anticipatory bail plea
-
‘రాజకీయ కారణాలతోనే ఏఆర్ డెయిరీపై కేసు’
అమరావతి, సాక్షి: తిరుపతి లడ్డూ వ్యవహారంలో.. ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ (Rajasekaran) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సోమవారం ఆయన ఓ పిటిషన్ వేశారు.తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) ఫిర్యాదుతో తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో.. తనపై అరెస్టు సహా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తన పిటిషన్లో ఆయన కోరారు.నెయ్యి శాంపిల్స్ సేకరణ జరిపి.. దాన్ని విశ్లేషించడంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండెడ్స్ అథారిటీ నిబంధనలేమీ అనుసరించలేదని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించారు. అలాగే తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండానే కేసు పెట్టడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.తనపై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని, రాజకీయ కారణాలతో కేసు పెట్టారని ఆరోపిస్తున్నారాయాన. ఈ క్రమంలో తన ముందస్తు బెయిల్ మంజూరుకు ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానని ఆయన అభ్యర్థిస్తున్నారు. ఈ పిటిషన్ రేపు(మంగళవారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: లడ్డూ వివాదం.. జగన్ చెప్పిందే కోర్టూ చెప్పింది! -
వైఎస్సార్సీపీ నేతలపై అప్పటివరకు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు
సాక్షి, విజయవాడ: తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను కేసుల్లో ముద్దాయిలుగా లేరని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ముద్దాయిలుగా చేర్చితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సజ్జల, ఆర్కేలను ముద్దాయిలుగా చేర్చితే నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చిన 5 రోజులు వరకు అరెస్ట్ చేయవద్దని హై కోర్టు స్పష్టం చేసింది.ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగాం సురేష్‌కు సంబంధించిన విచారణను ఆగస్టు 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు చర్యలు ఏమీ తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్‌పై 14వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. -
ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట లభించింది. తమపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ, వైఎస్సార్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిపింది. తదుపరి విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా వేసిన కోర్టు.. అప్పటివరకు ఎలాంటిచర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది. -
ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట
సాక్షి, విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది.పిన్నెల్లితో సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఊరట లభించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేసులున్న అభ్యర్థులపై వచ్చే నెల 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది.కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. సంఘటన ఈనెల 13న జరిగితే.. 15న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. ముందు ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని.. తర్వాత లోకేష్ ట్విట్టర్లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై నిరంజన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ట్విట్టర్లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని.. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన నిరంజన్‌రెడ్డి.. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉంటే 41A నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు. -
చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు
సాక్షి, ఢిల్లీ/విజయవాడ: అవినీతి కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ శుక్రవారమూ కలిసి రాలేదు. న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అటు సుప్రీంకోర్టులో.. ఇటు విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ శుక్రవారం ఆయనకు ఎలాంటి ఊరటా లభించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్‌ను విచారణ అనంతరం సుప్రీం కోర్టు శుక్రవారం వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. సిద్ధార్థ లూథ్రా వాదనలు పిటిషనర్‌పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ఫైబర్‌నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం విచారణను నవంబర్ ఎనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తరఫు లాయర్లకు గుర్తు చేసిన ధర్మాసనం ఆ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన తర్వాతనే ఫైబర్‌నెట్ కేసును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌పై తీర్పును నవంబర్ ఎనిమిదవ తేదీన వెల్లడిస్తామంది ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. అయితే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఎనిమిదవ తేదీకి కాకుండా.. తొమ్మిదవ తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు లాయర్ లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత ఇబ్బంది రీత్యా తదుపరి విచారణను ఒక్కరోజు ముందుకు జరపాలని కోరారు. ధర్మాసనం ఆ విజ్ఞప్తిని మన్నించి.. నవంబర్ తొమ్మిదివ తేదీనే విచారణ చేపడతామని తెలిపింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని.. పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే పక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. సెక్షన్17-ఏ మీదనే వాడివేడి వాదనలు జరిగాయి. వాదనలు ముగిసే సమయంలో చంద్రబాబు తరఫు లాయర్ హరీశ్ సాల్వే మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేశారు. కానీ, కేసులో ప్రధాన వాదనలు విన్నామని.. ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ప్రస్తావన ఉండబోదని.. నేరుగా తుది తీర్పే ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీర్పు ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠత సర్వత్రా ఏర్పడింది. ఇదీ చదవండి: అవినీతిపరులకు ‘17ఏ’ రక్షణ కవచం కాదు మరోవైపు ఫైబర్ నెట్ కేసు పిటిషన్‌ను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తాలూకూ ప్రభావం శుక్రవారం ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ జరిగే విచారణపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ సీఐడీ చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. చంద్రబాబును కోర్టులో హాజరు పర్చాలని కూడా ఆదేశించింది. కానీ, సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో.. అది వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం జరగాల్సిన విచారణ సైతం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబును కోర్టులో హాజరుపరచాల్సి వస్తే.. అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. ఏసీబీ కోర్టులోనూ.. లీగల్ ములాఖత్‌ల సంఖ్య పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్‌ను శుక్రవారం అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం కొట్టేసింది. ములాఖత్‌ల సంఖ్య పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు గురువారం కోరారు. చంద్రబాబు కేసుల విచారణ వివిధ కోర్టుల్లో ఉన్నందున ములాఖత్‌ల సంఖ్య మూడుకు పెంచాలని పిటిషన్లో అభ్యర్థించారు. అయితే.. అలా చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది. తాజాగా శుక్రవారం ఈ పిటిషన్ ఏసీబీ కోర్టు ముందుకు రాగా.. కోర్టు కొట్టేసింది. ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని తిరస్కరిస్తూ.. సరైన లీగల్ ఫార్మట్‌లో దాఖలు చేయాలంటూ చంద్రబాబు తరపు లాయర్లకు సూచించింది. ►కాల్ డేటా రికార్డింగ్స్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించగా.. ఈ నెల 26వ తేదీ వరకు సమయం కావాలని కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పిటిషన్‌ను వాయిదా వేసింది ఏసీబీ కోర్టు -
Oct 20th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases Arrest Remand Court Hearings And Political Updates 20:49, అక్టోబర్ 20, 2023 మనసంతా బాబే.! ► తెలంగాణ ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబు గురించే ► బాబు ఎప్పుడొస్తాడు? తనకు ఎలా దారి చూపిస్తాడు? ► తెలంగాణ ఎన్నికల కీలక సమయంలో బాబు గైడెన్స్ లేకుండా ఎలా పని చేసేది? 19:49, అక్టోబర్ 20, 2023 రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691 చంద్రబాబు ఆరోగ్యం కుశలం ► రాజమండ్రి జైల్లో చంద్రబాబు క్షేమంగా ఉన్నారన్న డాక్టర్లు ► ఇవ్వాళ్టి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన డాక్టర్లు 19:39, అక్టోబర్ 20, 2023 యాక్షన్ ఎవరిపై.? రియాక్షన్ ఎవరిపై ? ► రాజమండ్రిలో ఈ నెల 23 న టీడీపీ - జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ ► పైకి పొత్తుల ప్రకటన, లోలోన గుంభనంగా మంతనాలు ఈ పొత్తుతో నాకేంటీ అన్న చందాన టీడీపీ, జనసేన నాయకులు ఎంత లాభపడదాం? ఎన్ని సీట్లలో పోటీ చేద్దాం? గెలిచే సీట్లు ఎన్ని? కచ్చితంగా ఓడే సీట్లు ఎన్ని? పైకి ఉద్యమ కార్యాచరణ, లోన సమన్వయ సమస్య ఇప్పటికిప్పుడు పక్క పార్టీకి ఎలా జై కొట్టేది? పోటీకి అవకాశం లేనపుడు సాగిలపడడమెందుకు? అసంతృప్తిని కప్పిపుచ్చేందుకు అటు పవన్, ఇటు లోకేష్ రకరకాల ప్రయత్నాలు 19:19, అక్టోబర్ 20, 2023 ముఖ్యమంత్రి ఆశలకు మంగళం ► జనసేన కార్యవర్గానికి స్పష్టత ఇచ్చిన పవన్ ► సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యం ► ముఖ్యమంత్రి పదవి అంటే ఇష్టమే, సుముఖమే ► కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పదవి గురించి ఆలోచించే పరిస్థితి లేదు ► ఈరోజు మన ప్రాధాన్యం సీఎం పదవి కాదు ► జనసేన కార్యకర్తలకు ఇబ్బందులు ఉన్నా టిడిపితో కలిసి వెళ్లాలి ► గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలి ► ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుంది ► ఒకరి అండదండలు లేకుండా జనాదరణతో ఇంతదూరం వచ్చాం ► 150 మంది క్రియాశీల సభ్యులతో పార్టీ ప్రారంభమైంది ► ప్రస్తుతం పార్టీలో 6.5 లక్షల మందికి పైగా సభ్యులున్నారు ► పార్టీపరంగా ఏ నిర్ణయమైనా నేను ఒక్కడినే తీసుకునేది కాదు ► ప్రజల్లో ఉన్న భావాన్ని పలు నివేదికల ద్వారా తెప్పించుకున్నా ► మన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులే ► క్రియాశీల సభ్యుల అభిప్రాయాలు నివేదిక రూపంలో తీసుకుంటున్నా ► అందరి అభిప్రాయాల మేరకే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నా 18:18, అక్టోబర్ 20, 2023 2 ములాఖత్ లకు ఓకే ►చంద్రబాబుకు జైల్లో రెండు లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ►చంద్రబాబుకు భద్రత దృష్ట్యా రెండు ములాఖత్‌లను ఒకటికి కుదించిన జైలు అధికారులు ►లీగల్ ములాఖత్‌లు మూడుకి పెంచాలని మరోసారి పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు ►వివిధ కోర్టులలో కేసులు ఉండటంతో మూడు ములాఖాత్‌లు ఇవ్వాలని కోరిన బాబు తరపు న్యాయవాదులు ►రెండు ములాఖత్ లను అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు 17:20 అక్టోబర్ 20, 2023 నవంబర్ 9కి ఫైబర్ గ్రిడ్ కేసు ►ఏసీబీ కోర్టులో ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై నిర్ణయం వాయిదా ►పైబర్‌నెట్ పీటీ వారెంట్‌పై నిర్ణయం నవంబర్ 10కి వాయిదా ►సుప్రీంకోర్టులో ఫైబర్‌నెట్ కేసుపై విచారణ ఉన్నట్లు సీఐడీ మెమో ►సీఐడీ మెమో ఆధారంగా ఏసీబీ కోర్టులో విచారణ నవంబర్ 10కి వాయిదా ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ నవంబర్9కి వాయిదా ►తొలుత నవంబర్8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ►నవంబర్9న విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాది విజ్ఞప్తి 15:10, 20 అక్టోబర్ 20, 2023 హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ ఖాళీ ►బీఆర్ఎస్లో చేరిన టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ► రావులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ►కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు అధికారం లోకి వచ్చింది బీఆర్ఎస్: రావుల ►కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుంది ►మేము అభివృద్ది కోసం పోటీ పడ్డాం కానీ వ్యక్తుల కోసం ఏనాడూ పోటీ పడలేదు 14:05 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్ వాయిదా ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్ విచారణ వాయిదా ►ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►చంద్రబాబు లాయర్ల పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడీకి ఆదేశం ►ఈ నెల 26వరకు సమయం కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►పీపీ విజ్ఞప్తితో పిటిషన్ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 13:55 అక్టోబర్ 19, 2023 టీడీపీ శ్రేణుల్లో వైరాగ్యం ►చంద్రబాబు అరెస్ట్‌తో పాతాళానికి పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ►నాయకత్వ లేమితో పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ►మాటిమాటికి ఢిల్లీకి పోతున్న నారా లోకేష్ ►హడావిడి చేసి.. ఆపై సినిమాలతో బిజీ అయిన నందమూరి బాలకృష్ణ ►సగం సినిమా షూటింగ్‌లతో.. సగం రాజకీయాలతో అయోమయస్థితిలోకి జనసేన క్యాడర్‌ను నెట్టేసిన పవన్ ► సింపథీ కోసం నారా భువనేశ్వరి యాత్ర తెరపైకి ►బాబు అరెస్ట్ అప్పటి నుంచి.. ఇచ్చిన నిరసనల పిలుపునకు ప్రజల నుంచి కనీసం స్పందన లేని వైనం ►న్యాయస్థానాల్లోనూ వరుసగా తగులుతున్న దెబ్బలు.. దక్కని ఊరట ►పండుగ తర్వాత కూడా పరిస్థితి మారకుంటే.. తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్న కొందరు నేతలు 13:34 అక్టోబర్ 19, 2023 స్కిల్ స్కామ్ లో బయటపడింది గోరంత! డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కామెంట్స్ ►దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు చంద్రబాబు ►చంద్రబాబు అరెస్టు అయిన బాధ ఆయన కుటుంబ సభ్యుల్లో కనిపించలేదు.. ►చంద్రబాబు బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు? ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయం చేస్తున్నారు ►బాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారు? ►చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణ కోరవచ్చు కదా! ► రూ. 371 కోట్ల అవినీతిలో అడ్డంగా దొరికిపోయారు కాబట్టి జైలు జీవితం అనుభవిస్తున్నారు ►స్కిల్ స్కామ్ లో బయటపడింది కేవలం గోరంత మాత్రమే ►చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెతికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుంది నారా బ్రాహ్మణి ట్వీట్స్ వెనుక అత్తమామల వేధింపులే కారణం అయ్యుండొచ్చు. @brahmaninaraతో గొడవపడి అప్పట్లో నారా భువనేశ్వరి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. నారా ఇంటిగుట్టు వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. - మాజీ మంత్రి పేర్నినాని #GajaDongaChandrababu#EndofTDP pic.twitter.com/slTX4WCgm5 — YSR Congress Party (@YSRCParty) October 20, 2023 13:06 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మరో రెండు పిటిషన్లు బాకీ ►ఏసీబీలో కోర్టులో ఇవాళ ఇంకా రెండు విచారణకు రావాల్సిన చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ విచారణపై నిర్ణయం తీసుకోనున్న ఏసీబీ కోర్టు ►సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదాతో.. ఏసీబీ కోర్టులోనూ వాయిదా పడే అవకాశం ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు 12:55 అక్టోబర్ 19, 2023 ఓడిపోయే స్థానాలు మనకొద్దు సార్ ►మంగళగిరిలో జనసేన సీనియర్లు, ముఖ్యనేతలతో భేటీ కానున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ►టీడీపీతో పొత్తు, వారాహి యాత్రపై చర్చించనున్న పవన్ ►టీడీపీ ముందర జనసేన డిమాండ్లు ఉంచాలని పవన్‌పై ఒత్తిడి చేయనున్న సీనియర్లు ►పాతికా, ముప్ఫై కాదు.. జనసేనకు యాభై సీట్లు కేటాయించాలి ►సామాజిక వర్గ బలం ఉన్న నియోజకవర్గాలతో పాటు అడిగిన నియోజకవర్గాలే ఇవ్వాలి ►ఓడిపోయే స్థానాలను అంటగట్టొద్దు ►వారాహి యాత్ర అంతటా చేయడం దండగ ►పోటీ చేసే స్థానాల్లోనే చేద్దాం ►పవన్ కల్యాణ్‌కు రెండు సీట్లు ఇవ్వాలి.. రెండు చోట్లా పోటీకి టీడీపీ వాళ్లు కృషి చేయాలి ►టీడీపీకి సమాన గౌరవం జనసేనకు ఇవ్వాలి ►టీడీపీ రెబల్స్‌కు జనసేనలోకి పంపకూడదు ►పార్టీని నమ్ముకున్న వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి ►లిక్కర్, పెట్రోల్.. ఇలా మొత్తం ఎన్నికల ఖర్చంతా టీడీపీనే భరించాలి 12:32 అక్టోబర్ 19, 2023 లాయర్ల కోట్ల ఫీజులకు డబ్బెక్కడది?: లక్ష్మీ పార్వతి ►చంద్రబాబు కేసుల కోసం సీనియర్ లాయర్లు ►40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పని చేస్తున్నారు ►సీనియర్ లాయర్లకు రోజు రూ.కోటి నుంచి రూ.2.50 కోట్లు ఫీజు ►లాయర్ల ఫీజుకే కోట్లకు పైగా ఖర్చు ఉండొచ్చు ►2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పారు ►లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడ్నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తెలపాలి ►దాచుకున్న అవినీతి సొమ్మును లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా? 11:22 అక్టోబర్ 19, 2023 క్వాష్ తర్వాతే ఫైబర్ నెట్ సంగతి ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 9వ తేదీకి వాయిదా ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు పెండింగ్‌లో ఉందని.. అది ఇచ్చేవరకు ఆగాలని బాబు లాయర్లకు సూచించిన సుప్రీంకోర్టు ►ఆ తర్వాతే ఫైబర్ నెట్ కేసు సంగతి చూస్తామని వెల్లడి ►చంద్రబాబు జైలులోనే ఉన్నారు కదా, మీరు ఇంటరాగేషన్ చేసుకోవచ్చు కదా: జడ్జి ►క్వాష్ పిటిషన్‌పై 8వ తేదీన తీర్పు ఇస్తామన్న ధర్మాసనం ►క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►ఇవాళ లిఖిత పూర్వక వాదనల సమర్పణకు ఆఖరు తేదీ ►17ఏ సెక్షన్‌పైనా సాగిన వాడీవేడి వాదనలు ►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్‌కు సుప్రీం నో ► నేరుగా తుది తీర్పే ఇస్తామని చంద్రబాబు లాయర్లకు స్పష్టీకరణ ►నవంబర్ 8 కోసం ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన టీడీపీ శ్రేణులు 10:59 అక్టోబర్ 19, 2023 ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ►విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్ వాదనలు సిద్ధార్థ లూథ్రా వాదనలు: ►పిటిషనర్‌పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ►ఫైబర్‌నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు ►ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ►చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం -- ►వాదనల తర్వాత తదుపరి విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు ►వ్యక్తిగత ఇబ్బంది కారణంగా ఆ మరుసటి రోజుకి విచారణ కోరిన లాయర్ లూథ్రా ► సరేనన్న ధర్మాసనం ► నవంబర్ 9దాకా.. చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని, పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం 10:49 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ ►చంద్రబాబు లీగల్ ములాఖత్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు ►లీగల్ ములాఖత్‌లను పెంచాలని గురువారం పిటిషన్ వేసిన బాబు లాయర్లు ► వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసుల విచారణలు ఉన్నందునా.. లీగల్ ములాఖత్‌ల సంఖ్య మూడుకి పెంచాలని పిటిషన్లో కోరిన లాయర్లు ► అత్యవసర విచారణ కోరగా.. సాధ్యం కాదన్న కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశం ►ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదంటూ ఇవాళ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ►సరైన లీగల్ ఫార్మట్‌లో మరోసారి పిటిషన్ ఫైల్ చేయమని సూచన 10:15 అక్టోబర్ 19, 2023 చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్‌నెట్ స్కాం ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ అభియోగాలు ►టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనం దోపిడీ ►రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారు ►బాబు హయాంలో 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగింది ►2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు ►చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ ►హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీ ►బ్లాక్ లిస్టులో ఉన్న టెరా కంపెనీకి టెండర్ ►అభ్యంతరం తెలిపిన ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ బదిలీ ►టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగింపు ►ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల ►అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి చేరిక ►ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటు!! ►అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బుల తరలింపు ►నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బు బదిలీ ►ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమకు చేరిక ►పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చివరకు చంద్రబాబు వద్దకు ►ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లే అని సీఐడీ దర్యాప్తులో వెల్లడి 09:45 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్లపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు చంద్రబాబు మూడు పిటిషన్లపై విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ ►సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ►నేడు ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డ్స్ పిటిషన్‌పై విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్‌పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు ►సీడీఆర్ పిటిషన్ నేడు విచారించనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబుకి లీగల్ ములాఖాత్ల సంఖ్య మూడుకి పెంచాలని గురువారం బాబు లాయర్ల పిటిషన్ ►అత్యవసర విచారణకు నిరాకరించిన ఏసీబీ కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశం ►నేడు లీగల్ ములాఖత్‌ల పిటిషన్‌పైనా విచారణ జరిగే అవకాశం 08:55 అక్టోబర్ 19, 2023 బాబు ఆరోగ్యం.. నారా ఫ్యామిలీ అల్లిన కథలు ►గురువారం వర్చువల్ విచారణ టైంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన జడ్జి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? చంద్రబాబు : ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : జైల్లో డాక్టర్లున్నారు కదా, రోజూ చెక్ చేస్తున్నారా? చంద్రబాబు : అవును, రోజూ డాక్టర్లు చెక్ చేస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : డాక్టర్లు హెల్త్ రిపోర్ట్ ఇస్తున్నారా? చంద్రబాబు : అవును, డాక్టర్లు ఏ రోజుకారోజు హెల్త్ రిపోర్టు ఇస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? చంద్రబాబు : జెడ్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిని నేను, నాకు సెక్యూరిటీపై అనుమానాలున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : మీకున్న సందేహాలను రాతపూర్వకంగా ఇవ్వండి, పరిశీలిస్తాం ఇవి చంద్రబాబు స్వయంగా జడ్జి ఎదుట చెప్పిన మాటలు.. మరి నారా ఫ్యామిలీ ఏమంటోంది? మా నాన్నకు స్టెరాయిడ్స్ : గత వారం తనయుడు నారా లోకేష్ బాబు చంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉంది, ఆయన కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ►ఈ ఆరోపణలన్నీ వట్టివేనని తేల్చిన కోర్టు విచారణ ►లోకేష్, భువనేశ్వరీ అసత్య ఆరోపణలు ఎందుకు? ►స్టెరాయిడ్స్, కిడ్నీలు ఎక్కడినుంచి అల్లిన కథలు? ►టీడీపీ పతనం నేపథ్యంలోనే.. సానుభూతి కోసం అసత్యాల ప్రచారమా? 08:36 AM, అక్టోబర్ 20, 2023 తీర్పు ఎప్పుడన్న దానిపై ఉత్కంఠ ►చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ ►స్కిల్ డెవెలప్మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏపై వాడీవేడిగా సాగిన వాదనలు ►ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి ఇవాళ(శుక్రవారం) ఆఖరిరోజు ►వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ ►నేరుగా తీర్పు ఇస్తామంటూ.. బాబు లాయర్లు చేసిన మధ్యంతర బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం ►21 నుంచి 29 దాకా కోర్టుకు దసరా సెలవులు ►ఎలాంటి తీర్పు వస్తుందో? ఎప్పుడు వస్తుందోనని చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళన 08:15 AM, అక్టోబర్ 20, 2023 టీడీపీ ఆశలన్నీ ఆ ఫలితం మీదే! ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఇవాల్టి నుండి చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ కొనసాగింపు ►నవంబర్ 1 వరకు రిమాండ్‌లోనే చంద్రబాబు ►సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ ఫలితంపైనే టీడీపీ ఆశలు ►జైల్లో చంద్రబాబుకు యధావిధిగా కొనసాగుతున్న ఆరోగ్య పరీక్షలు ►సుప్రీంలో క్వాష్ పిటిషన్ ఫలితం తేలాకే ప్రారంభం కానున్న భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర 07:43 AM, అక్టోబర్ 20, 2023 సుప్రీంలో బాబు ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►సుప్రీం కోర్టులో నేడు ఫైబర్ నెట్ స్కామ్ కేఏసు విచారణ ►ఫైబర్ నెట్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ► ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణ ► హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►9వ నెంబర్ కేసుగా లిస్ట్ అయిన పిటిషన్ ►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపుల్లో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు ►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాప్ట్ కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడం పై అవినీతి ఆరోపణలు ► ఇవాళ్టి సుప్రీం ఆదేశాల తర్వాతే.. పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 07:30, అక్టోబర్ 19, 2023 అన్నీ నిజాలే చెప్పాలి ► నిజం గెలవాలి పేరిట యాత్రలో నారా భువనేశ్వరీ నిజం చెప్పాలి ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 07:10 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబుకు భద్రతా అనుమానాలు ►జైల్లో తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు ►గురువారం వర్చువల్ విచారణ సందర్భంగా జడ్జితో ప్రస్తావించిన బాబు ►అలాంటి సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని బాబుకి సూచించిన కోర్టు ►చంద్రబాబు రాసిన లేఖను సీజ్ చేసి సమర్పించాలని అధికారులకు కోర్టు ఆదేశం ►ఆరోగ్య సమస్యలూ ఉన్నాయని జడ్జితో చెప్పిన చంద్రబాబు ►అధికారుల్ని వివరణ కోరిన ఏసీబీ న్యాయమూర్తి ►ప్రత్యేక వైద్య బృందం ఉందన్న అధికారులు ►వైద్య నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించిన ఏసీబీ జడ్జి 07:10 AM, అక్టోబర్ 20, 2023 వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ►సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ను తోసిపుచ్చిందని గుర్తు చేసిన సీఐడీ తరపు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణ చేపట్టలేమన్న హైకోర్టు ►విచారణను దసరా తర్వాతకి వాయిదా వేసిన కోర్టు ► వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని రిక్వెస్ట్ చేసిన బాబు లాయర్లు ►బాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం ►చంద్రబాబు ఆరోగ్య సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లిన బాబు లాయర్లు 06:55 AM, అక్టోబర్ 20, 2023 వివిధ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ కేసులో నేడు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ►ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న ద్విసభ్య ధర్మాసనం ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ ►ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►నేడు లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయవాదులు ►తీర్పు దసరా తర్వాతే వెలువడే అవకాశం? ►ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసు విచారణ నవంబరు 7కి వాయిదా ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►సుప్రీంలో ఫైబర్‌నెట్ కేసు విచారణ ఉండడంతో.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హాజరు పెండింగ్ ► సుప్రీం ఆదేశాల తర్వాతే.. ఫైబర్ నెట్ కేసులోనూ పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే ఛాన్స్ 06:35 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబు రిమాండ్ @41 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజుకి చేరిన జ్యుడీషియల్ రిమాండ్ ► 7691 నెంబర్‌తో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ► స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది వసతి ►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి ►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు ►తాజాగా.. గురువారం ఐదోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగింపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రం అట్టుడికిపోతున్నట్లు JaiTDP, ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కరోజూ కూడా ఎక్కడా హెరిటేజ్‌ని మూసిన దాఖలాలు కనిపించలేదు. నేను వస్తున్నా అంటూ గప్పాలు కొట్టిన బాలయ్య.. హైదరాబాద్‌కి వెళ్లిపోయి కులాసాగా సినిమా పూర్తి చేసుకుని ఈరోజు… pic.twitter.com/C9SXh0EKTU — YSR Congress Party (@YSRCParty) October 19, 2023 -
సుప్రీంలో చంద్రబాబు రెండు పిటిషన్ల విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. స్కిల్‌డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో క్వాష్ పిటిషన్‌తో పాటు ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేర్వేరు పిటిషన్లు వేశారాయన. ఈ క్రమంలో ఇవాళ రెండు పిటిషన్లు విచారణకు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు వినిపించారు. ‘‘ఐదేళ్ల కిందట జరిగిన నేరానికి కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చట్టం అనుమతిస్తుంది. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారనేది ముఖ్యం కాదు. నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టం ఆధారంగానే విచారణ జరగాలి. కొన్ని చట్టాలను సవరించిన ఆ చట్టంలోని మిగిలిన భాగం అలాగే కొనసాగుతుంది. 17ఏ చట్టం తర్వాత జరిగిన కేసులకే వర్తిస్తుందని.. సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవినీతి అనేది ఎప్పుడు ఉద్యోగ బాధ్యత కిందకు రాదు. 17ఏ చట్టంం ప్రాథమిక విచారణకే వ్యతిరేకం అయినప్పుడు.. కేసులు ఎలా విచారిస్తారు. 17ఏ విషయంపై నాలుగు హైకోర్టులు చెప్పిన తీర్పులు చంద్రబాబుకి వ్యతిరేకంగానే ఉన్నాయి. నేరం జరిగిన సమయానికి 17ఏ లేదు కాబట్టి.. ఇది బాబుకి వర్తించదు. ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 17ఏ చంద్రబాబుకు వర్తించదు. ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 17ఏ చంద్రబాబుకు వర్తించదు.. ఇది అవినీతికి సంబంధించిన చట్టం. అవినీతి పరుల్ని కాపాడే చట్టం కాదు. చంద్రబాబు కేసు ఉద్యోగ బాధ్యత కిందకు రాదు కాబట్టి 17ఏ వర్తించదు. గతంలో నేరం జరిగి.. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసినా 17ఏ వర్తించదు. చంద్రబాబుది సాక్ష్యాలు తారుమారు చేయడం.. ప్రజాధనం లూటీ చేసిన కేసు. అరెస్ట్ చేసిన వెంటనే సెక్షన్ 482 కింద క్వాష్ అడగడం ఎంత వరకు కరెక్టో కోర్టు నిర్ణయించాలి. పోలీసులకు కనీసం విచారణ చేసే అవకాశం ఇవ్వకుండా క్వాష్ కోరడం ఎంత వరకు సబబు. స్కిల్ స్కాం కేసు విచారణ ప్రాథమిక దశలో ఉంది. ఈ సమయంలో చంద్రబాబు క్వాష్ సరికాదు. 17ఏ చట్టం రాకముందు జరిగిన నేరాలకు.. 17ఏ వర్తించదని నాలుగు హైకోర్టులు తీర్పు ఇచ్చాయి. 17ఏ వర్తిస్తుందని ఏమైనా తీర్పులున్నాయా? అని ప్రశ్నించిన బెంచ్ అలా తీర్పులు వచ్చినట్లు నా దృష్టికి రాలేదు.. రోహత్గీ 17ఏ వర్తిస్తుందని తీర్పులు ఉన్నాయి.. చంద్రబాబు తరపు న్యాయవాది లాయర్ లూథ్రా రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ.. ‘‘కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు.. విచారణను అడ్డుకోవద్దని సుప్రీం కోర్టు పలుమార్లు తీర్పు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నారు. మరి నిర్ణయాలతో సంబంధం లేకుంటే.. 17ఏ ఎలా వర్తిస్తుంది?. 17ఏ అనేది కేవలం అధికార బాధ్యతలకు సంబంధించిన సెక్షన్. నేనే ఈ నిర్ణయాలకు బాధ్యుడిని అని చంద్రబాబు అంటేనే సెక్షన్ 17ఏ వర్తిస్తుంది. ఈ కేసులో 2018 జూన్ 5వ తేదీన జీఎస్టీ డీజీ రాసిన లేఖ చాలా కీలకం. విచారణ 2018లోనే ప్రారంభమైంది అని చెప్పడానికి ఇది తిరుగులేని సాక్ష్యం. జీఎస్టీ డీజీ రాసిన లేఖపై హైకోర్టులోనూ వాదనలు జరిగాయి. జీఎస్టీ రాసిన సమయంలో చంద్రబాబే సీఎంగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతోందని.. 2017లోనే ఒక విజిల్ బ్లోయర్ లేఖ రాశారు. విజిల్ బ్లోయర్ పేరు చెప్పకుండా ఉండే చట్టం.. ఇంకా అమల్లో ఉందా? అని రోహత్గీని అడిగిన సుప్రీం కోర్టు విజిల్ బ్లోయర్తన గుర్తింపును చెప్పకుండా ఉండే హక్కు ఉంది: రోహత్గీ ..14మే 2017లో మరోసారి విజిల్ బ్లోయర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరుగుతోందని పుణే జీఎస్టీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రత్యేక చట్టానికి సవరణ 6ఏను గతంలో సుప్రీం కోర్టు కొట్టేసింది. విచారణ సంస్థలను విచారణ నుంచి అడ్డుకునేందుకు సవరణ చేయలేదు’’ అని రోహత్గీ వాదించారు. దాదాపు గంటన్నరపాటు సాగిన వాదనల అనంతరం పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది ధర్మాసనం. చంద్రబాబుని అరెస్ట్ చేస్తారేమో? ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వాయిదా వేసింది. అయితే.. పీటీ వారెంట్ ప్రకారం చంద్రబాబుని సోమవారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చాల్సి ఉందని, ఆ రోజు హాజరుపరిస్తే గనుక ఈ కేసులో అరెస్ట్ చేస్తారని చంద్రబాబు లాయర్ లూథ్రా విచారణ వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రోజు హాజరుపరిస్తే అరెస్టు చేస్తారని, అప్పుడు ఈ పిటిషన్ నిరర్థకం అవుతుందని లూథ్రా ధర్మాసనానికి వివరించారు. ఆ దశలో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి జోక్యం చేసుకుని.. ‘‘సోమవారం అరెస్టు ఉండద’’ని సీఐడీ తరఫున హామీ ఇచ్చారు. -
ఏపీ హైకోర్టులో నారా లోకేష్‌కు ఎదురు దెబ్బ
సాక్షి, గుంటూరు: ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం డిస్పోస్ చేసింది. అంతేకాదు ఈ కేసులో లోకేష్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సీఐడీని ఆదేశించిన కోర్టు.. మరోవైపు విచారణకు సహకరించాల్సిందేనని నారా లోకేష్‌కు తేల్చి చెప్పింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్ పేరు చేరుస్తూ ఈ మధ్యే విజయవాడ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాకలు చేసింది. దీంతో అరెస్ట్ భయంతో.. నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. లోకేష్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే లోకేష్‌కు 41-ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. ‘‘మేము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నాం. దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని లోకేష్‌ను ఆదేశించిండి’’ అని ఏజీ శ్రీరామ్ చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 41-ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని సూచించింది. ఆ ఆదేశాలను అనుసరించి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ బయల్దేరింది ఏపీ సీఐడీ. మరికాసేపట్లో ఏపీ సీఐడీ అధికారులు లోకేష్‌ను కలిసి నోటీసులు అందించే అవకాశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: పాపం.. లోకేష్‌ను కించపరుస్తూ యెల్లో మీడియా కథనాలు -
Sep 29, 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu And Nara Lokesh Bail Petition Hearings and Ground updates 7:07 PM, సెప్టెంబర్ 29, 2023 కోర్టులపై వక్రభాష్యాలకు సమాధానాలు ఇవిగో ► కోర్టులకు ఎదురవుతున్న సవాళ్లకు ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్‌లో సూటిగా, స్పష్టంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ సమాధానాలు ప్రశ్న : కోర్టుల స్వతంత్రత గురించి మీరేమంటారు? తీర్పు ఇచ్చే సమయంలో మీపై ఒత్తిడులుంటాయా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ : ► ఒక జడ్జిగా నాకు 23ఏళ్లుగా అనుభవం ఉంది. ► ఒక కేసులో ఇలా ఉండండి, ఇలా తీర్పు చెప్పండి అని ఏ ఒక్కరు మాపై ఒత్తిడి తీసుకురారు, తీసుకురాలేదు. ► ప్రతీ రోజూ సుప్రీంకోర్టులో ఉదయాన్నే బెంచ్ మీదకు వెళ్లకముందు జడ్జిలందరూ కలిసి కాఫీ తాగుతాం. ► కానీ ఏ ఒక్కరు ఇంకొకరి కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోరు ► ఇక హైకోర్టులోనయితే ఈ సున్నితమైన పరిస్థితి మరింత ఎక్కువ. ► కొన్ని సార్లు సింగిల్ బెంచ్‌లో జడ్జి ఇచ్చిన తీర్పును అదే హైకోర్టులోని మరో ఇద్దరు జడ్జిలు సమీక్షించాల్సి ఉంటుంది. ► ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు. ► ఎవరి కేసునయితే నేను సమీక్షించబోతున్నానో.. అదే జడ్జితో కలిసి భోజనం చేయవలిసిన పరిస్థితి ఉంటుంది. ► భోజనం షేర్ చేసుకుంటాం. అయితే కేసులను మాత్రం షేర్ చేసుకోం. ► అది మేం తీసుకున్న శిక్షణలో భాగం. ► అంతెందుకు మాపై ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యవస్థ నుంచి ఒత్తిడి రాదు. ► ఇది నా ఒక్కరి గురించి చెప్పడం లేదు. మొత్తం దేశంలోని న్యాయవ్యవస్థ గురించి చెబుతున్నాను. 7:02 PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ఎక్కడ.? ► ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A14 లోకేష్ ► 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లిన CID బృందం ► ఇప్పటివరకు బస చేసిన ITC మౌర్య హోటల్లో రూమ్ ఖాళీ ► మీటింగ్‌లు పెట్టే గల్లా జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌజ్‌లో లేడు ► రెగ్యులర్‌గా వాడే కారు మార్చేశాడు ► CID కంటికి కనిపించకుండా లోకేష్ దాగుడు మూతలు 6:32 PM, సెప్టెంబర్ 29, 2023 అభివృద్ధి తరలిపోతోందన్న బ్రాహ్మణి.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా? ► బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలకు YSRCP సూటి ప్రశ్నలు 1) బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో కేంద్ర సంస్థ ఆదాయంపన్ను అధికారులు ఫిబ్రవరి 13 ,2020న సోదాలు జరిపినపుడు రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీన్ని మీరు అంగీకరించారా? లేదా? 2) అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో రూ.119 కోట్లు (20%) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును, నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని అని శ్రీనివాస్ చౌదరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్‌కంటాక్స్ సంస్థ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది. దీనిమీద మీ మాటేంటీ? 3) రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నలుగురిని అరెస్ట్ చేసింది. మరి మీరు అంతా సవ్యంగా జరిగిందని ఎలా అంటారు? 4) CID నోటీసులు అందుకున్న వెంటనే పెండ్యాల శ్రీనివాసచౌదరి, మనోజ్ వాసుదేవ్ , యోగి విదేశాలకు ఎందుకు పారిపోయారు? 6:23 PM, సెప్టెంబర్ 29, 2023 పళ్లాలను గరిటలతో కొట్టండి : బ్రాహ్మణి ► చంద్రబాబు అరెస్ట్ అయినందుకు నిరసన తెలపాలంటూ పిలుపు ► బ్రాహ్మణి తీరును తప్పుబట్టిన మంత్రి అంబటి ► నాడు పళ్లాలను గరిటలతో కొట్టిన కాపులను దెబ్బతీశారు, ఇప్పుడు విధి ప్రకారం మీ వంతొచ్చిందంటూ చురకలు విధి విచిత్రమైనది ! కాపు ఉద్యమంలో పళ్ళాలు కొట్టినవారిని మక్కెలిరగొట్టి బొక్కలో వేసావ్ ! అవినీతి కేసులో బొక్కలో పడి పళ్ళాలు కొట్టమంటున్నావ్ ! వారే వాహ్ !@ncbn@naralokesh @iTDP_Official — Ambati Rambabu (@AmbatiRambabu) September 29, 2023 5:23 PM, సెప్టెంబర్ 29, 2023 భువనేశ్వరీకి నోటీసులు ఇవ్వాలి : కోర్టును కోరిన లూథ్రా ► రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూద్రా వాదనలు ► భువనేశ్వరి అకౌంట్ నుంచే లింగమనేనికి అద్దె చెల్లింపులు జరిగాయి ► చంద్రబాబు, భువనేశ్వరికి 91 నోటీసు ఇవ్వొచ్చు కదా అని కోరిన లూథ్రా ► బాబు బెయిల్ నిరాకరణకు లింగమనేని వ్యవహారానికి లింకు పెట్టొద్దు లూథ్రా 5:20 PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ఢిల్లీలో ఎందుకు ఉంటున్నారంటే.? : అచ్చెన్నాయుడు ► ఎన్నికేసులు వేసినా లోకేష్ భయపడడు ► సుప్రీంకోర్టు లాయర్లకు బ్రీఫింగ్ ఇవ్వడానికే లోకేష్ ఢిల్లీలో ఉంటున్నాడు ► లాయర్లతో చర్చించాలి కాబట్టే లోకేష్ పాదయాత్ర వాయిదా 5:00 PM, సెప్టెంబర్ 29, 2023 తప్పులు చేసిన చంద్రబాబు జైలుకు వెళ్లారు : రఘువీరారెడ్డి ► శ్రీసత్యసాయి జిల్లా: చంద్రబాబు అరెస్ట్‌పై సీనియర్ నేత N.రఘువీరారెడ్డి వ్యాఖ్యలు ► స్వీయ తప్పిదాల వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లారు ► తాను తవ్విన గోతిలో తనే పడ్డారు చంద్రబాబు ► ప్రత్యేక హోదా కోసం 2017లో గుంటూరులో సభ నిర్వహిస్తే చెప్పులు, రాళ్లు వేయించారు ► టీడీపీ దీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.. చంద్రబాబు విడుదల కాలేరు ► న్యాయస్థానంలో తప్పు చేయలేదని చంద్రబాబు నిరూపించుకోవాలి 4:25 PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసు అక్టోబర్ 3కు వాయిదా ► చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ వచ్చే నెల 3కు వాయిదా ► CID తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు ► లింగమనేని భూముల పక్కనుంచి వెళ్లేలా అలైన్మెంట్ మార్పులు ► అలైన్మెంట్ మార్పు తర్వాత లింగమనేని భూముల విలువ భారీగా పెరిగింది ► లింగమనేని, హెరిటేజ్ సంస్థలు భూఅక్రమాలకు పాల్పడ్డాయి ► చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ లూథ్రా వాదనలు 3:25 PM, సెప్టెంబర్ 29, 2023 స్టేబిఎన్ ఇన్నాళ్లకు జైలుకెళ్లాడు : బొత్స ► విజయనగరంలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి నేతలు కలిసి దోచుకుతిన్నారు ► ఇప్పడు సెక్షన్లు వర్తించవని అంటున్నారు తప్ప.. అవినీతి జరగలేదని చెప్పడం లేదు ► చంద్రబాబు ఇప్పటివరకు స్టే లు తెచ్చుకొని బ్రతికాడు ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కూడా అలాగే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు ► జైలుకు వెళ్లిన తర్వాత సానుభూతి పొందాలని చూస్తున్నాడు ► శాసనసభలో చర్చకు అవకాశం ఉన్నప్పటికీ టిడిపి ఎమ్మెల్యేలు చర్చించకుండా పారిపోయారు ► అవినీతి జరిగిందని అసెంబ్లీలో ఉన్న టిడిపి ఎమ్మెల్యేలకి కూడా తెలుసు 3:15 PM, సెప్టెంబర్ 29, 2023 తెలుగుసేనలో అయోమయం ► రాజమండ్రిలో జైలుకు పరిమితమైన చంద్రబాబు ► ఢిల్లీ నుంచి కదలనంటున్న లోకేష్ బాబు ► రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు భువనేశ్వరి ► రాజమండ్రి లోకేష్ క్యాంప్‌లో నారా బ్రాహ్మణి ► రెండు రోజుల హడావిడి తర్వాత కనిపించని బాలకృష్ణ ► జైలు ముందు పొత్తు ప్రకటన చేసి సైలంట్ అయిన పవన్ కళ్యాణ్ 3:10PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో బాబు, లోకేష్ పిటిషన్లు వాయిదా ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ► కేసు విచారణను అక్టోబర్ 4, 2023, బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు ► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా అక్టోబర్ 4కు వాయిదా వేసిన హైకోర్టు 3:00PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 4వరకు ఆగండి ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో లోకేష్ వేసిన ముందస్తు బెయిల్‌పై విచారణ ► లోకేష్‌ను అరెస్ట్ చేసే విషయంలో అక్టోబర్ 4వరకు ఆగాలని హైకోర్టు సూచన ► ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు 2:50PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : అమరావతి రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసు ► చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న హైకోర్టు ► CID తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు 2:40PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ లోకేషన్ ఎక్కడ? ► ఢిల్లీ: మీడియాకు కంటపడకుండా తిరుగుతున్న లోకేష్ ► కార్లు మారుస్తూ రహస్యంగా మీటింగులు ► నిన్నటి నుంచి గల్లా జయదేవ్ ఇంటికి రాని లోకేష్ ► ఐటీసి మౌర్య నుంచి మరో చోటకు మకాం మార్పు ► జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌస్‌లో ఉన్నారని సమాచారం ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్ట్ ఎదురుదెబ్బ తగలడంతో న్యాయవాదులతో మంతనాలు ► CID బృందం వస్తుందని తెలిసి ఢిల్లీలో అలర్ట్ 2:30PM, సెప్టెంబర్ 29, 2023 ►లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం ►స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసుల్లో లోకేష్ బెయిల్ పిటిషన్ 2:15 PM, సెప్టెంబర్ 29, 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు ► హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బాబు లాయర్లు ► ఫైబర్ నెట్ స్కాంలో A25గా ఉన్న చంద్రబాబు ► A25గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సిఐడి మెమో ► తాజా పరిణామాలతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ► అత్యవసరంగా విచారించాలని ఇప్పటికే హైకోర్టును కోరిన లోకేష్ లాయర్లు ► కాసేపట్లో హైకోర్టు బెంచ్ ముందుకు విచారణకు వచ్చే అవకాశం 2:00 PM, సెప్టెంబర్ 29, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు గురించి పది పాయింట్లు.. తండ్రీ కొడుకులు ఏం చేశారంటే.? 1. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2016 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రారంభించారు. రూ.149కే కేబుల్ ప్రసారాలు, 200 చానళ్లతో టీవీ, ఫోన్ సౌకర్యం ఇస్తామని ప్రకటించారు. 2. ఫైబర్‌నెట్ ప్రాజెక్టును బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు టెరాసాఫ్ట్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన APTS వీసీ సుందర్‌ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగించారు. 3. టెరాసాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్ ఎవరంటే హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన దేవినేని సీతారామయ్య 4. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెట్‌టాప్ బాక్స్ రూ.2,200కే దొరుకుతుండగా చంద్రబాబు సర్కారు మాత్రం రూ.4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లు వేమూరి అంగీకరించారు. 5. APSFL నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చారు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్వేర్ అడ్రస్ ఒక్కటే. 6. ఈ డబ్బంతా పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు రూటు అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇన్కమ్ టాక్స్ కూడా శ్రీనివాస్‌కు, చంద్రబాబుకు నోటీసులిచ్చింది. 7. హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్కి టెరా సాఫ్ట్‌తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్‌కు పనులు ఇచ్చేసుకున్నారు. 8. ఐదేళ్లూ చంద్రబాబు వద్దే పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఉండింది. ఆ శాఖ పరిధిలోనిదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్. నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. 9. లోకేశ్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్‌ను 2017 సెప్టెంబర్ 14న APSFLకు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్ మాల్ పెద్ద ఎత్తున జరిగినట్టు తేలింది. లోకేశ్ వద్ద ఉన్న శాఖలకు, APSFLకు సంబంధం లేదు. అయినా తన తండ్రి శాఖలోని ఫైల్ తెప్పించుకున్న లోకేశ్.. 2017 నవంబర్ 12న బీబీఎన్‌ఎల్‌తో ఎంవోయూ ఫైల్‌పై సంతకం చేశారు 10. కేంద్రం అనుమతి లేకుండా అంచనా వ్యయం రూ.500 కోట్లకుపైగా పెంచేసి వేమూరి సంస్థకు ఖరారు చేశారు. BBNL మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. 1:40 PM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ఇప్పటికైనా బయటకు రావాలి : మంత్రి రోజా ► ఈ 20 రోజుల్లో లోకేష్ ముఠా నానా యాగీ చేసింది ► తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాలి ► తప్పు చేయక పోతే ముందస్తు బెయిల్‌కు ఎందుకు దరఖాస్తు చేస్తుకున్నారు? ► యువగళం పాదయాత్ర ఆపేసి ఢిల్లీలో ఎందుకు దాక్కున్నారు? ► ఎన్టీఆర్ కూతురు, మనవరాలిగా భువనేశ్వరి, బ్రాహ్మణిలను అభిమానిస్తాం, ► టిడిపి స్క్రిప్ట్ చదివితే మాత్రం తప్పులు ఎత్తి చూపిస్తాం ► ఎర్ర బుక్‌లో రాసుకున్నాము, తాట తీస్తాం అన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 1:35PM, సెప్టెంబర్ 29, 2023 కుంభకోణం గురించి మాట్లాడరెందుకు? : సజ్జల రామకృష్ణారెడ్డి ► ఈ 20 రోజుల్లో లోకేష్ ముఠా నానా యాగీ చేసింది ► ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైంది ► సాక్ష్యాధారాలతో దొరికితే చంద్రబాబును కోర్టు రిమాండ్‌కు పంపింది ► జరిగిన కుంభకోణంపై వీరంతా మాట్లాడడం లేదు ► దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు ► మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు ► చంద్రబాబు అరెస్టును దేశ సమస్యలా చిత్రీకరిస్తున్నారు ► రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చారు, ఐక్యరాజ్యసమితికి ఇచ్చినా ఆశ్చర్యం లేదు ► మూడేళ్లు దర్యాప్తు చేశాక ఆధారాలతో అరెస్ట్ చేశారు ► స్కిల్ స్కామ్ లో పూర్తి ఆధారాలు ఉన్నాయి ► తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ స్టేట్మెంట్ ఇచ్చింది ► గంటా సుబ్బారావుకు నాలుగు పదవులిచ్చారు ► మొత్తం నాలుగు కేసుల్లో అన్ని ఆధారాలున్నాయి ► డిజైన్ టెక్ ద్వారా కోట్లు కొట్టేశారు 1:25PM, సెప్టెంబర్ 29, 2023 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ ► హైకోర్టులో మరో పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు ► ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ ► ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు 12:55PM, సెప్టెంబర్ 29, 2023 ఇండియా కూటమి వైపు సైకిల్ వెళ్తొందా.? బయటకొస్తున్న అసలు ఎజెండాలు ► చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్పటివరకు తెగ ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ► హైదరాబాద్‌లో ధర్నాలను పోలీసులు నిలిపివేయడంపై టి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఆగ్రహం ► చంద్రబాబును వెనకేసుకొస్తూ ప్రకటనలు చేస్తోన్న రేవంత్ ► గతంలో చంద్రబాబుతో కలిసి ఓటుకు కోట్లు పంపిణీ చేసి రెడ్ హండెడ్‌గా దొరికిన రేవంత్ ► తాజాగా చంద్రబాబు కోసం తెగ ఆరాట పడ్డ మోత్కుపల్లి ► బాబును తిట్టిన నోటితోనే ప్రశంసలు కురిపించి తెలుగుదేశం పార్టీనే ఆశ్చర్యపరిచిన మోత్కుపల్లి ► ఇవ్వాళ బెంగళూరుకు వెళ్లిన మోత్కుపల్లి నర్సింహులు ► డీకే శివకుమార్ తో భేటీ అయిన మోత్కుపల్లి నర్సింహులు ► పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అంటోన్న మోత్కుపల్లి ► డీకే శివకుమార్ డైరెక్షన్‌తోనే చంద్రబాబుకు మోత్కుపల్లి మద్ధతిచ్చారా? 12:45PM, సెప్టెంబర్ 29, 2023 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో యార్లగడ్డ క్వాష్ పిటిషన్లు ► లోకేష్ యువగళం పాదయాత్రలో రెచ్చిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ► తన మనుష్యులతో కలిసి వీరంగం సృష్టించినట్టు యార్లగడ్డపై అభియోగాలు ► గన్నవరం నియోజకవర్గంలోని రంగన్నగూడెం, వీరవల్లి పోలీస్ స్టేషన్లు ముట్టడి ► ఏపీ హైకోర్టును ఆశ్రయించిన యార్లగడ్డ వెంకట్రావు ► మూడు కేసుల్లో క్వాష్ పిటిషన్ వేసిన యార్లగడ్డ ► యార్లగడ్డ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నాగముత్తు 12:25PM, సెప్టెంబర్ 29, 2023 విజయవాడ వేదికగా కురుక్షేత్ర సంగ్రామ శంఖారావాన్ని పూరించిన CM వైఎస్ జగన్ ► ప్రస్తుత సంక్షేమ ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలోని స్కాముల నేతలకు మధ్య యుద్ధం ► ఫైబర్ గ్రిడ్ స్కామ్, స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్... ► అమరావతి పేరుతో స్కాములు చేసిన గత నాయకులతో యుద్ధం ► గతంలోనూ ఇదే బడ్జెట్, మారిందల్లా సీఎం ఒక్కడే ► గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు? ► దోచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలి ► దోచుకున్నది పంచుకునేందుకే వాళ్లకు అధికారం కావాలి ► వాళ్లకు మాదిరిగా నాకు గజదొంగల ముఠా తోడుగా లేదు ► వంత పాడేందుకు వాళ్లకున్నట్టు దత్త పుత్రుడు లేడు ► పేదవాడి ప్రభుత్వం నిలబడాలి, పెత్తందారుల ప్రభుత్వం రాకూడదు ► మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే నాకు తోడుగా నిలవండి ► ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలవండి ► ఓటు వేసే ముందు జరిగిన మంచి గురించి ఆలోచించండి 12:15PM, సెప్టెంబర్ 29, 2023 రాజమండ్రి జైలుకు నారాయణ, చంద్రబాబుతో ములాఖత్ ► 20 రోజులుగా జైల్లో ఉన్నా చంద్రబాబు మనో ధైర్యం కోల్పోలేదు ► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి లోకేష్‌పై కేసు పెట్టారు ► ఇన్నర్ రింగ్‌రోడ్‌లో నా సొంత భూమి పోయింది, దాని ఖరీదు ఏడు కోట్ల రూపాయలు ► జనసేనతో పొత్తుపై ఉమ్మడి కమిటీ వేస్తాం ► కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ముందుకు వెళ్తాం ► అన్ని విషయాలు కోర్టులోనే తేలుతాయి, బాబు జైల్లో ధైర్యంగా ఉన్నారు 12:05PM, సెప్టెంబర్ 29, 2023 ఎక్కడ దాక్కున్నా తప్పుంటే అరెస్ట్ కావాల్సిందే : లోకేష్ ఛాలెంజ్‌కు పేర్ని నాని కౌంటర్ ► ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేసే దమ్ము CIDకి లేదా ? : లోకేష్ ఛాలెంజ్ ► ఢిల్లీ కాదు.. సప్త సముద్రాల అవతల చెట్టు తొర్రలో దాక్కున్నా తప్పు చేస్తే అరెస్ట్ కావాల్సిందే : పేర్ని నాని నారా లోకేష్‌ని అరెస్ట్ చేయాలంటే ఢిల్లీలోనే కాదు.. చెట్టు తొర్రలో దాక్కున్నా దర్యాప్తు అధికారులు నిమిషాల్లో అరెస్ట్ చేసి తీసుకురాగలరు. చంద్రబాబు కంటే నువ్వేమీ పోటుగాడివి కాదు కదా @naralokesh..? కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేయాలి? అనేది దర్యాప్తు… pic.twitter.com/dLLF8HcNj3 — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 12:00PM, సెప్టెంబర్ 29, 2023 పచ్చమీడియాకు ఇంత పక్షపాతమా? : YSRCP ► ఏ కేసులోనయినా ఏ మీడియా అయినా రెండు వర్షన్లను కవర్ చేస్తారు ► కానీ స్కిల్ స్కాంలో పచ్చమీడియా నిజాలు దాచిపెడుతోంది ► మేం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే కవర్ చేయలేదు ► టిడిపి వాళ్లు అసత్యాల ప్రజంటేషన్‌కు మాత్రం ఎల్లో మీడియా పట్టం కట్టింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజెంటేషన్ రూపంలో క్లియర్‌గా ప్రభుత్వం చూపించినా.. ఎల్లో మీడియా మాత్రం ప్రసారం చేయలేదు. కేవలం టీడీపీ వాళ్లు చెప్పింది మాత్రమే ప్రజలకి చూపించారు. బాబు అరెస్ట్ తర్వాత ఎల్లో మీడియా పిచ్చి పీక్స్‌కి చేరిపోయింది. దీన్ని… pic.twitter.com/mimAxmJcXA — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 11:40AM, సెప్టెంబర్ 29, 2023 మరో రెండు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన లోకేష్ ►హైకోర్టులో మరో రెండు పిటిషన్లు వేసిన లోకేష్ లాయర్లు ►స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో నిందితుడు లోకేష్ ►ఈ రెండు కేసుల్లో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి ►అరెస్ట్ చేస్తారు, అత్యవసరంగా విచారించండి : హైకోర్టుకు అభ్యర్థన ►మధ్యాహ్నం తర్వాత బెంచ్ ముందుకు పిటిషన్లు వచ్చే అవకాశం 11:20AM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు : హైకోర్టు : BIG BREAKING ►IRR కేసులో నారా లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు ►దర్యాప్తుకు లోకేష్ సహకరించాల్సిందే : హైకోర్టు ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌కు నోటీసులు ►కేసు దర్యాప్తుకు లోకేష్ సహకరించాలన్న హైకోర్టు ►కుంభకోణంలో లోకేష్ పాత్రను స్పష్టం చేస్తూ 129 ఆధారాలు సేకరించిన సిట్ ►ముందస్తు బెయిల్ పిటిషన్‌కు అంగీకరించని న్యాయస్థానం ►దర్యాప్తు అధికారి FIRలో మార్పు చేశారని నివేదించిన అడ్వొకేట్ జనరల్ ►41ఏ నిబంధనలు పూర్తిగా పాటిస్తామని చెప్పిన అడ్వొకేట్ జనరల్ 11:15AM, సెప్టెంబర్ 29, 2023 ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 11:02AM, సెప్టెంబర్ 29, 2023 41 ఏ కింద లోకేష్‌కు నోటీసులు: ఏజీ శ్రీరామ్ ►IRR కేసులో నారా లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు ►కోర్టులో వెల్లడించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ►హైకోర్టులో ఏపీ సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు ►నోటీసుల కాపీ హైకోర్టుకు అందజేత ► ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న విచారణ ► లోకేష్ తరపున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్ 10:55AM, సెప్టెంబర్ 29, 2023 బటన్ నొక్కడంలో తేడాలు గమనించండి: YSRCP ► జగనన్న బటన్ నొక్కితే సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఖాతాల్లో నగదు జమ ► అదే చంద్రబాబు బటన్ నొక్కితే.. ఫస్ట్ కార్పోరేట్ సంస్ధల ఖాతాల్లోకి నగదు జమ ► మళ్లీ ఆ డబ్బు షెల్ కంపెనీల ద్వారా తిరిగి బాబు జేబులోకే వెళ్తుంది. ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, అమరావతి అసైన్డ్ భూమల స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాంలో అంతర్లీనంగా జరిగింది ఇదే..! జగనన్న బటన్ నొక్కితే సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. కానీ.. చంద్రబాబు బటన్ నొక్కితే తొలుత కార్పోరేట్ సంస్ధల ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. మళ్లీ ఆ డబ్బు డొల్ల కంపెనీల ద్వారా తిరిగి బాబు జేబులోకే వెళ్తుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం,… pic.twitter.com/mQ8rlC4JfQ — YSR Congress Party (@YSRCParty) September 29, 2023 10:50AM, సెప్టెంబర్ 29, 2023 IRR కేసులో లోకేష్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం ►ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం ►లోక్ష్ తరపున వాదనలు వినిపిస్తున్న దమ్మాలపాటి శ్రీనివాస్ ► ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్ ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంతో లబ్ధి పొందినట్లు ఏపీ సీఐడీ అభియోగం 10:04AM, సెప్టెంబర్ 29, 2023 కుటుంబ సభ్యుల ములాఖత్ నేడు! ►నేడు చంద్రబాబుతో ములాఖత్ కానున్న కుటుంబసభ్యులు ►రాజమండ్రి జైలులో ఉ.11 గం.కు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ ► సతీమణ భువనేశ్వరి, కోడలు బ్రహ్మణితో పాటు మాజీ మంత్రి నారాయణ కూడా 08:58AM, సెప్టెంబర్ 29, 2023 విధుల్లో చేరిన జైలు సూపరిండెంట్ ►రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ విధుల్లో చేరిన రాహుల్ ►కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో విధులకు దూరంగా ఉన్న సూపరిండెంట్ రాహుల్ ►జైలు సూపరిండెండెంట్ భార్య అనారోగ్య కారణాలతో సెలవు పెడితే విపరీతార్థాలు తీసిన పచ్చ మీడియా ►పచ్చ మీడియా తీరుపై వెల్లు వెత్తిన విమర్శలు 08:45AM, సెప్టెంబర్ 29, 2023 సుప్రీంలో బాబుకు మరో దెబ్బ! ►సుప్రీం కోర్టులో చంద్రబాబు SLP లిస్టింగ్‌కే మరింత ఆలస్యం ►అక్టోబర్ 3 కాదు.. 6? ►ఇంతకు ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ అక్టోబరు 3కి వాయిదా ►కానీ, అక్టోబర్ 6వ తేదీ.. అదీ లిస్టింగ్‌కు వచ్చే ఛాన్స్ ► అంటే ఆరోజు.. పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తారా? అని చెప్పే ఛాన్స్ ► ఒకవేళ విచారణ చేపడితే.. ఏ రోజు విచారణ చేపడతారో ప్రకటిస్తుంది బెంచ్ ►సుప్రీం కోర్టు వెబ్సైట్లో ఈ మేరకు కంప్యూటర్ జనరేటెడ్ ధృవీకరణ 08:33AM, సెప్టెంబర్ 29, 2023 శతవిధాల ప్రయత్నాలు ►చంద్రబాబు బెయిల్ కోసం విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ వర్గాలు ►లోకేష్ అరెస్టు అవుతాడని రాజమండ్రిలో వదంతులు ►అరెస్టు అవుతాడనే కారణం తోనే ఢిల్లీ నుంచి రాకుండా జాప్యం చేస్తున్నారంటూ వార్తలు ►ఇవాళ నుంచి ప్రారంభం కావలసిన యువగళం వాయిదా ►సుప్రీంకోర్టులో క్వాష్ ఫలితం తేలిన తర్వాతే రాజమండ్రి కి రానున్న లోకేష్ ►రాజమండ్రి టిడిపి శిబిరంలో నారా బ్రాహ్మణి భువనేశ్వరుని ముందు పెట్టుకుని కార్యక్రమాలు కొనసాగిస్తున్న టీడీపీ శ్రేణులు ►‘‘బాబుతో మేము’’, ‘‘పోస్ట్ కార్డు ఉద్యమం’’ తో పాటు రిలే నిరాహార దీక్షలు ,దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు ►ప్రజల నుంచే కాదు.. టీడీపీ కార్యకర్తల నుంచి కూడా కనిపించని స్పందన 07:10AM, సెప్టెంబర్ 29, 2023 లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ►నేడు హైకోర్టులో వాదనలు జరిగే అవకాశం ►అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో ఏ14గా లోకేష్ పేరు చేర్చిన ఏపీ సీఐడీ ► అరెస్ట్ భయంతో.. ఢిల్లీ నుంచే యాంటిసిపేటరీ బెయిల్‌కు దరఖాస్తు ► బెయిల్ వస్తేనే యువగళం పాదయాత్ర.. లేకుంటే మరిన్ని రోజులు ఢిల్లీలోనే 07:05AM, సెప్టెంబర్ 29, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ► మధ్యాహ్నం 2.15కి ప్రారంభంకానున్న విచారణ ►ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా ►మరోసారి వాదనలు వినిపించనున్న ఏజీ ►చంద్రబాబు కేసులు..బెయిల్ పిటిషన్లతో టీడీపీ(TDP) శ్రేణుల్లో టెన్షన్ పెరుగుతోంది. 07:00AM, సెప్టెంబర్ 29, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @20 ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►ఏసీబీ కోర్టు విధించిన జ్యూడీషియల్ రిమాండ్ 20వ రోజుకి చేరిక ► సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకుంది ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్‌తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు ► అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు -
నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
సాక్షి, గుంటూరు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఏ14గా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. రాజధాని పేరుతో అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) వేసే ప్రాజెక్టు పేరిట నాటి టీడీపీ సర్కార్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ విషయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదుతో ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు తదనంతరం.. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్ నారా లోకేశ్‌ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేసి నారా లోకేష్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసింది ఏసీ సీఐడీ. తన తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో జరిగిన స్కామ్‌లో నారా లోకేష్ కీలక భూమిక పోషించారని, అలైన్మెంట్ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్ ఫుడ్స్ కోసం భూములను నారా లోకేష్ కొల్లగొట్టినట్లు దర్యాప్తు సంస్థ సీఐడీ నిర్ధారించుకుంది. చంద్రబాబు, నారాయణ, లోకేష్‌తోపాటు లింగమనేని రమేశ్, రాజశేఖర్‌లు, అలాగే.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది ఏపీ సీఐడీ. అయితే నారాయణ ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. -
AP: కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్ల మేర నష్టం కలిగించారంటూ విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సూర్యనారాయణపై ఉన్నవి మామూలు ఆరోపణలు కాదని, అవి చాలా తీవ్రమైనవని హైకోర్టు స్పష్టం చేసింది. సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని తేల్చి చెప్పింది. సూర్యనారాయణ పాత్రపై వ్యాపారులు స్పష్టమైన వాంగ్మూలాలు ఇచ్చారన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత వ్యాపారులు ముందుకొచ్చి వాంగ్మూలాలు ఇచ్చారని, సహ నిందితులు సైతం వాంగ్మూలాలు ఇచ్చారని, పలువురు సాక్షులు కూడా వాంగ్మూలం ఇచ్చారని, వీటన్నింటినీ పరిశీలిస్తే నేరంలో సూర్యనారాయణ పాత్ర ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయంది. చదవండి: పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు దర్యాప్తులో పోలీసులు సేకరించిన సాక్ష్యాలు సూర్యనారాయణ పాత్రను ప్రాథమికంగా నిర్ధారిస్తున్నాయని తెలిపింది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించినటువంటి తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో సూర్యనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులో సూర్యనారాయణ పాత్రపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అది ఇంకా పూర్తి కాలేదంది. అందువల్ల ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు. -
ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా?
