tribals
-
మాకు రోడ్లేవి? .. ఏడు గ్రామాల ప్రజల పాదయాత్ర
మాడుగుల(అనకాపల్లి జిల్లా): ఎన్నికలకు ముందు హామీలకు హామీలు కురిపించి అధికారం వచ్చిన తర్వాత వాటిని గాలికొదిలేస్తోంది ఏపీ ప్రభుత్వం. హామీలను అమలు చేయకపోవడంపై ఏపీ ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. తాజాగా అనకాపల్లి జిల్లాలోని ఏడు గ్రామాల గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తాడివలస, గొప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం గ్రామాలకు చెందిన గిరిజనులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు.తమకు రోడ్లేవి అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీనిలో భాగంగా 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు ఏడు గ్రామాల ప్రజలు. రోడ్డు కోసం మాడుగల ఎంపీడీవో కార్యాలయం ముందు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవో వినతిపత్రం సమర్పించారు గిరిజనులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలవుతున్నా తమ రోడ్డు గురించి ఇప్పటివరకూ పట్టించుకోలేదని మండిపడుతున్నారు.. వర్షాలు పడితే వాగులు, వంకలు దాటాల్సి వస్తుందని, గర్భిణీలకు హాస్పిటల్ కు డోలీలు కట్టి తీసుకెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు స్థానికులు కాకపోవడం వలన తమ సమస్యలను పట్టించుకునే వారే లేరంటున్నారు. -
పూలతో ఘుమఘుమలు
కంచేడి పూలు... అందంగా కనిపించే వీటిని గిరిజనులు లొట్టలేసుకుని మరీ తింటారు... వాటితో ఘుమఘుమలాడే కూరలు చేసుకుని ఇష్టంగా లాగించేస్తారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో లభించే వీటికి అల్లూరి జిల్లాలో మంచి డిమాండ్ ఉంది. ఏజెన్సీ వాసులే కాకుండా ఇప్పుడు మైదాన ప్రాంతవాసులు కూడా వీటిని తినేందుకు అలవాటు పడ్డారు.సాక్షి,పాడేరు: అడవుల్లోను, గ్రామాల సమీపంలోను కంచేడి చెట్లకు మార్చి, ఏప్రిల్ నెలల్లో పూలు పూస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వీటిని సర్వరోగ నివారిణిగా గిరిజనులు భావిస్తారు. ఈ పూలను ఈ సీజన్లో రోజువారీ కూరగా వండుకుని ఇంటిల్లాపాదీ తింటారు. మైదాన ప్రాంత ప్రజలు కూడా కంచేడి పూల కూర తినడానికి అలవాటుపడ్డారు. అల్లూరి జిల్లాలోని వారపుసంతల్లో ఈ పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో వీటిని ఉడకబెట్టి తిన్నాడన్న పురాణగాథ కూడా ప్రచారంలో ఉంది. ఈ విరులు.. ఆరోగ్య సిరులు ఈ పూల కూర మంచి రుచికరంగా ఉండడంతో పాటు, ఔషధగుణాలు కలిగిఉండడంతో గిరిజనులు ఇష్టంగా తింటారు. రక్తహీనత, కీళ్ల సమస్య, నొప్పులు, అజీర్ణం, కంటిచూపు మందగించడం వంటి రుగ్మతలు ఉన్న వారు ఈ కూరను తింటే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో పలు శారీరక రుగ్మతలను నయం చేస్తుందని గిరిజనుల నమ్మకం. వీటితో వేపుడు, ఇగురు కూరలను వండుకుని తింటున్నారు. కొంతమంది ఎండుచేప, ఎండు రొయ్యలను కూడా కలిపి ఇగురు కూరగా తయారు చేస్తారు. మరి కొంతమంది గిరిజనులు ఈపూలను బాగా ఎండబెట్టి వరిగెలు తయారు చేసుకుని, భద్రపరుచుకుని ఏడాది పొడవునా వండుకుని తింటారు. బుట్ట కంచేడిపూలు రూ.600 నుంచి రూ.800 ధరతో అమ్ముతున్నారు. సంతల్లో చిన్న పోగులుగా వేసి వాటాను రూ.50తో అమ్మకాలు విక్రయిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ పూలు లభిస్తాయి. అనారోగ్య సమస్యలు దూరం కంచేడిపూలను వండుకుని తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఏడాదిలో రెండు నెలల మాత్రమే పూసే కంచేడి పూలను పూర్వం నుంచి తింటున్నాం. ఈకూర రుచికరంగా ఉండడంతో పాటు శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కంచేడి పూలను మహిళలు అధికంగా తింటారు. – చిట్టిబాబు, ఆయుర్వేద వైద్యుడు,కుజ్జెలి గ్రామం, పాడేరు మండలం -
గిరిజన వర్సిటీకి భూములిస్తే మార్చేస్తారా?
కొత్తవలస: పోలీసు శిక్షణ కేంద్రం (గ్రేహౌండ్స్) పేరిట మరోసారి తమను మోసం చేయొద్దని అప్పన్నదొరపాలెం, తమ్మన్నమెరక, జోడిమెరక గ్రామాలకు చెందిన గిరిజనులు ఆర్డీఓ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 526 ఎకరాల భూముల్లో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించేందుకు నిర్ణయించగా.. ఆర్డీఓ దాట్ల కీర్తి ఆధ్వర్యంలో సర్పంచ్ జోడు రాములమ్మ అధ్యక్షతన తహసీల్దార్ బి.నీలకంఠరావు అప్పన్నదొరపాలెంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. సభకు హాజరైన గిరిజనులు మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మిస్తామని చెప్పి తమ భూములను లాక్కున్నారని తెలిపారు. 2019లో ఎన్నో హామీలిచ్చారని, అందులో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. భూములిచ్చిన గిరిజనులను పోలీస్ బందోబస్తు మధ్య బంధించి పూజలు నిర్వహించారన్నారు. ఇప్పుడు అవే భూముల్లో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పడం మోసగించడమేనని పేర్కొన్నారు. తహసీల్దార్ ప్రభుత్వ నిబంధనల్ని వివరిస్తూ గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ సమయంలో గిరిజనులంతా ఒక్కటై తమను మళ్లీ మోసం చేయొద్దని నినదించారు. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం 178 మంది గిరిజనులకు చెందిన 179 ఎకరాల్లోని జీడిమామిడి తోటలను ఏడు రకాల హామీలిచ్చి తీసుకుందని.. నేటికీ వాటి అమలు ఊసే లేదని నిలదీశారు. గ్రేహౌండ్స్ నిర్మాణానికి తమ భూములిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తే తమ శవాలపై నిర్మాణాలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ.. గిరిజనుల డిమాండ్లు రాసి ఇస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. మరోసారి గ్రామంలో సభ ఏర్పాటు చేస్తామని అప్పటిలోగా ఆలోచన చేసుకోవాలని సూచించారు. -
మీ ఊరు కాదంటున్నారు!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆ ఊరికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. నాలుగు తరాలుగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఇళ్లు.. ప్రభుత్వ పాఠశాల.. చెరువు.. ఆయకట్టు కింద పొలాలూ ఉన్నాయి. అయినా, సరే ఇప్పుడిది మీ ఊరు కాదంటున్నారు అటవీ శాఖ అధికారులు. చెట్టు.. పుట్ట, ఇళ్లు, పొలాలన్నీ మీవి కావు. దీనిమీద మీకు హక్కులు లేవు. ఇది అటవీ శాఖకు చెందిన సంపద అని అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంతో కోల్పోయిన భూములకు వచ్చిన నష్ట పరిహారాన్ని కూడా వారి ఖాతాలో వేసుకున్నారు. అడుగు తీసి అడుగేయాలన్నా అనుమతి తీసుకోవాలంటున్నారు. ఇలా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నరజాముల తండా వాసులపై కొంతకాలంగా జులుం ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన యర్రగొండపాలెంకు 20 కిలోమీటర్ల దూరంలో.. జాతీయ రహదారి పక్కనే ఉండడం ఈ తండాకు తంటాలు తెచ్చిపెడుతోంది. మారుమూల అటవీ ప్రాంతంలోని నరజాముల తండాలో 290 కుటుంబాలకు పైగా జీవిస్తున్నాయి. అందరూ సుగాలీలే. పశువులను మేపుతూ, కట్టెలు కొడుతూ యర్రగొండపాలెంలో అమ్ముతూ పొట్ట పోసుకుంటుంటారు. కొందరు ఉద్యోగాలు కూడా సాధించారు. అయితే, ఆదివాసీలకు జరిగే అన్యాయాన్ని సరిచేసే పేరుతో తెచ్చిన అటవీ హక్కుల చట్టం–2006 ఇప్పుడు వీరి నెత్తిన కత్తిలా వేలాడుతోంది. వేసవిలో మంచినీటి బోర్లు వేసుకోవడానికి లేదు.. పొలాలకు వెళ్లనీయరు.. జీవాలను మేపుకొనేందుకు అడవిలోకి వెళ్తే కేసులు పెడుతున్నారు.. పాములు, క్రూర జంతువుల నుంచి ఆత్మరక్షణకు గొడ్డలి తీసుకెళ్తే లాక్కుంటున్నారు. ఆఖరికి పశువులనూ స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు గ్రామంలోని మౌలిక సమస్యలను ఉద్దేశపూర్వకంగానే అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రెండెకరాల పరిహారం అటవీ శాఖ ఖాతాలోకి.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలో రెండు ఎకరాలు హైవే నిర్మాణంలో పోయింది. పరిహారం కోరితే అటవీ శాఖ భూమి అని అంటున్నారు. మా భూమికి వారు డబ్బులు తీసుకోవడం ఏం న్యాయం? – నరసింహనాయక్, నరజాములతండా గిరిజనులపై ఆంక్షలు పెరిగిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లమల అడవుల్లో జీవించే గిరిజనులపై ఆంక్షలు, దాడులు పెరిగిపోయాయి. వారిపై అక్రమ కేసులు బనాయించడం, ఇళ్ల నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపివేయడం చేస్తున్నారు. కాయ కష్టంతో పండించిన పంటను అమ్ముకోనీయకుండా కూటమి ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్పడుతోంది. గిరిజనుల బాధలను గుర్తించిన వైఎస్ అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదుకున్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ పక్కా ఇళ్లు మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం గిరిజనులపై అటవీ అధికారులను ఉసిగొల్పుతోంది. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కు ఈ దారుణాలు కనిపించడం లేదు. మొద్దు నిద్ర వీడి గిరిజన ప్రాంతాలను సందర్శించి స్థానికుల బాధలు తెలుసుకుని పరిష్కరించాలి. – తాటిపర్తి చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, యర్రగొండపాలెంహైవేతో పెరిగిన సమస్యలు నాలుగేళ్ల క్రితం యర్రగొండపాలెం–హైదరాబాద్ రహదారి నేషనల్ హైవే 565 అయింది. మల్లాపాలం దాటాక 5 కిలోమీటర్ల నుంచి దావపల్లి వరకు 20.09 కిలోమీటర్ల మేర దండకారణ్యం ఉంది. అటవీ ప్రాంతానికి అవతల వరకు హైవే నిర్మాణమైంది. అనుమతులు రావడంతో ఇటీవల అడవిలోనూ పనులు మొదలుపెట్టారు. నరజాముల తండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లు, పొలాలు హైవేలో పోయాయి. స్థానికులతో చర్చించకుండా, చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా తండాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూడా అటవీ శాఖ కొట్టుకుని తీసుకుపోయింది. ఈ మేరకు నష్ట పరిహారం చెల్లించాలని గిరిజనులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఏమయ్యారు?నరజాముల తండాలో 400 ఎకరాల రెవెన్యూ స్థలం ఉంది. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 47 సెంట్ల నుంచి 10 ఎకరాల వరకు పొలాలకు పట్టాలు ఇచ్చారు. పాస్ పుస్తకాల ద్వారా గిరిజనులు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. 1972లో 250 ఎకరాలలో చెరువు నిర్మించగా ఆయకట్టు కింద 800 ఎకరాలు సాగవుతున్నాయి. 50 ఏళ్ల కిందటే ప్రభుత్వ పాఠశాల, అనుబంధంగా హాస్టల్ కూడా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సచివాలయం నిరి్మంచారు. ఇలా అన్ని సౌకర్యాలను కల్పిoచినపుడు అటవీ అధికారులు ఎక్కడకు పోయారని గిరిపుత్రులు నిలదీస్తున్నారు. ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజనులు కన్నతల్లిలాంటి ఊరిని కాపాడుకునేందుకు సుగాలీలు సిద్ధమవుతున్నారు. గ్రామంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. వదిలి వెళ్లేది లేదని తెగేసి చెబుతూ.. ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. తమ ఇళ్లు, పొలాలను రెవెన్యూ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఏఐ వార్తలు @ గిరిజన టీచర్
ఆదిలాబాద్ టౌన్: ఆదివాసీ పేద కుటుంబంలో జన్మించి అభ్యున్నతి వైపు పయనిస్తున్నాడు గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కైలాస్. అంతరించిపోతున్న గోండి, కొలామి భాషల పరిరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా యాంకర్‌ను సృష్టించి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నాడు. గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబాడా భాషల్లో వందలాది పాటలు రాసి ఔరా అనిపించాడు. ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం వాఘాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన కైలాస్ సేవల గురించి ఇటీవల మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రస్తావించి ప్రశంసించటం గమనార్హం.మట్టిలోని మాణిక్యంకైలాస్ 1 నుంచి 10వ తరగతి వరకు వాఘాపూర్ సర్కారు బడిలో చదివాడు. ఉట్నూర్‌లోని లాల్‌టేక్డి రెసిడెన్షియల్లో ఇంటర్, ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశాడు. 2000 సంవత్సరంలో అన్ట్రెయిన్డ్ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కొలువు సాధించాడు. ఈయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు పిల్లలు గంగోత్రి, సృజన్‌రామ్ ఉన్నారు. గాదిగూడ మండలంలోని డొంగర్‌గావ్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేసి, ప్రస్తుతం ఇంద్రవెల్లి మండలం గౌరపూర్‌లో స్కూల్ అసిస్టెంట్ (సాంఘిక శాస్త్రం)గా విధులు నిర్వహిస్తున్నాడు. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ పాఠాలు బోధిస్తున్నాడు. కరోనా సమయంలో గిరిజనులను అప్రమత్తం చేసేందుకు గోండి భాషలో కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేశాడు. గోండి భాషలోకి మహాభారతంఆదివాసీలకు మహాభారత గ్రంథాన్ని అందించాలనే ఉద్దేశంతో తెలుగు లిపి ద్వారా గోండి భాషలోకి ఆ గ్రంథాన్ని కైలాస్ అనువదించాడు. ‘సుంగల్తూర్పో (ఇలవేల్పు), తొడసం బండు (ఇంటి దేవత), నైతం మారుబాయి (అమ్మమ్మ), తొడసం నేలేంజ్ (తమ్ముని కూతురు)’పేరిట ఏఐ యాంకర్‌తో వార్తలు చదివించేవాడు. సంగీతం అంటే ఆయనకు మక్కువ. దీంతో కొలామి భాషలో వందకు పైగా పాటలు రచించి, వాటిని సైతం ఏఐ యాంకర్‌తో పాడించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.గిరిజనులను చైతన్యపర్చాలని..గిరిజనులను చదువు వైపు మళ్లించడంతోపాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నా. జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సాంకేతికతపై ఉన్న మక్కువతో ఏఐ యాంకర్ ద్వారా గోండి, కొలామి ఇతర భాషల్లో వార్తలు చదివించడం, పాటలు పాడించడం చేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నన్ను అభినందించడం సంతోషంగా ఉంది. – తొడసం కైలాస్, ఉపాధ్యాయుడు -
ఆదివాసీ చట్టం రద్దుకు కుట్రలు!
కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం 1/70 చట్టాన్ని రద్దు చేసి, గిరిజనుల హక్కు లను హరించేందుకు సన్నద్ధ మైంది. ‘ఈ చట్టం ఉంటే మన్యం ప్రాంత అభివృద్ధి చెందద’ని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు అందులో భాగమే! అడవి, అటవీ భూములు, అందులోని వనరు లపై తరతరాలుగా వస్తున్న ఆదివాసీ గిరిజనుల హక్కులను హరించటానికి వలస పాలకుల నుంచి దేశీయ పాలకుల వరకు అనేక గిరిజన వ్యతిరేక చట్టాలు చేశారు. 1855లో భారత గవర్నర్ జనరల్ డల్హౌసీ తొలి గిరిజన వ్యతిరేక అటవీ విధానాన్ని ప్రకటించి, అటవీ సంపదలన్నీ ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించాడు. 1864లో అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ నియామ కంతో అడవిపై బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం ప్రారంభమైంది. 1865లో ఓ చట్టం ద్వారా పూర్తిగా అడవులను తన అధీనంలోకి తెచ్చుకుంది. అధికార మార్పిడి తర్వాత దేశీయ పాలకులు, వలస పాలకుల విధానాలనే కొనసాగించారు. 1952లో ప్రకటించిన అటవీ విధానం దాని కొనసాగింపే! 1973లో ‘టైగర్ ప్రాజెక్టు’ పేరుతో గిరిజనులను అడవి నుండి వెళ్ళ గొట్టేందుకు పూనుకుంది. 1980లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గిరిజన వ్యతిరేక చట్టం అడవి నుండి గిరిజనులను ఖాళీ చేయించే చర్యలు తీసుకుంది. 2023లో మోదీ ప్రభుత్వం ‘అటవీ హక్కుల సవరణ చట్టం’ ద్వారా అటవీ భూములను బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టే విధానాలు చేపట్టింది. షెడ్యూల్డ్ ఏరియా భూ బదలాయింపు నిబంధనల చట్టం–1959 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఏడాది మార్చి 4న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం గిరిజనుల భూము లను, 1963 కంటే ముందు నుంచి స్థానికంగా ఉండి, భూమి హక్కులు కలిగిన గిరిజనేతరుల భూములను కూడా కాపాడుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 (1) ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించిన వాటిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఈ చట్టం 1963లో అమల్లోకి వచ్చింది. దీనికి కీలక సవరణలు 1970లో జరిగాయి కనుక ఈ చట్టం ‘1/70’గా ప్రాచుర్యంలో ఉంది. శ్రీకాకుళం గిరిజన ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల భూమి సమస్యను ముందుకు తెచ్చింది. గిరిజన పోరాటాలు ఇతర ప్రాంతాలకు విస్తరించ కుండా చూసేందుకు ప్రభుత్వమే గిరిజనులకు భూములు ఇచ్చి వారి హక్కులకు రక్షణ కల్పిస్తుందనే భ్రమలు కల్పించటానికి ఆనాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 1970లో 1/70 చట్టాన్ని చేసింది. ఈ చట్ట ప్రకారం గిరిజన ప్రాంతాల్లో భూమిపై పూర్తి హక్కు గ్రామ సభలకు, పంచాయితీలకు, గిరిజన సలహా మండలికి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో సెంటు భూమి సేకరించాలన్నా గ్రామ సభ, పంచాయితీ తీర్మానం అవసరం. ఈ తీర్మానం గిరిజన సలహా మండలికి పంపుతారు.1/70 సెక్షన్ –3 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతా ల్లోని అన్ని అటవీ సంపదలు, భూములు కేవలం గిరిజనులకు గాని లేక గిరిజనులు సభ్యులుగా ఉన్న సొసైటీకి మాత్రమే చెందుతాయి. అందుకు విరుద్ధంగా గిరిజనేతరులు భూములు పొందితే చట్ట రీత్యా చర్యలు తీసుకోబడతాయి. 5వ షెడ్యూల్లో ఉన్న అటవీ భూములను ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు లీజుకు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపై 1997 జూలైలో సుప్రీమ్ కోర్టు త్రిసభ్య ధర్మాసనం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వ లేదా దాని సంస్థలు లీజుకి ఇచ్చిన భూములు చెల్లవని తీర్పు ఇచ్చింది. ‘పీసా’ చట్టం కూడా ప్రతి ఆదివాసీ సమూహానికి, తమ గ్రామ పరిధిలోని సహజ వనరులపై హక్కు గ్రామ సభలకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. చట్ట సవరణ ప్రయత్నాలుగిరిజనులకు చెందాల్సిన అటవీ భూములను, బహుళజాతి సంస్థలకు, గిరిజనేతరులకు కట్ట పెట్టేందుకు 1996–2001 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 1/70 చట్ట సవరణకు నాటి సీఎం చంద్రబాబు దగ్గర నుండి శాసనసభ కమిటీల నివేదికల దాకా అనేక ప్రయత్నాలు జరిగాయి. 2000లో చింత పల్లి బాక్సైట్ తవ్వకాల కోసం ‘రస్ ఆల్ ఖైమా’ బహుళజాతి సంస్థకు బాబు ప్రభుత్వం అనుమతించింది. వేలాది ఎకరాలు అప్పగించేందుకు సిద్ధ మయింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య మాలు రావడంతో బాబు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. గత చంద్రబాబు ఆలోచనలకు అను గుణంగానే 1/70 చట్టం గురించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. గిరిజన ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమించడంతో ప్రభుత్వం ‘1/70 చట్టాన్ని రద్దు చేయబోమ’ని చంద్రబాబే స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇది మోసపూరిత ప్రకటనే. రద్దు అనే కత్తి చట్టంపై వేలాడుతూనే ఉంది. కూటమి ప్రభుత్వ మోసాలను గమనించి 1/70 చట్టాన్ని సవరించే చర్యలను వ్యతిరేకిస్తూ, చట్టంలో ఉన్న లొసుగులను తొలగించాలనీ, అటవీ హక్కుల సవరణ చట్టాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయాలనీ అన్ని వర్గాల గిరిజనులు ఉద్యమించాలి.బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526 -
సిరుల చీపురు
సాక్షి, పాడేరు: మనం ఇళ్లలో వాడే చీపురు పంట గిరిబిడ్డలకు జీవనాధారం. ఏజెన్సీలోని హుకుంపేట, డుంబ్రిగుడ, పెదబయలు, మంచంగిపుట్టు, అరకులోయ, జి.మాడుగుల, పాడేరు, సీతంపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో వేల కుటుంబాలు చీపురు పంటను సాగుచేస్తూ ఉపాధి పొందుతున్నాయి. పూర్వం దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే కొండచీపురు మొక్కలు నేడు మన్యం అంతా విస్తరించాయి.కొండపోడు, మెట్ట భూముల్లో గిరిజనులు చీపురు పంటను సాగుచేస్తున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ పంట చేతికి వస్తుంది. చీపురు గడ్డి (Broom grass) శాస్త్రీయనామం “థైసెలోలెనా మాక్సిమా’ ఈ మొక్కలు హిమాలయాల్లోని ఎత్తయిన ప్రాంతాలు, దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. మన ప్రాంతానికి దీన్ని వలస మొక్కగా చెప్పవచ్చు. చీపురుతో స్వయం సమృద్ధి కొండచీపుర్లకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది. ప్రస్తుతం చీపురు పంట దిగుబడికి రావడంతో పుల్లలను సేకరిస్తున్న గిరిజనులు వాటిని బాగా ఎండబెట్టి, కట్టలు కట్టి మండల కేంద్రాలు, వారపుసంతల్లో అమ్ముతున్నారు. చీపురు కట్టల తయారీలో గిరిజన కుటుంబాలు ఇంటిల్లిపాదీ కష్టపడతాయి. మహిళలు కూడా చీపురు సేకరణ, కట్టలు కట్టడం అలవాటు చేసుకున్నారు.చీపురు కట్టకు మార్కెట్లో రూ.40 నుంచి రూ.50 వరకు ధర పలుకుతోంది. ఎకరానికి కనీసం 2వేల వరకు చీపురు కట్టలు తయారవుతాయి.దీంతో ప్రతి గిరిజన రైతు ఏడాదికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నాడు. కొంతమంది గిరిజన రైతులు నేరుగా విశాఖపట్నం,గాజువాక, విజయనగరం, రాజమండ్రి వంటి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏటా ఏజెన్సీ అంతటా కొండచీపుర్ల అమ్మకాలు భారీగా జరుగుతాయి. ప్రస్తుతం మన్యం (Manyam) సంతల్లో వ్యాపారులంతా పోటాపోటీగా కొనుగోలు చేస్తుండటంతో చీపురు అమ్మకాల ద్వారా గిరిజన రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు.అడవిలోకి వెళ్లి పుల్ల, పుల్ల ఏరుకుని ఇంటికి తెచ్చి చీపురు కట్టలుకట్టి సంతల్లో అమ్ముకునేవారు. దట్టమైన అడవుల్లో చీపురు పుల్లల సేకరణ గిరిబిడ్డలకు నిరంతర సవాలే. నిత్యం క్రూర మృగాలు, విషసర్పాలతో పోరాటమే. సేకరణ మరీ కష్టంగా మారుతుండటం, రోజురోజుకూ గిరాకీ పెరుగుతుండటంతో ఆ చీపురు మొక్కల్ని తమ సమీపంలోని కొండవాలుల్లో పెంచడం మొదలు పెట్టారు. అలా ప్రారంభమైన చీపుర్ల సాగు ప్రస్తుతం ఏజెన్సీలో సుమారు వెయ్యి ఎకరాల వరకు విస్తరించింది.చీపురు పంటతో మంచి ఆదాయం కొండచీపురు పంట ద్వారా మా గ్రామంలోని అన్ని గిరిజన కుటుంబాలకు మంచి ఆదాయం లభిస్తోంది. మెట్ట,కొండపోడులో చీపురు సాగు చేస్తున్నాం.ఎకరం పంట ద్వారా సుమారు 2వేల వరకు చీపురు కట్టలు తయారు చేస్తాం. పంట సేకరణ, కట్టలు కట్టడం కష్టం తప్ప చీపురు సాగుకు ఎలాంటి పెట్టుబడి లేదు. – పాంగి అప్పన్న, మేభ గ్రామం సూకురు పంచాయతీ, హుకుంపేటమహిళలకు స్వయం ఉపాధి చీపురుపంట సాగుతో సీజన్లో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తోంది. సంక్రాంతి పండుగ దాటిన నాటి నుంచి మే నెల వరకు చీపురు కట్టలను సంతల్లో అమ్మకాలు జరుపుతాం, వీటి అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో సగం మహిళలమే తీసుకుని ఆసొమ్ముతో పలు వస్తువులు కొనుక్కుంటాం.గత పదేళ్ల నుంచి కొండచీపురు పంటను సాగుచేసుకుంటున్నాం.చీపురు పంట ఆరి్ధకంగా ఏటా మా కుటుంబాలను ఆదుకుంటోంది. – జన్ని సన్యాసమ్మ, గిరిజన మహిళా రైతు -
అయ్యన్న వ్యాఖ్యలతో స్తంభించిన మన్యం
సాక్షి, పాడేరు/బుట్టాయగూడెం: గిరిజనుల ప్రధాన చట్టం 1/70ని సవరించి టూరిజం అభివృద్ధి చేయాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు భగ్గుమన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో తలపెట్టిన 48 గంటల రాష్ట్ర మన్యం బంద్ తొలిరోజు విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీతో పాటు అఖిలపక్షాల నేతలు ఈ బంద్‌లో పాల్గొన్నారు. పాడేరు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా బంద్ జరిగింది. పాడేరు, అరకు, రంపచోడవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి తదితర ప్రాంతాల్లో గిరిజనులంతా ఏకమై సంపూర్ణ బంద్ చేశారు. మన్యం మొత్తం స్తంభించడంతో సీఎం చంద్రబాబు దిగి వచ్చారు. 1/70 చట్టాన్ని సవరించబోమని స్వయంగా ‘ఎక్స్’లో ప్రకటించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అఖిలపక్ష నాయకులతో మంగళవారం సమావేశమై గిరిజన చట్టాలు, హక్కులను పరిరక్షిస్తామని సీఎం ప్రకటించారని, 1/70 చట్టం రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వివరించారు. దీంతో మంగళవారం సాయంత్రం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. బంద్‌ను ముగిస్తున్నట్లు ప్రకటించారు.గిరిజన చట్టాల జోలికి వస్తే ఖబడ్దార్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకూటమి ప్రభుత్వ పెద్దలు గిరిజన హక్కులు, చట్టాల జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు హెచ్చరించారు. గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ బాధ్యత పాలకులపై ఉందన్నారు. 1/70 చట్టాన్ని సవరించి గిరిజనుల సంపదను దోచుకునేలా స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలిరోజు బంద్ విజయవంతం కావడంతో ప్రభుత్వం దిగి వచ్చిందని, ప్రభుత్వం గిరిజనులకు నష్టం చేసే ఏ కార్యక్రమం తలపెట్టినా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఎమ్మెల్యే› విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు.అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే బాలరాజుగిరిజన చట్టాలను సవరించాలంటూ వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు గిరిజనులకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో విలేకరులతో మాట్లాడుతూ 1/70 చట్టం సవరణ చేయాలని చూస్తే సహించేది లేదన్నారు.స్పీకర్ అయ్యన్నపై జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదురాజవొమ్మంగి: గిరిజనుల చట్టం 1/70పై వ్యాఖ్యలు చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకా యల అయ్యన్నపాత్రుడుపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయ కులు జడ్డంగి పోలీస్ స్టేషన్లో మంగళవా రం ఫిర్యాదు చేశారు. టూరిజంతో పాటు ఇతరత్రా మన్యం అభివృద్ధి చెందాలంటే 1/70 చట్టాన్ని సవరించాలన్న అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సంఘం నాయకులు తెడ్ల రాంబాబు, సత్యన్నారాయణ, సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, సవిరెల చంద్రుడు, పలువురు మహిళా నాయకులు చెప్పారు. బాధ్యత గల పదవిలో ఉన్న అయ్యన్న ఇలా మాట్లాడటం చట్ట వ్యతిరేకమని అన్నారు.వేకువజాము నుంచే బంద్మంగళవారం వేకువజాము పాడేరులో వైఎస్సార్ïÜపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, సీపీఎం, సీపీఐతో పాటు గిరిజన, ప్రజా సంఘాలన్నీ మంగళవారం బంద్ చేపట్టాయి. ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, సీపీఎం రాష్ట్ర నేతలు పి.అప్పలనరస, కిల్లో సురేంద్రతో పాటు నేతలంతా గిరిజనులకు అయ్యన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.పెదబయలులో మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో నేతలంతా రోడ్లపై బైఠాయించారు. అరకు లోయలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు ఘాట్‌లో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, జీసీసీ మాజీ చైర్పర్సన్ డాక్టర్ స్వాతిరాణి, వైఎస్సార్సీపీ నేతలంతా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణాలు, పెట్రోల్ బంకులను స్వచ్ఛందంగానే మూసివేశారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వారపు సంతలు రద్దయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షను వాయిదా వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రంగానే పనిచేశాయి. బ్యాంకులు తెరచుకోలేదు. అకిలపక్ష నేతలు రోడ్లపైనే భోజనాలు చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసివే యించారు. స్థానిక బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాల నాయకులు బైఠాయించారు. -
కూటమి ప్రభుత్వంపై భగ్గుమంటున్న గిరిజనులు
-
మా ప్రాణాలు తీసే అభివృద్ధి మాకెందుకు బాబు, కూన రవికుమార్కి గిరిజనులు వార్నింగ్
-
ఏజెన్సీలో అగ్గి రాజేసిన స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు
-
లగచర్లలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి, వికారాబాద్ జిల్లా: దుద్యాల మండలం లగచర్లలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పారిశ్రామిక వాడ కోసం భూసేకరణలో భాగంగా సర్వే కోసం వచ్చిన అధికారులకు రోటిబండ తండా గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీగా తరలివచ్చిన పోలీసులు వారిని వెళ్లకుండా వారించారు. దీంతో గిరిజనులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. గిరిజనులు ప్లకార్డులు చేతబూని తమ నిరసన తెలిపారు.మా అనుమతి లేకుండా పొలాల్లో సర్వే ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీస్ పహారా మధ్య అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటి బండ తండా, పులిచర్లకుంట తండాలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం దాదాపు 13 వందల ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలల క్రితం ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లి కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులపై గిరిజనులు, రైతులు దాడి చేశారు.ఈ ఘటన సంచలంగా మారిన విషయం తెలిసిందే. అనేక మంది రైతులు జైలు పాలయ్యారు. ప్రస్తుతం వాళ్లు బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేయటంతో ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుపై వెనక్కి తగ్గింది. తర్వాత అక్కడే పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని నిర్ణయించి భూసేకణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా గ్రామాల్లో భూసేకరణ కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారుఇందులో భాగంగా ఇవాళ రోటిబండ తండాకు అధికారులు సర్వే చేసేందుకు రాగా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో పోలీసులు భారీగా మోహరించి రైతులను సర్వేవైపు వెళ్లకుండా అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ పొలం పరిశ్రమల కోసం లాక్కుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్దితుల్లో భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. పోలీసుల నిర్భందంతో సర్వేచేయటంపై మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే సర్వే నిలిపివేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్య మంటున్నారు గిరిజన మహిళలు. -
ఆదివాసీల వింత సంప్రదాయం.. 2 కిలోల నూనె తాగిన మహిళ
-
గోండు భాషలో ప్రాథమిక విద్య
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీలకు గోండు భాషలో ప్రాథమిక విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆదివాసీ ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలను సంఘాల నేతలు సీఎం వద్ద ప్రస్తావిస్తూ వినతులు సమర్పించారు. ఆదివాసీల సమగ్రాభివృద్ధికి చర్యలురాష్ట్రంలోని ఆదివాసీల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలోనే పెట్టాం. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతివనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని అప్పట్లోనే నిర్ణయించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేశాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్ ఓవర్సీస్ స్కాలర్షిప్లను క్లియర్ చేస్తాం. ఆదివాసీ గూడేల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరు చేస్తాం. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేస్తాం. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందిస్తాం’ అని సీఎం వారికి హామీనిచ్చారు. -
గిరిజనులకు సికిల్‌సెల్ స్క్రీనింగ్
సాక్షి, అమరావతి: ప్రాణాంతకమైన సికిల్‌సెల్ వ్యాధిని పూర్తిగా నివారించి, గిరిజనులను దాని బారినుంచి కాపాడటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దేశంలోని గిరిజన ప్రాంతాల్లో ‘మిషన్ టు ఎలిమినేషన్ సికిల్‌సెల్ ఎనీమియా 2023–24’ను నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరిగే 2047 నాటికి గిరిజన ప్రాంతాల్లో సికిల్‌సెల్ అనేది లేకుండా చేసేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా స్క్రీనింగ్(నిర్ధారణ పరీక్షలు) నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ హాయంలోనే కార్యాచరణ..రాష్ట్రంలో 40 ఏళ్లలోపు గిరిజనులు 19,90,277 మంది ఉన్నట్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ మూడేళ్లలో (మూడు దశల్లో) రోగ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేసి రోగ లక్షణాలున్నవారిని గుర్తించాలని ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలోనే తొలిదశ రోగ నిర్ధారణ పరీక్షలు గతేడాది చేపట్టారు. ఇప్పటి వరకు 9,38,007 మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేíÜ 4,36,556 సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశారు. మరో 10,52,270 మందికి 2025 మార్చి నాటికి పరీక్షలు పూర్తి చేసేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.బాధితులకు భరోసా ఇచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంతొలిదశలో రాష్ట్రంలోని ఏజెన్సీ జిల్లాల్లో అత్యధికంగా సికిల్‌సెల్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధిక పరీక్షలు నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో సికిల్‌సెల్ రోగులు, క్యారియర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సికిల్‌సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు గొప్ప భరోసా ఇచ్చింది. గిరిజనుల్లో 1,913 మంది సికిల్‌సెల్, 1,707 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు గత ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్ అందించడంతోపాటు ఉచిత వైద్యం అందించింది. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కావడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధితులకు సామాజిక భద్రతా పెన్షన్ పెంచి మరీ ఇచ్చారు.గిరిజనుల్లోనే తీవ్రత ఎందుకంటే..సికిల్‌సెల్, తలసేమియా రెండూ రక్తసంబంధ వ్యాధులే. ఇవి రెండూ గిరిజనుల్లోనే ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రక్త సంబంధీకుల మధ్యే వివాహాలు ఎక్కువగా జరగడమని గుర్తించారు. మైదాన ప్రాంతాల్లో బయటి వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే గిరిజన ప్రాంతాల్లో గూడెం, ఊళ్లలో అతి తక్కువ జనాభా ఉండటం, వాటి పరిధి తక్కువగా ఉండటంతో వాళ్లలో వాళ్లే మేనరికపు వివాహాలు చేసుకుంటారు. రక్త సంబంధీకుల మధ్యే తరచూ వివాహాలు జరగడంతో జన్యుపరమైన సమస్యలతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకుల నిర్ధారించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రోగ లక్షణాలున్న ఇద్దరు వివాహం చేసుకోకుండా అవగాహన కల్పిస్తారు. దీనివల్ల భావితరాలకు సికిల్‌సెల్ సోకుండా అడ్డుకట్ట వేస్తారు. అప్పటికే రోగ లక్షణాలున్నవారికి పెన్షన్‌తోపాటు వైద్యసేవలు అందించి వారి జీవితకాలాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తారు.రోగ లక్షణాలను బట్టి కార్డులు⇒ సికిల్ సెల్ రోగ లక్షణాలు (బాధితులు), రోగవ్యాప్తికి కారకులుగా (క్యారియర్స్)ఉన్నవారిని గుర్తించి తగు వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. ⇒ చదువురాని వారికి సైతం అర్థమయ్యే రీతిలో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఈ కార్డుల్ని డిజైన్ చేశారు.⇒ క్యారియర్స్‌గా ఉన్నవారికి ప్రాణాపాయం లేకపోయినా వారి ద్వారా పిల్లలకు ఆ రోగం సంక్రమించే అవకాశం ఉంది.⇒ సికిల్‌సెల్, తలసేమియా వ్యాధుల తీవ్రతను తెలిపేలా తెలుపు, పసుపు రంగుల్లో వాటిని రూపొందిస్తున్నారు.⇒రోగ నిర్ధారణ పరీక్షల అనంతరం సంబంధిత వ్యక్తికి సికిల్‌సెల్, తలసేమియా వంటి రోగ లక్షణాలు ఉన్నాయో? లేదో? తెలిపే కార్డులు ఇస్తారు.⇒ రోగ లక్షణాలు లేకపోతే పూర్తిగా తెలుపు, లక్షణాల తీవ్రతను బట్టి తెలుపు నుంచి ముదురు పసుపురంగు వరకు ఉండేలా కార్డులు ఇస్తారు. -
కొండకోనల్లో నృత్య సౌందర్యం
మాటలు లేని కాలంలో ఆదివాసీలు లయబద్ధంగా వేసిన గెంతులే నేడు ప్రపంచదేశాల్లో గొప్ప నృత్యంగా వెలుగొందుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటైన గిరిజనుల కొమ్ముకోయ నృత్యం అత్యంత పురాతన కళారూపంగా ప్రసిద్ధి చెందింది. కోయ జాతి గిరిజనులు మాత్రమే చేసే ఈ నృత్యం దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఈ నృత్యం పేరు చెబితే చింతూరు మండలంలోని కోయజాతికి చెందిన కళాకారులు గుర్తుకువస్తారు.చింతూరు: సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొమ్ముకోయ నృత్యంతో తమ ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటుతున్నారు కోయజాతికి చెందిన గిరిజన కళాకారులు. ఈ నృత్యం పేరు చెబితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని తుమ్మలకు చెందిన గిరిజన కళాకారులు ముందుగా గుర్తుకొస్తారు. సొంత శుభకార్యాలతో ప్రారంభమైన ఈ నృత్యం రాష్ట్రంలో వివిధ పండుగల సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ భాగమైంది. అనంతర కాలంలో ఇతర రాష్ట్రాల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు కామన్వెల్త్ గేమ్స్, ఐపీఎల్ ప్రారంభం, ముగింపు సంబరాల్లో సైతం ఈ నృత్యం ఎంతో ప్రాచుర్యం పొందింది. 20 బృందాలు... తుమ్మలతోపాటు బుర్కనకోట, సరివెల, వేకవారిగూడెం, సుద్దగూడెం తదితర గ్రామాలకు చెందిన గిరిజన కళాకారులు సైతం ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సుమారు 20 బృందాల వరకు ఉన్నాయి. ఈవెంట్‌ను బట్టి ఒక్కో బృందంలో 20 నుంచి 40 మంది మహిళలు, పురుషులు ఉంటారు. ⇒ గిరిజన సంస్కృతికి తగ్గట్టుగా దుస్తులు ధరించి పురుషులు అడవి బర్రె కొమ్ములను పోలిన ఆకృతులు, నెమలి ఈకలతో కూడిన తలపాగా చుట్టుకుని, పెద్ద డోలు పట్టుకుని దానిని వాయిస్తూ ఉంటారు. మహిళలు తలకు రిబ్బన్ చుట్టుకుని అందులో ఈకలను పెట్టుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని పురుషుల డోలు వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తుంటారు. ముందు నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ నృత్యం క్రమేపీ పుంజుకుంటుంది. ⇒ నృత్యం ముగింపులో పొట్టేళ్ల మాదిరిగా పురుషులు తమ కొమ్ములతో ఒకరినొకరు గుద్దుకోవడం ప్రత్యేక ఆకర్షణ. దుస్తుల అలంకరణ వైవిధ్యంగా ఉంటుంది. పురుషులు ఎర్ర దుస్తులు ధరిస్తే మహిళలు పచ్చ దుస్తులు ధరిస్తారు. సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో.. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నారు. వివిధ పండుగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటున్నారు. ⇒ మన్యంలో చిత్రీకరించే కొన్ని సినిమాల్లో సైతం కొమ్ముకోయ నృత్య ప్రదర్శనకు చోటు దక్కింది. పుష్ప–2, గేమ్‌చేంజర్, దేవదాసు–2, ఊరిపేరు భైరవకోన, దొంగలబండి, అమ్మాయినవ్వితే.. శ్లోకం వంటి చిత్రాల్లో తమ ప్రదర్శనకు అవకాశం వచ్చినట్టు నృత్య కళాకారులు తెలిపారు.⇒ రోజుకు రూ.వెయ్యి: ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు రవాణా ఖర్చులు, వసతి కల్పించడంతో పాటు ఒక్కొక్కరికీ రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తారని వారు పేర్కొన్నారు. ఒకొక్క కళాకారుడు ఏడాదికి సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఆదాయం పొందుతుంటారు. ⇒ ఎంతో ఖ్యాతి పొందినా కళాకారులు మాత్రం వ్యవసాయం, కూలిపనులపై కూడా ఆధారపడుతుంటారు.ప్రస్థానమిలా..చింతూరు మండలం తుమ్మ లకు చెందిన పట్రా ముత్యం తమ గ్రామానికి చెందిన కొంత మంది కళాకారులతో కలసి ఓ బృందాన్ని ఏర్పాటుచేసి వివిధ పాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కొమ్ముకోయ నృత్య ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన మృతి అనంతరం అతని కుమారుడు రమేష్ సంప్రదాయ వృత్తిగా ఈ నృత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఐటీడీఏ సహకరించాలి కొమ్ముకోయ నృత్యం ద్వారా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటుతున్న తమకు సహకారం అందించాలి. ఐటీడీఏ ద్వారా తమకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే తాము ప్రదర్శనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. – పట్రా రమేష్, కొమ్ముకోయ కళాకారుడు, తుమ్మల ఎంతో ఆదరణ ఆదివాసీ సంస్కృతిలో భాగంగా ప్రకృతి ఒడిలో తాము నేర్చుకున్న ఈ నృత్యానికి ఇతర ప్రాంతాల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనల ద్వారా అక్కడి సంస్కృతిని తాము తెలుసుకునే అవకాశం కలుగుతోంది. ప్రభుత్వం నుంచి మాలాంటి కళాకారులకు పూర్తిస్థాయిలో సహకారంఅందించాలి. – వుయికా సీత, కొమ్ముకోయ నృత్య కళాకారిణి -
Vippa Puvvu: విప్ప పువ్వు.. కల్పతరువు
గిరిజనులకు అడవి ప్రసాదించిన ఫలాల్లో విప్ప పువ్వు ఒకటి. మన్యంలో విరివిగా లభించే ఇవి గిరిజనులకు మంచి ఆదాయ వనరు. ఇప్పటివరకు సీజన్లో మాత్రమే సేకరించి ఆదాయం పొందేవారు. ఇక నుంచి వీటితో ఏడాది పొడవునా అనుబంధ ఆహార ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పొందే దిశగా గిరి మహిళలు అడుగులు వేస్తున్నారు. చింతూరు: లాటిన్ పరిభాషలో సపోటేసీ జాతికి చెందిన అడవి చెట్టు విప్ప. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది. చెట్లు కలిగిన గిరిజనులు పూలు రాలడానికి ముందే వాటి చుట్టూ నేలను శుభ్రం చేస్తారు. తెల్లవారుతున్న వేళ విప్పపూలు (Vippa puvvu) రాలుతున్న సమయంలో సువాసన వెదజల్లుతుంది. ఇంటిల్లిపాదీ కలసి చెట్టు వద్దకు చేరుకుని బుట్టలు, చేటలతో పూలను సేకరిస్తారు. వీటిని నాలుగైదు రోజులు బాగా ఎండబెడతారు. ఎండిన పూలను సంతలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. ఏడాది పొడవునా అమ్మకాలు అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో విరివిగా విప్పచెట్లు ఉన్నాయి. కొన్ని గిరిజన కుటుంబాలు వీటిపై వచ్చే ఆదాయంతో ఏడాది పొడవునా జీవనం సాగిస్తున్నాయి. సేకరించిన పూలను ఎండబెట్టి చింతూరు, ఏడుగురాళ్లపల్లి, కుంట మార్కెట్లకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. భద్రాచలం, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఒక చెట్టుకు సుమారు 150 కిలోల విప్ప పువ్వు లభ్యమవుతుంది. దీనిని ఎండబెట్టిన తరువాత వచ్చే పువ్వు కిలో రూ.50 నుంచి రూ.60 ధరకు విక్రయిస్తున్నారు. విప్పకాయలు కిలో రూ.30కు అమ్ముతున్నారు. ఈ చెట్లు విస్తారంగా ఉన్నందున గిరిజనులకు చేతినిండా ఆదాయం వస్తోంది. పోషకాలెన్నో.. : విప్పపూలలో ఎన్నో పోషక గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగాలను హరించే ఔషధ గుణాలు కూడా విప్పపూలలో ఉన్నాయని వారు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి రోగాలను నయంచేసే గుణంతోపాటు ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఎనర్జీ, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్–సి వంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయని వారు చెబుతున్నారు. విప్పకాయలతో చేసిన నూనెతో మసాజ్ చేస్తే కీళ్లనొప్పులు దూరమవుతాయని వారు పేర్కొంటున్నారు. స్వీట్ల తయారీ దిశగా అడుగులువిప్ప పూలను సారా తయారీ, ప్రసాదాల్లో మాత్రమే వినియోగించేవారు. ప్రస్తుతం కొన్ని స్చచ్ఛంద సంస్థల సహకారంతో స్వీట్ల తయారీపై మహిళలు దృష్టి పెట్టారు. చింతూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విప్ప పూల సేకరణ, స్వీట్ల తయారీపై మహిళలకు అవగాహన కల్పిస్తోంది. లడ్డూ, హల్వా, జామ్, కేక్ వంటి తినుబండారాల తయారీపై శిక్షణ ఇచ్చి ఉపా ధిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి విప్పపువ్వుల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నందున వీటితో స్వీట్లు తయారీపై శిక్షణ ఇవ్వడంతోపాటు మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నాం. చింతూరు డివిజన్లోని గిరిజన గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపట్టాం. తాము అందిస్తున్న సహకారం గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. – సుభాని,కార్యదర్శి, ఆశా స్వచ్ఛంద సంస్థ, చింతూరువిప్పపువ్వుతో ఆర్థికాదాయం ప్రతి వేసవిలో ఇంటిల్లిపాదీ కలసి విప్పపూలు సేకరిస్తాం. వాటిని ఆరబెట్టి చింతూరు, మోతుగూడెం సంతల్లో విక్రయించడం ద్వారా ఆదాయం లభిస్తుంది. దీంతోపాటు మా సంస్కృతిలో భాగంగా విప్పపువ్వుతో సారా కూడా తయారుచేసి సేవిస్తాం. – పూసం మహేష్,లక్కవరం, చింతూరు మండలంశిక్షణ ఎంతో ఉపయోగం విప్పపువ్వుల సేకరణతో పాటు ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వీట్ల తయారీలో శిక్షణ పొందుతున్నాం. తయారు చేసే విధానంతోపాటు ఆన్లైన్ మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. నాణ్యమైన విప్పపూల సేకరణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. – వెట్టి కన్నమ్మ,తెరపాడు, చింతూరు మండలం -
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
ఆదివాసీ కళకు ఆయువు పోసినవాడు!
ఆదివాసీ ‘గుస్సాడి’ నృత్యాన్ని అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసిన కనకరాజు ‘అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం’ (అక్టోబర్ 25) నాడు తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహించి మొత్తం తెలంగాణ ఆదివాసీలకు గర్వకారణమైన ఆయన సేవలను ఒకసారి మననం చేసుకోవడం మన విధి. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్ల వాయి గ్రామానికి చెందిన కనకరాజు 1941లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు అంటే మక్కువ. ఆ క్రమంలోనే గుస్సాడి నృత్యకళపై అభిరుచిని పెంచుకున్నారు. పశువులను మేపడానికి అడవిలోకి పోయిన సందర్భంలో భుజం మీద కట్టెపుల్లను పెట్టుకొని టిక్కుటిక్కుమని శబ్దం చేసుకుంటూ తనే స్వతహాగా గుస్సాడి సాధన చేసేవారు. నిరక్షరాస్యుడైన కనకరాజు బతుకుదెరువు కోసం మార్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో దినసరి కూలీగా పనిచేస్తూనే... ఊరూరా తిరు గుతూ గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. అంత రించిపోతున్న కళను బతికించారు. ఏటా దీపావళికి వారం రోజుల ముందు నుండే గోండు ప్రాంతా లలో దండారి పండుగ మొదలవుతుంది. ఈ పండుగ వారికి చాలా పవిత్రం. గ్రామదేవతల శుభప్రద ఆశీస్సులను ఇతర గ్రామస్థులకు అందించే ధన్యజీవులు గుస్సాడీలు. వారు పొలికేక పెట్టి నాట్యం ఆపిన అనంతరమే వచ్చినవారికి ఆహ్వానాలు, పలకరింపులు మొదలవుతాయి. గుస్సాడీల చేతులలోని రోకళ్లను శంభు మహా దేవుని త్రిశూలంగా భావించి అభిషేకం చేస్తారు. గుస్సాడీలను శివుని ప్రతిరూపాలుగా భావించి వారి వస్తువులు, సంగీత పరిక రాలను (ఎత్మసూర్ పెన్) పూజిస్తారు. అందరూ కలసి గుస్సాడి నృత్యం చేస్తారు. తరువాత అతిథులకు భోజనం వడ్డిస్తారు. దండారీలో గుస్సాడీలు, పోరిక్‌లు ప్రముఖ పాత్ర వహిస్తారు. నెత్తి మీద నెమలి ఈకలు, పెద్ద టోపీ లతో ముఖానికి, ఒంటికి రంగులతో మెడ నిండా పూసల దండలు, కాళ్లకు గజ్జెలు, చేతిలో గంగారాం సోటితో గంతులు వేసుకుంటూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కళ అంతరించి పోకూడదనే ఉద్దేశంతో అప్పటి ఐఏఎస్ అధికారి మడావి తుకారాం ప్రత్యేక చొరవ తీసుకుని కనకరాజును ప్రోత్సహించారు. దీంతో కనకరాజు శిక్షకుడిగా మారి 150 మందికి ఐదు రకాల దరువులతో కూడిన డప్పు సహాయంతో శిక్షణ ఇచ్చారు. 1976 నుండి వరుసగా ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవా లలో ప్రదర్శనలు ఇప్పించారు.1981లో ప్రధాని ఇందిరాగాంధీ ముందు గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. 2014లో ఎర్ర కోటలో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ముందు ప్రదర్శించారు. కొన్ని సినిమాలలో కూడా ఈ కళను ప్రదర్శించారు. కనకరాజు గుస్సాడి నృత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2021లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ని ఇచ్చి గౌరవించింది. ఎనిమిది పదుల వయసు దాటినా, గుస్సాడిని బతికించడానికి మరో 30 మందికి శిక్షణనిచ్చారు. గుస్సాడి కళను వెలుగులోకి తెచ్చిన సామాన్యుడైన కనకరాజు ఈనాటి కళాభిమానులకు ఆదర్శప్రాయుడు. కనకరాజుకు నివాళిగా ఆయన శిష్యులు మరింతగా ఈ కళను ప్రపంచవ్యాప్తం చేస్తారని ఆశిద్దాం.– గుమ్మడి లక్ష్మినారాయణ,ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ ‘ 94913 18409 -
గిరిజనుల ఆరోగ్యంపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. ఐటీడీఏల పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారు లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో నివసి స్తున్న ప్రజలు అరగంట లోపలే చేరుకునేలా ఐటీ డీఏల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్ ఉండాలన్నారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూ నిటీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాద నలు రూపొందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారు లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లకు మంత్రి సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలోని మన్ననూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీ ఏల పరిధిలో ఉన్న ఆసుపత్రులు, వైద్య సౌకర్యా లు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సమీక్షించారు. హైదరా బాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.ప్రత్యేక వార్డులు.. బర్త్ వెయిటింగ్ రూంలు..ఐటీడీఏ పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతాలు, రోడ్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో బర్త్ వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గర్భిణి, ఆమెతోపాటు వచ్చిన కుటుంబ సభ్యులకు భోజనం, మంచినీరు ఇతర వసతులు కల్పించాలన్నారు. 108 అంబులెన్స్‌లు వెళ్లలేని ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఐటీడీఏ పరిధిలో నివసిస్తున్న ప్రిమిటివ్ ట్రైబ్స్ కోసం ఆదిలాబాద్ రిమ్స్ వంటి పెద్ద దవాఖానాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వారి భాషలో మాట్లాడగలిగే వైద్య సిబ్బందిని ఆ వార్డుల్లో నియమించాలని సూచించారు. -
రైలొస్తేనే బతుక్కి పట్టాభిషేకం
ఆ గ్రామాలు, గిరిజన తండాలన్నీ రైల్వే పట్టాల వెంబడే ఉంటాయి.. అందుకే వారి జీవన ప్రయాణం రైలు పరుగులపై ఆధారపడి ఉంటుంది. విధివంచితులు.. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి.. కుటుంబ భారం మీదపడి పిల్లలను పోషించుకునేందుకు కొందరు.. జీవనోపాధి లేక మరికొందరు.. రైళ్లలో పల్లీ, బఠాణీలు, సీజన్ పండ్లు అమ్ముకొని వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. రైలు బండి నడిస్తేనే.. కుటుంబానికి తిండి దొరుకుతుంది. - సాక్షి, మహబూబాబాద్ రైలులోనే ప్రయాణం మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, గార్ల, గుండ్రాతి మడుగు, మహబూబాబాద్, తాళ్లపూపల్లి, కేసముద్రం స్టేషన్ల పరిధిలోని తండాలతోపాటు, అటు విజయవాడ, ఇటు సికింద్రాబాద్, బల్లార్షా వరకు ఉన్న తండాల్లో మహిళలకు వ్యాపారమే ప్రధానాధారం. పండించిన పల్లీలు, తమ గ్రామాలు, తండాల పరిసరాలలో దొరికే సపోటా, ఈతపండ్లు, తాటిముంజలు, జామకాయలు ఇలా సీజన్ల వారీగా సేకరించి వాటిని విక్రయించి కుటుంబాలను పోషించుకునేందుకు గిరిజన మహిళలు రోజూ రైలులో ప్రయాణిస్తారు. ఇలా రోజూ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే వీరి ప్రయాణం రాత్రి 10 గంటల వరకు ఉంటుంది.ఒక్కోరోజు రాత్రి 12 గంటల వరకు సరుకులు అమ్ముకొని ఇంటికి వస్తారు. కొన్ని సందర్భాల్లో రైల్వేస్టేషన్లలో తలదాచుకొని మర్నాడు ఇంటికి చేరిన సందర్భాలు ఉన్నాయి. ఇలా రోజూ 200 మంది వరకు ఈ వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.1,000 వరకు సంపాదిస్తున్నారు.గుర్తింపు కార్డులివ్వాలి.. నా భర్త 14 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి పల్లీలు అమ్ముకుంటూ నాకున్న ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కుమారులను కష్టపడి సాదుకుంటూ వచ్చా. పొట్టకూటి కోసం పల్లీలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రైలు బండి నడిస్తేనే తిండి దొరుకుతుంది. పెద్దసార్లు దయ ఉంచి గుర్తింపు కార్డులు ఇస్తే భయం లేకుండా వ్యాపారం చేసుకుంటాం. – బానోతు హచ్చి, బడితండా, కేసముద్రం మండలంబొగ్గు బండి ఉన్నప్పటి నుంచి.. నలభయ్యేళ్లుగా రైలులో పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చా. బొగ్గు బండి ఉన్నప్పటి నుంచి పల్లీలు అమ్మడం మొదలుపెట్టా. పల్లి గ్లాసు.. పైస నుంచి అమ్మిన. రైలులో ఎన్నోమార్లు ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. కోర్టులో జరిమానా కట్టి వచ్చేవాళ్లం. ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్న ప్రతిసారీ తిరిగి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది. పొట్టకూటికోసం పల్లీలు అమ్ముకుంటూ ఇబ్బందులు పడుతూ వచ్చాం. నాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పల్లీలు అమ్మి అందరి పెళ్లిళ్లు చేసిన. మగ పిల్లలను చదివించిన. – బానోతు చాంది, బడితండా, కేసముద్రంవితంతువులే అధికం మహబూబాబాద్ జిల్లాలో ఏ తండాను కదిలించినా కన్నీళ్లే ఉబుకుతాయి. గుడుంబాకు బానిసలు కావడం, తండాలను కబళించే వింత వ్యాధులతో పాతికేళ్లు నిండక ముందే మృత్యువాత పడిన మగవారు ఎక్కువగా ఉన్నారు. అప్పటికే వివాహాలు చేసుకొని ఇద్దరు, ముగ్గురు పిల్లలతో 20 ఏళ్లు కూడా నిండని భార్యపై పిల్లలు, వృద్ధ అత్తామామల భారం పడుతుంది. ఈ సంసార సాగరాన్ని దాటేందుకు రైళ్లలో వ్యాపారం చేసుకోవడం సాధారణమవుతోంది. ఇలా పల్లీలు, బఠాణీలు, పండ్లు అమ్ముకొని పిల్లలను పెద్ద చదువులు చదివించి ప్రభుత్వ కొలువుల్లో చేరి్పంచిన వారు కొందరైతే.. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి భారం తీర్చుకున్నవారు మరికొందరు ఉన్నారు. అవమానాలు.. ఆప్యాయతలు నిత్యం రైలులో ప్రయాణం చేసుకుంటూ సరుకులు అమ్మే మహిళలకు అవమానాలు.. అ ప్యాయతలు ఎదురవుతుంటాయి. టికెట్ లేదని కేసులు పెట్టి జైలుకు పంపిన రైల్వే అధికారులు ఉన్నారు. మహిళలు కావడంతో ఆకతాయిలు ఇబ్బంది పెట్టడం, సూటిపోటి మాటలు, లైంగిక వేధింపులు కూడా చవిచూడాల్సి వస్తుందని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం రోజూ ప్రయాణం చేసే వారి ఆప్యాయత కూడా ఉంటుందంటున్నారు. దశాబ్దాలుగా రైలునే నమ్ముకొని జీవించే తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. -
గిరిజనుల భూమి గిరిజనులకే!
ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకున్నాయిఅనేదాన్నిబట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది. అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు ‘జల్’, ‘జంగల్’, ‘జమీన్ ’ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. అయితే స్వతంత్ర భారతదేశంలో గిరిజనుల కోసం చేసిన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. చొరబాటుదారులు అడవి ద్వారాలు తీశారు. ఆదిమ జాతీయులకు వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ప్రభుత్వాలు, పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఆలోచించి ఒక ఆమోదయోగ్యమైన కార్యాచరణను రూపొందించుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర చెబుతోంది.మాతృమూర్తైనా, మాతృభాషైనా, మాతృదేశమైనా పలికేటప్పుడు వేరువేరుగా వినిపించినా ఆ మూడింటి అంతఃసూత్రం ఒకటే బంధం. తల్లి గర్భాల యంలో మనం నేర్చుకున్న మనదైన భాషలో మాతృదేశంలో తొలి అడుగు మోపే నవజాత శిశువుకు ఈ మూడింటి అస్తిత్వం అనివార్యంగా ఇవ్వబడుతుంది. ఇలాంటిదే ఒక జాతికి కూడా ఉంటుంది. అదే మూలవాసీ సంస్కృతి. ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకు న్నాయి అనేదాన్నిబట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది.సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘కొమురం భీముడో’ అన్న సినీ గేయం కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. అడవి తల్లి తన గిరిజన సంతానాన్ని ఆత్మ గౌరవ బావుటా ఎగురెయ్యాలని సందేశాత్మకంగా చేసిన హెచ్చరి కలను స్పష్టం చేసేవిధంగా ఈ పాట సాగింది. వారి హక్కుల కోసం వారే ఉద్యమించాలనే ఉద్వేగాన్ని నింపుతుంది. ఈ పాట ప్రతి గిరిజనుడిని అగ్ని కణంలా వెంటాడింది. దేశంలో గిరిజన ప్రాంతా లున్న అన్ని రాష్ట్రాలలో వారి భాషలోకి తర్జుమా చేసి వినిపించాలనే ప్రణాళికతో అక్కడి నాయకులు ముందుకుపోతున్నారు. ‘మన సంస్కృతి మూలాల్ని నాశనం చేస్తున్న విదేశీయుల మీద నా పోరాటం’ అన్నారు బిర్సా ముండా. నూరేళ్ళ జీవితానుభవంతో 25 ఏళ్లు బతికి ధిక్కార హెచ్చరికను వినిపించి, బ్రిటిష్‌వాళ్ల గుండెల్లో ఫిరంగులు పేల్చాడు. ఆయన జయంతి నవంబర్ 15న ‘జన్ జాతీయ దివస్’గా జరుపుకొంటున్నాం. బిర్సా ముండా చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉంచడంతో పాటు, రాంచీ విమానాశ్ర యానికి, ఇంకా ఎన్నో సంస్థలకు ఆ వీరుని పేరు పెట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు ‘జల్’, ‘జంగల్’, ‘జమీన్ ’ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. బ్రిటిష్ పాలనలో మొత్తం 75 సార్లు గిరిజన తిరుగుబాట్లు జరిగాయంటే వారి చైతన్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. తెలంగాణా గవర్నరు జిష్ణుదేవ్ వర్మ ఈ మధ్యన తెలంగాణ గిరిజన ప్రాంతాలలో పర్యటించడం ముదావహం. గిరిజనులకు బాస టగా నిలవడానికి ‘యాక్ట్ 1/70’ని రూపొందించుకున్నాం. అందులో ఉన్న సెక్షన్ 3(1)(ఎ) ప్రకారం, వివాదాలు తేలేంతవరకు షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉన్న భూమి గిరిజనులదిగానే భావించబడుతుంది. ఈ మధ్యన గవర్నరు పర్యటించిన ప్రాంతం ఆ కోవకే చెందుతుంది. వారికి అధికారులు ఏ మేరకు పరిస్థితులను విశదీకరించారో గానీ, రాజ్యాంగంలోని ‘షెడ్యూల్ 5’ ప్రకారం గవర్నరుకు విశేషాధికారాలు ఉంటాయి. ఇది వజ్రాయుధం లాంటిది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు చెడ్డవాళ్లైతే అది కూడా చెడ్డది కావడం ఖాయం. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు మంచివాళ్లైతే అది కూడా మంచిదవటం అంతే ఖాయం’ అన్నారు. మన రాజ్యాంగ సంవిధాన మౌలిక నిర్మాణం ఎంతో గొప్పది. సామాజిక అణచివేతకు గురైనవారి అభ్యున్నతి కోసం తోడ్పడడమే రాజ్యాంగంలోని రిజర్వే షన్ల లక్ష్యం.స్వాతంత్య్రానంతరం పాలకులు ఆదివాసీలను చేరడానికి ముఖ్యంగా మూడు ఆలోచనలు చేశారు. ఏకాంతవాసం, కలిసి పోవటం, అభ్యున్నతి. 1958లో మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ కలిసిపోవటాన్ని ఎంచుకున్నారు. అంటే ఆదివాసీలతో కలిసి వారిని అభివృద్ధి పరచాలని. ఆదివాసీలను దోపిడీ నుంచి కాపా డాలని, రక్షణగా నిలవాలని, వారికి సంక్షేమ పథకాలు రూపొందింపజేయాలని భావించి ‘పంచశీల’ను ఎంచుకున్నారు. ఆ తరువాత యాక్ట్ డి.ఎఫ్. 1970 చట్టం తీసుకొచ్చారు. గిరిజనుల భూమిని, అటవీ సంపదను ఇది కవచంలాగా కాపాడుతుందని ఊదరగొట్టారు. కానీ ఆ చట్టాలు నిర్వీర్యం అయ్యాయి. చొరబాటుదారులు అడవి ద్వారాలు తీశారు.తెలంగాణాలో నిజాం కాలంలో దీనికోసం హైమన్ డార్ఫ్‌ని తన సలహాదారుగా నియమించుకున్నారు. ఎన్నో సంస్కరణలు చేశామను కున్నారు. కానీ 1948 అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఈ దిశగా పెద్దగా చర్యలు తీసుకోలేదు. 1976, ’77లో ఆదిలాబాద్‌లోని ఉట్నూరు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు విస్తుపోయే వాస్తవాలెన్నో వెలుగులోకి వచ్చాయి. సంపన్నతే చుట్టరికంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రా ప్రాంతాల నుండి వచ్చిన ధనికులు గిరిజనుల భూమిని ఆక్రమించుకొని, అసలు హక్కుదారులైన గిరిజనులను అక్కడ నుండి తరిమేశారనీ, దాంతో వారు దూరంగా వచ్చి తలదాచుకున్నారనీ, ఇప్పుడు ఆ స్థలాల నుండి కూడా అటవీ అధికారులు వేరే ప్రాంతాలకు వెళ్ళాలని బెదిరిస్తున్నారనీ గిరిజనులు చెప్పుకొచ్చారు.ఇదంతా వింటుంటే చరిత్రలోని చివరి మొఘల్ రాజు బహదూర్ షా జాఫర్ కథ గుర్తొస్తోంది. 1857 తిరుగుబాటు అణచివేయబడి బ్రిటిష్ సైన్యం చేతిలో ఆయన ఓడిపోయిన తరువాత రెండు గజాల భూమి తన భారతదేశంలో తనకు దొరకలేదనీ, ఆ బాధతోనే తన చివరి రోజుల్లో బర్మాలోనే గడుపుతూ అక్కడే ఖననం చేయబడ్డాడనీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గిర్‌గిలాని తన ఉపన్యాసంలో ఉట్టంకించటం గుర్తొస్తోంది. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఒకటుంది. రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్ళ ద్వారా గవర్నర్లకు విశేష అధికారాలే కల్పించారు. వారి జీవన స్రవంతిని, సంస్కృతి, వైవిధ్యాలను రక్షిస్తూ తమకు నచ్చిన రీతిలో జీవించే విధంగా గవర్నర్లు రెగ్యులరైజేషన్ ద్వారా పరిపాలించే అధికారాలను ఈ అధికరణలు ఇవ్వడం జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గిరిజనులు, వారి భూములపై హక్కుల అంశంపై అధ్యయనం చేయడానికి ల్యాండ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను 2005 ఆగస్టు 15న జె.ఎన్. గిర్‌గిలాని ఆనాటి శాసనసభకు సమర్పించారు. అందులో ఎన్నో భయంకర నిజాలు, గిరిజనేతరులు కబళించిన భూవివరాలు వెల్లడ య్యాయి. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల కోసం ఐఏఎస్ మూర్తి గారిని నియామకం చేసింది ప్రభుత్వం. వీరి నివేది కలో కేంద్రంలో కొంతమంది ఉన్నతాధికారులు అసలు 5వ షెడ్యూ ల్నే రాజ్యాంగం నుంచి ఎత్తివేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు ఒక ఆశ్చర్యకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు నివే దికలు ‘రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్’ ద్వారానే బహిర్గతమయ్యాయి తప్ప, అసలు శాసనసభ మెట్లు ఎక్కలేదన్నది నిజం. తెలంగాణ గవర్నర్ పర్యటించిన ములుగు జిల్లా గోవింద రావు పేట మండలంలోని గిరిజనుల భూముల అన్యాక్రాంతం గురించి ప్రభుత్వం నియమించిన కమిటీ 25 సంవత్సరాల క్రితమే నివేదిక లిచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనాయనీ, వాటిని గిరిజనులకు అప్పగించాలనీ తీర్పులిచ్చినా చలనం లేదు. తరతరాల నుండి జరిగిన అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ‘ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006’ కూడా నిరర్థకంగా మారింది. బిహార్‌లో గిరిజన యోధుడు బిర్సా ముండా త్యాగాన్ని శ్లాఘిస్తూ ఏళ్ల తరబడి గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న డాక్టర్ ఫెలిక్స్ పెడల్‌ను ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈయన ఎంతో చరిత్ర ఉన్న చార్లెస్ డార్విన్ మునిమనవడు. ఆయన నుండి స్ఫూర్తిని పొందాలి. ‘ఆజాద్ కా అమృతోత్సవ్’ దేశమంతటా జరుపుకొంటున్న శుభ వేళ ఆదిమ జాతీయులకు మాత్రం వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ఏ చర్యలు తీసుకున్నామని వివిధ ప్రభు త్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు, వివిధ రాజకీయ పార్టీలు,స్వచ్ఛంద సంస్థలు ఆలోచించాలి. దృఢ సంకల్పంతో ఒక ఆమోద యోగ్యమైన కార్యాచరణను రూపొందిచుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర స్పష్టం చేస్తోంది.సి.హెచ్. విద్యాసాగర్‌రావు వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
భూంకాల్ పోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాజ్యసంక్ర మణ సిద్ధాంతం, సైన్యసహకార పద్ధతి వంటి కుట్రపూరిత విధానాలతో బస్తర్ రాజ్యాన్ని కూడా ప్రిన్సిలీ స్టేట్‌గా బ్రిటీషర్లు మార్చారు. రాజును నామమాత్రం చేస్తూ పరోక్షంగా పాలన సాగించా రు. ఈ క్రమంలో 1878లో బ్రిటీష్ ప్రభుత్వం రిజ ర్వ్ ఫారెస్ట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో బస్తర్ అడవుల్లో 66 శాతం భూభాగంపై ఆదివాసీ లు హక్కులు కోల్పోయారు. రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన ప్రదేశాల్లో కర్ర పుల్ల తీసుకెళ్లాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మరోవైపు బ్రిటీ షర్ల కాలంలో బస్తర్ పాలకుడిగా ఉన్న భైరామ్ దేవ్ కుష్ఠువ్యాధి బారిన పడ్డారు. దీంతో ఆయన్ను పదవి నుంచి దూరంగా ఉంచి అతని కొడుకైన రుద్ర ప్రతాప్‌దేవ్‌ని 1891లో రాజుగా బ్రిటీష్ సర్కార్ గుర్తించింది. అయితే మేజర్ అయ్యేంత వరకు ఆయనకు పట్టాభిషేకం చేసే అవకాశం లేదు. అలా రాజుతోపాటు రాజకుటుంబంలో ప్రధాన పదవుల్లో ఉన్నవారు తమ అ«ధికారాలు కోల్పోయారు. ఇలా బ్రిటీషర్ల ఆధిపత్య ధోరణి కారణంగా ఇటు రాజవంశానికే కాక అటు ఆదివాసీలకు ఇక్కట్లు మొదలయ్యాయి. తిరుగుబాటుకు పిలుపు1909 అక్టోబర్‌లో జరిగిన దసరా వేడుకల్లో రిజర్వ్ ఫారెస్ట్ చట్టం, దాన్ని అమలు చేస్తున్న బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేయాలంటూ బస్తర్ రాజ్య మాజీ దివాన్ లాల్ కాళీంద్రసింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానికంగా పేరున్న ఆదివాసీ నేత గుండాధుర్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఫారెస్ట్ చట్టం కారణంగా తాము పడుతున్న బాధలను ఊరూరా ప్రచారం చేస్తూ తిరుగుబాటుకు ప్రజలను సిద్ధం చేశారు. ప్రతీ ఇంటి నుంచి ఒకరు పోరాటానికి రావాలని, ఆయుధాలు పట్టలేనివారు రాళ్లు, కర్రలు, కారం పొడి అయినా అందించాలని స్ఫూర్తి నింపారు. 1909 అక్టోబర్ నుంచి 1910 ఫిబ్రవరి మొదటివారం నాటికి బస్తర్‌లో అటవీ గ్రామాలన్నీ పోరాటానికి సంసిద్ధమయ్యాయి. ముఖ్యంగా బస్తర్‌లో ఉత్తర ప్రాంతమైన కాంకేర్ నిప్పు కణికలా మారింది.మూడు రోజుల్లోనే....1910 ఫిబ్రవరి 4న కుకనార్‌లో గుండాధూర్ నాయకత్వంలో ఆదివాసీలు బ్రిటీష్ అధికార కార్యాలయాలు, గోదాములు, మార్కెట్, ప్రభుత్వ అధికారుల ఇళ్లపై మెరుపుదాడులు జరిపారు. కేవలం మూడురోజుల్లోనే బస్తర్‌లోని 84 పరగణాల్లో 46 పరగణాలు తిరుగుబాటుదారుల అధీనంలోకి వచ్చాయి. కాంకేర్ ప్రాంతంలో బ్రిటీష్ అధికారులు, వ్యాపారులు ఇళ్లు వదిలి పారిపోయారు. దండకారణ్యంలో భూకంపం లాంటి తిరుగుబాటు వచ్చిందని తక్షణ సాయం అవసరమంటూ బ్రిటీష్ ప్రభుత్వానికి అప్పటి మహారాజు రుద్ర ప్రతాప్‌దేవ్ టెలిగ్రామ్ పంపారు. దీంతో ఈ పోరాటానికి భూంకాల్ పోరాటమని పేరు వచ్చింది. గుండాధూర్ చిక్కలేదుభూంకాల్ విప్లవాన్ని అణచివేసే పనిని కెప్టెన్ గేర్‌కు బ్రిటీష్ సర్కార్ అప్పగించింది. పదిరోజులు బ్రిటీష్, బస్తర్ స్టేట్ సైన్యాలు అడవుల్లో గాలించినా విప్లవకారుల్లో కేవలం 15 మందినే పట్టుకోగలిగారు. మరోవైపు తనను పట్టుకునేందుకు వచ్చిన కెప్టెన్ గేర్‌పైనే నేరుగా దాడి చేసి బ్రిటీషర్ల వెన్నులో గుండాధూర్ వణుకు పుట్టించాడు. తృటిలో కెప్టెన్ గేర్ ఆ దాడి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడు కున్నాడు. దీంతో బెంగాల్, జైపూర్ రాజ్యాల నుంచి అదనపు బలగాలను బస్తర్‌కు రప్పించారు. ఆ తర్వాత గుంఢాదూర్‌కు నమ్మకస్తుడైన సోనుమాంఝీ ద్వారా కోవర్టు ఆపరేషన్ జరిపి 1910 మార్చి 25 రాత్రి గుంఢాధూర్ ఆయన సహచరులు బస చేసిన అటవీ ప్రాంతంపై బ్రిటీష్ సైన్యం దాడి జరిపింది. ఇందులో 21 మంది చనిపోగా మరో ఏడుగురు పట్టుబడ్డారు. కెప్టెన్ గేర్ ఎంతగా ప్రయత్నించినా ఆదివాసీ పోరాట యోధుడు గుండాధూర్ మాత్రం చిక్కలేదు. మెరుపు తిరుగుబాటుతో బ్రిటీషర్లకు చుక్కలు చూపించిన బస్తర్ ఆదివాసీలు ఆ తర్వాత తమ హక్కుల కోసం స్వతంత్ర భారత దేశంలో ఏర్పడిన ప్రభుత్వంతోనూ ఘర్షణ పడ్డారు. ఈ పోరులో తాము దైవంగా భావించే మహారాజునే కోల్పోయారు. -
గిరిజనులకు ఇంటి వద్ద రేషన్ పంపిణీ నిలిపివేత
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ఇకపై ఇంటి వద్దకు రేషన్ సరకులు రావు. గిరిజనులు రేషన్ షాపులకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ విషయం వెల్లడించారు. మంత్రి మంగళవారం గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తామని, ఇకపై రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ అందించే మొబైల్ డిస్పెన్సరీ వాహనాలు (ఎండీయూ) వల్ల సమస్యలు ఉన్నాయన్నారు.అందువల్ల గిరిజనుల సౌలభ్యం కోసం ఏజెన్సీలోని 962 రేషన్ డిపోల ద్వారానే సరుకులు అందిస్తామని చెప్పారు. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీ అవుట్లెట్లను పెద్ద ఎత్తున విస్తరించి, డిమాండ్‌ను మరింతగా పెంచుతామన్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అందించే తేనె, ఇతర ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి పెడతామని చెప్పారు. జీసీసీ పరిధిలోని 16 పెట్రోల్ బంకులు, 18 గ్యాస్ డిపోలు, 12 సూపర్ మార్కెట్ల ద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు వస్తున్నాయని, వాటిలో 2 వేలకుపైగా పోస్టులు గిరిజన ప్రాంతాల్లో భర్తీ అవుతాయని చెప్పారు. దీంతో గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుందన్నారు. గిరిజన పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం 554 ఏఎన్ఎంలను డిప్యుటేషన్‌పై నియమిస్తున్నట్టు తెలిపారు. గిరిజన వసతి గృహాల్లో స్డడీ అవర్స్ పెడతామన్నారు. గిరిజన విద్యాలయాల్లో బాలికల రక్షణ కోసం ఫిర్యాదుల బాక్స్ పెడతామన్నారు. ఫిర్యాదు చేసిన విద్యారి్థని పేరు గోప్యంగా ఉంచుతామని, వేరే ప్రాంత అధికారులతో విచారణ చేయిస్తామని చెప్పారు. గిరి శిఖర గ్రామాల ప్రజలకు తక్షణ వైద్య సేవల కోసం ఫీడర్ అంబులెన్స్‌లు, ప్రసవం అనంతరం సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. వంద రోజుల్లో గంజాయికి చెక్ పెట్టేందుకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. -
చెంచుల అడ్డాలో లక్ష్మీగడ్డ
పెద్దదోర్నాల: భూచక్ర గడ్డ.. ఇది నల్లమల అభయారణ్యంలో దొరికే ఓ దుంప. లక్ష్మీగడ్డ.. లచ్చిగడ్డ.. మాగడ్డ పేర్లతోనూ పిలిచే ఈ మధుర దుంపలో ఎనలేని ఔషధాలు ఉన్నాయని చెబుతారు. తీగ జాతి మొక్క కాండంగా భూమి అడుగు భాగంలో ఇది పెరుగుతుంది. కేవలం అడవుల్లో మాత్రమే.. తక్కువ ఎత్తులో పెరిగే అరుదైన తీగ జాతి మొక్క. దీని పూలు ఆకర్షణీయంగా తెల్లగా, మంచి సువాసన కలిగి ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలంలోని నల్లమల అభయారణ్యంతోపాటు భద్రాచలం అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క భూమి అంతర్భాగంలో సుమారు 6 నుంచి 15 అడుగుల లోతులో 10 అడుగుల నుంచి 15 అడుగుల మేర పెరుగుతుంది. దుంప పైభాగమంతా ఎర్రగా ఉండి.. లోపలంతా తెల్లగా, అత్యంత రుచి కలిగి ఉంటుంది. భూచక్ర గడ్డ ఉన్న ప్రాంతంలో భూమి పైభాగంలో తెల్లపూలు కలిగిన ఓ రకమైన తీగ ఉంటుందని, ఇది ఓ రకమైన మత్తుతో పాటు మంచి సువాసన కలిగి ఉంటుందని ఈ గడ్డను సేకరించే చెంచు గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ వాసనను పసిగట్టిన చెంచు గిరిజనులు గడ్డ కోసం వేట మొదలు పెడతారు. తీగ ఆధారంగా గడ్డ ఇక్కడే ఉంటుంది అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే గడ్డ కోసం తవ్వకం మొదలు పెడతారు.చెంచులకు అవినాభావ సంబంధం చెంచు గిరిజనులకు భూచక్ర గడ్డతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. చెంచులు ఈ గడ్డను లచ్చిగడ్డ, లక్ష్మీగడ్డగా పిలుచుకుంటారు. భూచక్ర గడ్డతో ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ గడ్డ వాడకం వల్ల బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి, మధురంగా ఉండే ఓ దుంప జాతి గడ్డ. – మంతన్న, కో–ఆర్డినేటర్, ఆర్ఓఎఫ్ఆర్, పెద్దదోర్నాలఎన్నో ఔషధ గుణాలు భూచక్ర గడ్డలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెంచు గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ గడ్డను ఫ్రిజ్‌లో నిల్వ పెట్టుకుని ఔషధంలా వాడుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా తింటే మంచిదని, దాహం అనిపించినప్పుడు ఇది ఎక్కువగా తినటం వల్ల దప్పిక వేయదని వారు పేర్కొంటున్నారు. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి దీనిని తినటం వల్ల వేడి, వాతం, కడుపులో మంట, కడుపులో గడ్డలు, రాళ్లు ఉన్నా కరిగిపోతాయని స్పష్టం చేస్తున్నారు. అరికాళ్ల మంటలు, తిమ్మిర్లు, షుగరు, బీపీ వ్యాధులకు ఈ గడ్డ బాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఈ గడ్డను వారం రోజులు పరగడుపున తింటే కడుపులో గ్యాస్ సమస్యలు ఉండవని, క్రమం తప్పకుండా నెల రోజులు తింటే బీపీ, షుగర్ లాంటి వ్యాధులు పూర్తిగా నయం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ గడ్డను శ్రీశైలంతోపాటు పెద్దదోర్నాలలోని శ్రీశైలం రహదారిలో విక్రయిస్తుంటారు. -
కిడ్నీ వ్యాధితో ఊరు ఖాళీ
తాంసి: చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం.. ప్రశాంతమైన వాతావరణం. కాలుష్యానికి ఏమాత్రం తావులేదు. గ్రామంలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉంది. సీసీ రోడ్లు, డ్రెయినేజీ లైన్లు, విద్యుత్ సౌకర్యం తదితర వసతులు న్నాయి. కానీ సరైన రక్షిత నీటి సరఫరా లేదు. ఇప్పుడదే తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామస్తుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎంతలా అంటే ఏ ఒక్క కుంటుంబం కూడా మిగలకుండా ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయేంతగా..! విధిలేని పరిస్థితుల్లో భూగర్భ జలాలనే తాగునీటిగా వినియోగిస్తున్న గిరిజనుల్లో పలువురు కిడ్నీ (మూత్రపిండాలు) సంబంధిత వ్యాధుల బారిన పడటం, ఇటీవలి కాలంలో మరణాల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. గడిచిన మూడేళ్లలో ఈ వ్యాధి బారిన పడి 12 మంది మృత్యుఒడికి చేరారు. గ్రామంలోని చేద బావులు, చేతిపంపుల నీటిని తాగడం వల్లే తమ కిడ్నీలు పాడవుతున్నాయని ఆందోళనకు గురవుతున్న భీంపూర్ మండలం కమట్వాడ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవింద్పూర్ గిరిజనులంతా గ్రామాన్ని ఖాళీ చేసి మరో చోటికి వెళ్లిపోయారు. హామీలిచ్చి మరిచిపోయారు ఆదిలాబాద్ జిల్లా గోవింద్పూర్ గ్రామంలో 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు (200 మంది జనాభా) ఉన్నాయి. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేదు. మిషన్ భగీరథ నీరు పూర్తిస్థాయిలో రావడం లేదు. దీంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు చేద బావుల నీటినే గిరిజనులువినియోగించే వారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. యువకులు సైతం వ్యాధుల బారిన పడుతుండటంతో ఊరు వదిలి వెళ్లడం ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించిన ‘సాక్షి’ 2022 నవంబర్ 4న ‘ఊరొదిలిపోతున్నారు..’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో కొందరు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామాన్ని విడిచి వెళ్లవద్దని, గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తామని భరోనా ఇచ్చారు. కానీ హామీలేవీ నెరవేరలేదు. క్రమంగా జబ్బుపడే వారి సంఖ్య, మరణాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారు ఊరు ఖాళీ చేసి పక్కనే ఉన్న అడవి సమీపంలో గుడిసెలు వేసుకున్నారు. ఇక్కడ వారికి ఎలాంటి వసతులు లేవు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గుడ్డి దీపాలతో నెట్టుకొస్తున్నారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఇతర అవసరాల కోసం పక్కనున్న చెరువు, వాగు నీటిని వినియోగిస్తున్నారు. నీటిలో అధికంగా భార మూలకాలు ‘సాక్షి’ కథనంతో స్పందించిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం భీంపూర్ వైద్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గిరిజనుల రక్త, మూత్ర నమూనాలు, గ్రామంలోని చేతిపంపుల నుంచి నీటిని సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. నీటిలో భార మూలకాల శాతం అధికంగా ఉందని, ఈ కారణంగానే కిడ్నీ సంబంధిత వ్యాధులు సోకుతున్నాయని అప్పట్లోనే ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ అప్పట్నుంచీ ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సమస్య తీవ్రత చెప్పినా పట్టించుకోలేదు బోరు బావి నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు, కిడ్నీ వ్యాధులకు గురవుతున్నామని అధికారులకు మొర పెట్టుకున్నాం. దీంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – జమునబాయి, మాజీ సర్పంచ్, గోవింద్పూర్ భార్యను బతికించుకోవాలనుకున్నా కానీ.. నా భార్య కుమ్ర భీంబాయి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడ పరిక్షించిన వైద్యులు కిడ్నీ సమస్య ఉందని చెప్పారు. దీంతో ఆమెను బతికించుకునేందుకు రెండేళ్ల కిందటే మా గ్రామాన్ని వదిలేసి పక్కనే ఉన్న జెండా గూడకు వలసవెళ్లాం. కానీ కొన్నాళ్లకే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి చనిపోయింది. ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడుకునేందుకు గ్రామానికి దూరంగా ఉంటూ, వ్యవసాయ పనులు కూడా ఇక్కడి నుంచే చేసుకుంటున్నా. – కుమ్ర పరశురాం, గోవింద్పూర్ గ్రామస్తుడు మరోసారి వైద్య పరీక్షలు చేస్తాం గోవింద్పూర్ గ్రామాన్ని వైద్య సిబ్బందితో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేస్తాం. స్థానికులు గ్రామాన్ని విడిచివెళ్లిన విషయం ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. గతంలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో పరీక్షలు చేశాం. మరోసారి నీటి పరీక్షలతో పాటు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – నిఖిల్ రాజ్, భీంపూర్ మండల వైద్యాధికారి -
పోలీసులు X గిరిజనులు
సత్తుపల్లి: గిరిజన వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన సత్తుపల్లి పోలీసులపై గిరిజనులు దాడికి దిగారు. ఘటన పూర్వాపరాలిలా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు శివారు చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని 400 హెక్టార్లలో కొంతకాలంగా స్థానిక గిరిజనులు, స్థానికేతర గిరిజనుల మధ్య పోడు వివాదం నడుస్తోంది. గిరిజనులకు నేతృత్వం వహిస్తున్న కూరం మహేంద్రను అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు శనివారం సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు సీఐ టి.కిరణ్ పిలిపించి విచారించి పంపించారు. ఈక్రమంలో చంద్రాయపాలెంకు చెందిన గిరిజనులు ఆదివారం ఉదయం డయల్ 100కు ఫోన్ చేసి స్థానికేతర గిరిజనులు తమ భూముల్లోకి వస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో తొలుత ఎస్సై రాజు, ముగ్గురు పోలీసు సిబ్బంది వెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న సమాచారంతో సీఐ టి.కిరణ్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి చేరుకున్నారు. సీఐ కిరణ్‌పై మెరుపుదాడి.. అదే సమయంలో గిరిజన నేత కూరం మహేంద్ర ఫోన్లో మాట్లాడుతుండగా, ‘నిన్ననే కదా నీతో మాట్లాడి పంపించింది.. మళ్లీ గొడవ ఏమిటి’ అంటూ సీఐ కిరణ్ ఆయన ఫోన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఇంతలో ఒక్కసారిగా గిరిజన మహిళలు కోపోద్రిక్తులై సీఐ కిరణ్‌ను చుట్టుముట్టి పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుళ్లు పి.నర్సింహారావు, ఇమ్రాన్, సత్యనారాయణ, నరేష్ కలిసి సీఐ కిరణ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో చుట్టూ రక్షణ కవచంలా నిలిచి పోలీస్ వ్యాన్ వైపు తీసుకొస్తుండగా గిరిజనులు కర్రలతో వెంబడించి దాడి చేశారు. అతి కష్టంమీద అక్కడి నుంచి సీఐ కిరణ్‌ను పోలీసులు తీసుకొని బయ టపడ్డారు. ఈ ఘటనలో సీఐ కిరణ్ చొక్కా చిరిగిపోయింది. పోలీస్ పికెట్ ఏర్పాటు విషయం తెలుసుకుని కల్లూరు ఏసీపీ రఘు, రూరల్ సీఐ వెంకటేశం, డివిజన్లోని ఎస్సైలు, పెద్ద సంఖ్యలో సిబ్బంది చంద్రాయపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో బుగ్గపాడు శివారులో పోలీసులపై దాడి చేసిన గిరిజనులు గుంపులుగా వస్తుండగా పోలీసులు వారిని చుట్టుముట్టారు. గిరిజనులు ప్రతిఘటించటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి కూరం మహేంద్రతో సహా గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
ఖమ్మం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత.. పోలీసులపై గిరిజనుల దాడి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుంది. పోడుభూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గిరిజనుల దాడిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే అడ్డుకున్న పోలీసులపైనే గిరిజనలు దాడికి దిగారు. పోలీసులపై పెద్దసంఖ్యలో గిరిజనులు దాడికి పాల్పపడ్డారు. ఈ క్రమంలో సతత్తుపల్లి సీఐ కిరణ్, నలుగురు సిబ్బదికి గాయాలు అయ్యాయి. బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల విషయంతో ఘర్షణ చోటు చేసుంది. ఈ ఘర్షణను అడ్డగించిన పోలిసులను వెంటపడి మరీ గిరిజనలు కర్రలతో కొట్టారు. ఒక్కసారిగా అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. -
ఈ హోలీ రంగులను హాయిగా తినవచ్చు!
ముంబైకి చెందిన ఇద్దరు సోదరుల ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. గౌరంగ్, సౌరభ్ అనే సోదరులు ‘మాంక్స్ బూఫీ’ బ్రాండ్‌పై ‘అబీర్ హోలి కలర్స్’ పేరుతో సహజ రంగులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. పువ్వులు, మొక్కజొన్న పిండి... మొదలైన వాటితో భిల్ తెగ గిరిజనులు తయారు చేసిన ఈ రంగులను తినవచ్చు కూడా! -
బస్తర్‌లో భయం భయం!
తాండ్ర కృష్ణ గోవింద్, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై రూ.కోటి రివార్డు ఉన్న కీలక నేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కేంద్ర భద్రతా దళాలు క్యాంప్ నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు– భద్రతా దళాల మధ్య సాగుతున్న పోరును తెలుసుకునేందుకు ‘సాక్షి’ బస్తర్ అడవుల బాటపట్టింది. అన్నలు విధించిన ఆంక్షలు, పారామిలటరీ చెక్ పాయింట్లను దాటుకుంటూ వెళ్లి వివరాలు సేకరించింది. జవాన్లు, అధికారులతోపాటు మావోయిస్టుల ప్రత్యేక పాలన (జనతన సర్కార్)లో నివసిస్తున్న ప్రజలతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ముందు, వెనక ప్రమాదం మధ్య.. బస్తర్ దండకారణ్యం పరిధిలోకి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ,బస్తర్ జిల్లాలు వస్తాయి. ఇక్కడి ప్రజలు రెండు రకాల పాలనలో ఉన్నారు. వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ మీడియా బృందం ప్రయత్నించింది. ముందుగా భద్రాద్రి జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడుకు.. అక్కడి నుంచి సుక్మా జిల్లా పువ్వర్తికి వెళ్లింది. ఈ మార్గంలో ఎవరితో మాట్లాడినా.. వారి కళ్లలో సందేహాలు, భయాందోళన కనిపించాయి. కొండపల్లి వద్ద కొందరు గ్రామస్తులు మీడియా బృందాన్ని అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో వచ్చారంటూ గుర్తింపు కార్డులు అడిగి తీసుకున్నారు. సాయంత్రందాకా పలుచోట్లకు తీసుకెళ్లారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి ‘‘మీరంతా మీడియా వ్యక్తులే అని తేలింది. వెళ్లొచ్చు. ప్రభుత్వం తరఫునే కాకుండా ఇక్కడి ప్రజల కష్టాలను కూడా లోకానికి తెలియజేయండి’’ అని కోరాడు. అంతేగాకుండా ‘‘ఈ ప్రాంతంలోకి వచ్చేముందు అనుమతి తీసుకోవాల్సింది. అటవీ మార్గంలో అనేకచోట్ల బూబీ ట్రాప్స్, ప్రెజర్ బాంబులు ఉంటాయి. కొంచెం అటుఇటైనా ప్రాణాలకే ప్రమాదం’’ అని హెచ్చరించాడు. దీంతో మీడియా బృందం రాత్రికి అక్కడే ఉండి, మరునాడు తెల్లవారుజామున పువ్వర్తికి చేరుకుంది. అక్కడ భద్రతా దళాల క్యాంపు, హిడ్మా ఇల్లును పరిశీలించింది. అయితే భద్రతాపరమైన కారణాలు అంటూ.. ఫొటోలు తీసేందుకు, వివరాలు వెల్లడించేందుకు పారామిలటరీ సిబ్బంది అంగీకరించలేదు. ఆ పక్క గ్రామంలో హిడ్మా తల్లి ఉందని తెలిసిన మీడియా బృందం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడింది. తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ కమాండర్లు అడ్డగించారు. బైక్‌లపై తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లను చూసిన ఓ తెలుగు జవాన్ కల్పించుకుని.. ‘‘మీరు కొంచెం ముందుకొచ్చి ఉంటే.. మా వాళ్లు కాల్చేసేవారు’’ అని హెచ్చరించాడు. అదే దారిలో నేలకూలిన ఓ పెద్ద చెట్టును కవర్‌గా చేసుకుని బంకర్ నిర్మించారని, అందులో సాయుధ జవాన్లు ఉన్నారని, జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీడియా బృందం సాధ్యమైనన్ని వివరాలు సేకరించి తిరిగి చర్లకు చేరుకుంది. జనతన్ సర్కార్ ఆధీనంలో.. బీజాపూర్ జిల్లా పామేడు నుంచి చింతవాగు, ధర్మారం, జీడిపల్లి, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం మీదుగా పువ్వర్తి వరకు 60 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. పామేడు, ధర్మారం గ్రామాల వరకే ఛత్తీస్‌గఢ్‌తోపాటు ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. అక్కడివరకే పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల వంటివి ఉన్నాయి. తర్వాత చింతవాగు దాటి కొద్దిదూరం అడవిలోకి వెళ్లగానే జనతన సర్కార్‌కు స్వాగతం పలుకుతున్నట్టుగా మావోయిస్టులు హిందీలో చెక్కలపై రాసి చెట్లకు తగిలించిన బోర్డులు వరుసగా కనిపించాయి. జనతన సర్కార్ ఆ«దీనంలోని ఈ ప్రాంతాల్లో ఎక్కడా బీటీ రోడ్డు లేదు. ఎటు వెళ్లాలన్నా కాలిబాట, ఎడ్లబండ్ల దారులే ఆధారం. పోడు భూములు.. స్తూపాలు జనతన సర్కార్ ఆ«దీనంలోని గ్రామాల్లో మావోయిస్టులు తవ్వించిన చెరువులు, పోడు వ్యవసాయ భూములు, రేకుల షెడ్లలోని స్కూళ్లు కనిపించాయి. కానీ ఎక్కడా తరగతులు నడుస్తున్న ఆనవాళ్లు లేవు. అక్కడక్కడా కొందరు టీచర్లు కనిపించినా మాట్లాడేందుకు నిరాకరించారు. అక్కడక్కడా సంతల్లో హెల్త్ వర్కర్లు మాత్రం కనిపించారు. పరిమితంగా దొరికే ఆహారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్త్రీలు, పిల్లల్లో పోషకాహర లోపం కనిపించింది. అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వారు చెప్పారు. ఏ గ్రామంలోనూ గుడి, చర్చి, మసీదు వంటివి లేవు. జనతన సర్కార్‌లో మతానికి స్థానం లేదని స్థానికులు చెప్పారు. కొన్నిచోట్ల చనిపోయినవారికి గుర్తుగా నిలువుగా పాతిన బండరాళ్లు, మావోయిస్టుల అమరవీరుల స్తూపాలు మాత్రమే కనిపించాయి. బస్తర్ అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఇప్పసారా, లంద, చిగురు వంటి దేశీ మద్యం దొరుకుతుంది. కానీ జనతన సర్కార్ ఆ«దీనంలోని ప్రాంతాల్లో ఎక్కడా మద్యం ఆనవాళ్లు కనిపించలేదు. చాలా మందికి ఆధార్ కార్డుల్లేవు జనతన సర్కార్ పరిధిలోని గ్రామాల్లో సగం మందికిపైగా తమకు ఆధార్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డులు లేవని చెప్పారు. వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంతంతగానే దక్కుతున్నాయి. పువ్వర్తి సమీపంలోని మిర్చిపారా గ్రామానికి చెందిన మడకం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. అది కూడా మా గ్రామాలకు పది– ఇరవై కిలోమీటర్ల దూరంలో జనతన సర్కార్‌కు ఆవల ఉండే మరో గ్రామానికి వెళ్లి రెండు, మూడు నెలలకు ఓసారి తెచ్చుకుంటాం..’’ అని చెప్పాడు. ఇక ఎన్నికల ప్రక్రియపై పటేల్‌పారా గ్రామానికి చెందిన నందా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలా గ్రామాలకు నామ్ కే వాస్తే అన్నట్టుగా సర్పంచ్‌లు ఉన్నారు. ఎక్కువ మంది ఎన్నికలను బహిష్కరిస్తారు. అయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. సమీప పట్టణాల్లో నివాసం ఉండేవారు నామినేషన్ దాఖలు చేస్తారు. వారిలో ఒకరు సర్పంచ్ అవుతారు. కానీ చాలా గ్రామాల్లో వారి పెత్తనమేమీ ఉండదు. పరిపాలనలో గ్రామ కమిటీలదే ఆధిపత్యం..’’ అని వివరించాడు. సమష్టి వ్యవసాయం చాలా ఊర్లలో ట్రాక్టర్లు కనిపించాయి. వాటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేవు. ఆ ట్రాక్టర్లను ఊరంతా ఉపయోగించుకుంటారని తెలిసింది. ఇక్కడి ప్రజలకు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేదు. అంతా దట్టమైన అడవి అయినా ఎక్కడా అటవీ సిబ్బంది ఛాయల్లేవు. ఇటీవలికాలంలో చేతిపంపులు, సోలార్ లైట్లు వంటివి కనిపిస్తున్నాయి. వినోదం విషయానికొస్తే.. సంప్రదాయ ఆటపాటలతో పాటు కోడిపందేలను ఆదివాసీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ప్రభుత్వం తరఫున సేవలు అందించేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పువ్వర్తి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సుక్మా జిల్లా ఏఎస్పీ గౌరవ్ మొండల్ చెప్పారు. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి తాగునీరు, విద్యుత్, స్కూల్, ఆస్పత్రి వంటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. అయితే క్యాంపుల ఏర్పాటులో ఉన్న వేగం ప్రభుత్వ పథకాల అమల్లో కనిపించడం లేదేమని ప్రశి్నస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులే అందుకు కారణమన్నారు. ఇక క్యాంపుల ఏర్పాటు సమయంలో ఆదివాసీలు భయాందోళన చెందినా, తర్వాత శత్రుభావం వీడుతున్నారని మరో అధికారి తెలిపారు. ఈక్రమంలోనే జనతన సర్కారులోకి చొచ్చుకుపోగలుతున్నామన్నారు. ఇప్పటికీ మావోయిస్టులదే పైచేయి.. ప్రభుత్వ బలగాలు ఎంతగా మోహరిస్తున్నా ఇప్పటికీ అడవుల్లో మావోయిస్టులదే ఆధిపత్యం. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి ప్రజలకు ఆటపాటలే ప్రధాన వినోద సాధనాలు. మావోయిస్టులు చేతన నాట్యమండలి వంటివాటి ద్వారా ఇక్కడి ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తిస్తారు. పిల్లలకు ఏడేళ్లు దాటగానే గ్రామ కమిటీల్లో చోటు కల్పించి, భావజాలాన్ని నేర్పుతారు. మావోయిస్టుల పట్ల ఎవరైనా వ్యతిరేకత చూపితే ప్రమాదం తప్పదనే భయాన్ని నెలకొల్పారు’’ అని ఆరోపించారు. హిడ్మా అడ్డాలో క్యాంపు వేసి.. పువ్వర్తి జనాభా 400కు అటుఇటుగా ఉంటుంది. అందులో దాదాపు వంద మంది మావోయిస్టు దళాల్లో ఉన్నారు. వీరిలో హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకోగా.. ఆయన సోదరుడు దేవా బెటాలియన్ కమాండర్‌గా ఉన్నారు. పువ్వర్తిలో హిడ్మా కోసం ప్రత్యేక సమావేశ మందిరం, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేవి. అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే హిడ్మా సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఇవన్నీ భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయి. ఆధునిక పరికరాల సాయంతో వందల మంది కార్మికులు క్యాంపు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి వరకు రోడ్డుకూడా లేని ఈ గ్రామంలోకి ఇప్పుడు పదుల సంఖ్యలో లారీల్లో వస్తుసామగ్రి, రేషన్ తరలించారు. బుల్డోజర్లు, పొక్లెయినర్లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్‌్కఫోర్స్, డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ ఇలా వివిధ దళాలకు చెందిన సుమారు ఐదు వేల మంది సిబ్బంది మోహరించారు. గ్రామం నలువైపులా గుడారాలు, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్యాంపులు తమకు ఇబ్బందిగా మారుతున్నాయని చాలా మంది ఆదివాసీలు అంటున్నారు. కొండపల్లికి చెందిన మడావి మాట్లాడుతూ.. ‘‘క్యాంపులు ఏర్పాటైన తర్వాత మా గ్రామాల్లోకి వచ్చే భద్రతాదళాలు విచారణ పేరుతో జబర్దస్తీ చేస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కాల్పుల శబ్దాలు వినవస్తున్నాయి. విచారణ పేరిట ఎవరైనా గ్రామస్తుడిని తీసుకెళ్తే.. తిరిగి వచ్చే వరకు ప్రాణాలపై ఆశలేనట్టే. అందుకే భద్రతా దళాలు వస్తున్నట్టు తెలియగానే పెద్దవాళ్లందరం అడవుల్లోకి పారిపోతున్నాం’’ అని చెప్పాడు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘స్థానికులమైన మాకు భద్రతాదళాల నుంచి కనీస మర్యాద లేదు. అభివృద్ధి పేరిట అడవుల్లోకి వస్తున్నవారు గ్రామపెద్దల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..’’ అని పేర్కొన్నాడు. -
అరణ్యానికి ఆసరా
అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్ పర్యావరణవేత్త చికో మెండిస్ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ నిఘంటు అర్థానికీ, 1996లో తాము వెలువరించిన తీర్పునకూ తు.చ. తప్పకుండా కట్టుబడివుండాలని మొన్న సోమవారంనాడు సర్వోన్నత న్యాయ స్థానం చెప్పవలసి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా మన దేశంలో ‘అడవి’కి నిర్దిష్టమైన నిర్వచనం లేదు. దేశంలో అటవీభూముల విస్తీర్ణం ఎంతో స్పష్టమైన, సమగ్రమైన రికార్డు కూడా లేదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో మొత్తం ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయి. ఇది మరో 1,540 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని మూడేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. అయితే 1980 నాటి అటవీ సంరక్షణ చట్టానికి నిరుడు ఆగస్టులో తీసుకొచ్చిన సవరణల వల్ల ఆ చట్టం పరిధి కుంచించుకుపోయిందనీ, ఫలితంగా 1,97,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి ముప్పు ఏర్పడిందనీ పిటిషనర్లు ఆరోపించారు. వివాదాస్పదమైన 1ఏ నిబంధన అటవీప్రాంతంగా రికార్డుల్లో వుండి 1980–96 మధ్య చట్టబద్ధంగా అటవీయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూములు, అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలోవుండి వ్యూహా త్మక అవసరాలకు వినియోగపడే ప్రాంతం ఈ చట్టం పరిధిలోనికి రాదని చెబుతోంది. అలాగే మావోయిస్టు ప్రాంతాల్లో ఆంతరంగిక భద్రతకై చేపట్టే నిర్మాణాల కోసం అయిదు హెక్టార్ల వరకూ అటవీయేతర భూమిగా రికార్డుల్లోవున్న ప్రాంతాన్ని సేకరించవచ్చని చెబుతోంది. ఇక జూ, సఫారీ వంటి అవసరాల కోసం కూడా ఈ తరహా భూమిని తీసుకోవచ్చని వివరిస్తోంది. అడవులే అయిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంవల్లనో, మరే ఇతర కారణంవల్లనో రికార్డుల్లోకి ఎక్కని భూముల న్నిటికీ ఈ చట్టసవరణవల్ల ముప్పు ఏర్పడుతుందని పిటిషనర్ల వాదన. ఈ కేసులో సుప్రీంకోర్టు వెలు వరించిన తాత్కాలిక ఆదేశాల పర్యవసానంగా 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం నిబంధనలూ, 1996లో సర్వోన్నత న్యాయస్థానం టీఎన్ గోదావర్మన్ కేసులో ఇచ్చిన ఆదేశాలూ వర్తిస్తాయి. అడవులను సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరినప్పుడల్లా అభివృద్ధి మాటేమిటన్న ప్రశ్న వినబడుతూ వుంటుంది. ఆ రెండూ పరస్పర విరుద్ధాలన్నట్టు... ఒకటి కోల్పోతేనే రెండోది సాధ్యమ న్నట్టు మాట్లాడతారు. ఇది సరికాదు. ఏ కారణంతో అడవుల్ని హరించినా అది ఆత్మవినాశనానికే దారితీస్తుంది. అడవులంటే కేవలం వృక్షాలు మాత్రమే కాదు... అక్కడుండే ఆదివాసులూ, ఆ అడవిని ఆలంబనగా చేసుకుని జీవించే వన్యమృగాలతో సహా సమస్త జీవరాశులూ కూడా! అడవులను ధ్వంసం చేసినప్పుడు ఆవాసం కరువై వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడతాయి. ఆదివాసులు జీవిక కరువై ఇబ్బందుల్లో పడతారు. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడేవి. కానీ పర్యావరణానికి కలిగే చేటు అపారమైనది. అటవీప్రాంతం తగ్గితే కరువు, అకాలవర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందువల్ల అభివృద్ధికీ, పర్యావరణ పరిరక్షణకూ సమతూకం వుండేలా ప్రభుత్వ విధానాలుండాలి. 2006 నాటి పర్యావరణ (పరిరక్షణ) చట్టం కింద రూపొందించిన పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనలు కొంతమేరకు ఈ సమతూకాన్ని సాధించాయి. అయితే దాన్ని నీరు గార్చిన పర్యవసానంగా మైనింగ్ కోసం, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం, మౌలిక సదుపాయ ప్రాజెక్టుల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తున్న అనుమతులు ఆ సమతూకాన్ని దెబ్బతీసి కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చాయని ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక వెలువరించిన కథనాలు వెల్లడించాయి. వివిధ కారణాలవల్ల పర్యావరణ అనుమతులు పొందని కంపెనీలకు ఆర్నెల్లపాటు మినహాయింపునిచ్చిన 2017 నాటి కేంద్ర నిబంధనలే ఇందుకు కారణం. 2017–24 మధ్య వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన బాక్సైట్, బొగ్గు, ఇనుము మైనింగ్‌లతోపాటు, సిమెంట్ ఫ్యాక్టరీలు, సున్నపురాయి వంటి వంద ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని ఆ కథనం చెబుతోంది. 1996లో జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ బీఎన్ కృపాల్ ఇచ్చిన తీర్పు అడవికి విస్తృత నిర్వచనాన్నిచ్చింది. దాని ప్రకారం చట్టం నిర్వచనానికి సరిపోయే అటవీప్రాంతాలతోపాటు యాజమాన్యం ఎవరిదన్న అంశం జోలికి పోకుండా అడవిగా చట్టం గుర్తించిన అన్ని ప్రాంతాలూ అడవులు గానే భావించాలి. నిరుడు అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన సందర్భంగా పార్లమెంటులో మాట్లాడిన కేంద్ర పర్యావరణమంత్రి భూపేందర్ యాదవ్ ఆ చట్టం వల్ల ఆదివాసీ ప్రాంతా ల్లోని పాఠశాలల్లో కనీసం ఆడపిల్లల కోసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోతున్నామని వాపోయారు. ఇందులో నిజం లేదు. 2006 నాటి అటవీ హక్కుల చట్టం అలాంటి అవసరాల కోసం మినహాయింపునిస్తోంది. పర్యావరణ సమతూకాన్ని సాధించగలిగినప్పుడే దేశంలో హరితావరణాన్ని కాపాడు కోగలుగుతాం. చాలా దేశాలు అడవుల్ని కోల్పోయిన పర్యవసానంగా జరిగిన నష్టాన్ని గమనించుకుని వాటి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. బ్రెజిల్ వంటి దేశాలు అడవులను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. ధర్మాసనం చెప్పినవిధంగా ఏప్రిల్ 15కల్లా దేశంలోని అన్ని రకాల అటవీ భూములపై సమగ్ర వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలి. అడవుల రక్షణపై పౌరుల అవగాహనను పెంపొందించే చర్యలకు ఉపక్రమించాలి. -
Lok Sabha polls 2024: ఎన్నికలప్పుడే పేదలు గుర్తొస్తారు
భోపాల్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కిపైగా స్థానాలు కచి్చతంగా గెలుచుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు 400కు పైగా స్థానాలు లభిస్తాయని సాక్షాత్తూ ప్రతిపక్ష నేతలే చెబుతున్నారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఝాబూవా జిల్లాలో ఆదివారం గిరిజనుల బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. ఆ పారీ్టకి గ్రామీణులు, రైతులు, పేదలు కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. కొన్ని రోజుల క్రితం దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీరాముడితో సంబంధం ఉన్న ఆలయాలను దర్శించుకున్నానని, స్థానిక ప్రజల నుంచి తనకు అపరిమితమైన ప్రేమ లభించిందని చెప్పారు. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గ్రహించాయని, అందుకే దింపుడు కళ్లం ఆశతో కుటిల ప్రయత్నాలకు పాల్పడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. టూటీ చేయడం, ప్రజలను విభజించడం.. ఇదే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జనం సొమ్ము దోచుకోవడం, అధికారం పోయాక భాష, ప్రాంతం, కులం పేరిట విడదీయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిపోయిందన్నారు. అవినీతి, విభజన రాజకీయాలు అనే ఆక్సిజన్‌తో కాంగ్రెస్ బతుకుతోందన్నారు. ప్రజలకు నిజాలు తెలుసని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని తేలి్చచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అన్నారు. గిరిజనులు, పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందుకే ప్రతిపక్షాలు తనను దూషిస్తున్నాయని ఆరోపించారు. ప్రతి బూత్‌లో అదనంగా 370 ఓట్లు గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీకి అదనంగా 370 ఓట్లు వేయాలని ప్రజలను నరేంద్ర మోదీ కోరారు. మొత్తం 543 లోక్‌సభ సీట్లకు గాను తమకు 370కిపైగా సీట్లు కట్టబెట్టాలన్నారు. మధ్యప్రదేశ్‌లో డబులు ఇంజన్ ప్రభుత్వం డబుల్ స్పీడ్‌తో పని చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. రూ.7,550 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని ఆక్షేపించారు. గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ ప్రయతి్నంచిందని ధ్వజమెత్తారు. విలువలతో కూడిన విద్య కావాలి భారతీయ విలువల ఆధారిత విద్యా వ్యవస్థ తక్షణావసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బీ జిల్లా తాంకారాలో ఆదివారం వేడుకల్లో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. భారతీయ వ్యవస్థ వేదాల వైపు మళ్లాలంటూ దయానంద సరస్వతి పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఆయన గొప్ప సామాజిక సంస్కర్త అని కొనియాడారు. సమాజం నుంచి బానిసత్వం, మూఢనమ్మకాలను తొలగించేందుకు కృషి చేశారని తెలిపారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలోని పాఠశాలలు విలువలతో కూడిన విద్యనందిస్తున్నాయని ప్రశంసించారు. 21వ శతాబ్దంలో జాతి నిర్మాణం అనే బాధ్యత చేపట్టాలని ఆర్య సమాజ్‌కు విజ్ఞప్తి చేశారు. దయానంద సరస్వతి జని్మంచిన గుజరాత్లో తాను కూడా జని్మంచడం అదృష్టంగా భావిస్తున్నానని మోదీ అన్నారు. -
గిరిజన గృహాల్లో విద్యుత్ వెలుగులు
సాక్షి, అమరావతి: అడవులు, కొండల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి గిరిజన గృహానికీ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రూ.140 కోట్లను వెచ్చిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెలలో రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని గిరిజన గ్రామాలపై అధ్యయనం చేశాయి. అడవులు, కొండ ప్రాంతాల్లోని గిరిజనుల గృహాలకు విద్యుత్ లైన్లు వేయడానికి సాంకేతికంగా, ఆర్థికంగా ఉన్న సాధ్యాసాధ్యాలను వీరు అధ్యయనం చేశారు. గిరిజనుల నుంచి ఎటువంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా విద్యుత్ సదుపాయం కల్పిస్తోంది. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నంద్యాల జిల్లాలో 213 గిరిజన ఆవాసాల విద్యుదీకరణకు రూ.5 కోట్లు కేటాయించింది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రూ.24 కోట్లతో 1982 గిరిజనుల ఇళ్లకు విద్యుత్ సర్విసులు అందిస్తోంది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 8,819 గిరిజన గృహాల విద్యుదీకరణకు రూ.33.49 కోట్లతో డీపీఆర్ సిద్ధమైంది. ఇంకా ఏవైనా విద్యుత్ అందని గిరిజన గృహాలను కూడా డిస్కంలు గుర్తిస్తున్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల విద్యుదీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎంజేఏఎన్ఎంఏఎన్) పథకానికి కూడా మన రాష్ట్రం ఎంపికైంది. ఈ పథకం ద్వారా విద్యుత్ లైన్లు వేయడం సాధ్యం కాని ప్రాంతాల్లో సౌర విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అర్హులైన గిరిజన లబ్దిదారులందరికీ ప్రభుత్వం సబ్సిడీతో నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇంధన వినియోగ చార్జీలు, ట్రూ–అప్, ఎఫ్‌ఏపీసీఏ చార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన ఎస్టీ వినియోగదారుల రాయితీ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో 0–75 యూనిట్ల పరిమితి ఉండేది. 100 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారుల సర్విసులకు విద్యుత్ సరఫరా నిలిపివేసేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ బకాయిలను కూడా చెల్లించడంతో పాటు యూనిట్ల పరిమితిని కూడా 200కు పెంచింది. ఎస్టీల విద్యుత్ సబ్సిడీ గత ప్రభుత్వంతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగింది. దీంతో సర్వీసులూ పెరిగాయి. 5 లక్షలకు పైగా ఎస్టీ కుటుంబాలకు ఇప్పుడు ఉచిత విద్యుత్ అందుతోంది. ప్రతి ఆవాసానికీ విద్యుత్ ఈపీడీసీఎల్ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ సదుపాయం లేని 271 గిరిజన మారుమూల హాబిటేషన్స్ను గుర్తించాం. 4944 గిరిజన కుటుంబాలకు విద్ద్యుదీకరణ చేయడానికి రూ.29.96 కోట్లతో గతంలో ప్రతిపాదనలు రూపొందించాం. తాజాగా 1,474 గిరిజన ఆవాసాల్లో 8,819 గిరిజన గృహాల విద్యుదీకరణకు రూ. 33.49 కోట్లతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. ఇంకా విద్యుదీకరణ చేయని 245 హాబిటేషన్స్లో 1,544 గృహాల విద్యుదీకరణకు పాడేరు డివిజన్లోని గిరిజన ప్రాంతాల్లో సర్వే చేశాం. ప్రతిపాదనలు కూడా రూపొందించాం. –ఎల్ మహేంద్రనాథ్, ఎస్ఈ, విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ -
మనసున్న ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు అత్యధికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ మాజీ ఎంపీ, ఆచార్య అజ్మీర సీతారాంనాయక్ అన్నారు. గిరిజనులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. ఆదివారం విజయవాడలో ‘గిరిజన శంఖారావం’ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీతారాంనాయక్ మాట్లాడుతూ.. ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయడం గొప్ప విషయమన్నారు. ఏపీలో గిరిజనులకు జరుగుతున్నంత సంక్షేమం, అభివృద్ధి దేశంలో మరెక్కడా అందడం లేదని చెప్పారు. అందుకే ఏపీలోని గిరిజనులు జగన్‌ను దేవుడిగా అభిమానిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పపూలు ఏరుకుని బతికే కుటుంబానికి చెందిన తాను ఉమ్మడి ఏపీలో మొదటి పీహెచ్డీ చేసిన గిరిజన వ్యక్తినని చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో ఉన్నతంగా ఎదుగుతామన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యత ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ రాష్ట్రంలోని గిరిజనులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను మరింతగా పెంచాలనే తపనతో పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గిరిజనుల మాట వినే ప్రభుత్వం ఉందని, దాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. కానీ సీఎం జగన్ రెండు మంత్రివర్గాల్లోనూ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీలుగా గిరిజనులకు అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. అడవులకే పరిమితం అనుకున్న గిరిజన బిడ్డలను సీఎం జగన్ రాజకీయ రంగంలో కూడా చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకొని.. మరింతగా అభివృద్ధి చెందుదామని పిలుపునిచ్చారు. జీపీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు జి.మల్లిఖార్జున నాయక్, జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.రాజునాయక్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే గిరిజన తండాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం.. తదితర సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో పెత్తందారులతో జరుగుతున్న యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా, అగ్రవర్ణ పేదల నాయకుడైన సీఎం జగన్‌ను గెలిపించుకుందామని కోరారు. గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కె.రామలక్ష్మి, జె.లిల్లీ, నెల్లూరు నగర మేయర్ పొట్టూరి స్రవంతి, కదిరి రూరల్ జెడ్పీటీసీ కృష్ణ నాయక్, పలు కార్పొరేషన్ల డైరెక్లర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, గిరిజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ బంజార కళాకారుడు బిక్షు నాయక్ బృందం ప్రదర్శించిన గిరిజన కళారూపాలు ఆకట్టుకున్నాయి. -
‘పీఎం జన్ మన్’తో గిరిజనుల అభివృద్ధికి కృషి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్మన్ యోజన) పథకం ప్రవేశపెట్టిందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు. ఈ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్‌లు)తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గిరిజన తెగల్లో కూడా బాగా వెనుకబడిన తెగలున్నాయని.. వారిని ఇప్పటివరకు ఎవరూ అంతగా పట్టించుకోలేదన్నారు. అలాంటి వారందరి అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. 2023–24 నుంచి 2025–26 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కేంద్రం వాటాగా రూ.15,336 కోట్లు, రాష్ట్రాల వాటాగా రూ.8,768 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, నిరంతర నీటి సౌకర్యం, ప్రతి ఇంటికీ విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, మలీ్టపర్పస్ కేంద్రాలు, సోలార్ వీధి దీపాలు, మొబైల్ టవర్లు, ఒకేషనల్ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎస్‌లకు రాజీవ్ గౌబ సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాల ద్వారా లబ్ధి కలిగించాలన్నారు. ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చువల్‌గా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొత్త బల్లుగుడ, పాత బల్లుగుడకు చెందిన ఆదివాసీలతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి ఈ అంశంపై రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని పీవీటీజీ ఆవాసాల్లోని వారందరికీ వివిధ పథకాలను మిషన్ మోడ్‌లో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఉన్నతాధికారులు కె.విజయానంద్, బి.రాజశేఖర్, ఎంటీ కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాశ్, జి.జయలక్షి్మ, కాంతిలాల్ దండే, సురేష్ కుమార్, లక్ష్మీశా, జె.వెంకట మురళి, బాలూ నాయక్, కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. -
గిరిజన ఉపాధిలో వికాసం
సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని వన్ ధన్ వికాస్ కేంద్రాలు(వీడీవీకే)లతో గిరిజన ఉపాధిలో వికాసం కనిపిస్తోంది. వీటి ఏర్పాటుతో గిరిజనులకు ఉన్నతమైన జీవనోపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. గిరిజనులు సేకరించిన ఫలసాయంతోపాటు గిరిజన రైతులు పండించిన ఉత్పత్తులను నాణ్యత చెడిపోకుండా అందమైన ప్యాకింగ్‌తో అమ్మకాలు చేయిస్తోంది. గిరి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ అడవి బిడ్డలకు లాభదాయకంగా మలుస్తోంది. కొనుగోలుదారులకు సైతం ప్రయోజనాలను అందిస్తోంది. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో వీడీవీకేలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన వీడీవీకేల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఆయా ఐటీడీఏల పరిధిలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ వాటిని పర్యవేక్షిస్తున్నారు. విక్రయిస్తున్న ఉత్పత్తులివీ.. అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన అటవీ ఫలసాయంతోపాటు వారు పండించిన ఉత్పత్తులు కూడా అందంగా ప్యాక్‌చేసి వీడీవీకేల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా తేనె, కాఫీ, పసుపు, మిరియాలు, రాజ్మా, రాగులు, రాగి పిండి, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అడవి దుంపల నుంచి తీసిన పాలపిండి, జీడిపప్పు, నల్లజీడి పిక్కలు, మినుములు, చింతపండు, శీకాయ, శీకాయ పొడి, కుంకుడు, చీపుర్లు, అడ్డాకులతోపాటు ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి, నువ్వులు, కారం, కరివేపాకు, మునగాకు పొడులు కూడా విక్రయిస్తుండటం విశేషం. రూ.61.63 కోట్లతో 415 వీడీవీకేలు రాష్ట్రంలో 2019–20 నుంచి 2021–22 వరకు గిరిజన సంక్షేమ శాఖ 415 వీడీవీకేలను ఏర్పాటు చేయించింది. ఇందుకోసం రూ.61.63 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటివరకు రూ.36.04 కోట్లు విడుదల చేశారు. గిరిజన మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేయించి.. వారికి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గిరిజనులు పండించిన ఉత్పత్తులు, సేకరించిన ఫలసాయాలకు వీటిద్వారా కనీస మద్దతు ధర దక్కేలా చేస్తున్నారు. సేకరించిన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేలా గిరిజన మహిళలకు శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్‌కు అనుగుణంగా వాటిని సిద్ధం చేయడం వంటి లక్ష్యాలు సాధించడంలో వీడీవీకేల ద్వారా చేస్తున్న ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. గిరిజన ఉత్పత్తుల సేకరణ నుంచి మార్కెటింగ్ వరకు వీడీవీకేల ద్వారా అందిస్తున్న తోడ్పాటు గిరిజన మహిళల ఆర్థిక పురోగతికి దోహదం చేస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన వీడీవీకేలు సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. నెలకు రూ.25 వేలకు పైనే మిగులుతోంది గిరిజన మహిళలు గ్రూపుగా ఏర్పడి వీడీవీకే ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో కూడిన పెట్టుబడి సాయం అందిస్తుంది. ఐటీడీఏ, డీఆర్డీఏ పర్యవేక్షణలో ఇవి గిరిజన ప్రాంతాల్లో వినూత్న సూపర్ మార్కెట్ల మాదిరిగా ఆదరణకు నోచుకుంటున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో నెలకు కనీసం రూ.లక్షకుపైగా విక్రయాలు జరిగితే పెట్టుబడి పోనూ రూ.25 వేలు లాభం మిగులుతోంది. గ్రూపు సభ్యులు లాబాల్లో వాటా పంచుకుని మెరుగైన జీవనం గడిపేందుకు వీడీవీకేలు దోహదం చేస్తున్నాయి. – జి.పైడమ్మ, వీడీవీకే నిర్వాహకురాలు, పాడేరు -
ఆ పల్లెను చూసింది నలుగురు ఎమ్మెల్యేలే!
