first T20
-
మెరిసిన జెమీమా, స్మృతి
నవీ ముంబై: భారత మహిళల జట్టు చాన్నాళ్ల తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేయగా, బౌలింగ్‌లో టిటాస్ సాధు (3/37), దీప్తి శర్మ (2/21), రాధా యాదవ్ (2/28) కరీబియన్ జట్టును దెబ్బతీశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఉమా ఛెత్రి (26 బంతుల్లో 24; 4 ఫోర్లు), రిచా ఘోష్ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కరిష్మా రమ్హార్యాక్ 2, డియాండ్ర డాటిన్ 1 వికెట్ తీశారు. అనంతరం వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసి ఓడింది. ఓపెనర్ కియానా జోసెఫ్ (33 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డియాండ్ర డాటిన్ (28 బంతుల్లో 52; 4 ఫోరు, 3 సిక్స్‌లు) రాణించారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం ఇదే వేదికపై రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి (సి) కియానా (బి) కరిష్మా 54; ఉమా ఛెత్రి (బి) కరిష్మా 24; జెమీమా రోడ్రిగ్స్ (రనౌట్) 73; రిచా ఘోష్ (సి) మంగ్రూ (బి) డియాండ్ర 20; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 13; సజన (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–50, 2–131, 3–155, 4–190. బౌలింగ్: చినెలీ హెన్రీ 2–0–17–0, జైదా జేమ్స్ 1–0–13–0, హేలీ 3–0–38–0, కరిష్మా 4–0–18–2, అఫీ ఫ్లెచర్ 3–0–39–0, డియాండ్ర 4–0–37–1, షమిలియా 1–0–11–0, కియానా జోసెఫ్ 2–0–22–0. వెస్టిండీస్ మహిళల ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సబ్–మిన్నుమణి (బి) టిటాస్ 1; కియానా (సి) సైమా (బి) టిటాస్ 49; షెమైన్ (బి) దీప్తి శర్మ 13; డియాండ్ర (సి) రాధ (బి) టిటాస్ 52; చినెలీ హెన్రీ (సి) సబ్–మిన్నుమణి (బి) రాధ 7; షబిక (నాటౌట్) 15; అఫీ ఫ్లెచర్ (బి) దీప్తి శర్మ 0; జైదా (సి) ఉమా ఛెత్రి (బి) రాధ 5; మంగ్రూ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–2, 2–36, 3–80, 4–108, 5–126, 6–127, 7–140. బౌలింగ్: రేణుక 4–0– 25–0, టిటాస్ సాధు 4–0–37–3, దీప్తిశర్మ 4–0– 21–2, సైమా 4–0–35–0, రాధ 4–0–28–2.3622 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా స్మృతి మంధాన గుర్తింపు పొందింది. ఇన్నాళ్లు హర్మన్‌ప్రీత్ (3589 పరుగులు) పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది. 117 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ డియాండ్రా డాటిన్ (117) ఘనత సాధించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ (114) పేరిట ఉన్న రికార్డును డియాండ్రా బద్దలు కొట్టింది. -
మహిళ జట్టు సత్తా చాటేనా!
ముంబై: ఆ్రస్టేలియా చేతిలో మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన భారత మహిళల క్రికెట్ జట్టు ఐదు రోజుల వ్యవధిలోనే మరో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. భారత్ పర్యటనకు వ చ్చిన వెస్టిండీస్ అమ్మాయిల జట్టుతో సొంతగడ్డపై నెగ్గే ప్రయత్నంలో సాధన చేస్తోంది. రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ముందుగా భారత్, విండీస్ జట్ల మధ్య నేడు తొలి టి20 జరగనుంది. జట్టులో కొరవడిన నిలకడ, అనుభవజ్ఞుల బాధ్యతా రాహిత్యం, బ్యాటర్ల ఫామ్ లేమి హర్మన్‌ప్రీత్ సేనను కలవరపెడుతోంది. స్టార్ ఓపెనర్, వైస్ కెపె్టన్ స్మృతి మంధాన చాన్నాళ్ల తర్వాత సెంచరీతో టచ్‌లోకి వచ్చిoది. అయితే ఈ ఫామ్ ఇకపై కొనసాగిస్తుందో లేదో కరీబియన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లలో తెలుస్తుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం వరుసగా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపిస్తోంది. వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు ఆడనున్న తొలి టి20 సిరీస్ ఇదే కానుంది. ఆ్రస్టేలియా లాంటి పటిష్టమైన జట్టుతో జరిగిన చివరి వన్డేలో 4 వికెట్లతో చెలరేగినా... హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి జట్టులో స్థానం కోల్పోయింది. ఆతిథ్య జట్టు పరిస్థితి ఇలా ఉంటే వెస్టిండీస్ అమ్మాయిల జట్టు మనకంటే మెరుగనే చెప్పవచ్చు. బ్యాటింగ్‌లో కెపె్టన్ హేలీ మాథ్యూస్, క్వియానా జోసెఫ్, డియాండ్రా డాటిన్, షెమైన్ క్యాంప్‌బెల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ఏడాది టి20 ఫార్మాట్లో కరీబియన్ టీమ్ 13 మ్యాచ్‌లాడితే తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే నవంబర్ 2019నుంచి భారత్, విండీస్ మహిళల జట్ల మధ్య ఎనిమిది టి20లు జరిగితే అన్నింటిలో భారతే విజయం సాధించడం విశేషం. జట్లు (అంచనా) భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తిశర్మ, రేణుక, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్. వెస్టిండీస్ మహిళల జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్ ), షెమైన్ క్యాంప్‌బెల్, ఆలియా అలెన్, షమిలియా కానెల్, డియాండ్ర డాటిన్, అఫి ఫ్లెచర్, నెరిసా, క్వియానా జోసెఫ్, హెన్రీ, జైదా జేమ్స్, కరిష్మా రమ్హారక్. -
అమితోత్సాహంతో సూర్య సేన : యువ ఆటగాళ్లకు పరీక్ష
సొంతగడ్డపై ఐపీఎల్లో చెలరేగిపోయే భారత యువ క్రికెటర్లకు టీమిండియా తరఫున సత్తా చాటే మరో అరుదైన అవకాశం వచ్చింది. సీనియర్ల రిటైర్మెంట్తో పాటు మరికొందరు సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో జట్టులోకి వచ్చిన పలువురు యువ ఆటగాళ్లు తమదైన చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్ వారి సత్తాకు పరీక్ష పెట్టనుంది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల పోరుకు రంగం సిద్ధమైంది. అనుభవంలో మెరుగ్గా కనిపిస్తున్న బంగ్లా ఆతిథ్య జట్టుకు ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం. గ్వాలియర్: బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు కాస్త విరామం తర్వాత టి20ల్లో గెలుపుపై గురి పెట్టింది. నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ తలపడేందుకు సన్నద్ధమయ్యాయి. జింబాబ్వే పర్యటనలో భారత్‌ను గెలిపించిన కెప్టెన్ సూర్యకుమార్ మరో సిరీస్‌ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. టీమిండియా నుంచి కనీసం ఇద్దరు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మయాంక్, నితీశ్‌లకు చాన్స్! ఐపీఎల్లో తన మెరుపు బౌలింగ్‌తో మయాంక్ యాదవ్ అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు అదే ఎక్స్‌ప్రెస్ వేగం అతనికి భారత జట్టులో స్థానం అందించింది. ఆదివారం తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభిస్తే మయాంక్ సత్తా చాటగలడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ హర్షిత్ రాణా కూడా చాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఇద్దరు పేసర్లను ఒకేసారి అరంగేట్రం చేయిస్తారా అనేది చూడాలి. మరో వైపు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా బరిలోకి దిగడం ఖాయమైంది. నితీశ్ తన ఐపీఎల్ ప్రదర్శనతో జింబాబ్వేతో టూర్‌కు ఎంపికైనా...చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా తప్పుకున్నాడు. వీరితో పాటు జింబాబ్వేలో రాణించిన రియాన్ పరాగ్, అభిõÙక్ శర్మ చెలరేగిపోగలరు. టి20ల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న సామ్సన్, రింకూ, సుందర్, బిష్ణోయ్, వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడు అర్‡్షదీప్‌లతో భారత జట్టు పటిష్టంగా ఉంది. ఇక సారథిగానే కాకుండా అద్భుత బ్యాటర్‌గా సూర్యకుమార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగలరు. వీరిని నిలువరించడం బంగ్లాదేశ్‌కు అంత సులువు కాదు. అనుభవజు్ఞలతో... భారత్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఎక్కువ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. మహ్ముదుల్లా, ముస్తఫిజుర్, లిటన్ దాస్, తస్కీన్, మెహదీ హసన్ మిరాజ్... వీరంతా కనీసం 50 టి20లకు పైగా ఆడినవారే. ఇప్పుడు భారత్‌ను ఓడించాలంటే వీరంతా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. గతంలోనూ అప్పుడప్పుడు కాస్త మెరుపులు చూపించినా భారత్‌పై బంగ్లా పెద్దగా ఆధిపత్యం కనబర్చింది లేదు. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లలో తన్జీమ్, తన్జీద్, రిషాద్ ఇటీవల టి20ల్లో తమ జట్టు తరఫున కీలక ఆటగాళ్లుగా ఎదిగారు. టెస్టు సిరీస్ ఓడిన బంగ్లా కనీసం టి20ల్లోనైనా మెరుగ్గా ఆడి గౌరవంగా వెనుదిరగాలని భావిస్తోంది. తొలి పోరులో గెలిచి ఆధిక్యం లభిస్తే సిరీస్ విజయంపై బంగ్లా ఆశలు పెట్టుకోవచ్చు. దూబే స్థానంలో తిలక్ వర్మ వెన్ను గాయం కారణంగా ఆల్‌రౌండర్ శివమ్ దూబే బంగ్లాదేశ్‌తో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. అతను ఆదివారం ఉదయం జట్టు సభ్యులతో కలుస్తాడని బోర్డు పేర్కొంది. అయితే తొలి మ్యాచ్‌లో తిలక్ తుది జట్టులో ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిõÙక్, సంజు సామ్సన్, పరాగ్, నితీశ్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, అర్‡్షదీప్ సింగ్ బంగ్లాదేశ్: నజు్మల్ హసన్ (కెప్టెన్ ), లిటన్ దాస్, పర్వేజ్, తన్జీద్, మిరాజ్, తౌహీద్, మహ్ముదుల్లా, రిషాద్, తన్జీమ్, తస్కీన్, ముస్తఫిజుర్ -
ఆసీస్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ముగ్గురి అరంగేట్రం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో రేపు (సెప్టెంబర్ 11) జరుగబోయే తొలి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్‌తో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు (జేకబ్ బేథెల్, జేమీ ఓవర్టన్, జోర్డన్ కాక్స్) టీ20 అరంగేట్రం చేయనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం కావడంతో ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాంప్టన్ వేదికగా రేపటి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది.ఆసీస్‌తో తొలి టీ20 కోసం ఇంగ్లండ్ తుది జట్లు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్), విల్ జాక్స్, జోర్డన్ కాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెథెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, రీస్ టాప్లేకాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది.ఆసీస్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్..సెప్టెంబర్ 11- తొలి టీ20 (సౌతాంప్టన్)సెప్టెంబర్ 13- రెండో టీ20 (కార్డిఫ్)సెప్టెంబర్ 15- మూడో టీ20 (మాంచెస్టర్)సెప్టెంబర్ 19- తొలి వన్డే (నాటింగ్హమ్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (లీడ్స్)సెప్టెంబర్ 24- చెస్టర్ లీ స్ట్రీట్సెప్టెంబర్ 27- లండన్సెప్టెంబర్ 29- బ్రిస్టల్ -
ఆరంభం అదిరింది.. శ్రీలంకను చిత్తు చేసిన భారత్
పల్లెకెలె: టి20 ప్రపంచ చాంపియన్ భారత్... శ్రీలంక పర్యటనలో శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ బృందం 43 పరుగుల తేడాతో లంకపై విజయం సాధించింది. మూడు టి20ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. విరామం లేకుండా నేడే రెండో టి20 మ్యాచ్ జరగనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ సూర్యకుమార్ (26 బంతుల్లో 58; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్ పంత్ (33 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. పతిరణకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు నిసాంక (48 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (27 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్) ఒకదశలో భారత శిబిరాన్ని వణికించేలా మెరిపించారు. రియాన్ పరాగ్ (1.2–0–5–3) బంతితో మ్యాజిక్ చేశాడు. అర్‡్షదీప్ (2/24), అక్షర్ పటేల్ (2/38) కీలక వికెట్లు తీశారు. జైస్వాల్, గిల్ మెరుపులతో... ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (16 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్‌తో భారత్ ఇన్నింగ్స్ మొదలైంది. ఉన్నది కాసేపే అయినా ఇద్దరు పోటీపడి బౌండరీలు బాదడంతో 4వ ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. పవర్ ప్లేలో పవర్ చూపిన ఓపెనర్లిద్దరిని లంక బౌలర్లు వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చారు. మదుషంక వేసిన ఆరో ఓవర్లో శుబ్‌మన్ రెండు ఫోర్లు, డీప్ మిడ్‌వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. తొలి ఐదు బంతుల్లోనే 15 పరుగులు రాగా... అదే ఊపులో ఆఖరి బంతిని షాట్ ఆడేందుకు ప్రయతి్నంచగా, మిడాన్‌లో ఉన్న ఫెర్నాండో క్యాచ్ పట్టడంతో గిల్ వెనుదిరిగాడు. 6 ఓవర్లలో 74/1 స్కోరుతో ఉన్న భారత్‌కు తర్వాతి బంతి మరో దెబ్బతీసింది. హసరంగ వేసిన ఏడో ఓవర్ తొలిబంతికి జోరుమీదున్న జైస్వాల్ స్టంపౌట్ అయ్యాడు. సూర్య ఫిఫ్టీ... ఈ ఊరట కాస్తా ఆ రెండు బంతులకే పరిమితమైంది. తర్వాత దశను హార్డ్ హిట్టర్లు సూర్యకుమార్, రిషభ్ పంత్ మొదలుపెట్టారు. దీంతో పరుగుల్లో వేగం, బ్యాటింగ్‌లో దూకుడు మరింత పెరిగిందే తప్ప తగ్గనేలేదు. 8.4 ఓవర్లోనే భారత్ 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ స్ట్రోక్ ప్లేతో పదేపదే బౌండరీలకు తరలించాడు. చెత్త బంతులు ఎదురైతే సిక్స్‌లుగా బాదేశాడు. ఈ మెరుపులతో అతని అర్ధశతకం 22 బంతుల్లోనే పూర్తవగా, 13.1 ఓవర్లో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. కానీ తర్వాతి బంతికి పతిరణ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో కెపె్టన్ ఇన్నింగ్స్ ముగిసింది. హార్దిక్ పాండ్యా (9), పరాగ్ (7) విఫలమైనప్పటికీ పంత్ తనశైలి ఆటతీరుతో జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకెళ్లాడు. పరుగు తేడాతో అర్ధసెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. చకచకా లక్ష్యం వైపు... అంతలోనే! శ్రీలంక కూడా లక్ష్యానికి తగ్గ దూకుడుతోనే బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్ మెండీస్ మెరుపులతో సగటున ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌తో లంక ఇన్నింగ్స్ దూసుకెళ్లింది. 5.1 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. నిసాంక భారీషాట్లతో విరుచుకుపడగా, మెండీస్ బౌండరీలతో భారత బౌలర్ల భరతం పట్టాడు. జట్టు స్కోరు 84 వద్ద అర్ష్‌దీప్... మెండిస్‌ను అవుట్ చేసి తొలివికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. తర్వాత కుశాల్ పెరీరా (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) అండతో నిసాంక మరింతగా రెచి్చపోయాడు. 14 ఓవర్లదాకా ఎంతవేగంగా లక్ష్యం వైపు దూసుకొచి్చంతో... నిసాంక అవుటయ్యాక అంతే వేగంగా లంక ఇన్నింగ్స్ పతనమైంది. 140 స్కోరు వద్ద నిసాంక రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. 36 బంతుల్లో 74 పరుగుల సమీకరణం ఏమంత కష్టం కాకపోయినా... భారత బౌలర్లు పట్టుబిగించడంతో అనూహ్యంగా మరో 30 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లను కోల్పోయి లంక 170 పరుగులకే ఆలౌటైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (స్టంప్డ్) కుశాల్ మెండిస్ (బి) హసరంగ 40; గిల్ (సి) ఫెర్నాండో (బి) మదుషంక 34; సూర్యకుమార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పతిరణ 58; పంత్ (బి) పతిరణ 49; పాండ్యా (బి) పతిరణ 9; పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పతిరణ 7; రింకూ సింగ్ (బి) ఫెర్నాండో 1; అక్షర్ (నాటౌట్) 10; అర్‡్షదీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–74, 2–74, 3–150, 4–176, 5–192, 6–201, 7–206. బౌలింగ్: మదుషంక 3–0–45–1, అసిత ఫెర్నాండో 4–0–47–1, తీక్షణ 4–0–44–0, హసరంగ 4–0–28–1, కమిండు మెండీస్ 1–0–9–0, పతిరణ 4–0–40–4. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) అక్షర్ 79; కుశాల్ మెండిస్ (సి) జైస్వాల్ (బి) అర్‡్షదీప్ 45; పెరీరా (సి) బిష్ణోయ్ (బి) అక్షర్ 20; కమిండు మెండిస్ (బి) పరాగ్ 12; అసలంక (సి) జైస్వాల్ (బి) బిష్ణోయ్ 0; షనక (రనౌట్) 0; హసరంగ (సి) పరాగ్ (బి) అర్‡్షదీప్ 2; తీక్షణ (బి) పరాగ్ 2; పతిరణ (సి) అక్షర్ (బి) సిరాజ్ 6; ఫెర్నాండో (నాటౌట్) 0; మదుషంక (బి) పరాగ్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1–84, 2–140, 3–149, 5–160, 6–161, 7–163, 8–170, 9–170, 10–170. బౌలింగ్: అర్‡్షదీప్ 3–0–24–2, సిరాజ్ 3–0–23–1, అక్షర్ 4–0–38–2, రవి బిష్ణోయ్ 4–0–37–1, పాండ్యా 4–0–41–0, పరాగ్ 1.2–0–5–3. -
శుభారంభంపై భారత్ దృష్టి
పల్లెకెలె: భారత్ కొత్తకొత్తగా లంక పర్యటనను ప్రారంభించేందుకు సిద్ధమైంది. గతంలో టి20 సారథిగా వ్యవహరించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఈసారి గంభీర్ కోచింగ్‌లో నడవడం కొత్తే! టాపార్డర్‌లో రోహిత్ శర్మ, కోహ్లితో పాటు ఆల్‌రౌండర్ జడేజా పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో ఆ చాలెంజింగ్ స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లకు ఈ సిరీస్ సరికొత్తగా స్వాగతం పలకబోతోంది. మొత్తం పల్లెకెలె వేదికపైనే జరిగే మూడు టి20ల సిరీస్‌లో నేడు తొలి మ్యాచ్ జరుగుతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ అనుభవం, సూర్యకుమార్ సారథ్యం, సత్తాగల యువ ఆటగాళ్లతో భారత్ సమతూకంగా ఉంది. కొత్త జట్టు మేళవింపుతో శుభారంభంపై దృష్టి సారించింది. కొత్త కోచ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. గంభీర్ ఓపెనర్‌గా నిరూపించుకున్నాడు. అంతకుమించి రెండు ప్రపంచకప్ (2007 టి20; 2011 వన్డే) విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అలాగే దీనితో పోల్చలేకపోయినా కూడా... ఐపీఎల్లో విజయవంతమైన సారథిగా, అనంతరం మెంటార్‌గానూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిళ్లు అందించాడు. కాబట్టి గంభీర్ మార్గదర్శనంపై ఎవరికీ ఏ అనుమానాలు లేవు. అయితే పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఏ విధంగా సన్నద్ధం చేస్తారన్నదానిపైనే సర్వత్రా ఆసక్తినెలకొంది. దుర్భేధ్యంగా టీమిండియా ఈ ఏడాది భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ప్రపంచకప్‌లో ట్రోఫీ గెలిచేదాకా జైత్రయాత్ర కొనసాగించింది. ఓవరాల్‌గా ఈ ఏడాది 16 టి20లు ఆడిన భారత్ 15 మ్యాచ్‌ల్లో గెలిచింది. జింబాబ్వేకెళ్లిన ద్వితీయశ్రేణి భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఒటమి తప్ప సిరీస్ 4–1తో గెలిచి సత్తా చాటుకుంది. ఓపెనింగ్‌లో యశస్వి, గిల్‌లతో పాటు వన్‌డౌన్‌లో రిషభ్ పంత్ మెరిపిస్తే మిడిలార్డర్‌ను సూర్యకుమార్‌తో పాటు అనుభవజ్ఞుడైన హార్దిక్ పాండ్యా నడిపించగలడు.బౌలింగ్‌లో బుమ్రా కూడా విశ్రాంతిలో ఉండటంతో.... మొత్తం మీద అనుభవజు్ఞల్లేని టీమిండియాకు ప్రస్తుతం పాండ్యానే పెద్ద దిక్కు. బౌలింగ్‌లో సిరాజ్, అర్‡్షదీప్ సింగ్‌లు సత్తా చాటితే ఆరంభంలోనే వికెట్లు కూలుతాయి. గంభీర్ ప్లాన్ ముగ్గురు స్పిన్నర్లయితే వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లతో పాటు రవి బిష్ణోయ్‌కి చాన్స్ లభిస్తుంది. లంక ఎదురునిలిచేనా... స్టార్లు లేకపోయినా భారత్ సత్తాపై ఎవరికీ ఏ అనుమానాల్లేవు. కానీ కొన్నేళ్లుగా శ్రీలంక ప్రదర్శన మాత్రం నిరాశజనకంగా సాగుతోంది. ఇలాంటి జట్టును అనుభవం లేని కెపె్టన్ చరిత్ అసలంక ఏ మేరకు నడిపిస్తాడో చూడాలి. టాపార్డర్‌లో నిసాంక, కుశాల్ మెండిస్ బౌలింగ్‌లో హసరంగ, పతిరణ తప్ప జట్టులో నిలకడగా ఆడే ఆటగాళ్లే కరువయ్యారు. సొంతగడ్డపై అనుకూలత కూడా టి20లకు ఏమాత్రం అక్కరకు రాదు. కాబట్టి భారత్ యువ ఆటగాళ్లతో ఉన్నా... వారిలో ఐపీఎల్ అపారమైన అనుభవాన్నిచి్చంది. ఈ నేపథ్యంలో శ్రీలంక సిరీస్ గెలిచేందుకు కాదు... మ్యాచ్ నెగ్గేందుకే ప్రతిసారీ యుద్ధం చేయక తప్పదు! జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి, శుబ్‌మన్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సుందర్, అక్షర్, అర్శ్‌దీప్, రవి బిష్ణోయ్/ఖలీల్ అహ్మద్, సిరాజ్. శ్రీలంక: అసలంక (కెప్టెన్), నిసాంక, కుశాల్ మెండిస్, పెరీరా, ఫెర్నాండో, షనక, హసరంగ, తీక్షణ, బినుర ఫెర్నాండో, మదుషంక, పతిరణ. పిచ్, వాతావరణం ఇది స్పిన్ వికెట్. నిలదొక్కుకుంటే 180 పైచిలుకు స్కోరు సాధించవచ్చు. అయితే స్పిన్నర్లతో ఇబ్బందులు తప్పవు. శనివారం పగటివేళ వర్షం కురిసే అవకాశముంది. కానీ రాత్రికల్లా తెరిపినిస్తుందని స్థానిక వాతావరణశాఖ తెలిపింది. -
లంకతో తొలి టీ20.. భారత తుది జట్టులో ఎవరెవరు..?
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 పల్లెకెలె వేదికగా రేపు (జులై 27) జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా సర్వ శక్తులు ఒడ్డనుంది. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు ఫుల్ మెంబర్ జట్టును ఎంపిక చేశారు. టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం భారత్ ఫుల్ మెంబర్ జట్టుతో ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. ఈ సిరీస్‌కు ముందు భారత్ జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడినా అందులో సీనియర్లు ఆడలేదు. సీనియర్లు రాకతో భారత తుది జట్టు ఎంపిక మేనేజ్మెంట్కు పెద్ద సవాల్‌గా మారింది. తుది జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై పెద్ద కసరత్తే చేయాల్సి ఉంది.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌కు ఓపెనర్లుగా లైన్ క్లియర్ అయ్యింది. ఈ సిరీస్‌కు వారిద్దరే స్పెషలిస్ట్ ఓపెనర్లుగా ఎంపికయ్యారు. వన్‌డౌన్‌లో ఎవరిని పంపుతారనే దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ భారత్ సంజూ శాంసన్, రిషబ్ పంత్ ఇద్దరూ బరిలోకి దించితే సంజూ వన్‌డౌన్‌లో రావచ్చు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన మార్కు చూపించుకునే క్రమంలో అక్షర్ పటేల్‌ను వన్‌డౌన్‌లో పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.నాలుగో స్థానంలో నూతన టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఐదో స్థానంలో రిషబ్ పంత్, ఆరో స్థానంలో రింకూ సింగ్, ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఎనిమిదో స్థానంలో శివమ్ దూబే, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి భిష్ణోయ్, పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ తుది జట్టులో ఉండవచ్చు. ఒకవేళ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావిస్తే.. శివమ్ దూబే స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టుకు ఎంపిక కావచ్చు.శ్రీలంకతో తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా)..శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్/రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ -
కుర్రాళ్లు నిలవలేకపోయారు...
ఐపీఎల్ అనుభవంతో జింబాబ్వే గడ్డపై అడుగు పెట్టిన భారత యువ బృందం అంతర్జాతీయ వేదికపై ఆ మెరుపులు చూపించలేకపోయింది. తమతో పోలిస్తే టి20 క్రికెట్లో తక్కువ అనుభవం ఉన్న బలహీన ప్రత్యర్థిని నిలువరించడంలో విఫలమైంది. తమ ప్రధాన ఆటగాళ్లతో బరిలోకి దిగిన జింబాబ్వే ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాపై విజయాన్ని నమోదు చేసింది. తక్కువ స్కోర్ల మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతో సొంత అభిమానుల్లో ఆనందం పంచింది. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన టీమ్‌లోని ఒక్క ఆటగాడు కూడా ఈ మ్యాచ్‌లో ఆడకపోయినా... అధికారిక రికార్డుల ప్రకారం వరల్డ్ చాంపియన్ అయిన తర్వాత భారత్‌కు ఇది ఓటమి! హరారే: సొంత గడ్డపై ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. శనివారం జరిగిన పోరులో జింబాబ్వే 13 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. క్లైవ్ మదాందె (25 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా...మైర్స్ (23), బెన్నెట్ (22), మదివెరె (21) స్కోరులో తలా ఓ చేయి వేశారు. రవి బిష్ణోయ్ (4/13) అంతర్జాతీయ టి20ల్లో తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేయగా, సుందర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుబ్‌మన్ గిల్ (29 బంతుల్లో 31; 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (3/25), చటారా చెరో 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. రెండో టి20 నేడు ఇక్కడే జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. రవి బిష్ణోయ్‌కు 4 వికెట్లు... రెండో ఓవర్లోనే కయా (0) అవుటైనా...ఖలీల్ ఓవర్లో 4 ఫోర్లతో జింబాబ్వే బ్యాటర్లు 17 పరుగులు రాబట్టారు. అయితే ఆ తర్వాత ఈ జోరుకు బ్రేక్ పడింది. బిష్ణోయ్ తన తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లతో జింబాబ్వేను దెబ్బ తీశాడు. 10 ఓవర్లలో స్కోరు 69/3కి చేరింది. ఆ తర్వాత ఒకే స్కోరు వద్ద రెండు వికెట్లు కోల్పోయిన జట్టు 74/5 వద్ద నిలిచింది. కొద్ది సేపటికే సుందర్ కూడా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని పూర్తిగా నిలువరించాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన బిష్ణోయ్ కూడా మరో 2 వికెట్లు పడగొట్టడంతో జింబాబ్వే 100 లోపే ఆలౌట్ అయ్యేలా అనిపించింది. అయితే చటారా, మదాందె కలిసి తర్వాతి 27 బంతులను జాగ్రత్తగా ఆడి అభేద్యంగా 25 పరుగులు జోడించారు. 90/9 నుంచి స్కోరు 115 వరకు చేరింది. మ్యాచ్ తుది ఫలితంతో ఈ చివరి పరుగులే కీలకంగా మారాయి. టపటపా... తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (0) నాలుగు బంతులు ఆడితే, రియాన్ పరాగ్ (2) ఆట మూడు బంతుల్లో ముగిసింది. రుతురాజ్ (7) విఫలం కాగా, రింకూ సింగ్ (0) పేలవంగా నిష్క్రమించాడు. దాంతో స్కోరు 22/4. మరో అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురేల్ (6) విఫలం కావడంతో 9.5 ఓవర్లలో సగం టీమ్ పెవిలియన్‌కు! ఇదీ భారత జట్టు పరిస్థితి. మరో వైపు జాగ్రత్తగా ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. అయితే రజా బౌలింగ్‌లో అతను వెనుదిరగడంతో 47/6 వద్ద భారత్ ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో సుందర్ పోరాడినా లాభం లేకపోయింది. ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా 5 బంతుల్లో 2 పరుగులే చేసిన జట్టు చివరి వికెట్ కోల్పోయింది. స్కోరు వివరాలు: జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెరె (బి) బిష్ణోయ్ 21; కయా (బి) ముకేశ్ 0; బెన్నెట్ (బి) బిష్ణోయ్ 22; రజా (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 17; మయర్స్ (సి) అండ్ (బి) సుందర్ 23; క్యాంప్‌బెల్ (రనౌట్) 0; మదాందె (నాటౌట్) 29; మసకద్జ (స్టంప్డ్) జురేల్ (బి) సుందర్ 0; జాంగ్వే (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 1; ముజరబాని (బి) బిష్ణోయ్ 0; చటారా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–6, 2–40, 3–51, 4–74, 5–74, 6–89, 7–89, 8–90, 9–90. బౌలింగ్: ఖలీల్ 3–0–28–0, ముకేశ్ 3–0–16–1, రవి బిష్ణోయ్ 4–2–13–4, అభిõÙక్ 2–0–17–0, అవేశ్ 4–0–29–1, సుందర్ 4–0–11–2. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) మసకద్జ (బి) బెన్నెట్ 0; గిల్ (బి) రజా 31; రుతురాజ్ (సి) కయా (బి) ముజరబాని 7; పరాగ్ (సి) (సబ్) మవుతా (బి) చటారా 2; రింకూ సింగ్ (సి) బెన్నెట్ (బి) చటారా 0; జురేల్ (సి) మదెవెరె (బి) జాంగ్వే 6; సుందర్ (సి) ముజరబాని (బి) చటారా 27; బిష్ణోయ్ (ఎల్బీ) (బి) రజా 9; అవేశ్ (సి) రజా (బి) మసకద్జా 16; ముకేశ్ (బి) రజా 0; ఖలీల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 102. వికెట్ల పతనం: 1–0, 2–15, 3–22, 4–22, 5–43, 6–47, 7–61, 8–84, 9–86, 10–102. బౌలింగ్: బెన్నెట్ 1–1–0–1, మసకద్జ 3–0–15–1, చటారా 3.5–1–16–3, ముజరబాని 4–0–17–1, జాంగ్వే 4–0–28–1, రజా 4–0–25–3. -
Ind vs Zim: గిల్ కెప్టెన్సీలో కుర్రాళ్లతో కొత్తగా...
టి20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచింది...ఇంకా దేశంలో సంబరాలు, వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు టీమిండియా మరో టి20 పోరుకు రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఆటతో పోలిస్తే ఇది కాస్త భిన్నమైంది. రోహిత్, కోహ్లి, జడేజాల రిటైర్మెంట్ తర్వాత జట్టు కాస్త కొత్తగా కనపడబోతోంది.తమ అవకాశాల కోసం ఎదురు చూస్తూ వచ్చిన యువ ఆటగాళ్ల సత్తాను ప్రదర్శించేందుకు ఇది సరైన వేదిక కానుంది. వరల్డ్ కప్ టీమ్‌లో అవకాశం దక్కించుకోలేకపోయిన గిల్ నాయకత్వ సామర్థ్యానికి కూడా ఈ సిరీస్ పరీక్ష కానుండగా... సొంతగడ్డపై జింబాబ్వేవిజయాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. హరారే: పేరుకే ఇది భారత్‌కు చెందిన ద్వితీయ శ్రేణి జట్టు కావచ్చు. కానీ అగ్రశ్రేణి ఆటగాళ్లందరితో కలిసి ఆడిన, ఎదుర్కొన్న అపార ఐపీఎల్ అనుభవంతో యువ ఆటగాళ్లంతా కూడా అన్ని రకాలుగా సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. వరల్డ్ కప్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు స్వదేశానికి వచ్చిన సామ్సన్, యశస్వి, దూబే తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. మూడో టి20 సమయానికి వీరు జట్టుతో చేరతారు. 2026 టి20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని భారత సెలక్టర్లు సిద్ధం చేయదలిచే బృందంలో కొందరి ప్రదర్శనపై ఇక్కడినుంచే ఒక అంచనాకు రావచ్చు. గిల్ కెప్టెన్సీలో... ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించి సరైన ఫలితాలు రాబట్టలేకపోయిన శుబ్‌మన్ గిల్ తొలి సారి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఓపెనర్‌గా అతనితో పాటు అతని బాల్య మిత్రుడు, అండర్–19 వరల్డ్ కప్ సహచరుడు అభిషేక్ శర్మ ఆడటం ఖాయమైంది. అభిషేక్ కు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది.ఇటీవల ఐపీఎల్లో భీకర ఫామ్‌తో అదరగొట్టిన అభిõÙక్ ఇక్కడ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. మూడో స్థానంలో రుతురాజ్ ఖాయం కాగా, రియాన్ పరాగ్ కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వరల్డ్ కప్‌లో రిజర్వ్‌గా ఉండి ఆడే అవకాశం రాని రింకూ సింగ్‌పై కూడా అందరి దృష్టీ నిలిచింది. తన దూకుడును ప్రదర్శించేందుకు రింకూకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. బౌలింగ్‌లో కూడా ఐపీఎల్లో ఆకట్టుకున్న ఖలీల్, అవేశ్, బిష్ణోయ్‌లపై జట్టు ఆధారపడుతోంది. ప్రతిభ ఉన్నా...వరుస గాయాలతో పదే పదే సీనియర్ జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కీపర్‌గా తొలి ప్రాధాన్యత జురేల్‌కు దక్కవచ్చు. ఈ మ్యాచ్‌లో భారత్‌నుంచి ఎంత మంది అరంగేట్రం చేస్తారనేది ఆసక్తికరం. రజాపైనే భారం... జింబాబ్వే కూడా కొత్త కుర్రాళ్లపైనే దృష్టి పెట్టింది. అందుకే సీనియర్లలో ర్యాన్ బర్ల్పై వేటు వేసిన జట్టు సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఇర్విన్లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చి0ది. డ్రగ్స్ వాడిన ఆరోపణలతో నాలుగు నెలలు సస్పెన్షన్‌కు గురైన మదవెర్, మవుతా తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే కెప్టెన్ సికందర్ రజాపైనే జింబాబ్వే ప్రధానంగా ఆధారపడుతోంది. ఇటీవల వైటాలిటీ బ్లాస్ట్‌లో చెలరేగిన అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. మసకద్జ, ముజరబానిలనుంచి అతనికి సహకారం అందాల్సి ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్ ), అభిషేక్, రుతురాజ్, పరాగ్, రింకూ, జురేల్, సుందర్, బిష్ణోయ్, అవేశ్, తుషార్, ఖలీల్ జింబాబ్వే: రజా (కెప్టెన్ ), బెనెట్, మరుమని, క్యాంప్‌బెల్, నక్వి, మదాందే, మదవెర్, జాంగ్వే, ఫరాజ్, మసకద్జ, ముజరబాని పిచ్, వాతావరణం నెమ్మదైన పిచ్. భారీ స్కోర్లకు అవకాశం లేదు. గత 12 మ్యాచ్‌లలో 5 సార్లు మాత్రమే స్కోరు 150 పరుగులు దాటింది. పొడి వాతావరణం. వర్ష సూచన లేదు. 8 భారత్, జింబాబ్వే మధ్య 8 టి20లు జరిగాయి. 6 భారత్ గెలవగా, 2 జింబాబ్వే గెలిచింది. -
క్లీన్‌స్వీప్ లక్ష్యంగా...
చెన్నై: ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసి... ఏకైక టెస్టులో ఘనవిజయం సాధించి... జోరు మీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 సిరీస్‌నూ దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్ జరుగుతుంది. బలాబలాలను పరిశీలిస్తే దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లోనూ భారత్‌దే పైచేయి ఉండటం ఖాయమనిపిస్తోంది. వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన... ఏకైక టెస్టులో డబుల్ సెంచరీతో మెరిసిన షఫాలీ వర్మ అదే జోరును టి20 సిరీస్‌లోనూ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో పేసర్లు రేణుక సింగ్, అరుంధతి రెడ్డి... స్పిన్నర్లు ఆశా శోభన, శ్రేయాంక పాటిల్ కీలకం కానున్నారు. దక్షిణాఫ్రికా అవకాశాలన్నీ కెపె్టన్ లౌరా వొల్వార్ట్, మరిజన్ కాప్, సునె లుస్ ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయి. -
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
బంగ్లాదేశ్‌తో ఆదివారం సిల్హెట్లో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 44 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులు చేసింది. యస్తిక భాటియా (36; 6 ఫోర్లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30; 4 ఫోర్లు), షఫాలీ వర్మ (31; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 101 పరుగులకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (3/18), పూజ వస్త్రకర్ (2/25) బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. రెండో టి20 మంగళవారం జరుగుతుంది. -
నేడు పాక్, కివీస్ తొలి టి20
రావల్పిండి: టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్ జట్టు తో పాకిస్తాన్ ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ లో పోటీపడేందుకు సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో బ్రేస్‌వెల్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టుతో బాబర్ ఆజమ్ సారంథ్యంలోని పాకిస్తాన్ జట్టు తలపడు తుంది. తొలి మూడు మ్యాచ్‌లు రావల్పిండిలో, చివరి రెండు మ్యాచ్‌లు లాహోర్‌లో జరుగుతాయి. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌లను ఫ్యాన్‌కోడ్ యాప్‌లో తిలకించవచ్చు. -
చెత్త ప్రదర్శనతో విసుగు తెప్పించిన శ్రీలంక బౌలర్.. ఏకంగా 36 బంతులు
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మొదటి మ్యాచ్‌లో శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ చెత్త బౌలింగ్ ప్రదర్శనతో విసుగు తెప్పించాడు. టీ20 మ్యాచ్‌లో ఓ బౌలర్ 24 బంతులు వేయాల్సి ఉండగా.. పతిరణ ఏకంగా 36 బంతులు వేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. పతిరణ తన నాలుగు ఓవర్ల కోటాలో తొమ్మిది వైడ్లు, మూడు నో బాల్స్ వేసి 56 పరుగులు సమర్పించుకున్నాడు. తన తొలి ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన పతిరణ.. తన స్పెల్ రెండో ఓవర్లో 2 నో బాల్‌లు, 3 వైడ్లు.. మూడో ఓవర్లో 6 వైడ్లు.. నాలుగో ఓవర్లో నో బాల్ సహా మూడు బౌండరీలు సమర్పించుకుని చెత్త గణాంకాలు నమోదు చేశాడు. పతిరణ.. ఈ చెత్త ప్రదర్శనను తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఎలాగోలా విజయం సాధించి కాబట్టి సరిపోయింది. లేకపోతే లంక అభిమానులు పతిరణను ఆట ఆడుకునే వారు. ఓ అంతర్జాతీయ స్థాయి బౌలర్ ఒక్క మ్యాచ్‌లో ఇన్ని బంతులు వేస్తాడా అని ఏకి పారేసేవారు. కాగా, 207 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ శ్రీలంకకు ముచ్చెమటలు పట్టించింది. ఆతిథ్య జట్టు లక్ష్యానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులకే పరిమితమైంది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (59), సమరవిక్రమ (61 నాటౌట్) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో అసలంక (44 నాటౌట్) బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేశాడు. భారీ లక్ష్య ఛేదనలో తొలుత తడబడ్డ బంగ్లాదేశ్.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మహమదుల్లా (54), జాకిర్ అలీ (68) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడటంతో లక్ష్యం దిశగా పయనించింది. వీరికి పతిరణ చెత్త బౌలింగ్ కూడా తోడవ్వడంతో బంగ్లాదేశ్ సునాయాసంగా గెలుస్తుందని అనిపించింది. అయితే షనక ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి బంగ్లా గెలుపును అడ్డుకున్నాడు. -
ఆసీస్‌ను గెలిపించిన టిమ్ డేవిడ్
వెల్లింగ్టన్: ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన తొలి టి20 మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు ఆ్రస్టేలియాను గెలిపించాయి. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ పోరులో ఆ్రస్టేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా కివీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీస్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) తక్కువే చేసినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) కెపె్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. 17వ ఓవర్ ఆఖరి బంతికి హిట్టర్ టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు ఆసీస్ గెలిచేందుకు 19 బంతుల్లో 44 పరుగులు కావాలి. కాసేపటికే అది కాస్తా 9 బంతుల్లో 32 పరుగుల సమీకరణం కష్టంగా మారింది. ఈ దశలో మిల్నే వేసిన 19వ ఓవర్ ఆఖరి మూడు బంతుల్ని డేవిడ్ 4, 6, 6లుగా బాదేశాడు. దాంతో చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన సౌతీ వైడ్ సహా 3 బంతుల్లో 4 పరుగులే ఇచ్చాడు. ఇక మిగిలిన 3 బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా... డేవిడ్ 6, 2, 4లతో ఆసీస్ జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టి20 మ్యాచ్ శుక్రవారం ఆక్లాండ్‌లో జరుగుతుంది. -
శివాలెత్తిన మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్.. భారీ స్కోర్‌ను ఊదేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. కాన్వే, రచిన్ మెరుపు అర్దశతకాలు.. ఓపెనర్ డెవాన్ కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (19 నాటౌట్), మార్క్ చాప్మన్ (18 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. శివాలెత్తిన మార్ష్, డేవిడ్.. 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మార్ష్, టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి (4 వికెట్ల నష్టానికి) విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిగతా ఆటగాళ్లు కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్రవిస్ హెడ్ 24, డేవిడ్ వార్నర్ 32, మ్యాక్స్‌వెల్ 25, ఇంగ్లిస్ 20 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 2, ఆడమ్ మిల్నే, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. బౌండరీ కొట్టి గెలిపించిన డేవిడ్.. చివరి మూడు బంతుల్లో (సౌథీ బౌలింగ్‌లో) 12 పరుగులు అవసరం కాగా.. టిమ్ డేవిడ్ వరసగా 6, 2, 4 పరుగులు స్కోర్ చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓవర్లో మార్ష్, డేవిడ్ కలిపి 16 పరుగులు సాధించారు. అంతకుముందు ఓవర్లో (19) కూడా టిమ్ డేవిడ్ వీర బాదుడు బాదాడు. మిల్నే వేసిన ఈ ఓవర్లో డేవిడ్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. -
వందో మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన వార్నర్.. తొలి టీ20 ఆసీస్‌దే
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో విండీస్ చివరివరకు అద్భుతంగా పోరాడింది. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఎంతటి భారీ స్కోర్లనైనా ఛేదిస్తుందని అనిపించింది. జట్టులో దాదాపుగా అందరూ బ్యాట్‌తో మెరుపులు మెరిపించగల సమర్ధులే. ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్నా విండీస్ ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెరీర్లో వందో మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ (70) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ (39), టిమ్ డేవిడ్ (37 నాటౌట్), వేడ్ (21) వేగంగా పరుగులు సాధించగా.. మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్‌వెల్ (10), స్టోయినిస్ (9), అబాట్ (0) నిరాశపరిచారు. విండీస్ బౌలరల్లో రసెల్ 3 వికెట్లు, అల్జరీ జోసఫ్ 2, హోల్డర్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. నిర్ణీత ఓవర్లలో 202 పరుగులకు పరిమితమై (8 వికెట్లు కోల్పోయి) 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (53), జాన్సన్ చార్లెస్ (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చివారు తుస్సుమనిపించడంతో విండీస్ చేతులెత్తేసింది. ఆఖర్లో జేసన్ హోల్డర్ (34 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి విండీస్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. పూరన్ (18), పావెల్ (14), హోప్ (16), రసెల్ (1), రూథర్‌ఫోర్డ్ (7), షెపర్డ్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, స్టోయినిస్ 2, బెహ్రెన్‌డార్ఫ్, మ్యాక్స్‌వెల్, అబాట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఫిబ్రవరి 11న అడిలైడ్‌లో జరుగనుంది. -
విధ్వంసం సృష్టించిన డేవిడ్ వార్నర్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్లో 100వ టీ20 ఆడుతున్న వార్నర్.. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో మెరుపు హాఫ్ సెంచరీ బాది ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. వార్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ఆసీస్ 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జోష్ ఇంగ్లిస్ 39 పరుగులు (5 ఫోర్లు, సిక్స్) చేసి ఔట్ కాగా.. వార్నర్ (57), మిచెల్ మార్ష్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లిస్ వికెట్ జేసన్ హోల్డర్‌కు దక్కింది. 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 110/1గా ఉంది. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ కోవిడ్‌తో బాధపడుతున్నప్పటికీ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. కోవిడ్ నిర్ధారణ కావడంతో మార్ష్‌కు బదులు వార్నర్ టాస్కు వచ్చాడు. Mitchell Marsh is leading Australia but as he is COVID positive, David Warner came for the toss. pic.twitter.com/MBBgZ1z6RE — Johns. (@CricCrazyJohns) February 9, 2024 ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనున్నాయి -
NZ Vs PAK 1st T20: షాహీన్ అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్
పాకిస్తాన్ స్టార్ పేసర్, ఆ జట్టు కొత్త కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చుక్కలు చూపించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అలెన్ ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఆతర్వాత హ్యాట్రిక్ బౌండరీలు, ఆ వెంటనే సిక్సర్ బాదాడు. ఆఖరి బంతి డాట్ బాల్ అయ్యింది. ఆమిర్ జమాల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో రెండో బంతిని సైతం సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి ఓవర్లో మరో అఫ్రిది (అబ్బాస్ అఫ్రిది) అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరుకు అడ్డుకట్ట వేసి అతన్ని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కివీస్.. 11.2 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అలెన్, డెవాన్ కాన్వే (0) ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ (57), డారిల్ మిచెల్ (31) క్రీజ్‌లో ఉన్నారు. అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 417 రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20ల బరిలోకి దిగి హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. -
