Arjuna Ranatunga
-
కపిల్ దేవ్ పక్కనున్న దిగ్గజ క్రికెటర్‌ను గుర్తుపట్టారా?
క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన ఇద్దరు దిగ్గజ కెప్టెన్లను ఒకే ఫ్రేములో చూడటం అభిమానులకు కన్నులపండుగే! అలాంటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇందులో.. భారత్‌కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్‌ను ఈజీగానే గుర్తుపట్టారు నెటిజన్లు. అయితే, ఫొటోలో ఉన్న మరొక వ్యక్తి గురించి మాత్రం నమ్మలేకపోతున్నాం అంటున్నారు.దిగ్గజ బ్యాటర్ఆయన పూర్వ రూపానికి.. ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం. కపిల్ దేవ్‌తో పాటు ఉన్న క్రికెటర్ మరెవరో కాదు అర్జున్ రణతుంగ. శ్రీలంకను 1996లో వరల్డ్‌కప్ విజేతగా నిలిపిన దిగ్గజ బ్యాటర్.శ్రీలంక తరఫున 1982 నుంచి 2000 సంవత్సరం వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. మొత్తంగా 93 టెస్టులు, 269 వన్డేలు ఆడిన అర్జున్ రణతుంగ ఆయా ఫార్మాట్లలో 5105, 7456 పరుగులు సాధించాడు.పార్ట్‌టైమ్ బౌలర్ అయిన ఈ రైటార్మ్ మీడియం పేసర్ ఖాతాలో టెస్టుల్లో 16, వన్డేల్లో 79 వికెట్లు కూడా ఉన్నాయి. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అర్జున్ రణతుంగ రాజకీయాల్లో ప్రవేశించాడు.శ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగానూశ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికై ప్రజాసేవలో భాగమయ్యాడు. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్లు అర్జున్ రణతుంగ- కపిల్ దేవ్ ఫొటో తెరమీదకు రావడం విశేషం.ఇందులో అర్జున్ రణతుంగను చూసిన నెటిజన్లు.. ‘‘90వ దశకంలో ఆయన మ్యాచ్‌లు చూశాం. అసలు ఆయనా ఈయనా ఒక్కరేనా? అస్సలు నమ్మలేకపోతున్నాం. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు’’ అని కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల జూలై 27న తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ టూర్‌తో టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ ప్రస్థానం మొదలుకానుంది. చదవండి: ‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’Two World Cup winning captains. pic.twitter.com/zJane9Oq0u— Rex Clementine (@RexClementine) July 16, 2024 -
క్రికెట్ బోర్డులో అవినీతి? నన్ను చంపేస్తారంటూ సంచలన ఆరోపణలు
శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రక్షాళన కోసం తపించి తాను ప్రాణం మీదకు తెచ్చుకున్నానంటూ ఆ దేశ ‘క్రీడా మంత్రి’ రోషన్ రణసింఘే సంచలన వ్యాఖ్యలు చేశారు. బోర్డులో అవినీతి నిర్మూలిద్దామని భావిస్తే తనను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంక జట్టు దారుణ వైఫల్యం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. వరల్డ్‌కప్‌లో పరాభవం ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టు ఎంపిక, అనుసరించిన వ్యూహాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోర్డు సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు లంక క్రికెట్ బోర్డును పునురద్ధరించింది. అయితే, ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి కఠిన నిర్ణయం తీసుకుంది. లంక బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ లంక బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో తాజాగా రోషన్ రణసింఘే సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు. క్రికెట్ బోర్డులో జోక్యం వల్లే తనను మంత్రివర్గం నుంచి తొలగించారంటూ ఆయన ఆరోపించారు. నడిరోడ్డు మీద హత్య చేసే అవకాశం! ఈ మేరకు.. ‘‘క్రికెట్ బోర్డులో అవినీతిని నిర్మూలించాలనుకున్నందుకు నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డు మీదే నన్ను హత్య చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు అధ్యక్షుడు, అతడి చీఫ్ స్టాఫ్ మాత్రమే బాధ్యులు’’ అని రోషన్ రణసింఘే వ్యాఖ్యానించారు. భారీ ఆదాయానికి గండి! కాగా మంత్రి వర్గం నుంచి రోషన్ సస్పెన్షన్‌పై అధ్యక్షుడి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఆయన ఆరోపణలపై మాత్రం ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. కాగా ద్వీపదేశంలో ధనిక క్రీడా సంస్థగా లంక క్రికెట్ బోర్డు కొనసాగుతోంది. క్రికెట్ ద్వారా దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. గతంలో వరల్డ్‌కప్ గెలిచిన ఘనతతో పాటు పటిష్ట జట్టుగానూ ఆ టీమ్‌కు పేరుంది. అయితే, గత కొంతకాలంగా ఘోర పరాభవాలతో ప్రతిష్టను మసకబార్చుకుంటోంది శ్రీలంక జట్టు. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ సస్పెన్షన్ మరింత దెబ్బ కొట్టగా.. అధ్యక్షుడు విక్రమసింఘే నిషేధానికి గల కారణాల అన్వేషణకై విచారణ కమిటీ వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: తమ్ముడంటే ప్రేమ! మనుషులు దూరంగా ఉన్నా.. కోహ్లి తోబుట్టువు భావనా గురించి తెలుసా? -
జై షాకు క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం..
శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశడంటూ బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ అధ్యక్షుడు జై షాపై ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. రణతుంగ చేసిన వ్యాఖ్యలపై జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. శ్రీలంక పార్లమెంట్లో మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ.. మా ప్రభుత్వం తరపున ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్ జై షాకు క్షమాపణలు తెలుపుతున్నాము. మా బోర్డులోని లోపాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శి లేదా ఇతర దేశాలపై రుద్దలేము. ఇది మంచి పద్దతి కాదు అని పేర్కొన్నారు. అస్సలు ఏం జరిగిందంటే? వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనతో శ్రీలంక లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం అనంతరం శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే ఎస్ఎల్సీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. అనంతరం మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంతర కమిటీని నియమించారు. అంతలోనే శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బిగ్‌షాకిచ్చింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీరియస్‌గా పరిగణించిన ఐసీసీ ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేసంది. ఈ క్రమంలో ఓ స్ధానిక వార్తపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుణతుంగా మాట్లాడుతూ.. "శ్రీలంక క్రికెట్ బోర్డులో కొంతమంది అధికారులకు జై షాతో మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక క్రికెట్ ఈ స్ధాయికి దిగజారడానికి కారణం అతడే. భారత్‌లో ఉంటూ శ్రీలంక బోర్డును సర్వనాశనం చేస్తున్నాడు. అతను చాలా పవర్ఫుల్. ఎందుకంటే అతని తండ్రి భారత్ హోమ్ మినిస్టర్" అని సంచలన ఆరోపణలు చేశాడు. చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియా-భారత్ ఫైనల్‌కు అంపైర్లు ఖారారు.. లిస్ట్‌లో ఐరన్ లెగ్ అంపైర్ -
సర్వనాశనం చేశాడు.. జై షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
వన్డే వరల్డ్‌కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక ఇంటాబయటా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. వరల్డ్‌కప్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించిన అనంతరం ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు మొత్తాన్ని రద్దు చేశాడు. ఆపై బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. తమ క్రికెట్ బోర్డుకు పట్టిన దుస్థితి నేపథ్యంలో ఆ దేశ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ దేశ క్రికెట్‌కు ఈ గతి పట్టడానికి బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా కారణమని సంచలన ఆరోపణలు చేశాడు. తమ బోర్డు అధికారులతో ఉన్న సత్సంబంధాల కారణంగా షా మాపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఆరోపించాడు. తన తండి (అమిత్ షా) అధికారాన్ని అడ్డుపెట్టుకుని జై షా లంక క్రికెట్‌ను శాశిస్తున్నాడని ధ్వజమెత్తాడు. జై షా అనవసర జోక్యం కారణంగానే లంక క్రికెట్‌కు ఈ దుస్థితి దాపురించిందని వాపోయాడు. జై షాను ఉద్దేశిస్తూ రణతుంగ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో దుమారం రేపుతున్నాయి. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో శ్రీలంక ఘోర ప్రదర్శన కనబర్చి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ కారణంగా శ్రీలంక 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ టోర్నీలో లంక క్రికెట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌పై విజయం సాధించడం. మరోవైపు భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో భారత్.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. -
WC 2023: శ్రీలంక క్రీడా మంత్రి సంచలన నిర్ణయం.. క్రికెట్ బోర్డు రద్దు
వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంకకు గట్టి షాక్ తగిలింది. ఆటగాళ్ల అత్యంత చెత్త ప్రదర్శన నేపథ్యంలో ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యులందరిపై వేటు వేసింది. ఈ క్రమంలో బోర్డు తాత్కాలిక పాలనాధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ అర్జున రణతుంగను నియమించింది. ఈ మేరకు శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింఘే తన నిర్ణయాన్ని ప్రకటించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేస్తూ నోటీసులు జారీ చేసిన ఆయన.. కఠిన చర్యలకు ఉపక్రమించారు. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటిదాకా బోర్డు అధికారులకు సంబంధించిన ఆడిట్ రిపోర్టుపై విచారణ చేపడతామని రోషన్ రణసింఘే ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా శ్రీలంక క్రీడా మంతిత్వ శాఖ ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటిలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా వీరిలో ముగ్గురు రిటైర్డ్ జడ్జీలు. ఇక వరల్డ్‌కప్-2023 టోర్నీలో భాగంగా వాంఖడేలో టీమిండియా చేతిలో శ్రీలంక చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల ధాటికి తాళలేక లంక బ్యాటింగ్ ఆర్డర్ బెంబేలెత్తిపోయింది. కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డులు మూటగట్టుకుంది. దీంతో అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి మోహన డి సిల్వ తన పదవి నుంచి తప్పుకొన్నారు. మిగిలిన సభ్యులందరిపై వేటు వేస్తూ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ క్రికెట్ బోర్డు సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో రోషన్ ఇలా తానే స్వయంగా రంగంలోకి దిగారు. కాగా 1996 వరల్డ్‌కప్ విజేత అయిన శ్రీలంక భారత్ వేదికగా తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట గెలిచింది. ఇప్పటికే సెమీస్ అవకాశాలు కోల్పోయి చతికిలపడింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడి.. ఒకవేళ పాయింట్ల పట్టికలో టాప్-7కు చేరకపోతే చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించే అవకాశం కూడా కోల్పోతుంది. -
అతడొక మ్యాచ్ విన్నర్.. భారత సెలక్టర్ల నిర్ణయం సరైనదే: శ్రీలంక లెజెండ్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దాదాపు 20 నెలల తర్వాత వన్డే క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. వరల్డ్‌కప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అనూహ్యంగా అశ్విన్‌కు చోటు దక్కింది. దీంతో అతడు భారత వరల్డ్‌కప్ ప్రణాళికలలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ప్రపంచకప్‌కు తొలుత ప్రకటించిన వరల్డ్‌కప్ ప్రిలిమనరీ జట్టులో అశ్విన్ లేడు. కానీ ఆస్ట్రేలియా సిరీస్‌లో అశ్విన్ మెరుగ్గా రాణిస్తే కచ్చితంగా ప్రధాన టోర్నీలో ఆడుతాడని క్రికెట్ నిపుణులు జోస్యం చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై శ్రీలంక క్రికెట్ దిగ్గజం అర్జున రణతుంగ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అశ్విన్ మ్యాచ్ విన్నర్ అని రణతుంగ కొనియాడాడు. అదే విధంగా ఆసీస్ సిరీస్‌కు అశ్విన్‌ను ఎంపిక చేసి సెలక్టర్లు మంచి నిర్ణయం తీసుకున్నారని రుణతుంగ తెలిపాడు. భారత జట్టు మేనెజ్మెంట్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి ఆల్-రౌండర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ నావరకు అయితే.. రవి అశ్విన్ వంటి స్పిన్నర్‌కు ప్లేయింగ్ ఎలవెన్‌లో చోటు దక్కకపోయినా జట్టులో మాత్రం ఉండాలి. టోర్నీలో అతడు ఒక్క మ్యాచ్ ఆడినా చాలు జట్టును ఒంటి చేత్తో గెలిపిస్తాడు. అతడు ఫీల్డ్‌లో అంత యాక్టివ్‌గా ఉండకపోవచ్చు. కానీ ఉపఖండ పిచ్‌లపై అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి అతడికి కచ్చితంగా వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం ఇవ్వాలని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణతుంగ పేర్కొన్నాడు. కాగా అశ్విన్ చివరిసారిగా 2022 జనవరిలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడాడు. ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆసీస్‌తో మూడో వన్డేకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చదవండి: అందుకే అశ్విన్‌ను తీసుకున్నాం.. అతడు 20 నెలలగా ఆడకపోయినా: రోహిత్ శర్మ -
రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ధోనికి అలా సాధ్యం కాలేదు!
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Rohit Sharma Record: ఐదేళ్ల క్రితం ఆసియా కప్ టోర్నీలో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా మరోసారి అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత జట్టు ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి విజయకేతనం ఎగురవేసింది. మిస్టర్కూల్తో పాటు లంక లెజెండ్ మాదిరిగానే వన్డే మ్యాచ్‌లో 50 పరుగులకే ఆలౌట్ అయిన శ్రీలంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలోనే ఛేదించి రికార్డు స్థాయిలో అతి పెద్ద విజయం నమోదు చేసింది. కాగా ఆటగాడిగా రోహిత్ శర్మ కెరీర్లో ఇది 250వ అంతర్జాతీయ వన్డే కావడం విశేషం. అదే విధంగా ఆసియా కప్ వన్డే చరిత్రలో 28వది. ఇక ఈ మ్యాచ్‌లోనే కెప్టెన్‌గానూ రోహిత్ అరుదైన ఘనతలు సాధించాడు. శ్రీలంకపై విజయంతో ఆసియా వన్డే కప్‌లో సారథిగా తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి.. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ధోనికి అలా సాధ్యం కాలేదు అయితే, ధోని(14 మ్యాచ్‌లలో), రణతుంగ(13 మ్యాచ్‌లలో)ల కంటే అత్యంత వేగంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. 11 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించి చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. కొలంబోలో శ్రీలంకతో ఆదివారం నాటి ఫైనల్లో గెలుపుతో రోహిత్ శర్మ కెప్టెన్‌గా రెండోసారి ఆసియా కప్ అందుకున్నాడు. అజారుద్దీన్‌తో పాటు.. ధోని, రోహిత్ ఈ క్రమంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా మహ్మద్ అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోని తర్వాతి స్థానంలో నిలిచాడు. 1990-91లో అజారుద్దీన్, 2010, 2016(టీ20 ఫార్మాట్లో తొలిసారి)లో ధోని టీమిండియాకు టైటిల్ అందించారు. కాగా ఫైనల్లో ఆరు వికెట్లతో చెలరేగి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్ Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
లంక ఆర్థిక సంక్షోభం.. తరలివస్తున్న మాజీ క్రికెటర్లు
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభం కారణంగా లంక రూపాయి విలువ దారుణంగా పడిపోడవడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజుకు 12 గంటల పాటు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైన ఆ దేశ అధ్యక్షుడు గొటబోయ రాజపక్స గద్దె నుంచి దిగిపోవాలంటూ వారం రోజుల నుంచి ప్రజలు సెక్రటరియట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రజలు చేస్తున్న పోరాటానికి లంక మాజీ దిగ్గజ క్రికెటర్.. రాజకీయ నేత అర్జున రణతుంగ తన మద్దతు ఇచ్చారు. క్రికెట్ రిత్యా వేరే దేశాల్లో ఉన్న లంక క్రికెటర్లు కూడా ఆటను వదిలి వారం పాటు లంకకు వచ్చి ప్రజల పోరాటానికి మద్దతు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా రణతుంగ వ్యాఖ్యలు పలువురు మాజీ క్రికెటర్లను కదిలించాయి. సహచర మాజీ క్రికెటర్.. సనత్ జయసూర్య ఇప్పటికే రణతుంగతో కలిసి గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. ''ఈరోజు బయట మా అభిమానులు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇంకా అధికారిక ప్రభుత్వానికి భజన చేస్తూ కూర్చోలేం.. ప్రజలకు మా అవసరం ఉంది.. అందుకే ప్రత్యక్ష పోరాటానికి దిగాం.. క్రీడాకారులైనా సరే.. దేశం కష్టాల్లో ఉందంటే చూస్తూ ఊరుకోరు.'' అంటూ రణతుంగ పేర్కొన్నాడు. కాగా జయసూర్య నినాదాలు చేస్తూనే రాజపక్స ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లు దూకే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో జయసూర్య లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కాగా వీరిద్దరికి తాజాగా మరికొందరు మాజీ క్రికెటర్లు పరోక్షంగా తమ మద్దతు తెలిపారు. రాజకీయపరంగా నిరకుంశ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని.. గొటబయ రాజపక్స గద్దె దిగాలని మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే అభిప్రాయపడ్డాడు. మరో మాజీ క్రికెటర్ కుమార సంగక్కర కూడా ట్విటర్ వేదికగా తన నిరసనను వ్యక్తం చేశాడు. ఇక మాజీ టెస్టు క్రికెటర్.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామా శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గతంలో జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభంతో పోల్చాడు. అప్పుడు రాబర్ట్ ముగాబే.. ఇప్పుడు గొటబయ రాజపక్స ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ''కొన్ని సంవత్సరాల క్రితం నేను జింబాబ్వే వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజలు రాబర్ట్ ముగాబే ప్రభుత్వంపై త్రీవ నిరసన వ్యక్తం చేశారు. నా కారు డ్రైవర్ డీజిల్ తేవడానికి గంటల పాటు క్యూలైన్లో నిల్చోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి నా దేశంలో రావద్దని కోరుకున్నా. కానీ నా అంచనా తలకిందులైంది. ఒకప్పుడు జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభాన్ని ఇప్పుడు లంక ప్రజలు అనుభవిస్తున్నారు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Dhammika Prasad: నిరాహారదీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్ Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! -
దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి!
