FIPB
-
సీబీఐ కస్టడీకి..చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి నాలుగు రోజుల (ఆగస్టు 26 వరకు) సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో.. గురువారం మధ్యాహ్నమే చిదంబరాన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ.. అది సాయంత్రం వరకు పొడిగించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనంతరం గంటన్నరసేపు న్యాయమూర్తి అజయ్ కుమార్ చౌహాన్ ఇరువర్గాల వాదనలు విన్నారు. పదే పదే అవే ప్రశ్నలతో విసిగిస్తున్నారని చిదంబరం తరపు న్యాయవాదులు కపిల్ సిబల్, సింఘ్వీలు పేర్కొనగా.. కీలకమైన ప్రశ్నలకు ఆయన ఉద్దేశపూర్వకంగానే సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ వాదించారు. వాదనల తర్వాత.. లోతైన దర్యాప్తు కోసం చిదంబరాన్ని నాలుగురోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అంతకుముందు చిదంబరాన్ని సీబీఐ అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు. న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య బుధవారం అరెస్టైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంకు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆయనను ఆగస్ట్ 26 వరకు(నాలుగు రోజులు) సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. ‘చిదంబరంపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. లోతైన దర్యాప్తు అవసరం. సంబంధిత పత్రాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అందువల్ల కస్టడీలో ఉంచి విచారణ జరపడం తప్పనిసరని విశ్వసిస్తున్నాం’ అని ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ స్పష్టం చేశారు. చిదంబరంను కొత్తగా అడిగేందుకు సీబీఐ వద్ద ప్రశ్నలేవీ లేవని, బుధవారం ఉదయం గతంలో విచారణ సందర్భంగా వేసిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని, అందువల్ల కస్టడీ అవసరం లేదని చిదంబరం తరఫు న్యాయవాదులు చేసిన వాదనను ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. సీబీఐ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతీరోజు అరగంట పాటు చిదంబరంను ఆయన కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలుసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. కాగా, చిదంబరం అరెస్ట్‌పై రాజకీయం మరింత వేడెక్కింది. ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప మరేం కాదని, ఈ కేసులో చార్జిషీటు వేసేందుకు అవసరమైన ఆధారాలు సీబీఐ వద్ద లేవని కాంగ్రెస్ ఆరోపించింది. చట్టం తనపని తాను చేసుకుపోతోందని బీజేపీ పేర్కొంది. జవాబులను దాటవేస్తున్నారు.. ముందస్తు బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన, అరెస్ట్ నుంచి తక్షణ ఊరట కల్పించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. హైడ్రామా అనంతరం బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితుల నడుమ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సీబీఐ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సీబీఐ గెస్ట్‌హౌజ్‌లో ఆ రాత్రి ఉంచారు. గురువారం ఉదయం నుంచి నాలుగు గంటలపాటు పలు దఫాలుగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే, చాలా ప్రశ్నలను చిదంబరం దాటవేశారని, కొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా జవాబిచ్చారని సీబీఐ వర్గాలు తెలిపాయి. చిదంబరం ఖండించిన కొన్ని అంశాలకు సంబంధించిన ఆధారాలను అధికారులు ఆయనకు చూపడంతో.. ఆయన మౌనం దాల్చారని వెల్లడించాయి. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పటిష్ట భద్రత మధ్య చిదంబరంను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తి, చిదంబరం తరఫు న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ తదితరులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. కోర్టులో దాదాపు గంటన్నరకు పైగా వాడి వేడి వాదనలు కొనసాగాయి. చిదంబరం కస్టడీ అవసరం లేదని, ఆయన బెయిల్‌కు అర్హుడని సిబల్, సింఘ్వీ వాదించగా.. కేసుకు సంబంధించిన మరింత లోతైన కుట్ర మూలాలను వెలికి తీసేందుకు, చిదంబరం దగ్గరున్న రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు కనీసం 5 రోజుల కస్టడీ అవసరమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ వాదనలను తిప్పికొట్టారు. అనంతరం తీర్పు రిజర్వ్‌లో ఉంచిన న్యాయమూర్తి.. సాయంత్రం 7 గంటల సమయంలో చిదంబరంను 4 రోజులు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం చిదంబరంను మళ్లీ సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. వాదనలు ఇలా.. సిబల్, సింఘ్వీ (చిదంబరం తరఫున) ► ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన ఇతర నిందితులందరూ.. చిదంబరం కొడుకు కార్తి సహా బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్టైన వ్యక్తి కార్తికి చార్టర్డ్ అకౌంటెంట్ అయిన భాస్కర్ రామన్. ఆయన బెయిల్‌పై ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ వేరే కేసులో జైలులో ఉన్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి వారు బెయిల్‌పై ఉన్నట్లే భావించాలి. ► విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ)కి అనుమతులు ఇచ్చింది సీనియర్ అధికారులు. వారెవ్వరినీ అరెస్ట్ చేయలేదు. ► బెయిల్ మంజూరు అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమే. ► చిదంబరం విదేశాలకు పారిపోయే వ్యక్తి కాదు. ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని సీబీఐ కూడా చెప్పడం లేదు. ► ఈ కేసు అంతా అప్రూవర్ గా మారిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన విషయాలపైనే ఆధారపడి ఉంది. ► తాను ఏం వినాలనుకుంటోందో.. అదే చిదంబరం చెప్పాలని సీబీఐ కోరుతోంది. అది సాధ్యం కాదు. ► జవాబులు దాటవేస్తున్నారనే కారణం చూపి కస్టడీ కోరడం సరికాదు. ► కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే కస్టడీ లోకి తీసుకోవాలి. ఈ కేసులో అలా అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన అంశాలేవీ లేవు. ► చిదంబరంను గతంలో విచారణ సందర్భంగా అడిగిన పాత ప్రశ్నలనే బుధవారం కూడా మళ్లీమళ్లీ అడిగారు. ► సీబీఐ చెప్పేవన్నీ వాస్తవాలే అని అనుకోకూడదు. ► ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నట్లయితే తమకు అందజేయాలని కోరుతూ చిదంబరంకు సీబీఐ లేఖ రాస్తే సరిపోయేది. సొలిసిటర్ జనరల్ తుషార్ (సీబీఐ తరఫున) ► చిదంబరం సరిగ్గా సమాధానాలివ్వలేదు. కొన్నింటికి డొంకతిరుగుడు సమాధానాలిచ్చారు. విచారణలో సీబీఐకి సహకరించలేదు కనుక కస్టడీ అవసరం. ► చిదంబరంతో సీబీఐ నేరాన్ని ఒప్పించడం లేదు.. కేసు మూలాలను తెలుసుకోవాలని మాత్రమే ప్రయత్నిస్తోంది. ► ఈ కుంభకోణంలో ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రలో చిదంబరం భాగస్వామి. ► ఇది చాలా సీరియస్ కేసు. ఇందులో తెలివైన వాళ్లు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేసు మూలాల్లోకి వెళ్లలేకపోతే మాకు వైఫల్యమే ఎదురవుతుంది. ► గతంలో కార్తిని కూడా కస్టడీలోకి తీసుకునే విచారణ జరిపాం. ► చిదంబరం చాలా తెలివైనవాడు. ఈ కేసు విచారణలో సహకరించకుండా ఉండేందుకు ఆయనకు చాలా మార్గాలున్నాయి. ► ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ ఓపెన్ కోర్టులో బహిరంగంగా వెల్లడించలేం. ► చట్టం ముందు అంతా సమానమే. ► చిదంబరం తరఫున సమర్థులైన న్యాయవాదులున్నారు. కాబట్టి ఆయన సొంతంగా వాదించుకోవాల్సిన అవసరం లేదు. ► చిదంబరం ముందస్తు బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. నగదు అక్రమ చలామణికి సంబంధించి ఈ కేసు గొప్ప ఉదాహరణ అని స్పష్టమవుతోంది అని ఢిల్లీ హైకోర్టు అభివర్ణించింది. చిదంబరం ప్రధాన నిందితుడనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయంది. ► ఈ కేసులో చోటు చేసుకున్న క్విడ్ ప్రోకొ విషయాలు, కుట్ర అంశాలు తేలాల్సి ఉంది. ఆధారాలను చిదంబరం ముందు ఉంచి ప్రశ్నించాల్సి ఉంది. అందువల్ల ఆయన కస్టడీ చాలా అవసరం. 