Asaram bapu
-
4 గంటల భేటీకి రూ. 5 లక్షలు.. జైలులో కలుసుకోనున్న ఆశారాం-నారాయణ్
సూరత్: మైనర్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో 11 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్న ప్రవచనకర్త ఆశారాం ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇటీవలే ఆయనకు కోర్టు ఆదేశాలతో మహారాష్ట్రలో చికిత్స అందించారు. కాగా గుజరాత్ హైకోర్టు అనుమతితో ఆయన తన కుమారుడు నారాయణ్ సాయిని జోధ్‌పూర్ జైలులో కలుసుకోనున్నారు. అయితే ఇందుకోసం ఆశారాం కుమారుడు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి గుజరాత్‌లోని సూరత్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. కొన్ని షరతులతో తన తండ్రి ఆశారాంను 4 గంటల పాటు కలిసేందుకు గుజరాత్ హైకోర్టు నారాయణ్ సాయికి అనుమతినిచ్చింది. ఈ భేటీలో ఆశారాం, నారాయణ్ మినహా కుటుంబ సభ్యులెవరూ ఉండరు. శుక్రవారం గుజరాత్ హైకోర్టులో నారాయణ్ సాయి పిటిషన్‌పై విచారణ జరిగింది. నారాయణ్ సాయి అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో సూరత్‌లోని లాజ్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని, ఆయనను కలవాలని అనుకుంటున్నానని నారాయణ్‌సాయి తన పిటిషన్లో పేర్కొన్నాడు.మైనర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన ఆశారాం దాదాపు 11 ఏళ్లుగా జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. ఈ కాలంలో తండ్రీ కొడుకులు ఎప్పుడూ కలుసుకోలేదు. పెరోల్ కోసం ఆశారాం పలుమార్లు కోరినప్పటికీ మంజూరు కాలేదు. కాగా గుజరాత్ హైకోర్టు తన ఆదేశాలలో నారాయణ్ సాయిను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్ల పర్యవేక్షణలో విమానంలో జోధ్‌పూర్ జైలుకు పంపాలని పేర్కొంది. నాలుగు గంటల పాటు జైలులో ఉన్న తన తండ్రిని నారాయణ్ సాయి కలుసుకోనున్నాడు. ఇందుకోసం ఆయన సూరత్‌లోని పోలీస్ స్టేషన్‌లోని ప్రభుత్వ ఖజానాకు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం -
మేం వినబోం.. హైకోర్టుకు చెప్పుకోండి
న్యూఢిల్లీ: టీనేజీ అమ్మాయిలపై లైంగిక దాడులు, అత్యాచారం ఆరోపణల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద గురువు ఆశారాం బాపు తన శిక్షను రద్దుచేయాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తామేమీ వినదల్చుకోలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఏదైనా ఉపశమనం కావాలంటే రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లండి’’ అని స్పష్టం చేసింది. అయితే ఈ మేరకు ఆశారం గతంలో పెట్టుకున్న పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు నాలుగుసార్లు కొట్టేసిందని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశారాం శిక్ష రద్దుచేసి మహారాష్ట్ర ఆస్పత్రిలో వైద్యానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తామేమీ చేయలేవని, మళ్లీ హైకోర్టుకే వెళ్లాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 2013 ఏడాదిలో తన ఆశ్రమంలో టీనేజీ అమ్మాయిని రేప్ చేశాడనే కేసులో అదే ఏడాది అరెస్టయి 2018లో పోక్సో కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన నాటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. -
ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు?
మనదేశంలోని పేరుగాంచిన పలువురు బాబాలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిమీద పోలీసు కేసులు నమోదయ్యాయి. కొందరు బాబాలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బాబాలు ఏమి చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామీ నిత్యానంద: కలకత్తా యూనివర్శిటీలో ఎంఏ ఆశారాం బాపు: మూడవ తరగతి బాబా రామ్‌దేవ్: ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి శ్రీశ్రీ రవిశంకర్: సెంట్ జోసెఫ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సంత్ రామ్ పాల్: ఇంజినీరింగ్ డిప్లమో జగ్గీవాసుదేవ్(సద్గురు): మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో బ్యాచులర్ ఇది కూడా చదవండి: అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది? -
Hyderabad: ఆశారాం బాపుపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కోర్టు వివాదంలో ఉన్న ఆస్తిని విక్రయించడంతో పాటు తన తండ్రి మరణానికీ కారణమయ్యాడంటూ హిమాయత్‌నగర్‌కు చెందిన కున్వర్ నరేష్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఆశారాం బాపు సహా మొత్తం 14 మంది నిందితులుగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. బాధితుడి కుటుంబం ఆశారాం బాపునకు భక్తులుగా ఉన్నారు. వీరు పలుమార్లు శంషాబాద్, అహ్మదాబాద్, సూరత్‌లోని ఆయన ఆశ్రయాలకు వెళ్లడం, బాపు కూడా పలుమార్లు నరేష్ ఇంటికి రావడం జరిగింది. 2004 అక్టోబర్ 28న నరేష్ తండ్రి మోహన్ సింగ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆశారాం బాపు ఆశ్రమంలో ఇచ్చిన టానిక్, ప్రసాదం తీసుకోవడమే ఇందుకు కారణమని నరేష్ ఆరోపిస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అతడి శరీరంలో హెవీ మెటల్ పాయిజన్స్ ఉన్నట్లు చెప్పారని అతను ఆరోపిస్తున్నాడు. ఓ దశలో తన తండ్రిని అహ్మదాబాద్‌లోని ఆశ్రమానికి తీసుకెళ్లగా, బాపు స్వయంగా ప్రసాదం ఇచ్చారని, హైదరాబాద్ తీసుకువచ్చిన తర్వాత తన తండ్రి మృతి చెందారని అతను పేర్కొన్నాడు. మోహన్ మరణం తర్వాత ఆయన కుటుంబం ఆస్తులకు సంబంధించి పార్టీషన్ డీడ్ రాసుకుంది. దీని ప్రకారం హిమాయత్‌నగర్‌లోని 1326 చదరపు గజాల స్థలం నరేష్ తదితరులకు వచ్చింది. ఇదిలా ఉండగా నరేష్, అతడి తల్లి మాలతి సింగ్, సోదరుడు అనంత్ సింగ్, ఆశారాం బాపు ఆశ్రమం ట్రస్ట్ ప్రతినిధి పంజక్ కుమార్, బీకన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన బి.ప్రశాంత్ రెడ్డి, లోటస్ గృహ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కట్టా లక్ష్మీకాంత్ మధ్య సదరు స్థలానికి సంబంధించి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీని ప్రకారం ఆ స్థలంలో 36 నెలల్లో జీ 4 అంతస్తులతో భవనం నిర్మించాలి. ఇందులో 60 శాతం స్థల యజమానులకు, 40 శాతం డెవలపర్లకు చెందుతుంది. మొదటి, మూడో అంతస్తులు స్థల యజమానులకు, నాలుగో అంతస్తు ఆశారాం బాపు ట్రస్ట్‌కు చెందేలా నిర్మాణం చేపట్టాలని ఇందుకు అయ్యే ఖర్చు ఇరు పక్షాలు 60:40 వంతున భరించాల్సి ఉంది. భవనం నిర్మాణంలో ఉండగానే ఆశారాం బాపు, ఆయన ట్రస్ట్‌తో నరేష్ కుటుంబానికి వివాదాలు మొదలయ్యాయి. దీంతో నరేష్ తల్లి మాలతి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి 2014 ఫిబ్రవరిలో స్టేటస్ కో పొందారు. అయితే వాటిని ఉల్లంఘించి ఆశారాం బాపుతో పాటు ఆయన ప్రతినిధి, ఇతర సంస్థలు కుమ్మకై ్క సదరు స్థలాన్ని విక్రయించారని నరేష్ ఆరోపిస్తున్నారు. 2019–2020లో జరిగిన ఈ క్రయవిక్రయాలు ఇటీవల నరేష్ దృష్టికి రావడంతో అతను సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు నేరం జరిగినట్లు ఆధారాలు సేకరించారు. దీని ఆధారంగా ఆశారాం బాపుతో పాటు మరో 13 మందిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
అహ్మదాబాద్: దశాబ్దకాలం నాటి అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపూ దోషిగా తేలిన విషయం తెలిసిందే. 2013లో తన ఆశ్రమంలో నివసిస్తున్న మహిళపై లైంగికదాడి కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు సోమవారం ఆయన్ను దోషిగా తేల్చింది. ఈ కేసులో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి.. తాజాగా నేడు (జనవరి31) అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించారు. కాగా గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో 2001 నుంచి 2006 వరకు తనపై గురువు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు ఓ మహిళ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరత్‌కు చెందిన మహిళ ఆశారాం బాపూతో సహా ఏడుగురిపై అత్యాచారం, అక్రమ నిర్బంధం కేసు పెట్టారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన గాంధీనగర్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసులో ఆశారాంను దోషిగా తేల్చింది. ఇదే కేసులో సరైన ఆధారాలు లేనందున ఆశారాం భార్య, కుమార్తె, కుమారుడితో పాటు మరో నలుగురు మహిళలను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆశారాంకు జీవిత ఖైదు విధించింది. కాగా 81 ఏళ్ల ఆశారం బాపూ ప్రస్తుతం మరో అత్యాచారం కేసులో జోధ్‌పూర్ జైలులో శిక్షననుభవిస్తున్నారు. జోధ్‌పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవ్వగా..2018లో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. అతడిని ఇండోర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అనంతరం జోధ్‌పూర్‌కు తరలించారు. 2013 నుంచి జోధ్‌పూర్ జైలులోనే ఉన్నారు. ప్రముఖ అధ్యాత్మిక గురువుగా దేశ విదేశాల్లో శిష్యులను సంపాదించుకున్న ఆశారం చివరకు ఇలా కటకటాలపాలయ్యారు. చదవండి: చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం' -
ఆశారాం ఆశ్రమానికి వెళ్లిన హైదరాబాద్ యువకుడు అదృశ్యం!
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద ఆశారాం బాపూ ఆశ్రమం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆశ్రమానికి వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అదృశ్యమయ్యాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివారు మోతేరాలో ఉన్న ఈ ఆశ్రమానికి హైదరాబాద్ యువకుడు విజయ్ యాదవ్ తన స్నేహితులతో కలసి ఈ నెల 3న వెళ్లి అక్కడే బసచేశాడు. ఈ క్రమంలో అతడు 11వ తేదీ నుంచి కనిపించట్లేదు. ఆందోళన చెందిన కుటుంబీకులు సోమవారం ఆ ఆశ్రమానికి వెళ్లి విచారించగా నిర్వాహకుల నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు. దీంతో అక్కడి చాంద్‌ఖేడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు కావడంతో డీసీపీ–2 విజయ్ పాటిల్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది. బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపూ ప్రస్తుతం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ జైల్లో ఉన్నారు. ఈ నెల 8న విజయ్యాదవ్తోపాటు అతడి స్నేహితులు జోధ్‌పూర్‌లోని ఆశారాం ఆశ్రమంలో జరిగిన శిబిరానికి హాజరయ్యారు. మిగిలినవాళ్లు ఈ నెల 10న తిరిగి వచ్చేయగా, తాను మరికొన్ని రోజులుండి వస్తానంటూ విజయ్ అక్కడే ఆగిపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి కుటుంబీకులు అతడికి ఫోన్ చేస్తున్నా స్విచ్ఛాఫ్ అని వస్తోంది. దీంతో ఆందోళనకు గురైన విజయ్ సోదరుడు, ఓ బంధువు మోతేరాకు చేరుకుని ఆశ్రమ నిర్వాహకులను ఆరా తీశారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆశ్రయంలోకి వెళ్లినట్లు విజయ్ పేరు నమోదైనా, బయటకు వచ్చినట్లుగా నమోదు కాలేదు. ఆశ్రమంలో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించాలంటూ కుటుంబీకులు కోరగా 11వ తేదీకి సంబంధించిన ఫీడ్ అందుబాటులో లేదంటూ నిర్వాహకులు సమాధానం ఇచ్చారు. అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లు విజయ్ మెయిల్ ఐడీ నుంచి మెస్సేజ్.. ఆశ్రమంతోపాటు ఆశారాం బాపూ వ్యవహారశైలి కూడా వివాదాస్పదం కావడం, గతంలోనూ కొందరు ఇక్కడ మిస్సింగ్ అయిన ఉదంతాలు ఉండటాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. 2008లో ఇదే ఆశ్రమం నుంచి అదృశ్యమైన దీపేశ్, అభిషేక్‌లు సమీపంలోని నదిఒడ్డున శవాలుగా కనిపించారు. బుధవారం విజయ్ ఈ–మెయిల్ ఐడీ నుంచి కుటుంబీకులకు ఓ మెస్సేజ్ వచ్చిందని, స్వచ్ఛందంగా అజ్ఞాతంలోకి వెళ్తున్నానని, ఆశ్రమంపై అపవాదులు వేయవద్దని అందులో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. దర్యాప్తు అధి కారులు సదరు ఈ–మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను కనిపెట్టడానికి సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. -
ఐసీయూలో చేరిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ
జైపూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ శనివారం జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని ఐసీయూలో చేరారు. కాలేయ సంబంధిత వ్యాధి, మూత్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేగాక గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో 80 ఏళ్ల ఆశారాం బాపుకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించి 48 గంటల పాటు వైద్యుల పరిరక్షణలో ఉంచనున్నారు. చదవండి: ‘కళ్లు పీకి.. చేతులు విరుస్తా’ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు కాగా ఆశారాం బాపూ ప్రస్తుతం అత్యాచారం కేసులో జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదుగా ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక 2013లో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించింది 2014లో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే అతన్ని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నెలకు ఒకటి, రెండుసార్లు ఏయిమ్స్‌కు జోధ్‌పూర్‌కు తీసుకువస్తారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆశారాం బాపు జైలు నుంచి బయటకు వెళ్లకముందే, ఆయన్ను జోధ్‌పూర్ ఎయిమ్స్ తీసుకెళ్తున్నారనే సమాచారంతో భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని స్థానిక అధికారులు బలవంతంగా ఆ ప్రాంతం నుంచి పంపించేశారు. -
ఆశారాం బాపూకు చుక్కెదురు
జోధ్‌పుర్: మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో విధించిన జీవితఖైదును సవాలు చేస్తూ.. ఆశారాం బాపూ దాఖలు చేసిన పిటిషన్‌ను జోధ్‌పుర్ హైకోర్టు సోమవారం కొట్టిపారేసింది. బాధిత బాలిక మేజర్ అని, పోస్కో చట్టం నిబంధనల ప్రకారం ఆశారామ్‌కు శిక్ష వర్తించదని ఆయన తరపు న్యాయవాదులు శిరీష్ గుప్తే, ప్రదీప్ చౌదరి వాదించారు. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ వినీత్ కుమార్ మాధుర్‌లతో కూడిన స్పెషల్ బెంచ్ వీరి వాదనను తోసిపుచ్చింది. నేరం జరిగిన సమయంలో బాలిక మైనర్ అని ట్రయల్ కోర్టులో అభియోగాలు రుజువైన విషయాన్ని ప్రస్తావించింది. కాగా తన ఆశ్రమంలో చదువుతున్న మైనర్ బాలికను జోధ్‌పూర్‌కు దగ్గరలోని మనాయ్ గ్రామంలో 2013 ఆగస్ట్‌లో అత్యాచారం చేశానని ఆశారాం అంగీకరించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆశారాం బాపూకు జీవితఖైదు విధించింది. తనను తాను దైవదూతగా చెప్పుకునే ఆశారాం ప్రస్తుతం జోధ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే కేసులో దోషులుగా తేలిన మరో ఇద్దరికి 20 సంవత్సరాల చొప్పున శిక్షను కోర్టు విధించింది. -