మన పక్కదేశం శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా తదనంతర పరిణామాల అనంతరం లంకకు ఆదాయం తెచ్చిపెట్టే టూరిజం బాగా దెబ్బతింది. దీంతో పెట్రోల్ సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. తినడానికి తిండి లేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు దేశం విడిచి వలస పోతుంటే.. మరికొందరు పుట్టిన మట్టిని వదిలిరాలేక ఆకలితో అలమటిస్తున్నారు. రోజురోజుకు అక్కడ పరిస్థితి దిగజారుతూనే వస్తుంది. దీనికి ప్రధాన కారణమైన గొటబొయ రాజపక్స ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీ క్రికెటర్.. మంత్రి అర్జున రణతుంగ శ్రీలంక ఆటగాళ్లకు ఒక విజ్ఞప్తి చేశారు. ''ఆర్థిక సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతోంది.. దయచేసి ఐపీఎల్లో ఆడుతున్న లంక క్రికెటర్లు తిరిగి వచ్చి దేశానికి మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నా. దేశం తగలబడిపోతున్నా కొందరు క్రికెటర్లు ఏం పట్టనేట్లే ఉన్నారు. మాకెందుకు ఇదంతా అన్నట్లు ఐపీఎల్లో ఆడుతూ సొంత దేశం గురించి పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. కాగా క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికి.. సదరు బోర్డు ఒక మినిస్ట్రీ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ బోర్డులో ఉన్న ఉద్యోగులు, క్రికెటర్లు తమ జాబ్‌లు కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో యంగ్ క్రికెటర్లు ముందుకు వచ్చి తమ మద్దతు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడే ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు కావాలి. మీరెందుకు నిరసన వ్యక్తం చేయడం లేదని ప్రజలు అడుగుతున్నారు. దానికి నా దగ్గర కారణం ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చి 19 ఏళ్లయింది. అయితే ఇప్పుడున్నది రాజకీయ సమస్య కాదు.. ఆర్థిక సమస్య. ఇంతకముందు వనిందు హసరంగా, బానుక రాజపక్స ఆర్థిక సంక్షోభానికి మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడేమో వెళ్లి ఐపీఎల్ ఆడుకుంటున్నారు. నేను మీ జాబ్‌ను పూర్తిగా వదిలేయమని చెప్పను.. ఒక వారం పాటు ప్రత్యేక అనుమతి తీసుకొని దేశానికి వచ్చి మీ మద్దతు ఇవ్వండి చాలు'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: దివాళా తీశాం.. విదేశీ రుణాలు తీర్చలేం: లంక ఆర్థిక శాఖ మా పాలన కాదు! తీవ్ర సంక్షోభానికి అసలు కారణం చెప్పిన లంక ప్రధాని -
అది టీమిండియా- బీ జట్టు కాదు.. మాజీ కెప్టెన్‌కు బోర్డు కౌంటర్!
కొలంబో: మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వ్యాఖ్యలపై శ్రీలంక క్రికెట్ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న భారత జట్టు సెకండ్ టీం కాదని, అన్ని విభాగాల్లో ఎంతో పటిష్టంగా ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కొంతమంది మీడియాలో తమ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. వారందరికీ ఇదే సమాధానం. శ్రీలంక టూర్‌కు వచ్చిన టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు ఎంతో పటిష్టమైనది. భారత బృందంలోని ప్రస్తుత 20 మందిలో 14 మంది సభ్యులు ఇప్పటికే టీమిండియా తరఫున ఏదో ఒక ఫార్మాట్లో, మరికొందరు అన్ని ఫార్మాట్ల(టెస్టు, వన్డే, టీ20)లోనూ ప్రాతినిథ్యం వహించి ఉన్నారు. ఇది ద్వితీయ శ్రేణి జట్టుకాదు’’ అని పరోక్షంగా అర్జున రణతుంగకు కౌంటర్ ఇచ్చింది. అదే విధంగా... ఒకేసారి కోహ్లి, ధావన్ సారథ్యంలోని భారత జట్టు రెండు వేర్వేరు దేశాల్లో పర్యటించడంపై స్పందిస్తూ... ‘‘క్రికెట్ ప్రపంచంలో ఇదొక సరికొత్త విధానం. ముఖ్యంగా ఐసీసీ సభ్య దేశాలు... తమ అవసరాలకు అనుగుణంగా ఒక్కో ఫార్మాట్‌కు ప్రత్యేక స్వ్యాడ్తో ఆడించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల పోటీతత్వం పెరగడంతో పాటుగా, ఐసీసీకి ఇచ్చిన కమిట్మెంట్ల ప్రకారం... వివిధ బోర్డులు తమ మాటను నెరవేర్చుకునే వీలు కలుగుతుంది’’ అని శ్రీలంక క్రికెట్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా శ్రీలంక పర్యటనకు టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టును పంపించడం తమ దేశ క్రికెట్‌కు ఘోర అవమానమని అర్జున రణతుంగ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రతిపాదనకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు మతి లేదని విరుచుకుపడ్డారు. ఇక విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లగా.. శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న యువఆటగాళ్లతో కూడిన జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. జూలై 13 నుంచి భారత్- శ్రీలంక మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు జరగనున్నాయి. -
ఇండియా బి టీమ్ రావడం శ్రీలంక క్రికెట్‌కు ఘోర అవమానం..
కొలంబో: శ్రీలంక పర్యటనకు భారత్.. బి జట్టును పంపిచడం తమ దేశ క్రికెట్‌కు ఘోర అవమానమని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియా ప్రతిపాదనకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు అస్సలు బుద్ది లేదని ఆయన మండిపడ్డాడు. టెలివిజన్ మార్కెటింగ్‌లో భాగంగానే ఈ సిరీస్‌కు లంక క్రికెట్ బోర్డు ఒప్పుకుందని ఆరోపించాడు. తాజాగా పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. లంక బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్.. తమ బలమైన జట్టును ఇంగ్లండ్‌కు పంపించి బలహీనమైన రెండో జట్టును శ్రీలంకకు పంపించిందని విమర్శించాడు. బీసీసీఐ ఇలా వ్యవహరించడానకి తమ దేశ క్రికెట్ బోర్డు అసమర్థతతనే కారణమని ధ్వజమెత్తాడు. లంక క్రికెట్ బోర్డు అడ్మినిస్ట్రేషన్‌లో లోపాల కారణంగా తమ దేశ ఆటగాళ్లకు క్రమశిక్షణ లేకుండా పోయిందని, ఆటతీరు కూడా దారుణంగా ఉందని ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న లంక జట్టును ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, అర్జున రణతుంగ సారథ్యంలో శ్రీలంక జట్టు 1996 వన్డే ప్రపంచ కప్ సాధించింది. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధవన్ సారథ్యంలో యువ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం లంక పర్యటనకు వెళ్లింది. జూలై 13 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు జరగనున్నాయి. భారత జట్టు: శిఖర్ ధవన్(కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుత్‌రాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతం, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా -
ఇలా అయితే.. ప్రపంచకప్‌లో ఘోర ఓటమి తప్పదు
కొలంబో : ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌కు కొద్ది నెలల ముందు తమ జట్టు స్థైర్యాన్ని దెబ్బతీసేల శ్రీలంక మాజీ ఆటగాడు అర్జున రణతుంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లడ్-వేల్స్ వేదికగా మే చివరి వారంలో ప్రారంభ కానున్న ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించడం ఖాయమని తేల్చిచెప్పాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా అవినీతిలో కూరుకపోయిందని ధ్వజమెత్తాడు. దీంతో ఆటగాళ్లలో నైతికత దెబ్బతిన్నదని.. అందుకే వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప దేశం కోసం ఆడటం లేదని విమర్శించాడు. ఇలా అయితే ప్రపంచకప్‌లో శ్రీలంక తొలి రౌండ్లోనే ఇంటి బాట పట్టడం ఖాయమన్నారు. బోర్డు అధికారులు డబ్బు మీద పెట్టిన దృష్టి ఆటపై గాని ఆటగాళ్లపై గాని పెట్టడంలేదని దుయ్యబట్టారు. స్వదేశీ విదేశాల్లోనూ లంక వరుసగా సిరీస్‌లు ఓడిపోయినప్పటికీ.. జట్టులో ఎలాంటి ప్రక్షాళన చేయడం లేదని బోర్డు అధికారులపై మండిపడ్డాడు. దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టి యువ ఆటగాళ్లలో మరింత నైపుణ్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవడంలో బోర్డు పూర్తిగా విఫలమైందని అన్నాడు. ఇక ఇప్పటికే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించకపోవడంతో శ్రీలంక క్రికెట్ జట్టు ఆట ఎంతకి దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలని అన్నాడు. ఇక 1996లో ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టుకు రణతుంగా సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరగుతున్న టెస్టు సిరీస్‌లోనూ శ్రీలంక తడబడుతుంది. తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన లంక.. రెండో టెస్టులోనూ ఎదురీదుతోంది. -
బాధ్యతలు స్వీకరించిన రాజపక్స
కొలంబో: శ్రీలంకలో వెంటవెంటనే చోటుచేసుకుంటున్న పరిణామాల మధ్య మాజీ అధ్యక్షు డు మహింద రాజపక్స సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని సెక్ర టేరియట్‌లో జరిగిన కార్యక్రమంలో రాజపక్స ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సిరిసేన కేబినెట్లో మొత్తం 12 మంది మంత్రులతోపాటు సహాయ, డిప్యూటీ మంత్రు లు ప్రమాణం చేశారు. పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ ఆఫీసు వద్ద ఆదివా రం కాల్పుల్లో గాయపడిన మరొకరు సోమ వారం మరణించడంతో మృతుల సంఖ్య రెండుకు పెరిగింది. దీనికి సంబంధించి మంత్రి రణతుంగను పోలీసులు అరెస్టు చేశారు. -
కాల్పుల ఘటనపై రణతుంగ అరెస్ట్
కొలంబో : తన కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి శ్రీలంక క్రికెట్ దిగ్గజం, మంత్రి అర్జున రణతుంగను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కొలంబో క్రైమ్ పోలీసులు రణతుంగను అరెస్ట్ చేశారని, ఆయనను కోర్టులో హాజరుపరుస్తారని పోలీసు ప్రతినిధి రువాన్ గుణశేఖర పేర్కొన్నారు. విక్రమ సింఘేను ప్రధాని పదవి నుంచి తొలగించిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మహింద్ర రాజపక్సెను ప్రధానిగా నియమించిన సంగతి తెలిసిందే. నూతన ప్రధాని మహింద్ర రాజపక్సెతో సన్నిహితంగా మెలిగే కార్మిక సంఘాల నేతలు రద్దయిన కేబినెట్ మంత్రులను వారి కార్యాలయాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. రణతుంగ ఆదివారం తన కార్యాలయంలోకి ప్రవేశిస్తుండగా కొందరు అడ్డుకోవడంతో సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. -
చచ్చామనుకున్నాం : శ్రీలంక మాజీ క్రికెటర్
కొలంబో: ‘ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆ దేవుని దయ, నా భద్రతా సిబ్బంది దైర్యసాహసాలే కారణం. రాజపక్స అనుచరులు నన్ను చంపాలని చూశారు. దాదాపు మేం చచ్చామనుకున్నాం. మా దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. నాకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటనలు శ్రీలంక ప్రజలు సహించలేరు’అని ఆదివారం కొలంబోలో చోటుచేసుకున్న కాల్పుల ఘటననంతరం శ్రీలంకకు ప్రపంచకప్ అందించిన అర్జున రణతుంగ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రధాని పదవి నుంచి రణిల్ విక్రమసింఘేను తొలగించి మహింద రాజపక్సను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడ అధికార సంక్షోభం నేలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పెట్రోలియం శాఖ మంత్రి అయిన అర్జున రణతుంగ హుటాహుటిన లండన్ నుంచి లంకకు చేరుకున్నారు. ఆదివారం కొలంబోలోని తన కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించగా.. రణతుంగను అడ్డుకోవడంతో పాటు ఆయన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాజపక్స అనుకూల వ్యక్తులు కొందరు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, హెల్మెట్‌తో అర్జున రణతుంగను రక్షించారు. రణతుంగ భద్రతా సిబ్బందితోపాటు విక్రమసింఘే మద్దతుదారు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటననంతరం రణతుంగ రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. ఈ ఇద్దరు భవిష్యత్తు కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించారు. గత 18 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్జున రణతుంగ.. గతేడాదిన్నరగా పెట్రోలియం శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరులు ప్రసన్న రణతుంగ, రువాన రణతుంగాలు కూడా ఎంపీలే కావడం గమనార్హం. ఇక 1996 ప్రపంచకప్‌ను అర్జున రణుతంగ సారథ్యంలోనే శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: విక్రమ సింఘేనే ప్రధాని శ్రీలంక పార్లమెంటు రద్దు -
3రోజుల తర్వాత మళ్లీ ప్రధానిగా!
కొలంబో: శ్రీలంకలో రాజకీయ సంక్షోభం రోజురోజుకి ముదురుతోంది. రణిల్ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తొలగిస్తూ.. ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్ స్పీకర్ కరు జయసూరియ వ్యతిరేకించారు. చట్టపరంగా విక్రమసింఘే ప్రధాని అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా ఈ వివాదంపై సిరిసేనకు ఓ లేఖ రాశారు. పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు మూసివేయడం మరింత రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొన్నారు. వేరే వ్యక్తి పార్లమెంటులో మెజారిటీ నిరూపించుకునేంతవరకు విక్రమసింఘే ప్రధానిగా కొనసాగుతారని తెలిపారు. కాగా, శుక్రవారం రోజున విక్రమసింఘేను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సిరిసేన, దేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను ప్రధానిగా నియమించారు. అంతేకాకుండా విక్రమసింఘేకు భద్రత ఉపసంహరిస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో విక్రమసింఘే పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరచాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో మూడు వారాల పాటు పార్లమెంట్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు సిరిసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. హింసాత్మకంగా మారుతున్న వైనం శ్రీలంకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఆదివారం హింసాత్మకంగా మారింది. ఎంపీ అర్జున రణతుంగా సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పులో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్టు పోలీసు అధికారులు తెలిపారు. విక్రమసింఘే క్యాబినేట్లో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన రణతుంగా.. సిరిసేన శనివారం క్యాబినేట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆ పదవిని కొల్పోయారు. అయితే ఆదివారం రోజున ఆయన తన ఆఫీసులోకి వెళ్లే సమయంలో అక్కడ ఉన్న సముహంపై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. అలాగే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: శ్రీలంక పార్లమెంటు రద్దు -
#మీటూ : ‘ఆ మాజీ క్రికెటర్ నీచుడు’
#మీటూ.. పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని బయటపెట్టే ఆయుధంగా మారింది. సినీ, జర్నలిజం రంగాల్లో పెద్దలుగా గుర్తింపు పొందిన ఎంతో మంది ( ఉదా : నానా పటేకర్, వైరముత్తు, ఎంజే అక్బర్) అసలు సిసలు వ్యక్తిత్వాన్ని బట్టబయలు చేస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు ఈ రెండు రంగాలకు చెందిన ప్రముఖుల వేధింపులే బయటికి రాగా.. క్రీడా రంగంలో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారంటూ గుత్తా జ్వాల తన #మీటూ స్టోరిని బహిర్గతం చేశారు. తాజాగా ఓ ఎయిర్‌హోస్టెస్ శ్రీలంక మాజీ క్రికెటర్, కెప్టెన్ అర్జున రణతుంగ తనతో వ్యవహరించిన తీరు గురించి సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. #రణతుంగ.. ‘ముంబైలోని హోటల్ జూహు సెంటర్ ఎలివేటర్లో ఇండియన్, శ్రీలంక క్రికెటర్లు ఉన్నారని తెలిసి నా స్నేహితురాలు ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వెళ్దామని పట్టుపట్టింది. అలా ఆమెతో పాటుగా నేను కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ కాసేపటి తర్వాత తను స్విమ్మింగ్‌పూల్ వైపుగా పరిగెత్తింది. నేను కూడా తనని అనుసరించాను. తర్వాత తను మాయమైపోయింది. అయితే అప్పుడే హోటల్ రూం నుంచి బయటికి వచ్చిన రణతుంగ స్విమ్మింగ్‌పూల్ దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేను కూడా విష్ చేశాను. కానీ అంతలోనే నాకు అతి సమీపంగా వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. వికృత చేష్టలతో నన్ను చుట్టేశాడు. నాకు చాలా భయం వేసింది. కానీ వెంటనే తేరుకుని అతడిని వదిలించుకునేందుకు గట్టిగా తన్నడం మొదలుపెట్టాను. నీ పాస్‌పోర్టు క్యాన్సిల్ చేయిస్తా, పోలీసులకు చెబుతా అంటూ అరిచాను. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుని హోటల్ రిసెప్షన్లో కంప్లైంట్ చేశాను. కానీ ఇది మీ ప్రైవేట్ మ్యాటర్. మేమేం చేయలేమంటూ సిబ్బంది చేతులెత్తేశారు’ అంటూ అర్జున రణతుంగ తనతో ప్రవర్తించిన తీరును #రణతుంగ పేరిట తన మీటూ స్టోరీని ఇండియన్ ఎయిర్‌హోస్టెస్ బహిర్గతం చేశారు. కాగా శ్రీలంకకు వరల్డ్ కప్(1996) అందించిన కెప్టెన్‌గా రికార్డుకెక్కిన అర్జున రణతుంగ ప్రస్తుతం ఆ దేశ పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. -
మేమెప్పుడూ ఫిక్సింగ్‌కు పాల్పడలేదు
కొలంబో: శ్రీలంక క్రికెట్లో ఫిక్సింగ్‌కు ఆద్యులమంటూ తమపై దేశ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ తిలంగ సుమతిపాల చేసిన ఆరోపణలను మాజీ కెప్టెన్లు అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా తీవ్రంగా ఖండించారు. ‘మేమెప్పుడూ డబ్బు తీసుకోలేదు. మ్యాచ్‌లను ఫిక్స్ చేయలేదు’ అని వీరిద్దరూ మంగళవారం కొలంబోలో ప్రకటించారు. 1994లో లక్నో టెస్టు సందర్భంగా భారత బుకీ నుంచి రణతుంగ, డిసిల్వాలు 1500 అమెరికన్ డాలర్లు తీసుకున్నారని సుమతిపాల ఇటీవల ఆరోపించారు. దీంతో మాజీ సారథులిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకువచ్చారు. ‘సుమతిపాల అధ్యక్షుడిగా ఉన్న క్రికెట్ కమిటీలో నేను పనిచేశా. ఒకవేళ ఫిక్సర్నైతే నన్ను ఎలా కొనసాగించారు? ఆయన ఆరోపణలను లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు’ అని డిసిల్వా పేర్కొన్నాడు. ‘15 వేల డాలర్లు కాదు... ప్రపంచ కప్‌ను వదులుకుంటే 15 మిలియన్ డాలర్లైనా ఇచ్చేవారు. అయినా మేం ఎప్పుడూ డబ్బు కోసం ఆశపడలేదు. ఆటకు అంకితమయ్యాం. దేశానికి పేరు తేవడానికి శ్రమించాం’ అని 1996 ప్రపంచకప్‌లో శ్రీలంకను విజేతగా నిలిపిన రణతుంగ స్పష్టం చేశాడు. -
క్రికెట్ జూదంలా మారింది: మాజీ క్రికెటర్
