facebook live
-
ఎల్లో మీడియా వక్రీకరించింది
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారంపై స్థానిక అధికారులు సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో ఫేస్బుక్ లైవ్‌లో నీటి కేటాయింపులపై తాను మాట్లాడిన మాటలను ఎల్లో మీడియా వక్రీకరించిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్యావతి మండిపడ్డారు. తాను ప్రశ్నించింది అధికారులనైతే సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఎల్లో మీడియా చిత్రీకరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలపై అధికారులు స్పందించనప్పుడు సీఎం జగనన్న దగ్గరకు వెళ్తే పనులు అవుతున్నాయనడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు. అదే వీడియోలో జగనన్న స్ఫూర్తితో తామంతా ముందుకెళ్తున్నామని చెప్పానని, మరి వాటిని ఎల్లో మీడియా ఎందుకు హైలెట్ చేయలేదని నిలదీశారు. దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నించడం నేరమా? అని రామోజీని ప్రశ్నించారు. తప్పుడు రాతలు ఆపకుంటే దళిత మహిళల ఆగ్రహం ఎలా ఉంటుందో చవిచూస్తారని హెచ్చరిస్తూ ఈనాడు దినపత్రికను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చించివేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తా రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలో తానేదో భారీ స్థాయిలో భవిష్యత్తు ఊహించి రాలేదని ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు కచ్చితంగా జగనన్నలాంటి నాయకుడితోనే కలిసి పనిచేయాలని కోరుకున్నట్లు చెప్పారు. జగనన్న తనను సొంత చెల్లెలు మాదిరిగా చూసుకున్నారని తెలిపారు. జగనన్న ఆదేశిస్తే ఎలాంటి పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తానని, తన సీటును వదులుకునేందుకు సైతం సిద్ధమేనని ప్రకటించారు. దేశ చరిత్రలో గుర్తుండిపోయేలా ఎస్సీలకు సీఎం జగన్ మేలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలూ జగనన్న పరిపాలన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాయని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ సీపీలోనే పని చేస్తానని తెలిపారు. తనను జగనన్నకు దూరం చేయాలని కుట్రలు చేస్తే ఏ స్థాయి వ్యక్తికైనా తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలతో దిగజారిపోతున్నారని విమర్శించారు. -
గాల్లో ఎగురుతున్నామని ఎంత ఉత్సాహం.. కానీ, గాల్లోనే కలిసిపోతామని..!
విమాన ప్రమాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సోమవారం ‘జాతీయ సంతాప దినం’ ప్రకటించింది. విమాన కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ అధ్యక్షతన మంత్రి మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా విమాన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 68 మంది మృతదేహాలను గుర్తించగా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు మరో నలుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయిదుగురు భారతీయులు రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రమాదం సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా 72 మంది ఉన్నారు. వీరిలో అదుగురు భారతీయులతో కలిపి మొత్తం 15 విదేశీ ప్రయాణికులు ఉన్నారు. మరణించిన ఐదుగురు భారతీయులను అభిషేక్ కుష్వాహా(25), విషాల్ శర్మ(22), అనిల్ కుమార్ రాజ్‌భర్(27), సోను జైస్వాల్(35),సంజయ్ జైస్వాల్గా గుర్తించారు. అయిదుగురిలో యూపీకి చెందిన నలుగురు శుక్రవారమే(జనవరి 13) ఖట్మాండుకు వచ్చారు. వీరు పర్యాటక కేంద్రమైన లేక్ సిటీ పోఖారాలో పారాగ్లైడింగ్ అస్వాదించేందుకు వచ్చినట్లు దక్షిణ నేపాల్‌లోని సర్లాహి జిల్లా నివాసి అజయ్ కుమరా్ తెలిపారు. తామంతా ఒకే వాహనంలో భారత్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. పోఖారాకు బయలు దేరే ముందు పశుపతినాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారని,కి సమీపంలోని గౌశాలో, తరువాత హౌట్ డిస్కరీ ఆఫ్ తమెలో బస చేశారని వెల్లడించారు. ఫోఖారా నుంచిగోరఖ్‌పూర్ మీదుగా ఇండియాకు తిరిగి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. యూసీ సీఎం సంతాపం ఘోర ప్రమాదంలో మరణించిన ఐదుగురు భారతీయులలో నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నలుగురు యువకుల మృతదేహాలను సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి ముందు ఫేస్బుక్ లైవ్ నేపాల్ ప్రమాద ఘటన ముందు విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. సోనూ జైశ్వాల్ అనే అనే యూపీకి చెందిన యువకుడు విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు.. నవ్వుతూ వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. 58 సెకన్ల వీడియోలో విమానం ఒక్కసారిగా ఎడమవైపు మళ్లింపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అనంతరం నేలను ఢీకొని, మంటలు వ్యాపించాయి. ఈ దృశ్యాలన్నీ ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. During the Nepal plane accident,a passenger who was the victim of the accident was doing Facebook Live, the video went viral on social media. At least 68 people have died after a 72-seater plane crashed. #planecrash #NepalPlaneCrash #Nepal #pokhra #NepalPlaneCrashVideo pic.twitter.com/KSLpWhBIRp — Gajraj Singh Parihar (@GAJRAJPARIHAR) January 15, 2023 అసలేం జరిగిందంటే.. నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఖాట్మాండు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 10.33 నిమిఫాలకు టేకాఫ్ అవ్వగా.. 20 నిమిషాలు ప్రయాణించిన తర్వాత 10.50 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. పోఖారా చేరుకోవడానికి క్షణాల ముందు సెటి గండకి నది ఒడ్డున ఈ దుర్ఘటన జరిగింది. కాగా రెండు వారాల క్రితమే జనవరి 1న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. విమాన శిథిలాల నుంచి వెలికితీసిన మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం గండకి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి, గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కూలిపోయిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
జీవితంపై విరక్తితో చనిపోతున్నా.. పేస్బుక్ లైవ్‌లో చెప్పిన యువకుడు..
ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ యువకుడు తాను చనిపోతానని ఫేస్బుక్ లైవ్ వీడియోలో చెప్పాడు. జీవితంపై విరక్తి వచ్చి, ఒంటరితనం భరించలేక బలవన్మరణానికి పాల్పడాలనుకున్నాడు. అయితే పోలీసులు ఈ వీడియో చూసిన వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ యువకుడు ఎక్కడున్నాడో గుర్తించి కాపాడాలని డిప్యూటీ కమిషనర్ స్మార్తన పాటిల్ పోలీసులను ఆదేశించారు. వెంటనే వాళ్లు యువకుడు ఉండే ప్రాంతాన్ని గుర్తించి వెళ్లారు. అక్కడ వెతుకుతుండగా.. అతడు రోడ్డుపక్కన ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడు. పోలీసులు వెంటనే అతడ్ని తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీనియర్ ఇన్స్పెక్టర్ అశోక్ ఇండాల్కర్ అతనికి కౌన్సిలింగ ఇచ్చి ధైర్యం చెప్పారు. దీంతో యువకుడు ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నాడు. అనంతరం పోలీసులు యువకుడ్ని స్నేహితుడికి అప్పగించి ఇంటికి పంపారు. చదవండి: దారుణం.. రెండో భార్యను చంపి 50 ముక్కలు చేసిన భర్త! -
ఢిల్లీ హత్య కేసు మరవకముందే.. మరో దారుణం.. ప్రియురాలిని చంపి
లక్నో: యావత్ దేశాన్ని షాక్ గురిచేసిన ఢిల్లీలో శ్రద్ధా దారుణ హత్య మరవక ముందే ఉత్తర ప్రదేశ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. భర్తను విడిచి వచ్చేందుకు నిరాకరించందని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు ఓ ఉన్మాది. వివాహితను హత్య చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో లైవ్ పెట్టి ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఈ ఘటన సిలిగురి ప్రాంతంలోని న్యూ జల్పైగురి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. హత్యకు గురైన యువతిని రియా బిస్వాప్, నిందితుడు కిరణ్ దేబ్‌నాథ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్లుగా రిలేషన్ నదియా జిల్లాకు చెందిన రియా అనే మహిళ తన భర్త రోమియో బిస్వాస్‌తో కలిసి సిలిగురిలో నివసిస్తుంది. వీరికి ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే రెండేళ్లుగా కిరణ్ అనే యువకుడితో రియా రిలేషన్షిప్(వివాహేతర సంబంధం) కొనసాగిస్తుంది. భర్త లేని సమయాల్లో తరుచూగా రియాను అతడు కలిసేవాడు. గత అక్టోబర్ ఇద్దరు కలిసి ఇంటి నుంచి పారిపోయినట్లు తెలిసింది. అయితే తర్వాత రియా తన భర్త వద్దకు తిరిగి వచ్చింది. గొంతు కోసి దీంతో మళ్లీ భర్తను వదిలేసి రావాలని కిరణ్ వివాహితపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి రియా అంగీకరించకపోవడంతో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. పలుమార్లు దాడి చేశాడు. ఈ క్రమంలో భర్త ఇంట్లో లేని సమయంలో ఆదివారం రాత్రి కిరణ్ రియా ఇంటికి వెళ్లాడు. వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆవేశం పట్టలేని కిరణ్ అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కొసి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం పిల్లవాడు ఏడుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఇంటికి వచ్చి చూడగా రియా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రియుడూ ఆత్మహత్య ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివాహిత మృతదేహాన్ని బాత్రూమ్లో స్వాధీనం చేసుకున్నారు. శరీరంపై కొట్టిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రియురాలిని హత్య చేసిన రోజు రాత్రి.. న్యూజల్పైగురి రైల్వే స్టేషన్‌కు వెళ్లిన కిరణ్.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. చనిపోయే ముందు అతను ఫేస్బుక్ లైవ్ చేశాడు. నాకు మరో దారి లేదు ఇందులో ‘అవును నేను రియాను చంపాను. కానీ ఆమెను చంపకుండా ఉంటే ఇలా ఆత్మహత్య చేసుకునే వాడిని కాదు. కానీ ఆమె నాకు మరో మార్గం లేకుండా చేసింది. నాకు భయంగా ఉంది. జీవించడానికి ఇంకేం లేదు. నేను బతికితే నా జీవితాంతం జైల్లోనే గడపాల్సి వస్తుంది. అందుకే చనిపోతున్నా’ అని వీడియోలో పేర్కొన్నాడు. -
వాతావరణ కార్యకర్త ఫోన్ చోరీ...ఫేస్బుక్లో లైవ్ రికార్డు చేస్తుండగా....
నొయిడా: వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం మొబైల్ ఫోన్‌ని గుర్తు తెలియని వ్యక్తులు రెప్పపాటులో లాక్కుని పరారయ్యారు. ఈ మేరకు 11 ఏళ్ల బాలిక లిసిప్రియ నొయిడాలో తన అనుచరులతో కలిసి ఫేస్బుక్ లైవ్ రికార్డు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె వాతావరణాన్ని కలుషితం కాకుండా ఉండేలా... కాకర్స్ కాల్చకుండా దీపావళి పండుగను ఎలా జరుపుకోవాలనే దానిపై ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇంతలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగలు ఆమె ఫోన్‌ని లాక్కుకుని వెళ్లిపోయారు. దీంతో ఆమె పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా తనకు సహాయం చేయమంటూ ట్విట్టర్లో ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది. ఈ మేరకు సెంట్రల్ నొయిడా అదనపు డీసీపీ సాద్మియాన్ కేసు నమోదు మొబైల్ స్నాచర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మణిపూర్‌కి చెందిన లిసిప్రియ కంగుజం వాతావరణ మార్పులపై పోరాటం చేస్తున్న పర్యావరణ కార్యకర్త. కీలకమైన వాతావరణ మార్పు సమస్యలపై పలువురు ప్రపంచ నేతలను కలిసింది కూడా. అంతేగాదు ఆ బాలిక కాప్ 25 వాతావరణ మార్పు సదస్సులో ప్రసంగించి అందరీ మన్ననలను పొందింది. ఇటీవల చత్తీస్‌గఢ్ బొగ్గు వ్యతిరేక నిరసనలో పాల్గొంది. అలాగే 2020లో వాషింగ్టన్లో ఎర్త్‌డేని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొంది. (చదవండి: మిరాకిల్ అంటే ఇదే...మీద నుంచి కారు వెళ్లిపోయింది ఐనా...) -
Facebook Live: పోనీయ్.. 300 కి.మీ.లు దాటాలి
లక్నో: బీఎండబ్ల్యూ కారు.. మెరుపు వేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ఫేస్బుక్ లైవ్‌లో అత్యుత్సాహం.. ఇవన్నీ కలిసి నలుగురి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేశాయి. 230 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ నలుగురు యువకులు ప్రాణాలు బలిచేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం సుల్తాన్పూర్ వద్ద జరిగింది. ఈ ప్రమాదం తాలూకు వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆనంద్ ప్రకాశ్(35), అఖిలేశ్ సింగ్(35), దీపక్ కుమార్(37), మరో వ్యక్తి బీఎండబ్ల్యూ కారులో ఎక్స్‌ప్రెస్ హైవేపై అత్యంత వేగంతో దూసుకెళ్తున్నారు. దీంతో అందులోని వ్యక్తి.. ‘ స్పీడ్ మరింత పెంచు. స్పీడ్ 300 కి.మీ.లు దాటాలి. మనం ఫేస్బుక్ లైవ్‌లో ఉన్నాం’ అని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో అన్నాడు. అప్పటికే ఆ వేగంతో భయపడిన కారులోని వ్యక్తి.. ‘మనం నలుగురం చస్తాం. నెమ్మదిగా పోనీయ్’ అని అరిచాడు. దీంతో డ్రైవర్.. భయపడే వ్యక్తిని వారిస్తూ ‘ అరవకు. నేను అంతటి వేగంతో నడిపి చూపిస్తా’ అని కోప్పడ్డాడు. ఈ వాగ్వాదం నడుమే కారు 230 కి.మీ.ల వేగంలో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టింది. కారు టాప్, ముందుభాగం పగిలిపోయి కారులోని నలుగురూ ఛిద్రమై దూరంగా పడిపోయాడు. అక్కడిక్కడే మరణించారు. -
సింగపూర్‌లో ఘనంగా శ్రీగురు కళాంజలి కార్యక్రమం
సింగపూర్‌లో "స్వర లయ ఆర్ట్స్ " సంస్థ ఆగష్టు 14వ తేదీ సాయంత్రం శ్రీ గురు కళాంజలి కార్యక్రమ మొదటి భాగాన్ని యుమీ గ్రీన్ హాల్ నుంచి యూట్యూబ్, ఫేస్ బుక్ లైవ్ ద్వారా అద్వితీయంగా నిర్వహించారు. స్వర లయ ఆర్ట్స్ విద్యార్థులైన చిన్నారులు బొమ్మకంటి అనన్య, షణ్మిత తంగప్పన్లు ప్రార్ధనాగీతంతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. పప్పు పద్మా రవిశంకర్ (ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్నం A గ్రేడ్ ఆర్టిస్ట్ ) తమ వీణావాదనతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేయగా వారి తనయులు పప్పు జ్ఞానదేవ్ వయోలిన్, పప్పు జయదేవ్ మృదంగ సహకారంతో సాగిన సంగీతఝరి మరింత రక్తి కట్టింది. అనంతరం స్వర లయ ఆర్ట్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషు కుమారి కళాకారులతో వారి గురు పరంపర, వారి గురువుల విద్యాబోధనా విధానాల గురించి ఇంటర్వ్యూ రూపంలో చర్చించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఈ సందర్భంగా యడవల్లి శేషు కుమారి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలతో పాటు, వారి గురువుల కళావిశిష్టత, వైవిధ్యం మున్నగు అంశాలపై చర్చలతో విజ్ఞానవంతముగా ముందుతరాలకు ఉపయుక్తంగా రూపొందించబడింది. ఈ శీర్షికలో సమర్పించనున్న కార్యక్రమాలలో ఇది మొదటిభాగమని పేర్కొన్నారు. ప్రత్యేక అతిధిగా సంగీత సుధానిది గుమ్ములూరి శారద సుబ్రహ్మణ్యం కళాకారులకు అభినందనలు తెలిపారు. శ్రీ గురు కళాంజలి ప్రోగ్రాం గురువుల గూర్చి ఎన్నో విషయాలను తెలుసుకునే విధంగా ఉందని మరిన్ని కార్యక్రమాలు చెయ్యాలని సంస్థకు ఆశీస్సులను అందించారు.ఈ కార్యక్రమానికి కవుటూరు లలితా రత్నకుమార్, సౌభాగ్యలక్ష్మి రాజశేఖర్, విద్యాధరి , రాధిక నడదూరు మున్నగు ప్రముఖులు, స్నేహితులు విచ్చేసి హర్షం తెలియజేశారు. బొమ్మకంటి సౌజన్య పరిచయ కర్తగా వ్యవహరించారు. -
నువ్వైనా నా మాట వినూ! భర్త విషం తీసుకోవడం చూసి ఆ భార్య..
కరోనాతో కోట్లాది మంది బతుకులు తలకిందులు అయ్యాయి. ఉపాధి లేక ఎంతో మంది ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ తమ జీవితాలన్ని తలకిందులు చేసిందంటూ బాధపడేవాళ్లూ ఉన్నారు. ఈ జాబితాలో రాజీవ్ తోమర్ కూడా ఉన్నారు. కరోనా దెబ్బకి కోలుకోలేకుండా అయిన ఈయన.. ఏకంగా ప్రాణం తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడీ ఉదంతం ఇప్పుడు రాజకీయ విమర్శలకు తావిచ్చింది. కరడుగట్టిన బీజేపీ అభిమాని కాస్త విమర్శలు చేయడం పొలిటికల్ హీట్ పెంచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్పట్కు చెందిన బూట్ల వ్యాపారి రాజీవ్ తోమర్ (40) దంపతులు లైవ్‌లో విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో రాజీవ్ భార్య మరణించగా, రాజీవ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన ఫేస్బుక్ లైవ్‌లో సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీపై, ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన మరణానికి మోదీనే కారణం అవుతారంటూ వ్యాఖ్యలు చేశారు రాజీవ్. భార్య అడ్డుకుంది కానీ.. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాను అప్పుల పాలయ్యానని ఆ లైవ్ వీడియోలో రాజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, చిన్న వ్యాపారులకు మోదీ ఎంతమాత్రమూ హితుడు కాదని విమర్శించారు. ప్రధానికి చేతనైతే పరిస్థితులు చక్కదిద్దాలని హితవు పలికారు. ‘‘ప్రభుత్వం నాలాంటి వాళ్ల మాట వినడం లేదు.. కనీసం నువ్వైనా విను’’ అంటూ విసురుగా విషం తాగేశారు. భర్త విషం తాగడంతో షాక్ తిని.. ఆమె కూడా ఆ వెంటనే విషం తీసుకున్నారు. కాసేపటికి లైవ్ ద్వారా స్పందించిన కొందరు.. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పూనం మరణించినట్టు నిర్ధారించారు. రాజీవ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 2020లో విధించిన కరోనా లాక్డౌన్ కారణంగా రాజీవ్ వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తీసుకున్న రుణాలు చెల్లించే వీలులేకపోయిందన్నారు. బీజేపీ అభిమాని నుంచి.. రాజీవ్ తోమర్ కరడుగట్టిన బీజేపీ అభిమాని. ఈ మేరకు బీజేపీ మీద అభిమానంతో కట్టిన బ్యానర్లలో ఆయన ఫొటోలు ఉండడం, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పలువురు కీలక నేతలతో ఆయన సన్నిహితంగా దిగిన ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి. భాగ్‌పట్ ఎంపీ సత్యపాల్ సింగ్(ఎడమ)తో రాజీవ్(కుడి) వీడియోలో చెప్పినట్లుగా బీజేపీ ఎలాంటి సహకారం అందించకపోవడం వల్లే చనిపోయి ఉంటారని సన్నిహితులు చెప్తున్నారు. అయితే బీజేపీ మాత్రం వ్యక్తిగత కారణాలకు.. పార్టీని నిందించడం సరికాదని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కరోనాతో ఎంతో మంది నష్టపోయారని, కేవలం పార్టీ ప్రతిఫలాలు అందలేదన్న ఉద్దేశంతో నిందించడం సబబేలా అవుతుందని రాజీవ్ వీడియోను ఖండిస్తున్నారు పలువురు బీజేపీ నేతలు. ఇక ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అన్యాయం జరిగినా వదలం. ఈ పోరాటంలో మీరు ఒంటరివారు కాదు - నేను మీతో ఉన్నాను అంటూ రాజీవ్‌ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. రాజీవ్ భార్య మృతికి సంతాపం తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. बागपत के राजीव तोमर जी व उनकी पत्नी के वीडियो ने छोटे व्यापारियों की लाचारी का दर्दनाक सच दिखाया है। तोमर जी के स्वस्थ होने की कामना व उनकी पत्नी के दुखद देहांत पर मेरी शोक संवेदनाएँ। अन्याय के सामने हम हार नहीं मानेंगे। इस लड़ाई में आप अकेले नहीं हैं- मैं आपके साथ हूँ। — Rahul Gandhi (@RahulGandhi) February 9, 2022 बागपत में एक व्यापारी एवं उनकी पत्नी की आत्महत्या के प्रयास और उनकी पत्नी की मृत्यु के बारे में जान कर बेहद दुःख हुआ। परिजनों के प्रति मेरी शोक संवेदनाएं। मैं ईश्वर से प्रार्थना करती हूं कि श्री राजीव जी को जल्द स्वास्थ्य लाभ मिले। — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 9, 2022 -
మోదీజీ మీ విధానాన్ని మార్చుకోండి!....అప్పుల బాధలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వ్యాపారి!
Debt-Hit UP Trader Attempts Assassination In Live FacebooK: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో బూట్ల వ్యాపారం చేసే రాజీవ్ తోమర్ అప్పుల బాధలతో భార్యతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పైగా ఆ ఘటనకు సంబంధించిన వీడియోని కూడా ఆ వ్యాపారి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఉత్తర ప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియో పెద్ద కలకలం రేపింది. అంతేకాదు ఆ వీడియోలో అతని భార్యతో కలిసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్నట్లు కనిపిస్తుంది. పైగా ఆ వీడియోలో వ్యాపారి భార్య చనిపోవడానికి ముందు తన భర్తని పాయిజన్ తీసుకోకుండా ఆపడానికి యత్నిస్తున్నట్లు ఉంటుంది. అయితే ఈ ఘటనలో ఆ వ్యాపారి భార్య మరణించింది. కానీ రాజీవ్ తోమర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు నిమిషాల నిడివి గల ఫేస్బుక్ లైవ్ వీడియోలో తోమర్ మాట్లాడుతూ..."నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని నేను అనుకుంటున్నాను. నేను చనిపోయినా అప్పులు తీరుస్తాను. అయితే నేను ఈ వీడియోను వీలైనంత ఎక్కువగా షేర్ చేయమని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. నాకు దేశం పై నమ్మకం ఉంది. నేను దేశ వ్యతిరేకిని కాను. ప్రదాని నరేంద్ర మోదీజీ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ముమ్మాటికి చిన్న వ్యాపారులు, రైతుల శ్రేయోభిలాషులు కాదు. మీ విధానాలను మార్చుకోండి. జీఎస్టీ వల్ల నా వ్యాపారం దెబ్బతింది” అని తోమర్ కన్నీటిపర్యంతమయ్యాడు. అయితే ఈ వీడియోని వీక్షించిన కొంత మంది నెటిజన్లు పోలీసులకు సమాచారం అందించారు ఈ మేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ భార్య భర్తలని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్లో " బాగ్పత్లోవ్యాపారవేత్త అతని భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాజీవ్ జీ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆమె ట్వీట్ చేశారు. అంతేకాదు యూపీ అంతటా చిన్న వ్యాపారులు ఈ రకమైన బాధలను ఎదుర్కొంటున్నారని అన్నారు. పైగా నోట్ల రద్దు, జీఎస్టీ లాక్డౌన్ సామాన్య జనాన్ని చాలా బాధించాయి అని కూడా వ్యాఖ్యానించారు. (చదవండి: విద్యార్థిని కిడ్నాప్... రూ.20 లక్షలు డిమాండ్ చేసి రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ) -
ఫ్లైట్ ఎక్కేముందు కరోనా నెగెటివ్.. దిగాక పాజిటివ్!!
భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి భారత్‌లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన అనుభవం దృష్ట్యా.. కరోనా టెస్టులు, ఐసోలేషన్‌లో ఉంచడం.. ఇదంతా పెద్ద స్కామ్ అంటూ వీడియోలో వ్యాఖ్యానించాడా వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్బుక్ ద్వారా వైరల్ అవుతోంది. మనోజ్ లాద్వా యూకేలో సెటిల్ అయిన వ్యక్తి. తన మామ అంత్యక్రియల కోసం భార్యతో పాటు లండన్ ‘హీథ్రో ఎయిర్పోర్ట్’ నుంచి విమానంలో వచ్చాడు. విమానం ఎక్కే ముందు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. డిసెంబర్ 30న వర్జిన్ అట్లాంటిక్ ఫ్లయిట్లో ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అక్కడ ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన అయిన.. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఎయిర్పోర్ట్ సిబ్బందిని కోరారు. అయితే అందుకు నిరాకరించిన సిబ్బంది.. ఆయన్ని ప్రభుత్వం నిర్వహించే ఓ క్వారంటైన్ సెంటర్‌కు షిఫ్ట్ చేశారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. ఈ అనుభవంపై ఫేస్బుక్ లైవ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అంతా మాయగా ఉంది. విమానంలో గట్టిగా పదిహేను మంది కంటే ఎక్కువమంది లేం. దిగగానే.. అదీ గంటల వ్యవధిలో పాజిటివ్ ఎలా నిర్ధారణ అవుతుంది? లండన్ ఎయిర్‌పోర్టులు రిపోర్టులు చూపించినా నమ్మకపోతే ఎలా? ఇండిపెండెంట్ పరీక్షలకు అంగీకరించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇదో పెద్ద కుంభకోణంలా ఉంది అంటూ ఆరోపించాడాయన. నాతో పాటు మరికొందరు ప్రయాణికులు గట్టిగా సిబ్బందిని నిలదీశాం.ఇక్కడి మార్గదర్శకాలు ఇష్టం లేకపోతే.. బయట డబ్బులు కట్టి అయినా క్వారంటైన్ సెంటర్లో ఉండాలంటూ బీఎంసీ అధికారులు(Brihanmumbai Municipal Corporation) బెదిరిస్తున్నారు’’ అంటూ మనోజ్ లాద్వా ఆరోపించారు. ఇదిలా ఉంటే లాద్వా వీడియో తీసిన టైంలో.. వెనకాల మరికొంతమంది ప్రయాణికులు సెంటర్ నిర్వాహకులతో గొడవ పడుతున్నట్లు వాయిస్ వినిపించింది. అయితే ఎయిపోర్ట్ సిబ్బంది మాత్రం తాము అంతా పక్కాగా రూల్స్ ప్రకారమే ముందుకు పోతున్నట్లు చెబుతున్నారు. చదవండి: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం?? ఎక్కడంటే.. -
ఫేస్బుక్ లైవ్: ‘సిరిసిల్ల టౌన్ సీఐ వేధిస్తున్నాడు.. విషం తాగి చనిపోతున్నా’
