Ear Rings
-
చెవి తమ్మె పూర్తిగా తెగిపోతే..!
ఫ్యాషన్‌లో భాగంగానో లేదా తమ దుస్తులకు మ్యాచింగ్‌గా ఉంటాయనో కొందరు చాలా బరువైన ఇయర్ రింగ్స్‌ను వాడుతుంటారు. ఇలాంటి ఫ్యాషనబుల్ ఇయర్ రింగ్స్ ఎక్కువగా వాడుతుండటం లేదా హ్యాంగింగ్స్ తరచూ వేసుకుంటూ ఉండటంలో వాటి బరువు కారణంగా క్రమంగా చెవి రంధ్రం సాగితూ, ఆ రంధ్రం పెద్దదైపోయి ఒకదశలో చెవి తమ్మె పూర్తిగా తెగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇది పూర్తిగా తెగిపోయాక అప్పుడు రిపేర్ చేయించుకోవడం కంటే రంధ్రం పెద్దది అవుతున్న సమయంలోనే చేయించుకోవడం మంచిది. చాలా ఎక్కువ బరువుండే ఇయర్ రింగ్స్ లేదా హ్యాంగింగ్స్ కారణంగా చెవి బాగా సాగిపోయిన లేదా తెగిపోయిన చెవి తమ్మెను ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియ ద్వారా రిపేర్ చేయడం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియలో బాధితులకు ఎలాంటి మత్తుమందు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం ఆ ప్రాంతం వరకు శరీరం మొద్దుబారేలా మత్తు (లోకల్ అనస్థీషియా) ఇస్తే సరిపోతుంది. రెండుగా చీలిపోయినట్లుగా తెగిన చెవి తమ్మెను నేరుగా ప్లాస్టిక్ సర్జరీ చికిత్సలోనైనా లేదా చికిత్స తర్వాత గాయం మానిన తర్వాతనైనా... సదరు గాయం మచ్చను కనపడకుండా చేసేందుకూ చికిత్స అందించడం వచ్చు ఇందులో భాగంగా చెవి తమ్మెను వంకరటింకరగా (జిగ్‌జాగ్)గా అతికిస్తూ నిపుణులు రిపేర్ చేస్తారు. అయితే ఇలా చెవి తమ్మెలను అతికించే ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. అయితే ఈ అతికింపు ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. చెవి రంధ్రం చీరుకున్న తీరును బట్టి బాధితులకు ఎలాంటి ప్రక్రియ అవసరమో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఆ తర్వాత వాళ్లతోనే మాట్లాడుతూ (కౌన్సెలింగ్ నిర్వహిస్తూ) వాళ్లకు అవసరమైన ప్రక్రియ గురించి వివరిస్తారు. వాళ్లు అంగీకరిస్తే అప్పుడు అతికింపు చికిత్స చేస్తారు. ఈ చికిత్సలో భాగంగా రెండుగా చీరుకున్న రంధ్రానికి కుట్లు వేయడం కోసం అత్యంత నాణ్యమైన, బయటకు కనపడని సున్నితమైన దారాన్ని ఉపయోగిస్తారు. ప్రక్రియ అంతా పూర్తయ్యాక చికిత్స నిర్వహించిన చోట కొన్నాళ్ల పాటు పైపూతగా ఉపయోగించే యాంటీబయాటిక్ క్రీమ్‌ను కొంతకాలం పాటు రాయాల్సి ఉంటుంది. కాక΄ోతే గాయం అంతా మానాక వెంటనే బయటకు కనపడదుగానీ... బాగా పరిశీలనగా చూస్తే ఓ పెన్సిల్‌తో గీసినంత సన్నగా ఉండే గీత అస్పష్టంగా కనిపిస్తుంది. ఈ అతికింపు ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ చెవి కుట్టించుకోవాలంటే... చెవి రంధ్రం పూర్తిగా పూడిపోయాక కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఆగి, అప్పుడు కుట్టించుకోవచ్చు. అయితే ఈసారి మళ్లీ అలాంటి చాలా బరువైన హ్యాంగింగ్స్ కాకుండా తేలికైనవి వాడుతూ మాటిమాటికీ చెవి తమ్మె తెగి΄ోకుండా చూసుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక చెవి తమ్మెలు బాగా లేతగా ఉండే చిన్నారి బాలికలూ, చెవి తమ్మెలో తగినంత స్థలం లేనివారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. డా. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: ఛాతీలో నీరు చేరితే...?) -
కమలా హారిస్ క్లియర్ విన్నర్ కాదా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ వాడీవేడిగా సాగింది. అయితే, ఈ డిబేట్లో ఆద్యాంతం కమలదేపై చేయి నడిచిందంటూ అమెరికా మీడియా చెబుతుండగా.. సోషల్ మీడియాలో మాత్రం ఓ కొత్త చర్చ మొదలైంది.కమలా హారిస్ ఛీటింగ్ చేశారంటూ కొందరు నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. దానికి ట్రంప్ మద్దతుదారులు జత కలవడంతో అది తారాస్థాయికి చేరింది. ఇంతకీ ఈ చర్చకు కారణం..డిబేట్ టైంలో ఆమె ధరించిన చెవిపోగులే.పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా ట్రంప్-కమల మధ్య సంవాదం 90 నిమిషాల పాటు కొనసాగింది. ఇద్దరూ పలు అంశాలపై పరస్పర విమర్శలు గుప్పించున్నారు. డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ డిబేట్‌ను అత్యుత్తమ చర్చల్లో ఒకటిగా భావిస్తున్నానని చెప్పారు. అయితే కమలకే ఎక్కువ ఓట్లు పడ్డప్పటికీ.. ఇప్పుడు ఓ విమర్శ ఆమెను చుట్టుముట్టింది.ఈ చర్చలో కమలా హారిస్ ధరించిన చెవిపోగులు సీక్రెట్ పరికరమని, వాటి సాయంతోనే ఆమె డిబేట్లో అంత అద్భుతంగా మాట్లాడగలిగారంటూ కొందరు వాదిస్తున్నారు. ఈమేరకు కొన్ని వెబ్సైట్ ఫొటోలను, రివ్యూలను చూపిస్తున్నారు.Kamala Harris wasn’t wearing Nova H1 earring headphones. Quit lying to yourselves. She’s wearing Tiffany Hardwear pearl earrings. See how the Nova earrings only have one stalk coming off of them? See how Kamala’s has two? They’re not even the same thing. pic.twitter.com/zfTXRjEfDr— Daulton (@DaultonVenglar) September 11, 2024‘‘డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సంవాదంలో కమలా హారిస్ అద్భుతంగా మాట్లాడారు. ఇయర్రింగ్ మాదిరిగా ఉండే ఇయర్ఫోన్కు సంబంధించిన కథనం గుర్తుకు వచ్చింది’’ అని ఓ నెటిజన్, ఒబామా మాదిరిగానే కమలా బాగా మాట్లాడారన్న మరో యూజర్.. ఆమె ధరించిన చెవిపోగులు నోవా హెచ్1 ఆడియో ఇయర్రింగ్స్ మాదిరిగానే ఉన్నాయన్నారు. అయితే ఆమె మద్దతుదారులు మాత్రం ఆ వాదనను ఖండించారు. ఆమె రెగ్యులర్‌గా ధరించే ఇయర్రింగ్స్ అవని, వాటి విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు.🚨🚨KAMALA HARRIS EXPOSED FOR WEARING EARPIECE IN DEBATE *PROOFShe is seen wearing an earring developed by Nova Audio Earrings first seen at CES 2023. This earring has audio transmission capabilities and acts as a discreet earpiece.Kamala Harris confirms claims that a… pic.twitter.com/1y60rUdJT0— ELECTION2024 🇺🇸 (@24ELECTIONS) September 11, 2024ఇక.. ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో విన్నర్‌గా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ గెలిచారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా చానెల్స్ అధికారికంగా ప్రకటించాయి. డిబేట్లో ట్రంప్, హారిస్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారంటూ విశ్లేషణాత్మక కథనాలు ఇచ్చాయి. డిబేట్లో పాల్గొన్న అభ్యర్థులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారు: ఫాక్స్ న్యూస్కమలా హారిస్‌పై పైచేయి సాధించేందుకు ట్రంప్ అసంబద్ధ వాదనలు. అయితే టైం వేస్ట్ చేయకుండా ట్రంప్‌పై హారిస్ విరుచుకుపడ్డారు: ఏబీసీ మీడియాఈ డిబేట్లో కమలా హారిస్‌దే భారీ విజయం: పొలిటికోడిబేట్లో ట్రంప్ తనను తాను సమర్థించుకునేందుకు యత్నించారు. ట్రంప్ వాదనలు సత్యదూరంగా ఉన్నాయి. ఒక ప్రాసిక్యూటర్‌గా తన అనుభవాన్ని ఉపయోగించి ట్రంప్‌ను ఇరకాటంలో పడేసేందుకు కమల ప్రయత్నించారు: ది న్యూయార్క్ టైమ్స్కమలా హారిస్ ప్రసంగంతో ట్రంప్‌లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆమె పూర్తి సన్నద్ధతతో డిబేట్‌కు వచ్చారు: సీఎన్ఎన్డిబేట్లో ఇద్దరి మధ్య విమర్శ-ప్రతివిమర్శల్లో.. హారిస్‌దే పైచేయిగా సాగిందని, ట్రంప్ ఘోరంగా తడబడ్డారంటూ యూఎస్ మీడియా పేర్కొంది. అలాగే.. స్వింగ్ స్టేట్స్‌లోనూ కమలకు మంచి మార్కులు పడ్డాయని తెలిపాయి. మొత్తంగా హారిస్ ఈ డిబేట్లో క్లియర్ విన్నర్ అని తేల్చేశాయి.ఇదీ చదవండి: ట్రంప్ ఏమాత్రం మారలేదు -
చెవి రింగులతో ర్యాష్ వస్తోందా?
కొందరికి చెవి రింగులు లేదా దుద్దులు సరిపడక చెవి తమ్మెలకు ర్యాష్ రావచ్చు. కృత్రిమ ఆభరణాలలోని నికెల్ కారణంగా కొందరిలో ఈ ర్యాషెస్ వస్తాయి. ఫలితంగా దురద, ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే గాయం మరింత రేగి, రక్తస్రావమయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్యను ‘అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ టు నికెల్’ అంటారు. ఈ కింది సూచనలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నికెల్‌తో అలర్జీ ఉన్నవారు ఆ లోహంతో తయారైన రింగులు, దిద్దుల వంటి కృత్రిమ ఆభరణాలు ధరించడం సరికాదు.ఫ్యూసిడిక్ యాసిడ్ లాంటి తక్కువ మోతాదు కార్టికోస్టెరాయిడ్ ఉన్న యాంటీబయాటిక్ కాంబినేషన్‌తో లభించే క్రీములను గాయం ఉన్న చోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాస్తే త్వరగా తగ్గుతుంది. అప్పటికీ తగ్గక పోతే డాక్టర్‌ను సంప్రదించాలి. -
Fashion: జెట్ బ్లాక్ చీరలో మృణాల్! సారీ ధర ఎంతంటే..!
‘లవ్ సోనియా’తో బాలీవుడ్లో మెరిసిన తార మృణాల్ ఠాకూర్. తాజాగా ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. స్క్రీన్ మీద తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నట్టే ఫ్యాషన్‌లోనూ తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది మృణాల్. ఆ స్టయిల్ క్రియేషన్‌లో ఈ బ్రాండ్స్ కూడా భాగమే! పిచ్చిక నెమలి పింఛంలోని ఈకలను తలపించేంత మృదువైన ఫాబ్రిక్స్, ప్రకృతిని మరపించేన్ని రంగులు, డిజైన్లు పిచ్చిక లేబుల్ ప్రత్యేకతలు. ఆ డిజైన్స్ అన్నీ కూడా జైపూర్ హ్యాండ్ పెయింటింగ్స్, హ్యాండ్ ప్రింట్స్, ఎంబ్రాయిడరీలే. తన కళాత్మక దృష్టితో ఈ లేబుల్‌కు వన్నెలు అద్దిన డిజైనర్ ఊర్వశి సేథీ. ఈ బ్రాండ్ దుస్తులు ఆన్లైన్లో లభ్యం. ధరలు ఓ మోస్తరు రేంజ్లో ఉంటాయి. ఓలియో ఆష్నా సింగ్, స్నేహా సక్సేనా అనే ఇద్దరు స్నేహితులు కలసి ఏర్పాటుచేసిన బ్రాండ్ ‘ఓలియో’. ఈ జ్యూవెలరీ బ్రాండ్‌ను స్థాపించక ముందు ఆష్నా మీమ్స్ క్రియేటర్‌గా పాపులర్. స్నేహా.. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిగ్రీ చేసింది. దుస్తులు, యాక్సెసరీస్, జ్యూవెలరీ డిజైనింగ్‌లో దిట్ట. ఈ ఇద్దరూ కలసి సొంతంగా ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ను స్టార్ట్ చేయాలనుకుని 2015లో ‘ఓలియో’కు రూపమిచ్చారు. స్నేహ.. డిజైనింగ్ చూసుకుంటే, ఆష్నా.. బ్రాండ్ వ్యవహార బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఓలియో జ్యూవెలరీ ఆన్లైన్లో లభ్యం. ధరలూ అందుబాటులోనే. బ్రాండ్ వాల్యూ జెట్ బ్లాక్ చీర బ్రాండ్: పిచ్చిక ధర: రూ. 21,500 ఇయర్ రింగ్స్ బ్రాండ్: ఓలియో ధర: రూ. 8,050 ఇండియన్ కర్దాషియాన్ అని పిలిచారు నటిగా కొనసాగాలంటే ఫిట్నెస్ అవసరమని అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు అక్కడ నన్నంతా ఇండియన్ కర్దాషియాన్ అని పిలిచారు. నాలాంటి శరీరాకృతి తెచ్చుకోవడానికి వాళ్లు లక్షల్లో డబ్బు ఖర్చు పెడతారట. ఆ మాట విన్నాక నా మీద నాకు ఎక్కడలేని కాన్ఫిడెన్స్ పెరిగింది – మృణాల్ ఠాకూర్. -దీపికా కొండి చదవండి: Fashion-Velvet Long Jacket: సింపుల్ లుక్‌ను ‘రిచ్’గా మార్చేయగల వెల్వెట్ లాంగ్ జాకెట్! Nazriya Nazim Saree Cost: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! స్పెషాలిటీ? -
Fashion: లేబుల్ అర్తెన్ ప్రత్యేకత అదే.. ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర ఎంతంటే
పసుపు రంగు దుస్తుల్లో పచ్చగా మెరిసిపోతున్న ఈ నటిని గుర్తు పట్టారు కదా! ప్రేమమ్ ఫేమ్..మడోన్నా సెబాస్టియన్. గాయని కూడా. ఆమె మెచ్చే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే... లేబుల్ అర్తెన్ అర్తెన్.. అంటే సింపుల్‌గా సహజత్వం.. సహజసిద్ధమైన అని చెప్పుకోవచ్చు. పేరుకు తగ్గట్టే ఈ బ్రాండ్ రంగుల్లో కానీ.. ఫ్యాబ్రిక్‌లో కానీ.. డిజైన్స్‌లో కానీ.. సహజత్వాన్నే అద్దుతుంది. సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇదే ఈ బ్రాండ్ వాల్యూ. ధరలు మోస్తరు రేంజ్లో ఉంటాయి. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ డ్రెస్ : త్రీ పీస్ సెట్ బ్రాండ్: లేబుల్ అర్తెన్ ధర: రూ. 22,900 కుశాల్స్ జ్యూయెలరీ ఇది బెంగళూరుకు సంబంధించిన జ్యూయెలరీ బ్రాండ్. దీనికి దేశంలోని చాలా ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో స్టోర్స్ ఉన్నాయి. సరసమైన ధరలు.. చక్కటి డిజైన్లలో సిల్వర్ జ్యూయెలరీ ఈ బ్రాండ్ వాల్యూ. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ: ఇయర్ రింగ్స్ బ్రాండ్: కుశాల్స్ జ్యూయెలరీ ధర:రూ. 1,980 నాకు ఎల్లో కలర్, హెవీ ప్రింట్స్ అంటే చాలా ఇష్టం. మాక్సీ స్కర్ట్స్, ఒంటికి హత్తుకునేట్టుండే బ్లౌజెస్ నా ఆల్ టైమ్ ఫెవరెట్ కాస్ట్యూమ్స్. – మడోన్నా సెబాస్టియన్ -దీపిక కొండి చదవండి: Surbhi Puranik: హీరోయిన్ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా? -
Fashion: డ్రెస్ కలర్లో ఉండే ఫ్యాబ్రిక్ జ్యువెల్లరీ.. ఇప్పుడిదే ట్రెండ్!