రాష్ట్రంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల్లో ఒకటైన కొండరెడ్లకు ఓటు హక్కు కల్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ఈ ఏడాది కొత్తగా 71 మంది కొండరెడ్లు ఓటుహక్కు పొందారు. సమాజానికి దూరంగా అడవుల్లో నివసించే కొండరెడ్లను సైతం ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడంపై జిల్లా యంత్రాంగం చేసిన కృషిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ సైతం అభినందించారు. దీంతో ఒక్కసారిగా కొండరెడ్లు ఫోకస్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలపై కొండరెడ్ల జీవన స్థితిగతులతో పాటు అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. దట్టమైన అడవిలో..: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ – దమ్మపేట మార్గంలోని దట్టమైన అటవీ మార్గంలో ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఒక ఫారెస్ట్ చెక్ పోస్టు వస్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం లేని కాలిబాటలో 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. . కొండరెడ్లు నివాసముండే పూసుకుంట అనే గ్రామం వస్తుంది. ఇక్కడ 138 మంది కొండరెడ్లు నివసిస్తున్నారు. ఇందులో 80 మందికి గతంలో ఓటుహక్కు ఉండగా ఈ ఏడాది కొత్తగా 14 మందికి ఓటుహక్కు వచ్చింది. ఆ గ్రామం చూసిన ఎమ్మెల్యేలు నలుగురే..: గడిచిన డెబ్బై ఏళ్లుగా ఈ గ్రామాన్ని సందర్శించింది కేవలం నలుగురు ఎమ్మెల్యేలే. వారే జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు, వగ్గేల మిత్రసేన, తాటి వెంకటేశ్వర్లు. కొండ రెడ్ల ఓట్లు తక్కువగా ఉండటం, ఇతరులతో కలవకుండా వేరుగా నివసిస్తుండడంతో బడా నేతలు కానీ రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం లేదు. ఎన్నికల వేళ కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్నారు తప్ప అరుదైన గిరిజన జాతిగా గుర్తించడం లేదు. ఫలితంగా ఈ జాతి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. గవర్నర్ రాకతో..: రాష్ట్ర గవర్నర్ తమిళసై 2022 ఏప్రిల్‌లో ప్రత్యేకంగా పూసుకుంట గ్రామాన్ని సందర్శించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ప్రధాన రహదారి నుంచి 13 కి.మీ దూరంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆమె పలకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ గ్రామానికి ప్రభుత్వపరంగా వివిధ పక్కా భవనాలు మంజూరయ్యాయి. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయగా, రవాణా సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చారు. అలాగే, ఇక్కడి ప్రజలకు వెదురుతో అలంకరణ వస్తువులు తయారు చేయించడంపై శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. ఆ సౌకర్యాలు మూణ్నళ్ల ముచ్చటే..: గవర్నర్ రాకతో హడావుడిగా వచ్చిన సౌకర్యాలు ఇప్పుడు మూలనపడ్డాయి. ఆర్వో ప్లాంట్‌లో వాటర్ ట్యాంక్ పగిలిపోగా, బ్యాటరీ ఆటో రిపేరుకు వచ్చింది. శిక్షణా కేంద్రానికి వేసిన తాళం తీయడం లేదు. వీటిపై ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. వెదురు బుట్టల మార్కెటింగ్‌పై దృష్టి సారించకపోవడంతో స్థానికులు వాటి తయారీపై ఆసక్తి చూపడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లదీ ఇదే పరిస్థితి. కొండ దిగినా..: డెబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు, ఐటీడీఏ చేసిన ప్రయత్నాలతో కొండలు దిగి కింద ఉన్న అడవుల్లో కొందరు గ్రామాలను ఏర్పాటు చేసుకుంటే మరికొందరు మైదాన ప్రాంతాల సమీపాన ఉండే అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరంగా వీరి కోసం అమలు చేసే పథకాల అమలులోనూ చిత్తశుద్ధి లోపించడంతో సరైన ఫలితాలు రావట్లేదు. దాంతో వారు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రమాదపుటంచున..: అడవుల్లో ఉండటం, జీవన విధానం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వేషభాషల ఆధారంగా 1975లో దేశవ్యాప్తంగా ఆరుదైన ఆదిమజాతులను (ప్రిమిటీవ్ ట్రైబల్ గ్రూప్) ప్రభుత్వం గుర్తించింది. అయితే రానురానూ ఈ ఆదిమ జాతుల జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో 2006లో అత్యంత ప్రమాదంలో ఉన్న ఆదిమ జాతులుగా పేరు మార్చారు. ఈ కేటగిరీకి చెందిన 12 రకాల ఆదిమ జాతులు ఉమ్మడి ఏపీలో ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నాలుగు రకాలైన ఆదిమ తెగలే ఉన్నాయి. 2018–19లో రాష్ట్ర గిరిజన శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలం (జనాభా 40 వేలు), తోటి (4 వేలు), నల్లమల్ల అడవుల్లో చెంచులు (16 వేల జనాభా)తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 వేల మంది కొండరెడ్లు ఉన్నట్టు తేలింది. తాజాగా ఓటర్ల జాబితాకు వచ్చేసరికి కొండరెడ్ల జనాభా సగానికి సగం తగ్గిపోయి కేవలం 1,054కే పరిమితమైంది. ఇందులో 692 మందికి ఓటు హక్కు ఉంది. వీరంతా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఉన్న ఏడు కొండరెడ్డి గూడెల్లో నివాసం ఉంటున్నారు. రోడ్డు కావాలి.. మా ఊరికి రోడ్డు కావాలని ఎప్పటి నుంచో చెబుతున్నాం. వర్షాకాలం వస్తే ఊరు దాటడం కష్టం. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే దేవుడే దిక్కు. నీళ్ల ప్లాంటు, అంబులెన్స్, ఆటోలు పని చేయడం లేదు. – ఉమ్మల దుర్గ, పూసుకుంట చదువు ఆపేశాను నాకు ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను, తమ్ముడు తొమ్మిదో తరగతితోనే చదువు ఆపేసి పనులకు వెళ్తున్నాం. – ఇస్మాయిల్‌రెడ్డి, వీరారెడ్డిగూడెం -తాండ్ర కృష్ణగోవింద్ -
ఓ ఆదివాసి వీరనారి పోరాటం!
మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వీరమరణం పొందిన ఆదివాసీ వీరనారి రాణి దుర్గావతి. మధ్యప్రదేశ్‌లోని గోండు తెగకు చెందిన బుందేల్ ఖండ్ సంస్థానాధీశుడు చందవేల్‌కు 1524 అక్టోబర్ 5న దుర్గావతి జన్మించింది. దుర్గావతి భర్త దళపత్ షా గోండు రాజ్యాన్ని పాలిస్తూ మరణించాడు. కుమారుడు వీరనారాయణ్ మైనర్ కావడంతో దుర్గావతి గోండ్వానా రాజ్య పాలన చేపట్టింది. రాణి దుర్గావతి పైనా, ఆమె పాలిస్తున్న గోండ్వానా రాజ్య సంపద పైనా మనసు పారేసుకున్న అక్బర్ సేనాని ఖ్వాజా అబ్దుల్ మజీద్ అసఫ్ ఖాన్... అక్బర్ అనుమతిని తీసుకొని గోండ్వానాపై దండెత్తాడు. సుశిక్షితులైన వేలాది మొఘల్ సైనికులు ఒకవైపు, అసంఘ టితమైన ఆదివాసీ సైన్యం ఒకవైపు యుద్ధ రంగంలో తలపడ్డారు. మొఘల్ సైన్యానికి ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆదివాసీ సైనికులకు సంప్రదాయ ఆయుధాలే దిక్కయ్యాయి. మొఘల్ సైన్యం రాకను తెలుసుకున్న దుర్గావతి రక్షణాత్మకంగా ఉంటుందని భావించి ‘నరాయ్’ అనే ప్రాంతానికి చేరుకొంది. ఇక్కడ ఒకపక్క పర్వత శ్రేణులు ఉండగా మరోపక్క గౌర్, నర్మద నదులు ఉన్నాయి. ఈ లోయలోకి ప్రవేశించిన మొఘల్ సైన్యంపై గెరిల్లా దాడులకు దిగింది దుర్గావతి. ఇరువైపులా సైనికులు మరణించారు. దుర్గావతి ఫౌజ్దార్ అర్జున్ దాస్ వీరమరణం పొందాడు. ఆమె గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తే సైనికాధికారులు రాత్రి గుడ్డి వెలుతురులో ప్రత్యక్ష యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు. మరుసటిరోజు ఉదయానికి పెద్ద తుపాకులను వాడమని మొఘల్ సైన్యాధికారి అసఫ్ ఖాన్ సైనికులను ఆదేశించాడు. రాణి ఏనుగునెక్కి మొఘల్ సైనికులపై విరుచుకుపడింది. యువరాజు వీర్ నారాయణ్ కూడా యుద్ధరంగంలోకి దూకి మొఘల్ సైనికులను మూడుసార్లు వైనక్కి తరిమాడు. కానీ అతడు తీవ్రంగా గాయపడడంతో సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోయాడు. రాణి దుర్గావతికి కూడా చెవి దగ్గర బాణం తగిలి గాయపడింది. ఆ తర్వాత ఒక బాణం ఆమె గొంతును చీల్చివేసింది. వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహ వచ్చిన తర్వాత ఆమె ఏనుగును తోలే మావటి యుద్ధ రంగం నుంచి సురక్షిత ప్రదేశానికి తప్పించుకు వెళదామని సలహా ఇచ్చాడు. ఆమెకు అపజయం ఖాయం అని అర్థమయ్యింది. శత్రువుకు భయపడి పారిపోవడం లేదా అతడికి చిక్కి మరణించడం అవమానకరం అని భావించి తన సురకత్తిని తీసుకుని పొడుచుకొని ప్రాణాలు వదిలింది రాణి. దీంతో ఒక మహోజ్వల ఆదివాసీ తార నేలకొరిగినట్లయ్యింది. – గుమ్మడి లక్ష్మీ నారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
10,574 చోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రతి గడపకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 10,574 చోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కిల్లోగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ శిబిరాలకు వస్తున్న ప్రతి వ్యక్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరచడంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా పెద్దాస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండానే ఉన్నత వైద్యం అందిస్తామన్నారు. మూడు రోజుల్లోనే ఈ శిబిరాల ద్వారా 3.35 లక్షల మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. వీటిలో 11,780 కేసులను ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉన్నత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా 297 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకు 250 మంది వైద్య నిపుణులను కేటాయించామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనిచేస్తున్నారని వెల్లడించారు. గిరిజనులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు గిరిజనులంటే సీఎం జగన్‌కు అపారమైన ప్రేమ అని మంత్రి రజిని తెలిపారు. రూ.600 కోట్లతో మన్యం జిల్లా పార్వతీపురంలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారని చెప్పారు. అలాగే పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఏడాది ఇది ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీంతోపాటు 600 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో మన్యం ప్రజలు కేజీహెచ్‌కు వెళ్లే ఇబ్బందులు తప్పుతాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో బర్త్ వెయిటింగ్ సేవలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు 40.. 104, 108 వాహనాలను కేటాయించామన్నారు. 20 లక్షల మంది గిరిజనులకు సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నామన్నారు. రోగులకు నెలకు రూ.10 వేల పింఛన్ కూడా అందిస్తున్నామని చెప్పారు. అనంతరం వైద్య శిబిరానికి వచి్చన గిరిజనులకు మందుల కిట్లు పంపిణీ చేశారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు వచ్చే గిరిజనులకు ఉచితంగా ఆహారం, తాగునీరు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దత్తత గ్రామానికి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా? టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బాౖMð్సట్ తవ్వకాలతో మన్యాన్ని దోచుకోవాలని ప్రయత్నాలు చేశారని మంత్రి విడదల రజిని విమర్శించారు. పెదలబుడును చంద్రబాబు దత్తత తీసుకుని ఒక మంచి పని అయిన చేశారా అని నిలదీశారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఉన్న జీవోను రద్దు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నివాస్, ఐటీడీఏ పీవో వి.అభిõÙక్, ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
Tribal University: తొమ్మిదేళ్ల కల తీరేలా..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో సుమారు తొమ్మిదేళ్ల్ల నిరీక్షణకు తెరపడింది. ఉమ్మడి ఏపీ విభజన సమయంలోనే.. ఏపీ, తెలంగాణలలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏపీలోని విజయనగరం జిల్లా మర్రివలసలో 2019లోనే సెంట్రల్ ట్రైబల్ వర్సిటీని స్థాపించారు. రాష్ట్రంలో మాత్రం వర్సిటీకి స్థలం విషయంలో పేచీతో ఇన్నాళ్లూ జాప్యం జరిగింది. ఇప్పటికైనా ఈ అంశంపై స్పష్టత రావడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ ఏర్పాటయ్యే పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, గిరిజనులకు విద్యావకాశాలు పెరుగుతాయని అంటున్నారు. ఇన్నాళ్లూ లేఖలతోనే.. గిరిజన వర్సిటీ నిర్మాణానికి 500 ఎకరాల స్థలం కావాలని, అనుకూలమైన స్థలం ఉంటే వచ్చి పరిశీలిస్తామని 2016లోనే కేంద్ర ఉన్నత విద్యామండలి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో రాష్ట్ర రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించి.. ములుగు జిల్లాలోని బండాకెపల్లి శివార్లలో 335.4 ఎకరాలను సేకరించారు. 2017 ఫిబ్రవరిలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర అధికారులకు ఆ స్థలాన్ని చూపించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరిలో సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి కేంద్ర మానవ వనరుల శాఖకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కు అందించింది. తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. హెచ్‌సీయూ 2019లో రాష్ట్ర ఉన్నత విద్యామండలిని సంప్రదించగా.. తాత్కాలికంగా తరగతుల ప్రారంభం కోసం ములుగు మండలంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. ఒకేచోట 500 ఎకరాల స్థలం సమకూర్చే వీలు లేకపోవడంతో ములుగు–జాకారం ప్రాంతంలోని మేడారం జాతర సమీపంలో గట్టమ్మ గుట్ట వద్ద 335 ఎకరాలను, పసర వద్ద 165 ఎకరాలను ఇస్తామని చెప్పింది. కానీ తరగతులు ప్రారంభించడానికి కనీసం 50 ఎకరాల స్థలంలో నిర్మాణాలు ఉండాలని.. అంతేగాకుండా వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమి మొత్తాన్ని ఒకేచోట కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ అంశాలపైనే కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇన్నాళ్లూ పేచీ కొనసాగింది. అయితే ఇప్పుడు వర్సిటీని మంజూరు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించడంతో.. సదరు స్థలంలో అవసరమైన విద్యుత్, రోడ్లు, నీళ్లు వంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉండనుంది. గిరిజనులకు రిజర్వేషన్లు ఎంతశాతం? దేశవ్యాప్తంగా గిరిజనులకు 7.5శాతం రిజర్వేషన్ అమల్లో ఉండగా.. తెలంగాణలో 10శాతంగా ఉంది. మరి గిరిజన వర్సిటీలో గిరిజనులకు ఎంత మేర రిజర్వేషన్ ఇస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. సూపర్ న్యూమరరీ విధానంలో సీట్లు పెంచి అయినా గిరిజన విద్యార్థులకే ఎక్కువ సీట్లు కేటాయించాలన్న డిమాండ్ ఉంది. ఏపీలో ఉన్నట్టుగానే..! ఏపీలో ఇప్పటికే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నడుస్తున్న నేపథ్యంలో.. అక్కడ అమలు చేస్తున్న కోర్సులనే ములుగు వర్సిటీలోనూ అమలు చేసే అవకాశం ఉందని యూజీసీకి చెందిన ఓ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. సాధారణ కోర్సుల తోపాటు ప్రత్యేకంగా గిరిజన కళలు, సంస్కృతిపైనా కోర్సులను అందుబాటులోకి తీసుకురావొచ్చని పేర్కొన్నారు. గిరిజనులకు ఎక్కువ సీట్లు ఇస్తేనే ప్రయోజనం ఇన్నాళ్లకైనా గిరిజన వర్సిటీ ఇవ్వడం సంతోషకరం. కానీ దీనివల్ల గిరిజనులకు ఒరిగేదేమీ లేదు. గిరిజనుల పేరిట యూనివర్సిటీ పెట్టి వారికి కేవలం ఏడున్నర శాతం రిజర్వేషన్ ఇవ్వడమేంటి? అదేం గిరిజన యూనివర్సిటీ? ఇదేమిటని కేంద్రాన్ని అడిగితే యూజీసీ నిబంధనలు అంటున్నారు. అలాంటప్పుడు జనరల్ యూనివర్సిటీ పెట్టుకోండి అని చెప్పా.. గిరిజనులకు అత్యధికంగా సీట్లు ఇచ్చినప్పుడే అది గిరిజన వర్సిటీ అవుతుంది. దీనిపై కేంద్రమంత్రికి మళ్లీ లేఖరాస్తా. – అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎంపీ, కేయూసీ రిటైర్డు ప్రొఫెసర్ -
డోలీ కష్టాలకు చెక్
శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల్లో డోలీ మోతలు ఇకపై కనిపించవని ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ కృషితో గిరిశిఖర గ్రామాలకు చేరుకునేందుకు మార్గం సుగమమవుతోందని చెప్పారు. కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయని, దీనికి విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు వేస్తున్న రోడ్డే నిదర్శనమని అన్నారు. ధారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామాలైన దారపర్తి, పల్లపుదుంగాడ గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పాలనను వివరించారు. పథకాల అందుతున్న తీరును గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. పల్లపుదుంగాడలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ 2019లో ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చినపుడు ప్రాణాల మీదికి వస్తే డోలీ మోతలే దిక్కు అని, దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు రోడ్డు వేయమని గిరిజనులు అడిగారన్నారు. ఆ మేరకు అటవీశాఖ అనుమతులు సాధించి దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు ఐదు కిలోమీటర్ల రోడ్డును రూ.4.50 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. పల్లపుదుంగాడ నుంచి దారపర్తి వరకూ మరో 6 కి.మీ మేర రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. జల్‌జీవన్ మిషన్ కింద పల్లపుదుంగాడలో ప్రతి ఇంటికి కుళాయిలు వేసి తాగునీరు ఇచ్చామని.. పొర్లు, కురిడి, గూనపాడు, ధారపర్తి గ్రామాల్లో కుళాయిలు వేసే పనులు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం ధారపర్తి ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పినిశెట్టి వెంకటరమణ, స్టేట్ ఫోక్ అకాడమీ డైరెక్టర్ వి.రాంబాబు పాల్గొన్నారు. -
గోండు సామ్రాజ్యంలో అక్కా చెల్లెళ్ళ పోటీ?.. ఆదివాసీలు ఎటువైపు!
ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి బంధువులు పోటీ పడటం కొత్తేమీ కాదు. అన్నదమ్ములు, అక్కా తమ్ముళ్ళ ఇలా రక్త సంబంధీకులు కూడా చాలా చోట్ల పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కారు, హస్తం పార్టీల నుంచి అక్కా చెల్లెళ్ళ పోటీ పడబోతున్నారు. ఆ ఇద్దరు ఎవరో..యుద్ధంలో గెలిచేదెవరో చూద్దాం. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్ చేతిలో ఉన్న ఈ సీటు దక్కించుకోవడానికి అధికార బీఆర్ఎస్.. సీటు నిలుపుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆరు నూరైనా ఆసిఫాబాద్ దక్కించుకోవాల్సిందేనని కేడర్‌ను సిద్ధం చేస్తున్నాయి. ఆదివాసీలైన గోండుల ప్రాబల్యం ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది వారే. అన్ని పార్టీలు ఆ వర్గం నుంచే అభ్యర్థిని బరిలో దించడం సర్వసాధారణం. అందుకే గోండుల సామ్రాజ్యంలో గులాబీ జెండాను ఎగురవేయడానికి అసిపాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోవ లక్ష్మి 2014లో ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోవ లక్ష్మి తప్పకుండా విజయం సాధిస్తారని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. ఇదే సమయంలో కోవ లక్ష్మిని కట్టడి చేయడానికి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. కోవ లక్ష్మి మీద ఆమె స్వంత చెల్లెలిని బరిలో దించే ఆలోచన చేస్తోంది. ఆసిఫాబాద్ సర్పంచ్‌గా పనిచేసిన మర్సకోల సరస్వతిని అభ్యర్థిగా నిలిపేందుకు పావులు కదుపుతోంది. కోవ లక్ష్మి, మర్సకోల సరస్వతి మాజీ రాష్ట్ర మంత్రి కోట్నాక భీమ్రావు బిడ్డలు కావడం విశేషం. గులాబీ పార్టీ అక్క లక్ష్మికి టిక్కెట్ ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి చెల్లెలు సరస్వతి దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సరస్వతి అయితేనే కోవ లక్ష్మికి సరైన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్నారు. అయితే కోవలక్ష్మి ఒకసారి ఎమ్మెల్యేగా, ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత ఉందని టాక్ నడుస్తోంది. అక్క మీద ఉన్న వ్యతిరేకతే తనకు అనుకూలంగా మారుతుందని సరస్వతి భావిస్తున్నారట. అక్కడ మీద తాను తప్పకుండా విజయం సాధిస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి గతంలో ఒకసారి తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రజల్లో పలుకుబడి లేని చెల్లెలు తనకు పోటీయే కాదంటున్నారు కోవ లక్ష్మి. తాను సునాయసంగా విజయం సాధిస్తానని చెబుతున్నారు. ఆసిఫాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న అక్కా చెల్లెళ్ళ యుద్ధంలో ఆదివాసీలు ఎటువైపు నిలుస్తారో చూడాలి. -
దళితులు, గిరిజనులకు సముచిత గౌరవం
సాగర్: గత ప్రభుత్వాలకు దళితులు, ఓబీసీలు, గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చేవారని ప్రధాని మోదీ ఆరోపించారు. దళిత బస్తీలు, నిరుపేదలుండే ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో నీటి వసతి కూడా ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వం మాత్రం దళితులు, ఓబీసీలు, గిరిజనులకు సముచిత గౌరవం ఇచ్చిందని, జల్ జీవన్ మిషన్ ద్వారా వారి ఇళ్లలోకే మంచినీరు అందిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బడ్తుమా గ్రామంలో శనివారం ప్రధాని సంత్ రవిదాస్ జ్ఞాపకార్థం 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో నిర్మించే ఆలయం–స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బినా–కోటా డబుల్ లేన్ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయడంతోపాటు వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధానాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. -
వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరట..!
ముంచంగిపుట్టు: కూరగాయల్లో ఎన్నో రకాలు ఉంటాయి. మన్యంలో అయితే మరెన్నో రకాల కూరగాయలు లభ్యమవుతాయి. వెదురు నుంచి తీసిన కూరని ఎప్పుడైన వండుకొని తిని ఉంటారా? వినడానికే ఎంతో కొత్తగా ఉన్న మన్యం వాసులు మాత్రం వెదురు నుంచి తీసిన చిగురును కూర వండుకొని తింటారు. దీనిని మన్యం వాసులు వెదురు కొమ్ములు, వెదురు కంజి అని కూడా పిలుస్తారు. కానీ వెదురు కంజి కూర టేస్టే వేరు. వెదురు కొమ్ములు సీజన్ మొదలైయింది. ప్రస్తుతం మన్యంలో మండల కేంద్రాలు, వారపు సంతల్లో వెదురు కంజి అమ్మకాలు హాట్ కేకుల్లా జరుగుతున్నాయి. అటవీ, కొండ ప్రాంతాల్లో ఉన్న వెదురు బొంగు నుంచి లేత వెదురును తీసి చిగురును సేకరిస్తారు. దానిని శుభ్రపరిచి ముక్కలుగా చేస్తారు. వాటిని సంతల్లో రూ.20 నుంచి రూ.50 లు వరకు వాటాలుగా విక్రయిస్తారు. వెదురు కంజిని రెండు రకాలుగా కూర తయారికి వినియోగిస్తారు. పచ్చి వెదురు కంజిని ఒక రకంగా కూర తయారు చేస్తారు. వెదురు కంజిని ఎండబెట్టి మరో విధంగా కూర తయారికీ వినియోగిస్తారు. పచ్చిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే కూర తయారు చేసుకోవాలి. ముఖ్యంగా కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు వెదురు కంజినీ బాగా కడుగుకోవాలని గిరిజనులు చెబుతున్నారు. ఎండబెట్టుకొని ఉంటే ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర తయారికి వినియోగించుకోవచ్చు. ఈ వెదురు కంజి కూరను మన్యం వాసులంతా చాలా ఇష్టంగా తింటారు. వెదురు కంజిని వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకాలుగా కూరును తయారు చేస్తారు. ఎన్నో ఉపయోగాలు వెదురు కంజి కూర తయారు చేసే ముందు రెండు, మూడు సార్లు నీటితో శుభ్రం చేస్తారు. అప్పుడు వెదురు కంజిలో ఉండే చేదుపోతుంది. బాగా ఉడకబెట్టి దాని కషయాన్ని తీసుకుంటారు. దీంతో రక్తం శుద్ధి అవుతుందని, శరీరానికి తక్షణ శక్షి అందుతుందని, జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు నులిపురుగులను నివారిస్తుందని గిరిజనులు చెబుతారు. వెదుర కంజి ద్రావణాన్ని మారుమూల గిరిజనులు పాము, తేలు కాటులకు ఔషధంగా సైతం వినియోగిస్తారు. వెదురు కంజి ఉపయోగాలెన్నో అని గిరిజనులు చెబుతారు. సంతల్లో జోరుగా అమ్మకాలు వారపు సంతల్లో వెదురు కొమ్ముల అమ్మకాలు బాగున్నాయి. కొమ్ముల వాటా రూ20, రూ.50 చొప్పున అమ్ముతున్నాము. గతంలో మా గిరిజన ప్రాంతానికి చెందిన వారే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి వచ్చి కూడా వెదురు కొమ్ములను కొనుగోలు చేస్తున్నారు. కొమ్ములను పచ్చిగాను, ఉడకబెట్టి విక్రయిస్తున్నాం. శనివారం ముంచంగిపుట్టు వారపు సంతలో కొమ్ములు తెచ్చిన గంటల వ్యవధిలోనే అమ్ముడు పోయాయి. – కె.దొణ, పెదతమ్మెంగుల గ్రామం, ముంచంగిపుట్టు మండలం రుచికరంగా వంటకాలు వెదురు కొమ్ములతో తయారుచేసిన వంటకాన్ని ఎక్కువగా గర్భిణులకు అందజేస్తారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. గిరిజన ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల శరీరానికి వెంటనే వేడి చేసే గుణం వెదురు కంజి కూరల్లో ఉంటుంది. వెదురు కొమ్ముల కూర రుచికరంగా ఉంటుంది. ఈ నాలుగు నెలలు మాత్రమే వెదురు కొమ్ములు లభ్యమవుతాయి.అడవీ, కొండ ప్రాంతాల్లో లేత వెదురు నుంచి వెదురు కొమ్ములను సేకరిస్తారు .వారపు సంతలో విక్రయిస్తారు. – రాధమ్మ, సుజనకోట గ్రామం, ముంచంగిపుట్టు మండలం (చదవండి: పూర్తిగా శాఖాహారిగా మారితే ప్రమాదమా? చనిపోతారా!) -
గిరిజనోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 34 తెగలకు చెందిన 27.39 లక్షల గిరిజనులు ఉన్నారు. 26 జిల్లాలకు గాను 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల (ఐటీడీఏ) పరిధిలో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు గిరిపుత్రుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచాయి. 2019–20 నుంచి 2023–24 వరకు ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం మొత్తం రూ.20,948.15 కోట్లు వెచ్చించింది. నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల్లో ప్రతి గిరిజనులకు రెండుకు మించిన పథకాల ద్వారా లబ్ధి కలిగింది. ప్రత్యక్షంగా (డీబీటీ), పరోక్షంగా (నాన్ డీబీటీ) ఇప్పటివరకు గిరిజనులకు రూ.14,712.08 కోట్ల ప్రయోజనం చేకూరింది. ఆదివాసీలకు ఇంత భారీస్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూరడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. వైద్య రంగానికి సంబంధించి.. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.746.30 కోట్లను మంజూరు చేసింది. రక్తహీనత కారణంగా బాలింతలు, శిశువులు మరణిస్తున్న విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ గిరిజన ప్రాంతాల్లో గిరి గోరుముద్ద, బాల సంజీవని, పోషకాహార బుట్ట వంటి ప్రత్యేక వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏజెన్సీలో 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (సీహెచ్‌డబ్ల్యూ)లకు 1995 నుంచి ఉన్న కేవలం రూ.400 జీతాన్ని రూ.4 వేలకు పెంచారు. నేడు సాలూరులో ఆదివాసీ దినోత్సవం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని బుధవారం సాలూరులో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ముఖ్య అతిథిగా హాజరవుతారు. 20 రకాల గిరిజన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యారంగంలో ఇలా.. రాష్ట్రవ్యాప్తంగా 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్ని నిర్వహిస్తూ.. 1,55,599 మంది విద్యార్థులకు వసతి, ఇతర సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.920.31 కోట్లు కేటాయించింది. నాడు–నేడు మొదటి దశలో రూ.140 కోట్లతో గిరిజన విద్యా సంస్థలను తీర్చిదిద్దింది. రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల భూమిని కేటాయించింది. ఉపాధి పరంగా.. అర్హులైన ప్రతి ఎస్టీ కుటుంబానికి కనీసం రెండు ఎకరాల భూమిని అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది. 2019 ఆగస్టు నుంచి 2,15,309 ఎకరాల విస్తీర్ణంలో 1,26,997 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను, 39,272 ఎకరాల విస్తీర్ణంలో 26,287 డీకేటీ పట్టాలను పంపిణీ చేసింది. ఈ భూముల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.రూ.3,796.39 కోట్లు కేటాయించారు. 3 వేలకు పైగా బోర్లు వేయడంతోపాటు 2.27 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, కాఫీ, మిరియాల సాగును అభివృద్ధి చేశారు. -
చీమల చట్నీ-గోంగూర, తింటారు నోరూర! తేడా వస్తే చీమల చికిత్స కూడా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గల్లీలో ఉండే చిన్న హోటల్లోనే పొద్దున ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా ఇంకా ఎన్నో వెరైటీ టిఫిన్లు దొరుకుతాయి. ఇక మధ్యాహ్నం అన్నం, రెండు మూడు రకాల కూరలు, పప్పు, చారు, పెరుగు ఇవన్నీ లేనిదే ముద్ద దిగదు. ఇక ఏ స్టార్ హోటల్‌కి వెళ్లినా ఏ దేశపు వంటకాలైనా ఆర్డర్‌చేస్తే చాలు టేబుల్‌పై హాజరు... ఇవీ మైదాన ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు. కానీ అడవుల్లో జీవించే ఆదివాసీలు ఏం తింటారు? సీజన్లో దొరికే గోంగూర, చింతపండు, మిరపకాయలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆహార సేకరణ కష్టంగా మారిన సమయంలో ఎర్రచీమలతో పచ్చడి నూరుకుని కూడా తింటుంటారు. అయితే మారిన పరిస్థితుల్లో విద్య, ఉద్యోగాల కోసం అడవుల నుంచి బయటపడుతున్న వారి ఆహారపు అలవాట్లలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు చోటు చేసుకుంటోంది. వలస ఆదివాసీలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలు రెండు దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు ఆశ్రయం ఇస్తున్నాయి. వలస ఆదివాసీల్లో అనేక తెగలు ఉండగా, వీరిలో 90 శాతం మంది రోడ్డు, నీళ్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా అటవీ ప్రాంత పల్లెల్లోనే ఉంటున్నారు. పోడు సాగు చేసుకోవడం, ఇంటి ఆవరణలోనే తినే ఆహార పదార్థాలను పండించుకోవడం వీరి జీవనశైలి. గోంగూర.. పండుగే.. వానాకాలంలో మొలకెత్తే గోంగూర ఆగస్టులో తినేందుకు అనువుగా ఎదుగుతాయి. ఆ సమయంలో ఆదివాసీలు గోంగూర పండుగ చేసుకుంటారు. చింతకాయలు అందుబాటులోకి వచ్చే వరకు గోంగూరే వీరి ప్రధాన ఆహారం. వానాకాలం ముగిసేలోగా అందుబాటులో ఉన్న గోంగూర ఎండబెట్టుకుని వేసవి వరకు వాడుకుంటారు. ఎండాకాలంలో చింతకాయలు రాగానే పచ్చడి చేసుకుంటారు. గోంగూరతో పాటు పచ్చకూర (చెంచలి), బొద్దుకూర, నాగళి, టిక్కల్ అనే ఆకుకూరలు, కొన్ని రకాలైన దుంపలను కూడా వండుకుంటారు. కారం కావాలంటే.. మొదట్లో అటవీ ఫలసాయం తప్ప వ్యవసాయం తెలియని ఆదివాసీలను కారం రుచి మైమరపించింది. గోంగూర, చింతకాయ పచ్చడికి అవసరమైన మిరపకాయలు అపురూపమైన ఆహారంగా మారింది. దీంతో మిరపకాయల కోసమే ఎత్తయిన కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ.. వాగులు, వంకలు దాటుతూ రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి గోదావరి తీరానికి చేరుకునేవారు. ప్రారంభంలో భద్రాద్రి ఏజెన్సీలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను దొంగిలించుకెళ్లేవారట. ఆ తర్వాత ఇక్కడ పనిచేసి, కూలీగా మిర్చి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక పోడు సాగు కోసం ఆదివాసీలు అడవిని నరికేటప్పుడు ఇప్ప, మద్ది, తునికి, చింత, పాల చెట్లు తారసపడితే ముట్టుకోరు. ఇక ఇప్ప చెట్టునయితే దైవంతో సమానంగా కొలుస్తారు. చీమలు... ఆహారంగానే కాదు.. వైద్యానికి కూడా ఆకు రాలే కాలం మొదలైన తర్వాత వసంతం వచ్చే వరకు ఆదివాసీలకు ఆహార సేకరణ కష్టంగా మారుతుంది. ఈ సమయంలో చీమలను ఆహారంగా తీసుకుంటారు. సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలను వాటి గుడ్లను సేకరిస్తారు. అనంతరం ఉప్పు, కారం, టమాటా కలిసి రోట్లో వేసి రుబ్బుతారు. ఇలా తయారు చేసిన చట్నీని బస్తరియాగా పిలుస్తారు. ఈ పచ్చడిని వారు ఇష్టంగా తింటారు. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫామిక్ యాసిడ్ ఉండడమేకాక ప్రొటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండి జ్వరం, జలుబు, దగ్గు, కంటి సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు. అలాగే ఒంట్లో నలతగా ఉన్నా, తలనొప్పి, జ్వరంగా అనిపించినా చీమల చికిత్సకే మొగ్గు చూపుతారు. చెవులు, ముక్కుల ద్వారా చీమలు శరీరంలోకి వెళ్లకుండా ముఖాన్ని వస్త్రంతో కప్పేసుకుని చీమల గూడును ఒంటిపై జల్లుకుంటారు. వందల కొద్ది చీమలు శరీరాన్ని కుడుతుండగా.. మంట పుట్టి క్షణాల్లో ఒళ్లంతా చెమటలు వస్తాయి. రెండు, మూడు నిమిషాలు ఉన్న తర్వాత చీమలు తీసేస్తారు. తద్వారా ఒంట్లో ఉన్న విష పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లి ఉపశమనం కలుగుతుందని వారి నమ్మకం. కాగా, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలనే పండించి ఆహారంగా తీసుకునేవీరు క్రమంగా బియ్యానికి అలవాటు అవుతున్నారు. వ్యవసాయంలో ఎరువులు సైతం ఉపయోగిస్తున్నారు. గతంలో ఆవు పాలు తీసుకోని వీరు.. ఇప్పుడిప్పుడే పాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ గిరిజన పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు నెమ్మదిగా మైదాన ప్రాంత ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నారు. చీమల చట్నీకి జీఐ ట్యాగ్.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఆదివాసీలు తమ ఆహారంలో చీమల చట్నీకి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఎర్రచీమలతో తయారు చేసే ఈ పచ్చడి ఔషధపరంగానూ ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. చీమల చట్నీకి జీఐ టాగ్ సైతం లభించడం గమనార్హం. జొన్నలు, సజ్జలు తింటే తొందరగా ఆకలి వేయదు ఇంతకు ముందు జొన్నలు, సజ్జలు తినేవాళ్లం. పొద్దున తిని అడవికి వెళితే రాత్రి వరకు ఆకలి అనేది ఉండకపోయేది. కానీ బియ్యంతో చేసిన అన్నం అయితే రోజుకు రెండుసార్లు తినాల్సి వస్తోంది. ఇది తప్పితే బియ్యంతో చేసిన అన్నం బాగుంది. – మామిడి అరవయ్య (కూలీ, రెడ్డిగూడెం ఎస్టీ కాలనీ, పాల్వంచ మండలం) -
సహపంక్తి భోజనం.. రాత్రి బస
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆదివాసీలను ఆకట్టుకునే దిశలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు బుధవారం పార్టీ రాష్ట్ర నాయకత్వం తండాలు, గూడేల్లో బస చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని రెండు లేదా మూడు తండాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. ‘గిరిజన ఆదివాసీ సంరక్షణ హస్తం’పేరుతో చేపట్టనున్న ఈ కార్య క్రమం ద్వారా రాష్ట్రంలోని ఆదివాసీలు, గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే మేలు, చేపట్టబోయే ఇతర కార్యక్రమాల గురించి నేతలు వివరించనున్నారు. నివాళి.. నృత్య ప్రదర్శనలు.. నిద్ర బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కొమురం భీం, సేవాలాల్ మహరాజ్, ఇందిరాగాంధీ చిత్రపటాలకు నేతలు పూలమాలలు సమర్పించి నివాళులర్పిస్తారు. తర్వాత గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు, కళాకారులతో నృత్యాలు, పాటలు పాడించడం లాంటివి నిర్వహించనున్నారు. తండాలు, గూడేల్లోని స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడంతో పాటు అక్కడి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. భోజనాల అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదా తండా నాయకుడి ఇంట్లో నిద్రించనున్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులు, ఆదివాసీల వెన్నంటే ఉంటుందని చెప్పడమే ఈ కార్యక్రమ లక్ష్యమని, తండాలు, గూడేలను అక్కున చేర్చుకోవడం ద్వారా అక్కడి గిరిజనులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. 13న గాంధీభవన్‌లో సభ: మల్లురవి యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) వల్ల ఆదివాసీ గిరిజనులకు తీరని నష్టం జరుగుతుందని, ఆదివాసీలను నిర్మూలించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి చెప్పారు. ఈ నెల 13న ఆదివాసీలు, గిరిజనులతో వారి సమస్యలపై గాందీభవన్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు టి.బెల్లయ్య నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని అన్నారు. -
విశాఖ ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్ల పంపిణీ
తాటిచెట్లపాలెం: మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 45వ వార్డు తాటిచెట్లపాలెం దరి ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్లను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారుల్లో ఎక్కువమంది గిరిజనులున్నారు. వైఎస్సార్సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోకు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వారితో కలిసి టిడ్కో బ్లాకులను ప్రారంభించారు. ఇక్కడ నిర్మించిన మొత్తం 288 ఇళ్లలో మొదటి విడతగా 134 ఇళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు పట్టాలు, ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు డబ్బు కట్టించుకుని ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యాయని చెప్పారు. వారి నగదును వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాపసు ఇచ్చి, లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తోందని తెలిపారు. ఈ కాలనీలో చిన్నచిన్న పనులున్నా.. వర్షాకాలం సమీపించడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడకూడదని త్వరితగతిన ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే దసరాకు వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి సమక్షంలో లబ్ధిదారులందరికీ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి మిగిలిన పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భారీ ఫ్లెక్సీకి కాలనీవాసులతో కలిసి కె.కె.రాజు, హనోకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీశ్, ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాసరావు, జీవీఎంసీ జోన్–5 జోనల్ కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పాపునాయుడు, టిడ్కో ఎస్ఈ డి.ఎన్.మూర్తి, కార్పొరేటర్లు కంటిపాము కామేశ్వరి, బి.గంగారాం, వార్డు అధ్యక్షుడు పైడి రమణ తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్య విద్యను ప్రోత్సహించేలా...!
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 అమ లులోకి వచ్చి జూలై 29 నాటికి మూడేళ్లవుతోంది. మునుపటి విద్యా వ్యవస్థ లలోని భారీ అంతరాలను గుర్తించి నాణ్యమైన విద్యా వకాశాలు అందరికీ సమా నంగా అందించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రీస్కూల్ విద్య నుండి ఆరో తర గతి వరకు మాతృభాష బోధనా మాధ్యమంగాఉండాలని ఎన్ఈపీ ఉద్దేశం. అదేవిధంగా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం కరిక్యులం, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ కింద చేసిన సవరణలు ఏకకాలంలో రెండు పూర్తికాల విద్యా కార్యక్రమాలను కొనసాగించడాన్ని అనుమతిస్తున్నాయి. భౌతిక, ఆన్లైన్ మోడ్‌తో సహా, 4–సంవత్సరాల అండర్ గ్రాడ్యు యేట్ పాఠ్యాంశాలను ప్రోత్సహించడం వంటివి ఉన్నత విద్యలోని ముఖ్యాంశాలు. ఎన్ఈపీ–2020 నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. అలానే తల్లిదండ్రులు, తోటివారి ఒత్తిడి నుండి విద్యార్థికి ఉపశమనం కలిగించడానికి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఒక సంస్థ నుండి మరొక సంస్థకు, ఒక కోర్సు నుండి మరొక దానికి మారడానికి అవకాశం కల్పిస్తోంది. నైపుణ్య విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఎన్ఈపీ నేరుగా విద్యా సంస్థలతో పరి శ్రమలకు సంబంధాలు ఏర్పరచి చదువుకునే సమయంలోనే సమాంతరంగా వారికి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి జీవితంలో స్థిరపడే అవకాశాలను కల్పిస్తోంది. వినూత్న బోధనా పద్ధతులపై శిక్షణ అందించడం, ఐసీటీ సాధనాల విస్తృత వినియోగం వంటివి కూడా ఎన్ఈపీలో ముఖ్యమైన అంశాలు. ఎన్ఈపీ అధునాతన పాఠ్యాంశాలు, బోధనపై దృష్టి కేంద్రీకరిస్తూనే విద్యార్థుల సంభావిత అవ గాహన, విమర్శనాత్మక ఆలోచనలనూ ప్రోత్సహి స్తోంది. యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్, పెర్ఫార్మింగ్, విజువల్ ఆర్ట్స్‌తో పాటు పాఠ్యాంశాలను పునరుద్ధ రించడం, సమగ్ర పరచడం, గిరిజన జీవనశైలిని అర్థం చేసుకోవడానికి గిరిజన గ్రామానికి వెళ్లి జీవించడం, ‘డూయీంగ్ వైల్ లెర్నింగ్’ వంటి విద్యార్థి–కేంద్రీకృత పాఠ్యాంశాలు ఇందుకు నిద ర్శనం. ఎన్ఈపీ–2020 కింద విద్యార్థుల అంతర్లీన అవసరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్) వంటి వివిధ ప్రోగ్రామ్‌లు ప్రారంభించబడ్డాయి. ఎన్ఈపీ–2020 ఈక్విటీ, ఇన్‌క్లూజన్ అలాగే భాగస్వామ్య పాలన సిద్ధాంతాలపై ఆధారపడింది. అందువల్ల దివ్యాంగులు, మహిళలు, ఎల్జీ బీటీక్యూలు, ఎస్సీ, ఎస్టీలు, పీవీటీజీలు, డీఎన్టీలు వంటి వారికి సాధికారత కల్పించడం, వారికి సమానమైన అవకాశాలను అందిస్తూ అందు బాటులో ఉండటం ఇందులోని చాలా ముఖ్యమైన అంశం. గిరిజనుల కోసం ‘ఏకలవ్య మోడల్ రెసిడె న్షియల్ పాఠశాల’లను బలోపేతం చేయడం, కొత్త ఉపాధ్యాయుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వ డం, కొత్త ఈఎమ్ఆర్ఎస్ ప్రారంభించడం, 10–15 చిన్న పాఠశాలలను కలుపుతూ ‘వన్ స్కూల్ కాంప్లెక్స్’ పునర్నిర్మాణం వంటివి ఇందు కోసం తీసుకున్న కొన్ని చర్యలు. అంతర్జాతీయీ కరణ, సహకారం, భాగస్వామ్య పద్ధతిలో పథకాలను బలోపేతం చేయడం, విదేశీ విశ్వ విద్యాలయాల ఆఫ్–షోర్ క్యాంపస్‌లను స్థాపించడానికి ఆహ్వానించడం, అలాగే దేశంలో డిజిటల్ ఈ–విశ్వవిద్యాలయాల స్థాపన... ఎన్ఈపీ అమలు ప్రారంభించిన తర్వాత తీసు కున్న మరికొన్ని కార్యక్రమాలు. ఎన్ఈపీ ‘ల్యాబ్ టు ల్యాండ్’, ‘ల్యాండ్ టు ల్యాబ్’ను ప్రమోట్ చేస్తుంది. మొత్తం మీద ఎన్ఈపీ–2020 గత మూడు సంవత్సరాల్లో అనేక స్పష్టమైన ఫలితాలను సాధించగలిగింది. బహుళ ప్రవేశ–నిష్క్రమణ విధానం ద్వారా ఇది విద్యార్థులకు నేర్చుకునే సౌకర్యవంత మైన మార్గాన్ని అందించింది. ఆ విధంగా ఎన్ఈపీ–2020 భారతీయ విద్యా వ్యవస్థ చరిత్రలో నిజమైన గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్, ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (ఎన్ఈపీ ప్రారంభమై మూడేళ్లు) -
గిరిజనుల అభ్యున్నతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, న్యూఢిల్లీ: గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ 5వ రాజ్యాంగ సవరణ బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఎక్కడైనా గిరిజనులకు మేలు చేకూర్చే ఎలాంటి చర్యలనైనా వైఎస్సార్సీపీ సమర్థిస్తుందని, సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. అంతకుముందు సభలో టీడీపీ సభ్యుడు చేసిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత గిరిజనుల అభ్యున్నతి కోసం చేపట్టిన పలు చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని గిరిజన నివాసిత ప్రాంతంలోనే నెలకొల్పేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. ఇందుకు ప్రధానమంత్రి మోదీని ఒప్పించారని గుర్తుచేశారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన వందలాది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిందన్నారు. గిరిజన యూనివర్సిటీ భవనాలు, క్యాంపస్ నిర్మాణం ప్రారంభమయ్యాయని చెప్పారు. అనాదిగా వైద్య, ఆరోగ్య సౌకర్యాలకు నోచుకోని గిరిజనుల కోసం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో కూడిన వైద్యకళాశాల నిర్మాణం చేపట్టారన్నారు. పోడు వ్యవసాయమే గిరిజనుల జీవనాధారం అయినందున అటవీహక్కుల గుర్తింపు చట్టం కింద పోడుసాగు చేసే భూములకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. 1.30 లక్షల ఎకరాల్లో 55 వేలమంది గిరిజనులకు పట్టాల పంపిణీ జరిగిందని తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ గిరిజనుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక పోడుసాగు చేసే గిరిజనులకు తిరిగి పట్టాల పంపిణీ ప్రారంభించారని చెప్పారు. ఎస్టీ జాబితాలోకివాల్మికి, బోయ కులాలను చేర్చాలి మైదాన ప్రాంతంలో ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనుకబడిన వాల్మికి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ ఏడాది మార్చిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని విజయసాయిరెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డి కింద ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారని, దాని ప్రకారం ఎస్టీ జాబితాలోని కులాలకు 7 శాతం రిజర్వేషన్ ఇచ్చారని చెప్పారు. కొత్తగా ఏవైనా కులాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్ పరిమితి పెంచాల్సి ఉంటుంది కాబట్టి అప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న కులాలకు ఎలాంటి అన్యాయం జరగదని తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని వైఎస్సార్సీపీ తొలినుంచి డిమాండు చేస్తోందని చెప్పారు. లోక్‌సభ నుంచి మొదలుపెట్టి స్థానిక సంస్థల వరకు మహిళలకు 50 శాతం స్థానాలను రిజర్వు చేయడం వలన గిరిజనులకు వారికి కేటాయించిన 7 శాతం రిజర్వేషన్ కాకుండా అదనంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుందని తెలిపారు. కనకమేడల ప్రసంగానికి ఖండన అంతకుముందు చర్చలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఏపీలో స్థితిగతులంటూ పేర్కొనడాన్ని విజయసాయిరెడ్డి ఖండించారు. బిల్లు గురించి మాత్రమే మాట్లాడాలని ఉప సభాపతి హరివంశ్ పలుసార్లు చెప్పినప్పటికీ రవీంద్రకుమార్ తన ప్రసంగం తీరు మార్చుకోలేదు. చివరికి ప్రసంగం తీరు మార్చుకోకుంటే మరో సభ్యుడికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని ఉప సభాపతి స్పష్టం చేశారు. బిల్లుయేతర అంశాలు పరిశీలించి వాటిని రికార్డుల నుంచి తొలగిసా్తమని విజయసాయిరెడ్డికి హామీ ఇచ్చారు. -
గూడేనికి కొత్త గుర్తింపు
యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి: ‘‘అది.. రెండు నెలల క్రితం దాకా ఊరూ పేరూ లేని ఓ మూరుమూల గూడెం! అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం బావికాడిపల్లె పంచాయతీ శివారులో 40 మంది యానాదులు దశాబ్దాలుగా గుడిసెల్లో జీవిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మారలేదు! ప్రభుత్వ పథకాలేవీ దరి చేరలేదు! ఇప్పుడు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చొరవతో ఆ ప్రాంతంలో అభివృద్ధి కుసుమాలు వికసిస్తున్నాయి. తుప్పలను తొలగించి పారిశుధ్య పనులు చేపట్టడంతో ఇన్నాళ్లూ రవాణా సదుపాయం లేని ప్రాంతానికి దారి ఏర్పడింది. తాగునీటి కోసం మంచినీటి బోరు కూడా తవ్వారు. ఏ ఆధారంలేని వారికి ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది. దీంతో ఓటు హక్కు దక్కింది. రేషన్ కార్డులూ రెడీ అవుతున్నాయి. ఇదంతా ‘జగనన్న ఎస్టీ కాలనీ’లో కేవలం రెండు నెలల్లోనే జరిగిన పురోగతి. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో మంచి ఫలితాలు సాకారమవుతున్నాయి. వేర్వేరు కమిషన్ల ఏర్పాటు.. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి భిన్న స్థితిగతులు, సమస్యలు ఉంటాయి. గతంలో వారిని ఒకే కమిషన్ పరిధిలో కొనసాగించడంతో సత్వర న్యాయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కుంభ రవిబాబు 2021 మార్చి 4న నియమితులయ్యారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్‌గా న్యాయవాది, దళిత ఉద్యమ నాయకుడైన మారుమూడి విక్టర్ ప్రసాద్‌ను 2021 ఆగస్టు 24న ప్రభుత్వం నియమించింది. ఈ రెండు కమిషన్లు ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీల సమస్యలపై స్పందిస్తూ న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎస్టీ కమిషన్ పనితీరులో మైలు రాళ్లు.. ► కలెక్టరేట్లలో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ఎస్టీ కమిషన్ ఆరా తీస్తోంది. ► విశ్వవిద్యాలయాలను సందర్శించి విద్యార్థులు, పరిశోధకుల అడ్మిషన్లతోపాటు టీచింగ్, నాన్ టీచింగ్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వానికి నివేదించింది. ► శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ► ప్రభుత్వ శాఖల్లో నియామకాలు, పదోన్నతులు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, గిరిజనులకు భూమి పట్టాల (ఆర్ఓఎఫ్ఆర్, డీ పట్టా) పంపిణీపై ప్రభుత్వానికి నివేదించింది. ► గిరిజనులపై అఘాయిత్యాలు, భూ సమస్యలు, సర్వీసు వ్యవహారాలపై విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించింది. ► గిరిజన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ► కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండ, మాన్సింగ్ తండా, మత్రియ తండా తదితర తండాల్లో పర్యటించి కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదించింది. కృష్ణా నది నుంచి పైపులైను ద్వారా నేరుగా మంచినీరు అందించేలా ప్రతిపాదించింది. మారుమూల ప్రాంతాలకూ ప్రయోజనం సీఎం జగన్ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను నియమించి గిరిజనులకు ఎంతో మేలు చేశారు. గిరిజనులకు ఎక్కడ సమస్య తలెత్తినా కమిషన్ అక్కడికి వెళుతోంది. సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు సైతం విద్య, వైద్యం, సంక్షేమ పథకాలను అందించేలా సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. –వడిత్యా శంకర్ నాయక్, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు నీటి తిప్పలు తీర్చారు గతంలో మా ప్రాంతానికి కనీసం మంచినీటి సదుపాయం కూడా ఉండేది కాదు. దూరంగా ఉన్న తోటల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్లం. పనికి వెళితేనే అక్కడి రైతులు నీరు ఇచ్చేవారు. అధికారులు మా గ్రామాన్ని సందర్శించి బోరు వేయడంతో నీటి తిప్పలు తీరాయి. –ఎం.సరోజమ్మ, జగనన్న ఎస్టీ కాలనీ, బావికాడపల్లె గ్రామం తుప్పలు తొలగించి రహదారి సౌకర్యం మార్గమే లేని మా ప్రాంతానికి తుప్పలు తొలగించి రహదారి సౌకర్యం కల్పించారు. త్వరలో పక్కా రోడ్డు వేస్తామన్నారు. పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య పనులు చేశారు. బడికెళ్లే పిల్లల కోసం ఆటో ఏర్పాటు చేశారు. మాకు ఆధార్, ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు రేషన్ కార్డులు, ఇళ్లు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. –టి.నాగరాజు, జగనన్న ఎస్టీ కాలనీ, బావికాడపల్లె గ్రామం జగనన్న ఎస్టీ కాలనీగా నామకరణం గతంలో యానాదుల కాలనీకి పేరు కూడా లేదు. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు జగనన్న ఎస్టీ కాలనీగా బోర్డు ఏర్పాటు చేశాం. వారికి అవసరమైన వసతులు కల్పించడంతోపాటు సమస్యలు పరిష్కరించేలా శ్రద్ధ వహిస్తున్నాం. –గంగాధర్, బావికాడపల్లె పంచాయతీ కార్యదర్శి బాక్స్‌లో హైలెట్ చేయగలరు ► జగనన్న ఎస్టీ కాలనీలో యానాదుల సంఖ్య 40 ► గతంలో ఇద్దరికి మాత్రమే ఆధార్ ఉండగా ప్రత్యేక క్యాంపుతో 30 మందికి ఆధార్ కార్డులిచ్చారు. ► ఇప్పటివరకు ఎవరికీ ఓట్లు లేవు. తాజాగా 21 మందిని (10 మంది మహిళలు, 11 మంది పురుషులు)కి ఓటర్లుగా నమోదు చేశారు. ► ఆధార్ కార్డులు రావడంతో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేశారు. ► పెన్షన్లు కూడా అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ► ఐదేళ్ల లోపు పిల్లలకు పుట్టిన తేదీ సర్టిఫికెట్ నమోదు చేసి ముగ్గురిని బడిలో చేర్చారు. -
‘పోడు’ పట్టాదారుల్లో అనర్హులెందరు?
సాక్షి, హైదరాబాద్: పోడుభూముల్లో సాగు చేసు కుంటున్న గిరిజనులకు పట్టా పుస్తకాల పంపిణీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 1,51,146 మంది పోడు రైతులను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... గత నెల 27 నుంచి పట్టా పుస్తకా ల పంపిణీని ప్రారంభించింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రానికి 1,46,183 మంది పోడు రైతులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేశారు. అంటే 96.71 శాతం విజయవంతంగా పూర్తి చేశారు. మరో 4,963 మందికి ఒకట్రెండు రోజుల్లో పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు పట్టాపుస్తకాలు పొందిన వారిలో పలు వురు అనర్హులు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. అటవీభూమిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికే పోడు పట్టాకు అర్హతగా ప్రభు త్వం ప్రాథమిక నిబంధనను పెట్టింది. అయితే పట్టాలు పొందిన వారిలో పలువురు అటవీ భూమి సాగుపైనే కాకుండా ఇతరత్రా వ్యాపకాలున్నాయంటూ క్షేత్రస్థాయిలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై విచారణ చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. పునఃపరిశీలన రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో పోడు భూముల సాగుకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలనకు గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో నాలుగు అంచెల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హతలను ఖరారు చేశారు. ఎనిమిది నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. దరఖాస్తు పరిశీలన సమయంలో అర్జీదారుడు గిరిజనుడా? కాదా? అనే అంశాన్ని పరిశీలించిన అధికారులు... సదరు అర్జీదారుడు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నాడా? ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడా? లేక అటవీభూమిని మాత్రమే సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాడా? అనే కోణంలో పరిశీలన చేయలేదు. దీంతో పోడు అర్హుల్లో పలువురు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నట్లు వెలుగు చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంపిణీ చేసిన దరఖాస్తులను, పట్టా పుస్తకాలు పొందిన వారి వివరాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈమేరకు సంబంధిత 26 జిల్లాల కలెక్టర్లను పునఃపరిశీలించాలని ఆదేశించింది. మరోవైపు నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి పట్టాలు దక్కినట్లు వార్తలు రావడంతో గిరిజన సంక్షేమ శాఖ ఆ రెండు జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని గిరిజన శాఖ పేర్కొంది. 9 జిల్లాల్లో పూర్తి భద్రాద్రి కొత్తగుడెం, నిర్మల్, ములుగు, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి, నారాయణపేట్ జిల్లాల్లో వందశాతం లక్ష్యం పూర్తయింది. మిగతా జిల్లాల్లో లక్ష్యసాధన దాదాపు పూర్తయింది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 84 మంది అర్హులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 19 మంది అర్హులు ఉండగా... ఒక్కరికీ పట్టా ఇవ్వకపోవడం గమనార్హం. -
గిరిజనులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఆ కేసులు రద్దు!
సాక్షి, కొమురం భీం అసిఫాబాద్: అసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు పోడు భూముల పట్టాలను సీఎం విడుదల చేశారు. లక్షన్నర మంది గిరిజనులకు 4 లక్షల 6 వేల ఎకరాల పట్టాలు పంపిణీ చేశారు. పోడు భూములకు రైతుబంధు నిధులు విడుదల చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.. గిరిజన మహిళల పేరు మీదే పోడు భూముల పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. పోడు భూములపై ఉన్న గతంలోని కేసులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చిన తరువాత కేసులు ఉండటం సరికాదని అన్నారు. ఈ మేరకు వేదిక మీదే డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. రైతు బంధు కోసం దాదాపు రూ. 24 కోట్లు నిధుల కేటాయించినట్లు చెప్పారు. గిరిజన రైతుల పల్లెలకు త్రీ-ఫేజ్ కరెంట్ అందించాలని పేర్కొన్నారు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణనే అని పునరుద్ఘాటించారు. అసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీ కలలో కూడా ఊహించి ఉండరని అన్నారు. అంతకముందు మధ్యాహ్నం రెండు గంటలకు ఆసిఫాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ రిబ్బన్ కట్ చేసి పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. చదవండి: వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి: ఈటల కౌంటర్! -
డబుల్ పేరిట డబ్బులు దండుకుని
సాక్షి, మహబూబాబాద్/ ఇల్లందు/ గూడూరు: ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు, గిరిజనుల అమాయకత్వం, పేదరికాన్ని ఆసరా చేసుకుని స్వచ్ఛంద సంస్థ ముసుగులో తక్కువ ధరకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని వారి నుంచి రూ.20 కోట్ల మేర డబ్బులు దండుకున్నారు. ఇళ్లు కట్టేస్తున్నామని ఐరన్, సిమెంట్ పంపిణీ చేసి ఉడాయించేశారు. ఇంటిసామగ్రి తెస్తామని చెప్పి వెళ్లిన వారు రెండేళ్లుగా పత్తా లేకపోవడంతో బాధితులు చివరికి పోలీసుల్ని ఆశ్రయించగా అసలు విషయం బయటకొచ్చింది. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థ పేరుతో వచ్చి... పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి హోలీవర్డ్ సొసైటీ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ 2020లో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో కొంతమంది ఏజెంట్లను నియమించుకుంది. కేవలం రూ.4,50,000లకే 693 చదరపు అడుగుల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏజెంట్లను ఏజెన్సీ ప్రాంతాల్లోకి పంపించి ప్రచారం చేయించింది. వీరి మాటల్ని నమ్మేందుకుగాను పలుచోట్ల స్వచ్ఛంద సంస్థకు చెందిన అనుచరుల ఇళ్లను చూపించేవారు. తాము నిర్మించబోయే ఇళ్లకు 120 గజాల స్థలం ఉంటే చాలని, మొదటి కిస్తీగా రూ.1,65,000 చెల్లిస్తే సరిపోతుందని ప్రచారం చేయడంతో వీరిని నమ్మి డబ్బులు కట్టేందుకు మూడు జిల్లాల నుంచి గిరిజనులు ముందుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15వేల నుంచి రూ.1,80,000 వరకు కట్టించుకున్నారు. ఇలా డబ్బులు చేతికిరాగానే ఇళ్లు కట్టేస్తున్నామని చెబుతూ కొంతమందికి ఐరన్, సిమెంట్ తెచ్చి పిల్లర్లు వేసి మిగతా వారిని కూడా నమ్మించారు. దీంతో మిగిలిన వారూ డబ్బులు చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ విధంగా మూడు జిల్లాల్లో మొత్తం రూ.20 కోట్ల మేర వసూళ్లు చేశారు. రెండో కిస్తీ కట్టాకే మిగతా నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పి సంస్థకు చెందిన ఏజెంట్లను ఉద్యోగాల నుంచి తీసేశారు. తర్వాత సంస్థ అడ్రస్‌ను కూడా మార్చేశారు. సంస్థకు చెందిన ఫోన్లను కూడా స్విచ్ఛాఫ్ చేసేశారు. రెండేళ్లుగా వీరంతా పత్తా లేకుండాపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన కొంతమంది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిగిలినవారు కూడా ఆయా జిల్లాల్లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు. -
గిరిజనులకు అదనపు ఉపాధి
-
కేంద్రం గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలి
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గిరిజనులపై కపట ప్రేమను చూపిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ఫలాలను కేంద్రం నిలువరిస్తోందని ఆమె మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10 % రిజర్వేషన్లు దక్కాలన్నారు. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10% రిజర్వేషన్లను అమలు చేస్తోందని, కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మాత్రం ఈ రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన జాతీయ బంజారా మీట్–2023 కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల కోసం ఏం చేసిందో స్పష్టం చేయాలన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన నూతన పార్లమెంటు భవనం గిరిజనులదేనని అన్నారు. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రతిష్టాత్మకంగా గిరిజన, ఆదివాసీభవన్‌లను ఏర్పాటు చేసిందన్నా రు. ఢిల్లీలో సంత్ సేవాలాల్ భవనాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలన్నారు. 15 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బంజారాల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ రామచంద్రునాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. సదస్సులో చేసిన ముఖ్య తీర్మానాలు.. ♦ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో బంజారా భాషను చేర్చాలి. ♦ దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలను గిరిజనులుగా గుర్తించి ఎస్టీ రిజర్వేషన్లను వర్తింపచేయాలి. ♦ పార్లమెంటు ప్రాంగణంలో బాబా లఖిషా బంజారా పేరిట బంజారా భవన్‌ను నిర్మించాలి. ♦ పార్లమెంట్ ప్రాంగణంలో బాబా లఖిషా బంజారా విగ్రహం ఏర్పాటు చేయాలి. ♦ తెలంగాణలో గిరిజన వర్సిటీని ప్రారంభించాలి. ♦ ప్రైవేటు రంగంలోనూ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలి. ♦ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో గిరిజనులకు ప్రాధాన్యం కల్పించాలి. -
మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఇంఫాల్: మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా మైతీలు, గిరిజనులకు మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడికిపోయిన ఇంఫాల్‌లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. దీంతో ప్రభుత్వం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను రంగంలోకి దింపింది. కొన్ని జిల్లాల్లో నిరసనకారులకి, భద్రతా దళాలకు మధ్య కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాల్లో నిరసనకారుల్ని అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం కేంద్రం మరో 20 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ దళాల్ని పంపింది. మరోవైపు రైల్వే శాఖ ముందు జాగ్రత్త చర్యగా ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లను రద్దు చేసింది. -
మణిపూర్‌లో భీకర హింస
ఇంఫాల్: మణిపూర్‌లో హింస ప్రజ్వరిల్లింది. తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం అగ్గి రాజేసింది. గిరిజనులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేశారు. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్ జవాన్లను ప్రభుత్వం గురువారం రంగంలోకి దించింది. మరో 14 పటాలాల సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మైతీ వర్గం అధికంగా ఉన్న దక్షిణ ఇంఫాల్, కాక్చింగ్, థౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతోపాటు గిరిజన ప్రాబల్యం కలిగిన చురాచాంద్‌పూర్, కాంగ్పోక్పీ, తెంగౌన్పాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. చురాచాంద్‌పూర్, మంత్రిపుఖ్రీ, లాంఫెల్, కొయిరంగీ, సుగ్ను తదితర ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ జవాన్లు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. సమస్మాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) సిబ్బంది మోహరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రమంతటా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటిదాకా 9,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఘర్షణలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ వలసల వల్లే.. మైతీలు ప్రధానంగా మణిపూర్ లోయలో నివసిస్తున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమకు ఎస్టీ హోదా కల్పించాలని వారు కోరుతున్నారు. వలసదారుల నుంచి గిరిజనులకు చట్టప్రకారం కొన్ని రక్షణలు ఉన్నాయి. మైతీలకు ఎస్టీ హోదాపై రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని గత నెలలో మణిపూర్ హైకోర్టు సూచించింది. దీనిపై గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అపార్థం వల్లే అనర్థం: సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అమాయకులు మృతి చెందడం, ఆస్తులు ధ్వంసం కావడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం అపార్థం వల్లే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. మణిపూర్‌లో హింసాకాండపై పొరుగు రాష్ట్రం మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథాంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. గిరిజన సంఘీభావ యాత్ర గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ఏటీఎస్యూఎం) ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా మైతీలకు, గిరిజనులకు నడుమ ఘర్షణ మొదలయ్యింది. రాత్రికల్లా తీవ్రస్థాయికి చేరింది. హింస చోటుచేసుకుంది. తొలుత చురాచాంద్‌పూర్ జిల్లాలో మొదలైన ఘర్షణ, హింసాకాండ క్రమంగా రాష్ట్రమంతటికీ విస్తరించింది. -
TS: జీసీసీలో కారుణ్య నియామకాలపై గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ)లో కారుణ్య నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం కరుణించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదుల సంఖ్యలో ఉద్యోగులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. అయితే వరుసగా మూడేళ్లు లాభాలతో కొనసాగినప్పుడే కారుణ్య నియామకాలు చేపట్టాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత మూడేళ్ల నుంచి లాభాలు గడించినప్పటికీ కోవిడ్–19 కారణంగా ఆ తర్వాత నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థ లాభాల బాటలో ఉంది. ఈ నేపథ్యంలో జీసీసీ కారుణ్య నియామకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ఈ ఫైలుపై సీఎం సంతకం చేశారు. దీంతో కారుణ్య నియామకాల ఆర్జీలకు అతి త్వరలో మోక్షం కలగనుంది. 330 మంది ఉద్యోగులతో.. తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటీవ్ కార్పొరేషన్(టీఎస్జీసీసీ) పరిధిలో 330 మంది ఉద్యోగులు శాశ్వత, తాత్కాలిక పద్దతిలో పనిచేస్తున్నారు. మూడు డివిజినల్ కార్యాలయాలు, 18 సొసైటీలు, 311 రెగ్యులర్ డిపోలు, 158 సబ్ డిపోలున్నాయి. మరో 125 స్వయం సహాయక సంఘాలతోనూ జీసీసీ అనుసంధానమై కార్యకలాపాలు సాగిస్తోంది. జీసీసీ ద్వారా తేనె, ఇప్పపువ్వు, గమ్, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులతోపాటు సబ్బులు, షాంపూలు, కారం, పసుపు, కందిపప్పు, ఇతర ఆహార మసాలాలు, సుగంధ ద్రవ్య పొడి(పౌడర్)లు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలకు వంట సరుకులన్నీ దాదాపు జీసీసీ ద్వారానే సరఫరా చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు జీసీసీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పటికీ తయారీ యూనిట్లు విశాఖ కేంద్రంగా నడిచేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ప్రతి యూనిట్ కొత్తగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో జీసీసీకి ఏటా కేటాయింపులు జరిపినప్పటికీ రాబడి అంతంత మాత్రంగా ఉండేది. ఇప్పుడు లాభాల బాటలో కార్పొరేషన్ ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. టీఎస్జీసీసీ పరిధిలో ఎనిమిదేళ్లలో 30 ఉద్యోగులు వివిధ కారణాలతో మరణించారు. ఇందుకు సంబంధించి క్లెయిమ్స్ పూర్తి చేసినప్పటికీ కారుణ్య నియామకాలకు అర్హులైన వారసులు 30 మంది దరఖాస్తులు సమర్పించారు. తాజాగా వీరి దరఖాస్తులు పరిశీలించి కారుణ్య నియామకాలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. -
విప్పపువ్వు.. గిరిజనుల కల్పతరువు
బుట్టాయగూడెం: ఆదివాసీ గిరిపుత్రులకు అక్కడ లభించే ఉత్పత్తులు జీవనాధారం కల్పిస్తున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు సేకరించి వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతుంటారు. కొందరు అడవిలో ఉండే వెదురుతో బుట్టలు, చాటలు వంటివి నైపుణ్యంలో తయారు చేసి విక్రయిస్తారు. మరి కొందరు తేనె సేకరణ, తునికాకు, అడ్డాకుతో పాటు పలు రకాల ఉత్పత్తులు సేకరిస్తారు. కాలానికి అనుగుణంగా ఉపాధిని ఇచ్చే వృక్షాల్లో ఇప్పచెట్లు ప్రధానమైనవి. వేసవిలో వీటి ద్వారా గిరిజనులు ఉపాధి పొందడానికి అనేక అవసరాలు ఉన్నాయి. విప్పపువ్వును గిరిజనులు తెల్లవారుజామునే అడవిలోకి వెళ్ళి సేకరిస్తారు. తెల్లవారుజామున చెట్లపై నుండి కిందపడిన ఇప్పపువ్వును మధ్యాహ్నానికి సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడతారు. మూడు నెలల పాటు ఉపాధి మన్యం ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు విప్పచెట్ల ద్వారా మూడు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. ఖరీఫ్, రబీ పనులు ముగిసే సమయానికి విప్ప చెట్లు విరగపూస్తాయి. వీటి పువ్వులు గాలికి నేలరాలుతుంటాయి. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రి పండ్లు సేకరించి ఇంటికి తీసుకువస్తుంటారు. వీటిని సేకరించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విక్రయించి ఉపాధి పొందుతుంటారు. విప్పపువ్వుతో ఔషధాలు తయారీ గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వును జీసీసీల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పపువ్వులో ఎన్నెన్నో ఔషధ విలువలు ఉండడంతో ఈ పువ్వును ఔషధాల తయారీకి విక్రయిస్తారు. ఇప్పపువ్వు నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. విప్పపువ్వుతో దంతాలను శుభ్రం చేసుకోవడంతో దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యా«ధులుకు ఔషధంగా పనిచేస్తుంది. సచ్ఛమైన విప్పపువ్వుతో తయారు చేసిన సారాను సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని గిరిజనులు అంటున్నారు. వైద్యశాస్త్రంలోనూ ప్రాధాన్యం వైద్యశాస్త్రంలోనూ విప్పపువ్వు ప్రాధాన్యతను సంపాదించుకుంది. అడవిలో లభించే ఇప్పపువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నో పోషక విలువలున్నట్లు శాస్త్రీయంగా నిరూపించారు. భారత శాస్త్రీయ సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయంతో 1999లో నిర్వహించిన పరిశోధనలో ఎండిన ఇప్పపువ్వుల నుంచి పంచదారను తయారు చేసి జామ్, కేక్‌లు, చాక్లెట్లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. విప్పపువ్వు ఎక్కువకాలం నిల్వ ఉండడానికి మధ్యమధ్యలో ఎండిన వేప ఆకును వేస్తే నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు. పశ్చిమ మన్యంలో 20 వేలకు పైగా విప్ప చెట్లు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో ఇప్పచెట్లు దాదాపుగా 20 వేలకు పైగా ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ ఇప్పచెట్లు ఆధికంగా ఉన్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 5 వేల చెట్ల వరకూ అటవీప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో నాటి వాటిని పెంచుతున్నారు. గిరిజనులు సేకరించిన ఈ ఇప్పపువ్వులను జీసీసీ అధికారులే కాదు బయటి నుండి అనేక మంది వ్యాపారులు కూడా కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. ఇప్పపువ్వులో పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు గిరిజనులు చెప్తున్నారు. ప్రస్తుతం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలంలో కొండరెడ్లు ఈ పువ్వులను సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. 5 వేల ఇప్ప మొక్కలు నాటాం పశ్చిమ అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా పెరిగిన ఇప్పచెట్లే కాకుండా అడవిలో ఉండే ఖాళీ ప్రదేశాల్లో సుమారు 5 వేల వరకూ విప్పమొక్కలను నాటి పెంచుతున్నాం. ఇప్పచెట్ల నుంచి వచ్చే పువ్వుల ద్వారా గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలాల్లో కొండరెడ్లు ప్రస్తుతం విప్పపువ్వు సేకరణలో ఉపాధి పొందుతున్నారు. – దావీదురాజు నాయుడు,అటవీ శాఖ డీఆర్ఓ, పోలవరం జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి మా గ్రామ సమీపంలోని అడవుల్లో విప్పపువ్వుతోపాటు పలు ఉత్పత్తులు లభిస్తున్నాయి. విప్పపువ్వుతోపాటు పలు ఉత్పత్తులను గతంలో కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం జీసీసీ అధికారులు ఇప్పపువ్వు కొనుగోలు చెయ్యడంలేదు. ప్రస్తుతం ఇప్పపువ్వు సీజన్ ప్రారంభమవుతుంది. జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నాం. – కెచ్చెల బాలిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు– మోదేలు -
'మీసం లేని రొయ్య' అడవిలో ఉంటుందయ్యా..
దట్టమైన అడవుల్లో ఈత దుబ్బుల మాటున లభ్యమయ్యే అడవి రొయ్యల కోసం ఆదివాసీలు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు. వాటి కోసం వాగులు.. వంకలు.. కొండలు.. గుట్టలు దాటుకుని దట్టమైన అరణ్యాల్లోకి వెళ్తారు. ఈత దుబ్బుల్లో కనిపించగానే ఒడిసిపట్టి బుట్టలో వేసుకుంటారు. ఇంటికి తెచ్చి కమ్మగా వండుకుని ఆబగా తింటారు. ఏడాదికి మూడు నెలలు మాత్రమే లభించే ఈ జీవులను బొడ్డెంగులు అని పిలుస్తారు. ఆదివాసీలు మాత్రం వీటిని అడవి రొయ్యలుగా ముద్దుగా పిలుచుకుంటారు. బొడ్డెంగులకు రొయ్యల మాదిరిగా మీసాలుండవు కానీ.. సేమ్ టు సేమ్ రొయ్యల్ని పోలి ఉంటాయి. సాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మన్యంలో దొరికే బొడ్డెంగులు (అడవి రొయ్యలు) గిరిజనులకు ఎంతో ప్రీతి. వాటిని మన్యం ప్రజలు లొట్టలేసుకుని మరీ తింటారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ మాత్రమే ఇవి లభిస్తాయి. గిరిజన గ్రామాలను ఆనుకుని ఉండే అటవీ ప్రాంతంలో ఈత దుబ్బులున్న చోట ఇవి పెరుగుతాయి. ఈత మొదలును తవ్వితే మట్టిలో రొయ్యల మాదిరిగా ఉండే పురుగులు లభిస్తాయి. వీటి శరీరం పూర్తిగా కొవ్వుతో కూడి ఉంటుంది. వీటిని రొయ్యల వేపుడు, ఇగురు తరహా కూరలతోపాటు ఇతర వంటకాలను తయారు చేస్తుంటారు గిరిజనులు. ఎలా సేకరిస్తారంటే.. ఆదివాసీ యువకులు అటవీ ప్రాంతంలో చాలా శ్రమకోర్చి వీటిని సేకరిస్తుంటారు. సేకరించిన తర్వాత ఒక రాత్రి మాత్రమే ఇవి బతికి ఉంటాయి. ఈత చెట్టు కాపు పూర్తయ్యాక చెట్టు ఎండి అంతరించిపోయే క్రమంలో వాటి అడుగు భాగాన బొడ్డెంగులు పుట్టుకొస్తాయని ఆదివాసీలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వీటి సేకరణ గిరిజన యువతకు ఉపాధి వనరుగా మారింది. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోని పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో మాత్రమే ఈత చెట్ల పెంపకం ఉంది. మంగళవారం పాడేరు మార్కెట్‌కు బతికి ఉన్న బొడ్డెంగుల్ని గిరిజనులు తీసుకు రాగా.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. 30 బొడ్డెంగుల్ని రూ.100 చొప్పున విక్రయించగా, గంటలో ఎగరేసుకుపోయారు. బొడ్డెంగుల్ని విక్రయిస్తున్న గిరిజనులు రక్తహీనతకు తగ్గించే మందులా.. రక్తహీనత ఉన్న వారు బొడ్డెంగులను వేపుడు లేదా కూర వండుకుని తింటే ఆ సమస్య తగ్గుతుందని గిరిజనులు చెబుతుంటారు. బొడ్డెంగులు రక్తపుష్టిని కలగజేస్తాయని వైద్యులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉండే వీటిని సహజసిద్ధంగా దొరికే పౌష్టికాహారంగా అభివర్ణిస్తుంటారు. ఇవి దొరికిన రోజున బంధువులను పిలిచి మరీ గిరిజనులు విందులు ఏర్పాటు చేస్తుంటారు. జీలుగ కల్లు, మద్యం తాగేవారు నంజు (స్టఫ్)గా వీటిని ఆస్వాదిస్తారు. మంచి ఆదాయం వీటి కోసం దాదాపు వారం రోజులుగా తిరిగాం. పెదబయలు మండలం మారుమూల కుంతర్ల ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈత దుబ్బుల్లో సేకరించాం. తెచ్చిన గంటలోనే అమ్ముడయిపోయాయి. మంచి ఆదాయం వచ్చింది. వీటి వేపుడు ముందు రొయ్యల వేపుడు దిగదుడుపే. – బోనంగి కుమార్, కుంతర్ల, ఏఎస్సార్ మన్యం జిల్లా -
గిరి బిడ్డలపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ
సాక్షి,అమరావతి : గిరిజనులపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారని, వారి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. వివిధ పథకాల కింద రూ.15,589.38 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర గిరిజన విభాగం సమావేశం నిర్వహించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ షెడ్యూల్ తెగల జీవన ప్రమాణాల పురోగతితోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. 1.38 లక్షల గిరిజన కుటుంబాలకు 3 లక్షల ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేశారని గుర్తు చేశారు. తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చారని, ఎస్టీల అభివృద్ధికి కేటాయించిన నిధులను ఖర్చు చేయడానికి సబ్‌ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగించారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు మేరాజోత్ హనుమంత్ నాయక్, మత్స్యరాస వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బలహీన గిరిజనానికి బలమైన ఊతం
సాక్షి, అమరావతి: దేశంలో అంతరించే ప్రమాద జాబితాలో ఉన్న 75 గిరిజన తెగలను ప్రత్యేక బలహీనమైన గిరిజన సమూహాలు (పీవీటీజీ)గా గుర్తించి ఆయా తెగల సంరక్షణతోపాటు వారికి బలమైన ఊతమిచ్చేలా చర్యలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యాచరణ ప్రకటించడం మరింత కలిసివచ్చే అంశంగా మారనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్యంలో రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి, అభివృద్ధికి చేపట్టిన చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఎస్టీ కాంపొనెంట్ (ఉప ప్రణాళిక) ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12,487.48 కోట్లను గిరిజనుల కోసం ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం మూడున్నరేళ్లలోనే రూ.15,589.38 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేటాయించిన మొత్తం కంటే ప్రస్తుత ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో రూ.3,101.90 కోట్లు అదనంగా ఖర్చు చేయడం రికార్డు. అనేక చర్యలతో.. కాగా, గిరిజన తెగల సంక్షేమానికి సైతం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. నవరత్నాలతోపాటు వారికి అనేక విధాలుగా నేరుగా లబ్ధి చేకూరుస్తోంది. గిరిజనులకు భూమి హక్కు(ఆర్వోఎఫ్ఆర్, డీకేటీ పట్టాలు) ఇవ్వడంలో దేశంలోనే వైస్సార్సీపీ ప్రభుత్వానిదే అగ్రస్థానం కావడం గమనార్హం. రాష్ట్రంలో గడచిన 12 ఏళ్లలో 2.34 లక్షల ఎకరాలను పట్టాలుగా (దీనిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పంచిందే ఎక్కువ) పంపిణీ జరిగింది. కాగా, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 2.48,887 లక్షల ఎకరాలను పంచి రికార్డు సృష్టించింది. ప్రత్యేక గిరిజన విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల, ఇంజనీరింగ్ కాలేజీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటివి నెలకొల్పి ఎస్టీలకు సాంకేతిక, వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చింది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌కు ఊతమిస్తోంది. అరకు కాఫీ, నల్లమల నన్నారి వంటి అటవీ ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ను కల్పించి గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రపతి ఆదేశాలతో.. అంతరించే ప్రమాదమున్న జాతుల సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. దేశంలో అంతరించే ప్రమాద జాబితాలో ఉన్న 75 గిరిజన తెగల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరింత ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దేశవ్యాప్తంగా 75 పీవీటీజీల స్థితిగతులపై క్షేత్రస్థాయి అధికారులు అధ్యయనం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో 9 పీవీటీజీల జీనవ పరిస్థితులపై పరిశీలన జరుగుతోంది. గత నెల 27 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం సహకారంతో కేంద్ర బృందాలు క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టాయి. పాడేరు సమీకత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని మూడు ప్రాంతాల్లో కేంద్ర బృందాలు డొంగ్రీయా కోండ్, బోండా పోర్జా, పరంగి పోర్జా తెగల జీవన పరిస్థితిని, వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించాయి. వారి జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆ బృందాలు కేంద్రానికి నివేదించనున్నాయి. మూడేళ్ల మిషన్ దేశంలో బలహీన గిరిజన సమూహాల (పీవీటీజీ) సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మూడేళ్లపాటు ప్రత్యేక మిషన్(కార్యాచరణ)ను అమలు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం మూడేళ్లలో రూ.15 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను బడ్జెట్లో ప్రతిపాదించడం గమనార్హం. ఈ పథకంలో దేశంలోని 75 గిరిజన తెగలకు ప్రత్యేక లబ్ధి చేకూర్చనున్నారు. తద్వారా ఏపీలోని గిరిజన తెగలకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మరింత మేలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. -
కొమరంభీం జిల్లా జైనూర్ లో హైమన్ ధర్ఫ్ 36వ వర్థంతి సభ
-
ఆదివాసుల హృదయ దీపాలు
తూర్పు గోదావరి జిల్లా కొండ అడవుల్లో డాక్టర్ ఊర్మిల పింగ్లె తీసిన ఇక్కడ కనిపిస్తున్న ఫొటో... హైమండార్ఫ్ దంపతులు కలిసి ఉన్న దాదాపు తుది చిత్రం. పదవీ ఉద్యోగాలు లేకపోయినా మానవ శాస్త్రవేత్తగా తనతో యాభై ఏళ్లుగా వెన్నెముకలా ఉండి అలుపెరగకుండా కలిసి పని చేసిన బెట్టీ సాహచర్యం గురించి లోతుగా తలపోస్తున్నట్టు క్రిస్టోఫ్ హైమండార్ఫ్ కనిపిస్తున్నారు ఈ చిత్రంలో. ఆ తర్వాత కొద్ది రోజులకే హైదరాబాద్‌లో 11 జనవరి 1987 నాడు బెట్టీ అని అందరూ అభిమానంగా పిలిచిన ఎలిజబెత్ హైమండార్ఫ్ గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు విడిచారు. ఆమె మరణం క్రిస్టోఫ్ హైమండార్ఫ్‌ను బాగా కుంగదీసింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకే ఆయన కూడా తనువు చాలించారు. భారత్ ఈశాన్య ప్రాంతంలోని కొన్యక్ నాగాలు, ఆపతానీలు, హైదరాబాద్ నిజాం సంస్థానంలోని చెంచులు, కొండ రెడ్లు, రాజ గోండులు, ఇంకా నేపాల్ షేర్పాలు, మధ్య ప్రదేశ్ భిల్లులు.. ఈ జాతుల గురించి క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ చేసిన పరిశోధనలు ఇప్పటికీ ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అయితే వీటన్నింటిలో ఆదిలాబాద్ రాజ్ గోండులతో ఆయన 1940ల్లో ఏర్పరచుకొని, జీవన పర్యంతం కొనసాగించిన బాంధవ్యానికి సాటి రాగలిగి నది ఏదీ లేదు. మార్లవాయి గ్రామంలో రాజ్ గోండుల మధ్య వారిలో ఒకరిగా ఒక గుడిసెలో జీవిస్తూ వారి సంప్రదాయాలు, పురాణాలను, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సాధికారికంగా నమోదు చేస్తూ, ఆదివాసీ జీవన దృక్పథ సార్వజనీనమైన విలువను గుర్తుండి పోయేలా ఆవిష్కరించగలిగారు. హైదరాబాద్ సంస్థానంలోని ఆదివాసీలను దాదాపు మూడు సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన తరువాత 1945లో, ఆయన విశ్లేషణల నాణ్యతను చూసిన నిజాం ప్రభుత్వం ఆయనను గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది. సంస్థానంలోని ఆదివాసీల అభ్యున్నతికి కీలకమైన నూతన ప్రణాళికల రూపకల్పన, వాటి అమలు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ పదవిలో ఉంటూ కుమ్రం భీం తిరుగుబాటు, వీర మరణం తరువాత పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి, తీవ్రమైన నిరాదరణకు గురవుతున్న ఆదిలాబాద్ జిల్లా గోండుల కోసం తొలి పాఠశాలలు ఏర్పరిచి, భూములు లేని వేలాది ఆదివాసీ కుటుంబాలకు దాదాపు 160 వేల ఎకరాల భూమిని పట్టాలతో సహా అందించి వారి సమగ్ర పునరుజ్జీవనానికి గొప్ప పునాది వేయగలిగారు హైమండార్ఫ్. 1950లో లండన్‌కు వెళ్లి పోయిన తర్వాత కూడా తరచుగా ఆదిలాబాద్‌ను సందర్శిస్తూ గోండుల బాగోగుల గురించి తెలుసుకుంటూ ఉండేవారు హైమండార్ఫ్ దంపతులు. 1960ల తరువాత బయటి నుండి వచ్చిన చొరబాటుదారుల దురాక్రమణకు ఆదివాసీల భూములు గురికావడం, వారి పరిస్థితి మళ్లీ హీనం కావడం హైమండార్ఫ్ దంపతులను ఎంతో బాధించేది. తమను ఎంతో ఆదరించి, అభిమానించిన గోండుల సన్నిధిలో మార్లవాయి లోనే తమ సమాధులు ఉండాలని హైమండార్ఫ్ దంపతులు కోరుకున్నారు. బెట్టి మరణం తర్వాత, ఆమె అస్థికలను మార్లవాయికి తీసుకు వచ్చి, ప్రేమాభిమానాలతో తరలివచ్చిన వేలాది ఆదివాసీల సమక్షంలో మార్లవాయి గ్రామం పక్కనే ఖననం చేశారు. క్రిస్టోఫ్ అవశేషాలను కూడా ఆయన మరణించిన చాలా ఏళ్ళ తర్వాత బెట్టి సమాధి పక్కనే పూడ్చి మరో సమాధి నిర్మింపజేశారు. బెట్టి వర్ధంతినే హైమండార్ఫ్ దంపతుల ఉమ్మడి సంస్మరణ దినంగా ప్రతి ఏడాది మార్లవాయి గ్రామంలో 11 జనవరి నాడు నిర్వహిస్తూ వస్తున్నారు. గత కొన్నే ళ్లుగా ఇది పెద్ద కార్యక్రమంగా వికసిస్తూ వస్తున్నది. మార్లవాయి గ్రామ గుసాడి నృత్య కళాకారుడు కనక రాజుకు పద్మశ్రీ గౌరవం దక్కడం దీనికి తోడయ్యింది. తమ జాతి సంస్కృతిని అధ్యయనం చేసి, తమ అభ్యున్నతి కోసం పరితపించిన మానవ శాస్త్రవేత్త దంపతులకు ఆ జాతి నుంచి లభించిన ఇటువంటి ఆరాధనకు సాటిరాగల ఉదాహరణ మరెక్కడా లేదేమో! 1980వ దశకం నుండి చివరిదాకా హైమండార్ఫ్ దంపతులను బాగా ఎరిగిన, క్రిస్టోఫ్‌తో కలిసి రెండు పరిశోధన గ్రంథాలను కూడా రాసిన ఊర్మిళ పింగ్లె, బెట్టి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు: ‘తనను కలిసిన వారందరి పట్లా గొప్ప అనురాగం చూపుతూ... గొప్ప చమత్కారం, హాస్య దృష్టిలతో జీవ చైతన్యం ఉట్టిపడుతూ ఉండేది అమె. ఆదివాసీ సమాజాల పరిస్థితి పట్ల ఎనలేని సానుభూతితో వారి అభ్యున్నతి కోసం అంతటా వాదిస్తూ ఉండేది. తన భర్తకు నిజమైన ఆత్మబంధువుగా నిలిచిన వ్యక్తి!’ (క్లిక్ చేయండి: అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం) - సుమనస్పతి రెడ్డి ఆకాశవాణి విశ్రాంత అధికారి (జనవరి 11 హైమండార్ఫ్ దంపతుల సంస్మరణ దినం) -
ఆదివాసీల అభ్యున్నతే లక్ష్యంగా పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీలు, అత్యంత వెనుకబడిన గిరిజన తెగల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివరించారు. గురువారం రాష్ట్రపతి నిలయంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో ద్రౌపదీ ముర్ము ముందు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పది గిరిజన సమూహాలైన లంబాడా, కోయ, గోండు, ఎరుకల, పర్దాన్, ఆందులు, కొలాములు, చెంచు, తోటి ఇంకా కొండారెడ్డి తెగల కోసం నాలుగు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో షెడ్యూల్ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయని, వీటిలో 3,146 గిరిజన గ్రామపంచాయతీలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలోని 8.5 లక్షల మంది గిరిజన, ఆదివాసీ రైతులకు ఏటా రెండు విడతలురైతుబంధు పథకం కింద ఆర్థిక సాయా న్ని చేస్తున్నామని, ఇప్పటివరకు ఈ వర్గాలకు రూ.7,349 కోట్ల రూపాయలను వ్యవసాయ పెట్టుబడి సహాయంగా అందించామని మంత్రి.. రాష్ట్ర పతి ముర్ముకు తెలిపారు. అలాగే గిరిజన ఆవాసా లకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నామని, గిరిజనుల ఆరోగ్య వస తుల కోసం కొత్తగా 437 సబ్ సెంటర్లు, 32 బర్త్ వెయిటింగ్ హాళ్లు, 7 డయాగ్నొస్టిక్ హబ్‌లను నిర్మించామన్నా రు. ఆదిమ గిరిజన తెగల ప్రాంతాలలో 31 పాఠశాలలు, కొలాముల సమూహం కోసం ప్రత్యేకించి ప్రైమరీ పాఠశాలలు, సైనిక్ పాఠశాల, న్యాయ విద్య, ఫైన్ఆర్ట్స్ కోసం ప్రత్యేక కళాశాలు ఏర్పాటు చేశామని, దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పంచాయతీలకు పక్కా భవనాలు, రహదారుల సౌకర్యాలు.. చెంచు, కొలాములు, కొండారెడ్డి తెగలకు అటవీ ఉత్పత్తులపై ప్రభుత్వ సహకారం అందుతోందని మంత్రి సత్యవతి తెలిపారు. అలాగే 440 ఆదిమ జాతి గిరిజన గ్రామాలలో రూ.60 కోట్లతో అంతర్గత రోడ్ల సదుపాయం, 53 ఆదిమ జాతి ఆవాసాలలో రూ.2.39 కోట్లతో సౌర విద్యుదీకరణ చేపట్టి 443 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూర్చామన్నారు. 3,467 గిరిజన గ్రామాలకు రూ.221 కోట్లతో త్రీఫేజ్ విద్యుదీకరణ కల్పించామని, గిరిజన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు మంజూరు చేశామని, రూ.3,275 కోట్లతో 5,162 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని, 16,375 ఆదిమ జాతి పిల్లలు, గర్భిణిలు, బాలింతలకు, కౌమార దశలో ఉన్న అమ్మాయిలకు గిరి పోషణ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి సత్యవతి వివరించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు సేవచేస్తే దేవుణ్ణి పూజించినట్లే
అరకులోయ రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సింహాచలం: గిరిజనులకు సేవ చేయడం భగవంతుని ఆరాధించడంతో సమానమని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. అరకులోయలోని ఎన్టీఆర్ మైదానంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం శంకరాచార్య గిరి సందర్శన మహోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వామీజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణతో కలిసి ఉచిత మెగా వైద్యశిబిరం ప్రారంభించారు. 500 మంది పేద వృద్ధులకు దుప్పట్లు, 500మంది భక్తులకు భగవద్గీత గ్రంథాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు కల్మషం లేనివారని, వారికి సేవచేయాలని ఉద్బోధించారు. అందరూ దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో భగవంతుని కొలుస్తారు కానీ ఇక్కడ గిరిజన ప్రజలు ప్రకృతిని, చెట్లను దైవంగా ఆరాధిస్తారన్నారు. ఆంజనేయస్వామి గిరిజనుడే అని, అడవి బిడ్డలంతా అంజనీపుత్రుని వారసులేనని తెలిపారు. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మతమార్పిడులు చేస్తున్నారని, వారిని కట్టడి చేసేందుకే క్రిస్మస్ రోజున భగవద్గీతలను పంపిణీ చేశామన్నారు. గిరిజన ప్రాంతంలో దేవాలయల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామన్నారు. పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్య అందించేందుకు త్వరలోనే పాఠశాలలు ఏర్పాటుచేస్తామన్నారు. ఇక రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాలు ఏర్పడటం ఆనందంగా ఉందని, ఏపీలో మాత్రమే ఇలా గిరిజనులకు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటయ్యాయని స్వామీజీ అన్నారు. చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో ప్రజలను దైవ మార్గంలో నడిపించేందుకు కృషిచేయడంతోపాటు విద్య, వైద్య రంగాల్లో సేవలందిస్తున్న విశాఖ శారద పీఠానికి రుణపడి ఉంటామన్నారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి జగదీష్‌బాబు, ఎంపీపీ ఉషారాణి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
Nature Farming: సేంద్రియ సారం.. పుడమికి జీవం
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో వ్యవసాయం సాహసోపేతం. ఇక్కడ సాగుకు వర్షాలు, కొండవాగుల నీరే ఆధారం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ప్రకృతి సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులు కూడా సేంద్రియ విధానాలపై ఆసక్తి చూపుతూ సత్ఫలితాలు పొందుతున్నారు. కేఆర్‌పురం ఐటీడీఏ, ప్రకృతి వ్యవసాయ అధికారుల చొరవతో మూడేళ్లుగా గిరిజన రైతుల్లో ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం పెరిగింది. గిరిజన ప్రాంతంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కూరగాయలను అత్యధికంగా సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 15 వేల మందికి పైగా రైతులు సుమారు 9,400 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీటిలో 2,100 ఎకరాల్లో చిరుధాన్యాలు, 7 వేల ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో కూరగాయలు వంటివి పండిస్తున్నారు. ప్రోత్సాహం ఇలా.. గిరిజన ప్రాంతంలోని సన్న, చిన్నకారు గిరిజన రైతులను ప్రకృతి సాగు వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విత్తనం నాటిన నుంచి ఎరువులు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తక్కువ మోతాదులో ఎరువులు వాడుతున్న వారు, సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్న వారిని ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. ఇద్దరు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను, ఒక క్లస్టర్ కార్యకలాపాల నిర్వాహకుడు, ఎంపీఈఓ, సీఆర్పీలను నియమించి రైతులకు సాంకేతిక సలహాలను అందిస్తున్నారు. క్లస్టర్ పరిధిలో ఐదు పురుగు మందుల అవశేషాలు లేని ఎరువుల దుకాణాన్ని ఏర్పాటుచేశారు. కొందరు రైతులకు ఈ దుకాణాల బాధ్యతలను అప్పగించారు. ఇందుకు రూ.50 వేల రాయితీలపై రుణాలను కూడా అందించారు. వీరు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూనే దుకాణాల ద్వారా రైతులకు కషాయాలను, సేంద్రియ ఎరువులను తయారు చేసి అవసరమైన సామగ్రిని విక్రయించేలా ఏర్పాటుచేశారు. అలాగే 30 మంది రైతులకు ఆవుల కొనుగోలుకు రూ.10 వేల చొప్పున రాయితీలతో రుణాలను అధికారులు అందించారు. కషాయాల తయారీకి ఉపయోగపడే పరికరాలను సమకూర్చారు. అలాగే షెడ్, నైట్ నీడలో కూరగాయల సాగు చేసుకునేలా ఏర్పాట్లుచేశారు. 200 ఎకరాల్లో కూరగాయలు.. సుమారు 200 ఎకరాల్లో 250 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. పొట్ల కాయ, ఆనబకాయ, కాకరకాయ, దోసకాయలు, చిక్కుడు, బీర, వంకాయ, టమాట, బెండకాయ, గోరు చిక్కుళ్లు వంటి కూరగాయలతో పాటు గోంగూర, బచ్చలకూర, తోటకూర వంటి ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయంలో రైతులు పండిస్తున్నారు. 2,100 ఎకరాల్లో సుమారు 1,800 మంది రైతులు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. 2,100 ఎకరాల్లో చిరు ధాన్యాలు జొన్నలు, గంట్లు, పెసర, మినుము, ఉలవలు, బొబ్బర్లు, పెసలతో పాటు జీలుగు, జనుము వంటి పంటలను పండిస్తున్నారు. వీటికి ఆదరణ పెరగడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 7 వేల ఎకరాల్లో వరి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు తిరుమల, తిరుపతి దేవస్థానం వారు కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున ఈ ఏడాది 7 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దాదాపు 2,000 ఎకరాల్లో వరి కోతలు పుర్తయ్యాయి. అయితే ఎకరానికి 400 బస్తాల దిగుబడి రావడంతో రబీలో కూడా వరి పంటలు వేసేలా రైతులు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా గిట్టుబాటు ధర కూడా మెండుగా ఉంది. విస్తరిస్తున్న సేంద్రియ సాగు ప్రకృతి సాగు ఏటా పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది 39,873 మంది రైతులు 78,479 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల పంటలు సాగుచేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. రైతులకు అవగాహన పెంచి సాగును మరింత పెంచేలా కృషి చేస్తున్నాం. – పైడపల్లి లలితాసుధ, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం, ఏలూరు ప్రోత్సహిస్తున్నాం ప్రభుత్వం, ఐటీడీఏ అధికారుల సహకారం మరువలేనిది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. – వై.ముసలయ్య, ప్రకృతి వ్యవసాయ సబ్ డివిజనల్ యాంకర్, కేఆర్‌పురం లాభదాయకంగా ఉంది ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యవంతమైన పంటలు పండించడం ఆరోగ్యంగా ఉంది. నేను ఈ ఏడాది సుమారు రెండు ఎకరాల్లో బీర, ఆకుకూరల పంటలను సాగుచేస్తున్నాను. – సలాది కొండరాజు, గిరిజన రైతు, నిమ్మలగూడెం, బుట్టాయగూడెం మండలం -
Gujarat assembly elections 2022: కాంగ్రెస్‌కు గిరిజనులంటే గౌరవం లేదు: మోదీ
నెత్రంగోడా: కాంగ్రెస్ పార్టీకి గిరిజనులంటే ఏమాత్రం గౌరవం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని సైతం ఆ పార్టీ బలపరచలేదని పేర్కొన్నారు. ‘బిర్సా ముండా, గోవింద్ గురు వంటి గిరిజన నేతలను కాంగ్రెస్ పట్టించుకోలేదు. ముర్ముకు మద్దతివ్వాలని రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఆ పార్టీని చేతులు జోడించి వేడుకున్నా కాదన్నారు. గిరిజన పుత్రికను రాష్ట్రపతిని చేసేందుకు సర్వశక్తులూ ధారపోయాల్సి వచ్చింది’ అన్నారు. గుజరాత్‌లోని ఖేడా, భరుచ్ జిల్లాల్లో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్లు నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉండేదన్నారు. దేశంలో భారీ ఉగ్రదాడుల సమయంలో మౌనంగా ఉండటం ద్వారా కాంగ్రెస్, సారూప్య పార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నాయని ఆరోపించారు. ‘కాంగ్రెస్ మారలేదు. దేశాన్ని కాపాడుకోవాలంటే అలాంటి పార్టీలను దూరంగా ఉంచాలి’అని ప్రధాని పేర్కొన్నారు. -
అడవుల్లోనూ ఆహార పంటలు
‘‘నేను నా రెండెకరాల్లో వరి సాగుచేస్తున్నాను. ప్రభుత్వం అందించిన రైతుభరోసా సాగు పెట్టుబడికి ఎంతో ఉపయోగపడుతోంది. రాయితీ విత్తనాలు కూడా అందించి అండగా నిలుస్తోంది. ఈ ఏడాది 1070 వరి రకాన్ని సాగుచేశా. మంచి దిగుబడులు సాధిస్తున్నా. అటవీ ఫలాలు సేకరణతోనే కుటుంబాన్ని పోషిస్తూ గతంలో అవస్థలుపడ్డ నేను ఇప్పుడు ప్రభుత్వ సహకారంతో ఆహార పంటలూ పండిస్తూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నాను.’’ – కుర్సం రాజు, మెరకగూడెం, బుట్టాయగూడెం మండలం, ఏలూరు జిల్లా సాక్షి, అమరావతి: నిన్న మొన్నటి వరకు కేవలం అటవీ ఫలాల సేకరణపైనే ఆధారపడ్డ గిరిపుత్రులు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, సహకారంతో ఇతర అన్ని ప్రాంతాల్లోని రైతుల మాదిరిగానే ఆహార పంటలు పండిస్తూ వారితో సాగులో పోటీపడుతున్నారు. వీరికి ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్వోఎఫ్ఆర్ పట్టాల ద్వారా భూమిని పంపిణీ చేయడంతో అడవి బిడ్డలు ఇప్పుడు ఉద్యాన, వ్యవసాయ పంటల సాగువైపు మళ్లుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను అవలంబిస్తూ మేలైన దిగుబడులు సాధిస్తున్నారు. పోడు వ్యవసాయం, వంతుల సాగు, టెర్రస్ సాగు, వర్షాధార సాగు, మిశ్రమ పంటలు వేయడం, అంతర్ పంటలు, ఆర్గానిక్ వ్యవసాయం, జీరో బడ్జెట్ వ్యవసాయం వంటి విధానాలను ఆయా ప్రాంతాలు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. గిరిజనులు సాగుచేస్తున్న ప్రాంతాలివే.. సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, కోట రామచంద్రపురం, కృష్ణా, నెల్లూరు, శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లతోపాటు గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో అనేక గిరిజన తెగలు వ్యవసాయ సాగులో రాణిస్తున్నాయి. సాగుతో రైతులుగా మారిన గిరిజన తెగలు.. సవర, కాపు సవర, జతాపు, సవర గదబ, భగత, వాల్మీకి, కొండదొర, కొండరెడ్డి, వాల్మీకి, కొండ కమ్మర, కోయనైకపాడు, కోయ, లంబాడీ, చెంచు, సుగాలి, యానాది, ఎరుకల, నక్కల తెగలు. గిరిజన తెగలు సాగుచేస్తున్న పంటలు.. వరి, రాగి, జొన్నలు, బాజ్రా, కందులు, వేరుశనగ, జీడిపప్పు, కాఫీ, మిరియాలు, మామిడి, అనాస (పైనాపిల్), సీతాఫలం, రామాఫలం, పనస, బొప్పాయి, అరటి, టమాటా, పసుపు, చింతపండు, నిమ్మ, అల్లం, మిరప, పత్తి, పొద్దుతిరుగుడు, పొగాకు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు. ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది నేను సొంతంగా రెండున్నర ఎకరాల్లో వరి సాగుచేస్తున్నాను. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం బాగుంది. ఏటా రైతుభరోసాతోపాటు రాయితీతో కూడిన విత్తనాలు అందిస్తున్నారు. కోతుల బెడద నుంచి రక్షణగా పొలం చుట్టూ గ్రీన్ కర్టెన్ ఏర్పాటుచేశాను. పంట బాగుంది. రూ.35వేల వరకు మిగిలే అవకాశముంది. – బంధం చిన్న వీరాస్వామి, ఐ.పోలవరం గ్రామం, రంపచోడవరం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా కాఫీ సాగుకు తోడ్పాటు అందుతోంది రెండెకరాల్లో కాఫీ తోట పెంచుతున్నాను. ఇందులో అంతర్ పంటగా మిరియాలు సాగుచేస్తున్నాను. కాఫీ సాగులో ప్రభుత్వ ప్రోత్సాహం, కాఫీ బోర్డు, ఐటీడీఏ సహకారం బాగుంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కొనుగోలుతో బయట మార్కెట్లోను పోటీ పెరిగి మంచి ధర దక్కుతోంది. ఈ ఏడాది రూ.3 లక్షలు ఆదాయం వస్తుంది. – తమర్భ వెంకటేశ్వరనాయుడు, ఇరడాపల్లి గ్రామం, పాడేరు మండలం గిరిజన రైతులకు భరోసా అందిస్తున్నాం గిరిజన రైతులకు ఏటా రూ.13, 500 చొప్పున వైఎస్సార్ రైతుభరోసా సాయాన్ని అందిస్తూ విత్తన రాయితీ, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరులను సమకూరుస్తున్నాం. సీఎం నేతృత్వంలో 2019 ఆగస్టు నుంచి 1,20,361 మంది గిరిజనులకు 2,09,615 ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను, 26,287 మందికి 39,272 ఎకరాల డీకేటీ పట్టాలు అందించాం. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా భూములు చదును చేయడం, బోరు బావులు తవ్వడం వంటివి ప్రభుత్వం చేపట్టింది. – పీడిక రాజన్నదొర, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన ఉత్పత్తుల కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ గిరిజన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారు సేకరించిన అటవీ ఫల సాయంతోపాటు అటవీ ఉత్పత్తులను కూడా జీసీసీ మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రోత్సహిస్తోంది. అటవీ ఫలసాయం సేకరణతోనే గిరిజనులు సరిపెట్టుకోకుండా వ్యవసాయం, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. – శోభా స్వాతిరాణి, చైర్పర్సన్, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) -
FRO పై దాడి చేసిన గొత్తికోయల గ్రామ బహిష్కరణ
-
రాష్ట్రపతి ముర్ముకు ఎంపీపీ లేఖ
ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లిలోని ఆదివాసీ, గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపీపీ అరెం వరలక్ష్మి భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు గురువారం లేఖ రాశారు. గ్రామానికి చెందిన రెండేళ్ల బాలికకు సరైన వైద్యం అందకపోవడంతో ఇటీవల మృతి చెందగా, అంబులెన్స్ లేక ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు కొత్తమేడేపల్లితో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోని ఆదివాసీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా చూడడంతో పాటు అటవీహక్కుల చట్టాల అమలు తీరును పర్యవేక్షించాలని ఎంపీపీ ఆ లేఖలో రాష్ట్రపతిని కోరారు. -
ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?
కొంతమంది నియోదళిత్ మేధావులకు, వామపక్షీయులకు ప్రతి విషయాన్నీ కులం లేదా మత కోణంలో చూసే ధోరణి గత 30 సంవత్సరాలుగా అలవాటైంది. అకడమిక్స్‌లో కూడా ఈ ధోరణి రావడం ప్రమాదకరం. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, ముస్లింలు, క్రిష్టియన్లు, అగ్ర వర్ణాల వారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. 130 కోట్ల జనాభాలో, దాదాపుగా 30 కోట్ల మంది దళితులు ఉన్న భారతదేశంలో... కేవలం కొన్ని సంఘటలను చూపించి రిపోర్టులు తయారు చేసి, దేశమంతా వివక్షత ఉందని చెప్పడం ఎంతమాత్రమూ శాస్త్రీయం కాదు. అధర్మమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో దారుణమైన వివక్ష నేటికీ కొనసాగుతోంది. మన నియోదళిత్ మేధావులు వాటిని ఏమాత్రం ప్రస్తావిం చకుండా భారతదేశానికీ, హిందూమతానికీ వ్యతిరేకంగా పని చేసే కొన్ని సంస్థల రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. రాజీవ్ మల్హోత్ర, అరవిందన్ నీలకంఠన్ రాసిన ‘బ్రేకింగ్ ఇండియా – వెస్ట్రన్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద్రవిడియన్ అండ్ దళిత్ ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకంలో ఇటువంటి విదేశీ సంస్థలూ, అధ్యయన కేంద్రాలూ, ఎన్జీఓలూ వంటివి భారతదేశాన్ని, హిందూమతాన్ని విచ్ఛిన్నం చేయడానికి గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఒక బహిరంగమైన కుట్ర బట్టబయలైంది. ఇక ప్రపంచంలోని వివక్షకు వస్తే మొదటగా అమెరికాలో ఉన్న నల్లజాతీయులపై వివక్ష నేటికీ కొనసాగుతోంది. అయినా వారికి భారతదేశంలో దళితులలాగా రాజ కీయాలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు లేవు. దక్షిణాఫ్రికాలో నల్లజాతి వివక్ష (అపారై్థడ్) 1992 వరకు చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా జరిగింది. ఇప్పటికి కూడా దక్షిణాఫ్రికాలో వాళ్ళు రిజర్వేషన్లు కావాలని అడగలేదు. 1883 వరకు అమెరికాల్లో నల్ల జాతీయులు బానిసలుగా ఉండేవాళ్ళు, 1970 వరకు అమెరికాలో నల్లజాతీయులకు ఓటు హక్కులేదు. ఇప్పటికీ యూఎస్‌తో సహా అనేక దేశాల్లో జాతి, మతపరమైన వివక్ష ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1930లలో భారత్‌లో షెడ్యూల్డ్ కులాల వివక్షమీద అంబేడ్కర్ పోరాటం చేస్తున్న సమయంలోనే అమెరికాలో కూడా వివక్ష మీద పోరాటం జరుగుతోంది. ప్రముఖ అమెరికన్ నల్లజాతీయుల నాయకులు చానీతో బియాస్, బెంజమిన్ మేస్ లాంటి వారు భారతదేశానికి వచ్చి గాంధీని కలిసి వివక్షతపై చర్చలు జరిపారు. 1938లో హోవర్డ్ తురిమెన్ అనే ప్రముఖ నల్ల మతాధికారి అమెరికాకు వచ్చి పోరాటం సాగించాలని గాంధీని కలిసి విన్నవించారు. ప్రముఖ నల్ల జాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్... గాంధీజీనే ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికాలో అపార్థైడ్కు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా తదితరులు కూడా మహాత్మా గాంధీనే ఆదర్శంగా తీసుకున్నారు. ఇక్కడ నియో దళిత మేధావులు, వామపక్ష వాదులు దాచి పెట్టేదేమిటంటే... పైన పేర్కొన్న నాయకులు ఎవ్వరూ కూడా అంబేడ్కర్‌ను కలవలేదు. వీరెవ్వరు కూడా ఆయా దేశాల్లో రిజర్వేషన్లు కోరలేదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనే యూనివర్సల్ ప్రిన్సిపుల్‌కు రిజర్వేషన్లు అనేవి బద్ధ వ్యతిరేకం కాబట్టి. దేశం 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో కొన్ని శతాబ్దాల కాలం వెనుకబడింది. 1951 నాటికి అక్షరాస్యత కేవలం 16.7 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం, కాబట్టి కేవలం దళితులే కాదు అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వెనకబడే ఉన్నారు. దళితుల పరిస్థితి ఇంకా దయనీయమనే చెప్పాలి. అయితే ల్యాండ్ సీలింగ్ వల్ల వచ్చిన భూమిలో 46 శాతం దళితులకే వచ్చింది. అయినా ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. (క్లిక్ చేయండి: నిరసనకారులకు గుణపాఠమా?!) - డాక్టర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం -
గిరిజనులు, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం
-
సూర్యాపేటలో గిరిజనుల భారీ ర్యాలీ
భానుపురి (సూర్యాపేట): గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల పెంపుతోపాటు గిరిజన బంధు, పోడు భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం గిరిజనులు సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం క్రాస్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం నుంచి చర్చి కాంపౌండ్ రోడ్డు, పొట్టిశ్రీరాములు సెంటర్, పూలసెంటర్, కల్నల్ సంతోష్‌బాబు చౌరస్తా మీదుగా రైతుబజార్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వరకు డీజే మోతలు, నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహంతో పాటు సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. -
రిజర్వేషన్ల పెంపు చరిత్రాత్మక నిర్ణయం
మహబూబాబాద్ అర్బన్: బంజారా ఆదివాసీ, గిరిజనుల రిజర్వేషన్లు పెంపు దేశంలోనే ఒక చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజనుల జనాభా మేరకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ దాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. పోడుభూముల విషయంలోనూ సీఎం సానుకూల నిర్ణయం తీసుకుని సాగుదారులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారని వెల్లడించారు. గిరిజనులకు ఏ ప్రభుత్వం అందించని అనేక పథకాలను అమలు చేస్తూ గిరిజనులకు సీఎం కేసీఆర్ ఆరాధ్యుడిగా మారారని, తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. కేసీఆర్ తనకు పునర్జన్మనిచ్చారని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
తల నరికేసే ఊరిలో.. రెండు దేశాల బార్డర్!
దేశాల మధ్య సరిహద్దులు అంటే.. కంచెలు, హద్దు రాళ్లు గుర్తుకువస్తుంటాయి. కొన్నిచోట్ల గ్రామాలు, పట్టణాలకు దగ్గరగా సరిహద్దులు ఉంటుంటాయి. గ్రామాల మధ్యలోంచి కూడా దేశాల సరిహద్దులు వెళ్లే ప్రాంతాలూ కొన్ని ఉన్నాయి. అలా భారత్, మయన్మార్ దేశాల మధ్య ఉన్న గ్రామమే.. లోంగ్వా. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. రెండు దేశాల బార్డర్! భారత్, మయన్మార్ దేశాల మధ్య నాగాలాండ్ రాష్ట్రంలో లోంగ్వా గ్రామం ఉంది. కొన్యాక్ గిరిజనులు నివసించే ఈ గ్రామం ఎత్తైన కొండల మీద ఉంటుంది. ఈ గ్రామ పెద్ద ఇంటి మీదుగానే అంతర్జాతీయ సరిహద్దు వెళ్తుంది. ‘మేం భారత్‌లో తింటాం. మయన్మార్‌లో నిద్రపోతాం’ అని గ్రామ పెద్ద సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. ఈ గ్రామ పెద్దను ‘ఆంఘ్’ లేదా ‘చీఫ్టేన్’ అని పిలుచుకుంటారు. కొన్యాక్ తెగకు చెందినవారు 5 వేల మందికిపైగా ఉంటారని అంచనా. వారందరికీ ‘ఆంఘ్’ రాజు. ఆయనకు 60 మంది భార్యలు అని.. చుట్టూ ఇటు భారత్, అటు మయన్మార్‌లో ఉన్న 60 గ్రామాలను పాలిస్తుంటారని చెబుతారు. ఈ పరపతి కారణంగానే.. చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే ముందే లోంగ్వా గ్రామానికి 4జీ మొబైల్ నెట్వర్క్ వచి్చందని అంటుంటారు. తల నరికేసే యోధులు! రెండు దేశాల్లోనూ పౌరసత్వం కొన్యాక్ తెగలో ఓ ఆచారం ఉంది. ఈ తెగ యువకులు ప్రత్యర్థి తెగలవారితో తలపడి తల తెగనరికి తీసుకువస్తే యుద్ధవీరుడిగా గుర్తింపు ఇస్తారు. తలపై ఇత్తడి కిరీటాన్ని, మెడలో ఇత్తడి బిళ్లలతో కూడి దండను ధరిస్తారు. ఎంత మంది తలలు నరికితే అన్ని ఇత్తడి బిళ్లలు వేసుకుంటారు. ప్రభుత్వం 1960లో ఈ సాంప్రదాయాన్ని నిషేధించింది. అయినా ఇప్పటికీ తమ మెడలో ‘హెడ్ హంటర్స్’కు గుర్తుగా దండలను ధరిస్తారు. ఇక వారి తెగ సాంప్రదాయాన్ని, తమ హోదాను బట్టి ముఖంపై వివిధ ఆకారాల్లో పచ్చబొట్లు వేసుకుంటారు. తర్వాతి కాలంలో ఈ తెగకు చెందినవారు చాలా మంది క్రిస్టియనిటీ స్వీకరించారు. అయినా తమ ఆచారాలను కొనసాగిస్తుంటారు. భారత్, మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుపై ఉన్న లోంగ్వా గ్రామస్తులకు అధికారికంగానే ఇరు దేశాల పౌరసత్వం ఉంది. మన దేశంలో ఇలాంటి పౌరసత్వం ఉన్న ఏకైక గిరిజన తెగ వీరిదేనని చెబుతారు. గ్రామస్తులు చాలా మంది రెండు దేశాల ఎన్నికల్లోనూ ఓటేస్తారు. కొందరు మయన్మార్ ఆరీ్మలోనూ పనిచేస్తున్నారు. లోంగ్వా గ్రామం, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలకు నెలవు. భారత్ వైపు రెండు, మయన్మార్ వైపు మరో రెండు చిన్న నదులు, షిలోయ్ అనే ఓ సరస్సు ఉన్నాయి. దీనికితోడు కొన్యాక్ తెగవారి ప్రత్యేకతలు, ఆచారాలను చూడటానికి ఇటీవలికాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు లోంగ్వాకు వెళుతున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ (చదవండి: జ్ఞానవాపి మసీదు: కీలక తీర్పు పై ఉత్కంఠ) -
Araku Valley: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాల నెలవైన అరకు లోయలో ‘గిరి గ్రామదర్శిని’ ఆదివాసీ జీవన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. పచ్చటి కొండలు, లోతైన లోయలు, జాలువారే జలపాతాల నడుమ అరకును సందర్శించే పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తోంది. అన్నిటికి మించి గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో పర్యాటకులకు వివాహ వేడుక అవకాశాన్ని కల్పిస్తోంది. అరకులోని గిరిజన మ్యూజియానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెదలబుడు’ గ్రామంలో ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన గ్రామాన్ని నిర్మించింది. ఒడిశా సరిహద్దున గల ఈ ప్రాంతంలో దాదాపు 92 శాతం జనాభా గిరిజనులే. గిరిజన ఆచారాల్లో ఒదిగిపోవచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ఆదివాసీల జీవనశైలి, వారి సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడానికి ‘గిరి గ్రామదర్శిని’ని తీర్చిదిద్దింది. ఈ గ్రామంలో పర్యాటకులకు సాధారణ స్థానిక ఆదివాసీ వాతావ రణాన్ని అందిస్తూ సుమారు 15కి పైగా సంప్రదాయ గిరిజన గుడిసెలను ఏర్పాటు చేసింది. గిరిజనుల జీవన విధానాన్ని అనుభవించాలనుకునేవారు ఈ కాటేజీలను బుక్ చేసుకుని ఒకట్రెండు రోజులు బస చేయవచ్చు. ఈ సమయంలో పర్యాటకులు స్థానిక గిరిజన సమూహాలతో మమేకమై గడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల మాదిరిగానే కట్టు, బొట్టు, ఆభరణాలు ధరించి వారి ఆచార వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. ఎద్దుల బండిపై సవారీ, రాగి అంబలి, విలు విద్య క్రీడా కేంద్రం, బొంగరం ఆట, కొమ్మ రాట్నం, థింసా ఆడుకునేందుకు ప్రత్యేక స్థలం, నాగలి పట్టి దుక్కి దున్నడం ఇలా ఒకటేమిటి అనేక అంశాలు గిరి గ్రామదర్శినిలో ఉన్నాయి. గిరిజనుల ఆట విడుపు అయిన కోడి పుంజులను పట్టుకోవడం కూడా పర్యాటకుల కార్యకలాపాల్లో భాగం చేశారు. (క్లిక్: జాతీయ సదస్సులో మరోసారి ‘అరకు కాఫీ’ అదుర్స్) అక్కడే పెళ్లి చేసుకోవచ్చు గిరి గ్రామదర్శినిలో పర్యాటకులను ఆదివాసీ వివాహ పద్ధతి ఎక్కువగా ఆకట్టుకుంటోంది. వినూత్న రీతిలో వివాహం చేసుకోవాలనుకునే యువతకు, ఇప్పటికే వివాహమైన జంటలకు గిరిజన వివాహ అనుభూతిని అందిస్తోంది. పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ ఈ కాన్సెప్ట్‌ను రూపొందించింది. ఇందులో వధూవరులతోపాటు, స్నేహితులు, బంధువులను కూడా గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ముస్తాబు చేస్తారు. గుడిసెను వెదురు, పూలు, ఆకులతో అలంకరిస్తారు. ఇక్కడి గిరిజన పూజారి గిరిజన సంప్రదాయాల ప్రకారం వివాహ తంతును నిర్వహించేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటారు. ఆచారమంతా గిరిజన సంగీతంతో మార్మోగుతుంది. పెళ్లి విందు కూడా స్థానిక జీవన శైలిలో ఉంటుంది. క్యాంప్ ఫైర్ చుట్టూ థింసా నృత్యం చేస్తూ స్థానిక గిరిజన మహిళలు అతిథులను అలరిస్తారు. గిరిజన వివాహాలు పూర్తిగా మహిళలతో నిర్వహిస్తుండటం కూడా ఇక్కడి విశేషం. ఈ తరహా వివాహాన్ని కోరుకునేవారు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) -
గిరిజనుల్లో 'నవరత్న' కాంతులు.. ప్రగతిబాటలో ఏజెన్సీ గ్రామాలు
ఇతని పేరు మడివి సిరమయ్య. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గ్రామమైన గుంజవరం. మూడేళ్లలో ‘నవరత్నాల’ ద్వారా ఏకంగా రూ.2.86 లక్షల మేర లబ్ధి పొందాడు. గత ప్రభుత్వ హయాంలో సాయం అంటే ఏమిటో తెలీకుండా ఉండేదని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వలంటీర్ స్వయంగా తన ఇంటికొచ్చి పథకాలూ అందేలా చూస్తున్నారని అంటున్నాడు. అడవుల్లో ఎవరికీ పట్టనట్లు ఉండే గిరిజన బతుకులు సీఎం వైఎస్ జగన్ పుణ్యాన బాగుపడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈమె పేరు కుంజం సావిత్రి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ముసురుమిల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈమెకు అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం రెండు ఎకరాలకు భూమి హక్కు పట్టా అందించింది. అలాగే, మూడేళ్లుగా రైతుభరోసా అందిస్తూ పోడుభూముల్లో వ్యవసాయం చేసుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండగా నిలుస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలిపింది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్ని సామాజిక వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనేక సంవత్సరాలుగా కనీస సదుపాయాలకు నోచుకోని ఆదివాసీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరాల మూట అందిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గిరిజనోద్ధరణకు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. వీటిద్వారా 95 శాతం మంది గిరిజనులు లబ్ధి పొందారు. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనూ ఇంత ప్రయోజనం కలిగిన దాఖలాల్లేవు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో గిరిజనులకు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మేలు ఏమిటంటే.. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 27.39 లక్షల మంది గిరిజనులున్నారు. 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. వాటిలో 7 ఐటీడీఏలు అటవీ ప్రాంతంలోను, రెండు ఐటీడీఏలు మైదాన ప్రాంతాల్లోను గిరిజనుల కోసం పనిచేస్తున్నాయి. ఇక నవరత్నాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా గత మూడేళ్లలో 51,74,278 మంది గిరిజన లబ్ధిదారులకు రూ.9,204.75 కోట్ల మేర లబ్ధిచేకూరింది. ప్రత్యక్షంగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 33,92,435 మందికి రూ.7,012.35 కోట్లు, పరోక్షంగా (నాన్ డీబీటీ) 17,81,843 మందికి రూ.2,192.40 కోట్ల మేర లబ్ధిచేకూరింది. గిరిపుత్రులకు ఇంత భారీ స్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూరడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. దీనికితోడు గిరిజన ఉప ప్రణాళిక(ట్రైబల్ సబ్‌ప్లాన్).. కేంద్ర, రాష్ట్ర నిధులతో దాదాపు 40 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. గిరిజనం కోసం ప్రభుత్వ చర్యల్లో ముఖ్యమైనవి.. ► గిరిజన రైతులకు పోడు భూములపై యాజమాన్య హక్కులను కల్పించేలా సీఎం జగన్మోహన్రెడ్డి స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. గత మూడేళ్ల కాలంలో 1,34,056 మందికి ఆర్ఓఎఫ్ఆర్, ఆర్ఓఆర్ పట్టాలు చేతికందాయి. తద్వారా వారికి 2,48,066 ఎకరాలపై హక్కు లభించింది. అంతేకాదు వారికి వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వర్తింపజేశారు. ► గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.746 కోట్లు మంజూరు చేసింది. ► గిరిజన గ్రామాల్లో డోలీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఫీడర్ అంబులెన్సులను వినియోగిస్తున్న ప్రభుత్వం తాజాగా.. 128 బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తేనుంది. ► రక్తహీనత కారణంగా బాలింతలు, శిశువులు మరణిస్తుండడంతో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం గిరి గోరుముద్ద, బాల సంజీవని, పోషకాహార బుట్ట వంటి ప్రత్యేక వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలుచేస్తున్నారు. ► ఏజెన్సీలో 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (సీహెచ్‌డబ్ల్యూ)లకు 1995 నుంచి ఉన్న రూ.400 జీతాన్ని ఏకంగా రూ.4 వేలకు పెంచారు. ► గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. ► వంద శాతం గిరిజనుల జనాభా కలిగిన తండాలు, గూడేలను 165 కొత్త గిరిజన పంచాయతీలుగా ఏర్పాటుచేసిన ప్రభుత్వం అక్కడ ప్రజాప్రతినిధులంతా గిరిజనులే ఎన్నికయ్యేలా రిజర్వ్ చేస్తూ జీఓ నెంబర్ 560 జారీచేసింది. ► 4,76,206 గిరిజనుల కుటుంబాల గృహావసరాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోంది. ► గిరిజనులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ కురుపాంలో రూ.153 కోట్లతో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. ► కోట్లాది రూపాయలతో విద్యా సంస్థల భవనాలు, గిరిజన ప్రాంతాల్లోని రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. è రాష్ట్రానికి మంజూరైన గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రస్తుతం విజయనగరం వద్ద నిర్వహిస్తున్నారు. ► కరోనా కష్టకాలంలో.. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అడవి బిడ్డలకు అండగా నిలిచింది. ► ఇక విశాఖ జిల్లా తాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన సమరయోధుల మ్యూజియం, కాపులుప్పాడలో రూ.45 కోట్లతో అల్లూరి సీతారామరాజు స్మారక మ్యూజియం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. విశాఖలో రూ.10కోట్లతో ట్రైబల్ రీసెర్చ్ మిషన్ (టీఆర్ఎం)కు భవన నిర్మాణం పూర్తయింది. గిరిజనులకు వైఎస్ కుటుంబమే బాసట నాడు వైఎస్సార్ ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి పాలనలో గిరిజనులకు ఎంతో మేలు జరిగింది. అందుకే వీరిని గిరిజనులు దైవంతో సమానంగా భావిస్తారు. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటుచేశారు. మరో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. గిరిజనులకు విద్య, వైద్యం రెండు కళ్లుగా భావిస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి విద్యాసంస్థలు, ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. ప్రత్యక్షంగానే రూ.9వేల కోట్లకు పైగా వారికి లబ్ధిచేకూర్చారు. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి -
గుజరాత్ ఎన్నికలు.. గిరిజనులకు కేజ్రీవాల్ వరాలు
వడోదర: గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ను అమలు చేస్తుందని, పంచాయతీ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకూ వర్తింపజేస్తుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. గుజరాత్ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ చీఫ్‌గా సీఎంకు బదులుగా గిరిజనుడినే నియమిస్తామన్నారు. గుజరాత్ అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆయన ఈ మేరకు ముందుగానే ఎన్నికల హామీలను ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా గిరిజనులు ఇప్పటికీ వెనుకబాటుకు గురవుతున్నారన్నారు. ఆప్ నిజాయతీ దేశభక్తికి మారుపేరు కాగా, బీజేపీ అవినీతి, కల్తీమద్యానికి మారుపేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాబల్య చోటా ఉదయ్‌పూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి గిరిజన గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక మొహల్లా క్లినిక్‌ను ఏర్పాటు చేస్తుంది. గిరిజనులకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఈ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా నెలకొల్పుతాం. కుల ధ్రువీకరణ పత్రాల జారీని సులభతరం చేయడంతోపాటు నీడ లేని వారికి పక్కా ఇల్లు నిర్మిస్తాం. గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్లు వేస్తాం’ అని వెల్లడించారు. గిరిజన ప్రాంతాలు, గిరిజన తెగల ప్రజల పరిపాలన, నియంత్రణలకు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్లో ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. అదేవిధంగా, 1996లో తీసుకు వచ్చిన పంచాయతీ చట్టంతో గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో స్వయం పాలనకు వీలు కల్పిస్తుంది. (క్లిక్: బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు.. బీజేపీకి నితీశ్ షాక్!) -
‘పోడు’పై తెగని పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీకి విపక్షాలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య మరోసారి రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఈ క్రమంలో అనేక సవాళ్లు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాల సేకరణ ప్రక్రియలో భాగంగా దరఖాస్తులను స్వీకరించింది. 28 జిల్లాల్లోని 3,041 గ్రామపంచాయతీల పరిధిలో సుమారు 12.60 లక్షల ఎకరాల పోడు భూముల్లో సుమారు 3,95,000 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నట్లు తేలింది. ఇందులో 62 శాతం గిరిజనులు, 38% గిరిజనేతరులు ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల చట్టం 2006 ఆధారంగా 2008లో సుమారు 96,600 మందికి 3,08,000 ఎకరాల భూమిపై హక్కు లభించింది. అయితే పోడు వ్యవసాయం చేస్తున్నప్పటికీ కొంతమందికి హక్కులు దక్కలేదు. మరోవైపు మరికొంతమంది కొత్తగా అటవీ భూముల్లో పోడు వ్యవసాయం మొదలుపెట్టడంతో రాష్ట్రంలో పోడు రైతుల సమస్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. చట్ట సవరణతోనే సాధ్యం! అటవీ శాఖ భూములపై హక్కులు కల్పించే అటవీ హక్కుల చట్టం– 2006 లో అనేక కఠిన నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమ నిబంధనలే సమస్య పరిష్కారానికి ఆటంకంగా మారాయని, ఈ చట్ట సవరణ ద్వారానే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమనే అభిప్రాయం ఉంది. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 నాటికి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మాత్రమే ఆయా భూములపై హక్కులు కల్పించే అవకాశం ఉంది. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆ తేదీ నాటికి వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు మాత్రమే హక్కులు కల్పించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇక గిరిజనేతరులు తాము 75 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నట్లు తగిన ఆధారాలను చూపిస్తే వారికి హక్కులు దక్కేలా అప్పటి ప్రభుత్వం ఈ చట్టాన్ని తయారుచేసింది. అయితే 75 ఏళ్ల పోడుకు సంబంధించి సాక్ష్యాధారాలను సంపాదించే అవకాశాలు లేకపోవడంతో గిరిజనేతరులకు ఈ భూములపై హక్కులు దక్కడం లేదనే అభిప్రాయం గట్టిగా ఉంది. అంతా కేంద్రం చేతిలోనే..! ప్రస్తుతం తెలంగాణలో హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 3,95,000 మందికి ప్రయోజనం కలగాలంటే 2006 నాటి చట్టంలో ఉన్న డిసెంబర్ 2005 కట్ ఆఫ్ తేదీని మార్చాల్సి ఉంటుంది. దీంతో పాటు గిరిజనేతరులకు పోడు హక్కులు దక్కాలంటే, వారు 75 ఏళ్లుగా తాము వ్యవసాయం చేస్తున్నట్లు సాక్ష్యాధారాలను చూపించాలన్న నిబంధనను తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేపథ్యంలో..దరఖాస్తులు స్వీకరించినా, అర్హులైన పోడు రైతుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పరిశీలనకు అవకాశం లేకుండా పోయిందనే వాదనను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వినిపిస్తున్నాయి. మినహాయింపులకు అవకాశం లేదు.. అటవీ హక్కుల చట్టానికి కొన్ని సవరణలు చేసి పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఒక లేఖ కూడా రాశారు. అయితే తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు అడుగుతున్నట్టుగా మినహాయింపులు ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తూ కేసీఆర్‌కు కేంద్ర మంత్రి అర్జున్ ముండా లేఖ రాశారు. ఒకవేళ రాష్ట్రాలు అడుగుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల చట్టానికి మినహాయింపులు ఇస్తే, గిరిజనులతో పాటు అటవీ సంరక్షణకు తీవ్ర నష్టం కలుగుతుందని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ‘పోడు’మింగుడు పడని సమస్యగా మారింది. -
స్వాతంత్య్ర సంగ్రామంలో విరబూసిన అగ్ని పుష్పం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన అగ్ని పుష్పమై వికసించారు. విప్లవ శంఖమై బ్రిటిష్ ముష్కరులకు ముచ్చెమటలు పోయించారు. మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ముస్తాబైంది. అదే జిల్లాలోని పాలకోడేరు మండలం మోగల్లు ఆయన స్వస్థలం. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అల్లూరి సీతారామరాజు ఖ్యాతిని ఇనుమడింపచేసేలా 125వ జయంతి వేడుకలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నాయి. భీమవరంలో క్షత్రియ సేవా సమితి నేతృత్వంలో సుమారు రూ.3 కోట్లతో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దీనిని ఈ నెల 4న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించనున్నారు. విలక్షణమైన విద్యార్థిగా.. భీమవరం పట్టణానికి సమీపంలోని పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు స్వస్థలం. సీతారామరాజు 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో తల్లి సూర్యనారాయణమ్మ పుట్టింట జన్మించారు. ఆయన బాల్యం భీమవరం పరిసర ప్రాంతాల్లోనే సాగింది. సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. ముంబై వెళ్లి ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం నేర్చుకున్నారు. నరసాపురం, తణుకు పట్టణాల్లో కొంతకాలం ఫొటో స్టూడియోలు నడిపారు. సీతారామరాజు పుట్టాక 1902లో రాజమహేంద్రవరంలో స్టూడియో ప్రారంభించారు. ఆయన పలు ప్రాంతాలు తిరగడంతో సీతారామరాజు బాల్యం, చదువు కూడా ఆయా గ్రామాల్లోనే సాగాయి. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో రాజమండ్రి నుంచి తల్లి సూర్యనారాయణమ్మ సోదరుడు అప్పలనర్సయ్య స్వగ్రామమైన భీమవరం సమీపంలోని కొవ్వాడకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే 1909లో భీమవరంలోని మిషన్ హైస్కూల్లో ఒకటో ఫారంలో చేరారు. తర్వాత ఆయనకు జ్వరం రావడంతో మూడు నెలల పాటు స్కూల్‌కు వెళ్లలేదు. అనంతరం రాజమండ్రి వెళ్లి అక్కడి స్కూల్లో తిరిగి ఫస్ట్ ఫారంలో చేరారు. అక్కడే యోగాభ్యాసంపై దృష్టి సారించి హఠయోగం, పతంజలి యోగం, వేదాంతం వంటి వాటిని అభ్యసించారు. కళాకారుడిగానూ రాణింపు సీతారామరాజుకు నాటకాలంటే ఆసక్తి. 1912 డిసెంబర్ 12న 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం సందర్భంగా పిఠాపురంలోని రాజా కళాశాలలో శశిరేఖా పరిణయం నాటకం ప్రదర్శించారు. అందులో సీతారామరాజు శశిరేఖ పాత్ర వేశారు. తర్వాత విశాఖలోని ఏవీఎన్ కాలేజీ హైస్కూల్లో నాలుగో ఫారం కొంతకాలం చదివి.. 1913 జూలై 2న నరసాపురం టేలర్ హైస్కూల్లో నాలుగో ఫారంలో చేరారు. చించినాడలో గుర్రపు స్వారీ టైలర్ హైస్కూల్లో నాలుగో ఫారం చదువుతున్నపుడు ప్రతి శని, ఆదివారాల్లో సమీపంలోని చించినాడ గ్రామం వెళ్లేవారు. అక్కడ పినతండ్రి పినతండ్రి రామకృష్ణంరాజు మిత్రుడైన మునసబుకు చెందిన గుర్రంపై స్వారీ, చదరంగం నేర్చుకున్నారు. అనంతరం తునిలో ఉంటున్న తల్లి వద్దకు చేరుకున్నారు. 1913–17 మధ్య తుని సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచారం చేసి ఆదివాసీ జీవితాలను పరిశీలించారు. అనంతరం విప్లవ బాట పట్టి మన్యం ప్రజల కోసం బ్రిటిష్ వారితో పోరు సాగించి 1924 మే 7న వీర మరణం పొందారు. మోగల్లులో స్మారక కేంద్రం మోగల్లులోని అల్లూరి సీతారామరాజు నివాసాన్ని అల్లూరి స్మారక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ సహకారంతో క్షత్రియ సేవా సమితి ఈ పనులు చేపట్టింది. భీమవరం పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఏర్పాటు చేశారు. సమీకరించి.. పోరాడారు సాక్షి, అమరావతి: అటవీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను గమనించిన అల్లూరి సీతారామరాజు వారి కోసం 1919 నుంచి పోరుబాట పట్టారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల పరిధిలో బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు తిరుగుబాటు చేశారు. తొలుత అటవీ ఉత్పత్తులను కొల్లగొడుతూ.. గిరిజనులకు తగిన కూలీ ఇవ్వకపోవడంపై నిలదీశారు. గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. అది కొంతకాలానికి సాయుధ పోరాటంగా రూపుదిద్దుకుంది. ఆయుధాల కో సం అల్లూరి నాయకత్వంలోని మన్యం పోరాట వీరులంతా పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. గిరిజనుల్లో అల్లూరికి ఆదరణ పెరగడం, ఉద్యమం తీవ్రతరం కావడం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కలవరపరిచింది. అదనపు పోలీసు బలగాలను పంపి అల్లూరి పోరాటానికి అడ్దుకట్ట వేసే ప్రయత్నం జరిగింది. మన్యం పితూరీగా నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ తిరుగుబాటుని పరిగణించింది. తొలుత మలబారు సైన్యాన్ని రంగంలో దింపిన బ్రిటిష్ ప్రభుత్వం ఆపై అస్సాం రైఫిల్స్‌ను కూడా పంపింది. తీవ్ర పోరాటంలో గాయపడి కొయ్యూరు సమీపంలోని మంప వద్ద వాగులో గాయాలను శుభ్రం చేసుకుంటున్న అల్లూరిని అస్సాం రైఫిల్స్ దళాలు పట్టుకున్నాయి. పట్టుబడిన అల్లూరిని సజీవంగా తీసుకురావాల్సి ఉండగా, మార్గంమధ్యలోనే ఆయనను చెట్టుకు కట్టేసి కాల్చి చంపినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు. అల్లూరి తప్పించుకుని పారిపోయే అవకాశం ఉండటంతో 1924 మే 7న కాల్చి చంపినట్టు మేజర్ గుడాల్ తన నివేదికలో ప్రకటించారు. అల్లూరి మృతదేహాన్ని కృష్ణదేవీపేటకు తరలించి అక్కడే దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అల్లూరి çస్మృతివనంగా తీర్చిదిద్దారు. బ్రిటిషర్ల దారుణాలకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడి 27 ఏళ్ల ప్రాయంలోనే ప్రాణాలు కోల్పోయిన అల్లూరిని మన్యం వీరుడిగా ప్రజలు కొనియాడుతారు. మన్యం పోరాటంలో అల్లూరిని అనుసరించిన 17 మంది ముఖ్య అనుచరుల్లో కొందరిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి అండమాన్ సహా వివిధ జైళ్లలో బంధించింది. మరికొందరు పోరాటంలోనే ప్రాణాలు విడిచారు. మన్య పోరాటం ముగిసినా.. ఆ చైతన్య స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉంది. పోలీస్ స్టేషన్లపై దాడులకు వందేళ్లు ► సీతారామరాజు తన బృందంతో పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఈ ఏడాదితో సరిగ్గా వందేళ్లు పూర్తయ్యింది. గిరిజనుల వద్ద ఉన్న సంప్రదాయ విల్లంబులు, ఆయుధాలు సరిపోవని భావించి ఆధునిక ఆయుధాలను సమీకరించుకోవడం కోసం గిరిజనులతో కలిసి ఆ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. ఆయన ప్రధాన అనుచరులు గాం మల్లుదొర, గంటందొర, ఎండు పడాలు, ఎర్రేసులతో పాటు సుమారు 300 మంది పాల్గొన్నారు. ► 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై మొదటిసారి దాడి చేశారు. దాడికి ముందే నర్సీపట్నం వైపు వెళ్తున్న ఎస్సై లంబసింగి వద్ద అల్లూరికి ఎదురుపడగా.. ‘ఆయుధాల కోసం మీ స్టేషన్‌కే వెళ్తున్నాను’ అని రామరాజు చెప్పారని, అతడు మారు మాట్లాడక తప్పుకున్నట్టు చెబుతారు. ఈ దాడిలో 11 తుపాకులు, 1,390 తుపాకీ గుళ్లు, ఐదు కత్తులు, 14 బాయ్నెట్లను తీసుకెళుతున్నట్టు పోలీస్‌స్టేషన్ డైరీలో రాసి.. అల్లూరి సంతకం చేసి మరీ వెళ్లారు. æ ఆ మర్నాడు ఆగస్టు 23న కృష్ణదేవీపేట, 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి, ఆ తర్వాత వరుసగా అడ్డతీగల, రంపచోడవరం పోలీస్‌స్టేషన్లపైనా దాడులు కొనసాగాయి. చింతపల్లి దాడికి వందేళ్లు సమీపిస్తున్న సందర్భంగా తపాలా శాఖ స్మారక స్టాంపును ఆవిష్కరించింది. -
ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి
‘‘ఆదివాసులకు ప్రత్యేక పాలనా ధికారాలు, స్వయం పాలనా వ్యవస్థలు ఉంటాయి. వాళ్ళ ఆర్థిక, సామాజిక పునాదులపై ఆధారపడి మాత్రమే వారి అభివృద్ధి సాగాలి. వాళ్ళ ప్రాంతానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళ ప్రత్యేక మండళ్ళ అంగీకారం తప్పనిసరిగా ఉండాలి.’’ నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇవి. రాజ్యాంగ సభలో ఆదివాసీల తరఫున డిసెంబర్ 16, 1946న స్వయంగా ఆదివాసీ అయిన జైపాల్ సింగ్ ముండా మాట్లాడుతూ... ‘‘నా జాతి ప్రజలను ఆదివాసీయేతరులు నిరంతరం దోపిడీ చేయడం యావత్ దేశ చరిత్ర నిండా కనిపిస్తుంది. అయితే మనం ఈ రోజు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టాలి. స్వతంత్ర భారతంలో నా ప్రజలు నిర్లక్ష్యానికి గురికాకుండా సమానత్వం కోసం కృషి చేయాలని రాజ్యాంగ సభనూ, ప్రత్యేకించి ఈ సభ నాయకుడు జవహర్ లాల్ నెహ్రూనూ కోరుతున్నాను’’ అని అన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆది వాసీల రక్షణకు అనేక ఏర్పాట్లు రాజ్యాంగంలో చేసిన విషయమూ తెలిసిందే. బాబూ రాజేంద్రప్రసాద్, జైపాల్ సింగ్ ముండాలు చేసిన వ్యాఖ్యానాలకూ, డిమాండ్లకూ ఈనాటికీ కాలం చెల్లలేదు. వాళ్ళు ఆశించిన వ్యవస్థ గానీ, పరిస్థితులు గానీ ఈనాటికీ ఆవిష్కృతం కాలేదు. 75 ఏళ్ళ స్వాతంత్య్రం గానీ, 72 ఏళ్ళ రాజ్యాంగ రక్షణ గానీ ఇంకా ఆదివాసులకు రావాల్సినంత స్థాయిలో అందుబాటులోకి రాలేదు. సరిగ్గా ఈ సమయంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రా టిక్ అలయెన్స్ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ పేరును ప్రతిపాదించింది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందనేది పరిశీలకుల అభిప్రాయం. ద్రౌపదీ ముర్మూ సంతాల్ తెగకు చెందిన ఆదివాసీ మహిళ. భారతదేశంలోని ఆదివాసీ తెగలలో సంతాల్ తెగ జనాభా రీత్యా మూడవ అతిపెద్ద తెగ. ఆదివాసీ తెగలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యక్షంగా అధికారంలో లేనందువల్ల అక్కడి ఆదివాసీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలుచు కోవడం ద్వారా రాష్ట్రపతి గెలుపును సులభతరం చేసుకోవచ్చునని బీజేపీ భావించి నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజమే కావచ్చు. అంతే కాకుండా ఆదివాసుల పట్ల తమ ప్రభుత్వం ఎంతో చేస్తోందనీ, వారికి అనుకూలంగా ఉందని జాతీ యంగా, అంతర్జాతీయంగా చెప్పుకోవడానికి కూడా ద్రౌపదీ ముర్మూని ముందు భాగాన నిలిపి ఉండవచ్చు. అభిప్రాయాలేవైనా, కారణాలేమైనా ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేయడానికి బీజేపీ నిర్ణయించడం ఆహ్వానించదగినదే. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా ఉండబోతోంది. ఎన్డీయే ఇప్పటికే ఒక ముస్లింను, ఒక దళితుడిని రాష్ట్రపతిగా అందించింది. అయితే ముస్లింనూ, దళితుడినీ మొదటిగా రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కావడం విశేషం. ఒక వ్యక్తిని ముఖ్యంగా అణగారిన వర్గాలు, నిర్లక్ష్యానికి గురైన వర్గాలనుంచి ఏదైనా ఒక ముఖ్యమైన స్థానంలో నియమించినా, నిలబెట్టి గెలిపించినా, దాని ప్రయోజనం ఆ వ్యక్తికే పరిమితం కాకూడదనేది ప్రజాస్వామిక సూత్రం. ఒక సమూహానికి ఒక వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తే ఆ వ్యక్తికే కాక ఆ సమూహానికీ ప్రయోజనం చేకూరాలి. ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతిగా గెలిపించాలనే బీజేపీ సంకల్పం కేవలం ద్రౌపదీ ముర్మూ వ్యక్తిగత హోదాను పెంచడం, దానితో రాజకీయ ప్రయోజనం సాధించడం వరకు ఆగిపోకూడదు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి, దోపిడీ, అణచివేతకు గురైన ఆదివాసుల పట్ల ఒక ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమే కాదు, బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అప్పుడు మాత్రమే బీజేపీకి ఆదివాసుల పట్ల ప్రేమ ఉన్నట్లు అర్థం చేసుకోగలం. మిగతా సమాజంతో పోల్చి చూసినప్పుడు ఇప్పటి వరకు ఆదివాసుల జీవితాల్లో వచ్చిన మార్పు చాలా స్వల్పమే. నిజం మాట్లాడాలంటే శూన్యమనే చెప్పాలి. భారతదేశంలో దాదాపు ఒక లక్షా 50 వేల గూడేలున్నాయి. అందులో చాలా గూడేలకు సరైన మౌలిక వసతులు లేవనే విషయాన్ని నవంబర్ 18, 2019న నాటి ఆదివాసీ శాఖా మంత్రి అర్జున్ ముండా లోక్‌సభకు తెలియచేశారు. ఇదే సందర్భంలో మరిన్ని వాస్తవాలనూ ఆయన తెలిపారు. భారత్‌లో మొత్తం గృహాలు 24 కోట్ల 66 లక్షల 92 వేల ఉండగా, ఆదివాసులవి 2 కోట్ల 33 లక్షల ఇళ్ళున్నట్లు, దాదాపు ఒక కోటి యాభై లక్షల ఇళ్ళు సరైన రీతిలో లేవని తెలిపారు. మరుగుదొడ్లు అతి స్వల్పంగా నిర్మాణ మయ్యాయి. 70 శాతం పిల్లలు 10వ తరగతి నుంచే చదువులు మానేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే అన్ని తరగతుల్లో కలిపి ఆదివాసీలు 6 శాతానికి మించి లేరు. ఇందులో 4వ తరగతి చిన్నా చితకా ఉద్యోగాలే అధికం. ఆదివాసులు ఎక్కువగా మలేరియా, క్షయ వ్యాధులతో మరణిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో వంద మంది మలేరియా బారిన పడితే అందులో ఆదివాసులు 30 మంది ఉంటున్నారు. అదివాసీ జనాభాలో ఇది 50 శాతం. పిల్లలకు వ్యాక్సిన్ సదుపాయాలు అందలేకపోవడం వల్ల శిశు మరణాల సంఖ్య చాలా అధికంగా ఉంది. దాదాపు 50 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. క్షయ వ్యాధితో సగటు మరణాలు లక్ష జనాభాకు 256 మరణాలు కాగా, ఆదివాసులలో అవి మూడింతలు అంటే 750కి పైగా ఉన్నాయి. వీటితోపాటు, ఇటీవల దేశాభివృద్ధి పేరుతో ఆదివాసీ ప్రాంతాల్లో వెలుస్తున్న మైనింగ్, రోడ్లు, పరిశ్రమలు, ఇతర ఆదివాసీయేతర వ్యక్తులు నెలకొల్పుతున్న సంస్థల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. (క్లిక్: ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి ఇన్నేళ్లా?) ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిన బీజేపీ, దాని నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఆదివాసీల ప్రగతి, సంక్షేమం పట్ల, వారికి గౌరవంగా జీవించే హక్కును గ్యారంటీ చేసే విషయంలో శ్రద్ధ వహివంచక పోతే ఇది మరొక విఫల ప్రయోగం కాకతప్పదు. (క్లిక్: సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
కీడు గుడిసె.. మనసును కదిలించే కథ
తూర్పు కనుమలు ఆ చలికాలపు ఉదయాన మంచుముసుగు కప్పుకున్నాయి. చెట్టూపుట్టలూ, పశుపక్ష్యాదులూ మంచులో తడిసిముద్దయి చలికి వణుకుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో, దట్టమైన కీకారణ్యంలో ఎతై ్తన కొండలమీదుంది ఆ గూడెం. నాగరికతకు చాలా దూరంగా వున్న ఆ గూడెంలో ఒక గిరిజన తెగకు చెందిన ఇరవైమూడు కుటుంబాలు.. అనాదిగా వస్తున్న ఆచారాలను, కట్టుబాట్లను గౌరవిస్తూ జీవనం సాగిస్తున్నాయి. గూడేనికి కాస్త ఎడంగా, చుట్టూ రక్షణగోడలా వున్న వెదురుతడికల మధ్య వుంది ఆ గుడిసె. అందులో వెదురుబొంగులతో కట్టిన అటకమీద ముడుచుకుని పడుకున్న సోము చలికి గజగజా వణికిపోతున్నాడు. చలిపులి గుండెల్లోకి దూరి గిలిగింతలు పెడుతుంటే... భార్య సిసిరి గురించిన ఆలోచనలు అతని మనసును ముసురుతుంటే... నిద్రెలా పడుతుంది? హఠాత్తుగా ఏదో ఆక్రందన చెవికి సోగ్గానే దిగ్గున లేచి, అటక దిగాడు సోము. బయట మంచు తప్ప ఏం కనిపించ లేదు, వినిపించ లేదు. ‘అంత నా బెమ’ అనుకున్నాడు. గుడెసెలో ఓ మూలనున్న పొయ్యి దగ్గరికెళ్లి ముట్టించాడు. చిన్న మంట వెచ్చగా తగిలి ప్రాణం లేచొచ్చింది. చలి కాగుతుంటే అతడికి సిసిరి గుర్తుకొచ్చింది మళ్లీ. ‘యీ సలిలో అదెట్టావుందో ఏటో?’ అనుకుంటూ బాధగా నిట్టూర్చాడు. ‘ఆలుమగలను ఇడదీసే యీ ఆసారమేటి? దాన్నట్టుకుని గూడెం పెద్ద యాలాడ్డమేటి?’ అనుకుంటూ మొహం చిరాగ్గాపెట్టాడు. పక్క పక్క గూడేలకు చెందిన సోము, సిసిరి ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఇరు గూడేల పెద్దలను తమ మనువుకు ఒప్పించారు. ఆచారం ప్రకారం మనువుకు ముందు గుడిసెకట్టి ఆనక మనువాడారు. ఆ కొత్తగుడిసెలో కాపురం పెట్టి యేడాదిన్నరయింది. నిరంతరం ఒకరినొకరు అంటిపెట్టుకునుండే వారిద్దరినీ, సిసిరి నెలసరి సమయంలో తమ కీడు ఆచారం విడదీసేది. దాంతో ఆ ఆచారం పట్ల సోముకు ఎక్కడలేని కోపమూ వచ్చేది. సిసిరిని ఆచారం తప్పమనేవాడు. ‘గూడెం కట్టుబాటు దప్పితే తొప్పు గట్టాలి గదా మావ’ అని నచ్చచెప్పేది సిసిరి. కీడు గుడిసెకు వెళ్ళి, అక్కడ మూడ్రోజులుండి వచ్చేది. ప్రస్తుతం సిసిరి నిండు చూలాలు! దాంతో ఆమె మకాం కొద్దిరోజులక్రితం కీడు గుడిసెకు మారింది మళ్లీ. రెండునెలలు అక్కడే వుంటుంది. కొన్ని గిరిజన తెగల్లో వుండే ఆ ఆచారం.. సోము వాళ్ల తెగలోనూ వుంది. స్త్రీలు నెలసరి అయితే మూడ్రోజులు, గర్భిణీలు, రజస్వలైనవాళ్లు రెండునెలలు గూడేనికి కాస్త దూరంలో వుండే కీడు గుడిసెలో వుండాలి. వారు గూడెంలో వుంటే వారి కీడు (మైల) గూడేనికి అశుభం కలిగిస్తుందని భావిస్తారు. వారు ఆ కీడు గుడిసెలోనే వుంటూ, వారికి కేటాయించిన దారుల్లోనే బయటకెళ్లి రావాలి. వారికి వారి బంధువులైన స్త్రీలు తింటానికి పట్టుకెళ్లిస్తారు. ఎవరైనా ఆచారం తప్పితే శిక్షలు కఠినంగా వుంటాయి. గూడెం నుంచి నిర్దాక్షిణ్యంగా వెలివేస్తారు. పురుడుకోసం కీడు గుడిసెలోకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా గూడేనికి తిరిగొస్తారన్నది సందేహమే! కీడు గుడిసెలో మంత్రసాని పురుళ్లు పోస్తుంది. ఒక్కోసారి కాన్పు కష్టమై ప్రాణాలమీదకు వచ్చినా సరే ఆసుపత్రికి తీసుకెళ్లరు. బలవంతంగా మోటుపద్ధతుల్లో కాన్పు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో కీడు గుడిసెలోనే కన్నుమూసిన అభాగ్యులెందరో? సోము అలాంటి సంఘటనలు ఎన్నో చూశాడు. మరెన్నో విన్నాడు. అందుకే అతడు భయపడుతున్నాడు. చలి కాగుతూ సిసిరికి ఏం కాకూడదని కొండదేవతను వేడుకుంటున్నాడు. తమ ఆచారాల్లో కొన్నింటిని మూఢాచారాలుగా భావిస్తాడు సోము. అడవిలో తాము సేకరించినవి అమ్మి కావలసిన సరుకులు తెచ్చుకోవడంకోసం.. అప్పుడప్పుడు అతడు సమీప పట్టణంలోకి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడల్లా పట్టణ ప్రజల జీవనవిధానాన్ని పరిశీలించేవాడు. అక్కడ కీడు గుడిసె ఆచారంతోపాటు తాము పాటిస్తున్న మరికొన్ని ఆచారాలూ లేవని గ్రహించేవాడు. ఆ విషయాలను తన నేస్తాలతో చెప్పి బాధపడేవాడు. ఓ రోజు గూడెం పెద్ద గుర్రప్ప, కీడు గుడిసెకు మరమ్మత్తులు చేయడానికి మనుషులను పురమాయిస్తుంటే సోము ధైర్యంచేసి, ‘పట్నంల యాడ ఇట్టాంటి కీడు ఆసారం నేదు. మనంగూడ మానుకుందాం’ అన్నాడు. గుర్రప్ప గుర్రుగా చూసి ‘నక్కబుట్టి నాలుగువోరాలు గానేదు, యీ గాలీవోన యెన్నడు సూడనేదన్నదంట. అట్టాగుంది నీ యెవ్వారం. మూతిమీద మీసమే సరిగ్గ రానేదు పెద్దకొబుర్లు ఆడేతున్నవు’ వెటకారంగా అన్నాడు.‘ఆడోల్ని ఇబ్బందెట్టే, ఆల్ల పేనంమ్మీదకు దెచ్చే ఆసారం యెంతసెడ్డదో తెల్డానికి మీసమే రానొవసరం నేదు’ అన్నాడు సోము ఆవేశంగా. గుర్రప్ప అగ్గిమీద గుగ్గిలమైపోయాడు. ‘ఏట్రా... ఇప్పసారా తల కెక్కేసినదేటి? ఏటేటో వోగుతున్నవు. గూడెం బాగు కోసరం మన పెద్దోల్లెట్టిన ఆసారం మనం పాటించల. మానుకుంతే కొండదేవతకు కోపమొస్తది. ఆసారం దప్పినప్పుడల్ల గూడెంల పీనుగులెగుతున్న ఇసయం నీకుతెల్ద? మల్ల ఇట్టాగ ఆసారాన్ని ఎటకారంసేత్తే గూడెం పెద్దగ ఏటిసేయాల్నో అదే సేస్తను’ అంటూ హెచ్చరించాడు. అందుకే సోము మళ్లా ఆ మాట ఎత్తలేదు. ‘ఒరే సోముగే... లెగిసినవ... గుర్రెట్టుకొని నిద్రోతున్నవ?’ అంటూ గుడిసెలోకి దూరాడు సోము అయ్య కన్నప్ప. చలి కాగుతున్న సోము ‘నిద్రడితేనే కదర నిద్రోడనికి... సిసిరికి ఎట్టుందో తెలిసినదేటి?’ ఆత్రుతగా అడిగాడు. ‘అది సెప్పడనికే వొచ్చినను. సిసిరి పెరిస్తితి ఏం బాగోనేదంట. కాన్పుసేయడం కట్టమని మంత్రసాని అందంట. కోడలికేటవుతాదోనని మీయమ్మ రాగాలుదీత్తు నెత్తిబాదుకుంతున్నది’ చెప్పాడు కన్నప్ప. అది విని సోము భయంతో వణికిపోయాడు. సిసిరికి ఏం కాకూడదని తమ దేవతలకు మొరపెట్టుకుని ‘ఒరే అయ్య... మరిప్పుడేటి సేయడం?’ అన్నాడు బేలగా. ‘సేసేదేటుందిర. సిసిరికి ఏటిగాకుండ కాన్పయితే కొండదేవతకు అడవిపందిని బలిత్తమని మొక్కీసుకోడమే! అంతకుమించి మనం సేసేది ఏటినేదు’ అన్నాడు కన్నప్ప విచారంగా. ‘ఒరే అయ్య... అలాగనకుర. సిసిరి నా పేనం! అది సావగూడదు. ఆలిస్యెం సెయ్యకుండ ఆసుపెత్రికి దీస్కుపోదం. దాన్ని బతికించుకుందం’ అన్నాడు సోము ఏడుస్తూ. ‘నీకేటి మతిపోనదేటిర... గూడెం ఆసారం నీకు తెల్దేటి? కిందటేడు కాసమ్మ కాన్పు జెరక్క గిలగిల కొట్టుకుంతుంటే, దాని పెనిమిటి కొండప్ప ఆసుపెత్రికి దీస్కుపోతన్నడు. గుర్రప్ప ఒప్పుకున్నడేటి? ఆసారం దప్పుతావేట్ర ఎదవనాయాలంటు గయ్యిన లేసినడు గద...’ ‘పేనం కంటే ఆసారం గొప్పదేటి? నాకు సిసిరికంటే మరేటి గొప్పది గాదు. దాన్ని బతికించుకుందానికి నాను ఆసారం దప్పుతను. గుర్రప్ప ఏటిసేస్తడో సేసుకోమను’ తెగింపుగా అన్నాడు సోము. ‘గుర్రప్ప దయదాచ్చన్యంనేనోడు. గూడెం కట్టుబాటు దప్పితే సిచ్చేసి, ఎలేస్తడు. గూడెం ఇడిసి మనం బతకలేం. దేవతమీద బారమేసి వొల్లకుండడమే’ నచ్చజెప్తూ అన్నాడు కన్నప్ప. ‘ఎలేస్తడని బయిపడితే సిసిరి సస్తది. సిసిరికి ఉసురుంతే ఈడగాకబోతే ఏడన్న బతుకుతం. ఒరే అయ్య... నా మాటిని సాయం సెయ్య. సిసిరిని డోలీగట్టుకుని ఆసుపెత్రికి దీస్కుపోదం’ దీనంగా బతిమాలాడు సోము. గూడెం కట్టుబాటు తప్పడమంటే గుర్రప్ప ఆగ్రహానికి గురికావడమే! అయితే కొడుకు బాధను చూడలేకపోయాడు కన్నప్ప. ఆచారం కోసం కోడల్ని చంపుకోవడం ఆయనకూ ఇష్టం లేదు. ‘సరే బయిలెల్లయితే’ అంటూ డోలీ కట్టడానికి దుప్పట్లు, పొడవైన వెదురుబొంగు అందుకున్నాడు. సోము గాబరాగా అటకెక్కి పెట్టెలో దాచుకున్న డబ్బులను మొల్లో దోపుకున్నాడు. డోలీ ముందు కొమ్ము కన్నప్ప, వెనుక కొమ్ము సోము భుజాలమీద వుంచుకుని మోసుకుపోతున్నారు. మంచును చీల్చుకుంటూ, రాయీరప్పను దాటుకుంటూ, తుప్పలు డొంకలను తప్పించుకుంటూ దూసుకుపోతున్నారు. డోలీకి పక్కగా సోము అమ్మ నారమ్మ కంగారుగా నడుస్తోంది. ఏ క్షణంలో గుర్రప్పొచ్చి తమను అడ్డుకుంటాడోనని ఆమె భయపడుతోంది. మరోపక్క సిసిరిని ఆపదనుంచి గట్టెక్కించమని కొండదేవతకు పదేపదే మొరపెట్టుకుంటోంది. సిసిరి మూలుగు తప్ప మరే శబ్దమూలేని ఆ అడవిలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆయాసపడుతూ అడుగులేస్తున్న కన్నప్ప, సోము హఠాత్తుగా ఆగిపోయారు. ఓ అమ్ము వారిపక్క నుంచి రివ్వున దూసుకొచ్చి ఎదురుగా ఉన్న జువ్విచెట్టుకు గుచ్చుకుంది. వెనక్కి తిరిగి చూసి హడలిపోయారు. ముంచుకొస్తున్న విపత్తును చూసి నారమ్మ గుండెలు బాదుకుంటూ కూలబడిపోయింది. అల్లంత దూరంలో గుర్రప్ప, విల్లంబులు పట్టుకుని, గూడెం ప్రజలను వెంటేసుకుని వడివడిగా అడుగులేస్తూ వస్తున్నాడు. ఆ దృశ్యం చూసి కన్నప్ప, సోము జడుసుకుని డోలీని కిందకు దించారు. గుర్రప్ప వస్తూనే కన్నప్పను మెడపట్టుకొని పక్కనున్న డొంకలోకి తోసేశాడు. నారమ్మ వైపు కొరకొర చూసి బండబూతులు తిట్టాడు. సోమును పట్టుకొని చెంపలు వాయించేశాడు. ‘ఏరా గుంటనాయాల... గూడెం కట్టుబాటును దప్పే దయిర్యం వొచ్చేసిందన్న మాట నీకు’ అంటూ నిప్పులు కక్కాడు. సోము గుర్రప్ప కాళ్ళమీద పడిపోయాడు ‘నీకు దన్నం పెడత గుర్రప్ప. సిసిరికి వయిద్యమందకబోతే సచ్చిపోద్ది. ఈ పాలికి మా తొప్పుకాసి ఒగ్గియ్యి’ అంటూ. ‘ఒగ్గియ్యిడానికేట్ర... మామంత పరుగు పరుగునొచ్చింది? ఆసారం కాపాడుకోటానికి’ గుర్రప్ప కోపంగా అన్నాడు. సోము ధైర్యం కూడగట్టుకొని ‘ మడిసి పేనాలు తీసే ఆసారం మాకొద్దు. కాలం మారినది గుర్రప్ప. దిగువున సాన గూడేలు మార్నయి. మనము మారదం’ అన్నాడు. ‘గుంటడు సెప్పే కొబుర్లు ఇనీడానికి నానేమి ఎర్రి మేకనుగాదు, మేకల్ని నమిలేసే పెద్దపులిని! గూడెం పెద్దగ ఆసారాన్ని రచ్చించడం కోసరం ఎంతకైన తెగిత్తను.’ డొంకలో పడ్డ కన్నప్ప నెమ్మదిగా లేచి.. ‘గుర్రప్ప... కోపమిడిసి సాంతంగ ఆలోసించు. ఇంతవొరకు ఆసారం కోసరం ఎందరో ఆడకూతుర్ల ఉసురోసుకున్నం. పురుడు రాక గిలగిలకొట్టుకుంతున్న సిసిరిని బతికించుకుందం. కూస్త పెద్దమనుసు సేసుకుని మమ్ము ఆసుపెత్రికి అంపు’ బతిమాలుతూ అన్నాడు. ‘అరే కన్నప్ప... ఉప్పుడువొరకు కట్టుబాట్లకు అడ్డుసెప్పని నువ్వు, నీవొరకు వొచ్చేసరికి ఆటిని దప్పమంతన్నవు. నీకో నాయం, మరోల్లకింకో నాయం సేయమంతున్నవు? ఇలగయితే రేపు మరోడు మరో ఆసారం దప్పుతడు. అప్పుడు గూడ నాను సూస్తు కూకోవల? గూడెం ఆసారాలు, కట్టుబాట్లు అందరు ఆచెరించాల్సిందే!’ అన్నాడు గుర్రప్ప కళ్ళెర్రజేసి. మంచు క్రమంగా తొలగిపోతోంది. సూర్యకిరణాలు చెట్ల మధ్య నుంచి విచ్చుకుంటున్నాయి. ప్రసవ వేదనతో సిసిరి గింజుకుంటోంది. గుర్రప్ప సిసిరిని సమీపించి ‘నొప్పులోర్సుకుని కులదేవతకు మొక్కుకోయే. నీకేటిగాదు’ అంటూ ధైర్యం చెప్పి, డోలీని కీడు గుడిసెకు చేర్చమని ఓ ఇద్దరు యువకులకు పురమాయించాడు. వారు డోలీని భుజాలకెత్తుకుంటుంటే సోము, కన్నప్ప ఏడుస్తూ అడ్డుపడ్డారు. వారిని అక్కడున్న మగోళ్ళు తలోమాటతో దూషిస్తూ పక్కకు లాగారు. ఆడోళ్ళు చోద్యం చూస్తూ నిల్చున్నారు. అంతలో ఆ ఆడోళ్ళ మధ్యనున్న గుర్రప్ప పెళ్ళాం చుక్కమ్మ, జుట్టు విరబోసుకుని గట్టిగా అరుస్తూ పూనకంతో ఊగిపోతుంది. ఆమెకు తమ కులదేవత పూనిందని, ఎవరో వేపకొమ్మలు విరిచి ఆమె చేతిలో పెట్టారు. ఆమె తల గుండ్రంగా ఊపుతూ, రాగాలు తీస్తూ ‘నాను కొండదేవతన్రో గుర్రప్ప... నువ్వు తొప్పు సేత్తున్నవ్రో... తొప్పు సేత్తున్నవు’ అంటూ గుర్రప్పను వేపకొమ్మలతో కొడుతోంది. ఆడోళ్ళు చుక్కమ్మను గట్టిగా పట్టుకుని ‘తల్లీ... అమ్మా... తొప్పేటో సెప్పు తల్లీ. సెప్పు...’ అని అడుగుతున్నారు. చుక్కమ్మ రౌద్రంగా మొహంపెట్టి ‘సిసిరి నా బిడ్డరో బిడ్డ. అది పాపం పున్నెం దెలీని పిల్లరో... అది గూడేనికి ఎలుగురో... దాని కడుపులో బిడ్డ అడ్డం దిరిగినదిరో... దాన్ని ఆసుపెత్రికి దీసుకుబోనివ్వడ్రో... అది సస్తే గూడేనికి సేటుకాలమొస్తదిరో... గూడెం వొల్లకాడవుద్దిరో... నా మాటినికొండ్రో...’ అంటూ రాగాలు తీసి చెప్తూ, హఠాత్తుగా సొమ్మసిల్లి కింద పడిపోయింది. అది విని గుర్రప్పతో సహా అంతా కొయ్యబారిపోయారు. ఏనాడూ చుక్కమ్మ మీదకు రాని కులదేవత, ఇప్పుడిలా వచ్చి చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. సిసిరి చచ్చిపోతే గూడేనికి అరిష్టమని అంతా ఊసులెట్టుకున్నారు. గుర్రప్ప తెగ భయపడిపోయాడు. ఆకాశంలోకి చూసి దండం పెడుతూ ‘తప్పైపోనది, సెమించు తల్లీ... గూడెమ్మీద గుర్రెట్టుకోకు. దయిసూపు తల్లీ... నువ్వు సెప్పినట్టే సిసిరిని ఆసుపెత్రికి దీస్కుబోతం’ అని లెంపలేసుకున్నాడు. సిసిరిని ఆసుపత్రికి తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు. అంతే.. సోము, కన్నప్ప వేగంగా కదిలి డోలీని భుజాలకెత్తుకొని పరుగందుకున్నారు. నారమ్మతోపాటు గూడెంలోని కొందరు .. సాయంగా డోలీవెంట నడిచారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సిసిరిని చేర్చారు. డాక్టర్లు వెంటనే వైద్యం అందించారు. ఆపరేషన్ చేసి, తల్లీబిడ్డను కాపాడారు. చలికాలం గడిచి, ఎండాకాలం ఆఖరుకొచ్చింది.. ఓ రోజు ఉదయం సోము గుడిసెలో ఒంటరిగా కూర్చుని, మూడ్రోజుల కిందట కీడు గుడిసెకెళ్లిన సిసిరికోసం ఎదురుచూస్తున్నాడు. కాసేపటికి తలారా స్నానంచేసి బిడ్డను చంకనేసుకుని వచ్చింది సిసిరి. సోము పక్కన కూర్చుని ‘ఎవురుతోటి సెప్పనంటే నీకో రహస్యెం సెప్పుతను!’ అంది నెమ్మదిగా. ‘సెప్పనుగనీ ఏటా రహస్యెం?’ అడిగాడు ఆత్రుతగా సోము. ‘సుక్కమ్మ నిన్న కీడు గుడిసెకొచ్చినది. ఎవురుతోటి సెప్పొద్దని రేత్రి ఓ రహస్యెం సెవినేసింది. ఆ రోజున సుక్కమ్మమీదన నిజెంగ కొండదేవత పూన్లేదంట. నా పేనాలుగాపాడానికి ఇంకో మార్గంనేక దేవతకు సెమాపన సెప్పి అట్టా నాటకమాడినదంట. ఇన్నాక నా కల్లమ్మట నీల్లొచ్చిసినయి. సుక్కమ్మ కాల్లమీద పడిపోనను’ చెప్పింది ఉద్విగ్నంగా. అది విని సోము ఆశ్చర్యపోయాడు. చుక్కమ్మ చేసిన సాయానికి అతడి మనసు పులకించింది. గూడెం ఆచారాలకు, కట్టుబాట్లకు గుర్రప్ప ఇంటిలోనే వ్యతిరేకత మొదలైంది. ఇక తమ మూఢాచారాలకు త్వరలోనే చెల్లుచీటి పడుతుందని భావించాడు. సిసిరి ఒళ్ళోని బిడ్డను ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని ‘సిట్టితల్లీ... మీయమ్మడుతున్న ఇక్కట్లు సూసి, ఆడబుట్టుక బుట్టినానని బెంగెట్టుకోకు... నువ్వు పెద్దయ్యేసెరికి యీ ఆసారాలేం వుండవునే. గూడెం పెద్దతోనే కీడు గుడిసెకు అగ్గెట్టేసే రోజు తొందర్లోనే వస్తది. ఆ రోజు కోసరం నాను పోరాడతనేవుంట’ అన్నాడు దృఢంగా, ఆశగా. ఆ చంటిబిడ్డకు ఏమర్థమయిందో తండ్రివైపు చూస్తూ బోసినవ్వు నవ్వింది. -బొడ్డేడ బలరామస్వామి -
అంతర్జాతీయ క్రీడా పోటీల్లో గిరిజన యువకుల సత్తా
అనంతగిరి/ జి.మాడుగుల/ చింతూరు: (అల్లూరి సీతారామరాజు జిల్లా): జిల్లాలోని అనంతగిరి, జి.మాడుగుల, చింతూరు మండలాలకు చెందిన గిరిజన యువకులు నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన యూత్‌గేమ్స్ ఇండో, నేపాల్ ఇంటర్నేషనల్ సిరీస్–2022 పోటీల్లో సత్తా చాటారు. ఈనెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయతీ వెన్నెల గ్రామానికి చెందిన ప్రభూషణరావు అండర్–19 విభాగంలో సింగిల్స్, డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. అలాగే చింతూరుకు చెందిన కారం చక్రియవర్ధన్ రెండు గోల్డ్‌మెడల్స్ సాధించాడు. బ్యాడ్మింటన్ అండర్–17 విభాగం సింగిల్స్‌లో చక్రియవర్ధన్ గోల్డ్‌మెడల్ సాధించగా, రంపచోడవరానికి చెందిన లతిక్‌తో కలసి డబుల్స్ విభాగంలోనూ గోల్డ్‌మెడల్ సాధించాడు. అలాగే అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీకి చెందిన పాంగి గౌతమ్ షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో బంగారు పతకం సాధించాడు. అనంతగిరి పంచాయతీ పెద్దూరు గ్రామానికి చెందిన కమిడి సూర్య, గౌతమ్ కలిసి డబుల్స్‌లో రజత పతకాన్ని సాధించారు. (క్లిక్: అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన్యం యువకుల సత్తా) -
గిరిజనులపై ప్రభుత్వం మొసలి కన్నీరు: ఆర్ఎస్పీ
భద్రాచలంఅర్బన్: గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం భద్రాచలం చేరుకుంది. మొదట అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్య ప్రజలను, బస్‌పాస్ చార్జీలు పెంచి విద్యార్థులను ఇబ్బంది పెడుతోందన్నారు. రాష్ట్రంలో ‘మన ఊరు – మన బడి’కార్యక్రమానికి సంవత్సరానికి రూ.7,800కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ నిధులతో బడులు బాగుపడటమేమో కానీ.. కాంట్రాక్టర్లు బాగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఎన్నికల డ్రామానేనని విమర్శించారు. భద్రాద్రి జిల్లాలో పోడు భూముల సమస్య అధికంగా ఉందన్న ఆర్ఎస్పీ ఈ సమస్య పరిష్కరిస్తానని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేశారు. -
రికార్డ్: నజియ విజయం
ఎక్కడి కేరళ, ఎక్కడి మహారాష్ట్ర! కానీ కళకు దూరం ఎప్పుడూ భారం కాదు అని నిరూపించింది నజియ నవస్. తిరువనంతపురం(కేరళ)కు చెందిన నజియ ఇంటర్నెట్లో ఒకసారి వర్లీ పెయింటింగ్‌లను చూసి అబ్బురపడింది. మహారాష్ట్రలో ప్రసిద్ధి పొందిన వర్లీ ఆర్ట్ తనను ఎంత ఆకట్టుకుందంటే ఎలాగైనా సరే ఆ ఆర్ట్ నేర్చుకోవాలి అనుకునేంతగా! అనుకోవడానికేం... ఎన్నయినా అనుకుంటుంటాం. మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాలకు వెళ్లి వర్లీ నేర్చుకోవడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే అంతర్జాలాన్నే గురువుగా భావించి సాధన మొదలు పెట్టింది. దానికి ముందు ఎన్నో విషయాలను చదివి తెలుసుకుంది. వర్లీ కళ అనేది అసామాన్య చిత్రకారుల సృష్టిలో నుంచి వచ్చింది కాదు. సామాన్య గిరిజనులే దాని సృష్టికర్తలు. మట్టిగుడిసెలను తమకు తోచిన కళతో అలంకరించేవారు. నిత్యం అందుబాటులో ఉన్న వస్తువులనే పెయింటింగ్స్ కోసం వాడేవారు. తరాలు మారుతున్న కొద్దీ ఈ కళ మరింత విస్తృతి పొందింది. విశేషం ఏమింటే వర్లీ చిత్రాలలో ప్రకృతి ప్రధాన వస్తువుగా కనిపిస్తుంది. ప్రకృతికి మనిషికి మధ్య ఉండే సంబంధాలను అవి చిత్రీకరిస్తాయి. వర్లీ కళకు సంబంధించి రకాల విషయాలు తెలుసుకునే క్రమంలో ఎలాగైనా నేర్చుకోవాలనే పట్టుదల నజియాలో పదింతలైంది. ఎట్టకేలకు తనకు ఇష్టమైన కళలలో పట్టు సాధించింది. ఇప్పటివరకు వందకు పైగా వర్లీ పెయింటింగ్స్ వేసింది. డిగ్రీ పూర్తి చేసిన నజియాకు తన అభిరుచి ఆదాయ మార్గంగా కూడా మారింది. ఆన్లైన్లో తన వర్లీ పెయింటింగ్‌లు అమ్ముతుంది. తాజాగా 5 అంగుళాల పొడవు, వెడల్పైన వర్లీ పెయింటింగ్‌తో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది నజియ. గతంలో ఉన్న పది అంగుళాల పొడవు, వెడల్పయిన వర్లీ పెయింటింగ్ రికార్డ్‌ను నజియ బ్రేక్ చేసింది. ‘నేర్చుకున్నది చాలు’ అని అనుకోవడం లేదు నజియ. ముంబైకి వెళ్లి ఆ కళలో మరిన్ని మెళకువలు నేర్చుకోవాలనుకుంటుంది. ‘కళను పట్టుదలగా నేర్చుకోవాలి. ఉదారంగా పంచాలి’ అంటారు. వర్లీ కళను సొంతంగా నేర్చుకున్న నజియ ఇప్పుడు ఆ కళను ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగా నేర్పించడానికి రెడీ అవుతుంది. -
ఆదివాసీ అస్తిత్వాలకు గొడ్డలిపెట్టు
జనాభాలో 12 కోట్ల పైచిలుకు ఉన్న అమాయక ఆదివాసీ ప్రజలకు హిందూ అస్తిత్వాన్ని అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. జనగణనలో ఆదివాసీలను హిందువులుగా నమోదుచేస్తూ... వారి చారిత్రక అస్తిత్వాన్ని మాయం చేస్తున్న వైనం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కుల వ్యవస్థ పునాదిగా ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ నినాదంతో సాగుతున్న సాంఘిక పునర్నిర్మాణ జగన్నాథ రథ చక్రాల కింద ‘బహుళ అస్తిత్వాల’ భారతీయ సమాజం నలిగిపోతోంది. ఈ దేశ బహుళత్వాన్ని అంతర్థానం చేయడం ద్వారా, అతి పెద్ద ఓటు బ్యాంకును సంఘటితం చేస్తున్నారు. అనేక జాతులు, కులాలు, మతాలుగా ఉన్న భారతీయులు తమ తమ సాముదాయక అస్తిత్వాలను కాపాడుకోవడానికి పోరాటాలకు దిగాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కోట్లమంది మూలవాసులు కేవలం తమ అస్తిత్వం కోసమే పోరాడాల్సిన పరిస్థితి దాపురించింది. కులం, మతం, ప్రాంతం, జాతి, భాష, జెండర్ తదితర బహుళ అస్తిత్వాలు అంశీభూతాలుగా ఉన్న భార తీయ సమాజం... నేడు అస్తిత్వ వైషమ్యాల సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. పాలక, ఆధిపత్య అస్తిత్వాలూ; అణగారిన అస్తిత్వాల మధ్య ఒక విధమైన యుద్ధ వాతావరణం నెలకొంది. దళిత, బహుజన సామాజిక సమూహాలూ; ముస్లిం తదితర మైనారిటీ సమూహాలూ నేడు మెజారిటీ మత, కుల అస్తిత్వ దాష్టీకానికీ, విద్వేషకాండకూ గురవుతున్నాయి. కుల వ్యవస్థ పునాదిగా ఉన్న ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ అనే నినాదంతో సాగుతున్న సాంఘిక పునర్నిర్మాణ జగన్నాథ రథ చక్రాల కింద బహుళ అస్తిత్వాల భారతీయ సమాజం బీటలు వారుతోంది. 2024 నాటికి దేశ జనగణన డిజిటైజేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్న సర్వే వివాదాస్పదంగా మారింది. కుల గణన జరగాలని ఓబీసీలు ఉద్యమిస్తున్నారు. లింగాయత్ తదితర అస్తిత్వ సమూహాలు తమను హిందూ మతంలో భాగంగా కాక, ప్రత్యేక మైనారిటీ మతస్థులుగా గుర్తించాలని 20వ శతాబ్దం ప్రారంభం నుంచీ డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించాయి. ఇప్పుడు అత్యంత నిశ్శబ్దంగా దేశ జనాభాలో 8.6 శాతంగా ఉన్న ఆదివాసీ సమూహాల అస్తిత్వ ఆకాంక్షలను ధ్వంసం చేస్తూ జనగణన సాగిస్తు న్నారు. ఆదివాసీ ప్రజానీకాన్ని హిందువులుగా చిత్రించడానికి వారి దేవతలను సైతం హైందవీకరిస్తున్నారు. అందుకు ఇటీవలి ఉదాహ రణ కోయల కులదేవత సమ్మక్కను హిందూ దేవతను చేస్తున్న వైనం! జనగణన సమయంలో ఆదివాసులు తమను హిందువులుగా నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’లో ఈ దేశ బహుళత్వాన్ని అంతర్థానం చేయడం ద్వారా, అతిపెద్ద ఓటు బ్యాంకును సంఘటితం చేస్తున్నారు. తద్వారా కేంద్రీకృత అధికారాన్ని సుస్థిరం చేయాలని మెజారిటీ మతతత్వ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగమే... దేశ జనాభాలో 12 కోట్ల పైచిలుకు ఉన్న అమాయక ఆదివాసీ ప్రజలకు హిందూ అస్తిత్వాన్ని అంటగట్టే ప్రయత్నం! షెడ్యూల్డ్ తెగలుగా రాజ్యాంగంలో వర్గీకరణకు గురైన ఆదివాసీ ప్రజల్లో చాలామంది హిందూ, క్రైస్తవం, ఇస్లాం మత శాఖల్లో అంతర్భాగం అయినప్పటికీ... ఇప్పటికీ గణనీయమైన సంఖ్యలో సాంప్రదాయిక ఆదివాసీ మతస్థులుగానే కొనసాగుతున్నారు. 2011 జనగణన ప్రకారం ఆనాటి 121 కోట్ల మంది జనాభాలో 79 లక్షల మంది హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధం, జైన మతాలకు చెందినవారు కాదు. నాస్తికులు, జొరాస్ట్రియన్లు, యూదులు, నిర్దిష్ట, అనిర్దిష్ట ఆదివాసీ మతాలకు చెందిన వారినందరినీ కలిపి ‘ఇతర మతాలు, విశ్వాసాలు’ అనే వర్గీకరణ కింద చేర్చారు. జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాల పరిధిలోని ఛోటానాగ్పూర్ పీఠభూమి ప్రాంతానికి చెందిన ముండా, భూమిజ్, ఖారియా, బైగా, హో, కురుఖ్, సంతాల్ తెగలకు చెందిన ప్రజలు సంప్రదాయిక చారి త్రక సంలీన మతమైన ‘సార్నాయిజం’కు చెందినవారు. సార్నా మతస్థులు 49 లక్షల మంది, సారి ధమ్మ 5 లక్షలు మంది ఉన్నారనీ; వీరితో పాటు వీరికి తోడు సంతాల్, కోయపూనెమ్, దోన్యీ– పోలోయిజం, సానామహిజం, ఖాసీ, నియామ్త్రే అనే మత విశ్వాసా లున్నట్టు 2011 జనగణనలో నమోదయ్యింది. ఆదివాసీ మతం, ప్రకృతి మతం, ‘సర్వాత్మ వాదం’ విశ్వాసులు కూడా ఉన్నట్టు అందులో నమోదు చేశారు. ఇంతటి వైవిధ్యం గల ఆదివాసీ ప్రజలను రాజకీయ దురు ద్దేశాల నేపథ్యంలో చారిత్రక అస్తిత్వ రహితులుగా మార్చివేసేందుకు పాలకులు ప్రయత్నిస్తుండటం అన్యాయం. వివిధ విశ్వాసాలు, ఆలోచనా ధోరణులు సామాజిక పరిణామ క్రమంలో సమకాలీన పాలక వర్గాల, ప్రజల అవసరాలకు అను గుణంగా ‘చారిత్రక సంలీనం’కు గురయ్యాయి. ఆయా జాతుల, తెగల, రాజ్యాల, సామ్రాజ్యాల పాలకవర్గాల అవసరాలకు అను గుణంగా చారిత్రక సంలీనం మెజారిటీ మతానికి చెందిన పాలకుల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసేందుకు ఉపకరించేది. అలాంటి సంలీనం చారిత్రకంగా ప్రతీఘాతుక పాత్ర నిర్వహిస్తుంది. గ్రీకో– ఈజిప్షియన్, హెలినిస్టిక్ కాలంలో, గ్రీకో– రోమన్ మత చారిత్రక సంలీనాలు; షింటో–బౌద్ధం; అక్బర్ స్థాపించిన దీన్ –ఇ– ఇలాహి మతం; జర్మానిక్– సెల్టిక్– క్రిస్టియన్ మత విశ్వాసాల సంలీనాలు; నాజీ జర్మనీలో హిట్లర్ ప్రోత్సహించిన ‘జర్మన్ ఎవలాంజికల్ చర్చ్’; రష్యాలో ప్రతీఘాతుక విప్లవం కోసం ఏర్పాటైన ‘లివింగ్ చర్చ్’ అనే ఉద్యమం... అన్నీ కూడా మత చారిత్రక సంలీనాలే. ఇవన్నీ రాజ్య సుస్థిరత కోసం పాలకుల ప్రోత్సాహంతో ఏర్పాటైన మత చారిత్రక సంలీనాలు. ఈ నేపథ్యంలోనే నేడు ఇండియా వ్యాప్తంగా ‘ఏకీకృత హిందూ అస్తిత్వ’ కార్యక్రమం కూడా ఒక మత చారిత్రక సంలీనమే! భారతీయ న్యాయవ్యవస్థ ప్రకారం స్థానిక లేదా మూలవాసీ మతాలన్నీ హిందూ మతం పరిధిలోకి వస్తాయి. వైదిక మతాలు మాత్రమే హిందూ మతం కిందికి వస్తాయని రాజ్యాంగం గుర్తించక పోవడం వల్ల... ఆదివాసీ లాంటి మైనారిటీ మతాలకు ప్రత్యేక గుర్తింపు రాకుండా పోయింది. ద్వీపకల్పంలోని స్థానిక మతాలన్నిటినీ కలిపి హిందూ మతంగా గుర్తించడం పర్షియన్ల కాలం నుంచి ప్రారంభమైంది. వివిధ విశ్వాసాలకు, ప్రకృతి మతాలకు నిలయంగా ఉన్న ఇండియాను సులభంగా గుర్తించేందుకు వీలుగా పర్షియన్లు ‘హిందూ’ అని పిలవడంతో ఇక్కడి మతాలన్నిటినీ హిందూ మతంగా గుర్తించడం పరిపాటిగా మారింది. 1955 హిందూ వివాహ చట్టంలో కూడా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు కాని వారంతా హిందువులే నని నిర్వచించడం ఒక పెద్ద చారిత్రక తప్పిదమయింది. రాజ్యాంగం లోని ఈ లొసుగును ఆసరాగా తీసుకొని పాలకులు ఆదివాసీలకు జనగణన ద్వారా హిందూ అస్తిత్వాన్ని పులుముతూ, మెజారిటీ ఓటు బ్యాంకును రూపొందించాలనే కుయుక్తులు పన్నుతున్నారు. హిందూ అస్తిత్వం అనేది ఏకరీతి వ్యవస్థ కాదు. కుల అస్తిత్వమనే అసమానత్వం, అస్పృశ్యతల దుర్మార్గమైన దొంతర్ల వ్యవస్థ అది. 12 కోట్లౖకు పెగా ఉన్న ఆదివాసీ ప్రజానీకం అసమానతల దొంతర్ల వ్యవస్థలో భాగమయ్యే ప్రమాదం ఉంది. వీర శైవం, లింగాయత్, శ్రీవైష్ణవం, ఆదివాసీల ప్రకృతి మతాలు కాల క్రమంలో హిందూ చారి త్రక సంలీనానికి గురయ్యాయి. ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని జరి గినా ఇప్పటికీ అవైదిక వ్యక్తీకరణలు ఆయా ప్రకృతి మతాల్లో కొన సాగుతూనే ఉన్నాయి. అలాంటి చిన్నపాటి ప్రత్యేకతలను కూడా తొల గించి ‘సామాజిక ఫాసిజానికి’ గురి చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఆదివాసీ ప్రజలను 2011 నాటి జనగణనలోని వర్గీకరణతో గానీ, మొత్తం ‘ప్రకృతి మతం’ అనే వర్గీకరణతోగానీ నమోదు చేయాలి. అదే సమయంలో మైదాన ప్రాంతాల్లోని హిందూ మతం గొడుగుకింద తమ విశిష్టతలను కోల్పోయిన లింగాయత్, శ్రీవైష్ణవం తదితర మత శాఖలను హిందూ మతంలో భాగంగా కాకుండా విడి విడిగా మైనారిటీ మతాలుగా గుర్తించాల్సి ఉంది. వైదికేతర విశిష్ట మతాలను, ఆదివాసీల మతాలను మైనారిటీ మతాలుగా పరిగణిస్తూ రాజ్యాంగ లోపాన్ని సవరణ చేయాలి. మైనారిటీ మత గుర్తింపు కోసం ఆయా మతçస్థులు ఉద్యమిస్తే, ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ అనే ఓటు బ్యాంకు రాజకీయ కుట్రలను ఎదుర్కొనడం సాధ్యమవుతుంది! శ్రమ సంబంధాల ప్రాతిపదికన దళిత, మైనారిటీ తదితర అణచివేత సమూ హాలలోని నిజ అస్తిత్వ ప్రజానీకంతో సంఘటితమైన ‘ఏకీకృత నిజ అస్తిత్వ’ ఉద్యమ నిర్మాణమే తక్షణ కర్తవ్యం. ఆత్మగౌరవ, కుల వివక్ష వ్యతిరేక, కుల నిర్మూలనా ఉద్యమాలు ‘ఏకీకృత నిజ అస్తిత్వ’ ఉద్య మాలుగా అవతరిస్తేనే హిందూ చారిత్రక సంలీనాన్ని అడ్డుకోగలం! వ్యాసకర్త: వెన్నెలకంటి రామారావు సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 95503 67536 -
గిరిజన హక్కులను కాపాడుదాం: కోదండరామ్
సిరిసిల్లటౌన్: ఏళ్ల తరబడి పోడు భూముల్లో సాగు చేసుకుంటూ బతుకుతున్న గిరిజనులు, గిరిజనేతరులకు అండగా నిలుస్తామని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్మిక భవన్లో సీపీఐ ఆధ్వర్యంలో పోడు సాగుదారుల హక్కులపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు తరతరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నారని, వారి కి హక్కు పత్రాలివ్వడం సర్కారు బాధ్యత అని చెప్పారు. అటవీ చట్టాలన్నీ ఆదివాసులు, గిరిజను లకు అనుకూలంగా ఉన్నా, వాటిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగులో ఉన్న భూము లపై యాజమాన్య హక్కులు పొందడానికి రైతు లకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లా డుతూ.. జిల్లాలోని 20వేల ఎకరాల్లో గిరిజనులు, ఇతర నిరుపేదలు సాగు చేసుకుంటున్నారని, తద్వారా సుమారు 10వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. ఆయా భూములపై యాజమాన్య హక్కులు వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గిరిపల్లెల్లో సంక్షేమ రాజ్యం
ఏజెన్సీ పేరు చెప్పగానే బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో కొండల్లో జీవనం సాగిస్తున్న కొండరెడ్ల బాధలను ఊహించుకుంటారు. ప్రభుత్వ ఫలాలు అందక వారు పడే ఇబ్బందుల గురించి చర్చించుకుంటారు. అది ఒకప్పుడు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పరుగులు తీస్తోంది. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధితో పాటు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతో ఆదివాసీలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి ముందుకు సాగుతున్నారు. బుట్టాయగూడెం: గతంలో గిరిజనులు అభివృద్ధిలో వెనుకబడి ఎన్నో ఇక్కట్ల మధ్య జీవించేవారు. వారికి సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా ఉండేవి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో గిరిజనుల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. మారుమూల గ్రామాల్లో పక్కా ఇళ్ల నిర్మాణాలతో పాటు కొండ ప్రాంత మారుమూల గ్రామాలకు సైతం తారు రోడ్లు వేయించారు. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిపుత్రులకు పట్టాలు ఇచ్చారు. గిరిజన ప్రాంతంలో అనేక సంక్షేమ, అభివృద్ధి ప«థకాలు అమలు చేసి వైఎస్సార్ ఆదివాసీల ఆపద్భాందవుడిగా నిలిచిపోయారు. వైఎస్సార్ అకాల మరణంతో ఏర్పడిన ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. జగనన్న పాలనలో.. ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో గిరిజనుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో గిరిజనుల కష్టాలు తెలుసుకున్న ఆయన “నేను విన్నాను.. నేనున్నాను’ అని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సుమారు 4,000 మందికి పైగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలివ్వడమే కాకుండా ఆ భూములకు రైతు భరోసా పథకం వర్తించేలా ఏర్పాటు చేశారు. బాహ్య ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఆదివాసీలు జోలు మోతతో అనేక అవస్థలు పడేవారు. ఆ కష్టాలు తీర్చేలా సుమారు 15 బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి అనారోగ్య బాధితులకు సేవలందించేలా కృషి చేశారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట మారుమూల గ్రామాల్లో సైతం సుమారు రూ.40 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి కృషి చేశారు. సుమారు రూ.15 కోట్లతో నాడు–నేడు పథకంలో పాఠశాలల రూపురేఖలు మార్చి కొండ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకునేలా రూపుదిద్దారు. రూ.18 కోట్ల వ్యయంతో సచివాలయం, విలేజ్ క్లినిక్‌లు, ఆర్బీకేల నిర్మాణానికి కృషి చేశారు. రూ.15 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. గిరిజనుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా సుమారు రూ.50 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా వందల కోట్ల నిధులను సీఎం జగన్ గిరిజన ప్రాంతానికి కేటాయించారు. ప్రస్తుతం అవి టెండర్ల దశలో ఉన్నాయి. ప్రతీ కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ సంక్షేమ పథకాలు కొండలు దాటి ఇళ్లకు చేరేలా వలంటీర్ల వ్యవస్థ ద్వారా కృషి చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో కొండ ప్రాంతాల్లో మహిళలు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతంలో ఉన్న రేగులపాడులో ఉంటున్నాడు. 30 ఏళ్లుగా 2 ఎకరాల్లో కొండపోడు వ్యవసాయం చేస్తుండగా.. ఆ భూమికి పట్టా కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టా రాలేదు. ఇప్పుడు వలంటీర్ ద్వారా ఇంటికే పట్టా తెచ్చి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -గురుగుంట్ల లచ్చిరెడ్డి మారుమూల గుంజవరం గ్రామం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందుతున్న పథకాలపై ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. వారి గ్రామంలో ప్రతీ ఇంటికీ రూ. 2 లక్షల వరకూ సంక్షేమ పథకాలు అందాయని చెబుతోంది. తనకు సుమారు రూ. 2,93,000 సొమ్ము ప్రభుత్వ పథకాల ద్వారా అందాయి. నేరుగా తన బ్యాంక్ ఖాతాలోకి సొమ్ములు చేరాయి. -పాయం రత్నం.. గుంజవరం గ్రామం. ప్రభుత్వం ద్వారా వివిధ పథకాల రూపంలో రూ. 2,86,000 సొమ్ము అందింది. పథకాల కోసం పనులు మానుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే వాళ్లమని.. జగనన్న ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా పింఛను సొమ్ము తెల్లవారకముందే అందుతుందని అంటున్నాడు. -మడివి శిరమయ్య. -
గిరిజనులకు 'పట్టా'భిషేకం
సాక్షి, అమరావతి: గిరిపుత్రులకు పట్టాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో 1,33,342 మందికి 2,47,595 ఎకరాల భూమికి ఆర్ఓఎఫ్ఆర్, డీకేటీ పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ పట్టాల పంపిణీ తీరును అధ్యయనం చేయడం మన రాష్ట్రానికి గర్వకారణం. గతేడాది తెలంగాణ అధికారుల బృందం మన రాష్ట్రానికి వచ్చి అధ్యయనం చేసి.. నివేదికను తమ ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా గిరిజనులకు భూపంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిన వైఎస్ స్వాతంత్య్రానికి ముందు నుంచే గిరిజనులు అటవీ ప్రాంతంలోని భూముల్లో పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవారు. బ్రిటీష్ ప్రభుత్వం రక్షిత అటవీ ప్రాంతం అనే పేరుతో 18వ శతాబ్దంలో పోడు వ్యవసాయాన్ని రద్దు చేసింది. పోడు వ్యవసాయం చేసేవారిపై బ్రిటీషు వారు దురాగతాలకు పాల్పడేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఆదివాసీలకు అల్లూరి సీతారామరాజు అండగా నిలిచారు. స్వాతంత్య్రానంతరం కూడా పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనుల పరిస్థితి మెరుగుపడలేదు. తరతరాలుగా వారు సాగు చేసుకునే అటవీ భూములపై వారికి ఎలాంటి హక్కులు లేకుండా పోయాయి. అటవీ అధికారులు సైతం పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులపై కేసులు పెట్టి, పంటలను ధ్వంసం చేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజనులకు పట్టాల పంపిణీకి ఉన్న అడ్డంకులు తొలగించి వారికి హక్కు కల్పించేలా వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనుల కష్టాలను తన పాదయాత్రలో తెలుసుకున్న వైఎస్సార్.. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి 2006లో దేశ వ్యాప్తంగా అటవీ హక్కుల చట్టం(ఆర్ఓఎఫ్ఆర్) అమల్లోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఆ చట్టం ప్రకారం పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు వ్యక్తిగతంగాను, సామూహికంగాను అటవీ భూములపై హక్కు కల్పించే మహోన్నత కార్యక్రమానికి 2008లో వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. అప్పట్లో 56 వేల గిరిజన కుటుంబాలకు 1.30 లక్షల ఎకరాల భూమిని వ్యక్తిగత పట్టాలుగా పంపిణీ చేశారు. దీంతో పాటు గిరిజన కుటుంబాలకు సామూహిక సాగు హక్కు పత్రాలనూ అందించారు. సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం : తెలంగాణ అధికారుల బృందం పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గిరిజనులు తమకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలివ్వాలని గత కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ పట్టాల పంపిణీ విషయంలో ప్రభుత్వం అనేక అవరోధాలను ఎదుర్కొంటోంది. అలాంటిది ఏపీలో అంత పెద్ద ఎత్తున పట్టాల పంపిణీ ఎలా సాధ్యమైందనే విషయంలో తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసింది. గతేడాది సెప్టెంబర్ 18న ఆ రాష్ట్ర అధికారుల బృందం ఏపీకి వచ్చి ఇక్కడ గిరిజనులకు పట్టాల పంపిణీ తీరుపై అధ్యయనం చేసింది. ఏపీ సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు దిలీప్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, టి.మహేష్, టి.శ్రీనివాసరావులు సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టం(ఆర్ఓఎఫ్ఆర్) పథకం ద్వారా భూమి పట్టాలు అందించిన ఆంధ్రప్రదేశ్ విధానం.. అన్ని రాష్ట్రాలకూ ఆదర్శప్రాయమని ప్రశంసించారు. ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి, తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ రికార్డ్ వైఎస్సార్ చేపట్టిన గిరిజనులకు పట్టాల పంపిణీ మహోన్నత యజ్ఞాన్ని సీఎం వైఎస్ జగన్ అదే స్థాయిలో కొనసాగించి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి గిరిజనుడికీ ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా హక్కు పట్టాలను అందిస్తున్నారు. 2020 అక్టోబర్ 2 నుంచి ఇప్పటి వరకు 1,07,769 మంది గిరిజనులకు 2,08,794 ఎకరాల అటవీ భూములకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేశారు. మరో 25,573 మంది గిరిజన కుటుంబాలకు 38,801 ఎకరాల భూములకు డీకేటీ పట్టాలను అందించారు. మొత్తంగా 1,33,342 మంది గిరిజనులకు మొత్తం 2,47,595 ఎకరాల భూమికి ఆర్ఓఎఫ్ఆర్, డీకేటీ పట్టాలను పంపిణీ చేయడం విశేషం. మార్పు మొదలైంది.. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగుదార్లకే భూమిపై హక్కు కల్పించడం అంటే గొప్ప సామాజిక మార్పునకు ఊతమిచ్చినట్టే. ఇదే ఆశయంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి శ్రీకారం చుడితే.. ఆయన తనయుడిగా సీఎం వైఎస్ జగన్ మరో రెండు అడుగులు ముందుకేసి మరిన్ని ఎకరాలకు పట్టాలిచ్చి రికార్డు సృష్టించారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడంతో వారి జీవితాల్లో మార్పు మొదలైంది. సొంత భూమి ఉండడంతో వారికి ఆత్మవిశ్వాసంతో పాటు సమాజంలో గౌరవం దక్కుతోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి -
ముగిసిన మోదమ్మ గిరిజన జాతర
సాక్షి, పాడేరు: అల్లూరిసీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో మూడు రోజులుగా జరుగుతున్న గిరిజన ప్రజల ఆరాధ్యదైవం మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఉత్సవాలకు రూ.కోటి కేటాయించారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల 15న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆది, సోమవారాల్లో మోదకొండమ్మ తల్లిని దర్శించుకోగా, మంగళవారం ఉత్సవాల చివరి రోజున రాష్ట్ర టూరిజం మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. సాయంత్రం అనుపోత్సవాన్ని నిర్వహించారు. ఊరేగింపు సంబరం అంబరాన్ని తాకింది. చోడవరం, అరకు ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చెట్టి పాల్గుణతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అభిషేక్, ఎస్పీ సతీష్‌కుమార్, ఏఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పర్యాటకాభివృద్ధికి కృషి: మంత్రి రోజా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, అరకులోయ ప్రాంతాలను పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమను రోజా సమర్పించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకెళ్తున్న మంత్రి రోజా అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అరకులోయ, బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి హిల్స్‌తో పాటు పలు జలపాతాలు, వలిసె పువ్వులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పారు. గిరిజ నుల కోసం పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడంతో గిరిజనులపై సీఎంకు ఎంత అభిమానం ఉందో అర్థమవుతుందన్నారు. -
అధరహో...సిరులు కురుపిస్తున్న చింత
సాక్షి,పాడేరు: చింతపండు గిరిజనుల ఇంట సిరులు కురిపిస్తోంది. ఈ ఏడాది మంచి ధర లభించింది. ప్రైవేట్ వ్యాపారులు, జీసీసీ సిబ్బంది పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని పాడేరు డివిజన్లో 11 మండలాలు, రంపచోడవరం డివిజన్ పరిధిలో మారెడుమిల్లి ప్రాంతంలో వ్యాపారం జోరుగా సాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో చింతపండు దిగుబడి ఆశాజనకంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లోని చింతపండుకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. జీసీసీ సిబ్బంది, ప్రైవేట్ వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నారు. దిగుబడి చివరిదశకు చేరుకోవడంతో కొనుగోలులో పోటీ నెలకొంది. గిరిజన సహకార సంస్థ ఈ ఏడాది కిలో రూ.32.40 మద్దతు ధరతో భారీగా కొనుగోలు చేస్తోంది. గత ఏడాది చింతపల్లి, పాడేరు డివిజన్ల పరిధిలో సుమారు 120 టన్నుల వరకు జీసీసీ కొనుగోలు చేసింది. మార్చి నెల సీజన్ ప్రారంభంలో కిలో రూ.25 నుంచి రూ.30 వరకు వ్యాపారులు కొనుగోలు చేయగా, జీసీసీ రూ.32.40కు కొనుగోలు చేసింది. మార్కెట్లో పోటీగా ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు కూడా ధరను పెంచారు. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు చింతపండు నాణ్యతను బట్టి కిలో రూ.35 నుంచి రూ.40 వరకు కొనుగోలు చేస్తున్నారు.అయితే తూకంలో మాత్రం తేడాలు ఉండడంతో మోసపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు. సంతల్లో విక్రయాలు పలువురు గిరిజనులు తాము సేకరించిన చింతపండును సంతల్లో విక్రయిస్తున్నారు. దేవరాపల్లి, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు సంతల్లో చింతపండును భారీగా విక్రయించారు. ప్రైవేటు వ్యాపారులు,స్థానిక ప్రజలు 15 కిలోల బరువు తూగే చింతపండు బుట్టను రూ.500 నుంచి రూ.500 వరకు కొనుగోలు చేశారు. భారీగా కొనుగోలు గిరిజన సహకార సంస్థ అన్ని వారపుసంతల్లో చింతపండును భారీగా కొనుగోలు చేస్తోంది. గత ఏడాది కొనుగోలు చేసిన చింతపండు నిల్వలు కోల్డ్ స్టోరేజీలో ఉన్నప్పటికీ ఈ ఏడాది గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. పాడేరు డివిజన్లో 230 క్వింటాళ్లు, చింతపల్లిలో 100 క్వింటాళ్లు కొనుగోలు చేశాం. ఈ నెలలో లక్ష్యం మేరకు చింతపండును కొనుగోలు చేస్తాం. గిరిజనులంతా జీసీసీ సంస్థకు సహకరించాలి. – కురుసా పార్వతమ్మ, జీసీసీ డీఎం,పాడేరు -
మారేడు తెచ్చి.. నన్నారి షర్బత్ చేసి..
ప్రకృతినే నమ్ముకున్న గిరిజనులు వాటినే ఆధారం చేసుకుని మంచి ఆహార ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ప్రతి ఏడాది వేసవి సమీపిస్తే అడవిలో మారేడును సేకరించి నన్నారి షర్బత్ తయారీకి పూనుకుంటారు. అనుకున్నదే తడవుగా ఒక సంఘంగా ఏర్పడి విరివిగా షర్బత్‌ను తయారుచేసి విక్రయిస్తున్నారు. వేసవి నేపథ్యంలో రసాయనాలు లేకుండా తయారు చేస్తున్న సన్నారి షర్బత్‌కు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేస్తున్న గిరిజనులు ఆర్థిక పరిపుష్టికి అడుగులు వేస్తున్నారు. సాక్షి, నెల్లూరు : జిల్లాలోని రాపూరు మండలంలో నన్నారి షర్బత్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన గిరిజనులు దీనినే ఉపాధిగా మార్చుకున్నారు. స్థానిక వెలుగొండల్లో దొరికే అటవీ ఫలసాయాన్ని సేకరించి నన్నారీని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసి ఆదాయం గడిస్తున్నారు. ప్రకృతి వనరులతో తయారు చేసే నన్నారి షర్బత్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ద్వారా శరీర ఉష్ణోగ్రత్త తగ్గుతుంది. సంఘటితంగా ఏర్పడి వెలుగొండలను ఆనుకుని ఉన్న రాపూరు మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. స్థానికంగా ఉన్న అటవీనే నమ్ముకుని జీవించే గిరిజన మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దకాలంలోనే గిరిజనులు సంఘటితంగా ఏర్పడి గ్రామస్థాయి సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆపై శ్రీ లక్ష్మీ నరసింహ యానాది మండల సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. ఆపై వారి జీవన విధానం మెరుగు పరుచుకునేందుకు ప్రధాన మంత్రి వన్‌ధన్ యోజన కార్యక్రమం ఏర్పాటుచేసి తద్వారా మెరుగైన జీవనోపాధులు కల్పించుకోవడం జరిగింది. వెలుగొండల్లో ముడిసరుకు సేకరించి.. వెలుగొండల్లో విరివిగా కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. 275 మంది గిరిజన సభ్యులు వన్‌ధన్ వికాస కేంద్రం(వీడీవీకే) ఏర్పాటు చేసుకుని అటవీ ఫలసాయం సేకరణ చేస్తున్నారు. వీరికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐటీడీఏ శాఖల ఆధ్వర్యంలో గిరిజనులకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి కావలసిన శిక్షణ కార్యక్రమాలు, తయారీ, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు. ఉసిరితో.. అలాగే జనవరి నుంచి మార్చి నెల వరకు వెలుగొండ అడవుల్లో ఉసిరి కాయల సేకరణ జరుగుతుంది. ఈ సీజన్లో దాదాపు 20 టన్నుల ఉసిరి కాయలను సేకరిస్తుంటారు. దాదాపు 150 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. సేకరించిన ఉసిరికాయలను కేజీ రూ.30ల చొప్పున దళారులు గిరిజనుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుంటారు. విలువ ఆధారిత ఉత్పత్తిలో భాగంగా ఉసిరి కాయలతో ఉసిరి క్యాండీలు చేయడం వలన, మూడు కేజీల ఉసిరికాయలతో ఒక కేజీ క్యాండీలను తయారీ చేస్తారు. వీటి విలువ మార్కెట్లో రూ.500గా ఉంది. ఈ ఉసిరి క్యాండీల తయారీలో దాదాపు 30 మంది గిరిజనులు శిక్షణ పొందారు. చక్కెర పాకంలో ఉడకబెట్టిన ఉసిరి కాయలను నానబెట్టడం ద్వారా ఈ క్యాండీలను తయారు చేస్తారు. తయారీ ఖర్చు పోగా, మిగిలిన ఆదాయాన్ని సమంగా పంచుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే నిమ్మకాయ ఊరగాయల తయారీ, స్వచ్ఛమైన తేనె సేకరణ చేసి విక్రయాలు చేస్తున్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం గిరిజనులు తయారు చేసిన అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఉత్పత్తులను పెంచలకోన నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో మార్కెటింగ్ చేసేలా స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సాయం చేశారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ ద్వారా అటవీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్లో కూడా పెంచలకోన నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఎటువంటి కల్తీ లేని అటవీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ ఫలసాయంతో మండలంలోని దాదాపు 1,590 పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. విలువపెంచి విక్రయాలు అడవుల్లో సేకరించే కలపేతర అటవీ ఉత్పత్తులకు ముడిసరుకులు విక్రయిస్తే అంతగా ఆదాయం వచ్చేది కాదు. ముడిసరుకులను బయటకు వెళ్లి వస్తువుల విలువలను పెంచి అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. ఒక కేజీ కుంకుళ్లు అమ్మితే రూ.20 వస్తుంది. అదే విత్తనాలను వేరు చేసి అమ్మితే కేజీ రూ.140 వస్తుంది. ఉసిరి కేజీ అమ్మితే రూ.30 వస్తుంది అదే ఆమ్ల క్యాండీలుగా చేసి అమ్మితే కేజీ రూ.500 వరకు వస్తుంది. మారేడు కూడా కేజీ రూ.350 వస్తుంది అదే నన్నారి షర్బత్ చేసి అమ్మితే రూ.2500 వస్తుంది. ఇలా లాభదాయకంగా ఉంది. – వెలుగు సుబ్బయ్య, వన్‌ధన్ వికాస కేంద్రం అధ్యక్షుడు అందరం సంపాదిస్తున్నాం వన్‌ధన్ వికాస కేంద్రం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పని దొరుకుతోంది. ఇంట్లోని వారంతా సంపాదిస్తుండడంతో ఆనందంగా జీవిస్తున్నాం. డీఆర్డీఏ, ఐటీడీఏ, జీసీసీ వారు మాకు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు సాయం చేశారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. – గాలి శ్రీనివాసులు, వన్‌ధన్ వికాస కేంద్రం కార్యదర్శి నన్నారి తయారీ ఇలా.. శ్రీ లక్ష్మీనరసింహ యానాది మండల సమాఖ్యలోని సభ్యుల్లో దాదాపుగా 30 మంది నన్నారి షర్బత్ తయారీలో నిష్ణాతులుగా ఉన్నారు. అలాగే 150 మంది నన్నారి షర్బత్‌కు కావల్సిన మారేడు గడ్డలను సేకరించి ప్రాసెసింగ్ చేస్తుంటారు. గాలి వెంకటేశ్వర్లు, గాలి శ్రీనివాసులు, వెలుగు సుబ్బయ్య, యాకసిరి జయరామయ్య, నారాయణ, నల్లు శివ మొదలగు వారు ఈ నన్నారి షర్బత్‌ను తయారు చేస్తుంటారు. జనవరి నుంచి జూన్ నెల వరకు నన్నారి షర్బత్ తయారీ మీద గిరిజనులు దృష్టి పెడుతుంటారు. దీనికి కావల్సిన మారేడు గడ్డలను వెలిగొండ అడవుల్లో జనవరి నుంచి మే నెల వరకు సేకరిస్తారు. ఈ సీజన్లో దాదాపుగా 10 నుంచి 15 టన్నుల వరకు మారేడు గడ్డలను సేకరిస్తారు. సాధారణంగా ఒక కేజీ గడ్డల విలువ రూ.400 ఉండగా ఒక కేజీ నుంచి 30 లీటర్ల నన్నారి షర్బత్‌ను తయారు చేయవచ్చు. మార్కెట్లో ఒక లీటర్ రూ.160 ఉండగా కేజీ మారేడుతో దాదాపుగా రూ.4,800 ఆదాయం వస్తుంది. ఇలా 15 టన్నులకు రూ.72 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అందులో తయారీకి కావల్సిన ఇతర దినుసుల ఖర్చు, తయారీ ఖర్చు, లేబర్ వంటి వాటిని తీసేయగా మిగిలిన ఆదాయాన్ని సమంగా పంచుకుంటూ ఆర్థికంగా పురోగమిస్తున్నారు. -
వారొస్తేనే మిర్చి కోతలు.. వలస కూలీల బతుకుచిత్రం ఇది..
సాక్షి, ఎటపాక: కాయకష్టం వారికిష్టం..చిన్నా పెద్దా తేడాలుండవు.. సమష్టిగా పనిచేయడం.. వచ్చిన దానినే అంతా సమానంగా పంచుకోవడం వారి నైజం. కల్మషం లేని హృదయాలు వారివి. వారంతా వలస కూలీలు. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా కూలీ పనుల కోసం ఏజెన్సీకి వలస వచ్చి మూడునెలల కాలం ఇక్కడే జీవనం సాగిస్తారు. ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలతో పాటు తెలంగాణలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు, వెలేరుపాడు మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తారు. అయితే మిర్చి కోతలకు జనవరి ప్రారంభంలోనే కూలీలు కుటుంబ సమేతంగా తిండి గింజలు పట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వస్తారు. వీరిని ఇక్కడకు తీసుకొచ్చేందుకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే వీరొస్తేనే మిర్చి పంట చేతికొచ్చేది. ఏజెన్సీలో సుమారు 8 వేల మంది వలస కూలీలు ఈ నెల చివరి వరకు ఇక్కడే ఉండి కూలి పనులు చేసుకుంటారు. మిర్చి తోటల్లోనే భోజనం చేస్తున్న కూలీలు ఆహారపు అలవాట్లు వలస కూలీలు వారి వెంట తెచ్చుకున్న దంపుడు బియ్యాన్నే భోజనం తయారీకి వాడతారు. అన్నంలో కలుపుకునేందుకు చింత పండు పులుసునే నిత్యం తయారు చేసుకుంటారు. ఘాటుగా ఉండే పచ్చి మిరపకాయలను బండపై నూరి దానినే అన్నంలో కలుపుకుని ఎంతో ఇష్టంగా తింటారు. రైతులు దయతలచి వారానికోమారు ఇచ్చే జుట్టు కోళ్లను(లగ్గారం) కోసుకుని తింటారు. వీరికి నీటి గుంటలు, సెలయేర్లు, సాగునీటి పైపుల వద్ద నీటితోనే స్నానాలు చేయడం అలవాటు. కొందరు ఆ నీటినే తాగుతుంటారు. ఎండ తీవ్రతకు చెట్ల కింద సేదతీరుతున్న ఆదివాసీలు రాత్రి భోజనాల అనంతరం సంప్రదాయ నృత్యాలతో సందడి చేసి నిద్ర పోవడం వీరి దినచర్య. ఇలా వారు పిల్లా పాపలతో కలిసి కూలి పనులు చేస్తారు. తద్వారా వచ్చిన డబ్బులు, మిరపకాయలను భద్రంగా దాచుకుని తిరిగి వారి సొంత గ్రామాలకు పయనమవుతారు. ఇలా వలస కూలీలనే నమ్ముకుని ఇక్కడి రైతులు మిర్చి సాగు చేస్తుంటారు. వీరు ఇక్కడ కూలి పనులకు ఉన్నంత కాలం స్థానిక పల్లెల్లో సందడిగా ఉంటుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కాలువల్లో చెలమ నీటిని తాగుతున్న చిన్నారులు వాగులు వంకల్లోనే నివాసం కూలీ పనులకు వచ్చిన వీరంతా గుంపులు గుంపులుగా వాగులు, గోదావరి ఇసుక దిబ్బలపై నివాసం ఉంటారు. నీటి సౌకర్యం ఉన్న చోట గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తారు. వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను కలిసి వండుకుంటారు. సూర్యుడు ఉదయించక ముందే మిర్చి తోటల్లో కాయలు కోసేందుకు వెళ్లిపోతారు. కొద్ది గంటలు పనులు చేశాక వారి వెంట తెచ్చుకున్న భోజనాన్ని సమానంగా పంచుకుని తోటల్లోనే తింటారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే కొంత సమయం చెట్ల నీడనే సేదతీరి.. ఆ వెంటనే మరలా పనులకు ఉపక్రమిస్తారు. సూర్యుడు అస్తమించాక వీరి నివాస ప్రాంతాలకు క్యూ పద్ధతిలో వెళ్లిపోతారు. పని విరామంలో వారికి వారే క్షవరం చేసుకుంటున్న దృశ్యం -
సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కన్సాలిడేటెడ్ వేతనాల పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషాలిటీ) వైద్యుల కన్సాలిడేటెడ్ వేతనాన్ని రూ.53,500 నుంచి రూ.85 వేలకు ప్రభుత్వం పెంచింది. ప్రొబేషన్ కాలాన్నీ మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ గిరిజన ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు వేతనాల్లో ప్రోత్సాహకాలను ప్రకటించారు. బేసిక్ పే మీద స్పెషాలిటీ వైద్యులకు 50%, సాధారణ వైద్యులకు 30% ప్రోత్సాహకం ఇచ్చారు. ఆ వెంటనే స్పెషలిస్ట్ వైద్యులకు కన్సాలిడేట్ వేతనాలను పెంచడం గమనార్హం. 2020లో జీవో నంబర్ 60 ద్వారా నియమితులైన వైద్యులకు ఈ నెల నుంచి పెంచిన వేతనాలు అమల్లోకొస్తాయి. తాజాగా నియమితులయ్యే వైద్యులకూ రూ.85 వేల కన్సాలిడేటెడ్ వేతనాన్ని ఖరారు చేశారు. -
కాలం ఎంతగామారింది.. తాచేరు వయా ‘ఫోన్ పే’మెంట్!
చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా): కాలం ఎంతగామారింది.. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గిరిజనులు తమ సంప్రదాయ పండగలకు వినియోగిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏటా ఈ నెలలో ఇటుకల పండగ నిర్వహిస్తారు. అందులో భాగంగా ప్రధాన రహదారుల్లో గేట్లు ఏర్పాటు చేసి వాహన చోదకుల వద్ద తాచేరు (డబ్బులు) వసూలు చేస్తుంటారు. చదవండి: హిజ్రాల అందాల పోటీలు.. సందడే సందడి అయితే చిల్లర లేదని చెప్పి కొందరు వాహనచోదకులు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో గిరిజన మహిళలు, యువతులు గేట్ల వద్ద ఫోన్ పేకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్ స్కానర్‌ను ఉపయోగించి తాచేరు వసూలు చేస్తున్నారు. పురుషులు వేటకు అడవి బాట పడుతుండడంతో మహిళలే ఈ పనిలో నిమగ్నమవుతారు. ఒకప్పుడు ఫోన్లో సంభాషించడమే అంతగా తెలియని గిరిజనులు ఇప్పుడు స్కానర్ ద్వారా తాచేరు వసూలు చేయడం చూసి మైదాన ప్రాంతాలకు చెందిన వాహన చోదకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. -
వింత వ్యాధి కలకలం?
సాలూరు: మన్యంలో వింత వ్యాధి మళ్లీ విజృంభిస్తోందని గిరిజనుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల 13న పాచిపెంట మండలంలోని కర్రివలస పంచాయతీ కంకణాపల్లి గ్రామంలో వింత వ్యాధితో మరణాలు సంభవించాయి. ఈ నెల రెండవ వారంలో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కాళ్లు, చేతులు, ముఖం పొంగి బాగా నీరసించిపోయారు. వెంటనే వారు పాచిపెంట పీహెచ్‌సీకి వెళ్లగా సాలూరు సీహెచ్‌సీకి రిఫర్ చేశారు. బాధితుల్లో గమ్మెల ప్రశాంత్ (21) పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ ప్రశాంత్ ఈనెల 13న మరణించాడు. సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కాగా సుమారు పదిమంది ఈ విధంగానే భాదపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తుల్లో భయాందోళన వింత వ్యాధితో సంభవిస్తున్న మరణాలపై గిరిజనుల్లో భయాందోళనలు అధికమవుతున్నాయి. ఈ విథమైన మరణాలపై గతేడాది జనవరి19వ తేదీన మన్యంలో మరణ మృదంగం శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఐటీడీఏ పీఒ కూర్మనాథ్ స్పందించి గ్రామంలో పర్యటించి వైద్యసేవలు ముమ్మరం చేశారు. కానరాని వింతవ్యాధి లక్షణాలు అయితే మళ్లీ ఈ నెలలో ఆ తరహా వ్యాధి ప్రబలడంతో పాచిపెంట పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పీవీ లక్ష్మిని వివరణ కోరగా, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, గ్రామంలో రెండు రోజులుగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ అనారోగ్య లక్షణాలు తప్ప వింత వ్యాధి లక్షణాలు ఎవరికి లేనట్లు గుర్తించామన్నారు.త్వరలో అందరికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. తాగునీరు సమస్య కారణం కావచ్చన్న అనుమానంతో తాగునీటి పరీక్షలు నిర్వహించగా ఎటువంటి సమస్య లేదని గుర్తించినట్లు ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకట చినఅప్పలనాయుడు తెలిపారు. దీనిపై ఐటీడీఏ పీఓ కూర్మనా«థ్ వివరణ కోరగా, గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశామన్నారు. గ్రామంలో వైద్యశిబిరాలు నిర్వహించినట్లు వైద్యాధికారులు చెప్పారని, ప్రజలెవరూ భయాందోళనలకు గురికావద్దని, తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా సమీప ఒడిశా నుంచి వస్తున్న సారా మన్యంలో ఏరులై పారుతున్న నేపథ్యంలో సారా తాగడం ఈ విధమైన వ్యాధులకు కారణం కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో మెరుగైన వైద్యసేవలు అందించాలని, మన్యాల్లో సారా నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
గిరిజనుల స్థితిగతులు ఆందోళనకరం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘రాష్ట్రంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా 9.34% ఉంది. కానీ పలు ప్రాంతాల్లో వారి ఆరోగ్యం, జీవనస్థితిగతులపై నాకు ఆందోళన కలుగుతోంది. రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని గిరిజన గ్రామాలను దత్తత తీసుకొని ఆయా తెగల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక చర్య లు తీసుకుంటా’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. రెండు రోజుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం దమ్మపేట మండలం పూసుకుంట, అశ్వారావుపేట మండలం గోగులపూడి, రెడ్డిగూడెంలో గవర్నర్ పర్యటించారు. కొండరెడ్లతో ముఖా ముఖి నిర్వహించారు. అనంతరం అశ్వాపురం మండలంలోని మణుగూరు భారజల కర్మాగారాన్ని సందర్శించారు. తర్వాత కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి గవర్నర్ విలేకరులతో మాట్లాడారు. దమ్మపేట మండలం పూసుకుంటలో కొండరెడ్లను పలకరించానన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రి సౌజన్యంతో అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించగా ఒకరికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తేలిందన్నారు. ఆ వ్యక్తికి హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయిస్తామన్నారు. అలాగే 100 మంది గర్భిణులకు స్కానింగ్ నిర్వహిస్తే 48 మంది హైబీపీతో, 27 మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. బ్రెస్ట్ కేన్సర్‌తో ఒకరు, సర్వైకల్ కేన్సర్‌తో ఒకరు బాధపడుతున్నారని చెప్పారు. రూ. 44.32 లక్షలు మంజూరు... ‘గిరిజనులు పీచు పదార్థాలు తినకపోవడం వల్లే వారిలో ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. అందుకే ఇప్పపువ్వుతో చేసిన మహువా లడ్డూలు పెడుతున్నాం. తద్వారా చిన్నారుల్లో పోషకలోపాన్ని అధిగమించి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. అలాగే ఆ ప్రాంత అభివృద్ధికి మేం రూ. 44.32 లక్షలు మంజూరు చేశాం. మహిళల కోసం హైజీనిక్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. గిరిజన మార్గాల్లో అత్యవసర పరిస్థితుల్లో సాధారణ అంబులెన్సులు, వాహనాలు ప్రయాణించలేనందున రెండు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశాం’అని గవర్నర్ తెలిపారు. మీరంటే ఎంతో ప్రేమ... ‘మీపై (ఆదివాసీలపై) ఎంతో ప్రేమ ఉంది. ఆ ఆసక్తి, అభిరుచితో మీ కోసం పోషకాహార లోప నివారణకు పైలట్ ప్రాజెక్టు చేపట్టా. మీరంతా సంపూర్ణ ఆరోగ్యంగా, మంచి చదువు, జీవనోపాధితో జీవించాలని కోరుకుంటున్నా’అని కొండరెడ్డి గిరిజనులతో భేటీలో గవర్నర్ తమిళిసై చెప్పారు. అంతకుముందు తమిళిసైకి గిరిజన మహిళలు రేల నృత్యాలు, చిల్ల కాయల సవ్వడులు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమిళిసై సరదాగా డప్పులు వాయిస్తూ వారితో కలసి నృత్యం చేశారు. ఆపై కొండరెడ్లతో కలసి సహపంక్తి భోజనం చేయడంతోపాటు వారికి స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ గౌరవ చైర్మన్ అజయ్ మిశ్రా, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆర్డీవో స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
అడవి బిడ్డలకు ఆర్థిక భరోసా
పార్వతీపురం టౌన్: ఆరు దశాబ్దాల కిందటి వరకూ గిరిజనులు నిలువు దోపిడీకి గురయ్యేవారు. గిరిజనులు పండించే పంటను మైదాన ప్రాంతం నుంచి వచ్చే వ్యాపారులు వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరకే కొనుగోలు చేసి వారి శ్రమను దోచుకునేవారు. గిరిజన గూడాల్లో జీసీసీలు ఏర్పడే వరకూ ఇదే తంతు సాగగంతో ఆర్థికంగా వారి బతుకులు కుదేలయ్యాయి. అయితే ఇప్పుడు గిరిజనుల సంపదకు వారే యజమానులు. గిరిజనుల నుంచి మద్దతు ధరకు ముడిసరుకును జీసీసీ (గిరిజన సహకార సంస్థ) కొనుగోలు చేస్తుండడంతో వారి మోముల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఇలా కొనుగోలు చేసిన సరుకులను మరింత నాణ్యమైన ఉత్పత్తులుగా మలిచి జీసీఎంఎస్ (గిరిజన్ కార్పొరేషన్ మార్కెటింగ్ సొసైటీ) ద్వారా జనం చెంతకు జీసీసీ(గిరిజన సహకార సంస్థ) చేర్చుతోంది. తక్కువ ధరలకే విక్రయిస్తూ అటు వినియోగ దారులు, ఇటు గిరిజనులకు లాభాల వారధిగా నిలుస్తోంది. దళారుల బారినుంచి గిరిజనులను కాపాడుతూ అధిక ఆదాయం అర్జించి పెడుతూ ఏటా రూ.కోట్ల విలువైన వ్యాపారం సాగిస్తోంది. ఉత్పత్తులు ఇలా.. గిరిజనుల నుంచి తేనె, చింతపండు, నరమామిడి వంటి దాదాపు 26 రకాల చిన్న తరహా అటవీ ఉత్పత్తులను ఏటా జీసీసీ కొనుగోలు చేసి 70 కేంద్రాల్లో నిల్వచేస్తోంది. ఏడు పారిశ్రామిక సదుపాయాల్లో ప్రాసెసింగ్ అనంతరం ఉత్పత్తులను మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి తేవడమే జీసీసీ లక్ష్యం. పసుపు, కుంకుమ, తేనె, షరబత్, షాంపూలు, సబ్బులు, కాఫీ పొడి తదితర 27 ఉత్పత్తులను రిటైల్‌గా ప్రత్యేక ఔట్లెట్లు, సూపర్ బజార్లు, రైతుబజార్లు, ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పరిసర గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో స్టాల్స్ పెట్టి విక్రయాలు నిర్వహించడమే కాకుండా మొబైల్ సేవలను కూడా ప్రారంభించింది. మారుమూల పల్లెలకు గిరిజన ఉత్పత్తులను చేరవేస్తోంది. గిరిజనులకు ఆర్థిక ఊతం ప్రకృతి సిద్ధమైన గిరిజన ఉత్పత్తులు దళారుల పాలవకుండా మైదాన ప్రాంతాల ప్రజలకు చేరువ చేసేందుకు జీసీఎంఎస్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాం. రానున్న రోజుల్లో గిరిజన ఉత్పత్తులను ప్రజలందరికీ చేరువచేసే ప్రణాళిక సిద్ధం చేశాం. గిరిజనులకు ఆర్థిక ఊతం కల్పిస్తాం. ముడిసరుకులకు మద్దతు ధరకల్పిస్తాం. - శోభా స్వాతిరాణి, చైర్పర్సన్, జీసీసీ ప్రతి గ్రామానికి చేరువ చేస్తాం జీసీఎంఎస్‌కు మరింత ఆదాయం చేకూరేలా ఉత్పత్తులను గ్రామ స్థాయి ప్రజలకు అందించేందు మొబైల్ సేవలు ప్రారంభించాం. దీనివల్ల గిరిజనులు లబ్ధిపొందడమే కాకుండా ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతి గ్రామానికి జీసీఎంఎస్ ఉత్పత్తులు సరఫరా అయ్యేలా మొబైల్ సేవలను విస్తృతం చేస్తాం. - డి. సురేంద్ర కుమార్, జీసీసీ డివిజనల్ మేనేజర్ పార్వతీపురం ఆరోగ్యకర ఉత్పత్తులు స్వచ్ఛమైన ముడి సరుకుల తో ప్రజారోగ్యానికి ఎటు వంటి హాని కలిగించని ఉత్పత్తులను జీసీఎంఎస్ ఆధ్వర్యంలో విక్రయిస్తున్నాం. ఆరోగ్యానికి మేలుచేసే ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రం పార్వతీపురం పరిధిలో నాలుగు స్టాల్స్‌తో పాటు మొబైల్ వాహన సేవలు ప్రారంభించాం. - సాంబశివరావు, సీనియర్ అసిస్టెంట్, జీసీసీ పార్వతీపురం -
పోడు భూములకు పట్టాలతో ఆనందం
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న కొండపోడు భూములపై హక్కులు లేక గిరిజనులు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఆ భూములపై వారికి హక్కులు లేవంటూ అటవీ అధికారులు వేధించేవారు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆ భూముల్లో సాగు చేసిన పంటలను అటవీశాఖ సిబ్బంది నాశనం చేసేవారు. పోడు భూములను ఖాళీ చేయాలని హెచ్చరిస్తూ అక్కడ గిరిజనులు ఏర్పాటు చేసుకున్న మకాంలు తగులబెట్టి బెంబేలెత్తించేవారు. ఏమీ చేయలేని నిస్సహాయతతో గిరిజనులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొనే వారు. వీరికి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలివ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారి బతుకులకు భరోసా ఏర్పడింది. రంపచోడవరం: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రంపచోడవరం నియోజకవర్గంలో 17,661 మంది గిరిజనులకు 45,871. 23 ఎకరాల పోడు భూములపై హక్కులు కల్పించారు. పోడు పట్టాలు అందజేసి వరి కళ్లల్లో ఆనందం నింపారు. దీంతో పాటు స్థానిక గిరిజనులకు కమ్యూనిటీ పట్టాలు అందజేశారు. తద్వారా ఆ భూముల్లో లభించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించారు. ఇలా రంపచోడవరం డివిజన్లో 12,334 మంది గిరిజనులకు 49,508 ఎకరాలపై కమ్యూనిటీ హక్కులు కల్పించారు. దీంతో తమ కల నెరవేరిందంటూ ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు అండగా.. గిరిజనులకు అండగా వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు), ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు అండగా నిలిచారు. వారి సమస్యలను వైఎస్సార్ సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. హక్కు పట్టాలు మంజూరులో వారు కీలకపాత్ర పోషించారు. పోడు భూమి ఖాళీ చేయమన్నారు నా భర్తకు అనారోగ్యం. ముగ్గురు పిల్లలతో బొల్లికొండలో పోడు చేసుకుంటూ అక్కడే జీవిస్తున్నాం. పోడు వదిలి వెళ్లిపోవాలని అటవీ సిబ్బంది బెదిరించారు. అలా ఇబ్బంది పడుతూనే పోడు పట్టాల కోసం ఎదురు చూశా. సీఎం జగనన్న వచ్చిన తరువాత 3 ఎకరాల 85 సెంట్ల పోడు భూమికి పట్టాలు ఇచ్చారు. అందులో కందులు, కొర్రలు వేశాను. జీడిమామిడి మొక్కలు పెంచుకుంటున్నాను. –మర్రిక సీత, దాకరాయి, రాజవొమ్మంగి మండలం నిబంధనల మేరకు పట్టాలు అటవీ హక్కుల చట్టం ద్వారా అర్హత ఉన్న ప్రతీ గిరిజనుడికి కొండపోడు పట్టాలు మంజూరు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిశీలించిన తరువాత పట్టాలు మంజూరు చేస్తాం. అటవీ హక్కుల చట్టం నిబంధనల ప్రకారం దరఖాస్తులు పరిశీలన జరుగుతుంది. ఏజెన్సీలో ఇప్పటికే పోడు భూములు సాగు చేసుకుంటున్న అనేక మంది గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చాం. –కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్, రంపచోడవరం స్వేచ్ఛగా సాగు చేసుకుంటున్నా గత 25 ఏళ్ల నుంచి దాకరాయి దగ్గర బొల్లికొండలో నివాసం ఉంటూ అక్కడే కొండపోడు సాగు చేసుకుంటున్నాను. బుడములు, చోళ్లు , సామలు జీడిమామిడి మొక్కలు పెంచుకుంటుండగా అటవీ అధికారులు అనేక ఇబ్బందులు పెట్టారు. జగనన్న సీఎం అయిన తరువాత 8 ఎకరాల పోడు భూమికి పట్టాలు ఇచ్చారు. రెండు సార్లు రైతు భరోసా పొందాను. ప్రభుత్వ సాయం ఎన్నటికీ మరువలేను. –మర్రి లక్ష్మయ్య, దాకరాయి, రాజవొమ్మంగి మండలం -
‘ఔషధాల అడ్డా’కు
హుకుంపేట(అరకు): గిరిజన ప్రాంతంలో ఆరోగ్యపరంగా, వాణిజ్యపరంగా పేరు గాంచింది అడ్డ తీగ. ఫణెర వహ్లి అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ అడ్డ చెట్లు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో అడవితో పాటు పలు చోట్ల సహజంగాను పెరుగుతాయి. ఈ అడ్డ ఆకులతో విస్తరాకులు, బెరడుతో తాళ్లు, అడ్డ గింజలు.. ఇలా చెట్టులోని అన్ని భాగాలు గిరిజనులకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఆకులను, గింజలను, అడవుల నుంచి సేకరించి వారపు సంతల్లో విక్రయిస్తుంటారు. సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు అడ్డ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఈ ఆకులను తింటే ఆరోగ్యానికి మేలు చేకూరటమే కాక, జీర్ణ సంబంధిత సమస్యలు కూడ తగ్గుతాయి. అడ్డ గింజల్లో ప్రోటీన్, కాల్షియం ఇంకా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్ బారిన పడకుండా కాపాడుతుంది. ఏజెన్సీలో సంక్రాంతి రోజు గిరిజన సంప్రదాయ వంటకం పులగంలో ఈ అడ్డ గింజలు వేసి దేవతలకు నివేదిస్తారు. ఆ తర్వాత పులగాన్ని అడ్డాకులలో భుజిస్తారు. కొన్ని ప్రముఖ దేవాలయాల్లో అడ్డాకులను ప్రసాదం ప్యాకింగ్ కోసం నేటికీ వాడుతుండటం విశేషం. నేటి తరానికి వివరించాలి క్రమేపీ గిరిజనుల్లో అడ్డ ఆకుల సంప్రదాయపు అలవాట్లు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత తరానికి వీటి ప్రాముఖ్యత తెలియక వాటిని పట్టించుకోవటం లేదు. మరోవైపు అడ్డాకుతో తయారయ్యే విస్తరాకుల ఉత్పత్తి తగ్గటం వలన పేపర్ ప్లేట్ వాడటం పెరిగింది. పేపర్ ప్లేట్లు పర్యవరణానికి అంత అనుకూలమైనది కాదు కనుక ఈ అడ్డతీగ ప్రాముఖ్యత అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. సహజంగా దొరికే ఈ అడ్డాకులతో విస్తర్లుగా చేసి పేపర్ ప్లేట్లకు ప్రత్యామ్నయంగా వాడితే పర్యవరణానికి మేలు చేసినట్లేనని పలువురు మేధావులు, గిరిజనులు అభిప్రాయ పడుతున్నారు. అడ్డ ఆకు, తీగలతో ప్రయోజనాలు ► అడ్డాకులతో విస్తరాకుల తయారీ ► అడ్డ తీగలతో నారలు చేసి కంచెలు కట్టడం ► అడ్డ తీగలతో బుట్టలు అల్లుకోవటం ► అడ్డ గింజలను ఆహారం(స్నాక్స్) రూపంలో తీసుకోవటం అప్పట్లో అడ్డాకులే జీవనాధారం మా చిన్నతనంలో అడవిలోకి వెళ్లి అడ్డాకులు సేకరించే వాళ్లం. వాటిని ఎండబెట్టి, వారానికి ఒకసారి వారపు సంతల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించాం. అడ్డ గింజలతో కూర వండుకునేవాళ్లం. ఇప్పుడు అడ్డాకులు సంతల్లో అమ్ముదామన్నా గిట్టుబాటు ధర ఉండట్లేదు. ప్రభుత్వ అధికారులు జీసీసీ ద్వారా అడ్డాకులు కొనుగోలు చేస్తే మాకు ఉపాధి కలుగుతుంది. –పాంగి కాసులమ్మ, కామయ్యపేట గ్రామం, హుకుంపేట మండలం ఆరోగ్యానికి మంచిది విశాఖ ఏజెన్సీ అడవుల్లో సహజంగా దొరికే ఈ అడ్డాకులు, అడ్డ గింజలు ఆరోగ్యపరంగా ఎంతో మంచివి. వీటిని వీడీవీకే కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తే గిరిజనులకు మంచి ఉపాధి లభిస్తుంది. వీటితో విస్తరాకులు తయారు చేసి ఉపయోగిస్తే పేపర్ ప్లేట్లు విక్రయాలు తగ్గించి, పర్యావరణాన్ని కాపాడవచ్చు. విస్తరాకుల ద్వారా మంచి ఉపాధితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. –డా.శ్రావణ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ విభాగం, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖ -
అడవుల్లో ఆవాసం.. అన్ని వృత్తుల్లో నైపుణ్యం
-
అడ్డాకుల వినియోగం.. ఆరోగ్యానికి మేలు
హుకుంపేట(అరకు): గిరిజన ప్రాంతంలో ఆరోగ్యపరంగా, వాణిజ్యపరంగా పేరు గాంచింది అడ్డ తీగ. ఫణెర వహ్లి అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ అడ్డ చెట్లు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో అడవితో పాటు పలు చోట్ల సహజంగాను పెరుగుతాయి. ఈ అడ్డ ఆకులతో విస్తరాకులు, బెరడుతో తాళ్లు, అడ్డ గింజలు.. ఇలా చెట్టులోని అన్ని భాగాలు గిరిజనులకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఆకులను, గింజలను, అడవుల నుంచి సేకరించి వారపు సంతల్లో విక్రయిస్తుంటారు. సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు అడ్డ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఈ ఆకులను తింటే ఆరోగ్యానికి మేలు చేకూరటమే కాక, జీర్ణ సంబంధిత సమస్యలు కూడ తగ్గుతాయి. అడ్డ గింజల్లో ప్రోటీన్, కాల్షియం ఇంకా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్ బారిన పడకుండా కాపాడుతుంది. ఏజెన్సీలో సంక్రాంతి రోజు గిరిజన సంప్రదాయ వంటరం పులగం అన్నంలో ఈ అడ్డ గింజలను వేసి దేవతలకు నివేదిస్తారు. ఆ తర్వాత పులగం అన్నం వండుకుని అడ్డాకులలో భుజిస్తారు. కొన్ని ప్రముఖ దేవాలయాల్లో అడ్డాకులను ప్రసాదం ప్యాకింగ్ కోసం నేటికీ సంప్రదాయంగా వాడటం విశేషం. అడ్డ చెట్టులో కాచిన అడ్డ కాయలు, అడ్డ కాయలకు కట్టిన అడ్డ తాడు నేటి తరానికి వివరించాలి క్రమేపీ గిరిజనుల్లో అడ్డ ఆకుల సంప్రదాయపు అలవాట్లు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత తరానికి వీటి ప్రాముఖ్యత తెలియక వాటిని పట్టించుకోవటం లేదు. మరోవైపు అడ్డాకుతో తయారయ్యే విస్తరాకుల ఉత్పత్తి తగ్గటం వలన పేపర్ ప్లేట్ వాడటం పెరిగింది. పేపర్ ప్లేట్లు పర్యవరణానికి అంత అనుకూలమైనది కాదు కనుక ఈ అడ్డతీగ ప్రాముఖ్యత అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. సహజంగా దొరికే ఈ అడ్డాకులతో విస్తర్లుగా చేసి పేపర్ ప్లేట్లకు ప్రత్యామ్నయంగా వాడితే పర్యవరణానికి మేలు చేసినట్లేనని పలువురు మేధావులు, గిరిజనులు అభిప్రాయ పడుతున్నారు. అప్పట్లో అడ్డాకులే జీవనాధారం మా చిన్నతనంలో అడవిలోకి వెళ్లి అడ్డాకులు సేకరించే వాళ్లం. వాటిని ఎండబెట్టి, వారానికి ఒకసారి వారపు సంతల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించాం. అడ్డ గింజలతో కూర వండుకునేవాళ్లం. ఇప్పుడు అడ్డాకులు సంతల్లో అమ్ముదామన్నా గిట్టుబాటు ధర ఉండట్లేదు. ప్రభుత్వ అధికారులు జీసీసీ ద్వారా అడ్డాకులు కొనుగోలు చేస్తే మాకు ఉపాధి కలుగుతుంది. –పాంగి కాసులమ్మ, కామయ్యపేట గ్రామం, హుకుంపేట మండలం ఆరోగ్యానికి మంచిది విశాఖ ఏజెన్సీ అడవుల్లో సహజంగా దొరికే ఈ అడ్డాకులు, అడ్డ గింజలు ఆరోగ్యపరంగా ఎంతో మంచివి. వీటిని వీడీవీకే కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తే గిరిజనులకు మంచి ఉపాధి లభిస్తుంది. వీటితో విస్తరాకులు తయారు చేసి ఉపయోగిస్తే పేపర్ ప్లేట్లు విక్రయాలు తగ్గించి, పర్యావరణాన్ని కాపాడవచ్చు. విస్తరాకుల ద్వారా మంచి ఉపాధితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. –డా.శ్రావణ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ విభాగం, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖ అడ్డ ఆకు, తీగలతో ప్రయోజనాలు ► అడ్డాకులతో విస్తరాకుల తయారీ ► అడ్డ తీగలతో నారలు చేసి కంచెలు కట్టడం ► అడ్డ తీగలతో బుట్టలు అల్లుకోవటం ► అడ్డ గింజలను ఆహారం(స్నాక్స్) రూపంలో తీసుకోవటం -
పెళ్లికి కట్నకానుకలు రద్దు.. ఏకగ్రీవ తీర్మానం
సాక్షి, ఇంద్రవెల్లి: తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను కాపాడడానికి ఆదివాసీలు దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకూ మారుతున్న కాలంలో ఆదివాసీలు పాత ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల్లో రాయిసెంటర్ల సార్మెడిల ఆధ్వర్యంలో గ్రామాల పెద్దలతో సమావేశాలు నిర్వహించి తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పాత పద్ధతిలో పెళ్లిలు నిర్వహణ, కట్నకానులకు దూరంగా ఉండాలని ఆయా ఆదివాసీ గ్రామాల పెద్దల సమక్షంలో తీర్మానాలు చేస్తున్నారు. ఫంక్షన్ హాల్లో పెళ్లిలు రద్దు... ప్రస్తుతం మారుతున్న కాలంలో ఒక్కరిని చూసి ఒక్కరూ ఉన్న కుటుంబీకులు పెళ్లి వేడుకలు వరుడు ఇంట్లో కాకుండా ఫంక్షన్ హాల్లో నిర్వహించడంపై చర్చించారు. పెళ్లి వేడుకలు వరుడు ఇంట్లో లేదా.. ఇల్లరికం అయితే వధువు ఇంట్లో నిర్వహించాలని ఆదివాసీ పెద్దలు తీర్మానాలు చేశారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం... తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు యథావిధిగా కొనసాగించడం, పెళ్లిల్లో అక్కాచెల్లెల్లు తప్ప ఇతరులకు అహేరి(కానుక)లు రద్దు చేయుడం, సామూహిక వివాహాలు చేయడం, ఎర్రబోట్టు కార్యక్రమంలో సాల్ ముద్ద(బంగారపు ఉంగరం) ఇవ్వరాదు. పెళ్లిచూపులకు పది మంది కంటే ఎక్కువ మంది వెళ్లరాదు. పెళ్లి వేడుకల్లో నాలుగు డోళ్లు మాత్రమే ఉపయోగించాలి. వధువును పెళ్లికి ఒక రోజు ముందే పెళ్లి కొడుకు గ్రామానికి పంపించాలి. నిర్ణయించిన సమయంలో పెళ్లి చేయాలి. అక్షింతలు పసుపుతో కలిపిన బియ్యం మాత్రమే వాడాలి. వధూవరులకు ముఖాముఖిగా తమకు తోచిన కట్నకానుకలు ఇవ్వాలి. వివాహ వేడుకల్లో వరుడు దోతి, రూమల్ ధరించాలి. పెళ్లి మండపంలో కరెకోపాల నీటితో మండపం వద్దనే స్నానం చేయించాలి. కట్నం, హుండీ, బండి, బెడ్, కూలర్, ప్రీజ్ ఇవ్వడం రద్దు చేస్తూ తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్, వడగామ్, ఇంద్రవెల్లి తదితర రాయిసెంటర్లలో సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేశారు. పాత ఆచారాలను అమలు చేయాలి ప్రస్తుత కాలంలో కొనసాగుతున్న వరకట్నాలు, కానుకలతో నిరుపేద కుటుంబీకులు పెళ్లిలు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. రాయిసెంటర్ సమావేశంలో ఆదివాసీ పెద్దలు చేసిన తీర్మానాన్ని ఆదివాసీ గ్రామాల్లో అమలు చేసి పాత పద్ధతి, తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహరాలు, సంస్కృతి, సంప్రదాయాలను అన్ని గ్రామాల్లో అమలు చేయాలి. – ఆత్రం మారు, వడగామ్ కట్నం లేని పెళ్లి చేద్దాం.. సిర్పూర్(యూ): పేదల ఇంట్లో ఖర్చు లేకుండా పెళ్లి చేయలాంటే ఆదివాసీ పెళ్లిళ్లు ఎంతో ఆదర్శం. గతంలో ఆదివాసీ ప్రజలు తమ కూతురుకు పెళ్లి చేయాలంటే నయా పైస ఖర్చు లేకుండా జరిగిపోయేది. పెళ్లికి సంబంధించిన ప్రతి పనిని గ్రామస్తులు అన్ని తామై చేసేవారు. కాలక్రమంలో వరకట్నాలు, బహుమతులు, కానుకలు ఇవ్వడం మొదలైంది. ఇలాంతి సంస్కృతి సమాజానికే ప్రమాదమని గ్రహించి ఆదివాసీ పెద్దలు తిరిగి తమ పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు. కట్నకానుకలు నిషేధిస్తూ తీర్మానాలు చేస్తున్నారు. సిర్పూర్(యు) గ్రామ పటేలు ఆత్రం ఆనంద్‌రావు కట్నాకానుకలు తీసుకోవద్దని తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని రాయిసెంటర్‌లో సమర్పించి అన్ని గ్రామాల్లో ఇదే పద్ధతి అమలయ్యేలా నాంది పలకనున్నట్లు గ్రామపటేళ్లు చెబుతున్నారు పెళ్లి పేదలకు భారం కాకూడదు.. గతంలో ఆదివాసీ ప్రజలు తమ కూతురుకు పెళ్లి చేస్తున్నారంటే ఎలాంటి ఖర్చు లేకుండా జరిగేది. కానీ నేటి ఆధునిక యుగంలో ఒకరిని చూసి ఒకరు కట్నాలు ఇవ్వడం, తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ పద్ధతి సమాజానికి మంచిది కాదని భావించాం. పేదవారికి పెళ్లి అనేది భారం కాకూడదనే ఉద్దేశంతో కట్నాలను నిషేధిస్తూ గ్రామ తీర్మానం చేశాం. పెద్దలతో చర్చిస్తూ అన్నీ గ్రామాల్లో ఇదే పద్ధతిని అమలు చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నం. పాత ఆచారాలు, సంప్రదాయాలు అందరికీ మేలుచేస్తాయి. – ఆత్రం ఆనంద్‌రావు, గ్రామపటేలు మంచి నిర్ణయం ప్రస్తుతం కట్నకానుకలతో ఆడ పిల్లల పెళ్లిలు నిర్వహించడానికి నిరుపేద కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతన్నారు. అదే విధంగా రోజురోజుకూ మారుతున్న కాలంలో పాత ఆచారాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. రాయిసెంటర్‌లో చేసిన తీర్మానం ప్రకారం పెళ్లిలు, వేడుకలు నిర్వహించాలి. ప్రతి గ్రామంలో అమలు చేయాలి. – రాయిసిడం అన్నపుర్ణ, గోండ్‌గూడ మా కాలంలో కట్నాలు లేవు మా కాలంలో కట్నాలు లేవు.. కానుకలు లేవు... సాధారణంగా పెళ్లి చూపులు చూసి ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పెళ్లిలు జరిగాయి. రోజురోజుకూ పెళ్లి వేడుకల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు పెళ్లిలు చేయడానికి కట్నాలు, కానుకల పేరుతో లక్షలు కూడా సరిపోవడం లేదు. పాత పద్ధతిలో వేడుకలు నిర్వహించాలి. – ఆత్రం లక్ష్మిబాయి, ఇంద్రవెల్లి, గోండ్‌గూడ -
‘కొటియా’ క్లస్టర్లో ఏపీ జెండా రెపరెప
సాక్షి, అమరావతి: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల మధ్య కోరాపుట్ జిల్లాలోని కొటియా పల్లెల ప్రజలు తాము ఏపీలోనే ఉంటామని బ్యాలెట్ ద్వారా ఒడిశా ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఒడిశా ప్రభుత్వం నిర్వహించిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా కొటియా క్లస్టర్ పరిధిలో పొట్టంగి జోన్–1 స్థానానికి ఫిబ్రవరి 18న పోలింగ్ జరిపించింది. అదే నెల 26న ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజున ఫలితం ప్రకటించారు. మహిళలకు కేటాయించిన ఈ స్థానం నుంచి ఒడిశా పాలకపక్ష పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ), ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కలిసి మమతా జానీ అనే మహిళను ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. కొటియా గ్రామాల్లో గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును తారుమారు చేసేందుకు ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించిన అక్కడి మూడు రాజకీయ పార్టీలు జానీ గెలుపు కోసం పెద్దఎత్తున ప్రచారం చేశాయి. అయినా ఫలితం దక్కలేదు. తెలుగు మాట్లాడే స్వతంత్ర అభ్యర్థిని టికై గెమెల్ 3,710 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెమెల్కు 10,354 ఓట్లు రాగా, మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి జానీకి 6,644 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి అభ్యర్థి ఓటమి పాలవడంతో ఒడిశా రాజకీయ పార్టీలకు షాక్ తగిలింది. తెలుగు అభ్యర్థిని గెలిపించటం ద్వారా తాము ఏపీలోనే ఉంటామని అక్కడి ప్రజలు ఒడిశా ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేశారు. -
బెదిరింపులు.. బుజ్జగింపులు!
సాలూరు: కొటియా పల్లెల్లో ఒడిశా దూకుడు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఆంధ్రాలోనే ఉంటామంటూ తేల్చి చెప్పిన గిరిజనులపై చర్యలకు దిగుతోంది. ఒడిశా ప్రభుత్వం ఈ నెల 18న కొటియా పల్లెల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. తామంతా ఆంధ్రాలోనే ఉంటామంటూ కొందరు గిరిజనులు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. వారి అప్పీల్‌ను సోమవారం కోర్టు స్వీకరించింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలని స్థానిక గిరిజన నేతలు, ప్రజలు నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఒడిశా ప్రభుత్వం వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఆంధ్రా వైపు మొగ్గుచూపుతున్న 12 మంది.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ మంగళవారం సాయంత్రం పొట్టంగి తహసీల్దార్ సమన్లు జారీచేశారు. వాటిని తీసుకునేందుకు గిరిజన నాయకులు తిరస్కరించడంతో ఒడిశా పోలీసులు వాగ్వాదానికి దిగారు. అప్పటికీ సమన్లు తీసుకునేందుకు నిరాకరించడంతో స్థానిక నేతలు బుజ్జగించే యత్నాలు ప్రారంభించారు. ఒడిశాలోని పొట్టంగి మాజీ ఎమ్మెల్యే ప్రపుల్ల పంగి, స్థానిక నేతలు కొందరు బుధవారం సాయంత్రం పట్టుచెన్నేరుకు వచ్చి ఎన్నికల్లో పాల్గొనాలని గిరిజనులతో మధ్యవర్తిత్వం నడిపారు. ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ మావోలు ఇప్పటికే లేఖ విడుదల చేశారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొటియాపల్లెల్లో నెలకొంది. -
అడవి చెప్పిన కథ.. అర్చనలకు ఫలితంగా అక్షర జ్ఞానం
అనగనగనగా ఓ అడవి. ఆ అడవిలో కొన్ని అరుదైన కోవెలలు. ఆ మందిరాల్లో మంత్రాలు లేకుండా పూజలు. ఆ అర్చనలకు ఫలితంగా అక్షర జ్ఞానం. తమ ఉనికికి ఊపిరి పోసేందుకు, వేల ఏళ్ల నాటి భాషను బతికించుకునేందుకు, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఆదివాసీలు నట్టడవిలో వెలగించిన చైతన్య దివిటీలు ఈ దేవాలయాలు. సకల దేవతల సమాహారంగా అక్షరాలు కొలువై ఉన్న ఈ ఆలయాలను చూడాలంటే జనాలను దాటి వనంలోకి వెళ్లాలి. సిక్కోలు మన్యంలోని భామిని మండలాన్ని పలకరించాలి. అక్కడ అడవి చెప్పే స్ఫూర్తి కథను వినాలి. భామిని: భామిని మండలంలోని మనుమకొండ, పాలవలసలో రెండు ఆలయాలు విభిన్నంగా ఉంటాయి. ముక్కోటి దేవతల్లో ఒక్కరిని కూడా అక్కడ ప్రతిష్టించలేదు. అష్టోత్తరాలేమీ రాయలేదు. ప్రత్యేక ప్రార్థనలంటూ ఏమీ లేవు. అక్కడ కనిపించేవి కేవలం అక్షరాలు. అవును.. అచ్చంగా అక్షరాలే. సవర లిపిని ఆలయాల్లో ప్రతిష్టించి వాటిని పూజలు చేసే గొప్ప సంప్రదాయం ఈ రెండు గ్రామాల్లో కనిపిస్తోంది. ఆదివాసీలు చిత్రాల్లో దైవ రూపాలను గుర్తించి పూ జించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అందుకే తమ అమ్మ భాషను లిపి రూపంలో ఆరాధిస్తున్నా రు. ఈ ఆలయాల ఆలోచన వె నుక ఓ ఉద్యమమే దాగి ఉంది. ఆ ఉద్య మం పేరు మతార్బనోమ్. మత్ అంటే దృష్టి, తార్ అంటే వెలుగు, బనోమ్ అంటే విస్తరించడం కలిపి.. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం. అక్షర జ్ఞానం కోసం.. సవర భాష చాలా పురాతనమైనది. కానీ లిపి లేకపోవడంతో సరైన గుర్తింపునకు నోచుకోలేదు. ఆ లిపిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఓ ఉద్యమమే జ రిగింది. అందులో భాగమే ఈ అక్షర బ్రహ్మ ఆల యాలు. ఎప్పుడో 1936లో సవర పండిత్ మంగ య్య గొమాంగో ఈ లిపికి అక్షయ తృతీయ నాడు రూపం ఇచ్చారు. పుష్కర కాలం కష్టపడి తయారు చేసిన ఈ లిపి గిరిజనుల ఇళ్లకు చేరాలంటే ఏం చే యాలని ఆలోచించగా.. తట్టిన మహత్తర ఆలోచనే అక్షర బ్రహ్మ దేవాలయాలు. గిరిజన గ్రామాల్లో ఆలయాలు నిర్మించి అందులో అక్షరాలను ప్రతిష్టించి వాటి ద్వారా గిరిజనులను చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నించారు. దాని ఫలితంగా లిపి ఇంటింటికీ చేరింది. అంతే కాదు ఆదివాసీల్లో గల మద్యం, వివిధ రకాల మాంస భక్షణ వంటి దురాచారాల నుంచి దూరం చేసేందుకు కూడా ఈ మందిరాలు వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. విగ్రహాలు ఇవే.. సవర పండిత్ మంగయ్య గొమాంగో 24 అక్షరాలను రూపొందించి వాటిని చిత్రాల రూపంలో మలిచి ఆలయాల్లో ప్రతిష్టించారు. ఈ 24 అక్షరాలలో 16 హల్లులు, 8 అచ్చులు ఉంటాయి. అప్పట్లో అక్షర బ్ర హ్మ ఉద్యమం సరిహద్దులు దాటి అడవి గుండా వ్యాపించింది. ఆ సందర్భంలోనే భామిని మండలం మనుమకొండ, పాలవలసలోనూ అక్షరబ్రహ్మ ఆల యాలు ఏర్పాటయ్యాయి. సతివాడ సమీపంలో బొడమ్మమెట్టపై కొత్తగా అక్షరబ్రహ్మ ఆలయం ఇటీవల ఏర్పాటైంది. సీతంపేట మండలం నౌగడ, ముత్యాలు, శంభాంలలోనూ, విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం కన్నాయిగూడ, లక్కగూడలోనూ తర్వాత అక్షరబ్రహ్మ అలయాలు వెలిశా యి. జామిగూడ, సతివాడ, నౌగడ తదితర గ్రామా ల్లో అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా కేంద్రాలు పేరున ప్రచార మందిరాలు వెలిశాయి. జాతీయ స్థాయిలో.. ఇటీవల మనుమకొండలో జరిగిన అక్షరబ్రహ్మ యువ నిర్మాణ సేవా సంఘం జాతీయ స్థాయి సదస్సులో ఐదు రాష్ట్రాల ప్రతినిధులు, మతార్బనోమ్ ప్రచారకులు సవరభాషను జాతీయ భాషగా తీర్చిదిద్దడానికి తీర్మానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సరవభాషా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయించారు. ఒడిశా నుంచి మాజీ ముఖ్యమంత్రి గిరిధర గొమాంగో, మాజీ ఎమ్మెల్యే రామూర్తి గొమాంగో, సవర భాషను ఆవిష్కరించిన మంగయ్య కుమారు డు, సవర లిపి ప్రచార జాతీయ అధ్యక్షుడు డిగాన్సిమ్ గొమాంగో, అసోం నుంచి వచ్చిన పాగోని బోయా, గాబ్రియల్ బోయా, లోక్మి బోయాలు చర్చించారు. సవర భాష ప్రాచుర్యానికి చెందిన పుస్తకాల స్టాల్స్, సవర లిపి కరపత్రాలు, మేగజైన్లు, పోస్టర్లు ప్రదర్శించాలని నిర్ణయించారు. ప్రతి ఆదివాసీ ఇంట.. మా భాషకు లిపిని అందించిన సవర పండిత్ మంగయ్య గొమాంగో మాకు ఆరాధ్య దైవం. అక్షర బ్ర హ్మ ప్రచార కార్యక్రమాన్ని ప్రతి ఆదివాసీ ఇంటికీ చేర్చుతున్నాం. అక్షర బ్రహ్మ ఆలయాలు నిర్మించలేని చోట అక్షర బ్రహ్మ ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక పూజలతో సవర లిపి ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. – సవర కరువయ్య, జిల్లా కోఆర్డినేటర్, అక్షర బ్రహ్మ ప్రచారకుల సంఘం, సతివాడ సవర భాషలో బోధిస్తాం.. సవర భాషలోని పదాలు, వాడుక వస్తువులను సవర లిపిలో వివరిస్తున్నాం. గిరిజన గ్రామాల్లో సమావేశాలు పెట్టి ఇతర భాషలతో పాటు సవర భాష అక్షరాలతో పదాలు, అర్థాలు బోధిస్తున్నాం. సవర భాషకు గుర్తింపు తీసుకురావడానికి రాత్రింబవళ్లు కొండలపై తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. – పత్తిక సాయన్న, ప్రచారకుడు, అక్షరబ్రహ్మ యువసేవా సంఘం, మనుమకొండ -
తూర్పుగోదావరి: కల్తీ కల్లు తాగి నలుగురు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా ఏజెన్సీలో కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. రోజు సేవించే కల్లు ఎలా కల్తీకి గురైందనే విషయం అంతు చిక్కకుండా ఉంది. ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
బురిడీ బాబు.. నెలన్నర అవుతున్నా పత్తాలేరు..
చంద్రబాబునాయుడు వంచనకు కేరాఫ్.. అని మరోసారి నిరూపితమైంది. అధికారంలో ఉన్నా.. లేకున్నా జనాన్ని బురిడీ హామీలతో వంచన చేయడం అలవాటై పోయింది. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నేనున్నానంటూ బాధితులకు భరోసా ఇచ్చిన వాడే ప్రజానాయకుడు. కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకునే మనస్సు ఉండాలి. ప్రజాక్షేత్రంలో ఇచ్చిన హామీని ఎంత కష్టమైనా నెరవేర్చే సత్తా ఉండాలి. అప్పుడే ప్రజలు ఆ ప్రజానాయకుడి చిత్తశుద్ధిని నమ్మి తమ హృదయాల్లో చోటు కల్పిస్తారు. కానీ చంద్రబాబులో ఏ కోశాన వెతికినా ఇలాంటి లక్షణాలు కనిపించవు. వరద బాధితులను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నెలన్నర అవుతున్నా.. పత్తాలేకుండాపోయారు. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక్కో గిరిజన కుటుంబానికి రూ.5 వేలు సాయం వెంటనే అందిస్తాం. ఈ ప్రభుత్వానికి పేదలపై ప్రేమ లేదు. నేనున్నాను ఆదుకుంటాను. – ఇది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతేడాది నవంబర్ 25న నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ. సీన్ కట్ చేస్తే 43 రోజులు గడుస్తున్నా బాబు హామీ కార్యరూపంలోకి దాల్చలేదు. ఒక్క గిరిజన కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి రూపాయి సాయం అందలేదు. సాక్షి, నెల్లూరు: జిల్లాలో గతేడాది నవంబర్‌లో అతి భారీ వర్షాలు కురిశాయి. వరదలు ఉప్పొంగాయి. పెన్నా పరీవాహక ప్రాంతాల్లో గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వరదలు వచ్చాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఎన్నో కుటుంబాలు కట్టుబట్టలతో ప్రాణాలతో బయట పడ్డాయి. తక్షణమే స్పందించిన ప్రభుత్వం బాధితులకు అండగా నిల్చింది. నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆదుకుంది. పునరావాస కేంద్రాల్లోనే తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.2 వేలు వంతున ఆర్థిక సాయం అందజేసింది. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆ«ధికార యంత్రాంగం రేయింబవుళ్లు కష్టపడి బాధితులకు బాసటగా నిలిచారు. ఇంత కష్టంలో ప్రభుత్వం స్పందించిన తీరుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు ఇంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవని బాధితులే కాకుండా ప్రజానీకమంతా ముక్తకంఠంతో ప్రశంసలు కురిపించింది. చదవండి: ('బావ మాట బంగారు బాట అన్నట్లు బాలకృష్ణ మాట్లాడుతున్నారు') సాయమంటూ.. యూటర్న్ చంద్రబాబునాయుడు ఏనాడు ఇచ్చిన మాట మీద, చెప్పిన మాట మీద నిలబడిన దాఖలాలు లేవని జిల్లా పర్యటన తర్వాత మరోసారి రుజువువైంది. ఈ ఉదంతం తర్వాత యూటర్న్ తీసుకోవడంలో మరో మైలు రాయిని అధిగమించారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కోసం చంద్రబాబు గతేడాది నవంబర్ 25న జిల్లాలో పర్యటించారు. నాయుడుపేట నుంచి నెల్లూరు, ఇందుకూరుపేట, భగత్‌సింగ్ కాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో పర్యటించి స్థానిక గిరిజన కాలనీకి వెళ్లారు. అక్కడ గిరిజనులతో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న 150 కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ప్రతి కుటుంబానికి రూ.5 వేలు చొప్పున రూ.7.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మాట ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చి ఇప్పటికి దాదాపు 43 రోజులు గడిచింది. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఎలాంటి సాయం అందలేదు. సాక్షాత్తు చంద్రబాబు వచ్చి హామీ ఇచ్చాడు కదా? తప్పక సాయం అందుతుందని పాపం ఆ గిరిజనులు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. పలుమార్లు ఆ పార్టీ నేతలను కలిసి అయ్యా.. చంద్రబాబు ఇస్తామన్న రూ. 5 వేలు డబ్బులు రాలేదని చెప్పుకుని వాపోయారు. ఆ టీడీపీ నేతలు కూడా మా బాబుగారంతే? ఇచ్చిన మాట ఎప్పుడూ నెరవేర్చాడు? అలా చేస్తే ఆయన చంద్రబాబు ఎలా అవుతాడంటూ ఎదురు ప్రశ్నించడంతో గిరిజనులు మిన్నకుండిపోయారు. -
గిరిజన బాలల ‘సేవా భారతి’
సాక్షి, అమరావతి: ► ఈ చిత్రంలోని యువతి.. నూప రాధ. ఊరు.. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం పాలగూడెం. గిరిజన కుటుంబానికి చెందిన రాధ తండ్రి చినరాముడు 2014లో మరణించారు. ఆ తర్వాత చెల్లిని కూడా కోల్పోయింది. రాధ తల్లి ముత్తమ్మకు చదివించే స్తోమత లేకపోవడంతో పదో తరగతితోనే రాధ చదువు ఆపేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సేవా భారతి సంస్థ రాధను ఇంటర్ నుంచి నర్సింగ్ వరకు చదివించింది. ఆ సంస్థ సాయంతో ప్రస్తుతం రాధ కూనవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తోంది. ► తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురంకు చెందిన రాంబాబు తండ్రి అతడికి ఆరేళ్ల వయసున్నప్పుడు మరణించాడు. దీంతో రాంబాబు తల్లి వెంకటలక్ష్మి మరో పెళ్లి చేసుకుంది. దీంతో అనాథగా మారిన అతడిని సేవా భారతి సంస్థ ఆదుకుంది. అనాథ బాలుర ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి చదువు చెప్పింది. తర్వాత బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన రాంబాబు కాకినాడలో ఇరిగేషన్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. అమ్మ మృతితో చదువు ఆపేశాను మా అమ్మ సోములమ్మ మృతి చెందడంతో 2012లో ఇంటర్‌తో చదువు ఆపేశా. సేవా భారతి సంస్థ ఆదరించి చదువు చెప్పించింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నా. – కొండ్ల వీరపురెడ్డి, గిరిజన యువకుడు ఇలా.. రాధ, రాంబాబులే కాకుండా చిన్నారి, పాయం సుమన్, మండకం గంగాధర్, బుచ్చిరెడ్డి, తుర్రం రాధ, జగన్ బాబు, బేబీ, ముక్తేశ్వరి వంటి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు, ఆర్థికంగా తోడ్పాటు లేని అభాగ్యులు, మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన దాదాపు 90 మంది గిరిజన బాలబాలికలకు సేవా భారతి ట్రస్ట్ చేయూతను అందించింది. వారికి అన్ని విధాలా అండగా నిలిచి చదువులు చెప్పింది. ఆ సంస్థ అందించిన ఆసరాతో ఇప్పుడు వారంతా వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరంతా ఆదివారం విజయవాడ సత్యనారాయణపురంలోని విజ్ఞాన విహార పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కష్టాల కడలి నుంచి చదువుల బాటలో సాగి ఉద్యోగమనే విజయ తీరానికి చేరుకున్న వైనాన్ని అందరికీ వివరించి వారిలో స్ఫూర్తిని రగిలించారు. ఈ సమావేశంలో సేవా భారతి అధ్యక్షుడు డాక్టర్ సాయి కిషోర్, ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు, విద్యాభారతి ప్రాంత కార్యదర్శి ఓంకార నరసింహం పాల్గొన్నారు. చింతూరు, వరరామచంద్రపురం, కూనవరం, కుక్కునూరు, భద్రాచలం తదితర మండలాల్లో దాదాపు 200కుపైగా గ్రామాల్లో ప్రజలకు విద్య, వైద్య సేవలందిస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు దాదాపు 20 ఏళ్లకుపైగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాం. చదువుకు దూరమైన పిల్లల్ని గుర్తించి చదివిస్తున్నాం. ఇలా చదువుకుంటున్నవారు, చదువుకుని స్థిరపడినవారు దాదాపు 600 మంది ఉన్నారు. వారంతా నన్ను మావయ్య, నాన్న అని పిలుస్తుంటే చాలా సంతృప్తిగా ఉంది. –సాయి కిశోర్, సేవాభారతి రాష్ట్ర అధ్యక్షుడు ఏఎన్ఎంగా పనిచేస్తున్నా మాది పేద కుటుంబం కావడంతో చదువు ఆపేశాను. ఇలాంటి పరిస్థితుల్లో సేవా భారతి సంస్థ నన్ను నర్సింగ్ చదివించింది. ఇప్పుడు రేఖపల్లిలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా పనిచేస్తున్నా. –ఎం.రాములమ్మ, గిరిజన యువతి -
15 కిలోమీటర్ల నడక.. కొండలు, గుట్టలెక్కి.. అనుకున్నది సాధించారు
సాక్షి,ములుగు(వాజేడు): వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గుట్టలెక్కి వెళ్లి గిరిజనులకు శనివారం కరోనా టీకాలను వేశారు. మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీ పరిధిలోని పెనుగోలు కుగ్రామం గుట్టలపై ఉంది. ఏటూరునాగారం ఐటీడిఏ అడిషనల్ డీఎం హెచ్ఓ మంకిడి వెంకటేశ్వర్లు, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది చిన్న వెంకటేశ్వర్లు, అరుణ కుమారి పెనుగోలు గిరిజనుల సహకారంతో కిట్లను మోసుకుంటూ 15 కిలో మీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్లారు. దారిలో కలిసిన ఒక్కరిద్దరికి టీకాలను సైతం వేసి గ్రామానికి చేరుకుని టీకాలను వేశారు. అనంతరం అందరి నుంచి రక్త నమూనాలను సేకరించారు. చదవండి: హాస్టల్లో ఏదో ఉందని! ఒంటిపై రక్కుతున్నట్లు, తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని.. -
గంజాయి పంట ధ్వంసం
కొయ్యూరు/డుంబ్రిగుడ: విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ నిమ్మలగొంది, బోయవుట, డుంబ్రిగుడ మండలంలోని కురిడి పంచాయతీ గోరాపూర్ గ్రామాల్లో గిరిజనులు బుధవారం 40 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. కొయ్యూరు సీఐ స్వామినాయుడు, మంప, కొయ్యూరు, డుంబ్రిగూడ ఎస్ఐలు లోకేష్‌కుమార్, దాసరినాగేంద్ర, సంతోష్‌కుమార్ బుధవారం ఆయా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు ఏకమై 40 ఎకరాల్లో గంజాయి మొక్కలను పీకి పారేశారు. ఇక మీదట గంజాయి తోటలు పెంచబోమని వారు పోలీసులకు తెలిపారు. సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ గిరిజనుల్లో చైతన్యం వచ్చిందని, స్వచ్ఛందంగా వారే గంజాయిని ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. -
4 గంటల పర్యటన.. రూ.23 కోట్లకు పైగా ఖర్చు
భోపాల్: గిరిజన యోధుల సంస్మరణార్థం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 15న జనజాతీయ గౌరవ్ దివస్‌ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరువుతున్నారు. కార్యక్రమంలో భాగంగా మోదీ రాష్ట్ర రాజధానిలో సుమారు 4 గంటల పాటు ఉండనున్నారు. ఈ క్రమంలో ప్రధాని 4 గంటల పర్యటన కోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 23 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నది. దీనిలో సుమారు 15 కోట్ల రూపాయలను రవాణా కోసమే ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. జంబోరి మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమం కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి జనాలను తరలించనున్నారు. (చదవండి: అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..) మధ్యప్రదేశ్ ప్రభుత్వం భగవాన్ బిర్సా ముండా జ్ఞాపకార్థం జన్‌జాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న మోదీ.. ఈ వేదిక మీదుగా దేశంలో తొలిసారి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించిన హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. జంబోరి మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుదిక్కుల నుంచి సుమారు 2 లక్షల మంది గిరిజనులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యక్రమం జరగనున్న వేదిక మొత్తాన్ని గిరిజన యోధుల చిత్రాలతో అలంకరించనున్నారు. ఈ క్రమంలో వారం రోజుల నుంచి 300 మంది కళాకారులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. (చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!) కార్యక్రమం కోసం 52 జిల్లాల నుంచి వచ్చే ప్రజల రవాణా, ఆహారం, వసతి కోసం ప్రభుత్వం 12 కోట్ల రూపాయలకు కేటాయించింది. అతిథులు కూర్చునే వేదిక కోసం ప్రత్యేకంగా ఐదు గోపురాలు, గుడారాల నిర్మాణం, ఇతర అలంకరణ, ప్రచారానికి గాను 9 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్డ్ తెగలకు 47 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. 2008లో బీజేపీ వీటిలో 29 గెలిచింది. 2013లో ఆ సంఖ్య 31 పెరిగింది. అయితే 2018లో 47 స్థానాల్లో బీజేపీకి 16 సీట్లు మాత్రమే వచ్చాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని శివరాజ్‌సింగ్ చౌహాన్ భారీ ఎత్తున గిరిజనుల యోధుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చదవండి: ప్రభుత్వాలకు మీరు మార్గదర్శకులు సార్.. మా ఊరే లేదంటున్నారు -
గంజాయి నిర్మూలనకు గిరిజనుల ప్రతిన
జి.మాడుగుల/గూడెం కొత్తవీధి: గంజాయి పంటను ఇకపై సాగు చేయబోమని గిరిజనులు ప్రతిన బూనారు. గంజాయి సాగు, రవాణాను పూర్తిగా రూపుమాపేందుకు నడుం కట్టారు. విశాఖ ఏజెన్సీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు, ఐటీడీఏ అధికారులు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ‘పరివర్తన’ కార్యక్రమంతో గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. జి.మాడుగుల మండలం మారుమూల గ్రామాల్లో ఇప్పటికే గిరిజనులు గంజాయి సాగును నిషేధిస్తూ తీర్మానించుకుని తోటలను నరికి పారేస్తున్నారు. మండలంలోని నుర్మతి పంచాయతీ పినజాగేరు, వండ్రాంగుల, వాకపల్లి, డిప్పలగొంది, గాదిగుంట గ్రామాల సమీపంలోని కొండ ప్రాంతాల్లో 100 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను సోమవారం గిరిజనులు కత్తులు పట్టి నరికి ధ్వంసం చేశారు. గూడెం కొత్తవీధి మండలంలోని దామనాపల్లిలో సర్పంచ్ కుందరి రామకృష్ణ గ్రామపెద్దలు, యువకులను చైతన్యపరిచి సాగు చేస్తున్న గంజాయి తోటల్లో మొక్కలను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ ఫీల్డ్‌మెన్ గోవింద్, గ్రామ వలంటీర్లు, యువకులు పాల్గొన్నారు. -
ఇక కష్టాలు దూరమండి.. కొండ కోనల్లో ఆపద్బాంధవి
బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): మారుమూల కొండకోనల్లోని ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్‌లు అపర సంజీవనిలా మారాయి. 108, 104 వాహనాలు వెళ్లలేని అటవీ ప్రాంతాలకు సులభంగా చేరుకుంటూ అడవిబిడ్డలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. దీంతో జోలికట్టి భుజాలపై మోసుకొచ్చే కష్టాలు గిరిజనులకు తప్పాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో ఐటీడీఏ, వైద్యారోగ్యశాఖ అధికారులు ఎనిమిది బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 2019 నుంచి ఈ వాహనాల ద్వారా విశేష సేవలు అందుతున్నాయి. (చదవండి: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..) ఐదు మండలాల పరిధిలో.. కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాలు ఉన్నాయి. వీటిలో 152 గ్రామాలు, 405 శివారు గ్రామాలు ఉండగా సుమారు 1,20,000 వరకూ గిరిజన జనాభా ఉంది. దాదాపు 40 గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారి సదుపాయం లేదు. భౌగోళిక స్వరూపం దృష్ట్యా బస్సులు, 108, 104 వాహనాలు ప్రయాణించలేని పరిస్థితి. ఆయా గ్రామాల్లో గిరిజనులు అనారోగ్యాలపాలైతే జోలి కట్టి మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకువచ్చేవారు. చదవండి: రైతన్నకు తోడుగా 'ఏపీ ఆగ్రోస్' ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గిరిజనుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. మారుమూల ప్రాంతాల్లో సేవలందిచేలా రాష్ట్రవ్యాప్తంగా బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటుచేశారు. జిల్లాలో 40 గ్రామాలకు సే వలందించేలా ఎనిమిది వాహనాలను సమకూర్చగా.. మరో ఏడు వాహనాల కోసం వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటీవల ప్రతిపాదనలు చేశారు. ఇవి త్వరలో రానున్నాయని సమాచారం. రెండేళ్లు.. 11,255 కేసులు రెండేళ్ల నుంచి జిల్లాలో బైక్ అంబులెన్స్‌ల ద్వారా 11,255 అత్యవసర కేసులకు సేవలు అందించారు. 2019–20లో గర్భిణులు 824, జ్వర పీడితులు 3,012, పాయిజన్ కేసులు 160, ఆర్టీఏ 118, ఇతర కేసులు 1,020 మొత్తం 5,134 కేసులకు బైక్ అంబులెన్స్‌ల ద్వారా సేవలందించారు. 2020–21, 2021–22లో ఇప్పటివరకూ గర్భిణులు 558, ఆర్టీఏ 99, జ్వరపీడితులు 4,059, పాయిజన్ కేసులు 149, ఇతర కేసులు 956 మొత్తంగా 6,121 మందికి సేవలు అందించారు. ప్రయోజనాలు ఎన్నో.. ►పరిమాణం, పనితీరు కారణంగా బైక్ అంబులెన్స్‌లు గిరిజన ప్రాంతాల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులను కాపాడేందుకు సాధారణ అంబులెన్స్ కంటే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ►దీని ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను రక్షించగలుగుతున్నారు. గర్భిణులను వేగంగా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ►కుక్కునూరు మండలంలో అమరవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో కొయిదా, తొట్కూరుగొమ్ము, పోలవరం మండలంలో కొరుటూరు, మేడేపల్లి, బుట్టాయగూడెం మండలంలో అలివేరు, చింతపల్లి తదితర గ్రామాల్లో బైక్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని సేవలు అందించేలా.. గిరిజన గ్రామాల్లో ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా కృషి చేస్తున్నాం. మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు ప్రస్తుతం ఎనిమిది బైక్ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నాం. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మరో ఏడు బైక్ అంబులెన్స్‌లకు ప్రతిపాదనలు పంపించాం. వీటి ద్వారా గిరిజనులకు మరిన్ని సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం అత్యవసర వైద్యం బైక్ అంబులెన్స్‌లలో అత్యవసర వైద్యానికి సంబంధించిన మెడికల్ కిట్‌ను అందుబాటులో ఉంచాం. అలాగే చిన్నపాటి ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంటుంది. సెలైన్ పెట్టే సౌకర్యం కూడా అంబులెన్స్‌లో ఉంది. అనారోగ్యం పాలైన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు మెరుగైన వైద్యం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశాం. బైక్ అంబులెన్స్ సేవలు మరింత విస్తరిస్తాం. – జి.మురళీకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, కేఆర్‌పురం -
కొనసాగుతున్న గంజాయి తోటల ధ్వంసం
సీలేరు/డుంబ్రిగుడ: ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలతో గిరిజనులు స్వచ్ఛందంగా విశాఖ ఏజెన్సీలోని గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. సీలేరు ఎస్ఐ రంజిత్ చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో విశాఖపట్నం జిల్లా ధారకొండ పంచాయతీ చిన్నగంగవరం గ్రామ పరిధిలోని గంజాయి తోటలను స్థానికులు సోమవారం నరికేశారు. అలాగే డుంబ్రిగుడ మండలంలోని సాగర పంచాయతీ కొసోంగుడ, బల్లిగెడ్డ గ్రామాల్లో కూడా సర్పంచ్ తౌడమ్మ, ఎంపీటీసీ దేవదాసుల ఆధ్వర్యంలో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అరకు సీఐ జి.డి.బాబు మాట్లాడుతూ.. గంజాయి పండించి జైలు పాలు కావద్దని.. కుటుంబాలను రోడ్డున పడవేయద్దని హితవు పలికారు. -
CCMB: గిరిజనులకు కోవిడ్ ముప్పు అధికం
సాక్షి, హైదరాబాద్: దేశంలో సాధారణ ప్రజలతో పోలిస్తే గిరిజనులు కోవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేల్చారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు గిరిజన తెగల ప్రజలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. సీసీఎంబీ శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ (సీడీఎఫ్‌డీ) డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ ఈ పరిశోధనలు చేపట్టారు. సీసీఎంబీ... అండమాన్ నికోబార్ దీవుల్లోని స్థానిక తెగల ప్రజల జన్యుక్రమాలను పరిశీలించి.. వారు కోవిడ్ బారిన పడేందుకు ఉన్న అవకాశాలపై ఒక అంచనా కట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబేతో కలసి చేపట్టిన ఈ పరిశోధన కోసం మొత్తం 1,600 మంది గిరిజన తెగల ప్రజల జన్యు క్రమాలను విశ్లేíÙంచారు. మొత్తం 227 తెగలకు చెందిన (అండమాన్‌లోని ఒంగే, జరావా తెగలు కలుపుకొని) జన్యుక్రమాల్లో కోవిడ్‌కు గురయ్యేందుకు అవకాశమున్న పొడవాటి డీఎన్ఏ పోగులు ఉన్నట్లు తెలిసింది. మానవ పరిణామానికి సజీవ సాక్ష్యాలు... అండమాన్ తెగల జన్యుక్రమాల ద్వారా వారి మూలలను వెలికి తీసిన తంగరాజ్ అంచనా ప్రకారం.. ఒంగే, జరావా తెగల వారితోపాటు దేశంలోని కొన్ని ఇతర తెగల ప్రజలూ కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. జరావా తెగల ప్రజల్లో ఏస్2 జన్యువులోని మార్పులు ఎక్కువ మందిలో ఉన్నాయని, ఈ జన్యుమార్పులు ఉన్న వారు కోవిడ్ బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువని ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే తెలిపారు. -
Telangana: అడవే ఉండాలి.. ఆక్రమణ ఉండొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల మూడో వారం నుంచి కార్యాచరణ చేపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ‘భవిష్యత్తులో అంతా అడవే ఉండాలని, లోపల ఎవరూ ఉండటానికి వీల్లేదు (నన్ ఈజ్ ఇన్ సైడ్. ఇన్సైడ్ ఈజ్ ఓన్లీ ఫారెస్ట్)’ అని స్పష్టం చేశారు. అడవుల మధ్యలో పోడు చేస్తున్నవారిని గుర్తించి అంచులకు తరలిస్తామని.. అక్కడ భూమి ఇచ్చి, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని.. రైతుబంధు, రైతు బీమా కూడా వర్తింపజేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఒక్క గజం అటవీ భూమి అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ శనివారం పోడు భూముల అంశంపై ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీ పరిరక్షణ కమిటీల నియామకానికి విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. పోడు సమస్య పరిష్కారంపై అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని, అవసరమైతే ఇతర పార్టీల నేతలను హెలికాప్టర్లో తీసుకెళ్లి అన్యాక్రాంతమైన భూములను చూపిస్తామని చెప్పారు. సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు ఆయన మాటల్లోనే.. నిర్లక్ష్యం వద్దు ‘‘మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు ఒక్క చెట్టూ మిగలదు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి. హరితహారంతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. హరితనిధికి విశేష స్పందన వస్తోంది. అడవులను రక్షించుకునే విషయంలో అటవీశాఖ అధికారులు మరింతగా శ్రద్ధ కనబర్చాలి. సమర్థవంతమైన అధికారులను నియమించాలి. వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. పోడు భూముల సమస్య పరిష్కారానికి అక్టోబర్ మూడో వారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలి. బయటివారితోనే అసలు సమస్య గిరిజనుల సంస్కృతి అడవితో ముడిపడి ఉంటుంది. వారు అడవులకు హాని తలపెట్టరు. జీవనోపాధి కోసం అడవుల్లో దొరికే తేనె, బంక, కట్టెలు, ఇతర అటవీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించుకుంటారు. సమస్య అంతా బయటినుంచి వెళ్లి అటవీ భూములను ఆక్రమించి, చెట్లను నరికి, అటవీ సంపదను దుర్వినియోగం చేసేవారితోనే. వారి స్వార్థానికి అడవులను బలికానివ్వం. పోడు సమస్య పరిష్కారమైన మరుక్షణమే అటవీభూముల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలను ప్రారంభిస్తాం. అక్రమ చొరబాట్లు లేకుండా చూసుకోవడం అటవీశాఖ అధికారుల బాధ్యతే. మూడో వారంలో దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు సంబంధించి ఈ నెల మూడో వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలి. ఆ దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా.. వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్థారించాలి. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ చర్యలు చేపట్టాలి. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేయాలి. ఈ విషయంగా ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు తీసుకోవాలి. గిరిజన సంక్షేమశాఖతో సమన్వయం చేసుకుని అటవీ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలి. నవంబర్ నుంచి సర్వే.. రాష్ట్రంలో అటవీ భూముల సర్వేను నవంబర్ నుంచి ప్రారంభించనున్నాం. అక్షాంశ, రేఖాంశాల కో–ఆర్డినేట్స్ ఆధారంగా.. ప్రభుత్వ, అటవీ భూముల సరిహద్దులను గుర్తించాలి. అవసరమైన చోట కందకాలు తవ్వడం, కంచె వేయడం వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. పకడ్బందీ చర్యల కోసం అవసరమైతే పోలీస్ రక్షణ అందిస్తాం. అంతిమంగా అందరి లక్ష్యం ఆక్రమణలకు గురికాకుండా అడవులను పరిరక్షించుకునేదై ఉండాలి..’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్ , భూపాల్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీఎం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, పీసీసీఎఫ్ శోభ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అడవిలో అడుగు పెట్టనివ్వం
సాక్షి, కొణిజర్ల/కారేపల్లి(ఖమ్మం): పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులపై అటవీ, పోలీసు అధికారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని..ఇకపై వారిని అడవిలో అడుగు పెట్టనివ్వబోమని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, కారేపల్లి మండలం చీమలపాడులో శనివారం ‘పోడు రైతుల పొలికేక’నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడుతూ..అడవిలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకే హరితహారం పేరుతో అటవీ భూములను పేదల నుంచి లాక్కుంటున్నారని మండిపడ్డారు. పోడు సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీతో కాలయాపనే తప్ప సామాన్యుడికి ఒరిగేదేమీ లేదన్నారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ..పోడుసాగు చేసుకుంటున్న మహిళలు, చిన్నారులు..చివరకు ఎద్దులపై కూడా కేసులుపెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. పోడు రైతుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు రహదారులను దిగ్బంధం చేయనున్నట్లు వెల్లడించారు. పోడుసాగుదారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి గోపగాని శంకర్రావు, సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, బాగం హేమంతరావు తదితరులు పాల్గొన్నారు. భారత్ బంద్‌కు మావోల మద్దతు దుమ్ముగూడెం: ప్రతిపక్షాలు ఈనెల 27న పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా రోడ్లను ధ్వంసం చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో శనివారం చోటుచేసుకుంది. జాగుర్గుండ దంతెవాడ రోడ్డు కమర్గూడ సమీపంలోని రహదారిని మావోయిస్టులు తవ్వేశారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అలాగే, దంతెవాడ–సుక్మా సరిహద్దులోని సామేలి గ్రామంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా 27న జరిగే బంద్‌కు తమ మద్దతు ఉంటుందంటూ మావోయిస్టులు పోస్టర్లు వేశారు. చదవండి: పాఠశాలలో కరోనా కలకలం -
పట్టించుకోని ఆదివాసీల గోడు
-
ఏవోబీలో మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవ సభ
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవాన్ని మావోయిస్టుల మిలీషియా కమాండర్లు, సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 21 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీలోని అత్యంత మారుమూల, దట్టమైన అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టు మిలీషియా కమాండర్లు, గ్రామ కమిటీల సభ్యుల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. మావోయిస్టుల స్తూపం వద్ద ఉద్యమంలో అమరులైన మావోయిస్టులకు నివాళులర్పించారు. అనంతరం తెలుగు, ఒడియా భాషలలో రాసిన బేనర్లు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులపై అణచివేత చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని నినాదాలు చేశారు. అనంతరం భారీ సభను ఏర్పాటు చేశారు. జననాట్య మండలి ఆధ్వర్యంలో తెలుగు, ఒడియా భాషలలో విప్లవ గీతాలను ఆలపించారు. సభా ప్రాంగణం అంతా ఎర్ర జెండాలు, బ్యానర్లతో నిండిపోయింది. సభలో ఆంధ్ర ఒడిశా గ్రామాలకు చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
సార్.. మా ఊరే లేదంటున్నారు
జి.మాడుగుల: తమకు ఆధార్ కార్డులు ఇప్పించాలని ఆదివాసీ గిరిజన బాలబాలికలు ఆదివారం వినూత్నంగా చేతులు జోడించి వేడుకున్నారు. విశాఖ జిల్లా జి.మాడుగుల–రావికమతం మండలాల సరిహద్దులో నేరేడుబంద అనే కుగ్రామం ఉంది. ఇక్కడ పాతికలోపు కుటుంబాలు ఉన్నాయి. మారుమూలన ఉండే ఈ గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో.. ఇక్కడ జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ కాలేదు. వీరు ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్దనే జన్మించడం, ఆరోగ్య సిబ్బంది రికార్డుల్లో కూడా వీరి గురించి నమోదు కాకపోవడంతో వీరికి బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో ఆధార్ కార్డులు జారీ చేయడం సమస్యగా మారింది. మండలంలో గడుతూరు పంచాయతీ కేంద్రానికి, రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కేంద్రానికి వెళ్లి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే నేరేడుబంద గ్రామం తమ జాబితాలో లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు కూడా ఆధార్ కార్డులు లేవు. దీంతో విద్యతోపాటు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం.. జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో చర్యలు చేపట్టి మాకు ఆధార్ కార్డులు ఇప్పించాలి’ అని గిరిజన పిల్లలు వేడుకున్నారు. -
బ్రిటిష్, నిజాంలను మరిపిస్తున్న కేసీఆర్
కొణిజర్ల: గత ముప్ఫై ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, నిరుపేదలపై కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ జైలుపాలు చేయడం బ్రిటిష్, నిజాంల పాలనను తలపిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌లో ఇటీవల పోడు ఘర్షణలో అటవీ అధికారులు కేసులు నమోదు చేయగా, జైలుకు వెళ్లి వచ్చిన మహిళారైతులను వారు శుక్రవారం ఇక్కడ పరామర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికి తమ హయాంలో హక్కు కల్పించగా, 2014 తర్వాత ఆ చట్టం అమలు కావడం లేదన్నారు. దీనికితోడు నిరుపేద దళితులు, గిరిజనులకు మూడెకరాలు భూమి ఇస్తానని గద్దెనెక్కిన కేసీఆర్ తర్వాత ఆ భూమి ఇవ్వకపోగా, ఉన్న పోడు భూములను లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎల్లన్ననగర్ పోడు సాగుదారుల విషయంలో అటవీ, జైలు శాఖల అధికారుల తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు నిరుపేదలంటే చిన్నచూపని ఆరోపించారు. బడా భూస్వాములు గుట్టలకు పట్టాలు చేయించుకున్నా రైతుబంధు ఇస్తూ, పేదలు పోడు సాగుచేసుకుంటే మాత్రం ఒప్పుకోవడం లేదని విమర్శించారు. ఇక్కడి మహిళలపై అట వీ అధికారులు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పం పితే, జైలు అధికారులు ఇబ్బంది పెట్టడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ‘కొత్త భూమి కొట్టం, పాత భూమి పోనివ్వం’అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని సీతక్క వెల్లడించారు. వారి వెంట మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పాల్గొన్నారు. గిరిజనులిచ్చిన రొట్టెలు తిన్న భట్టి, సీతక్క ఎల్లన్ననగర్ పోడు సాగుదారులను పరామర్శించడానికి వచ్చిన భట్టి విక్రమార్క, సీతక్కకు వారు జొన్నరొట్టెలు ఇచ్చారు. స్థానిక గిరిజన మహిళలు రొట్టెలు తినాలని కోరగా, తొలుత వద్దని చెప్పిన నేతలు ఆ తర్వాత పప్పుతో జొన్న రొట్టెలు తినడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. -
జీసీసీకి 5 జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 5 సాధించి సత్తా చాటింది. రెండు విభాగాల్లో మొదటి ర్యాంకు, ఒక విభాగంలో రెండో ర్యాంకు, మరో రెండు విభాగాల్లో మూడో ర్యాంకు లభించాయి. ► ప్రతిస్పందన విభాగంలో.. గిరిజనుల కోసం ప్రధానమంత్రి వన్ ధన్ వికాస్ యోజన కేంద్రాలు, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల (ఎంఈపీ)కు ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను అందించడంలోను దేశంలోనే టాప్‌లో నిలిచి మొదటి ర్యాంకు సాధించింది. ► రిటైల్ అండ్ మార్కెటింగ్ విభాగంలో.. సేంద్రియ, సహజ ఆహార ఉత్పత్తుల సరఫరాలోను జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు గెల్చుకుంది. ► కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.4 కోట్ల 50 లక్షల 74 వేల విలువైన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు దక్కింది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.9 కోట్ల 76 లక్షల, 27 వేల విలువైన చిన్న తరహా అటవీ ఫలసాయాలు (ఎంఎఫ్పీ) సేకరించినందుకు జాతీయ స్థాయిలో 3 వ ర్యాంకు సాధించింది. ► 2020–2021లో అత్యధికంగా రూ.12 కోట్ల 86 లక్షల 12 వేలను వినియోగించినందుకు దేశంలోనే 3 వ ర్యాంకు దక్కించుకుంది. సీఎం మార్గనిర్దేశం.. సిబ్బంది అంకితభావంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశం, అధికారులు, సిబ్బంది అంకితభావం వల్లే జీసీసీకి 5 అవార్డులు దక్కాయి. కరోనా కష్టకాలంలోను ఉత్తమ పనితీరుతో జీసీసీ అధికారులు, సిబ్బంది అధికంగా వ్యాపార వ్యవహారాలను నిర్వహించగలిగారు. అటవీ, వ్యవసాయోత్పత్తుల సేకరణకు 2019–20లో రూ.13.18 కోట్లు, 2020–21లో రూ.76.37 కోట్లు ఖర్చుచేశాం. జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు 2019–20లో రూ.24.22 కోట్లు జరగ్గా, 2020–21లో రూ.33.07 కోట్లకు పెరిగాయి. 2019–20లో జీసీసీ రూ.368.08 కోట్ల వ్యాపారాన్ని మాత్రమే చేయగా, 2020–21లో తీవ్రమైన కరోనా నేపథ్యంలోను రూ.450.68 కోట్ల మేరకు వ్యాపారం చేయగలిగింది. – పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి జాతీయస్థాయిలో సత్తా చాటింది జాతీయస్థాయి ర్యాంకింగ్ల్లో జీసీసీ సత్తా చాటింది. పలు విభాగాల్లో ఏకంగా 5 జాతీయ అవార్డులు రావడం ఎంతో గర్వకారణం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని జీసీసీలు పలు విభాగాల్లో సాధించిన ప్రగతి మేరకు కేంద్ర ట్రైఫెడ్ సంస్థ ఈ అవార్డులను అందిస్తుంది. తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల్లోను అటవీ ఉత్పత్తుల సేకరణలో జీసీసీ పటిష్టమైన కార్యాచరణ చేపట్టింది. అటవీ ఉత్పత్తుల అమ్మకాల్లో రాష్ట్రంలోని గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమన్వయం, పర్యవేక్షణతోనే ఇంత గొప్ప రికార్డును సాధించడానికి సాధ్యమైంది. – పీఏ శోభ, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్, విశాఖపట్నం -
పోడు..‘గోడు’ వినే వారేరీ?
ఈ ఫొటోలో కనిపిస్తున్న గ్రామం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి. కాకతీయుల కాలం నుంచే ఉన్న ఈ గ్రామంలో సామంత రాజులు అప్పట్లోనే వేలుబెల్లి పెద్ద చెరువును తవ్వించారు. 600 కుటుం బాలు, 2 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలోని గిరిజనులు, గిరిజనేతరులు కలిసి.. 3వేల ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నారు. అందులో 200 ఎకరాలకు 1/70 ద్వారా పట్టాలు ఇవ్వగా.. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 36 మంది గిరిజనులకు మరో 200 ఎకరాలకు హక్కుపత్రాలు ఇచ్చారు. మిగతా 2,600 ఎకరాలకు పట్టాలు లేవు. 2018 తర్వాత నిర్వహించిన రెవెన్యూ– ఫారెస్టు సరిహద్దుల గుర్తింపులో భాగంగా.. ఈ గ్రామస్తులు సాగుచేసుకుంటున్న భూమి అడవిపరిధిలో ఉందని రికార్డుల్లో నమోదు చేశారు. అటవీశాఖ అధికారులు సరిహద్దు గుర్తులు పెట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వందల ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి అటవీశాఖదేనని అంటుండటం తో.. గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. కేసులు భరించలేక వలస బాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మొండికట్ట గ్రామంలో గిరిజనేతర రైతులు సుమారు 250 ఎకరాల పోడు భూముల్లో రెండేళ్ల కిందటి వరకు వ్యవసాయం చేశారు. కానీ అటవీశాఖ అధికారులు రైతులను అడ్డుకున్నారు. మొదట 22 మందిపై, తర్వాత మరో 18 మందిపై కేసులు పెట్టారు. ఆ రైతులు కోర్టు చుట్టూ తిరగలేక, కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక.. ఆ గ్రామం వదిలి జీవనోపా«ధి కోసం వలస పోయారు. అటవీశాఖ సిబ్బంది ఆ పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటారు. .. ఇలా ఒకటి రెండు చోట్ల కాదు.. రాష్ట్రంలోని ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం దాకా అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజనుల పరిస్థితి ఇది. అవి ఫారెస్టు భూములంటూ స్వాధీనం చేసుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తుండగా.. అడవినే నమ్ముకొని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై తమకు హక్కు ఉందని, వాటిని వదిలి ఎక్కడికి వెళ్లాలని గిరిజనులు వాపోతున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పోడు భూమి సమస్య ఎప్పుడు తీరుతుందా అని ఎదురుచూస్తున్నారు. గూగుల్ సర్వేతో.. ప్రభుత్వం భూప్రక్షాళన, అటవీ భూముల క్రమబద్ధీకరణ, అడవుల సంరక్షణ పేర్లతో గూగుల్ సర్వే నిర్వహించి.. ఆ డేటాను జీఏఆర్‌ఎస్ (గ్లోబల్ ఏరి యా రిఫరెన్స్ సిస్టమ్)కు అనుసంధానం చేసింది. వందల ఏళ్ల నాటి అడవుల సరిహద్దులను నిక్షిప్తం చేసింది. ఈ క్రమంలో గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములు కూడా అడవుల పరిధిలోనే ఉన్నాయని చూపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ట్రెంచ్‌లు వేస్తున్నారు. ఇదేమిటంటూ గిరిజనులు ఆందోళనలో మునిగిపోతున్నారు. 3,31,070 ఎకరాలకు పట్టాలిచ్చిన వైఎస్సార్ 2004 సార్వత్రిక ఎన్నికల ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో భాగంగా ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పోడు సమస్యను గుర్తించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 2006లో తెలంగాణలో హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో 99,486 మంది రైతులు సాగుచేసుకునే 3,31,070 ఎకరాల భూములకు భూమిహక్కు పత్రాలను ఇచ్చారు. ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరు 2006 ఏడాదిలో, ఆ తర్వాత కూడా కొందరు గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. దానికితోడు అప్పటికే పోడు చేస్తున్నా దరఖాస్తు చేసుకోని వారు కూడా ఉన్నట్టు అప్పట్లో అధికారులు గుర్తించారు. వారందరికీ హక్కు పత్రాలివ్వాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ, పలు కారణాలతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కలిపి 8 లక్షల ఎకరాల మేర పోడు భూముల సమస్య ఉందని గిరిజన సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ భూములకు హక్కుపత్రాలిచ్చి అడవుల అభివృద్ధిలో భాగంగా పండ్ల తోటలను పెంచేలా ప్రోత్సహిస్తే.. ఇటు ప్రభుత్వ లక్ష్యం, ఇటు గిరిజనులకు ఉపాధి రెండూ నెరవేరుతాయని అంటున్నారు. – సాక్షి, మహబూబాబాద్ -
ప్రమాదకరంగా కిన్నెరసాని వాగు: కట్టెల సాయంతో..
సాక్షి, ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, అళ్ళపల్లి మండలాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మండలాల్లో ఉన్న కిన్నెరసాని, మల్లన్న, కోడిపుంజుల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆళ్లపల్లి మండలంలో మోదుగుల గూడెం, సజ్జల బోడు గ్రామాల మధ్య కిన్నెరసాని వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఆదివాసీలు కర్రల సహాయంతో వంతెన తయారు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. సోమవారం పొద్దుటే వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులు సాయంత్రం తిరిగి వచ్చే వేళకు కిన్నెరసాని నది పొంగింది. దాన్ని దాటితేనే ఇంటికి చేరుతారు. దీంతో చేసేదేం లేక కట్టెల సాయంతో నిచ్చెన మాదిరి ఏర్పాటు చేసుకుని వాగు ప్రవాహాన్ని అతికష్టం మీద దాటారు. చాలా ప్రమాదకరంగా ఇబ్బందులు పడుతూ వాగు దాటిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే గుండాల మండల కేంద్రంలో కూలి పనులు, వ్యవసాయ పనిముట్లు, విత్తనాల కొనుగోలుకు రైతులు కూలీలు నిత్యం గుండాల మండలానికి రాకపోకలు సాగిస్తుంటారు. వాగు దాటడం ప్రమాదమని తెలిసినా సాహసం చేయక తప్పట్లేదు అంటున్నారు. గతంలో వాగు దాటే క్రమంలో వరద ఉధృతికి కొట్టుకొని పోయి ఇద్దరు మృతిచెందిన సంఘటనలు ఉన్నాయని ఏళ్లు గడిచినా బ్రిడ్జి పనులు పనులు పూర్తిచేయడం లేదన్నారు. దీంతో ఏజెన్సీలో ఉన్న ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వాగు దాటే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జి పనులను పూర్తి చేసి ఏజెన్సీ వాసుల కష్టాలను తీర్చాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు. -
నేడు కేసీ తండాకు గవర్నర్.. గిరిజనులతో కలిసి రెండో డోస్
సాక్షి, మహేశ్వరం: మండల పరిధిలోని కేసీ తండా అంగన్వాడీ కేంద్రంలో సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గిరిజనులతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోనున్నారు. వ్యాక్సిన్ పట్ల గిరిజనుల్లో ఉన్న అపోహాలు తొలగించేందుకే గిరిజనులతో కలిసి గవర్నర్ టీకా తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఆమె తన మొదటి డోస్‌ను పుదుచ్చేరి ప్రభుత్వాస్పత్రిలో తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేసీ తండాకు చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పాల్గొంటారని ఎంపీపీ కొరుపోలు రఘుమారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.. గవర్నర్ పర్యటనకు సంబంధించి కేసీ తండా, శివగంగ రాజరాజేశ్వర ఆలయంలో ఏర్పాట్లను ఆదివారం అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ దిలీప్‌కుమార్, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్షి్మ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీఏ అడిషనల్ పీడీ నీరజ, తహసీల్దార్ ఆర్పి. జ్యోతి తదితరులు ఉన్నారు. కేసీ తండాలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ -
మావోయిస్టుల బెదిరింపులు: కట్టుబట్టలతో నడిరోడ్డుపై..
ముంచంగిపుట్టు: ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య వారు నలిగిపోతున్నారు. పోలీసు ఇన్ఫార్మర్ అన్న అనుమానం వస్తే చాలు మావోయిస్టులు కక్ష కడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్టే హతం చేస్తున్నారు. వారి వేధింపులు భరించలేక ప్రాణభయంతో గిరిజనులు సొంత ఊరిని వదిలి వేరే చోట తలదాచుకుంటున్నారు. ఇలా రంగబయలు, లక్ష్మీపురం, భూసిపుట్టు పంచాయతీలకు చెందిన 13 గ్రామాల నుంచి 41 కుటుంబాలు ముంచంగిపుట్టు మండల కేంద్రానికి వచ్చి బిక్కుబిక్కుమని బతుకీడుస్తున్నాయి. తాజాగా రంగబయలు పంచాయతీ గోబరపడా గ్రామంలో గత నెల 30వ తేదీన జరిగిన ఘటన మన్యవాసుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఏకంగా 10మంది సాయుధ మావోయిస్టులు, 30మంది మిలీíÙయా సభ్యులు ఇంటిని చుట్టుముట్టడంతో వంతాల రామచందర్ ఇంటి వెనక నుంచి అడవిలోకి పారిపోయాడు. దీంతో మావోయిస్టులు తనను నిర్దాక్షిణ్యంగా కొట్టారని, తన ఇంటిని, వస్తువులను ధ్వంసం చేశారని రామచందర్ భార్య సొంబరి తెలిపింది. పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్న రామచందర్‌ను హతమారుస్తామని, తక్షణమే ఊరు నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఆమె ముగ్గురు పిల్లలతో రాత్రి పూట అడవిలో నడుచుకొని తనకు తెలిసిన వారి దగ్గర మూడు రోజులు తలదాచుకుంది. భర్త ఆచూకీ తెలియక ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్లో శనివారం సాయంత్రం ఆమె ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు సమీప గ్రామాల్లో వెతికి రామచందర్‌ను గుర్తించి సొంబరికి అప్పజెప్పారు. నిరసన వెల్లువ మావోయిస్టుల చర్యకు నిరసనగా బాధిత కుటుంబంతోపాటు గిరిజనులు భారీ సంఖ్యంలో ఆదివారం ముంచంగిపుట్టులో నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ నుంచి పోలీసు స్టేషన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. “మావోయిస్టులారా.. ఇంకా ఎంతమందిని మా గ్రామాల నుంచి తరిమేస్తారు.. గిరిజన ఆడపిల్లలపై దాడులు చేస్తూ మా బాగు కోసం అంటే ఎలా నమ్మేది.. మా అడవి నుంచి వెళ్తారా, తరిమి కొట్టాలా.. అంటూ నినాదాలు చేశారు. మా గ్రామాలపై మీ పెత్తనం ఏమిటి... మీ స్వార్ధంతో మా బతుకులు పాడు చేయొద్దు.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు పలువురు మాట్లాడుతూ సొంత గ్రామాల్లో సుఖంగా బతుకుతున్న తమపై లేనిపోని నిందలు వేసి గ్రామాల నుంచి తరిమేశారని, తమ కళ్ల ముందే భర్తలను దారుణంగా చంపేశారని ఆవేదన చెందారు. తమ ఇళ్లు, భూములు వదులుకొని కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతకాలం తమను వేధిస్తారని ప్రశ్నించారు. తమ పిల్లల భవిష్యత్‌ను అంధకారంలో పెట్టవద్దని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. చేతిలో సామాన్ల మూటలతో దీనంగా ఉన్న రామచందర్ కుటుంబం పరిస్థితి చూపరులకు ఆవేదన కలిగించింది. -
గిరిజనులకు ఆర్థిక వికాసం
సాక్షి, విశాఖపట్నం: గిరిజనుల ఆర్థిక వికాసానికి ప్రభుత్వం చేయూత ఇస్తోంది. వారు దళారుల చేతుల్లో మోసపోకుండా.. కష్టానికి తగిన ఫలితం లభించేలా చూస్తోంది. అటవీ ప్రాంతంలో చెట్ల నుంచి గిరిజనులు సేకరించి తెచ్చిన చింతపండుకు దళారులు, వ్యాపారులు నిర్ణయించిన ధర కిలోకు రూ.35 మించలేదు. దాన్ని పిక్కతీసి, కాస్త శుభ్రం (ప్రాసెసింగ్) చేసి దుకాణాల్లో వ్యాపారులు విక్రయించే కిలో ప్యాకెట్ ధర రూ.150 వరకు ఉంటోంది. ఇక సూపర్ మార్కెట్లలో, మాల్స్‌లో రూ.200 ఉంటోంది. ఈ వ్యత్యాసం తగ్గించడానికి, గిరిజనులే స్వయంగా గిట్టుబాటు ధర సాధించుకునేలా చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. వన్‌ధన్ వికాస్ కేంద్రాల (వీడీవీకేల) ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోంది. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో సుమారు 3.63 లక్షల గిరిజన కుటుంబాలున్నాయి. వీరు అటవీ ప్రాంతంలో తేనె, సీకాయ, కుంకుడుకాయలు, చింతపండు, ఉసిరికాయలు, కరక్కాయలు, కొండచీపుళ్లు తదితర అటవీ ఉత్పత్తులను సేకరించి స్థానిక సంతల్లో విక్రయిస్తుంటారు. ప్రైవేట్ వ్యాపారులు, దళారుల ప్రమేయం వల్ల ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించటంలేదు. గిరిజన రైతులు పండిస్తున్న పసుపు, రాజ్మా, బొబ్బర్లు, సజ్జలు, రాగులు, కంది, మిరప, జీడిపిక్కలు తదితర వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రభుత్వం మద్దతు ధర కల్పించినవి మినహా మిగతా పంటల పరిస్థితి అలాగే ఉంది. ఈ నేపథ్యంలో వీడీవీకేల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గత ఏడాది రాష్ట్రంలో 75 వీడీవీకేలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి పరిధిలోని 8 ఐటీడీఏలు, గిరిజన సహకారసంస్థ (జీసీసీ), ట్రైఫెడ్ నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. వీటిద్వారా ప్రభుత్వం వీడీవీకేలకు రూ.10.64 కోట్లు మంజూరు చేసింది. ప్రాసెసింగ్‌కు ఉపయోగపడే పరికరాలు, ఇతరత్రా సరంజామా కొనుగోలుకు ఈ నిధులను గిరిజనులు ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మరో 188 వీడీవీకేలను మంజూరు చేసింది. వాటికి అడ్వాన్స్‌గా రూ.14 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం వీడీవీకేల సంఖ్య 263కు చేరింది. వీటన్నింటికీ మొత్తం రూ.38.83 కోట్ల వరకు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.24.64 కోట్లు నిధులు విడుదల చేసింది. ఉత్పత్తులకు అదనపు విలువ దాదాపుగా ఒకటి లేదా పక్కపక్కనుండే రెండు, మూడు గ్రామాల గిరిజనులే సభ్యులుగా వీడీవీకేలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 20 మంది సభ్యులతో ఒక గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి 15 గ్రూపులను ఒక వీడీవీకే పరిధిలోకి చేరుస్తున్నారు. ఇలా ఒక్కో వీడీవీకేలో మొత్తం 300 మంది చొప్పున 263 వీడీవీకేల్లో 78,900 మంది సభ్యులు కానున్నారు. వీడీవీకేకి రూ.15 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో ప్రాసెసింగ్, ప్యాకింగ్‌కు ఉపయోగపడే పరికరాలను ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. గిరిజనులు తాము సేకరించిన అటవీ ఉత్పత్తులను, పండించిన పంటలను గ్రామాల్లోనే సొంతంగా వ్యాపార తరహాలో శుద్ధి (ప్రాసెసింగ్) చేస్తున్నారు. తద్వారా ఆయా ఉత్పత్తులకు అదనపు విలువ (వాల్యూ ఎడిషన్) సమకూరుతోంది. ఆ ఉత్పత్తులను జీసీసీకి విక్రయిస్తున్నారు. జీసీసీకే కాకుండా లాభం ఉంటే ఇతర వ్యాపారులకు అమ్ముకునే వెసులుబాటు కూడా ఉంది. సొంత వ్యాపారంతో మంచి ధర.. ఇప్పటివరకు వీడీవీకేల ద్వారా గిరిజనులు రూ.21.19 లక్షల విలువైన ఉత్పత్తులను విక్రయించారు. ఇది ప్రారంభం మాత్రమే. అన్ని అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా విలువను జోడించేలా ప్రణాళికను రూపొందించాం. దీనివల్ల ఆయా ఉత్పత్తులకు మంచి ధర వస్తుంది. ట్రైఫెడ్, జీసీసీ మార్కెట్ సపోర్టు కల్పిస్తున్నాయి. ఈ విధానం వల్ల మరికొంతమంది గిరిజనులకు ఉపాధి కలుగుతుంది. – సురేంద్రకుమార్, జనరల్ మేనేజరు (మార్కెటింగ్), జీసీసీ -
ఎంపీ స్కూటీపై వెళ్లి.. బాధితులకు అండగా..
సాక్షి, మహబూబాబాద్ /బయ్యారం: అటవీ ప్రాంతాల్లో కరోనాతో బాధపడుతున్న గిరిజనులకు ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోతు హరిప్రియ అండగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం అటవీ ప్రాంతాల్లో శనివారం కవిత, హరిప్రియతో కలసి పర్యటించారు. మండలంలోని గురిమెళ్ల, గౌరారం, బాలాజీపేట పంచా యతీల్లో కరోనా బాధితులను వారు పరామర్శించి 158 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు. కొన్ని ప్రాంతాలకు పెద్ద వాహనాలు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో ఎంపీ స్కూటర్‌పై, ఎమ్మెల్యే బైక్‌పై ప్రయాణించడం విశేషం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బాధితులు అధైర్యపడొద్దని సూచించారు. పౌష్టికాహారం తీసుకుంటూ, వైద్యులు సూచించిన మందులు వాడితే త్వరగా కోలుకోవచ్చని అన్నారు. బైక్‌పై ఎమ్మెల్యే బానోతు హరిప్రియ పిల్లల్లో కోవిడ్–19పై ఆందోళన వద్దు సాక్షి, హైదరాబాద్: పిల్లల్లో కోవిడ్ వ్యాప్తి గురించి ఆందోళన చెందవద్దని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా పరిస్థితులపై శనివారం ఆమె ఉన్నతాధికారులు, జిల్లా సంక్షేమాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో మహిళలు, యువకులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారన్నారు. మూడో దశ పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశాలున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ప్రచారాలను చూసి ఆందోళన చెందవద్దని, పిల్లలు కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించేలా సిద్ధం చేయాలని, మాస్కు ధరించడం, శానిటైజర్లు, హ్యాండ్ వాష్ వినియోగించి చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో కూడా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పొషకాహారాన్ని అందిస్తున్నారని మంత్రి వారిని అభినందించారు. చదవండి: జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో.. ‘పది పడకల ఐసీయూ’లు -
కరోనా పరీక్షలు చేస్తామన్నారు.. అడవిలోకి పారిపోయారు
డెహ్రడూన్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పుటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని ఒక గిరిజన గ్రామ నివాసితులకు కోవిడ్-19 పరీక్షలను నిర్వహించడానికి జిల్లా ఆరోగ్య కార్యకర్తల బృందం వెళ్లినప్పుడు సమీపంలోని అడవికి పరిగెత్తారు. కరోనా పరీక్ష చేయించుకుంటే తమకు సోకుతుందని గ్రామస్తులు భయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ గ్రామంలో బన్రావాట్స్ నివసిస్తున్నారని, వీరు ఆదిమ తెగ వాసులని అధికారులు పేర్కొన్నారు. ఇక దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,73,790 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247కి చేరింది. ఇందులో 22,28,724 యాక్టివ్ కేసులు ఉండగా, 2,51,78,011 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 3617 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,22,512కి చేరుకుంది. నిన్న కొత్తగా 2,84,601 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: వీళ్లు కరోనా ఉన్నట్లు మరిచారేమో.. అందుకే ఇలా? -
MLA Seethakka: ఎడ్లబండే ఎమ్మెల్యే కాన్వాయ్
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం అడవి రంగాపూర్(నారాయణపూర్) గ్రామంలోని బండ్లపహాడ్ గొత్తికోయగూడెం వాసులకు ఎమ్మెల్యే సీతక్క అండగా నిలిచారు. గ్రామానికి దూరంగా నివసిస్తున్న గొత్తికోయలు కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న ఆమె శనివారం వెళ్లి సరుకులు అందజేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, గూడెంకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ఎడ్లబండే ఎమ్మెల్యే కాన్వాయ్ అయింది. అందులోనే సరుకులు వేసుకుని అదే బండిపై ఎమ్మెల్యే పయనమయ్యారు. ఆమె వెంట అనుచరులు, గన్మ్యాన్లు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. ఈ సందర్భంగా బియ్యం, కూరగాయలు, ఇతరత్రా సరుకులు గొత్తికోయలకు అందజేసి సీతక్క వారికి భరోసా కల్పించారు. ప్రతి పేద కుటుంబానికి రూ.6 వేలు ఇవ్వాలి.. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున, ప్రతీ పేద కుటుంబానికి రూ.6 వేలు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా మొద్దునిద్ర వీడాలని ఆమె సూచించారు. Every drop of my blood will contribute to the growth of this nation and to make our people strong & developed.@RahulGandhi @priyankagandhi @manickamtagore @JitendraSAlwar #aimcprayaas #SOSTCongress @MahilaCongress @INCIndia @kumari_selja @sushmitadevinc #COVID #RahulGandhi pic.twitter.com/Ifkbb3GFEJ — Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) May 30, 2021 చదవండి: Telangana: జూన్ 15నుంచి రైతుబంధు -
ఐదు రోజుల పెళ్లి, అక్కడ వరుడు తాళి కట్టడు!
బుట్టాయగూడెం: బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి తల్లి ఒడిలో.. గిరి శిఖర ప్రాంతాల్లో నివసించే కొండరెడ్ల గిరిజనుల జీవనం.. వారు పాటించే సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. వారి వివాహ తంతు సైతం ప్రత్యేకమే. కొండరెడ్ల వివాహ సమయంలో కుటుంబ పెద్దలే పురోహితులుగా వ్యవహరిస్తారు. వీరి పెళ్లిళ్లకు పిలుపులు ఉండవు. పిలవలేదు కదా అని వివాహాలకు ఎవరూ హాజరు కాకుండా ఉండరు. కుటుంబ సమేతంగా అందరూ హాజరవుతారు. పెళ్లి పనుల్లో గ్రామస్తులంతా విధిగా పాల్గొంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 1.25 లక్షల మంది గిరిజనులు ఉండగా.. వీరిలో సుమారు 10 వేల మంది కొండరెడ్డి తెగకు చెందిన వారు. కొండరెడ్డి గిరిజనుల్లో అత్యధికులు బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ఎత్తైన కొండల నడుమ గిరి శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్నారు. కొన్ని పద్ధతులు మారినా ఆచారం ప్రకారమే.. కొండరెడ్డి గ్రామాల్లో పెళ్లి విషయంలో 1980 తరువాత కొన్ని పద్ధతులు మారినా.. పూర్వ ఆచారాలనే కొనసాగిస్తున్నారు. 1980వ సంవత్సరానికి ముందు ఏ యువకుడైనా యువతిని ఇష్టపడితే.. ఆ విషయం పెద్దలకు చెప్పేవారు. తర్వాత ఆ అమ్మాయి బయటకు వెళ్లినప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని ఆ యువతిని తాను పెళ్లాడుతున్నానని బహిరంగంగా చెప్పేవాడు. అతడిని పెళ్లాడటం ఆ యువతికి ఇష్టం లేకపోయినా ఊరి పెద్దలు వారిద్దరికీ వివాహం చేసేవారు. మొదట ఊరి పెద్దలు వరుడు, వధువు తలపై నీళ్లు పోస్తే.. ఆ తరువాత వరుడు ఆ యువతి మెడలో నల్లపూసల దండ వేసేవాడు. ఇలా పెళ్లి తంతు పూర్తయ్యేది. పెళ్లికి పెద్దలే పురోహితులు. మంత్రాలు ఉండవు. వారిద్దరూ సుఖంగా ఎలా కాపురం చేసుకోవాలో నాలుగు మాటలు చెప్పటం ద్వారా తంతు ముగిసేది. ఇటీవల ఈ పద్ధతుల్లో కొంత మార్పు వచ్చింది. ఏ యువకుడైనా యువతిని ఇష్టపడితే ఇంట్లో పెద్దలకు చెప్పాలి. వారు, ఊరి పెద్దలు కలిసి యువతి, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధం ఖాయం చేస్తారు. ఈ మధ్య కాలంలో తాళి కట్టే సంప్రదాయం కూడా మొదలైంది. పతాణాలు తప్పనిసరి పెళ్లి అనంతరం వధూవరులకు పతాణాల కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో పెళ్లి కూతురు వైపు వారు వధువును గ్రామంలో ఎవరికీ తెలియకుండా దాచేస్తారు. వరుడు, అతని తరఫు వారు వధువును వెతికి పట్టుకోవాలి. ఆ తరువాత వధూవరులు ఇంటికి వచ్చే సమయంలో గ్రామస్తులంతా వారిద్దరి కాళ్లకు అడ్డుపడుతూ బురదలో దొర్లుతారు. ఆ సమయంలో కింద దొర్లే వారికి పెళ్లికొడుకు డబ్బులు ఇవ్వడం ఆనవాయితీ. ఐదు రోజుల పాటు విందు తప్పనిసరి పెళ్లి చేసిన కుటుంబాలు తప్పనిసరిగా గ్రామస్తులందరికీ ఐదు రోజులపాటు సహపంక్తి భోజనాలు పెట్టవలసిందే. అందులో మాంసం తప్పనిసరి. మొదటి మూడు రోజులపాటు బంధువులు, చుట్టుపక్కల వారు భోజనాలకు వస్తారు. మూడో రోజున శోభనం జరిపిస్తారు. నాలుగో రోజున ఊరందరికీ భోజనాలు (ఊర బంతి) పెట్టి తీరాలి. దీనికి గ్రామంలో ఎవరైనా హాజరుకాకపోతే.. పెళ్లి వారింటి నుంచే వారికి భోజనం పంపిస్తారు. ఐదో రోజున మాత్రం పెళ్లి జరిగిన రెండు కుటుంబాల వారు, బంధువులకు భోజనాలు పెడతారు. ఇలా ఐదు రోజుల పెళ్లి సందడిగా.. సంప్రదాయబద్ధంగా సాగిపోతుంది. మా పెళ్లికి పెద్దలే పురోహితులు మా తెగల్లో కుటుంబ పెద్దలే పురోహితులుగా వ్యవహరిస్తారు. మంత్రాలు ఉండవు. తాళి»ొట్టు ఉండదు. నా పెళ్లి అలాగే జరిగింది. నేను ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. అదే విషయాన్ని పెద్దలకు చెప్తే వారు అమ్మాయివైపు వారితో మాట్లాడి వివాహం చేశారు. మెడలో నల్లపూసల దండ వెయ్యడంతో నా పెళ్లి అయిపోయింది. – కెచ్చెల బుల్లిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం పెద్దల మాటకు విలువిస్తాం పెళ్లి సమయంలో పెద్దల మాటకే విలువ ఇస్తాం. వారు చెప్పిందే వేదం. అదే ఆచారం. గ్రామ దేవతలు మా కుల దేవతలు. వారినే పూజిస్తాం. పంటలు చేతికి వచ్చే సమయంలో చేసే పండుగలో తప్పనిసరిగా గ్రామ దేవత పూజలు విధిగా చేస్తాం. – కెచ్చెల పద్మ, కొండరెడ్డి మహిళ, రేగులపాడు, బుట్టాయగూడెం మండలం -
ప్రకృతి ఆరాధన: చెట్టు మానులే దేవతామూర్తులు..
బుట్టాయగూడెం: చెట్టును, పుట్టను దేవుళ్లగా కొలవడం హిందూ సంస్కృతిలో భాగం. ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతితో మమేకం కావడం దీనిలోని ఉద్దేశం. ప్రత్యేకించి గిరిజన సంప్రదాయాలు వినూత్నంగా ఉంటాయి. తరతరాలుగా తాతముత్తాతల నుంచి వచ్చిన ఆనవాయితీలను కొనసాగిస్తూ భావితరాలకు అందిస్తున్న గిరిజన తెగలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో నాయక్‌పోడు గిరిజనులు ఒకరు. చెట్టు మానులను కొయ్య రూపాలుగా మార్చి ఏటా శ్రీరామనవమికి పూజలు చేయడం బుట్టాయగూడెం మండలంలోని లక్ష్మీపురం నాయక్‌పోడు గిరిజనుల ప్రత్యేకం. గ్రామంలో 50 నాయక్‌పోడు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. గ్రామ దేవతగా గంగానమ్మవారు పూజలందుకుంటున్నారు. అయినా గ్రామస్తులంతా సీతారాములను ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా అడవిలోని నాలుగురకాల చెట్ల మానులను సేకరించి వాటిని ప్రత్యేక రూపంలో మలిచి ఘనంగా పూజలు చేస్తుంటారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు వీరంతా. గ్రామంలో రామాలయం ఉన్నా తామంతా ఇలానే దేవుళ్లకు పూజలు చేస్తామని శ్రీరామనవమి ఉత్సవ కమిటీ సభ్యులు వనుము వీర్రాజు, కుసినే మణికుమార్, కుసినే వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగు రకాల మానుల నుంచి.. శ్రీరామనవమికి ముందు ఉత్సవ కమిటీ సభ్యులు అడవికి వెళ్లి చెండ్ర, పాల, ఊడిగ, రావిచెట్ల మానులు సేకరిస్తారు. చెండ్ర చెట్టు మానును రాముడిగా, పాలచెట్టు మానును సీతాదేవిగా, ఊడిగ చెట్టు మానును లక్ష్మణుడిగా, రావిచెట్టు మానును ఆంజనేయుడిగా చెక్కించి గ్రామ మధ్యలో ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఇలా ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపిస్తామని వీరు చెబుతున్నారు. ఏజెన్సీ మారుమూల గ్రామంలో వినూత్న ఆచారంతో సీతారాముల కల్యాణం జరగడం ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుంది. అదే మాకు జయం అడవిలోని చెట్ల మానులు తీసుకువచ్చి విగ్రహాలుగా మలిచి పూజలు చేస్తాం. ఇది మా ఆనవాయితీ. ఇదే మాకు జయం, శ్రీరామరక్ష. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. –గురువింద రామయ్య, లక్ష్మీపురం చదవండి: అపురూప దృశ్యం.. ఆవిష్కృతం గట్టిగా కేకలు వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా.. -
ఆంధ్రాలో మావోలకు ఎర్ర జెండా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు ఉద్యమ విస్తరణకు ఎర్ర జెండా పడింది. గత రెండేళ్లుగా గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉద్యమ విస్తరణపై తీవ్ర ప్రభావం చూపించాయి. ప్రభుత్వ పథకాలతో ఆర్థికంగా బలపడుతున్న గిరిజనులు సామాజిక చైతన్యంతో మావోయిస్టుల దరికి చేరడం లేదు. ప్రధానంగా ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో రిక్రూట్మెంట్ నిలిచిపోవడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఉద్యమ పరిధి తగ్గిపోయింది. ఏవోబీలోని మావోయిస్టు పార్టీ దళాల్లో చేరేందుకు స్థానిక ఆదివాసీ యువత ఆసక్తి చూపడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులపై స్థానిక ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో మావోయిస్టులు తిరిగే వ్యూహాత్మక ఉద్యమ ప్రాంతాలు కుచించుకుపోతున్నాయి. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రోడ్లు, సెల్ టవర్ల నిర్మాణంతో మైదాన ప్రాంతాలకు రాకపోకలు పెరగడంతో గిరిజనులు చైతన్యవంతులవుతున్నారు. ఏజెన్సీలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ గ్రామ స్థాయి సంఘాలు.. ఆదివాసీ విప్లవ రైతు కూలీ సంఘాలు (ఏవీఆర్‌సీఎస్), ఆదివాసీ విప్లవ మహిళా సంఘాలు (ఏవీఎంఎస్), విప్లవ ప్రజా కమిటీలు (ఆర్పీసీ), మిలీషియా కమిటీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆదివాసీ ప్రజల్లో పోలీసులు, ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి పెరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు మారుమూల ప్రాంతాలకు సైతం చేరడంతో మావోయిస్టులకు గిరిజనులు దూరమవుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కుచించుకుపోతున్న కమిటీలు.. ఏవోబీ ప్రాంతంలో ఏపీ నుంచి మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, ఒడిశా వైపు విస్తరించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కటాఫ్ ఏరియాను ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే), వివేక్‌లు పర్యవేక్షిస్తున్నారు. ఏవోబీలో రెండేళ్ల క్రితం మావోయిస్టులకు చెందిన ఎనిమిది ఏరియా కమిటీలు ఉంటే ఇప్పుడవి నాలుగుకు పరిమితమయ్యాయి. వాటిలో కలిమెల, నారాయణపట్నం, నందాపూర్, కాఫీదళం ఏరియా కమిటీలు కనుమరుగయ్యాయి. గాలికొండ, పెద్దబయలు, గుమ్మ, బోయపెరుగువాడ ఏరియా కమిటీలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఏవోబీలో రెండు డివిజన్ కమిటీలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కంపెనీలు రెండు ఉండగా ఇప్పుడు ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి ఎనిమిది ఎదురు కాల్పులు జరగ్గా ఒక డివిజన్ కమిటీ సభ్యుడు, ఒక ఏరియా కమిటీ సభ్యుడితోపాటు మరో ఆరుగురు హతమయ్యారు. ఒక సెంట్రల్ జోన్ కమిటీ సభ్యుడు, ఒక డివిజన్ కమిటీ సభ్యుడు, ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఇద్దరు పార్టీ సభ్యులు కలిపి మొత్తం ఆరుగురు అరెస్టు అయ్యారు. మొత్తం 31 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో స్టేట్ కమిటీకి చెందిన 11 మంది, ఏవోబీ ఎస్‌జెడ్‌సీకి చెందిన 20 మంది ఉన్నారు. -
కొండపల్లి ‘పోడుభూమి’ రణరంగం
సాక్షి, పెంచికల్పేట్: కొండపల్లి ‘పోడుభూమి’రణరంగమైంది. గిరిజనులకు, పోలీసులకు మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసులపైకి గిరిజన రైతులు, మహిళలు రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అటవీ భూముల్లో ప్లాంటేషన్ నిలిపివేయాలని, పోడు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత పాల్వాయి హరీశ్‌బాబు రెండురోజులుగా నిరవధిక దీక్ష చేపట్టారు. అర్ధరాత్రి దీక్షా శిబిరం వద్దకు జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.హరీశ్‌బాబుతోపాటు పార్టీ జిల్లా కార్యదర్శి కొంగ సత్యనారాయణను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించడంతో మహిళలు, రైతులు తిరగబడి రాళ్ల దాడికి దిగారు. దీంతో కాగజ్‌నగర్ రూరల్ సీఐ, పెంచికల్పేట్ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. పోలీసులను అడ్డుకున్న గ్రామస్తులు హరీశ్‌బాబును రెబ్బెన వైపు వాహనంలో తరలించగా.. మరో పోలీసు అధికారుల బృందం కొండపల్లి మీదుగా పెంచికల్పేట్ చేరుకోవటానికి బయలుదేరింది. దీంతో కొండపల్లి పొలిమేర్లలో పోలీసుల వాహనాలను మహిళలు అడ్డుకున్నారు. హరీశ్‌బాబును విడిచిపెట్టాలని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం వేకువజాము 4 గంటల వరకూ పోలీసులను ఘెరావ్ చేశారు. ఆసిఫాబాద్ ఏఎస్పీ అచ్చేశ్వర్రావు అదనపు పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన మహిళా కానిస్టేబుల్స్ తిరుపతిబాయి, కోమలి రెబ్బెనలో పోలీసు వాహనాల అడ్డగింపు బెజ్జూర్ మండలం రెబ్బెన గ్రామం మీదుగా పోలీసులు హరీశ్‌బాబును తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న గ్రామస్తులు అదే రాత్రి 12 గంటల సమయంలో పెద్దసంఖ్యలో రోడ్డుకు అడ్డుగా నిలిచారు. పోలీసు వాహనాలను ఆపేసి టైర్లలో గాలిని తీసేశారు. వాహనంలో ఉన్న హరీశ్‌బాబును తీసుకునివెళ్లారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారని, మహిళల కళ్లలో కారం చల్లి ఇష్టారీతిన వ్యవహరించారని హరీశ్‌బాబు విమర్శించారు. పలువురిపై కేసు నమోదు కొండపల్లిలో పోలీసులపై దాడికి పాల్పడి, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పెంచికల్‌పేట ఎస్సై రమేశ్ తెలి పారు. బీజేపీ నేతలు పోలీసుల కళ్లలో కారంకొట్టి దాడి చేశారని, కాగజ్‌నగర్ రూరల్ సీఐ, ఎస్సై, ఇద్దరు మహిళాకానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఆరు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారని, దాడులకు పాల్పడిన వారిపై కేసు నమెదు చేశామని వివరించారు. -
కొటియాలో ఒడిశా దౌర్జన్యకాండ..
సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశా అధికారులు, పోలీసులు, నేతలు పేట్రేగిపోయారు. ఏపీలో గురువారం జరిగిన పరిషత్ ఎన్నికలకు వస్తున్న గిరిజనులను అడ్డుకుని వారిపై దౌర్జన్యానికి దిగారు. వారు వెళ్లే దారిలో అడ్డంగా బారికేడ్లు, గేట్లు పెట్టారు. కోవిడ్‌ను సాకుగా చూపుతూ కోరాపుట్ జిల్లా కలెక్టర్ 144 సెక్షన్ విధించడంతో ఒడిశా అధికారులు, పోలీసులు ఆ గ్రామాల్లో మోహరించి గిరిజనులను అడుగడుగునా అడ్డుకున్నారు. ఆంధ్రాలో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకుంటున్న ఒడిశా పోలీసులపై గిరిజనం తిరగబడ్డారు. తాము ప్రతిసారీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని, ఇప్పుడే ఎందుకు వద్దంటున్నారని నిలదీశారు. ఆంధ్రా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తోందని.. తాము ఆంధ్రాలోనే ఉంటామని నినదించారు. దారికి అడ్డంగా నిలిచిన ఒడిశా పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులను తోసుకుంటూ ఓటేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, గిరిజనుల మధ్య జరిగిన తోపులాటలో మహిళా గిరిజన ఓటర్లు రోడ్డుపై పడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. అయినప్పటికీ పట్టుదలతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లారు. పట్టుచెన్నేరు, పగులుచెన్నేరుల్లో రోడ్డుకు అడ్డుగా ఒడిశా అధికారులు వేసిన గేట్లను తోసేసి తోణాం, మోనంగి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. విరుచుకుపడ్డ ఐటీడీఏ పీవో కొటియా గ్రామాలకు వెళ్తున్న గిరిజన సమీకృతాభి వృద్ధిసంస్థ (ఐటీడీఏ) పీవో ఆర్.కూర్మనాథ్‌ను ధూళిభద్ర, ఎగువశెంబి గ్రామాల సమీపంలో ఒడి శా అధికారులు అడ్డుకున్నారు. దీంతో పీవోకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించే హక్కు మీకెక్కడదని. సుప్రీంకోర్టు స్టేటస్కో విధించిన అంశాన్ని ఆయన వారికి గుర్తుచేశారు. అడ్డంగా వేసిన బారికేడ్లను ఆయనే తోసేసి ముందుకు కదిలారు. ఆ గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. దీంతో ధూళిభద్ర ప్రజలు కాలిబాటన, ఎగువశెంబి ప్రజలు అప్పటికే ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా నేరెళ్లవలస పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఒడిశా అధికారులు చల్లగా జారుకున్నారు. విజయనగరం జిల్లా సబ్ కలెక్టర్ విధేహ్ ఖరే, ఎస్పీ రాజకుమారి, తదితరులు నేరెళ్లవలస, ధూళిభద్ర గ్రామాల్లో పర్యటించారు. చదవండి: పరిషత్ ఎన్నికలు: పోలింగ్ ప్రశాంతం.. రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ -
కొటియాలో ఒడిశా ఆంక్షలు
సాలూరు: పరిషత్ ఎన్నికల్లో కొటియా గిరిజనులు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఒడిశా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. కోవిడ్ వ్యాప్తిని సాకుగా చూపుతూ కొరాపుట్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ ఎమ్.అక్తర్ 144 సెక్షన్ విధించడంతో ఒడిశా అధికారులు బుధవారం ప్రత్యేక బలగాలతో కొటియా గ్రామాలకు చేరుకున్నారు. గిరిజన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ తోణాం, మోనంగి పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా పట్టుచెన్నేరులో రహదారులపై రాళ్లు అడ్డంగా వేసి దారిని దిగ్బంధించి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ఈ గ్రామాలకు సంబంధించి గంజాయిభద్ర ఎంపీటీసీ స్థానానికి నేరెళ్లవలస సంత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల్సి ఉంది. ఒడిశా ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓటు వేసేందుకు వెళ్లకూడదని ఆంక్షలు విధిస్తున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. పోలింగ్ నిర్వహణకు వెళ్లిన సిబ్బందిని కూడా అడ్డుకోవడంతో సీఐ అప్పలనాయుడు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్వో మధుసూదనరావు నేరెళ్లవలస చేరుకున్నారు. ఒడిశా బలగాలు వారికి 144 సెక్షన్ ప్రతిని చూపించాయి. దీనిపై బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చర్చలు సాగుతున్నాయి. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ తెలిపారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు పోలింగ్ స్టేషన్లో వివాదం కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం.. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని కౌశల్యాపురం పోలింగ్ స్టేషన్లో ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. కౌశల్యాపురం ప్రాథమిక పాఠశాలలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం ఆంధ్రా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఒడిశా అధికారులు బుధవారం పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చి భూభాగానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నందున ఎన్నికలు నిర్వహించొద్దంటూ ఆంధ్రా అధికారులకు చెప్పారు. ఈ విషయమై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు చర్చించారు. అనంతరం అధికారులు దీనిపై పాలకొండ ఆర్డీవో, సీతంపేట ఐటీడీఏ పీవోలకు ఫిర్యాదు చేశారు. వెంటనే పీవో.. కౌశల్యాపురం పాఠశాల వద్దకు చేరుకుని ఇరు రాష్ట్రాల అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఒడిశా అధికారులతో పీవో మాట్లాడి గురువారం పాఠశాలలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. -
అడవి బిడ్డలపై దాడి అత్యంత హేయం: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లాలో అటవీ ప్రాంతంలో అడవి బిడ్డలపై అటవీ సిబ్బంది పైశాచిక దాడిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఇప్పపూలు, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్లిన గిరిజనులపై జరిగిన దాడిలో 14 మహిళలు, 9 మంది పురుషులకు తీవ్ర గాయాలయ్యాయని, వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అటవీ ఉత్పత్తులను సేకరించడం తప్పు కాదని, ఉత్పత్తుల సేకరణపైనే ఆధారపడి చెంచు, లంబాడాలు ఆధారపడి జీవిస్తున్నారని, 29 రకాల అటవీ ఉత్పత్తులను సేకరించి ఉపాధి పొందవచ్చు అని అటవీ చట్టం చెబుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గిరిజనులకు రోగం వస్తే హెలికాప్టర్లో తీసుకువచ్చి కార్పొరేట్ దవాఖానల్లో చేర్చించి కడుపులో పెట్టి చూసుకుంటామని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, పోడు భూముల సమస్యను తనే కుర్చీ వేసుకుని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గిరిజన మహిళలను చెట్లకు కట్టేసి కొట్టిన అరాచకాలు టీఆర్ఎస్ పాలనలో ఉందని, గత ఏడేళ్లుగా అనేక ప్రాంతాల్లో అధికారులు, అధికార పార్టీల నేతల ఆగడాలకు అడ్డేలేకుండా పోయిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. చదవండి: తెలంగాణలో పండుగలు, పబ్బాలు లేవు! కరోనా తెచ్చిన కష్టం; ఊరి చివర గుడిసె.. ఒంటరిగా బాలిక -
గిరిజనులకు రక్షణగా ఎస్టీ కమిషన్: పుష్పశ్రీవాణి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు గిరిజనులను ఏనాడూ పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్ కుంభా రవిబాబు పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గిరిజనుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని.. ఆయనను ప్రతి గిరిజనుడు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారన్నారు. గిరిజనులకు రక్షణగా ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఉంటుందన్నారు. గిరిజనులకు 3 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దన్నారు. గిరిజనుల సాధికారత సాధించడానికే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారని పుష్ప శ్రీవాణి అన్నారు. చదవండి: రాజకీయ బతుకుదెరువు కోసమే టీడీపీ కుట్రలు’ ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్‌గా కుంభా రవిబాబు బాధ్యతలు -
గిరిజనులకు రక్షణగా ఎస్టీ కమిషన్: పుష్పశ్రీవాణి
-
దళిత అభివృద్ధికి దండిగా..
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈసారి భారీగా ఖర్చు చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేనంత అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (సబ్‌ప్లాన్) కింద రూ.33,611.06 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్)కి రూ.21,306.84 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్డీఎఫ్) కింద రూ.12,304.22 కోట్లు చూపించింది. 2020–21తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.7,304.81 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నారు. పథకాల పరుగులు... గతేడాది కోవిడ్–19 వ్యాప్తి వల్ల నెలకొన్న పరిస్థితులతో పలు సంక్షేమ పథకాలు డీలా పడ్డాయి. ప్రస్తుతం ఈ పరిస్థితులను అధిగమిస్తున్నప్పటికీ కొన్ని పథకాల్లో అవాంతరాలు వచ్చాయి. ఈసారి భారీ కేటాయింపులు జరపడంతో సంక్షేమ పథకాల అమలు వేగం పుంజుకోనుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలు చేసే ఆర్థిక చేయూత పథకాలు పరుగులు పెట్టనున్నాయి. అదేవిధంగా ఇదివరకు పెండింగ్‌లో ఉన్న కార్యక్రమాలు సైతం పరిష్కారం కానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధి మొత్తాన్ని సంబం ధిత సంక్షేమ శాఖలు.. ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఖర్చు చేయా ల్సి ఉంటుంది. ఈసారి భారీగా కేటాయింపులు జరపడంతో ఆయా శాఖలు తలపెట్టిన కార్యక్రమాలన్నీ -
గిరిజన ఉత్పత్తులకు పెరగనున్న విలువ
సాక్షి, అమరావతి: గిరిజనులు పండించే వ్యవసాయ ఉత్పత్తులు, అడవుల్లో సేకరించే ఫల సాయాలకు ఇకపై విలువ పెరగనుంది. ఇప్పటివరకు గిరిజనులు వీటిని నేరుగా వ్యాపారులకు అమ్ముతున్నారు. వారికి సరైన ధర లభించడంలేదు. ఈ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విక్రయించడం ద్వారా వ్యాపారులు లాభాలు గడిస్తున్నారు. దీన్ని గమనించిన ప్రభుత్వం.. ఈ లాభాలు గిరిజనులకే దక్కేలా చూడాలని నిర్ణయం తీసుకుంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన పంటలను ఎక్కడికక్కడ ప్రాసెసింగ్ చేయించడం ద్వారా మంచి ధరలకు అమ్మే వీలుంది. ఆ కార్యక్రమానికి గిరిజన స్వయం సహాయక సంఘాల (స్త్రీలు, పురుషులు) ద్వారా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సంఘాలతో వన్‌ధన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) ఆర్థికసాయం అందిస్తున్న ఈ కార్యక్రమం విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే మొదలైంది. విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 50 వన్‌ధన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 750 గ్రూపులున్నాయి. ఈ గ్రూపుల్లో సుమారు 15 వేలమంది సభ్యులున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేఆర్ పురం ఐటీడీఏలో ఒక వన్‌ధన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్లో ఉన్న 15 గ్రూపుల్లో 300 మంది సభ్యులున్నారు. మరో 46 వన్‌ధన్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విశాఖ జిల్లా పాడేరు, పశ్చిమ గోదావరి జిల్లా కేఆర్‌పురం ఐటీడీఏల పరిధిలో మరో 46 వన్‌ధన్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీటిలో 690 గ్రూపులతో 12,605 మంది సభ్యులుంటారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.4.50 కోట్లతో.. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులకు విలువ జోడించడం ఎలా అనే అంశంపై 15 వేలమందికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి కాగానే ఒక్కో గ్రూపు రూ.15 లక్షల విలువైన ప్రాసెసింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రధానంగా అడవుల్లో సేకరించిన చింతపండును విత్తనాలు తీసి ప్రాసెసింగ్ చేయడం ద్వారా విలువ జోడించవచ్చు. ప్రస్తుతం విత్తనాలతో గిరిజనులు అమ్మే చింతపండు కిలో రూ.35కు గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) కొనుగోలు చేస్తోంది. అదే ప్రాసెస్ చేసిన తరువాత దాని ఖరీదు కిలో రూ.65కు పైన ఉంటుంది. రిటైల్ మార్కెట్లో కిలో చింతపండు ధర రూ.200 వరకు ఉంది. ఇలా ప్రతి ఉత్పత్తికి విలువ జోడించే విధంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని తద్వారా వచ్చిన ఆదాయాన్ని గిరిజనులే తీసుకుంటారు. వన్‌ధన్ వికాస్ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుండగా మానవ వనరులను రాష్ట్ర ప్రభుత్వం జీసీసీ ద్వారా సమకూరుస్తోంది. -
ఐటీడీఏలతో గిరిజనాభివృద్ధి
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమం, అభివృద్ధిలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు (ఐటీడీఏ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. గిరిజనులను ఆధునిక సమాజం వైపు మళ్లించే కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. విద్య, వైద్యం వంటి రంగాల్లో వీరికి మరిన్ని సదుపాయాలు కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అంతేకాక.. గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు, వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఐటీడీఏల ద్వారా చర్యలు తీసుకుంటోంది. షెడ్యూల్డ్ ఏరియాగా అటవీ గ్రామాలు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27.39 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వీరు అధికంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాలో ఉన్న అటవీ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో 36 మండలాలు, 4,765 గ్రామాలున్నాయి. వీటికి ప్రత్యేక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. షెడ్యూల్డ్ గ్రామాల్లో గిరిజనులు గ్రామసభల ద్వారా తీసుకునే నిర్ణయాలను ప్రభుత్వం అమలుచేయాల్సి ఉంటుంది. పీవీటీజీల కోసం ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రంలోని పాడేరు, పార్వతీపురం, రంపచోడవరం, సీతంపేట, శ్రీశైలం ఐటీడీఏల్లో ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపులు (పీవీటీజీ) ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా కోండు, గదబ, పూర్జ, చెంచు వంటి ఆదిమ గిరిజనులు ఉన్నారు. ఆధునిక సమాజం గురించి ఇప్పటికీ వీరికి పూర్తిస్థాయిలో అవగాహనలేదు. అందువల్ల వీరి కోసం ప్రత్యేక కార్యాచరణ ద్వారా కార్యక్రమాలు చేపడతారు. శ్రీశైలం ఐటీడీఏ పూర్తిగా చెంచు గిరిజనుల కోసం ఏర్పాటుచేసింది. నల్లమల అడవుల్లో వీరు నివసిస్తున్నారు. అలాగే, నెల్లూరులో కేవలం యానాదుల కోసం ఐటీడీఏ ఏర్పాటైంది. ఇక మిగిలిన రంపచోడవరం, సీతంపేట, పార్వతీపురం, కోట రామచంద్రాపురం, చింతూరు, పాడేరు ఐటీడీఏల్లో అన్ని కులాలకు చెందిన గిరిజనులు ఉన్నారు. ఒక్క పాడేరులోనే 6,04,047 మంది గిరిజనులు ఉన్నారు. సాధారణ జనంతో పోలిస్తే ఇక్కడ గిరిజనులు 91 శాతంమంది ఉన్నారు. అరకు ప్రాంత అడవులపై వీరు ఆధారపడి జీవిస్తున్నారు. ఇలా మొత్తం 34 రకాల కులాలకు చెందిన గిరిజనులు రాష్ట్రంలో జీవిస్తున్నారు. ఏజెన్సీ పల్లెల ముంగిట్లోకి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలతోపాటు విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అయితే, గిరిజన విశ్వవిద్యాలయం, గిరిజన ఇంజనీరింగ్–మెడికల్ కాలేజీలు, ఏడు ఐటీడీఏల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుచేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాక.. ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయాలు ఏర్పాటుకావడంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వం వారి ముంగిటకు చేరింది. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం గిరిజనులకు కలిగింది. వెంటనే ఐటీడీఏ స్పందిస్తోంది. ఆచార వ్యవహారాల్లో మార్పులు గిరిజనులు ఒకప్పుడు వారి ఆచార వ్యవహారాలకు అత్యంత విలువ ఇచ్చేవారు. ఇప్పుడూ వాటికి విలువిస్తూనే ఆధునిక సమాజం వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ఐటీడీఏ తీసుకున్న చర్యలతో ఆదిమ గిరిజనులైన చెంచుల వస్త్రధారణలో మార్పులు వచ్చాయి. 25 ఏళ్ల క్రితం పురుషులు కేవలం గోచీ.. మహిళలు తువ్వాళ్లు మాత్రమే చుట్టుకునే వారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఐఏఎస్ అధికారుల ఆలోచనలతో ముందుకు.. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కంటే గిరిజన సంక్షేమ శాఖలోనే ఐఏఎస్‌లు ఎక్కువమంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం సీతంపేట, రంపచోడవరం, పాడేరు ఐటీడీఏల్లో వీరున్నారు. అంతేకాక.. ఈ శాఖలో డైరెక్టర్, ముఖ్య కార్యదర్శుల హోదాల్లో కూడా ఐఏఎస్‌లు ఉన్నారు. మిగిలిన ఐటీడీఏలకూ గతంలో ఐఏఎస్‌లు ఉండే వారు. కానీ, ప్రస్తుతం ఆ స్థానాల్లో గ్రూప్–1 అధికారులున్నారు. ఇలా అత్యధికంగా ఉన్నతాధికారులు ఉన్న సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖే. వీరి ఆలోచనలతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని గిరిజన సంక్షేమం, అభివృద్ధిని ముందుకు నడిపిస్తోంది. పోడు వ్యవసాయానికి పెద్దపీట ఏజెన్సీలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం ఇటీవల భూమి హక్కు పత్రాలు ఇచ్చింది. వీటి ద్వారా అటవీ భూములపై గిరిజనులకు హక్కులు ఏర్పడతాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2.50 లక్షల మంది గిరిజనులకు భూమి హక్కుపత్రాలు ఇప్పించారు. ఆ తరువాత ఇప్పుడే ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ 3.20 లక్షల మంది గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇప్పించి వారి మనసుల్లో నిలిచారు. మరో లక్ష మందికి ఇప్పించేందుకు సర్వే జరుగుతోంది. -
ఒడిశా అధికారుల అదుపులోనే ఏపీ గ్రామాలు
మందస: రాష్ట్ర సరిహద్దులోని గిరిజన గ్రామాలపై ఒడిశా అధికారుల దౌర్జన్యం కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబకోట, బుడారిసింగి పంచాయతీల్లోని పలు గ్రామాలను ఒడిశా అధికారులు, పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. తాము ఏపీలోనే ఉంటామని చెబుతున్నా కూడా.. ఒడిశా అధికారులు మాత్రం స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేయొద్దంటూ గిరిజనులను బెదిరిస్తున్నారు. సాబకోట పంచాయతీ పరిధిలోని మాణిక్యపట్నం, మధ్యకోల.. బుడారిసింగి పంచాయతీలోని గుడ్డికోల గ్రామాలు ఒడిశా పరిధిలోనే ఉన్నాయని ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. కానీ ఈ గ్రామస్తుల రేషన్, ఆధార్ కార్డులు ఏపీకి చెందినవే. ఏపీ నుంచే సంక్షేమ పథకాలనూ అందుకుంటున్నారు. అయినా కూడా ఒడిశా అధికారులు మొండిగా వ్యవహరిస్తూ.. గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన పలువురిని బెదిరించి.. నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పోలీసులు కూడా ఈ గ్రామాల్లో తిరుగుతూ.. ఏపీలో ఓట్లు వేయొద్దని గిరిజనులను బెదిరిస్తున్నారు. బుధవారం ఈ గ్రామాల్లో ఏకంగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. గురువారం మరిన్ని బలగాలను దించుతామని, ప్రజలెవరూ పోలింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని హెచ్చరించారు. గిరిజనులు మాత్రం ఏపీలోనే ఉంటామని.. పోలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని వేడుకుంటున్నారు. ఈ విషయం మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఒడిశా అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ బడే పాపారావు మాట్లాడుతూ.. పోలీసు బలగాలను ఏర్పాటు చేసి ఈ గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిపిస్తామన్నారు. -
స్థానిక ఎన్నికలు: బీజేపీ.. ఓటుకు రేటు
కావలి(నెల్లూరు జిల్లా): ఎన్నికల్లో ఉనికి కోసం బీజేపీ ఓటుకు రేటు నిర్ణయించి విచ్చలవిడిగా ఓట్ల కొనుగోలుకు తెగబడుతోంది. కావలి నియోజకవర్గంలో కావలి, అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల పరిధిలో 63 పంచాయతీలు ఉండగా 386 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. 636 వార్డులకు 1,617 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో బీజేపీ మద్దతుదారులుగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు చాలా మంది రాజకీయాలకు పూర్తిగా కొత్త. స్థానికంగా వీరికి ఎటువంటి మద్దతు కూడా లేదు. (చదవండి: ‘దొంగ’దెబ్బ.. ఇది టీడీపీ పనేనా?) కేవలం ఓట్ల కొనుగోలే లక్ష్యంగా బీజేపీ నాయకులు వీరిని బరిలో నిలిపారు. ఓటుకు రూ. 5 వేల వంతునైనా ఇచ్చి ఉనికి కాపాడుకోవాలనే ఉద్దేశంతో గ్రామాల్లో నోట్ల కట్టలు వెదజల్లుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావలి మండలం లక్ష్మీపురం పంచాయతీలోని గిరిజనులకు ఓటుకు రూ. 5వేల వంతున బలవంతంగా ఇచ్చే ప్రయత్నం చేయడంతో గిరిపుత్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. బీజేపీ నాయకులు మంచాలపై పెట్టి వెళ్లిన డబ్బులను రూ.1.24 లక్షలు అధికారులకు అప్పగించి ఫిర్యాదు చేశారు.(చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ-జనసేన అడ్డదారులు..) బీజేపీ జిల్లా అధ్యక్షుడి స్వగ్రామంలోనే.. కావలి మండలం నెల్లూరు–ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉన్న కావలి మండలం లక్ష్మీపురం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్ స్వగ్రామం. ఆయన తన స్వగ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తానని కొద్ది రోజులుగా సవాళ్లు విసురుతున్నాడు. జనవరి 31వ తేదీ అర్థరాత్రి భరత్‌కుమార్ కుటుంబ సభ్యులు గ్రామంలోని గిరిజన కాలనీలో ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారి ఇంటికి వెళ్లి ఓటుకు రూ.5 వేల చొప్పున ఇవ్వసాగారు. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు లేచి బయటకు రాగానే ఈ మాట చెప్పే సరికి, తమకు డబ్బులు వద్దని చెప్పినా బీజేపీ నాయకులు బలవంతంగా ఇళ్లల్లో మంచాలపై నగదు పెట్టేసి వెళ్లిపోయారు. ఇలా రూ.1.25 లక్షలు పంపిణీ చేశారు. అయితే గిరిజనులు తాము డబ్బులు తీసుకొని ఓటు వేస్తే అభివృద్ధి పనులు అడగలేమని ఆ డబ్బులు మాకొద్దని తీసుకెళ్లమని గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు బూచి మాల్యాద్రి, మద్దూరి రవి, గుండ్లపల్లి లక్ష్మీనారాయణకు మొర పెట్టుకున్నారు. అయినప్పటికీ బీజేపీ నాయకులు ఆ డబ్బులు తీసుకోకపోగా, చాలకపోతే రూ.10 వేల చొప్పున ఇస్తామని అనడంతో గిరిజనులు నిర్ఘాంతపోయారు. ఇక చేసేది లేక ఈ విషయాన్ని బుధవారం అధికారులకు తెలియజేశారు. ఇదే విషయాన్ని కావలిలోని బీజేపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు భరత్‌కుమార్ ఇంటికి వచ్చి చెప్పినా, ఆయన వినిపించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు లక్ష్మీపురం గ్రామంలోని గిరిజన కాలనినీకి చేరుకుని వారి నుంచి ఫిర్యాదును అందుకొని నగదును స్వాధీనం చేసుకొన్నారు. -
ఆ ఘనత సీఎం వైఎస్ జగన్‌దే..
సాక్షి, విజయవాడ: గిరిజనుల కోసం మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి లేదని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులను చంద్రబాబు.. ఐదేళ్లు మోసం చేశారని ఆమె దుయ్యబట్టారు. ‘గిరిజనులకు దేశంలో ఎవరూ చేయని మేలు వైఎస్ జగన్ చేశారు. వారికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ప్రత్యేక ఎస్టీ కమిషన్, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ, 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం.గిరిజనులకు ఏనాడైనా చంద్రబాబు ఇన్ని పథకాలు తెచ్చారా?. జీవో నెంబర్ 3పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశామని’’ పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. (చదవండి: ‘రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటాం’) -
గిరిజనుల ఉపాధికి జీసీసీ భరోసా
సాక్షి, అమరావతి: అడవినే నమ్ముకుని కొండ కోనల్లో నివసించే గిరిజనులకు రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) అండగా నిలుస్తోంది. వారు సేకరించే అటవీ ఉత్పత్తులతో పాటు పండించే పంటలను కొనుగోలు చేస్తూ ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలతో పాటు శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సుమారు లక్షన్నర గిరిజన కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తోంది. గిరిజనులు జొన్న, సజ్జలు, రాగులు, కంది పంటలతో పాటు అక్కడక్కడా వరి పండిస్తున్నారు. తేనె, కుంకుళ్లు, చింతపండు, ఉసిరి తదితర అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు. గిరిజనులు తమ గ్రామాలను వదిలి బయటకు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన 962 డిపోల ద్వారా ఆయా ఉత్పత్తులన్నిటినీ జీసీసీ కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.5.23 కోట్ల విలువైన 6,320.30 క్వింటాళ్ల వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిన అటవీ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో మద్దతు ధరను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తోంది. కేవలం అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజన కుటుంబాలకు రూ.98.19 లక్షలు జీసీసీ ద్వారా అందాయి. కాఫీ రైతులకు ప్రోత్సాహం మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహంతో అనువైన చోట కాఫీ తోటల పెంపకాన్ని గిరిజనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.21 కోట్ల విలువైన 2,005.16 క్వింటాళ్ల అరబికా ఫార్చెమెంట్, అరబికా చెర్రీ, రోబస్టా చెర్రీ రకం కాఫీ గింజలను జీసీసీ సేకరించింది. అదే సమయంలో 760 గిరిజన కాఫీ రైతు కుటుంబాలకు రూ.1.36 కోట్ల వ్యవసాయ పరపతి కల్పించింది. గిరిజనుల అవసరాలు తీర్చడంపై జీసీసీ దృష్టి కేంద్రీకరిస్తోంది. 16 పెట్రోల్ బంకులు, 10 ఎల్పీ గ్యాస్ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 11,704.32 కోట్ల విలువైన పెట్రోల్, గ్యాస్, కందెనల అమ్మకాలు చేపట్టింది. అలాగే ‘గిరిజన్’ బ్రాండ్ కింద అటవీ ఉత్పత్తులతో తయారయ్యే సబ్బులు, కారం, పసుపు పొడుల వంటి వస్తువులకు రూ.16.01 కోట్ల విలువైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది. 75 వన్‌ధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు ప్రధానమంత్రి వన్‌ధన్ వికాస్ యోజన ద్వారా 21,280 మంది సభ్యులతో కూడిన 1,125 గ్రూపులతో 75 వన్‌ధన్ వికాస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీసీసీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా గ్రామాల్లోనే శుద్ధి (ప్రాసెసింగ్) చేయడం ద్వారా ఉత్పత్తులకు అదనపు విలువను జోడిస్తారు. ఈ విధంగా తయారైన వస్తువులను సభ్యులు తిరిగి జీసీసీకి లేదా తమకు ఇష్టమొచ్చిన చోట అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. ఈ వన్‌ధన్ వికాస్ కేంద్రాలు కొత్తగా మరో 188 ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. -
పులి చంపేసింది!
సాక్షి, మంచిర్యాల/పెంచికల్పేట్/బెజ్జూర్: రాష్ట్రంలోని అటవీ గ్రామాల్లో పులుల అలజడి కొనసాగుతోంది. కొన్ని రోజుల కిందటే పెద్ద పులి దాడిలో ఒకరు మరణించిన ఘటన మరువక ముందే మరో గిరిజన యువతిని పులి బలి తీసుకుంది. కుమురం భీం జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి శివారులో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొండపెల్లికి చెందిన పసుల నిర్మల (18) తల్లి లస్మక్క మరికొందరు కూలీలతో కలసి అన్నం సత్తయ్య చేనులో పత్తి తీసేందుకు వెళ్లింది. కూలీలంతా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తినేందుకు వెళ్తుండగా నిర్మలపై వెనక నుంచి ఒక్కసారిగా పులి దాడి చేసింది. మొదట నడుముపై పంజాతో తీవ్రంగా గాయపర్చింది. ఆ తర్వాత గొంతుపై కరచుకుని లాక్కెళ్లింది. అక్కడే ఉన్న అన్నం చక్రవర్తి అనే యువకుడు కర్రతో పులిని బెదిరించగా మరోసారి దాడి చేసేందుకు యత్నించి పారిపోయింది. చూస్తుండగానే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు జిల్లా అటవీ అధికారి శాంతారామ్, ఎఫ్‌డీవో వినయ్‌కుమార్, రేంజ్ అధికారులు ఘటనాస్థలాన్ని చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. దాడి చేసిన పులి గురించి వివరాలు సేకరించారు. జెడ్పీ వైస్ చైర్మన్ క్రిష్ణ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ ఐదు టీంలతో రెండు చోట్ల బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధిస్తామన్నారు. సమీప అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. వణుకుతున్న అటవీ గ్రామాలు.. ఈనెల 11న దహెగాం మండలం దిగిడలో విఘ్నేశ్ అనే యువకుడిపై పులి దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే.. ఇది జరిగిన 18 రోజుల్లోనే జిల్లాలో మరొకరు పులికి బలి కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూడ్రోజుల క్రితం పెంచికల్పేట్ మండలం అగర్‌గూడ శివారులో పెద్దవాగులో పులి సంచరిస్తుండగా యువకులకు కనిపించింది. అంతకు ముందు బెజ్జూరు, మంచిర్యాల జిల్లా వేమనపల్లి అటవీ ప్రాం తాల్లోనూ ఓ పులి కొందరి కంటపడింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు ఎలా వెళ్లాలని స్థానికులు వణికిపోతున్నారు. దహెగాం అడవుల్లో పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసినా చిక్కడం లేదు. కాగజ్‌నగర్ డివిజన్లో మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఆరు పులుల వరకు సంచరిస్తున్నాయి. తడోబా అందేరి టైగర్ రిజర్వులో పులులు సమీప గ్రామాల్లోకి వచ్చి దాడులు చేసిన ఘటనలు అనేకం.. ఈ క్రమంలో అటువంటి ఘటనలే ఇక్కడా పునరావృతం అవుతుండటంతో అక్కడి జనం భయాందోళన చెందుతున్నారు. అంబులెన్స్‌కు అడ్డుగా.. ఇటు నిర్మల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా బెజ్జూర్–పెంచికల్పేట్ సరిహద్దులోని గొల్లదేవర వద్ద దాదాపు 9 నిమిషాల పాటు పులి అంబులెన్స్‌కు అడ్డొచ్చినట్టు అంబులెన్స్ డ్రైవర్ గణేశ్ ‘సాక్షి’కి తెలిపారు. దీంతో వాహన లైట్లు బంద్ చేసి అక్కడే వేచిచూశానన్నారు. బెజ్జూర్–సులుగుపల్లి, చిన్నసిద్దాపూర్, పెద్ద సిద్దాపూర్ గ్రామాల వైపు అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లినట్లు వెల్లడించాడు. దాడిచేసింది కొత్త పులే.. దిగిడలో దాడి చేసిన పులి ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. తాజా ఘటనలో దాడి చేసింది మరో పులిగా గుర్తించాం. దీనిని మ్యాన్ఈటర్ అనలేం.. పత్తి చేన్లు అటవీప్రాంతంలో పులి ఆవాసం వరకు విస్తరించాయి. దీంతో పులి ఆవాసానికి ప్రతికూలంగా మారాయి. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తాం.. పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నాం. – శాంతారామ్, జిల్లా అటవీ అధికారి ‘అవ్వా సచ్చిన్నే’ అనే అరుపు విని.. అందరం మధ్యాహ్నం పని ముగించుకుని పత్తి చేనులో అన్నం తినేందుకు వెళ్తుండగా ఒక్కసారిగా ‘అవ్వా సచ్చిన్నే’ అంటూ అరుపు వినబడింది. ఉలిక్కిపడి చూడడంతో పులి యువతిని నోట కరుచుకొనిపోతోంది. వెంటనే ఓ కర్ర తీసుకుని పులిపైకి విసిరాను. అక్కడున్నవాళ్లమంతా అరవడంతో దూరంగా వెళ్లింది. వెళ్లి చూసేసరికి అప్పటికే యువతి మృతి చెందింది. నేను, రాజన్ కలిసి ఆమెను తీసుకొస్తుండగా మాపైకి కూడా గాండ్రిస్తూ మీదకు ఉరకబోయింది. అందరం గట్టిగా అరవడంతో అడవిలోకి పారిపోయింది. –అన్నం చక్రవర్తి, ప్రత్యక్ష సాక్షి