సిరిసిల్ల: పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఆరోపిస్తూ.. ఓ యువకుడు ఫేస్బుక్ లైవ్‌లో పురుగుల మందు తాగాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన యువకుడు గొలిసెల దిలీప్ (23) ట్రాక్టర్ డ్రైవర్. తనను సిరిసిల్ల టౌన్ సీఐ అనిల్‌కుమార్ వేధిస్తున్నాడని, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించాడని, మళ్లీ తనపై మరో కేసు నమోదు చేశాడని లైవ్‌లో ఆరోపించాడు. వేములవాడ శివారులోని చింతలఠాణాకు చెందిన యువతిని ప్రేమించానని, సదరు యువతితో కలిసి ఉన్న ఫొటోలను పోలీసులు తొలగించారని, ఆమెను వదిలివేయాలని, మరచిపోవాలని వేధిస్తున్నారని పేర్కొన్నాడు. రౌడీషీట్ తెరుస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పాడు. సదరు యువతిని వేధిస్తున్నానంటూ గతంలో కూడా ఓ కేసు నమోదు చేసి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం మరో కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని బెదిరించారని, దీంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఫేస్బుక్ లైవ్‌లో పురుగుల మందు తాగాడు. బస్వాపూర్–నేరెళ్ల గ్రామాల మధ్య దిలీప్ ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న దిలీప్‌ను సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దిలీప్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఫొటోలు చూపించి బ్లాక్మెయిల్ చేశాడు యువతి ఫొటోలు తీసి దిలీప్ ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయంలో గతంలో పోలీసు కేసు నమోదైంది. జైలుకు వెళ్లి వచ్చా డు. అయినా మళ్లీ అతడి వేధింపులు తగ్గకపోవడంతో షీ–టీమ్‌ను ఆశ్రయించారు. షీ–టీమ్ సూచనలతో అతడిపై మరో కేసు నమోదు చేశాం. యువతిని వేధిస్తున్న అంశంలో చట్టబద్ధంగానే వ్యవహరించాం. అతన్ని మేం వేధించలేదు. – అనిల్‌కుమార్, సిరిసిల్ల టౌన్ సీఐ -
FactCheck: ఆ పాడు పని చేసింది వాళ్లిద్దరూ కాదు
బాకు: ‘‘లైవ్‌లో ఉన్న సంగతి మర్చిపోయి మరీ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అజర్ బైజాన్ ప్రధాని అలీ అసదోవ్’’.. ఈ క్యాప్షన్‌తో ఓ వీడియో ఈమధ్య ఫేస్బుక్లో బాగా వైరల్ అయ్యింది. కొన్ని ఇంటర్నేషనల్ వెబ్‌సైట్స్, టాబ్లాయిడ్స్ అసదోవ్ తీరును తప్పుబడుతూ ఆ వార్తను ప్రచురించేశాయి. అయితే ఈ వీడియోకు సంబంధించి ఓ ట్విస్ట్ ఇప్పుడు బయటపడింది. అందులో ఉంది ఆయన కాదంటూ అసలు విషయం తెలిసొచ్చింది. వీడియోలో ఏముందంటే.. జూమ్ మీటింగ్ జరుగుతుండగా.. అందులో పెద్దాయన సడన్‌గా వెనక్కి తిరుగుతాడు. అక్కడే ఉన్న ఓ మహిళ వెనుక భాగాన్ని తన చేత్తో తాకుతాడు. దీంతో ఉలిక్కి పడ్డ ఆ మహిళ.. ఆయనతో వాగ్వాదానికి దిగుతుంది. ఆ వెంటనే అక్కడి నుంచి భయంతో పరుగులు తీస్తుంది. వెంటనే ఆయన కెమెరా ఆఫ్ చేస్తాడు. అయితే కొందరు ఫేస్బుక్ యూజర్లు.. ఇది అజర్ బైజాన్ అధ్యక్షుడి పనే అని, కాదు ప్రధాని అలీ అసదోవ్ పనే అని మరికొందరు ప్రచారం చేశారు చేశారు. జూమ్ మీటింగ్‌కు ఎగ్జిట్ కొట్టని సంగతి మరిచి.. అలా ప్రవర్తించారని కామెంట్స్ చేశారు. అయితే అందులో ఉంది అజర్ బైజాన్ అధ్యక్షుడో, ప్రధానో కాదని ఇప్పుడు తేలింది. పాత వీడియో కానీ.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించింది అజర్ బైజాన్ మాజీ ఎంపీ, యూనివర్సిటీ ప్రొఫెసర్ హుసేయిన్బలా మిరాలమోవ్. పోయిన నెలలో ఆయన ఈ పాడు పనికి పాల్పడ్డాడు. పైగా ఈ వీడియో రిలీజ్ అయ్యి నెలపైనే అయితోంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయగా, ఆయన్ని న్యూ అజర్ బైజాన్ పార్టీ బహిష్కరించింది కూడా. అయితే ఈ వ్యవహారం అధికారిక జూమ్ మీటింగ్‌లోనే జరగడం విశేషం. ఇక పోలికలు కూడా పట్టించుకోకుండా కథనాలు ప్రచురించిన వెబ్సైట్లపై దావాకు అజర్ బైజాన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: మనిషికి బర్డ్‌ఫ్లూ.. ఇది అసలు విషయం -
ఐర్లాండ్.. ముంబై.. ధులే..!
ముంబై: మహారాష్ట్రలోని ధులేకు చెందిన ఓ యువకుడు ఫేస్బుక్ లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన ఐర్లాండ్ లోని ఫేస్బుక్ అధికారులు వెంటనే ముంబై పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని గుర్తించి, యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అంతా 50 నిమిషాల్లోపే పూర్తయింది. ధులే పోలీస్ ఠాణాలో హోంగార్డ్‌గా చేస్తున్న వ్యక్తి కుమారుడు(23) ఆదివారం చేతిని కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. దీనిని ఐర్లాండ్‌లోని ఫేస్బుక్ సిబ్బంది గమనించి వెంటనే ముంబైలోని సైబర్ క్రైం పోలీస్ డిప్యూటీ కమిషనర్ రశ్మి కరండికర్కు ఫోన్ చేసి తెలిపారు. ఆమె వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తంచేశారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులు రాత్రి 9 గంటలకల్లా ధులేలోని భోయి సొసైటీ ప్రాంతంలోని ఓ ఇంట్లో గాయపడి ఉన్న బాధిత యువకుడిని గుర్తించారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి, ప్రాణాపాయం నుంచి కాపాడారు. సోమవారం అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారని ఎస్పీ చిన్మయ్ పండిట్ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడబోయిన ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. -
జూమ్ దర్శనం.. ఫేస్బుక్ హారతి!
కోవిడ్ థీమ్‌తో బొజ్జ గణపయ్యలు, ఫేస్బుక్ లైవ్ ద్వారా దర్శనాలు, ఇళ్లలోనే పూజలు, ఎక్కడికక్కడే నిమజ్జనాలు... ఈ సారి వినాయక చవితి పండుగపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడంతో ఎక్కడా సందడే కనిపించడం లేదు. వినాయక చవితి పండుగంటే పిల్లా పెద్దల్లో ఒకటే సంబరం. గణపతి బప్పా మోరియా అంటూ వీధులన్నీ మారుమోగిపోతాయి. పెద్ద పెద్ద విగ్రహాలు, వైవిధ్యమైన రూపాలతో గణపతి రూపులు ఆకట్టుకుంటాయి. కానీ ఈసారి కరోనా వైరస్‌తో భౌతికదూరం పాటించాల్సి రావడంతో ఎక్కడా పండుగ వాతావరణమే కనిపించడం లేదు. అంబరాన్నంటే సంబరాలు లేకపోయినా విఘ్నాల దేవుడు కరోనా నుంచి కాపాడాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు పూజలకి సిద్ధమవుతున్నారు. ఆంక్షల మధ్య గణపయ్యలను సిద్ధం చేస్తూ శనివారం నాడు తమ శక్తి కొద్దీ పండుగ చేయడానికి ఏర్పాట్లు చేశారు. గణేశ్ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించే మహారాష్ట్రలో ఈసారి ఒకేసారి అయిదుగురు భక్తులకు మించి అనుమతించకూడదని ఆంక్షలు విధించారు. అంతేకాదు నాలుగు అడుగులకి మించి విగ్రహం పెట్టడానికి అనుమతి నిరాకరించారు. చాలా చోట్ల 10 రోజులకు బదులుగా ఒకటిన్నర రోజులో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక కరోనా వైరస్‌ని చంపేస్తున్న పోజులో గణపతులు కొలువుతీరుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వినాయకుడికి మాస్కులు కూడా తొడుగుతున్నారు. బెంగళూరులో వార్డుకి ఒక్క గణేశుడికి మాత్రమే అనుమతిచ్చారు. మండపాల దగ్గర ప్లాస్మా కేంద్రాలు ముంబైలో ప్రతీ ఏడాది 3 వేల వరకు గణేశ్ మండపాలు పెట్టేవారు. ఈ ఏడాది వాటి సంఖ్య 1,800కి తగ్గిపోయింది. నగరంలో సుప్రసిద్ధ లాల్బాగ్చా మండపం సమీపంలో కరోనా రోగులకు ప్లాస్మా దానం కోసం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముంబై నగర బీజేపీ శాఖ వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేకంగా రథాన్ని ఏర్పాటు చేసింది. ఆ రథంలో నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి గణేశుల్ని అందులో నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టింది. ఢిల్లీలో జూమ్ కాల్ దర్శనాలు ఢిల్లీలోని అత్యంత పురాతన గణేశ్ ఉత్సవ కమిటీ మరాఠి మిత్ర మండల్ ఫేస్బుక్, జూమ్ యాప్‌ల ద్వారా దర్శనాలకి ఏర్పాట్లు చేసింది. భక్తులు ఇంటి నుంచి దర్శించుకొని హారతి కూడా తీసుకునే సదుపా యాలు ఏర్పాటు చేసింది. ‘‘కరోనా సమయంలో గణపతి ఉత్సవాలను నిర్వహించడం అత్యంత కష్టం. అందుకే ఒకటిన్నర రోజులకే పరిమితం చేశాం. 35 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవాల్ని సాదాసీదాగా నిర్వహిస్తున్నాం’’అని ఉత్సవ కమిటీ సభ్యురాలు నివేదిత చెప్పారు. -
ఎఫ్బీలో సత్తి ‘గరం గరం’ ముచ్చట్లు
సాక్షి, హైదరాబాద్ : తన మాట, భాష, యాసతో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న బిత్తిరి సత్తి గురించి తెలియని వారుండరు. రంగు రంగుల పూల చొక్కాతో తనదైన హావభావాలతో అందరిని అలరిస్తుంటాడు. మరి అలాంటి సత్తి ‘సాక్షి’ టీవీలో గరం గరం వార్తలతో మన ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ వేదికగా లైవ్‌లో ముచ్చటించనున్నాడు. ఆదివారం (ఆగస్ట్ 2) సాయంత్రం 5 గంటలకు ‘సాక్షి’ ఫేస్బుక్ ద్వారా లైవ్‌లో తన మాటలను మనతో షేర్ చేసుకోబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం చూసి ఆనందించండి. (బిత్తిరి సత్తితో ‘గరం గరం వార్తలు’.. రేపే ప్రారంభం) కాగా, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిత్తిరి సత్తి ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాం ఆదివారం ప్రారంభం కానుంది. సాక్షి టీవీలో ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రొమోలకు వీక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణితో సత్తి జరిపిన సంభాషణకు సంబంధించిన తాజా ప్రొమో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ‘గరం గరం వార్తలు’ కోసం వీక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఈ స్పందనను బట్టి అర్థమవుతోంది. -
దీదీ ముహూర్తం ఫిక్స్ చేసింది..!
కోల్‌కతా: కరోనా ఎఫెక్ట్‌తో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు బంద్ అయ్యాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు పార్టీలు ర్యాలీలను, ప్లీనరీలను కూడా వర్చవల్‌గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చేరారు. ఈ నెల 21న అమరవీరుల దినోత్సవం సందర్భంగా దీదీ ఒక వర్చువల్ ర్యాలీని నిర్వహించనున్నారు. 1988 నుంచి టీఎంసీ ప్రతి ఏడాది అమరవీరుల దినోత్సవాన్ని జరుపుతుంది. ఇదే రోజున మమత త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. జూలై 21న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మమత ర్యాలీని ఉద్దేశించి ఫేస్బుక్ ద్వారా ప్రసంగించి.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని సమాచారం. ఈ క్రమంలో 21 నాటి ర్యాలీ గురించి మమత పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.(కరోనా ఎక్స్‌ప్రెస్ వ్యాఖ్యలపై దీదీ స్పందన) ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఈసారి జూలై 21ని బహిరంగ ప్రదేశంలో జరుపుకోలేకపోతున్నాము. కాని ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నేను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తాను. ప్రజలు బూత్ స్థాయిలో గుమి గూడాలి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రతి బూత్‌లో సుమారు 30 మంది హాజరుకావాలి. తర్వాత జెండా ఎగరవేసి అమరవీరులకు నివాళులు అర్పించాలి. మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నేను ప్రసంగిస్తాను’ అని తెలిపారు. బెంగాల్లో సుమారు 80,000 బూత్‌లు ఉన్నాయి. ప్రతి బూత్‌లో 30 మంది సమావేశమైతే, సుమారు 2.5 లక్షల మంది పాల్గొనవచ్చు. (కరోనా : బెంగాలీలకు గుడ్‌న్యూస్) ర్యాలీని ఉద్దేశించి తృణమూల్ చీఫ్ వర్చువల్ మాధ్యమాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. బీజేపీ ఇప్పటికే ఇలాంటి ర్యాలీలు ఆరు నిర్వహించింది. మొదటి దానిని అమిత్ షా నిర్వహించారు. దీనిలో ప్రజలు పాల్గొనడానికి బెంగాల్ అంతటా 70,000 టెలివిజన్ సెట్లను ఏర్పాటు చేశామని బీజేపీ పేర్కొన్నది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. తృణమూల్ వద్ద ఆ రకమైన డబ్బు లేదు అన్నారు. -
షి ఈజ్ సెలబ్రిటీ క్వీన్
సాక్షి,సిటీబ్యూరో: ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి దివ్య అన్వేషిత కొమ్మరాజు. ‘ఫేస్బుక్’లో లైవ్ ఆప్షన్ వచ్చాక భారతీయ సంప్రదాయంతో ముస్తాబై లైవ్‌లోకి వచ్చింది. మొదటి వీడియోలోనే నెటిజన్లను తన చక్కని రూపంతో ఆకట్టుకుంది. ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ నెటిజన్లు అక్కున చేర్చుకున్నారు. ‘ఫేస్బుక్’ ద్వారా తను చేస్తున్న మంచి పనులను గుర్తిస్తూ గతేడాది ‘సాక్షి’ ‘షీ ఈజ్ ఫేస్బుక్ క్వీన్’ అంటూ ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ‘యస్.. షీ ఈజ్ రియల్లీ ఫేస్బుక్ క్వీన్’ అంటూ సాక్షాత్తు ‘ఫేస్బుక్’ కంపెనీనే అంగీకరించింది. ఒక సాధారణ యువతికి ఫేస్బుక్ అధికారికంగా ‘బ్లూ టిక్’ ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారి అయ్యుంటుంది. పదేళ్ల క్రితం ట్రంకు పెట్టెతో ఖమ్మం నుంచి సిటీకి వచ్చిన దివ్య అన్వేషిత ఈ రోజు టాప్ సెలబ్రిటీలకు దీటూగా ‘బ్లూటిక్’ని సాధించడంపై ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలకు దక్కిన గౌరవం తనకు దక్కడం హైదరాబాదీగా గర్వంగా ఉందంటోంది దివ్య అన్వేషిత. -
‘ఆ ఊహనే భరించలేకున్నా.. చనిపోతున్నా’
న్యూఢిల్లీ: ‘తనకు మరొకరితో వివాహం జరుగుతుందనే ఊహనే భరించలేకున్నాను. తను లేకుండా నేను బతకలేను. తను నాకు దూరమవుతుందనే బాధ నా గుండెను మెలిపెడుతుంది. ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఉద్యోగం కూడా పోయింది... తను లేని జీవితం నాకు వద్దు. అందుకే చనిపోతున్నాను. అమ్మానాన్న నన్ను క్షమించండి.. నా అవయవాలను ఎవరికైనా దానం చేయండి’ అంటూ ఆగ్రావాసి ఒకరు ఫేస్బుక్ లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. ఆగ్రాకు చెందిన శ్యామ్ సికార్వార్ అలియాస్ రాజ్(22) అనే వ్యక్తి కొంతకాలంగా ఓ యువతిని ప్రేమించాడు. అయితే వీరి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాక యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేశారు. దాంతో రాజ్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో సమీపంలోని ఆలయానికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోవడానికి గల కారణాలను ఫేస్బుక్ లైవ్ ద్వారా పంచుకున్నాడు రాజ్. అంతేకాక తన చావుకు ఎవరిని బాధ్యుల్ని చేయవద్దని పోలీసులను కూడా కోరాడు. దాంతో పాటు నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను కూడా రాశాడు రాజ్. దానిలో తల్లిదండ్రుల్ని బాధపెడుతున్నందుకు క్షమించమని కోరడమే కాక తన అవయవాలను దానం చేయాల్సిందిగా కోరాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్బుక్ లైవ్‌పై ఆంక్షలు
పారిస్: తమ లైవ్ స్ట్రీమింగ్ వీడియోలపై పలు ఆంక్షలు విధించనున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. తీవ్రవాదం, విద్వేషాన్ని ఫేస్బుక్ ద్వారా వ్యాప్తి చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. ‘క్రైస్ట్‌చర్చ్’మసీదు కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో తీవ్రవాదం పెచ్చుమీరకుండా ఉండేందుకు ఆ సంస్థలపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్, ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌లు ప్రపంచవ్యాప్తంగా ‘క్రైస్ట్‌చర్చ్’పిలుపునివ్వాలని సిద్ధమవుతున్నారు. మార్చిలో శ్వేత జాతీయుడు క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ మసీదులో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 51 మంది చనిపోయారు. కాల్పులు జరుపుతూ దుండగుడు ఫేస్బుక్లో లైవ్‌స్ట్రీమ్ చేశాడు. అప్పటినుంచి చర్యలు తీసుకోవాల్సిందిగా జుకర్ బర్గ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరిగింది. దీంతో ఫేస్బుక్ వినియోగదారులు తీవ్రవాద సంబంద వీడియోల లైవ్‌పై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. ‘న్యూజిలాండ్‌లో జరిగిన మారణహోమం తర్వాత తీవ్రవాదం వ్యాప్తిచేసేందుకు ఫేస్‌బుక్‌ను వాడుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపాం’అని ఫేస్బుక్ తెలిపింది. -
వైరల్ : ఫేస్బుక్ లైవ్‌తో రాక్షసానందం
-
వైరల్ : ఫేస్బుక్ లైవ్‌తో రాక్షసానందం
న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్ సిటీలోని మసీదులను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పాశవిక చర్యకు పాల్పడ్డ దుండగులు. మసీదుల్లోని గదుల్లో తిరుగుతూ కాల్పులు జరుపుతున్న దృశ్యాల్ని ఫేస్బుక్లో లైవ్‌స్ట్రీమ్ చేసి రాక్షసానందం పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం నిందితుడు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారెంట్‌గా తెలుస్తోంది. కారులో వచ్చిన అతడు మసీదుకు దగ్గరగా వాహనాన్ని నిలిపి, ఆ తర్వాత లోనికి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. ఇక తమ దేశానికి వలస వచ్చిన వారిని, మైనారిటీ వర్గాల జనాభా పెరగడాన్ని సహించలేకే దుండగుడు జాత్యంహకార చర్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం.. 49 మంది మృతి ‘వారి’ స్ఫూర్తితోనే ఉన్మాది కాల్పులు కాగా ఈ ఘటనను ఉగ్రదాడిగా భావిస్తున్నామని ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని జసీండా ఆర్డెర్న్.. ‘న్యూజిలాండ్ చరిత్రలోనే ఇదో చీకటి రోజు’ అని ఉద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులను మూసివేయాలని న్యూజిలాండ్ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. -
ఫలితాలొచ్చాక కేసీఆర్ ఫాంహౌస్‌కే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లిపోవడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయని, 11న ఫలితాలు వస్తే.. 12న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. డిసెంబర్ 12 తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు పారిపోవడం ఖాయమన్నారు. గాంధీభవన్ నుంచి ఫేస్బుక్ లైవ్‌తో పాటు చార్మ్స్ ద్వారా పార్టీ బూత్ అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణలో అడుగుపెడుతున్నారని, రాష్ట్ర ఏర్పాటులో ఎంతో కృషి చేసిన ఆమె ఇక్కడకు రావడం చరిత్రాత్మక ఘటన అని వ్యాఖ్యానించారు. మేడ్చల్‌లో జరిగే సభకు సోనియాగాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వస్తున్నారని, ఈ సందర్భంగా సోనియాను సన్మానించి గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలకు ఉందని పేర్కొన్నారు. అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా? ఆత్మగౌరవం పేరుతో కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలన మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని, నేరెళ్ల దళితులను అకారణంగా వేధించి హింసించినపుడు ఆయనకు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఖమ్మంలో గిరిజన రైతులు మిర్చి పంటకు మద్దతు ధర అడిగినపుడు పోలీసులు లాఠీలతో కొట్టి కేసులు పెట్టి వేధించినపుడు ఆత్మగౌరవం ఏమైందని నిలదీశారు. ఢిల్లీకి, అమరావతికి ఆత్మగౌరవం తాకట్టు అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారని.. చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకుంటారని ప్రగల్భాలు పలుకుతున్నారని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతామంటే చంద్రబాబు అడ్డుకున్నాడా, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామంటే ఎవరైనా అడ్డుకున్నారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఆత్మగౌరవం పేరుతో కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను జనం నమ్మరని, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులకు భూమి పేరుతో, పేదలకు డబుల్ బెడ్ రూమ్ పేరుతో, ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేసి ఓట్లు పొంది గత ఎన్నికలలో విజయం సాధించిన కేసీఆర్ నాటకాలను పూర్తిగా ప్రజలు అర్థం చేసుకున్నారని, ఇక ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని ఉత్తమ్ పేర్కొన్నారు. -
ఫేస్బుక్లో పరిణయం లైవ్
తుమకూరు: ఇప్పుడు సోషల్ మీడియా సర్వస్వం అయిపోయింది. ఏ కార్యక్రమాన్నైనా ఆన్లైన్లో నిర్వహిస్తూ యువత హడావుడి చేస్తోంది. దానికి తాజా ఉదాహరణే ఈ పెళ్లి. ఒక ప్రేమ జంట ఫేస్బుక్ లైవ్‌లో పరిణయం చేసుకున్నారు. తుమకూరు జిల్లాలోని మధుగిరి పట్టణానికి చెందిన కిరణ్ అదే ప్రాంతానికి చెందిన అంజన ప్రేమించుకుంటున్నారు. రాజకీయ నాయకుడైన యువతి తండ్రి వారి ప్రేమకు అడ్డుచెప్పడంతో జంట రెండు రోజుల క్రితం ఇళ్ల నుంచి పారిపోయింది. శుక్రవారం ఈ జంట ఒక ఆలయంలో పెళ్లి చేసుకుంది. అంతేకాదు వరుడు తన ఫేస్బుక్ ఖాతాలో పెళ్లిని ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాడు. యువతి తండ్రి ఫిర్యాదుతో మధుగిరి పట్టణ పోలీసులు ప్రేమికుల కోసం గాలిస్తున్నారు. -
అతడి ఆత్మహత్యను లైవ్‌లో చూశారు
గురుగ్రామ్ : మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయనేది ఇటీవలి కాలంలో వినిపిస్తున్న మాట. తాజాగా గురుగ్రామ్‌లో జరిగిన సంఘటన గురించి చదివితే ఆ మాట నిజమనిపించక మానదు. ఓ వ్యక్తి ఆత్మహ్యత చేసుకుంటన్నది ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తే.. 2వేల మంది దానిని సినిమాలా చూశారే తప్ప ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌లోని పటౌడి గ్రామానికి చెందిన అమిత్ చౌహన్‌కు సోమవారం సాయంత్రం తన భార్యతో గొడవ జరిగింది. ఆమె 7 గంటల ప్రాంతంలో ఇద్దరు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న అమిత్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. దానిని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని, ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి అంటూ లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వారికి తెలిపాడు. తర్వాత గంటకు అతడు సీలింగ్ ఫ్యాన్‌కు ఊరి వేసుకున్నాడు. దాదాపు 2 వేల మంది ఈ వీడియోను చూసినప్పటికీ ఒక్కరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటననపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం పది గంటలకు తమకు సమాచారం అందిందని తెలిపారు. తాము అక్కడికి చేరుకునే సరికే కుటుంబ సభ్యులు అతని అంత్యక్రిమలు పూర్తి చేశారని పేర్కొన్నారు. అమిత్ మరణంపై కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిచ్చేలా ఉందని.. దీనిపై విచారణ చేపట్టామని వెల్లడించారు. కాగా అమిత్ మానసికంగా కుంగిపోయాడని.. ఆరు నెలల నుంచి చికిత్స పొందుతున్నాడని అతని బంధువులు పోలీసులకు తెలిపారు. దీనిపై అమిత్ తండ్రి ఆశోక్ చౌహన్ మాట్లాడుతూ.. తనకు సోమవారం రాత్రి 9 గంటలకు ఈ విషయం తెలిసిందన్నారు. భార్యతో, ఇరుగుపొరుగు వాళ్లతో అమిత్ తరచు గొడవ పడుతుండేవాడని తెలిపారు. -
ఫేస్బుక్ లైవ్‌లో టీడీపీ కార్యకర్త ఆత్మహత్య
సాక్షి, చిలకలూరిపేట టౌన్: పక్షవాతంతో మంచం పట్టిన తన తండ్రిని అధికారపార్టీ నాయకులు పట్టించుకోవట్లేదని మనస్తాపం చెందిన టీడీపీ యువ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి.. చిలకలూరిపేటలోని తూర్పు దళితవాడకు చెందిన టీడీపీ నాయకుడు యడ్ల దాసు అలియాస్ జింగిరి రెండేళ్లక్రితం పక్షవాతంతో మంచం పట్టాడు. అప్పట్నుంచీ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు మేరిబాబు, విజయ్ కుమారులు. ఎంటెక్ చేసిన మేరిబాటు స్థానిక కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. దాసు భార్య ఎస్తేరు రోజువారీ కూలీ పనులకు వెళుతోంది. వీరిద్దరూ సంపాదించిన డబ్బులు దాసు వైద్యఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో చిన్నకుమారుడు విజయ్ ఇంటర్ పూర్తవగానే టవర్ నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భర్త వైద్య చికిత్సకయ్యే ఖర్చు తడిసిమోపెడవడంతో తట్టుకోలేని పరిస్థితుల్లో ఎస్తేరు స్థానిక టీడీపీ నాయకులను కలసి.. చికిత్సకయ్యే ఖర్చును మంత్రి ద్వారా ఇప్పించేలా చూడాలని ఎన్నోసార్లు వేడుకుంది. అయినా ఫలితం లేకపోయింది. ఇదుగో అదుగో అంటూ టీడీపీ నాయకులు కాలయాపన చేశారు తప్ప పట్టించుకోలేదు. పార్టీ వైపు నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సాయం అందలేదు. ఈ పరిస్థితుల్లో తండ్రి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండడం, కుటుంబమంతా కష్టపడినా వైద్యఖర్చులకు కూడా సరిపోకపోవడంతో విజయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం చీరాలలోని రామాపురం బీచ్‌కు పురుగు మందు డబ్బా తీసుకెళ్లిన విజయ్ అక్కడే ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసి టీడీపీ తమకు ఏ సహాయం చేయలేదని, అయినవాళ్లే అంతా అన్యాయం చేశారని, ప్రభుత్వం ఏర్పడినా ఉద్యోగాలు రావని ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ పురుగుమందు తాగాడు. తన మరణంతోనైనా టీడీపీ ప్రభుత్వం స్పందించి.. మంచంలో ఉన్న తన తండ్రిని బతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. పురుగు మందు తాగి పడిపోయిన విజయ్‌ని గమనించిన స్థానికులు గుంటూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు.