ded
-
రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఏర్పాట్లు చేసూ్తనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శ కాలు జారీ చేసింది. కాగా, 2022, 2023 కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీచేశారు. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్‌కు హాజరుకావొచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ‘టెట్’ నిబంధనల సడలింపు.. ఇక టెట్ నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధన ఉండేది. దాన్ని సవరించి ఏపీ టెట్–2024 నోటిఫికేషన్‌కు ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్‌లో 50 మార్కులు తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎక్కువమంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశముంటుంది. అలాగే.. ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్ పేపర్–1 రాసే అభ్యర్థులు ఇంటర్మిడియట్‌లో 50 శాతం మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్/సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేయాలి లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్–1 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. అయితే.. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఐదు శాతం మార్కుల సడలింపునిచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. -
స్పెషల్ డీఎస్సీ కోసం ఆందోళన
పాడేరు రూరల్: ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అరుకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తెడబారికి సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. టెట్ క్వాలీఫైడ్ డీఎడ్ అభ్యర్థులు బుధవారం పాడేరులో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి సినిమాహాల్ సెంటర్ మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం వద్ద బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడారు. బీఎడ్ చది విన వారికి కూడా ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం కల్పి స్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోట్‌ను వెనక్కి తీసుకోవాలని, స్పెషల్ డీఎస్సీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డీఎడ్ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం ఐటీడీఏ ఇన్చార్జీ పీవో డీకే బాలాజీకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు కె.వై.కుమార్, కార్యదర్శి టి.విజయ్‌కుమార్, నాయకులు కె.కుస్టో, సోమేష్, డి.ధనురాష్, శ్యామ్యుల్, ఏజెన్సీ 11 మండలాల నుంచి డీఎడ్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు డీఎడ్ పరీక్షలు
-జూలై 6 నుంచి 12 వరకు నిర్వహణ రాయవరం(మండపేట) : ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ శిక్షణ కోర్సు(డీఎడ్) 2015–17 బ్యాచ్‌కు సంబంధించి తొలి ఏడాది పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఎట్టకేలకు సన్నద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం పరీక్షల టైం టేబుల్ వెల్లడించారు. జూలై 6 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరో పేపరు మినహా మిగిలిన ఐదు సబ్జెక్టులకు సంబంధించి కొత్త, పాత సిలబస్ అనుసరించి ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఆరో పేపరుకు మాత్రం కొత్త సిలబస్‌ను అనుసరించనున్నట్లు ప్రకటించారు. తొమ్మిదినెలలు ఆలస్యం.. 2015–17 విద్యా సంవత్సరానికి 2015 డిసెంబరులో డీఎడ్ ప్రవేశాలు పొందిన ఛాత్రోపాధ్యాయులకు వాస్తవానికి 2016 సెప్టెంబరులోనే పరీక్షలు జరగాల్సి ఉంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో లోపాల వల్ల పరీక్షల నిర్వహణలో జాప్యం చోటు చేసుకుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో ఒక్కో ప్రవేశానికి రూ.2 వేల అపరాధ రుసుమును విధిస్తూ గత డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేశారు. అపరాధ రుసుమును రూ.వెయ్యికి తగ్గించాలని కోరుతూ అన్ ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాల చేసి విజ్ఞప్తులతో పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యమైంది. తొమ్మిది నెలలు ఆలస్యంగా జూలై 6 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. చివరి అరగంటలో బిట్ పేపరు.. 2015–17 బ్యాచ్‌కు కొత్త సిలబస్‌లను అనుసరించి పరీక్షలను నిర్వహించనుండగా, అంతకు ముందు బ్యాచ్‌కు సంబంధించి మాత్రం పాత సిలబస్‌ను అనుసరించి పరీక్షలను నిర్వహిస్తారు. వారికి ఇదే చివరి అవకాశంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరు పేపర్లకు సంబంధించి అభ్యర్థులకు చివరి అరగంటలోనే 20 మార్కులకు బిట్ పేపరు ఇవ్వనున్నారు. బిట్ పేపరు ఇవ్వడం ఇదే తొలిసారిగా అధ్యాపకులు పేర్కొంటున్నారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, అన్ఎయిడెడ్ కళాశాలల నుంచి సుమారు మూడు వేల మంది ఛాత్రోపాధ్యాయులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో కన్వీనర్, యాజమాన్య కోటా నుంచి 2,122 మంది ప్రవేశాలను పొందగా 841 మంది స్పాట్ అడ్మిషన్ల పేరుతో ప్రవేశాలను పొందడం గమనార్హం. ఇదిలా ఉండగా మొదటి సంవత్సరం శిక్షణ పూర్తి చేసుక్ను ఛాత్రోపాధ్యాయులు రెండో ఏడాది శిక్షణ గతేడాది అక్టోబరు నెల నుంచి పొందుతున్నారు. రెండేళ్ల పరీక్షలు ఒకేసారి రాయాల్సి వస్తుందేమోనని ఇప్పటి వరకు ఛాత్రోపాధ్యాయులు భయాందోళనలు వ్యక్తం చేశారు. తాజాగా డీఎడ్ పరీక్షల నిర్వహణకు తేదీలను ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తాం. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం. –అప్పారి జయప్రకాష్, ప్రభుత్వ డైట్ కళాశాల, బొమ్మూరు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.. ఛాత్రోపాధ్యాయుల మొదటి సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం. – జి.నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, కాకినాడ -
డీఎడ్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల
జూలై 6 నుంచి ప్రారంభం కర్నూలు సిటీ: డీఎడ్ మొదటి సంవత్సర పరీక్షలు జూలై 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. పాత, కొత్త సిలబస్‌తో పరీక్షలు జరుగనున్నాయి. మరో మూడు నెలలు ఉంటే కోర్సు గడువు సైతం పూర్తి కానున్న తరుణంలో విద్యార్థులు.. మొదటి ఏడాది పరీక్షలు రాయనుండటం గమనార్హం. జిల్లాలో ఒక ప్రభుత్వ డీఎడ్ కాలేజీతో పాటు, మొత్తం 93 కాలేజీలు ఉన్నాయి. నామినల్ రోల్స్ 3200 మందికి చేశారు. అయితే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మిగిలిపోయిన సీట్లను ఇష్టానుసారంగా భర్తీ చేసినట్లు విమర్శలు ఉన్నాయి. మొదటి సంవత్సర పరీక్షలు పాత సిలబస్‌తో రాయాలో కొత్త సిలబస్‌తో రాయాలో అర్థం కాకపోవడంతో కొన్ని రోజులు ఛాత్రోపాధ్యాయులు ఆందోళనకు గురి అయ్యారు. దీనిపై సెకెండరీ ఎడ్యుకేషన్ స్పష్టత ఇచ్చింది. పాత, కొత్త సిలబస్‌లతో రాయాల్సి ఉంటుంది. ఆరో పేపరుకు మాత్రం మొత్తం కొత్త సిలబస్‌ను అనుసరించనున్నారు. ఈ పేపరుకు సంబంధించి అభ్యర్థులకు మాత్రం చివరి ఆరగంటలో బిట్ పేపర్ ఇవ్వనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. తేదీ పేపరు సబ్జెక్టు జూలై–06 పేపర్–1 చైల్డ్‌హుడ్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లర్నింగ్ (కొత్త సిలబస్),ఎడ్యుకేషన్ ఇన్ ఎమర్జీ ఇండియా (పాత సిలబస్) జూలై –07 పేపర్–2 సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరికులం (కొత్త సిలబస్),ఎడ్యుకేషన్ సైకాలజి మెజర్మెంట్ అండ్ ఎవాల్యుషన్(పాత సిలబస్) జూలై–08 పేపర్–3 చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (కొత్తసిలబస్), ప్రాథమిక విద్య ప్రణాళిక యాజమాన్యం, ఉపాధ్యాయుల విధులు (పాత సిలబస్) జూలై–10 పేపర్–4 తెలుగు పెడగాగి/ఉర్దూ, తమిళ్ ప్రాథమిక స్థాయి (కొత్త సిలబస్), ప్రాస్పెక్టీవ్స్ ఇన్ ప్రైమరీ అండ్ ఇంక్లీసివ్ఎడ్యుకేషన్(పాతసిలబస్) జూలై–11 పేపర్–5 ప్రాథమిక స్థాయి గణిత శాస్త్ర పెడగాగి (కొత్త సిలబస్), కెపాసిటీ బిల్డింగ్(పాత సిలబస్), పార్ట్–1 కంప్యూటర్ ఎడ్యుకేషన్, పార్ట్–2 ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ పార్ట్–3 వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ జూలై–12 పేపర్–6 పెడగాగి అక్రాస్ కరికులమ్ అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్ (కొత్త సిలబస్) -
డీఎడ్ పరీక్షలు నిర్వహించేదెన్నడో?
పూర్తి కావొస్తున్న రెండో సంవత్సరం నేటికీ విడుదల కాని తొలి ఏడాది పరీక్షల షెడ్యూల్ ఆందోళనలో డీఎడ్ విద్యార్థులు రాయవరం (మండపేట) : వారంతా భావి ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులైన అనంతరం విద్యార్థులకు సమయానికి పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న వీరే పరీక్షలు ఎప్పుడు రాయాలో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. డీఎడ్ మొదటి సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరంలోకి ప్రవేశించినా... తొలి సంవత్సరం పరీక్షలకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయక పోవడంతో డీఎడ్ విద్యార్థులు(ఛాత్రోపాధ్యాయులు) ఆందోళన చెందుతున్నారు. భిన్నంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ విద్యార్థులు ఏ కోర్సు చదివినా సాధారణంగా జూన్, జూలై నెలల్లో పాఠాలు ప్రారంభించి ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత విద్యా సంవత్సరాన్ని ముగిస్తారు. డీఎడ్ విద్యార్థుల విషయంలో మాత్రం విద్యాశాఖ భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రతి ఏటా అడ్మిషన్లు జూన్‌లో ప్రారంభించడం లేదు. అక్టోబరులో తరగతులు ప్రారంభించి సకాలంలో సిలబస్‌ను పూర్తి చేయలేక పోతున్నారు. రాష్ట్ర విద్యాశాకాధికారుల అలసత్వం కారణంగా విద్యార్థులకు సంవత్సరం కాలం వృథా అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ జిల్లాలో పరిస్థితి... రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో (డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) కళాశాల ఉండగా జిల్లాలో 60 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డైట్ కళాశాలలో 100 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రైవేటు కళాశాలల్లో కొన్ని చోట్ల బ్యాచ్‌కు 100 మంది, కొన్ని కళాశాలల్లో బ్యాచ్‌కు 50 మంది చొప్పున విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ప్రకారం జిల్లాలో సుమారుగా 3,900 మంది డీఎడ్ విద్యార్థులు చదువుతున్నారు. రెండేళ్ల కోర్సులో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగు పెట్టి 11 నెలలు కావస్తున్నా నేటికీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయలేదు. ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం పూర్తి చేశారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో జిల్లా విద్యాశాకాధికారుల వద్ద కూడా ఎలాంటి సమాచారం లేదు. విద్యార్థుల సమస్యలివీ.. రెండో సంవత్సరం పూర్తి కావస్తున్నా వార్షిక పరీక్షలు నిర్వహించకపోవడతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తే... రెండో సంవత్సర పాఠ్యాంశాలు చదవాలా..మొదటి సంవత్సరం పరీక్షలకు సిద్ధం కావాలా? అనే సందిగ్దంలో ఉన్నారు. రెండు సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలు ఒకే సారి వెంట వెంటనే ఎలా రాయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. మా భవిష్యత్తుతో చెలగాటమా? ప్రభుత్వం మా భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. పాఠ్య పుస్తకాలను సైతం సకాలంలో అందించలేదు. నేటి వరకూ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. - షేక్ షమీలా బేగం, డీఎడ్ విద్యార్థిని, పలివెల, కొత్తపేట మండలం ఆశ్చర్యంగా ఉంది అకడమిక్ విద్యా సంవత్సరం ప్రకారం గత ఏడాది నవంబరు నాటికే మొదటి సంవత్సరం పూర్తవుతుంది. సెకండియర్ డిసెంబర్ నుంచి ప్రారంభమైంది. అయినా నేటి వరకూ ఫస్టియర్ పరీక్షలకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. - కె.చిరంజీవి, ప్రిన్సిపాల్, పలివెల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది డైట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించని విషయం వాస్తవమే. మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే రెండో సంవత్సరం సిలబస్ చదువుతున్నారు. పరీక్షల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. - అప్పారి జయప్రకాష్, డైట్ ప్రిన్సిపాల్, బొమ్మూరు, రాజమహేంద్రవరం రూరల్ షెడ్యూల్ విడుదల కావాలి డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ విడుదలైన వెంటనే పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. గత ఏడాది విద్యార్థుల వార్షిక పరీక్షల గురించి ఇప్పటి వరకూ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి షెడ్యూల్ రాలేదు. - జి.నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, కాకినాడ -
రాష్ట్రస్థాయి డీఎడ్ క్రీడాపోటీల ఓవరాల్ ఛాంప్‌గా ‘తూర్పు’
రాజమహేంద్రవరం రూరల్ : గుంటూరు జిల్లాలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీల్లో 55 పాయింట్లతో తూర్పు గోదావరి జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుందని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు తెలిపారు. డైట్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను ఆయన అభినందించారు. బొమ్మూరు డైట్ కళాశాల విద్యార్థులు 400 మీటర్ల పరుగు రిలేలో ప్రథమ, బాలికల విభాగంలో ద్వితీయ స్థానాలు సాధించారని తెలిపారు. విజేతలను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు, ఎస్ఎస్ఏ పీవో ఎం.శేషగిరి, డివైఈవో ఎస్.అబ్రహం, పీఈటీ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జీవన్‌దాస్, ప్రైవేటు డీఎడ్ కళాశాలల ప్రతినిధులు డీవీ సుబ్బరాజు, ఆర్.విశ్వనాథరావు, ప్రభుత్వ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఐహెచ్జీఎన్ ప్రసాద్, ఐఏఎస్ఈ కళాశాల ప్రాంగణ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆర్.నాగేశ్వరరావు, డైట్ అధ్యాపకులు జె.సుబ్రహ్మణ్యం, డి.నాగేశ్వరరావు, ఆర్జేడీ రాజు, ఎ.రామకృష్ణ, కేవీ సూర్యనారాయణ, సాల్మన్‌రాజు, బావాజీరెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. రాష్ట్రస్థాయి విజేతలు వీరే.. బాలుర వాలీబాల్ పోటీలో రత్న సలోమన్ డీఎడ్ కళాశాల (గోకవరం), కబడ్డీలో డైట్ కళాశాల (ఐటీడీఏ, రంపచోడవరం), హైజంప్‌లో వీవీఎస్ డీఎడ్ కళాశాల (యు.కొత్తపల్లి), 100 + 4 మీటర్ల పరుగు రిలేలో బొమ్మూరు డైట్ కళాశాల, బాలికల విభాగం 400 మీటర్ల పరుగులో సాయిరామ్ డీఎడ్ కళాశాల (పిడింగొయ్యి) ప్రథమ స్థానాలు సాధించాయని జయప్రకాశరావు తెలిపారు. చెస్‌లో వైవీఎస్ అండ్ బీఆర్ఎం డీఎడ్ కళాశాల (ముక్తేశ్వరం) ద్వితీయ, బాలికలు 200 మీటర్ల రన్నింగ్, పాటల పోటీల్లో డైట్ కళాశాల (ఐటీడీఏ, రంపచోడవరం), లాంగ్‌జంప్‌లో నారాయణ డీఎడ్ కళాశాల (మలికిపురం), వక్తృత్వ పోటీల్లో జీబీఽఆర్ డీఎడ్ కళాశాల (అనపర్తి), 100 + 4 మీటర్ల పరుగు రిలేలో బొమ్మూరు డైట్ కళాశాల ద్వితీయ స్థానాలు సాధించాయని వివరించారు. -
వెబ్సైట్లో డీఎడ్ సెకండియర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: గత నవంబర్‌లో నిర్వహించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. మార్కుల మెమోలను తమ వెబ్సైట్లో (bse.telangana.gov.in) అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు రీకౌంటింగ్ కావాలనుకుంటే ఎం.పద్మావతి, అడిషనల్ జాయింట్ సెక్రటరీ పేరుతో నేరుగా లేదా పోస్టు ద్వారా వచ్చే నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి సబ్జెక్టుకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. -
ఓవరాల్ చాంపియన్ విజేత బుక్కపట్నం
అట్టహాసంగా ముగిసిన డీఎడ్ క్రీడా పోటీలు బుక్కపట్నం : ప్రభుత్వ డైట్, ప్రయివేట్ డీఎడ్ కళాశాలల ఆధ్యర్యంలో స్థానిక చౌడేశ్వరీ ఆలయం వద్ద డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రీడా పోటీలు సోమవారం అట్టహాసంగా ముగిశాయి. బుక్కపట్నం డైట్ కళాశాలతోపాటు జిల్లాలోని 30 డీఎడ్ కళాశాలల్లో శిక్షణ పొందుతున్న ఛాత్రోపా«ధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థినీవిద్యార్థులు ఒవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. విజేత జట్ల వివరాలు : కబడ్డీ బాల,బాలికల విభాగాల్లో బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థులు ఫైనల్లో విజేతలుగా నిలిచారు. రన్నర్స్‌గా జ్ఞాన భారతి (కళ్యాణద్గుం), ఎస్వీ డీఎడ్ కళాశాల (ఓడీసీ) విద్యార్థులు నిలిచారు. వాలీబాల్‌లోనూ బుక్కపట్నం డైట్ క్రీడాకారులు విజేతలుగా నిలిచి సత్తాచాటారు. బాలాజీ కళాశాల (నల్లమాడ) క్రీడాకారులు రన్నర్స్‌గా నిలిచారు. చెస్ పోటీలో : ధర్మవరం హైందవి కళాశాల విద్యార్థులు విజేతలుగా, బుక్కపట్నం డైట్ కళాశాల క్రీడా కారులు రన్నర్స్‌గా నిలిచారు. టెన్నిస్‌లో ఎస్వీ డీఎడ్ కళాశాల జట్టు విజయం సాధించగా, టెన్నికాయిట్‌లో సెయింట్ జోషఫ్ (అనంతపురం) క్రీడాకారులు విజయం సాధించారు. జిల్లా అథ్లెటిక్స్‌లో : 400 మీటర్ల పరుగు పందెం బాలుర విభాగంలో ధర్మవరం హైందవి కళాశాల విద్యార్థి అనిల్‌కుమార్ మొదటి స్థానం, నల్లమాడ బాలాజీ కళాశాల విద్యార్థి మన్సూర్ ద్వితీయ స్థానం, సెయింట్ జోసఫ్ (అనంతపుం) కళాశాల విద్యార్థి మారుతీ తృతీయ స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో : బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థిని శివమ్మ ప్రథమ స్థానం, పెనుకొండ రాణా కళాశాల విద్యార్థిని గీత ద్వితీయ, అనంతపురం బాలాజీ కళాశాల విద్యార్థిని వనజాక్షి తృతీయ స్థానంలో నిలిచారు. లాంగ్ జంప్‌లో బాలికల విభాగం : బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థిని మేఘన మొదటి స్థానం, అనంతపురం జెయింట్ జోసఫ్ కళాశాల విద్యార్థిని ఉమాదేవి ద్వితీయ, అనంతపురం లిటిల్ ఫ్లవర్ కళాశాల విద్యార్థిని మౌనిక తృతీయ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో : ధర్మవరం హైందవి కళాశాలకు చెందిన అశోక్ ప్రథమ స్థానం, ఓడీసీ విజ్ఞాన్ కళాశాల విద్యార్థి గౌస్ ద్వితీయ స్థానం, పెనుకొండ రాణా కళాశాల విద్యార్థి అశోక్‌కుమార్ తృతీయ స్థానంలో నిలిచారు. 800 మీటర్ల పరుగు పందెం బాలుర విభాగంలో : బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థి సురేష్‌కుమార్ మొదటి స్థానం, గుంతకల్ డీఎడ్ కళాశాలకు చెందిన లక్ష్మన్న రెండో స్థానం, అనంతపురం సెయింట్ జోసఫ్ విద్యార్థి గోపి తృతీయ స్థానంలో నిలిచారు. 800 మీటర్ల పరుగు పందెం విభాగంలో : బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థిని శివమ్మ ప్రథమ స్థానం, అనంతపురం సుశీల కళాశాల విద్యార్థిని వనజాక్షి ద్వితీయ స్థానం, ఓడీసీ ఎస్వీ కళాశాల విద్యార్థిని జయదీపిక తృతీయ స్థానంలో నిలిచారు. 4 మీటర్ల రిలే పోటీల్లో బాలుర విభాగంలో : బుక్కపట్నం డైట్, సెయింట్ జోసఫ్, రాణా పెనుకొండ కళాశాలల క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. బాలికల విభాగంలో : బుక్కపట్నం డైట్, రాణా పెనుకొండ, సెయింట్ జోసఫ్ కళాశాలల విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 200 మీటర్ల బాలుర విభాగంలో : అనంతపురం భారతి కళాశాల విద్యార్థి గంగాధర్ ప్రథమ, బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థి ఏకాంత్ ద్వితీయ ,పెనుకొండ రాణా కళాశాల విద్యార్థి అశోక్‌కుమార్ తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. బాలికల విభాగంలో : బుక్కపట్నం డైట్ విద్యార్థిని మేఘన ప్రథమ, బాలాజీ (నల్లమాడ) కళాశాల విద్యార్థిని లత ద్వితీయ, రాణా (పెనుకొండ) కళాశాల విద్యార్థిని గీత తృతీయ స్థానాల్లో నిలిచారు. షాట్ ఫుట్ బాలికల విభాగంలో : అనంతపురం సెయింట్ జోసఫ్ కళాశాల విద్యార్థిని ఉమాదేవి ప్రథమ, అనంతపురం లిటిల్ ఫ్లవర్ విద్యార్థిని త్రివేణి ద్వితీయ, ఓడీసీ ఎస్వీ కళావాల విద్యార్థిని జయదీపిక తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలుర విభాగంలో : అనంతపురం రైసర్ కళాశాలకు చెందిన దేవేంద్ర ప్రథమ, అనంతపురం సుశీల కళాశాల విద్యార్థి రాజేష్ ద్వితీయ, ఓడీసీ ఎస్వీ కళాశాల విద్యార్థి రామాంజి తృతీయ స్థానాల్లో నిలిచారు. పాటల పోటీల్లో : కళ్యాణదుర్గం వివేకానంద కళాశాల విద్యార్థిని సంధ్య ప్రథమ, ఇదే పట్టణానికి చెందిన శ్రీదేవి కళాశాల విద్యార్థిని అఖిలబాను ద్వితీయ, అనంతపురం బాలాజీ డీఎడ్ కళాశాల విద్యార్థి సాంబశివుడు తృతీయ స్థానం లో నిలిచారు. వక్తృత్వపు పోటీల్లో విజేతల వివరాలు : బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థి అనిల్‌కుమార్, అనంతపురం బాలాజీ కళాశాల విద్యార్థిని అశ్విని, సుశీల కళాశాలకు చెందిన శ్రీనివాసులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. చిత్రలేఖనంలో పోటీల్లో : కళ్యాణదుర్గం శ్రీదేవి కళాశాలకు చెందిన వాణి, గోరంట్ల కళాశాలకు చెందిన దీపిక, ధర్మవరం హైందవి కళాశాలకు చెందిన మణిప్రియ వరుసగా 1,2,3వ స్థానాలు దక్కించుకున్నారు. క్విజ్ పోటీల్లో : పెనుకొండ సత్యసాయి డీఎడ్ కళాశాల విద్యార్థులు రమేశ్, బాలయ్య, బుక్కపట్నం డైట్కళాశాలకు చెందిన లోకేశ్, శివకేశవ, నల్లమాడ బాలాజీ కళాశాలకు చెందిన హరిబాబు, స్వర్ణలతలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినట్లు వ్యాయామ అధ్యాపకుడు రామకష్ణ, నాగరాజులు తెలిపారు. -
నేటి నుంచి డీఎడ్ స్పోర్ట్స్ మీట్
బుక్కపట్నం : స్థానిక చౌడేశ్వరీ ఆలయం వద్దనున్న మైదానంలో శనివారం జిల్లా డీఎడ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపాల్, స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ జనార్దన్‌రెడి, డైట్ వ్యాయామ అధ్యాపకుడు రామక్రిష్ణ శుక్రవారం తెలిపారు. ఈ పోటీలు 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 49 ప్రైవేట్ డీఎడ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారన్నారు. వారికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. -
చిరుతల్లా.. శరాల్లా..
సత్తా చాటుతున్న డీఎడ్ విద్యార్థులు హోరాహోరీగా జిల్లాస్థాయి క్రీడాపోటీలు రాజమహేంద్రవరం రూరల్ :వారు వేట వేళ చిరుతల్లా లంఘిస్తున్నారు. సంధించిన శరాల్లా దూసుకుపోతున్నారు. వివిధ క్రీడల్లో తమ సత్తాను, వడీ, వడుపులను చాటుతూ సంభ్రమానందాలు కలిగిస్తున్నారు. బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణాసంస్థ (డైట్)లో జిల్లాస్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు రెండవరోజు గురువారం హోరాహోరీగా సాగాయి. డైట్ ప్రాంగణంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, చెస్ పోటీలు, జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రన్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్‌లలో విద్యార్థులు తలపడ్డారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. కాగా సాంస్కృతిక విభాగంలో పాటలు, ఏకపాత్రాభినయం, నృత్యపోటీలు నిర్వహించారు. పోటీలను డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు, లెక్చరర్ రాయుడు, ఇతర లెక్చరర్లు, పీఈటీల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జీవన్‌దాస్, పీడీ ప్రసాద్, పీఈటీలు పర్యవేక్షించగా, ప్రైవేటు డీఎడ్ కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
డీఎడ్ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్ : క్రీడల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు సాధించవచ్చని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి తెలిపారు. బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో జిల్లా స్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ డైట్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఏఎస్ఈ (ట్రైనింగ్ కళాశాల) ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఐహెచ్జిఎన్ ప్రసాదు, ప్రభుత్వ మోడల్ హైస్కూలు హెచ్ఎం ఆర్.నాగేశ్వరరావు, జిల్లా ప్రైవేటు డీఎడ్ కళాశాలల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు డి.వి.సుబ్బరాజు, రాష్ట్ర ప్రైవేటు డీఎడ్ కళాశాలల సంఘ కార్యనిర్వాహక సభ్యుడు ఆర్.కె.విశ్వనాథరావు మాట్లాడారు. ఎంపీడీఓ ఎ.రమణారెడ్డి, తహసీల్దార్ జి.భీమారావు, ఎంఈఓ కె.నరసింహారెడ్డి, పీఈటీల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జీవన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. హోరాహోరీగా పోటీలు తొలి రోజు బాలుర క్రీడా పోటీల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, బాల్ బ్యాడ్మింటన్, బాలికల విభాగంలో ఖోఖో, కబడ్డీ, చెస్, టెన్నికాయిట్, వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. సాంస్కృతిక విభాగంలో పాటలు, ఏకపాత్రాభినయం, నృత్య పోటీలు, సాహిత్య విభాగంలో వక్తృత్వం, వ్యాస రచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. -
డీఎడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
బుక్కపట్నం : డీఎడ్–2016 రెండో కౌన్సెలింగ్‌లో సీట్లు డౌన్ లోడు చేసుకున్న విద్యార్థులకు డైట్ కళాశాలలో మంగళవారం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టామని ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి అన్నారు. రెండో కౌన్సిలింగ్ స్లైడింగ్‌లో కొత్త కళాశాలలో సీట్లు పొందిన వారు గతంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేదని అలాంటి వారు కూడా బుధవారం హాజరు కావచ్చనని ఆయన పేర్కొన్నారు. -
డీఎడ్‌కు ప్రత్యేక కౌన్సెలింగ్
అంగలూరు (గుడ్లవల్లేరు) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుకు మంగళవారం అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస ్థ(డైట్)లో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను అధ్యాపకులు డి.నగేష్, ఏవీడీఎం ప్రసాద్ పరిశీలించారు. ప్రిన్సిపాల్ జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బుధవారం కూడా కొనసాగుతుందని తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. సీట్లు పొందిన అభ్యర్థులు గురువారం లోగా తమకు కేటాయించిన సంస్థలో చేరకపోతే ఆ సీట్లు పక్షం రోజుల్లోగా రద్దు అవుతాయన్నారు. -
డీఎడ్ పరీక్షలు
ఏలూరు సిటీ : డీఎడ్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు నవంబర్ 03తేదీ నుంచి 08తేదీ వరకు నిర్వహిస్తామని జిల్లా విద్యా«ధికారి డీ.మధుసూధనరావు మంగళవారం తెలిపారు. 2014–16 విద్యాసంవత్సరానికి సంబంధించి డీఎడ్ అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్దపడాలని కోరారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. -
డీఎడ్ పరీక్షలు
ఏలూరు సిటీ : డీఎడ్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు నవంబర్ 03తేదీ నుంచి 08తేదీ వరకు నిర్వహిస్తామని జిల్లా విద్యా«ధికారి డీ.మధుసూధనరావు మంగళవారం తెలిపారు. 2014–16 విద్యాసంవత్సరానికి సంబంధించి డీఎడ్ అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్దపడాలని కోరారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. -
ఐటీడీఏ డిప్యూటీ ఈఓ సాంబయ్య మృతి
ఏటూరునాగారం : ఐటీడీఏ డిప్యూటీ ఈఓ, తాళ్లగడ్డ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పులుసం సాంబయ్య(45) బుధవారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, హెడ్‌కానిస్టేబుల్ రమేష్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని తాళ్లగడ్డలో కుటుంబ సభ్యులతో నివాసముంటున్న సాంబయ్యకు వారం రోజులుగా కడుపునొప్పి వస్తుండడంతో ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకున్నాడు. అలాగే పాఠశాలలో గడ్డి బాగా పెరగడంతో గడ్డి నివారించేందుకు పెస్టిసైడ్స్ షాపులో తెచ్చుకున్న గడ్డి మందును ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో 10వ తేదీన ఉదయం కడుపునొప్పి వస్తుండడంతో టానిక్ అనుకొని పక్కనే ఉన్న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తర్వాత సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఈ నెల 19న ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశాడు. మృతుడి భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు హెడ్‌కానిస్టేబుల్ రమేష్ తెలిపారు. -
వీర సైనికులారా వందనం
కశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన భారత జవాన్లకు నివాళిగా సోమవారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. లోక్‌సత్తా విద్యార్థి విభాగం, మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. హన్మకొండ జూనియర్ కళాశాల నుంచి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ సాగింది. -
డీఎడ్ విద్యార్థులు 15లోగా ఫీజులు చెల్లించాలి
డీఈవో మధుసూదనరావు ఏలూరు సిటీ : డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) 2014–16 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజు, నామినల్ రోల్స్ సమర్పించాల్సిన తేదీలను డీఈవో డి.మధుసూదనరావు శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు ఫీజులను ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 15లోగా చెల్లించాలని, నామినల్ రోల్స్‌ను కాలేజీ యాజమాన్యాలు ఈనెల 17లోగా డీఈవో కార్యాలయానికి సమర్పించాలని కోరారు. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 22 వరకు ఫీజులు చెల్లించవచ్చని, నామినల్ రోల్స్ వివరాలు 24 తేదీలోగా డీఈవో కార్యాలయానికి సమర్పించాలని తెలిపారు. రెగ్యులర్ అభ్యర్థులు రూ.250, ఫెయిల్ అయిన అభ్యర్థులు నాలుగు లేదా ఐదు పరీక్షలకు రూ.250, మూడు పేపర్లకు రూ.175, రెండు పేపర్లకు రూ.150, ఒక పేపర్‌కు రూ.125 చెల్లించాలని తెలిపారు. డీఏ డ్రాకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏపీ ట్రెజరీ వెబ్సైట్లో నూతన డీఏను డ్రా చేసుకునేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం అప్డేట్ చేసిందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, బి.గోపీమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి 8వ తేదీల్లో డీఏ అరియర్స్ బిల్లులను డీడీవోలు అంతా బిల్లులు చేసి ట్రెజరీలకు పంపాలని కోరారు. -
బైక్ అదుపుతప్పి.. యువకుడి దుర్మరణం
నేరడ (కురవి) : రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతిచెంది నట్లు కురవి ఎస్సై జె.రామకృష్ణ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం..ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా రుద్రారం(గోపాలపట్నం) తాలూకాలోని అర్జునెల్లి గ్రామానికి చెందిన కోరెం నరేంద్ర(28) మానుకోట మండలంలోని జంగిలిగొండ వద్ద జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 14న(ఆదివారం) రాత్రి పనులు ముగించుకొని ద్విచక్రవాహనంపై జంగిలిగొండ నుంచి నేరడ గ్రామానికి వచ్చాడు. అక్కడి నుంచి కురవి వైపు వస్తుండగా, అతడి బైక్ అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనున్న కాలువ గట్టుపై పడిపోయాడు. కణతకు తీవ్ర గాయమై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ఆ రోడ్డు మీదుగా వెళ్తున్నవారు గమనించి ప్రమాద ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. అయితే సకాలంలో చికిత్స అందక సంఘటనా స్థలంలోనే నరేంద్ర కన్నుమూశాడు. కురవి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మానుకోటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, నరేంద్ర పనిచేస్తున్న జేసీబీ యజమానికి సంఘటన గురించి తెలిపారు. మృ తదేహాన్ని సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నిర్మల్ టౌన్: పట్టణంలోని కంచెరోని చెరువు సమీపంలోని జాతీయరహదారిపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పట్టణ ఎసై ్స సునీల్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన గౌతంరెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి ఏపీ25ఎల్ 9009 నెంబర్ కారులో నిజామాబాద్‌వైపు Ðð ళ్తున్నాడు. ఈ క్రమంలో నిజామాబాద్ వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారును నడుపుతున్న గౌతమ్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మిగతా వారు తీవ్ర గాయాలపాలు కాగా, వారిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స తెలిపారు. -
26న డీఎడ్ కళాశాల ప్రిన్సిపాళ్లతో సమావేశం
బుక్కపట్నం : జిల్లాలోని అన్ని డీఎడ్ కళాశాల ప్రిన్సిపాళ్లతో ఈనెల 26న సమావేశం నిర్వహిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. రెండో సంవత్సరం డీఎడ్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై చర్చిస్తామన్నారు. ప్రిన్సిపాళ్లు ఉదయం 9 గంటలకు తప్పక హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. -
వడ్రంగి అనుమానాస్పద మృతి
తాడేపల్లిగూడెం రూరల్ (పశ్చిమగోదావరి) : అనుమానాస్పద స్థితిలో వడ్రంగి మరణించిన ఘటన మంగళవారం తాడేపల్లిగూడెం గుడ్ షెపర్డ్ హైస్కూల్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని మూడో వార్డు వీకర్స్ కాలనీకి చెందిన మల్లాది శ్రీనివాస్(35) కొండాలమ్మగుడి రోడ్డులోని అంజలి వైన్స్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వడ్రంగి పనిచేస్తూ శ్రీనివాస్ జీవనం సాగిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం చింతలపల్లికి చెందిన శ్రీనివాస్‌కు, కృష్ణా జిల్లా కృత్తివెన్నుకు చెందిన లక్షీ్మశ్రీదేవికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు దివ్యశ్రీ, విజయకిషోర్ ఉన్నారు. ఆరేళ్లపాటు హైదరాబాద్‌లో వడ్రంగి పనిచేసిన శ్రీనివాస్ రెండేళ్ల క్రితం తాడేపల్లిగూడెం వచ్చాడు. ఇక్కడ వీకర్స్ కాలనీలో నివసిస్తూ, పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం స్థానికులు అతడి మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎంఆర్ఎల్ఎస్ మూర్తి, ఎస్సై ఎం.సూర్యభగవాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న మృతుని భార్య లక్ష్మీశ్రీదేవి నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడిని మింగేసిన నీటికుంట
గోగుబాక(నెల్లిపాక) : నీటిగుంటలో పడి ఏడేళ్ల బాలుడు మరణించిన విషాద ఘటన ఎటపాక మండలంలోని గోగుబాక గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచిబోయిన నాగరాజు, పద్మావతి దంపతుల కుమారుడు హర్షవర్థన్(7) రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో దుస్తులు ఉతికేందుకు వెళుతున్న మహిళలతో కొందరు చిన్నారులు వెళ్లారు. గ్రామ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో తవ్విన నీటిగుంట వద్ద తోటి చిన్నారులతో కలిసి ఆడుకుంటుండగా, హర్షవర్థన్ అదుపుతప్పి నీటిలో పడి మునిగిపోయాడు. ఈ విషయాన్ని చిన్నారులు సమీపంలో దుస్తులు ఉతుకుతున్న మహిళలకు చెప్పడంతో వారు భయంతో కేకలు వేశారు. దీంతో అటుగా వస్తున్న కొందరు కూలీలు గమనించి అక్కడకు చేరుకుని, నీటిగుంట నుంచి బాలుడిని వెలికితీశారు. అతడిని సమీపంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
ఏపీలో డీఎడ్ స్పాట్ అడ్మిషన్లకు అనుమతి
-2014-15 బ్యాచ్ ఫస్టియర్ విద్యార్ధులకు అవకాశం హైదరాబాద్ ఏపీలో డీఎడ్ 2014-15 బ్యాచ్ ఫస్టియర్‌లో ప్రయివేటు కాలేజీలు చేపట్టిన స్పాట్ అడ్మిషన్లకు పాఠశాల విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో 28 డీఎడ్ కాలేజీలు కన్వీనర్ కోటా కింద మిగిలిపోయిన 168 సీట్లను స్పాట్ అడ్మిషన్ల కింద భర్తీచేసుకున్నాయి. ఈ విద్యార్ధులను ఫస్టియర్ పరీక్షలకు అనుమతించేందుకు ప్రభుత్వం అనుమతించడంతో సంబంధిత కాలేజీలు నిర్ణీత అపరాధ రుసుము, పరీక్ష ఫీజులను సోమవారమే చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ ఆదివారం ఆర్సీ నెంబర్ 53/సీ1/2015ను విడుదల చేశారు. ఆయా కాలేజీలు విద్యార్ధుల నామినల్ రోల్స్‌ను, ధ్రువపత్రాలను కూడా సమర్పించాలని ఆదేశించారు. ఈ అభ్యర్ధులకు హాల్‌టిక్కెట్లు జారీచేయాల్సి ఉన్నందున తక్షణమే చెల్లింపులు, నామినల్‌రోల్స్‌ను సమర్పించాలన్నారు. -
‘ఢీ’ఎస్సీ
* ‘టెర్ట్’కు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ ఉద్యోగార్థులు * ప్రణాళికాబద్ధమైన సాధనతో విజయుం సాధ్యవుంటున్న నిపుణులు * కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్న అభ్యర్థులు చిత్తూరు(ఎడ్యుకేషన్): రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లాలోని వేలాదివుంది బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు తమ కల నెరవేర్చుకునేందుకు తుదిపోరుకు సన్నద్ధవువుతున్నారు. ఈసారి టెట్, డీఎస్సీ రెండు పరీక్షలను కలిపి టెర్ట్(టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్మెంట్ టెస్ట్) పేరిట సిలబస్‌ను సైతం సమ్మిళితం చేసి ఒకే పరీక్షను నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. 2012 డీఎస్సీ సిల బస్నే ఇవ్వడంతో హైస్కూల్స్థారుు వరకు పాత పాఠ్యపుస్తకాల కోసం అభ్యర్థులు శోధిస్తున్నారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 221 ఉండగా, సెకండరీ గ్రేడ్ టీచర్లు 1,194 పోస్టులున్నారుు. లాంగ్వేజ్ పండిట్లు 182 ఉండగా, తొమ్మిది పీఈటీ పోస్టులు ఉన్నారుు. ఎస్జీటీ పోస్టులకు కేవలం డీఎడ్ అభ్యర్థులు వూత్రమే అర్హులుగా ప్రకటించడంతో బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే కుస్తీ పడుతున్నారు. టెట్ రద్దు చేయుడంతో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన ప్రతి అభ్యర్థీ డీఎస్సీ (టెర్ట్) రాసే అవకాశం ఉంది. ఈసారి దరఖాస్తులు రికార్డుస్థాయిలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయు పోస్టులు ఉండడంతో ఇతర జిల్లాల అభ్యర్థులు సైతం నాన్‌లోకల్ కేటగిరీ కింద ఇక్కడ దరఖాస్తు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓపెన్ కేటగిరీలో 20 శాతం నాన్‌లోకల్ అభ్యర్థులు పోటీపడే వెసులుబాటు ఉండడంతో ముఖ్యంగా పోస్టులు తక్కువగా ఉన్న వైఎస్సార్, విజయునగరం, కృష్ణా, విజయునగరం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు తదితర జిల్లాలకు చెందిన అభ్యర్థులు వున జిల్లావారితో పోటీ పడనున్నారు. తెలుగు అభ్యర్థులకు అన్యాయుం తెలుగు బోధనలో ఏవూత్రం ఉపయోగంలేని సబ్జెక్టులకు అధిక వూర్కులు కేటారుుంచి తెలుగు సబ్జెక్టుకు తక్కువ వూర్కులు కేటారుుం చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. స్కూల్ అసిస్టెంట్లకు ఈసారి సిలబస్ కొద్దిగా క్లిష్టతరంగా ఇచ్చారు. పాఠ్యపుస్తకాల్లోని కవి కాలాదులతోపాటు విషయు అవగాహనకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగుభాష సాహిత్యచరిత్ర (వెలవుల తివ్మున్న) తెలుగుభాష సాహిత్య సమీక్ష (ద్వానాశాస్త్రి, నాగయ్యు), ప్రశ్నోత్తర కైముది(తెలుగు అకాడమీ) పుస్తకాలు అధికవూర్కులు సాధించేందుకు తోడ్పడతాయి. -యువశ్రీ మురళి,తెలుగు భాషా పండితులు, గోవర్థనపురం, వరదయ్యుపాళెం భూగోళం, చరిత్రపై శ్రద్ధ చూపాలి సోషల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు భూగోళ శాస్త్రం, చరి త్ర అంశాలపై ప్రధానంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భూగోళ శాస్త్రంలో వ్యూప్కు అనుసంధానంగా ప్రిపేర్ కావాలి. చరిత్ర విషయూనికొస్తే కాలానుగుణంగా రాజవంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ప్రతి ప్రశ్నకూ తార్కిక పద్ధతిలో ఆలోచించి సవూధానాలు గుర్తించాలి. - సురేష్‌బాబు,సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, శ్రీకాళహస్తి ప్రతి మార్కూ కీలకం ఉపాధ్యాయు ఉద్యోగానికి పోటీ తీవ్రతరమైం ది. పరీక్షలో ప్రతి వూర్కూ కీలకం కానుంది. దీంతో మిగిలి ఉన్న కాలాన్ని విభజించుకుని అవగాహనతో కూడిన ప్రిపరేషన్‌తో సత్ఫలితాలు సాధించవ చ్చు. అకాడమీ పుస్తకాలను చదవడం ద్వారా అధిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. - నల్లందుల గుణశేఖర్రెడ్డి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రాక్టీస్ పేపర్లు సాధన చేయూలి ఉపాధ్యాయు పరీక్ష డీఎస్సీకి పోటీ తీవ్రంగా ఉంటుంది. సివిల్స్ స్థారుులో ప్రిపేర్ కావాలి. తక్కువ కాల వ్యవధిలో అధిక ప్రశ్నలకు సవూధానాలు రాయూలి. వీలైనన్ని ఎక్కువ పేపర్లను సాధన చేయూలి. విషయూంశాలపై జ్ఞానంతోపాటు అవగాహన పెంపొందించుకోవాలి. గతంలో అడిగిన ప్రశ్నల సరళిని పరిశీలించాలి. ఇతర వ్యాపకాలను తగ్గించి ఏకాగ్రతతో సాధన చేస్తే విజేతలుగా నిలవచ్చు. - కె.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు పోటీ చూసి ఆందోళన వద్దు డీఎస్సీకి పోటీ తీవ్రంగా ఉంటుంది. పోస్టును సాధించడం అనే లక్ష్యం తప్ప వునస్సులో వేరే ఆలోచనవద్దు. నాలుగు నెలల కాలవ్యవధి పరీక్షకు ఉండడంతో సవుయూన్ని ఏవూత్రం వృథా చేయుకుండా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకతను పాటిస్తాం. అనవసర విషయూలను వదిలిపెట్టి సిలబస్ ను అనుసరించి ప్రిపరేషన్ సాగాలి. - శామూయల్, ఇన్చార్జి డీఈవో, చిత్తూరు