FAME scheme
-
ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీ రూ.5 వేలేనా?
ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న రాయితీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించేసింది. ఫేమ్ స్కీమ్ స్థానంలో ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూవీలర్లపై గరిష్టంగా మొదటి సంవత్సరంలో రూ.10,000, రెండో ఏడాదిలో రూ.5,000 సబ్సిడీ మాత్రమే ప్రభుత్వం అందించనుంది.ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకానికి సంబంధించిన వివరాలను, ఏయే వాహనానికి ఎంత సబ్సిడీ వస్తుందన్న విషయాలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఇటీవల వెల్లడించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద బ్యాటరీ 'పవర్'ఆధారంగా కిలోవాట్ అవర్‌కు రూ.5,000 సబ్సిడీని నిర్ణయించినట్లు కుమారస్వామి తెలిపారు. అయితే మొదటి సంవత్సరంలో మొత్తం సబ్సిడీ రూ.10,000 మించదు. రెండవ సంవత్సరంలో ఈ సబ్సిడీ కిలోవాట్ అవర్‌కు సగానికి అంటే రూ. 2,500కి తగ్గుతుంది. మొత్తం ప్రయోజనాలు రూ. 5,000 మించవు.ఇక ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలుదారులకు మొదటి సంవత్సరంలో రూ.25,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. రెండో ఏడాది రూ.12,500 సబ్సిడీని పొందవచ్చని కుమారస్వామి తెలిపారు. ఎల్ 5 కేటగిరీ (త్రీవీలర్లను తీసుకెళ్లే వాహనాలు) వాహనాలకు మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.25,000 సబ్సిడీ లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.‘ఫేమ్’లో భారీగా సబ్సిడీఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) పథకాన్ని మొదటిసారి 2015 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ రెండో ఫేజ్‌ను 2019 ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఇది వాస్తవానికి మూడేళ్ల ప్రణాళిక 2022 మార్చి 31న ముగియాల్సి ఉండగా 2024 జూలై 31 వరకు పొడిగించింది.ఈ స్కీమ్ రెండో దశ కాలంలో నమోదైన ఒక్కో ఎలక్ట్రిక్ టూవీలర్‌పై ప్రభుత్వం ప్రభుత్వం రూ.20,000 రాయితీ అందించేది. ఫేమ్2 ప్రారంభంలో సబ్సిడీ మొత్తం కిలోవాట్ అవర్‌కు రూ.10,000 ఉండేది. తర్వాత రూ.15000 లకు పెంచినప్పటికీ మళ్లీ తగ్గించింది. -
ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.10,900 కోట్లు.. కేంద్రం ఆమోదం
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ‘ఫేమ్’ పథకం స్థానంలో రెండు సంవత్సరాలకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (పీఎం ఈ-డ్రైవ్) పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఏయే వాహనాలకు ఎంతెంత?పీఎం ఈ-డ్రైవ్ పథకం 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఈ-త్రీ వీలర్లు, 14,028 ఈ-బస్సులకు మద్దతు ఇస్తుంది. అలాగే 88,500 ఛార్జింగ్ సైట్లకు కూడా ఈ స్కీమ్ ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్కులు, ఇతర అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) వాడకాన్ని ప్రోత్సహించడానికి ఈ పథకం కింద రూ.3,679 కోట్ల విలువైన సబ్సిడీలు/డిమాండ్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది.ఇదీ చదవండి: న్యూ లాంచ్: ఎలక్ట్రిక్ యుటిలిటీ కారు ఎంజీ విండ్సర్14,028 ఈ-బస్సుల కొనుగోలు కోసం ప్రభుత్వ, ప్రజా రవాణా సంస్థలకు రూ.4,391 కోట్లు అందిస్తారు. రోగుల తరలింపు కోసం ఈ-అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త చొరవను తీసుకుంది. ఈ-అంబులెన్స్‌ల విస్తరణకు రూ.500 కోట్లు కేటాయించింది. అలాగే ఈ-ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.500 కోట్లు అందించనుంది. -
ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టత
ఎలక్ట్రిక్ వాహనాలకు అందించే సబ్సిడీలకు తాను వ్యతిరేకం కాదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రానున్న రెండేళ్లలో ఈవీ ధర పెట్రోల్, డీజిల్ వాహనాలకు సమానంగా ఉంటుందన్నారు. భారత ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ 64వ వార్షిక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మంత్రి ఈవీలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఈవీలకు ప్రభుత్వం అందించే రాయితీ అవసరం లేదని తెలిపినట్లు కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. అవికాస్తా వైరల్‌గా మారడంతో మంత్రి దీనిపై తాజాగా స్పష్టతనిచ్చారు. ‘ఈవీలకు సంబంధించి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలకు నేను వ్యతిరేకం కాదు. దీనికి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా నన్ను బాధ్యత వహించాలని, ఈవీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరితే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈవీలు ప్రారంభమైనప్పుడు ఒక కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ధర 150 డాలర్లు(రూ.12,500)గా ఉండేది. ప్రస్తుతం దాని ధర 108-110 డాలర్లుగా(రూ.9,100) ఉంది. ఇది రానున్న రోజుల్లో రూ.8,300కు తగ్గుతుందని విశ్వసిస్తున్నాను. ఉత్పత్తి ఖర్చులు తగ్గినందున సబ్సిడీ లేకుండా కూడా కంపెనీలు వాటి ఖర్చులను నిర్వహించవచ్చని అంచనా వేశాను’ అని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌లో ట్యాబ్లెట్ పీసీల జోరు‘వచ్చే రెండేళ్లలో ఈవీ ధర పెట్రోల్, డీజిల్ వాహనాలకు సమానంగా ఉంటుంది. కంపెనీల నిర్వహణ ఖర్చులు తగ్గుతున్నాయి. భవిష్యత్తులో సబ్సిడీల అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ ఆర్థిక మంత్రిత్వశాఖ, భారీ పరిశ్రమల శాఖ ఈ విభాగానికి మరింత రాయితీలు అవసరమని భావిస్తే, నేను దాన్ని వ్యతిరేకించను’ అని స్పష్టం చేశారు. -
ఈవీలకు రూ.10,000 కోట్ల ప్రోత్సాహం
ఎలక్ట్రిక్ వాహనాలకు మరో విడత కేంద్ర సర్కారు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)–3 పథకం కింద రూ.10,000 కోట్లను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి.ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు, ప్రభుత్వం కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సులకు ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఆరంభంలో రెండేళ్ల కాలానికి దీన్ని అమలు చేయనున్నట్టు తెలిసింది. ఫేమ్ –2 కింద 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ ఇవ్వగా.. ఫేమ్–3లో ఇంతకంటే అధిక సంఖ్యలో బస్సులకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు సమాచారం. ఫేమ్–2లో ఎలక్ట్రిక్ కార్లకు సైతం ప్రోత్సాహకాలు లభించగా.. ఫేమ్–3లో వీటి ప్రోత్సాహకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పథకం నుంచి కార్లను మినహాయించనున్నట్టు తెలుస్తోంది. ఫేమ్ –2 పథకం గడువు 2024 మార్చితో ముగిసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు విక్రయ ధరపై 15 శాతం సబ్సిడీ లభించడం గమనార్హం. ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్)ను తాత్కాలికంగా అమల్లోకి తీసుకొచ్చారు.ఇదీ చదవండి: అగ్రిటెక్ స్టార్టప్‌లకు బూస్ట్ఈఎంపీఎస్ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు ఈ ఏడాది జూలై వరకు ప్రోత్సాహకాల కింద రూ.500 కోట్లను కేంద్రం కేటాయించింది. ప్రతి ద్విచక్ర ఈవీపై రూ.10,000 చొప్పున సబ్సిడీ కేటాయించింది. కానీ ఫేమ్–2లో ఇది రూ.22,500గా ఉంది. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనంపై రూ.50,000 సబ్సిడీని ఈఎంపీఎస్ కింద ఇచ్చారు. ఫేమ్–2లో ఇది రూ.1,11,505గా ఉంది. కిలోవాట్ హవర్‌కు రూ.5,000 చొప్పున ద్విచక్ర, త్రి చక్ర వాహనాలకు సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. -
