-
మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం టీడీపీ నేతల దౌర్జన్యం
వజ్రకరూరు: అధికారం అండగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అంతా తాము చెప్పినట్టే జరగాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలిపై టీడీపీ నేతలు దౌర్జ్యనం చేశారు. దీంతో ఆమె క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఛాయాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో గత 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని బోయ సుంకమ్మ నిర్వహిస్తున్నారు. ఆమెకు సహాయకురాళ్లుగా ఆమె కుమార్తెలు రాధ, లక్ష్మి ఉన్నారు. ఇన్నేళ్లలో వారిపై చిన్న ఫిర్యాదు కూడా అందలేదు. కానీ గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు ఏజెన్సీ కోసం బోయ సుంకమ్మను బెదిరింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కూడా తమ పార్టీ కార్యకర్తలే చూసుకుంటారని అందువల్ల స్వచ్ఛందంగా తప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ అధికారికంగా తనకు ఎవరూ ఏజెన్సీ నిర్వహించవద్దని చెప్పకపోవడంతో బోయ సుంకమ్మ ఎప్పటిలాగే చిన్నారులకు మధ్యాహ్న భోజనం వండుతోంది. ఈ క్రమంలో గురువారం పాఠశాల వద్దకు వెళ్లిన కొందరు టీడీపీ నాయకులు సుంకమ్మపై మరోసారి దౌర్జన్యానికి దిగారు. చెబితే వినవా... ‘ఒక్కసారి చెబితే నువ్వు వినవా.. ఏజెన్సీ నుంచి తప్పుకోకపోతే నీ అంతు చూస్తాం’ అంటూ హెచ్చరించారు. దీంతో సుంకమ్మ అది చెప్పేందుకు మీరెవరని ప్రశ్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేతలు వంట గదిలోని సామగ్రి, కూరగాయలు తీసుకువచ్చి రోడ్డుపై పడేశారు. అడ్డుకోబోయిన సుంకమ్మ కూతురు రాధ, మనుమడు దొరబాబు, మనుమరాలిని పక్కకు నెట్టివేశారు. దీంతో మనస్తాపం చెందిన సుంకమ్మ వంటగదిలోకి వెళ్లి క్రిమి సంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను 108లో గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వజ్రకరూరు ఎస్ఐ నరేష్ ఆస్పత్రికి వెళ్లి సుంకమ్మ నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే మండల విద్యాధికారి తిమ్మప్ప కూడా ఆమెను పరామర్శించి వివరాలు సేకరించారు. కాగా అదే పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్ మహేశ్వరిని కూడా టీడీపీ నేతలు బెదిరించారు. ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవాలంటూ టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు స్వీపర్ మాముడూరు మహేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగం వదిలేస్తే తన కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఐదుగురు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
చింతపల్లి రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న 759 కిలోల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు స్థానిక ఏఎస్పీ ప్రతాప్‌శివకిశోర్ తెలిపారు. ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో గంజాయి లభ్యం కాకపోవడంతో ధారకొండ పంచాయతీ గంగవరం గ్రామానికి చెందిన వండలం బాలు బద్దర్ తనకు పరిచయం ఉన్న ఒడిశాలోని చిత్రకొండ బ్లాక్ బరడబందకు చెందిన చేపల వ్యాపారి లింగుఖిలా (బాబూరావు)ను ఆశ్రయించాడు. అతని ద్వారా 759 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి రెండు బొలోరా వాహనాల్లో గూడెం, చింతపల్లి మీదుగా తాళ్లపాలెం చేర్చేందుకు లింగుఖిలాతో రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు వ్యాన్లలో గంజాయి తీసుకొస్తుండగా గూడెం కొత్తవీధిలోని సంస్థ కాలనీ వద్ద సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ అప్పలసూరి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వ్యాన్లలో ఉన్న బాలుబద్దర్‌తోపాటు రింతాడ పంచాయతీ కుమ్మరివీధికి చెందిన పాంగి గోవర్దన్, మాలిగుడకు చెందిన కొర్రలైకోన్ (లక్ష్మణ్), ఊబలపాలెంకు చెందిన కిల్లో శంకర్రావు, చింతపల్లి మండలం కడశిల్పకి చెందిన మైనర్ (17)ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.38 లక్షల విలువైన 759 కిలోల గంజాయి, రెండు వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, రూ.16,900 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు లింగుఖిలా (బాబూరావు) కోసం గాలిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు. -
ప్రసవం కోసం వస్తే ప్రాణాలుపోయాయి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీతోపాటు ఆమె కవల శిశువులు మరణించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమటలోని పద్మావతి హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. డాక్టర్ సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పోరంకికి చెందిన బండ్రపల్లి ప్రశాంత్, మాధవి(25) దంపతులకు ఒక బాబు(2) ఉన్నాడు. మాధవి రెండోసారి గర్భం దాల్చడంతో పటమటలోని పద్మావతి హాస్పిటల్లో రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రాత్రి మాధవికి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. మాధవిని పరీక్షించిన డాక్టర్ వెంకటరమణ సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. తొలుత నార్మల్ డెలివరీలో ఒక శిశువు జన్మించినా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రెండో శిశువు అడ్డం తిరగడంతో సిజేరియన్ చేశారు. అప్పటికే రెండో శిశువు కూడా మృతిచెందింది. సిజేరియన్ చేసిన అనంతరం మాధవి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవి బుధవారం ఉదయం మృతిచెందారు. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన తన భార్య, ఇద్దరు శిశువులు మృతిచెందడంతో పద్మావతి ఆస్పత్రి వద్ద మాధవి భర్త ప్రశాంత్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. తాము ఆస్పత్రికి వచ్చిన వెంటనే డాక్టర్ వెంకటరమణ స్పందించి సిజేరియన్ చేసి ఉంటే తల్లీబిడ్డలు బతికేవాళ్లని, డాక్టర్ నిర్లక్ష్యంవల్లే మరణించారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటమట పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.వైద్యశాఖ విచారణ తల్లీ, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పద్మావతి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణులైన వైద్యులను నియమించాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.ఈ మేరకు జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ హిమబిందు, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పరుచూరి అనిల్‌కుమార్, ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ఏవీ రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిర ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు.డాక్టర్ వెంకటరమణ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వైద్య రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు, విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. -
అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళపై టీడీపీ నేత అఘాయిత్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: వీరబల్లి మండలం ఒదివీడు గ్రామంలో దారుణం జరిగింది. ఓ మహిళపై టీడీపీ నేత పెద్ద రెడ్డయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళగా అదే గ్రామానికి చెందిన పెద్ద రెడ్డయ్య బాత్రూంలో దూరి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో అక్కడ నుండి నిందితుడు పరారయ్యాడు.బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ వీరబల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. న్యాయం చేయకపోగా, ఆమె పట్ల ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తనకు న్యాయం జరగకపోతే చావేశరణ్యమని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
