Cricket Australia
-
అత్యుత్తమ టెస్టు జట్టు కెప్టెన్‌గా బుమ్రా.. భారత్ నుంచి మరొకరికి చోటు
క్రికెట్ ఆస్ట్రేలియా 2024 ఏడాదికి గానూ అత్యుత్తమ టెస్టు క్రికెట్ జట్టు( Cricket Australia's Test team of 2024)ను ప్రకటించింది. ఈ టీమ్‌కు టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను కెప్టెన్‌గా ఎంచుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).. కేవలం ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రమే చోటిచ్చింది.భారత్ నుంచి మరొకరికి చోటుకాగా 2024లో టెస్టుల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లతో సీఏ ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఉండగా.. జో రూట్(Joe Root) వన్‌డౌన్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు.లంక ఆటగాడికి స్థానంఇక నాలుగో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్ర.. వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ యువ తార హ్యారీ బ్రూక్, శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్ కోటాలో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ క్యారీ స్థానం సంపాదించగా.. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, భారత స్టార్ బుమ్రా, ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఎంపికయ్యారు. ఏకైక స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.క్రికెట్ ఆస్ట్రేలియా 2024కు గానూ ఎంచుకున్న అత్యుత్తమ టెస్టు జట్టుయశస్వి జైస్వాల్(భారత్), బెన్ డకెట్(ఇంగ్లండ్), జో రూట్(ఇంగ్లండ్), రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్(శ్రీలంక), అలెక్స్ క్యారీ(ఆస్ట్రేలియా), మ్యాచ్ హెన్రీ(న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్- భారత్), జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా).2024లో ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందంటే?యశస్వి జైస్వాల్ఈ ఏడాదిలో 15 టెస్టులాడి 1478 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉనఆయి. అత్యధిక స్కోరు 214బెన్ డకెట్బెన్ డకెట్ 2024లో 17 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1149 రన్స్ సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 153.జో రూట్ఇంగ్లండ్ వెటరన్ స్టార్ జో రూట్ ఈ సంవత్సరం 17 టెస్టుల్లో ఆడి 1556 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఆరు శతకాలు, ఓ డబుల్ సెంచరీ ఉన్నాయి. హయ్యస్ట్ స్కోరు 262.రచిన్ రవీంద్రకివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర ఈ ఏడాది 12 టెస్టు మ్యాచ్‌లలో కలిపి.. 984 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు: 249.హ్యారీ బ్రూక్ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2024లో 12 టెస్టుల్లో కలిపి 1100 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. అత్యధిక స్కోరు 317.కమిందు మెండిస్శ్రీలంక తరఫున ఈ ఏడాది అద్భుత ఫామ్ కనబరిచిన కమిందు మెండిస్ 9 టెస్టులు ఆడి.. 1049 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. హయ్యస్ట్ స్కోరు: 182.అలెక్స్ క్యారీఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 2024లో తొమ్మిది టెస్టులు ఆడాడు. 42 డిస్మిసల్స్లో భాగం కావడంతో పాటు.. నాలుగు స్టంపౌట్లు చేశాడు. అదే విధంగా.. మూడు అర్ధ శతకాల సాయంతో 440 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98.మ్యాట్ హెన్రీకివీస్ పేసర్ మ్యాచ్ హెన్రీ ఈ ఏడాది తొమ్మిది టెస్టులాడి 48 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 7-67.జస్ప్రీత్ బుమ్రాటీమిండియా వైస్ కెప్టెన్ 2024లో పదమూడు టెస్టు మ్యాచ్‌లు ఆడి ఏకంగా 71 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 6-45. భారత్ తరఫున అత్యంత వేగంగా 200 టెస్టు వికెట్ల క్లబ్లో చేరిన ఫాస్ట్‌బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆసీస్‌తో తొలి టెస్టుకు సారథ్యం వహించి.. భారత్‌ను 275 పరుగుల తేడాతో గెలిపించాడు. జోష్ హాజిల్వుడ్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఈ సంవత్సరం 15 టెస్టు మ్యాచ్‌లలో కలిపి 35 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5-31.కేశవ్ మహరాజ్సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ ఏడాది 15 టెస్టుల్లో పాల్గొని 35 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5-59. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో సౌతాఫ్రికా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం! -
Champions Trophy 2025: ఐసీసీ అధికారిక ప్రకటన.. ఇకపై
చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా ఆడే మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించింది. అదే విధంగా.. ఇకపై భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు కూడా పాకిస్తాన్ అక్కడ పర్యటించబోదని తెలిపింది. కాగా వచ్చే ఏడాది జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తమ జట్టును పాక్‌కు పంపే ప్రసక్తి లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐసీసీకి తేల్చి చెప్పింది. తాము టోర్నీలో పాల్గొనాలంటే తటస్థ వేదికల(హైబ్రిడ్ విధానం)పై టీమిండియా మ్యాచ్‌లను నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తొలుత ఇందుకు అంగీకరించలేదు.షరతులు విధించిన పీసీబీఅనేక చర్చలు, ఐసీసీ గట్టిగా హెచ్చరించిన అనంతరం పీసీబీ ఎట్టకేలకు పంతం వీడింది. అయితే, ఇకపై భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు కూడా హాజరుకాబోమని.. తమకు కూడా తటస్థ వేదికలు ఏర్పాటు చేయాలని షరతు విధించినట్లు వార్తలు వచ్చాయి. ఐసీసీ తాజా ప్రకటనను బట్టి ఆ ఊహాగానాలు నిజమని తేలాయి.ఆ టోర్నీలన్నింటికి ఇదే నిబంధనఇకపై భారత్- పాకిస్తాన్లలో ఐసీసీ టోర్నమెంట్లు జరిగినపుడు హైబ్రిడ్ విధానాన్ని పాటిస్తామని గురువారం తెలిపింది. అంటే.. ఇరుజట్లు తమ దాయాది దేశాల్లో ఇకపై ఆడబోవని స్పష్టం చేసింది. చాంపియన్స్ ట్రోఫీ-2025(పాకిస్తాన్)తో పాటు మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ 2025(భారత్), పురుషుల టీ20 ప్రపంచకప్ 2026(భారత్- శ్రీలంక) టోర్నీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.ఆస్ట్రేలియాలో మహిళల టోర్నమెంట్లుఅంతేకాదు.. మహిళల టీ20 ప్రపంచకప్ 2028 ఆతిథ్య హక్కులను కూడా పాకిస్తాన్ దక్కించుకుందని ఐసీసీ ఈ సందర్భంగా తెలియజేసింది. దీనిని కూడా హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహిస్తామని పేర్కొంది. ఇక 2029- 2031 మధ్య మహిళల సీనియర్ జట్లకు సంబంధించిన అన్ని ఐసీసీ టోర్నీలకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ తెలిపింది.కాగా హైబ్రిడ్ విధానంలో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ-2025కి టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి. మరోవైపు.. పాకిస్తాన్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ టోర్నీలో అడుగుపెట్టింది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి ఈ అవకాశం దక్కించుకుంది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇక ఈ టోర్నీకి సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది.చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు -
టీమిండియా టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్లకు చోటు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మరో 12 రోజుల్లో తెరలేవనుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ షురూ కానుంది. ఈ క్రమంలో తొలి టెస్టుకు 13 సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టులో ఇద్దరు ఆన్క్యాప్డ్ ప్లేయర్లు నాథన్ మెక్‌స్వీనీ, జోష్ ఇంగ్లిష్‌లకు చోటు దక్కింది. తొలి టెస్టుకు మైఖల్ నసీర్ గాయం కారణంగా దూరమయ్యాడు. భారత్-ఎ జట్టుతో జరిగిన రెండో అనాధికారిక టెస్టులో నసీర్ గాయపడ్డాడు.ఓపెనర్‌గా నాథన్ మెక్‌స్వీనీ..భారత్-ఎ జట్టుతో జరిగిన సిరీస్‌లో నాథన్ మెక్‌స్వీనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.రెండు మ్యాచ్‌ల్లోనూ మెక్‌స్వీనీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. పెర్త్ టెస్టులో ఉస్మాన్ ఖవాజాతో కలిసి మెక్‌స్వీనీ ఓపెనింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.జోష్ ఇంగ్లిష్ కూడా ఇటీవల కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల జట్టులో కీలక సభ్యునిగా ఉన్న ఇంగ్లిష్.. ఇప్పుడు క్యారీకి బ్యాకప్‌గా చోటు సంపాదించుకున్నాడు.పెర్త్ టెస్టుకు ఆసీస్ జట్టు: స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్చదవండి: ‘పాకిస్తాన్లో ఆడేదే లేదు’ -
భారత క్రికెటర్లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.. అంపైర్‌పై కిషన్ ఫైర్?
