epass
-
‘రేషన్’.. డిజిటలైజేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని అమలుపర్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ‘4 జీ’ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేసేందుకు చర్యలు చేపట్టింది. బ్లూటూత్ సాయంతో ఈ– పాస్ యంత్రాన్ని తూకం వేసే యంత్రానికి అనుసంధానం చేసి లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. మే నెల నుంచి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ చౌకదుణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇందుకోసం æసరికొత్త యంత్రాలను ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరవేసింది. తప్పుడు తూకాలకు చెక్ చౌక ధరల దుకాణాల్లో తప్పుడు తూకాలకు చెక్ పడనుంది. లబ్ధిదారులు తీసుకునే సరుకులు మాత్రమే డ్రా కానున్నాయి. వాస్తవంగా ఇప్పటి వరకు బయోమెట్రిక్‌కు సంబంధించిన ఈ–పాస్ యంత్రం, తూకం వేసే వెయింగ్ మెషీన్ వేర్వేరుగా ఉండేవి. లబ్ధిదారుడి బయోమెట్రిక్ తీసుకుని అవసరమైన సరుకులను తూకం మెషీన్ ద్వారా అందించి మిగతా సరుకులు డీలర్లు నొక్కేయడం ఆనవాయితీగా మారింది. తూకంలో సైతం తేడా ఉండేది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ– పాస్ యంత్రానికి, తూనికల యంత్రం అనుసంధానమై ఉంటుంది. లబ్ధిదారు వేలి ముద్ర నిర్ధారణ అయిన వెంటనే బ్లూటూత్‌తో తూనికల యంత్రానికి సిగ్నల్ వెళ్తుంది. లబ్ధిదారుడి కుటుంబంలో ఎన్ని యూనిట్లు, రేషన్, ఇతర కోటా సమాచారం వెళ్తుంది. దీని ఆధారంగా రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా రికార్డు అవుతుంది. సేవలు వేగవంతం కావడంతో పాటు లబ్ధిదారుకు హెచ్చు తగ్గులు లేకుండా రేషన్ పంపిణీ అవుతుంది. (చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి) -
తెలంగాణ ఈ-పాస్ పోర్టల్‌కు సాంకేతిక ఇబ్బందులు
-
ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఈ-పాస్ తిప్పలు
-
Lockdown: నో పాస్.. నో ఎంట్రీ
కోదాడ రూరల్/అలంపూర్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సడలింపు సమయంలోనైనా తెలంగాణలోకి ప్రవేశించాలంటే ఈ–పాస్ తప్పనిసరి. దీంతో పాస్ లేని వాహనాలన్నింటినీ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు అయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్‌లు లేకుండా వచ్చిన వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోకి అనుమతించలేదు. కోదాడ డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, ఇద్దరు ఎంవీఐలతో పాటు 60 మంది పోలీసు సిబ్బంది చెక్‌పోస్టులో విధులు నిర్వహిం చారు. రాష్ట్రంలో ఉదయం 6–10 గంటల వరకు లాక్డౌన్ మినహాయింపు ఉండటంతో రాష్ట్రంలోకి ప్రవేశిం చేందుకు ఏపీ నుంచి వందల సంఖ్యలో వాహనాలు తెల్లవారుజామున 4 గంటలకే రామాపురం చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న వాడపల్లి, మట్టపల్లి, పులిచింతల, సాగర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో శనివారం రాత్రి నుంచి వాహన రాకపోకలను నిషేధించారు. కోదాడ వైపు ఉన్న రామాపురం చెక్‌పోస్టు నుంచి మాత్రమే అనుమతి ఉండటంతో అక్కడకు వాహనాలు భారీగా చేరుకున్నాయి. పోలీసులు ముందుగా ఈ–పాస్‌లు ఉన్న వాహనాలను అనుమతించారు. అనుమతి లేని వాటిని వెనక్కి పంపే క్రమంలో ఏపీ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి మధ్యాహ్నం 12 గంటల వరకు భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. లాక్డౌన్ మినహాయింపు సమయం ఉంది కదా తమను ఎందుకు అనుమతించరు.. అంటూ కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. పాస్‌లు లేని వాహనాలను అనుమతించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. దీంతో వాహనదారులు చేసేదేమీ లేక వెనుదిరిగిపోయారు. అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాలను మాత్రం ఎలాంటి తనిఖీలు చేయకుండానే అనుమతించారు. అప్పటికప్పుడు ఆయా జిల్లాల నుంచి ఈ–పాస్ అనుమతి తీసుకున్న వారిని కూడా అనుమతించారు. ఇదిలా ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కూడా అనుమతి లేని వాహనాలను పోలీసులు ఆపడంతో ఆదివారం ఉదయం ట్రాఫిక్‌జామ్ అయింది. ఈ–పాస్ ఉన్న వాహనాలను అనుమతించి, మిగతా వాటిని దారి మళ్లించారు. -
ఈపాస్ ఉన్నవారికి మాత్రమే ఏపీలోకి ఎంట్రీ
సాక్షి, అమరావతి : ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అనుమతి లేని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఈపాస్ ఉన్నవారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. అంబులెన్స్‌లు, వైద్య చికిత్సలకు అనుమతినిస్తున్నారు. అత్యవసర ఎంట్రీకి పోలీస్ సిటిజన్ సర్వీసెస్ యాప్‌కి అప్లై చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఈపాస్‌ల కోసం ఏకంగా ట్రంప్, అమితాబ్‌లను వాడేశారు..
షిమ్లా : కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్డౌన్ వైపు మొగ్గుచూపాయి. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలతో అష్టదిగ్బంధనం చేశాయి. తమ రాష్ట్రంలోకి ప్రవేశించటానికి ఈపాస్‌లు తప్పనిసరి చేశాయి కొన్ని రాష్ట్రాలు. ఈపాస్‌లు ఉన్న వారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఈపాస్లతో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. ప్రముఖ వ్యక్తుల పేర్లతో ఈపాస్లకోసం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ల పేర్లపై ఈపాస్‌లను రిజిస్టర్ చేశారు దుండగులు. రెండు ఈపాస్‌లు హెచ్‌పీ-2563825, హెచ్‌పీ2563287.. ఒకే ఆధార్, ఫోన్ నెంబర్‌పై రిజిస్టర్ చేశారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి : కేటుగాళ్ల మాయ.. 19 లక్షలు స్వాహా -
రజనీకాంత్ క్షమాపణ.. నిజమేనా?
సాక్షి, చెన్నై: తమిళనాడులో విపరీతంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో చెన్నై సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాల్లో గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది. చెన్నై సిటీ ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్లకుండా, ఇతర జిల్లాల ప్రజలు చెన్నై సిటీలో అడుగు పెట్టకుండా తమిళనాడు ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే ఈ పాసులు తీసుకోవాలని నిబంధనలు పెట్టింది. (చదవండి : తదుపరి చిత్రానికి రజనీ రెడీ) ఈ నేపథ్యంలో ఇటీవల, సూపర్ స్టార్ రజనీకాంత్ లగ్జరీ కారు నడుపుతూ, చెన్నై సమీపంలోని . కీళంబాక్కంలోని లోని తన ఫామ్ హౌస్ రెండో కూతురు, అల్లుడితో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ కాలం గడుపుతున్నారని కొన్ని ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. ఫామ్ హౌస్ లో రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కీళంబక్కం వరకు కారులో వెళ్లిన రజనీకాంత్‌కు ఈ పాస్ ఉందా అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. (చదవండి : చంద్రముఖి సీక్వెల్‌పై లారెన్స్ స్పందన) అయితే రజనీకాంత్ నిబంధనల ప్రకారం ఈ పాస్ తీసుకోనే కారులో ప్రయాణం చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా మళ్లీ ఇప్పుడు రజనీ చేసినట్లు చెబుతున్న మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాస్ లేకుండా ప్రయాణం చేసినందకు రజనీకాంత్ క్షమాపణలు చెప్పారని ఆ ట్వీట్ సారాంశం. ‘ఈ పాస్ లేకుండా ప్రయాణించాను. మీ బిడ్డగా పరిగణించి నన్ను క్షమించండి’అని రజనీ ట్వీట్ చేశారు. అయితే అది రజనీకాంత్ ట్వీటర్ ఖాతా కాదని, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. రజనీ అధికారిక ట్వీటర్ ‘@rajinikanth’పేరుతో ఉండగా, నకిలీ ఖాతా‘@RajiniOff’పేరుతో ఉంది. రజనీ ట్వీటర్ ఖాతాను 2013 ఫిబ్రవరిలో తెరచినట్లు ఉండగా, రజనీ క్షమాపణ చెబుతూ చేసిన ట్వీటర్ ఖాతా గత నెలలో తెరచినట్లు ఉంది. దీంతో ఇది నకిలీ ట్వీట్ అని అర్థమవుతంది. ఈ ఫేక్ ట్వీట్‌పై రజనీకాంత్ స్పందించాల్సి ఉంది. -
లాక్డౌన్: ఏపీ ప్రభుత్వం ఈ-పాస్‌ల జారీ
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల తయారీ, రవాణా సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ (ఎమర్జెన్సీ) పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నిత్యావసర వస్తువుల కంపెనీలు, సరఫరాదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ-పాస్‌లు పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న వారికి మెయిల్ లేదా ఫోన్‌కు అనుమతులు మంజూరు చేసి ప్రభుత్వం పాసులు జారీ చేయనుంది. నిత్యావసర వస్తువుల తయారీ, రవాణాకు చెందిన కంపెనీ, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఇరవైశాతం మంది ఉధ్యోగులకు లేదా కనీసం ఐదుగురికి నిబంధనలకు లోబడి పాస్‌లు ఇవ్వనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పాస్‌లు జారీ చేస్తారు. (చదవండి: లాక్డౌన్: మోదీ ఎలా యాక్టివ్‌గా ఉంటున్నారు ?) కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి, ప్రభుత్వ నిబంధనలు (ఉదయం 6 నుంచి ఉదయం 11 వరకు) అనుసరించి నిత్యావసరాలు కొనేందుకు వెళ్లిన ప్రజలకు, సరుకు రవాణా వాహనాలు నడిపేవారికి, పంటను తరలించే రైతులకు ఈ-పాస్‌లు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ రూపంలో ఉండే ఈ-పాస్‌లను తనిఖీ చేసేందుకు చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసుల వద్ద తగిన మెకానిజం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. పాస్‌లలో ఫోర్జరీ, దుర్వినియోగానికి పాల్పడితే 2005-ఎన్ఎండీఏ చట్టం, భారత శిక్షాసృతి ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించింది. నిత్యావసర సరుకుల తయారీ పరిశ్రమలు, వాటి సరఫరా దారులకు ఈ పాస్ విధానం మరింత సౌలభ్యం కల్పించనుంది. (చదవండి: ఇల్లు సైతం ‘లాక్’ డౌన్) క్రింది లింక్‌ల ద్వారా ఆన్లైన్లో ఈ-పాస్ అప్లై: https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration (లేదా) https://www.spandana.ap.gov.in/ -
మొరాయిస్తున్నాయి..!
‘‘ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. అందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ, అందులో నెలకొంటున్న సాంకేతిక సమస్యలను సత్వరం పరిష్కరించకపోవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.’’ జడ్చర్ల : ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబందించి ఈ–పాస్ విధానాన్ని అమలులోకి తేగా సాంకేతిక సమస్యలతోఅటు డీలర్లు ఇటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివైస్‌లకు సంబందించి గ్రామీణప్రాంతాలలో పూర్తి స్థాయిలో నెట్ రాకపోవడంతో పంపిణీలో ఆలస్యం చోటు చేసుకుం టుంది. దీనికి తోడు ఇటీవల డివైస్‌లలో సాఫ్ట్‌వేర్‌ను ఆకస్మికంగా మార్పు చేయడంతో ఈనెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ నిలిచిపోయింది. ఏమైంది అన్న విషయం అర్థం గాక మొదటి రోజు అటు అధికారులు ఇటు డీలర్లు తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. తీరా వయాసిస్ కంపెనీ తమ సాఫ్ట్వేర్ మార్పు చేసి ఆధార్ అనుసంధానంగా సర్వర్‌తో లింక్ చేసే కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి అమలు చేస్తుందని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్తోనే.. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ పూర్తి చేసే విధంగా అధికారులు విధివిధానాలను రూపొందించారు. 15వ తేదీ తర్వాత బియ్యం పంపిణీ ఉండదు. ఆ సమయంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసే విధంగా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆకస్మికంగా 1వ తేదీనుంచి అంటే బియ్యం పంపిణీ ప్రారంభంరోజు నుంచే సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేయడంతో సమస్య నెలకొందని అటు అధికారులు ఇటు రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ సమస్యలు ఈ–పాస్ విధానంలో తరచు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేక పోవడంతో సమస్య నెలకొంటుందని అంటున్నారు. తమకు ఎయిర్టెట్, ఐడియా సిమ్‌లు జారీ చేశారని అయితే కొన్ని ప్రాంతాల్లో ఆయా సిమ్‌లు పనిచేయడం లేదన్నారు. ఒక వేళ పనిచేసినా నెట్ సిగ్నల్ సరిగ్గా లేక నెట్ నెమ్మదిగా ఉంటుందని.. దీంతో పొద్దస్తమానం సమయం వెచ్చించే పరిస్థితి ఉంద న్నారు. 4జీ నెట్ అందించే జియో సిమ్‌లను సరఫరా చేస్తే బాగుంటుందని వారు పేర్కొంటున్నారు. నెట్ స్పీడ్‌గా వస్తే పని కూడా సులువు అవుతుందని, బియ్యం పంపిణీని త్వరగా పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నా మని కొందరు డీలర్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేగాక మిషన్లలో సాంకేతిక సమస్య తలెత్తితే సదరు మిషన్‌ను తీసుకుని సంబందిత తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని టెక్నిషియన్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంటుందన్నారు. దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు ఇటీవల డివైస్(మిషన్)లలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఓ టెక్నీషియన్‌ను తమ కార్యాలయంలో అందుబాటులో ఉంచి సమస్యను సరిచేయిస్తున్నాం. దాదాపుగా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి బియ్యం పంపిణీకి చర్యలు తీసుకున్నాం. – లక్ష్మీనారాయణ, తహసీల్దార్, జడ్చర్ల -
‘రేషన్’ పాట్లు..
ఇల్లెందు(అర్బన్) : మండల పరిధిలోని పూబెల్లిలో ఎటువంటి సెల్ సిగ్నల్స్ లేకపోవడంతో చౌకదుకాణానికి పంపిణీ చేసిన ఈపాస్ యంత్రాలు పనిచేయడంలేదు. పదిహేను రోజులుగా డీలర్ వివిధ ప్రయత్నాలు చేసినా ఎంతకీ ఫలితం లేకుండా పోయింది. 1వ తేదీ నుంచి 15 లోపు సరుకుల పంపిణీ చేయాల్సిన డీలర్ 15నాటికి ఒక్కరికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోయారు. ఈ దుకాణం పరిధిలో సుమారు 378 తెల్ల రేషన్, అంత్యోదయ కార్డు వినియోగదారులు ఉన్నారు. విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. సిగ్నల్స్ పని చేయకపోతే తాము సరుకులు పంపిణీ చేసేదేలాని అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఇటీవల రెండు రోజుల క్రితం రికార్డుల్లో వినియోగదారుల వివరాలను నమోదుచేసుకొని పరుకుల పంపిణీ ప్రక్రియను షురూ చేశారు. ఈ విషయం చాలా మంది వినియోగదారులకు తెలియకపోవడంతో సరుకులు తీసుకోలేదు. స్టాక్ దుకాణంలోనే నిల్వ ఉంది. ఎలా పంపిణీ చేయాలో తెలియక డీలర్ సతమతమవుతున్నారు. అధికారులు మాత్రం మూడు రోజుల్లో సరుకుల పంపిణీ పూర్తి చేయాలని డీలర్‌కు ఆదేశాలు జారీ చేశారు. బయో మెట్రిక్ ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ప్రతి నెలా ఇలాగైతే తాము సకాలంలో సరుకులు తీసుకోవడం సాధ్యం కాదని గ్రామస్తులు అంటున్నారు -
రేషన్‌కు నెట్వర్క్ తిప్పలు
చౌటుప్పల్ : రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలు లబ్ధిదారులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. నెట్వర్క్ ఆధారంగా నడిచే ఈ–పాస్ యంత్రాలు సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అయినా ఒక్కోసారి ఫలితం లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలంలోని జైకేసారంలో ఆదివారం రేషన్‌డీలర్, లబ్ధిదారులు ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంపైకి ఎక్కారు. డీలర్ తూర్పింటి భూపాల్ ఇంట్లో సరిగ్గా నెట్వర్క్ రావడం లేదు. దీంతో ఆయన భార్య భాగ్య ఈ–పాస్ యంత్రాన్ని తీసుకుని గ్రామ పంచాయతీ భవనంపైకి వెళ్లింది. లబ్ధిదారులు సైతం ఆమె వెంట వెళ్లారు. అక్కడ యంత్రానికి సిగ్నల్స్ అందడంతో వారికి టోకెన్ జారీ చేశారు. టోకెన్ల ఆధారంగా డీలర్ ఇంట్లో సరుకులు తీసుకెళ్లారు. వేలిముద్రలు వేసేందుకు వృద్ధులు గ్రామ పంచాయతీ భవనంపైకి ఎక్కి కిందికి దిగేం దుకు అవస్థలు పడ్డారు. సరైన సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపా«ధ్యక్షుడు పల్లె మధుకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పౌర సరఫరాల్లో పారదర్శకతకే ‘ఈ–పాస్’
నిర్మల్‌టౌన్: అక్రమాలకు తావు లేకుండా నిత్యావసర సరుకులను పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాలులో శుక్రవారం చౌకధరల దుకాణాల డీలర్లకు ఈ పాస్ యంత్రాల వినియోగంపై నిర్వహించిన శిక్షణ, అవగాహన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, పెంబి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్మల్‌రూరల్, నిర్మల్అర్బన్, సోన్, లక్ష్మణచాంద, మామడ మండలాలకు సంబంధించిన రేషన్ డీలర్లకు ఈ పాస్‌పై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ, చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకులను పంపిణీ చేసేందుకు ఈ–పాస్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సౌలభ్యంగా, పారదర్శకంగా నిత్యావసర సరకులను పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ పాస్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. దీనివల్ల రేషన్ సరుకులు పక్కదోవ పట్టకుండా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రేషన్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈపాస్‌ను ప్రవేశపెట్టిందన్నారు. రేషన్ డీలర్లకు అర్థమయ్యేలా ఈ పాస్ యంత్రాల పనితీరుపై ఆమె వివరించారు. అనంతరం ఈపాస్ బయోమెట్రిక్ మిషన్లను రేషన్ డీలర్లకు పంపిణీ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈపాస్ యంత్రాలతో 48 లక్షల లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపారు. వచ్చే నెల 18 నుంచి... ఈ నెలలో కొత్తగూడెం, గద్వాల్, ఖమ్మం, నాగర్‌కర్నూల్, వనపర్తి, యాదాద్రి బోనగిరి జిల్లాల్లో ఈపాస్ యంత్రాలపై శిక్షణ కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం నుంచి నల్గొండ, సూర్యాపేట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పాస్ మిషన్ల ద్వారా ఆన్లైన్ బయోమెట్రిక్ విధానంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్డీవో ప్రసూనాంబా, జిల్లా పౌరసరఫరాల ఇన్చార్జి అధికారి వాజీద్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకళ, ప్రాజెక్టు మేనేజర్ రఘునందన్, అసోసియేట్ మేనేజర్ శ్రావణ్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
ప్రభుత్వాన్ని పేదలు తిట్టుకుంటున్నారు
సాక్షి, అమరావతి: ఈపాస్ విధానాన్ని అధికార టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. ఈ విధానం వల్ల రాష్ట్రంలోని వేలాదిమంది పేదలకు సరిగా రేషన్ అందడం లేదన్నారు. దీంతో వారంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై వారు మాట్లాడారు. రేషన్ సరిగా అందనివారు ప్రతి నియోజకవర్గంలోనూ వేల సంఖ్యలో ఉన్నారని, వారికి సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. రెండు మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే కూడా కార్డులు తొలగిస్తున్నారని, ఇలాగైతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈపాస్‌తో ప్రభుత్వానికి రావాల్సినంత చెడ్డపేరు వచ్చిందన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ.. వేలిముద్రలు సరిపోలని వారు 37 వేల మంది ఉన్నట్టు తేలిందని, వారికి కూడా రేషన్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలో వైద్యం పరిస్థితి దారుణంగా ఉందని పలువురు సభ్యులు మండిపడ్డారు. అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో మంత్రులు అవాస్తవాలు చెబుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రభుత్వం దేవుళ్ల మధ్య కూడా విబేధాలు సృష్టిస్తోందన్నారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు టాంపరింగ్‌కు గురయ్యాయని పలువురు ఆరోపించారు. -
ఈ–పరేషాన్!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలు ‘రేషన్’ సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈనెల నుంచి ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీకి ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా ఆయా రేషన్ దుకాణాలకు ఈపాస్ మిషన్లను అందజేసింది. లబ్ధిదారులు ఈపాస్ మిషన్‌పై వేలిముద్ర వేస్తేనే సరుకులను అందజేస్తారు. సర్వర్ సమస్యతో మూడురోజులుగా ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటంతో లబ్ధిదారులు పండగపూట రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతుండగా.. అటు డీలర్లు మొరాయిస్తున్న మిషన్లతో గడువులోగా సరుకులు పంపిణీ చేయక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరుకుల పంపిణీలో ఆలస్యం అవుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం నెలనెలా పౌరసరఫరాల దుకాణాల ద్వారా రూపాయికే కిలో బియ్యాన్ని ఒక్కొక్కరికీ (కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి) ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. బియ్యం పంపిణీ ఎంతగా పెరిగిందో.. అదేస్థాయిలో అక్రమాలకూ తావు ఏర్పడింది. రేషన్ దుకాణాలకు బియ్యం పూర్తిగా చేరకుండానే.. మిల్లర్లు, వ్యాపారుల దరి చేరుతున్నాయి. ఇలా ప్రతినెలా లారీల కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అయినా అక్రమాలను మాత్రం అడ్డుకోలేకపోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్, ఐపీఎస్ అధికారి సీవీ.ఆనంద్ నియంత్రణపై దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో ఈ–రేషన్ ప్రక్రియకు ఈ ఏడాది మార్చి నుంచి శ్రీకారం చుట్టి.. రేషన్ దుకాణాల్లో వేలిముద్రల (ఈ–పాస్) యంత్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా రేషన్ సరుకుల్లో అక్రమాలను అరికట్టగలిగారు. ఈ ప్రక్రియ అక్కడ విజయవంతం కావడంతో ఇతర జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా అన్ని జిల్లాల్లో కసరత్తు ప్రారంభించింది. మొరాయిస్తున్న ఈ–పాస్ యంత్రాలు.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ 48 శాతమే.. ఉమ్మడి జిల్లాల్లోని రేషన్ దుకాణాలలో బయోమెట్రిక్ యంత్రాలు, ఈపాస్ విధానాన్ని ప్రభుత్వం టెండర్ల ద్వారా ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అన్ని దుకాణాలలో యంత్రాలను ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ నుంచి యంత్రాలు వినియోగంలోకి తేవాలనుకున్నా... ఈనెలనుంచే అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఆహారభద్రత కార్డులోని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు రేషన్ దుకాణానికి వచ్చి వేలిముద్ర వేస్తేనే రేషన్ సరుకులు ఇస్తారు. తద్వారా బోగస్ కార్డులను ఏరివేయవచ్చని, నెలనెలా బియ్యం తీసుకోని కార్డుదారుల బియ్యాన్ని డీలర్లు స్వాహా చేయకుండా అడ్డుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. దీనికితోడు నిజమైన కార్డుదారులకే సరుకులు అందుతాయని భావించారు. అయితే ఈ విధానంలో సాంకేతిక అంతరాయాలు కలుగుతున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 16 మండలాల లెవెల్ స్టాక్ పాయింట్ల (ఎంఎల్ఎస్) నుంచి 1,880 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెలా 16,644 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇందులో 1,460 రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ విధానం అమలవుతోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 94,1948 కార్డులు 27,73,996 యూనిట్లపై 16,643.976 టన్నుల బియ్యానికి గాను ఇప్పటివరకు 7,989.108 (48 శాతం) టన్నుల బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. సర్వర్ సమస్యతో కొద్దిరోజులుగా ఈ–పాస్ మిషన్లు మొరాయిస్తుండటమే ఇందుకు కారణంగా అధికారులు చెప్తుండగా.. లబ్ధిదారులు పండగపూట రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. -
ఇంకెన్నాళ్లు..
♦ రేషన్ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం ♦ ఎట్టకేలకు జిల్లాకు చేరుకున్న వేయింగ్ మిషన్లు ♦ తాజాగా ఈ పాస్ మిషన్లలో సాంకేతిక లోపం ♦ వారం గడిచినా.. ప్రారంభం కాని రేషన్ సరఫరా ♦ పండుగలు సమీపిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన హన్మకొండ అర్బన్: జిల్లాలో రేషన్ బియ్యం అందక పేద, మధ్య తరగతి వర్గాలు అల్లాడుతున్నాయి. ప్రతి నెలా ఒకటి నుంచి 14వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా... ఇప్పటివరకూ మొదలుకాలేదు. పౌరసరఫరాల వ్యవస్థలో రేషన్‌షాపుల ద్వారా బియ్యం పంపిణీ కోసం చేపట్టిన ఈ పాస్ విధానం అమలులో అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. మరో పది రోజుల్లో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బియ్యం పంపిణీ కాకపోవడం.. ఎప్పుడిస్తారో స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు షాపుల చుట్టూ తిరుగుతున్న పేదలకు సమాధానం చెప్పలేక డీలర్లు తలపట్టుకుంటున్నారు. మిషన్లు వచ్చినా.. రేషన్‌డీలర్లకు ఈ పాస్ యంత్రాలు పంపిణీ చేసిన అధికారులు వేయింగ్ మిషన్లు లేక హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే వాటి కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు జిల్లాకు వేయింగ్ మిషన్లు చేరుకున్నా యి. అయితే ఈ పాస్ యంత్రాలను వేయింగ్ మిషన్‌కు అనుసంధా నం చేసే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. శుక్రవారం హన్మకొండ మండలం పరిధిలోని డీలర్లను ఈ పాస్ మిషన్లతో కలెక్టరేట్‌కు రావాలని అధికారులు ఆదేశించారు. అయితే ఎంత సేపు ప్రయత్నించినా.. చాలా మిషన్ల అనుసంధానం ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో డీలర్లు వెనుదిరిగారు. జిల్లాలో 599 షాపుల్లో ఈ ప్ర క్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెల వరకు అవకాశమివ్వండి.. మిషన్లలో సాంకేతిక సమ్స్యలను దృష్టిలో పెట్టుకుని పండుగలు ఉన్నందున ఆగస్టు నెలలో మాదిరిగా పంపిణీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రేషన్‌డీలర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం జేసీ దయానంద్‌కు వినతిపత్రం అందజేశారు. జేసీ నిర్ణయం మేరకు అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆలస్యమైనా ఈ పాస్ ద్వారానే... ఈ నెల తప్పనిసరిగా ఈ పాస్ విధానం ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని కమిషనర్‌నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందువల్ల కాస్త ఆలస్యమైనా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేస్తాం. జిల్లాలో వేలేరుతోపాటు మరికొన్ని మండలాల్లో మిషన్ల అనుసంధానం పూర్తయింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా మొత్తం పూర్తి చేస్తారు. గతంలో మాదిరిగా ఒక్కనెల పంపిణీకి అనుమతి ఇవ్వాలని రేషన్‌డీలర్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జేసీకూడా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేయమన్నారు.– విజయలక్ష్మి, డీసీఎస్ఓ -
ఇంటర్ విద్యార్థుల ‘ఉపకార’ యాతన
► ఈ–పాస్ వెబ్సైట్లో కనిపించని జూనియర్ కాలేజీల వివరాలు ► ప్రవేశాల ప్రక్రియ ముగిశాకే లింకు ఇస్తామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తుకు చిక్కులు తప్పడం లేదు. ఈ ఏడాది ముందస్తుగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటికీ సాంకేతిక సమస్యలు విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2017–18 విద్యాసంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ జూన్ 20న ప్రారంభం కాగా.. ఈ నెల 30తో గడువు ముగియనుంది. అయితే ఇప్పటివరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఒక్కరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించలేదు. వెబ్సైట్లో సమాచార లోపంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో దరఖాస్తులకు తుది గడువు సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ఈ–పాస్‌తో అనుసంధానం చేయకపోవడంతో.. ఈ–పాస్ వెబ్సైట్లో కాలేజీల సమాచారాన్ని సంబంధిత బోర్డులు/యూనివర్సిటీలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జూనియర్ కాలేజీల సమాచారాన్ని ఈ–పాస్ వెబ్సైట్లో ఇంటర్మీడియెట్ బోర్డు నమోదు చేయాలి. ఇందుకు బోర్డు వెబ్‌సైట్‌ను ఈ– పాస్‌తో అనుసంధానం చేయాలి. ప్రస్తుతం కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతుండటంతో ఈ– పాస్ వెబ్‌సైట్‌తో ఇంటర్మీడియెట్ వెబ్‌సైట్‌ను అధికారులు అనుసంధానం చేయలేదు. దీంతో ఉపకారవేతనాల దరఖాస్తులో బీఐఈ(బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్) ఆప్షన్ కనిపించడం లేదు. కాలేజీల సమాచారం లేకపోవడంతో ఆయా విద్యార్థులు దరఖాస్తును సమర్పించలేక పోతున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యా ర్థులు సంక్షేమ శాఖలకు ఫిర్యాదు చేశారు. ప్రవే శాల ప్రక్రియ ముగియగానే, వచ్చే వారంలో బోర్డు లింకును అనుసంధానం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఇక ఈ–పాస్బుక్కు
♦ అమలుకు రెవెన్యూ శాఖ కసరత్తు ♦ పాత పుస్తకాల పంపిణీ నిలిపివేత ♦ ఆధునిక పరిజ్ఞానంతో కొత్త పుస్తకాలు ♦ నకిలీలకు చెక్ పెట్టేందుకు ‘డిజిటల్’ ♦ ఆన్లైన్ పనులు చేపడుతున్న అధికారులు నిర్మల్‌రూరల్: నకిలీ పాసు పుస్తకాల ఆట కట్టించేం దుకు.. రైతన్నకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఈ–పాస్‌బుక్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీంతో నకిలీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రెవెన్యూ శాఖలో అవినీతికి ముకుతాడు వేయొచ్చని భావిస్తోంది. అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులకు మేలు జరిగేలా ఈ–పట్టాదారు పాస్‌బుక్‌లను జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు అన్ని పనులను మీసేవతో లింకప్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు పాస్ పుస్తకాలనూ డిజిటలైజేషన్ చేసే పనికి శ్రీకారం చుట్టింది. పాస్ పుస్తకాలను మాన్యువల్‌గా కాకుండా ఆన్లైన్ ద్వారా జారీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే మాన్యువల్ పాస్ పుస్తకాలు ఇవ్వొద్దని ఆదేశాలూ జారీ చేసింది. పాత పుస్తకాలతో అక్రమాలు ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఈ–పాస్ పుస్తకాల విధానానికి పనులు మొదలుపెట్టింది. భూమి హక్కులు పొందేందుకు రైతులకు గతంలో సర్వే నంబర్, విస్తీర్ణం ఆధారంగా పాస్ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. కాలక్రమంలో ఈ విధానానికి స్వస్తిచెప్పి.. రైతు పట్టా పుస్తకాల పేరిట టైటిల్ డీడ్, పాస్ పుస్తకం అనే రెండు రకాల పుస్తకాలను పంపిణీ చేశారు. వీటిలో భూమి స్వభావం, విస్తీర్ణం తదితర వివరాలు పొందుపర్చారు. అక్రమాలు చోటు చేసుకోకుండా వరుస సంఖ్య కేటాయించారు. అయినప్పటికీ పాస్ పుస్తకాల పంపిణీలో భారీగానే అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. బోగస్ పట్టా పాస్ పుస్తకాల దందా చాలాచోట్ల వెలుగులోకి వచ్చింది. నకిలీ పాస్‌పుస్తకాల ద్వారా చాలామంది అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు గతంలో పలు సంఘటనలూ బయటకు వచ్చాయి. అవినీతిని అరికట్టేందుకు.. రెవెన్యూ శాఖలో ప్రధానంగా పాస్‌పుస్తకాల జారీలో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, అక్రమాలు బయటపడ్డాయి. బోగస్ పుస్తకాలను తయారు చేసి ఇచ్చిన ఘటనలు అనేక జిల్లాల్లో కనిపించాయి. ఇందులో పలువురు అధికారులూ సస్పెండ్ అయిన సంఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో రెవెన్యూ శాఖలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం నూతన సంస్కరణలను అమలులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. బోగస్ పట్టాపాస్ పుస్తకాలను పూర్తిగా నియంత్రించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే భూముల కొనుగోలు, ఇతర కారణాలతో భూహక్కులను పొందుతున్న వారికి పాస్ పుస్తకాల జారీని నిలిపివేసింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలనూ జారీచేసింది. కొత్తగా ఈ–పాస్‌పుస్తకాలనే అందించేందుకు సన్నద్ధమవుతోంది. పకడ్బందీగా కొత్త పుస్తకం ఇప్పటివరకు కొనసాగిన మాన్యువల్ విధానానికి పుల్‌స్టాప్ పడనుంది. ఇప్పుడు క్షేత్రస్తాయిలో ఆధునికీకరిస్తున్న డాటా నేరుగా సీసీఎల్ఏ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి లబ్ధిదారులకు నేరుగా ఈ–పాస్‌పుస్తకం అందేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా జరిగితే కొంతమంది ఇంటి అడ్రస్‌లు మార్పులు ఉంటే అవి తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తహసీల్దార్ల ద్వారానే లబ్ధిదారులకు అందించాలా.. లేక ఆన్లైన్ ద్వారా తీసుకునే అవకాశం కల్పించాలా.. అనే దానిపై చర్చిస్తోంది. ఇక ఈ–పాస్ పుస్తకం పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. దీనిపైన అధికారుల సంతకాలు, పట్టాదారు వివరాలు డిజిలైజ్డ్ అయి వస్తాయి. వీటిని మార్చడానికి బోగస్ చేయడానికి వీలు లేదు. ఈ పుస్తకం చినగడం, మంటల్లో వేసిన కాలిపోవడం వంటివి జరగకుండా పకడ్బందీగా రూపొందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈపుస్తకాలు యూనిక్ కోడ్ ఆధారంగా జారీ కానున్నాయి. సర్వే నంబర్, 1బి ఖాతా సంఖ్యతో తహసీల్దార్, ఆర్డీవో డిజిటల్ సంతకంతో ఈ–పాస్‌బుక్‌ను ముద్రించనున్నారు. నిలిచిన పాస్‌పుస్తకాల జారీ ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ–పాస్‌పుస్తకాల నేపథ్యంలో జిల్లాలో మాన్యువల్‌గా పాస్‌బుక్‌లను ఇవ్వడం నిలిపివేశారు. అయితే రైతులకు రుణాలు కావాలంటే బ్యాంకుల్లో పాస్‌పుస్తకాలను చూపడం తప్పనిసరి. ప్రస్తుత సీజన్లో రైతులు రుణాల కోసం బ్యాంకుల వెంట తిరగాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని మండలాల్లో రైతులకు మాన్యువల్‌గా పాస్ పుస్తకాలను అందిస్తున్నారు. ఇకనుంచి మాత్రం పూర్తిస్థాయిలో ఈ–పాస్‌పుస్తకాలనే ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ ప్రయత్నంతోనైనా ఏళ్ల తరబడి నడుస్తున్న నకిలీ పట్టా పాస్ పుస్తకాల అక్రమాలకు తెరపడాలని రైతులు ఆశిస్తున్నారు. త్వరలో అందుబాటులోకి.. ప్రభుత్వం ఈ–పాస్‌పుస్తకాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే పాస్ పుస్తకాల జారీని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు త్వరలోనే ఈ–పాస్ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. బోగస్ పుస్తకాలకు కళ్లెం వేసేందుకు డిజిటలైజ్డ్ ఈ–పాస్ పుస్తకాలు ఉపయోగపడతాయి. నిర్మల్ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు : 02(నిర్మల్, భైంసా) రెవెన్యూ మండలాలు : 19 ప్రస్తుతం సాగుభూమి : 3లక్షల 64వేల ఎకరాలు రైతుల సంఖ్య : లక్షా 35వేల 565 మంది (సమగ్ర సర్వే ప్రకారం) -
మొదటి అడుగు మహబూబ్‌నగర్‌లో..
పౌరసరఫరాల శాఖలో ఈ– పాస్ షురూ - ఈ–పాస్‌తో రేషన్ అక్రమాలకు కళ్లెం - మూడు దశల్లో రాష్ట్రం అంతటా అమలు - బిజినెస్ కరస్పాండెంట్లుగా రేషన్ డీలర్లు: కమిషనర్ సి.వి.ఆనంద్ సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో రేషన్ అక్రమాలకు చెక్ పెట్టడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నడుం బిగించింది. రేషన్ దుకాణాలను నగదురహిత కార్యకలాపాలకు వేదికగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో దశల వారీగా ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పాస్ ) విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో మొదటి దశలో పది జిల్లాల్లో 5,242 షాపుల్లో, రెండో దశలో 11 జిల్లాల్లో 4,817 షాపులు, మూడో దశలో తొమ్మిది జిల్లాల్లో 5,507 షాపుల్లో మొత్తంగా మూడు దశల్లో 15,606 రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి అడుగులు పడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో 6 రేషన్ షాపులు, జడ్చర్ల మండలంలో 20 షాపులు, మహబూబ్‌నగర్ మండలంలో 14 షాపులు, మొత్తంగా 40 షాపుల్లో ఈ విధానాన్ని ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాది మార్చి నుంచి ఈ–పాస్ విధానం అమలవుతోంది. ఇక్కడ ఈ విధానం ప్రవేశ పెట్టిన తర్వాత ఈ ఏడాది మార్చి నెల వరకు రూ.269కోట్ల మేర ఆదా అయ్యింది. దీంతో ఈ–పాస్ విధానంతో రేషన్ అక్రమాలకు పక్కాగా కళ్లెం వేయొచ్చని నిర్ణయానికి వచ్చారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ–పాస్ యంత్రాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ–పాస్ యంత్రాల్లో గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. పైలెట్ ప్రాజెక్టు కింద ఈ –పాస్ విధానం అమలవుతున్న హైదరాబాద్ రేషన్ షాపుల్లోని ఈ యంత్రాల్లో కేవలం వేలిముద్రల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కాగా, నగదు రహిత లావాదేవీలకు వీలుగా యంత్రాల్లో మార్పులు చేశారు. ఈ–పాస్‌కు అదనంగా ఐరిస్ స్కానర్, బరువులు తూచే ఎలక్ట్రానిక్ తూకం, స్వైపింగ్, ఆధార్ ద్వారా చెల్లింపులు (ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం /ఏఈపీఎస్), ఆడియో వాయిస్ వంటి అంశాలను పొందుపరిచారు. వివిధ రకాల చెల్లింపులు చేపట్టేలా యంత్రాలను రూపొందించారు. నిత్యావసర సరుకులకు చెల్లింపులకింద నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నుంచే డబ్బులు తీసుకునేందుకు వీలుగా యంత్రాల్లో స్టాఫ్ట్వేర్ను పొందుపరిచారు. చౌకధరల దుకాణాల్లో మైక్రో ఏటీఎంలు.. చౌకధరల దుకాణాల ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగణంగా మైక్రో ఏటీఎంలను అమరుస్తున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు. సరుకుల పంపిణీతో పాటు బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణకు చౌకధరల దుకాణదారుడిని బిజినెస్ కరస్పాండెంట్‌గా వ్యవహరించనున్నామన్నారు. కొంత మందిలో వేలిముద్రలు అరిగిపోవడం తదితర కారణాలతో బయోమెట్రిక్ విధానంలో సమస్యలు వస్తున్న కారణంగా, దీనిని అధిగమించడానికి నూతంగా ఐరిస్‌ను, గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టకుని వాయిస్ ఓవర్ విధానం తెచ్చామన్నారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామంలోని రేషన్ షాపులో ప్రయోగాత్మకంగా ఈ–పాస్ యంత్రాన్ని కమిషనర్ ఆనంద్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. -
ఈ-పాస్ మిషన్లతోనే ఎరువుల పంపిణీ
- 1 నుంచి పకడ్బందీగా ప్రక్రియ - కర్నూలు సబ్ డివిజన్ డీలర్ల అవగాహన సదస్సులో ఏడీఏ కర్నూలు(అగ్రికల్చర్): మే నెల 1నుంచి రసాయన ఎరువులను విధిగా ఈ-పాస్ మిషన్ల ద్వారానే పంపిణీ చేయాలని కర్నూలు ఏడీఏ రమణారెడ్డి సూచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీపై కర్నూలు సబ్ డివిజన్లోని రసాయన ఎరువుల డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ...డీలర్లకు నాగార్జున, గ్రీన్‌ఫీల్డ్, క్రిప్కో కంపెనీలు ఈ-పాస్ మిషన్లను సరఫరా చేస్తాయన్నారు. ప్రతి డీలరు విధిగా తమ వివరాలను ఈ-పాస్ మిషన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రైతుల ఆధార్ నెంబర్లు, వెబ్‌ల్యాండు వివరాలను కూడా వీటిలో అప్లోడ్ చేస్తామన్నారు. మే నెల 1నుంచి మాన్యువల్‌గా ఒక్క బస్తా కూడా విక్రయించరాదన్నారు. భూసార పరీక్ష పలితాలను బట్టి, సాగు చేసే పంటను బట్టి ఎన్ని బస్తాల ఎరువులు అవసరమో అన్ని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీ చేయలేమని భావించే డీలర్లు ఈ వ్యాపారం నుంచి వైదొలగవచ్చన్నారు. జేడీఏ కార్యాలయ ఫర్టిలైజర్ ఏఓ వేదమణి, సీ.బెళగల్ ఏఓ సురేష్‌బాబు ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు, కల్లూరు వ్యవసాయాధికారులు అశోక్‌కుమార్‌రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ–పాస్.. రేషన్ ఫెయిల్!
- వేలి ముద్రలు పడలేదని 19.92 లక్షల మందికి అందని సరుకులు - పేదల కడుపు కొడుతున్న సాంకేతికత - బ్యాంకు ఖాతాలో డబ్బులుంటేనే రేషన్.. - సర్కారు నిర్ణయాలతో వృద్ధుల్లో తీవ్ర ఆందోళన సాక్షి, అమరావతి వేలి ముద్రలు సరిగా లేక ఈ–పాస్ మెషిన్ వాటిని స్వీకరించక పోవడం, కొత్త రేషన్‌కార్డుల్లో తప్పుల తడకలు తదితర కారణాల వల్ల ఈ నెలలో 19.92 లక్షల మంది పేదలు రేషన్ సరుకులు పొందలేకపోయారు. బియ్యం, చక్కెర, గోధుమలు, గోధుమ పిండి, కిరోసిన్ తదితర రేషన్ సరుకులపై ఆధారపడి బతుకీడుస్తున్న లక్షలాది మంది వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఏ పనీ చేసుకోలేని వారి పరిస్థితి సాంకేతికత పుణ్యమా అని దయనీయంగా మారింది. రాష్ట్రంలో 1.38 కోట్ల తెల్లరేషన్ కార్డులు ఉంటే ఇలాంటి సమస్యలతో ప్రతి నెలా లక్షలాది మంది పేదలు రేషన్‌కు దూరం అవుతున్నారు. వేలి ముద్రలు సరిగా పడని వారికి గ్రామ రెవెన్యూ కార్యదర్శి (వీఆర్వో) సర్టిఫికెట్ ఇస్తే రేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న మాట లు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. రేషన్‌షాపు వరకు నడవలేని వృద్ధులకు వారి ఇంటికే వెళ్లి రేషన్ ఇవ్వాలన్న ఆదేశాలు కూడా సరిగా అమలు కావడం లేదు. దీనికి తోడు నగదు రహితంగానే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకోవడం కూడా పలు ఇబ్బందులకు కారణమ వుతోంది. కృష్ణా జిల్లాలో 85 శాతం పైగా నగదు రహితం గానే సరుకులు ఇవ్వాలని కలెక్టర్ అహ్మద్ బాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో ఇటు లబ్ధిదా రులు, అటు రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడలో ఒక వ్యక్తి రేషన్ కోసం వెళ్తే నగదు రహిత విధానంలో సరుకులు ఇస్తామని చెప్పారు. చేసేదిలేక ఆ వ్యక్తి బ్యాంకుకు ఆటోలో వెళ్లి ఖాతాలో సరుకులకు అయ్యే మొత్తం జమ చేసి వచ్చారు. ఇందుకు తనకు రూ.30 ఖర్చు అయ్యిందని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రతి నెలా బ్యాంకులో డబ్బు జమ చేసి ఆ తర్వాత సరుకులు తీసుకోవాలంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ–పాస్ మెషిన్లు సరిగా పనిచేయక గంటల తరబడి రేషన్ షాపులవద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 1.66 లక్షల కొత్తకార్డులు జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చామని చెబుతున్నా అందులో సగానికి పైగా కార్డులకు రేషన్ నిలిపివేశారనే ఆరోపణలున్నాయి. ఇలాగైతే ఎలా? తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం గ్రామానికి చెందిన అడపా సత్యవతికి కుష్టువ్యాధి ఉంది. నగదు రహిత రేషన్ తీసుకోవాలంటే ఈ–పాస్ లో వేలి ముద్రలు వేయడం తప్పనిసరి. ఆమె వేలి ముద్రలు సరిగా లేనందున ఈ–పాస్ స్వీకరించలేదు. ఈ విషయమై డీలర్.. తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ల డంతో ఆమెకు మాత్రం రేషన్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారే కాకుండా వయసు మీరి వేలి ముద్రలు సరిపోలక లక్షలాది మంది రేషన్ అందుకోలేకపోతున్నారు. పైగా బ్యాంకులో వారి ఖాతాల్లో డబ్బులుండేలా చూసుకుంటేనే ఇకపై రేషన్ అందుతుంది. లేదంటే లేదు. -
కత్తిగట్టారు!
కర్నూలులో దారుణ హత్య - ప్రాణం తీసిన ఈ-పాస్ కుంభకోణం - మృతుడు ప్రజాపంపిణీ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు - విజిలెన్స్‌కు సమాచారం ఇచ్చాడని కక్ష - కిరాయి హంతకుల ప్రమేయంపై పోలీసుల అనుమానం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రజాపంపిణీ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్ హత్యతో కర్నూలు నగరం ఉలిక్కిపడింది. ఈ పాస్ కుంభకోణంపై విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారనే కక్షతో బాధిత డీలర్లు కిరాయి హంతకులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు శివారులోని జొహరాపురానికి చెందిన వెంకటేష్ గౌడ్ రేషన్‌షాపు డీలర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మీదేవికి ఒక కుమారుడు, కూతురు. వీరు నగరంలోని బిర్లాగడ్డలో నివాసం ఉంటున్నారు. రెండో భార్య పేరు కూడా లక్ష్మీదేవినే. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుతూరు సంతానం. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి వెంకటేష్‌గౌడ్ సమీప బంధువు. నగరంలోని అన్ని పార్టీల నాయకులతో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి. డీలర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన వెంకటేష్‌గౌడ్ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ప్రాణం మీదకు తెచ్చిన ఈ–పాస్ కుంభకోణం నాలుగైదు నెలల క్రితం జిల్లాలో ఈ–పాస్ కుంభకోణం ఓ కుదుపు కుదిపింది. ఈ కుంభకోణంలో 161 మంది డీలర్లు బైపాస్ చేసి ప్రజల సరుకులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. బైపాస్ చేసిన సమాచారాన్ని వెంకటేష్‌గౌడ్ విజిలెన్స్ అధికారులకు అందజేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ కుంభకోణంలో 161 మంది డీలర్లు సస్పెండ్ అయ్యారు. ఇందులో కర్నూలు నగరంలోనే 100 మంది ఉన్నారు. దీంతో వీరందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు సస్పెండైనా డీలర్లు ఆయనపై కక్ష పెంచుకొని హత్య చేయించినట్లు తెలుస్తోంది. కిరాయి హంతకుల పనేనా? మద్దూరు నగర్‌లోని జానీ సైబర్ల్యాండ్లో ఉన్న వెంకటేష్‌గౌడ్‌ను ఆటోలో నుంచి దిగిన ఐదుగురు దుండగులు సెకన్ల వ్యవధిలో హత్య చేశారు. వేటకోడవళ్లతో తలపై ఒక్క దెబ్బతో ప్రాణం తీశారంటే కచ్చితంగా కిరాయి హంతకుల పనేనని పోలీసులు భావిస్తున్నారు. వెంకటేష్ తలపై నిలువుగా నరకడంతో వెనుక వైపు నుంచి ముందు భాగం వరకు చీలిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. అడ్డు వచ్చిన సైబర్ల్యాండ్ నిర్వాహకుడు రఘు, మరోవ్యక్తి చంద్రేశేఖరరెడ్డిలపైనా దుండగులు దాడి చేశారు. దీంతో ఆ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు చంద్రశేఖరరెడ్డిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీ రమణకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎనిమిది మంది డీలర్లపై హత్య కేసు నమోదు వెంకటేశ్‌గౌడ్ హత్య కేసులో భార్య సుమలత(లక్ష్మీదేవి) ఫిర్యాదు మేరకు నగరంలోని 8 మంది డీలర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. అనుమంతయ్య, పక్కీరప్ప, గనిబాషా, ఎరుకలి శీను, నూర్‌బాషా, వడ్డేగేరి రమేష్, లక్ష్మన్న, ప్రమీలమ్మ తదితరులు కిరాయి హంతకులతో కలిసి తన భర్తను హత్య చేయించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అన్ని రేషన్ దుకాణాల్లో ఈ–పాస్
పౌరసరఫరాల శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ విధానాన్ని అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు సత్ఫ లితాలు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరా బాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 1,545 రేషన్ దుకాణా ల్లో ఈ–పాస్ విధానంతో గతేడాది మార్చి నుంచి ఇప్పటి దాకా సుమారు రూ.130 కోట్లు ఆదా అయినట్లు శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణ యించారు. ఈ మేరకు ఈ–పాస్ యంత్రాల సరఫరా టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. గతంలో వినియోగిం చిన ఈ–పాస్ యంత్రాల్లో కేవలం వేలిముద్ర సౌకర్యం మాత్రమే ఉండగా... తాజాగా బహుళ ప్రయోజనకారిగా ఉండేందుకు ఐరిస్, ఈ–వేయింగ్ సౌకర్యం ఉండేలా తయారు చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ–పాస్ విధానంలో ప్రతి రాష్ట్రా నికి కొన్ని లక్ష్యాలు నిర్దే శించిందని.. నగదు రహిత లావాదేవీల కోసం ఈ చర్యలు తీసు కుందని చెబుతున్నారు. దీంతో ఆ దిశగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. నగదురహిత లావాదేవీల వైపు అన్ని శాఖలూ మళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల్లో భాగంగా కూడా రేషన్ దుకాణాలపై దృష్టి పెట్టారు. మినీ ఏటీఎంలుగా రేషన్ షాపులు! మారుమూల, బ్యాంకులు లేని గ్రామాల్లో సైతం రేషన్ షాపులున్నాయి.దీంతో భవిష్యత్తులో వీటినే మినీ ఏటీఎం లుగా చేయాలన్న ప్రణాళిక ఉందని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ముందు ముందు రేషన్ డీలర్లను ‘బిజినెస్ కరస్పాండెంట్లు’గా తయారు చేయడం ద్వారా మీ–సేవ కేంద్రాల్లో లభించే సేవలను అందించేలా ఈ–పాస్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. -
ప్రచార ఆర్భాటంగా స్వైపింగ్
► దరఖాస్తు చేసి 15 రోజులైనా అందని మిషన్లు ► ఉన్న మిషన్లకు సర్వర్ బిజీ ► ఇబ్బంది పడుతున్న జనం, వ్యాపారులు పెద్ద నోట్లు రద్దు తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలు చేయాలంటూ పెద్దయెత్తున ప్రచారం ప్రారంభించాయి. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ ప్రకటనలు కేవలం ప్రచార ఆర్భాటమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు ప్రజలకు, అటు వ్యాపారులకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. తిరుపతి గాంధీరోడ్డు : నగరంలోని వ్యాపార, వాణిజ్య వర్గాలు వెంటనే నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాలని పాలకులు, అధికారులు ఆదేశించారు. వ్యాపారులు అంగీకరించడమేగాక వారి పరిధిలోని బ్యాంకర్ల వద్ద స్వైపింగ్ (ఈ–పాస్) మిషన్ల కోసం రెండు వారాల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. నేటికి ఒక్క మిషన్ కూడా రాలేదు. పెద్దషాపులు, షాపింగ్ మాల్స్‌లో తప్పా మిగతా దుకాణాల్లో ఏర్పాటు చేయకపోవడంతో నగదు రహిత లావాదేవీలు జరగడం లేదు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి అ«ధికారులు, బ్యాంకర్లు తమ పరిధిలోని వ్యాపారుల వివరాలు సేకరించారు. మండల పరిధిలో ఎందరికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.. అందులో ఎందరు ఏటీఎం కార్డులు వినియోగిస్తున్నారు.. ఆయా మండలాల పరిధిలో ఎన్ని బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయి తదితర సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ప్రతి వందమందికీ ఒక ప్రతినిధిని నియమించి, ఈ–పాస్ యంత్రాన్ని అందజేసి, వారి ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిగేలా అవసరమైన సర్వే నిర్వహించి ఆ వివరాలను జిల్లా అధికారులకు పంపారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ దిశగా ఇప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీల నిర్వహణ కోసం మంత్రి నారాయణ కొద్ది రోజుల క్రితం 30వేల స్వైపింగ్ మిషన్లు వస్తాయని పేర్కొన్నారు. ఇందుకోసం 5వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు ఎవరికీ రాకపోవడంలో వ్యాపారులు డీలా పడుతున్నారు. నెల రోజుల్లో ఎక్కడ చూసినా ఏటీఎంలలో నోక్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నగదు చేతికి అందక ప్రజలు విలవిలలాడుతున్నారు. చిన్నపాటి లావాదేవీలు వదిలి, పెద్ద లావాదేవీలకు మాత్రమే స్వైపింగ్ మిషన్లు వీలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. సర్వర్ బిజీ.. కొన్ని దుకాణాల్లో ఎప్పటి నుంచో స్వైపింగ్ మిషన్లు ఉన్నాయి. గతంలో వీటికి పెద్దగా ఆదరణ కనిపించలేదు. నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసినప్పటి నుంచి వీటికి ఆదరణ పెరిగింది. అయితే ఉన్న కొద్దిపాటి మిషన్లకే సర్వర్ బిజీ అని వస్తోంది. ఇక పూర్తి స్థాయిలో మిషన్లు ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏమిటన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అవగాహన ఏదీ? ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై సరైన అవగాహన లేదు. పిల్లలు దుకాణాలకెళ్లి తినుబండారాలు, పెన్ను, పెన్సిల్ వంటి వాటికీ యంత్రాలు వినియోగించాలంటే ఇబ్బందులు తప్పవు. అల్పాదాయ వర్గాలకు కొంతవరకు నగదు రహితం నుంచి ఉపశమనం కల్పించాలి. – అవినాష్‌రెడ్డి, పూల వ్యాపారి దరఖాస్తు చేసి రెండు వారాలైంది నగదు రహిత లావాదేవీలు ప్రారంభించేందుకు స్వైపింగ్ మిషన్ కోసం రెండు వారాల క్రితం బ్యాంకులో దరఖాస్తు చేశా. ఇప్పటివరకు మంజూరు చేయకపోవడంతో నగదు రహిత లావాదేవీలు నిర్వహించలేకపోతున్నాం. వేగంగా యంత్రాలు అందిస్తే లావాదేవీలు ప్రారంభించేందుకు వీలవుతుంది. – అబ్దాహీర్, ప్రొవిజన్ స్టోర్ ఇలాగే ఉంటే కష్టం పరిస్థితులు ఇలాగే ఉంటే షాపుల్లోని కుర్రాళ్లకు జీతం ఇవ్వడం కూడా కష్టంగా ఉంటుంది. స్వైపింగ్ మిషన్లు లేక బేరాలు పోతున్నాయి. పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరిగాం. ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి నోట్లు రద్దు చేయడమే తెలుసుకాని దాని పరిష్కారంలో తీవ్ర లోపాలున్నాయి. –కృష్ణమూర్తి, హార్డ్‌వేర్ వ్యాపారి ప్రచారం చేసుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు, అ«ధికారులు నగదు రహిత లావాదేవీల ప్రచారం పై చూపుతున్న ఆసక్తి క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో చూప డం లేదు. బ్యాంకులు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చిల్లర ఇవ్వకుండా రూ.2వేల నోట్లను మాత్రమే ఇస్తున్నాయి. దుకాణాల్లో పెద్దనోట్లకు చిల్లర ఇవ్వలేక అవస్థలు పడుతున్నాం. –సుధీర్‌రెడ్డి, హార్డ్‌వేర్ షాప్ -
ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఈ–పాస్ యంత్రాలు
సాక్షి, అమరావతి : ఆర్టీసీలో నగదు రహిత కార్యకలాపాల్ని ప్రోత్సహించేందుకు గాను ఆర్డినరీ సర్వీసుల నుంచి ఏసీ సర్వీసుల్లో ఈ–పాస్ యంత్రాలు వినియోగించనున్నట్లు యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. క్రెడిట్, డెబిట్, రూపే కార్డులతో టిక్కెట్లకు చెల్లింపులు జరిపేలా స్వైపింగ్ యంత్రాలను వాడనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం 16 వేల యంత్రాలను సమకూరుస్తున్నట్లు ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి మూర్తి చెప్పారు. -
అప్పులోనూ అడ్డంగా దోపిడీ
– కొందరు రేషన్ డీలర్ల చేతివాటం – ఇవ్వని సరుకులు ఇచ్చినట్లుగా వేలిముద్రలు – వాటి మొత్తాన్ని రసీదులో చూపిస్తున్న వైనం – వచ్చే నెల లబ్ధిదారుని ఖాతాల్లో ఈ మొత్తం బదిలీ -------------------------------------------------------------- అనంతపురంలో నివాసముంటున్న కె.రమణ తన కార్డు తీసుకుని రేషన్ షాపునకు వెళ్లాడు. 15 కేజీ బియ్యం(రూ.15), అర కేజీ చక్కెర(రూ.8) ఇచ్చారు. వాటికి రూ.23 అవుతుంది. అయితే డీలర్ మాత్రం వీటితో పాటు కిలో గోధుమ పిండి (రూ.16.50), లీటరు కిరోసిన్ (రూ.19) కూడా ఇచ్చినట్లు ఈ–పాస్‌లో వేలిముద్ర వేయించుకున్నాడు. అన్ని సరుకులకు కలిపి రూ.58.50 పైసలకు రసీదు ఇచ్చాడు. తనకు రెండు సరుకులు ఇచ్చి నాలుగు సరుకులు ఇచ్చినట్లు రసీదు ఇవ్వడంతో రమణ కంగుతిన్నాడు. వెంటనే డీలర్లని ప్రశ్నిస్తే.. రెండ్రోజుల్లో మిగిలిన సరుకులు ఇస్తామంటూ పంపి వేశాడు. ఇది ఒక్క రమణ సమస్యే కాదు.. తెల్లకార్డు కలిగిన లబ్ధిదారులందరిదీ. డీలర్ల అక్రమాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ------------------------------------------------------------ చౌక దుకాణాల్లో జరిగే అక్రమాలు అరికట్టాలని, డీలర్ల అవినీతికి చెక్ పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా డీలర్లు ఏదో ఒక దారి వెతుక్కుంటూనే ఉన్నారు. తమకు అడ్డు లేదని నిరూపిస్తున్నారు. తెల్లకార్డుదారుల సొమ్మును అడ్డంగా దోచుకుంటూ దొరల్లా చెలమణి అవుతున్నారు. అప్పుగా సరుకులు ఇమ్మంటే... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కార్డుదారులకు డిసెంబర్ నెల సరుకులు అప్పుగా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీన్ని కొందరు డీలర్లు తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. తమ తెలివి తేటలతో చేతివాటం ప్రదర్శిస్తూ, కార్డుదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సరుకులను అప్పుగా ఇస్తూ... అందలోనూ దోపిడీకి తెరతీయడం అందరూ విస్తుపోయేలా చేస్తోంది. ఇదే అంశం ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చనీయాంశమైంది. అదెలాగంటే... ఎన్ని సరుకులు ఇస్తే అన్నింటికే ఈ-పాస్‌లో వేలిముద్ర వేయించుకోవాలి. ఇది నిబంధన. అయితే అందుకు విరుద్ధంగా కొందరు డీలర్లు తమ అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. రెండు సరుకులు ఇచ్చేసి అన్ని సరుకులు ఇచ్చినట్లుగా వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఈ–పాస్‌లో ఇచ్చినట్లుగా ఉంది కాబట్టి సరుకులు కార్డుదారుని చేరినట్లు ఆన్లైన్లో నమోదవుతుంది. దోపిడీ జరిగే తీరు ఇలా.. గత నెల వరకు ఇచ్చిన సరుకులకే కార్డుదారులు డబ్బులు ఇచ్చేవారు. ప్రస్తుత నెలలో సరుకులను అప్పుగా డీలర్లు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని వచ్చె నెలలో ఇచ్చే సరుకుల మొత్తాన్ని కలసి కార్డుదారుని ఖాతా నుంచి తమ ఖాతాకు బదిలీ చేసుకుంటారు. రమణ విషయం తీసుకుంటే అతనికి ఇచ్చిన సరుకులు రెండు. అందుకు అయిన మొత్తం రూ.23. అయితే నాలుగు సరుకులు ఇచ్చినట్లుగా రూ.58.50 పైసలకు రసీదు ఇచ్చాడు. అంటే వచ్చే నెలలో ఈ మొత్తం రమణ ఖాతా నుంచి డీలర్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇక్కడ ఇవ్వని సరుకులు గోధుమ పిండి(రూ.16.50), కిరోసిన్(రూ.19). మొత్తం రూ.25.50 పైసలు డీలర్ సునాయసంగా నొక్కేస్తున్నాడనేది స్పష్టమవుతోంది. అనంతపురం ఆర్డీఓ మలోల ఏమంటున్నారంటే... కార్డుదారునికి ఇచ్చిన సరుకులకు మాత్రమే డీలర్ రసీదు ఇవ్వాలి. ఇవ్వని సరుకులు కూడా ఇచ్చినట్లుగా నమోదు చేయడం నేరం. అలా ఎవరైనా డీలరు అధికంగా వసూలు చేస్తున్నా, ఇవ్వని సరుకులు ఇచ్చినట్లు రసీదు ఇస్తుంటే వెంటనే మా దృష్టికి లేదా తహశీల్దారు దృష్టికైనా తీసుకువస్తే సదరు డీలర్‌పై చర్యలు తీసుకుంటాం.