లైంగిక దాడి కేసులో ఆశారాం కుమారుడు దోషి
అహ్మదాబాద్ : లైంగిక దాడి కేసులో ఆశారాం బాపూ కుమారుడు నారాయణ్ సాయిని సూరత్ సెషన్స్ కోర్టు శుక్రవారం దోషిగా నిర్ధారించింది. సూరత్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై నారాయణ్ సాయి లైంగిక దాడికి పాల్పడినట్టు సెషన్స్ కోర్టు ధ్రువీకరించింది. ఇదే కేసులో గంగా,జమున, హనుమాన్‌లను కూడా కోర్టు దోషులుగా పేర్కొనగా, మోనికా అనే మహిళను నిర్ధోషిగా నిర్ధారించింది. 2013లో నమోదైన ఈ కేసులో ఆరేళ్ల తర్వాత నారాయణ్ సాయిపై అభియోగాలు రుజువయ్యాయి. ఇక ఈ కేసుకు సంబంధించి దోషులకు ఈనెల 30న శిక్ష ఖరారు చేస్తారు. కాగా, ఆశారాం బాపూ సైతం మహిళలపై లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
త్వరలో మంచిరోజులొస్తాయి: ఆసారాం
జైపూర్: అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 77 ఏళ్ల ఆసారాం బాపు ఆడియో సంభాషణ క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ‘త్వరలో మంచి రోజులు వస్తాయి’ అని ఆసారాం అవతలి వ్యక్తికి చెప్పటం ఉంది. సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న ఆ టేపు ప్రస్తుతం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో జోధ్‌పూర్ సెంట్రల్ జైల్ సిబ్బందిపై విమర్శలు మొదలయ్యాయి. అత్యాచార కేసు : ఆసారాం దోషి ‘వ్యవస్థ పట్ల మనం గౌరవంతో నడుచుకోవాలి. నన్ను చూసేందుకు జైలుకు ఎవరూ రావొద్దు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించకండి. కింది కోర్టులు తప్పు చేస్తే పైకోర్టులు ఆ తప్పులను సరిదిద్దుతాయి. త్వరలో మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఉంది. ఆశ్రమంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారం నాకు అందింది. ఆ విషయంలో శ్రద్ధ వహించండి. నా సంగతి తర్వాత.. ముందు శిల్పి-శరత్ చంద్రల బెయిల్ కోసం ప్రయత్నించండి. గురువుగా నా భక్తుల విషయంలో శ్రద్ధ చూపటం నా కర్తవ్యం’ అంటూ ఆసారాం ఆ వ్యక్తితో చెప్పటం ఉంది. అవతలి వ్యక్తి మాత్రం మౌనంగా ఆ మాటలన్ని విన్నాడు. ఈ క్లిప్ బయటకు ఎలా వచ్చిందో తెలీదుగానీ వైరల్ అవుతోంది. నిబంధనల ప్రకారమే ఫోన్ చేశారు... ఈ ఆడియో క్లిప్‌పై జైళ్ల డీఐజీ విక్రమ్ సింగ్ స్పందించారు. శిక్ష ఖరారైన రెండు రోజుల తర్వాత.. అంటే శుక్రవారం ఈ ఫోన్ సంభాషణ జరిగినట్లు ఆయన వెల్లడించారు. ‘సాధారణంగా ఖైదీలకు ఒక నెలలో.. రెండు ఫోన్ నంబర్లకు సుమారు 80 నిమిషాలపాటు మాట్లాడుకునేందుకు అనుమతి ఉంటుంది. దానిని అనుసరించే సబర్మతి ఆశ్రమంలోని సాధక్తో శుక్రవారం సాయంత్రం ఆసారాం మాట్లాడారు. బహుశా ఆ ఆడియో క్లిప్ లీక్ అయ్యి ఉంటుంది’ అని విక్రమ్ సింగ్ తెలిపారు. అయితే ఆ క్లిప్ ఎలా బయటకు పొక్కి ఉంటుందన్న విషయంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఆశ్రమంతో నాకు సంబధం లేదు... గత కొంత కాలంగా ఆసారాం కూతురు భారతి మీడియా కంటపడకుండా తిరుగుతున్నారు. ఆసారాం అత్యాచారం చేశాడంటూ మరో మహిళ దాఖలు చేసిన కేసులో భారతితోపాటు ఆసారాం భార్య లక్ష్మీ నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసు కోసం శుక్రవారం భారతి గాంధీనగర్ కోర్టుకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘ఆశ్రమంలో జరిగే ప్రతీ వ్యవహారంలో నా హస్తం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, 17 ఏళ్ల నుంచి ఆశ్రమానికి నేను దూరంగా ఉంటున్నా. ఈ విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులను అడిగినా చెబుతారు. నా తండ్రి చేసిన అకృత్యాలకు నాకు సంబంధం లేదు’ అని ఆమె వివరణ ఇచ్చారు. ఆసారాం కూతురు భారతి(పాత చిత్రం) -
ఆసారాంకు బతికే హక్కు లేదు; నటి
సాక్షి, ముంబై: అత్యాచార కేసులో ఆసారాం బాపుకు జీవితఖైదు శిక్షపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హర్షం వ్యక్తం చేశారు. అయితే మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప్రాణాలతో ఉంచటం సరైందని కాదని ఆమె అంటున్నారు. అసారాం లాంటి వారికి ఉరిశిక్షే సరైందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2013లో 16 ఏళ్ల బాలికపై ఆసారాం అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరం రుజువు కావటంతో ఈ ఏప్రిల్ 25న కోర్టు ఆసారాంకు జీవిత ఖైదు విధించింది. దీనిపై రాఖీ సావంత్ స్పందిస్తూ... ‘ఆసారాంకు శిక్ష పడ్డందుకు నాకు సంతోషంగా ఉంది. రేపిస్టులకు ఇదొక హెచ్చరిక. అయితే అతనికి ఉరి శిక్ష ఎందుకు వేయలేదు? బాధితురాలు మైనర్. పైగా మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వం అంటోంది. ఆ లెక్కన్న ఆసారాంకు కూడా మరణ శిక్ష వేయటమే సబబు. మైనర్లను చిదిమేసే రాక్షసులను వదలకూడదు’ అని రాఖీ సావంత్ వ్యాఖ్యానించారు. పోక్సో చట్టం సవరణ ద్వారా కేంద్రం తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం.. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తారు. 12 నుంచి 16 ఏళ్ల లోపు అమ్మాయిలపై లైంగిక దాడి చేస్తే జీవిత ఖైదు, లేదా కనీసం 20ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేయనున్నారు. దీంతో పాటు చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులు విచారణ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర కూడా వేశారు. -
హైదరాబాద్‌కు విస్తరించిన ఆశారాం సామ్రాజ్యం
-
జేజేల నుంచి.. జైలు దాకా...!
