bad loans
-
మొండి రుణాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి
కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేసిన జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరిన్ని మొండి రుణాల కొనుగోలుకి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు సుమారు 300 కంపెనీల నుంచి రూ. 3 లక్షల కోట్ల రుణాల జాబితా సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాడ్ బ్యాంక్‌గా పిలిచే ఎన్ఏఆర్సీఎల్ గతేడాది(2022–23) రూ. 50,000 కోట్ల మొండి రుణాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యం విధించుకున్నప్పటికీ రూ. 10,378 కోట్ల రుణాలను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. వివరాలు చూద్దాం.. ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో బ్యాడ్ బ్యాంక్ తొలుత పెట్టుకున్న భారీ లక్ష్య సాధనలో విఫలమైనప్పటికీ ఈ ఏడాది మరింత వేగంగా ముందుకు సాగాలని భావిస్తోంది. కొన్ని ప్రాథమిక అవాంతారాలు లక్ష్య సాధనలో అడ్డు తగిలినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది మరింత పటిష్టంగా రుణ కొనుగోలు చేపట్టాలని చూస్తోంది. నిజానికి 300 కంపెనీల నుంచి మొత్తం రూ. 3 లక్షల కోట్ల మొండి రుణాలు నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ముందుగా విక్రయించాల్సిన మొండి ఖాతాలను గుర్తించమంటూ ఈ నెల మొదట్లో ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకులు ఎన్ఏఆర్సీఎల్కు పలు మొండి ఖాతాలను ఆఫర్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వీటి ప్రకారం విక్రయానికి సిద్ధమైన జాబితా నుంచి 20–25 శాతం ఖాతాలను బ్యాడ్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. జాబితా పెద్దదే.. ఈ ఏడాది విక్రయానికి సిద్ధంకానున్న మొండి ఖాతాల జాబితాలో వీడియోకాన్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, జీటీఎల్, వీసా స్టీల్, క్వాలిటీ, గాయత్రి ప్రాజెక్ట్స్, ఎరా ఇన్ఫ్రా, రీడ్ అండ్ టేలర్ ఇండియా, కోస్టల్ ఎనర్జెన్ తదితరాలున్నాయి. కాగా.. ఇటీవల విదర్భ ఇండస్ట్రీస్(రూ. 1,150 కోట్లు), రోల్టా(రూ. 600 కోట్లు), వీవోవీఎల్(రూ. 1,100 కోట్లు) ఖాతాలను ప్రభుత్వ బ్యాంకులు బ్యాడ్ బ్యాంకుకు ఆఫర్ చేశాయి. ఈ బాటలో ధరణి షుగర్స్ ఖాతా(రూ. 619 కోట్లు)ను దాదాపు రూ. 223 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా రెయిన్బో పేపర్స్ రూ. 1,136 కోట్ల రుణాలకుగాను ఎన్ఏఆర్సీఎల్ రూ. 87 కోట్ల యాంకర్ ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఇలా.. 2022–23లో జేపీ ఇన్ఫ్రాటెక్, ఎస్ఎస్ఏ ఇంటర్నేషనల్, హీలియోస్ ఫొటో వోల్టాయిక్కు చెందిన మొత్తం రూ. 10,378 కోట్ల రుణాలను ఎన్ఏఆర్సీఎల్ చేజిక్కించుకుంది. ఇందుకు నగదు, సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 3,636 కోట్లు ఆఫర్ చేసింది. కాగా.. కొన్ని రుణాల విషయంలో ఎన్ఏఆర్సీఎల్ ఆఫర్లను రుణదాతలు తిరస్కరిస్తున్నాయి. మరికొన్ని కేసుల్లో మరింత మెరుగైన ఆఫర్లు లభిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వివరించాయి. జీటీఎల్‌కు బ్యాడ్ బ్యాంకు ప్రతిపాదిత రూ. 360 కోట్ల ఆఫర్ అంచనాలను చేరకపోవడంతో తిరస్కరణకు గురైంది. రుణదాతలు రూ. 550 కోట్లు ఆశించడం గమనార్హం! ఇక మెక్నల్లీ భారత్ విషయంలో నాల్వా స్టీల్ రూ. 424 కోట్లకుపైగా ఆఫర్ చేసింది. ఇదేవిధంగా మిట్టల్ కార్ప్‌నకు ఎన్ఏఆర్సీఎల్ రూ. 228 కోట్లు ఆఫర్ చేయగా.. రూ. 405 కోట్ల బిడ్‌తో ఖాతాను ఫీనిక్స్ ఏఆర్సీ గెలుచుకుంది. కాగా.. బ్యాడ్ బ్యాంక్ మొండి రుణాల కొనుగో లుని 15–85 నిష్పత్తిలో ఆఫర్ చేస్తుంది. అంటే 15 శాతం ముందస్తు చెల్లింపు, మిగిలిన 85% బకాయిల నుంచి రికవరీ ద్వారా చెల్లిస్తుంది. -
ఏయూ స్మాల్ బ్యాంక్ లాభం రూ.393 కోట్లు
ముంబై: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 30 శాతం పెరిగి రూ.393 కోట్లుగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మెరుగుపడ డం, మొండి బకాయిలకు (ఎన్పీఏలు) కేటాయింపులు తగ్గడం లాభాల వృద్ధికి కలిసొచ్చింది. మొ త్తం ఆదాయం 36 శాతం పెరిగి రూ.2,413 కోట్లు గా నమోదైంది. ప్రధానంగా నికర వడ్డీ ఆదాయం 41 శాతం జంప్ చేసి రూ.1,153 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 6.3 శాతంగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మెరుగు మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 1.81 శాతంగా (రూ.1,019 కోట్లు) ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.60 శాతం (రూ.1,058 కోట్లుగా) ఉండడం గమనార్హం. నికర ఎన్పీఏలు 1.29 శాతం (రూ.520 కోట్లు) నుంచి 0.51 శాతానికి (రూ.285 కోట్లు) పరిమితమయ్యాయి. డిసెంబర్ త్రైమాసికంలో రూ.176 కోట్ల కేటాయింపులు చేసింది. రుణ వ్యాపారంలో బలహీన వృద్ధిని చూపించింది. పరిశ్రమ వ్యాప్తంగా రుణాల మంజూరు జోరుగా ఉంటే, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిసెంబర్ త్రైమాసికంలో 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం రుణాలు రూ.56,335 కోట్లుగా, డిపాజిట్లు 5 శాతం పెరిగి రూ.61,101 కోట్ల చొప్పున ఉన్నాయి. కాసా రేషియో 38 శాతానికి చేరింది. నిధులపై వ్యయాలు 6 శాతంగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో 90 శాతం రిటైల్ విభాగంలో ఉంటే, 93 శాతం రుణాలు సెక్యూర్డ్‌గా బ్యాంక్ తెలిపింది. -
ప్రభుత్వరంగ బ్యాంక్‌ల లాభాల పంట
న్యూఢిల్లీ: వసూలు కాని మొండి బకాయిల ఫలితంగా భారీ నష్టాల్లోకి కూరుకుపోయిన ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) ఇక కోలుకుంటాయా?.. ఐదేళ్ల క్రితం ఎదురైన ప్రశ్న ఇది. కానీ, ఈ అనుమానాలన్నింటినీ తొలగిస్తూ ఐదేళ్లలోనే భారీ లాభాలను నమోదు చేసే స్థితికి తమ బ్యాలన్స్ షీట్లను పీఎస్‌బీలు పటిష్టం చేసుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021–22) రూ.66,539 కోట్ల లాభాలను సొంతం చేసుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.లక్ష కోట్ల లాభాల మార్క్‌ను చేరుకుంటాయని అంచనా. బ్యాలన్స్ షీట్లలో నిరర్థక రుణాలు (వసూలు కానివి/ఎన్పీఏలు) భారీగా పెరిగిపోవడంతో ఒక దశలో 11 పీఎస్‌బీలను ఆర్బీఐ తన దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి తీసుకొచ్చి ఆంక్షలు విధించింది. బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకున్న తర్వాత వాటిపై ఆంక్షలను ఆర్బీఐ తొలగించడం గమనార్హం. మరోవైపు పీఎస్‌బీల బ్యాలన్స్ షీట్ల పటిష్టతకు కేంద్ర సర్కారు సైతం పెద్ద ఎత్తున నిధులను బడ్జెట్లో భాగంగా కేటాయిస్తూ వచ్చింది. లేదంటే బ్యాంకులు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చి ఉండేది. ఇంకోవైపు దివాలా పరిష్కార ప్రక్రియల రూపంలోనూ మొండి బకాయిలను బ్యాంక్‌లు కొంత వరకు వసూలు చేసుకోగలిగాయి. ఐదేళ్లలో భారీ నష్టాలు పీఎస్‌బీలు 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019–20 వరకు రూ.2,07,329 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. ఇందులో అత్యధిక నష్టాలు 2017–18లో రూ.85,370 కోట్లుగా ఉన్నాయి. 2015–16లో రూ.17,993 కోట్ల నష్టాలు రాగా, 2016–17లో రూ.11,389 కోట్లు, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్ల చొప్పున నష్టాలు వచ్చాయి. సంస్కరణల ఫలితం ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న సంస్కరణలు మేలు చేశాయని చెప్పుకోవచ్చు. ప్రధాని మోదీ, నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేపట్టిన వ్యూహాత్మక విధానంలో భాగంగా.. 2016–17 నుంచి 2020–21 మధ్య పీఎస్బీలకు రూ.3,10,997 కోట్ల నిధులను (రీక్యాపిటలైజేషన్‌లో భాగంగా) కేంద్ర సర్కారు సమకూర్చింది. ఈ రీక్యాపిటలైజేషన్ కార్యక్రమం అండతో పీఎస్‌బీలు కూలిపోయే ప్రమాదం నుంచి బలంగా లేచి నిలబడ్డాయి. రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో నిధులు అందించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటుపై ప్రభావం పడకుండా జాగ్రత్తపడింది. వేటికవి చిన్న బ్యాంక్‌లుగా కార్యకలాపాల నిర్వహణతో ఉండే రిస్క్‌ను అర్థం చేసుకుని, దాన్ని అధిగమించేందుకు, బలమైన బ్యాంకుల రూపకల్పనకు వీలుగా పీఎస్‌బీల మధ్యపెద్ద ఎత్తున వీలీనాలను కూడా కేంద్రం చేపట్టింది. 2017 నాటికి 27 పీఎస్‌బీలు ఉండగా.. వాటి సంఖ్యను 12కు కుదించింది. చిన్న వాటిని పెద్ద బ్యాంకుల్లో కలిపేసింది. ఇతర చర్యలు మరోవైపు 3.38 లక్షల షెల్ కంపెనీల బ్యాంక్ ఖాతాలను (నిధులు మళ్లించేందుకు వినియోగిస్తున్నవి) కేంద్రం స్తంభింపజేయడం కూడా కీలకమైన నిర్ణయంగా చెప్పుకోవాలి. దీనివల్ల బ్యాంక్‌ల నుంచి రుణాల రూపంలో నిధులను కాజేసే చర్యలకు బ్రేక్ పడింది. 2018–19లో రికార్డు స్థాయి నిరర్థక రుణ వసూళ్లు కావడంతో పీఎస్‌బీల స్థూల రుణాల్లో క్రెడిట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ నిష్పత్తి 80.3 శాతం నుంచి 63.9 శాతానికి దిగొచ్చింది. గాడిన పడకపోతే ప్రైవేటీకరించేందుకు సైతం వెనుకాడేది లేదన్న సంకేతాన్ని కూడా కేంద్రం పంపించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్ఐసీకి విక్రయించడం ద్వారా సెమీ ప్రైవేటీకరణ చేసింది. బ్యాంకులను భారీగా ముంచిన భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ఎఫ్ఎస్, నీరవద్ మోదీ తదితర కేసుల్లో బ్యాంక్‌లు కఠిన చర్యలకు దిగాయి. మోసపూరిత రుణ వ్యవహారాలతో సంక్షోభంలో పడిన యస్ బ్యాంక్‌ను సైతం ఆర్బీఐతో సమన్వయం చేసుకుని కేంద్రం గట్టెక్కించింది. టర్న్ అరౌండ్ ఈ చర్యల ఫలితాలు ఒక్కోటి తోడయ్యి పీఎస్‌బీలు గాడిన పడి, తిరిగి బలంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి పటిష్టమయ్యాయి. దీని ఫలితమే గతేడాది రూ.5,66,539 కోట్ల లాభాలు రావడం అని చెప్పుకోవాలి. అంతకుముందు వరకు కేంద్రం నుంచి నిధుల సహకారాన్ని అర్థించే స్థితిలో ఉన్నవి కాస్తా, మార్కెట్ నుంచి స్వయంగా నిధులు సమీకరించుకునే స్థాయికి బలపడ్డాయి. ప్రైవేటు బ్యాంక్‌లతో పోటీ పడే స్థితికి వచ్చాయి. అంతేకాదు గత ఆర్థిక సంవత్సరానికి చాలా పీఎస్‌బీలు వాటాదారులకు డివిడెండ్లను సైతం పంపిణీ చేశాయి. ఎస్బీఐ సహా తొమ్మిది పీఎస్‌బీలు ప్రకటించిన డివిడెండ్ రూ.7,867 కోట్లుగా ఉంది. పీఎస్‌బీలు బలమైన పునాదులపై పనిచేస్తున్నాయని, నికర లాభాల్లో అనూహ్యమైన వృద్ధిని చూస్తాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ ఏస్ రాజీవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పీఎస్‌బీల ఉమ్మడి లాభాలు ప్రసత్తు ఆర్థిక సంవత్సరంలో ఎంత లేదన్నా రూ.80,000–1,00,000 కోట్ల మధ్య ఉండొచ్చన్నారు. రుణ ఎగవేతలను కట్టడి చేశామని, ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడుతున్నట్టు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎండీ స్వరూప్‌కుమార్ మెహతా సైతం చెప్పారు. -
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ప్రబుద్ధుల్లో ఈయనే నెంబర్ వన్!
పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో బ్యాంకు రుణాల ఎగవేతదారులపై చర్చి జరిగింది. సభలోని ఓ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మార్చి 31,2022 నాటికి మనదేశంలో సుమారు 50 మంది బ్యాంకులకు రూ.92,570 కోట్లు బాకీ పడినట్లు తెలిపారు. వారిలో వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ కంపెనీ నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తం రూ.7,848 కోట్లని వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సేకరించిన రిపోర్ట్ ఆధారంగా కరాద్ బ్యాంకు రుణాలు ఎవరు? ఎంతంత? రుణ ఎగవేతకు పాల్పడ్డారో స్పష్టం చేశారు.రుణ ఎగవేత దారుల్లో ఛోక్సీ తర్వాత ఎరా ఇన్ఫ్రా (రూ.5879 కోట్లు),రేగో ఆగ్రో (రూ.4803), కాస్ట్ స్టీల్ అండ్ పవర్ (రూ.4,596 కోట్లు), ఎబిజి షిప్‌యార్డ్ (రూ.3,708 కోట్లు), ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ (రూ.2,893కోట్లు),విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ (రూ.2,931కోట్లు), రోటోమాక్ గ్లోబల్ (రూ.2,893 కోట్లు), కోస్టల్ ప్రాజెక్ట్ రూ.2,311కోట్లు, జూమ్ డెవలపర్లు (రూ.2,147 కోట్లు) జాబితాలో ఉన్నట్లు తెలిపారు. తగ్గిన ఎన్పీఏలు ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు లేదా నాన్ ఫర్మామెన్స్ అసెట్స్ (NPA)రూ.8.9లక్షల కోట్లుకు చేరాయి. అయితే మొండి బకాయిల్ని తగ్గించేందుకు కేంద్రం కృషి చేయడంతో అవికాస్త రూ.3లక్షల కోట్లు తగ్గాయి. రైట్ - ఆఫ్‌లో ఎస్బీఐ అగ్రస్థానం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మొండి బకాయిల్ని రైట్ ఆఫ్ చేయడంలో రూ.2లక్షల కోట్లతో ముందంజలో ఉంది. ఆ తర్వాత రూ.67,214 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ఉన్నాయి.ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.50,514 కోట్లు,హెచ్డీఎఫ్సీ రూ.34,517కోట్లు ఉన్నాయని కరాద్ పార్లమెంట్లో రుణాల ఎగవేతపై మాట్లాడారు. ఈ సందర్భంగా రుణ ఎగవేత దారులపై చర్యలు తీసుకునేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మెహుల్ చోక్సీపై మూడు కొత్త ఎఫ్ఐఆర్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న మెహుల్ చోక్సీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గత వారం మూడు కొత్త ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని మూడు సభ్య బ్యాంకుల కన్సార్టియంకు చోక్సీ మరియు ఇతరులు ₹ 375.71 కోట్ల తప్పుడు నష్టం కలిగించారని ఈ తాజా ఎఫ్ఐఆర్లో మూడవది ఆరోపించింది . వీల్ చైర్లో కోర్టుకు కాగా,పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి గతేడాది కరేబియన్ దేశం డొమినికా న్యాయస్థానం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. అంటిగ్వా నుంచి తమ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన చోక్సికి బెయిల్ ఇవ్వలేమని పిటిషన్‌ను కొట్టివేసింది. చోక్సీ(62) వీల్ చైర్లో కోర్టుకు హాజరయ్యారు. చోక్సీ అక్రమంగా డొమినికాకు రాలేదని, ఆయనని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని అందుకే బెయిల్ ఇవ్వాలంటూ చోక్సీ తరఫు లాయర్ వాదించారు. చివరిగా ::::: రైట్ - ఆఫ్ అంటే ఏమిటి? ప్రతి ఏడాది ఆర్ధిక సంవత్సరం(మార్చి ముగిసే) నాటికి అన్నీ బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లను బహిరంగంగా ప్రకటిస్తాయి. అంటే బ్యాంకుకు ఎంత లాభం వచ్చింది. నష్టం ఎంత వచ్చింది. మొండి బకాయిలు ఎంత ఉన్నాయని చెబుతాయి. అయితే ఆ సమయంలో బ్యాలెన్స్ షీట్లో మొండి బకాయిలు కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు సురేష్ అనే వ్యక్తి ఎక్స్ అనే బ్యాంకు నుంచి రూ.10వేల కోట్లు రుణం తీసుకున్నాడు. ఆ రుణాన్ని చెల్లించకుండా ఎగవేతకు (మొండి బకాయిలు) పాల్పడ్డాడు. అప్పుడు ఆ ఎక్స్ బ్యాంక్ యాజమాన్యం తనకు వచ్చిన లాభాల్ని మొడి బకాయిల స్థానంలో చూపిస్తారు. అంటే సురేష్ ఎగొట్టిన రూ.10వేల కోట్లు మనకు కనిపించవు. దీన్నే రైట్ - ఆఫ్ అని పిలుస్తారు. మొండి బకాయిలు అంటే ఏమిటి? బ్యాంకులు అనేక విధాలుగా లోన్లు ఇస్తూ ఉంటాయి.పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని అవి ఎగొట్టి కొందరు, బకాయిలు తీర్చే స్థోమత లేక కొందరు.ఇలా చాలామంది బ్యాంకులకు మోత మోగిస్తున్నారు.వీటినే మొండి బకాయిలు,నిరర్థక ఆస్తులు అంటారు.ఆర్ధిక పరిభాషలో వీటిని ఏన్పీఏ(non-performing assets)అని పిలుస్తారు. -
ఆరేళ్లలో బ్యాంకింగ్ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా?
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు గడచిన ఆరేళ్లలో రూ. 11.17 లక్షల కోట్ల మొండి బకాయిలను (ఎన్పీఏ) మాఫీ చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ ఒక లిఖిత పూర్వక సమాధానంలో పార్లమెంటుకు తెలియజేశారు. నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తి ప్రొవిజనింగ్ (మొండిబకాయిలకు కేటాయింపులు) జరిగిన ఖాతాలుసహా సహా నిరర్థక ఆస్తులను (ఎన్పీఏలు) సంబంధిత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ నుండి రైట్–ఆఫ్ ద్వారా తొలగించడం జరుగుతుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. బ్యాలెన్స్ షీట్‌ను పటిష్టం చేయడం, పన్ను ప్రయోజనాలను పొందడం, మూలధనాన్ని పటిష్టం చేసుకోవడం వంటి తన సాధారణ కసరత్తులో భాగంగా బ్యాంకులు ఎన్పీఏలను రద్దు చేస్తాయి. ఆర్బీఐ మార్గదర్శకాలు, బోర్డులు ఆమోదించిన విధానాలకు అనుగుణంగా బ్యాంకులు ఈ రైట్–ఆఫ్ నిర్వహిస్తాయని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి మంత్రి తెలిపిన సమాచారం వివరాల్లోకి వెళితే.. ► ఆర్బీఐ గణాంకాల ప్రకారం, గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ. 8,16,421 కోట్ల రుణ మాఫీ చేశాయి. మొత్తం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (ఎస్సీబీలు) విషయంలో ఈ విలువ రూ. 11,17,883 కోట్లుగా ఉంది. ► గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మొత్తం 6,59,596 కోట్ల రూపాయల రికవరీ జరిపాయి. ఇందులో రైటాఫ్ లోన్ ఖాతాల నుండి జరిగిన రికవరీల విలువ 1,32,036 కోట్లు. ► ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 1 కోటి కంటే ఎక్కువ ఎగవేసిన రైటాఫ్‌లు/డిఫాల్టర్ల పేర్లతో సహా ఈ జాబితాకు సంబంధించి, రుణ గ్రహీతల వారీగా రైట్ ఆఫ్ లోన్ ఖాతాల సమాచారాన్ని నిర్వహించడం లేదని ఆర్బీఐ తెలియజేసింది. ► ఆర్బీఐ తెలిపిన సమాచారం ప్రకారం, జూన్ 30, 2017 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 25 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 8,045. 2022 జూన్ 30వ తేదీ నాటికి ఈ సంఖ్య 12,439కు చేరింది. ఇదే కాలంలో ప్రైవేట్ రంగ బ్యాంకులకు సంబంధించి ఈ సంఖ్య 1,616 నుంచి 2,447కు ఎగసింది. ► 2017 జూన్ 30వ తేదీ నాటికి ఉద్దేశపూర్వక ఎగవేతలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 8,744 దావాలు దాఖలయ్యాయి. 2022 జూన్ 30వ తేదీ నాటికి ఈ సంఖ్య 14,485గా ఉంది. ఇందుకు సంబంధించి సూట్ ఫైల్ కాని వారి సంఖ్యలు వరుసగా 917, 401గా ఉన్నాయి. ► రూ. 25 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన దావా ఫైల్ చేసిన ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (సీఐసీ) వెబ్సైట్లలో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది. సూట్ ఫైల్కాని ఉద్దేశపూర్వక డిఫాల్టర్ల జాబితా గోప్యంగా ఉంటుంది. పబ్లిక్ డొమైన్లో ఉండదు . ► అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం 2017 మే 1వ తేదీ నుండి ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన కేసులతో సహా మొత్తం 515 మోసం కేసులు నమోదయ్యాయి. 2022 డిసెంబరు 15 నాటికి, ఈ కేసుల్లో దాదాపు రూ. 44,992 కోట్ల ఆస్తుల జప్తు జరిగిందని, డైరెక్టరేట్ ద్వారా 39 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలయ్యాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలియజేసింది. ► 2017 మే నుండి 2022 డిసెంబర్ 15 నాటికి పీఎంఎల్ఏ 2002 కింద విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రూ. 19,312.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వీటిలో రూ. 15,113 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు అప్పగించడం జరిగింది. ► గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల్లో ప్రభుత్వం చేసిన మొత్తం రీక్యాపిటలైజేషన్ (మూలధన కేటాయింపుల) పరిమాణం మొత్తం రూ.2,90,600 కోట్లు. ప్రైవేట్ రంగ బ్యాంకుగా వర్గీకరణ జరిగిన (2019 జనవరి 21న) ఐడీబీఐ బ్యాంక్‌కు రీక్యాపిటలైజేషన్ విలువ రూ. 4,557 కోట్లు. భారీ లాభాలు మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) కట్టడికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. చదవండి: ఘరానా మోసం : రైల్వే ఉద్యోగం..8 గంటల డ్యూటీ, వచ్చే పోయే రైళ్లను లెక్కించడమే పని! -
ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల మొండిబకాయిల మాఫీ
న్యూఢిల్లీ: దేశంలో గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 10,09,511 కోట్ల మొండి బకాయిలను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మాఫీ(రైటాఫ్) చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రైటాఫ్ అనేది రుణ గ్రహీతలకు ఎలాంటి లబ్ధి చేకూర్చదని నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. వారి నుంచి రుణాలను వసూలు చేసే ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను (రైటాఫ్ లోన్లు) తిరిగి చెల్లించాల్సిందేనని వివరించారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.6,59,596 కోట్ల రుణాలను తిరిగి వసూలు చేశాయని, ఇందులో రూ.1,32,036 కోట్ల మేర రైటాఫ్ లోన్లు ఉన్నాయని తెలియజేశారు. ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు -
ఎస్బీఐ మొండి బకాయిలు అన్ని కోట్లా? షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అందించిన రుణాల్లో 1,71,953 కోట్ల రూపాయలకు పైగా మొండి బకాయిలు ఉన్నాయని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేయని మొండి బకాయిలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, పారిశ్రామికవేత్తలు రుణాలను తీసుకొని తిరిగి చెల్లించని అప్పులు ఎన్ని ఉన్నాయనే సమాచారాన్ని భారత రిజర్వ్ బ్యాంకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుని తెలుసుకున్న రాజేంద్ర పల్నాటి ఆ వివరాలను బయట పెట్టారు. వీటితో పాటుగా పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపారాల కోసం నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)లో భాగంగా అప్పుగా ఇచ్చిన లోన్లు 1,06,804 కోట్ల రూపాయలు ఇంకా తిరిగి రాలేదని భారతీయ స్టేట్ బ్యాంక్ పీఐఓ ములుకుంట్ల శ్రీనివాస్ రావు తెలిపారు. -
జేసీ ఫ్లవర్స్‌కు యస్ బ్యాంక్ మొండి రుణాలు.. విలువ రూ. 48,000 కోట్లు
న్యూఢిల్లీ: ఒత్తిడిలో పడిన మొండి రుణాలను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు యస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఎంపిక చేసిన మొత్తం రూ. 48,000 కోట్ల రుణాలను యూఎస్‌కు చెందిన ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి విక్రయించనున్నట్లు పేర్కొంది. ఈ రుణాల పోర్ట్‌ఫోలియోకు జేసీ ఫ్లవర్స్ ఏకైక బిడ్డర్‌గా నిలిచినట్లు తెలియజేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పారదర్శక బిడ్డింగ్ విధానాలను అవలంబిస్తూ స్విస్ చాలెంజ్ పద్ధతిలో బిడ్లకు ఆహ్వానం పలికినట్లు బ్యాంక్ వెల్లడించింది. ప్రాథమిక(బేస్) బిడ్డింగ్‌కు జులైలోనే జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీ మాత్రమే రేసులో నిలిచినట్లు పేర్కొంది. ఇతర బిడ్స్ దాఖలుకాకపోగా.. స్విస్ చాలెంజ్ ప్రాసెస్‌ను ముగించినట్లు తెలియజేసింది. వెరసి ఈ విధానం ప్రకారం గెలుపొందిన జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. కాగా.. ఒప్పందం ప్రకారం జేసీ ఫ్లవర్స్ ఏఆర్‌సీలో 19.99 శాతం వాటా కొనుగోలుకి బ్యాంక్ తగిన పెట్టుబడులకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకునే సన్నాహాలు ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. చదవండి: పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్ జెట్.. 3 నెలల పాటు -
మరింత తగ్గనున్న మొండిబాకీల భారం
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండిబాకీల భారం 2024 మార్చి నాటికి 5–5.5 శాతానికి దిగి వచ్చే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం 2022 మార్చి నాటికి స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.9 శాతానికి తగ్గింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో నెలకొన్న ఒత్తిడి క్రమంగా తగ్గి, మొండి బాకీల రికవరీలు కూడా పెరగనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. అలాగే 2023 ఆర్థిక సంవత్సరంలో రుణ వ్యయాలు 1.5 శాతం స్థాయిలో స్థిరపడగలవని, అటుపైన 1.3 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. ఇతర వర్ధమాన మార్కెట్లు, భారత్ 15 ఏళ్ల సగటు స్థాయికి రుణ వ్యయాలు సర్దుబాటు కావొచ్చని తెలిపింది. వడ్డీ రేట్ల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణంతో చిన్న, మధ్య తరహా సంస్థలు, అల్పాదాయ కుటుంబాలపై పరిమిత స్థాయిలో ప్రతికూల ప్రభావం పడొచ్చని ఎస్అండ్పీ వివరించింది. మెరుగ్గా వృద్ధి అంచనాలు .. మధ్యకాలికంగా చూస్తే భారత్ ఆర్థిక వృద్ధి అవకాశాలు పటిష్టంగానే ఉండగలవని ఎస్అండ్పీ పేర్కొంది. 2024–26 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి వార్షికంగా 6.5–7 శాతం స్థాయిలో నమోదు కావచ్చని వివరించింది. జనాభా, చౌకగా కార్మిక శక్తి లభ్యత తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. అంతే గాకుండా ఆర్థిక వ్యవస్థకు కేంద్రం బాసటగా నిలుస్తుందని, అలాగే రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ యోచన ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మద్దతును కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఎస్అండ్పీ వివరించింది. రాబోయే రోజుల్లో జీడీపీకి అనుగుణంగా రుణ వృద్ధి ఉండగలదని, కార్పొరేట్ రంగంతో పోలిస్తే రిటైల్ రంగాలకు రుణాల్లో వృద్ధి అధికంగా ఉండే ధోరణులు కొనసాగవచ్చని పేర్కొంది. రుణ వ్యయాలు తగ్గడం, రుణ వృద్ధి మెరుగుపడుతుండటం వంటి అంశాలు బ్యాంకుల ఆదాయాలకు దన్నుగా నిలవొచ్చని ఎస్అండ్పీ వివరించింది. -
బకాయిలు..బాబోయ్!! హౌసింగ్ రుణాల్లో ‘మొండి బకాయిల’ భారం!
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల పోర్ట్‌ఫోలియో నాణ్యత మెరుగుపడినప్పటికీ, వాటి స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏ)లు గత ఏడాది నవంబర్, డిసెంబర్‌ల్లో 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగినట్లు క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది. బ్యాంకుల రుణ నిబంధనావళి పరిధిలోకి హౌసింగ్ ఫైనాన్షియర్లను తీసుకు వస్తుండడం దీనికి నేపథ్యమని నివేదిక విశ్లేషించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గత ఏడాది నవంబర్ 12 వతేదీన రుణదాతలు అందరికీ వర్తించేలా కఠినమైన రుణ నాణ్యత రిపోర్టింగ్ నిబంధనలను ప్రవేశపెట్టింది. తద్వారా హౌసింగ్ ఫైనాన్షియర్లు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) వాణిజ్య బ్యాంకుల నిబంధనావళి పరిధిలోకి తీసుకువచ్చింది. కొత్త నిబంధనలను 2021 డిసెంబర్ 31నాటికి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఈ గడువును 2022 సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తూ ఆర్బీఐ 2022 ఫిబ్రవరి 15వ తేదీన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో క్రిసిల్ ఆవిష్కరించిన నివేదికలోకి కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► మొండి బకాయిల్లో 2021–22 ప్రస్తుత (మార్చి) త్రైమాసికం ముగిసే నాటికి ఒక స్థిరీకరణ చోటుచేసుకునే అవకాశం ఉంది. ► 2021 నవంబర్ తర్వాత కేవలం నెలరోజుల్లో (2021 డిసెంబర్ 31 నాటికి) చౌక గృహ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించి స్థూల మొండిబకాయిలు 140 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఇతర ఫైనాన్షియల్ కంపెనీల విషయంలో ఏకంగా ఈ పెరుగుదల 3.3 శాతంగా ఉంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఆయా కంపెనీల అకౌంట్ల సవరణలు దీనికి కారణ. ఇలాంటి పరిస్థితి లేకపోతే ఎన్పీఏలు డిసెంబర్ నాటికి కేవలం 2.6 శాతం పెరిగేది. దీని ప్రకారం, కొత్త నిబంధనల నేపథ్యం వల్ల ఎన్పీఏలు 70 బేసిస్ పాయింట్లు పెరిగాయన్నమాట. అయితే 2022 మార్చి ముగిసే నాటికి 3 శాతానికి ఎన్పీఏలను పరిమితమయ్యే అవకాశం ఉంది. ► మరో రకంగా చెప్పాలంటే, కొత్త నిబంధనలు లేకపోతే రుణ నాణ్యత 40 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశం కూడా ఉంది. ►హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బీఎఫ్సీలను వాణిజ్య బ్యాంకుల పరిధిలోనికి తీసుకురావడానికి సంబంధించి గడువును ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ పొడిగించినప్పటికీ, ఈ ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకంటే, ఇప్పటికే పలు హౌసింగ్ ఫైనాన్స్, ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని, అమలు చేస్తున్నాయి. ► రుణాల విషయంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ విధానాలను మార్చుకుంటున్నాయి. అనవసర వ్యయాల కట్టడి, వసూళ్ల విషయంలో మరింత వ్యవస్థాపరమైన పటిష్టత వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ► కాగా, ఎన్బీఎఫ్సీలకన్నా హెచ్ఎఫ్సీల రుణ నాణ్యత కొంత మెరుగ్గా వుండే అవకాశాలు ఉన్నాయి. ► రుణాల విషయంలో 95 శాతం ఉన్న 35 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను క్రిసిల్ తన నివేదిక కోసం అధ్యయనం చేసింది. -
పీఎన్బీ మొండిబాకీ లెక్కల్లో వ్యత్యాసాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) దాదాపు రూ. 2,617 కోట్ల మేర మొండిబాకీలు తక్కువగా చూపినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆడిట్లో వెల్లడైంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ లెక్కల ప్రకారం పీఎన్బీ స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) రూ. 81,089.70 కోట్లుగా ఉన్నాయి. కానీ పీఎన్బీ రూ. 78,472 కోట్లు మాత్రమే ఎన్పీఏలుగా చూపించింది. దీంతో ఆర్బీఐ, పీఎన్బీ లెక్కల మధ్య రూ. 2,617 కోట్ల వ్యత్యాసం (డైవర్జెన్స్) వచ్చింది. ఇక నికర ఎన్పీఏలు రూ. 30,038 కోట్లుగా ఉన్నట్లు పీఎన్బీ చూపగా, ఆర్బీఐ ఆడిట్ ప్రకారం రూ. 32,655 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర ఎన్పీఏలకు సంబంధించి కూడా డైవర్జెన్స్ రూ. 2,617 కోట్లుగా ఉన్నట్లు పీఎన్బీ వెల్లడించింది. మరోవైపు మొండిబాకీలకు కేటాయింపుల విషయంలో కూడా రూ. 2,091 కోట్ల మేర వ్యత్యాసం నమోదైంది. రూ. 50,242 కోట్ల మేర ప్రొవిజనింగ్ చేయాల్సి ఉండగా.. రూ. 48,151 కోట్లు మాత్రమే పీఎన్బీ కేటాయించింది. 2018–19 ఆర్థిక ఫలితాల్లో పీఎన్బీ రూ. 9,975 కోట్ల నష్టాన్ని ప్రకటించగా.. ఆర్బీఐ లెక్కించిన విధంగా ప్రొవిజనింగ్ చేసి ఉంటే నష్టాలు రూ. 11,336 కోట్లుగా ఉండేవి. దాదాపు రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ స్కామ్ నుంచి బైటపడేందుకు నానా తంటాలు పడుతున్న పీఎన్బీకి ఇతరత్రా మొండిబాకీలు భారంగా మారుతున్నాయి. -
ఆర్బీఐ పరిష్కార గడువు నేటితో ముగింపు
ముంబై: భారీ మొండి బకాయి ఖాతాల (ఎన్పీఏలు) విషయంలో ఆర్బీఐ విధించిన ఆరు నెలల గడువు సోమవారంతో ముగిసిపోనుంది. సుమారు 70 ఖాతాలకు సంబంధించి రూ.3.8 లక్షల కోట్ల రుణాలకు బ్యాంకులు పరిష్కార ప్రణాళిక సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే వాటిని ఎన్సీఎల్టీ పరిష్కారానికి నివేదించక తప్పనిసరి పరిస్థితిని బ్యాంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులు చివరి క్షణంలో వీటికి సంబంధించి పరిష్కారం కోసం తమ చర్యల్ని వేగవంతం చేశాయి. ఈ ఖాతాల్లో ఎక్కువగా విద్యుత్ కంపెనీలవి కాగా, ఈపీసీ, టెలికం కంపెనీలవీ ఉండటం గమనార్హం. అయితే, ఎన్సీఎల్టీకి నివేదించే విషయంలో బ్యాంకులు సుముఖంగా లేవు. ఎందుకంటే ఇప్పటికే ఎన్సీఎల్టీకి సిఫారసు చేసిన ఖాతాల విషయంలో బ్యాంకులు ఎక్కువ హేర్‌కట్ (ఒక రుణంపై నష్టం) ఎదుర్కోవాల్సి వచ్చింది. అలోక్ ఇండస్ట్రీస్ ఎన్పీఏ ఖాతాలో ఈ హేర్‌కట్ 86 శాతంగా ఉండటం గమనార్హం. అంటే బ్యాంకులు తామిచ్చిన రుణంలో 86 శాతాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి. రుణ గ్రహీతలు చెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించి, నాటి నుంచి 180 రోజుల్లోపు (ఆరు నెలలు) పరిష్కారాన్ని కనుగొనాలన్నది ఆర్బీఐ ఆదేశాల సారం. ఈ ఆదేశాలు ఈ ఏడాది మార్చి 1 నుంచి అమల్లోకి రాగా, నాటికి ఎన్పీఏలుగా ఉన్న ఖాతాలకు గడువు ఆగస్ట్ 27తో తీరిపోనుంది. సోమవారం నాటికి పరిష్కారం లభించకపోతే ఎన్సీఎల్టీ ముందు నమోదుచేసి, దివాలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. చివరి క్షణంలోపు అవకాశం ఉన్నంత మేరకు పరిష్కారానికి బ్యాంకులు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలహాబాద్ హైకోర్టులో విచారణ పెండింగ్ రూ.3.8 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో మూడో వంతు విద్యుత్ కంపెనీలవి కాగా, ఇవి ఇప్పటికే ఆర్బీఐ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. కాగా, కొన్ని బ్యాంకులు పరిష్కార ప్రణాళికను రూపొందించగా, మరికొన్ని ఇదే పనిలో ఉన్నట్టు ఓ ప్రభుత్వరంగ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. చాలా వరకు బ్యాంకులు పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపేందుకు లేదా డిఫాల్టింగ్ కంపెనీలకు రుణ సదుపాయం ఇచ్చేందుకు గాను సోమవారం బోర్డు సమావేశాలు ఏర్పాటు చేశాయని చెప్పారు. అయితే, రూ.3.5 లక్షల కోట్లు విలువైన సుమారు 60 ఎన్పీఏ ఖాతాలను ఎన్సీఎల్టీకి నివేదించే అవకాశం ఉందన్న సమాచారం వినిపిస్తోంది. -
బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి కుదేలు
సాక్షి, ముంబై: బ్యాంకు ఆఫ్ ఇండియా క్యూ4 ఫలితాల్లో మరోసారి చతికిలబడింది. విశ్లేషకులు అంచనాలను దరిదాపుల్లోకి కూడా రాలేక భారీ నష్టాలను చవి చూసింది. గత ఏడాది నష్టాలకు కొనసాగింపుగా మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.3969 కోట్ల భారీ నికర నష్టాలను నమోదు చేసింది. గత ఏడాది1045కోట్ల రూపాయల నష్టాలను సాధించింది. కాగా 1187కోట్ల రూపాయల నష్టాలను రిపోర్ట్ చేసే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేశారు. బ్యాడ్ లోన్ల బెడద బ్యాంక్ ఆఫ్ ఇండియాను భారీగా దెబ్బ తీసింది. స్థూల ఎన్పీఏలు మార్చి చివరి నాటికి 16.58 శాతంగా నమోదయ్యాయి, అంతకు ముందు త్రైమాసికంలో 16.93శాతంగా ఉండగా , ఏడాది క్రితం ఇది 13.22శాతంగా ఉన్నాయి. బ్యాడ్ లోన్ల కేటాయింపులు 41 శాతం పెరిగి రూ .6,674 కోట్లకు చేరుకున్నాయి. -
మరో ఫేక్ న్యూస్ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ వార్తల ప్రచారం పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు నకిలీ వార్తలు రాసిన జర్నలిస్టుల పీఐబీ గుర్తింపు కార్డులను తక్షణం రద్దు చేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి స్మృతి ఇరానీ సర్కులర్ జారీ చేయడం, దాన్ని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేయడం తదితర పరిణామాలు తెల్సినవే. పీఐబీ గుర్తింపు కార్డులు కలిగిన జర్నలిస్టులు నకిలీ వార్తలు రాయరని, సోషల్ మీడియా ఊపందుకున్న నేపథ్యంలో ఆకాశ రామన్నలు, అజ్ఞాతవ్యక్తులే అలాంటి వార్తలు రాస్తారని కాబోలు స్మృతి ఇరానీ సర్కులర్ విషయంలో నరేంద్ర మోదీ తక్షణం స్పందించారు. ఇప్పుడు మరో నకిలీ వార్త సంచలనం సృష్టించింది. యూపీఏ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ బ్యాంకుల నుంచి కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని ఎగ్గొట్టడంతో పేరుకు పోయిన 9 లక్షల కోట్ల బ్యాంకుల నిరర్థక ఆస్తుల్లో నాలుగు లక్షల నిరర్థక ఆస్తులు లేదా రుణాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) 2016’ వసూలు చేసిందన్నది ఆ నకిలీ వార్త. ఈ వార్తను ముందుగా పాలకపక్ష భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 14వ తేదీన పోస్ట్ చేయగా, ప్రధాన మంత్రి వెబ్సైట్ కూడా ఈ వార్తను మీడియా విభాగంలో ప్రముఖంగా పేర్కొంది. ఆ తర్వాత ప్రధాన మంత్రి ‘నమో’ యాప్ విస్తతంగా షేర్ చేసింది. బీజేపీతోపాటు ఎన్డీయే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ ఈ వార్తను షేర్ చేస్తున్నారు. ఈ వార్త నకిలీదని తెలుసుకోగానే బీజేపీ పార్టీ, ప్రధాని వెబ్సైట్ దాన్ని తొలగించాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ బ్యాంకుల్లో పేరుకుపోయిన 9 లక్షల కోట్ల నిరర్థక ఆస్తుల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయడమంటే మాటలు కాదు. అది ఏ ప్రభుత్వం చేసినా దాన్ని ఆ ప్రభుత్వం ఘనతగానే పరిగణించవచ్చు. సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఈ నకిలీ వార్త ముందుగా ఎక్కడ పుట్టిందో తెలుసుకునేందుకు ‘ఆల్టర్ న్యూస్’ వెబ్సైట్ నెట్లో తూర్పార పట్టగా, ఎకనామిక్ టైమ్స్ పత్రికలో ఏప్రిల్ నాలుగవ తేదీతో ‘4 లాక్ క్రోర్ రూపీస్ ఎన్పీఏఎస్ రిటర్న్ డ్యూ టూ ఇన్సాల్వెన్సీ సిస్టమ్: అఫీషియల్’ అనే శీర్షికతో ఓ వార్త ఉంది. ప్రభుత్వ బ్యాంకుల్లో పేరుకుపోయిన 9 లక్షల కోట్ల నిరర్థక లేదా చెడ్డ రుణాల్లో సగానికి కొంచెం తక్కువగా, 4 లక్షల కోట్ల రూపాయలు ‘ఐబీసీ–2016’ కింద వసూలయ్యాయన్నది ఆ వార్త. ఆ వార్త కూడా ఓ అధికారి చెప్పినట్లు ఉంది. ఆ వార్తను ఎకనామిక్ టైమ్స్ పత్రిక ‘ఐఏఎన్ఎస్’ అనే వార్తా సంస్థ నుంచి తీసుకొంది. ‘ఇండస్ట్రీ ఛాంబర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ పరిశ్రమలు దివాలా సమస్యను ఎలా అధిగమించాలనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటీ శ్రీనివాస్ మాట్లాడుతూ నాలుగు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారట. ఆ తర్వాత ఈ వార్తకు మరింత మసాలా అద్ది నకిలీ వార్తలను ప్రచారం చేయడంలో ప్రసిద్ధి చెందిన వెబ్సైట్ ‘పోస్ట్‌కార్డ్ న్యూస్’ ప్రచురింది. ‘మాసివ్ క్రాక్‌డౌన్ బై మోదీ గవర్నమెంట్ ఆన్ ఎన్పీఎస్’ శీర్షికన ప్రచురించింది. ‘కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 9 లక్షల కోట్ల మొండి రుణాల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలను అంటే, 44.44 శాతం రుణాలను ఇటీవల ప్రవేశపెట్టిన ఐబీసీ విధానం ద్వారా మోదీ వసూలు చేశారు’ అని అందులో ఉంది. పోస్ట్‌కార్డ్ న్యూస్‌ను ఎక్కువగా నమ్ముకునే బీజేపీ, దాని అనుబంధ సంఘాలు ఈ వార్తను పిక్ చేశాయి. షేర్ చేశాయి. నకిలీ వార్తల కేసులో పోస్ట్‌కార్డ్ న్యూస్ ఎడిటర్ మహేశ్ విక్రమ్ హెగ్డేను మార్చి 30వ తేదీన బెంగుళూరులో పోలీసులు అరెస్ట్ చేయడం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం 9.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఎక్కువగా పెరిగినది 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాకే. ఏదైమైనా నాలుగు లక్షల కోట్ల రూపాయల చెడ్డ రుణాలు వసూలయ్యాయంటే సాధారణ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్బీఐ ప్రకటించిన డేటాను సేకరించేందుకు ప్రయత్నించగా, రాజ్యసభలో మార్చి నెలలోనే ఆర్థిక సహాయ మంత్రి శివ ప్రసాద్ శుక్లా ఆర్బీఐ డేటాను వెల్లడించిన విషయం వెలుగుచూసింది. రిటెన్ ఆఫ్ చేసిన 2. 73 లక్షల కోట్ల రూపాయల చెడ్డ రుణాల్లో 29, 343 కోట్ల రూపాయలు వసూలయ్యాయని మంత్రి తెలిపారు. బ్యాంక్ రుణాల రైటాఫ్‌కు, రుణాల వేవర్‌కు తేడా ఉంది. ఈ రెండింటి మధ్య తేడా లేకుండా సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. రైటాఫ్ చేసిన రుణాలను వసూలు చేసేందుకు వివిధ రకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తూనే ఉంటారు. రైటాఫ్ చేసిన రుణాలను వసూలు చేసేందుకే మోదీ ప్రభుత్వం ‘ఐబీసీ–2016’ విధానాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ నిరర్థక ఆస్తుల్లో వసూలు ఎప్పటిలాగే 10.77 శాతం మాత్రమే ఉందని శుక్లా వివరించారు. తుది వివరణ కోసం ‘ఆల్టర్ న్యూస్’ రిపోర్టర్, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి శ్రీనివాస్‌ను ప్రశ్నించగా, తన వార్తను మీడియా తప్పుగా అర్థం చేసుకొందని చెప్పారు. ‘బ్యాంకుల మొత్తం నిరర్థక ఆస్తుల్లో 50 శాతం ఆస్తులను ఐబీసీ పరిధిలోకి తెచ్చాం. 3.30 లక్షల కోట్ట రూపాయలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు అప్పగించాం, ట్రిబ్యునల్‌కు నివేదించడానికి ముందే 83,000 కోట్ల రూపాయలు సెటిల్ అయ్యాయి. వాటిని కలుపుకుంటే నాలుగు లక్షలు దాటుతుంది’ అని మాత్రమే తాను చెప్పానన్నారు. వసూలైన 83వేల కోట్ల రూపాయలను వసూలుకాని రుణాలకు ఎందుకు కలుపుకోవాలో ఆయనకే తెలియాలి. ఈ అసలు వార్త అలా, అలా నకిలీ వార్తగా మారిపోయింది. ఎకనామిక్ టైమ్స్లాగానే శ్రీనివాస్ వార్తను ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఫస్ట్‌పోస్ట్ పత్రికలు ప్రచురించినప్పటికీ వసూలైన మొత్తం కచ్చితంగా అంత ఉండదని సందేహం వ్యక్తం చేశాయి. -
రూ 81,683 కోట్లకు చెల్లుచీటీ
సాక్షి, న్యూఢిల్లీ : బడాబాబుల ఎగవేతలకు బ్యాంకులు ఆమోదముద్ర వేశాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏకంగా రూ 81,683 కోట్ల రాని బాకీలను రద్దు చేశాయి. వీటిలో అత్యధికంగా ఎస్బీఐ రూ 20,339 కోట్లను రానిబాకీలుగా తేల్చేసి చేతులు దులుపుకుంది. ఈ గణాంకాలు ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరగకముందువి కావడం గమనార్హం. 2012-13లో పీఎస్‌యూ బ్యాంకులు రద్దు చేసిన మొత్తం రూ 27,231 కోట్లుగా నమోదైంది. గడిచిన అయిదేళ్లలో దాదాపు మూడు రెట్లు అధికంగా మొండి బాకీలను ప్రభుత్వ రంగ బ్యాంకులు తాజాగా రద్దుల పద్దుల చేర్చాయి. ఎస్బీఐతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2016-17లో రూ 9205 కోట్లను, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ 7346 కోట్లు, కెనరా బ్యాంక్ రూ 5,545 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ 4348 కోట్ల మేర రాని బాకీలను రద్దు చేశాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో బ్యాంకులు రద్దు చేసిన రుణాల మొత్తం రూ 53,625 కోట్లకు పెరిగింది. ఆర్బీఐ అంచనాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ 15 శాతానికి పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. బ్యాంకులు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో పీఎస్‌యూ బ్యాంకులకు రానున్న రెండేళ్లలో రూ 2.11 లక్షల కోట్ల మూలధనం సమీకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. -
మొండి బాకీలను అమ్మేందుకు ఆన్లైన్ వేదిక
సాక్షి, ముంబయి : రూ లక్షల కోట్ల మొండి బాకీలతో సతమతమవుతున్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అమెరికా తరహాలో ఆన్లైన్ ట్రేడింగ్ వేదికను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ సూచించింది. ఆన్లైన్లో మొండి బాకీలను విక్రయించే వ్యవస్థ ఏర్పాటుకు పూనుకోవాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వైరల్ ఆచార్య పేర్కొన్నారు. అమెరికా, దక్షిణ కొరియాలో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తినప్పుడు ఇలాంటి వ్యవస్థ ఏర్పాటై ఆ తర్వాత రుణ విక్రయాల్లో పరిశ్రమ ప్రమాణాలతో పనిచేస్తోందని గుర్తుచేశారు. ఇక 2017, సెప్టెంబర్ నాటికి బ్యాంకుల రాని బాకీలు మొత్తం రూ 10 లక్షల కోట్లకు చేరిన విషయం తెలిసిందే. మొండి బాకీలు పేరుకుపోతున్న క్రమంలో గత జూన్ నుంచి ఆర్బీఐ 40 అతిపెద్ద మొండి బకాయిదారులను గుర్తించి వారిని డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌కు నివేదించాలని బ్యాంకులకు సూచించింది. పది లక్షల కోట్ల మొండి బాకీల్లో ఈ 40 ఖాతాలే రూ 4 లక్షల కోట్ల వరకూ ఉన్నాయి. మొండి బకాయిల జాబితాలో ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, భూషణ్ పవర్, అమ్టెక్ ఆటో, వీడియోకాన్ ఇండస్ర్టీస్, జేపీ ఇన్ఫ్రా వంటి కంపెనీలున్నాయి. ఇక బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి 10.8 శాతానికి, సెప్టెంబర్‌లో 11 శాతానికి పెరుగుతాయని ఆర్బీఐ ఇటీవల వెల్లడించిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో హెచ్చరించింది. -
ఎస్బీఐకి మొండిబకాయిల సెగ
ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాభాల్లో పడిపోయింది. మొండిబకాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో, 2017-18 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకు లాభాలు 20.45 శాతం క్షీణించాయి. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో బ్యాంకు లాభాలు రూ.2,005.5 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు లాభాలు రూ.2,520.96 కోట్లగా ఉన్నాయి. బ్లూమ్‌బర్గ్ అంచనాల ప్రకారం బ్యాంకు రూ.2,955.90 కోట్ల లాభాలను ఆర్జిస్తుందని భావించారు. కానీ బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు గత క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్‌కు బాగా పెరిగాయి. గత క్వార్టర్లో 6.9 శాతమున్న స్థూల ఎన్పీఏలు ఈ క్వార్టర్లో 9.97 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు కూడా జూన్ క్వార్టర్లో 5.97 శాతానికి ఎగిశాయి. గత క్వార్టర్లో ఇవి కూడా 3.71 శాతంగానే ఉన్నాయి. అంతేకాక ప్రొవిజన్లు, కంటింజెన్సీస్ 53.1 శాతం పెరిగి రూ.21,054.74 కోట్లగా ఉన్నాయి. రుణాలు ఇవ్వడం ద్వారా బ్యాంకు ఆర్జించిన కోర్ ఆదాయం లేదా నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ)లు 22 శాతం పెరిగి రూ.17,606.01 కోట్లగా రికార్డయ్యాయి. ఇవి గతేడాది రూ.14,437.31 కోట్లుగానే ఉన్నాయి. ఇతర ఆదాయాలు 11.03 శాతం ఎగిసి రూ.8,005.66 కోట్లగా బ్యాంకు ప్రకటించింది. ఫలితాల ప్రకటనలో బ్యాంకు లాభాలు 20 శాతం మేర పడిపోవడం, మొండిబకాయిలు ఎగియడంతో బ్యాంకు షేరు 5.02 శాతం క్షీణించి రూ.281.80గా నమోదవుతోంది. -
మొండి కొండ @ 7.7 లక్షల కోట్లు
♦ 2016–17లో 35 శాతం పైకి ♦ ప్రైవేటు బ్యాంకుల్లోనూ పెరిగిపోతున్న ఎన్పీఏలు ♦ 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు ♦ యాక్సిస్, యస్ బ్యాంకుల ఖాతాల్లో తేడాలు ♦ ఐవోబీ, ఐడీబీఐ బ్యాంకుల్లోనూ తార స్థాయికి ♦ సరైన స్థాయిలోలేని నిధుల కేటాయింపులు న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులు 2016–17 ఆర్థిక సంవత్సరంలోనూ మొండి బకాయిల సమస్య నుంచి బయటపడలేకపోయాయి. సరికదా గత కాలపు రుణాల సమస్యలు వాటిని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. బడా కార్పొరేట్ సంస్థల నుంచి ఛోటా మోటా కంపెనీల వరకు, ఔదార్యంతో భారీగా రుణాలను మంజూరు చేసేసిన బ్యాంకులు... ఇప్పుడు వాటిని వసూలు చేసుకోలేక, రద్దు చేసి అందుకు సరిపడా నిధులు కేటాయించలేక (ప్రొవిజన్స్) ‘మింగలేక కక్కలేక’ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకూ మొండి బకాయిలు (వసూలు కాకుండా మొండిగా మారినవి/ఎన్పీఏలు) ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)కే ఎక్కువ శాతం పరిమితం అనుకుంటుంటే... ఇన్నాళ్లు వాటిని కప్పి పెట్టిన ప్రైవేటు రంగ బ్యాంకుల దాపరికాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఎన్పీఏలను వాస్తవ గణాంకాల కంటే తక్కువగా చూపిస్తున్నట్టు ఇటీవలి యెస్ బ్యాంకు ఉదంతం తెలియజేస్తోంది. మొత్తానికి దేశీయ స్టాక్ మార్కెట్లో నమోదిత బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.7.7 లక్షల కోట్లకు చేరి సవాల్‌గా మారాయి. ఏడాదిలోనే భారీగా పెరుగుదల మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఇప్పటి వరకు దాదాపు అన్ని బ్యాంకులు ప్రకటించాయి. సిటీ యూనియన్ బ్యాంకు వెల్లడించాల్సి ఉంది. ఇటీవలే ఐదు బ్యాంకులను తనలో కలిపేసుకున్న ఎస్బీఐ సైతం కన్సాలిడేటెడ్ ఫలితాలను వెల్లడించింది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన అన్ని బ్యాంకుల ఖాతా పుస్తకాల ప్రకారం స్థూల ఎన్పీఏలు రూ.7.7 లక్షల కోట్లకు చేరినట్టు స్పష్టమవుతోంది. 2016 మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరంలో స్థూల ఎన్పీఏలు రూ.5.70 లక్షల కోట్లు. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొండి రుణాలు 35 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. నికర ఎన్పీఏలు 58 శాతం పెరిగిపోవడం గమనార్హం. కానీ, బ్యాంకులు మొండి బాకీల కోసం చేస్తున్న కేటాయింపులు అరకొరగానే ఉన్నట్టు అర్థమవుతోంది. ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఖాతాల ప్రక్షాళన కార్యక్రమాన్ని 2015–16 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల నుంచే మొదలు పెట్టగా... ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం ఈ ప్రక్రియను గత ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించాయి. దీంతో వాటి ఖాతాల్లోని మకిలి బయటకొస్తోంది. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు ఏకంగా 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు చేరడం దీన్నే సూచిస్తోంది. మరి అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (ఎస్బీఐలో కలిసిన బ్యాంకులను మినహాయించి చూస్తే) ఎన్పీఏల పెరుగుదల చాలా తక్కువగా 20 శాతంగానే ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో ఒక విధంగా తమ ఖాతాల ప్రక్షాళనను భారీగానే నిర్వహించాయి. ఆర్బీఐ సమీక్షతో వెలుగులోకి పీఎస్బీల్లో మొండి బకాయిల ప్రక్షాళన కార్యక్రమం 2015–16 ద్వితీయార్ధం నుంచి ఆరంభమైంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించిన (ఏక్యూఆర్) ఆర్బీఐ... వసూలు కాకుండా ఒత్తిడిలో ఉన్న రుణాలను ఎన్‌పీలుగా ప్రకటించి వాటికి నిధులు కేటాయించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ఫలితం 2015 డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆర్థిక ఫలితాల్లో కనిపించడం ఆరంభమైంది. ఆర్బీఐ ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు 2015 సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ఉన్న స్థూల ఎన్పీఏలను విశ్లేషించి చూస్తే ఆ తర్వాతి కాలంలో పీఎస్‌బీల కంటే ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు అనూహ్యంగా పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు బ్యాంకుల్లో స్థూల ఎన్పీఏల పెరుగుదల 300% మించి ఉంది. ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు ఈ రెండు బ్యాంకులు ఎన్పీఏలను తక్కువ చేసి చూపించినట్టు స్పష్టమవుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీల విషయమై ఆర్బీఐ నిర్ధారణకు, తమ అంచనాలకు మధ్య తేడా ఉన్నట్టు ఈ రెండు బ్యాంకులు ఇటీవలే ప్రకటించాయి కూడా. ఈ తేడా రూ.9,478 కోట్లు అని యాక్సిస్ బ్యాంకు వెల్లడించగా... యాక్సిస్ ఖాతాల పరంగా వెలుగు చూడని ఎన్పీఏలు రూ.4,177 కోట్లు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో యునైటెడ్ బ్యాంక్, ఐడీబీఐ ఎన్పీఏలు భారీగా పెరిగాయి. పరిమితి దాటితే ఆంక్షలు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు ప్రైవేటు రంగ బ్యాంకుల కంటే అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఐఓబీ, ఐడీబీఐ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ఎన్పీఏల శాతం గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా సత్వర దిద్దుబాటు చర్యల్ని చేపట్టాల్సి ఉంటుంది. అంటే నియమకాలు నిలుపుచేయడం, శాఖల విస్తరణకు బ్రేక్‌వేయడం వం టివి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం చూస్తే... నికర ఎన్పీఏలు 6–9% ఉంటే ఆ బ్యాంకులు రిస్క్ కేటగిరీ–1 పరిధిలోకి వస్తాయి. ఎన్పీఏలు 9–12% ఉంటే రెండో రిస్క్ విభాగంలోకి, 12%పైన ఉన్న బ్యాంకులు మూడో కేటగిరీ కిందకు వస్తాయి. నికర విలువను దాటేసిన ఎన్పీఏలు: మెకిన్సే కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కో దేశీ బ్యాంకుల మొండి బకాయిల సంక్షోభంపై తాజాగా నివేదిక విడుదల చేసింది. దేశీయ బ్యాంకులకు చెందిన ఒత్తిడిలో ఉన్న మొత్తం రుణాలు (పునరుద్ధరించిన రుణాలు సహా) ఈ రంగం మొత్తం నెట్‌వర్త్‌ను మించిపోయాయి. ఈ రంగం నికర విలువ రూ.9.24 లక్షల కోట్లు కాగా, ఒత్తిడిలో ఉన్న రుణాల విలువ రూ.9.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు మెకిన్సే వివరించింది. ‘‘తక్కువ వడ్డీ రేట్ల వాతావరణంలోనూ రుణాల్లో వృద్ధి లేకపోవడం, ఒత్తిడితో కూడిన రుణాలు అధిక స్థాయికి చేరడం, టెక్నాలజీ, నియంత్రణల పరంగా వచ్చిన మార్పులు భారత బ్యాంకింగ్ రంగానికి తుఫాను మాదిరి వాతావరణాన్ని కల్పించాయి’’ అని మెకిన్సే పేర్కొంది. ఎన్పీఏ ఆర్డినెన్స్ పరిధిలో 15 రోజుల్లో ప్రణాళిక! న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ)ల సమస్య పరిష్కారానికి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో పక్షం రోజుల్లో ఒక కార్యాచరణ ప్రణాళిక విడుదల చేయనుంది. ఎన్పీఏలు రూ. 8 లక్షల కోట్లు దాటిన నేపథ్యంలో సమస్య పరిష్కారం దిశలో ఆర్బీఐకి మరిన్ని అధికారాలను కట్టబెడుతూ ఇటీవలే కేంద్రం ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేయడం తెలిసిందే. ఎన్పీఏలకు సంబం ధించి సమస్యల గుర్తింపునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు, సమ స్య పరిష్కార ప్రక్రియలో సమయ కేటాయింపు, నిర్ణయం వంటి అంశాలు ఉంటాయని సంబంధిత వర్గాలు వెల్ల డించాయి. ఈ సమస్య 60 నుంచి 90 రోజులు ఉంటుందని కూడా తెలుస్తోంది. బడా మొండిబకాయిలకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఐ 50 కేసులను గుర్తించినట్లు సమాచారం. ఆర్డినెన్స్ అమలు పర్యవేక్షణకు కమిటీ ఎన్పీఏ ఆర్డినెన్స్‌ను ఆచరణలో పెట్టే దిశగా ఆర్బీఐ చర్యల్ని ఆరంభించింది. ఇందు కోసం తన అధికార పరిధిలో పర్యవేక్షణ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ సోమవారం ప్రకటించింది. అలాగే, సమస్య తీవ్రత దృష్ట్యా కమిటీని విస్తరించి మరింత మంది సభ్యులకు చోటు కల్పించనున్నట్టు పేర్కొంది. -
రుణ మోసాలపై సత్వర నివేదికలు ఇవ్వండి: ఆర్బీఐ
ముంబై: రుణ మోసాలపై క్రియాశీలంగా సత్వర చర్యలు అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భావిస్తోంది. త్వరితగతిన ఈ సమాచారాన్ని అందించాలని, సమయాన్ని వృధా చేయరాదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా సూచించారు. సంబంధిత రుణ మోసాలు, మొండిబకాయిల విషయంలో నాలుగేళ్ల సమాచారాన్ని నివేదికలో పొందుపరచాలని ఆయన పేర్కొన్నారు. ఒక రుణ గ్రహీతను ‘ఫ్రాడ్’ అని ప్రకటించే నాలుగేళ్ల ముందే అతని రుణం మొండిబకాయిగా గుర్తించిన సందర్భాలను తాము గమనిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్ మోసాల్లో 92 శాతం రుణాలతో సంబంధం ఉన్నవేనని ఆయన అన్నారు. -
మొండి బకాయిలకు... మూల కారణం గుర్తించాలి
సుప్రీంకోర్టు వ్యాఖ్య... కేవలం పేర్లు వెల్లడిస్తే సమస్య పరిష్కారం కాబోదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌కు రూ.500 కోట్లు ఆపైన బకాయిదారుల పేర్లు వెల్లడించినంత మాత్రాన మొండిబకాయిల సమస్య (ఎన్పీఏ) పరిష్కారం అయిపోదని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. తీవ్రమైన ఎన్పీఏ సమస్యకు ప్రధాన కారణాన్ని విశ్లేషించి, పరిష్కరించడం అవసరమని అభిప్రాయపడింది. మొండిబకాయిలు, రూ.500 కోట్లు పైబడిన వారి పేర్ల వెల్లడికి సంబంధించి జరుగుతున్న విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖాన్వేకర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది. భారీ రుణ బకాయిదారుల పేర్ల వెల్లడి అవకాశాలను పరిశీలించాలని ఇప్పటికే కేంద్రం, ఆర్బీఐలకు సుప్రీం సూచించిన సంగతి తెలిసిందే. రుణ రికవరీ వ్యవస్థను సరిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? డెట్ రికవరీ ట్రిబ్యునళ్లు (డీఆర్టీ), డెట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (డీఆర్ఏటీ) వంటి న్యాయ వేదికల చట్టాల పటిష్టత విషయంలో చర్యలు వంటి అంశాలపై నాలుగువారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) రంజిత్ కుమార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతక్రితం రంజిత్ కుమార్ కోర్టుకు తన వాదనలు వినిపిస్తూ... ఎన్పీఏలు సహా ఇందుకు సంబంధించి వివిధ సమస్యలపై ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. కమిటీ త్వరలో నివేదిక సమర్పిస్తుందనీ వెల్లడించారు. 57 డిఫాల్టర్ల బకారుులు రూ.85,000 కోట్లు... అంతక్రితం సొలిసిటర్ జనరల్ మొండిబకాయిదారుల గురించి సుప్రీంకోర్టుకు తెలియజేస్తూ... కేవలం 57 మంది రుణ గ్రహీతలు బ్యాంకింగ్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.85,000 కోట్లని అన్నారు. ‘‘ఈ రుణ గ్రహీతలు ఎవరు? వారు ఎంత చెల్లించాలి? ఎందుకు తిరిగి చెల్లించడం లేదు? వంటి అంశాలు ప్రజలకు ఎందుకు తెలియకూడదు’’ అని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 8,100 ఎగవేతదారులు... రూ.76,685 కోట్లు దేశంలో 2016 మార్చి నాటికి దాదాపు 8,167 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం రూ.76,685 కోట్లని లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఏడాదిలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 16% పెరిగిందని ఆయన తెలిపారు. రూ.25 లక్షలు పైబడిన బకాయిదారుల సంఖ్య 2015 మార్చి నాటికి 7.031 మంది ఉంటే ఆ సంఖ్య 2016 మార్చి నాటికి 8,167 మందికి చేరినట్లు తెలిపారు. అదే సమయంలో బకాయిలు 28.5 శాతం ఎగసి రూ.59,656 కోట్ల నుంచి రూ.76,685 కోట్లకు చేరినట్లు వివరించారు. 2015-16లో రూ.21,509 కోట్ల వసూళ్లకు సంబంధించి బ్యాంకులు 1,724 ఎఫ్ఐఆర్లు నమోదుచేసినట్లు తెలిపారు. అరుుతే ఈ కేసుల విషయంలో శిక్షలు 1.14 శాతమే ఉందని వివరించారు. అలాగే బ్యాంకులు గడచిన ఏడాది కేవలం రూ.3,498 కోట్ల బకాయిలను మాత్రమే వసూలు చేసుకోగలిగాయని తెలిపారు. -
భారత్ ఓ ఆశా కిరణం
• బ్యాంక్‌ల మొండి బకాయిలు సమస్యే • ఐఎంఎఫ్ వెల్లడి న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో భారత్ ఆశాకిరణమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభివర్ణించింది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెరిగిపోతున్న మొండి బకాయిలు సమస్యేనని పేర్కొంది. భారత్‌తోపాటు చైనా సైతం తన వృద్ధిని కొనసాగిస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ మౌరిస్ ఆబ్స్‌ఫెల్డ్ అన్నారు. భారత్‌లో ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యలోటు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో బ్రూకింగ్స్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఆబ్స్‌ఫెల్డ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత్‌లో ఇప్పటికీ నిర్మాణపరమైన సవాళ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విషయంలో చెప్పుకోతగ్గ పురోగతి ఉన్నప్పటికీ, అవి పెరిగిపోవడం సవాలేనన్నారు. 2016, 2017 సంవత్సరాల్లో భారత్ 7.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఇటీవలే ఐఎంఎఫ్ తన అంచనాలను ప్రకటించి న విషయం తెలిసిందే. -
‘మొండి’ భారం రెట్టింపు...
కేర్ రేటింగ్స్ వెల్లడి ముంబై: బ్యాంక్‌ల మొండి బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో దాదాపు రెట్టింపై 8.5 శాతానికి చేరాయని ప్రముఖ రేటింగ్ సంస్థ, కేర్ రేటింగ్స్ తాజా నివేదిక తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు భారీగా ఉండడమే దీనికి కారణమంటున్న ఈ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.., ⇒ గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో 4.6 శాతంగా ఉన్న బ్యాంక్‌ల మొండి బకాయిలు ఈ క్యూ1లో 8.5 శాతానికి పెరిగాయి. ⇒ గత క్యూ1లో 5.3 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు ఈ క్యూ1లో 10.4 శాతానికి ఎగిశాయి. మరో ఆరు నెలల పాటు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మొండి బకాయిలు, వాటికి కేటాయింపుల సమస్యలు తప్పవు. ఫలితంగా వాటా లాభదాయకత దెబ్బతింటుంది. ⇒ {పైవేట్ బ్యాంక్‌లు కొంత నయంగా ఉన్నాయి. గత క్యూ1లో 2.1%గా ఉన్న ప్రైవేట్ బ్యాంక్‌ల మొండి బకాయిలు ఈ క్యూ1లో 3%కి పెరిగాయి. ⇒ మొండి బకాయిల కారణంగా పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు భారీ నష్టాలను ప్రకటించాయి. ⇒ బకాయిలను గుర్తించి వాటికి కేటాయింపులు జరపడం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇచ్చే చర్య. పోటీని తట్టుకోవడానికి తగిన సన్నద్ధతను ఇవ్వడానికి బ్యాంక్‌లకు ఈ చర్య ఉపకరిస్తుంది. -
82 శాతం తగ్గిన కార్పొరేషన్ బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: .కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 82 శాతం పడిపోయింది. 2015 ఇదే కాలంలో రూ.204.2 కోట్లుగా ఉన్న లాభం, తాజా సమీక్షా కాలంలో రూ.53.3 కోట్లకు తగ్గింది. మొండిబకాయిలకు సంబంధించి అధిక ప్రొవిజనింగ్ కేటాయింపులు దీనికి ప్రధాన కారణమని బ్యాంక్ తెలిపింది. కాగా ఇదే త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.5,335 కోట్ల నుంచి రూ.5,241 కోట్లకు పడిపోయింది. ప్రొవిజనింగ్ తదితర కేటాయింపులు రూ.621 కోట్ల నుంచి రూ.895 కోట్లకు పెరిగాయని తెలిపింది. స్థూల రుణాల్లో స్థూల మొండిబకాయిలు 5.43 శాతం నుంచి 11.01 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏల విషయంలో ఈ శాతం 3.55 శాతం నుంచి 7.22 శాతానికి పెరిగింది. -
యాక్సిస్ లాభాలకు బకాయిల సెగ
హెచ్డీఎఫ్సీ, కొటక్ మహింద్రా బ్యాంకుల వల్లే దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకుకి మొండిబకాయిల బెడద తప్పలేదు. శుక్రవారం ప్రకటించిన 2016-17 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 21 శాతం పడిపోయాయి. జూన్ క్వార్టర్లో నికరలాభాలు రూ.1555.53 కోట్లగా ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు రూ.1978.44 కోట్లగా ఉన్నాయి. మరోవైపు బ్యాడ్ లోన్స్ లేదా స్థూల నిరర్థక ఆస్తులు 59 శాతం పెరిగి, రూ.4010.23 కోట్లగా నమోదైనట్టు బ్యాంకు పేర్కొంది. 2016 మార్చి త్రైమాసికంలో ఇవి రూ.2522.14 కోట్లగా ఉన్నాయి. అయితే నికర వడ్డీ ఆదాయాలు 11.35 శాతం ఎగిసి, రూ.4,516.92 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయాలు రూ.4,056.23 కోట్లగా ఉన్నాయి. నిర్వహణ లాభాలు కూడా 9.22 శాతం జంప్ అయి, ఏడాదికి ఏడాది రూ.4,469.37 కోట్లగా రికార్డు చేసింది. ఏప్రిల్-జూన్ కాలంలో తన నెట్ వర్క్ లను విస్తరించుకున్నట్టు యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. దేశమంతటా తను కలిగి ఉన్న నెట్ వర్క్ లకు 102 బ్రాంచ్ లను కలుపుకున్నట్టు వెల్లడించింది. దీంతో జూన్ 30కి 1,882 సెంటర్లలలో బ్యాంకుకు మొత్తం 3,006 దేశీయ బ్రాంచ్‌లు, ఎక్స్టెన్షన్ కేంద్రాలు ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాంకు షేర్లు 0.13 శాతం పడిపోయి, రూ.537.55గా నమోదైంది. -
భారత్ లో పడిపోయిన వ్యాపార ఆశావాదం
న్యూఢిల్లీ : రెండు త్రైమాసికాలుగా టాప్ స్థానంలో ఉన్న భారత్, వ్యాపార ఆశావాద స్థాయిలో(బిజినెస్ అప్టిమిజమ్ ఇండెక్స్) గ్లోబల్ గా మూడో స్థానానికి పడిపోయింది. సంస్కరణలు అమలుచేయడంలో విఫలమవుతుండటంతో వ్యాపార ఆశావాద స్థాయిని ప్రపంచవ్యాప్తంగా భారత్ కోల్పోయింది. ఏకీకృత వస్తుసేవల పన్ను(జీఎస్టీ), ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల బెడద వంటి కారణాలతో భారత్ తన స్థానాన్ని కోల్పోయిందని రిపోర్టు వెల్లడించింది. తాజా గ్రాంట్ తోర్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ లో ఈ విషయం వెల్లడైంది. 2016 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత మూడో స్థానంలో నిలిచిందని రిపోర్టు నివేదించింది. జీఎస్టీ లాంటి ప్రధాన సంస్కరణల అమలులో విఫలం, పన్ను వివాదాలు ఎంతకీ తేలకపోవడం, నిరర్థక ఆస్తులు పెరగడంతో బ్యాంకింగ్ లో సమస్యలు పెరగడం, బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకుల్లో రీక్యాపిటలైజేషన్ అవసరం రావడం వంటివి కార్పొరేట్ ఇండియాలో వ్యాపార విశ్వాసాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో మొత్తంగా భారత్ లో వ్యాపార ఆశావాద స్థాయిని తగ్గిస్తుందని రిపోర్టు పేర్కొంది. జనవరి-మార్చి త్రైమాసికంలో టాప్ లో నిలిచిన ఉపాధి అంచనాల వృద్ధి రెండో స్థానానికి క్షీణించింది. వ్యాపార అవకాశాలు, మార్కెట్లో ఆశావాద స్థాయి ఎక్కువగానే ఉన్నప్పటికీ.. కీలక సంస్కరణల అమలు పెట్టుబడిదారులు, ర్యాకింగ్ పై ప్రభావం చూపుతుందని గ్రాంట్ తోర్న్టన్ ఇండియా ఎల్ఎల్పీ పార్టనర్ హరీష్ హెచ్వీ చెప్పారు. ఒకవేళ ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు పాస్ అయితే, ఈ ట్రెండ్ రివర్స్ అవుతుందని తెలిపారు.