4 గంటలు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గురువారం ఉదయం దాదాపు 4 గంటల పాటు చిదంబరంను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతులు, ఐఎన్ఎక్స్ మీడియా ప్రమోటర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలతో పరిచయం, వారితో జరిపిన సమావేశాలు, కార్తికి చెందిన చెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ సంస్థ.. తదితర విషయాలపై డెప్యూటీ ఎస్పీ ఆర్ పార్థసారథి నేతృత్వంలోని అధికారుల బృందం ఆయనను లోతుగా ప్రశ్నించింది. అయితే, వారి ప్రశ్నలకు చిదంబరం సూటిగా జవాబివ్వలేదని, చాలా ప్రశ్నలకు అసలు సమాధానమే ఇవ్వలేదని, కొన్ని ప్రశ్నలను దాటవేశారని, మరికొన్ని ప్రశ్నలకు డొంకతిరుగుడుగా జవాబిచ్చారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదే కేసుకు సంబంధించి చిదంబరంను గత సంవత్సరం కూడా ఒకసారి ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడి గెస్ట్‌హౌజ్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న సూట్ నంబర్ 5ను ఆయనకు కేటాయించారు. గురువారం ఉదయం అల్పాహారం అనంతరం 10.20 గంటల సమయంలో ఇంటరాగేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భవనంలోకి మీడియాను కూడా పరిమితంగానే అనుమతించారు. వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు కోర్టు ముందు భారీ బందోబస్తు కోర్టు విచారణ తర్వాత చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తున్న అధికారులు చిదంబరంను కోర్టుకు తీసుకొస్తున్న కారు ట్రాఫిక్‌లో చిక్కుకున్న దృశ్యం -
చిదంబరం కస్టడీ అవసరమే
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోందనీ, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి అవినీతి, నగదు అక్రమ చలామణి కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో చిదంబరంను అరెస్టు చేసేందుకు సీబీఐ, ఈడీలకు మార్గం సుగమమైంది. మంగళవారం రాత్రే సీబీఐ, ఈడీ అధికారుల బృందాలు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకోగా, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని సమాచారం. 3రోజుల్లో తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నాననీ, అంతవరకు తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలని చిదంబరం కోరినా హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో ముందస్తు బెయిలు కోసం సుప్రీంకోర్టులో బుధవారమే అత్యవసర విచారణ కోరాలని చిదంబరం లాయర్లు నిర్ణయించారు. విచారణను నీరుగార్చలేం.. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ చిదంబరం ఢిల్లీ హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు. గురువారం పదవీ విరమణ పొందనున్న న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ చిదంబరం అభ్యర్థనను తోసిపుచ్చారు. చిదంబరమే ప్రధాన నిందితుడనీ ప్రాథమికంగా తెలుస్తున్నందున, న్యాయపరమైన అడ్డంకులను సృష్టించి దర్యాప్తు సంస్థలను విచారణను నీరుగార్చలేమని ఆయన అన్నారు. హైకోర్టులో ఎలాంటి ఉపశమనమూ లభించకపోవడంతో చిదంబరం ఆ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఆయనకు తక్షణ ఉపశమనమేదీ లభించనప్పటికీ, ఆయన పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. చిదంబరం ఇంటికి సీబీఐ, ఈడీ చిదంబరానికి ముందస్తు బెయిలును నిరాకరిస్తూ సాయంత్రం 3.40 గంటల సమయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడంతో రాత్రికే సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి చేరుకున్నారు. మొదట సీబీఐ, ఆ తర్వాత కొద్దిసేపటికే ఈడీ అధికారులు వెళ్లారు. అయితే అధికారులు ఎవ్వరూ మీడియాతో మాట్లాడలేదు. చిదంబరం ఇంటికి రావడం వెనుక ఉన్న ఉద్దేశమేంటని ప్రశ్నించినా వారు నోరు మెదపలేదు. అధికారులు వెళ్లిన సమయంలో చిదంబరం ఇంట్లో లేరని సమాచారం. ‘ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ప్రధాన నిందితుడని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని మేం భావిస్తున్నాం. చిదంబరం పార్లమెంటు సభ్యుడు అయినంత మాత్రాన ఆయనకు ముందస్తు బెయిలు ఇవ్వలేం. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చిదంబరంపై ఈ కేసులు పెట్టారని ఇప్పుడే చెప్పడం అర్థం లేని పని.’ – ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సునీల్ గౌర్ ‘మరో రెండ్రోజుల్లో పదవీ విరమణ పొందనున్న న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ హడావుడిగా సాయంత్రం 3.40 గంటలకు ఈ తీర్పు చెప్పారు. ఈ తీర్పును ఈ ఏడాది జనవరిలోనే రిజర్వ్‌లో ఉంచారు. మరో మూడు రోజులు ఆగి తీర్పును వెలువరించాలని కోరాం. అయినా జస్టిస్ గౌర్ మా విజ్ఞప్తిని పట్టించుకోకుండా మంగళవారమే తీర్పు ఇచ్చారు.’ – కపిల్ సిబల్, చిదంబరం తరఫు న్యాయవాది ఐఎన్ఎక్స్ కేసు ఇదీ.. 2007– ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు అందుకోవడానికి ఆమోదం తెలిపిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ). ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం. ఎఫ్ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు. ► 2017 మే 15: ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ. ► 2018 : ఐఎన్ఎక్స్ మీడియాపై మనీలాండరింగ్ కేసు పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ► 2018 మే 30 : సీబీఐ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన చిదంబరం. ► 2018 జూలై 23:ఈడీ కేసులోనూ ముందస్తు బెయిలు ఇవ్వాలని మరోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన చిదంబరం. ► 2018 జూలై 25 : ఈ రెండు కేసుల్లోనూ అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ తొలిసారి ఉత్తర్వులిచ్చిన ఢిల్లీ హైకోర్టు. ఆ తర్వాత పలుమార్లు ఆ గడువు పొడిగింపు. ► 2019 జనవరి 25: ముందస్తు బెయిలుపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఢిల్లీ హైకోర్టు. ► 2019 ఆగస్టు 20 : తీర్పు చెబుతూ, చిదంబరం బెయిలు అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. -
కార్తీ కేసు సందడి!
ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతులు ఇప్పించడం కోసం లంచం తీసుకున్నారన్న ఆరోపణపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని బుధ వారం సీబీఐ అరెస్టు చేసింది. కార్తీని 5 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ గురువారం ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. అధికారంలో ఉండగా రాజ కీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునేందుకు సీబీఐని ఉపయోగించుకున్నదని ఆరో పణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు ఈ కేసు విషయంలో అదే ఆరోపణ చేస్తున్నది. దానిలోని నిజానిజాల సంగతలా ఉంచి బ్రిటన్ నుంచి వచ్చిన కార్తీని చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేసినప్పుడు చోటుచేసుకున్న హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. ఆ హడావుడి చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టి పరారైన నీరవ్‌మోదీ తరహాలో వేరే దేశానికి కార్తీ పరారవుతున్నాడేమో, దాన్ని నివారించడానికి సీబీఐ వలపన్ని అరెస్టు చేయాలని చూస్తున్నదేమోనన్న అ నుమానం కలుగుతుంది. కానీ ఆయన మరో దేశం నుంచి ఇక్కడ అడుగుపెట్టాడు. ఈ కేసులో నిరుడు మే నెలలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారం యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2007 నాటిది. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా ఆ సంవత్సరం మార్చి 13న ఎఫ్ఐపీబీని ఆశ్రయించగా, రూ. 4.62 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) తెచ్చుకునేందుకు ఆ ఏడాది మే 30న దానికి అనుమతి లభించింది. అయితే అదే సమయంలో తమ అనుబంధ సంస్థ ఐఎన్ఎక్స్ న్యూస్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలన్న ఆ సంస్థ వినతిని మాత్రం తిరస్కరించింది. అందుకు వేరే దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఐఎన్ఎక్స్ మీడియా ఎఫ్ఐపీబీ తనకు విధించిన పరిమితుల్ని ఉల్లంఘించి రూ. 4.62 కోట్లకు బదులు రూ. 305 కోట్ల ఎఫ్‌డీఐలను తీసుకు రావడమేగాక అందులో 26 శాతాన్ని ఐఎన్ఎక్స్ న్యూస్‌కు మళ్లించింది. ఈ వ్యవహారంపై ఎఫ్ఐపీబీ ఐఎన్ఎక్స్ మీడియా నుంచి వివరణ కోరినప్పుడు కార్తీ చిదంబరం జోక్యం చేసుకుని ఆ మండలిలోని కొందరిని ప్రభావితం చేశారన్నది సీబీఐ ఆరోపణ. ఇలా ప్రభావితం చేసినందుకు ఆయన పరోక్షంగా నియంత్రిస్తున్న అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఐఎన్ఎక్స్ మీడియా నుంచి రూ. 10 లక్షలు ముట్టాయని సీబీఐ చెబుతోంది. ఆదాయపు పన్ను విభాగం దర్యాప్తు నుంచి తప్పించేందుకు కార్తీకి మరో మూడున్నర కోట్ల రూపాయలు, భారీయెత్తున షేర్లు అందాయన్నది మరో ఆరోపణ. ఇందుకు సంబంధించిన అనేక ఆధారాలు కార్తీ సీఏ భాస్కరరామన్ కంప్యూటర్లో లభించాయని సీబీఐ అంటోంది. కుమార్తె షీనాబోరాను హత్య చేసిన కేసులో విచారణనెదుర్కొంటున్న దంపతులు ఇంద్రాణీ ముఖర్జీ, పీటర్ ముఖర్జీలిద్దరూ కలిసి స్థాపించిన సంస్థ ఐఎన్ఎక్స్ మీడియా. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లు రెండూ ఇప్పటికే ఈ కేసులో కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసి సోదాలు నిర్వహించాయి. ఆయనను ఈడీ అనేకసార్లు ప్రశ్నించింది. చివరకు విదేశాలకు వెళ్లే వీలు లేకుండా లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది. నేరుగా కార్తీ సంస్థకు అందిన రూ. 10 లక్షలు కాక ఇతర ముడుపులు విదేశాల్లో ఆయన పేరనున్న ఖాతాల్లోకి చేరాయని ఈడీ ఆ రోపించింది. తన కుమార్తెను ఉన్నత చదువుల్లో చేర్చేందుకు బ్రిటన్ వెళ్లడానికి అవ రోధంగా ఉన్న లుకౌట్ నోటీసుకు వ్యతిరేకంగా కార్తీ గత నవంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అలా వెళ్లనిస్తే విదేశీ ఖాతాలన్నిటినీ ఆయన మాయం చేసే ప్రమాదమున్నదని సీబీఐ వాదించింది. చివరకు న్యాయస్థానం అనుమతితో కార్తీ వెళ్లి వచ్చారు. ఆయన వెళ్లాక బయటపడిన మరిన్ని ఆధారాలతోనే ప్రస్తుతం కార్తీని అరెస్టు చేయాల్సివచ్చిందని సీబీఐ చెబుతోంది. ఈ కేసు పరిధిని మరింత విస్తృతపరిచి చిదంబరాన్ని అరెస్టు చేస్తారా అన్నది కీలకమైన ప్రశ్న. కేంద్ర ఆర్థికమంత్రి హోదాలో ఎఫ్ఐపీబీకి చిదంబరం ఇన్చార్జి. తాము కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో చిదంబరాన్ని కలిసినప్పుడు కార్తీ వ్యాపారానికి సహకరించమని ఆయన తమను కోరారని పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. ఈ కేసు మాత్రమే కాదు...చిదంబరంపై భారత్‌కు చెందిన ఎయిర్‌సెల్‌ను 2006లో మలేసియా సంస్థ మాక్సిస్ టేకోవర్ చేయడానికి ఎఫ్ఐపీబీ అనుమతి మంజూరు చేసిన వ్యవహారం కూడా ఉంది. ఆ సమయంలో టెలికమ్యూనికేషన్ల రంగంలో గరిష్టంగా 74శాతం ఎఫ్‌డీఐలకు మాత్రమే అనుమతి ఉండగా మాక్సిస్ 99.3శాతం వరకూ పెట్టింది. పైగా నిబంధనల ప్రకారం ఎఫ్ఐపీబీ సిఫార్సులు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం(సీసీఈఏ)కు వెళ్లి అక్కడ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఆ ఫైలు అటు పోకుండానే చిదంబరం అనుమతులు మంజూరు చేశారన్నది ఆరోపణ. ఐఎన్ఎక్స్ మీడియాలోగానీ, ఎయిర్ సెల్–మాక్సిస్ వ్యవహారంలోగానీ పరిమితులకు మించి ఎఫ్‌డీఐలకు అనుమ తిం చడం అనుమానాలకు తావిస్తున్నదని బీజేపీ నాయకుడు సుబ్ర హ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఎయిర్‌సెల్ కేసును ‘అన్ని కోణాల్లోనూ’ దర్యాప్తు చేస్తున్నట్టు నిరుడు ఏప్రిల్‌లో సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే నిరుడు డిసెంబర్లో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి రాజాతోసహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేకకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుకు తెచ్చుకోవాలి. నిందితుల అపరాధాన్ని రుజువు చేయడానికి తగిన సాక్ష్యాలను సేకరించడంలో, నిరూపించడంలో సీబీఐ ఘోరంగా విఫలమైం దని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కార్తీ కేసులో లభించాయంటున్న ఆధారాలు న్యాయస్థానాల్లో నిలబడేవిధంగా సీబీఐ దర్యాప్తు చేస్తుందా అన్నదే కీలకమైన ప్రశ్న. కార్తీ అరెస్టుకు చేసిన హడావుడి వల్ల కాంగ్రెస్‌కు రాజకీయంగా ఎంత నష్టం కలుగు తుందోగానీ...సరిగా నిరూపించలేకపోతే అప్రదిష్టపాలయ్యేది సీబీఐ మాత్రమే. -
‘అది తమిళనాడు నుంచే లీకైంది’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపీబీ)లో భాగమైన ఆరుగురు కార్యదర్శులను తమ కుటుంబంలోని సభ్యులు ప్రభావితం చేశారనడం ‘అర్థరహితం’అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం పేర్కొన్నారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఎఫ్ఐపీబీలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సోమవారం మీడియాతో మాట్లాడిన చిదంబరం ఈ ఆరోపణలను కొట్టివేశారు. కొందరు పనిలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తమ కుటుంబంలోని ఎవరూ ఎఫ్ఐపీబీని ప్రభావితం చేసే అవకాశమే లేదని, ఆరుగురితో కూడిన బోర్డు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఏ ఒక్క అధికారీ సొంతంగా నిర్ణయం తీసుకోలేరన్నారు. ఎఫ్ఐపీబీ సిఫార్సు చేసిన వాటికి మాత్రమే తాను అనుమతి ఇచ్చానని, తన హయాంలో బోర్డులో పనిచేసిన కార్యదర్శులంతా ఎంతో అనుభవం ఉన్న సీనియర్ ఐఏఎస్‌లని.. ఒక్కరు మాత్రం ఐఎఫ్ఎస్ అధికారని వివరించారు. ‘‘నా నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు ఏ అధికారి ధైర్యం చేసేవారు కాదు. మా కుటుంబ సభ్యులైనా కూడా అధికారులతో మాట్లాడేందుకు అనుమతించేవాడిని కాద’’ని పేర్కొన్నారు. అక్రమంగా నగదు బదిలీలో భాగంగా పక్షం రోజుల క్రితం సీబీఐ.. కార్తి, ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్థాపకురాలు ఇంద్రాని, పీటర్ ముఖర్జీ నేరపూరిత కుట్ర కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం విదితమే. దీనిపై చిదంబరం స్పందిస్తూ.. ఎఫ్ఐఆర్లో తన పేరును చేర్చనప్పటికీ, ఎఫ్ఐపీబీని చేర్చడంతో నాటి ఆర్థిక మంత్రిగా తననూ టార్గెట్ చేసినట్లేనని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీ అనుకోకుండా తనకు సోషల్ మీడియా ద్వారా లభించిందని, ఇది లీక్ అయింది కూడా తమిళనాడు నుంచే అని వెల్లడించారు. అందులో ఉన్న ఆరోపణలన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కార్తిపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఎం/ఎస్ ఎడ్వాంటేజ్ స్ట్రాటిజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎస్‌సీపీఎల్)లో అతడు డైరెక్టర్ కాదని, కనీసం వాటాదారుడు కూడా కాదన్నారు. ఆ కంపెనీ తన కుమారుడి స్నేహితులదని, వారంతా టార్గెట్ కావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తి దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తాడని చిదంబరం వివరించారు. -
ఎఫ్ఐపీబీ రద్దుతో ఎఫ్‌డీఐల జోరు
-
ఎఫ్ఐపీబీ రద్దుతో ఎఫ్‌డీఐల జోరు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించేందుకు పాతికేళ్ల కిత్రం ఏర్పాటైన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎఫ్ఐపిబి) రద్దుపై హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్యకారణంగా విదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా రానున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోకి విదేశీపెట్టుబడులకు మంచి బూస్ట్ ఇస్తుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభిప్రాయపడింది. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే విధంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ)ని రద్దు చేయడాన్ని సీఐఐస్వాగతించింది. కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంద్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన దానికి కొనసాగిపుంగా ఎఫ్ఐపిబి రద్దు ప్రక్రియ ద్వారా ఎఫ్‌డీల జోరు పెరుగుతుందని, తద్వారా మరిన్న ఉపాధి అవకాశాలు రానున్నాయని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. భారత్ ఒక ఆచరణీయ వ్యాపార గమ్యస్థానంగా నిలవనుందని తెలిపారు. ప్రస్తుతం, కేవలం 11 రంగాల్లో మాత్రమే ఆమోదం ఉన్న పాతికేళ్లనాటి ఎఫ్ఐపీబీని రద్దు చేయడం, సింగిల్ విండో ద్వారా ఎఫ్‌డీఐ ప్రదిపాదనలను ఆమోదించడం వ్యాపార నిర్వహణలో సంస్కరణలు, వ్యాపార సరళీకరణ, పెట్టుబడిదారుల్లో విశాసాన్ని పెంచేందకు ప్రభుత్వం నిబద్ధతను ప్రతిబింబింస్తోందని బెనర్జీ వ్యాఖ్యానించారు. అలాగే మేకిన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగానికి వ్యూహాత్మక భాగస్వామ్యంతో దేశీయసంస్థల్లో టెక్నాలజీ బదిలీ మార్గాన్ని సుగమం చేసిందని పేర్కొన్నారు. కాగా బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఎఫ్ఐపిబి రద్దుకు ఆమోదం తెలిపింది. దీనిస్థానే కొత్త వ్యవస్థను త్వరలోనే ప్రకటిస్తారు. కొత్త వ్యవస్థలో విదేశీ పెట్టుబడి ప్రతిపాదనలను సంబంధిత మంత్రిత్వ శాఖలు స్వయంగా పరిశీలించి ఆమోదిస్తాయి. ఇందుకు సంబంధించి ప్రామాణికమైన మార్గదర్శకాలను రూపొందిస్తారని ఆర్థిక మంత్రి జైట్లీ కేబినెట్ చెప్పారు. కీలకమైన రంగాలు ముఖ్యంగా దేశ భద్రత, సమగ్రతతో ముడివడిన రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలకు హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. -
ఎఫ్ఐపీబీ రద్దుకు క్యాబినెట్ ఆమోదం
-
ఎఫ్ఐపీబీ రద్దుకు క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ)ను రద్దు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని స్థానంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలపై సంబంధిత శాఖలే నిర్ణయం తీసుకునే విధంగా కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. కీలకమైన రంగాల్లో ప్రతిపాదనలకు మాత్రం హోంశాఖ అనుమతులు తప్పనిసరని వివరించారు. ప్రస్తుతం ఎఫ్ఐపీబీ దగ్గర పెండింగ్‌లోని ప్రతిపాదనలను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపనున్నట్లు జైట్లీ చెప్పారు. రూ. 5,000 కోట్ల పైబడిన ప్రతిపాదనలకు ఎప్పట్లాగే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఓకే చెప్పా ల్సిందే. 1990లలో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రధాని కార్యాలయం పరిధిలో ఎఫ్ఐపీబీ ఏర్పాటైంది. స్థానిక ఉత్పత్తుల కొనుగోలు విధానానికి ఓకే.. ప్రభుత్వ విభాగాల్లో ఉత్పత్తులు, సర్వీసుల కొనుగోలుకు సంబంధించి స్థానిక సరఫరాదారులకు ప్రాధాన్యమిచ్చేలా కొత్త విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఉపాధికల్పనతో పాటు మేకిన్ ఇండియా కార్యక్రమానికీ ఊతం లభించనుంది. స్థానిక కంటెంట్ కనీసం 50% ఉన్న ఉత్పత్తులు, సర్వీసులందించే సంస్థలకు ప్రాధాన్యం దక్కుతుంది. -
ఎఫ్ఐపీబీ రద్దు... ఇక ఎఫ్‌డీఐల జోరు
