Dean Elgar
-
విరాట్ కోహ్లి నాపై ఉమ్మేశాడు.. రెండేళ్ల తర్వాత: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని ఉద్దేశించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ ఓ పోడ్కాస్ట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన మొదటి భారత పర్యటనలో విరాట్ కోహ్లి తనపై ఉమ్మివేసాడని ఎల్గర్ ఆరోపించాడు. ఆ సంఘటన జరిగిన రెండు ఏళ్ల తర్వాత కోహ్లి తనకు క్షమాపణలు చెప్పాడని ఎల్గర్ తెలిపాడు. కాగా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన ఎల్గర్.. 2015 తొలిసారి టెస్టు క్రికెట్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో విరాట్ కోహ్లి టీమిండియా ఫుల్‌టైమ్ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. "అది భారత్‌లో నా తొలి పర్యటన. మొదటి టెస్టులో నేను బ్యాటింగ్‌కు వచ్చాను. విరాట్ కోహ్లిని ప్రత్యక్షంగా చూడటం కూడా అదే తొలి సారి. అక్కడ పిచ్‌ను చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఆ వికెట్‌పై ఆడటం నాకు పెద్ద సవాలుగా మారింది. టర్నింగ్ వికెట్‌పై అశ్విన్, జడేజాను ఎదుర్కొవడం కష్టంగా మారింది. అంతేకాకుండా వారిద్దరూ నన్ను స్లెడ్జ్ చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో కోహ్లి నాపై ఉమ్మివేశాడు. వెంటనే నా బాషలో ఓ అసభ్య పదజాలం వాడి బ్యాట్‌తో కొడతానని అన్నాను. నేను మాట్లాడిన బాష కోహ్లి అర్ధమైంది అనుకునున్నాను. ఎందుకంటే అప్పటికే అతడు ఐపీఎల్లో ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. నేను బూతు పదం వాడిన తర్వాత కోహ్లి కూడా అదే పదాన్ని వాడి నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. అతడు అరుస్తునే ఉంటాడని పట్టించుకోవడం మానేసాను. ఎందుకంటే మేము భారత్‌లో ఉన్నాము కాబట్టి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఎబి డివిలియర్స్ సైతం కోహ్లిని ప్రశ్నించాడు. అనంతరం రేండేళ్ల తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చినప్పుడు కోహ్లి నాకు ఫోన్ చేశాడు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత మనిద్దరం కలిసి డ్రింక్ చేద్దామా? నేను ప్రవర్తించిన తీరు పట్ల క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని అన్నాడు. నేను అందుకు అంగీకరించాను. ఆ సిరీస్ అయిపోగానే ఇద్దరం పార్టీ చేసుకున్నాం. వేకువజామున 3 గంటల వరకు మేమిద్దరం డ్రింక్ చేస్తునే ఉన్నామని'బాంటర్ విత్ బాయ్స్' అనే ఈ పోడ్ కాస్ట్లో ఎల్గర్ పేర్కొన్నాడు. -
చరిత్రకెక్కిన విజయంతో సఫారీ టూర్ ముగింపు
తగ్గేదేలే... సినిమా డైలాగ్‌లా ఉంది సఫారీలో భారత పర్యటన తీరు! తొలి టెస్టును ఆతిథ్య జట్టు మూడు రోజుల్లోనే ముగిస్తే... రెండో టెస్టును టీమిండియా రెండు రోజుల్లోనే ఖతం చేసింది. మొదటి మ్యాచ్ ముగియగానే అందరూ ‘భారత్ సొంతగడ్డపై పులి... విదేశాల్లో పిల్లి’ అని నిట్టూర్చారు. ఇప్పుడదే విమర్శకులు ‘ఔరా’ అని విస్తుపోయేలా మన పేస్ పేట్రేగిపోయింది. అచ్చిరాని కేప్‌టౌన్‌లో కేక పెట్టింది. క్రీజులోకి దిగిన బ్యాటర్ల గుండెల్లో గుబులు రేపింది. ఇన్నేళ్లుగా ఏ వేదికపై గెలవలేకపోయామో అక్కడే చరిత్రకెక్కే గెలుపుతో భారత్ మళ్లీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కేప్‌టౌన్: క్రికెట్‌నే శ్వాసించే భారత అభిమానులకు ఈ కొత్త సంవత్సరం కిక్ ఇచ్చే గిఫ్ట్‌ను టీమిండియా ఇచ్చింది. ఆఖరి రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. మొత్తం సఫారీ పర్యటనలో మూడు ఫార్మాట్ల సిరీస్‌ను సాధికారంగా ముగించింది. గత డిసెంబర్లో టి20 సిరీస్‌తో ఈ పర్యటన మొదలైంది. టి20 సిరీస్‌ను 1–1తో సమం చేసుకున్న టీమిండియా... వన్డే సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. తాజాగా టెస్టు సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. తద్వారా ఏ ఒక్క సిరీస్‌లోనూ తగ్గలేదు సరికదా... పైపెచ్చు వన్డేలతో ఒకమెట్టుపైనే నిలిచింది. అలా మొదలై... ఇలా కుదేలైంది! తొలిరోజే 23 వికెట్లతో ఆసక్తికర పేస్ డ్రామాకు తెరలేపిన మ్యాచ్... రెండో రోజు అదే పేస్ పదునుకు తెరపడేలా చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 62/3తో గురువారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. ఇంత తక్కువ జట్టు స్కోరులోనూ మార్క్రమ్ (103 బంతుల్లో 106; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ హైలైట్ కాగా... తొలి ఇన్నింగ్స్‌ను సిరాజ్ కూల్చితే... రెండో ఇన్నింగ్స్‌లో ఆ పని బుమ్రా (6/61) చేశాడు. 98 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వల్ల భారత్ లక్ష్యం 79 పరుగులతో మరింత చిన్నదైంది. దీన్ని టీమిండియా 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులతో చకచకా ఛేదించింది. ఒకడి పోరాటం... మరొకడి పేస్ ప్రతాపం టెస్టుల్లో ఆటంటే ఐదు రోజులు. నాలుగు ఇన్నింగ్స్‌లు... 15 సెషన్లు... 450 ఓవర్లు... 40 వికెట్లు... అంటే అందదూ (బ్యాటింగ్) డబుల్ యాక్షన్ చేయాల్సిందే! అన్ని రోజులు శ్రమించినా... ప్రతి సెషన్లోనూ చెమటోడ్చినా చాలా టెస్టుల్లో (డ్రాలతో) ఫలితమే రాదు! కేప్‌టౌన్‌లో మాత్రం పేస్ పదునుకు, భారత్ పట్టుదలకు ఒక వంతు (ఐదు సెషన్లలోపే)లోనే, రెండు రోజులు పూర్తవకముందే భారత్ జయభేరి మోగించింది. తొలి సెషన్లో దక్షిణాఫ్రికా ఓవర్‌నైట్ బ్యాటర్ మార్క్రమ్ వన్డేను తలపించే ఆటతీరుతో చకచకా పరుగులు సాధించాడు. మరోవైపు బుమ్రా... బెడింగ్హమ్ (11), కైల్ వెరిన్ (9)లను పడగొట్టడంలో సఫలమయ్యాడు. దీని వల్ల జట్టు స్కోరు వంద పరుగుల్లోపే సగం (85/5) వికెట్లను కోల్పోగా, మార్క్రమ్ ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. పిచ్ సంగతి, బుమ్రా పేస్ నిప్పులు వెంటనే అర్థమైపోవడంతో మార్క్రమ్ ధనాధన్ బౌండరీలతో సెంచరీ సాధించాడు. కానీ ఈలోపే బుమ్రా కూడా జాన్సెన్ (11), కేశవ్ మహరాజ్ (3) వికెట్లను చేజిక్కించుకున్నాడు. మార్క్రమ్ పోరాటానికి సిరాజ్ బౌలింగ్‌లో చుక్కెదురవగా... మిగతా టెయిలెండర్లు లంచ్‌లోపే అవుటయ్యారు. ఇక రెండో సెషన్లో లక్ష్యఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులోకి దిగిన వారంతా వేగంగా బ్యాటింగ్ చేశారు. యశస్వి జైస్వాల్ (23 బంతుల్లో 28; 6 ఫోర్లు), గిల్ (11 బంతుల్లో 10; 2 ఫోర్లు), కోహ్లి (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) అవుట్‌కాగా, కెపె్టన్ రోహిత్ (16 నాటౌట్; 2 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (4 నాటౌట్; 1 ఫోర్) అజేయంగా ముగించారు. సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించగా... ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ పురస్కారాన్ని ఎల్గర్, బుమ్రా సంయుక్తంగా గెల్చుకున్నారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 55 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 153 ఆలౌట్; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 106; ఎల్గర్ (సి) కోహ్లి (బి) ముకేశ్ 12; జోర్జి (సి) రాహుల్ (బి) ముకేశ్ 1; స్టబ్స్ (సి) రాహుల్ (బి) బుమ్రా 1; బెడింగమ్ (సి) రాహుల్ (బి) బుమ్రా 11; వెరిన్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 9; జాన్సెన్ (సి అండ్ బి) బుమ్రా 11; కేశవ్ మహరాజ్ (సి) అయ్యర్ (బి) బుమ్రా 3; రబడ (సి) రోహిత్ శర్మ (బి) ప్రసిధ్ కృష్ణ 2; బర్గర్ (నాటౌట్) 6; ఎన్గిడి (సి) యశస్వి (బి) బుమ్రా 8; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (36.5 ఓవర్లలో ఆలౌట్) 176. వికెట్ల పతనం: 1–37, 2–41, 3–45, 4–66, 5–85, 6–103, 7–111, 8–162, 9–162, 10–176. బౌలింగ్: బుమ్రా 13.5–0–61–6, సిరాజ్ 9–3–31–1, ముకేశ్ కుమార్ 10–2–56–2, ప్రసిధ్ కృష్ణ 4–1–27–1. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) స్టబ్స్ (బి) బర్గర్ 28; రోహిత్ శర్మ (నాటౌట్) 16; శుబ్‌మన్ గిల్ (బి) రబడ 10; కోహ్లి (సి) వెరిన్ (బి) జాన్సెన్ 12; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (12 ఓవర్లలో మూడు వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–44, 2–57, 3–75. బౌలింగ్: రబడ 6–0–33–1, బర్గర్ 4–0–29–1, జాన్సెన్ 2–0–15–1. -
IND VS SA 2nd Test: అలా జరగడం దురదృష్టకరం: రోహిత్ శర్మ
కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా.. సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (6/15) విశ్వరూపం ప్రదర్శించడంతో 55 పరుగులకే (తొలి ఇన్నింగ్స్‌లో) కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినప్పటికీ, సఫారీ పేసర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో 153 పరుగులకే పరిమితమైంది. టీమిండియా తమ చివరి ఆరు వికెట్లు ఒకే స్కోర్ వద్ద కోల్పోయి భారీ స్కోర్ చేయలేకపోవడమే కాకుండా ఓ అనవసరమైన చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాను మార్క్రమ్ (106) చిరస్మరణీయ శతకంతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈసారి బుమ్రా (6/60) సఫారీలను దెబ్బకొట్టాడు. ఫలితంగా ఆ జట్టు 176 పరుగులకే పరిమితమై, టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆడుతూపాడుతూ ఛేదించి, సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇదో గొప్ప విజయం. తొలి టెస్ట్‌లో చేసిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. మా బౌలర్లు అద్బుతంగా రాణించారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆడాం. ఫలితం సాధించాం. బ్యాటర్లు కూడా తమవంతు ప్రయత్నం చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం మా విజయావకాశాలను మెరుగుపర్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే స్కోర్ వద్ద చివరి ఆరు వికెట్లు కోల్పోవడం దురదృష్టకరం. సిరాజ్ గురించి మాట్లాడుతూ.. ఆ స్పెల్ చాలా ప్రత్యేకం. ఎప్పుడోకాని ఇలాంటివి చూడలేము. బుమ్రా కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. సాధారణంగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. మిగతా పని పిచ్ చూసుకుంటుందని ఊహించాం. అదే జరిగింది. క్రెడిట్ మొత్తం పేసర్లకే దక్కుతుంది. సౌతాఫ్రికాకు ఎప్పుడు వచ్చినా పరిస్థితులు ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఇక్కడ గత నాలుగైదు సంవత్సరాల్లో మేము అత్యుత్తమ విజిటింగ్ జట్టుగా మారాం. ఇక్కడే కాదు ఓవర్సీస్ మొత్తంలో గత కొద్దికాలంగా మేము చాలా మెరుగయ్యాం. సిరీస్ గెలుచుంటే బాగుండేది. సౌతాఫ్రికా అత్యుత్తమ జట్టు. వారు మాకెప్పుడూ ఛాలెంజే. అందుకే మేము ఇక్కడ సిరీస్ (టెస్ట్) గెలవలేకపోతున్నాం. ఎల్గర్ గురించి మాట్లాడుతూ.. క్రికెట్ సౌతాఫ్రికాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. కెరీర్ ఆధ్యాంతం జట్టు ఉన్నతికి తోడ్పడ్డాడు. ఇలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ మ్యాచ్‌లో ఎల్గర్‌ను త్వరగా ఔట్ చేయడం గురించి ముందే మాట్లాడుకున్నాం. ఎల్గర్ ఇలాంటి కెరీర్ కలిగి ఉండటం అభినందనీయం. ప్రతిసారీ ఇలాంటి ఆటగాడిని చూడలేము. అద్భుతమైన కెరీర్. అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు అంటూ హిట్‌మ్యాన్ ముగించాడు. -
