Devineni Uma Maheshwara Rao
-
టీడీపీ సీనియర్ నేతకు షాక్.. బాబు వద్దకు పంచాయితీ!
సైకిల్ పార్టీలో ఆయనో సీనియర్ నాయకుడు. అంతా నాకే తెలుసు .. నాకు మాత్రమే తెలుసనుకునే ఆ నేతను ఇప్పుడు సొంత కేడరే వద్దనుకుంటుందట. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చాల్సిందే అని స్థానిక నేతలు గట్టిగా పట్టపడుతున్నారట. కేడర్‌లో పెరుగుతున్న అసంతృప్తిని ఆశావహులు మరింత రెచ్చగొడుతున్నారు. టిక్కెట్ రేస్‌లో ఉన్నామనే సంకేతాలు పంపుతున్నారట. ఆ నాయకుడెవరో? ఆ నియోజకవర్గం ఎక్కడుందో ఓ లుక్కేద్దాం. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో తనకు ఎదురే లేదని చెప్పుకునే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సొంత నియోజకవర్గంలోనే ఎదురుగాలి వీస్తోందట. నియోజకవర్గాల పునర్విభజనతో దేవినేని ఉమా నందిగామ నుంచి మైలవరానికి వలస వచ్చారు. స్థానిక నేత కాకపోయినా మైలవరం నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు, ప్రజలు ఉమాను ఆదరించి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే మంత్రి అయిన తర్వాత, గత ఐదేళ్ల కాలంలో పార్టీ కేడర్‌ను దేవినేని ఉమ అసలు పట్టించుకోలేదని.. ఒంటెద్దు పోకడలు పోతూ.. అంతా తనకే తెలుసనే అహంభావంతో మెలిగాడని మైలవరం టీడీపీలో టాక్ నడుస్తోంది. దీంతో చాలామంది కార్యకర్తలు, స్థానిక నేతలు ఆయనకు దూరమైపోయారట. 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక ఉమా మైలవరాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారట. ఏవైనా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలుంటే మాత్రం వచ్చి అటెండెన్స్ వేయించుకుని వెళ్లిపోతున్నారట. ఈక్రమంలోనే ఉమాతో పార్టీ కేడర్‌కు దూరం బాగా పెరిగి ఈసారి ఉమా మాకొద్దు అనే స్థాయికి చేరిందట. వలస వచ్చిన నాయకుడైనా నెత్తిన పెట్టుకున్నందుకు కనీసం తమకు అండగా నిలవని ఉమా తమకు వద్దే వద్దంటూ అధినేత చంద్రబాబుకు తేల్చి చెప్పేశారట మైలవరం యెల్లో కేడర్. మైలవరం సీటు నాకే ఇవ్వాలి.. ఇదిలా ఉంటే.. ఇటీవల మైలవరంలో దేవినేని ఉమాకు బొమ్మసాని సుబ్బారావు కంట్లో నలుసులా మారారట. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న బొమ్మసాని సుబ్బారావు ఈసారి మైలవరం టిక్కెట్ దక్కించుకోవాలని తహతహలాడుతున్నారట. అందుకే గత ఆరునెలలుగా ఉమాకు వ్యతిరేకంగా నియోజకవర్గ నేతల్ని తనవైపునకు తిప్పుకుంటూ.. మైలవరంలో సెపరేటుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. ఈసారి తనకే టిక్కెట్టివ్వాలని.. అడిగే హక్కు తనకే ఉందని బహిరంగంగానే పోటీ గురించి దేవినేనికి సంకేతాలు పంపిస్తున్నారట. ఆ మధ్య ఆత్మీయ సమావేశంలో తన మద్దతుదారులతో బలప్రదర్శన చేసి సక్సెస్ అయ్యాడట సుబ్బారావు. తాజాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం విడిగా నిర్వహించడంతో పాటు బూత్ లెవల్ మీటింగ్ లు పెట్టి మైలవరంలో పోటీకి నేనూ అర్హుడినే అంటూ ఓపెన్ గానే తన వాయిస్ వినిపించారట. దేవినేని ఉమాకోసం ఎంతో చేశా.. ఎప్పుడూ వేరే వాళ్లకోసం కష్టపడటమేనా పార్టీ తన వంటి సీనియర్లను గుర్తించాలి. మైలవరం సీటు తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. తన వెనుక, ముందు జరుగుతున్న పరిణామాలతో దేవినేని ఉమాలో కలవరం మొదలైందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే కేడర్‌కు తనపై ఉన్న అసంతృప్తిని ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతుంటే.. ఇప్పుడు బొమ్మసాని ఓపెన్ ఛాలెంజ్‌లు ఉమాను మరింతగా టెన్షన్ పెడుతున్నాయట. -
సొంతపార్టీ వాళ్లకే చెమటలు పట్టించిన ఉమా! మాకొద్దు బాబోయ్ అంటున్న తమ్ముళ్లు
ఎన్టీఆర్ జిల్లా: తెలుగుదేశం పార్టీలో జనం నెత్తిన చేతులు పెట్టే నేతలకు కరువేమీ లేదు. అదే కోవలోకి వస్తారు మాజీ మంత్రి..సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. ఇప్పుడాయన పేరు చెబితే పార్టీలోను, మైలవరం నియోజకవర్గంలోనూ అందరూ మండిపడుతున్నారట. నోటి దురుసు, అహంభావానికి కేరాఫ్ అడ్రస్ అయిన దేవినేని వ్యవహారంతో కార్యకర్తలు ఎప్పట్నుంచో విసిగిపోయి ఉన్నారట. ఇటీవల ఉమా తీరు మరింత వరస్ట్‌గా మారడంతో క్యాడర్ కు అస్సలు రుచించడం లేదని టాక్. దీంతో అతనికి వ్యతిరేకంగా మైలవరంలో గ్రూపులు మొదలయ్యాయట. దేవినేని ఉమా తాజాగా వెలగబెట్టిన నిర్వాకం కారణంగా సైకిల్ పార్టీ శ్రేణులు ఉమా అంటే ఆమడ దూరంలో ఉంటున్నారట. గొల్లపూడి వన్ సెంటర్ లో ఆలూరి చిన్నారావుకు చెందిన స్థలంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ స్థలం ఆలూరి చిన్నారావుకు అతని తల్లి శేషారత్నం గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారు. ఆ స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో తన ఆస్థిని కాపాడుకునేందుకు శేషారత్నం జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారు. ఏడాది పాటు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు కలెక్టర్ గిఫ్ట్ డీడ్ రద్దుచేసి ఆ స్థలాన్ని ఆమెకు ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలూరి శేషారత్నం ఆ స్థలంపై కన్నేశారు కలెక్టర్ ఆదేశాలతో శేషారత్నంకు స్థలం అప్పగించేందుకు అధికారులు అక్కడకు వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో దేవినేని ఉమా జోక్యం చేసుకుని కుటుంబ వ్యవహారాన్ని రాజకీయంగా మార్చేశారని టాక్. వాస్తవానికి టీడీపీ కార్యాలయం పేరిట ఆ స్థలాన్ని పర్మినెంట్ గా కొట్టేయాలనేది దేవినేని ఉమా ప్లాన్ అని చెబుతున్నారు. ఇందులో భాగంగానే దేవినేని ఉమా ఓ రేంజ్ లో డ్రామా నడిపించాడు. కానీ అతని బెదిరింపులకు వెరవకుండా శేషారత్నం ధైర్యంగా నిలబడ్డారు. తల్లీ కొడుకుల మధ్య ఉమా చిచ్చు పెట్టాలని ఎంత ప్రయత్నించినా వ్యూహం ఫలించలేదట. దీంతో అధికారులు ఎట్టకేలకు ఆ స్థలాన్ని ఆమెకు ఇప్పించడంతో పాటు అక్కడున్న టీడీపీ కార్యాలయాన్ని కూడా తరలించారు. ఐతే పార్టీ కార్యాలయం ముసుగులో శేషారత్నం స్థలం కొట్టేయాలన్న దేవినేని ప్లాన్ దారుణంగా ఫెయిలవ్వడంతో పాటు పార్టీకి తీరని నష్టం వాటిల్లేలా చేసిందట. పార్టీ కార్యకర్తకే వెన్నుపోటా? శేషారత్నం కుటుంబం అంతా టీడీపీ పార్టీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం వివాదానికి కారణమైన స్థలానికి నెలకు లక్షరూపాయలు అద్దె వస్తుందని తెలిసినా పార్టీ కోసమే అయాచితంగా ఇచ్చేశారు. ఇలాంటి సమయంలో దేవినేని పన్నాగం తెలుసుకుని స్థలాన్ని కాపాడుకునేందుకు శేషారత్నం తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. సొంత పార్టీకి చెందిన వారి స్థలాన్నే కబ్జా చేయాలని దేవినేని ఉమా వేసిన ప్లాన్ సక్సెస్ కాకపోగా...రచ్చ రచ్చగా మారి పచ్చ పార్టీ అభాసుపాలైందట. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుందట. అసలే మైలవరం టీడీపీలో లోకల్ నాన్ లోకల్ వార్ నడుస్తున్న సమయంలో ఈ పంచాయతీ ఏంటంటూ మండిపడుతున్నారట చినబాబు, చంద్రబాబు. ఇప్పటికే వేరుకుంపటి పెట్టుకున్న మైలవరం తమ్ముళ్లంతా..అదే అదనుగా కట్టకట్టుకుని ఉమాపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేశారట. ఈసారి ఉమా మాకొద్దంటున్నాం కాబట్టి... ఈసారి ఆ సీటేదో మాకే ఇచ్చేయండి బాబు అంటూ అధినేత ముందు క్యూ కట్టేస్తున్నారట. మాకొద్దు బాబు.. మీకో దండం మైలవరం నుంచి దేవినేని ఉమాను బయటికి పంపించేయాలనుకుంటున్న బొమ్మసాని సుబ్బారావు, జంపాల సీత రామయ్య, కాజా రాజ్ కుమార్, జువ్వ రాంబాబు తదితర ఆశావాహులంతా హై కమాండ్ వద్ద ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారట. ఈ మొత్తం వ్యవహారాన్ని బయటి నుంచి గమనిస్తున్న క్యాడర్ మాత్రం 2024లో ఉమాకు మైలవరం టిక్కెట్టు ఇస్తే పార్టీ మూసేసుకోవడం ఖాయమని బాహాటంగానే చర్చించుకుంటున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
