Dairy cattle
-
పాలు స్వచ్ఛంగా ఉన్నాయా?
ఆధునిక జీవితంలో పాలు తాగడం మంచిదని అనేకులు భావిస్తారు. ఆ మేరకు నిత్యం పాల అవసరం పెరిగింది. పాల నుంచి తయారు చేసే ఉత్పత్తుల పరిమాణం, వైవిధ్యం కూడా పెరిగింది. అందుకే కొందరికే పాలు అందుతున్నాయి. పాలు, మజ్జిగ విరివిగా దొరికే పల్లెలలో ఉదయం 8 దాటితే పాలు ఉండటం లేదు. మరోవైపు పాల ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. సహజ పశువుల మేత తగ్గుతున్నది. పశువులు మేసే గడ్డి మైదానాలు దాదాపు లేనట్లే! పశువులకు కావాల్సిన నీరు, నీడ సహజంగా దొరికే పరిస్థితులు లేవు. ఇంకొక వైపు పాల నాణ్యత మీద అనుమానాలు పెరుగుతున్నాయి. పాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి.పాల కథ –1 పశువులు స్వేచ్ఛగా తిరగగలిగే ప్రదేశాలు దాదాపుగా లేవు. చెట్లు, కమ్యునిటీ స్థలాలు తగ్గినాయి. గుట్టలు కూడా ప్రైవేటు పరం అవుతున్నాయి. దానివల్ల పాడి పశువుల సంఖ్య తగ్గిపోతున్నది. పశు పోషకుల సంఖ్య తగ్గుతున్నది. పాడి పశువులను పోషించే జ్ఞానం, నైపుణ్యం తగ్గుతున్నది. వరి, జొన్న, మక్క లాంటి పంటల నుండి వచ్చే మేత కూడా లేదు. చొప్ప, ఎండు గడ్డి వంటివి రైతులు పొలంలోనే కాలబెడుతున్నారు. పశు గ్రాసం ప్రత్యేకంగా పండించాల్సి వస్తున్నది. పశు పోషకులకు భూమి లేదు. ఉన్నా ఆ భూమి ఇతర ఉపయోగాలకు వాడటం వల్ల పశుగ్రాసం మీద శ్రద్ధ లేదు. వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు పశు వులను పోషించడం లేదు. ఆ యా పంటలకు రసాయనాలు పిచికారీ చేయడం వల్ల పశువులు తినలేవు. తిన్నా అనారోగ్యం పాలు కావచ్చు. చనిపోవచ్చు కూడా. జన్యుమార్పిడి బీటీ ప్రత్తి చేలలో తిరిగిన పశు వులు, గొర్రెలకు చర్మవ్యాధులు వచ్చినాయి. ఆకులు తిన్న గొర్రెలు చనిపోయినాయి. దరిమిలా, పాశ్చాత్య దేశాల మాదిరి ‘స్టాల్ అని మల్స్’ పరిస్థితికి చేరుకుంటున్నాము. పెద్ద డెయిరీలతో కాలుష్యంపాడి పశువులను ఒకే దగ్గర కట్టేసి, పాలు పిండి అమ్మే వ్యాపార వ్యవస్థను డెయిరీ అని పిలుస్తారు. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో డెయిరీగా పిలిచే పశు పాలు, మాంసం ఉత్పత్తి కేంద్రాలు చాల పెద్దవి. వాటిని ఫ్యాక్టరీ ఫామ్స్ అంటారు. ప్రపంచంలో అతి పెద్ద 10 ఫ్యాక్టరీ ఫామ్స్‌లో పై రెండు చైనాలో ఉన్నాయి. తరువాత 8 ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అతి పెద్ద చైనా ఫామ్‌లో లక్ష ఆవులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఒక ఫ్యాక్టరీ ఫామ్‌లో కేవలం యాభై మంది 55 వేల పశువులను నిర్వహిస్తారు. ఇటువంటి ఫ్యాక్టరీ డెయిరీలు ప్రపంచ పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించాయి. వీటి నుంచి వచ్చే రసాయన, కాలుష్య జలాల వలన నీటి వనరులు కలు షితం అవుతున్నాయి. క్రిమి–కలుపు సంహారకాలు, హార్మోన్లు,యాంటీ బయాటిక్స్, ఫాస్ఫేట్ అధికంగా ఉండే ఎరువులు, బ్యాక్టీ రియా–సోకిన ఎరువులు దీనికి కారణం.అమెరికాలో 2022 నాటికి పాతిక వేల డైరీ ఫామ్‌లు ఉన్నాయి. 10,000 మంది డెయిరీ రైతులు ఉన్నారు. 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమిలో పాడి రైతుల సంఖ్య 1.34 లక్షలు. ఇక్కడ అత్యధికంగా పాడి ఆవులను పోషించే దేశాలు జర్మనీ, ఫ్రాన్ ్స, నెద ర్లాండ్స్. భారతదేశంలో పది పశువులు లేదా అంతకంటే తక్కువ ఉన్న డెయిరీ ఫామ్‌లు 7.5 కోట్లు. భారత్‌లోనే చాలావరకు డెయిరీ ఫామ్‌లు చిన్న–స్థాయి, కుటుంబ యాజమాన్యంతో నడిచేవి.అంత పెద్ద డెయిరీ ఫామ్‌లు భారతదేశంలో లేకున్నా పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంలో 24% వాటాను అందిస్తున్న ఈ ఉత్పత్తి దాదాపు 21 కోట్ల టన్నులు. అధిక పాల దిగుబడికి పేరుగాంచిన భారతదేశంలో బర్రెల జనాభా ఎక్కువ. అయినా పాడి పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది. ప్రాథమిక పాడి రైతు లకు గిట్టుబాటు ధర రాని పరిస్థితులున్నాయి.పాలు ఇచ్చే పశువులు బర్రెలు, ఆవులు. ఇవి ఎక్కువగా భారత దేశంలో వాడతారు. పాలు ఇంకా వివిధ రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. గాడిద పాలు, మేక పాలు శ్రేష్ఠమైనవి అని భావించే వారు ఉన్నారు. బెంగళూరులో ఒక కుటుంబం గాడిదతో పాటు ఇంటింటికి తిరుగుతూ లీటర్ రూ.500లకు అమ్ముతున్న వైనం చూశాం. మొక్కలు, పండ్ల నుంచి వచ్చే పాలు కూడా ఈ మధ్య ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా పండించే సోయా నుంచి తీసే పాలు అనేక ఆహార పదార్థాలలో వాడుతున్నారు. అయితే పశువుల నుంచి పాలను సేకరించడం హింసగా భావించే వారు ఉన్నారు. పశువుల పాలు పడనివారు మొక్కల పాలను ఆశ్ర యిస్తున్నారు. ఇటీవల మొక్కల నుంచి తీసుకునే పాల వ్యాపారం విపరీతంగా పెరిగింది. 2019లో మొక్కల పాల మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు దాటిందని అంచనా.పశువు ఒక యంత్రమా?తరతరాల నుంచి పాలు సేకరించి జీవించే యాదవులు, ఇంకా ఇతర వృత్తుల వారు ఉన్నారు. పశువులకు రోగాలు రాకుండా చూసుకునే జ్ఞానం, నైపుణ్యం వీరికి సంప్రదాయంగా ఉండింది. వీరు చేసే వ్యాపారంలో పాడి పశువులను ప్రేమగా చూసుకోవడం కీలకం.అందినంత పిండుకునే తత్వం లేదు. లేగ దూడను తల్లి నుంచి వేరు చేయరు. ఫలితంగా, పాలు నిత్యం ఒకే పరిమాణంలో ఉండేవి కావు. ఉండవు కూడా. పాలు ప్రకృతి ఉత్పత్తి. ఒక మర యంత్రం నుంచి వచ్చినట్లు రోజు ఒకే పరిమాణంలో రావాలని లేదు.పశువులకు ఇవ్వాల్సిన గ్రాసం, దాణా, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగాయి. రాను రాను ఒక కుటుంబం ఆధారపడే పాడి పశువుల జీవ నోపాధి సమస్యలలో పడింది. ప్రభుత్వాలు పాడి పశువుల కొనుగోలుకు కొన్ని పథకాలు పెట్టాయి తప్పితే, పశు గ్రాసం కొరకు కావాల్సిన భూమి, పశు వుల నివాసానికి భూమి వగైరా వాటి మీద దృష్టి లేదు.పాశ్చ్యాత్య దేశాలు పాడి పశువును ఒక యంత్రంగా మార్చాయి. పాల ఉత్పత్తి పెంచడానికి ‘హైబ్రిడ్’ అవును తెచ్చారు. అది సరి పోలేదని ఆవుల పొదుగును రెండింతలు, మూడింతలు పెంచారు. ఆ పొడుగులతో అవి నడవలేక యాతన పడుతున్నా పట్టించుకోలేదు. దాణాలో మార్పులతో పాల ఉత్పత్తి పెరుగుతుందని భావించి అందులో మార్పులు చేస్తూనే ఉన్నారు. గడ్డి తినే ఆవులకు లేగ దూడల మాంసం తినిపించినందుకు బ్రిటన్‌లో పూర్వం ‘మ్యాడ్ కౌ’ వ్యాధి వచ్చి అనేక ఆవులు చనిపోయినాయి. పశువుల శరీరాన్ని ఒక పరిశోధన కేంద్రంగా మార్చేశారు. అనుచిత ఆహారం ఇవ్వడం వల్ల పశువులకు వ్యాధులు వస్తున్నాయి. అపాన వాయువు ఎక్కువ అవుతున్నది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తు న్నది అని చెప్పి, ఇప్పుడు పాడి పశువులలో ‘జన్యుమార్పిడి’ ప్రయ త్నాలు కూడా చేస్తున్నారు. ఈ రకమైన పరిశోధన మానవుల నైతిక తను ప్రశ్నిస్తున్నది. జన్యుమార్పిడి పాడి పశువుల ద్వారా ఔషధాలను ఉత్పత్తి చేయడం, పాల దిగుబడిని పెంచడం, వ్యాధులను నిరోధించాలని పరిశోధనలు చేస్తున్నారు. కొమ్ములు రాని జన్యు మార్పిడి పాడి పశువుల గురించిన పరిశోధన చేస్తున్నారు. కొమ్ములు ఉంటే ఇతర పశువులను, యజమానులను పొడుస్తున్నాయని ఈ రక మైన పరిశోధనలు చేస్తున్నారు. మేలు జాతి పశువుల కొరకు అవలంబిస్తున్న కృత్రిమ గర్భధారణ పద్ధతి కూడా ఫలించడం లేదు. ఫలించక పోగా, మేలు స్థానిక పశు జాతులను కలుషితం చేస్తున్నారు. పాల ద్వారా విషాలుపాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి. కొన్ని రకాల గడ్డి భార లోహాలను నేల తీసుకుంటుంది. ఆ గడ్డి ద్వార సీసం, ఇంకా ఇతర ప్రమాదకర భార లోహాలు పాలు తాగే వారికి చేరుతున్నాయి. పాడి పశువులకు ఇచ్చే దాణా ద్వారా కూడా మనుషులు తమను తామే కలుషితం చేసుకుంటున్నారు. పడేసిన చికెన్ బిరియాని, బ్రెడ్డు ముక్కలు వగైరా బర్రెలకు, ఆవులకు పెడుతున్నారు. పాడి పశువులకు ఇచ్చే ఆహారాన్ని బట్టి పాలు ఉంటాయని పశువుల యజమానులకు తెలుసు. వినియోగదారులకు తెలియదు. తెలిసినా ఏమి చేయలేక మిన్నకుంటారు. సహజ గ్రాసం తినని పశువు పాలలో పోషకాలు ఉండే అవకాశం తక్కువ. పాలలో తగ్గిపోతున్న పోషకాల మీద మన దేశంలో పరిశోధనలు లేవు. చెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
సంచార పశు వైద్యంపై అసత్య రాతలా?
సాక్షి, అమరావతి: పాడి రైతులకు తోడుగా ప్రభుత్వం ఉంటుంటే చూడలేని రామోజీరావు తన పాడు రాతలతో ప్రభుత్వంపై బురద జల్లడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మూగజీవాలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై కూడా ఈనాడులో విషంకక్కారు. 108 తరహాలోనే ఫోన్ చేసిన అరగంటలోపే పాడి రైతుల ఇంటి ముంగిటకు చేరుకొని వైద్య సేవలందిస్తున్న ఈ వాహన సేవలపై దుష్ప్రచారం చేశారు. ‘సంచార పశు వైద్యం చాపచుట్టేశారు’అంటూ ‘ఆవు కథ’మాదిరే ఈనాడులో ఓ కథనం అచ్చేశారు. ఆ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిస్తే.. ఆరోపణ: కానరాని వాహనాలు వాస్తవం : గతంలో పాడి పశువులకు చిన్న పాటి అనారోగ్యం వచ్చినా 5–20 కిలోమీటర్ల దూరంలోని పశువైద్యశాలలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన పశు సంవర్ధక సహాయకులు సకాలంలో వ్యాక్సిన్లు, ప్రాథమిక వైద్యసేవలు అందిస్తున్నారు. నాణ్యమైన పశువైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్రంలో రూ. 278 కోట్లతో 340 మొబైల్ అంబులేటరీ క్లినిక్స్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మొబైల్ వైద్యసేవల కోసం టోల్ ఫ్రీ నం.1962తో ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆరోపణ: మూలనపడ్డ పరికరాలు వాస్తవం : ప్రతి అంబులెన్స్‌లో పశువైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను ఏర్పాటు చేసింది. 295 పశువైద్యులతోపాటు 337 పశువైద్య సహాయకులు సేవలందిస్తున్నారు. ప్రతి వాహనంలో 51 రకాల వైద్య పరికరాలను ఉంచారు. 20 రకాల పేడ సంబంధిత, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా ప్రతి వాహనంలో మైక్రో స్కోప్‌తో సహా 33 రకాల పరికరాలతో చిన్నపాటి లేబరేటరీని ఏర్పాటు చేశారు. కనీసం వెయ్యి కిలోల బరువున్న పశువులను సమీప వైద్యశాలకు తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్ లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య వస్తే వెంటనే మరమ్మతులు చేçస్తున్నారు. ఒకవేళ మరమ్మతు ఆలస్యం అయితే సమీప మండల వాహనాలను వినియోగిస్తున్నారు. ఆరోపణ: అరకొరగా వైద్య సేవలు.. జ్వరం మందులు లేవు వాస్తవం : టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రతి రోజూ వెయ్యికి పైగా కాల్స్ వస్తున్నాయి. ఫోన్ చేసిన అరగంటలోపే ఆయా గ్రామాలకు చేరుకొని ఉచితంగా సేవలందిస్తున్నారు. అవసరమైన చోట సమీప పశువైద్యశాలలకు తరలించి నాణ్యమైన, మెరుగైన సేవలు అందించి పైసా ఖర్చు లేకుండా వైద్యసేవలనంతరం తిరిగి రైతు ఇంటి వద్దకే తీసుకొచ్చి పశువులను అప్పగిస్తున్నారు. ప్రతి వాహనంలో రూ. 30 వేల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఏడాదిన్నరలో 6,97,116 పశువులకు ఉచిత చికిత్స అందించారు. 5,14,740 మంది పశుపోషకులు లబ్ధి పొందారు. ఆరోపణ: సమ్మె బాట పట్టిన సిబ్బంది వాస్తవం : సంచార పశువైద్య సేవ వాహనాల నిర్వహణ, వీటిలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి సంబంధించిన జీత భత్యాలు చెల్లింపు బాధ్యత జీవీకే సంస్థకు అప్పగించారు. ఈ వాహనాల్లోని సిబ్బందికి ఆ సంస్థ సకాలంలో జీతభత్యాలు అందిస్తోంది. ఇప్పటివరకు ఏ ఒక్కరూ తమకు జీతభత్యాలు అందడం లేదంటూ సమ్మె నోటీసు ఇవ్వలేదు. అయినా నోటీసు ఇచ్చినట్టుగా ఈనాడు తన కథనంలో తప్పుడు ఆరోపణ చేసింది. మరోవైపు ఏపీ స్ఫూర్తితో ఏపీ మోడల్లోనే పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లో మొబైల్ అంబులేటరీ వాహన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే సంచార పశువైద్యం చాపచుట్టేస్తున్నారంటూ ఈనాడు విషపు రాతలు రాయడం పాడి రైతులను విస్మయానికి గురిచేస్తోంది. -
పశుపోషకుల ఇంటి ముంగిటే వైద్య సేవ
సాక్షి, అమరావతి: 108 అంబులెన్స్ తరహాలోనే మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వం తీసుకొస్తున్న డాక్టర్ వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలు (మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్) మే 19 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ‘డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ’ పథకం ద్వారా దాదాపు రూ.278 కోట్లతో 340 వాహనాలు కొనుగోలుతో పాటు వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 175 వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.‘డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ’ పథకం ద్వారా ప్రస్తుతం మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.142.90 కోట్లతో 175 వాహనాలు, రెండో దశలో రూ.134.74 కోట్లతో మిగిలిన 165 వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలలో సైతం పాడి పశువులతో పాటు, పెంపుడు జంతువులకు అత్యవసరమైన, నాణ్యమైన పశువైద్యసేవలు అందించేందుకు వీలుగా ఈ వాహనాల నిర్వహణకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ.. ఒక్కొక్క వాహన నిర్వహణకు నెలకు రూ.1.90 లక్షల చొప్పున నిధులను కేటాయించింది. -
పాడి రంగానికీ ఆర్బీకేల దన్ను
అనకాపల్లి జిల్లా మునగపాక గ్రామానికి చెందిన ఇతడి పేరు ఉయ్యూరు రామనరేష్. రెండు గేదెలు, రెండు ఆవులున్నాయి. గతంలో మార్కెట్లో దొరికే నాసిరకం దాణా వినియోగించటం వల్ల ఆశించిన స్థాయిలో పాల దిగుబడి వచ్చేది కాదు. పైగా పశువులు తరచూ అనారోగ్యం బారిన పడేవి. దీంతో ఆర్బీకేల ద్వారా ఇస్తున్న నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్) తీసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతడి పశువులు రోజుకు 1–2 లీటర్ల పాలను అధికంగా ఇస్తున్నాయి. ఆ పాలలో వెన్న శాతం కూడా పెరగడంతో మంచి ఆదాయం వస్తోందని, తానిప్పటి వరకు కిలో రూ.6.50 చొప్పున 200 కిలోల టీఎంఆర్ తీసుకున్నానని రామనరేష్ ఆనందంతో చెబుతున్నారు. సాక్షి, అమరావతి: పాడి పశువులకు నాణ్యమైన పశుగ్రాసం, దాణా అందిస్తే అధిక దిగుబడితోపాటు నాణ్యమైన పాలను ఇస్తాయి. మరోవైపు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాయి. నాణ్యమైన పాల దిగుబడి వస్తే పాడి రైతుల ఆదాయానికి ఢోకా ఉండదు. ఇన్నాళ్లూ పశుగ్రాసం, దాణా కోసం పాడి రైతులు పాట్లు పడేవారు. వాటికి చెక్ పెడుతూ ఏడాదిగా ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్న పశుగ్రాసం విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్), నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమాలు, లివర్ టానిక్స్ తదితర పోషక మిశ్రమాలతోపాటు గడ్డి కత్తిరించే యంత్రాలు (చాప్ కట్టర్స్) వంటి వాటిని సబ్సిడీపై ఇస్తుండటంతో రైతుల వెతలు తీరుతున్నాయి. ఇందుకోసం పశు సంవర్ధక శాఖ 11ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుంది. సర్టిఫై చేసిన పశుగ్రాసం.. సంపూర్ణ మిశ్రమ దాణా పశుగ్రాసం కొరతకు చెక్ పెట్టేందుకు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన జొన్న (సీఎస్హెచ్–24 ఎంఎఫ్ రకం), మొక్కజొన్న (ఆఫ్రికన్ టాల్ రకం) పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. ఏడాదిలో 1.41 లక్షల మంది రైతులకు రూ.15.81 కోట్ల విలువైన 1,500 టన్నుల జొన్న, 489 టన్నుల మొక్కజొన్న పశుగ్రాస విత్తనాలు సరఫరా చేసింది. వీటిని 1,05,531 ఎకరాల్లో సాగు చేయడం ద్వారా 4.21 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని రైతులు ఉత్పత్తి చేసుకుని పశుగ్రాసం కొరతను అధిగమించారు. మరోవైపు అత్యంత పోషక విలువలు గల సంపూర్ణ మిశ్రమ దాణాæ(టీఎంఆర్)ను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తోంది. దీనిని వాడటం వల్ల పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఇతర దాణాలేవీ పెట్టాల్సిన అవసరం ఉండదు. సర్టిఫై చేసిన మిశ్రమ దాణా కిలో రూ.15.80 కాగా.. రైతులకు సబ్సిడీపై రూ.6.50కే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రతి పాడి రైతుకు రెండు నెలలకు ఒకసారి 60 శాతం సబ్సిడీపై గరిష్టంగా 1,800 కిలోల చొప్పున ఇస్తోంది. ఇప్పటివరకు రూ.29.43 కోట్ల విలువైన 18,625 మెట్రిక్ టన్నుల టీఎంఆర్ దాణాను 46,563 మంది రైతులకు పంపిణీ చేసింది. మరోవైపు పశుగ్రాసం వృథాను అరికట్టేందుకు ఆర్బీకేల ద్వారా 40 శాతం రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాలు అందిస్తోంది. 2 హెచ్‌పీ 3 బ్లేడ్ చాప్ కట్టర్ ఖరీదు రూ.33,970 కాగా, సబ్సిడీ పోనూ రూ.20,382కే ఇస్తోంది. ఇప్పటివరకు రూ.4.52 కోట్ల విలువైన 2,173 చాప్ కట్టర్స్‌ను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. 3 టన్నుల టీఎంఆర్ తీసుకున్నా గతంలో నాణ్యమైన దాణా దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఆర్బీకే ద్వారా ఇప్పటివరకు 3 టన్నుల టీఎంఆర్ తీసుకున్నా. బుక్ చేసుకున్న వారం లోపే అందిస్తున్నారు. దీని వినియోగంతో పాల దిగుబడి, నాణ్యత కూడా పెరిగింది. – పద్మజా భాను, దేవికొక్కిరపల్లి, యలమంచిలి పశుగ్రాసం వృథా కావడం లేదు నాకు 12 గేదెలు, 3 ఆవులు, 4 దూడలు ఉన్నాయి. మాది కరువు ప్రాంతం కావడంతో పశుగ్రాసం కొరత ఎక్కువ. దూరప్రాంతాల నుంచి పశుగ్రాసం తెచ్చుకున్నా చాలావరకు వృథా అయ్యేది. 2 హెచ్‌పీ సామర్థ్యం గల చాప్ కట్టర్ కోసం ఆర్బీకేలో బుక్ చేశా. దీన్ని ఉపయోగించడం వల్ల పశుగ్రాసం వృథా కావడం లేదు. – డి.మోహన్‌దాస్, వీరుపాపురం, కర్నూలు జిల్లా ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఇన్పుట్స్ సరఫరా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం మేరకు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన, సర్టిఫై చేసిన పశుగ్రాసం విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, ఖనిజ లవణ మిశ్రమాలతో పాటు గడ్డి కత్తిరించే యంత్రాలు సబ్సిడీపై అందిస్తున్నాం. వీటివల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. పాల దిగుబడితో పాటు నాణ్యత కూడా పెరిగిందని రైతులు చెబుతున్నారు. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ -
హెర్బల్ మిక్చర్‌తో పశువులకు పుష్టి!
సృష్టిలో ఏ ప్రాణికైనా ఆరోగ్యం, దేహదారుఢ్యం ప్రధానంగా 5 క్రియలపై ఆధారపడి ఉంటుంది. అవి: 1. ఉచ్ఛ్వాస 2. నిశ్చ్వాస 3. సేవనం 4.పచనం 5. విసర్జనం. పశువులలో ఈ 5 క్రియలను దృష్టిలో పెట్టుకొని కొన్ని దినుసులతో ఈ రోజు మనం అమృత తుల్యమైన హెర్బల్ మిక్చర్‌ను తయారు చేసుకుందాం. మినరల్ మిక్చర్, కాల్షియంలకు బదులుగా ఈ హెర్బల్ మిక్చర్ ఉపయోగపడుతుంది. ఈ హెర్బల్ మిక్చర్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చీటికి మాటికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీన్ని తిన్న పశువులు ఎండు/పచ్చి గడ్డి ఎక్కువ తింటాయి. కాబట్టి, ఆ మేరకు దాణాను తగ్గించుకోవచ్చు. గోసంరక్షణ శాలలకు దానాలు ఇచ్చే వారు ఈ హెర్బల్ మిక్చర్‌ను స్వయంగా తయారు చేయించి దానం చేస్తే మేలు జరుగుతుంది. హెర్బల్ మిక్చర్‌కు కావలసిన దినుసులు 1. సొంఠి – 200 గ్రా.: దీన్ని ఆయుర్వేదంలో మహా ఔషధంగా పిలుస్తారు. వాత, పిత్త, కఫ దోషాలను సమతూకం చేయగలదు. ప్రధానంగా ఆమ వాత రోగాన్ని నిర్మూలిస్తుంది. 2. మిరియాలు – 150 గ్రా. : మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్ అధికంగా కలిగి ఉండి జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. 3. పిప్పళ్లు – 50 గ్రా. : దీన్ని రసాయన గుణకారిణి అంటారు. అరుగుదలకు బాగా ఉపయోగపడటమే కాకుండా గర్భాశయ శుద్ధికి దోహదపడుతుంది. రక్తాన్ని పెంపొందిస్తుంది. 4. వాములయు మిరియాలు – 50 గ్రా.: దీన్నే వాయు విడంగాలు అని కూడా పిలుస్తారు. జీర్ణవ్యవస్థలో ఉండే పలు రకాల రుగ్మతలను తొలగించడంతో పాటు మంచి డీవార్మింగ్ దినుసుగా ఉపయోగపడుతుంది. 5. తోక మిరియాలు – 50 గ్రా. : వీటిని చలువ మిరియాలు అంటారు. శరీరానికి చలువ చేస్తూ గుండె రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు నాలుకపై రుచి గ్రంథుల వృద్ధికి, మూత్ర వ్యవస్థ శుద్ధికి చాలా ఉపయోగకారిణి. 6. వాము – 200 గ్రా.: మనుషులు వామును ఎక్కువగా జీర్ణాశయ సమస్యలకు ఉపయోగిస్తారు. కానీ, పశువుల్లో పాల స్రావాన్ని మెరుగుపరిచే చను గ్రంథులకు శ్రీరామరక్షగా వాము ఉపయోగపడుతుంది. 7. పాల ఇంగువ – 100 గ్రా.: ఇది ఒక యాంటీ మైక్రోబియల్ దినుసు. సుఖ విరేచనకారి గాను, నరాల ఉత్తేజకారిణిగాను ఉపయోగ పడుతుంది. 8. వెల్లుల్లి – 300 గ్రా. : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అనే నానుడి ఉండనే ఉంది. వెల్లుల్లి కూడా అంతే. ఇది ప్రధానంగా పరాన్న భుక్కులను సమూలంగా నశింపజేస్తుంది. 9. మెంతులు – 150 గ్రా.: మెంతులు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వలన పశువులో పొదుగు వాపు దరిచేరనీయక పాల రుచిని బాగా పెంచుతుంది. 10. మోదుగుపువ్వు – 300 గ్రా.: శివునికి ఇష్టమైన పువ్వు. ఇవి కడుపులోని బద్దె పురుగుల నివారణకు, చర్మ వ్యాధుల వలన వచ్చే దురదలను అలాగే విషతుల్యాల నుంచి రక్షణ కల్పిస్తాయి. 11. దాల్చిన చెక్క – 50 గ్రా.: ఇందులోని 41 సమ్మేళనాలు అనేక రుగ్మతలపై విశేషంగా పనిచేస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నివారిణిగా, మెదడుకు రక్షణ కారిణిగా పనిచేస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 12. నల్లనువ్వులు లేదా వేరు పిసరాకు – 1.5 గ్రా.: జింక్, థయామిన్, ఐరన్, కాల్షియం, విటమిన్–ఇ సమృద్ధిగా ఉండటం వలన వీటిని ఆంగ్లంలో పవర్ హౌజ్ అని పిలుస్తారు. పశువులను ముఖ్యంగా యువి కిరణాల నుంచి నల్ల నువ్వులు రక్షిస్తాయి. నోటి పూతల నివారణకు ఉపయోగపడుతుంది. నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు వేరు పిసర ఆకులో కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిలో దేనినైనా వాడుకోవచ్చు. 13. ఉలవలు 1.5 కిలోలు : వీటిలో పోషక విలువల అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో విశేషంగా పనిచేస్తాయి. 14. తాటి బెల్లం – 1.5 కిలోలు : ఐరన్ అధికంగా ఉంటుంది. జీర్థాశయ ఎంజైముల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. పేగుల్లో ఉన్న విషతుల్యాలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. 15. యాలకులు – 50 గ్రా. : యాలకులలో టర్పనైన్, లియోనెన్, టెర్ఫినోల్ లాంటి రసాయనాలు ఉన్నాయి. ఉదర సంబంధమైన అజీర్తి, మలబద్ధకాన్నే కాకుండా అల్సర్‌ను సైతం నివారిస్తాయి. 16. లవంగాలు – 100 గ్రా. : ఇవి రక్తాన్ని గడ్డకట్టడంలోనూ, నొప్పులు, వాపులు నియంత్రించడంలోనూ, రక్త ప్రసరణలోనూ, సంతాన ఉత్పత్తిలోనూ పశువులలో చక్కగా పనిచేస్తాయి. పైన ఉదహరించిన దినుసులను దంచి మిశ్రమంగా చేసుకొని తగు పాళ్లలో ఆవ నూనె (750 ఎం.ఎల్. నుంచి ఒక లీటరు వరకు) కలుపుకొని తడి తగలకుండా 2 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. వాడే విధానం : పెద్ద పశువులకు రోజుకోసారి 50 గ్రా. మోతాదులో, దూడలకు రెండు నెలలు దాటిన దగ్గర నుంచి 5–20 గ్రాముల మోతాదులో తినిపించాలి. ప్రతి రోజూ అక్కర్లేదు. వరుసగా నెలకు 10–15 రోజులకు తగ్గకుండా వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమంతో పశువులను అనేక రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. అంతే కాకుండా దుకాణాల్లో దొరికే మినరల్ మిక్చర్, కాల్షియం వాడకంతో పని లేకుండా అనేక సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం. పైన చెప్పిన మోతాదులో తయారుచేసుకున్న హెర్బల్ మిక్చర్ 10 పెద్ద పశువులకు, 5 దూడలకు (10 రోజులు) సరిపోతుంది. – వల్లూరు రవి కుమార్ (90300 17892), సురభి గోశాల వ్యవస్థాపకులు,పేరకలపాడు, కంచికచర్ల మం., కృష్ణా జిల్లా, ఏపీ ప్రభుత్వ గోపుష్టి ప్రాజెక్టు సలహాదారు, డా.వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కార గ్రహీత. -
గణనీయంగా పెరిగిన గుడ్లు, మాంసం ఉత్పత్తి
సాక్షి, అమరావతి: రాష్రంలో గుడ్లు, మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తి 15 శాతం, మాంసం ఉత్పత్తి 11.76 శాతం పెరిగాయి. 2019–20లో 8.50 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి కాగా 2020–21లో 9.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిందని పశుసంవర్ధకశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 2019–20లో 2,170.77 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా 2020–21లో 2,496.39 కోట్లు ఉత్పత్తి అయినట్లు అంచనా వేశారు. 2020–21లో 147.13 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ అంచనాలను రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కేంద్రానికి పంపించింది. కేంద్రం ఆమోదిస్తే వాటి విలువ ఎంత అనేది కూడా తేలనుందని అధికారులు తెలిపారు. మరోపక్క తాజా గణాంకాల మేరకు రాష్ట్రంలో మొత్తం 3,40,68,177 పశుసంపద ఉంది. ఇందులో అత్యధిక పశుసంపద అనంతపురం జిల్లాలో 66.06 లక్షలుండగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 14.44 లక్షలు ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరగతి రైతుల వద్ద ఎక్కువగా పశుసంపద ఉంది. కరువు పరిస్థితుల్లో ఆ రైతులకు ప్రధాన ఆదాయవనరు పశుసంపదే. రాష్ట్రంలో మొత్తం 46,00,087 ఆవులు ఉండగా 62,19,499 గేదెలున్నాయి. 1,76,26,971 గొర్రెలుండగా 55,22,133 మేకలు ఉన్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో మేకలు, గొర్రెల సంపద గణనీయంగా పెరిగింది. గతంలో గొర్రెలు 135.60 లక్షలుంటే తాజా గణాంకాల ప్రకారం 176.26 లక్షలకు, మేకలు 44.96 లక్షల నుంచి 55.22 లక్షలకు పెరిగాయి. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలకు పాడిపశువులు రాష్ట్రంలో మరింత పాలు, మాంసం ఉత్పత్తి పెంచడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు జీవనోపాధి మెరుగుపరచడం ద్వారా ఆర్థికంగా వారి కాళ్లమీద వారే నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత ద్వారా ఆర్థికసాయం అందించింది. వారు కోరుకున్న మేరకు పాడి పశువులు, మేకలు, గొర్రెలు కూడా సమకూర్చేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు జగనన్న పాలవెల్లువ కింద 1,12,008 యూనిట్లను అందజేయాలని, అలాగే జగనన్న జీవక్రాంతి ద్వారా 72,179 యూనిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 70 శాతం మేర యూనిట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. పాల ఉత్పత్తి పెంచేందుకు నాణ్యమైన దాణా రైతుభరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు నాణ్యమైన పశువుల దాణాను సబ్సిడీపై సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మినరల్, మిశ్రమ లవణాలు ఉన్న దాణాను సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద 20 వేల ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో పశుగ్రాసం పెంచేందుకు చర్యలను చేపట్టాం. ఈ చర్యలతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. చేయూత మహిళలకు జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి ద్వారా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను రాష్ట్రం నుంచే సరఫరా చేస్తున్నాం. – అమరేంద్రకుమార్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ -
అక్కచెల్లెమ్మలకు రోజూ సుస్థిర ఆదాయం
పాదయాత్రలో నేను ‘పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట..’ అన్నాను. ఆ మాటలను ఇవాళ గుర్తుకు తెచ్చుకుంటే సంతోషంగా ఉంది. కేవలం వ్యవసాయంతోనే బతకడం కష్టం. ఆదాయం పెరగాలంటే పాడి సహకారం అవసరం. అందుకే ఆసరా, చేయూత పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచాం. వారికి ఇచ్చిన డబ్బులు సద్వినియోగం అయ్యేలా, జీవిత కాలం.. మరో శతాబ్దం పాటు వారికి మేలు కలిగేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. –సీఎం వైఎస్ జగన్ లీటర్‌కు రూ.15 అదనంగా వచ్చాయి నేను ప్రైవేటు డెయిరీలో గతంలో పాలు పోసేదాన్ని. అప్పుడు లీటరుకు రూ.33 నుంచి రూ.35 పడింది. అమూల్ కేంద్రంలో ఇప్పుడు అదే పాలకు రూ.50 వచ్చాయి. అంటే రూ.15 అదనం. చాలా సంతోషంగా ఉంది. లీటరుకు రూ.33 ఇస్తుంటే ఏం లాభం అని అందరూ పాడి తీసేయాలనుకుంటుంటే మీరు ఇలా మేలు చేశారు. ఎప్పుడూ మీరే సీఎంగా ఉండాలి అన్నా. – జట్టి విజిత, అల్లూరు, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, ఆసరా అక్కచెల్లెమ్మలకు పాడి పశువుల ద్వారా ప్రతి రోజూ మెరుగైన సుస్థిర ఆదాయం కల్పించాలనే లక్ష్యంతోనే ఏపీ–అమూల్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వారికి శాశ్వతంగా జీవిత కాలం ఆదాయం కల్పించడానికి వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. లీటర్ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.7 వరకు ఇస్తారన్నారు. ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు తొలి దశ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. తొలి దశలో చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో 400 గ్రామాల్లో పాలసేకరణ ప్రారంభించడంతో పాటు లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు సీదిరి అప్పలరాజు, కన్నబాబు, బాలినేని, పెద్దిరెడ్డి, అమూల్ ఎండీ ఆర్ఎస్ సోథి తదితరులు ఇవాళ్టి ప్రాజెక్టుతో ఆ కల సాకారం ► నా పాదయాత్రలో లీటర్ వాటర్ బాటిల్‌ను రైతులు తీసుకు వచ్చారు. ఒక లీటరు వాటర్ ధర రూ.21 ఉంది. ఈ రోజు పాల ధర కూడా అంతే ఉందని చెప్పి బాధపడ్డారు. నాకు బాగా గుర్తుంది. అప్పుడే పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయించుకున్నాను. ► సహకార రంగాన్ని బలపరచాలి. మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచాలి. మనం రూ.4 ఎక్కువగా ఎప్పుడైతే సహకార రంగం నుంచి ఇస్తామో, అప్పుడు ప్రైవేటు డెయిరీలు కూడా రేట్లు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా రేట్లు పెరుగుతాయి. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు ఆదాయం పెరిగి మేలు జరుగుతుంది. ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టాం. పాలు పోసే అక్కచెల్లెమ్మలే ఓనర్లు ► ఈ ఏడాది జులై 21న మన ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. తద్వారా రైతులకు లీటర్ పాలకు దాదాపు రూ.5 నుంచి రూ.7 వరకు అదనంగా దక్కుతుంది. అమూల్ అన్నది సహకార ఉద్యమం, దానికి ఓనర్స్ ఎవరూ లేరు. పాలు పోసే అక్కచెల్లెమ్మలే ఓనర్లు. ► ఎక్కువ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత లాభాలను కూడా బోనస్‌గా సంవత్సరానికి రెండు సార్లు చొప్పున ఇస్తారు. అమూల్ భారతదేశంలోనే కాదు ప్రపంచంతో పోటీపడే కంపెనీ. ఈ మధ్య కాలంలో ఐఎఫ్సీఎన్ (ఇంటర్నేషనల్ ఫార్మ్ కంపేరిజన్ నెట్వర్క్) ఇచ్చిన రిపోర్టు చూస్తే అమూల్‌కి 8వ స్థానం దక్కింది. అమూల్ స్టాల్‌లోని ఉత్పత్తులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 9,899 గ్రామాల్లో బీఎంసీలు ► రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాల్లో రూ.3 వేల కోట్లతో బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీ), ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు (ఏఎంసీయూ) ఏర్పాటు చేస్తున్నాం. బీఎంసీలు రెండు వేల లీటర్ల పాలను స్టోర్ చేయగలిగిన సామర్థ్యంతో ఉంటాయి. ► తొలివిడతగా ఈ రోజు చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాల సేకరణ మొదలు పెడుతున్నాం. త్వరలోనే ఇది ప్రతి నియోజకవర్గం.. 9,899 గ్రామాలకు విస్తరిస్తుంది. పాల సేకరణ తర్వాత 10 రోజుల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి. ఎక్కడా మధ్యవర్తులు ఉండరు. కమీషన్లు ఇచ్చుకోవడం ఉండదు. 4.69 లక్షల మందికి ఆవులు, గేదెలు ► మహిళలు మోసపోకుండా మంచి ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించడంలో భాగంగా ఐటీసీ, అలానా గ్రూప్ వంటి అనేక పెద్ద పెద్ద సంస్థలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాం. ► ఇందులో భాగంగానే 4.69 లక్షల మంది మహిళలు ఆవులు, గేదెలు ఇవ్వండని అడిగారు. ఒకేసారి అన్ని యూనిట్లు దొరకవు కాబట్టి (ఒక యూనిట్ అంటే ఒక గేదె లేదా ఆవు) దశల వారీగా ఇస్తాం. ఇవాళ 7 వేల యూనిట్లు పంపిణీ చేస్తున్నాం. ► వచ్చే ఏడాది ఫిబ్రవరికి లక్ష యూనిట్లు, ఆగస్టు నుంచి మళ్లీ ఫిబ్రవరి వరకు మరో 3.69 లక్షలకుపైగా యూనిట్లు పంపిణీ చేస్తాం. ఒక్క రూపాయి కూడా అక్కచెల్లెమ్మలు పెట్టాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు స్వయంగా కూడా పశువులను కొనుగోలు చేయవచ్చు. ► పంజాబ్, హరియాణా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి అధిక పాల దిగుబడినిచ్చే ఆవులు, గేదెలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. 10న గొర్రెలు, మేకలు పంపిణీ ► డిసెంబర్ 10వ తేదీన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు కూడా ప్రారంభిస్తున్నాం. ఒక్కో యూనిట్లో 15 గొర్రెలు, మేకలు ఉంటాయి. దాదాపుగా 77 వేల రిటైల్ షాపులు హిందుస్థాన్ లీవర్, ఐటీసీ సంస్థల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో ఇప్పటికే ఏర్పాటు చేయించాం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలసి నడవడానికి ముందుకు వచ్చిన అమూల్ సంస్థకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ► ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, సీఎస్ నీలం సాహ్ని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, కైరా మిల్క్ యూనియన్ (అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ పాల్గొన్నారు. ఏపీలో మహిళలు ఘన విజయం సాధిస్తారు మొదటి సారి ఒక రాష్ట్రం సహకార ఉద్యమాన్ని తన ఉద్యమంగా భావించింది. ఏపీ ఇప్పటికే మత్స్య, పౌల్ట్రీ ఉత్పత్తుల్లో అగ్ర స్థానాల్లో ఉంది. ఇప్పుడు పాల ఉత్పత్తిలో కూడా ముందడుగు వేస్తోంది. ఏపీలో ప్రజలు అంకిత భావం ఉన్న వారు. ఏపీలో మహిళలు ఘన విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. – వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రొఫెసర్ సశ్వత ఎన్.బిస్వాస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ (ఇర్మా), డైరెక్టర్ సీఎం కృషి వల్లే ఇదంతా.. 36 లక్షల రైతుల కుటుంబాలు అమూల్‌కు ఓనర్లుగా ఉన్నాయి. ఇది రైతుల సంస్థ. ఏ కంపెనీ అయినా తక్కువ ఖరీదుకు కొని ఎక్కువ డబ్బుకు అమ్మాలని తన సీఈఓకు చెబుతుంది. కాని అమూల్లోని 18 మంది బోర్డు సభ్యులు.. ఎక్కువ రేటుకు పాలు కొని, వినియోగదారులకు సరసమైన ధరలకే అమ్మాలని చెబుతారు. మీ కళ్లముందే అన్నీ జరుగుతాయి. ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. – డాక్టర్ ఆర్.ఎస్.సోథి, ఎండీ,గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) రెట్టింపు డబ్బులొస్తున్నాయి గతంలో నాకు నాలుగు ఎనుములు (గేదెలు) ఉండేవి. మీ నాన్నగారు ఉన్నప్పుడు లోన్ శాంక్షన్ అయితే కొనుక్కున్నాం. లీటరుకు 4.5 వెన్న శాతం వస్తే.. రూ.25 వచ్చేవి. 4 లీటర్ల పాలు పోస్తే రోజుకు వంద రూపాయలు వచ్చేవి. అదే పనికి పోతే ఎక్కువ డబ్బులు వస్తాయని మూడు ఎనుములు అమ్మేసి, ఒకటి ఉంచుకున్నాం. ఇప్పుడు అదే పాలను అమూల్ డెయిరీకి తీసుకెళ్లి పోశాం. 6.5 వెన్న శాతంతో లీటరుకి రూ.50 డబ్బులు పడింది. నాలుగు లీటర్ల పాలు పోస్తే రోజుకు రూ.200 వచ్చాయి. – అశ్వని, నల్లపురెడ్డి పల్లె, వైఎస్సార్ కడప జిల్లా. ఇదీ మన గ్రామ స్వరూపం రాబోయే రోజుల్లో గ్రామ స్వరూపం పూర్తిగా మారుతుంది. గ్రామంలోకి అడుగు పెట్టగానే గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అందులో పనిచేసే వాళ్లు కనిపిస్తారు. నాలుగు అడుగులు ముందుకేస్తే ఇంగ్లిష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. అదే గ్రామంలో ఇటువైపు అడుగులు వేస్తే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అందులో ఒక ఏఎన్ఎం 24 గంటలు 51 రకాల మందులతో అంటుబాటులో ఉంటారు. ఆ క్లినిక్ ఆరోగ్యశ్రీకి రిఫరల్ పాయింట్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే.. ఆర్బీకే, బల్క్ మిల్క్ యూనిట్, మరో నాలుగు అడుగులు వేస్తే రాబోయే రోజుల్లో జనతా బజార్ కనిపిస్తుంది. రొయ్యలు, చేపలు మన గ్రామంలో పండించే పంటలు అక్కడ దొరుకుతాయి. విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు మన గ్రామంలోనే వలంటీర్ చేయి పట్టుకుని సహాయం చేసే పరిస్థితి కళ్ల ఎదుటనే కనిపిస్తుంది. ఒక్క సంవత్సరంలో ల్యాండ్ స్కేప్ పూర్తిగా మారిపోతుంది. -
వైఎస్సార్ చేయూత, ఆసరా మహిళలకు నేడు పశువుల పంపిణీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. దీంతోపాటు అమూల్ కార్యకలాపాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పశువుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాలను విక్రయించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నగదును పంపిణీ చేస్తారు. ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో భాగంగా పాలసేకరణ, మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. ఈ నెల 5వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు లక్ష యూనిట్లు, అలాగే వచ్చే ఏడాది ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరిల మధ్య 3.68 లక్షల పాడిపశువుల యూనిట్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్‌ను కలసిన అమూల్ ఎండీ సోధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) ఎండీ ఆర్.ఎస్.సోధి మంగళవారం కలిశారు. సీఎం జగన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. సోధితోపాటు కైరా మిల్క్ యూనియన్(అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ ఉన్నారు. -
నవంబరు 26న పాడి పశువుల పంపిణీ
-
పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, ఆసరా లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆయా శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా లబ్ధిదారులు, వారికి ఇవ్వనున్న పాడి పశువులు తదితర అంశాలపై సీఎం నిశితంగా సమీక్షించారు. అధికారులు వివరాలను అందించారు. 2,11,780 ఆవులు, 2,57,211 గేదెలు, 1,51,671 గొర్రెలు, 97,480 మేకల పంపిణీకి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. (చదవండి: 26 వేల కోట్లతో పేదలకు ఇళ్లు) లబ్ధిదారులకు ఇవ్వనున్న ప్రతి పశువునూ పశు సంవర్థక శాఖ అధికారులు భౌతికంగా తనిఖీ (ఫిజికల్ వెరిఫికేషన్) చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాను ఆర్బీకేల పరిధిలో రిజిస్టర్ చేయనున్నారు. ప్రతి నెలా పశువు అరోగ్యాన్ని వైద్యుడు పరిశీలించనున్నారు. పాడి పశువుకు ఇచ్చే ఆరోగ్య కార్డులో ఎప్పటికప్పుడు పశు వైద్యులు వివరాలు నమోదు చేయనున్నారు. అలాగే పాడి పశువు ఇచ్చే పాల దిగుబడి కూడా నమోదు చేయనున్నారు. నవంబరు 26 నుంచి తొలిదశలో పాడి పశువుల పంపిణీ జరగనుంది. వర్చువల్ విధానంలో 4 వేల గ్రామాల్లో పంపిణీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తొలుత ప్రకాశం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. తర్వాత దశల వారీగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పెట్టుబడికి కచ్చితంగా గిట్టుబాటు రావాలని, అందుకనే జాతుల ఎంపికలో జాగ్రత్త వహించాలని తెలిపారు. ‘‘ పర్జేజ్ కమిటీ బలంగా ఉండాలి. ఆ కమిటీలో కచ్చితంగా సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు ఉండాలి. బీమా సంస్థ ప్రతినిధితో పాటు, బ్యాంకర్ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలి. వెటర్నరీ సర్వీసులు కూడా బలోపేతం చేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకోవాలని’’ సీఎం సూచించారు. (చదవండి: సీఎం జగన్ ఆదేశంతో 108 కోట్లు మిగులు) పాడి పశువులకు ఎలాంటి సమస్య వచ్చినా ఆర్బీకేల పరిధిలో వెంటనే వాటికి వైద్యం అందాలని సీఎం ఆదేశించారు. ఆ స్థాయిలో అధికారులు సన్నద్ధం కావాలని నిర్దేశించారు. ఆర్బీకేల పరిధిలో ఏర్పాటు చేస్తున్న వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలను పశువుల వైద్యానికి వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. ‘‘కాల్ సెంటర్ల ఏర్పాటు, వాటి ద్వారా వైద్యం అందేలా చూడాలి. పశు దాణా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలి. పశు దాణాలో రసాయనాలు (కెమికల్స్) లేకుండా చూడాలి. సహజమైన పదార్థాలతో దాణా తయారయ్యేలా చూడాలి. రసాయనాలో కలుషితమైన ఆహారం కారణంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరుగుతున్నాయి. సేంద్రీయ పద్దతులకు పెద్ద పీట వేయాలి. సేంద్రీయ (ఆర్గానిక్) పాలు, సేంద్రీయ మాంసం ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీని వల్ల మరింత ధర లభించే అవకాశం ఉంటుంది. సేంద్రీయ పాల బ్రాండ్‌ను మరింత ప్రమోట్ చేయాలి. దీనిపై మహిళలకు మరింత అవగాహన కల్పించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. చేయూత, ఆసరా పథకాల కింద గ్రామాల్లో మహిళలు ఏర్పాటు చేసుకున్న చిల్లర దుకాణాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కలిపి 78 వేల దుకాణాలు ప్రారంభం అయ్యాయని అధికారులు తెలిపారు. చేయూత కింద కొత్తగా లబ్ధి పొందిన 2.78 లక్షల మంది నుంచి కూడా ఆప్షన్లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వారు కూడా సుస్థిర జీవనోపాధి పొందేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. -
లబ్ధిదారుల ఇష్టం మేరకే పాడి పశువుల కొనుగోలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లోని మహిళా లబ్ధిదారులు పాడిపశువులను రాష్ట్రంలోగానీ, ఇతర రాష్ట్రాల్లోగానీ కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాడిపశువుల కొనుగోలుకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య విడుదల చేశారు. 45 నుంచి 60 సంవత్సరాల్లోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మహిళలకు వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలు అందజేసినట్లు తెలిపారు. పాల ఉత్పత్తిదారుల ఆదాయం పెంపు, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పాల ఉత్పత్తి పెరుగుదలకు ఆర్బీకేల్లో మేలిరకం పశువుల మేత, దాణా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. దాదాపు 5.63 లక్షల మంది మహిళలు ఆవులు, గేదెల కొనుగోలుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న మేరకు.. ► ముర్రా జాతి గేదెలు, జెర్సీ, హెచ్ఎఫ్ సంకరజాతి అవులు, గిరి, సహావాల్ దేశీయరకం ఆవులను పాడివైనా, చూడివైనా కొనుక్కోవచ్చు. ► ఇనాఫ్ ట్యాగ్ ఉన్న వాటినే సెర్ప్, పశుసంవర్ధకశాఖల సిబ్బంది పర్యవేక్షణలో రాష్ట్రంలోగానీ, ఇతర రాష్ట్రాల్లోగానీ కొనుగోలు చేసుకోవచ్చు. ► పాల దిగుబడి, పశువు వయసు, లక్షణాలను బట్టి ధర నిర్ణయించాలి. ► అమ్మకందారులు తమకు సమీపంలోని ఆర్బీకేల వద్దకుగానీ, పశువిక్రయ కేంద్రాలకుగానీ పశువులను తరలించాలి. ► పశుసంవర్ధకశాఖ వైద్యులు పరిశీలించి వ్యాధులు లేవని నిర్ధారించిన తరువాత లబ్ధిదారులు కొనుగోలు చేయాలి. ► మేలిరకం జాతి ఎంపిక, కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లబ్ధిదారులకు శిక్షణ ఇస్తారు. ► పశువుల రవాణా, బీమా తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ► పశువుల ధర రూ.75 వేలకు మించితే అదనపు మొత్తాన్ని లబ్ధిదారులే భరించాలి. ► పశువుల రవాణా ఖర్చులను ముందు లబ్ధిదారులు భరించాలి. వాటి రశీదులను బ్యాంకర్లకు ఇచ్చి ఆ ఖర్చులు పొందవచ్చు. -
టీకాలతో పాడి పశువుల ఆరోగ్య రక్షణ
పాడి పశువులను రైతు ప్రతి రోజూ గమనించాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనపడితే తక్షణమే సంబంధిత పశువైద్యునిచే చికిత్స చేయించాలి. అశ్రద్ధ కనబరిస్తే నష్టం అపారంగా ఉంటుంది. అందుకు పాడి పశువుల ఆరోగ్యం పరిరక్షణ కార్యక్రమాల పట్ల అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి. పాడిపశువులకు వ్యాధులు రాకముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పాడి పశువులకు అంటువ్యాధులు సోకక ముందే నివారణ చర్యగా వ్యాధినివారణ టీకాలు వేయించడం ఎంతైనా మంచిది. చికిత్స కన్నా వ్యాధి నివారణ మిన్న. పాడి పశువులు అంతః, బాహ్య పరాన్న జీవులకు లోనయినప్పుడు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పశువులకు వచ్చే సాధారణ వ్యాధులు: ► సూక్ష్మజీవుల (బాక్టీరియా) వలన కలిగే వ్యాధులు – ఉదా.. గొంతువాపు, జబ్బవాపు, దొమ్మ, బ్రూసెల్లోసిస్. ► సూక్ష్మాతి సూక్ష్మ జీవులు (వైరస్) వలన కలిగే వ్యాధులు – ఉదా.. గాలికుంటు, శ్వాసకోశవ్యాధి, మశూచి వ్యాధి. ► అంతర పరాన్న జీవుల వలన కలిగే వ్యాధులు– ఉదా.. కుందేటి వెర్రి (సర్రా), థైలేరియాసిస్, బెబీసియోసిస్, కార్జపు జలగవ్యాధి, మూగబంతి. ► ఇతర వ్యాధులు– ఉదా.. పాల జ్వరం, పొదుగు వాపు, చర్మవ్యాధులు, దూడల మరణాలు. ► రైతులు తమ పశు సంపదను శాస్త్రీయ యాజమాన్య పద్ధతులలో పోషించి, సాధారణంగా వచ్చే వ్యాధుల గురించి, వాటి నివారణ పద్ధతులపై సరైన అవగాహన ఏర్పరచుకొని రక్షించుకున్నట్లయితే ఆర్థికంగా ఎంతో లాభపడతారు. పశువులలో సామాన్యంగా వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు – చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. -
మూగ జీవాలపై పులి పంజా
సాక్షి, ఎల్లారెడ్డిరూరల్: అటవీ ప్రాంతం శివారులో మేతకు వెళ్ళిన పశువులపై చిరుత పులుల దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. దీంతో పశువులను మేతకు తీసుకువెళ్ళేందుకు పశువుల కాపరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. ప్రధానంగా అడవులు అధికంగా ఉన్న ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, వర్ని, మాచారెడ్డి, సిరికొండ, ఇందల్వాయి, బిచ్కుంద తదితర మండలాల్లో ఇటీవల చిరుతపులి వరుసగా దాడులు చేయడంతో మేకలు, గొర్రెలు, లేగదూడలు మృతి చెందాయి. దీంతో పశువుల యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల్లో 12 మేకలు, 4 లేగ దూడలు.. చిరుతపులి గడిచిన నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలోని పలు మండలాల్లో పశువులపై దాడులు చేయడంతో 12 మేకలు, గొర్రెలతో పాటు 4 లేగ దూడలు మృత్యువాత పడ్డాయి. గత నెల 10న జిల్లాలోని లింగంపేట మండలంలోని సురాయిపల్లి అటవీప్రాంతంలో లింగంపేట మండల కేంద్రంలోని శంకర్ పంతులుకు చెందిన లేగ దూడపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది. ఈనెల ఒకటిన ఎల్లారెడ్డి మండలంలోని అడ్విలింగాలలో గంగెడ్ల రమేశ్‌కు చెందిన 3 లేగ దూడలను చిరుత పులి పశువుల కొట్టంపై దాడి చేసి ఎత్తుకెళ్ళింది. వారం రోజుల్లో 3 లేగ దూడలను చిరుత ఎత్తుకెళ్ళిందని బాధితుడు తెలిపారు. ఈనెల 8న ఎల్లారెడ్డి మండలంలోని సోమర్యాగడి తండాలోని ఆంగోత్ లాల్‌సింగ్‌కు చెందిన రెండు మేకలపై చిరుతపులి తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో దాడి చేసి ఎత్తుకెళ్ళినట్లు బాధితుడు తెలిపారు. ఈనెల 15న లింగంపేట మండలంలోని ఎక్కపల్లితండాలోని మోజీరాంకు చెందిన రెండు మేకలను చిరుత హతమార్చింది. వారం క్రితం ఇదే ప్రాంతంలో రూప్సింగ్, రావుజీ, కిషన్‌లకు చెందిన 10 మేకలపై చిరుతదాడి చేసిందన్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా చిరుతపులి దాడులు చేయడంతో పశువులను మేతకు తీసుకుని వెళ్లాలంటేనే భయమేస్తోందని పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు. అందని నష్ట పరిహారం.. వన్యప్రాణుల ద్వారా మృతి చెందిన పశువులకు, వణ్య ప్రాణుల ద్వారా దాడులలో గాయపడిన వారికి అటవీశాఖ నుంచి ఎలాంటి నష్ట పరిహారం అందడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు తమకు బతుకుదెరువుగా ఉన్న మూగ జీవాలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా వీటిపై చిరుతపులి దాడులు చేసి హతమార్చడంతో జీవనోపాధి కోల్పోతున్నామని పశువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులు మృత్యువాత పడడంతో వాటికి రావాల్సిన నష్ట పరిహారంపై అధికారులకు విన్నవించినా ఇంతవరకు ఎలాం టి నష్ట పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పశువులు పోయిన వాటికి నష్ట పరిహారం అందిస్తే వాటి స్థానంలో మరో వాటిని కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చిరుతదాడిలో మృతి చెందిన వాటికి నష్ట పరిహారం అందించాలని బాధితులు వేడుకుంటున్నారు. చిరుత దాడిలో మృతి చెందిన లేగ దూడ రెండేళ్లైనా పరిహారం అందలేదు.. మేకలను మేతకు తీసుకువెళ్ళిన సమయంతో చిరుతపులి దాడి చేసి తన 5 మేకలను హతమార్చింది. దీనికి సంబంధించి రూ.30 వేల నష్టం వచి్చంది. నష్టం జరిగి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ అటవీశాఖ అధికారుల నుంచి నష్ట పరిహారం అందలేదు. – రావుజ్యా, సోమర్యాగడి తండా. నష్ట పరిహారం వర్తించదు.. చిరుత దాడిలో మేకలు, గొర్రెలు మృతి చెందితే వాటికి నష్ట పరిహారం వర్తించదు. కేవలం పాడి పశువులు, మనుషులపై దాడులు చేస్తేనే వాటికి నష్ట పరిహారం అందుతుంది. లేగదూడలకు సంబంధించి అధికారులకు ప్రతిపాదనలు పంపిం చాం. నిధులు రాగానే వారికి అందజేస్తాం. పశువుల కాపరులు అటవీ ప్రాంతానికి పశువుల ను మేతకు తీసుకెళ్లద్లు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. – చంద్రకాంత్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారి. -
అక్రమార్కుల పా‘పాలు’
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ పాడి గేదెల పథకాన్ని కొందరు భ్రష్టుపట్టిస్తున్నారు. అక్రమార్కుల పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. 3, 4 లీటర్లు కూడా పాలివ్వని పశువులను కూడా రైతులతో కొనిపిస్తున్నారు. కొందరు అధికారులు, పశువైద్యులు, దళారులు కుమ్మక్కు అయి పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో పాలకొరత లేకుండా, స్వయంసమృద్ధి సాధించాలని సర్కారు సంకల్పించింది. అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ గేదెల పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ విజయ డెయిరీ, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్ డెయిరీల్లోని 2.13 లక్షల మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక పాడి పశువును సబ్సిడీపై అందజేయాలన్నది సర్కారు ఉద్దేశం. ఒక్కో పాడి పశువుకు రూ.80 వేలు యూనిట్ ధరగా నిర్దారించారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 75 శాతం సబ్సిడీ (రూ.60 వేలు) ఇస్తారు. అందులో మిగిలిన 25 శాతం (రూ.20 వేలు) లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. ఇతర లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ (రూ.40 వేలు) ఖరారు చేశారు. మిగిలిన 50 శాతం వాటాను లబ్ధిదారుడు తన వాటాగా చెల్లించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలి. యూనిట్ ధర రూ.80 వేలలో పాడి పశువు ధర, మూడేళ్ల బీమా, 300 కిలోల దాణా కూడా కలిపారు. కాబట్టి లబ్ధిదారుడు ఎలాంటి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. కమీషన్ల కోసం కుమ్మక్కు... నాలుగు డెయిరీల పరిధిలో 2.13 లక్షల మంది పాడి రైతులకుగాను ఇప్పటివరకు 57,567 మంది రైతులకు పాడి పశువులను సబ్సిడీపై ఇచ్చారు. అందులో విజయ డెయిరీ పరిధిలో 29,189 మంది రైతులు, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీకి చెందిన 13,878 మంది, ముల్కనూరు మహిళా డెయిరీకి చెందిన 2,942 మంది. కరీంనగర్ డెయిరీలో 11,558 మంది పాడి రైతులు ఇప్పటివరకు గేదెలు లేదా ఆవులు కొనుగోలు చేశారు. వయసు మళ్లిన వాటిని కొనుగోలు చేసి రైతులకు ఇస్తున్నారు. పాడి ఉత్పత్తి గేదెలలో కనీసం 6–10 లీటర్లు, ఆవులలో 8–12 లీటర్లు సామర్థ్యం కలిగి ఉండాలి. ముర్రా, గ్రేడేడ్ ముర్రా గేదెలు, ఆవు జాతి అయిన జెర్సీ, హోలిస్టిన్ సంకర జాతి పశువులను కొనవలసి ఉండగా నాటు పశువులను కొంటున్నారు. సబ్సిడీ గేదె బహిరంగ మార్కెట్లో రూ.30 వేలకు మించి ధర పలకదని, కానీ దాన్నే రూ.80 వేలకు కొనిపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేదెలను తీసుకొచ్చే ప్రాంతంలోని దళారులతో పశువైద్యులు కొందరు కుమ్మక్కు అయి ప్రతి గేదె పేరిట రూ.10 వేలకుపైగానే కమీషన్ కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గేదెలను తీసుకువచ్చే వాహనాల ఖర్చు కూడా రైతులతోనే పెట్టిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ఎన్నో సంతలుండగా, ఇతర రాష్ట్రాల్లో కొనిపిస్తూ రైతులను అప్పులపాలు చేస్తున్నారు. పాడి పశువులను కొనకపోతే ఇప్పటికే పోస్తున్న పాలు తీసుకోబోమని పాల కేంద్రాల నిర్వాహకులు, వైద్యం చేయబోమని కొందరు పశు వైద్యాధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని పాడి రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ను అడ్డుపెట్టుకొని అధికారులు ఎంతో ధీమాగా అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. పాడి గేదెల పంపిణీలో అవినీతి పాడిగేదెల పంపిణీలో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ పథకంతో రైతుకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కాంట్రాక్టర్లకు, పశువైద్యాధికారులకు పెద్ద ఎత్తున కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వం సరఫరా చేసే పాడిగేదె బహిరంగ మార్కెట్లో రూ.30 వేలకు మించి ఉండదు. రవాణా ఖర్చులు మాపైనే వేసేందుకు పశువైద్యులు ప్రయత్నిస్తున్నారు. దీన్ని నేను వ్యతిరేకించాను. – రాగీరు కిష్టయ్య, రైతు, జైకేసారం, చౌటుప్పల్ మండలం -
పట్టణాల్లోనూ గొర్రెల పథకం
సాక్షి, జనగామ: పట్టణ, విలీన గ్రామాల్లోను సబ్సిడీ గొర్రెల పథకం అమలు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జనగామ జిల్లాలోని పెంబర్తి, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో శనివారం చేప పిల్లలు, పాడి పశువులు, గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నివాసంలో విలేకరులతో.. ఆ తర్వాత ఆయా సభల్లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రూ.80 కోట్ల విలువైన చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పాడి రైతులకు రూ. 4 ప్రోత్సాహకం, 50 శాతంపై పాడి పశువులను అందిస్తున్నామని వివరించారు. 70 లక్షల గొర్రెలు ఇస్తే 35 లక్షల పిల్లలు పుట్టాయన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు రూ. 4 వేల పంట పెట్టుబడి పథకం ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ అందిస్తామన్నారు. కొన్ని రోజులు పాలు పోసి మానేసిన రైతులకు పాడి పశువులను అందించే విషయం ఆలోచిస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదేనని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కోదండరాం రాజకీయ నిరుద్యోగిగా మారి విమర్శలు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో ఈసారి బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని మంత్రి జోస్యం చెప్పారు. ఔను బెదిరిస్తాం.. తప్పేముంది? దేవాలయం కట్టిస్తే కబ్జా చేశాడని, అధికారి ఇంటికి వెళితే బెదిరించారని ముత్తిరెడ్డిపై విమర్శలు చేయ డం సరికాదని తలసాని పేర్కొన్నారు. అవసరమైతే బెదిరిస్తామని అందులో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. కార్యక్రమంలో శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గొర్లకాపరుల కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పాలు పోసినా దక్కని ‘పాడి పశువు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ ‘పాడి పశువు’కొంతమంది విజయ డెయిరీ రైతులకు దక్కడంలేదు. దశాబ్దాల తరబడి విజయ డైరీకి పాలు పోస్తున్న రైతుల్లో వేలాది మందికి ఈ పథకం వర్తించడంలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు 35 వేల మంది రైతులు సబ్సిడీ పాడి పశువులు పొందే అవకాశం కోల్పోయారు. మొత్తం లక్ష మంది రైతులు విజయ డెయిరీకి నిరంతరం పాల సేకరణలో చేదోడు వాదోడుగా ఉండగా వారిలో 65 వేల మందికి మాత్రమే సబ్సిడీ గేదెలు దక్కుతాయని అధికారులు తేల్చి చెప్పారు. 35 వేల మంది పాడి రైతుల్లో చాలామంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. నాలుగు డెయిరీల్లోని 2.13 లక్షల రైతులకు లబ్ధి తెలంగాణ విజయ డెయిరీ, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్ డెయిరీల్లోని 2.13 లక్షల మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక పాడి పశువును సబ్సిడీపై అందజేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. నాలుగైదు రోజుల్లో పలుచోట్ల గేదెలను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఒక్కో పాడి పశువుకు రూ.80 వేలు యూనిట్ ధరగా నిర్ధారించారు. దానికి అదనంగా రూ. 5 వేలు రవాణా, ఇతర ఖర్చుల కోసం సర్కారు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 75 శాతం సబ్సిడీ (రూ. 60 వేలు) ఇస్తారు. అందులో మిగిలిన 25 శాతం (రూ.20 వేలు) లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. ఇతరలబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ (రూ.40 వేలు) ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు సబ్సిడీపాడి పశువుల కోసం ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే పలుచోట్ల పాడి రైతులు తమ వాటాధనాన్ని చెల్లించారు. అయితే, విజయ డెయిరీలోని రైతుల్లో దాదాపు 35 వేల మంది వరకు సబ్సిడీ పాడిపశువులను పొందే అవకాశాన్ని కోల్పోయారు. ‘ఈ–లాభ్’లో నమోదు కాకపోవడం వల్లే... నాలుగు డెయిరీలకు చెందిన మొత్తం 2.13 లక్షల మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. అందులో విజయ డెయిరీకి చెందిన పాడి రైతులు 65 వేలు అర్హులుగా నిర్ధారించింది. పశు సంవర్థక శాఖ ఏర్పాటు చేసిన ‘ఈ–లాభ్’పోర్టల్‌లో నమోదైన రైతులకే సబ్సిడీ పాడి పశువులు పొందేందుకు అర్హులని పేర్కొంది. ఇది విజయ డెయిరీలోని 35 వేల మంది రైతులకు శాపంగా మారింది. వాస్తవంగా విజయ డెయిరీకి గ్రామాల్లో పాల సొసైటీల ద్వారా పాలు వస్తాయి. ఆయా సొసైటీలకు రైతులు పాలు పోస్తుంటారు. అయితే, గత నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని విజయ డెయిరీ యాజమాన్యం ఇవ్వలేదు. దీంతో అనేకమంది రైతులు తాము పాలు పోయమంటూ తేల్చిచెప్పారు. దీంతో జిల్లాల్లో ఉన్న పాల సొసైటీ యాజమాన్యాలు సొంతంగానే రైతులకు లీటరుకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకం ఇచ్చాయి. ఆ సమయంలోనే ఈ–లాభ్ పోర్టల్‌లో పాడి రైతుల సమాచారం నింపాలని, ఆ సమాచారం ఉంటేనే ప్రోత్సాహకం ఇస్తామని విజయ డెయిరీ యాజమాన్యం స్పష్టంచేసింది. అయితే అప్పటికే రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చిన స్థానిక పాల సొసైటీలు, తమ సొమ్ము వస్తుందో రాదోనని గమనించి కేవలం కొద్దిమంది రైతులే పాలు పోస్తున్నారనే సమాచారాన్ని నమోదు చేశారు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో 4 వేల మంది రైతులు పాలు పోస్తుంటే, ఈ–లాభ్‌లో మాత్రం 1,200 మంది పాడి రైతులే పాలు పోస్తున్నట్లు నమోదు చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది పాలు పోస్తుంటే, కేవలం 65 వేల మంది పేర్లనే నమోదు చేశారు. ఇదే కొంపముంచింది. ఈ–లాభ్‌లో ఉన్న రైతులనే సబ్సిడీ పాడి పశువుల పథకానికి ప్రమాణికం తీసుకోవడంతో విజయ డెయిరీకి పాలు పోసే రైతుల్లో 35 వేల మంది అర్హత కోల్పోయారు. కొన్నిచోట్ల వేలాది మంది రైతులు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహక సొమ్ము కూడా కోల్పోతుండటం పరాకాష్ట. పాడి రైతులకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇప్పుడు సబ్సిడీ బర్రెల పథకానికి నోచుకోవడం లేదు. దీన్ని పరిష్కరించడంలో పశు సంవర్థక శాఖ శ్రద్ధ చూపడంలేదు. వారందరూ అనర్హులంటూ భీష్మించుకు కూర్చుంది. ప్రైవేటు డెయిరీలు మాత్రం పాల పరిమాణానికి మించి రైతులను చేర్చుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. -
మరువలేని మమకారం
కర్ణాటక : తన కష్టసుఖాల్లో భాగమైన పాడి పశువులు శాశ్వతంగా దూరమయ్యాయని తెలిసి ఆ బడుగుజీవి కన్నపిల్లలనే కోల్పోయినంతగా రోదించాడు. ధారవాడ జిల్లా హొసయెల్లాపురలో బుధవారం ఉదయం ఈ విషాదం జరిగింది. మంగళవారం రాత్రి ఈదురుగాలులు, వర్షానికి గ్రామానికి చెందిన గురుప్రసాద్‌కు చెందిన పాక కూలిపోయింది. శిథిలాల కింద చిక్కి రెండు ఎనుములు, ఒక దూడ సజీవ సమాధి అయ్యాయి. ఉదయాన్నే ఈ ఘోరాన్ని గమనించిన గురుప్రసాద్ ఎనుములను గుండెలకు హత్తుకుని విలపించాడు. ఈ దృశ్యం చూపరుల హృదయాలను పిండేసింది. -
ఎక్కడైనా కొనుక్కోవచ్చు
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీపై అందించే పాడి పశువులను ఎక్కడైనా, ఎవరి వద్దయినా కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. లబ్ధిదారు ఏ రకమైన పాడి పశువునైనా కొనుగోలు చేసుకోవచ్చని.. దీనిలో సంబంధిత శాఖ, వ్యక్తుల జోక్యం ఉండదని పేర్కొంది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మంగళవారం తెలుగులో మార్గదర్శకాలు విడుదల చేశారు. తెలంగాణ విజయ డెయిరీ, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్ డెయిరీల్లోని 2.13 లక్షల మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక పాడి పశువును సబ్సిడీపై అందజేయనున్నారు. ఒక్కో పాడి పశువుకు రూ. 80 వేలు యూనిట్ ధరగా నిర్ధారించారు. అందుకు అదనంగా రూ.5 వేలు రవాణా, ఇతర ఖర్చుల కోసం కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 75% (రూ.60వేలు), ఇతరులకు 50%(రూ.40వేలు) సబ్సిడీ ఖరారు చేశా రు. మిగిలిన సొమ్మును లబ్ధిదారు చెల్లించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా పథకాన్ని అమలు చేయనున్నారు. పశువులను కొనుగోలు చేసిన చోటు నుంచి రైతు వద్దకు చేర్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. పథకానికి కావాల్సిన నిధులను విజయ డెయిరీ ఫెడరేషన్ ద్వారా సమకూర్చుతారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పాడి పశువుల కొనుగోలు ప్రారంభం కానుంది. -
సబ్సిడీపై 2.13 లక్షల పాడి పశువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2.13 లక్షల మంది పాడిరైతులకు సబ్సిడీపై గేదెలు, ఆవుల పంపిణీని ఆగస్టు మొదటివారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఇక్కడ ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయ, కరీంనగర్, ముల్కనూర్, మదర్ డెయిరీలకు పాలు పోస్తున్న 2.13 లక్షల మంది రైతులకు సబ్సిడీపై పాడిగేదెలు, పాడి ఆవులను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. ఒక్కో పాడిగేదెకు రూ. 80 వేలు కాగా ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీని వర్తింప చేస్తామని పేర్కొన్నారు. మొదటగా 15 వేల మంది లబ్ధిదారులకు గేదెలను పంపిణీ చేస్తామని, ప్రతినెలా 15 వేల నుండి 16 వేల పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ గేదెలను హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆయా రాష్ట్రాలలో గేదెల లభ్యత, నాణ్యతను పరిశీలించేందుకు డెయిరీల ప్రతినిధులు, అధికారులు, రైతులతో కూడిన బృందాలు పర్యటించినట్లు వివరించారు. రైతుల ఇష్టాఇష్టాలపై ఆధారపడే విధంగా పాడిగేదెల కొనుగోలు పథకం నిబంధనలు రూపొందిస్తామన్నారు. పశువుల కొనుగోలు విధివిధానాలను 2.13 లక్షల మంది సభ్యులకు తెలుగులో కరపత్రం రూపంలో ముద్రించి అందజేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బల్క్‌మిల్క్ చిల్లింగ్ సెంటర్ల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు అధికారులు స్థానిక డెయిరీతో కూడిన 300 బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పాడిగేదెల కొనుగోళ్లకు వెళ్లే లబ్ధిదారుల ఎంపిక తదితర బాధ్యతలను ఆయా డెయిరీ ఫెడరేషన్ చైర్మన్లు చేపట్టాలని మంత్రి సూచించారు. విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి ఈ కార్యక్రమాన్ని ఇతర డెయిరీల చైర్మన్లతో సమన్వయం చేస్తారన్నారు. కొనుగోలు చేసిన ప్రతి గేదెకు తప్పనిసరిగా బీమా చేస్తామని తలసాని చెప్పారు. ఇప్పటికే పాడిరైతులను ప్రోత్సహించేందుకు లీటర్ పాలకు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకోవాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు. లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ.. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన అన్ని విలీన గ్రామాల్లో నివసిస్తున్న గొల్ల, కురుమలకు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, వనపర్తి, కొల్హాపూర్ల్లో నివసిస్తున్న వారికి పంపిణీ చేయడానికి వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా మంత్రి తలసాని ఆదేశించారు. గతేడాది జూన్ 20వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రూ. 3,700 కోట్లతో 65 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు చెప్పారు. -
గోమా(ఫి)య
వారానికి రూ.4 కోట్లు.. నెలకు రూ.16 కోట్లు.. ఏడాదికి రూ.200 కోట్లు.. ఏంటి.. ఈ అంకెలనుకుంటున్నారా? కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పశువులపై జరుగుతున్న వ్యాపారం ఇది. వ్యవసాయం భారంగా మారిన తరుణంలో అన్నదాత పశుపోషణ వదులుకుంటున్నాడు. రైతు అవసరాల కోసం కొంత పశుసంపద ఉంచుకున్నా.. మిగిలినది మాత్రం పశు మాఫియా ద్వారా కబేళాలకు తరలుతోంది. ప్రకృతి అనుకూలించకపోవడం.. చీడపీడల బెడద.. అక్కరకు రాని ప్రభుత్వ పథకాలు.. గిట్టుబాటు కాని ధరలు.. ఆదుకోని ప్రభుత్వం.. వెరసి వ్యవసాయానికి దూరమై వేరే వ్యాపకాలు చూసుకుంటున్న రైతులు తాము ప్రేమగా పెంచుకున్న పశువులను అమ్ముకుంటున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో వారానికి ఒకరోజు జరిగే సంత పశువుల మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. రైతులు, పాడిపోషకులు, వ్యాపారులు ఇక్కడ పశువుల క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఈ సంతల ద్వారా మార్కెట్ యార్డు కమిటీలకు దండిగా ఆదాయం చేరుతోంది. ఈ మార్కెట్ యార్డుల కమిటీలను పశుమాఫియా తమ చేతి కీలుబొమ్మలుగా మార్చుకుని, పశు సంపదను దోచుకుని కబేళాలకు తరలిస్తోంది. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల, మాచర్ల, వినుకొండ, క్రోసూరులో పశువుల సంతలు ఉన్నాయి. వారంలో ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో పశువుల సంతలు నిర్వహిస్తుంటారు. కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేట యార్డు పరిధిలోని చిల్లకొల్లు గొర్రెల మండీలు, నందిగామ పశువుల సంతతో పాటు జీవాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఆయా సంతలో గేదెలు, దున్నలు, ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలు సంతలకు వస్తున్నాయి. ప్రతివారం వేల సంఖ్యలో వస్తుండగా, వచ్చిన వాటిలో 40శాతం మాత్రమే పాడిపోషణకు, వ్యవసాయ అవసరాలకు కొంటున్నారు. మిగిలిన 60 శాతం పాడి పశువులు, ఎద్దులు, ఆవులను తమిళనాడులోని కబేళాలకు తరలిస్తున్నారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో గోవులు, గేదెలను కుక్కి తీసుకెళ్తూ పట్టుబడిన కంటైనర్లు, లారీలే∙ఇందుకు నిదర్శనం. అంతా ‘అమ్మ’ కనుసన్నల్లో.. గుంటూరు జిల్లాలో జరిగే పశువుల సంతలో లావాదేవీలన్నీ మంత్రి సతీమణి కనుసన్నల్లో జరుగుతాయి. చిలకలూరిపేటలో మంత్రి కీలక అనుచరుడు రంగంలోకి దిగి ప్రైవేట్‌గా సంతనే నిర్వహిస్తున్నాడు. సంత చుట్టూ ప్రహరీ నిర్మించి బౌన్సర్లను నియమించుకున్నాడు. ఆ సంతలోకి వెళ్తే.. వారు చెప్పినట్టే రైతులు ఇచ్చుకోవాలి. కాదు.. అంటే బౌన్సర్ల చేతి దెబ్బలు తిని రావాలి. ఇక్కడి నుంచే మూగజీవాలు కబేళాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో ఏ సంతలో పశు క్రయవిక్రయాలు జరిగినా అమ్మ అనుమతితో పాటు మంత్రి అనుచరుడికి కప్పం చెల్లించాలి. చిలకలూరిపేటలో కప్పం చెల్లిస్తే రాష్ట్ర సరిహద్దుల వరకూ ఏ స్థాయి అధికారి వాహనాన్ని అడ్డుకునేది లేదు. నిబంధనలు ఇవీ.. పశువుల సంత నిర్వహణకు చాలా నిబంధనలు ఉన్నాయి. సంత నిర్వహణ కోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన ఎనిమిది మందితో ఎస్ఎల్ఎంసీ కమిటీ ఏర్పాటుచేయాలి. వారు నిత్యం సంతలను పర్యవేక్షిస్తుండాలి. సంతల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి, పాకలు, పశుగ్రాసం, తాగునీటి సౌకర్యం, పశువులు రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఏర్పాటు చేయించాలి. రవాణాచేసే ప్రతి జీవానికి సంబంధిత కమిటీలో పశువైద్యుడు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. సంతలో విక్రయించిన, కొనుగోలు చేసిన వివరాలను రికార్డు చేయించాలి. తక్కువ వయస్సు (యంగ్ యానిమల్) అయితే, అవి వ్యవశాయానికా, పాల దిగుబడి, లేదా పునరుత్పత్తి (బ్రీడింగ్) కోసమా అనే డిక్లరేషన్‌ను పశువుల కొనుగోలుదారుల వద్ద తీసుకోవాలి. ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్స్ యాక్ట్–1977 (సెక్షన్–6) ప్రకారం ఇతర రాష్ట్రాలకు ఆవులను రవాణా చేయరాదు. సంత నుంచి రవాణా చేసే వాహనాల ధ్రువపత్రాలను పోలీస్, రవాణా, పశు సంవర్ధకశాఖ, మున్సిపల్ లేదా పంచాయతీ అధికారులు పరిశీలించాలి. కానీ, పై నిబంధనలు ఎక్కడ అమలుకావు. -
రైతు మిత్రులు సంత పాలు
కాటేసిన కరువు! పాడి పశువులు ఉన్న ఇంట్లో కరువు కాటకాలకు చోటు ఉండదు’ అనేది సూక్తి. పెద్దవాళ్లు ఈ మంచిమాట చెప్పి పశువును కాపాడితే అది మనిషికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చెప్పేవాళ్లు. ఇంటి పోషణ బాధ్యత పంచుకుని యజమానికి సాయంగా నిలుస్తుందనేవాళ్లు. రైతుకి అసలైన బాంధవ్యం పశువుతోనే. ఆ సూక్తులకు కాలం చెల్లినట్లే ఉంది. పాడి ఆవు, గేదెను బతికించుకోవడానికి గుప్పెడు గడ్డిపరకలు కరువయ్యాయి. వర్షం కూడా జనం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన నగరాలకే పరిమితమవుతున్నట్లే ఉంది. నడిరోడ్లను, భవనాలను చెరువులుగా మారుస్తూ ‘గతంలో ఇవి చెరువులే, చెరువులను ఆక్రమించి భవనాలు కట్టేసుకున్నార’ని గుర్తు చేస్తోంది. ఎండి బీడువారిన నేల మీద నాలుగు చినుకులు చిలకరిస్తే పచ్చగా గడ్డి మొలుస్తుందని వానకు కూడా మనసు రాలేదు చాన్నాళ్లపాటు. దాంతో రైతులు తమ పశువులను సంత పాలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకుం టున్నారు. తనతోపాటు పొలంలో కష్టపడిన ఎడ్లు, ఇంటిని పాడితో కళకళలాడించిన ఆవులు, గేదెలు కళ్లెదుటే ఆకలితో నకనకలాడుతుంటే రైతులు చూడలేకపోతున్నారు. ఎవరైనా ఒక మోపు గడ్డి వేసి వాటి ప్రాణాలను కాపాడుకునే వాళ్లకు అమ్మి అవి క్షేమంగా ఉన్నాయని తృప్తి పడదామంటే అదీ కష్టంగానే ఉంది. కబేళాలో కోసి మాంసాన్ని అమ్ముకునే వ్యాపారి తప్ప పశువును కొనడానికి ఎవరూ రావడం లేదు. వనపర్తి జిల్లా పెబ్బేరు సంతకెళ్తే గుండెను రంపంతో కోస్తున్నంత బాధ కళ్ల ముందు కనిపిస్తుంది. ఇన్ని రోజులు తనతోపాటు కష్టపడిన పశువును వదల్లేక రైతుల ముఖాల్లో ఎంతో దైన్యం. ఎంత కష్టమైనా నీ ఇంటి ముందు కొట్టంలోనే ఉంటానని చెప్పడానికి మాటలు రాక పశువులు మౌనంగా కన్నీళ్లు కారుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాలో పెబ్బేర్ సంతకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు, రైతులు వచ్చి ఎద్దులు, ఆవులు, గేదెలను కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు సంతకు వచ్చిన పశువుల్లో అధిక శాతం కబేళాలకు తరలి వెళ్తున్నాయి. వాటిని మేపడానికి మేత లేదు, పశుగ్రాసం కొనడానికి రైతు దగ్గర డబ్బుల్లేవు. పశువులను కొనడానికి సంతకు వచ్చిన వారిలో వ్యాపారులు తప్ప రైతులు ఉండడం లేదు. పశుగ్రాసం కొరతతో... గడ్డి కొని పశువును కాపాడుకుందామంటే... ఒక్క ట్రాక్టర్ ఎండు వరి గడ్డి పదివేలకు పైగానే పలికింది. ఆ పైన రవాణా ఖర్చులు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు మేత కొనలేక పాడి పశువులను పోషించలేక సంతకు తరలించాల్సి వచ్చింది. వాన చుక్క జీవం పోస్తుంది. వాన పడక ప్రాణం తీస్తుంది. – సాక్షి, వనపర్తి నా వల్ల కాలేదు నాకు నాలుగు ఆవులు, రెండు జతల ఎద్దులు ఉన్నాయి. వాటికి మేత లేక ఇబ్బంది పడుతున్నాను. గడ్డి ధర కొనే పరిస్థితి లేదు. ఏమి చేయాలో అర్థం కాక సంతకు తీసుకొచ్చా. వర్షాలు కురిసి పచ్చిక మొలిచే వరకు వాటి ప్రాణాలను కాపాడడం చాలా కష్టం. అవి కడుపు మాడ్చడం ఇష్టంలేక అమ్మేయాలని వచ్చాను. – శ్రీనివాసులు, కాకురాల, గద్వాల గడ్డికొనలేకనే... నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. పత్తి, వేరుశనగ వేశాను. ఒక జత ఎద్దులు, మూడు ఆవులు ఉన్నాయి. వరి పంట వేయకపోవడంతో గడ్డికి తీవ్రకొరత ఏర్పడింది. గడ్డి, దాణా కొనాలంటే అప్పులు చేయాల్సి వస్తోంది. – రామచంద్రయ్య, శేరుపల్లి, వనపర్తి -
నిబద్ధతకు నిదర్శనం
డెయిరీ ఆవిర్భావంతో ఆత్మస్థైర్యం పెరిగింది అవార్డు బాధ్యతను పెంచింది ప్రతీ మహిళ పాడి పశువులను పెంచాలి ముల్కనూర్ డెయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీల భీమదేవరపల్లి(హుస్నాబాద్): మహిళలు నేడు సమాజంలో సగ భాగమై అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళలు మరో అడుగు ముందుకేసి ఏకంగా డెయిరీని ఏర్పాటు చేసుకొని నేడు వారి కుటుంబాలకు అండగా ఉంటున్నారు. నిబద్ధతకు నిదర్శనంగా ముల్కనూర్ సొసైటీని తీర్చిదిద్ది నారీ లోకానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్డీడీబీ) ఈ నెల 2వ తేదీన ముల్కనూర్ డెయిరీకి ఉత్తమ అవార్డును అందించిన నేపథ్యంలో ముల్కనూర్ స్వకృషి డెయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీలను ‘సాక్షి’ పలుకరించగా పలు విషయాలు వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే... కరువును ఎదుర్కునేందుకు మా కుటుంబాలకు కొంత తోడ్పాటు కోసం మేము 2002 సంవత్సరంలో ముల్కనూర్‌లో డెయిరీ ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు గ్రామాల్లో తిరుగుతూ పాల సంఘాల సభ్యత్వ నమోదు కోసం కృషి చేశాం. ఆ విధంగా అన్ని గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసి వ్యాపారం ప్రారంభించాం. నిబద్ధతకు నిదర్శనంగా మహిళలమంతా సంఘటితంగా కృషి చేస్తూ అనేక ఒడిదొడుకులను అధిగమించి నేడు లాభాల బాటలో పయణిస్తున్నాం. ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సలహాలు, సూచనల మేరకు ప్రతీ ఏడాది డెయిరీ అనేక కొత్త పథకాలు, నూతన ఒరవడితో ముందుకెళ్తోంది. 140 గ్రామాల్లో 22 వేల మంది సభ్యులతో ప్రతి రోజు 55 వేల లీటర్ల పాలను సంఘాల నుంచి డెయిరీకి సేకరిస్తున్నాం. 22 వేల మంది ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లడమే మా విజయానికి నిదర్శనం. పాల విక్రయాల్లో ఎలాంటి రాజీలేకుండా నాణ్యమైన పాలను అందిస్తున్నాం. పాల శుభ్రత, నాణ్యత, పశువుల ఆరోగ్యం, వాటి దాణతో పాటుగా సభ్యుల ఆరోగ్యం, వారి సంక్షేమం కోసమే నిరంతరం శ్రమించాం.... ఇంకా శ్రమిస్తూనే ఉంటాం. మేము ఎప్పుడు కూడా లాభం కోసం చూడలేదు. లాభమే మమ్ములను వెదుక్కుంటూ వచ్చింది. అందుకే మా సేవలను గుర్తించి 2011 డిసెంబర్ 6న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార సంఘ అవార్డును అందుకున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినందుకుగాను మూడు పర్యాయాలు డెయిరీకి ఐఎస్ఓ గుర్తింపు లభించడమే మా సొసైటీ నిబద్దతకు నిదర్శనం. ప్రతి మహిళ కూడా తప్పకుండా పాడి పశువును పెంచాలి. పాడి పశువుతో ఇంట్లో పాలు ఉండడంతో పాటుగా ఆర్థికంగా కొంత తోడ్పాటు ఉంటుంది. త్వరలో ఐస్‌క్రీం విక్రయాలు.. డెయిరీ ద్వారా ఇప్పటి వరకు పాలు, పెరుగు, మజ్జిగ, దూద్‌పేడ్, లస్సీ, స్వీట్ లస్సీ, నెయ్యి పదార్థాలను విక్రయిస్తున్నాం. త్వరలో ఐస్‌క్రీమ్‌ను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తాం. పెట్రోల్ పంపుల్లో కూడా పాలు, పాల ఉత్పత్తులను విక్రయించేందుకు ఇటీవల హిందుస్థాన్ పెట్రోల్ కార్పోరేషన్ సంస్థతో ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో 25 చోట్ల ఈ విక్రయాలను ప్రారంభిస్తాం. కాజీపేటలోని హిందుస్థాన్ పెట్రోల్ పంపులో కలెక్టర్ చేతుల మీదుగా ఇప్పటికే ప్రారంభించాం. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఇటీవల మా డెయిరీకి ఉత్తమ సహకార అవార్డును అందించింది. ఇది మహిళల సమష్టి కృషికి నిదర్శనం. ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది. ఇదే ఉత్సాహంతో పనిచేసి మరిన్ని అవార్డులను సొంతం చేసుకుంటాం. అధ్యక్షురాలైనా... ఎల్కతుర్తి మండలం దండెపల్లి గ్రామానికి చెందిన కడారి పుష్పలీల డెయిరీ ప్రారంభ సమయం నుంచి కష్టపడుతూ డెయిరీకి తన సేవలను అందిస్తోంది. దండేపల్లి పాల సంఘ అధ్యక్షురాలిగా కొనసాగుతూనే డెయిరీ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నారు. గత రెండు పర్యాయాలుగా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అధ్యక్షురాలిగా ఓ వైపు డెయిరీ కార్యకలాపాలను సమీక్షిస్తూనే మరో వైపు తమ పాడి గేదెల పాలను స్వయంగా ఆమె పితికి ఆ ఊళ్లో కేంద్రానికి పోసి వస్తుంది. ప్రస్తుతం రోజుకు పది లీటర్ల పాలను ఆమె కేంద్రానికి పోస్తోంది. -
ఇదో గోకులం
మెదక్‌లో గిరిజనుల మూగ ప్రేమ ♦ కరువుతో మొదళ్లకుంట తండావాసుల పోరాటం ♦ మేత కోసం మైళ్లదూరం.. పాపన్నపేట: కరువు కాటుకు పచ్చని పల్లెలు, పాడి పశువులు విలవిల్లాడుతున్నాయి. భగభగ మండుతున్న ప్రచండ భానుడి ప్రభావంతో జలవనరులు ఎడారులయ్యాయి. చెరువులు, కుంటలు ఎండిపోయి నైబారాయి. గుక్కెడు నీటికోసం మనుషులే కాదు.. మూగజీవాలు తహతహలాడుతున్నాయి. అయినా ఆ గిరిపుత్రులు మాత్రం పశు సంపదను బతికించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వాటి మేత కోసం కాళ్లు బొబ్బలెక్కుతున్నా లెక్క చేయకుండా మండుటెండల్లో మైళ్ల దూరం అడుగులు వేస్తున్నారు. కరువు కోరలకు తమ కాడెడ్లను బలికాకుండా చూసుకుంటామని ధీమాతో చెబుతున్నారు. తమ సంకల్పానికి సర్కార్ చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో మారుమూలనున్న మొదళ్లకుంట ఓ గిరిజన తండా. అక్కడ 50 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నా.. రెండు వేల పశుసంపద వారి సొంతం. మండలంలో మొత్తం ఆరు వేల పశువులుంటే ఈ ఒక్క తండాలోనే 2 వేల పశువులు ఉండటం వారి మూగప్రేమకు నిదర్శనం. పశు సంపదతో వచ్చే ఎరువు వారి ప్రధాన ఆదాయం. సేంద్రియ ఎరువులు వాడాలనుకునే మండలంలోని రైతులంతా ఈ గిరిజన తండాకే వస్తుంటారు. ఉద యం 10గంటల సమయంలో మేత కోసం పశువులు వెళ్తుంటే.. శ్వేత సైన్యమే కదనభూమికి కదులుతున్నట్లు కనిపిస్తుంది. తాగునీటికి తండ్లాట 50 గుడిసెల ఆ తండాలో నాలుగు బోర్లు ఉన్నప్పటికీ ఒక్కటి కూడా పనిచేయడం లేదు. ఇటీవల కొత్తగా ఓ బోరు వేయగా అందులో నీళ్లు పడ్డప్పటికీ మోటారు బిగించకపోవడంతో అది అలంకారప్రాయంగానే మిగిలింది. ప్రస్తుతం సమీపంలోని నర్సింగరావుపల్లి తండాలో ఓ సింగిల్‌ఫేస్ బోరు నుండి వచ్చే నీటితో ఓ మడుగును ఏర్పాటు చేశారు. ఆ రెండు తండాల పశువుల దాహార్తి తీర్చేందుకు ఈ మడుగును ఉపయోగించుకుంటున్నారు. ఇక మేత కోసం ఉదయం 10గంటలకు ఇంటి నుంచి బయల్దేరే వీరు మండుటెండలో మంజీరా చుట్టూ పశువులను తిప్పుతారు. పశువులను కాపాడుకుంటాం ఒక్క గడ్డిమోపు కొనాలంటే రూ.100లు కావాలి. కరువు కాలంలో పశువులకు కొని పెట్టాలంటే మా వల్ల కాదు. పశువులు ఇంటి ముందుంటే లక్ష్మికళ కనిపిస్తుంది. అందుకే పశువులను మాత్రం అమ్మకుండా కాపాడుకుంటాం. - తులసీరాం -
పాడి పశువుల పరిరక్షణ అందరి బాధ్యత
జహీరాబాద్ టౌన్: రోజురోజుకూ తగ్గిపోతున్న పాడి పశువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాజకీయపార్టీల నాయకులు పేర్కొన్నారు. పాడి గేదెల పరిరక్షణపై రైతు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేందాస్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అతిథి గృహంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జి నరోత్తం, వైఎస్సార్ సీపీ జహీరాబాద్ అధికార ప్రతినిధి కిష్టోఫర్, బీజేపీ జిల్లా నాయకుడు సుధీర్ బండారీ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, టీఆర్ఎస్ నాయకుడు, కౌన్సిలర్ రాములు నేత, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శేషుబాబు తదితరులు మాట్లాడుతూ, పలు కారణాల వల్ల పాడిగేదెల సంపద తగ్గిపోతుందన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ సమీపంలోని ‘అల్లానా’ వధ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పాడి పశువులను వధిస్తోందన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న ‘అల్లానా’పై ఉద్యమించాలని తీర్మానం చేశారు. వట్టిపోయిన పశువులను మాత్రమే పరిశ్రమ సేకరించాలని, లారీల్లో గేదెలను తరలించరాదని, నిర్ధారిత సమయాల్లోనే పశువులను తరలించాలని, పశు వైద్యాధికారుల అజమాయిషీ ఉండాలని తీర్మానాలు చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నేత భాస్కర్, టీడీపీ నేత కృష్ణ, శ్రీకాంత్, పాడి గేదెల పరిరక్షణ సంఘం నాయకులు సునీల్‌కుమార్, రాజ్‌కుమార్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఇక పశుభాగ్య
ప్రోత్సాహంగా నగదు స్థానంలో పాడి పశువులు ఎస్సీ, ఎస్టీలకు నూతన సంక్షేమ పథకం వారిని పాడి వైపు ప్రోత్సహించడమే లక్ష్యం నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలు సాక్షి, బెంగళూరు :షెడ్యూలు కులాలు, తెగల వర్గానికి చెందిన పాడి రైతులకు ప్రోత్సాహక ధనానికి బదులు పాడి పశువులను ఇచ్చే యోచనలో రాష్ర్ట సర్కార్ ఉంది. దీన్ని ‘పశుభాగ్య’ పేరుతో నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రానున్న కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా అమలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం పాడి రైతుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు 10 శాతం మంది కూడా లేరు. దీంతో ఆ వర్గానికి చెందిన వారిని పాడి వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందిస్తోంది. పాడి రైతులకు లీటరు పాలకు రూ.4, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.6 ప్రోత్సాహకంగా ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన రూ.104 కోట్లను సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఖర్చు చేయాలనే విషయంపై మంత్రి మండలిసమావేశంలోనూ చర్చించారు. అయితే దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్ ఆంజనేయ, పశుసంవర్థక శాఖ మంత్రి టీబీ జయచంద్రకు విభేదాలు చోటుచేసుకున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ప్రోత్సాహకాన్ని పెంచడం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీబీ జయచంద్ర వాదించారు. దీంతో ప్రోత్సాహకం పెంపు నిర్ణయం మూడు నెలలుగా వాయిదా పడుతోంది. సమస్య పరిష్కారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు ప్రోత్సాహకం బదులు ఒక్కొక్క లబ్ధిదారుడికి ఉచితంగా లేదా దాదాపు 95 శాతం సబ్సిడీపై రెండు పాడి పశువులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అర్హుల ఎంపికను స్థానిక శాసన సభ్యులకు ఇవ్వాలని తీర్మానించింది. మరోవైపు పశువుల కొనుగోలు, నిధుల విడుదల విషయం సాంఘిక, సంక్షేమ, పశుసంవర్థకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరగనుంది. మొదటి ఏడాది 13,000 మందికి ‘పశుభాగ్య’ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా వచ్చే నెల ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.