developers
-
గోద్రెజ్ ప్రాపర్టీస్ ధరఖాస్తు రిజెక్ట్ చేసిన రెరా
ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్‌కు భారీ షాక్ తగిలింది. గురుగ్రామ్, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్స్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ 2016కు అనుగుణంగా లేని కారణంగా గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మాణ ప్రాజెక్ట్‌ల పొడిగింపు దరఖాస్తును రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తిరస్కరించింది. గోద్రెజ్ డెవలపర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను పొడిగించాలని కోరుతూ ఆ సంస్థ ప్రమోటర్లు రెరాకు దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తులో లైసెన్స్ పునరుద్ధరణ, త్రైమాసిక పురోగతి నివేదిక (క్యూపీఆర్)లో అందించిన బ్యాంక్ బ్యాలెన్స్‌కు సంబంధించిన వివరాల్లో లోపాలు తలెత్తాయి. ఆ లోపాల్ని సరిదిద్దాలని రెరా అనేక సార్లు గోద్రెజ్‌కు ఆదేశాలు చేసింది. అయితే, వాటిని సరిదిద్దడంలో సదరు నిర్మాణ సంస్థ ప్రమోటర్లు విఫలమయ్యారు. దీంతో తాజాగా గోద్రెజ్ డెవలపర్ల ప్రాజెక్ట్ పొడింపు ధరఖాస్తును రిజెక్ట్ చేసింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ సెక్టార్ 85, గురుగ్రామ్‌లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఎయిర్ ఫేజ్ 4 నిర్మాణాలు చేపడుతోంది. ఇందుకోసం రెరా నుంచి గోద్రెజ్ 2018 నుంచి 2023 వరకు రిజిస్ట్రేషన్ పొందింది. రిజిస్ట్రేషన్ తేదీ ముగియడంతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్‌ను పొడిగించాలని కోరుతూ గోద్రెజ్ ప్రాపర్టీస్ రెరా చట్టంలోని సెక్షన్ 6 కింద దరఖాస్తు చేసింది. దరఖాస్తును పరిశీలించిన రెరా.. ఆ దరఖాస్తులో అనేక లోపాలను గుర్తించింది. వాటిని సరిదిద్దాలని కోరింది. చివరికి తీరు మార్చుకోకపోవడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ దరఖాస్తును తిరస్కరించింది. -
10 భారతీయ కంపెనీ యాప్‌లపై కన్నెర్రజేసిన గూగుల్!
టెక్ దిగ్గజం గూగుల్ (Google) పది భారతీయ కంపెనీల యాప్‌లపై చర్య తీసుకుంటున్నట్లు ఈ రోజు (మార్చి 1) వెల్లడించింది. ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ బిల్లింగ్ విధానాన్ని పాటించని కారణంగా కంపెనీ వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. గూగుల్ తొలగించనున్న యాప్‌ల జాబితాలో మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫారమ్ షాదీ.కామ్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ALTT, స్టేజ్ మాత్రమే కాకుండా.. డేటింగ్ యాప్ క్వాక్ క్వాక్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. ఈ యాప్స్ అన్నీ కూడా ప్లే స్టోర్‌కు ఫీజులు చెల్లించకపోవడం వల్ల వీటిని పూర్తిగా తొలగించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యాప్ డెవలపర్లు కూడా గూగుల్ మీద కొన్ని ఆరోపణలు చేశారు, ఇందులో గూగుల్ గేట్ కీపింగ్ చార్జీలు, ఎక్స్ట్రా కమీషన్స్ ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. యాప్ డెవలపర్ల నుంచి తక్కువ ఫీజులే వసూలు చేస్తున్నట్లు తెలిపింది. గూగుల్ ప్లేలో ప్రస్తుతం 200000 మంది భారతీయ యాప్ డెవలపర్లు తమ విధానాలకు కట్టుబడి ఉన్నారని, సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌ను నిర్ధారిస్తున్నారని కంపెనీ తెలిపింది. అయితే 10 కంపెనీలు మాత్రమే తమ నియమాలను పెడచెవిన పెడుతున్నాయని, ఈ కారణంగానే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఇదీ చదవండి: అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ ఈవెంట్: పాప్ సింగర్ ఒక్క పర్ఫామెన్స్కే అన్ని కోట్లా? -
Generative AI: ఏఐలో అమెరికాను ఢీకొట్టేది భారతీయులే..!
ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో భారతీయుల ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచంలోని పలు టెక్నాలజీ దిగ్గజాలకు అధితులుగా భారతీయులే ఉండి నడిపిస్తున్నారు. అత్యాధునిక సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందించడంలో ఇండియన్ డెవలపర్ కమ్యూనిటీ కీలక పాత్రను మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తాజాగా ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. భవిష్యత్తు అంతా ఈ టెక్నాలజీతోనే ముడిపడింది. జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్‌లు ఇప్పటికే అనేకం వస్తున్నాయి. వీటిలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. ముఖ్యంగా ఉత్పాదక ఏఐ ప్రాజెక్ట్‌ల్లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు భారత డెవలపర్లు గట్టి పోటీ ఇస్తున్నారు. 2027 నాటికల్లా.. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని సాఫ్ట్వేర్ కొలాబరేషన్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ అయిన గిట్‌హబ్ (GitHub)లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉంది. 1.32 కోట్ల మంది డెవలపర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. 2027 నాటికి గిట్‌హబ్‌లో భారత్ అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా అమెరికాను అధిగమిస్తుందని భావిస్తున్నారు. గిట్‌హబ్‌లో అత్యధిక సంఖ్యలో జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్న అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ డెవలపర్ల కార్యకలాపాలు, పనితీరును తరువాతి తరం ఏఐ పూర్తిగా మార్చేస్తోందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. భారత డెవలపర్ కమ్యూనిటీ మన టెక్నాలజీ, టూల్స్‌తో భారత్‌తోపాటు ప్రపంచ భవిష్యత్తు కోసం కృషి చేస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
భారత్‌లో మైక్రోసాఫ్ట్ సీడబ్ల్యూబీ ప్రోగ్రాం..
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ తమ ‘కోడ్ వితౌట్ బ్యారియర్స్’ (సీడబ్ల్యూబీ) ప్రోగ్రాంను భారత్‌లోనూ ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ కలి్పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్, కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో లింగ అసమానతలను తొలగించడంలో తోడ్పడే ఉద్దేశంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాల్లో 2021లో ఈ ప్రోగ్రాంను ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు. దీని కింద మహిళా డెవలపర్లు, కోడర్స్‌కు శిక్షణ, నెట్వర్కింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు శిక్షణ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షా కోపైలట్ ప్రోగ్రాం.. ప్రధానంగా ఉపాధ్యాయులకు సాధికారత కలి్పంచేందుకు ఉద్దేశించినదని సత్య నాదెళ్ల తెలిపారు. అజూర్ ఓపెన్ఏఐ మోడల్ తోడ్పాటుతో పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు శిక్షా కోపైలట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని 30 గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. -
వసతులు, సౌకర్యాలపై బిల్డర్లు దృష్టి సారించాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో భూమి లభ్యత పరిమితంగా ఉండటంతో డెవలపర్లు ఎత్తయిన నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. భవనాల ఎత్తు పెరిగే కొద్దీ సమస్యలు ఉంటాయి. అందుకే ఎత్తు మాత్రమే కొలమానం కాకుండా సౌకర్యాలు, వసతులు కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలి’అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డెవలపర్లకు సూచించారు. హైదరాబాద్‌లో శనివారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) రజతోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా...ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు రెరా ప్రతినిధులను నియమించకపోవటం శోచనీయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్వేస్, హైవేస్, రైల్వేస్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం.. వెరసి హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అని వెంకయ్య కొనియాడారు. చంద్రుడిపై ఇళ్లు కట్టే స్థాయికి నరెడ్కో ఎదుగుతుందని ఛలోక్తి విసిరారు. సమర్థ నాయకుడితోనే అభివృద్ధి: వేముల స్థిర, సమర్థవంతమైన నాయకుడితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెరుగైన మౌలిక వసతులు, శాంతి భద్రతలు బాగున్న చోట పెట్టుబడులు వాటంతటవే వస్తాయని ఈ విషయంలో హైదరాబాద్ ముందున్నదని చెప్పారు. కార్యక్రమంలో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రజన్ బండేల్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మైక్రోసాఫ్ట్‌పై ట్విటర్ సంచలన ఆరోపణలు!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సోషల్ మీడియా డెవలపర్ నిబంధనల్ని ఉల్లంఘించి తమ డేటాను వినియోగిస్తుందంటూ ట్విటర్ సంచలన ఆరోపణలు చేసినట్లు ‘ఏఎఫ్‌పీ’ నివేదిక తెలిపింది. గతంలో పలు మార్లు నిబంధనల్ని ఉల్లంఘించి మైక్రోసాఫ్ట్ డేటాను సేకరించిందని మస్క్, అటార్నీ అలెక్స్ స్పైరో (మస్క్ తరుపు న్యాయవాది) సంతకంతో కూడిన లెటర్‌ను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు పంపినట్లు తెలుస్తోంది. చదవండి👉 ‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే? ఆ లెటర్ ఆధారంగా..ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ట్విటర్ నుంచి మైక్రోసాఫ్ట్ డేటా సేకరించడాన్ని నిలిపివేసింది. అయితే అప్పటి వరకు తమ సంస్థ యూజర్ల డేటాను వినియోగించుకున్నందుకు గాను మైక్రోసాఫ్ట్ రుసుము చెల్లించాలని, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ (ఏపీఐ) ఫోరం డెవలపర్ల తరుపున మస్క్ డిమాండ్ చేశారు. అంతేకాదు రెండేళ్ల నుంచి మైక్రోసాఫ్ట్ ట్విటర్ కంటెంట్‌ను గుర్తించి, నియంత్రించే ప్రయత్నించినట్లు ట్విటర్ ఆరోపించింది. అయితే, ఆ డేటాను ఎక్కడ స్టోర్ చేశారు? స్టోర్ చేసిన డేటాతో ఏం చేశారో? జూన్ 7లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. తాజాగా, ట్విటర్ పంపిన లెటర్‌పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. మస్క్ తమకు లెటర్ పంపినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, ఆ లెటర్‌పై రివ్యూ జరిపి తగిన విధంగా స్పందిస్తామని, ఆ సంస్థతో తాము సఖ్యతతో ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్, గూగుల్‌ను ఎదుర్కొనేలా మైక్రోసాఫ్ట్ కృత్తిమ మేధ ఆధారిత టూల్ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్‌కు పోటీగా అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఎక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. పరోక్షంగా చాట్‌జీపీటీని వ్యతిరేకిస్తున్నారు. గత ఏప్రిల్‌లో మైక్రోసాఫ్ట్ చట్ట విరుద్దంగా ట్విటర్ డేటా సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు శిక్షణ ఇస్తుందని, దావా వేసేందుకు సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు. కాగా, డెవలపర్ల ఫోరం తరుపున మాట్లాడుతున్న మస్క్.. మైక్రోసాఫ్ట్ నుంచి ఫీజులు వసూలు చేసి తద్వారా ఆదాయాన్ని గడించనున్నారని వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 అమ్మకానికి సుందర్ పిచాయ్ ఇల్లు.. కొనుగోలు చేసిన యాక్టర్.. ఎవరో తెలుసా? -
మాక్రోటెక్ డెవలపర్స్‌కు రూ.933 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా బ్రాండ్) సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.933 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. తన బ్రిటిష్ అనుబంధ కంపెనీకి ఇచ్చిన రుణానికి సంబంధించి రూ.1,177 కోట్లు కేటాయింపులు చేయాల్సి రావడమే ఈ నష్టాలకు దారితీసినట్టు సంస్థ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.223 కోట్లుగా ఉండడం గమనించాలి. రుణానికి కేటాయింపులు, ఫారెక్స్ ప్రభావాలను పక్కన పెట్టి చూస్తే నికర లాభం 28 శాతం పెరిగి రూ.367 కోట్లుగా ఉంటుందని మాక్రోటెక్ డెవలపర్స్ వివరించింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో క్షీణించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,137 కోట్ల నుంచి రూ.1,761 కోట్లకు పరిమితమైంది. బ్రిటన్‌లో ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గాను లోధా డెవలపర్స్ యూకేకు గ్రూపు రుణాలు ఇవ్వాల్సి వచ్చినట్టు సంస్థ పేర్కొంది. ప్రస్తుతమున్న భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం తదితర పరిస్థితులు తమ రుణాలపై ప్రభావం చూపించినట్టు వివరించింది. ఎన్సీడీల జారీ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. -
రీడిజైన్డ్ యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ వచ్చేసింది: ప్రత్యేకతలేంటి?