నా ఆస్తి టీడీపీకి ఎందుకు ఇవ్వాలి?: శేషారత్నం
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో టీడీపీ కార్యాలయానికి నా ఇంటిని ఇవ్వనంటూ యజమాని ఆలూరి శేషారత్నం కీలక వ్యాఖ్యలు చేశారు. నా ఇంటికి నేను వెళ్తే మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా నానా రభస చేస్తున్నారని మండిపడ్డారు. నా కుటుంబం, నా ఆస్తి విషయంలో టీడీపీకి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. నా ఆస్తిని టీడీపీకి ఎందుకు ఇవ్వాలో సమాధానం చెప్పాలన్నారు. దేవినేని ఉమా పోలీసులను దూషించడం సమంజసం కాదు అని శేషారత్నం సూచించారు. చదవండి: (ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేత దేవినేని ఉమా హైడ్రామా) -
ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేత దేవినేని ఉమా హైడ్రామా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వన్ సెంటర్లో టీడీపీ నేతలు హైడ్రామా సృష్టించారు. దేవినేని ఉమా కార్యకర్తలతో కలిసి డ్రామా పాలిటిక్స్ నడిపారు. ప్రస్తుతం టీడీపీ ఆఫీస్ ఉన్న స్థలాన్ని చిన్నాకు అతని తల్లి శేషారత్నం గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చింది. అయితే కుమారుడు తల్లిని పట్టించుకోవడంతో ఇప్పుడు కలెక్టర్ ద్వారా శేషారత్నం గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ స్థలంలో ఉన్న టీడీపీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని కోరింది. అయితే ఖాళీ చేసేదిలేదంటూ దేవినేని ఉమా ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చదవండి: (ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!) -
దేవినేని ఉమకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న బొమ్మసాని
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావు మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దేవినేని లేకుండానే బొమ్మసాని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే దేవినేని నాయకత్వాన్ని బొమ్మసాని, అతని వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదిలా ఉంటే, మైలవరంలో లోకల్ నినాదం కూడా రోజురోజుకి బలపడుతోంది. రాబోయే ఎన్నికల్లో ఈసారి స్థానికుడే టికెట్ ఇవ్వాలంటూ బొమ్మసాని వర్గం డిమాండ్ చేస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఆత్మీయ సమావేశంలో బొమ్మసాని నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు ఆ వర్గం ప్రకటించింది. దీంతో మైలవరం టీడీపీలో కలవరం మొదలైంది. చదవండి: (సొంత జిల్లాలో పరువు కోసం పాకులాడుతున్న బాబు.. కంటి మీద కునుకు కరువే!) -
దేవినేని వారి పబ్లిసిటీ స్టంట్స్.. అరెరే.. డ్రామా చేస్తే నమ్మాలి కదా..!
చంద్రబాబు హయాంలో ఆయన రేంజే వేరు. బాస్ తర్వాతే తానే అన్నట్లుగా బిల్డప్‌లు ఇచ్చేవారు. శిలాఫలకాలు, శంకుస్థాపనలు మినహా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. గత ఎన్నికల్లో జనం తుక్కు కింద ఓడించేశారు. ఇక కేడర్, ప్రజలు పట్టించుకోవడం మానేశారు. అయితే ఇప్పుడా నేత సానుభూతి రాజకీయాలకు తెరదీస్తున్నాడు. ప్రజల కోసం తానేదో చేస్తున్నట్లు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. మైలవరం గుర్తుకొచ్చింది.! దేవినేని ఉమామహేశ్వరరావు.. తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకుల్లో తానే పెద్ద సూపర్ స్టార్ అని ఓవర్ బిల్డప్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. తనంత గొప్పోడు లేడంటూ.. ప్రజలకు దూరంగా ఉంచుతూ.. కనీసం నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోకుండా లెవెల్ చూపించే ఉమకు గత ఎన్నికల్లో ప్రజలు ఆయన అసలు స్థానం ఏంటో చూపించారు. ఓడాక ఆయన్ను కేడర్ పట్టించుకోవడంలేదు. ప్రజలు అసలే మర్చిపోయారు. గతంలో పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో తళుక్కున మెరిసి మాయమైపోయే దేవినేని ఇప్పుడు మైలవరంలో అసలు కనిపించడమే మానేశారట. మరోవైపు ఆయన వ్యతిరేక వర్గం వేరు కుంపటి పెట్టడంతో ఇన్నాళ్లు మైలవరం నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యాడట దేవినేని. ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు మళ్లీ మైలవరం గుర్తుకొచ్చింది. డ్రామా@టిడ్కో పార్టీలో, ప్రజల్లో తన మైలేజ్ పడిపోతుందని భావించిన దేవినేని ఉమ.. ఇప్పుడు కొత్తగా ప్రజాసమస్యలన్నీ తన భుజాన వేసుకున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారట. తాజాగా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి కాలనీలో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాల వద్ద నిరసన దీక్ష పేరుతో ఓ కొత్త డ్రామాకు తెరతీశారు దేవినేని ఉమ. నివాసయోగ్యమైన గృహాలను పేదలకు కేటాయించినందుకుగాను నిరసన తెలియచేస్తున్నా.. జగన్ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తా అంటూ వీరావేశంలో స్పీచ్‌లు ఇచ్చారట. అయితే క్షేత్రస్థాయిలో ఉమాతో పాటు నిరసనలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని ముక్కున వేలేసుకోవాల్సి వచ్చిందట. ఇల్లు ఇస్తే ఎంత ఇస్తావు..? గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2018లో జక్కంపూడి కాలనీలో కొన్ని ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో టిడ్కో ఇల్లు కావాలంటే 25 వేలు కట్టాలంటూ లబ్ధిదారుల నుంచి వీఎంసీ ద్వారా రూ.15కోట్ల 90 లక్షలు వసూలు చేశారు. ఇవి కాకుండా అనధికారికంగా టీడీపీ నేతలు అందిన కాడికి లబ్ధిదారుల నుంచి దోచుకున్నారు. ప్రభుత్వం దిగిపోయే సరికి రూ.90 కోట్లు ఖర్చుచేసి 20 శాతం మాత్రమే ఇళ్లు పూర్తి చేసి.. రూ.69 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన పనులతో కలిపి ప్రస్తుతం 67 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. గతంలో టీడీపీ ఎగ్గొట్టిన 21 కోట్లతో పాటు ఇప్పటి వరకూ జరిగిన పనులకు రూ.270 కోట్లు వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. ఇక టీడీపీ హయాంలో లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులో 10 కోట్లను ఇప్పటికే వీఎంసీకీ తిరిగి ప్రభుత్వం చెల్లించేసింది. మిగిలిన రూ. 5కోట్ల 90 లక్షలు త్వరలో చెల్లించనుంది. అలాగే జక్కంపూడి లే అవుట్ లో 423 కోట్లతో హౌసింగ్, 139 కోట్లతో మౌలిక సదుపాయాలు మొత్తం 570 కోట్ల రూపాయలతో మార్చి నాటికి నిర్మాణాలన్నింటినీ పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని సీఎం జగన్ ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉంది. ఈ వాస్తవాలన్నింటినీ పక్కన పెట్టేసి పబ్లిసిటీ కోసం దేవినేని ఉమ టిడ్కో ఇళ్ల వద్ద నిరసన దీక్ష పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు . డ్రామా చేస్తే నమ్మాలి కదా..! తమ ప్రభుత్వంలోనే ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయిందని.. ఈ ప్రభుత్వం మూడేళ్లైనా ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని బురద జల్లే ప్రయత్నం చేశారు పచ్చ పార్టీ నేత దేవినేని ఉమ. ప్రభుత్వం చెబుతున్నట్లుగా అక్కడ పనులు జరుగుతుంటే.. ఇళ్లు పూర్తైనా ఇవ్వడం లేదంటూ ఈయన నిరసన చేపట్టడం వింతగా ఉందంటూ నిరసనలో పాల్గొనేందుకు వెళ్ళినవారు బాహాటంగానే చర్చించుకున్నారట. తన ఉనికిని కాపాడుకునేందుకు దేవినేని చేస్తున్న ప్రయత్నాలు చూసి సైకిల్ పార్టీ శ్రేణులు తల బాదుకుంటున్నారట. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
రామోజీ ఆరాటమే తప్ప రాజకీయంగా చంద్రబాబుకు కష్టమే!
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, దేవినేని ఉమా తొందరపాటు చర్యల వలనే డయాఫ్రంవాల్ దెబ్బతిన్నదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రం వాల్ డ్యామేజీ వల్లే పోలవరం పనులు కొంచెం నెమ్మదయ్యాయని అన్నారు. వారి దుందుడుకు చర్యల వలనే ఇది దెబ్బతిన్నదని కేంద్ర నిపుణులు సైతం అంగీకరిస్తున్నారన్నారు. ఈ మేరకు మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఆగస్టులో ఇచ్చే నీటిని ఈసారి ముందుగానే ఇవ్వబోతున్నాం. జూన్‌లోనే గోదావరి, కృష్ణా బేసిన్లో నీటిని విడుదల చేస్తున్నాం. ఖరీఫ్‌కి రైతులు సిద్దంగా ఉండాలి. విత్తనాలు, ఎరువులను కూడా అందుబాటులో ఉంచుతున్నాం. కాలువలకు జరుగుతున్న మరమ్మత్తు పనులు రేపటితో పూర్తవుతాయి. వ్యవసాయానికి గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూడా ఇలా నీటిని విడుదల చేయలేదు' అని అంబటి రాంబాబు అన్నారు. చదవండి: (నాడు తండ్రి.. నేడు తనయుడు: దశాబ్దంన్నర తరువాత అదే ప్రదేశంలో..) పచ్చ మీడియా విషపురాతలు 'ప్రతిరోజూ ఈనాడు రామోజీరావు ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. ఎవరినో అధికారంలోకి తేవటానికి పచ్చమీడియా ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 250కి పైగా పథకాలు పని చేయటం లేదని పచ్చ పత్రిక రాసింది. ఎన్నికలకు ముందు విషం కక్కితే జనం నమ్ముతారని వారి ఆలోచన. చంద్రబాబు ఏనాడైనా రైతులకు మేలు చేశారా?. ఒంటిమిట్టలో ఎత్తిపోతల పథకం పని చేస్తున్నా పనిచేయటం లేదని రాశారు. రామోజీ ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతకడు. శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల దగ్గర టీడీపీ వారు చాలా కాలంగా రిపేర్లు చేయలేదు. మన ప్రభుత్వం వచ్చాక మరమ్మత్తులు చేస్తున్నాం. చంద్రబాబు ముందస్తు ఎన్నికలంటూ కలలు కంటున్నారు. కానీ అవి నెరవేరవు. మేము ప్రజల దగ్గరకు వెళ్తుంటే వారిలో ఆనందం కనిపిస్తోంది' అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చదవండి: (Hyderabad: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్) -
‘టీడీపీ నిజ నిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. సిద్ధమేనా’
సాక్షి, తాడేపల్లి: ‘దళితులపై దాడి చేసిన దేవినేని ఉమ ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్లారు.. దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర ఉంది’ అని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు మరోసారి దళిత ద్రోహి అని నిరూపించుకున్నారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్లారు. దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర కూడా ఉంది’’ అని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘దేవినేని అబద్ధాలను నిజం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే చంద్రబాబు గొల్లపల్లి వచ్చారు. 2004లో వసంత నాగేశ్వరరావు కారును దగ్ధం చేసింది గుర్తులేదా. 2016 డిసెంబర్ 4న 143 సర్వే నంబర్లో దేవినేని మైనింగ్ ప్రారంభించారు.. అవి అసలు రెవిన్యూ భూములా.. ఫారెస్ట్ భూములా అనే విషయం తేల్చాలి. 2018లో దేవినేని ఉమా క్రషర్ ప్రారంభించారో లేదో చెప్పాలి. దేవినేని ఉమ తప్పు చేశాడన్న విషయం చంద్రబాబుకు తెలుసు. దేవినేని నీచ పనులకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు. అబద్ధాలను నిజం చేసేందుకే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. దేవినేని ఉమను సమర్ధిస్తున్న చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. మరో ఎమ్మెల్యే జోగి రమేష్ ‘‘చంద్రబాబు బుద్ధి కొంచెం కూడా మారలేదు. దళితులపై దాడి చేసిన దేవినేని ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్తారు. చంద్రబాబుకు కొంచెం కూడా అగ్రవర్ణ అహంకారం తగ్గలేదు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. మీరు సిద్ధమేనా. మైనింగ్‌లో దోచుకుంది ఎవరో మొత్తం తేలుస్తాం’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. ‘‘పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టారు. ఎన్నికల్లో ఓడించారనే కక్షతోనే దళితులపై దాడులు చేస్తున్నారు. దళితులపై దాడి చేసిన వారిని పరామర్శించడమేంటి’’ అని ప్రశ్నించారు. -
దేవినేని ఉమా అరెస్టు.. 14 రోజుల రిమాండ్
సాక్షి, అమరావతి బ్యూరో/ జి.కొండూరు/ మైల వరం/హనుమాన్ జంక్షన్: ప్రశాంతంగా ఉన్న కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. తన అనుచరులను, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గడ్డమణుగు గ్రామస్తులపై దాడి చేయించిన ఉమాకు మైలవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తన హయాంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి దేవినేని ఉమా కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. వాటిని ఆధారాలతో సహా ఎమ్మెల్యే తిప్పికొట్టడంతో ఉమా నియోజకవర్గంలో అల్లర్లకు కుట్ర పన్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ హంగామా మొదలుపెట్టారు. వాస్తవానికి అక్కడ తవ్వకాలకు అనుమతులను టీడీపీ హయాంలో దేవినేని ఉమానే ఇప్పించాడు. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న ఉద్దేశంతో దేవినేని వ్యూహాత్మకంగా మంగళవారం కొండపల్లిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొండపల్లి రిజర్వ్ ఫారెస్టుకు వెళ్లి.. వైఎస్సార్సీపీ నేతల ప్రోద్బలంతోనే తవ్వకాలు జరుగుతున్నాయంటూ ముందే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఎల్లో మీడియాలో ఊదరగొట్టించారు. ఈ విషయం తెలుసుకున్న జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామస్తులు మంగళవారం రాత్రి దేవినేని ఉమాను అడ్డుకున్నారు. ‘నువ్వు అధికారంలో ఉండగా చేసిన అడ్డగోలు పనులను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు అంటగడుతున్నావ్.. దీనికి సంజాయిషీ చెప్పాలి’ అంటూ ఉమాను నిలదీశారు. పోలీసులు వెంటనే స్పందించి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులతో పాటు వైఎస్సార్సీపీ నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దేవినేని ఉమా కూడా తన అనుచరగణంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. 4 గంటలకు పైగా పోలీస్‌స్టేషన్ వద్ద కారులోనే ఉన్న ఉమా తన అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో వారంతా కలిసి పాలడుగు దుర్గాప్రసాద్‌తో పాటు ఆయన డ్రైవర్ సురేష్ తదితరులపై దాడి చేశారు. పోలీస్‌స్టేషన్ ముందే దుర్గాప్రసాద్ కారును ధ్వంసం చేశారు. దళితుడైన సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి అదుపు తప్పడంతో దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేసి నందివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అశాంతి రేపడానికి దేవినేని ఉమా, టీడీపీ నాయకులు ఎత్తుగడ వేశారని గడ్డమణుగు గ్రామస్తులు మండిపడ్డారు. వర్చువల్‌గా కోర్టుకు హాజరు.. మైలవరం కోర్టుకు ఉమాను తీసుకొస్తారన్న సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్ద ఎత్తున కోర్టుకు చేరుకొని హల్చల్ చేశారు. దీంతో పోలీసులు దేవినేని ఉమాను నందివాడ నుంచి హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచే జూమ్ యాప్ ద్వారా వర్చువల్‌గా మైలవరం న్యాయమూర్తి షేక్ షెరీన్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం దేవినేని ఉమాకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు నిందితులుగా ఉన్న తెలుగు యువత నాయకుడు లీలా ప్రసాద్, డ్రైవర్ ప్రసాద్‌ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. -
జి.కొండూరు పీఎస్‌లో దేవినేని ఉమాపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై జి.కొండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుచరులతో కలిసి తనపై దాడి చేశారని దాసరి సురేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషిస్తూ కర్రలు, రాడ్లు, రాళ్లతో తనను గాయపరచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవినేని ఉమా, ఆయన అనుచరులు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని సురేశ్ తెలిపారు. ఈ క్రమంలో దేవినేని ఉమాపై 188, 147, 148, 341, 323, 324, 120బి, 109, 307, 427,.. 506, 353, 332 రెడ్‌విత్ 149 ఐపీసీ, 3ఈడీఏ, 3(1)R, 3(1)S,.. 3(2)V, ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దేవినేని ఉమాతో పాటు మొత్తం 18 మందిపై కేసు పెట్టారు. కాగా జి.కొండూరుకి చెందిన వైఎస్సార్సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌పై టీడీపీ నేతలు దాడి చేసిన విషయం విదితమే. అదే విధంగా దళిత కార్యకర్త సురేశ్‌పై కూడా దేవినేని ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దాడులకు ప్రేరేపించిన దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
దేవినేని ఉమాపై కొడాలి నాని ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అరాచకాలతో ప్రజలు విసిగిపోయి తిరగబడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. దళితులు, పోలీసులను దేవినేని ఉమా ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడారని.. ఉద్దేశపూర్వంగానే వారిని రెచ్చగొట్టారని తెలిపారు. అందుకే గ్రామస్తులు తిరగబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయాలేమీ ఎల్లో మీడియాకు పట్టవని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తోందని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జి.కొండూరు ఘటన గురించి మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘ఉమా అనుచరులే వైఎస్సార్ సీపీ నేత కారు అద్దాలు పగలగొట్టారు. టీడీపీ నేతలు లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టుగా మాట్లాడుతున్నారు. మా కార్యకర్తలపై దాడి చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్‌పై దేవినేని ఉమా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి, వెన్నుపోటుదారుడు చంద్రబాబు’’ అని మండిపడ్డారు. పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘చంద్రబాబు గోబెల్స్ అయితే అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా. అక్కడ జరిగే మైనింగ్ క్వారీలు నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి. దీంట్లో ఉమా హయాంలో అక్కడ ఎంత మైనింగ్ జరిగిందో మార్క్ చేస్తున్నాం. అత్యంత ఎక్కువ మైనింగ్ ఆయన హయాంలోనే జరిగింది. అక్కడి కాంట్రాక్టర్లును డబ్బులకోసం బెదిరించాడు. ఆ తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ అని బెదిరించి ఆపించాడు. ఆ తర్వాత మళ్లీ దాన్ని రెవెన్యూ ల్యాండ్‌గా మార్పించింది ఉమానే. ఇప్పుడు అధికారం పోగానే మా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి కంకర దొరక్కూడదనే ఆయన రభస చేశాడు. ఇటువంటి పిచ్చి పనులు చేస్తే ఉమానే కాదు చంద్రబాబుని కూడా పోలీసు శాఖ వదలదు’’ అని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. -
దేవినేని ఉమా పోలీసులను ఇబ్బంది పెట్టారు: డీఎస్పీ
సాక్షి, కృష్ణా జిల్లా/జి. కొండూరు: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అరెస్టు నేపథ్యంలో డీఎస్పీ కీలక వివరాలు వెల్లడించారు. ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా సుమారు 4 గంటల పాటు దేవినేని అడిగామని.. అయినా కారులో నుంచి దిగకుండా ఆయన పోలీసులను ఇబ్బంది పెట్టారన్నారు. ‘‘ఫిర్యాదు ఇవ్వకపోగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవరించారు. తన వర్గాన్ని రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రోత్సహించారు. పోలీస్ స్టేషన్‌కు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు రావచ్చు. ఇరువర్గాలపైనా కేసులు నమోదు చేశాం. ఓ వర్గానికి చెందిన 18 మందిపై, మరో వర్గానికి చెందిన ఆరుగురిపై కేసులు నమోదు చేశాం. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తాం’’ అని డీఎస్పీ తెలిపారు. కాగా జి.కొండూరుకి చెందిన వైఎస్సార్సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌పై టీడీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దళిత కార్యకర్త సురేష్‌పై కూడా దేవినేని ఉమా అనుచరులు కూడా రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దాడులకు ప్రేరేపించిన దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రెండో రోజూ.. ఉమ దాటవేత ధోరణి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేసి.. ఆయన ప్రతిష్టను దెబ్బతీసి, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన కేసులో నిందితుడైన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండో రోజు విచారణలోనూ దాటవేత ధోరణే అవలంభించారు. మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఉదయం 11గంటలకు వచ్చిన ఉమను రాత్రి 8 గంటల వరకు విచారించారు. సీఎం వైఎస్ జగన్ వీడియో మార్ఫింగ్‌పై కీలక సమాచారం రాబట్టేందుకు సీఐడీ ప్రయత్నం చేసింది. తొలి రోజు విచారణలో దాటవేసిన సమాధానాలను రాబట్టేందుకు అవే ప్రశ్నలను రెండో రోజు కూడా సీఐడీ అధికారులు సంధించారు. అయినప్పటికీ తన ఫోన్‌కు సంబంధించిన సమాచారం, మార్ఫింగ్ వీడియో ప్రదర్శించిన ట్యాబ్, తగిన ఆధారాలపై ఉమ స్పష్టత ఇవ్వలేదని సమాచారం. దీంతో ఈ నెల 4వ తేదీన మరోసారి విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు ఉమకు నోటీసు ఇచ్చారు. అధికారంలోకి రాగానే పోలీసుల సంగతి తేలుస్తాం..ఉమ టీడీపీ అధికారంలోకి రాగానే పోలీసుల సంగతి తేలుస్తామని, తమను ఇబ్బంది పెట్టిన పోలీసులను గుర్తుపెట్టుకుని మరీ ఛత్తీస్‌గఢ్, ఒడిశా బోర్డర్‌కు పంపిస్తామని మాజీ మంత్రి ఉమ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. సీఐడీ విచారణకు ముందు, అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమ పోలీసులను టార్గెట్ చేసి హెచ్చరికలు చేశారు. కేసులకు భయపడేది లేదని, రాజమండ్రి జైల్లో ఉండడానికైనా తాను సిద్ధమన్నారు. -
వల్లభనేని సవాల్.. దేవినేని ఉమ హైడ్రామా
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ‘నిరసన దీక్ష’ పేరుతో డ్రామా రక్తి కట్టించారు. గొల్లపూడిలో సోమవారం 3648 ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా.. దేవినేని ఉమకు వైఎస్సార్ సీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ బహిరంగ చర్చకు రావాల్సిందిగా సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం గొల్లపూడి సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండగా.. దేవినేని మాత్రం ‘నిరసన దీక్ష’ పేరుతో డ్రామా ప్రారంభించారు. (చదవండి : నాడు ఎన్టీఆర్ ఉసురుతీసి ఇప్పుడు దండలేస్తావా!) అంతేకాక బహిరంగ చర్చకు హాజరు కాకుండా ఉండేందుకు తన దీక్ష గురించి ముందే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నారనే కారణంతో పోలీసులు దేవినేనిని అరెస్ట్ చేశారు. చర్చకు హాజరుకాకుండా ఉండేందుకు పక్కా ప్లాన్‌తోనే దేవినేని నిరసన దీక్ష ప్రారంభించి.. అరెస్ట్ అయ్యేలా వ్యూహం పన్నారు. చర్చ జరగకుండా తప్పించుకున్నారు. -
చంద్రబాబు ప్రవాసనేతలా మారారు
-
దేవినేని ఉమా ఓ పిచ్చోడు
సాక్షి, విజయవాడ: దేవినేని ఉమా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనో పిచ్చోడు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి మండి పడ్డారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరుతుండటం పట్ల టీడీపీ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్థసారథి ఈ విమర్శలపై స్పందించారు. బాబు నివాసం వరదకు మునిగి పోతుందని తాము ఎప్పుడో హెచ్చరించామని.. నేడు అది నిజమయ్యిందని పార్థసారథి తెలిపారు. దీన్ని కప్పిపుచ్చడానికే తెలుగు దేశం నేతలు డ్రామాలాడుతున్నారని పార్థసారథి విమర్శించారు. చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు వస్తుందనే విషయం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే టీడీపీ నాయకులు డ్రోన్ పేరుతో కొత్త రాజకీయాలు చేస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు. తన ఇంట్లోకి నీరు వస్తుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజలకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాబు.. హైదరాబాద్‌లో దాక్కున్నాడు.. ఇదేనా ఆయన 40 ఏళ్ల అనుభవం అంటూ పార్థసారథి ఎగతాళి చేశారు. -
నేనెవరికి భయపడను : కేశినేని నాని
సాక్షి, విజయవాడ : భయం తన రక్తంలో లేదని, ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) స్పష్టం చేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, తిరుగుబావుట ఎగరవేసిన నాని.. కొద్ది రోజులుగా సోషల్‌మీడియా వేదికగా వరుస పోస్ట్‌లతో తమ పార్టీనేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. బుధవారం తన అధికారిక ఫేస్బుక్ పేజీలో ‘నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను.’ అనే సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమను ఉద్దేశించి పెట్టినదేనని టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఇక దేవినేని ఉమ ఒంటెద్దు పోకడలకు పార్టీ అధినాయకత్వం అడ్డు చెప్పలేదని ఐదేళ్ల పాటు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కేశినేని నాని ఇప్పుడు అవకాశం రావడంతో నిశబ్ద పోరాటానికి తెరలేపారు. విజయవాడ ఎంపీగా రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు. చంద్రబాబు ఇచ్చిన లోక్‌సభ విప్ పదవిని తిరస్కరించి తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో నాని టీడీపీనీ వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: కేశినేని నాని తిరుగుబాటు! తేలని కేశినేని నాని పంచాయితీ -
కృష్ణమ్మ గర్భంలో పెద్దల పాగా!
-
కృష్ణమ్మ గర్భంలో పెద్దల పాగా!
తుళ్లూరు: ఒక ప్లాన్ విఫలమైతే మరొకటి..! పథకం ఏదైనా అంతిమ లక్ష్యం అందినకాడికి కాజేయడమే. రాజధాని ప్రాంతంలో టీడీపీ పెద్దల అనుచరుడైన ఓ బడాబాబు గతేడాది ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెంలో రూ.500 కోట్ల విలువ చేసే లంక భూములను ఆక్రమించుకునేందుకు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టడంతో కొన్నాళ్లు వెనక్కి తగ్గినా ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. కృష్ణా నదిలో ఆక్రమించుకున్న ప్రాంతంలో కృత్రిమ ఇసుక దిబ్బలను సృష్టించి అందులో ఓ దీవి, రిసార్టులు నిర్మించి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ముఖ్యమంత్రి మద్దతుతోనే ఆక్రమణలు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామం రెవెన్యూ పరిధి 1/ఏ సర్వే నంబరుతోపాటు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గుంటుపల్లి పరిధిలో 395 సర్వే నంబరులో నది మధ్యలో ఉన్న 70 ఎకరాల భూమిని అధికార పార్టీ నేతలు దర్జాగా ఆక్రమించారు. కృష్ణా పరీవాహక ప్రాంతమైన తాళ్లాయిపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తుమ్మలపాలెం, గుంటుపల్లి మధ్య కృష్ణా నదిలో 2017లోనే కబ్జాదారులు కంచె వేశారు. ఈ ప్రాంతం రాజధాని స్టార్టప్ ఏరియాకు సమీపంలో ఉండడంతో రానున్న రోజుల్లో దీని విలువ ఆకాశాన్నంటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎకరా భూమి రూ.2 కోట్లు వరకు ఉండగా భవిష్యత్తులో సుమారు రూ.25 కోట్లు పలుకుతుందని అంచనా. ఇందులో రిసార్టులు, మల్టీఫ్లెక్స్‌లు, పబ్బులు, క్లబ్బులు నిర్మించి సొమ్ము చేసుకోవాలనేది టీడీపీ నేతల లక్ష్యం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మద్దతుతోనే ఈ ఆక్రమణలు జరిగినట్టు తెలుస్తోంది. సుమారు 40 అడుగుల లోతు ఉన్న నదిలో ఇసుకను నింపి దిబ్బగా సృష్టించడానికి రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆక్రమణ వ్యూహం అమలు చేయడానికి గజ ఈతగాళ్లను రంగంలోకి దించి ఇనుముతో తయారు చేసిన రోప్‌ను నీటిలో వదిలారు. రోప్‌లకు ప్లాస్టిక్‌తో తయారు చేసిన డబ్బాలను అమర్చి ఆ ప్రాంతం తమదేనంటూ జెండాలు పాతారు. మత్స్యకారులను అటువైపు వేటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పైపులైన్లతో ఆక్రమిత ప్రాంతంలోకి ఇసుక తరలింపు.. ఆక్రమించుకున్న 70 ఎకరాల్లో దాదాపు 40 అడుగుల లోతులో ఉన్న నదీ ప్రాంతాన్ని ఇసుక దిబ్బగా మార్చడానికి టీడీపీ నేతలు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. పెద్దపెద్ద డ్రెడ్జర్ల ద్వారా పైపు లైన్లు ఏర్పాటు చేసి ఇసుక నేరుగా ఆక్రమిత నదీ ప్రాంతంలోకి చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆక్రమిత ప్రాంతంలోకి పైపుల ద్వారా చేరవేసిన ఇసుకను ప్రొక్లెయిన్ల ద్వారా సరి చేస్తున్నారు. అక్కడ నీటిని నదిలోకి మళ్లిస్తున్నారు. 40 అడుగుల లోతులో ఉన్న నదీ ప్రవాహాన్ని తట్టుకునేలా కృత్రిమ ఇసుక దిబ్బలను సృష్టించారంటే కృష్ణమ్మ గర్భంలో పాగా వేయడానికి ఎంత బరితెగించారో ఊహించవచ్చు. ఈ ప్రాంతం సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నివాసానికి, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా నివాసానికి మధ్యలో ఉండడం గమనార్హం. నదీ ప్రవాహాన్ని మళ్లించడం వల్ల వరదలు వస్తే ఒత్తిడి పెరిగి కరకట్టలు తెగి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమిత నదీ ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, తుళ్లూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. అధికారులు ఏం చేస్తున్నట్టు? టీడీపీకి చెందిన దొంగల ముఠా ఏకంగా కృష్ణా నదినే ఆక్రమించేస్తే అధికారులు ఏం చేస్తున్నారు? రెండేళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తోందంటే ఇదంతా వారి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా కూడా విధించింది. నదీ ప్రవాహాన్ని మళ్లించడం, పూడ్చడం, డ్రెడ్జింగ్ చట్ట రీత్యా నేరం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. – ఉండవల్లి శ్రీదేవి (వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి) సుమోటోగా విచారణ చేపట్టాలి... భూములు, కొండలను కబ్జా చేసిన టీడీపీ నేతలు నదులను కూడా అక్రమించేశారు. రాజధాని పేరుతో బంగారు పంటలు పండే భూములను ఇప్పటికే నాశనం చేశారు. ఇప్పుడు రిసార్టులు, ఐలాండ్ల కోసమని నదినే పూడ్చేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టారంటే దీని వెనుక సీఎం చంద్రబాబు హస్తం కచ్చితంగా ఉంటుంది. దీనిపై సుమోటోగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. మా పార్టీ తరపున కోర్టులో కూడా పోరాడతాం. – నందిగం సురేష్ (వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి) -
మరో 4 వారాలు ఓపిక పట్టు ఉమా!
సాక్షి, హైదరాబాద్ : ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ట్విటర్ వేదికగా దేవినేని ఉమ, చంద్రబాబునాయుడు, నారాలోకేష్, పచ్చమీడియాపై సాయిరెడ్డి ధ్వజమెత్తారు. ‘మరో 4 వారాలు ఓపిక పట్టు ఉమా. ఇరిగేషన్ శాఖలో ఐదేళ్లుగా నువ్వు సాగించిన అరాచకం అంతా బయటకొస్తుంది. అధికారులు, బాధితులైన కాంట్రాక్లర్లు నీ దోపిడీ వ్యవహారాల ఫైళ్లను స్వచ్ఛందంగా తెచ్చిస్తున్నారు. పోలవరం, హంద్రీ-నీవాల్లో రెండేళ్లలోనే వందల రెట్లు అంచనాలు పెంచింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు దావోస్ వెళ్లిన మధ్యప్రదేశ్ సీఎం, విడిది కోసం రూ.1.8 కోట్లు ఖర్చు పెట్టారని పచ్చ మీడియా గగ్గోలు పెడుతోందని, మరి ఆహ్వానం లేకున్నా బాబు, ఆయన కుమారుడు 4 సార్లు ప్రత్యేక విమానాల్లో వెళ్లి ప్రజలపై రూ.100 కోట్ల భారం మోపిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించరని విజయసాయిరెడ్డి నిలదీశారు. -
నయానో.. భయానో ఇచ్చేయండి
సాక్షి, విజయవాడ : ఎన్నికలకు మరో మూడు రోజులే గడువు ఉండటంతో అభ్యర్థులు వేగం పెంచారు. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం ప్రతిపక్షం ఆత్మ స్థైర్యం దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోంది. పార్టీ నాయకులను, కార్యకర్తలను నయానో..భయానో లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు బెదిరింపులకు పాల్పడుతోంది. ఎంతకైనా తెగిస్తూ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంతకైనా తెగించేందుకు టీడీపీ నేతలు, శ్రేణులు సిద్ధమయ్యారు. తిరువూరులో మంత్రి జవహర్ గెలుపు కోసం బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో అక్కపాలెం అనే గ్రామంలో సర్పంచ్ భర్త నాగేశ్వరరావును టీడీపీ గూండాలు హత్య చేశారు. ఇప్పుడు తమకు వ్యతిరేకంగా పనిచేస్తే నాగేశ్వరరావు వద్దకు పంపుతామంటూ హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలోని నాయకులు ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రక్షణ నిధి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన తాను అండగా ఉంటానని భరోసా ఇవ్వడంతో పార్టీ శ్రేణులు పనిచేయడం ప్రారంభించాయి. జగ్గయ్యపేటలో ఒక బీఎల్ఓను టీడీపీ అభ్యర్థులు బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఆ బీఎల్ఓకు అండగా నిలబడ్డారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నించగా.. తమకు ఏమీ జరగలేదని బీఎల్ఓ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. విజయవాడలో ఒక వైద్యుడిపై టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు అందరి ముందు వీరంగం వేసిన విషయం అందరికి తెలిసిందే.. అసభ్య పదజాలంతో ఆయన్ను దూషించడంతో ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఇది పెద్ద వివాదం కావడంతో చివరకు ఆ వైద్యుడిని తన ఇంటికి పిలిపించుకుని బొండా సెటిల్ చేసుకున్నారు. ఇక గుడివాడలో టీడీపీ అభ్యర్థి, ఆయన అనుచరులను చూస్తుంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వారిలో ఉన్న వర్గ తగాదాలకే ఒక యువకుడు అనుమానస్పదంగా మృతి చెందాడు. టీడీపీ నాయకులు బెదిరింపులకు భయపడవద్దని, వారిని ఎదుర్కొవాల్సి వస్తే తానే ముందుకు ప్రాణాలను ఫణంగా పెడతానని అక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోడాలి శ్రీవెంకటేశ్వరరావు ప్రకటించారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గన్నవరంలోనూ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమాత్రం లేదు. గ్రామాలను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు టీడీపీ అభ్యర్థి ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే ప్రతిపక్ష కార్యకర్తలను బంధించి పెట్టుకుని ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది మైలవరంలో గెలుపుకోసం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు ఆయన సభను భగ్నం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఆయన అనుచరులు అంగబలం, ఆర్థికబలంతో గ్రామాల్లో ప్రతిపక్ష కార్యకర్తలను లొంగదీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను వైఎస్సార్‌కాంగ్రెస్ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అడుగడుగునా అడ్డుకుంటున్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీ బెదిరింపులు.. గత నాలుగున్నర ఏళ్లుగా గ్రామాల్లో పెత్తనం సాగించిన జన్మభూమి కమిటీలు ఇప్పుడు ఏ మాత్రం తగ్గడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినా ఓటు వేసినా వారి తెల్లకార్డులు, పింఛన్లు రద్దు చేయిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎన్నికలు అయిన తర్వాత నెల రోజుల వరకు కౌంటింగ్ జరగదని ఈ లోగా తమ ప్రభుత్వం పింఛన్లు, కార్డులను రద్దు చేయిస్తామంటూ మైలవరం, నందిగామ, అవనిగడ్డ నియోజకవర్గ గ్రామాల్లో జోరుగా బెదిరింపులకు దిగుతున్నారు. గత ఐదేళ్లుగా వారి పెత్తనం చూసిన గ్రామస్తులు ఇప్పుడు వారికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ఒకవైపు ఎన్నికల ప్రచారం చేసుకుంటూ మరోకవైపు తమ పార్టీ శ్రేణుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
తమ్ముళ్లు కాదు తోడేళ్లు..
సాక్షి, మైలవరం : అధికారం అండతో నాలుగున్నరేళ్లలో అందినకాడికి దండుకున్నారు. కాదేదీ అవినీతికి అనర్హం అన్న చందంగా సాగిపోయాయి టీడీపీ నాయకుల లీలలు. ఇసుక రేవుల నుంచి చెరువుల్లో మట్టిదాకా ప్రతి చోట అవినీతే. నీరు చెట్టు పనుల్లో రూ.కోట్లు కొల్లగొట్టినా.. అభివృద్ధి పనులను తూతూ మంత్రంగా చేపట్టి రూ.కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టినా అడిగే నాథుడే లేదు. దేవినేని, అతని అనుచరులు కలిసి నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్లు దోచుకున్నారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు అవినీతి అక్రమాలు ఆయన పర్యవేక్షించిన శాఖ మాదిరిగానే భారీస్థాయిలో ఉండటం విశేషం. నియోజకవర్గంలో సహజ వనరులైన మట్టి, చెట్టు, ఇసుక, గ్రావెల్ ఇలా దేన్నీ వదలకుండా కోట్లు దండుకున్నారు. ఇక ఎత్తిపోతల పథకాల పేరుతో దేవినేనితో పాటు అతని అనుచరులు దోపిడీ అంతా ఇంతా కాదు. ఎందుకూ పనికిరాని వాగులు, వంకలపై 22 ఎత్తిపోతల పథకాలను నిర్మించి ప్రజాధనాన్ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా మంత్రిగారి ఆజ్ఞలేనిదే పనులు మొదలు కాదంటే ఆయన ప్రభావం ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఎత్తిపోతల పథకాల్లో రూ.10కోట్ల అవినీతి మైలవరం నియోజకవర్గంలో రైతులకు సాగు నీరు అందించడమే లక్ష్యం అంటూ 22 ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఎత్తిపోతల పథకాలను దశాబ్దాలుగా నీరు ప్రవహించని ఎన్ఎస్పీ కాలువలు, బుడమేరు, వాగులపై నిర్మించారు. వీటి నిర్మాణాలకు గానూ రూ.22.57కోట్లను కేటాయించారు. నాసిరం పైపులు, తక్కు ఖరీదు మోటార్లు, షెడ్ల నిర్మాణం తదితర పనుల్లో రూ.10కోట్ల మేర అవినతీకి పాల్పడినట్లు తెలుస్తుంది. నీరు–చెట్టులో కోట్లు పోగేశారు నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద రూ.118కోట్ల పనులు చేపట్టారు. ఈ పథకం కింద చెరువుల్లో పూడికతీత, కాలువల మరమత్తులు తదితర పనులన్నీ చేశారు. చెరువుల్లో పూడికతీసిన మట్టిని రైతులకు ఉచితంగా అందించాల్సి ఉండగా ఇటుక బట్టీలకు, రియల్ వెంచర్లకు తరలించి రూ.కోట్లు వెనకేసుకున్నారు. మొత్తం 48 చెరువులలో పనులు జరగ్గా మట్టిని విక్రయించి రూ.70కోట్ల వరకు పోగేసినట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. మైలవరం మండలంలోని వెల్వడం సమీపంలో ఉన్న మోదుగుల చెరువులో దేవినేని అనుచరుడు కోమటి సుధాకర్ గతేడాది నీరు–చెట్టు పనులు చేపట్టారు. అయితే చెరువులో 32వేల క్యాబిక్ మీటర్లు మాత్రమే తవ్వడానికి అనుమతులు ఉండగా 1,42,875 క్యాబిక్ మీటర్ల మట్టిని తరలించినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజుకు రూ.2 లక్షల చొప్పున రూ.5కోట్ల విలువైన మట్టిని చుట్టుపక్కల గ్రామాల్లోని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. అదే విధంగా జి.కొండూరు మండలంలోని వెల్లటూరు పడమర చెరువు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు నుంచి 2017–18 సంవత్సరంలో 2లక్షల క్యాబిక్మీటర్ల మట్టిని తవ్వి తరలించారు. ఒక్కొక్క ట్రక్కు మట్టిని రూ.400 నుంచి 600కు విక్రయించారు. ఈ విధంగా రెండేళ్లలో రూ.12కోట్ల మేర గడించారు. అదేవిధంగా గొల్లపూడి మేజర్ పంచాయతీ పరిధిలో నీరు–చెట్టు కింద రూ.1.80కోట్ల మేర పనులు జరిగాయి. ఇక్కడ కూడా మట్టిని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. బుడమేరులో అక్రమాలెన్నో.. మైలవరం నియోజకవర్గంలో చండ్రగూడెం నుంచి వెలగలేరు వరకు విస్తరించి ఉన్న బుడమేరు ఆధునికీకరణ పనుల్లో దేవినేని అనుచరులు చేతివాటం చూపించారు. ఈ పనులకు గానూ రూ.45కోట్ల మేర కేటాయించారు. అయితే బుడమేరులోని మొక్కలు తొలగించి కేవలం రూ.10కోట్లతో పనులు ముగించి, అక్రమ బిల్లులతో రూ.35కోట్ల మేర కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం అండతో.. ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి ఇసుకరేవుల్లో దేవినేని అనుచరులు నిబందనలకు విరుద్ధంగా నది నుంచి అక్రమంగా డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుకతోడుతున్నారు. రోజుకు 4వేల క్యూబిక్ మీటర్లు నది నుంచి తోడి లారీలతో రవాణా చేస్తున్నారు. రోజుకు రోజుకు సుమారు రూ.6లక్షలు వరకు సంపాడించారు. మాజీ సర్పంచి మల్లెల పద్మనాభరావుకు చెందిన సీలింగ్ భూమిని రాష్ట్రాభివృద్ధిలో భాగంగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే నేపథ్యంలో తన వాటా దక్కించుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. గుంటుపల్లిలో కృష్ణానది నుంచి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు సర్వే నంబర్ 144, 147లో సుమారు 70 ఎకరాల్లో అమరావతి అమెరికన్ వైద్యశాలకు 26 ఎకరాలు కేటాయించి తెరవెనుక మంత్రాంగంతో తనవాటా దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎన్టీటీపీఎస్ బూడిద చెరువులో సిమెంటు కంపెనీల పేరుతో అనుమతులు పొంది ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా బూడిద తరలించి కోట్లు గడించారు. కేతనకొండ, మూలపాడు, కొండపల్లి రాతిక్వారీల్లోనూ పర్మిట్లు లేకుండానే అక్రమ మార్గాన నడిపిస్తున్నారు. -
మంత్రి దేవినేని అబద్ధాల కోరు
అనంతపురం సప్తగిరి సర్కిల్: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2018 నాటికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన దేవినేని ఉమ ఇప్పటి వరకు కనీసం గేట్లను కూడా నిర్మించలేదన్నారు. బహుళార్థక ప్రాజెక్టు పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సి ఉన్నప్పటికీ...సీఎం చంద్రబాబు కమిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంతో లాలూచి పడి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని చెబుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా రూ. 18 వేల కోట్లు కాగా, చంద్రబాబు, బీజేపీ ప్రభుత్వాలు దీన్ని రూ.58,750 కోట్లకు పెంచారన్నారు. దీని ద్వారా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ నిధులతో 2019 ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. మంత్రి దేవినేని మాత్రం అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారన్నారు. జిల్లాలోని కరువును పారదోలామని చెబుతున్న ప్రభుత్వం... ఒక్క ఎకరాకైనా నీరిచ్చిందా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా 17 ప్రాజెక్టులు జాతికి అంకితం చేశామని చెబుతూ మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి వనరును అమ్ముకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. జన్మభూమి కమిటీల సభ్యులు గజదొంగలను మించిపోయారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, ఆపార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోగుల పుల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నపూస రామచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు రవీంద్రారెడ్డిలు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి =m nu8*/0 -
రూ. 25 కోట్ల స్థలం..ఏడాది లీజు రూ. వెయ్యి
సాక్షి, విజయవాడ: అది రాష్ట్ర రాజధాని విజయవాడ నగరం నడిబొడ్డునున్న ఆటోనగర్‌లోని విలువైన స్థలం. ఎకరం పాతిక కోట్లు పైమాటే. ‘వడ్డించే వాడు మనవాడైతే..’ అన్నట్లు ఇప్పుడు ఈ స్థలం కారుచౌకగా టీడీపీకి రాష్ట్ర ప్రభుత్వం ధారాదత్తం చేసింది. ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల చొప్పున 33ఏళ్లపాటు లీజుకిచ్చింది. అంతేకాదు.. ఆ లీజును 99ఏళ్లకు పొడిగించుకునే సౌలభ్యం కూడా కల్పించింది. పరిశ్రమలు ఉండాల్సిన చోట పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించిన సర్కారు భూపందేరం కథాకమామిషు వివరాలు.. విజయవాడ ఆటోనగర్‌లో జలవనరుల శాఖకు చెందిన 93 సెంట్లు ( సుమారు 4,500 గజాల) స్థలం ఉంది. దీని ఖరీదు కనీసం రూ.25 కోట్లు ఉంటుంది. 2016 జూలైలో జారీచేసిన జీవో 340 ప్రకారం ఈ స్థలాన్ని తమకు కేటాయించాలంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అప్పట్లో దరఖాస్తు చేశారు. అంతే.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని జలవనరుల శాఖ అందుకు క్లియరెన్స్ ఇచ్చేసింది. ఆ వెంటనే రెవెన్యూ శాఖ, నగరపాలక సంస్థలూ ఓకే చెప్పేశాయి. ఇంకేముంది.. ప్రభుత్వ ఆమోదంతో ఈ స్థలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల చేతికి వెళ్లిపోయింది. మంత్రి నారా లోకేశ్ శనివారం ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏడాదికి రూ.1000 అద్దె.. 33 ఏళ్లకు లీజు.. ఇంత ఖరీదైన స్థలాన్ని కేవలం వెయ్యి రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం తన ఆధ్వర్యంలోని టీడీపీకి కట్టబెట్టింది. 340 జీవో ప్రకారం సీఆర్డీఏ పరిధిలో రాజకీయ పార్టీలకు కేటాయించే ఎకరా స్థలానికి ఏడాదికి రూ.1000 అద్దె చెల్లిస్తే సరిపోతుంది. అయితే, అన్ని రాజకీయ పార్టీలు స్థలాలు అడగకుండా ఉండేందుకు పార్టీ బలాబలాలను బట్టి స్థలం కేటాయించాలని జీవోలో పేర్కొన్నారు. ఈ జీవో ప్రకారం 33 ఏళ్లకు స్థలాన్ని తొలుత లీజుకు తీసుకుని తరువాత దాన్ని 99 ఏళ్లకు లీజును పొడిగించుకోవచ్చు. వాస్తవంగా ఈ స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకు అద్దెకిస్తే ఏడాదికి ఎంతలేదన్నా రూ.30 లక్షలు అద్దె వస్తుందని ఆటోనగర్ పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. అంత విలువైన స్థలాన్ని కేవలం ఏడాదికి రూ.వెయ్యికే అద్దెకు ఇవ్వడంపై వారు విస్తుపోతున్నారు. మంత్రి ఉమా డైరెక్షన్లోనే.. ఇదిలా ఉంటే.. కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీకి విజయవాడలో శాశ్వత భవనంలేదనే అపవాదును తొలగించేందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తమ శాఖకు చెందిన స్థలాన్ని కట్టబెట్టి, అక్కడ తన ఆధ్వర్యంలోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని కొందరు ఇరిగేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. సుమారు ఎకరం మేర ఉన్న ఇక్కడ.. ఇరిగేషన్ కార్యాలయాలు కట్టాలని ఆ శాఖ ఉద్యోగ సంఘాలు గతంలో డిమాండ్ చేశాయి. ఈ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించి కేసీ డిజన్, కేఈ డివిజన్, స్పెషల్ డివిజన్, పులిచింతల డివిజన్ తదితర శాఖలను ఇక్కడకు మార్చాలని రెండేళ్ల క్రితం అధికారులు కూడా భావించారు. అయితే, అప్పట్లోనే మంత్రి దేవినేని ఉమా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఆయా కార్యాలయాలను జిల్లాకు తరలించాలంటూ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రూ.25 కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి కట్టబట్టేందుకే అప్పట్లో ఇరిగేషన్ కార్యాలయాల ప్రతిపాదనను మంత్రి తోసిపుచ్చారని ఆ శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. కలపనూ వదలి పెట్టలేదు.. మరోవైపు.. ఈ స్థలంలో సుమారు వందేళ్ల నాటి చెట్లు ఉన్నాయి. అలాగే, ఇరిగేషన్ శాఖకు చెందిన షెడ్లు ఉన్నాయి. వీటి కలప విలువ సుమారు రూ.కోటి వుంటుందని అంచనా. వీటిని కూల్చివేసి వచ్చిన కలపనంతా తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా మౌనంగా వున్నారు. మంత్రి లోకేష్ వస్తుండడంతో మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు రాత్రి, పగలు అక్కడే మకాం వేసి పనులు చకచకా చేయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఇదిలా ఉంటే.. విజయవాడ ఆటోనగర్‌కు ఆసియాలోనే అతిపెద్దదిగా గుర్తింపు ఉంది. ఇక్కడ పరిశ్రమలు మినహా ఇతర వేటికీ అనుమతించకూడదనే నిబంధన ఉంది. అయితే, ఈ నిబంధనను ప్రభుత్వ పెద్దలు తుంగలో తొక్కి టీడీపీ కార్యాలయానికి కట్టబెడుతూ జీవో ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఆటోనగర్‌లో పార్టీ కార్యాలయం నిర్మిస్తే.. పరిశ్రమలకు పొందే అన్ని రాయితీలు పొందవచ్చని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. కాగా, అధికారంలో ఉండగానే జిల్లా పార్టీకి విజయవాడలో ఒక కార్యాలయం నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒత్తిడి మేరకే పార్టీ నేతలు ఈ స్థలాన్ని ఎంపిక చేసి ముఖ్యమంత్రికి చెబితే ఆయన అందుకు ఆమోదించారని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. భవిష్యత్తులో ఇక్కడ భారీ భవనాన్ని నిర్మిస్తామని వచ్చే ఎన్నికలకు ఇక్కడ నుంచే జిల్లా కార్యాక్రమాలన్నీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
హద్దులు చెరిపి.. అటవీ ధ్వంసం
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి అండదండలతో చెలరేగు తున్న మైనింగ్ మాఫియా అటవీ భూముల్లోనూ చొరబడి కొండలను కొల్లగొడుతోంది. కంచికచర్ల మండలం పరిటాల రెవెన్యూ పరిధిలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులో హద్దులు చెరిపేసి రాత్రిపగలు తేడా లేకుండా సాగిస్తున్న పేలుళ్లు, అక్రమ మైనింగ్‌తో వన్యప్రాణులు గజగజలాడుతున్నాయి. విలువైన వృక్ష సంపద నేలరాలుతోంది. మంత్రి అనుచరుల అక్రమ క్వారీయింగ్ కంచికచర్ల మండలం పరిటాల రెవెన్యూ పరిధి దొనబండ సర్వే నెంబర్ 801లోని 1,204 ఎకరాల్లో 94 క్వారీలకు స్థానిక టీడీపీ నేతలు అనుమతులు తెచ్చుకున్నారు. ఒక్కోచోట 5 నుంచి 10 హెక్టార్ల లోపు మాత్రమే క్వారీయింగ్‌కు అనుమతించారు. హెక్టార్‌కు రూ.50 వేల చొప్పున రాయల్టీ చెల్లిస్తున్నారు. అయితే క్వారీయింగ్‌కు అనుమతించిన ప్రాంతంలో మూడేళ్ల క్రితమే తవ్వకాలు పూర్తయ్యాయి. ఆ తరువాత వీరి కన్ను రెవెన్యూ భూములను ఆనుకుని వెనుకవైపు ఉన్న కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌పై పడింది. అప్పటికే క్వారీయింగ్ చేసిన ప్రాంతం అనుమతులు చూపిస్తూ కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లోకి చొచ్చుకుపోయారు. అటవీ ప్రాంతంలో కొండలను నిత్యం రిగ్గు బ్లాస్టింగ్లతో పిండిచేస్తూ ఖనిజాలను కొల్లగొడుతున్నారు. అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు ‘సాక్షి’ ప్రతినిధులు శుక్రవారం అక్కడకు చేరుకోవడంతో భారీ యంత్రాలను హడావుడిగా ఫారెస్ట్ నుంచి బయటకు తరలించడం గమనార్హం. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సమీప బంధువులైన చల్లగుండ్ల చిన నాగేశ్వరరావు, చింతల రామ్మోహన్రావులతోపాటు మంత్రికి ప్రధాన అనుచరుడైన మోడరన్ క్రష్షర్స్ యజమాని తోటకూర పూర్ణ ఇక్కడ అక్రమ క్వారీయింగ్ నిర్వహిస్తున్నారు. మైనింగ్ మాఫియాకు సహకరించినందుకు ఎన్నికల సమయంలో టీడీపీకి ఇక్కడ రెండు నియోజకవర్గాల్లో నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వణుకుతున్న వన్యప్రాణులు.. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ 150 కిలోమీటర్ల పరిధిలో విస్తరించినట్లు 1990లో నిర్వహించిన జియలాజికల్ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ అపార ఖనిజ సంపదతోపాటు వన్యప్రాణులు కూడా ఉన్నాయి. జింకలు, దుప్పిలు, కణితలు, చిరుతలతో పాటు 32 రకాల జంతువులు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ అటవీ ప్రాంతంలో 48 రకాల అరుదైన వృక్ష జాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ 100 హెక్టార్లలో కొండలు విస్తరించి ఉండగా ఇప్పటికే దాదాపు 80 హెక్టార్ల పరిధిలో కొండలను మైనింగ్ మాఫియా పిండి చేసినట్లు తెలుస్తోంది. క్వారీయింగ్ కోసం అరుదైన వృక్ష జాతులను నాశనం చేస్తున్నారు. జిలెటిన్‌స్టిక్స్ లాంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలతో రిగ్గు బ్లాస్టింగ్లు చేస్తుండడంతో వన్యప్రాణులు భీతిల్లి పరుగులు తీస్తున్నాయి. రాత్రి పగళ్లు తేడా లేకుండా పేలుళ్లు జరుపుతుండడంతో వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి. హద్దులను చెరిపి.. మైనింగ్‌శాఖ అనుమతులు ఇచ్చేటప్పుడు సర్వే నిర్వహించి హద్దులు నిర్థారించాలి. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రి దేవినేని ఉమా అండదండలు ఉండడంతో పరిటాల క్వారీలకు నిర్వాహకులు హద్దులే లేకుండా చేశారు. 94 క్వారీలకు హద్దులు ఏమిటో అంతుబట్టవు. హద్దులు చెరిపేసి రెవెన్యూ, ఫారెస్ట్ భూముల్లోకి చొచ్చుకుపోతున్నారు. రెండు కొండల మధ్య రహదారి.. దొనబండలో క్వారీ నిర్వాహకులు 801 సర్వేనెంబర్‌లోని కొండ పోరంబోకు భూములతోపాటు కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో కలిసే రెండు కొండలను తొలిచేశారు. రెండు కొండల మధ్య అనుమతులు లేకుండా 40 అడుగుల మేర దాదాపు రూ.3 కోట్లతో రహదారి నిర్మాణం చేపట్టారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే అక్కడ లభ్యమైన 2 వేల ట్రిప్పుల గ్రావెల్‌ను కూడా అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇందులో మంత్రి అనుచరులు కీలకంగా వ్యవహరించడంతో రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్ అధికారులు మౌనం దాల్చారు. అడవిని ఆక్రమించారు.. దొనబొండ క్వారీ నిర్వాహకులు పోరంబోకు, అటవీ భూములను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వేల టన్నుల కంకర తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లోకి చొచ్చుకుపోయి క్వారీయింగ్ చేయడంపై అటవీశాఖకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. మంత్రి అనుచరులు కావడంతో వారి ఆడిందే ఆటగా ఉంది. – మార్తా శ్రీనివాసరావు (స్థానికుడు, పరిటాల) అటవీ భూముల్లో తవ్వకాలే లేవు.. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ జరగటం లేదు. రెవెన్యూ భూముల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. ఒకవేళ అటవీ ఆక్రమణ జరిగి ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – లెనిన్ (అటవీరేంజ్ అధికారి, కంచికచర్ల)