ఎఫ్‌డీఐ విధానం మరింత సరళతరం న్యూఢిల్లీ: సింహభాగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆటోమేటిక్ మార్గంలోనే వస్తున్న నేపథ్యంలో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే విధంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ)ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇకపై ప్రభుత్వ అనుమతి అవసరమైన విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలపై .. సంబంధిత మంత్రిత్వ శాఖలే తగు నిర్ణయాలు తీసుకుంటాయని వివరించారు. ప్రస్తుతం దాదాపు 90 శాతం ఎఫ్‌డీఐలు ఆటోమేటిక్ మార్గంలోనే వస్తుండగా.. కేవలం పది శాతం ప్రతిపాదనలే ఎఫ్ఐపీబీ వద్దకు వెడుతున్నాయని జైట్లీ చెప్పారు. అందుకే ఎఫ్ఐపీబీని విడతలవారీగా రద్దు చేసే సమయం వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శ ప్రణాళికలను రాబోయే నెలల్లో ప్రకటించగలమన్నారు. మరోవైపు, ఎఫ్‌డీఐ విధానాన్ని మరింత సరళతరం చేసే అంశం కూడా పరిశీలనలో ఉందని, త్వరలో ఇందుకు సంబంధించిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని జైట్లీ చెప్పారు. తాజా పరిణామాలతో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ వ్యవధి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తిగా ఉన్న సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ కంపెనీలకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని ఈవై ఇండియా సంస్థ పేర్కొంది. 1990లలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తొలినాళ్లలో ప్రధాని కార్యాలయం (పీఎంవో) కింద ఎఫ్ఐపీబీ ఏర్పాటైంది. ఆ తర్వాత 1996లో దీన్ని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ)కి బదలాయించారు. 2003లో ఆర్థిక వ్యవహారాల విభాగం కింద చేర్చారు. ఆటోమేటిక్ పద్ధతిలోకి రాని రంగాల్లో విదేశీ పెట్టుబడుల కోసం ఎఫ్ఐపీబీ ఆమోదముద్ర అవసరమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఎఫ్‌డీఐలు 30 శాతం పెరిగి 21.62 బిలియన్ డాలర్లకు చేరాయి. -
బడ్జెట్లో మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విదేశీ పెట్టుబడులను మరింత ప్రోత్సహించేలా భారీ సంస్కరణ చేపట్టారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలను పరిశీలించే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపిబి) రద్దు చేస్తున్నట్టు ప్రకటించి మరో సంచలనం సృష్టించారు. విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు(ఎఫ్ఐపిబి) నుండి అనుమతులు పొందడానికి, నిబంధనలు సైతం ఉల్లంఘించి డైరెక్ట్ పెట్టుబడులను సాధిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాలను సరళీకరిస్తామని ఆయన చెప్పారు. ఎఫ్ఐపీబీ మార్గదర్శకాలు రాబోయే సంవత్సరంలో మరింత సరళంగా ఉండనున్నట్టు చెప్పారు. మేకిన్ ఇండియాలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుడులను భారీగా ఆహ్వానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గత ఏడాది భారతదేశం పౌరవిమానయాన నుండి ఫార్మాస్యూటికల్స్ వరకు రంగాల్లో విదేశీ పెట్టుబడును మరింత సులభతరం చేశారు. ప్రపంచంలో భారతదేశం అత్యంత ఓపెన్ ఆర్థిక వ్యవస్థగా తయారు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. భారతదేశం లో కొన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ఆటోమేటిక్ ఎఫ్ఐపిబి ద్వారా అనుమతి లభించేది. ప్రభుత్వం లేదా భారతదేశం యొక్క రిజర్వు బ్యాంకు నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే 100శాతం విదేశీ పెట్టుబడిదారులు పూర్తిగా సొంతదారు కావడానికి అనుమతి ఉంది. ఉదాహరణకు దేశంలో యాపిల్ ఫోన్ల తయారీలో రూ.5వేల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులకు ఎఫ్ఐపిబి అనుతినిచ్చింది. దీనిపై వివాదం నెలకొన్న సంగతి విదితమే. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ముఖ్యంగా బ్యాంకింగ్, రక్షణ మరియు పౌర విమానయాన రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. కాగా 1990ల కాలంలో ఆర్థిక సరళీకరణలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసింది. పీఎంవో కింద పనిచేసేలా దీన్ని రూపొందించారు. అయితే 2013 లో ఆర్థిక శాఖకు దీన్ని బదిలీ చేశారు. -
ఆరు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆరు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. వీటి విలువ రూ.1,200 కోట్లు. ఆమోదం తెలిపిన ప్రతిపాదనల్లో సనోఫి సింథల్యాబో ఇండియా, స్టార్ డెన్ మీడియా సర్వీసెస్, ఐడియా సెల్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, బొహింగర్ ఇంగేల్హిమ్ ఇండియా, ఎ మెనారిని ఇండియా, రెసిఫార్మ్ పార్టిసిపేషన్ ఉన్నాయి. మొత్తం 17 ఎఫ్‌డీఐ ప్రతిపాదనల్లో ఆరింటికి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) 3 ప్రతిపాదనలను తిరస్కరించింది. ఏఎంపీ సోలార్ ఇండియా ప్రతిపాదన కూడా ఇందులో ఒకటి. మరో 6 సంస్థలనుంచి మరింత సమాచారాన్ని కోరింది. క్రెస్ట్ ప్రిమిడియా సొల్యూషన్స్, యు బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఇందులో ఉన్నాయి. -
ఆరు ఎఫ్డీఐప్రతిపాదనలకు ఆమోదం
న్యూఢిల్లీ: అంతర్ మంత్రిత్వశాఖల విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డ్ (ఎఫ్ఐపీబీ) ఆరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మంగళవారం ఆమోదముద్ర వేసింది. ప్రతిపాదనల విలువ దాదాపు రూ.105 కోట్లు. మొత్తం 13 ప్రతిపాదనలను పరిశీలించి ఆరింటిని ఖరారు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. నేడు ఆమోదం పొందిన పెట్టుబడుల్లో రూ.88 కోట్ల సెవా శాంటి యానిమేలీ ప్రధానమైనది. పలు రంగాలకు సంబంధించి ఎఫ్‌డీఐలను భారత్ ఆటోమేటిక్ రూట్లోనే ఆమోదిస్తోంది. -
యాపిల్ రీటైల్ స్టోర్లకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: వాల్డ్ వైడ్ ఫేమస్ యాపిల్ ఫోన్లకు భారతదేశంలో కష్టాలు ఇక తగ్గనున్నట్టే కనిపిస్తోంది. ఇక స్వదేశీ స్టోర్లలో త్వరలోనే ఈ క్రేజీ ఫోన్లు లభ్యం కానున్నాయి. యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత పర్యటన నేపథ్యంలో ఈ ముఖ్యమైన పరిణామం చేసుకుంది. పూర్తిగా సొంతమైన రీటైల్ స్టోర్ల ఏర్పాటుకోసం యాపిల్ పెట్టుకున్న ప్రతిపాదనకు కండిషన్లతో కూడిన ఆమోదం లభించింది. ఈ మేరకు ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తిగా సొంతమైన రీటైల్ స్టోర్ల ఏర్పాటుకోసం చేసిన ఆపిల్ ప్రతిపాదనను అంగీకరించిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు కచ్చితమైన షరతులతో ఆమోదం తెలిపింది. ఈ వార్తలను ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు ధృవీకరించారు. లోకల్ సోర్సింగ్ సంస్థలకు 30 శాతం భాగస్వామ్యం కల్పించాలనే షరతు పెట్టిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రకటన మరో రెండు రోజుల్లో వెలువడనుందని కూడా ఆయన ధృవీకరించారు. ప్రస్తుత డీఐపీనీ నియమాల ప్రకారం సింగిల్ బ్రాండ్ రిటైలింగ్ కోసం, స్థానిక ఉత్పత్తులకు 30 శాతం చోటు కల్పించాలనే నిబంధన ఉంది. అలాగు మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో 51 శాతం, ప్రత్యేక పరిస్థితుల్లో కనీసం 30 శాతం భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుంది. వరకు అనుమతి ఉంది. ఈ మేరకు యాపిల్ మినహాయింపు నిచ్చిన ప్యానెల్ యాపిల్ స్టోర్ల ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. కాగా గత వారం ఆపిల్ ను ఇండియాలో ముందుకు తీసుకుపోవడమే లక్ష్యం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇండియాలో పర్యటించారు. భారత్‌లో దీర్ఘకాలంపాటు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలనుకుంటున్నామనీ, వచ్చే వెయ్యేండ్లపాటు సంస్థ సేవలందించనున్నామని ప్రకటించారు. రిటైల్ విక్రయాల విషయంలో యాపిల్‌కు మెరుగైన భవిష్యత్ ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