మెక్కే వేదికగా ఆ్రస్టేలియా ‘ఎ’ తో జరిగిన తొలి అనధికారిక టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ ‘ఎ’ ఓటమి పాలైంది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో హైడ్రామా చోటు చేసుకుంది. టీమిండియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.ఇదే విషయంపై భారత జట్టును అంపైర్ బెన్ ట్రెలోర్, షవాన్ క్రెగ్లు మందలించారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు సైతం తాము ఏ తప్పు చేయలేదని అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఫీల్డ్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది.అసలేం జరిగిందంటే?ఆఖరి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఎ విజయానికి 86 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆసీస్ బ్యాటర్లు మెక్‌స్వీనీ, బ్యూ వెబ్‌స్టర్ భారత ప్లేయర్లు ఫీల్డ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో అంపైర్ షాన్ క్రెయిగ్ భారత జట్టుకు కొత్త బంతిని అందించాడు.అయితే బంతిని మార్చడంపై భారత ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేశారు. 'మీరు బంతిని స్క్రాచ్ చేశారు. కాబట్టి మేం బాల్‌ను మార్చాం. దీనిపై ఇక ఎలాంటి చర్చ లేదు. ఆట కొనసాగించండి' అంటూ అంపైర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదంతా స్టంప్ మైక్రోఫోన్లో రికార్డు అయింది. అయితే అంపైర్ వ్యాఖ్యలకు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ ఘాటుగా బదులిచ్చాడు. "మేము ఏమీ చేయలేదు. మీ నిర్ణయం అత్యంత మూర్ఖత్వం’’ అని అన్నాడు. ఈ క్రమంలో కిషన్‌పై అంపైర్ అగ్రహం వ్యక్తం చేశాడు. మీపై ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇది మంచి పద్దతి కాదు. మీ జట్టు చేసిన పనికి బంతిని మార్చాం'' అని అంపైర్ పేర్కొన్నాడు.క్లారిటీ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇక ఈవివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. భారత ఆటగాళ్లు ఎవరూ ఎటువంటి బాల్ టాంపరింగ్ పాల్పడలేదు. పూర్తిగా దెబ్బతిన్నడం వల్లనే బంతిని మార్చాల్సి వచ్చింది. ఈ విషయం నాలుగో రోజు ఆటకు ముందే ఇరు జట్ల కెప్టెన్, మేనేజర్‌కు తెలియజేశారు. ఈ వివాదంపై తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకోబడవు" అని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది.చదవండి: IND vs NZ: ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్.. అసలు ఆ షాట్ అవసరమా? వీడియో -
2027 వరకు హెడ్ కోచ్‌గా అతడే.. సీఏ ప్రకటన
ఆస్ట్రేలియా పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు పొడిగింపు ఇచ్చారు. 2027 సీజన్ ముగిసేదాకా మెక్డొనాల్డే హెడ్ కోచ్‌గా కొనసాగుతాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) బుధవారం ప్రకటించింది. అంటే దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచకప్ దాకా మెక్‌డొనాల్డ్ ఆసీస్ జట్టుతో ఉంటాడు. జస్టిన్ లాంగర్ తప్పుకోవడంతో 2022లో మెక్‌డొనాల్డ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు.డబ్ల్యూటీసీతో పాటు వన్డే వరల్డ్ కప్మెక్డొనాల్డ్ కోచింగ్‌లోనే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సాధించింది. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌నూ కైవసం చేసుకుంది. వన్డే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునే లక్ష్యంతోనే ఆయన పదవీకాలాన్ని పొడిగించినట్లు తెలిసింది.అందుకే పొడిగించాంఈ లోపే వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండటంతో మెక్‌డొనాల్డ్‌పై సీఏ మరోసారి నమ్మకం ఉంచింది. హెడ్ కోచ్‌గా మెక్‌డొనాల్డ్ ఇప్పటికే నిరూపించుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ అన్నారు. జట్టు నిలకడైన విజయాల్లో మెక్‌డొనాల్డ్ కీలకపాత్ర పోషిస్తున్నాడని, దీంతో కోచింగ్ బృందాన్ని మరింత పటిష్ట పరిచేందుకే పొడిగింపు ఇచ్చామని హాక్లీ తెలిపారు. ఇక.. తనకు లభించిన పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన మెక్‌డొనాల్డ్.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిబద్ధతతో పూర్తి చేస్తానని చెప్పారు. చదవండి: IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ -
మహిళా క్రికెటర్‌తో ‘బంధం’.. శ్రీలంక మాజీ ప్లేయర్‌కు భారీ షాక్!
శ్రీలంక మాజీ క్రికెటర్ దులిప్ సమరవీరకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాలో కోచ్‌గా పనిచేస్తున్న అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 20 ఏళ్ల నిషేధం విధించింది. ఫలితంగా.. రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో ఏ స్థాయిలోనూ అతను పనిచేయడానికి వీలుండదు. ప్రస్తుతం విక్టోరియా రాష్ట్ర మహిళల జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్న సమరవీర.. ఓ మహిళా క్రికెటర్‌తో బలవంతంగా సంబంధం పెట్టుకోవడంపై సీఏ కన్నెర్ర చేసింది. అంతేకాదు.. సమరవీర తీవ్రమైన అతిక్రమణకు పాల్పడ్డాడని ఆగ్రహించింది. ఇది సీఏ నియమావళికి విరుద్ధమని, క్రికెట్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను అసీస్ బోర్డు ఉపేక్షించదని ఒక ప్రకటనలో పేర్కొంది. 2008 నుంచి ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో కాగా సమరవీర 1993–1995 మధ్య కాలంలో శ్రీలంక తరఫున ఏడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు. తదనంతరం 2008లో ఆస్ట్రేలియాలో కోచింగ్ బృందంలో చేరాడు. మొదట క్రికెట్ విక్టోరియా మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. సుదీర్ఘకాలం పాటు విక్టోరియా జట్టుకు సేవలందించాడు. అదే విధంగా.. మహిళల బిగ్‌బాష్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. రెండు వారాల క్రితం విక్టోరియా సీనియర్ మహిళల జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమించారు. కానీ ఓ మహిళా క్రికెటర్‌తో పెట్టుకున్న అనుచిత సంబంధం ఆస్ట్రేలియాతో బంధాన్నే తెగదెంపులు చేసింది. నిషేధం కారణంగా.. అతడు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో ఏ స్థాయి జట్టుకు, లీగ్‌లకు, అకాడమీకి, బోర్డుకు పనిచేయడానికి వీలుండదు. చదవండి: రూ. 45 లక్షలు ఇస్తేనే భారత్‌కు ఆడతా.. కారణం చెప్పిన నగాల్ -
T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో దుమ్ములేపిన యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెగర్క్‌తో పాటు మరో క్రికెటర్ వరల్డ్‌కప్ జట్టుతో ప్రయాణించనున్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ట్రావెలింగ్ రిజర్వ్స్‌గా ఇద్దరు బ్యాటర్లను ఎంపిక చేసింది. జేక్ ఫ్రేజర్- మెగర్క్‌తో మాథ్యూ షార్ట్‌కు కూడా అవకాశం ఇచ్చింది.స్టీవ్ స్మిత్‌తో పాటు వాళ్లకు మొండిచేయిఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు జేసన్ బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంగాల ఆశలకు గండిపడినట్లయింది. కాగా ఈసారి వరల్డ్‌కప్‌లో మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా జూన్ 5న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా ఒమన్‌తో తలపడనుంది.దుమ్ములేపిన మెగర్క్ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జేక్ ఫ్రేజర్-మెగర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. లుంగి ఎంగిడి స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 330 పరుగులు సాధించాడు.ఈ ఓపెనింగ్ బ్యాటర్ స్ట్రైక్‌రేటు ఏకంగా 234.04 ఉండటం విశేషం. ఇక ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న మెగర్క్.. 15 మంది సభ్యుల ప్రధాన జట్టులో కూడా స్థానం సంపాదించుకునే అర్హతలు కలిగి ఉన్నా సీనియర్లు ఉన్న కారణంగా సాధ్యం కాలేదు.అందుకే ఇలా జరిగిందిఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో జేక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరల్డ్‌కప్ జట్టు ఫైనల్ 15 కోసం అతడి పేరును పరిగణనలోకి తీసుకునేలా చేశాడు.ఇక మాథ్యూ షార్ట్ సైతం బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. అయితే, వీరిద్దరు టాపార్డర్ బ్యాటర్లు కావడం వల్లే మొదటి 15 మంది సభ్యుల జాబితాలో వాళ్లకు చోటు దక్కలేదు’’ అని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్.చదవండి: శివమ్ దూబేపై వేటు.. వరల్డ్‌కప్ జట్టులో ఫినిషర్‌కు చోటు! -
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్ ఓవర్స్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్ అగర్, కెమరూన్ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ కొనసాగనున్నారు. మిచ్ మార్ష్‌తో పాటు ట్రవిస్ హెడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటా ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్ 5న మొదలవుతుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్-బిలో ఆసీస్.. ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా వరల్డ్‌కప్ విన్నర్లతో..క్రికెట్ ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్‌కప్ విన్నర్లు ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ జట్టును అనౌన్స్ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్ కొడుకు, కూతురు ఉండటం విశేషం. -
స్టోయినిస్‌కు మొండిచెయ్యి.. కొత్తగా నలుగురికి అవకాశం
2024-25 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన 23 మంది ఆటగాళ్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (మార్చి 28) ప్రకటించింది. ఈ జాబితాలో లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మార్కస్ స్టోయినిస్, ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కలేదు. వీరితో పాటు ఆస్టన్ అగర్, మార్కస్ హ్యారిస్, మైకేల్ నెసర్, మ్యాట్ రెన్షాలకు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ లభించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్తగా నలుగురు ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్ కల్పించింది. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మ్యాట్ షార్ట్, ఆరోన్ హార్డీ కొత్తగా కాంట్రాక్ట్ పొందిన వారిలో ఉన్నారు. ఈ నలుగురిలో బార్ట్లెట్ తొలిసారి కాంట్రాక్ట్ పొందగా.. మిగతా ముగ్గురు గతంలో వార్షిక కాంట్రాక్ట్ పొందారు. ఈ వార్షిక కాంట్రాక్ట్ టీ20 వరల్డ్‌కప్ అనంతరం అమల్లోకి వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా 2024-25: సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, జే రిచర్డ్సన్, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
T20I: అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. అధికారిక ప్రకటన
ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ నిరవధికంగా వాయిదా పడింది. ఇందుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఏడాది ఆగష్టులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసీస్- అఫ్గన్ మధ్య సిరీస్ జరగాల్సి ఉంది. అఫ్గనిస్తాన్‌లో పరిస్థితుల దృష్ట్యా యూఏఈలో అఫ్గన్ ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. కారణం ఇదే ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గన్ ప్రభుత్వం మహిళలు, బాలికల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందన్న కారణంతో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా 2021లోనూ సీఏ ఇదే కారణంతో ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టును రద్దు చేసింది. అఫ్గనిస్తాన్‌లో రోజురోజుకూ బాలికలు, మహిళల పరిస్థితి దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా అఫ్గన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలికలు హైస్కూల్‌కు వెళ్లకుండా, మహిళలు ఉన్నత విద్యనభ్యసించకుండా, ఉద్యోగాలు చేయకుండా కఠిన నిబంధనలు విధించిందనే వార్తల నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన అండర్-19 వుమెన్ టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్‌కు ఫుల్ మెంబర్ జట్లలో అఫ్గనిస్తాన్(మహిళలు క్రికెట్ ఆడకూడదనే నిబంధన) ఒక్కటే హాజరు కాలేదు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించామన్న క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చివరగా అప్పుడే కాగా చివరగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ తలపడ్డాయి. ఇందులో గ్లెన్ మాక్స్వెల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో మూడు వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గన్ క్రికెట్ బోర్డు పరిస్థితిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి సీఈఓ గాఫ్ అలార్డిస్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఫుల్ మెంబర్‌కు తాము మద్దతుగా నిలవకతప్పదని పేర్కొన్నారు. చదవండి: Rohit Sharma: రోహిత్ క్రీజులో ఉన్నంతవరకే ముంబైకి మా మద్దతు! వీడియో An update to our Aussie men's team schedule ⬇️ CA will continue its commitment to the participation of women and girls cricket around the world and will work closely with the ICC and the Afghanistan Cricket Board to resume bilateral matches in the future. pic.twitter.com/OIO5PLjle5 — Cricket Australia (@CricketAus) March 19, 2024 -
పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్వెల్..
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ గ్లెన్ మాక్స్వెల్ ఓ వివాదంలో చికుకున్నాడు. జనవరి 19న ఆసీస్ క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్న ‘‘సిక్స్ అండ్ అవుట్’’ బ్యాండ్ అడిలైడ్‌లో ఓ కాన్సర్ట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అనుమతి లేకుండానే మాక్స్వెల్ పాల్గోనున్నాడు. అంతేకాకుండా ఫుల్‌గా తాగి ఆసుపత్రి పాలయ్యాడు. పీకల దాగా తాగిన మాక్స్వెల్ పబ్‌లోనే సోయలేకుండా పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కాగా ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సీరీయస్‌గా తీసుకుంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది. అయితే తాజాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ప్రకటించిన ఆసీస్ జట్టులో మాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు. విండీస్‌తో టీ20ల దృష్ట్యా అతడికి విశ్రాంతి ఇచ్చారు. అంతే తప్ప అతడిని జట్టు నుంచి తప్పించడానికి పబ్ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు మాక్స్వెల్ కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే జట్టును ఫైనల్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. దీంతో మెల్బోర్న్ కెప్టెన్సీ నుంచి మాక్సీ తప్పుకున్నాడు. చదవండి: SA20 2024: జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే.. కట్‌చేస్తే.. 52 పరుగులకే ఆలౌట్! -
డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్.. మార్ష్‌కు ప్రమోషన్! ఏకంగా రూ.6 కోట్లు
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా మార్ష్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో మార్ష్‌కు ప్రమోషన్ ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఏడాది గాను మార్స్‌కు టాప్ సెంట్రాల్ కాంట్రక్ట్ ఇచ్చి భారీగా అతడి జీతాన్ని పెంచాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మార్ష్ ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో మిడిల్ టైర్లో ఉన్నాడు. అయితే టాప్ టైర్లో ఉన్న ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులకోవడంతో.. మార్ష్ ప్రమోషన్ దాదాపు ఖాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అతడు టాప్ టైర్ కాంట్రాక్ట్‌కు ప్రమోషన్ పొందితే.. అతడు 5 లక్షల యూఎస్ డాలర్ల నుంచి 8 లక్షల యూఎస్ డాలర్ల వరకు వార్షిక వేతనం పొందే అవకాశముంది. అంటే భారత కరెన్సీలో సూమారు రూ. 4 కోట్ల నుంచి 7 కోట్ల వరకు అందనుంది. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అత్యధిక వేతనాన్ని పొందుతున్నాడు. అతడికి జీతం రూపంలో క్రికెట్ ఆస్ట్రేలియా 2 మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో రూ.16 కోట్లు) చెల్లిస్తోంది. -
బీసీసీఐ అదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఆస్ట్రేలియా కంటే 28 రేట్లు ఎక్కువ!
బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా).. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ప్రపంచక్రికెట్లో తమ ఆధిపత్యాన్ని భారత క్రికెట్ బోర్డు కొనసాగిస్తోంది. ప్రతీ ఏటా తమ నికర అదాయాన్ని బీసీసీఐ పెంచుకుంటూ పోతుంది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం బీసీసీఐ నెట్ వర్త్ 2.25 బిలియన్ డాలర్లు (రూ.18760 కోట్లు). కాగా ఇతర ఏ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ దారిదాపుల్లో లేదు. భారత క్రికెట్ బోర్డు తర్వాత రెండో స్ధానంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక అదాయం 79 మిలియన్ డాలర్లు(రూ. 660 కోట్లు). అంటే ఆసీస్ క్రికెట్ బోర్డు కంటే బీసీసీఐ ఆదాయం దాదాపు 28 రేట్లు అధికంగా ఉంది. ఇక ఈ జాబితాలో మూడో స్ధానంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఉంది. ఈసీబీ నెట్‌వర్త్ 59 మిలియన్ డాలర్లు(సుమారు రూ.490 కోట్లు). బీసీసీఐకి అదాయం ఎలా అంటే? బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ బోర్డులు ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను, టోర్నమెంట్ నిర్వహణ, క్రికెట్ ఆసోషియేషన్‌లకు నిధుల రిలీజ్ చేయడం వంటివి చూసుకుంటాయి. బోర్డులకు మీడియా రైట్స్, స్పాన్సర్ షిప్‌ల రూపంలో అదాయాన్ని పొందుతాయి. కాగా ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ బోర్డు ఆర్థిక వృద్ధి బాగా పెరిగింది. ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐ భారీగా అర్జిస్తోంది. 2023-27 కాలానికి గాను ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం మూడు వేర్వేరు సంస్థలు కలిపి బీసీసీఐకి రూ. 48,390.32 కోట్లు చెల్లించాయి. వరల్డ్‌కప్ ద్వారా భారీ అదాయం.. వన్డే వరల్డ్‌కప్-2023కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి.. భారత అర్ధిక వ్యవస్ధపై మాత్రం కాసుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఎకమోనిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. రూ. 22,000 కోట్లు భారత అర్ధిక వ్యవస్ధలోకి వచ్చినట్లు సమాచారం. చదవండి: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్.. సౌతాఫ్రికాకు ఊహించని షాక్! ఇక అంతే సంగతి -
భారత్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. స్టార్ ఆటగాళ్లంతా ఇంటికి
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 28) జరుగబోయే మూడో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత జట్టులోని సభ్యుల్లో ఆరుగురు స్వదేశానికి బయల్దేరతారని వెల్లడించింది. వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, స్టోయినిస్, ఇంగ్లిస్, సీన్ అబాట్‌లకు విశ్రాంతినిస్తున్నట్లు పేర్కొంది. వీరిలో స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా రెండో టీ20 ముగిసిన అనంతరమే స్వదేశానికి బయల్దేరగా.. మిగతా నలుగురు ఇవాళ మ్యాచ్ (మూడో టీ20) అనంతరం స్వదేశానికి బయల్దేరతారని ప్రకటించింది. ఈ ఆరుగురికి ప్రత్యామ్నాయంగా క్రికెట్ ఆస్ట్రేలియా నలుగురు ఆటగాళ్లను ప్రకటించింది. వీరిలో జోష్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్ ఇదివరకే భారత్‌కు చేరుకోగా.. బెన్ డ్వార్షుయిస్, క్రిస్ గ్రీన్‌లు నాలుగో టీ20 సమయానికంతా జట్టులో చేరతారని వెల్లడించింది. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. ఆసీస్ జట్టులో స్టార్ ఆటగాళ్లు మిస్ కానుండటంతో ఈ సిరీస్ ఇకపై కల తప్పనుంది. భారత్ జట్టులోని స్టార్ ఆటగాళ్లు సైతం వరల్డ్‌కప్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. భారత్‌తో టీ20 సిరీస్‌కు అప్డేట్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. మాథ్యూ వేడ్ (కెప్టెన్), బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, కేన్ రిచర్డ్సన్ -
వరల్డ్‌కప్ అత్యుత్తమ జట్టు ఇదే.. కెప్టెన్‌గా కోహ్లి! రోహిత్‌కు నో ఛాన్స్
వన్డే ప్రపంచకప్-2023 తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా నవంబర్ 12న బెంగళూరు వేదికగా జరిగిన భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌తో లీగ్ స్టేజి ముగిసింది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అద్బుతమైన సెంచరీతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్(128 నాటౌట్)కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీ లీగ్ దశలో ప్రదర్శన ఆధారంగా 12 మంది సభ్యులతో కూడిన అత్యుత్తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో కోహ్లి దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌ల్లో 594 పరుగులు చేసిన విరాట్.. టోర్నీ టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్లగా క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్ ఎంపికయ్యారు. అదే విధంగా మూడో స్ధానంలో కివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర, నాలుగో స్ధానంలో విరాట్ కోహ్లికి చోటు దక్కింది. ఐదవ స్ధానంలో ప్రోటీస్ ఆటగాడు మార్క్రమ్కు స్ధానం లభించింది. ఇక ఆల్‌రౌండ్ కోటాలో గ్లెన్ మాక్స్వెల్, మార్కో జానెసన్, రవీంద్ర జడేజాకు క్రికెట్ ఆస్ట్రేలియా చోటిచ్చింది. ఫాస్ట బౌలర్ల కోటాలో షమీ, బుమ్రా, మధుషంక ఉన్నారు. అదే విధంగా ఈ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడమ్ జంపాకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అవకాశమిచ్చింది. అయితే ఈ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్‌ను క్రికెట్ పరిగణలోకి తీసుకోకపోవడం గమానార్హం. క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన వరల్డ్‌కప్ అత్యుత్తమ జట్టు ఇదే 1.క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్) (591 పరుగులు) 2.డేవిడ్ వార్నర్ (499 పరుగులు) 3.రచిన్ రవీంద్ర (565 పరుగులు, 5 వికెట్లు) 4.విరాట్ కోహ్లీ (కెప్టెన్) (594 పరుగులతో పాటు ఒక్క వికెట్) 5.ఐడెన్ మార్క్రామ్ (396 పరుగులు) 6.గ్లెన్ మాక్స్వెల్ (396 పరుగులు, 5 వికెట్లు) 7.మార్కో జాన్సెన్ (157 పరుగులతో పాటు 17 వికెట్లు) 8.రవీంద్ర జడేజా (111 పరుగులతో పాటు 17 వికెట్లు) 9.మహ్మద్ షమీ (17 వికెట్లు) 10.ఆడమ్ జంపా (22 వికెట్లు) 11.జస్ప్రీత్ బుమ్రా (17 వికెట్లు) 12.దిల్షాన్ మధుశంక (12వ ఆటగాడు) (21 వికెట్లు) -
వరల్డ్‌కప్ జట్టును అధికారికంగా ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఒక్క మార్పు
క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ 2023లో పాల్గొనే తమ జట్టును కొద్దిసేపటి కిందట అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో ఊహించిన విధంగానే గాయం నుంచి పూర్తి కోలుకోని ఆస్టన్ అగర్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో మార్నస్ లబూషేన్ జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకుంటున్న ట్రవిస్ హెడ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మిగతా జట్టంతా ముందుగా ప్రకటించిన విధంగా యథాతథంగా కొనసాగుతుంది. Australia, here's your squad to take on the ODI World Cup in India starting on October 8! Congratulations to all players selected 👏 #CWC23 pic.twitter.com/xZAY8TYmcl — Cricket Australia (@CricketAus) September 28, 2023 కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా కొద్ది రోజుల కిందట తమ వరల్డ్‌కప్ ప్రొవిజనల్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళ (సెప్టెంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో సీఏ ఓ మార్పు చేసింది. ప్రొవిజనల్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన లబూషేన్ ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి, గాయపడిన అగర్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆసీస్.. టీమిండియాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న నెదర్లాండ్స్‌తో.. అక్టోబర్ 3న పాకిస్తాన్‌తో కమిన్స్ సేన తలపడుతుంది. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే ఆస్ట్రేలియా జట్టు ఇదే: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మార్నస్ లబూషేన్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ -
ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ జట్టులో కీలక పరిణామం
ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాయం కారణంగా ప్రపంచకప్ తొలి భాగానికి దూరమవుతాడనుకున్న ట్రవిస్ హెడ్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు తెలుస్తుంది. హెడ్ స్థానంలో ప్రపంచకప్ జట్టులోకి వస్తాడనుకున్న మార్నస్ లబూషేన్ ఇతర ఆటగాడి రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక కానున్నట్లు సమాచారం. ఆసీస్ ప్రొవిజనల్ జట్టులో చోటు దక్కించుకున్న ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ కాలి కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో లబూషేన్ ఆసీస్ వరల్డ్‌కప్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తుంది. తొలుత అగర్‌కు రీప్లేస్‌మెంట్‌గా మాథ్యూ షార్ట్ లేదా తన్వీర్ సంగాను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అయితే టీమిండియాతో ఆఖరి వన్డేలో మ్యాక్స్‌వెల్ బంతితో రాణించడంతో (4 వికెట్లు) స్పిన్నర్‌కు బదులు ప్రొఫెషనల్ బ్యాటర్‌ను జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే క్రికెట్ ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని ప్రకటించకపోగా.. లబూషేన్‌ను అగర్ స్థానంలో జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది. అగర్ స్థానంలో వరల్డ్‌కప్ జట్టులోకి వస్తామని కలలు కన్న మాథ్యూ షార్ట్, తన్వీర్ సంగాకు ఈ ఊహించని పరిణామంతో నిరాశే ఎదురైంది. మ్యాక్స్‌వెల్ స్పిన్నర్‌గా రాణించి ఈ ఇద్దరి ఆశలను అడియాసలు చేశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ స్థానాన్ని మ్యాక్సీ భర్తీ చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా నమ్మకంగా ఉంది. పై పేర్కొన్న మార్పులకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడనున్న విషయం తెలిసిందే. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆసీస్.. టీమిండియాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న నెదర్లాండ్స్‌తో.. అక్టోబర్ 3న పాకిస్తాన్‌తో కమిన్స్ సేన తలపడుతుంది. వరల్డ్‌కప్ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా టీమ్: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ -
క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ప్రతి ఆస్ట్రేలియా ఆటగాడు (దేశవాలీ, అంతర్జాతీయ ఆటగాళ్లు) నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్‌తో బ్యాటింగ్‌కు దిగడం తప్పనిసరి చేసింది. ఇటీవలికాలంలో బ్యాటర్లు తరుచూ ఫాస్ట్ బౌలింగ్‌లో గాయపడుతుండటంతో సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. సీఏ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది ఆసీస్ క్రికెటర్లు తమ మునుపటి ప్రాక్టీస్‌ను మార్చుకోవాల్సి వస్తుంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ తదితరులు నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించేందుకు ఇష్టపడరు. సీఏ తాజా నిర్ణయంతో వీరంతా తప్పనిసరిగా మెడ భాగం సురక్షితంగా ఉండేలా హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. కాగా, నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఫిలిప్ హ్యూస్ మరణాంతరం (2012) ప్రత్యేకంగా తయారు చేయించింది. హ్యూస్ ఈ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు కోల్పోయే వాడు కాదు. 2019 యాషెస్ సిరీస్‌లో ఇంచుమించు ఇలాంటి ప్రమాదమే మరొకటి సంభవించి ఉండేది. నాడు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్ స్టీవ్ స్మిత్‌ను మెడ భాగంలో బలంగా తాకింది. అంత జరిగాక కూడా స్మిత్ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించేందుకు ఇష్టపడే వాడు కాదు. ఇది ధరిస్తే అతని హార్ట్ బీట్ అమాంతంగా పెరుగుతుందని అతను చెప్పుకొచ్చేవాడు. వార్నర్ సైతం నెక్ ప్రొటెక్టర్ ధరిస్తే, అది తన మెడలోకి చొచ్చుకుపోయేదని చెప్పి తప్పించుకునే వాడు. సీఏ తాజా నిర్ణయంతో వీరు కారణాలు చెప్పి తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న సిరీస్ సందర్భంగా రబాడ వేసిన ఓ రాకాసి బౌన్సర్ కెమారూన్ గ్రీన్ మెడ భాగంలో బలంగా తాకింది. అయితే అతను ఈ నెక్ ప్రొటెక్టర్ ఉండటంతో బ్రతికి బయటపడ్డాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే క్రికెట్ ఆస్ట్రేలియా నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మరోవైపు స్వదేశంలోనూ బౌన్సీ పిచ్‌లు ఎక్కువగా ఉండటంతో దేశవాలీ క్రికెటర్లు కూడా ముందు జాగ్రత్తగా ఈ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించి బ్యాటింగ్‌కు దిగాలని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన జారీ చేసింది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా జాతీయ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆసీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ సిరీస్ అనంతరం ఆసీస్ సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు టీమిండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. తదనంతరం అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. -
ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో విజయం కన్నా బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఆసీస్ జట్టుకు నేరుగా గెలవడం చేతగాక ఇలా చీటింగ్ చేసి గెలవాలని చూసిందంటూ ఇంగ్లండ్ అభిమానులు ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. నిజానికి బెయిర్ స్టో ఔట్ సరైనదే. బంతి డెడ్ కాకముందే క్రీజులో నుంచి బయటికి వెళ్లి మాట్లాడడం తప్పు. ఇదే అదనుగా భావించిన అలెక్స్ క్యారీ వికెట్ల వైపు బంతిని వేసి తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. అయితే దీన్ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా పేర్కొంటూ ఆస్ట్రేలియా టీమ్‌పై విమర్శలు చేశారు ఇంగ్లీష్ అభిమానులు. ఐదో రోజు మొదటి సెషన్ ముగిసిన అనంతరం లార్డ్స్ లాంగ్ రూమ్‌లో ఉన్న కొందరు ఎంసీసీ సభ్యులు కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లను బూతులు తిట్టారు. వీరితో ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ వాగ్వాదానికి దిగారు. సాధారణంగా మిగిలిన క్రికెట్ గ్రౌండ్లో క్రికెటర్లు, డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లే దారిలో వేరే వాళ్లు ఉండడానికి, కూర్చోవడానికి అవకాశం ఉండదు. అయిలే లార్డ్స్‌లో మాత్రం లాంగ్ రూమ్ పేరుతో ఎంసీసీ సభ్యుల కోసం ఓ లాంగ్ రూమ్ ఉంటుంది. ఇందులో మెర్లీబోన్ క్రికెట్ క్లబ్, మిడిల్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సభ్యులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.. వీళ్లు వీవీఐపీల హోదాల లాంగ్ రూమ్‌లో కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచే ఇరుజట్ల క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న కొంతమంది ప్రతినిధులు ఉస్మాన్ ఖవాజాతో గొడవపడ్డారు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ ప్రతినిధులను వారించాల్సింది పోయి ఉస్మాన్ ఖవాజాను బలవంతంగా తోసేశారు. ఆ తర్వాత వార్నర్‌ను కూడా టార్గెట్ చేయడంతో తాను కూడా ఏం తగ్గలేదు. అయితే వివాదం మరింత ముదురుతుందేమోనని సెక్యూరిటీ వచ్చి వార్నర్‌ను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. దీనిపై ఉస్మాన్ ఖవాజా స్పందించాడు. ''ఇది నిజంగా చాలా నిరుత్సాహపరిచింది. వాళ్లు మమ్మల్ని బూతులు తిట్టారు. ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. అందుకే నేను వాళ్లను నిలదీశా.. వాళ్లలో కొందరు మాపై నిందలు వేశారు. ఇది మమ్మల్ని అవమానించడమే.. ఎంసీసీ మెంబర్స్ నుంచి ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు'' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంసీసీ ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ కోరుతూ బహిరంగ లేఖను విడుదల చేసింది.''ఆస్ట్రేలియా క్రికెట్‌కు, ఉస్మాన్ ఖవాజా, వార్నర్‌లకు క్షమాపణలు. అమర్యాదగా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దురుసుగా ప్రవర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది.గ్రౌండ్లో జరిగిన విషయాన్ని నిలదీస్తే అధికారం బయటివాళ్లకు లేదు. అది వాళ్లకు సంబంధం లేని విషయం.'' అంటూ ప్రకటన విడుదల చేసింది. Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳 🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw — Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023 MCC Statement.#Ashes pic.twitter.com/fWYdzx1uhD — Marylebone Cricket Club (@MCCOfficial) July 2, 2023 జరిగింది ఇదీ.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని వదిలేసిన జానీ బెయిర్‌స్టో, ఓవర్ అయిపోయిందని భావించి కీపర్ వైపు చూడకుండానే ముందుకు వచ్చేశాడు. జానీ బెయిర్‌స్టో క్రీజు దాటడాన్ని గమనించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, వికెట్లవైపు త్రో వేశాడు. అది తగలడంతో ఆస్ట్రేలియా వికెట్ కోసం అప్పీల్ చేసింది. రన్ తీయాలనే ఉద్దేశంతో జానీ బెయిర్‌స్టో క్రీజు దాటలేదు. ఓవర్ అయిపోయిందని నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో మాట్లాడాలని ముందుకు నడుచుకుంటూ వచ్చేశాడు. వెనకాల ఏం జరిగిందో కూడా తెలియని జానీ బెయిర్‌స్టో, అవుట్ కోసం అప్పీల్ చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక తెల్లమొహం వేశాడు. థర్డ్ అంపైర్ ఔట్ అని ఇవ్వడంతో చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. చదవండి: ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు 'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక -
Ashes Series 2023: గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్.. ఇకపై కష్టమే..!
5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. రెండో టెస్ట్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన (కాలు బెణికింది) వారి తురుపు ముక్క, స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ సిరీస్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. లయోన్ లేని లోటు ఆసీస్‌కు ఎదరుదెబ్బగా పరిగణించబడుతుంది. లయోన్ స్థానంలో సీఏ ఎవరిని కొత్తగా ఎంపిక చేయలేదు. మూడో టెస్ట్‌కు లయోన్ స్థానంలో టాడ్ మర్ఫీ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మర్ఫీ ప్రతిభను (4 టెస్ట్‌ల్లో 14 వికెట్లు) పరిగణలోకి తీసుకుని సీఏ అతనివైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన మర్ఫీ.. ఆసీస్ తరఫున ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. ఆసీస్-ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్ట్ హెడింగ్లే వేదికగా జులై 6 నుంచి మొదలు కానుంది. కాగా, రెండో టెస్ట్, రెండో రోజు ఆటలో బెన్ డకెట్ క్యాచ్ అందుకోబోతూ నాథన్ లయోన్ కాలు బెణికింది. యాదృచ్చికంగా ఈ మ్యాచ్ లయోన్‌కు తన కెరీర్లో వరుసగా వందో టెస్ట్ మ్యాచ్. గాయపడిన అనంతరం లయోన్ బరిలోకి దిగనప్పటికీ..నాలుగో రోజు జట్టు కోసం పెద్ద సాహసమే చేశాడు. కుంటుతూనే బ్యాటింగ్‌కు వచ్చి తన జట్టుకు అతి మూల్యమైన పరుగులు సమకూర్చాడు. ఈ మ్యాచ్‌లో లయోన్ లేకపోయినా ఆసీస్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. స్టోక్స్ పోరాటం వృధా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆసీస్ అంతిమంగా విజయం సాధించినప్పటికీ.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వారికి ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాపించాడు. వీరోచితమైన ఇన్నింగ్స్‌తో తన జట్టును గెలిపించినంత పని చేశాడు. ఆసీస్ నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక్కడే అద్భుతమైన పోరాటం చేశాడు. జట్టులో డకెట్్ (83) మినహా మిగతా వారెవ్వరి నుంచి సహకారం లభించకపోవడంతో ఇంగ్లండ్ 327 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ఫైర్..!
-
చాలా హాస్యాస్పదంగా ఉంది.. ఆస్ట్రేలియా బోర్డుపై విరుచుకుపడిన వార్నర్
బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై 2018లో క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు అతడి కెప్టెన్సీపై జీవితకాల బ్యాన్ విధించింది. అయితే ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకోలేదు. దాంతో అతడు మళ్లీ టీమ్ వైస్ కెప్టెన్ అయ్యి.. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టును కూడా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో సీఏ విధించిన కెప్టెన్సీ బ్యాన్పై గతేడాది నవంబర్‌లో రివ్యూ పిటిషన్‌ను వార్నర్ దాఖలు చేశాడు. ఇందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. అయితే ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్.. కేసును బహిరంగంగా విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో తన రివ్యూ పిటిషన్‌ను వార్నర్ ఉపసంహరించుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి కీలక వాఖ్యలు చేశాడు. "నా పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను గతాన్ని మార్చిపోవాలని భావిస్తుంటే.. వారు మాత్రం ఇంకా కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఎవరూ జవాబుదారీగా ఉండకూడదని, ఎవరూ నిర్ణయం తీసుకోకూడదనుకొన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియాలో నాయకత్వలోపం సృష్టంగా కన్పిస్తోంది. ఇదే విషయంపై నేను టెస్టు మ్యాచ్‌లు ఆడే సమయంలో పదే పదే ఫోన్ కాల్స్ వచ్చేవి. నేను లాయర్లతో మాట్లాడడేవాడిని. అది నా ఏకాగ్రతను దెబ్బతీసింది. ఇదంతా నాకు ఆగౌరవంగా అనిపించింది. అందుకే గతాన్ని మర్చిపోవాలని భావిస్తున్నా. ఈ కథ అంతా గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. కానీ ఈ విషయంపై మాత్రం నేను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా" అని సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ పేర్కొన్నాడు. -
ఎస్సీజీ గేట్‌కు సచిన్ పేరు
సిడ్నీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోమవారం (ఏప్రిల్ 24) 50వ పుట్టినరోజు జరుపుకున్నాడు. క్రికెట్ ప్రేక్షకులకు, ప్రత్యేకించి ‘మాస్టర్’ బ్యాట్స్‌మన్ అభిమానులకు ఇది పండగ రోజు. ఈ ‘ఫిఫ్టీ’ని మరింత చిరస్మరణీయం చేసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వైపు నుంచి అపురూప కానుక లభించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లోని ఓ గేట్‌కు సచిన్ పేరు పెట్టింది. ఈ మైదానం అతనికెంతో ప్రత్యేకమైంది. ఈ వేదికపై ‘లిటిల్ మాస్టర్’ మూడు శతకాలు సహా 785 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 241 (2004లో). ఇక్కడ సచిన్ 157 సగటు నమోదు చేయడం మరో విశేషం. సోమవారం సచిన్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీజీ, న్యూసౌత్‌వేల్స్ వేదికల చైర్మన్ రాడ్ మెక్ గియోచ్, సీఈఓ కెర్రీ మాథెర్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ ‘సచిన్ గేట్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సచిన్ అనుభవాన్ని ప్రస్తావించారు. ‘భారత్ వెలుపల సిడ్నీ నా ప్రియమైన మైదానం.1991–92లో నా తొలి ఆసీస్ పర్యటన మొదలు కెరీర్ ముగిసేదాకా ఎస్సీజీలో నాకు మరిచిపోలేని స్మృతులెన్నో వున్నాయి’ అని సచిన్ పేర్కొన్నారు. సచిన్ సమకాలికుడు బ్రియాన్ లారా (విండీస్) కూడా అక్కడ గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌ల ఆడటంతో మరో గేట్‌కు లారా పేరు పెట్టారు. తనకు కలిసొచ్చిన ఈ మైదానం పేరును లారా తన కుమార్తెకు ‘సిడ్నీ’ అని పెట్టుకున్నాడు. -
పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ వేదికగా అధికారికంగా ద్రువీకరించింది. కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ''మారియా కమిన్స్ చనిపోవడం చాలా బాధాకారం. క్రికెట్ ఆస్ట్రేలియా తరపున పాట్ కమిన్స్, అతని కుటుంబసభ్యులకు మా ప్రగాడ సానభూతి. కమిన్స్ తల్లి మృతికి సంతాపంగా టీమిండియాతో నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఆసీస్ క్రికెటర్లు నల్ల రిబ్బన్లతో(బ్లాక్ ఆర్మ్ బాండ్స్) బరిలోకి దిగుతారు.. '' అంటూ ట్వీట్ చేసింది. పాట్ కమిన్స్ తల్లి మృతిపై బీసీసీఐ సహా టీమిండియా ఆటగాళ్లు తమ సంతాపాన్ని ప్రకటించారు. ''ఈ విషాద సమయంలో కమిన్స్, అతని కుటుంబసభ్యులుకు మా సానుభూతి తెలియజేస్తున్నాం'' అంటూ ట్వీట్ చేశారు. కాగా తల్లి అనారోగ్యం కారణంగా పాట్ కమిన్స్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు ముగియగానే స్వదేశానికి వెళ్లిపోయాడు. తల్లిని దగ్గరుండి చూసుకోవాలన్న అతని కోరికను మన్నించిన క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకరించింది. తన తల్లి మారియా చివరి రోజుల్లో పక్కనే ఉండాలని భావించిన కమిన్స్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని ఇటీవలే పత్రికా ప్రకటనలో పేర్కొన్నాడు. We are deeply saddened at the passing of Maria Cummins overnight. On behalf of Australian Cricket, we extend our heartfelt condolences to Pat, the Cummins family and their friends. The Australian Men's team will today wear black armbands as a mark of respect. — Cricket Australia (@CricketAus) March 10, 2023 On behalf of Indian Cricket, we express our sadness at the passing away of Pat Cummins mother. Our thoughts and prayers are with him and his family in this difficult period 🙏 — BCCI (@BCCI) March 10, 2023 చదవండి: మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు -
ఆస్ట్రేలియా క్రికెట్లో కలవరం.. తర్వాత ఎవరు?
ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక విషయంలో కలవరం మొదలైంది. ప్రస్తుతం జట్టులో నాథన్ లియోన్ మాత్రమే ప్రధాన స్పిన్నర్‌గా కనిపిస్తున్నాడు. లియోన్ వయస్సు 35 సంవత్సరాలు. రిటైర్మెంట్కు దగ్గరికి వచ్చిన అతను మహా అయితే మరో రెండు సంవత్సరాలు ఆడే అవకాశం ఉంది. దిగ్గజం షేన్ వార్న్ తర్వాత టాప్‌క్లాస్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న లియోన్ తన కెరీర్లో 117 టెస్టులాడి 468 వికెట్ల పడగొట్టాడు. దశాబ్దం కాలంగా లియోన్ ఆసీస్ టెస్టు జట్టులో ఏకైక ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతూ వస్తున్నాడు. మరి అతను రిటైర్ అయ్యాకా ఆసీస్ క్రికెట్లో స్పిన్ భాద్యతలు తీసుకునేది ఎవరనేదానిపై చర్చ మొదలైంది. ఆసీస్ లాంటి ఫాస్ట్ పిచ్ మైదానాలపై పేస్ బౌలర్లకు కొదువ లేదు. ఆ దేశం నుంచి వచ్చే బౌలర్లలోనే ఎక్కువగా మీడియం, ఫాస్ట్ బౌలర్లే కనిపిస్తారు తప్ప స్పిన్నర్లు చాలా తక్కువ. స్వదేశంలో ఆడినంత వరకు పేస్ దళంతోనే మ్యాచ్‌లు గెలిచే ఆస్ట్రేలియా భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లకు వచ్చేసరికి స్పిన్నర్లను వెతుక్కోవాల్సి వస్తోంది. అయితే టాడ్ మర్ఫీ రూపంలో ఆస్ట్రేలియా జట్టుకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శనే కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు రెండు టెస్టులు కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ఇదే విషయమై ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పందించాడు. ''ప్రస్తుతం ఆస్ట్రేలియాకు పెద్ద దిక్కులా మారాడు. వార్న్ లాంటి దిగ్గజ ఆటగాడిని భర్తి చేయలేకపోయిన ఉన్నంతలో అతను టాప్ క్లాస్ స్పిన్నర్. మరి లియోన్ రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ క్రికెట్లో స్పిన్ బాధ్యతలు తీసుకునేది ఎవరు అని ప్రశ్నించుకోవాలి. అందుకు నా సమాధానం 22 ఏళ్ల టాడ్ మర్ఫీ. టీమిండియాతో తొలి టెస్టులోనే ఆస్ట్రేలియా తరపున టాడ్ మర్ఫీ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏడు వికెట్లతో ఆకట్టుకొని తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ఏడు వికెట్లలోనూ ఐదు టాప్‌క్లాస్ బ్యాటర్లవే ఉన్నాయి. ఉపఖండం పిచ్‌లపై ప్రభావం చూపుతున్న ఒక డెబ్యూ బౌలర్ తర్వాతి కాలంలో జట్టుకు ప్రధాన స్పిన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. నాథన్ లియోన్ అలా వచ్చినవాడే. అతని వారసత్వాన్ని టాడ్ మర్ఫీ కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా. అయితే ఆస్ట్రేలియాకు టాడ్ మర్ఫీ రూపంలో ఒక మంచి స్పిన్నర్ దొరికినట్లే. వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న మర్ఫీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అద్బుతాలు చేయగలడన్న నమ్మకం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇరుజట్ల మధ్య ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. రెండు టెస్టుల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ రెండు టెస్టులు కూడా రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. ఇక మూడో టెస్టు మార్చి ఒకటి నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది. చదవండి: 'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్' 'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు