Bhavish Aggarwal
-
ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్‌ను అంగీకరించాలంటే తనకు కొన్ని షరతులు ఉన్నాయని కునాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సర్వీసు సెంటర్ వద్ద పోగైన వాహనాల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రాల మధ్య మాటల యుద్ధం సాగింది.ప్రభుత్వ విభాగమైన సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఇయితే ఈ ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించిందని కంపెనీ ఇటీవల పేర్కొంది.ఇదీ చదవండి: సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!ఈ పరిణామాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేశారు. దానిపై కునాల్ ఎక్స్ వేదికగా కొన్ని డిమాండ్లను లేవనెత్తారు. వాటిని తీరిస్తే తాను జాబ్‌లో చేరుతానని చెప్పారు. ‘ఓలాతో కలిసి పనిచేయడానికి కంపెనీ సీఈఓ ఆఫర్‌ను అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నన్ను కంపెనీ విషయాలకు సంబంధించి వేలసార్లు ట్యాగ్ చేశారు. నేను ఓలా ఉద్యోగిగానే భావిస్తున్నాను. కంపెనీ ఆఫర్‌ను స్వీకరించాలంటే కొన్ని డిమాండ్లను తీర్చాలి.ఓలా సర్వీస్ సెంటర్లలో స్కూటర్ ఇచ్చిన కస్టమర్లకు ఏడు రోజుల్లో సర్వీస్ అందేలా కంపెనీ చర్య తీసుకోవాలి.ఏడు రోజులు దాటినా మరమ్మతులు పూర్తి కాకపోతే వేరే స్కూటర్‌ను తాత్కాలికంగా వినియోగదారులకు అందించాలి.స్కూటర్ రిపేర్ పూర్తయ్యే వరకు రోజువారీ రవాణా ఖర్చుల కింద రూ.500 ఇవ్వాలి.కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెండు బీమాలు అందించాలి. వాహనానికి ఒకటి, సర్వీస్‌లకు మరొకటి. కస్టమర్లకు సర్వీస్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందించాలి’ అని కునాల్ అన్నారు. -
హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌ను అందులో ట్యాగ్ చేశారు. ఇటీవల కమెడియన్ కునాల్ కమ్రా, భవిష్ అగర్వాల్ మధ్య ఆన్లైన్ వేదికగా జరిగిన మాటల యుద్ధంతో ఈ ఓలా వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది.హర్ష్ గోయెంకా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓలా ఎలక్ట్రిక్‌పై స్పందిస్తూ ‘తక్కువ దూరంలోని గమ్యాలు చేరాలంటే నేను ఓలా స్కూటర్ వినియోగిస్తాను. ఒక ‘కమ్రా’(ఇంటి గది) నుంచి మరో ఇంటి గదికి వెళ్లాలనుకుంటే ఓలా స్కూటర్ వాడుతాను’ అన్నారు. తన ట్విట్లో కునాల్ కమ్రా పేరుతో అర్థం వచ్చేలా ప్రస్తావించారు.If I have to travel close distances, I mean from one ‘kamra’ to another, I use my Ola @bhash pic.twitter.com/wujahVCzR1— Harsh Goenka (@hvgoenka) October 8, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదుఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. -
ఎన్నికల్లో సంస్థల సహకారం ఎంతున్నా అది తప్పనిసరి
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 ద్వారా అందించిన రాయితీలు దేశంలోని మొత్తం ప్రజల సొమ్మని కేరళ కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలని పేర్కొంది. ఇటీవల ఓలా వంటి ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు అందిస్తున్న సేవలపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. దాంతో కేరళ కాంగ్రెస్ స్పందించింది. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో కేంద్రమంత్రి నితిన్గడ్కరీను ట్యాగ్ చేస్తూ కొన్ని విషయాలు పంచుకుంది.‘ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అయ్యే ఖర్చు భారత ప్రజలందరిది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాల పెంపునకు ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాల ద్వారా రాయితీలిచ్చింది. మే 2023 కంటే ముందు విక్రయించిన ఓలా ఎస్1 ప్రో మోడల్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ట్యాక్స్‌తో సహా రూ.1.16 లక్షలు రాయితీ అందించాయి. ఒక స్కూటర్‌కు ఇది భారీ రాయితీ. వినియోగదారులు, వారి భద్రత, సర్వీసును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందించిన రాయితీలు ఏమేరకు ప్రయోజనం కలిగించాయో ప్రభుత్వం తెలుసుకోవడం చాలాముఖ్యం’ అని తెలిపింది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులు‘మన దేశాన్ని బ్రాండ్ ఇమేజ్ సమస్య వెంటాడుతోంది. చైనా చౌకైన, తక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తులు తయారీ చేస్తుందనే బ్రాండ్ ఇమేజ్ నుంచి బయటపడేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. కొన్ని భారతీయ కంపెనీలు ఎలాంటి రెగ్యులేటర్ పరిశీలన లేకుండా కస్టమర్ భద్రతను విస్మరించి తక్కువ నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. దాంతో దేశంలోని ఇతర బ్రాండ్లపై ప్రభావం పడుతోంది. అందువల్ల ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న నాణ్యమైన వాహనాలను ఉత్పత్తి చేయడం సవాలుగా మారుతోంది. ఫలితంలో ‘చైనా బ్రాండ్’ ఇమేజ్‌నే మూటగట్టుకునే ప్రమాదముంది. కాబట్టి వాహనాల తయారీ, సర్వీసు అందించడంలో ప్రభుత్వం రెగ్యులేటర్‌గా ఉండాలని కోరుతున్నాం. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనదైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలి’ అని కేరళ కాంగ్రెస్ పేర్కొంది.Dear @nitin_gadkari,The reported quality issues with @OlaElectric or any other Electric Vehicle company for that matter is not between the company and their customers. It concerns each and every tax payer of this country.We've been giving huge subsidies to these companies… pic.twitter.com/rbCbkTHOhL— Congress Kerala (@INCKerala) October 7, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. -
అంత బలుపు వద్దు.. ఓలా సీఈవోపై నెటిజన్ల ఫైర్!
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ మాట తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ వేదికగా కమెడియన్ కునాల్ కమ్రాపై భవిష్ అగర్వాల్ చేస్తున్న వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా యూజర్లు విరుచుకుపడుతున్నారు.భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. షోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకుంటున్నారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కునాల్ కమ్రా పెట్టిన పోస్టులకు ‘ఇది పెయిడ్ పోస్టు’.. ‘నువ్వు సంపాదించలేనంత డబ్బు ఇస్తా’.. అంటూ తలపొగరుగా ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించిన తీరు.. ప్రయోగించిన పదాలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే..అగర్వాల్ వర్సెస్ కమ్రా మాటల యుద్ధం వ్యవహారంలో చాలా మంది ఓలా కస్టమర్లతోపాటు నెటిజన్లు సైతం కమ్రాకు మద్దతుగా నిలుస్తున్నారు. భవిష్ మాట తీరుపై చీవాట్లు పెడుతున్నారు. ఓలా సర్వీస్ ఎంత చెత్తగా ఉందో చెప్పేందుకు మంచి కమెడియనే కావాల్సిన అవసరం లేదంటూ ఒక యూజర్ స్పందించారు. ఈ అహంకారం నిర్లక్ష్య ధోరణి నుంచి వచ్చిందని, దీనికి బుద్ధి చెప్పాలని మరో యూజర్ కామెంట్ చేశారు. ‘ఎంత అహంకారివి నువ్వు. సంపదను చాటుకోవడం మానేయండి. అంతా పోగొట్టుకుని రోడ్లపైకి వచ్చిన ఇలాంటి అహంకార సీఈవోలు ఎందరో ఉన్నారు. మీ విఫలమైన ఉత్పత్తులు, సేవల నమూనాను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి’ అంటూ ఒక నెటిజన్ ఘాటుగా రాసుకొచ్చారు.ఈ అంశంలో ఓలా రూపొందించిన ఏఐ ఫ్లాట్‌ఫామ్ కృత్రిమ్ కూడా భవిష్ అగర్వాల్‌నే తప్పుపట్టింది. భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధంపై ఓ జర్నలిస్ట్ ఓలా కృత్రిమ్ ఏఐ స్పందనను కోరారు. అది అందించిన స్పందనను ‘ఎక్స్’లో షేర్ చేశారు. కమ్రా లేవనెత్తిన ఆందోళనపై భవిష్ స్పందించిన తీరు హుందాగా లేదంటూ బదులిచ్చింది. ఆందోళనలను గుర్తించి పరిస్థితి పట్ల సానుభూతి చూపాలని అగర్వాల్‌కు కృత్రిమ్ సలహా ఇచ్చింది. I asked OLA bro's AI for PR advice on the developing situation with @kunalkamra88.It clearly does not like the response OLA bro gave. 😆 pic.twitter.com/bX6FifrThO— meghnad (Nerds ka Parivaar) (@Memeghnad) October 6, 2024 -
ఓలా సీఈఓ, కమెడియన్ మధ్య మాటల యుద్ధం
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆన్లైన్ వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రంగా స్పందించారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై కమ్రా ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది.ఓలా సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఎలక్ట్రిక్ వాహనాలను సూచించే ఫొటో షేర్ చేస్తూ కమ్రా తన ఎక్స్ ఖాతాలో ‘భారతీయ వినియోగదారులు సమస్యలపై మాట్లాడలేరని అనుకుంటున్నారా? వారికి ఇలాంటి సమస్యా? రోజువారీ వేతన కార్మికులు ద్విచక్ర వాహనాలు వాడుతూ జీవనాధారం పొందుతున్నారు’ అని ఆయన తన పోస్ట్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేస్తూ ‘భారతీయులు ఈవీలను ఎలా ఉపయోగిస్తారు?’ అని తెలిపారు. ‘పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నా సంస్థ నాయకుడి నుంచి ఎలాంటి సమాధానం లేదు’ అని మరోపోస్ట్ పెట్టారు.Since you care so much @kunalkamra88, come and help us out! I’ll even pay more than you earned for this paid tweet or from your failed comedy career.Or else sit quiet and let us focus on fixing the issues for the real customers. We’re expanding service network fast and backlogs… https://t.co/ZQ4nmqjx5q— Bhavish Aggarwal (@bhash) October 6, 2024ఈ వ్యవహారంపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఘాటుగా స్పందించారు. కమ్రా పెట్టిన పోస్ట్‌లు ‘పెయిడ్ పోస్ట్’లు అని వ్యాఖ్యానించారు. ఈమేరకు భవిష్ కమ్రా విమర్శలకు ప్రతిస్పందనగా పోస్ట్ చేశారు. ‘మీరు ఈవీల వ్యవహారంపై చాలా శ్రద్ధ వహిస్తారు కాబట్టి, వచ్చి మాకు సాయం చేయండి! ఈ ‘పెయిట్ ట్వీట్’లు, విఫలమైన మీ కామెడీ కెరీర్ ద్వారా ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువగానే మీకు డబ్బు ఇస్తాను. ఇవేవీ కాదంటే నిశ్శబ్దంగా ఉండండి. మేము కస్టమర్ల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడుతున్నాం. సర్వీస్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాం. బ్యాక్‌లాగ్‌లు త్వరలో క్లియర్ చేస్తాం’ అని స్పందించారు.Instead can you give a total refund to anyone who wants to return their OLA EV & who’s purchased it in the last 4 months? I don’t need your money people not being able to get to their workplace need your accountability.Show your customers that you truly care? https://t.co/tI2dwZT2n2— Kunal Kamra (@kunalkamra88) October 6, 2024కమ్రా భవిష్ ట్వీట్‌పై తిరిగి స్పందించారు. ‘పెయిడ్ ట్వీట్ చేసినట్లు, నేను ఏదైనా ప్రైవేట్ కంపెనీ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి డబ్బు పొందినట్లు మీరు రుజువు చేస్తే నా అన్ని సోషల్ మీడియా అకౌంట్లను వెంటనే తొలగించి, మీరన్నట్లు ఎప్పటికీ నిశ్శబ్దంగా కూర్చుంటాను’ అని చెప్పారు. దీనికి అగర్వాల్ బదులిస్తూ ‘నేను అన్న మాటలతో బాధపడ్డారా? సర్వీస్ సెంటర్‌కు రండి. మాకు చాలా పని ఉంది. మీ ఫ్లాప్ షోల కంటే నేను బాగా డబ్బులిస్తాను. మీ వ్యాఖ్యలపై నిజంగా మీరెంత శ్రద్ధ వహిస్తున్నారో మీ అభిమానులకు తెలియాలి’ అని అన్నారు.ఇదీ చదవండి: రతన్‌టాటా ప్రేమ విఫలం.. పెళ్లికి దూరందీనిపై కమ్రా బదులిస్తూ ‘కస్టమర్ల ఈవీను తిరిగి ఇవ్వాలనుకునే వారికి, గత నాలుగు నెలల్లో ఈవీను కొనుగోలు చేసిన వారికి డబ్బు వాపసు చేస్తారా? మీ డబ్బు నాకు అవసరం లేదు. మీ ఈవీ వాడుతున్న కస్టమర్లు సరైన సేవలందక తమ కార్యాలయాలకు చేరుకోవడం లేదు. దీనికి సమాధానం చెప్పండి. మీరు నిజంగా శ్రద్ధ వహిస్తున్నట్లు మీ కస్టమర్లకు తెలియాలి కదా?’ అని అన్నారు. దీనిపై భవిష్ స్పందిస్తూ ‘మా కస్టమర్లకు అందే సర్వీసు జాప్యం జరిగితే వారికి తగినన్ని ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. మీరు నిజంగా సమస్యపై స్పందించాలంటే కేవలం కుర్చీలో కూర్చొని విమర్శలు చేయడం కాదు. సమస్య ఎక్కడుందో తెలుసుకోండి. దీనిపై వెనక్కి తగ్గకండి’ అని పోస్ట్ చేశారు.We have enough programs for our customers if they face service delays. If you were a genuine one, you would have known.Again, don’t try and back out of this. Come and do some real work rather than armchair criticism. https://t.co/HFFKgsl7d9— Bhavish Aggarwal (@bhash) October 6, 2024 -
మ్యాప్‌మైఇండియా ఆరోపణల్లో విశ్వసనీయత లేదు..
న్యూఢిల్లీ: మ్యాప్‌లను కాపీ చేశారంటూ మ్యాప్‌మైఇండియా తమపై చేస్తున్న ఆరోపణల్లో విశ్వసనీయత లేదని ఓలా సహ–వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్‌ను అడ్డం పెట్టుకుని లబ్ధి పొందేందుకే ఆ కంపెనీ తమపై మ్యాప్‌ల కాపీయింగ్ ఆరోపణలు చేసిందని ఆయన పేర్కొన్నారు. తాము లీగల్ నోటీసు పంపినా మ్యాప్‌మైఇండియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదని అగర్వాల్ పేర్కొన్నారు. సొంతంగా దేశీ నావిగేషన్ మ్యాప్ తయారు చేశామంటూ ఓలా మాతృసంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రకటించడం ఓ గిమ్మిక్కు అంటూ మ్యాప్‌మైఇండియా ఆరోపించడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో సంబంధ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడానికి మూడు రోజుల ముందు జూలై 23న మ్యాప్‌మైఇండియా ఆ సంస్థకు నోటీసులు పంపింది. ఓలా ఎలక్ట్రిక్ ఆగస్టు 9న లిస్టయింది. ఈ నేపథ్యంలోనే అగర్వాల్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాము చాలాకాలంగా రైడ్ షేరింగ్ వ్యాపారంలో ఉన్నందున తమ దగ్గర మ్యాపింగ్‌కి సంబంధించిన డేటా..టెక్నాలజీ బోలెడంత ఉందని, ఒక సంస్థను కూడా కొనుగోలు చేశామని అగర్వాల్ తెలిపారు. బహుశా మ్యాప్‌మైఇండియా కస్టమర్లు ఓలా మ్యాప్స్ వైపు మళ్లుతున్నారేమోనని, ఇది సమస్యగా మారడం వల్లే ఆ కంపెనీ తమపై ఆరోపణలు చేస్తోందని అగర్వాల్ పేర్కొన్నారు. -
ఓలా ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టు: క్లారిటీ ఇచ్చిన భవిష్
ఎలక్ట్రిక్ ద్విచక్రవాహన విభాగంలో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మూడేళ్ళ క్రితమే ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ ప్రెజెక్టును నిలిపివేస్తున్నట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వల్ వెల్లడించారు.ఓలా ఎలక్ట్రిక్ ఈ నెల ప్రారభంలో ఐపీఓ ప్రారంభించిన తరువాత లాభాలను ఆర్జించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా భారతీయ వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులపై ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు భవిష్ అన్నారు.నిజానికి 2022లో పుల్ గ్లాస్ రూఫ్‌తో కూడిన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విడుదల చేయబోతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఆ తరువాత అదే ఏడాది ఆగష్టు 15న జరిగిన ఓ ఈవెంట్లో ఈ కారుకు సంబంధించిన స్కెచ్‌లు విడుదల చేశారు. అప్పట్లోనే ఈ కారు తయారు కావడానికి సుమారు రెండేళ్లు పడుతుందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.భారతదేశంలో ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీకి సవాలుగా ఓలా ఎలక్ట్రిక్ సింగిల్ చార్జితో 500 కిమీ రేంజ్ అందించే కారును లాంచ్ చేయనున్నట్లు ఎప్పుడో చెప్పింది. కానీ ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఐపీఓకు వెళ్లడం వల్ల ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలన్న ఓలా నిర్ణయాన్ని భవిష్ అగర్వాల్ ధృవీకరించారు. అయితే ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మళ్ళీ ప్రారంభమవుతుందా? లేదా? అనే విషయాలను సీఈఓ స్పష్టం చేయలేదు. -
ఓలా ఈ–బైక్స్ వచ్చేశాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రో వేరియంట్లను ప్రవేశపెట్టింది. 2.5–16 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో తయారయ్యాయి. ధర రూ.74,999 నుంచి మొదలై రూ.2,49,999 వరకు ఉంది. 2025 దీపావళి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఒకసారి చార్జింగ్‌తో వేరియంట్‌నుబట్టి 200 నుంచి 579 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 124–194 కిలోమీటర్లు. కాగా, క్విక్ కామర్స్‌లోకి ఓలా ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఓలా క్యాబ్స్ కాస్తా ఓలా కన్జూమర్ అయింది. అలాగే ఓలా పే పేరుతో యూపీఐ సేవలను సైతం కంపెనీ ఆవిష్కరించింది. అనుబంధ కంపెనీ కృత్రిమ్ ఏఐ 2026 నాటికి ఏఐ చిప్‌ను ప్రవేశపెట్టనుంది. -