కొలంబో: ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లంక క్రికెట్ బోర్డును జూదగాళ్లు నడిపిస్తున్నారని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. ‘ప్రస్తుతం శ్రీలంక జట్టు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటోంది. మా దేశ క్రికెట్ బోర్డు పరిపాలనా విభాగంలో లోపాలున్నాయి. క్రికెట్‌ని జూదగాళ్లు నడిపిస్తున్నారు. దీంతో క్రికెట్ జూదగాళ్ల ఆటలా మారింది. వరుస పరాజాయాలకు ఆటగాళ్లు కారణం కాదు. దయచేసి వారిని నిందించవద్దు’ అని రణతుంగ అభిమానులను కోరారు. ప్రస్తుతం బోర్డులో ఉన్న సభ్యుల్లో ఏ ఒక్కరికీ క్రికెట్ ఆడిన అనుభవం లేదని, ఇది చాల విచారించతగిన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డును నడిపించడానికి వారు అర్హులు కాదని, దీనివల్లనే తప్పులు జరుగుతున్నాయని రణతుంగ లంక బోర్డుపై మండిపడ్డారు. రెండు రోజుల క్రితం భారత్ అభిమానులను ఉద్దేశించి రణతుంగా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో 2011 వరల్డ్‌కప్ ఫైనల్ ఫిక్సయిందని ఈ మ్యాచ్‌పై పూర్తి విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. -
మాజీ క్రికెటర్‌పై ఇండియన్ ఫ్యాన్స్ గరం
సాక్షి, స్పోర్ట్స్: శ్రీలంక సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ అర్జున రణతుంగపై ఇండియన్స్ గరంగరంగా ఉన్నారు. అసంబద్ధ వ్యాఖ్యల నేపథ్యంలో లంక మాజీ కెప్టెన్ పై ట్విట్టర్లో టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆగష్టు 27న పల్లెకల్లె మూడో వన్డే సందర్భంగా లంక ఓటమిని తట్టుకోలేక శ్రీలంక ఫ్యాన్స్ బాటిళ్లను మైదానంలోకి విసిరి రచ్చ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆరగంట సేపు ఆటను నిలిపివేసి అనంతరం తిరిగి ప్రారంభించగా, భారత్ విక్టరీ సాధించింది. అయితే వరసగా ఓటమి పాలవుతున్న తమ జట్టును చూసి మండిపడుతున్న శ్రీలంక ఫ్యాన్స్ ను అర్జున రణతుంగ ఊరడించే క్రమంలో ఇండియన్ ఫ్యాన్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈడెన్ గార్డెన్ లో 1996లో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా వరుస వికెట్లు కోల్పోవడంతో ఫ్యాన్స్ వాటర్ బాటిల్స్ విసిరి, ప్లకార్డులు తగలబెట్టి అప్పట్లో పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ విషయాన్ని ఉటంకిస్తూ అభిమానులతో రణతుంగ... ‘మీకు నా విన్నపం ఒక్కటే. క్రికెట్ చరిత్రలో మనకంటూ ఓ చరిత్ర, సాంప్రదాయం ఉన్నాయి. దయచేసి భారత క్రికెట్ అభిమానుల్లాగా మాత్రం ప్రవర్తించకండి. ఇలాంటి ప్రవర్తనతో లంక టీం పరువు తీయకండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో రణతుంగా వార్ ప్రకటించిన ఇండియన్ క్రికెట్ లవర్స్ ట్వీట్లతో రణతుంగపై విరుచుకుపడుతున్నారు. Think before you speak. Indian spectators are matured than srilankans @ArjunaRanatunga — harikrishnaa (@harikrishnaa114) 30 August 2017 @ArjunaRanatunga A man who just have 4 test hundreds in his name (just equal to what our Aswin a batsman Cum bowler has in his name) — Ajay Sharma (@ajay_saraswat18) 30 August 2017 -
భారత అభిమానుల్లా ప్రవర్తించకండి: రణతుంగ
సాక్షి, పల్లెకెలె: శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత అభిమానుల్లా ప్రవర్తించవద్దని శ్రీలంక అభిమానులకు సూచించాడు. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయాన్ని తట్టుకోలేని లంక అభిమానులు మైదానంలోని ఫీల్డర్లపై బాటిళ్లు విసిరారు. దీంతోమ్యాచ్ 35 నిమిషాల పాటు అంపైర్లు ఆటను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన రణతుంగ ‘భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానులు వాటర్ బాటిల్స్ విసిరి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. లంక అభిమానులు కాస్త ఓర్పుతో ఉండాలి. సంయమనం పాటించాలి. ఇలాంటి సంఘటనలను పునరావృతం చేయవద్దు. లంక ప్రజలు క్రికెట్‌ని ప్రేమిస్తారు. మేము మ్యాచ్ ఓడిపోయినప్పుడు వారెంతో బాధకు గురవుతారు. క్రికెట్ కోసం ఎన్నో వదులుకున్నాం. వరుస ఓటములతో జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానుల్ని ఒకటే కోరుతున్నాను. దయచేసి భారత ప్రేక్షకుల్లా ప్రవర్తించొద్దు. మనకంటూ మంచి చరిత్ర, సంస్కృతి ఉంది. ఇలాంటి ప్రవర్తనను మన చరిత్ర, సంస్కృతి ఒప్పుకోదు’ అని రణతుంగ అన్నాడు. 1996లో ప్రపంచకప్ సెమీస్‌లో ఈడెన్గార్డెన్లో భారత్-లంక జట్లు తలపడ్డాయి. భారత్ వరుస వికెట్లు కోల్పోవడంతో అభిమానులు వాటర్ బాటిల్స్ విసిరి, ప్లకార్డులు తగలబెట్టి గొడవ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రణతంగ పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు. ఇక గతంలో 2011 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందని వివాదస్పద వ్యాఖ్యలు చేసి భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. -
'క్రికెట్ బాస్ పదవికి రాజీనామా చేయను'
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు పేలవమైన ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ తనను ఆ దేశ క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలంటూ మాజీ దిగ్గజ క్రికెటర్ అర్జున్ రణతుంగా చేసిన డిమాండ్ ను తిలంగా సుమతిపాల తోసిపుచ్చారు. తాను పదవి నుంచి దిగాల్సిన అవసరం లేదంటూ రణతుంగకు కౌంటర్ ఇచ్చాడు. జట్టు ఆట తీరు బాలేకపోవడంలో క్రికెట్ పరిపాలన విభాగం తప్పిదం లేదనే విషయం తెలుసుకోవాలన్నాడు. 'నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. జట్టు ఆడకపోతే అది మా సమస్య కాదు. ఫీల్డ్ లో ఆడే జట్టు సరైన ప్రదర్శన చేయకపోతే క్రికెట్ పరిపాలన విభాగం ఏం చేస్తుంది. మా వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేదు' అని సుమతిపాల అన్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ క్రికెట్ బాస్ పదవికి రాజీనామా చేయనని సుమతిపాల స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రీలంక పెట్రోలియం మంత్రిగా ఉన్న అర్జున్ రణతుంగ.. తమ దేశ క్రికెట్ లో అవకతవకలు జరుగుతున్నాయంటూ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు, ప్రధాని రాణిల్ విక్రమ్ సింఘేకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేసి తాత్కాలికంగా కమిటీ ఏర్పాటు చేయాలని వారికి రణతుంగ విన్నవించారు. ఈ క్రమంలోనే ఎస్ఎల్సీ అవలంభిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు.శ్రీలంక క్రికెట్ పరిపాలనలోఉన్న అసహ్యకర వాతావరణం నెలకొందంటూ విమర్శలు గుప్పించారు. -
మాథ్యూస్ చేసింది సరైంది కాదు..
