Ducati
-
2025లో లాంచ్.. ఇప్పుడే సిద్దమైన డుకాటీ
ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ' సరికొత్త మల్టిస్ట్రాడా వీ2, వీ2 ఎస్ బైకులను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ బైకులను వచ్చే ఏడాది (2025) లాంచ్ చేయనున్నట్లు సమాచారం.2025లో లాంచ్ కానున్న కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ2 బైక్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా 18 కేజీల తక్కువ బరువుతో ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 19 లీటర్లు. ఇందులోని 890 సీసీ ఇంజిన్ 115.6 హార్స్ పవర్, 92.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్ అండ్ బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది.కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా డిజైన్, ఫీచర్స్ వంటివన్నీ రెండింటిలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఎస్ వేరియంట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యూనిట్. ఈ బైక్ ముందు భాగంలో 120/70-ఆర్19 టైర్, వెనుక 170/60-ఆర్19 టైర్లు ఉన్నాయి. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్‌లు, వెనుక 265 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి.మల్టీస్ట్రాడా వీ2 ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్లు, స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, పవర్ మోడ్లు, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్‌తో కూడిన సరికొత్త ఎలక్ట్రానిక్స్ వంటివన్నీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లేలో కనిపిస్తాయి. ప్రస్తుతం కంపెనీ ఈ బైక్ ధరలను వెల్లడించలేదు. అయితే ధరలు రూ. 16 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. -
డుకాటీ కొత్త బైక్.. ధర ఎంతంటే?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ డుకాటీ 2025 పానిగెల్ వీ4ను ఆవిష్కరించింది. కంపెనీ మొదటిసారి దేశీయ విఫణిలో ఈ బైకును 2018లో లాంచ్ చేసింది. ఆ తరువాత అనేక మార్పులకు లోనవుతూ వచ్చిన ఈ బైక్ ఇప్పుడు లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 2025 డుకాటీ పానిగెల్ వీ4 సింగిల్-సైడెడ్ స్వింగార్మ్ కలిగి ఉంది. ఈ బైక్ 1103 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ వీ4 ఇంజిన్ పొందుతుంది. ఇది 13500 rpm వద్ద 216 హార్స్ పవర్, 11250 rpm వద్ద 120.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది దాని మునుపటి బైక్ కంటే కూడా 2.7 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది.2025 డుకాటీ పానిగెల్ వీ4 బైక్ 6.9 ఇంచెస్ TFT డిస్ప్లే పొందుతుంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, రైడింగ్ మోడ్లు, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.కొత్త ఫెయిరింగ్ డిజైన్, రీడిజైన్ ఎల్ఈడీ హెడ్‌లైట్, నార్మల్ స్వింగార్మ్ కలిగి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. టైయిల్లైట్ కూడా రీడిజైన్ చేశారు. ఈ బైక్ అధికారిక ధరలు ఇంకా వెల్లడికాలేదు. అయితే దీని ధర రూ. 2772 లక్షల నుంచి రూ. 33.48 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం. -
దశాబ్దాల తర్వాత మళ్ళీ అలాంటి బైక్: ధర ఎంతో తెలుసా?
డుకాటి భారతదేశంలో హైపర్‌మోటార్డ్ 698 మోనో పేరుతో సరికొత్త బైకును రూ. 16.50 లక్షలకు లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో అమ్ముడవుతున్న హైపర్‌మోటార్డ్ 950 ఆర్విఇ ధర కంటే రూ.50000 ఎక్కువ. ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల (జులై) చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.హైపర్‌మోటార్డ్ 698 మోనో అనేది.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత సింగిల్ సిలిండర్ మోటార్‌సైకిల్‌పై డుకాటి చేసిన ప్రయత్నం. కంపెనీ 1950 నుంచి 1970 వరకు సింగిల్ సిలిండర్ కాన్ఫిగరేషన్‌తో ఇంజిన్లను తయారు చేసింది. మళ్ళీ ఇప్పుడు ప్రయత్నిస్తూ సింగిల్ సిలిండర్ మోటార్‌సైకిల్ లాంచ్ చేసింది.డుకాటీ లాంచ్ చేసిన హైపర్‌మోటార్డ్ 698 బైక్ 659 సీసీ సింగిల్ సిలిండర్ కలిగి 77.5 హార్స్ పవర్, 63 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డబుల్ ఎగ్జాస్ట్, ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్, హై ఫ్రంట్ మడ్‌గార్డ్, షార్ప్ టెయిల్, ఫ్లాట్ సీటు వంటి అంశాలతో ఈ బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
ఇండియన్ మార్కెట్లో రూ.20.98 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ ఇండియా' దేశీయ మార్కెట్లో కొత్త 'పానిగేల్ వీ2' బైకును బ్లాక్ కలర్ ఆప్షన్లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 20.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 30000 ఎక్కువ. ఇప్పటికే కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త డుకాటీ పానిగేల్ వీ2 బ్లాక్ ఫెయిరింగ్ పొందటమే కాకుండా.. ఫ్యూయల్ ట్యాంక్ మీద, వీల్స్ మీద, వెనుక భాగంలో రెడ్ కలర్ స్కీమ్ చూడవచ్చు. డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి అదే కన్ను మాదిరిగా ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్, ట్విన్ హెడ్‌ల్యాంప్ వంటివి ఉన్నాయి.పానిగేల్ వీ2 బైక్ అదే 995 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10750 rpm వద్ద 155 Bhp పవర్, 9000 rpm వద్ద 104 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ 43 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ షోవా యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు ఫుల్లీ అడ్జస్టబుల్ మోనోషాక్ పొందుతుంది. బ్రేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్.. కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్ వంటి వాటితో పాటు.. పైరెల్లీ డయాబ్లో రోస్సో కోర్సా II టైర్లను కలిగి 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ బైక్ రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. -
స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్ప్రైజ్
డై హార్డ్ ఫ్యాన్స్ ఉండే హీరోల్లో తలా అజిత్ ఒకడు. తమిళనాడులో ఇతడికి కోట్లాదిమంది అభిమానులున్నారు. తెలుగులోనూ ఇతడికి ఓ మాదిరి గుర్తింపు ఉంది. అడపాదడపా యాక్షన్ సినిమాలతో ఆకట్టుకునే ఇతడు ప్రస్తుతం ఓ రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. బుధవారం ఇతడి 53వ పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇతడి భార్య మాత్రం అదిరిపోయే గిఫ్ట్‌తో సర్ప్రైజ్ చేసింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)1990లోనే నటుడిగా కెరీర్ ప్రారంభించిన అజిత్.. 'ప్రేమ పుస్తకం' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పూర్తిగా తమిళంకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం 'విడామయూర్చి' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు. తాజాగా బుధవారం అజిత్ 53వ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు.ఈ క్రమంలోనే అజిత్ భార్య షాలిని.. భర్తకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. బైక్స్ అంటే అజిత్ ఎంత ఇష్టమో బాగా తెలిసిన షాలిని.. ఈ బర్త్ డే కానుకగా డుకాటీ బైక్ బహుమతిగా ఇచ్చింది. మార్కెట్లో దీని ధర రూ.10 లక్షలు పైమాటే. ఏదేమైనా ఇలా బైక్ ఇచ్చి పుట్టినరోజు సర్ప్రైజ్ చేయడం అజిత్ అభిమానులకు తెగ నచ్చేసింది. (ఇదీ చదవండి: పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) Shalini Ajith gifted Ducati bike for Thala #Ajith 🥰#HBDAjithKumar 🎉🎂#VidaaMuyarchi .. #AjithKumar#GoodBadUgly #Ajithkumar𓃵 pic.twitter.com/aWYnXAI5CU— 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) May 1, 2024 -
ఈ బైక్ కొనుగోలుపై రూ.1.97 లక్షల డిస్కౌంట్ - నేడే ఆఖరు..
భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది బైక్ రైడర్లు ఇష్టపడే బైక్ బ్రాండ్లలో ఒకటి 'డుకాటి' (Ducati). ఫెస్టివల్ సీజన్ పూర్తయిన తరువాత కూడా ఈ కంపెనీ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన మోడల్ మీద భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఏ బైకుపై సంస్థ డిస్కౌంట్ అందిస్తోంది, డిస్కౌంట్ తర్వాత ఈ బైక్ ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డుకాటి కంపెనీకి చెందిన మాన్స్టర్ (Monster) బైకుపై సంస్థ ఏకాంగి రూ. 1.97 లక్షలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ధర రూ. 12.95 లక్షలు కాగా.. డిస్కౌంట్ తరువాత ఇది రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు (నవంబర్ 30) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డుకాటి మాన్స్టర్ బైక్ 937 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలిగి 9250 ఆర్పీఎమ్ వద్ద 109 బీహెచ్పీ పవర్, 6500 ఆర్పీఎమ్ వద్ద 92 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్, డుకాటి క్విక్ షిఫ్ట్ ద్వారా 6-స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది, తద్వారా అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల నిర్ణయంపై 'ఎలాన్ మస్క్' ఘాటు వ్యాఖ్యలు దేశీయ మార్కెట్లో డుకాటి మాన్స్టర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, ఎస్పీ వేరియంట్లు. ప్రారంభంలో ఈ బైక్ రూ. 15.95 లక్షల ధర వద్ద విడుదలైంది, ఆ తరువాత ఈ ధరలు కొంత అతగ్గుముఖం పట్టాయి. దీంతో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. -
డెలివరీ బాయ్‌కి ఇంత ఖరీదైన బైకా? అవాక్కవుతున్న నెటిజన్లు - వీడియో వైరల్
జొమాటో, స్విగ్గి వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారే కాదు, వాటి ద్వారా సంపాదించుకునే వారు కూడా ఎక్కువైపోయారు. దీంతో కొంతమంది తమ లగ్జరీ బైకులను డెలివరీ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ యూజర్ రాజ్ గోథాంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఖరీదైన డుకాటి కంపెనీ బైక్ కనిపిస్తుంది. దీని ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీనిపైన కూర్చున్న డెలివరీ బాయ్ జొమాటో షర్ట్ ధరించి ఉన్నాడు. అతడు తన ప్రతి ఆర్డర్‌కు 200 వరకు సంపాదిస్తున్నట్లు, అందులో రూ. 50 పెట్రోలు కోసం వెచ్చించినా.. తనకి రూ. 150 మిగులుతుందని.. ఇలా రోజుకి 20 ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు. నెలకు రూ. 45,000.. వీడియోలో కనిపించే వ్యక్తి చెప్పినదాని ప్రకారం, అతడు నెలకు రూ. 45,000 సంపాదిస్తానని చెప్పాడు. నిజానికి ప్రతి ఆర్డర్‌కు రూ. 30 నుంచి రూ. 40 మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్షిప్.. 5వేల విద్యార్థులకు అవకాశం - లాస్ట్ డేట్ ఎప్పుడంటే? అతడు చెప్పినదాని ప్రకారం రోజుకి రూ. 3000, ఇలా నెలకు రూ. 90,000 సంపాదించాలి అంటూ ఒకరు. డుకాటి ఇండియా కూడా ఎమోజితో కామెంట్ చేసింది. మరి కొంతమంది కామెడీ కోసం చేసిన వీడియో మాదిరిగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. View this post on Instagram A post shared by Raj Gothankar (@raj_official_2151) -
చిరుత లాంటి వేగం ఈ బైక్ సొంత - ధర ఎంతో తెలుసా?
Ducati Panigale V4R: భారతదేశంలో సరసమైన బైకులు మాత్రమే కాకుండా అత్యంత ఖరీదైన బైకులు కూడా అమ్ముడవుతున్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో కవాసకి, డుకాటి మొదలైన బ్రాండ్ బైకులు ఉన్నాయి. తాజాగా డుకాటి ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఖరీదైన బైకును లాంచ్ చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డుకాటి విడుదల చేసిన బైక్ పేరు 'పానిగలె వి4 ఆర్' (Panigale V4 R). దీని ధర అక్షరాలా రూ. 69.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా మరింత ఎక్కువ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులోని 998 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ 215 bhp పవర్ అందిస్తుంది. 2019 నుండి కంపెనీ భారతదేశంలో V4R విక్రయించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ లేటెస్ట్ బైక్ రేస్ టీమ్‌ల కోసం అందించే కొన్ని ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున గన్ డ్రిల్డ్, పిస్టన్ వంటి వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్ - ఫస్ట్ యూనిట్ చూసారా!) ఇది ట్రాక్-ఓరియెంటెడ్ సూపర్‌బైక్ అయినందున ఎలక్ట్రానిక్స్ సూట్‌తో వస్తుంది. వీటిలో కొత్త 'ట్రాక్ ఈవో' మోడ్, రీకాలిబ్రేటెడ్ డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ బై వైర్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ EVO2 సిస్టమ్‌లు ఉన్నాయి. రైడర్ ఎంచుకోవడానికి ఫుల్, హై, మీడియం, లో అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ బైక్ ముందు భాగంలో 1 అనే నెంబర్ ఉండటం చూడవచ్చు. ఇది వరల్డ్ సూపర్‌బైక్‌లలో డుకాటి ఆధిపత్యాన్ని చూపించడానికి ఉపయోగపడుతుంది. ఈ బైక్ కూడా సీబీయు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా అమ్ముడవుతాయి. ఇప్పటికే భారత్‌కు ఐదు యూనిట్లు వచ్చాయని, అవన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. -
ఈ బైక్స్ కొనుగోలుపై కనీవినీ ఎరుగని బెనిఫిట్స్ - రూ. 4 లక్షల వరకు..
Ducati Benefits: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ బైక్ బ్రాండ్స్‌లో ఒకటైన 'డుకాటి' (Ducati) తన 10వ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా కంపెనీకి చెందిన కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద రూ. 4 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. కంపెనీ అందించనున్న ఈ బెనిఫీట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బెనిఫీట్స్.. నివేదికల ప్రకారం, డుకాటి ఇండియా ఇప్పుడు తన స్ట్రీట్‌ఫైటర్ వి4, మల్టీస్ట్రాడా వి4 మోడల్స్ మీద ఏకంగా రూ. 4 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ బైక్స్ అసలు ధరలు దేశీయ మార్కెట్లో రూ. రూ. 22.15 లక్షలు, రూ. 21.48 లక్షలు కావడం గమనార్హం. అదే సమయంలో స్ట్రీట్‌ఫైటర్ వి2, మల్టీస్ట్రాడా వి2, మాన్స్టర్ మోడల్స్ మీద రూ. 2 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మోడల్ బైకుల అసలు ధరలు రూ. 18.10 లక్షలు, రూ. 16.05 లక్షలు, రూ. 12.95 లక్షలు. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) కంపెనీ అందిస్తున్న ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్ కాదు, అయితే డుకాటి బ్రాండ్ దుస్తులు, యాక్ససరీస్ వంటివి పొందవచ్చు. ఈ బెనిఫీట్స్ కూడా స్టాక్ ఉన్నత వరకు మాత్రమే లభిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను కొనుగోలుదారులు సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌లను సందర్శించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
భారత్‌లో రూ. 15.95 లక్షల బైక్ లాంచ్ - ప్రత్యేకతలేంటో తెలుసా?
భారతదేశంలో ఎట్టకేలకు డుకాటీ కంపెనీ మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే ఖరీదైనప్పటికీ అద్భుతమైన డిజైన్, ఆధునిక పరికరాలను పొందుతుంది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'డుకాటీ మాన్స్టర్ ఎస్పి' (Ducati Monster SP) ధర రూ. 15.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్ దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా రూ. 3 లక్షలు ఎక్కువ ఖరీదైనది కావడం విశేషం. డిజైన్ & ఫీచర్స్: నిజానికి లేటెస్ట్ డుకాటీ మాన్స్టర్ ఎస్పి డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో MotoGP ఇన్స్ఫైర్డ్ లివరీతో పాటు బ్లాక్ అవుట్ పార్ట్స్ కలిగి ప్యాసింజర్ సీట్ కౌల్ పొందుతుంది. LED DRL ప్రొజెక్టర్ స్టైల్ హెడ్ లాంప్ ఇందులో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ ఇండికేటర్లతో మస్కులర్ ఫ్యూయెల్ ట్యాంక్, స్టెప్ అప్ సీట్, రెండు వైపులా 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. (ఇదీ చదవండి: వయసు 24.. సంపాదన రూ. 100 కోట్లు - అతడే సంకర్ష్ చందా!) ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ కలిగిన 4.3 ఇంచెస్ కలర్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది బైక్ గురించి రైడర్ కి కావలసిన సమాచారం అందిస్తుంది. ఎలక్ట్రానిక్ లాంచ్ కంట్రోల్ సిస్టం, రైడింగ్ మోడ్స్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త డుకాటీ మాన్స్టర్ ఎస్పి బైక్ ఇంజిన్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే 937 సిసి ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి 9250 rpm వద్ద 109.9 bhp పవర్ & 6500 rpm వద్ద 93 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్ల వరకు ఉంటుంది. (ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఇంటర్నేషనల్ కాల్స్.. క్లిక్ చేసారో మీ పని అయిపోయినట్టే!) ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'డుకాటీ మాన్స్టర్ ఎస్పి' బైక్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RS, బీఎండబ్ల్యూ ఎఫ్900 ఆర్, కవాసకి జెడ్900 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ లేటెస్ట్ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
డుకాటీ బైక్ రూ.72 లక్షలు
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్‌బైక్స్ తయారీ సంస్థ డుకాటీ ఈ ఏడాది భారత్‌కు స్ట్రీట్‌ఫైటర్ వీ4 లంబోర్గీని మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. 208 హెచ్‌పీ పవర్‌తో 1,103 సీసీ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. డుకాటీ క్విక్ షిఫ్ట్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్, హైడ్రాలికల్లీ కంట్రోల్డ్ స్లిప్పర్ డ్రై క్లచ్ ఏర్పాటు ఉంది. ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.72 లక్షలు ఉండే అవకాశం ఉంది. దీనితోపాటు మరో ఎనమిది మోడళ్లు 2023లో భారత్‌లో రంగ ప్రవేశం చేయనున్నాయి. ఈ బైక్‌లు రూ.10.39 లక్షల నుంచి లభిస్తాయి. 2022లో కంపెనీ భారత్‌లో ఐదేళ్ల గరిష్టం.. 15 శాతం వృద్ధి సాధించింది. -
బైక్ కొనుగోలుదారులకు షాక్.. డుకాటీ ధరలు పెరగనున్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓ వైపు కొత్త సంవత్సరం వస్తుండగా, మరో వైపు ఆటో మొబైల్ రంగ సంస్థలు క్రమంగా తమ వాహనాల ధరలను పెంచుతూ పోతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ సంస్థ డుకాటీ కూడా చేరింది. తమ అన్ని మోడళ్ల బైక్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఎంత శాతం సవరిస్తుందన్న విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. “ముడిసరుకు, ఉత్పత్తి, రవాణాలకు సంబంధించిన ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కొంతకాలంగా కంపెనీ ఈ భారాన్ని భరిస్తూ వస్తోంది. అయితే వీటిని అధిగమించేందుకు, ప్రస్తుతం ధరలను సవరించాలని నిర్ణయించుకున్నట్లు” అని డుకాటీ తెలిపింది. అలాగే గ్లోబల్ మార్కెట్లోకి విడుదలయ్యే అన్ని బైక్‌లను భారత్‌కు తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
డుకాటి ఇండియా సూపర్ బైక్స్: దిమ్మ దిరిగే ధరలు
న్యూఢిల్లీ: డుకాటి ఇండియా 2022 పానిగేల్ వీ4 రేంజ్ బైక్స్‌ను విడుదల చేసింది. వీటి ధర రూ. 26.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం. వేరియంట్లు ఉన్నాయి - స్టాండర్డ్, ఎస్,ఎస్పీ-2 ఇలా మూడు వేరియంట్లలో ఈ సూపర్ బైక్ అందుబాటులో ఉంది. అయితే ఫీచర్లను అప్డేట్ చేయడమే కాదు ధరలను కూడా అదే రేంజ్లో పెంచేసింది. కొత్త గ్రాఫిక్లతోపాటు, అద్భుతమైన డిజైన్‌తో 2022 పనిగేల్ వీ4 బైక్స్‌ని అప్డేట్ చేసింది. ఇక ధరల విషయానికి వస్తే బేస్ వేరియంట్ ధరను గతం కంటే రూ. 3 లక్షలు పెంచింది. ఎస్ ధర రూ. 31.99 లక్షలు (గతం కంటే రూ. 3.59 లక్షలు ఎక్కువ) ఎస్పీ2 ధర రూ. 40.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)( సుమారు 4 లక్షలు ఎక్కువ) .ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, చెన్నైలోని అన్ని డుకాటీ డీలర్‌షిప్‌లలో మొత్తం 3 వేరియంట్ల బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంజీన్ 1103 cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్ . దీనికి కొత్త సైలెన్సర్ ఆయిల్ పంప్‌ను జోడించింది. తద్వారా ఈ ఇంజీన్ సామర్థ్యం 13,000 RPM వద్ద 215.5 HP , 9500 RPM వద్ద 123.6 Nm వరకుపెరిగిందని కంపెనీ ప్రకటించింది. ఇంకా ఫుల్లీ రెడ్ ఫెయిరింగ్లపై బ్లాక్ లోగోలు, డబుల్ ఫాబ్రిక్ సాడిల్, బ్లాక్ రిమ్స్‌పై రెడ్ ట్యాగ్ (S వేరియంట్లో) జోడించింది. హై ఎండ్ వేరియంట్ ఎస్పీ 2లో 1103 cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్నే అమర్చింది. ఇంకా ఇటాలియన్ ఫ్లాగ్‌తో కూడిన కార్బన్ ఫైబర్‌లో వింగ్స్, STM-EVO SBK 9-డిస్క్ డ్రై క్లచ్, డెడికేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ స్ప్రాకెట్స్, 520 చైన్, ఎడ్జస్టబుల్ రైడర్ ఫుట్-పెగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రిమోట్ అడ్జస్టర్, మెషిన్డ్ బ్రేక్ చ, క్లచ్ లివర్లతో కూడిన బ్రెంబో MCS మాస్టర్ సిలిండర్, 9-స్పోక్ ఫోర్డ్ మెగ్నీషియం వీల్స్, కార్బన్ ఫైబర్‌లో ఫ్రంట్ మడ్‌గార్డ్ , సింగిల్ సీట్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
డుకాటీ కొత్త బైక్ : రూ.34.99 లక్షలు
హైదరాబాద్: సూపర్‌బైక్స్ తయారీలో ఉన్న ఇటలీ సంస్థ డుకాటీ.. భారత్‌లో స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్పీ స్పోర్ట్ నేక్డ్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ బుకింగ్‌లు , డెలివరీలను కూడా స్టార్ట్ చేసింది. ట్రాక్షన్ అండ్ వీల్ కంట్ట్రోల్ తోపాటు పలు ఎలక్ట్రానిక్ రైడింగ్ ఎయిడ్స్‌తో 'వింటర్ టెస్ట్' లివరీ లుక్‌తో అద్భుతమైన డిజైన్‌తో దీన్ని లాంచ్ చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.34.99 లక్షలు. ఫీచర్ల విషయానికి వస్తే.. 1,103 సీసీ లిక్విడ్-కూల్డ్, డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్ ఇందులో అందిస్తోంది. సింగిల్ సీట్, కార్బన్ హీల్ గార్డ్స్‌తో అడ్జస్టబుబుల్ రైడర్ ఫుట్ పెగ్స్, 3 రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ కార్నరింగ్ బాష్, ట్రాక్షన్ కంట్రోల్ ఈవో 2, స్లైడ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, పవర్ లాంచ్, క్విక్ షిఫ్ట్ అప్/డౌన్ వంటి హంగులు ఉన్నాయి. -
డుకాటీ నుంచి రూ.12.89 లక్షల బైక్.. చరిత్రకు నివాళి!
ముంబై: ఇటాలియన్ లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటీ గురువారం స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో పేరుతో కొత్త బైక్ విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.12.89 లక్షలుగా ఉంది. డుకాటీ స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో బైకులో 86 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేసే 1077 సీసీ ఇంజిన్ ఉంది. ‘‘స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో బైక్ దాని ఎయిర్–కూల్డ్ ఎల్– ట్విన్ ఇంజిన్ చరిత్రకు నివాళులు అర్పించేందుకు తయారయ్యింది. ఈ ఏడాది భారత మార్కెట్లో డుకాటీ మొదటి ఆవిష్కరణ ఇది’’ అని కంపెనీ భారత విభాగపు ఎండీ బిపుల్ చంద్ర తెలిపారు. -
డుకాటి పనిగలే సరికొత్తగా ...! ధర ఎంతంటే..!
ప్రముఖ ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం డుకాటి భారత మార్కెట్లలోకి సరికొత్త అప్డేట్డ్ వెర్షన్ బైక్‌ను లాంచ్ చేసింది. వీ4 శ్రేణిలో ‘డుకాటి పనిగలే వీ4 ఎస్పీ’ టాప్-ఆఫ్-ది-లైన్ వెర్షన్ బైక్‌ను డుకాటి ఇండియా విడుదల చేసింది. 2021డుకాటి పనిగలే వీ4 ఎస్పీ ధర 36.07 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. దీని ధర డుకాటి వీ4 ఎస్ బైక్ మోడల్ కంటే ఎక్కువ. ట్రాక్ఫోకస్డ్, తేలికైన బైక్ మోడల్‌గా డుకాటి పనిగలే నిలవనుంది. ఇందులో తేలికైన అల్లాయ్ వీల్స్‌తో పాటుగా కార్బన్ ఫైబర్‌తో బైక్ బాడీను రూపొందించారు. దీంతో సుమారు 1.4 కిలోల బరువు తగ్గింది. చదవండి: బిఎమ్‌డబ్ల్యు ఎలక్ట్రిక్ స్కూటర్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! డుకాటి పనిగలే స్టాండర్డ్ వెర్షన్ డిజైన్‌ను వీ4 ఎస్పీ పొందనుంది. అయితే ఈ బైక్ ప్రత్యేకమైన 'వింటర్ టెస్ట్' డిజైన్‌తో రానుంది. ఈ కొత్త డిజైన్ మోటోజీపీ, ఎస్బీకే మోటర్‌సైకిళ్ల ప్రేరణతో రూపొందించారు. ఫ్యూయల్ ట్యాంక్‌పై ఎరుపు రంగుతో, బ్రష్డ్-అల్యూమినియం ఫినిషింగ్‌తో రానుంది. డుకాటి పనిగలే ఇంజిన్ విషయానికి వస్తే... డెస్మోసెడిసి స్ట్రాడేల్ 1103 సీసీ ఇంజిన్‌తో రానుంది. ఇది 13000 ఆర్పీఎమ్ వద్ద 211 బీహెచ్పీ ఉత్పత్తి చేస్తోంది. 9500ఆర్పీఎమ్ వద్ద 124ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయనుంది. ఈ బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ బైక్ ఓపెన్ కార్బన్ ఫైబర్ క్లచ్ కవర్, లైసెన్స్ ప్లేట్ రిమూవల్ ప్లగ్, మెషిన్డ్ మిర్రర్ బ్లాక్-ఆఫ్ ప్లేట్లను కలిగి ఉంది. ఈ బైక్‌లో ప్రత్యేక ఆకర్షణగా డేటా ఎనలైజర్+జీపీఎస్ మాడ్యూల్‌ను ఏర్పాటుచేశారు. క్విక్‌షిఫ్టర్, రైడింగ్ పవర్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ వంటి మరిన్నింటితో సహా అనేక ఎలక్ట్రానిక్ ఎయిడ్లతో రానుంది. చదవండి: అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రికార్డ్లను తుడిచి పెట్టింది -
భారత్‌లో డుకాటీ హైపర్‌మోటార్డ్ 950
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటాలియన్ సూపర్‌బైక్స్ తయారీ కంపెనీ డుకాటీ తాజాగా భారత్‌లో హైపర్‌మోటార్డ్ 950 మోడల్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో హైపర్‌మోటార్డ్ 950 ఆర్వీఈ రూ.12.99 లక్షలు, హైపర్‌మోటార్డ్ 950 ఎస్పీ రూ.16.24 లక్షలు ఉంది. ట్విన్ సిలిండర్ ఇంజన్, 114 హెచ్‌పీ పవర్, 14.5 లీటర్ల సామర్థ్యంతో ఇంధన ట్యాంక్, స్పోర్ట్, టూరింగ్ మోడ్స్‌తో రూపొందించింది. హూపర్మెటార్డ్ 950 బైక్ డెలివరీలు ప్రారంభం అయినట్టు డుకాటీ తెలిపింది. అంతర్జాతీయంగా విజయవంతం కావడంతో ఈ మోడల్‌ను ఇక్కడి మార్కెట్లో పరిచయం చేసినట్టు వివరించింది. -
డుకాటీ నుంచి స్క్రాంబ్లర్ లిమిటెడ్ ఎడిషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటాలియన్ సూపర్‌బైక్స్ తయారీ సంస్థ డుకాటీ తాజాగా లిమిటెడ్ ఎడిషన్ స్క్రాంబ్లర్ డెసర్ట్ స్లెడ్ ఫాస్ట్హౌజ్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.10.99 లక్షలు. డుకాటీ స్క్రాంబ్లర్, అమెరికన్ క్లోతింగ్ బ్రాండ్ ఫాస్ట్హౌజ్ సహకారాన్ని వేడుక చేసుకోవడంలో భాగంగా కొత్త మోడల్‌కు రూపకల్పన చేశారు. అంతర్జాతీయంగా 800 యూనిట్లు మాత్రమే తయారు చేశారు. -
పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మార్కెట్లలోకి నయా డుకాటీ మాన్స్టర్...!
ప్రముఖ ఇటాలియన్ బైక్‌ల తయారీదారు డుకాటీ భారత మార్కెట్లలోకి నయా మాన్స్టర్ బైక్ మోడళ్లను లాంచ్ చేసింది. స్పోర్టీలుక్‌తో , తేలికగా, సులభంగా ప్రయాణించేలా రూపొందించిన డుకాటీ మాన్స్టర్ బైక్స్ ప్రియులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. డుకాటీ మాన్స్టర్, మాన్స్టర్ ప్లస్ అనే రెండు వేరియంట్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! డుకాటీ మాన్స్టర్ వేరియంట్ ధర రూ.10.99 లక్షలు, డుకాటీ మాన్స్టర్ ప్లస్ వేరియంట్ ధర రూ.11.24 లక్షలుగా ఉంది(ఎక్స్ షోరూమ్). న్యూ డుకాటి మాన్స్టర్ రెడ్, డార్క్ స్టీల్త్‌లో బ్లాక్ వీల్స్, ఏవియేటర్ గ్రేతో జీపీ రెడ్ వీల్స్‌తో అందుబాటులో ఉంది. ప్లస్ వెర్షన్ కూడా అదే రంగుల్లో లభిస్తుంది. అంతేకాకుండా డుకాటీ మాన్స్టర్ ఏరోడైనమిక్ విండ్‌షీల్డ్ తో రానుంది. ఎంబెడెడ్ రౌండ్ హెడ్‌ల్యాంప్, బైసన్ బ్యాక్ ఇన్స్పైర్డ్ చంకీ ఫ్యూయల్ ట్యాంక్, క్లీన్ టెయిల్ సెక్షన్ , సెంటర్ పొజిషన్డ్ ఇంజిన్ వంటి మాన్స్టర్ డిజైన్ ఎలిమెంట్లతో ఈ బైక్స్‌ను తయారుచేశారు. డుకాటీ న్యూ మాన్స్టర్ లైట్వేట్గా 166కేజీలు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంతకుముందు వచ్చిన బైక్ కంటే 60 శాతం తక్కువ బరువులో చాసిస్ ఉందని డుకాటీ తెలిపింది. గ్లాస్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ పాలిమర్‌తో బైక్ ఫ్రేమ్‌ను తయారుచేశారు. డెస్మోడ్రోమిక్ టెక్నాలజీతో కొత్త టెస్టాస్ట్రెట్టా 11 డిగ్రీల 937సీసీ ఎల్ ట్విన్ ఇంజిన్‌ను డుకాటీ మాన్స్టర్ అమర్చారు. 111 హెచ్‌పీ సామర్థ్యంతో 9,250 ఆర్పీఎమ్ వద్ద 93ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తిచేయనుంది. The New Monster arrives in 3 fun colours: The all-time classic Ducati Red The playful Aviator Grey And of course, the mysterious Dark Stealth. Now available in India with prices starting at INR 10,99,000 Lacs (Ex-Showroom India).#NewMonster #JustFun pic.twitter.com/dOadyWnGY5 — Ducati India (@Ducati_India) September 23, 2021 చదవండి: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! -
దేశంలో ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్: ధోని ఫేవరెట్ ఏంటో తెలుసా?
యువతకు స్పోర్ట్స్ బైక్స్ అంటే యమా క్రేజ్. రోడ్లపై రయ్.. రయ్ దూసుకుపోవడం అంటే వారికి భలే సరదా. బైక్స్ కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ను మార్కెట్లో దించుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఖరీదైన కొన్ని స్పోర్ట్స్ బైక్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్రాండ్ ధోని మన దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ పేర్లు చెప్పాల్సి వస్తే మొదటి గుర్తొచ్చేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే. ఖాళీ సమయాల్లో రాంచీ వీధుల్లో బైక్స్పైన చక్కర్లు కొట్టడం ధోనికి ఇష్టం. ఖరీదైన కార్లకు తోడు ఖరీదైన బైక్స్ కూడా అతని గారేజీలో కొలువై ఉంటాయి. కవాసకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ ఎక్స్ 132 హెల్‌క్యాట్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, డుకాటి 1098, సుజుకి హయబుస తదితర బైక్‌లు ధోని కలెక్షన్లో ఉన్నాయి. (చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!) ఇక బాలీవుడ్ విషయానికి వస్తే జాన్ అబ్రహం పెద్ద బైక్ లవర్ అని చెప్పవచ్చు. అతని వద్ద ఉన్న బైక్స్ విలువ కోటిన్నర రూపాయల వరకూ ఉంటుందని చెబుతారు. కవాసకి నింజా జెడ్ఎక్స్-14 ఆర్, అప్రిల్లా ఆర్ఎస్వీ 4 తదితర బైక్‌లు అతని వద్ద ఉన్నాయి. షాహిద్ కపూర్ కూడా బైక్స్ లవరే. షూటింగ్ లేని సమయాల్లో అతను బైక్స్‌పైనే లాంగ్ డ్రైవ్స్‌కు వెళతాడు. షాహిద్ వద్ద బీఎండబ్ల్యూ 310 ఆర్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ లాంటి ఖరీదైన మోటార్‌సైకిల్స్ ఉన్నాయి. ఇక బైక్స్ లవర్స్ లిస్ట్‌లో మాధవన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ తదితరులు ఉన్నారు. కవాసకి నింజా హెచ్2ఆర్ ఇంజిన్ కెపాసిటి : 998 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 216 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 305.75 బీహెచ్పీ, 14,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 79,90,000 బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ఇంజిన్ కెపాసిటీ : 999 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 192 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16.5 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 209.19 బీహెచ్పీ, 14,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 42,00,000 హోండా గోల్డ్‌వింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,833 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 385 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 21.1 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 124.7 బీహెచ్పీ, 5,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 37,75,000 హార్లీడేవిడ్సన్ రోడ్ కింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,746 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 375 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 22.7 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : - మన దేశంలో ధర (సుమారు) : రూ. 30,00,000 అప్రిల్లా ఆర్ఎస్వీ4 1100 ఫ్యాక్టరీ ఇంజిన్ కెపాసిటి : 1099 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 202 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17.9 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 213.89 బీహెచ్పీ, 13,000ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,50,000 డుకాటీ పనిగేల్ వీ4 ఇంజిన్ కెపాసిటి : 1,103 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 198 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 211.21 బీహెచ్పీ, 13,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,27,000 బీఎండబ్ల్యూ ఆర్ 1250 అడ్వెంచర్ ఇంజిన్ కెపాసిటి : 1,254 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 268 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 30 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 134.1 బీహెచ్పీ, 7,700 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 25,00,000 ట్రయంప్ రాకెట్ 3 ఇంజిన్ కెపాసిటి : 2,458 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 304 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 18 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 165 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 22,27,000 ఇండియన్ చీఫ్ బాబెర్ డార్క్‌హార్స్ ఇంజిన్ కెపాసిటి : 1890 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 352 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 15.1 లీటర్లు మన దేశంలో ధర (సుమారు) : రూ. 21,40,000 సుజుకి హయబుస ఇంజిన్ కెపాసిటి : 1,340 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 266 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 20 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 187.3 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 18,47,000 -
డుకాటీ బైక్ @ 23 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూపర్ బైక్స్ తయారీలో ఉన్న ఇటలీ దిగ్గజం డుకాటీ తాజాగా భారత్‌లో రెండు అడ్వెంచర్ టూరర్ మోడళ్లను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర మల్టీస్ట్రాడా వీ4 రూ.18.99 లక్షలు కాగా వీ4–ఎస్ రూ.23.10 లక్షలు ఉంది. 10,500 ఆర్పీఎంతో 170 హెచ్‌పీ పవర్ వీ4 గ్రాన్టూరిస్మో ఇంజిన్ పొందుపరిచారు. రోడ్, ఆఫ్–రోడ్ వినియోగం కోసం ఇంజిన్‌ను డిజైన్ చేశారు. రైడింగ్ మరింత సౌకర్యవంతం చేసేందుకు వీ4 ఎస్ మోడల్‌కు రాడార్ టెక్నాలజీని వినియోగించారు. ఇది వేగాన్ని నియంత్రించడంతోపాటు వెనుక నుంచి వాహనాలు వస్తే హెచ్చరిస్తుంది. -
డుకాటి పనిగలే V 4, ధర ఎంతో తెలుసా?
వెబ్‌డెస్క్ : బైక్ లవర్స్‌కి శుభవార్త ! డుకాటి ఫ్లాగ్షిప్ మోడల్ డుకాటి ఇండియాలో అడుగు పెట్టింది. సపర్ స్టైలిష్ లుక్‌తో సాటి లేని ఇంజన్ సామర్థ్యంతో భారత్ రోడ్లపై పరుగులు పెట్టేందుకు డుకాటి పనిగలే వీ4, వీ4 ఎస్ మోడళ్లు రెడీ అయ్యాయి. ధర డుకాటి పనిగలే వీ4 ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ ధర రూ.23.50 లక్షలు ఉండగా. దీని తర్వాతి వెర్షన్, మోర్ ప్రీమియం మోడల్ అయిన డుకాటి పనిగలే వీ4 ఎస్ ధర రూ. 28.40 లక్షలుగా ఉంది. లేటెస్ట్ ఫీచర్స్ డుకాటిలో ప్రీమియం మోడలైన పనగలే వీ మోడళ్లకు 2020 చివరిసారి డిజైన్, ఇంజన్లో మార్పులు చేర్పులు చేశారు. దాని ప్రకారం న్యూ ఎయిరోడైనమిక్ ప్యాకేజీ, స్మాల్ ఇంజన్ ట్వీక్స్, హార్డ్‌వేర్ డిజైన్‌లో చేంజేస్ వచ్చాయి. భద్రత ఈ బైక్‌పై రివ్వుమని దూసుకుపోయే రైడర్ భద్రత దృష్ట్యా కార్నరింగ్ ఏబీఎస్, వీలీ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కార్నర్స్‌లో బ్రేక్ హ్యాండ్లింగ్ మరింత మెరుగ్గా డిజైన్ చేశారు. V4 S ప్రత్యేకతలు అల్యుమినియం వీల్స్, లిథియం అయాన్ బ్యాటరీ, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు డుకాటి పనగలే వీ 4 ఎస్‌లో ఉన్నాయి. ఈ ఫీచర్లు పనగలే వీ 4లో లేవు. పవర్ఫుల్ కాటీ పనగలే వీ 4 ఇంజన్ సామర్థ్యం 1103 సీసీ. త్వరలోనే డుకాటి సంస్థ క్రూజర్ బైక్‌ని ఇండియా మార్కెట్లోకి తేనుంది. చదవండి: మార్కెట్ లో లంబోర్గిని కొత్త లగ్జరీ కారు -
Ducati: డుకాటీ నుంచి రెండు కొత్త బైకులు
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్ బైకుల తయారీ సంస్థ డుకాటీ గురువారం స్ట్రీట్‌ఫైటర్ వీ4, వీ4 ఎస్ మోడళ్ల కొత్త వెర్షన్ బైకులను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద వరుసగా రూ.19.99 లక్షలు, రూ.22.99 లక్షలుగా ఉన్నాయి. ఈ రెండింటిలోనూ బీఎస్ 6 ప్రమాణాలను కలిగిన ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 208 హెచ్‌పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ఆరు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉన్నాయి. వీటిలో వీ4 మోడల్ బైక్ రెడ్ కలర్ ఆప్షన్లో లభిస్తుంది. అదే వీ4ఎస్ మాత్రం రెడ్‌తో పాటు డార్క్ స్టీల్త్ కలర్ ఆప్షన్లతో వస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని డుకాటీ డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేత తర్వాత డెలివరీలు మొదలుకానున్నాయి. కొత్త వెర్షన్ బైకులు... లగ్జరీ మోటార్ సైకిళ్ల పట్ల ఆసక్తి కలిగిన వారి మన్ననలను పొందుతాయని డుకాటీ భారత విభాగపు ఎండీ బిపుల్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: గూగుల్ క్రోమ్ యాప్‌తో జర జాగ్రత్త! -
సరికొత్త ముస్తాబుతో డుకాటీ ‘‘స్క్రాంబ్లర్’’
సాక్షి, న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్‌బైకుల తయారీ సంస్థ డుకాటీ శుక్రవారం 2021 డుకాటీ స్క్రాంబ్లర్ రేంజ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన ఈ మోడల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఐకాన్ డార్క్ వేరియంట్ రూ.7.99 లక్షలుగా ఉంది. స్క్రాంబర్ల్ ఐకాన్, ఐకాన్ డార్క్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.8.49 లక్షలు, రూ.10.99 లక్షలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉండే డుకాటీ డీలర్ షాపుల్లో బైకులను బుక్ చేసుకోవచ్చని, జనవరి 28 నుంచి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధిక కస్టమర్లు మెచ్చే బైకుల జాబితాలో స్క్రాంబ్లర్ రేంజ్ మోడళ్లు ఎల్లప్పుడూ స్థానాన్ని కలిగి ఉంటాయని ఆవిష్కరణ సందర్భంగా డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర తెలిపారు. -
దూసుకొచ్చిన ‘డుకాటీ డయావెల్ 1260’
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ దిగ్గజం డుకాటీ.. భారత మార్కెట్లోకి సరికొత్త ‘డయావెల్ 1260’ బైక్‌ను శుక్రవారం ప్రవేశపెట్టింది. ఈ బైక్ ధర రూ.17.7 లక్షలు కాగా, ఇదే మోడల్లో అధునాతన స్పోర్ట్స్ బైక్‌ను కంపెనీ విడుదలచేసింది. ‘డయావెల్ 1260 ఎస్’ పేరుతో అందుబాటులోకి వచ్చిన నూతన స్పోర్ట్స్ వేరియంట్ ధరను రూ.19.25 లక్షలు(ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ఇందులో 1262 సీసీ ఇంజిన్‌ను అమర్చించి. ఈ సందర్భంగా డుకాటీ ఇండియా ఎండీ సెర్గీ కెనోవాస్ మాట్లాడుతూ.. ‘క్రూయిజర్‌ను ఇష్టపడే వాళ్లలో అధిక శాతం వినియోగదారులు డయావెల్ మోడల్‌ను ఇష్టపడతారు. నూతన 1260 బైక్‌కు మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు.