Charmi Kaur
-
ఇలా అవుతుందని ఊహించలేదు: చార్మీ, మంచు లక్ష్మి ఎమోషనల్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ భార్య, యోగా ట్రైనర్ రూహీ మరణవార్త అందరినీ కలిచివేస్తోంది. ఎంతోమంది తారలకు యోగా టీచర్‌గా పని చేసిన రూహి అనారోగ్యంతో గురువారం నాడు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. చార్మీ, మంచు లక్ష్మి.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనలయ్యారు. ఈ వార్త అబద్ధమైతే బాగుండు 'ప్రియమైన రూహి.. నీ కోసం ఇలాంటి పోస్ట్ వేస్తానని ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. మాటలు రావడం లేదు. నువ్వు ఇక లేవన్న వార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. మనం చివరిసారి కూడా ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం. 18 ఏళ్ల అందమైన స్నేహబంధం మనది. నిన్ను మిస్ అవుతానని చెప్పడం చిన్నమాటే అవుతుంది. నీ కుటుంబానికి ఆ దేవుడు మరింత శక్తినివ్వాలి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది చార్మీ. డ్యాన్స్, నవ్వులు.. అవన్నీ.. మంచు లక్ష్మి.. రూహితో తన చివరి చాట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'రూహి నుంచి నాకు అందిన చివరి మెసేజ్ ఇదే! ప్రతివారం తనను జిమ్‌లో కలుస్తూ ఉండేదాన్ని. తన ముఖంలో ఎప్పుడూ ఒక నిష్కల్మషమైన నవ్వు కనిపిస్తూ ఉండేది. ఎంతో ఎనర్జీగా కనిపించేది. మేమిద్దరం ఒళ్లంతా చెమటలు పట్టేవరకు డ్యాన్స్ చేసేవాళ్లం.. దవడలు నొప్పిపుట్టేంతవరకు నవ్వుతూనే ఉండేవాళ్లం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని నువ్వు మరోసారి నిరూపించావు. ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు ఎంతో బాధగా ఉంది. మేము అదృష్టవంతులం సెంథిల్, తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తుంటేనే మనసు కలుక్కుమంటోంది. కానీ నువ్వు జీవితానికి సరిపడా ప్రేమను పంచి వెళ్లిపోయావు. నీతో కలిసి ప్రయాణం చేసిన మేమంతా ఎంతో అదృష్టవంతులం. ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ సర్ప్రైజ్ చేసేదానివి.. ఇప్పుడు స్వర్గంలో ఉన్న ఏంజెల్స్‌కు యోగాసనాలు నేర్పిస్తున్నావని ఆశిస్తున్నాను. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. ఇకపై నన్ను చూడటానికి రాలేవు. ఇలాంటి పోస్ట్ వేస్తానని కలలో కూడా ఊహించలేదు. నీ పేరు మీద ఈరోజు ప్రతిక్షణం సెలబ్రేట్ చేసుకుంటా.. ఇట్లు నీ స్నేహితురాలు లక్ష్మి' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్ భార్య మృతి -
హనుమాన్ కంటే 'శ్రీ ఆంజనేయం' బెటర్.. కృష్ణ వంశీ రియాక్షన్ వైరల్
ఈ సంవత్సరం సంక్రాంతి హిట్‌గా 'హనుమాన్' చిత్రం నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతుంది. తాజాగా ఈ సినిమా 300 సెంటర్లలో 30రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా హనుమాన్ ఉండటం విశేషం. హనుమాన్ చిత్రం గురించి సోషల్ మీడియా ఒక చర్చ జరుగుతుంది. గతంలో కృష్ణ వంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం చిత్రం గురించి ఇప్పుడు మళ్లీ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.నితిన్, ఛార్మి నటించిన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. సినిమా కథ బాగున్నప్పటికీ కొన్ని పాయింట్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. కానీ ఇందులో కూడా గ్రాఫిక్స్ పనితీరును మెచ్చుకోవాల్సిందే. తాజాగా నెటిజన్లు కొందరు హను మాన్ కంటే శ్రీ ఆంజనేయం సినిమానే గొప్ప సినిమా అంటూ కృష్ణ వంశీ ఎక్స్ పేజీలో పలు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో అంటూ తిడుతూ ఒక పోస్ట్ పెట్టాడు. దానికి డైరెక్టర్ కృష్ణ వంశీ రియాక్ట్ అయ్యారు. ప్లీజ్ ప్రేక్షకులను మాత్రం తిట్టకండి వాళ్ల నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు.. శ్రీ ఆంజనేయం సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది. ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వాళ్లకు నచ్చలేదు. కానీ మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు అని కృష్ణ వంశీ రిప్లై ఇచ్చారు. ఇంతలో మరో నెటిజన్ శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మి క్యారెక్టర్ చాలా చిరాకు పుట్టించేలా ఉందని చెప్పాడు. ఈ కారణంతోనే సినిమా ప్లాప్ అయిందని తెలిపాడు. అందుకు కృష్ణ వంశీ మాత్రం గాడ్ బ్లెస్ యు అని రిప్లై ఇచ్చారు. వాస్తవంగా అప్పట్లో ఆ సినిమా ప్లాప్‌కు కారణం ఛార్మి పాత్రే అని ఎక్కువగా కామెంట్లు చేశారు. ఆమెలో మంచి నటి ఉన్నప్పటికీ కథలో ఛార్మి పాత్రను క్రియేట్ చేసిన విధానం బాగలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి చిత్రంలో మితిమీరిన ఎక్స్ ఫోజింగ్ సాంగ్ ఉండటం ఎవరికీ నచ్చలేదు. నితిన్ పాత్రను కూడా మరీ అమాయకంగా చూపించడం పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. Audience r never wrong .. they didn't like it means there was a mistake r problem of reachability .. so dnt blame audience sir .. may b I was wrong AT some portions .. THQ 🙏♥️ God bless https://t.co/RBumH9z4nm — Krishna Vamsi (@director_kv) February 11, 2024 GOD bless you 🙏 https://t.co/1AcCs3Q2vq — Krishna Vamsi (@director_kv) February 11, 2024 -
ఇస్మార్ట్ యాక్షన్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రామ్, పూరీల కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రూపొందుతోంది. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా గురువారం పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా హీరో రామ్, కీలక పాత్ర చేస్తున్న సంజయ్ దత్తో పూరి జగన్నాథ్ ఉన్న వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 18న రిలీజ్ కానుంది. -
'డబుల్ ఇస్మార్ట్' కోసం బిగ్ బుల్‌ను దించిన పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన వార్త ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. 'లైగర్'తో దెబ్బతిన్న పూరీ 'డబుల్ ఇస్మార్ట్' కోసం పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను తీసుకున్నారు. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. (ఇదీ చదవండి: సౌత్ ఇండియాలో రిచ్చెస్ట్ హీరో ఆయనే.. ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే) ఇక సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కుడా రిలీజ్ చేశారు. అందులో సిగరెట్ తాగుతూ సంజయ్ దత్ కనిపిస్తుండగా ఆయనపై గన్స్ అన్నీ పాయింట్ చేసి ఉన్నాయి. ఇందులో 'బిగ్ బుల్'గా సంజయ్ దత్ కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. గతంలో కేజీఎఫ్ 2లో అధీర పాత్రలో ఆయన మెప్పించిన విషయం తెలిసిందే. ఈ మూవీపై సంజయ్ కూడా ట్వీట్ చేశాడు. డైరెక్టర్ పూరిజగన్నాధ్, రామ్ పోతినేనితో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని ఆయన తెలిపాడు. ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్టైనర్లో తాను భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందంటూ సంజయ్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషి వేడుకోవడంతో ఆమె నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా) ఇక 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్‌గా రానున్న ఈ సినిమాలో రామ్‌కు జోడిగా మీనాక్షి చౌదరి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. పూరీ సొంత నిర్మాణంలో ఛార్మీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి8న ప్రేక్షకుల ముందుకు రానుంది. It takes me immense pride to be working with the director of the masses #PuriJagannadh ji and the young energetic Ustaad @ramsayz 🤗 Glad to be Playing the #BIGBULL in this sci-fi mass entertainer #DoubleISMART Excited to be teaming up with this super-talented team and Looking… pic.twitter.com/SrIAJv6yy1 — Sanjay Dutt (@duttsanjay) July 29, 2023 -
పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్
2019లో పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ హిట్ అందుకుంది. ఆ సినిమా మాస్ ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించి వారిద్దరికీ బ్లాక్ బస్టర్‌గా నిలించింది. ఈ సినిమా సీక్వెల్ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ఓ ఇస్మార్ట్ అప్డేట్ను చిత్ర యూనిట్ షేర్ చేసింది. లైగర్ రిజల్ట్ తనను తీవ్రంగా బాదించినా మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు పూరి. తనలో ఉన్న ప్రత్యేకత ఇదేనని చెప్పవచ్చు. హీరోలకు ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ బేస్ పూరికి ఉంది. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) నేడు జులై 10న ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగినట్లు యూనిట్ తెలిపింది. అందుకు సంబంధించిన పలు షేర్ చేసింది. జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీనికి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. అది హిట్ అయితే డబుల్ ఇస్మార్ట్ కి డబుల్ కిక్ ఇవ్వడమే కాకుండా.. లైగర్‌తో నష్టపోయిన పూరి బౌన్స్ బ్యాక్ ఇవ్వడం ఖాయం. బాలీవుడ్ హీరోయిన్ రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరోక హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారని సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. With the blessings of Lord Shiva 🔱 Ustaad @ramsayz & Dashing Director #PuriJagannadh's#DoubleISMART Pooja ceremony commenced 🪔 Shoot Begins on July 12th❤️🔥 Mass Action Entertainer at the cinemas on MARCH 8th, 2024💥@Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/Kj9vDRHiIg — Puri Connects (@PuriConnects) July 10, 2023 (ఇదీ చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి!) -
లైగర్ నష్టాలతో నిరవధిక దీక్ష.. స్పందించిన చార్మీ
బాక్సాఫీస్ బద్ధలు కొడుతుందనుకున్న విజయ్ దేవరకొండ లైగర్ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ నిర్మించారు. గతేడాది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ గండం గట్టెక్కలేకపోయింది. ఈ సినిమా వల్ల ఎంతో డబ్బు నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఎదుట రిలే నిరవధిక దీక్షకు పూనుకున్నారు. నష్టాన్ని భర్తీ చేస్తామని పూరీ జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ ధర్నాపై నటి, నిర్మాత చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఫిలిం ఛాంబర్‌కు ఈ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపింది. చదవండి: మోడ్రన్ లవ్ చెన్నై... ఆ ఓటీటీలో అప్పుడే స్ట్రీమింగ్! -
రోడ్డెక్కిన లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు
-
చాలా రోజుల తర్వాత జంటగా కనిపించిన పూరి జగన్నాథ్-ఛార్మీ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీ పేర్లు లైగర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో పాన్ ఇండియా రేంజ్లో వినిపించాయి. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఛార్మీ అయితే కొన్నాళ్ల పాటు సోషల్ మీడియా నుంచి కూడా దూరంగా ఉంది. ఇప్పటికీ ఆమె నెట్టింట అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. లైగర్ రిలీజై సుమారు 6-7 నెలలు అయినా నిమా ఫంక్షన్లు, పార్టీలు ఇలా బయట కూడా వీరు అంతగా కనిపించలేదు. అలాంటిది తాజాగా ఛార్మీ-పూరీలు ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా లైగర్ అనంతరం విజయ్‌తో అనౌన్స్ చేసిన ‘జనగణమన’ ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. మరి త్వరలోనే ఏదైనా ప్రాజెక్ట్ గురించి కబురు చెబుతారేమో చూడాలి మరి. -
‘లైగర్’ ఫ్లాప్.. చార్మీ షాకింగ్ నిర్ణయం
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్ నిలుస్తుందని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మైక్ టైసన్ వంటి ప్రపంచ చాంపియన్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి నిరూపించింది. ఫలితంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందంటున్నారు సినీ విశ్లేషకులు. చదవండి: నిర్మాతతో టీవీ నటి రెండో పెళ్లి, కొత్త జంటపై దారుణమైన ట్రోల్స్ ఇక లైగర్ ఫలితం అనంతరం చార్మీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఆమె ట్వీట్ చేస్తూ ట్రోలర్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. తాను సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘చిల్ గాయ్స్. కాస్తా బ్రేక్ తీసుకుంటున్నా(సోషల్ మీడియాకు). పూరీ కనెక్ట్స్ త్వరలోనే మరింత దృఢంగా, మునుపటికి కంటే ఉత్తమంగా తిరిగి వస్తుంది. అప్పటి వరకు కాస్తా శాంతించండి అబ్బాయిలు’ అంటూ చార్మీ రాసుకొచ్చింది. ఇక చార్మీపై కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా లైగర్ ఫ్లాప్‌తో విజయ్‌తో పాటు పూరీ కనెక్ట్స్ నిర్మాతలైన చార్మీ, పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! ప్రమోషన్స్‌లో విజయ్ ఓవరాక్షన్, నోటి దురుసు వల్లే ఈసినిమా ఫ్లాప్ అయ్యిందని, అతడిని నమ్ముకున్నందుకు పూరీ కనెక్ట్స్ పని అయిపోయిందంటూ సోషల్ మీడియా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు చార్మీ, పూరీ కనెక్ట్స్‌ను ట్యాగ్ చేస్తూ సినిమా అసలు బాగోలేదని, విడుదలకు ముందు క్రియేట్ చేసిన హైప్ కథలోనే లేదని.. కథ, కథనం చాలా బలహీనంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటి కారణంగానే ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Chill guys! Just taking a break ( from social media )@PuriConnects will bounce back 😊 Bigger and Better... until then, Live and let Live ❤️ — Charmme Kaur (@Charmmeofficial) September 4, 2022 -
'లైగర్' డిజాస్టర్‌పై స్పందించిన ఛార్మి
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్ నిలుస్తుందని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మైక్ టైసన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి ప్రూవ్ చేసినట్లయ్యింది. ఫలితంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై నిర్మాత ఛార్మి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'జనాలు ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూసే యాక్సిస్ ఉంది. కుటుంబం మొత్తం ఇంట్లోనే భారీ బడ్జెట్ సినిమాలు చూడగలరు. కాబట్టి సినిమాలు వారిని ఎగ్జైట్ చేయనంత వరకు థియేటర్లకు రావడానికి వాళ్లు ఇష్టపడటం లేదు. తెలుగులో ఇటీవల బింబిసార, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. సుమారు రూ 150 కోట్ల నుంచి రూ. 170కోట్ల వరకు వసూలు చేశాయి. కానీ బాలీవుడ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2019నుంచి లైగర్ కోసం కష్టపడ్డాం. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత లైగర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఎన్నో అడ్డంకులను దాటి థియేటర్లో విడుదల చేశాం. కానీ సినిమా ఫెయిల్యూర్ అవడం బాధగా అనిపిస్తుంది' అంటూ ఛార్మి ఆవేదన వ్యక్తం చేసింది. -
చేతిలో రూపాయి లేకపోయినా ఆఫర్‌ను రిజెక్ట్ చేశా : ఛార్మి
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'లైగర్' మూవీ జోరు కనిపిస్తోంది.రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోలో విజయ్‌కు జోడీగా అనన్య పాండే నటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా విజయ్, పూరి జగన్నాథ్‌లను ఛార్మి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను పూరి జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. చదవండి: ఛార్మితో రిలేషన్ బయటపెట్టిన పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఛార్మి అడిగారు. ఇక లాక్డౌన్ టైంలో ఓ ఓటీటీ సంస్థ నుంచి భారీగా ఆఫర్ వచ్చినా వదులుకున్నాననని, చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా సరే ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు చెబుతూ ఛార్మీ ఎమోషనల్ అయ్యింది. -
విజయ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మైక్ టైసన్.. ఎంతంటే
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చదవండి: హీరో కాకముందు విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా? ప్రస్తుతం వరుస ప్రమోషన్స్‌తో మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. లైగర్ కోసం విజయ్ దేవరకొండ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం విజయ్ దాదాపుగా రూ. 35కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అనన్య పాండేకు మాత్రం కేవలం రూ. 3కోట్ల రూపాయాలే అప్పజెప్పారట. మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఈ సినిమాలో నటించిన మైక్ టైసన్‌కు విజయ్ కంటే ఎక్కువగా సుమారు రూ. 40కోట్ల వరకు రెమ్యునరేషన్ అందించినట్లు సమాచారం. -
'లైగర్'.. ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ : పూరి జగన్నాథ్
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఆగస్టుల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని హన్మకొండలో లైగర్ టీం ఫ్యాన్డమ్ టూర్‌ని నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..హాయ్ వరంగల్., వర్షం పడుతున్నా తడిచిమరీ ఈ వేడుకకి విచ్చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ లవ్ యూ. ఆగస్ట్ 25 విడుదలౌతుంది. కరణ్ జోహార్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. అపూర్వ మెహతా మిగతా టీం అందరికీ థాంక్స్. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారికి కృతజ్ఞతలు. ఒక రోజు మా ఆవిడ తిట్టింది. ఎందుకంటే.. కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు మంచి మంచి సినిమాలు తీసుతున్నారు.. నువ్వు వెనకపడిపోతున్నావ్.. సందీప్ రెడ్డి వంగా అనే డైరెక్టర్ వచ్చాడు. అర్జున్ రెడ్డి అనే సినిమా తీశాడు. నేను నా కూతురు మూడు సార్లు చూశాం., నువ్వూ చూడు'' అని చెప్పింది. అర్జున్ రెడ్డి చూశా. డైరెక్షన్ బావుంది.. సినిమా కూడా బాగానే వెళ్తుంది. కానీ 45 నిమిషాలు సినిమా చూసి ఆపేశా. కారణం.. సినిమాలో కుర్రాడిపై నా ద్రుష్టి ఆగిపోయింది. ఇంత నిజాయితీగా ఒక కుర్రాడు నటిస్తున్నాడని విజయ్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అప్పుడే విజయ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. విజయ్ లో నాకు నచ్చేది నిజాయితీ. లైగర్ లో ఎంత ఎలివేషన్ పెట్టినా కొంచెం పొగరు కూడా కనిపించదు. చాలా నిజాయితీగా చేశాడు. ఒక నిర్మాతగా విజయ్ కి కోటి రూపాయిలు ఇస్తే వద్దు ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండని అంటాడు. తర్వాత రెండుకోట్లు పంపిస్తే.,,. మాకు అప్పులున్నాయని తెలిసి.. ముందు అప్పులు తీర్చమని తిరిగిపంపించేస్తాడు. ఈ రోజుల్లో ఇలా ఎవరంటారు ? హ్యాట్సప్ టు విజయ్. విజయ్ నాన్నగారు మా అబ్బాయిని ఒక కొడుకులా చూసుకొని మంచి సినిమా తీయ్ అన్నారు. కానీ విజయ్ నన్ను ఒక తండ్రిలా చూసుకొని నా కష్టాల్లో నాతో పాటు నిల్చున్నాడు. విజయ్ లాంటి హీరోని నేను చూడలేదు. మైక్ టైసన్ ని పట్టుకోవడానికి ఏడాది పట్టింది. ఆయన్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చిన క్రెడిట్ ఛార్మికి దక్కుతుంది. మైక్ టైసన్ లాంటి లెజెండ్ తో కలసి పని చేసే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనతో సినిమా చేస్తామంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. అనన్య ఫైర్ బ్రాండ్. అద్భుతంగా నటిస్తుంది. రమ్యకృష్ణ గారు రెబల్ తల్లిగా కనిపిస్తారు. అమెది చాలా స్ఫూర్తిని ఇచ్చే పాత్ర. ఛార్మీ సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఏ కష్టాన్ని నా వరకూ తీసుకురానివ్వదు. సెట్ లో ఆమె ఏడ్చిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ బయటికి చెప్పదు. ఛార్మీకి బిగ్ థాంక్స్. అలీతో చేసిన సినిమాలన్నీ హిట్టే. కష్టాల్లో సుఖాల్లో తోడుంటాడు. నాపై ప్రేమతో స్టేజ్ పై డ్యాన్స్ వేశాడు. రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, చంకీ పాండే, గెటప్ శ్రీను, వంశీ అందరూ ప్రేమతో చేసిన సినిమా ఇది. అజీమ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. భాస్కర భట్ల మంచి లిరిక్స్ రాశారు. సాగర్ సౌత్ మ్యూజిక్ చూసుకున్నారు. విష్ నటుడిగా తెలుసు. అతను రియల్ ఫైటర్. ఈ సినిమాలో బ్యాడ్ గాయ్ రోల్ ప్లేయ్ చేశాడు. మా కంపనీ సీఈవో కూడా. విష్ మా బలం. డివోపీ విష్ణు శర్మ, ఎడిటర్ జునైద్, ఆర్ట్ డైరెక్టర్ జానీ, అనిల్.. మా పీఆర్వో వంశీ- శేఖర్, లీగర్, మార్కెటింగ్ టీమ్స్ ,శ్రేయాస్ మీడియా శ్రీనివాస్.. అందరికీ కృతజ్ఞతలు. లైగర్ ఆగస్ట్ 25 న వస్తోంది. ఇది ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ. సినిమాని మీరంతా థియేటర్ లో చూడాలి' అని కోరారు. ఛార్మీ కౌర్ మాట్లాడుతూ.. ఐ లవ్ యూ వరంగల్. ఈవెంట్ చేయాలంటే నా ఫస్ట్ ఛాయిస్ వరంగల్. ఇక్కడ ఈవెంట్ జరిగితే సినిమా సూపర్ హిట్. చివరి క్షణంలో వేదిక మారింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు ఎంతో సహకారం అందించారు. లైగర్ గురించి చాలా మాట్లాడాలని వుంది. కానీ లైగర్ సక్సెస్ కొట్టి బిగ్ బాక్సాఫీసు నంబర్స్ క్రియేటి చేసిన తర్వాత అప్పుడు సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. ఆగస్ట్ 25 వాట్ లాగా దేంగే'' అన్నారు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈదెబ్బతో ఇండియా మొత్తం నేనేంటో చూపిస్తా..
-
ట్రైలర్‌కే ఈ రచ్చ ఏందిరా నాయనా! విజయ్ మాస్ స్పీచ్
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'లైగర్'. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు లైగర్ ట్రైలర్‌తో ట్రీట్ ఇచ్చారు మూవీ టీం. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో గ్రాండ్‌గా లైగర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'మీకు మా అయ్య తెల్వడు, మా తాత తెల్వడు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది. ఆ సినిమా కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు. అయినా ట్రైలర్‌కి ఈ రచ్చ ఏందిరా నాయనా? ఏందిరా ఈ మెంటల్ మాస్! మీ ప్రేమకు ఐ లవ్ యూ. ఈ సినిమా కోసం బాడీ, ఫైట్స్, డ్యాన్స్ చేసినా అంటే అది మీ కోసమే. ఈ సినిమాను మీకు డెడికేట్ చేస్తున్నా. ఆగస్టు 25న ఇండియా షేక్ అవ్వడం గ్యారెంటీ!' అంటూ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే రేంజ్లో విజయ్ మాట్లాడాడు. ఇక ఇండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ విజయ్ దేవరకొండ అంటూ పూరి జగన్నాథ్ మరింత హైప్ క్రియేట్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, అనిల్ తడానీ, అనన్య పాండే, చార్మీ సహా పలువురు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయ్ దేవరకొండ సరసన శ్రీదేవి కూతురు
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించనున్న రెండో సినిమా 'జనగణమన' (JGM). లైగర్ సెట్స్‌పై ఉండగానే ఈ మూవీని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ముంబైలో గ్రాండ్‌గా ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సైనికుడిగా కనిపించనున్నాడు రౌడీ హీరో.ఇక ఈ సినిమాలో విజయ్ సరసన ఎవరు నటించనున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ని తీసుకోవాలని చూస్తున్నారట. లైగర్ మూవీలోనే హీరోయిన్గా జాన్వీని అనకున్నా కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో ఫైనల్లీ ఈ ప్రాజెక్ట్ ద్వారా జాన్వీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. -
పూరీ జగన్నాథ్ 'జనగణమన' పోస్టర్ లాంచ్.. అప్పుడే వార్ స్టార్ట్
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ 'జనగణమన' (JGM). రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జగన్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. ఇదివరకే పాన్ ఇండియాగా 'లైగర్' మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ క్రేజీ కాంబోగా వస్తోన్న ఈ 'జనగణమన' చిత్రం పోస్టర్, విడుదల తేదిని ప్రకటించారు. ఈ పోస్టర్ లాంచ్‌ను మంగళవారం (మార్చి 29) ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ఆర్మీ డ్రెస్‌లో ప్రత్యేక ఛాపర్లో ముంబై చేరుకున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సైనికుడిగా కనిపించనున్నాడు రౌడీ హీరో. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ 'నేను ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. నేను చూసిన స్క్రిప్ట్‌లలో ఇది చాలా ఛాలెంజింగ్ కథ. ఈ సినిమా కథ ప్రతీ భారతీయుడికి హత్తుకుంటుంది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడూ చేయని పాత్రను జెజీఎంలో చేస్తున్నాను. ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకులపై కచ్చితంగా ఉంటుందని విశ్వవిస్తున్నాను.' అని తెలిపాడు. 'మా తర్వాతి ప్రాజెక్ట్ జెజీఎం పోస్టర్‌ను నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్‌తో మళ్లీ కలిసి పనిచేయడం గొప్పగా అనిపిస్తుంది. ఇది ఒక బలమైన కథ, కథనంతో ఉన్న అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్.' అని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ బాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఆగస్టు 3, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 2022లో షూటింగ్ ప్రారంభంకానుంది. -
పార్టీలో హీరోయిన్‌తో విజయ్ ముచ్చట్లు.. వీడియో తీసిన చార్మీ
Liger Stars Vijay Deverakonda, Ananya Panday At Apoorva Mehta Birthday: బాలీవుడ్ అంతా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తుంది. ఇప్పటికే మన స్టార్స్ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. ఇక టాలీవుడ్ అర్జున్‌రెడ్డి విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ చేస్తున్న 'లైగర్' సినిమా కోసం ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. ఓవైపు షూటింగ్లో బిజీగా ఉంటూనే, మరోవైపు పార్టీ మూడ్‌ని ఎంజాయ్ చేస్తుంది లైగర్ టీం. గురువారం ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో లైగర్ బ్యాచ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. బ్లాక్ అండ్ బ్లాక్‌లో అందరూ దుమ్మురేపారు. మోస్ట్ స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేశారు. పార్టీ మొత్తంలో లైగర్ టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రసత్తుం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే..ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ సినిమా ఆగస్ట్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) -
రికార్డు స్థాయిలో 'లైగర్' డిజిటల్ రైట్స్.. విజయ్ క్రేజ్ అలాంటిది
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కతుతున్న పాన్ ఇండియా సినిమా 'లైగర్'. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా గురించి ఓ వార్త ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి భారీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండకు ఉన్న స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకొని మూవీ రిలీజ్‌కు ముందే లైగర్ డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.60కోట్లకు సొంతం చేసుకుందట. ఇదే నిజమైతే విజయ్ కెరీర్లో రికార్డు స్థాయిలో కుదరిన డీల్ ఇదేనని చెప్పొచ్చు. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇక దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అనన్య పాండే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. -
Liger Movie: రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన 'లైగర్' టీం
Vijay Devarakonda Liger Movie Announces Release Date: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 25న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఈ ఏడాది చివర్లో డిసెంబర్31రోజు లైగర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. #AagLagaDenge #LIGER #LigerOnAug25th2022 https://t.co/o1aztzI9GD — Puri Connects (@PuriConnects) December 16, 2021 -
మహేశ్‌బాబుతో పోటీ పడనున్న విజయ్ దేవరకొండ
Vijay Devarakonda Liger Movie Going To Release On Ugadhi: లాస్ వేగాస్ నుంచి లాస్ ఏంజిల్స్‌కు షిఫ్ట్ అయింది ‘లైగర్’ టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లైగర్’. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాస్ ఏంజిల్స్‌లో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్లపై లాస్ వేగాస్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత తదుపరి చిత్రీకరణ కోసం ‘లైగర్’ యూనిట్ లాస్ ఏంజిల్స్‌కి వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. కానీ వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల చేసే సాధ్యాసాధ్యాలను నిర్మాతలు ఆలోచిస్తున్నారని ఫిల్మ్‌నగర్ తాజా టాక్. మరోవైపు మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారువారి పాట’ చిత్రం ఏప్రిల్ 1న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
లాస్ ఏంజెల్స్‌లో 'లైగర్' టీం సందడి.. ఫోటో వైరల్
Vijay Deverakonda and Ananya Panday shoot for Liger in Los Angeles: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా 'లైగర్'. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఇటీవలె లాస్ వెగాస్‌లో షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో షెడ్యూల్‌ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను చార్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. లైగర్ టీం..లాస్ ఏంజెల్స్ నుంచి హాయ్ చెబుతుంది అంటూ ఫోటోను పంచుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, చార్మీ, పూరి జగన్నాథ్ ఉన్నారు. ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటి రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) -
ఆకాశ్ మంచి నటుడే.. కానీ అందులో చాలా వీక్: పూరి జగన్నాథ్
‘ప్రేమ కన్నా మోహం చాలా గొప్పది.. మోహం నుంచే ప్రేమ పుడుతుంది.. ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ మోహమే అని అనుకుంటారు.. రొమాంటిక్ సినిమాకు అదే ఫ్రెష్‌గా ఉంటుంది’అన్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’.పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటే చేసింది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. . ‘ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా రోజులైంది. మూడేళ్ల తరువాత థియేటర్లో సినిమా చూడటం చాలా బాగుంది. సినిమా చూసిన చాలా మంది ఎమోషనల్ అయ్యారు. థియేటర్ కాకపోతే ఏడ్చేవాళ్లమని చాలా మంది చెప్పారు. ముందే ఎడిటింగ్ రూంలో చూసినప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చింది. ఇది ఇడియట్ లాంటి సినిమా అని అందరూ అన్నారు. ఆకాశ్ మంచి నటుడే. కానీ రొమాన్స్‌లో వీక్. ఇంకా బాగా చేస్తాను అంటే ఇంకా బాగా రాస్తాను. ఈ చిత్రాన్ని యంగ్ జనరేషన్ తీస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే అనిల్‌కు ఇచ్చాను. కథను ఎంతో ప్రేమిస్తే గానీ కూడా అలాంటి ఎమోషన్‌ను క్యారీ చేసేలా తీయడం మామూలు విషయం కాదు. అనిల్ బాగా తీశాడు. దర్శకులందరూ వచ్చి ఈ చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇదొక మంచి వాతావరణాన్ని క్రియేట్ అయ్యేలా చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ కూడా సినిమా చూస్తే బాగుండేది. మళ్లీ నా మీద షాంపైన్ పోసేవారు. ఆయన ఏలూరులో షూటింగ్లో ఉన్నారు. అందుకే రాలేకపోయారు. నటుడిగా ఆకాశ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ఇది పెద్ద హీరో కథ. కానీ ఆకాశ్ బాగా హోల్డ్ చేశాడు. బయట సినిమాలు చేయనివ్వు.. కొంచెం పేరు వచ్చాక మనం చేద్దామని ఆకాశ్ అన్నాడు. సినిమా విడుదలవుతుందని తెలిసి.. ప్రభాస్ ఫోన్ చేశాడు. డార్లింగ్ మనం ఏం చేద్దాం.. ఎలా ప్రమోట్ చేద్దామని అన్నారు. ఇక విజయ్ కూడా వరంగల్‌లో ఫంక్షన్ పెడదామని అన్నారు. వారిద్దరూ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు’ అని అన్నారు. ‘ఆకాశ్ అద్భుతంగా నటించాడు. ఇది మా అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. ఇది మాకు చావో రేవో అనే సినిమా ఉండేది. కానీ నిన్న అందరూ సినిమా గురించి మాట్లాడాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్. సినిమాను ఇంతలా ప్రమోట్ చేసిన ప్రభాస్, విజయ్ దేవరకొండలకు థ్యాంక్స్’ అని అన్నారు నటి, నిర్మాత చార్మి. చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా గుర్తుండిపోవాలని అనుకున్నాను. ఈ సినిమాకు నా వాయిస్ ప్లస్ అవుతుందని అందరూ అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. మీ నాన్న డబ్బింగ్ చెప్పారా? అని అన్నారు. సినిమా చూసిన అందరూ కూడా అదే అన్నారు. మా నాన్నకు ఓ హిట్ సినిమా ఇవ్వాలి. అదే నా లక్ష్యం. వాస్కోడిగామా పాత్రనే సెకండ్ పార్ట్‌గా తీయాలనే కోరికగా ఉంది’అన్నాడు యంగ్ హీరో ఆకాశ్. -
హీరోయిన్గా ఉన్నప్పుడు కంఫ్టర్ ఉండేది: చార్మీ
Charmy Kaur: అతి తక్కువ కాలంలోనే నటిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ చార్మీ. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన చార్మీ ఆ తర్వాత సినిమాలకు గుడ్‌డై చెప్పి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నిర్మించిన రొమాంటిక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. 'హీరోయిన్గా ఉన్న సమయంలో ఎక్కువ కంఫర్ట్ ఉండేది. ఫిటినెస్‌పై మాత్రమే దృష్టి పెడితే సరిపోయేది. కానీ నిర్మాతగా బాధ్యతలు స్వీకరించడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అందరి కంఫర్ట్ చూసుకోవాల్సి వస్తుంది. అయినా నాకేమీ విసుగు అనిపించడం లేదు. ఇప్పటికీ నటిగా అవకాశాలు వస్తున్నాయి. కానీ నాకు ఇక నటించే ఆలోచన మాత్రం లేదు. అని చెప్పుకొచ్చింది. చదవండి: పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్ టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత -
మందు గ్లాస్‌తో పూరికి బర్త్‌డే విషెస్ తెలిపిన చార్మీ
Charmi Kaur Birthday Wishes To Director Puri Jagannadh: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా చార్మీ ఆయనకు స్పెషల్ బర్త్‌డే విషెస్‌ను తెలియజేసేంది. 'నాకెంతో ఇష్టమైన వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మీరు గర్వపడేలా ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటానని ఆశిస్తున్నాను' అంటూ మందు గ్లాసు పట్టుకొని పూరితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో పూరి జగన్నాథ్ కుర్చీలో కూర్చొని ఉండగా, చార్మీ మందు గ్లాసుతో దర్శనమిచ్చింది. హీరోయిన్గా గుడ్‌బై చెప్పిన చార్మీ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్ ఈ చిత్రంలో బాక్సర్‌గా అలరించబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. Happy birthday to my most favourite human 🤩 the trust and belief u have over me , I hope I live upto it always n keep making u feel proud 🤗#purijagannadh #hbdpurijagannadh 💕@puriconnects pic.twitter.com/7Aq9U4KA2a — Charmme Kaur (@Charmmeofficial) September 27, 2021