిటీ గార్డు బహుదూర్ సింగ్‌ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 53 సంవత్సరాల లఖానీ తమ ఇంటి సమీపంలోని గ్రీన్‌పార్క్ ప్రాంతంలో బొటిక్ నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. వీరిద్దరిని పలుమార్లు కత్తితో పొడిచి చంపారని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబందించి స్ధానికులు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నామని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ దేవేందర్ ఆర్య చెప్పారు. కాగా, ముగ్గురు నిందితులు నేరాన్ని అంగీకరించారని పోలీస్ కమిషనర్ అజయ్ చౌదరి వెల్లడించారు. ఫ్యాషన్ డిజైనర్ వర్క్‌షాప్‌లో పనిచేసే రాహుల్ అన్వర్ అనే టైలర్ దోపిడీకి పాల్పడే ఉద్దేశంతోనే ఈ హత్యలకు పాల్పడ్డాడు. అన్వర్‌కు సహకరించిన ఇద్దరు బంధువులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
గిరికుల పాఠశాల
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఎల్లమ్మ తండా గిరిజన మహిళలు పాఠశాల స్థాయిలో కూడా చదువుకోనప్పటికీ ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సృజనాత్మక సహకారం అందిస్తున్నారు! వీరు డిజైన్ చేస్తున్న లంబాడీల సంప్రదాయ దుస్తులు, బ్యాగులు, సెల్‌ఫోన్ ప్యాకెట్లు, చీరలు, జాకెట్లు.. అందమైన కుట్లు, అల్లికలతో ఆకట్టుకుంటూ దేశ, దేశాలలో విక్రయం అవుతుండటం విశేషం. ఒక్కరితో మొదలై ఇరవై ఏళ్ల క్రితం (1998లో) అంగన్వాడీ కేంద్రం వద్ద ఆయాగా పని చేస్తుండేది కేతావత్ లక్ష్మి. ఖాళీ సమయంలో తమ గిరిజన సంప్రదాయ దుస్తులపై అందమైన ఎంబ్రాయిడరీ కుట్టు పనిని చేస్తూ ఉండేది. అంగన్ వాడీ తనిఖీ నిమిత్తం ఓ మాతాశిశు సంక్షేమ శాఖ అధికారి అక్కడికి వచ్చారు. లక్ష్మి చేస్తున్న అందమైన అల్లికలను పరిశీలించారు. అనంతరం ఆయన లక్ష్మితో మాట్లాడి ఆమె ప్రతిభ గురించి చేనేత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. చేనేత చేతివృత్తుల అధికారి సత్యవతి ఎల్లమ్మతండాకు వచ్చి, లక్ష్మి చేస్తున్న ఎంబ్రాయిడరీ వర్క్‌ను చూసి ఈ పనిని మరికొంత మంది కలిసి చేస్తే తమ సంస్థ నుండి ప్రత్యేక తర్ఫీదు ఇస్తామని చెప్పారు. అలా 2000 సంవత్సరంలో పది మంది జట్టుగా ఏర్పడిన గిరిజన మహిళలు సంప్రదాయ కుట్లు, అల్లికలు నేర్చుకున్నారు. వారందరికీ కేతావత్ లక్ష్మి కో–ఆర్డి్డనేటర్గా వ్యవహరించింది. ఇప్పుడు ఆ తండాలో 200 మందికి పైగా గిరిజన మహిళలు సంప్రదాయ అల్లికలు, కుట్లు నేర్చుకుని పనులను చురుగ్గా చేస్తున్నారు. వందకు చేరువై ఏమాత్రం చదువురాని అంగన్వాడీ ఆయా లక్ష్మి ఎల్లమ్మ తండా మహిళలకే కాకుండా బోడకొండ, కొర్రంతండా, లోయపల్లి, అంభోత్ తండా గ్రామాల్లో దాదాపు వంద మంది మహిళలకు అల్లికలపై తర్ఫీదు ఇస్తోంది. ప్రభుత్వం ప్రత్యేక భవన సదుపాయం కల్పించింది. వీరి నైపుణ్యం గురించి తెలుసుకున్న రాష్ట్ర గోల్కొండ చేనేత సంస్థ 75 మంది మహిళలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు అందిస్తోంది. ఇక్కడ తయారు చేసిన వస్తువులకు హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాలలోనూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, లక్ష్మి 2006లో ఇరాన్, 2012లో లండన్ దేశాలు వెళ్లి అక్కడ తమ బృందం తయారు చేసిన డిజైనింగ్ దుస్తులను విక్రయించింది. ఎల్లమ్మ తండా మహిళల హస్తకళా నైపుణ్యం నగరంలోని ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నత విద్యార్థులను తండాకు రప్పించేలా చేసింది. హైదరాబాద్ నుంచి ప్రతియేటా ఐదారు బృందాలుగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేసే విద్యార్థులు ఎల్లమ్మతండా మహిళల వద్ద డిజైనింగ్ మెళకువలు నేర్చుకోవడానికి వస్తున్నారు! నగరంలో వివిధ ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాలల నుండి విద్యార్థులు తండాకు వచ్చి ఇక్కడి మహిళల సహకారం తీసుకోవడంతో ‘‘మా తండా వాసుల ఎంబ్రాయిడరీ కళ బయటి ప్రపంచానికి తెలియడం, ఆదరణ లభించడం మాకు ఆనందంగా, ఎంతో గర్వంగా ఉంది’ అంటున్నారు తండా మహిళలు. భరోసాతో భేషుగ్గా తండాల మహిళలు చేస్తున్న అల్లికలు, చేతి కుట్ల గురించి తెలుసుకున్న గోల్కొండ చేనేత సంస్థ రాష్ట్ర డైరెక్టర్ శైలజా రామయ్యర్ గిరిజన మహిళలతో మాట్లాడి ఢిల్లీ నుండి దారాలు, అల్లికలకు సంబంధించిన మెటీరియల్‌ను అందించారు. 2017 సెప్టెంబర్ 17న కేంద్ర చేనేత (చేతివృత్తుల) శాఖ ముఖ్య కార్యదర్శి అనంతకుమార్ సింగ్ కూడా ఎల్లమ్మతండాకు వచ్చి గిరిజనుల చేతి అల్లికల గురించి తెలుసుకున్నారు. వారికి తగినన్ని సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్వయంగా తర్ఫీదు ఇక్కడి గిరిజన మహిళలు అల్లికలు, డిజైనింగ్ పై మాకు ప్రత్యేకంగా తర్పీదు ఇస్తున్నారు. తరగతి గదుల్లో, కంఫ్యూటర్లో విని, చూసి నేర్చుకుంటున్నప్పటికీ, ఈ తండా మహిళలు నేర్పే విద్య మాకెంతో ప్రయోజనకరంగా ఉంది. – అమ్రిత, ‘నిఫ్ట్’ విద్యార్థిని, హైటెక్ సిటీ మెళకువ నేర్చుకుంటున్నాం హైదరాబాద్ నుండి ఎల్లమ్మతండాకు వచ్చి అల్లికలు, డిజైనింగ్ దుస్తులపై ఎలా చేయాలో తెలుసుకుంటున్నాం. రంగు, రంగుల దారాల మార్పులు చేయడం వంటి మెళకువలు వీళ్లు మాకు నేర్పిస్తున్నారు. మాకు ఇష్టమైన డిజైన్‌లో దుస్తులను అందంగా రూపొందించి చూపుతున్నారు. – జాహీ, ఫైనల్ ఇయర్, ‘నిఫ్ట్’ ఇక్కడ ప్రాక్టికల్‌గా చూస్తున్నాం ఒక్కోసారి ప్రొఫెసర్లు చెప్పిన ఆర్ట్‌ఫామ్ అర్ధం కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సంప్రదాయ కళలను నేరుగా చూస్తే వాటి మూలాలను కూడా మన డిజైన్‌లో పొందుపర్చవచ్చు. ఎల్లమ్మతండాలో మహిళల ద్వారా మేం ఆ కళను నేర్చుకుంటున్నాం. – శుభం చేరీషీయా, ‘నిఫ్ట్’ మరింత సహకారం అవసరం మా తండాలో ప్రతి ఇంటిలో మహిళలు దుస్తులపై అందమైన అల్లికలు చేయడంలో నిష్ణాతులు. ఎవరికి వారే సాటి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మా కళకు మరింత ప్రోత్సాహం అందించాలి. తండాలో తయారు చేసిన దుస్తులు, వస్తువులకు ఇక్కడి నుండే మార్కెటింగ్ కల్పించి, బ్రాండ్‌గా గుర్తించాలి. దీని వల్ల తండా మహిళల ఉపాధి మెరుగుపడుతుంది. దీంతో మరింతమంది ఈ కళను అందుకోవడానికి ఉత్సాహం చూపుతారు. – కేతావత్ లక్ష్మి, ఎల్లమ్మతండా – యాట మహేష్, సాక్షి, మంచాల -
బ్యూటీ స్మైల్
-
నిందితుడెవరో తేలిపోయింది!
సాక్షి, ముంబై: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ప్యాషన్ డిజైనర్ సునీత సింగ్ (45) కేసులో నిందితుడెవరో తేలిపోయింది. గురువారం ఉదయం సునీత బాత్రూమ్లో శవమై కనిపించారు. ఈ ఘటన లోఖండ్‌వాలాలోని క్రాస్‌గేట్ బిల్డింగ్‌లో జరిగింది. ఆ సమయంలో ఫ్లాట్‌లో ఆమెతో పాటు కొడుకు లక్ష్య సింగ్ (22), అతనికి కాబోయే భార్య అషుప్రియ ఉన్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కథ చెప్పాడు.. సునీత సింగ్ మరణంపై ఆమె కుమారుడు పోలీసులకు చెప్పిన వివరాలు.. బాత్రూమ్లోకి వెళ్లిన అమ్మ.. ఎంతసేపటికీ బయటికి రాలేదు. ఎంత పిలిచినా స్పందన లేదు. అనుమానం వచ్చి నేను బాత్రూమ్ డోర్‌ను బలవంతంగా తెరిచాను. అప్పటికే ఆమె కిందపడిపోయి ఉంది.. ఫ్లోర్‌పై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. అది చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాను. వెంటనే దగ్గర్లో ఉన్న ఆభరణాల వ్యాపారికి విషయం చెప్పాను. అతను పోలీసులకు సమాచారమివ్వమని సూచించాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు అంబులెన్స్‌కు ఫోన్ చేశాను. అంతేకాకుండా ఢిల్లీలోని బంధువులకు ఈ విషయం తెలిపాను. నేను తిరిగి వచ్చేలోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారని లక్ష్య వెల్లడించాడు. పోస్టుమార్టం రిపోర్టు పోస్టుమార్టం రిపోర్టు సునీత మృతిపై అనుమానాలు రేకెత్తించింది. తమదైన శైలిలో పోలీసులు లక్ష్యని ప్రశ్నించడంతో నిజం బయకొచ్చింది. అమ్మతో బాత్రూత్‌లో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుందనీ, కోపంతో ఆమెను నెట్టేయడంతో వాష్‌బేసిన్‌కి పడిపోయిందని లక్ష్య తెలిపాడు. సునీత తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పృహ కోల్పోయింది. కొన ఊపిరితో ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నామనీ, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. (చదవండి : బాత్రూమ్లో శవమై కనిపించిన ప్యాషన్ డిజైనర్) -
బాత్రూమ్లో శవమై కనిపించిన ప్యాషన్ డిజైనర్
ముంబై: ప్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్న సునీత సింగ్ తను నివాసం ఉంటున్న ప్లాట్లోనే అనుమానస్పద స్థితిలో మరణించారు. వివరాల్లోకి వెళ్తే ముంబైలోని లోఖండ్వాలాలో తన కొడుకు లక్ష్య, అతనికి కాబోయే భార్య అషుప్రియ బెనర్జీలతో కలిసి సునీత నివాసం ఉంటున్నారు. కాగా, గురువారం ఉదయం ఆమె బాత్రూమ్లో శవమై కనిపించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ‘గురువారం ఉదయం అమ్మ బాత్రూమ్లోకి వెళ్లింది. ఆ తర్వాత కొంత సేపటికి నేను పలిచిన ఆమె నుంచి స్పందన రాలేదు. దీంతో నేను బాత్రూమ్ డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేశాను. అప్పటికే ఆమె కిందపడిపోయి ఉంది.. ఫ్లోర్‌పై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. దీంతో నేను ఆందోళనకు గురయ్యాను. గుడికి వెళ్లి, అక్కడి నుంచి తెలిసిన ఆభరణాల వ్యాపారి వద్దకు వెళ్లి విషయం చెప్పాను. అతడు పోలీసులకు ఈ విషయం చెప్పమని సూచించాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు అంబులెన్స్‌కు ఫోన్ చేశాను. అంతేకాకుండా ఢిల్లీలోని బంధువులకు ఈ విషయం తెలిపాను. నేను తిరిగి వచ్చేలోపే పోలీసులు అక్కడికి చేరుకున్నార’ని సునీత కొడుకు పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఈ కేసును అనుమానస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం లక్ష్య, అశుప్రియలను విచారిస్తున్నామని.. లక్ష్య కలిసిన ఆభరణాల వ్యాపారితో పాటు, ప్రైవేటు అంబులెన్స్‌ను తీసుకొచ్చినవారిని కూడా విచారిస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె తలకు గాయం కావడం వల్ల మృతిచెందినట్టుగా తెలుస్తోందన్నారు. ఆమె ముఖంపై కూడా చిన్న చిన్న గాయాలు ఉన్నట్టు వెల్లడించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వస్తేగానీ ఆమె ఎలా మృతి చెందిందో చెప్పాలేమని ఆయన తెలియజేశారు. -
లేడీ డిజైనర్.. రైఫిల్ షూటర్..
చదివిన కోర్సు ఒకటి.. చేసిన ఉద్యోగం ఇంకోటి..ఆ రెండింటిలోనూ ‘కిక్’ లేక తనను తానే ‘డిజైన్’ చేసుకుంది. ఫ్యాషన్ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ‘స్టార్ డిజైనర్’గా పేరు తెచ్చుకుంటోంది ‘హారికారావు’. ఎంతోమంది సెలబ్రిటీలకు దుస్తులు రూపొందించి ఇచ్చే ఈమె తుపాకీ పేల్చడంలోనూ దిట్టేనండోయ్. తూర్పు–పడమర లాంటి రెండు విభిన్న రంగాల్లోదూసుకుపోతున్న హారిక.. తన ప్రయాణ విశేషాలను‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. శ్రీనగర్‌కాలనీ : ‘‘నేను పుట్టింది, పెరిగింది అంతా వరంగల్‌లోనే. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. చిన్ననప్పటి నుంచి అందరికంటే భిన్నంగా ఉండడం నాకు అలవాటు. మొదట నా దుస్తులు అందరికి నచ్చేలా కొత్తగా ఉండాలనుకునేదాన్ని. అలా ఫ్యాషన్‌పై ఇష్టం పెరిగింది. కొంత ఊహ వచ్చాక నా దుస్తులు నేనే డిజైనింగ్ చేసుకునేదాన్ని. అవి నచ్చి సన్నిహితులు, బంధువులు అలాంటివి చేసి ఇవ్వమనేవారు. అలా శుభకార్యాలకు దుస్తులు డిజైన్ చేసేదాన్ని. కొత్త రంగుల మేళవింపుతో డిజైనింగ్స్ ఇచ్చేదాన్ని. నా సృజనాత్మకత నచ్చి చాలా మంది ప్రశంశించేవారు. అయితే ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని కోరిక ఉన్నా వరంగల్‌లో శిక్షణా కేంద్రాలు లేకపోవడంతో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. పతకాలే లక్ష్యం... కాలేజీ రోజుల్లో ఎన్సీసీలో చేరాను. అక్కడే రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నా. ఆ శిక్షణతో ప్రతిష్టాత్మక జీవీ మౌలాంకర్ షూటింగ్ పోటీల్లో పాల్గొన్నాను. డిజైనింగ్‌తో పాటు షూటింగ్లో ఉన్న అభిరుచితో ఫిలింనగర్‌లోని గగన్ నారంగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పటికే లెవెల్–1 పూర్తి చేశాను. అందరూ మెచ్చేలా రైఫిల్ షూటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని పతకాలు సాధించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నా. కుటుంబమే నా బలం నేను ఎంచుకున్న రెండు రంగాలు విభిన్నమైనవి. ఒకదానిదో మరొక దానికి పొంతన ఉండదు. నా ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యులతో పాటు నా భర్త సత్య ప్రోత్సాహం ఎంతో ఉంది. ఉద్యోగం చేస్తుంగా వివాహమైంది. నా ఇష్టాన్ని గుర్తించిన నా భర్త ప్రోత్సాహంతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశా. ఇప్పుడు మెహిదీపట్నంలో హారిక స్టూడియోస్‌ను ఏర్పాటు చేశాను. విదేశాల్లో జరిగిన పలు ప్యాషన్ వీక్స్‌లో నా డిజైన్స్‌ను ప్రదర్శించాను. అక్కడ మంచి గుర్తింపు వచ్చింది.సినీతారలు ఆనంది, సింగర్ చిన్మయి, విష్ణుప్రియ, ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ, పలువురు బుల్లితెర నటీమణులకు డిజైనింగ్ చేశాను. అంతర్జాతీయ డిజైనర్‌గా గుర్తింపు కోసం కృషి చేస్తున్నా’’ అంటూ ముగించారు హారిక. ఉద్యోగాన్నివదిలేశా.. ఎమ్మెస్సీ తర్వాత ఫార్మారంగంలో ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ అక్కడ ఆశించిన ఉద్యోగం రాకపోవడంతో సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని ఇన్ఫోసిస్‌లో చేరాను. ఉద్యోగంలో ఉండగా తోటి కొలీగ్స్ దుస్తులు డిజైన్ చేసేదాన్ని. అవి అందరికీ బాగా నచ్చేవి. కొన్నాళ్లకు చేస్తున్న ఉద్యోగంలో కిక్ లేకపోవడంతో అది వదిలేసి నచ్చిన ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టాను. -
టాప్ ఫ్యాషన్ డిజైనర్స్ చిక్కారు
న్యూఢిల్లీ : టాప్- ప్రొఫైల్ ఫ్యాషన్ డిజైనర్లు ఆదాయపు పన్ను శాఖ చేతికి చిక్కారు. పెద్ద మొత్తంలో పన్నులు ఎగ్గొట్టినందుకు ఢిల్లీలోని వీరి షోరూంలపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 25 మంది డిజైనర్లు షోరూంలు, నివాసాలను ఆదాయపు పన్ను అధికారులు సెర్చ్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దాడులు పలు గంటల పాటు జరిగినట్టు తెలిసింది. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో అనుమానిత లావాదేవీలను గుర్తించినట్టు ఐటీ డిపార్ట్మెంట్ వర్గాలు చెప్పాయి. పలు డాక్యుమెంట్లను కూడా సీజ్ చేసినట్టు పేర్కొన్నాయి. డిఫెన్స్ కాలనీ, ఖాన్ మార్కెట్, మహిపాల్పూర్, గ్రేటర్ కైలాష్ వంటి ప్రాంతాల్లో ఉన్న షోరూంలలో ఈ దాడులు జరిపినట్టు తెలిపాయి. ఉత్తర ఢిల్లీలో ఉన్న గాయకుడు నరేంద్ర ఛాంచల్ నివాసంలో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. పన్నుఎగవేతతో ఆయన కొడుకును ఐటీ వర్గాల కనుసన్నలోకి వచ్చేశారు. ఢిల్లీ నివాసంలో మాత్రమే కాక, ఆయన పూర్వీకుల ఇంటిలో కూడా దాడులు నిర్వహించి, పలు డాక్యుమెంట్లను సీజ్ చేసింది. దేశరాజధానిలో ఈ నెలలో జరిగిన అతిపెద్ద దాడిలో ఇదీ ఒకటి. మే 22న ఐటీ డిపార్ట్మెంట్ రూ.215 కోట్లకు పైన నల్లధనాన్ని గుర్తించింది. టాప్ డిజైనర్ నివాసాలు, గాయకుడి నివాసంలో మాత్రమే కాక, ఢిల్లీలోని దిగ్గజ కేటరింగ్, టెంట్ ఆపరేటర్లపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కూడా రూ.100 కోట్లకు పైగా బ్లాక్‌మనీని వెలికితీసింది. కోట్ల రూపాయల నగదును, జువెల్లరీని సీజ్ చేసింది. -
పొడుగ్గా.. పొందికగా
లాంగ్ గౌన్ వెస్ట్రన్ పార్టీలో తప్పనిసరి కనిపించే డ్రెస్ఇండియన్ స్టైల్‌కి మార్చేస్తేదానికి ఎంబ్రాయిడరీ చేర్చితేదుపట్టా అదనపు హంగుగా చేరితేమన వేడుకకు పొడుగ్గా.. పొందికగా అమరిపోతుంది. మెరూన్ కలర్ ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లాంగ్ గౌన్ ఇది. రెండు చేతులకు పెద్ద మోటిఫ్స్, నెక్కు, హ్యాండ్ కఫ్స్‌కి, దుపట్టాకి, అంచుకి జరీ, జర్దోసీతో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. ప్రిన్సెస్ కట్ బాడీ పార్ట్, బోట్ నెక్ డిజైన్ ఈ డ్రెస్‌కు ప్రధాన ఆకర్షణ అయ్యాయి. ఇలాంటి డ్రెస్ తక్కువ బడ్జెట్లో మీరూ రూపొందించుకోవాలంటే.. ఇలా రూపొందించుకోవచ్చు.. వేలు, లక్షలు ఖర్చు పెట్టి డిజైనర్ డ్రెస్‌ను రూపొందించుకోలేం అని నిరుత్సాహపడనక్కర్లేదు. మన బడ్జెట్‌ను బట్టి తక్కువ ఖర్చుతోనే డిజైన్ చేయించుకోవచ్చు. ∙మీ దగ్గర తగినంత బడ్జెట్ ఉంటే ఖరీదైన ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌ని ఈ లాంగ్గౌనికి వాడుకోవచ్చు. ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ధర రూ.500/– నుంచి రూ.1000/– పైన ఉంటుంది. తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే సెమీ రా సిల్క్, సెమీ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి మీటర్ ఫ్యాబ్రిక్‌కి రూ.150/–ల నుంచి రూ.500/–వరకు లభిస్తాయి. ∙ఇది ప్యానెల్స్ లాంగ్గౌన్ కాబట్టి ఎంత ఎక్కువ ఫ్లెయిర్ ఉంటే డ్రెస్ అందం అంతగా పెరుగుతుంది. ఈ గౌన్‌కి 10 మీటర్ల ఫ్లెయిర్ వచ్చేలా డిజైన్ చేశాం. తక్కువ బడ్జెట్లో అయిపోవాలంటే కనీసం 5 మీటర్ల ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవాలి. ఎంబ్రాయిడరీకి బదులుగా రెడీమేడ్ అంచులు ∙నెక్కి, చేతులకు, అంచులకు ఎంబ్రాయిడరీ చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకని బ్రొకేడ్ ఫ్యాబ్రిక్, రెడీమేడ్‌గా లభించే ఎంబ్రాయిడరీ చేసిన అంచులను ఈ గౌన్‌కి జత చేశాం. మార్కెట్లో ఎంబ్రాయిడరీ అంచులు తక్కువ ధరకే లభిస్తాయి. ఎంబ్రాయిడరీకి బదులు వీటిని వాడినా మీకు ఆ లుక్ వస్తుంది. బ్రొకేడ్ క్లాత్ ఫ్యాబ్రిక్లోనూ హెవీ బ్రొకేడ్స్, సెమీ బ్రొకేడ్స్ ఉంటాయి. తక్కువ ఖర్చులో డ్రెస్ కావాలనుకుంటే సెమీ బ్రొకేడ్ తీసుకోండి. ఇది మీటర్ ఫ్యాబ్రిక్ రూ.500/–ల లోపు లభిస్తుంది. అదే ప్యూర్ బ్రొకేడ్ మీటర్ ధర దాదాపు రూ.3000/–నుంచి లభిస్తుంది.దుపట్టా దుపట్టాకి ప్యూర్ క్రేప్ఫ్యాబ్రిక్కు బదులు జరీ చెక్స్ ఉన్న జార్జెట్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకున్నాను. ఇది మీటర్‌కి రూ.200/– నుంచి లభిస్తుంది. అంచులు ∙10 మీటర్ల ఈ లాంగ్ గౌన్ ప్యానెల్ ఫ్లెయిర్కి అంచుకు 3 మీటర్ల ఫ్యాబ్రిక్ పట్టింది. బార్డర్ కోసం ఫ్యాబ్రిక్ వెడల్పు 10 ఇంచుల కొలత తీసుకొని, అంత మేరకు అంచుగా వేశాం. మీరు ఎత్తు తక్కువ ఉంటే బార్డర్ వెడల్పు 4– 5 ఇంచులు వెడల్పు తీసుకోవచ్చు. ∙ఎంబ్రాయిడరీ బార్డర్స్ మీటర్ చొప్పున రెడీమేడ్‌గా లభిస్తాయి. ఇవి రూ.100 నుంచి రూ.1000/– దొరికేవీ ఉన్నాయి. మీ బడ్జెట్ బట్టి వీటిని ఎంపిక చేసుకోవడమే. సుమారుగా డ్రెస్ ఖర్చు ∙సెమీ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌కి మీటర్‌కి సుమారు రూ.150/– నుంచి రూ.500/– (5 మీటర్లు) ∙అంచులకి వాడే సెమీ బ్రొకేడ్ ఫ్యాబ్రిక్ మీటర్‌కి దాదాపు రూ.300/– నుంచి రూ.500/– (3 మీటర్లు) ∙ఎంబ్రాయిడరీ బార్డర్స్ మీటర్‌కి రూ.100/– నుంచి రూ.1000/– (3 మీటర్లు) ∙దుపట్టా ఫ్యాబ్రిక్ 2 1/2 మీటర్లకు దాదాపు రూ.300 నుంచి రూ.500 /– ఈ మొత్తం డ్రెస్ డిజైన్‌కి దాదాపు రూ.2500/– నుంచి ఖర్చు అవుతుంది. తక్కువ బడ్జెట్లో ఇలాంటి డ్రెస్ కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ ఎంపికయే ప్రదానం. - మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ -
దారుణం: కన్న తండ్రే కామాంధుడై..
ముంబై : మహానగరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వావివరసలు మరచి జంతువులూ ప్రవర్తించాడు. కన్నతండ్రి అనే పదానికే కళంకం తెచ్చిన ఆ దుర్మార్గుడిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైలోని వకోల ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. అతనికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. 17 ఏళ్ల తన పెద్ద కూతురిపై గత రెండేళ్లుగా పలు మార్లు అత్యాచారం చేశాడు. గత ఏడాది నవంబర్‌లో రెండో కూతురు(13)పై కూడా అత్యాచార యత్నం చేశాడు. ఈ విషయాన్నిపెద్ద కూతురు గత వారం తల్లికి చెప్పడంతో ఆమె భర్తతో గొడవకు దిగింది. దీంతో భార్య, పిల్లలను ఇంటి నుంచి గెంటేశాడు. ఆదివారం ఈ మేరకు భార్య ముంబైలోని వకోల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
భగీరథ ప్రయత్నం.. భారతీయ వస్త్రధారణం
-
కోదండ రాముని సేవలో ‘ఫ్యాషన్ డిజైనర్’
సాక్షి ప్రతినిధి, తిరుపతి : హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తురాలు మూడేళ్లుగా తిరుపతి కోదండ రామస్వామికి భక్తి పూర్వక సేవలందిస్తూ తరిస్తోంది. ఏటా మార్చిలో జరిగే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మిక, పురా ణ కథల పరదాలను విరాళంగా అందజేస్తోంది. వృత్తి రీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రసన్నరెడ్డి హైదరాబాద్‌లోని బోయిన్పల్లి ఏరియాలో ఉంటున్నారు. ఐదేళ్ల కింద ట బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అప్పట్లో ఆలయ ప్రధాన ద్వారం దగ్గ ర వేలాడే స్వామివారి పరదాలను చూశారు. అందమైన దేవతల బొమ్మలతో పరదాలను తయారు చేయించి అందజేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత సంవత్సరం నుంచి ఏటా బ్రహ్మోత్సవాలకు వారం రోజుల ముందు సరికొత్త డిజైన్లు, దేవతల స్వరూపాలతో కూడిన పరదాలను సొంత వర్క్‌షాప్‌లో తయారుచేయించి తిరుపతి తీసుకొస్తున్నారు. ఏటా ఇందుకోసం రూ.3 లక్షలు ఖర్చు చేస్తున్న ప్రసన్నరెడ్డి ఈ ఏడాది కూడా స్వామివారికి 30 పరదాలను సమకూర్చా రు. మేలు రకం క్లాత్‌ను ఎంపిక చేసుకుని పవిత్రంగా పరదాలను తయారు చేయిస్తున్నానని ప్రసన్నరెడ్డి ‘సాక్షికి తెలిపారు. తన తల్లిదండ్రులకు శ్రీరామచంద్రమూర్తిస్వామి వారంటే ఎనలేని భక్తి, తనకూ శ్రీరామనవమి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని ఆమె వివరించారు. స్వామి వారికి ఏటా పరదాలను సమకూర్చి అందజేసే అదృష్టాన్ని ముందు ముందు కూడా కలుగజేయాలని భగవంతుని కోరుకుంటున్నానని ప్రసన్నరెడ్డి వెల్లడించారు. -
లెజండరీ ఫ్యాషన్ డిజైనర్ కన్నుమూత
‘లిటిల్ బ్లాక్ డ్రెస్’ తో ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించిన ప్రముఖ ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ హుబెర్ట్ డి గివెన్చీ(91) శనివారం పారిస్‌లో కన్నుమూశారు. 1950వ దశకంలో క్వీన్ ఎలిజబెత్‌తో పాటు, పలువురు చైనీస్ సోషలైట్స్కు డ్రెస్ డిజైనింగ్ చేయటం ద్వారా ప్రఖ్యాతిగాంచారు. అమెరికా మాజీ మొదటి మహిళ జాక్వలిన్ కెన్నెడీ దుస్తులను డిజైన్ చేసేందుకు హుబెర్ట్ను డిజైనర్‌గా నియమించుకున్నారు. తన అధికార పర్యటనల్లో భాగంగా ఆమె ఎల్లప్పుడూ హుబెర్ట్ డిజైన్ చేసిన దుస్తులనే ధరించేవారు. ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచిన హుబెర్ట్ మరణించారని ఆయన భాగస్వామి ఫిలిప్ వెనెట్ తెలిపారు. -
ఇంజినీర్ టు డిజైనర్
సంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చే హైదరాబాద్ ఫ్యాషన్ హబ్‌గా మారింది. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్లు సైతం ఇక్కడ స్టోర్స్ తెరిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆసిఫ్ మర్చంట్ కూడా ఇటీవల ‘హై ఫ్యాషన్ ఇంటర్నేషనల్ కౌచర్ స్టోర్’ను సిటీలో ప్రారంభించారు. ఎంతోమంది మోడల్స్‌ను తీర్చిదిద్దిన ఆయన ఫ్యాషన్ రంగంలో వస్తున్న మార్పులపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్‌లో బ్రాండెడ్ కార్లు, ఇంటర్నేషనల్ స్టోర్స్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది ఈ సిటీకి అంతర్జాతీయ అభిరుచి ఉందని. ఇక్కడి వారు దుస్తుల విషయంలో ప్రయోగాలు చేస్తుంటారు. గతంలో ఇక్కడ అనేక సార్లు ఫ్యాషన్ షోలు చేశాను. అందుకే ముంబై, దుబాయ్ తర్వాత సౌత్‌లో నా ఫ్యాషన్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాను. ఇండియా దూసుకెళ్తోంది.. నేను కెరీర్ మొదలెట్టినప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ రంగం ఇంతగా లేదు. ఫ్యాషన్‌కి సంబంధించిన చదువుల్లేవు. ఈ రంగంలో వస్తున్న విజయాలు, ఆదాయంతో ఇండియన్ ఫ్యాషన్ రంగం దూసుకెళ్తోంది. ఫ్యాషన్ కాలేజీలు, స్టూడియోలు వస్తున్నాయి. పిల్లలు ఫ్యాషన్ డిజైనర్ అవుతానని ధైర్యంగా చెబుతున్నారు. నేను వచ్చినప్పుడు ఇవన్నీ లేవు. ఫ్యాషన్ రంగంలో ఉన్న చాలా మందితో కలిసి పనిచేసి, వారి అనుభవం నుంచి ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను. ఓపికే విజయం.. అయితే ఈ రంగంలోకి వస్తున్న నేటి తరానికి ఓపిక ఉండడం లేదు. అన్నింటికీ ఇంటర్నెట్ ఉంది. అప్పుడు మాకు కంప్యూటర్ కూడా లేదు. ఇంత దూరం రావడానికి 20 ఏళ్లు పట్టింది. ఈ రోజుల్లో 20 నెలల్లో సాధించాలనుకుంటున్నారు. ఎదగడంలో తొందరొద్దు. మన పని మాట్లాడాలి. ఎంత త్వరగా పేరు వస్తే అంత త్వరగా పోతుందని గుర్తెరిగి నడుచుకోవాలి. అవే స్ఫూర్తి.. నా డిజైన్లకు స్ఫూర్తి ప్రకృతి. నా చుట్టూ ఉండే మనుషులు. రోడ్డు మీద బెగ్గర్ కూడా కొన్ని సార్లు మనకు స్ఫూర్తి కలిగించొచ్చు. సంప్రదాయ దుస్తులను ట్విస్ట్ చేసి మరింత ఫ్యాషనబుల్‌గా యువతకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంజినీర్ టు డిజైనర్ నా స్వస్థలం ముంబై. సివిల్ ఇంజినీరింగ్ చదివాను. ఇంజినీర్కి, ఫ్యాషన్ డిజైనర్‌కి ఇమాజినేషన్, క్రియేషన్ ఉంటాయి. నాకు ఐదుగురు సిస్టర్స్. ఓ సోదరి తన దుస్తులు ఆమే కుట్టుకునేది. అలా చిన్నప్పటి నుంచి డిజైన్ చేయడం, కటింగ్, స్టిచ్చింగ్ చేయడం గమనించేవాణ్ని. అది రానురాను మరింత పెరిగింది. ఇంజినీరింగ్ పూర్తయ్యే సమయానికి 300 దుస్తులు తయారు చేయమని ఓ ఆర్డర్ వచ్చింది. లండన్ ప్రదర్శనలో అవి బాగా అమ్ముడయ్యాయి. దాంతో నమ్మకం పెరిగింది. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయింది. -
స్టార్స్ తళుకులు..ఫ్యాషన్ మెరుపులు
ఫ్యామిలీ వేడుకల నుంచి ఫ్యాషన్ ఈవెంట్ల దాకా.. అవార్డ్ ఫంక్షన్ల నుంచి ఆడియో లాంచ్‌ల దాకా.. అన్నింటా తారల తళుకుబెళుకులే. నగరంలో జరిగే పబ్లిక్ ఈవెంట్స్‌లో సినిమా తారలు కనపడడం ఇప్పుడు సర్వసాధారణమైంది. అదే సమయంలో సదరు ఫంక్షన్లలో వీరి స్పెషల్ లుక్ మాత్రం తరచుగా టాక్ ఆఫ్ ది సిటీగా మారుతోంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఓ అవార్డ్‌ల వేడుకలో తారల స్పెషల్ లుక్ మరోసారి సిటీ ఫ్యాషన్‌కు హాట్ టాపిక్ అయింది. నిన్నా మొన్నటి దాకా అవుటాఫ్ సినిమా లుక్‌లో సమంత టాప్ ఇన్ టౌన్ కాగా.. ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పుడు యువ తారలు పోటీపడుతున్నారు. ఒకప్పుడు సినిమా తారలు బయట కనపడడం చాలా అరుదు. అరకొరగా కనపడినా.. హెవీ మేకప్, విభిన్న రకాల కాస్ట్యూమ్స్ వేసిన భారాన్ని తగ్గించుకోవడానికి అన్నట్టుగా చాలా సింపుల్‌గా కనిపించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది.. సినిమాల్లో కనపడ్డానికన్నా బయట మరింత స్పెషల్‌గా ఉండాలన్నట్టు అందాల తారలు పోటీపడుతున్నారు. బయట కెమెరా కళ్లను తిప్పుకోనివ్వకుండా అద్భుతమైన డ్రెస్సింగ్ స్టైల్స్‌తో అదరగొడుతున్నారు. బాలీవుడ్ టు టాలీవుడ్ గతంతో పోలిస్తే టాలీవుడ్లో యువ తారలు ఇప్పుడు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. పబ్లిక్ లుక్ విషయంలో నవయువ టాలీవుడ్‌కి బాలీవుడ్ ఆదర్శంగా మారింది. ముంబయిలో జరిగే పబ్లిక్ ఈవెంట్స్‌లో తారలు బాగా పాల్గొంటారు. అంతేకాదు.. ఆ ఈవెంట్స్ కోసం స్పెషల్ డిజైన్స్‌ను సెలక్ట్ చేసుకుంటారు. సదరు ఈవెంట్స్‌లో వారు ధరించిన దుస్తులు, యాక్సెసరీస్ వంటివి పత్రికలు, మేగ్జైన్స్లో ఫ్యాషన్ పండితుల సమీక్షకు నోచుకుంటున్నాయి. దీంతో అక్కడ తారలు మరింత కేర్‌ఫుల్‌గా తమని తాము తీర్చిదిద్దుకోక తప్పడం లేదు. సాధారణంగా సినిమాల్లో పాత్ర, సన్నివేశం డిమాండ్ చేసిన మేరకు దుస్తులు ధరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా తమదైన స్టైల్ స్టేట్మెంట్ ఇదీ అని చెప్పుకునేందుకు గాని నచ్చిన పర్సనల్ స్టైల్‌ని చూపించేందుకు గాని పెద్దగా ఆస్కారం ఉండదు. దాంతో ఫ్యాషన్ విషయంలో తమదైన అభిరుచిని వ్యక్తపరచేందుకు తారలు పబ్లిక్ ఈవెంట్స్‌ను ఓ అవకాశంగా మార్చుకుంటున్నారు. పోటాపోటీ.. ఎవరికి వారేసాటి.. టాలీవుడ్ హీరోయిన్లలో సమంత పబ్లిక్ స్టైల్స్‌లో చాలా కాలం టాప్ ప్లేస్‌లో కొనసాగారు. విభిన్న రకాల దుస్తులు, యాక్సెసరీస్‌తో నార్త్ ఇండియన్ స్టార్స్‌కు దీటుగా వేడుకల్లో కనిపించేవారామె. ‘ఈవెంట్స్‌కి గెస్ట్‌గా వెళ్లినప్పుడు శామ్స్ (సమంత) డిఫరెంట్ లుక్‌తో కనపడాలనుకుంటుంది. ప్రత్యేక శ్రధ్ధతో లుక్‌ని తీర్చిదిద్దుకుంటుంది. అందుకే సినిమాలను మించి ఈవెంట్స్‌లో ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది’ అన్నారు సమంతకు వ్యక్తిగత స్టైలిస్ట్ నీరజ కోన. అయితే పెళ్లికి కాస్త ముందు నుంచే ఆమె బయట ఈవెంట్స్‌లో పాల్గొనడం తగ్గింది. ఈ క్రమంలో ఇప్పుడు పలువురు యువతారలు సమంతనే స్ఫూర్తిగా తీసుకుంటూ ఈవెంట్స్‌కి గ్లామర్ అద్దుతున్నారు. వీరి అవుట్ లుక్ పుణ్యమాని సిటీ డిజైనర్ల సత్తాకు చెప్పుకోదగ్గ పరీక్ష ఎదురవుతోంది. మరో విశేషం ఏమిటంటే.. సిటీలో సినిమా కాస్ట్యూమ్ డిజైనర్స్, సినిమా రంగానికి అవతల ఫ్యాషన్ రంగంలో పేరొందిన డిజైనర్స్ వేర్వేరు కావడంతో.. ఈ ఈవెంట్స్ పుణ్యమాని సిటీ డిజైనర్స్‌కు సినిమాస్టార్స్తో కలిసి పనిచేసే అవకాశం బాగా పెరిగింది. -
నాన్న చిరంజీవికి, తమ్ముడు చరణ్‌కి ఆమె డిజైనర్!
జీవితమంతా కుట్లు అల్లికలే. అలా కుట్టీ.. అల్లీ.. పేరిస్తేనే జీవితం అందంగా కనబడుతుంది. డైరెక్టర్ కథ అల్లుతాడు.. సినిమాటోగ్రాఫర్ కెమెరాతో కథను కూర్చుతాడు. రైటర్ సంభాషణతో ఎంబ్రాయిడరీ చేస్తాడు... ఎడిటర్ సైజ్‌కి కట్ చేస్తాడు. ఇవన్నీ రంగస్థలం మీదకు వచ్చే ముందు హీరోకి క్యారెక్టర్ అన్న దుస్తులు తొడుగుతారు. సుష్మిత... నాన్న చిరంజీవికి, తమ్ముడు చరణ్‌కి క్యారెక్టర్ అన్న దుస్తులు కుడుతుంది. ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ మీ నాన్నగారి (చిరంజీవి)కి, ఇప్పుడు తమ్ముడి (రామ్‌చరణ్)కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మీ ఫీలింగ్? సుష్మిత: ఫ్యాషన్ స్టైలింగ్‌లో స్పెషలైజేషన్ చేశా. మొదట్నుంచీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. డాడీ ‘ఇంద్ర’ సినిమాలో ‘రాధే గోవిందా..’ సాంగ్‌కి స్టైలింగ్ చేశా. ఆ తర్వాత ‘అందరివాడు’. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’కి ఫస్ట్ టైమ్ ఫుల్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశా. అంతకుముందు సాంగ్స్‌పైనే దృష్టి పెట్టేదాన్ని. డాడీ తర్వాత తమ్ముడి సినిమా (‘రంగస్థలం)కి చేయడం చాలా మంచి అనుభవం. ‘రంగస్థలం’ విలేజ్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి సవాల్‌గా అనిపించిందా? డాడీ ‘ఖైదీ నంబర్ 150’కి చరణ్‌తో కలసి సహ నిర్మాతగా చేశా. కానీ, చరణ్ హీరోగా ఉన్నప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేయడం ఇదే ఫస్ట్‌టైమ్. 1985 బ్యాక్‌డ్రాప్ మూవీ కాబట్టి నైన్టీన్ ఎయిటీస్ సినిమాలు చూశాను. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల యాస, కట్టూబొట్టు, వ్యవహార శైలి, సంప్రదాయాల గురించి అవగాహన ఉంది. అయినా బాగా రిసెర్చ్ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ సుకుమార్‌గారు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. దాంతో కొంచెం వర్క్ ఈజీ అయ్యింది. సినిమాకి కావల్సిన ఫ్యాబ్రిక్ ఎక్కడ కొన్నారు? ఎయిటీస్‌లో వాడిన లుంగీలు, చొక్కాలు, ప్రింట్లు ఇప్పుడు లేవు. పెద్ద పెద్ద గళ్లు, డార్క్ కలర్స్ వాడేవాళ్లు. అప్పట్లో వాడిన కొన్ని కలర్స్ ఇప్పుడు లేవు. కొన్ని లుంగీలు, చొక్కాలు ప్రత్యేకంగా ప్రింట్ చేయించాం. తూర్పు గోదావరి జిల్లాలో షూట్ చేసినప్పుడు రాజమండ్రి లోకల్ మార్కెట్స్, పోలవరం మార్కెట్స్‌లో కొన్నాం. హైదరాబాద్‌లోనూ షాపింగ్ చేశాం. ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఎంతకాలం సినిమాలు చేసినా చూస్తారు. కూతురిగా మీ డాడీకి రెస్ట్ కావాలని మీకనిపించదా? అస్సలు లేదు. ఎందుకంటే ఖాళీగా ఉంటే డాడీ అదోలా ఉంటారు. తమ్ముడు కూడా ఆ టైపే. డాడీ ఇంట్లో ఉండటంకన్నా షూటింగ్‌తో బిజీగా ఉండటమే బెటర్. పని చేసిన రోజున చాలా హ్యాపీగా ఉంటారు. అందుకే డాడీ అలా వర్క్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. జనరల్‌గా కొంతమంది డిజైనర్స్ అవసరానికి మించి డ్రెస్సులు కుట్టించేసి, నిర్మాతతో ఖర్చు పెట్టిస్తారట. ‘రంగస్థలం’లో సాదాసీదా బట్టలే కాబట్టి ఎక్కువ ఖర్చు అయ్యుండదేమో? నేను ప్రొడ్యూసర్– ఫ్రెండ్లీ కాస్ట్యూమ్ డిజైనర్‌ని. ముందు కొనేద్దాం. తర్వాత చూసుకుందాం అనుకోను. నేనేదో ఫుల్ పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు కానీ, బాగా ప్లాన్ చేసి చాలా తక్కువ వేస్టేజ్ అయ్యేలా చూసుకుంటా. ఒకవేళ ఏమైనా మిగిలిపోతే అవి కూడా యాజ్ అయ్యేలా ట్రై చేస్తా. ఇన్డోర్ లొకేషన్ అనుకోండి.. ఆ రోజుకి ఏం కావాలో అదే రెడీ చేస్తా. అవుట్డోర్ అప్పుడు సేఫ్టీ కోసం రెండు మూడు డ్రెస్సులు ఎక్స్ట్రా ప్లాన్ చేస్తా. అంతే. చిట్టిబాబు (రామ్‌చరణ్ పాత్ర పేరు) కోసం ఎన్ని లుంగీలు కొన్నారేంటి? సినిమా మొత్తం ఆ గెటప్‌లోనే కనిపిస్తారా? రఫ్‌గా 35 నుంచి 40. చరణ్ విలేజ్ మాస్ కుర్రాడి క్యారెక్టర్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. 85 పర్సెంట్ లుంగీ గెటప్‌లోనే కనిపిస్తాడు. చిట్టిబాబు లుక్ గురించి సుకుమార్‌గారు చెప్పినప్పుడే ఎగై్జట్ అయ్యాను. చాలా స్కెచ్ వర్క్ చేశాం. ఎందుకంటే చరణ్‌ను నేనెప్పుడూ అలా చూడలేదు. ఇంట్లో కూడా అలా ఉండడు. ఇంతకీ చిట్టిబాబు అలియాస్ రామ్‌చరణ్‌కి లుంగీ కట్టుకోవడం వచ్చా? వచ్చా అంటే.. యాక్టర్స్ ఎవరైనా కొత్త విషయాన్ని ఇట్టే నేర్చుకోగలరు. చరణ్ కూడా అలాగే నేర్చుకున్నాడు. లుంగీలు కట్టుకోవడం చరణ్‌కి ఈజీగానే అలవాటైపోయింది. మధ్యలో లాంగ్ గ్యాప్ తీసుకున్నారు.. ‘ఖైదీ నంబర్ 150’తో రీ–ఎంట్రీ అయ్యారు. మళ్లీ ఎంటర్ కావడానికి రీజన్? పిల్లలు పుట్టిన తర్వాత బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దయ్యారు. ‘ఖైదీ నంబర్ 150’కి ముంబయ్ నుంచి షబీనా ఖాన్ అని హై ప్రొఫైల్ డిజైనర్ వచ్చారు. మంచి డిజైన్స్ ఇచ్చారావిడ. ముంబై వాళ్లకు డాడీ ఇమేజ్ తెలియకపోవచ్చు. ఆయన స్టైల్ ఏంటో ‘గ్యాంగ్ లీడర్’లాంటి మూవీస్ చూసినవారికే తెలుస్తుంది. అందుకే ‘నువ్వెందుకు ట్రై చేయకూడదు అక్కా’ అన్నాడు చరణ్. ‘నా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలి’ అన్నాను. దాంతో ‘నాన్నగారి కమ్ బ్యాక్ మూవీ. అక్క డిజైన్ చేస్తే బాగుంటుంది బావగారూ’ అని చరణ్ మా ఆయనతో మాట్లాడాడు. ఆయన ఒప్పుకున్నారు. ‘ఖైదీ నంబర్ 150’ జరుగుతున్నప్పుడు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ స్టార్ట్ అయింది. ఆ షోకు డిజైనింగ్ చేశాను. ఆ తర్వాత ‘రంగస్థలం’ స్టార్ట్ చేశా. ‘నా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలి’ అని తమ్ముడితో అన్నానన్నారు. అంటే అత్తామామల పర్మిషనా? మీ బెటరాఫ్ పర్మిషనా? మా ఆయన పర్మిషనే తీసుకోవాలనుకున్నాను. మా మావయ్య, అత్తయ్య ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. అమ్మాయిలకు పెళ్లైంది కదా అని ఇంట్లో కూర్చోకూడదు. ఏదో ఒక వ్యాపకం ఉండాలంటారు. ఇక్కడ మా నాన్నగారు ఎలానో అక్కడ మా అత్తమ్మవాళ్లు అలా. చిరంజీవిగారి ‘సైరా’కి కూడా చేస్తున్నారు కదా.. అది వెరీ వెరీ చాలెంజింగ్ మూవీ? అవునండి. ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ వైజ్‌గా రిఫరెన్సెస్ ఉండవు. మూడు నెలలు రీసెర్చ్ వర్క్ చేశాం. బిగ్ క్రియేటివ్ టీమ్ కూడా ఉంది. చాలా వరకు రీ–క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడే ‘సైరా’ గురించి మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. ఇంత కష్టపడుతున్నారు. ‘సైరా’ నిర్మాత రామ్‌చరణ్ మీకు ఎంత చెక్ ఇస్తారు? ఆ విషయం తమ్ముణ్ణే అడగండి (నవ్వుతూ). మా మధ్య మనీ టాపిక్ రాదు. డాడీ, తమ్ముడు కాబట్టి ఎక్కువ కేర్ తీసుకుంటాను. నా టార్గెట్ ఒకటే. స్క్రీన్ మీద వాళ్లు అందంగా కనిపించాలి. ఫ్యాన్స్ ఈలలు వేయాలి. ‘రంగస్థలం’ షూట్ రాజమండ్రిలో జరిగినప్పుడు ఎండలకు సమంత కళ్లు తిరిగి పడిపోయారు. మీకేమైనా ఇబ్బంది? ‘రంగస్థలం’ డిజైనింగ్ పరంగా చాలెంజింగ్ అనిపించలేదు కానీ, లొకేషన్లో యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. రాజమండ్రిలో షూట్ చేసినప్పుడు మొబైల్ నెట్వర్క్ లేకపోవడం బెటర్ అయ్యింది. వర్క్ మీద కాన్సంట్రేట్ చేశాం (నవ్వుతూ). ఫోన్‌కాల్స్ లేవు. ఇక వాట్సాప్ సంగతి మర్చిపోయాం. ఏప్రిల్‌లో అక్కడ షూట్ చేశాం. విపరీతమైన ఎండలు. టఫ్ అనిపించింది. కొంతమంది సన్ స్ట్రోక్ బారిన పడ్డారు. లక్కీగా నాకేం కాలేదు. కష్టం తెలియకుండా పెరిగారు.. ఇప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం మీకేంటి? ‘‘మీ టాలెంట్‌ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. మేం కష్టపడింది మిమ్మల్ని కంఫర్టబుల్‌గా ఉంచడానికే. మీరు ఓన్ ఐడెంటిటీ తెచ్చుకోవాలి’’ అని డాడీ అంటుంటారు. అందుకే తమ్ముడు తన ఫీల్డ్‌లో, నేను నా ఫీల్డ్‌లో ప్రూవ్ చేసుకోవడానికి తపనపడుతున్నాం. మా లగ్జరీ లైఫ్ వెనకాల డాడీ పడిన కష్టం తెలుసు. నా పిల్లలకు ఆ కష్టం తెలియజెప్పాలనుకుంటున్నా. అప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. మీ చిన్నప్పటి విశేషాలు.. మీరు, మీ తమ్ముడు, చెల్లెలు శ్రీజ.. మీ ముగ్గురిలో ఎవరు అల్లరి చేసేవారు? నేనే. వాళ్లిద్దరూ కొంచెం క్వైట్. శ్రీజ అంత పబ్లిక్ పర్సన్ కాదు. చరణ్, నేను చిన్నప్పుడు చాలా ఫైట్ చేసేవాళ్లం. మా ఇద్దరికీ అస్సలు పడేది కాదు. ఇంట్లో మా అల్లరి భరించలేక ఇద్దర్నీ వేరు వేరు హాస్టల్స్‌లో పెట్టాలని కూడా ఆలోచించారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కి ఫిల్మ్ ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు నేను టెన్త్ స్టాండర్డ్‌లో ఉన్నాను. అందుకని అక్కడే మా పెద్దమ్మ వాళ్ల ఇంట్లో ఉండి చదువుకున్నాను. తమ్ముణ్ణి హాస్టల్లో పెట్టారు. ఆ సెపరేషన్లో తమ్ముణ్ణి చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ కలిగింది. తనకూ సేమ్ ఫీలింగ్. అప్పటినుంచి కొట్టుకోవడం మానేశాం. ఇప్పుడు మేం బ్రదర్ అండ్ సిస్టర్ అనేకన్నా.. బెస్ట్ ఫ్రెండ్స్ అనొచ్చు. ఇంట్లోకి కొత్త అమ్మాయి వచ్చిన తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య ఏదో గ్యాప్ వచ్చిన ఫీలింగ్ కలగడం సహజం. ఉపాసన మీ ఇంటి కోడలయ్యాక మీకలాంటి ఫీలింగ్? అస్సలు లేదు. ఉపాసన నాకు ముందు నుంచే బాగా తెలుసు. అందర్నీ కలుపుకుని వెళ్లే మనస్తత్వం తనది. ఎవరితో అయినా ఎక్కడైనా తను ఈజీగా మింగిల్ అయిపోతుంది. వెరీ లైవ్లీ పర్సన్. మా ఇంటికి ఓ కొత్తమ్మాయి వచ్చిన ఫీలింగ్ ఏమీ లేదు. మీరు తనని వదినా అని పిలుస్తారా? పెళ్లికి ముందే పరిచయం అన్నాను కదా. ఉపాసన అని పిలవడం అలవాటు. నన్ను సుష్మితా అని పిలిచేది. అలాగే కంటిన్యూ అవుతున్నాం. మీకు వంట వచ్చా.. పిల్లల కోసం ఏమైనా కుక్ చేస్తారా? పిల్లలకు స్వయంగా వండి పెడతాను. ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేస్తే ఎవరికైనా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. టైమ్ ఉన్నప్పుడల్లా కేక్‌లు, బిస్కెట్లు చేస్తాను. పిల్లలు కూడా చేసి పెట్టమని అడుగుతుంటారు. వంట చేయడానికి టైమ్ ఉంటుందా? అంటే.. ఉండకపోవచ్చు.. కానీ, టైమ్ తీసుకోవాలి. ఇంతకీ మీ పెద్ద పాప సమారా, చిన్న పాప సంహితలో మీ డాడ్ ఫ్యాన్ ఎవరు? తమ్ముడు ఫ్యాన్ ఎవరు? పెద్దపాప తాతగారి ఫ్యాన్. చిన్న పాప మావయ్య ఫ్యాన్. ఎప్పుడైనా ఇంట్లో ‘ధృవ, ఖైదీ నంబర్ 150 చూడాలనుకుంటే ఇద్దరికీ గొడవే. చిన్నపాప ‘ధృవ’ అంటుంది. పెద్దపాప ‘ఖైదీ నంబర్ 150’ సినిమా కావాలని పేచీ పెడుతుంది. పిల్లలిద్దరికీ కామన్‌గా ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ ఇష్టం. మనవరాళ్లిద్దరిలో తాతను ఎవరు ఇమిటేట్ చేస్తారు? మా చిన్న పాప డాడీని ఇమిటేట్ చేస్తుంది. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’ సాంగ్ ఉంది కదా. ఆ పాటకు డాడీ డ్యాన్స్ చేసినట్లే చేస్తుంది. మార్క్స్ తక్కువగా వచ్చినప్పుడు మీ డాడీకి చెప్పకుండా దాచేసిన సందర్భాలేమైనా? మా ఇద్దరికన్నా శ్రీజ స్టడీస్‌లో బెస్ట్. మార్కుల విషయంలో తనకు ఏ ప్రాబ్లమ్ లేదు. నాకు, తమ్ముడికి తక్కువ వచ్చేవి. అప్పుడు మేమిద్దరం ‘నువ్వు ఈ వారం ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించు. నేను నెక్ట్స్ వీక్ చూపిస్తా’ అని మాట్లాడుకునేవాళ్లం. అవన్నీ తలచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. మంచి జ్ఞాపకాలు. ఫైనల్లీ.. ఇక్కడ గోల్డెన్ స్పూన్‌తో పెరిగిన మీకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఎలాఉంది? మోస్ట్ కంఫర్టబుల్ ఫ్యామిలీ. మా అత్తమ్మకు గ్లామరస్ ఫీల్డ్ అంటే ఇష్టం. ‘నువ్వెందుకు స్క్రీన్‌పైకి వెళ్లకూడదు’ అంటారు? ‘‘అత్తమ్మా... చాలా లేట్ అయింది. ఇప్పుడు వెళితే బాగుండదు’’ అని సరదాగా అంటుంటాను. అమ్మ ఇంట్లో ఎలా ఉంటానో అత్తమ్మ ఇంట్లోనూ అలానే. ఐయామ్ వెరీ మచ్ బ్లెస్డ్. – డి.జి. భవాని -
ఫ్యాషన్ మంత్ర
-
దివి నుంచి దిగివచ్చావా.. యాపిల్ బ్యూటీ