documentary
-
నయనతారతో డేటింగ్.. నన్ను ఆ జంతువుతో పోల్చారు: విఘ్నేశ్ శివన్
కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్ స్టార్ నయనతారను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. అయితే తాజాగా నయనతార తన జర్నీని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ డాక్యుమెంటరీలో నయన్ భర్త విఘ్నేశ్ శివన్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. నయనతారతో డేటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇందులో వివరించారు. తాను నయన్‌తో డేటింగ్లో ఉన్నప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో తనకు తెలుసన్నారు. ఒక మృగాన్ని అందమైన అమ్మాయి ఎంచుకుంటే దానిని ఎవరూ ఆపలేరంటూ.. నన్ను కుక్కతో పోల్చారని విఘ్నేశ్ శివన్ వెల్లడించారు. కుక్కకు బిర్యానీ తినిపిస్తున్నారని చేసిన మీమ్‌లో మా ఇద్దరి చిత్రాలు ఉన్నాయని విఘ్నేశ్ తెలిపారు.అయితే తాను నయనతారతో డేటింగ్ చేయడంలో తప్పు ఏంటని ట్రోలర్స్‌ను విఘ్నేశ్ ప్రశ్నించాడు. బస్ కండక్టర్ సూపర్ స్టార్ (రజినీకాంత్) అయ్యారు.. మన జీవితంలో ఒక గొప్ప స్థానానికి చేరుకోవడం అంత తేలిక కాదని అన్నారు. మేమిద్దరం లవ్‌లో ఉన్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయని తెలిపారు. వాటిని నేను తేలిగ్గా తీసుకున్నప్పటికీ.. నయనతార గిల్టీగా ఫీలయిందని పేర్కొన్నారు. కొన్నిసార్లు నేను తన జీవితంలో భాగం కాకపోతే.. ఆమె మరింత సంతోషంగా ఉండేదన్న భావనతో కలిగిందని విఘ్నేశ్ శివన్ తెలిపాడు.నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నయన్ తన ప్రేమ జీవితం, కెరీర్ ఆధారంగా తీసుకొచ్చారు. ఆమె తన అరంగేట్రం నుంచి సినీ ప్రయాణం చూపించారు. ఇందులో నాగార్జున, రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, రాధిక శరత్‌కుమార్, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా నటించారు. కాగా.. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత ధనుశ్- నయనతార మధ్య వివాదం మొదలైంది. అనుమతి లేకుండా నానుమ్ రౌడీ ధాన్ మూవీ క్లిప్‌లను ఉపయోగించినందుకు నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు ధనుశ్. -
పింక్ బెల్ట్ గురించి తెలుసా? మీకుందా? కరాటేలో కాదు!
కరాటేలో పింక్ బెల్ట్ లేదు. కాని నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క అమ్మాయి, మహిళపింక్ బెల్ట్ కలిగి ఉండాలని అంటుంది అపర్ణ రజావత్.ఆగ్రాతో మొదలుపెట్టి దేశంలో లక్షలాది మందికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్న ఈ మార్షల్ ఆర్టిస్ట్ అమెరికన్ డాక్యుమెంటరీ మేకర్ జాన్మెక్రిటెను ఆమెపై డాక్యుమెంటరీ చేసేలా స్ఫూర్తినిచ్చింది.‘పింక్ బెల్ట్’ ఇప్పుడు వివిధ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు పొందుతోంది. మీకుందా పింక్ బెల్ట్?కరాటేలో పింక్ బెల్ట్ లేదు. వైట్, ఆరంజ్, బ్లూ, ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్లాక్ బెల్ట్‌లు ఉంటాయి. తర్వాతి రోజుల్లో కొన్ని కరాటే స్కూల్స్‌లో పింక్ బెల్ట్‌ను కూడా మొదలు పెట్టారు. ఇది వైట్ నుంచి ఎల్లో మధ్య స్థాయిలో ఉంటుంది. ‘ఏ స్థాయిలోదైనా ప్రతి స్త్రీకి ఆత్మరక్షణ విద్య తెలిసి ఉండాలి’ అంటుంది అపర్ణ రజావత్. ‘మన దేశంలో అబ్బాయిలు అమ్మాయిలు సమానం కాదని చిన్నప్పటి నుంచి మెదడులో వేస్తారు. ఇప్పటికీ కూడా ‘బేటీ బచావో బేటీ పఢావో’ అంటున్నాం. ఎవరైనా కాపాడే వస్తువా స్త్రీ అంటే? ఇది కాదు నేర్పాల్సింది... కొడుకుకు సంస్కారం నేర్పండి... నేర్వకపోతే దండించండి... ఇది కదా నేర్పాలి’ అని ప్రశ్నిస్తుందామె.అన్నయ్యల మీద తిరగబడి...అపర్ణ అవడానికి రాజస్థాన్ క్షత్రియ పుత్రిక అయినా తండ్రి ఉద్యోగరీత్యా ఆగ్రాలో పెరిగింది. నలుగురు అక్కచెల్లెళ్లు, ఇద్దరు అన్నయ్యలు. చిన్నప్పటి నుంచి తల ఒంచుకుని ఉండటం అపర్ణకు ఇష్టం లేదు. ఎదురు చెప్పేది. దాంతో అన్నయ్యలు ఆమెను దారిలో పెట్టాలని తరచూ గద్దించేవారు. అప్పుడు అపర్ణకు ఈ అన్నయ్యలను ఎదిరించాలంటే నేను ఏదో ఒక యుద్ధవిద్య నేర్వాలి అనుకుంది. అలా ఎనిమిది పదేళ్ల వయసులోనే కరాటేలో చేరింది. రాజ్‌పుత్‌ల ఇళ్లల్లో ఆడపిల్లల్ని అలా కరాటే నేర్పించడానికి పంపడం మర్యాద తక్కువ. అందుకని డ్రాయింగ్ క్లాస్‌కు వెళుతున్నానని చెప్పి వెళ్లేది. తల్లి ఇందుకు సహకరించింది. అలా నేర్చుకున్న కరాటేతో 12వ ఏట తన కంటే సీనియర్ బెల్ట్ ఉన్న అమ్మాయిని ఓడించడంతో పేపర్లో వార్త వచ్చింది. దాంతో ఇంట్లో తెలిసి గగ్గోలు రేగింది. ఆ తర్వాత తండ్రి ఆమె సామర్థ్యాన్ని గ్రహించి కరాటేలో ప్రోత్సహించాడు. ‘కరాటేలో తొలి ఇంటర్నేషనల్ మెడల్ తెచ్చిన భారతీయ మహిళను నేనే’ అంటుంది అపర్ణ.నిర్భయ ఘటన తర్వాత...చదువుకున్నాక అమెరికాలో ఉంటూ ట్రావెల్ ఏజెంట్‌గా పని చేస్తున్న అపర్ణను 2012లో నిర్భయ ఘటన కలచి వేసింది. ఆ సమయంలో అమెరికాలో ఆమె సహోద్యోగులు ‘మీ ఇండియాలో ఇలాగే ఉంటుందా?’ అని అడగడం మరీ అన్యాయంగా అనిపించింది. ‘నా వంతుగా ఏం చేయగలను’ అనుకున్నప్పుడు ఆమెకు తట్టిన సమాధానం స్వీయ రక్షణలో వీలైనంతమందికి శిక్షణ ఇవ్వడం. ఆ ఆలోచనతోనే 2016లో ఇండియా వచ్చి ఆగ్రాలో ‘పింక్‌బెల్ట్ మిషన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేవలం రెండుమూడు రోజుల వర్క్‌షాప్‌ల ద్వారా స్త్రీలకు కనీస ప్రతిఘటన విద్యలు నేర్పి పింక్ బెల్ట్‌ను బహూకరించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెంచడమే పింక్‌బెల్ట్ మిషన్ లక్ష్యం.ఆత్మరక్షణ ఈ స్త్రీలకు అక్కర్లేదా?‘ఆత్మరక్షణ గురించి స్త్రీలకు చాలా అ΄ోహలు ఉన్నాయి. ఆ అ΄ోహలను తీర్చాల్సిన అవసరం ఉంది’ అంటుంది అపర్ణ.అపోహ: వయసు నలభై దాటేసింది. బలహీన పడి΄ోయాను. కరాటే నేర్చుకోవాలా?వాస్తవం: కరాటే ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు. తాయ్చిలాంటి విద్యనైతే 80 ఏళ్ల తర్వాత కూడా నేర్చుకోవచ్చు.అపోహ: నేను ఇంటి బయటకే వెళ్లను. నాకు ఆత్మరక్షణ విద్య ఎందుకు?వాస్తవం: స్త్రీలపై దాడులు జరిగేది ఇళ్లలోనే. అదీ అయినవాళ్ల చేతుల్లోనే. ఇంట్లో ఉన్నత మాత్రాన రక్షణ ఉన్నట్టు కాదు.అపోహ: నేను మంచి ఆఫీస్‌లో పని చేస్తాను. నా కొలిగ్స్ మర్యాదస్తులు.వాస్తవం: మీరు ఎక్కడ పని చేసినా మీకు ప్రమాదం ΄÷ంచే ఉంటుంది. ΄ార్కింగ్ ఏరియాలో మీ మీద దాడి జరిగితే?అపోహ: నేను రెచ్చగొట్టే దుస్తులు వేసుకోను. నా జోలికి ఎవరూ రారు.వాస్తవం మీరు ఎలాంటి దుస్తులు ధరించినా దాడి జరిగే అవకాశం ఉంది. అత్యాచారం లైంగిక చర్య మాత్రమే కాదు... ఆధిపత్య నిరూపణ కోసం చేసే చర్య కూడా.అపోహ: ఆడవాళ్లు ఎంత నేర్చినా మగవారితో సమానం అవుతారా?వాస్తవం ఆత్మరక్షణ విద్య నేర్చుకునేది మగవారి బలంతో సమానం అని చెప్పడానికి కాదు. ప్రమాదం జరిగినప్పుడు మెదడు మొద్దుబారి లొంగి΄ోకుండా ఫైట్‌బ్యాక్ చేసే సన్నద్ధత కోసం.ఆ లక్ష్యంతో ఇప్పటికి అపర్ణ ఇండియాలోని నాలుగైదు రాష్ట్రాల్లో ఇప్పటికి 2 లక్షల మంది అమ్మాయిలు, మహిళలకు వర్క్‌షాప్‌ల ద్వారా ఆత్మరక్షణ నేర్పింది. దీని కోసం ఫుల్‌టైమ్ మాస్టర్స్‌ను తీర్చిదిద్దింది. అమెరికాలోని భారతీయుల కోసం కూడా ఈ శిక్షణ కొనసాగిస్తోంది.డాక్యుమెంటరీ నిర్మాణంఅపర్ణ రజావత్ కృషి గురించి దేశ విదేశాల పత్రికలు రాశాయి. అలా ఆమె కథ హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు మెక్క్రయిట్ ఆమెను పిలిచి ఏకంగా సినిమాయే తీస్తానని చె΄్పాడు. కాని వాస్తవిక స్ఫూర్తి అందరికీ అందాలంటే డాక్యుమెంటరీ చాలని కోరింది అపర్ణ. అలా ‘పింక్ బెల్ట్’ పేరుతో 79 నిమిషాల డాక్యుమెంటరీ తయారయ్యి ప్రస్తుతం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందుతోంది. షికాగో, న్యూబరీ పోర్ట్, జైపూర్ ఫెస్టివల్స్‌లో పింక్ బెల్ట్ హర్షధ్వానాలు అందుకుంది. యూట్యూబ్‌లో దీని ట్రైలర్ తాజాగా విడుదలైంది. -
అదర్ కోహినూర్స్, రాక్స్ ఆఫ్ హైదరాబాద్ ప్రత్యేక డాక్యుమెంటరీ, అక్టోబర్ 20న
అదర్ కోహినూర్స్, రాక్స్ ఆఫ్ హైదరాబాద్ బృందం హైదరాబాద్ హెరిటేజ్ గురించి సరికొత్త డాక్యుమెంటరీని ఆవిష్కరించనుంది. అక్టోబర్ 20న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగే గ్రాండ్ ఈవెంట్లో అధికారికంగా దీన్ని లాంచ్ చేయనుంది. హైదరాబాద్ పట్టణ విస్తరణతో కనుమరుగవుతున్న రాళ్లకు (అదర్ కోహినూర్స్) నివాళిగా దీన్ని రూపొందించామని నిర్వాహకులు తెలిపారు.ఉమా మగల్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ 48 నిమిషాల డాక్యుమెంటరీ, హైదరాబాద్‌లోని ప్రత్యేకమైన ప్రకృతిలో అద్భుతమైన రాళ్లను, వాటి వైభవాన్ని పరిచయం చేయనుంది. నగర గొప్ప సాంస్కృతిక, చారిత్రాత్మక సంబంధాన్ని ఆవిష్కరిస్తుంది. అక్టోబరు 20న సాయంత్రం 6 గంటలకు ప్రసిద్ధ "సాంగ్ ఆఫ్ ది కోహినూర్స్"ని ర్యాప్ సాంగ్ ఈ కార్యక్రమం మొదలు కానుంది. డీజే ముర్థోవిక్ స్వరపరిచిన అనుజ్ గుర్వారా అందించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోనేంది. ఈ పాటను హైదరాబాద్ ప్రేమ గీతం అని పిలుస్తారు. ఈ చిత్రం కేవలం హైదరాబాద్ రాళ్ల డాక్యుమెంటేషన్ కాదు; ఇది ఒక సాంస్కృతిక ఉద్యమం. నగర ప్రత్యేకమైన సహజ వారసత్వాన్ని జరుపుకోవడానికి ,రక్షించడానికి విభిన్న నేపథ్యాల నుండి ప్రజలను ఒకచోట చేర్చడం. నగర ప్రకృతి దృశ్యాన్ని గౌరవించే స్థిరమైన పట్టణ అభివృద్ధిపై చర్చ జరగాలని టీం భావిస్తోంది.మరిన్ని వివరాల కోసం, సందర్శించండి: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.అదర్స్కొహినూర్.కామ్ -
మా అమ్మ పాట జానపదాల పూదోట
‘అసమాన అనసూయ’... ఇదీ తెలుగు జానపద సంగీత సామ్రాజ్ఞి వింజమూరి అనసూయాదేవి పై ఆమె కుమార్తె సీతా రత్నాకర్ రూపొందించిన డాక్యుమెంటరీ పేరు. గంటన్నర నిడివి గల ఈ డాక్యుమెంటరీ వింజమూరి అనసూయాదేవి గాత్రాన్ని, ఘనతను, అనుభవాలను ్ర΄ోది చేసింది. దేశ విదేశాలఫెస్టివల్స్లో ప్రశంసలు పొందుతోంది. ఆగస్టు 11న కాకినాడలో, ఆగస్టు 17న హైదరాబాద్‌లో ప్రదర్శితం కానున్న ఈ డాక్యుమెంటరీ గురించి సీతా రత్నాకర్ తెలిపిన వివరాలు.‘దూరదర్శన్‌లో పని చేస్తున్న సమయంలో నేను కొన్ని డాక్యుమెంటరీలు తీశాను. అయితే జానపద సంగీత విభాగంలో గొప్ప కృషి చేసిన మా అమ్మ మీద డాక్యుమెంటరీ తీసే ఉద్దేశం నాకు అప్పట్లో ఉండేది కాదు. మా అమ్మ 1990 తర్వాత అమెరికా లో స్థిర నివాసం ఏర్పరుచుకుంది. ఒకసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు అందరి మీద డాక్యుమెంటరీలు‡ తీస్తున్నావ్ మరి నా మీద ఎప్పుడు తీస్తావు అని అడిగింది. అవును కదా అనుకున్నాను. అయినా సరే ఆ పనికి శ్రీకారం చుట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది’ అని గుర్తు చేసుకున్నారు సీతా రత్నాకర్. ఆమె తన తల్లి వింజమూరి అనసూయ పై తీసిన డాక్యుమెంటరీ ‘అసమాన అనసూయ’ ఇప్పుడు వివిధ దేశాలలో జరుగుతున్న ఫెస్టివల్స్‌లో పాల్గొంటోంది. కోల్‌కతా చలన చిత్ర ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో 2024 సంవత్సరానికి ప్రథమ బహుమతి పొందింది. తాజాగా ఈ డాక్యుమెంటరీని ఆగస్టు 11న కాకినాడ సూర్యకళామందిరంలో, ఆగస్టు 17న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సప్తపర్ణిలో ప్రదర్శించనున్నారు.డాక్యుమెంటరీ విలువ తెలిసింది‘మా అమ్మ అమెరికాలో ఉన్నప్పుడు మా అక్క భర్త ఆమె అనుభవాలను నమోదు చేసిన టేప్ ఫుటేజ్ ఉంది. నేను డాక్యుమెంటరీ కోసం ప్రత్యేకంగా అమ్మతో మాట్లాడాలనుకునేలోపు ఆమె 2019లో స్వర్గస్తురాలయింది. ఆమెపై డాక్యుమెంటరీ అవసరం ఆమె ΄ోయాక గానీ పూర్తిగా నాకు తెలియరాలేదు. వెంటనే రంగంలో దిగాను. కరోనా మొదటి రెండేళ్ల సమయంలో ఫుటేజ్ మొత్తం గేదర్ చేసుకుని పని ్రపారంభించాను. పాత టేప్ ఫుటేజ్ అంతా డిజిటలైజ్ చేయించాను. ఆ తర్వాత దాన్ని అంతటినీ గుదిగుచ్చి 94 నిమిషాల డాక్యుమెంటరీ తయారు చేశాను. మా అమ్మ జీవితాన్ని తెలుసుకోడం అంటే స్వాతంత్య్రానికి 20 ఏళ్ల పూర్వం నుంచి ఆ తర్వాత సినిమా, రేడియో, ఇతర మాధ్యమాల తెలుగు సంగీత చరిత్రను తెలుసుకోవడమే’ అని తెలిపారు సీతా రత్నాకర్.జానపదం అమ్మపాట... బాట‘మా అమ్మ వింజమూరి అనసూయాదేవి 1920 మే 12 తేదీన కాకినాడలో జన్మించింది. మా అమ్మకు బాల్యం నుండే సంగీతం పట్ల మక్కువ కలిగింది. ఎనిమిదేళ్ల వయసులోనే గ్రాంఫోన్ రికార్డు పాడిన ఘనత ఆమెది. అప్పటినుంచి ఆమె తన మేనమామ, ప్రఖ్యాత భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రితో పాటల ప్రయాణం చేస్తూ ఎన్నో పాటలకు ్రపాణం ΄ోసింది. అయితే ‘జానపదం’ అంటేనే ఆమెకు మక్కువ. ‘బండీర ΄÷గ బండీర’, ‘గోలకొండోయి గొరుగాకు పుల్ల’, ‘రామనా సందనాలో’, ‘గోదారోరి సిన్నది’, ‘కొండండోరి సెరువుల కింద’, ‘హోలీ హోలీయరంగ హోలీ’, ‘గోదావరి ్రపాంత పెళ్లి పాటలు’– మొదలైన వందలాది తెలుగు జానపదాలను రేడియో ద్వారా ప్రజలకు చేరువ చేయడంలోనూ, కచేరీల స్థాయికి తీసుకువెళ్లడంలో ఆమెది పెద్ద పాత్ర’ అంటారు సీతా రత్నాకర్.మొక్కజొన్న తోటలో...‘మా అమ్మ తన చెల్లి సీతతో కలిసి వింజమూరి సిస్టర్స్‌గా ఎన్నో కచేరీలు చేసింది. దేవులపల్లి రాసిన ‘జయజయజయ ప్రియభారత జనయిత్రీ’కి బాణీ ఏర్పరచి కాకినాడ పి.ఆర్. కళాశాల స్వర్ణోత్సవ సభలో(1935) పిల్లలతో పాడించింది. కొనకళ్ళ‘మొక్కజొన్న తోటలో’ పాటకి ్రపాణం ΄ోసింది. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా గాంధీజీ పాల్గొన్న కాకినాడ టౌన్ హాల్ సభలో ఆయన పక్కన కూర్చుని దేశభక్తి గీతాలు పాడటం ఆమె ఎప్పుడూ మర్చి΄ోలేదు’ అని గుర్తు చేసుకున్నారామె.నేను రెండో కుమార్తెను‘నేను అమ్మకు రెండో కుమార్తెను. చెన్నైలో స్థిరపడ్డాను. మా అక్క రత్నపాపతో కలిసి అమ్మ కచేరీలలో కోరస్ పాడేదాన్ని. ఆ తర్వాత దూరదర్శన్ లో ్ర΄ోగ్రాం ప్రొడ్యుసర్‌గా నాలుగు దశాబ్దాలు పనిచేసి 2012లో పదవీ విరమణ చేశాను. 2014లో నుంచి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ మొదలుపెట్టాను. నేను తీసిన ‘కాస్మిక్ కనెక్షన్’ డాక్యుమెంటరీకి దేశ విదేశ పురస్కారాలు వచ్చాయి. ‘అసమాన అనసూయ’ డాక్యుమెంటరీకి దేశ విదేశాలలో గుర్తింపు వస్తోంది. అయితే తెలుగువారే దానిని ఎక్కువ చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారామె.– సాక్షి ఫ్యామిలీ డెస్క్ఇన్పుట్స్: డా.కె.రామచంద్రారెడ్డి -
‘రామ కథా యాత్ర’పై డాక్యుమెంటరీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రఖ్యాత ఆధ్యాతి్మక వేత్త మొరారి బాపు ఇటీవల తాను చేసిన ద్వాదశ జ్యోతిర్లింగ రామకథా యాత్రపై ఒక డాక్యుమెంటరీని విడుదల చేశారు. రెండు రైళ్లలో ఒకదానిలో ప్రయాణించిన బాపు, ఆయన బృందం దీనిని చిత్రీకరించిందనీ, మంచు కప్పేసిన హిమాలయ శిఖరాల మీదుగా పచ్చని లోయలు విశాలమైన సముద్ర తీరాల వరకూ సాగిన ఈ యాత్రలో అనేక ఆధ్యాతి్మక విశేషాలను వీక్షించవచ్చని రూపకర్తలు తెలిపారు. అదే విధంగా బాపు రచించిన జర్నీ విత్ యాన్ ఇని్వజబుల్ పవర్, సాక్ర్డ్ స్టోరీస్ ఫ్రమ్ ది 12 జ్యోతిర్లింగాస్ పుస్తకాలు అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
రాజమౌళి పై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ... స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
-
Business: సారూ.. మీరు.. మీ ఐటీఆరూ..
‘సారూ’ అని మాత్రమే సంబోధిస్తున్నారు.. మా సంగతేమిటి అని ఎదురుప్రశ్న వేయకండి.. మేడమ్‌గారు!! ఇది అందరికీ వర్తించే విషయమే. ఈ రోజు, ఈ కాలమ్‌లో.. ఎవరు ఏ ఫారంలో ఆదాయపు పన్ను రిటర్నులను సబ్మిట్ చేయాలనేది ప్రస్తుతపు ప్రశ్న. అసెస్సీలు వారి వారి ఆదాయాన్ని ఒక నిర్దేశించిన ఫారంలోనే తెలియజేయాలి. ఈ ఫారంలో అన్ని కాలమ్‌లు సంపూర్ణంగా నింపి, రిటర్నుని లేదా ఫారంని ఫైల్ చేయాలి. ఫారం చాలా ముఖ్యమైన డాక్యుమెంటు. మీ ఆదాయాన్ని బట్టి, ఏ ఫారం ఎవరు ఫైల్ చేయాలో మీరే నిర్ణయించుకోవచ్చు. మీ క్యాటగిరీని బట్టి.. అంటే స్టేటస్ .. అంటే మీరు వ్యక్తులా, కంపెనీయా, ఉమ్మడి కుటుంబమా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మీ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం దేశంలో ఏడు రకాల ఫారమ్‌లు అమల్లో ఉన్నాయి. ఫారం 1 లేదా సహజ్ని వ్యక్తులు, రెసిడెంట్లు, కేవలం జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం మాత్రమే ఉంటేనే వేయాలి. ఈ రూపంలో వచ్చే ఆదాయం రూ. 50,00,000 దాటని వారు వేయొచ్చు. ఫారం 2 ని వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం కూడా వేయొచ్చు. జీతం, పెన్షన్, ఇంటి మీద ఆదాయం, ఇతర ఆదాయం ఉండి, మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితేనే వెయ్యాలి. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు ఈ ఫారం వేయకూడదు. ఇక ఫారం 3. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం.. వ్యాపారం, వృత్తి మీద ఆదాయం/లాభం ఉన్న వారు, ఇతరత్రా అన్ని ఆదాయాలతో పాటు ఈ ఫారం వేయొచ్చు. నాలుగో ఫారం తీసుకుంటే.. దీన్నే సుగమ్ అని కూడా అంటారు. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు, వ్యాపారం.. వృత్తిపరమైన ఆదాయాలు, ఇతరత్రా ఆదాయాలు ఉన్నవారు దీన్ని వేయాలి. లెక్కలతో నిమిత్తం లేకుండా కేవలం టర్నోవరు మీద నిర్దేశించిన శాతం కన్నా ఎక్కువ లాభం చూపించే వారు ఈ ఫారం వేయొచ్చు. ఇక ఐటీఆర్ 5. ఇది వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తించదు. ట్రస్టులు, వ్యక్తుల కలయిక అంటే గ్రూప్ లేదా అసోసియేషన్, ఎల్ఎల్పీలు, కంపెనీలు మొదలైన వారు వేయొచ్చు. మరొకటి ఫారం 6. కంపెనీలు మొదలైనవి, కంపెనీల చట్ట ప్రకారం నమోదు అయినవి వేయాలి. విదేశీ కంపెనీలు కూడా వేయొచ్చు. కొన్ని సంస్థలను కంపెనీగా పరిగణిస్తారు. అటువంటివి కూడా ఈ ఫారం వేయాలి. చివరగా ఫారం 7. మతపరమైన ధారి్మక సంస్థలు, హాస్పిటల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, ట్రేడ్ యూనియన్లు, రాజకీయ సంస్థలు, ఎన్జీవోలు మొదలైన సంస్థలు ఈ ఫారం వేయాలి. ఈ ఫారాల సంగతి ఇది.. స్థూలంగా చెప్పాలంటే వేతన జీవులకు ఫారం 1 లేదా ఫారం రెండు వర్తిస్తుంది. అయితే, వీరికి వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉంటే ఫారం 3 లేదా ఫారం 4 వేయాలి. జీతమే ఉంటే ఫారం 1 లేదా 2, వ్యాపారమే ఉంటే ఫారం 3 లేదా 4 వేయాలి. వెనకటికి కుప్పుస్వామీ మేడ్ ఇట్ డిఫికల్ట్ (kuppuswamy made it difficult) అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అలాగే ఉన్నాయి ఈ ఫారాలు కూడా. ఏ కేటగిరిలో ఎవరు వేశారు, ఎంత ఆదాయం డిక్లేర్ చేశారు మొదలైన సమాచారం కోసం వెసులుబాటుగా ఉండాలని ఇన్ని ఫారాలు. ఈ కాలమ్ ద్వారా ప్రతి వారం మీకు మీ సంశయాలు తీరుస్తాం. ఓపిగ్గా వెయిట్ చేయండి. ఇవి చదవండి: మార్చిలో ఎంఎఫ్‌లు డీలా -
సోషల్ మీడియాతో కుమారి ఆంటీకి క్రేజ్.. ప్రముఖ ఓటీటీ బిగ్ ప్లాన్!
ఇప్పుడు కాలాన్ని కలియుగం కంటే సోషల్ మీడియా యుగం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను ప్రజలు విపరీతంగా వాడేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏకంగా అడిక్ట్ అయిపోయారనుకోండి. 'వాడటం మొదలు పెడితే మాకన్న బాగా ఎవరూ వాడలేరు' అనే మిర్చి సినిమా డైలాగ్ గుర్తుకొచ్చేలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అందువల్లే క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నారు. అలానే ఇటీవల సోషల్ మీడియాలో పేరు తెలియని వారు కూడా ఒక్కసారిగా ఫేమస్ అయిపోతున్నారు. సినిమా స్టార్లను మించి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో చరవాణి ఉండడం.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ పెరిగిపోవడంతో మరింత ఈజీగా మారిపోయింది. ఇటీవలే గుంటూరు కారం సాంగ్‌తో కుర్చీ తాత ఫేమస్ అయ్యారు. అదే స్టైల్లో రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీకి విపరీతమైన క్రేజీ వచ్చింది. ఆమె హోటల్‌కు ఒక్కసారిగా కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఆమె హోటల్‌కు వెళ్లి వచ్చాక మరింత ఫేమస్ అయిపోయింది. దీంతో యూట్యూబర్స్ అంతా ఒక్కసారిగా కుమారి ఆంటీ వెంటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్ ఓ రేంజ్‌కు దూసుకెళ్లింది. అయితే అది కాస్తా కుమారి ఆంటీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. ట్రాఫిక్‌కు అంతరాయం అవుతోందంటూ పోలీసులు ఆమె బిజినెస్‌ను అడ్డుకునేస్థాయికి తీసుకొచ్చింది. కానీ చివరికీ మళ్లీ ఆమెను సడలింపు ఇచ్చారు కూడా. అయితే ఇంతలా ఫేమస్ అయిన కుమారి ఆంటీపై ఏకంగా సినిమానే తీయనున్నట్లు తెలుస్తోంది. అసలు ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయ్యారు? అనే ఆసక్తికర అంశాలతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కానీ ప్రస్తుతం ఈ టాపిక్ అయితే నెట్టింట అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్‌గా క్రేజ్ దక్కించుకున్న కుమారి ఆంటీపై డాక్యుమెంటరీ సినిమాగా వస్తే ఆమె రేంజ్ వేరే లెవెల్‌కు చేరుతుందంటున్నారు నెటిజన్స్. -
రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు
రెక్కల పురుగులన్నీ సీతాకోక చిలుకలు కావు.కాని సీతాకోకచిలుకలన్నీ రెక్కల పురుగులే.హిమాలయప్రాంతాలకు చెందిన మాత్ (రెక్కల పురుగు)లపై తీసిన ‘నాక్టర్న్స్’ డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన ‘సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి అవార్డ్ గెలిచిన డాక్యుమెంటరీ ఇదొక్కటే. డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ పరిచయం. అమెరికాలో ప్రతి ఏటా జరిగే సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నామినేషన్ పొందడమే పెద్ద గుర్తింపుగా భావిస్తారు. అవార్డు రావడం ఇంకా పెద్ద గౌరవం. ఈ సంవత్సరం ఉటాలో జనవరి 18–28 తేదీల మధ్య జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మన దేశం నుంచి ‘వరల్డ్ డాక్యుమెంటరీ కాంపిటీషన్’లో ‘నాక్టర్న్స్’లో చోటు సంపాదించడమే కాకుండా ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ క్రాఫ్ట్’ అవార్డు పొందింది. అనిర్ బన్‌దత్తాతో కలిసి అనుపమా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ రెక్కల పురుగుల లోకంలో ప్రేక్షకులను విహరింపచేస్తుంది. ఢిల్లీ కృత్రిమత్వం నుంచి ‘నేను, అనిర్ బన్ దత్త ఢిల్లీలో జీవిస్తుంటాము. రోజూ ఒకే రకమైన ట్రాఫిక్, ΄÷ల్యూషన్. ప్రకృతితో మాకు ఏమీ సంబంధం లేదనిపించేది. ఆ సమయంలో మాకు మాన్సీ అనే పర్యావరణ శాస్త్రవేత్త పరిచయం అయ్యింది. హిమాలయాలలో ‘మాత్స్’ (రెక్కల పురుగులు) మీద పరిశోధన చేస్తున్నానని చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల వీటికి కలుగుతున్న నష్టం ఏమిటో ఆమె తెలుసుకుంటోంది. ఇది డాక్యుమెంటరీ చేయాల్సిన విషయం అనుకున్నాం. గత కొన్నేళ్లుగా నేను, అనిర్బన్ డాక్యుమెంటరీలు తీస్తున్నాం. మెయిన్‌స్ట్రీమ్ పట్టించుకోని విషయాలను మేం పట్టించుకుంటాం. దీనికి ముందు మేము ఇండో–మయన్మార్ సరిహద్దులోని తోరా అనే పల్లెకు (మణిపూర్‌లో ఉంది) కరెంటు రావడం గురించి డాక్యుమెంటరీ తీశాం. దాని పేరు ‘ఫ్లికరింగ్ లైట్స్’. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా కరెంటు లేని పల్లె ఉండటం, దానికి కరెంటు కోసం కొందరు ఎదురు చూడటం, దేశంలోనే ఉన్నా పరాయీకరణ భావన ఎదుర్కొనడం దీనిలో చూపించాం. ఈ డాక్యుమెంటరీకి ఆమ్స్టర్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు దక్కింది. ఇప్పుడు మాత్స్ గురించి తీసిన ‘నాక్టర్న్స్’కు కూడా సండాన్స్ ఫెస్టివల్లో అవార్డ్ వచ్చింది. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది అనుపమా శ్రీనివాసన్. కష్టనష్టాలకు ఓర్చి ‘నాక్టర్న్స్ డాక్యుమెంటరీలో రెండే పాత్రలుంటాయి. ఒకటి పర్యావరణ శాస్త్రవేత్త మాన్సీ, రెండు హిమాలయాల స్థానిక బగున్ తెగకు చెందిన బికి అనే గిరిజనుడు. అతని సాయంతో ఆమె రెక్కల పురుగులను అన్వేషణ చేస్తుంటే మేం రికార్డు చేస్తూ వెళ్లాం. సాయంత్రం అయ్యాక మాన్సీ పలచటి తెర కట్టి దాని వెనుక నీలం రంగు బల్బు వెలిగించేది. ఆ తర్వాత కాసేపటికే వేలాది రెక్కల పురుగులు వచ్చి ఆ స్క్రీన్ మీద వాలేవి. వాటి రంగులు, రూపాలు, ఆకారాలు అన్నీ అద్భుతం. అవి తాము మనిషితో కలిసి జీవిస్తున్నామన్నట్టు ఉన్నాయి. మనమే వాటితో కలిసి జీవిస్తున్నాం అన్న ఎరుకలో లేము’ అంటుంది అనుపమా శ్రీనివాసన్. ‘హిమాలయాల్లో షూటింగ్... అదీ అడవుల్లో అంటే చాలా శ్రమ. అక్కడంతా తేమగా ఉంటుంది. ఏ క్షణమైనా వాన పడొచ్చు. అంతేగాక రాత్రి వేళల్లో విపరీతమైన చలి. జలగలు పట్టి పీక్కుతినాలని చూసేవి. కాని ఇన్ని సమస్యల మధ్య ఆ రెక్కల పురుగుల జీవనం, వాటి కదలికలు ఎంతో ఆసక్తి కలిగించేవి. మా డాక్యుమెంటరీకి అవార్డు రావడానికి కారణం మేము ప్రకృతి ధ్వనులను పరిపూర్ణంగా రికార్డు చేశాం. ఆ ధ్వనుల వల్ల అడవిలో ఉంటూ మాత్స్‌ను చూస్తున్న అనుభూతి కలుగుతుంది’ అంది అనుపమా శ్రీనివాసన్. -
వామ్మో.. వీళ్ల పెళ్లి ఖర్చు రూ.491 కోట్లా? ప్రత్యేకతలివే!
ఒకప్పుడు రాజుల కాలంలో ఐదు రోజులు ఆడంబరంగా పెళ్లి చేసుకునే వారని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ కంప్యూటర్ యుగంలో కూడా కొంత మంది ధనవంతులు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇటీవల సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి తన కూతురు పెళ్ళికి వందల కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక కార్ డీలర్షిప్ తన కూతురు 'మడేలైన్ బ్రాక్వే' పెళ్లి ఐదు రోజులు ఘనంగా చేసాడు. దీనికైన ఖర్చు 59 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.491 కోట్లు కంటే ఎక్కువ. ఈ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. 26 ఏళ్ల మడేలైన్ బ్రాక్వే.. తన ప్రియుడు 'జాకబ్ లాగ్రోన్'తో జరిగిన ఐదు రోజుల పెళ్ళికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీసింది. కచేరీ ప్రారంభం నుంచి వేర్సైల్లెస్ ప్యాలెస్‌లో రాత్రిపూట బస చేసే వరకు అన్నింటికీ సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలైస్ గార్నియర్‌లో రిహార్సల్ డిన్నర్, వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో రాత్రిపూట బస, ప్రైవేట్ లంచ్, ఉటాలోని ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్‌లో బ్యాచిలొరెట్ వీక్ వంటి అన్ని వీడియో రికార్డ్ చేసుకున్నారు. వివాహ వేదిక ఎక్కడో స్పష్టంగా వెల్లడించలేదు, కానీ ఈఫిల్ టవర్ ఉద్యానవనంలో వేడుకలు పెద్ద ఎత్తున జరిగినట్లు, బహుశా అదే ప్రాంతంలో పెళ్లి కూడా జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ జంట 2020 మార్చిలో డేటింగ్ ప్రారంభించారు. లాగ్రోన్ లింక్డ్ఇన్ అకౌంట్ ప్రకారం, అతను కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్‌లో టాలెంట్ కోఆర్డినేటర్‌గా, కంట్రీ సింగర్ జాసన్ ఆల్డియన్కు ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. పెళ్ళికి కొన్ని రోజుల ముందే ఈ జంట, వారి స్నేహితులు పారిస్‌కు వెళ్లారు. వీరు బస చేసిన హోటల్ గదుల ఖరీదు రోజుకి 2400 డాలర్లని సమాచారం. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. కోట్లు ఖర్చు పెట్టి వివాహాలు చేసుకున్న ఘటనలు ఇప్పటికే కూడా చాలా వెలుగులోకి వచ్చాయి. గతంలో కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి తన కూతురు పెళ్ళికి రూ. 500 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. పెళ్ళిలో వధువు ధరించిన చీర ఖరీదే రూ. 17 కోట్లు కాగా, ఆమె వేసుకున్న బంగారు ఆభరణాల ఖరీదు రూ. 90 కోట్లు, మేకప్ కోసం మాత్రమే రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Lake Como Wedding Planner (@lakecomoweddings) -
అడ్డంకులను దూరంగా తన్ని,30 ఏళ్లుగా ఆడపిల్లల కోసం కష్టపడుతూ..
మణిపూర్ ఒక మంచి వార్తను వినిపించింది. ఆ రాష్ట్రానికి చెందిన మహిళా దర్శకురాలు మీనా లాంగ్జామ్ తీసిన ‘ఆండ్రో డ్రీమ్స్’ ముంబైలో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో బెస్ట్ డాక్యుమెంటరీగా ఎంపికైంది. మణిపూర్‌లోని మారుమూల గ్రామం ‘ఆండ్రో’లో ఆడపిల్లల ఫుట్‌బాల్ క్లబ్‌ను 30 ఏళ్లుగా పరిస్థితులకు ఎదురీది నడుపుతున్న ‘లైబి’ అనే మహిళ పోరాటాన్ని ఈ డాక్యుమెంటరీ రికార్డు చేసింది. ఆడపిల్లల క్రీడా స్వేచ్ఛను ఎన్ని అడ్డంకులొచ్చినా కొనసాగనివ్వాలనే సందేశం ఇచ్చే ఈ డాక్యుమెంటరీ దేశ, విదేశాల్లో ప్రశంసలు పొందుతోంది. అంతా చేసి ఎనిమిది వేల మంది జనాభా మించని ఊరు ఆండ్రో. మణిపూర్ తూర్పు ఇంఫాల్ జిల్లాలో మారుమూల ఉంటుంది అది. అక్కడి ఆడపిల్లలు ఫుట్‌బాల్ ఆడితే ఏంటి... ఆడకపోతే ఏంటి? కాని 60 ఏళ్ల లైబి మాత్రం– ఆడాల్సిందే అంటోంది. ఆమె గత ముప్పై ఏళ్లుగా ‘ఆండ్రో మహిళా మండల్ అసోసియేషన్– ఫుట్‌బాల్ క్లబ్’ (అమ్మ– ఎఫ్‌సీ) నడుపుతోంది. ఈ క్లబ్‌కు నిధులు లేవు. బిల్డింగ్ లేదు. ఊళ్లో ప్రోత్సాహం లేదూ, ఏమీ లేదు. కాని లైబి మాత్రం అంతా తానై క్లబ్‌ను నడుపుతోంది. ఈ మధ్యే ఆమె ఒక పూరి పాక నిర్మించి దానినే క్లబ్ బిల్డింగ్‌గా ప్రారంభించుకుంది. ‘అమ్మాయిలు కేవలం వంటకు, ఇంటి పనికి అంకితమై పోకూడదు. చదువుకోవాలి. ఆడాలి. ధైర్యంగా భవిష్యత్తును నిర్మించుకోవాలి. మా ప్రాంతంలో పురుషులదే సర్వాధికారం. ఇంటి పెద్ద, తెగ పెద్ద ఎంత చెప్తే అంత. వారి దృష్టిలో ఆడవాళ్ల గురించి చింతించాల్సింది ఏమీ ఉండదు. అమ్మాయిలు ఆడతామన్నా ఒప్పుకోరు. నా పోరాటం వల్లే ఇవాళ మా ఊరి నుంచి జాతీయ స్థాయిలో అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు’ అంటుంది లైబి. ఈమె పోరాటం ప్రపంచానికి చెప్పదగ్గది అనిపించింది మణిపూర్‌కే చెందిన మహిళా దర్శకురాలు మీనా లాంగ్జామ్కు. అలా తయారైన డాక్యుమెంటరీనే ‘ఆండ్రో డ్రీమ్స్’. ఇద్దరి కథ ప్రస్తుతం ముంబైలో ‘జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అట్టహాసంగా జరుగుతోంది. ఇందులో ‘ఆండ్రో డ్రీమ్స్’ బెస్ట్ డాక్యుమెంటరీగా నిలిచింది. ఇప్పటికే కేరళ, కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ఎంపికైన ఈ డాక్యుమెంటరీ ముంబైలో విమర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ‘దీనికి కారణం ఆండ్రోలో అమ్మ క్లబ్‌ను నడుపుతున్న లైబి పోరాటాన్ని, ఆ క్లబ్లో గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉంటూ మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలనుకునే నిర్మల అనే అమ్మాయి ఆకాంక్షలని నేను చూపించడమే. ఒక రకంగా చాదస్త వ్యవస్థతో రెండు తరాల స్త్రీల పోరాటం ఈ డాక్యుమెంటరీ’ అని తెలిపింది మీనా లాంగ్జామ్. మణిపూర్ వెలుతురు నిజానికి మే 3వ తేదీ నుంచి మణిపూర్ వేరే కారణాల రీత్యా వార్తల్లో ఉంది. కాని మణిపూర్‌ను అభిమానించేవారికి ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ సాధిస్తున్న విజయాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. ‘నా డాక్యుమెంటరీ విజయం మా ప్రాంతంలో గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టే ఉత్సాహాన్ని ఇస్తే అంతే చాలు’ అంది మీనా లాంగ్జామ్. మణిపూర్ యూనివర్సిటీలో కల్చరల్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న మీనా పాఠాలు చెప్పడంతో పాటు డాక్యుమెంటరీలు కూడా తీస్తుంది. 2015లో ఆమె మణిపూర్‌లో ఫస్ట్ మహిళా ఆటోడ్రైవర్‌గా ఉన్న లైబీ ఓయినమ్ మీద డాక్యుమెంటరీ తీస్తే దానికి చాలా పేరొచ్చింది. ఆ తర్వాత ‘అచౌబీ ఇన్ లవ్’ పేరుతో పోలో ఆటకు అనువైన స్థానిక జాతి అశ్వాలపై డాక్యుమెంటరీ తీస్తే దానికీ పేరొచ్చింది. ఇప్పుడు ‘ఆండ్రో డ్రీమ్స్’ మణిపూర్ ఘనతను చాటుతోంది. బాలికలు, యువతులు క్రీడల్లో ఎంతో రాణిస్తున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆంక్షలు ఉండనే ఉంటాయి. అలాంటి ప్రతి చోట అమ్మాయిలను ప్రోత్సహించే లైబి లాంటి యోధురాళ్లు, వారి గెలుపు గాధలను లోకానికి తెలిపే మీనా లాంటి వాళ్లు ఉండాలని కోరుకుందాం. -
ప్రభుత్వం సాధించిన విజయాలకు అక్షర చిహ్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయపరంపరకు అక్షరచిహ్నంగా ‘తెలంగాణ మోడల్’ పుస్తకం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన ’తెలంగాణ మోడల్‘’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్ పొందుపరిచారని చెప్పారు. విజయాలను నమోదు చేయడం అంటే చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు భద్రపరచడమేనని, ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఈ విజయాలు పుస్తకరూపంలో రావడం భవిష్యత్తరాలకు పాఠాలుగా నిలుస్తాయన్నారు. ‘టుడే ఏ రీడర్– టుమారో ఏ లీడర్’ అంటారని గుర్తు చేశారు. శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. ఎర్రోజు శ్రీనివాస్ ‘నడక’ పుస్తకావిష్కరణ తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలన్నీ కలిపి తీసుకొచ్చిన ’నడక’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ వ్యాసాల ద్వారా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్ అభినందించారు. -
'ది ఎలిఫెంట్ విస్పరర్స్' వివాదం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బొమ్మన్ !
ఆర్ఆర్ఆర్తో పాటు ఆస్కార్ పొందిన డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఏనుగులను సంరక్షించే గిరిజన దంపతుల జీవనం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఆ దంపతులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే దీన్ని తెరకెక్కించిన కార్తికి గోంజాల్వెస్ తీరు పట్ల ఇటీవలే ఈ దంపతులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటిస్తే ఇల్లు, వాహనం, బెల్లీ మనవరాలు చదువుకు కావాల్సిన సాయంతోపాటు కలెక్షన్స్‌లోనూ వాటా ఇస్తామని కార్తికి చెప్పిందని బొమ్మన్, బెల్లీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన దంపతులు తమకు డబ్బులు ఇవ్వకుండా దర్శకురాలు మోసం చేసిందని వాపోయారు. అంతే కాకుండా తాము ఖర్చు పెట్టిన కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. (ఇది చదవండి: ఉద్యోగులకు బంపరాఫర్..సెలవుతో పాటు ఏకంగా టికెట్స్ కూడా!) ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అయితే ఇప్పటికే గిరిజన దంపతులు దర్శకురాలికి రూ.2 కోట్ల చెల్లించాలంటూ లీగల్ నోటీస్ పంపినట్లు తెలిసింది. ఆస్కార్ వచ్చిన తర్వాత దేశ ప్రధాని, తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి ఆమె పురస్కారాలు అందుకున్నారని.. తమకు మాత్రం మొండిచేయి చూపించారంటూ లీగల్ నోటీసులో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో బొమ్మన్, బెల్లీ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.2 కోట్ల లీగల్ నోటీసు గురించి తమకు తెలియదని బొమ్మన్ చెప్పినట్లు వెల్లడిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. బొమ్మన్ దంపతులు చేసిన ఆరోపణలపై పూర్తిగా యూ టర్న్ తీసుకున్నట్లు సమాచారం. ఓ మీడియా ప్రతినిధితో బొమ్మన్ మాట్లాడుతూ..' మా డిమాండ్లు నెరవేరితే కేసును వెనక్కి తీసుకుంటానని నేను చెప్పలేదు. అక్కడ ఏమి జరిగిందో నాకు ఏమి తెలియదు. లీగల్ నోటీసులు పంపినట్లు నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కార్తీకి నాతో బాగా మాట్లాడారు. అంతే కాకుండా సహాయం చేస్తానని కూడా చెప్పారు. కేసు విషయంలో నేనేం చేస్తా. ఆమె మాకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాకు ఉద్యోగం ఇప్పిస్తే చాలు." అని అన్నారు. ఇప్పటికే దీనిపై వివాదం తలెత్తగా.. బొమ్మన్ కామెంట్స్‌తో సీన్ కాస్తా రివర్స్ అయింది. (ఇది చదవండి: మమ్మల్ని నమ్మించి మోసం చేసింది.. దర్శకురాలిపై తీవ్ర ఆరోపణలు!) అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. -
గోయింగ్ సోలో! ఇద్దరు విజేతల అరుదైన కథ
‘ఆడపిల్లలు సైకిల్ తొక్కడమేమిటి!’ అని ఆశ్చర్యపోయే కుటుంబాల్లో పుట్టారు గరీమ శంకర్, రేణు సింఘీలు చిన్నప్పుడు సైకిల్‌ను చూడడం తప్ప నడిపింది లేదు. సైకిల్‌పై జెట్ స్పీడ్‌తో దూసుకుపోయేవాళ్లను చూసి ఆశ్చర్యపడేవారు. అలాంటి వారు సైకిలింగ్‌లో అద్భుతాల సృష్టిస్తారని ఎవరూ ఊహించలేదు. ‘గోయింగ్ సోలో’ డాక్యుమెంటరీలో వారి అంతర్. బహిర్ ప్రయాణం ఉంటుంది. నాలుగు గోడల మధ్య ఇంటికి పరిమితమైన రోజుల నుంచి లండన్–ఎడిన్బర్గ్–లండన్ (ఎల్‌ఈఎల్)లాంటి ప్రతిష్ఠాత్మకమైన సైకిలింగ్ ఈవెంట్స్ వరకు చేసిన ప్రయాణం కళ్లకు కడుతుంది. ‘వారి జీవితాల్లో సైకిలింగ్‌కు మించి చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి అనిపించింది. వారి జీవితాల్లోని అద్భుతాలను ఆవిష్కరించడానికి సైకిల్ అనేది ఒక సాధనం మాత్రమే’ అంటాడు ‘గోయింగ్ సోలో’ డైరెక్టర్ అమీ గోర్. ఢిల్లీలోని ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన గరీమకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు తప్ప ఏ లోటూ లేదు. టీనేజ్‌లో ఉన్నప్పుడు అందరిలాగా తాను కూడా రోడ్డు మీద సైకిల్ తొక్కాలనుకునేది. సైకిల్ తొక్కడం మాట ఎలా ఉన్నా ఇల్లు దాటి బయటికి రావడమే గగనంగా ఉండేది. తల్లిదండ్రులు ఆమెను పొరపాటున కూడా బయటికి పంపేవారు కాదు. గరీమకు పెళ్లి అయింది. ఆ తరువాత ఒక బిడ్డకు తల్లి అయింది. బాగా బరువు పెరిగింది. అది తనకు చాలా ఇబ్బందిగా మారింది. బరువు తగ్గడానికి మార్గాల గురించి ఆలోచిస్తున్న సమయంలో తనకు ఇష్టమైన సైకిలింగ్ గుర్తుకు వచ్చింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు తమ్ముడి ద్వారా సైకిల్ తొక్కడం నేర్చుకుంది. అయితే ఆమె సైకిల్ యాత్ర ఇంటిపరిసరాలకే పరిమితం. బరువు తగ్గడం మాట ఎలా ఉన్నా సైకిలింగ్ ద్వారా తాను ఒంటరిగా రోడ్డు మీదికి వచ్చింది. నగరంలో ప్రతి వీధిని చూసే అవకాశం వచ్చింది. అంతా కొత్తగా ఉంది. చాలా ఉత్సాహంగా ఉంది! ఇక అప్పటి నుంచి రెగ్యులర్ రైడర్‌గా మారింది. సైకిల్ లేకుండా ఆమెను చూడడం అరుదైపోయింది. సైకిలింగ్‌పై గరీమ ఆసక్తిని గమనించిన సన్నిహితులు ‘లక్ష్యం ఏర్పాటు చేసుకో. విజయం సాధించు’ అని చెప్పేవారు. దీంతో తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త అడుగులు వేసింది. సైకిల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం ప్రారంభించింది. ఆ రేసులను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చేది. తెలిసినవాళ్లు లండన్–ఎడిన్బర్గ్–లండన్ (ఎల్‌ఈఎల్) సైకిల్ ఈవెంట్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో షెడ్యూల్‌కు మూడు నెలల ముందు తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ‘నిజానికి అదొక అసాధ్యమైన లక్ష్యం. కాని ఏదో ధైర్యం నన్ను ముందుకు నడిపించింది’ అంటున్న గరీమ ఎల్ఈఎల్లో 125 గంటలలో 1,540 కిలోమీటర్లు దూరం సైకిలింగ్ చేసింది. గరీమ ఉత్సాహం, సాహసానికి ముచ్చటపడిన ఎల్‌ఈఎల్ కమ్యూనిటీ ఆమెను మెడల్‌తో సత్కరించింది. ఇక రాజస్థాన్‌కు చెందిన రేణు సింఘీ విషయానికి వస్తే పెళ్లికి ముందు అంతంత మాత్రంగా ఉన్న స్వేచ్ఛ ఆ తరువాత పూర్తిగా పోయింది. వంట నుంచి పిల్లల పెంపకం వరకు పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. తన కుమారుడికి సైకిల్ కొనడానికి ఒకరోజు బైక్షాప్కు వెళ్లింది. తన కోసం కూడా ఒక సైకిల్ కొన్నది. అప్పటికి ఆమె వయసు 52 ఏళ్లు. ‘ఈ వయసులో సైకిల్ తొక్కడమేమిటి’ అనేవారు కుటుంబసభ్యులు. అయితే అవేమీ పట్టించుకోకుండా లాంగ్–డిస్టెన్స్ సైకిలింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచేది. ఆ తరువాత ఇంటర్నేషనఃల్ ఈవెంట్స్‌పై దృష్టి పెట్టింది. ‘మనకు నచ్చింది చేయాలి. వయసు అనేది అడ్డు కాదు’ అంటున్న సింఘీ ఎల్‌ఈఎల్–ఈవెంట్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. అమ్మీ మీడియా (న్యూయార్క్), ఖాన్ అండ్ కుమార్ మీడియా (ఇండియా) నిర్మించిన ‘గోయింగ్ సోలో’ను దిల్లీ, ఊటీ, జైపుర్, జోద్పూర్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్లో చిత్రీకరించారు. 70 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీకి అమీ గోర్ దర్శకుడు. టీవి, షార్ట్‌ఫిల్మ్, డాక్యుమెంటరీలలో పదిసంవత్సరాల అనుభవం ఉంది. ‘వారి అనుభవాలు, ప్రయాణం నన్ను ఎంతో ఉద్వేగానికి గురిచేశాయి. రకరకాల పరిస్థితులు లేదా వయసును కారణంగా చూపి తమకు తాము రకరకాల పరిమితులు విధించుకునే ఎంతోమందికి ఈ డాక్యుమెంటరీ స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు డైరెక్టర్ అమీ గోర్. (చదవండి: చూసే కన్ను బట్టి అర్థం మారుతుంది..ట్రై చేయండి అదేంటో!) -
బీబీసీపై రూ.10 వేల కోట్ల పరువు నష్టం కేసు
న్యూఢిల్లీ: ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంట్ రూపొందించిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)పై ఓ ప్రభుత్వేతర సంస్థ ఢిల్లీ హైకోర్టులో రూ.10 వేల కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ డాక్యుమెంట్లో ప్రధాని మోదీ, భారత న్యాయవ్యవస్థపై తప్పుడు ఆరోపణలతో బీబీసీ భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపించింది. గుజరాత్‌కు చెందిన జస్టిస్ ఆన్ ట్రయల్ అనే సంస్థ వేసిన పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. బీబీసీ (యూకే)తోపాటు బీబీసీ(ఇండియా)కు సమన్లు ఇచ్చింది. సెప్టెంబర్ 25న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. పిటిషన్‌దారు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. నష్ట పరిహారంతోపాటు తమ సంస్థకు ఇతర ఆదాయ మార్గాలు లేనందున కోర్టు ఫీజులు తదితరాల కోసం రూ.10 వేల కోట్లు చెల్లించాలని కోరారు. -
అవునూ.. మన అడవుల్లో ఏనుగెందుకు లేదు?
మీరు ఓ విషయాన్ని గమనించారా? మన రాష్ట్రంలో జూలో తప్ప అడవుల్లో ఏనుగులు లేవు. చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ ఉన్నాయి. దక్షిణాదిలో అయితే.. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మందలు మందలుగా కనిపిస్తే.. ఇటు ఏపీలోనూ పదుల సంఖ్యలో అటవీ ప్రాంతాల్లో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. మరి తెలంగాణలో ఎందుకు లేవు? ఇటీవలే ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీకి ఆస్కార్ పురస్కారం దక్కిన నేపథ్యంలో ఏనుగుల మీదకు అందరి దృష్టి మళ్లింది. ఈ నేపథ్యంలో అసలు గజరాజు తెలంగాణలో ఎందుకు లేడు? పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు రాడు? అన్న విషయంపై ఓ లుక్కేద్దామా.. – సాక్షి, హైదరాబాద్ ఎందుకు లేవు.. ఎందుకు రావు.. ♦తెలంగాణలో ఏనుగులు కనిపించకపోవడానికి ప్రధానంగా భౌగోళిక, వాతావరణ పరిస్థితులే కారణం. తెలంగాణ, చుట్టుపక్కల ప్రాంతాలు భౌగోళికంగా దక్కన్ పీఠభూమిపై ఉండటంతోపాటు అడవుల మధ్య ‘డ్రై ఏరియా’ కారణంగా చారిత్రకంగానే ఇక్కడ ఏనుగులు లేవు. తెలంగాణకు ఆనుకుని ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని జిల్లాలన్నీ (పూర్వపు హైదరాబాద్ స్టేట్‌లోని) పొడి వాతావరణం, వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాలే. రాయచూర్, గుల్బర్గా, అకోలా, బీదర్, నాందేడ్ తదితర చోట్లా ఏనుగులు లేకపోవడంతో తెలంగాణలో ఏనుగుల ప్రవేశానికి అవకాశాలు లేకుండా పోయాయి. ♦ఏనుగులు స్థిర నివాసం ఏర్పరుచుకోవాలంటే దట్టమైన అడవులు, పచ్చదనం అవసరం. కనీసం 1,000–1,500 మిల్లీమీటర్ల వర్షపాతముండే ప్రాంతాలు కావాలి. తేమ వాతావరణం ఉండాలి. కనీసం 7, 8 నెలల పాటైనా అడవుల్లోని చెట్లు ఆకులు కలిగి ఉండాలి. గడ్డి ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. ఒక్కో ఏనుగుకు సగటున రోజుకు 150 నుంచి 200 కేజీల మేత అవసరం. ఒక గుంపులో ఐదు ఏనుగులుంటే రోజూ టన్ను మేత కావాలి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి దట్టమైన అడవులు లేకపోవడం వల్ల.. పెద్ద పులులు, ఇతర జంతువులు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి, స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నా ఏనుగులు మాత్రం రావడం లేదు. ♦ అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగులున్న చిత్తూరు, విజయనగరం జిల్లాల నుంచి తెలంగాణలోకి రావడానికి ఎలాంటి అడవుల కనెక్షన్ లేదు. మధ్యలో మైదాన ప్రాంతాలను దాటి ఏనుగులు ఇటు వచ్చేందుకు అవకాశాల్లేవు. ఏపీ సరిహద్దుల్లో ఖమ్మంకు ఆనుకుని పశ్చి మగోదావరి, మహబూబ్‌నగర్‌కు ఆనుకుని కర్నూలు, నల్లగొండ వైపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఏనుగులు లేవు. దీనితో తెలంగాణలోకి వచ్చే పరిస్థితి లేదు. ♦ గతంలో ఉమ్మడి ఏపీలోకి రెండు మార్గాల్లో ఏనుగులు వచ్చాయి. ఒకటి.. చిత్తూరు జిల్లాకు ఆనుకుని ఉన్న కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అడవుల నుంచి వచ్చాయి. ఆ రెండు రాష్ట్రాలు కూడా ఏనుగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే. ఆయా చోట్ల ఏనుగుల సంతతి పెరగడంతో పొరుగునే ఉన్న ఏపీలోకి ప్రవేశించాయి. స్థిరనివాసం ఏర్పరుచుకునే వాతావరణం, పరిస్థితులు ఉండడంతో ఇక్కడే ఉండిపోయాయి. ♦ ఇక రెండోది.. ఒడిశాకు పలుమార్లు భారీ వరదలు రావడంతో సరిహద్దుల్లోని విజయనగరం జిల్లాకు కొన్ని ఏనుగులు వలస వచ్చాయి. తిరిగి వెళ్లకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండిపోయాయి. అదేవిధంగా జార్ఖండ్ నుంచి కూడా ఏనుగులు వలస వచ్చాయి. చారిత్రకంగా, భౌగోళికంగా, ఇతర ప్రధాన కారణాలతో తెలంగాణలో ఏనుగులు లేవు. ఏపీలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఏనుగులు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగును నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకువచ్చేలా ఒక కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో పెద్దపులులు అసలు లేకపోవడం, ఇటు తెలంగాణలో ఏనుగులు లేకపోవడంతో.. రెండు ప్రాంతాల్లో పరస్పరం పులులు, ఏనుగులను మార్పిడి చేస్తే బావుంటుందని అంచనా వేశారు. ఈ విధంగా చేయడం ద్వారా మొత్తం ఉమ్మడి ఏపీవ్యాప్తంగా పుష్కలంగా వన్యప్రాణులతో పాటు జీవవైవిధ్యంతో కూడిన మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆశించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. – ఎ.శంకరన్, ఓఎస్డీ, తెలంగాణ అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ విభాగం -
బంగారంలాంటి ఆలోచన
బంగారు ఆభరణాలు తయారుచేసే స్వర్ణకారుల జీవితాలు బంగారమయంగా ఉన్నాయా.. ఈ విషయాన్ని నేరుగా తెలుసుకోవడమే కాదు వారికి సాయం చేయాలనే ఆలోచనతో పాతికేళ్ల లోపు యంగ్‌స్టర్స్ స్వచ్ఛందంగా వారిని కలిసి, ఆభరణాలను తయారుచేయించి హైదరాబాద్ తెల్లాపూర్‌లో ప్రదర్శనను ఏర్పాటుచేశారు. గ్లోబలైజేషన్లో భాగంగా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు, కంప్యూటర్ డిజైన్స్ వచ్చాక స్వర్ణకారుల ప్రాభవం మసకబారిపోతోందని, వారి కళను బతికించడం కోసం చేస్తున్న ప్రయత్నమిదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. వీరిలో శ్రీహర్షిత, ప్రద్యుమ్న, రిత్విక్, ప్రకృతి, సంస్కృతి, సర్వనా, సాత్విక్, భరణ్య, అజయ్, భగీరథ్ లు ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి వీరితో మాట్లాడినప్పుడు స్వర్ణకారుల కళ, వారి శ్రమకు తగిన ఫలం రాబోయే రోజుల్లో మరింతగా పెరగాలని కోరుకున్నారు. స్వర్ణకారులు తయారుచేసిన ఆభరణాల ప్రదర్శనకు ముందుండి నడిచిన చాడా శ్రీహర్షిత లా పూర్తి చేసి, తెలంగాణలోని ‘బచ్పన్ బచావో ఆందోళన్’కి లీగల్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తోంది. భరణ్య లా చదువుతోంది. రుత్విక్ డాక్టర్ కాగా స్వాతిక్ లా చేస్తున్నాడు. ప్రకృతి పన్నెండవ తరగతి పూర్తిచేసి సైకాలజీ పట్టా పొందడానికి కృషి చేస్తోంది. ప్రద్యుమ్న, భగీరథ్లు బీటెక్ చేస్తున్నారు. ఇక సర్వనా, సంస్కృతి లు స్కూల్ ఏజ్‌లోనే ఉన్నారు. నేరుగా కలిసి.. తాము చేస్తున్న కార్యక్రమాల గురించి శ్రీహర్షిత మాట్లాడుతూ ‘ఎడిస్టీస్ ఎన్జీవోని కిందటేడాది ప్రారంభించాం. దీని ద్వారా ప్రభుత్వ స్కూల్ పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారిలో మంచి మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తుంటాం. ఇందుకు కర్నూలు వాసి అయిన నర్మదా టీచర్ ప్రెసిడెంట్‌గా ఉండి సరైన సూచనలు ఇస్తుంటారు. స్కూల్ కార్యక్రమాల తక్వాత హస్తకళలకు సాయం చేయాలనే ఆలోచన చేసినప్పుడు స్వర్ణకారుల జీవితాలను చూశాం. మూడు నెలల క్రితం అనుకున్న ఈ కార్యక్రమాన్ని వెంటనే మొదలుపెట్టాం’ అని వివరిస్తే.. ‘దాదాపు పాతికమంది స్వర్ణకారుల కుటుంబాలను నేరుగా కలిసి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, ఒక డాక్యుమెంటరీ రూపొందించాం. ఆ తర్వాత కొంతమంది ప్రముఖులను కలిసి, స్వర్ణకారుల జీవితాల గురించి తెలియజేశాం. మేం ఏ కార్యక్రమం చేసినా, అందులో ప్రతీసారి కొత్తవారు సభ్యులు అవుతూ ఉంటారు. దీంతో మరికొందరికి సాయం చేయాలన్న ఆలోచన కూడా పెరుగుతోంది’ అని వివరించింది భరణ్య. శ్రమ ఎక్కువ.. ఆదాయం తక్కువ ‘హైదరాబాద్‌లోని కళాకారులనే కలుసుకున్నాం. వీరిలో స్థానిక కళాకారులే కాదు కలకత్తా, గుజరాత్.. వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారున్నారు. స్వర్ణకారుల షాప్‌లో ఒకరు మాస్టర్‌గా ఉంటారు. వారికి తప్ప మిగతా అందరికీ చాలా తక్కువ ఆదాయం ఉంటుంది. దీంతో కుటుంబాలు పోషించుకోలేని స్థితిలో ఉన్నవారిని చూశాం. జ్యువెలరీ అంటే లగ్జరీ గూడ్ అని మనకు తెలుసు. వీటిని తయారుచేసేవారి దగ్గర కూడా బాగా డబ్బు ఉంటుంది అనుకుంటాం. కానీ, వాళ్ల దగ్గర ఏమీ ఉండటం లేదు. ఈ కారణంగా వారి పిల్లలు కనీస చదువులు కూడా కొనసాగించలేకపోతున్నారు. ఈ ఎగ్జిబిషన్లో 25 మంది కళాకారులు పాల్గొన్నారు. సందర్శకులు వారి ఆభరణాలు కొనుగోలు చేసి, స్వర్ణకారులకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ కుటుంబాలకు మేం ఇలా సాయంగా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది’ అని వివరించారు ఈ యంగ్‌స్టర్స్. మన హస్తకళలన్నీ ముందు తరాలలోనూ సుసంపన్నంగా వెలగాలి. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జనంలోకి వెళుతూ ఉంటే స్వర్ణకళాకారుల భవిత కూడా బంగారమే అవుతుంది. కళను గుర్తించండి... ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఎంత కష్టపడినా ఒక్కోరోజు నాలుగైదు వందలు కూడా రావు. బంగారాన్ని కాల్చి, తీగ తీసి, అత్యంత శ్రద్ధతో ఒక ఆభరణాన్ని తయారు చేయాలంటే ఎంతో టైమ్ పడుతుంది. ఇప్పుడంతా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులకే వెళుతున్నారు. మా దగ్గర ఆభరణాలు చేయించుకునేవారు బాగా తగ్గిపోయారు. ప్రస్తుతం మేం ఆర్థికంగానే కాదు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాం. రాబోయే తరాలకు ఈ పని అందించే ధైర్యం చేయలేకపోతున్నాం. మా పిల్లలను వేరే పనులు చూసుకోమని చెబతున్నాం. ఇలాంటి ప్రదర్శనల ద్వారా ప్రముఖులు మా పనిని గుర్తిస్తే ఈ కళ బతుకుతుంది. – గోవింద్, స్వర్ణకారుడు ప్రత్యేకమైనది ఏ పని అయినా ఒకసారి చేసి వదిలేయడం వల్ల సరైన ఫలితాలు రావు. ఈ విషయం స్వర్ణకారులను కలిసినప్పుడు మరింతగా అర్ధమైంది. నిరంతరం సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఎంచుకున్న కార్యక్రమం ఇది. దీనికి చాలా మంది ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఈ ఆలోచన ప్రత్యేకంగా ఉందని అభినందించారు. – శ్రీహర్షిత సాయపడదాం జ్యువెలరీ షాపులు వచ్చాక స్వర్ణకారుల కళానైపుణ్యం ప్రశ్నార్ధకంగానే మారింది. కోవిడ్ తర్వాత వీరి ఇబ్బందులు మరీ పెరిగాయి. కంటిచూపు, గంటలు గంటలు కూర్చొని పని చేయడం వల్ల బ్యాక్పెయిన్తో సఫర్ అవుతున్నారు. ఈ విధంగా వారికి సాయం పడటం సంతోషాన్నిచ్చింది. – ప్రకృతి – నిర్మలారెడ్డి -
ఓటీటీలో రిలీజవుతున్న ఆహా 'గోదారి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుత సినీరంగంలో ఓటీటీ హవా నడుస్తోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా మరో కొత్త కంటెంట్‌తో మీ ముందుకు వస్తోంది. గోదారి పేరుతో తెరకెక్కిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో గోదావరి నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు వివరించేలా స్వాతి దివాకర్ దర్శకత్వంలో డాక్యుమెంటరీని రూపొందించారు. దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ.. 'ఆహా ఓటీటీ ద్వారా ఈ గోదారి డాక్యుమెంటరీని ప్రేక్షకులకు చూపించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకుముందెన్నడూ చూడని గోదారి అందాలను ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరించాం. గోదావరి నదీ విశిష్ణత, దాని చుట్టూ కోట్ల మంది ప్రజలు అవలంబించే సంస్కృతీ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నాం.' అని అన్నారు. ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీ ఆహా ఓటీటీలో మైలురాయిగా నిలవనుంది. ఇలాంటి డాక్యుమెంటరీలతో మన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన కట్టడాల గురించి ప్రేక్షకులకు వివరించే అవకాశం ఉంటుందని ఆహా యాజమాన్యం తెలిపింది. త్రింబకేశ్వర్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ చివరికి అంతర్వేది దగ్గర సాగరంలో కలుస్తుంది మన గోదారి. తన ప్రవాహ ప్రయాణంలో వివిధ రకాల ప్రాంతాలు, మనుషులు, యాసలు, భాషలు, పుణ్యక్షేత్రాలను పలకరిస్తూ, పరవశిస్తూ వారి జీవితాల్లో ముఖ్య భూమిక పోషిస్తోందని -
విశ్వవేదికపై ఏనుగుఘీంకారం.. మన దేశంలో ఏనుగుల పరిస్థితి ఏమిటి ?
ఏనుగుకి, మనిషికి మధ్య ఉండే భావోద్వేగ బంధం ప్రపంచాన్ని కదిలించింది. విశ్వవేదికపై ఏనుగుఘీంకారం ఆస్కార్ కుంభస్థలాన్ని కొట్టింది.డాక్యుమెంటరీలు తీసే వారికి ఎలిఫెంట్ విస్పరర్స్వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. మనిషికి, జంతువుకి, ప్రకృతికి మధ్య ఉండే గాఢానుబంధం మరోసారి చర్చకు వచ్చింది. మన దేశంలో ఏనుగుల పరిస్థితి ఏమిటి ?ఏనుగుల సంరక్షణ ఏ విధంగా ఉంది ? ఏనుగంటే మనకి ఒక జంతువు కాదు. అంతకంటే ఎక్కువే. గణనాథుడి మారురూపంగా గజరాజుల్ని పూజిస్తాం.. ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు మంచినీళ్లు తాగింది ఏనుగూ అంటూ ఏనుగు మనకెంత ముఖ్యమైనదో చిన్నప్పట్నుంచి ఉగ్గుపాలతో నేర్పిస్తాం. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏనుగుని చూడడమంటే అదొక సంభ్రమం. కానీ ఏనుగుల్ని కాపాడుకోవడంలో మనం అంతగా శ్రద్ధ కనబరచడం లేదనే చెప్పాలి. ఏనుగు దంతాల కోసం వాటిని వేటాడడం, ఏనుగుల ఆవాసాలైనా కారిడార్లను ఆక్రమించుకోవడం, ఏనుగుల కారిడార్లలోనే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం వంటి చర్యలతో ఏనుగుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. సంరక్షణకి ఏం చేస్తున్నాం ? జీవవైవిధ్యానికి అత్యంత కీలకమైన ఏనుగుల్ని కాపాడుకోవడానికి 1992లో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ రిజర్వ్ ప్రాజెక్టు 30 ఏళ్లవుతున్నప్పటికీ అతీగతీ లేకుండా ఉంది. ఏనుగుల్ని కాపాడుకోవడానికి మనకి ప్రత్యేకంగా చట్టాలేమీ లేవు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం పరిధిలోకే ఏనుగులూ వస్తాయి. దీంతో ఏనుగులు ఆవాసం ఉండే కారిడార్లు, వాటి సంరక్షణకు ఏర్పాటు చేసిన రిజర్వ్‌ల నిర్వహణలన్నీ తూతూ మంత్రంగా జరిపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఏనుగులెంత కీలకమో గ్రహించిన కేంద్రం 2010లో ఏనుగుని జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించింది. ఏనుగుల సంరక్షణ విధానాలను సమీక్షించడానికి ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ (ఈటీఎఫ్)ని ఏర్పాటు చేసింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని మార్చాలని, ఏనుగుల సంరక్షణ కోసం జాతీయ ఏనుగుల పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అయితే నిధుల కొరతతో ఆ చర్యలేవీ కేంద్రం తీసుకోలేదు. ప్రతీ ఏడాది ఏనుగుల సంరక్షణ కోసం రూ.30–35 కోట్ల నిధుల్ని మాత్రమే కేటాయిస్తున్నారు. 2020లో వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో ఏనుగుల రిజర్వ్‌లను చేరుస్తూ సవరణలు చేశారు. 2022, ఆగస్టు 2న సవరణ బిల్లుని లోక్‌సభ ఆమోదించింది. అంతకు మించి ఏనుగుల రక్షణకు ప్రత్యేకంగా చర్యలేవీ తీసుకోలేదు.. ఏనుగులు, మనుషులకి మధ్య ఘర్షణ ఏనుగులకి, మనుషులకి మధ్య నిత్యం ఒక ఘర్షణ నెలకొని ఉంటుంది. మనిషి ఎప్పుడైతే అడవుల్ని కూడా ఆక్రమించడం మొదలుపెట్టాడో ఏనుగులు గుంపులు గుంపులుగా పంట పొలాలపైకి పడడం, రైతుల్ని తమ కాళ్ల కింద పడి తొక్కేసి ప్రాణాలు తీయడం వంటివి చేస్తున్నాయి. దీంతో రైతులు ఏనుగుల బారి నుంచి పంటల్ని కాపాడడానికి విద్యుత్ కంచెలు , కందకాలు ఏర్పాటు వంటివి చేయడంతో అవి చనిపోతున్నాయి. ఇక ఏనుగు దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఉండడంతో వాటిని అక్రమంగా వేటాడుతున్న వారూ ఉన్నారు. ఏనుగుల కారిడార్లలో రైల్వే ట్రాక్‌లు ఉండడంతో అవి బలైపోతున్నాయి. 1987–2017 మధ్య కాలంలో రైల్వే ట్రాక్‌ల కింద పడి 265 ఏనుగులు మరణించాయి. ఏనుగులు జరిపే దాడుల్లో ఏడాదికి సగటున 500మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ప్రజల చేతుల్లో ఏడాదికి సగటున 100 గజరాజులు మరణిస్తున్నాయి. ఏనుగుల్ని మరింత సంరక్షించాలంటే, అవి ప్రజలు, పంట పొలాల జోలికి రాకుండా ఉండాలంటే ఏనుగులుండే కారిడార్లను పటిష్ట పరచాల్సి ఉంది. దేశంలో 110 ఏనుగు కారిడార్లు ఉన్నప్పటికీ 70% మాత్రమే వినియోగంలో ఉన్నాయి. 29% కారిడార్లు ఆక్రమణకి లోనయ్యాయి. 66% కారిడార్లలో జాతీయ రహదారుల వెంబడి వెళుతున్నాయి. 22 కారిడార్లలో రైల్వే లైన్లు ఉన్నాయి. ఏనుగుల తినే తిండి ఎక్కువ కావడంతో అవి ప్రతీ రోజూ చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. అవి సంచరించే మార్గాల్లో జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లు, మైనింగ్ తవ్వకాలు, కాలువలు, ఫెన్సింగ్‌లు ఉండడం వాటికి దుర్భరంగా మారింది. రైళ్లు, వాహనాల కింద పడి ప్రమాదవశాత్తూ మరణిస్తున్నాయి. అందుకే ఏనుగులు సంచరించే కారిడార్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారుల్లో ఏనుగుల సంచారం కోసమే ప్రత్యేకంగా వంతెనలు నిర్మించడం విశేషంగా చెప్పుకోవాలి - సాక్షి, నేషనల్ డెస్క్ -
లోకం మెచ్చిన దర్శకుడు
ఫిల్మ్ మేకర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు కోల్‌కతాకు చెందిన శౌనక్ సేన్.అతడి ఫీచర్–లెంగ్త్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ మన ఫ్యూచర్ గురించి మౌనంగానే ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది.జీవజాలంపై కాస్త కరుణ చూపమని చెప్పకనే చెబుతోంది... దిల్లీలోని ఏజెకె మాస్ కమ్యూనికేషన్ రిసెర్చ్ సెంటర్ నుంచి మాస్ కమ్యూనికేషన్లో పట్టా పుచ్చుకున్న శౌనక్సేన్ జెఎన్‌యూలోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్థెటిక్స్లో పీహెచ్డీ చేశాడు. ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా డాక్యుమెంటరీ ఫెలోషిప్, డిజిటల్ అండ్ సోషల్ మీడియా ఫెలోషిప్‌కు ఎంపిక కావడం, కేంబ్రిడ్జి యూనివర్శిటీ అర్బన్ ఎకోలజీస్ ప్రాజెక్ట్‌లో విజిటింగ్ స్కాలర్‌గా భాగం కావడం తన ప్రపంచాన్ని విస్తృతం చేసింది. సేన్‌లోని కళకు సామాజిక స్పృహ తోడైంది.తొలి డాక్యుమెంటరీ ‘సిటీస్ ఆఫ్ స్లీప్’కు పెద్ద పేరే వచ్చింది. ఈ డాక్యుమెంటరీకి ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా ఫండింగ్ చేసింది. ఇది న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్‌ఫెస్టివల్, తైవాన్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫెస్టివల్, ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇరవై చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రత్యేక ప్రశంసలు పొందింది. ఆరు అవార్డ్లు అందుకుంది. సేన్ రెండో ఫీచర్ లెంగ్త్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతూనే ఉంది.వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్(సన్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, యూఎస్) గెలుచుకుంది. ‘హాస్యం, వ్యంగ్యం మేళవించి పర్యావరణ విధ్వంసాన్ని కళ్లకు కట్టిన చిత్రం’ అని జ్యూరీ సభ్యులు ప్రశంసించారు. ఈ డాక్యుమెంటరీ మరో ప్రసిద్ధ అవార్డ్ గోల్డెన్ ఐ (కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్) గెలుచుకుంది. ‘ఆల్ దట్ బ్రీత్స్’కు సంబంధించిన ప్రపంచవ్యాప్త హక్కులను అమెరికన్ టెలివిజన్ నెట్వర్క్ హెచ్‌బీవో తీసుకుంది.ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన మరో ఘనత ఆస్కార్ ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’కు నామినేట్ కావడం.మనుషుల కార్యకలాపాల వల్ల జీవజాలం స్థితిగతుల్లో వస్తున్న మార్పుకు ఈ చిత్రం అద్దం పడుతుంది. ‘ఎక్కడ పడితే అక్కడ పక్షులు చచ్చిపోయి కనిపిస్తుంటాయి. అయ్యో! అని మనకు అనిపించదు. మన దారిన మనం వెళుతూనే ఉంటాం. రోజువారి పనుల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే ఉంటాం. క్షణం కూడా వాటి గురించి ఆలోచించం. ఇది ఎంత ఆశ్చర్యం, ఎంత విషాదం!’ అంటుంది ఈ చిత్రంలో ఒక పాత్ర. జీవజాలానికి సంబంధించి మనుషులలోని స్పందనారాహిత్యాన్ని, మొద్దుబారినతనాన్ని దుమ్ము దులుపుతుంది ఆల్ దట్ బ్రీత్స్. మనుషులలోని స్పందనారాహిత్యం గురించి ‘చీమ కుట్టినట్లైనా లేదు’ అంటారు. ‘ఆల్ దట్ బ్రీత్స్’ చీమ నుంచి పిచ్చుక వరకు సమస్త జీవజాలం గురించి ఆలోచించమని చెబుతుంది.‘నేను మాత్రమే..అనే స్వార్థం ఉంటే నువ్వు కూడా మిగలవు’ అనే మార్మిక సందేశాన్ని ఇస్తుంది. ‘యాంత్రికంగా నేచర్–వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీ తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలు ఎన్ని మంచి పనులు చేస్తున్నారో తెలుసా!లాంటి స్వీట్ ఫిల్మ్ తీయాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. మనం వేగంగా పరుగులు తీస్తున్నాం. ఆ పరుగు కొన్ని నిమిషాల పాటు అయినా ఆపి చుట్టు ఏం జరుగుతుందో అలోచించాలి. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వ విధానాలకు సంబంధించిన విషయం కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటున్నాడు సేన్. సేన్ ఇష్టాల గురించి చెప్పాలంటే...సామాజిక పరిస్థితుల గురించి లోతుగా తెలుసుకోవడం అంటే ఇష్టం. సృజనాత్మకత నిండిన సినిమాలు చూడడం అంటే ఇష్టం. సామాజిక అంశాలకు, సృజనాత్మకత జోడించి తనదైన శైలిలో సరికొత్త చిత్రాన్ని ఆవిష్కరించడం అంటే మహా ఇష్టం. -
న్యాయం కోసం రణం
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, బాధితుల న్యాయపోరాటం, పోరాటం చేసే క్రమంలో పడుతున్న కష్టాలు... అయినప్పటికీ వెనకడుగు వేయని పట్టుదలకు ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ అద్దం పడుతుంది. ఝార్ఖండ్‌లోని ఒక గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా నిషా పహుజా తీసిన ఈ చిత్రం టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచిపామ్ స్ప్రింగ్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2023) వరకు ‘బెస్ట్ డాక్యుమెంటరీ’గా ప్రశంసలు అందుకుంటూనే ఉంది... పదమూడు సంవత్సరాల తన కూతురిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు రంజిత్ అనే రైతు. పోలీసుల స్పందన అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇక చుట్టాలు, పక్కాలు, గ్రామస్థుల విషయానికి వస్తే...‘జరిగిందేదో జరిగింది. పోయేది మీ కుటుంబ పరువే. కేసు వెనక్కి తీసుకోండి’‘మీ సంగతి ఏమిటోగానీ మన కులం పరువు పోయేట్లు ఉంది. కేసు వెనక్కి తీసుకోండి’‘మన జాగ్రత్తలో మనం ఉండకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతాయి. వారిని మనం ఏం చేయలేము. కేసు వెనక్కి తీసుకోండి’ఎవరు ఎలా స్పందించినా, ఆ స్పందనలో చివర గట్టిగా వినిపించే మాట... కేసు వెనక్కి తీసుకోండి. అయితే రంజిత్ వీరి ఉచిత సలహాలను పట్టించుకోలేదు. పోరాటదారిని వదలలేదు. ఈలోపు బెదిరింపులు పెరిగాయి. ‘కేసు ఉపసంహరించుకుంటావా లేదా?’ అని గ్రామస్థులనుంచి ఒత్తిడి పెరిగింది. రంజిత్ చేస్తున్న న్యాయపోరాటానికి శ్రీజన ఫౌండేషన్ అండగా నిలిచింది. మహిళల హక్కుల గురించి పనిచేస్తున్న స్వచ్ఛందసంస్థ ఇది. స్థూలంగా చెప్పాలంటే ‘టు కిల్ ఏ టైగర్’ అనే డాక్యుమెంటరీ కథ ఇది.అయితే ఇది కాల్పనిక కథ కాదు.ఝార్ఖండ్‌లోని బెరో జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల సమాహారం.డైరెక్టర్, రైటర్ నిషా పహుజా ‘టు కిల్ ఏ టైగర్’ రూపకర్త.కెనడియన్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపుపొందిన నిషా దిల్లీలో పుట్టింది. కెనడాలోని టోరంటోలో పెరిగింది. చిన్నవయసులోనే తల్లిదండ్రులతోపాటు కెనడాకు వెళ్లిన నిషా తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. బాలీవుడ్ సినిమాలు చూస్తూనే పెరిగింది.‘యూనివర్శిటీ ఆఫ్ టోరంటో’లో ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుకున్న నిషా రకరకాల సామాజిక ఉద్యమాల్లోపాల్గొంటోంది. డాక్యుమెంటరీ రీసెర్చర్‌గా పేరు తెచ్చుకుంది.కాలేజీ రోజుల నుంచే నిషాకు రచన, దర్శకత్వం అనేవి ఇష్టమైన సబ్జెక్ట్‌లు. కెరీర్ ప్రారంభంలో రీసెర్చర్‌గా కెనడియన్ ఫిల్మ్‌మేకర్స్ జాన్ వాకర్, అల్ కజిమ్లతో కలిసి పనిచేసిన నిషా చిత్ర నిర్మాణంపై కొంత అవగాహన, అనుభవం వచ్చాక డైరెక్టర్‌గా అడుగులు వేసింది. తక్కువ కాలంలో డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. కమర్షియల్ డైరెక్టర్‌గా రాణించాలనేది ఆమె కల కాదు. వాస్తవ సంఘటనలనే చిత్రాలుగా తీయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ‘చిత్రం ఎంత వాస్తవికంగా ఉంటే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవుతారు’ అంటుంది నిషా. 2012లో వచ్చిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ ఆమెలో రచన, దర్శకప్రతిభను ప్రపంచం దృష్టికి వచ్చేలా చేసింది. భారతీయ సమాజానికి చెందిన అమ్మాయిల జీవితంలో సంక్లిష్టతలు, వైరుధ్యాలను ఆధారంగా చేసుకొని తీసిన ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదం కావడంతోపాటు ఎంతో చర్చను రేకెత్తించింది. ఇక ‘టు కిల్ ఏ టైగర్’ విషయానికి వస్తే మొదట ఈ చిత్రాన్ని తీయాలనుకోలేదు నిషా. ఝార్ఖండ్‌లోని ఒక స్వచ్ఛందసంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి చిత్రం చేయాలని రంగంలోకి దిగినప్పుడు 13 సంవత్సరాల అమ్మాయి అత్యాచారానికి గురైన సంఘటన గురించి విన్నది. బాధితురాలు, ఆమె తండ్రితో మాట్లాడింది. మొదట తాను తీస్తున్న చిత్రంలో భాగంగానే బాధితురాలి గురించి చెప్పా లనుకుంది. అయితే ఆ తరువాత మాత్రం ఈ సంఘటననే చిత్రంగా తీయాలని నిర్ణయించుకుంది. టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్ నుంచి (హాట్ డాక్స్) కెనడియన్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫెస్టివల్ వరకు ఎక్కడో ఒకచోట ‘టు కిల్ ఏ టైగర్’ గురించి ప్రస్తావన, ప్రశంస వినిపిస్తూనే ఉంది. ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తూనే ఉంది. -
పాలనా రథానికి ప్రజలే రక్ష!
భారతీయులు 140 కోట్ల మంది తనకు రక్షా కవచంగా ఉన్నారని ప్రధాని అన్నారు. మరి అలాంటప్పుడు ఒక డాక్యుమెంటరీని ఎందుకు అంతగా ప్రభుత్వం వ్యతిరేకించింది? భారత సమాజ పరిస్థితులు, ప్రభుత్వ చర్యల గురించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగోరే భారతీయుల హక్కుల్ని ఇది కాలరాయడం కాదా? ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం కష్టసాధ్యమని నమ్మిన నాయకులున్నారు. కానీ జాతీయోద్యమ నాయకుడైన మహావీర్ త్యాగి ప్రజలు భాగస్వాములు కాని అధికారాలు ప్రభుత్వాలకు ఉండటానికి వీల్లేదని వాదించారు. ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాచే పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాల్ని కూలద్రోసే హక్కును ప్రజలకు దఖలు పరచాలన్నారు. ‘‘నా ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను దేశ ప్రజలు నమ్మ బోరు. 140 కోట్లమంది భారతీయులూ నాకు రక్షణగా, సురక్షితమైన కవచంగా ఉన్నారు.’’ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (8 ఫిబ్రవరి 2023) గుజరాత్లో 2002లో మైనారిటీలపై జరిగిన మూకుమ్మడి హత్యా కాండ గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక ప్రకటన చేస్తూ– గుజరాత్ ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడటంలో గుజరాత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనీ, ఆ తర్వాత వారాల తరబడి సాగిన హింసాకాండను అదుపు చేయలేక పోయిందనీ నిశితంగా విమర్శించింది. అంతేగాదు, గత 20 సంవత్సరాలుగానూ దేశవ్యాప్తంగా వివిధ బాధ్యతాయుత సంస్థల ప్రతినిధులు, మానవ హక్కుల నాయకులు ఈ విపరిణామాన్ని ఖండిస్తూ వచ్చారు. అయినా 2002 నాటి గుజరాత్ హింసాకాండను ప్రోత్సహించిన బాధ్యు లెవరిపైనా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదు. గుజరాత్ ఊచ కోతలపై ‘ఇండియా – ది మోదీ క్వశ్చన్’ మకుటం కింద ఒక డాక్యు మెంటరీని ‘బీబీసీ’ విడుదల చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీ ‘భారతదేశ సార్వభౌమాధికారాన్ని, నిజాయితీని అవమాన పరుస్తోం’దన్న పేరిట సామాజిక మాధ్యమాలన్నిటి నుంచి ప్రభుత్వం తొలగించింది. భారత సమాజ పరిస్థితుల గురించి, ప్రభుత్వ చర్యల గురించి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోగోరే భారతీయుల హక్కుల్ని కాలరాయడం పట్ల శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తదితర విద్వత్ సంపన్నులు 500 మందికి పైగా విస్మయం వ్యక్తం చేశారు. పరిణామాలకు అద్దం నిజానికి ‘బీబీసీ’ డాక్యుమెంటరీ వచ్చింది గుజరాత్ మారణకాండ అనంతరం 20 సంవత్సరాలకు. అంతకుముందే 2010 నాటికే రాణా అయూబ్ ‘గుజరాత్ ఫైల్స్’ పేరిట గుజరాత్ బీజేపీ పాలకవర్గ ‘మాలోకా’న్ని ప్రత్యక్షరబద్ధంగా నమోదు చేసింది. ఈ గ్రంథానికి ఉపోద్ఘాతం రాసింది మరెవరో కాదు, సాక్షాత్తూ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ. ‘ఈశావాప్యోపనిషత్’లో కళ్లు తెరిపించే ఒక సూక్తి ఉంది: ‘‘నిజం అనే ముఖాన్ని కనపడనివ్వకుండా ఓ బంగారు కుండీలో దాచి ఉంచుతారు. అసలా జలతారు కుండీలో దాగిన నిజమేమిటి?’’ అలాగే నిజమనేది కట్టుకథకు అందని వాస్తవం! అలాంటి ‘గుజరాత్ వాస్తవాల’ను రాణా అయూబ్ సాహసంతో బహిర్గతం చేసిందని శ్రీకృష్ణ కితాబిచ్చారు. ‘అయూబ్ రచన పరి శోధనాత్మక పాత్రికేయ విధి నిర్వహణలో ఒక సాహస యాత్ర. పాలనా రంగంలో నానాటికీ పెరిగిపోతున్న నిజాయితీకి పాతరేసి, దొంగచాటు రాజకీయ కుట్రలకు మార్గం తీస్తున్న పరిణామాలకు ప్రత్యక్ష సాక్ష్యం’ అని పేర్కొన్నారు. రాజ్యాంగ రచనా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అంబేడ్కర్, భారత ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైనందున అధికార దుర్వినియోగానికి పాల్పడటం కష్టసాధ్యమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంబేడ్కర్ అభిప్రాయంతో జాతీయోద్యమ నాయకుల్లో ఒకరైన మహావీర్ త్యాగి(1899–1980) విభేదిస్తూ, అంబేడ్కర్ లాగా ఇలాంటి అభిప్రాయాలు కల నాయకులెవరైనా ఉంటే వారు అలాంటి ప్రకటనలు చేయబోయేముందు కొన్నాళ్లు జైలులో ఉండొస్తే మంచిదని వ్యంగ్యంగా సలహా ఇచ్చారు! ఆ పిమ్మట త్యాగి, రాజ్యాంగ రచన ముసాయిదా సంఘానికి సవాలుగా ఒక ప్రతిపాదన చేస్తూ, ప్రజలకు ఆమోదించిన ప్రాథమిక హక్కుల్ని ముందుముందు ఏర్పడబోయే ప్రభుత్వాలు కాలరాచే పరిస్థితుల్లో అలాంటి ప్రభుత్వాల్ని కూలద్రోసే లేదా మార్చేసే హక్కును ప్రజలకు దఖలు పరిచే అంశాన్ని చర్చించారా లేదా అని ప్రశ్నించారు. ప్రజలకున్న అలాంటి సహజమైన హక్కుకు మీరు గ్యారంటీ ఇవ్వలేదని త్యాగి విమర్శిస్తూ ప్రభుత్వ హక్కులతోపాటు ప్రజల హక్కుల్ని గురించి కూడా ఆలోచించా లన్నారు. ప్రజలు భాగస్వాములు కాని అధికారాలు ప్రభుత్వాలకు ఉండటానికి వీల్లేదని త్యాగి వాదించారు. అందుకు పూర్తిగా సమ్మ తిస్తూ డాక్టర్ అంబేడ్కర్, ఉత్తరోత్తరా ప్రివెంటివ్ డిటెన్షన్ (ముందస్తు ఊహపై ఆధారపడి) పైన వ్యక్తుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టే స్వేచ్ఛను భావిప్రభుత్వాలకు అనుమతించే ప్రసక్తి ఉండరాదని పలుమార్లు స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్రం తర్వాత ప్రజాస్వామ్యం, ఎన్నికల మాటున ‘ఓటు’ ఎరలోనూ షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తరగతులకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. పైగా ఎన్నికల పేరిట సంపన్న వర్గాలు, కుల, మత, రాజకీయ పక్షాలూ చేసిందీ, చేస్తున్నదీ – అన్ని కులా లలోని పేదలు, అణగారిన ప్రజలు చైతన్యం పొందకుండా జాగ్రత్త పడటం మాత్రమే. అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగ ప్రతిని వెలుగు చూడకుండా రాజ్యాంగ రచనా సంఘంలోని కొందరు సభ్యులు విశ్వ ప్రయత్నం చేశారు. అడ్డదారులలో ఎన్నికల పేరిట కుల, మత సంపన్న వర్గాల సభ్యులు హెచ్చుమంది ఎలా అనతికాలంలోనే ‘కుబేర సంతానం’గా మారి భారతదేశ ఆర్థిక వ్యవస్థనే, తారుమారు చేయడానికి వెనుదీయడం లేదో ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. రాజ్యం కార్పొరేట్ ఎస్టేట్ వ్యాపారంగా ఎలా మారిపోయిందో రుజువై పోయింది. స్వతంత్రంగా వ్యవహరించాలి 1951 మేలోనే కేంద్ర, రాష్ట్ర శాసన వేదికల్లోకి ప్రవేశించడానికి ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలో ‘ప్రజా ప్రాతినిధ్య బిల్లు’ను అంబేడ్కర్ ప్రవేశపెడుతూ అవసరమైన సవరణలను కూడా ప్రతి పాదించారు. వాటిలో ప్రధానమైనవి – పార్లమెంట్, ఎన్నికల చట్టం పార్లమెంట్ సభ్యుల స్వేచ్ఛను ప్రభుత్వ స్వేచ్ఛను భిన్నమైనవిగా భావించాలి. మొత్తం పార్లమెంట్‌ను అవినీతికి ‘పెద్ద బిడ్డ’గా మార్చ కుండా ఉండే విధంగా సభనూ, ఎన్నికల చట్టాన్నీ రూపొందించాలి. పార్లమెంట్ సభ్యులకు రాజకీయ పదవులను కట్టబెట్టడం ద్వారా లేదా ఇతర ప్రలోభాలకు లోను చేయడం ద్వారా మొత్తం పార్లమెంట్‌ను లేదా శాసన వేదికలను అవినీతిపాలు చేసేలా ప్రభుత్వానికి అవకాశం కల్పించకూడదు. దానికి తగిన విధంగా మన శాసన వేదికలు, పార్ల మెంట్, ఎన్నికల చట్టమూ ఉండాలని అంబేడ్కర్ అభిలషించారు. పార్లమెంట్ లేదా శాసన వేదిక అనేది నిర్భీతిగా, ప్రభుత్వం నుంచి ఏ ప్రలోభాన్ని ఆశించకుండా స్వతంత్రంగా వ్యవహరించలేని నాడు అలాంటి శాసన వేదికలు నిష్ప్రయోజనకరం. శాసన వేదికలు ప్రభు త్వాలు చెప్పే మాటలకు డూడూ బసనన్నలుగా, నట, గాయక వందిమాగధులుగా వ్యవహరించరాదని కూడా అంబేడ్కర్ (1951 మే 9) నిర్మొహమాటంగా పేర్కొన్నారని మరచి పోరాదు. పార్లమెంట్ ఒక స్టాక్ ఎక్స్ఛేంజీగా (వ్యాపార లావాదేవీల కేంద్రం) ఇప్పటికే (1951 నాటికే) మారిపోయిందని పండిట్ లక్ష్మీకాంత మైత్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంప్రదాయానికి 75 ఏళ్లకు కూడా ‘కళ్లెం’ వేయడానికి పాలకులకు ఇష్టం లేదు. దీనివల్ల పాలకులు ప్రయోజనం పొందడం సహజం. కనుకనే న్యాయ వ్యవస్థ తన జడత్వాన్ని క్రమంగా వదిలించుకుని చైతన్యావస్థలోకి వచ్చి కఠినమైన నిర్ణయాలు తీసుకోగల సత్తాను సంతరించుకుంటోంది. అందుకే కవి కుమారుడు ఎంతటి కమ్మని సూక్తిని విడిచి వెళ్లాడో గదా – ‘‘బలవంతపు రాజ్యకాంక్షా ఒక పాపము జూచునే ఈశ్వరా?’’! తన ‘బీదతనం’ దేశ దారిద్య్రమనీ, తన మరణం లోక ప్రళయమనీ భావించి సంచరించే అహంకారుల గురించి సుమతీ శతకకారుడు హెచ్చరించలేదూ?! abkprasad2006@yahoo.co.in -
డాక్యుమెంటరీపై మాటల సెల్ఫ్ గోల్
గుజరాత్లో 2002లో జరిగిన హింసపై ‘బీబీసీ’ నిర్మించిన తాజా డాక్యుమెంటరీని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఖండించారు. తాను దాన్ని చూడలేదని పేర్కొంటూనే, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా, తప్పుడు వాదనతో, ప్రచార యావతో తీసిన డాక్యుమెంటరీగా దాన్ని ప్రకటించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ, హోమ్ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి పలు మంత్రిత్వ శాఖలు, సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు... బీబీసీ తాజా డాక్యుమెంటరీపై కనీసపాటి ఆలోచన కూడా లేకుండా తీవ్ర ధోరణిలో మాట్లాడారు. భారతదేశ సార్వభౌమత్వాన్నీ, సమగ్రతనూ ఆ డాక్యుమెంటరీతో కించపర్చారంటూ వారు ఆరోపించారు. భారతదేశంలో అసలు ప్రసారమే చేయని ఒక డాక్యుమెంటరీ చిత్రం మన దేశాన్ని ఆ స్థాయిలో ముక్కలు ముక్కలు చేస్తుందా? వారు వ్యక్తం చేసిన ఆందోళన బీబీసీ పైనా, దాని డాక్యుమెంటరీ పైనా కాదు. మన దేశ మనుగడ పైనే వారు కలవరం వ్యక్తపరిచినట్టుగా తయారైంది. తప్పుగా మాట్లాడటం ద్వారా వారు తమ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఈ విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచించేకొద్దీ, నిజానికి సమస్య మనలోనే ఉందని చెబు తాను. సాధారణంగా రాజకీయ నాయకుల వద్ద ప్రతి సమస్యకూ పరిష్కారం ఉండాలనీ, ప్రతి సమ స్యపై వారు వ్యాఖ్యానించాలనీ, ప్రతి వ్యక్తికి సంబంధించి అర్థవంతమైన, కచ్చితమైన అభిప్రా యాన్ని కూడా కలిగి ఉండాలనీ, అన్ని పరిస్థితు లనూ వారు అర్థం చేసుకోవాలనీ మనం భావిస్తుంటాం. కాని వారు అలా చేయలేరు. అది వారికి సాధ్యం కూడా కాదు. అలాగని తాము దేన్నయినా సరే... చేయగలమని వారు నటించినట్లయితే దానిని మనం వారిని అగౌరవించాల్సిన పని లేదు. సూటిగా చెప్పాలంటే, రాజకీయ నాయకులు వారి పట్ల మనకు ఉందనుకుంటున్న గౌరవాన్ని కోల్పో వలసిన అవసరం లేదు. అయితే వారు గుర్తించనిది ఏమిటంటే, మన అంచనాలు వారికి ఒక ఉచ్చు లాంటివి. ఆ సంగతి వారు స్పష్టంగా గ్రహిస్తూనే, గర్విస్తూనే మనం ఏర్పరచిన ఉచ్చులో చిక్కుకుంటూ ఉంటారు. ఇవాళ ఆలోచనాత్మకమైన, మేధాసహితమైన స్పందనల కంటే ఆకట్టుకునేలా అభిప్రాయాలు వెల్లడించడమే ఎక్కువ అవసరమని రాజకీయ నాయకులు భావించే దశకు మనం చేరుకున్నాం. ఎందుకంటే, వీటిలో ఆకర్షణీయమైన స్పందనే పతాక శీర్షికలకు ఎక్కుతుంది. అది వారికి ప్రచా రాన్ని కల్పిస్తుంది. మరోవైపున ఆలోచనతో కూడిన స్పందన మరింత అర్థవంతంగానూ, సహాయకారి గానూ ఉండవచ్చు కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి కాస్త ఏకాగ్రత అవసరమవుతుంది. కాబట్టి పునః పరిశీలనకు అది పిలుపునిస్తుంది. పైగా ఆకర్షణీయ మైన స్పందనకు సరిసమానమైన ప్రభావాన్ని మేధాసహితమైన స్పందన కలిగించనే కలిగించదు. ‘షారుఖ్ ఖాన్ ఎవరు? అతడి గురించి నాకేమీ తెలీదు’ అని అస్సామ్ ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ఇటీవల చేసిన ప్రకటన దీనికి అత్యుత్తమ మైన ఉదాహరణ అని నేను చెబుతాను. గౌహతిలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆయన చేసిన ఈ వ్యాఖ్య అత్యంత వివాదాస్పద మైంది. అంతేకాదు. ఆయన మాటల్లో అసలు నిజం లేదు. ఒకవేళ ఆయన వ్యాఖ్య గనక నిజమే అయితే... మన దేశంలోని ప్రజల గురించి ఏ మాత్రం తెలియని స్థితిలో సదరు అస్సామ్ ముఖ్య మంత్రి ఉన్నారని చెప్పక తప్పదు. నిజానికి ఆయన చేసిన ఆ ప్రకటన అమితాబ్ బచ్చన్ స్వయంగా ‘నరేంద్ర మోదీ ఎవరు? ఆయన గురించి నాకేమీ తెలీదు’ అని చెప్పినట్టు ఉంది. ప్రముఖ హిందీ సినీ కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఎవరో తెలియని భారతీయులు ఎవరైనా ఉంటారా అని నాకు సందేహం. అలాగే, భారతీయ జనతా పార్టీ నేత – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి కూడా తెలియనివారు ఉన్నారంటే కూడా సందేహించాల్సి ఉంటుంది. అందుకనే అస్సామ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యను జనం దృష్టిని ఆకర్షించడానికి, జనం తమను ఏదో ఒకలా గుర్తుంచుకునేలా చేసే తప్పుడు ప్రయత్నంగానే చూడాల్సి ఉంటుంది. ఈ ఉదంతంలో అన్నీ తప్పుడు అంశాలే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. విషాదం ఏమిటంటే, కనీసపాటి ఆలోచన కూడా లేకుండా షారుఖ్ ఖాన్ గురించి అలా మాట్లాడటం వల్ల అస్సామ్ ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ దేశవ్యాప్తంగా మూర్ఖుడిగా మారిపోయారు. 2002 నాటి గుజరాత్ హింసపై బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రూపొందించిన డాక్యుమెంటరీని విమర్శించి, ఖండించాలన్న ఉద్దేశంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి కూడా దాదాపు ఇలాంటి పనే చేశారు. ఆ డాక్యుమెంటరీని తాను చూడలేదని ఒప్పుకుంటూనే, నిర్దిష్టంగా ఒక తప్పుడు వాదనను జనంలోకి తీసుకుపోవడానికి, ప్రచారమే పరమావధిగా తీసిన డాక్యుమెంటరీగా దాన్ని ప్రకటించారు. పైగా అది పక్షపాతంతో కూడుకున్నదనీ, దాంట్లో నిష్పా క్షికత లోపించిందనీ నిందించారు. అయితే బీబీసీ తాజా డాక్యుమెంటరీని చూడ నప్పుడు దాంట్లోని విషయాలను ఆయన ఎలా ప్రస్తావించారు? అది కూడా తానొక అధికారిక ప్రతి నిధి అయ్యుండి, తాను చూడని విషయంపై ఎలా వ్యాఖ్యానించారు అనే ప్రశ్న వస్తుంది. అయితే తాను దేని గురించి మాట్లాడుతున్నదీ తనకు స్పష్టంగా తెలుసన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు, వర్ణనలు ఉన్నాయి. అధికారిక ప్రతినిధి చేసే ప్రక టన సాధికారికంగా ఉంటుందనీ, విశ్వసించదగిన దనీ ఎవరైనా భావిస్తారు. వాళ్ళూ వీళ్ళూ చెబుతుంటే విని చెబుతున్నట్టుగా, వేరెవరి అభిప్రాయాలో మళ్లీ ప్రస్తావించినట్టుగా ఉంటాయనీ, ఉండాలనీ ఎవరూ అనుకోరు. కానీ ఆయన తాజా వ్యాఖ్య లన్నీ అచ్చంగా అలాగే ఉన్నాయని గ్రహించాలి. భారత విదేశీ వ్యవహారాల శాఖ, హోమ్ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి పలు మంత్రిత్వ శాఖలకూ, సంస్థలకూ చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ అధికారులు దాదాపుగా దేశంలోని అన్ని పత్రికలతో మాట్లాడారు. బీబీసీ తాజా డాక్యుమెంటరీపై తమ వాదనను బలంగా వినిపించడం కోసం కనీసపాటి ఆలోచన అయినా కూడా లేకుండా వారు తీవ్ర ధోరణితో మాట్లాడారు. ఆ తొందరలో చివరకు భారతదేశం గురించి ఇబ్బందికరమైన ప్రశ్నలు పొడసూపేలా చేశారు. ఆ డాక్యుమెంటరీలో భారత సార్వభౌమత్వాన్నీ, సమ గ్రతనూ కించపర్చారంటూ వారు ఆరోపించారు. నిజమా? నిజంగానే అలా జరిగిందా? ఇంతకూ వారు గుర్తించని విషయం ఒకటి ఉంది. అది ఏమిటంటే – తాము ఏం మాట్లాడు తున్నాం అనే విషయం గురించి వారు కనీసం ఒక్కసారి కూడా ఆగి, నింపాదిగా ఆలోచించలే పోయారు. భారతదేశంలో అసలు ప్రసారమే చేయని ఒక డాక్యుమెంటరీ చిత్రం మన దేశాన్ని ఆ స్థాయిలో ముక్కలు ముక్కలు చేస్తుందా? పైగా యూట్యూబ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్రచార, ప్రసార వేదికలను వాడేవారు మన జనాభాలో అతి తక్కువమంది అని తప్పక గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఆ కొద్దిమంది ఆ డాక్యుమెంటరీ చూసినంత మాత్రాన మన జాతీయ చట్రమే కదిలి పోతుందా? విచ్ఛిన్నమవుతుందా? చివరకు వచ్చేసరికి వారు వ్యక్తం చేసిన ఆందోళన అంతా బీబీసీ పైనా, దాని డాక్యుమెంటరీ పైనా కాదు. మన దేశంలోని పరిస్థితి పైనా, దేశ మనుగడకు సంబంధించిన అంశం పైనే వారు కలవరం వ్యక్తపరిచినట్టు అయింది. అలా వారు దాన్ని గురించి తప్పుగా మాట్లాడటం ద్వారా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అయింది. ఇప్పుడు మన ప్రియమైన ముఖ్యమంత్రి, మన అధికార ప్రతినిధి, అలాగే నిగూఢమైన మన ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ విషయంపై భయకంపిత స్వరంతో మాట్లాడి ఉన్నట్లయితే నేను దానికి ఏమాత్రం భయపడను. బదులుగా ముసి ముసిగా నవ్వుకునేవాడిని. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆయనకు మనం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నామేమోనని అనిపిస్తోంది!
ఆయనకు మనం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నామేమోనని అనిపిస్తోంది! -
‘జామియా’లో డాక్యుమెంటరీ కలకలం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థి సంఘం నాయకులు ఏర్పాట్లు చేయడం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటలో కలకలం రేపింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నేతలు ప్రకటించారు. దీంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంటరీ ఎందుకొచ్చింది? తిరువనంతపురం: బీబీసీ డాక్యుమెంటరీని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తప్పుబట్టారు. ‘జీ20 కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఇదే సమయానికి బీబీసీ డాక్యుమెంటరీ తేవడం ఏంటి?’ అని ప్రశ్నించారు.