రూ.7,262 కోట్ల ఎఫ్ డీఐలకు ఓకే
15 ప్రతిపాదనలకు ఎఫ్ఐపీబీ ఆమోదముద్ర న్యూఢిల్లీ: ప్రభుత్వం రూ.7,262 కోట్ల విలువైన 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన వాటిల్లో జపాన్ బీమా సంస్థ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఏఐఏ, అవైవా లైఫ్ తదితర సంస్థలు ప్రతిపాదనలు ఉన్నాయి. బీమా సంస్థల్లో విదేశీ భాగస్వామ్య సంస్థలు తమ వాటాను 49 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలే వీటిల్లో అధికంగా ఉన్నాయి. ఈ నెల 7న జరిగిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) సూచనలు ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతమున్న 41.87 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవాలన్న యస్‌బ్యాంక్ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ఎఫ్ఐపీబీ నివేదించింది. వివరాలు..,మ్యాక్స్ ఇండియా డీమెర్జర్ కారణంగా మ్యాక్స్ ఇండియా వాటాదారులకు షేర్ల కేటాయించాలన్న టారస్ వెంచర్స్ ప్రతిపాదన ఆమోదం పొందింది. మ్యాక్స్ ఇండియా డీమెర్జర్ కారణంగా మ్యాక్స్ ఇండియా వాటాదారులకు షేర్ల కేటాయించాలన్న టారస్ వెంచర్స్ ప్రతిపాదన ఆమోదం పొందింది. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటాను 26% నుంచి 49%కి పెంచుకోవాలన్న నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతిపాదన ఓకే అయింది. ఈ 23% వాటా కొనుగోలుకు నిప్పన్ లైఫ్ రూ.2,265 కోట్లు వెచ్చించనున్నది. ఈ ప్రతిపాదనకు నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటికే కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆమోదం పొందింది. మరికొన్ని రోజుల్లోనే ఈ డీల్ పూర్తవుతుందని అంచనా. డీల్ పూర్తయ్యాక కంపెనీ పేరు రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్‌గా మారుతుంది. ఏఐఏ ఇంటర్నేషనల్‌లో వాటాను 26% నుంచి 49 శాతానికి పెంచుకోవాలన్న టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదన విలువ రూ.2,055 కోట్లు. అవైవా ఇంటర్నేషనల్‌లో అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తన వాటాను 49 శాతానికి పెంచుకునే ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.940 కోట్లతో అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఈ వాటాను పెంచుకుంటోంది. బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో విదేశీ వాటాను 49%కి పెంచుకోవడానికి అనుమతి. ఈ ప్రతిపాదన విలువ రూ.1,664 కోట్లు. ఎన్‌బీఎఫ్‌సీలోని 25కి పైగా విభాగాల్లో 100%కి ఎఫ్‌డీఐలు! న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం.. కమోడిటీ బ్రోకింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెబ్ట్ ఫండ్ సహా ఎన్‌బీఎఫ్‌సీలోని 25కి పైగా విభాగాల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 100%కి పెంచే ఆలోచనలో ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ) సంబంధిత విభాగాల్లో ఎఫ్‌డీఐ ఆకర్షణకు కృషి చేస్తామన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం ప్రభుత్వం మర్చంట్ బ్యాంకింగ్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ, స్టాక్ బ్రోకింగ్ సహా 18 ఎన్బీఎఫ్సీ విభాగాల్లో ఆటోమెటిక్ మార్గంలో 100% ఎఫ్‌డీఐలను అనుమతిస్తోంది. -
నాలుగు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం
వీటి విలువ రూ.1,810 కోట్లు న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్ఐపీబీ) రూ.1,810 కోట్ల విలువైన నాలుగు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిలో హెచ్డీఎఫ్సీ స్టాండర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఫైర్ ప్లై నెట్వర్క్స్ లిమిటెడ్, సాఫ్ట్వేర్ ఈజ్ కరెక్ట్ తదితర ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది. హెచ్‌డీఎఫ్‌సీలో ఉన్న హెచ్డీఎఫ్సీ స్టాండర్ట్ లైఫ్ షేర్లను స్టాండర్ట్ లైఫ్‌కు బదిలీ చేయడానికి ఎఫ్ఐపీబీ పచ్చజెండా ఊపింది. దీంతో హెచ్డీఎఫ్సీ స్టాండర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో విదేశీ వాటా 26 శాతం నుంచి 35 శాతానికి పెరుగుతుంది. ఈ ప్రతిపాదన కారణంగా రూ.1,700 కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తాయని అంచనా. మొత్తం తొమ్మిది ప్రతిపాదనల్లో నాలుగింటిని వాయిదా వేసింది.ఒక ప్రతిపాదన వెనక్కివెళ్లిపోయింది. అవైవా లైఫ్ ఇన్సూరెన్స్, టాటా సికోర్స్కీ, షేర్‌ఖాన్, క్వాంటమ్ సిమ్యులేటర్స్ ప్రతిపాదనలు వాయిదా పడ్డాయి. -
జీవీకే బయోసెన్సైస్ ఎఫ్డీఐకు ఓకే
న్యూఢిల్లీ: జీవీకే బయోసెన్సైస్‌కు చెందిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం లభించింది. మొత్తం రూ.160 కోట్ల విలువైన మూడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్ఐపీబీ) ఆమోదం తెలిపింది. అజెండాలో మొత్తం 24 ప్రతిపాదనలు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. అయితే ఈ నెల మొదట్లో వెల్లడించిన కొత్త ఎఫ్‌డీఐ విధానం కారణంగా 11 ప్రతిపాదనలు ఆటోమేటిక్ రూట్ కిందకు వస్తాయని, ఈ 11 ప్రతిపాదనల విలువ రూ.300 కోట్లుగా ఉంటుందని వివరించారు. జీవీకే బయోసెన్సైస్‌తో పాటు స్కేలేన్‌వర్క్స్ పీపుల్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ, జీఎంఎస్ ఫార్మా ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. ఏసీఎన్ కేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనను తిరస్కరించామని తెలిపారు. హెచ్డీఎఫ్సీ స్టాండర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ విదేశీ వాటా పెంపు ప్రతిపాదన, ఫైర్‌ఫ్లై నెట్వర్క్స్, టాటా సికోర్స్కీ ఏరోస్పేస్ ప్రతిపాదనలతో సహా మొత్తం 9 ప్రతిపాదనలను ఎఫ్ఐపీబీ వాయిదా వేసిందని వివరించారు. -
ఎఫ్‌డీఐల పెంపునకు మరిన్ని చర్యలు
ఎన్ఆర్ఐలు, తయారీ సంస్థలకు నిబంధనల సడలింపు! న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను మరింతగా ఆకర్షించడంపై మోదీ సర్కారు దృష్టిసారించింది. దీనిలో భాగంగా తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ఈ-కామర్స్ పోర్టల్స్ ద్వారా విక్రయించుకునేందుకు అనుమతించడంతో పాటు ప్రవాస భారతీయుల(ఎన్ఆర్ఐ)కు సంబంధించి ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించడం వంటి పలు చర్యలపై కసరత్తు జరుగుతోంది. మరోపక్క, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) ఆమోదించే పెట్టుబడి పరిమితిని ఇప్పుడున్న రూ.1,200 కోట్ల నుంచి రూ.3,000 కోట్లకు పెంచాలని కూడా వాణిజ్య-పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ), ఇతరత్రా సాధనాల ద్వారా జరిపే పెట్టుబడులన్నింటికీ కలిపి ఒకే పరిమితి(కాంపొజిట్ క్యాప్)ని ప్రవేశపెట్టాలని కూడా కోరింది. రక్షణ, రైల్వేలు, వైద్య పరికరాలు, నిర్మాణ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రభుత్వం సడలించిన సంగతి తెలిసిందే. కాగా, 2014-15 ఏడాది ఏప్రిల్-జనవరి కాలంలో భారత్‌లో ఎఫ్‌డీఐలు 36 శాతం వృద్ధితో 25.52 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదిలాఉండగా... వచ్చే నెల 9న జరగనున్న సమావేశంలో దాదాపు 32 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై ఎఫ్ఐపీబీ నిర్ణయం తీసుకోనుంది. -
కేకేఆర్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: రెండు ఫార్మా కంపెనీల్లో రూ.1,434 కోట్లతో వాటాల కొనుగోలుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ చేసిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. హైదరాబాద్ కేంద్రంగాగల గ్లాండ్ ఫార్మాలో 37.98%, గ్లాండ్ సెల్సస్ బయోకెమికల్స్‌లో 24.9% వాటాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలివి. ఈ కొనుగోళ్లకు కాంపిటీషన్ కమిషన్ గత జనవరిలోనే ఆమోదం తెలిపింది. భెల్‌లో 4.66 శాతం వాటా విక్రయంపై... విద్యుత్ పరికరాల సంస్థ భెల్‌లో 4.66 శాతం వాటాను బ్లాక్ డీల్ రూట్లో విక్రయించాలన్న నిర్ణయానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోని సీసీఈఏ ఈ నిర్ణయాన్ని మంగళవారం ఆమోదించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
వొడాఫోన్ ఇండియా.. ఇక బ్రిటిష్ కంపెనీ
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా సబ్సిడరీలోని మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను రూ.10,141 కోట్లతో కొనుగోలు చేయడానికి యునెటైడ్ కింగ్డమ్కు చెందిన వొడాఫోన్ గ్రూప్ చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశీయ టెలికం రంగంలో అతిపెద్ద ఏకమొత్తం విదేశీ పెట్టుబడి ఇదే. కొనుగోలు పూర్తయిన తర్వాత పూర్తిగా విదేశీ సంస్థ ఆధీనంలో ఉండే కంపెనీగా వొడాఫోన్ ఇండియా ఆవిర్భవించనుంది. వొడాఫోన్ గ్రూప్ ప్రతిపాదనను ఆమోదించినట్లు గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశం అనంతరం ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. టెలికంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను అనుమతిస్తూ ప్రభుత్వం గతేడాది నిర్ణయించడం విదితమే. చందాదారుల సంఖ్య పరంగా దేశంలో రెండో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఇండియాలో ప్రస్తుతం 64.38% వాటా వొడాఫోన్ గ్రూప్‌నకు ఉంది. మైనారిటీ షేర్హోల్డర్లలో అజయ్ పిరమల్ వద్ద 10.97%, వొడాఫోన్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనల్జీత్ సింగ్ వద్ద 24.65% షేర్లున్నాయి. వీటి కొనుగోలుకు గాను అనల్జీత్ సింగ్‌కు రూ.1,241 కోట్లు, పిరమల్‌కు రూ.8,900 కోట్లను వొడాఫోన్ గ్రూప్ చెల్లించనుంది. పిరమల్‌కంటే ఎక్కువ వాటా వున్న అనల్జీత్‌కు బాగా తక్కువ మొత్తం చెల్లించడానికి సింగ్, వొడాఫోన్ల మధ్య ఒప్పందమే కారణం. సింగ్‌కు చెందిన మరో కంపెనీలో పరోక్షంగా వొడాఫోన్ పెట్టుబడి చేయడం దీని నేపథ్యం. -
ఫార్మాలో 100% ఎఫ్‌డీఐల కొనసాగింపు
న్యూఢిల్లీ: ఇప్పుడున్న ఫార్మా కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బహళజాతి ఫార్మా దిగ్గజాలు దేశీ కంపెనీలను చేజిక్కించుకోవడం వల్ల చౌక ధరల ఔషధాలు లేకుండా పోతాయన్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫార్మా ఎఫ్‌డీఐలపై సమీక్ష అనంతరం ప్రస్తుత పాలసీనే యథాతథంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ‘నాన్-కాంపీట్’ అంశాన్ని మాత్రం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అమోదంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప అనుమతించకూడదనే నిబంధనను విధించినట్లు డీఐపీపీ తెలిపింది. ఫార్మా ఎంఎన్‌సీలు దేశీ కంపెనీల కొనుగోళ్ల జోరు పెంచుతుండటంతో ఎఫ్‌డీఐ నిబంధనలను కఠినతరం చేయాలని తొలుత డీఐపీపీ ప్రతిపాదించింది. ఇలా కొనుగోలు చేయడం వల్ల దేశంలో చౌక జనరిక్ ఔషధాల లభ్యతకు తీవ్ర ముప్పువాటిల్లుతోందని కూడా ఆందోళన వ్యక్తంచేసింది. క్లిష్టతరమైన, అరుదైన ఫార్మా విభాగాల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 100 శాతం నుంచి 49 శాతానికి తగ్గించాలని సూచించింది. అయితే, కేంద్ర కేబినెట్ మాత్రం డీఐపీపీ ఆందోళనలను తోసిపుచ్చడం గమనార్హం. అమెరికా ఫార్మా దిగ్గజం మైలాన్.. బెంగళూరుకు చెందిన ఏజిలా స్పెషాలిటీస్(స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్స్ అనుబంధ కంపెనీ)ను చేజిక్కించుకున్న డీల్‌కు గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ఒప్పందం విలువ రూ.5,168 కోట్లు. అదే విధంగా 2008లో జపాన్ సంస్థ దైచీ శాంక్యో కంపెనీ.. భారత్‌లో నంబర్‌వన్ ఫార్మా కంపెనీ ర్యాన్‌బాక్సీని కొనుగోలు చేయడం విదితమే. ఈ డీల్ విలువ 4.6 బిలియన్ డాలర్లు. ఇక పిరమల్ హెల్త్‌కేర్‌ను అమెరికా సంస్థ అబాట్ 3.7 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది. కాగా, కొత్త ఫార్మా ప్రాజెక్టుల ఏర్పాటులో భారత్ 100 శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ ఆమోదం రూట్లో అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. -
టెస్కో, వొడాఫోన్లకు ఎఫ్ఐపీబీ ఓకే
న్యూఢిల్లీ: దేశీయ మల్టీబ్రాండ్ రిటైలింగ్‌లో ప్రవేశించేందుకు యూకే రిటైలింగ్ దిగ్గజం టెస్కోకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతి లభించింది. దీంతోపాటు దేశీయ మొబైల్ దిగ్గజంలో మైనారిటీ వాటాదారుల వాటాను కొనుగోలు చేసేందుకు వొడాఫోన్‌కు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల పరిమితిని పెంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతిపాదనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆర్థికశాఖ వర్గాలు ఈ విషయాలను వెల్లడించాయి. తొలి దశలో భాగంగా టెస్కో 11 కోట్ల డాలర్లను(రూ. 7,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్ హైపర్‌మార్కెట్స్‌లో 50% వాటాను కొనుగోలు చేయనుంది. ఇక మరోవైపు వొడాఫోన్ ఇండియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనల్జిత్ సింగ్‌కు గల 24.65% వాటాతోపాటు అజయ్ పిరమల్‌కు చెందిన 10.97% వాటాను బ్రిటిష్ సంస్థ వొడాఫోన్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు రూ. 10,141 కోట్లను వెచ్చించనున్నట్లు అంచనా. -
20 ఎఫ్‌డీఐలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: పూర్తిస్థాయి విమానయాన సర్వీసులను ప్రారంభించేందుకు వీలుగా టాటా సన్స్‌తో జత కట్టిన సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తోపాటు 20 ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విదేశీ పెట్టుబడుల మొత్తం విలువ రూ. 916 కోట్లు. గత నెల చివర్లో సమావేశమైన ఎఫ్ఐపీబీ ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. వీటిలో సింగపూర్ ఎయిర్‌లైన్ పెట్టుబడి విలువ రూ. 303.2 కోట్లుకాగా, రూ. 179.43 కోట్ల రెలిగేర్ ఎంటర్‌ప్రెజైస్ ప్రతిపాదన కూడా ఉంది. పెట్టుబడి సలహా సర్వీసులు, ఆర్థిక సేవలతోపాటు ఎన్బీఎఫ్సీ రంగంలో పెట్టుబడులకు రెలిగేర్ ఈ నిధులను వినియోగించనుంది. ఈ బాటలో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏర్పాటుకు జేఎం ఫైనాన్షియల్(రూ. 22.19 కోట్లు), ఫార్మా రంగ పెట్టుబడులకు పెర్రిగో ఏపీఐ ఇండియా(రూ. 130 కోట్లు) చేసిన ప్రతిపాదనలకు అనుమతి లభించింది. కాగా, రూ. 1,400 కోట్ల విలువైన ఫెడరల్ బ్యాంక్ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదించింది. బ్యాంక్‌లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 74%కి పెంచేందుకు అనుమతి కోరింది. డీఎల్ఎఫ్ లిమిట్లెస్ డెవలపర్స్, సింగ్టెల్ గ్లోబల్ ఇండియా ప్రతిపాదనలపై ఏ నిర్ణయాన్నీ ప్రకటించలేదు. -
హెచ్అండ్ఎం పెట్టుబడి ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన దుస్తుల సంస్థ హెనెస్ అండ్ మారిట్జ్ (హెచ్అండ్ఎం)తో పాటు స్విట్జర్లాండ్ నిర్మాణ సామగ్రి దిగ్గజం హోల్సిమ్ పెట్టుబడి ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదముద్ర వేసింది. బుధవారం జరిగిన సమావేశంలో మొత్తం 23 ప్రతిపాదనలు పరిశీలనకు రాగా 14 ప్రతిపాదనలను ఆమోదించింది. తాజా నిర్ణయంతో హెచ్అండ్ఎం భారత్‌లో సుమారు రూ. 720 కోట్లతో సింగిల్ బ్రాండ్ రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. అలాగే హోల్సిమ్.. భారత్‌లోని అనుబంధ సంస్థలను కన్సాలిడేట్ చేసుకునేందుకు సాధ్యపడుతుంది. -
వచ్చే జూన్ నాటికి...టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ టేకాఫ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మే-జూన్ నాటికల్లా దేశీయంగా విమాన సర్వీసులు ప్రారంభించాలని టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ సంస్థ ..టాటా-ఎస్ఐఏ భావిస్తోంది. టాటా-ఎస్ఐఏ చైర్మన్ ప్రసాద్ మీనన్ విషయం తెలిపారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతులు లభించిన నేపథ్యంలో టాటా గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా, ఎస్ఐఏ చైర్మన్ గో చూన్ ఫాంగ్, మీనన్.. శుక్రవారం పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్‌తో సమావేశమయ్యారు. మిగతా అనుమతులు కూడా వేగంగా లభించగలవని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా మీనన్ తెలిపా రు. మరోవైపు, పార్కింగ్ స్థలం, రూట్లు మొదలైన వాటికి సంబంధించి టాటా-ఎస్ఐఏ ఎంత వేగం గా వివరాలు సమర్పిస్తుందన్న దాన్ని బట్టి విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీ జీసీఏ వేగవంతంగా అనుమతు లు ఇవ్వడం ఆధారపడి ఉంటుందని అజిత్ సింగ్ చెప్పారు. ఈ ఎయిర్‌లైన్స్ రాకతో దేశీ విమానయాన రంగానికి ప్రయోజనం చేకూరగలదన్నారు. అటు, ఈ జేవీ విషయంలో ఎయిర్ఏషియా ఇండియా మరో ప్రమోటర్ అరుణ్ భాటియా అసంతృప్తి వ్యక్తం చేశారన్న వార్తలపై స్పంది స్తూ.. అలాంటి గందరగోళం లేదని రతన్ టాటా స్పష్టం చేశారు. టాటా-ఎస్ఐఏ జేవీలో టాటా సన్స్‌కి 51%, ఎస్‌ఐఏకి 49% వాటాలు ఉంటాయి. ప్రారంభ దశలో ఇందులో ఇరు కంపెనీలు కలసి 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నాయి. ఎయిరిండియాను ప్రైవేటీకరిస్తే సంతోషమే: రతన్ టాటా ప్రభుత్వ రంగానికి చెందిన ఎయిరిండియాను ప్రైవేటీకరిస్తే మంచిదేనని రతన్ టాటా చెప్పారు. అదెప్పుడు జరిగినా తాను సంతోషిస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎయిర్‌లైన్స్ వంటి వ్యాపార రంగాల్లో ఉండకూడదని, ఎయిరిండియాని ప్రైవేటీకరించే అవకాశాలను రాబోయే ప్రభుత్వాలు పరిశీలించగలవ ంటూ అజిత్ సింగ్ వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చిన నేపథ్యంలో టాటా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా సన్స్ ప్రారంభించిన విమానయాన సంస్థే తర్వాత రోజుల్లో ఎయిరిండియాగా మారింది. -
15 ఎఫ్‌డీఐలకు ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వం శుక్రవారం రూ.2,000 కోట్ల విలువైన 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రెండు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను తుది ఆమోదం కోసం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ)కి నివేదించింది. 10 ప్రతిపాదనలను వాయిదా వేసింది. సీసీఈఏకు నివేదించిన వాటిల్లో రూ.10,668 కోట్ల విలువైన మైలాన్ ప్రతిపాదన, రూ. 5,500 కోట్ల విలువైన ఐడీఎఫ్సీ ట్రస్టీ కంపెనీ ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ రెండు ప్రతిపాదనల విలువ రూ.1,200 కోట్ల మించి ఉండటంతో వీటిని సీసీఈఏకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదించింది. గత నెల 27న జరిగిన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ) సమావేశం సూచనల మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ 15 ఎఫ్‌డీఐలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటి వివరాలు..., జుబిలంట్ ఫార్మా, సింగపూర్(రూ.1,145 కోట్లు), లోటస్ సర్జికల్ స్పెషాల్టీస్(రూ.150 కోట్లు), సిమ్బయోటెక్ ఫార్మాల్యాబ్(రూ.306 కోట్లు), అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్(రూ.200 కోట్లు).