బడ్జెట్లో ‘ఫేమ్ 3’ ప్రకటన ఉండదు: కేంద్రమంత్రి
దేశీయంగా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన ఫేమ్ 3 పథకాన్ని 2024 బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం లేదని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. అయితే దీన్ని అమలు చేయడానికి ముమ్మరంగా సన్నాహాలు సాగుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ పథకం మూడో దశను అమలు చేస్తామని తెలిపారు.ఒక పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..‘ఈ బడ్జెట్లో ఫేమ్ 3 పథకాన్ని చేర్చే అవకాశం లేదు. దీని అమలుకు సంబంధించి సన్నాహక పనులు జరుగుతున్నాయి. ఈ పథకంతో సంబంధం ఉన్న మొత్తం ఏడు మంత్రిత్వ శాఖలు ప్రోగ్రామ్‌ను ఎలా రూపొందించాలో సిఫార్సు చేశాయి. మరికొన్ని నెలల్లో ఈ పథకాన్ని అమలు చేస్తాం’ అన్నారు.ఇదీ చదవండి: ఆటోమోటివ్ రంగంలో 4,000 మందికి శిక్షణ!కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 పథకాన్ని అధికారికంగా 2019 నుంచి మార్చి 31, 2024 వరకు అమలు చేసింది. ఫేమ్ 2 కింద మొత్తం రూ.11,500 కోట్ల సబ్సిడీని అందించింది. దాంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫేమ్ పథకం కోసం ప్రత్యేకంగా రూ.2,671.33 కోట్లు కేటాయించారు. ఈసారి బడ్జెట్లో ఫేమ్ 3కి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని ఆశించిన మార్కెట్ వర్గాలకు కేంద్రమంత్రి వ్యాఖ్యలతో కొంత నిరాశే మిగిలినట్లు తెలిసింది. ఏదేమైనా బడ్జెట్ ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ మొబిలిటీలో వేగంగా మార్పులు చేయడానికి ప్రభుత్వం ఏప్రిల్ 1, 2015లో ఫేమ్ పథకాన్ని ప్రారంభించింది. -
మరికొంతకాలం ‘ఈవీ’లకు ఊరట
సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ)ను కొనాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరుతో ఫేమ్–2 పథకం ముగుస్తున్న తరుణంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయించింది. మార్చి 31తో ఫేమ్–2 పూర్తవగానే ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం అమలులోకి వస్తుందని కేంద్ర పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం ఈ ఏడాది జూలై చివరి వరకూ అమలులో ఉండనుంది. దీని ప్రకారం కొత్తగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి టూ వీలర్లకు కిలోవాట్‌కు రూ. 10 వేలు చొప్పున గరిష్టంగా రూ. 25 వేలు, త్రీ వీలర్లకు రూ. 50 వేల వరకూ ప్రయోజనం చేకూరనుంది. విద్యుత్ వాహనాల కోసం కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్ఏఎంఈ) పథకాన్ని 2019లో తీసుకువచ్చింది. నిజానికి ఈవీలపై ప్రోత్సాహకాలను కేంద్రం తగ్గిస్తూ వస్తోంది. గతేడాది మే వరకూ 15 శాతం నుంచి 40 శాతం వరకూ సబ్సిడీ ఇచ్చేది. జూన్ తర్వాత వాహన ధరలో కేవలం 15 శాతం గానీ లేదా కిలోవాట్ హవర్ (కెడబ్ల్యూహెచ్)కు రూ. 10 వేలుగానీ ఏది తక్కువైతే అది మాత్రమే సబ్సిడీ ఇవ్వడం ప్రారంభించారు. రానున్న మూడేళ్లలో 1 మిలియన్ ఈవీ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోనున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని కూడా కేంద్రం తేల్చేసింది. ఆదర్శంగా ఏపీ ‘ఈవీ’ ప్రోత్సాహం మన రాష్ట్రం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధివిధానాలను రూపొందించింది. అవి దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాలకు ఏపీ అందిస్తున్న తోడ్పాటు భేష్ అని ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రౌండప్ 2023 నివేదిక కొనియాడింది. 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్ వెహికిల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకు తోడ్పాటునందిస్తున్న నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందని నివేదిక తెలిపింది. 2030 నాటికి మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాల్లో సగం విద్యుత్ వాహనాలే ఉండాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఏపీ చొరవను ఆదర్శంగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు సూచించాయి. ఈవీ ప్రమోషన్‌కు వివిధ విధానాల ద్వారా సహకరిస్తూ, ప్రోత్సాహకాలను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. కాగా ఏపీలో ప్రస్తుతం దాదాపు 65 వేల విద్యుత్ వాహనాలున్నాయి. భవిష్యత్తులో విద్యుత్ వాహనాల వినియోగం రాష్ట్రంలో భారీగా పెరగనుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అభిప్రాయపడింది. 2034 నాటికి దాదాపు 10.56 లక్షల వాహనాలు రాష్ట్ర రోడ్లపై తిరిగే అవకాశం ఉందని, వీటన్నిటి కోసం 677 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక (ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్)లో వెల్లడించింది. దీనికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో సుమారు 400 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలను కల్పిస్తోంది. లక్ష మంది ఉద్యోగులకు ఈవీలను వాయిదా పద్ధతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. -
ఫేమ్-2 పథకం పొడిగింపుపై కేంద్రం వ్యాఖ్యలు
దేశంలో విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్-2 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు నెలలు పొడిగించబోతోందంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం 2024 మార్చి 31తో ముగియనున్న సందర్భంగా మరో నాలుగు నెలల పాటు గడువును పొడిగిస్తారని, ఇందుకోసం అదనంగా రూ.500 కోట్లు కేటాయిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఈ పథకాన్ని పొడిగించే ప్రతిపాదనలేవీ లేవని తేల్చి చెప్పింది. ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమకు భారీ షాక్.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్’ కేంద్రం ఫేమ్ పేరిట ఇప్పటికే రెండు దఫాల్లో విద్యుత్తు వాహన కొనుగోళ్లకు రాయితీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్లు, ఫోర్ వీలర్లకు రాయితీ వర్తిస్తుంది. తొలుత ఫేమ్-2 కింద రూ.10వేల కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత దాన్ని రూ.11,500 కోట్లకు పెంచారు. నిధులు అందుబాటులో ఉండే వరకు ఈ పథకాన్ని పొడిగిస్తారనే వాదనలు వచ్చాయి. అయితే, సార్వత్రిక ఎన్నికల వేళ గడువు పొడిగిస్తారంటూ వార్తలు రాగా.. అవన్నీ అవాస్తవమని కేంద్రం చెప్పింది. -
Budget 2024: పెరుగుతున్న ఈవీ రంగం అంచనాలు - కొత్త స్కీమ్ వస్తుందా..
ఫేమ్ II సబ్సిడీ పథకం ముగియడంతో, ఫేమ్ III సబ్సిడీ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు మార్చి 2024 తర్వాత కూడా కొనసాగుతాయని చెబుతున్నారు. భారత ప్రభుత్వం ఫేమ్ II స్కీమ్ కింద రూ. 10,000 కోట్ల బడ్జెట్‌తో వాహనాలను ఎలక్ట్రిక్ విభాగంలో జోడించడానికి ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫేమ్ II గడువు ముగిసిన తర్వాత అమలు చేయడానికి సిద్దమవుతున్న ఫేమ్ III అంత విస్తృతంగా ఉండకపోవచ్చని, రానున్న బడ్జెట్లో ఈ స్కీమ్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం పరిశ్రమలకు సహాయం చేయాలి. అప్పుడే ఆశించిన రీతిలో ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఫేమ్ III ప్రోత్సాహకాలు ఎలా ఉంటాయనేది త్వరలోనే తెలుస్తుంది. FAME IIIని రాబోయే కేంద్ర బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రి సీతారామన్ నిస్సందేహంగా ప్రవేశపెడతారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఇప్పటికే ధృవీకరించారు. అయితే ఫేమ్ III కూడా ఫేమ్ II మార్గదర్శకాలనే కొనసాగించే అవకాశం ఉంది. 2021 సెప్టెంబర్ 15న PLI-ఆటో స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం ఐదేళ్లకు రూ. 25,938 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. ఆ తరువాత ఈ పథకం 2027-28 ముగిసే వసరకు పొడిగించారు. అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ (AAT) ఉత్పత్తి తయారీని పెంచడం, దాని కోసం లోతైన స్థానికీకరణను ప్రోత్సహించడం, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-అమర్చిన వాహనాల వంటి జీరో ఎమిషన్ వెహికల్స్ (ZEVలు) కోసం ప్రపంచ సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం ఈ పధకం ముఖ్య లక్ష్యం. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2024 మీద ఆటోమొబైల్ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేంద్రం ఈ ఆశలను నిజం చేస్తుందా? లేక షాకిస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ప్రోత్సాహాలు అవసరం, కాబట్టి రానున్న బడ్జెట్ సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. 2024-25 బడ్జెట్ కథనాల కోసం క్లిక్ చేయండి. -
సబ్సిడీ ఎత్తేస్తే అంతే.. సీఈవో ఆందోళన!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించుకోవడంపై ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమలో ఒకటీ రెండు సంవత్సరాల వృద్ధి స్తబ్దతకు దారితీయవచ్చని ఆయన అంటున్నారు. పరిశ్రమ మనుగడ కోసం రాయితీలపైనే పూర్తిగా ఆధారపడనప్పటికీ వచ్చే ఏప్రిల్‌లోనే సబ్సిడీని నిలిపివేస్తే కంపెనీలు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ దృష్టాంతం పరిశ్రమ వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో జాప్యానికి దారి తీస్తుంది. ఈ ఏడాది మార్చిలో ముగియనున్న ఫేమ్2(FAME-II) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే గత ఏడాది జూన్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని తగ్గించింది. ఉన్నట్టుండి సబ్సిడీని తగ్గించడం వల్ల కలిగిన ప్రతికూల ప్రభావాన్ని తరుణ్ మెహతా ఎత్తిచూపారు. దీనివల్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ 2023లో వృద్ధిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడంలో పేరుగాంచిన చండీగఢ్ ఫేమ్ స్కీమ్ లేకపోతే ప్రభావితం కావచ్చన్నారు. దేశం అంతటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడంలో ఫేమ్ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాలుష నియంత్రణ, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదం చేస్తోంది. అయితే బ్యాటరీ ఖర్చులు అధికంగా ఉండటం, విడి భాగాలపై సరఫరా పరిమితులు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. -
FAME-3: ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీ పూర్తిగా ఎత్తేస్తారా?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం బాగా పెరిగింది. కొత్తగా టూ వీలర్లు కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు అనేకం పుట్టుకొచ్చాయి. కానీ ఈ పరిస్థితి మారబోతోంది.. ఎందుకు.. ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని, వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ - FAME) పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది స్కీమ్ మొదటి విడత ఇప్పటికే పూర్తి కాగా రెండో విడత కూడా ప్రస్తుతం ముగింపు దశ వచ్చేసింది. దీని కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం మరికొన్ని వారాల్లో మొత్తానికే ఎత్తేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే స్కీమ్ మూడో విడత (ఫేమ్-3)ని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం లేనట్లు సమాచారం. ఇదీ చదవండి: ‘ఆ కార్లు భారత్‌లోకి ఎప్పటికీ రావు.. రానీయను’ ఆర్థిక శాఖ వ్యతిరేకత దేశంలోని ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఫేమ్-3 అమలును కేంద్ర ఆర్థిక శాఖ వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రభుత్వంలోని ఇతర శాఖలు సైతం దీనిపై అయిష్టతను కనబరుస్తున్నాయి. ఇప్పటికే సబ్సిడీలో కోత ఫేమ్-2 స్కీములో సబ్సిడీని ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో తగ్గించింది. దీంతో అప్పట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తగ్గింది, కానీ ఇప్పుడు స్థిరంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి వాహనదారులు సబ్సిడీ కోసం కాకుండా క్లీనర్ ఎనర్జీ వాహనాలపై ఆసక్తితో క్రమంగా అటువైపు మళ్లుతున్నారని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. దీంతోపాటు ఫేమ్-2 స్కీములో ఎలక్ట్రిక్ వాహన సంస్థలు అక్రమాలకు పాల్పడటం కూడా ఈ స్కీము ముగింపునకు కారణంగా భావిస్తున్నారు. -