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్ లక్ష్మీణ్ ఇచ్చిన తీర్పు మీడియాకు ఒక గుణపాఠం అని చెప్పాలి. జస్టిస్‌ను ఈ సందర్భంగా అభినందించాలి. అవినాష్‌కు బెయిల్ ఇవ్వడం, ఇవ్వకపోవడం కాదు ఇక్కడ ఇష్యూ. తనను ప్రభావితం చేయాలని ప్రయత్నించిన మీడియాకు ఆయన దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. తనను భయపెట్టాలని అనుకున్న మీడియాకు ఆయన తనేమిటో తెలియచెప్పారని అనుకోవచ్చు. న్యాయ వ్యవస్థకు సంబంధించి కొంత సంయమనం అవసరం. అలాగనీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై విశ్లేషణ చేయరాదని కాదు. జనాన్ని నమ్మించాలని చూశారు.. కానీ.. అందులో తప్పుఒప్పుల గురించి మాట్లాడుకోరాదని కాదు. కాని గౌరవ న్యాయమూర్తిపై దురుద్దేశాలు ఆపాదించకూడదు. అభియోగాలు చేయరాదు. అవినాష్ రెడ్డిని సీబిఐ అరెస్టు చేయడానికి యత్నించిందన్న సన్నివేశం సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఏకంగా అవినాశ్ ను హెలికాప్టర్లో ఈ మీడియా తరలించేసింది. ఈ మీడియా సీఆర్ పిఎఫ్ దళాలను కూడా తెచ్చేసింది. అవినాష్ తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ఏమి జరుగుతుందో శోధించడానికి వీరు చేయని అకృత్యాలు లేవు. ఇంకేముంది అవినాశ్ అరెస్టు ఖాయం అని వారు నమ్మారో లేదో కాని, జనాన్ని నమ్మించాలని చూశారు. కాని వారు అనుకున్నదానికి రివర్స్‌లో కేసు సాగడంతో ఏకంగా న్యాయమూర్తిపై దాడికి దిగారు. అలా చేయకుండా.. అదేదో.. ఒక సస్పెండెడ్ మెజిస్ట్రేట్‌ను కూర్చోబెట్టి చండాలపు ఆరోపణలు చేయించారు. ఆ టివీలో చర్చ చూస్తే అదంతా మాచ్ ఫిక్సింగ్ ప్రకారమే హైకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేయించినట్లు కనిపిస్తుంది. నిజానికి అలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేస్తే వెంటనే సంబంధిత చానల్ వారు వెంటనే నిలుపుదల చేయడం, క్షమాపణ చెప్పించడం, తాము కూడా క్షమాపణ చెప్పడం చేయాలి. అలా చేయకుండా, అదేదో తమ చానల్‌కు సంబంధం లేని వ్యవహారంగా వదలివేశారు. చట్టం ప్రకారం న్యాయమూర్తులపై సంచులు వెళ్లాయి అంటూ ఆరోపణలు చేయడం ఎంత తప్పో, వాటిని ప్రచారం చేయడం కూడా అంతే తప్పు అవుతుంది. ఎవరూ చట్టానికి అతీతులు కారు.. కాని గత నాలుగేళ్లుగా న్యాయ వ్యవస్థతో తమ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్న ఈ మీడియా సంస్థలు అహంకారానికి ప్రతిరూపంగా మారిపోయాయి. తాము ఏమి చేసినా ఎదురులేదన్న చందంగా మారాయి. తమకు న్యాయ వ్యవస్థలో ఎవరో పెద్ద స్థాయిలో ఉన్నవారితో పరిచయం ఉందన్న అతిశయంతో వారు చెలరేగిపోయారు. నిజానికి ఈ మీడియావారికి పరిచయం ఉన్నంతమాత్రాన గౌరవ జడ్జిలు వారికి అనుకూలంగా ఉంటారని అనుకోజాలం. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండకుండా ఎందుకు ఉంటారు?. మార్గదర్శి కేసు కూడా ఇందుకు ఒక ఉదాహరణే అవుతుంది. ఆ కంపెనీ డిపాజిట్ల వివరాలన్నిటిని సమర్పించాలని గౌరవ న్యాయస్థానం స్పష్టం చేయడం ద్వారా ఎవరూ చట్టానికి అతీతులు కారని తేల్చింది. ఆ టీవీ సైలెంట్ అయిపోయింది.. గతంలో ఒక కేసులో కొందరికి జైలు శిక్ష పడింది. అలా శిక్ష పడినవారి మహిళా బంధువు ఒకరు సంబంధిత న్యాయాధికారిపై ఆరోపణలు చేస్తూ ఒక టీవీ ముందు మాట్లాడారు. ఆ టీవీవారు తెలిసో, తెలియకో ఒకటికి రెండుసార్లు ప్రసారం చేశారు. దాంతో ఆ న్యాయాధికారి ఆ టీవీవారికి, ఆరోపణ చేసిన మహిళకు నోటీసు జారీ చేసి కేసు చేపట్టారు. ఆ తర్వాత ఆ టీవీ సైలెంట్ అయిపోయింది. ఈ నాలుగేళ్లలో ఏపీలో న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రెచ్చిపోయిన మాట నిజమే కావచ్చు. ప్రతిదానికి పిల్ రూపంలో కేసులు వేయించడం, వాటిని తమ మీడియాలో ప్రచారం చేయడం, ఎవరైనా గౌరవ న్యాయమూర్తి ప్రభుత్వంపై ఏదైనా కామెంట్ చేస్తే దానిని బ్యానర్ కథనాలుగా చేసి జనంలో పలచన చేయాలని యత్నించారు. ఇటీవల ఏపీ నుంచి సుప్రీంకోర్టు జ్జడి అయిన ఛీప్ జస్టిస్ పి.కె.మిశ్ర ఈ పరిణామాలపై విసుగు చెందారు. సీబీఐ డొల్లతనం.. ప్రశ్నల రూపంలో అసలు ప్రభుత్వం పనిచేసుకోవాలా? వద్దా? ప్రతిదానికి పిల్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా సీబిఐలో ఎవరితోనో రహస్య సంబంధాలు పెట్టుకుని ఉన్నవి, లేనివి రాయడం అలవాటు చేసుకున్నారు. ఆ దర్యాప్తు సంస్థకు చెందిన కొందరు అధికారులు తమ చెప్పుచేతలలో ఉన్నట్లుగా ప్రవర్తించిన ఈ మీడియా న్యాయ వ్యవస్థను కూడా అలాగే లొంగదీసుకోవాలని యత్నించి విఫలం అయింది. గౌరవ న్యాయమూర్తి లక్ష్మణ్ మొత్తం కేసును క్షుణ్ణంగా పరిశీలించి అనేక అబ్జర్వేషన్లు చేశారు. కేసు దర్యాప్తు తీరులో సిబిఐ డొల్లతనాన్ని ఆయన ప్రశ్నల రూపంలో బహిర్గతం చేశారు. అలాగని అవినాశ్‌కు ఏమీ పూర్తి స్థాయి రిలీఫ్ ఇవ్వలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చారు తప్ప, ఒకవేళ అవినాశ్‌ను అరెస్టు చేయదలిస్తే ఐదు లక్షల పూచీకత్తు తీసుకుని బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. మరికొన్ని కండిషన్లు పెట్టారు. అదే టైమ్‌లో తనపై ముడుపుల ఆరోపణ చేసిన ఏబిఎన్, మహా టీవీలపై చర్య తీసుకునే విషయాన్ని ఛీఫ్ జస్టిస్‌కు నివేదించారు. ఇంత బేలెన్స్‌డ్‌గా వ్యవహరించడం ఆ న్యాయమూర్తి విశిష్టత అని చెప్పాలి. ఆయన కావాలనుకుంటే ఏబిఎన్, మహా టీవీల వారికి వెంటనే నోటీసు ఇచ్చి చర్య తీసుకోవచ్చు. అయినా ఆ పని చేయలేదు. కాని ఈ సందర్భంగా ఆయన కలత పడిన తీరును వివరించారు. ఒక దశలో కేసు నుంచి తప్పుకుందామని అనుకున్న విషయాన్ని కూడా చెప్పారు. ఒకవేళ అలా చేసి ఉంటే ఈ ఎల్లో మీడియా లక్ష్యం నెరవేరినట్లయ్యేది. ఒక చిన్న లాజిక్.. చాలా పెద్ద విషయం.. అందుకే ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ముందస్తు బెయిల్ కేసులలో ఇంతగా పరిశీలించరట. కాని తనపై టీవీలలో చర్చలు ఇష్టారీతిగా జరిపిన కారణంగా ఆయనకు బాధ్యత ఏర్పడింది. కేసుకు సంబంధించి ఆయన లేవనెత్తిన ఒక చిన్న లాజిక్ చాలా పెద్ద విషయాన్నే తెలియచెప్పింది. సీబిఐ దర్యాప్తులో సహేతుకత కొరవడిన విషయం తేటతెల్లమైంది. వైఎస్ వివేకా హత్య జరిగినట్లు నిందితుడు ఒప్పుకున్నాక, ఆయన శరీరంపై గాయాలు స్పష్టంగా కనబడుతున్న తరుణంలో రక్తం తుడిస్తే ఆధారాలు ఏలా మాయమవుతాయని ఆయన ప్రశ్నించారు. అలాగే వైఎస్ వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కొన్ని ఆధారాలను దాచిన వైనం గురించి ప్రశ్నించారు. ఒక జర్నలిస్టు ఆసక్తికర విశ్లేషణ.. వివేకాకు ఇంతర మహిళలతో ఉన్న సంబంధాలపై కూడా అడిగారు. వీటిలో అనేకం అవినాశ్ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా సిబిఐ వాటిని పట్టించుకోకుండా దూకుడుగా ఎవరో ఎజెండా ప్రకారం అవినాశ్ ను ఇబ్బంది పెట్టడానికే అన్నట్లు విచారణ సాగించిందన్న విమర్శలు వచ్చాయి. ఎల్లో మీడియాకు ఈ విషయంలో చాలా పవర్ ఉందన్నది వాస్తవమే. ఎందుకంటే సిబిఐలో చీమ చిటుక్కుమన్నా ఈ మీడియాకు ముందుగానే తెలిసిపోతుండడమే ఇందుకు ఉదాహరణ అవుతుంది. గతంలో సీబిఐ నుంచి సమాచారం రాబట్టాలంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటిది వీరికి అంత తేలికగా సమాచారం ఎలా వస్తుందా అన్న సంశయం వస్తుంది. ఇంకో విశేషం ఉంది. సోషల్ మీడియాలో ఒక జర్నలిస్టు ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. టీడీపీ తన పుస్తకంలో ఏమి చెప్పిందో.. సీబీఐ కూడా.. టీడీపీ వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్‌ను లాగాలన్న దురుద్దేశంతో వేసిన ఒక పుస్తకంలో ఉన్న అంశాలనే సీబిఐ తన దర్యాప్తులో కొన్ని భాగాలుగా చేసిందని ఆయన చెబుతున్నారు. ప్రత్యేకించి గుండెపోటు, రక్తం తుడువడం మొదలైన విషయాలలో టీడీపీ తన పుస్తకంలో ఏమి చెప్పిందో సిబిఐ తన అభియోగాలలో అదే చెప్పిందట. అందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు. కాని అలాంటి అనుమానాలకు ఆస్కారం ఇచ్చి ఉండాల్సిందికాదు. వివేకా కుమార్తె చేస్తున్న ఆరోపణలను విచారించడంతో పాటు అవినాశ్ తదితర వ్యక్తులు చెబుతున్న కోణాలపై కూడా దర్యాప్తు చేసి ఉంటే సీబిఐపై ఇంతగా విమర్శలు వచ్చేవి కావు. చదవండి: Fact Check: పోలవరం పూర్తవుతున్నందుకా.. ఈనాడు ‘రంకెలు’ ఇప్పుడు బ్రేక్ పడిందా? ఈ కేసులో తానే వివేకాను చంపానని చెప్పిన వ్యక్తి అప్రూవర్ అవడం, అతనికి బెయిల్ ఇవ్వడానికి సీబీఐతో పాటు వివేకా కుమార్తె సహకరించడం వంటివి చూస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. అలాగే హత్య జరిగిన తొలి రోజులలో సునీత మాట్లాడిన తీరుకు, ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు సంబంధం లేకపోవడం కూడా గమనించదగ్గ సంగతే. ఈ కేసును రాజకీయ కుట్రగా చేసేసి చేతులు దులుపుకోవాలని సీబిఐ చేసిన యత్నానికి ఇప్పుడు బ్రేక్ పడిందని అనుకోవచ్చు. నేర్చుకోవలసిన పాఠం ఇదే.. ఈ కేసు ద్వారా నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే సీబిఐ తన ఇష్టం వచ్చినట్లు విచారణ చేస్తే అన్నిసార్లు కుదరదన్నది ఒకటైతే, మీడియా తనతోచిన విధంగా, తాము కోరిన విధంగా ట్రయల్ చేసే తీర్పులు ఇచ్చేస్తే ప్రభావం అవడానికి న్యాయ వ్యవస్థ సిద్దంగా ఉండదని తెలుసుకోవాలి. జస్టిస్ లక్ష్మణ్ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టారని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి.. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఉన్నత న్యాయస్థానం. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఇవాళ తుది తీర్పు వెలువరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్.. బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అవినాష్‌రెడ్డి లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.. షరతులతో కూడిన బెయిల్ అవినాష్‌రెడ్డికి మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో వివేకా కేసులో అవినాష్ రెడ్డి కస్టడీ విచారణ అవసరం లేదని బెంచ్ సీబీఐ తరపు న్యాయవాదులతో స్పష్టం చేసింది. హైకోర్టు ఆర్డర్కాపీలో ఏముందంటే.. 30 పేజీల హైకోర్టు ఆదేశాల్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. సీబీఐ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. సాక్ష్యాలను తారుమారు చేశారనడానికి కూడా ఎవిడెన్స్ లేవు. చెప్పుడు మాటల ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేసింది. ఊహాజనితమైన విచారణ మాత్రమే సాగింది. ఈ తరుణంలో.. కస్టోడియల్ విచారణ అవసరం లేదని భావిస్తున్నాం. అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నాం. హైకోర్టు షరతులివే ► అవినాష్‌రెడ్డిని గనుక అరెస్టు చేసినట్లయితే.. రూ. 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ పై విడుదల చేయాలి ► సీబీఐ అనుమతి లేకుండా అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదు. ► సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేయకూడదు. ► సీబీఐ దర్యాప్తునకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరించాలి. ► ప్రతి శనివారం ఉ.10 నుంచి సా.5 వరకు అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలి ► అవసరమని CBI భావించినప్పుడు విచారణకు అవినాష్ రెడ్డిని పిలవచ్చు పైషరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చు. ఆ ఛానెల్స్ డిబేట్‌పై అభ్యంతరం ఇక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా టీవీ ఛానెల్స్‌లో తాజాగా వివేకా కేసు పరిణామాలపై జరిగిన డిబేట్లో న్యాయమూర్తికి డబ్బుల సంచులు వెళ్లాయంటూ ఓ సస్పెండెడ్ మెజిస్ట్రేట్ చేసిన వ్యాఖ్యలపైనా.. హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఆ చర్చకు సంబంధించిన వీడియోలను కోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచారం చేశాయి. మీడియా ఛానల్ డిబేట్ లో కొంత మంది వ్యక్తుల ద్వారా నాపై ఆరోపణలు చేయించారు’’ అంటూ ఆర్డర్ కాపీలో వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ‘‘‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్చకు మేం అడ్డంకి కాదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. మీడియా కథనాలు చూసి ఒక స్థాయిలో నేను ఈ కేసు విచారణ నుండి తప్పుకోవాలనుకున్నాను. సస్పెండ్ అయ్యి ఒక జడ్జ్ నాకు డబ్బు సంచులు వచ్చాయని అసత్య ప్రచారం చేయడం బాధాకరం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి విచారణ జరిపి తీర్పు వెల్లడించాను. ఆయా డిబేట్ల వీడియోలను కోర్టుకు సమర్పించండి. చీఫ్ జస్టిస్ ఆ వీడియోలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారు అని హైకోర్టు జడ్జి పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి అనేక మలుపులు.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏప్రిల్ 17వ తేదీన అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి ఆ పిటిషన్‌పై విచారణ అనేక మలుపులు తిరిగింది. చివరికి.. సుప్రీం కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించింది. అవినాష్‌రెడ్డికి బెయిల్ పిటిషన్ వేసే హక్కు ఉందని, పిటిషన్‌పై వాదనలు వినాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా వాదనలు వింది తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా.. సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడుసార్లు హాజరయ్యారు. అయితే తల్లి అనారోగ్యం కారణంగా ఈ నెల 22వ తేదీన విచారణకు మాత్రం హాజరు కాలేదు. సీబీఐ విచారణలో ఇప్పటిదాకా తాను సహకరిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. తల్లి బాగోగులు చూసుకోవడానికి గడువు కోరుతూ సీబీఐకి విజ్ఞప్తి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి పలు ప్రశ్నలను సంధించింది. ఇదీ చదవండి: అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేయడం సరికాదు! -
లోక్ సభ అభ్యర్ధిత్వం కోసమే వివేకా హత్య జరిగిందని ఎలా చెప్తున్నారు ?
-
‘అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’
సాక్షి, హైదరాబాద్: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించగా, సునీత తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూత్రా, సీబీఐ తరపున పీపీ నాగేంద్ర వాదనలు వినిపించారు. ‘‘వివేకాను దస్తగిరే హత్య చేశాడు.. అలాంటప్పుడు దస్తగిరి స్టేట్మెంట్ను ఎలా పరిగణలోకి తీసుకుంటారు.. గూగుల్ టేకౌట్ ఎలా ఆధారం అవుతుంది?. అవినాష్‌ను లక్ష్యంగా చేసుకొనే దర్యాప్తు జరుగుతోందని అవినాష్ తరఫు న్యాయవాది అన్నారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి జమ్మలమడుగు వెళ్తున్నట్టు 5గురు సాక్షులు స్టేట్ మెంట్ ఇచ్చారు, కానీ అవినాష్ రెడ్డి తన ఇంటి నుంచి నేరుగా వివేకా ఇంటికి వచ్చాడని CBI చెబుతుంది" అని లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ‘‘ఢిల్లీలో దస్తగిరి 2 నెలల పాటు సీబీఐ కస్టడీలో ఉన్నాడు. కస్టడీ ముగియగానే దస్తగిరి బెయిల్ పిటిషన్ వేశాడు. అప్రూవర్‌గా సీబీఐ దస్తగిరిని మార్చింది. దస్తగిరి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ఎక్కడా అపోజ్ చేయలేదు. దస్తగిరిని ముందుగానే ప్లాన్ చేసి అవినాష్‌రెడ్డి పేరు చెప్పేలా చేసింది. సీబీఐ చెప్పిన వాటికి దస్తగిరి అంగీకరించి అప్రూవర్‌గా మారాడు. దస్తగిరి బెయిల్లో మెరిట్స్ పరిగణలోకి తీసుకోలేదు. హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం నేనెక్కడా చూడలేదు.’’ అని అవినాష్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. చదవండి: వివేకా కేసు: వీడియో రిలీజ్ చేసిన ఎంపీ అవినాష్ ‘‘దస్తగిరి యాంటీసిపేటరి బెయిల్‌ను సీబీఐ వ్యతిరేకించకపోవడం న్యాయ సమ్మతం కాదు. అక్కడ ఇక్కడ విన్న మాటలను బట్టి అవినాష్‌పై ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ఇక్కడ విన్న మాటలు ఎప్పుడూ ఎవిడెన్స్ కాదు. దస్తగిరి మొదటి స్టేట్మెంట్లో గంగిరెడ్డి సహా ఐదుగురు పేర్లు మాత్రమే చెప్పారు. తర్వాత ఇచ్చిన మరో స్టేట్మెంట్లో కొత్తపేర్లు తెరపైకి తెచ్చారు. అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ వద్ద లేవు.’’ అని అవినాష్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. "గూగుల్ టేకౌట్ అనేది ప్రత్యేక యాప్ ఏం కాదు, గూగుల్ టేకౌట్ అక్యూరసీ 2000 మీటర్లు ఉంటుంది. ఇక్కడ 50 మీటర్ల వ్యత్యాసం ఉంది. ఏ కోర్టులు గూగుల్ టేక్ అవుట్ ను ఆధారంగా పరిగణించవు. గూగుల్ టేక్ ఔట్ ఎప్పుడూ కచ్చితమైన ప్రదేశాన్ని చూపించదు. 15-20 మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. గూగుల్ టేకౌట్ కు ఎలాంటి శాస్త్రీయత లేదు" "హత్య జరిగిన రాత్రి 1.58 కి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఏ2 సునీల్ యాదవ్ ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ చెబుతోందని సి.బి.ఐ అంటోంది. కానీ హత్యకు ముందు రోజు రాత్రి నుంచి ఉదయం 9 గంటలవరకు దస్తగిరి, సునీల్ యాదవ్ కలిసే ఉన్నాము అని దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఒక వేళ సునీల్ యాదవ్ లొకేషన్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉంటే దస్తగిరి టేకౌట్ కూడా అక్కడే ఉండాలి కదా" అని అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ‘‘అవినాష్ కోసం మా నాన్న ప్రచారం చేశారని సునీతనే చెప్పారు. ఇంకా సిబిఐ ఆరోపిస్తున్న రాజకీయ కోణంలో హత్యకు మోటివ్ ఎక్కడుంది? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిబిఐ ఎప్పుడయినా ఇంటరాగేషన్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు గతంలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఈ ఆదేశాలు ఇస్తే మేం తూచా తప్పకుండా పాటిస్తామని" అవినాష్ న్యాయవాది నివేదించారు. వాదనల అనంతరం అవినాష్ రెడ్డి పిటిషన్‌ను రేపు మధ్యాహ్నం 3.30గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. -
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు(బుధవారం) వాదనలు వింటామని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు కాల పరిమితిని సుప్రీంకోర్టు పొడిగించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా తాజాగా జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. -
అవినాష్ కోసం వివేకా ప్రచారం చేశారు: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా 2021 దాకా జరిగిన సీబీఐ దర్యాప్తులో ఎలాంటి ఆధారాల్లేవన్న విషయాన్ని తెలంగాణ హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. వివేకా కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం హైకోర్టు ఆయనకు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలని అవినాష్‌కు చెబుతూనే.. ఏప్రిల్ 25వ తేదీ దాకా అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐను ఆదేశించింది హైకోర్టు. అంతేకాదు ఈ పిటిషన్‌పై మధ్యంతర ఉత్వర్వుల్లో పలు కీలకాంశాలను ప్రస్తావించింది బెంచ్. వివేకా హత్యకు ఐదు కారణాలున్నాయని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. రాజకీయంగా పోటీ, ఆస్తుల వివాదం, అక్రమ సంబంధాలు, కొందరితో విభేధాలు, సిబ్బందితో వివాదాలని పేర్కొన్నారు. కానీ, వివేకా మాత్రం అవినాష్‌రెడ్డి కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. పైగా అవినాష్‌రెడ్డి అప్పటికే ఎంపీగా ఉండి.. రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి వాంగ్మూలం మేరకే అవినాష్‌పై కేసు నమోదు చేశారు. మరో నిందితుడు దస్తగిరికి చెప్పిన విషయాన్ని పరిగణించారు. హత్య వెనుక ఎవరో పెద్దవాళ్లున్నారని ఏ1 అన్నాడన్నది దస్తగిరి కథనం. ఎవరో ఏదో అన్నారని.. దాని ఆధారంగా అభియోగం మోపడం హియర్ సే(సాధారణంగా న్యాయస్థానంలో సాక్ష్యంగా అనుమతించబడదు) అవుతుంది. పైగా 2021 వరకు జరిగిన సీబీఐ దర్యాప్తులో అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. సీబీఐ కూడా ఇప్పటి వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయలేదు. కేవలం నోటీసులు ఇచ్చి మాత్రమే విచారించింది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడమన్న ఆప్షన్ చిట్ట చివరిదై ఉండాలి. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను ఈ కోర్టు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎవరిమీద ఏ ఆరోపణలున్నాయి? దానికి ఆధారాలేమున్నాయి?. ఏప్రిల్ 25వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దు. అవినాష్‌రెడ్డి విచారణ సందర్భంగా ప్రశ్నలను ముందుగా ఇచ్చి.. లిఖితపూర్వకంగా జవాబులు తీసుకోవాలి. దర్యాప్తు ప్రక్రియను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేయాలి. ఈ కేసులో తుది ఉత్తర్వులు ఏప్రిల్ 25న ఇస్తాం అని తెలంగాణ హైకోర్టు ఇరు వర్గాలకు స్పష్టం చేసింది. అంతేకాదు.. కేసు దర్యాప్తుపై ఇప్పటికే సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, దర్యాప్తును ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయమని సుప్రీంకోర్టు సూచించిందని కోర్టు గుర్తు చేసింది. అలాగే.. మధ్యంతర ఉత్వర్వుల్లో సిద్దారాం vs మహారాష్ట్ర కేసును ఉదహరించింది. -
వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయ్: అవినాష్‌రెడ్డి న్యాయవాది
సాక్షి, హైదరాబాద్: వివేకా కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. కేవలం దస్తరిగి ఇచ్చిన కన్ఫెషన్ తప్ప.. సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, పైగా దస్తగిరిని కూడా బెదిరించి ఆ స్టేట్మెంట్ తీసుకుందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. ఆపై పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. భాస్కర్‌రెడ్డి పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే అరెస్ట్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి దస్తగిరి కన్ఫెషన్ తప్ప సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరిని బెదిరించి.. చిత్రహింసలకు గురిచేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పాడు. దస్తగిరి కూడా సీబీఐకి భయపడి భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయి. ఒకటి కుటుంబం, రెండోది వ్యాపార సంబంధాలు, మూడోది వివాహేతర సంబంధాలు, నాలుగోది పొలిటికల్ గెయిన్. వీటిపై సీబీఐ ఫోకస్ పెట్టలేదని అవినాష్ రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. అలాగే.. వైఎస్ అవినాష్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని, రాజకీయ కోణంలో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్రలో భాగమే ఇదంతా అని వాదించారు. ఈ తరుణంలో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు.. వివేకా కేసులో అవినాష్‌రెడ్డి ఇవాళ్టి విచారణను రేపటికి సీబీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. రేపు సాయంత్రం నాలుగు గంటల తర్వాతే అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: వివేకాపై అందుకే సునీత కక్షగట్టింది -
తాండవ్ వివాదం: ‘ఆమె అరెస్ట్ తప్పదు’
లక్నో: అమెజాన్ ముఖ్య అధికారి అపర్ణ పురోహిత్‌కి అలహాబాద్ హై కోర్టులో చుక్కెదురయ్యింది. ‘తాండవ్’ వెబ్ సీరిస్ మీద నమోదైన కేసుకు సంబంధించి ఆమె దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హై కోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్ తిరస్కరించారు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయిన పొలిటికల్ డ్రామా తాండవ్‌పై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాండవ్ మేకర్స్‌పై ఉత్తరప్రదేశ్ నోయిడాలో కేసు నమోదు చేశారు. తాండవ్ వెబ్ సిరీస్‌లో మతపరమైన శత్రుత్వం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఇందుకు గాను ఈ వెబ్ సీరిస్ మేకర్స్‌పై చర్యలు తీసుకోవాలిందిగా ఫిర్యాదులో కోరారు. అపర్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సిద్ధార్థ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పిటిషన్‌దారుకి ఈ దేశ చట్టాలపై చిన్నచూపు ఉన్నట్లు ఆమె ప్రవర్తన ద్వారా తెలుస్తోంది. ఈ కారణంగా ఆమెకు కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం లభించదు’’ అన్నారు. ‘‘ఒకవేళ దేశ పౌరులు ఇలాంటి నేరాలకు పాల్పడితే.. ఇక్కడి జనాల నుంచి వ్యతిరేకతను, నిరసనను చవి చూడాల్సి వస్తుంది. అప్పుడు వెంటనే ఈ దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన శక్తులు చురుకుగా మారతాయి. చిన్నవిషయాన్ని పెద్దదిగా చేసి.. భారతీయ పౌరులు అసహనంగా ఉన్నారు.. 'ఇండియా' నివసించడానికి అసురక్షిత ప్రదేశంగా మారిందని ఆరోపిస్తూ వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ప్రచారం చేస్తూ.. చర్చను లేవనెత్తుతాయి. దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి’’ అన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ జైలులో చాలా రోజులు గడిపిన తరువాత ఇటీవల సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన హాస్యనటుడు మునవర్ ఫరూకి కేసును ప్రస్తావిస్తూ, న్యాయమూర్తి.. "పాశ్చాత్య చిత్ర నిర్మాతలు వారి దైవమైన యేసు ప్రభువును, ఇతర ప్రవక్తలను ఎగతాళి చేసే సాహసం చేయరు. కాని హిందీ చిత్ర నిర్మాతలకు ఈ విషయంలో ఎలాంటి హద్దులు లేవు. ఇప్పటికే అనేక సార్లు వారు హిందూ దేవతలను చాలా ఘోరంగా అవమానించారు’’ అని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో హిందీ చిత్ర పరిశ్రమలో చారిత్రక, పౌరాణిక వ్యక్తుల ఇమేజ్ను అణచివేసే చర్యలు పెరిగాయని.. దీన్ని సరైన రీతిలో అడ్డుకోకపోతే భారతీయ సామాజిక, మత పరిస్థితులు వినాశకరమైన పరిణామాలను చవి చూడాల్సి వస్తుందని.. ఇలాంటి చర్యలు సరైనవి కావని జస్టిస్ సిద్ధార్థ్ అభిప్రాయపడ్డారు. ఈ దేశ సాంఘిక, సాంస్కృతిక వారసత్వం గురించి పెద్దగా తెలియని దేశంలోని యువ తరం ప్రస్తుతం సినిమాల్లో చూపించిన వాటిని క్రమంగా నమ్మడం ప్రారంభిస్తారని.. ఇద దేశ సమైక్యతను దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: 'తాండవ్' వివాదం.. నాలుక కోస్తే రూ. కోటి రివార్డు అమెజాన్ నెత్తిన పిడుగు: సుప్రీంకోర్టు నోటీసులు -
అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్‌లతో వివాదంలో చిక్కుకున్న కేరళ ఆక్టివిస్టు రెహానా ఫాతిమాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయించాల్సిందిగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘అసలు మీరెందుకు ఇదంతా చేశారు? మీరు ఆక్టివిస్టే కావొచ్చు. అయినంత మాత్రాన ఇలా ఎందుకు ప్రవర్తించారు? సమాజంపై ఇది చాలా దుష్ప్రభావం చూపుతుంది. మీరు అసభ్యతను వ్యాపింపజేస్తున్నారు. అసలు ఇలాంటి చర్యలు ఎదుగుతున్న పిల్లలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసా’’అని అసహనం వ్యక్తం చేసింది.(అర్థనగ్నంగా పెయింటింగ్, సోషల్ మీడియాలో దుమారం) ఇక రెహానా ఫాతిమా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. తన క్లైంట్‌పై చైల్డ్ పోర్నోగ్రఫీ కింద ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. పురుషులు అర్ధనగ్నంగా కనిపిస్తే లేని అభ్యంతరం మహిళల విషయంలో ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తన క్లైంట్ మహిళ అయినందు వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాగా అర్ధనగ్న శరీరంపై కన్నబిడ్డలతో వాటర్ పెయింటింగ్ వేయించుకుంటూ రెహానా ఫాతిమా ఇటీవల ‘బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్’ పేరిట సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మైనర్లతో అసభ్యంగా ప్రవర్తించారన్న కారణంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు కాగా ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు.(సుప్రీంకోర్టులో ఆ బిషప్కు షాక్..) ఈ నేపథ్యంలో కేరళలోని పలు ఆలయాల్లో కొన్ని దేవతా మూర్తులు కూడా అర్ధనగ్నంగా కనిపిస్తాయని.. అయినప్పటికీ ఆలయానికి వెళ్లిన వారిలో లైంగిక ప్రేరేపణ బదులు ఆ విగ్రహాల్లో దైవత్వమే కనిపిస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. తల్లి శరీరంపై బిడ్డల పెయింటింగ్ కూడా ఇలాంటిదేనని అభిప్రాయపడ్డారు. అదే విధంగా తనపై ఐటీ చట్టం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని ప్రశ్నించారు. ఆ నేపథ్యంలో ఆమె పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... ముందస్తు బెయిలుకు నిరాకరించడంతో సుప్రీంకోర్టు ఆశ్రయించగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. -
మాజీ మంత్రి పితాని కుమారుడికి హైకోర్టు షాక్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ సహా మరో ఇద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే భయంతో పితాని కుమారుడు వెంకట సురేష్, పితాని మాజీ పీఎస్ మురళీమోహన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మురళీమోహన్ను శుక్రవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.. (చక్రం తిప్పిన పితాని కుమారుడు?) తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు హయాంలో మందుల కొనుగోలు, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున స్కాం జరిగింది. ఆ స్కాం పితాని సత్యనారాయణ హయాంలోనూ కొనసాగింది. పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మికశాఖలో ఏ పని జరగాలన్నా మంత్రి కుమారుడు వెంకట్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఏ కాంట్రాక్టు కావాలన్నా వెంకట్‌ను కలిసి పది శాతం చెల్లిస్తేనే పనులు జరిగినట్లుగా ప్రచారం జరిగింది. తమ పనుల కోసం కాంట్రాక్టర్లు పితాని స్వగ్రామం కొమ్ముచిక్కాలకు క్యూ కట్టేవారు. పితాని వెంకట్ చీటీపై టెండర్లు ఎవరికి కేటాయించాలో రాసిచ్చేవారని, దాని ఆధారంగానే పనులు జరిగేవని తెలుస్తోంది. -
చిదంబరం కస్టడీని కోరిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఈ కేసులో చిదంబరం కస్టడీ విచారణకు అనుమతించాలని బుధవారం ఢిల్లీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఎదుట ఈడీ తన స్పందనను తెలియచేస్తూ ఆయనకు బెయిల్ ఇవ్వరాదని కోరింది. చిదంబరం తప్పించుకు తిరుగుతూ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు నివేదించింది. కాగా, చిదంబరం బెయిల్ పిటిషన్‌పై గురువారం ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ ఎదుట వాదనలు కొనసాగనున్నాయి. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో అక్టోబర్ 8న చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలను నవంబర్ 1 వరకూ అరెస్ట్ చేయరాదని ఇచ్చిన ఉత్తర్వులు ముగియడంతో కోర్టు తదుపరి ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది. -
ముందస్తు బెయిల్‌కు బిషప్ ములక్కల్ అప్పీల్
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ ముందస్తు బెయిల్ కోరుతూ మంగళవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. నన్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆమెపై చర్యలు చేపట్టినందుకు ప్రతీకారంగానే ఆమె తనపై లైంగిక దాడి ఆరోపణలు చేశారని బిషప్ పేర్కొంటున్నారు. తనపై నన్ చేసిన ఆరోపణలు కట్టుకథంటూ ఆయన కొట్టిపారేస్తున్నారు. మరోవైపు తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో చర్చి బాధ్యతల నుంచి తనను తాత్కాలికంగా తప్పించాలని ములక్కల్ పోప్ ఫ్రాన్సిస్‌కు లేఖ రాశారు. ఈ కేసును ఎదుర్కొనేందుకు తాను తరచూ కేరళ ప్రయాణించాల్సి ఉన్నందున బిషప్ బాధ్యతల నుంచి తాను వైదలగుతానని లేఖలో బిషప్ స్పష్టం చేశారు. కేసులో తదుపరి విచారణ నిమిత్తం ఈనెల 19న హాజరు కావాలని కేరళ పోలీసులు తనకు నోటీసులు జారీ చేసిన క్రమంలో డయాసిస్ బాధ్యతలను మాధ్యూ కొక్కండమ్‌కు అప్పగిస్తూ బిషప్ సర్క్యులర్ జారీ చేశారు. జలంధర్ కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014- 2016 మధ్య కాలంలో క్రైస్తవ మహిళా సన్యాసిని (46) మీద 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
టీవీఎస్ బాస్‌పై సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాట పవిత్ర విగ్రహాల మాయం, చోరీ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రెండు ప్రధాన ఆలయాల్లో విగ్రహాల మాయంపై హైకోర్టు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో టీవీఎస్ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు నమోదు, అరెస్ట్‌కు అవకాశం ఉందన్న అంచనాలతో కోర్టులో పిటిషన్ వేశారు. విగ్రహాల చోరీ కేసులకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ పీడీ అదికేశవులతో కూడిన స్పెషల్ డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. ఆరు వారాలపాటు ఆయనను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అనంతరం, శ్రీనివాసన్ ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు. ప్రస్తుతానికి శ్రీనివాసన్‌కు ఊరట లభించింది. మరోవైపు కేవలం కాపాలీశ్వర్ భక్తుడిగా తాను ఆలయ వృద్ది కోసం వ్యక్తిగత నిధులను భారీగా వెచ్చించానని పిటిషన్లో శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆలయ పెయింటింగ్, ఇతర పునర్నిర్మాణ ఖర్చుల కోసం 70 లక్షల రూపాయలను వెచ్చించినట్టు కోర్టుకు తెలిపారు. అంతకుమించి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే శ్రీరంగం ఆలయ పునర్నిర్మాణం కోసం ఆలయ ఛైర్మన్‌గా వ్యక్తిగతంగా 25 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు వెల్లడించారు. అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో 100 ఆలయాలను పునర్నిర్మాణం పూర్తిచేసినట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. జూలై 28న మద్రాసు హైకోర్టు సమర్పించిన అఫిడవిట్లో వేణు శ్రీనివాసన్ పేరును ఎలిఫెంట్ రాజేంద్రన్ ప్రస్తావించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు. తిరుచ్చికి చెందిన రంగజరాన్ నరసింహన్, చెన్నైకి చెందిన ఎలిఫెంట్ రాజేంద్రన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీరంగం ఆలయం నుంచి పవిత్రమైన అనేక పురాతన కళాఖండాలు చోరీకి గురయ్యాయనీ, ఆలయంలోని ప్రధాన పెరుమాళ్(విష్ణుమూర్తి) విగ్రహం దెబ్బతిందని ఫిర్యాదుదారులు ఆరోపించారు. అలాగే కపాలీశ్వర్ ఆలయంలో శివుడిని పూజించే నెమలి(పార్వతిదేవి ప్రతిరూపంగా భావించే) ప్రతిమను మార్చివేశారని ఆరోపించారు. 2004లో ఆయన పునరుద్ధరణ కార్యక్రమంలో వీటిని రాత్రికి రాత్రే తారుమారు చేశారనేది పిటిషన్ దారుల ప్రధాన ఆరోపణ. కాగా 2004లో తమిళనాడులోని దేవాలయాలలో కుంభాభిషేకం నిర్వహణకు నియమించిన ప్రభుత్వ కమిటీ(ఆలయ పునరుద్ధరణ కమిటీ)లో వేణు శ్రీనివాసన్ సభ్యుడిగా ఉన్నారు. అలాగే శ్రీరంగం ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా కూడా ఆయన ఉన్నారు. ఇక్కడ కుంభాభిషేకం నిర్వహణలో కూడా ఈయన భాగం. తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలు, చెన్నైశివారు ప్రాంతంలో మైలాపూర్‌లోని కపాలీశ్వర, శ్రీరంగం ఆలయాల విగ్రహాలు, ఇతర పురాతన వస్తులు మాయం కేసులో విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించిన మరోసటి రోజే శ్రీనివాసన్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు టీవీఎస్ ట్రస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తమిళనాడులోని అనేక పురాతన ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధికి సహాయ సహకారాలందించే శ్రీనివాసన్‌పై తాజా ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. -
హనీ..మీరు అక్కడికెందుకు వెళ్లలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : డేరా బాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్‌సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు రిజర్వులో ఉంచింది. రేప్ కేసులో గుర్మీత్ సింగ్‌కు జైలు శిక్ష పడిన తర్వాత హనీప్రీత్ కనిపించకుండాపోయిన సంగతి తెలిసిందే. ఆమె కోసం రెండు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న నేపథ్యంలో సోమవారం ముందస్తు బెయిల్‌కు హనీ దరఖాస్తు చేసుకుంది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం.. పంజాబ్-హర్యానా హైకోర్టుకు వెళ్లకుండా తమ వద్దకు ఎందుకు వచ్చారని ఆమెను ప్రశ్నించింది. అజ్ఞాతంలో ఉన్న హనీతోపాటు డేరా బాబా సహచరులైన ఆదిత్య ఇన్సాన్, పవన్ ఇన్సాన్‌ను అరెస్టు చేయాలని పంచకుల కోర్టు సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యంలో.. ఎవరికీ అనుమానం రాకుండా బురఖా ధరించి ఆమె ఢిల్లీలోని తన న్యాయవాది ఇంటికి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఆమె న్యాయవాది ఇంటికి వెళుతుండగా నమోదైన సీసీటీవీ కెమెరా దృశ్యాలు పోలీసులకు అందాయి. ఈ వీడియో దృశ్యాల్లో ఉన్నది హనీయేనని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన న్యాయవాది ప్రదీప్ ఆర్య ద్వారా ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో పోలీసుల గాలింపులు డేరా బాబా గుర్మీత్ సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్, ఇతర సహచరుల కోసం హర్యానా పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం గాలించారు. ఆమె కోసం ఢిల్లీ, నేషనల్ కాపిటల్ రీజియన్ పరిసర ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-2లోనూ సోదాలు జరిగాయి. డేరా బాబా అకృత్యాలు, ఆయన అరెస్టు అనంతరం జరిగిన అల్లర్లులో హనీతోపాటు ఆదిత్య ఇన్సాన్, పవన్ ఇన్సాన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. వీరి గురించి అంతర్జాతీయంగా అలర్ట్ ప్రకటించారు.