కొలంబో:గత నెలలో శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్సీ కి గుడ్ బై చెబుతూ ఏంజెలో మాథ్యూస్ తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం సరైంది కాదని ఆ దేశ దిగ్గజ కెప్టెన్ అర్జున రణతుంగ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ అతను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెబితే శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ఎలా అనుమతి ఇచ్చిందని రణతుంగ ప్రశ్నించాడు. అతను కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందన్నాడు. జట్టు అవసరాల దృష్ట్యా అతన్ని మరికొంత కాలం కెప్టెన్ గా కొనసాగమని ఎస్ఎల్సీ పెద్దలు కోరి ఉండాల్సిందన్నాడు. ఒకవేళ కెప్టెన్సీ విషయంలో తనను మాథ్యూస్ అడిగితే అనుమతి ఇచ్చేవాడిని కాదన్నాడు. అందుకు ఇది తగిన సమయం కాదని చెప్పేవాడినని రణతుంగ పేర్కొన్నాడు. 'నేను చూసిన లంక కెప్టెన్లలో మాథ్యూస్ ఒక అత్యుత్తమ కెప్టెన్. రంజన్ మదుగలే తరువాత ఆ స్థాయి ఉన్న కెప్టెన్ మాథ్యూస్. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని బోర్డుకు చెప్పినప్పుడు అందుకు అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదు. నీ నిర్ణయాన్ని కొన్నాళ్లు అలా ఉంచుకోమని బోర్డు చెప్పి ఉండాల్సింది. అది చేయకపోవడంతో లంక జట్టు పరిస్థితి పూర్తిగా గాడి తప్పింది. గతేడాది ఆసీస్ వంటి నంబర్ వన్ జట్టును మాథ్యూస్ నేతృత్వంలోని శ్రీలంక వైట్ వాష్ చేసింది. ఆ క్రెడిట్ మాథ్యూస్ తో పాటు యావత్ జట్టుకు దక్కింది. అయితే జట్టు ఓటములకే మాథ్యూస్ ను బలి పశువును చేస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం. ఈ కారణం చేత మాథ్యూస్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బె చెప్పాడు. మాథ్యూస్ సానుకూల ధోరణి గల కెప్టెన్. అతను ఆత్మవిశ్వాసం సడలడానికి మా క్రికెట్ బోర్డే కారణం'అని రణతుంగా తెలిపాడు. -
'ప్రతీసారి కోహ్లికి కోపం అవసరం లేదు'
కొలంబో: మైదానంలో తరచు కోపాన్ని ప్రదర్శించడం భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లికి అంత మంచిది కాదని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగా అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడిగా ఇప్పటికే తానేమిటో కోహ్లి నిరూపించుకున్నప్పటికీ, కెప్టెన్ గా నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని రణతుంగా పేర్కొన్నారు. ఆటగాడిగా కోహ్లి అత్యుత్తమ స్థాయిని చూశా. అయితే కెప్టెన్ గా అతని ఏ రేటింగ్ ఇవ్వలేను. అతను కెప్టెన్ గా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. ప్రతీసారి మైదానంలో కోహ్లి కోపాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పదేపదే కోహ్లి కోపాన్ని తెచ్చుకుంటే అది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపిస్తుంది. అవసరమైన సందర్బాల్లో తప్పితే, ప్రతీదానికి కోపంతో కూడిన దూకుడును ప్రదర్శించడం కోహ్లికి మంచిది కాదు. కెప్టెన్ గా ధోని, అజహరుద్దీన్ లతో కోహ్లికి పోలిక వద్దు. కపిల్ దేవ్ పోలిక కోహ్లికి సరిపోతుందేమో. దానికి కూడా కోహ్లి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది' అని రణతుంగ పేర్కొన్నారు. -
'వరల్డ్ కప్' ఫిక్సింగ్ పై ఫిర్యాదు చేస్తే..
కొలంబో: 2011 వరల్డ్ కప్‌లో భారత్ -శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందంటూ ఇటీవల అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని శ్రీలంక ప్రభుత్వాని డిమాండ్ చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరించిన రణతుంగ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రణతుంగ వ్యాఖ్యలపై శ్రీలంక ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఆ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగినట్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని శ్రీలంక క్రీడా మంత్రి దయసిరి జయశేఖర తెలిపారు. 'రాత పూర్వకంగా ఫిర్యాదు చేయండి. ఆ ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నా' అని జయశేఖర బదులిచ్చారు. కొన్ని రోజుల క్రితం భారత్- శ్రీలంకల వరల్డ్ కప్-2011 ఫైనల్ మ్యాచ్ పై తనకు అనుమానాలు ఉన్నాయంటూ రణతుంగ ఆరోపించాడు. లంకేయులు ఆడిన తీరు పలు అనుమానాలకు తావిచ్చిందంటూ ఆరేళ్ల తరువాత రణతుంగా కొత్త పల్లవి అందుకున్నాడు.