పాకిస్తాన్‌తో తొలి టీ20కి ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (జనవరి 12) జరిగే తొలి టీ20కి ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ కోవిడ్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న సాంట్నర్ జట్టులో లేకపోవడం కివీస్‌కు పెద్ద లోటు. సాంట్నర్‌ను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించినట్లు క్రికెట్ న్యూజిలాండ్ పేర్కొంది. కాగా, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి దేశంలో ఎలాంటి అంక్షలు లేనప్పటికీ.. ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. 🚨NEWS ALERT🚨: Mitchell Santner has been ruled out of the first T20I against Pakistan after testing positive for Covid. pic.twitter.com/lCFttMZzpQ — CricTracker (@Cricketracker) January 12, 2024 ఇదిలా ఉంటే, ఆక్లాండ్ వేదికగా ఇవాళ న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 11: 30 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ ఫుల్‌టైమ్ టీ20 జట్టు కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదికి ఇది తొలి మ్యాచ్ కాగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చాలాకాలం తర్వాత టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీపర్), డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్ పాకిస్తాన్: మొహ్మమద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), షాహీన్ అఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, జమాన్ ఖాన్, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రర్ అహ్మద్, సాహిబ్జాదా ఫర్హాన్, అబ్బాస్ అఫ్రిది, హసీబుల్లా ఖాన్ -
పొట్టి ఫార్మాట్లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్ ఈ ఘనతను కేవలం 149 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఖాతా తెరవకుండానే ఔటైనా అతని ఖాతాలో ప్రపంచ రికార్డు చేరడం విశేషం. Players to be part of most wins in T20I history: 1) Rohit Sharma - 100* 2) Shoaib Malik - 86 Hitman created history in Mohali. pic.twitter.com/x7UkiRwMUv — Johns. (@CricCrazyJohns) January 11, 2024 ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ (111) పేరిట ఉండగా.. పురుషుల క్రికెట్లో రోహిత్ తర్వాత ఈ రికార్డు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ (124 మ్యాచ్‌ల్లో 86 విజయాలు) పేరిట ఉంది. రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20 విజయాల్లో భాగమైన ఘనత విరాట్ కోహ్లి (115 మ్యాచ్‌ల్లో 73 విజయాలు) సొంతం చేసుకున్నాడు. ఆఫ్ఘన్‌తో తొలి టీ20లో విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ కెప్టెన్‌గానూ అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో టీమిండియా కేవలం 52 మ్యాచ్‌ల్లోనే 40 విజయాలు సాధించింది. Rohit Sharma has 40 wins from just 52 games in T20I as a captain 🇮🇳 - One of the most successful captains in T20I history. pic.twitter.com/Tpas68JN4M — Johns. (@CricCrazyJohns) January 12, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. శివమ్ దూబే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (1/9, 60 నాటౌట్) చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ (42) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించగా.. గుర్బాజ్ (23), కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (25), అజ్మతుల్లా (29), నజీబుల్లా (19 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం ఛేదనలో భారత్ ఖాతా తెరవకుండానే రోహిత్ (0) వికెట్ కోల్పోయినా కుర్రాళ్లు జట్టును గెలిపించారు. శుభ్‌మన్ గిల్ (23), తిలక్ వర్మ (26), శివమ్ దూబే (60 నాటౌట్), జితేశ్ శర్మ (31 ), రింకూ సింగ్ (16 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ 2, ఒమర్జాయ్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 ఇండోర్ వేదికగా జనవరి 14న జరుగనుంది. -
IND Vs AFG, 1st T20I: కుర్రాళ్లు గెలిపించారు
విరాట్ కోహ్లి ఆడలేదు... రోహిత్ శర్మ విఫలమయ్యాడు... అయినా సరే యువ ఆటగాళ్ల ప్రదర్శనతో భారత్ విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్‌తో పోరులో అక్కడక్కడా కాస్త శ్రమించినా... చివరకు గెలుపు టీమిండియాదే అయింది. ముందుగా అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌లో శివమ్ దూబే మెరుపులు జట్టును సిరీస్‌లో ఆధిక్యంలో నిలిపాయి. అఫ్గాన్ ఆటగాళ్లు కొంత పోరాడినా... మంచు ప్రభావంతో పాటు ఒత్తిడిలో ఆ జట్టు చిత్తయింది. మొహాలి: అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. గురువారం జరిగిన తొలి పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. నబీ (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా, జితేశ్ శర్మ (20 బంతుల్లో 31; 5 ఫోర్లు) రాణించాడు. నబీ మెరుపులు... అఫ్గాన్‌కు ఓపెనర్లు ఇబ్రహీమ్ జద్రాన్ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), గుర్బాజ్ (28 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగైన ఆరంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 48 బంతుల్లో 50 పరుగులు జోడించారు. 1 పరుగు వద్ద ఇబ్రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను దూబే వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. అయితే ఒకే స్కోరు వద్ద వీరిద్దరిని అవుట్ చేసి భారత్ పైచేయి సాధించింది. తొలి అంతర్జాతీయ టి20 ఆడుతున్న రహ్మత్ షా (3) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నబీ, అజ్మతుల్లా (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యంతో అఫ్గాన్ కోలుకుంది. ముఖ్యంగా నబీ దూకుడు ప్రదర్శించడంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. రవి బిష్ణోయ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు రాగా... ముకేశ్ వేసిన తర్వాతి ఓవర్లో నబీ 2 సిక్స్‌లు బాదాడు. నబీ, అజ్మతుల్లా నాలుగో వికెట్‌కు 43 బంతుల్లో 68 పరుగులు జత చేయగా... ముకేశ్ ఒకే ఓవర్లో వీరిని పెవిలియన్ పంపించాడు. చివరి 2 ఓవర్లలో అఫ్గాన్ 6 ఫోర్లతో 28 పరుగులు రాబట్టింది. రోహిత్ డకౌట్... ఛేదనలో రెండో బంతికే భారత్‌కు అనూహ్య షాక్ తగిలింది. శుబ్‌మన్ గిల్ (12 బంతుల్లో 23; 5 ఫోర్లు)తో సమన్వయ లోపంతో కెపె్టన్ రోహిత్ శర్మ (0) రనౌట్‌గా వెనుదిరిగాడు. మిడాఫ్ దిశగా ఆడిన రోహిత్ సింగిల్ కోసం దూసుకుపోగా, గిల్ ఏమాత్రం స్పందించకుండా తన క్రీజ్‌లోనే ఉండిపోయాడు. దాంతో డకౌట్ అయిన రోహిత్ తన సహచరుడిపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వెనుదిరిగాడు. ఆ తర్వాత కొన్ని చక్కటి బౌండరీలు కొట్టిన గిల్ అదే జోరులో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. భారీ షాట్లు ఆడటంలో తడబడిన తిలక్ వర్మ (22 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో దూబే, జితేశ్ భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. అఫ్గాన్ పేలవ ఫీల్డింగ్ కూడా భారత్‌కు సానుకూలంగా మారింది. జితేశ్ వెనుదిరిగినా... రింకూ సింగ్ (9 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో దూబే మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (స్టంప్డ్) జితేశ్ (బి) అక్షర్ 23; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) దూబే 25; అజ్మతుల్లా (బి) ముకేశ్ 29; రహ్మత్ (బి) అక్షర్ 3; నబీ (సి) రింకూ (బి) ముకేశ్ 42; నజీబుల్లా (నాటౌట్) 19; కరీమ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–50, 2–50, 3–57, 4–125, 5–130. బౌలింగ్: అర్ష్‌దీప్ 4–1–28–0, ముకేశ్ 4–0–33–2, అక్షర్ 4–0–23–2, సుందర్ 3–0–27–0, దూబే 2–0–9–1, బిష్ణోయ్ 3–0–35–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రనౌట్) 0; శుబ్‌మన్ గిల్ (స్టంప్డ్) గుర్బాజ్ (బి) ముజీబ్ 23; తిలక్ (సి) గుల్బదిన్ (బి) అజ్మతుల్లా 26; శివమ్ దూబే (నాటౌట్) 60; జితేశ్ శర్మ (సి) ఇబ్రహీమ్ (బి) ముజీబ్ 31; రింకూ సింగ్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (17.3 ఓవర్లలో 4 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–0, 2–28, 3–72, 4–117. బౌలింగ్: ఫారుఖీ 3–0–26–0, ముజీబ్ 4–1–21–2, మొహమ్మద్ నబీ 2–0–24–0, నవీన్ 3.3–0–43–0, అజ్మతుల్లా 4–0–33–1, గుల్బదిన్ 1–0–12–0. -
పంత్ ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా టీ20 వరల్డ్‌కప్ ఆడాలి..!