న్యూఢిల్లీ: యాపిల్ రీడిజైన్ చేసిన సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తీసుకొచ్చింది. ఎం1 చిప్‌ను అప్‌గ్రేడ్ చేసి ఎం 2 చిప్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తాజాగా ఆవిష్కరించింది. యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2022లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ లాంచ్ చేశారు. కోవిడ్ తరువాత ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్న తొలి డెవలపర్ల సమావేశంలో ఐవోస్ 16కి సంబంధించి కొత్త అపడేట్ సహా కొన్ని భారీ ప్రకటనలను కూడా చేసింది. ఇండియన్ మార్కెట్లో ధరలు 10 జీపీయూ కోర్ ఎం2 మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ. 1,49,000 నుండి ప్రారంభం 8 జీపీయూ కోర్ ఎం2 మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ. 1,19,900 నుండి మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్ ఫీచర్లు 13.6 అంగుళాల డిస్ప్లే (థిన్నర్ బెజెల్స్) 2560x1664 నేటివ్ పిక్సెల్స్ రిజల్యూషన్ బేస్ వేరియంట్‌తో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ స్టోరేజీని 2టీవీ వరకు విస్తరించుకునే అవకాశం 11.3 మిమీ, బరువు 2.7 పౌండ్లు (1.22 కిలోలు) సిల్వర్, స్పేస్ గ్రే, స్టార్‌లైట్, మిడ్నైట్ బ్లాక్ . గోల్డ్ కలర్లలో లభ్యం. ఇందులోని ఎం2 చిప్ గత జనరేషన్ ఇంటెల్ ఆధారిత మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే 5 రెట్లు వేగం, అలాగే 2020 ఎంఐ మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే 40 శాతం వేగంగా పనిచేస్తుంది. ఇది డ్యూయల్ USC-C పోర్ట్‌లతో కూడా వస్తుంది, రెండూ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. 20 గంటల బ్యాటరీ లైఫ్, 1080p హెచ్డీ కెమెరా, MagSafe ఛార్జింగ్, టచ్ ఐడీ, మేజిక్ కీబోర్డ్ , ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్ లాంటివి ఇతర ఫీచర్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
త్వరలోనే యాపిల్ టెక్ ఫెస్టివల్, ఆతృతగా ఎదురు చూస్తున్న టెక్ లవర్స్!
టెక్ దిగ్గజం యాపిల్ నిర్వహించే టెక్ ఫెస్టివల్ వచ్చేసింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)- 2022ను జూన్ 6నుంచి జూన్ 10వరకు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ డెవలర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా యాపిల్ సంస్థ తాను విడుదల చేయబోయే గాడ్జెట్స్ గురించి ప్రకటన చేస్తుంది. అందుకే వచ్చే నెలలో జరగనున్న కాన్ఫరెన్స్ లో యాపిల్ ఏం ప్రకటన చేస్తుందోనని టెక్ లవర్స్‌కు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ల గురించి డబ్ల్యూడబ్ల్యూడీసీలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఐఓఎస్ 16, ఐపాడ్ ఐఓఎస్ 16, వాచెస్ ఓస్ 9 లలో అదనంగా కొన్ని ఫీచర్లను యాడ్ చేయనుంది. నోటిఫికేషన్ల అప్డేట్తో పాటు కార్ క్రాష్ డిటెక్షన్, ఐపాడ్లలో కొత్త మల్టీ టాస్కింగ్ ఇంటర్ ఫేస్ తో పాటు మిగిలిన గాడ్జెట్ అప్డేట్ల గురించి ప్రకటన చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు పేర్కొన్నాయి. -
ఖాళీ స్థలం చూపిస్తారు..మొత్తం చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే ఫ్లాట్..!
సాక్షి, హైదరాబాద్: కస్టమర్లకు ఆకాశంలో పిట్టను చూపించి కింద మసాలా నూరిస్తున్నారు డెవలపర్లు. ఖాళీ స్థలం చూపించి 10 అంతస్తులు, 20 ఫ్లోర్లు కడుతున్నామని నమ్మబలికి వంద శాతం సొమ్ము చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే దొరకుతుందని ఆశ చూపెడుతున్నారు. నిజమేనని నమ్మిన కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. సాధారణంగా డెవలపర్ చదరపు అడుగు (చ.అ.) రూ.5 వేలకు విక్రయిస్తుంటాడు. ప్రీ లాంచ్, యూడీఎస్ స్కీమ్స్‌లో వంద శాతం సొమ్ము చెల్లిస్తే మాత్రం రూ.3 వేలకే అమ్ముతారు. నిర్మాణ అనుమతులు వచ్చి, రెరాలో నమోదయ్యాక ఇందులో ధర రూ.5,500లకు చేరుతుంది. ఎందుకంటే ఆయా అనుమతుల కోసం డెవలపర్ కొంత ఆమ్యామ్యాలు సమర్పించుకుంటాడు కాబట్టి. ఈ ఖర్చును ధరను పెంచేసి భర్తీ చేసుకుంటాడు డెవలపర్. ఇదే ప్రాజెక్ట్‌లో ప్రీలాంచ్, యూడీఎస్లో కొనుగోలు చేసిన కొనుగోలుదారుడు చ.అ. రూ.3,500 చొప్పున రీసేల్‌కు పెడతాడు. కొనేందుకు వచ్చిన ఏ కస్టమర్ అయినా రీసేల్ ప్రాపర్టీకే ఆకర్షితుడవుతాడు. దీంతో డెవలపర్ వాటా ఫ్లాట్లు విక్రయం కాక చేతిలో నిర్మాణ వ్యయం లేక పనులను నిలిపివేస్తాడు. దీంతో ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోతుంది. ఎవరు నిర్మిస్తున్నారంటే? చిన్న కంపెనీలు మాత్రమే కాదు బడా కంపెనీలు కూడా ఇదే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ఇటీవల కోకాపేట, ఖానామేట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా యూడీఎస్ స్కీమ్‌తో పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేశాయి. ఇటీవలే నానక్‌రాంగూడలో హైరైజ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన మరొక నిర్మాణ సంస్థ, జూబ్లిహిల్స్ ప్రధాన కేంద్రంగా ఉన్న మరొక కంపెనీ ఇదే తరహా విక్రయాలు చేపడుతున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా యూడీఎస్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. అంతా సోషల్ మీడియాలోనే.. యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు లేదా స్థలాల విక్రయాల ప్రచార దందా సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. ప్రధాన కంపెనీలు తమ పాత కస్టమర్లకు ఇంటర్నల్ సేల్స్ చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్లలో ప్రచారం చేయిస్తున్నాయి. 100 శాతం పేమెంట్‌తో ఫ్లాట్లను అమ్మించే ఏజెంట్లకు అధిక శాతం కమీషన్‌ను అందిస్తున్నాయి. ప్రీలాంచ్, యూడీఎస్ ప్రాజెక్ట్‌లన్నీ పేపర్లు, బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏదీ ఉండదు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మబలుకుతారు. అధిక కమీషన్‌కు ఆశపడి చాలా మంది ఏజెంట్లు యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీరంతా కేవలం తమ కమీషన్ గురించి ఆలోచిస్తున్నారే తప్ప.. రేపొద్దున సదరు బిల్డర్ అపార్ట్‌మెంట్‌ను కడతాడా? లేదా అని ఆలోచించట్లేదు. పొరపాటు బిల్డర్ ప్రాజెక్ట్‌ను కట్టకపోయినా.. సమయానికి డెలివరీ చేయకపోయినా నష్టపోయేది కొనుగోలుదారులే. ప్రభుత్వానికి నష్టం ఎలాగంటే? ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనే ఎక్కువ ఆదాయం సమకూరుతుంటుంది. కానీ, నిర్మాణ సంస్థలు హెచ్ఎండీఏ పరిధిలో చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ చార్జీలను దొడ్డిదారిన తగ్గించుకుంటున్నాయి. ఫ్లాట్ల అమ్మకాలకు బదులుగా ప్రాజెక్ట్ కంటే ముందే అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్)ను రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఫ్లాట్ కొంటే చెల్లించాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలకు బదులుగా.. యూడీఎస్లో సప్లమెంటరీ రిజిస్ట్రేషన్ కింద 1 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు. యూడీఎస్లో చ.అ. ధర తక్కువగా ఉండటం, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకపోవటంతో కొనుగోలుదారులు ఈ తరహా ప్రాజెక్ట్‌లకు ఆకర్షితులవుతున్నారు. ఈ విధానంతో బిల్డర్లకు భారీగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. దేశంలో ఇప్పటివరకు టీఎస్ రెరాకు 70 వేలకు పైగానే ఫిర్యాదులు అందాయి. కానీ, ఒక్క కేసు నమోదు చేయలేదు. కేవలం నోటీసులు జారీ చేసి జరిమానాలతోనే సరిపెడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెçసులుబాటు అందుబాటులో ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం భౌతికంగా ఫిర్యాదు చేయాల్సిందే. ప్రభుత్వం ఏం చేయాలంటే? ► హెచ్ఎండీఏ, రెరా విభాగాలకు శాశ్వత చైర్మన్లను నియమించాలి. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. రెరా అథారిటీ, అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. ► సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, రెరా విభాగాలను అనుసంధానించాలి. దీంతో ఆయా విభాగాల అనుమతులు జారీ అయితే రిజిస్ట్రేషన్ చేసేలా ఉండాలి. ► రెరాలో నమోదు కాకుండా విక్రయాలు జరిపే ఏజెంట్లు, మధ్యవర్తులపై క్రమశిక్షణరాహిత్య చర్యలు తీసుకోవాలి. ► రెరా అధికారులు, సిబ్బంది ఆఫీసులో కూర్చోవడానికి బదులు శివారు ప్రాంతాల్లో క్రమం తప్పకుండా క్షేత్ర పర్యటన చేయాలి. అప్పుడే ఏయే బిల్డర్లు మోసాలకు పాల్పడుతున్నారో తెలుస్తుంది. ► ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించి ఫేస్బుక్, ఇన్‌సాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో సాగే ప్రీలాంచ్, యూడీఎస్ ప్రచారాలు, రాయితీలపై ఆరా తీయాలి. ► ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ ఉండాలి. రెరా అథారిటీ ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబరు క్రియేట్ చేసి.. ఫ్లాట్లు, ప్లాట్లు కొనే వారు ముందస్తుగా తమకు సమాచారం ఇ వ్వాలని కోరాలి. ఈ నంబరు మొత్తం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగాలి. స్థిరాస్తిని కొనేముందు కొనుగోలుదారులు తప్పకుండా రెరాను సంప్రదించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ► పక్క రాష్ట్రంలో లోకల్ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్ అనుమతుల కోసం లోకల్ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి. -
కట్టే వాళ్లకే ఇవ్వండి.. కళ్లబొల్లి మాటలు చెప్పేటోళ్లకు కాదు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నెలకొంటున్న రియల్టీ హైప్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు భూ యజమానులు అత్యాశకు పోతున్నారు. సాధారణంగా డెవలపర్‌కు, భూమి యజమానికి మధ్య 40:50 లేదా 50:50 నిష్పత్తితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎక్కువ అడ్వాన్స్, నిర్మాణ స్థలం ఇచ్చే డెవలపర్లకే డెవలప్మెంట్ అగ్రిమెంట్‌కు అప్పగిస్తున్నారు. మరి, నిజంగానే సదరు డెవలపర్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగలడా? అనే అంశాన్ని అంచనా వేయడంలో విఫలమవుతున్నారు. కేవలం డెవలపర్ ఇచ్చే అడ్వాన్స్ మీదే దృష్టిపెడుతున్నాడు. ఎవరైనా డెవలపర్ స్థలం కోసం వస్తే చాలు 30 అంతస్తులు, 40 అంతస్తులు కడతావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఫలానా డెవలపర్ అంత అడ్వాన్స్ ఇస్తానన్నాడు? మరో డెవలపర్ ఇంత పర్సంటేజ్ ఇస్తానన్నాడంటూ వచ్చిన డెవలపర్‌తో బేరమాడుతున్నారు. దీంతో అసలైన డెవలపర్‌కు స్థలాన్ని అప్పగించే బదులు ఫ్యాన్సీ నంబర్లు చెప్పే మోసపూరిత డెవలపర్లకు స్థలాన్ని అగ్రిమెంట్ చేస్తున్నారు. ఈ బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. అగ్రిమెంట్ చేసుకొని.. ఆ స్థలాన్ని యూడీఎస్ కింద కొనుగోలుదారులకు ముందే విక్రయించేస్తున్నారు. వాళ్లు ఇచ్చే సొమ్మును స్థల యజమానికి ఇచ్చేస్తున్నారు. తీరా నిర్మాణ పనులు వద్దకొచ్చేసరికి.. దిక్కులు చూసే పరిస్థితి నెలకొంటుంది. నిర్మాణం ఆరంభమై ఒక స్థాయికి వస్తే తప్ప మిగిలిన ఫ్లాట్లను అమ్మలేని పరిస్థితి. అమ్మడానికి ప్రయత్నించినా.. ఈ లోపు మరో డెవలపర్ యూడీఎస్లో ఫ్లాట్లను అమ్మడం ఆరంభిస్తాడు. ఫలితంగా అమ్మకాల్లేక ప్రాజెక్ట్ నిలిచిపోతుంది. డెవలప్మెంట్కు ఇచ్చే ముందు.. - స్థల యజమానులు అధిక అంతస్తులు, ఎక్కువ అడ్వాన్స్‌లు తీసుకొని మురిసిపోవటం మానేసి.. అసలు డెవలపర్ ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయగలడా? లేదా అనే అంశాన్ని ఆలోచించాలి. - అమ్మకాల మీదే ఆధారపడి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని భావించే డెవలపర్లకు స్థలాన్ని ఇవ్వకపోవటమే మంచిది. - ఎవరైనా స్థలం ఇవ్వమని చర్చలకు వచ్చినప్పుడు ఆయా డెవలపర్ క్రెడిబులిటీని పరిశీలించడంతో పాటు నిర్మాణాన్ని పూర్తి చేసే ప్రణాళికల గురించి చర్చించాలి. - ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నాక డెవలపర్ తోక జాడించే అవకాశం ఉందా? అనవసరంగా ఇబ్బందుల్ని సృష్టిస్తాడా? అనే అంశాన్ని బేరీజు వేయాలి. - స్థలాన్ని అప్పగించాక సకాలంలో ఫ్లాట్లను అందించక కొనుగోలుదారులకు తలనొప్పు లు తెస్తాడా? వంటి అంశాన్ని విశ్లేషించాలి. - ఫ్లాట్లను విక్రయించడానికి ఏజెంట్ల మీద ఎక్కువ ఆధారపడతాడా? లేక సొంత సిబ్బంది ఎంతమేర ఉన్నారనేది తెలుసుకోవాలి. - కొనుగోలుదారుల నుంచి తీసుకున్న సొమ్ము తీసుకొని వేరే ప్రాజెక్ట్‌లోకి మళ్లిస్తున్నాడా? లేక ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కోసమే ఖర్చు చేస్తున్నాడా? వంటి అంశాన్ని ఆరా తీయాలి. - ఆర్ధిక నష్టాల్లో ఉన్న డెవలపర్లకు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయకపోవటమే మంచిది. చదవండి:JLL: ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో హైదరాబాద్ టాప్ -
చైనా పోన్జీ స్కీముల తరహాలో.. హైదరాబాద్‌లో మోసాలు.. డెవలపర్ల సంఘం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ రేటు కంటే తక్కువ ధర అని సామాన్య ప్రజలకు ఆశ చూపిస్తూ.. తనది కాని స్థలంలో ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తానని నమ్మబలుకుతూ కొనుగోలుదారులను నట్టేట ముంచుతున్న బిల్డర్లకు కంచె వేయాలని డెవలపర్ల సంఘాలు ముక్త కంఠంతో కోరాయి. అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) కింద విక్రయాలను చేపడుతున్న ప్రాజెక్ట్‌లకు అనుమతులను, రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సూచించా రు. బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు ఆయా ప్రాజెక్ట్‌లకు రుణాలను మంజూరు చేయవద్దని కోరాయి. నిర్మాణ రంగానికి భద్రత, భరోసా కల్పించకపోతే గ్లోబల్ హైదరాబాద్ ఎదుగుదలకు యూడీఎస్ డెవలపర్లు విరోధంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ, రెరాలకు శాశ్వత కమిషనర్లను నియమించడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, ప్రజలలో విస్తృతమైన అవగాహన చేపట్టాలని సూచించారు. శుక్రవారం క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ సంఘాల సమావేశం జరిగింది. ► గతంలో చైనా కంపెనీలు పోన్జీ స్కీమ్‌లతో ఎలాగైతే అమాయక కస్టమర్ల నుంచి కోట్ల రూపాయాలను కొల్లగొట్టాయో.. అదే విధంగా యూడీఎస్ విక్రయాలతో కొందరు డెవలపర్లు తయారయ్యారని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణా రావు ఆరోపించారు. ప్రారంభ దశలోనే ఆయా డెవలపర్లను ఆడ్డుకోకపోతే సామాన్య, మధ్యతరగతి ప్రజల పెట్టుబడులు గాల్లో కలిసిపోతాయని తెలిపారు. గత ఏడాదిన్నర క్రితం ఒకట్రెండు యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసిన కస్టమర్లు నిర్మాణ పనులు ప్రారంభం కాక, కట్టిన డబ్బులూ వెనక్కి ఇవ్వకపోవటంతో రోజూ డెవలపర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. సంఘటిత నిర్మాణ రంగానికి యూడీఎస్ ఒక కేన్సర్ మహమ్మారి లాగా తయారవుతోందని... దీన్ని ప్రాథమిక దశలోనే నిర్మూలించాలి. లేకపోతే ఝాడ్యం ముదిరి బ్రాండ్ హైదరాబాద్‌ను దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. ► హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెరా నిబంధనల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయడమే పరమావధిగా యూడీఎస్ ప్రాజెక్ట్‌లు చేపట్టడుతున్నారు. మార్కెట్ రేటు కంటే 50 శాతం తక్కువ ధరకు ఆఫర్ చేస్తుండటంతో కస్టమర్లు ఆశ పడుతున్నారు. ముందు వెనకా ఆలోచించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకపోయినా, ఆయా స్థలానికి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా లేదా సంబంధిత భూమి కన్జర్వేషన్ జోన్ లేదా 111 జీవో పరిధిలో ఉన్నా నిర్మాణ అనుమతులు రావు. కస్టమర్ల పెట్టుబడులకు భరోసా లేదు. భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు తామూ బాధ్యత వహించాల్సి వస్తుందని కొనుగోలుదారులకు అర్థం కావట్లేదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా కొనుగోలుదారులు మోసపోయామని తెలుసుకొని వినియోగదారుల ఫోరంకు, రెరాకు వెళ్లినా లాభం ఉండదు. సివిల్ కోర్ట్‌కు పోతే ఎన్నేళ్లు పడుతుందో బహిరంగ రహస్యమే. ► గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించాలనే ఉద్దేశంలో రెరా చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, మన రాష్ట్రంలో రెరా అమలు అంతంత మాత్రంగానే సాగుతోందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి అన్నారు. హైదరాబాద్ మార్కెట్లో 60–70 శాతం కొనుగోళ్లు అంతిమ గృహ కొనుగోలుదారులు, 30–40 శాతం పెట్టుబడిదారులుంటారు. ఇలాంటి చోట కస్టమర్ల పెట్టుబడులకు భద్రత కల్పించాల్సిన రెరా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అక్రమ పద్దతిలో నిర్మాణాలు, విక్రయాలు చేపడుతున్న డెవలపర్లను ఎలా నియంత్రించాలనే అంశంపై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు డెవలపర్ల సంఘాలు ప్రభుత్వంతో కలిసి వస్తాయని తెలిపారు. ► రెరాలో డెవలపర్లే కాదు కొనుగోలుదారులకు శిక్ష ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా జరిగితే కోర్ట్‌కు వెళ్లినా లాభం ఉండదు. రెరాలో నమోదు కాని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేయాలన్న ప్రాథమిక నిబంధనలను మరిచిపోయి తక్కువ ధర అని ఆశ పడి యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసినందుకు మీకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం, రెరా న్యాయం చేయవని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీకృష్ణా రెడ్డి తెలిపారు. సామాన్య, మధ్యతరగతి నుంచి ముందస్తు సొమ్ము వసూలు చేసి.. అక్రమ డెవలపర్లు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. ఎవరు చేస్తున్నారో చెప్పరు! యూడీఎస్, ప్రీలాంచ్లలో కొనుగోలు చేయొద్దని, కష్టార్జితాన్ని బూదిదపాలు చేసుకోవద్దని కొనుగోలుదారులకు డెవలపర్ల సంఘాలు సూచిస్తుండటం ప్రశంసించదగ్గ పరిణామమే. కానీ, ఆయా ప్రాజెక్ట్‌లను ఎవరు చేపడుతున్నారో తెలపమని విలేకరులు ప్రశ్నించగా.. ప్రమోటర్ల పేర్లు బయటకు రాకుండా ఏజెంట్లతో దందా నడిపిస్తున్నారని సమాధానం ఇచ్చారు. వాట్సాప్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సాధారణంగా సంఘటిత డెవలపర్లకు ఏజెంట్లకు 1.5–2 శాతం కమీషన్ ఇస్తుంటే.. యూడీఎస్ డెవలపర్లు మాత్రం 5–10 శాతం