ambedkar university
-
వర్సిటీల్లో నియామకాలకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు అనుసరించాల్సిన విధివిధానాలు సిఫారసు చేసేందుకు ఉన్నత విద్యామండలి నేతృత్వంలో కమిటీ ఏర్పాటయ్యింది. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఘంటా చక్రపాణి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సభ్యులుగా ఉంటారు. మరో ఇద్దరు సభ్యులను ఈ కమిటీ నిర్ణయిస్తుంది. నియామకాలకు సంబంధించిన సూచనలతో పాటు, కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్), ప్రమోషన్లకు సంబంధించిన అంశాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను సైతం ఈ కమిటీ పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తుంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విశ్వవిద్యాలయాల వీసీల సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అన్నీ పరిశీలించాకే.. యూనివర్సిటీల్లో దాదాపు 3 వేల బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా గతంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని వర్సిటీల్లో నియామకాలు చేపట్టేందుకు వీలుగా కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. అయితే దీని స్థానంలో కాలేజ్ సరీ్వస్ కమిషన్ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశాలన్నీ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత నియామకాలు చేపట్టాల్సి ఉంటుందని ఉన్నత విద్యా మండలికి విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. వీసీల సమావేశం వివరాలను మండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి మీడియాకు వివరించారు. ర్యాంకింగ్‌లపైనా కమిటీ! యూనివర్సిటీల స్థితిగతులు, నాణ్యత ప్రమాణాలు, అనుబంధ గుర్తింపు విధానాలపై వీసీల సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. తమ వర్సిటీల పరిధిలో సమస్యలను వీసీలు సమావేశంలో లేవనెత్తారు. జాతీయస్థాయిలో ర్యాంకులు పడిపోవడానికి కారణాలు, వీటిని ఏ విధంగా మెరుగుపర్చాలనే అంశంపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వర్సిటీలు ప్రధానంగా ఎదుర్కొంటున్న నిధుల కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాలని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. పరిశ్రమల నుంచి సామాజిక బాధ్యత కార్యక్రమం కింద, పార్లమెంట్ సభ్యుల ప్రాంతీయ అభివృద్ధి నిధుల ద్వారా లబ్ధి పొందే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. సిలబస్ మార్పుపై కసరత్తు పూర్తి కొన్ని నెలలుగా ఉన్నత విద్యా మండలి చేపట్టిన పలు కార్యక్రమాలను వీసీలకు బాలకిష్టారెడ్డి వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే దిశగా సిలబస్‌లో గణనీయ మార్పు తెస్తున్నామని, ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయిందని తెలిపారు. మార్కెట్ డిమాండ్, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్ ఉండబోతుందని వివరించారు. న్యూస్ లెటర్ విడుదల మండలి నేతృత్వంలో రూపొందిస్తున్న న్యూస్ లెటర్‌ను విద్యాశాఖ కార్యదర్శి శ్రీధర్ ఈ సందర్భంగా విడుదల చేశారు. మండలి నేతృత్వంలో రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల్లో పురోగతిని ఇందులో వివరించారు. సమావేశంలో ఘంటా చక్రపాణితో పాటు పలు వర్సిటీల వీసీలు పాల్గొన్నారు. -
ఇదే కదా సుపరిపాలన అంటే..: కొమ్మినేని
సాక్షి, శ్రీకాకుళం: తమకు అందుతున్న నిరంతర సేవలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలో సుపరిపాలన అమలవుతుందా లేదా అని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్.మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో “సుపరిపాలన దిశగా ఆంధ్ర ప్రదేశ్ రూపాంతరం” అంశంపై అవర్ స్టేట్ అవర్ లీడర్, వై.ఎస్.ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం ఆధ్వర్యం లో మంగళవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమ అవసరాల కోసం ఎవరి దయాదాక్షిణ్యాలు కోసం యాచించాల్సిన అవసరం లేని వ్యవస్థను ప్రభుత్వంలో ప్రవేశపెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు సుపరిపాలనలో భాగమన్నారు. గతంలో రైతులు వ్యవసాయ ఇన్ పుట్స్ కోసం ధర్నాలు, ఆందోళనలు చేసేవారని, ఆ పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చిందన్నారు. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లకోసం మండల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి ఇంటికే వచ్చే ఏర్పాటు విజయవంతంగా అమలు అవుతోన్నదన్నారు. ఇదే సుపరిపాలన అంటేనని తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి జరగడం లేదన్న వాదన సరికాదన్నారు. విశాఖలో అదానీ డేటా సెంటరు, భోగాపురం విమానాశ్రయం, రామాయపట్నం, మచిలీపట్నంలో పోర్టులు వంటి వి అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్దానం లో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మానవతా థృక్పధానికి నిదర్శనమని కొనియాడారు. శ్రీ శ్రీ, గురజాడ, గరిమెళ్ళ, వంగపండు, వంటి ఉత్తరాంధ్ర కవులను, వ్యావహారిక భాషా వేత్త గిడుగు రామ్మూర్తిని, కాళీపట్నం రామారావును ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. తమ ప్రసంగంలో ఆద్యంతం సుపరిపాలన పై విద్యార్థులు ప్రతి స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. నిమ్మ వెంకట రావు మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రవేశ పెట్టిన “నవరత్నాల” పథకంలో మహాత్మా గాంధీ, జ్యోతిబా ఫూలే, ఆర్ధిక వేత్త అమర్త్య సేన్ ల సిద్ధాంతాలు యిమిడి వున్నాయన్నారు. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు వారి ఇంటివద్దనే, ఒకటో తేదీనే అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం వారికి పేదలు, నిస్సహయుల పట్ల వున్న అనుకూల ధృక్పధాన్ని మనం తెలుసు కోవచ్చన్నారు. చదవండి: అమ్ముడుపోను.. చావుకు భయపడను: పోసాని విద్యకు వృత్తి పరమైన నైపుణ్యాన్నిజోడించడంద్వారా ఉన్నత విద్య అనంతరం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచిందన్నారు. ఆర్ధిక పరమైన అన్ని అంశాలను మహిళలకు కేటాయించడం ద్వారా వారి సాధికారితకు నిజమైన నిర్వచనాన్నిఇచ్చారన్నారు. తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లితండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా విద్యా సంస్థలపై తల్లులకుప్రశ్నించే అధికారాన్ని కల్పించారని ఆయన పేర్కొన్నారు ఇదంతా సుపరిపాలనలో భాగమని ఆయన తెలిపారు. పరిపాలన అందరికీ ఉపయోగంగా, ఉపయుక్తంగా వుండాలని అందుకు నిదర్శనంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్సిటి రిటైర్డ్ వీసీ వి.బాల మోహన్‌దాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు పథకాలు అందజేయడంలో తండ్రి కి మించిన తనయుడు సీఎం జగన్ అని కొనియాడారు. విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రవేశపెట్టిన విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీయ విద్యా దీవెనలకు సంబంధించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అవర్ స్టేట్ అవర్ లీడర్ వైఎస్సార్ ఇంటలెక్చరర్ ఫోరమ్ చైర్మన్ జి. శాంతమూర్తి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ బి.అర్ధయ్య, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉదయభాస్కర్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. రాజేష్, సి.హెచ్. కృష్ణారావు, డా. సి.హెచ్. రాజశేఖర్, ఇ. కామరాజు, పొన్నాల వెంకట లక్ష్మణరావు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ వర్సిటీ అకడమిక్ డైరెక్టర్‌గా ఘంటా చక్రపాణి
బంజారాహిల్స్ (హైదరాబాద్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితు లయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం బోధనేతర సంఘం అధ్యక్షుడు జి.మహేశ్వర్‌గౌడ్, జనరల్ సెక్రెటరీ మార్కండేయశర్మ, వైస్‌ప్రెసిడెంట్ ఆర్.భూలక్ష్మి, జాయింట్ సెక్రెటరీ పాండు, కోశాధికారి వెంకట పిచ్చయ్య తదితరులు చక్రపాణిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. -
భావి అవసరాలు తీర్చేలా నూతన విద్యావిధానం
అహ్మదాబాద్: భారత్ గత సంవత్సరం ఆవిష్కరించిన నూతన విద్యా విధానం భవిష్యత్ అవసరాలను తీర్చగలదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ విధానాన్ని రూపొందించారని ప్రశంసించారు. విద్యార్థి నేర్చుకునే జ్ఞానం దేశాభివృద్ధికి ఉపయోగపడాలనే డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ ఆకాంక్షను తీర్చేదిగా ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలు భారత సామాజిక జీవనంలో అంతర్లీనంగా ఉన్నాయన్నారు. అహ్మదాబాద్‌లోని బాబాసాహెబ్ అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్వహించిన ‘అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్’ 95వ వార్షిక సమావేశం, యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ల జాతీయ సెమినార్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ బుధవారం ప్రసంగించారు. ప్రతీ విద్యార్థికి వేర్వేరు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ‘విద్యార్థి సామర్థ్యం ఏమిటి? సరిగ్గా బోధిస్తే ఏ స్థాయికి వెళ్లగలడు? ఆ విద్యార్థి లక్ష్యం ఏమిటి? అనే అంశాలను విశ్లేషించాలి’ అని సూచించారు. కృత్రిమ మేథ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, 3డీ ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, మొబైల్ టెక్నాలజీ, స్మార్ట్ హెల్త్ కేర్, రక్షణ తదితర రంగాల్లో భారత్‌ను యావత్ ప్రపంచం దిక్సూచిగా చూస్తోందన్నారు. భవిష్యత్ అవసరాల కోసం మూడు నగరాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జ్ఞానం, ఆత్మగౌరవం, మర్యాదపూర్వక వ్యవహారశైలిని అంబేద్కర్ గౌరవించేవారన్నారు. ఆయన చూపిన ఈ మార్గంలో నడిచే బాధ్యతను మన విద్యాలయాలు చేపట్టాలన్నారు. అంబేద్కర్‌పై కిశోర్ మాక్వానా రచించిన నాలుగు పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించారు. అంబేద్కర్‌కు ప్రధాని నివాళులు బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాలను సామాజిక స్రవంతిలోకి తీసుకురావడానికి అంబేడ్కర్ చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా అంబేడ్కర్‌కు శిరçస్సు వంచి నమస్కరిస్తున్నానని బుధవారం ప్రధాని ట్వీట్ చేశారు. సరిపడా వ్యాక్సిన్లు అందజేస్తాం ► కరోనాపై కలిసికట్టుగా పోరాడుదాం ► ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: దేశ అవసరాలకు సరిపడా కోవిడ్–19 వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై అందరం కలిసికట్టుగా పోరాడుతామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ గ్రూప్‌లు ఏకతాటిపైకి రావాలని కోరారు. మోదీ గురువారం అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో సామాజిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసేలా చూడాలని అన్నారు. గత ఏడాది వైరస్ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు జన్ భాగీదారి(ప్రజల భాగస్వామ్యం)తో సమర్థంగా కట్టడి చేయగలిగామని గుర్తుచేశారు. ఈసారి కూడా ప్రజలను మరింత కార్యోన్ముఖులను చేయాలని పిలుపునిచ్చారు. టీమ్ ఇండియా స్ఫూర్తితో పోరాటం కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో అందరినీ కలుపుకొని పోయేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలను పక్కనపెట్టి ఈ పోరాటంలో ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం (టెస్ట్), వైరస్ రూపాంతరం చెందుతున్న తీరుపై దృష్టి పెట్టడం (ట్రాక్), సరైన సమయంలో చికిత్సనందించడం (ట్రీట్)’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఆయన బుధవారం గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. -
యూనివర్సిటీలో విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
-
ఫెలోషిప్ నిరాకరించారని దళిత ప్రొఫెసర్‌పై..
లక్నో : ఫెలోషిప్ నిరాకరించినందుకు ఓ దళిత ప్రొఫెసర్‌పై ఆయన ఛాంబర్‌లోనే అగ్రవర్ణ విద్యార్థి దాడి చేసిన ఘటన బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కలకలం రేపింది. కులం పేరుతో ప్రొఫెసర్‌ను దూషిస్తూ, ఆయనను తోసివేయడంతో వర్సిటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధిత ప్రొఫెసర్ ఫిర్యాదుతో నిందితుడు, రీసెర్చ్ స్కాలర్ సంజయ్ ఉపాధ్యాయను లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా వర్సిటీ క్యాంపస్‌లో భారీగా పోలీస్ బలగాలను తరలించారు. ప్రొఫెసర్‌ను రీసెర్చ్ స్కాలర్ కులం పేరుతో దూషించడం పట్ల ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. ఎకనమిక్స్ డిపార్ట్మెంట్లో సంజయ్ ఉపాధ్యాయ ప్రొఫెసర్ ఎల్సీ మాలియ పర్యవేక్షణలో పీహెచ్డీ చేస్తున్నారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఫెలోషిప్ కోసం ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం తిరస్కరణకు గురైందని చెప్పారు. తాను దళితుడిని కాకపోవడం వల్లే తన పేపర్‌ను తిరస్కరించారని ప్రొఫెసర్ మాలియతో సంజయ్ వాగ్వాదానికి దిగారు. ప్రొపెసర్ను కులం పేరుతో దూషిస్తూ కాలర్ పట్టుకుని కొట్టేందుకు ప్రయత్నించారు. ఇతర ఫ్యాకల్టీ సభ్యులు ఆయనను కాపాడారని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు ఈ ఘటనలో నిందితుడు, బాధితుడు అగ్ర, నిమ్న వర్గాలకు చెందిన వారు కావడంతో ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్ధులు రెండు వర్గాలుగా విడిపోయారు. -
ఆ ఆన్సర్ షీట్లు చూసి టీచర్లు షాక్
ఆగ్రా : పరీక్షలకు ముందు సరైన సన్నద్ధత లేక, సమాధాన పత్రాల్లో దేవుడి బొమ్మలు వేస్తూ.. దేవుడా మమ్మల్ని పాస్ చేయించూ అంటూ కోరుకోవడం సినిమాల్లో చూస్తుంటాం. అచ్చం సినిమాల్లో మాదిరే భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల సమాధాన పత్రాలు చూసి పేపర్ మూల్యాంకన చేసే టీచర్లే షాకైపోయారు. వర్సిటీ 2017-18 సంవత్సరానికి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్స్ సమాధాన పత్రాల్లో విద్యార్థులు హనుమాన్ భజన్లు, హారతి పాటలు రాశారు. భక్తి పాటలు, హారతి లైన్లతో విద్యార్థులు తమ సమాధాన పత్రాలను నింపేశారని పేపర్లు మూల్యాంకన చేసిన టీచర్లు పేర్కొన్నారు. ఒక విద్యార్థి అయితే ఏకంగా హారతి లైన్లకు అర్థం కూడా రాసినట్టు ఓ టీచర్ చెప్పారు. తన గర్ల్‌ఫ్రెండ్ తనని చదువుల్లో మంచి ప్రతిభ గల వాడిగా భావిస్తుందని, తనని పాస్ చేయాలని లేదంటే ఆమె తనని విడిచిపెడుతుందంటూ ఓ విద్యార్థి తన మనోవేదనను వెల్లబుచ్చాడు. ఇలా సమాధాన పత్రాల్లో వింత వింత జవాబులతో పేపర్లు దిద్దే టీచర్లకే చుక్కలు చూపించారు. కొన్ని కేసుల్లో 20 పేజీల సమాధాన పత్రాలను సినిమా స్క్రిఫ్ట్‌లు, కవితలు, పాస్ మార్కులు వేయాలంటూ అభ్యర్థనలు ఇవే కనిపించాయని, కొంతమంది విద్యార్థులైతే ఏకంగా టీచర్లను ప్రలోభపెట్టేందుకు కరెన్సీ నోట్లను కూడా ఆఫర్ చేసినట్టు ఓ సీనియర్ టీచర్ చెప్పారు. వింత వింత సమాధానాలు రాసిన విద్యార్థుల తుది ఫలితాలు జూన్ 15న వర్సిటీ అధికారులు వెల్లడించనున్నారు. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయకుండా.. ఇలాంటి సిల్లీ సిల్లీ అంశాలు రాసి పాస్ కావాలని విద్యార్థులు యోచిస్తున్నారని భీమ్ రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జీఎస్ శర్మ అన్నారు. ప్రతి రోజు టీచర్లు 5000కు పైగా సమాధాన పత్రాలను దిద్దుతారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫైనల్ ఎగ్జామ్స్‌కు దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. -
బోధకులు లేక.. బోధనెలా?
► వర్సిటీలో రెగ్యులర్ బోధకుల కొరత ► కాంట్రాక్టు సిబ్బందితోనే నెట్టుకొస్తున్న వైనం ఎచ్చెర్ల క్యాంపస్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం 2008 జూన్ 25న ఏర్పాటైంది. ఇక్కడ అన్నింటికంటే ప్రధాన సమస్య రెగ్యులర్ బోధకుల నియామకం జరగకపోవడం, ప్రస్తుతం యూనివర్సిటీలో 12 మంది మాత్రమే రెగ్యులర్ బోధకులు ఉన్నారు. వీరిలో వర్సిటీ పాలనాపరమైన కీలక బాధ్యతల్లో కొందరు ఉన్నారు. రూరల్ డెవలప్మెంట్లో ఇద్దరు ప్రొఫెసర్లు ఉండగా.. ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య ఇన్చార్జి వీసీగా ఉన్నారు. ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామర్స్ అండ్ మేనేజ్మెంట్లో ఇద్దరు రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉండగా.. ప్రొఫెసర్ గుంట తులసీరావు రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు ఎగ్జామినేషన్స్ డీ¯న్గా వ్యవహరిస్తున్నారు. ఎకనామిక్స్‌లో ఒక ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య ఉండగా.. ఆయన చీఫ్ వార్డెన్‌గా వ్యవహరిస్తున్నారు. బయోటెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ పీలా సుజాత ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మరో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. సోషల్ వర్కులో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా.. డాక్టర్ గంజి సంజీవయ్య జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఇలా కీలకమైన బాధ్యతల్లోనే కొందరు ఉన్నారు. రెండుసార్లు నోటిఫికేషన్ జారీ చేసినా..: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ బోధకులు నియామకానికి రెండుసార్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. అయినా నియామకాలు మాత్రం చేపట్టలేదు. 2013 సంవత్సరం జూన్ 22న 34 పోస్టులకు.. 2014 మార్చి 1న 15 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్లు జారీ చేశారు. వర్సిటీలో ఆరు ప్రొఫెసర్, 10 అసోసియేట్ ప్రొఫెసర్లు, 33 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు గతంలో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే నేటికీ నియామకాలు జరగలేదు. వర్సిటీ ఏర్పడిన సమయంలో అరుగురు మాత్రమే ఇక్కడ ఉండేందుకు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. 22 మంది మాతృసంస్థ ఏయూకు వెళ్లి పోయారు. ఆ స్థానంలో సైతం పోస్టులు వర్సిటీలో భర్తీ కాలేదు. 2009లో కొత్తగా ప్రారంభించిన బయోటెక్నాలజీలో నలుగురు, సోషల్వర్కులో ముగ్గురు బోధన సిబ్బందిని మాత్రమే నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో కామన్ పాలసీ వంటి కొత్త రిక్రూట్ మెంట్ విధానాన్ని ప్రభుత్వం తెరమీదకు తెస్తోంది. దీంతో న్యాయపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఫలితంగానే నియామకంలో జాప్యం జరుగుతోంది. రెగ్యులర్ బోధకులు లేకపోతే.. బోధన కుంటుపడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం.. : ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫె సర్ల నియామకంలో ప్రభుత్వం కామన్ పాలసీ విధానం, స్క్రీనింగ్ టెస్ట్ వంటి అంశాలను తెరపైకి తెస్తోం ది. దీంతో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి. వర్సిటీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు –10 పోస్టులకు సంబంధించి పాలక మండలిలో చర్చించి, ఉన్నత వి ద్యా శాఖ అధికారులు దృష్టికి తీసుకువెళతాం. నియామకాలకు చర్యలు తీసుకుంటాం. రెగ్యులర్ పోస్టుల నియామకంతోనే విద్యబలోపేతం అవుతుంది. -- ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, ఇన్చార్జి వీసీ, డాక్టర్ బీఆర్‌ఏయూ. -
వర్సిటీ అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం
ఎచ్చెర్ల క్యాంపస్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ 2008 జూన్ 25న ఏర్పడింది. కొత్త యూనివర్సిటీలు బలోపేతం కావాలంటే ప్రత్యేక నిధులు అవసరం. సీనియర్ వర్సిటీల స్థాయికి చేరుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. అందులో భాగంగానే కొత్త యూనివర్సిటీల నుంచి ప్రభుత్వం అనుమతులు కోరింది. ఈ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదనలు అందజేశారు. కొత్తగా ఏర్పాటైన వర్సిటీలు ఆదికవి నన్నయ్య, శ్రీకృష్ణ, విక్రమసింహపురిలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి రూ.33.45 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పలు నిర్మాణాలు చేయాలని అధికారులు భావించారు. అధికారులు ప్రతిపాదించిన వాటిలో రూ.6 కోట్లతో పరిపాలన భవనం, రూ.90 లక్షలతో న్యాయకళాశాల, రూ.90 లక్షలతో విద్యావిభాగం భవనాలు, రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం, రూ. 2.50 కోట్లతో క్రికెట్ మైదానం, రన్నింగ్ ట్రాక్‌కు రూ.1.50 కోట్లు, జిమ్ ఏర్పాటుకు రూ.1.50 కోట్లు, ఎగ్జామినేషన్స్ బ్లాక్‌కు రూ. 3.45 కోట్లు, వసతిగృహం భవనాలకు రూ.2.65 కోట్లు, తరగతి గదుల నిర్మాణం కోసం రూ.4.05 కోట్లు, రూ.8 కోట్లతో అకడమిక్ భవనాల నిర్మాణం చేపట్టాలని భావించారు. ఉన్నత విద్యాశాఖ మంజూరు చేసిన ఈ నిధులను వర్సిటీలకు నేరుగా మంజూరు చేయకుండా రోడ్లు, భవనాల శాఖకు ఖర్చు, అంచనాల బాధ్యత అప్పగించారు. ఈ మేరకు ఆర్అండ్బీ అధికారులు వర్సిటీకి వచ్చి అంచనాలు రూపొందించారు. నిర్మాణాలకు అనువైన స్థలాలను సైతం గుర్తించారు. అంచనాలకు అనుగుణంగా పనులకు టెండర్లు వేయనున్నట్లు ప్రకటించారు. అయితే వర్సిటీ అధికారులు ఆర్‌అండ్‌బీకి కాకుండా, కేంద్ర ప్రజా పనుల విభాగానికి పనులు అప్పగిస్తే నాణ్యత ఉంటుందని భావించారు. నిధుల మంజూరుపై నీలినీడలు: ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఈ నిధుల మంజూరుపై నీలినీడలు అలుముకున్నాయి. గత రెండేళ్ల నుంచి ప్రదిపాదన దశలో ఉన్న నిధులు మంజూరు కావడం లేదు. ఉన్నత విద్యామండలి, ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి సైతం వర్సిటీ అధికారులు తీసుకువెళ్లారు. అయినా ప్రభుత్వం నిధుల మంజూరు చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రత్యేక నిధులు బడ్జెట్లో కేటాయించడం కుదరదు. మరోవైపు పెద్ద యూనివర్సిటీలకు బడ్జెట్లో వర్సిటీ స్థాయి బట్టి నిధులు మంజూరు అవుతున్నాయి. బడ్జెట్లో వర్సిటీకి అరకొర నిధులతో ప్రభుత్వం సరిపెడుతోంది. ప్రస్తుతం మంజూరు చేసిన ప్రత్యేక నిధులు సైతం అందజేయలేదు. అసలు ఈ నిధులు మంజూరు అవుతాయా? లేదా? అన్న అంశం సైతం ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం: ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో వర్సిటీకి అందజేశారు. అనంతరం రోడ్లు, భవనాల శాఖకు వర్సిటీ ప్రత్యేక నిధులు అప్పగించారు. ఇంజినీరింగ్ అధికారులు సైతం వర్సిటీకి వచ్చి నిర్మాణాలకు అనువైన స్థలాలు, అంచనాలు పరిశీలించారు. ఈ వర్సిటీ సీనియర్ వర్సిటీలతో పోటీ పడాలంటే ప్రత్యేక నిధులు తప్పని సరి. లేదంటే ప్రగతి సాధ్యం కాదు. వర్సిటీలో కొత్త కోర్సులు, అకడమిక్, అడ్మినిస్ట్రేషన్, ఎగ్జామినేషన్ విభాగాలు బలోపేతం కావాలంటే ప్రత్యేక నిధుల మంజూరు కీలకం. నిధుల కోసం అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లాం. ---ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ -
26న అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ప్రవేశ పరీక్ష
హైదరాబాద్: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, బికాం, బీఎస్సీ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్షను ఈ నెల 26 న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1 నాటికి 18 సంవత్సరాల పూర్తయిన వారు ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. వివరాలకు విద్యానగర్‌లోని అంబేద్కర్ స్టడీ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. -
ర్యాగింగ్‌కు పాల్పడితే... బహిష్కరణ
అంబేడ్కర్ వర్సిటీ ఇన్చార్జి వీసీ చంద్రయ్య ఎచ్చెర్ల క్యాంపస్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, దాని అనుబంధ కళాశాలల్లో ఎవరైనా ర్యాగింగ్‌పై పాల్పడితే బహిష్కరిస్తామని వర్సిటీ ఇన్చార్జి వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య అన్నారు. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు వర్సిటీ చేపట్టిన ర్యాగింగ్ నిర్మూలన చర్యలు, భవిష్యత్‌లో ర్యాగింగ్ పట్ల వ్యవహరించే విధానాలను అధికారులు పరిపాలనా కార్యాలయంలో మంగళవారం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. నేరం ఎక్కువగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, విద్యార్థులపై ర్యాగింగ్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం వర్సిటీలో తరగతి గదులు, వసతి గృహం, క్యాంపస్ ప్రాంగణంలో నిఘా పెట్టామని, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు వినియోగిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు తమ బాధ్యతలు విస్మరిస్తే విలువైన జీవితం కోల్పోతారని అన్నారు. ప్రతి విభాగంలో ప్రత్యేక ర్యాగింగ్ అవగాహన సదస్సులు న్యాయ నిపుణలతో పెట్టామన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులు పట్ల ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి సైతం తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాయని చెప్పారు. రాత్రులు సైతం వసతి గృహం పరిశీలిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు నియమావళి మేరకు ర్యాగింగ్ కేసులు క్రిమినల్ కేసులు కంటే తీవ్రంగా పరిగణించబడతాయని తెలిపారు. యూనివర్సిటీలో పటిష్టమైన యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ వ్యవస్థ ఉందని వివరించారు. రిజస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు పాల్గొన్నారు. -
విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం
అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తులసీరావు ఎచ్చెర్ల క్యాంపస్ : ప్రస్తుతం విద్యా ప్రమాణాలు మెరుగుపడవల్సిన అవసరం ఉందని, అంతర్జాతీయ ప్రమాణాలు విద్యలో ఉంటేనే విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగు పడతాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ రిజస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు అన్నారు. ఢిల్లీలో ఈ నెల 11 నుంచి 12 వరకు జరిగిన అంతర్జాతీయ ఫిక్కీ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సదస్సులో ప్రత్యేకంగా ఏపీ నాలెడ్స హబ్ అన్న అంశంపై నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సు వివరాలను ఆయన పరిపాలన కార్యాలయంలో విలేకరులకు మంగళవారం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యలో ప్రక్షాళన అవసరంగా చెప్పారు. ప్రస్తుతం మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంలో ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవటం, స్కైఫ్ విద్యా విధానం విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత విద్యా విధానం అభివృద్ధి చెందాలంటే విదేశీ విద్యాలయాలు, దేశంలోని ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ లాంటి విద్యాలయాలుతో అనుసంధానం చేయవల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విదేశీ ఒప్పందాలు వల్ల విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయని చెప్పారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, జాతీయ సాంకేతి క మండలి వంటి సంస్థలు విద్యా ప్రమాణాలు మెరుగుకు ప్రత్యేక దృష్టి పెట్టవల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి విశ్వవిద్యాలయల్లో మౌలిక వసతులు కల్పించటం, ఛారుుస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం అమలు చేయటం, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్సకు ప్రాధాన్యతనివ్వటం, టీచింగ్ సిబ్బందిని నియమించటం వంటి అంశాలు కీలకంగా వివరించారు. విదేశీ విద్యతో పోల్చి చూస్తే మన విద్యా ప్రమాణాలు వెనుకబడి ఉన్నాయని చెప్పారు. అమెరికా, జపాన్, సౌత్ కోరియా, బ్రిటన్ వంటి దేశాల్లో విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేసి మన విద్యలో సంక్షరణలు అమలు చేయవల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడాలంటే విద్యా విధానంలో మార్పులతోనే సాధ్యమని తులసీరావు చెప్పారు.\ -
అంబేడ్కర్ వర్సిటీ రిజిస్ట్రార్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆగ్రహం వ్యక్తం చేయడంతో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్ రాజీనామా చేశారు. శనివారం జరిగిన వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ భేటీలో వర్సిటీ పాలనా వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా గంటల తరబడి నిలబెట్టడం ఏంటనే అంశంపై మాటామాటా పెరిగింది. దీంతో సుధాకర్‌పై ఆచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మన స్థాపానికి గురైన రిజిస్ట్రార్ సుధాకర్ అప్పటికప్పుడే రాజీనామా చేశారు. -
డిగ్రీ ప్రయోగ పరీక్షలు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: డిగ్రీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు సెకెండ్ సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు సోమవారం ఆరంభమయ్యాయి. డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో జిల్లాలో ఏడు రీజియన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం పురుషుల కళాశాల పరిధిలో 14 కళాశాలలు, శ్రీకాకుళం మహిళలు-13, నరసన్నపేట-12, కాశీబుగ్గ (ఎస్బీఎస్వైఎం డిగ్రీ కళాశాల)-16, ఇచ్ఛాపురం-10, పాలకొండ-15, రాజాం(జీసీఎస్ఆర్ డిగ్రీ కళాశాల) పరిధిలో 11 కళాశాలలు ఉన్నాయి. ఇందులో కాశీబుగ్గ, రాజాం మినహా మిగిలిన రీజనల్ కేంద్రాలన్నీ ప్రభుత్వ కళాశాలలే. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లే చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తుండడంతో చూసిరాతలు జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కళాశాలల్లో ఎక్స్‌ట్రనల్ ఎగ్జామినర్లను ఓ గదిలో కూర్చోబెట్టి సపర్యలు చేసి చూసిరాతను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై వర్సిటీ పరీక్షల అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అసౌకర్యాల నడుమ పరీక్షలు.. కొన్ని కళాశాలల్లో ప్రయోగ పరీక్షలను విద్యార్థులు అసౌకర్యాల నడుమ రాస్తున్నారు. సరైన సదుపాయాలు, పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్‌లలో నేలపైనే కూర్చొని పరీక్షలు రాసారు. -
జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత
ప్రభుత్వ స్థలలతో పాటు అనుమతి లేని పలు ప్రాంతాల్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 45లోని అంబేద్కర్ యూనివర్సిటీ వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వస్థలంలో గుడిసెలు నిర్మించుకున్న పేదలను ఖాళీ చేయించడానికి వచ్చిన అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అయినా అధికారులు బలవంతంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. -
వారు నిధులిస్తారు.. మీరు చెల్లించండి
అంబేడ్కర్, తెలుగు వర్సిటీల రిజిస్ట్రార్లకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 92 సేవా కేంద్రాలు, శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 3ప్రాంతీయ పీఠాల్లో పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చే నిధులను స్వీకరించి, వాటిని ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాలని హైకోర్టు బుధవారం ఇరు యూనివర్సిటీల రిజిస్ట్రార్లను ఆదేశించింది. ఇదే సమయంలో 92 సేవా కేంద్రాలు, 3 ప్రాంతీయ పీఠాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఉన్న ప్రాంతీయ కేంద్రాలకు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తన సేవలను నిలిపేసిందని, దీనివల్ల 3.5 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంబ దులు పడుతున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. ఇదే సమయంలో ఏపీలోని క్యాంపస్‌లకు తమ సేవలను నిలిపేస్తూ తెలుగు విశ్వవిద్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రెండు వ్యాజ్యాలను బుధవారం ధర్మాసనం మరోసారి విచారించింది. ఏపీలోని స్టడీ సెంటర్లు, ప్రాంతీయ పీఠాల్లో ప్రస్తుతం ఎంత మంది పనిచేస్తున్నారు.. ఎంత మంది పదవీ విరమణ చేశారు.. వారికి చెల్లించాల్సిన మొత్తం ఎంత? తదితర వివరాలను ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఇవ్వాలని 2 యూనివర్సిటీల రిజిస్ట్రార్లను ఆదేశించింది. వాటి ఆధారంగా నిధులకు సంబంధించిన చెక్కులను రిజిస్ట్రార్లకు అందచేయాలని ముఖ్య కార్యదర్శికి తెలిపింది. చెక్కులు అందుకున్న తరువాత ఆ మొత్తాలను ఉద్యోగులకు చెల్లించాలంది. -
విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల సేవా కేంద్రాలకు సేవలందించే విషయంలో హైకోర్టు శుక్రవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడింది. ఒకరిని ఒకరు నిందించుకుంటూ విద్యార్థులకు ఏమీ చేయడంలేదని నిప్పులు చెరిగింది. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలూ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉభయులూ కూడా తమ ఉత్తర్వులను అమలు చేయలేదని హైకోర్టు మండిపడింది. ఈ ఏడాది సెప్టెంబర్ 4న ఉత్తర్వులు జారీ చేస్తే, ఇరువురూ కూడా తీరిగ్గా నవంబర్‌లో స్పందించారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. తమ ఉత్తర్వులు జారీ తరువాత, వాటిని అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో రాతపూర్వకంగా ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని అంబేడ్కర్ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధాకర్‌ను ఆదేశించింది. అలాగే కొన్ని కోర్సులను అర్ధంతరంగా నిలిపేయడంపై కూడా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని క్యాంపస్‌లకు సేవలను నిలిపేస్తూ తెలుగు వర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో ఉన్న ప్రాంతీయ కేంద్రాలకు అంబేడ్కర్ వర్సిటీ సేవలను నిలిపేసిందని, దీని వల్ల 3.5 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. ఈ రెండు వ్యాజ్యాలను మరోసారి విచారించిన సందర్భంగా ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ స్పందిస్తూ, ఏపీలోని సేవా కేంద్రాలకు సేవలందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను సక్రమంగా అమలు చేయలేదన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తాము సేవా కేంద్రాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు విడుదల చేశామన్నారు. దీనికి తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో కేవలం తెలుగు వర్సిటీకి సంబంధించింది మాత్రమేనని, అందులో అంబేడ్కర్ వర్సిటీ ప్రస్తావన లేదన్నారు. దీంతో జీవోను పరిశీలించిన ధర్మాసనం, అందులో అంబేడ్కర్ వర్సిటీ గురించి ఎందుకు ప్రస్తావించలేదని వేణుగోపాల్‌ను నిలదీసింది. అంబేడ్కర్ వర్సిటీ వెబ్సైట్ నుంచి ఏపీలోని 92 సేవా కేంద్రాల వివరాలను తొలగించిందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పం దించింది. రిజిస్ట్రార్ సుధాకర్‌తో సంప్రదించి సేవా కేంద్రాలు తొలగించలేదని తెలంగాణ ఏజీ కోర్టుకు చెప్పారు. దీంతో ధర్మాసనం, ఈ వ్యవహారంలో రిజిస్ట్రార్‌కు ఏదో ఉద్దేశాలున్నాయని అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. -
కోర్టు ఉత్తర్వులు అమలు కావడం లేదు
అంబేడ్కర్, తెలుగు వర్సిటీల వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చిన ఏపీ ఏజీ తీవ్రంగా పరిగణిస్తామన్న ధర్మాసనం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల సేవా కేంద్రాలకు గతంలో మాదిరిగా యథాతథంగా సేవలు అందించడంతో పాటు, పరీక్షలను సైతం నిర్వహించాలని ఇరు విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అమలు కావడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ మంగళవారం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ, ఇది చాలా తీవ్రమైన అంశమని, సేవలు కొనసాగింపు, పరీక్షల నిర్వహణలో తామిచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా ఉంటే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని క్యాంపస్‌లకు తమ సేవలను నిలిపేస్తూ తెలుగు వర్సిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో ఉన్న ప్రాంతీయ కేంద్రాలకు అంబేడ్కర్ వర్సిటీ తన సేవలను నిలిపేసిందని, దీని వల్ల 3.5 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. ఈ రెండు వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం మంగళవారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, ఏపీలోని ఈ రెండు విశ్వవిద్యాలయాల సేవా కేంద్రాల నిర్వహణ ఖర్చులను, అందులో పనిచేస్తున్న బోధనా, బోధనేతర సిబ్బంది జీతాలను ఏపీ ప్రభుత్వమే భరించాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అలాగే ఏపీలోని సేవా కేంద్రాలకు యథాతథంగా సేవలను కొనసాగించడంతో పాటు పరీక్షలను సైతం నిర్వహించాలని ఇరు విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను గత విచారణ సమయంలో ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అయితే ఈ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది. -
బీఈడీ ఫలితాలు విడుదల
శ్రీకాకుళం జిల్లా : ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బీఈడీ ఫలితాలు విడుదల అయ్యాయి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్ శనివారం ఫలితాలను విడుదలచేశారు. బీఈడీలో 82శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. మొత్తం 18,017 మంది పరీక్షలు రాయగా 14,090మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన చెప్పారు. -
అంబేద్కర్ వర్సిటీ ప్రవేశపరీక్ష ఫలితాల విడుదల
బంజారాహిల్స్(హైదరాబాద్): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం విశ్వ విద్యాలయం గత నెల 30న అర్హత పరీక్షను నిర్వహించింది. మొత్తం 14,403 మంది అభ్యర్ధులు పరీక్ష రాయగా ఇందులో 12,487 మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాలను అంబేద్కర్ వర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చని, అడ్మిషన్లకు ఈ నెల 25 చివరి తేదీ అని వారు తెలిపారు. -
'కోర్టు తీర్పు మాకు సానుకూలం'
హైదరాబాద్: అంబేడ్కర్, తెలుగు విశ్వవిద్యాలయాలపై కోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సానుకూలంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్క మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలన్నారు. గవర్నర్ మాట కూడా లెక్కచేయకుండా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని వాపోయారు. పాఠ్యపుస్తకాల్లో సిలబస్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. పాఠ్యపుస్తకాల్లో ఆంధ్ర కవుల, రచయితల పాఠాలను తొలగించడం దారుణమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
అంబేడ్కర్ వర్సిటీలో కొత్త పీజీ కోర్సు
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కోర్సు కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఈ రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉండడంతో ఈ కోర్సును తీసుకొచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించారు. ఇంగ్లిష్ మీడియంలో ఉన్న ఈ కోర్సుకు ఏదేని డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 8 గడువుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలు వర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చు. -
30న 'అంబేడ్కర్' వర్సిటీ రెండో విడత ప్రవేశ పరీక్ష
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రెండో విడత ప్రవేశ పరీక్ష ఈ నెల 30న నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24 వరకు ఆఖరి గడువని పేర్కొన్నారు. పరీక్షకు రెండు రోజుల ముందు హాల్‌టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతో స్తంభించిన అంబేడ్కర్ వర్సిటీ సేవలు
అనంతపురం ఎడ్యుకేషన్ : అంబేడ్కర్ యూనివర్సిటీ అడకత్తెరలో పోకచెక్కలా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన నేపథ్యంలో మన రాష్ట్రంలో వర్సిటీ సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఆందోళనకు గురువుతున్నారు. దీనిపై పలువురి స్పందనలు ఇలా ఉన్నాయి. విద్యార్థులకు తీవ్ర నష్టం మన రాష్ట్రంలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సేవలు నిలిచిపోవడంతో వివిధ కోర్సులు చేస్తున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థులు నష్టపోకుండా చూడాలి. -రామగంగిరెడ్డి, అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ రాష్ట్ర విభజనతో దుష్ఫలితాలు రాష్ట్ర విభజన నేపథ్యం విద్యారంగంపై దుష్ఫలితాలు చూపుతోంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అంబేడ్కర్ వర్సిటీని ఆశిస్తున్నారు. చేయని తప్పుకు విద్యార్థులు బలవుతున్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి మన రాష్ట్రంలో అంబేడ్కర్ దూరవిద్య విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. -డీ. మురళీధర్‌రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్కేయూ విద్యలో పక్షపాతం తగదు విద్యలో పక్షపాత ఉండకూడదు. పద్మావతి యూనివర్సిటీలో రాయలసీమకు 20 శాతం, తెలంగాణకు 40, కోస్తాకు 40 శాతం సీట్లు కేటాయించారు. అంబేడ్కర్ యూనివర్సిటీలోనూ ఇదే విధానం అనుసరించాలి. విద్య అనేది అందరికీ సమానం -డాక్టర్ ఎం. శ్రీరాములు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్కేయూ -
ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు
హైదరాబాద్ సిటీ: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయాలనుకునేవారు ఈ నెల 23 వరకు ఐసెట్- 2015 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ ఆచార్య సి.హెచ్.వి రామచంద్రమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. దూర విద్యలో చేరడానికి ఆసక్తి కలిగిన విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో పంపాలని చెప్పారు. ఇతర కళాశాలల్లో రెగ్యులర్ విధానంలో ఎంబీఏలో చేరే విద్యార్థులు రూ. 500 అపరాధ రుసుముతో ఈ నెల 20 వరకు దరఖాస్తు చేయవచ్చన్నారు.