Ecommerce market
-
త్వరలో ఈ–కామర్స్ ఎగుమతి హబ్‌లు
దేశంలో ఈ–కామర్స్ ఎగుమతి హబ్‌లను ఏర్పాటు చేసేందుకు డీహెచ్ఎల్, లెక్స్షిప్ సహా కొత్తగా అయిదు సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయిదింటిలో మూడు దరఖాస్తులను షార్‌లిస్ట్ చేసినట్లు, వీటిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు హబ్‌లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలో రాగలవని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని వివరించారు.కస్టమ్స్, సెక్యూరిటీ క్లియరెన్స్ మొదలైనవి వేగవంతం చేసేందుకు ఇందులో సదుపాయాలు ఉంటాయి. అలాగే నాణ్యత, సర్టిఫైయింగ్ ఏజెన్సీలు కూడా ఉంటాయి. హబ్‌లను నెలకొల్పిన సంస్థల స్పందనను బట్టి దేశవ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం సవివరంగా మార్గదర్శకాలను రూపొందిస్తుందని అధికారి పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అగ్రిగేటర్ సంస్థ షిప్‌రాకెట్, ఎయిర్‌కార్గో హ్యాండ్లింగ్ కంపెనీ కార్గో సర్వీస్ సెంటర్లను (సీఎస్సీ) ఇప్పటికే పైలట్ ప్రాతిపదికన ప్రభుత్వం ఎంపిక చేసింది.ఇదీ చదవండి: వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..2030 నాటికి ఈ–కామర్స్ ఎగుమతులు 100 బిలియన్ డాలర్లకు చేరవచ్చని, రాబోయే రోజుల్లో 200–250 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే, ప్రస్తుతం 800 బిలియన్ డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ఈ–కామర్స్ ఎగుమతులు 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ–కామర్స్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనాలో ఎక్స్పోర్ట్ హబ్‌లు గణనీయంగా ఉన్నాయి. -
దుమ్మురేపనున్న ఆన్లైన్ అమ్మకాలు, పండగ సీజన్లో రూ.90వేల కోట్ల బిజినెస్
మూడేళ్ల తర్వాత కొవిడ్ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో.. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. వెరసీ గత ఏడాదితో పోలిస్తే రాబోయే పండగ సీజన్లో ఆన్లైన్ విక్రయాలు గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ 18- 29 శాతం వృద్దితో రూ.90,000 కోట్లకు చేరుకోవచ్చంటూ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అంచనా వేసింది. ఆయా ఈ- కామర్స్ సంస్థలు నిర్వహించే ఫెస్టివల్ సేల్స్ అధికారిక తేదీలు ఇంకా బహిర్ఘతం కానప్పటికీ, ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్', అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' విక్రయాలు అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమవుతాయని అంచనా. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఇ-కామర్స్ అమ్మకాలు గణనీయమైన వృద్ధిని సాధించినప్పటికీ, ఈ రంగం గత రెండు త్రైమాసికాల్లో నామ మాత్రపు ఫలితాల్ని రాబట్టింది. జనవరి-జూలై 2023 కాలంలో, జీఎంవీ మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 10 శాతం పెరిగింది. ఏది ఏమైనప్పటికీ, కొవిడ్ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో, రాబోయే పండుగ సీజన్లో ఆన్లైన్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఈ పండగ విక్రయాల్లో దాదాపు 14 కోట్ల మంది పాల్గొనవచ్చని, వీరు కనీసం ఒక్కసారి అయినా కొనుగోళ్లు చేసే అవకాశం ఉందని వివరించింది. భారత ఇ-కామర్స్ సంస్థలు ప్రత్యేక పండగ విక్రయాలు ప్రారంభించి 2023కు పదేళ్లు పూర్తికానుంది. ఈ సమయంలో భారత ఇ-కామర్స్ స్థూల మర్చండైజ్ విలువ (జీఎంవీ) దాదాపు 20 రెట్లు వృద్ధి చెందింది. వార్షిక కొనుగోలుదార్ల సంఖ్య దాదాపు 15 రెట్లు అధికమైంది. 2014లో ఇ-కామర్స్ పరిశ్రమ పూర్తి ఏడాదిలో రూ.27,000 కోట్ల జీఎంవీ నమోదు చేయగా.. 2023లో దాదాపు రూ.5.25 లక్షల కోట్ల జీఎంవీకి చేరే అవకాశం ఉంది. ఈ సంవత్సరం పండుగ సీజన్లో బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, గృహ, ఫ్యాషన్, సాధారణ వస్తువుల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని రెడ్‌సీర్ నివేదిక హైలెట్ చేసింది. -
రానున్న రోజుల్లో టాయ్స్ ఎక్స్ పోర్ట్ హబ్ గా ఏపీ..
-
అమెజాన్ సేల్.. 5జీ స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్.. సమ్మర్ ఆఫర్ గురూ!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ 5జీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మే 27 నుంచి మే 31 వరకు జరిగే ఈ సేల్‌లో 5జీ స్మార్ట్ఫోన్లు వన్‌ప్లస్, రియల్మీ, శాంసంగ్‌తో పాటు ఇతర బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. కొనుగోలు దారులు ఈ ప్రత్యేక సేల్‌లో రూ.1,666 నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ ృపొందవచ్చని వెల్లడించింది. అదనంగా, అమ్మకాలు జరిగే సమయంలో ఎక్ఛేంజ్ ఆఫర్లో రూ.10,000 వేల వరకు బోనస్ పొందవచ్చు. ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లకు 24 నెలల పాటు ఎంపిక చేసుకున్న ఫోన్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని ఓ ప్రకటనలో పేర్కొంది. ఐక్యూ 11 5జీ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2ప్రాసెసర్ అందుబాటులో ఉన్న ఐక్యూ 11 5జీ స్మార్ట్ ఫోన్‌పై రూ.5వేల వరకు ఎక్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. 9 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ఈ ఫోన్ 2కే ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. రెడ్మీ నోట్15 జీ రెడ్మీ నోట్12 5జీ కొనుగోలు దారులకు రూ.2,000 వరకు ఎక్ఛేంజ్ డిస్కౌంట్‌తో పాటు పలు బ్యాంక్‌లు అందించే ఆఫర్లు సైతం వినియోగించుకోవచ్చు. ఈ రెడ్మీ 5జీ ఫోన్ 120 హెచ్‌జెడ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4జనరేషన్ 1 5జీ ప్రాసెసర్, 48 ఎంపీ ఏఐ ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తుంది. షావోమీ 13 ప్రో షావోమీ 13 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2, 4 ఎన్ఎం ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.71,999 ఖరీదైన ఈ ఫోన్‌ను అమెజాన్, బ్యాంక్‌లు ఇచ్చే మొత్తం ఆఫర్లను కలుపుకొని ఎక్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ.10,000 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్లో 6.73 అంగుళాల 2కే 120 హెచ్‌జెడ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 4,820 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్ ధర రూ.55,499 కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్ఛేంజ్ బోనస్ కింద రూ.10,000 వరకు తగ్గింపు ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు 9 నెలల పాటు నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. ఈ ఫోన్లో 48 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8ఎంపీ టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. వన్ ప్లస్ 10 ఆర్ 5జీ వన్ ప్లస్ 10 ఆర్ 5జీ ధర రూ. 32,999గా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ సేల్‌లో ఈ ఫోన్‌పై రూ. 3వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ లభిస్తుంది. 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా ఫోన్ వెనుక భాగంలో ఉంది. శాంసంగ్ ఎం14 5జీ శాంసంగ్ ఎం14 5జీ 6.6 ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే, 5ఎన్ఎం ప్రాసెసర్, 50ఎంపీ ట్రిపుల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ రూ. 15,490 కి కొనుగోలు కొనుగోలు చేయొచ్చు. రూ. 500 ఎక్స్చేంజ్ ఆఫర్లతో పాటు బ్యాంక్‌లు అందించే ఆఫర్లు ఉన్నాయి . రియల్మీ నార్జో 50 5జీ రియల్మీ నార్జో 50 5జీ 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 810 5జీ, పవర్ ఫుల్ గేమింగ్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో 3,000 డిస్కౌంట్ లభిస్తుండగా.. రూ.14,249 కే కొనుగోలు చేయొచ్చు. చదవండి👉 అంతా బాగుంది అనుకునేలోపు యూట్యూబర్లకు ఊహించని షాక్! -
అమెజాన్ పే కంపెనీకి ఆర్బీఐ జరిమానా
ముంబై: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన ఆన్లైన్ పేమెంట్స్ ప్రాసెసింగ్ సర్వీసుల్లో ఉన్న అమెజాన్ పే ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.3.06 కోట్ల జరిమానా విధించింది. ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు, నో యువర్ కస్టమర్ (కేవైసీ) అంశాల్లో కొన్ని నిబంధనలను పాటించకపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూ పాలని సూచిస్తూ గతంలోనే కంపెనీకి ఆర్బీఐ నోటీసు జారీ చేసింది. అమెజాన్ పే ప్రతిస్పందనను పరిశీలించిన అనంతరం పెనాల్టీ విధించింది. -
కార్ల అమ్మకాల్లో కార్స్24 దూకుడు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఎన్బీఎఫ్సీ విభాగం ఆకర్షణీయ ఫలితాలు సాధించనున్నట్లు సెకండ్‌హ్యాండ్(ప్రీఓన్డ్) వాహనాల ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ కార్స్24 అంచనా వేస్తోంది. వినియోగించిన కార్లకు కనిపిస్తున్న భారీ డిమాండు నేపథ్యంలో 80–100 శాతం వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఎంవో గజేంద్ర జంగిడ్ పేర్కొన్నారు. గతేడాది(2021–22) నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ) విభాగం రూ. 75 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇందుకు ప్రీఓన్డ్ కార్ల ఫైనాన్సింగ్ బిజినెస్ దోహదం చేసింది. 2019లో కంపెనీ ఎన్బీఎఫ్సీ లైసెన్సును పొందింది. తద్వారా కన్జూమర్లకు రుణాలివ్వడం ప్రారంభించినట్లు గజేంద్ర తెలియజేశారు. కంపెనీ ద్వారా విక్రయమవుతున్న ప్రతీ 2 కార్లలో ఒకదానికి ఫైనాన్స్ అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా ప్రీఓన్డ్ కార్ల విభాగంలో ఫైనాన్సింగ్ అవకాశాలు అతిస్వల్పమని వివరించారు. దీంతో ఎన్బీఎఫ్సీ లైసెన్సును తీసుకున్నట్లు వెల్లడించారు. -
స్మార్ట్‌ఫోన్ బొనాంజా: నిముషానికి ఎన్ని ఫోన్స్ కొన్నారో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిముషానికి 1,100 మొబైల్ ఫోన్లు.. పండగల సీజన్ విక్రయాల్లో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల వేదికలపై నాలుగు రోజుల్లో అమ్ముడైన సంఖ్య ఇది. వీటి విలువ రూ.11,000 కోట్లు అని కన్సల్టెన్సీ కంపెనీ రెడ్‌సీర్ వెల్లడించింది. ‘సెప్టెంబర్ 22-25 మధ్య ఈ–కామర్స్ సంస్థలు రూ.24,500 కోట్ల వ్యాపారం నమోదు చేశాయి. సేల్-1 అంచనా విక్రయాల్లో ఇది 60 శాతం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌తోపాటు మింత్రా, అజియో, నైకా తదితర వేదికలు సేల్-1లో ఉన్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఫ్యాషన్ విభాగం నాలుగున్నర రెట్లు అధికంగా అమ్మకాలు జరిగి రూ.5,500 కోట్లకు చేరుకున్నాయి’ అని వివరించింది. -
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్‌పై 300కి పైగా సహకార సంఘాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్కెట్‌ప్లేస్ (ఆన్లైన్ క్రయ, విక్రయ వేదిక/ఈ కామర్స్) ‘జెమ్’ పోర్టల్‌లో 300 వరకు కోఆపరేటివ్ సొసైటీలు (సహకార సంఘాలు) నమోదైనట్టు కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జెమ్ పోర్టల్‌లో సంస్థల నమోదు ప్రక్రియను మంత్రి వర్చువల్‌గా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అమూల్, ఇఫ్కో, క్రిబ్కో, నాఫెడ్, సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంకు తదితర సంస్థలు కొనుగోలుదారులుగా జెమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయని చెబుతూ.. విక్రేతలుగానూ నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. కోఆపరేటివ్ సొసైటీలు సైతం జెమ్ ద్వారా తమకు కావాల్సిన వస్తు, సేవలను కొనుగోలు చేసుకునేందుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది జూన్‌లో అనుమతించింది. అంతకుముందు ఈ అవకాశం లేదు. తొలిదశలో రూ.100 కోట్ల టర్నోవర్/డిపాజిట్లు ఉన్న సొసైటీలను అనుమతించారు. దీంతో 589 సంస్థలకు అర్హత ఉందని గుర్తించగా, 300కు పైన ఇప్పటివరకు నమోదు చేసుకున్నాయి. మంత్రి ప్రారంభంతో.. మొదటి రోజే సుమారు రూ.25 కోట్ల విలువైన ఆర్డర్లు నమోదైనట్టు అంచనా. దేశవ్యాప్తంగా 8.5 లక్షల సహకార సంఘాలు ఉంటే, వీటి పరిధిలో 29 కోట్ల మంది భాగస్వాములుగా ఉన్నారు. జెమ్‌పై కోఆపరేటివ్‌ల నమోదు అర్హతలను మరింత సరళీకరించనున్నట్టు మంత్రి అమిత్‌షా తెలిపారు. కాగా, సహకార సంఘాల్లో సంస్కరణలు అవసరమని మంత్రి అమిత్‌షా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. -
ఈ–కామర్స్ రంగంలోకి హోండా ఇండియా పవర్!
న్యూఢిల్లీ: హోండా ఇండియా పవర్ ప్రోడక్ట్స్ (హెచ్‌ఐపీపీ) తాజాగా ఈ–కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. జనరేటర్లు, వాటర్ పంప్‌లు, టిల్లర్లు, బ్రష్ కటర్లు, లాన్ మోవర్లు వంటి అయిదు రకాల ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించనున్నట్లు సంస్థ చైర్మన్, ఎండీ తకహిరో యుడా తెలిపారు. తమ కంపెనీ డీలర్ షిప్‌లకు రాలేని కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు డిజిటల్ బాట పట్టినట్లు ఆయన వివరించారు. ‘ప్రస్తుతం మాకు దేశవ్యాప్తంగా 600 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో కస్టమర్లకు.. సమీప అవుట్లెట్లు 50 కిలోమీటర్ల పైగా దూరంలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఉత్పత్తులను ఎంచుకునేందుకు, చెల్లింపులు జరిపేందుకు మా వెబ్సైట్ ఉపయోగపడుతుంది. ప్రీ–డెలివరీ ఇన్స్పెక్షన్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ తదితర కార్యకలాపాలను మా డీలర్లు చూసుకుంటారు‘ అని తకహిరో వివరించారు. ఆన్లైన్లో కొత్త కస్టమర్ల రాకతో డీలర్లకు కూడా ఆదాయం పెంచుకోవడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆన్లైన్ విభాగాన్ని అయిదు ఉత్పత్తులకు పరిమితం చేస్తున్నామని తకహిరో వివరించారు. ఆన్లైన్లో తొలి ఏడాది 1,000 యూనిట్ల విక్రయాలను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. -
కరోనా దెబ్బకు..ఈ-కామర్స్ రంగానికి పెరిగిన డిమాండ్! ఎంతలా అంటే!
సాక్షి, హైదరాబాద్: కరోనాతో దేశీయ స్థిరాస్తి రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటే.. గిడ్డంగుల విభాగానికి మాత్రం మహమ్మారి బూస్ట్‌లాగా పనిచేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ–కామర్స్ వినియోగం పెరిగింది. దీంతో ఆయా కంపెనీలు ఔట్లెట్లు, వేర్‌హౌస్‌ల ఏర్పాటుపై దృష్టిసారించాయి. ఫలితంగా గతేడాది ముగింపు నాటికి దేశంలో గ్రేడ్–ఏ వేర్‌హౌస్ స్పేస్ 14 కోట్ల చ.అ.లకు చేరిందని అనరాక్ రీసెర్చ్ తెలిపింది. ఇందులో ఎన్సీఆర్ వాటా దాదాపు 15–20 శాతం వాటా ఉందని పేర్కొంది. 2018–21 మధ్య కాలంలో ఈ పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు 16 శాతంగా ఉందని తెలిపింది. దేశంలోని 70 శాతం మోడ్రన్ వేర్‌హౌస్ స్పేస్‌లు ముంబై, ఎన్సీఆర్, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పుణే నగరాలలో కేంద్రీకృతమై ఉన్నాయని అనరాక్ క్యాపిటల్ ఎండీ, సీఈఓ శోభిత్ అగర్వాల్ తెలిపారు. ఆన్లైన్ వ్యాపారాలలో స్థిరమైన వృద్ధి నమోదవుతుండటంతో ప్రధాన నగరాలలో మల్టీలెవల్ వేర్‌హౌస్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలు గిడ్డంగుల స్థలాల కోసం విస్తృతంగా శోధిస్తున్నారని, అదే సమయంలో నిర్వహణ వ్యయం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. -
దెబ్బ అదుర్స్ కదూ!! చైనాకు చుక్కలు చూపిస్తూ..దూసుకెళ్తున్న భారత్!
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వరుస కీలక నిర్ణయాలు భారత్‌కు వరంగా మారుతున్నాయి. మన దేశంలో చైనా ప్రొడక్ట్‌లపై కేంద్రం నిషేదం విధిస్తున్న విషయం తెలిసిందే. ఆ నిషేధంతో దేశీయ ఉత్పత్తులకు భారీ ఎత్తున డిమాండ్ పెరిగి చైనాకు చుక్కలు చూపిస్తుంది. భారత్‌లో ఈ-కామర్స్ రంగం నుంచి వచ్చే ఆదాయం చైనాకు తగ్గి.. భారత్ ఆదాయం పెరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రాగన్ కంట్రీలో ఈ-కామర్స్ రంగం నుంచి వచ్చే ఆదాయం 2.8ట్రిలియన్లు..ఆ ఆదాయం మనదేశ జీడీపీకి సమానంగా ఉంది. అయితే కేంద్రం చైనా ఉత్పత్తుల్ని బ్యాన్ చేయడంతో భారత్‌లో ఈకామర్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. చైనా ఆదాయానికి పోటాపోటీగా దేశీయంగా ఈకామర్స్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలో ఈకామర్స్ ను ఉపయోగించే జాబితాలో 150మిలియన్ల మంది కొత్త వినియోగదారులు వచ్చి చేరారు. ఈ సందర్భంగా.."చైనా ఇ-కామర్స్ ఆదాయాలు ఒక సంవత్సరంలో 2.8ట్రిలియన్ల అమ్మకాలు జరపడం ద్వారా చైనా ప్రపంచంలోని మిగిలిన దేశాల కంటే ముందంజలో ఉంది. ఇదే సమయంలో భారత్‌లో ఈకామర్స్ రంగం ఊపందుకోవడం సంతోషకరమైన విషయమేనని సిఐఐ నిర్వహించిన ఈకామర్స్ కాన్క్లేవ్లో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ ఐటీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపాంకర్ చక్రవర్తి మాట్లాడుతూ..గత నెలలో 150మిలియన్ల మంది వినియోగదారులు ఈకామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగించుకున్నారు. 50శాతం ఇంటర్నెట్ వినియోగదారులు ఆన్లైన్లో షాపింగ్ చేయడం ప్రారంభించారు. ఆన్‌లైన్‌పై అవగాహన పెరడగంతో ఈ కామర్స్ సంస్థలలో పెట్టుబడులు పెరిగాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కామర్స్ కంటెంట్, వాణిజ్య పరంగా, ఆన్లైన్ ఆఫ్‌లైన్ పరంగా మార్కెట్ ఇంటిగ్రేషన్‌ను తీసుకువచ్చిందని టాటా క్లిక్ బ్యూటీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ధర్మరాజన్ చెప్పారు. మాల్స్‌లో డిజిటల్ అడాప్టేషన్ భారీగా ఉంది. మాల్స్‌లో కూడా 50శాతం మంది కస్టమర్లు డిజిటల్ అడాప్టేషన్ల ద్వారా వెళ్తున్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లను జోడించడం ఒకదానికొకటి అనుబంధంగా మారిందని బెనర్జీ చెప్పారు. తద్వారా భారత్‌లో ఈకామర్స్ రంగం మరింత వృద్ది సాధించేందుకు తోడ్పడుతుందని తెలిపారు. చదవండి: ముఖేష్ అంబానీ ముందు చూపు.. సన్మీనాలో వందల కోట్ల పెట్టుబడులు!! -
వచ్చేసింది ఫ్లిప్‌కార్ట్ సేల్..అదిరిపోయే ఆఫర్స్! 80 శాతం డిస్కౌంట్!!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 23నుంచి ఫ్రిబ్రవరి 28వరకు ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ లో కొనుగోలు దారులు ఎలక్ట్రానిక్ అండ్ యాక్ససరీస్‌పై 80శాతం భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. 6 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సేల్‌లో కొనుగోలు దారులు ఎలక్ట్రానిక్ అండ్ యాక్ససరీస్‌పై 80శాతంతో పాటు ఎస్ బ్యాంక్,స్లైస్ వీసా, ఐడీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ వినియోగంతో 10శాతం డిస్కౌంట్‌ను అదనంగా పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులు తెలిపారు. ఇక ఈ సేల్‌లో ప్రత్యేకంగా ల్యాప్ టాప్ కొనుగోళ్లపై రూ.30వేలు విలువ చేసే కొనుగోలు దారులకు ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు అందించే ఐటీ కోర్స్ లను ఉచితంగా పొందవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ల్యాప్ ట్యాప్, డెస్క్‌ట్యాప్, స్మార్ట్ ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్, స్మార్ట్ వాచెస్, కెమెరా యాక్ససరీస్‌తో పాటు ఇతర ప్రొడక్ట్‌లపై భారీ ఎత్తున డిస్కౌంట్ లను సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తన ప్రకటనలో పేర్కొంది. -
వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, అమెజాన్ తరహాలో..
వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని రానుంది. ఈ ఫీచర్‌తో స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా..ఓ వైపు ఈ కామర్స్ రంగంపై దృష్టిసారిస్తూనే.. యూజర్లు ఫుడ్, రీటైల్, లోకల్ ప్రాడక్ట్‌లను అమ్ముకునేలా ఆన్లైన్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఓ ఫీచర్‌ను డెవలప్ చేసింది. ప్రస్తుతం ఆ ఫీచర్ పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు టెస్ట్ చేసే పనిలో పడింది. వాట్సాప్ ఈ కామర్స్ రంగంపై కన్నేసింది. ఇన్ని రోజులు స్టిక్కర్స్, మల్టీ డివైజ్ ఆప్షన్లతో హడావిడి చేసిన ఈ మెసేజింగ్ యాప్... ఇకపై యూజర్లు తన ప్లాట్ ఫామ్‌లో ప్రాడక్ట్‌లను అమ్ముకునేందుకు వీలుగా ఆన్ లైన్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. అమెజాన్ తరహాలో ఆన్లైన్ స్టోర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రాడక్ట్‌లను అమ్ముకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ పనితీరును గుర్తించేందుకు బ్రెజిల్ దేశం 'సావో పాలో' అనే ప్రాంతంలో అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ సీఈఓ 'మాథ్యూ' రాయిటర్స్‌కు తెలిపారు. ఈ సందర్భంగా వాట్సాప్ సీఈఓ మాట్లాడుతూ..వాట్సాప్‌లో ఈ కామర్స్ బిజినెస్ ప్లాట్ ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఫీచర్‌ను డెవలప్ చేశాం.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే బిజినెస్ చేసుకునేలా ఈ కామర్స్ స్టోర్ ప్రారంభించుకోవచ్చని చెప్పారు. కాగా, ఇప్పటికే ఫేస్ బుక్ చిన్న చిన్న బిజినెస్‌ల నిర్వహణ కోసం 'షాప్' ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. చదవండి : 'మనీ హెయిస్ట్ సీజన్ 5' ఎమోజీలొస్తున్నాయ్ -
ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి, కారణం ఇదేనా
ముంబై: దేశీయంగా ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు జున్‌లో 5.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది జూన్‌లో నమోదైన 6.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే 22 శాతం క్షీణించాయి. అయితే, సీక్వెన్షియల్‌గా ఈ ఏడాది మే నెలలో వచ్చిన 4 బిలియన్ డాలర్లతో పోలిస్తే 33 శాతం పెరిగాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమ లాబీ గ్రూప్ ఐవీసీఏ రూపొందించిన నెలవారీ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మరోవైపు, గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే మాత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో పీఈ/వీసీ పెట్టుబడులు 45 శాతం పెరిగి 26.9 బిలియన్ డాలర్లకు చేరాయి. ‘దేశీయంగా పీఈ/వీసీ పెట్టుబడుల కార్యకలాపాలు 2021 ప్రథమార్ధంలో రికార్డు స్థాయిలో పెరిగాయి. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరగనుంది. ప్రథమార్ధం, రెండో త్రైమాసికంలో పీఈ/వీసీ పెట్టుబడులు గరిష్ట స్థాయిలో వచ్చాయి‘ అని ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. భారీ డీల్స్ (100 మిలియన్ డాలర్ల పైబడినవి), మధ్య స్థాయి డీల్స్ (20–100 మిలియన్ డాలర్ల దాకా)పై ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ,ఈ–కామర్స్ ఫేవరెట్స్.. రంగాలవారీగా చూస్తే టెక్నాలజీ, ఈ–కామర్స్, ఆర్థిక సేవలు, ఫార్మా, విద్య, మీడియా.. వినోద రంగాల్లో పెట్టుబడుల ధోరణి సానుకూలంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆయా రంగాలు కోవిడ్ వల్ల పుంజుకోవడమో లేదా మహమ్మారి ప్రభావాల నుంచి వేగంగా కోలుకోవడమో ఇందుకు కారణం కావచ్చని వివరించింది. అటు ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, రిటైల్, కన్జూమర్ ఉత్పత్తుల విభాగాల్లో పీఈ/వీసీ పెట్టుబడులు కాస్త తగ్గినట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో అత్యధికంగా 3.6 బిలియన్ డాలర్ల విలువ చేసే 12 ఒప్పందాలు కుదిరాయి. గతేడాది జూన్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 4.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సహా 6.1 బిలియన్ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు 11 నమోదయ్యాయి. కొను గోళ్లకు సంబంధించి 1.9 బిలియన్ డాలర్ల విలువ చేసే అయిదు డీల్స్ కుదిరాయి. చదవండి: క్రెడిట్ కార్డ్ వినియోగం,పెట్రో ధరలపై ఆఫర్లు డిస్కౌంట్లు -
Drone Delivery: డ్రోన్లతో లాజిస్టిక్స్ డెలివరీకి రెడీ
న్యూఢిల్లీ: డ్రోన్ల ద్వారా వాణిజ్య సరుకు రవాణా సర్వీసులను ప్రారంభించేందుకు ప్రయోగాత్మక ప్రాజెక్టు సిద్ధమైంది. ఇందుకు వైమానిక సరుకు రవాణా(కార్లో) సంస్థ స్పైస్ ఎక్స్‌ప్రెస్ ఈ కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీ 'డెలివరి' చేతులు కలీపాయి. మూడు నాలుగు నెలల్లో డ్రోన్ల డెలివరీ పైలట్ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఇందుకు వీలుగా రెండు సంస్థలూ అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్టు కోసం దేశీ ఎయిర్‌లైన్స్ కంపెనీ స్పైస్ జెట్‌కు చెందిన స్పైస్ ఎక్స్ఫ్రైస్ కన్ఫార్షియంను పౌర విమానయాన అధీకృత సంస్థ (డీజీసీఏ) ఎంపిక చేసింది. బీవీఎల్వోఎస్ పరిధిలో డ్రోన్ల వినియోగానికి ప్రయోగాత్మక ప్రాజెక్టుకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది. దీంతో ఎమర్జెన్సీ సర్వీసులు, సరుకు రవాణా, క్రిటికల్ మెడికల్ సర్వీసుల, పర్యావరణ పహారా తదితర కీలక వాణీజ్య సర్వీసులకు డ్రోన్ల టెక్నాలజీని వినియోగించేందుకు వీలుంటుందని నిపుణులు తెలియజేశారు. డెలివరీతో కుదిరిన ఎంవోయూ ద్వారా రెండు సంస్థలూ లబ్లి పొందనున్నట్లు స్పైస్ ఎక్స్‌ప్రెస్ సీఈవో సంజీవ్ గుప్తా పేర్కొన్నారు. తమకున్న సామర్జ్యాలతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టనున్నట్లు చెప్పారు. ఇది సరుకు రవాణాలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని 3-4 నెలల్లో ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్పైస్‌జెట్‌తో తమకున్న దీర్షకాల సాహచర్యానికి ఈ ఒప్పందం మరింత బలాన్నివ్వనున్నట్లు డెలివరీ సీఈవో అజిత్ పాయ్ పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా లాజిస్టిక్స్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే వీలున్నదని తెలియజేశారు. ఎంవోయూలో భాగంగా భూమిపై లాజిస్టిక్స్ సేవలకు డెలివరీ పూర్తస్తాయిలో మద్దతివ్వనుంది. కాగా.. ఈ మే నెలలో డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల డెలివరీని చేపట్టేందుకు పార విమానయాన శాఖ తెలంగాణ ప్రభుత్వానికి షరతులతో అనుమతించిన విషయం విదితమే. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే బాటలో వ్యాక్సిన్ల సరఫరాకు యూఏఎస్ నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది. చదవండి: సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్ -
ఈ-కామర్స్‌కు కఠిన నిబంధనలు.. ఫ్లాష్ సేల్స్ నిషేధం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో ఫ్లాష్ సేల్స్‌తో ఈ–కామర్స్ కంపెనీల హడావిడి గుర్తుందిగా. భారీ డిస్కౌంట్‌తో అతి తక్కువ ధరకు ఫలానా ఉత్పత్తిని, ఫలానా సమయానికి అమ్ముతామంటూ చేసే ఆర్భాటాలకు కొద్ది రోజుల్లో అడ్డుకట్ట పడనుంది. ఒక వస్తువును ప్రదర్శించి మరో వస్తువును అంటగట్టినా, ఉత్పాదనను, సేవను అందించడంలో విక్రేత విఫలమైనా ఆ బాధ్యత ఈ–కామర్స్ కంపెనీదే. ఈ మేరకు వినియోగదారుల రక్షణ (ఈ– కామర్స్) నిబంధనలకు సవరణలు చేయాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) సోమవారం సూచించింది. చదవండి : ఐటీలో భవిష్యత్ అంతా వీటిదే ప్రతిపాదిత సవరణలపై తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేసేందుకు ఈ–కామర్స్ కంపెనీలు, పారిశ్రామిక సంఘాలకు జూలై 6 వరకు ఎంసీఏ సమయం ఇచ్చింది. మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కొందరు విక్రేతలకే ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ కంపెనీలపై కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ జరుపుతున్న తరుణంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆఫ్‌లైన్ విక్రేతలను దెబ్బతీసేలా ఆఫర్ చేస్తున్న భారీ డిస్కౌంట్లపైనా సీసీఐ దర్యాప్తు చేస్తోంది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఈ–కామర్స్ కంపెనీల్లో జవాబుదారీ పెరుగుతుంది. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా దేశంలో ఈ–కామర్స్ రంగంలో కఠిన నిబంధనలు రానున్నాయి. ప్రతిపాదిత సవరణల్లో ఏముందంటే.. అధికారుల నియామకం కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ఈ–కామర్స్ కంపెనీలు తగు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. చీఫ్ కాంప్లియాన్స్ ఆఫీసర్‌ను నియమించాలి. భారతీయ పౌరుడైన ఈ–కామర్స్ ఉద్యోగిని రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలి. చట్టాన్ని అమలు చేసే సంస్థలు సంప్రదింపుల కోసం ఈ అధికారి అందుబాటులో ఉండాలి. ప్రతి ఈ–కామర్స్ సంస్థ వీలైనంత త్వరగా లేదా ఆర్డర్ అందిన 72 గంటల్లోగా సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలకు అందించాలి. ప్రైవేట్ లేబుల్స్ ప్రైవేట్ లేబుల్స్ అమ్మకాలకు, ప్రమోషన్‌కు ఈ–కామర్స్ కంపెనీ తన బ్రాండ్‌ను వినియోగించరాదు. ఆధిపత్యానికి చెక్ ఏ విభాగంలోనైనా ఆధిపత్య స్థానం కలిగి ఉన్న ఈ–కామర్స్ సంస్థ దాని మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేయడానికి అనుమతించరు. ఒక నిర్దిష్ట విక్రేత లేదా సెల్లర్స్ సమూహాన్ని మాత్రమే విక్ర యించడానికి వీలు కల్పించే ఫ్లాష్ సేల్స్ నిషేధం. విదేశీ ఉత్పత్తులు ఈ–కామర్స్ కంపెనీలు వినియోగదారుల కోసం ముందస్తు కొనుగోలు దశలో వాటి మూలం ఆధారంగా వస్తువులను గుర్తించి, వడపోత యంత్రాంగాన్ని అందించాలి. దేశీయ అమ్మకందారులకు న్యాయమైన అవకాశాన్ని కల్పించేందుకు ఆన్లైన్ కంపెనీలు దిగుమతి చేసుకునే వస్తువులకు ప్రత్యామ్నాయాలను చూపించాలి. ప్రాధాన్యతకు అడ్డుకట్ట ఈ–కామర్స్ కంపెనీలకు చెందిన ఏ సంస్థ కూడా సెల్లర్‌గా నమోదు కారాదు. ఈ సంస్థలు అన్యాయమైన ప్రయోజనం కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫాం నుంచి వినియోగదార్లకు చెందిన సమాచారం సేకరించరాదు. డెలివరీ సేవలు అందించే ఏ కంపెనీకి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వరాదు. -
నెలకు లక్షల ఆర్డర్లు, 4 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఈకామర్స్ సంస్థ
న్యూఢిల్లీ: బీ2బీ ఈ–కామర్స్ సంస్థ ఉడాన్.. గడిచిన 12–18 నెలల్లో టెక్నాలజీ, సరఫరా వ్యవస్థతో పాటు ఇతరత్రా విభాగాలపై రూ. 4,000 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. వార్షిక ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 100 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఉడాన్ కార్యకలాపాలు ప్రారంభమై అయిదేళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ సిబ్బందికి పంపిన అంతర్గత మెయిల్లో సహ వ్యవస్థాపకులు ఆమోద్ మాలవీయ, సుజీత్ కుమార్, వైభవ్ గుప్తా ఈ విషయాలు తెలిపారు. లక్షల మంది చిన్న వ్యాపారుల సమస్యలు తీర్చేందుకు ఏర్పాటైన తమ సంస్థ.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యాపార వ్యూహాలకు పదును పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వారు వివరించారు. కేవలం ఈ–కామర్స్‌కే పరిమితం కాకుండా దేశీయంగా అతి పెద్ద కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా ఎదగనున్నట్లు పేర్కొన్నారు. 2016లో ఏర్పాటైన ఉడాన్ ప్లాట్‌ఫాంలో 30 లక్షల మంది పైగా యూజర్లు, 30,000 మంది పైగా విక్రేతలు ఉన్నారు. రోజూ 1.5–1.75 లక్షల ఆర్డర్లు, నెలకు 45 లక్షల పైచిలుకు ఆర్డర్లు డెలివరీ చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఇన్వెస్టర్ల నుంచి 280 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,048 కోట్లు) అందుకుంది. దాదాపు 3 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఇప్పటిదాకా సుమారు 1.15 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. చదవండి: కరోనాతో తగ్గేదే లే, వేల కోట్లు వసూలైన ట్యాక్స్ -
టాటా క్లిక్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు
కోల్‌కతా, సాక్షి: ఈకామర్స్ వెంచర్ టాటా క్లిక్‌లో తాజాగా రూ. 3,500 కోట్లను ఇన్వెస్ట్ చేయాలని టాటా గ్రూప్ ప్రణాళిలు వేసింది. ఇందుకు వీలుగా టాటా క్లిక్ అధీకృత మూలధనాన్ని ప్రస్తుత రూ. 1,500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లకు పెంచేందుకు నిర్ణయించింది. ఇందుకు బోర్డు అంగీకరించినట్లు టాటా క్లిక్ మాతృ సంస్థ టాటా యూనిస్టోర్ నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా పెట్టుబడులను సమకూర్చనున్నట్లు తెలియజేసింది. తద్వారా కంపెనీ వృద్ధికి అవసరమైన నిధులు అందించనున్నట్లు వివరించింది. (ఆన్లైన్ బ్రాండ్ బోట్‌కు భారీ నిధులు) ఈకామర్స్‌కు ప్రాధాన్యం ప్రస్తుతం టాటా యూనిస్టోర్ పెయిడప్ షేర్ క్యాపిటల్ రూ. 1,203 కోట్లుగా నమోదైంది. ఇటీవల రుణ సమీకరణ పరిమితిని రూ. 490 కోట్లకు పెంచుకుంది. గత ఏప్రిల్‌లో మాతృ సంస్థ నుంచి రూ. 30 కోట్లు సమకూర్చుకుంది. ఇదేవిధంగా 2020లో రూ. 311 కోట్లు, 2019లోరూ. 292 కోట్లు, 2018లో రూ. 224 కోట్లు చొప్పున అందుకుంది. కొంతకాలంగా టాటా గ్రూప్ ఈకామర్స్ బిజినెస్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఈ సందర్భంగా కార్పొరేట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్టిన్‌ఫో పేర్కొంది. కాగా.. 2019-20లో కంపెనీ ఆదాయం 144 శాతం జంప్‌చేసి రూ. 266 కోట్లను అధిగమించింది. నికర నష్టం సైతం 9.7 శాతం పెరిగి రూ. 270.6 కోట్లను తాకింది. అయితే ప్రస్తుత వేగాన్ని కొనసాగిస్తే టాటా యూనిస్టోర్ త్వరలోనే నిర్వహణ లాభాలు ఆర్జించే స్థాయికి చేరుతుందని ఆల్టిన్‌ఫో వ్యవస్థాపకుడు మోహిత్ యాదవ్ అంచనా వేశారు. -
అలీబాబాను ఆదుకోని బైబ్యాక్ ప్లాన్
హాంకాంగ్, షాంఘై: ఇటీవల పతన బాటలో సాగుతున్న చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. సోమవారం మరోసారి ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో హాంకాంగ్‌లో లిస్టయిన అలీబాబా షేరు 9 శాతం పతనమైంది. తద్వారా జూన్ తదుపరి కనిష్టానికి చేరింది. గత రెండు రోజుల్లో షేరు భారీగా తిరోగమించడంతో కంపెనీ మార్కెట్ విలువలో 116 బిలియన్ డాలర్లమేర ఆవిరైనట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. యూఎస్‌లోనూ షేరు ఇంట్రాడేలో 15 శాతం వరకూ పతనంకావడం గమనార్హం! నిజానికి కంపెనీ 10 బిలియన్ డాలర్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించింది. అయినప్పటికీ చైనీస్ నియంత్రణ సంస్థలు కంపెనీ ఆధిపత్య ధోరణిపై దర్యాప్తు చేపట్టనుండటంతో ఈ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. (యాంట్ గ్రూప్ ఐపీవోకు చైనీస్ షాక్) దర్యాప్తు ఎఫెక్ట్ అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మాతోపాటు.. అతని ఫైనాన్షియల్ సామ్రాజ్యంపై ఇటీవల కొద్ది రోజులుగా చైనీస్ అధికారులు కన్నెర్ర చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అలీబాబాపై గుత్తాధిపత్య నిబంధనలకింద చైనీస్ నియంత్రణ సంస్థలు దర్యాప్తునకు ఆదేశించాయి. యాంట్ గ్రూప్, అనుబంధ సంస్థలపైనా దర్యాప్తునకు శ్రీకారం చుట్టాయి. యాంటీట్రస్ట్ చట్ట ప్రకారం అలీబాబా గ్రూప్‌పై భారీ స్థాయిలో జరిమానాలు విధించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళనతో అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. కాగా.. తొలుత ప్రతిపాదించిన 6 బిలియన్ డాలర్ల బైబ్యాక్‌ను 10 బిలియన్ డాలర్లకు పెంచేందుకు అలీబాబా బోర్డు నిర్ణయించింది. 2022వరకూ బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. అయినప్పటికీ సోమవారం షేరు 222 డాలర్ల వద్ద ముగిసింది. (యూఎస్ మార్కెట్లకు జో బైడెన్ జోష్) కేంద్ర బ్యాంకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వారాంతాన యాంట్ గ్రూప్‌నకు చెందిన రుణ వ్యాపారం, కన్జూమర్ ఫైనాన్స్ వివరాలపై ఆరా తీసింది. ఇప్పటికే అంటే గత నెలలో 37 బిలియన్ డాలర్ల విలువైన యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూని చైనా నియంత్రణ సంస్థలు నిషేధించాయి. తద్వారా హాంకాంగ్, షాంఘైలలో లిస్టింగ్ చేపట్టేందుకు యాంట్ గ్రూప్ చేసుకున్న సన్నాహాలకు సరిగ్గా రెండు రోజుల ముందు చెక్ పెట్టాయి. కొద్ది రోజుల క్రితం జాక్ మా ఒక ఇంటర్వ్యూలో చైనీస్ బ్యాంకింగ్ వ్యవస్థ, రుణ నిబంధనలు తదితర అంశాలపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో నియంత్రణ సంస్థలు కన్నెర్ర చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు టెన్సెంట్ తదితర టెక్ దిగ్గజాలకు సైతం సమస్యలు సృష్టించవచ్చని ఈ సందర్భంగా విశ్లేషకులు చెబుతున్నారు. -
టాటా గ్రూప్ కిట్టీలో బిగ్‌బాస్కెట్!
ముంబై, సాక్షి: దాదాపు ఐదు నెలల చర్చల అనంతరం ఆన్లైన్ గ్రోసరీ స్టార్టప్ బిగ్‌బాస్కెట్‌ను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రెండు సంస్థల మధ్య ఇప్పటికే ప్రారంభమైన చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బిగ్‌బాస్కెట్‌లో 80 శాతం వాటాను 1.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 9,600 కోట్లు)కు టాటా గ్రూప్ సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తద్వారా బిగ్‌బాస్కెట్ విలువను 1.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,850 కోట్లు)గా మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. డీల్ ఇలా.. ఒప్పందంలో భాగంగా బిగ్‌బాస్కెట్‌లో ఇప్పటికే వాటా కలిగిన ఇన్వెస్టర్ల నుంచి టాటా గ్రూప్ 50-60 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లలో చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా తదితర సంస్థలున్నాయి. బిగ్‌బాస్కెట్‌లో అలీబాబా 26 శాతం వాటాను కలిగి ఉంది. అంతేకాకుండా బిగ్‌బాస్కెట్ తాజాగా జారీ చేయనున్న మరో 20-30 శాతం వాటాను సైతం టాటా గ్రూప్ కొనుగోలు చేయనుంది. తద్వారా బిగ్‌బాస్కెట్‌లో మొత్తం 80 శాతం వాటాను టాటా గ్రూప్ సొంతం చేసుకునే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. సూపర్-యాప్.. గ్రూప్‌లోని కన్జూమర్ బిజినెస్‌లన్నిటినీ కలుపుతూ ఇటీవల టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. డీల్ ద్వారా బిగ్‌బాస్కెట్‌ను సైతం సూపర్ యాప్‌లో భాగం చేసే యోచనలోఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో హౌస్‌హోల్డ్, గ్రోసరీ విభాగంలో పలు ప్రొడక్టులను అందించేందుకు వీలుంటుందని తెలియజేశారు. టాటా సన్స్ వార్షిక సమావేశంలో భాగంగా గతేడాది చైర్మన్ చంద్రశేఖరన్ సూపర్‌యాప్ ప్రస్తావన తీసుకొచ్చిన విషయం విదితమే. సూపర్ యాప్ ద్వారా గ్రోసరీ, ఫ్యాషన్, ఫుడ్, ఎలక్ట్రానిక్స్, బీమా, ఫైనాన్షియల్, ఎడ్యుకేషన్ తదితర పలు సర్వీసులకు తెరతీయనున్నట్లు పేర్కొన్నారు. కొంతకాలంగా దేశీ ఈకామర్స్ మార్కెట్లో అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫ్లిప్‌కార్ట్ తదితర దిగ్గజాలు వేగవంతంగా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తగినంత మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు టాటా గ్రూప్ సైతం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే డీల్‌పై ఇటు టాటా గ్రూప్, అటు బిగ్‌బాస్కెట్ పెదవి విప్పకపోవడం గమనార్హం! -
రూ.7.5 లక్షల కోట్లకు రిటైల్ ఈ కామర్స్
న్యూఢిల్లీ: దేశంలో ఈకామర్స్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 2024 నాటికి రిటైల్ ఈ కామర్స్ మార్కెట్ పరిమాణం 100 బిలియన్ డాలర్లకు (రూ.7.5లక్షల కోట్లు) చేరుకుంటుందని ఓ నివేదిక తెలియజేసింది. అంతర్జాతీయ సంస్థ అల్వారెజ్ అండ్ మార్సల్ (ఏఅండ్ఎం), సీఐఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. వినియోగదారుల్లో మారుతున్న కొనుగోళ్ల ధోరణి, ఆన్లైన్లో విక్రేతలు పెరుగుతుండడం తదితర అంశాలు రిటైల్ ఈ కామర్స్ మార్కెట్ వృద్ధికి ఇతోధికంగా తోడ్పడతాయని ఈ నివేదిక తెలియజేసింది. తాజా గ్రోసరీల విక్రయాలకు డిమాండ్, ఫుడ్ డెలివరీ కంపెనీల సంఖ్య పెరగడం కూడా వచ్చే ఐదేళ్లలో మార్కెట్ విస్తరణకు మేలు చేస్తుందని పేర్కొంది. సరఫరా వ్యవస్థకు సంబంధించి నూతన ఆవిష్కరణలు అన్నవి భారత్ లో ఈ కామర్స్ మార్కెట్ తదుపరి విస్తరణకు కీలకమని సూచించింది. పదేళ్లలో భారీగా విస్తరణ.. గత పదే?ళ్ల కాలంలో భారత రిటైల్ రంగం శరవేగంగా ప్రగతి సాధించినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘2019 చివరికి రిటైల్ రంగం పరిమాణం 915 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ఇందుల్ రిటైల్ ఈ కామర్స్ మార్కెట్ పరిమాణం 2019 ఆఖరుకు 30 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ 2010లో రిటైల్ రంగంలో ఈ కామర్స్ మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్ల కంటే (రూ.7,500 కోట్లు) తక్కువగా ఉండగా, పదేళ్లలో 30 బిలియన్ డాలర్ల స్థాయికి విస్తరించింది’’ అని ఈ నివేదిక తెలియజేసింది. గత దశాబ్ద కాలంలో ఈ కామర్స్ వృద్ధికి ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య పెరగడం తోడ్పడినట్టు పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫర్నిచర్, ఫార్మసీ, కాస్మెటిక్స్ మార్కెట్ విస్తరణలో ప్రముఖ పాత్ర పోషించినట్టు తెలిపింది. ‘‘ఈ కామర్స్ రిటైల్ మార్కెట్ (బిజినెస్ టు కస్టమర్/బీటుసీ) 2024 నాటికి 100 బిలియన్ డాలర్లకు పైగా విస్తరించనుంది. 2019నాటికి దేశంలో ఈ కామర్స్ విస్తరణ 3 శాతమే. విస్తరణకు భారీ అవకాశాలున్నాయి’’ అని ఈ నివేదిక అంచనా వేసింది. అమెరికా, చైనా మార్కెట్లలో ఈ కామర్స్ రిటైల్ వ్యాప్తి 2019 నాటికి వరుసగా 15 శాతం, 20 శాతంగా ఉండగా.. భారత్ లో 2024 నాటికి 6 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. ‘‘ఈ కామర్స్ విక్రయాల్లో పెద్ద మొత్తం దేశంలోని అగ్రగామి 30 పట్టణాల నుంచే వస్తున్నా.. వచ్చే ఐదేళ్లలో 60 శాతానికి పైగా అమ్మకాలు టైర్–2, 3 పట్టణాల నుంచి వచ్చే అవకాశం ఉంది. కనుక చిన్న పట్టణాలకు కూడా సరుకులను డెలివరీ చేసే విధంగా ఈ కామర్స్ కంపెనీలు విక్రేతల పరిధిని పెంచుకోవాల్సి ఉంటుంది’’ అని ఏఅండ్ఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ సైగల్ పేర్కొన్నారు. కస్టమర్ల అవసరాలు, మారుతున్న కొనుగోళ్ల ధోరణి, తగిన టెక్నాలజీలు, రవాణా భాగస్వాములపై ఈ కామర్స్ విస్తరణ ఆధారపడి ఉంటుందని ఈ నివేదిక తెలియజేసింది. ఎఫ్ఎంసీజీ, గ్రోసరీలు, వస్త్రాల విక్రయాలు మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియా, చాట్ ఇంజన్స్, ఏఐ బాట్స్ అన్నవి కీలకమవుతాయని పేర్కొంది. -
ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ హైజంప్!
దేశీయంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా పలు రంగాలు డీలాపడినప్పటికీ.. ఆన్లైన్ గ్రోసరీ బిజినెస్ మాత్రం జోరందుకుంది. వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డవున్ అమలు చేస్తున్న నేపథ్యంలో హోమ్ డెలివరీలు చేసే ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ తదితర సంస్థల బిజినెస్ ఊపందుకుంది. కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్ 76 శాతం జంప్‌చేయనున్నట్లు ఫారెస్టర్ రీసెర్చ్ తాజాగా అభిప్రాయపడింది. వెరసి 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 22,500 కోట్లు)ను తాకనున్నట్లు అంచనా వేసింది. దేశవ్యాప్త లాక్‌డవున్ కారణంగా ఈకామర్స్ బిజినెస్‌కు 1.3 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం సమకూరనున్నట్లు ఫారెస్టర్ అంచనా వేసింది. దీంతో తొలుత వేసిన 2 బిలియన్ డాలర్ల ఆన్లైన్ గ్రోసరీస్ బిజినెస్ 3 బిలియన్ డాలర్లను అధిగమించవచ్చని అభిప్రాయపడింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర కంపెనీలు సైతం వినియోగదారులకు ఆన్లైన్ ద్వారా కిరాణా సరుకులను అందిస్తున్న విషయం విదితమే. 35.5 బిలియన్ డాలర్లకు ఈఏడాది దేశీయంగా మొత్తం ఈకామర్స్ బిజినెస్ 6 శాతం వృద్ధితో 35.5 బిలియన్ డాలర్లను తాకనున్నట్లు అంచనా. అయితే గత ఆరు వారాలుగా ఈకామర్స్ బిజినెస్‌లో నమోదైన అధిక డిమాండ్ కొనసాగకపోవచ్చని ఫారెస్టర్ రీసెర్చ్ పేర్కొంది. లాక్‌డవున్ తొలి రోజుల్లో బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వంటి కంపెనీలకు ఐదు రెట్లు అధికంగా ఆర్డర్లు లభించినప్పటికీ ఇటీవల నెమ్మదించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. అయితే మరికొంతకాలంపాటు ఈకామర్స్ బిజినెస్‌లో అమ్మకాల పరిమాణం అధికంగానే నమోదయ్యే వీలున్నట్లు తెలియజేశారు. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో 35 శాతం అధికంగా ఆర్డర్లు లభిస్తున్నట్లు బిగ్‌బాస్కెట్ సీఈవో హరి మీనన్ పేర్కొన్నారు. కోవిడ్-19కు ముందు బిజినెస్‌తో పోలిస్తే లాక్‌డవున్ కాలంలో 60 శాతం అధిక విలువగల ఆర్డర్లు లభించినట్లు గ్రోఫర్స్ సీఈవో అల్వీందర్ తెలియజేశారు. -
ఈ–కామర్స్ 1.2 లక్షల కోట్ల డాలర్లు!
ముంబై: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2021 నాటికి 1.2 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనుంది. అప్పటికి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వినియోగదారుల మార్కెట్‌గా మారనుంది. డెలాయిట్ ఇండియా, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ–కామర్స్ మార్కెట్... కొనుగోలుదారులు ఆన్లైన్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో 2021 నాటికి 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని నివేదిక పేర్కొంది. దేశీ కరెన్సీ రూపాయి మారకం విలువపై ఒత్తిడి, క్రూడాయిల్ దిగుమతుల భారం పెరుగుతున్నప్పటికీ.. 2021–2026 మధ్య భారత రిటైల్ మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 7.8% మేర వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం 32% వార్షిక వృద్ధి సాధిస్తున్న భారత ఈ–కామర్స్ మార్కెట్ మరికొన్నాళ్ల పాటు మరింత అధిక వృద్ధి నమోదు చేయనుందని నివేదిక తెలిపింది. మారుతున్న కొనుగోలుదారుల ధోరణులు.. ఇంటర్నెట్ వినియోగం, ఆన్లైన్లో కొనుగోలు జరిపేవారి సంఖ్య పెరుగుతుండటం, వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతుండటం తదితర అంశాలు ఈ–కామర్స్ మార్కెట్ వృద్ధికి దోహదపడనున్నాయని డెలాయిట్ నివేదిక పేర్కొంది. అటు ఎం–కామర్స్ (మొబైల్ ద్వారా కొనుగోళ్లు) కూడా భారీగా పెరుగుతోందని వివరించింది. 2016 ఆర్థిక సంవత్సరంలో రూ. 20,000 కోట్లుగా ఉన్న ఎం–కామర్స్ లావాదేవీల పరిమాణం 2018 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,00,000 కోట్లకు చేరినట్లు తెలిపింది. సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటం, మారుతున్న షాపింగ్ ధోరణులు, స్మార్ట్‌ఫోన్స్ వినియోగంలో వృద్ధి వంటివి ఆన్లైన్ అమ్మకాల పెరుగుదలకు తోడ్ప డ్డాయి. ఇక, ప్రథమ..ద్వితీయ..తృతీయ శ్రేణి మార్కెట్స్‌లో మిలీనియల్స్ (1980–1996 మధ్య పుట్టినవారు) ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఆహారం, దుస్తులు, ఫుట్‌వేర్, యాక్సెసరీలు మొదలైన వాటి కొనుగోళ్లు అత్యధికం. సోషల్ కామర్స్ ప్రభావం... ఆన్లైన్ కొనుగోళ్లకు సంబంధించి సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోందని నివేదిక పేర్కొంది. 28% మిలీనియల్స్.. సోషల్ మీడియా సిఫార్సుల మేరకు కొనుగోళ్లు జరపగా, 63% మిలీనియల్స్ తమకిష్టమైన బ్రాండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. దేశీ ఈ–కామర్స్ రంగంలో కన్సాలిడేషన్ కూడా పెరుగుతోందని, 2017, 2018లో విలీన... కొనుగోళ్ల డీల్స్ 25 శాతం మేర పెరగడమే నిదర్శనమని నివేదిక పేర్కొంది. -
మీకు కావాల్సిన వస్తువులు తీసుకొని వెళ్లండి
షాపింగ్‌కు వెళ్లడం ఒక ఎత్తయితే, బిల్లింగ్ కౌంటర్ల వద్ద వేచిచూడటం మరో ఎత్తు. ఈ ఎదురుచూపులు అవసరం లేకుండా.. అసలు బిల్లింగ్ కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన పనే లేకుండా సరికొత్త టెక్నాలజీని ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థ ప్రధాన కార్యాయం సీటెల్‌లో తొలిసారిగా అత్యంత అధునాతన టెక్నాలజీతో ఓ కొత్త రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. అదే అమెజాన్ గో స్టోర్. దీని ప్రాముఖ్యత ఏమిటో ఓ సారి తెలుసుకుందాం. అమెజాన్ గో... షాపింగ్ ఎంతో సులువు.. అమెజాన్ గో స్టోర్‌లోకి షాపింగ్‌కి వెళ్లే ముందే మీ స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్ గో అనే యాప్ ఓపెన్ చేయాలి. ఈ యాప్‌ను ఓపెన్ చేయగానే క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని మాల్ ప్రవేశద్వారం వద్దే స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేరుగా అక్కడున్న స్మార్ట్ కప్ బోర్డుల వద్దకు వెళ్లి, వాటిలో మనకు కావాల్సిన వస్తువులను తీసుకోవాలి. మనం తీసుకునే సమయంలోనే అవి నేరుగా మన కార్ట్‌లోకి యాడ్ అయిపోతాయి. ఒకవేళ మనం తీసుకున్న వస్తువు వద్దనుకుంటే వెంటనే అక్కడ పెట్టేయొచ్చు. అదే సమయంలో ఆ వస్తువు కార్ట్ నుంచి తొలగిపోతుంది. ఏమైతే మనం తీసుకుని బ్యాగులో వేసుకుంటామో అవి మాత్రమే మన కార్ట్‌కు యాడ్ అవుతాయి. మాల్ వదిలివెళ్లే సమయానికి కూడా కార్ట్‌లో అవే ఉంటాయి. వాటికి ఎంత మొత్తం అయిందో మన స్మార్ట్‌ఫోన్‌లోనే చూసుకోవచ్చు. చెల్లింపు కూడా ఆటోమేటిక్‌గా ఆన్లైన్లోనే అయిపోతుంది. దీంతో బిల్లింగ్ కౌంటర్‌కు వెళ్లి గంటల పాటు వేచిచూడాల్సివసరం ఉండదు. నేరుగా బయటికి వచ్చేయొచ్చు. దీంతో కస్టమర్లకు షాపింగ్ ఎంతో సులభతరంగా మారుతుంది. 2016 లో ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ 2017 ఆరంభం నుంచే అందుబాటులోకి వచ్చింది. కానీ ఇందులో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతున్నట్లుగా విమర్శలు రావటంతో కంపెనీ వివరణ ఇచ్చింది. సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆశించిన దాని కంటే ఎక్కువగా శ్రమిస్తున్నారు. కస్టమర్లకు ఏం కావాలో తెలుసుకునేందుకు వారి నుంచి సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సోమవారం నుంచి తమ తొలి సీటెల్ ఆటోమేటెడ్ స్టోర్ ప్రారంభమైందని చెప్పారు. ఈ స్టోర్‌లో కిరాణా సామాన్లు, శీతల పానీయాలు, భోజన తయారీ కిట్లు అందుబాటులో ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని స్టోర్లను తెరిచే యోచనలో ఉన్నట్లు కూడా తెలిపారు. అమెజాన్‌కు రీటైల్ స్టోర్లు నిర్వహించడం కొత్తేమీ కాదు. అమెరికా వ్యాప్తంగా13 బుక్‌స్టోర్లను నిర్వహిస్తోంది. మరో మూడు ప్రాంతాల్లో కూడా ఈ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. 'హోల్ ఫుడ్స్ గ్రోసరీ చైన్'ను ఇప్పటికే దాదాపు 13.7 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ కామర్స్‌లో అమెజాన్ డాట్ కామ్‌కు గట్టి పోటీని ఇస్తున్న దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' కూడా త్వరలో కిరాణరంగంలోకి అడుగుపెట్టనుంది. ఈ రంగంలో కూడా ఇరు కంపెనీలకు గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది. -
ఐదేళ్లలో రూ. 16,250 కోట్లు ఖర్చుచేస్తాం: ఫ్లిప్‌కార్ట్
గిడ్డంగులు, లాజిస్టిక్స్‌కు వ్యయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వచ్చే నాలుగైదేళ్లలో సుమారు రూ.16,250 కోట్లు వెచ్చించనుంది. ఈ మొత్తాన్ని గిడ్డంగుల ఏర్పాటుతోపాటు లాజిస్టిక్స్‌కు వ్యయం చేయనున్నట్టు కంపెనీ సీవోవో బిన్నీ బన్సల్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద ఫ్లిప్‌కార్ట్ ఏర్పాటు చేసిన భారీ గిడ్డంగిని ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. ‘2019-20 నాటికి 80-100 గిడ్డంగులను ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. వీటిలో మూడు, నాల్గవ తరగతి పట్టణాల్లో సగం గిడ్డంగులను నెలకొల్పుతాం. దేశంలోని కస్టమర్లకు రెండు రోజుల్లోనే ఉత్పత్తులను చేర్చాలన్నది లక్ష్యం. రెండు మూడేళ్లలో లాభాల్లోకి వస్తాం’ అని సీవోవో తెలిపారు. కంపెనీ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 40 శాతం. మేడ్చల్ గిడ్డంగి నుంచి ఒక రోజులోనే ఈ రాష్ట్రాలకు ఉత్పత్తులను సరఫరా చేసే వీలుంది. ఫ్లిప్‌కార్ట్‌లో పోచంపల్లి చీరలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయని కంపెనీ వివరించింది. చిన్న వ్యాపారుల్నీ సంరక్షిస్తాం: ఈటల ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల రాకతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. ఈ-కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల రిటైల్ వర్తకులు నష్టపోతున్నారన్న సాక్షి ప్రతినిధి ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘ఈ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. పెద్ద కంపెనీలు భారీగా కొనుగోలు చేస్తాయి కాబట్టి వాటికి తక్కువ ధరకు సరుకులు వస్తాయి. అందుకే డిస్కౌంట్ ఇవ్వగల్గుతున్నాయి. అయితే కంపెనీలతోపాటు చిన్న, మధ్యతరహా వ్యాపారులనూ బతికించుకుంటాం’ అని మంత్రి వివరించారు. కస్టమర్లు ఆన్లైన్లో కొంటున్నారు కాబట్టి రిటైలర్లు కూడా వ్యాపార విధానాన్ని మార్చుకోవాల్సిందేనని బన్సల్ స్పష్టం చేశారు. రిటైలర్ల వ్యాపార విస్తరణకు తాము వేదికగా ఉన్నామన్నారు.