ఫేమ్ ఉల్లంఘనలపై విచారణ
న్యూఢిల్లీ: ఫేమ్–2 స్కీము నిబంధనల ఉల్లంఘనలో అధికారులపరంగా తప్పిదాలు జరిగాయన్న ఆరోపణలపైనా కేంద్రం దృష్టి పెట్టింది. వాటితో పాటు వేలిడేషన్, టెస్టింగ్ ఏజెన్సీలైన ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) అధికారుల పాత్రపైనా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి నెల రోజుల వ్యవధిలో నివేదిక రావచ్చని శాఖ కార్యదర్శి కమ్రాన్ రిజ్వి తెలిపారు. ఆ తర్వాత ఉల్లంఘనలకు బాధ్యులైన వారితో పాటు సిస్టమ్స్‌ను కూడా సరిదిద్దే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. స్థానికంగా తయారీని, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చేలా కేంద్రం రూ. 10,000 కోట్లతో ఫేమ్–2 స్కీమును ప్రవేశపెట్టింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీలు పెద్ద స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నాయని, ఏడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ప్రోత్సాహకాలు పొందాయని ఆరోపణలొచ్చాయి. -
ఈ–టూవీలర్ కంపెనీలకు చెక్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్–2 స్కీమ్ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై చట్టపరమైన చర్యలకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, పథకం కింద పొందిన రూ. 469 కోట్ల పైచిలుకు సబ్సిడీ ప్రోత్సా హకాలను తిరిగి చెల్లించాలంటూ ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటో ఈ జాబితాలో ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీటిలో రివోల్ట్ మోటార్స్ మాత్రమే ప్రోత్సాహకాలను తిరిగి చెల్లించేందుకు ముందుకు వచి్చనట్లు వివరించారు. మిగతా సంస్థలు ఇంకా స్పందించలేదని పేర్కొన్నారు. రీఫండ్‌కు డెడ్‌లైన్ దాదాపు ముగిసిపోతోందని చెప్పారు. ‘వచ్చే వారం కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చట్టపరమైన చర్యలకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాం’ అని అధికారి వివరించారు. ఉల్లంఘనలు ఇలా.. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేసేలా రూ. 10,000 కోట్ల ప్రోత్సాహకాలతో కేంద్రం 2019లో ఫేమ్–2 పథకాన్ని ఆవిష్కరించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రకటించిన తొలి ఫేమ్ వెర్షన్‌కు కొనసాగింపు. ఫేమ్–2 పథకం నిబంధనల ప్రకారం .. దేశీయంగా తయారైన పరికరాలతో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అయితే, పలు కంపెనీలు వీటిని ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ స్కీముతో ప్రయోజనం పొందిన కంపెనీలపై భారీ పరిశ్రమల శాఖ విచారణ జరిపింది. వీటిలో ఏడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్న పరికరాలను ఉపయోగించినట్లుగా వెల్లడైంది. దీంతో గత ఆర్థిక సంవత్సరం సబ్సిడీలను విడుదల చేయడంలో కేంద్రం ఆలస్యం చేసింది. ఫలితంగా అటు సబ్సిడీ బకాయిలు చిక్కుబడిపోయి, ఇటు మార్కెట్ వాటా కోల్పోయి ఎలక్ట్రిక్ వాహన సంస్థలు దాదాపు రూ. 9,000 కోట్లు నష్టపోయినట్లు విద్యుత్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య ఎస్ఎంఈవీ అంచనా వేసింది. కొనుగోళ్లపై పొందిన రిబేట్లను తిరిగి చెల్లించేలా కస్టమర్లకు సూచించే అవకాశాలను పరిశీలించాలంటూ సబ్సిడీలపరమైన మద్దతు కోల్పోయిన ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి?
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ (Electric Two wheeler) కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారు ఆ వాహనాలపై తాము పొందిన డిస్కౌంట్‌ను ఆయా కంపెనీలకు వెనక్కి కట్టాల్సి రావచ్చు. ఫేమ్2 పథకం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తం రూ. 469 కోట్లు తిరిగి కట్టాలని భారీ పరిశ్రమల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా తమకు సబ్సిడీలు రద్దు చేసిన నేపథ్యంలో తాము కస్టమర్లకు ఇచ్చిన డిస్కౌంట్లను వారి నుంచి వెనక్కి కోరే అవకాశాన్ని పరిశీలించాలని ఆ ఏడు ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనను తెలియజేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సొసైటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖకు తాజాగా ఓ లేఖ రాసింది. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్ , ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక ప్రోత్సాహకాలను పొందినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జరిపిన విచారణలో వెల్లడైంది. దీంతో ఆయా కంపెనీలు పొందిన సబ్సిడీలను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంపోర్టెడ్ పార్ట్స్ వినియోగం ఫేమ్2 పథకం నిబంధనల ప్రకారం.. మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్లను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. కానీ ఈ ఏడు సంస్థలు విదేశాల దిగుమతి చేసుకున్న విడి భాగాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. చాలా ఈవీ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని పెంచడానికి ఉద్దేశించిన దశల తయారీ ప్రణాళిక (PMP) నిబంధనలను పాటించకుండా సబ్సిడీలను క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అనామక ఈ-మెయిల్లు అందడంతో మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడానికి 2019లో రూ. 10,000 కోట్లతో ఫేమ్2 ((ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రారంభించిన ఫేమ్ పథకానికి కొనసాగింపు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు!
ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీకి సంబంధించిన ఫేమ్ పథకం మూడో విడత (ఫేమ్ 3)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ సారి ఈ పథకాన్ని కింద ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం మొదటి విడతలో కేవలం ద్విచక్ర వాహనాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆయా వాహనాల ధరలపై అత్యధికంగా 40 శాతం సబ్సిడీ అందించేది. తర్వాత రెండో విడత (ఫేమ్ 2)లో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై సబ్సిడీని 15 శాతానికి తగ్గించింది. తాజా నివేదికల ప్రకారం.. మూడో విడతలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను చేర్చనుంది. ఇక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని తగ్గించి త్రిచక్రవాహనాలకు సబ్సిడీని పెంచే అవకాశం ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 3 పథకాన్ని ఇంకా రూపొందించనప్పటికీ ఇందుకోసం ఆయా పరిశ్రమల వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొత్త సబ్సిడీ విధానం వెల్లడైతే ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగుతుందా? -
‘ఫేమ్’ లేని ఈ–టూవీలర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు భారీ షాక్ తగిలింది. ఫేమ్–2 సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత విధించడంతో గత నెలలో ఈ–టూ వీలర్ల అమ్మకాలు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. 2023 జూన్‌లో దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్లవి కలిపి 45,734 యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఇది 56.58 శాతం తగ్గుదల. 2022 జూన్‌లో భారత్‌లో 44,381 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే క్రితం ఏడాదితో పోలిస్తే గత నెల విక్రయాల్లో 3 శాతం వృద్ధి నమోదైంది. 40 శాతం ఉన్న ఫేమ్ సబ్సిడీ కాస్తా 2023 జూన్ 1 నుంచి 15 శాతానికి వచ్చి చేరింది. ప్రభుత్వ నిర్ణయంతో తయారీ కంపెనీలు చాలామటుకు ద్విచక్ర వాహనాల ధరలను పెంచడం ప్రస్తుత పరిస్థితికి కారణం. కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు అనే విషయంలో మే నెల, జూన్ అమ్మకాలు నిదర్శనంగా నిలిచాయి. అత్యధికంగా మే నెలలో.. దేశంలో అత్యధికంగా 2023 మే నెలలో 1,05,338 యూనిట్ల ఎలక్ట్రిక్ టూ వీలర్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. భారత్‌లో తొలిసారిగా ఈ–టూవీలర్లు ఒక లక్ష యూనిట్ల మార్కును దాటాయి. జూన్ నుంచి ఫేమ్ సబ్సిడీ తగ్గుతుందన్న వార్తల నేపథ్యం మే నెల అమ్మకాల జోరుకు కారణమైంది. ఈ ఏడాది మార్చితో పోలిస్తే 22.53 శాతం తగ్గి ఏప్రిల్‌లో 66,466 యూనిట్లు నమోదయ్యాయి. దేశంలో తొలుత 2022 ఆగస్ట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 50,000 యూనిట్ల మార్కును చేరుకున్నాయి. ఆ నెలలో మొత్తం 52,225 యూనిట్లు భారత రోడ్లపై పరుగెత్తాయి. అదే ఏడాది పండుగల సీజన్ అయిన అక్టోబర్‌లో ఈ సంఖ్య 77,250 యూనిట్లకు చేరింది. భారత్‌లో 135 కంపెనీలు ఈ–టూ వీలర్ల రంగంలో పోటీపడుతున్నాయి. జూన్ మాసంలో టాప్–8 కంపెనీల వాటా ఏకంగా 86.66 శాతం ఉంది. వీటిలో ఏడు కంపెనీలు తిరోగమన వృద్ధి సాధించడం గమనార్హం. కంపెనీ మే జూన్ క్షీణత (శాతాల్లో) ఓలా 28,629 17,552 38.7 టీవీఎస్ 20,397 7,791 61.8 ఏథర్ 15,407 4,540 70.5 బజాజ్ 9,965 2,966 70.2 ఓకినావా 2,907 2,616 10 -
భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. ఏ బైక్ ఎంత ధర పెరిగిందంటే!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలకు రెక్కలొచ్చాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ, ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. సవరించిన ఫేమ్–2 సబ్సిడీ జూన్ 1 నుండి అమలులోకి రావడమే ఇందుకు కారణం. వేరియంట్‌ను బట్టి ఐక్యూబ్ ధరను రూ.17–22 వేల మధ్య పెంచినట్టు టీవీఎస్ మోటార్ కంపెనీ పేర్కొంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో గతంలో ఐక్యూబ్ బేస్ రూ.1,06,384, ఎస్ ట్రిమ్ ధర రూ.1,16,886 ఉంది. ఏథర్ 450ఎక్స్ ప్రో ధర సుమారు రూ.8,000 అధికం అయింది. దీంతో ఈ మోడల్ ప్రారంభ ధర బెంగళూరు ఎక్స్‌షోరూంలో రూ.1,65,435లకు చేరింది. ‘ఫేమ్–2 సవరణ ఫలితంగా సుమారు రూ.32,000 సబ్సిడీ తగ్గింది. అయినప్పటికీ దేశంలో ఈవీ స్వీకరణను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ధరల ప్రభావంలో భారీ భాగాన్ని కంపెనీ గ్రహిస్తోంది’ అని ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఎస్ ఫోకెలా తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ టూ–వీలర్లు రూ.15,000 వరకు ప్రియం అయ్యాయి. దీంతో ఎస్1–ప్రో రూ.1,39,999, ఎస్1 రూ.1,29,999, ఎస్1 ఎయిర్ ధర రూ.1,09,999 పలుకుతోంది. ప్రభుత్వ సబ్సిడీలలో గణనీయ తగ్గింపు ఉన్నప్పటికీ జూన్ నుండి ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచామని ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో భవీశ్ అగర్వాల్ చెప్పారు. ధర పెంచడం లేదు.. ఈ–స్కూటర్ మోడల్స్ ధరలను పెంచబోమని హీరో ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ టూ–వీలర్ల స్వీకరణను ప్రోత్సహించడానికి, వాటి యాజమాన్య ఖర్చుపై ఉన్న అపోహలను తొలగించడానికి అంకితభావంతో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ‘ఎలక్ట్రిక్ వాహన కంపెనీలకు రావాల్సిన సబ్సిడీలు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వద్ద 15 నెలలకు పైగా నిలిచిపోయాయి. మాపై తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ మేము చేయగలిగినంత వరకు మా ప్రస్తుత ధరలను కొనసాగుతాయి. తద్వారా వినియోగదారులకు సరసమైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో మా వంతు కృషిని కొనసాగిస్తాము’ అని హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ వివరించారు. లాయల్టీ బెనిఫిట్ ప్రోగ్రామ్.. ‘రాబోయే కొన్ని త్రైమాసికాలలో ఫేమ్–2 సబ్సిడీ క్రమంగా తగ్గుతుంది. దేశంలోని ద్విచక్ర వాహనాల్లో కాలుష్య రహిత టూ–వీలర్ల వ్యాప్తిని ప్రోత్సహించడానికి కంపెనీ మెరుగైన ఉత్పత్తులు, గొప్ప విలువను అందించడం కొనసాగిస్తుంది’ అని టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ అన్నారు. ఫేమ్–2 సబ్సిడీలో కోత తర్వాత ఖర్చు భారాన్ని తగ్గించడానికి పరిమిత కాలానికి 2023 మే 20 వరకు బుకింగ్స్ చేసిన ఐక్యూబ్ కస్టమర్ల కోసం కంపెనీ లాయల్టీ బెనిఫిట్ ప్రోగ్రామ్‌ను అందిస్తుందని వివరించారు. ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహకం కిలోవాట్‌కు రూ.10,000 ఉంటుందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ ప్రోత్సాహకాలపై పరిమితిని ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో ప్రస్తుతం ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగం పెంచేందుకు మూడేళ్ల కాల పరిమితితో ఫేమ్ పథకాన్ని 2019 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చారు. ఆ తర్వాత ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకు పొడిగించారు. -
ఈవీ బైక్ కొనుగోలు దారులకు భారీ షాక్.. జులై 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు?
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు కేంద్రం షాకిచ్చింది. ఎలక్ట్రిక్ బైక్‌ల వినియోగాన్ని ప్రోత్సహించేలా కొనుగోలు దారులకు అందించే సబ్సీడీని భారీగా తగ్గించనుంది. దీంతో ఈవీ బైక్స్ ధరలు ఆకాశాన్నంటనున్నాయి. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేలా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-2) స్కీంను ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా విద్యుత్ వాహనాల కొనుగోలుపై ఒక కేడబ్ల్యూహెచ్‌కు రూ.10వేల సబ్సిడీని రూ. 15 వేలకు పెంచి వేసింది. వాహనం ఖరీదులో 20 శాతమే అందించే సబ్సిడీని సైతం 40 శాతానికి పెంచింది. ఇప్పుడా 40 శాతం సబ్సీడీని 15 శాతానికి తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక తగ్గించిన సబ్సీడీ జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నాయి. 21 శాతం వృద్దితో జేఎంకే రిసెర్చ్ అనలటిక్స్ నివేదిక ప్రకారం.. గత ఏప్రిల్ నెలలో ఈవీ వాహనాల కొనుగోళ్లు పెరిగినట్లు వెల్లడించింది. 21 శాతం వృద్దితో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు 1,10,503 యూనిట్లు అమ్ముడు పోయాయి. అదే నెలలో దేశంలోని ఉత్తర్ ప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో మొత్తం కలుపుకొని 21,845 వెహికల్స్‌ను కొనుగోలు చేశారు. ఎక్కువ వెహికల్స్‌ను కొనుగోలు చేసిన జాబితాలో ఓలా ప్రథమ స్థానంలో ఉండగా, టీవీఎస్, ఎథేర్ మోటార్స్‌లు వరుస స్థానాల్లో ఉన్నాయి. 10వేల కోట్లు కేటాయింపు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్‌లు, ఆటోలు, కార్లు, బస్సుల వినియోగానికి తోడ్పడేలా ఫేమ్ పథకంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రోత్సహకాలు అందిస్తుంది. ఇందుకోసం రూ.10,000 కోట్లను కేటాయించింది. ఏప్రిల్ 1, 2019 నుంచి మూడేళ్లకాలానికి ఇది వర్తిస్తుందని తెలిపింది. చదవండి👉 అమ్మకానికి సుందర్ పిచాయ్ ఇల్లు.. కొనుగోలు చేసిన యాక్టర్.. ఎవరో తెలుసా? -
చార్జింగ్ స్టేషన్లకు రూ.800 కోట్లు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగంలోని మూడు చమురు కంపెనీలకు రూ.800 కోట్లు మంజూరు చేసినట్టు భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్–2 కింద ఈ మొత్తాన్ని సమకూరుస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా ఫిల్లింగ్ సెంటర్లలో 7,432 చార్జింగ్ కేంద్రాలను 2024 మార్చి నాటికి ఏర్పాటు చేస్తాయి. ఈ స్టేషన్స్‌లో ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న బస్‌లకు చార్జింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఈ మూడు కంపెనీలకు తొలి విడతగా రూ.560 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,586 చార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా జోడించనున్న కేంద్రాలతో ఎలక్ట్రిక్ వాహన రంగానికి మంచి బూస్ట్‌నిస్తుందని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. -
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ధర ఇంత తక్కువ..?
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరగడంతో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఈవీలను ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జింగ్ చేసుకుంటే ఎంత ధర చెల్లించాలో కూడా పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనలను ప్రతి కిడబ్ల్యుహెచ్‌కు రూ.12.06 + జిఎస్టీ చెల్లించి ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ కొత్త ధరలు వచ్చే ఏప్రిల్ నెల నుంచి వర్తించనున్నాయి. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలో వాట్‌కు రూ.15 వేల చొప్పున సబ్సిడీని ప్రభుత్వం అందించనుందని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో) పేర్కొంది. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ తేడా లేకుండా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని చెప్పారు. రూ.10 లక్షల విలువైన వాహనాల వరకూ సబ్సిడీ ఉంటుందన్నారు. ఫేమ్ 2 స్కీమ్ కింద హైదరాబాద్ అంతటా సుమారు 118పబ్లిక్ వేహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ పట్టణాలలో మరో 20 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ మొత్తం 138కి చేరుకోనుంది. ఇప్పటికే, నగరంలో కొన్ని ప్రదేశాలలో ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ వచ్చే మార్చి నాటికి సిద్ధం కానున్నాయి. టీఎస్ రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ జనయ్య మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనలను ప్రతి కిడబ్ల్యుహెచ్‌కు రూ.12.06 + జిఎస్టీ చెల్లించి ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఇది పెట్రోల్ & డీజిల్ కంటే చాలా చౌక అని పేర్కొన్నారు. "ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటాకు చెందిన 30.2 కిడబ్ల్యుహెచ్ బ్యాటరీ గల టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ కారును ఫుల్ చార్జ్ చేయడానికి రూ.360 అయితే, అదే పెట్రోల్, డీజిల్ కార్ల కోసం అయితే 3 లీటర్ల పెట్రోల్ కూడా రాదని" అని ఆయన అన్నారు. అదే ఇంటి వద్ద ఎలక్ట్రిక్ వాహనలను ఛార్జింగ్ చేసుకుంటే కిడబ్ల్యుహెచ్‌కు కేవలం రూ.6 మాత్రమే అవుతుంది అని అన్నారు. (చదవండి: కనిపించని కరెన్సీ గురించి తెలుసా..!) -
కేంద్రంపై ‘హీరో’ పంకజ్ ముంజాల్ ఘాటు విమర్శలు
ముంబై: దేశంలో ఎలక్ట్రిక్ బైసికిల్ వ్యాపారానికి ముప్పు ఉందని హెచ్ఎంసీ గ్రూప్ సీఎండీ పంకజ్ ఎం ముంజాల్ అన్నారు. తయారీ, ఎగుమతులను ప్రోత్సహించే ముఖ్యమైన పాలసీల నుంచి ఈ విభాగాన్ని విస్మరించడమే కారణమని ఆయన స్పష్టం చేశారు. ‘దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఉద్ధేశించిన ఫేమ్–2తోపాటు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాల పథకంలో ఈ–బైసికిల్స్ చేర్చలేదు. ఫలితంగా వచ్చే ఐదేళ్లలో యూరోపియన్ యూనియన్‌కు రూ.10,000 కోట్ల విలువైన ఎగుమతి అవకాశాలను భారత్ కోల్పోయే ప్రమాదం ఉంది. చైనా నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు 83 శాతం వరకు యాంటీ డంపింగ్ డ్యూటీని ఈయూ విధిస్తోంది. ఈ–బైక్స్ మార్కెట్ ఈయూలో రూ.43,000 కోట్లుంది. భారత్‌తో పోలిస్తే విలువ పరంగా 50 రెట్లు పెద్దది. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా భారత్ అవకాశంగా మలుచుకోవాలి. సైకిళ్లపై దిగుమతి సుంకాలను ప్రస్తుతం ఉన్న 14 శాతం నుంచి సున్నా స్థాయికి తీసుకు రావాలి’ అని అన్నారు. హీరో సైకిల్స్‌ను హెచ్ఎంసీ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. చదవండి : ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో చైనాకు పోటీగా భారత్ దూకుడు! -
ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి కేంద్రం తీపికబురు!
Fame 2 Scheme For Electric Vehicle: ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారికి కేంద్రం తీపికబురు చెప్పే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఫేమ్ 2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ బైకులు, కార్లు కొనేవారికి భారీ సబ్సిడీ లభిస్తుంది. అయితే, ఈ ఫేమ్ 2 స్కీమ్ గడువు తేదీని పొడగించాలని చూస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్‌కి మరింత ఊతం ఇచ్చే దిశగా గతంలో కేంద్రం ఎలక్ట్రికల్ వెహికల్ తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. దీని వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. (చదవండి: ఒక్కసారిగా పేలిన ఫోన్ ఛార్జర్...! స్పందించిన కంపెనీ...!) ఈవీ వెహికల్స్ తయారీకి సంబంధించి కిలోవాట్ పర్ అవర్ సామర్థ్యం కలిగిన బైక్ తయారీ ధరలో 20 శాతంగా ఉన్న సబ్సిడీని 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక కిలోవాట్ పర్ అవర్ సామర్థ్యం కలిగిన బైక్‌పై రూ.15,000 సబ్సిడీ లభిస్తోంది. ఇలా 2 kWh బైక్‌పై రూ. రూ.30,000 సబ్సిడీ 3 kWh బైక్‌పై రూ. 45,000 వరకు సబ్సిడీ లభిస్తోంది. లక్షన్నర ధర మించని బైకులకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. కంపెనీలకు ఇచ్చే సబ్సిడీ మార్చి 31, 2022 వరకు కొనసాగనుంది. అయితే, ఇప్పుడు ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీ గడువు తేదీని మార్చి 31, 2024 వరకు పొడగించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృవీకరించలేదు. ఇప్పటి వరకు ఈ పథకం కింద సుమారు 1,24,415 వాహన కొనుగోలుదారులు ప్రయోజనం పొందారు. ఇందులో 99,652 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాదారులు, 23,059 ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాదారులు, 1,693 ఎలక్ట్రిక్ నాలుగు చక్రాల వాహనాదారులు ఉన్నారు. రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ల పరంగా కర్ణాటక(25,725 ఈవీలు), తమిళనాడు (19,222 ఈవీలు), మహారాష్ట్ర (13,384 ఈవీలు), ఉత్తరప్రదేశ్(7,990 ఈవీలు), రాజస్థాన్ (10,010 ఈవీలు), ఢిల్లీ (8,897 ఈవీలు) ఈ పథకం కింద ఎక్కువగా ప్రయోజనం పొందాయి. -
Revolt RV400: రెండు గంటల్లో బుకింగ్స్ క్లోజ్.. స్పెషల్ ఏంటి?
రాహుల్ శర్మ నేతృత్వంలోని భారతీయ రివోల్ట్ మోటార్స్ సంస్థ 2019లో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బైక్ లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుంచి వీటి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. తాజాగా రెండు రోజుల క్రితం రివోల్ట్ ఆర్వీ400 బైక్ లను సేల్ తీసుకొచ్చిన రెండు గంటల్లోనే బుకింగ్ క్లోజ్ అయినట్లు ప్రకటించింది. రివోల్ట్ మోటార్స్ రెండు గంటల వ్యవధిలోనే రూ.50 కోట్లకు పైగా విలువైన మోటారు సైకిళ్లను విక్రయించింది. ఇప్పుడు బైక్ లను బుక్ చేసుకున్న కస్టమర్ లకు సెప్టెంబర్ 2021 నుంచి డెలివరీ చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. ఫేమ్ 2 కింద సబ్సిడీలు లభించడంతో ఆర్వీ 400 బైక్ ధరను రివోల్ట్ రూ.28,201 మేర తగ్గించింది. రూ.1,19,000 ధరకే బుకింగ్‌కు పెట్టింది. ఈ బైక్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగేందుకు ఇది ఒక కారణం. ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు చాలా తక్కువగా ఉన్న సమయంలో ఆర్వీ 400 వచ్చింది. వాస్తవానికి, మార్కెట్లో దీనికి పోటీగా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు ఇప్పటికీ లేవు. దీని బైక్ డిజైన్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు గతంలో కొన్న వారి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ లభించడంతో సేల్స్ పుంజుకున్నాయి. రివోల్ట్ మోటార్స్ బైక్ కొనేవారికి ఈఎమ్ఐ కూడా సులభంగా లభిస్తుంది. డౌన్ పేమెంట్, రిజర్వేషన్ ఫీజులు వంటివి లేవు. భవిష్యత్ లో డిమాండ్ అనుగుణంగా మరిన్ని ఉత్పత్తులను తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొంది. 72వీ 3.24 కిలోవాట్స్ లిథియన్ ఇయాన్ బ్యాటరీతో గల 3కిలోవాట్ మోటార్‌తో ఆర్వీ 400 మోడల్ వస్తోంది. ఈ మోడల్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఇకో, నార్మల్, స్పోర్ట్స్ లాంటి మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. చదవండి: అలర్ట్: దగ్గర పడుతున్న ఆధార్ పాన్ లింక్ గడువు -
ఈవీలపై సబ్సిడీతో పాటు ప్రోత్సాహకాలూ ఇవ్వాలి
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ కీలకమైన సూచనలు చేసింది. ఫేమ్-2 పథకం కింద ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై (ఈవీ) ఇస్తున్న సబ్సిడీకి అదనంగా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని సూచించింది. అంతేకాదు.. ప్రాధాన్యరంగ రుణ వితరణ విభాగంగా ఈవీలను గుర్తించడంతోపాటు.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీని ఇవ్వాలని కోరింది. వీటికి అదనంగా.. ఈవీల కోసం ప్రత్యేక లేన్లు.. వాణిజ్య సముదాయల వద్ద ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను కల్పించాలని కూడా సూచించడం గమనార్హం. ప్రస్తుతం వాహన విక్రయాల్లో పర్యావరణ అనుకూల ఈవీ, తక్కువ కార్బన్‌ను విడుదల చేసే వాహనాల వాటా 1 శాతంలోపే ఉంది. ఇతర సూచనలు.. గ్రీన్ జోన్లను పట్టణాల పరిధిలో ఏర్పాటు చేసి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే అనుమతించాలి. ఎలక్ట్రిక్ బస్సులనే రవాణాకు వినియోగించాలి. అదే సమయంలో సంప్రదాయ వాహనాలపై అధిక పన్నులు వేయాలి. ఈవీ చార్జింగ్ సదుపాయాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు దేశవ్యాప్త విధానం అవసరం. చార్జింగ్ స్టేషన్ల వద్ద కొంత స్థలంలో కేఫ్టేరియా, ఆహార కేంద్రాల ఏర్పాటు ద్వారా అదనపు అదాయానికి అనుమతించాలి. ఎలక్ట్రిక్ రవాణా విభాగానికి రుణాలను సమకూర్చే ఆర్థిక సంస్థలను ప్రోత్సహించాలి. 65 కిలోమీటర్లకు కేవలం ఐదు రూపాయలే ఖర్చు! -
హమ్మయ్యా! బ్యాటరీ బస్సు ఆశలు సజీవం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చేజారిన 324 ఎలక్ట్రిక్ బస్సులను తిరిగి సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ‘ఫాస్టర్ అడాప్సన్ అండ్ మాన్యుఫాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)’పథకం రెండో విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది రాష్ట్రానికి 324 బ్యాటరీ బస్సులను మంజూరు చేసింది. కానీ సరిగ్గా అదే సమయంలో ఆర్టీసీలో ఉధృతంగా సమ్మె జరుగుతుండటం, నాన్ ఏసీ బస్సులు తీసుకోవాలని నిర్ణయించగా, ఓ ఉన్నతాధికారి ఏసీ బస్సులే కావాలంటూ ఒత్తిడి ప్రారంభించటంతో ఆర్టీసీ చివరకు వాటిని వదులుకుంది. అయితే, ఇప్పటికీ ఆ కేటాయింపులు సజీవంగానే ఉన్నాయని తాజాగా ఢిల్లీ నుంచి సమాచారం రావటంతో వాటిని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఓ ఉన్నతాధికారి నిర్వాకంతో ఫేమ్ పథకం మొదటి విడతలో 40 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు రాగా, అవి తెల్ల ఏనుగుల్లా మారిపోయాయి. ప్రస్తుతం విమానాశ్రయం– హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల మధ్య తిప్పుతున్నారు. వీటి నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటం, పూర్తిలోఫ్లోర్ డిజైన్‌తో ఉండటం వల్ల దూర ప్రాంతాలకు నడపలేకపోవటం... వెరసి ఆర్టీసీకి అవి గుది బండగానే మారాయి. దీంతో గతేడాది ఫేమ్ –2 పథకం కింద 324 బస్సులు మంజూరైనప్పుడు అన్నీ నాన్ ఏసీ బస్సులే తీసుకోవాలని నిర్ణయించారు. ఆ మేరకే ప్రతిపాదన సిద్ధం చేసి ఢిల్లీకి పంపారు. కానీ తీరా వాటిని తీసుకునేవేళ, ఓ ఉన్నతాధికారి జోక్యం చేసుకుని ఏసీ బస్సులే తీసుకోవాలని పట్టుబట్టారు. తెలిసీ నష్టాలు తెచ్చుకోవడం ఎందుకని ఇతర అధికారులు వాదించారు. సరిగ్గా అదే సమయంలో ఆర్టీసీలో సమ్మె జరుగుతుండటం, ఫేమ్ పథకం కింద తీసుకునే బస్సులు ప్రైవేటు సంస్థ ద్వారా అద్దె ప్రాతిపదికన తీసుకోవాల్సి రావటం సమస్యగా మారింది. అద్దె బస్సుల సంఖ్య పెరగటం వల్ల ఆర్టీసీ ప్రైవేటు పరమవుతుందని, అద్దె బస్సులు తీసుకోవద్దని కార్మికులు డిమాండ్ చేశారు. ఎలాగూ ఏసీ బస్సులు తీసుకోవద్దన్న నిర్ణయంతో ఉన్న ఆర్టీసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు దీన్ని సాకుగా చూపి ఆ బస్సులకు టెండర్లు పిలవలేదు. గడువులోపు టెండర్లు పిలవనందున ఫేమ్ పథకం కేటాయింపులు కూడా రద్దయ్యాయి. మరోవైపు ఇప్పుడు ఆర్టీసీకి అత్యవసరంగా 1,300కు పైగా బస్సులు కావాల్సి ఉంది. ఇదే సమయంలో ఫేమ్–2 కేటాయింపులు పూర్తిగా రద్దు కాలేదని, దానికి సంబంధించిన ఫైలు కేంద్ర ఉపరితల రవాణాశాఖలో సర్క్యులేషన్లోనే ఉందన్న విషయం తెలిసింది. దీంతో ఆ కేటాయింపులను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరాలని ఆర్టీసీ నిర్ణయించింది. బ్యాటరీ బస్సులు కొన్ని సమకూరితే నిర్వహణ వ్యయం కూడా తగ్గి కలిసి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. పాత మంజూరీని కేంద్రం పునరుద్ధరిస్తే నాన్ ఏసీ బస్సులే తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. -
రోడ్డెక్కనున్న 5,595 ఎలక్ట్రిక్ బస్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా మరో 5,595 ఎలక్ట్రిక్ బస్‌లు రోడ్డెక్కనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఈ మేరకు ఫేమ్ ఇండియా స్కీం ఫేజ్–2 కింద ఆమోదం తెలిపింది. 64 నగరాల్లో ఇవి కొద్ది రోజుల్లో పరుగెత్తనున్నాయి. 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు, స్మార్ట్ సిటీస్, రాజధాని నగరాలు, స్పెషల్ కేటగిరీ స్టేట్స్‌లోని నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆసక్తి వ్యక్తీకరణను డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కోరింది. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 14,988 ఎలక్ట్రిక్ బస్‌ల కోసం 86 ప్రతిపాదనలు చేశాయి. వీటిని పరిశీలించిన ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, సాంక్షనింగ్ కమిటీ చేసిన సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం 5,595 బస్‌లను మంజూరు చేసింది. ఇందులో 5,095 బస్‌లు నగరాల్లో (ఇంట్రాసిటీ) నడిపేందుకు నిర్దేశించారు. నగరాల మధ్య (ఇంటర్సిటీ) కార్యకలాపాలు సాగించేందుకు మరో 400 బస్‌లు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం 100 బస్‌లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు కేటాయించారు. కాంట్రాక్టు కాలంలో అన్ని బస్‌లు 400 కోట్ల కిలోమీటర్లు తిరగనున్నాయి. 120 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. ఫేజ్–2 కింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మొత్తం 350 ఎలక్ట్రిక్ బస్‌లను చేజిక్కించుకుంది. ఇందులో విశాఖపట్నం 100, విజయవాడ 50, అమరావతి 50, తిరుపతి 50, కాకినాడ 50 బస్‌లను దక్కించుకున్నాయి. అలాగే నగరాల మధ్య ప్రజా రవాణాకు 50 బస్‌లను కేటాయించారు. తెలంగాణలో హైదరాబాద్‌కు 300, వరంగల్‌కు 25 బస్‌లు అలాట్ అయ్యాయి. కాగా, ఫేజ్–2లో నాలుగు రాష్ట్రాల్లో లోయెస్ట్ బిడ్డర్‌గా హైదరాబాద్ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నిలిచినట్టు మార్కెట్ వర్గాల సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా సంస్థల టెండర్లలో ఈ కంపెనీ పోటీలో ముందున్నట్టు తెలుస్తోంది. 9, 12 మీటర్ల పొడవున్న బస్‌లను ఒలెక్ట్రా తయారు చేస్తోంది. ఇప్పటికే దేశంలో పలు నగరాల్లో 400కుపైగా ఒలెక్ట్రా ఈ–బస్‌లు విజయ వంతంగా పరుగెడుతున్నాయి. బ్యాటరీ మినహా బ స్కు కావాల్సిన విడిభాగాలన్నీ దేశీయంగా తయా రు చేస్తోంది. జడ్చర్ల వద్ద సంస్థకు ప్లాంటు ఉంది.