beauty parlour
-
నో బ్యూటీ పార్లర్.. నా అందం, ఆనందం రహస్యం అదే! నటి
ఈ విషయం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నీనా గుప్తాకు బ్యూటీ పార్లర్లకు వెళ్లే అలవాటు లేదు. ‘అవునా!! గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు తరచూ పార్లర్ లకు వెళ్తుంటారు కదా! అందమే కదా అసలు ఎవరికైనా ఆనందం?’ అని మీరు అడిగి చూడండి... నీనా చెప్పే సమాధానం మిమ్మల్ని మరింతగా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ‘నా కూతురే నా ఆనందం‘ అంటారు నీనా!ఆనందం అందాన్నిస్తుంది. ఆ ఆనందం కూతురు మసాబా రూపంలో నీనా కళ్లెదుట ఉంది. ఇక ఆమెకు ఫేషియల్స్ ఎందుకు? పార్లర్లు ఎందుకు? నీనా వయసు 65. సింగిల్ మదర్‌కి స్ట్రెస్ ఉంటుంది. కూతురు ఉన్న సింగిల్ మదర్‌కి మరింత స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్, మరింత స్ట్రెస్‌లను మించిన మూడోస్ట్రెస్ కూడా ఉండేది నీనాకు. అదేమిటో అందరికీ తెలిసిందే. ఆమె కూతురి తండ్రి ఇండియన్ కాదు. 1980ల నాటి వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్. నీనా, రిచర్డ్స్కు పుట్టిన అమ్మాయే మసాబా. రిచర్డ్స్ కు అప్పటికే పెళ్లి అయి ఉండటంతో ఆయన్ని పెళ్లి చేసుకోకుండా, మసాబా పెరిగి పెద్దయ్యే వరకు – ఒంటరిగానే ఉండిపోయారు నీనా. ప్రస్తుతం మసాబా వయసు 35 ఏళ్లు. ఇప్పటికీమసాబానే నీనా కంటి వెలుగు. మసాబానే ఆమె అందం, ఆనందం. ‘ఎదుగుతున్న వయసులో నా కూతురి కోసం నేను రెండు పనులు ఎప్పటికీ చేయకూడదు అని ఒట్టు పెట్టుకున్నాను. ఒకటి: ఆమె చదువు కోసం ‘ఎవరినీ డబ్బు సాయం అడగకూడదు.’ రెండు : తండ్రి (దగ్గర) లేని పిల్లగా ఆమె కోసం ‘ఎవరి ఎమోషనల్ సపోర్టూ తీసుకోకూడదు.’ ఈ రెండిటిపై గట్టిగా నిలబడ్డాను. మనం డబ్బు, సపోర్ట్ అడగం అని తెలిస్తే ఎవరైనా ధైర్యంగా మన దగ్గరకు వస్తారు. మనమూ అంతే.. ఎవరి దగ్గరకైనా ధైర్యంగా వెళ్లగలం అని ‘బ్రట్ ఇండియా’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కుషా కపిల్‌తో చెప్పారు నీనా గుప్తాకూతురు మాత్రమే కాదు, సింగిల్ మదర్‌గా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ రావటం కూడా నీనా అందానికి కారణం అయి ఉంటుంది -
ప్రియుడి కోసం పోలీసు వేషం
సేలం: ప్రియుడి కోసం కన్యాకుమారి జిల్లా వడచ్చేరిలో పోలీసు యూనిఫారంతో సబ్ ఇన్స్పెక్టర్ అని తెలుపుతూ హల్చల్ చేస్తున్న యువతిని, అందుకు కారణమైన ప్రియుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా వడచ్చేరికి చెందిన వ్యక్తి శివ. ఇతనికి రైలు ప్రయాణంలో చైన్నె తాంబరానికి చెందిన అభిప్రభ అనే యువతి పరిచయమైంది. వీరి స్నేహం ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం గురించి శివ తన తల్లికి తెలిపిన స్థితిలో తనకు మహిళా పోలీసు కోడలిగా రావాలని తల్లి కోరినట్టు సమాచారం. దీంతో తన ప్రియురాలు అభిప్రభను పోలీసు వేషధారణలో తన తల్లికి కనిపించాల్సిందిగా శివ కోరాడు. ప్రియుడి కోరిక మేరకు అభిప్రభ పోలీసు దుస్తులను అద్దెకు తీసుకుని సబ్ ఇన్స్పెక్టర్లా వెళ్లి శివ తల్లిని కలిసింది. అప్పుడు తాను తాంబరంలో సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నట్టు తెలిపిందని సమాచారం. దీంతో అభిప్రభ తన స్నేహితుడైన పృథ్వీరాజ్ సాయంతో పోలీసు దుస్తులను తీసుకుని చైన్నె, నెల్లై, కన్యాకుమారి తదితర ప్రాంతాలలో తాను పోలీసు దుస్తుల్లో ఉన్నట్టు ఫొటోలు, వీడియోలను తీసుకుని ప్రియుడు శివ తన తల్లిదండ్రులకు చూపించి, వారి వివాహానికి అనుమతి పొందినట్లు తెలుస్తోంది.పట్టించిన బ్యూటీ పార్లర్ఈ స్థితిలో గత నెల 28వ తేది నాగర్‌కోవిల్‌లో డబ్ల్యూసీసీ సమీపంలో ఉన్న ఒక బ్యూటీ పార్లర్‌కు ఫేషియల్ చేసుకున్న అభిప్రభ తాను వడచేరిలో ఉన్న పోలీసుస్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నట్టు తెలిపి డబ్బులు ఇవ్వకుండా వెళ్లినట్టు తెలిసింది. అదే విధంగా మళ్లీ గురువారం సాయంత్రం అదే బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ఫేషియల్ చేసుకుంది. అప్పుడు సందేహం ఏర్పడిన బ్యూటీ పార్లర్ యజమాని వడచేరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్న అభిప్రభను పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించగా తన ప్రేమ వివాహం కోసం ప్రియుడి కోరిక మేరక తాను సబ్ ఇన్స్పెక్టర్గా నాటకం ఆడినట్లు అంగీకరించింది. దీంతో నకిలీ పోలీసుగా హల్చల్ చేసినందుకు అభిప్రభను, ఆమెను పోలీసుగా నటింప చేసినందుకు ప్రియుడు రవిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద విచారణ జరుపుతున్నారు. -
పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు, సింపుల్‌గా ఇంట్లోనే..