అదే మా కొంపముంచింది.. మార్క్రమ్ బ్యాటింగ్ తీరు అత్యద్భుతం: సౌతాఫ్రికా కెప్టెన్
కేప్‌టౌన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిత్తైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. అంతిమంగా భారత పేసర్లదే పైచేయిగా నిలిచింది. సిరాజ్ (6/15) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత భారత్‌ను 153 పరుగులకే పరిమితం చేసి తిరిగి మ్యాచ్‌లోకి వచ్చింది. అనంతరం మార్క్రమ్ కఠినమైన పిచ్‌పై నమ్మశక్యంకాని రీతిలో బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శించి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరపురాని ఇన్నింగ్స్ (106) ఆడాడు. మార్క్రమ్ రెచ్చిపోతుండటంతో ఓ సమయంలో సౌతాఫ్రికా మ్యాచ్‌పై పట్టు సాధించేలా కనిపించింది. అయితే బుమ్రా (6/60) మరో ఎండ్‌లో ఎవరినీ కుదురుకోనీయకపోవడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌కు 176 పరుగుల వద్ద తెర పడింది. ఫలితంగా దక్షిణాఫ్రికా టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని (79) ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆడుతూపాడుతూ ఛేదించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా ముగించింది. కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో చావుదెబ్బ (55 పరుగులకు ఆలౌట్) తినడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. మార్క్రమ్ చిరస్మరణీయ శతకంతో తిరిగి మమ్మల్ని మ్యాచ్‌లోకి తెచ్చాడు. భారత పేసర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఓటమిని జీర్జించుకోవడం కాస్త కఠినమే. 2-0 తేడాతో సిరీస్‌ను గెలిచుంటే బాగుండేది. అయినా పర్లేదు. గెలుపు కోసం మా వంతు పోరాటం చేశాం. మా కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. సిరీస్ ఆధ్యాంతం పేసర్లు బౌలింగ్ చేసిన తీరు.. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ బ్యాటింగ్ చేసిన తీరు అత్యద్భుతం. ఈ పిచ్‌పై ఫలితం అందరి ఊహలకు విరుద్దంగా వచ్చింది. దురదృష్టవశాత్తూ మేమే బాధితులమయ్యాము. ఈ ఫలితం ఓ గుణపాఠం లాంటిది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడంపై స్పందిస్తూ.. రోహిత్ శర్మ సైతం అదే పని చేసేవాడు. అంతిమంగా చూస్తే తొలి రోజు తొలి సెషనే మా కొంపముంచిందని ఎల్గర్ అన్నాడు. -
భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ విశేషాలు, రికార్డులు..
కేప్‌టౌన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. దీనికి ముందు సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేప్‌టౌన్ టెస్ట్ రికార్డులు.. 2024లో తొలి టెస్ట్ కేవలం ఒకటిన్నర రోజుల్లో ముగిసింది (నాలుగున్నర సెషన్లు) భారత్.. సౌతాఫ్రికాను కేప్‌టౌన్‌లో తొలిసారి ఓడించింది కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఏషియన్ జట్టుగా భారత్ రికార్డు ధోని తర్వాత సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డు అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్ (55, తొలి ఇన్నింగ్స్) టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు (భారత్) పరుగులేమీ (153 పరుగుల వద్ద) చేయకుండా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. 2024లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ (642 బంతుల్లో) టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్లు (23) పడిన రెండో మ్యాచ్‌గా రికార్డు. మ్యాచ్ విశేషాలు.. సిరాజ్ చెలరేగడంతో (6/15) తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది ఒకే స్కోర్ వద్ద (153, తొలి ఇన్నింగ్స్) టీమిండియా చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. కెరీర్లో తొమ్మిదో ఐదు వికెట్ల ప్రదర్శనతో (6/61) సౌతాఫ్రికా నడ్డివిరిచిన బుమ్రా సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీ (99 బంతుల్లో) చేసిన మార్క్రమ్ సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా మార్క్రమ్ రికార్డు సౌతాఫ్రికా తాత్కలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ టెస్ట్ కెరీర్ ముగిసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్-సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- డీన్ ఎల్గర్, బుమ్రా స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం -
చరిత్ర తిరగరాసిన భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ పలు రికార్డులను కొల్లగొట్టింది. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే (నాలుగున్నర సెషన్లు) ముగిసిన ఈ మ్యాచ్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగియగా.. గత రికార్డు 656 బంతులుగా ఉండింది. 1932లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు టెస్ట్‌ల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా ఉండింది. ఈ జాబితాలో వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య 1935లో జరిగిన మ్యాచ్ మూడో స్థానంలో (672 బంతుల్లో) ఉండగా.. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ నాలుగో స్థానంలో (788), ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య 1888లో జరిగిన మ్యాచ్ (లార్డ్స్) ఐదో స్థానంలో (792) ఉన్నాయి. ఇదిలా ఉంటే, కేప్‌టౌన్ టెస్ట్‌లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. -
చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం
South Africa Vs India 2nd Test 2024 Day 2 Updates- కేప్‌టౌన్: చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్ 75 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్‌లో కోహ్లి (12) ఔటయ్యాడు. భారత్ లక్ష్యానికి ఇంకా నాలుగు పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్ 57 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (10) ఔటయ్యాడు. భారత్ గెలుపుకు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. జైస్వాల్ ఔట్ 44 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బర్గర్ బౌలింగ్‌లో జైస్వాల్ (28) ఔటయ్యాడు.భారత్.. దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక గెలుపుకు ఇంకా 35 పరుగుల దూరంలో ఉంది. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్.. లక్ష్యంగా దిశగా దూసుకుపోతున్న టీమిండియా 79 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా దూకుడుగా ఆడుతుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ టీ20 తరహాలో విరుచుకుపడుతున్నాడు. అతను కేవలం 21 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. రోహిత్ 6 పరుగులతో అతని జతగా క్రీజ్‌లో ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 35/0గా ఉంది. 176 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 176 పరుగుల వద్ద ముగిసింది. మార్క్రమ్ అద్భుతమైన సెంచరీ సాధించిన అనంతరం సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఆఖరి వికెట్ (ఎంగిడి (8)) కూడా బుమ్రాకే దక్కింది. దీంతో బుమ్రా ఖాతాలో ఆరు వికెట్లు చేరాయి. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, ఈ ఇన్నింగ్స్‌లో ఆరు కలుపుకుని బుమ్రా ఖాతాలో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడ్డాయి. బుమ్రాతో పాటు ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా టార్గెట్ 79 పరుగులుగా ఉంది. మ్యాచ్‌కు లంచ్ విరామం ప్రకటించారు. భారత పేసర్ల విజృంభణ.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 32.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన రబడ(2) ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 31.4: సిరాజ్ బౌలింగ్‌లో సెంచరీ హీరో మార్క్రమ్ అవుట్ సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్.. 60 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా ఓపెనర్‌గా బరిలోకి దిగిన మార్క్రమ్ అత్యంత కఠినమైన పిచ్‌పై అద్బుత సెంచరీతో (99 బంతుల్లో 102 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున ఇది ఆరో వేగవంతమైన సెంచరీ కూడా కావడం విశేషం. ఐదేసిన బుమ్రా.. పట్టుబిగించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 62 పరుగుల స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. బుమ్రా ధాటికి తొలి సెషన్లోనే మరో 4 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా బుమ్రా ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో (5/59) చెలరేగడంతో సౌతాఫ్రికా 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 60 పరుగుల ఆధిక్యంలో ఉంది. మార్క్రమ్ (102 నాటౌట్) అద్భుత శతకంతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా రబాడ (2) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
ఇటువంటి పిచ్‌ను నా కెరీర్లో చూడలేదు: సౌతాఫ్రికా కెప్టెన్
కేప్‌టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజు వికెట్ల వర్షం కురిసింది. ఇరు జట్ల పేసర్ల చెలరేగడంతో ఏకంగా మొదటి రోజు 23 వికెట్లు నేలకూలాయి. మొదటి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కేవలం 55 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం టీమిండియా కూడా 153 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విజృంభించాడు. సఫారీ బౌలర్లలో బర్గర్, రబాడ, ఎంగిడీ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇక కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్.. ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన ఎల్గర్ రెండో టెస్టులో మాత్రం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తొలి రోజు ఆట అనంతరం స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఎల్గర్ కేప్‌టౌన్ పిచ్ పరిస్థితి గురించి వివరించాడు. సెషన్ కొనసాగుతన్నకొద్దీ వికెట్ పరిస్థితి మారిపోయిందని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. "సాధారణంగా న్యూలాండ్స్ పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది. బ్యాటర్ కాస్త సమయం వెచ్చిస్తే క్రీజులో నిలదొక్కకోవచ్చు. అందుకే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాను. కానీ ఈ మ్యాచ్‌లో సెషన్ కొనసాగుతున్న కొద్దీ బంతి గతిలో మార్పు కన్పించింది. అంతేకాకుండా బౌన్స్ కూడా చాలా ఎక్కవైంది. దీంతో బ్యాటర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాను. అయితే పిచ్‌ను దగ్గరనుంచి చూస్తే బాగానే ఉన్నట్లు అన్పిస్తోంది. గతంలో ఎప్పుడూ ఈ వేదికలో ఇలా జరగలేదు. డొమాస్టిక్ క్రికెట్లో కూడా ఇప్పటివరకు ఇంత చెత్త గణాంకాలు నమోదు కాలేదు. ఇటువంటి పిచ్‌ను ఇప్పటివరకు నా కెరీర్లో చూడలేదు" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్గర్ పేర్కొన్నాడు. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం -
చివరి మ్యాచ్ ఆడిన ఎల్గర్..
-
Ind Vs SA: ‘రెండో టెస్టులో టీమిండియాదే విజయం.. ఎందుకంటే?’
Ind Vs SA 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి రోజే ప్రొటిస్ జట్టు కీలక వికెట్లు కోల్పోయింది కాబట్టి భారత్ గెలుపు సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. టీమిండియా పేసర్లు మరోసారి విజృంభించి సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేసి శుభారంభం అందిస్తే.. బ్యాటర్లు విజయ లాంఛనం పూర్తి చేయగలరని గావస్కర్ అంచనా వేశాడు. కాగా సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచే అవకాశాన్ని ఆదిలోనే చేజార్చుకున్న టీమిండియా.. కేప్‌టౌన్‌లో గెలిచి కనీసం డ్రా చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన టెస్టులో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. అనూహ్య రీతిలో సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. 36 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఆ తర్వాత 153 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం మళ్లీ బౌలింగ్ చేసిన టీమిండియాకు మూడు వికెట్లు దక్కాయి. డీన్ ఎల్గర్ రూపంలో కీలక బ్యాటర్‌ను అవుట్ చేయగలిగింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా.. టీమిండియాకు 36 పరుగుల ఆధిక్యం దక్కింది. రోహిత్ సేనదే విజయం.. ఎందుకంటే ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ ఇంకా ఆధిక్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి మ్యాచ్ టీమిండియా చేజారిపోతుందని నేను అనుకోవడం లేదు. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్లో మిగిలిన ఆటగాళ్లంతా కలిసి 150- 200 పరుగులు చేయడం మాత్రం కష్టమే. కాబట్టి భారత్‌కు విజయావకాశాలు ఎక్కువే. ఇన్నింగ్స్ తేడాతో విజయం దక్కకపోయినా.. మెరుగైన స్థితిలోనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind vs SA: అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్’ సిరాజ్ -
చివరి మ్యాచ్ ఆడిన ఎల్గర్.. అభిమానుల మనసు గెలుచుకున్న కోహ్లి!
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దక్షిణాఫ్రికా స్టాండింగ్ కెప్టెన్ డీన్ ఎల్గర్‌కు కోహ్లి ఘనమైన విడ్కోలు పలికాడు. ఏం జరిగిందంటే..? ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు చివరిసారిగా ఎల్గర్ మైదానంలో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన ఎల్గర్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 12 పరుగులే చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో రెండో బంతిని ఎల్గర్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్‌తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. అక్కడ వున్న విరాట్ కోహ్లి ఈజీగా క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్‌ను పట్టిన వెంటనే కోహ్లి ఎటువంటి సెలబ్రేషన్స్ జరపుకోకుండా పరిగెత్తుకుంటూ ఎల్గర్ వద్దకు వెళ్లి అతడని అలింగనం చేసకున్నాడు. అంతేకాకుండా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని డ్రెస్సింగ్ రూమ్‌తో ప్రేక్షకులకు సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. చదవండి: Ind vs SA: అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్’ సిరాజ్ #MukeshKumar's nibbler gets #DeanElgar on his final test! Will #TeamIndia keep racking up wickets before the day's play? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/qftk1SpI8D — Star Sports (@StarSportsIndia) January 3, 2024 -
Ind Vs SA 2nd Test: సిరాజ్ 6తో మొదలై 23తో ముగిసె...
ఒకే రోజు 23 వికెట్లు... ఎన్ని మలుపులు... ఎన్ని అనూహ్యాలు... భారత్ టాస్ ఓడగానే వెనుకబడిపోయినట్లు అనిపించింది...కానీ మొహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ ఆటను మార్చేసింది...అతని పదునైన అవుట్స్వింగర్లను తట్టుకోలేక దక్షిణాఫ్రికా కుప్పకూలింది... పునరాగమనం తర్వాత అతి తక్కువ స్కోరుకు ఆలౌటైంది...అనంతరం భారత్ వేగంగా పరుగులు సాధించి ముందంజ వేసింది...ఆధిక్యం దాదాపు వందకు చేరింది... కానీ ఇంతలో మరో అడ్డంకి ...ఒక్క పరుగు చేయకుండా చివరి 6 వికెట్లు చేజార్చుకొని టీమిండియా కాస్త డీలాపడింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ మన బౌలింగ్ చెలరేగి ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. మొత్తంగా చూస్తే మొదటి రోజు మనదే పైచేయి కాగా...రెండో రోజు సఫారీలను కట్టడి చేస్తే టెస్టు భారత్ ఖాతాలో చేరినట్లే! కేప్‌టౌన్: భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు తొలి రోజు ఆట ఆసక్తికర మలుపులతో సాగి టెస్టు క్రికెట్ మజాను పంచింది. బుధవారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మొహమ్మద్ సిరాజ్ (6/15) తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. అనంతరం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (46), రోహిత్ (39), శుబ్‌మన్ గిల్ (36) మినహా అంతా విఫలమయ్యారు. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ‘సున్నా’కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. టపటపా... మ్యాచ్‌కు ముందు రోజు అంచనా వేసినట్లుగానే ఆరంభంలో పేస్ బౌలర్లకు పిచ్ అద్భుతంగా అనుకూలించడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. సిరాజ్ తన రెండో ఓవర్ రెండో బంతికి మార్క్రమ్ (0)ను అవుట్ చేయడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. గత మ్యాచ్ స్టార్, కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఎల్గర్ (2) కూడా సిరాజ్ బంతికే బౌల్డ్ అయి నిరాశగా వెనుదిరిగాడు. స్టబ్స్ (3)ను వెనక్కి పంపి బుమ్రా కూడా జత కలిశాడు. జోర్జి (2)ని కూడా పెవిలియన్ పంపించిన సిరాజ్, ఆ తర్వాత ఒకే ఓవర్లో బెడింగామ్ (12), జాన్సెన్ (0)ల పని పట్టి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాతి చివరి 4 వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అదే వరుస... యశస్వి జైస్వాల్ (0) ఆరంభంలోనే వెనుదిరిగినా రోహిత్, గిల్ కలిసి చకచకా పరుగులు రాబట్టారు. దాంతో పదో ఓవర్లోనే భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపించిన బర్గర్...శ్రేయస్ (0)ను కూడా అవుట్ చేశాడు. అయితే కోహ్లి చక్కటి షాట్లతో స్కోరును వేగంగా నడిపించాడు. మరో వైపు బాగా ఇబ్బంది పడిన రాహుల్ (8) తాను ఎదుర్కొన్న 22వ బంతికి గానీ తొలి పరుగు తీయలేకపోయాడు. ఒక దశలో స్కోరు 153/4 వద్ద నిలిచింది. అయితే తర్వాతి 11 బంతులు భారత్‌ను బాగా దెబ్బ తీశాయి. ఈ 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయకుండా జట్టు 6 వికెట్లు కోల్పోవడంతో అదే స్కోరు వద్ద టీమ్ ఆలౌట్ అయింది. స్కోరు వివరాలు: దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) యశస్వి (బి) సిరాజ్ 2; ఎల్గర్ (బి) సిరాజ్ 4; జోర్జి (సి) రాహుల్ (బి) సిరాజ్ 2; స్టబ్స్ (సి) రోహిత్ (బి) బుమ్రా 3; బెడింగామ్ (సి) యశస్వి (బి) సిరాజ్ 12; వెరీన్ (సి) గిల్ (బి) సిరాజ్ 15; జాన్సెన్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; మహరాజ్ (సి) బుమ్రా (బి) ముకేశ్ 3; రబాడ (సి) శ్రేయస్ (బి) ముకేశ్ 5; బర్గర్ (సి) యశస్వి (బి) బుమ్రా 4; ఎన్గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (23.2 ఓవర్లలో ఆలౌట్) 55. వికెట్ల పతనం: 1–5, 2–8, 3–11, 4–15, 5–34, 6–34, 7–45, 8–46, 9–55, 10–55. బౌలింగ్: బుమ్రా 8–1–25–2, సిరాజ్ 9–3–15–6, ప్రసిధ్ 4–1–10–0, ముకేశ్ 2.2–2–0–2. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (బి) రబడ 0; రోహిత్ (సి) జాన్సెన్ (బి) బర్గర్ 39; గిల్ (సి) జాన్సెన్ (బి) బర్గర్ 36; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) రబడ 46; శ్రేయస్ (సి) వెరీన్ (బి) బర్గర్ 0; రాహుల్ (సి) వెరీన్ (బి) ఎన్గిడి 8; జడేజా (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 0; బుమ్రా (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 0; సిరాజ్ (రనౌట్) 0; ప్రసిధ్ (సి) మార్క్రమ్ (బి) రబడ 0; ముకేశ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (34.5 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–17, 2–72, 3–105, 4–110, 5–153, 6–153, 7–153, 8–153, 9–153, 10–153. బౌలింగ్: రబడ 11.5–2–38–3, ఎన్గిడి 6–1–30–3, బర్గర్ 8–2–42–3, జాన్సెన్ 9–2–29–0. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (నాటౌట్) 36; ఎల్గర్ (సి) కోహ్లి (బి) ముకేశ్ 12; జోర్జి (సి) రాహుల్ (బి) ముకేశ్ 1; స్టబ్స్ (సి) రాహుల్ (బి) బుమ్రా 1; బెడింగ్హామ్ (నాటౌట్) 7; మొత్తం (17 ఓవర్లలో 3 వికెట్లకు) 62. వికెట్ల పతనం: 1–37, 2–41, 3–45. బౌలింగ్: బుమ్రా 6–0–25–1, సిరాజ్ 5–2–11–0, ముకేశ్ 6–2–25–2. -
IND VS SA 2nd Test: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా
South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్‌టౌన్: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా రెండో టెస్ట్‌లో తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఆలౌటయ్యాక, సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 36 పరుగులు వెనుకపడి ఉంది. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 45 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (1) ఔటయ్యాడు. ఇదే రోజు తొలి ఇన్నింగ్స్‌లో కూడా బుమ్రానే స్టబ్స్‌ను ఔట్ చేశాడు. 16 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 49/3గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా రెండో టెస్ట్ తొలి రోజు ఇరు జట్ల పేసర్లు అత్యద్భుతాలు చేస్తున్నారు. ఇరు జట్ల పేసర్ల ధాటికి ఇప్పటికే 22 వికెట్లు నేలకూలాయి. తాజాగా సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో జార్జీ (1) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 56 పరుగులు వెనుకపడి ఉంది. మార్క్రమ్ (25), ట్రిస్టన్ స్టబ్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 37 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఎల్గర్ (12) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌కు విరుద్దంగా ఆడుతున్న సౌతాఫ్రికా 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత టీమిండియాను 153 పరుగులకు ఆలౌట్ చేసి తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అయితే సఫారీలు తమ సెకెండ్ను తొలి ఇన్నింగ్స్‌లో ఆడినట్లు ఆడట్లేదు. ఆ జట్టు ఓపెనర్లు చాలా జాగ్రత్తగా వికెట్లు పడకుండా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 37/0గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఇంకా 61 పరుగులు వెనకపడి ఉంది. ఒకే స్కోర్ వద్ద ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా 153 పరుగుల వద్ద టీమిండియా ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయి, అదే స్కోర్ వద్ద ఆలౌటైంది. 34వ ఓవర్లో ఎంగిడి పరుగులేమీ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆ మరుసటి ఓవర్లోనే రబాడ.. కోహ్లి (46), ప్రసిద్ద్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్లో, అదే స్కోర్ వద్ద (153) సిరాజ్ (0) కూడా రనౌటయ్యాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన ఎంగిడి.. టీమిండియా 153/7 లుంగి ఎంగిడి ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఎంగిడి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. రాహుల్ (8), జడేజా (0), బుమ్రా (0) ఐదు బంతుల వ్యవధిలో ఔటయ్యారు. కోహ్లి (46), సిరాజ్ క్రీజ్‌లో ఉన్నారు. టీ విరామం.. టీమిండియా స్కోర్ 111/4 తొలి రోజు టీ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 111/4గా ఉంది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 110 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (0) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 105 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (36) ఔటయ్యాడు. విరాట్ కోహ్లి (16), శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత శర్మ ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (24), విరాట్ కోహ్లి (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆధిక్యంలోకి వచ్చిన టీమిండియా 10: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య జట్టును 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తొలి పది ఓవర్లలోనే లీడ్ సంపాదించింది. ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 58 పరుగులు సాధించిన టీమిండియా మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 38 పరుగులు సాధించి జోరు మీదున్నాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ ఆరు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్ యశస్వి జైస్వాల్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 20/1గా ఉంది. ఎంగిడి వేసిన రెండో ఓవర్లో మూడు బౌండరీలు బాది రోహిత్ శర్మ జోరుమీదున్నాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
అన్‌స్టాపబుల్ సిరాజ్: అద్భుత ప్రదర్శన.. టెస్టుల్లో ఇదే తొలిసారి
South Africa vs India, 2nd Test: కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్ములేపాడు. ఆరంభంలోనే ప్రొటిస్ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. తొలుత ఐడెన్ మార్క్రమ్(2)ను అవుట్ చేసిన ఈ హైదరాబాదీ స్పీడ్‌స్టర్.. అనంతరం కెప్టెన్ డీన్ ఎల్గర్ రూపంలో బిగ్ వికెట్ పడగొట్టాడు. కీలక వికెట్ కూల్చి.. పతనానికి నాంది పలికి గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి అద్భుత రీతిలో ఎల్గర్‌ను బౌల్డ్ చేశాడు. అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా సిరాజ్ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన ఎల్గర్(4) షాట్ ఆడేందుకు విఫలయత్నం చేసి వికెట్ పారేసుకున్నాడు. తాను అవుటైన తీరును నమ్మలేక నిరాశగా మైదానాన్ని వీడాడు. కాగా గత మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో రాణించిన డీన్ ఎల్గర్ సౌతాఫ్రికాకు భారీ విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో తెంబా బవుమా స్థానంలో.. అది కూడా తన కెరీర్లో ఆడుతున్న ఆఖరి టెస్టులో కెప్టెన్‌గా బరిలోకి దిగిన అతడిని సిరాజ్ ఇలా కోలుకోలేని దెబ్బకొట్టాడు. Knocked ‘em overrrr! _ ‘ | | /#MohammedSiraj has every reason to celebrate, as he cleverly sets up #DeanElgar and gets the big fish! 💥 Tune-in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/EGX6XxZsSu — Star Sports (@StarSportsIndia) January 3, 2024 సిరాజ్ దెబ్బకు టాపార్డర్ కకావికలం దీంతో ఆరంభంలోనే సౌతాఫ్రికా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్‌ను 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ చేయగా.. టోనీ డీ జోర్జీ(2) రూపంలో సిరాజ్ మళ్లీ తన వికెట్ల ఖాతా తిరిగి తెరిచాడు. ఈ రైటార్మ్ పేసర్ దెబ్బకు సౌతాఫ్రికా టాపార్డర్ మొత్తం కలిపి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక జోర్జీ వికెట్ తీసుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన సిరాజ్.. 15.2 ఓవర్ వద్ద డేవిడ్ బెడింగ్హాం(12), అదే ఓవర్లో ఐదో బంతికి మార్కో జాన్సెన్(0) వికెట్లు కూడా పడగొట్టాడు. తద్వారా కేప్‌టౌన్ టెస్టులో ఐదు వికెట్ హాల్ నమోదు చేశాడు. టెస్టుల్లో తొలి 6 వికెట్ హాల్ అంతటితో సిరాజ్ విధ్వంసం ఆగిపోలేదు. 17.5 ఓవర్ వద్ద వెరెనె(15) రూపంలో ఆరో వికెట్ దక్కించుకున్నాడు ఈ ఫాస్ట్‌బౌలర్. తద్వారా టెస్టుల్లో టీమిండియా తరఫున తన మొదటి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటికే ఆసియా కప్-2023 ఫైనల్ సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసి వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా ఇక సిరాజ్ తర్వాత వికెట్లు పడగొట్టే బాధ్యత తీసుకున్న ముకేశ్ కుమార్ కేశవ్ మహరాజ్(3)ను అవుట్ చేయగా.. బుమ్రా.. నండ్రీ బర్గర్(4)ను పెవిలియన్‌కు పంపాడు. ఇక 23.2 ఓవర్ వద్ద కగిసో రబడ(5)ను పెవిలియన్‌కు పంపి ముకేశ్ కుమార్ సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఇలా భారత పేసర్ల ధాటికి సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్‌పై సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! Pacy wickets with bounce on offer! Pitches in #SouthAfrica pose a different challenge, but former #TeamIndia batting coach #SanjayBangar delivers a masterclass on how best to deal with this test. Tune-in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/FYPOC19Kfn — Star Sports (@StarSportsIndia) January 3, 2024 -
ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్: 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్‌టౌన్: రెండో టెస్టులో భారత పేసర్ల విజృంభణతో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. బుధవారం నాటి మ్యాచ్‌లో తొలి రోజు ఆట తొలి సెషన్లో 23.2 ఓవర్లలోనే ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్ ముగించింది. ప్రొటిస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ కైల్ వెరెనె 15 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ అత్యధికంగా ఆరు వికెట్లు తీయగా.. బుమ్రాకు రెండు, ముకేశ్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. మరో పేసర్ ప్రసిద్ కృష్ణ 4 ఓవర్ల బౌలింగ్‌లో పది పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ చేశాడు. Double breakthrough for #TeamIndia!@mdsirajofficial is breathing 🔥 this morning & bags a -fer in just his 8th over! A sensational spell leaves #SouthAfrica reeling! Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hpzR8g9wLH — Star Sports (@StarSportsIndia) January 3, 2024 22.6: తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా బుమ్రా బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి నండ్రే బర్గర్(4) పెవిలియన్ చేరాడు. స్కోరు: 55-9(23) 21: హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సౌతాఫ్రికా.. స్కోరు: 50-8 ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 19.6: ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి ఔటైన కేశవ్ మహరాజ్(3). సౌతాఫ్రికా స్కోరు: 46-8(20) 17.5: ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా సిరాజ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెరెనె (15) ఔటయ్యాడు. అతడి రూపంలో సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. సిరాజ్ ఖాతాలో ఆరో వికెట్ చేరింది. సౌతాఫ్రికా స్కోరు: 45-7(18). రబడ, కేశవ్ మహరాజ్ క్రీజులో ఉన్నారు. 15.5: తిరుగులేని సిరాజ్.. ఆరో వికెట్ డౌన్ టీమిండియా పేసర్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. పదహారో ఓవర్ రెండో బంతికి బెడింగ్హాం(12)ను పెవిలియన్‌కు పంపిన ఈ హైదరాబాదీ బౌలర్.. ఐదో బంతికి మార్కో జాన్సెన్(0) రూపంలో మరో వికెట్ దక్కించుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కేశవ్ మహరాజ్, వెరెనె క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా స్కోరు: 34-6(16) మరోసారి మ్యాజిక్ చేసిన సిరాజ్ 15.2: కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటికే మార్క్రమ్, ఎల్గర్, జోర్జి రూపంలో మూడు వికెట్లు తీసిన తాజాగా నాలుగో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి డేవిడ్ బెడింగ్హాంను ఔట్ చేశాడు. తద్వారా సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఇక అంతకు ముందు బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్‌ను అవుట్ చేసిన విషయం తెలిసిందే. 