టీమిండియా చిచ్చరపిడుగు రిషబ్ పంత్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని అన్నాడు. ఫార్మాట్ ఏదైనా పంత్ గేమ్ ఛేంజర్ అని, అందుకే అతను ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా జట్టులోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపాడు. నేను సెలెక్టర్‌ను అయితే ఈ పనిని తప్పక చేస్తానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దీని ముందు గవాస్కర్ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశిస్తూ కూడా పలు కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో కేఎల్ రాహుల్ కూడా వికెట్‌కీపింగ్ కమ్ బ్యాటింగ్‌కు బెస్ట్ ఛాయిసే. అయినా నా ఓటు మాత్రం పంత్‌కే అని అన్నాడు. పంత్ అందుబాటులో ఉన్నంత కాలం అతనే తన ఫస్ట్ ఛాయిస్ అని తెలిపాడు. ఒకవేళ పంత్ అందుబాటులో లేకపోతే మాత్రం తన ఓటు కేఎల్ రాహుల్‌కు ఉంటుందని చెప్పిన గవాస్కర్.. రాహుల్ వల్ల టీమిండియా సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. రాహుల్ వికెట్‌కీపింగ్ చేస్తూ మిడిలార్డర్లో అయినా ఓపెనర్‌గా అయినా సింక్ అవుతాడని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో జరిగిన గేమ్ ప్లాన్ అనే షోలో గవాస్కర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, 2022 చివర్లో జరిగిన కార్ యాక్సిడెంట్లో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిని విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీమిండియా సిరీస్‌కు ఒకరు చొప్పున పార్ట్‌టైమ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లతో నెట్టుకొస్తుంది. ఇటీవలి కాలంలో కేఎల్ రాహుల్ ఈ పాత్రలో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అతను పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడటంతో పాటు అద్భుతంగా వికెట్‌కీపింగ్ చేశాడు. పంత్ తిరిగి జట్టులోకి వస్తే రాహుల్ కేవలం బ్యాటింగ్ వరకు మాత్రమే పరిమితం కావచ్చు. ఏడాదికి పైగా జట్టుకు దూరంగా ఉంటున్న పంత్.. ఈ ఏడాది ఐపీఎల్ సమయానికంతా పూర్తి ఫిట్నెస్ సాధించి బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాల్టి నుంచి ప్రారంభంకాబోయే టీ20 సిరీస్ కోసం భారత సెలెక్టర్లు రాహుల్‌ను కానీ ఇషాన్ కిషన్‌ను కాని వికెట్కీపర్లుగా ఎంపిక చేయలేదు. ఈ జట్టులో వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపిక చేయబడ్డారు. రాహుల్, ఇషాన్‌లకు రెస్ట్ ఇచ్చినట్లు సెలెక్టర్లు చెబుతున్నారు. మొహాలీ వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఇవాళ రాత్రి 7 గంటలకు తొలి టీ20 ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల చేత కోహ్లి తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు. -
India Vs Afghanistan T20I: టీమిండియాతో తొలి టీ20.. ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ షాక్
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ భారత్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సిరీస్ కోసం రషీద్ జట్టుతో పాటు భారత్‌కు విచ్చేసినప్పటికీ.. గాయం పూర్తిగా తగ్గకపోవడంతో సెలెక్టర్లు అతన్ని తిరిగి ఇంటికి పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇదే గాయం కారణంగా రషీద్ బిగ్‌బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. రషీద్ భారత్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ప్రకటించాడు. కాగా, రషీద్ వన్డే వరల్డ్‌కప్ అనంతరం వెన్నెముక సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-ఆఫ్ఘనిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి ప్రారంభంకానుంది. మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ అనంతరం జనవరి 14న రెండో టీ20 (ఇండోర్), జనవరి 17న (బెంగళూరు) మూడో టీ20 జరుగనున్నాయి. తొలి టీ20కి కోహ్లి దూరం.. చాలాకాలంగా టీ20ల్లో తన బ్యాటింగ్ చూడాలని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన అభిమానులకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఊహించని షాక్ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాల చేత అతను ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20కి దూరమయ్యాడు. కోహ్లి రెండో టీ20 నుంచి తిరిగి అందుబాటులోకి వస్తాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు. -
భారత మహిళల విజయగర్జన
ముంబై: ఆ్రస్టేలియా మహిళలతో వన్డే సిరీస్‌ను 0–3తో చేజార్చుకున్న భారత జట్టు టి20 సిరీస్‌లో మెరుపు విజయంతో శుభారంభం చేసింది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో ఆసీస్‌ను కట్టడి చేసిన మన జట్టు... ఆపై అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబర్చింది. శుక్రవారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన తొలి టి20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 19.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. 2020 టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత ఆసీస్ జట్టు మళ్లీ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. ఫోబీ లిచ్‌ఫీల్డ్ (32 బంతుల్లో 49 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలైస్ పెరీ (30 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. పవర్‌ప్లే ముగిసేసరికి 33/4 స్కోరుతో ఆసీస్ ఇబ్బందుల్లో పడిన స్థితిలో లిచ్‌ఫీల్డ్, పెరీ ఐదో వికెట్‌కు 52 బంతుల్లోనే 79 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. యువ పేస్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిటాస్ సాధు (4/17) పదునైన బంతులతో ప్రత్యర్థిని కుప్పకూల్చగా... శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (44 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్మృతి మంధాన (52 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 93 బంతుల్లోనే 137 పరుగులు జోడించడం విశేషం. తొలి ఓవర్లో ఎక్స్‌ట్రాల రూపంలోనే 14 పరుగులు రావడంతో మొదలైన ఛేదనలో చివరి వరకు భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ముఖ్యంగా గత రెండు వన్డేల్లో తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన షఫాలీ ఇప్పుడు మళ్లీ అవకాశం రాగానే చెలరేగిపోయింది. విజయానికి ఐదు పరుగుల దూరంలో స్మృతి వెనుదిరిగినా... షఫాలీతో కలిసి జెమీమా (6 నాటౌట్) మ్యాచ్ ముగించింది. సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా, రెండో మ్యాచ్ ఆదివారం ఇదే మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో స్మృతి అంతర్జాతీయ టి20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకొని హర్మన్‌ప్రీత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచింది. -
పరాజయంతో ప్రారంభం
ముంబై: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. బుధవారం వాంఖెడె మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 38 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. హీతెర్ నైట్ సారథ్యంలోని ఇంగ్లండ్ ఈ గెలుపుతో సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్ ఇదే వేదికపై శనివారం జరుగుతుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. రేణుక సింగ్ తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో సోఫీ డంక్లీ, అలీస్ క్యాప్సీలను అవుట్ చేసింది. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ ఇంగ్లండ్‌ను డానియల్ వైట్ (47 బంతుల్లో 75; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నాట్ సివర్ బ్రంట్ (53 బంతుల్లో 77; 13 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. మూడో వికెట్‌కు 138 పరుగులు జోడించి ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. భారత బౌలర్లలో రేణుక సింగ్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి ఓడిపోయింది. షఫాలీ వర్మ (42 బంతుల్లో 52; 9 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ (3/15) భారత్‌ను కట్టడి చేసింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సోఫియా డంక్లీ (బి) రేణుక సింగ్ 1; డానియల్ వైట్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) సైకా ఇషాక్ 75; అలీస్ క్యాప్సీ (బి) రేణుక సింగ్ 0; నాట్ సివర్ బ్రంట్ (సి) రిచా ఘోష్ (బి) రేణుక సింగ్ 77; హీతెర్ నైట్ (బి) శ్రేయాంక పాటిల్ 6; అమీ జోన్స్ (సి) జెమీమా (బి) శ్రేయాంక పాటిల్ 23; ఫ్రెయా కెంప్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 197. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–140, 4–165, 5–177, 6–197. బౌలింగ్: రేణుక 4–0–27–3, పూజ 4–0–44–0, సైకా ఇషాక్ 4–0–38–1, దీప్తి శర్మ 3–0–28–0, శ్రేయాంక 4–0–44–2, కనిక అహుజా 1–0–12–0. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) సారా గ్లెన్ (బి) సోఫీ ఎకిల్‌స్టోన్ 52; స్మృతి మంధాన (బి) నాట్ సివర్ బ్రంట్ 6; జెమీమా రోడ్రిగ్స్ (సి) అమీ జోన్స్ (బి) ఫ్రెయా కెంప్ 4; హర్మన్‌ప్రీత్ కౌర్ (బి) సోఫీ ఎకిల్‌స్టోన్ 26; రిచా ఘోష్ (సి) అలీస్ క్యాప్సీ (బి) సారా గ్లెన్ 21; కనిక అహుజా (సి) నాట్ సివర్ బ్రంట్ (బి) సోఫీ ఎకిల్‌స్టోన్ 15; పూజ వస్త్రకర్ (నాటౌట్) 11; దీప్తి శర్మ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–20, 2–41, 3–82, 4–122, 5–134, 6–151. బౌలింగ్: మహికా గౌర్ 2–0–18–0, లారెన్ బెల్ 4–0–35–0, నాట్ సివర్ బ్రంట్ 4–0–35–1, ఫ్రెయా కెంప్ 2–0–30–1, సోఫీ ఎకిల్‌స్టోన్ 4–0–15–3, సారా గ్లెన్ 4–0–25–1.