child care
-
తినే ఆహారంలో వెరైటీలు ఉండేలా చూసుకోవాలి..! లేదంటే?
జీవనశైలి అలవాట్లలో పెద్ద ఎత్తున వచ్చిన మార్పులతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మారిన, మారుతున్న ఆహార అలవాట్లతో ఎక్కువ మందిలో పోషకాహార లోపాలు, రక్తలేమి, ఇతర అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం కూడా పెరగడంతో ఊబకాయం వంటి సమస్యలకు అనేక మంది గురవుతున్నారు.ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్–హైదరాబాద్, ఎన్ఐఎన్ నిపుణుల కమిటీ ‘డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ ఇండియన్స్’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో పలు సూచనలు చేసింది. అన్ని వయసుల వారిలో ఆరోగ్య పరిరక్షణకు 17 డైటరీ గైడ్‌లైన్స్ సూచించింది. సమతుల ఆహారంలో వెరైటీలు (భిన్నరకాల ఆహార పదార్థాలు) ఉండేలా చూసుకోవడం ముఖ్యమని చెప్పింది.ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ గైడ్‌లైన్స్‌లో ముఖ్యమైనవి..మనం తీసుకునే ఆహారంలో తాజా కూరలు, పండ్లు, 50 శాతం ధాన్యం (సిరియల్స్) పోషకాలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. చిక్కుళ్లు, గింజలు, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవాలి.ఆరునెలల వయసు పైబడిన పిల్లలకు ఇళ్లలోనే తయారు చేసిన సెమీ–సాలిడ్ సప్లిమెంటరీ ఫుడ్‌ను ఇవ్వాలి.చిన్నపిల్లలు, పెరిగే వయసున్న పిల్లలకు తగిన ఆహారం అందించి వారు అనారోగ్యం బారిన పడకుండా చూడాలి.నూనె/కొవ్వుపదార్థాలు పరిమితంగా వాడాలి, తగినంతగా పోషకాలు, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్‌ను వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా లభించేలా చూడాలి.కండలు పెంచేందుకు ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోరాదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుని ఊబకాయం వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, చక్కె ర, ఉప్పు ఎక్కువ ఉన్న వాటిని నియంత్రించాలి.శారీరకంగా చురుకుగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్నే తీసుకోవాలి. మంచినీళ్లు తగినంతగా తాగాలి.ప్రస్తుతం ఆహార పదార్థాలు ఎక్కువగా ప్యాకేజ్డ్ రూపంలో వస్తున్నందున ఆ ప్యాకెట్లపై ఉన్న వివరాలను పూర్తిగా చదివాకే కొనుగోలు చేయాలి.గంటల తరబడి టీవీలు చూస్తున్నపుడు మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగాలి.బిజీ షెడ్యూళ్లలో పనిచేస్తున్నా గంటకు ఒకసారైనా 5 నుంచి 10 నిమిషాలు నడవాలి.ఇవి చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది! -
Summer Special: పిల్లల్లో... వ్యాధి నిరోధకత పెంచండిలా!
వేసవి సెలవలు ఇచ్చేశారు. పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు. ఈ సమయంలోనే వారికి వ్యాధినిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరిగే ఆహారాన్ని అందించడం వల్ల స్కూళ్లు తిరిగి తెరిచి, వర్షాలు పడినా కూడా చిన్నా చితకా వ్యాధులు రాకుండా ఉంటాయి. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలో తెలుసుకుందాం...సాధారణంగా పోషకాలన్నీ ఉన్న సమీకృత ఆహారం అందించడం వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది. అందుకు ఏం చేయాలో చూద్దాం...గుడ్డు: కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, బి2 (రైబోఫ్లేవిన్) కోడిగుడ్డులో లభిస్తాయి.ఆకుకూరలు: ఆకుపచ్చటి ఆకుకూరలు, కొత్తిమీర, పాలకూర, ఈ సీజన్లో సమృద్ధిగా లభించే మునగకాడలు వంటివి తప్పనిసరిగా పెట్టాలి. వీటిలో ఫైబర్‌తోపాటు ఐరన్, జింక్, మినరల్స్ లభిస్తాయి.పెరుగు, మజ్జిగ: పెరుగులో ప్రొబయోటిక్స్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్ యోగర్ట్, వెజిటబుల్స్ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు.పసుపు: పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ ఇచ్చే ఆహారంలో చిటికడు పసుపును చేర్చడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు.బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్నట్స్, అప్రికాట్స్ వంటివి ఎక్కువగా తినిపించడం వల్ల మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది.ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అయిన మామిడి, జామ, తాటిముంజలు, సపోటా వంటివి ఇవ్వాలి. పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్‌జ్యూస్‌లు, చాక్లెట్స్, ΄్యాకేజ్డ్ స్నాక్స్‌ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. గంటసేపైనా బయట ఆడుకునేలా ్రపోత్సహించాలి. ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది.ఇవి చదవండి: Health: ఇంతకీ.. పనీర్ స్వచ్ఛమైనదేనా? ఏం కొంటున్నామో! ఏం తింటున్నామో!! -
చిన్నారులు బరువు పెరుగుతున్నారా? అయితే జాగ్రత్త!
మన దేశంలో అప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన పిల్లలు రెండున్నర కిలోల నుంచి 3 కిలోల వరకు బరువుంటారు. పిల్లల బరువు అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. తల్లిదండ్రుల జీన్స్, తల్లి ఆహారపు అలవాట్లు, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి వచ్చిన రుగ్మతలు, తల్లి బరువు వంటి అంశాలపై పిల్లల బరువు ఆధారపడి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఎక్కువ తేడా లేకుండా.. ఈ బరువుకు కాస్త అటు ఇటుగా ఉన్న పిల్లలూ ఆరోగ్యంగా పుట్టినట్టే. కొన్ని సూచనలతో చిన్నారులు ఆరోగ్యంగా బరువు పెరుగుతున్నారో లేదో తెలుసుకోవచ్చు. పిల్లలు పుట్టాక మొదటి వారంలో– పుట్టినప్పుడు ఉన్న బరువు కంటే మొదట్లో కాస్త తగ్గుతారు. నిర్దిష్టంగా చెప్పాలంటే మొదటి వారం పదిరోజుల్లో పుట్టిననాటి బరువులో 5 శాతం నుంచి 10 శాతం బరువు తగ్గుతారు. ఇక రెండోవారం నుంచి క్రమేణా బరువు పెరుగుతూపోతారు. మొదటి మూడు నెలల్లో దాదాపు రోజుకు 20 నుంచి 30 గ్రాములు పెరుగుతూ పోతే... మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రోజుకు 10 నుంచి 15 గ్రాముల వరకు పిల్లలు బరువు పెరుగుతారు. ఇలా చూస్తే మొదటి ఐదునెలల్లో పుట్టినప్పటికంటే రెట్టింపు (డబుల్) బరువు, ఏడాదికి మూడు రెట్ల (ట్రిపుల్) బరువు పెరగాలి. కానీ పాపలందరూ ఇలాగే పెరగాలని లేదు. కాస్త అటు ఇటుగా ఉన్నా అది ఆరోగ్యకరమైన బరువే. అయితే ఈ లెక్కకు దూరంగా ఉంటే మాత్రం తగినంత బరువు పెరగడం లేదని అర్థం చేసుకోవాలి. తల్లి నుంచి రెండు రకాల పాలు.. బిడ్డ పాలు తాగేప్పుడు తల్లి నుంచి రెండు రకాల పాలు వస్తాయి. మొదట వచ్చే పాలను ఫోర్ మిల్క్ అంటారు. రెండోసారి పాలను హైండ్ మిల్క్‌గా పేర్కొంటారు. అంటే ఈ హైండ్ మిల్క్ పాప కాసిన్ని పాలు తాగాక వస్తాయి. నిజానికి ఫోర్ మిల్క్ కంటే.. హైండ్ మిల్క్ చాలా బలవర్ధకమైనవి. బరువు పెరగడానికి ఇవే ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫోర్ మిల్క్‌ను ప్రసవం కాగానే స్రవించే ముర్రుపాలతో ΄÷రబాటు పడవద్దు. ముర్రుపాలు వేరు, ఫోర్ మిల్క్ వేరు. పుట్టగానే స్రవించే ముర్రుపాలు శిశువుకు చాలా మంచివి. రోగనిరోధకతను ఇస్తాయి. ఫోర్ మిల్క్ అంటే... పాలు పట్టడం మొదలు పెట్టగానే మొదట స్రవిస్తాయి. ఓ పది–పదిహేను గుటకల తర్వాత హైండ్ మిల్క్ స్రవిస్తాయి. తగినంత బరువు పెరగడం లేదంటే.. తల్లి పాలు సరిపోక పోవడం లేదా బిడ్డ సరిగా తాగకపోవడం, బిడ్డ పూర్తిగా తాగకుండా మధ్యలోనే నిద్రపోవడం, పాలు తాగకపోవడానికి కొన్నిసార్లు తల్లి వైపునుంచి, మరికొన్నిసార్లు బిడ్డ వైపు నుంచి కూడా కారణాలు ఉండవచ్చు. తల్లి బిడ్డకు పాలు సరిగా పట్టకపోవడం జరగవచ్చు. పాలు పడుతున్నప్పుడు చిన్నారి దృష్టి పాల నుంచి పక్కకు మళ్లవచ్చు. పాలపీక అలవాటు చేయడం వల్ల చిన్నారులు పాలు సరిగా తాగరు. ఎనీమియా, యూరినరీ ఇన్ఫెక్షన్స్, చెవిలో ఇన్ఫెక్షన్స్, అలర్జీల వంటిఆరోగ్యపరమైన సమస్య ఉన్నా బరువు పెరగకపోవచ్చు. బరువు పెరగడానికి.. రెండు మూడు గంటలకు ఓమారు పాలు పట్టించాలి. ∙ఓ రొమ్ము పట్టించాక ఆ రొమ్ము నుంచి పాలు పూర్తిగా తాగిందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. ఇందుకు చేయాల్సింది... బిడ్డ పూర్తిగా పాలు తాగాక చిన్నారికి అదే రొమ్మును అందిస్తే ముఖం తిప్పుకోవడం, రొమ్ము అందుకోకపోవడం చేస్తుంది. ఓ రొమ్ములోని పాలు పూర్తిగా పట్టించాక రెండో రొమ్ము కూడా అందించాలి. అప్పుడు ఆ రెండో రొమ్ము పాలు తాగకపోయినా– బిడ్డ సంతృప్తిగా ఉంటే పూర్తిగా పాలు తాగినట్లే. బిడ్డకు పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోడానికి రోజులో ఎన్నిసార్లు పక్క తడుపుతోందన్న అంశం కూడా ఓ సూచన. పాప పగటిపూట కనీసం నాలుగయిదుసార్లు పక్క తడుపుతుంటే.. పాలు సరిపోతున్నాయని అనుకోవచ్చు. చికిత్స ఎప్పుడంటే..? పైన పేర్కొన్న అంశాలను జాగ్రత్తగా గమనిస్తూ, పాప బరువును ప్రతివారం పరీక్షిస్తూ ఉండాలి. అప్పటికీ బిడ్డ బరువు వయసుకు తగి నంతగా పెరగడం లేదంటే... ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో వైద్యపరీక్షల ద్వారా తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. — డా. శివనారాయణరెడ్డి వెన్నపూస, నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రిస్ట్ ఇవి చదవండి: చల్లచల్లని కూల్ కూల్ -
అమ్మకు శిక్షణ.. బిడ్డకు రక్షణ
సాక్షి, అమరావతి: పాలుతాగే పసికందులను వదిలి వెళ్లేందుకు ఏ మాతృమూర్తికీ మనసొప్పదు. పక్కింటికి వెళ్లినా వెంట తీసుకెళ్తుంది. తప్పనిసరిగా వదిలి వెళ్లాల్సివస్తే మాత్రం బాగా కావాల్సిన వారికి మాత్రమే అప్పగిస్తుంది. కానీ.. ఉద్యోగం సాధించి, శిక్షణ కోసం వారం రోజులపాటు వదిలి ఉండాల్సి వస్తే..! సరిగ్గా ఇలాంటి తల్లుల ఇబ్బందిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వారు శిక్షణ పొందుతున్న ప్రాంగణాల్లోనే ప్రత్యేక బేబీకేర్ సెంటర్ల (ఎఫ్ఎల్ఎన్ కిడ్స్‌స్పేస్)ను ఏర్పాటుచేసింది. పిల్లలు తినే ఆహారం.. ఏ సమయానికి ఏం తింటారు.. ఎప్పుడు నిద్రపోతారు.. ఇలా అన్ని వివరాలను తీసుకుని ప్రత్యేకంగా పాలు, ఆహారం, ఆట వస్తువులతో పాటు కేర్ టేకర్లను సైతం నియమించింది. ఉదయం ఉపాధ్యాయ శిక్షణకు హాజరయ్యేటప్పుడు పిల్లలను ఈ కిడ్స్స్పేస్లో వదిలి తల్లులు ట్రైనింగ్‌కు హాజరై.. సాయంత్రం తిరిగి తీసుకుంటున్నారు. ఎక్కడా ఏ బిడ్డకు ఇబ్బంది కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లను, సంరక్షణ బాధ్యతను సమగ్ర శిక్ష అధికారులు తీసుకున్నారు. కొత్తగా కేజీబీవీల్లో చేరిన టీచర్లకు మరింత మెరుగ్గా బోధనా నైపుణ్యాలు అందించేందుకు సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో వారం రోజులపాటు విజయవాడ, విశాఖపట్నంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడకు వచ్చేటప్పుడు తమ పిల్లల బాధ్యత ఎలాగని బెంగపడ్డ టీచర్లు.. పిల్లల కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటుచేయడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. 