పెడిక్యూర్ ఇప్పుడు ఇంట్లోనే.. ►పాదాలను మెరిపించడంలో అరటితొక్కలు చక్కగా పనిచేస్తాయి. ►అరటితొక్కలను పాదాలపైన రుద్దితే మృతకణాలు, దుమ్మూ ధూళీ తొలగిపోతాయి. ► అరటి తొక్కలను ముక్కలుగా తరిగి కొద్దిగా తేనె వేసి పేస్టు చేయాలి. ఈ పేస్టుని పాదాలకు రాయాలి. అరగంట తరువాత సాధారణ నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారడంతో పాటు, చక్కగా మెరుస్తాయి. ► అరటితొక్కల పేస్టులో కొద్దిగా అలోవెరా జెల్ కలపాలి. ఈ పేస్టుని పాదాలకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ పేస్టు పాదాలకు తేమనందించి కోమలంగా ఉంచుతుంది. ► అరటితొక్కల పేస్టులో కాఫీ పొడి, తేనె వేసి కలిపి స్క్రబర్‌లా పదిహేను నిమిషాలు రుద్దాలి. పాదాలపైన మురికి, మలినాలు పోయి చక్కగా మెరుస్తాయి. -
ఒంగోలు బ్యూటీపార్లర్ కేసు: మార్గదర్శి మేనేజర్ భార్య అరెస్ట్
ఒంగోలు టౌన్: ఒంగోలులోని శ్రీకృష్ణనగర్‌లో బ్యూటీషియన్‌పై దాడి చేసి చోరీకి పాల్పడిన కేసులో ఒంగోలు మార్గదర్శి బ్రాంచి మేనేజర్ కరణం నాగేశ్వరరావు భార్య కరణం మోహన దీప్తి ఉరఫ్ దీప్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలికా గర్గ్ కేసు వివరాలను వెల్లడించారు. ఒంగోలుకి చెందిన షేక్ రజియా శ్రీకృష్ణ నగర్‌లోని తన ఇంటిలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. ఆమె భర్త షేక్ మీరా ఉద్యోగ నిమిత్తం ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తారు. కూతురు కాలేజికి వెళ్లి సాయంత్రం వస్తుంది. దీంతో రజియా ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. రజియాకు షేక్ సాహెర భాను అనే స్నేహితురాలు ఉంది. ఆమెకు రజియా వద్ద రూ.10 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు ఉన్నాయని తెలుసుకుని ఆ విషయాన్ని తనకు పరిచయమున్న కరణం దీప్తి, ముండ్రు లక్ష్మి నవత ఉరఫ్ నవ్య, అలహరి అపర్ణలకు చెప్పింది. దీంతో అప్పటికే అనేక చోరీలు చేసి ఉన్న ఈ కిలాడీ ముఠా బ్యూటీ పార్లర్ మీద కన్నేశారు. వీరు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బ్యూటీపార్లర్‌కు వచ్చారు. మేకప్ చేయించుకునేందుకు వచ్చినట్లు నమ్మించారు. మొదట ఇద్దరు ఐ బ్రోస్ చేయించుకున్నారు. మరొకరికి పెడిక్యూర్ చేస్తుండగా అదను చూసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రజియా మీద ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న మత్తు కలిగించే ద్రావణాన్ని స్ప్రే చేశారు. తేలికపాటి యాసిడ్ లాంటి ద్రావణాన్ని ఆమె మీద చల్లారు. క్లోరోఫాం ప్రయోగించడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. ఆ తరువాత వాళ్లు చేతికి అందిన కాడికి దోచుకొని పోయారు. రజియా మెడలోని బంగారు నగలు, ఇంట్లో కప్‌బోర్డులో దాచిన నగలు, రూ.40 వేల నగదు దోచుకొని వెళ్లారు. ఈ కేసు వివరాలను తెలుసుకున్న ఎస్పీ మలికా గర్గ్ వెంటనే పోలీసులను రంగంలోకి దించారు. సీఐ భక్తవత్సలరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. చదవండి: అవమానించడంతోనే పెట్రోల్ పోసుకున్నా సీసీ కెమెరాల్లో ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు హైడ్రామా మధ్య వారిని అదుపులోకి తీసుకున్నారు. కరణం మోహన దీప్తితో పాటుగా బజాజ్ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేసే ముండ్ర వెంకటరావు భార్య లక్ష్మి నవత, శ్రీనివాసరావు భార్య అలహరి అపర్ణ, దాసరి భాను ఉరఫ్ షేక్ సాహెరా భానులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఒంగోలు తాలూకా పరిధిలో పెళ్లూరు, పొదిలి, దొనకొండలలో కూడా చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. 24 గంటల్లోపే కేసును ఛేదించడమే కాకుండా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, సీఐ భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కస్టమర్లుగా వచ్చి బ్యూటీపార్లర్‌లో చోరీ
ఒంగోలు టౌన్: ఫేస్‌వాష్ చేయించుకుంటామని వచ్చిన ముగ్గరు మహిళలు అదునుచూసి బ్యూటీపార్లర్ నిర్వాహకురాలిపై దాడి చేసి అందినకాడికి దోచుకువెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నగరంలోని శ్రీకృష్ణనగర్‌లో షేక్ రజియా అనే మహిళ ఇంటి వద్దే బ్యూటీపార్లర్ నిర్వహిస్తుంది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు మహిళలు వచ్చి ఫేస్‌వాష్, ఐబ్రోస్ చేయించుకుంటామని చెప్పారు. దీంతో వారిని ఇంట్లోకి తీసుకెళ్లిన రజియా.. ఐ బ్రోస్ చేస్తుండగా ముగ్గురికీ పెడిక్యూర్ చేయాలని కోరారు. ఈ లోగా ఒక మహిళ బాత్రూమ్‌కువెళ్లిఆలస్యంగా వచ్చింది. మిగిలిన వారు నమ్మకంగా మాట్లాడుతూ ఐ బ్రోస్ చేయించుకున్నారు. తరువాత ఒక మహిళకు పెడిక్యూర్ చేస్తుండగా రజియాపై ఒక్కసారిగా దాడికి దిగారు. దాడిలో రజియా మెడకు, కుడి చేతికి గాయాలయ్యాయి. అనంతరం మత్తు మందు చల్లడంతో రజియా స్పృహ కోల్పోయింది. కాసేపటికి తేరుకున్న రజియా ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె మెడలోని బంగారు నగలతో పాటుగా ఇంట్లోని కప్‌బోర్డులో దాచి ఉంచిన నగలు, రూ.40 వేల నగదు కూడా దోచుకొనిపోయినట్లు గుర్తించి తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కె.అంకమ్మ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహిళకు షాకిచ్చిన బ్యూటీపార్లర్
-
దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి..
సాక్షి, హైదరాబాద్: తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసిన ఓ మహిళకు బ్యూటీ పార్లర్ షాక్ ఇచ్చింది. పొడవాటి కురుల కోసం ప్రయత్నించి ఉన్న జుట్టును పొగొట్టుకుంది. అందం కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళ అబిడ్స్‌లోని బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది. జుట్టును అందంగా చేస్తానని చెప్పిన బ్యూటిషియన్.. ముందుగా మహిళ హెయిర్ కొంచెం కట్ చేసింది. బాధిత మహిళ అభ్యంతరం చెబుతున్నా విన్నకుండా ఏదో హెయిర్ ఆయిల్ కూడా పూసారు. ఇంటికెళ్లిన తర్వాత ఆ మహిళ జుట్టు మొత్తం ఊడిపోయింది. జుట్టు ఊడిపోయిన భార్యను చూసి భర్త షాక్ అయ్యాడు. అందగా కనిపించాలనుకున్న తన భార్యకు వెంట్రుకలు ఊడిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆలుమగల మధ్య చిచ్చు పెట్టిన బ్యూటీ పార్లర్‌పై బాధితురాలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊడిపోయిన జుట్టును పట్టుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి.. బ్యూటీ పార్లర్ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, హెయిర్ కలర్ కోసం అబిడ్స్‌లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్‌కి వచ్చాను. స్పెషల్ హెయిర్ స్టైల్ చేస్తానని నా హెయిర్ మొత్తం కాలిపోయేలా చేసింది. పార్లర్ నిర్వహకురాలు సొంతంగా తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడతామన్నారు. అది వాడితే పూర్తిగా నా జుట్టు రాలిపోయింది. వాటర్ పెడితే.. దువ్వెనతో దువ్వినా కూడా జుట్టు రాలిపోతుంది. క్వీన్ పార్లర్‌ను వెంటనే సీజ్ చేయాలి’’ అని ఆమె పేర్కొంది. -
జుట్టుతో పోయింది..గుండుతో బయటకొచ్చింది
-
అబిడ్స్‌లో బ్యూటీపార్లర్ నిర్వాకం.. ఆయిల్ పెట్టగానే ఊడిపోయిన మొత్తం జుట్టు
సాక్షి, హైదరాబాద్: హెయిర్ కట్ చేయించుకునేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళకు షాక్ తగిలింది. బ్యూటీషియన్ నిర్వాకంతో ఆ మహిళకు జట్టు ఊడిపోయిన ఘటన అబిడ్స్‌లో జరిగింది. మహిళకు హెయిర్ కట్ చేసి ఆయిల్ పెట్టగానే మొత్తం జుట్టు ఊడిపోయింది. పీఎస్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పార్లర్‌పై కేసు నమోదు చేశారు. బ్యూటీ పార్లర్ నిర్వాహకుల నిర్వాకంతో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోడంతో బ్యూటీ పార్లర్ అంటే మహిళలు హడలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫేస్ వ్యాక్స్ చేయించుకున్న మహిళలకు ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు రావడం, ఫేస్‌మాస్క్ వికటించి మొహం నల్లగా మారిపోవడం వంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. కొంతమంది బ్యూటీషియన్లకు సరైన అవగాహన లేకపోవడం, నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడంతో మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయి. చదవండి: వదినపై అందరూ చూస్తుండగానే... -
మహిళలు ఇంటి వద్దే దర్జాగా.. ఆర్జించే మంచి ఆదాయ వనరు అది..
సాక్షి, రాజాం సిటీ: పట్టణాల్లో ఏర్పాటుచేసిన బ్యూటీ పార్లర్లు మగువల అభిరుచులకు తగ్గట్టు నిర్వహిస్తున్నారు. పట్టణం నుంచి పల్లె వరకు నేడు మహిళలు, చిన్నారులు సైతం అందంపైనే మక్కువ చూపుతున్నారు. ఇంట్లో చిన్న చిన్న వేడుకలతోపాటు పెళ్లిళ్ల సీజన్లో నిశ్చితార్థం మొదలుకుని ఫొటోషూట్, పెళ్లి తంతు ముగిసే వరకు అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బ్రైడల్ మేకప్, శారీ డ్రాపింగ్, కేశాలంకరణలో ఎక్కడా మేకప్ విషయంలో రాజీపడడంలేదు. ఆదాయ వనరుగా.. బ్యూటీషియన్ కోర్సు చేసిన మహిళలకు ఇంటి వద్దే ఆదాయవనరు సమకూరుతోంది. ప్రతి నిత్యం ఐ బ్రో అందంగా తీర్చిదిద్దడంలో మెళకువలు పాటిస్తూ ఆదాయమార్గాలను అన్వేషిస్తున్నారు. మహిళల ఆసక్తి, అభిరుచి గమనించి బ్యూటీ పార్లర్లలో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. శరీరతత్వం, రంగు, వేడుకను బట్టి వారికి అమరేలా మేకప్ చేస్తున్నారు. మేకప్ రకం, వాడే మెటీరియల్ బట్టి పారితోషికం కూడా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఇళ్లకు తీసుకువెళ్లి మేకప్ చేయించుకునేందుకు బ్యూటీషియన్లతో ముందుగానే మహిళలు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లి మేకప్ చేసేందుకు సైతం మెటీరియల్‌కు అనుగుణంగా రూ. 4 వేల నుంచి రూ. 10వేల వరకు రేట్లు నిర్ణయించి బ్యూటీషియన్స్ ఆదాయం సంపాదిస్తున్నారు. శిక్షణతో ప్రోత్సహిస్తున్న సంస్థలు.. మహిళలకు ఉపాధిమార్గాలు చూపేందుకు కొన్ని సంస్థలు బ్యూటీషియన్ కోర్సులలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాయి. దీంతో మహిళలు కూడా ఆసక్తి కనబరిచి శిక్షణ పొందుతున్నారు. అలాగే బ్యూటీ పార్లర్లలో పనిచేసుకుంటూ చిన్న చిన్న చిట్కాలను, మెళకువలను నేర్చుకుంటూ సొంతంగా పార్లర్లను ఏర్పాటు చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. అభిరుచికి తగ్గట్టు.. జీఎంఆర్ నైరెడ్ సంస్థలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని సొంతంగా పార్లర్ నడుపుతున్నాను. పార్లర్‌కు వచ్చిన మహిళల అభిరుచికి తగ్గట్టు మేకప్ చేస్తుంటాం. వేడుకలు ఉన్నా లేకపోయినా కొందరు మహిళలు నెలకోసారి బ్యూటీ పార్లర్లకు వచ్చి ఫేషియల్ చేసుకుంటున్నారు. అందంగా ఉన్నామనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరుగుతోంది. యువతులు కాలానికి అనుగుణంగా మార్పు కోరుకుంటున్నారు. ఎక్కువ మంది ఫంక్షన్లకు అనుగుణంగా పార్లర్‌కు వచ్చి మేకప్ చేయించుకుంటున్నారు. మరికొంతమంది కోరికమేరకు ఇళ్ల వద్దకు వెళ్లి సర్వీసు అందిస్తున్నాం. – టి.హైమావతి, బ్యూటీషియన్, ఆదిత్య బ్యూటీ పార్లర్, రాజాం. 1400 మందికి శిక్షణ.. జీఎంఆర్ నైరెడ్ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 1400 మందికి బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ అందించాం. యువతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇదో చక్కని అవకాశం. పదో తరగతి చదివి ఖాళీగా ఉన్నవారందరినీ ఉపాధిమార్గం వైపు ప్రోత్సహిస్తున్నాం. ఇందులో భాగంగా అందిస్తున్న బ్యూటీషియన్ కోర్స్‌లో చేరి మెళకువలు తెలుసుకుంటున్నారు. సంస్థ స్థాపించిన తరువాత నిర్విరామంగా యువతకు ఉపాధి శిక్షణ ఉచితంగా అందిస్తున్నాం. – కె.శశిధర్, డైరెక్టర్, జీఎంఆర్ నైరెడ్, రాజాం. (చదవండి: హాయ్..‘అమిగోస్’ అంటూ వచ్చిన ఆశికా రంగనాథ్ ధరించిన చీర ధర ఎంతంటే..!) -
వెనుక నుంచి ఫాలో అవుతూ.. బ్యూటీ పార్లర్లో వధువుపై కాల్పులు జరిపిన పోలీస్!
పాట్నా: మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన ఓ వధువుపై కానిస్టేబుల్ తుపాకీతో కాల్పులు జరిపాడు. పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని ముంగేర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తారాపూర్ డయారాలోని మహేశ్‌పూర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అపూర్వ కుమారికి ఇటీవల ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజు దగ్గర పడడంతో ఆమె మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. అయితే ఓ వ్యక్తి రహస్యంగా ఆమెను ఫాలో అవుతూ బ్యూటీ పార్లర్‌కు చేరుకున్నాడు. యువతి మేకప్ వేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా వెనుక నుంచి ఓ వ్యక్తి పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక బుల్లెట్ కుమారి భుజం నుంచి దూసుకెళ్లి ఛాతీ నుంచి బయటకు వచ్చింది. కుమారిపై కాల్పులు అనంతరం.. కానిస్టేబుల్ ఆ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, భయంతో పిస్టల్ అతని చేతిలో నుంచి జారిపోవడంతో అతను అలా చేయలేకపోయాడు.పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇదంతా బ్యూటీపార్లర్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. గాయపడిన యువతిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమెదు చేసుకుని ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ‘నిందితుడు పాట్నాలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు గుర్తించాం. అతను మహేశ్‌పూర్ గ్రామానికి చెందినవాడు, అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించాం. త్వరలో అరెస్టు చేస్తామని’ డీఎస్పీ తెలిపారు. వధువుకి, అతనికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు కాల్పులు జరిపాడు? అన్న ప్రశ్నలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు. చదవండి: ప్రేమ పెళ్లి.. భర్తకు షాకిచ్చిన స్కూల్ టీచర్ భార్య, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్‌తో కలిసి... -
బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వలేదని భార్య క్షణికావేశంతో..
ఓ మహిళ చిన్న విషయానికి క్షణికావేశంలో పెద్ద నిర్ణయం తీసుకుని విగత జీవిగా మారింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటున్న 34 ఏళ్ల మహిళ బ్యూటీపార్లర్‌కు వెళ్లాలనుకుంది. అందుకు భర్త అంగీకరించకపోగా అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఈ మేరకు ఆ మహిళ క్షణికావేశంలో కోపంతో ఫ్యాన్‌కి ఉరివేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. బాధితురాలి భర్త విచారణలో.. తాను బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా అడ్డుకోవడంతోనే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పాడు. మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి అయిన తదనంతరం అన్ని కోణాల్లో ఈ కేసును విచారిస్తామని పోలీసు అధికారి యాదవ్ తెలిపారు. (చదవండి: శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్ విషయాలు వెల్లడించిన సీపీ) -
చిత్తూరు కొండమిట్టలో దారుణం.. బ్యూటీపార్లర్‌లోకి ప్రవేశించి..
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని కొండమిట్టలో దారుణం జరిగింది. బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్న యువతిని అత్యంత కిరాతంగా గొంతుకోసి చంపేశాడు ఓ యువకుడు. వేలూరు రోడ్డులోని ఆనందా ధియేటర్ వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యూటీ పార్లర్‌లోకి ప్రవేశించిన యువకుడు చక్రవర్తి.. ముందుగానే తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో విచక్షణారహితంగా ప్రశాంతి గొంతు కోశాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతి, యువకులను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర రక్తస్రావంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం యువతి మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న చక్రవర్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కాగా మృతురాలు చిత్తూరు పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ నాగరాజు కూమార్తెగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిపై దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతరులెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక యువకుడే దాడి చేశాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చదవండి: 'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్‌కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్‌లో.. -
Kukatpally: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వెంకట నరసింహారాజు (31) సూరారంలోని చిత్తారమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉటున్నాడు. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని లావిష్ బ్యూటీ పార్లర్, వెల్నెస్ స్పా నిర్వహిస్తున్నాడు. స్పా సెంటర్ ముసుగులో విటులను రప్పించి వాట్సప్‌లో యువతుల ఫొటోలు పంపుతూ విటులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరులో దారుణం.. బ్యూటీపార్లర్‌లో భార్యను చంపిన భర్త
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. స్థానిక గాంధీనగర్‌లో భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. స్వాతి అనే మహిళ బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. అప్పులు తీర్చేందుకు భార్య పేరున ఉన్న స్థలాన్ని అమ్మాలని భర్త కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నాడు. దీనికి స్వాతి అంగీకరించలేదు. ఇవాళ బ్యూటీపార్లర్‌కు వచ్చిన కోటేశ్వరరావు స్థలం విషయంలో మరోసారి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో స్వాతి తీవ్రగాయాలతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం భర్త వెంకటేశ్వరరావు పూలదండలు తీసుకొచ్చి భార్య మెడలో వేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అటుతల్లి చనిపోవడం, తండ్రి జైలు పాలవడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. చదవండి: (మీర్పేట్లో దారుణం.. వివాహితపై ఎస్బీ కానిస్టేబుల్ అత్యాచారం) -
పనిలోంచి తీసేశారని కక్ష.. యజమాని కుటుంబాన్ని దారుణంగా..!
న్యూఢిల్లీ: పని చేస్తున్న చోట ప్రేమ వ్యవహారం నడిపించారు. అది తెలిసిన యజమానికి పని లోంచి తొలగించాడని కక్ష పెంచుకున్నారు. కుటుంబం మొత్తాన్ని కడతేర్చారు. యజమాని దంపతులతో పాటు పని మనిషిని సైతం దారుణంగా హత్య చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం వెలుగు చూసింది. ఉద్యోగం నుంచి తొలగించారనే కారణంగానే పగ పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల చిన్న పాప ఇంట్లో నిద్రపోతున్న నేపథ్యంలో చిన్నారిని గమనించలేదని చెప్పారు. ఏం జరిగింది? తూర్పు ఢిల్లీలోని అశోక్‌నగర్‌లో శాలు అహుజా బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం పార్లర్లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. వారు ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారనే విషయం తెలిశాకే పనిలోంచి తీసేశారు అహుజా. అంతకు ముందు వారితో ఆమె భర్త సమీర్ అహుజా సైతం ఓసారి గొడవపెట్టుకున్నారు. దీంతో వారిపై పగ పెంచుకున్నాడు వ్యక్తి. తన గర్ల్ ఫ్రెండ్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు సచిన్, సుజిత్‌ల హత్యకు ప్లాన్ చేశారు. మరో ఇద్దరి సాయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ కెమెరాల్లో నమోదైన వివరాల ప్రకారం.. ఐదుగురు రెండు బైకుల్లో ఉదయం 8 గంటల సమయంలో అహుజా ఇంటికి వచ్చారు. శాలూ అహుహా, ఆమె పని మనిషి స్వప్న మృత దేహాలు గ్రౌండ్ ఫ్లోర్లో లభించగా.. సమీర్ అహుజా మొదటి అంతస్తులో పడి ఉంది. ఆయన ముఖం, తలపై తీవ్రంగా కొట్టి గాయపరిచారు. వారి చిన్నారిని వారు గుర్తించకపోవటం వల్ల చంపలేదని పోలీసులు తెలిపారు. మహిళలిద్దరి గొంతు కోశారని, సమీర్ అహుజాను ప్యాన్‌తో కొట్టారని వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. ఇదీ చదవండి: యాపిల్ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి! -
బ్యూటీపార్లర్ నిర్వాకం.. విద్యార్థిని ముఖంపై నీటిపొక్కులు
సాక్షి, గుంటూరు: తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలో ఓ బ్యూటీ పార్లర్ నిర్వాహకుల వల్ల ఓ విద్యార్థిని ముఖంపై నీటిపొక్కులు వచ్చాయి. ఫలితంగా ఆమె తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. బ్యూటీపార్లర్‌కు సోమవారం సాయంత్రం ఉండవల్లికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని వచ్చింది. ఫేస్ వ్యాక్స్ చేయించుకుంది. ఆ రాత్రి ఆమె ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు వచ్చాయి. కంగారు పడిన ఆమె ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు ఫేస్ వ్యాక్స్ వల్లే ఇలా జరిగిందని చెప్పారు. దీంతో విద్యార్థిని బంధువులు మంగళవారం బ్యూటీపార్లర్‌కు వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా, ఘరానాగా సమాధానమిచ్చారు. ఇవన్నీ సహజమేనని చెప్పారు. చేతనైనది చేసుకోండి అంటూ దౌర్జన్యంగా మాట్లాడారు. దీంతో విద్యార్థిని పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని ముఖంపై వచ్చిన నీటిపొక్కులు తగ్గడానికి నాలుగు నెలల నుంచి 5 నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. చదవండి: Viral: స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేస్తున్న డ్రాగన్స్.. నమ్మడం లేదా? -
బ్యూటీపార్లర్‌కు వెళ్లడంపై భర్త అభ్యంతరం.. కొంత కాలంగా ఫోన్లోనూ..
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో తల్లితో పాటు ఆమె ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. యూసుఫ్‌గూడ సమీపంలోని బ్రహ్మశంకర్ నగర్లో నివసించే భాగ్యశ్రీ (24) నాలుగున్నరేళ్ల నందిక, రెండున్నరేళ్ల ఎస్. మల్లికార్జున్ ఈ నెల 6వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అంతకుముందు భర్త మహేశ్‌తో గొడవ పడింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఆమె బ్యూటీపార్లర్‌కు వెళ్లడంపై భర్త అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కొంత కాలంగా ఫోన్లో ఇష్టానుసారంగా, టూమచ్‌గా మాట్లాడుతున్నట్లు ఆరోపించడంతో గొడవ ఎక్కువైంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు పిల్లలను తీసకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని..) -
బ్యూటీ పార్లర్లో ఉద్యోగం అన్నారు.. రిసార్టులకు పంపి..
సాక్షి, చెన్నై: ఇళ్లల్లో పని పేరిట త్రిపుర రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలను తీసుకొచ్చి.. ఓ ముఠా వ్యభిచార కుంపంలో దించి చిత్ర హింసలకు గురి చేసింది. ఈ ఘటన చెన్నైలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. త్రిపుర రాష్ట్రం శివజాల ప్రాంతానికి చెందిన సలీమా ఖదున్(38) అక్కడి బాలికలు, యువతులకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి బెంగళూరు, చెన్నైకు పంపిస్తోంది. ఈ క్రమంలో త్రిపురకు చెందిన నలుగురు బాలికల్ని తొలుత ఓ బ్యూటీ పార్లర్లో ఉద్యోగం నిమిత్తం పంపించింది. కొన్నాళ్లు అక్కడున్న ఆ బాలికల్ని చెన్నైకు తరలించారు. ఈనెల 17వ తేదీ చెన్నై శివారులోని కేలంబాక్కం పడూర్‌లోని ఓ నివాసంలో ఈ బాలికల్ని ఉంచారు. అక్కడ అలావుద్దీన్, మైదీన్, అన్వర్, హుస్సేన్ అనే నలుగురు వ్యక్తులు బాలికలను చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టారు. చదవండి: (Hyderabad: రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య) ఈసీఆర్ మార్గంలోని కొన్ని రిసార్టులకు పంపించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించారు. ఈనెల 26న వారి నుంచి తప్పించుకున్న ఓ 16 ఏళ్ల బాలిక గస్తీ పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు ఆ నలుగురు బాలికల్ని రక్షించారు. అయితే, ఆ మహిళతో పాటుగా ముఠా సభ్యులు మాత్రం తప్పించుకున్నారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా బాధిత బాలికలను త్రిపురకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళ అదృశ్యం
సాక్షి, చిక్కడపల్లి(హైదరాబాద్): బ్యూటీపార్లర్‌కు వెళ్లిన గృహిణి అదృశ్యమైన ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. దోమలగూడ గగన్‌మహల్‌లో నివసించే జి.దుర్గాప్రసాద్, భార్గవి(26) భార్యాభర్తలు. భార్గవి బుధవారం సాయంత్రం 5.30 సమయంలో సమీపంలోని బ్యూటీపార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం 6.30కు భార్గవి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో దుర్గాప్రసాద్ బ్యూటీపార్లర్‌కు వెళ్లి వాకబు చేశాడు. ఆమె అక్కడ లేకపోవడంతో బంధువులు, స్నేహితులను సంప్రదించాడు. ఫలితం లేకపోవడంతో దుర్గాప్రసాద్ చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ప్రేమ్‌కుమార్ కోరారు. -
వినియోగదారులుగా వచ్చి హత్యాయత్నం..
నాచారం: బ్యూటీపార్లర్‌కు వినియోగదారులుగా వచ్చి నిర్వాహకురాలిపై హత్యాయత్నం చేసి సొత్తు చోరీ చేసిన నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.ఈ సంఘటన మల్కాజిగిరి సీసీఎస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజిగిరి సీసీఎస్ డీసీపీ నాగరాజు ఆధ్వర్యంలో నాచారంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సఫిల్‌గూడలోని వైల్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే బిట్రా విష్ణుప్రియ (25), మౌలాలి షఫీనగర్‌కు చెందిన ముత్తిరాజు మౌనిక (21) ఇద్దరు టైలర్ పనిచేస్తుంటారు. దువ్వ వెంకటరత్నకుమారి (50) వైల్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్లో తన నివాసంలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తుంటుంది. విష్ణుప్రియ తరచూ వెంకటరత్నకుమారి మేకప్ చేసుకోవడానికి వెళ్తుటుంది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్న నగదు, బంగారం ఇతర వస్తువులను చూస్తూ ఉండేది. అసలే ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న విష్ణుప్రియ ఒంటరిగా ఉన్న వెంకటరత్నకుమారి ఇంట్లో దొంగతనం చేయాలని నిశ్చయించుకుంది. విష్ణుప్రియ, మౌనిక ఇద్దరు కలిసి డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేకప్ కోసం వెంకటరత్నకుమారి ఇంటికి వెళ్లారు. మౌనికకు మేకప్ చేసే సమయంలో విష్ణుప్రియ రోకలిబండతో వెంకటరత్నకుమారి తలపై గట్టిగా కొట్టింది. ఆమె కిందపడిపోగానే చార్జింగ్ వైర్‌తో గొంతుకు చుట్టి హత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి నోటి నుండి రక్తం రాగానే చనిపోయిందనుకొని ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, బంగారు గాజులు, ఐఫోన్, తీసుకొని పరారయ్యారు. కొంతసేపటి తర్వాత వెంకటరత్నకుమారి స్పృహలోకి వచ్చి తనపై జరిగిన దాడి గురించి నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు అందిన 24 గంటలలోపే నింధితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.1,56 లక్షల విలువ గల 18 తులాల బంగారం, ఒక ఐఫోన్లను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును తొందరగా చేదించిన సీసీఎస్ మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ లింగయ్య, కె.జగన్నాదరెడ్డి, పోలీసు బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి అడిషనల్ డీసీపీ క్రైం ఎస్కె.సలీమా, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళను కాలుతో తన్నిన సెల్వకుమార్
-
బ్యూటీ పార్లర్ పేరుతో క్రాస్ మసాజ్
గోల్కొండ: బ్యూటీ పార్లర్ ముసుగులో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్ సెంట్రల్ జోన్ టీం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అబిడ్స్ చిరాక్ గల్లీలో రాధమ్మ అలియాస్ జ్యోతి అనే మహిళ ఎస్ఎస్ న్యాచురల్ ఫ్యామిలీ స్పా అండ్ సెలూన్ పేరుతో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈ బ్యూటీ పార్లర్‌కు మహ్మద్ ఆరిఫ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. బ్యూటీ పార్లర్ ముసుగులో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నట్లు సమా చారం అందడంతో ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకురాలు రాధమ్మతో పాటు ఇద్దరు బ్యూటీషియన్లు, మేనేజర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా రాధమ్మ గతంలో నారాయణగూడలో స్లా్పష్ బ్యూటీ సెలూన్ స్పా ముగుసులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో 2015లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
సిరి కేసు ఆవిరి!
బ్యూటీ పార్లర్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సిరి(19) కేసు.. మనీ మాటున ఆవిరవుతోంది. కేసును నీరుగార్చేందుకు అధికార పక్షం, కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిపిన హైడ్రామాలో రూ.లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతురాలి కుటుంబానికి రూ.2.50 లక్షలు ముట్టజెప్పి రాజకీయ బ్రోకర్లు రూ.25లక్షలు పంచుకున్నట్లు తెలుస్తోంది. సిరితో సిరి కేసు ఆవిరైపోయింది. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పాటు లక్షలు చేతులు మారడంతో సాక్ష్యాలను భూస్థాపితం చేసి హత్య కేసును నీరుగార్చారు. పార్లర్ నిర్వాహకురాలి తండ్రి గతంలో ఓ యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడైనా కనీసం ఆయనపై ఈగ వాలకుండా మధ్యవర్తులు వ్యవహారాన్ని నోట్ల కట్టలతో మేనేజ్ చేశారు. యువతి మృతి సంగతలా ఉంచితే అసలు అక్కడ జరుగుతున్న వ్యవహారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రేపల్లె: పట్టణంలోని డూ అండ్ డై బ్యూటీ పార్లర్లో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతి సిరి కేసును నీరుగార్చేందుకు అధికార పక్షమైన టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడించిన హైడ్రామాలో దాదాపు 25 లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతురాలి కుటుంబానికి రూ.2.50 లక్షలు ముట్టజెప్పి, మిగతా సొమ్ము రాజకీయ బ్రోకర్లు పంచుకున్నారని తెలుస్తోంది. పట్టణంలోని 10వ వార్డులో ఉన్న డూ అండ్ డై బ్యూటీ పార్లర్లో యాదాద్రి జిల్లా వరిగొండ మండలం రెడ్లపాలెం గ్రామానికి చెందిన జి.సిరి(19) అనే యువతి బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో యువతి మరణిస్తే రాత్రి 8గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిరి తల్లితండ్రులు ఊర్మిళ, యాదయ్యలతో పాటు బంధువులు సిరి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. మృతి చెందిన అనంతరం క్షణాల్లో సంఘటనా స్థలానికి రాజకీయ నాయకుల రంగప్రవేశం, మృతురాలి తల్లిదండ్రులతో బేరాలు మాట్లాడి రూ.2.50 లక్షలు వెల కట్టడం, బేరం కుదరగానే గురువారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించడం శరవేగంగా జరిగిపోయాయి. రాజకీయ ఒత్తిడులతో కీలక అంశాలకు పాతర సిరి మృతి కేసులో రాజకీయ ఒత్తిడులతో పోలీసులు కీలక అంశాలకు పాతర వేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి తీవ్ర ఒత్తిడి చేయడంతో కేసును నీరుగార్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్న గదిలో కాకుండా శవం వేరే గదిలో ఉండడం, ఉరి వేసుకున్నట్టు చెబుతున్న గదిలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించినా పట్టించుకోలేదు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు గ్రహించినా క్లూస్ టీమ్‌ను ఎందుకు రప్పించలేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సిరి తల్లిదండ్రులు ఊర్మిళ, యాదయ్య తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని నిర్వాహకులే చంపి వుంటారని చెప్పినా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బ్యూటీ పార్లర్లో సిరితో పాటు పనిచేస్తున్న దీనా అనే యువతి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పార్లర్ నిర్వాహకురాలి తండ్రి గతంలో హత్య కేసులో నిందితుడు బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు తోట సింధు హైదరాబాద్‌లో ఉంటుండడంతో ఆమె తండ్రి పార్లర్ నిర్వహణ బాధ్యతలు చూస్తుంటారు. ఆయన 2003లో పట్టణంలో జరిగిన భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందిన ఆషా అనే యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు. కలప వ్యాపారం చేసే ఆయన కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి కలప తెప్పిస్తూ కోట్లలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి కలప వ్యాపారులు వచ్చిన సమయంలో ఈ బ్యూటీ పార్లర్లో విడిది చేస్తుంటారని స్థాని కుల ఆరోపణ. బ్యూటీ పార్లర్‌కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా వస్తున్నారని చుట్టుపక్కల వారు ఆరోపిస్తున్నారు. -
ఆమె టార్గెట్ బ్యూటీపార్లర్
మారేడుపల్లి : నగరంలోని బ్యూటీపార్లర్లలో చోరీలకు పాల్పడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఓ ఘరానా మహిళా దొంగను మారేడుపల్లి పోలీసులు శనివారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపిన మేరకు.. కడప టౌన్‌కు చెందిన పైడికాల్వ డైసీ మార్టిన్ అలియాస్ డైసీ అలియాస్ వందన అలియాస్ లక్ష్మి అలియాస్ ప్రియ (36) ఇలా కొత్త కొత్త పేర్లతో పరిచయం చేసుకుంటూ బ్యూటీపార్లర్లలో గత మూడు నెలలుగా 17 బ్యూటీపార్లర్లలో చోరీలకు పాల్పడింది. నిర్వాహకులను మాటలతో నమ్మించి మాయచేసి వారి బంగారు ఆభరణాలను చోరీ చేసేది. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిఘా ఉంచి నిందితురాలిని అరెస్టు చేశారు.ఆమె నుంచి రూ. 17 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీన పర్చుకున్నారు. డైసీ తక్కువ కస్టమర్లతో ఉన్న బ్యూటీపార్లర్లను ఎంచుకుని బ్యూటీపార్లర్ల నిర్వాహకులను దోచుకుంది. సందర్భాన్ని బట్టి తాను బ్యూటీపార్లర్‌కు సంబంధించిన కాస్మొటిక్స్ సరఫరా చేస్తానని, మంచి ఆఫర్లు ఉన్నాయంటూ బ్యూటీపార్లర్ నిర్వాహకులను నమ్మిస్తుంది. కాస్మొటిక్స్ పెట్టుకునే ముందు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసి పక్కనపెట్టాల్సిందిగా సూచిస్తుంది. కాస్మొటిక్స్ మొఖానికి రాసిన తర్వాత నెమ్మదిగా బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి నుండి పరారవుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి ,2018 నుండి మే వరకు హైదరాబాద్ నగరంలో 9, సబరాబాద్‌లో 5, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 చొప్పున బ్యూటీపార్లర్లలో చోరీకి పాల్పడినట్లు డీసీపీ సుమతి తెలిపారు. విద్యావంతుల కుటుంబానికి చెందిన డైసీ బీఏ ఇంగ్లీష్ చదివింది. మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వాణి అనే బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేశారు. నిందితురాలిని బిహెచ్ఈఎల్లో సంచరిస్తుందనే సమాచారంతో మారేడుపల్లి పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.. నిందితురాలిపై పీడీయాక్టు నమోదు చేయనున్నట్లు డీసీపీ సుమతి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాసులు, డీఐ అప్పలనాయుడు పలువురు పాల్గొన్నారు.