Avatar 2
-
ఓటీటీలోకి వచ్చేసిన అవతార్-2.. ఇక నుంచి ఉచితంగానే!
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్-2: ది వే ఆఫ్ వాటర్'. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా డిసెంబర్16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఓటీటీలో అవతార్-2.. ఇక నుంచి ఫ్రీగా చూసేయొచ్చు!) అయితే ఇప్పటికే ఈ సినిమా రెంటల్ పద్ధతిలో ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నుంచి ఇండియాలో ఫ్రీగా చూసేందుకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ కన్నడ, మళయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికి వరకు ఈ విజువల్ వండర్‌ను చూడడం మిస్సయిన వారు చూసేయండి. (ఇది చదవండి: రెండో పెళ్లిపై దారుణ ట్రోల్స్.. స్పందించిన ఆశిష్ విద్యార్థి) -
ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!
ప్రస్తుతం థియేట్రికల్ సినిమాల కంటే ఓటీటీల హవా ఎక్కువగా నడుస్తోంది. ప్రస్తుతం బిజీ లైఫ్‌లో థియేటర్లకు వెళ్లలేని వారు ఓటీటీల్లోనే నచ్చిన సినిమాలు చూసేస్తున్నారు. అయితే ఈ వారం ఓటీటీకి వచ్చేందుకు సినిమాలు అదేస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఓటీటీతో పాటు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్న సినిమాలేవో ఓ లుక్కేద్దాం. ఈ వారంలో రిలీజయ్యే చిత్రాల్లో జేమ్స్ కామెరూన్ సంచలనం అవతార్-2. అయితే ఈ చిత్రం రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులోకి వస్తోంది. టాలీవుడ్ చిత్రాలు అమిగోస్, శ్రీదేవి శోభన్ బాబు, సత్తిగాని రెండెకరాలు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. అలాగే బాలీవుడ్ నుంచి షెహజాదా, గ్యాస్ లైట్ కూడా ఈ వారంలోనే రిలీజ్ అవుతున్నాయి. తెలుగులో తెరకెక్కిన గోదారి అనే డాక్యుమెంటరీ ఈ వారమే విడుదల కానుంది. వీటితో ఈ వారంలో అలరించేందుకు వెబ్ సిరీస్‌లు కూడా క్యూ కట్టాయి. నెట్ ఫ్లిక్స్: మై లిటిల్ పోనీ- టెల్ యువర్ టేల్- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 27 ఎమర్జెన్సీ- ఎన్వైసీ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 29 అన్ సీన్ -(ఇంగ్లీష్ ) – మార్చి 29 ఫ్రమ్ మీ టూ యూ- కిమీ నీ తోడోకే (కొరియన్ సిరీస్) – మార్చి 30 ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబత్ -(హిందీ) – మార్చి 31 కాపీక్యాట్ కిల్లర్- (మాండరిన్ సిరీస్) – మార్చి 31 కిల్ బోక్సూన్ -(కొరియన్ ) – మార్చి 31 మర్డర్ మిస్టరీ 2-(ఇంగ్లీష్ ) – మార్చి 31 అమిగోస్ -(తెలుగు) – ఏప్రిల్ 1 కంపెనీ ఆఫ్ హీరోస్ - (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1 జార్ హెడ్ 3 - ద సీజ్ (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1 షెహజాదా -(హిందీ ) – ఏప్రిల్ 1 స్పిరిట్ అన్ టేమ్డ్- (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1 వార్ సెయిలర్- (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 2 ఆహా: గోదారి- (తెలుగు డాక్యుమెంటరీ) – మార్చి 31 సత్తిగాని రెండెకరాలు- (తెలుగు సినిమా) – ఏప్రిల్ 1 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అవతార్ 2 (రెంట్ విధానంలో) – మార్చి 28 శ్రీదేవి శోభన్ బాబు (తెలుగు) – మార్చి 30 డాగీ కమిలోహా ఎండీ సీజన్ 2 (ఇంగ్లీష్ ) – మార్చి 31 గ్యాస్ లైట్ (హిందీ) – మార్చి 31 ఆల్ దట్ బ్రీత్స్ (హిందీ) – మార్చి 31 జీ5 అగిలన్ -(తమిళం) – మార్చి 31 అయోతి- (తమిళం) – మార్చి 31 యునైటెడ్ కచ్చే-(హిందీ) – మార్చి 31 యాపిల్ టీవీ ప్లస్ టెట్రిస్ (ఇంగ్లీష్ ) – మార్చి 31 బుక్ మై షో మమ్మీస్ (ఇంగ్లీష్) – మార్చి 27 సన్ నెక్స్ట్ భగీరా (తమిళం) – మార్చి 31 ముబీ ప్లీజ్ బేబీ ప్లీజ్ (ఇంగ్లీష్) – మార్చి 31 ఎమ్ఎక్స్ ప్లేయర్ ఇండియన్ సమ్మర్స్ (హిందీ) – మార్చి 27 -
పలు ఓటీటీలోకి అవతార్ 2.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్.. కానీ!
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2). గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు జేమ్స్ కామెరూన్. ఇన్నాళ్లు థియేటర్ ఆడియన్స్ అలరించిన ఈ చిత్రం.. ఇప్పడు ఓటీటీ ప్రేక్షకులను పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు సిద్దమైంది. ఇదిలా ఉంటే రేపు ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై ‘అవతార్’ టీమ్ అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంతవరకు చూడని విశేషాలను మూడు గంటలపాటు చూసేందుకు సిద్ధం అవ్వండి’ అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. కానీ ఒక్క హాట్‌స్టార్‌లోనే కాకుండా రేపు ఈ మూవీ పలు ఓటీటీల్లో సందడి చేసేందుకు రేడీ అయ్యింది. మూవీఎస్ ఎనీ వేర్, యాపిల్ టీవీ, ప్రైమ్ వీడియో, వుడు, ఎక్స్ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్ మూవీ అండ్ టీవీల్లో ‘అవతార్2’ స్ట్రీమింగ్ కానుంది. అయితే అవతార్ చూడలంటే మత్రం కొన్ని కండిషన్ పెట్టారు మేకర్స్. తొలుత ఈ మూవీని అద్దె ప్రాతిపదికన అందుబాటులో తెస్తున్నారు. ఈ సినిమా చూడాలంటే వారు ప్రీ ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్నీ మూవీస్ ఇన్సైడర్స్ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉంచారు. ఈ మూవీ అద్దె 19.99 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,600. మార్చి 28వ తేదీ ఉదయం 9.30గంటల నుంచి ‘అవతార్2’ చూడొచ్చు. ఒకసారి మూవీని ప్రీఆర్డర్ చేసిన తర్వాత 48 గంటల్లోగా క్యాన్సిల్ చేసుకోవచ్చు(యూకే, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఉండేవారికి 14 రోజుల వెసులుబాటు). అయితే సినిమా చూడటం, డౌన్లోడ్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయడం కుదరదు. ‘అవతార్2’ 4కె అల్ట్రా హెచ్డీ, డాల్బీ అట్మాస్ ఆడియోతో రానుంది. కాగా ‘అవతార్’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు జేమ్స్ కామెరూన్. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2)ను తెరకెక్కించాడు. పార్ట్ 1లో అడవి అందాను చూపిస్తే.. పార్ట్ 2లో సముద్రం లోపల మరో సుందరమైన ప్రపంచం ఉందని తెలియజేశాడు జేమ్స్ కామెరూన్. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న అవతార్ 2.. ఎప్పుడు? ఎక్కడ?
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2). గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు జేమ్స్ కామెరూన్. ఇన్నాళ్లు థియేటర్ ఆడియన్స్ అలరించిన ఈ చిత్రం..ఇప్పడు ఓటీటీ ప్రేక్షకులను పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు సిద్దమైంది. మార్చి 28 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ‘అవతార్’ టీమ్ ఓ ట్వీట్ చేసింది. ఇంతవరకు చూడని విశేషాలను మూడు గంటలపాటు చూసేందుకు సిద్ధం అవ్వండి’అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. మార్చి 28 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవతార్’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు జేమ్స్ కామెరూన్. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘అవతార్ అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2)ను తెరకెక్కించాడు. పార్ట్ 1లో అడవి అందాను చూపిస్తే.. పార్ట్ 2లో సముద్రం లోపల మరో సుందరమైన ప్రపంచం ఉందని తెలియజేశాడు. Return to Pandora whenever you want at home, only on Digital March 28. Get access to over three hours of never-before-seen extras when you add #AvatarTheWayOfWater to your movie collection. pic.twitter.com/4dOhyjMU9l — Avatar (@officialavatar) March 7, 2023 -
అవతార్ 3 కాన్సెప్ట్ అదుర్స్.. అంచనాలను పెంచేసిన డైరెక్టర్
‘అవతార్’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు జేమ్స్ కామెరూన్. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘అవతార్ అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2)ను తెరకెక్కించాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశాడు. పార్ట్ 1లో అడవి అందాను చూపిస్తే.. పార్ట్ 2లో సముద్రం లోపల మరో సుందరమైన ప్రపంచం ఉందని తెలియజేశాడు. దీంతో అవతార్ 3పై అందరికి ఆసక్తి నెలకొంది. పార్ట్ 3 నేపథ్యం ఏంటి? కొత్తగా ఏం చూపించబోతున్నారనే ఉత్సకత ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. తాజాగా అవతార్ 3 కాన్సెప్ట్ ఏంటో దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించాడు. నిప్పు నేపథ్యంలో అవతార్ 3 కొనసాగుతుందట. ఇటీవల క్రిటిక్ చాయిస్ అవార్డ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అవతార్ 2కి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ మూవీ అవార్డు లభించింది. తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్ కామెరూన్ పాల్గొని, అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవతార్ 3 ఎలా ఉండబోతుందో వివరించాడు. ‘అగ్ని ఒక చిహ్నం..ప్రయోజకారి. అవతార్ 3లో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. దీంతో పాటు మరో రెండో సంస్కృతులను కూడా పరిచయం చేస్తా. ఒమక్టయా, మెట్కైనా తెగలను మీరు కలుస్తారు. ఇదంతా పండోరా గ్రహంలోనే జరుగుతుంది. ఇంతకు మించి ఏమి చెప్పలేను’అని జేమ్స్ కామెరూన్ అన్నారు. అవతార్2తో పాటే అవతార్ 3 షూటింగ్‌ని కూడా పూర్తి చేశాడు జేమ్స్ కామెరూన్. విజువల్ఎఫెక్ట్స్ పని మాత్రం మిగిలి ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పండోరా గ్రహంలోని ఏడాది ప్రదేశంలో ఈ సినిమా సాగుతుందని హాలీవుడ్ టాక్. అక్కడ ఉండే సంపదను దోచుకోవడానికి మనుషులు ప్రయత్నిస్తే.. వారిని జేక్ సెల్లీ ఫ్యామిలీ ఎలా అడ్డుకుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
అవతార్-2 అరుదైన రికార్డ్.. రెండు వారాల్లోనే ఆ చిత్రాన్ని దాటేసింది..!
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’. డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియాలోనూ ఓ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోందీ చిత్రం. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సముద్రం అడుగున ఓ అద్భుత ప్రపంచాన్ని సృష్టించడం కామెరూన్‌కే సాధ్యమనేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: అవతార్-2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ రేట్స్) తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వన్ బిలియన్ డాలర్ల టికెట్ల అమ్మకాల మార్క్‌ను అవతార్-2 అధిగమించింది. కేవలం 14 రోజుల్లో ఈ మార్క్‌ను దాటేసింది కామెరూన్ విజువల్ వండర్. జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రాన్ని అధిగమించి 2022లో రెండో అత్యధిక గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. 2022లో విడుదలైన మూడు సినిమాలు మాత్రమే వన్ బిలియన్ డాలర్ల మార్కును అధిగమించాయి. అవతార్: ది వే ఆఫ్ వాటర్‌తో పాటు టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్: మావెరిక్ (31 రోజులు), క్రిస్ ప్రాట్ మూవీ జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఈ మార్క్ చేరుకోవడానికి నాలుగు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. 2019లో విడుదలైన తొమ్మిది సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లను అధిగమించాయి. 2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ మూవీ తర్వాత అవతార్- 2 అత్యంత వేగంగా ఈ మార్క్‌ను చేరుకుంది. స్పైడర్ మ్యాన్ చిత్రం కేవలం 12 రోజుల్లోనే అధిగమించి మొదటిస్థానంలో ఉంది. ఇప్పటివరకు కేవలం ఆరు సినిమాలు మాత్రమే మొదటి రెండు వారాల్లో వన్ బిలియన్ చేరుకున్నాయి. (ఇది చదవండి: సెన్సేషన్‌గా అవతార్ 2.. ఇండియాలో ఎంత వచ్చిందంటే?) అవతార్ 2 ఇప్పటివరకు ఉత్తర అమెరికాలో 317.1 మిలియన్ డాలర్లు, విదేశాల్లో 712.7 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 1.025 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. జురాసిక్ వరల్డ్ డొమినియన్ 1.001 బిలియన్ డాలర్లను అధిగమించి రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది అవతార్-2. ప్రస్తుతం అంచనాల ప్రకారం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి మరోసారి పుంజుకోనుంది. అవతార్-2 ప్రధాన థియేట్రికల్ మార్కెట్ అయిన చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలు ఆంక్షల రష్యాలో చిత్రానికి ఆదరణ తగ్గింది. -
సెన్సేషన్‌గా అవతార్ 2.. ఇండియాలో ఎంత వచ్చిందంటే?
హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం అవతార్: ది వే ఆఫ్ వాటర్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. మొదటి వారం కలెక్షన్లతో ఇరగదీసిన ఈ మూవీ రెండోవారం కూడా అదే జోరు కొనసాగించింది. గత వారంలో క్రిస్మస్ సెలవులు ఉండటంతో సినిమాకు బాగా కలిసొచ్చింది. ఈ హాలీడేస్‌ను బాగా క్యాష్ చేస్తున్న అవతార్ 2 ఒక్క ఇండియాలోనే రూ.300 కోట్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు పోటీగా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఏ చిత్రం కూడా లేకపోవడంతో వసూళ్ల సునామీ ఇప్పుడప్పుడే ఆగేట్లు కనిపించడం లేదు. శుక్రవారం నాడు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ సర్కస్ సినిమా రిలీజ్ అయినప్పటికీ దానికి స్పందన అంతంత మాత్రమే! దీంతో హిందీ ఆడియన్స్ కూడా అవతార్ సీక్వెల్‌ను ఎగబడి మరీ చూస్తున్నారు. అవతార్ 2 రిలీజైన రెండో శనివారం కూడా అత్యధికంగా రూ.21(నెట్) కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో రెండో శనివారం అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించిందీ మూవీ. కాగా జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేసిన అవతార్(2009) చిత్రం ఎన్నో అద్భుతాలు సృష్టించింది. విజువల్ వండర్‌గా వరల్డ్ వైడ్ బ్లాక్బాస్టర్గా నిలిచిన ఈ మూవీకి పదమూడేళ్ల తర్వాత సీక్వెల్‌గా వచ్చింది అవతార్: ది వే ఆఫ్ వాటర్. ఈ నెల 16న రిలీజైన ఈ చిత్రంలో సిగర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ఫ్ కర్టిస్, ఈడీ ఫాల్కో, జెమైన్ క్లెమెంట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇండియాలో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజైంది. చదవండి: అవతార్ 2 ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు తగ్గాయ్ రెండు థియేటర్లు అమ్మేశారు.. బాబాయి పోయిన నెలకే నాన్న: కమెడియన్ కూతురు -
అవతార్-2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ రేట్స్
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’. డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియాలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందీ చిత్రం. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి.. వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు ఈ సినిమా టికెట్ రేట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవతార్ మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అవతార్-2 త్రీడీ వెర్షన్ టికెట్ ధరలు భారీగా తగ్గాయి. IMAX, 4DX వెర్షన్లు కాకుండా 3డీ వెర్షన్ టికెట్ ధరను రూ.150కి తగ్గించారు. ప్రేక్షకుల సంఖ్యను మరింత పెంచేందుకు తాజాగా తీసుకున్న టికెట్ తగ్గింపు నిర్ణయం కలెక్షన్లు పెరిగేందుకు బాగా ఉపయోగపడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అవతార్-2 ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి మరి. -
‘అవతార్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేస్తోంది.. ఫ్యాన్స్‌కు పండగే
విజువల్ వండర్ అవతార్-2 ప్రస్తుతం థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది. ఇప్పటివరకు సుమారు 5వేల కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక 3D, 4DX టెక్నాలజీతో అందుబాటులో ఉన్న అవతార్-2 సినిమా టికెట్ రేట్స్ కూడా భారీగానే ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి అభిమానులకు గుడ్‌న్యూస్. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. రిలీజ్ డేట్ నుంచి 234 రోజుల తర్వాతే అవతార్ 2 ఓటీటీలోకి అందుబాటులో రానుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ సినిమాని ఓటీటీ చూడాలనుకునే ప్రేక్షకులు అప్పటిదాకా వేచిచూడాల్సిందే. -
శివకార్తికేయన్ చిత్రానికి అవతార్ టీం?
హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ ది వే ఆఫ్ వాటర్. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మైమరిపిస్తున్నాయి. ఆ చిత్రానికి బలం నేపథ్య సంగీతం, విజువల్ ఎఫెక్ట్సే. అలాంటి చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు కొందరు ఇప్పుడు తమిళ చిత్రం అయలాన్‌కు పనిచేస్తున్నట్లు సమాచారం. నటుడు శివ కార్తికేయన్ ఇంతకుముందు నటించిన డాక్టర్, డాన్ చిత్రాల విజయాలకు తాజాగా నటించిన ప్రిన్స్ చిత్రం బ్రేక్ వేసింది. దీంతో తదుపరి నటిస్తున్న అయలాన్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ఆయనకు జంటగా రకుల్ ప్రీతిసింగ్ నటిస్తుండగా, ఇషా గోపికర్, భానుప్రియ, యోగి బాబు, బాల శరవణన్, కరుణాకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రానికి పనిచేసిన హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కొందరు పనిచేస్తున్నట్లు తెలిసింది. దీంతో అయలాన్ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
మైండ్ బ్లాక్ చేస్తున్న అవతార్ 2 తొలిరోజు కలెక్షన్స్
-
విషాదం.. అవతార్ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి
ప్రపంచ సినీ ప్రియులంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా ‘అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్’. ఈ సినిమా నిన్న (డిసెంబర్ 16) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌ను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెలుగు వారు సైతం ఈ సినిమా చూసేందుకు తెగ ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆంధ్ర ప్రదేశ్‌లో కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్ళాడు. చదవండి: అవతార్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. దీంతో శ్రీను తమ్ముడు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా గతంలో అవతార్ ఫస్ట్‌పార్ట్ సమయంలోనూ ఒకరు ఇలాగే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. తైవాన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి అవతార్ ఫస్ట్ పార్ట్ సినిమా చూస్తూ 2010లో గుండెపోటుతో మరణించాడు. అతడికి హైబీపీ ఉన్నది. అవతార్ సినిమా చూసి తీవ్ర ఉద్రేకానికి గురైన కారణంగా ఆ వ్యక్తి మరణించినట్టు అతడిని పరీక్షించిన వైద్యులు అప్పుడు చెప్పారు. చదవండి: అందుకే నా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచాను: శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు -
‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’ మూవీ రివ్యూ
టైటిల్: అవతార్-ది వే ఆఫ్ వాటర్ నటీనటులు: సామ్ వర్తింగ్టన్, జోయా సాల్డానా, స్టీఫెన్‌లాంగ్, సిగర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్ తదితరులు నిర్మాణ సంస్థలు: లైట్‌స్ట్రోమ్ ఎంటర్టైన్మెంట్, టీఎస్జీ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: జేమ్స్ కామెరూన్, జోన్ లాండౌ దర్శకత్వం: జేమ్స్ కామెరూన్ సంగీతం: సైమన్ ఫ్రాంగ్లెన్ సినిమాటోగ్రఫీ: రస్సెల్ కర్పెంటర్ ఎడిటింగ్ : స్టీఫెన్ ఈ, డెవిడ్ బ్రేన్నర్, జాన్ రెఫౌవా విడుదల తేది: డిసెంబర్ 16, 2022 కథేంటంటే... మానవ సైన్యంతో పోరాడి పండోరా ప్రపంచాన్ని కాపాడిన జేక్ సెల్లీ ( సామ్ వర్తింగ్టన్) .. నావీ తెగకు నాయకుడవుతాడు. భార్య నేత్రి(జోయా సాల్డానా) కలిసి అక్కడే ఉంటాడు. వారికి లోక్, నితాయాం, టూక్ అనే ముగ్గురు పిల్లలు పుడతారు. అలాగే కిరీ అనే అమ్మాయిని, స్పైడర్ అనే అబ్బాయిని దత్తత తీసుకుంటారు. పండోరా ప్రజలను యోగక్షేమాలు చూసుకుంటూ హాయిగా జీవిస్తుంటారు జేక్ సెల్లీ ఫ్యామిలీ. అదే సమయంలో పండోరాని ఆక్రమించేందుకు మనుషులు మరోసారి దండయాత్రకు వస్తారు. జేక్ సెల్లీ ఫ్యామిలీని అంతమొందిస్తే పండోరా గ్రహాన్ని ఆక్రమించుకోవచ్చని.. ఆ దిశగా పోరాటం చేస్తుంటారు. మనుషుల నుంచి తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు జేక్ సెల్లి..మెట్ కానియా ప్రాంతానికి పారిపోతాడు. సముద్రమే ప్రపంచంగా జీవించే మెట్ కానియా తెగ... జేక్ సెల్లీ రాకను అడ్డుకుంటుంది. అయితే అక్కడి రాజు టోనోవరి వీరికి అండగా నిలబడతాడు. మెట్కానియా తెగ మాదిరే.. జేక్ ఫ్యామిలీ కూడా సముద్రంతో అనుబంధం ఏర్పరచుకొని హాయిగా జీవితం గడుపుతుంటారు. ఈ విషయం మనుషులకు తెలుస్తుంది. ఎలాగైన జేక్ సల్లీ కుటుంబాన్ని మట్టుబెట్టాలని కల్నల్ మైల్స్ క్వారిచ్(స్టీఫెన్‌లాంగ్) అతని బృందంతో కలిసి మెట్ కానియా ప్రాంతంపై దండయాత్రకు వస్తాడు. మనుషుల బృందాన్ని జేక్ సెల్లీ ఎలా ఎదుర్కొన్నారు. అతనికి మెట్ కానియా తెగ ఎలా సహాయం చేసింది. పిల్లలను రక్షించుకోవడానికి నేత్రీ, జేక్ సెల్లీ ఎలాంటి పోరాటం చేశారనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘అవతార్’ చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి, సరికొత్త ప్రకృతి అందాలను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. అప్పటి వరకు చూడని వింత జీవులు.. తెలియని ప్రపంచం.. సరికొత్త ప్రేమాయణం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఆ సినిమాలో ఉన్నాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. అందుకే 13 ఏళ్లు తర్వాత వచ్చిన సీక్వెల్‌పై సీనీ ప్రేక్షకులు భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. మరోసారి కొత్త ప్రపంచంలోకి వెళ్లోచ్చని ఆశపడ్డారు. నిజంగానే జేమ్స్ కామెరూన్ మరో ప్రపంచాన్ని చూపించాడు. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. సినిమా ప్రారంభంలో కాసేపు ‘అవతార్’మాదిరే పండోరా గ్రహంలోని అందాలను చూపించిన దర్శకుడు... ఆ తర్వాత కథను సముద్రంవైపు మళ్లించాడు. సముద్రం అడుగున చూపించే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. తిమింగలంతో జేక్స్ తనయుడు చేసే పోరాటం ఆకట్టుకుంది. అలాగే పాయకాన్(భారీ ఆకారం గల చేప)తో లోక్ స్నేహం.. క్లైమాక్స్ అది చేసిన పోరాటం సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. నితాయాం చనిపోయే సన్నివేశం హృదయాలను హత్తుకుంటాయి. విజువల్స్ పరంగా అవతార్ కంటే గొప్పగా ఈ చిత్రం ఉంటుంది. కానీ కథలో మాత్రం కొత్తదనం కొరవడింది. సాధారణ రివేంజ్ డ్రామాగా కథనం సాగుతుంది. జేక్ సెల్లీ ఫ్యామిలీని అంతమొందించేందుకు కల్నల్ మైల్స్ ప్రయత్నించడం..అతని దాడిని జేక్ సెల్లీ తిప్పికొట్టడం..ఇదే ఈ సినిమా కథ. నేత్రి పిల్లలను కల్నల్ బందించడం.. జేక్స్ పోరాటం చేసి తిరిగి తెచ్చుకోవడం.. కథనం మొత్తం ఇలానే సాగుతుంది. ఈ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. కానీ కొత్త జీవులు, విజువల్స్ యాడ్ చేయడం వల్ల అవతార్ 2 కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో నౌకలో వచ్చే కొన్ని సన్నివేశాలు టైటానిక్ సినిమాను గుర్తు చేస్తాయి. విజువల్స్ అండ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ అయితే.. సినిమా నిడివి(192.10 నిమిషాలు), ఊహకందేలా కథనం సాగడం మైనస్. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రంలో హీరో జేక్ సెల్లీగా సామ్ వర్తింగ్టన్ నటించాడు. ఓ తెగ నాయకుడిగా, పిల్లలకు మంచి తండ్రిగా చక్కని నటన కనబరిచాడు. యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవతార్‌కు మించిన యాక్షన్స్ సీన్స్ ఇందులో ఉన్నాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న కల్నల్ మైల్స్ క్వారిచ్ పాత్రలో స్టీఫెన్‌లాంగ్ ఒదిగిపోయాడు. నేత్రిగా జోయా సాల్డానా చక్కని నటనను కనబరిచింది. నౌకలో ఆమె చేసే పోరాట ఘట్టాలు హైలైట్. సిగర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాల్లో వంక పెట్టనక్కర్లేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే..ప్రతీది అద్భుతంగా ఉన్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని తొలగించి సినిమా నిడివిని తగ్గిస్తే.. బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజిశెట్టి, సాక్షి వెబ్ డెస్క్ -
అవతార్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత
సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్-2 నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పంచ వ్యాప్తంగా 52000 స్క్రీన్స్‌లో అవతార్-2 గ్రాండ్‌గా విడుదలైంది.అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత మోగించింది. గతంలో ఏ సినిమాకి లేనంతగా అవతార్-2కి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ క్రమంలో భారత్‌లో కేజీఎఫ్ రికార్డును అవతార్-2 బ్రేక్ చేసేసింది. దీంతో ఓపెనింగ్ కలెక్షన్స్‌పై కూడా భారీగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. భారత్‌లో సుమారు రూ.30-40 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అవతార్-2 మూవీ కోసం 4,41,960 మంది భారత్‌లో అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఏ సినిమాకి కూడా ఇంతమంది అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకోలేదు. కేజీఎఫ్-2కి 4,11,000 మంది, బ్రహ్మస్త్రకి 3,02,000, దృశ్యం-2కి 1,16,000, ఆర్ఆర్ఆర్కి 1,05,000 టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 800 ప్లస్ థియేటర్స్ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. దీన్ని బట్టి ఓవరాల్‌గా తొలి మూడు రోజుల్లోనే భారత్‌లో అవతార్-2 రూ.100కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తుంది. -
