Digestion
-
AP: లాభాల తీపి పెంచేలా
సాక్షి, అమరావతి : పంచదారతో పోలిస్తే బెల్లంలో పోషక విలువలు ఎక్కువ. ఔషధ గుణాలకూ కొదవ లేదు. జీర్ణశక్తిని పెంచడం.. రక్తహీనతను తగ్గించడం వంటి సుగుణాలెన్నో బెల్లానికి ఉన్నాయి. అయినా పంచదారకు ఉన్నంత డిమాండ్ బెల్లానికి లేదు. ఈ నేపథ్యంలోనే బెల్లంతో విలువ ఆధారిత ఇతర ఉత్పత్తుల్ని తయారు చేయడంపై అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం చెరకు రైతులకు, బెల్లం తయారీదారులకు శిక్షణ ఇస్తోంది. తద్వారా వారి ఆదాయాలను.. మరోవైపు బెల్లం వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. బెల్లం పొడి.. మంచి రాబడి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇతర లవణాలు, ప్రోటీన్ల వల్ల త్వరగా బూజు పట్టడం, నీరు కారటం వంటి కారణాల వల్ల బెల్లం నాణ్యత చెడిపోతుంది. దీనిని నివారించేందుకు అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం బెల్లాన్ని పొడి రూపంలో మార్చే సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ పొడి గోధుమ వర్ణంలో పంచదార రేణువుల్లా ఉంటుంది. దీనికి అమెరికా, ఫిలిప్పీన్స్, కొలంబియా, ఇండోనేషియా దేశాల్లో డిమాండ్ ఎక్కువ. చెరకు రసాన్ని స్థిరీకరించిన మోతాదులో స్ప్రే డ్రైయింగ్ ద్వారా పొడి రూపంలో మార్చుకోవచ్చు. చాక్లెట్లు.. కేకుల తయారీ ఇలా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరిగించిన వెన్నలో కోకో, బెల్లం పొడి కలిపిన మిశ్రమానికి జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు అద్ది చాక్లెట్ అచ్చులలో వేయడం ద్వారా చాక్లెట్లు తయారవుతాయి. ఇదే తరహాలో చోడి పిండి, బెల్లం పొడి కలిపి కూడా చాక్లెట్లను తయారు చేసుకోవచ్చు. బెల్లం కేకు తయారీ కోసం కరిగించిన వెన్నలో బెల్లం పొడి, గోధుమ పిండిలో బేకింగ్ పౌడర్లను కలిపి తయారు చేసుకున్న మిశ్రమానికి కొద్దికొద్దిగా నీళ్లు వేస్తూ కాస్త జారుగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఆ తరువాత మైక్రో ఓవెన్లో 100–190 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 20 నిమిషాల పాటుచేసి.. 5 నిమిషాలపాటు చల్లారిస్తే రుచికరమైన కేక్ తయారవుతుంది. ఓట్స్ కుకీస్.. న్యూట్రీ బార్స్ వెన్న, బెల్లం పొడి కలిపిన మిశ్రమంలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, నానబెట్టిన ఓట్స్, యాలకుల పొడివేసి కలిపిన మిశ్రమాన్ని పాలు లేదా నీళ్లు వేసి చపాతి ముద్దలా చేసి డీప్ ఫ్రిజ్‌లో 10 నిమిషాలు పెట్టాలి. ఆ తర్వాత చపాతి కర్రతో ఒత్తుకుని కావాల్సిన ఆకారాల్లో బిస్కెట్లుగా కోసి ట్రేలో అమర్చి మైక్రో ఓవెన్లో 120 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 20 నిమిషాల పాటు బేకింగ్ చేస్తే రుచికరమైన బెల్లం ఓట్స్ కుకీస్ తయారవుతాయి. న్యూట్రీ బార్స్ తయారీ విషయానికి వస్తే.. బెల్లం లేత పాకం వచ్చిన తర్వాత తొలుత కొర్రలు, సామలు, జొన్నల మిశ్రమాన్ని ఆ తర్వాత వేరుశనగ పప్పు, బెల్లం, యాలకుల పొడిని వేసి బాగా కలిపి ట్రేలో వేసి సమానమైన ముక్కలు చేసి చల్లారనివ్వాలి. ఇలా తయారైన న్యూట్రీ బార్లను ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి గాలి చొరబడని ప్రదేశంలో భద్రపర్చుకోవాలి. బెల్లం పానకం చెరకు రసాన్ని శుద్ధి చేసి మరగబెట్టిన తరువాత చిక్కటి పానకం తయారవుతుంది. దీనిని దోశ, ఇడ్లీలు, గారెలు, రొట్టెలతో చట్నీ లేదా తేనె మాదిరిగా కలిపి తింటారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో దీనిని చపాతీలు, పూరీల్లో కూడా వాడుతుంటారు. పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన జాగరీ ప్లాంట్ ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి బెల్లం పానకం లేదా బెల్లం, బెల్లం పొడిని తయారు చేస్తారు. బెల్లం కాఫీ ప్రీమిక్స్.. జెల్లీస్.. సోంపు బెల్లం పొడిని పాలు, యాలకుల పొడితో కలిపి ప్రీమిక్స్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. దీనిని 7.5 గ్రాముల మోతాదులో 100 గ్రాముల వేడి నీళ్లలో కలిపితే రుచికరమైన కాఫీ తయారవుతుంది. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 5 నిమిషాలు మరిగించిన చెరకు రసానికి తగిన మోతాదులో జెలటీన్ అడార్ జెల్‌ని కలిపి చల్లారిన తర్వాత మౌల్డ్‌లో వేసుకుని శీతల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిస్తే బెల్లం జెల్లీ రెడీ అవుతుంది. అల్లం లేదా ఉసిరిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని డ్రయ్యర్లో ఆరబెట్టి బెల్లం కోటింగ్ మెషిన్లో 30–70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద తగినంత నీరు కలిపిన బెల్లం పొడి ద్రావణాన్ని కొద్దికొద్దిగా వేస్తే బెల్లం కోటింగ్‌తో రుచికరమైన అల్లం, ఉసిరి ముక్కలు తయారవుతాయి. అదేరీతిలో సోంపును కూడా తయారు చేసుకోవచ్చు. పాస్తా.. నూడిల్స్ బెల్లంతో నూడిల్స్ లేదా పాస్తా తయారు చేసుకోవచ్చు. పుడ్ ఎక్స్‌ట్రూడర్ అనే మెషిన్లో గంటకు 25–35 కేజీల వరకు పాస్తా పదార్థాలను వివిధ ఆకారాల్లో తయారు చేయవచ్చు. బెల్లం పొడి, గోధుమ పిండి, మొక్కజొన్న రవ్వ, మైదా, రాగి పిండి మిశ్రమాన్ని పాస్తా మెషిన్లో ట్యాంక్‌లో వేస్తారు. తగినంత నీళ్లు పోసి 5–10 నిమిషాల పాటు మిక్సింగ్ చేసి మరో 45 నిమిషాల తర్వాత నచ్చిన ఆకారంలో ఉండే ట్రేలలో వేస్తే పాస్తాలు తయారవుతాయి. వాటిని డ్రయ్యర్లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 5 గంటలపాటు ఆరబెడితే చాలు. శిక్షణ ఇస్తున్నాం బెల్లంతో ఇతర ఉత్పత్తుల తయారీలో పాటించాల్సిన సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తున్నాం. విదేశాలకు ఎగుమతి చేసే విధంగా బెల్లం దిమ్మలు, పాకం, పొడి రూపంలో తయారయ్యేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక బెల్లం తయారీ ప్లాంట్ రూపొందించాం – డాక్టర్ పీవీకే జగన్నాథరావు, సీనియర్ శాస్త్రవేత్త, అనకాపల్లి ప్రాంతీయ పరిశోధనా కేంద్రం -
కడుపు నొప్పి: అల్లం, పుదీనా, గ్రీన్ బనానా.. వీటితో..
ఇంట్లో ఫేవరేట్ వంటలు చేస్తే ఆరోజు మన చేతికి ఎముక ఉండదు. లాగించెయ్యడమే... ఇక రోడ్డు పక్క స్టాల్స్, హోటళ్ల ఇష్టమైన, ఘుమఘుమలాడే చిరుతిండ్లు కనిపిస్తే ఇంకేముంది.. క్షణాల్లో అక్కడ వాలిపోతాం! ఆనక.. తిన్నది అరగక.. పడేతిప్పలు అన్నీఇన్నీకాదు. కడుపునొప్పితో ప్రారంభమై వాంతులు, మలబద్ధకం/విరేచనాలు... ఒక్కోసారి.. క్లైమాక్స్‌లో హాస్పిటల్ బిల్ చూసి మూర్చపోయేంత పనౌతుంది. పిల్లలు, పెద్దల్లో సర్వసాధారణంగా కనిపించే కడుపునొప్పికి వంటింట్లో దొరికే ఈ 5 రకాల పదార్థాలతో ఏ విధంగా ఉపశమనం పొందవచ్చో నిపుణుల మాటల్లో.. అల్లం కడుపునొప్పి సాధారణ లక్షణాలు వికారం, వాంతులు. వీటి నివారణకు ఎప్పుడైతే చర్యలు తీసుకుంటామో అప్పుడు మన శరీరం కొంత తేరుకుంటుంది. వికారం, వాంతులకు సహజమైన నివారణ మంత్రం అల్లం అని చెప్పవచ్చు. అల్లం నేరుగా తిన్నా లేదా వంటల్లో వాడినా ఎంతో మేలు చేస్తుంది. ద్రావణ రూపంలో తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు, తాపనివారణకు అల్లం అద్భుతమైన ఔషధమని ఫోర్టిస్ హాస్పిటల్‌కు చెందిన డా. అహుజా తెలిపారు. సీమ చామంతి కడుపునొప్పితో సహా వివిధ వ్యాధుల నివారణకు పూర్వకాలం నుంచే సీమ చామంతి వాడుకలో ఉంది. పేగు సంబంధిత వ్యాధులు అంటే గ్యాస్, అజీర్ణం, డయేరియా, వాంతులకు ఈ ఔషధమొక్క బాగా పనిచేస్తుంది. దీనిని కషాయం రూపంలో పిల్లలకు పట్టిస్తే కడుపునొప్పి ఇట్టే మాయం అవుతుంది. ఈ వ్యాధుల నివారణలో సీమ చామంతి ఔషదమొక్క కీలకపాత్రపోషిస్తున్నప్పటికీ, దీని పనితీరుపై మరికొంత అధ్యయనం చేయవలసి ఉంది. పెప్పర్మింట్(పుదీనా) ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనేది పెద్ద పేగు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి. కడుపునొప్పి, ఉబ్బసం, మలబద్ధకం, డయేరియా వంటివి దీని ప్రధాన లక్షణాలు. అసౌకర్యాన్ని కలిగించే ఈ లక్షణాలను పెప్పర్మింట్ హెర్బల్‌తో నివారించవచ్చు. పేగుల్లో ఆకస్మికంగా సంభవించే కండరాల నొప్పి తగ్గించడానికి, వాంతులు, డయేరియాల నివారణకు పెప్పర్మింట్లోని మెంథాల్ ఉపయోగపడుతుందని బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అధ్యయనాలు వెల్లడించాయి. చదవండి: Red Lady Finger: ఎర్ర బెండీ.. భలే భలే.. వాళ్లకి మేలు! గ్రీన్ బనానా డయేరియా తీవ్రతను పచ్చ అరటితో తగ్గించవచ్చు. పచ్చ అరటిలో రెసిస్టెంట్ స్టార్చ్ అనే ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. అది యాంటి డయేరియా కారకాలు కలిగి ఉంటుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల్లో నెమ్మదిగా పులిసిన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పేగులు ఎక్కువ నీటిని పీల్చుకొనేలా ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా అరటిలో విటమిన్ ‘బి6’, పొటాషియం, ఫోలిక్ యాసిడ్లు కూడా ఉంటాయి. ఈ పోషకాలు తిమ్మిరి, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. డయేరియా నివారణలో పచ్చ అరటి ప్రయోజనాలపై వెనుజులాకు చెందిన పీడియాట్రీషియన్ డా. థైజ్ అల్వరెజ్ అకోస్టా నిర్వహించిన పరిశోధనాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పెరుగు జీర్ణక్రియ కార్యకలాపాల్లో మార్పుల కారణంగా కడుపునొప్పి సంభవిస్తుంది. అంటే కడుపులోని బ్యాక్టీరియా అసమతుల్యతం అవుతుందన్నమాట. ప్రోబయోటిక్స్ (మంచి సూక్ష్మజీవులు) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గ్యాస్, ఉబ్బసం వంటి రుగ్మతలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చు. పెరుగులో జీవించి ఉండే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, డయేరియా (అతిసారా) నివారణకు తోడ్పడుతుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారు పెరుగు సేవిస్తే సులభంగా జీర్ణం అవుతుంది. ప్రోబయోటిక్ ఉత్పత్తులు ఐబీఎస్ రుగ్మతలకు ఉపశమనం కలిగిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలోని జువాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఎనా రే బెనర్జి వెల్లడించారు. చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
నోటి దుర్వాసనా.. ఇలా దూరం చేసుకోండి!
పదిమందిలో మాట్లాడాలంటే ఎంతో ఇబ్బంది కలిగించే అంశం.. నోటి నుంచి దుర్వాసన! సాధారణంగా ధూమపానం, మద్యపానం, గుట్కా, తంబాకు, వక్కపొడి లాంటి అలవాట్లున్నవారిలో ఈ సమస్య అధికం. కానీ కొంతమందిలో పైన చెప్పిన ఎలాంటి అలవాట్లు లేకున్నా, ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది సరైన నోటి శుభ్రత (ఓరల్ హైజీన్) పాటించకపోవడం, రెండవది కడుపులో జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోవడం. నోటి దుర్వాసన సమస్యను వైద్య పరిభాషలో ‘హాలిటోసిస్’ అంటారు. నోటి నుంచి దుర్వాసన వస్తోందంటూ డాక్టరును సంప్రదిస్తే మొదటగా ఆయన అడిగే ప్రశ్న ‘మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో కాస్త చెప్పండి’ అంటూ మనం తీసుకునే ఆహారం గురించే అడుగుతారు.ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం, తాజా తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తినాలంటారు. అలాగే ద్రవ పదార్థాలు పుష్కలంగా తాగాలంటారు. ఇవన్నీ మీ గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ట్రాక్ట్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. దాంతో కడుపులో ఎలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులూ తలెత్తవు. ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన మరో జాగ్రత్త కూడా ఉంది. అదే... ఆహారం తీసుకున్న ప్రతిసారీ ఫ్లాసింగ్ ప్రక్రియ ద్వారా దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలు బెటర్.. నోటి దుర్వాసనను సమర్థంగా ఎదుర్కోవడంలో కొత్తిమీర, పుదీన, యూకలిప్టస్, రోజ్మేరీ, ఏలక్కాయ వంటివి బాగా పని చేస్తాయి. ఈ ఔషధీయ పదార్థాలను అలాగే నమలడం లేదా వాటిని నీటిలో మరిగించి ఆ టీని తాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని అపసవ్యతలు తగ్గి, పనితీరు మెరుగవుతుంది. దాంతో నోటి దుర్వాసనా దూరమవుతుంది. అలాగే మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారం తరవాత కూడా చివరగా ఏలక్కాయ, కొత్తిమీర, పుదీన వంటి వాటిని తినడం ద్వారా నోటి దుర్వాసనను దూరంగా ఉండవచ్చు. తాజాపరిశోధనల ప్రకారం... రోజూ తాజా పెరుగు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనకు కారణమైన హైడ్రోజెన్ సల్ఫేడ్ పాళ్లను అదుపుచేయవచ్చు. పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవడం ద్వారా దంతాల మీద పాచి పేరుకోవడాన్ని, చిగుళ్ల వ్యాధులను కూడా నివారించవచ్చు. నమిలినప్పుడు కరకరలాడే (అంటే క్రంచీగా అనిపించే పండ్లు) పండ్లు అయిన ఆపిల్స్, క్యారట్స్ వంటి పీచు పదార్ధాలు సమృద్ధిగా ఉండేవాటినీ, కూరగాయలు నోటి దుర్వాసనకు విరుగుడుగా పని చేస్తాయి. వీటిని తినడం వల్ల లాలాజలం ఎక్కువగా విడుదలై నోటిని శుభ్రంగా ఉంచుతుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లతో కూడిన చాలా రకాల పోషకాహారం దంతాల మీద పాచి పేరుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ సమస్యను పండ్లు, ఆకుకూరలు, కాయగూరలను తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. హాలిటోసిస్‌కు చిగుళ్ల వ్యాధులు, జింజవైటిస్ వంటి దంతాల సమస్యలు ముఖ్యమైన కారణాలు. వీటిని నివారించాలంటే‘సి’ విటమిన్ పుష్కలంగా ఉండే నిమ్మజాతి పండ్లు, ఉసిరితో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. చదవండి: నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు -
నిద్ర అలవాట్లలో తేడా వస్తే...
వేళకింత తిని.. పడుకోవాలని పెద్దలు అంటూంటే.. వారిదంతా చాదస్తం అని యువతరం కొట్టిపారేస్తూంటుంది. కానీ.. బ్రైగమ్ అండ్ విమన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ప్రకారం.. నిద్ర అలవాట్లలో వచ్చే తేడాలు ఊబకాయం, హైపర్ టెన్షన్లతోపాటు మధుమేహం వంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యలకూ కారణమవుతోందని తెలియడం చూస్తే మాత్రం పెద్దలమాట చద్దిమూట అనుకోవాల్సిందే. ఒక్కోరోజు ఒక్కో సమయంలో నిద్రపోయే వారితో పాటు.. నిద్రపోయే సమయంలో కూడా తేడాలు ఉండేవారు 2000 మందిని పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తియాన్వీ హువాంగ్ తెలిపారు. ఆరేళ్లపాటు జరిపిన పరిశీలనల తరువాత ఈ తేడాలు ఎక్కువగా ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. అయితే ఈ అధ్యయనంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని.. కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారి నిద్ర అలవాట్ల గురించి వారిని ప్రశ్నించి తెలుసుకోవడం ఇందులో ఒకటని.. ఆక్టీ గ్రాఫ్ వంటి వాచీలను వాడటం ద్వారా వారంలో వారు ఎంత సమయం నిద్రపోతున్నారో తెలుసుకున్నారని వీరు విమర్శిస్తున్నారు. వీటి ఆధారంగా వారి నిద్ర అలవాట్లలో వచ్చిన తేడాలు ఏమిటన్నది నిర్దిష్టంగా తెలియదని చెప్పారు. -
తినేది మొత్తం పది గంటల్లోనే...
ఉదయాన్నే ఓ కాఫీ.. ఆ తరువాత ఉపాహారం.. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి మళ్లీ భోజనం! ఇదీ మనలో చాలామంది ఆహారపు అలవాట్లు. ఇంకోలా చెప్పాలంటే 14 నుంచి 15 గంటల పాటు అప్పుడప్పుడూ తింటూనే ఉంటాం అన్నమాట. ఇలాకాకుండా ఒక రోజులో తినేది ఏదో మొత్తం పది గంటల్లోపు తినేస్తే అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చునని అంటున్నారు సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. మానవుల్లో జీర్ణక్రియకు సంబంధించిన జన్యువులు ఉదయం వేళల్లో ఎక్కువ చురుకుగా ఉంటాయని, కణ మరమ్మతులకు సంబంధించినవి రాత్రిపూట చైతన్యంగా ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సచ్చిదానంద పాండ తెలిపారు. ఎలుకలపై తాము కొన్ని పరిశోధనలు చేశామని, కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువగా ఉన్న ఆహారాన్ని రోజంతా తీసుకున్న ఎలుకలు కొంతకాలానికే ఊబకాయం, ఇతర జీర్ణసంబంధిత ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టగా ఎనిమిది నుంచి పదిగంటల గడువులో మాత్రమే ఆ రకమైన ఆహారమే తీసుకున్న ఎలుకలు నాజూకుగా, ఆరోగ్యంగా ఉన్నాయని ఆయన వివరించారు. శరీర గడియారానికి అనుగుణంగా ఆహారం తీసుకోవడం వల్లనే ఈ ఆరోగ్య లాభాలు చేకూరాయని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. -
బీపీఏ రసాయనంతో మధుమేహం?
మధుమేహం వచ్చేందుకు మన జీవనశైలి కారణమని కొందరంటారు.. ఊబకాయమని ఇంకొందరు.. వారసత్వమని మరికొందరు అంటూంటారు. ఇవన్నీ నిజమే. కాకపోతే యూనివర్సిటీ ఆఫ్ మిసోరీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన పుణ్యమా అని ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు చాలా క్షేమకరం అని చెప్పిన ‘బిస్ఫెనాల్ – ఏ’ (బీపీఏ) అనే రసాయనం ఇన్సులిన్ విడుదలను నియంత్రిస్తూంటుందని వీరు అంటున్నారు. ప్లాస్టిక్‌తోపాటు కొన్ని ఇతర పదార్థాల్లోనూ వాడే ఈ రసాయనం జీర్ణక్రియలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫెడ్రిక్ వోమ్ సాల్ తెలిపారు. ఎలుకలతోపాటు, మనుషుల కాలేయ కణాలపై తాము ప్రయోగాలు చేశామని, గ్లూకోజ్ సమక్షంలో బీపీఏ రసాయనం తక్కువ స్థాయిలో ఉన్నా కూడా ఇన్సులిన్ మోతాదుల్లో తేడాలు వచ్చినట్లు గుర్తించామని వివరించారు. ఇన్సులిన్ తగ్గిపోతే.. రక్తంలోని గ్లూకోజ్ బయటకు వెళ్లిపోదు. దీర్ఘకాలంలో ఈ పరిస్థితి మధుమేహానికి దారితీస్తుందన్నది తెలిసిందే. మధుమేహం విషయంలో బీపీఏ ప్రభావంపై ఒక అధ్యయనం జరగడం ఇదే తొలిసారి అని.. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఫలితాలను రూఢీ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. -
ఊబకాయానికి.. బ్యాక్టీరియాకు లింకు!
‘‘తినడం తగ్గించేశాను.. రోజూ వ్యాయామం చేస్తున్నాను. కాని ఒళ్లు తగ్గడం లేదు’’ ఈ రకమైన వ్యాఖ్యలు మనం తరచు వింటూంటాం. శరీర™ è త్వం అంతేనేమో అనుకుని సరిపెట్టుకుంటాం కూడా. అయితే అసలు కీలకం మన పేగుల్లోని బ్యాక్టీరియాలో ఉందంటున్నారు మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు. శరీరానికి శక్తినిచ్చే కేలరీలన్నీ ఒకేరకంగా ఉండవని, పేగుల్లోని బ్యాక్టీరియా మనం ఆహారాన్ని ఖర్చుపెట్టే క్రమాన్ని మార్చేడం ద్వారా ఒళ్లు పెరగడం/తగ్గడాలను ప్రభావితం చేస్తున్నట్లు వీరు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. బరువు తగ్గించుకోవాలనుకుంటున్న ఊబకాయుల పేగుల్లోని బ్యాక్టీరియాలో చాలా మార్పులు ఉన్నాయని వీరు గుర్తించారు. సులువుగా ఒళ్లు తగ్గే వారిలో ఫాస్కోలార్కోటో బ్యాక్టీరియం ఎక్కువగా ఉంటే, ఇతరుల్లో డయాలిస్టర్ బ్యాక్టీరియా సమృద్ధిగా ఉన్నట్లు తాము గుర్తించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త వందనా నెహ్రా తెలిపారు. అలాగే కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయగల ఎంజైమ్‌ల విషయంలోను ఇరువురిలో తేడాలు ఉన్నట్లు తెలిసిందని ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వైద్యులు ఊబకాయులకు మరింత ప్రభావవంతమైన సలహా, సూచనలు ఇవ్వవచ్చునని వందన వివరించారు. -
పిండి పదార్థం పెరిగితే పిల్లల్లో ఎదుగుదల!
పిల్లల్లో ఎదుగుదల లోపాలను నివారించేందుకు రెసిస్టెంట్ స్టార్చ్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఆఫ్రికాకు చెందిన పిల్లల వ్యర్థాలను విశ్లేషించడం ద్వారా అరటిపండుతోపాటు వేర్వేరు బీన్స్‌ల ద్వారా శరీరానికి లభించే పిండిపదార్థం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తించారు. పిల్లల్లోని బ్యాక్టీరియా ఈ రకమైన పిండిపదార్థం పూర్తిగా జీర్ణం కాకుండా పేవుల్లో పులియబెట్టి కొన్ని రకాల కొవ్వుల ఉత్పత్తికి సహకరిస్తాయని, ఈ కొవ్వులు కాస్తా కడుపులో వాపు/మంటలు రాకుండా నిరోధిస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. గర్భంలో ఫలదీకరణం చెందింది మొదలు.. పుట్టిన తరువాత రెండేళ్లకాలం వారి ఎదుగుదలకు ఎంతో కీలకమని.. ఈ తొలి వెయ్యి రోజుల కాలంలో పౌష్టికాహారం తీసుకుంటే జీవితాంతం మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చునని ఇప్పటికే జరిగిన అనేక పరిశోధనలు చెబుతున్నాయి. భారత్‌తోపాటు, ఆఫ్రికాలోనూ లక్షల సంఖ్యలో సవజాత శిశువులు పోషకాహార లోపం బారిన పడటమే కాకుండా.. పూర్తిస్థాయిలో ఎదగలేకపోతున్న నేపథ్యంలో ఈ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. కడుపు/పేవుల్లో వాపు/మంటల్లాంటివి లేకపోతే పోషకాలు శరీరానికి ఒంటబట్టి ఎదుగుదల మెరుగవుతుందని అంచనా. పసిపిల్లలకు అందించే ఆహారంలో రెసిస్టెంట్ స్టార్చ్‌ను పెంచడమే కాకుండా.. వండే పద్ధతుల్లో మార్పులు చేయడం ద్వారా ఈ పిండిపదార్థం శరీరంలోకి ఎక్కువగా చేరేలా చేయవచ్చునని వీరు సూచిస్తున్నారు. -
జీర్ణశక్తికి మిరియాలు
మిరియాలు ఆహారానికి రుచితో పాటు దేహానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వాటితో ఉన్న కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇవి. మిరియాలకు కడుపులోని జీర్ణరసాలను స్రవింపజేసే గుణం ఉంది. ఆకలిని ప్రేరేపిస్తాయి. అందుకే ఆహారం జీర్ణం కాకుండా కడుపు ఉబ్బరం వంటి సమస్యతో బాధపడేవారు మిరియాలను తీసుకోవడం మంచిది. అవి కడుపులోని జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైములను, రసాయనాలను పుష్కలంగా స్రవించేలా చేసి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదపడతాయి. మిరియాలతో కూడిన ఆహారం తీసుకునేవారిలో కడుపు సంబంధిత సమస్యలు చాలా తక్కువ. అవి మలబద్దకాన్ని, డయేరియాను సైతం నివారిస్తాయి. మిరియాలలో యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వల్ల హానికరమైన ఇన్ఫెక్షన్స్ను సమర్థంగా నిరోధిస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలకు తొలుత స్ఫురించే చిట్కా వైద్యం మిరియాలే. అవి జలుబు, దగ్గులను నివారించడానికి వాటిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణమే కారణం. ఛాతీ పట్టేసినట్లు ఉన్నా, శ్వాస తీసుకోవడం కష్టమైనా మిరియాలు తీసుకుంటే తక్షణం ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎన్నో రకాల క్యాన్సర్ల నివారణకు సమర్థంగా తోడ్పడతాయి. మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను మిరియాలు సమర్థంగా అరికట్టడం ద్వారా క్యాన్సర్‌ను నివారిస్తాయి. మిరియాలు తీసుకునేవారిలో పొట్ట పెరగదు. అంతేకాదు... అవి బరువు పెరగకుండా కూడా తోడ్పడతాయి. మిరియాలలోని పైపరిన్ అనే పదార్థం మెదడు కణాలను ఉత్తేజపరుస్తుంది. దాంతో మతిమరపు, అలై్జమర్స్ లాంటి అనేక నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. మెదడు చురుగ్గా ఉంటుంది. -
జీర్ణశక్తిని పెంచే బొప్పాయి!
బొప్పాయి పండుతో ఆరోగ్యానికి సమకూరే ప్రయోజనాల జాబితాకు అంతు లేదు. జీర్ణక్రియకు తోడ్పడటం మొదలుకొని... అది జరిగే సమయంలోనే అందులోని హానికరమైన క్రిములను తుదముట్టించడం వరకు అనేక మేళ్లు చేస్తుంది బొప్పాయి. అందులో కొన్ని... ►బొప్పాయి కంటికి మేలు చేస్తుంది. కంటికి వచ్చే మాక్యులార్ డీజనరేషన్ అనేæ కంటి జబ్బును నివారిస్తుంది. ∙ఎముకలు బలహీనంగా మారే ఆస్టియోఆర్థరైటిస్ను బొప్పాయి అరికడుతుంది.∙బొప్పాయి తినేవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ ∙అనేక రకాల క్యాన్సర్లతో బొప్పాయి పోరాడుతుంది ∙మహిళల్లో రుతుక్రమాన్ని చక్కబరుస్తుంది. గర్భవతుల విషయంలో ఒక జాగ్రత్త : పండిన బొప్పాయి గర్భవతులకు మేలే అయినప్పటికీ వారికి బొప్పాయి పెట్టే విషయంలో ఒకింత జాగ్రత్త అవసరం. పూర్తిగా పండనిదీ, లేదా బాగా పచ్చిగా ఉన్న బొప్పాయిలో ‘పపాయిన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేసి కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీసేలా చేయవచ్చు. అందుకే పచ్చిది, పాక్షికంగా పండినవాటిని మాత్రం వారు తినకూడదు. -
తేలిక పడండి
బయట వాతావరణంలో వేడి బాగా తగ్గినప్పుడు జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. తద్వారా అరుగుదల సమస్యలు ఏర్పడతాయి. అదే సమయంలో ఈ సీజన్లో తాత్కాలిక ఆనందం కోసం తీసుకునే టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివి మరిన్ని అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా పొట్టలో గ్యాస్, ఎసిడిటీ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే గత వారం మనం గ్యాస్ సమస్యకు చెక్ పెట్టే కొన్ని యోగాసనాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరికొన్ని ఆసనాలు... శలభాసనం బోర్లా పడుకుని చేతులు రెండూ శరీరం కిందకు, అరచేతులు పొట్ట కిందకు పోనించి, వీలైతే మోచేతులు కూడా పొట్ట, ఛాతీ కిందకు తీసుకెళ్లాలి. ముందుగా గడ్డాన్ని నేల మీద ఉంచి సపోర్ట్ తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ కాళ్లు రెండూ ఎంత వరకూ వీలైతే అంత పైకి తీసుకెళ్లాలి. మోకాళ్లు, తొడలు భూమిని తాకకుండా చేయగలిగితే ఉత్తమం. మోకాళ్లు స్ట్రైయిట్‌గా ఉంచగలిగితే మరీ ఉత్తమం. లేదా ఎవరి శక్తి మేర వాళ్లు చేయవచ్చు. చివరిస్థితిలో గడ్డాన్ని కూడా భూమి మీద నుంచి పైకి లేపే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ ఛాతీ, కాళ్లు నెమ్మదిగా భూమి మీదకు తీసుకురావాలి. జాగ్రత్తలు: పొట్టలో అల్సర్సు ఉన్నవాళ్లు పొట్ట మీద కొంచెం ఒత్తిడి తక్కువగా వుండేట్టు ప్రయత్నం చేయాలి. భుజంగాసనం ఆసనంలో బోర్లా పడుకుని ఫొటోలో చూపిన విధంగా మోచేతులు రెండూ భూమి మీద ఉంచాలి. శ్వాస తీసుకుంటూ తలను, ఛాతీని పైకి లేపి ఉంచాలి. కాళ్లు రెండూ స్ట్రెయిట్‌గా పాదాలు రెండూ కూడా స్ట్రెచ్ చేసిన స్థితిలో ఉంచాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ ఛాతీని తలను కిందకు తీసుకురావాలి. ఇదే విధంగా 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయాలి. లాభాలు: ఇది గ్యాస్ సమస్యకు మాత్రమే కాకుండా, కింది వెన్నునొప్పికి మలబద్ధకానికి కూడా ఉపయోగపడుతుంది. గమనిక: మోచేతులు రెండూ పూర్తిగా ఓపెన్ చేసి చేతులు రెండూ స్ట్రెయిట్‌గా ఉంచి అరచేతులతో భూమిని గట్టిగా అదుముతూ తలను, ఛాతీని వీలైనంత పైకి లేపి మెడ భాగాన్ని పైకి సాగదీస్తూ చేసే ఆసనాన్ని పూర్ణ భుజంగాసనంగా వ్యవహరిస్తారు. ధనురాసన పొట్టమీద బోర్లా పడుకుని కాళ్లు రెండూ మడిచి ఎడమ చేత్తో ఎడమ చీలమండను లేదా పాదాన్ని, కుడిచేత్తో కుడి పాదాన్ని పట్టుకుని శ్వాస తీసుకుంటూ కాళ్లను, మోకాళ్లను పైకి లేపుతూ ఛాతీని తలను పైకి లేపుతూ ధనురాసన స్థితిలోకి రావాలి. 