1,190 మంది కేజీబీవీ టీచర్లకు శిక్షణ ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీల్లో బోధన కోసం 1,190 మందిని టీచర్లుగా నియమించింది. వారంతా దాదాపు 24 నుంచి 30 ఏళ్లలోపు వారే. వారికోసం విజయవాడ, విశాఖపట్నంలో ఫౌండేషన్ లెరి్నంగ్ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్)పై ఈనెల 6 నుంచి శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేశారు. ఇక్కడకు వచ్చిన వారిలో దాదాపు 40 శాతం మంది చంటి పిల్లలతో రావడం, ఆ పిల్లలను ఎక్కడ ఉంచాలో తెలీక ఇబ్బందిపడ్డారు. ఇది గమనించిన సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు వెంటనే అదే ప్రాంగణంలో ‘ఫౌండేషన్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ కిడ్స్ స్పేస్’ సెంటర్లు ఏర్పాటుచేశారు. టాయ్స్ కార్నర్, హోలిస్టిక్ డెవలెప్మెంట్ సెంటర్, స్లీపింగ్ కార్నర్, స్టోరీ టెల్లింగ్ కార్నర్, మదర్/గార్డియన్‌ను అందుబాటులో ఉంచారు. టీచర్ల ఏకాగ్రత శిక్షణపై ఉండేలా పిల్లల సంరక్షణ బాధ్యత అధికారులే తీసుకోవడం ఇదే ప్రథమం. గతంలో శిక్షణకు తాము మూడు నెలల బిడ్డలతో వచ్చి ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు పిల్లల సంరక్షణను సమగ్ర శిక్ష అధికారులు తీసుకోవడం గొప్ప విషయమని సీనియర్ టీచర్లు సంతోషం వ్యక్తంచేశారు. విజయవాడ, విశాఖపట్నంలో మొదటి విడత శిక్షణ ముగియడంతో ఈనెల 16 నుంచి అనంతపురం, తిరుపతిలో టీచర్ల శిక్షణ మొదలవుతుందని, అక్కడ కూడా ఇదే తరహా బేబీకేర్ సెంటర్లను ఏర్పాటుచేయనున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. తల్లులు ఇబ్బంది పడకూడదనే.. బాలికా విద్యాభివృద్ధే ధ్యేయంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కేజీబీవీల ద్వారా నాణ్యమైన చదువుతోపాటు చక్కని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అక్కడ తల్లిదండ్రులకు, సంరక్షకులకు దూరంగా ఉండి విద్యార్థులు చదువుతుంటారు. వారికి రక్షణతో పాటు ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే కొత్తగా చేరిన టీచర్లకు బోధనా నైపుణ్యాలతో పాటు విద్యార్థులు, సహచరులతో మెలగాల్సిన విధానాలపై శిక్షణ ఇస్తున్నాం. అయితే, ఈ శిక్షణ కేంద్రానికి కొందరు చిన్నపిల్లలతో వచ్చి ఇబ్బందిపడడం గమనించాను. వారి ఏకాగ్రత కోల్పోకుండా వారి పిల్లల సంరక్షణ బాధ్యతను మేం తీసుకుని బేబీ కేర్ సెంటర్లను ఏర్పాటుచేశాం. పిల్లలను చూసుకునేందుకు అంగన్వాడీ కార్యకర్తలను సంరక్షకులుగా నియమించాం. – బి. శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ఎస్పీడీ పిల్లల కోసం చక్కటి ఏర్పాట్లు.. ట్రైనింగ్ అనగానే సబ్జెక్టు వరకే ఉంటుందనుకున్నాను. టీచర్‌కు ఉండాల్సిన ఉత్తమ లక్షణాలను, విద్యార్థులు, తోటి టీచర్లతో ఎలా ఉండాలి?, కమ్యూనికేషన్ స్కిల్స్, సైన్స్ ప్రయోగాలు, విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలు ఎలా రాబట్టాలి వంటి అంశాలపై చక్కని శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో కొందరు తమ పసిపిల్లలను తీసుకొస్తే అంగన్వాడీ ఆయాలు, ప్రథమ్ సభ్యులకు పిల్లల సంరక్షణ బాధ్యతను అప్పగించారు. పిల్లల కోసం బెస్ట్‌ఫుడ్, ఆట వస్తువులు, నర్సులను అందుబాటులో ఉంచారు. – విజయ జాగు, కెమిస్ట్రీ పీజీటీ, నక్కపల్లి కేజీబీవీ (అనకాపల్లి జిల్లా) ఇంటి వాతావరణం తలపించేలా.. కేజీబీవీ టీచర్ శిక్షణ కోసం నాలుగు నెలల పాపతో వచ్చాను. కొత్త ప్రదేశం.. పైగా చల్లని వాతావరణం, పాప తట్టుకోలేదేమోనని ముందు భయపడ్డాను. ఒకవైపు శిక్షణ.. మరోవైపు పాపను చూసుకోవడం ఇబ్బంది తప్పదనుకున్నాను. కానీ, ఇక్కడ పిల్లల కోసం వేడినీళ్లు, పాలు, సెరిలాక్, ఆహారం వంటివి ఏర్పాటుచేశారు. ఆరోగ్య జాగ్రత్తల కోసం నర్సులను నియమించారు. కొంచెం పెద్ద పిల్లలకు ఆట వస్తువులు, బొమ్మలు ఏర్పాటుచేశారు. భోజనం, వసతి ఇంటిని తలపించేలా ఉంది. – హెచ్ఆర్. దివ్యశ్రీ, తాడిమర్రి కేజీబీవీ, బోటనీ పీజీటీ (అనంతపురం జిల్లా) -
గర్భిణులకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’
సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న ‘కేసీఆర్ కిట్’ స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లకు రూపకల్పన చేసింది. రక్తహీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో కిట్లు పంపిణీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. అదే సమయంలో మిగతా 8 జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఆదిలాబాద్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ములుగులో సత్యవతి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, వికారాబాద్‌లో సబిత ఇంద్రారెడ్డి, నాగర్‌కర్నూల్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, గద్వాల్ జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొంటారు. ఇప్పుడు 1.25 లక్షల మంది గర్భిణులకు ఇది ఉపయోగపడనుందని అంచనా. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. రక్తహీనత నుంచి విముక్తి రక్తహీనత గర్భిణుల పాలిట శాపంగా మారుతోంది. దీనివల్ల ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. రక్తహీనతను నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తు న్న ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించడంలో విజయవంతమైంది. ఈ నెలలో కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. మాతృ మరణాల సంఖ్యను తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పథకాన్ని అమలు చేస్తోంది. అత్యధికంగా కొమురంభీం జిల్లాలో 83 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రిçÙన్ కిట్ల లక్ష్యం. ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ.1,962 వెచ్చిస్తోంది. 13–27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్ చెకప్ సమయంలో ఒకసారి, 28–34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్ చెకప్ సమయంలో రెండోసారి కిట్‌ను ఇస్తారు. 9 జిల్లాల్లోని 231 ఆరోగ్య కేంద్రాల్లో వీటిని పంపిణీ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతంగా ఉన్న ప్రసవాలు, ఇప్పుడు 66 శాతానికి చేరాయి. తల్లీబిడ్డల సంరక్షణకు ఎక్కడా లేని పథకాల అమలు :హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: ‘తల్లి బాగుంటే ఇల్లు బాగుంటుంది. పిల్లలు బాగుంటే భావిభారతం బాగుంటుంది. అందుకే తల్లీబిడ్డల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తున్నారు’అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్.. పౌష్టికాహారాన్ని అందించి, తల్లీబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందించనుందని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని మరింత చేరువ చేస్తున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
జాబ్ మానేయ్!.. నిజమే కదా! అనుకుని త్యాగం.. డిప్రెషన్లోకి వెళ్లి..
ఉద్యోగం చేసే స్త్రీ విషయంలో కుటుంబంలో ఎదురయ్యే ప్రతీ సమస్య ఆమెకు ఎప్పుడూ ఓ సవాల్‌గానే ఉంటుంది. పిల్లల సంరక్షణ, పెద్దల ఆరోగ్యం, ఆఫీస్ ఇంటికి దూరమైనా, ఆర్థికంగా బాగున్నాం అనుకున్నా... ముందుగా ‘ఆమె’ను ‘ఉద్యోగం మానేయ్!’ అని అంటుంటారు ఇంట్లో. ‘నిజమే కదా! నా అవసరం మొదట ఇంటికే ఉందనుకుంటూ కుటుంబం కోసం కెరియర్ను త్యాగం చేసేస్తుంది. ఆ తర్వాత... రకరకాల కారణాలతో డిప్రెషన్ బారిన పడుతున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుందం’టున్నారు మనస్తత్వ నిపుణులు. ఉద్యోగం నుంచి దూరమైతే.. ఉద్యోగం చేస్తున్నప్పుడు ‘రోజూ పనిలో అలసిపోయాం. ఒక్క రోజు సెలవు తీసుకొని విశ్రాంతి తీసుకుందామని ఆలోచనకు ఆడ–మగ తేడా ఏమీ ఉండదు. కానీ, ఉద్యోగం మానేశాక ‘రోజూ సెలవే కదా!’ అనే ఆలోచన నిస్పృహను కలిగిస్తుంది. ‘ఈ సంఖ్య స్త్రీలలో ఎక్కువ. ఎందుకంటే కుటుంబ అవసరాల దృష్ట్యా ఏ చిన్న అవసరం వచ్చినా మొదట ఆ భారం పడేది మహిళపైనే. అందుకే, బలి అవుతుంది కూడా మహిళే’ అంటారు మనస్తత్వ నిపుణులు. కొంతమందిలో కుటుంబ భవిష్యత్తుకు తమ సంపాదన ఎంత విలువైనదో తెలుసు కాబట్టి, ఒత్తిడితో కూడిన ఆందోళనతో జీవనం గడపాల్సి ఉంటుంది. తమను తాము అందంగా తీర్చిదిద్దుకోవడంలోనూ శ్రద్ధ తగ్గుతుంటుంది. ఇక ‘నేను ఏమీ చేయలేనా..’ అనే బాధ అంతర్లీనంగా ఉండిపోతుంది. ఇంట్లో ఉండడం వల్ల తీరిక సమయం లభించడంతో ప్రతికూల ఆలోచనలు తలెత్తుతుంటాయి. మరొకరి మీద ఆధారపడటమా..?! ఉద్యోగం చేస్తున్న మహిళల్లో మిగతావారితో పోల్చితే నేను, నా వర్క్‌ప్లేస్, సొంత గుర్తింపు, ఆదాయం.. అనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. దాని వల్ల మల్టిపుల్ పనులు చేసేంతగా తమను తాము తీర్చిదిద్దుకోగలరు. కానీ, ఒక్కసారిగా జాబ్ మానేసి, ఇంటి పనులు రొటీన్‌గా చేస్తూ ఉండటం, ప్రతి చిన్న అవసరానికి (డబ్బు కోసం) భర్త మీద ఆధారపడటం చాలా మందికి నచ్చదు. కొన్ని రోజులు సర్దుబాటు చేసుకున్నా.. ‘నాకంటూ ఓ జీవితం లేదా! ఎప్పుడూ ఇదే ఇంటి పనా’ అనే విసుగు పొందే భావన కలుగుతుంది. దీని వల్ల కుటుంబంలోనూ గొడవలు తలెత్తుతుంటాయి. ప్రతిఫలం ఆశించని పని.. ‘చాలా సంవత్సరాలుగా మన దేశంలో గృహ హింస కేసులను చూస్తున్నాం. సమాజంలోని వెనుకబాటుతనానికి ఇది కూడా ఒక కారణంగా ఉంటుంది. పని చేయడం వల్ల మహిళలు తమ నిర్ణయాలు తాము తీసుకోవడానికి, స్వతంత్రంగా ఉండటానికి, ప్రతిరోజూ ఆత్మవిశ్వాసంతో మెలిగేలా చేస్తుంది. సమాజం ఒక గృహిణి చేసే పనులను అది ఆమె కర్తవ్యంగా భావించి, వాటికి ప్రతిఫలం ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగానే చూస్తుంది. ఇంటి పనుల్లో ప్రతిఫలాన్ని ఆశించడాన్ని ఎవరూ హర్షించరు. అందుకే, తెలియని అసంతృప్తి, ఆందోళన కూడా ఉంటుంది. అదే ఉద్యోగం చేసే మహిళకు నిరాశ గురించి ఆలోచించే సమయం ఉండదు. చాలా వరకు మధ్య, దిగువ తరగతి ఇళ్లలో గృహిణులు వారి భాగస్వామి నుంచి అసహనాన్ని ఎదుర్కొంటుంటారు. అందుకు ఆర్థిక సమస్యల భారం ప్రధానమైదిగా కనిపిస్తుంది. గృహిణులలో మానసిక ఆరోగ్య సమస్యలకు డిప్రెషన్, ఆందోళన, వైవాహిక అసంతృప్తి, గృహ హింస, పితృ స్వామ్య భావజాలాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. నవతరం ఆలోచన.. ప్రశ్నించడమే! ‘గతకాలపు వారితో పోల్చితే ఈ తరం అమ్మాయిలు చాలా దూర దృష్టితో ఆలోచిస్తున్నారనే చెప్పాలి. సమస్యలు వచ్చినప్పుడు ఆ భారం మొత్తం ‘నా మీదే పడుతుందా?, భర్త ఏమైనా పంచుకుంటాడా?’ లాంటి ప్రశ్నలు ముందే అడిగి, కుటుంబసభ్యులతో చర్చించి మరీ నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో ఏ సమస్య వచ్చినా ‘ముందు భార్యే ఆఫీస్‌కి సెలవు పెట్టాలి’ అనుకుంటారు. వరుస సెలవులు పెడితే ఆఫీసు రూల్స్ ఒప్పుకోవు. తప్పదనుకుంటే ఉద్యోగం మానేయ్! అంటారు. అందుకే, ఈ తరం అమ్మాయిలు పెళ్ళికి ముందే బోలెడన్ని రూల్స్ పెడుతున్నారు. లేదంటే పెళ్లి, పిల్లల్ని కనడం ప్లానింగ్‌లో వయసు పైబడినా ఫర్వాలేదు అనే ఆలోచనకూ వస్తున్నారు’ అంటున్నారు సైకాలజిస్ట్‌లు.ఉద్యోగం ఆమెలో ఆత్మవిశ్వాసంతో పాటు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఆమె తనలా పనిలో భాగస్వామ్యమైన వారితో పరిచయాలను, స్నేహితులను ఏర్పరుస్తుంది. ఈ విధానం జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం చేస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. – నిర్మలారెడ్డి ఇతరత్రా అవకాశాలవైపు దృష్టి ►గతంలో కన్నా ఇప్పుడు ఆఫీసుకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉన్నవాళ్లు ఇంట్లో ఉండి ఆఫీసు పని చేసుకునేవారి అవకాశాన్ని ఎంచుకుంటున్నారు. కంపెనీలు కూడా అర్హులైనవారికి ఈ అవకాశాలను ఇస్తుంది కాబట్టి, వినిగియోంచుకోవచ్చు. ►కొందరు జాబ్ మానేసినా కొత్త ఆదాయ వనరులను పొందుతున్నారు. అలాంటి వారి గురించి తెలుసుకొని, స్ఫూర్తి పొందవచ్చు. ►జాబ్ మానేయాల్సి వస్తే అది ఎంతకాలం అనేది ముందే కుటుంబసభ్యులతో చర్చించి, ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి. ►ఇంటి వద్ద ఉండాల్సి వచ్చినప్పుడు కెరియర్‌కు ఉపయోగపడే సెల్ఫ్ డెవలప్మెంట్ వర్క్స్ ఎంచుకోవాలి. ►కెరియర్‌కు ఉపయోగపడే నైపుణ్యాలు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా పెంచుకునే సదుపాయం ఉంది. ►చాలామందిలో పెళ్లి తర్వాత పక్కన పెట్టేసిన హాబీస్ ఉంటాయి. వాటిలో గుర్తింపు, సంతృప్తినిచ్చే ఏదో ఒక హాబీని ఎంచుకొని దానిపైన దృష్టి పెట్టాలి. ►ఇంట్లోవారు(భాగస్వామి) కూడా జాబ్ మానేసి, తమ సంరక్షణకోసం పనిచేస్తున్న స్త్రీ సేవలను గుర్తించాలి, ప్రశంసించాలి. ►2–3 ఏళ్లు జాబ్‌కి గ్యాప్ వచ్చినా.. ప్రూవ్ చేసుకోవడానికి ‘మళ్లీ ప్రయత్నించు’ అని ప్రోత్సహించాలి కానీ, ‘ఇంకేం చేస్తావులే ..’ అని నిరుత్సాహపరచకూడదు. ఆమె సేవలను గుర్తించాలి ఇంట్లో ఏ సమస్య వచ్చినా ముందు జాబ్ మానేసేది మహిళనే. మొదట్లో కుటుంబం గురించే చేస్తున్నాం కదా అనుకుంటారు. జాబ్ మానేసినప్పుడు బాగానే ఉంటుంది. కానీ, రోజులు మారుతున్నకొద్దీ గత వర్కింగ్ స్టైల్‌కి, తర్వాత ఇంటి రొటీన్ పనులకు సర్దుబాటు అవ్వలేక ఫ్రస్టేషన్‌కు, డిప్రెషన్‌కు లోనవుతుంటారు. ఈ అసహనం కుటుంబ గొడవలకు దారితీస్తుంది. ఈ సమస్యలను ఎదుర్కొంటున్నవారిలో అన్నిరంగాల్లో పనిచేస్తున్నవారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగినులు ఎక్కువ ఉంటున్నారు. ఆమె త్యాగాన్ని, సేవలను కుటుంబం గుర్తించడం, ప్రోత్సహించడం సరైన పరిష్కారం. – ప్రొఫెసర్ పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్స్ ట్రెయినర్ -
చిన్నారిని సంరక్షణలోకి తీసుకోవడం అక్రమ నిర్బంధం కాదు
సాక్షి, అమరావతి: తల్లి మరణించిన చిన్నారిని అమ్మమ్మ, తాతయ్య తమ సంరక్షణలోకి తీసుకోవడం అక్రమ నిర్బంధం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదంది. చిన్నారిని అమ్మమ్మ తాతయ్య తమ సంరక్షణలోకి తీసుకోవడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించలేమని పేర్కొంది. తన భార్య మరణించిన నేపథ్యంలో పదినెలల తన కుమార్తెను తన అత్తమామలు అక్రమంగా నిర్బంధించారంటూ బాపట్లకు చెందిన గోపి అనే వ్యక్తి దాఖలుచేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టేసింది. సహజసిద్ధ సంరక్షకుల హక్కులను నిర్ధారించేముందు ఆ చిన్నారి సంరక్షణ అత్యంత ముఖ్యమని తెలిపింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని గుర్తుచేసింది. చిన్నారి కస్టడీ కోసం సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని గోపీకి సూచిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ బి.వి.ఎల్.ఎన్.చక్రవర్తి ధర్మాసనం తీర్పు చెప్పింది. ప్రతి ఆదివారం వెళ్లి అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉన్న ఆ చిన్నారిని చూసుకునేందుకు గోపీకి ధర్మాసనం అనుమతి ఇచ్చింది. తన భార్య చనిపోయిన తరువాత తన కుమార్తెను తన అత్తమామలు అక్రమంగా నిర్బంధించారని, ఆ చిన్నారిని కోర్టు ముందు ప్రవేశపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ గోపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం విచారించింది. -
Health Tips: గుడ్లు, బెల్లం, తేనె, అవకాడో.. పిల్లలకు వీటిని తినిపిస్తే..
Healthy Weight Gain Tips For Kids: పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ బరువు కూడా పెరుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు మాత్రం ఉండవలసిన దాని కన్నా తక్కువ బరువు ఉంటారు. మీ పిల్లలు బరువు తక్కువగా ఉన్నారంటే, వారు తగిన ఆహారం తీసుకోవడం లేదని, ఒకవేళ తీసుకున్నా, అది వారి వొంటికి పట్టడం లేదనీ అర్థం. తగినంత బరువు లేకపోతే పిల్లల్లో మానసిక వికాసం కూడా సరిగా ఉండదు. చదివినవి గుర్తు ఉండదు. అందువల్ల వారు తినే ఆహారం మీద దృష్టి పెట్టడం అవసరం. దాని మీద అవగాహన కోసం... జంక్‌ఫుడ్, ఫ్యాట్, షుగర్ ఎక్కువ ఉన్న ఆహారం వల్ల పిల్లలు కొంత బరువు పెరుగుతారేమో కానీ దాని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఈ జంక్ ఫుడ్స్ పిల్లలకి కావాల్సిన పోషకాలని అందించలేవు. అందువల్ల వారు ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు తోడ్పడే ఆహారాన్ని పెట్టాలి. అలాంటి వాటిలో పాలు ముఖ్యమైనవి. గుడ్లు: ఎగ్స్‌లో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. పిల్లల బరువుని క్రమబద్ధీకరించడంలో గుడ్లు ఎంతో సాయం చేస్తాయి. వి గ్రోత్ మజిల్స్, శారీరక కణజాలం పెంపొందేలా చేయడంలో ఎగ్స్ పాత్ర కీలకమైనది. ఇందుకోసం బాగా ఉడికించిన గుడ్డును వారు ఇష్టపడేలా కొంచెం ఉప్పు, మిరియాలపొడి లేదా వారు తినే మరేవైనా పదార్థాల కాంబినేషన్‌తో కొంచెం కొంచెంగా మీ పిల్లలకి అలవాటు చేయండి. చికెన్: పిల్లలకి చికెన్ హై క్యాలరీ, హై ప్రొటీన్ ఫుడ్ అవుతుంది. చికెన్‌లో ఉండే ఫాస్ఫరస్ వల్ల ఎముకలు, పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. లివర్, కిడ్నీ మాత్రమే కాక కేంద్ర నాడీ వ్యవస్థ మొత్తం చికెన్ వల్ల శక్తి పుంజుకుంటుంది. బెల్లం: బెల్లంలో ఐరన్‌తో పాటూ ఎసెన్షియల్ మినరల్స్ ఉన్నాయి. చెరుకు రసం నుండి తయారయ్యే బెల్లం రిఫైండ్ షుగర్ కంటే మంచిది. మీ పిల్లలకి ఇంకొన్ని ఆరోగ్యకరమైన క్యాలరీలు అందాలంటే వారికి నచ్చిన ఆహార పదార్థాలలో ఆర్గానిక్ బెల్లాన్ని కలపండి. అయితే, బెల్లాన్ని తగిన మోతాదులోనే ఇవ్వాలని గుర్తు పెట్టుకోండి. తేనె: ఆరోగ్యంగా బరువు పెరగడానికి సాయం చేసే వాటిలో తేనె కూడా ఒకటి. తేనెలో 17% నీరు, 82% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొవ్వు శాతం చాలా తక్కువ. టోస్ట్, శాండ్విచెస్, దిబ్బరొట్టెల వంటి వాటికి టీ స్పూన్ తేనె కలపాలి. అయితే, తేనె కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి. డ్రై ఫ్రూట్, నట్స్: జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, ఆప్రికాట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌ని ఇష్టపడని పిల్లలు అరుదుగానే ఉంటారు. నేరుగా తీసుకుంటే అలాగే పెట్టవచ్చు. లేదంటే వీటిని స్నాక్స్‌లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఐస్‌క్రీమ్స్, స్మూతీల్లో కలపవచ్చు. ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి అవసరమైన ఐరన్, విటమిన్స్, మెగ్నీషియం, ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్ వంటివన్నీ డ్రై ఫ్రూట్స్, నట్స్‌లో ఉన్నాయి. ప్యాన్‌కేక్స్: ఫారిన్లో ప్యాన్‌కేక్స్ అంటారు. మన దేశంలో అయితే అట్లు అంటారు. పిల్లలు దోసెలని ఇష్టంగానే తింటారు. వీటిని బ్రేక్ ఫాస్ట్‌లా పెట్టవచ్చు లేదా స్నాక్‌గా కూడా తినిపించవచ్చు. దోసెలలో ఉండే ఇన్గ్రీడియెంట్స్ను హై క్యాలరీ ఫుడ్స్ గా పరిగణించవచ్చు. ఓట్మీల్: ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పిల్లల్లో అరుగుదల బాగా జరిగేలా చూస్తుంది. ఇందులో గ్లూటెన్ కూడా ఉండదు. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, స్టార్చ్ ఉంటాయి, ఇవి పిల్లలకి ఎంతో మేలు చేస్తాయి. బీన్స్, పప్పులు: ప్రొటీన్ పుష్కలం గా లభించేది వీటిలోనే. బీన్స్‌లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ బ్లడ్ షుగర్ ని క్రమబద్ధీకరించి, మూడ్ స్వింగ్స్ లేకుండా చేస్తుంది కాబట్టి పిల్లలకి వారికి నచ్చిన పద్ధతిలో బీన్స్ వండి పెట్టడం ఎంతో మేలు. అరటి పండు: మనకి సంవత్సరం పొడుగూతా దొరికే అరటి పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అరుగుదల సరిగ్గా జరిగేలా చేస్తాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ 6 వల్ల ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి పిల్లలకు అరటి పండు కూడా ఒక మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. అవకాడో: ఇందులో విటమిన్స్ సీ, ఈ, కే, బీ6, పొటాషియం, ఫ్యాట్, ఫైబర్, లుటీన్, బీటా కెరొటిన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన ఓవరాల్ హెల్త్ బాగుండడానికి అవకాడో ఎంతో సాయం చేస్తుంది. అవకాడోని స్మూతీలా చేసి తీసుకోవచ్చు. మొక్కజొన్న: వీటిలో ఉండే కెరొటినాయిడ్స్ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంతే కాక, మొక్కజొన్న లో పిండిపదార్థాలు కూడా ఎక్కువే. మొక్కజొన్న కండె ఉడికించి పిల్లలకి పెట్టవచ్చు. చిలగడదుంప: దీనిలో ఫైబర్, విటమిన్స్ బి,సి ఐరన్, కాల్షియం, సెలీనియం వంటి మినరల్స్ ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బీటా కెరొటిన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. బంగాళ దుంప: ఆలూని ఇష్టపడని పిల్లలు తక్కువ. కాబట్టి దీన్ని మీ పిల్లల ఆహారంలో చేర్చడం తేలికే. వీటిలో విటమిన్స్ ఏ, సీ ఇంకా ఫైబర్, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ పిల్లలు ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి సహకరిస్తాయి. ఫ్రూట్ స్మూతీ: పిల్లలకే కాదు, పండ్లు ఎవరికైనా ఎంతో మంచివి, ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి మరీ మంచివి. కానీ, కొందరు పిల్లలకి పండ్లు నచ్చవు, ముఖం తిప్పుకుంటారు. అలాంటప్పుడు వీటిని స్మూతీలా చేసి ఇచ్చారనుకోండి,పేచీ పెట్టకుండా తాగేస్తారు. చివరగా... పిల్లలందరి శరీర తత్త్వం ఒకేలా ఉండదు. బరువు తక్కువ ఉన్న పిల్లలకి పెట్టడానికి ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్, ఇంకా ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎంచుకోవడం మేలు. అన్నింటికీ మించి వారు తిననని మారాం చేస్తుంటే బలవంతం చేసి నోటిలో కుక్కడం వల్ల బరువు పెరగరు సరికదా, అసలు తినడమంటేనే ఇష్టపడకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్లు ఇష్టపడే ఆహారాన్ని లేదా ఇష్టపడే రీతిలో తినిపించడం మేలు. చదవండి: Summer Care: ఏసీ గదిలో ఎక్కువసేపు గడుపుతున్నారా.. జాగ్రత్త! -
Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే..
కేవలం 14 రోజులు వర్క్ చేస్తే 9 లక్షల రూపాయలా..! ఫేక్ నోటిఫికేషన్ అని కొట్టిపారేస్తారేమో.. నిజమండీ! ఈ విధమైన ఉద్యోగాలు కూడా ఉన్నాయీ జిందగీలో. ఉద్యోగవివరాలు ఇవే.. యూకే లోని ఎడిన్బర్గ్లో ఈ రకమైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి తాజాగా విడుదలైంది. డిసెంబర్ 22 నుంచి జనవరి 5 వరకు మొత్తం 14 రోజుల ఉద్యోగావకాశం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఏమిటంత ముఖ్యమైన జాబ్ అనే కదా అనుకుంటున్నారు..! చదవండి: ఈ రెండు చిత్రాల్లో మార్పులు కనిపెట్టారా? మళ్లీ ఓ పాలి.. లుక్కెయ్యండి.. సామీ.. ఓ సంపన్న కుటుంబం క్రిస్టమస్ సెలవుల్లో పిల్లల్ని చూసుకోవడానికిగాను ఈ ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతోంది. ఐదేళ్ల కవల పిల్లల సంరక్షణకుగాను రోజుకు అక్షరాల 59 వేల రూపాయల జీతం చొప్పున.. మొత్తం 14 రోజులకు 9 లక్షల రూపాయల జీతం ప్రకటించింది సదరు కుటుంబం. క్రిస్టమస్ టైంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఫుడ్, బెడ్ అన్నీ అక్కడే. ఈ ఉద్యోగాంలో చేరిన ఆయా.. పిల్లలకు స్నానం చేయించడం, ఆహారం పెట్టడం, వారితో ఆటలాడటం, నిద్ర పుచ్చడం.. వంటి పనులు చేయాలి. అంతేకాదు దరఖాస్తు దారులకు ఖచ్చితంగా పిల్లల సంరక్షణలో ఐదేళ్ల అనుభవం కూడా ఉండాలి. వింతగా అనిపించినా.. పిల్లల సంరక్షణకు ఆ తల్లీదండ్రులు ఎంత కేర్ తీసుకుంటున్నారో కదా! చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? -
గర్భిణులకు భారీగా నగదు ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం చేయించుకున్న గర్భిణికి శిశు సంరక్షణ కిట్ పేరిట 2016 నుంచి 2019 వరకూ రూ.695 విలువ చేసే కిట్ ఇచ్చేవారని, ఇప్పుడు గర్భిణికి ప్రసవం అనంతరం ఆసరా కింద భారీగా నగదు ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ ప్రసవం అయితే రూ.5 వేలు, సిజేరియన్ అయితే రూ.3 వేలను 24 గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నామని స్పష్టం చేశారు. ఆ మొత్తం నుంచే శిశువుల సంరక్షణకు కావాల్సినవి గర్భిణులే కొనుక్కుంటున్నారన్నారు. ‘శిశు సంరక్షణ కిట్లకు కటకట’ శీర్షికన కిట్ల పంపిణీని నిలిపివేసినట్టు ఓ పత్రిక రాసిందని, ఇది సరికాదని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో కేవలం శిశు సంరక్షణ కిట్ మాత్రమే ఇచ్చి.. ఎలాంటి నగదు ఇచ్చేవారు కాదన్నారు. ఇప్పుడు గర్భిణికి రూ.3 వేల నుంచి రూ.5 వేల చొప్పున చెల్లిస్తున్నామన్నారు. ప్రసవం కాగానే ప్రతి ఒక్కరికీ నగదు జమ అవుతోందన్నారు. 46.79 శాతం మందికి రెండు డోసులూ పూర్తి రాష్ట్రంలో ఇప్పటివరకూ 46.79 శాతం మందికి కోవిడ్ టీకా రెండు డోసులూ పూర్తయినట్టు సింఘాల్ చెప్పారు. 18 ఏళ్లకు పైబడిన 3.47 కోట్ల మంది టీకాకు అర్హులని గతంలో తాము అంచనా వేయగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం 3.95 కోట్లుగా సమాచారం పంపించిందన్నారు. దీన్ని బట్టి ఇప్పటివరకూ 46.79% మందికి రెండు డోసులు టీకా పూర్తయిందన్నారు. రాష్ట్రంలో 1,84,90,379 మందికి రెండు డోసులు వేశామన్నారు. 1,32,65,148 మందికి తొలి డోసు పూర్తయిందని చెప్పారు. వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ సగటు కంటే మన రాష్ట్రం చాలా ముందుందని తెలిపారు. కరోనా కేసులు తగ్గినా 104 కాల్‌సెంటర్‌ను కొనసాగిస్తున్నామని, ఎవరు ఫోన్ చేసినా సమాచారం వస్తుందన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు మొదలుకొని కొత్త మెడికల్ కాలేజీల వరకూ నిర్మాణం జరుగుతున్నాయని, ప్రణాళికాబద్ధంగా నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరోగ్యశ్రీలో చికిత్సల జాబితా పెంచామని, గత 6 నెలల్లోనే రూ.1,013 కోట్లను ఆరోగ్యశ్రీ కింద వ్యయం చేశామన్నారు. -
Photo Story: వరదపాశం పెద్దబండపై పోసి..
అచ్చంపేట రూరల్: వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమ తల్లిదండ్రులు వర్షం రాక కోసం ఎదురుచూస్తుండటం చూసి మంగళవారం కొంతమంది చిన్నారులు, యువకులు గ్రామ సమీపంలోని పెద్దబండపై వరదపాశం పోశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఆలయాల్లో వర్షం కోసం పూజలు చేశారు. కప్పకావడితో ఊరంతా తిరిగారు. పోగైన డబ్బులతో వరదపాశం తయారుచేశారు. అనంతరం పెద్దబండపై పోసి ఆరగించారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా పడతాయని వారి నమ్మకం. ఖమ్మం: ప్రయాణికుల సౌకర్యార్థం బస్సే..షెల్టర్‌గా మారింది. ఖమ్మం నగరం నుంచి ఇల్లెందు వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బస్‌షెల్టర్ లేదు. దీంతో ఆర్టీసీ అధికారులు ఓ బస్‌ను ఇలా ఉంచి..తాత్కాలిక బస్ షెల్టర్ అంటూ ఫ్లెక్సీ కట్టారు. -సాక్షి ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం సిద్దిపేట కలెక్టరేట్లో ‘చైల్డ్ కేర్’ సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట సమీకృత కలెక్టరేట్లో చైల్డ్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులతోపాటు, కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం పిల్లలతో వచ్చే తల్లులకు సైతం ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల కోసం ప్రత్యేక గది, ఆడుకోవడానికి గార్డెన్‌ను తీర్చిదిద్దుతున్నారు. మహిళా ఉద్యోగుల పిల్లలను బేబీ కేర్‌కు పంపించకుండా విధులు నిర్వర్తిస్తూ వారిని చూసుకునేలా సిద్ధం చేస్తున్నారు. మూడేళ్లలోపు పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీ, ఆటలు, పాటలు నేర్పించేందుకు అంగన్వాడీ టీచర్‌ను సైతం నియమించనున్నారు. చదవండి: ఎంపీ కోమటిరెడ్డికి అవమానం: సీఎం కేసీఆర్ సభకు అందని ఆహ్వానం -
చిన్నారులపై చిన్న చూపు!
సాక్షి, అమరావతి: చిన్నారుల సంరక్షణకు నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి చిన్నచూపు చూసింది. గత ఆర్థిక సంవత్సరం మహిళా, శిశు సంక్షేమానికి రూ.30,000 కోట్లు కేటాయించిన కేంద్రం.. తాజా బడ్జెట్లో మాత్రం రూ.24,435 కోట్లే కేటాయించింది. అంతే కాకుండా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పథకాలకు కూడా కత్తెర వేశారు. అలాగే రెండు, మూడు పథకాలను కలిపి ఒక మిషన్ కిందకు తీసుకొచ్చారు. మహిళలు, పిల్లలకు సంబంధించి మూడు ముఖ్యమైన మిషన్లు.. వాత్సల్య(పిల్లల రక్షణ, సంరక్షణ, సంక్షేమ), శక్తి(మహిళల రక్షణ, సంక్షేమం), సంబల్(ఉజ్వల హోమ్స్, వన్‌స్టాఫ్ సెంటర్స్, హెల్ప్‌లైన్స్, స్వధార్)ను ఏర్పాటు చేశారు. మిషన్ వాత్సల్యలో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ పథకం(ఐసీపీఎస్) ఒక భాగం. గత బడ్జెట్లో ఐసీపీఎస్‌కు రూ.1,500 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి రూ.900 కోట్లే కేటాయించింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో–2019 నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక బాలుడు లేదా బాలిక అదృశ్యమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి రక్షణకు సంబంధించిన మిషన్ వాత్సల్యకు నిధుల కోత విధించారు. అలాగే కరోనా విజృంభణ సమయంలో సంరక్షణ గృహాల్లో ఉన్న 1,48,788 మంది పిల్లలను వారి సంబంధీకుల వద్దకు పంపించారు. అయితే లాక్డౌన్ దెబ్బకు వీరిని పోషించాల్సిన వారు ఉపాధి కోల్పోవడంతో.. ఈ చిన్నారుల్లో అత్యధిక మంది బాలకార్మీకులుగా మారిపోయారు. మరోవైపు స్కూల్ ఎడ్యుకేషన్‌కు కూడా గత ఆర్థిక సంవత్సరం కన్నా 9.71 శాతం తక్కువ నిధులు కేటాయించారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారుల సంరక్షణ, అభివృద్ధి ఎలా సాధ్యమని విద్యా రంగ నిఫుణులు ప్రశ్నిస్తున్నారు. -
శిశుసంరక్షణపై మరింత శ్రద్ధ అవశ్యం
చిన్నారుల ఆరోగ్యం పట్ల ఎలా వ్యవహరిస్తున్నామన్న అంశమే ఏ సమాజ భవిష్యత్తుకైనా గీటురాయి అవుతుందని నల్ల సూరీడు నెల్సన్ మండేలా ఒక సందర్భంలో చెప్పారు. శిశువులను జాతి సంపదగా భావించి వారి శ్రేయస్సుకు చేతనైనదంతా చేస్తేనే భవిష్యత్తు సమాజం మెరుగ్గా వుంటుంది. సహస్రాబ్ది లక్ష్యాల్లో ఒకటైన శిశు మరణాల నియంత్రణలో మన దేశం ఆనాటికానాటికి పురోగతి సాధిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వున్న శిశు మరణాల అధ్యయన సంఘం నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం 1990లో మన దేశంలో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ప్రతి వేయి మందికి 126మంది చనిపోయేవారు. ఇప్పుడా సంఖ్య 34కి తగ్గింది. ఈ వయసు పిల్లల్లో మరణాల రేటు గత రెండు దశాబ్దాల్లో ఏటా 4.5 శాతం చొప్పున తగ్గుతున్నదని నివేదిక అంటోంది. అంకెల రూపంలో చెప్పాలంటే 1990లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు మన దేశంలో 34 లక్షలుంటే... ఇప్పుడది 8,24,000కు తగ్గింది. మాతా శిశు సంరక్షణ కోసం పథకాలు రూపొందించి, వాటికి తగినన్ని నిధులు కేటాయించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకోవాలి. అయితే ఈ కృషి సరిపోదు. ఈ రంగంలో మరింత శ్రద్ధ పెట్టి పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో అయిదేళ్లలోపు పిల్లల మరణాల్లో 49 శాతం కేవలం అయిదు దేశాల్లో సంభవిస్తున్నాయని నివేదిక వివరిస్తోంది. ఆ అయిదు దేశాల్లో నైజీరియా ప్రథమ స్థానంలో వుంటే మన దేశం రెండో స్థానంలో, పాకిస్తాన్, ఇథియోపియా, కాంగో ఆ తర్వాతి స్థానాల్లో వున్నాయి. అంటే ప్రపంచ దేశాల్లో సంభవిస్తున్న మరణాల్లో దాదాపు సగం ఈ దేశాల్లోనే జరుగుతున్నాయి. గర్భధారణ సమయంలో మహిళలకు అవసరమైన పోషకాలు లభ్యమయ్యేలా చూస్తే, వారి ఆరోగ్యానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటే పుట్టే శిశువు ఆరోగ్యవంతంగా వుంటుంది. ఆ సమయంలో మహిళకు అందించే కొద్దిపాటి ఆసరా ఆమె ప్రాణాలను నిలబెట్టడమే కాదు... పుట్ట బోయే శిశువుకు సైతం ఎంతగానో ఉపకరిస్తుంది. గర్భిణులూ, బాలింతల్లో రక్తహీనత వుంటే శిశువుల్లో కూడా ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవు. ప్రసూతి సమయంలో సమస్యలు ఏర్పడటం, తక్కువ బరువుతో శిశువు జన్మించడం, పుట్టిన నెలలోనే వ్యాధిబారిన పడటం, న్యూమోనియా, డయేరియా, మలేరియా వంటి వ్యాధులు అయిదేళ్లలోపు శిశువుల మరణాలకు కారణమవుతు న్నాయి. సకాలంలో వ్యాక్సిన్లు అందించడంవల్లనే గత మూడు దశాబ్దాల్లో ఈ మాదిరి మరణాలు చాలా వరకూ అరికట్టడం సాధ్యమైంది. అయితే ఈ కృషి మరింతగా పెరగాలి. మన గ్రామీణ ప్రాంతాల్లో వైద్యపరమైన సదుపాయాలు ఇప్పటికీ అంతంతమాత్రమేనన్నది చేదు నిజం. పేరుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా అక్కడ తగినంతగా సిబ్బంది వుండరు. అవసరమైన మందులు లభించవు. ఊరూరా తిరిగి గర్భిణులను గుర్తించి, వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించే విస్తృతమైన నెట్ వర్క్ మన దేశంలో అమలవుతోంది. కానీ ఇదింకా పూర్తి సంతృప్తికరంగా లేదు. ఆ నెట్వర్క్ ద్వారా గర్భిణులకు కొంత మేర సాయం అందుతున్నా వైద్య రంగ మౌలిక సదు పాయాలు పూర్తి స్థాయిలో లేకపోవడం పెద్ద శాపంగా మారింది. కనుకనే ప్రసవాల కోసం మంత్ర సానులను ఆశ్రయించే ఆచారం ఇంకా తగ్గలేదు. ఈ విషయంలో ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలు ఎంతో మెరుగని చెప్పాలి. ఆసుపత్రిలో ప్రసవాలు జరిగినప్పుడే నవ జాత శిశుమరణాలు తగ్గుముఖం పడతాయని వైద్యరంగ నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. 2030 నాటికల్లా ప్రపంచ దేశాలన్నీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలని 2015 సెప్టెంబర్‌లో ఐక్య రాజ్యసమితి తీర్మానించింది. ఈ లక్ష్యాల్లో పేదరిక నిర్మూలన, శిశు మరణాల తగ్గింపు, ఆహారభద్రత, నాణ్యతగల విద్య తదితరాలున్నాయి. ఇవి సాధించాలంటే మనం ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం వుంది. అలా చేయగలిగితే నైజీరియా, పాకిస్తాన్, కాంగో వంటి దేశాల సరసన చేరే పరిస్థితి రాదు. కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడి అన్ని రంగాలనూ ధ్వంసం చేసినట్టే ఆరోగ్య రంగ వ్యవస్థనూ కూడా దెబ్బతీసింది. ముఖ్యంగా శిశు మరణాల అదుపుకోసం దశాబ్దాలుగా శ్రమించి సాధించిన విజయాలను అది నాశనం చేసే ప్రమాదం కనబడుతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అప్రమత్తతతో వ్యవహరించాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుం టున్న చర్యలు ఎంతో ప్రశంసించదగ్గవి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ వైద్యం రూపురేఖలు మార్చడానికి నడుంకట్టింది. రాష్ట్రంలో 7,458 ఆరోగ్య ఉపకేంద్రా లుంటే వాటిల్లో 80 శాతం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ఇకపై ప్రతి ఒక్క కేంద్రానికీ అన్ని సదుపాయాలతో కూడిన సొంత భవనం వుండాలన్నది ఏపీ ప్రభుత్వం తాజాగా పెట్టుకున్న లక్ష్యం. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల పేరిట వీటి రూపురేఖలు సంపూర్ణంగా మార్చి ప్రతి 2,500 మందికి ఒక కేంద్రం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందులో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు టీకాలు వేయించుకునే అవకాశం వుండటంతోపాటు 90 రకాల మందులు లభ్యమవుతాయి. బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసినవారు, ఏఎన్ఎం అక్కడ అందుబాటులో వుంటారు. ఇటు తెలంగాణలో గ్రామీణ వైద్యరంగాన్ని మెరుగుపరచడంతోపాటు మాతా శిశు రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. 2017లో ప్రారంభించిన కేసీఆర్ కిట్ పథకం, ఆ మరుసటి ఏడాది ప్రారంభించిన అమ్మ ఒడి శిశు మరణాల రేటను తగ్గించడంలో గణనీయంగా తోడ్పడిందని గణాంకాలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణలను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా...ముఖ్యంగా ఉత్తరాదిన వైద్య రంగ మౌలిక సదుపాయాలను మెరుగుపరిస్తే ప్రభుత్వాలు క్రియాశీలకంగా పనిచేస్తే అసంఖ్యాక పసిప్రాణాలను గండం నుంచి గట్టెక్కించగలమని పాలకులు గుర్తించాలి. -
‘పనికి బలవంతం చేయొద్దు’
న్యూఢిల్లీ: పిల్లల సంరక్షణలో ఉన్న మహిళను పనికి/ ఉద్యోగానికి వెళ్లమని బలవంతం చేయరాదని ఢిల్లీ కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. పిల్లల సంరక్షణ కోసం ఇస్తున్న రూ.10వేలను రూ.35వేలకు పెంచాలంటూ భార్యనుంచి విడిపోయిన ఓ భర్తను కోర్టు ఆదేశించింది. భర్త నుంచి విడిపోయిన భార్య పిల్లాడి సంరక్షణకోసం తనకు మంచి లాభదాయకమైన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చిందని, ఆమెకు ఇచ్చే మెయింటెనెన్స్‌ను రూ.10,000 నుంచి రూ. 35,000కు పెంచి ఆ మొత్తాన్ని రెండు నెలల్లోగా పూర్తిగా చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది. పిల్లల సంరక్షణలో ఉన్న మహిళలను బలవంతంగా పనికి వెళ్లమని చెప్ప జాలరని, వారు రోజంతా పనిచేసే యంత్రాలు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. -
ఏజెన్సీ ప్రాంతాల్లో శిశు సంరక్షణ భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నవజాత శిశువుల కోసం ఏర్పాటుచేసిన ఎస్ఎన్సీయూ (స్పెషల్ న్యూకేర్ బార్న్ యూనిట్స్) సేవలు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి విధానాన్ని తాము కూడా అనుసరిస్తామని ఇథియోపియా బృందం ప్రశంసించింది. ఈ దేశానికి చెందిన వైద్య బృందం సోమ, మంగళవారాల్లో ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయగూడెంతో పాటు పలు నవజాత శిశువుల వైద్య కేంద్రాలను సందర్శించింది. ఇథియోపియాలోని వొలైటా సొడు యూనివర్సిటీకి చెందిన ముగ్గురు వైద్యుల బృందం ఈ కేంద్రాల సందర్శనకు వచ్చింది. ఇందులో డా.మెస్ఫిన్ బిబిసొ, డా.ఇయోబ్ ఎషెటు, డా.లూకాస్ డింగాటో ఉన్నారు. శిశు సంరక్షణ కేంద్రాల్లో అందుతున్న సేవలను ఈ బృందం పరిశీలించి ఇక్కడ అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడింది. ఈ కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానం, వైద్యులు అనుసరిస్తున్న వైద్య విధానాలను అడిగి తెలుసుకున్నారు. తమ దేశంలో కూడా ఈ విధానాన్ని అనుసరిస్తామని, సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరారు. నవజాత శిశువుల కోసం ఇక్కడ 24 గంటలూ సేవలు అందుతుండటం గొప్ప విషయమని.. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి సేవలు అందుబాటులో ఉండటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని వారు చెప్పారు. ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాలను తమ దేశంలోనూ అమలుచేసేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని బృందం తెలిపింది. కాగా, జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో రాష్ట్రంలోని ఏడు ఏజెన్సీ ప్రాంతాల్లో 21 ఎస్ఎన్సీయూలు నడుస్తున్నాయి. 2018 మేలో ప్రారంభమైన వీటిల్లో 2019 డిసెంబర్ 20 నాటికి 7,500 నవజాత శిశువులకు వైద్యమందినట్లు ఇథియోపియా బృందానికి అధికారులు వివరించారు. ట్రాకింగ్ విధానంతో మెరుగైన సేవలు గర్భిణిని ఆస్పత్రికి తీసుకురావడం, సకాలంలో వైద్య పరీక్షలు చేయించడం, సుఖ ప్రసవానికి ప్రోత్సహించడం వంటి విషయాల్లో ట్రాకింగ్ విధానాన్ని అమలుచేస్తున్నాం. ప్రసవానికి గర్భిణి పుట్టింటికి వెళ్లినా అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రసవానికి అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నాం. కేఆర్ పురం ఏజెన్సీ పరిధిలో మరో ఎస్ఎన్సీయూ పెడితే బాగుంటుంది. – ఆర్వీ సూర్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ, కేఆర్ పురం -
తల్లికి, బిడ్డకు ఆరోగ్యమస్తు
శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతానికి చెందిన శ్రీదేవి తొలి కాన్పు కోసం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరి పండంటి పాపకు జన్మనిచ్చింది. తొలి కాన్పు కావడంతో బిడ్డ సంరక్షణ ఎలాగో ఆమెకు తెలియలేదు. ఇంతలో వైద్యుడు ఎంసీపీ కార్డు ఇచ్చారు. అందులో బిడ్డ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఉన్నాయి. ఆ వివరాలతో శ్రీదేవి తన బిడ్డను చక్కగా చూసుకోగలుగుతోంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లికి చెందిన ముత్యాల మీనాకుమారి.. గర్భిణి. వైద్యపరీక్షల కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా అక్కడ ఆమెకు ఎంసీపీ కార్డును ఇచ్చారు. అందులో ఇచ్చిన జాగ్రత్తలను పాటిస్తున్నానని.. తల్లీబిడ్డల ఆరోగ్యంపై చాలా వివరాలు పొందుపరిచారని మీనాకుమారి సంతోషం వ్యక్తం చేస్తోంది. సాక్షి, అమరావతి: గర్భిణిగా నిర్ధారణ అయినప్పటి నుంచి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే జాగ్రత్తలు పాటించాలి? ఎప్పుడు ఏయే పరీక్షలు చేయించుకోవాలి? బిడ్డ పుట్టాక ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు ఏ టీకాలు వేయించాలి? ఎలాంటి ఆహారం పెట్టాలి? అనారోగ్యంగా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బిడ్డ ఎదుగుదలకు ఏం చేయాలి?.. ఇలా గర్భిణులకు, బాలింతలకు ఎన్నో సందేహాలు. వీటిని నివృత్తి చేయడానికి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రంగంలోకి దిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గర్భిణుల నుంచి బాలింతలు.. బిడ్డల వరకు వారి సంరక్షణే ధ్యేయంగా ఎంసీపీ (మాతా శిశు సంరక్షణ) కార్డులు రూపొందించింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లోని బోధనాస్పత్రుల వరకు పంపిణీ చేస్తోంది. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి.. బిడ్డ పుట్టాక తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంతో అమూల్యమైన సమాచారం ఎంసీపీ కార్డుల్లో పొందుపరిచింది. ఈ కార్డుల ద్వారా లక్షలాది మంది గర్భిణులు, బాలింతలు ప్రయోజనం పొందుతున్నారు. 9 నెలలు ఇలా.. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి తొమ్మిది నెలలు పూర్తయి ప్రసవం అయ్యే వరకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఎంసీపీ కార్డులో పొందుపరిచారు. గర్భిణి.. మొదటి త్రైమాసికంలో ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి.. గర్భస్థ పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి.. సాధారణ పరీక్షలు అంటే.. రక్తపోటు, మూత్ర పరీక్షలు వంటివి ఎప్పుడు చేయించుకోవాలి.. ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి? వంటి వాటిని వివరించారు. కార్డుల్లో ఇచ్చిన సమాచారం ద్వారా 9 నెలల కాలంలో ఉన్న బరువుకు అదనంగా 10 నుంచి 12 కిలోలు బరువు పెరగాలని, కనీసం 180 ఐరన్ ఫోలిక్ మాత్రలు వాడాలని గర్భిణులు తెలుసుకుంటున్నారు. సుఖప్రసవాలు ఎక్కువ చేయడమే లక్ష్యం రాష్ట్రంలో సుమారు 50 శాతం సిజేరియన్ ప్రసవాలే జరుగుతున్నాయి. దీనివల్ల తల్లికి భవిష్యత్‌లో శారీరక సమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి వారిని బయటపడేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సుఖప్రసవాలు జరగాలంటే ముందు గర్భిణులకు చక్కటి అవగాహన ఉండాలనే లక్ష్యంతో ఎంసీపీ కార్డులను రూపొందించింది. దీనివల్ల మాతా శిశు మరణాల రేటును కూడా తగ్గించవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి వెయ్యి ప్రసవాలకు 34 మంది శిశువులు, ప్రతి లక్ష ప్రసవాలకు 74 మంది తల్లులు ప్రసవ సమయంలో మృతి చెందుతున్నారు. రానున్న రెండేళ్లలో ఈ మరణాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఎంసీపీ కార్డులను ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్యానికి వచ్చే ప్రతి తల్లికీ, గర్భిణికీ అందిస్తోంది. టీకాలే బిడ్డకు రక్షణ కవచం బిడ్డ పుట్టగానే వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. వీటి బారి నుంచి బిడ్డను రక్షించుకోవాలంటే టీకాలే మార్గం. బిడ్డకు ఏ వయసులో ఏ టీకా వేయించాలో తల్లికి అవగాహన ఉంటే బిడ్డను కాపాడుకోవడం సులువవుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ఎంసీపీ కార్డుల్లో బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏయే టీకాలు వేయించాలో తెలుపుతూ కాలనిర్ణయ పట్టికను రూపొందించారు. అంతేకాకుండా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల, అభివృద్ధి దశలతో చిత్రమాలికను రూపొందించడం.. టీకాల సామర్థ్యాలపై వివరణలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు మంచి అవగాహన కల్పిస్తున్నాయి. ఎంసీపీ కార్డులో ఉన్న మరికొన్ని వివరాలు.. - స్థానిక ఏఎన్ఎం (ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫరీ) వద్ద ఏయే సేవలు ఉంటాయో సూచించడం - రొమ్ము సంబంధిత వ్యాధుల లక్షణాలను చెప్పడం - గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ లక్షణాలను వివరించడం - సంచార చికిత్సలో భాగంగా చేసే వైద్య పరీక్షలేవో తెలపడం - మొదటి కాన్పులో తలెత్తిన సమస్యలేవైనా ఉంటే వాటి వివరాలు తీసుకోవడం - గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పౌష్టికాహారం.. జాగ్రత్తలు - రక్తస్రావం, రక్తహీనత, జ్వరం, మూర్ఛ వంటి ఏవైనా లక్షణాలు ఉంటే గర్భిణి తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలు - తల్లిపాలు ఇస్తే శిశువుకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలపడం - పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల గురించి చిత్రాలతో వివరించడం - ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల ప్రాధాన్యత చెప్పడం - ప్రధానమంత్రి మాతృవందన యోజన, జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ వంటి పథకాల ద్వారా ప్రసవం తర్వాత ఇచ్చే నగదు వివరాలు. అవగాహన ఉంటే వైద్యం చేసుకున్నట్టే.. గర్భిణులకు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన ఉందంటే వైద్యం చేసుకున్నట్టే లెక్క. పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ప్రసవానంతరం బిడ్డ సంరక్షణకు కావాల్సిన చిట్కాలు.. ఈ మూడూ ప్రధాన అంశాలు. వీటిని తెలుసుకుంటే చాలు తల్లీ, బిడ్డ సురక్షితంగా ఉంటారు. ఈ అంశాలను ఎంసీపీ కార్డులో అర్థమయ్యే విధంగా రూపొందించడం బాగుంది. కార్డులో ఉన్న అంశాలను క్రమం తప్పకుండా పాటిస్తే చాలు. గర్భిణులు జాగ్రత్తలు పాటిస్తే సుఖప్రసవం జరిగి బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. –డా.వై.మాధవి, గైనకాలజిస్ట్, కడప -
ఓ విద్యార్థీ... నీ దారేది?
సాక్షి, తిరుపతి ఎడ్యుకేషన్ : భవానీనగర్‌లోని మోక్షిత ఇంటర్లో 95శాతానికిపైగా మార్కులు తెచ్చుకుంది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి ఇంజినీరింగ్‌లో చేరింది. సహ విద్యార్థులతో కలిసి తరగతులకు డుమ్మా కొట్టి సినిమాలు, షికార్లకు వెళ్లడం ప్రారంభించింది. విలాసానికి అలవాటు పడి అబద్దాలు చెప్పి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేసింది. చదువులో వెనుకబడ్డ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించారు. నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు ఐదేళ్లకు పూర్తయ్యింది. అరాకొర మార్కులు సాధించడంతో అనుకున్న ఉద్యోగం రాక చిరు ఉద్యోగంలో చేరింది. ఇంటర్లో 80శాతం మార్కులతో ఉత్తీర్ణుడైన కార్తీక్ ఇంజినీరింగ్‌లో చేరి నాలుగేళ్లు కష్టపడి చదివాడు. చెడు స్నేహాలు, దురలవాట్లకు దూరంగా ఉండి తరగతులు, ప్రయోగశాలలకు క్రమం తప్పకుండా హాజరై సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాడు. క్యాంపస్ సెలెక్షన్స్‌లో ప్రతిభ చూపి రూ.10లక్షల వార్షిక వేతనంలో ప్రముఖ కంపె నీలో ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడ్డాడు. పదో తరగతి వరకు ఇంట్లో ఉంటూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులే ఎక్కువ. పది పూర్తయిన తర్వాత 60శాతానికి పైగా విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటూ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్నారు. ఈ సమయంలో తప్పటడుగులు వేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. సెల్‌ఫోన్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిదని విద్యానిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉంటూనే కళాశాలకు వెళ్తున్న విద్యార్థులు సైతం స్నేహితుల ప్రభావంతో దురలవాట్లకు లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి. మద్యం, ధూమపానం చేయడానికి అలవాటు పడుతున్నారు. సెల్ఫోన్లో అసభ్యకర చిత్రాలు చూసి ఉద్వేగాలకు లోనై నేరాలకు పాల్పడి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. దురలవాట్లకు అలవాటు పడి ఏకాగ్రతతో చదవలేకపోతున్నారు. నగరాల్లోనే కాకుండా పట్టణాల్లో సైతం కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు దిగి అప్పులపాలవుతున్నారు. దీంతో పరీక్షలు సరిగా రాయలేక మార్కులు తక్కువగా వస్తున్నాయి. కొంతమంది ఉత్తీర్ణులు కాకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కళాశాలకని చెప్పి నదులు, సముద్రాల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. అరకొరగా చదివితే అంతే అరకొరగా చదివి బొటాబొటి మార్కులతో ఉత్తీర్ణులై కోర్సు పూర్తి చేసిన వారికి సరైన ఉద్యోగం లభించడం లేదు. నైపుణ్యం లేకపోతే ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం సాధించడం కష్టమే. ఆ తరువాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లి లక్షలాది రూపాయల ఫీజుల చెల్లించి ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మూడు, నాలుగేళ్ల తరువాత చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. సమయాన్ని వృథా చేయకుండా, తాత్కాలిక ఆకర్షణలకు గురికాకుండా కోర్సుల్లో చేరి మొదటి రోజు నుంచే కష్టపడి చదువుతూ నైపుణ్యాలు పెంచుకుని పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు బాగా లభిస్తున్నాయి. తమ ప్రతిభతో పోటీ పరీక్షల్లో సత్తా చాటి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రముఖ విద్యాసంస్థల్లో చేరుతున్నారు. అనంతరం ప్రముఖ సంస్థల్లో కొలువు సాధించి కన్నవారికి గౌరవాన్ని తెచ్చిపెడుతున్నారు. సెల్‌తో జాగ్రత్త సెల్‌ఫోన్‌ను విజ్ఞానం పెంచుకోవడం కన్నా వినోద అవసరాలకే ఎక్కువగా వాడుతున్నారు. అర్ధరాత్రి దాటే వరకు సినిమాలు, వీడియోలు చూస్తున్నారు. రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పోకుండా తరగతి గదిలో ఏకాగ్రత కొరవడి అధ్యాపకులు చెప్పిన పాఠాలు సక్రమంగా వినలేకపోతున్నారు. వ్యసనాలు వద్దు మద్యం తాగుతూ షికార్లు చేస్తూ కళాశాలలకు డుమ్మా కొడుతున్నారు. చదువును అశ్రద్ధ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రా ణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యసనాలకు బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి ఇంటర్ వరకు కొంత నియంత్రణ ఉంటుంది. అనంతరం ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీఎస్సీ, ఫార్మసీ, డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. విద్యార్థులకు ఎక్కువగా స్వేచ్ఛ లభించే దశ ఇదే. దీన్ని సద్వినియోగం చేసుకునే వారు బాగా చదివి తల్లిదండ్రులు గుర్వించేలా ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగం సాధిస్తున్నారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి జీవితంలో విజేతలుగా నిలుస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే రెండో వైపు స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక ఆనందాలకు ప్రాధాన్యమిస్తూ చదువుపై శ్రద్ధ చూపకుండా విద్యార్థులు దారి తప్పుతున్నారు. ఆకర్షణను ప్రేమగా భావించి చదువును పాడు చేసుకుంటున్నారు. ప్రేమను తిరస్కరించారని దాడులు చేయడం లేదా.. బలవన్మరణానికి పాల్పడడం జరుగుతోంది. పక్కదారి పడితే అంధకారమే యుక్తవయసులో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉండి విద్యార్థులు దారి తప్పే అవకాశం అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు పిల్లల నడవడికను గమనిస్తూ తప్పు మార్గంలో వెళ్లకుండా చూడాలి. కొంచెం ఎక్కువ సమయమే కేటాయించి వారి వ్యవహార శైలి పర్యవేక్షించాలి. నాలుగు నుంచి ఆరేళ్లు కష్టపడి చదివితే బంగారు భవిష్యత్తు లభిస్తుందనే విషయాన్ని పిల్లలకు వివరించి చెప్పాలి. –డాక్టర్ కృష్ణప్రశాంతి, సీనియర్ జనరల్ ఫిజిషియన్ సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. పిల్లలను కళాశాలలో చేర్పించి ఇక తమ బాధ్యత తీరిందని తల్లిదండ్రులు భావించకూడదు. నెలలో కనీసం రెండుమార్లయినా కళాశాలకు వెళ్లి అధ్యాపకులతో మాట్లాడి విద్యార్థి గురించి తెలుసుకోవాలి. అవసరాలకు మించి డబ్బు ఇవ్వకూడదు. స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి పిల్ల లకు వివరిస్తుండాలి. –ఎం.కృష్ణయ్య, ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్ఐఓ) గారాబం పనికిరాదు పిల్లలను అతిగా గారాబం చేయకూడదు. ఇదే వారు పాడవడానికి కారణమవుతుంది. నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు పెంపొందించుకునేలా, పెద్దలను గౌరవించడం, మంచి స్నేహితుల అవసరాన్ని తెలుసుకునేలా చూడాలి. –ప్రకాష్‌బాబు, ప్రిన్సిపాల్, ఎస్పీబ్ల్యూ జూనియర్ కళాశాల -
మాఅమ్మగారు
కష్టం చూసి పరుగెత్తుకొచ్చేస్తుంది అమ్మ. మనసు బాగుండకపోతే మలాం రాస్తుంది అమ్మ. కనకపోయినా.. అమ్మ అనిపిస్తుంది అమ్మ.అమ్మ లాంటి ఈ మామ్మగారైతే... విధి చిన్నచూపు చూసినా.. ఈ చిన్నారిని ‘మన–వరాలు’ అనే అనుకుంది. ఇంచుమించు ప్రతి ఇంట్లోను భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్తున్నారు. అటువంటి వారి కోసం చైల్డ్ కేర్ సెంటర్లు మొదలయ్యాయి. ఈ సెంటర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వీరు పిల్లలను బాధ్యతగానే చూస్తున్నప్పటికీ అడపాదడపా వారి మీద చెయ్యి చేసుకుంటున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పిల్లలను చూడటం ఉద్యోగంలో భాగంగా భావిస్తారు వీరు. అరవై ఏళ్ల క్రితమే శిశు సంరక్షణం ఇందుకు భిన్నంగా ఆరు దశాబ్దాల క్రితమే శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించారు సీతారామలక్ష్మమ్మ, సీతారామాంజనేయ శర్మ దంపతులు. బాపట్ల దగ్గర వల్లూరుకి చెందిన వీరు వివాహమైన కొత్తల్లో ఉద్యోగరీత్యా గుంటూరు చేరారు. ‘‘పెళ్లినాటికి నాకు పదకొండేళ్లు, ఆయనకు ఇరవై సంవత్సరాలు. మావారు గుంటూరు పొగాకు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేసేవారు. కొన్ని సంవత్సరాల తరవాత విజయవాడలో ఒక వ్యాపారి దగ్గర రోజుకి రూపా యి పావలా జీతానికి అకౌంట్లు రాసేవారు. చాలీచాలని జీతంతో కావడంతో, కిరాణా షాపులలో పొట్లాలు కట్టేదాన్ని నేను’’ అంటారు లక్ష్మమ్మ. మొదట.. పెద్దవాళ్లకు సేవ విజయవాడలోని కుర్తాళం ఆశ్రమంలో ఈ దంపతులిద్దరూ ఆరేళ్లపాటు పెద్దవారికి సేవలు చేశారు. తరవాత ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి పదహారు సంవత్సరాలపాటు ఆశ్రమాలలో జీవనం సాగించారు. ఈ దంపతులకు ఒకే ఒక ఆడపిల్ల. అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన నాటì నుంచి ఎవ్వరి మీద ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని నష్టానికి అమ్మేశారు. ‘‘మా వారు రిటైరయ్యారు. పెన్షన్ ఏమీ లేదు. మా తిండి మేం తినడానికి ఏదో ఒక పనిచేయాలని నిశ్చయించుకున్నాం. విజయవాడ సత్యనారాయణ పురంలో చైల్డ్ కేర్ సెంటర్ ప్రారంభించాం. ఇద్దరు పిల్లలతో ప్రారంభమైన ఈ సెంటర్ అతి వేగంగా పాతికమందికి చేరుకుంది. సుమారు 20 ఏళ్ల పాటు పిల్లలతో ఆడుతూ పాడుతూ హాయిగా నడిపాం. వారిని మా సొంత మనవలుగానే భావించాం’’ అని గతం గుర్తు చేసుకుంటారు సీతారామలక్ష్మమ్మ. వాళ్లమ్మాయే.. ఈ అమ్మాయి ఆ స్కూల్లోనే అందరితో పాటు జయరామ్, రమ దంపతులు వాళ్ల అబ్బాయిని చేర్పించారు. రోజూ ఉదయాన్నే అబ్బాయిని మామ్మ గారి దగ్గర వదిలి, సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లేవారు. అలా వారి కుటుంబంతో వీరికి సాన్నిహిత్యం ఏర్పడింది. ‘‘ఈ అబ్బాయి తరవాత వాళ్లకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి మానసిక దివ్యాంగురాలు. అందువల్ల మిగిలినవారి కంటె జాగ్రత్తగా చూడాలి. దేవుడు ఆ పిల్లకు ‘చెప్పిన మాట వినే లక్షణం’ ప్రసాదించాడు. నేను ఏది చెప్పినా తుచ తప్పక ఆచరించేది’’ అంటారు లక్ష్మమ్మ. సంరక్షణతో పాటు సంస్కారం ఈ శిశు సంరక్షణ కేంద్రంలో రైమ్స్‌తో పాటు సంస్కారం కూడా నేర్పారు. శర్మ, లక్ష్మమ్మ.. వాళ్ల చిన్నతనంలో నేర్చుకున్న, చదువుకున్న నీతి కథలు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేవారు. పిల్లలతో అనుబంధం పెంచుకుంటూ, జీవితం హాయిగా, ఆనందంగా గడిపేశారు. వయోభారం మీద పడుతుండటంతో ఇరవై ఏళ్ల తరవాత శిశుసంరక్షణ కేంద్రానికి స్వస్తి పలికి, వడియాలు, అప్పడాల వంటివి తయారు చేసి అమ్మడం మొదలుపెట్టామని చెప్పారు లక్ష్మమ్మ. అనూహ్యంగా.. ఆ రోజు..! రెండేళ్ల క్రితం సీతారామాంజనేయశర్మ గతించారు. అప్పటికి ఆయనకు వంద సంవత్సరాలు నిండాయి. ‘‘మా వారు ఏదో పని ఉందని బయటకు వెళ్లి, వచ్చి కుర్చీలో కూర్చున్నారు. ‘కాఫీ కావాలా’ అని పిలిస్తే పలకలేదు. ఇక ఎన్నడూ కాఫీ తాగరని అర్థం కావడంతో, నా చేతిలో కప్పు చేతిలోనే ఉండిపోయింది’’ అంటూ కళ్లు తుడుచుకున్నారు లక్ష్మమ్మ. ఇరుగు పొరుగువారు ఆయన అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు. ‘‘నేను కన్ను మూస్తే, నా బాధ్యత ఎవరు తీసుకుంటారనే సంశయంతో నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి చాలామంది నిరాకరించారు. భగవంతుడు పరీక్షలు పెడుతూనే, పరిష్కారాలూ చూపిస్తాడు. ఎట్టకేలకు ఒక ఇల్లు అద్దెకు దొరికింది. ఇప్పుడు నేను ఏ ఇంట్లో ఉంటున్నానో, ఆ ఇంటావిడ తాతగారికి గతంలో నేను ఆశ్రమంలో ఉన్న రోజుల్లో సేవ చేశానట. ఆ కృతజ్ఞతతో వారి మనుమరాలు నాకు ఇల్లు అద్దెకు ఇచ్చి, నన్ను సొంత అమ్మమ్మలా చూసుకుంటున్నారు’’ అని చెప్పారు లక్ష్మమ్మ. మామ్మగారికి ఇటీవల కొద్దిగా అనారోగ్యం చేయడంతో ఆవిడను ఆసుపత్రికి తీసుకువెళ్లి, చూపించి, ‘మేమున్నాం’ అని భరోసా ఇచ్చారు ఇంటి ఓనరు, లక్ష్మీప్రియ తల్లిదండ్రులు. జన్మజన్మల అనుబంధం ‘‘మాది ఏ జన్మ బంధమో ఈ ఇద్దరు పిల్లలతోపాటు, వారి తల్లిదండ్రులు కూడా ఆత్మీయులు అయిపోయారు. నన్ను సొంత మామ్మగా చూసుకుంటున్నారు. నెలనెలా ఎంతో కొంత డబ్బు ఇస్తుంటారు. ఇంట్లో ఏ శుభకార్యం చేయాలన్నా నా సలహా తీసుకుంటారు’’ అంటున్న మామ్మగారిని చూస్తే అపురూపంగా అనిపిస్తుంది. నా చెయ్యి మంచిదని.. క్రేన్ వక్కపొడి వారు నేటికీ నెలకు నాలుగు వేల రూపాయలు ఒక కొడుకు తల్లికి పంపుతున్నట్టుగానే పంపుతున్నారు. వారు క్రేన్ వక్కపొడి వ్యాపారం ప్రారంభించకముందు వాళ్ల ఇంటి పక్కనే పదిహేను సంవత్సరాలు అద్దెకున్నాం. క్రేన్ వక్కపొడి ప్రారంభోత్సవం సందర్భంగా, వక్కలు తెచ్చి నా చేత దంపించి, బోణీ చేయించారు. అలా మొదలుపెట్టాక కోటీశ్వరులయ్యారనే భావనతో ఇప్పటికీ నాకు నెలకు నాలుగు వేల రూపాయలు పంపుతున్నారు. – సీతారామలక్ష్మమ్మ మా అమ్మాయిని తీర్చిదిద్దారు మాకు ఈ మామ్మగారు భగవంతుడు ఇచ్చిన వరం. మా అమ్మాయిని సొంత మనవరాలి కంటె ఎక్కువగా చూసుకుంటారు. ఇంటికి వచ్చిన వాళ్లకి మంచి నీళ్లు అవ్వడం, కాళ్లు చేతులు కడుక్కుని భోజనం చేయడం, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం, ఇంటికి ఎవరైనా వస్తే మంచినీళ్లు ఇమ్మని తల్లికి చెప్పడం వంటివన్నీ మామ్మగారి దగ్గరే నేర్చుకుంది. ఇల్లు తుడుస్తుంది, ఇంటికి వచ్చిన వారు వెళ్లేటప్పుడు వారికి పండు, బొట్టు ఇచ్చేవరకు ఊరుకోదు. పదిహేనేళ్లుగా మామ్మగారు మా పిల్లను సాకుతున్నారు. మా పిల్ల ఆవిడను ‘మామ్మగారు’ అనే పిలుస్తుంది. ఇంట్లో ఏదైనా తినే పదార్థాలు ఉంటే మామ్మగారికి ఇచ్చేవరకు ఊరుకోదు. – రమ, జయరామ్ దంపతులు, విజయవాడ – డా. వైజయంతి పురాణపండ -
'పే' స్కూల్స్..!
సాక్షి, అమరావతి : ‘నలుగురిలో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో పిల్లలకు చిన్నప్పుడే నేర్పాలి. ప్లే స్కూల్లో వెయ్యాలి. పిల్లల బుర్రలు ఐదేళ్లలోపు చురుగ్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్లకు బాగా నేర్పిస్తే తర్వాత చదువుల్లో బాగా ఎదుగుతారు’.. అంటోంది లలితమ్మ. నాలుగిళ్లల్లో పనిచేస్తేనే ఆమె కుటుంబం గడుస్తుంది. ఆయినప్పటికీ అప్పుచేసి మరీ తన కొడుకును ప్లే స్కూల్లో చేర్పించింది. ‘నా కూతురి ప్లే స్కూలుకు చెల్లించిన ఫీజు నేను ఒకటవ తరగతి నుంచి పీజీ వరకు చెల్లించిన ఫీజుకు రెట్టింపుగా ఉంది. మారిన కాలానికి అనుగుణంగా నా బిడ్డ ఎదగాలనే కోరికతో అప్పుచేసి మరీ చేర్పించా’నంటున్నారు విజయవాడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీరామ్. ..ప్లేస్కూళ్ల యజమానులు సాగించే ప్రచారం ఏ స్థాయిలో ఉందో.. కిందిస్థాయి వర్గాలను సైతం అది ఏ విధంగా ప్రభావితం చేస్తోందో గ్రహించడానికి ఇదో ఉదాహరణ. ప్రధానంగా పై తరహా ఆలోచన విధానమే ప్లే స్కూళ్ల మార్కెట్ ఏటా 32 శాతం వృద్ధితో దూసుకుపోయేందుకు కారణమవుతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్లల్లో పిల్లల బాగోగుల గురించి పట్టించుకునే వారే లేకపోవడం.. పిల్లల భవిష్యత్తు గురించి పెద్దలు భారీగా కలలు కనడం, పోటీ ప్రపంచంలో తమ పిల్లలు వెనుకబడిపోతారేమోనని భావిస్తుండటం వంటి అంశాలు.. ప్లే స్కూళ్ల విస్తరణకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు, ఆదాయాలు పెరగడం వంటివి కూడా ప్లే స్కూల్ మార్కెట్ పెరగడానికి దోహదం చేస్తున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పిల్లలకు 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిస్తామంటూ కొన్ని కార్పొరేట్ సంస్థలు సాగిస్తున్న భారీ ప్రచారం కూడా పెద్దల్ని కొంతమేర ప్రభావితం చేస్తోంది. అయితే, పెద్దలు ఈ తరహా ప్రచారంలో కొట్టుకుపోరాదంటున్నారు హైదరాబాద్‌కు చెందిన చైల్డ్ సైకాలజిస్ట్ సి.వీరేందర్. ‘హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యాన్ని భవిష్యత్తు పేరుతో ఒత్తిడికి గురిచేయొద్దు. వాళ్లను కుటుంబంతో, తాతయ్య అమ్మమ్మలతో గడపనివ్వండి’ అని సలహా ఇస్తున్నారు. వేల నుంచి లక్షల్లో ఫీజులు.. నిన్నమొన్నటి వరకు కేవలం నగరాలకే పరిమితమైన ప్లే స్కూళ్ల సంస్కృతి ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించింది. ‘సాక్షి’ పరిశీలన ప్రకారం.. నగరాల్లో పేరున్న స్కూళ్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. విశాఖ, తిరుపతిలోని ప్లే స్కూళ్లలో లక్ష, లక్షన్నర రూపాయల ఫీజు కడితేనే సీటు. విజయవాడలో సీటు కావాలంటే పాతిక వేల నుంచి లక్ష వరకూ చెల్లించాల్సిందే. హైదరాబాద్ నగరంలోని టాప్ ప్లే స్కూళ్లు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజు కట్టించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు కలిగిన కంగారు, యూరో కిడ్స్, బచ్పన్, కిడ్జస్ వంటి సంస్థలు నగరాన్ని బట్టి ఫీజుల్ని నిర్దేశిస్తున్నాయి. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించిన అనంతరం.. విజయవాడలో ఏర్పాటుచేసిన ప్లే స్కూళ్లల్లో ఆశించిన రీతిలో పిల్లలు చేరలేదు. సచివాలయం వచ్చినప్పటికీ, చాలామంది ఉద్యోగులు తమ కుటుంబాల్ని ఇక్కడకు తీసుకురాకపోవడంతో అనుకున్న స్థాయిలో వ్యాపారం జరగడం లేదంటున్నారు విజయవాడలోని బచ్పన్ ఫ్రాంఛైజ్ నిర్వాహకులు కాళేశ్వరరావు. ఒంటరిగా ఉంచలేక.. ఐదేళ్లు వచ్చే వరకు మా అబ్బాయిని బడికి పంపకూడదనుకున్నాం. కానీ, ఇంతలో తిరుపతికి బదిలీ అయ్యింది. మూడు గదుల ఇంటిలో నేనూ, మా వారూ, బాబు మాత్రమే ఉంటున్నాం. అదే మా ఊళ్లో అయితే ఆడుకోవడానికి విశాలమైన స్థలం ఉంటుంది. ఇక్కడ బయటకు వెళ్లే అవకాశమే లేదు. అందుకే ఇష్టం లేకపోయినా ప్లే స్కూల్‌కు పంపుతున్నాను. – బి.వీణ, తిరుపతి పిల్లలతో కలసి ఉంటారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరమూ ఉద్యోగానికి వెళ్తేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకే ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. పిల్లాణ్ణి ఇంటి దగ్గరుంచితే వీడియో గేమ్స్, మొబైల్ ఫోన్ వదలడు. ఫిజికల్ గేమ్స్ ఆడేందుకు ఎవరూ అందుబాటులో లేరు. అందుకే ప్లే స్కూలుకి పంపుతున్నాం. అక్కడ ఉల్లాసంగా గడిచిపోతుంది. పైగా నాలెడ్జ్ కూడా అందుతుంది. – మాధురి, తల్లి, విశాఖపట్నం నిరుడు ఇద్దరే.. ఇప్పుడు 45 మంది ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్లే స్కూల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. అందుకు మా స్కూలే ఉదాహరణ. ఏడాది కిందట ఇద్దరు పిల్లలతో స్కూల్ ప్రారంభించాం. ఇప్పుడు పిల్లల సంఖ్య 45కి చేరింది. ప్లే స్కూల్లో పిల్లలపట్ల తగిన కేర్ తీసుకుంటాం. అవసరమయ్యే శిక్షణను అందిస్తాం. వీటి నిర్వహణ చాలా కష్టం. – మల్లిక, ప్రిన్సిపల్, లిటిల్ డాక్లింగ్ స్కూల్, విశాఖపట్నం కేంద్రం ఏం చెబుతోంది? కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ’ (ఈసీసీఈ–2013) ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్న పిల్లలకు విద్య, ఆటపాటలు నేర్పాలి. ప్రైవేటు సంస్థలు కూడా ఈ పాలసీ తాలూకు విధివిధానాలకు కట్టుబడి నడుచుకోవాలి. - ప్రతీ 20 మంది పిల్లలకు ఒక టీచరు, ఒక ఆయా తప్పనిసరిగా ఉండాలి. - ప్లేస్కూల్ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. - పిల్లలకు ఎటువంటి ప్రమాదాలు జరగడానికి వీల్లేకుండా పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాలి. - పిల్లలకు అనుకూలమైన బాత్రూంల ఏర్పాటు, సీసీటీవీ, అగ్నిమాపక రక్షణ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్ కలిగి ఉండాలి. - ప్రతీ మూడు నెలలకు ఒకసారి చిన్నారులకు వైద్య పరీక్షలు చేయించాలి. - ముఖ్యంగా రోజుకు 3–4 గంటలకు మించి ప్లే స్కూల్ నిర్వహించకూడదు. - చిన్న పిల్లలకు ఏం నేర్పించాలనే దానిపై కూడా కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ బోధన ప్రణాళిక రూపొందించింది. ప్రతీ ప్లే స్కూల్ నిర్వాహకులు దీన్ని విధిగా పాటించాల్సి వుంది. ఈ దిశగా.. శిశు సంక్షేమ శాఖ తనిఖీలు జరపాల్సిన అవసరముందనే అభిప్రాయం బలంగా వినబడుతోంది. -
పిల్లల ఆరోగ్యమే.. మన మహాభాగ్యం
వేసవి వచ్చిందంటే పిల్లలకు పరీక్షలు వస్తాయి. వాటి తర్వాత సెలవులు వచ్చేస్తాయి. ఆ సెలవులకు పిల్లలు అమ్మమ్మల ఇంటికీ, నానమ్మల ఇంటికీ బిరబిరా వచ్చేస్తారు. ఇక అస్తమానమూ ఆటలే. అందునా ఎర్రటి ఎండలో! నగరాల్లో, పెద్దపట్టణాల్లో ఇలా ఎండల్లో ఆటలాడే పరిస్థితి లేకపోయినా మిగతా చోట్ల పిల్లలు ఎంతో కొంత ఎండలో ఆడుతూనే ఉంటారు. ఇక నగరాల నుంచి పట్టణాలకు వచ్చిన పిల్లలూ అంతే. అలా ఈ వేసవి వేడిమిలో వాళ్లు ఆటలాడటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. ఒంట్లోని నీళ్లూ, ఖనిజ లవణాలూ తగ్గిపోతాయి. మరి వాటిని భర్తీ చేయాల్సిన బాధ్యత తల్లులదే కదా. అందుకే ఆటల అల్లరి పిల్లల కోసం తల్లుల కోసం ఇవి కొన్ని ఆహార సూచనలూ, న్యూట్రిషన్ చిట్కాలు. ►పాల ఉత్పత్తులు పుష్కలంగా పెట్టండి. పిల్లలకు తాజా లస్సీ, తాజా మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్‌లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి ఇవ్వండి. అవి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని ఇస్తాయి. వాళ్లకు ప్రొటీన్లను అందజేస్తాయి. ఎముకల బలం కోసం క్యాల్షియమ్‌ను ఇస్తాయి. వేడిమిలో ఆడటానికి వీలుగా అదనపు ద్రవాలను (ఫ్లూయిడ్లను) ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుంటాయి. ►పిజ్జాలు, శాండ్విచ్ వంటివాటి కోసం వాళ్లు గొడవ చేస్తుంటారు. అవి హానికరమంటూ ఆ వయసు పిల్లలను సముదాయించడం, సమాధానపరచడం కష్టం. కాబట్టి వాటిలో పనీర్, తాజాకూరగాయలు పుష్కలంగా నిండి ఉండేలా ఇవ్వండి. కానీ ఎక్కువగా చీజ్ వేసిన వాటిని తినే విషయంలో మాత్రం అంతగా ప్రోత్సహించకండి. గ్రిల్డ్ వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు. ►ఐస్‌క్రీముల కోసం కూడా వాళ్లు గొడవ చేస్తుంటారు. అలాంటప్పుడు ఇంట్లో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్ వంటివి పిల్లలకి పెట్టవచ్చు. ఇవన్నీ ఆరోగ్యకరమే. కాకపోతే కూల్‌డ్రింక్స్ కోసం కూడా వాళ్ల గొడవ ఎక్కువగానే ఉండవచ్చు. కానీ అందుకు ప్రోత్సహించకండి. మరీ ముఖ్యంగా కోలా డ్రింక్స్. వాటికి బదులు చల్లటి తాజా పండ్లరసాలను ఇస్తామంటూ బేరంపెట్టండి. ఈ బేరం అటు పెద్దలకూ, ఇటు పిల్లలకూ... ఇద్దరికీ లాభదాయకమే. ఈ వేసవి సెలవులు పూర్తయ్యేవరకూ పిల్లల విషయంలో ఇదే న్యూట్రిషన్‌ను కరాఖండీగా ఫాలో అవ్వండి. ఎందుకంటే పిల్లల హెల్తే... మన వెల్త్! -
ఆ బాధ్యత అత్తలదే!
ఝుంఝున్: లింగవివక్ష లేకుండా అందరూ సమానమనే భావనను సమాజం అలవర్చుకోవాలని ప్రధాని∙మోదీ పేర్కొన్నారు. బాలికల భ్రూణహత్యలు మనం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇంట్లో ఆడపిల్లలను సంరక్షించే బాధ్యతను ఆ బాలిక తల్లి, అత్తగారే తీసుకోవాలని సూచించారు. మహిళాదినోత్సవం సందర్భంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ (ఎన్ఎన్ఎమ్)ను రాజస్తాన్‌లోని ఝుంఝున్‌లో మోదీ ప్రారంభించారు. ‘సమాజంలో ప్రతిఒక్కరూ సమానమే. బాలురతో సమానంగా బాలికలు నాణ్యమైన విద్యను అందుకోవాలి. బాలిక ఎప్పటికీ భారం కారాదు. ఆమె మన కుటుంబానికి గర్వకారణం. చుట్టుపక్కల చూడండి. మన కూతుళ్లు దేశప్రతిష్టను ఎలా పెంచుతున్నారో గమనించండి. కుమారులతో సమానంగా కూతుళ్లను పెంచండి’ అని అన్నారు. నవభారత నిర్మాణం కోసం మహిళల జీవితాల్లో సానుకూలమైన మార్పుతీసుకురావటం, మహిళాశక్తిని సరైన పద్ధతిలో వినియోగించుకోవటం చాలా అవసరమన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని 161 జిల్లాలనుంచి దేశవ్యాప్తంగా 640 జిల్లాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? ‘తరగతి గదుల నుంచి క్రీడాప్రాంగణాల వరకు ప్రతిచోటా వారు రాణిస్తున్నారు. అందుకే నేడు బాలికలకు సమానత కల్పించే వాతావరణాన్ని సృష్టిస్తామని మనం ప్రతిజ్ఞ చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ లింగ వివక్ష చూపకూడదు. దేశంలో బాలికల భ్రూణహత్యలు జరుగుతుండటం మనం సిగ్గుపడాల్సిన, ఆందోళన చెందాల్సిన విషయం. ఈ దారుణమైన అలవాటును సమాజం నుంచి రూపుమాపేందుకు మనందరం చిత్తశుద్ధితో పనిచేయాలి. మనమింకా 18వ శతాబ్దపు ఆలోచనలతోనే ఉన్నాం. అలాంటప్పుడు 21 శతాబ్దపు పౌరులమని చెప్పుకునే హక్కు మనకెక్కడిది’ అని మోదీ పేర్కొన్నారు. బాలికలను పురిట్లోనే చంపేయటం ద్వారా ఈ తరం ఇబ్బందులు పడుతోందని.. భవిష్యత్ తరాలకోసం పెను ప్రమాదాన్ని స్వాగతిస్తున్నట్లేనన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే బడ్జెట్‌తోనే ఈ సమస్యకు పరిష్కారం దొరకదని.. బాలికలకు సరైన విద్యనందించటం, విస్తృత ప్రచారం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావటం అత్యంత అవసరమన్నారు. తక్కువకాలంలో ఈ దిశగా భారీ మార్పును సాధించలేమని ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభిస్తే సమాజంనుంచి ఈ చెడు సంప్రదాయం తొలగిపోయేందుకు ఐదారు తరాలు పడుతుందన్నారు. పౌష్టికాహార ఆవశ్యకతను, మిషన్ ఇంద్రధనుష్ (జాతీయ వ్యాధినిరోధక కార్యక్రమం) ద్వారా చిన్నారులు, మహిళల్లో వస్తున్న సానుకూల మార్పునూ మోదీ వివరిం చారు. అంతకుముందు, కలెక్టర్లతో సంభాషించిన మోదీ.. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఏపీ, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, గుజరాత్, హరియాణా, కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు. కున్వర్బాయిని గుర్తుచేసుకున్న మోదీ కొందరు మహిళలు మార్గదర్శకమైన కార్యక్రమాల ద్వారా దేశ చరిత్రలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారని మోదీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కు స్ఫూర్తిగా నిలిచిన దివంగత కున్వర్బాయిను గుర్తుచేసుకున్నారు. షి ఇన్స్పైర్ మి హ్యాష్‌ట్యాగ్‌తో గురువారం ప్రధాని పలు ట్వీట్లు చేశారు. ‘ఈ ఏడాది ఆరంభంలో కన్నుమూసిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 106 ఏళ్ల కున్వర్బాయి జీవితం స్ఫూర్తిదాయకం. ఆమెకున్న మేకలు అమ్మి తన ఇంట్లో రెండు మరుగుదొడ్లు నిర్మించారు. స్వచ్ఛభారత్‌లో ఆమె భాగస్వామ్యం మరువలేనిది. ఆమెనుంచి ఆశీర్వాదం తీసుకున్న రోజును ఎన్నటికీ మరవబోను’ అన్నారు. -
అనాథ పిల్లలపై అమానుషం
హన్మకొండ చౌరస్తా: అమ్మా, నాన్న పిలుపునకు దూరమై.. నా అనేవారు లేని పిల్లల సంరక్షణ చూడాల్సినవారే అమానుషంగా ప్రవర్తించారు. సరైన భోజనం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించినందుకు హింసించారు. అంతటితో అహం చల్లారక గుండు గీయించారు. అమానుషమైన ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ పట్టణ వీధి బాలల వసతి గృహంలో సుమారు వంద మంది అనాథ విద్యార్థులు ఉన్నారు. పిల్లలందరూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వారం రోజులుగా వార్డెన్ అర్చన వ్యక్తిగత సెలవులో ఉండగా, వసతి గృహాన్ని ట్యూటర్ రాజు, వాచ్‌మన్ జవహర్లే నిర్వహిస్తున్నారు. అయితే నీళ్ల చారు, సరిగా ఉడకని అన్నాన్ని వడ్డించడంపై రెండు రోజుల క్రితం కల్యాణ్, దిలీప్, అక్షయ్‌వర్మ అనే విద్యార్థులు ట్యూటర్, వాచ్మన్లను నిలదీశారు. దీంతో ‘మమ్మల్నే అడుగుతార్రా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఆ ముగ్గురు విద్యార్థులను చితకబాదారు. అయినప్పటికీ శాంతించని వాచ్‌మన్, ట్యూటర్లు ఆ ముగ్గురికి గుండు చేయించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఏబీఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్బీ, డీఎస్‌యూ విద్యార్థి సంఘాలు బుధవారం సాయంత్రం వసతి గృహం ఎదుట ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ ట్యూటర్, వాచ్మన్లను విధుల నుంచి తొలగించాలని, మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన ఉధృతం కాకుండా బందోబస్తు చేపట్టారు. ఆ ఇద్దరిని తొలగించాం విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ట్యూటర్ రాజు, వాచ్‌మన్ జవహర్‌ను తొలగిస్తూ ఉదయమే తీర్మానం చేశాం. వారిద్దరిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. పిల్లలకు సరైన భోజనం పెట్టడం లేదనడం సరైంది కాదు. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నాం. – కేడల పద్మ, నిర్వాహకురాలు,పట్టణ వీధి బాలల వసతి గృహం, లష్కర్‌బజార్ -
‘అమ్మా’నవీయం..
భద్రాచలంటౌన్: అయ్యో పాపం..పసివాడు. నాలుగేళ్ల పిల్లాడు. కానీ..ఆ తల్లి ఎంత కోపంతో ఉందో..ఏ బాధలో చేసిందో కానీ..కర్కశంగా వాతలు పెట్టింది. తాను కన్న బిడ్డే అయినా..ఎందుకో ఆ క్షణంలో మానవత్వం మరిచింది. శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని జగదీష్ కాలనీకి చెందిన పల్లపు లంకమ్మ తన నాలుగేళ్ల కుమారుడు రఘురాం మట్టి తింటున్నాడని వాతలు పెట్టింది. ఈమె భర్త ఈ ఏడాది అక్టోబర్‌లో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండట్లేదు. ఆరేళ్ల కూతురితో పాటు ఈ బాబును సాకేందుకు ఆదాయం లేక, అటు భర్త మరణం తట్టుకోలేక మానసికంగా దెబ్బతిని..కోపాన్ని పిల్లలపై చూపుతుంటుందని ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం) కౌన్సిలర్ యశోద తెలిపారు. ఈ క్రమంలో శనివారం పిల్లాడు రఘురాం మట్టి తింటున్నాడని కోపంతో గరిటెను కాల్చి ఎడమ బుగ్గ మీద, రెండు చేతుల మీద కాల్చింది. బాబు శరీరం కమిలి తల్లడిల్లుతుండడంతో స్థానికులు అంగన్వాడీ టీచర్ మాధవికి విషయం తెలిపారు. ఐసీడీఎస్ కౌన్సిలర్ యశోద, పోలీస్ వారు సోమవారం లంకమ్మ ఇంటికి వెళ్లి..కౌన్సెలింగ్ నిర్వహించి, బాలుడిని ఖమ్మంలోని చైల్డ్ కేర్‌లో ఉంచుతామని తెలిపారు. ఆ తల్లిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
మాతా, శిశు సంరక్షణకు హెల్త్ బాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మాతా, శిశు సంరక్షణకు సంబంధించి అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ) ప్రపంచంలోనే తొలి హెల్త్ ఇంపాక్ట్ బాండ్‌ను ఆవిష్కరించింది. ఈ ’ఆరోగ్య అభివృద్ధి బాండ్ల’ పథకాన్ని తొలుత మాతా, శిశు మరణాల రేటు అత్యధికంగా ఉంటున్న రాజస్తాన్‌లోని 14 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. రాజస్తాన్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్ పేరిట ఆవిష్కరించిన ఈ పథకాన్ని ’ఉత్కృష్ట’ ఇంపాక్ట్ బాండ్‌గా వ్యవహరించనున్నట్లు యూఎస్ఏఐడీ అడ్మినిస్ట్రేటర్ మార్క్ గ్రీన్ వెల్లడించారు. వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం ద్వారా మాతా, నవజాత శిశువుల మరణాలను నివారించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ బాండ్ విధానం పనిచేస్తుందని గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా గ్రీన్ గురువారమిక్కడ తెలిపారు. ముందుగా ప్రైవేట్ పెట్టుబడులతో రాజస్తాన్‌లోని ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. నిర్దేశిత ప్రమాణాలు, లక్ష్యాలు సాధిస్తేనే యూఎస్ఏఐడీ ఆ పెట్టుబడులను తిరిగి చెల్లిస్తుందని గ్రీన్ చెప్పారు. యూఎస్ఏఐడీ, మెర్క్ ఫర్ మదర్స్, ది యూబీఎస్ ఆప్టిమస్ ఫౌండేషన్, హెచ్ఎల్ఎఫ్పీపీటీ, పీఎస్ఐ సంస్థల భాగస్వామ్యంతో ఇది అమలవుతుంది. ప్రాథమికంగా 35 లక్షల డాలర్ల నిధులు.. ఐదేళ్ల వ్యవధిలో సుమారు 10 వేల మంది దాకా మహిళలు, నవజాత శిశువుల ప్రాణాలు కాపాడవచ్చని అంచనా వేస్తున్నట్లు గ్రీన్ వివరించారు. ఈ బాండ్ కోసం యూబీఎస్ ఆప్టిమస్ ఫౌండేషన్ ప్రా«థమికంగా సుమారు 35 లక్షల డాలర్ల వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చనుంది. హెచ్ఎల్ఎఫ్పీపీటీ, పీఎస్ఐ ఈ నిధులతో దాదాపు 440 ప్రైవేట్ హెల్త్‌కేర్ సెంటర్స్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి వెచ్చిస్తాయని గ్రీన్ చెప్పారు. మరోవైపు క్షయ వ్యాధిపై అవగాహన పెంచేందుకు, 2025కల్లా క్షయ వ్యాధిరహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు మరో 10 లక్షల డాలర్లు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. ఫీడ్ ది ఫ్యూచర్ పేరిట ఆఫ్రికాలోని ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు తోడ్పాటునిచ్చేందుకు 20 లక్షల డాలర్లు వెచ్చించనున్నట్లు గ్రీన్ చెప్పారు. అటు డిజిటల్ టెక్నాలజీని మహిళలకు కూడా మరింతగా చేరువ చేసే దిశగా వచ్చే ఏడాది తొలినాళ్లలో ఉమెన్ కనెక్ట్ చాలెంజ్ మొదలైనవి ప్రకటించనున్నట్లు గ్రీన్ వివరించారు. అంచనాలు మించిన జీఈఎస్.. మూడు రోజులపాటు జరిగిన జీఈఎస్‌కి అంచనాలను మించిన స్పందన లభించిందని మార్క్ గ్రీన్ హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా లభించిన ఆదరణ, యువ ఎంట్రప్రెన్యూర్స్ ఉత్సాహంగా పాలుపంచుకున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన చెప్పారు. స్వయం సమృద్ధి సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్న భారత్‌తో అమెరికాకు దృఢమైన బంధం ఉందని గ్రీన్ పేర్కొన్నారు. సుమారు 60 ఏళ్ల క్రితం అమెరికా నుంచి ఆహారపరమైన సాయం అందుకున్న స్థాయి నుంచి ప్రస్తుతం భారత్ సమాన భాగస్వామి స్థాయికి ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు. అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం కావడానికి జీఈఎస్ దోహదపడగలదని యూఎస్ఏఐడీ సీనియర్ డిప్యూటీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ మిషెలీ బెకరింగ్ తెలిపారు. -
మేడ్చల్ లో ‘బాల స్వస్థ’ ప్రారంభం
మేడ్చల్: బాలల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాల స్వస్థ కార్యక్రమాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్ సెంటర్(సీహెచ్ఎన్సీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గ్రామాల్లోని పాఠశాలల పిల్లలు, అంగన్వాడీ చిన్నారులకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ప్రతీ సీహెచ్‌ఎన్‌సీకి రెండు వాహనాలు కేటారుుంచి.. దీనిలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఒక ఆయుష్ డాక్టర్, ఒక ఫార్మాసిస్ట్, ఒక ఏఎన్ఎంను నియమించనున్నట్లు తెలిపారు. వీరంతా ఈ వాహనంలో గ్రామాలకు చిన్నారులకు పరీక్షలు చేసి అవసరమైన వైద్యం అందిస్తారని చెప్పారు. మేడ్చల్ సీహెచ్‌ఎన్‌సీకి రెండు వాహనాలు కేటారుుంచగా వాటి ద్వారా సీహెచ్ఎన్సీ పరిధిలో శ్రీరంగవరం, దుండిగల్, జవహర్‌నగర్, అల్వాల్, శామీర్‌పేట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సేవలందిస్తారని మండల వైద్యాకారి ఆనంద్ తెలిపారు. వైద్యులకు మెడికల్ కిట్లు అందజేసిన అనంతరం.. ఎమ్మెల్యే జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, ఎంపీపీ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైరన్ సత్యనారాయణ, ఎంపీడీఓ దేవసహయం, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాస్కర్‌యాదవ్, టీఆర్ఎస్ నాయకులు విష్ణుచారి, నర్సింహారెడ్డి, రాఘవేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.