Disha App
-
కూటమి అధికారంలోకి వచ్చాకే మహిళలపై అత్యాచారాలు పెరిగాయి
-
సొంత పత్రం.. రోత నాటకం!
సాక్షి, అమరావతి: శాసనసభ వేదికగా సీఎం చంద్రబాబు మరోసారి తన కపట నాటకాన్ని ప్రదర్శించారు. శాంతి భద్రతలపై శ్వేతపత్రం ముసుగులో టీడీపీ రూపొందించిన ఓ కరపత్రాన్ని చదివి వినిపించారు. తాను ముఖ్యమంత్రిననే విషయాన్ని విస్మరించి టీడీపీ అధ్యక్షుడి పాత్ర పోషించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నిస్సిగ్గుగా నిరాధార ఆరోపణలు, వక్రీకరణలతో సభను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కళ్లెదుటే పచ్చమూకలు యథేచ్ఛగా సాగిస్తున్న హత్యలు, విధ్వంస కాండపై మౌనముద్ర వహిస్తూ నేరాలను ఏమాత్రం ఉపేక్షించబోనంటూ గాంభీర్యంగా ప్రకటించారు.చంద్రబాబు ఆరోపణలు – వాస్తవాలువైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, దాడులు, మహిళలపై వేధింపులు అమాంతం పెరిగాయి. చంద్రబాబు కాకి లెక్కలతో చట్టసభను పక్కదారి పట్టించేందుకు యత్నించడం విస్తుగొలుపుతోంది. సర్కారు సొంత లెక్కలు ఎలా ఉన్నా దేశంలో ఏటా నేరాల వివరాలను వెల్లడించే జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదికలు మాత్రం వాస్తవాలను కళ్లకు కట్టినట్లు వెల్లడిస్తున్నాయి. 2014–19 వరకు టీడీపీ హయాంతో పోలిస్తే 2019–24 మధ్య వైఎస్సార్సీపీ పాలనలో ఏపీలో అన్ని రకాల నేరాలు తగ్గాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇరు ప్రభుత్వాల పాలన చివరి ఏడాదిలో నేరాలు, దాడులు, ప్రమాదాలు ఎలా ఉన్నాయో చెప్పేందుకు అధికారిక నివేదికలే నిదర్శనం.వైఎస్సార్సీపీ హయాంలో గంజాయి, డ్రగ్స్ దందా విచ్చలవిడిగా పెరిగింది.రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి దందాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసింది. గతంలో చంద్రబాబు హయాంలో టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా జరిగాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవోబీలో గంజాయి సాగును కూకటి వేళ్లతో పెకలించింది. రెండు దశల్లో నిర్వహించిన ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా 11,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది.మహిళల భద్రతలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైంది. దిశ యాప్‌తో ప్రయోజనం లేదు.మహిళా భద్రత కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. దిశ మొబైల్ యాప్, దిశ పోలీసు స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం తదితర చర్యలతో నెలకొల్పిన వ్యవస్థలు మహిళల భద్రతకు గట్టి భరోసానిచ్చాయి. అందుకే దిశ యాప్‌ను ఏకంగా 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలు దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, ఫోన్‌ను షేక్ చేసినా నిమిషాల వ్యవధిలోనే సాయం అందించి పోలీసులు కాపాడిన ఘటనలు అనేకం ఉన్నాయి. 2024 ఏప్రిల్ నాటికి యాప్ ద్వారా వచ్చిన 31,607 ఎస్‌వోఎస్ కాల్స్‌పై పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు భద్రత కల్పించారు. దిశ యాప్ జాతీయ స్థాయిలో ఏకంగా 19 అవార్డులు సాధించడం మహిళల భద్రత పట్ల గత ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. నేరం ఎక్కడ జరిగిందన్న విషయంతో సంబంధం లేకుండా తక్షణమే బాధితులకు భరోసా కల్పించి కేసులు నమోదు చేసేలా జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని తీసుకొచ్చారు. గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించి అక్క చెల్లెమ్మల భద్రత పట్ల అత్యంత శ్రద్ధ వహించారు.చంద్రబాబుతో సహా టీడీపీ, జనసేన నేతలపై కేసులు పెట్టారు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును అడ్డుకున్నారు.చంద్రబాబుపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేయలేదు. 2014–19లో టీడీపీ సర్కారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో నిధులు కొల్లగొట్టిన విషయాన్ని 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఏసీబీకి కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఆ విషయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం తొక్కిపెట్టింది. అనంతరం పుణేకు చెందిన ఓ సామాజికవేత్త ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తేవడంతో సీఐడీ విచారణ మొదలైంది. నాడు ఏకంగా 13 చోట్ల ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేసి మరీ స్కిల్ నిధులు కొల్లగొట్టారని ఆధారాలతో నిరూపితమైంది. అందువల్లే సీఐడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. సీఐడీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం రిమాండ్ విధించడంతో చంద్రబాబు 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. అదే రీతిలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు, అసైన్డ్ భూముల కుంభకోణాల్లో చంద్రబాబు పాత్రను సీఐడీ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. ఇందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అక్రమంగా వేధించడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.⇒ వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును వైఎస్ జగన్ ప్రభావితం చేశారన్నది పూర్తి అవాస్తవం. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆ కేసును దర్యాప్తు చేస్తోందనే విషయాన్ని విస్మరించి చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారు.కోడెలపై ఫర్నిచర్ దొంగతనం కేసు పెట్టారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఫర్నిచర్‌ను వెనక్కి ఇవ్వకున్నా పట్టించుకోలేదు.స్పీకర్ కార్యాలయం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ను కోడెల శివప్రసాద్ గుంటూరు లోని తమ కుటుంబానికి చెందిన ఆటోమొబైల్ షోరూమ్‌కు అక్రమంగా తరలించారు. అందుకే అప్పట్లో శాసన సభ స్పీకర్ ఆదేశాలతో పొలీసులు కేసు నమోదు చేశారు. కానీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఫర్నిచర్‌ను వైఎస్ జగన్ ఎక్కడికి తరలించుకుపోలేదు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ రెండు సార్లు సాధారణ పరిపాలన శాఖ (జీ ఏడీ) ముఖ్య కార్యదర్శికి లేఖలు రాశారు. క్యాంపు కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్‌ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ జూన్ 15, 19వ తేదీల్లో రెండుసార్లు ఈ మెయిల్ ద్వారా లేఖలు పంపారు. అయినా సరే కూటమి ప్రభుత్వం స్పందించ లేదు. దాంతో జూలై 1న మరో లేఖ రాశారు. ఆ ఫర్నిచర్‌ను వెనక్కి అయినా తీసుకోండి.. లేదంటే ఆ ఫర్నిచర్ విలువ చెబితే ఆమేరకు డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వమే ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఇక వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి పది దఫాలకుపైగా జీఏడీ ముఖ్య కార్యదర్శికి ఫోన్ చేసి ఆ ఫర్నిచర్‌ను వెనక్కి తీసుకెళ్లాలని సూచించారు. అయినా సరే ప్రభుత్వం స్పందించలేదు. ఇలా ఉంటే బాబు వక్రీకరించి బురదజల్లేందుకు యత్నించడం విడ్డూరంగా ఉంది. దీని వెనుక పక్కా కుట్ర దాగి ఉంది. ఇంతకీ ఆ కుట్ర ఏమిటంటే... ఫర్నిచర్‌ను తీసుకెళ్లాలని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ఇన్చార్జీ పంపిన లేఖపై జీఏడీ అధికారులు సమీక్షించారు. దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై సలహా కోసం సంబంధిత ఫైల్‌ను ఆర్థిక శాఖ పరిశీలనకు పంపారు. దాన్ని పరిశీలించిన ఆర్థిక శాఖ.. ముఖ్యమంత్రి కార్యాలయం అభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలో ఆ ఫైల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయానికి పంపింది. సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో నెల రోజులుగా పెండింగ్‌లో ఉంది. అంటే ఆ ఫర్నిచర్‌ను వెనక్కి తీసుకెళ్లడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చంద్రబాబు కార్యాలయమే ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబే ఉద్దేశపూర్వకంగా ఆ ఫైల్‌ను తొక్కి పెట్టారు. మరోవైపు శాసనసభ వేదికగా వైఎస్ జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దుష్ప్రచారం కుట్రతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబూ...! ఇప్పటికైనా సరే సీఎంమ స్థాయికి తగ్గట్టుగా హుందాగా వ్యవహరించండి. శాసనసభలో మంది బలాన్ని చూసుకుని అడ్డగోలు ఆరోపణలు చేయాలనే మీ కుట్రలను సమర్థంగా తిప్పికొడతాం అని వైఎస్సార్ సీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.దేశమంతా నిరసిస్తున్నా పట్టదా?రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న నరమేధం,దమనకాండపై మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపలేదు. శ్వేతపత్రం పేరుతో వైఎస్సార్సీపీ సర్కారుపై బురద చల్లడం మినహా తన హయాంలో కొనసాగుతున్న మారణహోమంపై స్పందించాలనే ధ్యాసే లేకుండా వ్యవహరించారు. నెలన్నరలో 36 హత్యలు, 20 అత్యాచారాలు, వెయ్యికిపైగాగా దాడులతో రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా వైఎస్సార్సీపీ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో ఆ మారణహోమం ఫోటోలు, వీడియోలను పరిశీలించిన వివిధ జాతీయ పార్టీ నేతలు నివ్వెరపోయారు. దేశమంతా దీన్ని తీవ్రంగా ఖండించి నిరసిస్తున్నా సీఎం చంద్రబాబు శాసనసభలో కనీసం స్పందించకపోవడం ద్వారా టీడీపీ రౌడీ మూకల దమనకాండకు వత్తాసు పలికినట్లు స్పష్టమవుతోంది. -
బాబు, పవన్.. ముచ్చుమర్రి బాధితులను కలిసే టైమ్ లేదా?: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. అలాగే, ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయభాంత్రులకు గురవుతున్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. నిన్న కేబినెట్ సమావేశంలో ఈ ఘటనలపై ఎందుకు చర్చించలేదు.రాంబిల్లి మైనర్ బాలిక దర్శిని ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.హోం మంత్రి అనితకు సన్మానాలపై ఉన్న శ్రద్ధ బాధిత కుటుంబాలను పరామర్శించడంపై లేదు. హోం మంత్రి చర్యలు దారుణంగా ఉన్నాయి. బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న ఈ ప్రభుత్వం ఆ బుల్డోజర్లను ఆకాతాయిలపై ప్రయోగించాలి. దిశ చట్టంతో మహిళలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్షణ కల్పించారు. 2700 మంది మహిళలను దిశ యాప్ రక్షించింది. దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదని హోం మంత్రి పదే పదే చెప్పారు. అందుకే దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. ‘దిశ’ అనే ఆయుధాన్ని ఆక్టివ్ చెయ్యండి.కేంద్రంలో ‘దిశ’ చట్టం పెండింగ్‌లో ఉంది. చట్టం అమలులోకి వచ్చేలా చూడాలి. కూటమిలో ఉన్న మీరు దిశ చట్టంపై బాధ్యత తీసుకోవాలి. దర్శిని కుటుంబానికి కనీసం ఆర్ధిక సహాయం కూడా ప్రకటించలేదు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. హోం మంత్రి పక్క నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరిగితే ఆమెకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మహిళలపై దాడులను ప్రభుత్వం అరికట్టాలి లేదంటే వైఎస్సార్సీపీ ప్రజా పోరాటలకు సిద్ధమవుతుంది. రాజకీయాలు పక్కన పెట్టి ఆడపిల్లల భద్రతపై ప్రభుత్వం పని చెయ్యాలి. దిశ చట్టాన్ని అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చూడాలి’ అంటూ హితవు పలికారు. -
అండగా ఆదిశక్తి
మహిళలపై గృహ హింస, లైంగిక వేధింపులు.. అమ్మాయిల పట్ల ఆకతాయిల ఆగడాలు, ర్యాగింగ్ భూతం బాలికలపై వికృత చేష్టలు.. ఇలాంటి వాటికి చాలా వరకు మహిళలు బలయ్యాకగానీ స్పందన, న్యాయం జరిగేది కాదు. ఇదంతా గతం. మగువలు బాధితులుగా మారక ముందేరక్షణ ఛత్రంగా నిలవాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఆ ఆలోచనల్లో నుంచే అలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తూ ఆయన సంధించిన పాశుపతాస్త్రం ‘దిశ’ అన్ని సమస్యలకూ ఒక్కచోటే పరిష్కారం లభించేలా రూపొందించిన ఈ యాప్ మన ఆడపిల్లల రక్షణ ‘దిశ’గా ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం. అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. వారికి తక్షణ భరోసాగా పోలీసుల అభయహస్తం.. ఆపత్కాలంలో దిశ యాప్‌లోని బటన్ నొక్కితే.. మహిళలకు నిశ్చింతే.. సత్వర సాయమే కాదు.. దిశ పోలీసు స్టేషన్లతో సత్వర న్యాయమూ.. –సాక్షి, అమరావతి సీఎం జగన్ మది నుంచి పుట్టిన ‘దిశ’ అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నామంటే చాలు క్షణాల్లో పోలీసులు చేరుకుని భద్రత కల్పించే వ్యవస్థ ఏర్పడాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన. అందులో నుంచి పుట్టిందే దిశ మొబైల్ యాప్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రవేశపెట్టిన దిశ మొబైల్ యాప్ మహిళల భద్రతకు పర్యాయపదంగా మారింది. మగువలకు అనుక్షణం రక్షణగా నిలిచే దిశ యాప్, దిశ పోలీసు స్టేషన్లు ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టాయి. యావత్ దేశానికి ఇవి దిక్సూచిగా నిలిచాయి. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దిశ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు... నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరు కుని రక్షణ కవచంలా నిలుస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ‘దిశ’కు జాతీయస్థాయిలో ఎన్నో ప్రశంసలు దక్కాయి. అవార్డులు వరించాయి. ఎన్నో రాష్ట్రాలు ఈ వ్యవస్థను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. రికార్డు స్థాయిలో 1.50 కోట్ల డౌన్లోడ్లు 2020 డిసెంబర్ 15న అందుబాటులోకి వచ్చిన దిశ యాప్ ఫోన్లో ఉందంటే మహిళలు నిశ్చింతగా ఉన్నట్టే. ఈ యాప్‌ను ఇంతవరకు కోటీ 50 లక్షల 10 వేల 15 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కేవలం డౌన్‌లోడ్‌తోనే ఆగిపోకుండా కోటీ 29 లక్షల 8 వేల 530 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఓ మొబైల్ యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్లలో దేశంలో దిశ యాప్‌దే రికార్డు కావడం విశేషం. ఆపదలో ఉన్నామని దిశ యాప్‌కు సమాచారం ఇస్తే పట్టణాలు, నగరాల పరిధిలోనైతే 5 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాలైతే 10 నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దిశ యాప్ ద్వారా ఇంతవరకు 10 లక్షల 80 వేల 454 ఎస్ఓఎస్ కాల్ రిక్వెస్ట్‌లు వచ్చాయి. కొత్తగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి, రెండుసార్లు ఎస్ఓఎస్ బటన్ నొక్కి చూస్తారు. వాటిని మినహాయిస్తే పోలీసు చర్యలు తీసుకునే కాల్స్ 31,607 ఉన్నాయి. వీటన్నింటికీ పోలీసులు తక్షణం స్పందించి ఘటన స్థలానికి చేరుకుని తగిన న్యాయం అందించారు. దిశ యాప్‌లో సగటున రోజుకు 250 కాల్స్ వస్తున్నాయి. దశ‘దిశ’లా నిఘా లైంగిక వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను జియో మ్యాపింగ్ చేశారు. లైంగిక దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్న 2 లక్షల 17 వేల 467 మంది నేర చరితుల డేటా బేస్ రూపొందించి వారి కదలికలపై నిఘా పెట్టారు. ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తున్న 1,531 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్లు, లైంగిక వేధింపులకు పాల్పడిన 2,134 మందిపై షీట్లు తెరిచారు. నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలు సత్వరం సేకరించేందుకు అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలలో ఫోరెన్సిక్ లాŠయ్బ్లు ఏర్పాటు చేశారు. తిరుపతి, విశాఖపట్నంలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీలు నిర్మిస్తున్నారు. గతంలో ఫోరెన్సిక్ నివేదికకు మూడు నాలుగు నెలలు పడితే.. ప్రస్తుతం 48 గంటల్లోనే వస్తున్నాయి. చార్జ్షీట్ల నమోదులో దేశంలోనే ప్రథమం దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో ఇంతవరకు 3,009 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరే.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని 2019 డిసెంబర్లో ప్రవేశపెట్టారు. దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 60 రోజుల్లోపే ఏకంగా 96.07 శాతం కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ నిర్దేశించిన మేరకు 60 రోజుల్లో చార్జ్షీట్ల నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అక్కచెల్లెమ్మల రక్షణకు దిశ పోలీస్ స్టేషన్లు ♦ దిశ యాప్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా ప్రభుత్వం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 8 పోలీస్ స్టేషన్లను త్వరలో ఏర్పాటు చేయనుంది. ♦ మహిళలకు హెల్ప్ డెస్క్, వెయిటింగ్ హాల్, కౌన్సెలింగ్ రూమ్, వాష్ రూమ్స్, క్రచ్–ఫీడింగ్ రూమ్‌లతో ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో దిశ పోలీస్ స్టేషన్లకు ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. ♦ ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు ఏర్పాటు చేశారు. ♦ పోక్సో కేసుల విచారణకు 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ♦ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 బొలెరో వాహనాలు ♦ 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. నేరం సంభవించిన ప్రాంతానికి తక్షణం చేరుకోవడానికి వీటిని అందుబాటులోకి తెచ్చారు. 60 రోజుల్లోనే దర్యాప్తు 2020 నుంచి ఇప్పటివరకు 7,070 పోక్సో కేసులకు సంబంధించి 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమే. జాతీయ స్థాయిలో ప్రశంసలు దిశ వ్యవస్థకు ఇంతవరకు 19 జాతీయస్థాయి అవార్డులు లభించాయి. నీతి ఆయోగ్, జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు, జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ బాలల కమిషన్ తదితర సంస్థలు దిశ వ్యవస్థను కొనియాడాయి. నేరం చేస్తే శిక్ష ఖాయం మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పోక్సో కేసులు నమోదు చేయడమే కాకుండా దోషులకు సత్వరమే శిక్షలు పడేలా చేస్తున్నారు. ఇంతవరకు 85 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. మరో 10 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఇంకో 27 కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది. -
శాంతిభద్రతలు భేష్
పోలీసు యంత్రాంగం అత్యుత్తమ పనితీరుతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిస్థాయిలో విజయవంతమవుతోందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా దిశ వ్యవస్థతో మహిళల భద్రతను పటిష్టపరచడం దేశానికే ఆదర్శప్రాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ మొబైల్ యాప్, దిశ వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో మహిళా పోలీసు వ్యవస్థతో మహిళల భద్రతకు పూర్తి భరోసా కల్పి స్తున్నామని తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. – సాక్షి, అమరావతి వినూత్న విధానాలతో నేరాల కట్టడి విజబుల్ పోలీసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమర్థ వినియోగం, వినూత్న విధానాలతో నేరాల కట్టడి సాధ్యమైంది. 2022 కంటే 2023లో రాష్ట్రంలో నేరాలు 8.13శాతం తగ్గాయి. 2022లో 1,75,612 కేసులు నమోదు కాగా 2023లో 1,61,334 కేసులకు తగ్గాయి. హత్యలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు, ఘర్షణలు, మహిళలపై నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. హత్యలు, హత్యాయత్నం కేసులు 10శాతం, దోపిడీలు 28.57శాతం, దొంగతనాలు 37.24 శాతం, పగటి దొంగతనాలు 13.41 శాతం, రాత్రి దొంగతనాలు 13.54 శాతం, రోడ్డు ప్రమాదాలు 7.83 శాతం, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 15.20 శాతం, సైబర్ నేరాలు 25.52 శాతం తగ్గాయి. పోలీసు బీట్లు పునర్వ్యవస్థీకరించడం, నిరంతర పర్యవేక్షణ, అనుమానితుల వేలిముద్రల సేకరణ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం వంటి విధానాలను పటిష్టంగా అమలు చేశాం. మహిళా భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించి సత్ఫలితాలను సాధించాం. అసాంఘిక శక్తులపై నిఘా, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, మహిళా పోలీసుల సమర్థ వినియోగం, పీడీ యాక్ట్ ప్రయోగం, కన్విక్షన్ బేస్డ్ విధానాలతో నేరాలను గణనీయంగా తగ్గించగలిగాం. పోలీసు శాఖకు చెందిన 4,92,142 కేసులను లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కరించాం. రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నాం. రాష్ట్రంలోని 4వేల మంది రౌడీల్లో వెయ్యి మంది జైళ్లలో ఉన్నారు. ఈ ఏడాది 900 మంది రౌడీలకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించగలిగాం. మరో 200 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం. మహిళలకు పటిష్ట భద్రత 2023లో రాష్ట్రంలో మహిళలపై నేరాలతోపాటు అన్ని రకాల నేరాలను గణనీయంగా తగ్గించడంలో పోలీసు యంత్రాంగం సమర్థవంతమైన పాత్ర పోషించింది. క్షేత్రస్థాయి వరకు పోలీసింగ్ వ్యవస్థను విస్తృత పరచడం, సమర్థ పర్యవేక్షణ, సున్నిత ప్రాంతాల జియో మ్యాపింగ్ వంటి విధానాలతో మహిళలకు పటిష్ట భద్రత. 2022లో కంటే 2023లో మహిళలపై అత్యాచార కేసులు 28.57శాతం, వరకట్న కేసులు 11.76శాతం, మహిళలపై ఇతర నేరాలు 14శాతం తగ్గడమే అందుకు నిదర్శనం. సమర్థ పోలీసింగ్ విధానాలతో రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు భారీగా తగ్గాయి. డ్రగ్స్, గంజాయి కట్టడి డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. నాటుసారాపై ఉక్కుపాదం మోపాం. మూడేళ్లలో 5 లక్షల కేజీల గంజాయిని జప్తు చేశాం. గిరిజనులకు 2.52 లక్షల ఎకరాల్లో ప్రత్యమ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నాం. విలేకరుల సమావేశంలో అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబ్రత బాగ్చి, డీఐజీ రాజశేఖర్‌బాబు కూడా పాల్గొన్నారు. -
దశ దిశలా రక్షణ
మహిళలకు రక్షణ, భద్రతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్నవారిని నిమిషాల వ్యవధిలోనే రక్షించడానికి దిశ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు... నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళలను రక్షిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో దిశ వ్యవస్థకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. ఎన్నో రాష్ట్రాలు దీన్ని తమ ప్రాంతాల్లోనూ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిశ యాప్‌ను ఆవిష్కరించి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. – సాక్షి, అమరావతి ♦ చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఓ బాలికను ఓ యువకుడు∙కిడ్నాప్ చేసి అత్యాచారానికి యత్నించాడు. అతడి ఇంట్లో నుంచి బాలిక అరుపులు వినిపించడంతో సమీపంలో ఉన్న ఓ వ్యక్తి దిశ యాప్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆ బాలికను రక్షించి యువకుడిని అరెస్ట్ చేశారు. ♦ పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళపై ఆమె భర్త మద్యం మత్తులో గొడ్డలితో దాడి చేశాడు. ఆమె వెంటనే అంటే సాయంత్రం 6.39 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించారు. పోలీసులు 6.41 గంటలకే అంటే కేవలం రెండు నిమిషాల్లోనే అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి కాపాడారు. ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ♦ సమీప బంధువు మోసగించడంతో విజయవాడలో ఓ మహిళ అర్ధరాత్రి 12.53 గంటలకు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన బిడ్డను కాపాడాల్సిందిగా ఆమె తల్లి దిశ యాప్ ద్వారా పోలీసులకు విన్నవించారు. కమాండ్ కంట్రోల్ సిబ్బంది 12.55 గంటలకు విజయవాడ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు 12.58 నిమిషాలకే అంటే కేవలం 5 నిమిషాల్లోనే బాధిత మహిళ నివాసానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ♦ ఎన్టీఆర్ జిల్లా నవులూరుకు చెందిన ఓ మహిళ పరీక్ష రాసేందుకు వెళ్లిన తన 15 ఏళ్ల కుమార్తె ఇంటికి తిరిగి రాలేదని దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లినట్టు గుర్తించిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆ బాలిక ఆచూకీ తెలుసుకుని ఆమె తల్లి వద్దకు చేర్చారు. యువకుడిపై కేసు నమోదు చేశారు. ♦ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 19 ఏళ్ల యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి తనతో తీసుకువెళ్లాడు. ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా వ్యభిచారం చేయాల్సిందిగా వేధించసాగాడు. దాంతో ఆ యువతి పొరుగింటివారి సహాయంతో దిశ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించింది. పోలీసులు వెంటనే ఆ నివాసానికి చేరుకుని యువతిని రక్షించి యువకుడిని అరెస్ట్ చేశారు. చార్జ్షీట్ల నమోదులో దేశంలోనే ప్రథమ స్థానం.. దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో ఇప్పటివరకు 3,009 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇక పోలీస్ స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా సరే జీరో ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని 2019 డిసెంబర్లో ప్రవేశపెట్టారు. అలాగే దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 60 రోజుల్లోపే ఏకంగా 96.07 శాతం కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర హోం శాఖ నిర్దేశించిన మేరకు 60 రోజుల్లో చార్జ్షీట్ల నమోదులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం విశేషం. 2020 నుంచి ఇప్పటివరకు 7,070 పోక్సో కేసులకు సంబంధించి 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తవ్వడం గమనార్హం. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమే. అక్కచెల్లెమ్మల రక్షణకు పటిష్ట వ్యవస్థ.. ♦ దిశ యాప్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా ప్రభుత్వం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 8 పోలీస్ స్టేషన్లను త్వరలో ఏర్పాటు చేయనుంది. ♦ మహిళలకు హెల్ప్ డెస్క్, వెయిటింగ్ హాల్, కౌన్సెలింగ్ రూమ్, వాష్ రూమ్స్, క్రచ్–ఫీడింగ్ రూమ్‌లతో ఈ పోలీస్ స్టేషన్లను నెలకొల్పారు. ఈ క్రమంలో దిశ పోలీస్ స్టేషన్లకు ఐఎస్వో సర్టిఫికెట్ లభించడం విశేషం. ♦ ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులను ఏర్పాటు చేశారు. ♦ పోక్సో కేసుల విచారణకు 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. ♦ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 బొలెరో వాహనాలను సమకూర్చారు. ♦ 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. నేరం సంభవించిన ప్రాంతానికి తక్షణం చేరుకోవడానికి వీటిని అందుబాటులోకి తెచ్చింది. ♦ లైంగిక వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను జియో మ్యాపింగ్ చేసింది. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్న 2,17,467 మంది నేర చరితుల డేటా బేస్ రూపొందించి వారి కదలికలపై నిఘా పెట్టింది. మహిళలను ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తున్న 1,531 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్లు, లైంగిక వేధింపులకు పాల్పడిన 2,134 మందిపై షీట్లు తెరిచింది. ♦ నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలను సత్వరం సేకరించేందుకు అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలలో ఫోరెన్సిక్ లాŠయ్బ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి, విశాఖపట్నంలలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీలను నిరి్మస్తోంది. గతంలో ఫోరెన్సిక్ నివేదిక వచ్చేందుకు మూడు నాలుగు నెలల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం కేవలం 48 గంటల్లోనే నివేదికలు వస్తున్నాయి. నేరానికి పాల్పడితే కఠిన శిక్షే.. దర్యాప్తు పూర్తి చేయడమే కాదు దోషులకు న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. 2019 తర్వాత మహిళలపై నేరాలకు పాల్పడేవారిపై శిక్షలు విధించడం పెరిగింది. పోలీసులు ప్రాధాన్యత కేసులుగా తీసుకున్నవాటిలో ఇప్పటివరకు 85 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. మరో 10 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఇంకో 27 కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది. జాతీయస్థాయిలో.. అద్భుతమైన పనితీరుతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న దిశ వ్యవస్థకు ఇప్పటివరకు 19 జాతీయస్థాయి అవార్డులు లభించడం విశేషం. నీతి ఆయోగ్, జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు, జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ బాలల కమిషన్ తదితర సంస్థలు దిశ వ్యవస్థను కొనియాడాయి. రికార్డు స్థాయిలో 1.46 కోట్ల డౌన్లోడ్లు దిశ యాప్ ఫోన్లో ఉందంటే మహిళలు నిశ్చింతగా ఉన్నట్టే. అందుకే ఈ యాప్‌ను ఇప్పటివరకు 1,46,99,012 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కేవలం డౌన్‌లోడ్‌తోనే ఆగిపోకుండా 1,27,06,213 మంది రిజిస్టర్ కూడా చేసుకున్నారు. ఓ మొబైల్ యాప్ డౌన్లోడ్, రిజి్రస్టేషన్లలో దేశంలో దిశ యాప్‌దే రికార్డు కావడం విశేషం. ఆపదలో ఉన్నామని దిశ యాప్‌కు సమాచారం ఇస్తే పట్టణాలు, నగరాల్లో 5 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 10 నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దిశ యాప్ ద్వారా ఇప్పటివరకు 10,80,454 ఎస్‌వోఎస్ కాల్ రిక్వెస్ట్‌లు వచ్చాయి. కొత్తగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి రెండుసార్లు ఎస్‌వోఎస్ బటన్ నొక్కి చూస్తారు. అటువంటివి కాకుండా పోలీసులు చర్యలు తీసుకోదగ్గవి 31,541 కాల్స్ ఉన్నాయి. ఈ కాల్స్ అన్నింటికీ పోలీసులు తక్షణం స్పందించి ఘటన స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకున్నారు. దిశ యాప్ ద్వారా సగటున రోజుకు 250 కాల్స్ రావడం ఈ వ్యవస్థ పట్ల మహిళల్లో ఏర్పడిన భరోసాకు నిదర్శనం. దోషులకు సత్వరం శిక్షలు మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పోక్సో కేసులు నమోదు చేయడమే కాకుండా దోషులకు సత్వరమే శిక్షలు పడేలా చేస్తున్నారు. దిశ పోలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా కేసుల దర్యాప్తు, నేర నిరూపణ ప్రక్రియ పక్కాగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
యువతిని ఆదుకున్న ‘దిశ’
కందుకూరు: దిశ యాప్ ఆపదలో ఉన్న మహిళల పట్ల ఆపద్బాంధవునిగా మారింది. సోమవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కందుకూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దూబగుంట గ్రామం వద్ద ఓ యువతి అనుమానాస్పదంగా తిరుగుతుందని బ్రహ్మయ్య అనే యువకుడు దిశ యాప్‌కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే రూరల్ పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి ఆ యువతిని ప్రశ్నించారు. తాను మదనపల్లి నుంచి విజయవాడ వెళ్తూ కందుకూరులో బస్సు దిగానని, ఎటువెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపింది. పోలీసులు.. ఆమెను ఒంగోలులోని సఖి సెంటర్‌కు తరలించి మదనపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయించిన ‘దిశ’
తెనాలిరూరల్ : వ్యక్తి వేధింపులు తాళలేని ఓ మహిళ దిశ యాప్ ఎస్ఓఎస్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. ఆ వ్యక్తిని దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలిలో నివాసముండే మహిళ తన కుమార్తె పెళ్లి ఖర్చుల నిమిత్తం శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి రూ.రెండు లక్షలు అప్పుగా తీసుకుంది. కొన్ని నెలల తర్వాత వడ్డీతో సహా చెల్లించింది. అయినా శ్రీనివాసరావు ఆ మహిళకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. గతంలో అప్పు కోసం తన ఆఫీస్‌కు వచ్చినప్పటి ఫొటోలు, కాల్ రికార్డ్లున్నాయని బెదిరించేవాడు. బాధిత మహిళ తన భర్తకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా శ్రీనివాసరావు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం బాధిత మహిళకు, ఆమె భర్తకు మార్ఫింగ్ ఫొటోలు పంపి వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు దిశ ఎస్ఓఎస్కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. తెనాలి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బాధిత మహిళ ఇంటికి దిశ పోలీసులు ఆరు నిమిషాల్లో చేరుకున్నారు. ఆమెకు శ్రీనివాసరావు పంపించిన అసభ్యకర సందేశాలను, అప్పు చెల్లించినట్టు ఉన్న వివరాలను పోలీసులు సేకరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావుపై ఐపీసీ సెక్షన్ 354 ఈ, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
మహిళా రైతును కాపాడిన దిశ యాప్
సాక్షి, నంద్యాల జిల్లా: దిశ యాప్‌తో తనకేమి ఉపయోగం ఉంటుందనుకున్న ఓ మహిళా రైతుకు అదే యాప్ రక్షణగా నిలబడింది. పొలం పనులు ముగించుకొని ఇంటికెళ్తున్న ఆమెపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి యత్నించగా, వెంటనే ఆ మహిళ దిశ SOS కు కాల్ చేసి సహాయం కోరింది. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రుద్రవరం మండలం పెద్ద కంబలూరుకు చెందిన మహిళ పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేసి ప్రసాద్ నుంచి తప్పించుకుంది. స్థానికులు రావడంతో ప్రసాద్ అక్కడ నుండి పారిపోయాడు. బాధిత మహిళ దిశ SOS కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించింది. చదవండి: పవన్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు.. వలంటీర్ స్టేట్మెంట్ రికార్డ్ బాధిత మహిళ వుండే లోకేషన్‌కు దిశ పోలీసులు కేవలం పది నిముషాల వ్యవధిలో చేరుకున్నారు. సిరివెళ్ల వైపు పారిపోతున్న నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్ పై ఐపీసీ సెక్షన్ 354 ఏ, 354 బి, 506ల కింద రుద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ SOS కు కాల్ చేసిన పది నిముషాల వ్యవధిలో పోలీసులు వచ్చి సహాయం చేశారని బాధిత మహిళ సంతోషం వ్యక్తం చేసింది. రెండు నెలల క్రితం తన సెల్ ఫోన్లో గ్రామ సచివాలయ సిబ్బంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసి, ఎలా ఉపయోగించాలో వివరించినట్లు మహిళ తెలిపింది. ఆ సమయంలో దిశ యాప్ వలన తనకేమి ఉపయోగం ఉంటుందని సచివాలయ సిబ్బందితో వాదించిన విషయాన్ని మహిళ గుర్తు చేసింది. కానీ అదే దిశ యాప్ ఈ రోజు తనకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ఊహించలేదని పేర్కొంది. ఆపదలో ఉన్న తనకు దిశ పోలీసులు చేసిన సహాయం ఎప్పటికీ మరువలేనని చెప్పింది. మహిళల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనిచేస్తున్నట్లు దిశ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
లోన్ యాప్ వేధింపులు.. మహిళకు అండగా నిలిచిన ‘దిశ’ యాప్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: లోన్ యాప్ నిర్వాహకుల వికృత చేష్టలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మహిళకు దిశ యాప్ అండగా నిలిచింది. లోన్ తీసుకోకపోయిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ టూ టౌన్ పరిధిలోని మహిళకు గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. దుర్భాషలాడుతూ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేయడంతో దిశ(ఎస్‌వోఎస్)కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి లొకేషన్‌కు చేరుకున్న దిశ పోలీసులు వివరాలు సేకరించారు. బాధితురాలి కుమారుడు సెల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ పొరపాటున లోన్ యాప్ నోటిఫికేషన్‌ను క్లిక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నోటిఫికేషన్ క్లిక్ చేయగానే రెండు వేలు ఆటోమెటిక్ గా బాధితురాలి ఖాతాలో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. బాధితురాలి సెల్ ఫోన్‌కు పంపించిన అసభ్యకరమైన వీడియోలతో పాటు ఇతర టెక్నికల్ ఆధారాలను పోలీసులు సేకరించారు. చదవండి: యాప్‌లతో సేఫ్టీకి భరోసా! -
మహిళపై అఘాయిత్యానికి నేపాల్ యువకుల యత్నం
కందుకూరు: అర్ధరాత్రి ఊరికి వెళ్లేందుకు బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసిన ముగ్గురు యువకులు అఘాయిత్యానికి విఫలయత్నం చేశారు. దిశ యాప్‌లో వచ్చి న ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు నేపాల్‌కు చెందిన యువకులు కాగా, మరొకరు పట్టణానికి చెందిన యువకుడు. మంగళవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని మాచవరం రోడ్డులో ఈ ఘటన జరిగింది. డీఎస్పీ రామచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పనులపై పట్టణానికి వచ్చింది. అయితే ఆలస్యం కావడంతో రాత్రి 11 గంటల వరకు పట్టణంలోనే ఉండిపోయింది. ఆ సమయంలో తమ ఊరికి వెళ్లే బస్సు కోసం పామూరు బస్టాండ్‌లో వేచి చూస్తోంది. అదే సమయంలో కందుకూరు పట్టణంలోని గూర్ఖాలుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన యువకులు కరణ్, జ్యోషిలతో పాటు, పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ ఫిరోజ్ ముగ్గురూ మహిళ వద్దకు వచ్చారు. ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని మాచవరం వైపు తీసుకెళుతున్నారు. ఎస్ఆర్ పెట్రోల్ బంకు సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పెట్రోల్ బంకు వద్దకు చేరుకుంది. దీంతో పెట్రోల్ బంకులో పనిచేసే యువకుడు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళకు రక్షణ కల్పించి యువకుల కోసం గాలించారు. అయితే అప్పటికే వారు పారిపోవడంతో ఆటో ఆధారంగా బుధవారం నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
బాలికను కాపాడిన ‘దిశ’
సాక్షి,యద్దనపూడి(బాపట్ల): తన పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో తప్పించుకున్న బాలిక దిశ యాప్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో నివాసముండే యువకుడు (20) సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్తోన్న పక్కింటి బాలిక(16)ను బలవంతంగా తన గదిలోనికి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తండ్రి ఫోన్ నుంచి దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయగా 10 నిమిషాల్లోనే బాధితురాలి ఇంటికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. విచారణలో యువకుడు బాలికపై అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా, దిశ యాప్‌ను కొన్ని నెలల కిందటే సచివాలయ సిబ్బంది తమ ఫోన్లో డౌన్లోడ్ చేయించారని బాలిక తెలిపింది. ఆపదలో ఉçన్న తనకు దిశ యాప్ ఎంతగానో ఉపయోగపడిందని తనలాగే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ దిశ యాప్ ఒక రక్షణ కవచంలా ఉంటుందని చెప్పింది. చదవండి: దేవుడు ముడివేసిన జంట.. అడ్డంకులు అధిగమించి అన్యోన్యంగా ముందుకు -
నాకు పెళ్లి వద్దు, చదువుకుంటా.. దిశా యాప్ ద్వారా బాలిక ఫిర్యాదు
సాక్షి,ఏలూరు టౌన్: తనకు చదువుకోవాలని ఉన్నా.. పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ ఓ బాలిక దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలిక వద్దకు చేరుకుని.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ వివరాలను పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన బాలికకు ఈనెల 8వ తేదీన వివాహం జరిపించేందుకు ఆమె తల్లిదండ్రులు ముహూర్తం నిర్ణయించారు. తనకు ఇంకా చదువుకోవాలని ఉందని చెప్పినా పెద్దలు వినకపోవడంతో.. ఆమె ఆదివారం ఉదయం 9.37 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన దిశ సిబ్బంది సమీపంలోని తడికలపూడి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకన్న, సిబ్బందితో కలిసి 10 నిమిషాల్లోనే బాలిక ఇంటికి చేరుకొని.. ఆమెను విచారించారు. ‘ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను. కనీసం గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేయాలని ఉంది. నా చదువు పూర్తయ్యాక మా అమ్మ, నాన్న చెప్పినట్లే చేస్తా’ అని ఆ బాలిక పోలీసులతో పాటు తన తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులు కూడా ఆ బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. ఆమె చదువును మధ్యలోనే అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. బాలికకు పెళ్లి చేయడం నేరమని వివరించారు. మంచి మార్కులు తెచ్చుకుంటున్న ఆమెను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో బాలిక సంతోషం వ్యక్తం చేసింది. పోలీసులకు, దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. చదవండి: Odisha Train Accident: ఒక్కరు తప్ప అందరూ సేఫ్ -
నగ్నంగా పూజలు చేస్తే డబ్బులంటూ మోసం.. 12 మంది అరెస్ట్
గుంటూరు రూరల్: డబ్బు ఆశ చూపి యువతుల్ని మోసగించేందుకు ప్రయత్నించిన ఘరానా మోసగాడి ఆగడాలకు దిశ యాప్ సాయంతో అడ్డుకట్ట పడింది. బాధిత యువతులు తమ మొబైల్ ఫోన్లోని దిశ యాప్ ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని యువతులను రక్షించారు. వారిచ్చి న సమాచారం ఆధారంగా అఘాయిత్యాలకు పాల్పడిన 12 మందిని నల్లపాడు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ మహబూబ్‌బాషా కథనం ప్రకారం.. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు అనే వ్యక్తి బోర్లు వేసే సమయంలో కొబ్బరి కాయలతో నీరు పడుతుందో లేదో చెప్పే పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే గుప్త నిధులను వెతికేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన వి.నాగేంద్రబాబుకు నగ్నంగా పూజలు చేస్తే ఆర్థికంగా కలిసి వస్తుందని ఆశ చూపాడు. దీంతో నాగేంద్రబాబు తన క్లాస్మేట్ అయిన కర్నూలు జిల్లా ఆత్మకూరు, నంద్యాల ప్రాంతాలకు చెందిన సురేష్, ఖాశిం, పెద్దరెడ్డిలకు ఒకసారి నగ్నంగా పూజలో కూర్చునే మహిళలు ఉంటే వారికి లక్ష రూపాయలు ఇస్తారని చెప్పాడు. దీంతో సురేష్, ఖాశిం, పెద్దరెడ్డి ఇద్దరు యువతులతో గత మంగళవారం గుంటూరు వచ్చి నాగేంద్రబాబును కలిశారు. ఈ విషయాన్ని నాగేంద్రబాబు పూజారి నాగేశ్వరరావుకు ఫోన్లో చెప్పాడు. దీంతో నాగేశ్వరరావు అనుచరులు, అతడి కారు డ్రైవర్ సునిల్, చిలకలూరిపేటకు చెందిన ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే అరవిందచౌదరి, సుబ్బు, శివ, రాధ గుంటూరు బస్టాండ్‌కు వెళ్లి నంద్యాల నుంచి వచ్చిన సురేష్, ఖాశిం, పెద్దరెడ్డిలను కలిసి.. డబ్బుల విషయమై మాట్లాడుకుని ఒప్పందానికి వచ్చారు. కదిలితే ప్రాణాలు పోతాయని బెదిరించి.. మంగళవారం రాత్రి పూజలు ప్రారంభించాలని నాగేశ్వరరావు చెప్పగా.. వారంతా తాడికొండ మండలం పొన్నెకల్లులోని నాగేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత నాగేశ్వరరావు యువతులను ఓ గదిలో నగ్నంగా కూర్చోబెట్టి పూజలు ప్రారంభించాడు. మధ్యలో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించగా.. వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూజ చేస్తున్న సమయంలో కదిలితే ప్రాణాలు పోతాయని బెదిరించడంతో యువతులు ఏమీ చేయలేకపోయారు. పూజలు ముగిసిన అనంతరం నాగేశ్వరరావు, అతని అనుచరులు యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బుధవారం నాడు పొన్నెకల్లులో పూజలు కుదరటం లేదని చిలకలూరిపేటలోని పండరీపురంలో అరవిందచౌదరి ఇంట్లో పూజలు చేయాలని నిర్ణయించాడు నాగేశ్వరరావు. బుధవారం రాత్రి అందరూ కలిసి చిలకలూరిపేట వెళ్లారు. శుక్రవారం వరకూ పూజలు చేసే క్రమంలో యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుగు రోజులుగా పూజలు చేస్తున్నా ఫలితం లేకపోవటంతో నాగేశ్వరరావు అక్కడినుంచి జారుకున్నాడు. దిశ యాప్‌ను ఆశ్రయించడంతో.. ఈ క్రమంలో సదరు యువతులు ఒప్పందం ప్రకారం తమకు డబ్బు ఇస్తే ఇంటికిపోతామని నాగేశ్వరరావు అనుచరులను అడిగారు. దీంతో నాగేశ్వరరావు అనుచరులకు, యువతులకు వివాదం తలెత్తింది. ఈ విషయాన్ని అరవిందచౌదరి నాగేశ్వరరావుకు ఫోన్ చేసి చెప్పగా.. తన ఇంటికి వస్తే సెటిల్మెంట్ చేసుకుందామని నాగేశ్వరరావు సూచించాడు. అందరూ కారులో పొన్నెకల్లు బయలుదేరారు. మధ్యలో నాగేశ్వరరావు అనుచరులు యువతులను బెదిరించడంతో గోరంట్ల సమీపంలో బాధిత యువతులు తమ వద్దనున్న సెల్ఫోన్లో దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో వెంటనే స్పందించిన ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ నేతృత్వంలో నల్లపాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణమే నగర శివార్లలోని గోరంట్ల వద్ద ఉన్న యువతుల చెంతకు చేరుకుని ఆమెతోపాటున్న అరవింద చౌదరి, నాగేంద్రబాబు, సునిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు జరిగిన విషయాన్ని ఒప్పుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, అరవింద చౌదరి, రాధ, భాస్కర్, పెద్దరెడ్డి, సాగర్, వెంకటసురేష్, శివ, సునీల్, పవన్, సుబ్బులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరు ఉన్నారని, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ మహబూబ్‌బాషా చెప్పారు. ఎవరైనా డబ్బు ఆశచూపి యువతులు, మహిళలకు ఎరవేస్తే నమ్మి మోసపోవద్దని డీఎస్పీ కోరారు. -
సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలన్నా సీఎం జగన్
-
యాప్‌లతో సేఫ్టీకి భరోసా!
అడ్వాన్స్డ్ ఎరాలో ఉన్నాం.. మీట నొక్కే వేగంలో పనులు అయిపోతున్నాయి.. అయినా స్త్రీకి సంబంధించిన విషయంలో సమాజపు ఆలోచనలే ఇంకా ప్రగతి పంథా పట్టలేదు! అందుకే ఇప్పటికీ ఆమెకు భద్రత లేదు! ఆమె సేఫ్టీకి సాంకేతికత యాప్‌ల ద్వారా ఇస్తున్న భరోసా మనసావాచాకర్మణా సమాజం ఇవ్వడం లేదు! ఆ స్పృహను సాధించే వరకు.. మహిళ ఆ సేఫ్టీ యాప్‌లనే నమ్ముకోక తప్పదు!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యూఎన్ఓ ఈ ఏడాది ప్రకటించిన థీమ్.. డిజిటాల్: ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ (DigtALL: Innovation and technology for gender equality). . అవును ఏ ఆవిష్కరణ అయినా.. సాంకేతికతైనా స్త్రీ, పురుష సమానత్వాన్నే చాటాలి. ఈ సమానత్వ పోరు నేటిది కాదు.. దాదాపు 115 ఏళ్ల నాటిది. నాడు అమెరికాలో గార్మెంట్ ఇండస్ట్రీలో ప్రమాదరకమైన పని పరిస్థితులు.. స్త్రీల పట్ల వివక్ష.. అసమాన వేతనాలు వంటి విషయాల్లో మార్పు కోసం మహిళల సమ్మెతో మొదలైన పోరాటం.. అన్ని రంగాల్లో.. అన్ని విషయాల్లో జెండర్ ఈక్వాలిటీ దిశగా ఇంకా కొనసాగుతూనే ఉంది. శతాబ్దం మారింది.. అయినా సమానత్వ సాధన కోసం ఇంకా థీమ్స్‌ను సెట్ చేసుకునే దశ, దిశలోనే ఉన్నాం. ‘కాలం మారింది.. ఇప్పుడు అన్ని రంగాల్లో స్త్రీలు కనపడుతున్నారు.. వినపడుతున్నారు కదా!’ అని మనకు అనిపించినప్పుడల్లా.. ఒక్కసారి స్త్రీల మీద జరుగుతున్న క్రైమ్ రికార్డ్స్‌ను ముందేసుకుందాం! అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నారు కదా అని ఎత్తుకున్న తల దించేసుకుంటుంది. స్వేచ్ఛ ఉంటేనే సమానత్వం సిద్ధిస్తుంది. భద్రత ఉంటేనే ఆ స్వేచ్ఛకు అర్థం ఉంటుంది. ఇంట్లో హింస.. బయట హింస.. ఆఖరకు ఆడపిల్ల తల్లి గర్భంలో ఉన్నా హింసే. ఈ వాక్యాలు రొడ్డకొట్టుడులా అనిపిస్తున్నాయి. అంటే పరిస్థితిలో ఇంకా మార్పు రాలేదనే కదా! అందుకే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ సాధించాలంటే ముందు ఆడపిల్ల సురక్షితంగా ఉండాలి. ఇంటా.. బయటా బేఫికర్‌గా మసలగలగాలి! పోలీసులు, చట్టాలు ఉన్నాయి కదా అని తట్టొచ్చు! ‘నాకు సేఫ్టీ లేదు.. భయంగా ఉంది’ అని అమ్మాయి చెబితేనే కదా.. పోలీసులు స్పందించేది. ఆ అభద్రతను రిజిస్టర్ చేస్తేనే కదా.. రక్షణ చట్టాలు వచ్చేవి. ఇదంతా జరగాలంటే సమాజంలో అవగాహన రావాలి. అమ్మాయిలను చూసే తీరు.. వాళ్లతో ప్రవర్తించే పద్ధతులు మారాలి. వాళ్ల పట్ల మర్యాద పెరగాలి. వీటన్నిటికీ మగపిల్లలకు జెండర్ సెన్సిటివిటీ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో.. తనున్న పరిస్థితి పట్ల ఎరుక.. దాన్నుంచి బయటపడే చొరవ అమ్మాయిలకూ అంతే అవసరం. ముందు తన చుట్టూ ఉన్న ప్రమాదాన్ని గుర్తించే ధైర్యం.. తెగువ చేయాలి. అందుకు ఇప్పుడు సాంకేతికత బోలెడంత సాయాన్ని అందిస్తోంది. యాప్‌ల రూపంలో! అలా ఫోన్లో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాల్సిన విమెన్ సెక్యూరిటీ యాప్‌లు కొన్ని ఇక్కడ.. దిశ ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ కమ్యూనికేషన్ వింగ్ రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్. ఫోన్లో యాప్‌ను ఓపెన్‌చేసి.. మూడుసార్లు షేక్ చేయగానే ఫోన్లోని జీపీఎస్ యాక్టివేట్ అయ్యి.. దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లు, డ్యూటీలో ఉన్న పోలీసులను అలర్ట్ చేస్తుంది లొకేషన్‌ను పంపించి. ఒకవేళ ఫోన్ షేక్ చేయకుండా యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్‌ను నొక్కినా.. మీ సమాచారం మీరున్న ప్రాంతానికి దగ్గర్లోని పోలీస్ స్టేషన్లు, ఆన్ డ్యూటీ పోలీసులకు చేరుతుంది. వెంటనే సహాయ సిబ్బంది మీ దగ్గరకు చేరుకుంటారు. ఈ యాప్ సహాయంతో 100 నంబర్, లేదా ఈ యాప్‌లో ఉన్న ఇతర హెల్ప్ లైన్ నంబర్స్కూ కాల్ చేయవచ్చు. ఈ యాప్ ప్రమాదస్థలికి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ల వివరాలనే కాక.. ఇతర సేఫ్టీ ప్లేసెస్, ఆసుపత్రులు, ఇతర హెల్ప్‌లైన్ నంబర్లనూ అందిస్తోంది. విమెన్ సేఫ్టీ (Women Safety) ఈ యాప్‌లోని బటన్‌ను ఒక్కసారి తడితే చాలు.. మీరు ప్రమాదంలో చిక్కుకున్న సంగతి.. లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్ సహా మీ ఫోన్లో మీరు ఫీడ్ చేసుకున్న ఎమర్జెన్సీ నంబర్లకు చేరిపోతుంది. ఇందులోని బటన్లు మూడు రంగుల్లో ఉంటాయి. అంటే మీరున్న పరిస్థితి తీవ్రతను బట్టి ఆయా రంగుల్లో ఉన్న బటన్స్‌ను నొక్కాలి. షీ టీమ్స్ మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్రం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ వింగ్ 2014లో ప్రారంభమైంది. తొలుత హైదరాబాద్‌లోని సైబరాబాద్ పరిధికే వీరి సేవలు పరిమితమైనా.. తర్వాత ఏడాదికి అంటే 2015కల్లా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా 331 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. 112 యాప్ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆల్ ఇన్ వన్ యాప్ ఇది. ఉపయోగించడం చాలా తేలిక. ప్రమాదంలో ఉన్నప్పుడు.. ఈ యాప్‌ను సింగిల్ ట్యాప్ చేస్తే చాలు.. మీరున్న డేంజర్ సిచ్యుయేషన్‌కు సంబంధించి అలారమ్ మోగుతుంది. తక్షణమే సహాయక చర్యల సిబ్బందీ స్పందిస్తారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ఫోన్లకూ సెట్ అవుతుంది. ఈ 112 యాప్ మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తుంది. కీ ఫీచర్స్ ఏంటంటే.. ఎమర్జెన్సీ అలారమ్‌ను పంపించేందుకు ఇందులో ఆడియో/విజువల్ మీడియా ఉంటుంది. 24 గంటలూ ఈ యాప్ ద్వారా భద్రతా సేవలు పొందవచ్చు. అదనంగా.. సంఘటనల విచారణలోనూ తనవంతు సాయం అందిస్తుంది. మై సేఫ్టీపిన్ (My SafetyPin) డేటా మాపింగ్ టెక్నిక్స్ సాయంతో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు సేఫ్‌గా ఫీలయ్యేందుకు సాయపడుతుందీ అప్లికేషన్. వెలుతురు, వైశాల్యం, సెక్యూరిటీ గార్డ్స్, కాలిబాట, ప్రజా రవాణా వ్యవస్థ, జెండర్ యూసేజ్, భావోద్వేగాలు.. మొదలైన తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ యాప్‌ను రూపొందించారు. ఒకవేళ మీరు రాంగ్రూట్ని ఎంచుకున్నా ఇది వెంటనే మీ కుటుంబ సభ్యులను అలర్ట్ చేస్తుంది. భద్రమైన దారిని ఎంచుకునేందుకు మీకు తోడ్పడుతుంది. మీరు తప్పిదారి అంత భద్రతలేని ప్రాంతంలోకి వెళ్లినా.. ఆ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. సెర్చింగ్‌లో మీ చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు.. ఇతర సౌకర్యాల గురించీ మీకు సమాచారం ఇస్తుంది. దేశంలోని నగరాలను సురక్షిత నగరాలుగా మార్చడమే ‘మై సేఫ్టీపిన్’ లక్ష్యం. షీరోస్ ఇప్పుడున్న లీడింగ్ విమెన్ యాప్స్‌లో యూనిక్ యాప్ ఇది. మహిళల భద్రతకు సంబంధించే కాదు కెరీర్ గైడెన్స్, ఫ్రీ హెల్ప్ లైన్, రెసిపీలు మొదలు బ్యూటీ టిప్స్, ఇంట్లో ఉండే పనిచేసుకునే ఉపాధి అవకాశాల నుంచి కొత్త కొత్త పరిచయాలు, ఉచిత న్యాయ సలహాల వరకు మహిళలకు అవసరమైన చాలా అంశాల్లో ఈ యాప్ సహాయమందిస్తుంది. మీ నెలసరినీ ట్రాక్ చేస్తూ సూచనలిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది దీని గోప్యత, భద్రత. మీ ఫొటోలు, వీడియోలు మొదలు మీ వ్యక్తిగత సమాచారాన్నంత గోప్యంగా.. భద్రంగా ఉంచుతుంది. దీని సేవలను ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్.. రెండు ఫోన్లలోనూ పొందవచ్చు. స్మార్ట్ 24 గీ సెవెన్ ( స్మార్ట్ 24 X7) దీనితో ఇరవైనాలుగు గంటల కస్టమర్ సర్వీస్ సెంటర్‌తో సపోర్ట్ పొందవచ్చు. ఇది ఇటు యాపిల్ అటు ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్ అవుతుంది. ఆపదలో ఉన్న మహిళలు తమ దీని ద్వారా ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులతోపాటు చుట్టుపక్కలనున్న ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, అంబులెన్స్ సర్వీసెస్‌కూ పంపిచవచ్చు. వాటి సహాయం పొందవచ్చు.ఆపదలో ఉన్న వాళ్లు బటన్ నొక్కగానే ఆ ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్లు సేవ్ చేసుకున్న అయిదు ఎమర్జెన్సీ నంబర్లకు క్షణాల్లో సమాచారం వెళ్తుంది. ఒకవేళ జీపీఆర్ఎస్ అందుబాటులో లేకపోతే.. ఎస్మ్మెస్లు వెళ్తాయి. స్మార్ట్ 24 ఇంటూ సెవెన్ కస్టమర్ కేర్ సెంటర్ వాళ్లూ వెంటనే కాల్ చేస్తారు. బీసేఫ్ (bSafe) మహిళల మీద జరుగుతున్న హింస, లైంగిక వేధింపులు, లైంగిక దాడులను నివారించడమే కాక దురదృష్టవశాత్తు ఇలాంటి నేరాలు జరిగితే.. సంబంధించిన సాక్ష్యాధారాలనూ అందిస్తుంది. వాయిస్ యాక్టివేషన్, లైవ్ స్ట్రీమింగ్, ఆడియో, వీడియో రికార్డింగ్, ఫాల్స్ కాల్, ఫాలో మీ, లొకేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్‌తో మహిళల భద్రతకు భరోసానిస్తోంది. బటన్‌ను ఒక్కసారి నొక్కితే చాలు.. ఎస్ఓఎస్ సిగ్నల్‌ను సెండ్ చేసేస్తుంది. దీని ద్వారా.. అత్యవసర వేళల్లో ఫొటోలు తీసుకుని.. వాటిని పోస్ట్ చేయొచ్చు. మీరున్న చోటును మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది. దీన్ని ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్ రెండు ఫోన్లలోనూ డౌన్లోడ్ చేçసుకోవచ్చు. నిర్భయ ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్. ఫోన్లో డౌన్లోడ్ అయ్యాక.. ఒక్కసారి బటన్‌ను ప్రెస్ చేయగానే యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ బటన్ నొక్కడం వీలు పడకపోతే ఫోన్ షేకింగ్ ద్వారా, ఎస్సెమ్మెస్‌ల ద్వారా.. ఫోన్ కాల్ ద్వారా కూడా మన పరిస్థితిని తెలియజేయవచ్చు. అయితే వీటికి డేటా ప్లాన్, జీపీఎస్ అవసరం ఉంటాయి. ఆపదలో ఉన్నవారి లొకేషన్‌ను ఇది ప్రతి రెండు గంటలు.. లేదా ప్రతి మూడువందల మీటర్లకు మారినప్పుడల్లా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు పంపిస్తూంటుంది. ఎస్ఓఎస్ – స్టే సేఫ్ ఇది ఆండ్రాయిడ్ యాప్. ఫోన్లో ఈ యాప్ యాక్టివేట్ అయితే చాలు.. ఫోన్ లాక్ మోడ్‌లో ఉన్నా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ను అన్‌లాక్ చేసుకునేంత టైమ్ ఉండదు. వెంటనే స్పందించాలి. అందుకే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. ఆపదలో ఉన్నామని తెలియగానే ఫోన్‌ను రెండుమూడు సార్లు షేక్ చేయాలి.. అంతే.. మనకు సంబంధించిన సమాచారం.. మనమున్న లొకేషన్ సహా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి వెళ్లిపోతాయి. ఒకవేళ షేక్ చేయడం తికమక వ్యవహారంలా అనిపిస్తే ఈ యాప్ హోమ్ బటన్‌ను ప్రెస్ చేసినా చాలు.. మన సమాచారం, లొకేషన్ సహా మప ఫోన్ బ్యాటరీ ఏ స్థితిలో ఉందో కూడా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి చెప్పేస్తుంది. అంతేకాదు ఆడియో రికార్డింగ్‌నూ పంపుతుంది. రక్ష (Raksha) భద్రతతో కూడిన స్వావలంబన.. ఈ యాప్ లక్ష్యం. అందుకే అహర్నిశలూ అందుబాటులో ఉంటుంది. దీన్ని ఉపయోగించడమూ తేలికే. మీరు ఆపదలో చిక్కుకున్నారని మీకు అనిపించిన వెంటనే యాప్‌లో సూచించిన బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు.. మీరున్న లొకేషన్ సహా మీకు సంబంధించిన అలర్ట్స్ అన్నీ మీ కుటుంబ సభ్యులకు చేరుతాయి మీ వాళ్ల ఫోన్ నంబర్ల ద్వారా. నెట్వర్క్ లేకపోయినా.. ఈ యాప్ స్పందిస్తుంది. వాల్యూమ్ కీని మూడు సెకండ్ల పాటు ప్రెస్ చేస్తే చాలు.. మీ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. ఇందులో ఎస్ఓఎస్ కూడా ఉన్నందున.. ఇంటర్నెట్ లేని ఏరియాల్లో .. ఎస్సెమ్మెస్ ద్వారా మీకు సంబంధించిన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు చేరవేస్తుంది. ఐయామ్ శక్తి (Iam Shakthi) ఇదీ యూజర్ ఫ్రెండ్లీనే. ఫోన్లోని పవర్ బటన్‌ను రెండు సెకండ్ల వ్యవధిలో అయిదుసార్లు నొక్కితే చాలు.. ఫోన్లో ముందుగా సెట్ చేసిపెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు లొకేషన్ సహా సమాచారం వెళుతుంది. బటన్ నొక్కిన వెంటనే లొకేషన్‌ను ట్రేస్ చేయలేకపోతే.. ట్రేస్ అయిన వెంటనే మళ్లీ అలర్ట్ మెసేజెస్ను పంపిస్తుంది. విత్యు (WithYou) ఇది కూడా ‘స్పాట్ఎన్సేవ్’ లాంటిదే. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్లోని పవర్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే .. మనకు సంబంధించిన సమాచారమంతా లొకేషన్ సహా.. అంతకుముందే సెట్ చేసిపెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు వెళుతుంది.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి. స్పాట్ఎన్సేవ్ ఫీల్ సెక్యూర్ ఇప్పుడున్న అన్ని సేఫ్టీ యాప్లోకెల్లా అడ్వాన్స్డ్ యాప్ ఇది. దీన్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాచీలా మణికట్టుకు ధరిస్తే చాలు. అవును రిస్ట్ బ్యాండ్‌లా! డేంజర్ సిచ్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీ ఫోన్ పవర్ బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేయాలి అంతే.. రిస్ట్బ్యాండ్లోని యాప్ యాక్టివేట్ అయ్యి మీరు ముందే సెట్ చేసి పెట్టుకున్న మీ ఎమర్జెన్సీ ఫోన్ నంబర్స్‌కి.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి.. మీరున్న లొకేషన్ సహా వివరాలను అందిస్తూంటుంది. ఒకవేళ మీరు ఫోన్‌ను ఉపయోగించే స్థితిలో లేకపోతే రిస్ట్బ్యాండ్కున్న బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేసినా చాలు బ్లూటూత్ సాయంతో యాప్ పనిచేయడం మొదలుపెడుతుంది. ఇటు చూడండీ.. ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో)–2021 నివేదిక ప్రకారం.. దేశంలో మహిళల మీద జరుగుతున్న హింస 2020 సంవత్సరం కన్నా 2021లో 15.3 శాతం పెరిగింది. 2020లో 3,71,503 కేసులు నమోదైతే 2021లో 4,28,278 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు ఈ హింసాత్మక సంఘటనల రేటు 64.5 శాతంగా నమోదైంది. 2020లో ఇది 56.5 శాతం. వీటిల్లో 31.8 శాతం గృహహింస కేసులే. మిగతావన్నీ వేధింపులు, కిడ్నాప్‌లు, లైంగికదాడుల కేసులు. మహిళల మీద జరుగుతున్న హింసలో అసోం రాష్ట్రం మొదటి స్థానపు అప్రతిష్ఠను మూటగట్టుకుంది. తర్వాత స్థానాల్లో ఒడిశా, హరియాణా, తెలంగాణ, రాజస్థాన్‌లు నిలిచి ఆ అవమానపు భారాన్ని మోస్తున్నాయి. షాకింగ్ ఏంటంటే.. గతంలో కన్నా తెలంగాణలో మహిళల మీద హింస పెరిగినట్టు చూపిస్తోంది ఎన్సీఆర్బీ. అత్యంత తక్కువ కేసులతో నాగాలాండ్ కాస్త మెరుగైన రాష్ట్రంగా కనిపిస్తోంది. మూడేళ్లుగా ఇది ఈ రికార్డ్‌నే మెయిన్టైన్ చేస్తోంది. హింస పెట్రేగుతున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లు నిలిచి తలవంచుకుంటున్నాయి. 2021 సంవత్సరం CEOWORLD మ్యాగజీన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. మహిళల భద్రత విషయంలో ప్రపంచంలోకెల్లా తొలి స్థానంలో నిలిచిన దేశం నెదర్లాండ్స్. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో స్వీడన్లు ఉన్నాయి. డెన్మార్క్ నాలుగో స్థానాన్ని పొందింది. చిత్రమేంటంటే.. అందరికీ పెద్దన్నలా వ్యవహరించే అమెరికా మొదటి పది స్థానాల్లో ఎక్కడా లేదు. 20వ స్థానంలో ఉంది! యునైటెడ్ కింగ్‌డమ్‌ది పదిహేడో స్థానం. మన గురించీ చెప్పుకోవాలి కదా.. మహిళల భద్రత విషయంలో మన పరువుకు దక్కిన ప్లేస్.. నలభై తొమ్మిది! -
Andhra Pradesh: శభాష్.. ‘దిశ’
అనంతపురానికి చెందిన లావణ్య విజయవాడలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల సెలవులకు ఇంటికి వెళ్లింది. తిరిగి కళాశాల వద్దకు వచ్చి దిగబెట్టడానికి తండ్రికి వీలుపడలేదు. బస్సు ఎక్కిద్దామని బస్టాండ్‌కు వచ్చాడు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సెల్‌ఫోన్‌లోని ‘దిశ’ యాప్‌ను ఉపయోగించమని చెప్పాడు. ఇలా ఉపయోగించాలని చూపించబోగా ‘నాన్నా.. నాకు తెలుసులే’ అని లావణ్య చెప్పడంతో జాగ్రత్తలు చెప్పి వెనుదిరిగాడు. ఇలా లక్షలాది మందికి ‘దిశ’ ఓ ఫ్రెండ్‌గా, ఓ సోదరుడిగా, ఓ బాడీగార్డ్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాక్షి, అమరావతి: సినిమాల్లో చివరి సీన్లోనే పోలీసులు వస్తారని ఎన్నో దశాబ్దాలుగా చూపిస్తున్నారు. దుర్ఘటన జరిగాక తీరిగ్గా పోలీసులు వస్తారు తప్ప.. వెంటనే రక్షణ కల్పించరనే అపప్రద దేశ వ్యాప్తంగా పోలీసులపై ఉంది. కానీ, రాష్ట్ర పోలీసు శాఖ ఆ చరిత్రను తిరగరాస్తోంది. ఆపదలో ఉన్నామని ఇలా చెబితే చాలు అలా క్షణాల్లో అక్కడకు చేరుకుని భద్రత కల్పిస్తోంది. మహిళలు సంప్రదించగానే తక్షణం భద్రత కల్పించే వ్యవస్థను రూపొందించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు ఆచరణ రూపమే దిశ మొబైల్ యాప్. ఇది రక్షణ కోసం మహిళలకు ప్రభుత్వం అందించిన అస్త్రం. ఆధునిక సమాచార సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ రూపొందించిన ఈ యాప్ మహిళా భద్రతకు పూర్తి భరోసానిస్తోంది. ఈ యాప్‌ను రికార్డు స్థాయిలో మహిళలు డౌన్లోడ్ చేసుకుంటుండటమే అందుకు నిదర్శనం. ఇప్పటి వరకు 1,10,40,102 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ మొబైల్ యాప్‌ను కూడా ఇంత భారీ స్థాయిలో ఎవరూ డౌన్లోడ్ చేసుకుని, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. క్షణాల్లో ఆపన్న హస్తం.. ఇప్పటి వరకు దిశ యాప్ ద్వారా 9.60 లక్షల ఎస్ఓఎస్ వినతులు దిశ కమాండ్ కంట్రోల్‌కు చేరాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే యాప్ పని తీరు పరీక్షించేందుకు చేసే ఎస్ఓఎస్ వినతులూ అత్యధికంగా ఉన్నాయి. అలాగే, ఇప్పటి వరకు చర్యలు తీసుకోదగిన 23,039 ఎస్ఓఎస్ వినతులు వచ్చాయి. పోలీసులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టారు. ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న 1,237 మందికి భద్రత కల్పించారు. నేరాలకు యత్నించిన కేసుల్లో 2,323 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మొత్తంగా 3,560 ఘటనల్లో బాధితులకు అండగా నిలిచారు. పటిష్ట వ్యవస్థతో సమర్థ పర్యవేక్షణ దిశ యాప్ సమర్థవంతంగా పని చేసేందుకు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, 15 మంది ఇతర అధికారులతో కూడిన బృందం 24/7 కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దిశ యాప్ పని తీరును సాంకేతిక సమస్యల్లేకుండా చూసేందుకు 51 మందితో కూడిన సహాయక బృందాన్ని కూడా నెలకొల్పింది. ఇక గస్తీ విధుల కోసం 900 ద్విచక్ర వాహనాలతోపాటు 163 బోలెరో వాహనాలను సమకూర్చింది. దాదాపు 3 వేల పోలీసు వాహనాలకు జీపీఎస్ ద్వారా దిశ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానించారు. ఫోరెన్సిక్ సైన్స్ విభాగాన్నీ బలోపేతం చేసింది. కేంద్ర హోంశాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లోపే రాష్ట్ర పోలీసులు అత్యధిక కేసుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నారు. దోషులను గుర్తించి సకాలంలో శిక్షలు పడేలా చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యాచారం–హత్య కేసుల దర్యాప్తునకు సగటున 222 రోజులు సమయం పట్టగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం సగటున 58 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 19 అవార్డులు దిశ యాప్ ప్రభావంతో రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్సీఆర్బీ)–2021 వెల్లడించింది. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో మహిళలపై నేరాల కేసులు 111.2 నమోదవుతుండగా కేరళలో 73.3 కేసులు ఉన్నాయి. అదే ఏపీలో 67.2 కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారం–హత్య కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో ఆరు, 2020లో ఐదు కేసులు నమోదు కాగా 2021లో రెండు కేసులు నమోదయ్యాయి. అత్యాచారయత్నం కేసులు 2019లో 177, 2021లో 162 కేసులు నమోదయ్యాయి. బాలికలపై అత్యాచార యత్నం కేసులు 2019లో 45, 2020లో 40, 2021లో 35 నమోదయ్యాయి. మహిళలపై దాడుల కేసులు ఎనిమిది శాతం తగ్గాయి. ఇంత సమర్థవంతంగా పని చేస్తున్న దిశ యాప్‌కు జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 19 అవార్డులు వచ్చాయి. దిశ వ్యవస్థ దేశానికి ఆదర్శం మహిళా భద్రతను ప్రథమ ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఇందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా దిశ యాప్‌పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. డౌన్ లోడ్, రిజిస్ట్రేషన్లపై శ్రద్ధ తీసుకున్నాం. దాంతో ఏపీలో మహిళలపై వేధింపులు తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది. దిశ యాప్ పనితీరును ఇతర రాష్ట్రాల పోలీసు శాఖలు కూడా పరిశీలించాయి. దిశ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. – కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ దిశ యాప్ మహిళలకు ఒక వరం ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. పోలీస్ అవసరం ఉన్న వారు ఎస్ఓఎస్ బటన్ నొక్కడం ద్వారా సత్వర సహాయం అందుతుంది. ఆపదలో ఉన్నప్పుడు కాల్ చేసే అవకాశం లేకపోతే ఫోన్‌ను నాలుగైదుసార్లు షేక్ చేస్తే చాలు.. పోలీసులకు సమాచారం అందుతుంది. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై దాడులు ఆపలేకపోతున్న పరిస్థితుల్లో దిశ యాప్ ఒక వరం లాంటిది. – కె శ్యామల, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోక్సో కోర్టు యాప్‌పై అవగాహన పెంచుకోవాలి దిశా యాప్ మహిళలకు అండగా నిలుస్తోంది. విద్యార్థినులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది. పెద్దగా చదువుకోని మహిళలు కూడా ఈ యాప్‌ను సులువుగా ఉపయోగించవచ్చు. మహిళలు, విద్యార్థినులు ఈ యాప్‌పై అవగాహన పెంచుకోవాలి. – పి.రమణమ్మ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, విజయనగరం. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఓ యువతిని రాంబాబు అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించాడు. వారి పెళ్లికి పెద్దలు కూడా సమ్మతించారు. కానీ, ఆ యువతిపై అనుమానం పెంచుకున్న రాంబాబు ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఆమె ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీన్ని గుర్తించిన ఆ యువతి సోదరి దిశ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించగా వారు కేవలం ఆరు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న రాంబాబును అరెస్టు చేశారు. విజయవాడలో ఓ బిడ్డకు తల్లి అయిన ఒంటరి మహిళను ఓ యువకుడు నమ్మించి మోసగించాడు. దాంతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన బిడ్డను సంరక్షించమని దిశ యాప్ ద్వారా పోలీసులను కోరింది. పోలీసులు కేవలం 3 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఆమెను మోసగించిన యువకుడిపై కేసు నమోదు చేశారు. మహిళలకు ఒక భరోసా ప్రయాణ సమయంలో దిశ యాప్‌లో ఉండే ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉపయోగించి గమ్య స్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్ చేస్తుంది. ప్రయాణించే వాహనం దారి తప్పితే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలుస్తుంది. అప్పుడు పోలీసులు వెంటనే స్పందించే తీరు హర్షణీయం. సీఎం వైఎస్ జగన్ మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన దిశ యాప్ ఎంతో భరోసా కల్పిస్తోంది. – జి.రత్నకుమారి, గృహిణి, గుంటూరు -
మన మహిళలు 'నవ'దుర్గలు
రాష్ట్ర రాజకీయాల్లో అన్నింటా అర్ధ భాగం కంటే అధికంగానే దక్కించుకున్న అతివలు ‘శైలపుత్రి’గా శక్తి సామర్థ్యాలు చాటుకుంటున్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో ‘లలితాదేవి’గా బాలికలు ప్రకాశిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఇంగ్లిష్ మీడియం చదువులతో విజ్ఞానాన్ని సముపార్జిస్తూ ‘గాయత్రి’గా విరాజిల్లుతున్నారు. అమ్మ ఒడితో ‘చదువుల తల్లి’గా రాణిస్తున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, గోరుముద్దతో ‘అన్నపూర్ణదేవి’ని తలపిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూతతో ప్రతి మహిళ ‘మహాలక్ష్మి’గా అవతరిస్తోంది. వైఎస్సార్ పెన్షన్ కానుక, ఇళ్ల పట్టాలతో అక్క చెల్లెమ్మలు ‘దుర్గాదేవి’గా పురోగమిస్తున్నారు. దిశ, సచివాలయ పోలీస్ లాంటి అస్త్రాలతో ప్రతి మహిళా ‘మహిషాసురమర్దిని’గా ధైర్యంగా జీవిస్తోంది. సాక్షి, అమరావతి: నవదుర్గ అవతారాలకు ప్రతి రూపాలుగా ప్రతి అతివ నవరత్నాలతో పురోగమిస్తోంది. సామాజిక, రాజకీయ రంగాల్లో శక్తి స్వరూపిణిగా గుర్తింపు పొందుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్ర మహిళలు కీర్తి ప్రతిష్టలు సముపార్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో దశ తిరిగిన మహిళా లోకానికి ఇది నిజమైన విజయ దశమిగా అభివర్ణిస్తున్నారు. నవకాంతులు ప్రసాదించడంలో నవరత్నాల పథకాలు కీలకపాత్ర పోషించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహిళా సాధికారతలో సాటిలేదు.. మహిళా సాధికారతలో ఏపీ సాధించిన అద్భుతాలను గమనిస్తే దేశంలో మరే రాష్ట్రం మనకు సాటి లేదని చెప్పొచ్చు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలంటూ 1993 నుంచి పార్లమెంట్లో బిల్లులు పెడుతూనే ఉన్నా ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. మన రాష్ట్రంలో ఏ డిమాండ్లు, ఉద్యమాలు లేకపోయినా వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకే కేటాయిస్తూ చట్టం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. నామినేటెడ్ పదవుల్లో 51 శాతం మహిళలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం ఇదే. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్ ఛైర్మన్‌గా జకియా ఖానంను నియమించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గాను నీలం సాహ్ని నియమితులయ్యారు. గతంలో మహిళకు తొలిసారిగా హోంమంత్రి పదవి ఇచ్చి వైఎస్సార్ రికార్డు సృష్టిస్తే సీఎం వైఎస్ జగన్ హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితకు అవకాశమిచ్చి చిత్తశుద్ధి చాటుకున్నారు. తొలి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణి, మలి విడతలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతోపాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులు అప్పగించారు. రాష్ట్రంలో 13 జడ్పీ ఛైర్మన్ల పదవుల్లో ఏడుగురు మహిళలే ఉన్నారు. 26 జడ్పీ వై‹స్ చైర్మన్ పదవుల్లో 15 మహిళలకే దక్కాయి. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులకుగానూ 18 మంది మహిళలే ఉన్నారు. స్థానిక సంస్థల నుంచి నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకే అగ్రపీఠం దక్కింది. దాదాపు 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం, దాదాపు 1.30 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిలో 51 శాతం మహిళలకే ఇవ్వడం విశేషం. ఆసరాతో ఆదుకున్నారు... చంద్రబాబు సర్కారు మోసాలతో అప్పుల పాలైన పొదుపు సంఘాల మహిళలను సీఎం జగన్ వైఎస్సార్ ఆసరాతో ఆదుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న బ్యాంకు రుణాలు మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో ఆయా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) లెక్కల ప్రకారం ఎన్నికలు జరిగిన తేదీ నాటికి 78.76 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్న 7.97 లక్షల పొదుపు సంఘాల పేరిట రూ.25,517 కోట్లు రుణాలు ఉండగా ఇప్పుటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను ప్రభుత్వం ఆయా మహిళల ఖాతాల్లో జమ చేసింది. 2020 సెప్టెంబరులో తొలి విడతలో రూ.6,318.76 కోట్లు, రెండో విడతగా 2021 అక్టోబరులో మరో రూ.6,439.52 కోట్లను మహిళలకు అందజేసింది. సున్నా వడ్డీ పథకానికి మళ్లీ జీవం.. గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థల అధిక వడ్డీ ఆగడాల నుంచి మహిళలను ఆదుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో పావలా వడ్డీ పథకాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. బ్యాంకు నుంచి తీసుకునే రుణాలను సకాలంలో చెల్లించే పొదుపు సంఘాల మహిళలకు ఈ పథకం ద్వారా వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తోంది. 2014 తర్వాత విభజన అనంతరం అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో పథకం అమలు ఆగిపోయింది. పొదుపు సంఘాల మహిళలపై వడ్డీ భారం పడింది. దీనివల్ల సుమారు 18.36 శాతం పొదుపు సంఘాలు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మిగిలిపోయాయి. అప్పటిదాకా బాగా నడుస్తూ ‘ఏ’ కేటగిరిలో ఉన్న సంఘాలు ‘సి’, ‘డి’ గ్రేడ్లలోకి పడిపోయాయి. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ సున్నా వడ్డీ పథకానికి తిరిగి జీవం పోశారు. గత మూడేళ్లలో ఈ పథకం ద్వారా మహిళా సంఘాల రుణాలకు సంబంధించి బ్యాంకులకు రూ.3,615.29 కోట్ల వడ్డీని ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం 99.6 శాతానికి పైగా పొదుపు సంఘాలు ఏ గ్రేడ్‌కు తిరిగి చేరాయి. ‘చేయూత’తో శాశ్వత జీవనోపాధికి శ్రీకారం గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోని 45–60 ఏళ్ల వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు సైతం ఆర్థిక దన్ను కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా అర్హులైన లబ్ధిదారులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తారు. 26.39 లక్షల మంది మహిళలకు మూడు విడతల్లో రూ.14,110.61 కోట్లను ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా ప్రభుత్వం చేకూర్చే లబ్ధితో మహిళలకు శాశ్వత జీవనోపాధులు కలిగేలా అమూల్, హిందూస్థాన్ యూనీలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబుల్, రిలయెన్స్ రిటైల్, అజియో లాంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మల్టీ నేషనల్ సంస్థల సహకారం, ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో 5,28,662 కుటుంబాలు వివిధ వ్యాపారాలు, ఆదాయ మార్గాల ద్వారా శాశ్వత జీవనోపా«ధి పొందుతున్నాయి. అమ్మ ఒడి.. చదువులమ్మ గుడి ప్రతి తల్లి తన బిడ్డలు మంచి చదువులు చదువుకోవాలని, ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తుంది. వాటిని నెరవేర్చేలా విద్యారంగ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ఏటా రూ.వేల కోట్లను ఖర్చు చేస్తున్నారు. చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా ప్రభుత్వమే భరించేలా వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. మూడేళ్ల వయసులో అంగన్వాడీల కేంద్రాలకు వచ్చే దశ నుంచి పాఠశాల విద్య, ఇంటర్ విద్య, ఉన్నత విద్య పూర్తి చేసేవరకు పేద పిల్లల చదువుల వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. సంతృప్తస్థాయిలో వాటిని అమలు చేయడమే కాకుండా తల్లిదండ్రులపై నయాపైసా భారం లేకుండా ప్రభుత్వమే భరిస్తోంది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, మనబడి నాడు–నేడు లాంటి పథకాలను రూ.వేల కోట్లతో అమలు చేస్తున్నారు. డిజిటల్ విద్య అందించేందుకు వీలుగా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు ఏటా ఉచితంగా ట్యాబ్‌లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్యా రంగంలో జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నారు. గతంలో ఉన్నత విద్యార్థులకు ఇచ్చే ట్యూషన్ ఫీజులు నామమాత్రంగా ఉండగా ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే భరిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో పాఠశాల, ఉన్నత విద్యపై రూ.55,064.13 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ఇందులో పాఠశాల విద్యార్ధుల కోసం రూ.43,236.67 కోట్లు వ్యయం చేయగా ఉన్నత విద్యార్ధుల కోసం రూ.11,827.46 కోట్లు వెచ్చించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 47,32,065 మంది విద్యార్ధులు చదువుతుండగా ఒక్కో విద్యార్థిపై రూ.91,369.56 చొప్పున ఖర్చు చేసింది. ఉన్నత విద్యారంగంలో 11,02,000 మంది విద్యార్ధులుండగా ఒక్కొక్కరిపై రూ.1,07,327 చొప్పున వ్యయం చేసింది. అమ్మ ఒడి కింద ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తుండగా విద్యా దీవెన, వసతి దీవెన నిధులను కూడా తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. సంపూర్ణ పోషణ.. గోరుముద్ద రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని సమకూర్చడంతోపాటు అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి బలవర్థక ఆహారం అందిస్తున్నారు. వారికి ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నారు. ఏడు షెడ్యూల్ ప్రాంతాల్లో మంచి పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా 30.16 లక్షల మందికి మేలు జరుగుతోంది. ఈ పథకానికి గత ప్రభుత్వం ఏటా కేవలం రూ.600 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లను వెచ్చిస్తోంది. బడికెళ్లే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా రోజుకో రకమైన మెనూతో బలమైన ఆహారాన్ని అందిస్తున్నారు. లక్షాధికారి అవుతున్న పేదింటి మహిళ సొంతిల్లు సామాన్యుల ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రతి అక్కచెల్లెమ్మ తమకంటూ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. మహిళా సాధికారతకు పెద్దపీట‡ వేసిన సీఎం జగన్ రాష్ట్రంలో లక్షల మంది మహిళల సొంతింటి కలను నెరవేర్చే మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో 31 లక్షలకుపైగా ఇళ్లను నిర్మిస్తున్నారు. మహిళల పేరిట ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు, పట్టణ, నగర ప్రాంతాల్లో రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల విలువైన స్థలాలను మహిళల పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయడంతో పాటు పావలా వడ్డీతో రూ.35 వేల చొప్పున రుణ సాయం అందేలా చర్యలు తీసుకుంది. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై ఇనుము, సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రిని సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలపై భారం వేయకుండా కనీస సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తోంది. ఒక్కో మహిళకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఆస్తులను సమకూర్చడం పేదింటి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతోంది. మొత్తంగా రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలకు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద సమకూరుస్తోంది. అగ్రవర్ణ పేద మహిళలను ఆదుకున్న ప్రభుత్వం వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా అగ్రవర్ణ పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. 45 – 60 ఏళ్ల వయసున్న దాదాపు 3.93 లక్షల మంది ఓసీ అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం అందుతోంది. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.15 వేల చొప్పున వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఇది కాకుండా కాపు నేస్తం, లా నేస్తం లాంటి పథకాల ద్వారా కూడా అగ్రవర్ణ మహిళలకు ప్రభుత్వం మేలు చేస్తోంది. మహిళా భద్రతకు ‘దిశ’ దిక్సూచి మహిళా భద్రతలో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. రాష్ట్ర మహిళల చేతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన బ్రహ్మాస్త్రం దిశ యాప్ ఉంది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు నిముషాల్లోనే రక్షణ కల్పించే అన్నలా దిశ యాప్ భరోసానిస్తోంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నిశ్చింతగా ఉండవచ్చన్న విశ్వాసాన్నిస్తోంది. దిశ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించడమే కాకుండా అందుకు అవసరమైన మౌలిక వ్యవస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పెట్రోలింగ్ వాహనాలు, కమాండ్ కంట్రోల్ రూమ్‌తోపాటు ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించింది. దిశ యాప్‌పై సీఎం జగన్ స్వయంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా పోలీసు శాఖ ఇతర శాఖలతో కలసి మహిళలను చైతన్యం చేస్తోంది. ఇప్పటివరకు 1.35 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం విశేషం. దిశ యాప్‌ను ఆశ్రయించడం ద్వారా దాదాపు 12 వేల మంది మహిళలు రక్షణ పొందారు. మన రాష్ట్ర మహిళలు ఇతర రాష్ట్రాల్లో ఆపదలో చిక్కుకున్నా సరే దిశ యాప్ వారిని ఆదుకోవడం విశేషం. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఢిల్లీలో ప్రమాదంలో చిక్కుకుని దిశ యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించగా, మన రాష్ట్ర పోలీసులు తక్షణమే స్పందించి ఢిల్లీ పోలీసుల ద్వారా భద్రత కల్పించి సురక్షితంగా స్వరాష్ట్రానికి తెచ్చారు. మహిళలపై వేధింపులు, దాడుల కేసుల సత్వర దర్యాప్తు, న్యాయస్థానాల్లో విచారణకు కూడా దిశ వ్యవస్థ దోహదపడుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి ఏడు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయగా... 8 నెలల్లో న్యాయస్థానం విచారణ పూర్తిచేసి దోషికి ఉరిశిక్ష విధించేలా చేశారు. దిశ యాప్ ప్రభావంతో రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్సీఆర్బీ) 2021 వెల్లడించింది. మహిళలకు భద్రత కల్పించడంతో సమర్థంగా పని చేస్తున్న దిశ యాప్ జాతీయ స్థాయిలో 19 అవార్డులు సాధించింది. -
పెరిగిన భద్రత.. తగ్గిన నేరాలు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టెక్ పోలీసింగ్ విధానం సత్ఫలితాలిస్తోంది. రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయి. సైబర్ నేరాల కట్టడిలోనూ రాష్ట్ర పోలీసు యంత్రాంగం విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన దిశ యాప్ సత్ఫలితాలిస్తోంది. పోక్సో ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం తదితర చర్యలతో పోలీసుల పనితీరు గణనీయంగా మెరుగుపడుతోంది. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ మంచి పనితీరు కనబరిచిందని జాతీయ నేర గణాంకాల నివేదిక (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)–2021) వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేరాలు గణనీయంగా తగ్గాయని ఆ నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. ఎన్సీఆర్బీ నివేదికలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. తగ్గిన హత్యలు ► రాష్ట్రంలో హత్యలు గణనీయంగా తగ్గాయి. చంద్రబాబు ప్రభుత్వంలో 2014లో 1,175, 2015లో 1,099, 2016లో 1,123, 2017లో 2,154, 2018లో 935 హత్యలు జరిగాయి. అంటే ఏడాదికి సగటున 1,077 మంది హత్యకు గురయ్యారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో 870, 2020లో 853, 2021లో 956 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే సగటున 893 హత్యలు జరిగాయి. ఏడాదికి సగటున 63 వరకు తగ్గినట్టు ఎన్సీఆర్బీ వెల్లడించింది. రాష్ట్రంలో అల్లర్లు, అలజడుల కేసులు 2019లో 492 నమోదు కాగా 2021లో 444కు తగ్గాయి. ► రాష్ట్రంలో కిడ్నాప్ కేసులూ తగ్గాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014లో 1,066, 2015లో 917, 2016లో 917, 2017లో 1,018, 2018లో 1,055 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాదికి సగటున 944 మంది కిడ్నాప్‌నకు గురయ్యారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో 902, 2020లో 737, 2021లో 835 కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాదికి సగటున 824 కిడ్నాప్‌లు జరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. డబ్బుల కోసం 2019లో 15 కిడ్నాప్‌లు జరగ్గా.. 2021లో 9 కేసులే నమోదయ్యాయి. బడుగులకు భద్రత ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషిచేస్తోంది. అవగాహన సదస్సుల ద్వారా వారిలో చైతన్యం కలిగిస్తోంది. దాంతో ఎస్సీ, ఎస్టీలు తాము వేధింపులకు గురైతే ఇప్పుడు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగలుగుతున్నారని ఎన్సీఆర్బీ నివేదిక గణాంకాలు వెల్లడించాయి. ► చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు సంబంధించి 2014లో 2,113 కేసులు, 2015లో 2,263 కేసులు, 2016లో 2,335 కేసులు, 2017లో 1,969 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద టీడీపీ ప్రభుత్వ హయాంలో సగటున ఏడాదికి 2,103 కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2021 వరకు సగటున 2,011 కేసులు నమోదయ్యాయి. ఇక 2021లో 2,014 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ► టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీలకు సంబంధించి 2014లో 390 కేసులు, 2015లో 362 కేసులు, 2016లో 405 కేసులు, 2017లో 341 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి సగటున 365 కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో 361 కేసులే నమోదయ్యాయి. ఇక 2019 నుంచి 2021వరకు సగటున ఏడాదికి కేసుల సంఖ్య 337కు తగ్గింది. ► ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, రక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. వేధింపులకు గురైన ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019వరకు రూ.52.32కోట్లే పరిహారంగా అందించారు. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2022 వరకు మూడేళ్లలోనే బాధితులైన ఎస్సీ, ఎస్టీలకు పరిహారంగా రూ.120 కోట్లు ఇవ్వడం విశేషం. పోలీసు సిబ్బందిపై కేసులు తగ్గుదల రాష్ట్రంలో పోలీసు సిబ్బందిపై కేసులు కూడా తగ్గాయి. 2020లో 261 కేసులు నమోదు కాగా 2021లో 185 కేసులే నమోదయ్యాయి. లాకప్ మరణాలు 2020లో 8 జరగ్గా, 2021లో ఆరుకు తగ్గాయని నివేదిక వెల్లడించింది. చార్జిషీట్ల నమోదులో అగ్రస్థానం కేసుల దర్యాప్తు, నేరస్తులకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. నేర నిరూపణలో కీలకమైన చార్జిషీట్లను సకాలంలో దాఖలు చేయడంలో అగ్రస్థానాన్ని సాధించింది. గడువులోగా దేశంలో 77.1శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏకంగా 93.7 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేస్తుండటం విశేషం. ఒక కేసు దర్యాప్తునకు 2018లో సగటున 164 రోజుల సమయం పట్టగా.. 2021లో 42 రోజుల్లోనే పూర్తి చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఏడు రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయడం పోలీసు శాఖ సమర్థతకు నిదర్శనం. పోక్సో కేసుల్లో 60 రోజల్లోనే చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. 2019లో 14శాతం కేసుల్లోనే 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా.. 2021లో ఏకంగా 92.5 శాతం కేసుల్లో దాఖలు చేశారు. మహిళా భద్రతకు భరోసా ► దిశ యాప్ ద్వారా మహిళల భద్రతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భరోసానిస్తోంది. 2019 నుంచి వారిపై నేరాలు పెరగకుండా సమర్థంగా కట్టడి చేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో మహిళలపై నేరాల కేసులు 16,362 నమోదు కాగా... 2017లో 17,909 నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో మహిళలపై నేరాల కేసులు 17,752కు తగ్గాయని నివేదిక వెల్లడించింది. ► తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో మహిళలపై నేరాల కేసులు 111.2 నమోదు అవుతుండగా కేరళలో 73.3 కేసులు ఉన్నాయి. కాగా ఏపీలో 67.2 కేసులు నమోదవుతున్నాయి. ► ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారం–హత్య కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో ఆరు, 2020లో ఐదు కేసులు నమోదు కాగా 2021లో రెండు కేసులు నమోదయ్యాయి. అత్యాచారయత్నం కేసులు 2019లో 177, 2021లో 162 కేసులు నమోదయ్యాయి. బాలికలపై అత్యాచార యత్నం కేసులు 2019లో 45, 2020లో 40, 2021లో 35 నమోదయ్యాయి. మహిళలపై దాడుల కేసులు 8 శాతం తగ్గాయి. 2020లో 2,541 కేసులు నమోదు కాగా 2021లో 2,330 కేసులు నమోదయ్యాయి. బాలలపై నేరాలు తగ్గుముఖం బాలలపై నేరాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. 18ఏళ్ల లోపు వారిపై వేధింపుల కేసులు రాష్ట్రంలో తగ్గాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. బాలికలపై దాడుల కేసులు 2020లో 513 నమోదు కాగా 2021లో 493కు తగ్గాయి. బాలలను వేధించేవారిపై పోక్సో చట్టం కింద నమోదు చేసే కేసులు 7శాతం తగ్గాయని నివేదిక పేర్కొంది. ఈ కేసులు 2019లో 502, 2021లో 466 నమోదయ్యాయి. రైతు ఆత్మహత్యలపై తప్పుదోవ పట్టిస్తున్న ఎల్లో మీడియా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్యపై ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది. ఎన్సీఆర్బీ నివేదికలో ఆత్మహత్యల సంఖ్యనే పేర్కొంటుంది. కానీ అందుకు కారణాలను ప్రత్యేకంగా పేర్కొనదు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలతో నిమిత్తం లేదని కూడా ఎన్సీఆర్బీ స్పష్టం చేసింది. కానీ ఎల్లో మీడియా మాత్రం ఈ విషయాన్ని వక్రీకరిస్తూ వాస్తవ విరుద్ధమైన కథనాలను ప్రచురిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నిమగ్నమైన వ్యక్తుల ఆత్మహత్యలు తగ్గాయి. 2019లో 628 మంది, 2020లో 564 మంది ఆత్మహత్య చేసుకోగా 2021లో ఆత్మహత్యలు 481కు తగ్గాయి. భూమి కలిగిన రైతుల ఆత్మహత్యల కేసులు 2019లో 438, 2020లో 424 నమోదు కాగా 2021లో 359కు తగ్గాయి. కౌలు రైతుల ఆత్మహత్యలు 2019లో 190, 2020లో 140 కేసులు నమోదు కాగా 2021లో 122కు తగ్గాయి. -
AP: సచివాలయాలు సూపర్.. కేంద్ర మంత్రి ప్రశంసలు
కాకినాడ: ఏపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకెంతో మేలు చేస్తోందని కేంద్ర మత్స్యకార, పశుసంవర్థక శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ప్రశంసించారు. బుధవారం ఆయన కాకినాడలో పర్యటించి.. 36వ డివిజన్ సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి 50 కుటుంబాలకు ఓ వలంటీర్‌ను, ప్రతి డివిజన్‌కు ఓ సచివాలయాన్ని ఏర్పాటు చేసి.. వాటికి కార్యదర్శులను నియమించి.. వ్యవస్థను సమర్థంగా నడిపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. దళారీ వ్యవస్థకు దూరంగా.. సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే చేరుస్తుండటం వ్యక్తిగతంగా కూడా తనకెంతో నచ్చిందని చెప్పారు. అంతకుముందు 36వ డివిజన్ సచివాలయంలో విధుల్లో ఉన్న మహిళా పోలీస్ ఫోన్ నుంచి దిశ యాప్ పనితీరును ఆయన పరిశీలించారు. ఎస్‌వోఎస్ బటన్ నొక్కగా.. సెకన్ల వ్యవధిలో దిశ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడంతో.. కేంద్ర మంత్రే దానికి జవాబిచ్చారు. ‘నేను కేంద్ర మంత్రి మురుగన్‌ను, దిశ యాప్ పనితీరును పరిశీలించేందుకే ఎస్‌వోఎస్ బటన్ నొక్కాను’ అని వారికి తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దిశ యాప్‌తో పాటు కంట్రోల్ రూమ్‌లు, ప్రత్యేక పోలీస్స్టేషన్లు, సిబ్బందిని ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించడం అభినందనీయమన్నారు. కేంద్ర మంత్రి వెంట కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మేయర్ సుంకర శివప్రసన్న తదితరులున్నారు. -
బాలలకు భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రధాన ప్రభుత్వ శాఖలన్నింటినీ సమన్వయపరుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణకు వచ్చే నెలలో ప్రత్యేకంగా ‘కంప్లైంట్ మానిటరింగ్ సెల్ (సీఎంఎస్)’ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా వచ్చే విజ్ఞాపనలు, ఫిర్యాదులను పరిశీలించి సమన్వయం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఒక సమన్వయకర్త (కోఆర్డినేటర్)ను నియమిస్తారు. ప్రతి గ్రామ, పట్టణాల్లోని వార్డు స్థాయిల్లో అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, మహిళా పోలీస్, వలంటీర్లను సైతం భాగస్వాముల్ని చేస్తారు. ఇందుకోసం ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ప్రాథమికంగా దృష్టి సారించిన కీలక అంశాలు, చర్యలు ► విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయనున్నారు. ► బాలలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులు తదితర నేరాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తారు. పోక్సో చట్టంతోపాటు బాలల హక్కులపైన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ► బాలల అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది. పేదరికం, ఆర్థిక సమస్యలు, కోవిడ్ నేపథ్యంలో చితికిపోయిన కుటుంబాలకు చెందిన బాలలు అక్రమ రవాణా బారిన పడుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో తేలిగ్గా డబ్బు సంపాదన మరిగిన కొందరు బ్రోకర్లు బాలలను కార్మికులుగా, బలవంతపు వ్యభిచారానికి, కిరాయి యాచక వృత్తిలోకి దింపుతున్నారు. బాలలపై ఈ క్రూరత్వాన్ని కట్టడి చేసేలా చర్యలు చేపట్టింది. ► ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బాల్య వివాహాలు, డ్రాపవుట్స్ (బడి మానేయడం) వంటి వాటిని నివారించేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను భాగస్వాముల్ని చేయనున్నారు. ► దత్తత పేరుతో జరుగుతున్న దగాను నివారించడంపై దృష్టి పెట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దత్తత రిజిస్ట్రేషన్ చెల్లదనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల దత్తతకు కేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కఠినంగా అమలు చేయనున్నారు. ► భ్రూణ హత్యలకు దారితీసే లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడ శిశువులను వదిలించుకునేలా రోడ్డు, చెత్త కుప్పల్లో వదిలేసే దారుణాలు, సరోగసి (అద్దె గర్భాల) మాఫియాలపైనా దృష్టి పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగం జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు, పోలీసులను సమన్వయపరిచి ఈ మాఫియాపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ► బాలల స్వీయ రక్షణకు తోడ్పడే దిశ అప్లికేషన్ (యాప్)పై ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టి రోడ్డుపైన, విద్యాలయాల్లో బాలల మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను ఇన్స్టాల్ చేయిస్తున్నారు. ఈ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపద సమమంలో దిశ యాప్ రక్షణ కవచంలా ఉంటుందని బాలలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పది ప్రభుత్వ శాఖలతో సమన్వయం బాలల హక్కులు, సమస్యలపై పది ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నాం. ప్రధానంగా వైద్య ఆరోగ్య, విద్య, పోలీస్, కార్మిక, పంచాయతీరాజ్, మహిళా శిశు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో బాలల సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోంది. – డాక్టర్ కేసలి అప్పారావు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ -
ఒక్క రోజులో 3.20 లక్షల ‘దిశ’ డౌన్లోడ్స్
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం దిశ యాప్ డౌన్లోడ్స్ మెగా డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయానికి మొత్తం 3.20 లక్షల డౌన్‌లోడ్స్‌తో పాటు 1.70 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపారు. ఇది రాష్ట్రంలోనే రికార్డుగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1.34 లక్షల రిజిస్ట్రేషన్లతో విశాఖ జిల్లా టాప్‌లో ఉండగా తాము దాన్ని అధిగమించినట్టు చెప్పారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు సమన్వయంతో ఇది సాధ్యమైందన్నారు. చదవండి: చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు.. అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు రెవెన్యూ, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, గ్రామ/వార్డు వలంటీర్లు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి మహిళ స్మార్ట్ ఫోన్లో దిశా యాప్ ఉండాలన్న లక్ష్యంతో విద్యారి్థనులు, గృహిణుల ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. ఉదయం ఈ మెగా డ్రైవ్‌ను జిల్లా కలెక్టర్ ఎన్.ఢిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా ప్రారంభించారు. నగరంలోని బస్టాండ్, కనకదుర్గ ఆలయం, ప్రకాశం బ్యారేజీ, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కలెక్టర్, పోలీస్ కమిషనర్లు పర్యటించి అక్కడున్న విద్యారి్థనులు, మహిళలతో యాప్ డౌన్లోడ్ చేయించారు. -
దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్
నెల్లూరు (క్రైమ్): మహిళల రక్షణకు రూపొందించిన దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో అన్ని పోలీస్స్టేషన్లలో పరిధిలో బుధవారం నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా పోలీసు లు బృందాలుగా ఏర్పడి అంగన్వాడీ, ఆశ వర్క ర్లు, వలంటీర్ల సహకారంతో మహిళలు, యువతులు, విద్యార్థినులకు యాప్‌పై విస్తృత అవగాహన కల్పించారు. గంటల వ్యవధిలోనే లక్ష మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. స్థానిక ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొన్న ప్రముఖులు, మహిళలు, యువత, ప్రజలకు దిశ యాప్ పని తీరును వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. అందులో భాగంగా దిశ చట్టం, దిశ మొబైల్ యాప్‌ను రూపొందించిందన్నారు. దేశంలోని అన్నీ అత్యవసర యాప్‌ల్లో కెల్లా దిశ యాప్ అత్యున్నతమైందన్నారు. దిశ యాప్ ఉంటే పోలీసులు మీ వెన్నంటే ఉనట్లేన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. ఎవరికి ఏ సమయంలో ఆపద వస్తుందో తెలియదని, నాకేం కాదని అనుకోవడం సరికాదన్నారు. ప్రతి మహిళ, యువతి తమ ఫోన్లలో యాప్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆపద సమయంలో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, ఫోనును నాలుగైదుసార్లు ఊపినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుందని, సిబ్బంది అప్రమత్తమై నిమిషాల్లోనే చేరుకుని రక్షణ చర్యలు చేపడుతారన్నారు. యాప్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి మహిళ ఆపద సమయంలో దానిని ఉపయోగించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. దిశ యాప్ విశిష్టతను వివరించిన విద్యార్థినులకు ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. స్వర్ణవేదికలో మెగా డ్రైవ్‌లో ఎస్పీ పాల్గొని మహిళలనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్ డి. హిమవతి, ఏఎస్పీ క్రైమ్స్ కె.చౌడేశ్వరి, ఏఆర్ ఏఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ కోటారెడ్డి పాల్గొన్నారు. నగరంలో.. నెల్లూరులోని ఆరు పోలీసుస్టేషన్లు, ట్రాఫిక్, సీసీఎస్ పోలీసుస్టేషన్ల పరిధిలో మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ జరిగింది. నగర ఇన్స్పెక్టర్లు వీరంద్రబాబు, టీవీ సుబ్బారావు, అన్వర్‌బాషా, దశరథరామారావు, కె. నరసింహరావు, కె, రామకృష్ణ, సౌత్, నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు జి. రామారావు, రాములునాయక్ తమ స్టేషన్ల పరిధిలో అవగాహన, రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. -
విశాఖలో ఒక్క రోజులో 1.26 లక్షల డౌన్లోడ్స్
పెదవాల్తేరు (విశాఖతూర్పు): రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ విషయంలో అమలు చేస్తున్న దిశ యాప్ డౌన్లోడ్ల విషయంలో సరికొత్త ఘనత సాధించింది. నగరంలో బుధవారం ఒక్కరోజే 1.26 లక్షల మంది మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని పోలీసులు చెప్పారు. ఈ విధంగా డౌన్లోడ్ల విషయంలో విశాఖ నగరం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. దిశ పోలీసులు, వార్డు వలంటీర్లు, మహిళా పోలీసులు వారి పరిధిలోని మహిళలు, విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ వారి మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, దిశ పోలీసులను నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ అభినందించారు. -
దేశానికే దిశ నిర్ధేశం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మహిళలకు రక్షణ కల్పించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ‘దిశ’ నిర్దేశం చేశారని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నా రు. ఏపీ తరహాలో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు ది శ యాప్ అమలుచేసే దిశగా అడుగు వేస్తున్నాయని తెలిపారు. శ్రీకాకుళంలోని సన్‌రైజ్ హోటల్లో దిశ యాప్ రిజిస్ట్రేషన్స్ మెగా డ్రైవ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ జీఆర్ రాధిక అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా దిశ యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యతను లఘు చిత్రం ద్వారా చూపించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దిశ యాప్ ద్వారా యువతులు నిర్భయంగా ఉండవచ్చని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు పెద్ద ఎత్తున ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ యాప్‌పై విద్యార్థినులు ఇంటి చుట్టుపక్కల వా రికి అవగాహన కల్పించాలని సూ చించారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రికి మహిళాలోకం జేజేలు పలుకుతోందన్నారు. ఈ యాప్ ద్వారా రానున్న రో జుల్లో నేరాల సంఖ్య తగ్గతుందన్నారు. కఠిన శిక్షలు అమలు చేసే దిశగా ఏపీలో అడుగులు పడుతున్నాయని తెలిపారు. దిశ ఓ రక్షణ కవచం మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మహిళల భద్రతపై ఎస్పీ ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చు ట్టడం చాలా గొప్ప విషయమన్నారు. దిశ యాప్ అనేది ఒక రక్షణ కవచమని తెలిపారు. దిశ యాప్ ద్వారా ఢిల్లీలో ఆపదలో ఉన్న ఓ మహిళను సురక్షి తంగా కాపాడారని గుర్తు చేశారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ యాప్, దిశ వాహనాలు, పెట్రోలింగ్ వాహనాలను ప్రవేశపెట్టి ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. మీ వెంటే ఉంటుంది.. జాయింట్ కలెక్టర్ విజయసునీత మాట్లాడుతూ అక్క, అన్న అనుక్షణం మీతో ఉండలేకపోవచ్చని, దిశ యాప్ ప్రతి క్షణం మీ వెంటనే ఉంటుందని తెలిపారు. యాప్ ఉంటే పోలీసు రక్షణ ఉన్నట్టేనన్నారు. పాట అదుర్స్.. ప్రత్యేక ఆహ్వానితుడు, గాయకుడు, ఇండియన్ ఐడ ల్ విజేత రేవంత్ దిశ యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యత గురించి పాడిన పాట అందరికీ ఆకట్టుకుంది. తన సొంత ఊరిలో ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామి కావడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. మ నపై మనం నమ్మకం పెట్టుకోవాలన్నారు. అనంతరం దిశ యాప్ రిజిస్ట్రేషన్ మెగా డ్రైవ్ చేపట్టి పెద్దఎత్తున దిశ యాప్‌లు రిజిస్ట్రేషన్ చేయించారు. యాప్ అందరికీ కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ దిశ యాప్ ను ఆడ, మగ అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. దిశ యాప్ ఎస్ఓఎస్ బటన్ నొక్కి షేక్ చేస్తే పోలీసు వారికి సమాచారం చేరి తక్షణమే ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి నైనా జైస్వాల్, ఎస్పీ, జెడ్పీ చైర్పర్సన్, జేసీలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ∙ఈ సందర్భంగా నాటుసారా వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి నిర్వహించి షార్ట్‌ఫిల్మ్‌ల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. మొదటి బహుమతిగా రూ.10 వేలు శ్రీకాకుళం వాసి జర్నలిస్ట్ డోల అప్పన, డాక్టర్ మాదిన ప్రసాదరావు టీమ్‌కు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు కాశీబుగ్గ వాసి బోనెల గోపాలరావులకు మంత్రి చేతులమీదుగా అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.శ్రీనివాసరావు, టీపీ విఠలేశ్వరరావు, పి.సోమశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ కేపీ గోపాల్, డీఎస్పీ ఎం.మహేంద్ర, శివరామి రెడ్డి, జి.శ్రీనివాసరావు, ప్రసాద రావు, సీఐ ఈశ్వర్ ప్రసాద్ అంబేడ్కర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దిశ గొప్ప వరం సమాజంలో స్త్రీ శక్తిని పెంపొందించడానికి దిశ గొప్ప వరం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు అమలు చేసి ప్రతి ఒక్క నిరుపేదకు విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చి మానవతావాదిగా నిరూపించుకున్నారు. దిశ అనేది మహిళల రక్షణకు కేంద్ర బిందువులాంటి ఆయుధం. – నైనా జైస్వాల్, క్రీడాకారిణి నాన్నలా రక్షణ దిశ యాప్ ఓ అన్నలా, నాన్నలా, అమ్మలా మహిళకు భద్రత ఇస్తుంది. ఈ యాప్ ఉంటే తల్లిదండ్రులు నిర్భయంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – పిరియా విజయ, జెడ్పీ చైర్పర్సన్ మొదటి ప్రాధాన్యత జిల్లాలో ప్రతి మహిళ భద్రతకు పోలీసు శాఖ మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పో లీసుల సాయం పొందాలి. స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోదు. దిశ యాప్ ఉంటేనే స్మార్ట్. యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ వివరాలను గోప్యంగా ఉంటాయి. పురుషు లు కూడా యాప్‌ను వినియోగించాలి. – జీఆర్ రాధిక, ఎస్పీ