Arjuna
-
వాళ్ల కోసమే 'కల్కి' చేశాను.. నాదేం లేదు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ఎట్టకేలకు స్పందించాడు. రీసెంట్గా రిలీజైన 'కల్కి' సినిమాలో ఇతడు అర్జునుడి పాత్రలో కనిపించాడు. ఈ క్రమంలోనే ఇతడి డైలాగ్ డెలివరీపై విమర్శలు వచ్చాయి. రెండు మూడు రోజుల నుంచి కర్ణుడు గొప్పా? అర్జునుడు గొప్పా? అనే విషయమై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా.. 'కల్కి' సక్సెస్‌పై రౌడీ హీరో తొలిసారి స్పందించాడు. తానేం లక్కీ ఛార్మ్ కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: 'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?)'మన ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాం. నాగీ, ప్రభాస్ అన్న కోసమే ఇందులో నేను నటించాను. ఇలాంటి సినిమాలో చివరలో అలా రావడం నాకు సంతోషంగా ఉంది. నాగీ యూనివర్స్‌లో ఓ పాత్ర పోషించాను అంతే. వాళ్లందరి కోసం ఈ పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. వైజయంతీ మూవీస్‌లోనే నా కెరీర్ మొదలైంది. అందుకే నాగీ ప్రతి సినిమాలో చేస్తుంటా. మహానటి అద్భుతమైన సినిమా, 'కల్కి' అద్భుతమైన సినిమాలు అంతే. అవి నా వల్ల అవి హిట్ కాలేదు. నేనేం లక్కీ ఛార్మ్ కాదు' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.విజయ్ దేవరకొండ తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అతడిని మీడియా 'కల్కి' గురించి ప్రశ్నించగా.. పై విధంగా సమాధానమిచ్చాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే నాగ్ అశ్విన్ తర్వాత తీయబోయే మూవీస్‌లోనూ విజయ్ ఉండటం పక్కా.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్)#VijayDeverakonda about #Kalki2898AD movie ❤️The way he say #Prabhas anna 😍 is what I really like 😍 pic.twitter.com/o5D4g7538e— The Chanti (@chanticomrade_) June 30, 2024 -
కల్కి లో ఎవరు గొప్ప..?
-
ఫోటోతో పాటు గుడ్ న్యూస్ చెప్పిన 'మహాభారతం' సీరియల్ అర్జునుడు
భారత ఇతిహాసాల్లో ఒకటిగా చెప్పుకునే మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని 'మహాభారతం' అనే సీరియల్ తెరకెక్కింది. హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో ఇది అందుబాటులో ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోలలో మహాభారతం కూడా ఒకటి. 269 ఏపిసోడ్స్ ఉన్న ఈ సీరియల్‌కు IMDb రేటింగ్ 9.0 ఉంది. మహాభారతం సీరియల్లో అర్జునుడిగా నటించిన హిందీ సీరియల్ నటుడు షహీర్ షేక్‌ను ఎవరూ మరచిపోలేరు. ఆయన మరోసారి తండ్రి అయ్యాడు. 2020లో రుచికా కపూర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ జంటకు ఒక పాప ఉంది. ఇప్పుడు మరో ఆడ శిశువుకు రుచికా జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. భారతీయ వెండితెర ప్రముఖ నటులలో ఒకరైన షహీర్ షేక్ తన చిరకాల స్నేహితురాలు రుచికా కపూర్‌ను మార్చి 2020లో వివాహం చేసుకున్నాడు. వారి మొదటి కుమార్తె అనయను 2021లో స్వాగతించారు. తమ పర్సనల్ లైఫ్‌ను ఎక్కువగా కెమెరా కళ్లకు దూరంగా ఉంచిన ఈ జంట ఈసారి తన జీవితంలోకి వచ్చిన కొత్త అతిథి గురించి షహీర్ భార్య రుచిక ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది. సోదరిని కలిగి ఉండటానికి మించిన గొప్పదనం నిజంగా ఏమీ లేదని రుచికా కపూర్ డిసెంబర్ 31 న తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. అక్కడ తన ఇద్దరు పిల్లల ఫోటోలను పోస్ట్ చేసింది. పెద్ద పాప పేరు అనయ అయితే రెండో కుమార్తె పేరు కుద్రత్ అని ఆమె తెలిపింది. తన చెల్లెల్ని అనయ ఎంతో ముద్దుగా కౌగిలించుకోవడం ఆ ఫోటోలో చూడవచ్చు. షహీర్ షేక్ త్వరలో బాలీవుడ్ చిత్రం అయిన డు పట్టి (Do Patti ) సినిమాలో నటి కృతి సనన్ సరసన నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజోల్ కూడా ఓ పాత్ర పోషించింది. కన్నికా ధిల్లాన్ కథను అందించిన ఈ చిత్రానికి శశాంక్ చతుర్వేది దర్శకత్వం వహించారు. షహీర్ షేక్ కుచ్ రంగ్ ప్యార్ కే ఐసా బీ, మహాభారత్, నవ్య, బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ, క్యా మస్త్ హై లైఫ్ మొదలైన హిందీ సీరియల్స్‌లో కూడా ఆయన నటించారు. అతని భార్య రుచిక ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా, మార్కెటింగ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఇది కాకుండా, ఆమె బాలాజీ మోషన్ పిక్చర్ డిప్యూటీ హెడ్‌గా కూడా పనిచేసింది. ఆమె ఉడ్తా పంజాబ్, ఏక్ విలన్ రిటర్న్, దొబారా వంటి చిత్రాలకు సహ దర్శకత్వం వహించింది. View this post on Instagram A post shared by Ruchikaa Kapoor Sheikh (@ruchikaakapoor) -
అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..
కొన్ని చెట్లకి ఆశ్చర్యకరంగా మన పురాణాల్లోని వ్యక్తుల పేర్లు ఉంటాయి. చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఐతే ఇప్పుడు మీరు వింట్ను చెట్లు పేరు కూడా మహాభారతంలో శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన వాడు అయిన అర్జునుడు పేరుతో పిలుస్తారు ఆ చెట్టుని. ఆ చెట్టు బెరడునను ఆయుర్వేదంలో తప్పనసరిగా ఉపయోగిస్తారు. ఈ చెట్లులో ఉండే ఔషధ గుణాలు చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్నీ కావు. అర్జున చెట్టు బెరడు వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సిరలు, ధమనుల్లో రక్తం ప్రవాహం సాపీగా జరిగేలా చూస్తుంది. గుండె లయబద్ధంగా కొట్టుకునేలా చేస్తుంది. రక్తపోటుని నియంత్రింస్తుంది. ఒత్తిడి, దుఃఖం వల్ల కలిగే శారీరక ఒత్తడిని నియంత్రిస్తుంది పోగాకు, దూమపానం వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ 'ఈ' సమృద్ధిగా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షస్తుంది కూడా. ఫ్యాటీ లివర్ వ్యాధికి చక్కటి దివ్యౌషధం. కాలేయ వ్యాధి ముఖ్య లక్షణమైన స్టీటోసిస్ను ఎదుర్కొవడంలో అర్జునోలిక్ యాసిడ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనంలో తేలింది. అధిక కొలస్ట్రాల్ స్థాయిలకు గట్టి ప్రత్యర్థి అర్జున బెరుడు. హైపోకొలెస్టెరోలేమిక్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. లిపోప్రోటీన్, ట్రైగ్లిజరైడ్స్ ఉనికిని తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తరుచుగా గుండెల్లో మంటగా అనిపించే ఫీలింగ్‌కు చెక్ పెడుతుంది. మంచి డైజిస్టివ్ టానిక్‌గా ఉపయోగపడుతుంది. శక్తిమంతమైన యాంటీ బాక్టీరియల్ సామర్థ్యాలను కలిగి ఉంది. కణుతుల పెరుగుదలను నియంత్రిస్తుంది. గమనిక: అయితే అర్జున బెరడుని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటే ముందుగా ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించి వారి సలహాలు సూచనలు మేరకు ఉపయోగించడం మంచిది. (చదవండి: పిల్లల్లో టాన్సిల్స్ సమస్య ఎందుకు వస్తుంది? నిజానికి ట్రాన్సిల్స్ మంచివే ఎందుకంటే..) -
Ravuri Arjuna Rao: కులం పేరు చెప్పాలని జైల్లో కొట్టారు
‘ఉప్పు సత్యాగ్రహంలో జైలుకెళ్లినప్పుడు కులం పేరు చెప్పని నాలాంటి వారిని పోలీసులు లాఠీలతో కొట్టారు. అయినా నా సిద్ధాంతానికి నీళ్లు వదల్లేదు. కుల మత రహిత సమాజాన్నే జీవితాంతం కోరుకుంటాను’ అంటూ నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడ్డ స్వాతంత్య్ర సమరయోధుడు, నాస్తికుడు రావూరి అర్జునరావు. వర్ణ వివక్షకు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన యోధుడు ఆయన. నాస్తికోద్యమ నాయకుడు, గాంధేయవాది గోపరాజు రామచంద్రరావు (గోరా) పెద్ద అల్లుడు రావూరి అర్జునరావు (104) వయోభారంతో ఆదివారం హైదరాబాద్‌లో తన చిన్నకుమారుడు డాక్టర్ పవర్ నివాసంలో కన్నుమూశారు. సుమారు తొమ్మిదేళ్ల ఏళ్ల క్రితం ‘సాక్షి’తో ఆయన పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే... తొమ్మిది నెలల కఠిన కాగార శిక్ష కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వానపాముల గ్రామంలో 1918లో జన్మించాను. 1940లో సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు(గోరా) ముదునూరు వచ్చారు. అప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది. నాస్తిక కేంద్రంలో అన్నే అంజయ్య సహకారంతో వయోజన విద్యా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. 1942లో గాంధీగారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బళ్లారిలోని ఆలీపురం క్యాంప్ జైల్లో తొమ్మిది నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాను. అస్పృస్యతా నివారణకు కృషి జైలు శిక్ష అనంతరం వానపాముల వచ్చి నాస్తికోద్యమ నాయకుడు గోరాతో కలిసి అస్పృస్యతా నివారణ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అప్పుడు దళితుల మధ్య కుల ద్వేషం ఎక్కువగా ఉండేది. నాలుగేళ్లు అక్కడే ఉండి రెండు కులాల్లో ఎవరి ఇంట్లో వివాహాలు జరిగినా కలిసి భోజనం చేయడం, బహు మతులు ఇచ్చి పుచ్చుకునేలా మార్పులు తీసుకొచ్చాం. ఆదర్శ వివాహాలకు ప్రాధాన్యమిచ్చాం. కులాంతర వివాహాల వల్ల సామాజిక అసమానతలు పోతాయని గోరా నమ్మేవారు. అదే ఆయనను గాంధీగారికి సన్నిహితుడిని చేసింది. గాంధీజీకి సపర్యలు జైల్లో ఉన్నప్పుడు గోరాతో నాకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. తన పెద్ద కుమార్తె మనోరమను వివాహం చేసుకోవాలని ఆయన నన్ను కోరారు. ఎవరైనా మంచి వ్యక్తితో మనోరమ వివాహం చేయమన్నాను. మనోరమతో వివాహానికి నన్ను ఒప్పించారు. ఈ విషయాన్ని ఆయన గాంధీకి తెలిపారు. 1945లో మమ్మల్ని మద్రాస్ తీసుకురావాలని గాంధీజీ గోరాకు ఉత్తరం రాశారు. మనోరమతో గాంధీజీ మాట్లాడి కులాంతర వివాహాన్ని రెండేళ్ల తరువాత చేయాలని సూచించారు. నన్ను సేవాగ్రామ్‌లో ఉండి హిందీ నేర్చుకోవాలని, అందరితో పరిచయాలు పెంచుకుని మనోరమకు ఉత్తరాలు రాయాలని గాంధీజీ చెప్పారు. అలా 1946 ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి 1948 ఏప్రిల్ వరకు గాంధీజీ సేవాగ్రాం ఆశ్రమం వార్ధాలో ఉంటూ ఆయనకు సపర్యలు చేశాను. 1948లో గాంధీజీ హత్యకు గురవ్వడంతో ఆయన సమక్షంలో జరగాల్సిన నా వివాహం నిలిచిపోయింది. మహామహులే పెళ్లి పెద్దలు గాంధీజీ లేరన్న శోకం నుంచి తేరుకున్నాక వార్ధాలోని మహాత్ముడి ఆశ్రమంలోనే అదే ఏడాది మార్చి 13న హరిజన్ సేవక్ సంఘ్ అధ్యక్షుడు ఠక్కర్బాబా ఆధ్వర్యంలో ‘సత్యసాక్షి’గా ప్రభాకర్జీ మా వివాహం జరిపించారు. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్, ఆచార్య కృపలానీ వంటి మహామహులు మా పెళ్లికి పెద్దలు. తరువాత విజయవాడ నాస్తిక కేంద్రానికి చేరుకున్నాం. 20 మందికి ఆదర్శ వివాహాలు 1953లో మా దంపతులం వానపాముల చేరుకుని కాపురం ప్రారంభించి, గాంధీ స్మారక నిధి తరఫున పని చేశాం. 1960లో గుడివాడకు మకాం మార్చాం. అక్కడే హరిజన సేవా సంఘం, బాలుర వసతి గృహం నడిపాం. ఖాదీ బోర్డులో కూడా పని చేసేవాడిని. గుడివాడ, కృష్ణా, నెల్లూరులలోని కొన్ని ప్రాంతాలలో మూఢనమ్మకాల నిర్మూలన, కుల మత రహిత సమాజ స్థాపనకు, సెక్యులర్ వ్యవస్థ నిర్మాణానికి కృషి చేశాం. సుమారు 20 మందికి ఆదర్శ వివాహాలు చేశాం. మనిషిని గౌరవించటం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. విజ్ఞానం పెరిగే కొద్దీ కులతత్వం పెరిగిపోతోంది. పూర్వం త్యాగం ఉండేది. స్వార్థం కోసమే కులతత్వం పెరుగుతోంది. ఆ బీజం నశించినప్పుడే నిజమైన నవ సమాజ స్థాపన జరిగినట్లు. విజయవాడకు రావూరి భౌతికకాయం రావూరి అర్జునరావు భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి సోమవారం విజయవాడ బెంజి సర్కిల్లోని నాస్తిక కేంద్రానికి తీసుకురానున్నారు. సోమవారమే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రావూరి అర్జునరావుకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
మంచి మాట: ఆత్మ నిగ్రహం అసలైన బలం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అతని అభివృద్ధి నిలిచిపోయి అథః పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు విమర్శ చేసుకొంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో సత్సాంగత్యం తో మనసును అదుపులో పెట్టుకోవాలి. అలా మనస్సును అధీనంలో ఉంచుకోవడమే మనో నిగ్రహం. మనోస్థైర్యం దానికి ఆలంబన. 3చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, దాయాదులైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడిపోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. ధనుర్బాణాలు పక్కన పడేసి, నైరాశ్యంలో కూరుకుపోయాడు. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు మనోనిగ్రహాన్ని తిరిగి పొందడం వల్లనే తిరిగి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్య సంధులుగా, న్యాయపరులుగా, నీతివేత్తలుగా తీర్చిదిద్దుతుంది. అందుకే భగవద్గీతను కంఠోపాఠంగా కాకుండా జీవన వెలుగు దివిటీగా చేసుకోమంటారు పెద్దలు. ప్రవరాఖ్యుడికున్నంత మనోనిగ్రహం అందరికీ ఉండాలన్నది శాస్త్ర వచనం. ప్రవరాఖ్యుడు ఒకసారి హిమాలయాలు చూడడానికి వెళ్ళాడు. సిద్ధుడిచ్చిన లేపనం అక్కడ కరిగి పోయింది. కష్టకాలం వచ్చింది. అక్కడ అమిత సౌందర్యవతి అయిన గంధర్వ కాంత కనిపించింది. ఆమెను దారి చెప్పమని ప్రవరాఖ్యుడు అడిగాడు. కానీ ఆమె అతనిని తనను వివాహమాడమని తియ్యని మాటలెన్నో చెప్పింది. ప్రవరాఖ్యుడు ఆమె మాటలకు చలించలేదు. అందాలు ఆరబోసి అతనిని రెచ్చగొట్టినప్పటికీ అతడు నిగ్రహాన్ని విడిచిపెట్టకుండా తన భార్యను, బంధువులను గుర్తు పెట్టుకున్నాడు. ప్రవరాఖ్యుడి వలెనే అందరూ మనో నిగ్రహంతో ముందుకు వెళ్ళాలంటోంది సనాతన ధర్మం. అయితే దీనిని భక్తిమార్గంలో నడవడం వల్లనే సులువుగా సాధించవచ్చు. మనో నిగ్రహం అలవడితే దివ్యశక్తి ఆవహిస్తుంది. సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని అవగతం చేస్తుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడిగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయ లోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీతతో సహా ఇంచుమించు ఇతర మతగ్రంథాలన్నీ ప్రబోధించాయి. మనస్సును జయిస్తే చాలు. ముల్లోకాలను జయిస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేవి అదుపులో ఉంటాయి. దుర్గుణాలు సద్గుణాలుగా మారి శాంతి సౌఖ్యాలనిస్తాయి. అయితే ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ప్రతిభ ఉండీ పిరికితనం వల్ల మనిషి చాలా పోగొట్టుకుంటాడు. ఆత్మస్థైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. ఆత్మ స్థైర్యం ఓ బలవర్ధక పానీయం వంటిది. అది పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్యసాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతా భావన సాధించేందుకు తగిన బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధన లో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. – దాసరి దుర్గాప్రసాద్ -
అమ్మో! ఒక మనిషికి ఇన్ని పేర్లా?..
అంతఃపురంలో ఆడవాళ్ళే మిగిలారు. విరటుడు సైన్యంతో సుశర్మను ఎదుర్కొనాడానికి వెళ్ళాడు. మారువేషాలలో ఉన్న పాండవులు నలుగురూ వెళ్ళారు. ఇంతలో దూత వచ్చి ఉత్తరదిశను పెద్ద సైన్యం మన గోవులను మళ్లించుకు వెళ్ళిం దని ఉత్తరకుమారుడికి చెప్పాడు. నా వద్ద సారథిలేడు, ఉంటే నేను వారిని ఓడించి గోవులను తీసుకు వస్తానని ఉత్తరకుమారుడు బిరాలు పలికేడు. అప్పుడు సైరంద్రి బృహన్న లను తీసుకు వెళ్ళమంటుంది. మరో గత్యం తరం లేక ఉత్తరకుమారుడు వెళ్తాడు. అక్కడ సైన్యాన్నిచూసి భయపడి బృహన్నల వారి స్తున్నా పారిపోతాడు. బృహన్నల ఉత్తరడుని అడ్డగించి నేను అర్జునుడిని. నీవు రథం నడుపు నేను యుద్ధం చేస్తానంటాడు. ఉత్తరుడు నమ్మడు. ఆ మాటలు విన్న ఉత్తర కుమారుడు సంభ్రమాశ్చర్యాలతోసందేహంగా "బృహన్నలా! అర్జునికి పది పేర్లున్నాయి. వాటిని వివరిస్తే నేను నిన్ను నమ్ముతాను " అన్నాడు. బృహన్నల చిరు నవ్వుతో ఉత్తరుని చూసి నాకు అర్జునుడు, పల్గుణుడు, పార్ధుడు, కిరీటి, శ్వేతవాహ నుడు, బీభస్తుడు, విజయుడు, జిష్ణువు, సవ్యచాచి, ధనుంజయుడు అనే దశ నామాలు ఉన్నాయి " అన్నాడు. అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక " బృహన్నలా ! ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతాను " అన్నాడు. అర్జునుడు ఇలా అన్నాడు. "కుమారా! నేను ధరణి అంతటిని జయించి ధనమును సముపార్జించితిని కనుక ధనుంజయుడ నయ్యాను. ఎవ్వరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడి నయ్యాను. నేను ఎల్లప్పుడూ నా రథమునకు తెల్లటి అశ్వాలను మాత్రమే పూన్చుతాను కనుక శ్వేత వాహనుడిని అయ్యాను. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాసిస్తుంటుంది కనుక కిరీటి నయ్యాను. యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి బీభత్సమైన పరిస్థితిలో కూడా సంయమును కోల్పోయి జుగ్గుస్సాకరమైన, బీభత్సమైన పనులు చెయ్యను కనుక బీభత్సుడి నయ్యాను. నేను గాండీవాన్ని ఉపయోగించే సమయంలో రెండు చేతులతో నారిని సంధిస్తాను. కాని ఎక్కువగా ఎడమచేతితో అతి సమర్ధంగా నారిని సంధిస్తాను కనుక సవ్యసాచిని అయ్యాను. నేను ఎక్కవ తెల్లగా ఉంటాను కనుక నన్ను అర్జునుడు అంటారు. నేను ఉత్తర పల్గుణీ నక్షత్రంలో జన్మించాను కనుక ఫల్గుణుడిని అయ్యాను. మా అన్నయ్య ధర్మరాజు. నా కంటి ముందర ఆయనను ఎవరైనా ఏదైనా హాని కలిగించిన దేవతలు అడ్డు తగిలినా వారిని చంపక వదలను. కనుక జిష్ణువు అనే పేరు వచ్చింది. మా అమ్మ అసలు పేరు పృధ. కుంతి భోజుని కుమార్తె కనుక కుంతీదేవి అయింది. పృధపుతృడిని కనుక పార్ధుడిని అయ్యాను. అయినా ఉత్తర కుమారా! నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికే ధర్మరాజు తమ్ముడిని నేను అసత్యం చెప్పను. నేను శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వన దహనంలో అగ్ని దేవునికి సాయపడి నందుకు బ్రహ్మ, రుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలతో పాటు నాకు కృష్ణుడు అనే పదకొండవ నామం బహూకరించారు. నేను నివాత కవచులను సంహరించిన సమయంలో ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహుకరించాడు. దేవతలందరూ మెచ్చి ఈ శంఖమును ఇచ్చారు కనుక దీనిని దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధనుని బంధీని చేసినపుడు గంధర్వులతో పోరాడి వారిని గెలిచాను కనుక నీవు భయపడ వలసిన పని లేదు. మనం కౌరవ సైన్యాలను ఓడించి గోవులను మరల్చగలం " అన్నాడు. అర్జునుడి ఈ పది నామాలే ఉన్నాయా లేక ఇంకమైనా పేర్లు ఉన్నాయా? ఉన్పాయనే చెప్పవచ్చు. భగవద్గీతలో ఉన్న అర్జునుడి ఇతర నామాలు ఇవి. అనఘుడు, అనసూయుడు, కపిధ్వజుడు, కురుప్రవీరుడు, కురునందనుడు, కురుశ్రేష్ఠుడు కూరుసత్తముడు, కౌంతేయుడు, గుడాకేశుడు దేహభృయాం వరుడు, పరంతపుడు, పురుషవర్ధనుడు, భరతర్షభుడు , భరత శ్రేష్ఠుడు, భరతసత్తముడు, మహాబాహుడు. అమ్మో! ఒక మనిషికి ఇన్ని పేర్లా! ఇక్కడ మరో విషయం తెలుసుకోవలసినది ఉంది. పిడుగులు పడేటప్పుడు అర్జునుని దశ నామాలను తలచుకుంటే ఆ పిడుగు మనదరిదాపుల్లో పడదు, మనకు ప్రాణభయం ఉండదంటారు పెద్దలు. -గుమ్మా నిత్యకళ్యాణమ్మ -
కరోనా: వాయిదా పడిన ‘అర్జున’ విడుదల
డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన అర్జున చిత్రాన్నివాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం గురువారం ప్రకటించింది. సినిమాను ముందుగా ఈ నెల 6న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు. కరోనా ప్రభావం కారణంగానే చిత్రం విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. రాజశేఖర్ సరసన అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్స్ ట్రెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇందులో రాజశేఖర్ తండ్రీ కొడుకులుగా అద్భుతమైన నటనను కనబరిచారని అన్నారు. సమకాలీన రాజకీయ నేపథ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమని, యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దీనిని మలచడం జరిగిందని చెప్పారు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ... అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారని అన్నారు. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తాయి అని అన్నారు. -
వాస్తవ సంఘటనలతో...
డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘అర్జున’. మరియం జకారియా హీరోయిన్. కన్మణి దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను నట్టికుమార్ ఆవిష్కరించారు. నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిది. వాస్తవ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించాం. సూర్యనారాయణ అనే రైతు పాత్రలో, ఆయన తనయుడు అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఓ హైలైట్. దాదాపు 800 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
అర్జున... సన్నాఫ్ సూర్యనారాయణ
రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘అర్జున’. ఇందులో మరియం జకారియా హీరోయిన్గా నటించారు. కన్మణి దర్శకత్వంలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ‘‘ఇందులో సూర్యనారాయణ అనే రైతు, అతని కొడుకు అర్జునగా ద్విపాత్రాభినయం చేశారు రాజశేఖర్. తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉంటాయి. వాస్తవ సంఘటనల ప్రేరణగా రాజకీయ నేపథ్యంలో కన్మణి బాగా తెరకెక్కించారు. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. కోట శ్రీనివాసరావు, చలపతిరావు, రేఖ, మురళీశర్మ, శివాజీరాజా తదితరులు నటించిన ఈ సినిమాకు ‘వందేమాతరం’ శ్రీనివాస్ సంగీతం అందించారు. -
కిరాతార్జునీయం
పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయమది. తమ వద్దకు వచ్చిన వ్యాసమునీంద్రుని పాండవులు అర్ఘ్య పాద్యాదులతో పూజించిన తరువాత ఆయనతో ‘కౌరవులు మమ్మల్ని మాయ జూదంలో ఓడించారు. మమ్మల్ని అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికీ పంపించారు. శత్రుంజయులుగా పేరొందిన మాకే ఇప్పుడు శత్రుభయం పట్టుకుంది. మాకు తగిన తరుణోపాయం చెప్పండి’’ అని అడిగారు. అపుడు వ్యాసభగవానుడు ‘‘మీకు ఎంతమంది శత్రువులున్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కలగాలి. కాబట్టి అర్జునుని శంకరుని గురించి తపస్సు చేయమనండి. శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు పాశుపతాస్త్రం అడగండి. శంకరుడు దానిని మీకు ఇచ్చి విజయీభవ అని ఆశీర్వదిస్తే ఇక మీ విజయానికి తిరుగులేదు’’ అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వ్యాసుడి సూచన మేరకు అర్జునుడు శివారాధన చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఒక అడవిపందిని సృష్టించి దానిని అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు పంపాడు. అది అక్కడికి వెళ్లి రొద చేస్తోంది. ఆ ధ్వనికి కళ్ళు తెరిచి చూశాడు అర్జునుడు. వెంటనే తన విల్లందుకున్నాడు. ఈలోగా శివుడు అర్జునుడి వెనుక నుంచి అడవిపంది మీదకి వేసిన బాణం దాని పృష్ట భాగంలోంచి శరీరంలోకి వెళ్లి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేలమీద పడింది. సరిగ్గా అదే సమయంలో ఎక్కుపెట్టిన అర్జునుడి బాణం అడవి పంది నోట్లోంచి శరీరంలోకి వెళ్లి అక్కడనుంచి పృష్ఠభాగంలోంచి బయటకు వెళ్లి నేలమీద పడింది. శివుడు తన ప్రమథగణాలలో ఒకడిని పిలిచి తన బాణాన్ని తీసుకు రమ్మనమని చెప్పాడు. అతను వెళ్లి అర్జునునితో ‘ఈ బాణం మా నాయకుడిది. ఆయన గొప్ప వీరుడు. ఆయన బాణం తీశాడంటే ఎవరూ నిలబడలేరు. జాగ్రత్త’’ అన్నాడు కవ్వింపుగా.. ‘‘మీ నాయకుడు అంత మొనగాడయితే నాతో యుద్ధానికి రమ్మని చెప్పు’’ అన్నాడు అర్జునుడు. ఆ మాటకోసమే ఎదురు చూస్తున్నాడు కిరాతుడి రూపంలో ఉన్న శివుడు. కొండమీది నుంచి ఒక్క దూకు దూకి అర్జునుడి ముందు నిలబడి, ‘‘ఈ పందిని నువ్వు నీ బాణంతో కొట్టావా? ఏదీ ఇప్పుడు చూపు నీ విద్య’’ అన్నాడు. అర్జునుడు క్షణం ఆలస్యం చేయకుండా శివుని మీద బాణాలు ప్రయోగించడం ప్రారంభించాడు. శివుడు కూడా అర్జునుని మీదకు బాణాలు వేస్తున్నాడు. అర్జునుడు తన బలం అంతటినీ ఉపయోగించి శివుడిని పడగొట్టేందుకు యత్నిస్తున్నాడు. కానీ శివునికి ఏమీ అవడం లేదు. తర్వాత ఇద్దరూ మల్లయుద్ధం చేశారు. శంకరుడు అర్జునుని శరీరాన్ని తోసి అవతల పారేశాడు. అపుడు అర్జునుడు తిరిగి లేచి తన ధనుస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక గట్టి ప్రహారం చేశాడు. అపుడు శంకరుడు ఇక యుద్ధాన్ని చాలించి చంద్రవంకతో, పట్టుపుట్టంతో, పార్వతీ సమేతంగా అర్జునుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. మళ్ళీ కొడదామని గాండీవాన్ని ఎత్తిన అర్జునుడు తన ఎదుట సాక్షాత్కరించిన అర్ధనారీశ్వరుడి పాదాల మీద పడి శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి కన్నుల వెంట నీరు కార్చుతూ ‘‘ఈశ్వరా, జగత్తుకే తండ్రివయిన నీపై అజ్ఞానినై బాణాలు వేశాను. నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయింది’’ అని పరమేశ్వరుని పాదాల మీద పడిపోయాడు. అపుడు శంకరుడు ‘‘నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను. మీకు ఎదురులేదు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీరే గెలిచి తీరుతారు. విజయీభవ!’’అని ఆశీర్వదించాడు. ఇందులో మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే... ఆపదలో ఉన్న సమయంలో తగిన ఉపాయం చూపిన వాడే మనకు హితుడనీ, భగవంతుడు తన భక్తులకు అనేక పరీక్షలు పెట్టి, వాటిలో ¯ð గ్గినప్పుడే వరాలను అనుగ్రహిస్తాడనీ, అంతవరకూ మనం కుంగిపోకుండా కాలం పెట్టిన పరీక్షలలో నిగ్గు తేలాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
బృహన్నలార్జునీయం
విరటుని పుత్రుడు ఉత్తర కుమారుడు బృహన్నల సారథ్యంలో యుద్ధభూమికి వచ్చాడు. అశేషమైన ఆ సేనని చూసి భయంతో పారిపోబోగా బృహన్నల అతన్ని వెనక్కి తీసుకుని వచ్చి ధైర్యం చెప్పాడు. శమీవృక్షంపై గల ఆయుధాల మూటను తీసుకు వస్తే తాను యుద్ధంలో సాయం చేస్తానన్నాడు. సరేనని ఉత్తరుడు చెట్టు వద్దకు వచ్చాడు. రథం నుండి దిగి శమీవృక్షాన్ని ఎక్కి ఆ మూటను కిందికి దించి, దానిపైనున్న బంధనాలను తొలగించాడు. చాలా పెద్దవైన బంగారపు విల్లులను, మెరుస్తున్న బాణాలను చూసి ఆశ్చర్యంతో ‘‘ఈ దివ్యాస్త్రాలు ఎవరెవరివి? ఇక్కడికి ఎలా వచ్చాయి?’’ అని అడిగాడు. ‘‘ఈ దివ్యాస్త్రాలు పాండవులవి. వీటిలో పెద్దదైన ఈ ధనుస్సు గాండీవం. దీనిని బ్రహ్మదేవుడు, ప్రజాపతి, ఇంద్రుడు, చంద్రుడు ధరించారు. ఆ తర్వాత అర్జునుడు దీనిని వాడుతున్నాడు. సర్పాల్లా కనిపించే ఈ బాణాలు అర్జునుడివే. అవిగాక మిగతా ఆయుధాలన్నీ ధర్మరాజ, భీమ, నకుల సహదేవులవి’’ అని చెబుతూ, ఎవరెవరివి ఏయే ఆయుధాలో చూపెట్టాడు బృహన్నల. ఉత్తరుడు మరింత ఆశ్చర్యంతో ‘‘పాండవులు ఇప్పుడెక్కడున్నారు? ఈ ఆయుధాల సంగతి నీకు ఇంత విపులంగా ఎలా తెలుసు?’’ అనడిగాడు. బృహన్నల అతనితో ‘‘ఉత్తరకుమారా! నేను అర్జునుడను. మీ తండ్రిగారితో వీనులవిందుగా మాట్లాడుతూ ఆనందింపజేస్తున్న వ్యక్తి యుధిష్ఠిరుడు. మీ ఆస్థానంలోని పాకశాస్త్ర ప్రవీణుడు వలలుడే భీముడు. నకులుడు అశ్వపాలకుడు. సహదేవుడు గుర్రాలను రక్షించే నాయకుడు. సైరంధ్రియే ద్రౌపది.’’ అని చెప్పాడు. అదంతా విని ఉత్తరుడు విస్తుపోవడమేగాక పాండవులను చూడగలిగినందుకు ఎంతో సంతోషంతో బృహన్నలను ‘‘నీకున్న ప్రసిద్ధమైన పదిపేర్లను, వాటి కారణాలను చెప్పు’’ అనడిగాడు కుతూహలంతో. ‘‘ఉత్తరకుమారా! నేనొకప్పుడు రాజులందరినీ జయించి వారివద్దనుండి ధనాన్ని తీసుకొని దాని మధ్య కూర్చున్నాను. అందుచేత ధనంజయుడన్నారు. యుద్ధానికెప్పుడెళ్లినా జయించకుండా రాలేదు కనుక విజయుడన్నారు. నా రథానికి తెల్లటి గుర్రాలను కట్టడం వల్ల శ్వేతవాహనుడనే పేరొచ్చింది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రాన పుట్టాను కాబట్టి ఫల్గుణుడన్నారు. రాక్షసులని జయించినందుకు దేవేంద్రుడు నా తలపై కిరీటాన్నుంచి గౌరవించాడు కనుక నన్ను కిరీటి అన్నారు. బీభత్సంగా యుద్ధం చేస్తాను కాబట్టి బీభత్సుడనే పేరొచ్చింది. రెండు చేతులతోనూ సమానవేగంగా బాణాలను వేయగలను కాబట్టి సవ్యసాచి అన్నారు. నా శరీరపు రంగు మట్టిరంగును పోలి విలక్షణంగా ఉండడం వల్ల పార్థుడని పేరొచ్చింది. గాండీవాన్ని ధరిస్తాను కాబట్టి గాండీవి అన్నారు’’ అని వివరించాడు. ఉత్తరుడికి మరోసారి ధైర్యవచనాలు చెప్పి, శత్రువులను జయించి, గోవులను కాపాడమని పలికి రథాన్ని కౌరవుల సమీపానికి నడిపించమన్నాడు. ఉత్తరుడు ధైర్యంతో ముందుకెళ్లాడు. సమయం వచ్చినప్పుడు కానీ, తమ స్థాయిని బయట పెట్టుకోరాదు. పాండవులు దానిని పాటించారు కాబట్టి విజయవంతంగా అజ్ఞాతవాసం చేయగలిగారు. అంతేకాదు, అర్జునుడికి ఉన్న పేర్లన్నీ ఆయనలోని విశేషగుణాలని బట్టి వచ్చినవే కానీ, తనంత తానుగా పెట్టుకున్నవి కాదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని తీరవలసిన నీతి. నిజమైన వీరుడు చేతల్లో చూపిస్తాడు అర్జునుడిలా... అంతేగానీ ఉత్తముడిలా ప్రగల్భాలు పలుకడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఎనిమిదేళ్ల తరువాత ‘అర్జున’ విడుదల
గరుడవేగ సినిమా యాంగ్రీ హీరో రాజశేఖర్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే ఈ సినిమా తరువాత రాజశేఖర్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. అంతేకాదు గతంలో రాజశేఖర్ హీరోగా ప్రారంభమై ఆగిపోయిన సినిమాలకు కూడా ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. 2011లొ రాజశేఖర్ హీరోగా అర్జున సినిమాను ప్రారంభించారు. తరువాత ఏమైందో కాని ఈ సినిమా ఊసే లేదు. ఏళ్లు గడిచిపోయాయి. రాజశేఖర్ ఇతర చిత్రాలతో బిజీ అయ్యాడు. సడన్‌గా ఇప్పుడు అర్జున తెర మీదకు వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఈ నెల 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇదే జోరులో రామ్ గోపాల్ వర్మ, రాజశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన పట్టపగలు సినిమా కూడా రిలీజ్ అవుతుందేమో చూడాలి. కన్మణి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘అర్జున’ సినిమాలో మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతమందించారు. రాజశేఖర్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. -
శాపాన్నే వరంగా...
అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తూన్నప్పుడు, శివుడు కిరాత వేషంలో పరీక్షించడానికి వచ్చాడు. అదే సమయంలో మూకాసురుడు అర్జునుణ్ణి చంపుదామని ఒక పందిలాగ వచ్చాడు. అర్జునుడు ఆ పందిమీద బాణం వేసినప్పుడే మాయాకిరాతుడు కూడా బాణం వేసి, చచ్చిపోయిన పందిని నాదంటే నాదని వాదులాడుకుంటూ ఇద్దరూ యుద్ధానికి దిగారు. అర్జునుడి అమ్ములపొది ఖాళీ అవడంతో మల్లయుద్ధం చేశాడు. ఆ పోరులో శివుణ్ణి మెప్పించి, పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఆమీద అక్కడికి వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను పొంది, ఇంద్రుడు పిలవగా స్వర్గానికి అతిథిగా వెళ్లాడు. సంగీతం నాట్యమూ కూడా నేర్చుకోమని ఇంద్రుడు పురమాయిస్తే, అర్జునుడు చిత్రసేనుడి దగ్గర నేర్చుకొన్నాడు. అక్కడికి ఊర్వశి వచ్చి అతన్ని కోరుకొంటే, ‘చంద్రవంశానికి మాతృరూపివి నువ్వు. అంచేత కాదని అన్న అర్జునుణ్ని ‘నపుంసకుడివికమ్మ’ని శపించింది ఊర్వశి. అయితే, తన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో అర్జునుడు ఆ శాపాన్నే వరంగా ఉపయోగించుకున్నాడు. ఉత్తర గోగ్రహణానికి దుర్యోధనుడు భీష్ముడూ కర్ణుడూ మొదలైనవాళ్లతో వచ్చినప్పుడు, ఉత్తరుడికి సారథిగా బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్లాడు. అక్కడ కౌరవ సైన్యాన్ని చూసి బెంబేలెత్తిన ఉత్తరుణ్ని సారథిగా చేసుకొని, అర్జునుడే యుద్ధం చేసి ఆవుల్ని మళ్లించాడు. భాగవతంలో ఏముంటుంది? ♦ మహాభారత కావ్యాన్ని రచించిన తర్వాత కూడా వేదవ్యాసుడిని మనసులో ఏదో తెలియని వెలితితో బాధిస్తుండడంతో నారద మహర్షి సూచన మేరకు భగవంతుని లీలలను వర్ణించే పురాణానికి శ్రీకారం చుడతాడు. అదే శ్రీమద్భాగవతం. ♦ భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం హిందూ సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గా... భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగా, భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథగా ప్రసిద్ధి పొందింది. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాల గురించి ఈ గ్రంథంలో ఉటాయి. ♦ ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేదవ్యాసుడు గ్రంథస్తం చేసినట్లుగానూ ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను ‘స్కంధాలు‘ అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, ఎన్నో తత్వ బోధలు, అనేకమైన ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథం. ఇది మొత్తం ద్వాదశ (12) స్కంధాలు అంటే 12 భాగాలుంటుంది. ♦ వేదాంత సారమే శ్రీ మద్భాగవతం. భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరే ఇతరములు రుచించవు. వైష్ణవ సిద్ధాంతాలలో వేదాంత సూత్రాలకు భాగవత పురాణమే సహజమైన వ్యాఖ్య. పురాణాలలో ఇది ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఎలా అవతరించింది? భాగవత పురాణం సంభాషణల రూపంలో సాగుతుంది. పరీక్షన్మహారాజు ఉత్తర, అభిమన్యుల కుమారుడు) ఒక మునిశాపం వల్ల ఏడు రోజులలోపు మరణిస్తాడని తెలిసి తన రాజ్య విధులన్నీ పక్కనబెట్టి ప్రతి జీవి అంతిమ లక్ష్యాన్ని తెలుసుకోవాలని కోరుకున్నాడు. అదే సమయంలోనే తను సంపాదించిన అపార జ్ఞాన సంపదను ఎవరికి బోధించాలో తెలియక, ఒక మంచి శిష్యుని కోసం వెతుకుతున్న శుకుడు అనే ముని రాజుకు తారసపడి ఆ రాజుకు భాగవత కథలను బోధించడానికి అంగీకరిస్తాడు. ఈ సంభాషణ ఎడతెరిపిలేకుండా ఏడు రోజులపాటు కొనసాగింది. ఈ వారం రోజుల సమయంలో రాజుకు నిద్రాహారాలు లేవు. ఒక జీవి అంతిమ లక్ష్యం, నిత్య సత్యమైన భగవంతుని గురించి తెలుసుకోవడమేనని శుకుడు వివరిస్తాడు. భాగవతాన్ని విన్న పరీక్షిత్తు ముక్తి పొందుతాడు. -
ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
♦ ‘ఖేల్‌రత్న’ అందుకున్న జజరియా, సర్దార్ సింగ్ ♦ ‘అర్జున’ స్వీకరించిన సాకేత్, జ్యోతి సురేఖ ♦ ప్రసాద్‌కు ‘ద్రోణాచార్య’ హకీమ్‌కు ‘ధ్యాన్‌చంద్’ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ క్రీడా పురస్కారాలను స్వీకరిస్తున్న దేవేంద్ర జజరియా, సర్దార్ సింగ్ (ఖేల్‌రత్న), సాకేత్ మైనేని, జ్యోతి సురేఖ (అర్జున), గంగుల ప్రసాద్ (ద్రోణాచార్య లైఫ్‌టైమ్ అచీవ్మెంట్), హకీమ్ (ధ్యాన్‌చంద్ అవార్డు) కుడి నుంచి... న్యూఢిల్లీ: హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జరిగిన జాతీయ క్రీడా అవార్డుల పురస్కార కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకల్లో అత్యున్నత రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డును పారాలింపియన్ దేవేంద్ర జజరియాతో పాటు హాకీ సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. వీరికి జ్ఞాపికతో పాటు రూ.7.5 లక్షల చొప్పున చెక్‌ను అందించారు. 2004 ఏథెన్స్, 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా జావెలిన్ త్రోయర్ జజరియా నిలిచాడు. ఇక గత కొన్నేళ్లుగా మిడ్ ఫీల్డర్ సర్దార్ సింగ్ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే 17 మంది క్రీడాకారులు అర్జున అవార్డు దక్కించుకోగా... కౌంటీ మ్యాచ్‌ల్లో ఆడుతున్న కారణంగా క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. మిగతా వారంతా అర్జునను స్వీకరించారు. ఇందులో తెలుగు తేజాలు సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ) కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన జీఎస్ఎస్వీ ప్రసాద్ ‘ద్రోణాచార్య’ (లైఫ్ టైమ్ అచీవ్మెంట్)... ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి గుర్తింపుగా తెలంగాణకు చెందిన ఒలింపియన్ సయ్యద్ షాహిద్ హకీమ్ ‘ధ్యాన్‌చంద్’ అవార్డులను అందుకున్నారు. రియో పారాలింపిక్స్ హైజంప్ (ఎఫ్46)లో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలు అర్జున స్వీకరించేందుకు వస్తున్న సమయంలో ఆహుతుల నుంచి విశేష స్పందన కనిపించింది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డును రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ తరఫున నీతా అంబానీ స్వీకరించారు. అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు జ్ఞాపిక, సర్టిఫికెట్లతో పాటు రూ. 5 లక్షల చొప్పున చెక్‌ను అందుకున్నారు. ‘దివ్యాంగ అథ్లెట్లకు ప్రోత్సాహం అందించాలి’ భారత పారా అథ్లెట్లకు ఇది చరిత్రాత్మకమైన రోజు అని దేవేంద్ర జజరియా అభిప్రాయపడ్డాడు. ‘నాలాంటి వారు భారత్‌లో ఐదు కోట్ల మంది అథ్లెట్లు ఉన్నారు. వారికి మరింత తోడ్పాటు అవసరం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగ క్రీడాకారుల కోసం చాలా చేయాల్సి ఉంది’ అని 31 ఏళ్ల జజరియా కోరాడు. అవార్డు గ్రహీతలు ఖేల్‌రత్న: దేవేంద్ర జజరియా(పారాథ్లెట్, జావెలిన్ త్రో), సర్దార్‌సింగ్ (హాకీ). అర్జున: సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ), హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), బెంబేమ్ దేవి (ఫుట్‌బాల్), ఎస్ఎస్పీ చౌరాసియా (గోల్ఫ్), ఎస్వీ సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాష్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్‌రాజ్ (టీటీ), సత్యవర్త్ కడియాన్ (రెజ్లింగ్), తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెట్స్). పుజారా (క్రికెట్). ద్రోణాచార్య: దివంగత డాక్టర్ ఆర్.గాంధీ (అథ్లెటిక్స్), జీఎస్ఎస్వీ ప్రసాద్ (బ్యాడ్మింటన్), బీబీ మహంతి (బాక్సింగ్), హీరానంద్ (కబడ్డీ), రాఫెల్ (హాకీ), సంజయ్ చక్రవర్తి (షూటింగ్), రోషన్ లాల్ (రెజ్లింగ్). ధ్యాన్‌చంద్: భూపిందర్ సింగ్ (అథ్లెటిక్స్), సయ్యద్ షాహిద్ హకీమ్ (ఫుట్‌బాల్), సుమరాయ్ టెటే (హాకీ). -
అర్జునుడి గురుదక్షిణ
పురానీతి భరద్వాజ మహర్షి కొడుకు ద్రోణుడు. తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేసేవాడు. భరద్వాజుడికి పాంచాల దేశాధీశుడు పృషతుడు చిరకాల మిత్రుడు. తన కొడుకు ద్రుపదుడిని భరద్వాజుడి ఆశ్రమంలో చేర్చాడు. ద్రోణుడు, ద్రుపదుడు సహాధ్యాయులుగా విద్యాభ్యాసం చేసేవారు. కొంతకాలానికి పృషతుడు కాలం చేయడంతో ద్రుపదుడు తన రాజ్యానికి వెళ్లి, పట్టాభిషిక్తుడై రాజ్యభారం మోయాల్సి వచ్చింది. అస్త్రవిద్యపై ఆసక్తి గల ద్రోణుడు తండ్రి వద్ద విద్యాభ్యాసం చాలించుకున్న తర్వాత అగ్నివేశుడనే ముని వద్ద చేరి అస్త్రవిద్యను అభ్యసించాడు. ద్రోణుడి శుశ్రూషకు అగ్నివేశుడు సంతసిల్లాడు. ద్రోణుడికి ధనుర్వేదాన్ని ఆమూలాగ్రంగా నేర్పించాడు. అగ్నివేశుడి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన ద్రోణుడికి భరద్వాజుడు కృపి అనే కన్యతో వివాహం జరిపించాడు. వారికి అశ్వత్థామ అనే కొడుకు కలిగాడు. సంసారభారం మీద పడటంతో ద్రోణుడికి ద్రవ్యార్జన అనివార్యంగా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ద్రోణుడికి పరిస్థితులు కలసిరావడం లేదు. క్షత్రియులను నిర్జించిన పరశురాముడు సంపదనంతా బ్రాహ్మణులకు పంచిపెడుతున్నట్లు విన్న ద్రోణుడు. పరశురాముడిని వెదుక్కుంటూ బయలుదేరాడు. మహేంద్రగిరిపై తపోనిష్టలో ఉన్న పరశురాముడిని కలుసుకున్నాడు. ‘ఎవరివి నీవు? ఎందుకు వచ్చావు?’ అని పరశురాముడు ప్రశ్నించగా, ‘నేను భరద్వాజుడి కుమారుడను. విత్తాపేక్షతో వచ్చాను’ అని బదులిచ్చాడు ద్రోణుడు. అందుకు పరశురాముడు చాలా విచారించాడు. ‘తరుణం మించిన తర్వాత వచ్చావు నీవు. నా వద్దనున్న సంపదనంతా ఇతరులకు పంచిపెట్టేశాను. నా వద్ద ప్రస్తుతం దివ్యాస్త్ర శస్త్రాలు తప్ప మరేమీ లేవు’ అని అన్నాడు. ‘మహాత్మా! వాటినే అనుగ్రహించండి’ అని పలికిన ద్రోణుడు పరశురాముడి నుంచి అస్త్ర శస్త్రాలను తీసుకుని ఇంటికి వచ్చాడు. అస్త్రశస్త్రాలు ఆకలి తీర్చలేవు కదా! ఇంట్లో పసిబాలుడైన అశ్వత్థామ ఆకలికి అల్లాడిపోతున్నాడు. అలాంటి విపత్కర పరిస్థితిలో ద్రోణుడికి బాల్యమిత్రుడైన ద్రుపదుడు గుర్తుకొచ్చాడు. సహాయం చేస్తాడనే ఆపేక్షతో పాంచాల రాజధానికి బయలుదేరాడు. ద్రుపదుడి సభకు వెళ్లాడు. ద్రోణుడెవరో గుర్తించనట్లే నటించాడు ద్రుపదుడు. ద్రోణుడు తనను తాను పరిచయం చేసుకుని, బాల్యస్మృతులను గుర్తుచేస్తే, ‘మహారాజునైన నేనెక్కడ. దరిద్రుడవైన నీవెక్కడ’ అంటూ తూలనాడాడు. అవమాన భారంతో ద్రోణుడు వెనుదిరిగాడు. కొంతకాలం గడిచాక బావమరిది అయిన కృపాచార్యుడి సహాయంతో ధృతరాష్ట్రుడి వద్ద కొలువు పొందాడు. పాండు తనయులకు, కౌరవులకు అస్త్రవిద్య నేర్పించాడు. వారిలో పాండవ మధ్యముడు అర్జునుడు మేటిగా తయారయ్యాడు. గురుదక్షిణ ఏమివ్వాలని కోరారు శిష్యులు. ద్రుపదుడు తనకు చేసిన అవమానాన్ని వివరించి, అతడికి గుణపాఠం చెబితే చాలన్నాడు ద్రోణుడు. పాండవులు, కౌరవులు అస్త్రధారులై పాంచాల దేశాన్ని ముట్టడించారు. ద్రుపదుడు స్వయంగా రణరంగంలోకి దిగి వీరవిహారం మొదలుపెట్టాడు. కౌరవులు అతడి ధాటికి తాళలేక పరుగులు తీశారు. పరిస్థితిని గమనించిన అర్జునుడు నేరుగా ద్రుపదుడితో తలపడ్డాడు. ద్రుపదుడిని నిరాయుధుడిగా చేసి పట్టి బంధించి తెచ్చి ద్రోణుడి సమక్షంలో నిలిపాడు. ‘గురూత్తమా! ఇదిగో నా గురుదక్షిణ’ అని పలికాడు. ద్రోణుడు విజయ దరహాసం చిందిస్తూ ద్రుపదుడిని తేరిపార చూశాడు. ‘ఓహో! ద్రుపద మహారాజా! ఇప్పటికైనా మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొందురా?’ అని పలికాడు. అవమాన భారంతో తలదించుకున్నాడు ద్రుపదుడు. ‘ఇకనైనా బ్రాహ్మణులను అవమానించకు’ అని హితవు పలికి అతడిని విడిచిపుచ్చాడు ద్రోణుడు. -
అర్జునావతారంలో నితీష్.. మోదీపై యుద్ధం
వారణాసి: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ మహాభారతంలో అర్జునుడిలా దర్శనమిచ్చారు. అది కూడా ప్రధాని నరేంద్రమోదీ నియోజవర్గంలో.. సరిగ్గా వారణాసికి 30 కిలో మీటర్ల దూరంలో.. శ్రీకృష్ణుడిగా శరద్ యాదవ్ రథాన్ని నడుపుతుండగా అర్జునుడిగా తన విల్లమ్ములో నుంచి భాణాన్ని తీస్తున్న పోజులో నితీశ్ కుమార్ కనిపించారు. ఈ మేరకు ఫ్లెక్లీలను ప్రధాని నియోజక వర్గంలో పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ ఫ్లెక్లీలకు ట్యాగ్ లైన్ గా.. 'ప్రధాని నరేంద్రమోదీపైన మత శక్తులపైన యుద్ధం' అని పెట్టారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో జేడీయూ భారీ ఎత్తున ప్రచారానికి దిగేందుకు తెరలేపింది. బిహార్ లో దెబ్బకొట్టినట్లుగానే ప్రధాని మోదీని ఉత్తరప్రదేశ్‌లో లౌకికవాదులను ఏకం చేసి దెబ్బకొట్టాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తొలిసారి ఉత్తరప్రదేశ్ లోని పింద్రా నుంచి తన ప్రస్తానం ప్రారంభించేందుకు జేడీయూ సిద్ధమైన నేపథ్యంలో ఇక్కడ అందరినీ ఆకర్షించేలా పోస్టర్లు వేశారు.. ఫ్లెక్సీలు పెట్టారు. ఈ రోజు ఇక్కడ జరగబేయే సమావేశంలో నితీశ్ పాల్గొంటారు. -
లింగమయ్య పిలిస్తే కష్టం తెలియదయా!
అర్జునుడు తపస్సు చేసిన దీక్షావనం పరమేశ్వరుడు వరాలిచ్చిన పుణ్యస్థలి కృంగదీసే రోగాలకు ఔషధగని పసిపాపల నుంచి పండువృద్ధుల దాకావస్తున్నాం లింగమయ్యా అంటూ నల్లమల అడవుల్లో అద్భుతమైన సాహసయాత్ర .. సలేశ్వరం యాత్ర... ఎత్తయిన కొండగుట్టలు.. పచ్చని చెట్లు..పక్షుల కిలకిలరావాలు.. జాలువారే జలపాతాలు.. ఆరుదైన వన్యప్రాణులతో అలరారే నల్లమలలో వేయి అడుగుల లోతైన లోయులో కొలువైన సలేశ్వరం (లింగమయ్య) దర్శనం ఒక వుహత్తర ఘట్టం. అత్యంత ప్రవూద భరితమైన కొండ చరియుల వూర్గంలో కేవలం పాదం మోపే స్థలంలో ప్రయాణించాలి. ప్రతి ఏటా ఏప్రిల్ వూసంలో వచ్చే చైత్ర పూర్ణివు రోజున భక్తులు లింగమయ్యను భక్తిశ్రద్ధలతో దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. నాటినుంచి ఐదు రోజుల పాటు శ్రీ రావులింగేశ్వర స్వామి నావుస్మరణతో నల్లవుల ప్రాంతం వూరుమోగుతుంది. నల్లమలలో వివిధ రోగాల నివారణకు ఉపయోగపడే మూలికలు లభిస్తాయి. ఇక్కడ వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం కన్నుల పండువ చేస్తుంది. ఈ నీటిజాలు నల్లమల లోపలిభాగం నుంచి వస్తుండడంతో ఈ జలం దీర్ఘకాలిక రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని భక్తుల నవ్ముకం. ఈ ప్రాంతంలోనే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడని ప్రతీతి. వెయ్యి అడుగుల లోతులో.. లింగవుయ్యు దర్శనం కోసం 200 అడుగుల లోతున పదునైన రాళ్లతో కూడిన గుట్టను దిగడంతో సలేశ్వర ప్రయూణం ఆరంభవువుతుంది. గుట్టను దిగిన అనంతరం దాదాపు ఆరు వందల అడుగుల ఎత్తు ఉండే వురో గుట్టను ఎక్కాల్సి ఉంటుంది. సువూరు వేరుు అడుగులకు పైగా లోతున్న లోయువైపు కొండ చరియులను ఆధారంగా చేసుకుని భక్తులు రాత్రివేళ ప్రయూణిస్తారు. పిడికెడు శివలింగం.. కేవలం పిడికెడు ఎత్తు గల శివలింగం.. దానిమీద ఇత్తడితో చేసిన పడగ ఒక్కటే ఇక్కడ పూజలందుకునేది. చెంచులే ఇక్కడ ప్రధాన పూజారులు. ఉత్సవాలు జరిగే 5 రోజుల పాటు లక్షలాది వుందితో నల్లవుల అడవి ఈనినట్లుగా అనిపిస్తుంది. ఈ ఉత్సవాలు అరుున తర్వాత నిర్జనప్రదేశమే! గుండంలో స్నానం చేస్తే సర్వరోగాలు మాయం సలేశ్వర క్షేత్రంలో కొండల నడుమ దాదాపు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జలపాతంలో పడే నీటిలో స్నానం చేస్తే సర్వరోగాలు మటుమాయం కావడమే గాక, ఆయుష్షు పెరుగుతుందని విశ్వాసం. ఈ లోయ మార్గంలో ఒక్కొక్కరు మాత్రమే నడవడానికి దారి ఉంటుంది. లింగాలలో జరిగే శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాల సమయంలోనే ఈ క్షేత్రాన్ని భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీ. ఈమార్గంలో చూడదగిన ప్రదేశాలు... మల్లెల తీర్థం ... ప్రకృతి ప్రియులను ఆకట్టుకోవడంలో ప్రధానమైంది మల్లెలతీర్థం. సూర్యకిరణాలకు చోటివ్వని చల్లని ప్రదేశమైన ఈ తీర్థానికి మతాలతో సంబంధం లేకుండా అందరూ ప్రకృతి ఒడిలో సేదతీర్చుకుంటారు. 500 అడుగుల ఎత్తు నుంచి నిరంతరం హోరెత్తుతూ దూకే జలధార మూడు సరస్సులను నింపుతూ నల్లమల అడవి గుండా కృష్ణానదిలో కలుస్తుంది. - బండారు శ్రీనివాస్, అచ్చంపేట సలేశ్వరం ఎలా వెళ్తారంటే... సలేశ్వర క్షేత్రానికి వెళ్లడానికి రెండు వూర్గాలు ఉన్నాయి. అచ్చంపేట - శ్రీశైలం జాతీయ రహదారిలోని ఫరహాబాద్ చౌరస్తా నుంచి రామ్‌పూర్ చెంచుపెంట (అప్పాపూర్ మార్గంలో40 కిలోమీటర్ల వరకు వెళ్తే) చేరుకుంటే అక్కడినుంచి క్షేత్రం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా కాకుండా బల్మూర్, లింగాల -అప్పారుుపల్లి ద్వారా వెళ్లొచ్చు. ఎక్కడినుంచి ఎంత దూరం... హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిలోని మన్ననూర్ అనంతరం ఫర్హాబాద్ చౌరస్తా వస్తుంది. ఇక్కడి నుంచి 31 కి.మీ. దూరంలో దట్టమైన అటవీ మార్గంలో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది. దూరం: హైదరాబాద్ నుంచి 186 కి.మీ, మహబూబ్‌నగర్ నుంచి 151కి.మీ, అచ్చంపేట నుంచి 61 కి.మీ, మన్ననూర్ నుంచి 46 కి.మీ. నల్లమల కొండల్లో నివసిస్తుస్న చెంచు జనాభా కేవలం 50 వేల లోపే. వేల సంవత్సరాలుగా స్వయం సమృద్ధితో, స్వయం పాలనలో జీవించిన వీరు తెలుగు రాష్ట్రాల విభజనకు, దాని పర్యవసానాలకు లోనవుతున్నారు. వీరి నివాస ప్రాంతాల్లోనే ప్రస్తుత శ్రీశైలం, అహోబిలం, ఉమామహేశ్వరం, మద్దిమడుగు, బౌరాపూర్, సలేశ్వరం, లొద్దిమల్లయ్య, కదలీవనం, అక్కమహాదేవి గుహలు, భీముని కొలను, ఇష్టకామేశ్వరి, మల్లెలతీర్థం లాంటి క్షేత్రాలున్నాయి. కేస్తాపూర్ నాగోబాజాతర, సమ్మక్క - సారక్కల మేడారం జాతర జరిగేది ఇక్కడే. చెంచుల ఆడపడుచు ధీరవనిత బౌరమ్మ జ్ఞాపకార్థం మార్చి మొదటివారంలో ‘చెంచుల పండుగ’ (పాలమూరు) జరిగింది. ఏప్రిల్ 19 నుంచి 23 వరకు ఐదురోజులపాటు ఏడాదికి ఒక్కసారి వచ్చే ‘లింగమయ్య ఉత్సవాలు’ సలేశ్వరంలో జరుపుకోబోతున్నాం. ఈ పండుగల సందర్భంగా చెంచులు వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు పాటిస్తారు. వాటిని వచ్చే తరాల వారికి అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆదివాసులు ఎంతో నిష్టగా జరుపుతారు. ఈ సందర్భంగా వీళ్లు భూమిని, ఆకాశాన్ని, నీటిని, గాలిని, నిప్పును, చెట్టును, రాళ్లను చివరికి తమ ఇంటికి వచ్చిన పంటను తమదైన పద్ధతిలో పూజిస్తారు. ‘మీరు బాగుండాలి - మేం బాగుండాలి, అందరినీ సమానంగా చూడుస్వామి’ అని చెంచులు చేసే ప్రార్థన అందరికీ కనువిప్పు. - డా.రాంకిషన్, సలేశ్వరం క్షేత్రం ఉన్న అప్పాయపల్లి గ్రామవాస్తవ్యులు -
శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం
విశ్వరూపాన్ని చూపమని అర్జునుడు శ్రీకృష్ణపరమాత్మను ప్రార్థింపగా ఆయన అర్జునునికి దివ్యచక్షువు ప్రసాదించి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ రూపాన్ని చూసే అదృష్టం అర్జునునికి కలిగింది. ఆ తేజస్సును మన మాటలచే వర్ణించగలమా? ఆకాశాన వేయిమంది సూర్యులు ఒకేసారి ఉదయించినప్పుడు కలిగే ప్రకాశం విశ్వరూప ప్రకాశానికి సరిపోలుతుందేమో! అర్జునునికి ఏమి కనపడిందంటే... అనేక రూపాలుగా విభక్తమైన జగత్తు అంతా శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని ఒక్కటిగా చేరి ఉండటం కనిపించింది. ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, అశ్వినీదేవతలు సమస్త మరుద్గణాలు నానావిధ వర్ణాలు, ఆకృతులు గల అఖిల చరాచరాలు బ్రహ్మాదిదేవతలు సకల లోకాలు- ఇంకా ఎన్నియో కనిపించినాయి. ఇటువంటి మహత్తరమైన జగత్తంతా పరమాత్మయొక్క ఒక్క అంశం మాత్రమే. ఈ సకల జగత్తు పరమాత్మ ఒక పాదం మాత్రమే అనే విషయం వేదాలలో చెప్పబడి ఉంది. దీనిని బట్టి పరమాత్మకు ఒక రూపం ఉన్నదని మనం భావించకూడదు. పరమాత్మ సర్వమయత్వాన్ని, అనంతత్వాన్ని మనకు తెలియజెప్పేందుకు మన సామాన్య భాషలో ఈ విధంగా చెప్పబడింది. పరమాత్మకు ఈ విశ్వం ఒక్క పాదం మాత్రమే అయినట్లయితే, పరమాత్మ తత్వం ఎటువంటిదో మనం ఊహించుకోవడానికి వీలుగా ఈవిధంగా చెప్పబడిందేకానీ వేరు కాదు. - కూర్పు: బాలు శ్రీని -
అర్జునుని సందేహాలు శ్రీకృష్ణుని సమాధానాలు
మామిడిపూడి ‘గీత’ అర్జునుని సంశయాల ను విని శ్రీ కృష్ణుడు చిరునవ్వుతో పరిహాసపూర్వకంగా పలుకుతున్నాడు.. ‘‘అర్జునా! నీవేమో తెలిసినవానిలా మాట్లాడావు. ప్రజ్ఞావాదమాడావు. ఎవరిని గురించి దుఃఖపడనక్కరలేదో వారిని గురించి దుఃఖిస్తున్నావు. నీ సంశయాలకూ, దుఃఖానికీ తగిన కారణం లేదు. దేహి యొక్క, దేహం యొక్క తత్వాన్ని నీవు తెలుసుకుంటే ఇలా దుఃఖించవు. ఆత్మ నిత్యమైనది. పుట్టిన ప్రతి ప్రాణీ మరణించవలసిందే. మరణించిన ప్రతి ప్రాణీ పుట్టవలసిందే. ఈ విధంగా పుడుతూ, చస్తూ ఉండే వారిని గురించి చింతించడమెందుకు? మొదటిమాట, ఈ దేహాలు ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయో, నశించిన తర్వాత ఏమవుతున్నాయో నీకు తెలుసా? వీని మొదలుగాని, తుది గానీ కనిపించడం లేదు. మధ్యకాలంలో మాత్రమే ఇవి కనపడుతున్నాయి. ఆద్యంతాలు తెలియబడని వాటిని గురించి దుఃఖమెందుకు? (క్షాత్రధర్మం గురించి వచ్చేవారం) - కూర్పు: బాలు శ్రీని -
భక్తియోగం
మామిడిపూడి ‘గీత’ భక్తియోగాన్ని గురించి శ్రీకృష్ణభగవానుడు సెలవిచ్చిన సంగతులను మననం చేసుకుందాము. అపి చే త్సుదురాచారె భజతే మానన్య భాక్ సాధురేవ స మంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః( 9-30) ‘‘అర్జునా! ఎటువంటి వాడైనా సరే, అనన్య భక్తితో నన్ను భజించేవాడు మంచి నిర్ణయం కలవాడు కాబట్టి సాధువుగానే పరిగణించాలి. అతడు అనతి కాలంలోనే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని, కీర్తిని పొందుతున్నాడు. నా భక్తుడు ఎన్నటికీ చెడడు. అనన్య భక్తితో ఎల్లప్పుడూ తనయందే మనస్సును నిలిపి తననే ఎవరు భజిస్తున్నారో, వారి యోగక్షేమాలను తానే స్వయంగా చూసుకుంటానని శ్రీకృష్ణ పరమాత్మ అభయమిచ్చి ఉన్నాడు! సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః( 18-66) ‘‘అర్జునా! అన్ని ధర్మాలనూ పక్కనబెట్టి నన్నే శరణు పొందు. నేను నిన్ను సమస్త పాపాలనుండి విముక్తుడిని చేస్తాను. నీవు విచారించకు’’ భక్తితో ప్రయత్నం చేసిన అందరూ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ కీలకాన్ని తెలుసుకుని, మనం ఎట్టి సంశయాలనూ పెట్టుకోక శ్రద్ధాభక్తులతో గీతాశాస్త్రాన్ని అనుసరించి, దానికి తగ్గట్టు నడచుకుంటే ఎన్నో మేళ్లను పొందవచ్చు. కూర్పు: బాలు- శ్రీని (వచ్చేవారం: అర్జునుని సంశయాలకు శ్రీకృష్ణుని సమాధానాలు) -
అర్జునుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 13 అర్జునుడు కుంతి సంతానంలో మూడో వాడు. ‘అరజ్జు’ అంటే జైలని ఒక అర్థం. రజ్జువంటే తాడు. అంచేత ‘అ-రజ్జు’ అని విడదీస్తే, బంధనం లేనివాడన్న అర్థం వస్తుంది. ఎవడైనా ఈ శరీరమనే జైల్లో ఉన్నవాడే. ఆ బంధనాన్ని వదిలించు కోవాలంటే అదుపు కావాలి. శరీరమనే జైల్లో ఉంటూ కూడా నిగ్రహంతో బంధనానికి లోబడకుండా ఉండగలిగే సాధకుడు అర్జునుడు. వేయించిన (ఋజి-భర్జనే) విత్తనాలు మొలకెత్తవు. ‘ఋజ’ అనే ధాతువులో ముందు ముందుకు నడవడమూ మంచి స్థానాన్నే సంపాయించడమూ దాగి ఉన్నాయి. వీటిలోని ‘ఋ’కారం ‘ఆర్’గా మారి అర్జునుడనే మాట పుట్టింది. అదుపుతోనూ తపస్సుతోనూ మునపటి కర్మలనే విత్తుల్ని వేయించి, శాశ్వతమైన ఆత్మపదాన్ని ఆర్జించాలన్న పట్టుదలతో ఎడతెరిపి లేకుండా ప్రయత్నించే సాధకుడే అర్జునుడు. అర్జునుడికి ‘సవ్యసాచి’ అని పేరొకటి ఉంది. సవ్యమంటే కుడీ ఎడమా అని రెండర్థాలూ ఉన్నాయి; ‘సాచి’ అంటే అడ్డంగా అని అర్థం. రెండు చేతులతోనూ గాండీవాన్ని అడ్డంగా లాగి బాణాల్ని వేయగలిగిన సామర్థ్యమున్నవాడు గనకనే అతనికి సవ్యసాచి అనే పేరు వచ్చింది. ఇతనికి ‘ధనంజ యుడ’నే మరో పేరుంది. ‘ధనం’ అంటే డబ్బని అర్థం. యుద్ధంలో ఓడిపోయినవాళ్ల ధనం జయించినవాళ్ల సొంతం అవుతుంది గనక, ‘ధనం’ అనే మాటకు యుద్ధమనే అర్థం వచ్చింది. యుద్ధంలో ఎప్పుడూ జయాన్నే వరించే విజయుడిగాను, జయించినవాళ్ల సొమ్మును తన బొక్కసంలోకి చేర్చుకొన్నవాడిగాను అర్జునుడు ధనంజయుడు. ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేయడానికి ముందు ‘ఉత్తర’ దిక్కులో ఉన్న రాజుల్ని జయించి అర్జునుడు ధనంజయుడయ్యాడు. ధనంజయుడంటే అగ్ని అనే అర్థం కూడా ఉంది. యుద్ధంలో జయాన్నిచ్చేది మనిషి లోపల ఉండే ఉత్సాహమూ పరాక్రమమూ ధైర్యమూ పట్టుదలా అనే వేడి. యుద్ధాలు బయటివి మాత్రమే కావు. లోపల కూడా జరుగుతూ ఉంటాయి. లోపల పుట్టే భావావేశాల వల్లనే ఏ యుద్ధాలైనా పుడతాయి. రెండు రకాల పోరుల్లోనూ వేడీ కాకా అవసరం. అందుకనే ‘ధనాన్ని’ జయించేవాడు అగ్ని అయ్యాడు. ఈ అగ్నికి బొడ్డు వెనక ఉండే మణిపూర చక్రం ఆస్థానం. ఈ చక్రం కూడా రెండు దిక్కులకీ పోడానికి వీలునిచ్చే చక్రం. ఇంద్రియాల మీద అదుపులేని సాధకుడు ఈ చక్రం నుంచి కింది చక్రాలైన స్వాధిష్ఠాన మూలాధారాలవైపు జారిపోతాడు; ఇంద్రియాల మీద చెప్పుకోదగ్గ అదుపును సాధించినవాడు అనాహతమూ విశుద్ధమూ మొదలైన పైచక్రాల వైపు కొనసాగుతాడు. ఇదీ సవ్యసాచిత్యం లాంటిదే.అర్జునుణ్ని ‘నరుడ’ని పిలవడం కద్దు. నాట్యం చేసేవాడి మాదిరిగా ఒంట్లోని అవయవాల్ని బాగా కదుపుతూ పనుల్ని చేసే మనిషిని నరుడని అంటారు. పనుల్ని చేస్తూ ఉంటే, వాటివల్ల వచ్చే ఫలితాల వల్ల అవి బంధాన్ని కలగజేస్తాయి. అంచేత ఎవడైతే పనుల్ని బంధనానికి లోను గాకుండా చేస్తూ ఉంటాడో అతగాడే నిజమైన ‘నరుడ’ని పెద్దలు చెబుతారు. నరుడంటే నాయకుడని (నౄ-నయే) చెబుతారు కూడాను. ఏ నరుడైనా నేతగా కావాలంటే, ఇతరుల కన్నా వేరుగా, వాళ్లకు ఒక నమూనాగా ఉండి, ముందుకు నడిపేవాడు కావాలి. అటువంటి నరుణ్ణే సాధకేంద్రుడని అంటారు. అటువంటి నరుణ్ణించే నారాయణుడు పుడతాడు. ‘నర’ శబ్దం వృద్ధిని చెంది ‘నార’ శబ్దమవుతుంది. పెరిగి పెంపొందడం, పనుల్ని నేర్పుగా బంధం అంటకుండా చేయడంతోనే అబ్బుతుంది. అప్పుడే అతను ‘నారాలకు’, ‘అయనుడు’, అంటే ‘దారి’ అయినవాడూ, దారి చూపించే వాడూ అవుతాడు. అంటే, ‘నారాయణు డ’వుతాడు. ఒకటే శక్తి రెండు కింద విడి నరుడూ నారాయణుడూ కింద అవుపిస్తారు. అర్జునుడు ద్రోణాచార్యుడి శిష్యుడై ఏకాగ్రతను బాగా ఒంటబట్టించు కొన్నాడు. అస్త్ర పరీక్షలో అర్జునుడి ఏకాగ్రత అర్థమైంది ద్రోణుడికి. చిటారు చెట్టుకొమ్మ మీద ఉన్న పక్షి తాలూకు తలను మాత్రమే చూస్తూ, దాని శరీరాన్ని గానీ చుట్టూ ఉన్న ఆకులూ రెమ్మలూ గానీ చూడకుండా తన బాణాన్ని వేసి, దాని తలను తెగ్గొట్టిన మేటి విలుకాడు అర్జునుడు. ఒకరోజున గంగలో స్నానానికి దిగిన ద్రోణుణ్ని ఒక మొసలి పట్టుకొంది. తతిమ్మా శిష్యులందరూ ఏం చేయాలో తెలియక, ఉన్న చోటనే నిశ్చేష్టులై నిలిచిపోతే, అర్జునుడు మాత్రం తన బాణాలతో ఆ మొసలిని ముక్కలు ముక్కలు చేశాడు. దానికి మెచ్చుకొని, అర్జునుడికి బ్రహ్మశిరో నామకమైన ఆటంబాంబులాంటి అస్త్రాన్ని ప్రయోగ సంహారాలతో సహా ఉపదే శించాడు ద్రోణుడు. అతను గురువుగారికి ద్రుపదుడి వల్ల జరిగిన అవమానానికి ప్రతీకారం చేసి అతని రాజ్యాన్ని ద్రోణుడి కైవసం చేశాడు. అటువంటి యోద్ధకు భార్యను కానుకగా ఇద్దామని, ద్రుపదుడు ద్రౌపదిని అగ్నిముఖంగా కూతురిగా పొందాడు. కిందనున్న నీళ్లలోకి చూస్తూ, పైనున్న చక్రయంత్రంలోని కన్నానికి పైనున్న చేపను ఐదు బాణాలతో కొట్టి ద్రౌపదిని గెలుచుకొన్నాడు. అర్జునుడు ఒక బ్రాహ్మణుడి గో ధనాన్ని కాపాడటం కోసం, యుధిష్ఠిరుడు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్న చోట్లో పెట్టిన ఆయుధాల కోసం వెళ్లవలసి వచ్చింది. అంచేత పెట్టుకొన్న నియమం ప్రకారం అతను వనవాసం చేయవలసి వచ్చింది. ప్రభాస తీర్థంలో శ్రీకృష్ణుణ్ని కలుసు కొన్నాడు. అక్కడ రైవతక పర్వతం మీద జరుగుతూన్న ఉత్సవంలో సుభద్రను చూసి మోహించాడు. శ్రీకృష్ణుడి అను మతితో ఆవిణ్ని ఎత్తుకుపోడంతో బల రాముడికి కోపం వచ్చింది. అప్పుడు కృష్ణుడు ‘అర్జునుడితో పోరి గెలవడం కష్టం. అతను మనను జయించి సుభద్రను తీసుకొనిపోతే మనకే మచ్చ. అంచేత అతన్ని ఊరడించి, వాళ్లను వెనక్కి తెచ్చి, మనమే పెళ్లి చేయడం మంచిది’ అని సలహా ఇచ్చాడు. అక్కడ సుభద్రకు అభిమన్యుడు పుట్టాడు. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తూన్నప్పుడు, శివుడు కిరాత వేషంలో పరీక్షించడానికి వచ్చాడు. అదే సమయంలో మూకాసురుడు అర్జునుణ్ని చంపుదామని ఒక పందిలాగ వచ్చాడు. అర్జునుడు ఆ పందిమీద బాణం వేసినప్పుడే మాయాకిరాతుడు కూడా బాణం వేసి, గిరగిరా తిరుగుతూ చచ్చిపోయిన పందిని నాదంటే నాదని వాదులాడుకుంటూ ఇద్దరూ యుద్ధానికి దిగారు. అర్జునుడి అమ్ములపొది ఆశ్చర్యంగా ఖాళీ అయింది. ఇక కుస్తీకి దిగాడు. ఆ పోరులో శివుణ్ని మెప్పించి, పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఆమీద అక్కడికి వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను పొంది, ఇంద్రుడు పిలవగా స్వర్గానికి అతిథిగా వెళ్లాడు. సంగీతం నాట్యమూ కూడా నేర్చుకోమని ఇంద్రుడు పురమాయిస్తే, అర్జునుడు చిత్రసేనుడి దగ్గర నేర్చుకొన్నాడు. అక్కడికి ఊర్వశి వచ్చి అతన్ని కోరుకొంటే, ‘చంద్ర వంశానికి మాతృరూపివి నువ్వు. అంచేత ఇది తగద’ని కాదన్న అర్జునుణ్ని ‘నపుంసకుడివి కమ్మ’ని శపించింది. ‘ఈ శాపం నీకు అజ్ఞాతవాసవేళ పనికి వస్తుంద’ని ఇంద్రుడతణ్ని ఊరడించాడు. ఉత్తర గోగ్రహణానికి దుర్యోధనుడు భీష్ముడూ కర్ణుడూ మొదలైనవాళ్లతో వచ్చినప్పుడు, ఉత్తరుడికి సారథిగా బృహ న్నల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్లాడు. అక్కడ కౌరవ సైన్యాన్ని చూసి బెంబేలెత్తిన ఉత్తరుణ్ని సారథిగా చేసుకొని, అర్జునుడే యుద్ధం చేసి ఆవుల్ని మళ్లించాడు. రాయాబారాలన్నీ విఫలమై, తీరా యుద్ధం ప్రారంభమయ్యే తరుణంలో అర్జునుణ్ని విషాదం చుట్టుముట్టింది: ‘నా శరీరంలోని ఇంద్రియాల్లాంటి ఈ నా చుట్టాల్నీ సొంతవాళ్లనీ చంపి ఏం బావు కోవాలి?’ అనే పనికిరాని జాలి పుట్టు కొచ్చింది. శ్రీకృష్ణుణ్ని ‘నాకిప్పుడేమీ పాలుపోవడం లేదు. నాకు గురువువై మార్గాన్ని చూపించు’ అని వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడప్పుడు కర్తవ్యాన్ని బోధించాడు: ‘ఇక్కడ ఈ లోకంలో లోపలా బయటా అన్నీ సంఘర్షణలే. వాటి నుంచి ఎవడూ పారిపోలేడు. ఈ కర్మలనన్నిటినీ నిమిత్త మాత్రంగా చెయ్యాలి తప్ప, వాటి ఫలితాల ఆస్తి మీద మనకెవ్వరికీ హక్కు లేదు. పరమేశ్వరుణ్నే శరణు కోరుకొని, ఫలితాలన్నీ అతనివేనన్న వివేకంతో, అతని చేతిలో ఒక సాధనంగా మాత్రమే పనిచెయ్యాలి. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వర్నీ చంపడం లేదు, చావడం లేదు కూడాను. మార్పులకు గురి అయ్యే శరీరాలు మార్పుల్ని పొందితే మనం ఏడవవలసిన పనిలేదు. అంతటా వ్యాపించి ఉన్న మనలో ఎవరికీ చావులేదు. భగవంతుణ్నే గుండెలో పెట్టుకొని తొణుకూ బెణుకూ లేకుండా ఈ జగన్నాటకాన్ని వినోదంగా చూస్తూ ఉండాలి. అతనూ నేనూ ఒకటేనన్న భావాన్ని రూఢి చేసుకొని, జీవితంలో సంఘర్షణలన్నీ నవ్వుతూనే ఎదుర్కోవాలి. అప్పుడే నీ మోహం పోతుంది’. ఈ ఉద్బోధను విని, గురువు చెప్పినట్టుగానే చేస్తూ అర్జునుడు యుద్ధంలో విజృంభించాడు. ఒకరోజున కర్ణుణ్నింకా చంపలేదన్న కోపంతో ధర్మరాజు అర్జునుడితో, ‘నీ గాండీవాన్ని ఎవరికైనా ఇచ్చెయ్’ అంటూ అవమానపరుస్తూ అన్నాడు. అలాగ అన్నవాణ్ని చంపుతానని అర్జునుడి వ్రతం. అయితే ధర్మరాజును చంపితే తాను బతకలేడు. ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలో చెప్పమని శ్రీకృష్ణుణ్ని అడిగాడు అర్జునుడు. ‘పెద్దవాణ్ని తిట్టడం అతన్ని చంపడంతో సమానం. తనను తాను పొగుడుకోవడం చావడంతో సమానం. ఈ రెండు పనులూ చేసి నీ ప్రతిజ్ఞను తీర్చు కో’మంటూ అతను సలహా ఇచ్చాడు. ఆ తరువాత యుద్ధభూమికి వెళ్లి కర్ణుణ్ని సంహరించాడు అర్జునుడు. మొత్తం మీద భారతమంతటా అర్జునుడి సాధకరూపం ఉట్టిపడుతూ వచ్చింది. ఏకాగ్రతతో తపస్సు చేశాడు. కానీ మధ్యమధ్యలో ఈర్ష్యా కామమూ కోపమూ ఏమీ చేయలేని దీనత్వమూ విషాదమూ కూడా అతనిలో చోటు చేసుకున్నాయి. చివరికి పెద్ద పెద్ద హేమాహేమీలను గెలిచి ప్రతిజ్ఞలు తీర్చుకొన్నాడు. అన్నిరకాల యుద్ధాల్లోనూ గెలిచాడు. దేవతలక్కూడా లొంగని కాలకేయుల్నీ నివాతకవచులనే రాక్షసుల్నీ సంహరించాడు. నరత్వం నుంచి నారాయణ గురుత్వంతోనూ సఖిత్వంతోనూ పెంపొందుతూ నారాయణుడితో ఒకటయ్యాడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
ప్రతి సాధకుడూ అర్జునుడే!
ఎందుకు రాశానంటే! ఇదొక చిత్రమైన సైన్సు, ఆధ్యాత్మికత కలయిక. ఏస్ట్రోఫిజిక్స్‌లో పీహెచ్డీ చేసిన డాక్టర్ ముంజులూరి నరసింహారావు పరమహంస యోగానంద శిష్యులు. హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కళాశాలలో పనిచేసి 2001లో రీడర్‌గా రిటైర్ అయ్యారు. ఆయన ఇటీవలే రెండు సంపుటాలుగా శ్రీమద్భగవద్గీతకు (మొదటి సంపుటం; 1-6 అధ్యాయాలు; రెండో సంపుటం; 7-18 అధ్యాయాలు) బృహత్ వ్యాఖ్యానాన్ని వెలువరించారు. ఈ సందర్భంగా ఆయనతో చిరు సంభాషణ: - భగవద్గీతకు సంబంధించిన వ్యాఖ్యానాలు ఏదోరకంగా ఎన్నో ఉనికిలో ఉన్నప్పుడు, మళ్లీ మీరు వ్యాఖ్యానానికి ఎందుకు పూనుకున్నారు? ఇది ‘రోజూ తింటూన్న అన్నాన్నే మరోసారి తినమన్నట్టు’గా ఉంటుందిగదా అనుకోవడం సహజమే. అయితే ఈ వ్యాఖ్యానం శ్రీకృష్ణుడికీ అర్జునుడికీ మధ్య జరిగిన సంవాదంగా కాకుండా, ప్రతి మనిషి గుండెల్లోనూ కొలువై ఉన్న భగవంతుడికీ పుట్టినదగ్గరి నుంచీ వెంటాడుతూన్న పుట్టెడు దుఃఖాల్ని పోగొట్టుకొందామని ప్రయత్నిస్తూన్న సాధకునికీ మధ్య ప్రతి క్షణమూ జరుగుతూన్న సంవాదంగా చెబుతుంది. - అంటే ప్రతి సాధకుడూ అర్జునుడే... అవును, ప్రతిసాధకుడూ అర్జునుడే. ఇంట్లో భార్యాభర్తల కీచులాటలూ, అన్నదమ్ముళ్ల కుమ్ములాటలూ, డబ్బుకోసం అందరిమధ్యా వచ్చే మనస్పర్థలూ, భాగస్వామ్య వర్తకాల్లో పుట్టే కొట్లాటలూ, దేశాల మధ్య వచ్చే సరిహద్దు తగాదాలూ, యుద్ధాలూ చూసి, వేసారిపోయి ‘ఇంతేనా జీవితమంటే’ అనే మీమాంసకు వస్తాడు ప్రతిమనిషీను. ఈ వరస ప్రశ్నలతో పుట్టే జిజ్ఞాసతో ప్రతిమనిషీ, బయట దానికి జవాబు దొరకక, లోపలికి ఆలోచనను మళ్లిస్తాడు. బయట నుంచి దృష్టిని లోపలికి తిప్పడమే పెద్ద ముందడుగు. అప్పుడు లోపలున్న స్వచ్ఛమైన ‘నేను’ (అంటే ఆత్మ లేక భగవంతుడు) మౌనంగానే మాట్లాడుతుంది. ఆ మాటలను ప్రతివాడూ వింటాడు గానీ వినిపించుకోడు; చెవిని మలుపుకొనో నులుముకొనో పరధ్యానాన్ని నటిస్తాడు. ఈ వ్యాఖ్యానం ఆ పరధ్యానాన్ని మాని, సూటిగా ఆ లోపలి నుంచి వచ్చే మాటలను శ్రద్ధగా వినమని చెబుతుంది. - మిగతా వ్యాఖ్యానాలకూ మీ వ్యాఖ్యానానికీ ఉన్న ప్రధాన తేడా? ప్రతి అధ్యాయమూ ఒక్కొక్క యోగమే అయినా యోగశాస్త్రంగా భగవద్గీతకు తెలుగులో ఒక్క వ్యాఖ్యానమూ లేదు. యోగమంటే పరమాత్మతో శరీరాల్లో మగ్గుతూ ఉన్న ఆత్మను కలుపుకోడమూ దానికోసం అనుసరించవలసిన ఉపాయమూను. అంతేతప్ప వట్టి ఆసనాలూ ముద్రలూ మాత్రమే కాదు. శ్రీ పరమహంస యోగానందగారిని అనుసరిస్తూ, పతంజలి మహర్షి చెప్పిన యోగసూత్రాలతో భగవద్గీతా శ్లోకాలను పోల్చుకొంటూ, ఇతరమైన ఉపనిషత్తులతోనూ వేదమంత్రాలతోనూ తులనను చూపిస్తూ నా వ్యాఖ్యానం సాగింది. - ఈ పుస్తకం ద్వారా పాఠకుడికి అందగల పరమార్థం ఏమిటనుకుంటున్నారు? ‘నీలోనే దుర్యోధనుడు ఉన్నాడు, ధర్మరాజూ ఉన్నాడు, శ్రీకృష్ణుడూ ఉన్నాడు. వాళ్లందర్నీ ఏవో కథలోని పాత్రలుగా సరిపెట్టుకొని అసలు విషయాన్ని దాటెయ్యకు. అవతలి పోరాటాల కన్నా నీలోనే మంచికీ చెడుకీ మధ్య జరుగుతూన్న జగడాలే ముఖ్యమైనవి.వాటిల్లో గెలవడానికి ప్రయత్నిస్తే, బయటి పోట్లాటలూ వాటికవే సద్దుమణుగుతాయి. అన్నిరకాల పోరాటాలూ మనస్సు తాలూకు ఆవేశాల వల్ల పుట్టుకొచ్చినవే. ఆ ఆవేశాలను జయించడానికి, ప్రాణాన్ని అదుపులో పెట్టుకో. మనస్సూ ప్రాణమూ ఒకదాన్నొకటి విడిచి ఉండలేవు. ప్రాణాన్ని అదుపులో పెట్టుకోవడమే తడవు, మనస్సూ అదుపులోకి వస్తుంది. మనస్సు అణిగిపోగానే అహంకారమూ అణిగిపోతుంది’. ఇలా గ్రంథం పొడుగునా ప్రమాణ వాక్యాలను సూచిస్తూ అక్కడక్కడ చిన్ని చిన్ని కథల ద్వారా విషయాన్ని ఆకళింపుకు తేవడానికి ప్రయత్నం చేశాను. జిజ్ఞాసువులకూ సాధకులకూ ఆధ్యాత్మిక లాభాన్ని చేకూర్చే పుస్తకం ఇది. ఆ ఉద్దేశంతోనే దీన్ని రాయడం జరిగింది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
నిర్మాతకు పొగరు ఉండాలి
తమిళసినిమా: నిర్మాత అనే వాడికి పొగరు ఉండాలని సీనియర్ దర్శక నటుడు ఆర్.సుందరరాజన్ అన్నారు. వి.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్న చిత్రం కంగారు. వివాదస్పద చిత్రాల దర్శకుడిగా పేరొందిన సామి దర్శకత్వం వహిస్తూ, నవ నటుడు అర్జునా, ప్రియాంక, కోమల్ శర్మ నాయికా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం నగరంలోని ఆర్కేవీ స్టూడియోలో జరిగింది. చిత్ర దర్శకుడు సామి మాట్లాడుతూ నాలుగేళ్ల తరువాత తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రం కంగారు అని తెలిపారు. తన గత చిత్రాలు వేరే విధంగా ఉండడానికి తాను మాత్రమే కారణం కాదన్నారు. ఒక చిత్రం ఎలా ఉండాలన్నది ఒక వ్యక్తి నిర్ణయించలేదన్నారు. దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు ఇలా అందరూ కలసి నిర్ణయం తీసుకుంటారన్నారు. అయితే చిత్రం విజయం సాధిస్తే అందరూ భాగం పంచుకుంటారన్నారు. అపజయాలకు దర్శకుడిని మాత్రమే బాధ్యుడిని చేస్తారని, ఇదెక్కడి న్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. కంగారు చిత్రం విషయానికొస్తే తన శిష్యుడు సాయి ప్రసాద్ చెప్పిన కథతో తెరకెక్కించిన చిత్రం అని చెప్పారు. తమిళ సినిమాలు గుర్తుండిపోయే చిత్రంగా ఉంటుందన్నారు. వైరముత్తు రాసిన ఐదు పాటలు ఆణిముత్యాల్లా ఉంటాయని ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను విడుదల చేయనున్నారని వెల్లడించారు. ఏమిటి దుస్థితి : చిత్ర నిర్మాత సురేష్ కామాక్షి మాట్లాడుతూ ఈ కంగారు చిత్రాన్ని చాలాకాలం మోసుకుంటూ వస్తున్నానన్నారు. ఇది తనకు చాలా నేర్పిందన్నారు. ఇతర వృత్తుల్లో యాజమాన్యం కార్మికులను కట్టడి చేస్తుంటే సినిమాలో మాత్రం కార్మికులు నిర్మాతలను కట్టడి చేస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఆయన వ్యాఖ్యలకు స్పందించిన దర్శక, నటుడు ఆర్.సుందరరాజన్ మాట్లాడుతూ, ఒకసారి సంగీత దర్శకుడు ఇళయరాజా ఏడు పాటలు కంపోజ్ చేసి అవన్నీ ఒకే చిత్రానికి అందిస్తానన్నారు. కొందరు నిర్మాతలు నాలుగైదు పాటలు చాలంటే, అలాగైతే తన పాటలు ఇవ్వనని చెప్పారు. ఒక సంగీత దర్శకుడికే అంత పొగరు ఉంటే రచయితగా తనకెంత పొగరుండాలని ఆయన పాటలు విందాం అనుకుని విన్నానన్నారు. ఆ తరువాత ఆ పాటలన్నీ తానే తీసుకుని వైదేహి కాత్తిరుందాల్ చిత్రంకు వాడుకున్నానన్నారు. ప్రతిభ పొగరంటే అలా ఉంటుందన్నారు. అలాగే నిర్మాతలకు పొగరు, ఐక్యతా భావం ఉండాలన్నారు. లేకుంటే ఎవరూ విలువనివ్వరని చెప్పారు. -
వివరం: భగవానుడు గీసిన గీత
ఇహ పర లోకాలలో సుఖాన్ని సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఒక కాలానికీ, ప్రాంతానికీ చెందిన ఒక మనిషి యొక్క అభ్యుదయాన్నీ శ్రేయస్సునూ కోరుకుంటూ తగిన మార్గాలను బోధించేవాడు గురువవుతాడు. సర్వ దేశాలకు, సర్వ కాలాలకు, సర్వ జాతులకు వర్తించే విధంగా జగత్తులోని ప్రతి మానవుణ్నీ ఉద్దేశించి అభ్యుదయ నిశ్శ్రేయస మార్గాలను రెండింటినీ మహోదాత్తమైన పద్ధతిలో, విశ్వజనీనమైన ‘భగవద్గీతా’ రూపంలో ఉపదేశించడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. చైత్ర శుద్ధ నవమి - ధర్మాన్ని ఆచరించిన శ్రీరాముని పుట్టినరోజు. శ్రావణ బహుళ అష్టమి - ధర్మాన్ని ఉపదేశించిన శ్రీకృష్ణుని పుట్టినరోజు. మార్గశిర శుద్ధ ఏకాదశి - శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ని నిమిత్తంగా చేసుకొని సకల మానవాళికి ‘గీత’ బోధించిన రోజు. ప్రపంచంలోని అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతమై విరాజిల్లిందని ఉపనిషత్ గ్రంథాలకు పీఠికలు రాసిన అనేక మంది జ్ఞానులు చెబుతున్నారు. ‘ఆధ్యాత్మము’ అంటే ప్రాణుల స్వభావము లేదా వాస్తవ రూపం! దీని గురించి వివరంగా తెలుసుకునే విద్యే ఆధ్యాత్మ విద్య! ఇంకా సరళంగా చెప్పాలంటే - ఎక్కణ్నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి వెళ్లాలి, అందుకు ఏం చేయాలి?... అనేవి సంక్షిప్తంగా చెప్పే శాస్త్రమే ‘గీతా’ శాస్త్రం! చాలా మతగ్రంథాల్లాగా ప్రత్యేకంగా రాయబడిన గ్రంథం కాదిది. మహాభారతమనే ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకూ 700 శ్లోకాలతో 18 అధ్యాయాలుగా విభక్తమై ఉంది భగవద్గీత! స్కూల్లో టీచరు సంవత్సరమంతా పాఠం చెప్పి, పరీక్షల ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పినట్టు - మొత్తం లక్ష శ్లోకాల భారతంలో - జీవితంలో పాసైపోవడానికి 700 శ్లోకాలు చాలన్నట్టుగా బయటకు తెచ్చిందే - భగవద్గీత! అర్జునుడి విషాదం వల్ల కృష్ణుడు గీత బోధించవలసి వస్తుంది. యుద్ధంలో తనవాళ్లందరూ మరణిస్తారన్నది అర్జునుడి చింతకు మొదటి కారణం. తానే వారందరినీ చంపడం అధర్మం అనే భావన రెండో కారణం. ఈ విషాద కారణాలు రెండింటినీ తొలగించి, అర్జునుని స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరించడానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నమే భగవద్గీత! నిరుడు రాసిన పుస్తకానికి అదే సంవత్సరంలో కాలం చెల్లడం చూస్తున్నాం! మరి ఒకటా రెండా 5,152 సంవత్సరాల క్రితం ఉపదేశించబడి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట... బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లోనో, పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్స్లోనో, మోటివేషన్ స్పీచుల్లోనో, మోరల్ వ్యాల్యూస్ చర్చల్లోనో... ఏదో ఒక సందర్భంలో ‘గీత’ గురించి మాట్లాడుకోవడం... అమెరికన్ సెనేట్‌లో ‘భగవద్గీత’ మీద ప్రమాణం చేసి, కాంగ్రెస్ సభ్యురాలిగా తులసీ గబ్బర్డ్ పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దేశమంతా గర్వపడుతూ చప్పట్లు చరచడం... గీత శక్తిని ప్రపంచానికి చాటడమే అవుతుంది. పైగా... ‘భగవద్గీతా కించి దధీతా...’ భగవద్గీతను ఏ కొంచెం అధ్యయనం చేసినా వాడి గురించి యముడు చర్చించడని శంకరాచార్య... ‘జ్ఞానం గురించి లోతైన అవగాహన నాకు భగవద్గీత వల్లే ఏర్పడింది’ అని మాక్స్‌ముల్లర్... ‘శాశ్వతమైన ప్రమాణాలు గల ఉపదేశానికి సంక్షిప్త రూపమే భగవద్గీత. ఇది భారతీయులకే కాదు మానవ లోకానికంతటికీ సుస్థిరమైన ఉత్తమ ప్రయోజనాన్నిస్తుంది’ అని ఆల్డస్ హక్స్లీ... ‘ప్రతిఫలాపేక్ష విడిచి కర్మలను ఆచరించడమనే అద్భుతమైన సూచననిచ్చి, మానవ బలహీనతల్ని రూపుమాపి ఉత్తమ సమాజాన్ని నిర్మించగలిగే బలాన్నివ్వడం భగవద్గీత గొప్పదనం’ అని స్వామి వివేకానంద... ఇలా మహానుభావుల అనుభవాల్లో భగవద్గీత గురించి వింటుంటే, గీత లౌకిక ప్రయోజనాలనీ, పారమార్థిక ప్రయోజనాలనీ రెండూ ఇస్తుందనే నమ్మకం కలగడం లేదూ! కాబట్టే - గీత మీద ప్రమాణం చేస్తే అంతా నిజమే చెప్పాలన్నంత పవిత్రతను ఆ గ్రంథానికి ఆపాదించటం జరిగింది. యుద్ధ రంగంలో నిలబడే రెండు పక్షాలూ ఒకరికొకరు శత్రువులు. అది యుద్ధ ధర్మం! అక్కడ నిలబడి ‘వీళ్లందరూ నావాళ్లు’ అని మమకారాన్నీ, ‘నేను చంపవలసి వస్తోంద’ని అహంకారాన్నీ ప్రదర్శించాడు అర్జునుడు - తాత్కాలికమైన మోహావేశంలో! అది గమనించి, ‘డ్యూటీ కరెక్ట్‌గా చేయాలంటే అహంకార మమకారాల్ని వదిలిపెట్టాలం’టూ డ్యూటీలో ఉన్న బ్యూటీ గురించి కృష్ణుడు చెప్పిందే గీత! పైగా జరుగుతున్న యుద్ధం - వ్యక్తుల మధ్య కాదనీ, ధర్మానికీ అధర్మానికీ మధ్య అనీ, చనిపోయేది శరీరమే కానీ ఆత్మ కాదనీ శాశ్వతమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఉపదేశించాడు కృష్ణుడు! మనుజుల కర్తవ్యాన్ని గుర్తుచేసి, జ్ఞాన బోధతో పరమాత్మను చేరే మార్గాన్ని చూపించడమే కృష్ణావతార వైశిష్ట్యం! ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఫలితం పరమాత్మ వంతుగా భావించి, భవ బంధాలను వదలి చేయడమే మనిషి కర్తవ్యం... ఇదే గీతా సారాంశం! అసలు భగవద్గీత ఏం చెబుతుంది? ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అసలు కృష్ణుడు అర్జునునికి ఉపదేశం మొదలెడుతూనే - ‘అశోచ్యా నన్వ శోచస్త్వం... దుఃఖింప తగనివారిని గూర్చి దుఃఖిస్తున్నావు’ అన్నాడు. నిజానికి మనం చేస్తున్నదీ ఇదే! ఏది అవసరమో అది వదిలేసి, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి బాధపడుతుంటాం! దేని గురించి ఎంత ఆలోచించాలో, ఎవరి గురించి ఎంత ఆలోచించాలో తెలుసుకోవడమే వివేకం! ఫేస్‌బుక్కుల ముందు విలువైన సమయమంతా పాడు చేసుకుంటున్న యువతరానికి భగవద్గీత పుస్తకం ప్రయోజనమేమిటో చెప్పాల్సి ఉంది. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం... త్యక్త్వోత్తిష్ట..!’ నీచమైన మనో దౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సంసిద్ధుడవై లే!’ అంటూ జాగృత పరచి, జీవన గమ్యానికి చేర్చే స్ఫూర్తినిస్తుంది గీత! భగవంతుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతను బట్టి ఇస్తాడు. జ్ఞానులూ అంతే. ఆసక్తిని బట్టీ, అర్హతను బట్టీ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ‘శిష్యస్తేహం... శాధిమాం త్వాం ప్రపన్నం... దైన్యంతో ఆలోచనాశక్తిని కోల్పోయాను. శిష్యుడిగా అర్థిస్తున్నాను. సరైన మార్గం చూపించు!’ అని అర్జునుడు శరణు వేడాకే కృష్ణుడు గీత బోధ మొదలుపెట్టాడు. ఆసక్తి లేనివాడికి ఏ విషయమూ పట్టుబడదు. అందుకే ‘ఆసక్తి లేనివాడికి భగవద్గీత ఉపదేశించవద్ద’న్నాడు కృష్ణుడు. (ఇదంతే నా తపస్కాయ - (18-67).. భగవద్గీతే కాదు, ఏ సబ్జెక్టయినా అంతే! వేదికపైన ఉపన్న్యాసకుడు చెప్పిందే చెబితే, బోర్ కొట్టేస్తున్నాడంటారు. కాలేజీలో లెక్చరర్ చెప్పింది మళ్లీ మళ్లీ చెప్పాలి. దీన్ని రివిజన్ అంటారు. ‘గీత’లో కృష్ణుడు చేసిందీ ఇదే! అర్జునుడు ఆచరించాల్సిన కర్తవ్యాన్నీ, కాపాడుకోవాల్సిన క్షత్రియ ధర్మాన్నీ పలుమార్లు పలు విధాలుగా చెప్పాడు. కాబట్టే ‘న యోత్స్యే... (యుద్ధం చేయను) అని అన్నవాడు కాస్తా, గీతోపదేశంతో అజ్ఞాన జనితమైన సందేహాలు మొత్తం తొలగిపోయి ‘కరిష్యే వచనం తవ... నువ్వు చెప్పినట్టే చేస్తాను’ అన్నాడు అర్జునుడు. మనలోని ఆత్మగ్రంథం తెరుచుకోనంతవరకూ బాహ్య గ్రంథాలన్నీ నిరుపయోగాలు. మన ఆటంకాలన్నీ తొలగించి, మన ఆత్మను మనం దర్శించే అవకాశం కల్పిస్తుంది గీత! ఇంట్లో అమ్మా నాన్నా ఉన్నారంటే పిల్లల ప్రవర్తన అదుపులో ఉంటుంది. సమాజంలో పోలీసు వ్యవస్థ ఉందంటే, జనం ప్రవర్తన అదుపులో ఉంటుంది. ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి, మరుజన్మ ఆధారపడి ఉంటుందని తెలుసుకుంటే, ఈ జన్మంతా అదుపులో ఉంటుంది. అదే చెబుతూ పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది గీత - ‘శరీరం యదవాప్నోతి.. (15-8)! మనం చేసే పనులు ఎవడూ చూడ్డం లేదనుకుంటే, పెద్ద పొరబాటే! ‘సర్వతోక్షి శిరోముఖం... సర్వత శృతిమల్లోకే..’ నువ్వు చేసేది చూస్తున్నాడు. మాట్లాడేది వింటున్నాడు పరమాత్మ! వాడన్నీ గమనిస్తుంటాడన్న విషయం బాల్యంలోనే అర్థమైపోతే, జీవితాన్ని పారదర్శకంగా, ఆదర్శవంతంగా గడిపేయొచ్చు! విశేషమేమిటంటే - భౌతికంగా గీతను బోధించినవాడు కృష్ణుడే అని మనం అనుకుంటున్నప్పటికీ, ‘గీత’ లో ఎక్కడా ‘కృష్ణ ఉవాచ’ అని కనిపించదు. ‘భగవాన్ ఉవాచ!’ అనే కనిపిస్తుంది. ఈ భగవానుడికి ఎవరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ రకంగా జగత్తులో మానవుడని చెప్పబడే ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి చేసిన మహోదాత్తోపదేశం కాబట్టే గీత దేశ, కాల, జాత్యాదులకు అతీతంగా విరాజిల్లుతోంది. కర్మణ్యేవాధి కారస్తే... అంటూ ఫలితంపైన దృష్టి పెట్టకుండా, త్రికరణ శుద్ధిగా కర్మని ఆచరించమని చెప్పే గ్రంథాన్ని ఒక మతానికి ఎలా పరిమితం చేయగలం! భోగ లాలసత్వానికీ, దురాశలకీ, నీతి బాహ్యమైన భావావేశాలకీ లోను కాకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు త్రికరణ శుద్ధిగా ఆచరించాలని చెప్పే గీత నాకు తల్లి లాంటిది. స్వాతంత్య్ర సముపార్జనా దీక్షలో నాకు అమేయమైన శక్తినిచ్చింది భగవద్గీత. - మహాత్మాగాంధీ ఏదో విధంగా భోగమయ జీవితాన్ని గడపాలనే మానవ సమాజ ప్రవృత్తిని భగవద్గీత వ్యతిరేకిస్తుంది. ఉత్తమ లక్ష్య సాధన కోసం ఏ క్షణంలోనైనా, ఎలాంటి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలని బోధిస్తుంది. తెలివితేటల్నీ, కాలాన్నీ డబ్బుగా మార్చుకోవటంలోను, వీకెండ్స్ పేరుతో దాన్ని ఖర్చుపెట్టి ఆనందాన్ని కొనుక్కోవడంలోను బిజీగా ఉంటూ... అదే జీవితమనుకుంటున్న ఈ పరుగుల ప్రపంచానికి, భారతీయత కనిపించకుండా గ్లోబలైజేషన్ ముసుగు కప్పేసిన అధిక శాతం యువతరానికీ, భగవద్గీత ఉత్తమమైన, శాశ్వతమైన మార్గాన్ని సూచిస్తుందనడంలో సందేహం లేదు! హిందూ ధర్మ సాహిత్యం అనంతమైనది. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, సిద్ధాంతాలు! ‘వీటిలో దేన్ని అనుసరించాల’ని సామాన్యుడడిగే ప్రశ్నకి ఒకే సమాధానం చెప్పొచ్చు. వీటన్నిటి సారమూ - ‘సర్వ శాస్త్రమయీ గీతా..’ అని పేరుగాంచినదీ... సాక్షాత్తూ భగవానుడైన శ్రీకృష్ణుడే చెప్పినదీ ‘భగవద్గీత’ ఒక్కటి చాలు! ‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే... జ్ఞానంతో సమానమైనదీ పవిత్రమైనదీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి జ్ఞానివి కమ్ము అంటూ అర్జునుణ్ని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని జ్ఞానులు కావాలని కాంక్షించింది గీత! అందుకే భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చిన విదేశీయులకు మన ధన, కనక, వస్తు, వాహనాలపైన కన్ను పడితే, జర్మనీ దేశస్తులు మాత్రం ‘మా దృష్టి భారతదేశంలోని ఆధ్యాత్మ జ్ఞాన సంపదపైన పడింది’ అన్నారు. వేదాల గురించి, భగవద్గీత గురించి అనేక సందర్భాలలో ప్రస్తావించిన ఎడ్విన్ ఆర్నాల్డ్, మాక్స్ ముల్లర్, ఓపెన్ హామర్లు జర్మనీ దేశం వారే! మహాత్మాగాంధీకి భగవద్గీతపైన మక్కువ ఏర్పడటానికి కారణం - ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన ‘ద సాంగ్ ఆఫ్ సెలెస్టల్’ అనే గీతానువాద గ్రంథమే! ఏం చదువుకున్న తర్వాత ఇంకా చదవడానికి మిగిలే ఉంటుందో - అది విజ్ఞానం! ఏం తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకునేందుకు మిగిలి ఉండదో - అది ఆధ్యాత్మ జ్ఞానం! ఆధ్యాత్మ జ్ఞానం లేకుండా మిగతా లౌకిక జ్ఞానాలన్నీ స్వార్థాన్నే ప్రేరేపిస్తాయి. మనదేశం ఈ స్వార్థంలోనే కొట్టుకుపోవడానికి కారణం - ప్రస్తుతం మన విద్యావ్యవస్థలో ఆధ్యాత్మ జ్ఞాన బోధన లేకపోవడమే! ఈ జ్ఞానం అవసరాన్ని గుర్తించడం వల్లే, న్యూజెర్సీ (యూఎస్ఏ)లోని ‘సెటన్ హాల్ యూనివర్సిటీ’ లో చేరే ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా భగవద్గీత చదవాలనే నిబంధన పెడుతూ, ఈ కోర్సుకు ‘ద జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫామేషన్’ అని పేరుపెట్టారు. మరి ‘గీత’ పుట్టిన భారతదేశంలో మాత్రం ‘సెక్యులర్’ పేరుతో దీన్ని దగ్గరికే రానివ్వకపోవడం దురదృష్టకరం. పక్కింట్లో ‘గీత’ వినిపిస్తుంటే ఎవరో టపా కట్టేసుంటారనే స్థితి నుంచి, ‘తెల్లారింది... పక్కింటివాళ్లు లేచి పనులు చేసుకుంటున్నారు’ అనే స్థితికి సంకేతంగా ఒక ఉద్యమ స్థాయిలో గీతా ప్రచారం జరగవలసి ఉంది! ‘వీళ్లందరూ నావాళ్లు’ అని మమకారాన్నీ, ‘నేను చంపవలసి వస్తోంద’ని అహంకారాన్నీ ప్రదర్శించాడు అర్జునుడు - తాత్కాలికమైన మోహావేశంలో! అది గమనించి, ‘డ్యూటీ కరెక్ట్‌గా చేయాలంటే అహంకార మమకారాల్ని వదిలిపెట్టాలం’టూ డ్యూటీలో ఉన్న బ్యూటీ గురించి శ్రీకృష్ణుడు చెప్పిందే గీత! అందుకే గీత నేర్చుకుందాం. రాత మార్చుకుందాం. ఇంటింటా గీతాజ్యోతిని వెలిగిద్దాం. భగవద్గీత... ఉత్తమ జీవన విధాన మార్గం! మానవులకు ఆశాదీపం! సాధకులకు కల్పవృక్షం! సర్వేజనాస్సుఖినోభవన్తు! - గంగాధర శాస్త్రి గాయకుడు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భగవద్గీత లాంటి కర్తవ్య బోధనా గ్రంథం లేకపోతే ప్రపంచ వాఙ్మయం పరిపూర్ణమైనట్టు కాదు. - ఎడ్విన్ ఆర్నాల్డ్, ‘ది సాంగ్ ఆఫ్ సెలెస్టన్ గ్రంథకర్త’