ఓ మైనర్ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆసారాం బాపూజీకి జోధ్‌పూర్ కోర్టు జీవితఖైదు విధించిన నేపథ్యంలో స్వయం ప్రకటిత బాబాలు, స్వామిజీలు, అధ్యాత్మిక గురూజీల వివాదాస్పద వైఖరి, వారు ఎదుర్కొన్న కేసులు, పడిన శిక్షలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రధానంగా ఇలాంటి స్వామిజీల్లో మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. తల్లితండ్రులను పూజించాలని, లైంగిక వాంఛలు లేని పవిత్రమైన జీవితాన్ని గడపాలంటూ ఉపదేశాలిచ్చే 79 ఏళ్ల ఆసారాం బాపూజీ అత్యాచారం కేసులో అరెస్టయి 2013 నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. ఆధ్యాత్మిక కేంద్రంలోనే ఆసారాం తనపై అత్యాచారం చేశారంటూ ఓ టీనేజీ భక్తురాలి ఫిర్యాదుపై ఆయన అరెస్టయ్యారు.. ఆ తర్వాత మరో మహిళా అనుయాయి కూడా ఇదే ఆరోపణ చేశారు. ఈ ఆధ్యాత్మిక సంస్థ వ్యవహారాలు పర్యవేక్షించే ఆసారాం కుమారుడు నారాయణ్ సాయి కూడా అత్యాచారం ఆరోపణలతోనే కటకటాల పాలయ్యారు. శిక్షపడిన, కేసులు ఎదుర్కొంటున్న స్వామిజీలు కొందరు... గుర్మీత్ రాం రహీమ్ : గతేడాది ఆగస్టులో అత్యాచారం కేసులో గుర్మీత్‌సింగ్‌కు ఇరవైఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు వెలువరించాక జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో 36 మంది చనిపోయారు. గంగానంద తీర్థపథ : కేరళ కొల్లాంలోని ఆశ్రమాన్ని నిర్వహించిన తీర్థపథ పూజా పద్ధతుల (ఆచారాల) నిర్వహణ నెపంతో ఓ న్యాయశాస్త్ర విద్యార్థినిని అయిదేళ్ల పాటు శారీరకంగా లొంగదీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికి ప్రతిగా ఆ అమ్మాయి తీర్థపథ పురుషాంగాన్ని తెగ్గోసి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. అయితే ప్రాయశ్చిత్తంగా తానే ఆ పని చేసినట్లు ఆయన ప్రకటించుకున్నాడు. మెహందీ ఖాసిం : ఏడుగురు అమ్మాయిలను రేప్ చేసినందుకు 43 ఏళ్ల మెహందీ బాబాకు ముంబై కోర్టు 2016 ఏప్రిల్‌లో జీవితఖైదు విధించింది. మానసిక వికలాంగులైన అబ్బాయిలను ఆరోగ్యవంతులను చేసే చికిత్స కోసం అమ్మాయిలను కూడా పంపించాలని, తాను చేసే చికిత్స ద్వారా ఈ అమ్మాయిలు మానసిక వికలాంగులకు జన్మనివ్వకుండా నివారించవచ్చునని వారిపై అత్యాచారం జరిపాడు. సంతోష్ మాధవన్ అలియాస్ స్వామి అమృత చైతన్య : ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన కేసులో మాధవన్‌కు 2009లో కేరళ కోర్టు 16 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. పేద కుటుంబాలకు చెందిన ఈ బాలికలను ఏదో నెపంతో రప్పించి, వారిని నిర్భందించి అత్యాచారం చేశాడు. స్వామి ప్రేమానంద : శ్రీలంక నుంచి 1984లో తమిళనాడులోని తిరుచిరాపల్లికి వచ్చిన ప్రేమానంద్ అక్కడ ఆశ్రమం నెలకొల్పాడు. ఇక్కడే అతడు తనపై అత్యాచారం చేయడంతో గర్భం దాల్చినట్లు 1994లో ఒక అమ్మాయి ఆరోపించింది. పదమూడు మంది మైనర్ బాలికలను రేప్ చేసిన కేసుల్లో ప్రేమానంద్తో పాటు మరో ఆరుగురికి కోర్టు శిక్ష విధించింది. జ్ఞానచైతన్య : మూడు హత్యలకు గాను 14 ఏళ్ల జైలు జీవితాన్ని గడిపి బయటికొచ్చాక ఒక బ్రిటీష్ కుటుంబాన్ని కలుసుకుని తన గత జన్మలో వారి కుమార్తె తన భార్యగా ఉందంటూ నమ్మించాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఆ యువతిని లైంగికంగా వేధించడంతో పాటు హింసించాడు. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన ఆ యువతి చేసిన ఫిర్యాదుతో అతడిని పోలీసులు మళ్లీ ఆరెస్ట్ చేశారు. రాంపాల్ మహారాజ్ : హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు వివిధ కేసుల్లో 2014లో కోర్టు జారీచేసిన అరెస్ట్ వారెంట్ నుంచి తప్పించుకునేందుకు తన భక్తులతో రాళ్లు, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో గురు రాంపాల్ మహారాజ్ దాడులు చేయించాడు. కొన్ని రోజుల తర్వాత కాని పోలీసులు ఈ భారీ కాంప్లెక్స్‌ను ఖాళీ చేయించలేకపోయారు. ఈ ముట్టడిలో ఆరుగురు చనిపోయారు. స్వామి నిత్యానంద : లైంగిక వేధింపులు ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానందపై కర్ణాటకలోని ఆశ్రమంలో తమను శారీరకంగా హింసించారంటూ అయిదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. సినీనటితో శృంగారం వీడియో వివాదం వెలుగుచూడడంతో 2010లో 53 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపాడు. ఇద్దరు మహిళలతో అసభ్య ప్రవర్తనపై ఒక స్థానిక టెలివిజన్ చానల్ వీడియో విడుదల చేయడంతో గ్రామస్తులు ఆశ్రమంపై దాడి చేశారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మోదీ, ఆశారాం మధుర ఙ్ఞాపకం.. పోస్టు వైరల్!
-
ఆశారాం- మోదీ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్
-
ఆశారాం- మోదీ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపూతో ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఉన్న ఓ వీడియోను కాంగ్రెస్ బుధవారం తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీడియోలో ఉన్న ఫోటోలు కొన్నేళ్ల కిందటవి కావడం గమనార్హం. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘ ఓ వ్యక్తి ఎలాంటి వాడన్నది అతని చుట్టూ ఉండే వాళ్లను చూస్తే తెలుస్తుంద’నే సామెతను క్యాప్షన్‌గా ఉటంకించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై పలువురు స్పందించారు. కాంగ్రెస్ పోస్ట్‌కు దీటుగా కొందరు సోషల్ మీడియా యూజర్లు ఆశారాంకు నమస్కరిస్తున్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఫోటోలను పోస్ట్ చేశారు. మరోవైపు ఆశారాంతో ప్రధాని మోదీ కలిసున్న పాత ఫోటోలను పోస్ట్ చేయడంపై నటుడు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ మండిపడ్డారు. స్వామీజీగా తనకు తాను చెప్పుకున్న వారితో వారు దోషులుగా నిర్థారణ కాకముందు వారితో సన్నిహితంగా మెలగడం నేరం కాదని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కిందట తన ఆశ్రమంలో16 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఆశారాం బాపూను దోషిగా నిర్ధారించిన జోథ్‌పూర్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. -
మోదీ, ఆశారాం మధుర ఙ్ఞాపకం.. పోస్టు వైరల్!
16 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును దోషిగా తేలుస్తూ జోధ్‌పూర్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఆశారాం బాపు, ప్రధాని నరేంద్ర మోదీలు కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమం వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అధికారిక ట్విటర్లో దర్శనమిచ్చింది. ‘నారాయణ్.. నారాయణ్ ’ అనే కామెంట్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా.. ‘నరేంద్ర మోదీ, ఆశారాం బాపులకు సంబంధించిన కొన్ని మధుర ఙ్ఞాపకాలు’ అని ట్వీట్ చేస్తూ.. వారు కలిసి ఉన్న ఓ పాత వీడియోను పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌ను ఐసీసీకి చెందిన వ్యక్తి ఒకరు ‘నారాయణ్.. నారాయణ్’ అంటూ కామెంట్ చేస్తూ రీట్వీట్ చేశారు. వెంటనే తేరుకున్న ఐసీసీ టీమ్ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్‌ను తొలగించింది. కానీ అప్పటికే నెటిజన్లు ఈ పోస్ట్‌ను స్క్రీన్‌షాట్ తీసి కామెంట్లు పెడుతుండటంతో, ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్వీట్‌పై విమర్శలు రావడంతో ఐసీసీ క్షమాపణలు తెలిపింది. తమ అధికారిక ట్విటర్లో ఈ పోస్ట్ ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని, దీనిపై విచారణ మొదలుపెట్టామని వివరణ ఇచ్చింది. Since the tweet is unavailable, here is screen-shot! :) pic.twitter.com/l4m4ZzSl7E — Goonerunny (@tushizap) April 25, 2018 Sharing some old sweet memories between @narendramodi and Asaram. pic.twitter.com/c8cveZzn0f — Pratik Sinha (@free_thinker) April 25, 2018 -
ఆశారాం బాపుకు జీవిత ఖైదు
-
2వేల బెదిరింపు లేఖలు, వందల ఫోన్ కాల్స్
జోథ్‌పూర్ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై నమోదైన రేప్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో సీనియర్ ఐపీఎస్ అధకారి అజయ్ పాల్ లంబా ఎదుర్కొన్న సవాళ్లివి. ఆశారాంపై రేప్ కేసును విచారిస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు, శిష్యులు తననకు బెదిరింపులు వెల్లువెత్తాయని, బెదిరింపు లేఖలు, ఫోన్‌కాల్స్‌తో తనను భయపెట్టాలని ప్రయత్నించారని ఆయన తెలిపారు. మైనర్‌పై అత్యాచారం జరిపిన కేసులో జోథ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు బుధవారం ఆశారాంను దోషిగా తేల్చి.. ఆయనకు జీవితఖైదు విధించింది. తన కెరీర్లోనే అత్యంత హైప్రొఫైల్ కేసు ఇదని ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు జరిపిన ఐపీఎస్ అధికారి అజయ్‌పాల్ లంబా తెలిపారు. 2013 ఆగస్టు 20న తనకు ఈ కేసును అప్పగించారని, అప్పటికే ఈ కేసుపై మీడియా ఫోకస్ తీవ్రంగా ఉందని, పలువురు సాక్షులు హత్యకు గురయ్యారని, దీనికి తోడు ఆశారాం శిష్యుల నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బెదిరింపులు వచ్చేవని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో అజయ్‌పాల్ జోథ్‌పూర్ వెస్ట్ డీసీపీగా ఉండేవారు. ‘లేఖల్లో తీవ్రమైన దూషణలు ఉండేవి. ఆశారాంకు ఏమైనా జరిగితే మీ కుటుంబాన్ని అంతం చేస్తామని హెచ్చరించేవారు. నా ఫోన్ నిరంతరం మోగుతూనే ఉండేది. దీంతో గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఎత్తేవాడిని కాదు. నేను ఉదయ్‌పూర్‌కు మారిన తర్వాత బెదిరింపు లేఖలు ఆగిపోయాయి’ అని 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో తన కూతుర్ని కొంతకాలం పాఠశాలకు పంపలేదని, తన భార్య కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లేది కాదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన ఏసీబీ ఎస్పీగా జోథ్‌పూర్‌లో నివాసముంటున్నారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తే.. కేసుకు సంబంధించిన సాక్షిని తానే చంపానని ఒప్పుకున్నాడని, అంతేకాకుండా మరో అప్పడి జోథ్‌పూర్ డీఎస్పీ చంచల్ మిశ్రాను కూడా చంపేందుకు టార్గెట్ చేసినట్టు వెల్లడించాడని తెలిపారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన పదివారాల్లోనే మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేశామని, ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని, అయితే, కేసులోని చిక్కుముడుల వల్లే దర్యాప్తు కొంత జాప్యమైందని ఆయన తెలిపారు. -
ఆశారాం బాపుకు శిక్ష ఖరారు
జోధ్‌పూర్ : 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు జోధ్‌పూర్ ట్రయిల్ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరికి 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. కాగా 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం ఆమెపై అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్ చేయడం కూడా ఒక ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్ 1న ఆశారాంను రాజస్థాన్ జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేట్ సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. ఆశారాంకు బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని కూడా బెదిరించారు. దీంతో సుప్రీంకోర్టులో కూడా అతనికి బెయిల్ లభించలేదు. ఈ కేసులో ఆశారాంపై ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడిచింది. దోషిగా తేల్చింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని దోషులుగా పేర్కొన్న కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. దోషులుగా తేలిన ఇద్దరికి ఇరవై ఏళ్లు జైలు శిక్ష విధించింది. -
‘ఆశ’గా ఎదురుచూసి.. కంగుతిన్నారు!
జోధ్‌పూర్: తాము నమ్మిన భగవత్స్వరూపం కడిగిన ముత్యంలా తిరిగొస్తుందని ఆశగా ఎదరుచూసిన భక్తులు కంగుతిన్నారు. బాలికపై అత్యాచారం కేసులో ప్రముఖ ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపు దోషిగా తేలడంతో ఆయన అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ గురువు నిర్దోషిగా విడుదలవుతారని దండలు కూడా తీసుకొచ్చిన అభిమానులు కోర్టు తీర్పుతో షాక్‌కు గురయ్యారు. ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం కనిపించిన దృశ్యాలివి! ఆథ్యాత్మిక గురువుగా ఒక వెలుగు వెలిగిన ఆశారాం.. దేశవ్యాప్తంగా 400కుపైగా ఆశ్రమాలు స్థాపించారు. 2013లో సహారన్‌పూర్‌లోని తన ఆశ్రమంలోనే ఆయన మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదయింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆశారాం దోషే అంటూ జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మాత్రం నిర్దోషులుగా బయటపడ్డారు. బాపూజీ నిర్దోషిగా బయటికొస్తారని దండలతో వచ్చి జోధ్‌పూర్ జైలు వద్ద హడావిడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీర్పు నేపథ్యంలో ఆశారాం అనుచరులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలున్న దరిమిలా రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని కీలక పట్టణాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యాయం దక్కింది: బాధితురాలి తండ్రి ‘‘ఆశారాం దోషిగా తేలడంతో మాకు న్యాయం దక్కింది. ఈ కేసులో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన సాక్షుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని కోరుతున్నాను. దోషికి కఠిన శిక్ష పడుతుందని భావిస్తున్నా. సుదీర్ఘంగా సాగిన న్యాయ పోరాటంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ తీర్పుపై అప్పీలు! అత్యాచారం కేసులో ఆశారాంను దోషిగా తేల్చిన జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ఆశారాం ఆశ్రమ అధికార ప్రతినిధి నీలమ్ దుబే మీడియాకు చెప్పారు. తీర్పు కాపీని క్షుణ్నంగా చదివి, నిపుణులతో చర్చించిన మీదట తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. దొంగ బాబాలకు చెంపపెట్టు: కాంగ్రెస్ ‘నిజమైన సాధువులకు, దొంగ బాబాలకు మధ్య తేడాలను ప్రజలు పసిగట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తీర్పు ఖచ్చితంగా చాలా మార్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా బాబాలు, సాధువుల పట్ల అంతర్జాతీయంగా నెలకొన్న అభిప్రాయాల్లో మార్పు వస్తుంది’’ అని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. -
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు షాక్
-
అత్యాచార కేసు : ఆశారాం దోషి
జోధ్‌పూర్ (రాజస్థాన్) : మైనర్ బాలికపై అత్యాచార కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని దోషులుగా పేర్కొన్న కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. అయితే, ఆశారాంకు శిక్షపై కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతోంది. కోర్టు తీర్పుపై న్యాయపరంగా సలహా తీసుకుని ముందుకు వెళ్తామని ఆశారాం అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, కోర్టు తీర్పు నేపథ్యంలో జోధ్‌పూర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ఆశారాంకు శిక్ష పడటంపై బాధితురాలి తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పోరాటంలో వారికి మద్దతుగా నిలిచినందుకు పలువురికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యులుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. తీర్పు అనంతరం ఆశారాం అనుచరులు విధ్వంసక చర్యలకు దిగుతారేమోనన్న అనుమానంతో ఈ నెల 30వ తేదీ వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఈ కేసులో 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగష్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్ చేయడం కూడా ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్ 1న ఆశారాంను జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేటు సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. మొత్తం 9 మంది సాక్ష్యుల్లో ముగ్గరు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఆశారాంకు బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని సైతం ఆశారాం ప్రైవేటు సైన్యం బెదిరించింది. దీంతో సుప్రీంకోర్టులో కూడా ఆశారాంకు బెయిల్ లభించలేదు. మరో రెండు అత్యాచార కేసులు ఆశారాం బాపూని అరెస్ట్ చేసి రెండు నెలలు తిరక్కుండానే సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్ సమీపంలోని ఆశ్రమంలో 2001, 2006 సంవత్సరం మధ్య ఆశారాం తనపై చాలాసార్లు లైంగికంగా దాడులకు దిగాడని అక్క ఆరోపణలు చేస్తే, సూరత్ ఆశ్రమంలో నారాయణ సాయి తనను అత్యాచారం చేశాడంటూ చెల్లి కోర్టుకెక్కింది. దీంతో పోలీసులు నారాయణ సాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆశారాం ఎలా ఎదిగాడు? 1941 సంవత్సరంలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సింధ్ ప్రాంతంలో పుట్టిన ఆశారాం 15 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కేవలం మూడో తరగతి మాత్రమే చదువుకున్న అతను ఆధ్యాత్మిక మార్గం పట్టాడు. గురు లీలా షాజీ మహరాజ్ దగ్గర శిష్యరికం చేశాడు. 1972 సంవత్సరంలో గుజరాత్‌లోని మొతేరా దగ్గర సబర్మతి తీరంలో చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశాడు. తనని తాను దేవుడిగా ప్రకటించుకుని ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఏడాదిలోనే ఆ కుటీరం కాస్త ఆశ్రమంగా మారిపోయింది. ఆధ్యాత్మిక గురువుగా దేశ విదేశాల్లో ప్రఖ్యాతి వహించాడు. ప్రస్తుతం ఆయనకి దేశ విదేశాల్లో 400 ఆశ్రమాలు రెండు కోట్ల మంది శిష్యపరివారం ఉంది. పార్టీలకు అతీతంగా ఎందరో రాజకీయ వేత్తలు ఆయనకు పరమ వీర భక్తులు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు ఆయన ఆశ్రమాలకు అయాచితంగా భూ కేటాయింపులు చేశాయి. ఆశారాం ఆస్తులు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఏకంగా 10 వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని ఆయన కూడబెట్టాడు. అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగునా వివాదాలే చోటు చోసుకున్నాయి. భూ కబ్జా ఆరోపణలు, ఆశ్రమంలో అనుమానాస్పద మృతులు వంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఆశ్రమం ఎన్ని అరాచకాలకు నెలవుగా మారిందో ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి. -
రేపే తీర్పు... మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ అత్యాచార ఆరోపణల కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది. దీంతో జోధ్‌పూర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆశారాం అనుచరులు విధ్వంసక చర్యలకు దిగుతారేమోనన్న అనుమానంతో ఈ నెల 30వ తారీకు వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారామ్ తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం ఆమెపై అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్ చేయడం కూడా ఒక ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్ 1న ఆశారాంను రాజస్థాన్ జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేట్‌సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. ఆశారాంకు బెయిల్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని కూడా బెదిరించారు. దీంతో సుప్రీంలో కూడా అతనికి బెయిల్ లభించలేదు. ఈ కేసులో ఆశారాంపై ఆరోపణలు రుజువైతే ఆయనకు గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరో రెండు అత్యాచార కేసులు ఆశారాం బాపూని అరెస్ట్ చేసి రెండు నెలలు తిరక్కుండానే సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్ సమీపంలోని ఆశ్రమంలో 2001, 2006 సంవత్సరం మధ్య ఆశారాం తనపై చాలాసార్లు లైంగికంగా దాడులకు దిగాడని అక్క ఆరోపణలు చేస్తే, సూరత్ ఆశ్రమంలో నారాయణ సాయి తనను అత్యాచారం చేశాడంటూ చెల్లి కోర్టుకెక్కింది. దీంతో పోలీసులు నారాయణ సాయిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఆశారాం ఎలా ఎదిగాడు ? 1941 సంవత్సరంలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సిం«ద్ ప్రాంతంలో పుట్టిన ఆశారాం 15 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కేవలం మూడో తరగతి మాత్రమే చదువుకున్న అతను ఆధ్యాత్మిక మార్గం పట్టాడు. గురు లీలాషాజీ మహరాజ్ దగ్గర శిష్యరికం చేశాడు. 1972 సంవత్సరంలో గుజరాత్‌లోని మొటెరా దగ్గర సబర్మతి తీరంలో చిన్న కుటీరాన్ని ఏర్పాడు చేశాడు. తనని తాను దేవుడిగా ప్రకటించుకుని ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఏడాదిలోనే ఆ కుటీరం కాస్త ఆశ్రమంగా మారిపోయింది. ఆధ్యాత్మిక గురువుగా దేశవిదేశాల్లో ప్రఖ్యాతి వహించాడు. ప్రస్తుతం ఆయనకి దేశవిదేశాల్లో 400 ఆశ్రమాలు 2 కోట్ల మంది శిష్యపరివారం ఉంది. పార్టీలకతీతంగా ఎందరో రాజకీయ వేత్తలు ఆయనకు పరమ వీర భక్తులు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు ఆయన ఆశ్రమాలకు అయాచితంగా భూ కేటాయింపులు చేశాయి. ఆశారాం ఆస్తులు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఏకంగా 10 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కూడబెట్టాడు. అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగునా వివాదాలే చోటు చోసుకున్నాయి. భూకబ్జా ఆరోపణలు, ఆశ్రమంలో అనుమానాస్పద మృతులు వంటివి ఎప్పట్నంచో ఉన్నాయి. అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఆశ్రమం ఎన్ని అరాచకాలకు నెలవుగా మారిందో ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఆశారాం బాపు కేసులో తీర్పు వాయిదా
జోధ్‌పూర్ : అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై తీర్పును రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు రిజర్వ్ చేసింది. శనివారం ఈ కేసును విచారించిన కోర్టు తీర్పును ఈ నెల 25న వెలువరించనుంది. మైనర్ బాలికపై కొన్నేళ్లపాటు లైంగి దాడులకు పాల్పడ్డారన్న కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆశారం బాపు జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇదే జైలులో సల్మాన్ ఖాన్ రెండు రోజులు ఉన్న తర్వాత శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసులో దోషిగా తేలితే ఆశారం బాపునకు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2013 ఆగస్ట్ 3వ తేదీన ఈ ఆధ్యాత్మిక గురువును జోధ్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బెయిల్ కోసం ఆయన పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసుకున్నా కోర్టులు అందుకు నిరాకరించాయి. 1997-2006 మధ్యకాలంలో అహ్మదాబాద్ శివార్లలోని ఆశ్రమంలో ఉన్న సమయంలో ఆశారాం బాపు పలుమార్లు తనపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని బాలిక 2013లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జోధ్‌పూర్ జైల్లో ఉన్న ఆశారాం బాపు భవితవ్యం కోర్టు తీర్పుతో మరికొన్ని రోజుల్లో తేలనుంది.