adolf hitler
-
హిట్లర్‌ను పొగిడాడు.. దిగ్గజ టెక్ కంపెనీలో మంచి ఉద్యోగం పోగొట్టుకున్నాడు!
అడాల్ఫ్ హిట్లర్.. ప్రపంచాన్ని వణికించిన నియంత. కొన్ని లక్షల మంది ప్రజలను పొట్టన బెట్టుకున్న క్రూరుడు. అతడి చెరలో పడితే చావే తప్పితే పునర్జన్మ ఉండదు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, మిత్ర రాజ్యాల దళాలు నాజీలను ఓడించడానికి ఆరేళ్లు ప్రయత్నించాయంటే..హిట్లర్ ఎంతటి గట్టివాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నియంతను పొగిడాడంటూ ప్రముఖ టెక్ దిగ్గజం డెలాయిట్ ఓ ఉద్యోగుని విధుల నుంచి తొలగించింది. నీరభ్ మెహ్రోత్రా డెలాయిట్‌లో అసోసియేట్ డైరెక్టర్, రిస్క్ అడ్వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా నీరభ్ ‘ఫ్రైడే ఇన్స్పిరేషన్’ అనే కొటేషన్‌తో అడాల్ఫ్ హిట్లర్ ఆకర్షణీయమైన వ్యక్తి అంటూ నియంతపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘ఇటీవల నేను ది డార్క్ చార్మ్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్ బుక్ కొనుగోలు చేశా. ఆ బుక్ చదివే కొద్దీ ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తుంది. ముఖ్యంగా అందులో హిట్లర్ గురించి, వరల్డ్ వార్ 2 పై ఈ బుక్ నాకు సరైన అవగాహన ఇచ్చింది’’ అని మెహ్రోత్రా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో పాటు ఆకర్షణీయమైన అడాల్ఫ్ హిట్లర్‌లోని కొన్ని లక్షణాల్ని మనం ఆకళింపు చేసుకోవాలి. తన మాటలతో ప్రజల్ని ఆకర్షించే మాగ్నెటిక్ స్పీకర్, కాన్ఫిడెంట్ ఎక్కువ’అని పేర్కొన్నాడు. అంతే అడాల్ఫ్ హిట్లర్‌ను పొగుడుతావా? అంటూ నెటిజన్లు మెహ్రోత్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. నెటిజన్ల కామెంట్లపై మెహ్రోత్రా స్పందిస్తూ బహిరంగ లేఖలో ఇలా రాశారు. ‘‘నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. క్షమించండి అంటూ అభ్యర్థించాడు. ‘నేను తప్పు చేస్తే దానిని అంగీకరించే ధైర్యం ఉండాలని నా గురువులు, బాస్‌లు, కోచ్‌లు నాకు సలహా ఇచ్చారు. వారి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాను. నేను చేసిన పోస్ట్‌పై క్షమాణలు కోరుతున్నాను అని అందులో రాశాడు. మరోవైపు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్ది సేపటికే డెలాయిట్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మెహ్రూత్రా ఇకపై తమ కంపెనీలో పనిచేయడం లేదని పేర్కొంది. గత నెలలో మా సంస్థలో చేరిన ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు మా భాగస్వామ్య విలువలకు అనుగుణంగా లేవు.మా అంతర్గత విధానాలను ఉల్లంఘించారు. ఈ ఉద్యోగి ఇకపై డెలాయిట్ ఇండియాలో పని చేయడు’ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు ఆ ప్రటకనలో తెలిపారు. -
వేలంలో రూ.కోట్లు పలికిన ‘హిట్లర్’ వాచ్.. ఎంతంటే?
వాషింగ్టన్: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు సంబంధించిన చేతి గడియారం వేలం వేయగా దానిని దక్కించుకునేందుకు ఎగబడ్డారు. అమెరికాలోని అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో ఈ గడియారం 1.1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.8.6 కోట్లు) పలికింది. బంగారు ఆండ్రియాస్ హుబెర్ రివర్సిబుల్ వాచ్ నాజీ పార్టీ గుర్తును కలిగి ఉంటుంది. అలాగే.. గద్ద, స్వస్తిక్ గుర్తులు సహా ఏహెచ్ అని అడాల్ఫ్ హిట్లర్ పేరును సూచిస్తూ అక్షరాలు ఉంటాయి. నాజీ స్మారక వస్తువులను వేలం వేస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటోంది వేలం సంస్థ. తాజాగా..గడియారం వేలానికి ముందు జెవిష్ నేతలు తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ వేలం కొనసాగించింది. ఈ వాచ్‌ను ఓ గుర్తు తెలియని వ్యక్తి సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. జన్మదిన కానుక.. అడాల్ఫ్ హిట్లర్ 44వ జన్మదినం సందర్భంగా 1933, ఏప్రిల్ 20న నేషనలిస్ట్ సోషియలిస్ట్ వర్కర్స్ పార్టీ ఆఫ్ జర్మనీ సభ్యులు ఈ వాచ్‌ను కానుకగా ఇచ్చారు. 1945 మే నెలలో సుమారు 30 మంది ఫ్రెంచ్ సైనికులు.. బవారియాలోని హిట్లర్‌కు చెందిన ఆల్పైన్ నివాసంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఫ్రెంచ్ సైనికుడికి ఈ చేతి గడియారం దొరికినట్లు సమాచారం. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న నాలుగు రోజులకు ఈ గడియారం దొరికనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా? -
బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?
హిట్లర్ నియంత. నేతాజీ.. నియంతలకే ఒక వింత! స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ గైడ్ లైన్స్ ఏవీ ఫాలో కాలేదు నేతాజీ. ‘శత్రువుకు చెంప చూపిస్తే స్వరాజ్యం రాదు, గన్ తీసి కణతలకు గురిపెడితే వస్తుంది’ అని గాంధీజీతోనే వాదించిన వాడు నేతాజీ. అలాంటి వాడు జర్మనీతో టై–అప్ అయి, బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి ఇండియాకు స్వాతంత్య్రం సంపాదించాలని ప్లాన్ వేసుకుని హిట్లర్ని కలవడానికి వెళ్లాడు. సహాయం కోసం కాదు, ‘ఇచ్చిపుచ్చు కోవడం’ అనే డీల్ కోసం వెళ్లాడు. హిట్లర్ కూడా బ్రిటన్ పై పోరాడు తున్నాడు కాబట్టి, నేతాజీ సైన్యం (సొంత సైన్యం) హిట్లర్‌కు, హిట్లర్ సైన్యం నేతాజీకి హెల్ప్ చేస్తుంది. అది మాట్లాడ్డానికి వెళ్లాడు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు’ అవుతాడు అనే సింపుల్ లాజిక్‌తో వెళ్లాడు. తగ్గి వెళ్లలేదు. దేశం కోసం తగ్గితే మాత్రం ఏముంది అనీ వెళ్లలేదు. చెయ్యి కలిపితే కలిపాడు, లేకుంటే లేదు అనుకుని వెళ్లాడు. హిట్లర్ అనుచరులు నేతాజీని ఆహ్వానించారు. అయితే హిట్లర్ దగ్గరికి వెళ్లనివ్వలేదు. బయటి గదిలోనే కూర్చోబెట్టారు! ‘ఫ్యూరర్ లోపల ఇంపార్టెంట్ మీటింగులో ఉన్నారు’ అని చెప్పారు. ఫ్యూరర్ అంటే లీడర్ అని. నేతాజీ చాలాసేపు బయటే వేచి ఉన్నాడు. బల్ల మీద న్యూస్ పేపర్లు ఉంటే, వాటిని తిరగేస్తున్నాడు. ఎంతసేపటికీ రాడే హిట్లర్! చివరికి వచ్చాడు. వచ్చాక నేతాజీని చూసీచూడనట్లు మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు. నేతాజీ కూడా గమనించీ, గమనించనట్లు ఉండిపోయాడు. హిట్లర్ రావడం, నేతాజీని చూడడం; నేతాజీ కూడా హిట్లర్‌ను గమనించడం, గమనించనట్లు ఉండడం.. అలా చాలాసార్లు జరిగింది. తర్వాత మళ్లీ ఒకసారి వచ్చి, నేతాజీ పక్కన నిలుచున్నాడు హిట్లర్. నేతాజీ పట్టించుకోలేదు. పేపర్ చదువుతున్నట్లుగా ఉండిపోయాడు. హిట్లర్.. నేతాజీ వెనక్కు వెళ్లి నిలుచుని నేతాజీ భుజాలపై చేతులు వేశాడు! వెంటనే నేతాజీ తలతిప్పి చూసి, ‘‘హిట్లర్!’’ అన్నాడు. హిట్లర్ నవ్వాడు. ‘‘హిట్లర్‌నని నువ్వెలా చెప్పగలవ్?’’ అన్నాడు. నేతాజీ నవ్వాడు. ‘‘హిట్లర్‌కి కాకుండా, సుభాస్ చంద్రబోస్ భుజాలపై చేతులు వేసే ధైర్యం మరెవరికి ఉంటుంది?’’ అన్నాడు. హిట్లర్‌కి చాలామంది డూప్‌లు ఉండేవాళ్లు. డూప్‌లకు పల్టీకొట్టే రకం కాదు నేతాజీ. ప్రతి లక్ష్యానికీ రెండు దారులు ఉంటాయి. ‘కంటికి కన్ను’ దారొకటి. ‘రెండో చెంప’ దారొకటి. మొదటి దారి నేతాజీది. రెండో దారి గాంధీజీది. అలాగని నేతాజీ.. గాంధీజీని గౌరవించకుండా లేరు! సింగపూర్‌లో ఏర్పాటు చేసుకున్న ‘ఆజాద్ హింద్’ రేడియోలోంచి 1944 జూలై 6న మాట్లాడుతూ, తొలిసారిగా నేతాజీ.. గాంధీజీ పేరెత్తారు! ‘‘జాతిపితా.. నన్ను దీవించండి. ఈ పోరాటంలో నేను గెలవాలని నన్ను దీవించండి’’అని కోరాడు. నిజమైనా.. కాకున్నా.. .. బోస్ దూకుడు అలాంటిదే. బోస్ ఆత్మస్థర్యం అలాంటిదే. దేశంలోని బ్రిటిష్ వాళ్లనే అతడు లెక్క చెయ్యలేదు. నచ్చనప్పుడు గాంధీజీ మాట కూడా వినలేదు. యూరప్ అంతా తిరిగినవాడికి జర్మనీ ఏంటి? జర్మనీలోని హిట్లర్ ఏంటి? ‘‘హిట్లర్‌కి కాకుండా, సుభాస్ చంద్రబోస్ భుజాలపై చేతులు వేసే ధైర్యం మరెవరికి ఉంటుంది?’’ అని బోస్ హిట్లర్‌తో అని ఉండేందుకైతే అవకాశం లేకపోలేదు. బోస్పై ప్రామాణికమైన పుస్తకాలు అనేకం వచ్చాయి. వాటిల్లో ‘నేతాజీ ఇన్ యూరప్’ పుస్తకం ఒకటి. అందులో ఈ సందర్భం (బోస్ భుజాలపై హిట్లర్ చెయ్యేసిన సందర్భం) గురించి లేదు. అలాగే బోస్ పై వచ్చిన మరికొన్ని పాపులర్ పుస్తకాలు.. ది స్ప్రింగింగ్ టైగర్, ఇండియాస్ బిగ్గెస్ట్ కవర్ అప్, ది ఇండియన్ పిలిగ్రిమ్, బోసే స్వయంగా రాసిన ‘లెటర్స్ టు ఎమిలీ షెంకెల్’, ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇన్కన్వీయంట్ నేషనలిస్ట్, హిస్ మెజెస్టీస్ అపోనెంట్.. వీటిల్లో ఎక్కడా ఆ ఘటనపై చిన్న ప్రస్తావన కూడా లేదు. చరిత్రలో కొన్ని మిస్ అవుతాయి. చరిత్ర రచనలో అవి ఊహా వాస్తవాలుగా ప్రత్యక్షం అవుతాయి. ఇదీ అలాంటిదే అయినా కావచ్చు. (చదవండి: స్ఫూర్తి యోధులు లాల్ బాల్ పాల్... సమర యోధులు రామయ్య, బసవయ్య, బ్రహ్మయ్య) -
క్షమించరాని వ్యాఖ్యలు.. రష్యా విదేశాంగ మంత్రిపై ఫైర్
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్ సహా పలుదేశాల అధినేతలు, ప్రతినిధులు లావ్రోవ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇటలీకి చెందిన ఓ మీడియా సంస్థ తాజాగా రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా.. ‘‘ఉక్రెయిన్ను డీ-నాజీఫై చేస్తామంటూ ప్రకటించుకున్న రష్యా.. తన పోరాటాన్ని ఎలా సమర్థించుకుంటుందంటూ లావ్రోవ్కు ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. ‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వయంగా ఓ యూదు. అయినప్పటికీ.. ఆ దేశంలో నాజీయిజం ఉనికి ఉండొచ్చు. కానీ, హిట్లర్‌లోనూ యూదు రక్తం ఉంది కదా. అదేం విషయం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ ఒక ప్రకటనలో.. లావ్రోవ్ వ్యాఖ్యలు క్షమించరానివి. చారిత్రక తప్పిదం. ఇలాంటి అబద్ధాలు చరిత్రలో భయంకరమైన నేరాలకు యూదులనే నిందిచడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయన్నారు. హోలోకాస్ట్ యూదులు తమను తాము చంపుకోలేదని స్పష్టం చేశారాయన. ఇక ఈ వ్యాఖ్యలపై రష్యా రాయబారిని పిలిపించి.. ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఆదేశించింది. మరోవైపు నిరాధారమైనవని వరల్డ్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ సెంటర్ యాద్ వాషెమ్ ఖండించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉక్రెయిన్ను డీ మిలిటరైజ్, డీ నాజిఫై చేయడమే తమ లక్ష్యమని ఇదివరకే రష్యా ప్రకటించింది. కానీ, ఈ క్రమంలో ఇలా అభ్యంతరకర వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్నారు లావ్రోవ్. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ఇజ్రాయెల్ మొదటి నుంచి ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. ఒకవైపు కీవ్-మాస్కో మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని చెబుతూనే.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను పట్టించుకోకుండా రష్యాతో వాణిజ్య వ్యాపార ఒప్పందాలను కొనసాగిస్తోంది. అయితే లావ్రోవ్ హిట్లర్-యూదుల రక్తం వ్యాఖ్యలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ ఇదిలా ఉండగా.. రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభ్యంతరం వ్యక్తం చేశాడు. లావ్రోవ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా, ఆమోదయోగ్యం కానీ రీతిలో ఉన్నాయంటూ మండిపడ్డారు. చదవండి: ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు -
హిట్లర్ వదిలేసినా.. పుతిన్ చేతిలో ఖతమయ్యాడు!
ఉక్రెయిన్ యుద్ధంలో ఒక్కొక్కరి ఒక్కో గాథ. రోజుకో కథ బయటకు వస్తోంది. కదన రంగంలో అడుగుపెట్టడం దగ్గరి నుంచి.. ప్రాణత్యాగాల దాకా ప్రపంచాన్ని కదిలిస్తున్న కథలెన్నో. ఈ తరుణంలో హిట్లర్ సైన్యం చేతుల్లోంచి తప్పించుకున్నా.. ఇప్పుడు పుతిన్ యుద్ధ దాహానికి బలైన ఓ పెద్దాయన కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బోరిస్ రోమన్చెన్కో.. 96 ఏళ్ల ఈ పెద్దాయన శుక్రవారం జరిగిన దాడుల్లో దుర్మరణం పాలయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బుచెన్వాల్ద్ డోరా ఇంటర్నేషనల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు ఈయన. ఖార్కీవ్లో ఆయన ఉంటున్న అపార్టెమెంట్ మీద రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో బోరిస్ రోమన్చెన్కో చనిపోయినట్లు Buchenwald concentration camp మెమోరియల్ ఇనిస్టిట్యూట్ తన అధికారిక ట్విటర్ పేజీ వెల్లడించింది. రోమన్చెన్కో.. 1943 రెండో ప్రపంచ చుద్ధం సమయంలో బుచెన్వాల్ద్ కాన్సెంట్రేషన్ క్యాంప్‌కు తరలించబడ్డాడు. అక్కడ నాజీ సైన్యం చేతిలో చిత్రవధ అనుభవించి.. సుమారు 53 వేలమందికి పైగా చంపబడ్డారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ అతికొద్ది మందిలో ఈయన ఒకడు. ఆయన అదృష్టం ఎలా ఉందంటే.. అదే ఏడాది డోరా- మిట్టెలాబూ కాన్సెంట్రేషన్ క్యాంప్‌లో, ది బెర్గెన్ బెల్సెన్, పీనెమిండె క్యాంప్‌లోనూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. Romanchenko మృతిపై రష్యా విదేశాంగ మంత్రి దిమిత్రి కులెబ ట్విటర్లో స్పందించారు. హిట్లర్ చేతి నుంచి తప్పించుకున్నా.. పుతిన్ చేతిలో హతమయ్యాడంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక Holocaust survivorగా 2012లో బుచెన్వాల్డ్ లిబరేషన్ వేడుకల్లో రోమన్చెన్కో పాల్గొన్నాడు. Borys Romanchenko, 96, survived four Nazi concentration camps: Buchenwald, Peenemünde, Mittelbau-Dora, Bergen-Belsen. He lived his quiet life in Kharkiv until recently. Last Friday a Russian bomb hit his house and killed him. Unspeakable crime. Survived Hitler, murdered by Putin. pic.twitter.com/QYJ4xrNYC9 — Dmytro Kuleba (@DmytroKuleba) March 21, 2022 నాలుగు శరణార్థ క్యాంపుల్లోనూ ప్రాణాలతో బయటపడ్డ రోమన్చెన్కోను యమజాతకుడిగా ఆయన్ని అభివర్ణిస్తుంటారు ఉక్రెయిన్ ప్రజలు. తిరిగి 2018లోనూ ఆయన్ని ఖార్కీవ్‌కు చెందిన ఓ న్యూస్‌పేపర్ ఇంటర్వ్యూ చేసింది కూడా. ఉక్రెయిన్ అధ్యక్ష భవనం నుంచి రోమన్చెన్కో మరణంపై అధికారిక ప్రకటన వెలువడింది. -
పుతిన్ చెంపను నిమిరిన హిట్లర్! ఇదే వాస్తవం
ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడి కొనసాగుతోంది. ఇప్పటికే 70 సైనిక స్థావరాలు, 10 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించుకుంది. 40 మంది ఉక్రెయిన్ సైనికులు, పది మంది పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలను ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన పుతిన్ పోకడలను సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కామెంట్లు, మీమ్స్‌తో పుతిన్‌ను పెద్దఎత్తును ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వ ట్విటర్ హ్యాండిల్ ఓ క్యారికేచర్‌ను పోస్ట్ చేసింది. పుతిన్‌ను జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఆప్యాయంగా చెంపను నిమురుతున్న ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోను చూసిన పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ క్యారికేచర్‌ను ఓ ‘పొలిటికల్ మీమ్’ అంటూ కామెంట్ చేయగా..‘అది మీమ్ కాదు.. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న వాస్తవాలకు ప్రతిరూపం’ అని పేర్కొంది ఉక్రెయిన్ ప్రభుత్వం. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు సమీపిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని నగరంలోని ఉత్తర భాగంలో రష్యా దళాలు ప్రవేశించాయి. ఇప్పటికే లుహాన్స్క్లోని రెండు పట్టణాలను రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు ప్రతిఘటన దాడుల్లో పది రష్యా ఫైటర జెట్లు ధ్వంసం అయినట్లు సమాచారం. pic.twitter.com/IaqFbpayqz — Ukraine / Україна (@Ukraine) February 24, 2022 -
3,518 మంది హత్యలకు సహకారం.. 75 ఏళ్ల తర్వాత విచారణ
బెర్లిన్: అడాల్ఫ్ హిట్లర్ పేరు చేబితే ఇప్పటికి జర్మనీలో కొందరు వణికిపోతారు. అవును మరి అతడు చేసిన దురాగతాలకు లెక్కే లేదు. జర్మనీ నియంతగా మారిన తర్వాత హిట్లర్ యూదులను తీవ్రంగా ద్వేషించాడు. దేశం మొత్తం జల్లెడ పట్టి.. యూదులను ఊచకోత కోశాడు. ఏకంగా కాన్సెంట్రేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి.. యూదులను అత్యంత దారుణంగా హత్య చేశాడు. దాదాపు ఏడున్నర లక్షల మంది యూదులు నాజీ శిబిరాలలో రాక్షసంగా మరణించారు అంటే ఎంత దారుణంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నియంత పేరు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే.. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన డెబ్భైఐదు సంవత్సరాల తర్వాత జర్మనీ కోర్టు.. మాజీ నాజీ కాన్సంట్రేషన్ గార్డు ఒకరిని విచారిస్తుంది. జర్మనీ చట్టాల ప్రకారం నిందితుడి పేరు వెల్లడించలేదు. సదరు గార్డు 1942 నుంచి 1945 వరకు సచ్సెన్హాసన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో క్యాంప్ గార్డ్‌గా పనిచేశాడు. సదరు గార్డు 3,518 మంది హత్యలకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని, సెషన్ రోజుకు రెండున్నర గంటలకు పరిమితం చేస్తామని అధికారులు తెలిపారు. ప్రాసిక్యూటర్ల ప్రకారం, ప్రస్తుతం 100 ఏళ్ల వయసు ఉన్న ఆ వ్యక్తి 75 ఏళ్ల క్రితం నిర్బంధ శిబిరం వద్ద గార్డుగా పని చేశాడు. ఆ సమయంలో అతడు 3,518 హత్యలకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడైన క్యాంప్ గార్డుపై 1942 లో మాజీ సోవియట్ యుద్ధ ఖైదీలను కాల్చడం, విషపూరిత వాయువు జైక్లాన్ బీని ఉపయోగించడంతో సహా ఉరితీయడానికి సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. సచ్సెన్హాసన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో కనీసం 2,00,000 మందిని ఖైదు చేయగా.. 20,000 మందిని హత్య చేశారు. ఈ ఆరోపణల విచారణల నేపథ్యంలో ప్రాసిక్యూటర్ నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించాడు, ఆ తర్వాత అతను విచారణకు ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించారు. గత నెలలో జర్మనీ కోర్టు 95 ఏళ్ల నాజీ గార్డుని విచారించినట్లు తెలియజేసింది. అక్టోబర్ 1943 నుంచి ఏప్రిల్ 1945 వరకు స్టాలగ్ 6సీ బాథోర్న్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో సదరు వ్యక్తి గార్డుగా పని చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అనేక మంది మాజీ సోవియట్ సైనికులు స్టాలగ్ 6సీ బాథోర్న్ శిబిరంలో పెద్ద సంఖ్యలో మరణించినట్లు నివేదిక తెలిపింది. తరువాత దీనిని పోలిష్ దళాలు విముక్తి చేశాయి. ఇక ఈ ఏడాది మార్చిలో, ప్రాసిక్యూటర్లు అమెరికా నుంచి బహిష్కరించబడిన 95 ఏళ్ల మాజీ నాజీ డెత్ క్యాంప్ గార్డ్ ఫ్రెడరిక్ కార్ల్ బెర్గర్‌పై కేసును కొట్టేశారు. బెర్గర్‌ను విచారించడానికి తగిన సాక్ష్యాలు లేనందున ఈ కేసును కొట్టేస్తేన్నట్లు కోర్టు తెలిపింది. -
గూగుల్‌లో కనిపిస్తున్న ఆ పెద్దాయన ఎవరో తెలుసా?
గొప్ప వ్యక్తులకు, మేధావులకు, సెలబ్రిటీలకు గూగుల్ డూడుల్‌తో గౌరవం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇవాళ(జులై 3న) ఓ జర్మన్ డాక్టర్‌కి గూగుడ్ డూడుల్ దర్శనమిచ్చింది. ఆయన పేరు సర్ లుడ్విగ్ గట్ట్‌మన్. న్యూరోసర్జన్. పారాఒలింపిక్స్‌కు ఆద్యుడు ఈయనే. అంతేకాదు జర్మనీలో నాజీల చేతిలో అవమానాలు అనుభవిస్తూనే.. వందల మంది పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టాడు. ఒకానొక టైంలో హిట్లర్‌కు ఆయన మస్కా కొట్టిన తీరు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది కూడా. వెబ్‌డెస్క్: జర్మనీలోని టాస్ట్(ఇప్పుడది టోస్‌జెక్ పేరుతో పోలాండ్‌లో ఉంది)లో 1899 జులై 3న జన్మించాడు లుడ్విగ్. యూదుల పట్ల నాజీలు కర్కశంగా వ్యవహరించే సమయం అది. 18 ఏళ్ల వయసులో కోల్‌మైన్ యాక్సిడెంట్లో గాయపడ్డ ఓ వ్యక్తి తన కళ్ల ముందే మరణించడం లుడ్విగ్ మనసును కలిచివేసింది. అలా ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాడు. బ్రెస్లావు యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా, ఫ్రెయిబర్గ్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత న్యూరోసర్జన్‌గా ఒట్ఫ్రిడ్ ఫోరెస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. అయితే పేదలకు ఉచితంగా సేవలు చేయాలన్న ఆయన సంకల్పం.. ఫోరెస్టర్కు నచ్చలేదు. దీంతో ఆయన్ని వెలేశాడు. ఆ తర్వాత నాజీలు అధికారంలోకి వచ్చాక యూదులను మెడిసిన్ ప్రాక్టీస్‌కు అనుమతించలేదు. దీంతో బ్రెస్లావు జూయిష్ ఆస్పత్రిలో సేవలందించాడు లుడ్విగ్. ఆ టైంలో నాజీల చేతిలో యూదులు బలికాకుండా ఉండేందుకు.. వాళ్లను తన ఆస్పత్రుల్లో పేషెంట్లుగా చేర్పించుకుని నాటకంతో వాళ్ల ప్రాణాలను నిలబెట్టాడు. క్రిస్టాలెనెచ్ట్ మారణ హోమం టైంలో గాయపడ్డ వాళ్లెవరనేది చూడకుండా ఉచిత చికిత్స అందించి మనుసున్న మంచి డాక్టర్‌గా పేరు దక్కించుకున్నాడు. హిట్లర్‌కు మస్కా కొట్టి.. యూదుల సానుభూతిపరుడు అయినప్పటికీ.. వైద్యమేధావి అనే ఉద్దేశంతో హిట్లర్, లుడ్విగ్ గట్ట్‌మన్ జోలికి పోలేదు. ఆ టైంలో హిట్లర్ తన మిత్ర రాజ్యం పోర్చుగల్ నియంత అయిన అంటోనియో డె సాలాజార్కు చికిత్స కోసం గట్ట్మన్ను ఏరికోరి మరీ పంపించాడు. అయితే తిరుగు ప్రయాణంలో లుడ్విగ్ నాజీ సైన్యానికి మస్కా కొట్టాడు. లండన్‌లోనే తన కుటుంబంతో సహా విమానం దిగిపోయి.. యూకే శరణు వేడాడు. దీంతో యూకే ప్రభుత్వం ఆయనకు ఆశ్రయం కల్పించింది. అక్కడే ఆయనకు 250 పౌండ్ల సాయంతో శరణార్థిగా ఉండిపోయాడు. హిట్లర్‌కు లుడ్విగ్ మస్కా కొట్టిన తీరును దాదాపు అన్ని మీడియా ఛానెళ్లన్నీ అప్పట్లో ప్రముఖంగా ప్రచురించాయి కూడా. యుద్ధవీరుల కోసం ఆటలు ఇక యూకే వ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో సేవలందించిన లుడ్విగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో లార్డ్ లిండ్సేకి మకాం మార్చాడు. 1943లో ప్రభుత్వ ప్రోత్సాహంతో బకింగ్హాంషైర్లో స్టోక్ మండ్‌విల్లే ఆస్పత్రిని నెలకొల్పాడు. ఇది వెన్నెముకలు దెబ్బతిన్న పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది. ఈ సెంటర్‌కు లుడ్విగ్నే మొదటి డైరెక్టర్‌గా నియమించింది యూకేప్రభుత్వం. 1945లో గట్ట్మన్కు బ్రిటన్ పౌరసత్వం దక్కింది. ఆ టైంలో స్టోక్ మండ్‌విల్లే గేమ్స్‌ను నిర్వహించాడు లుడ్విగ్. ఈ ఈవెంట్లో సైన్యంలో సేవలందిస్తూ కాళ్లు, చేతులుకోల్పోయిన వాళ్లు, నడుం చచ్చుపడిపోయి వీల్ చైర్‌కు పరిమితమైనవాళ్లతో ఆటలు నిర్వహించాడు. విశేషం ఏంటంటే.. సరిగ్గా అదే రోజున జులై 29, 1948 లండన్ ఒలింపిక్స్ మొదలయ్యాయి. దీంతో ఈ ఆటలకు పారా ఒలింపిక్ గేమ్స్ అనే పేరు దక్కింది. అలా డిజేబిలీటీ ఉన్నవాళ్లతో ఒలింపిక్స్ నిర్వహించడం తర్వాతి కాలంలో క్రమం తప్పకుండా నడుస్తోంది. అందుకే లుడ్విగ్ గట్ట్మన్ను ‘ఫాదర్ ఆఫ్ పారా ఒలింపిక్స్’ అని పిలుస్తారు. గుండెపోటుతో ఐదు నెలలు.. ఆ తర్వాత ‘ఇంటర్నేషనల్ స్పైనల్ కార్డ్ సొసైటీ’ని నెలకొల్పాడు గట్ట్‌మన్. 1966లో క్లినికల్ వర్క్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కొన్నాళ్లపాటు ఆటగాళ్ల కోసం పని చేశాడాయన. ఆ తర్వాత హార్టికల్చర్‌తో ‘పొప్పా జీ’ అనే బిరుదు దక్కించుకున్నాడు. భారీ క్యాలిప్లవర్లు పండించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1979 అక్టోబర్‌లో ఆయనకు గుండెపోటు రాగా.. ఐదు నెలలపాటు ఆస్పతత్రిలో పొందుతూ.. చివరికి 1980, మార్చి18న కన్నుమూశాడు. ఆయన గౌరవార్థం.. 2012లో స్టోక్ మండ్‌విల్లే స్టేడియం బయట కాంస్య విగ్రహాన్ని ఉంచారు. అదే ఏడాది జరిగిన లండన్ పారా ఒలింపిక్స్ కమిటీకి ఆయనకూతురు ఎవా లోయిఫ్లెర్ను మేయర్‌గా నియమించారు. జర్మనీ ప్రభుత్వం ఆయనకు మెడికల్ సొసైటీ ప్రైజ్‌తో సత్కరించింది. రష్యా ప్రభుత్వం 2013లో స్టాంప్ రిలీజ్ చేసింది. ఇప్పుడు గూగుల్ 122వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌తో స్మరించుకుంది. చదవండి: అంతరిక్షంలోకి తెలుగు ధీర.. శిరీష బండ్ల -
వేలంలో బాత్రూమ్ సీటు: ఎవరిదంటే..
అసలు నియంత అనే పేరుకు బ్రాండ్అంబాసిడర్.. రెండో ప్రపంచ యుద్ధం రావడానికి ప్రధాన కారకుడిగా పేర్కొనే అడాల్ఫ్ హిట్లర్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆయన బాత్రూమ్ సీటు వేలం వేయనున్నారు. దీనికి ప్రారంభ ధరగా 5 వేల డాలర్లు నిర్ణయించారు. దీనికి సంబంధించిన వేలం ఈనెల 8వ తేదీన అమెరికాలోని మేరీల్యాండ్‌లో జరగనుంది. ఈ విషయాన్ని వేలం నిర్వహించే సంస్థ ‘అలెగ్జాండర్ ఆక్షన్స్’ ప్రకటించింది. జర్మన్ అధ్యక్షుడిగా ఉన్న అడాల్ఫ్ హిట్లర్ బేవరియన్ ఆల్ప్స్లో ఉన్న తన ప్రైవేట్ బాత్రూమ్ ఉపయోగించేవాడు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలోని బెర్చ్టేస్ గాడెన్లో ఉన్న హిట్లర్ ప్రైవేట్ బాత్రూమ్లో ఆ టాయ్‌లెట్ సీటును అమెరికాకు చెందిన సైనికుడు రాంగ్వాల్డ్ సి బోర్చ్ దొంగతనం చేశాడు. బొవారియన్ రిట్రీస్ సమయంలో హిట్లర్ ఇంటిని సాయుధ దళాలు చుట్టుముట్టగా ఆ సమయంలో అదే అదునుగా అతడు టాయ్‌లెట్ సీట్‌ను ఎత్తుకెళ్లి న్యూజెర్సీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఏళ్లుగా అది అతడి ఇంటి పునాదిలోనే ఉంది. ఇప్పుడు ఆ సీటును ఆ సైనికుడి కుటుంబసభ్యులే వేలానికి పెట్టారు. ఆ సీటును వేలం పెట్టి సొమ్ము చేసుకుందామని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ టాయ్‌లెట్ సీట్ చెక్కతో తయారుచేసి ఉంది. రెండు ముక్కలుగా ఉంది. 19 ఇంచుల పొడవు, 15 ఇంచుల వెడల్పు ఉంది. దీనికి స్టీల్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఇది దాదాపు 15,000 డాలర్లు పలుకుతుందని ఆ సంస్థతో పాటు సైనికుడి కుటుంబసభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేరిల్యాండ్లోని చెసాపీకే సిటీలో ఈనెల 8వ తేదీన ఈ వేలం జరగనుందని ‘అలెగ్జాండర్ ఆక్షన్స్’ సంస్థ తెలిపింది. గతంలో హిట్లర్ వాడిన ఫోన్‌ను వేలంలో ఉంచగా భారీ ధర పలకడంతో ఈ మేరకు ఆ సైనికుడి కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. -
నియంత
-
మోదీపై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వీడియో: వైరల్
సాక్షి, బెంగళూరు : ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్ ఖాతాలో ఓ వీడియాను పోస్ట్ చేశారు. హిట్లర్‌కు, మోదీకు ఎలాంటి తేడా లేదంటూ ఆ వీడియో సాగింది. 24 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పలు మోదీ, హిట్లర్ ఫోటోలు ఉన్నాయి. కాగా గతంలో మోదీపై ప్రకాశ్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీపై అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి మోదీపై విమర్శలకు దూరంగా ఉన్న ప్రకాశ్.. తాజా వీడియోతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. RE INCARNATION.... who did this. #JustAsking pic.twitter.com/1HPbsSfAU2 — Prakash Raj (@prakashraaj) January 6, 2020 -
‘మోదీ హిట్లర్ దారిలో నడుస్తున్నాడు’
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని నాజీల నియంత హిట్లర్‌తో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గురుగ్రామ్‌లో హోలీ పండుగ నాడు క్రికెట్ ఆడిన ఓ ముస్లిం కుటుంబంపై మూక దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ‘అధికారం కోసం మోదీ హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తున్నారు. కానీ అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఆయన అనుచరులకు అర్థం కావడం లేదు. ఇలాంటి దాడులు చేయాలని ఏ గీత చెబుతుంది? ఏ రామాయణంలో రాసుంది?’ అంటూ ట్వీట్ చేశారు. హోలీ పండుగ నాడు గురుగ్రామ్‌కు చెందిన సాజిద్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడుతుండగా.. గుర్తు తెలియని ఓ 20 మంది వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ‘క్రికెట్ ఆడాలంటే పాకిస్తాన్ వెళ్లండి.. ఇక్కడ ఆటలాడకుడదంటూ బెదిరించారు. ఇందుకు సంబంధించిన మీడియా సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
మాకో హిట్లర్ కావాలి
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అస్థిర ప్రభుత్వాలు రాజ్యమేలినా.. ఏనాడూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాన్ని సైన్యం చేయలేదు. ప్రజాతీర్పే శిరోధార్యం.. మరి ఇలాంటి దేశంలో ప్రస్తుతం ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. కారణమేదైనా కావొచ్చు.. భారతీయుల్లో అత్యధికులు(55 శాతం మంది) నియంతృత్వ పాలనను కోరుకుంటున్నారని ప్యూ రీసెర్చ్ సర్వేలో తేలింది. ప్రపంచంలోని 38 ముఖ్య దేశాల్లో పాలన తీరు, ప్రభుత్వాలపై ప్రజల విశ్వాసం.. అనే అంశాలపై ప్యూ రీసెర్చ్ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16–మే 8 మధ్యలో 38 దేశాల్లో 41,953 మంది అభిప్రాయాలను ప్యూ రీసెర్స్ సేకరించింది. దీని ప్రకారం.. సమష్టి నిర్ణయాల కంటే ఏకవ్యక్తి పాలనే మెరుగని భారతీయులు విశ్వసిస్తున్నారు. ఏడు దశాబ్దాల ఘనచరిత్ర కలిగిన ప్రజాస్వామ్యమని (ఎమర్జెన్సీ చీకటి రోజులను మినహాయిస్తే) చెప్పుకునే మనదేశంలో 55 శాతం మంది ఏదో ఒకరూపంలో నియంతృత్వాన్నే కోరుకుంటున్నారు. 27 శాతం మంది పటిష్ట నాయకత్వాన్ని కోరుకోగా, 53 శాతం మంది సైనిక పాలనే మేలంటున్నారు. అయితే 50 ఏళ్లకు పైబడిన వాళ్లలో మాత్రం అత్యధికులు సైనికపాలనకు తాము వ్యతిరేకమంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తమకు విశ్వాసముందని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో ఏకంగా 85 శాతం మంది చెప్పడం విశేషం. 2012 నుంచి భారత్ సగటున 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఇది ముఖ్యకారణమని ప్యూ విశ్లేషించింది. శక్తిమంతమైన నాయకుడు కావాలి.. శక్తిమంతమైన నాయకుడి రూపంలో ఏకవ్యక్తి పాలన మేలని 27 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. బలమైన నాయకుడి పాలనను 48 శాతం మంది రష్యన్లు కోరుకుంటున్నారు. అయితే ఏకవ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతమైన పాలన సాధారణంగా జనాదరణకు నోచుకోదని ప్యూ రీసెర్స్ వ్యాఖ్యానించింది. పార్లమెంటు, న్యాయస్థానాల జోక్యం లేకుండా.. శక్తిమంతమైన నాయకుడు నిర్ణయాలు తీసుకునే పాలనా విధానం మెరుగ్గా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఫలితాలు త్వరగా కనపడతాయని భావిస్తున్నారు. అయితే ఇలాంటి పాలన మంచిది కాదని 71 శాతం మంది పేర్కొన్నారు. జర్మనీలో 93 శాతం, స్వీడన్లో 90 శాతం, నెదర్లాండ్స్‌లో 89 శాతం మంది బలమైన ఏకవ్యక్తి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టెక్నోక్రసీ(సాంకేతిక నిపుణులతో కూడిన బృందం) పాలనను బలపర్చిన మూడు దేశాల్లో భారత్ కూడా ఒకటి. వియత్నాంలో 67 శాతం, భారత్‌లో 65 శాతం, ఫిలిప్పీన్స్‌లో 62 శాతం మంది నిపుణుల ఆధ్వర్యంలో పాలన సాగాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే రాజకీయ నాయకత్వం చేతిలోనే పాలన ఉండాలని 57 శాతం మంది ఆస్ట్రేలియన్లు పేర్కొన్నారు. సైనిక పాలనకు ‘జై’ ఆదర్శ ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా నిలుస్తున్నామని చెప్పుకొనే భారత్‌లో ఏకంగా 53 మంది సైనికపాలనను కోరుకోవడం విశేషం. రాజకీయ నాయకత్వంపై నమ్మకాన్ని కోల్పోవడం, అవినీతి పెచ్చరిల్లడం, ఇతర అవలక్షణాలు దీనికి కారణం కావొచ్చు. సైనికపాలనను కోరుకుంటున్న వారిలో మెజారిటీ 50 ఏళ్లలోపు వారే కావడం ఇక్కడ గమనార్హం. ఇది యువతలో ప్రస్తుత వ్యవస్థపై గూడుకట్టుకున్న అసహనాన్ని సూచిస్తోంది. దక్షిణాఫ్రికాలోనూ 52 శాతం మంది సైనికపాలనే మేలని భావిస్తున్నారు. అయితే యూరోప్‌లో మాత్రం కేవలం పది శాతం మందే సైనిక పాలనకు ఓటేశారు. సర్వే నిర్వహించిన 38 దేశాల్లో సగం కంటే ఎక్కువ దేశాల్లో ప్రాతినిథ్య ప్రజాస్వామ్యమే మేలని జనం అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య అనుకూల వైఖరి ఉన్నా దేశాలను బట్టి ఇది మారింది. ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తూనే.. ఇతర పాలన విధానాలకు కూడా తాము వ్యతిరేకం కాదనే భావనను ఆయా దేశాల ప్రజలు వ్యక్తపరిచారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పెయింటింగ్‌పై స్క్రూడ్రైవర్‌తో దాడి
రోమ్ : ఇటలీలోని గోయా నుంచి బెకాన్ మధ్య కొనసాగుతున్న మొబైల్ మ్యూజియంలో ఇటీవల ఓ 40 ఏళ్ల యువకుడు నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ వేసిన ఆయిల్ పెయింటింగ్‌పై దాడి జరిపారు. ఈ పెయింటింగ్‌ను హిట్లర్ వేశాడని తెలియగానే సదరు వ్యక్తి ఆవేశంతో ఊగిపోతూ ఒక్కసారిగా స్క్రూడ్రైవర్‌తో దాడి చేశాడని ఈ మొబైల్ మ్యూజియంను నిర్వహిస్తున్న చిత్ర విమర్శకుడు, క్యూరేటర్ విక్టోరియో స్కార్బీ మీడియాకు తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకోబోతే పారిపోయాడని, పెయింటంగ్కు పెద్దగా నష్టం ఏమీ సంభవించలేదుకనుక, నిందితుడిపై కేసు పెట్టాలనుకోవడం లేదని కూడా ఆయన తెలిపారు. ఇలాంటి చిత్రాలు భావోద్వేగాలను కలిపించే మాట వాస్తవమేనైనా, సంయమనం పాటించడం మానవుడి విధిగా ఆయన మాట్లాడారు. వియన్నా ఆర్ట్స్ కళాశాలలో అడ్మిషన్ కోసం హిట్లర్ దరఖాస్తు చేసుకున్నప్పుడు పంపించిన చిత్రాల్లో ఒకటి ఈ పెయింటింగ్ అని తెలిపారు. ‘వియన్నా అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ కాలేజీలో అడ్మిషన్ కోసం హిట్లర్ రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఆయనకు అడ్మిషన్ లభించలేదు. -
ఆధార్ కోరలు తీసిన సుప్రీం
రెండో మాట మన ‘ఆధార్’ సమాచారం యావత్తూ అమెరికాకు చేరిందనీ, అకౌంట్ నంబర్లు సహా ఆధార్ సమాచారం నిక్షిప్తమై ఉన్న ‘డేటా’ కాస్తా అమెరికన్ కేంద్ర గూఢచార సంస్థలకు అందుబాటులో ఉందనీ, ఇందుకు వారు ‘క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్’ అనే కంపెనీని వాడుకున్నారని ప్రసిద్ధ ‘వికీలీక్స్’ సంస్థ వెల్లడించింది. విచిత్రమేమంటే మన పాలకులకు ‘ఆధార్’ రూపకల్పనకు కీలకమైన బయోమెట్రిక్ పరికరాలను సరఫరా చేసిన కంపెనీల్లో ఈ క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ కంపెనీ కూడా ఉందని వికీలీక్స్ తెలిపింది. ‘వ్యక్తిగత జీవితంలో గోప్యత అనేది మానవుడి హుందాతనం, గౌరవ ప్రతిపత్తులకు సంబంధించి కీలక అంశం. అదే రాజ్యాంగ చట్టానికి జవం, జీవం. పార్లమెంటరీ చట్టాలు ఈ గోప్యతను కాపాడతాయని ప్రభుత్వం వాదిస్తున్నది. కానీ చట్టాలను పార్టమెంటరీ మెజారిటీ పేరిట రూపొందించనూ వచ్చు; అదే మెజారిటీ చాటున రద్దు చేయనూ వచ్చు. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కే. రాజ్యాంగంలోని 21వ అధికరణలో పేర్కొన్న జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలలో గోప్యత (ప్రైవసీ) అంతర్భాగమే. వివిధ సంక్షేమ పథకాల వల్ల లాభాలను అందుకునేందుకు ‘ఆధార్’ గుర్తింపు కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలైనందున ఆధార్ వివరాలను (డేటా) కాపాడేందుకు ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయవలసిందే. వ్యక్తుల గోప్యతా హక్కుకు సమాచార గోప్యత అనివార్యం. ఒకవేళ ఆధార్ పేరిట వ్యక్తి గోప్యతా స్వేచ్ఛపై ఆంక్షలు సహేతుకంగా లేకపోతే ఆధార్‌నే కొట్టేస్తాం’. – (సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు, 24–8– 2017) ‘వేలిముద్రల అవసరం చట్టప్రకారం కేవలం నేరగాళ్ల విషయంలోనే వర్తిస్తుంది. పౌరులకు కాదు.’ – గాంధీజీ తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు ఏ పరిణామాల నేపథ్యంలో పాలక వర్గాల ఏ వికృత నిర్ణయాల, చేష్టల పూర్వరంగంలో అనివార్యమయిందో తెలుసుకోవాలి. నలభై ఏళ్లనాడు కాంగ్రెస్ హయాంలో (ఇందిర పాలన) ఆత్యయిక పరిస్థితి విధించినందువల్ల రాజ్యాంగం హామీ పడిన స్వాతంత్య్రాలను ప్రజలు కోల్పోవలసి వచ్చింది. నేడు బీజేపీ–ఆరెస్సెస్ కేంద్ర పాలనా వ్యవస్థలో మరో రూపంలో దేశ ప్రజలు ఎదుర్కొనవలసి వస్తున్నది. అలాంటి నేపథ్యంలో సుప్రీం కేంద్రానికి మరొక ముగుతాడు వేయవలసి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ అగ్రనేత అడ్వాణి ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో! ‘మరొకసారి దేశంలో ఆత్యయిక పరిస్థితి ప్రకటించే అవకాశం ఉంద’ని అన్నారు. అనంతర పరిణామాలలో వచ్చినదే ఆధార్ గుర్తింపు కార్డు. దీనిని కాంగ్రెస్ ప్రారంభించగా, బీజేపీ పాలనలో మరింత పటిష్టంగా పౌరులపై నిఘా కార్యకలాపాలు పెంచే క్రమంలో వచ్చింది. ప్రజా ప్రయోజనంతో నిమిత్తం లేదు ఆధార్ చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు అనంతం. ప్రజా ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కలిగిన నందన్ నిలేకనీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో (2009–10) మంతనాలాడి పౌరులకు 12 అంకెలతో కూడిన ఒక శాశ్వత గుర్తింపు కార్డు ఉండడం అవసరమని ఒప్పించారు. అలా అపురూప (యూనిక్ ఐడెంటిటీ కార్డు యూఐడీ) కార్డు ముద్రణకు పాలకులను అంగీకరింపచేశారు. నిజానికి ‘ముందు ముందు ప్రజా ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా సాంకేతిక నిపుణులే పాలకుల ద్వారా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అమలు జరిపించే’ అవకాశం ఉందని ఒక అమెరికన్ రచయిత 20 ఏళ్ల నాడే పేర్కొన్నారు. దీనికి రుజువు ఆధార్ మంత్రాంగం. దీనిని ప్రజా సేవల పేరిట వ్యక్తుల పైన కూపీలు తీసే వేగుల ప్రయోగంగా భావించి కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి పుట్టస్వామి, ఇంకొందరు సామాజిక కార్యకర్తలు చట్టరూపం దాల్చక ముందు కేవలం బిల్లు రూపంలో ఉన్నప్పుడే (ఆగస్ట్–సెప్టెంబర్ 2013) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు సంబంధించిన పిటిషన్లు ముంబై, మద్రాసు హైకోర్టులలో దాఖలైనాయి. అప్పుడు జస్టిస్ పుట్టస్వామి సుప్రీంకోర్టులో ఒక ప్రశ్న లేవనెత్తారు– ‘నా నిత్యావసరాలకు రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటెంట్ కార్డు, పాన్ కార్డు, ప్రయాణ కార్డు, పాస్‌పోర్ట్ కార్డు ఉండగా ప్రత్యేకించి ఈ ఆధార్ కార్డును నేనెందుకు తీసుకోవాలి?’ అని. నిజానికి ఆధార్ కార్డు పథకం ఆమోదం పొందేవరకు ‘స్వచ్ఛందం’ ప్రాతిపదకనే చూపారు. తరువాత నిర్బంధం చేశారు అని కూడా ఆయన వివరించారు. ఇంకా చావుపుట్టుకల నమోదుకు, విద్యా సంస్థలలో చేరడానికి, ఉద్యోగాలకు, బ్యాంకు లావాదేవీలకు, వస్తు సేవలకు– ఇలా సవాలక్ష పేర్లతో ఆధార్‌ను అనుసంధానించి నిర్బంధం చేశారు. అందుకే 2013లో సుప్రీంకోర్టు వస్తుసేవలకు మాత్రం స్వచ్ఛందంగానే అనుమతించాలనీ, నిర్బంధం చేయరాదనీ తీర్పు ఇవ్వవలసి వచ్చింది. ఈ తీర్పును నాడు కాంగ్రెస్ మన్నించింది. కానీ ఆ పార్టీ పాలనలో లోలోపల తొలుస్తున్న పురుగు మాత్రం అలాగే ఉంది. ఆ పురుగునే బీజేపీ పాలకులు పెంచి పోషించారు. దాని వికృత రూపమే ఆ తరువాత 2016లో ‘ఆధార్’కు చట్టబద్ధత కల్పిం చడం, నిర్బంధం చేయటమూ. నిజమే మరి, జస్టిస్ పుట్టస్వామి ప్రభృతులు తమ వాంగ్మూలంలో చెప్పినట్టు తనను గుర్తించడానికి ఫొటోతో సహా ఉన్న ఒక్క ‘రేషన్ కార్డు’ చాలన్నట్టుగా, ఇండియాలో పౌరులపై నిఘా వేయడానికి, అరెస్టులు చేయడానికి మరెన్నో చట్టాలున్నాయి, కేంద్ర సంస్థలున్నాయి, సాధనాలున్నాయి: ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, మిలటరీ ఇంటెలిజెన్స్, నేషనల్ టెక్నికల్ రీసెర్చి ఆర్గనైజేషన్, రెవెన్యూ గూఢచారి శాఖ, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్టు, సమాచార సాంకేతిక వ్యవహారాల నియంత్రణ చట్టం, మోనిటరింగ్, సెన్సిటివ్ పర్సనల్ డేటా రూల్స్ 2011, సైబర్ కాప్ రూల్సు 2011, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) 1973 వగైరా, వగైరా. మరి ఇన్ని ఉండగా కూడా ‘ఆధార్’ను పాలకులు ఎందుకు ఆశ్రయించినట్టు? గోప్యత హక్కుకు భంగం కాబట్టే! సుప్రీం తాజా తీర్పు వచ్చేదాకా ‘గోప్యత ప్రాథమిక హక్కు’ కాదన్నవారు అది ప్రాథమిక హక్కేనని, సంపూర్ణ హక్కు మాత్రం కాదని మాట మార్చారు. కానీ ఆధార్‌ను నిర్బంధం చేయడంలో పాలకుల ప్రయోజనం వేరు. కేంద్రం నియమించిన అధికారి దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తుల ఉనికికి సంబంధించిన సమాచారాన్ని, అధికారిక రికార్డులను ప్రభుత్వానికి వెల్లడిం చాల్సి ఉంటుందని ఆధార్ చట్టం శాసిస్తోంది. దీనిపై శంకర్ అయ్యర్ వివరిస్తూ నిఘాకు భారీ సమాచార దృశ్యం కావాలంటే అడుగడుగునా చిన్న చిన్న చుక్కల్ని కలుపుకుంటూ పోవాలి గదా అన్నారు. అంటే, గోప్యంగా ఉన్న సమాచారాన్ని నాలుగు మూలలనుంచి ఆధార్ కార్డు ఆధారంగా గుంజు కుంటూ రావాలి. ఈ కూపీ ప్రయోగాలన్నింటినీ స్వయంగా బ్రిటిష్, అమెరికన్, ఫ్రెంచి పార్లమెంట్లను సందర్శించిన తరువాతనే తాను ఇండియాలో ఆధార్ ప్రయోగానికి దిగానని స్వయంగా నిలేకని ప్రకటించారని మరచిపోరాదు. ఆధార్ మూలాలు ఇప్పటివా? ‘ఆధార్’ ప్రయోగానికి మూలాధారమైన రహస్య యంత్రం ‘బయోమెట్రిక్’ చట్టాన్ని ప్రపంచంలో మొదటిసారిగా 1933లోనే జర్మనీ ప్రజలపై ప్రయోగించినవాడు నాజీ హిట్లర్. నాటికే బహుళ జాతి గుత్త కార్పొరేషన్ అయిన ‘ఐబీఎం’ సంస్థ ఆసరాతో హిట్లర్ ‘ఆర్యజాతి’ సిద్ధాంతం పేరిట యూదులను జర్మనీ నుంచి తరిమికొట్టే ప్రయత్నంలో జనాభా లెక్కల పేరిట విధ్వంసం సృష్టించాడు. ఇందుకోసం ‘హోలెంత్–డి–11’ అనే ఐడీ (గుర్తింపు) కార్డుల్ని ఉత్పత్తి చేసే యంత్రాన్ని సృష్టించారు. ఈ యంత్రాన్నే ఇప్పుడు వాషింగ్టన్ లోని అమెరికన్ హాలోకాస్డ్ (యూదు మతస్తుల్ని లక్షల సంఖ్యలో ఊచకోత కోయించిన) దృశ్యాలలో ఉన్న ప్రదర్శనశాలలో ఉంచారు. కానీ ఆధునిక అమెరికా పాలకులు సామ్రాజ్య విస్తరణ యుద్ధ ప్రయోజనాలలో భాగంగా ‘భస్మాసుర హస్తా’న్ని సొంత పౌరులపైనే జాతీయ భద్రత, హోంలాండ్ సెక్యూరిటీ చట్టాల పేరిట ‘నిఘా’ చట్టాలను ప్రయోగిస్తోంది. ఈ నిఘాకు అమెరికా పెట్టిన పేరు ‘ప్రజల సామాజిక భద్రత’, దాని పేరిట ఒక ‘నంబరు’తో ఉన్న కార్డు. అంతేగాదు, ఆస్ట్రేలియాలో ‘ఆర్వీలియన్ లాస్’ పేరిట పౌరులపై ఇలాంటి నిఘా చట్టాలే ఉన్నాయి. కానీ అక్కడ కూడా ప్రజా వ్యతిరేకత కట్టలు తెంచుకున్నప్పుడు ఆస్ట్రేలియా పాలకులు ఉపసంహరించుకోవలసి వచ్చింది. అలాగే ప్రజాగ్రహం ఫలితంగా ఈ ‘నిఘా’ చట్టాల్ని తర్వాత కెనడా, న్యూజీలాండ్, ఫిలిప్పీన్స్, గ్రీస్ ప్రభుత్వాలూ ఉపసంహరించుకోక తప్పలేదు. నేటి జర్మనీలో ‘బయోమెట్రిక్’ (ఐరిస్) కూపీ సమాచార సేకరణను పూర్తిగా నిషేధించారు. అంతదాకా అమెరికాలో లేని ‘సోషల్ సెక్యూరిటీ నంబర్’ (ఎస్.ఎస్.ఎన్.) అనే కూపీ ప్రయోగాన్ని తర్వాత ప్రవేశపెట్టిన వాడు మాజీ ప్రెసిడెంట్ జార్జిబుష్. ఈ నంబర్ని డ్రైవింగ్ లైసెన్స్‌కి, బ్యాంకు ఖాతాలకు, ప్రయాణీకులకు, ఎయిర్‌లైన్స్ టికెట్లకు వాడేలా నిర్బం ధించాడు. బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ దీనినే అనుసరించబోయాడుగానీ, ప్రజలు తిప్పికొట్టారు. ఖండాలు దాటిన మన డేటా మన ‘ఆధార్’ సమాచారం యావత్తూ అమెరికాకు చేరిందనీ, అకౌంట్ నంబర్లు సహా ఆధార్ సమాచారం నిక్షిప్తమై ఉన్న ‘డేటా’ కాస్తా అమెరికన్ కేంద్ర గూఢచార సంస్థలకు అందుబాటులో ఉందనీ, ఇందుకు వారు ‘క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్’ అనే కంపెనీని వాడుకున్నారని ప్రసిద్ధ ‘వికీలీక్స్’ సంస్థ (26.8.17) వెల్లడించింది. విచిత్రమేమంటే మన పాలకులకు ‘ఆధార్’ రూపకల్పనకు కీలకమైన బయోమెట్రిక్ పరికరాలను సరఫరా చేసిన కంపెనీల్లో ఈ క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ కంపెనీ కూడా ఉందని వికీలీక్స్ తెలిపింది. ఈ సందర్భంలోనే మన పాలనా వ్యవస్థలో జరుగుతున్న మరో పరిణామాన్ని కూడా సామాజిక కార్యకర్తలూ, ప్రజలూ గుర్తించాల్సిన అవసరం ఉంది. అది– ‘శాసన వ్యవస్థను ఆక్రమించి న్యాయవ్యవస్థ పెత్తనం చేయాలని ప్రయత్నిస్తోంది. చట్టాన్నైనా న్యాయవ్యవస్థ సమీక్షా పరిధికి బద్ధురాలిని చేసిన రాజ్యాంగ ఆదేశాన్ని పాలకులు ఉల్లంఘించడానికి వెనుకాడ్డం లేదని గమనించాలి. ఇది, ప్రజాస్వామ్యం మనుగడకు ప్రమాదకర సూచీ. అందుకే ఎమర్జెన్సీ రద్దు చేసిన ప్రజల హక్కు ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ ద్వారా న్యాయాన్ని పొందే అవకాశాన్ని కల్పించి వందలాదిమంది డిటెన్యూల విడుదలకు అందుబాటులోకి తెచ్చి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదోన్నతిని కాలదన్నిన జస్టిస్ ఖన్నా ఒక మాటన్నారు: ‘‘కొందరు పాలకులు కాటికి చేరినా, అక్కడి నుంచి కూడా ప్రజల్ని శాసించాలని కోరుకుంటా’’రు అని!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కిరణ్ బేడీపై మరీ అంత ద్వేషమా!
-
కిరణ్ బేడీపై మరీ అంత ద్వేషమా!
పుదుచ్చేరి: అధికార కాంగ్రెస్ పార్టీకి, లెఫ్టినెంగ్ గవర్నర్ కిరణ్ బేడీకి మధ్య వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. జూలై 4న ముగ్గురు నేతలను కేంద్రం ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయడం, ఆపై కిరణ్ బేడీ వారితో ప్రమాణ స్వీకారం చేయించడం పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎల్జీ కిరణ్ బేడీ ఓ నియంతగా వ్యవహరిస్తున్నారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు ఆమెను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ భేడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌గా చూపిస్తూ కాంగ్రెస్ నేతలు పోస్టర్లు అంటించడం మరో వివాదానికి దారితీసింది. తవళకుప్పం జంక్షన్లో కిరణ్ బేడీ.. ఓ హిట్లర్ అని వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు బేడీని ఏకంగా జర్మనీ నియంత హిట్లర్‌గా చిత్రీకరిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల నియామకమైన ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల వ్యవహారంపై భగ్గుమంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై, కిరణ్ బేడీపై తమ నిరసనను ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ బేడీ నిజంగా సమర్థరాలైన పాలనాధికారే అయినట్లయితే దేశ ప్రజస్వామ్య వ్యవస్థ గురించి, సమాఖ్య స్ఫూర్తి గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, డీఎంకే, వాపపక్షాలు, వీసీకేలు మూకుమ్మడిగా బేడీ చర్యలను వ్యతిరేకించడంతో పాటు ఆమెను వెనక్కు పంపాలని, డిస్మిస్ చేయాలని నినాదాలు చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జూలై 8న ఈ పార్టీలు బంద్ ను చేపట్టి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రజాస్వామ్య విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నారని ఆందోళనకు దిగారు. మరోవైపు బేడీ మాత్రం ముఖ్యమంత్రి నారాయణస్వామి సహా మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరు తప్పు చేసినా బహిరంగంగా ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో గ్రూపులో అవినీతి వివరాలను వెల్లడిస్తుండటం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. తాను రబ్బర్ స్టాంప్‌ను కానని, అన్యాయాన్ని ప్రశ్నించే అధికారంతో పాటు ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని కిరణ్ బేడీ అంటున్నారు. -
తప్పులో కాలేసిన ‘ట్రంప్’ సెక్రటరీ.. సారీ
వాషింగ్టన్: సిరియా ప్రభుత్వం తమ సొంత ప్రజలపై కెమికల్ దాడులు చేయడాన్ని విమర్శించే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, శ్వేతసౌదం మీడియా కార్యదర్శి సియాన్ స్పైసర్ నాలుకకరుచుకున్నాడు. కనీసం నాటి జర్మనీ నియంత హిట్లర్ కూడా విష రసాయనాలను తన సొంత ప్రజలపై ఇలా ప్రయోగించలేదన, ఇలాంటి యుద్ధ విధానాలు అనుసరించలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే తాను అన్నమాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సిరియా ప్రజలపై విషరసాయనాల దాడులు జరిగి దాదాపు 100మంది అమాయకపు పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. దాడిని సిరియా ప్రభుత్వమే చేసిందని ఆరోపిస్తూ అమెరికా క్షిపణుల దాడి చేసింది. ఈ దాడిని సమర్థించుకునే క్రమంలో వైట్ హౌస్ తరపున ప్రకటన చేస్తూ తొలుత ‘సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్లాగా హిట్లర్ కూడా చేయలేదు. సొంత ప్రజలపై ఆయన కూడా ఎన్నడూ విష రసాయనాలు ప్రయోగించలేదు. ఇలాంటి యుద్ధ విధానాలు అనుసరించలేదు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కొన్ని గంటల్లోనే ధుమారం రేగింది. హిట్లర్ విష వాయువులు ప్రయోగించి మిలియన్లమంది యూదులను, ఇతరులను హత్య చేశాడంటూ ఇప్పటికే వాస్తవాలు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. దీంతో మరోసారి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సియాన్ ‘నిజం చెప్పాలంటే నేను ఆ మాటలు అనుకోకుండా ఉపయోగించాను. అది నా తప్పే. వాస్తవానికి హిట్లర్‌తో పోలిక లేదు. అలా చెప్పినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. అలా చేయడం నిజంగానా తప్పే’ అని తిరిగి వివరణ ఇచ్చారు. అయితే, బషర్ ఎంత దారుణ చర్యకు పాల్పడ్డాడో చెప్పడమే తన ఉద్దేశం అని, తన మాటలు విన్నవారు కేవలం బషర్ ప్రవర్తను అర్థం చేసుకోవాలని చెప్పారు. -
అచ్చం హిట్లర్‌లాగే ఉన్నాడు.. అరెస్టు చేశారు
ఆస్ట్రియా: అచ్చం హిట్లర్‌లాగే ఉండటమే కాకుండా అలాంటి ప్రవర్తనే చూపిస్తున్న ఓ వ్యక్తిని ఆస్ట్రియా పోలీసులు అరెస్టు చేశారు. హిట్లర్ జన్మించిన బ్రౌనౌ నివాసం ముందు ఫొటోకు పోజివ్వడమే కాకుండా నాటి నాజీ పోకడలు గొప్పవని పొగిడినట్లుగా తన ప్రవర్తనను చూపించడంతో అతడిని అదుపులోకి తీసుకొని జైలులో వేశారు. మరో విశేషమేమిటంటే అతడి పేరు కూడా హిట్లరే కావడం. అవును అతడి పేరు హరాల్డ్ హిట్లర్. అంతేకాదు.. అతడు ఇటీవలె జర్మనీ సరిహద్దు వరకు వెళ్లి తిరిగొచ్చాడట. అప్పట్లో అడాల్ఫ్ హిట్లర్ కూడా ఆస్ట్రియా నుంచి జర్మనీలోకి 1913లో అడుగుపెట్టారు. హరాల్డ్ హిట్లర్ అరెస్టుపై ఫర్ట్నర్ అనే పోలీసు అధికారి దీనిపై వివరణ ఇస్తూ అతడు ఉద్దేశపూర్వకంగా హిట్లర్‌లాగా ప్రవర్తించడం వల్లే తాము అరెస్టు చేశామని చెప్పారు. అతడు ఏం చేస్తున్నాడనే విషయంపై పట్ల పూర్తి అవగాహనతో ఉన్నాడని, కావాలని నాజీతత్వంతో తన్మయత్వం పొందినట్లు ప్రవర్తిస్తున్నాడని, ఇది జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆస్ట్రియాలో నాజీల కాలంలో ఊచకోతలు జరిగాయి. వారు చేయని దారుణమంటూ లేదు. దీంతో నాజీ లక్షణాలు కనిపించేవారిని ఆస్ట్రియా పోలీసులు అస్సలు వదిలిపెట్టరు. బ్రౌనౌ నివాసంలో 1889లో హిట్లర్ జన్మించారు. ఈ నివాసాన్ని నియో నాజీలు గొప్పగా భావిస్తున్న నేపథ్యంలో గత ఏడాది ధ్వంసం చేయాలని ఆస్ట్రియా అధికారులు భావించారు. -
ఆన్ లైన్లో అమ్మకానికి నియంత వస్తువులు..!
లండన్: జర్మనీ నియంతగా పేర్కొనే అడాల్ఫ్ హిట్లర్ కు చెందిన కొన్ని కోడింగ్ మేషిన్లను అమ్మకానికి పెట్టారు. యూకేలోని బ్లెక్లే పార్క్ నేషనల్ కంప్యూటింగ్ మ్యూజియం వాలంటీర్లు ఆన్ లైన్ మార్కెట్ ఈ-బే లో ఈ లోరేంజ్ మేషిన్లను గుర్తించారు. ఇవి జర్మనీకి చెందిన కోడింగ్ వస్తువులని, వాటి ధర దాదాపు రూ.100గా ట్యాగ్ పెట్టినట్లు తెలిపారు. ఈ-బే లో ఓ వస్తువు కోసం తనతోటి ఉద్యోగి వెతుకుతుండగా జర్మనీకి చెందిన లోరెంజ్ టెలీ ప్రింటర్ ను గుర్తించారని మ్యూజియం వాలంటీర్ జాన్ వెట్టర్ పేర్కొన్నాడు. నాజీ పార్టీ వారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వీటిని వాడినట్లు అభిప్రాయపడ్డాడు. లోరెంజ్ ఎస్.జెడ్ 42 మెషిన్ హిట్లర్ వాడినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో దాదాపు 200కు పైగా ఉండేవని, ప్రస్తుతం నాలుగు మాత్రమే లభ్యమయ్యాయని చెప్పారు. అయితే ఈ టెలీప్రింటర్ల సహాయంతో జనరల్ అధికారులతో హిట్లర్ సంభాషించేవాడని, వీటి ఉనికి 1970 దశకంలో మొదటగా వెలుగులోకి వచ్చిందని స్థానిక మీడియాతో కథనాలు వచ్చాయి. అయితే సీక్రెట్ కోడింగ్ ద్వారా వారు రహస్యాలపై చర్చించేవారు. నాజీ పార్టీకి చెందిన ప్రముఖులకు మాత్రమే వీటి వాడకం తెలుసునని యూకే అధికారులు అభిప్రాయ పడుతున్నారు. -
ఆ నియంత బొమ్మ రేటెంతో తెలుసా..?
న్యూయార్క్: ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూసిన నియంత బొమ్మకు న్యూయార్క్ లో జరిగిన వేలంపాటలో రికార్డు ధర పలికింది. మొకాళ్ల మీద కూర్చుని ఉన్న జర్మనీ నియంత హిట్లర్ బొమ్మను ప్రముఖ ఇటాలియన్ చిత్రకారుడు మారిజియో క్యాటెలాన్ తయారుచేశారు. వ్యాక్స్, రెజిన్ మెటీరియళ్లతో తయారుచేసిన ఈ బొమ్మ గతంలో 7.9 మిలియన్ డాలర్ల ధర పలుకగా.. ఈ సారి 10 నుంచి 15 డాలర్లు పలుకుతుందని న్యూయార్క్ మ్యూజియం అధికారులు భావించారు. కానీ, వారి అంచనాలను మించి 17.5 మిలియన్ డాలర్ల (రూ. 114.59 కోట్ల)కు ఈ విగ్రహం అమ్ముడుపోయింది.. బౌండ్ ఫెయిల్ పేరుతో నిర్వహించిన ఈ వేలంలో మొత్తం 39 మోడరన్ వర్క్స్ ను అమ్మకానికి ఉంచారు. దీంతో పాటు వేలానికి ఉంచిన మరో బొమ్మ 'వన్ బాల్ టోటల్ ఈక్విలిబ్రియమ్ ట్యాంక్' 15.3 మిలియన్ డాలర్ల (రూ. 101.92 కోట్ల)కు అమ్ముడుపోయింది.. ఈ బొమ్మను జెఫ్ కూన్స్ తయారుచేశారు. ఆదివారం మొదలైన ఈ వేలంపాట గురువారం వరకు కొనసాగనుంది. ఇప్పటివరకు విక్రయించిన బొమ్మలకు 78.1 మిలియన్ డాలర్ల (రూ. 520 కోట్ల)కు పైగా సొమ్ము వచ్చింది. -
ట్రంప్ కన్నా నేనే బెటరేమో!
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ ను చూడగానే ఆయన అభిమానులు ఉప్పొంగిపోతారు. మరికొందరైతే ఇటీవల ఓ అడుగు ముందుకేసి.. 'నాజీ శైలీ'లో ఆయనకు సెల్యూట్ కూడా చేస్తున్నారు. మరీ ట్రంప్ ఏం తక్కువ తిన్నాడా.. ఆ ఫాసిస్ట్ నియంతనే మరిపించేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీంతో సహజంగానే చాలామంది జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్, ట్రంప్ మధ్య పోలికలు పెడుతున్నారు. ఇద్దరినీ ఒకేగాటున కడుతున్నారు. ఈ నేపథ్యంలో హిట్లర్ స్వయంగా దిగొచ్చి.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఓ టీవీ చర్చలో పాల్గొంటే ఎలా ఉంటుంది. ట్రంప్ ప్రచారశైలిపై, అడ్డదిడ్డంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై హిట్లర్ ఇప్పుడు ఉండివుంటే ఏమనుకొని ఉండేవాడు. ఓ రకంగా తన భావజాలాన్ని ముందుకు తీసుకెళుతున్నట్టు కనిపిస్తున్న ట్రంప్ ను హిట్లర్ మెచ్చుకునేవాడా? లేక విమర్శించేవాడా? ఇలాంటి ప్రయత్నమే కొనన్ చానెల్ తాజాగా చేసింది. కొనన్ ఒబ్రియన్ షోలో హిట్లర్ ను స్వయంగా ఆహ్వానించింది. సారా సిల్వర్ మ్యాన్ హిట్లర్ వేషధారణలో వచ్చి.. ఇప్పుడు హిట్లర్ బతికి ఉంటే ఏమనుకొని ఉండేవాడో, ట్రంప్ పై ఆయన మనోగతమేమిటో వెల్లడించే ప్రయత్నం చేసింది. ట్రంప్ గురించి అడిగినప్పుడు.. 'నన్ను తప్పుగా భావించకు కొనన్. అతను చెప్పే చాలా విషయాలతో నేను ఏకీభవిస్తాను. 90శాతం వరకు అతను నాలాగే చెప్తున్నాడు. కానీ అతను చెప్తున్న పద్ధతి నాకు నచ్చడం లేదు. అతను అల్పంగా మాట్లాడుతున్నాడు. అతనితో నన్ను పోల్చడం నన్ను నిరాశపరుస్తున్నది. నన్ను ఇంత తక్కువగా ప్రజలు అర్థం చేసుకున్నారా? అని బాధేస్తోంది' అని హిట్లర్ వేషధారి సారా పేర్కొంది. -
హిట్లరూ.. ప్రేమించాడు!
‘‘ఆ అమ్మాయి అందంగా ఉంది కదూ’’ అన్నాడు హిట్లర్. అవును హిట్లరే! తన పిచ్చి కోసం లక్షల ప్రాణాలను గాల్లో కలిపేసిన హిట్లర్. యూదులను మృత్యుకుహరంలోకి నెట్టి పైశాచికానందాన్ని అనుభవించిన హిట్లర్. ముక్కుపచ్చలారని చిన్నారులను ఇరుకుగదుల్లో బంధించి, వారిని పీనుగులుగా మార్చిన హిట్లర్. రాజ్యకాంక్షతో ఆల్ఫ్స్ పర్వత మంచు శిఖరాలపై రక్తపుటేరులు పారించిన హిట్లర్..! నిజమే..అతని అణువణువూ ద్వేషంతోనే నిండిపోయింది. అందులో వేరే ఏ ఉద్వేగానికీ చోటు లేదు. మరి, ప్రేమకు..?! 1905 వసంతకాలం.. ఆస్ట్రియాలోని లింజ్ నగరం.. క్లాసులు ముగించుకుని స్కూలు వెలుపలికి వచ్చాడు పదహారేళ్ల హిట్లర్. పక్కనే తోడుగా నడుస్తున్నాడు అగస్ట్ కుబిజెక్. ఇద్దరికీ ఓ సంగీతశాలలో పరిచయం. ఆ పరిచయమే స్నేహంగా మారింది. ఎంతటి స్నేహమంటే.. ఇద్దరికీ వేరే స్నేహితులే లేనంతగా! హిట్లర్ తన మనసులోని భావాలన్నిటినీ కుబిజెక్‌తో మాత్రమే పంచుకునేవాడు. ఇది కూడా వారి స్నేహబంధం బలపడడానికి కారణమేనేమో! ఆరోజు కూడా హిట్లర్ ఉన్నట్టుండి కుబిజెక్ చేతిని బలంగా పట్టుకున్నాడు. ‘‘ఆ అమ్మాయి అందంగా ఉంది కదూ’’ అన్నాడు. పరధ్యానంలో ఉన్నాడు కుబిజెక్. ‘‘రేయ్ నిన్నే! ఆ రాగి జుత్తు అమ్మాయి అందంగా ఉంది కదూ’’ రెట్టించిన ఉత్సాహంతో అడిగాడు హిట్లర్. అవునన్నట్టు తలూపాడు కుబిజెక్. ‘‘నీకీ విషయం చెప్పితీరాలి. నేనా అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పీకలదాకా ఆమె ప్రేమలో మునిగిపోయాను’’ నెమ్మదస్తుడిగా ఉండే హిట్లర్ నుంచి ఎప్పుడూ ఊహించని మాటలు వింటున్నాడు కుబిజెక్. హిట్లర్ తనతో మాత్రమే నొక్కిమరీ ఈ ప్రేమ విషయం ఎందుకు చెప్పాడో కూడా అతడికి అర్థమైంది. అవును.. వీరిద్దరూ తొలిసారిగా కలుసుకున్నప్పుడే పోటీ పడ్డారు, సంగీతశాలలో స్థానం కోసం. తర్వాతి నుంచి ప్రతి విషయంలోనూ పోటీనే. అందుకే, ముందు జాగ్రత్తగా కాబోలు.. కుబిజెక్‌తో తన ప్రేమ విషయం చెప్పేశాడు. ఆ రోజు నుంచి ప్రతి సాయంత్రం హిట్లర్‌కీ అతడి మిత్రుడికీ ఒకటే పని.. లింజ్ వీధుల్లో ఆమె కోసం ఎదురు చూడటం! అత్యంత సౌందర్యవతి అయిన ఆ అమ్మాయి పేరేంటో కూడా వీరికి తెలీదు. నీలిరంగు కళ్లు, రాగి దారాలతో ఒత్తుగా అల్లినట్టుండే జుత్తు, మల్లెతీగ లాంటి సన్నని నడుము, సోయగాలు ఉట్టిపడే నాజూకు నడక తప్ప ఆమె గురించి వీరికేమీ తెలీదు. ఆమె కళ్లను చూస్తూనే పరవశించిపోయేవాడు హిట్లర్. అది కూడా దూరం నుంచే..! మిత్రుడి కోసం ఓరోజు బోలెడంత సమాచారం మోసుకొచ్చాడు కుబిజెక్. ‘‘వాళ్లు మనకంటే బాగా డబ్బున్నవాళ్లు. సమాజంలో పేరున్నవాళ్లు. ఆ అమ్మాయి ఈ మధ్యే మ్యూనిచ్, జెనీవాల్లో చదువు పూర్తి చేసుకుని వచ్చింది. బహుశా నీకంటే రెండేళ్లు పెద్దది కావొచ్చు. చెప్పడం మర్చిపోయా.. ఆమె పేరు స్టెఫానీ. స్టెఫానీ ఐజక్!’’ హిట్లర్‌తో చెబుతున్నాడు. ఐజక్ అనగానే హిట్లర్ ఎలా స్పందిస్తాడో చూద్దామనుకున్నాడు. ‘‘అంటే.. ఆమె యూదుల అమ్మాయా?’’ అడిగాడు హిట్లర్. అవునన్నట్టు తలూపాడు కుబిజెక్. ‘‘ఏదేమైనా.. ఆ అమ్మాయి నా కోసమే పుట్టింది. నేను జీవించేది ఆమె అనుగ్రహం కోసమే’’ కుండబద్దలు కొట్టాడు హిట్లర్. తన తల్లి చేతిలో చేయి వేసుకుని విహారానికి వచ్చే ఆ దేవకన్య కోసం హిట్లర్ వేచిచూడని సాయంత్రాలు లేవు. అలా అని ఒక్క హిట్లరే కాదు. ఆ వీధిలోని కుర్రాళ్లందరిదీ అదే పరిస్థితి. ఏ పూటకి ఆ పూట ఆమె చిరునవ్వు గెలుచుకుంటే చాలు అనుకునేవాడు హిట్లర్. అయితే, అదేమంత సులభంగా జరగలేదు. కొన్ని నెలల నిరీక్షణ తర్వాతే ఆమె దృష్టిలో పడ్డాడీ యువ ప్రేమికుడు. తనను దూరం నుంచే కన్నార్పక చూసే మధ్యతరగతి కుర్రాడి వైపు ఓ అరనవ్వు విసిరేదామె. ఆ మాత్రానికే ప్రపంచాన్ని జయించినంతగా సంబరపడేవాడు హిట్లర్. ఆమె నవ్వని రోజు అతడికి ప్రళయమే. తనను తాను హింసించుకునేవాడు. అతడి కళ్లు ఎరుపురంగులోకి మారిపోయేవి. ప్రపంచాన్నే నాశనం చేస్తాడేమో అన్నంత పిచ్చిగా ప్రవర్తించేవాడు.అయితే, హిట్లర్ ఏనాడూ స్టెఫానీతో మాట్లాడలేదు. మాట్లాడేందుకు ప్రయత్నించలేదు కూడా! ఎప్పుడైనా కుబిజెక్ ప్రోత్సహిస్తే.. ‘‘రేపు తప్పకుండా మాట్లాడతా’’ అంటూ తప్పించుకునేవాడు. అవును మరి, ఆమెను అల్లంత దూరాన చూస్తేనే అతడి గొంతు వణుకుతుంది. ఇక, దగ్గరకెళ్తే మాటేం పెగులుతుంది..? అయితే, చురుకైన ఆస్ట్రియన్ మిలటరీ అధికారులు ఆమెతో మాటకలిపేందుకు వెనకాడేవారు కాదు. స్టెఫానీ కూడా అందరితోనూ కలివిడిగా ఉండేది. ఇదంతా హిట్లర్‌కు నచ్చేది కాదు. కానీ, యువ మిలటరీ జనరల్స్‌ను అతడేం చేయగలడు? అందుకే వారిని దూరం నుంచే తిట్టుకునేవాడు. అసహ్యించుకునేవాడు. హిట్లర్ తన తల్లిని చూసేందుకు వెళ్లినప్పుడు కూడా స్టెఫానీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. ఓ రోజు కుబిజెక్ నుంచి లేఖ అందుకున్నాడు. ‘‘స్టెఫానీకి డ్యాన్స్ అంటే పిచ్చి. ఆమె ప్రస్తుతం డ్యాన్స్ క్లాసులకు హాజరవుతోంది’’ అన్నది అందులోని సారాంశం. డ్యాన్స్ అంటే హిట్లర్‌కు గిట్టదు. వెంటనే కుబిజెక్ లేఖకు ఇలా జవాబు రాశాడు.. ‘‘స్టెఫానీకి డ్యాన్స్ అంటే ఇష్టమని నేననుకోను. బహుశా ఈ సమాజం కోసమే ఆమె నేర్చుకుంటోందేమో! ఒకసారి ఆమె నా భార్య అయ్యాక, సమాజంతో ఆమెకు పని ఉండదు. డ్యాన్స్ నేర్చుకోవాలనే కోరికా ఉండదు’’. హిట్లర్ జీవితంలో మరిచిపోలేని సంఘటన 1906 జూన్‌లో జరిగింది. ఎప్పటిలాగే తల్లితో కలిసి గుర్రపు బండిపై విహారానికి వచ్చిన స్టెఫానీ.. చేతినిండా రోజాలతో కనిపించింది. ఆ రోజు హిట్లర్‌ను దాటుకుంటూ వెళ్తూనే అతడి చేతిలో ఓ రోజా పెట్టి, నవ్వుల జల్లులు కురిపించింది. అంతే.. అతడి ఆనందానికి అవధుల్లేవు. నింగినీ నేలనూ ఏకం చేసేస్తాడా అన్నంతగా ఎగిరి గంతేశాడు. ‘‘చూశావా..! ఈ రోజాని చూశావా. తను నన్ను చూసి నవ్వింది చూశావా. తను కూడా నన్ను ప్రేమిస్తోంది’’ బిగ్గరగా అరుస్తున్నాడు హిట్లర్. కుబిజెక్ మౌనంగా వింటున్నాడు. స్నేహితుడి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. దురదృష్టవశాత్తూ ఓ రోజు హిట్లర్ తల్లి రొమ్ము క్యాన్సర్‌తో మరణించింది. అంత్యక్రియలకు అందరూ వచ్చారు. స్టెఫానీ కూడా వచ్చింది. హిట్లర్‌కు మిగతా వారెవ్వరూ కనిపించలేదు. ఒక్క స్టెఫానీ తప్ప! ‘‘నన్ను ఓదార్చడానికే స్టెఫానీ వచ్చింది కదూ’’ కుబిజెక్ను అడుగుతున్నాడు అమాయకంగా. అయితే, స్టెఫానీకి ఇదేమీ తెలీదు. హిట్లర్ తనను పిచ్చిగా ప్రేమిస్తున్నాడనీ, తనకోసం ప్రాణాలైనా ఇస్తాడనీ, తనకోసం జీవితాంతం వేచిచూస్తాడనీ తెలీదు. తెలియాలంటే హిట్లర్ నోరువిప్పాలిగా! ఓరోజు కుబిజెక్‌తో అప్రయత్నంగా, ‘‘స్టెఫానీని కిడ్నాప్ చేస్తాను. తనను గట్టిగా హత్తుకుని డనుబ్ నదిలోకి దూకుతాను. మరణించాకైనా మేం కలిసి జీవిస్తాం’’ అన్నాడు. హిట్లర్ మానసిక పరిస్థితికి, లోలోపలే దాచుకున్న ఉద్వేగానికీ ఈ మాట అద్దం పడుతుంది. అయితే, హిట్లర్ అన్నంత పనీ చేయలేదు. వియన్నా వెళ్లిపోయాడు. తర్వాత చాలాకాలం అతడి జాడే లింజ్ నగరంలో కనిపించలేదు. మరోవైపు స్టెఫానీకి ఓ ఆస్ట్రియా మిలటరీ అధికారితో 1908లో వివాహం జరిగిపోయింది. 1913 క్రిస్మస్ సందర్భంగా స్టెఫానీకి శుభాకాంక్షలు చెబుతూ లింజ్‌లోని వార్తాపత్రికల్లో ప్రటకన వేయించాడు హిట్లర్. ఆ సమయానికి ఆమె వియన్నాలో స్థిరపడింది. బహుశా ఆ ప్రకటన ఆమె చూసి ఉండకపోవచ్చు. అలా హిట్లర్ ప్రేమ మూగగానే మిగిలి పోయింది! కొసమెరుపు: యూదులను హిట్లర్ ద్వేషించినట్టుగా మరే వ్యక్తీ ద్వేషించి ఉండరేమో! అదే హిట్లర్ ఓ యూదు అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడని తెలుసుకున్నాక.. స్టెఫానీ కోసం అన్వేషించింది మీడియా. 1973లో విడుదలైన ఓ ఆస్ట్రో-జర్మన్ టెలివిజన్ ఫిల్మ్‌లో ఆమెను తొలిసారిగా ఇంటర్వ్యూ చేశారు. ‘‘నేను లింజ్లో ఉండగా ఓ ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది. ఓ అనామక వ్యక్తి తాను డిగ్రీ పూర్తి చేసి వస్తాననీ అంతవరకూ తనకోసం వేచి ఉండమనీ రాశాడు. నేను స్పందించడానికి అతడి చిరునామా లేదు. బహుశా అది హిట్లరే పంపించి ఉంటాడు’’ అని గుర్తుచేసుకుందామె. ద్వేషాన్నే శ్వాసించి బతికిన వ్యక్తి జీవితంలో ప్రేమా..!? నిజంగా హిట్లర్ ప్రేమలో పడ్డాడా? ఏమో ఎవరికి తెలుసు.. హిట్లర్ కంటే పెద్ద నియంత ప్రేమే..! అది ఆదేశిస్తే పడకుండా ఉండగలడా..!! -
హిట్లర్‌పై భారత జిహాదీ ప్రశంసలు
లండన్: భారత సంతతికి చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది సిద్ధార్థ ధార్ జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'జిహాదీ సిద్'గా పేరుబడ్డ అతడు తాజాగా వెలుగుచూసిన ఓ వీడియోలో హిట్లర్‌ను కొనియాడాడు. తన స్వగతం చెప్పుకొంటున్నవిధంగా ఉన్న ఈ వీడియోను 2014లో అతను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ఇందులో యూదులు, యూదుమతవాదంపై తీవ్ర విద్వేషాన్ని వెళ్లగక్కాడు. 'వారి విషగ్రంథాలను ఇతర వ్యక్తులు సైతం పసిగట్టి.. వాటిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అందులో హిట్లర్ కూడా ఉన్నారు' అంటూ జర్మనీ నియంతను అతను కొనియాడాడు. 1909 నాటి 'ప్రోటోకాల్స్ ఆఫ్ ద ఎల్డర్స్ ఆఫ్ జియాన్' గ్రంథం ప్రపంచవ్యాప్తంగా యూదుల ఆధిపత్యాన్ని ప్రబోధించిందని, మానవత్వంపై యుదులకున్న విద్వేషాన్ని ఇది చాటుతోందని అతను పేర్కోన్నాడు. 32 ఏళ్ల జిహాది సిద్ గతంలో బ్రిటన్‌లో సేల్స్ మన్‌గా పనిచేశాడు. బంధీల తలలు నరికిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో ఇతడు కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. -
మళ్లీ మార్కెట్లోకి హిట్లర్ మేనిఫెస్టో
ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టించిన దివంగత జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ రాసిన సంచలనాత్మక మేనిఫెస్టో 'మైన్ కాంఫ్ (నా సంఘర్షణ)' 70 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రచురణకు నోచుకుంది. గతంలోలా యథాతథంగా కాకుండా... హిట్లర్ రాసిన అంశాలను యథాతథంగా ఇస్తూనే ఆయన చెప్పిన అబద్ధాలు, అర్ధ సత్యాలు, హింస ప్రేరేపిత ఉపన్యాసాల్లో నిగూఢంగా దాగున్న ఉద్దేశాలను బయటపెట్టే వ్యాఖ్యానాలు, విశ్లేషణలతో వస్తోంది. 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ హిస్టరీ' ప్రచురిస్తున్న ఈ పుస్తకం వారంరోజుల్లోనే మార్కెట్లోకి వస్తోంది. దీని ధరను 63 డాలర్లుగా నిర్ణయించారు. ఆయన రాసిన పుస్తకం 600 పేజీలు ఉండగా, ఇప్పుడు తీసుకొస్తున్న పుస్తకం వ్యాఖ్యానాలు, విశ్లేషణలతో 2000 పుటలతో వస్తోంది. ఇంతకుముందు ప్రచురించిన తొలి పుస్తకం హిట్లర్ చనిపోయిన నాటి నుంచి 70 ఏళ్ల కాపీరైట్ హక్కు గడువు డిసెంబర్ 31వ తేదీతో ముగిసిపోవడంతో ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలని నిర్ణయించారు. ఇప్పటికీ హిట్లర్‌ను, ఆయన ఫిలాసఫీని ఆరాధించే అసాంఘిక అరాచక శక్తులు ఇప్పటికీ జర్మనీలో ఉండడంతో వ్యాఖ్యానాలు, విశ్లేషణలు లేకుండా పుస్తకాన్ని ముద్రించరాదని జర్మనీ అత్యున్నత న్యాయస్థానం ఇదివరకే ఆంక్షలు విధించింది. హిట్లర్ 'మై కాంఫ్' పుస్తకాన్ని 1923 నుంచి 1933 మధ్య రెండు భాగాలుగా ప్రచురించారు. ఈ పుస్తకాలు 40 లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. సమకాలీన ప్రపంచంపై, ముఖ్యంగా యూదులు, ఇతర మైనారిటీ వర్గాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి తనలో కలిగిన సంఘర్షణ గురించి హిట్లర్ ఈ పుస్తకాల్లో వివరించారు. జాతులను రెచ్చగొట్టే రోమాంచిత ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది సమకాలీన ప్రపంచ చరిత్రకు అవసరం లేకపోయినా గతించిన చరిత్రలోని వాస్తవాలను వెలుగులోకి తీసుకరావాలనే సదుద్దేశంతోని మళ్లీ 'మై కాంఫ్' తీసుకొస్తున్నామని 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ హిస్టరీ' వివరించింది.