‘అవతార్ 2’ మూవీ ట్విటర్ రివ్యూ
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 16) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 13 ఏళ్ల తర్వాత వస్తున్న ‘అవతార్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ప్రపంచ వ్యాప్తంగా సీనీ ప్రముఖుల కోసం స్పెషల్ స్క్రీనింగ్స్ వేశారు. దీంతో అప్పుడే ఈ సినిమాపై సోషల్ మీడియాలో రివ్యూలు వచ్చాయి. బాలీవుడ్ స్టార్స్ అయితే అవతార్ 2పై ప్రశంసల జల్లు కురిపించారు. పలు చోట్ల అవతార్ 2 ఫస్ట్ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ట్విటర్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కథేంటి? ఎలా ఉంది తదితర విషయాలను ట్విటర్ వేదికగా తెలియజేస్తున్నారు. అవేంటో చూసేయండి‘అవతార్ 2 ఓ విజువల్ ట్రీట్. ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతుంది. థియేటర్స్‌లో ఈ సినిమా చూస్తే కలిగే అనుభూతే వేరు’ అని నెటిజన్స్ అంటున్నారు. I’m almost convinced James Cameron shot #AvatarTheWayOfWater on another planet. The film is absolutely stunning and immersive. It’s long but I was completely engaged all the way through. Much like #avatar 13 years ago, this film is a cinematic achievement and a must see event! pic.twitter.com/2WFlJzmbeI — Joseph Deckelmeier (@Joelluminerdi) December 6, 2022 #AvatarTheWayOfTheWater First 90mins has surreal experience with ethereal visuals. 25 mins underwater visuals are magnificent. Waiting for the second half!!!! #AvatarTheWayOfWater #Avatar pic.twitter.com/nwYbN6DEh9 — AZEEZ RAHMAN (@Oliverthala) December 16, 2022 Just saw #AvatarTheWayOfWater. I think the first one is overhated but indulgent. But the story was simple and there were only a few characters. The problem is they were too one-dimensional. — Josh Kroeger (@KailKilbourne) December 16, 2022 In #AvatarTheWayOfWater, #Pandora has been so fully realized, and so meticulously worked out by director @JimCameron - who submerged his actors in real water for the film's many underwater sequences - that it all feels completely lived in. It is pure #JamesCameron movie magic! pic.twitter.com/9fz1zTcke9 — Somesh Sinha (@SinhaSomesh) December 16, 2022 #avatar2 foi o único filme da vida que não me fez dormir no cinema, e olha que a maioria nunca passou de 2hrs, e avatar são 3hrs. ESPETÁCULO!! — Caio Vinícius (@caio7090) December 16, 2022 #AvatarTheWayOfWater was fuckin' SICK and made me cry A LOT. I saw it with my dad. The first movie is one of his favorites, so he's been waiting for this for so long and I'm glad he got to see it and I hope he gets to see the next one too. I'M AN AVATAR STAN AND I DON'T FEEL BAD. — taylor johnston. (@TheSewerGoblin) December 16, 2022 #AvatarTheWayOfWater this is a spectacle. It’s very long, the final battle rules , it’s a lock for the Visual effects Oscar and in IMAX 3D there is a mix between HFR & regular frame rate. Jim Cameron you nut. — RRRyan B+ (@TheChewDefense) December 16, 2022 I really enjoy the tech in this film! definitely interested to see how the future tech is crafted every time! #AvatarTheWayOfWater all the marine tech had me like woah I shouldn't enjoy the evilness 😭 — 𝖙𝖜𝖎𝖙𝖈𝖍 𝖙𝖗𝖎𝖘 🎥 𝕯𝖊𝖈 𝟏𝟗 🎊 (@_StayFancy) December 16, 2022 i’m still reeling from the fact that i FINALLY, after twelve years of waiting, got to see #AvatarTheWayOfWater. it was worth the wait and then some. a genuine “see it in theaters on the biggest/best screen possible” kind of movie. (also, see it in 3D. just saying) — Matt Anderson (@matthew70798) December 16, 2022 #AvatarTheWayofWater Review: Brilliance Written All Over It 👏 The Visuals Are Terrific 💯 The Duration Was Not An Issue For Me ✌️#JamesCameron - Take A Bow🤩 The Long Wait Was Worth It😃#Avatar #Avatar2 #Avatar2review #AvatarTheWayOfWaterreview #AvatarTheWayOfWaterreview pic.twitter.com/PDaGeaRvNk — Kumar Swayam (@KumarSwayam3) December 16, 2022 Saw #AvatarTheWayOfWater on #IMAX tonight. Loved it. It was as good as I wanted it to be. The visuals are truly stunning. I want to see it again already. Big thumbs up 👍🏻 #movie — Josef Blumenfeld (@JosefBlumenfeld) December 16, 2022 AVATAR DAY... ♂️ BEST EXPERIENCE OF ALL TIME WHERE WE GOES TO THE ANOTHER WORLD.. 😇💙#AvatarTheWayOfWater #Avatar | #Avatar2 pic.twitter.com/nrpSMhgsjZ — Karthikeyan AK (@Karthik_AK2) December 16, 2022 All hail James Cameron, King of the Blockbusters! #AvatarTheWayOfWater pic.twitter.com/UJC3DTcyqU — David Hummingbird (@davidshbird) December 16, 2022 After watching #AvatarTheWayOfWater I’d welcome a 9 hour long sequel! Holy shit! https://t.co/cmr8ce3Isq — ❄️Snow Jake❄️ (@Fake_JakeH) December 16, 2022 Film Review: AVATAR: THE WAY OF WATER (2022): James Cameron's Epic Sequel is Awe-Inspiring but Struggles a Bit to Live Up to the Original Movie https://t.co/kHFDD2zIfH #FilmBook #20thCenturyStudios #AmandaSilver #AvatarTheWayofWater #BaileyBass #BrendanCowell #BritainDalt... pic.twitter.com/hyt5ytNyt5 — William Karrington (@FilmBookWilliam) December 16, 2022 #AvatarTheWayOfWater - First half (Indian version), mind blowing! The world of @JimCameron , especially the under water sequences are stunning . The emotional bond between #JakeSully and his family make us root throughout the film . Excellent 👌👌 — Rajasekar (@sekartweets) December 16, 2022 -
‘అవతార్’ కథేంటి? పార్ట్ 2 లో ఏం చూపించారు?
ఎట్టకేలకు అవతార్ సినిమా సీక్వెల్ ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్' థియేటర్స్‌లో వచ్చేసింది. భారత్‌లో నేడు(డిసెంబర్ 16) ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే లక్షలాది మంది ముందుగా టికెట్ బుక్ చేసుకొని పండోరా ప్రపంచానికి చూడడానికి వెళ్లారు. అవతార్ 2009 డిసెంబర్ 18న విడుదలైంది. 13 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్ విడుదలైంది. పార్ట్ 2 చూసే ముందు.. ఒక్కసారి అవతార్ కథేంటో మరోసారి గుర్తు చేసుకుందాం. ఈ చిత్రం కోసం పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించాడు జేమ్స్ కామెరూన్. ఆ గ్రహం మీద ‘నావి’ అనే తెగ జీవిస్తుంటుంది. అక్కడ ఉండే సహజవనరులపై మానవుల కన్ను పడుతుంది. అమెరికా సైన్యం అక్కడకు వెళ్లగా.. నావీ తెగ వారిని ఎదుర్కొంటుంది. దీంతో ఏలియన్‌ను పోలి ఉన్న నావీ తెగ మనుషులను తాము తయారు చేయలనుకుంటారు. నేటివ్స్ డీఎన్ఏతో మానవ డీఎన్ఏను జోడించి,రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే అవతార్లను రెడీ చేస్తారు. అలాంటి అవతార్లలో జేక్ సల్లీ(సామ్ వర్తింగ్టన్) ఒకరు. మనిషిగా ఉన్నప్పుడు జేక్ సల్లీ నడవలేడు. నావికా దళంలో ఉన్నప్పుడు ఆయన ప్రమాదానికి గురై కాళ్లు పోగోట్టుకుంటాడు. అయితే అవతార్‌గా మారిన తర్వాత జేక్ సల్లీ పరుగెత్తగలగుతాడు. పండోరా గ్రహంలో ఉన్న ఓ విలువైన చెట్టు రహస్యాన్ని చెబితే.. కాళ్లు వచ్చేలా చేస్తానని జేక్‌కు ఓ అధికారి ఆఫర్ ఇస్తాడు. దీంతో జేక్ ఆ గ్రహంపైకి వెళ్తాడు. అక్కడ క్రూర మృగాలు దాడి చేయడంతో జేక్ సల్లీతో వచ్చిన మిగిలిన సభ్యులంతా పారిపోతారు. ఆయన ఒక్కడే పండోరాలో ఉండిపోతాడు. ఇక చావడం ఖాయం అనుకున్న సమయంలో నావీ తెగకు చెందిన నేత్రి అతన్ని రక్షిస్తుంది. నావీతెగ పెట్టిన ఓ పరీక్షలో విజయం సాధించి జేక్ వారిలో ఒక సభ్యునిగా చేరిపోతాడు. వారిలో ఒకడిగా ఉండేందుకు శిక్షణ తీసుకునే క్రమంలో జేక్ సల్లీ నేత్రీతో ప్రేమలో పడిపోతాడు. నావీ తెగ మంచితనం చూసి వారికి రక్షణగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఓ రోజు ఆర్డీఏ ఆఫీసర్లు పండోరా గ్రహంపై ఉన్న విలువైన చెట్టును తొలగించేందుకు ప్రయత్నిస్తారు. జేక్ వారిని అడ్డుకుంటారు. తాము తయారు చేసిన అవతార్..తమకే వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆర్డీఏ అధికారులు షాకవుతారు. తమను మోసం చేశాడని అతని శరీరంలోని అవతార్‌ను తొలగించే ప్రయత్నం చేస్తారు. తాను నావీ తెగతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లేలా చేస్తానని జేక్ పండోరా గ్రహం మీదకు వస్తాడు. జరిగిన విషయం చెప్పబోతుండగా..వారు వినిపించుకోరు. ప్రేమ పేరుతో మోసం చేశాడని నేత్రి భావిస్తుంది. ఒకవైపు జేక్ సల్లీ నావి తెగను ఒప్పించే ప్రయత్నం చేస్తుండగానే.. మరోవైపు ఆర్డీఏ అధికారులు పండోరాపై యుద్ధానికి వస్తారు. ఈ క్రమంలో జేక్ సల్లీ నావీ తెగకు అండగా నిలబడతాడు. మానవులతో యుద్దం చేసి వారిని తిగిరి భూమ్మీదకు పంపిస్తాడు. అంతేకాదు తాను శాశ్వతంగా అవతార్గానే ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అవతార్ కథ ముగుస్తుంది. మానవులు, ఏలియన్ ల మధ్య యుద్దంతో పాటు అంతకు మించిన ప్రేమ కథను ‘అవతార్’లో చూపించాడు జేమ్స్ కామెరూన్. అవతార్ 2లో కూడా జేక్ సల్లీ, నేత్రి తమ ప్రపంచమైన పండోరాను కాపాడుకునే పోరాటం చేస్తారని తెలుస్తోంది. . అయితే ఇది నీటి అడుగున జరిగే కథ. పండోరాలోని మరిన్ని వింతలు, అద్భుతాలు, అక్కడి మనుషుల అమోఘమైన సాహసాలతో అవతార్-2 అద్భుతంగా రూపొందించినట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతంది. -
అవతార్ 2 లీక్.. నెట్టింట దుమ్ము దుమారం..
జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం అవతార్ 2. ఈ సినిమా శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండగా చిత్రయూనిట్‌కు భారీ షాక్ తగిలింది. రిలీజ్‌కు ఒకరోజు ముందే ఆన్లైన్లో అవతార్ 2 సినిమా ప్రత్యక్షమైంది. కొందరు ఈ సినిమాను పైరసీ చేసి టెలిగ్రామ్‌లోనూ అప్లోడ్ చేశారు. ఫ్రీగా సినిమా అందుబాటులోకి రావడంతో చాలామంది నెట్టింట ప్రింట్ డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు. దీనిపై సినీప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవతార్ 2 థియేటర్లలో చూసిన సినిమా అని, ఫోన్లో చూస్తే మజా ఏం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. వేలాది కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన సినిమాను ఇలా పైరసీ చేయడం చాలా పెద్ద తప్పని కామెంట్లు చేస్తున్నారు. మరి అవతార్ 2 విడుదలకు ముందే ఆన్లైన్లో అందుబాటులోకి రావడం వల్ల సినిమా కలెక్షన్లపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో చూడాలి! కాగా 13 ఏళ్ల క్రితం ఘన విజయం సాధించిన అవతార్‌కు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఈ సినిమా ఏకంగా 160 భాషల్లో రిలీజ్ కానుంది. ఒక్క భారత్‌లోనే ఆరు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు. పండోరాలోని మరిన్ని వింతలు, అద్భుతాలు, ప్రకృతి అందాలు, సాహసాలతో సినిమా అద్భుతంగా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటివరకు ఇండియా మొత్తం మీద 10 లక్షల టికెట్లు అమ్ముడవగా అందులో ఏడున్నర లక్షల టికెట్లు దక్షిణాదివాళ్లే బుక్ చేసుకోవడం విశేషం. చదవండి: పుట్టింటికి వెళ్లిన ఉపాసన, మిస్ యూ అత్తమ్మ అంటూ పోస్ట్ నేను బతికే ఉన్నా, చనిపోలేదు: సీనియర్ నటి -
‘అవతార్ 2’పై అక్షయ్ కుమార్ రివ్యూ
అవతార్ 2.. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కోట్లాది సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే కొంతమంది సీనీ ప్రముఖుల కోసం ఇప్పటికే స్పెషల్ షో వేసింది చిత్రబృందం. ఈ సినిమా చూసిన బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. Watched #AvatarTheWayOfWater last night and Oh boy!!MAGNIFICENT is the word. Am still spellbound. Want to bow down before your genius craft, @JimCameron. Live on! — Akshay Kumar (@akshaykumar) December 14, 2022 అక్షయ్ కూమార్ కూడా ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘నిన్న రాత్రి అవతార్ 2 సినిమా చూశాను. ఈ చిత్రం గురించి చెప్పడానికి అద్భుతం అనే పదం కూడా సరిపోదేమో. ఇప్పటికీ ఆ సినిమా నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. జేమ్స్ కామెరూన్ ప్రతిభకు తలవంచాలని ఉంది’ అని అక్షయ్ ట్విటర్లో పేర్కొన్నాడు. ‘అవతార్ 2లోని విజువల్స్, ఎమోషన్స్ చూసి ఆశ్చర్యపోయాను. మళ్లీ ఈ చిత్రాన్ని త్రీడీలో చూడాలనుకుంటున్నాను’అని వరుణ్ ధావన్ ట్వీట్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. భారత్‌లో హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ కానుంది. #AvatarTheWayOfWater is by far the most important film for the future of cinema. Was blown away by the visuals and the emotions. It’s amazing when the biggest filmmaker of the world chooses his film to give an important message. I wanna see it again in imax 3d @Disney — VarunDhawan (@Varun_dvn) December 14, 2022 -
వామ్మో.. అవతార్ 2 రన్‌టైమ్ అన్ని గంటలా.. అంతసేపు ప్రేక్షకులు కూర్చుంటారా?
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. 13 ఏళ్ల తర్వాత ‘అవతార్’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ.. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతుందోననే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. అందుకే టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటున్నారు. నెట్టింట అవతార్ 2పై ప్రతి రోజు ఏదో ఒక చర్చ మొదలవుతుంది. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే ‘అవతార్ 2’ రన్ టైమ్ 192 నిమిషాల 10 సెక్లను. అంటే 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు.ఇటీవల కాలంలో అత్యధిక నిడివి గల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం తగ్గిపోయాయి. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలే ఎక్కువగా విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు కూడా నిడివి తక్కువ ఉన్న సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంటెంట్‌లో దమ్ము ఉంటే తప్పా మూడు గంటల పాటు ప్రేక్షకుడు థియేటర్లో కూర్చొలేకపోతున్నాడు. కానీ జేమ్స్ కామెరున్ మాత్రం తన సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకుడు.. మూడు గంటల పాటు కొత్త ప్రపంచంలోకి వెళ్తాడని.. నిడివి తనకు సమస్యే కాదు అంటున్నాడట. 2009లో విడుదలైన అవతార్-1 రన్‌టైమ్ 162 నిమిషాలు. అంటే రెండు గంటల 42 నిమిషాలు. దాన్ని మించి అవతార్ 2 రన్ టైమ్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. -
వామ్మో.. విడుదలకు ముందే అవతార్-2 రికార్డుల మోత!
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రం ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల వరల్డ్ వైడ్ బిజినెస్ సాధించిందని ప్రచారం జరుగుతోంది. ప్రపంచ దేశాలతో పాటు భారతీయ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఇండియాలో ఈ నెలలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కేవలం మూడు రోజుల్లోనే 45 స్క్రీన్లలో 15,000పైగా ప్రీమియం ఫార్మెట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ‘అవతార్-2 ’ విడుదలకు ఇంకా మూడు వారాల సమయం ఉంది. ఇంత ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే కూడా ఇలాంటి స్పందన రావడం సంతోషంగా ఉందని పీవీఆర్ పిక్చర్స్ సీఈఓ కమల్ జియాంచందాని అన్నారు. 'జేమ్స్ కామెరూన్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్ పై ప్రతిసారీ ఏదో ఒక మాయాజాలం సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులు అలాంటి మరో దృశ్యం కోసం ఎదురు చూస్తున్నారు! అడ్వాన్స్ బుకింగ్ లపై భారీ స్పందన వచ్చింది. ఇది కేవలం ప్రీమియం ఫార్మాట్ అమ్మకాల గురించి నేను చెబుతున్న మాట. ఇతర అన్ని ఫార్మాట్ లలో టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ఓపెనవ్వడంతో ఇంకా భారీ సంఖ్యలను ఆశిస్తున్నాము' అని అన్నారు. ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేందర్ సింగ్ జ్యాలా ..‘అవతార్‌కి సీక్వెల్ తరతరాలుగా ప్రజలు చూసే ఒక భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. మా ప్రీమియం ఫార్మాట్ షోలన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇది మాకు అద్భుతమైన వార్త. మేము 3D - 2D ఫార్మాట్ ల బుకింగ్‌లను ప్రారంభించిన తర్వాత బుకింగ్ సంఖ్యలు గణనీయంగా పెరుగుతాయని ఆశిస్తున్నాం’ అన్నారు. సినీపోలిస్ సీఈఓ దేవాంగ్ సంపత్ మాట్లాడుతూ.. ‘అవతార్ 13 సంవత్సరాల క్రితం విడుదలైనప్పుడు ఈ చిత్రానికి భారీ స్పందనను చూసి మేం మంత్రముగ్దులయ్యాం. ఇది అప్పట్లో బ్లాక్ బస్టర్ .. ఇప్పటికీ సినీ ప్రేక్షకుల హృదయాలను శాసిస్తోంది. భారతదేశంలోని ప్రేక్షకులు ఎల్లవేళలా లార్జర్-దన్-లైఫ్ ఎంటర్ టైనర్ లపై గొప్ప ప్రేమను కురిపిస్తూనే ఉంటారు. ఒక్క రోజులోనే మేము భారతదేశం అంతటా టికెట్ల అమ్మకాల్లో పార్ట్ 2కి అద్భుతమైన స్పందనను పొందాం. ప్రపంచంలోనే అత్యుత్తమ 3డి టెక్నాలజీ అయిన సినెపోలిస్ రియల్ డి 3డిలో సినిమాను చూడండి’అని అన్నారు. -
‘అవతార్-2’లో ఏం ఉంది? సినిమా ఎలా ఉండబోతుంది?
‘అవతార్’ చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి, సరికొత్త ప్రకృతి అందాలను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆ చిత్రాన్ని ప్రపంచ సినీ అభిమానులు మర్చిపోలేరు. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్స్ రెడీ అయింది. డిసెంబర్ 16న అవతార్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్' ఎలా ఉండబోతుందో ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చాడు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. మొదటి భాగంలోలాగే ఈ చిత్రంలో కూడా జేక్ సల్లీ, నేత్రిలు ‘పండోరా’ప్రపంచాన్ని కాపాడుకోవడానికి మనుషులతో పోరాటం చేస్తారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఇది నీటి అడుగున జరిగే కథ. మొదటి సినిమా లాగే, ఈ చిత్రంలో కూడా జేక్ సల్లీ, నేత్రి తమ ప్రపంచమైన పండోరాను కాపాడుకునే పోరాటం చేస్తారని తెలుస్తోంది. మొదటి భాగం చివరల్లో నేత్రి గర్భవతి అని హింట్ ఇచ్చాడు. ఈ చిత్రం ట్రైలర్లో గర్భవతిగా నేత్రిని చూపించారు. జేక్, ఆయన భార్య నేత్రి, పిల్లలు ...వీరంతా కలిసి పండోరా ప్రపంచానికి కాపాడుకోవడానికి సాహసాలు చేస్తారు. అవతార్ పార్ట్-1లో పండోరా గ్రహం మీద పనిచేసిన రిసోర్స్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్(ఆర్డీఏ).. సెకండ్ పార్ట్‌లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సారి కొత్త రకమైన రోబోటిక్ మిషిన్స్‌తో ఆర్డీఏ నావి తెగ మీద అధికారాన్ని చెలాయించాలని చూస్తుంది. ట్రైలర్‌ని గమనిస్తే..ఒక షాట్లో నావీ తెగకు చెందినవారిని ఆర్డీఏ బంధించినట్లు, వారి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తుంది. వీరిని ఎదిరించడానికి హీరో జేక్ సల్లీ.. మెట్ కానియా తెగ సహాయం తీసుకుంటాడు. మరి మెట్ కానియా తెగ ఎలాంటి సాయం అందించిందో సినిమాలోనే చూడాలి. అలాగే అవతార్-2లో ఒక టీనేజ్ రొమాంటిక్ లవ్‌స్టోరీని కూడా చూపించబోతున్నారు. ట్రైలర్లో జేక్ సెల్లి కొడుకు మరో తెగకు చెందిన అమ్మాయితో మాట్లాడుతూ.. ‘ఎవరూ నన్ను అర్ధం చేసుకోవట్లేదు’ అంటే.. ‘నేను అర్థం చేసుకుంటాను’అని ఆ అమ్మాయి చెబుతుంది. అంటే వీరిద్ద మధ్య ఓ లవ్‌స్టోరిని నడిపించబోతున్నట్లు అర్థమవుతుంది. పండోరాలోని మరిన్ని వింతలు, అద్భుతాలు, అక్కడి మనుషుల అమోఘమైన సాహసాలతో అవతార్-2 అద్భుతంగా రూపొందించినట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతంది. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో డిసెంబర్ 16 తర్వాత తెలుస్తుంది. -
కనీవినీ ఎరుగని రీతిలో 'అవతార్ 2' బిజినెస్
-
Avatar 2 Trailer: అవతార్ 2 ట్రైలర్ వచ్చేసింది
విజువల్ వండర్ అవతార్ మూవీ గురించి తెలియని సినీ ప్రేమికుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులను ఎంతగానో అబ్బురపరిచిన ఈ చిత్రం సునామీలాంటి కలెక్షన్లతో ప్రపంచ బాక్సాఫీస్‌ను గడగడలాడించేసింది. 2009లో అవతార్ సినిమా రాగా పదమూడేళ్ల తర్వాత దీని సీక్వెల్ వస్తోంది. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ పేరుతో సీక్వెల్ తెరకెక్కించగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. 3డీ వర్షన్లో ఉన్న ట్రైలర్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 160 దేశాల్లో డిసెంబర్ 16న ఈ సినిమా విడుదల కాబోతోంది. చదవండి: అవతార్ 2 తెలుగు ట్రైలర్‌కు అన్ని కోట్లా? -
వామ్మో! ‘అవతార్ 2’ తెలుగు రైట్స్‌కు అన్ని కోట్లా?
2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన హాలీవుడ్ చిత్రం ‘అవతార్’. ఈ సినిమాతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచలోనికి తీసుకేళ్లాడు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. భారత ప్రేక్షకులను సైతం ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమాకు సీక్వెల్‌గా రానున్న సంగతి తెలిసిందే. అవతార్ 2(ది వే ఆఫ్ వాటర్) పేరుతో సీక్వెల్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చదవండి: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు, గాయకుడు మృతి దాదాపు 160 దేశాల్లో ఈ ఏడాది డిసెంబర్ 16న అవతార్ 2 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో హై ఎండ్ టెక్కాలజీతో నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే బిజినెస్ విషయంలో వివిధ దేశాల్లో రికార్డు సృష్టిస్తోందని సమాచారం. ఇండియాలో సైతం అవతార్ 2 భారీగానే బిజినెస్ చేసేలా ఉందని సినీ విశ్లేషకుల అంచనా. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాకు విపరీతమైన హైప్ నెలకొంది. చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు అందుకే అవతార్ థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తిగా ఉన్నారట. దీంతో తెలుగులో ఈ మూవీ దాదాపు రూ.100 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు వినికిడి. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ సినిమాను కొనే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి విడుదలకు ముందే ఇన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి. -
అవతార్ 2: నేవీ నాయకి లుక్ వచ్చేసింది!
అవతార్.. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఎంతగానో అలరించిందీ చిత్రం. దీంతో ఈ విజువల్ వండర్‌కు సీక్వెల్‌గా రాబోతోంది అవతార్: ది వే ఆఫ్ వాటర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న ఏకంగా 160 భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాలో నేవీ అధికారి రొనాల్గా నటించిన కేట్ విన్స్లెట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. భయమెరుగని నిజాయితీ గల నాయకిగా ఆమెను కీర్తించారు. అందుకు తగ్గట్టుగానే ఆమె లుక్ కూడా అదిరిపోయింది. ప్రముఖ ఎంపైర్ మ్యాగజైన్‌పై ఆమె ఫస్ట్ లుక్ ప్రచురితమైంది. ఇకపోతే విన్స్లెట్.. తన పాత్ర కోసం నీళ్లలో ఉన్నప్పుడు ఎక్కువ సేపు శ్వాస నిలుపుకోవడాన్ని ప్రాక్టీస్ చేసిందట. 20th సెంచరీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో విన్స్లెట్తో పాటు సామ్ వార్తింగ్టన్, జియో సాల్డనా, సిగర్నీ వేవర్ సహా పలువురు నటిస్తున్న విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by 20th Century Studios (@20thcenturystudios) చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ జూలై 1న ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు..