eKYC
-
22లోగా రబీ ఈ క్రాప్, ఈ కేవైసీ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: ప్రస్తుత రబీలో ఈ–క్రాప్, ఈకేవైసీల నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. రబీలో ఎక్కువ సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము వంటి మెట్టపంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుందని, అందువలన సాధ్యమైనంత త్వరగా ఈ క్రాప్, ఈ కేవైసీల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నియమించిన సూపర్ చెక్ బృందాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ కేవైసీలో నూరుశాతం సాధించే దిశగా ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న క్యాంపెయిన్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే ఖరీఫ్ 2024లో అవసరమైన ఎరువులు, విత్తనాల కోసం జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. పీఎం కిసాన్ 16వ విడత నిధులు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఇంకా ఆధార్‌తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేయని వారిని గుర్తించి సత్వరమే ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. -
సిలిండర్ ఈకేవైసీ @ రూ.150
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గృహజ్యోతి’ పథకంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ప్రారంభానికి ముందే అక్రమార్కులకు కాసులపంట కురిపిస్తోంది. ఈకేవైసీ పేరుతో అందినకాడికి దోచుకుంటున్న విషయం మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై మహిళలు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక శివనగర్ ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీకి రూ.150 చెల్లించాలని ఏజెన్సీ నిర్వాహకులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినవారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మరోవైపు ఈకేవైసీతో పాటుగా కచ్చితంగా పైపు తీసుకోవాలనే నిబంధన ఉందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల అధికారిని వివరణ కోరగా.. ఈకేవైసీకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
ఈ–క్రాప్ నమోదుకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఈ–పంట నమోదులో మరిన్ని సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ఈ సీజన్లో 89.37 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా.. తొలకరి కాస్త ఆలస్యం కావడంతో ఇప్పటివరకు 9.07 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. సాంకేతిక సమస్యలకు తావులేకుండా పకడ్బందీగా ఈ–పంట నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టగా, మిగిలిన జిల్లాల్లో వచ్చే వారం ప్రారంభించనున్నారు. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు పంట నష్టపరిహారం, పంటల బీమా, పంట కొనుగోలుకు ఈ–పంట నమోదే ప్రామాణికం కావడంతో చిన్నపాటి లోపాలకూ ఆస్కారంలేని రీతిలో ఈ–పంట నమోదు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. నూరు శాతం ఈ–క్రాప్ నమోదు చేస్తున్నప్పటికీ ఈకేవైసీ నమోదులో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద ఈ–పంట నమోదు చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ)సౌజన్యంతో ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్ చేశారు. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటాతో అనుసంధానించిన యాప్‌లో రైతు ఆధార్ నెంబర్ కొట్టగానే అతని పేరిట ఏ ఏ సర్వే నెంబర్లలో ఎంత విస్తీర్ణంలో వ్యవసాయ, కౌలు భూములున్నాయో తెలిసిపోతుంది. తొలుత ఆధార్, వన్ బీ, జాతీయ చెల్లింపుల సహకార సంస్థ (ఎన్పీసీఐ), ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌నెంబర్, సీసీఆర్సీ కార్డుల వివరాలను ఈ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులతో కలిసి ప్రతిరోజు కనీసం 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్రస్థాయి పరిశీలనకు చేస్తారు. యాప్‌లో నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో సరిపోల్చుకుని అంతా ఒకే అనుకుంటే జియో కోఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోను తీసి అప్లోడ్ చేస్తారు. జియో ఫెన్సింగ్ ద్వారా సరిహద్దుల గుర్తింపు.. ఈసారి కొత్తగా జియో ఫెన్సింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. మొన్నటి వరకు సాగుచేసే పొలానికి కాస్త దూరంగా నిలబెటిŠట్ ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే సరిపోయేది. కానీ, ఇక నుంచి ఖచ్చితంగా సాగుచేసే పొలంలో నిలబెట్టి జియో ఫెన్సింగ్ ద్వారాæ సరిహద్దులు నిర్ధారించిన తర్వాతే ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. గిరిజన రైతులు సాగుచేసే అటవీ భూముల (ఆర్ఓఎఫ్ఆర్) డేటా ఉన్న గిరిజన సంక్షేమ శాఖకు చెందిన గిరి భూమి వెబ్‌సైట్‌తో అనుసంధానం చేస్తున్నారు. తద్వారా ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో గిరిజనులు సాగుచేసే పంటల వివరాలు కూడా పక్కాగా ఈ–క్రాప్‌లో నమోదు చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను నమోదు చేసేలా యాప్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఈ ఫిష్ డేటాతో అనుసంధానం ఖాళీగా ఉంటే నో క్రాప్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వాకల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రి ల్యాండ్ యూజ్ అని నమోదు చేస్తున్నారు. డుప్లికేషన్‌కు తావులేకుండా ఉండేందుకు ఈ–ఫిష్ డేటాతో ఇంటిగ్రేట్ చేశారు. ఈ–క్రాప్ నమోదు పూర్తికాగానే రైతుల ఫోన్ నెంబర్లకు డిజిటల్ రశీదు, వీఏఏ/వీహెచ్ఏ, వీఆర్ఏల వేలిముద్రలతో పాటు చివరగా రైతుల వేలిముద్రలు (ఈకేవైసీ) తీసుకోవడం పూర్తికాగానే రైతు చేతికి భౌతికంగా రశీదు అందజేస్తారు. ప్రతీ సీజన్లోనూ నూరు శాతం ఈ–పంట నమోదు చేయగా, ఖరీఫ్–22లో 92.4 శాతం ఈకేవైసీ నమోదు చేశారు. గడిచిన రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 97.47 శాతం ఈకేవైసీ నమోదు చేశారు. ఇక ఈసారి ఈ–పంటతో పాటు నూరు శాతం ఈకేవైసీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబర్ 20 కల్లా ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తిచేసి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ఈ–పంట జాబితాలను ప్రదర్శిస్తారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత సెప్టెంబర్ 30న తుది జాబితాలను ప్రదర్శిస్తారు. -
లింక్ క్లిక్ చేసి లక్షలు నష్టపోయిన 40 మంది.. బాధితుల్లో ప్రముఖ నటి!
సైబర్ మోసాలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. కొంచెం ఏమరుపాటుగా ఉన్నా ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేస్తారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు, ప్రముఖులు కూడా ఈ సైబర్ మోసాలకు గురవుతున్నారు. ఇలాగే ముంబైలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన కస్టమర్లు ఏకంగా 40 మంది తమ కేవైసీ, పాన్ వివరాలను అప్డేట్ చేయాలంటూ వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మోసానికి గురయ్యారు. మూడు రోజుల్లో లక్షల రూపాయలు నష్టపోయారు. బ్యాంక్ కస్టమర్లు తమ గుర్తింపును ధ్రువీకరించుకోవడానికి కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. అయితే ఇందుకోసం బ్యాంకులు ఇలా మెసేజ్‌ల ద్వారా లింక్‌లు పంపవు. సంబంధిత బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లు లేదా యాప్‌ల ద్వారా ఆన్లైన్లో ఈ-కేవైసీ చేసుకోవచ్చు. అలాగే నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవచ్చు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. ప్రస్తుతం అన్ని బ్యాంకుల్లోనూ పాన్ వివరాలను అప్డేట్ చేసుకోవడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ లింక్‌లతో ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు. కస్టమర్లు కంగారు పడి వెంటనే లింక్ క్లిక్ చేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులలో కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ తదితర రహస్య వివరాలను నమోదు చేసి లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి మోసాలకు గురై డబ్బు పోగుట్టుకున్నట్లు ఫిర్యాదు చేసిన 40 మంది బాధితుల్లో ప్రముఖ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. ఇటీవల తనకు ఓ వచ్చిందని, అది బ్యాంక్ నుంచే వచ్చిందని నమ్మి లింక్‌ను క్లిక్ చేశానని ఆమె తెలిపారు. ఇలా క్లిక్ చేసి తన కస్టమర్ ఐడీ, పాస్వర్డ్, ఓటీపీ నమోదు చేశానని పోలీసులకు ఆమె వివరించారు. ఇంతలో బ్యాంక్ అధికారినంటూ ఒక మహిళ ఫోన్ చేసి తన మొబైల్ నంబర్‌కు వచ్చిన మరో ఓటీపీని నమోదు చేయాలని చెప్పడంతో అలాగే చేశానని, ఆ తర్వాత తన ఖాతా నుంచి రూ.57,636 కట్ అయిందని ఆమె పేర్కొన్నారు. -
బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్!
ముంబై: ఆన్లైన్లో కేవైసీ (ఖాతాదారుల వివరాలు) వెరిఫికేషన్ పూర్తి చేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్లైన్లో అప్డేట్ చేయొచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కేవైసీ ధృవీకరణ లేదా అప్డేషన్ కోసం కస్టమర్లు కచ్చితంగా శాఖకు రావాలంటూ బ్యాంకులు డిమాండ్ చేయజాలవని, అలాంటి నిబంధనేదీ పెట్టలేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అలాగే సెంట్రల్–కేవైసీ (సీ–కేవైసీ) పోర్టల్‌లో తమ వివరాలను అప్లోడ్ చేసిన కస్టమర్లను కూడా బ్యాంకులు.. వెరిఫికేషన్ కోసం అడగనక్కర్లేదని తెలిపారు. అలాంటి సందర్భాల్లో కస్టమర్లు తమ కేవైసీ వివరాలను సీ–కేవైసీ పోర్టల్ నుంచి యాక్సెస్ చేసుకోవాలంటూ అధికారిక ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబరు ద్వారా బ్యాంకుకు మెయిల్ లేదా మెసేజీ పంపించవచ్చని దాస్ పేర్కొన్నారు. -
ఆధార్ ఈకేవైసీ లావాదేవీలు 25 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ఈకేవైసీ లావాదేవీలు సెప్టెంబర్ నెలకు 25.25 కోట్లుగా నమోదయ్యాయి. ఆగస్ట్ నెలతో పోలిస్తే ఇవి 7.7 శాతం పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) అన్నది అన్ని ముఖ్య లావాదేవీలకు అవసరమని తెలిసిందే. పేపర్లతో సంబంధం లేకుండా ఆధార్ బయోమెట్రిక్‌తో ఈకేవైసీ విధానం పలు చోట్ల అమల్లో ఉన్న విషయం గమనార్హం. ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) సైతం ఆర్థిక సేవల విస్తృతికి కీలకమని ఈ ప్రకటన పేర్కొంది. ‘‘ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏఈపీఎస్, మైక్రో ఏటీఎంల ద్వారా మారుమూల ప్రాంతాల్లో మొత్తం మీద 1,594 కోట్ల బ్యాంకింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలలోనే 21.03 కోట్ల ఏఈపీఎస్ లావాదేవీలు దేశవ్యాప్తంగా జరిగాయి’’అని వెల్లడించింది. ఆధార్ ద్వారా సెప్టెంబర్ నెలలో 175.41 కోట్ల ధ్రువీకరణ లావాదేవీలు నమోదయ్యాయి. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 12 వరకే గడువు..
సాక్షి, అమరావతి: పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక తనిఖీల కోసం ఈ–కేవైసీ చేయించుకున్న రైతుల జాబితాలను ఈ నెల 16వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. చదవండి: అన్ని ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టండి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖరీఫ్ సీజన్లో 1.08 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వీఆర్వో కలిపి 90 శాతం ఈ–క్రాప్‌ను ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. రైతులందరికీ తమ మొబైల్ నంబర్‌కు వారు సాగు చేసిన పంట, విస్తీర్ణం, ఇతర వివరాలను మెసేజ్ రూపంలో పంపుతున్నామని వివరించారు. ఈ వివరాలను తెలియజేస్తూ రైతు భరోసా కేంద్రాల్లో ఉండే సిబ్బంది సంతకంతో కూడిన రశీదు కూడా ఇస్తారని తెలిపారు. -
అలర్ట్: పీఎం కిసాన్ ఈ-కేవైసీ అప్డేట్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం ద్వారా అర్హులైన కోట్లాదిమంది రైతులకు 12వ విడత నగదును ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలోనే విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 1న ఈ నగదును రైతుల ఖాతాల్లో జమచేయనుందని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది.(వారెన్ బఫెట్ పోలికపై రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్పందన వైరల్) మరోవైపు ఈ-కేవైసీ అప్డేట్ చేసుకొని రైతన్నలకు మరో అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ ఈ-కేవైసీ అప్డేట్ గడువును ఆగస్టు 31వ తేదీ దాకా పొడిగించింది. ఇప్పటివరకు 11 విడతలు నగదు అందుకున్న రైతులు 12వ విడత నగదు పొందాలంటే ఈ-కేవైసీ అప్డేట్ తప్పనిసరి. అప్డేట్ చేయకపోతే తదుపరి విడత నగదు రైతులకు రాదు. ఈనేపథ్యంలో ఈ ఈ-కేవైసీ అప్డేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. (లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!) పీఎం కిసాన్ నమోదిత అన్నదాతలు ఓటీపీ ఆధారంగా కూడా పీఎం కిసాన్ పోర్టల్‌లో ఆఫ్‌లైన్‌లో అప్డేట్ చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్‌లైన్‌లో బయోమెట్రిక్ ఆధారంగా కూడా సమీపంలోని సీఎస్సీ కేంద్రాలల్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఈ-కేవైసీ అప్డేట్ ఇంట్లోనే మీ మొబైల్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా పీఎం కిసాన్ వెబ్ సైట్ లాగిన్ కావాలి ఆ తర్వాత కుడి వైపు ఉండే e-KYC ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఇక్కడ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. సెర్చ్ స్టెప్-4పై క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. సంబంధిత నంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అదే ఆఫ్‌లైన్‌లో అయితే ఎలా లబ్దిదారుడైన అన్నదాత సమీపంలోని సీఎస్సీ కేంద్రానికి వెళ్లాలి. పీఎం కిసాన్ ఖాతా కోసం ఆధార్ అప్డేట్ సమర్పించాలి. పీఎం కిసాన్ ఖాతాకు లాగిన్ అయ్యేందుకు బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్ కార్డ్ నంబర్ అప్డేట్ చేసి, సబ్మిట్ చేసిన తర్వాత ఫోన్‌కు వచ్చే ఎస్ఎంఎస్ ద్వారి నిర్ధారించుకోవాలి. అంతేకాదు హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ ఐడిలో మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092లో సంప్రదించవచ్చు. అధికారిక ఇ-మెయిల్ ఐడీని సంప్రదించి పరిష్కారం పొందవచ్చు. దేశంలో అన్ని భూస్వామ్య రైతు కుటుంబాలకు ఈ పథకంలో ఆర్థికఆసరా కల్పిస్తోంది కేంద్రం.తద్వారా రైతులకు వ్యవసాయ,సంబంధిత సామాగ్రి కొనుగోలు ఖర్చులకు సాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున అందిస్తుంది. ఈ మొత్తాన్ని విడతకు రూ. 2000 చొప్పున ఏడాదిలో 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అంటే ప్రతి నాలుగు నెలలకోసారన్నమాట. దీనికి సంబంధించి నమోదు గడువు ఇప్పటిదాకా జూలై 31. అయితే ఇప్పటికే ఈ డెడ్‌లైన్‌ను వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ గడువును 3 సార్లు ( జూలై 31, మే 31, మార్చి 31) పొడిగించింది. -
ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు
అనంతపురం అగ్రికల్చర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్ నోయువర్ కస్టమర్) తప్పని సరి అయింది. ఈ ఏడాది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2వేల చొప్పున ఏటా రూ.6వేలు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఈ నెల 31వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోకపోతే పథకం లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉంది. చదవండి: నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి ఈ–కేవైసీ, కేవైసీ రెండూ వేర్వేరు.. ఈ–కేవైసీ, కేవైసీ (నో యువర్ కస్టమర్) రెండు విధానాలు వేర్వేరు. ఓటీపీ ఆధారంగా చేసే విధానాన్ని ఈ–కేవైసీ అంటారు. ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీతో ఈ–కేవైసీని పూర్తి చేస్తారు. అలాగే కేవైసీని డాక్యుమెంట్ల ఆధారంగా పూర్తి చేస్తారు. ఇంతకు మునుపు కేవైసీ చేయించిన పీఎం కిసాన్ లబ్ధిదారులు మళ్లీ ఈ–కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు మనీ ల్యాండరింగ్, ఫేక్ అకౌంట్లను అరికట్టేందుకు ఈ–కేవైసీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల అనర్హులకు సంక్షేమ పథకాలు నిలిచిపోతాయి. దీంతో ప్రజాధనం ఆదా అవుతోంది. స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంట్లోనే ఇలా... స్మార్ట్‌ఫోన్ ఉంటే ఇంట్లోనే ఈ–కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా www.pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేసుకోవాలి. అప్పుడు ఆధార్‌కార్డుకు లింకై ఉన్న మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేస్తే ఈ–కేవైసీ అప్డేట్ అవుతుంది. కస్టమర్ సర్వీస్ సెంటర్లలో... జిల్లాలోని దాదాపు అన్ని మండల కేంద్రాల్లో ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్లలో (సీఎస్సీ) రైతుల సౌకర్యార్థం ఈ–కేవైసీ చేస్తున్నారు. ఆన్లైన్ కేంద్రాలు, మీసేవ కేంద్రాల్లోనూ ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ నెల 31 లోపు రైతులు ఈ–కేవైసీని పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఈ పథకం వర్తించదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ఈ–కేవైసీ నమోదుకు గడువు పొడగిస్తూ వచ్చింది. ఇదే చివరి అవకాశం కావడంతో రైతులను ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చైతన్య పరుస్తున్నారు. అవకాశం జారవిడుచుకోవద్దు.. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.2 వేలు చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6 వేలు లబ్ధి చేకూరుతుంది. అర్హత ఉన్న ప్రతి రైతూ ఆధార్, దానికి అనుసంధానమైన ఫోన్ నెంబరు, అలాగే ఓటీపీ నెంబరు ఆధారంగా అథెంటిఫికేషన్ చేసుకోవాలి. రైతులు ఈ విషయాన్ని గమనించి సాధ్యమైనంత తొందరగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఇదే చివరి అవకాశం.. జారవిడుచుకోవద్దు. – బి.చంద్రానాయక్, డీఏఓ -
అలర్ట్: ఇలా చేయకపోతే మీ రూ. 2000 పోయినట్లే..!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో సంవత్సరానికి రూ. 6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఉండాలని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. అందుకే ఇందులో లబ్ధిదారుడిగా ఉన్న రైతులు కేవైసీ చేసుకున్నప్పటికీ మళ్లీ తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలా చేసిన ప్రతి లబ్ధిదారునికి రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు అనగా సంవత్సర కాలానికి రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 11 విడుతలుగా నగదును అందించింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాలో నేరుగా నగదు జమచేస్తున్నారు అధికారులు.ప్రస్తుతం అన్నదాతులు 12వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్రం ప్రభుత్వ సమాచారం ప్రకారం ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాలకు నగదను పంపనున్నారు. అయితే ఆ నగదు పొందాలంటే ప్రతి లబ్దిదారుడు ముందుగా ఈకేవైసీ( e-KYC)ని తప్పనిసరి పూర్తి చేయాలి. జూలై 31లోగా e-KYCని పూర్తిచేయాలని కేంద్రం గడువు విధించింది. e-KYC నమోదు ఇలా.. ఈ–కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్‌లో ఉచితంగా చేసుకోవచ్చు. మీ సేవ, ఈ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో కూడా రైతులు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు www.pmkisan.gov.in లింక్‌ను ఓపెన్ చేయగానే అందులో ఈ–కేవైసీ అప్డేట్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు ఆధార్ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ–కేవైసీ అప్డేట్ అవుతుంది. చదవండి: African Parrot: మా రుస్తుమా ఎటో వెళ్లిపోయింది.. మీకు కనిపిస్తే చెప్పండి.. రూ.50వేలు ఇస్తాం.. -
ఈ-కేవైసీ నమోదులో కొత్త సమస్యలు.. ఆధార్‌కు లింకు కాని ఫోన్ నంబర్లు
నర్వ (నారాయణ్‌పేట్ జిల్లా): రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈకేవైసీని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్లలో నిధులను కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించగా.. ఈ సీజన్లో అర్హులను గుర్తించేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. కాగా గడువు ఈ నెల 31 వరకే ముగుస్తున్నా జిల్లాలో ఈకేవైసీ నామమాత్రంగా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే నమోదైంది. ఈకేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రమే ప్రస్తుతం రూ.2 వేల చొప్పున చెల్లింపులు చేయాలని లేదా నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్ నుంచి నిధులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి జాన్‌సుధాకర్ తెలిపారు. చదవండి👉 ‘ఇలాంటి ఫథకం దేశంలో ఎక్కడా లేదు’ అనుసంధానం ఇలా.. రైతులు ముందుగా పీఎం కిసాన్ పథకం వివరాలిచ్చిన తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌కార్డును అనుసంధానించుకోవాలి. తదుపరి ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్‌ను అనుసంధానించాలి. అనంతరం పీఎం కిసాన్ పోర్టల్‌లో ఆధార్ ఆధారితంగా ఈకేవైసీ చేస్తున్నప్పుడు ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ సంఖ్యను తిరిగి నమోదు చేస్తేనే ఈకేవైసీ పూర్తవుతుంది. సెల్ఫోన్లో పీఎం కిసాన్ యాప్ ద్వారా లేదా కంప్యూటర్లో పోర్టల్ ద్వారా రైతులే ఈకేవైసీని చేసుకోవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో సైతం ఈకేవైసీని పూర్తి చేయించాలి. ఆధార్ ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసిన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేస్తారు. బోగస్ రైతులు జాబితా నుంచి తొలగించబడతారు. 2018లో పథకం ప్రారంభించిన దగ్గర నుంచి 10 విడతలుగా నిధులను విడుదల చేయగా ప్రస్తుతం ఏప్రిల్‌లోనే 11వ విడతకు సంబంధించి ఈ దఫా నిధులు ఇవ్వాల్సి ఉండగా ఈకేవైసీతో ఈ నెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. అవగాహన కల్పించరూ.. ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ చేసుకోవడం గురించి చాలా మంది రైతులకు తెలియదు. ఇవి చేసుకోలేకనే ఎంతో మంది రైతులు ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. తాజాగా ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కానీ, క్షేతస్థ్రాయిలో ఈ విషయమే చాలా మంది రైతులకు తెలియదు. తెలిసిన వారు వెళ్లినా మీ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్‌కు ఫోన్ నంబర్ లింకు లేకపోవడం వంటి కారణాలతో మళ్లీ మళ్లీ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం వ్యవసాయాధికారులు ధాన్యం నాణ్యత ధ్రువీకరణ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈకేవైసీని పూర్తిచేయించేందుకు రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈకేవైసీని పూర్తి చేయని రైతులకు నిధులు నిలిచిపోనున్నందున రైతులందరూ ఈకేవైసీని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చదవండి👉🏻 గడువు 31 వరకే.. ఈ–కేవైసీ తప్పనిసరి.. ఇలా నమోదు చేసుకోండి నమోదు చేసుకోండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం రైతులు ఈ నెల 31లోగా నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈకేవైసీ నమోదు చాలా తక్కువగా ఉంది. ఆయా మండలాల ఏఈఓలు నమోదును వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నాం. రైతులకు గ్రామాల్లో గడువులోగా ఈకేవైసీ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి. పీఎం కిసాన్ లబ్ధి రైతులే కాకుండా మిగిలిన రైతులు కూడా ఈకేవైసీ చేసుకుంటే మంచిది. – జాన్‌సుధాకర్, జిల్లా వ్యవసాయాధికారి ఇప్పటి వరకు రాలే.. ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రాలేదు. అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ నెల 31 వరకు గడువు ఉన్నందు వల్ల వెంటనే చేసుకుంటాను. – గోవిందరెడ్డి, రైతు, పెద్దకడ్మూర్ గ్రామం -
PM Kisan: గడువు 31 వరకే.. ఈ–కేవైసీ తప్పనిసరి.. ఇలా నమోదు చేసుకోండి
దేవరకొండ (నల్గొండ): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏడాదికి మూడు సార్లు జమ చేస్తుంది. ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పది విడుతలుగా నగదును అందించింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాలో నగదు జమకానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి వ్యసాయ అధికారులు రైతులకు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31లోగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సొమ్ము తమ ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చదవండి👉🏼 ‘పరువుహత్య’ విచారణపై ఒవైసీకి అభ్యంతరం ఎందుకు? నమోదు ఇలా.. ఈ–కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్‌లో ఉచితంగా చేసుకోవచ్చు. మీ సేవ, ఈ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో కూడా రైతులు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు www.pmkisan.gov.in లింక్‌ను ఓపెన్ చేయగానే అందులో ఈ–కేవైసీ అప్డేట్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు ఆధార్ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ–కేవైసీ అప్డేట్ అవుతుంది. చదవండి👉🏾 India: మహిళల్లో 32 శాతం మంది ఉద్యోగులు -
ఆన్లైన్ గేమింగ్ కోసం.. కేవైసీ ఇవ్వాలి
న్యూఢిల్లీ: ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ భారీగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది. దీంతో ఈ గేమింగ్ పరిశ్రమను యాంటీ మనీ లాండరింగ్ చట్టం (అక్రమ నగదు చెలామణి నిరోధక/పీఎల్‌ఎంఏ) పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. దీనివల్ల అక్రమ నగదు చెలామణిని నిరోధించడమే కాకుండా, ఉగ్రవాదులకు నిధులు అందకుండా కట్టడి చేసినట్టు అవుతుంది. మనీ లాండరింగ్ చట్టం పరిధిలోకి తీసుకొస్తే స్కిల్ గేమింగ్, ఈ గేమింగ్ కంపెనీలన్నీ కూడా తమ కస్టమర్లకు సంబంధించి కేవైసీ నిబంధనలను అనుసరించాలి. బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, స్టాక్స్ కొనుగోలుకు ఇస్తున్నట్టే.. ఈ గేమింగ్/స్కిల్ గేమింగ్ యూజర్లు తమకు సంబంధించి కేవైసీ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు గేమింగ్‌కు సంబంధించి యూజర్ల లావాదేవీలను ప్రభుత్వం ట్రాక్ చేయగలుగుతుంది. పారదర్శకత లేదు.. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో పారదర్శకత లేదని వెల్లడైంది. కొన్ని నగదు లావాదేవీలకు సంబంధించి వివరాలను దర్యాప్తు సంస్థలు పొందలేకపోయాయి. ఈ గేమింగ్ సంస్థలు తమ కస్టమర్ల విషయంలో పూర్తి స్థాయి వివరాలను సేకరించడం, ధ్రువీకరించడం చేయడం లేదని తెలిసింది. గేమింగ్ యాప్‌ల రూపంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టు, వీటికి సంబంధించి కస్టమర్ గుర్తింపు వివరాలు లేవని దర్యాప్తులో వెల్లడైనట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో కేవైసీ నిబంధనల పరిధిలోకి, పీఎల్‌ఎంఏ కిందకు స్కిల్ గేమింగ్ యాప్‌లను ప్రభుత్వం తీసుకురానున్నట్టు తెలిపాయి. దీంతో ఆయా సంస్థలు డైరెక్టర్‌తోపాటు, ప్రిన్సిపల్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. స్కిల్ గేమింగ్ యాప్స్, ఈ గేమింగ్ సంస్థలను పీఎంఎల్ఏ పరిధిలోకి తీసుకువస్తే.. నగదు జమ చేస్తున్న వ్యక్తి, లబ్ధి దారు, ఇతర ముఖ్యమైన వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కు నివేదించాల్సి ఉంటుంది. అలాగే, రూ.50,000కు పైన ఎటువంటి లావాదేవీ విషయంలో అయినా అనుమానం ఉంటే, ఆ వివరాలకు కూడా ప్రత్యేకంగా తెలియజేయాలి. పీఎల్‌ఎంఏ చట్టం కిందకు ఆన్లైన్ స్కిల్ గేమింగ్ యాప్‌లను కూడా రిపోర్టింగ్ సంస్థలుగా తీసుకురావడానికి ముందు.. బ్రిటన్‌కు చెందిన గ్యాంబ్లింగ్ చట్టాన్ని పరిశీలించాలన్న సూచన కూడా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ గేమింగ్ సంస్థలను నియంత్రించే విషయంలో సరైన కార్యాచరణ లేకపోవవడం పట్ల కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపాయి. ప్రస్తుతం ఈ కంపెనీలన్నీ కూడా కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద నమోదు అవుతున్నాయి. ఈ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులపై నిషేధం కూడా లేదు. స్కిల్ గేమింగ్ కంపెనీల్లో కొన్ని మాల్టాలో నమోదైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ గ్రే లిస్ట్‌లో ఉన్న ఈ దేశం.. ఆర్థిక అక్రమాలకు వేదికగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేశాయి. -
పీఎం కిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడగింపు!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం-కిసాన్) రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ ఈ-కేవైసీ గడువు తేదీని పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ-కేవైసీ గడువును మే 22, 2022 వరకు పొడగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ గడువును 2022 మే 22 వరకు పొడిగించినట్లు అధికారిక పోర్టల్ ద్వారా తెలిపింది. ఇంతక ముందు ఈ-కేవైసీ గడువు మార్చి 31, 2022 వరకు ఉండేది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద డబ్బులు పొందుతున్న రైతులు కచ్చితంగా ఆధార్ ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-కేవైసీ చేసుకోలేకపోయినట్లయితే పీఎం కిసాన్ నగదు మీ ఖాతాలో జమ కాదు. కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించిందని వేచి చూడకుండా.. వెంటనే ఈ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి రైతులు ఇకేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేయొచ్చు. ఈ పథకం కింద, సంవత్సరానికి ₹6,000 మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ₹2,000లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తదుపరి విడత డబ్బులను వచ్చే నెలలో రైతులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ-కేవైసీ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలి? పీఎం-కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్లో ఈ-కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆధార్ కార్డు నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నంబర్ నమోదు చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. 'సబ్మిట్' పై క్లిక్ చేస్తే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం వెబ్సైట్ డౌన్లో ఉంది. పనిచేయడం లేదు. (చదవండి: మంటల్లో కాలిపోతున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈవీ రంగంపై నీలి నీడలు!) -
బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కెవైసీ గడువు పొడిగించిన ఆర్బీఐ!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ తెలిపింది. కెవైసీ అప్డేట్ గడువును మార్చి 31, 2022 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. కోవిడ్-19 కొత్త రకం ఓమిక్రాన్ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతంలో ఈ గడువు డిసెంబర్ 31, 2021 వరకు ఉండేది. "కోవిడ్-19 కొత్త రకం ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా కెవైసీ అప్డేట్ గడువును మార్చి 31, 2022 వరకు వరకు పొడగించినట్లు" అని సెంట్రల్ బ్యాంక్ గురువారం తెలిపింది. కెవైసీ ప్రక్రియలో భాగంగా ఖాతాదారులు బ్యాంకులకు తమ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది. కోవిడ్-19 కారణంగా కెవైసీ అప్డేట్ చేయని కస్టమర్ ఖాతాల విషయంలో ఎలాంటి పరిమితి ఉండదని ఆర్బీఐ తెలిపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002, మనీ లాండరింగ్ నిరోధక(రికార్డుల నిర్వహణ) నియమాలు-2005 నిబంధనల పరంగా ఖాతాదారుల కెవైసీ అప్డేట్ ఆర్బీఐ 2016లో నియంత్రిత సంస్థలను ఆదేశించింది. కేవైసీ కేవలం బ్యాంకింగ్ లావాదేవీలకు మాత్రమే కాదు, నగదుతో ముడిపడి ఉన్న అన్ని లావాదేవీలకు కేవైసీ చేయాల్సి ఉంటుంది. రిస్కు తక్కువగా ఉన్న ఖాతాలకు ప్రతి పదేళ్లకు ఒకసారి కేవైసీ అప్డేట్ చేయాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. ఎక్కువ రిస్క్ ఉన్న అకౌంట్ హోల్డర్స్ ప్రతి రెండేళ్లకు ఒకసారి కేవైసీని అప్‌డేట్ట్ చేయాలి. ఎక్కువ కాలం పాటు ఇన్‌యాక్టివ్‌లో ఉన్న, రీయాక్టివేట్ కావాల్సిన డోర్మాట్ బ్యాంకు ఖాతాలు కూడా కేవైసీని అప్డేట్ చేయాలి. ఒకవేళ కేవైసీ అప్డేట్ చేయకపోతే భవిష్యత్‌లో బ్యాంకులు కస్టమర్ల ఎలాంటి లావాదేవీలు చేయకుండా నిలిపివేస్తాయి. (చదవండి: హ్యుందాయ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ కార్లకు స్వస్తి..!) -
జియో యూజర్లకు అలర్ట్.. 42 కోట్ల వినియోగదారులకు మెసేజ్!
ఈ-కేవైసీ మోసాలు, నకిలీ ఎస్సెమ్మెస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ రిలయన్స్ జియో తన వినియోగదారులను కోరింది. దేశంలోని అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ జియో తన చందాదారులకు పంపిన ఒక మెసేజ్‌లో ఇటీవల దేశంలో ఎక్కువగా జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొత్త ఏడాది, పండుగుల పేరుతో వచ్చే ఆఫర్స్ లింక్స్ మీద క్లిక్ చేయవద్దు అని తెలిపింది. ఇప్పటికే ఈ ఈ-కేవైసీ మోసాలు, నకిలీ ఎస్సెమ్మెస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా మెసేజ్‌లు పంపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్రింద పేర్కొన్న విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జియో తన యూజర్లకు సూచిస్తుంది. ► ఈ-కేవైసీ వెరిఫికేషన్ పేరుతో వచ్చే కాల్స్/సందేశాలకు స్పందించవద్దు అని సూచిస్తుంది. వెరిఫికేషన్ కోసం ఏదైనా నెంబరుకు కాల్ చేయమని మిమ్మల్ని అడిగే ఆ మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలుపుతుంది. ► కేవైసీ /ఆధార్ వివరాలను అప్డేట్ చేయడానికి జియో కస్టమర్లు ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దని కోరింది. అటువంటి వాటి కోసం ఏదైనా థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోమని జియో మిమ్మల్ని ఎన్నడూ అడగదని పేర్కొంది. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల మోసగాళ్ళు మీ ఫోన్లోని మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేసుకుంటారు అని పేర్కొంది. ► సైబర్ మోసానికి సంబంధించిన ఇటీవలి కొన్ని కేసుల్లో మోసగాళ్ళు తమను తాము జియో ప్రతినిధులుగా పేర్కొంటున్నారని తెలిపింది. అలాగే, చందాదారుల ఆధార్, బ్యాంకు ఖాతాలు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ-కేవైసీ పేరుతో అడుగుతున్నారని, అలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ-కేవైసీ పేరుతో వచ్చే ఎస్ఎమ్ఎస్/కాల్స్ ను ఏవీ నమ్మవద్దని టెల్కో వినియోగదారులను కోరింది. ► ఈ-కేవైసీ పేరుతో వచ్చే ఎస్ఎమ్ఎస్‌లలో ఉన్న నెంబర్లను తిరిగి కాల్ చేయవద్దని కస్టమర్లకు పేర్కొంది. ► జియో ప్రతినిధి అని చెప్పుకునే కాలర్లు పంపే లింక్స్, అటాచ్ మెంట్లపై క్లిక్ చేయవద్దని జియో కస్టమర్లకు సూచిస్తుంది. ► మైజియో యాప్‌లో మీకు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు గనుక తృతీయపక్ష యాప్‌లను డౌన్లోడ్ చేసుకోమని వినియోగారులను ఎన్నడూ అడగాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది. (చదవండి: చిక్కుల్లో సుందర్ పిచాయ్...! అదే జరిగితే..?) -
పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ-కేవైసి చేయకపోతే రూ.2 వేలు రానట్లే..!
PM KISAN e-KYC: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాది 3 విడతలలో రూ. 2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలను రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం కింద 10వ విడత నగదును అతి త్వరలో రైతుల ఖాతాలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతుంది. అయితే, ఈ సారి రైతుల ఖాతాలో 10వ విడత డబ్బులు జమ చేయడానికి ముందు సరికొత్త రూల్ అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ 10వ విడత రూ.2000 వేలను రైతుల ఖాతాలో జమ చేయాలంటే కచ్చితంగా ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ-కేవైసి ప్రక్రియలో భాగంగా రైతులు తమ ఆధార్ నెంబర్‌ను ప్రధాన మంత్రి-కిసాన్ ఖాతాతో అనుసంధానం చేయాలి, లేకపోతే ఈ విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ కావు అని తెలిపింది. ఈ-కేవైసి అనేది రెండూ రకాలుగా చేయవచ్చు. ఆధార్-మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా ఈ-కేవైసి ప్రక్రియ విధానం మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్‌తో లింకు అయిన వారు మాత్రమే ఈ విధానం ద్వారా ఈ-కేవైసి అనేది చేయవచ్చు. మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు పీఎం కిసాన్ హోమ్ పేజీలో కనిపించే "ఈ-కేవైసి" ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబరు, క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నంబర్ నమోదు చేసి "Get OTP" క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కి వచ్చే ఓటీపీ నమోదు చేసి "Submit For Auth" మీద నొక్కండి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ప్రధాన మంత్రి-కిసాన్ ఖాతాతో లింకు అవుతుంది. మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్‌తో లింకు కానీ వారు, ఈ-కేవైసి పూర్తి చేయడం కోసం మీ దగ్గరలోని CSC కేంద్రాన్ని సందర్శించండి. ఆ తర్వాత వారితో పీఎం కిసాన్ ఈ-కేవైసి కోసం వచ్చినట్లు చెప్పండి. మీ బయోమెట్రిక్ తీసుకొని పీఎం కిసాన్ ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేస్తారు. (చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!) -
జోరుగా ఈ–పంట నమోదు
సాక్షి, అమరావతి: ఈసారి విత్తుతో పాటు పంటల నమోదు కూడా ఒకేసారి ప్రారంభమైంది. విత్తనం వేసిన వెంటనే రైతులు తమ పంట వివరాలను ఆర్బీకేలో నమోదు చేశారు. ఆ తర్వాత 15–20 రోజుల్లో ఆర్బీకేల్లోని వ్యవసాయ, ఉద్యాన సహాయకులు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్లారు. ఆర్బీయూడీపీ యాప్‌లోని వివరాలతో సరిపోల్చి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత పంట ఫొటో, ఇతర వివరాలను అప్లోడ్ చేశారు. మూడో దశలో రైతుల వేలిముద్రలు (ఈ–కేవైసీ) తీసుకొని ఈ–పంట వివరాలతో అనుసంధానించారు. ఈ యాప్‌లో పంట వివరాలు నమోదు కాగానే రైతు మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపారు. ‘మీ పంట ఈ క్రాప్‌లో నమోదైనట్టు’గా ధ్రువీకరించే రశీదు (డిజిటల్ ఎక్నాలెడ్జ్మెంట్ కాపీ)ని కూడా అందజేశారు. ఎంత నమోదైందంటే ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 92.21 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 89.96 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లో సాగు చేస్తున్న రైతులు అందరూ ఆర్బీకేల్లో పంట వివరాలు నమోదు చేసుకున్నారు. సాగైన విస్తీర్ణంలో 80,52,863 ఎకరాల్లో (దాదాపు 90 శాతం) పంటల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. ఇప్పటి వరకు 77,00,550 ఎకరాల్లో పంటలకు సంబంధించి రైతులకు రశీదులు అందజేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలో రైతు ఫొటో తీసి పంట వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది ఈ ఖరీఫ్‌లో పంటలు సాగు చేస్తున్న 42,92,773 మంది రైతులకు గాను ఇప్పటివరకు 29,86,151 మంది వేలిముద్రలను ఈ క్రాప్‌తో అనుసంధానించడం ద్వారా 70 శాతం ఈ కేవైసీ పూర్తి చేశారు. ఇంకా 9.43 లక్షల ఎకరాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉంది. 13.06 లక్షల రైతుల వేలిముద్రలను ఈ క్రాప్‌తో అనుసంధానించాల్సి ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో నవంబర్ 5వ తేదీ, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో నవంబర్ 15 కల్లా ఈకేవైసీతో సహా మొత్తం ప్రక్రియ పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. కోతలు ప్రారంభమయ్యే నాటికి కొనుగోలు కేంద్రాలు కోతలు ప్రారంభమయ్యే నాటికి ఆర్బీకే స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొనుగోలు సందర్భంగా ఏ ఒక్క రైతు ఇబ్బందిపడకుండా చర్యలు చేపట్టారు. ‘ఈ–పంట’లో నమోదుతో లాభాలెన్నో... ఈ క్రాప్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాగు ఉత్పాదకాలు, పంట రుణాలు, సున్నా వడ్డీ, పెట్టుబడి రాయితీలు, పంటల బీమా, పంట నష్టపరిహారంతో పాటు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు అమ్ముకోవచ్చు. తాజాగా సాగుకు అవసరమైన సలహాలు, సూచనలు పొందే వెసులుబాటు కూడా కల్పించారు. ఏ సర్వే నంబర్లో ఏ రకం పంట వేశారు, ఎప్పుడు కోతకొస్తుంది. ఎంత దిగుబడి వస్తుంది, పంట నాణ్యత ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. ఎన్నో ప్రయోజనాలు ► మిరప సాగు చేసా. పంట వివరాలు నమోదు చేయించుకున్నా. ఈ పంట నమోదుతో ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఏర్పడింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులే కాదు.. పంట రుణాలు,. పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం.. ఇలా ప్రతిదీ ఈ పంటలో వివరాల ఆధారంగానే ఇస్తున్నారు. – సీహెచ్ వెంకట సతీష్‌కుమార్, చినఓగిరాల శ్రీకాకుళం జిల్లా దారబకు చెందిన ఈ రైతు పేరు ఎస్.సిమ్మయ్య. ఈ ఖరీఫ్‌లో 3 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఆర్బీకేలో బుక్ చేసుకున్న వెంటనే ఇతనికి విత్తనాలు ఇచ్చారు. వాటిని నాటిన అనంతరం ఆర్బీకేలో పంట వివరాలు (ఈ–పంటలో) నమోదు చేయించాడు. వెంటనే సిబ్బంది అతని పొలానికి వచ్చి పంట వివరాలు తీసుకున్నారు. ఫొటోలు తీసుకొన్నారు. వేలిముద్రలు తీసుకొని ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు. రశీదు కూడా ఇచ్చారు. ఇప్పుడు తనకు ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు అందుతాయని సిమ్మయ్య సంతోషంగా ఉన్నాడు. ఈ రైతు పేరు మారెప్ప. అనంతపురం జిల్లా దురదకుంట. 9 ఎకరాల్లో వేరుశనగ వేశాడు. విత్తనాలు వేయగానే ఆర్బీకేలో పంట వివరాలు నమోదు చేశాడు. 15 రోజుల్లో వ్యవసాయ సిబ్బంది వచ్చి పంట ఫొటోలు, వివరాలు తీసుకున్నారు. రైతు వేలిముద్రలు కూడా తీసుకొని, రశీదు ఇచ్చారు. ఇకపై తెగుళ్లు, చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడానికి వ్యవసాయ అధికారుల తోడ్పాటు లభిస్తుందని, పంట విక్రయం కూడా సులభమవుతుందని మారెప్ప ఘంటాపథంగా చెబుతున్నాడు. ఇలా రాష్ట్రంలో దాదాపు 43 లక్షల మంది రైతులు తమ పంటలు ఈ–పంటలో నమోదు చేయించుకున్నారు. దాదాపు 70 శాతం రైతుల ఈ కేవైసీ పూర్తయింది. మిగతా 30 శాతం రైతుల పంటల నమోదు కూడా వేగవంతంగా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రైతు ఏ రాయితీ పొందాలన్నా పంటల నమోదు (ఈ–క్రాప్) తప్పనిసరి. ఈ ఏడాది మరింత సాంకేతికతతో కొత్తగా తీసుకొచ్చిన రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లా్లట్‌ఫామ్ (ఆర్బీయూడీపీ) ద్వారా ఈ పంట నమోదు జరుగుతోంది. -
ఏపీ: ఈ–కేవైసీ గడువు 15 వరకు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం చేసే (ఈ–కేవైసీ) గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ మంగళవారం ప్రకటించారు. లబ్ధిదారులెవరూ ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ–కేవైసీ నమోదు గడువు ఆగస్టు 31తో ముగిసింది. వరుస సెలవులు, పండుగలు రావడం, సర్వర్లు సరిగా పని చేయక పలు చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయలేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గడువు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదన్నారు. ఆపై వయసున్న పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ఉందని, పెద్దలు మాత్రం సెప్టెంబర్ 15లోగా చేయించుకోవచ్చని వివరించారు. ఇవీ చదవండి: ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేశ్ ప్రభుత్వ భూమిపై పచ్చమూక.. -
ఈ-కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఈ–కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవమని ఆయన వెల్లడించారు. ఈ-కేవైసీ చేసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా రేషన్ తీసుకోవచ్చని, గ్రామ వాలంటీర్ ద్వారా ఈ-కేవైసీ నమోదు చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించామని, ప్రజలు.. ఆధార్, మీ–సేవ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున తరలివెళ్లడం ఆపేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆధార్, ఈ–కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో కోన శశిధర్ ఈ మేరకు స్పందించారు. చదవండి: లోకేశ్ హైడ్రామా.. పథకాలు పక్కదోవ పట్టించడానికే -
శభాష్...శ్రీవైష్ణవి!
మోపిదేవి (అవనిగడ్డ): ఏపీలో వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తోంది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని పెదప్రోలుకు చెందిన ఇద్దరు వృద్ధురాళ్లు అనారోగ్యంతో కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్రంలో చికిత్స పొందుతున్నారు. ఏపీలో పింఛన్లు అందుకుంటున్న వీరు ఈకేవైసీ నమోదు చేయాల్సి ఉంది. మండవ బేబీ సరోజిని ఎల్బీ నగర్లో, మండవ రమాదేవి అశోక్‌నగర్‌లో ఉంటున్నారు. వారు స్వగ్రామం రాలేని పరిస్థితిలో వలంటీర్ కూనపులి సాయి మాలిక శ్రీ వైష్ణవి హైదరాబాద్ వెళ్లి ఈకేవైసీ నమోదు చేయించారు. తమకు ఈ కేవైసీ నమోదు చేయించిన వలంటీర్‌కు ఇద్దరు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. -
శభాష్ వలంటీర్: బెంగళూరు వెళ్లి బీమా..
కురబలకోట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నారు. కురబలకోట మండలం భద్రయ్యగారిపల్లె గ్రామ వలంటీర్ వేపలపల్లె దయ్యాల కిరణ్ కుమార్‌రెడ్డి తన పరిధిలోని వారు కొందరు బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు. గురువారం వారి వద్దకు వెళ్లి.. బీమా ఈకేవైసీ చేశాడు. తమ కోసం గ్రామ వలంటీర్ బెంగళూరు వచ్చి వైఎస్సార్ బీమా నమోదు చేయడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం దాటిన వలంటీర్ల సేవలు ► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పింఛన్‌దారులకు మూడు నెలల నగదు అందజేత చీరాల టౌన్: అభాగ్యుల పాలిట వలంటీర్ వ్యవస్థ ఆశా దీపంగా మారుతున్నది. వరుసగా మూడో నెలకూడా పింఛన్ తీసుకోకపోతే కార్డు రద్దయ్యే ప్రమాదం ఉండడంతో వార్డు వలంటీర్లు చొరవ చూపిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వలంటీర్లు షేక్.నాగూర్‌బాబు, కె.గోపి మూడు నెలల పింఛన్‌ను ఒకేసారి చెల్లించడంతో సంబంధిత వ్యక్తులు హర్షం వ్యక్తం చేశారు. చీరాల బోస్ నగర్‌కు చెందిన కె.అంజలీకుమారి ఊపిరితిత్తుల వ్యాధితో చెన్నై పెరంబూర్‌లోని గ్లోబల్ హాస్పిటల్లో మూడు నెలల నుంచి చికిత్స పొందుతోంది. పెరంబూర్ వైద్యశాలలో అంజలీకుమారికి పింఛన్ అందిస్తున్న వలంటీర్ కె.గోపి గురువారం రాత్రి గోపి రైలులో పెరంబూర్ వెళ్లి మూడు నెలల వైఎస్సార్ పింఛన్ ఒకేసారి అందజేశాడు. అలానే బోస్‌నగర్‌కు చెందిన గుంటి రామచంద్రరావు క్యాన్సర్ వ్యాధికి తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర మెడికల్ సైన్సెస్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మూడు నెలలుగా పింఛన్ తీసుకోవడంలేదు. దీంతో వలంటీర్ షేక్.నాగూర్‌బాబు శుక్రవారం ఉదయం తిరుపతికి చేరుకుని మొత్తం నగదు అందజేశాడు. 95.4 శాతం మందికి పింఛన్ల పంపిణీ ► నేడు కూడా వలంటీర్ల ద్వారా కొనసాగనున్న పంపిణీ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు శుక్రవారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శుక్రవారం రాత్రి వరకు మొత్తం 58,16,064 (95.4 శాతం) మందికి రూ.1,405.74 కోట్ల పింఛను డబ్బు పంపిణీ చేశారు. శనివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. -
ఏడుగురి కోసం 700 కి.మీ. ప్రయాణం..
చిల్లకూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా, పదిలంగా అందించటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు వలంటీర్లు. తమ పరిధిలో ఉండే కుటుంబాల్లో ఒకరిగా కలిసి పోయి సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చేయూత పథకంతో పాటుగా వైఎస్సార్ బీమా యోజన పథకానికి అర్హులైన లబ్ధిదారులతో ఈకేవైసీ చేయించాల్సి ఉంది. దీంతో వలంటీర్లు ఆ పనిలో నిమగ్నమయ్యారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చిల్లకూరు మిక్సెడ్ కాలనీకి చెందిన 70 కుటుంబాలను వలంటీర్ శ్రీరాం అశోక్‌కు కేటాయించారు. అయితే అందులోని ఏడు కుటుంబాలు బుట్టలు అల్లుకుని, వాటిని విక్రయించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వలస పోయాయి. కోవిడ్ కారణంగా వారంతా కర్ణాటక రాష్ట్రంలోని తుమ్ముకూరు ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఈకేవైసీ చేయించుకోవాలని వలంటీర్ వారికి సమాచారం ఇవ్వగా, వారు తాము రాలేక పోతున్నామని తెలియజేశారు. దీంతో లబ్ధిదారులు నష్ట పోకుండా చూడాలని భావించిన వలంటీర్ అశోక్ చిల్లకూరు నుంచి తుమ్ముకూరుకు సుమారు 700 కి.మీ. దూరం ఉన్నప్పటికీ వెరవకుండా బైక్‌పై తన సొంత ఖర్చులతో వెళ్లాడు. ఏడుగురు లబ్ధిదారుల చేత ఈకేవైసీ చేయించి, పథకాలకు సంబంధించి ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేశాడు. వలంటీర్ అశోక్‌ను మండల అధికారులు, స్థానికులు అభినందించారు. -
చిన్నారి కోసం శ్రీకాకుళం నుంచి బెంగళూరుకు..
కొత్తూరు: గెల్లంకి రవికుమార్, సుధారాణిలది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఓండ్రుజోల గ్రామం. అయితే కొద్ది రోజుల కిందట ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. అంతలో తమ రెండున్నరేళ్ల చిన్నారికి క్యాన్సర్ అని తెలిసింది. అక్కడే బిడ్డకు వైద్యం చేయిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.3.5 లక్షల అప్పులు చేశారు. అవి సరిపోలేదు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇక తమ బిడ్డను ఆదుకునేది ‘ఆరోగ్యశ్రీ’ మాత్రమేనని నమ్మి ఓండ్రుజోలలోని తమ వలంటీర్ బరాటం నరసింగరావుకు ఫోన్ ద్వారా విషయం చెప్పారు. తల్లిదండ్రులు ఈకేవైసీ చేయిస్తేనే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుందని వలంటీర్‌వారికి చెప్పడంతో.. తమ బిడ్డ ప్రమాదకర స్థితిలో ఉన్నాడని, ఈ పరిస్థితుల్లో ఊరికి రావడం తమకు అసాధ్యమని వారు కన్నీటి పర్యంతమయ్యారు. వారి దుస్థితికి చలించిపోయిన వలంటీర్ బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 13వ తేదీన ఒండ్రుజోల నుంచి బయల్దేరి వెళ్లాడు. బెంగళూరులోని సెయింట్ జాన్సన్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న చిన్నారి వద్దకు 14వ తేదీన చేరుకుని, తల్లిదండ్రులతో పాటు చిన్నారి వేలి ముద్రలు కూడా తీసుకుని ఈకేవైసీ చేయించాడు. ఇక ఆరోగ్య శ్రీ కార్డు మంజూరవుతుందని, సంక్రాంతి సెలవుల తర్వాత కార్డు ముద్రించి ఇస్తామని భరోసా ఇచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ చిన్నారి కోసం బెంగళూరు వచ్చిన వలంటీర్‌కు ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. వలంటీర్ మానవత్వాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. -
ఎప్పుడైనా ఈకేవైసీ నమోదు
సాక్షి, అమరావతి : ఆధార్, ఈ–కేవైసీ నమోదుకు గడువు అనేది లేదని, ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్, ఈ–కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. పెద్ద సంఖ్యలో ఆధార్, మీ–సేవ కేంద్రాలకు ప్రజలు వెళ్లడం.. అక్కడ పెద్దఎత్తున క్యూలు కట్టడాన్ని ప్రభుత్వం గమనించింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదివారం ఒక ప్రకటన జారీచేశారు. ఆధార్ అప్డేట్ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు. వాటిని నిదానంగా అప్డేట్ చేయించుకోవచ్చునని, ఇందుకు ఎటువంటి గడువులేదని ఆయన పేర్కొన్నారు. ఆధార్, ఈ–కేవైసీ నమోదు, అప్డేట్ చేయించకపోయినా రేషన్ ఇస్తారని, రేషన్ ఇవ్వరనే వదంతులను నమ్మవద్దని శశిధర్ కోరారు. కాగా, పాఠశాల పిల్లలు తాజా వివరాల నమోదుకు ఆధార్, మీ–సేవ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరంలేదని ఆయనన్నారు. రానున్న రోజుల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వమే ప్రత్యేక బృందాలను పంపిస్తుందని, అక్కడే ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు. ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో అక్కడ మాత్రమే ఈ–కేవైసీ చేసుకోవాలని.. దీనికోసం ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ–సేవా కేంద్రాల వద్దకు వెళ్లకూడదని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు. గతంలోనే రేషన్ దుకాణం వద్ద ఈ–కేవైసీ చేయించుకుని ఉంటే మళ్లీ చేయించుకోవాల్సిన అవసరంలేదని ఆయన సూచించారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని, ఆధార్ కేంద్రాలు, మీ–సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడవద్దని కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు. ఆందోళన వద్దు : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ: రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డుదారులు ఈకేవైసీపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కార్డులోని కుటుంబసభ్యులు ఎప్పుడైనా ఈకేవైసీ చేసుకోవచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈకేవైసీ లేకపోతే రేషన్ సరుకులు ఇవ్వరనే వదంతులు నమ్మవద్దని చెప్పారు. రేషన్ సరుకులు నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. కార్డులోని కుటుంబసభ్యుల్లో ఏ ఒక్కరికి ఈకేవైసీ ఉన్నా రేషన్ సరుకులు ఇస్తామన్నారు. నానితో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, సీనియర్ నాయకుడు పాలేటి చంటి ఉన్నారు.