వైఎస్సార్ జిల్లా: రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా: వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై పడి ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పని చేస్తున్న నాగార్జునరెడ్డిగా గుర్తించారు. నైట్ డ్యూటీ ముగించుకొని తెల్లవారుజామున వెళ్లి రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. కుటుంబకలహాలతో ఏఎస్సై నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహితను కర్కశంగా నరికి చంపిన ఆటో డ్రైవర్
పొందూరు: మండలంలోని తాడివలస సమీపంలో చిన్న బొడ్డేపల్లి గ్రామానికి చెందిన వివాహిత హత్య మంగళవారం సంచలనం రేపింది. వివాహితను హత్య చేసిన ఆటోడ్రైవర్ ఆమె మృతదేహాన్ని నేరు గా పొందూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు..చిన్నబొడ్డేపల్లి గ్రామానికి చెందిన అచ్చయ్య, రాజులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అమలాపురపు రాజేశ్వరి భర్త గుప్తేశ్వరరావు మూడేళ్ల కింద ట అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆమె తన కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుమార్తెతో పాటు తల్లిదండ్రులను పోషిస్తున్నారు. రెండు నెలల కిందట బొడ్డేపల్లి రైల్వేట్రాక్ పనులకు వచ్చిన నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామానికి చెందిన ఆముజూరు గోపాల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. గ్రామంలోనే వారిద్దరూ తరచూ కలిసేవారు. మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి వెళ్లడానికి సిద్ధమైన రాజేశ్వరి గోపాల్‌కు ఫోన్ చేసింది. గోపాల్ ఆటోపై చిన్నబొడ్డేపల్లికి వచ్చాడు. ఆటోలో ఇద్దరూ వాల్తేరుకు బయ లుదేరారు. అయితే తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. గోపాల్ తనతో తెచ్చుకున్న చాకుతో రాజేశ్వరి మెడపై పలుమార్లు దాడిచేశాడు. దీంతో రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన రాజేశ్వరిని గోపాల్ తన ఆటోలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయాడు. ఆమదాలవలస సీఐ దివాకర్‌యాదవ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విచారణ చేపట్టారు. మృతురాలి తల్లిదండ్రులు అచ్చయ్య, రాజు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేశారు. హత్య చేసిన గోపాల్‌తో కలి సి హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
నెల్లూరు జిల్లా: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి దగ్గర జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు గాయపడిన వారిని హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమా? అతివేగమా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ బోల్తాబస్సు క్లీనర్ మృతి పలువురు విద్యార్థులకు గాయాలు.హుటాహుటిన గాయపడిన విద్యార్థులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ప్రమాదానికిగల కారణాలు పూర్తి… pic.twitter.com/x5CKlHCjen— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024 -
నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నార్సింగిలో ఓ ఇంజినీర్‌ను దారుణ హత్య చేశారు. ఇజాయత్ అలీ కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. శనివారం.. దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన దుండగులు ఇంజనీర్‌ను కదలకుండా పట్టుకోగా, మరొకరు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం పరారైనట్లు తెలుస్తోంది.వారిలో ఇద్దరు యువకులు కాగా.. ఓ యువతి ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం క్వాలిస్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వాహనాన్ని, రెండు ఫోన్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ టెర్రర్.. ఒకే స్పాట్లో మూడు ప్రమాదాలు..
సాక్షి, ఎన్టీఆర్: ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ దుర్మరణం చెందారు. ఒకే స్పాట్లో కొన్ని నిమిషాల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఖాళీ గ్యాస్ సిలిండర్ల లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే, అదే మార్గంలో వస్తున్న మరో కంటైనర్.. ప్రమాదానికి గురైన లారీ ఢీకొట్టింది. దీంతో, లారీ ముందున్న ఇద్దరు వ్యక్తులు(తండ్రి, కొడుకు) మృతిచెందారు.ఆ తర్వాత ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ పారిపోయే ప్రయత్నం చేశాడు. కంటైనర్‌ను స్పీడ్‌గా నడపడంతో సదరు కంటైనర్.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం, సమాచారం అందుకున్న కంచికచర్ల హైవే మొబైల్ పోలీసులు కేసర వద్ద ఆ కంటైనర్‌ను పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో మృతులు ఎన్టీఆర్ జిల్లా ఐతవరం గ్రామానికి చెందిన సంకు మాధవరావు(65), అతని కుమారుడు సంకు రామరాజు(45)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్సీపీ ఓటమిని జీర్ణించుకోలేక ముగ్గురు మృతి
వెల్వడం(మైలవరం)/మధురానగర్(విజయవాడసెంట్రల్)/ఉయ్యూరు: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిని జీర్ణించుకోలేక ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన అయిలూరి శ్రీనివాసరెడ్డి(35) వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి స్థానికంగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బలంగా నమ్మాడు. కానీ, పార్టీ ఓడిపోవడంతో శ్రీనివాసరెడ్డి తీవ్ర మనోవేదనతో కుమిలిపోతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదేవిధంగా విజయవాడలోని 27వ డివిజన్ బావాజీపేటకు చెందిన వైఎస్సార్సీపీ గృహసారథి నామా శ్రీను(55) గత 12 ఏళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోయినప్పటి నుంచి బాధపడుతున్న శ్రీను గురువారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నామా శ్రీను మృతికి మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. కాగా, కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కడవకొల్లు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త, లారీ డ్రైవర్ జె.కొండలరావు (56) కూడా పార్టీ ఓటమిని తట్టుకోలేక తీవ్ర వేదనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు వారం రోజుల కిందట గుండెపోటు రావడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. కొండలరావు భౌతికకాయం వద్ద సర్పంచ్ మంగినేని సుధారాణి, పార్టీ నాయకులు నివాళులర్పించారు. -
ఊరొదలకపోతే చంపేస్తాం
సాక్షి ప్రతినిధి, బాపట్ల/సాక్షి, టాస్‌్కఫోర్స్ : బాపట్ల, తిరుపతి జిల్లాల్లో అధికార టీడీపీ నేతల అరాచక పర్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు చితక బాదుతున్నారు. ఇళ్లు, ఇతర ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. బలహీన వర్గాలపై, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి. ఊరు విడిచి వెళ్లాలని, లేకపోతే చంపేస్తామని నేతలు, కార్యకర్తలను మైకు అనౌన్స్మెంట్ల ద్వారా హెచ్చరిస్తుండటం విస్తుగొలుపుతోంది. దీంతో పలువురు నేతలు, కార్యకర్తలు ఊర్లు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. మరి కొందరు గ్రామాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన వైఎస్సార్సీపీ మండల స్థాయి నాయకుడు చెన్ను కోటేశ్వరరావు కుటుంబం 20 రోజులుగా అజ్ఞాతంలో గడుపుతోంది. కోటేశ్వరరావు 1995 నుంచి వరుసగా మూడు దఫాలుగా గుళ్లపల్లి సర్పంచ్‌గా, మండల పరిషత్ అధ్యక్షుడిగా పని చేశారు. 2021 నుంచి ఆయన సతీమణి సర్పంచ్‌గా ఉన్నారు. గ్రామ పంచాయతీలోనే కాక మండల స్థాయిలో పేరున్న నేత. కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తలు చెన్ను కోటేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేశారు. వీరి హయాంలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాలన్నింటినీ ధ్వంసం చేశారు. కోటేశ్వరరావును గ్రామస్తుల సమక్షంలో దుర్భాషలాడారు. చంపేస్తామంటూ ఏకంగా మైకులో గ్రామం మొత్తం తిరిగి అనౌన్స్మెంట్ చేయడం గమనార్హం. అంతటితో ఆగకుండా మారణాయుధాలతో ఇంటి వద్దకు వెళ్లి గ్రామం వదలి వెళ్లకపోతే చంపేస్తామని నేరుగా హెచ్చరించారు.దీంతో కోటేశ్వరరావు కుటుంబంతో కలిసి సొంత గ్రామం గుళ్లపల్లి వదిలి వెళ్లిపోయారు. తర్వాత ఆయన వాటర్ ప్లాంట్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఆయన అనుచరుడి ఇంటిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు నాలుగు రోజుల క్రితం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసి గ్రామానికి చెందిన 8 మంది టీడీపీ కార్యకర్తలతో తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉందని.. వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అయినా పోలీసుల నుంచి స్పందన లేదు. దాడులను ప్రోత్సహిస్తున్న మంత్రి అనగాని చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటకు చెందిన ఆంధ్రప్రభ విలేకరి ఎనుముల వెంకటేశ్వరరావు ఇంటిని బుధవారం టీడీపీ నేతలు జేసీబీతో ధ్వంసం చేశారు. కొత్త ఇల్లు ని ర్మించుకొని మూడు నెలల క్రితమే ఆయన గృహ ప్రవేశం చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడన్న కక్షతో ఈ దురాగతానికి పాల్పడ్డారు. పోలీసులు కనీసం ఫిర్యాదు పత్రం కూడా తీసుకోలేదు. ఇదే మండలం రాం»ొట్లవారిపాలెంకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రాజేష్‌కుమార్ ఇంటిపై 30 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడి దారుణంగా కొట్టారు. ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ప్రసాదరెడ్డిని చంపేస్తామని బెదిరించారు. గ్రామం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఆయన ఊరు వదిలి వెళ్లారు. ఇలా పలువురు నేతలు అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. నగరం, నిజాపట్నం తదితర మండలాల్లో సైతం ఈ తరహా దాడులు పెరిగాయి. రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క రేపల్లె నియోజకవర్గంలోనే వందల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లారు. మంత్రి కనుసైగ మేరకే దాడులు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా, మంత్రి స్పందించక పోవడమే ఇందుకు నిదర్శనం. కాగా, జిల్లాలో బాధితుల నుంచి పోలీసు అధికారులు ఫిర్యాదులు కూడా స్వీకరించక పోవడం గమనార్హం.ఊరొదిలిన గిరిజన, దళిత కుటుంబాలు శ్రీకాళహస్తి రూరల్ మండల పరిధిలో టీడీపీ శ్రేణుల దాడులతో ఈశ్వరయ్య కాలనీకి చెందిన 55 కుటుంబాలు, వాగివేడులో 17 కుటుంబాలు, నారాయణపురంలో 3 కుటుంబాలు.. మొత్తం 75 కుటుంబాలు ఊరొదిలి వెళ్లిపోయాయి. ఇందులో ఎంపేడు సర్పంచ్ కొండయ్య కుటుంబం కూడా ఉంది. సర్పంచ్ కుటుంబం ఎక్కడకు వెళ్లిందో తెలియట్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరొదిలి వెళ్లిన వారిలో సూళ్లకు వెళ్లే పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు. వారి కోసం స్కూల్ టీచర్లు తోటి విద్యార్థులను నివాసాలకు పంపించారని స్థానికులు తెలిపారు.ఆస్తులు ధ్వంసం చేస్తున్న కూటమిపుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం పెద్దగొట్టికల్లుకు చెందిన మాధవరెడ్డి, జనార్థన్‌రెడ్డి ఆస్తులను కూటమి నేతలు ధ్వంసం చేశారు. పీలేరు–తిరుపతి జాతీయ రహదారిలోని రొంపిచర్ల క్రాస్ వద్ద ఉన్న వీఎంఆర్ కన్వెన్షన్ హాలు ముఖ ద్వారం ఆర్చిని గురువారం అర్ధరాత్రి కూలదోశారు. జనార్ధన్‌రెడ్డికి చెందిన సెరికల్చర్ షెడ్డును పడగొట్టారు. కొంత కాలంగా చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నా.. పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వరయ్య కాలనీలో జరిగిన ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో షికారీలపై మరోసారి దాడులు చేశారని స్థానికులు చెబుతున్నారు. ‘వాళ్లు అధికారంలో ఉన్నారు.. వారితో జాగ్రత్తగా ఉండాలి’ అని పోలీసులు సలహా ఇచ్చినట్లు సమాచారం. చంద్రగిరి నియోజక వర్గం పాకాల మండల యూత్ అధ్యక్షుడు చంటిపై గురువారం రాత్రి దాడి జరిగినా, పోలీసులు పట్టించుకోలేదు.ఫ్యాన్‌కు ఓటేసినందుకు ఊళ్లో ఉండొద్దు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ఫ్యాను గుర్తుకు ఓటేసిన షికారీలు, దళితులను ఊర్ల నుంచి వెళ్లగొడుతున్నారు. ఊరు విడిచి వెళ్లని వారి నివాసాల్లోకి దూరి తరిమి తరిమి కొట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మరి కొన్ని చోట్ల వైఎస్సార్సీపీకి ఓటేసిన, పార్టీ శ్రేణుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఇంకొందరికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అప్పులిచ్చిన వాళ్లను నివాసాలకు పంపి ఒత్తిళ్లు చేయిస్తూ రాక్షసానందం పొందుతున్నారు.శ్రీకాళహస్తి పరిధిలో ఇప్పటికే రూ.12 కోట్లు విలువ చేసే నివాసాలను కూల్చి వేశారు. శ్రీకాళహస్తి రూరల్ మండల పరిధిలోని ఈశ్వరయ్యకాలనీలో టీడీపీ శ్రేణులు శుక్రవారం షికారీల (గిరిజనులు) ఇళ్లలోకి చొరబడి కర్రలు, రాళ్లతో తరిమి కొట్టారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దీంతో పలువురు కాలనీ విడిచి వెళ్లిపోయారు. ఈ నెల 12న ఎంపేడు పంచాయతీ ఈశ్వరయ్యకాలనీ, వాగివేడు, నారాయణపురంలో జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. నివాసాల్లోకి చొరబడి చిన్నా , పెద్దా తేడా చూడకుండా విచక్షణా రహితంగా దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ వారిలో చిన్న పిల్లలు, మహేశ్వరి (బాలింత), రవీన (గర్భిణి), ఎంజీఆర్ (వృద్దుడు)తో పాటు మరి కొందరు ఉన్నారు. -
విశాఖలో దారుణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న పద్మిని ఆడియో
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. వివాహితను హత్య చేసిన అత్త, మామ, భర్త ఆత్మహత్యగా చిత్రీకరించారు. అత్త,మామ, భర్త, వేధింపులు భరించలేక మృతురాలు పద్మిని.. బంధువులకు ఆడియో రికార్డ్ చేసి పంపించింది. నోటిలో పురుగులు మందు బలవంతంగా పోసి భార్యను భర్త సోమేశ్వరరావు హత్య చేశాడు. ఈ నెల ఒకటో తేదీన ఘటన చోటు చేసుకోగా, కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. భర్త, అత్త మామలను గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు.వరకట్నపు వేధిపులు కేసు ఆడియో ‘సాక్షి’కి చిక్కింది. మృతురాలు పద్మిని తన మావయ్యకి ఆడియో పంపింది. పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకొని రావాలని భర్త వేధింపులకు గురిచేశాడు. పురుగులు మందు నీటిలో పోసి.. భర్త సోమేశ్వరరావు చేతిని అడ్డు పెట్టాడు. 25 సార్లు వాంతులు చేసుకున్న పద్మిని ఆడియో కన్నీరు తెప్పిస్తుంది. -
ప్రేమోన్మాది ఘాతుకం.. విజయవాడలో వ్యాపారి దారుణహత్య!
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడ బృందావన కాలనీలోని గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కారణంతో ఓ ఉపాధ్యాయుడు.. యువతి తండ్రిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు విద్యాధరపురానికి చెందిన కంకిపాటి శ్రీరామచంద్రప్రసాద్(56) లబ్బీపేటలోని బృందావన్ కాలనీలో సింధూ భవన్ సమీపంలో కిరాణా షాపు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఉదయం వచ్చి వ్యాపారం నిర్వహించుకుని రాత్రి ఇంటికి వెళ్తుంటాడు. ఆయన కుమార్తె బీ.టెక్ పైనలియర్ చదువుతుంది.గత కొన్ని నెలలుగా ఒక ప్రైవేట్ స్కూల్లో పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్న విద్యాధరపురానికి చెందిన మణికంఠ ప్రేమిస్తున్నానని తనను పెళ్లిచేసుకోమని శ్రీరామచంద్రప్రసాద్ కుమారై వెంటపడుతూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యువతి తల్లిదండ్రులు మణికంఠను మందలించారు. గురువారం సాయంత్రం తండ్రితో పాటు కుమార్తె కూడా షాపునకు వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసి ఇద్దరు ఇంటికి బయలుదేరుతున్నారు.ఆ సమయంలో వారిపై కోపం పెంచుకున్న మణికంఠ షాపు వద్దకు చేరుకున్నాడు. అతను తన వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీరామచంద్రప్రసాద్‌పై దాడి చేసి నరికి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే వ్యాపారి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మణికంఠను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. -
పిన్నెల్లికి రిమాండ్
సాక్షి, నరసరావుపేట/నెల్లూరు (క్రైం): పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టు రెండు కేసుల్లో 14 రోజుల రిమాండ్ విధించింది. మరో రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ మేజిస్ట్రేట్ ఎస్. శ్రీనివాస కల్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ రోజు, తరువాత జరిగిన ఘటనలపై తనపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బుధవారం మధ్యాహ్నం హైకోర్టు తోసిపుచ్చడం, ఆ వెంటనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి నరసరావుపేట ఏరియా వైద్యశాలలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని మాచర్లకు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శ్రీనివాస కల్యాణ్ ముందు హాజరుపరిచారు. ఆయనపై నమోదైన నాలుగు కేసులపై విడివిడిగా ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకు వాదనలు కొనసాగాయి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం కేసు, పోలింగ్ బూత్ ముందు మహిళను బెదిరించారంటూ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కారంపూడి సీఐ నారాయణస్వామి, టీడీపీ నేత నంబూరి శేషగిరిరావుపై దాడి కేసుల్లో రిమాండ్ విధించింది. పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. వెంటనే ఆయన్ని పటిష్ట భద్రత మధ్య నెల్లూరు తీసుకెళ్లారు. గురువారం ఉదయం 8.30 గంటలకు నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తగా కేంద్ర కారాగారం వద్ద పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎవరూ అక్కడికి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.కోర్టు వద్దే పిన్నెల్లిపై దాడికి యత్నంపెన్నెల్లిని కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చిన సమయంలో కోర్టు వద్దే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై దురుసుగా వ్యవహరించారు. పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ముందే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. పిన్నెల్లి కోర్టు లోపలికి వెళ్తున్న సమయంలో మాచర్లకు చెందిన టీడీపీ కార్యకర్త కొమేర శివ అడ్డంగా నిలబడి దురుసుగా మాట్లాడాడు. ఆయనపై దాడి చేయబోయాడు. పోలీసులు అడ్డుకోకపోవడంతో పిన్నెల్లి అతన్ని తోసుకొని కోర్టులోకి వెళ్లిపోయారు. కోర్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. మాజీ ఎమ్మెల్యేని కోర్టులో హాజరుపరుస్తున్న సందర్భంలో ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీ కార్యకర్తలను అక్కడకు అనుమతించడమే కాకుండా వారు రెచ్చగొట్టేలా దుర్భాషలాడుతున్నా, బాణాసంచా కాల్చుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. పిన్నెల్లిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందని తెలిసి కూడా ఆయన్ని కోర్టుకు తీసుకువచ్చే సమయానికి వారిని చెదరగొట్టలేదు. పిన్నెల్లిని కోర్టు లోపలికి తీసుకువెళ్లే సమయంలో ఆయన ముందు పోలీసులు ఎవరూ లేరు. అందువల్లే టీడీపీ కార్యకర్త శివ కోర్టు ప్రాంగణంలోనే నేరుగా పిన్నెల్లికి ఎదురు రాగలిగాడు. వెంటనే అతన్ని నిలువరించకపోగా, అతను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, దాడికి యత్నించినా పట్టించుకోకపోవడం పోలీసుల ఉద్దేశపూర్వక చర్యేనని వైఎస్సార్సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పైగా, ఉద్దేశపూర్వకంగా కోర్ట వద్దే పిన్నెల్లికి అడ్డు నిలబడి, దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్త శివే తనపై పిన్నెల్లి దాడి చేశారంటూ మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
ఆగని టీడీపీ అరాచకం
సాక్షి నెట్వర్క్: టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి ఘర్షణల్ని కొనసాగిస్తున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది దౌర్జన్యం చేయడానికే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడై 20 రోజులు దాటినా టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంసకాండ ఆపకపోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. బుధవారం రాత్రి, గురువారం సైతం శిలాఫలకాల ధ్వంసం వంటి ఘటనలు కొనసాగాయి. తిరుపతిలో ఆగని విధ్వంసం తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్డు శిలాఫలకాన్ని బుధవారం రాత్రి టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటి మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా 22 రోడ్లను నిర్మించారు. ప్రతి మాస్టర్ ప్లాన్ రోడ్డుకు కవులు, మహానీయుల పేర్లు పెట్టారు. అందులో భాగంగానే తిరుపతి జీవకోన ప్రధాన మార్గంలోని సత్యనారాయణపురం మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ‘విరజా మార్గం’గా నామకరణం చేసి అక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు రెచ్చిపోయి అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. తిరుపతి అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన టీడీసీ నేతలు ఇలా కక్ష సాధింపులకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ చర్యతో ఇరువాడలో ఉద్రిక్తత సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలను ఎందుకు పెట్టలేదంటూ సచివాలయ సిబ్బందిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటన అచ్యుతాపురం మండలం ఇరువాడలో గురువారం చోటుచేసుకొంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గునపాలతో శిలాఫలకాలు ధ్వంసం చేసి పెకలించడంతో సచివాలయ సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈ ఘటనకు పాల్పడంతో వీడియోల ఆధారంగా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.వైఎస్ జగన్ ఫొటో ధ్వంసం వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లె రైతు భరోసా కేంద్రం భవనంపై నవరత్నాలు పేరుతో ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఫొటోను రాళ్లతో పగులగొట్టారు. కావాలనే టీడీపీ కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ యువనేతపై హత్యాయత్నంబీరు సీసాలు, మారణాయుధాలతో దాడి పాకాలలో చిత్తూరు రౌడీ గ్యాంగ్ బీభత్సం చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ అరాచకాలు పాకాల: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చిత్తూరు నుంచి దిగుమతి అయిన రౌడీమూకల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం రాత్రి పాకాల మండల వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు యుగంధర్ నాయుడు (చంటి)పై చిత్తూరు నుంచి బైకులపై వచ్చిన ఐదుగురు సభ్యుల రౌడీ గ్యాంగ్ బీరు సీసాలు, మారణాయుధాలతో దాడిచేసి అతడిని హతమార్చేందుకు యత్నించారు. యుగంధర్ తలను బీరు బాటిల్‌తో పగులగొట్టారు. మారణాయుధాలతో ఒళ్లంతా గాయాలు చేశారు. ‘మా అన్న పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీకి పనిచేస్తావా.. నిన్ను చంపితే దిక్కెవరు’ అంటూ ఇష్టారాజ్యంగా దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నుగారిపల్లి సమీపంలోని తన మామిడి తోటలో ఉండగా.. గుర్తు తెలియని ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై తోటలోకి చొరబడి హతాయత్నం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామిడి తోటలోని తన గెస్ట్‌హౌస్‌లో ఉన్న గృహోపకరణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో కొనసాగితే ప్రాణాలతో ఉంచబోమని బెదిరించారని తెలిపారు. చిత్తూరు నుంచి కిరాయి మూకలను రప్పించి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయించి ఓ నేత పైశాచిక ఆనందం పొందుతున్నాడని బాధితుడు మండిపడ్డాడు.ఇది ప్రజాస్వామ్యమా .. అరాచకమా?దాడులపై హ్యూమన్‌రైట్స్ కమిషన్ స్పందించాలి మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు సాక్షి,అమరావతి/ రైల్వేకోడూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత 25 రోజులుగా కొనసాగిస్తున్న అరాచకాలు, విధ్వంసాలు, దాడులు, దాషీ్టకాలు చూస్తూంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక అరాచక రాజ్యంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. తమకు ఊహ వచి్చనప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదని తెలిపారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఇలా ప్రజలపై జరుగుతున్న దాడులపై హ్యూమన్‌రైట్స్ కమిషన్ తక్షణమే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని కోరారు. పేదల ఇళ్లు కూల్చివేత దుర్మార్గం.. ఎస్టీ కాలనీ వాసుల ఇళ్లను రెవెన్యూ, ఏపీఎండీసీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేయడం దుర్మార్గమని రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓబులవారిపల్లె మండలం మంగంపేటకాపుపల్లె ఎస్టీ కాలనీ వాసుల గృహాలను బుధవారం జేసీబీతో అధికారులు కూల్చి వేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గురువారం ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్లల్లో బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలున్నారని చూడకుండా తెల్లవారుజామున జేసీబీలతో నేలమట్టం చేయడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు
వినుకొండ (నూజెండ్ల): పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై కేవలం గంటల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదాలతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. చెట్టును ఢీకొన్న వాహనం రూరల్ పరిధిలోని కొత్తపాలెం సమీపంలో టయోటా వాహనం అదుపు తప్పిచెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరుకు చెందిన టీటీడీలో పనిచేసి పదవీ విరమణ చేసిన బ్రహ్మశ్రీ సోమాసి బాలగంగాధర్ శర్మ (69), ఆయన భార్య యశోద (67), డ్రైవర్ కట్టా నిర్మలరావు (45) అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు హెచ్.వై.శర్మ, అతని భార్య సంధ్య తీవ్రంగా గాయపడగా, ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరందరూ కర్ణాటకలోని బళ్లారి నుంచి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుని గుంటూరు వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.స్వగ్రామానికి వెళ్తూ.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మీరావలి (25) స్వగ్రామం వెళుతుండగా మినీలారీ ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మీరావలి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. తండ్రీ కొడుకులు మృతి అదే రహదారిలో వినుకొండ రూరల్ మండలం వద్ద.. ప్రకాశం జిల్లా ఉమ్మడివరం గ్రామానికి చెందిన మాలెపాటి పెదరామ కోటేశ్వరరావు(45) తన కుమారుడు అంజిబాబుతో (25) కలిసి వినుకొండ రూరల్ మండలం కొతపాలెం వస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు మృతి చెందగా కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. అంజిబాబును మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ గుంటూరులో మృతిచెందాడు. -
మాట్లాడే పనుంది ఇంటికిరా..
సాక్షి, అమరావతి/నల్లజర్ల: సచివాలయ మహిళా ఉద్యోగిపై తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురం మాజీ ఉప సర్పంచ్, టీడీపీ నేత మైనం చంద్రశేఖర్ బెదిరింపులకు దిగారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ మహిళా ఉద్యోగిని తన ఇంటికి రావాలని చంద్రశేఖర్ ఆదేశించాడు. రాకపోతే ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మాట్లాడే పని ఉంది ఇంటికి రమ్మనగా.. ఆ ఉద్యోగి ఏదైనా మాట్లాడాలంటే సచివాలయానికి వచ్చి మాట్లాడాలని మర్యాద పూర్వకంగా జవాబిచ్చింది. ‘నాకు సచివాలయానికి వచ్చే పనిలేదు. నువ్వే మా ఇంటికి రావాలి’ అని చంద్రశేఖర్ అనగా.. ‘ఇంటికి ఎలా వస్తామండి’ అని ఆ ఉద్యోగిని సమాధానమిచ్చింది. ‘ఫర్వాలేదమ్మా మీరు గ్రామస్థాయి ఉద్యోగులే కదా.. ఫర్వాలేదు. మీరేం మండల స్థాయి అధికారులు కాదు కదా. మా దగ్గరకురావడానికి నామోïÙగా ఉందా? మాట్లాడే పని ఉందమ్మా’ అని అతడు అన్నాడు. ఏదైనా ఉంటే సచివాలయానికి వచ్చి మాట్లాడాలని ఆమె సూచించగా.. ‘సచివాలయానికి రావాల్సిన పని నాకు లేదు. టీడీపీ నెగ్గిన వెంటనే ఒకసారి చెప్పాను. మా ఊళ్లో ఉద్యోగం చేయాలంటే మా ఇంటికి రావాల్సిందే. నీ ఫోన్లో ఈ విషయాలన్నీ రికార్డింగ్ అవుతాయా? రికార్డు చేసి నువ్వు మీపై అధికారులకు కూడా చెప్పు. మీరేం ఊరికి మొగాళ్లేం కాదు. ఈ ఆడియో ఈ గ్రామంలోని వైఎస్సార్ సీపీ మెయిన్ నాయకులకు, అధికారులకు పంపు’ అంటూ చంద్రశేఖర్ బెదిరింపులకు దిగాడు. -
అనగాని ఇలాకాలో ఆగని విధ్వంసం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకా రేపల్లెలో టీడీపీ నేతల విధ్వంసం పతాక స్థాయికి చేరింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా చితక బాదుతున్నారు. ఊళ్లు వదలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ఉంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. అధికారం అండతో కూటమి నేతలు, ప్రధానంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు తెగబడుతుండటంతో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే గ్రామాలు వదిలి వెళ్లారు. కొందరు స్వగ్రామాల్లోనే ఉంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు తున్నారు. ఏ సమయంలో టీడీపీ నాయకులు దాడి చేస్తారో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. చెరుకుపల్లి, నిజాంపట్నం, నగరం మండలాల పరిధిలో ఈ తరహా దాడులు పెరిగాయి. విలేకరి ఇల్లు కూల్చివేత చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటలో బుధవారం ఉదయం టీడీపీ నేతలు గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి యెనుముల వెంకటేశ్వరరావుకు చెందిన ఇంటిని కూల్చివేశారు. వెంకటేశ్వరరావు నాలుగేళ్ల క్రితం 4 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం జరిగింది. బుధవారం ఉదయం టీడీపీ నేతలు జేసీబీతో వచ్చి ఆయన ఇంటిని కూల్చివేశారు.టీడీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న గ్రామంలో 225 ఓట్లు వైఎస్సార్సీపీకి రావడానికి విలేకరి వెంకటేశ్వరరావే కారణమని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయనను బెదిరించిన టీడీపీ నేతలు బుధవారం అతడి ఇంటిని కూల్చివేశారు. గ్రామకంఠం స్థలంలో వెంకటేశ్వరరావు ఇంటిని నిర్మించుకున్నారనేది టీడీపీ ఆరోపణ. అక్కడ దాదాపు 40 కుటుంబాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. పూరిళ్ల స్థానంలో చాలామంది భవనాలు నిర్మించుకున్నారు. 30 సంవత్సరాలుగా విద్యుత్ బిల్లులు, పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. వెంకటేశ్వరావు మూడేళ్ల క్రితం వేరొకరి వద్ద 4 సెంట్ల స్థలం కొనుగోలుచేసి ఇంటిని నిర్మించుకున్నారు. తన ఇంటికి భార్య శ్యామల పేరున విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఆక్రమణలు అనుకుంటే అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలి. చట్టవిరుద్ధంగా గృహాలు నిర్మించారనుకుంటే అందరికీ నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టాలి. కానీ.. టీడీపీ నేతలు జేసీబీతో వెంకటేశ్వరరావు ఇంటిని మాత్రమే కూల్చివేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు సహేతుకం కాదని పాత్రికేయులు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు. తన ఇంటిని టీడీపీ నేతలు కూల్చివేస్తున్న విషయాన్ని తెలిపేందుకు విలేకరి Ððవెంకటేశ్వరరావు ప్రయతి్నంచినా పోలీసులు స్పందించలేదు. వెంకటేశ్వరరావు ఇంటిని టీడీపీ నేతలు కూల్చడంపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
విశాఖపట్నం: భీమిలో పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు మృతి చెందారు. వివరాలలోకి వెళితే నర్సింగరావు(59), కొడుకు భార్గవ్(27) ను వారం క్రితం వారి పెట్ డాగ్ కరిచింది..భార్గవ్ ను ముక్కు మీద, నర్సింగరావు ను కాలిపై కరిచిన వారి పెట్ డాగ్ రెండు రోజుల్లో చనిపోవడంతో వారు అలెర్ట్ అయ్యారు..రేబిస్ ఇంజక్షన్స్ వేయించుకున్నారు..అయితే బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే. తండ్రి కొడుకు మరణించారు -
ప్రాణం తీసిన ‘ఫైనాన్స్’
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి తీసుకున్న రుణం ఓ మహిళ పాలిట మృత్యు పాశమైంది. అధిక వడ్డీలు చెల్లించలేక, ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు భరించలేక తనువు చాలించింది. మంగళవారం విజయవాడలో ఈ విషాదం చోటు చేసుకుంది. విజయవాడ వాంబే కాలనీకి చెందిన అల్లంపల్లి మస్తానమ్మ అలియాస్ మాధవి (44) పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త లక్ష్మీనారాయణతో విభేదాలు తలెత్తడంతో పదేళ్ల క్రితం విడిపోయి వేరుగా ఉంటోంది. ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తగారిళ్లకు పంపింది. వ్యాపారంలో నష్టం రావడం, పిల్లల వివాహాల కోసం కొంత అప్పులు చేసింది. హైదరాబాద్‌కు చెందిన క్రిస్ ఫైనాన్స్, స్పందన అనే సంస్థల ప్రతినిధులు రుణాలు ఇస్తామని చెప్పడంతో వారి వద్ద డబ్బులు అప్పుగా తీసుకోవడంతో పాటు మరి కొంతమంది మహిళలను కూడా గ్రూపులుగా చేర్చి అప్పు ఇప్పించింది. రూ.42 వేలు అప్పు ఇస్తే ప్రతి నెల మొదటి బుధవారం రూ.3,370 చొప్పున 20 నెలల పాటు చెల్లించాలనే షరతుతో ఫైనాన్స్ సంస్థలు అప్పులు ఇచ్చాయి. కొద్ది నెలలుగా అనారోగ్యం, వ్యాపారం సరిగా నడవకపోవడంతో డబ్బులు చెల్లించేందుకు బయట అప్పులు చేసింది. గత బుధవారం డబ్బులు కట్టకపోవడంతో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు ఆమె ఇంటి వద్దకు వచ్చి బెదిరించినట్లు సమాచారం. తాజాగా మంగళవారం మరోసారి వచ్చి భయబ్రాంతులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మస్తానమ్మ వారి ముందే ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై నున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గృహ సారథిగా సేవలు..మస్తానమ్మ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. 60వ డివిజన్లో వైఎస్సార్ సీపీ గృహ సారథిగా మస్తానమ్మ సేవలందించారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలు ఆమె ఇంటి వద్దకు చేరుకుని సంతాపం తెలిపారు. -
టీడీపీ, జనసేన నేతల వీరంగం
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ, జనసేన నాయకులు బరితెగించి విధ్వంసం సృష్టించారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో 11 మంది కార్లలో సైరన్ మోగించుకుంటూ వచ్చి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. పార్టీ జెండాలు పట్టుకుని టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ పంచాయతీ కార్యాలయం కింద బాణసంచా కాల్చి హడావుడి చేశారు. బలవంతంగా కార్యాలయం పైకి చేరుకున్నారు. సర్పంచ్ రూమ్‌లోకి చొరబడి గోడకు ఉన్న మాజీ ముఖ్యమంత్రులు వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలను ధ్వంసం చేశారు. మరోపక్క ఫ్లెక్సీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్చిత్రపటాన్ని పీకి పడేశారు. సర్పంచ్ టేబుల్‌పై కేక్ కట్‌చేసి టేబుల్‌కు, గోడలపైన పులిమారు. కార్యాలయం భవనానికి టీడీపీ జెండా కట్టి నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు దౌర్జన్యకాండ చేస్తున్న సమయంలో పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, కొందరు సిబ్బంది ఉన్నారు. కార్యాలయంలో విధ్వంసం గురించి సర్పంచ్ రాచమళ్ల పూర్ణచంద్రరావు, వార్డు, ఎంపీటీసీ సభ్యులకు సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే కార్యాలయానికి చేరుకున్న సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో ఈ విధంగా ప్రవర్తించడంపై భయాందోళనలకు గురైన సిబ్బంది విధులు నిర్వర్తించలేమంటూ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ భాస్కరరావు, పటమట పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం : సర్పంచ్ పూర్ణచంద్రరావు పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకులు చెలరేగి ప్రవర్తించడంపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ రాచమళ్ల పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఎనికేపాడు గ్రామంలో ఈ విధంగా గొడవలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారని చెప్పారు. పంచాయతీ కార్యాలయం గోడలపై మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలతోపాటు వేరే పార్టీలకు చెందిన నాయకుల ఫొటోలు కూడా ఉన్నాయని తెలిపారు. కానీ వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్, జగన్ చిత్రపటాలను, మాజీ ఎమ్మెల్యే వంశీ ఫ్లెక్సీని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సమయంలో కార్యాలయంలో ఉంటే తనపైనా దాడిచేసేవారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నాయకులు రాజకీయంగా ఎదగడాన్ని జీరి్ణంచుకోలేక ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలా దాడులు చేస్తుంటే పంచాయతీ కార్యాలయంలో విధులు ఎలా నిర్వర్తించాలని ప్రశ్నించారు. ఈ ఘటనపై వెంటనే విచారించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలకు కక్ష సాధింపు నోటీసులురాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దాష్టీకాలు ఏడు రోజుల్లో కట్టడాలు తొలగించాలంటూ హెచ్చరిక ఉండి/పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాల మీద కక్షసాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వైఎస్సార్ విగ్రహాలు, ప్రభుత్వ భవన శిలాఫలకాలను ఓవైపు ధ్వంసం చేస్తుండగా.. మరోవైపు పార్టీ కార్యాలయాలను తొలగించాలంటూ నోటీసులు జారీ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం, పార్వతీపురం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారంలోని కార్యాలయానికి సంబంధించి మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేరిట నోటీసులు ఈ నెల 22న, 25న జారీ చేసినట్లు ప్రస్తుత, పాత తేదీల్లో ముద్రించి నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం గోడలకు అతికించారు. నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లో కట్టడాలను కూల్చాలని, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరిక జారీ చేశారు. అయితే పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రారంభించినట్లు వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా కార్యాలయానికి నోటీసులు నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ల కాలనీలో సుమారు 1.5 ఎకరాల రెవెన్యూ స్థలంలో నిర్మించిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ అధికారులు మంగళవారం నోటీసులు అంటించారు. తమ శాఖ ముందస్తు అనుమతులు తీసుకోకుండా పరిమితికి మించి భవన నిర్మాణం చేశారని, ఏడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ఈ నిర్మాణాన్ని తొలగిస్తామని ప్లానింగ్ అధికారి భాస్కర్ పేరుతో ఉన్న నోటీసును పౌడా అధికారి రఘురామ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ అంటించారు. ఎన్నికల ముందే భవన నిర్మాణం పూర్తికాగా, ఎన్నికల కోడ్ అడ్డు రావటంతో కార్యాలయాన్ని ప్రారంభించలేదు. ఇప్పుడు నోటీసులు ఇవ్వడం కేవలం కక్ష సాధింపులో భాగమేనని వైఎస్సార్సీపీ నాయకులు భావిస్తున్నారు. -
విధ్వంసం... అరాచకం..
సాక్షి నెట్వర్క్: టీడీపీ కార్యకర్తల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రగతి పనులకు సంబంధించిన శిలాఫలకాలను పలుచోట్ల ధ్వంసం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం సచివాలయ భవన నిర్మాణానికి సంబందించిన శంకుస్థాపన శిలాఫలాకాన్ని టీడీపీ కార్యకర్తలు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు, మండల ప్రజాప్రతినిధుల పేర్లతో ఈ శిలాఫలకాన్ని ఏర్పాటుచేయగా.. దానిని పగులగొట్టారు. టీడీపీ నాయకుడు, సర్పంచ్ యర్రా రామకృష్ణ ఇంటి ముందు రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సైతం ధ్వంసం చేశారు. జెండా దిమ్మె ధ్వంసం తిరుపతి జిల్లా చంద్రగిరికోటలో వైఎస్సార్సీపీ జెండా దిమ్మెను మంగళవారం తెల్లవారుజామున టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చంద్రగిరిలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పోలీసులను వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. జగనన్న కాలనీలో రాళ్లు ధ్వంసం పశి్చమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొత్తపూసలమర్రులో టీడీపీ నాయకులు దాషీ్టకానికి తెగబడ్డారు. జగనన్న కాలనీలో సరిహద్దు రాళ్లు ధ్వంసం చేశారు. పైప్‌లైన్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. గ్రామ టీడీపీ నాయకులు కొల్లాటి గోవిందరాజు, బస్వాని పోతురాజు, బర్రి నాగరాజు, జల్లా బుజ్జి, బొమ్మిడి పోతురాజు, ఒడుగు సామోరు, కొయ్యలగడ్డ బాలాజీ తదితరులు వచ్చి పైప్‌లైన్ పనులను అడ్డుకున్నారని గ్రామస్తులతోపాటు అభివృద్ధి కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. లబి్ధదారులు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని, జగనన్న ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇస్తే పనులను అడ్డుకుంటున్నారని లబి్ధదారులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ముంచేసిన ‘మై క్వీన్’
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలో మనీ సర్క్యులేషన్ స్కీమ్ ముంచేసింది. ఒక్క రూపాయి కడితే ఏడు రూపాయలు, రూ.100 కడితే రూ.700 చెల్లిస్తామంటూ వల విసిరి బాధితులకు శఠగోపం పెట్టింది. ప్రైవేటు ఉపాధ్యాయులు, యువత, చిరు వ్యాపారులు, సాధారణ ప్రజలు భారీ ఆదాయం వస్తుందనే ఆశతో ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. మొదట్లో వారికి బాగానే డబ్బులు వచ్చాయి. అయితే నాలుగు రోజుల నుంచి కొంతమందికి డబ్బులు రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది. ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యజమాని ఎక్కడుంటాడో తెలీదు.. చెన్నై కేంద్రంగా అంతా కేవలం ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒక్క మార్కాపురంలోనే కాకుండా పెద్దారవీడు, తర్లుపాడు, పెద్ద దోర్నాల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం తదితర మండలాలకు కూడా ఈ చైన్ లింకు స్కీమ్ విస్తరించినట్టు సమాచారం. మై క్వీన్ యాప్ లింక్ పంపి.. ఒక్క రూపాయి కడితే మరుసటి రోజు రూ.7 అకౌంట్లో జమయ్యేలా మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ను రూపొందించారు. ఈ చైన్ సిస్టమ్‌లో భాగంగా మొదట డబ్బులు చెల్లించిన వ్యక్తికి ‘మై క్వీన్’ యాప్ లింక్ పంపుతారు. ఆ వ్యక్తి మరో కొంత మందిని చేర్పిస్తే వారికి కూడా లింక్‌ను షేర్ చేస్తారు. ఇందులో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్లోడ్ చేయాలి. రూ.100 ఈ రోజు చెల్లిస్తే 24 గంటలు గడిచాక నగదు చెల్లించిన వ్యక్తి ఖాతాలో రూ.700 జమవుతాయి. దీంతో 24 గంటల్లోనే తాము కట్టిన దానికి 7 రెట్లు ఆదాయం రావడంతో ఈ యాప్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఒక్క మార్కాపురం పట్టణంలోనే 8 నుంచి 10 వేల మంది సభ్యులుగా చేరి సుమారు రూ.5 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. గతంలో ఇలాంటి స్కీమ్‌ల విషయంలో మోసపోయినా ప్రజలు లెక్కచేయడం లేదు. త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ మై క్వీన్ యాప్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. నెల రోజుల్లోనే లక్షాధికారులు కావాలనే దురాశ వారిని తెగించేలా చేస్తోంది. ఈ క్రమంలో కొంతమందికి కొన్ని రోజుల నుంచి నగదు చెల్లింపులు కావడంలేదని తెలుస్తోంది. ఈ విషయమై మార్కాపురం సీఐ ఆవుల వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ప్రజలెవరూ ఇలాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు. -
కొనసాగుతున్న శిలాఫలకాల ధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంస కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నారు. ప్రగతిపనుల శిలాఫలకాన్ని ముక్కలు చేస్తున్నారు. వీరి అరాచకాలు శనివారం రాత్రి, ఆదివారం కూడా కొనసాగాయి. » నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లెలో హెల్త్‌సెంటర్ ప్రారం¿ోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్, అప్పటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముక్కలు చేశారు. ప్రభుత్వ భవనానికి ఉన్న నవరత్నాల లోగోకు రంగులు వేశారు. దీనిపై గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారిస్తున్నారు. » కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో గత ప్రభుత్వం హయాంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, జగ్గంపేట వైస్ ఎంపీపీ నక్కా వెంకట్రావు (శ్రీను) ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్రంపాలెంలోని సగరుపేటలో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని ఈ ఏడాది మార్చి 2న అప్పటి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, చంటిబాబు చిత్రపటాలను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 9 గంటల వరకూ శిలాఫలకం బాగానే ఉందని, అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దీనిని గునపంతో ధ్వంసం చేశారని శ్రీను తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని జగ్గంపేట ఎ.ఎస్.ఐ. సుబ్బారావు ఆధ్వర్యాన పోలీసులు పరిశీలించారు. ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయకపోవడంతో ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. » పల్నాడు జిల్లా నరసరావుపేటలో సుమారు ఏడువేలమందికి గృహనిర్మాణ పట్టాల పంపిణీ, వసతి కలి్పంచిన వినుకొండ రోడ్డులోని జగనన్న కాలనీ ప్రారం¿ోత్సవ శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. 2021 జనవరి మూడో తేదీన అప్పటి గృహనిర్మాణశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ కాలనీకి భూమిపూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. కాలనీలో సుమారు 500 మంది ఇళ్లు నిరి్మంచుకుని ఉంటున్నారు. కొన్ని గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. శిలాఫలకాన్ని మాయం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు
కర్లపాలెం/సాక్షి, అమరావతి: అమెరికాలో ఓ దుండగుడి తుపాకీ కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన యువకుడు దాసరి గోపీకృష్ణ (32) మృతి చెందాడు. రైతు కూలీ కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు గోపీకృష్ణ. బీటెక్ వరకు చదివి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హెచ్–1బి వీసా రావటంతో ఉద్యోగం కోసం సుమారు 11 నెలల కిందట అమెరికా వెళ్లాడు.ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ.. మరో వైపు టెక్సాస్ రాష్ట్రం డెల్లాస్ సిటీలోని సూపర్ మార్కెట్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఓ దుండగుడు సూపర్ మార్కెట్‌కు వచ్చి గోపీకృష్ణపై గన్‌తో కాల్పులు జరిపి ఏవో వస్తువులు తీసుకుని పారిపోయాడు. తీవ్రగాయాలైన గోపీకృష్ణ అక్కడే కుప్పకూలిపోగా స్థానికులు ఓ వైద్యశాలలో చేరి్పంచారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ సహకారంతో తమ బిడ్డ భౌతికకాయాన్ని త్వరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.గోపీకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: వైఎస్ జగన్అమెరికాలోని సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మృతి చెందటం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోపికృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. మృతుడి కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.