11 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 23-4 బెడింగ్హామ్ 8, వెరెనె సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. అతడి ధాటికి సౌతాఫ్రికా 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 15 పరుగుల వద్ద డి జార్జీ (2) ఔటయ్యాడు. నాలుగు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 9.2: సిరాజ్బౌలింగ్లో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టోనీ డీ జోర్జీ ఔట్ 8.3: బుమ్రా బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగిన ట్రిస్టన్ స్టబ్స్ ►రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. కెప్టెన్ ఔట్ ►సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ బౌలర్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. ►ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొదటి మ్యాచ్‌లో సెంచరీలో రాణించిన ఎల్గర్ ఈ ఇన్నింగ్స్‌లో 4(15) పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి వికెట్ డౌన్ ►ఫస్ట్ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. ►సిరాజ్ వేసిన రెండో ఓవర్లో మార్క్రమ్2(10) ఔట్ ►టీమిండియాతో రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తెంబా బవుమా గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో డీన్ ఎల్గర్ సౌతాఫ్రికా కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవడమే తమ లక్ష్యమని టాస్ సందర్భంగా పేర్కొన్నాడు. ఎల్గర్‌కు ఆఖరి టెస్టు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టే తొలుత బ్యాట్‌తో రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తొలి టెస్టులో గెలిచాం కాబట్టి కేప్‌టౌన్‌లో తాము ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలమని ఎల్గర్ పేర్కొన్నాడు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన బవుమా స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కోయెట్జీ స్థానంలో లుంగి ఎంగిడిని రెండో టెస్టులో ఆడిస్తున్నట్లు ఎల్గర్ తెలిపాడు. కాగా వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ కెరీర్లో ఇదే ఆఖరి టెస్టు కావడం విశేషం. అశ్విన్, శార్దూల్ అవుట్ ఇక ఇప్పటికే బాక్సింగ్ డే టెస్టులో ఓటమి పాలైన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా, పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముకేశ్ కుమార్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు ఇవే సౌతాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్ డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! -
ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ బలహీనం: భారత్ గెలవాలంటే అదొక్కటే మార్గం
South Africa vs India, 2nd Test : సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా గెలుపు అవకాశాలపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో డీన్ ఎల్గర్‌ను తొందరగా అవుట్ చేస్తే రోహిత్ సేన పని సులువు అవుతుందని పేర్కొన్నాడు. కేప్‌టౌన్‌లో ఎల్గర్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గానూ బరిలోకి దిగుతున్న కారణంగా అతడిపై సహజంగానే ఒత్తిడి ఉంటుందన్న ఈ మాజీ ఓపెనర్.. టీమిండియా బౌలర్లు దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించాడు. ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపితే సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చడం కష్టమేమీ కాబోదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేప్‌టౌన్‌లో అంత ఈజీ కాదు కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో ఓడిన టీమిండియా కేప్‌టౌన్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. అయితే, సీమర్లకు స్వర్గధామమైన న్యూల్యాండ్స్ పిచ్‌పై ఆతిథ్య జట్టు బౌలర్లు మరోసారి చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో రోహిత్ సేన ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ కాబట్టి ఒత్తిడి సహజం ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘డీన్ ఎల్గర్ కెరీర్లో ఇది ఆఖరి టెస్టు. తెంబా బవుమా జట్టుతో లేడు కాబట్టి ఎల్గర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పుడు తన దృష్టి మొత్తం కేవలం రన్స్ తీయడం కాకుండా.. ట్రోఫీ గెలవడం పైనే ఉందని ఇప్పటికే ఎల్గర్ స్పష్టం చేశాడు. కాబట్టి అతడిపై ఒత్తిడి ఉండటం సహజం. నా దృష్టిలో అయితే.. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగానే ఉంది. డీన్ ఎల్గర్ బ్యాటింగ్ కూడా సాధారణంగానే ఉంది. అయితే, అతడిని అవుట్ చేయడం అంత తేలికేమీ కాదు. ఒక్కసారి ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపితే మాత్రం మిగతా బ్యాటర్లు కూడా క్యూ కట్టడం ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేశవ్ మహరాజ్‌ను ఆడిస్తారు! అదే విధంగా.. పేసర్ గెరాల్డ్ కోయెట్జీ గాయపడటం సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బేనన్న ఆకాశ్ చోప్రా.. అతడి స్థానంలో లుంగీ ఎంగిడీ జట్టులోకి వచ్చే అవకాశం లేదన్నాడు. ఎంగిడి దాదాపు ఏడాది కాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు కాబట్టి మేనేజ్మెంట్ అతడి వైపు మొగ్గు చూపకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను రెండో టెస్టులో ఆడించే అవకాశాలు ఉన్నాయని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! -
భారత్‌తో రెండో టెస్టు.. కెరీర్లో ఇదే చివరి మ్యాచ్! కెప్టెన్‌గా బరిలోకి
కేప్‌టౌన్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ సారథిగా వీడ్కోలు పలకనున్నాడు. భారత్‌తో సిరీస్‌కు ముందే మాజీ కెప్టెన్ ఎల్గర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. తొలి టెస్టులో అతని భారీ సెంచరీతోనే సఫారీ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. ఎల్గర్ 287 బంతుల్లో 28 ఫోర్లతో 185 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ మొదటి రోజునే గాయపడ్డ రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా జనవరి 3 నుంచి జరిగే రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఎల్గర్‌ను దక్షిణాఫ్రికా బోర్డు అతని కెరీర్లో ఆఖరి మ్యాచ్ కోసం కెప్టెన్‌గా బరిలోకి దింపుతోంది. చదవండి: IND Vs SA: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. 146 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే తొలి ఆటగాడిగా! -
IND Vs SA: గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్..
టీమిండియాతో తొలి టెస్టులో విజయం సాధించిన జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా దూరమయ్యాడు. బావుమా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో తొలి రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా బావుమా గాయపడ్డాడు. దీంతో అతడు తొలి టెస్టుల్లో తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. అయితే అతడి గాయం కొంచెం తీవ్రమైనది కావడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ దృవీకరించారు. ఇక రెండో టెస్టులో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్ ప్రోటీస్ జట్టును నడిపించనున్నాడు. అదే విధంగా బావుమా స్ధానంలో జైబుర్ హంజా జట్టులోకి వచ్చాడు. "బావుమా ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో లేడు. కానీ తొలి టెస్టులో అవసరమైతే తాను బ్యాటింగ్ చేయడానికి సిద్దమయ్యాడు. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. బావుమా గాయం నుంచి కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టే అవకాశముంది. ఈ క్రమంలో టెంబా కేప్ టౌన్ టెస్టుకు దూరంగా ఉండనున్నాడు. యువ ఆటగాడు జుబేర్ హంజా అతడి స్ధానాన్ని భర్తీ చేయనున్నాడని" ఈఎస్పీఎన్తో షుక్రి పేర్కొన్నాడు. కాగా జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: #Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణాలు అవే! అతడు అద్భుతం -
అందుకే ఓడిపోయాం.. అతడు మాత్రం అద్భుతం: రోహిత్ శర్మ
Ind Vs SA 1st Test 2023- Rohit Sharma Comments On Loss: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే పరాజయం పాలైనట్లు పేర్కొన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా తాము ఆడలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అసాధారణ పోరాటం చేశాడని.. అయినప్పటికీ తిరిగి పుంజుకునే అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకోలేకపోయామని రోహిత్ వాపోయాడు. కాగా సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన రోహిత్ సేనకు ఆతిథ్య జట్టు గట్టి షాకిచ్చింది. టీమిండియా ఘోర పరాజయం సెంచూరియన్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ఈ మేరకు.. ‘‘గెలుపు దిశగా మా ఆట తీరు సాగలేదు. కేఎల్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి మాకు అవకాశాలు సృష్టించాడు. మా బ్యాటింగ్ చెత్తగా సాగింది కానీ మేము వాటిని ఉపయోగించుకోలేకపోయాం. ఈరోజు మా బ్యాటింగ్ చెత్తగా సాగింది. టెస్టు మ్యాచ్ గెలవాలంటే ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించాలి. కానీ ఈరోజు మేము అది చేయలేకపోయాం. ఇక్కడికి వచ్చే ముందే ఎవరు ఎలాంటి పాత్ర పోషించాలన్న విషయం మీద అందరు ఆటగాళ్లకు అవగాహన ఉంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లు మా బ్యాటర్లకు అనుక్షణం సవాల్ విసిరారు. అందుకే ఓడిపోయాం అయితే, మేము వారిపై పైచేయి సాధించలేకపోయాం. ఇది బౌండరీ స్కోరింగ్ గ్రౌండ్. సౌతాఫ్రికా బ్యాటర్లు బ్యాటింగ్ చేసినపుడు వారు అనేకసార్లు ఫోర్లు బాదారు. కానీ మేము అలా చేయలేకపోయాం. అందుకే ఓటమిని మూటగట్టుకున్నాం. ప్రత్యర్థి జట్టు బలాబలాలను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. ఏదేమైనా మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసేందుకు మేము ఆస్కారం ఇవ్వడం ఏమాత్రం ఆహ్వానించదగ్గ విషయం కాదు. రెండు ఇన్నింగ్స్‌లోనూ మా బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. మా బౌలర్లలో చాలా మందికి ఇదే తొలిసారి మా బౌలర్లలో చాలా మంది ఇప్పుడే మొదటిసారిగా సౌతాఫ్రికా పర్యటనకు వచ్చారు. అయినా, ఓటమికి సాకులు వెదకాలనుకోవడం లేదు. మళ్లీ తిరిగి పుంజుకుని తదుపరి మ్యాచ్ మీద దృష్టి పెడతాం’’ అని రోహిత్ శర్మ తెలిపాడు. కాగా ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ(101) సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తొలుత 5 పరుగులకే పరిమితమైన అతడు.. గురువారం నాటి ఆటలో డకౌట్‌గా వెనుదిరిగాడు. సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా తొలి టెస్టు స్కోర్లు: ►టాస్: సౌతాఫ్రికా- తొలుత బౌలింగ్ ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ►సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 408 ఆలౌట్.. 163 పరుగుల ఆధిక్యం ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: 131 ఆలౌట్ ►ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డీన్ ఎల్గర్(185 పరుగులు) ►ఇరు జట్ల మధ్య రెండో టెస్టు: జనవరి 3 నుంచి ఆరంభం. చదవండి: Ind W vs Aus W: ‘టీమిండియాకు మరో నయా ఫినిషర్’.. దుమ్ములేపిన ఆల్‌రౌండర్.. కానీ -
Ind Vs SA: టీమిండియా ఆలౌట్.. సౌతాఫ్రికా ఘన విజయం
South Africa Vs India 1st Test Day 3 Updates: సౌతాఫ్రికా ఘన విజయం 34.1: మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి(76) రూపంలో టీమిండియా పదో వికెట్ కోల్పోయింది. మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 34.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత్.. 131 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ఏకంగా ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న రోహిత్ సేన కల ఇప్పటికి కలగానే మిగిలిపోయింది. ప్రొటిస్ పేసర్లలో నండ్రీ బర్గర్ నాలుగు వికెట్లతో చెలరేగి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. రబడ రెండు వికెట్లు, మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా రనౌట్‌లో ఎల్గర్, రబడ భాగమయ్యారు. అంతకు ముందు సౌతాఫ్రికా 408 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. డీన్ ఎల్గర్ సెంచరీ(185)తో రాణించగా.. బెడింగ్హామ్(56), మార్కో జాన్సెన్(84- నాటౌట్) అర్ధ శతకాలతో మెరిశారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 31.5: సిరాజ్ రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ కృష్ణ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 121/9 (31.5). కోహ్లి 67 పరుగులతో ఆడుతున్నాడు. 31.3: ఫోర్ బాదిన సిరాజ్ బుమ్రా రనౌట్.. ఎనిమిదో వికెట్ డౌన్ 30.2: రబడ బౌలింగ్‌లో కోహ్లి పరుగుకు యత్నించగా.. సమన్వయ లోపం కారణంగా బుమ్రా రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 117/8 (30.5) ఏడో వికెట్ కోల్పోయిన భారత్ 28.3: రబడ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగిన శార్దూల్ ఠాకూర్(2). జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 105/7 (28.3) నెమ్మదిగా ఆరంభించి.. దూకుడు పెంచిన కోహ్లి కఠినమైన సెంచూరియన్ పిచ్‌పై నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లి.. తర్వాత దూకుడు పెంచాడు. వరుసగా వికెట్లు పడుతున్న తరుణంలో ఆచితూచి ఆడిన ఈ రన్‌మెషీన్.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ 50 పరుగుల మార్కు అందుకున్నాడు. 61 బంతుల్లో హాఫ్ సెంచరీ(53) పూర్తి చేసుకున్నాడు. వచ్చీ రాగానే అశ్విన్‌ను పెవిలియన్‌కు పంపిన బర్గర్ 25.6: నండ్రే బర్గర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. తొలుత రాహుల్‌ను అవుట్ చేసిన ఈ యంగ్ పేసర్.. అతడి స్థానంలో వచ్చిన అశూను కూడా పెవిలియన్‌కు పంపాడు. బెడింగ్హామ్కు క్యాచ్ ఇచ్చి అశ్విన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. స్కోరు: 96-6(26). శార్దూల్ ఠాకూర్ క్రీజులోకి వచ్చాడు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 25.5: కేఎల్ రాహుల్(4) రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 96/5 (25.5). అర్ధ శతకానికి చేరువైన కోహ్లి 20.6: కోయెట్జీ బౌలింగ్‌లో ఫోర్ బాదిన కోహ్లి. అర్ధ శతకానికి ఆరు పరుగుల దూరంలో ఉన్న రన్‌మెషీన్. 19 ఓవర్లలో భారత్ స్కోరు: 78-4 కోహ్లి 34, రాహుల్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయి టీమిండియా 17.5: శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ అద్భుత బంతితో అయ్యర్(6)ను బౌల్డ్ చేశాడు. గత ఇన్నింగ్స్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 72/4 (17.5). మూడో సెషన్ మొదలు 17 ఓవర్లలో టీమిండియా స్కోరు: 65-3 ఈసారి అయ్యర్ క్యాచ్ వదిలేశారు 15.5: మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ స్లిప్‌లో బౌలింగ్ చేస్తున్న కీగన్ పీటర్సన్ వదిలేశాడు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే 101 పరుగులు వెనుబడి ఉంది. కోహ్లి 18, అయ్యర్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 13.6: మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో గిల్(26) బౌల్డ్. స్కోరు: 52-3(14). కోహ్లి 14, శ్రేయస్ అయ్యర్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లలో టీమిండియా స్కోరు: 39/2 గిల్- కోహ్లి మధ్య 26 పరుగుల భాగస్వామ్యం. కోహ్లి 8, గిల్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11.5: జాన్సెన్ బౌలింగ్‌లో ముల్దర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో కోహ్లికి లైఫ్ లభించింది. ►11.1: మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఖాతా తెరిచిన కోహ్లి 8 ఓవర్లలో టీమిండియా స్కోరు: 19/2 ఇంకా ఖాతా తెరవని కోహ్లి.. 13 పరుగులతో క్రీజులో ఉన్న గిల్ రెండో వికెట్ కోల్పోయిన భారత్ 5.3: నండ్రే బర్గర్ బౌలింగ్‌లో యశస్వి జైశ్వాల్(5) అవుట్. టీమిండియా స్కోరు: 13/2 (5.3). విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 2.5: రబడ బౌలింగ్‌లో రోహిత్ శర్మ అవుట్. 8 బంతులు ఎదుర్కొని సున్నా స్కోరుకు పెవిలియన్ చేరిన టీమిండియా కెప్టెన్. క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్‌బ్యాటర్ శుబ్‌మన్ గిల్. ఆధిక్యం ఎంతంటే టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 163 పరుగుల ఆధిక్యం సాధించింది. తొమ్మిదో వికెట్ డౌన్.. బవుమా ఆబ్సెంట్ హర్ట్ 108.4: బుమ్రా బౌలింగ్‌లో నండ్రే బర్గర్ బౌల్డ్(0). దీంతో సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే.. మొదటి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ తెంబా బవుమా గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో అతడు బ్యాటింగ్‌కు అందుబాటులో లేకపోవడంతో.. 408 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆలౌట్ అయినట్లు అంపైర్లు ప్రకటించారు. 107 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 407/8. 162 పరుగుల ఆధిక్యం 400 వందల పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా 102.5: బుమ్రా బౌలింగ్‌లో మార్కో జాన్సెన్ ఫోర్ బాదడంతో సౌతాఫ్రికా స్కోరు 400 దాటేసింది. ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 100.5: లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టిన టీమిండియాకు తొలి ఓవర్లోనే వికెట్ లభించింది. బుమ్రా బౌలింగ్‌లో కగిసో రబడ(1) బౌల్డ్ అయ్యాడు. అతడి రూపంలో సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నండ్రీ బర్గర్ క్రీజులోకి వచ్చాడు. 101.5 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు 396/8. టీమిండియా కంటే 151 పరుగుల ఆధిక్యంలో ఉంది. లంచ్ బ్రేక్ టీమిండియాతో తొలి టెస్టులో మూడో రోజు ఆటలో భాగంగా భోజన విరామ సమయానికి సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. 100 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. భారత్ కంటే 147 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక గురువారం నాటి ఆటలో లంచ్ బ్రేక్ వరకు ఎల్గర్ రూపంలో శార్దూల్ ఠాకూర్, గెరాల్డ్ కోయెట్జీ రూపంలో అశ్విన్ ఈ మ్యాచ్‌లో తమ తొలి వికెట్ తీసుకున్నారు. ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 99.1: అశ్విన్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన గెరాల్డ్ కోయెట్జీ(19). అతడి రూపంలో సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. ఎట్టకేలకు ఎల్గర్ అవుట్ 94.5: శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగిన సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్. దీంతో సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. అద్భుత సెంచరీతో చెలరేగి సౌతాఫ్రికాను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న ఎల్గర్ ఇన్నింగ్స్‌కు తెరపడటంతో టీమిండియాకు కాస్త ఊరట లభించింది. కాగా డీన్ ఎల్గర్ 185 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. గెరాల్డ్ కోయెట్జీ క్రీజులోకి వచ్చాడు. మార్కో జాన్సెన్ 60 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 96 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 366/6. 94.3: టెస్టుల్లో మార్కో జాన్సెన్ అత్యధిక స్కోరు 100 పరుగులకు పైగా ఆధిక్యంలో సౌతాఫ్రికా 89.5: వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్న ఎల్గర్, జాన్సెన్. ఓవర్ ముగిసేసరికి ఎల్గర్ 179, జాన్సెన్ 55 పరుగులతో క్రీజులో ఉన్నారు. 89.2: అశ్విన్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్ ఫోర్ బాదడంతో సౌతాఫ్రికా 103 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. జాన్సెన్ హాఫ్ సెంచరీ 87.6: సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న మార్కో జాన్సెన్ 78 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా గత పది ఓవర్లలో 45 పరుగులు సాధించింది సౌతాఫ్రికా. ఎల్గర్- జాన్సెన్ 74 పరుగుల మెరుగైన భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు. 84వ ఓవర్ పూర్తయ్యేసరికి ఆతిథ్య జట్టు 78 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక రెండో రోజు భారత బౌలర్లలో పేసర్లు సిరాజ్, బుమ్రాకు రెండు వికెట్లు దక్కగా.. ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. స్కోరు: 323/5 (84) 300 పరుగుల మార్కును అందుకున్న సౌతాఫ్రికా 79వ ఓవర్: తొలి టెస్టులో టీమిండియాపై సౌతాఫ్రికా ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. 256/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను మొదలుపెట్టిన ప్రొటిస్ జట్టు 79వ ఓవర్ ఆఖరి బంతికి మూడు వందల పరుగుల మార్కును అందుకుంది. సెంచరీ వీరుడు, ఓపెనింగ్ బ్యాటర్ డీన్ ఎల్గర్ గురువారం ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. మరో ఎండ్‌లో మార్కో జాన్సెన్ కూడా చక్కటి సహకారం అందిస్తూ 26 పరుగులు పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు హైలైట్స్: ►బాక్సింగ్ డే టెస్టులో శతక్కొట్టిన రాహుల్. ►ఓవర్‌నైట్ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా 245 పరుగులకు టీమిండియా ఆలౌట్. ►సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అజేయ సెంచరీ -140 (211 బంతుల్లో). ►అరంగేట్ర బ్యాటర్ బెడింగ్హాం అర్ధ శతకం. ►రెండో రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 256-5(66 ఓవర్లలో). ►ఎల్గర్‌తో కలిసి 3 పరుగులతో క్రీజులో ఉన్న మార్కో జాన్సెన్. ►సౌతాఫ్రికాకు 11 పరుగుల స్వల్ప ఆధిక్యం. బాక్సింగ్ డే టెస్టు: సౌతాఫ్రికా వర్సెస్ భారత్ తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. సౌతాఫ్రికా డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, తెంబా బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెరైన్(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, నండ్రే బర్గర్. -
ఎల్గర్ అజేయ సెంచరీతో...
‘బాక్సింగ్ డే’ టెస్టుపై దక్షిణాఫ్రికా ఆధిక్యం కనబరుస్తోంది. రెండో రోజు ఆటలో భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ చేసిన సఫారీ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుకుంది. దక్షిణాఫ్రికా ఆరంభానికి సిరాజ్ తూట్లు పొడిచినప్పటికీ ఓపెనర్ డీన్ ఎల్గర్ (అజేయ) శతకంతో సాఫీగా సాగిపోయింది. రెండు పటిష్టమైన భాగస్వామ్యాలతో సఫారీ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించేందుకు ఎల్గర్ కీలకపాత్ర పోషించాడు. సెంచూరియన్: ఓవర్‌నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ మినహా తొలి టెస్టులో రెండో రోజంతా దక్షిణాఫ్రికా హవానే నడిచింది. ఓపెనర్ ఎల్గర్ చక్కని సెంచరీతో సఫారీ భారీ స్కోరుపై కన్నేసింది. తద్వారా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని పెంచుకునేందుకు పట్టుబిగిస్తోంది. బుధవారం రెండో రోజు ఆటలో తొలుత భారత్ తొలి ఇన్నింగ్స్ 67.4 ఓవర్లలో 245 పరుగుల వద్ద ముగిసింది. రాహుల్ (137 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) టెస్టుల్లో ఎనిమిదో శతకం సాధించాడు. మొదటి రోజే రబడ 5 వికెట్లు తీయగా, రెండో రోజు మిగిలిన రెండు వికెట్లలో కొయెట్జీ (1/74), బర్గర్ (3/50) చెరొకటి తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వెలుతురు మందగించి ఆట నిలిచే సమయానికి 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి 11 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ఎల్గర్ (140 బ్యాటింగ్; 23 ఫోర్లు), జాన్సెన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బుమ్రా, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టాడు. శతకం పూర్తయ్యాక ఆలౌట్! వర్షం, గ్రౌండ్ తడి ఆరడానికి సమయం పట్టడంతో రెండో రోజు కూడా ఆట ఆలస్యంగానే మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ తొలి సెషన్లో 8.4 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు రాహుల్, సిరాజ్ (5) తొమ్మిదో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. రాహుల్ సెంచరీకి చేరువయ్యాక కొయెట్టీ 65వ ఓవర్ తొలి బంతికి సిరాజ్‌ను అవుట్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్‌తో రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే బర్గర్ అతన్ని బౌల్డ్ చేయడంతో 245 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. సిరాజ్ దెబ్బ తీసినా... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలోనే సిరాజ్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ మార్క్రమ్ (5) కీపర్ క్యాచ్‌తో వెనుదిరిగేలా చేశాడు. అయితే భారత శిబిరానికి ఈ ఆనందం తర్వాత శ్రమించక తప్పలేదు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఎల్గర్‌కు జతయిన టోనీ డి జార్జి (62 బంతుల్లో 28; 5 ఫోర్లు) భారత బౌలర్లను తేలిగ్గా ఎదుర్కొన్నారు. 49/1 స్కోరువద్ద తొలి సెషన్ ముగియగా... రెండో సెషన్లోనూ ఈ జోడీ భారత బౌలింగ్ దళాన్ని కష్టపెట్టింది. ఎల్గర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... సఫారీ స్కోరు వంద దాటింది. ఈ దశలో బుమ్రా వైవిధ్యమైన బంతులతో రెండు కీలక వికెట్లను పడగొట్టి టీమిండియాను ఊరడించాడు. రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించాక జార్జిని, తన మరుసటి ఓవర్లో పీటర్సన్ (2)ను పెవిలియన్ చేర్చాడు. 113 పరుగుల వద్ద 3 వికెట్లను కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. అయితే క్రీజులో పాతుకుపోయిన ఎల్గర్‌కు బడింగ్హామ్ చక్కని సహకారం ఇవ్వడంతో మరో భారీ భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను నిలబెట్టింది. ఎల్గర్ శతకాన్ని పూర్తి చేసుకోగా... టీ విరామం (194/3) వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఆఖరి సెషన్లోనూ ఎల్గర్–బడింగ్హామ్ జోడీ భారత బౌలర్లకు పరీక్షపెట్టింది. ఈ క్రమంలో బడింగ్హామ్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 131 పరుగులు జోడించాక సిరాజ్ ఓవర్లో బడింగ్హామ్ (56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిష్క్రమించాడు. వెరిన్ (4)ను ప్రసిధ్ అవుట్ చేశాడు. తర్వాత కాసేపటికే బ్యాడ్‌లైట్‌తో ఆటను నిలిపివేశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి) బర్గర్ 17; రోహిత్ (సి) బర్గర్ (బి) రబడ 5; శుబ్‌మన్ (సి) వెరిన్ (బి) బర్గర్ 2; కోహ్లి (సి) వెరిన్ (బి) రబడ 38; అయ్యర్ (బి) రబడ 31; రాహుల్ (బి) బర్గర్ 101; అశ్విన్ (సి) సబ్–ముల్డర్ (బి) రబడ 8; శార్దుల్ (సి) ఎల్గర్ (బి) రబడ 24; బుమ్రా (బి) జాన్సెన్ 1; సిరాజ్ (సి) వెరిన్ (బి) కొయెట్జీ 5; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (67.4 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–24, 4–92, 5–107, 6–121, 7–164, 8–191, 9–238, 10–245. బౌలింగ్: రబడ 20–4–59–5, మార్కొ జాన్సెన్ 16–2–52–1, బర్గర్ 15.4–4–50–3, కొయెట్జీ 16–1–74–1. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 5; ఎల్గర్ (బ్యాటింగ్) 140; టోని జార్జి (సి) యశస్వి (బి) బుమ్రా 28; పీటర్సన్ (బి) బుమ్రా 2; బెడింగ్హమ్ (బి) సిరాజ్ 56; వెరిన్ (సి)రాహుల్ (బి) ప్రసిధ్‌కృష్ణ 4; జాన్సెన్ (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (66 ఓవర్లలో 5 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–11, 2–104, 3–113, 4–244, 5–249. బౌలింగ్: బుమ్రా 16–3–48–2, సిరాజ్ 15–0–63–2, శార్దుల్ 12–2–57–0, ప్రసిధ్‌కృష్ణ 15–2–61–1, అశ్విన్ 8–3–19–0. -
IND Vs SA: కేఎల్ రాహుల్, ఎల్గర్ సెంచరీలు! రెండో రోజు హైలైట్స్ ఇవే
South Africa vs India, 1st Test Day 2 Update: టీమిండియాతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సరికి పదకొండు పరుగుల లీడ్‌లో ఉంది. కఠినమైన సెంచూరియన్ పిచ్‌పై వెటనర్ ఓపెనర్ డీన్ ఎల్గర్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో.. ప్రొటిస్ జట్టు టీమిండియాపై పైచేయి సాధించింది. బాక్సింగ్ డే టెస్టులో రోహిత్ సేన 208/8 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి ఆటను ఆరంభించింది. కేఎల్ రాహుల్ సెంచరీ(101) పూర్తి చేసుకోగా.. 245 పరుగులకు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ ఏకంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. అరంగేట్ర ఫాస్ట్‌బౌలర్ నండ్రీ బర్గర్ మూడు, గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సెన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ వికెట్ కోల్పోయింది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ డీన్ ఎల్గర్, యువ బ్యాటర్ టోనీ డీ జోర్జితో కలిసి మెరుగైన స్కోరుకు పునాది వేశాడు. అయితే, జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్‌తో తొలుత టోనీని 28 పరుగులకు.. ఆ తర్వాత అతడి స్థానంలో వచ్చిన కీగాన్ పీటర్సన్ 2 పరుగులకే వెనక్కి పంపాడు. దీంతో సౌతాఫ్రికా మరో రెండు రెండు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి దశలో ఎల్గర్‌కు జతకలిసిన అరంగేట్ర బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్ మరో ఎండ్ నుంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో ఎల్గర్.. 42.1 ఓవర్ వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఎల్గర్‌తో చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన బెడింగ్హామ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 60.1వ ఓవర్ వద్ద సిరాజ్ అద్భుత బంతితో బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఎల్గర్- బెడింగ్హామ్ 131 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో రోహిత్ సేనకు కాస్త ఊరట లభించగా.. ఆ మరుసటి రెండో ఓవర్లో అరంగేట్ర బౌలర్ ప్రసిద్ కృష్ణ వికెట్ తీసి జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. 61.5వ ఓవర్ వద్ద వెరైన్‌ను అవుట్ చేసి అంతర్జాతీయ టెస్టుల్లో తొలి వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. వెరైన్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా డ్రింక్స్ బ్రేక్(64వ ఓవర్) సమయానికి 254 పరుగులు సాధించింది. ఈ క్రమంలో సెంచరీ వీరుడు ఎల్గర్‌కు జతైన మార్కో జాన్సెస్ వికెట్ పడకుండా జాగ్రత్త పడగా.. ఎల్గర్ సైతం ఆచితూచి ఆడాడు. అయితే, సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 66వ ఓవర్ వద్ద వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత రెండో రోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి సౌతాఫ్రికా పదకొండు పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చేతిలో ఇంకా ఐదు వికెట్లు ఉన్నాయి. డీన్ ఎల్గర్ 140, జాన్సెన్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి రెండో రోజు ఆటలోనూ సౌతాఫ్రికా టీమిండియాపై ఇలా ఆధిపత్యం చాటుకుంది. -
Ind vs SA: సెంచరీతో చెలరేగిన ఎల్గర్.. తొమ్మిదేళ్ల రికార్డు బ్రేక్!
South Africa vs India, 1st Test Day 2: టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ సెంచరీతో చెలరేగాడు. కఠినమైన పిచ్‌పై వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే.. అద్భుత ఇన్నింగ్స్‌తో భారత బౌలర్లకు కొరకరానికొయ్యగా తయారయ్యాడు. ఫేర్వెల్ సిరీస్‌లో 140 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని తన కెరీర్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కాగా సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా- టీమిండియా మధ్య మంగళవారం బాక్సిండే టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ప్రొటిస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. 208/8 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి ఆటను ఆరంభించిన టీమిండియా.. 245 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్లు పడిన ఆనందం నిలవనీయకుండా ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ను 5 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. అయితే, ఎల్గర్ ఆ సంతోషాన్ని మరీ ఎక్కువ సేపు నిలవనీయలేదు. యువ ప్లేయర్ టోనీ డీ జోర్జితో కలిసి నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. కానీ జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు టోనీ 28, కీగాన్ పీటర్సన్ 2 పరుగులకు అవుట్ కాగా... సౌతాఫ్రికా మరో రెండు రెండు వికెట్లు కోల్పోయింది. ఫేర్వెల్ సిరీస్‌లో సెంచరీ ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అరంగేట్ర బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్తో చక్కగా సమన్వయం చేసుకుంటూ ఎల్గర్ ముందుకు సాగాడు. నెమ్మది నెమ్మదిగా స్కోరు పెంచుకుంటూ 42.1 ఓవర్ వద్ద భారత పేసర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో ఎల్గర్‌కు ఇది 14వ శతకం. పటిష్ట టీమిండియాతో సిరీస్ తర్వాత తను రిటైర్ అవుతున్న క్రమంలో సెంచరీ బాదడంతో ఈ వెటరన్ ఓపెనర్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఎల్గర్ సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న భారత స్టార్ విరాట్ కోహ్లి చప్పట్లతో అతడిని అభినందించడం విశేషం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. సొంతగడ్డపై టీమిండియాతో టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు సెంచరీ చేసి తొమ్మిదేళ్లకు పైగానే అయింది. ఎల్గర్ తాజా మ్యాచ్‌లో శతకం బాదడం ద్వారా ఆ రికార్డును బ్రేక్ చేశాడు. స్వదేశంలో 2014 తర్వాత భారత్‌పై సెంచరీ సాధించిన సౌతాఫ్రికా తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో కఠిన పిచ్‌పై ఈ మేరకు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన డీన్ ఎల్గర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక టీ విరామ సమయానికి సౌతాఫ్రికా 49 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఎల్గర్ 115, బెడింగ్హాం 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: Virat Kohli: ఓసారి మా అక్క నన్ను బాగా కొట్టింది.. రూ. 50 నోటు చూడగానే చించేసి! 8️⃣4️⃣ Test Matches 5️⃣1️⃣4️⃣6️⃣ Runs 2️⃣3️⃣ Fifties 1️⃣3️⃣ Tons Dean Elgar's last dance gets underway as he steps to the crease at SuperSport Park 🇿🇦#ThankYouDean #WozaNawe#BePartOfIt pic.twitter.com/m3FQNj4K9v — Proteas Men (@ProteasMenCSA) December 27, 2023 -
IND vs SA: ముగిసిన రెండో రోజు ఆట.. సౌతాఫ్రికాదే పైచేయి!
South Africa vs India, 1st Test Day 2 Updates: వెలుతురు లేమి కారణంగా ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి పదకొండు పరుగుల స్వల్ప ఆధిక్యంతో టీమిండియాపై సౌతాఫ్రికా పైచేయి సాధించింది. 66: వెలుతురు లేమి కారణంగా ఆటకు అంతరాయం వెలుతురు లేమి కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి సౌతాఫ్రికా 66 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి పదకొండు పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఎల్గర్ 140, మార్కో జాన్సెన్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా పేసర్లలో బుమ్రాకు రెండు, సిరాజ్‌కు రెండు, ప్రసిద్ కృష్ణకు ఒక వికెట్ దక్కాయి. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగిన వెరైన్. వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 249/5 (61.5) 60.4: ఆధిక్యంలోకి వచ్చిన సౌతాఫ్రికా సిరాజ్ బౌలింగ్‌లో వెరైన్ ఫోర్ బాదడంతో ఆతిథ్య సౌతాఫ్రికా ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 60.1: సిరాజ్ బౌలింగ్‌లో బెడింగ్హాం(56) బౌల్డ్. దీంతో సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోగా.. సెంచరీ వీరుడు ఎల్గర్‌తో కలిసి 131 పరుగుల పటిష్ట భాగస్వామ్యానికి తెరపడింది. స్కోరు: 244/4 (60.1). బెడింగ్హాం అర్ధ శతకం 57.6: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సౌతాఫ్రికా అరంగేట్రం బ్యాటర్ బెడింగ్హాం. టీ బ్రేక్ సమయానికి టీ విరామ సమయానికి సౌతాఫ్రికా 49 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఎల్గర్ 115, బెడింగ్హాం 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. 42.1: డీన్ ఎల్గర్ సెంచరీ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది వంద పరుగులు పూర్తి చేసుకున్న సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్. టెస్టుల్లో అతడికి ఇది 14వ సెంచరీ. టీమిండియాతో సిరీస్ తర్వాత రిటైర్ కానున్న ఎల్గర్. 32 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 125/3 ఎల్గర్ 76, డేవిడ్ బెగిడింగ్హాం ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. 30.2: మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా బుమ్రా బౌలింగ్‌లో కీగాన్ పీటర్సన్ బౌల్డ్ అయ్యాడు. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 28.6: బుమ్రా బౌలింగ్‌లో టోనీ డి జోర్జి(28) యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. సౌతాఫ్రికా స్కోరు: 104-2(28). ఎల్గర్, కీగాన్ పీటర్సన్ క్రీజులో ఉన్నారు. 28: వంద పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా ఎల్గర్ 65, టోనీ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 100-1 ఎల్గర్ అర్ధ శతకం.. స్కోరు: 91-1(24) 22.6: శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఎల్గర్. అర్ధ శతకానికి చేరువైన ఎల్గర్ లంచ్ బ్రేక్ తర్వాత సౌతాఫ్రికా బ్యాటర్లు కాస్త వేగం పెంచారు. 22 ఓవర్లు ముగిసే సరికి ఎల్గర్ 45, టోని 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 49-1@ లంచ్‌బ్రేక్ భోజన విరామ సమయానికి సౌతాఫ్రికా 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. టీమిండియా కంటే 196 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం డీన్ ఎల్గర్ 29, టోని 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక సిరాజ్ బౌలింగ్‌లో మార్క్రమ్ తొలి వికెట్‌గా వెనుదిరిగిన విషయ తెలిసిందే. ఈ క్రమంలో ఎల్గర్, టోనీ ఆచితూచి ఆడుతున్నారు. పది ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 33/1 7 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 22-1 ఎల్గర్ 10, టోని 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3.5: తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా టీమిండియా పేసర్ సిరాజ్బౌలింగ్లో మార్క్రమ్ వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. స్కోరు: 11-1(4). డీన్ ఎల్గర్, టోనీ క్రీజులో ఉన్నారు. భారత్ 245 పరుగులకు ఆలౌట్ సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు భారత్ ఆలౌటైంది. 208/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. అదనంగా 37 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కష్టమైన పరిస్థితుల్లో రాహుల్ తన క్లాస్‌ను చూపించాడు. టెయిలాండర్లతో కలిసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. రాహుల్ 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లి(38), శ్రేయస్ అయ్యర్(31) పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ ఐదు వికెట్లతో చెలరేగగా.. డెబ్యూ ఆటగాడు బర్గర్ 3 వికెట్లతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ సెంచరీ.. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 133 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై రాహుల్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. రాహుల్ ప్రస్తుతం 101 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. క్రీజులో రాహుల్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ ఉన్నాడు. తొమ్మిదో వికెట్ డౌన్.. 238 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సిరాజ్.. కోయట్జీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దూకుడుగా ఆడుతున్న రాహుల్.. రెండో రోజు ఆట ప్రారంభం నుంచే టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడుతున్నాడు. 63 ఓవర్లు ముగిసే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(80), సిరాజ్(5) పరుగులతో ఉన్నారు. రెండో రోజు ఆట ప్రారంభం.. సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు రెండు రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులో కేఎల్ రాహుల్(70), మహ్మద్ సిరాజ్ ఉన్నారు. వర్షం కారణంగా 30 నిమిషాల ఆలస్యంగా ఆట ఆరంభమైంది. కాగా తొలి రోజు టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. -
టీమిండియాతో సిరీస్: టెస్టులకు సౌతాఫ్రికా ఓపెనర్ వీడ్కోలు
Dean Elgar Retirement: సౌతాఫ్రికా వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ కీలక ప్రకటన చేశాడు. టీమిండియాతో సిరీస్ తర్వాత తాను టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. సొంతగడ్డపై ఆడనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘క్రికెట్ ఆడాలన్నది నా కల. అయితే, దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం అన్నింటికంటే అత్యుత్తమైన విషయం. నా ఆశయాలను నెరవేర్చుకునే క్రమంలో 12 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఎంతో గర్వంగా ఉంది. నాకిష్టమైన స్టేడియంలోనే.. ఇదొక అసాధారణ ప్రయాణం. ఇలాంటి అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం. సొంతగడ్డపై టీమిండియాతో సిరీస్ నా కెరీర్లో చివరిది కానుంది. అందమైన, అద్భుతమైన ఆట నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. కేప్‌టౌన్‌లో నా చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్నాను. ప్రపంచంలోకెల్లా నా అభిమాన స్టేడియం అది. అక్కడే నేను న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా తొలిసారి టెస్టుల్లో పరుగు నమోదు చేశాను. అక్కడే నా చివరి పరుగు కూడా తీయాలనుకుంటున్నాను’’ అని డీన్ ఎల్గర్ భావోద్వేగపూరిత ప్రకటన చేశాడు. అందరికీ ధన్యవాదాలు తన ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, సోదరుడు, జీవిత భాగస్వామి నికోల్, స్పాన్సర్స్, క్రికెట్ సౌతాఫ్రికా.. అన్నింటికీ మించి తనను ఇన్నాళ్లుగా ప్రోత్సహిస్తున్న అభిమానులకు ఎల్గర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా 2012లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. అదే ఏడాది ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఎల్గర్ కెరీర్లో కేవలం 8 అంతర్జాతీయ వన్డేలు ఆడి.. 104 పరుగులు చేశాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 84 టెస్టులు ఆడి 5146 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఎల్గర్ అత్యధిక స్కోరు 199. సౌతాఫ్రికా తరఫున పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన 36 ఏళ్ల డీన్ ఎల్గర్.. పలు మ్యాచ్‌లలో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. చదవండి: విరాట్ కోహ్లి 3.O.. 2023లో ఎన్నో ఘనతలు! కానీ అదొక్కటే