ఆభరణం అంటే..మనకు బంగారం, వెండి ఇతర లోహాలతో చేసిన నగలే కళ్ల ముందు నిలుస్తాయి. అలా కాకుండా డ్రెస్ కలర్లో ఉండే ఫ్యాబ్రిక్ జ్యువెల్లరీ ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. డ్రెస్ ఫ్యాబ్రిక్‌నే జ్యువెల్రీ మేకింగ్‌లోనూ వాడుతూ ఆభరణాలను రూపొందించుకోవడంపై దృష్టి పెడుతోంది నేటి తరం. డ్రెస్‌ను పోలినట్టుగా ఉండే చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ ఎంపిక మనకు తెలిసిందే. అలాగే, డ్రెస్‌లోని మెటీరియల్‌తోనే ఆభరణమూ ధరిస్తే... ఆ అందం ఇనుమడిస్తుందని నేటి వనితల ఆలోచన. అందుకే ఇలా ఫ్యాబ్రిక్‌తో రకరకాల ఆభరణాలు తయారు చేయడమే కాదు, వాటి ఎంపిక లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఒకేరంగులో చిన్న చిన్న మార్పులతో ఉండే ఈ ఆభరణాలు క్యాజువల్ వేర్‌గానూ, ఫ్యాషన్వేర్గానూ అందుబాటులో ఉంది. జరీ జిలుగులూ ఎంబ్రాయిడరీ మెరుగులు ఫ్యాబ్రిక్ దుస్తులపై ఎంబ్రాయిడరీ సొగసు గురించి మనకు తెలిసిందే. పట్టుచీరల అంచుల అందమూ పరిచయమే. ఎంబ్రాయిడరీ డ్రెస్ లేదా జరీ చీర పాతదైపోయిందని పక్కన పెట్టేసేవారు వాటి అంచులను జాగ్రత్తగా కట్ చేసి, ముచ్చటైన ఆభరణాలను రూపొందించుకోవచ్చు. వీటి తయారీలో కావల్సింది నచ్చిన క్లాత్, గట్టి ఫ్యాబ్రిక్, గమ్ లేదా సూదీ దారం, ఇయర్ హుక్స్... సెట్ చేసుకుంటే చాలు. కావల్సిన డిజైన్‌లో ఆభరణాలను రూపొందించుకొని డ్రెస్‌కు తగిన విధంగా ధరించవచ్చు. మేడ్ ఈజీ... వందల రూపాయల్లో అందరికీ అందుబాటులో ఉండే ధరలలో ఆకట్టుకునే ఈ ఆభరణాలు అన్ని వయసువారికీ ముఖ్యంగా కాటన్ డ్రెస్సులు, చీరల మీదకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెస్ట్రన్ వేర్ మీదకూ వినూత్నంగా వెలిగిపోతున్న ఫ్యాబ్రిక్ జ్యువెలరీ మేకింగ్ కూడా సులువుగానే ఉండటంతో నేటి వనిత విభిన్న రకాల డిజైన్స్‌లో ఫ్యాబ్రిక్ ఆభరణాలను తీర్చిదిద్దుతోంది. జర్మన్ సిల్వర్, బోహో స్టైల్... ఫ్యాబ్రిక్‌ను మెడకు హారంగా, చెవులకు హ్యాంగింగ్స్‌లా సెట్ చేశాక మరిన్ని ఆకర్షణలు జోడించాలంటే ఏదైనా లోహాన్ని జత చేయచ్చు. అందుకు జర్మన్ సిల్వర్, ట్రైబల్ జ్యువెలరీ పీసెస్‌ను ఎంపిక చేసుకొని ఫ్యాబ్రిక్ జత చేయచ్చు. చదవండి: Surbhi Puranik: హీరోయిన్ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా? -
Fashion: ఈ అనార్కలీ సెట్ ధర 46 వేలు! ఇయర్ రింగ్స్ 14,000 వేలు!
టాలీవుడ్లో పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందీ బాలీవుడ్ నటి.. సయీ మంజ్రేకర్. ‘గని’తో తెలుగు తెర మీద మెరిసింది. మేజర్‌తో మురిపించింది. ఆమె తండ్రి అటు నార్త్.. ఇటు సౌత్‌లో మంచి నటుడు, దర్శకుడు.. మహేశ్ మంజ్రేకర్. ఆయన నీడలో కాకుండా తన ప్రతిభతో ప్రయణం సాగించాలనుకుంటోంది. ఆమె స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఆమె అటైర్లో ప్రతిఫలింపచేస్తున్న బ్రాండ్స్ ఇవే.. జరియా ది లేబుల్ సంప్రదాయ భారతీయ హస్తకళలను సంరక్షించడానికి కృషిచేస్తున్న ‘కళా రక్షణ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలసి పనిచేస్తున్న ఫ్యాషన్ బ్రాండే జరియా ది లేబుల్. వ్యవస్థాపకురాలు సుప్రియా జైన్. దేశీ ఫ్యాబ్రిక్, పాశ్చాత్య డిజైన్స్ .. ఈ రెండిటి సమ్మేళనమే ఈ బ్రాండ్. అజ్రఖ్పూర్, కశ్మీర్ వంటి ప్రాంతాల ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ, అప్లిక్ వర్క్ వంటి కళానైపుణ్యాలే జరియా లేబుల్‌కి వాల్యూ. అంతా హ్యాండ్ మేడే. ధరలూ ఆ స్థాయిలోనే ఉంటాయి. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ: డ్రెస్: అన్కార్కలీ సెట్ బ్రాండ్: జరియా ది లేబుల్ ధర: రూ. 46,325 సంగీతా బూచ్రా రాజస్థాన్ సంప్రదాయ నగల స్ఫూర్తితో ఏర్పడిన బ్రాండే సంగీతా బూచ్రా జ్యుయెల్స్. వెండి నగలు ఈ బ్రాండ్ ప్రత్యేకం. అందుబాటులోనే ధరలు.. ఆన్లైన్లో నగలు. జ్యూయెలరీ ఇయర్ రింగ్స్ బ్రాండ్: సంగీతా బూచ్రా ధర: రూ. 14,000 ఈట్.. ప్రే.. లవ్.. నా ఫిలాసఫీ. ఆత్మపరిశీలన నాకు చేతకాదు. అదే నా బలహీనత. నా చుట్టూ ఉండేవాళ్లను మాత్రం సరదాగా.. సంతోషంగా ఉంచుతా. అది నా బలం. – సయీ మంజ్రేకర్ ∙దీపిక కొండి చదవండి: Beach Jewellery: అలంకరణకు కొన్ని గవ్వలు .. ధర రూ.100 నుంచి వెయ్యి వరకు! -
Fashion: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర రూ. 79,500! స్పెషాలిటీ?
లైట్ పర్పుల్ కలర్ లెహెంగాలో .. అంతకన్నా లైట్ మేకప్‌తో .. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మెరిసిపోతున్న ఆ సెలబ్రిటీని గుర్తుపట్టారా? రుక్సర్ థిల్లాన్ అంటున్నారు కదా యూత్ అంతా ముక్త కంఠంతో. కరెక్ట్! గతేడాది ఆమె సోదరి పెళ్లి వేడుకలోని ఆ దృశ్యం. రుక్సర్ను పరిచయం చేయడానికి ఆమె నటించిన తెలుగు సినిమాల పేర్లు .. ఆకతాయి, కృష్ణార్జున యుద్ధం! తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం! ఈ ఫంక్షన్లో ఆమె అటైర్గా మారిన బ్రాండ్స్ వివరాల మీదకూ చూపు మరల్చండి.. వివాణి ‘మనం వేసుకునే దుస్తులు మన అభిరుచినే కాదు మన ఐడెంటినీ వ్యక్తపరుస్తాయి’ అంటారు వాణి వాట్స్. అనడమే కాదు నమ్ముతారు కూడా. ఆ నమ్మకంలోంచి వచ్చిందే మహిళల డ్రెస్ డిజైన్ బ్రాండ్ వివాణి. 2015లో ప్రారంభించింది. ప్రాచీన భారతీయ ఎంబ్రాయిడరీ కళకు మోడర్న్ ఫ్యాషన్ జోడించి సరికొత్త డిజైన్స్‌ను రూపొందించడమే వివాణి వాల్యూ. కాబట్టే ఆ బ్రాండ్ ఇప్పుడు భారతీయ హస్తకళా రాజసానికి పర్యాయంగా ప్రాచుర్యం పొందుతోంది. చిన్నప్పటి నుంచి ఆమెకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, హస్తకళలు, ఆర్కిటెక్చర్ అంటే ఆసక్తి. ఆ ఆసక్తే కొద్దే పర్ల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్స్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. వివాణిని సృష్టించింది. ది చాంద్ స్టూడియో ఏమ్‌బీఏ చదివిన అన్న దేవేశ్, ఎమ్మే సైకాలజీ చేసిన చెల్లి రిమ్ఝిమ్ల కలల ప్రాజెక్టే ‘ది చాంది స్టూడియో’ జ్యూయెలరీ. 1990లో రత్నాలు, వెండి నగల ఎగుమతితో ప్రారంభమైంది ఆ అన్నాచెల్లెళ్ల ఈ ప్రయాణం. వెండి నగల పట్ల ఈ ఇద్దరికీ ఉన్న అభిరుచి.. ఆ నగలకు మార్కెట్లో ఉన్న డిమాండ్, ఈ వ్యాపారంలో వాళ్లు గడించిన అనుభవం.. ఈ మూడు ‘ది చాంద్ స్టూడియో’ ఏర్పాటుకు ప్రేరణనిచ్చాయి. ఆకట్టుకునే డిజైన్స్, అందుబాటు ధరలు ఈ బ్రాండ్ యూఎస్పీ. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ : లెహెంగా బ్రాండ్: వివాణి ధర: రూ. 79,500 జ్యూయెలరీ: ఇయర్ రింగ్స్ ధర: రూ.2,800 మాంగ్ టీకా బ్రాండ్: ది చాంది స్టూడియో ధర: రూ.4,800 సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలనుంది. అంతేకాదు ప్రతిభావంతులైన ఎంతోమంది డైరెక్టర్స్ వస్తున్నారు. వాళ్లందరితోనూ పనిచేయాలనుంది. – రుక్సర్ థిల్లాన్ చదవండి👉🏾Varsha Mahendra: అక్కడ కేవలం బ్లవుజులే! ఒక్కో దాని ధర రెండున్నర వేల నుంచి 20 వేల వరకు.. -
Dancing Dolls: ఈ అందమైన ‘బుట్టబొమ్మ’లు మీ దగ్గర ఉన్నాయా?!
అలంకరణలో ఆభరణాలు అందులోనూ ప్రత్యేకమైన వాటినే అతివలు ఎప్పుడూ కోరుకుంటారు. అందుకే నాట్య బొమ్మలు ఆభరణాలుగా మగువల మెడలోనూ, చెవులకు ఇంపుగా మెరిసిపోతున్నాయి. బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా.. అంటూ చూపరులను పాడుకునేలా చేస్తున్నాయి. కూచిపూడి, భరతనాట్యం శాస్త్రీయ నృత్య రూపాలే కాదు వెస్టర్న్ స్టైల్లో బాలే డ్యాన్స్ భంగిమలు ఆభరణాల్లో కనువిందు చేస్తుంటే చూపు తిప్పుకోలేం. రత్నాలు పొదిగిన బంగారు బుట్టలు, లాకెట్లు.. వెండితో మురిసిన నాట్యమయూరాలు చెవులకు లోలాకులు అయితే ఎంత అందంగా ఉంటాయో కళ్లారా చూడాల్సిందే. పచ్చలు, కెంపులు, వజ్రాలు, కుందన్స్ తో మెరిపించిన ఈ ఆభరణాల జిలుగులు ఎంత చూసినా తనివి తీరవు. సంప్రదాయ వేడుకల సందర్భాలలోనే కాదు క్యాజువల్‌గా, ప్రత్యేక వెస్ట్రన్ పార్టీలకూ ధరించడానికి నాట్యాభరణాలను మన ఇంటి బుట్టబొమ్మల కోసం ఎంపిక చేసుకోవాల్సిందే అనిపిస్తున్నాయి. బంగారు, వెండి మాత్రమే కాకుండా ఇమిటేషన్, ఫ్యాషన్ జువెల్రీలోనూ ఈ ఆభరణాలు అందమైన నృత్య భంగిమల్లో కనువిందు చేస్తున్నాయి. -
సమంతకు క్రేజ్.. 10 లక్షల లైకులు
సినీ ప్రపంచం, ఫ్యాషన్ వరల్డ్‌లో కొత్తదనానికే మొదటి ప్రాధన్యత. దాంతో సినీ జనాలు, మోడళ్లు ఫ్యాషన్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు. కొత్త ట్రెండ్స్‌ను పరిచయం చేస్తారు. ఈ విషయంలో అక్కినేని వారి కోడలు సమంత ఓ అడుగు ముందే ఉంటారని చెప్పవచ్చు. దుస్తుల విషయంలో గానీ, ఆభరణాల విషయలో గానీ ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుంటారు సమంత. (సమంత బ్యూటీ థెరపీ వీడియో ) View this post on Instagram New piercings 😎 A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Aug 17, 2020 at 11:24pm PDT తాజాగా సమంత ఇయర్ రింగ్స్ తెగ ట్రెండ్ అవ్వడమే కాక యువతులును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. వీటిలో సమంత ఏకంగా ఐదు చిన్న చిన్న చెవి దుద్దులు ధరించారు. డైమండ్, ఇతర మెటల్స్‌తో తయారు చేసిన ఈ చిన్న చిన్న స్టడ్స్ యువతులను తెగ ఆకర్షిస్తున్నాయి. ‘న్యూ పియర్సింగ్స్’ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోను ఇప్పటికే 10 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ‘సూపర్బ్.. ఫ్యాషన్‌లో మీకు మీరే సాటి’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. మీరు చూసి.. నచ్చితే ఫాలో అవ్వండి. -
ట్వింకిల్ చెవులకు.. అక్షయ్ అరుదైన గిఫ్ట్
సాక్షి, ముంబై : భర్త ఇచ్చిన ప్రియమైన కానుకను ఆమె ధరించింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాకు ప్రేమతో ఉల్లిపాయలతో చేసిన ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ట్వింకిల్ ఖన్నా ఆ ఇయర్ రింగ్స్‌ను పెట్టుకున్నారు. అంతేకాకుండా తన చెవులకు ఆ ఆనియన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఉన్న ఫోటోను ఆమె షేర్ చేశారు. ఇయర్ రింగ్స్ ఒక షూట్ నుంచి మరొక షూట్ వరకూ ఎలా ప్రయాణించాయో కదా అని ట్వింకిల్ వ్యాఖ్యానించారు. అయితే కొంతమంది నెటిజన్లు వావ్ అంటూ అభినందించగా, మరికొందరు అబ్బే బాగోలేదంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కియార అద్వానీలతో తెరకెక్కిన గుడ్‌న్యూస్ మూవీ ప్రమోషన్ కోసం అక్షయ్ ఇటీవల కపిల్ శర్మ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ షో నుంచి అక్షయ్ ఉల్లిపాయలతో చేసిన చెవి రింగులను తెచ్చి ట్వింకిల్‌కు అందించగా ...ఆమె వాటిని సంతోషంగా స్వీకరించారు. తనకు అక్షయ్ నుంచి మంచి బహుమతి లభించిందని.... కొన్ని సార్లు చిన్నవిషయాలు సైతం మన మనసుల్ని తాకుతాయి అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. -
విన సొంపు
చెవులకు దుద్దుల్లా పెట్టుకోనక్కర్లేదు... బుట్టల్లా బరువును మోయక్కర్లేదు హుక్‌ని తగిలించుకుంటే చాలు... చెవిని మొత్తం కప్పుతూ... హ్యాంగింగ్‌లా మెరుస్తూ జూకాలా జిగేల్మంటూ... మదిని దోచుకుంటున్నాయి. ‘బంగారమైనా సరే అలా చెవిని మొత్తం కప్పేస్తే ఎలా వినపడుతుందంటావూ...’ అనే గుసగుసలు మానేసి అంతా కళ్లప్పగించి చూడాల్సిందే! గిరిజనుల ఆభరణాలు ఫ్యాషన్ జువెల్రీలో ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ బంగారు ఆభరణాలనూ హత్తుకుని కనువిందు చేస్తుంది. చెవికి నిండుదనాన్ని తీసుకువచ్చే ఈ ఆభరణాలలో జూకాల నుంచి ఎన్నో వైవిధ్యమైన డిజైన్లు వస్తున్నాయి. రంగు రంగు రత్నాభరణాలతో చేసిన లేయర్డ్ హ్యాంగింగ్ కఫ్స్ కూడా ఇండోవెస్ట్రన్ స్టైల్లో మెరిపిస్తుంటే.. చెవిని పూర్తిగా కప్పినట్టుగా ఉండే ఈ గోల్డ్ కఫ్స్ సంప్రదాయ వేడుకలలో ఆకర్షణగా నిలుస్తున్నాయి. ►కింది బుట్ట, కఫ్ రెండూ కలిపి ఒకే తరహా డిజైన్‌తో ఉంటాయి. ►వీటిని చెవికి పెట్టుకోకుండా హుక్తో తగిలించుకుంటే చాలు. ►వీటిలో నెమిలి, పువ్వులు–లతలు, దేవతామూర్తుల డిజైన్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. -
చెవిన వేసుకోండి
ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండీలుక్‌నే ఇస్తాయి. మరీ ముఖ్యంగా చెవుల నుంచి భుజాల వరకు వేలాడే హ్యాంగింగ్స్‌ను చూస్తే ఎవరికైనా ఒకసారి పెట్టుకోవాలని మనసు పోతుంది. ఎవరైనా పెట్టుకున్నప్పుడు అవి బాగున్నాయని అలాంటివే కొంటే... అవి మన ముఖానికి నప్పకపోతే ఎలా? అందుకే మన ముఖాకృతిని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ►ఓవల్ షేప్ ముఖానికి ఏ మోడల్ అయినా చక్కగా నప్పుతుంది. చెవులకు అంటినట్లుండే దిద్దుల నుంచి మీడియం సైజు లోలకుల వరకు అన్నీ బాగుంటాయి. ఇక భుజాలను తాకే హ్యాంగింగ్స్ అయితే చెప్పక్కరలేదు. ఎంతమందిలో ఉన్నా ప్రతి ఒక్కరి దృష్టి వాటి మీద, వాటిని అలంకరించుకున్న వాళ్ల మీద కొన్ని సెకన్లపాటు కేంద్రీకృతమవుతుంది. ఈ ఫేస్‌కట్‌కి మెటల్, బీడ్స్, స్టోన్స్ ఏవైనా నప్పుతాయి. ►స్క్వేర్ ముఖాకృతి ఉన్న వాళ్లు కొంచెం జాగ్రత్తగా ఎంచుకోవాలి. ముఖం ఆకారానికి పూర్తి విరుద్ధంగా ఉండాలి చెవి ఆభరణాలు. కొట్టొచ్చినట్లు కనిపించేవిగా కాకుండా పొందికగా ఉన్నట్లనించే మోడల్స్ తీసుకోవాలి. అందులో వాడిన బీడ్స్ రంగులు కూడా హుందాగా ఉండాలి. ►హార్ట్ షేప్ ముఖానికి చెవుల దగ్గర తక్కువగా ఉండి కింద వేళ్లాడే భాగం వెడల్పుగా ఉంటే ముఖం అందంగా కనిపిస్తుంది. దీనినే ట్రయాంగిల్ ఫేస్ అని కూడా అంటారు. నుదురు వెడల్పుగా ఉండి చెంపలు పలుచగా, కింది దవడలోపలికి, గడ్డం కొనదేలి ఉంటుంది. చెవుల నుంచి గడ్డం మధ్యలో ఉన్న గ్యాప్‌ని హ్యాంగింగ్స్ ద్వారా కవర్ చేయగలిగితే ఆ ఇయర్ రింగ్స్ వాళ్ల కోసమే డిజైన్ చేశారా అన్నట్లుంటుంది. ►రౌండ్ ముఖానికి ఇయర్ రింగ్స్ సైజు, పొడవు మీద దృష్టి కేంద్రీకరించాలి. మెడ పొడవును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పొడవు హ్యాంగింగ్స్ కాని మీడియం సైజు లేదా చెవిని అంటిపెట్టుకుని ఉంటే దిద్దులు ఏవైనా బావుంటాయి. వాటి డిజైన్‌లో రౌండ్ ఉండకూడదు, ఓవల్ షేప్ కాని, నలుచదరం లేదా ఒకదాని కింద మరొకటిగా వేలాడదీసినట్లు ఉండాలి. ఈ ముఖానికి బీడ్స్ కూడా అందం తెస్తాయి. -
ఎవర్గ్రీన్ జూకాలు
ఆభరణాల ఎంపికలోనూ, ధరించడంలోనూ ఈ తరం చాలా అధునాతనంగా ఆలోచిస్తోంది. ఆ ఆలోచనలను అందిపుచ్చుకుంటూ అధునాతన డిజైన్స్ వైపు దృష్టి పెడుతూనే సంప్రదాయ డిజైన్స్‌నూ మిళితం చేస్తున్నారు. ప్రఖ్యాత ఫ్యాషన్ అండ్ జువెల్రీ డిజైనర్ రోహిత్బాల్తో కలిసి రెండేళ్ల పాటు వర్క్ చేశాను. వజ్రాభరణాల డిజైన్స్లోని శిల్పకళను అర్ధం చేసుకున్నాను. ఇప్పుడు యంగర్ జనరేషన్ కాలేజీ, ఆఫీస్, ఫంక్షన్ ఇలా వేటికవి సందర్భానుసారం వజ్రాభరణాలను ధరించడంలో ఆసక్తి చూపుతోంది. వారి ఆలోచనలకు తగ్గట్టు వన్ టచ్ ఝుమ్ కా కలెక్షన్‌ని తీసుకువచ్చాం. వజ్రం ఖరీదులోనే కాదు కానుకల్లోనూ విలువైనది. అలాంటి వజ్రాభరణాలను ఎంపిక చేసుకోవాలంటే అవి తరతరాలకూ నచ్చేలా ఉండాలి. అలా ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచేపోయే డిజైన్స్ ఇవి. ♦ మ్యాంగో మోటిఫ్ జుంకీలది భారతీయ సంప్రదాయ డిజైన్. ఎన్నాళ్లైనా, తరతరాలకూ ఈ డిజైన్ మారదు. ♦ ఆకు మోటిఫ్, బెల్ షేప్డ్ డిజైన్ జూకాలు. ప్రాచీన కళ ఉట్టిపడే ఈ ఎప్పటికీ ఆకట్టుకుంటుంది . ♦ చంద్రుడు, నక్షత్రాలను పోలి ఉండేవి అచిరకాలం నిలిచే డిజైన్. ♦ కలువ పువ్వును పోలిన మోటిఫ్స్. ప్రతీ వేడుకలోనూ వైవిధ్యంగా వెలిగిపోతాయి.– సీమా మెహతా, ఆభరణాల నిపుణులు, కీర్తిలాల్స్ -
చెవికి ముక్కెర
‘ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా..’ అని పాడుకునే రోజులు కావివి. చెవినింటిలో కొత్తగా చేరిన ఆభరణం గురించి మాట్లాడుకోవాలి అంతా. కొత్త ఎప్పుడూ వింతే కాబట్టి ఈ వింత గురించి కొంత మాట్లాడుకుందాం. చెవికి జూకాలు, దుద్దుల నుంచి సెకండ్ స్టడ్ రింగ్స్ కూడా పెట్టేసుకొని ముచ్చటపడిపోయాం ఇన్నాళ్లూ. ఇప్పుడా ముచ్చట మరి కాస్త లోపలికి అదేనండి చెవిలోపలికి దూరింది. గిరిజనుల స్టైల్ ఇప్పుడు అమ్మాయిలకు బాగా నచ్చుతున్నట్టుగా ఉంది. అందుకే చెవి లోపలివైపుగా ఉండే డెయిత్కు ముక్కెరలాంటి రింగ్ ను పెట్టుకుంటున్నారు. ఇవి ప్రెస్ చేసేవి, పూర్తిగా సెట్ చేసేవి వచ్చాయి. చెవికి చుట్టూత స్టడ్స్‌తో నింపే స్టైల్ నుంచి చెవికి మధ్య గోడలా ఉండే అమరికకు అందమైన రింగు తొడిగి అబ్బురపరుస్తున్నారు. ఈ స్టైల్‌నీ మీరూ ట్రై చేయచ్చు. -
చిచ్చురేపిన చెవిదిద్దులు..
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్: భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదంలో బుధవారం రాత్రి మోరంపూడి సాయినగర్‌కు చెందిన లావేటి రాజరాజేశ్వరి(19) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏడాదిన్నర క్రితం పెట్రోలు బంకులో పని చేస్తున్న సమయంలో రాజరాజేశ్వరి ఆటోడ్రైవర్ లావేటి మోహన్ల మధ్య స్నేహం ప్రేమగా మారి కొవ్వూరు కృష్ణునిగుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం మోరంపూడి సాయినగర్‌లోని రేకులో షెడ్డులో కాపురం ఉంటున్నారు. రాజేశ్వరికి తల్లి పోలవరపు వరలక్ష్మి సుమారు నాలుగు గ్రాములు బంగారపు చెవిదిద్దులు చేయించి ఇచ్చింది. అయితే తల్లికి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కుమార్తెకి చెందిన చెవిదిద్దులను తీసుకుని వెళ్లి తనఖాపెట్టారు. దీంతో బుధవారం రాజేశ్వరి, మోహన్ల మధ్య ఈ విషయంపై వాగ్వివాదం చోటుచేసుకుంది. రాజేశ్వరి ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో రాత్రి 7.30 గంటలకు ఆమె కుమార్తె ఇంటికి వచ్చి అల్లుడితో మాట్లాడింది. అయితే మోహన్ తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, ఆ చెవిదిద్దులు ఇస్తే తనఖాపెట్టి ఇబ్బందులు తొలగించుకుంటానని తెలిపాడు. దీంతో అత్త వరలక్ష్మి ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, తరువాత విడిపిస్తానని తెలిపింది. ఈ లోపు అల్లుడు కోపంతో బట్టల బ్యాగు తీసుకుని ఆటో వేసుకుని వెళ్లిపోయాడు. ఈలోపు తల్లి, తమ్ముడు బయట మాట్లాడుకుండగానే లోపలికి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాజేశ్వరి రాలేదు. దీంతో తల్లి వరలక్ష్మి లోపలికి వెళ్లి చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంది. వెంటనే ఉరి విప్పి రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే రాజేశ్వరి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. రాజేశ్వరి తల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఇన్స్పెక్టర్ కేఎన్ మోహన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో తహసీల్దార్ కె.పోసిబాబుశవపంచనామా నిర్వహించారు. -
పూసలతో హ్యాంగింగ్స్
మోడ్రన్ డ్రెస్సుల మీదకు ఫ్యాషన్ జువెల్రీలో ఎన్ని మోడల్స్ ఉన్నా సరిపోవు. కొన్ని రకాల ఇయర్ హ్యాంగింగ్స్తోనూ లుక్‌లో గొప్ప మార్పు తీసుకురావచ్చు. ఈ ముచ్చటైన ఇయర్ హ్యాంగింగ్స్ మీరే డిజైన్ చేసుకోవచ్చు. ♦ నచ్చినవి మూడు రకాల పూసలు (పొడవు పూసలకు రెండువైపులా రంధ్రాలు ఉంటాయి) ♦ హుక్‌కి కావల్సిన తీగ లేదా హుక్స్ విడిగానూ లభిస్తాయి. ♦ ప్లాస్టిక్ వైర్ తయారీ: 1. పొడవు పూసలను వైర్‌తో ఇలా గుండ్రటి షేప్ వచ్చేలా గుచ్చాలి. 2. చిన్న గోల్డ్ బాల్స్‌ని చివరలో, మధ్యలో పెద్ద తెల్లని పూస వచ్చేలా వైర్‌తో గుచ్చి సెట్ చేసుకోవాలి. 3. పూసలన్నీ ఇలా ఒక షేప్ వచ్చేలా గుచ్చాలి. 4. హ్యాంగింగ్ పూసను తెల్లటి పూసల వూర్కి అటాచ్ చేస్తూ హుక్తో జత చేయాలి. 5. గోల్డ్ కలర్ పూసలను చివరలను కలపుతూ గుచ్చాలి. 6. పై భాగంలో హుక్ లేదా సన్నని గోల్డ్ కలర్ తీగను తగిలించి, పట్టుకారతో సెట్ చేయాలి. 7. బొమ్మలు చూపిన విధంగా రెండు హ్యాంగింగ్స్‌ను ఇలా తయారుచేసుకోవాలి. -
ఆమె ముడిసరుకు తెలిస్తే షాక్ అవాల్సిందే
ఆకర్షణీయమైన వస్తువులు, బ్యాగులు, చెవి రింగులను కళాత్మకంగా ఎవరైనా చేస్తారు. అందుకోసం రాళ్లు, బంగారం, వెండి ఇలా ఏవేవో వాడుతుంటారు. వెంట్రుకలతో, కుట్టు మిషన్లతో ఇలా కాదేదీ కళకనర్హం అన్నట్లు అన్ని వస్తువులను వాడేశారు కళాకారులు. అయితే వీరందరికీ భిన్నాతిభిన్నంగా బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌కు చెందిన అలైస్ పాట్స్ ఆలోచించారు. మహిళల కోసం పలు రకాల ఉత్పత్తులను భిన్నమైన పదార్థాలతో తయారు చేసి చాలా ఫేమస్ అయిపోయారు. ఎందుకంటే వాటిని తయారు చేసేందుకు ఆమె ఎంచుకున్న ముడిసరుకు తెలిస్తే షాక్ అవాల్సిందే. అవేంటో తెలుసా.. మన శరీరం నుంచి ఉత్పత్తయ్యే చెమట, మూత్రం, రక్తం! ఏంటీ వీటితో ఎలా తయారు చేస్తారనుకుంటున్నారా..? వీటి నుంచి తెల్లగా మెరిసే స్ఫటికాలను తయారు చేసి బట్టలను చాలా అందంగా ముస్తాబు చేస్తారట. ప్లాస్టిక్‌ను వాడే కన్నా వీటితో తయారు చేస్తే ప్రకృతికి కూడా మేలు చేసినట్లవుతుందని పాట్స్ చెబుతున్నారు. ఇటీవల కాలేజీ ఫ్యాషన్ షోలో ఆమె చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచితే అనూహ్య స్పందన వచ్చింది. -
చెవి పోగు కోసం హత్య..!
టీ.నగర్: చెవి పోగు కోసం స్నేహితుడిని హత్య చేసిన అన్నదమ్ములను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ సంఘటన చెంగల్పట్టు సమీపంలో ఆదివారం జరిగింది. వివరాలు.. చెంగల్పట్టు తట్టాన్‌మలై వీధికి చెందిన ఉమాపతి కుమారుడు నవీన్ కుమార్ (18). ఇతను పదో తరగతి వరకు చదివి స్నేహితులతో కలిసి గంజాయి, మద్యం తరలింపుల్లో పాల్గొంటున్నాడు. ఇతనిపై టౌన్ పోలీసు స్టేషన్లో ఒక కేసు ఉంది. ఇలా ఉండగా నవీన్ కుమార్‌కు తట్టాన్‌మలై వీధి సమీపంలోని కేకే వీధికి చెందిన యువకులతో పాతకక్షలు ఉన్నాయి. ఆదివారం పెరియనత్తం ముమ్మలై ప్రాంతంలో కాళ్లు చేతులు కట్టిన స్థితిలో నవీన్ కుమార్ మృతిచెందాడు. పాతక్షల కారణంగా హత్య జరిగి ఉండవచ్చన్న కారణంతో పోలీసులు విచారణ జరిపారు. ఇందు కోసం పోలీసు ప్రత్యేక బృందాలు విచారణ జరిపాయి. దీనికి సంబంధించి అన్నదమ్ములు ప్రవీణ్ కుమార్, అబిలను అరెస్టు చేశారు. వారి వద్ద విచారణ జరపగా.. నాలుగు నెలల కిందట నవీన్‌కుమార్ వేసుకున్న చెవి పోగును ప్రవీణ్ కుమార్ అడిగాడు. నవీన్‌కుమార్ ఇందుకు వీళ్లేదని తెలిపాడు. రూ.50 చెవి పోగును ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడన్న ఆగ్రహంతో తమ్ముడు అబితో చెప్పి ఆవేదన చెందాడు. దీంతో ప్రవీణ్ కుమార్, అబి కలిసి నవీన్ కుమార్‌ను హత్య చేసినట్లు తెలిసింది. -
చెవులకు కఫ్స్
చెవి బుట్టలు, రింగులు, హ్యాంగింగ్స్‌లో వచ్చిన ఎన్నో డిజైన్లు తెలిసినవే. చెవి మొత్తాన్ని సింగారిస్తూ, చూడగానే ఆకట్టుకునే ఇయర్ కఫ్స్ నేటితరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జుంకీలుగా వేలాడుతూ.. చెవి అంచుల వరకు ఉండేవి కొన్ని. మరికొన్ని దుద్దుల్లా చెవి భాగాన్ని పై వరకు పట్టి ఉంచుతాయి. ఈ కఫ్ ఇయర్ రింగ్స్ చెవినుండి పక్కకి పడిపోకుండా పోగు పైభాగంలో చిన్న కొక్కెం ఉంటుంది. రంధ్రం అక్కర్లేకుండా దాన్ని చెవికి పట్టి ఉంచేలా నొక్కితే సరిపోతుంది. డిజైన్స్ విషయానికి వస్తే లతలూ, పువ్వులూ, చేపలూ, జంతువుల బొమ్మలతో పాటు ఎన్నో ఫంకీ డిజైన్లు వీటిలో వస్తున్నాయి. బంగారమే కాదు బ్రాస్, స్టీల్.. ఇతర లోహాలతోనూ ఇయర్ కఫ్స్ ఆకట్టుకుంటున్నాయి. వీటిని సందర్భాన్ని బట్టి ధరించవచ్చు. -
తేడా తెలుసుకోగలిగారా?
పొద్దున లేచిన దగ్గర్నుంచి ఉరుకులు పరుగులు. లైఫ్ ఫుల్ బిజీ అయిపోయింది. జిందగీ గురించి ఇప్పుడు బాతాఖానీ పెడితే...అబ్బో బోలెడు టైమ్ ఖతమ్ అవుతుంది. దాని మానాన దాన్ని వదిలేద్దాం. ఈ రోజు మాత్రం సరదాగా ఓ గేమ్ ఆడదాం. ప్లేగ్రౌండ్ బ్యాగ్రౌండ్ లేని ఓ గేమ్ ప్లే చేద్దాం. అలాగని ఇండోర్ గేమ్ కాదు. బట్ అలాంటిదే. బ్రెయిన్ గేమ్ అన్నమాట. మేటర్ కంటిన్యూ చేయండి. గేమ్ స్ట్రాటజీ ఏంటో మీకే తెలుస్తుంది. సరే.. పైన ఉన్న ఫొటో చూడండోసారి. ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా? అందాల భామ ప్రగ్యా జైస్వాల్ అని మీకు తెలుసు. ఈ ఫొటోలో ఓ తేడా ఉంది. కనుక్కోగలిగారా? లేకపోతే ఇంకోసారి చూడండి. మళ్లీ మళ్లీ ప్రగ్యాని చూడండి. అబ్బా.. ఎన్నిసార్లు చూడాలి? అనుకుంటున్నారా. అయితే చిక్కుముడి విప్పేస్తాం. ఓసారి ప్రగ్యా జైస్వాల్ పెట్టుకున్న చెవి దిద్దులను చూడండి. రెండూ డిఫరెంట్‌గా ఉన్నాయి. ‘‘మనం రెండు డిఫరెంట్ సెట్స్ ఇయర్ రింగ్స్‌ని ట్రై చేసి నప్పుడు, ఒక సెట్‌ని సెలక్ట్ చేసుకుంటాం. అయితే పెట్టుకునేటప్పుడు ఆ సెట్‌ది ఒక చెవికి, మరో సెట్‌ది ఇంకో చెవికి పెట్టుకుంటేనే ప్రాబ్లమ్. అయితే ఒక్కోసారి మరచిపోతాం. అయినా గాబారా పడొద్దు. ఎందుకంటే మనం చెబితే తప్ప గుర్తుపట్టేవాళ్లు చాలా తక్కువ’’ అని ప్రగ్యా పేర్కొన్నారు. -
వి అంటే అతనేనా?
‘ప్యారులో పడిపోతే పరేషానురా..’ అని ‘ధృవ’లో ఒక పాట ఉంది. కరెక్టే.. ప్యారులో పడితే పరేషానే. ఎవరికీ వినిపించకుండా దొంగచాటుగా ఫోన్లు మాట్లాడుకోవడం, కనిపించకుండా తిరగడం.. అబ్బబ్బ... అంతా పరేషాన్. ఇప్పుడు నయనతార–దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ పరేషాన్లోనే ఉన్నారని చెన్నై టాక్. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలోకొచ్చినప్పటి నుంచి ఔత్సాహికరాయుళ్లు తమ దృష్టినంతా వాళ్ల మీదే పెట్టారు. ఇద్దరూ కలసి తిరిగితే.. స్మార్ట్ ఫోన్లో చాలా స్మార్ట్‌గా ఫొటోలు తీస్తున్నారు. చేతులు, మెడ.. ఇలా కంటికి కనిపించే శరీర భాగాల్లో ఏమైనా పచ్చబొట్లు ఉన్నాయా? అని అదే పనిగా వెతకడం మొదలు పెట్టారు. అలా వెతికిన ఓ రెండు కళ్లకు నయనతార చెవికి ఉన్న కమ్మలు కనిపించాయి. ‘వి’ ఆకారంతో అగుపించిన ఆ ఇయర్ రింగ్స్ గురించే ఇప్పుడు హాట్ టాపిక్. ‘వి’ అంటే ఏంటి? అనడిగితే ‘వ్యాన్’ అని చిన్నపిల్లలు చెబుతారు. విజయాల బాటలో దూసుకెళుతున్నవాళ్లు ‘విక్టరీ’ అంటారు. కానీ, ‘వి ఫర్ విఘ్నేష్ శివన్’ అన్నది కొందరి ఓపీనియన్. ప్రియుడి పేరు వచ్చేట్లుగా నయన ఇయర్ రింగ్స్ సెలక్ట్ చేసుకున్నారని అంటున్నారు. మరి.. ‘వి అంటే అతనేనా?’ నయనతారే చెప్పాలి. -
చెవి కమ్మలు ఇవ్వలేదని భార్యను హత్య..
మల్కాజిగిరి: చెవికమ్మలు అమ్ముకొని మద్యం తాగుతానంటే భార్య నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడో తాగుబోతు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి, మృతురాలి తమ్ముడు నరేష్ కథనం ప్రకారం...రంగారెడ్డిజిల్లా పూడూరుకు చెందిన ఆకుల ప్రభాకర్‌తో షాబాద్ మండలానికి చెందిన యశోద(32)కు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరు మల్కాజిగిరి వీణాపాణినగర్‌లో ఉంటున్నారు. యశోద తమ్ముడు నరేష్ అక్కకు తోడుగా ఉంటూ స్థానిక వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. క్యాటరింగ్ పనిచేసే ప్రభాకర్ తరచూ బయటకు వెళ్లి నెలల తరబడి కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. తాగుడుకు కూడా బానిసై తరచూ భార్యను వేధించేవాడు. చిత్తూర్ వెళ్లిన ప్రభాకర్ ఈనెల 2వ తేదీ రాత్రి ఇంటికి వచ్చాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని భార్యతో గొడవపడ్డాడు. డబ్బులు లేవని చెప్పడంతో చెవి కమ్మలు ఇస్తే అమ్ముకొని మందు తాగుతానని అన్నాడు. ఆమె నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్టు బావమరిది పని చేసే దుకాణానికి వెళ్లి మీ అక్క చనిపోయిందని చెప్పాడు. దీంతో నరేష్ బంధువులకు సమాచారం ఇవ్వగా అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ అక్కను బావ వేధించేవాడని, తన అక్క చావుకు అతనే కారణమని నరేష్ పేర్కొన్నాడు. గొంతు మీద కొన్ని గుర్తులు ఉన్నాయని, పోస్ట్‌మార్టం నివేదిక అందింతే పూర్తి వివరాలు తెలుస్తాయని, నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
లెదర్‌తో లవ్లీ ఐటమ్స్
నెలకు రెండు, మూడు జతల చెప్పులను వాడిపడేయడం మనలో చాలామందికి ఉన్న అలవాటే. అలాంటప్పుడు ఇంట్లోనే చెప్పులు తయారు చేసుకుంటే బాగుండని అందరికీ అనిపిస్తుంది. కానీ ఎలా చేసుకోవాలో తెలియదు. ఇక తెలిస్తే ఆగుతామా చెప్పండి. షాపుల్లో దొరికే లెదర్ తెచ్చుకొని ఇంట్లోనే చెప్పుల దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, నెక్లేస్లు, లాకెట్లు, బ్రేస్లెట్లు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో... కావలసినవి: రంగురంగుల లెదర్ షీట్స్ (షాపుల్లో దొరుకుతాయి), గ్లూ, కత్తెర, హుక్స్ (ఇయర్ రింగ్స్ తయారీకి) తయారీ విధానం: చెప్పుల తయారీకి.. ముందుగా లెదర్ షీట్‌ను ఫొటోలో కనిపిస్తున్న విధంగా కత్తెర సాయంతో కట్ చేసుకోవాలి (ఎవరి కాలి సైజుకు తగ్గట్టుగా). తర్వాత సైడ్లకు ఉన్న ముక్కలను ఒకదానికొకటి అతికించాలి. గట్టిగా ఉండాలనుకుంటే దారంతో కుట్టుకోవచ్చు కూడా. ఆపైన దానిపై ఓ పెద్ద బటన్ లేదా ఏదైనా కుందన్‌ను గ్లూతో అతికించుకుంటే అందంగా కనిపిస్తాయి. అలాగే ఇయర్ రింగ్స్ తయారీ కోసం వాటికి అనుగుణంగా లెదర్‌ను ఫొటోల్లో కనిపిస్తున్న విధంగా కట్ చేసుకొని, వాటికి చిన్న రంధ్రం పెట్టి హుక్‌ను బిగిస్తే సరి. కేవలం కాలిజోళ్లు, రకరకాల ఇయర్ రింగ్సే కాక నెక్లేస్, లాకెట్స్‌ను కూడా ఈ లెదర్‌తో సులువుగా తయారుచేసుకోవచ్చు. -
చెవి దుద్దులు,కాళ్ల పట్టీలు ఎత్తుకెళ్లాడు
హైదరాబాద్ : బాలికకు మాయమాటలు చెప్పి ఆమె బంగారు చెవికమ్మలను, కాళ్ల పట్టీలను ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడిషనల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన జానయ్య కూతురు ధరణి (13) ఆరో తరగతి చదువుతోంది. ఈ నెల 4వ తేదీన ఇంటి దగ్గర తమ్ముడితో కలిసి ఆడుకుంటుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పైన వచ్చి.. నీకు క్యారమ్బోర్డు కొనిస్తాను రమ్మని చెప్పడంతో శిరీషతో పాటు ఆ బాలిక తమ్ముడు కూడా బైక్‌పై ఎక్కారు. కొంత దూరం వెళ్లగానే బాలిక చెవిదుద్దులు, కాళ్ల పట్టీలు తీసుకుని వారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. సీసీ పుటేజీల ద్వారా లభించిన ఆ దొంగ ఫోటోను గుర్తించిన పోలీసులు ఆదివారం పత్రికలకు విడుదల చేశారు. దొంగ ఆచూకీ తెలిసిన వ్యక్తులు ఎవరైనా సెల్: 9490676378 నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.