Dhadak
-
‘ఏడుస్తూ ఉంటే నువ్వు చాలా బాగున్నావ్
శ్రీదేవి గారాల తనయ జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే కాక జాన్వీకి మరిన్ని అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమాల్లోకి రావాలనేది నా కల. దీన్ని సాకారం చేసుకోవడానికి నేను మా అమ్మతో గొడవ పడాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఆ రోజు నాకు ఇప్పటికి బాగా గుర్తుంది. నేను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నాను అని మా అమ్మతో చెప్పాను. తాను ముందు వద్దంది. ఆ తర్వాత ఇదే విషయమై మా ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. దాంతో నేను ఏడ్వడం మొదలుపెట్టాను. అప్పుడు మా అమ్మ నావైపు తిరిగి ఏడుస్తున్నప్పుడు నువ్వు చాలా బాగున్నావ్. యాక్టర్‌కు ఇది చాలా ముఖ్యం’ అని చెప్పిందంటూ గుర్తు చేసుకున్నారు. అంతేకాక ధడక్ చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించడం తనకు చాలా మేలు చేసిందన్నారు జాన్వీ. ఒక వేళ తాను ఆ చిత్రంలో నటించకపోతే.. ప్రస్తుతం తన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదని తెలిపారు. ఆ చిత్రం తనకు ఎన్నో విధాల మేలు చేసిందన్నారు. జాన్వీ ప్రస్తుతం.. వార్ ఎపిక్ డ్రామా ‘థక్త్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో తొలిసారిగా బాబాయ్ అనిల్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆమె.. భారత వైమానిక పైలట్ గుంజన్ సక్సేనా బయెపిక్ ‘కార్గిల్ గర్ల్’ సినిమా టైటిల్ రోల్లో కనిపించనున్నారు. -
పోటీ లేదు.. గీటీ లేదు
‘ధడక్’ సినిమాలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అదే లెవల్లో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కూడా ప్రేక్షకుల దగ్గర పాస్ అవుతుందా? ఇద్దరూ ఆల్మోస్ట్ ఒకేసారి సినిమాలను అనౌన్స్ చేశారు. జాన్వీ కపూర్ సినిమా ఏమో ముందు రిలీజైపోయింది. కానీ సారా సినిమా ఇంకా థియేటర్స్‌లో పడలేదు. దీంతో సారా డిఫెన్స్‌లో పడిపోయిందా? ఇదిగో ఇలా బాలీవుడ్లో జాన్వీకి, సారాకి పోటీ పెడుతున్నారు ఔత్సాహికరాయుళ్లు. మరి... ఈ పోటీలో ఫస్ట్ ప్లేస్ ఎవరిది అవుతుంది? అనే ప్రశ్న జాన్వీ ముందుంచితే.. ‘‘మా మధ్య పోటీ లేదు. గీటీ లేదు. ఇద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం. మమ్మల్ని పోటీదారులుగా ఊహించుకుని కొందరు ఎందుకు ఆనందపడతారో అర్థం కావడం లేదు. అయినా నాకు, సారాకే పోటీ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇషాన్ కట్టర్ (‘ధడక్’లో జాన్వీతో నటించిన హీరో)తో నాకు పోటీ పెట్టొచ్చు కదా? అంటే అమ్మాయిలైతే ఇలాంటి న్యూస్‌లకు ఎక్కువ మైలేజ్ వస్తుందని వాళ్ల ఫీలింగ్ అనుకుంటా. కొత్త టాలెంట్ రావాలని కోరుకునే మనస్తత్వం నాది. సారాతో పాటుగా ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’తో ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లు తారా సుతారియా, అనన్యా పాండేలకు కూడా మంచి పేరు రావాలి’’ అని చెప్పుకొచ్చారు. -
ఇదే ప్రశ్న అతన్ని ఎందుకు అడగరు...?
తొలి చిత్రం ‘ధడక్’తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అందాల తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్. ఇషాన్ ఖట్టర్, జాన్వి జంటగా నటించిన ఈ చిత్రం 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరింది. మరోపక్క ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ కూడా సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం సారా ‘కేదార్నాథ్’, ‘సింబా’ చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాదు జాన్వి, సారా మంచి స్నేహితులు కూడా. జాన్వి తొలి చిత్రంతోనే స్టార్డం సంపాదించుకోవడంతో పలు మీడియా వర్గాలు ఆమెను, సారాను పోల్చి చూస్తున్నారు. ఈ విషయంపై జాన్వి స్పందిస్తూ.. ‘నాకు, సారాకు మధ్య పోటీ ఏంటి? మేమిద్దరం మంచి స్నేహితులం. అయినా ఇలా పోల్చి చూడటం కొందరికి నచ్చుతుందేమో. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పుడు అర్థం వస్తుంది. ఇదే ప్రశ్నను నా సహనటుడు ఇషాన్‌ను ఎందుకు అడగరు? ప్రతిసారీ ఇద్దరు కథానాయికల మధ్యే పోటీ ఉంటుందని అంటుంటారు. కానీ అది నిజం కాదు. చెప్పాలంటే కథానాయికలు సక్సెస్‌ను కలిసే ఎంజాయ్ చేస్తుంటారు’ అని వెల్లడించారు జాన్వి. అంతేకాక సారాను బిగ్ స్క్రీన్‌పై చూడటం కోసం తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం జాన్వి, కరణ్ జోహార్ నిర్మించనున్న ‘తఖ్త్’ చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్, కరీనా కపూర్, ఆలియా భట్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
జాన్వీ షూ ఖరీదెంతో తెలుసా?
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెరంగేట్రం చేసిన 'ధడక్' సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దీంతో జాన్వీతో పాటు కపూర్ ఫ్యామిలీ పట్టరానంత సంతోషంతో ఉంది. ఆమె ఈ మధ్య ఎక్కడ కనిపించినా.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. తాజాగా జాన్వీ, సింగపూర్ నుంచి వస్తూ.. ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ఇక ఫోటోగ్రాఫర్లు వదిలిపెడతారా..? ఆమెను ఫోటోల మీద ఫోటోలు తీసి, మీడియా మాధ్యమాల్లో ప్రచురించాయి. అయితే ఈ ఫోటోల్లో ఆమె వేసుకున్న టీ-షర్ట్, షూ ఖరీదు వింటే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. ఆమె వేసుకున్న క్రీమ్ కలర్ కాటన్ జెర్సీ ఖరీదు రూ.33 వేలట. ఇది చిన్న స్లీవ్‌తో ఉన్న సెయింట్ లారెంట్ బాయ్‌ఫ్రెండ్ టీ-షర్టు. జాన్వీ టీ-షర్ట్‌తో పాటు ఆమె వేసుకున్న షూ కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. తెలుపు రంగుల్లో పింక్, బ్లూ రంగులో లెదర్‌ను కలిగి ఉన్న ఈ షూస్, దాదాపు 1.37 లక్షల రూపాయలట. జాన్వీ వేసుకున్న ఈ టీ-షర్ట్‌ను, షూను రెండింటినీ కూడా స్పెయిన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ బ్యాలెంసీగా నుంచి తెప్పించినవట. ఈ బ్రాండ్ ఫ్రెంచ్ మల్టినేషనల్ కంపెనీ కెరింగ్కు చెందినది. కాగ, ధడక్ మూవీ ప్రమోషన్స్ నుంచి ఆమె, స్టయిల్ లుక్స్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మరాఠి సినిమా సైరత్‌కు రీమేక్‌గా ధడక్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. -
రాజమౌళి మూవీలో జాన్వీ కపూర్..
ముంబై : అందాల నటి శ్రీదేవి విషాదాంతం తర్వాత ఆమె కుమార్తె జాన్వీ కపూర్ తొలి మూవీ ధడక్‌పై బాలీవుడ్ ఇండస్ర్టీ మొత్తం దృష్టిసారించింది. మరాఠీ చిత్రం సైరాత్ రీమేక్‌గా తెరకెక్కిన ధడక్‌కు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనన ఎదురైంది. ధడక్ విడుదలైన కొద్ది రోజులకే జాన్వీకి బాలీవుడ్ సహా దక్షిణాది సినీ పరిశ్రమల నుంచి సైతం ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్లో దర్శక దిగ్గజం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మూవీలో జాన్వీ కపూర్‌ను ఓ హీరోయిన్గా తీసుకోవాలని, ఈ దిశగా జాన్వీతో సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుకు జాన్వీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది తెలియరాలేదు. ఈ మూవీకి సంబంధించిన ఇతర తారాగణంపై త్వరలోనే అధికారిక సమాచారం వెలువడుతుందని భావిస్తున్నారు. మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారని, రామ్‌చరణ్ పోలీస్ అధికారిగా నటించనున్నారని సమాచారం. -
సినిమాల్లోకి జాన్వీ.. మరి ఖుషీ ప్లాన్సేంటి?
ముంబై : దివంగత నటి శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాలో జాన్వీ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. తల్లి లాగే జాన్వీ కూడా కళ్లతోనే భావాలను పలికించగలదంటూ శ్రీదేవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త శ్రీదేవి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి రానుందనేదే ఈ వార్తల సారాంశం. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనుందని బోనీ కపూర్ తెలిపారు. ‘ఖుషీ మొదట మోడల్ కావాలనుకుంది. కానీ ప్రస్తుతం తన లక్ష్యం మారింది. అక్క జాన్వీ లాగే తను కూడా హీరోయిన్ కావాలనుకుంటోంది. కెరీర్ గురించి నిర్ణయం తీసుకోగల పరిపక్వత నా పిల్లలకు ఉంది. అన్షులా, అర్జున్, జాన్వీలు తమ సొంత నిర్ణయం మేరకే కెరీర్‌ను రూపొందించుకున్నారు. ఇపుడు ఖుషీ కూడా వారి బాటలోనే నడవాలనుకుంటోందని’ బోనీ కపూర్ వ్యాఖ్యానించారు. -
జాన్వీకి పాడాలనుంది!
ధడక్... ఇప్పుడు నలుగురి కళ్లల్లో మెదులుతున్న సినిమా! ప్రఖ్యాత హిందీ గాయని లతామంగేష్కర్ నోటా ధడక్ మాట వినపడింది. అంతేకాదు.. జాన్వీకి ప్లేబ్యాక్ పాడాలనుంది అని కూడా చెప్పారు. ‘సాధారణంగా నేను సినిమాలు చూడను. జాన్వీ సినిమా ధడక్ చూశా. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్ ఉంది. జాన్వీకి నేపథ్యం పాడాలనుకుంటున్నాను’ అన్నారు. ఈ సందర్భంగానే అనిల్ కపూర్ నటిస్తున్న ‘ఫనే ఖాన్’ ట్రైలర్‌నూ చూశారు లతా. ‘బోనీ, అనిల్... మొదటి నుంచి మా మంగేష్కర్ కుటుంబానికి చాలా దగ్గర. ఇన్ఫాక్ట్ నేనంటే చాలా అభిమానం. అనిల్కైతే మరీను. అనిల్ అంటే మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం. ధడక్ సినిమాతో బోనీ మొహంలో నవ్వు చూశాను. శ్రీదేవి మరణంతో చాలా కుంగిపోయాడు. బోనీ మళ్లీ మామూలు మనిషవుతోంది జాన్వీ వల్లే. ఆ పిల్ల సినిమాతో అతనిలో మళ్లీ కొంత హుషారు కనిపించింది’ అంటూ కపూర్స్ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానాన్ని వెలిబుచ్చారు లతామంగేష్కర్. ‘ఫన్నేఖాన్’ సినిమాలో అనిల్‌కపూర్ పాత్ర లతామంగేష్కర్, మహ్మద్‌రఫీ అభిమానిగా ఉంటుంది. ఆ పాత్ర తన కూతురిని లతా మంగేష్కర్‌లా చేయాలని అనుకుంటుంది. ఇదీ ఆ సినిమా లైన్. ‘నా పన్నెండో ఏట సినిమా నేపథ్య గాయనిగా కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకుల్లో సినిమారంగంలో నా పట్ల అదే అభిమానం. అది నా అదృష్టం. ఈ సందర్భంగా దేశంలోని సింగర్స్ అందరికీ నేనొక మాట చెప్పదల్చుకున్నాను.. ఇంకో కిషోర్ కుమార్లాగో.. రఫీలాగో.. లతాలాగో కాకండి.. మీలా మీరుండండి.. మమ్మల్ని ఇమిటేట్ చేయకండి.. మీ స్వరం ప్రత్యేకతను చాటుకోండి’ అని సలహా ఇచ్చారు లతామంగేష్కర్. -
ఊరమాస్ పాటకు చిందేసిన క్రికెటర్లు
లండన్: జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ జంటగా నటించిన చిత్రం దఢక్. ఇప్పటికే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రానికి అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ మూవీలోని జింగాత్ పాట మాస్ పేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ పాటకు ఇంగ్లండ్‌లోని టీమిండియా ఆటగాళ్లు చిందేశారు. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి బయలుదేరే ముందు భారత్ ఏ జట్టు ఆటగాళ్లు చివరి రోజు లండన్ వీధుల్లో విహరిస్తూ, ఉల్లాసంగా గడిపారు. ఆటగాళ్లు బస్సులో ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న సమయంలో హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్, కే భరత్, అంకిత్ బావ్నే జింగాత్ పాటకు నృత్యం చేశారు. వీరు డ్యాన్స్ చేసిన వీడియోను సిరాజ్‌లో సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ‘లండన్‌లో చివరి రోజు జింగాత్ సాంగ్‌తో సరదాగా గడిచిపోయింది, త్వరలో కలుద్దాం’అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం క్రికెటర్ల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఇంగ్లండ్ లయన్స్, వెస్టిండీస్ జట్లతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ను ‘టీమిండియా ఏ’ గెలుచుకుంది. #having fun on#zingaat song last day in London.see you soon 🇮🇳 #teammatesforlife #indiaA🇮🇳 #bleedblue #bromance❤️ #moretolife #smilandrise @ankeetbawne @konasbharat @indiancricketteam A post shared by Mohammed Siraj (@mohammedsirajofficial) on Jul 20, 2018 at 3:40am PDT -
తొలి రోజే ‘ధడక్’ సరికొత్త రికార్డు
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను హీరోయిన్గా పరిచయం చేస్తూ కరణ్ జోహార్ నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘ధడక్’. మరాఠీ మూవీ ‘సైరట్’కు అధికారిక రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ నటనను చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. శుక్రవారం(జూలై 20) విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా రికార్డు సృష్టించి జాన్వీ సంతోషాన్ని రెట్టింపు చేసింది. విడుదలైన రోజే 8. 71 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా.. నూతన తారలతో రూపొంది, తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘ధడక్‌కు గొప్ప ఆరంభం.. నూతన తారలతో రూపొందినప్పటికీ తొలిరోజే 8.71 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ పేరిట ఉన్న రూ. 8 కోట్ల రికార్డును అధిగమించిందంటూ’ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కాగా ఈ రెండు సినిమాలు కరణ్ జోహారే నిర్మించారు. ‘ధడక్’ సినిమాలో జాన్వీకి జోడీగా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ నటించాడు. ‘బియాండ్ ద క్లౌడ్స్’ సినిమాలో సహాయక పాత్రలో నటించిన ఇషాన్‌కు హీరోగా మాత్రం ఇదే తొలి చిత్రం. #Dhadak takes a HEROIC START... Rarely does a film starring absolute newcomers open so well... Day 1 is higher than #StudentOfTheYear [₹ 8 cr]… Fri ₹ 8.71 cr. India biz. — taran adarsh (@taran_adarsh) July 21, 2018 -
ధడక్ : జాన్వీ రెమ్యునరేషన్ ఎంత?
అతిలోక సుందరి, అలనాటి అందాల తార శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్, సినీ కెరీర్లోకి ఎంట్రీ ఇస్తూ తీసిన మూవీ ధడక్ విడుదలైంది. జాతీయ అవార్డు అందుకున్న సైరత్ మూవీకి రిమేక్‌గా ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోని స్క్రీన్లపైకి వచ్చేసింది. బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సౌందర్యరాశి కలలు నిజమయ్యాయి. తొలి మూవీలోనే జాహ్నవి అద్భుతంగా నటించి, తల్లికి నటనలోనూ వారసురాలినని నిరూపించుకుంది. ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచి, ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న జాన్వీ కపూర్ పొందిన పారితోషికం ఎంత? అనేది ప్రస్తుతం ఆసక్తిదాయకమైన అంశంగా నిలిచింది. ఈ వివరాలను సైతం డైలీహంట్ రిపోర్టు చేసింది. ధడక్ సినిమాకు గాను, జాన్వీ కపూర్ అరవై లక్షల రూపాయల పారితోషికం అందుకున్నట్టు తెలిపింది. తన తొలి సినిమాకు ఈ మేరకు పారితోషికం పొందిందని తెలిసింది. అలాగే ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయిన ఇషాన్ ఖట్టర్‌కు కూడా అరవై లక్షల రూపాయల పారితోషికమే ఇచ్చారట. అయితే వీరిద్దరి కంటే అధికంగా జాన్వీ తండ్రిగా ఈ సినిమాలో నటించిన అశుతోష్ రాణాకు రూ.80 లక్షలకు చెల్లించారని.. సైరత్, ధడక్ రెండింటికీ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉన్న అజయ్-అతుల్‌లకు రూ.1.5 కోట్ల పారితోషికం ఇచ్చారని తెలిసింది. ధడక్ చిత్రానికి మ్యూజిక్ ఓ మ్యాజిక్ అని క్రిటిక్స్ సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా రీరికార్డింగ్ సినిమాను నిలబెట్టిందని, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసిందని అంటున్నారు. ఫీల్‌గుడ్, ఎమోషనల్ ఫ్యాక్టర్‌ను అందించడంలో అజయ్, అతుల్ సంగీతద్వయం ఆకట్టుకున్నదని చెబుతున్నారు. -
‘నీ ప్రేమే నన్ను నడిపిస్తుంది’
లెజండరీ యాక్టర్ శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్‌కి జులై 20 చాలా ప్రత్యేకమైన రోజు. నటిగా ఆమె బాలీవుడ్ ప్రయాణం ప్రారంభమైంది ఆ రోజే. జాన్వీ కపూర్ తన తొలి చిత్రం ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కుటుంబం మొత్తం జాన్వీకి మద్దతుగా ఉంది. కానీ ఎందరు ఉన్న తల్లి లేని లోటును మాత్రం ఎవరూ పూడ్చలేరు. జాన్వీ తొలి సినిమా ‘ధడక్’ గురించి శ్రీదేవి చాలా ఆత్రుతగా ఎదురుచూసేవారనే సంగతి తెలిసిందే. కానీ దురదృష్టం కొద్ది సినిమా విడుదల సమయానికి ఆమె మన మధ్యలో లేరు. దాంతో తన తొలి చిత్రాన్ని తల్లి అంకితం చేసి, నివాళులు అర్పించారు జాన్వీ కపూర్. అందులో భాగంగా సినిమా ప్రారంభానికి ముందు తన తల్లిని ఉద్దేశిస్తూ జాన్వీ ఒక స్పేషల్ నోట్‌ను ప్రదర్శించారు. దానిలో శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలోని ఒక అందమైన ఫోటో, దానితో పాటు ‘ఐ లవ్ యూ అమ్మ. ఇది నీ కోసం. ఎప్పటికి జాన్వీ’ అనే సందేశం. ఈ నోట్‌ను తెర మీద చూసిన ప్రతి ఒక్కరు ఒక్క క్షణం ఉద్వేగానికి లోనయ్యారు. అంతేకాక ఈ నోట్లో జాన్వీతో పాటు మొత్తం కుటుంబ సభ్యులందరూ శ్రీదేవి అభిమానులకు, మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘శ్రీదేవి మరణించిన సమయంలో మీరు(మీడియా, అభిమానులు) చూపిన ప్రేమకు, గౌరవానికి ధన్యవాదాలు’ అని రాసి ఉంది. దీని కంటే ముందే జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లిని ఉద్దేశిస్తూ ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పోస్టు చేశారు. ఈ సందేశంలో జాన్వీ‘ఇప్పుడు నా హృదయంలో అనంతమైన శూన్యం ఏర్పడింది. ఇక మీదట నేను దానితోనే సహవాసం చేయాల్సి ఉంటుంది. ఎంత శూన్యత ఉన్న ఇప్పటికి నీ ప్రేమను నేను అనుభవించగల్గుతున్నాను. నేను ఎప్పుడు కళ్లు మూసుకున్న ఎన్నో మంచి జ్ఞాపకాలు నా కళ్ల ముందు మెదులుతుంటాయి. నువ్వు చాలా స్వచ్ఛంగా, నిండు మనసుతో ప్రేమిస్తూంటావు. అందుకే అతను(దేవుడు) నిన్ను తన చెంతకు పిలిపించుకున్నాడు. కానీ నువ్వు మా కోసం ఎప్పటికి ఉంటావు. నా స్నేహితులు ఎప్పుడు అంటుండేవారు, నేను చాలా అదృష్టవంతురాలినని. అలా ఎందుకనేవారో నాకు ఇప్పుడు అర్ధం అవుతుంది. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉన్నావు. నేను ఎప్పుడూ.. ఎవరి మీద దేని కోసం ఆధారపడలేదు. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడు నా కోసం ఉన్నావు. నువ్వు నా ఆత్మలో భాగం. నా ప్రియ నేస్తానివి. నాకు సంబంధించిన ప్రతిది నువ్వే. మాపై నీ ప్రభావం చాలా బలమైనది. మేము ముందుకు వెళ్లడానికి ఇది తోడ్పడుతుంది. కానీ నువ్వు లేని లోటును మాత్రం అది పూర్తిగా తీర్చలేదు’ అంటూ తన తల్లికి నివాళులు అర్పించారు. -
‘ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత సంతోషించేదానివో’
అలనాటి అందాల తార శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మరాఠీ మూవీ ‘సైరాట్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘ధడఖ్’ సినిమా జూలై 20న విడుదల అయింది. అయితే సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ఒక రోజు ముందే బాలీవుడ్ ప్రముఖలకు ప్రత్యేక షోను ఏర్పాటు చేశారు. వీరిలో శ్రీదేవికి అత్యంత ఆప్తురాలు, నటి షబానా ఆజ్మి కూడా ఉన్నారు. ధడక్ సినిమాను చూసిన అనంతరం షబనా ఆజ్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్‌ను పోస్టు చేశారు. అందులో ‘శ్రీదేవి నువ్వు ఈ సమయంలో ఇక్కడ ఉంటే ఎంత బాగుండేదో. నువ్వు జాన్వీ తొలి సినిమా చూడాల్సింది. చాలా గర్వపడేదానివి. ఒక తార జన్మించింది’ అంటూ పోస్ట్ చేశారు. #Sridevi wish you were here to watch your daughter #Janvhi’s debut. You would have been so proud .. A star is born 👏👏 A post shared by Shabana Azmi (@azmishabana18) on Jul 20, 2018 at 6:18am PDT ఈ నెల 20 న విడుదలైన జాన్వీ కపూర్ తొలి బాలీవుడ్ చిత్రం ‘ధడక్’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా జాన్వీ నటనను పరిశ్రమ ప్రముఖులు తెగ మెచ్చుకుంటున్నారు. తొలి చిత్రమే అయినా చాలా బాగా నటించిందని, కళ్లతోనే అద్భుతమైన హవభావాలను పలికించిందని అభినందిస్తున్నారు. మరాఠీ చిత్రం ‘సైరాట్’కు రీమేక్ ఇది. శశాంక్ కేతన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్ హీరోగా నటించారు. ‘ధడక్’ చిత్రాన్ని ధర్మప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించారు. ఇప్పటికే చిత్రంలోని జింగత్ పాట యూట్యూబ్‌లో రికార్డ్ హిట్స్‌తో దూసుకుపోతోంది. -
ఇద్దరు యువరాణులు ఒకేచోట..!!
దివంగత నటి శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మరాఠీ మూవీ ‘సైరత్’ రీమేక్‌గా తెరకెక్కిన ‘ధడఖ్’ సినిమా ఈ రోజు(జూలై 20) విడుదల అయింది. ఈ సందర్భంగా ఎంతో మంది స్నేహితులు జాన్వీకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందరిలోనూ జాన్వీ చిన్ననాటి స్నేహితురాలు, స్టార్ కిడ్ అనన్య పాండే విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి. తాను, జాన్వీ కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోను పోస్ట్ చేసిన అనన్య... ‘నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గుడ్‌లక్ ధడఖ్ టీమ్’ అంటూ జాన్వీని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. ‘ఇద్దరు యువరాణులను ఒకేచోట చూడటం సంతోషంగా ఉందంటూ’ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందుతోన్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో అనన్య పాండే హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ‘ధడఖ్’ సినిమాను కూడా కరణే నిర్మించడం విశేషం. Always a big ❤️ for you @janhvikapoor !! Good luck to the entire team of #Dhadak ✨ @ishaan95 @shashankkhaitan @karanjohar @apoorva1972 @dharmamovies A post shared by Ananya 👩🏻🎓💫 (@ananyapanday) on Jul 19, 2018 at 5:08am PDT -
అమ్మపై కోపం వచ్చింది!
ఇప్పుడు అందరి దృష్టి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌పైనే. ఆమె కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘ధడక్’ ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవ్వడమే ఇందుకు కారణం. మరాఠీ చిత్రం ‘సైరాట్’కు రీమేక్ ఇది. శశాంక్ కేతన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్ హీరోగా నటించారు. ‘ధడక్’ చిత్రాన్ని ధర్మప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను జాన్వీ బయటపెట్టారు. తల్లి శ్రీదేవి మీద కోపం వచ్చిన ఓ సంఘటనను ‘ధడక్’ మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియా ముందు చెప్పారు. ‘‘నాకు దాదాపు పదేళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మ, కమల్‌హాసన్‌గారు నటించిన ‘సాద్మా’ సినిమాను చూశా. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ను అమ్మ గుర్తుపట్టలేక పోయిన సన్నివేశం నన్ను కదలించింది. ‘నువ్వు.. కమల్‌హాసన్‌ను ఎందుకు గుర్తుపట్టలేదు?’ అని అమ్మతో అలిగి రెండు రోజులు మాట్లాడలేదు. అలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా అమ్మ ఎమోషనల్‌గా నటించిన సినిమాలను నేను చూడను. ఎందుకంటే ఎక్కవగా ఏడ్చే క్యారెక్టర్స్‌నే అమ్మ చేసింది. కానీ ‘సాద్మా’లో అమ్మ ఇంకొకరిని ఏడిపించారు’’ అని చెప్పుకొచ్చారు జాన్వీ. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలు మహేంద్ర దర్శకత్వంతో కమల్‌హాసన్, శ్రీదేవి నటించిన తమిళ చిత్రం ‘మూడ్రామ్ పిరై’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో ‘వసంతకో కిల’ పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్నే హిందీలో ‘సాద్మా’గా తీశారు. ఈ సినిమాలో శ్రీదేవి, కమల్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. -
కచ్చితంగా ప్రధానమంత్రి అవుతా
స్టార్ల పిల్లలు జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్లో తమ చిత్రం ‘ధడక్’ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఇందుకోసం ‘హార్పర్ బజార్’అనే మేగజైన్‌కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. అందులో భాగంగా మీ ఇదరి ఎవరు దేశానికి ప్రధానమంత్రి అవుతారు అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు జాన్వీ హిల్లేరియస్ సమాధానం చెప్పారు. ఇదే ప్రశ్నకు ఇషాన్ ఇద్దరం కాలేమని చెప్పగా, తాను అవుతానని జాన్వీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇషాన్ నుంచి మైక్‌ను లాక్కుని మరీ జాన్వీ ప్రధానమంత్రి అవుతానని చెప్పారు. ఆ తర్వాత అందుకు సారీ కూడా చెప్పారు. -
ధడక్ ప్రమోషన్లలో వీరిదే హవా..
ముంబై : శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్‌ల తొలి చిత్రం ధడక్ విడుదల కోసం స్టార్ కిడ్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందకొస్తున్న ఈ చిత్ర ప్రమోషన్లను మూవీ యూనిట్ వేగవంతం చేసింది. మరాఠా మూవీ సైరాత్ రీమేక్‌గా శశాంక్ ఖైతన్ దర్శకత్వంలో తెరకెక్కిన ధడక్‌పై జాన్వీ సహా కపూర్ కుటుంబం భారీ ఆశలే పెట్టుకుంది. హీరో ఇషాన్ ఖట్టర్ గతంలో మాజిద్ దర్శఖత్వంలో బియాండ్ ద క్లౌడ్స్ అనే మూవీలో నటించాడు.వీరిద్దరూ ప్రేమికులుగా ధడక్‌లో ప్రేక్షకులను అలరిస్తారని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది. మరోవైపు మూవీ ప్రమోషన్స్‌లోనూ జాన్వీ, ఇషార్లే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ధడక్ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. -
కష్టాలు ఎదుర్కోడానికి రెడీ
కెరీర్లో తొలి సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గర పడుతోంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏ కొత్త యాక్టర్‌కైనా కాస్త టెన్షన్ పెరుగుతుంటుంది. ప్రజెంట్ ఆ ఒత్తిడినే ఫీల్ అవుతున్నారట శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. శశాంక్ కేతన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ జంటగా ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించిన ‘ధడక్’ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. మరాఠీ చిత్రం ‘సైరాట్’కు రీమేక్ ఇది. ఈ సందర్భంగా ‘మీరు యాక్టర్ అవుతా అన్నప్పుడు మీ ఇంట్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అన్న ప్రశ్నను జాన్వీ ముందు ఉంచితే...‘‘అమ్మానాన్నలు (శ్రీదేవి, బోనీకపూర్) నన్ను చాలా ప్రొటెక్టివ్‌గా పెంచారు. ఒక సందర్భంలో నేను నటిని కావాలనుకుంటున్న నిర్ణయాన్ని అమ్మకు చెప్పాను. నా నిర్ణయాన్ని మళ్లీ ఆలోచించుకోమన్నారు. అలాగే యాక్టింగ్ అంటే గ్లామరస్‌గా కనిపించడమో, లేక ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదవడమో కాదని కూడా పరోక్షంగా హెచ్చరించారు. కానీ ఆ తర్వాత సినిమాపై నాకు ఉన్న కమిట్మెంట్, యాక్టింగ్‌పై నా ప్యాషన్, కాన్ఫిడెన్స్ చూసి ఓకే అన్నారు’’ అని పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ –‘‘అమ్మ ఎంతో కష్టపడి మాకు ఈజీ లైఫ్‌ను అందిచాలనుకున్నారు. కానీ సినిమా లైఫ్‌లో అమ్మ ఫేస్ చేసిన గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియ్స్తో పాటు ఆ స్ట్రగుల్స్‌ను కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. -
‘జింగాత్’ను ఖూనీ చేశారు; అభిమానుల ఆగ్రహం
ముంబై: ‘‘ఒరిజినాలిటీలో ఉన్న మహత్తే వేరు’’,.. శ్రీదేవి కూతురు జాన్వీ తెరంగేట్రం చేస్తోన్న ‘ధడక్’ సినిమాలో పాటను విన్నవాళ్లలో కొద్దిమంది అంటున్నమాటిది. ఇంకొందరైతే ‘‘మా ఫేవరెట్ పాటను ఖూనీ చేశారు.. ఈ పాపం ఊరికే పోదు..’’ అని శపిస్తున్నారు! కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ‘ధడక్’ జులై 20న విడుదల కానుంది. ఇది మరాఠీ బ్లాక్ బస్టర్ ‘సైరట్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కాగా, అందరిచేతా ‘వహ్వా!’ అనిపించిన ‘ జింగాత్’ పాటను కూడా ‘ధడక్’లో (భాష మార్చి) యాజిటీజ్‌గా వాడేశారు. రెండు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చింది అజయ్-అతుల్ జోడీనే! తేడా ఏముంది?: మరాఠీలో లిరిక్స్ సందర్భోచితంగా సాగగా.. హిందీలో ఏమాత్రం అదోరకం పదాలు వాడినట్లు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఒరిజనల్లో కొరియోగ్రఫీక్ మూమేట్స్ కాకుండా వేడుకల్లో మనం చూసే డాన్స్‌లే కనిపిస్తాయి.. హిందీలో కుప్పిగంతులు వేయించారని మండిపడ్డారు. అలా బుధవారం విడుదలైన ‘ధడక్-జింగాత్’కు డిస్‌లైక్స్ కొడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ‘జింగాత్’ ఫ్యాన్స్. ‘‘కరణ్.. జింగాత్ పాటను పాడు చేసిన తీరు చూస్తే సినిమాను ఇంకెలా చెడగొట్టావో అర్థమవుతోంది..’’ అని ఫైరైపోయారు. అయితే, మరాఠీ వెర్షన్ చూడనివారు మాత్రం ఈ పాటే బాగుందని మెచ్చుకోవడం సహజమే. మీరు కూడా కిందిచ్చిన రెండు పాట(తాజా (హిందీ) జింగాత్ను, ఒరిజినల్ (మరాఠీ) జింగాత్)లను చూసి ఏది బాగుందో చెప్పండి.... (ధడక్) (సైరట్) Zingat from Sairat Zingat from Dhadhak#ZingaatRuined pic.twitter.com/uY8WMdaJmZ — Smoking Skills (@SmokingSkills_) 27 June 2018 Pic 1- Zingaat from Sairaat 😍 Pic 2- Zingaat from Dhadak 😒#ZingaatRuined Who agrees with me? 🙋😜 pic.twitter.com/c7ZPcSCvY5 — 💥 Šheetu ❤ Šhilpu 💥 (@Dil_ka_aitbaar) 27 June 2018 People to Karan Johar after listening to #Zingaat #zingaatRuined pic.twitter.com/RNlKoFwOMb — Ganesh Parmar (@SarcasmSeekar) 27 June 2018 Now I am 100% sure @karanjohar gonna ruined Sairat , #zingaatRuined Zingaat is successfully ruined . — Mrs. Shah Rukh Khan (@SRKkiSoni) 27 June 2018 Listened to this song 3 times after listening to Dhadak’s Zingaat.😭#ZingaatRuined pic.twitter.com/LQ0va5Hdj2 — Nutella ❥ (@Netzz_Rathi) 27 June 2018 Zingat original Vs Zingat remake@karanjohar #ZingaatRuined pic.twitter.com/SCn7F3nNgK — Imran (@imranyh) 27 June 2018 What Karan Johar has done to #Zingaat song...#zingaatRuined pic.twitter.com/Oswn1yMqHi — The (@Chandorkar) 27 June 2018 -
ధడక్ జింగాత్ పాట
-
వారి ప్రశంసకు మురిసిపోయిన జాన్వీ
ముంబై : అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్.. బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. త్వరలోనే తను నటించిన ‘ధడక్’ సినిమా తెరపైకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ను చూసిన వారంతా.. జాన్వీ నటనను, అందాన్ని చూసి ఫిదా అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. తొలి సినిమానే అయినా జాన్వీ చాలా అద్భుతంగా నటించిందని, హావభావాలను పలికించిన తీరు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇన్ని ప్రశంసల్లో ఓ కాంప్లిమెంట్ తన హృదయాన్ని తాకిందట. అది అన్న అర్జున్ కపూర్ మెచ్చుకోలు. ‘ఈ సినిమాలో నీవు చాలా నిజాయితీతో నటించినట్టు ఉంది. హీరోయిన్ మాదిరి నీవు నటించలేదు. పాత్రలో లీనైపోయావు. నిజాయితీగా నీ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించావు’ అని అర్జున్ ప్రశంస ఇచ్చాడట. ఈ మెచ్చుకోలును తన బెస్ట్ కాంప్లిమెంట్‌గా జాన్వీ చెప్పింది. అర్జున్ నుంచి వచ్చిన ఈ ప్రశంసతో తాను చాలా సంతోషంగా ఫీల్ అయినట్టు పేర్కొంది. అంతేకాక తన తండ్రి బోని కపూర్ కూడా ‘వావ్, ఎంత సహజంగా నీవు నటించావు’ అని ప్రశంసించారట. ఈ ఇద్దరి కాంప్లిమెంట్‌తో తాను చాలా ఖుషీగా ఉన్నట్టు జాన్వీ ఇటీవల ఇచ్చిన ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. కాగ, ధడక్‌లో జాన్వీకి జోడిగా షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ నటించాడు. జాన్వీ, ఇషాన్ ఇద్దరూ పోటీపడి నటించినట్టు ఉందని, ఇషాన్ ఖట్టర్ నటన కూడా అద్భుతంగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. మరాఠి హిట్ మూవీ ‘సైరాట్' రీమేక్‌గా ‘ధడక్' చిత్రాన్ని తెరకెక్కించారు. -
సారీ జాన్వీ
ఇంటి నుంచి బయటకు వెళ్తేనే బోలెడు జాగ్రత్తలు చెబుతారు అన్నయ్యలు. కొత్త ఉద్యోగంలోకి అడుగుపెడుతున్నప్పుడు కూడా చాలా టిప్స్ చెబుతారు. హీరోయిన్గా తన టాలెంట్‌ని ఫ్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జాన్వీకి కూడా అలాంటి సూచనలే ఇస్తున్నారు అర్జున్ కపూర్. జాన్వీ పరిచయం కానున్న ‘ధడక్’ ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. షూటింగ్లో భాగంగా వేరే దేశంలో ఉన్న అర్జున్ కపూర్ తన సలహాలను, శుభాకాంక్షాలను ట్వీటర్ ద్వారా పంచుకున్నారు. ‘‘సారీ.. ముంబైలో లేనందున ఈవెంట్‌కి రాలేకపోతున్నాను. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎప్పటికీ ఆడియన్స్‌లో నువ్వో భాగం అయిపోతావు. నీకో విషయం చెప్పదలుచుకున్నాను.. బాగా కష్టపడుతూ,నిజాయితీగా ఉంటూ, ప్రసంశలను తలకెక్కించుకోకుండా, అందరి ఒపీనియన్ తీసుకుంటూనే నీకంటూ ఓ దారిని సృష్టించుకోగలిగితే ఈ ఇండస్ట్రీకి మించిన గొప్ప చోటు లేదు. వాట్టన్నింటిని నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు అర్జున్. -
కన్నీటిపర్యంతమైన శ్రీదేవి చిన్న కూతురు
-
కన్నీటిపర్యంతమైన ఖుషీ కపూర్
జాన్వీ కపూర్‌కు, ఎంటైర్ కపూర్ ఫ్యామిలీకి నేడు బిగ్ డే. అలనాటి అందాల తార శ్రీదేవి, బోని కపూర్ల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న ధడక్ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. అనిల్ కపూర్, బోని కపూర్ల నుంచి ఖుషీ కపూర్ వరకు ఈ ట్రైలర్ లాంచ్‌కు హాజరయ్యారు. ఈ ఉద్వేగభరిత సందర్భంలో శ్రీదేవీ లేకపోవడం ప్రతి ఒక్కర్ని కలచివేసింది. చిన్న కూతురు ఖుషీ తనను తాను నియంత్రించుకోలేక, తల్లిని తల్లుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అలా తీవ్ర ఉద్వేగానికి గురైన చెల్లిని, జాన్వీ కపూర్ అక్కుని చేర్చుకుని ఓదార్చడంతో అక్కడున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. జాన్వీ సైతం మీడియా ఎంతో ముందు ఎంతో నెర్వస్‌గా ఫీలయ్యారు. జాన్వీని బాలీవుడ్‌కు పరిచయం చేయడంపై శ్రీదేవీ ఎప్పుడూ కలలు కంటూ ఉండేవారు. తల్లి కలను జాన్వీ నిజం చేయబోతున్నారు. శ్రీదేవి మరణించిన దగ్గర్నుంచి అక్కా చెల్లెళ్లు ఒకరికొకరు ఎంతో చేదుడువాదోడుగా ఉంటున్నారు. వీరికి అన్న అర్జున్ కపూర్, సోదరి అన్హులా కపూర్లు కూడా అండగా నిలబడుతూ వస్తున్నారు. నేడు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మనసుకు హత్తుకునేలా ఓ పోస్టు కూడా చేశారు. ఇషాన్ ఖట్టర్, జాన్వీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ ఖైటన్ దర్శకత్వం వహిస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. -
జాన్వీ ధడక్ ట్రైలర్
లెజెండరీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ధడక్ ట్రైలర్ వచ్చేసింది. ఇషాన్ ఖట్టర్, జాన్వీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ ఖైటన్ దర్శకత్వం వహిస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. ‘ఎప్పుడైతే రెండు వేర్వేరు ప్రపంచాలు కలుస్తాయో.. అవి ఒక్కటిగా మారిపోవటం ఖాయం’ అంటూ దఢక్ కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. మధుకర్, పార్వతి పాత్రల్లో ఇషాన్, జాన్వీలు అలరించనున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ, సరదా సన్నివేశాలు, రొమాంటిక్ లైఫ్... అంతా సజావుగా సాగిపోతున్న వేళ... వారి కుటుంబాలు అడ్డుతగలటం, ఎమోషన్స్ సన్నివేశాలు, ప్రేమను బతికించుకునేందుకు దూరంగా పారిపోవటం తదితర అంశాలతో ట్రైలర్ ను కట్ చేశారు. బబ్లీ యాక్టింగ్‌తో జాన్వీ, ఇషాన్‌లు ఆకట్టుకున్నారు. మరాఠీ హిట్ సైరాట్‌కు రీమేక్ కావటం, విషాదాంత కథాంశం అయినప్పటికీ... ధడక్‌పై బాలీవుడ్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. జూలై 20న దఢక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ధడక్ ట్రైలర్ విడుదల