Chetan Sharma
-
BGT: టీమిండియా ఆస్ట్రేలియాను ఖచ్చితంగా ఓడించి తీరుతుంది..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25పై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బీజీటీలో భారత్ ఆస్ట్రేలియాను ఖచ్చితంగా ఓడించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆసీస్‌ను వారి సొంతగడ్డపై వరుసగా మూడో సిరీస్‌లో మట్టికరిపించడం ఖాయమని జోస్యం చెప్పాడు. భారత్ తమ సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయినప్పటికీ చింతించాల్సిన అవసరం లేదని అన్నాడు. ఇప్పటికీ ఒత్తిడి ఆస్ట్రేలియాపైనే ఉందని తెలిపాడు. ఇటీవలికాలంలో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రతిసారి విన్నింగ్ కంటెండర్‌గా బరిలోకి దిగుతుందని పేర్కొన్నాడు. ఆసీస్ ఆటగాళ్లు బీజీటీ 2024-25పై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే వారి నెర్వస్నెస్ స్పష్టంగా బయటపడుతుందని అన్నాడు. భారత్ తాజాగా న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయినా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేతన్ శర్మ ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు.కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్..ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండాల్సి వస్తే, అతని స్థానంలో కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. రోహిత్ వ్యక్తిగత కారణాల చేత తొలి టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ రోహిత్ నిజంగా తొలి టెస్ట్‌కు దూరమైతే బూమ్రా టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ క్లూ ఇచ్చాడు. తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి మొదలుకానున్న విషయం తెలిసిందే.KL Rahul, Shubman Gill & Yashasvi Jaiswal in today's practice session at WACA in Perth ahead of BGT. 🇮🇳⭐pic.twitter.com/91TCibESHx— Tanuj Singh (@ImTanujSingh) November 12, 2024ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా ఆటగాళ్లు..ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఇదివరకే ప్రాక్టీస్ షురూ చేశారు. విరాట్ సహా భారత్ బృందంలోని పలువురు సభ్యులు రెండు రోజుల కిందటే ఆసీస్ గడ్డపై అడుగుపెట్టారు. విరాట్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఆస్ట్రేలియా కండీషన్స్‌కు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లు 10 రోజుల ముందే మ్యాచ్‌కు వేదిక అయిన పెర్త్‌కు చేరుకున్నారు. -
బుమ్రా అరుదైన ఘనత.. ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. చేతన్ శర్మ తర్వాత ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత సీమన్‌గా రికార్డుల్లోకెక్కాడు. 1986లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో చేతన్ శర్మ 188 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టగా.. ఈ మ్యాచ్‌లో బుమ్రా 91 పరుగులు సమర్పించుకుని 9 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలు బుమ్రా కెరీర్లో రెండో అత్యుత్తమ గణాంకాలు కూడా కావడం విశేషం. అతని కెరీర్ బెస్ట్ గణాంకాలను 2018లొ మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై (9/86) సాధించాడు. ఓవరాల్‌గా బుమ్రా తన కెరీర్లో తొమ్మిది సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. బుమ్రా 33 టెస్ట్‌ల్లో 20.82 సగటున 146 వికెట్లు పడొట్టాడు. రెండో టెస్ట్‌లో బుమ్రా ఒంటిచేత్తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను తనాతునకలు చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బుమ్రా చేసిన విన్యాసాలు భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రాతో పాటు యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కూడా టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించారు. జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో (209) చెలరేగగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో గిల్ సెంచరీతో (104) కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సమిష్టిగా రాణించి తమ జట్టుకు అపురూప విజయాన్ని అందించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. జైస్వాల్ విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో జైస్వాల్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. రోహిత్ 14, శుభ్‌మన్ గిల్ 34, శ్రేయస్ 27, రజత్ పాటిదార్ 32, అక్షర్ పటేల్ 27, కేఎస్ భరత్ 17, అశ్విన్ 20, బుమ్రా 6, ముకేశ్ కుమార్ 0 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, బషీర్, రెహాన్ తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (76) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 6, కుల్దీప్ 3, అక్షర్ ఓ వికెట్ పడగొట్టారు. 143 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 255 పరుగులు చేసి ఆలౌటైంది. ఫామ్ లేమితో సతమతమవుతున్న గిల్ ఎట్టకేలకు సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 4, రెహాన్ 3, ఆండర్సన్ 2, బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 292 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో 3 వికెట్లు, ముకేశ్, కుల్దీప్, అక్షర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది. -
టీమిండియా 4-1తో ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం ఖాయం!
Ind vs Eng 2024 Test Series: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అన్నాడు. తొలి టెస్టులో ఓడినా మిగిలిన నాలుగూ గెలిచి 4-1 తేడాతో ట్రోఫీని గెలుస్తుందని జోస్యం చెప్పాడు. కీలక ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ జట్టుతో లేకపోయినా వరుస విజయాలు సాధిస్తుందని చేతన్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా వైఫల్యం తర్వాత చేతన్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులకే చేతన్ శర్మ తిరిగి నియమితుడు కాగా.. కమిటీలో నలుగురు కొత్త సభ్యులకు చోటు దక్కింది. కానీ.. బీసీసీఐ తనకు ఇచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఓ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో.. ‘‘టీమిండియా క్రికెటర్లు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించకపోయినా ఇంజక్షన్లు వేసుకుని మైదానంలో దిగుతారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. క్రీడా వర్గాల్లో సంచలనం రేకెత్తించిన చేతన్ శర్మ వ్యాఖ్యల వల్ల అతడి పదవి ఊడింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలక్టర్‌గా చేతన్ స్థానంలో బాధ్యతలు చేపట్టాడు. ఇదిలా ఉంటే.. చాలా రోజుల తర్వాత చేతన్ శర్మ మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. అప్పుడు కూడా ఇలాగే జరిగింది ఇండియా టుడేతో మాట్లాడుతూ టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘అతిథులకు స్వాగతం పలికే క్రమంలో మనం వాళ్లకు ఓ అవకాశం ఇచ్చి ఉంటాం. కొన్నిసార్లు తప్పులు జరగడం సహజం. అయినా తొలి టెస్టులో టీమిండియా తప్పేమీ చేయలేదు. బాగా ఆడినా కూడా ఓడిపోయింది. మూడేళ్ల క్రితం కూడా మనం ఇలాగే చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయాం. కానీ ఆ తర్వాత వాళ్లను 3-1తో చిత్తు చేశాం. ఇప్పుడు కూడా అదే చరిత్ర పునరావృతం కాబోతోంది. రెండో టెస్టు నుంచి టీమిండియా మరింత దూకుడు పెంచడం ఖాయం. కచ్చితంగా ఈ సిరీస్‌ను 4-1తో గెలిచి తీరుతుంది’’ అని చేతన్ శర్మ అంచనా వేశాడు. కాగా ఫాస్ట్‌బౌలర్ చేతన్ శర్మ టీమిండియా తరఫున 23 టెస్టులాడి 396, 65 వన్డేల్లో 456 రన్స్ తీశాడు. అదేవిధంగా ఆయా ఫార్మాట్లలో వరుసగా 61, 67 వికెట్లు కూలగొట్టాడు. విశాఖపట్నంలో రెండో టెస్టు ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎదురైన ఈ పరాభవానికి.. విశాఖపట్నంలో బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి ఇరుజట్ల మధ్య డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో రెండో టెస్టు మొదలుకానుంది. చదవండి: Ind vs Eng 2nd Test Vizag: రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన -
బీసీసీఐలోకి చేతన్ శర్మ.. మరోసారి సెలెక్టర్‌గా బాధ్యతలు
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తిరిగి సెలక్షన్ బాధ్యతలను చేపట్టాడు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. టీమిండియా ఫేక్ ఫిట్ నెస్ సీక్రెట్స్, ఆటగాళ్ల ఎంపిక, విశ్రాంతి పేరుతో ఆటగాళ్లను ఆటకూ దూరం చేసే అదృష్టశక్తులు, ఎవరిని డ్రాప్ చేయాలి, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలని అనేది నిర్ణయించేది ఎవరు? బిసీసీఐ చీఫ్ గా సౌరబ్ గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన ఘర్షణల గురించి.. విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మ మధ్య ఉన్న ఈగో క్లాషెస్ గురించి.. ఇలా చెప్పుకుంటూపోతే బిసిసిఐకి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. దీంతో అతడు బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చేతన్ స్వయంగా బీసీసీఐకి తన రాజీనామాను సమర్పించాడు. అప్పటి నుంచి నాలుగు నెలల పాటు ఎవరికి కనిపించని చేతన్ శర్మ కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేడు.అయితే తాజాగా మరోసారి సెలక్షన్ కమిటీలో బాధ్యతలు చేపట్టాడు. కానీ జాతీయ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా కాకుండా నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చైర్మెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ జోన్ టీమ్ కు సెలక్షన్ కమిటీలో చేతన్ శర్మ భాగమయ్యాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా చేతన్ శర్మ సారథ్యంలోని నార్త్ జోన్.. తమ జట్టుకు మన్దీప్ సింగ్ ను సారథిగా ఎంపిక చేసింది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అదగరొట్టిన పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ తో పాటు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సంచలనం నెహల్ వధెరా లు కూడా నార్త్ జోన్ లో ఉన్నారు. కాగా ఈ టీమ్ లో జయంత్ యాదవ్ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్ గా ఉన్నాడు. చదవండి: భార్య జెర్సీతో బరిలోకి.. తొలి మ్యాచ్‌లోనే ఉతికారేశాడు -
చాలా కష్టంగా ఉంది.. ఒక్కరూ సాయం చేయడం లేదు.. కనీసం: చేతన్ శర్మ
Chetan Sharma shares cryptic post: భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ నెట్టింట మరోసారి వైరల్‌గా మారాడు. ఎవరూ సహకారం అందించడం లేదంటూ నర్మగర్భ ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా పరాభవం నేపథ్యంలో చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో అనూహ్య రీతిలో మరోసారి చేతన్ శర్మనే చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. శివ్‌సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌కు చేతన్ శర్మ పానెల్లో చోటిచ్చింది. సంచలన వ్యాఖ్యలతో వివాదంలో ఇదిలా ఉంటే.. చీఫ్ సెలక్టర్‌గా మరోసారి నియమితుడైన చేతన్ శర్మ నెల రోజుల్లోనే వివాదంలో చిక్కుకున్నాడు. ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. భారత క్రికెటర్లు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించనప్పటికీ ఇంజక్షన్లు వేసుకుని మైదానంలో దిగుతారంటూ సంచలనం రేపాడు. అదే విధంగా సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో నాటి కెప్టెన్ విరాట్ కోహ్లికి వ్యతిరేకంగా రాజకీయాలు జరిగాయంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో టీమిండియా ప్రతిష్ట, విశ్వసనీయతను దెబ్బతీసేలా మాట్లాడిన చేతన్ శర్మ రాజీనామా చేయడం కూడా చర్చకు దారితీసింది. ఒక్కరు కూడా సాయం చేయడం లేదు ఈ నేపథ్యంలో చేతన్ శర్మను తప్పించాలనే ఉద్దేశంతో బీసీసీఐ పెద్దలే ఈ స్టింగ్ ఆపరేషన్‌కు ప్రణాళికలు రచించారనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత.. తాజాగా ఓ క్రిప్టిక్ పోస్ట్‌తో చేతన్ శర్మ ముందుకు వచ్చాడు. ‘‘ఇప్పటిదాకా గడిచిన జీవితం చాలా కష్టంగా తోచింది. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఎలాంటి సహకారం లేదు. ఆ మాతా రాణి ఆశీర్వాదాలైనా నాపై ఉంటాయని ఆశిస్తున్నా’’ అని చేతన్ శర్మ ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందించిన ఆయన ఫాలోవర్లు.. ‘‘ధైర్యంగా ఉండండి. జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నీకు గడ్డు దశ నడుస్తుంది కావొచ్చు. కానీ ఏదో ఒకరోజు నీ సమస్యలు తీరిపోతాయి భాయ్’’ అని అండగా నిలుస్తున్నారు. చదవండి: యువతి పట్ల మృగంలా వ్యవహరించిన కేసు.. శ్రీలంక క్రికెటర్‌కు ఊరట చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే? Life has been very tough so far. No hope from your near & dear. Hope Mata Rani bless me..... — Chetan Sharma (@chetans1987) May 17, 2023 -
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా
-
BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా.. ఆమోదించిన జై షా!
Chetan Sharma RESIGNS!: భారత క్రికెట్ నియంత్రణ మండలి చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇటీవల ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. భారత క్రికెటర్ల గురించి అతడు మాట్లాడిన మాటలు వివాదానికి దారితీశాయి. ఆమోదించిన జై షా? దీంతో చేతన్ శర్మపై వేటు తప్పదని భావించగా.. శుక్రవారం అతడు రాజీనామా చేయడం గమనార్హం. చేతన్ శర్మ తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జై షాకు పంపించగా.. ఆయన ఆమోదం తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో రోహిత్ సేన సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన నేపథ్యంలో చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు రద్దు చేసి మళ్లీ అతడినే.. ఈ నేపథ్యంలో ఖాళీలు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ.. ఈ ఏడాది జనవరి 7న చేతన్ శర్మను మరోసారి చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. అతడి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌లకు చోటు ఇచ్చింది. అయితే, ఇటీవల ఓ టీవీ చానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాలను కుదిపేశాయి. దుమారం రేపిన వ్యాఖ్యలు టీమిండియా క్రికెటర్లు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించనప్పటికీ ఇంజక్షన్లు వేసుకుని మైదానంలో దిగుతారంటూ అతడు వ్యాఖ్యానించాడు. అదే విధంగా సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాటి కెప్టెన్ విరాట్ కోహ్లికి వ్యతిరేకంగా జరిగిన రాజకీయాలు, కోహ్లి- రోహిత్ శర్మ మధ్య విభేదాలు తదితర విషయాలను చేతన్ శర్మ ప్రస్తావించడం వివాదాస్పదమైంది. కావాలనే చేశారా? ఈ నేపథ్యంలో చేతన్ శర్మ అంటే పడని బీసీసీఐ పెద్దలే ఈ స్టింగ్ ఆపరేషన్‌కు ప్రణాళిక రచించారని, అతడిని తప్పించేందుకు ఇలా ప్లాన్ చేశారని క్రీడా వర్గాల్లో చర్చ జరిగింది. తనకు తానుగా స్వయంగా తప్పుకొనేలా వ్యూహాలు రచించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో అతడు తన రాజీనామా లేఖను జై షాకు సమర్పించాడని వార్తలు రావడం గమనార్హం. ఓవైపు టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టు జరుగుతున్న వేళ చేతన్ శర్మ రాజీనామా అంశం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్ స్పిన్నర్.. నటాషా నుదుటిన సింధూరం దిద్దిన హార్దిక్.. ముచ్చటగా మూడోసారి! పెళ్లి ఫొటోలు వైరల్ BCCI chief selector Chetan Sharma resigns from his post. He sent his resignation to BCCI Secretary Jay Shah who accepted it. (File Pic) pic.twitter.com/1BhoLiIbPc — ANI (@ANI) February 17, 2023 -
గిల్, ఇషాన్‌లు ఇద్దరు స్టార్ క్రికెటర్లను తొక్కేశారు.. చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు
జీ న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన విషయాలను బహిర్గతం చేశాడు. టీమిండియా, బీసీసీఐల్లో జరిగిన, జరుగుతున్న ఎన్నో విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్, బీసీసీఐల్లోని పెద్ద తలకాయలకు సంబంధించిన విషయాల్లో బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను వెల్లడించాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, టీమిండియా ప్రస్తుత, మాజీ సారధులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను వివరించాడు. కెప్టెన్సీ విషయంలో నాటి బీసీసీఐ బాస్ గంగూలీ.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మధ్య వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అగ్గి రాజేశాడు. కోహ్లి టీ20 కెప్టెన్సీ వదిలేస్తానన్నప్పుడు బీసీసీఐ అతన్ని పునరాలోచించుకోవాలని కోరిందని, అలాగే వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పించేముందు బోర్డు కోహ్లితో మాట్లాడిందని నాడు కోహ్లి ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి-రోహిత్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారిలో ఇగో ఉందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాస్తవానికి గంగూలీకి రోహిత్ శర్మపై ఎలాంటి ప్రత్యేక ఇంట్రెస్ట్ లేనప్పటికీ.. కోహ్లిపై మాత్రం వ్యతిరేకత ఉండిందంటూ బాంబు పేల్చాడు. టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేసి కోహ్లి బీసీసీఐపై పైచేయి సాధించాలని భావించాడని, అది నచ్చక పోవడం వల్లనే గంగూలీ-కోహ్లిల మధ్య గ్యాప్ పెరిగిందని అన్నాడు. అలాగే టీమిండియా ఆటగాళ్లు ఫిట్నెస్ ప్రూవ్ చేసుకునేందుకు ఇంజక్షన్లు వాడతారని, అవి డోపింగ్ టెస్ట్‌కు సైతం చిక్కని అధునాతన ఔషదాలంటూ భారత క్రికెట్లో ప్రకంపనలకు ఆధ్యం పోశాడు. కొందరు ఆటగాళ్లు పూర్తి ఫిట్‌గా లేకపోయినా తమను ఆడించాలని బతిమాలతారంటూ సరికొత్త దుమారానికి తెరలేపాడు. ఇదే సందర్భంగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, శిఖర్ ధవన్‌ల పేర్లను ప్రస్తావిస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. గిల్, ఇషాన్ కిషన్ల వల్ల కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, శిఖర్ ధవన్‌ల కెరీర్లు ప్రమాదంలో పడ్డాయని.. గిల్, ఇషాన్‌ల హవాలో రాహుల్, సంజూలకు అవకాశాలు క్రమంగా కనుమరుగవుతాయని అన్నాడు. శిఖర్ ధవన్ ట్రిపుల్ సెంచరీలు చేసినా బీసీసీఐ పట్టించునే పరిస్థితుల్లో లేదని, అతనో ఔట్‌డేటెడ్ ప్లేయర్ అని కామెంట్ చేశాడు. భారత క్రికెట్ గురించి.. బీసీసీఐ, టీమిండియాలో పెద్ద తలకాయల గురించి చేతన్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ సర్కిల్స్‌లో పెను దుమారం రేపుతున్నాయి. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన చేతన్ శర్మపై బీసీసీఐ ఏ చర్యలకు ఉపక్రమిస్తుందో వేచి చూడాలి. -
రోహిత్‌పై ప్రేమ లేదు.. కానీ కోహ్లికి వ్యతిరేకం! చేతన్ శర్మ షాకింగ్ కామెంట్స్
Virat Kohli- Sourav Ganguly- Rohit Sharma: ‘‘రోహిత్‌ను కెప్టెన్ చేసి అతడికి ఏదో మేలు చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. మేము విరాట్ కోహ్లికి వ్యతిరేకంగా ఉన్నామంతే. ఆ సమయంలో విరాట్ ఫామ్‌లేమిని బీసీసీఐ తనకు అనుకూలంగా మార్చుకుంది. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించింది. భారత నంబర్ 1 బ్యాటర్ పట్ల అలా ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు’’ అని టీమిండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అన్నాడు. కాగా ఓ టీవీ చానెల్.. స్టింగ్ ఆపరేషన్ ద్వారా భారత క్రికెట్ గురించి చేతన్ శర్మ పంచుకున్న అభిప్రాయాలను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పైచేయి సాధించాలనుకున్నాడు ఆట కంటే తానే అత్యున్నతం భావించిన కోహ్లికి చేదు అనుభవం తప్పలేదన్న చేతన్ శర్మ.. నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో కోహ్లి ఢీకొట్టడం అతడికి ప్రతికూలంగా మారిందన్నాడు. ‘‘టీ20 కెప్టెన్సీ వదిలేస్తానని కోహ్లి చెప్పినపుడు బీసీసీఐ, సెలక్షన్ కమిటీ అతడిని పునరాలోచించుకోవాలని సూచించింది. కానీ, సౌతాఫ్రికా టూర్ ముందు తను మీడియా ముందుకు వచ్చి టీ20 కెప్టెన్సీ విషయాన్ని పెద్దది చేశాడు. బీసీసీఐ ప్రెసిడెంట్‌పై పైచేయి సాధించాలని చూశాడు’’ అని చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు. చేతన్ శర్మ గొడవల్లేవు ఇక కోహ్లి- రోహిత్‌ల మధ్య విభేదాల ప్రస్తావన వచ్చినపుడు.. ‘‘నిజానికి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అయితే, ఇద్దరిలో ఇగో మాత్రం ఉంది. వాళ్లిద్దరూ అమితాబ్ బచ్చన్- ధర్మేంద్రలా పెద్ద సినీ స్టార్లు అనుకోండి. వృత్తిగతంగానే కానీ వ్యక్తిగతంగా వారి మధ్య అంతగా గొడవలేమీ లేవు’’ అని చేతన్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లి స్వయంగా వైదొలగగా.. వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ అతడిని తప్పించింది. దీంతో ప్రెస్‌మీట్ పెట్టిన కోహ్లి.. తనను సంప్రదించిన తర్వాతే వన్డే కెప్టెన్‌ను మార్చామన్న గంగూలీ వ్యాఖ్యలు ఖండించాడు. దీంతో బోర్డు- కోహ్లి మధ్య నాడు విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇక సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోగా.. రోహిత్ శర్మ అన్నిఫార్మాట్లకు సారథిగా నియమితుడతయ్యాడు. చదవండి: WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్, వేదికలు.. ఫైనల్ అప్పుడే! Ind Vs Aus 2nd Test: ఆసీస్‌తో రెండో టెస్టు ప్రత్యేకం.. ప్రధాని మోదీని కలిసిన పుజారా -
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారంటూ
BCCI - Chetan Sharma: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కొంతమంది టీమిండియా ఆటగాళ్లు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారంటూ అతడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి. ఆడనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తారు అందులో.. ‘‘ఆటగాళ్లు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోయినా.. మ్యాచ్ ఆడేందుకు వాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు. 80 శాతం ఫిట్నెస్తో ఉన్నా సరే ఇంజక్షన్లు వేసుకుని మైదానంలో దిగుతారు. 85 శాతం ఫిట్నెస్ సాధించినా.. ‘‘సర్ ప్లీజ్ మమ్మల్ని ఆడనివ్వండి’’అని బతిమిలాడుతారు. అయితే, మా వైద్య బృందం మాత్రం అందుకు అనుమతించదు. అయితే, ఆటగాళ్లు మాత్రం ఇలాంటి విషయాలతో పనిలేకుండా తాము ఎల్లప్పుడూ ఆడుతూనే ఉండాలని కోరుకుంటారు. బుమ్రా విషయమే తీసుకోండి.. అతడు కనీసం కిందకు బెండ్ అవ్వలేకపోతున్నాడు. అలాంటపుడు పాపం తను ఎలా ఆడగలడు? ఒకటీ రెండుసార్లు తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే, కొంతమంది మాత్రం 80 శాతం ఫిట్నెస్తో ఉన్నా.. ‘‘మేము పూర్తి ఫిట్‌గా ఉన్నాము సర్’’’ అని చెప్తారు’’ అని చేతన్ శర్మ పేర్కొన్నాడు. యాంటీ డోపింగ్ జాబితాలో ఉన్నవే.. అయితే, వాళ్లు వాడేవి ఇంజక్షన్లా లేదంటే పెయిన్ కిల్లర్సా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘వాళ్లు కేవలం ఇంజక్షన్లే వాడతారు. పెయిన్ కిల్లర్లు అస్సలు వాడరు. నిజానికి వాళ్లు ఎలాంటి ఇంజక్షన్ తీసుకున్నారో లేదో మనం కనిపెట్టలేం. పెయిన్ కిల్లర్ల వల్ల డోపింగ్‌లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. యాంటీ డోపింగ్ జాబితాలో ఉండే ఇంజక్షన్లే వాడతారు’’ అని చేతన్ శర్మ పేర్కొన్నాడు. మరి ఆటగాళ్లు తమంతట తామే ఈ ఇంజక్షన్లు తీసుకుంటారా అని సదరు టీవీ చానెల్ ప్రతినిధి అడుగగా.. ‘‘వాళ్లంతా పెద్ద పెద్ద సూపర్స్టార్లు. వాళ్లకు డాక్టర్లు దొరకరా? వేలాది మంది డాక్టర్లు చుట్టూ ఉంటారు. ఒక్క ఫోన్ కాల్ చాలు.. క్రికెటర్ల ఇంట్లో వాలిపోతారు’’ అంటూ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నా పనులు నాకుంటాయి.. మరి సెలక్టర్లకు ఈ విషయం తెలియదా అన్న ప్రశ్నకు.. ‘‘వాళ్లు ఇంజక్షన్లు తీసుకున్న విషయం మాకెలా తెలుస్తుంది? మ్యాచ్ ఆడతారు.. ఆరింటి దాకా గ్రౌండ్లో ఉంటారు. అప్పటి వరకు టీమ్ మేనేజ్మెంట్ వాళ్లతోనే ఉంటుంది. తర్వాత వాళ్లు బస్సులో హోటల్‌కు వెళ్లిపోతారు. ఎవరి గదులు వాళ్లకు ఉంటాయి. ప్రతి నిమిషం వాళ్లను గమనిస్తూ ఉండలేం కదా.. వాళ్లేం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారని ఊరికే వాళ్ల గురించే ఆలోచించం. నాకంటూ నా సొంత పనులు ఉంటాయి. వాకింగ్‌కు వెళ్లటమో, డిన్నర్ చేయడమో.. ఎవరి ప్లాన్లు వాళ్లకు ఉంటాయి కదా! ఎవరు నిబంధనలు అతిక్రమిస్తున్నారో నాకైతే కచ్చితంగా తెలియదు. 2500 మంది ఉన్నారు.. 99.9 శాతం మంది ప్లేయర్లు జాతీయ క్రికెట్ అకాడమీకి రిపోర్టు చేస్తారు. అందులో 0.5 శాతం మంది ఇలాంటి పనులు చేస్తారేమో? అది కూడా కచ్చితంగా చెప్పలేం. దాదాపు 2500 మంది ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లందరి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవడం కష్టం’’ అని చేతన్ శర్మ బదులిచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వేటు తప్పదా? కాగా టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా నిరాశజనక ప్రదర్శన నేపథ్యంలో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఆరంభంలో మరోసారి అతడినే చీఫ్ సెలక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. చేతన్ శర్మ వ్యాఖ్యలపై క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చేతన్ శర్మపై కఠిన చర్యలు తప్పవని, వేటు పడే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: నిన్ననే కదా వేలం అయ్యింది.. అప్పుడే విధ్వంసం మొదలైందా..? చిన్నారి విన్యాసాలకు సచిన్ ఫిదా IND Vs AUS: శ్రేయాస్ అయ్యర్ ఆగమనం.. వేటు ఎవరిపై? -
టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ.. బీసీసీఐ ప్రకటన
భారత క్రికెట్ జట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ మరోసారి నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం వెల్లడించింది. చేతన్‌తో పాటు ఈ సెలక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌కు చోటు దక్కింది. కాగా టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ సేన దారుణ వైఫల్యం నేపథ్యంలో సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చేతన్ శర్మ చైర్మన్‌గా ఉన్న కమిటీని రద్దు చేసి ఖాళీ స్థానాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలో మరోసారి చేతన్ శర్మ వైపే మొగ్గు చూపిన బీసీసీఐ పెద్దలు అతడిని అప్లై చేసుకోవాల్సిందిగా సూచించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్ సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఆలిండియా మెన్ సెలక్షన్ కమిటీని ఖరారు చేసింది. నవంబరు 18న 5 పోస్టుల కోసం దరఖాస్తులు కోరగా.. మొత్తం 600 మంది అప్లై చేసినట్లు పేర్కొంది. వీరిలో 11 మందిని షార్ట్‌లిస్ట్ చేసి చివరగా కావాల్సిన ఐదుగురిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా చేతన్ శర్మ ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. చదవండి: కొంచెం చూడరా బాబు.. బంతి వేయకముందే పిచ్ మధ్యలోకి! వీడియో వైరల్ -
రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా మళ్లీ అతడే!
Team India Chief Selector: టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సెలక్షన్ కమిటీ విషయంలో ఈ మాజీ పేసర్కే భారత క్రికెట్ నియంత్రణ మండలి మరోసారి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. కాగా 2020 డిసెంబరులో సునిల్ జోషి స్థానంలో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ నియమితుడయ్యాడు. ఈ క్రమంలో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన ఈ పంజాబ్ క్రికెటర్‌కు టీ20 ప్రపంచకప్-2022 తర్వాత చేదు అనుభవం ఎదురైంది. ఆసియా కప్, వరల్డ్‌కప్ ఈవెంట్లలో టీమిండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో అతడి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేసింది బీసీసీఐ. ప్రక్షాళన చర్యల్లో భాగంగా కొత్త కమిటీ ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, జాతీయ మీడియా తాజా కథనాల ప్రకారం.. చేతన్ శర్మనే మరోసారి చీఫ్ సెలక్టర్ చేసేందుకు బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చేతన్ శర్మను దరఖాస్తు చేసుకోవాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. నిబంధనలకు అనుగుణంగానే చేతన్‌తో పాటు హర్వీందర్ సింగ్ కూడా తన పదవిలో కొనసాగనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. సెలక్షన్ ప్యానెల్లో వీరితో పాటు 13 మంది పేర్లు షార్ట్‌లిస్టు అయినట్లు తెలుస్తోంది. అయితే, చీఫ్ సెలక్టర్ పదవి కోసం పోటీపడ్డ వెంకటేశ్ ప్రసాద్‌కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ సేన వైఫల్యం నేపథ్యంలో నవంబరులో సెలక్షన్ కమిటీని రద్దు చేశారు. సెమీస్‌లోనే భారత్ ఇంటిబాట పట్టిన తరుణంలో ఈ మేరకు సెలక్టర్లపై వేటు వేశారు. ఈ క్రమంలో ఖాళీ స్థానాల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రెస్‌నోట్ రిలీజ్లో.. ఇందుకు గల అర్హతలను ప్రస్తావించింది. ‘‘కనీసం ఏడు టెస్టు మ్యాచ్‌లు లేదంటే, 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు. అదే విధంగా ఆటకు వీడ్కోలు పలికి కనీసం ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు’’ అర్హులు అని పేర్కొంది. చదవండి: Ind Vs SL: ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! అర్ష్‌దీప్‌పైనే భారం! ఇషాన్, రుతు.. ఇంకా -
BCCI: అగార్కర్, లక్ష్మణ్ ఔట్.. సెలెక్షన్ కమిటీ రేసులో కొత్త పేర్లు
BCCI New Selection Committee: చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీపై బీసీసీఐ ఇటీవలే వేటు వేసిన నేపథ్యంలో కొత్త ప్యానెల్ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దరఖాస్తు స్వీకరణకు నిన్న (నవంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో 100 వరకు అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సెలెక్షన్ కమిటీ చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపించిన లక్ష్మన్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్‌లు దరఖాస్తు చేసుకోలేదన్న వార్త బీసీసీఐ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతానికి సెలెక్షన్ కమిటీకి ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో హేమంగ్ బదానీ, మణిందర్ సింగ్ పేర్లు చైర్మన్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ ఫైనల్ రిజల్ట్ రావాలంటే, డిసెంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే. ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురు ప్రముఖుల పేర్లు.. సౌత్ జోన్.. హేమంగ్ బదానీ కన్వల్జిత్ సింగ్ వెస్ట్ జోన్.. మణిందర్ సింగ్ నయన్ మోంగియా సలీల్ అంకోలా సమీర్ దీఘే సెంట్రల్ అండ్ నార్త్ జోన్.. అజయ్ రాత్రా గ్యాను పాండే అమయ్ ఖురాసియా అతుల్ వాసన్ నిఖిల్ చోప్రా రితేందర్ సింగ్ సోధి ఈస్ట్ జోన్.. శివ్ సుందర్ దాస్ ప్రభంజన్ మల్లిక్ ఆర్ఆర్ పరిడా శుభోమోయ్ దాస్ ఎస్ లహిరి -
BCCI: కొత్త చీఫ్ సెలక్టర్ ఎవరంటే..?
టీ20 వరల్డ్‌కప్-2022, అంతకుముందు జరిగిన పలు మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యం చెందడంతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై వేటు పడిన విషయం విధితమే. ఈ కమిటీకి చైర్మన్‌గా చేతన్ శర్మ ఉండగా, హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్), సునీల్ జోషి (సౌత్ జోన్), దేబశిష్ మొహంతి (ఈస్ట్ జోన్) సభ్యులుగా ఉన్నారు. వీరి పదవీ కాలం మరికొంత కాలం ఉన్నా.. బీసీసీఐ కమిటీని రద్దు చేసి, కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోయే సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. బీసీసీఐ ఉన్నత వర్గాల సమాచారం మేరకు.. సెలక్షన్ కమిటీ రేసులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో 2020లో దరఖాస్తు చేసుకున్న శివరామకృష్ణన్‌కు బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షాల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త చీఫ్ సెలెక్టర్‌గా శివరామకృష్ణన్ పేరు దాదాపుగా ఖరారైందని సమాచారం. రేసులో ఉన్న అజత్ అగార్కర్‌కు కూడా బోర్డులోని పలువురు ప్రముఖుల మద్దతు ఉండటంతో అతని అభ్యర్ధిత్వాన్ని కూడా తీసివేయడానికి వీల్లేదని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. సెలెక్షన్ కమిటీ సభ్యులకు ఉండాల్సిన అర్హతలు.. కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు ఐదేళ్లు పూర్తి అయ్యి ఉండాలి ఐదుగురు సభ్యులకు వయసు పరిమితి 60 ఏళ్లులోపే ఉండాలి 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకొనేందుకు అనర్హుడు -
సెలెక్షన్ కమిటీని హఠాత్తుగా తొలగించడానికి కారణాలివే..!
చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీకి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రద్దు చేసిన నేపథ్యంలో యావత్ భారత క్రికెట్ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. భారత క్రికెట్ చరిత్రలో జాతీయ సెలక్షన్ కమిటీని ఇలా హఠాత్తుగా తొలగించిన దాఖలాలు లేకపోవడంతో సర్వత్రా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. భారత క్రికెట్లో చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంపై అంతార్జతీయ క్రికెట్ సర్కిల్స్‌లో సైతం చర్చ జోరుగా సాగుతుంది. ఇంత ఆదరాబాదరాగా సెలెక్షన్ ప్యానెల్‌పై ఎందుకు వేటు వేయాల్సి వచ్చిందోనని నెటిజన్లు ఆరా తీసే పనిలో పడ్డారు. అయితే సెలెక్షన్ కమిటీపై వేటుకు గట్టి కారణాలే ఉన్నాయని బీసీసీఐ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. 2021 జనవరిలో చేతన్ శర్మ నేతృత్వంలో సునీల్ జోషి(సౌత్ జోన్), హర్విందర్ సింగ్(సెంట్రల్ జోన్), దెబాషిశ్ మొహంతి(ఈస్ట్ జోన్)లతో కూడిన జాతీయ సెలెక్షన్ కమిటీ ఎన్నికైంది. నాటి నుంచి కమిటీ తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా, నాసిరకంగా ఉన్నాయని బీసీసీఐ వివరణ ఇచ్చింది. వీరి హయాంలో టీమిండియా.. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో కనీసం నాకౌట్ స్టేజ్‌కు కూడా చేరలేదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి ఈ ఏడాది ఆసియా కప్‌లో సూపర్-4లోనే పరాభవం తాజాగా టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమణ బుమ్రా, జడేజా పూర్తి ఫిట్‌గా లేకపోయినా ఎంపిక చేయడం ఏడాదికి 8 మంది కెప్టెన్లను మార్చడం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు ఎంపిక చేసిన జట్లలో సమతూకం లోపించడం ఇలా పై పేర్కొన్న అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ చేతన్ శర్మ టీమ్‌కు ఉద్వాసన పలికినట్లు వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే, ఇదే నెలలోనే కొత్త సెలక్షన్ కమిటీని నియమించనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా వెల్లడించారు. సెలక్షన్ కమిటీలోని ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలని బీసీసీఐ పేర్కొంది. అలాగే, క్రికెట్‌కు కనీసం 5 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలని స్పష్టం చేసింది. చదవండి: బీసీసీఐ షాకింగ్ ప్రకటన.. సెలక్షన్ కమిటీ రద్దు -
దినేష్ కార్తీక్ కెరీర్ క్లోజ్..!
-
గంగూలీ అయిపోయాడు.. ఇప్పుడు చేతన్ శర్మ వంతు?!
బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దాదా తొలగింపుపై ఎంత డ్రామా నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి గంగూలీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీసీసీఐ మంగళవారం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది. తొలి వన్డే ప్రపంచకప్ (1983) గెలిచిన టీమిండియా సభ్యుడు, 67 ఏళ్ల రోజర్ బిన్నీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత మళ్లీ ఆటగాడే బోర్డు పగ్గాలు చేపట్టారు. మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పదవులన్నీ కూడా పోటీలేకుండానే నామినేషన్ వేసిన వాళ్లందరికీ దక్కాయి. కొత్త కార్యవర్గంలో రోజర్ బిన్నీ (అధ్యక్షుడు.. బీసీసీఐ కార్యదర్శిగా జై షా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా , సంయుక్త కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా,కోశాధికారిగా ఆశిష్ షెలార్‌లు నియమితులయ్యారు. గంగూలీని పదవి నుంచి తొలగించిన బీసీసీఐ ఇప్పుడు జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్.. మాజీ క్రికెటర్ చేతన్ శర్మ వర్గంపై కన్నువేసింది. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో గంగూలీ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ చేతన్ శర్మను చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపిక చేశాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు 2020 డిసెంబర్లో కొత్త సెలక్షన్ కమిటీని నియమించాడు. సెలక్షన్ కమిటీలోచేతన్ శర్మతో పాటు అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతి ఉన్నారు. తాజాగా చేతన్ శర్మ బృంధం తమ పదవులను కోల్పోయే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. చేతన్ శర్మ పనితీరు పట్ల బీసీసీఐ కొత్త నాయకత్వం సంతృప్తిగా ఉన్నప్పటికి కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయాలనే ధోరణిలోనే కొత్త పాలకవర్గం ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన పనితీరు కనబరిచిన చేతన్ శర్మను తొలగించకపోయినా.. అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతిని సాగనంపడం ఖాయమని సమాచారం. టి20 ప్రపంచకప్‌లో టీమిండియా చేసే ప్రదర్శన ఆధారంగానే సెలక్షన్ కమిటీ పదవుల మార్పుపై ఒక స్పష్టత రానుంది. వీరి స్థానాల్లో ఇద్దరు మాజీ క్రికెటర్లు.. ఒడిశాకు చెందిన మాజీ ఓపెనర్ శివ సుందర్ దాస్, బెంగాల్ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా, జాతీయ జూనియర్ సెలెక్టర్ రణదేబ్ బోస్ సెలెక్షన్ కమిటీ పదవుల కోసం పోటీలో ఉండొచ్చని అంటున్నారు. అయితే వీరిలో రణదేబ్ బోస్ జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించకపోవడం అతనికి మైనస్. దీనిని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం బెంగాల్‌కే చెందిన మాజీ వన్డే ప్లేయర్ లక్ష్మీ రతన్ శుక్లా లేదా ఒడిశాకు చెందిన సంజయ్ రౌల్లో ఒకరిని తీసుకోవచ్చని తెలుస్తోంది. చదవండి: 'లెగ్ స్పిన్ బౌలింగ్ వేయాలా'.. రిజ్వాన్ అదిరిపోయే రిప్లై ఆసియా కప్ టోర్నీలో ఆడలేం: జై షా -
భారత జట్టుతో పాటు ఐర్లాండ్‌కు వెళ్లనున్న చీఫ్ సెలెక్టర్..!
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టుతో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండు టీ20ల సిరీస్ నిమిత్తం టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటనుంచనుంది. ఇక జూన్ 26న డబ్లిన్ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఇంగ్లండ్ పర్యటన కారణంగా ఐర్లాండ్ సిరీస్‌కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా దూరమయ్యాడు. దీంతో తొలి సారి భారత జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఎంపిక కాగా, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. చేతన్ శర్మ భారత జట్టుతో పాటు ఐర్లాండ్‌కు పయనం కానున్నారు. మరోవైపు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బీసీసీఐ సెలెక్టర్ సునీల్ జోషి కూడా భారత జట్టుతో ఉన్నారు. ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత టీ20 జట్టు: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: Wasim Jaffer Trolls Eoin Morgan: 'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్ -
కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలా..? అలాంటి వార్తలు విని నవ్వుకునేవాడిని..!
ముంబై: టీమండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి, పరిమిత ఓవర్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు నెలకొన్నాయని, అందువల్లే కోహ్లి వన్డే కెప్టెన్సీని సైతం రోహిత్‌కు కోల్పోవాల్సి వచ్చిందని.. గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో భారత జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తాజాగా స్పందించాడు. కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలు నెలకొన్నాయన్న ప్రచారం అవాస్తవమని, అవన్నీ పనిలేని వ్యక్తులు పుట్టించే పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశాడు. కొన్ని సందర్భాల్లో అలాంటి వార్తలు విని తనలో తాను నవ్వుకునేవాడినని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి కోహ్లి-రోహిత్‌లు చాలా సన్నిహితంగా ఉంటారని, జట్టుకు సంబంధించిన అన్ని విషయాలు కలిసి చర్చిస్తారని, ఒకరి సారధ్యంలో మరొకరు ఆడేందుకు ఏమాత్రం సంకోచించరని, ఈ విషయాన్ని కోహ్లినే స్వయంగా వెల్లడించాడని గుర్తు చేశాడు. టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోకూడదని తామందరమూ కోహ్లిని కోరామని, అయినా అతను మా మాటలను పట్టించుకోలేదని వాపోయాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతోనే వన్డే సారధ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాల్సి వచ్చిందని వివరించాడు. భవిష్యత్తులో కోహ్లి-రోహిత్‌లు ఒకరి సారధ్యంలో మరొకరు కలిసి ఆడతారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారిద్దరూ ఒకే కుటుంబంలా కలిసుంటారంటూ కోహ్లి-రోహిత్‌ల ఎపిసోడ్‌కు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన అనంతరం చేతన్ శర్మ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. చదవండి: 'కోహ్లి మాటల్లో నిజం లేదు..' చేతన్ శర్మ కౌంటర్ -
'రుతురాజ్ టీమిండియాలో వండర్స్ చేయగలడు'
టీమిండియా యువ ఆటగాడు.. సీఎస్కే స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రసంశల వర్షం కురిపించాడు. సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ శుక్రవారం 18 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తుండగా.. రుతురాజ్ గైక్వాడ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేతన్ శర్మ రుతురాజ్‌పై స్పందించాడు. చదవండి: Virat Kohli- KL Rahul: కోహ్లి కెప్టెన్సీలో 108 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ''రుతురాజ్ గైక్వాడ్ టీమిండియాలో వండర్స్ చేయగలడు.ఐపీఎల్, విజయ్ హజారే ట్రోఫీ ఇలా ఏది చూసుకున్నా తన శైలిలో బ్యాటింగ్ కొనసాగిస్తూ అందరిని ఆకట్టుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూనే బ్యాట్స్‌మన్‌గా సెంచరీలు మీద సెంచరీలు బాదేశాడు. ఫలితం అతను ఈరోజు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. 18 మందిలో అతనికి చోటు దక్కింది. అయితే తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది మా చేతుల్లో ఉండదు. కానీ అతని అవసరం టీమిండియాకు ఉంది. భవిష్యత్తులో టీమిండియాలో స్టార్ బ్యాట్స్‌మన్‌గా ఎదుగుతాడు. ఓపెనింగ్ కాంబినేషన్లో రుతురాజ్‌ను ఆడిస్తే టీమిండియా బెస్ట్ ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: Devon Conway: గాయం నుంచి తిరిగొచ్చాడు.. 2022లో తొలి సెంచరీ బాదాడు ఇక ఐపీఎల్ 2021 సీజన్లో సీఎస్కే తరపున ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపాడు. 16 మ్యాచ్‌ల్లో 635 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో తన విశ్వరూపం ప్రదర్శించాడు. 5 మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాది ఔరా అనిపించాడు. అంతేకాదు ఈ ట్రోఫీలో రుతురాజే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం ఐదు మ్యాచ్‌లాడిన రుతురాజ్ 603 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. రుతురాజ్ ప్రదర్శనపై ముచ్చటపడిన అభిమానులు జట్టులోకి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రుతురాజ్ గతేడాది జూలైలో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ ద్వారా టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. చదవండి: Ruturaj Gaikwad: సెలక్టర్లకు తలనొప్పిగా మారుతున్న రుతురాజ్.. తాజా ఫీట్‌తో కోహ్లి సరసన -
'కోహ్లి మాటల్లో నిజం లేదు..' చేతన్ శర్మ కౌంటర్
కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపుపై ఎంత పెద్ద వివాదం నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌతాఫ్రికా టూర్‌కు ఒక్కరోజు ముందు కోహ్లి మీడియా ముందుకు వచ్చి వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయాన్ని తనకు గంటన్నర ముందు చెప్పిందని.. టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నప్పుడు తననెవరు సంప్రదించలేదని.. గంగూలీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నాడు. కోహ్లి ఘాటూ వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. అయితే ఇదే విషయాన్ని గంగూలీ వద్ద ప్రస్తావించగా.. అంతా బీసీసీఐ చూసుకుంటుందని చెప్పి సమాధానం దాటవేశాడు. ఈలోగా టీమిండియా సౌతాఫ్రికా టూర్ ఆరంభం కావడంతో వివాదం తాత్కాలికంగా ముగిసింది. చదవండి: IND Vs SA: తొలి టెస్టు విజయం.. టీమిండియాకు ఐసీసీ షాక్ తాజాగా కోహ్లి కెప్టెన్సీ విషయంపై టీమిండియా చీఫ్ సెలక్టెర్ చేతన్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' టి20 కెప్టెన్సీ నుంచి వైదొలిగే సమయంలో తనను ఎవరు సంప్రదించలేదన్న కోహ్లి మాటల్లో నిజం లేదు. వాస్తవానికి బీసీసీఐలోని ప్రతి సెలెక్టర్ సహా ఆఫీస్ బెరర్స్, సెలక్షన్ కమిటీ కన్వీనర్, ఇతర స్టాఫ్ మొత్తం కోహ్లిని కలిసి టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోరాం. టి20 ప్రపంచకప్ ముగిసేంత వరకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకునే విషయాన్ని ప్రకటించొద్దని తెలిపాం. కానీ టి20 ప్రపంచకప్ మధ్యలోనే కోహ్లి తాను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ విషయంలో బోర్డు సభ్యులంతా మరోసారి కోహ్లిని పునరాలోచించమన్నాం. అయితే టి20 ఫార్మాట్లో కెప్టెన్సీ వదిలేస్తే వన్డే ఫార్మాట్లో కూడా వదిలేయాలని కోహ్లికి ఆ సమయంలో చెప్పాలనుకోలేదు. దానిని కోహ్లి అపార్థం చేసుకున్నాడు. టి20 ప్రపంచకప్ తర్వాత అన్నీ ఆలోచించి కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించాం. ఉద్దేశపూర్వకంగా మాత్రం చేయాలనుకోలేదు. అంతిమంగా టీమిండియాకు ఎవరు కెప్టెన్‌గా ఉన్నా సరే.. జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టడమే లక్ష్యం. ఇక వన్డే కెప్టెన్సీ తొలగింపుపై కోహ్లికి, బీసీసీఐకి మధ్య ఎలాంటి వివాదం లేదు.. దయచేసి ఎలాంటి పుకార్లు పుట్టించొద్దు.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: IND Vs SA ODI Series: టీమిండియా వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ -
అతని గాయమే అశ్విన్‌కు కలిసొచ్చింది: చీఫ్ సెలెక్టర్
ముంబై: ఐపీఎల్లో రాణించడంతో పాటు యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కిందని భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తెలిపాడు. సుందర్ గాయపడటంతో ఆఫ్ స్పిన్నర్ కొరత ఏర్పడిందని, దాంతో అశ్విన్‌ను తీసుకోవడం అనివార్యమైందని పేర్కొన్నాడు. అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరమని తెలిపిన చేతన్ శర్మ.. అతను జట్టుకు పెద్ద ఆస్తి అని పేర్కొన్నాడు. కాగా, అశ్విన్ 2017 జూలైలో వెస్టిండీస్‌తో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. గత నాలుగేళ్లుగా అతను పూర్తిగా టెస్టులకే పరిమితమయ్యాడు. అయితే ఐపీఎల్లో అతని నిలకడైన ప్రదర్శన సెలక్టర్లు టీ20ల విషయంలో పునరాలోచించేలా చేసింది. గతేడాది ఐపీఎల్లో 7.66 ఎకానమీతో 13 వికెట్లు తీసిన యాష్.. ఢిల్లీ తొలిసారి ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది తొలిదశ ఐపీఎల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన యాష్.. కరోనా నేపథ్యంలో కుటుంబంతో కలిసుండాలని లీగ్ నుంచి తప్పుకున్నాడు. మరోవైపు అశ్విన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రస్తుత సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు సాధించింది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 17న ప్రారంభమయ్యే ఈ మెగాటోర్నీ కోసం భారత సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఎంపిక కాగా, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2007లో కెప్టెన్‌గా జట్టుకు తొలి టీ20 ప్రపంచకప్ అందించిన ధోనిని ఈ ప్రపంచకప్‌లో టీమిండియా మెంటర్‌గా బీసీసీఐ నియమించింది. భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్ చదవండి: అదే జరిగితే చారిత్రక సిరీస్ రద్దు.. తాలిబన్లకు క్రికెట్ ఆస్ట్రేలియా బెదిరింపులు -
చాహల్‌ను అందుకే తీసుకోలేదు.. ఇక వరుణ్ విషయానికి వస్తే..
ముంబై: వచ్చే నెలలో జరగనున్న టి20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత్ స్పిన్ విభాగంలో తనదైన ముద్ర వేసుకున్న లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌కు జట్టులో స్థానం దక్కకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్పందించారు. జట్టు ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్విక్‌గా బౌలింగ్ చేసే స్పిన్నర్లు మా ప్రాధాన్యత, అందుకే మేము చాహల్ స్థానంలో రాహుల్ చాహర్‌ను జట్టులో తీసుకున్నామని ఆయన తెలిపారు. ఐపీఎల్ ప్రదర్శన ‘మిస్టరీ ఆఫ్ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తికి చాన్స్ ఇప్పించిందని ఆయన అన్నారు. కాగా నాలుగేళ్ల తర్వాత అశ్విన్ మళ్లీ టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మెంటార్‌గా ఉండబోతున్నాడు. ఇక 2019 నుంచి చూస్తే చహల్ బౌలింగ్‌లో పదును తగ్గింది. శ్రీలంక పర్యటనలోనూ చహల్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగవుతున్న రాహుల్ చహర్ వరల్డ్‌కప్ అవకాశం దక్కించుకున్నాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరగనుండగా.. అక్టోబరు 24న తన ఫస్ట్ మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో భారత్ జట్టు ఢీకొట్టనుంది. భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్స్‌గా శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్ ఎంపికైనారు. చదవండి: T20 World Cup Team India Squad 2021: టీమిండియా జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని -
ట్రయల్స్ లేకుండా టీకాలా?: ఢిల్లీ హైకోర్టు
క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా కరోనా టీకాలనివ్వడం, అదికూడా పిల్లలకు ఇవ్వడం ఉత్పాతాన్ని కలిగిస్తుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ట్రయల్స్‌ను సత్వరం పూర్తి చేసి 18ఏళ్లలోపు వారికి కూడా తొందరగా టీకానిచ్చే చర్యలు వేగవంతం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచిఉన్నందున పిల్లలకు వెంటనే టీకాలిచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న పిల్‌పై కోర్టు విచారణ జరిపింది. కెనడా, యూఎస్‌లాంటి దేశాల్లో పిల్లలకు టీకాలిస్తున్నారని, భారత్‌లో ఈ విషయమై ఒక విధానం రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్ ఆరోపించారు. అయితే జైడస్ కాడిలా చిన్నపిల్లల కోసం డీఎన్ఏ టీకాపై ట్రయల్స్ జరుపుతోందని, త్వరలో ఇది అందుబాటులోకి రావచ్చని ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్‌శర్మ కోర్టుకు తెలిపారు. వీలయినంత తొందరగా దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యమన్నారు. 18 ఏళ్లలోపు వారికి టీకాపై ట్రయల్స్ జరుగుతున్నాయని, ఇవి పూర్తికాగానే పిల్లల టీకాలపై విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది. ట్రయల్స్‌ను సంపూర్ణంగా ముగించాలని, లేదంటే ఉత్పాతాలు జరుగుతాయని కోర్టు అభిప్రాయపడింది. పిల్లలకు టీకా కోసం దేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోందని, ఈ విషయమై చర్యలు తీసుకోవాలని సూచించింది. 10, 12 తరగతుల విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సినందున వీరికి టీకాలివ్వాలన్న మరో పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. -
ఆ ఇద్దరి కోసం పట్టుపట్టిన కోహ్లీ సేన.. బేఖాతరు చేసిన చీఫ్ సెలక్టర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కావడంతో, టీమిండియా మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఓపెనర్లైన పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌లను ఇంగ్లండ్‌కు పంపించాలని భారత సెలక్షన్ కమిటీని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గత నెల చివర్లో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మకు మెయిల్ చేశాడని, బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే షా, పడిక్కల్‌ను కాదని అనూహ్యంగా బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌ను స్టాండ్‌బైగా ఇంగ్లండ్ పర్యటనకు పంపడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2019-20 రంజీ సీజన్, ఇండియా ఏ న్యూజిలాండ్ పర్యటనలో ఏ మాత్రం ప్రభావం చూపని అభిమన్యు ఈశ్వరన్‌ను ఏ ప్రాతిపాదికన ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారనే విమర్శలు తలెత్తుతున్నాయి. కాగా, ఈ విషయమై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా జోక్యం చేసుకుంటేనే సెలక్షన్ కమిటీ చైర్మన్ స్పందించేలా ఉన్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి పృథ్వీషా, పడిక్కల్‌ను ఇంగ్లండ్‌కు పంపాలని టీమిండియా మేనేజ్మెంట్ నుంచి బీసీసీఐకి ఎలాంటి అధికారిక రిక్వెస్ట్ అందలేదు. మరోవైపు షా, పడిక్కల్ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో ఉన్నారు. జూలై 26న ఈ సిరీస్ ముగిసాక వీరి ఇంగ్లండ్ పర్యటన అంశం కొలిక్కివచ్చే అవకాశం ఉంది.