కమీషన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో వివరాలు ఉన్నాయని, కానీ, చర్యలు తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఆడిట్ బుక్స్ పరిశీలిస్తే తతంగం బయటపడుతుందని పేర్కొన్నారు. డెవలపర్ల సంఘాల దృష్టికి వచ్చిన యూడీఎస్ ఏజెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి, ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తదితరలు పాల్గొన్నారు. ► జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా కార్యాలయాలలో ఇన్ఫర్మేషన్ గైడెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. గృహ కొనుగోలుకు ముందు కొనుగోలుదారులు ఆయా కేంద్రాలను సంప్రదిస్తే.. వారికి మార్గనిర్ధేశనం చేయాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు సూచించారు. దీంతో అమాయక ప్రజలు మోసపోకుండా ఉండటంతో పాటు ప్రభుత్వం, నిర్మాణ సంస్థలతో నమ్మకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కన్జర్వేషన్ జోన్, 111 జీవో పరిధిలోనూ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని దీంతో హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందని తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ రేట్‌ను అంచనా వేయకుండా నిర్మాణ రంగంలో ఏమాత్రం అనుభవం లేకుండా ఆకాశంలో మేడలు కడతామని ఆశచూపిస్తూ అమాయకులను కలలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ► చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని కొందరు డెవలపర్లు అక్రమంగా ప్రాజెక్ట్‌లు, విక్రయాలు చేపడుతున్నారు. తక్కువ ధర అని ఆశ చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సంఘటిత నిర్మాణ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డెవలపర్లపై కూడా ఉందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రెసిడెంట్ సీ ప్రభాకర్‌రావు అన్నారు. అందుకే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన చేపట్టనున్నామని పేర్కొన్నారు. ► నోయిడా, గ్రేటర్ నోయిడాలో విక్రయించిన యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో ధర మార్కెట్ రేటుతో సమానంగా విక్రయించారు. అయినా సరే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. అలాంటిది మన దగ్గర మార్కెట్ రేటు కంటే సగం ధరకే యూడీఎస్ స్కీమ్‌లో విక్రయాలు చేపడుతున్నారు. మరి, ఇక్కడెలా నిర్మాణాలు చేయగలరనేది కొనుగోలుదారులు ప్రశ్నించుకోవాలని ట్రెడా ప్రెసిడెంట్ ఆర్ చలపతిరావు అన్నారు. చిన్న వస్తువును కొంటే ఐఎస్ఐ మార్క్ ఉందా? బ్రాండెడేనా అనా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే ఈ రోజుల్లో.. లక్షల్లో వెచ్చించే గృహ కొనుగోలు సమయంలో డెవలపర్ చరిత్ర, నిర్మాణ అనుమతులు, రెరా నమోదు వంటి కీలక అంశాలు పరిశీలించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. రిస్క్ లేని చోట పది గజాలు తక్కువైనా మంచిది గడువు లోగా నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. ఓపెన్‌స్పేస్, పార్క్‌లు, సెట్‌బ్యాక్స్, పర్మిషన్స్, అంతస్తుల సంఖ్య.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కొనుగోలుకు ముందే పరిశీలించుకోవాలని సూచించారు. ఎకరం రూ.50 కోట్లు ఉంటే 50 అంతస్తులు, రూ.40 కోట్లు ఉంటే 40 ఫ్లోర్లు.. ఇలా ఎంత రేటు ఉంటే అన్ని అంతస్తులు నిర్మిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలుదారులు రేటు తక్కువ చూపించేందుకే ఈ అసత్య ప్రచారమని తెలిపారు. -
క్రిప్టో ఇన్వెస్టర్లకు టోకరా ఇచ్చిన స్కిడ్ టోకెన్ డెవలపర్లు
-
అమ్మకానికి విజయ్‌మాల్యా విల్లా.. వేలంలో దక్కించుకున్న హైదరాబాద్ సంస్థ
Vijay Mallya Kingfisher House Sold For Rs 52 Crores: కింగ్ ఆఫ్ గుడ్టైమ్గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఆస్తులు వేలానికి వస్తున్నాయి. ఇందులో ముంబైలో ఉన్న విలాసవంతమైన ఇంటిని హైదరాబాద్‌కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ చేజిక్కించుకుంది. వేలానికి ఆస్తులు విజయ్‌మాల్యా... బిజినెస్ రంగానికి గ్లాబర్ సొబగులు అద్దిన వ్యాపారవేత్త. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్. అయితే కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభంతో ఆయన ప్రభ మసకబారిపోయింది. ఎయిర్‌లైన్స్ కంపెనీకి వచ్చిన వరుస నష్టాలతో మాల్యా ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు బాకీ పడ్డారు. చివరకు తమ అప్పుల కింద విజయ్ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించాయి. రూ. 52 కోట్లు ముంబై ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్‌ను బ్యాంకులు వేలానికి వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ వేలంలో హైదరాబాద్‌కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బేస్ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2016 నుంచి ప్రస్తుతం వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలానికి తెచ్చింది. అయితే ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలు మార్లు బ్యాంకులు ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది. -
గూగుల్ షాకింగ్ నిర్ణయం...! వారికి పెద్ద సమస్యే..!
ఆండ్రాయిడ్ యాప్‌లను క్రియేట్ చేసే డెవలపర్లకు గూగుల్ చేదు వార్తను అందించింది. గూగుల్ ప్లేస్టోర్‌లో పలు లిస్టెడ్ యాప్‌లపై షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇన్‌ఆక్టివ్‌గా ఉన్న యాప్‌లను, అలాగే చాలా రోజుల పాటు అప్డేట్ చేయకుండా ఉన్న యాప్‌లను పూర్తిగా తొలగించాలని గూగుల్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2021 సెప్టెంబర్ 1 నుంచి ఆయా యాప్స్ తొలగింపు ప్రక్రియ మొదలవుతుందని గూగుల్ ప్రకటించింది. ఇన్‌ఆక్టివ్‌గా ఉన్న యాప్‌లను తొలగించడంతో గూగుల్ ప్లే స్టోర్ క్లీన్ అవ్వడంమేకాకుండా ప్లే స్టోర్ భద్రత మరింత పటిష్టమైతుందని గూగుల్ పేర్కొంది. లోపాలు, బగ్‌లను కల్గిఉన్న యాప్‌లను గూగుల్ ఎప్పటికప్పుడు తీసువేస్తుంది. ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్స్ యాక్టివ్‌గా వారి యాప్‌లను మెయిన్‌టెన్ చేస్తే గూగుల్ ప్లే వాటిని తొలగించదు. గూగుల్ స్టోర్‌లో యాక్టివ్‌గా ఉండి, సుమారు 1000కిపైగా ఇన్స్టాల్ కలిగి ఉన్న యాప్‌లు, లేదా గత 90 రోజుల్లో ఇన్ యాప్ పర్చెస్ కల్గి ఉన్న యాప్‌లను తొలగించదని గూగుల్ పేర్కొంది. కొత్త పాలసీ అప్డేట్ కింద యాప్‌లను తిరిగి పాత యాప్‌లను, డేటాను పునరుద్దరించలేరు. వాటి స్థానంలో కచ్చితంగా కొత్త వాటినే సృష్టించాల్సి ఉంటుంది. యాక్సెసిబిలిటీ సర్వీస్ ఏపీఐ టూల్‌ను గూగుల్ జత చేయనుంది. ఇది యూజర్ డేటా, డివైజ్ ఫంక్షనాలిటీను యాక్సెస్ చేయడానికి సహాయపడుతుంది. దీంతో యూజర్లు సురక్షితంగా యాప్‌లను యాక్సెస్ చేయగలరు. -
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి. మార్కెట్ విలువ సవరణలను స్వాగతిస్తూనే.. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంపును మాత్రం డెవలపర్ల సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. విలువ, చార్జీలు రెండూ ఒకేసారి పెంచితే కొనుగోలుదారుల మీద తీవ్రమైన భారం పడుతుందని.. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోగా బ్లాక్‌మార్కెట్‌కు ఊతమిచ్చినట్లే అవుతుందని అభిప్రాయపడ్డాయి. 2013 ఆగస్టులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా విలువల సవరణ జరిగింది. ప్రతీ రెండేళ్లకొకసారి రిజిస్ట్రేషన్ విలువలను సమీక్షించి.. కొత్త విలువలను నిర్ధారించాలని చట్టంలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు. రాష్ట్రంలో జరిగిన పాలనాపరమైన సంస్కరణల కారణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణ ప్రాంతాలలో భూములు, ఆస్తులతో పాటు గ్రామీణ ప్రాంతా లలో వ్యవసాయ భూముల విలువ భారీగా పెరిగాయి. ప్రధానంగా ఏడేళ్లలో హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలు, హెచ్ఎండీఏ పరిధిలోని భూములు, ఆస్తుల విలువలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆదాయం పెంపునకు ప్రభుత్వం అధికారిక విలువల సవరణకు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు నిర్ణయించింది. సర్వే నంబర్ల వారీగా విలువల సవరణ.. ప్రస్తుతం తెలంగాణలో రిజిస్ట్రేషన్ చార్జీలు 6 శాతంగా ఉన్నాయి. ఇందులో స్టాంప్ డ్యూటీ 4 శాతం, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వం సవరించనున్న భూముల మార్కెట్ విలువలను శాస్త్రీయ పద్ధతిలో సవరించాల్సిన అవసరముందని ఓ రిటైర్డ్ సబ్‌రిజిస్ట్రార్ సూచించారు. ఏ ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచినా సరే గ్రామాన్ని యూనిట్ ప్రాతిపదికన తీసుకుని సవరిస్తుంటుంది. ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నంబర్లు మినహా మిగిలిన గ్రామం అంతా ఒకటే విలువ ఉంటుంది. అందుకే అంతర్గత రోడ్లు, అభివృద్ధి కార్యకలాపాలు జరిగే సర్వే నంబర్ల వారీగా మార్కెట్ విలువలు పెంచాలి. దీంతో లావాదేవీలను బట్టి చార్జీలు వసూలవడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకోవాలి.. కరోనా సమయంలో గృహ కొనుగోలుదారులకు ఉత్సాహం నింపేందుకు, అదే సమయంలో ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు మహారాష్ట్ర, పుణే, కర్ణాటక రాష్ట్రాలు స్టాంప్‌డ్యూటీని 3 శాతం తగ్గించాయి. మహారాష్ట్ర, పుణేలలో అన్ని రకాల గృహాలకు స్టాంప్‌డ్యూటీ మినహాయింపునిస్తే.. కర్ణాటకలో మాత్రం రూ.35 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు వెసులుబాటు కల్పించింది. మహారాష్ట్రలో గతేడాది డిసెంబర్లో మినహాయింపు ప్రారంభం కాగా ప్రతి నెలా రిజిస్ట్రేషన్లు మూడెంకల వృద్ధిని సాధించాయి. డిసెంబర్లో 204 శాతం, ఈ ఏడాది మేలో 2,489 శాతం, జూన్‌లో 327 శాతం వృద్ధి చెందాయి. ఆదాయం పెంపు అన్వేషణలో తెలంగాణ ప్రభుత్వం కూడా మహారాష్ట్ర విధానాన్ని అవలంభించాలని పలువురు డెవలపర్లు సూచించారు. మార్కెట్ విలువను పెంచి రిజిస్ట్రేషన్ చార్జీలను 3 శాతానికి తగ్గిస్తే రెట్టింపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. చెంపదెబ్బ గోడదెబ్బ రెండూ తగుల్తయ్.. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో బ్లాక్, వైట్ మనీ అంతరాన్ని తగ్గించాలంటే మార్కెట్ విలువ సవరణతోనే సాధ్యమవుతుంది. అయితే ఇదే సమయంలో రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా పెంచితే కొనుగోలుదారులకు చెంపదెబ్బ గోడ దెబ్బ రెండూ తగుల్తయ్. దీంతో మళ్లీ బ్లాక్ మార్కెట్ దారిలో లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగితే వ్యక్తిగత ఆస్తుల విలువ పెరగదు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల ప్రాపర్టీల అసెట్ వ్యాల్యూ పెరుగుతుంది. దీంతో ఆర్థిక సంస్థలు ఎక్కువ మొత్తంలో రుణాలను మంజూరు చేస్తాయి. మార్కెట్ విలువలు పెరగడం వల్ల 6–12 నెలల పాటు లావాదేవీలు తగ్గిపోతాయి. అప్పటివరకు రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచొ ద్దు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లావాదేవీల సంఖ్య తగ్గుతాయేమో కానీ ఆదాయం విలువ మాత్రం పెరుగుతుంది. – నరేంద్రకుమార్ కామరాజు, ఎండీ, ప్రణీత్ గ్రూప్ రిజిస్ట్రేషన్ చార్జీలకూ ఐటీసీ ఇవ్వాలి.. స్టాక్ ఎక్స్ఛేంజ్లో షేర్లు ట్రేడ్ అయినట్లుగానే ప్రాపర్టీలు కూడా ట్రేడింగ్ అవుతున్నాయి. ఒకటే ప్రాపర్టీ మీద పలుమార్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కాబట్టి గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ విలువను తాజా రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించాలి. అంటే జీఎస్టీలో ఎలాగైతే ఐటీసీ ఇస్తున్నారో అలాగే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లకు ఇవ్వాలి. ఉదాహరణకు రూ.50 లక్షలకు కొన్న అపార్ట్మెంట్.. రెండు మూడేళ్ల తర్వాత రూ.70 లక్షలకు విక్రయిస్తే రూ.70 లక్షల మీద రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేయకూడదు. తాజా రిజిస్ట్రేషన్ విలువ నుంచి ఇంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ విలువ రూ.50 లక్షలకు తీసేయాలి. పెరిగిన ధర ఏదయితే ఉందో రూ.20 లక్షల మీదనే రిజిస్ట్రేషన్ చార్జీలను వసూలు చేయాలి. ‘ఒకే దేశం–ఒకే పన్ను’ విధానమైన జీఎస్టీ.. రియల్ ఎస్టేట్ లావాదేవీల విషయంలో మాత్రం అమలవ్వడం లేదు. 6 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు, 5 శాతం జీఎస్టీ రెండూ చెల్లించాల్సి వస్తుంది. – సీ శేఖర్ రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్ -
ఎంటర్‌ప్రెన్యూర్‌లా కాదు.. పొలిప్రెన్యూర్‌గా
సాక్షి, హైదరాబాద్: బూమ్ ఉందంటే చాలు ఇన్వెస్టర్లే కాదు డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, బ్యూరోక్రాట్స్, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ పెట్టుబడులు పెట్టి మార్కెట్లో డిమాండ్‌ను సృష్టిస్తుంటారు. ప్రతి ఏటా 15–20 శాతం ధరలు పెరగడం ఆరోగ్యకరమైన వృద్ధి. అలాకాకుండా అబ్నార్మల్గా పెరిగితే మాత్రం అది బూమ్. ఇది ప్రభుత్వ అభివృద్ధి ప్రకటనలు, భవిష్యత్తు ప్రాజెక్ట్‌లను, ప్రాంతాలను బట్టి పెరుగుతుంటుంది. రియల్టీ బూమ్ ఇన్వెస్టర్లు ఉన్నంత కాలమే ఉంటుంది. ఒక్కసారి ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోగానే బద్దలైపోతుంది. ఇదేమీ కొత్తకాదు. 2008లో వచ్చిన రియల్టీ బూమ్ ఇలాంటిదే. 2015-16 వరకు కోలుకోలేదు. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ హైదరాబాద్ డెవలపర్లు ధైర్యంగా, బలంగా నిలబడటానికి కారణం నిజమైన కొనుగోలుదారులు తోడుగా నిలవటమే. ప్రతి సంవత్సరం నగరంలో 25 వేల గృహాలు విక్రయం అవుతుంటాయి. ఇదే స్థాయిలో లాంచింగ్స్ కూడా ఉంటాయి. కొనేవాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో.. గృహాల సప్లయి కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఒకవైపు రోజువారీ నిత్యావసర ఖర్చులు మోస్తూనే.. మరోవైపు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, ఆదాయ పన్నులను భరించి ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవటం కొనుగోలుదారులకు కష్టమే. ఆకాశాన్నంటిన భూముల ధరలు, నిర్మాణ అనుమతులు, బ్యాంక్ వడ్డీలు, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు, రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, స్థానిక నాయకుల ఒత్తిళ్లు.. వీటన్నింటినీ దాటుకొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం డెవలపర్‌కు సవాలే... ఇలా నిజమైన కొనుగోలుదారులు, డెవలపర్లకు మధ్యలో రాత్రికి రాత్రే ప్రాజెక్ట్‌లను ప్రారంభించేసి.. అడ్డదారిలో విక్రయాలు చేస్తూ రియల్టీ మార్కెట్లో కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తున్నారు కొందరు తాత్కాలిక బిల్డర్లు. ♦ ఒకవైపు రోజువారీ నిత్యావసర ఖర్చులు మోస్తూనే.. మరోవైపు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, ఆదాయ పన్నులను భరించి ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవటం కొనుగోలుదారులకు కష్టమే. ♦ ఆకాశాన్నంటిన భూముల ధరలు, నిర్మాణ అనుమతులు, బ్యాంక్ వడ్డీలు, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు, రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, స్థానిక నాయకుల ఒత్తిళ్లు.. వీటన్నింటినీ దాటుకొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం డెవలపర్‌కు సవాలే. ♦ ఇలా నిజమైన కొనుగోలుదారులు, డెవలపర్లకు మధ్యలో రాత్రికి రాత్రే ప్రాజెక్ట్‌లను ప్రారంభించేసి.. అడ్డదారిలో విక్రయాలు చేస్తూ రియల్టీ మార్కెట్లో కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తున్నారు కొందరు తాత్కాలిక బిల్డర్లు. పొలిప్రెన్యూర్ అయితేనే.. పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నలాజికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్... ఈ వ్యాపారం చేయాలన్నా ఉండాల్సిన ప్రధాన అంశాలివే. ఆయా అంశాలలో తెలంగాణ బలంగా ఉండటం వల్లే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌లా కాకుండా పొలిప్రెన్యూర్‌గా ఉంటేనే రాణించగలమని కిస్మత్‌పూర్‌కు చెందిన ఓ డెవలపర్ తెలిపారు. పొలిటికల్ కనెక్షన్స్ బాగా ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌ను పొలిప్రెన్యూర్స్ అంటారు. సాధారణ డెవలపర్లు చెప్పులు అరిగేలా తిరిగినా పరిష్కారంకాని సమస్యలన్నీ పొలిప్రెన్యూర్స్కు మాత్రం కూర్చున్న చోటే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. భూమి అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి ప్రాజెక్ట్‌ను మార్కెట్లోకి తెచ్చే వరకు సుమారు మూడేళ్ల సమయం పడుతుంది. ఈ కాలంలో వడ్డీ భారం డెవలపర్లదే. తీరా లాంచింగ్ చేశాక మార్కెట్ ప్రతికూలంలో ఉంటే మరింత భారమే. డెవలపర్లలో పోటీ భయం నెలకొంది.. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ఇప్పుడు కొనకపోతే ముందుముందు కొనలేమనే భయం ఎలాగైతే కొనుగోలుదారుల్లో ఉందో.. అలాగే కొత్త డెవలపర్లే పెద్ద ప్రాజెక్ట్‌లు చేసి మార్కెట్‌ను క్యాష్ చేసుకుంటుంటే మనం వదలుకుంటున్నామనే భయం సీనియర్ డెవలపర్లలో నెలకొంది. ప్రీలాంచ్లో విక్రయాలు, యూడీఎస్ బుకింగ్స్ చేస్తూ అడ్డదారులలో కొందరు డెవలపర్లు మార్కెట్‌ను పాడు చేస్తుంటే.. న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తూ, కొనుగోలుదారులు సొంతిల్లు కలను నిజం చేస్తున్న డెవలపర్లకు సమస్యలు వస్తున్నాయి. దీంతో డెవలపర్లు మానసికంగా నలిగిపోతున్నారని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కొనేముందు ఇవి చూడాలి.. ఎంపిక చేసిన ప్రాజెక్ట్ గురించి న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. ఎన్ని బ్యాంక్‌ల నుంచి ప్రాజెక్ట్లోన్ తీసుకున్నారు వివరాలు తెలుసుకోవాలి. హెచ్ఎండీఏ, లోకల్ బాడీ, ఫైర్, ఎన్విరాన్మెంటల్, ఎయిర్పోర్ట్ వంటి ప్రభుత్వ విభాగాల అనుమతులున్నాయా? లేవా? రెరాలో నమోదు చేశారా లేదా చూసుకోవాలి. ప్రాజెక్ట్‌ను కట్టే ఆర్థిక స్తోమత నిర్మాణ సంస్థకు ఉందా? లేదా? బిల్డర్‌కు నిర్మాణ రంగంలో సాంకేతిక అనుభవం ఉందా లేదా చూసుకోవాలి. నిర్మాణ సంస్థ విలువలు, డెవలపర్ గత చరిత్ర గురించి ఆరా తీయాలి. ప్రాజెక్ట్ నాణ్యత, గడువులోగా పూర్తవుతుందా లేదా పరిశీలించాలి. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? సోషల్ ఇన్ఫ్రా ఎలా ఉందో గమనించాలి. -
రియల్టీకి మౌలిక రంగ హోదా ఇవ్వండి!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై దేశీయ డెవలపర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక రంగ హోదాను ఈ బడ్జెట్లో ప్రకటిస్తారని డెవలపర్ల సంఘాలు ధీమావ్యక్తం చేస్తున్నాయి. ప్రాపర్టీలకు డిమాండ్ పెంచేలా, కొనుగోలుదారులకు, డెవలపర్లకు పన్ను మినహాయింపులు ఉండేలా ఈ బడ్జెట్ ఉంటుందని ఆశాభావంవ్యక్తం చేశారు. సింగిల్ విండో ద్వారా ప్రాజెక్ట్‌ల అనుమతులు, లిక్విడిటీని పెంచే చర్యలతో పాటు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) లభ్యత వంటివి ఆశిస్తున్నట్లు టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ అండ్ సీఈఓ సంజయ్ దత్ తెలిపారు. రియల్టీ రంగ వృద్ధి రాబోయే ఆర్ధిక సవరణల మీద ఆధారపడి ఉందని, ప్రాజెక్ట్‌లు వేగవంతంగా పూర్తి చేయడానికి ఒకే విండో క్లియరెన్స్ యంత్రాంగాన్ని మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఒకటే స్టాంప్ డ్యూటీ లేదా అన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చార్జీల తగ్గింపు వంటి సిఫారసులను చేపట్టాలని, దీంతో ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గి గృహ కొనుగోలుదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారని వివరించారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలను జీఎస్టీ పరిధిలోకే తీసుకురావాలని గౌర్స్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ మనోజ్ గౌర్ తెలిపారు. ఐటీ చట్టం, 1961లోని 80సీ కింద గృహ రుణాల్లో పన్ను మినహాయింపు పరిమితులను పెంచాలని, ప్రాపర్టీ అమ్మకం మీద దీర్ఘకాలిక పన్నుల్లో సంస్కరణలు చేపట్టాలని, నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీల మీద జీఎస్టీని హేతుబద్దం చేయాలని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ కోరారు. అఫర్డబుల్ మరియు మిడ్–ఇన్‌కం ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి కేటాయించిన ప్రత్యేక ఫండ్ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్)ను రూ.25 వేల కోట్లకు పెంచాలని కోరారు. బంగారం రుణ సంస్థలను ప్రోత్సహించాలి వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తున్న తమను ఇతర ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే ప్రత్యేకంగా చూడాలని బంగారంపై రుణాలను అందించే ఎన్బీఎఫ్సీలు కేంద్రాన్ని కోరాయి. ‘‘2021–22 బడ్జెట్ నుంచి వృద్ధి అనుకూల విధానాలను ఆశిస్తున్నాము. అప్పుడే రానున్న సంవత్సరాల్లో సామర్థ్యం మేరకు మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందగలదు. గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలు ఎంఎస్ఎంఈలు, వ్యక్తులకు వేగంగా రుణ సాయాన్ని అందిస్తున్నాయి. కనుక ఇతర ఎన్‌బీఎఫ్‌సీలకు భిన్నంగా చూడాలి. ఎందుకంటే రూ.1,500 మొత్తాల నుంచి సామాన్యులకు రుణాలను అందిస్తున్నాయి. ఇళ్లలోని బంగారాన్ని మానిటైజ్ చేసి ఆర్థిక వ్యవస్థకు సాయంగా నిలుస్తున్నాయి. కనుక పారదర్శకమైన, వృద్ధికి అనుకూలంగా ఉండే నియంత్రణ పరమైన వాతావరణాన్ని కోరుకుంటున్నాము. అలా చేస్తే కస్టమర్లకు మరింత మెరుగ్గా, వేగంగా సేవలు అందించడానికి వీలు పడుతుంది. బ్యాంకులు, గోల్డ్ ఎన్‌బీఎఫ్‌సీల మధ్య ఎల్టీవీ విషయంలో అంతరాన్ని తొలగించాలి. బ్యాంకుల మాదిరే బంగారం కాయిన్లపై రుణాలకు అనుమతించాలి. ఆర్బీఐ నుంచి శాశ్వత రీఫైనాన్సింగ్ విండో ఉండాలి. అలాగే, వడ్డీపై టీడీఎస్ నుంచి మినహాయింపునివ్వాలి’’ అంటూ ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ అలెగ్జాండర్ ముత్తూట్ బడ్జెట్ నుంచి తామేమి ఆశిస్తున్నామో తెలియజేశారు. ద్రవ్యలోటు కాకుండా... వృద్ధే లక్ష్యం కావాలి! ఇండియా రేటింగ్స్ బడ్జెట్ ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు సంబంధించిన నికర వ్యత్యాసం ద్రవ్యలోటు కట్టడిపైన మరీ అంత దృష్టి పెట్టకుండా, ఆర్థిక రివకరీ, వృద్ధిపైనే చర్యలు తీసుకోవాలని ఇండియా రేటింగ్స్ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఇండియా రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ దేవేంద్ర పంత్ నివేదికలోని అంశాలను వెల్లడించారు. -
యంగెస్ట్ మొబైల్ అప్లికేషన్ ప్రొగ్రామర్స్..
స్కూల్ రోజుల్లో కాలేజి జీవితం గురించి ఆలోచిస్తారు చాలామంది.ఈ పిల్లలు మాత్రం కంపెనీలు స్థాపించడం గురించి ఆలోచించారు. కలలను సాకారం చేసుకున్నారు....ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు... చెన్నైలో ఉండే సురేంద్ర కుమరన్ తన పిల్లలకు చందమామ కథలు చెప్పలేదు. కానీ గొప్పవాళ్ల కథలనే చందమామ కథలుగా చెప్పాడు. వాటిలో రైట్ బ్రదర్స్ నుంచి స్టీవ్‌జాబ్స్ వరకు ఎందరో ఉన్నారు. శ్రావణ్ కుమరన్, సంజయ్ కుమరన్ సోదరులకు స్టీవ్‌జాబ్స్ గురించి వినడం అంటే పదే పదే ఇష్టం.‘ఇరవై సంవత్సరాల వయసులోనే స్టీవ్‌జాబ్స్ తమ కారు గ్యారెజ్‌లో యాపిల్ మొదలుపెట్టాడు’ ఆ తరువాత? ‘మీలాంటి పిల్లలకు రోల్ మోడల్‌గా చూపించే స్థాయికి ఎదిగాడు. నాన్న చెప్పిన కథలు వృథా పోలేదు. పదహారేళ్లు నిండకుండానే ఈ సోదరులు ‘గో డైమెన్షన్స్’ పేరుతో టెక్నాలజీ సొల్యూషన్ కంపెనీ మొదలుపెట్టారు. పదకొండు అప్లికేషన్స్‌కు పైగా డెవలప్ చేశారు. ‘యంగెస్ట్ మొబైల్ అప్లికేషన్ ప్రొగ్రామర్స్’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. థర్డ్గ్రేడ్లో ఉన్నప్పుడు కుమరన్ బ్రదర్స్‌కు ల్యాప్‌టాప్ కొనిచ్చాడు తండ్రి. అప్పటి నుంచే సాంకేతిక విషయాల పట్ల వారిలో ఆసక్తి పెరిగింది. తండ్రి నుంచి ‘క్యూ బేసిక్’ నేర్చుకున్న తరువాత ‘ప్రోగ్రామింగ్’ మీద ఆసక్తి పెరిగింది. పర్వీందర్‌సింగ్ (18) , అర్జున్ సంతోష్ కుమార్ (20) రకరకాల పుస్తకాలు చదివి ప్రొగ్రామింగ్ మీద పట్టు సాధించిన కుమరన్స్ ‘గో వీఆర్’ పేరుతో సొంతంగా వర్చువల్ రియాలిటీ డివైజ్ తయారుచేశారు. మార్కెట్లో ఎన్నో వీఆర్ డివైజ్‌లు ఉండగా దీన్ని ఎందుకు కొనాలి? సోదరుల మాటల్లో చెప్పాలంటే వాటితో పోల్చితే ఇది కారుచౌక. తమ తొలి అధికారిక యాప్ ‘క్యాచ్ మీ కాప్’కి ముందు 150కి పైగా ‘టెస్ట్ యాప్స్’ రూపొందించారు. క్యాచ్ మీ కాప్, ఆల్ఫాబెట్స్ బోర్డ్స్, ప్రేయర్ ప్లానెట్, కార్ రేసింగ్, సూపర్‌హీరో జెట్ ప్యాక్, కలర్ పాలెట్... మొదలైన యాప్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. సేవాతత్వానికి ఊతం ఇచ్చే ‘గో డొనేట్’లాంటి యాప్స్‌ని రూపొందించిన కుమరన్ బ్రదర్స్ ‘సమాజం కోసం ఏదైనా కచ్చితంగా చేయాలని అనుకుంటున్నాము’ అంటున్నారు. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించడంతో పాటు ఎన్నో అవార్డ్లు సొంతం చేసుకున్నారు. చెన్నైలో ఒకరోజు. అబ్బాయి స్కూల్ నుంచి ఇంకా రాలేదు. వర్షం పెరిగింది. తల్లిదండ్రులలో ఆందోళన పెరిగింది. భారీ వర్షం కారణంగా అర్జున్ సంతోష్‌కుమార్ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. తల్లిదండ్రులకు పోయిన ప్రాణం లేచివచ్చింది. ఈ సంఘటనే అర్జున్‌ని ‘లొకెటేర’ అనే మొబైల్ యాప్ రూపొందించడానికి ప్రేరణ ఇచ్చింది. వాతావరణానికి అనుగుణంగా స్కూల్ బస్‌రూట్స్‌లో ప్లాన్, షెడ్యూల్, రీ–షెడ్యూల్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన సమాచారాన్ని పేరెంట్స్‌కు తెలియజేయడానికి అనువైన ఈ యాప్ మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (యంఐటీ) ‘బెస్ట్‌యాప్’ అవార్డ్ గెలుచుకున్నాడు. నిజజీవిత సమస్యలకు వినూత్నమైన పరిష్కారాల కోసం ‘లెటెరలాజిక్స్’ కంపెనీ మొదలుపెట్టాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫలితాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ‘ఎనీవన్ ఏఐ’ వెంచర్ మొదలుపెట్టిన అర్జున్ గూగుల్ వెబ్‌రేంజర్స్ అవార్డ్, నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ ఎచీవ్‌మెంట్స్ ఫర్ కంప్యూటర్ టెక్నాలజీ అవార్డ్లు అందుకున్నాడు. చెన్నైను వరదలు చుట్టిముట్టినప్పుడు అర్జున్ డెవలప్ చేసిన ‘ఐ వాలంటీర్ ఫర్ చెన్నై’ యాప్ స్వచ్ఛందసంస్థలు, సేవకులకు ఎంతో ఉపయోగపడింది. అర్జున్ సంతోష్ కుమార్‌కు ఎన్నో దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయి. ఇప్పటికీ అతడు సాధించిన విజయాలను బట్టి చూస్తే ఆ లక్ష్యాలకు చేరువకావడం కష్టం కాదు అనిపిస్తుంది. పుణెకి చెందిన పర్వీందర్‌సింగ్ ‘ప్రోసింగ్’గా సుపరిచితుడు. మధ్యతరగతికి చెందిన పర్వీందర్ 13 ఏళ్ల వయసులోనే టెక్ ప్రపంచంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. చదువులో చురుకైన పర్వీందర్ ప్రొగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని ‘మనీ రివార్డ్’ అనే తొలి యాప్‌ను లాంచ్ చేశాడు. తమ మొబైల్స్ ద్వారా డబ్బులు సంపాదించడానికి టీనేజర్స్‌కు ఉపయోగపడే యాప్ ఇది. 16 సంవత్సరాల వయసులో ‘ఇన్‌స్టా ఈజీ’ సార్టప్‌ను లాంచ్ చేశాడు. 17 సంవత్సరాల వయసులో ‘ది యాక్చువల్ గ్రోత్ హాక్–ఏ కంప్లీట్ గైడ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్’ అనే పుస్తకం రాశాడు. బేసిక్స్ నుంచి కీలకమైన సాంకేతిక విషయాల వరకు ఎన్నో ఈ పుస్తకం నుంచి నేర్చుకోవచ్చు. వీరు మచ్చుకు కొందరు మాత్రమే. ఇంకా ఎంతో మంది చిరంజీవులు ఉన్నారు. వారికి అభినందనలు తెలియజేద్దాం. -
కంటెయినర్ ఇళ్లొచ్చాయ్!
మొయినాబాద్(చేవెళ్ల)/కందుకూరు: చూడముచ్చటైన సోఫాలతో హాల్, అబ్బురపరిచే కిచెన్, బెడ్రూమ్లు, ఔరా అనిపించే ఇంటీరియర్. ఇది చాలా ఇళ్లలో ఉంటుంది కదా అని అనుకుంటున్నారా?. కానీ ఈ ఇళ్లు మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకునిపోవచ్చు. కొద్దిరోజులు విహారయాత్రలకు వెళ్లినా వీటిని మనతోనే తీసుకెళ్లొచ్చు. ఇవే కంటెయినర్ ఇళ్లు. ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వీటి నిర్మాణంవైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు. ట్రెండ్‌కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం ఇలా మారుతోంది. కొన్నిచోట్ల ఆఫీసులుగా మారుతున్నాయి. బయటకు సాధారణంగానే కనిపించినా.. లోపల మాత్రం సకల హంగులు ఉంటున్నాయి. సులభంగా తరలింపు... రియల్టర్లు, డెవలపర్లు, బిల్డర్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో తాత్కాలికంగా ఓ షెడ్ ఉండాలని భావిస్తున్నారు. చిన్న గది కట్టాలన్నా ఇటుకలు, ఇసుక, సిమెంటు, రేకులు తదితర సామగ్రి కావాలి. పని పూర్తయిన తరువాత దానిని కూల్చి వేయాల్సిందే. వీటికి ప్రత్యామ్నాయంగా కంటెయినర్లలో ఆఫీసులు ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిని సులభంగా తరలించే అవకాశం ఉండటంతో కూడా ఎక్కుమంది మొగ్గు చూపుతున్నారు. చదరపు అడుగుకు రూ.1,200... 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ప్రారంభించి 30/10, 40/10, 40/20, 40/8 ఇలా పలు కొలతల్లో కంటెయినర్ ఇళ్లు, కార్యాలయాలను తయారు చేసి ఇస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్లతో పాటు విద్యుత్, ఫ్యాబ్రికేషన్ తదితరాలను, ఫర్నిచర్, టాయిలెట్స్ సమకూర్చి అందజేస్తున్నారు. ఒక చదరపు అడుగు విస్తీర్ణం సుమారుగా రూ.1,200–1,500 వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. 20/10 కంటెయినర్ ఇల్లు ఏర్పాటుకు రూ.1.85–2.40 లక్షల వరకు ఖర్చవుతుంది. దీంతోపాటు టాయిలెట్, ఫర్నిచర్‌కు అదనంగా మరో రూ.60 వేలు వరకు తీసుకుంటున్నారు. 40/10 కంటెయినర్ దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కానుంది. కంటెయినర్‌ను బట్టి దాని జీవితకాలం 20–30 ఏళ్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. కంటెయినర్ ఇళ్లు, ఆఫీసులను శంషాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ పక్కన, నగరంలోని జీడిమెట్లలో తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆసక్తిని బట్టి తయారీ వినియోగదారుడి ఆసక్తి మేరకు వివిధ రకాల సైజుల్లో కంటెయినర్లను తయారు చేసి ఇస్తున్నాం. ఫాంహౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లతో పాటు ప్రాజెక్టుల వద్ద అవసరమైన ఆఫీస్ రూమ్‌లు, లేబర్ క్వార్టర్స్, టాయిలెట్లు, బాత్రూమ్లు తదితరాలను నిర్మించి ఇస్తున్నాం. సాధారణంగా మెటల్ మందం 1.2 మి.మీ., లోపల ఇన్సూలేషన్ 50 మి.మీ.తో ఇస్తాం. మందం పెరిగితే ధర పెరుగుతుంది. కంటెయినర్లో ఏర్పాటు చేసుకునే వసతుల్ని బట్టి ధర మారుతుంటుంది. ఆర్డర్ ఇచ్చిన వారం పది రోజుల్లో సరఫరా చేస్తాం. – కృష్ణంరాజు సాగి, నిర్వాహకుడు, ఆర్ఈఎఫ్ టెక్నాలజీస్, జీడిమెట్ల -
అసంతృప్తి రెరా
సాక్షి, హైదరాబాద్: రెరా లక్ష్యం తప్పుతోంది! నాణ్యత, గడువు, పారదర్శకత, ధర, క్రయ విక్రయాల్లో స్పష్టత, డెవలపర్లు, ఏజెంట్ల వివరాలు.. ఇలా ప్రతి ఒక్కటీ అందుబాటులో ఉంచాల్సిన రెరా.. అసలు లక్ష్యం దారి తప్పుతోంది. దీంతో కొనుగోలుదారులకు భరోసా కలిగించాల్సిన రెరా అసంతృప్తిని మిగులుస్తోందని కొనుగోలుదారుల సం ఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2017లో నోటిఫై చేసింది. తొలుత నమోదు గడువును 2018 నవంబర్ 30 వరకు విధించింది. కానీ, ఆశించిన స్థాయిలో డెవలపర్ల నుంచి స్పందన లేకపోవటంతో ప్రతి 15 రోజుల కొకసారి గడువు తేదీని పొడిగిస్తుంది. సరైన సమయంలో నమోదు చేసుకోని డెవలపర్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోకుండా ఇలా పలుమార్లు గడువును పొడిగించడం సరైంది కాదని.. ఇలా అయితే తెలంగాణలో రెరా అమలు సంతృప్తికరంగా ఉండదని సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెరా ముందు.. తర్వాత! 2017 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 30 మధ్య అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లు టీ–రెరాలో నమోదు చేసుకోవాలి. నమోదు చేశాకే ప్రకటనలు, అమ్మకాలు చేయాలి. మరి, 2017 జనవరి 1 కంటే ముందు అనుమతి పొందిన ప్రాజెక్ట్‌ల పరిస్థితి ఏంటి? ఆయా ప్రాజెక్ట్‌లను అడ్వర్టయిజింగ్ చేస్తే వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు, నంబర్లు, తేదీలు ప్రకటనలో తప్పకుండా ప్రకటించాలని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (యూ–ఎఫ్‌ఈఆర్‌డబ్ల్యూఏఎస్) డిమాండ్ చేసింది. అప్పుడే కొనుగోలుదారులకు ఆ ప్రాజెక్ట్ రెరాకు ముందా? లేక తర్వాతి ప్రాజెక్టా అనేది స్పష్టత వస్తుందని పేర్కొంది. వసూళ్లకే రెరా.. ప్రస్తుతం టీ– రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు, ప్రమోటర్లు, ఏజెంట్ల ప్రాథమిక సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని, ప్రాజెక్ట్ నిర్మాణ స్థితి గతులు, క్రయ విక్రయాల సంఖ్య, ప్రాజెక్ట్ బ్యాంక్ ఖాతా వివరాలు, ప్రమోటర్ల ఆదాయ వివరాలు వంటి కీలక సమాచారం ఏదీ కూడా అందుబాటులో లేదని యూ–ఎఫ్‌ఈఆర్‌డబ్ల్యూఏఎస్ జనరల్ సెక్రటరీ బీటీ శ్రీనివాసన్ తెలిపారు. టీ–రెరాను జస్ట్ ప్రాజెక్ట్‌ల నమోదుకు మాత్రమే ఉపయోగిస్తున్నట్టుందని పేర్కొన్నారు. నమోదు రుసుములు, జరిమానాలను వసూలు చేసే విభాగంగా రెరా మిగిలిందని ఆరోపించారు. వివరాలూ అసంపూర్తిగానే.. టీ– రెరాలో ఇప్పటివరకు ఎంత మంది డెవలపర్లు, ఏజెంట్లు నమోదు చేసుకున్నారు? ఎస్క్రో బ్యాంక్ ఖాతా, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ వివరాలు ఏవీ కూడా కొనుగోలుదారులకు అందుబాటులో లేవు. రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు ప్రతి మూడు నెలలకొకసారి అప్డేట్ చేయాలి. ఎన్ని అమ్ముడుపోయాయి? ఇంకా ఎన్ని ఫ్లాట్లు విక్రయానికి ఉన్నాయి? వంటి వివరాలేవీ అప్డేట్ చేయట్లేదు. గృహ కొనుగోలుదారులకు ఈ వివరాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టేటస్, ప్రాంతం అభివృద్ధిని అంచనా వేసుకొని కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకుంటారు.్డ జరిమానా వివరాల్లేవ్! గడువులోగా ప్రాజెక్ట్‌లను నమోదు చేయని డెవలపర్లకు రూ.2 లక్షలు జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎంత మంది డెవలపర్లు జరిమానా కట్టారు? ఆయా ప్రాజెక్ట్‌ల వివరాలేంటి? వంటి సమాచారమేదీ కూడా టీ–రెరాలో అందుబాటులో లేదు. ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఫిర్యాదులు, వాటి పత్రాలు, జడ్జిమెంట్ కాపీలు వంటివేవీ వెబ్సైట్లలో లేవు. ఈ వివరాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటే ఆయా ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదు అర్హత ఉండి మరీ చేసుకోలేదని.. అయినా అమ్మకాలు చేస్తున్నారని కొనుగోలుదారులకే తెలిసిపోతుందని.. దీంతో ఆయా ప్రాజెక్ట్లల్లో కొనుగోలు చేయాలా? వద్దా? అనేది వాళ్లే నిర్ణయించుకునే వీలుంటుంది. -
జీఎస్టీ 5%, 1% ప్రయోజనం శూన్యమే
హమ్మయ్య! జీఎస్టీ తగ్గింది. నిర్మాణంలో ఉన్న గృహాల మీద 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు గృహాల మీద 8 శాతం నుంచి 1 శాతానికి! బావుందని సంబరపడిపోకండి.. తగ్గిన జీఎస్టీ శ్లాబును కాస్త లోతుగా విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఐటీసీ లేకుండా జీఎస్టీ తగ్గింపుతో పెద్దగా ప్రయోజనం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే తాజా జీఎస్టీలో పన్ను రేటు తగ్గలేదు.. ఐటీసీ ఎంతొస్తుందనే అంశం మీద డెవలపర్లకు, కస్టమర్లకు మధ్య సందిగ్ధత తొలగిందంతే! సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ తగ్గింపు కస్టమర్లకు లాభమా? నష్టమా? అంటే నష్టమే అని చెప్పాలి. పాత, కొత్త రెండు జీఎస్టీ శ్లాబుల్లోనూ ప్రభుత్వానికొచ్చే పన్ను ఆదాయంలో ఎలాంటి మార్పు లేదు. ‘‘కేంద్రం ఐటీసీని నికరంగా 7 శాతంగా గణించింది. ఈ లెక్కన పాత జీఎస్టీలో 7 శాతం ఐటీసీ, 8 శాతం జీఎస్టీ.. రెండు కలిపి 12 శాతంగా ఉండేది. తాజా జీఎస్టీలో 7 శాతం ఐటీసీని ఇవ్వకుండా 1 శాతం జీఎస్టీ కేటాయించింది. తన్ని పడేసినా.. పడేసి తన్నినా తగిలే దెబ్బ కొనుగోలుదారునికే! గత జీఎస్టీలో కస్టమర్లకు ఐటీసీ 7–8 శాతం వరకొచ్చేది. 12 శాతం జీఎస్టీలో మిగిలిన 4–5 శాతం జీఎస్టీ కట్టేవాళ్లు. కానీ, ఇప్పుడు ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. అంటే గతంతో పోలిస్తే 1–2 శాతం జీఎస్టీ పెరిగినట్టేగా! చ.అ.కు రూ.300–500 పెంపు.. 12 శాతం జీఎస్టీ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో చాలా మంది డెవలపర్లు ఏం చేసేవారంటే.. కస్టమర్ల నుంచి 12 శాతం జీఎస్టీకి బదులు 8 శాతం వసూలు చేసేవాళ్లు. ఐటీసీని బదలాయించేవాళ్లు కాదు! ఒక్కోసారి డెవలపర్లకు ఐటీసీ 7–9 శాతం వరకూ వచ్చేది. దీంతో నిర్మాణ వ్యయం, తిరిగొచ్చిన ఐటీసీ అక్కడికక్కడే సరిపోయేది. కానీ, ఇప్పుడు కేంద్రం ఐటీసీని ఎత్తేసింది. అంటే డెవలపర్లకు నిర్మాణ సామగ్రి మీద వెచ్చించే ఐటీసీ తిరిగి రాదన్నమాట. హైదరాబాద్‌లో డెవలపర్లకు 15–20 శాతం వరకు మార్జిన్లుంటాయి. ఏప్రిల్ 1 తర్వాతి నుంచి ఐటీసీ రాదు కాబట్టి మార్జిన్లు 5–10 శాతం వరకు తగ్గే అవకాశముంది. ఈ నష్టాన్ని డెవలపర్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేస్తారు. అంటే ప్రాపర్టీ ధరలను పెంచుతారన్నమాట. దీర్ఘకాలంలో ధరలు చ.అ.కు రూ.300–500 వరకూ పెరిగే అవకాశముంది. ఐటీసీ లేకపోతే వ్యయం పెరుగుతుంది.. కొత్త జీఎస్టీ వల్ల స్థలాల ధరలు ఎక్కువ ఉన్న చోట లాభదాయకమని, తక్కువగా ఉన్న చోట పెద్దగా ప్రయోజనం ఉండదని క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. అర్బన్, నాన్–అర్బన్ ఎక్కడైనా సరే నిర్మాణ వ్యయం ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. మెట్రో నగరాల్లో ప్రాజెక్ట్ వ్యయంలో 1/3 వంతు వ్యయం స్థలం మీదనే పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి చోట ఐటీసీ లేకపోవటం అనేది డెవలపర్లకు భారమే. ఇదిలా ఉంటే 1 శాతం జీఎస్టీ ఉన్న అందుబాటు గృహాలు కొందామంటే.. 60 చ.మీ., రూ.45 లక్షల లోపు గృహాలు మెట్రో నగరాల్లో దొరకడం కష్టమే. కొత్త జీఎస్టీలోనూ కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఏంటంటే.. ఒక ప్రాజెక్ట్‌లో 50 ఫ్లాట్లు ఉన్నాయనుకుందాం. గతంలో 25 ఫ్లాట్లను విక్రయించిన డెవలపర్.. ఏప్రిల్ 1 తర్వాతి నుంచి విక్రయించే మిగిలిన ఫ్లాట్లకు ఐటీసీ తీసుకోవాలా? వద్దా? మరి, గతంలో విక్రయించిన ఫ్లాట్లకు ఐటీసీ తిరిగి వస్తుందా? రాదా?! తగ్గించాల్సింది నిర్మాణ సామగ్రి మీద సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి మీద జీఎస్టీని తగ్గించకుండా ప్రాపర్టీలపై జీఎస్టీని తగ్గించి లాభం లేదని టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్మాణ వ్యయంలో అత్యంత కీలకమైన సిమెంట్, స్టీల్ వంటి ఉత్పత్తుల మీద జీఎస్టీ భారం తగ్గించకుండా ప్రాపర్టీల మీద జీఎస్టీ తగ్గించడం.. అది కూడా ఐటీసీ లేకుండా సరైంది కాదని తెలిపారు. ప్రస్తుతం సిమెంట్ మీద 28 శాతం, స్టీల్, టైల్స్, రంగులు, సీపీ ఫిట్టింగ్స్, ఎలక్ట్రిక్ వంటి ఉత్పత్తుల మీద 18 శాతం, ఇటుకల మీద 5 శాతం, ఇసుక, మెటల్స్ మీద 8 శాతం జీఎస్టీ ఉంది. ఇక, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, వర్క్ కాంట్రాక్టర్స్ వంటి నిర్మాణ సంబంధమైన సేవల మీద 18 శాతం జీఎస్టీ ఉంది. నిర్మాణ ఉత్పత్తులు, సేవలు అన్నింటినీ 5– 8 శాతం జీఎస్టీలోకి తీసుకురావాలి. భవిష్యత్తులో జనప్రియ గృహాలే! ముందునుంచి కూడా కేంద్రం అందుబాటు గృహాల మీద ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ విభాగానికి 1 శాతం జీఎస్టీతో పాటూ క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) కింద రూ.2.5 లక్షల వరకూ వడ్డీ రాయితీ, పరిశ్రమ హోదాతో చౌక వడ్డీ రేట్లకు గృహ రుణాలు వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. పైగా అఫడబుల్ హౌజింగ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే భవిష్యత్తులో జనప్రియమైన అందుబాటు గృహాల నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఆధునిక వసతులు, సౌకర్యాలు, లగ్జరీ ఏర్పాట్ల మీద దృష్టిపెట్టిన డెవలపర్లు మళ్లీ పాత బాట పడతారని ఏవీ కన్స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్ రెడ్డి తెలిపారు. దశాబ్ధం క్రితం హైదరాబాద్‌లో నిర్మించిన 1000 లోపు చ.అ. ఫ్లాట్లు మళ్లీ దర్శనమిస్తాయని పేర్కొన్నారు. శివారు ప్రాంతాలు, అభివృద్ధికి ఆస్కారముండే ప్రాంతాల్లో అందుబాటు గృహాలను నిర్మిస్తారు. -
అందుబాటు గృహాలపై దృష్టి పెట్టండి!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ డెవలపర్లు ఎగువ మధ్య తరగతి ప్రజల గృహ నిర్మాణాలపై చూపించినంత శ్రద్ధ.. అందుబాటు గృహాల నిర్మాణంలో చూపించట్లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ తెలిపారు. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం వినియోగంలో హైదరాబాద్ అత్యంత వెనకబడి ఉందని.. ఈ పథకం కింద అఫడబుల్ గృహాల నిర్మాణంలో ముంబై నగరం బెటరని చెప్పారు. హైదరాబాద్‌లో 2 బీహెచ్‌కే గృహాల నిర్మాణాలను ప్రభుత్వమే చేస్తుందని, ప్రైవేట్ నిర్మాణ సంస్థలు కూడా పేదలు, దిగువ మధ్య తరగతికి అవసరమైన అఫడబుల్ గృహాలను నిర్మించాల్సిన అవసరముందని ఆయన సూచించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) సమావేశంలో ముఖ్య అతిథిగా కిశోర్ పాల్గొన్నారు. గ్రీన్ సిటీగా మాదాపూర్.. చైనా, సౌత్ కొరియా వంటి దేశాల్లో లాగా హైదరాబాద్ నిర్మాణ రంగంలోనూ టెక్నాలజీని వినియోగించాలి. దీంతో నిర్మాణ రంగంలో వేగంతో పాటూ అంతర్జాతీయ డిజైన్లు, నాణ్యత బాగుంటుంది. గ్రీన్ టెక్నాలజీ వినియోగంలో డెవలపర్లు ఆసక్తి చూపించాలి. వచ్చే ఏడాది నుంచి నగరంలోని ప్రతి భవనం గ్రీన్ ఎనర్జీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని.. మాదాపూర్, హైటెక్ సిటీలను గ్రీన్ సిటీలుగా మార్చాలి. ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు.. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో రహదారులు, మంచి నీటి వంటి మౌలిక వసతుల కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. కేశపురం, దేవుల నాగారం ప్రాంతాల్లో రెండు రిజర్వాయర్లను నిర్మించనున్నాం. వీటి సామర్థ్యం 20 టీఎంసీలు. ఇప్పటికే 29 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 49 టీఎంసీల నీటితో భవిష్యత్తులో నగరానికి నీటి కొరతే ఉండదని ధీమావ్యక్తం చేశారు. నగరంలో మెట్రో రైల్‌తో పాటు మరొక ట్రాఫిక్ సొల్యూషన్ అవసరముందని తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదక ప్రకారం.. వరల్డ్ డైనమిక్ నగరాల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది కాలంలో బెంగళూరును కిందికి నెట్టేసి మొదటి స్థానంలో నిలవటం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టుగానే నగరంలో వనరులు, పాలసీలు, విధానాలు, నాయకత్వం అన్ని అంశాలూ ఉన్నాయని తెలిపారు. క్రెడాయ్ ప్రాపర్టీ షో.. వచ్చే నెల ఫిబ్రవరి 15–17 తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ 7వ ప్రాపర్టీ షో జరగనుంది. జంట నగరాల్లోని సుమారు వందకు పైగా నిర్మాణ సంస్థలు షోలో పాల్గొంటున్నాయని.. రూ.25 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ప్రాపర్టీల వరకూ ప్రదర్శనలో ఉంటాయని క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ ఎస్ రాంరెడ్డి తెలిపారు. మూడు రోజుల ఈ ప్రాపర్టీ షోకు సుమారు 70 వేల మంది నగరంతో పాటూ ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తారని అంచనా. 20 శాతం ధరల వృద్ధి.. గత ఏడాది కాలంలో స్థిరాస్తి ధరలు 15–20 శాతం వరకు పెరిగాయని.. వచ్చే ఏడాది కాలంలో కూడా మరో 20 శాతం వరకూ ధరలు పెరుగుతాయని రాంరెడ్డి అంచనా వేశారు. రియల్టీ ధరలు, పన్నులు, ఫీజులు, స్థల ధరలు పెరిగినంత స్థాయిలో కొనుగోలుదారుల ఆదాయం మాత్రం పెరగట్లేదని అందుకే ప్రాపర్టీ కొనేందుకు ఇదే సరైన, చివరి అవకాశమని సూచించారు. -
టీ–రెరా గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా)లో ప్రాజెక్ట్‌లు, డెవలపర్లు, ఏజెంట్ల నమోదు గడువును పొడిగించారు. రూ.లక్ష జరిమానాతో ఈనెల 15 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టీ–రెరా అధికారి ఒకరు తెలిపారు. 15 వరకు కూడా నమోదు చేసుకోని పక్షంలో జరిమానాను మరింత పెంచుతామని.. ఆ తర్వాత ఏకంగా ప్రాపర్టీలను సీజ్ చేస్తామని చెప్పారు. వాస్తవానికి టీ–రెరాలో రిజిస్ట్రేషన్ గడువు నవంబర్ 30తో ముగిసింది. డిసెంబర్ 1 నుంచి 7 వరకు రూ.50 వేల జరిమానాతో రిజిస్ట్రేషన్‌కు అవకాశమిచ్చారు. ఠి 2017, జనవరి 1 నుంచి ఆగస్టు 31 మధ్య కాలంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీఎస్ఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లు టీ–రెరాలో పరిధిలోకి వస్తాయి. 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్ట్ టీ–రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. ఆగస్టు 31 తర్వాత అనుమతి తీసుకున్న ప్రాజెక్ట్‌లు మాత్రం జరిమానా లేకుండానే టీ–రెరాలో నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. -
క్వికర్ చేతికి హెచ్డీఎఫ్సీ రియల్టీ, హెచ్డీఎఫ్సీ డెవలపర్స్
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ రియల్టీ, హెచ్డీఎఫ్సీ డెవలపర్స్‌ను క్వికర్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసింది. అంతా షేర్ల రూపంలోనే ఈ అనుబంధ సంస్థలను క్వికర్‌కు విక్రయించామని హెచ్డీఎఫ్సీ తెలిపింది. డీల్‌లో భాగంగా ఈ రెండు సంస్థలను రూ.357 కోట్లకు క్వికర్‌కు విక్రయించామని, ఈ విలువ మేరకు తమకు క్వికర్ ఇండియాలో 3 శాతం వాటా లభిస్తుందని వివరించింది.