సోమనాథ్ ఆలయంలో ఓలా సీఈఓ పూజలు (ఫోటోలు)
-
ఓలా ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. టార్గెట్ రూ. 5,500 కోట్లు
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ వచ్చే వారం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది. ఆగస్టు 2న రిటైల్ సబ్స్క్రిప్షన్లు ప్రారంభించనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. సంస్థాగత పెట్టుబడిదారులకు మాత్రం ఒక రోజు ముందుగా ఆగస్టు 1న సబ్స్క్రిప్షన్లు తెరుచుకోనున్నాయి. ఆగస్టు 6న ఐపీఓ ముగుస్తుంది.ఐపీఓ ద్వారా రూ. 5,500 కోట్లను (సుమారు 657 మిలియన్ డాలర్లు) ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో భాగంగా దాదాపు 38 మిలియన్ షేర్లను విక్రయించాల్సి ఉందని కంపెనీ తెలిపింది. 2023 డిసెంబర్లో దాఖలు చేసిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌లో సూచించిన 47.4 మిలియన్ షేర్ల విక్రయం కంటే ఇది దాదాపు 20% తక్కువ.ఓలా ఎలక్ట్రిక్ సుమారు 4.2 బిలియన్ డాలర్ల నుంచి 4.4 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో ఐపీఓకు వస్తోంది. సింగపూర్‌కు చెందిన పెట్టుబడి సంస్థ టెమాసెక్ గతేడాది 140 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీ విలువను 5.4 బిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఆ మొత్తంతో పోలిస్తే.. ఇప్పుడు కంపెనీ ఐపీఓ వాల్యూషన్ 20 శాతం మేర తగ్గడం గమనార్హం. -
టెకీలూ.. ఆఫీసులకు కుర్తా వేసుకురండి
టెకీలు, ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు ఎలాంటి దస్తులు వేసుకుని వస్తారు..? చక్కగా సూటు బూటు వేసుకుని వస్తారు. కానీ కుర్తాలు వేసుకుని రావాలని చెబుతున్నారు ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్.ఏఎన్ఐకి చెందిన స్మితా ప్రకాష్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతీయులందరూ పాశ్చాత్య దుస్తులకు స్వస్తి పలికి కుర్తాలను ధరించాలని సూచించారు.“మనం కుర్తాలో మరింత సౌకర్యవంతంగా ఉండవచ్చు. ఇది ప్రత్యేకంగా భారతీయమైనది. నా దృష్టిలో, కుర్తా చాలా సొగసైన డ్రెస్. భారతీయులందరూ, ముఖ్యంగా యువ సాంకేతిక నిపుణులు కుర్తాలను ధరించాలని నేను అనుకుంటున్నాను” అని అగర్వాల్ అన్నారు.జూలై 8న షేర్ చేసిన ఈ పాడ్‌కాస్ట్ కొద్ది సమయంలోనే ట్రాక్‌ని పొందింది. చాలా మంది అగర్వాల్ భావాలతో ఏకీభవించడంతో కామెంట్ సెక్షన్ సానుకూల స్పందనలతో నిండిపోయింది. -
‘ఓలా అలా కాదు’.. మహిళా నియామకాలపై భవిష్ అగర్వాల్
ఫాక్స్‌కాన్ నియామక పద్ధతులపై వచ్చిన వార్తలపై ఓలా వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ భవీష్ అగర్వాల్ స్పందించారు. తమ కొత్త కర్మాగారాల్లో వివాహితలతో సహా మహిళల నియామకం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వివాహితలను నియమించుకోవడంపై ఓలాకు ఎటువంటి వ్యతిరేక విధానం లేదని అగర్వాల్ పేర్కొన్నారు.ఇటీవల ఓ మీడియా సమావేశంలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'మహిళలు ఎక్కువ క్రమశిక్షణ, నైపుణ్యంతో ఉంటారు. మేము మా కర్మాగారాలలో మహిళా శ్రామిక శక్తిని నియమించడం కొనసాగిస్తాం. పెళ్లైన మహిళలను నియమించుకోకూడదనే ఫాక్స్‌కాన్ లాంటి విధానాలు మా దగ్గర లేవు’ అన్నారు.భారత్‌లో మహిళా శ్రామిక శక్తి తక్కువగా ఉందని, దీనిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం జూనియర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను ఎక్కువగా నియమించుకుంటున్నామని, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కూడా మరింత మంది మహిళలను నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.కాగా మహిళా శ్రామిక శక్తిని పెంపొందించడంపై ఓలా ఎలక్ట్రిక్ గతంలోనే తమ వైఖరిని ప్రకటించింది. "ఈ రోజు, ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నడుపుతారని ప్రకటించడానికి నేను గర్విస్తున్నాను. ఈ వారం మేము మొదటి బ్యాచ్ ను స్వాగతించాం. పూర్తి సామర్థ్యంతో, ఫ్యూచర్ ఫ్యాక్టరీ 10,000 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది, ఇది మహిళలకు మాత్రమే పనిచేసే ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారం, ఏకైక మహిళా ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మారుతుంది'' అని బ్లాగ్ పోస్ట్‌లో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.యాపిల్ ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారు అయిన ఫాక్స్‌కాన్ భారత్‌లోని తన ఐఫోన్ కర్మాగారంలో వివాహిత మహిళలను ఉద్యోగాలకు తిరస్కరిస్తున్నట్లు ఇటీవలి పరిశోధనాత్మక నివేదిక బహిర్గతం చేసింది. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఉన్న ప్రధాన ఐఫోన్ అసెంబ్లింగ్ ఫ్యాక్టరీలో వివాహిత మహిళలను ఉద్యోగావకాశాల నుంచి తప్పించారని నివేదిక ఆరోపించింది. -
మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన భవిష్ అగర్వాల్ - ఫోటోలు
ఆదివారం దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్లో 'నరేంద్ర మోదీ' మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ మొదలైనవారు పాల్గొన్నారు.దేశాధినేతలు మాత్రమే కాకుండా పారిశ్రామిక వేత్తలు ముఖేష్ అంబానీ, భవిష్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను భవిష్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పోస్ట్ చేశారు. అయితే జాతీయ జెండాలను క్యాప్సన్గా పెట్టారు. పోస్ట్‌లో రాష్ట్రపతి భవన్ని చూపిస్తూ మూడు చిత్రాలను పంచుకున్నాడు.🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/0yrflT9DHs— Bhavish Aggarwal (@bhash) June 9, 2024 -
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్‌కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
ప్రముఖ దేశీయ క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఓలా.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చింది. లింక్డిన్లో దొర్లిన తప్పిదం కారణంగా మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ అజ్యూర్‌కు గుడ్‌బై చెప్పింది. ఇకపై అజ్యూర్‌ను వినియోగించేది లేదని తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా ఓలా గ్రూప్‌నకే చెందిన కృత్రిమ్ ఏఐ క్లౌడ్ సేవలను వినియోగించుకోనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ప్రకటించారుఇటీవల భవీష్ అగర్వాల్ తన గురించి తాను తెలుసుకునేందుకు లింక్డిన్ ఏఐ బాట్లో భవీష్ అగర్వాల్ ఎవరు? అని సెర్చ్ చేశారు. దీనికి బాట్ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భవీష్ పాశ్చాత్య విధానాల్ని గుడ్డిగా అనుసరిస్తే ఇలాగే ఉంటుందంటూ కామెంట్ చేశారు.ఆ కామెంట్లతో లింక్డిన్ తమ నిబంధనలకు విరుద్దంగా భవిష్ పోస్ట్ ఉందంటూ దానిని లింక్డిన్ డిలీట్ చేసింది. దీంతో లింక్డిన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భవీష్.. మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌కు గుడ్ బై చెప్పారు. లింక్డిన్ చర్యతో మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ను వినియోగించుకోబోమని స్పష్టం చేశారు. ఇటీవలే కృత్రిమ్ క్లౌడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ సేవల్ని వినియోగించుకుంటామని ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. -
లింక్డ్ఇన్పై అసంతృప్తి.. భవిష్ అగర్వాల్ ట్వీట్ వైరల్
ఓలా సీఈఓ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో లింక్డ్ఇన్ను విమర్శించారు. పాశ్చాత్య దేశాల టెక్నలాజిలు భరతదేశంలో వ్యాపిస్తున్నాయి. ఇందులో లోపాలు కూడా కూడా ఉన్నయని వివరించారు. అందుకే భారత్ సొంత టెక్నాలజీని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.లింక్డ్ఇన్ ఏఐ బాట్లో 'భవిష్ అగర్వాల్' ఎవరు అని సెర్చ్ చేస్తే.. వచ్చిన ఫలితంలో చాలా వరకు సర్వనామాలకు సంబంధించిన దోషాలు ఉన్నయని భవిష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.దీనిపైన లింక్డ్ఇన్ కూడా స్పందించింది. ఇది ప్రొఫెషనల్ కమ్యూనిటీ పాలసీలకు వ్యతిరేఖంగా ఉందని లింక్డ్ఇన్ నోటిఫికేషన్ ద్వారా పేర్కొన్నారు. నిజానికి భారత్ సొంత టెక్నాలజీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల టెక్నాలజీలను గుడ్డిగా నమ్మితే ఇలాంటి దోషాలే వస్తాయి. దీనిని యూజర్స్ నమ్మే ప్రమాదం ఉంది.Dear @LinkedIn this post of mine was about YOUR AI imposing a political ideology on Indian users that’s unsafe, sinister.Rich of you to call my post unsafe! This is exactly why we need to build own tech and AI in India. Else we’ll just be pawns in others political objectives. pic.twitter.com/ZWqiM90eT1— Bhavish Aggarwal (@bhash) May 9, 2024 -
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. -
హాలీవుడ్ హీరో కాదు.. ఫేమస్ బిజినెస్ మ్యాన్ - గుర్తుపట్టారా?
పైన ఫోటోలో చూడగానే పిలక పెట్టుకుని, కళ్ళజోడుతో స్టైల్‌గా కనిపిస్తున్న వ్యక్తి ఏ హాలీవుడ్ హీరో అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఈయన ఇండియాలో ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అయితే ఎందుకు ఈ అవతారమెత్తారు అనే అనుమానం మీలో రావచ్చు? దాని గురించే ఇక్కడ తెలుసుకుందాం.. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్థాపించి, ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసి అతి తక్కువ కాలంలోనే గొప్ప అమ్మకాలను పొందుతూ దూసుకెళ్తున్న ఈయనే ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్'. ఈ పేరు వినగానే ఇప్పుడు గుర్తోచేసి ఉంటుంది, ఈయనే భవిష్ అగర్వాల్ అని.. ఇక ఈ అవతారమెందుకు ఎత్తరనుకుంటున్నారా.. భవిష్ అగర్వాల్ ఆదివారం అబుదాబిలో ఇటీవల ప్రారంభించిన 'బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థకు చెందిన హిందూ మందిర్'ను సందర్శించారు. ఆ సమయంలో ఇలా కనిపించారు. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి భవిష్ అగర్వాల్ ఈ టెంపుల్ సందర్శించిన సందర్భంగా.. ఇది నా జీవిత జ్ఞాపకం అని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. Visiting and speaking at the @BAPS Hindu Mandir in Abu Dhabi was a life memory for me. It is such a historic moment of two civilisations coming together and thankful to be there to witness it🙏🏼 pic.twitter.com/rfHh8x4eJ3 — Bhavish Aggarwal (@bhash) February 18, 2024 -
ఓలా ఎలక్ట్రిక్ బంపరాఫర్!
ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ ఓలా కీలక ప్రకటన చేసింది. త్వరలో ఓలా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని ఆ సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ ప్రకటించారు. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడిన ఆయన..తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో న్యూ ఈవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తున్నారు. ఈ యూనిట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 25 వేల మందికి కొలువులు లభిస్తాయని తెలిపారు. తద్వారా ప్రతి ఏటా సుమారు ఒక కోటి టూ వీలర్స్ తయారవుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ కోసం గతేడాది తమిళనాడు ప్రభుత్వంతో ఓలా ఎలక్ట్రిక్.. ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం ఓలా ఎలక్ట్రిక్ రూ.7000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఎనిమిది నెలల్లో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ యూనిట్ విజయవంతంగా నిర్మించుకున్నట్లు భవిష్ అగర్వాల్ తెలిపారు. వచ్చేనెల నుంచి ఈవీ స్కూటర్ల ఉత్పత్తి తయారవుతుందని అన్నారు. గత జూన్‌లోనే తమిళనాడులో మెగా మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సహకారంతో తమిళనాడు గిగా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు తెలిపింది. దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ లీడర్‌గా నిలిచింది. నవంబర్ నెలాఖరు నాటికి మొత్తం ఈవీ స్కూటర్ల విక్రయంలో ఓలా ఎలక్ట్రిక్ వాటా సుమారు 32 శాతం. గతేడాది నవంబర్ నాటికి దాదాపు 30 వేల ఈవీ స్కూటర్లను విక్రయించింది. -
నేడే కృత్రిమ్ ఏఐ విడుదల
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా అధినేత భవిష్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. కృత్రీమ్.ఏఐని ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15 మధ్యాహ్నం 2.30గంటలకు కృత్రీమ్.ఏఐ లాంచ్‌ను కృత్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. Excited to showcase the potential of our AI. Tune in to the live launch event of Krutrim, India's own AI at 2:30PM tomorrow! Watch here: https://t.co/g7qmlHMuk1 pic.twitter.com/i7CrTrJYH1 — Bhavish Aggarwal (@bhash) December 14, 2023 ఈ సందర్భంగా ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో సొంత ఏఐ కుత్రిమ్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తద్వారా పరిశ్రమలు, జీవన విధానాన్ని సమూలంగా మార్చేందుకు ఏఐని 1.4 బిలియన్ల మందికి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏఐ మేడ్ ఇన్ ఇండియా ప్రస్తుత టెక్ ప్రపంచంలో కృత్తిమ మేధ దూసుకుపోతుంది. మనదేశం కూడా సొంతంగా ఏఐని తయారు చేసే స్థాయికి ఎదగాలి. కానీ దేశీయ స్టార్టప్‌లు, వినియోగదారులు విదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ నిపుణులతో తయారు చేసిన ఏఐని వినియోగిస్తున్నాయి. అలా కాకుండా భారతీయ భాషల్లో ఏఐని డెవలప్ చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు దారులకు శుభవార్త!
ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు దారులకు ఓలా శుభవార్త చెప్పింది. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరపై రూ.20,000 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ బైక్ ధర రూ.1,09,999 ఉండగా.. ధర తగ్గింపుతో రూ.89,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ కొత్తగా ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ కొనుగోలు దారులకు మాత్రమే అందుబాటులో ఉందని ఓలా పేర్కొంది. ఓలా ఎస్1ఎక్స్ సిరీస్‌లోని ఓలా ఎస్1 ఎక్స్ 3 కిలోవాట్ల బ్యాటరీ, ఓలా ఎస్1 ఎక్స్ 2 కిలో వాట్ల బైక్‌లను కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్ పొందలేరని వెల్లడించింది. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ 3 వాట్ల బ్యాటరీతో జతచేసిన 6కిలో వాట్ల మోటార్‌ను అందిస్తుంది. ఇందులో మొత్తం మూడు రైడ్ మోడ్లు ఉన్నాయి. వాటిల్లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్. ఎలక్ట్రిక్ స్కూటర్ 0-40కేపీఎంహెచ్ నుండి 3.3 సెకన్లలో, 5.5 సెకన్లలో 0-60 కేపీఎంహెచ్ వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం 90కేఎంపీహెచ్. ఏఆర్ఏఐ సర్టిఫైడ్ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ రేంజ్ ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 151కిమీ అయితే, ఒరిజినల్ రేంజ్ ఎకో మోడ్‌లో 125కిమీ, సాధారణ మోడ్‌లో 100కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. 500డబ్ల్యూ పోర్టబుల్ ఛార్జర్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఇంట్లో కేవలం ఏడు గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బైక్‌లోని ఫీచర్ల విషయానికొస్తే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టైలాంప్తో వస్తుంది. 5 అంగుళాల ఎస్సీడీ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, డిజిటల్ కీ, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్,క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
ఏఐపై భవిష్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సామాన్యులు సైతం సులభంగా వినియోగించేలా చాట్‌జీపీటీ తరహాలో భారత్ సైతం చాట్ బాట్లను తయారు చేయాలని ఓలా అధినేత భవిష్ అగర్వాల్ పిలుపునిచ్చారు. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో జరిగిన ఇన్సైట్: ది డిఎన్ఎ ఆఫ్ సక్సెస్ 12వ ఎడిషన్‌లో అగర్వాల్ మాట్లాడారు. రోజువారీ వినియోగంలో ఏఐ పాత్రపై ఆయన నొక్కి చెప్పారు. ఏఐ గురించి మాట్లాడుతూ..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారత్ ప్రపంచ దేశాలకు దిశా నిర్ధేశం చేసే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ‘ఏఐ రెవెల్యూషన్ వేగంగా జరుగుతోంది. ఇది మనుషుల ప్రొడక్టివిటీని పెంచుతుంది. సైన్స్ ,ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది.అంతేకాదు జ్ఞానం, సృజనాత్మకత సరిహద్దులను చెరిపేస్తుంది. సాంకేతిక, ఆర్థిక పురోగతితో పాటుగా రీసెర్చ్ ,మెటాఫిజికల్ అన్వేషణ వంటి వివిధ ఏఐ అంశాలలో భారత్ అగ్రగామిగా వృద్ది సాధిస్తుందని భవిష్ అగర్వాల్ అభిప్రాయ పడ్డారు. -
‘70 గంటలు పని’..నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ఐటీ ఉద్యోగుల ఆగ్రహం!
దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని ట్రోల్ చేస్తున్నారు. కానీ, ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ మాత్రం నారాయణ మూర్తి వ్యాఖ్యలతో ఏకీభవించారు. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్ దాస్ పై’ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నారాయణ మూర్తి భారతీయల పని సంసృ్కతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత వారానికి 70 గంటలు పనిచేస్తే భారత్ ఆర్ధిక రంగంలో ఊహించని విజయాలు సాధించవచ్చని వ్యాఖ్యానించారు. చైనా లాంటి దేశాలతో పోల్చినా దేశంలో పని గంటలు తక్కువని, ప్రపంచంలోనే అత్యల్పమని వివరించారు. ఇలా కాకుండా రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో జపాన్, జర్మన్ ప్రజలు ఎలా విధులు నిర్వహించారో, అలా చేయాలని అభిప్రాయపడ్డారు. Totally agree with Mr Murthy’s views. It’s not our moment to work less and entertain ourselves. Rather it’s our moment to go all in and build in 1 generation what other countries have built over many generations! https://t.co/KsXQbjAhSM — Bhavish Aggarwal (@bhash) October 26, 2023 ఈ సందర్భంగా ప్రభుత్వాల్లోని అవినీతి, బ్యూరోక్రాట్స్ జాప్యం వంటి ఇతర సమస్యలను ప్రస్తావించారు. ‘‘ఉత్పాదకత విషయంలో భారత్ చాలా వెనుకబడి పోయింది. దీన్ని పెంచాలి. మెరుగుపరుచుకోకపోయినా, ప్రభుత్వంలో అవినీతిని ఏదో ఒక స్థాయిలో తగ్గించకపోయినా, అధికార యంత్రాంగం వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైనా మనం ఏమీ సాధించలేం. అద్భుతమైన పురోగతి సాధించిన దేశాలతో పోటీ పడలేం’ అని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అయితే నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో పెద్ద దుమారమే చెలరేగింది. చాలామంది ఆయన వ్యాఖ్యలను ఖండించడం, విమర్శించడం చేశారు. కానీ... భవిష్ అగర్వాల్ మాత్రం మద్దతుగా మాట్లాడారు. ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నారాయణ మూర్తి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం. తక్కువ పని చేసి మనల్ని మనం సమర్ధించుకోవడం కాదని ట్వీట్ చేశారు. మరోవైపు టెక్కీలు మాత్రం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడి అభిప్రాయాలపై విభిన్నంగా స్పందిస్తున్నారు. 2005లో ఇన్ఫోసిస్‌లో కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారి వేతం ఏడాదికి రూ. 3.5 లక్షలుంటే 2023లోనూ అంతే ఇస్తున్నారని, ద్రవ్యోల్బణం నుంచి గట్టెక్కేలా రూ.15 లక్షల ప్యాకేజీ ఇస్తే .. అంచనాలకు మించి దాని కంటే 40 గంటలు అంకితభావంతో పనిచేస్తామని కొందరు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లు మీరూ చేసేయండి. Infosys fresher salary in 2005: 3.5 lakhs pa Infosys fresher salary in 2023: 3.5 lakhs pa If uncle adjusted inflation atleast, it would be well over 15LPA. Pay that and then expect to work for 40 hours with full dedication. Everything will sort out as is. https://t.co/kaAXbgzhwB — Abhishek (@MrAbhi_shek) October 26, 2023 Law limits work to 48 hours a week, but he wants 70. If we exclude Sundays, that's a grueling 12 hours a day. Dear Narayan murthy if youngsters work 12 hours daily, who will embrace your technology? It's time for your retirement; otherwise, Infosys faces a natural demise. https://t.co/7AesTZJWiS — Abinash Sahoo (@irabinash) October 26, 2023 #Infosys management loooking for employees to work 70 hrs a week pic.twitter.com/VR9WkVZYck — T.Ramesh (@hereiam_hi) October 26, 2023 First start paying salary to your Infosys employees like the companies pay in Germany and Japan. And then you call speak BS from your capitalist mouth.#NarayanaMurthy 🤡 pic.twitter.com/RO21ELrUbs — 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) October 27, 2023 Indirectly #Infosys founder Narayana Murthy is saying.. work 12 hours per day spoil your mental health due to NO proper sleep after spoiling ur health,spend lakhs of rupees in hospitals for ur treatment increase the business of Infosys increase profit,revenue of Infosys 😁😁 pic.twitter.com/YEEVdoEoig — Sharanu.N🇮🇳 (@sharanu_ja) October 27, 2023 -
ప్రతి పది సెకన్లకు ఒక బైక్..హాట్‌కేకుల్లా ఓలా స్కూటర్ల అమ్మకాలు!
ప్రముఖ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ ఓలా ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించింది. ఈ సేల్‌లో ఓలా ఈవీ బైక్స్ హాట్‌కేకుల్లా అమ్ముడు పోయాయని ఆ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలపై భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 2022 ఫెస్టివల్ సీజన్‌తో పోల్చితే.. ఈ ఏడాది దసరా, నవరాత్రులలో ప్రతి పది సెకన్లకు ఒక ఓలా బైక్‌ను అమ్మినట్లు పేర్కొన్నారు. దీంతో 2022 కంటే ఈ ఏడాది 2.5 రెట్లు అమ్ముడు పోయినట్లు సంతోషం వ్యక్తం చేశారు. Our sales have gone through the roof this Dussehra and Navratri! Selling a scooter every 10 seconds right now, and almost 2.5x of last year!😀 India’s EV moment is here this festive season!#endICEage — Bhavish Aggarwal (@bhash) October 24, 2023 అందుబాటులో ఐదు మోడళ్లు ఓలా దేశీయ మార్కెట్లో 5 మోడల్స్‌ను అమ్ముతుంది. గత ఆగస్ట్ నెలలో ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో జనరేషన్2, ఎస్1 ఎక్స్ పేరుతో మూడు వేరియంట్స్‌ను వాహనదారులకు పరిచయం చేసింది. 2030 నాటికి భారత్ లక్ష్యం ఇదే 2030 నాటికి భారతదేశం రోడ్ల పై ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తిరగాలని అప్పటి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2017లో ప్రకటించారు. అంతేకాదు, 2030 నాటికి దేశంలో 30 శాతం ప్రైవేటు కార్లు, 70 శాతం కమర్షియల్ వాహనాలు, 40 శాతం బస్సులు, 80 శాతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. తాజాగా, ఓలా సేల్స్ చూస్తుంటే భారత ప్రభుత్వ నిర్ధేశించిన లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. చదవండి👉 నెలకు రూ.70వేలు సంపాదించుకోవచ్చు.. ఓలా సీఈవో బంపరాఫర్ -
నెలకు రూ.70వేలు సంపాదించుకోవచ్చు.. ఓలా సీఈవో బంపరాఫర్
ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా శుభవార్త చెప్పింది. బైక్ ట్యాక్సీ డ్రైవర్లు నెలకు రూ.70,000 సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక చెల్లింపు పద్దతిని ప్రవేశ పెట్టినట్లు వెల్లడించింది. బెంగళూరుకి చెందిన రైడర్లు ముందుగా ఓలా ఎస్1 బైక్‌ని అద్దెకు తీసుకోవాలని, తద్వారా నెలకు రూ.70,000 సంపాదించుకోవచ్చంటూ ఓలా అధినేత భవిష్ అగర్వాల్ తెలిపారు. రైడ్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా సందించుకోవచ్చో వివరించారు. డబ్బులు ఎలా సంపాదించాలి? రైడర్లు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.5,000 చెల్లించి ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ బైక్‌ను అద్దెకు తీసుకోవాలి. ఇందుకోసం డ్రైవర్లు పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాలు, వినియోగంలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. అనతరం తాము రూపొందించిన ప్రత్యేక చెల్లింపులు ప్రకారం.. రైడర్లు కస్టమర్లకు సేవలు అందిస్తే కమిషన్ రూపంలో డబ్బులు సంపాదించుకోవచ్చని భవిష్ విడుదల చేసిన ఓ పాంప్లెట్లో పేర్కొన్నారు. ఓలా విడుదల చేసిన పాంప్లెట్లో ఏముందంటే? బెంగళూరులోని బైక్ ట్యాక్సీ డ్రైవర్ల కోసం తయారు చేసిన చెల్లింపు పద్దతి ప్రకారం.. 10 నుంచి 14 బుకింగ్స్ వరకు ఫిక్స్డ్ పేమెంట్ రూ.800 వరకు చెల్లిస్తుంది. అందులో ప్రతి రోజు రెంటల్ కింద రూ.100 చెల్లించాలి. ఇక, 15 నుంచి 19 బుకింగ్స్ వరకు ఇన్సెంటీవ్ రూపంలో రూ.1,300 వరకు సంపాదించవచ్చు. అందులో రెంటల్ అమౌంట్ రూ.50గా నిర్ధేశించింది. అయితే, రోజుకు 20 కంటే ఎక్కువ రోజువారీ బుకింగ్‌ల కోసం డ్రైవర్లు రోజువారీ అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా రోజుకి రూ.1,800 నుండి రూ. 2,800 పరిధిలో సంపాదించవచ్చు. వాళ్లు మాత్రం అనర్హులే అదే సమయంలో, డ్రైవర్లు వారి బుకింగ్‌లు రోజుకు 10 కంటే తక్కువ ఉంటే రోజువారీ స్థిర ఆదాయానికి అర్హులు కాదు. అయితే వారు అద్దె మొత్తంగా రూ. 300 చెల్లించాలని ఓలా తెలిపింది. ప్రయాణీకుల కోసం,ఓలా గత నెలలో షేర్ చేసిన రేట్ చార్ట్ ప్రకారం, బైక్ టాక్సీ సర్వీస్ కోసం 5 కిలోమీటర్లకు రూ. 25, 10 కిలోమీటర్లకు రూ. 50 చొప్పున నిర్ణయించింది. తక్కువలో తక్కువగా నివేదిక ప్రకారం, పూర్తిగా ఛార్జ్ చేయబడిన ఓలా ఎస్1 ఏ స్కూటర్ 70-75 కిమీల దూరం ప్రయాణం చేయొచ్చు. రూ. 800 ఇన్సెంటీవ్ పొందడానికి రైడర్ 10 రైడ్లను పూర్తి చేయాల్సి ఉండగా..ఏడు-ఎనిమిది ట్రిప్పుల తర్వాత వెహికల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. స్కూటర్ పూర్తిగా రీఛార్జ్ చేయడానికి ఆరు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. చివరిగా.. రైడర్లు ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశాల్ని తెలుసుకునేందుకు అధికారిక పేజీని సంప్రదించాలని ఓలా ప్లాంపెట్లో హైలెట్ చేసింది. చదవండి👉 ఓలాకు భారీ షాక్, తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సీఈవో భవీష్ అగర్వాల్! -
ఓలా ఎస్1 ఎయిర్: కస్టమర్లకు గుడ్ న్యూస్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 ఎయిర్ డెలివరీలను షురూ చేసింది. ఓలా ఎస్1,ఎస్1 ప్రోకి తరువాత గత నెలలో లాంచ్ అయిన ఇ-స్కూటర్ ఎస్ 1 ఎయిర్.ఇప్పటి వరకు 50వేల బుకింగ్‌లో ప్రజాదరణ పొందిన S1 Air డెలివరీలు 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యాయని, ఇతర మార్కెట్లలో త్వరలో మొదలవనున్నాయని కంపెనీ ఒకప్రకటనలో తెలిపింది. ఆసక్తిగల కస్టమర్లు దేశవ్యాప్తంగా 1,000కు పైగా ఎక్స్పీరియన్స్ నెట్‌వర్క్‌లో ఏదైనా ఒకదానిలో,లేదా యాప్‌ద్వారా S1 ఎయిర్, సులభమైన ఫైనాన్సింగ్ఎంపికలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనిప్రకటించింది. S1Air 3 kWh బ్యాటరీ సామర్థ్యం, 6kW గరిష్ట మోటారు శక్తి, 151 కిమీల సర్టిఫైడ్ రేంజ్ మరియు 90 km/hr గరిష్ట వేగాన్నిఅందిస్తుంది.ట్విన్ ఫ్రంట్ ఫోర్క్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, భారీ 34-లీటర్ బూట్ స్పేస్ , డ్యూయల్-టోన్బాడీ కలిగి ఉంది. ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చు. స్టెల్లార్ బ్లూ, నియాన్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్ , మిడ్నైట్ బ్లూ ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది.