Bhadrachalam temple
-
భద్రాద్రిలో వైభవంగా మహా పట్టాభిషేక మహోత్సవం (ఫొటోలు)
-
నేడు భద్రాద్రి రాములోరి కల్యాణం
-
చరిత్రలో ప్రత్యేకం.. అప్పట్లో సర్వేపల్లి, నీలం సంజీవరెడ్డి.. మళ్లీ ద్రౌపది ముర్ము
సాక్షి, భద్రాచలం: భద్రాచలానికి వీఐపీల రాక ప్రత్యేకం కానప్పటికీ.. అత్యున్నతస్థాయి హోదా గల రాష్ట్రపతి రావడం భద్రాచల చరిత్రలో ఎంతో ప్రత్యేకం. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు హాజరవడం పరిపాటే. కానీ జాతీయ స్థాయిలో అధికార హోదాలో భద్రాచలంలో పర్యటించటం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత ఆ స్థానం ద్రౌపది ముర్ముకే దక్కింది. భద్రాచలం – సారపాక మధ్య గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవానికి 1965 జూలై 13న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చారు. ఇప్పుడు ప్రసాద్ పథకంలో భాగంగా రూ.41 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ద్రౌపదిముర్ము వస్తున్నారు. అయితే నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా భద్రాచలం వచ్చినప్పటికీ.. ఆయన కేవలం స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్లారు. చదవండి: భద్రాచలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో నాటి అర్చకులు, తదితరులు (ఫైల్) -
రోడ్డు మార్గంలో భద్రాచలానికి రాష్ట్రపతి.. ముర్ము ప్రయాణించేది ఈ కారులోనే
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఈ నెల 28న దేశ ప్రథమపౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీతో పాటు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో రాష్ట్రపతి భద్రత విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే శత్రుదుర్భేద్యమైన వాహనాలను రాష్ట్రపతికి సమకూర్చనున్నారు. రోడ్డు మార్గంలో ఆలయానికి.. రాష్ట్రప్రతి, ప్రధాని వంటి అత్యున్నత పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులకు భద్రత కల్పించే విషయంలో స్పస్టమైన విధి విధానాలు ఉన్నాయి. రాష్ట్రపతి దేశీయంగా రోడ్డు మార్గంలో ప్రయాణం చేసేప్పుడు అత్యాధునిక సౌకర్యాలు, కట్టుదిట్టమైన రక్షణ, భద్రత వ్యవస్థ ఉన్న కార్లను వినియోగిస్తారు. ఇందుకోసం రాష్ట్రపతి అధికారిక నివాసాలు ఉన్న ఢిల్లీ, హైదరాబాద్, సిమ్లాలలో ఈ వాహనాలు రాష్ట్రపతి ప్రయాణించేందుకు సదా సిద్ధంగా ఉంటాయి. ఈ నెల 28న రాష్ట్రపతి వాయుమార్గం ద్వారా ఐటీసీకి చేరుకుని, అక్కడి నుంచి గోదావరి వంతెన మీదుగా సుమారు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి రామాలయ ప్రాంగణం చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రాష్ట్రపతి ఏ కారు ఉపయోగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. మెర్సిడెస్ ఎస్ క్లాస్ (ఎస్ 600) పులిమన్ గార్డ్.. పబ్లిక్ డోమైన్లో ఉన్న వివరాల ఆధారంగా రాష్ట్రపతి వాహనశ్రేణికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రపతిగా ముర్ము పదవీ బాధ్యతలు స్వీకరించగానే అధికారిక వాహనంగా మెర్సిడెస్ బెంజ్, మేబ్యాక్, ఎస్ క్లాస్ (ఎస్ 600) పులిమన్ గార్డ్‌ను కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కోసమే మెర్సిడెస్ సంస్థ ఈ శ్రేణికి చెందిన కార్లను తయారు చేస్తుంది. రాష్ట్రపతి కోసం కేటాయించిన కారును అధికారిక కార్యక్రమాలకు తగ్గట్టుగా కస్టమైజ్ చేస్తారు. చదవండి: Hyderabad: మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఈ ఏడాదిలోనే ఎన్ని కేసులంటే! ఈ కారు బుల్లెట్ ప్రూఫ్, (ల్యాండ్, క్లెమోర్ మైన్) బ్లాస్ట్ ప్రూఫ్, విష రసాయనాల దాడి నుంచి కాపాడే అధునాత భద్రతా వ్యవస్థ ఉంటుంది. రాత్రి వేళలల్లోనూ ఈ వాహనాలను నడపవచ్చు. ఫ్లాట్ టైర్ సిస్టమ్ ఉపయోగించడం వల్ల టైర్ల మీద దాడి జరిగినా కారు నడుస్తూనే ఉంటుంది. బరువు ఐదు టన్నులకు పైగా ఉంటుంది. గంటలకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. అధిక బరువు ఉన్నప్పటికీ కేవలం 8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. భద్రతా కారణాల రీత్యా ఈ వాహనానికి నంబర్ ప్లేట్ ఉండదు. హైదరాబాద్‌లో.. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి వేసవి కాలంలో సిమ్లాలో, శీతాకాలంలో హైదరాబాద్‌లో విడిది చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఇక్కడకు వచ్చినప్పుడు స్థానికంగా పర్యటనలకు వెళ్లేందుకు వీలుగా ఇక్కడ సైతం ప్రత్యేక వాహనాన్ని రాష్ట్రపతికి కేటాయించారు. మాజీ రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన సందర్భంగా టయోటా మినర్వా ఫార్చునర్ ఎస్యూవీ కారును ఉపయోగించారు. ప్రస్తుత రాష్ట్రపతి పర్యటనలకు ఇదే కారును కేటాయించే అవకాశం ఉంది. ఈ కారు సైతం బుల్లెట్ ప్రూఫ్, బ్లాస్ట్ ప్రూఫ్, కెమికల్ గ్యాస్ ఎటాక్ ప్రూఫ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. భద్రతా ప్రమాణాల ప్రకారం మినర్వా ఫార్చునర్ బీ 6 లెవల్ రక్షణ అందిస్తుంది. ఈ కారు రెగ్యులర్ మెడల్ ఖరీదు రూ. 44 లక్షల దగ్గర ఉండగా రాష్ట్రపతికి ఉపయోగించే కస్టమైజ్డ్ వెహికల్ ధర రూ. 80 లక్షల వరకు ఉండవచ్చు. సాధారణ కారు 2,180 కేజీల బరువు ఉంటే మినర్వా 3,700 కేజీల బరువు వరకు ఉంటుంది. సాధారణ కారు గరిష్ట వేగం గంటకు 176 కిలోమీటర్లు ఉండగా రాష్ట్రపతి ఉపయోగించే కారు గంటకు 150 కి.మీ స్పీడ్‌తో నడవగలదు. ప్యూర్ వెజిటేరియన్.. రాష్ట్రపతి భవన్లు కొలువై ఉన్న మూడు చోట్ల రాష్ట్రపతికి సేవలు అందించేందుకు ప్రత్యేకంగా వంటమనిషితో పాటు ఇతర వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. రాష్ట్రపతి దేశీయంగా ఎక్కడికి పర్యటనకు వెళ్లినా వీరే వంటలు చేస్తారు. ఈ నెల 28న రాష్ట్రపతి ముర్ముకు సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో లంచ్ ఏర్పాటు చేశారు. ద్రౌపది ముర్ము శాకాహారి కావడంతో ఇప్పటికే వెజిటేరియన్ వంటకు సంబంధించిన మెనూను సిద్ధం చేశారు. రాష్ట్రపతి భవన్ చెఫ్‌తో పాటు మరికొందరు వంటగాళ్లను ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. వీరు వండిన వంటకాలను ముందుగా భద్రతా సిబ్బంది పరీక్ష చేసిన తర్వాతే రాష్ట్రపతి, ఇతర అతిథులకు వడ్డిస్తారు. -
వైభవంగా రామయ్య పట్టాభిషేక మహోత్సవం (ఫొటోలు)
-
Khammam: భద్రాద్రి రామాలయంలో అక్రమాల పర్వం..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అక్రమాల పర్వం కొనసాగుతోంది. సమాచార హక్కు చట్టం సైతం తమకు వర్తించదని చెబుతూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వ్యవస్థ అంతా ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతిలో కేంద్రీకృతమై ఉంది. ఆలయ ఈఓకు సీసీగా ఉంటున్న సదరు వ్యక్తి కమిషనరేట్ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయినా దేవాదాయ శాఖ మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. దేవస్థానంలో పనిచేస్తూ రెండుసార్లు సస్పెండైన ఉద్యోగి వద్ద డబ్బులు తీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈవోగా ఆజాద్ ఉన్న సమయంలో హుండీ డబ్బులు చోరీ చేసిన వ్యవహారంలో సదరు ఉద్యోగిని తొలగించారు. అయితే అతను కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాడు. తరువాత రమేష్‌బాబు ఈవోగా ఉన్న సమయంలో మరోసారి హుండీ డబ్బులు చోరీ చేస్తుండగా స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో సదరు ఉద్యోగి తనకు రావాల్సిన బెనిఫిట్స్, సస్పెన్షన్ సమయంలో రావాల్సిన సగం జీతం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సుమారు రూ.5 లక్షల వరకు అతనికి వచ్చే బెనిఫిట్స్‌ను దండుకుని, ఉద్యోగంలోకి తీసుకున్నట్లు సమాచారం. అతను దేవస్థానం పనుల బదులు అధికారుల ఇళ్లల్లో పనులు చేస్తున్నాడని ఇతర ఉద్యోగులు చెబుతున్నారు. సదరు ఉద్యోగిని తిరిగి చేర్చుకోవద్దని దేవస్థానం ఉద్యోగుల యూనియన్ లేఖ సైతం ఇచ్చింది. ఓ ఉద్యోగి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద అతని భార్యకు ఉద్యోగం ఇచ్చారు. కొన్నేళ్ల పాటు విధులు నిర్వహించిన ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నాలుగేళ్లపాటు విధులకు హాజరు కాలేదు. వస్త్రాల విభాగంలో ఆమె పనిచేసిన సమయంలో రూ.4లక్షల మేర లెక్క తేడా రావడంతో.. ఆమెతోనే డబ్బులు కట్టించారు. మరోసారి లడ్డూల కౌంటర్లో పనిచేసినప్పుడు రూ.1.5 లక్షల మొత్తం తేడా రావడంతో మళ్లీ డబ్బులు కట్టించారు. ఆ తర్వాత ఆమె విధులకు రాలేదు. అనంతరం ఆమె ఉద్యోగంలో చేరేందుకు రావడంతో మొదట చేర్చుకోలేదు. కాగా ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్, భర్త పింఛన్ కింద వచ్చే డబ్బులను ఈవో సీసీ దండుకుని ఉద్యోగంలో చేర్చుకున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఆమెను గత శ్రీరామనవమికి ముందు 20 రోజుల పాటు శాశ్వత పూజల విభాగంలో పనులు చేయించారు. విషయం బయటకు పొక్కడంతో ప్రస్తుతం సదరు ఉద్యోగినిని పక్కన పెట్టి ఫైల్ పెండింగ్‌లో ఉంచారు. గత శ్రీరామనవమి సమయంలో అధికారుల ఆదేశాల మేరకు స్టోర్ ఇన్చార్జ్ భారీగా లడ్డూలు చేయించాడు. కోవిడ్ నేపథ్యంలో లడ్డూలు మిగిలిపోయి నష్టం వచ్చింది. దీంతో ఈ నష్టం బాపతు రూ.1.5 లక్షలను స్టోర్ ఇన్‌చార్జ్‌తో కట్టించారు. అయితే అధికారుల ఆదేశాలు లేకుండా స్టోర్ ఇన్చార్జ్ ఒక్కడే లడ్డూలు ఎలా చేయిస్తాడనే విషయమై పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన ఏపీకి చెందిన ఓ పోలీసు అధికారికి లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి దర్శనం చేయించడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తే విషయం తెలుస్తుందని పలువురు చెబుతున్నారు. ఇక శానిటరీ వర్కర్ల పేరిట నకిలీ పేర్లతో జీతాలు డ్రా చేసినట్లు సైతం పలువురు విమర్శలు చేస్తున్నారు. కాగా రామాలయంలో అధికారులు, సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై దేవస్థానం ఈవో శివాజీని వివరణ కోరగా... తొలగించిన ఉద్యోగులు మళ్లీ చేరడానికి వస్తే ఆపేశానని తెలిపారు. దేవస్థానానికి ఆర్టీఐ వర్తించే విషయమై అంతగా అవగాహన లేదని, ఏపీ పోలీస్ అధికారిని హనుమంతుడి ఆలయం వరకు మాత్రమే పంపామని వివరించారు. చదవండి: Telangana: భారీ వర్షాలు.. బహుపరాక్! -
పడవెక్కి భద్రాద్రి పోదామా..!
భద్రాద్రి రామయ్యను దర్శించాలంటే.. నల్లని నునుపైన తారురోడ్డు మీద.. బస్సులు, కార్లు, వ్యాన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రయ్‌మంటూ దూసుకుపోవడమే ప్రస్తుతం చాలామందికి తెలుసు. ఏదో వెళ్లాం వచ్చాం అన్నట్టే తప్ప.. ఇటువంటి ప్రయాణం పూర్తి ఆనందాన్నిస్తుందని చెప్పలేం. కానీ.. అదే ప్రయాణం– మంద్రంగా వీచే గాలి తరగలు తనువును సుతారంగా స్పృశిస్తుండగా.. గోదావరి అలల తూగుటుయ్యాలపై.. ‘లాహిరి లాహిరి లాహిరి’లో అన్నట్టుగా.. కనులను కట్టిపడేసే ప్రకృతి అందాల నడుమ.. హాయిహాయిగా.. సాగితే.. ఆ అనుభూతి ఎప్పటికీ పదిలమే. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ‘పడవెక్కి భద్రాద్రి పోదామా.. భద్రాద్రి రాముడిని చూద్దామా..’ అని పాడుకుంటూ వెళ్లే ఆనంద క్షణాలు త్వరలోనే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా గోదావరిపై జల రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరిలో లాంచీపై ప్రయాణం అంటే ఎవ్వరికైనా ఆనందదాయకమే. చిన్నారులకు, కుర్రాళ్లకైతే మరీ ఉత్సాహం. కానీ, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో లాంచీల్లో ప్రయాణమంటేనే వెనకడుగు వేయాల్సిన దుస్థితి. గతంలో కచ్చులూరు వద్ద పర్యాటక బోటు బోల్తా పడిన ఘోర ప్రమాదంలో 58 మంది మృత్యువాత పడిన విషయం ఇంకా కన్నుల ముందే కదలాడుతోంది. ఈ ప్రమాదం తరువాత రాష్ట్ర ప్రభుత్వం నదిలో ప్రమాద రహిత ప్రయాణానికి పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాజమహేంద్రవరం నుంచి పాపికొండలు పర్యాటకానికి తెర పడుతుందని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, అటువంటి అనుమానాలకు తావు లేకుండా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ సంకల్పించింది. చదవండి: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఇందులో భాగంగానే నాలుగు దశాబ్దాల కిందట ఆగిపోయిన జలరవాణాను పునరుద్ధరించే దిశగా చర్యలు ఆరంభిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జల రవాణాను ప్రోత్సహించేందుకు ‘సాగరమాల’ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తోంది. అదే తరహాలోనే ఖమ్మం, భద్రాచలం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు గిరిజన గ్రామాల్లో అటవీ ఉత్పత్తుల తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం అఖండ గోదావరిపై జలరవాణా చేపట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా పోలవరం – పోచవరం మధ్య జలరవాణాకు అనువైన పరిస్థితులపై బాథ్ మెట్రిక్ సర్వేకు ఇటీవల ఆదేశించింది. ఇందుకు రూ.45 లక్షలు కేటాయించింది. దీంతో రాజమహేంద్రవరం – భద్రాచలం మధ్య జల రవాణాకు మొదటి అడుగు పడినట్టయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే భద్రాద్రి రాముడిని దర్శించుకోవాలనుకునే వారు కూడా త్వరలో మళ్లీ గోదావరిపై లాంచీల్లో వెళ్లి వచ్చే అవకాశం కలగనుంది. తెల్లవారకుండానే ప్రయాణం అప్పట్లో భద్రాచలం వెళ్లే లాంచీ రాజమహేంద్రవరంలో తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరేది. దేవీపట్నం మండలం కొండమొదలుకు మధ్యాహ్నం 12 గంటలకు, అక్కడి నుంచి భద్రాచలానికి సాయంత్రం ఆరు గంటలకు చేరుకునేది. ప్రారంభంలో రూపాయి, ఐదు రూపాయలు ఉండే చార్జీ జల రవాణా ముగిసిపోయే నాటికి రూ.100కు చేరింది. ఒక లాంచీలో ట్రిప్పునకు 70 నుంచి 80 మందిని తీసుకువెళ్లేవారు. అటు గోదావరిలో ప్రయాణం మాదిరే ఇటు ధవళేశ్వరం నుంచి కోనసీమలోని పంట కాలువల్లో కూడా లాంచీలు, పడవలపై ప్రయాణం సాగేది. అప్పట్లో రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్ సరిహద్దు వరకూ మొత్తం అంతా గోదావరి పైనే రవాణా. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి కుంట (ఛత్తీస్‌గఢ్) వరకూ మధ్యలో ఉన్న గిరిజన పల్లెలకు నిత్యావసర వస్తువులు, అటవీ ఉత్పత్తుల తరలింపునకు జల రవాణాయే ఆధారం. భద్రాచలం దాటిన తరువాత దుమ్ముగూడెం వద్ద ఆనకట్ట పైనుంచి వెంకటాపురం వరకూ ఐదారు లాంచీలు తిరిగేవి. రాజమహేంద్రవరం నుంచి కూనవరం వరకూ లాంచీ ప్రయాణం చేస్తే.. అక్కడి నుంచి ప్రైవేటు బస్సులలో ప్రయాణించేవారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం నుంచి మహారాష్ట్ర వరకూ 10 లాంచీలు, రాజమహేంద్రవరం – ఛత్తీస్‌గఢ్‌లోని సాలాపూర్ మధ్య నాలుగు, పోలవరం, దేవీపట్నం, కొండమొదలు వరకూ రెండు లాంచీల చొప్పున నడిచేవి. భద్రాచలం సహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ గ్రామాల నుంచి పడవల మీద వెదురు, పొగాకు, తునికాకు, పసుపు, మిర్చి వంటి సరకులు తరలింపు జల రవాణా పైనే జరిగేది. సామర్థ్యాన్ని బట్టి ఒక్కో లాంచీపై 25 టన్నుల వరకూ రవాణా చేసేవా రు. ఇందుకు బస్తాకు 75 పైసల నుంచి రూపాయి వరకూ తీసుకునేవారు. గోదావరిపై రాజమహేంద్రవరం వద్ద రోడ్ కం రైలు బ్రిడ్జి, శబరి నదిపై చింతూరు – చట్టి మధ్య, గోదావరిపై భద్రాచలం – సారపాక మధ్య వంతెనల నిర్మాణం జరిగిన జలరవాణాకు క్రమంగా ఆదరణ తగ్గిపోయింది. 1978కి ముందే.. రాజమహేంద్రవరం నుంచి పోచవరం వరకూ రోడ్డు మార్గంలో దూరం160 కిలోమీటర్లు. అదే గోదావరి జల మార్గంలో 100 కిలోమీటర్లు మాత్రమే. అంటే 60 కిలోమీటర్లు తక్కువ. గతంలో రోడ్డు సౌకర్యం లేనప్పుడు గోదావరి జిల్లాల్లోని 100 గ్రామాలకు జల రవాణాయే దిక్కు. 1978కి ముందే గోదావరిలో జల రవాణా ఉంది. రాజమహేంద్రవరం నుంచి కూనవరం, భద్రాచలం, కుంట వరకూ ప్రతి రోజూ 80 నుంచి 100 లాంచీలపై ప్రజల రాకపోకలకు, నిత్యావసరాల తరలింపునకు జల రవాణా తప్ప ప్రత్యామ్నాయం ఉండేది కాదు. మారేడుమిల్లి రోడ్డు నిర్మించిన తరువాత ఆ మార్గంలో కలప, వెదురు రవాణా మాత్రమే జరిగేవి. 1986లో తారు రోడ్డు వేశాక రాజమహేంద్రవరం నుంచి బస్సు సర్వీసు ఏర్పాటుతో లాంచీ ప్రయాణాలు తగ్గాయి. అలా 80వ దశకం వరకూ జల రవాణా సాగింది. పూడికలు తెలుసుకునేందుకు.. నీటి లోపలి స్వరూపాన్ని అంచనా వేసేందుకు, ఇసుక, పూడిక ఎంతవరకూ ఉన్నయో తెలుసుకునేందుకు బాథ్ మెట్రిక్ సర్వే నిర్వహిస్తాం. ఎక్కడ లోతు ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉందనే విషయాలు కూడా సర్వే ద్వారా తెలుస్తాయి. దీనివలన పడవల రాకపోకలకు ఏ మేరకు అనువుగా ఉందో అంచనా వేయవచ్చు. జల రవాణాకు ఇబ్బందులు లేకుండా ఈ సర్వే సహాయ పడుతుంది. – ఆర్.మోహనరావు, హెడ్‌వర్క్స్ ఈఈ, ధవళేశ్వరం లాంచీ ఓనర్ అంటే ఆ రోజుల్లో ఎంతో గౌరవం 1983లో ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. అప్పట్లో నాకు 16 సంవత్సరాలు. ఇప్పుడు 55 సంవత్సరాలు. జల రవాణాను మూడు దశాబ్దాలు చూశాను. లాంచీ ఓనర్ అంటే మండల ప్రెసిడెంట్, పంచాయతీ ప్రెసిడెంట్లా ప్రజల్లో మంచి గౌరవం, ఆదరణ ఉండేది. ప్రయాణికుడికి రూపాయి నుంచి రూ.100 చార్జీ వరకూ నేను చూశాను. తక్కువ చార్జీ చేసినప్పటికీ ప్రయాణంలో ఉచితంగా భోజనాలు పెట్టేవాళ్లం. అప్పట్లో తక్కువ ఆదాయం వచ్చినప్పటికీ ఆ శాటిస్ఫేక్షన్ వేరుగా ఉండేది. ఇప్పుడు వేలు ఆర్జిస్తున్నా ఆ రోజుల్లో ఉన్న శాటిస్ఫేక్షన్ లేదు. – పాదం వెంకట రమణమూర్తి (బుల్లు), లాంచీల యజమాని, పట్టిసీమ -
త్వరలో దైవ దర్శనం ?
భద్రాచలంటౌన్: కరోనా ప్రభావం మనుషులతో పాటు దేవుళ్లకూ తాకింది. గత రెండు నెలలుగా ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. దీంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆన్లైన్లో ఆర్జిత సేవలకు అవకాశం కల్పించినా.. కనులారా భగవంతుడిని చూడకుండా పూజలు చేస్తే ఫలితం ఏంటని వాపోతున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలకు కొన్ని సడలింపులు ఇచ్చి, బస్సులు నడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నదేవాలయాలను ఆదుకునేందుకు ఎండోమెంట్ అధికారులు చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాలుగో దశ లాక్డౌన్ పూర్తి కానున్న నేపథ్యంలో జూన్‌లో ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశం కల్పించే అవకాశం, ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించినట్లు సమాచారం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాల్లో పాటించాల్సిన విధి,విధానాలపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. పూజలకు అవకాశమిస్తే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పాటు ఎక్కువ సమయం ఒకేచోట ఉంటారని, తద్వారా భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదని యోచిస్తున్నారు. అందుకే దైవ దర్శన భాగ్యం మాత్రమే కల్పించాలని భావిస్తున్నారు. గదులు అద్దెకివ్వరు.. వేసవి సెలవుల్లో భద్రాచలం రామాలయానికి నిత్యం 15 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్ టన్నెల్ ద్వారా ఆలయం లోపలకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్గదర్శకాలను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో 27 కాటేజీలు, 140 గదులు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గదులు అద్దెకిస్తే భౌతిక దూరం పాటించే అవకాశం ఉండదని, గదులు అద్దెకిస్తే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఒకటి, రెండు రోజులు ఉంటారని, అందుకే గదులు అద్దెకు ఇవ్వవద్దని యోచిస్తున్నారు. -
కమనీయం.. సీతారాముల కల్యాణం..
శ్రీరామనవమి వేడుకలు ఆదివారం జిల్లాలో కనులపండువగా సాగాయి. రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. బాజాభజంత్రీలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. జగదభిరాముడి కల్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. జిల్లా కేంద్రంలోని రామగిరిలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్య కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్లగొండ కల్చరల్ : రెండో భద్రాచలంగా పేరుగాంచిన జిల్లా కేంద్రంలోని రామగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయం ఆవరణలో ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణ కమనీయంలా సాగింది. మందుగా సేవపై స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఆలయం నుంచి కల్యాణ వేదిక వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీటలపై ప్రతిష్టింపజేశారు. ముందుగా విశ్వక్సేనారాధన నిర్వహించి కల్యాణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగింపజేయాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు రక్షాబంధనాలను సీతా అమ్మవారి, రాముల వారి ముంజేతికి అలంకరింపజేశారు. సుముహూర్తం ప్రారంభం కాగానే అర్చకులుల అమ్మవారి, స్వామివారి తలలపై జీలకర్రబెల్లం అలంకరించారు. మంగళసూత్రాన్ని భక్తులకు దర్శింపజేసి రాములవారి చేతులకు తాకించి సీతాదేవి మెడలో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు జయజయధ్వానాలు పలికారు. చివరగా తలంబ్రాలను సీతారాముల తలలపై ఉంచి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని ముగింపజేశారు. అంతకుముందు ఉదయం అమ్మవారికి, స్వామివారికి కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ నివాసం, నల్లగొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి నివాసావాల నుంచి పట్టువస్త్రాలను మంగళవాద్యాలతో తోడ్కొని వచ్చి అమ్మవారికి, స్వామివారికి అలంకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి–రమాదేవి దంపతులు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, ఆలయ ఈఓ ముకిరాల రాజేశ్వరశర్మ, ఆలయ స్థానాచార్యులు శ్రీరంగాచార్యులు, భక్తులు చకిలం వేణుగోపాల్‌రావు, సంధ్యారాణి, అక్కెనెపల్లి పద్మ, బుక్కా ఈశ్వరయ్య, మునాస వెంకన్న, జీనుగు జ్యోతి, ప్రధాన అర్చకులు సముద్రాల యాదగిరియాచార్యులు, శఠగోపాలాచార్యులు, రఘునందన భట్టాచార్ పాల్గొనగా కార్యక్రమాన్ని భక్తులకు తన వ్యాఖ్యానంతో కన్నులకు కట్టినట్లు శ్రీరంగంలోని శ్రీ రంగనాథుడి ఆలయం స్థానాచార్యులు పరాశర లక్ష్మీనర్సింహాచార్యులు వివరించారు. భక్తులకు మంచినీటి సౌకర్యం.. కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులు నల్ల గొండ గీతా విజ్ఞాన్ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ, మంచినీరు సరఫరా చేశారు. రామాలయం వలంటీర్లు భక్తుల వద్దకు వెళ్లి గోత్ర నామాలను రాసుకుని, వారందించే కట్నకానుకలను నమోదు చేసుకున్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో భక్తులకు ఓఆర్‌హెచ్ ప్యాకెట్లను, జ్వరం మాత్రలను, ఇతర మందులను అందజేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం ధనలక్ష్మి, ఆశా వర్కర్ విజయలక్ష్మి తదితరలు పాల్గొన్నారు. -
కల్యాణం.. వైభోగం
ఇల్లందకుంట(హుజూరాబాద్): అపర భద్రాద్రి ఇల్లందకుంటలో సీతారాముల కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఉదయాన్నే ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిలో ఊరేగించారు. స్వామి వారిని ఎదుర్కోళ్లు నిర్వహించారు. వేడుకల్లో మహిళల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రభుత్వం తరఫున కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఈవో సుదర్శన్ స్వామివారికి సమర్పించిన పట్టు వస్త్రాలను పూజారులు ఉత్సవ మూర్తులకు అలంకరించారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైకి మేళతాలాలతో తీసుకొచ్చారు. అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, శేషం సీతారామాచార్యులు వేదమంత్రోశ్ఛారణ మధ్య కల్యాణం తంతు ప్రారంభించారు. మొదట స్వామివారికి యజ్ఞోపవీతం చేయించారు. అభిజిత్ లగ్న సుముహూర్తమున మధ్యాహ్నం 12:30 గంటలకుసీతారాములకు జీలకర్రబెల్లం కార్యక్రమాన్ని జరిపించారు. వేలాది మంది భక్తుల శ్రీరామానామ స్మరణ మధ్య రామయ్య సీతమ్మవారికి తాళి కట్టారు. నేత్రపర్వంగా సాగిన ఈ వేడుకను తిలకించిన భక్తజనం పులకించిపోయారు. ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మారుమోగింది. ప్రముఖుల హాజరు.. ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణానికి జిల్లాలోని అందరు అధికారులు హాజరై స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేడకలకు హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్–జమున దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌లాల్, కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, ప్యాట రమేష్, తుమ్మేటి సమ్మిరెడ్డి, సర్పంచ్ కంకణాల శ్రీలత, ఎంపీటీసీ రామ్‌స్వరణ్‌రెడ్డి, రాష్ట్ర సహకార సంఘూల అధ్యక్షుడు తక్కళ్లపల్లి రాజే«శ్వర్రావు, మాజీ మార్కెట్ చైర్మన్ పింగిళి రమేశ్, చుక్కా రంజిత్, దేశిని కోటి, ఎంపీపీ గంగారపు లత, జెడ్పీటీసీ అరుకాల వీరశలింగం, రామ్ నర్సింహారెడ్డి, జిల్లా వైద్యధికారి రామ్‌మనోహర్‌రావు, తదితరులు హాజరై పూజలు చేశారు. భారీగా బందోబస్తు.. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచే బైపాస్ రూట్లలో వాహనాలను మళ్లించారు. వీఐపీ పాసులు ఉన్నప్పటికీ భక్తుల అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు కొంత మందిని అడ్డుకోవడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రొటోకాల్ ప్రకారం ముందు అనుకున్న ప్రకారమే మంత్రులు, ఎమ్మెల్యేలతో కొంత మందిని మాత్రమే లోపలికి పంపించి మిగతా వారిని ఆపివేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కల్యాణం వేడుకలు సజావుగా జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు. మహా అన్నదానం.. శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. వేడుకలకు హాజరైన భక్తులకు జమ్మికుంట రైస్ మిల్లర్స్, కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యాక్రమం నిర్వహించారు. అందరికీ సరిపడా భోజనాలు చేయించారు. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. సామాజిక సేవ.. వేసవి కాలం కావడం, ఎండ ఎక్కువగా ఉండడంతో ఇల్లందకుంట పీహెచ్సీ ఆధ్వర్యంలో ముందస్తుగానే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవా సంస్థ, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ పాఠశాలల విద్యార్థులు కళ్యాణ మండపంలో మంచి నీటిని, మజ్జిగను పంపిణీ చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మజ్జిగ ట్యాంకర్‌ను పంపించగా, ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తాగునీరు సరఫరా చేశారు. -
పులకించిన భద్ర‘గిరి’
సాక్షి, భద్రాచలం: భద్రాచలం రామాలయ ప్రాంగణం గిరిపుత్రులతో జనసందోహంగా మారింది. శబరి మాత వంశీయుల గిరి ప్రదర్శనతో భద్రగిరి, రామాలయ మాడ వీధులు పులకించిపోయాయి. భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శబరి స్మృతి యాత్ర ఉత్సవం బుధవారం వైభవోపేతంగా జరిగింది. వాల్మీకి జయంతి సందర్భంగా మొదట చిత్రకూట మండపం వద్దనున్న వాల్మీకి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఐటీడీఏ పీఓ, ఆలయ ఈఓ అయిన పమెల సత్పథి శబరి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించి, హారతి సమర్పించారు. శబరి మాత చిత్రపటంతో గిరిజనులు సంప్రదాయ కోలాటాలు, రేలా నృత్యాలు, కొమ్ము, కోయ డ్యాన్సులతో గిరి ప్రదక్షిణ చేశారు. మార్గమధ్యలో ఉన్న తూము నర్సింహదాసు, భక్త రామదాసు, శబరి మాత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మేళతాళాలు, అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ శబరి నది నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జలాలతో ధ్వజస్తంభానికి అభిషేకం చేశారు. మహిళలు పసుపు, కుంకుమ ముగ్గులను వేసి బలిపీఠం కార్యక్రమాన్ని జరిపారు. వేడుక కోసం ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాల పుష్పాలు, పండ్లతో గిరిజనులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రామయ్యకు పుష్పార్చన.. శ్రీసీతారామచంద్రస్వామి వారికి పుష్పార్చన అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఉత్సవ మూర్తులను, శబరి మాత చిత్రపటాన్ని గర్భగుడి నుంచి ఊరేగింపుగా చిత్ర కూట మండపానికి తీసుకొచ్చారు. గిరిజన భక్తులు వేడుకగా ఫల, పుష్పాలను అక్కడికి తీసుకొచ్చారు. వీటిని స్వామివారి ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు అర్చకులు, వేద పండితులు ‘శ్రీరామ సంపుటి’(శ్రీరామ నామ జపం) నిర్వహిస్తూ స్వామికి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు ఉచ్ఛరించిన ‘శ్రీరామాయనమః’ నామ స్మరణతో బేడా మండపం మార్మోగింది. అనంతరం పుష్పాలు, ఫలాలతో సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామికి వైభవంగా అర్చన నిర్వహించారు. కోలాహలంగా గిరిపుత్రుల ప్రదర్శన.. శబరి చిత్రపటంతో గిరిజనులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. రామాలయం నుంచి బ్రిడ్జి సెంటర్‌కు, తర్వాత బస్టాండ్ మీదగా అంబేడ్కర్ సెంటర్ వరకు వెళ్లి అక్కడ కొమ్ము నృత్యాలు చేశారు. గిరిజనుల కొమ్ము, కోయ నృత్యాలు భక్తులను, పట్టణవాసులను ఆకట్టుకున్నాయి. వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన గిరిజనులకు దేవస్థానం ద్వారా ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించి, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్‌కుమార్, డీఈ పాల్గొన్నారు. -
భద్రాచలంలో పోకల దమ్మక్క సేవాయత్ర ప్రారంభం
-
రామయ్యను దర్శించుకున్న ఎంపీ వినోద్‌కుమార్
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వినోద్ కుటుంబసభ్యులు.. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయా రు అమ్మవారు, అభయాంజనేయ స్వామి వారి ఆలయాలను కూడా దర్శించుకొని పూజలు చేశా రు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలోనే గొప్పగా భద్రాద్రి
ఖర్చుకు వెనకాడకుండా తీర్చిదిద్దుతాం: కేసీఆర్ - భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం - కొత్తగూడెం–భద్రాచలం మధ్య విమానాశ్రయం సాక్షి, హైదరాబాద్: దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా అవతరించేలా భద్రాద్రిని అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఖర్చు విషయంలో వెనకాడకుండా క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి మలుపు తిరిగి తూర్పుగా ప్రవహిస్తుందని, కొంతదూరం తర్వాత ఉత్తర వాహినిగా మారుతుందని.. శ్రీరాముడు పశ్చిమ దిక్కు నుంచి తూర్పునకు వచ్చి ఇదే ప్రాంతంలో నడయాడాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి అంశంపై కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ఇందులో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, భద్రాచలం ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణ తుది నమూనాకు సీఎం కేసీఆర్ కొన్ని సూచనలు చేశారు. దేవాలయానికి ఉత్తర, పడమర దిక్కున ఉన్న స్థలాలను కలుపుకొని 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. దేవాలయ ప్రాంగణంలోనే కల్యాణ మంటపం, షాపింగ్ కాంప్లెక్స్, భక్తులు సేదతీరే ప్రాంతాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. గర్భగుడి, ఇతర ప్రధాన కట్టడాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అన్ని సదుపాయాలు కల్పించాలి శ్రీరామచంద్రుడు కొలువై ఉన్న భద్రాచలానికి ఇతర రాష్ట్రాలతోపాటు వేరే దేశాల నుంచి కూడా భక్తులు వస్తారని, సీతారామ కల్యాణం సందర్భంగా లక్షల సంఖ్యలో దర్శించుకుంటారని కేసీఆర్ పేర్కొన్నారు. అలా లక్షలాది మంది తరలివచ్చినా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి, దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. ‘‘భక్తులు భద్రాచలానికి రావడానికి అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నాం. కొత్తగూడెం–భద్రాచలం మధ్య విమానాశ్రయం నిర్మిస్తున్నాం. కొత్తగూడెం వరకు ఉన్న రైలుమార్గాన్ని భద్రాచలం వరకు పొడిగించాలని ఇప్పటికే రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపాం. గోదావరి, ప్రాణహిత నదుల వెంట రహదారిని నిర్మించడం వల్ల మహారాష్ట్ర వరకు రోడ్డు సౌకర్యం కలుగుతుంది. ఏపీ రాజధాని అమరావతి, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలను కలిపే రహదారులు నిర్మిస్తున్నాం. గోదావరి నదిపై ప్రస్తుతమున్న బ్రిడ్జితో పాటు మరో వంతెన నిర్మిస్తున్నాం. నదిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండే విధంగా ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. యాత్రికులు పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. అన్ని విధాలా భద్రాద్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం..’’అని కేసీఆర్ వెల్లడించారు. అర్చకుల వేతనాలపై 15న ప్రకటన తమ వేతనాల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు, ఆలయ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో... ఈ అంశంపై కూడా బుధవారం భేటీలో చర్చించారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లింపు విధానం, వేతన స్థిరీకరణ, ధూపదీప నైవేద్యం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ వాకబు చేశారు. దీనిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపైనా చర్చించారు. ఇక జాప్యం లేకుండా ఈ అంశాన్ని కొలిక్కి తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడిన సీఎం.. 15వ తేదీన స్వయంగా ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు. ఆ రోజున ప్రగతిభవన్‌లో దేవాలయ ఉద్యోగులు, అర్చకుల సమక్షంలోనే వేతన అంశాన్ని వెల్లడిస్తామని చెప్పారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాల చెల్లింపు కోసం ప్రత్యేకనిధి ఏర్పాటు చేయాలని గతంలోనే మంత్రుల కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వోద్యోగుల తరహాలో ప్రతినెలా ఒకటో తేదీనే వారి ఖాతాల్లో వేతనాలు జమయ్యేలా చూడాలని సూచించింది. వీటినే సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్టు సమాచారం. దీనితోపాటు ధార్మిక పరిషత్ ఏర్పాటు అంశాన్ని కూడా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దీంతో ఆరోజు భారీ సంఖ్యలో ఆలయ ఉద్యోగులు, అర్చకులను ప్రగతిభవన్‌కు తరలించేందుకు అర్చక, ఉద్యోగ జేఏసీ నేతలు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈనెల 15న ఉదయం 10 గంటల కల్లా అర్చకులు, ఆలయ ఉద్యోగులు నల్లకుంట రామాలయానికి చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా ప్రగతి భవన్‌కు చేరుకోనున్నట్టు జేఏసీ చైర్మన్ భానుమూర్తి తెలిపారు. ఇక బాసర అభివృద్ధి రాష్ట్రంలో మరిన్ని దేవాలయాలను అభి వృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. యాదాద్రి, భద్రాద్రి తరహాలోనే వేములవాడ అభివృద్ధికి ఇప్పటికే చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో... గోదావరి తీరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. వెంటనే బాసరకు స్థపతులను పంపి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఆలయాల పరిరక్షణకు చర్యలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత దేవాలయాల విషయంలో చాలా నిర్లక్ష్యం, వివక్ష నెలకొన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేవాలయాల నిర్వహణలో, అర్చకులకు జీతాలు చెల్లించే విషయంలో అన్యాయం జరిగిందన్నారు. పూర్వకాలంలో మహారాజులు, జాగీర్దార్లు దేవాలయాలకు భూములు ఇచ్చారని.. ప్రభుత్వం ఆ భూములపై అజమాయిషీ చేస్తున్నదే తప్ప కొత్తగా భూములిచ్చిందేమీ లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తమ ప్రభుత్వం యాదాద్రి, వేములవాడ ఆలయాలకు భూములు ఇచ్చిందని.. అలాగే భద్రాద్రికి కూడా భూములు ఇస్తామని తెలిపారు. దేవాలయాల అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నామన్నారు. దేవాలయ భూముల పరిరక్షణ, ఆలయాల పరిరక్షణ జరగాలని పేర్కొన్నారు. -
నగల మాయంపై మరో కోణం!
విచారణకు రమ్మంటూ ఆలయ సిబ్బందికి పిలుపు అవుట్ సోర్సింగ్ అర్చకుల నుంచి వివరాలు సేకరణ హైదరాబాద్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలున్నట్లు ప్రచారం భద్రాచలం: రామాలయంలో నగల మాయంపై విచారణ మళ్లీ మొదటికొచ్చింది. నివేదిక సిద్ధమవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో ఆలయ సిబ్బందిని కూడా విచారణకు పిలవటంతో ఇది ఇప్పట్లో తేలేలాలేదని భక్తులు అంటున్నారు. ఆలయంలో పనిచేసే ఇద్దరు అవుట్ సోర్సింగ్ అర్చకులను తన చాంబర్లో విచారించారు. నగల మాయమై, తిరిగి ప్రత్యక్షమైన రోజు వరకూ అసలేం జరిగిందనే దానిపై అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఇద్దరు అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అర్చకులు తెలిపిన వివరాలను రికార్డు చేయటంతో పాటు, వారి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అదేవిధంగా ఆలయ సూపరింటెండెంట్ నర్సింహరాజు, మరో ఇద్దరు ఉద్యోగులు రామారావు, సాయిబాబాలను కూడా విచారణకు హాజరు కావాలని విచారణాధికారి రవీందర్ వారికి నోటీసులు అందజేశారు. ఇప్పటి వరకూ ఇద్దరు ప్రధానార్చకులతో పాటు, 11 మంది అర్చకుల నుంచి వివరాలను సేకరించిన డీఈ రవీందర్ వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నేడో, రేపో నివేదికను ఈవో రమేష్‌బాబుకు అందజేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ మరికొంత మంది ఉద్యోగులను కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించటంతో ఇది మరికొంతకాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగదీతలో ఆంతర్యమేమిటో.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నగల మాయంలో దోషులెవరో తెలుసుకునేందుకు భక్తులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సీతమ్మ వారి పుస్తెలతాడును మాయం చేసి పది రోజుల తరువాత అక్కడ పెట్టినప్పటికీ, అది వాస్తవమైనది కాదనే ప్రచారం ఉంది. మాయమైన రెండు బంగారు నగలు అమెరికాకు తరలించి వాటి స్థానంలో కొత్తవి చేయించి పెట్టారని అర్చకుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీసీతారాముల ఉత్సవమూర్తులను బేరం పెట్టింది మొదలు, నగల మాయం వరకూ జరిగిన మొత్తం ఎపిసోడ్లో ’ప్రధాన’ భూమిక పోషించిన అర్చకుడికి, హైదరాబాద్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీనిని ఏదో రీతిన మరుగనపరిచి, నగల మాయం వ్యవహారాన్ని భక్తులు మరిచిపోయేలా చేసేందుకే విచారణను సాగదీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పెద్దఎత్తున దుమారం రేపిన నగల మాయంలో వాస్తవాలు బయటకు వచ్చేలా విచారణను ఏదో ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించకుండా, ఆలయంలో పనిచేసే అధికారితో మమ అనిపించేలా ఉన్నతాధికారులే తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా భక్తులు అంటున్నారు. -
'భద్రాద్రిలో నగల మాయంపై విచారణ చేపట్టాలి'
హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి వారి ఆలయం లో సీతమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మణస్వామి మెడలోని బంగారు లాకెట్ మాయమయ్యాయి. ఈ నగల అదృశ్యంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలయాన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు. తాను ఈ విషయం మీద తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. వెంటనే ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. -
టెంపుల్ సిటీగా భద్రాచలం: కేసీఆర్
హైదరాబాద్: యాదగిరిగుట్ట తరహాలో భద్రాచలంను టెంపుల్ సిటీగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. బుధవారం భద్రాచలం ఆలయ అభివృద్ధిపై కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రాచలంలో సీతారాముల ఆలయం చుట్టూ ఉన్న రహదారులను మాడవీధులుగా తీర్చిదిద్దే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. మహాలక్ష్మి, ఆండాళ్ అమ్మవార్ల దేవాలయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. పర్ణశాల, చిత్రకూట మంటపం, జఠాయువు మంటపాన్ని తీర్చిదిద్దాలని కేసీఆర్ చెప్పారు. -
అమ్మకానికి రాములోరి విగ్రహాలు..!
♦ జార్జియాకు ‘పంచలోహా’లు ♦ ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం ♦ నేడో, రేపో శ్రీరామా నిలయం అప్పగింత భద్రాచలం: ఏళ్లుగా శ్రీరామ ప్రచారరథంలో ఊరేగుతూ, భక్తుల పూజలందుకున్న సీతారామలక్ష్మణ సమేత పంచలోహ విగ్రహాలు యూఎస్ఏలోని జార్జియాకు తరలిపోనున్నాయి. ఈ విగ్రహాలను అక్కడ నిర్మిస్తున్న రామాలయానికి అమ్మేందుకు ఆలయ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. చరిత్ర కలిగిన భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో గర్భగుడిలోని సీతారామలక్ష్మణ సమేతంగా ఉన్న మూలమూర్తులను పోలిన రెండు జతల పంచలోహ విగ్రహాలను గతంలో తయారు చేయించారు. అందులో ఒకదానిని శ్రీరామ ప్రచార రథంలో ఉంచగా, మరొకటి మొన్నటి వరకు ఈవో చాంబర్లో ఉండేది. రెండేళ్ల క్రితం చింతూరు మండలంలో జరిగిన ప్రమాదంలో శ్రీరామరథం పూర్తిగా ధ్వంసమైంది. కొత్త రథాన్ని తయారు చేయించకపోవడంతో అందులోని పంచలోహ విగ్రహాలను యాగశాలలో ఉంచారు. ప్రస్తుతం ఆ విగ్రహాలు రామాలయ ప్రాంగణంలోని గోశాల పక్కన ఉన్న ఆంజేయ స్వామి ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు. కాగా, యూఎస్ఏలోని జార్జియాలో భద్రాద్రి ఆలయం ఆకృతిలోనే ‘ శ్రీ సీతారామ టెంపుల్ ఆఫ్ జార్జియా’ పేరిట ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వచ్చిన ప్రతినిధులు భద్రాచలం దేవస్థానంలో ఉన్న పంచలోహ విగ్రహాలను తమకు ఇవ్వాలని కోరారు. విగ్రహాలు ఇస్తే దేశవ్యాప్తంగా ఉన్న 108 ప్రధాన ఆలయాల్లో వాటి కి పూజలు చేయించి, తాము నిర్మించే రామాలయంలో ప్రతిష్ఠించుకుంటామని కోరారు. అందుకు ప్రతిగా వేరే విగ్రహాలు చేయించి అందజేస్తామని, తగిన పారితోషికం ఇస్తామని చెప్పారు. దీనిపై దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి ఇక్కడి వైదిక కమిటీ సలహా కోరారు. ఈ క్రమంలో విగ్రహాలను జార్జియాకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఒక్కొక్కటీ ప్రైవేటుపరం.. భద్రాచలం రామాలయానికి ఏటా రూ.25 కోట్ల మేర ఆదాయం సమకూరుతోంది. ఉత్సవాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు ఇం దులో నుంచే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆలయాభివృద్ధి జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని సాకుగా చూపుతూ దేవస్థానానికి సంబంధించిన పలు నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. గతంలో భక్తరామదాసు జయంతోత్సవాలను ఐదు రోజులు కూడా ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. తాజాగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న శ్రీరామనిలయం (60 గదులతో ఉన్న సత్రం)ను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు యోచిస్తున్నారు. ఇలాంటి చర్య లు నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.. జార్జియా నుంచి ప్రతినిధులు పంచలోహ విగ్రహాలు కావాలని కోరారు. దీనిపై వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. శ్రీరామనిలయం సత్రం నిర్వహణ భారంగా ఉంది. దాని ఆదాయ వ్యయాలపై లెక్కకట్టి ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నాం. -కూరాకుల జ్యోతి, ఆలయ ఈవో -
నేడే ‘మహా’ ముగింపు
వెల్లువలా తరలివస్తున్న భక్తజనం ♦ ఆఖరి రోజు అధికారులు అప్రమత్తం ♦ అంత్యపుష్కరాల వరకూ మంచి రోజులేడ భద్రాచలం నుంచి సాక్షి బృందం : పన్నెండు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన గోదావరి పుష్కరోత్సవం శనివారంతో ముగియనుంది. పుష్కరోత్సవంలో గోదావరి నదిలో స్నానమాచరిస్తే ఎంతో పుణ్యం సిద్ధిస్తుందనే అపార నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆఖరి రోజు వేడుకల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. 14న భద్రాచలంలో త్రిదండి చినజీయర్ స్వామివారు గోదావరి పుష్కరాలను ప్రారంభించారు. 11 రోజులుగా పుష్కర స్నానం కోసం తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. జిల్లాలోని ఎనిమిది పుష్కర ఘాట్ల ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి. జిల్లాలో గోదావరి నది ప్రవేశించే వాజేడు మండలం లొట్టపిట్టగండి (టేకులగూడెం) మొదలుకొని భద్రాచలంకు దిగువన జిల్లా సరిహద్దుగా ఉన్న పురుషోత్తపట్నం వరకు గోదావరి తీరంలో ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. గోదావరి పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. జిల్లాలోని రామచంద్రాపురం, పర్ణశాల, భద్రాచలం, మోతె, చినరారుుగూడెం, కొండాయిగూడెం ఘాట్ల వద్ద భక్తుల సందడి నెలకొంది. ఇప్పటికే స్నానమాచరించిన వారు పుష్కరోత్సవం ముగింపు రోజున గోదావరిలో స్నానమాచరించాలని, ఇప్పటి వరకూ స్నానమాచరించనివారు ఆఖరి రోజున ఎలాగైనా పుణ్యస్నానం చేయాలనే ఆసక్తితో పుష్కర ఘాట్లకు తరలివస్తున్నారు. అంతటా అప్రమత్తం పుష్కరోత్సవం ముగింపు రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పదకొండు రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు పుష్కర స్నానం చేశారు. ఆఖరి రోజున కూడా భక్తులు సౌకర్యవంతంగా స్నానమాచరించి ఇళ్లకు వెళ్లేలా అధికారులు తగిన శ్రద్ధ తీసుకుంటున్నారు. జిల్లాలో పుష్కరాలను విజయవంతంగా ముగించాలనే తపనతో అధికార యంత్రాంగం మిగిలిన ఒక్కరోజుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏడాదంతా శుభమే.. మహా మహిమాన్వితంతో కూడిన గోదావరి పుష్కరాలు ఈ ఏడాదంతా ఉంటాయని భద్రాచలం దేవస్థానం స్థానాచార్యులు స్థలశాయి తెలిపారు. గురువు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. గోదావరి నదికి ఏడాది చివరలో అంత్యపుష్కరాలు నిర్వహిస్తారు. భక్తులు ఈ ఏడాదంతా పుష్కర స్నానం చేయవచ్చని వేద పండితులు చెబుతున్నారు. కృష్ణానదికి పుష్కరాలు వచ్చేంత వరకూ గోదావరిలో పుణ్య స్నానాలు చేయవచ్చని వారు చెబుతున్నారు. అంత్యపుష్కరాల వరకూ అంతా మంచిరోజులేనని దేవస్థానం వేద పండితులు ప్రసాద అవధాని అన్నారు. -
పోటెత్తిన ‘ఘాట్లు’
భద్రాచలం నుంచి సాక్షి బృందం : లక్షల సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో జిల్లా పుష్కరజాతరగా మారింది. వచ్చిపోయే వాహనాలు.. భక్తుల రద్దీతో అన్ని దారుల్లోనూ..భక్తులు, వాహనాలే కనిపిస్తున్నారుు. 8వ రోజు మంగళవారం ఎనిమిది ఘాట్లలో 4.62 లక్షల మంది భక్తులు స్నానమాచరించారు. భద్రాచలంలో భక్తుల రద్దీ నేపథ్యంలో పర్ణశాల, మోతె ఘాట్లకు అధిక సంఖ్యలో జనం తరలడం విశేషం. పర్ణశాల, మోతె ఘాట్లలో రెండు లక్షలకు పైగా భక్తులు వెళ్లి పుష్కర స్నానం చేశారు. భద్రాచలం రామాలయంలో రద్దీ నెలకొంది. క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి స్వామి వారి దర్శనానికి వేచి ఉండటంతో ఆర్జీత సేవలన్నీ నిలిపివేశారు. ఒకే క్యూలైన్లో భక్తులందరినీ ఆలయానికి పంపించారు. అయినా స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరడంతో మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో జిల్లాలోని దారులలో వాహనాల రద్దీ నెలకొంది. భద్రాచలంలో బ్రిడ్జి సెంటర్ నుంచి కూనవరం రోడ్డు వరకు వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. పోలీస్ అధికారులు ఎక్కువ సేపు వాహనాలు రోడ్డుపై నిలిపి ఉంచకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. యాగశాలకు వచ్చిన నాగసాధువులు.. సారపాక వద్ద ఏర్పాటు చేసిన విశ్వశాంతి మహాయజ్ఞం యాగశాలకు 10 మంది నాగసాధువులు, 30 మంది వైష్ణవ సాధువులు తరలివచ్చారు. యజ్ఞ నిర్వహ ణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఉదయం యాగశాలకు చేరుకున్న సాధువులు సాయంత్రం వరకు యాగం నిర్వహించారు. భక్తులు సాధువుల ఆశీస్సులు తీసుకునేందుకు యాగశాలకు తరలివెళ్లారు. సారపాక వద్ద ఏర్పాటు చేసిన మోతె ఘాట్‌కు వీఐపీల తాకిడి పెరిగింది. అధికారులు, వీఐపీలు మోతె ఘాట్‌లోనే స్నానం చేశారు. భద్రాచలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది భక్తులు పర్ణశాలకు తరలివెళ్లారు. మంత్రి తుమ్మల పర్యవేక్షణ భద్రాచలంలోని కరకట్టపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలియతిరిగారు. భక్తులతో మాట్లాడుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏదైనా అసౌకర్యం కలిగిందా..? ఏర్పాట్లు బాగున్నాయా..? అంటూ వారిని పలుకరించారు. ఘాట్ల వద్ద స్వచ్ఛంద సేవలందిస్తున్న వలంటీర్లను అభినందించారు. తుమ్మల వెంట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఉన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు భద్రాచలం, చినరావిగూడెం ఘాట్లను పరిశీలించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, ఇంటిలిజెన్స్ ఐజీ శశిధర్‌రెడ్డి, ఐజీ నవీన్‌చంద్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, ఎస్పీ షానవాజ్‌ఖాసీం రామాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపల్ కార్మికులకు అండగా కాంగ్రె స్ సీఎల్పీ నేత జానారెడ్డి ఖమ్మం/ఖమ్మం సిటీ : మున్సిపల్ కార్మికులకు పనికి తగ్గవేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల కోరిక న్యాయమైందని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ఖమ్మం ము న్సిపాలిటీ కార్యాలయంవద్ద ధర్నా చేస్తున్న ము న్సిపల్ కార్మికులకు మంగళవారం ఆయన సం ఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని, వారి వేతనాలను పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్మికులకే వేతనాలు పెంచుతామని చెప్ప డం విడ్డూరమన్నారు. జానారెడ్డి వెంట పాలే రు, ఖమ్మం ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు కొత్త సీతారాములు, దీపక్‌చౌదరి, నున్నా మాధవరావు, విజయ్‌కుమార్, వడ్డెబోయిన నరసింహారావు, యర్రం బాలగంగాధర్‌తిలక్, భూక్యా బాషా, కుర్రా భాస్కర్ ఉన్నారు. -
పుష్కరాలపై ‘కోటి’ఆశలు
భద్రాచలం : గోదావరి పుష్కరాలు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడతాయని భద్రాచలం దేవస్థానం అధికారులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈవోగా కూరాకుల జ్యోతి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేవస్థానానికి ఆదాయ వనరులు ఎలా పెంచాలనే దానిపై తనదైన శైలిలో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇది వరకే ప్రసాదాల ధరలు, పూజా టి క్కెట్ల ధరలను పెంచిన ఆమె గోదావరి పుష్కరాలతో మరింత ఆదాయం వచ్చేలా దృష్టి సారించారు. ఉన్నతాధికారులు వద్దన్నప్పటికీ, గోదావరి పుష్కరాల సమయంలో శీఘ్ర దర్శనం పేరుతో టిక్కెట్లును ఏర్పాటు చేశారు. అదే విధంగా స్వామి వారి నిత్యకల్యాణం, సహస్ర నామార్చన పూజలు, ఊంజల్ సేవను నిర్వహించేందుకే సిద్ధమయ్యారు. కల్యాణం, సహస్రనామార్చన, ఊంజల్ సేవలకు ఒక్కో దానికి రూ.1000 టిక్కెట్టును నిర్ణయించారు. పుష్కరాల పన్నెండు రోజుల్లో ఎంత లేదన్నా రూ.14 కోట్ల మేర ఆదాయం వచ్చేలా తగిన ప్రణాళిక రూపొందించి, యంత్రాంగాన్ని అప్రమత్తం చే శారు. పై మూడు పూజల ద్వారా పన్నెండు రోజులకు రూ.3.60 కోట్లు రాబట్టేలా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా శీఘ్ర దర్శనం పేరుతో 20 వేల మంది భక్తులకు రూ.200 టిక్కెట్టును విక్రయించటం ద్వారా రూ.4.80 కోట్ల మేర ఆదాయం రానుంది. 20 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3 కోట్లు ఆదాయం లభించనుంది. హుండీల కౌంటింగ్ ద్వారా రూ.3 నుంచి 4 కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.1.70 కోట్లు మాత్రమే భద్రాద్రి దేవస్థానంకు నిధులు మంజూరయ్యాయి. అయితే పుష్కరాలకు పన్నెండు రోజుల పాటు ప్రసాదాల తయారీ, ఇతర మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు ఎంత లేదన్నా రూ.6 కోట్ల వరకూ ఖర్చు రానుంది. ఇది పోను రూ.8 కోట్ల వరకూ ఆదాయం దేవస్థానంనకు మిగిలే అవకాశం ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మిగతా నాలుగు జిల్లాలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లలో తగిన స్థాయిలో నీళ్లు లేకపోవటంతో, భద్రాచలంనకు బాగానే భక్తులు వస్తారని సమాచార ఉన్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు భారీ అంచనాలనే వేస్తున్నారు. -
భద్రాచలంలో బారులు తీరిన భక్తులు
-
రామయ్య చెంతకు ‘కో(గో)టి’ తలంబ్రాలు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం రాముడి పెళ్లికి గోటితో వలిచిన కోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన భక్తులు గోటితో వలిచిన ఈ తలంబ్రాలను మంగళవారం ఆల యంలో సమర్పించారు. ఉభయగోదావరి, వైజాగ్ జిల్లాల నుంచి భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా రామాలయానికి వచ్చారు. తలంబ్రాలను అంతరాలయంలోని మూలమూర్తుల పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. ‘బ్రహ్మోత్సవా’లకు అంకురారోపణం వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురారోపణం చేశారు. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు పవిత్ర గోదావరి నుంచి పుణ్యజలాన్ని తీసుకొచ్చారు. అనంతరం మూలమూర్తుల వద్ద బ్రహ్మోత్సవాలకు అర్చకులు అనుజ్ఞ తీసుకున్నారు. -
భద్రాద్రి రాముడికి భరోసా కరువు!
అందరి బంధువు.. ఆదుకునే ప్రభువు.. అయిన ఆ భద్రాద్రి రాముడికే ప్రభుత్వ ఆదరణ కరువైంది. శ్రీ రాముని కల్యాణానికి అయ్యే నిధులు నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు అందించలేదు. ప్రతి సంవత్సరం భద్రాద్రిలో శ్రీ రామనవమికి కన్నులపండువగా జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వ పెద్దలు హాజరై హడావుడి చేయడం తప్ప, ఖర్చు గురించి పట్టించుకునే వారే లేరు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడంతో కల్యాణానికి అయ్యే ఖర్చు దేవస్థానానికి తలకు మించిన భారం అవుతోంది. ఈనెల 28న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాచల దేవస్థానం అధికారులు ఎప్పటిలాగే దేవస్థానం ఖజానా నుంచే ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర పండుగగా శ్రీరామనవమి గుర్తింపు పొంది ప్రతి గ్రామంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలు నిర్వహించడం తెలంగాణలో దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఏటా స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో హాజరయ్యే భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు వీఐపీ భక్తులకు, నేతలకు ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా స్వామివారి కల్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను పభుత్వం తరపున సమర్పించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. గోల్కొండ పాలకుడు తానీషా కాలం నుంచి ఈ ఆనవాయితీ ఉంది. పద్ధతులు, సంప్రదాయాలు నాటివే కొనసాగుతున్నా, ఇందుకయ్యే ఖర్చుకు మాత్రం ప్రభుత్వాలు పైసా కూడా విదల్చడంలేదు. - సాక్షి ప్రతినిధి, ఖమ్మం తడిసి మోపెడవుతున్న వసతుల కల్పన... సీతారామ కల్యాణానికి భారీగా తరలివచ్చే భక్తుల వసతులు, శానిటేషన్ వంటి బాధ్యతలు సైతం దేవస్థానం వారే భరించాల్సి వస్తోంది. భద్రాచలంలో శ్రీ రామనవమి సందర్భంగా భక్తులకు వివిధ శాఖల ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, గోదావరి నదీ తీరంలో చేసే మరమ్మతులకు సంబంధించిన నిధులను దాదాపు 50 శాతానికి దేవస్థానమే భరిస్తూ వస్తోంది. కల్యాణం కోసం వచ్చే భక్తులకు కనీస వసతులను ప్రభుత్వం కల్పించకపోవడం ఏమేరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో తొలిసారిగా జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవంపై ఈ ప్రభుత్వమైనా పూర్తిస్థాయి దృష్టి సారించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలిసారిగా సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో వీటి ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్భాటమే తప్ప నిధుల జాడే లేదు... భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున సమర్పించే పట్టువస్త్రాలు, వంద కేజీలకు పైగా ఇచ్చే ముత్యాలు భద్రాచలం దేవస్థానం అధికారులు కొనుగోలు చేసినవి కావడం గమనార్హం. వీటినే కల్యాణం సమయంలో అత్యంత ఆర్భాటంగా ప్రభుత్వపెద్దలు ముఖ్యమంత్రి లేదా దేవాదాయ శాఖ మంత్రి సమర్పిస్తారు. అయితే, ఈ ఖర్చును తామే భరిస్తామని ఓ జీవో జారీ చేసిన ప్రభుత్వం చేతులు దులుపుకుంది తప్ప నిధులను మాత్రం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. పట్టు వస్త్రాలు, ముత్యాలకు 15 వేలే కల్యాణ వేడుక సమయంలో సీత, రాముడుతోపాటు లక్ష్మణులకు అలంకరించే పట్టు వస్త్రాలను దేవస్థానం దాదాపు రూ. 30 వేలతో కొనుగోలు చేస్తోంది. తలంబ్రాలలో కలిపేందుకుగాను దాదాపు 100 కేజీల ముత్యాలను సైతం దేవస్థానమే సమకూరుస్తోంది. కేజీ రూ.3,000 చొప్పున 3 లక్షల రూపాయల విలువైన ముత్యాలు కొనుగోలు చేస్తోంది. పట్టువస్త్రాలు, ముత్యాలు కలిపి కేవలం 15 వేల రూపాయలు ఇవ్వాలని దాదాపు 10 సంవత్సరాల కిందట అప్పటి ప్రభుత్వాలు నిర్ణయించి జీవోలు జారీ చేశారుు. ఈ నామమాత్రపు నిధులు కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భద్రాచలం దేవస్థానం ఖాతాలో జమకాలేదు. -
భద్రాద్రి రామయ్యకు.. ముస్లింల సన్నాయి సేవ
నిత్యం భద్రాద్రి రామయ్య వీరి నాదస్వరంతోనే మేల్కొంటాడు. వీరి తియ్యని ‘నాద’స్వరంతో రామాలయ ప్రాంగణం పరవశించిపోతుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ముస్లింలు.. కౌసల్యా, సుప్రజా, రామ...అని వేకువజామున వినిపించే సుప్రభాత సేవ నుంచి రాత్రి నిర్వహించే పవళింపు సేవ వరకు వీరు రామయ్య సన్నిధిలోనే గడుపుతారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో దశాబ్దాల కాలంగా ఇద్దరు ముస్లింలు మంగళవాయిద్య బృందంలో నాదస్వరం (సన్నాయి), తాళం వాయించే కళాకారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నల్గొండ జిల్లా మటంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ మౌలాసాహెబ్ 2000 సంవత్సరం నుంచి భద్రాద్రి రామాలయంలో నాదస్వర కళాకారుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన తన తాతగారైన పల్నాడు నాదస్వర విద్వాంసులు హుస్సేన్ వద్ద నాదస్వర వాయిద్య నేర్చుకున్నాడు. మొదట్లో రామాలయంలో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలకు మౌలాసాహెబ్‌ను పిలిపించేవారు. ఈ క్రమంలో 2000 సంవత్సరం నుంచి దేవస్థానం ఆస్థాన నాదస్వర కళాకారుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇతని పెద్ద కుమారుడు బాషా కూడా భద్రాద్రి ఆలయంలోనే పనిచేస్తున్నాడు. రెండవ కుమారుడు హుస్సేన్ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం దీపారాధన చేసి రామయ్య సేవకు ఉపక్రమించటం మౌలాసాహెబ్‌కు నిత్యకత్యమైంది. దేవస్థానంలో జరిగే అన్ని పూజా కార్యక్రమాల్లోనూ పాల్గొంటాడు. అయితే రంజాన్, బక్రీద్ పండగల సమయంలో మసీద్‌లకు వెళ్లి నమాజు చేస్తాడు. రామయ్య దయ వల్లే తన కుటుంబం సంతోషంగా ఉందని, జీవితాంతం రాములోరి సేవలోనే తరిస్తానని ఆనందంగా చెపుతున్నాడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం గోసవీడుకు చెందిన షేక్ కాశిం బాబు కూడా సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందిన వారే. ఈయన తండ్రి హసన్ సాహెబ్ 1953 నుంచి భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాలలో నాదస్వర విద్వాంసులుగా సేవలందించారు. అయితే తన చిన్నప్పుడే సంగీతం నేర్చుకున్న కాశిం బాబు కూడా ఉత్సవాల సమయంలో రామయ్య సేవలో తరించేవాడు. 2000 సంవత్సరం నుంచి ఇక్కడే మంగళవాయిద్య బృందంలో పనిచేస్తున్నాడు. ఈయన నాదస్వరంతో పాటు, తాళం వాయించటంలోనూ దిట్ట. కుల, మత భేదం లేదని, మనసు స్వచ్ఛంగా ఉంటే ఏ దేవుడైనా చల్లగా చూస్తాడని, తాము రామయ్య సన్నిధిలో హాయిగా బతుకుతున్నామని చెపుతున్నారు. -వి.శివకుమార్, భద్రాచలం రూరల్