3 లేదా 5 శ్వాసల పాటు అలా ఉండి శ్వాస వదులుతూ రెండు కాళ్లు తల ఛాతీ భూమి మీదకు నెమ్మదిగా తీసుకురావాలి. ఈ ఆసనాన్ని కూడా 5 సార్లు రిపీట్ చేయడం, ఆసన స్థితిలో ఉన్నప్పుడు ముందుకు వెనుకకు స్వింగ్ అవడం, పక్కలకు రోల్ అవ్వడం వలన కూడా మంచి ఫలితం కనపడుతుంది. ప్రయోజనాలు: గ్యాస్ సమస్యతో పాటు పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గడానికి ఊబకాయానికి కూడా బాగా ఉపకరిస్తుంది. గమనిక: పాదాలు చేత్తో పట్టుకోవడం కుదరనివాళ్లు ఏదైనా తాడును కాని, చున్నీని కాని ఉపయోగించవచ్చు. అదీ సాధ్యపడకపోతే రెండు చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి కాళ్లు రెండూ భూమి పై నుంచి పైకి లేపి శ్వాస తీసుకుంటూ తలపైకి కాళ్లు కిందకు శ్వాస వదులుతూ తల కిందకు కాళ్లు రెండూ ఇంకా పైకి లేపుతూ స్వింగ్ అవ్వాలి. దీనిని అథోముఖ చాలన నౌకాసనంగా వ్యవహరిస్తారు. పొట్ట ఆధారంగా చేసే ఆసనాలు ఏమైనా అల్సర్సు ఉన్నవాళ్లు జాగ్రత్తగా సాధన చేయాలి. ఈ ఆసనాలు చేయడానికి ముందు ఒక ఆదివారం కాని లేదా ఏదైనా సెలవు దినం నాడు కాని చక్కగా శంఖ ప్రక్షాళన చేయడం కూడా అవసరం. గర్భిణీ స్త్రీలు చేయకూడదు. – సమన్వయం: ఎస్. సత్యబాబు మోడల్: ఈషా హిందోచా, ఫొటోలు: పోచంపల్లి మోహనాచారి - ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
ఎల్లో కల్లోలం
ఏ, బి, సి, డి, ఇ .. వీటిల్లో ఏది తాకినా ఒళ్లంతా అల్లకల్లోలమే! హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఇ.. లు కొన్నిసార్లే ప్రాణాంతకం అయినా దీర్ఘకాలిక జబ్బులుగా మారితే మాత్రం కాలేయానికి ముప్పు ఖాయం. కాలేయం.. మన శరీరానికి ఎనర్జీ ఫ్యాక్టరీ! ఈ ఫ్యాక్టరీలో హెపటైటిస్ పొల్యూషన్ రాకుండా చూసుకోవడం చాలా.. చాలా.. చాలా.. అవసరం. అందరికీ కామెర్లుగా తెలిసిన ఈ హెపటైటిస్ వైరస్ ఒక ఎల్లో కల్లోలం!! హెపటైటిస్ అనేది కాలేయానికి వచ్చే వ్యాధి. కానీ దాని గురించి తెలుసుకునేముందు అసలు కాలేయం ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యాధి ఎంత కీలకమైన అవయవాన్ని దెబ్బ తీస్తుందో తెలుసుకుంటేనే ఆ వ్యాధి వల్ల మనకు జరిగే నష్టమేమిటో అర్థమవుతుంది. మొదట ఆహారంతో మొదలుపెడదాం. తిన్న తర్వాత శక్తిని పుట్టించే ప్రక్రియ జరిపేదీ... శక్తి అవసరం లేనప్పుడు దాన్ని దాచే బాధ్యత నిర్వహించేదీ కాలేయమే. పొరబాటున మన వేలు తెగిందనుకోండి... వెంటనే రక్తాన్ని గడ్డకట్టించే ఫ్యాక్టర్స్‌ను రంగంలోకి దింపి ఆ రక్తస్రావాన్ని అరికట్టేది కాలేయం. మనం మాంసాహారం తినగానే జీర్ణక్రియలో అమైనోయాసిడ్స్ తయారౌతాయి. అవి అలాగే రక్తంలోకి వెళ్తే... వెంటనే చనిపోవడం ఖాయం. వాటిని ప్రోటీన్లుగా మార్చి మనకు ఉపయోగపడేలా, మనకు రోగనిరోధక శక్తి కల్పించేలా, మన కండరాల రిపేర్లు జరిగేలా చూసేది కాలేయం. గుండెకు సేఫ్టీ వాల్వ్ కాలేయం. హెపాటిక్ వెయిన్ అనే రక్తనాళం ద్వారా గుండెలోకి రక్తం వెళ్లే సమయంలో గుండెలోకి ఎంత రక్తం వెళ్తే దానికి సౌకర్యంగా ఉంటుందో అంతే రక్తాన్ని పంపి గుండెను కాపాడేదే కాలేయం. బయటి పదార్థం ఒంట్లోకి ఏది ప్రవేశించినా దానిలోని విషాలను విరిచేసేదీ కాలేయమే. అది సిగరెట్ పొగైనా... ఆల్కహాల్ డ్రింకైనా... ఇంకేదైనా విషమైనా. ఇలా కాలేయం చేసే పనులను ఒక జాబితాగా రాయాలంటే కనీసం ఐదొందలైనా ఉంటాయి. అది ఉత్పత్తి చేసే ఎంజైములు తక్కువలో తక్కువగా చెప్పాలన్నా వెయ్యికి పైగానే ఉంటాయి. అంతటి కెమికల్ ఫ్యాక్టరీని బయట మనం ఎక్కుడైనా పెట్టాలంటే వంద ఎకరాల స్థలం కావాలి. కానీ కిలోన్నర బరువు తూగేంత పరిమాణంలో ఉండి ఈ పనులన్నీ చేస్తుంది కాలేయం. అలా అది చేసే పనులన్నింటినీ దెబ్బతీసే జబ్బు హెపటైటిస్. మన దేశంలో పెద్ద సంఖ్యలో నమోదువుతున్న కేసుల్లో హెపటైటిస్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వ్యాధితో చనిపోతున్న వారిలో సగానికి పైగా భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాలకు చెందినవారే. హెపటైటిస్ సోకినప్పుడు దాని వల్ల కలిగే నష్టం ఏమిటన్నది చాలా మందికి సూచనప్రాయంగా కూడా తెలియదు. కానీ అదే జరిగితే కొన్నేళ్లలోనే అది కాలేయ క్యాన్సర్‌గా బయటపడి ప్రాణాలకే ముప్పు తేవచ్చు. అందుకే హెపటైటిస్పై అవగాహన పెంచుకోవడం అవసరం. హెపటైటిస్ వ్యాధి ఎలా వస్తుంది? హైపటైటిస్ అనేది వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి. ఇందులో హైపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే ఐదు రకాల వైరస్‌లున్నాయి. అవి సంక్రమించినప్పుడు తొలుత కనిపించే లక్షణం కామెర్లు. దాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది ముదిరి కాలేయం పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. కామెర్లు సోకిన వారికి మద్యం అలవాటు ఉన్నా, తెలియక ఏవైనా ఔషధాలూ, ఆకుపసర్లు తీసుకున్నా పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎప్పుడు బయట పడతాయి? హెపటైటిస్ వైరస్లు ఒంట్లోకి ప్రవేశించాక అవి తమ ప్రభావం చూపించి, వ్యాధి లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. హెపటైటిస్–ఏ, ఈ వైరస్లు బయటపడటానికి రెండు నెలల నుంచి ఆర్నెల్ల సమయం తీసుకుంటాయి. అదే బీ, సీ వైరస్లు అయితే ఎనిమిది వారాల నుంచి ఇరవయ్యారు వారాల సమయం పడుతుంది. హెపటైటిస్ బీ, సీ వైరస్లు మిగతా వాటి కంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఒకసారి అవి శరీరంలోకి ప్రవేశిస్తే చాలా కాలం పాటు ఉండి, దీర్ఘకాలిక హెపటైటిస్‌కు కారణమవుతాయి. నిరంతరం కాలేయ కణాలపై దాడి చేస్తూ లివర్ స్కార్స్కు దారితీస్తాయి. చివరకు కాలేయ క్యాన్సర్‌తో ప్రాణాలను కబళిస్తాయి. హెపటైటిస్లోని లక్షణాలు: ∙నీరసం ∙వికారం ∙ఆకలి లేకపోవడం ∙మూత్రం పచ్చగా రావడం ∙కళ్లు కూడా పచ్చగా కనిపించడం వంటివి కొన్ని ప్రధాన లక్షణాలు. చికిత్స: అన్ని రకాల హెపటైటిస్లలోనూ ప్రధానంగా లక్షణాలను బట్టే ఈ వ్యాధికి చికిత్స ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దాని వల్ల ఇతర పరిణామాలను అదుపు చేయడానికి అవసరమైన చికిత్స అందించాల్సి రావచ్చు. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతింటే మాత్రం కాలేయ మార్పిడి చికిత్స తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. ఇప్పుడు అధునాతన వైద్య పరికరాలు, విధానాలు అందుబాటులోకి రావడంతో ఈ చికిత్స ఇప్పుడు 95 శాతం వరకు విజయవంతమవుతోంది. కాలేయ మార్పిడితో రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది... మరణించిన దాత (కెడావరిక్ డోనార్) నుంచి సేకరించి కాలేయాన్ని అవసరమైన వారికి అమర్చడం. ఇక రెండో పద్ధతిలో ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి నుంచి అతడి కాలేయంలోని కొంత భాగాన్ని (దాదాపు 25 శాతం) దానంగా స్వీకరించి, అమర్చవచ్చు. వైరస్ సంక్రమణ హెపటైటిస్‌ను సంక్రమింపజేసే వైరస్లలో ఏ, ఈ అనే వైరస్లు కలుషితమైన నీళ్లు, కలుషితాహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే హెపటైటిస్ బి, సీ వైరస్లు మాత్రం కలుషితమైన రక్తం లేదా రక్తపు ఉత్పత్తులను శరీరంలోకి ఎక్కించడం వల్ల సంక్రమిస్తాయి. లేదా శారీరకంగా కలిసినప్పుడు ఒంట్లోని స్రావాల కలయిక వల్ల కూడా వ్యాప్తిస్తాయి. ఒక్కో హెపటైటిస్ ఎలా వ్యాపిస్తుందో తెలియాలంటే ఈ కింద ఉన్న జాబితా చూడండి. హెపటైటిస్ – ఏ మలపదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరడం వల్ల. హెపటైటిస్ – బి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా హెపటైటిస్ – సి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా హెపటైటిస్ – డి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా హెపటైటిస్ – ఈ మలపదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరడం వల్ల. అంటే హెపటైటిస్ ఏ, ఈ రకాలు ఒక విధంగానూ, బి, సి, డి... రకాలు మరో రకంగానూ వ్యాప్తి చెందుతాయన్నమాట. నివారణ / కాలేయాన్ని కాపాడుకోవడం ఎలా? కాలేయానికి ఉన్న సామర్థ్యం, దాని పనితీరు గురించి అవగాహన లేకపోవడం వల్ల, కాలేయ వ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే చాలామంది హెపటైటిస్ వ్యాధి బారిన పడుతుంటారు. దీనితో పాటు అనారోగ్యకరమైన జీవనశైలితో కాలేయాన్ని దెబ్బతీసే వైరస్ల బారిన పడుతున్నారు. దాంతో ఆ తర్వాతికాలంలో కాలేయ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. కేవలం కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా పరిస్థితిని కాలేయ క్యాన్సర్ వరకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. అందుకోసం తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలివి. ⇒ సొంతంగా హెల్త్ సప్లిమెంట్ల వంటివి తీసుకోకూడదు. అలాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకే వాటిని వాడాలి ⇒ హెపటైటిస్ వైరస్ల నంచి కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ⇒ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను నీటితో బాగా శుభ్రం చేసిన తర్వాతనే వాడాలి. ⇒ మద్యం అలవాటును పూర్తిగా మానేయాలి. ⇒ ఊబకాయం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ⇒ ఊబకాయం ఏర్పడితే పోషకాహార నిపుణులు, వైద్య నిపుణుల సలహాలు తీసుకొని బరువును అదుపులో ఉంచుకోవాలి. ⇒ తగినంత శారీరక శ్రమ చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ⇒ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... ∙ కామెర్ల వ్యాధి సోకినట్లు గుర్తించినప్పుడు నాటు వైద్యం, ఆకుపసర్ల జోలికి అస్సలు పోకూడదు. హెపటైటిస్ ఏ ఇది భారత్‌లో ఎక్కువ ⇒సాధారణంగా మన జీవిత కాలంలోని మొదటి, రెండో దశాబ్దంలో ఎక్కువగా కనిపిస్తుంది ⇒దానంతట అదే తగ్గుతుంది (సెల్ఫ్ లిమిటింగ్) ⇒ వైరస్ ప్రవేశించిన రెండు నుంచి నాలుగు వారాల్లో లక్షణాలు బయటపడతాయి n ఐజీఎమ్ హెచ్ఏవీ పరీక్షతో నిర్ధారణ చేస్తారు. ⇒ దీర్ఘకాలిక దశ ఉండదు, కాలేయాన్ని కుంచించుకుపోయేలా చేసే సిర్రోసిస్ దశ ఉండదు. కాబట్టి చాలాసందర్భాల్లో నిరపాయకరం ⇒అయితే ఒక్కోసారి తీవ్రమైన హెపటైటిస్‌కు కారణమవుతుంది ⇒లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్) ⇒వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ బి ⇒ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉంది ⇒రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా వ్యాప్తిచెందుతుంది ⇒సందర్భాల్లో దానంతట అదే తగ్గినా, కొన్ని సందర్భాల్లో చికిత్స అవసరమవుతుంది ⇒దీర్ఘకాలిక కాలేయ సమస్యలకు దారితీస్తుంది ⇒లివర్ సిర్రోసిస్‌కు దారితీసి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది ⇒ఆహారం, నీళ్ల ద్వారా వ్యాప్తిచెందదు n వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ సి ⇒వ్యాప్తిలో హెపటైటిస్ బి కంటే కాస్త తక్కువే ⇒దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ ⇒దీని చికిత్సకు వైరల్ ఆర్ఎన్ఏ, జీనోటైప్ పరీక్షలు అవసరం. చికిత్స ఎంతకాలం కొనసాగాలో తెలిపేందుకు కూడా ఈ పరీక్ష అవసరం ⇒అవకాశం లేదు అయితే వ్యాక్సిన్ కనిపెట్ట డానికి విశేష కృషి జరుగుతోంది ఏ, బి, సి, డి, ఇ .. వీటిల్లో ఏది తాకినా ఒళ్లంతా అల్లకల్లోలమే! ⇒హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఇ.. లు ⇒కొన్నిసార్లే ప్రాణాంతకం అయినా ⇒దీర్ఘకాలిక జబ్బులుగా మారితే మాత్రం ⇒కాలేయానికి ముప్పు ఖాయం. ⇒కాలేయం.. మన శరీరానికి ఎనర్జీ ఫ్యాక్టరీ! ⇒ఈ ఫ్యాక్టరీలో హెపటైటిస్ పొల్యూషన్ ⇒రాకుండా చూసుకోవడం ⇒చాలా.. చాలా.. చాలా.. అవసరం. ⇒అందరికీ కామెర్లుగా తెలిసిన ⇒ఈ హెపటైటిస్ వైరస్ హెపటైటిస్ అనేది కాలేయానికి వచ్చే వ్యాధి. కానీ దాని గురించి తెలుసుకునేముందు అసలు కాలేయం ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యాధి ఎంత కీలకమైన అవయవాన్ని దెబ్బ తీస్తుందో తెలుసుకుంటేనే ఆ వ్యాధి వల్ల మనకు జరిగే నష్టమేమిటో అర్థమవుతుంది. మొదట ఆహారంతో మొదలుపెడదాం. తిన్న తర్వాత శక్తిని పుట్టించే ప్రక్రియ జరిపేదీ... శక్తి అవసరం లేనప్పుడు దాన్ని దాచే బాధ్యత నిర్వహించేదీ కాలేయమే. పొరబాటున మన వేలు తెగిందనుకోండి... వెంటనే రక్తాన్ని గడ్డకట్టించే ఫ్యాక్టర్స్‌ను రంగంలోకి దింపి ఆ రక్తస్రావాన్ని అరికట్టేది కాలేయం. మనం మాంసాహారం తినగానే జీర్ణక్రియలో అమైనోయాసిడ్స్ తయారౌతాయి. అవి అలాగే రక్తంలోకి వెళ్తే... వెంటనే చనిపోవడం ఖాయం. వాటిని ప్రోటీన్లుగా మార్చి మనకు ఉపయోగపడేలా, మనకు రోగనిరోధక శక్తి కల్పించేలా, మన కండరాల రిపేర్లు జరిగేలా చూసేది కాలేయం. గుండెకు సేఫ్టీ వాల్వ్ కాలేయం. హెపాటిక్ వెయిన్ అనే రక్తనాళం ద్వారా గుండెలోకి రక్తం వెళ్లే సమయంలో గుండెలోకి ఎంత రక్తం వెళ్తే దానికి సౌకర్యంగా ఉంటుందో అంతే రక్తాన్ని పంపి గుండెను కాపాడేదే కాలేయం. బయటి పదార్థం ఒంట్లోకి ఏది ప్రవేశించినా దానిలోని విషాలను విరిచేసేదీ కాలేయమే. అది సిగరెట్ పొగైనా... ఆల్కహాల్ డ్రింకైనా... ఇంకేదైనా విషమైనా. ఇలా కాలేయం చేసే పనులను ఒక జాబితాగా రాయాలంటే కనీసం ఐదొందలైనా ఉంటాయి. అది ఉత్పత్తి చేసే ఎంజైములు తక్కువలో తక్కువగా చెప్పాలన్నా వెయ్యికి పైగానే ఉంటాయి. అంతటి కెమికల్ ఫ్యాక్టరీని బయట మనం ఎక్కుడైనా పెట్టాలంటే వంద ఎకరాల స్థలం కావాలి. కానీ కిలోన్నర బరువు తూగేంత పరిమాణంలో ఉండి ఈ పనులన్నీ చేస్తుంది కాలేయం. అలా అది చేసే పనులన్నింటినీ దెబ్బతీసే జబ్బు హెపటైటిస్. మన దేశంలో పెద్ద సంఖ్యలో నమోదువుతున్న కేసుల్లో హెపటైటిస్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వ్యాధితో చనిపోతున్న వారిలో సగానికి పైగా భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాలకు చెందినవారే. హెపటైటిస్ సోకినప్పుడు దాని వల్ల కలిగే నష్టం ఏమిటన్నది చాలా మందికి సూచనప్రాయంగా కూడా తెలియదు. కానీ అదే జరిగితే కొన్నేళ్లలోనే అది కాలేయ క్యాన్సర్‌గా బయటపడి ప్రాణాలకే ముప్పు తేవచ్చు. అందుకే హెపటైటిస్పై అవగాహన పెంచుకోవడం అవసరం. హెపటైటిస్ వ్యాధి ఎలా వస్తుంది? హైపటైటిస్ అనేది వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి. ఇందులో హైపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే ఐదు రకాల వైరస్‌లున్నాయి. అవి సంక్రమించినప్పుడు తొలుత కనిపించే లక్షణం కామెర్లు. దాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది ముదిరి కాలేయం పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. కామెర్లు సోకిన వారికి మద్యం అలవాటు ఉన్నా, తెలియక ఏవైనా ఔషధాలూ, ఆకుపసర్లు తీసుకున్నా పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎప్పుడు బయట పడతాయి? హెపటైటిస్ వైరస్లు ఒంట్లోకి ప్రవేశించాక అవి తమ ప్రభావం చూపించి, వ్యాధి లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. హెపటైటిస్–ఏ, ఈ వైరస్లు బయటపడటానికి రెండు నెలల నుంచి ఆర్నెల్ల సమయం తీసుకుంటాయి. అదే బీ, సీ వైరస్లు అయితే ఎనిమిది వారాల నుంచి ఇరవయ్యారు వారాల సమయం పడుతుంది. హెపటైటిస్ బీ, సీ వైరస్లు మిగతా వాటి కంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఒకసారి అవి శరీరంలోకి ప్రవేశిస్తే చాలా కాలం పాటు ఉండి, దీర్ఘకాలిక హెపటైటిస్‌కు కారణమవుతాయి. నిరంతరం కాలేయ కణాలపై దాడి చేస్తూ లివర్ స్కార్స్కు దారితీస్తాయి. చివరకు కాలేయ క్యాన్సర్‌తో ప్రాణాలను కబళిస్తాయి. హెపటైటిస్లోని లక్షణాలు: ∙నీరసం ∙వికారం ∙ఆకలి లేకపోవడం ∙మూత్రం పచ్చగా రావడం ∙కళ్లు కూడా పచ్చగా కనిపించడం వంటివి కొన్ని ప్రధాన లక్షణాలు. చికిత్స: అన్ని రకాల హెపటైటిస్లలోనూ ప్రధానంగా లక్షణాలను బట్టే ఈ వ్యాధికి చికిత్స ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దాని వల్ల ఇతర పరిణామాలను అదుపు చేయడానికి అవసరమైన చికిత్స అందించాల్సి రావచ్చు. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతింటే మాత్రం కాలేయ మార్పిడి చికిత్స తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. ఇప్పుడు అధునాతన వైద్య పరికరాలు, విధానాలు అందుబాటులోకి రావడంతో ఈ చికిత్స ఇప్పుడు 95 శాతం వరకు విజయవంతమవుతోంది. కాలేయ మార్పిడితో రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది... మరణించిన దాత (కెడావరిక్ డోనార్) నుంచి సేకరించి కాలేయాన్ని అవసరమైన వారికి అమర్చడం. ఇక రెండో పద్ధతిలో ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి నుంచి అతడి కాలేయంలోని కొంత భాగాన్ని (దాదాపు 25 శాతం) దానంగా స్వీకరించి, అమర్చవచ్చు. వైరస్ సంక్రమణ హెపటైటిస్‌ను సంక్రమింపజేసే వైరస్లలో ఏ, ఈ అనే వైరస్లు కలుషితమైన నీళ్లు, కలుషితాహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే హెపటైటిస్ బి, సీ వైరస్లు మాత్రం కలుషితమైన రక్తం లేదా రక్తపు ఉత్పత్తులను శరీరంలోకి ఎక్కించడం వల్ల సంక్రమిస్తాయి. లేదా శారీరకంగా కలిసినప్పుడు ఒంట్లోని స్రావాల కలయిక వల్ల కూడా వ్యాప్తిస్తాయి. ఒక్కో హెపటైటిస్ ఎలా వ్యాపిస్తుందో తెలియాలంటే ఈ కింద ఉన్న జాబితా చూడండి. హెపటైటిస్ – ఏ మలపదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరడం వల్ల. హెపటైటిస్ – బి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా హెపటైటిస్ – సి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా హెపటైటిస్ – డి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా హెపటైటిస్ – ఈ మలపదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరడం వల్ల. అంటే హెపటైటిస్ ఏ, ఈ రకాలు ఒక విధంగానూ, బి, సి, డి... రకాలు మరో రకంగానూ వ్యాప్తి చెందుతాయన్నమాట. నివారణ / కాలేయాన్ని కాపాడుకోవడం ఎలా? కాలేయానికి ఉన్న సామర్థ్యం, దాని పనితీరు గురించి అవగాహన లేకపోవడం వల్ల, కాలేయ వ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే చాలామంది హెపటైటిస్ వ్యాధి బారిన పడుతుంటారు. దీనితో పాటు అనారోగ్యకరమైన జీవనశైలితో కాలేయాన్ని దెబ్బతీసే వైరస్ల బారిన పడుతున్నారు. దాంతో ఆ తర్వాతికాలంలో కాలేయ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. కేవలం కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా పరిస్థితిని కాలేయ క్యాన్సర్ వరకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. అందుకోసం తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలివి. ∙సొంతంగా హెల్త్ సప్లిమెంట్ల వంటివి తీసుకోకూడదు. అలాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకే వాటిని వాడాలి ∙హెపటైటిస్ వైరస్ల నంచి కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ తీసుకోవాలి ∙ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను నీటితో బాగా శుభ్రం చేసిన తర్వాతనే వాడాలి ∙మద్యం అలవాటును పూర్తిగా మానేయాలి ∙ఊబకాయం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఊబకాయం ఏర్పడితే పోషకాహార నిపుణులు, వైద్య నిపుణుల సలహాలు తీసుకొని బరువును అదుపులో ఉంచుకోవాలి ∙తగినంత శారీరక శ్రమ చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... ∙కామెర్ల వ్యాధి సోకినట్లు గుర్తించినప్పుడు నాటు వైద్యం, ఆకుపసర్ల జోలికి అస్సలు పోకూడదు. హెపటైటిస్ల గురించి సంక్షిప్తంగా హెపటైటిస్ ఏ ఇది భారత్‌లో ఎక్కువ సాధారణంగా మన జీవిత కాలంలోని మొదటి, రెండో దశాబ్దంలో ఎక్కువగా కనిపిస్తుంది దానంతట అదే తగ్గుతుంది (సెల్ఫ్ లిమిటింగ్) వైరస్ ప్రవేశించిన రెండు నుంచి నాలుగు వారాల్లో లక్షణాలు బయటపడతాయి ఐజీఎమ్ హెచ్ఏవీ పరీక్షతో నిర్ధారణ చేస్తారు.దీర్ఘకాలిక దశ ఉండదు, కాలేయాన్ని కుంచించుకుపోయేలా చేసే సిర్రోసిస్ దశ ఉండదు. కాబట్టి చాలాసందర్భాల్లో నిరపాయకరం అయితే ఒక్కోసారి తీవ్రమైన హెపటైటిస్‌కు కారణమవుతుంది లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్) వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ బి ⇒ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉంది ⇒రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా వ్యాప్తిచెందుతుంది. ⇒చాలా సందర్భాల్లో దానంతట అదే తగ్గినా, కొన్ని సందర్భాల్లో చికిత్స అవసరమవుతుంది. ⇒ దీర్ఘకాలిక కాలేయ సమస్యలకు దారితీస్తుంది. ⇒ లివర్ సిర్రోసిస్‌కు దారితీసి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ⇒ఆహారం, నీళ్ల ద్వారా వ్యాప్తిచెందదు n వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ సి ⇒వ్యాప్తిలో హెపటైటిస్ బి కంటే కాస్త తక్కువే ⇒ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ n దీని చికిత్సకు వైరల్ ఆర్ఎన్ఏ, జీనోటైప్ పరీక్షలు అవసరం. చికిత్స ఎంతకాలం కొనసాగాలో తెలిపేందుకు కూడా ఈ పరీక్ష అవసరం. ⇒ నివారణకు అవకాశం లేదు అయితే వ్యాక్సిన్ కనిపెట్ట డానికి విశేష కృషి జరుగుతోంది. ⇒ సిర్రోసిస్‌కు దారితీసే అవకాశం ఉంది. ⇒కొద్దికాలంగా అందుబాటులో కొన్ని కొత్త మందులు. హెపటైటిస్ డి ఇది తనంతట తానే మనుగడ సాధించలేదు. సాధారణంగా హెపటైటిస్ బి వచ్చిన వారిలో ఆ తర్వాత కనిపిస్తుంది. దీర్ఘకాలిక సిర్రోసిస్ లేదా తీవ్రమైన సిర్రోసిస్‌కు కారణమవుతుంది. ఇంటర్ఫెరాన్ వంటి మందులతో చికిత్స సాధ్యమే. ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. హెపటైటిస్ ఇ ⇒ఒక్కోసారి చాలా మంది సమూహాలుగా దీని బారిన పడవచ్చు లేదా విడివిడిగానూ రావచ్చు ⇒ఏ వయసువారిలోనైనా రావచ్చు కానీ యుక్తవయస్కుల్లోనే ఎక్కువ ⇒మలం వల్ల కలుషితమైన ఆహారంతోనే వ్యాప్తి ⇒వ్యాధి దీర్ఘకాలికం కాదు. కాకపోతే అప్పటికప్పుడు తీవ్రంగా వస్తుంది ⇒లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్) ⇒త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హెపటైటిస్ డి ఇది తనంతట తానే మనుగడ సాధించలేదు. సాధారణంగా హెపటైటిస్ బి వచ్చిన వారిలో ఆ తర్వాత కనిపిస్తుంది. దీర్ఘకాలిక సిర్రోసిస్ లేదా తీవ్రమైన సిర్రోసిస్‌కు కారణమవుతుంది. ఇంటర్ఫెరాన్ వంటి మందులతో చికిత్స సాధ్యమే. ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. హెపటైటిస్ ఇ ⇒ఒక్కోసారి చాలా మంది సమూహాలుగా దీని బారిన పడవచ్చు లేదా విడివిడిగానూ రావచ్చు ⇒ఏ వయసువారిలోనైనా రావచ్చు కానీ యుక్తవయస్కుల్లోనే ఎక్కువ ⇒మలం వల్ల కలుషితమైన ఆహారంతోనే వ్యాప్తి ⇒వ్యాధి దీర్ఘకాలికం కాదు. కాకపోతే అప్పటికప్పుడు తీవ్రంగా వస్తుంది ⇒లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్) ⇒త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ బాలచంద్రన్ మీనన్ కాలేయ వ్యాధుల నిపుణులు – సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్. -
జీర్ణశక్తిని పెంచే అరటిపండు!
గుడ్‌ఫుడ్ అరటి పండు అతి సాధారణమైన పండు. దాని పోషక విలువలు అసాధారణం. దీనిని 107 దేశాలలో పండిస్తారు. దాదాపు 125 గ్రాములు ఉండే అరటి పండులో 110 క్యాలరీల శక్తి; 30 గ్రాముల పిండి పదార్థాలు; 1 గ్రాము ప్రోటీన్లు; 3 గ్రాముల పీచుపదార్థాలు; 5 మి.గ్రా. విటమిన్ బి6; 9 మి.గ్రా విటమిన్ సి; 450 మి.గ్రా. పొటాషియమ్ ఉంటాయి. ఇందులో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ కాబట్టి రక్తపోటు నియంత్రణలో ఈ పండు బాగా తోడ్పడుతుంది. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలిన అంశం ఏమిటంటే... చిన్నప్పుడు అరటిపండ్లు పుష్కలంగా తిని పెరిగిన పిల్లల్లో ఆస్తమా వచ్చేందుకు అవకాశాలు 34 శాతం తగ్గుతాయి. ఇందులో ఉండే పొటాషియమ్, విటమిన్ సి, విటమిన్ బి6... గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడతాయి. జీర్ణశక్తి కోసం ఉపకరించే ఆహారాల్లో అరటి పండు చాలా కీలకం. ఇందులోని అమైనో యాసిడ్స్ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. -
జీర్ణశక్తి మెరుగవ్వాలంటే...
యోగా శిరాసన: ఫొటోలో చూపిన విధంగా ఎడమకాలును ముందు కుర్చీ సీటు మీద ఉంచాలి. ఎడమ మోకాలును మడవకుండా మొదటగా ఛాతీని నిటారుగా ఉంచి శ్వాస తీసుకుని వదులుతూ ముందుకు వంగి రెండు చేతులతో ఎడమపాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. కుడి కాలుని మడిచి ఉంచడం వలన కుడి కండరాల మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు. అవసరమైతే సీటు యింకా ముందుకు తీసుకువస్తే సౌకర్యంగా ఉంటుంది. ముందుకు వంగినప్పుడు ఎడమ పాదాన్ని పట్టుకోలేకపోతే ముందు ఉన్న కుర్చీ సీటు భాగం కాని కుర్చీ హ్యాండ్‌ని కాని ఆధారంగా పట్టుకుని కొంచెం కొంచెం ముందుకు వంగుతూ క్రమ క్రమంగా సాధన పెంచుకుంటూ పోవాలి. కూర్చున్నప్పుడు కుర్చీ హ్యాండిల్ పొట్టకి ప్రెస్ చేస్తున్నట్లుగా ఉంటే సీటు కింద ఏదైనా చిన్న దిండులాంటిదాన్ని ఉపయోగించవచ్చు. శ్వాసతీసుకుంటూ పైకి వచ్చి, రెండవవైపు కూడా ఇదేవిధంగా చేయాలి. ఉపయోగాలు: గ్లూటియస్ కండరాలకు, ఎరెక్టర్ స్పైన్‌కి మంచి టోనింగ్ జరుగుతుంది. హామ్‌స్ట్రింగ్స్ మరియు కాఫ్ కండరాలు తొడవెనుక కాలు వెనుక భాగాలలోని కండరాలు స్ట్రెచ్ అవుతాయి. పొట్ట దగ్గర కండరాలు బాగా నొక్కినట్టు అవడం వల్ల జీర్ణశక్తి పెరుగుదలకు సహాయపడగలదు. కిడ్నీలు, ఎడ్రినల్ గ్రంధుల పనితీరు మెరుగుపడుతుంది. ఏకపాద శిరాసన కుర్చీలో సమంగా కూర్చుని రెండు కాళ్ళు ముందున్న కుర్చీ మీద సౌకర్యంగా ఉంచి కాళ్ళు పూర్తిగా రిలాక్స్ చేసి (అంటే మోకాళ్లు కొంచెం పైకి కిందకి మరియు పాదాలను పక్కలకు రొటేట్ చేసి), ఎడమకాలుని మడచి రెండు చేతులతో పట్టుకుని శ్వాస వదులుతూ ఎడమపాదాన్ని ఛాతీకి హత్తుకునే ప్రయత్నం చేయాలి. ఎడమకాలి కాఫ్ మజిల్ కింద నుండి ఎడమ చేతిని తీసుకువెడుతూ ఎడమపాదాన్ని పట్టుకోవడం గమనించాలి. నెమ్మదిగా ఎడమకాలుని కొంచెం కొంచెం పైకి లిఫ్ట్ చేస్తూ ఎడమపాదాన్ని ఎడమ భుజం మీదకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. కుర్చీ ఆధారంగా చేయడం వలన సీటు భాగాన్ని కుర్చీ ముందుకు తీసుకువచ్చి నడుము కొంచెం ఏటవాలుగా కుర్చీ వెనుకకు ఆనుకున్నట్లయితే పోశ్చర్ కొంచెం తేలికగా చేయగల్గుతారు. కుడికాలు నిటారుగా ముందుకు చాపి ఉంచాలి. శ్వాస వదులుతూ ఎడమకాలు సాధరణ స్థితికి తీసుకువచ్చి తిరిగి రెండవైపు కూడా ఇదే సాధన చేయాలి. ఉపయోగాలు: కాళ్లలోని గ్లూటియస్, సోయాస్, ఎడక్టర్ కండరాలకు నడుముపక్క భాగంలో ఉన్న ఒబిక్యూ మజిల్‌కి మంచి టోనింగ్ జరుగుతుంది. తుంటి కీలుభాగాలు ఓపెన్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థ, మలవిసర్జన వ్యవస్థల మీద పనిచేస్తుంది. పాంక్రియాస్ ఉత్తేజం కావడం వలన ఇన్సులిన్ ఉత్పత్తి నియంత్రణ జరుగుతుంది. అర్ధ మశ్చీంద్రాసన జానుశిరాసన తరువాత అదే వరసలో చేయవలసిన మరొక ఆసనం అర్ధ మశ్చీంద్రాసనం. ఇంతకుముందు ఆసనంలో స్ట్రెచ్ చేసిన ఎడమకాలును మడచి కుడికాలును ఎడమకాలు మీదుగా క్రాస్ చేసి కూర్చున్న కుర్చీలో కాని, ముందు కుర్చీలో కాని కుడి పాదాన్ని సపోర్ట్‌గా ఉంచి శ్వాసతీసుకుంటూ నడుమును కుడివవైపుకు తిప్పి కుడి భుజం మీదుగా వెనుకకు చూడాలి. ఈ స్థితిలో నడుము వీలైనంత నిటారుగా ఉంచి నడుమును పక్కలకు తిప్పాలి. కుర్చీ వెనుకభాగాన్ని (బ్యాక్‌రెస్ట్), హ్యాండిల్‌ను సపోర్ట్‌గా పట్టుకోవడం వలన చాలా ప్రభావంతంగా ఈ ఆసనం చేయవచ్చు. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ మళ్ళీ ముందుకు తిరిగి కాలుమార్చి శ్వాస తీసుకుంటూ రెండవ వైపుకు చేయాలి. ఉపయోగాలు: వెన్నెముక వ్యాకోచం చెందడానికి, స్టిఫ్ బార్క్ ప్రాబ్లమ్స్‌కి షిప్డ్ డిస్క్కి, బైల్ జ్యూస్ సిక్రేషన్స్కి, ఇన్సులిన్ రిలీజ్‌కి, హిప్ జాయింట్స్ వదులు అవ్వడానికి, భుజాలు, చేతులలో ఉన్న టెన్షన్స్ రిలీవ్ అవ్వడానికి, స్త్రీలలో రుతుక్రమ సమస్యలు, మూత్రకోశ సమస్యలు తొలగించడానికి ఉపయోగపడుతుంది. మోడల్: రీనా -
సామవేదం
భోజనాన్ని నెమ్మదిగా తినాలి... బాగా నమిలి, రుచిని ఆస్వాదిస్తూ తినాలి! ఆ భోజనం నిదానంగా జీర్ణం కావాలి... ఎక్కువ సేపు శక్తిని విడుదల చేయాలి! నిజమే... ఇదే అసలైన ఆరోగ్యం... అందుకు చిరుధాన్యమే అనువైన ఆహారం. కొర్రలు... రాగులు... జొన్నలు... సజ్జల జాబితాలో మరో చిరుధాన్యం సామలు. సామ కేసరి కావలసినవి: సామబియ్యం- ఒక గ్లాసు, పటిక బెల్లం పొడి- ముప్పావు గ్లాసు, అనాసపండు ముక్కలు- పావు కప్పు, యాలకుల పొడి- పావు చెంచా, నెయ్యి- రెండు చెంచాలు, జీడిపప్పు- గుప్పెడు, కిస్మిస్- గుప్పెడు, కుంకుమ పువ్వు- చిటికెడు, పాలు - అరకప్పు తయారీ: పాలు వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి మందపాటి బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి తీసి పక్కన పెట్టాలి. అదే బాణలిలో మిగిలిన నేతిలో సామబియ్యం వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. బియ్యం వేగేలోపు మరొక స్టవ్ మీద రెండున్నర కప్పుల నీటిని మరిగించాలి. బియ్యం వేగిన తర్వాత మరుగుతున్న నీటిని పోసి కలపాలి. మెత్తగా ఉడికిన తర్వాత అనాపసండు ముక్కలు, పటికబెల్లం పొడి, యాలకుల పొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఒక నిమిషం తర్వాత మిశ్రమం అడుగుపట్టకుండా కలిపి దించాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్తో గార్నిష్ చేయాలి. సామ ఆపం కావలసినవి: సామబియ్యం- ఒక గ్లాసు, అటుకులు- పిడికెడు, కొబ్బరికోరు- అర కప్పు, ఈస్ట్- అర చెంచా, పటికబెల్లం పొడి- ఒక చెంచా, ఉప్పు- తగినంత, నూనె- ఒక టేబుల్ స్పూన్ తయారీ: సామబియ్యాన్ని కడిగి ఐదు గంటల సేపు నానబెట్టాలి అరగ్లాసు వేడినీటిలో ఈస్ట్, పటికబెల్లం పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి. అటుకులను ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత అందులో కొబ్బరికోరు, ఈస్ట్ మిశ్రమం, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బాలి ఈ పిండిని ఒక పాత్రలోకి తీసుకుని ఆరుగంటల సేపు కదిలించకుండా ఉంచాలి ఆపం పెనం వేసి చేసి అందులో ఒక గరిటెడు పిండి వేసి అర చెంచా నూనె వేసి మూత పెట్టి సన్నమంట మీద కాల్చాలి. అర నిమిషానికి ఆపం కాలి అంచుల దగ్గర పైకి లేస్తుంది. అప్పుడు తీసేయాలి. ఆపాన్ని తిరగేసి కాల్చరాదు. ఒకవైపే కాల్చాలి. దీనికి కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్. గమనిక: ఆపం పిండిని ఆపం బాణలిలో పోయడం చాలా నైపుణ్యంతో కూడిన పని. బాణలిలో పోసిన తర్వాత బాణలి అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పినప్పుడు పిండి బాణలిలో విస్తరిస్తుంది. అది ఒక దగ్గర మందంగా, మరొక దగ్గర పలుచగా రాకుండా అంతా సమంగా విస్తరించేటట్లు బాణలిని తిప్పడం సాధన మీద వస్తుంది. ఈస్ట్ లేకపోతే ఒక స్పూను పెరుగు కలుపుకోవచ్చు లేదా బియ్యంలో ఒక చెంచా మెంతులు వేసుకోవచ్చు వరిపిండితో గంజి కాచి ఆపం పిండిలో కలుపుకుంటే ఆపం మెత్తగా వస్తుంది. సమంగా విస్తరించి పలుచగానూ ఉంటుంది ఇష్టమైతే ఆపం మీద క్యారట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. సామ వెజ్ కిచిడి కావలసినవి: సామల బియ్యం- ఒక గ్లాసు, ఉల్లిపాయ- ఒకటి, టొమాటో- ఒకటి, క్యారట్- ఒకటి, బీన్స్- ఐదు, పచ్చి బఠాణి- గుప్పెడు, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి- నాలుగు, జీలకర్ర- ఒక టీ స్పూన్, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు- ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు- తగినంత, నూనె- నాలుగు టీ స్పూన్లు, పసుపు- అర టీ స్పూన్ తయారీ: సామల బియ్యాన్ని కడిగి రెండున్నర గ్లాసుల నీరు పోసి పది నిమిషాల సేపు నానబెట్టాలి. ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, పచ్చిమిర్చి, టొమాటోలను చిన్న ముక్కలుగా తరగాలి ప్రెషర్ పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిముక్కలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పది సెకన్లపాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి సన్నమంట మీద వేగనివ్వాలి. అవి మెత్తబడిన తర్వాత క్యారట్, బీన్స్, పచ్చిబఠాణి, పసుపు వేసి బాగా కలిసి మూత పెట్టి రెండు నిమిషాల సేపు ఉంచాలి పైవన్నీ నూనెలో సన్నమంట మీద మగ్గిన తర్వాత సామబియ్యం నీటితోపాటు వేసి ఉప్పు కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఉడకనివ్వాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. దీనిని నేరుగా బాణలిలో కూడా చేసుకోవచ్చు. అప్పుడు నీటి మోతాదు కొద్దిగా పెంచాలి. దించిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ కిచిడీకి ఆవకాయవంటి పచ్చళ్లు, పుదీన, వేరుశనగపప్పు చట్నీలు బాగుంటాయి. గమనిక: బియ్యం ఉడికేటప్పుడు లవంగం, బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. -
హెల్త్‌కార్నర్
* జీర్ణశక్తిని మెరుగుపరచడానికి పుదీనా కూడా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా రసం తరచు తీసుకుంటున్నట్లయితే, జీర్ణకోశ సమస్యలు చాలావరకు నయమవుతాయి. అలాగే, పుదీనా నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. * ఆకలి మందగించడం, భోజనం తర్వాత వికారం వంటి సమస్యలకు దాల్చినచెక్క చక్కని ఔషధంగా పనిచేస్తుంది. చెంచాడు దాల్చినచెక్క పొడిని గ్లాసు నీళ్లలో వేసి కషాయంగా కాచుకుని, చల్లారిన తర్వాత తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు, దాల్చినచెక్క రక్తంలో చక్కెరస్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. * జీలకర్రను నీళ్లలో వేసి, కషాయంగా చేసుకుని తాగితే కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణసంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీలకర్రలో పుష్కలంగా ఉండే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అకాల వార్ధక్యాన్ని నివారిస్తాయి. * గర్భిణులకు తలెత్తే వేవిళ్ల సమస్యకు అల్లం బాగా ఉపయోగపడుతుంది. చిన్న అల్లం ముక్కను దంచుకుని, అందులో చిటికెడు ఉప్పు కలుపుకొని బుగ్గన వేసుకుని చప్పరిస్తూ ఉంటే అజీర్తితో పాటు వివిధ కారణాల వల్ల తలెత్తే వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. * వెల్లుల్లి జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు బరువును అదుపులో ఉంచుతుంది. రోజూ కనీసం రెండు వెల్లుల్లి రెబ్బలను తింటున్నట్లయితే, జీర్ణప్రక్రియతో పాటు జీవక్రియలు కూడా మెరుగుపడతాయి. శరీరంలో అదనంగా కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. * జ్వరం పడి లేచాక చాలామందికి నోరు అరుచిగా అనిపించడం, ఆకలి మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మిరియాలు ఈ సమస్యలకు విరుగుడుగా పనిచేస్తాయి. మిరియాల కషాయం తాగితే నోటికి రుచి పెరగడమే కాకుండా, ఆకలి కూడా పుడుతుంది. -
నేను మీ పేగుని
ఆనంద్ శరీరంలో నేనో అనాకారి భాగాన్ని. మిగిలిన అవయవాలన్నీ వాటి పని అవి చేసుకుంటూ కాస్త మొహమాటానికి పోతాయి గానీ, నేనలా కాదు. బిగదీసే నొప్పి ద్వారా, ఇబ్బందికరమైన శబ్దాల ద్వారా ఆనంద్‌కు నా ఉనికిని నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాను, ఒక్కోసారి అతిగా పనిచేస్తుంటాను. ఒక్కోసారి మందకొడిగా పనిచేస్తుంటాను. నేను ఆనంద్ పేగును. ఎనిమిది మీటర్ల పొడవు ఉంటాను.నేను లుంగలుగా చుట్టుకున్న పెద్ద గొట్టంలా తన శరీరంలో ఉంటానని ఆనంద్ అనుకుంటూ ఉంటాడు. నిజమే! నేను లుంగలుగా చుట్టుకున్న గొట్టాన్నే! అంతకు మించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా. నన్ను తనే పోషిస్తున్నాడని ఆనంద్ అనుకుంటూ ఉంటాడు. నిజానికి నేనే అతడిని పోషిస్తున్నాను. ఆహారాన్ని ఆమోదయోగ్యంగా మారుస్తా ఆనంద్ తినే ఆహారం నేరుగా రక్తంలో కలసిపోతే అది రక్తపింజర విషం కంటే ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి ఆహారాన్ని నేను ఆమోదయోగ్యంగా తయారు చేస్తాను. అతడి రక్తప్రవాహంలో కలిసే సాధారణ పదార్థాలుగా విడగొడతాను. అవే అతడి శరీరంలోని లక్షలాది కోట్ల కణాలకు ఆహారంగా మారుతాయి. అతడి కండరాలకు శక్తినిస్తాయి. ఆనంద్ తినే ఆహారంలోని కొవ్వులను నేను ఫ్యాటీ యాసిడ్స్‌గా, గ్లిజరాల్‌గా మార్చేది నేనే. ప్రొటీన్స్‌ను అమినో యాసిడ్స్‌గా, పిండి పదార్థాలను గ్లూకోజ్‌గా మారుస్తాను. నాకు ఈ రసాయనిక శక్తే లేకుంటే, ఆనంద్ మనుగడ సాగించలేడు. అతడు తినే ఎలాంటి ఆహారాన్నయినా నేను జీర్ణం చేసుకుంటాను. తర్వాత ఆ ఆహారంలోని పోషకాలను అతడి రక్తంలోకి పంపుతాను. జీర్ణం చేసుకున్న తర్వాత నాలో మిగిలే వ్యర్థంలో కోట్లాది మృత బ్యాక్టీరియా కణాలు, కాస్త జారుడుగా ఉండే మ్యూకస్ నిండి ఉంటాయి. వాటితో పాటే నేను పీల్చుకోలేని పదార్థాలు కూడా ఉంటాయి. దిగువభాగమే సూక్ష్మజీవులకు ఆవాసం నా నిర్మాణం సంక్లిష్టమైన జీర్ణక్రియకు అనుగుణంగా ఉంటుంది. కడుపు దిగువన ఉండే నా భాగాన్ని చిన్నపేగు అంటారు. ఇందులో ఎగువన 25 సెంటీమీటర్ల పొడవున ఉండే భాగాన్ని డువోడినమ్ అని అంటారు. దాని దిగువనే నాలుగు సెంటీమీటర్ల వ్యాసంతో రెండున్నర మీటర్ల పొడవున ఉండే భాగాన్ని జెజునమ్ అంటారు. నాలుగు మీటర్ల పొడవున ఉండే చివరి భాగాన్ని ఇలియమ్ అంటారు. దాని తర్వాత రెండు మీటర్ల పొడవున పెద్ద పేగు ఉంటుంది. సాధారణంగా నా పైభాగంలో ఎలాంటి సూక్ష్మజీవులు ఉండవు. కడుపులో తయారయ్యే శక్తిమంతమైన ఆమ్లాలు చాలావరకు సూక్ష్మజీవులను చంపేస్తాయి. అయితే, నా దిగువ భాగమే సూక్ష్మజీవులకు ఆవాసంగా ఉంటుంది. అక్కడ యాభై రకాలకు పైగా సూక్ష్మజీవులు లక్షల కోట్ల సంఖ్యలో ఉంటాయి. మూడు నుంచి ఎనిమిది గంటల్లో జీర్ణం ఆనంద్ తీసుకునే ఆహారాన్ని మొత్తంగా జీర్ణం చేసుకోవాలంటే, నా చిన్నపేగుకు మూడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. ఆనంద్ మూడు పూటలా తింటుంటాడు. అందువల్ల నా చిన్నపేగుకు విశ్రాంతి లభించడమే అరుదు. చిన్నపేగు ద్వారా జీర్ణమైన ఆహారం చిక్కని ద్రవరూపంలో పెద్దపేగుకు చేరుకుంటుంది. పెద్దపేగు అందులోని నీటిని పీల్చేసుకుని, రక్తంలోకి పంపుతుంది. తీరికగా జరిగే ఈ ప్రక్రియకు 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఆనంద్ రోజు మొత్తంలో ఎనిమిది లీటర్ల నీటిని కోల్పోతే, కొద్ది వ్యవధిలోనే డీహైడ్రేషన్‌కు గురై పూర్తిగా శుష్కించిపోతాడు. పెద్దపేగు నీటిని పీల్చేసుకున్న తర్వాత అందులో మెత్తటి ఘనరూపంలో వ్యర్థపదార్థం మిగులుతుంది. నెమ్మదిగా ఇది అడుగు భాగానికి చేరి, బయటకు పోతుంది. అయితే, ఆనంద్ ఒకవేళ తీవ్రమైన ఒత్తిడికి గురైనా, పెద్దపేగులోకి ఆహారం చేరే వేగం పెరిగినా, బ్యాక్టీరియా సోకినా.. నీటిని పీల్చుకునే ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. అలాంటప్పుడు ఆనంద్‌కు నీళ్ల విరోచనాలు మొదలవుతాయి. ఒకవేళ ఆనంద్ దిగులుతో కుంగిపోతున్నా, పీచుపదార్థాలు తగినంతగా లేని ఆహారం తీసుకున్నా, తగినంత నీరు తాగకపోయినా అతడికి మలబద్ధకం మొదలవుతుంది. అయితే, మలబద్ధకం కంటే నీళ్ల విరోచనాలతోనే ప్రమాదం ఎక్కువ. వాటి వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆనంద్ మరింత ఎక్కువగా నీళ్లు, ద్రావకాలు తాగాల్సి ఉంటుంది. నోటి నుంచే జీర్ణక్రియ ప్రారంభం ఆనంద్‌లో జీర్ణక్రియ అతడి నోటి నుంచే ప్రారంభమవుతుంది. నోటితో నమిలి మింగిన ఆహారం కాస్త మెత్తటి స్థితిలో కడుపులోకి చేరుతుంది. కడుపు ఆ ఆహారాన్ని చిలికేస్తుంది. దాంతో చిక్కటి సూప్‌లా మారిన పదార్థం నాలోకి చేరుతుంది. ఈ ప్రక్రియకు కాస్త సమయం పడుతుంది. ఆనంద్ ఓ గ్లాసుడు నీరు తాగితే, ఆ నీరు నాలోకి చేరడానికి పది నిమిషాలు పడుతుంది. ఘనాహారం తీసుకుంటే, అది నా వరకు చేరడానికి నాలుగు గంటలు పడుతుంది. కడుపు నుంచి నాలోకి విడుదలయ్యే ఆహారం శక్తిమంతమైన యాసిడ్‌తో నిండి ఉంటుంది. కడుపు నుంచి నాలోకి ఒకేసారి పెద్దమొత్తంలో యాసిడ్ విడుదలైతే సున్నితమైన నా లైనింగ్ దెబ్బతింటుంది. దాంతో నేను జీర్ణక్రియను సక్రమంగా నిర్వర్తించలేను. అయితే, చాలా వరకు నేను నాలోకి చేరే యాసిడ్‌ను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తాను. నాలోని డువోడినమ్ ఉత్పత్తి చేసే పదార్థం ఆనంద్ రక్తంలోకి చేరి, రక్తం ద్వారా అతడి క్లోమగ్రంథికి (పాంక్రియాస్‌కు) చేరుకుంటుంది. వెంటనే అతడి పాంక్రియాస్ క్షారస్వభావం గల జీర్ణరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ జీర్ణరసం నాలోని డువోడినమ్కు చేరి, అక్కడకు వచ్చిపడే యాసిడ్స్‌ను నిర్వీర్యం చేస్తాయి. పాంక్రియాస్ ఉత్పత్తి చేసే జీర్ణరసంలోని మూడు ముఖ్యమైన ఎంజైమ్స్ ఆహారంలోని ప్రొటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లను శరీరానికి పనికొచ్చేలా తయారు చేస్తాయి. పాంక్రియాస్ ద్వారా విడుదలయ్యే జీర్ణరసంతో పాటు నాలోకి వేర్వేరు మార్గాల ద్వారా రకరకాల రసాలు వచ్చి చేరుతూనే ఉంటాయి. నాలోకి రోజుకు రెండు లీటర్ల లాలాజలం, కడుపు ద్వారా మూడు లీటర్ల ఆమ్లరసాలు, లివర్ ద్వారా పిత్తరసం (బైల్), వివిధ గ్రంథుల ద్వారా మరో రెండు లీటర్ల స్రావాలు నాలోకి చేరుతాయి. ఈ ప్రక్రియకు ఏదైనా విఘాతం కలిగితే, ఆనంద్‌కు అల్సర్లు ఏర్పడతాయి. దాదాపు 75 శాతం అల్సర్లు డువోడినమ్లోనే ఏర్పడతాయి. తిండి జాగ్రత్తతో సురక్షితంగా ఉంటా చాలామందిలాగే ఆనంద్ కూడా తనకు తానే పెద్ద ఆహార నిపుణుడిని అనుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు తలెత్తే మలబద్ధకాన్ని వదిలించుకునేందుకు తనకు తోచిందల్లా తినేస్తూ ఉంటాడు. యవ్వనంలో సరే ఆనంద్ ఏం తిన్నా హరాయించుకునే శక్తి నాకు ఉండేది. ఈ నడివయసులోనూ అలాగే తింటే ఎలా కుదురుతుంది? ఆనంద్ కాస్త తిండి జాగ్రత్త పాటిస్తే చాలు, నేను సురక్షితంగా ఉంటా. అతడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటా. ఈ వయసులో ఆనంద్ గ్యాస్‌ను అతిగా ఉత్పత్తి చేసే ఉల్లిపాయలు, క్యాబేజీ, బీన్స్ వంటివి అతిగా తినకుండా ఉంటేనే మంచిది. వాటి బదులుగా పుష్కలంగా ఆకుకూరలు, చిరుధాన్యాలు, పండ్లు తీసుకోవడం మంచిది. అలాగే తను బాగా నీరు కూడా తాగాలి. ఒత్తిడికి, దిగులుకు దూరంగా ప్రశాంతంగా ఉండాలి. విశ్రాంతితో సర్దుకుంటా చాలామందిలాగానే ఆనంద్ కూడా తిండి విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటాడు. ఒక్కోసారి వేళాపాళా లేకుండా తింటుంటాడు. నడి వయసుకొచ్చాననే ధ్యాస కూడా లేకుండా రుచుల కోసం ఆత్రపడి నాలుకకు నచ్చినదల్లా లాగించేస్తూ ఉంటాడు. నడి వయసుకు వచ్చే సరికి నా వెలుపలి వైపు చిన్న చిన్న బుడగల్లా ఏర్పడతాయి. ఇవి మహా అయితే ఒక ద్రాక్షపండు పరిమాణంలో ఉంటాయి. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటే, వీటి వల్ల ప్రమాదమేమీ ఉండదు. ఇన్ఫెక్షన్లు సోకితే మాత్రం వీటికి వాపు ఏర్పడి నాకు ఇబ్బందులు కలుగుతాయి. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు, కొన్ని రసాయనాల వల్ల ఇలా జరుగుతుంది. వాటి వల్ల నొప్పి, వికారం, నీళ్ల విరోచనాలు మొదలవుతాయి. అలాంటప్పుడు ఒక రోజంతా విశ్రాంతినిస్తే నా అంతట నేనే తేరుకుంటాను. నా పెద్ద పేగులో లైనింగ్ దెబ్బతిన్నప్పుడు కూడా కడుపునొప్పి తప్పదు. ఒత్తిడి, కుంగుబాటు వంటి కారణాల వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఆనంద్ ఒత్తిడి నుంచి తేరుకుని, ప్రశాంతంగా మారితే నేనూ కోలుకుంటాను. పెద్దపేగు లోపలి గోడలు బాగా దెబ్బతిని అల్సర్ ఏర్పడితే, రక్తస్రావం కూడా జరగొచ్చు. అదృష్టవశాత్తు ఆనంద్‌కు ఇంతవరకు అలాంటి పరిస్థితి తలెత్తలేదు. ఒకవేళ ఆ పరిస్థితే తలెత్తితే, వైద్యుల సాయం తీసుకోక తప్పదు. మూడ్స్‌తో మారే పనితీరు ఆనంద్ శరీరంలోని చాలా ఇతర అవయవాల మాదిరిగానే నా పనితీరు కూడా అతడి మూడ్స్‌కు అనుగుణంగా మారుతూ ఉంటుంది. అతడి మూడ్స్ వల్ల ఒక్కోసారి నా కదలికలు వేగంగా మారడం లేదా ఒక్కోసారి కదలికలు నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతేకాదు, నేను ఆనంద్‌కు తరచుగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాను. ఒక్కోసారి శబ్దాలు తెప్పిస్తుంటా. నాలోని గ్యాస్ బుడగలు కదిలేటప్పుడు వచ్చే శబ్దాలవి. ఎక్కువగా అవి ఆనంద్ మింగిన గాలి వల్ల ఏర్పడినవే. అయితే, నేను కూడా కొంత గ్యాస్‌లను ఉత్పత్తి చేస్తా. వాటిలో ముఖ్యంగా మీథేన్, హైడ్రోజన్ ఉంటాయి. -
రూపంలో చిన్న.. మేలు చేయడంలో పెద్ద...
తిండి గోల వాము భారతీయులకు తెలిసిన అతి ప్రాచీన గొప్ప ఔషధం. దీనిని ఓమ అని కూడా అంటుంటాం. సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసుగా వాడుకలో ఉంది. ఆహారం జీర్ణం కానప్పుడు కాసింత వామును నోట్లో వేసుకోమంటుంటారు పెద్దలు. జీర్ణశక్తికే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్యసమస్యలకు ఔషధంలా వామును ఉపయోగిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా వాము సాగు ఉంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో వాము సాగులో ముందంజలో ఉన్నాయి. మన దేశంతో పాటు ఇరాన్, ఆఫ్టనిస్తాన్ దేశాలు వాము వాడకంలోనూ, ఉత్పత్తిలోనూ ముందున్నాయి. ఆకారానికి జీలకర్రలాగే అనిపించినా పరిమాణంలో చిన్నదిగా ఉండే వాము రుచి కొంచెం ఘాటు, ఇంకొంచెం కారం. రూపంలో చిన్నదైనా వాము చేసే మేలు మాత్రం మహా పెద్దది. మనం ఎంతో ప్రాచీనమైనదిగా చెప్పుకునే వాము మూలాలు ఈజిప్టులో ఉన్నాయని, అక్కడి నుంచి ఇండియాకు అటు తర్వాత ఇతర దేశాలకు విస్తరించిందని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. -
ప్రతి నాలుగైదు రోజులకు కొత్త పొరలు!
మెడి క్షనరీ సాంకేతికంగా అన్నవాహిక (ఈసోఫేగస్), చిన్న పేగు తొలి భాగం (డియోడినమ్) భాగాల మధ్య ఉన్న సంచి వంటి భాగాన్ని ‘కడుపు’ (స్టమక్) అంటారు. మనం తిన్న ఆహారం కడుపు నుంచి జీర్ణం కావడం ప్రారంభమవుతుంది. ఈ భాగంలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో పాటు పెప్సిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. పెప్సిన్ ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. కడుపులో స్రవించే యాసిడ్ ఆహారంతో పాటు కడుపు కండరాలపై కూడా పనిచేస్తుంది. అందుకే స్టమక్ లోపలి భాగం ఈ యాసిడ్‌ను తట్టుకునేందుకు మ్యూకస్ అనే తడిని స్రవిస్తుంటుంది. అయినప్పటికీ యాసిడ్ కడుపులోని లోపలి గోడలనూ జీర్ణం చేస్తుండటంతో ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి లోపలి లైనింగ్ పొర కొత్తగా పుడుతూ యాసిడ్ వల్ల ధ్వంసమైన భాగాన్ని ఆక్రమిస్తుంటుంది. ఇలా కడుపు లోపలి కండరాలు ఆకలి లేనప్పుడు ముడుచుకుంటూ, తిన్న తర్వాత సాగుతూ ఉండేలా ‘ముడుతల’తో ఉంటాయి. ఈ ముడుతలనే ‘గ్యాస్ట్రిక్ రుగీ’ (Gastric Rugae) అంటారు. -
వీర్యంలో పస్‌సెల్స్ ఎక్కువ, ఏం చేయాలి?
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ ఆహారం సరిగా జీర్ణం కావడం లేదు! నా వయసు 26 ఏళ్లు. బరువు 64 కేజీలు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. కొద్దిరోజులుగా పొట్ట అంతా ఉబ్బరంగా ఉంటోంది. తేన్పులు ఎక్కువగా వస్తున్నాయి. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కావడం లేదు. వీటితో పాటు కోపం, చిరాకు ఎక్కువగా కలుగుతున్నాయి. శారీరకంగానూ, మానసికంగానూ బాధపడుతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరని ప్రార్థిస్తున్నాను. - ఒక సోదరుడు, హైదరాబాద్ మీరు రాసిన లక్షణాలను బట్టి చూస్తే మీరు పెప్టిక్ అల్సర్‌తో గానీ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధితో గాని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ సమస్యతో ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో రాయలేదు. చాలావరకు అల్సర్స్‌కు సంబంధించిన వ్యాధి వల్ల కడుపులో నొప్పి రావడం, మంటరావడం జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత నొప్పి ఎక్కువ కావడం గానీ, తక్కువ కావడం గానీ జరుగుతుంది. ఒక్కోసారి కడుపులో అల్సర్స్ తీవ్రత ఎక్కువగా ఉంటే భోజనం తర్వాత వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు ముందుగా మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని, వ్యాధి నిర్ధారణ జరిగేలా చూసుకోండి. ఎండోస్కోపీ పరీక్షతో మీ వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ అయితే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. నాకు ఆర్నెల్ల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు చేసిన రక్త పరీక్షల్లో హెపటైటిస్-బి పాజిటివ్ అని చెప్పారు. ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తిరిగి ఆ టెస్ట్ చేయిస్తే మళ్లీ పాజిటివ్ అని తెలిపారు. ఈ వ్యాధికి తగిన చికిత్స అందుబాటులో ఉందా? నాకు సరైన సలహా ఇవ్వండి. - సుదర్శన్‌నాయుడు, చిత్తూరు మీరు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే ఆరు నెలల తర్వాత కూడా మీకు మీ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది కాబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్-బి ఉందని అర్థం. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్తపరీక్షలు చేయించుకొని, వ్యాధి ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి చాలామందిలో నిద్రాణ స్థితిలో ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి చైతన్యవంతం అయ్యే అవకాశం ఉంది. మీరు ప్రతి మూడు నెలలకోసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు నడుచుకోండి. యాండ్రాలజీ కౌన్సెలింగ్ వీర్యంలో పస్‌సెల్స్ ఎక్కువ, ఏం చేయాలి? నా వయుస్సు 34 ఏళ్లు. నాకు వివాహం జరిగి పదేళ్లు దాటింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. దాంతో దంపతులిద్దరం వైద్యపరీక్షలు చేయించుకున్నాం. ఆమెలో ఏ లోపం లేదు. కానీ నా వీర్యంలో పస్ సెల్స్ ఎక్కువగా (ప్లెంటీ ఆఫ్ పస్ సెల్స్) ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. పస్ సెల్స్ ఉన్నందువల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా? మాకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? - కేజేఎన్., విజయవాడ చాలాకాలంగా సంతానం లేనివారిలో మగవారికి మొదట సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఈ పస్ సెల్స్ ఉన్నప్పుడు వీర్యం నాణ్యత తగ్గుతుంది. దాంతో పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. డాక్టర్ సలహా మీద సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల వీర్యంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గితే వీర్యం నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. యూంటిబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ మరోసారి సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేసి, ఈసారి వీర్యం క్వాలిటీ వూవుూలుగా ఉన్నట్లు రిపోర్టు వస్తే మీకు పిల్లలు పుట్టే అవకాశాలు తప్పక మెరుగవుతాయి. నాకు కుడిపక్కన వరిబీజం (బుడ్డ) వచ్చింది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అన్నారు. కానీ ఆపరేషన్ వల్ల సెక్స్‌లో ఇబ్బందులేమైనా వస్తాయేమోననీ, పిల్లలు కలగరేమో అని చేయించుకోవడం లేదు. నాకు మార్గం చెప్పగలరు. - జీడీఎస్పీ., గుణదల హైడ్రోసీల్, హెర్నియా... ఈ ఆపరేషన్లకూ అంగస్తంభనకూ ఎలాంటి సంబంధం లేదు. అంగస్తంభనకు కావాల్సిన నరాలు అంగంలో చాలా లోపలికి ఉంటాయి. మీకు ఆపరేషన్ వృషణాల దగ్గర చేస్తారు. దీని వల్ల సెక్స్ చేయడానికి ఇబ్బంది అయ్యే అవకాశమే లేదు. పిల్లలు పుట్టకపోవడం అనేది కూడా జరగదు. నిజానికి మీ సమస్యకు ఆపరేషన్ చేయించుకోకపోతేనే చాలా ప్రమాదం. సర్జరీ తర్వాత సమస్యలన్నీ తొలగి, అంతా నార్మల్ అయిపోతుంది. కాబట్టి నిశ్చింతగా సర్జరీ చేయించుకోండి. నా వయసు 40. మూడేళ్లుగా షుగర్‌వ్యాధితో బాధపడుతున్నాను. ప్రస్తుతం చక్కెరపాళ్లు కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ రెండు మూడు నెలల నుంచి మూత్రంలో మంట, పురుషాంగం చివరిభాగంలో చర్మంపై పగుళ్లు వస్తున్నాయి. సెక్స్ చేసేటప్పుడు పురుషాంగం చివరన ఉన్న చర్మం మంటపుడుతోంది. దాంతోపాటు సెక్స్ సమయంలో పురుషాంగం చివర ఉన్న చర్మం వెనక్కిపోవడం లేదు. నా సమస్యకు సరైన మార్గాన్ని సూచించండి. - ఎస్.ఆర్.ఎస్.ఎమ్., నెల్లూరు షుగర్ వ్యాధి ఉన్నవారిలో పురుషాంగం చివరన ఉన్న చర్మంపై పగుళ్లు రావడం, ఇన్ఫెక్షన్ రావడం, తెల్లగా పాలిపోయినట్లుగా కావడం వంటి సమస్యలు చాలా సాధారణం. ఈ సమస్యను బెలనోఫ్తైస్ అంటారు. సాధారణంగా యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ క్రీమ్‌లతో ఇది తగ్గిపోతుంది. కాకపోతే పదే పదే వస్తుండటంతో పాటు... ప్రధానంగా చర్మం వెనక్కిపోకుండా సెక్స్‌లో సమస్యగా మారిన వారు దీనికోసం సున్తీ (సర్కమ్‌సిషన్) ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. అదేవిధంగా షుగర్ ఉన్న పేషెంట్స్‌లో యూరిన్‌లో ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తున్నా కూడా సున్తీ ఆపరేషన్‌ను సూచిస్తాం. ఈ ఆపరేషన్ తర్వాత మీరు పేర్కొన్న సమస్యలన్నీ దూరం కావడం వల్ల నిశ్చింతగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ తుంటి ఎముక ఫ్రాక్చర్, సర్జరీ తప్పదా? మా చిన్నమ్మగారి వయసు 77 ఏళ్లు. ఆమె ఆర్నెల్ల క్రితం బాత్రూమ్లో జారిపడింది. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఆయన ఎక్స్-రే తీసి, తుంటి ఎముక ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పడంతో మేం ఆమెను ఆర్థోపెడిక్ సర్జన్ వద్దకు తీసుకెళ్లాం. ఆమెకు మేజర్ సర్జరీ అవసరమనీ, దానికి సంబంధించిన అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా వివరించారు. మా కుటుంబ సభ్యులమంతా ఆ రిస్క్ ఫ్యాక్టర్లు విన్న తర్వాత చాలా ఎక్కువగా ఆందోళన పడ్డాం. కొందరు సన్నిహితుల సలహా మేరకు ఆమెను ఇంగ్లిష్ వైద్యులకు బదులుగా సంప్రదాయ వైద్యం చేస్తూ, ఎముకలను సరిచేసే వారిదగ్గరకు తీసుకెళ్లాం. వారేదో బ్యాండేజీ లాంటిది కట్టి, బెడ్‌రెస్ట్ తీసుకొమ్మని సలహా ఇచ్చారు. ఒక మూడు నెలల్లో ఆమె లేచి తిరుగుతుందని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆమె మంచం దిగలేపోతోంది. పైగా ఎప్పుడూ మంచం మీదే పడుకొని ఉండటం వల్ల వీపు మీద అంతటా పుండ్లు (బెడ్‌సోర్స్) వచ్చాయి. ఈ దశలో మాకు తగిన సలహా ఇవ్వమని ప్రార్థన. - వెంకటదుర్గారావు, విజయవాడ తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడం అన్నది పెద్ద వయసువారిలో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఆ వయసువారు సాధారణంగా డయాబెటిస్, గుండెజబ్బులతో బాధపడుతుంటారు. తుంటిఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు చాలా సందర్భాల్లో శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది. అయితే ఆ వయసు వారిలో శస్త్రచికిత్స అంటే ప్రపంచంలోని ఉత్తమమైన ఆసుపత్రికి వెళ్లినా ఆ వయసుకు సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్లు ఉండనే ఉంటాయి. అయితే ఆ రిస్క్ ఫ్యాక్టర్లకు జడిసి మీరు ఆపరేషన్ చేయించుకోకపోతే మున్ముందు మరింత తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇక ప్రస్తుత సమస్యకు వస్తే ఆమె మళ్లీ లేచి నిలబడి తిరగాలంటే శస్త్రచికిత్స తప్పనిసరి. కాకపోతే ఆర్నెల్ల కిందటితో పోలిస్తే ఈసారి రిస్క్ మరింత పెరుగుతుందని గుర్తించండి. ప్రమాదం జరిగినపుడు సాధ్యమైనంత త్వరలో శస్త్రచికిత్స చేయిస్తే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ పిల్లల కోసంమీరంత నిరాశ పడనక్కరలేదు! నా వయసు 26 ఏళ్లు. నేను రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నాను. నాకు పెళ్లయి నాలుగేళ్ల అవుతోంది. గత మూడేళ్లుగా పిల్లలు కావాలని కోరుకుంటున్నాను. అయితే నాకు పీరియడ్స్ నాలుగైదు నెలలకొకసారి వస్తున్నాయి. డాక్టర్‌ను కలిశాను. స్కానింగ్ తీసి పాలీ సిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పారు. నాకు ఎప్పటికైనా పిల్లలు పుడతారా? దయచేసి తగిన సలహా ఇవ్వండి. - ఒక సోదరి, హైదరాబాద్ పాలీ సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్యను చాలా మంది మహిళల్లో మేం రోజూ చూస్తుంటాం. మీకు పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సమస్య ఉంది కాబట్టి ఇలా రుతుస్రావం క్రమంగా రాదు. దాంతో మీలో అండాలు ఉత్పత్తి అయ్యే సంఖ్య కూడా బాగా తగ్గుతంది. ఫలితంగా మీలో గర్భధారణకు చాలా టైమ్ పట్టవచ్చు. మొట్టమొదట మీరు చేయాల్సిన పని... మీరు ఒకవేళ ఎక్కువ బరువు ఉంటే దాన్ని క్రమంగా తగ్గించుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చేసుకోండి. ఇదే జరిగితే...మీలో రుతుస్రావం క్రమబద్ధంగా రావడం మొదలవుతుంది. ఇక మీ ఆహారంలో ముదురాకుపచ్చటి తాజా ఆకుకూరలు చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పిజ్జా, బర్గర్, బేకరీ ఐటమ్స్ వంటి జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేయండి. ఈరోజుల్లో మీలో అండం ఉత్పత్తి అయ్యేలా చేసేందుకు చాలా మంది మందులు, వైద్యప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. మొదట టాబ్లెట్స్‌తో ప్రారంభించి, చికిత్సకు మీరు స్పందిస్తున్న తీరు ఆధారంగా క్రమంగా మీకు గొనాడోట్రాపిన్ ఇంజక్షెన్ ఇవ్వడం వంటివి చేస్తాం. లేదా మందులూ, గొనాడోట్రాపిన్ ఇంజెక్షన్ కలిపి కాంబినేషన్లలో కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీలాంటి వారిలో చాలామంది చాలా ప్రాథమిక చికిత్సకే బాగా స్పందిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ఒవేరియన్ డ్రిల్లింగ్ చేస్తాం. ఐవీఎఫ్ అనే అధునాతన చికిత్స చాలా కొద్దిమందికి మాత్రమే అవసరమవుతుంది. మీరు అప్పుడే అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. మీకు పిల్లలు పుట్టేందుకు చాలా అవకాశాలే ఉన్నాయి. ఇక మీకు పీసీఓఎస్ ఉందంటే దీంతోపాటు దీర్ఘకాలంలో డయాబెటిస్, యుటెరైన్ క్యాన్సర్, గుండెసమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మీరు మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోండి. సరైన చికిత్స తీసుకుంటూ క్రమబద్ధంగా రుతుస్రావం జరిగేలా చూసుకుంటే చాలా సమస్యలు వాటంతట అవే చక్కబడతాయి. -
జీర్ణం... జీర్ణం... వాతాపి జీర్ణం!
‘తింటే ఆయానం - తినకుంటే నీరసం’ అనే సరదా మాట అందరం వినేదే. ‘పొట్ట రాయిలా ఉంది, ఛాతీ మీద ఏదో బరువు పెట్టినట్టుంది’ అనే మాట కొందరు అనేదే వీటన్నింటికీ కారణం... అజీర్తి. తిన్నది జీర్ణం కాకపోవడం అనే సమస్య చూడటానికి చాలా చిన్నగా అనిపించినా తీవ్రంగా బాధిస్తుంది. కడుపులో ఏదో బరువును మోస్తున్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ‘అజీర్తి సమస్యపై అవగాహన కల్పించి, దాని లక్షణాలూ, ఆ సమస్యకు కారణాలూ, దానికి పరిష్కారాలను సూచించడం కోసమే ఈ కథనం. అజీర్తిని నిర్వచించడానికి ప్రత్యేకంగా లక్షణాలంటూ ఉండవు. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుండవచ్చు. కొందరిలో ఇది కడుపులో ఇబ్బంది(అబ్డామినల్ డిస్కంఫర్ట్)తో వ్యక్తమవుతుంది. మరికొందరిలో ఛాతీలో నొప్పితో దడ పుట్టిస్తుంది. సాధారణంగా అవి అజీర్తికి చెందినవే అని గుర్తించడానికి ఒక సూచన కూడా ఉంది. దాదాపు అజీర్తికి చెందిన లక్షణాలన్నీ తిన్నవెంటనే కనిపిస్తుంటాయి. చాలామందిలో తమ జీవితకాలంలోని ఏదో ఒక దశలో ఈ అజీర్తి సమస్యను అనుభవిస్తారు. కానీ కొందరిలో ఇది నిత్యం ఉంటుంది. అజీర్తికి కారణాలు: మన నోటి నుంచి అన్నకోశం వరకు ఉన్న పైప్‌ను ఈసోఫేగస్ అంటారు. ఈ ఈసోఫేగస్తో పాటు అన్నకోశంలోని లోపలి పొరలు చాలా సున్నితంగా కండర నిర్మితమైన గోడలతో ఉంటాయి. వీటిలోంచి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన స్రావాలు (డెజైస్టివ్ జ్యూసెస్) వెలువడుతుంటాయి. ఈ స్రావాలు యాసిడ్ (ఆమ్ల) గుణాలను కలిగి ఉంటాయి. అవి పొట్టలో ఊరి మనం తిన్న ఆహారంపై పని చేసి, దాన్ని మరింత చిన్నవైన అంశాలుగా మార్చివేస్తాయి. మనం తిన్నవి ఎంత సూక్ష్మమైన అంశాలుగా విడిపోతాయంటే మనం తాగిన నీళ్లతో కలిసి... మన పేగులు పీల్చుకునేందుకు వీలుగా ద్రవరూపంలోకి మారేంతగా అవి మారిపోతాయి. ఈ ప్రక్రియనే జీర్ణప్రక్రియ అని/అరగడం అని మనం వ్యవహరిస్తుంటాం. ఏదైనా కారణాల వల్ల మన అన్నకోశంలో పగుళ్లూ, చీలికలూ ఏర్పడితే మన కడుపులో స్రవించే యాసిడ్ ఆ గాయాలను మరింతగా నొప్పి, వాపు, మంట (ఇన్ఫ్లమేషన్) కలిగేలా చేస్తుంది. కడుపులోని లోపలి పొరకు గాయాలవ్వడానికి కారణాలు కొవ్వుతో జారుడుగా ఉండేవి లేదా మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం. అతిగా ఆల్కహాల్ తాగడం పొగతాగే అలవాటు కొన్ని రకాలైన మందులు (ఉదాహరణకు ఆస్పిరిన్, నొప్పినివారణ మందులు (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు). మనలోని తీవ్రమైన ఒత్తిడి, యాంగ్జైటీ వంటి అంశాలు కూడా జీర్ణప్రక్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కొంతమంది గర్భంతో ఉన్నప్పుడు జీర్ణసమస్యలు ఎదురవుతాయి స్థూలకాయుల్లో అజీర్ణ సమస్య ఉంటే అది జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది. వారి కడుపులో స్రవించే యాసిడ్ పైకి అంటే ఈసోఫేగస్‌లోకి తన్నేలా చేస్తుంది. అందుకే కొందరిలో ఆమ్ల గుణమైన పులుపు రుచి నోట్లో తెలుస్తుంది. అందుకే చాలామంది పుల్లతేన్పులనే మాటను తమ వాడుక భాషలో పులితేన్పులుగా వాడుతుంటారు. లక్షణాలు: అజీర్తితో బాధపడేవారిలో తరచూ కనిపించే లక్షణం ఛాతీలో నొప్పి. దీని వల్ల కొందరు తమకు గుండెపోటు వచ్చిందేమో అని అపోహపడి మరింత ఆందోళనకు గురయ్యే సందర్భాలూ ఉన్నాయి. మనం తిన్న ఆహారాన్ని అన్నకోశం (కడుపు-స్టమక్)లోకి తీసుకెళ్లే పైప్ ఛాతీలోనుంచి వెళ్తుంది. చాలామందిలో కడుపు పూర్తిగా నిండిపోగానే పొట్టకు పైభాగాన, ఛాతీలో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ (మైల్డ్) నుంచి చాలా తీవ్రంగా (సివియర్‌గా) ఉండవచ్చు. ఒక్కోసారి కొంత కొంత వ్యవధి తర్వాత మళ్లీ మళ్లీ రావచ్చు. డాక్టర్‌ను కలవాల్సిందెప్పుడు? చాలామంది ఈ అజీర్తి సమస్యను తమకు తామే పరిష్కరించుకుం టుంటారు. ఇలా అనిపించగానే యాంటాసిడ్ మాత్ర తీసుకుంటుంటారు. దాంతో అది తగ్గిపోతుంది. మళ్లీ ఎప్పటికోగానీ కనిపించదు. అయితే ఈ అజీర్తి సమస్య రెండువారాలకు పైగా తగ్గకుండా అదేపనిగా కనిపిస్తూ ఉంటే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. ఇక మరికొందరిలో అజీర్తి తీవ్రతను కొన్ని లక్షణాలు బలంగా వ్యక్తీకరిస్తాయి. ఉదాహరణకు... జిగురుగా ఉండి, మలం నల్లరంగులో విసర్జితమైనప్పుడు అది అసాధారణమైన వాసనతో ఉన్నప్పుడు మింగడంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు వాంతి అయి... అందులో రక్తపు ఆనవాళ్లు కనిపించినప్పుడు ఎలాంటి కారణాలు లేకుండా బరువు తగ్గుతున్నప్పుడు యాభైఐదేళ్లు దాటినవారిలో నిత్యం అజీర్తి సమస్య కనిపిస్తున్నప్పుడు డాక్టర్‌ను తప్పక కలవాలి. నివారణ, పరిష్కారం: కొన్ని సాధారణ ప్రక్రియలతో, మామూలు లోకజ్ఞానంతోనే మన అజీర్తి సమస్యను మనమే నివారించుకోవచ్చు. ఆహారాన్ని త్వర త్వరగా తినవద్దు. మెల్లమెల్లగా ఎక్కువసేపు నములుతూ తినండి. రాత్రి భోజనం నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందుగా చేయండి. మీ శరీరపు పైభాగాన్ని కాస్త ఎత్తుగా ఉండేలా చూడండి. దీనికోసం తలగడను ఉపయోగించుకోవచ్చు. అలాగే మీ రెండు కాళ్లను కూడా తలగడను పెట్టుకుని అవి మీ శరీరం కంటే కాస్త ఎత్తున ఉండేలా చూసుకోండి. దీనివల్ల కడుపులో స్రవించిన గ్యాస్ట్రిక్ యాసిడ్ స్రావాలు ఈసోఫేగస్‌లోకి ప్రవేశించ డాన్ని నివారించవచ్చు. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి ఆల్కహాల్ తీసుకునే అలవాటును మానేయండి స్థూలకాయం ఉన్నవారు తమ బరువును తగ్గించుకోవాలి దైనందిన జీవితంలో ఒత్తిడిని వీలైనంతగా నివారించుకోండి అజీర్తి సమస్యను తగ్గించుకోడానికి మెడికల్ షాపుల్లో ఉండే యాంటాసిడ్ మాత్రలు వాడవచ్చు. కానీ అవి వాడుతున్నా... రెండు వారాలకు మించి అజీర్తి తగ్గకుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ నవీన్ పోలవరపు కన్సల్టెంట్ మెడికల్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
తప్పక తినండి
ఆరోగ్యం ఏ ఆహార పదార్థంతోనైనా ఒకటో రెండో ఉపయోగాలు ఉంటాయి. కానీ ఖర్జూరంతో మాత్రం చెప్పలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే వెంటనే మీ ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చేస్తారు.ఖర్జూరాలు మలబద్దకాన్ని నివారిస్తాయి. వీటిలో ఉండే ప్రత్యేక రసాయనం జీర్ణశక్తిని మెరుగుపర్చడమే కాక, పేగు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. కడుపులో ఉండే హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే సోలబుల్, ఇన్సోలబుల్ ఫైబర్స్ పొట్ట నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. ఆకలిని తగ్గించి, ఎక్కువ ఆహారాన్ని తినకుండా అడ్డుకుంటాయి. అలాగే వీటిలో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి నేచురల్ షుగర్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో ఉంటే పొటాషియం, సల్ఫర్ శరీరంలోని కొవ్వును విచ్ఛిన్నం చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే కచ్చితంగా ఖర్జూరాలు తినమంటున్నారు డాక్టర్లు. -
తొక్కే కదా అని తీసి పారేస్తే..!
పండు తినడం, తొక్క పారేయడం సహజమే. అయితే నారింజ, బత్తాయి, కమలాఫలం తొక్కల్ని మాత్రం పారేయవద్దు అంటున్నారు నిపుణులు. ఎందుకూ అంటే... ఈ తొక్కలు మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయట ఇవి క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో పెద్ద పాత్రే పోషిస్తాయి గుండె మంటను తగ్గించడానికి దోహదపడతాయి వీటిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జలుబు, దగ్గు, ఫ్లూ, ఆస్త్మా వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ఈ తొక్కలు మంచి మందు శారీరక దుర్వాససను పోగొట్టే లక్షణం ఉంది వీటికి. అందుకే వీటిని పర్ఫ్యూమ్స్ తయారీలో ఉపయోగిస్తారు వీటితో పళ్లు రుద్దుకుంటే ముత్యాల్లా మెరుస్తాయి. అప్పుడప్పుడూ చిన్న ముక్కను నములుతూంటే... చిగుళ్ల సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కాబట్టి ఇంకెప్పుడూ తొక్కే కదా అని పారేయకండి. తప్పకుండా తీసుకోండి. ఎలా అంటే ఎండబెట్టి పొడి చేసి వంటల్లో వాడొచ్చు. లేదంటే నీళ్లలో మరిగించి ఆ నీటిని సేవించవచ్చు. మీ ఇష్టం! -
అల్సర్స్‌ని అడ్డుకుందాం....
స్టమక్ అల్సర్స్ ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన కడుపులో ఆమ్లం స్రవిస్తూ ఉంటుంది. అది ఆమ్లం కాబట్టి ఆహారంపై పనిచేయడానికి బదులుగా మన కడుపు కండరాల మీదే పని చేస్తే కడుపులో మంట వస్తుంటుంది. ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. యాసిడ్ వల్ల కనిపించే ప్రభావం కాబట్టి దీన్ని వాడుకభాషలో సైతం ‘ఎసిడిటీ’ అంటూ చాలామంది పేర్కొంటుండటం వల్ల ఇది ప్రజల్లో ఎంత ప్రాచుర్యంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ అదే యాసిడ్ క్రమక్రమంగా కడుపులోని కండరాలపై పనిచేస్తూ పోతే... జీర్ణవ్యవస్థ పొడవునా చాలా చోట్ల పుండ్లు పడే అవకాశం ఉంది. అయితే ఇలా పుండ్లు పడటంలో వేళ తప్పి తినడం లాంటి వాటి కంటే హెచ్. పైలోరీ అనే బ్యాక్టీరియా, ఆస్పిరిన్ వంటి రక్తాన్ని పలచబార్చే మందులు, ఐబూప్రొఫిన్ వంటి నొప్పి నివారణ మందులు (ఎన్ఎస్ఏఐడీస్) ఎక్కువగా కారణమవుతాయి. ఈ పుండ్లనే పెప్టిక్ అల్సర్స్ అని వ్యవహరిస్తుంటారు. ఇటీవల ఈ పెప్టిక్ అల్సర్లు ఎక్కువయ్యాయి. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. అల్సర్లు... రకాలు! జీర్ణవ్యవస్థ పొడవునా యాసిడ్ తన దుష్ర్పభావం చూపి, అక్కడి మెత్తటి కణజాలంపై పనిచేసి, ఆ మృదుకణజాలం ఒరుసుకుపోయేలా చేస్తుంది. ఇలా ఒరుసుకుపోయిన ప్రాంతమే పుండులా మారుతుంది. ఈ ఒరుసుకుపోయిన ప్రాంతం పేరును బట్టి సదరు అల్సర్ పేరును నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఈసోఫేగస్ భాగంలో ఇలా ఒరుసుకుపోతే వాటిని ఈసోఫేజియల్ అల్సర్స్ అంటారు. జీర్ణాశయంలో పుండు పడితే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. ఇక చిన్న పేగులో మూడు భాగాలుంటాయి. చిన్నపేగులోని మొదటిభాగమైన డియోడినమ్ అనేచోట పుండు పడితే దాన్ని డియోడినల్ అల్సర్ అని... ఇలా అది ఏర్పడే ప్రదేశాన్ని బట్టి అల్సర్పేరును నిర్ణయిస్తారన్నమాట. స్థూలంగా చెప్పాలంటే ప్రదేశం వేరైనా అల్సర్లన్నీ ఒకేలాంటి ప్రభావం చూపిస్తాయి. రిఫ్రాక్టరీ అల్సర్స్ ఇవి ప్రత్యేకమైన అల్సర్లు. కొన్నిసార్లు ఎంతగా చికిత్స తీసుకున్నా రోగి తాలూకు వ్యక్తిగత అలవాట్ల కారణంగానో (అంటే పొగాకు వినియోగం, ఆల్కహాల్ తాగడం వంటివి), హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్ మందులు పనిచేయకపోవడం వల్లనో (అంటే ఆ బ్యాక్టీరియా సదరు మందులపట్ల నిరోధాన్ని పెంచుకోవడం వల్ల), జోలింగర్-ఎలిసన్ సిండ్రోమ్ వల్లనో... అల్సర్లు ఎప్పటికీ తగ్గవు. పైగా కడుపులోని స్రావాలు మరింతగా పెరుగుతాయి. ఇలాంటి మొండి అల్సర్లను రిఫ్రాక్టివ్ అల్సర్స్ అంటారు. గుర్తుంచుకోండి గతంలో అల్సర్స్‌కు యాంటాసిడ్స్, సైటోప్రొటెక్టివ్ ఏజెంట్స్, హెచ్టూ బ్లాకర్స్ (ట్యాగమెట్, జాంటాక్) వంటి మాత్రలు వాడేవారు. కానీ అవి అల్సర్‌పై పని చేయవని ఆధునిక పరిశోధనల్లో తేలింది. కాబట్టి వాటిని రొటీన్‌గా ప్రిస్క్రయిబ్ చేయడం, వాడటం మంచిది కాదు. లక్షణాలు ►కడుపులో మంటలా అనిపించే నొప్పి. ఒక్కోసారి ఈ మంట గొంతువైపునకు పాకుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఛాతీ మీద మంటగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ► ఎప్పుడూ ఆకలిగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది. ► ఒక్కోసారి వికారంగా ఉంటుంది. వాంతులు కూడా కావచ్చు. వాంతులు అయినప్పుడు కొన్నిసార్లు రక్తం కూడా పడవచ్చు. ► తిండి సయించకపోవడంతో ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉంటుంది. ► ఛాతీకి కింద, కడుపునకు పైభాగంలో నొప్పిగా ఉండి, ఆ నొప్పి పెరిగి ఒక్కోసారి రాత్రివేళల్లో నిద్రాభంగం అవుతుంటుంది. ఆ నొప్పి వీపు వైపునకు కూడా పాకినట్లుగా అనిపిస్తుంది. (దీన్నే రిఫర్డ్ పెయిన్ అని అంటారు). ► అల్సర్ల నుంచి రక్తస్రావం జరిగితే... ఆ రక్తం మలంలో కలవడం వల్ల మలం నల్లగా కనిపించే అవకాశాలూ ఉంటాయి. ► బరువు తగ్గడం, ఛాతీ మీద ఏదో బరువు పెట్టినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు చాలా సాధారణం. ► అల్సర్ ఉన్నవారిలో భోజనం తిన్న తర్వాత అది ఈసోఫేజియల్ భాగం/ఛాతీ భాగంలో చిక్కుకుపోయినట్లుగా ఉంటుంది. నిర్థారణ ► కడుపులో అల్సర్లు ఉన్న లక్షణాలు కనిపించినప్పుడు రక్తపరీక్షలూ, మల పరీక్షల ద్వారా ముందుగా హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా ఉందా అనే నిర్ధారణ పరీక్షలు చేయాలి. ► ఎండోస్కోపీ ప్రక్రియతో జీర్ణవ్యవస్థ పైభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ► ఒకవేళ ఎక్కడైనా అల్సర్ కనిపిస్తే... ఆ భాగం నుంచి చిన్న ముక్క సేకరించి, దాన్ని బయాప్సీ పరీక్షకు పంపాలి. ► రోగి చేత బేరియం ద్రవాన్ని తాగించి ఎక్స్-రే తీసి పరీక్ష చేయడం ద్వారా కూడా అల్సర్లను నిర్ధారణ చేయవచ్చు. ► బయాప్సీ చేసినప్పుడు మనం హెచ్. పైలోరీ గురించి నిర్ధారణగా తెలుసుకోవచ్చు. బయాప్సీ ద్వారా అల్సర్‌లో క్యాన్సర్ ఉందా, లేదా తెలుస్తుంది. అందుకే స్టమక్ అల్సర్లన్నింటి విషయంలోనూ బయాప్సీ చేయించాలన్నది అంతర్జాతీయ సిఫార్సు (రికమండేషన్). డాక్టర్‌ను ఎప్పుడు కలవాలంటే... ►మీ కడుపులో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి మొదలై అది కడుపులో శూలంగా గుచ్చుతున్నంత తీవ్రంగా (ప్రికింగ్ పెయిన్) ఆగకుండా నొప్పి వస్తున్నప్పుడు. ► పొట్టను తడిమినప్పుడు మీ చేతికి అది మృదువుగా లేకుండా, చాలా గట్టిగా మారినట్లుగా అనిపిస్తున్నప్పుడు... ► నొప్పితో పాటు వాంతులు కావడం, అందులో రక్తం కనిపించడం వంటివి జరిగినా లేదా మలవిసర్జనకు వెళ్లినప్పుడు మలం నల్లగా కనిపించినప్పుడు... ► స్పృహ తప్పడం, అయోమయంగా మాట్లాడటం, తీవ్రంగా చెమటలు పట్టడం, తల అంతా తేలికైపోయిన భావన కలగడం, నిద్రవస్తున్నట్లుగా మత్తుగా అనిపించడం జరిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చికిత్స ► అల్సర్ ఏ ప్రాంతంలో ఏర్పడింది, అది ఏర్పడటానికి కారణం ఏమిటి అనే అనేక అంశాల మీద చికిత్స ఆధారపడి ఉంటుంది. ఒకవేళ హెలికోబ్యాక్టర్ పైలోరీ వల్ల అల్సర్లు ఏర్పడితే దానికి యాంటీబయాటిక్స్‌తో పాటూ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే మాత్రలు 10 నుంచి 14 రోజుల పాటు ఇస్తారు. ►హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా లేని అల్సర్స్‌కు కేవలం ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్స్‌ను 4 నుంచి 8 వారాల పాటు ఇస్తూ చికిత్స చేస్తారు. ► కొన్ని సందర్భాల్లో కడుపులో స్రవించే యాసిడ్ పరిమాణం తగ్గేందుకు మందులు ఇస్తూ... దానితో పాటు కడుపులో ఏర్పడ్డ పుండ్లు మానేందుకూ మందులు రాస్తారు. ► చికిత్సలో భాగంగా అల్సర్స్‌ను పుట్టేలా ప్రేరేపించే (అఫెండింగ్ ఏజెంట్స్) పొగతాగడం వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి. కొన్ని రిఫ్రాక్టరీ అల్సర్స్‌ను శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది. ప్రమాదకరంగానూ మారవచ్చు... ఒక్కోసారి జీర్ణాశయంలోగానీ లేదా పేగుల్లో గానీ ఒరుసుకుపోయిన చోటే... మళ్లీ మళ్లీ ఒరుసుకుపోతే అది జీర్ణాశయానికి / పేగుకు రంధ్రంలా పడేందుకు అవకాశం ఉంది. ఇలాంటి కండిషన్‌ను అల్సర్ పెర్ఫొరేషన్ అయి అది పెరిటోనైటిస్ అనే కండిషన్‌కు దారి తీస్తుంది. ఇది ప్రాణాపాయాన్ని కలిగించే స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జీర్ణాశయంలో స్రవించే ద్రవాలు, ఆ మార్గానికే పరిమితం కాకుండా శరీరం (బాడీ-క్యావిటీ)లోని అన్ని భాగాలకూ విస్తరించి శరీరాన్ని విషపూరితం చేసే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన కండిషన్. ఇలాంటప్పుడు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. నివారణ ► ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోండి. వేళకు భోజనం చేయండి. వేళతప్పి తినకండి. ►సమతులాహారం తీసుకోండి. మీ ఆహారంలో పీచు పదార్థాలు ఉండే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చేసుకోండి. మాంసాహారం తినాల్సి వచ్చినా... దానితో పాటు శాకాహారపు సలాడ్లు అంతే మోతాదులో తీసుకుంటూ ఉండండి. ► బాగా ఉడికిన ఆహారాన్ని కాస్త వేడిగా (మరీ వేడిగా కాదు) ఉన్నప్పుడే తినండి. ఎలాగైనా సద్వినియోగం చేద్దామనే ఉద్దేశంతో చెడిపోయిన ఆహారాన్ని తీసుకోకండి. దానివల్ల జరిగే సద్వినియోగం కంటే మీరు మీ ఆరోగ్యానికి చేసుకునే హానే ఎక్కువ. ► అల్సర్స్ మందులను డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఎందుకంటే ఇందులో ఇచ్చే ప్రోటాప్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) మందులను భోజనానికి ముందే వాడాల్సి ఉంటుంది. అందుకే అల్సర్ మందుల విషయంలో ఎలాపడితే అలా వాడకుండా డాక్టర్ సూచనలు పాటించడం తప్పనిసరి. ► చిన్న చిన్న నొప్పులకు నొప్పి నివారణ మాత్రలు వాడకండి. వాటితో చాలా అనర్థాలు వస్తాయి. అంతగా నొప్పిని భరించలేకపోతే పారసిటమాల్ వంటి మందులను నొప్పి తగ్గించేందుకు ఒకటి రెండు రోజులు వాడవచ్చు. ఒకవేళ అప్పటికీ నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ను కలవడం తప్పనిసరి. ► పొగతాగడం, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి దురలవాట్లను వెంటనే మానేయండి. ఇలాంటి అల్సర్స్ విషయంలో పొగతాగే అలవాటు, ఆల్కహాల్ కంటే మరింత ప్రమాదకారి అని గుర్తించండి. అలాగని ఆల్కహాల్ కూడా మంచిదేమీ కాదు. ► మలబద్దకం లేకుండా చూసుకోవడం మంచిది. ఇందుకోసం పీచు ఎక్కువగా ఉండే తాజా పండ్లు, ఏ సీజన్లో లభించేవి ఆ సీజన్లో వాడుతూ ఉండండి. ►అలాగే జీర్ణవ్యవస్థలోని కండరాల కదలికలు ఆరోగ్యంగా ఉండటానికి క్రమబద్ధంగా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయండి. చివరగా... పొట్టలో (స్టమక్) అల్సర్స్ ఉన్నవారు చికిత్స తీసుకున్న తర్వాత కూడా అవన్నీ తగ్గాయా లేదా అని మరోసారి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే స్టమక్ అల్సర్స్లో ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఉంటే అలాంటివి చికిత్స తర్వాత కూడా తగ్గవు. కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే వాటిని ఒకసారి బయాప్సీ తీసి పరీక్ష చేయాలి. కానీ డియోడినల్ అల్సర్స్ విషయంలో ఈ జాగ్రత్త అవసరం లేదు. కాబట్టి అల్సర్స్ ఉన్నాయని తేలితే, ఆ అంశాన్ని తేలిగ్గా తీసుకోకుండా డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ గురు ఎన్. రెడ్డి చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రోంటరాలజీ - లివర్ డిసీజెస్, చైర్మన్ - ఎండీ., కాంటినెంటల్ హాస్పిటల్స్, గచ్చీబౌలీ, హైదరాబాద్ -
ఖైకే పాన్ పామర్రు వాలా!
బెనారస్ వాలాకైనా.. ఏలూరు చిన్నోడికైనా.. హైదరాబాద్ బుల్లోడికైనా.. దవడ కిందకు కారా కిళ్లీ చేరితే మెదళ్లకు పట్టిన తుప్పు వదిలిపోతుంది. అదే మృష్టాన్న భోజనం తర్వాత ఓ మీఠా పాన్ లాగిస్తే గానీ.. అంతరంగమున ఆత్మారాముడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనలేడు. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. పల్లె నుంచి పట్నం వరకూ పాన్‌షాప్‌లకు ఉన్నంత గిరాకీ మరే కొట్టుకూ ఉండదు. కిళ్లీ కట్టడంలో హస్తవాసికి కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కొందరు అర నిమిషంలో కి ళ్లీ చుట్టిచ్చినా అద్భుతః అన్నట్టు ఉంటుంది. అలాంటి పాన్‌వాలానే పామర్రుకు చెందిన జగపతి. అందుకే కృష్ణా జిల్లాలో చుట్టిన ఆయన కిళ్లీ హైదరాబాద్‌లో కూడా ఫేమస్ అయింది. ఎల్లలు దాటిన ఈ కిళ్లీ రుచికి పెద్ద చరిత్రే ఉంది. ఆరు దశాబ్దాల కిందట కృష్ణా జిల్లా పామర్రులో జగపతి కిళ్లీ చుట్టడం ప్రారంభించారు. రకరకాల ఐటమ్స్‌తో రుచికరమైన కిళ్లీలు తయారు చేసేవాడు. దీంతో అనతి కాలంలోనే జగపతి కిళ్లీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఫేమస్ అయింది. ఎంతలా అంటే సినీ ప్రముఖులు, రాజకీయ ఉద్దండులు సైతం గుంటూరు వెళ్తే జగపతి కిళ్లీ తెప్పించుకుని మరీ నోరారా తినేవారు. ఈయనగారి కిళ్లీలు తిరుపతి, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాలు, చెన్నైకి కూడా వెళ్తుంటాయి. అదే క్రమంలో జగపతి కుమారుడు రామకృష్ణ హైదరాబాదీలకు పామర్రు కి ళ్లీ రుచి చూపిస్తున్నారు. 2001లో కూకట్పల్లి మలేసియా టౌన్షిప్ సమీపంలో చైతన్య ఫుడ్ కోర్టు ప్రారంభించారు. ఓ వైపు పసందైన భోజనంతో పాటుగా.. అంతే రుచికరమైన తీపి తాంబూలం కూడా అందిస్తున్నారు. మన్‌పసంద్ పాన్.. పామర్రులో తయారు చేసే కిళ్లీలు ప్రతిరోజూ ఇక్కడకు చేరుకుంటాయి. స్వీట్ పాన్, పీటీ కిళ్లీ, రత్న ఇలా 100 పేర్లతో రకరకాల కిళ్లీలు వీళ్లు అందిస్తున్నారు. జాజికాయ, జాపత్రి, లవంగం, మీనాక్షి లాంటి వాటితో పాటు సుగంధ ద్రవ్యాలు కలగలిపి మన్‌పసంద్ పాన్ తయారు చేస్తారు. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలే ఇందులో వినియోగిస్తుంటారు. ఒక్క స్వీట్పాన్లోనే 30 రకాల పదార్థాలను వినియోగిస్తారు. ఇక పెళ్లిళ్ల సీజన్లో పామర్రు తాంబూలాలకు భలే గిరాకీ ఉంటుంది. పాన్లు చుట్టడానికే పామర్రులో ప్రత్యేకంగా ఓ కుటీర పరిశ్రమ నడిపిస్తున్నారు వాళ్లు. దూరప్రాంతాలకు పంపాల్సిన కిళ్లీలు పాడవకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరు రూపాయల నుంచి రూ.600 వరకు ధర పలికే కిళ్లీలు ఇక్కడ దొరుకుతాయి. ఖరీదైన కిళ్లీల్లో కుంకుమపువ్వు, బంగారు ర్యాపర్ కూడా వాడుతుంటారు. పామర్రులో పకడ్బందీగా చుట్టిన ఈ కిళ్లీలతో హైదరాబాదీల నోరు పండిస్తున్నారు రామకృష్ణ. కోన సుధాకర్‌రెడ్డి