Folk Singer
-
సింగర్ శృతి మృతికి కారణం అదే..?
-
ఇన్‌స్టాతో పాపులర్.. ఫోక్ సింగర్ 'శృతి' ఆత్మహత్య
ఇన్‌స్టాగ్రామ్‌తో సోషల్‌మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడటం ఆమె ఫాలోవర్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఎక్కువగా జానపదాలు పాడుతూ ఎందరినో అభిమానులను సంపాదించుకుంది. జీవితంలో పెద్ద సింగర్ కావాలని ఎన్నో కలలు కన్నది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సంగీత కార్యక్రమాలు జరిగినా సింగర్ శృతి తప్పకుండా కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు.ఇన్‌స్టాగ్రామ్‌తో పరిచయమై.. మూడు ముళ్లతో ఒకటై.. పట్టుమని నెల గడవకముందే నవ వధువు సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి ఎర్ర భిక్షపతి, సత్యమ్మ దంపతుల కుమారుడు ఎర్ర దయాకర్ హైదరాబాద్‌లో క్యాబ్ నడపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తిమ్మాపూర్ గ్రామానికి శ్యామల, రమేశ్ కుతూరు, ఫోక్ సింగర్(యూట్యూబ్) శృతి (26) ఇన్‌స్టాగ్రామ్‌లో పేరడి పాటలతో ఫేమస్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్ వల్ల ఇద్దరి మధ్య కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడి ప్రేమపెళ్లి వరకు వచ్చింది. ఇద్దరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలిసింది. యువతి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల కారణంగా పెళ్లికి కొద్ది రోజులు ఆగాలని చెప్పడంతో వేచి చూశారు. కానీ అనివార్య కారణాల వల్ల నవంబర్ 27న పీర్లపల్లి గ్రామంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే, వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు, బంధువులు హాజరు కాలేదు. నవ దంపతులు పీర్లపల్లిలోనే ఉంటున్నారు. బుధవారం గ్రామంలోనే దయాకర్ వాళ్ల కులానికి చెందిన వారి దశదినకర్మకి తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో శృతిని కూడా తీసుకెళ్లడానికి దయాకర్ ఇంటికి రాగా ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికులకు, శృతి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.నాలుగు నెలల గర్భిణిప్రస్తుతం శృతి నాలుగు నెలల గర్భిణి కాగా ఇంటి వద్దనే ఉంటుంది. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వరకట్నం కోసమే శృతిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద ఇరువురి కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు సముదాయించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. -
ప్రముఖ ఫోక్ సింగర్‌పై అత్యాచార కేసు.. యువతి ఫిర్యాదు
యూట్యూబ్‌లో తన పాటలతో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సుద్దాల మల్లిక్ తేజ ఎన్నో పాటలు రచించడమే కాకుండా పాడటం కూడా జరిగింది. ఆయన ఎక్కువగా జానపద గీతాలు, ఫోక్ సాంగ్స్, తెలంగాణ ప్రాంతీయ పాటలతో ఫేమస్ అయ్యాడు. ఆయన పాటలకు అత్యధిక వ్యూస్ కూడా ఉన్నాయి.జగిత్యాలకు చెందిన ఒక యువతికి సింగర్‌గా అవకాశం ఇచ్చాడు. ఆమెతో కలిసి మల్లిక్ తేజ్ చాలా సాంగ్స్ పాడటం కూడా జరిగింది. వారిద్దరూ హైదరాబాద్, దుబాయ్‌తో పాటు పలుచోట్లు అనేక ఈవెంట్లు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో మల్లిక్ తేజ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని జగిత్యాల పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఛాన్సుల పేరుతో తనను వేధిస్తున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తనకు సంబంధించిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ మార్చేసి పలు ఇబ్బందులు పెడుతున్నట్లు బాధితురాలు తెలుపుతుంది. బ్లాక్ మెయిల్ చేసి స్టూడియోలోనే తనపై మల్లిక్ తేజ్ అత్యాచారం చేశాడని ఆమె పేర్కొంది. తరచూ ఫోన్ చేసి వేధిస్తూన్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. చిత్రపరిశ్రమ, సోషల్‌మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న వారిపై ఇలాంటి కేసులే నమోదయిన విషయం తెలిసిందే. వారిలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒకరు కాగా.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి ఉన్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న 'పల్సర్ బైక్' రమణ.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్
పల్సర్ బైక్ సాంగ్‌తో ఫుల్ ఫేమస్ అయ్యాడు జానపద కళాకారుడు సింగర్ రమణ. ఈ పల్సర్ బైక్ సాంగ్‌ను రవితేజ ధమాకా మూవీలోనూ వాడేశారు. ఈ ఒక్కటేనా.. 'పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో..', 'వస్తావా.. భాను వస్తావా..' ఇలా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడాడు. బుల్లితెర షోలలో, ఈవెంట్లలో పాటలు పాడుతూ ఊహించని స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ మధ్య బేబి 2 పేరుతో ఓ షార్ట్ ఫిలిం కూడా చేశాడు. తన జీవితంలో జరిగిన రియల్ బ్రేకప్ స్టోరీ ఆధారంగా ఈ లఘు చిత్రాన్ని తీసినట్లు తెలిపాడు. ఇకపోతే రమణ ఓ శుభవార్త చెప్పాడు. త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించాడు. డిసెంబర్ నెలాఖరులో అతడి ఎంగేజ్మెంట్ జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. కుందన శ్రీ అనే అమ్మాయితో అతడి నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ స్టేజీపై ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుని ఫోటోలకు పోజిచ్చారు. పనిలో పనిగా ఎంగేజ్మెంట్ వేదికపైనే ప్రీవెడ్డింగ్ షూట్ కూడా పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్‌గా మారగా కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. చదవండి: అమ్మ మరణం.. రోదిస్తూ గదిలోకి వెళ్లా.. ఎమోషనలైన శ్రీదేవి పెద్ద కూతురు -
అప్పటికే సూపర్ స్టార్,రెండో పెళ్లి.. ఇప్పటికీ మిస్టరీగా చమ్కీలా మరణం
మనసులో పుట్టిన మాటలకు బాణీ కట్టి రాగం అందుకుంటే, అది మహామహా జనసందోహాలను కూడా ఏకం చేసి ఉరకలేయిస్తుంది. సై.. సై.. అంటూ ఉర్రూతలూగిస్తుంది. విప్లవాలను, ఉద్యమాలను, సంస్కరణలను జతచేర్చి.. తరతరాలకు పాఠమవుతుంది. అయితే అదే రాగం కొందరికి చేదును, మరికొందరికి చికాకును ఇంకొందరిలో అసూయనూ రగిలించి నిప్పు రాజేస్తుంది. ఆ నిప్పే కాల్చేసిందో, లేక అంతటి ఔదార్యమున్న కలానికి కులం రంగు అద్దిన ఉన్మాదమే కడతేర్చిందో.. తెలియదు కానీ అమర్ సింగ్ చమ్కీలా జీవితంలో పెద్ద ఉపద్రవమే ముంచుకొచ్చింది. అసలు ఎవరీ చమ్కీలా? ఏం జరిగింది? భారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. చమ్కీలా అంటే పంజాబీలో ప్రకాశవంతమైనదని అర్థం. పంజాబ్, లూథియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలో చమార్ (దళిత్) కులానికి చెందిన కర్తార్ కౌర్, హరిరామ్ సింగ్ దంపతులకు 1960 జూలై 21న చమ్కీలా జన్మించాడు. అతని అసలు పేరు ధనీరామ్. చిన్నవయసులోనే గుర్మైల్ కౌర్ అనే బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరికి అమన్‌దీప్ కౌర్, కమన్ చమ్కీలా (ప్రస్తుతం ఫోక్ సింగర్) అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మరో కొడుకు పుట్టి.. అనారోగ్యంతో చనిపోయాడు. మొదటి నుంచి ఎలక్ట్రీషియన్ కావాలని ఆశపడిన ధనీరామ్.. ఆ ఆలోచనను పక్కనపెట్టి.. ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడానికి దుస్తుల మిల్లులో చేరాడు. అక్కడ ఓ స్నేహితుడు ఇతని రాతకు ముగ్ధుడై.. సురీందర్ షిండా అనే ఓ సంగీతవిద్వాంసుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ధనీరామ్ కథలో, పేరులో మార్పులు అక్కడి నుంచే మొదలయ్యాయి. చమ్కీలా (ధనీరామ్) టీమ్‌లో చేరినప్పటి నుంచి షిండా పేరు దేశవిదేశాలకు పాకింది. చమ్కీలాకు మాత్రం గుర్తింపు దక్కలేదు. పైగా ఇతర దేశాల్లో ప్రదర్శనలకు చమ్కీలాను తీసుకెళ్లడానికి షిండా ఇష్టపడేవాడు కాదు. 1980లో ఒకసారి షిండా.. కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ గ్రూప్‌లోని సోనియా అనే మరో గాయని చమ్కీలాను కలిసింది. ‘షిండాను దాటి నీకు గుర్తింపు రావాలంటే.. నేను కొత్తగా ప్రారంభిస్తున్న బృందంలో చేరు’ అని చెప్పడంతో చమ్కీలా సరే అన్నాడు. సోనియా పెట్టుబడి పెడితే.. చమ్కీలా తన ఆలోచనలకు మరింత పదునుపెట్టి.. ఆమె దగ్గరే జీతానికి కుదిరాడు. అనుకున్నట్లే షిండా కెనడా నుంచి పంజాబ్ వచ్చేలోపు.. సోనియా ఆధ్వర్యంలో ఎనిమిది యుగళగీతాలను విడుదల చేసి పంజాబ్‌ని ఓ ఊపు ఊపాడు చమ్కీలా. అయితే ఆ ఏడాది చివరికి.. సోనియా, ఆమె భర్త కలసి.. తన కారణంగా లక్షలు సంపాదిస్తూ, తనకు నెల జీతం మాత్రమే ఇస్తున్నారని గ్రహించాడు. దాంతో చమ్కీలా.. తానే ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే హార్మోనియం, ఢోలక్ వాయించగలిగే బృందంతో పాటు.. అమర్‌జోత్ కౌర్ అనే ఒక మహిళా గాయనినీ తన టీమ్‌లోకి తీసుకుని.. ఆల్బమ్స్ రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు. రిలీజ్ చేసిన ప్రతి ఆల్బమ్ హిట్ కొట్టడంతో చమ్కీలా పంజాబ్ సూపర్ స్టార్ అయ్యాడు. చమ్కీలా పాటల్లో కొన్ని.. ‘పెహెలే లల్కార్ నాల్ (తొలుత బాకా మోగింది)’ ఇది పెళ్ళైన జంట గురించి పాడిన పాట. ‘బాబా తేరా నన్కానా (బాబా నీ మందిరం, నీ గురువు గురునానక్)’ ఇది సిక్కులకు ధైర్యం చెప్పే పాట. ‘భూల్ గయీ మై ఘుండ్ కడ్నా (ముసుగు వేసుకోవడం మరచాను)’.. లాంటి పాటలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆ సమయం లోనే అతనికి అమర్ జోత్‌తో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారి.. పెళ్లిదాకా వెళ్లింది. మొదటి భార్య గుర్మైల్ని ఒప్పించి (విడాకులు తీసుకున్నాడని కొందరంటారు).. 1983లో అమర్జోత్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి జైమన్ (ప్రస్తుత ఫోక్ సింగర్) అనే కొడుకు పుట్టాడు. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా. వేడుక ఏదైనా.. ప్రతి ఊళ్లో అతని దరువు వినిపించాల్సిందే. ఏడాదికి ఊరూరా 366 ప్రత్యక్ష ప్రదర్శనలు చేసేవారంటే చమ్కీలా దంపతులు ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్‌జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్‌జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం. కొన్ని సంగీత బృందాలు కేవలం చమ్కీలా వల్లే మరుగున పడ్డాయని.. ఆ అక్కసుతోనే వారంతా కలసి అతనిని చంపించారని మరి కొందరి ఊహ. మరోవైపు చమ్కీలా రెండో భార్య అమర్‌జోత్ ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ కావడంతో.. ఇది పరువు హత్య అని.. అమర్‌జోత్ కుటంబీకులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని ఇంకొందరి వాదన. ఇతడి జీవితకథపై చాలా సినిమాలు, పుస్తకాలూ విడుదలయ్యాయి. వాటిలో కొన్ని వివాదాల పాలయ్యాయి. ఏది ఏమైనా చమ్కీలా గొంతు మూగబోయి 35 ఏళ్లు దాటింది. అయినా నేటికీ జానపద సంగీత ప్రియులకు అతడి పాట వినిపిస్తూనే ఉంది. ∙సంహిత నిమ్మన -
గద్దర్ అంత్యక్రియలు.. తరలివచ్చిన జనసంద్రం (ఫొటోలు)
-
గద్దర్ చేసిన ఆ పనులు విస్మయం కలిగించాయి.. ఎందుకిలా?
జనం గుండె చప్పుడులా మోగిన ఆ పాట దరువు ఆగింది. మద్దెల మోతల్ల విరబూసిన ఆ పదాల తోట వాడింది. ఉద్యమంలా జనాన్ని చైతన్యంవైపు నడిపించిన ఆ పాట పడమటి దిక్కున అస్తమించింది. కామ్రేడు గద్దరన్నా! కానరాని లోకాలకు పోయిండు, తన పాటను మన యాదిలో వదిలేసి! -సాక్షి, హైదరాబాద్ ప్రజా బాహుళ్యాన్ని తన పాటలతో ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ ఆదివారంనాడు అనారోగ్య కారణాలతో దివికేగారు. తొలి నుంచి పూర్తిస్థాయి మావోయిస్టుగా, సానుభూతిపరుడిగా ఉన్న గద్దర్.. జీవిత చరమాంకంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన పనులు విస్మయం కలిగించాయి. తన కర్రకు కట్టిన ఎర్ర జెండాను విప్పేయడం, సూటూబూటు ధరించడం, అచ్చమైన కమ్యూనిస్టు అయి ఉండీ.. ఎన్నికల్లో ఓటు వేయడం, గుళ్లకు, స్వామీజీల వద్దకు వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకించే చంద్రబాబు కడుపులో తలపెట్టడం, కాంగ్రెస్ వారి వేదిక ఎక్కడం, ప్రధాని మోదీ సభకు ఆహ్వానం లేకున్నా వెళ్లడం వంటివీ చర్చనీయాంశంగా మారాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గద్దర్ పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం కూడా జరిగింది. -
ముగిసిన గద్దర్ అంత్యక్రియలు
►గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి.. రాత్రి 8గంటల ప్రాంతంలో అధికారిక లాంఛనాలతో బౌద్ధ మత ఆచారంలో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించారు. ► గద్దర్ అంత్యక్రియల్లో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. ► బౌద్ధ ఆచారాల ప్రకారం గద్దర్ అంత్యక్రియలు.. ► గద్దర్ అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం.. అభిమానులను అదుపుచేయలేక పోతున్న పోలీసులు.. ► గద్దర్ ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఘనంగా నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ► అల్వాల్‌కి చేరుకున్న అంతిమ యాత్ర ► పార్టీలకు అతీతంగా అంతిమ యాత్రలో పాల్గొన్న నేతలు ► సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్‌కు గద్దర్ అంతిమయాత్ర చేరుకుంది. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. ►మధ్యాహ్నం 2.30 నిమిషాల తరువాత సీఎం కేసీఆర్ గద్దర్ ఇంటికి చేరుకోనున్నారు. ►కాసేపట్లో మహా భోది విద్యాలయ లో గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పోలీసులు పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు. రిహార్సల్ నేపథ్యంలో సెట్ రైట్ అయిన పోలీసులు. ప్రభుత్వ లాంచనాలతో మధ్యాహ్నం గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ►అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న గద్ధర్ అంతిమ యాత్ర ► గద్దర్ అంతిమ యాత్రలో కళాకారులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అంతిమ యాత్ర సందర్భంగా పోలీసులు అల్వాల్ భూదేవినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ► గద్దర్ అంతిమ యాత్ర వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. ►ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. గన్‌పార్క్, అసెంబ్లీ, నెక్లెస్‌రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్‌బండ్, జేబీఎస్, తిరుమల మీదుగా అల్వాల్ చేరనుంది. గద్దర్ ఇంటివద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ పాట మూగబోయింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. గద్దర్ పార్థివ దేహాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు ఘటించారు. ► అల్వాల్ భూదేవి నగర్‌లోని మహాభోది విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాభోధి విద్యాలయంలోని గ్రౌండ్ వెనకాల సమాధి కోసం చేస్తున్న ఏర్పాట్లను గద్దర్ కూతురు వెన్నెల దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏర్పాట్లను డీసీపీ సందీప్‌రావు పరిశీలిస్తున్నారు. ►గద్దర్ పార్థివదేహానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే, జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజనీ కుమార్ యాదవ్, అజారుద్దీన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, బూర న్సయ్య గౌడ్, గరికపాటి నర్సింహరావు నివాళులు అర్పించారు, ►గద్దర్ అంతిమ యాత్ర వాహానాన్ని జీహెచ్ఎంసీ అధికారులు. సిద్ధం చేశారు. వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను ఏర్పాటు చేశారు. గద్దర్ పార్దివదేహానికి వీచ్ హనుమంతరావు నివాళులు అర్పించారు ►రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఖమ్మం సభలో దివించారు: వీహెచ్ ►గద్దర్ మరణం పట్ల రాహుల్ తన ఆవేదన తెలియజేశారు. ►గద్దర్ చనిపోయినా గద్దర్ కోరుకున్నట్లు గా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. గద్దర్ చనిపోవడం బాధాకరం: మాజీమంత్రి జానారెడ్డి ► గద్దర్‌కు ఉన్న స్ఫూర్తి యువత నేర్చుకోవాలి. ►నేను హోం శాఖామంత్రిగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన్నప్పుడు గద్దర్ సూచనలు సేకరించాం. ►తన సూచనాలతోనే అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను హైదరాబాద్‌కు రప్పించాం. ►మావోయిస్టులతో ప్రభుత్వం చర్చల్లో గద్దర్ మధ్యవర్తిత్వం వహించారు. ►అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు నన్ను ఆనాడు కలిశాడు ►గద్దర్ పార్థివ దేహానికి సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీరమణ నివాళులు అర్పించారు. గద్దర్ తన రూమ్ మెట్ అని, రిటైర్మెంట్ తర్వాత తనను రాజకీయాల్లో రావాలని గద్దర్ కోరారని చెప్పారు. ► ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులు అర్పించారు. ►గద్దర్ పార్ధివదేహానికి తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. ►ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివ దేహానికి టీపీసీ రేవంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు నివాళులు అర్పించారు. ►నటుడు మోహన్ బాబు, బండ్ల గణేష్, మంచు మనోజ్, సింగర్ మధు ప్రియ గద్దర్‌కు నివాళులు అర్పించారు. ►అల్వాల్‌లోని గద్దర్ నివాసం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. ►తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. 74 ఏళ్ల వయసులో కూడా గోష్టిగొంగడితో సమాజాన్ని మేల్కొలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా: స్పీకర్ పోచారం ►గద్దర్ అంటే మెదక్.. మెదక్ అంటే ఉద్యమాలు: ఎమ్మెల్యే రఘునందన్ రావు ►వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ కోరుకున్నారు. ►4 దశాబ్దాల ఆశయ సాధక కోసం పోరాటం చేసి.. దానికి దూరం అయ్యారు. ►గద్దర్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. గద్దర్ మృతి బాధాకరం: కిషన్ రెడ్డి గద్దర్ పార్ధివ దేహానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. గద్దర్ మృతి బాధాకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలపై తిరుగులేని పోరాటం చేసిన ఉద్యమకారుడని కొనియాడారు. తన గొంతు ద్వారా తెలుగు సమాజానికే కాకుండా యావత్ భారతదేశానికి రోల్‌మాడల్‌గా నిలిచారని ప్రశంసించారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన విషయమని అన్నారు. ‘నాకు గద్దర్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధం ఉంది. నేను లేకున్నా మా ఇంటికి వచ్చి భోజనం చేసే వాళ్ళు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. * ఆయన కలగన్న రాజ్యం రాకముందే స్వర్గస్తులయ్యారు. చివరి కోరిక తిరకముందే కాలం చెల్లించారు. గద్దర్ మనల్ని విడిచి వెళ్లిపోవడం దూరంగా మరి వెళ్లిపోవడం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజాని, కవులు, కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు ఎంతో బాధాకరం. గద్దర్ ఆకస్మిక మృతికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం’ అని తెలిపారు సాక్షి, హైదరాబాద్: గద్దర్ అంతిమయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్ స్టేడియం నుంచి ప్రారంభం కానుంది. కళాకారులతో భారీ ర్యాలీగా గద్దర్ పార్థివదేహాన్ని తీసుకెళ్లనున్నారు. కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీ నేతలు ఈ అంతిమయాత్రలో పాల్గొననున్నారు. స్టేడియం నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా, జగ్జీవన్‌రామ్ విగ్రహం మీదుగా.. గన్‌పార్క్ వైపు సాగనుంది. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్ పార్ధివ దేహం చేరుకోగా.. కాసేపు అక్కడ పాటలతో కళాకారులు నివాళులు అర్పించనున్నారు. అనంతరం అమరవీరుల స్థూపం నుంచి సికింద్రాబాద్ మీదుగా భూదేవినగర్‌లోని తన నివాసానికి చేరుకోనుంది. అల్వాల్్ మహాబోధి గ్రౌండ్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. -
గద్దర్‌కు ఎన్నో ఆహ్వానాలు.. అయినా విమానం ఎక్కలేదు, విదేశాలకు పోలేదు
మంచిర్యాలఅర్బన్: గద్దర్ గళం..దేశవిదేశాల్లో ఎందరో అభిమానాన్ని చూరగొన్నది. ఆయన పాట వినేందుకు విదేశాల నుంచి అభ్యుదయ, సాంస్కృతిక సంఘాల నుంచి ఆహ్వానం వచ్చినా విమానం ఎక్కి వెళ్లలేకపోయారు. 1997, ఏప్రిల్ 6న ఆయనపై కాల్పులు జరగ్గా, ఆరు బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. ఐదు బుల్లెట్లను తొలగించిన వైద్యులు, వెన్నుపూసలో ఉన్న మరో బుల్లెట్ తొలగిస్తే ప్రాణానికే హాని ఉంటుందని చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఆ బుల్లెట్ శరీరంలోనే ఉండిపోయింది. దేశంలో ఇతర రాష్ట్రాల పర్యటనకు ఎయిర్‌పోర్ట్‌కు గద్దర్ వెళ్లినా, తనిఖీల్లో స్కానర్‌లో బుల్లెట్ చూపడం, అధికారులకు సమాధానం చెప్పడంలో అనేకసార్లు ఇబ్బంది పడినట్టు తెలిసింది. శరీరంలో బుల్లెట్, కేసులు పాస్‌పోర్టు జారీకి అడ్డంకిగా మారాయి. దీంతో ఎన్ని ఆహా్వనాలు వచ్చినా విమానం ఎక్కి విదేశాలకు వెళ్లలేకపోయారు. ► 1980 సమయంలో నక్సల్స్‌తో కలసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ► పీపుల్స్‌వార్ పార్టీ నిర్ణయం మేరకు 1982లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలపు జననాట్యమండలి సభ్యుడిగా పనిచేశారు. ► 1990 ఫిబ్రవరి 18న తిరిగి బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టారు. ► 1995లో పీపుల్స్‌వార్ పార్టీ గద్దర్‌ను బహిష్కరించింది. ఆయన తీవ్రంగా ఆవేదనకు గురవడంతో తిరిగి పార్టీలోకి ఆహా్వనించింది. 25 ఏళ్లుగా వెన్నులో బుల్లెట్‌తో గద్దర్‌పై చాలా సార్లు హత్యాయత్నాలు జరిగాయి. నల్లదండు ముఠా, బ్లాక్ టైగర్స్, గ్రీన్ టైగర్స్ ముఠాలు ఆయనను చంపడానికి ప్రయత్నించాయి. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. గ్రీన్‌టైగర్స్ పేరుతో కొందరు ఆగంతకులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన ప్రాణాలకు ప్రమాదమని ఒక బుల్లెట్‌ను వదిలేశారు. దీనితో దాదాపు 25 ఏళ్లుగా ఆ బుల్లెట్ గద్దర్ ఒంట్లోనే ఉండిపోయింది. ‘‘రాష్ట్ర అణచివేతకు చిహ్నంగా నా వెన్నెముకలో బుల్లెట్ అలాగే ఉంది. దానితో నాకు భయమేమీ లేదు, ఏ ప్రభావమూ పడలేదు. నా లక్ష్యాలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నా..పనిచేస్తూనే ఉంటా..’’ అని గద్దర్ తరచూ గుర్తు చేసుకునేవారు. -
భారతదేశంలోని టాప్ 10 జానపద గాయకులు
-
కళాకారుడికి అశ్రునివాళి: ముగిసిన సాయిచంద్ అంత్యక్రియలు
Telangana Folk Singer Sai Chand Last Rites Updates ► గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి. వనస్థలీపురం సాహెబ్‌నగర్ శ్మశాసనవాటికలో సాయిచంద్ అంత్యక్రియలు జరిగాయి. చితికి సాయిచంద్ కొడుకు నిప్పంటించారు. ► గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. సాయి చంద్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో సాయి చంద్ భార్య భావోద్వేగానికి లోనై రోదించగా.. కేసీఆర్ ఆమెను ఓదార్చారు. ► తెలంగాణ జానపద కళాకారుడు, ఉద్యమ గాయకుడు సాయి చంద్ భౌతిక కాయాన్ని చూసి కేసీఆర్ కంటతడి పెట్టారు. ► తెలంగాణ సమాజం ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయింది. సాయి చంద్ కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం కేసీఆర్ ► కాసేపట్లో గుర్రం గూడకు ముఖ్యమంత్రి కేసీఆర్.. సాయి చంద్ భౌతిక కాయానికి నివాళులు ► సాయి చందు పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ► సాయిచంద్ మృతిపై సంతాప ప్రకటన వెలువరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. సాయిచంద్ మృతదేహానికి నివాళులర్పించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ‘‘రాతి గుండెల్ని సైతం కరిగించిన గాత్రం సాయిచంద్‌ది. మా అందరికీ ఆత్మీయుడతను. చనిపోయడనే వార్త జీర్ణించుకోలేక పోతున్నం. ఆయన లేని లోటు తీర్చలేదు. హైదరాబాద్‌లో ఉంటే బ్రతికే వాడేమో!. అత్యంత చిన్న వయస్సులోనే చనిపోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు. ► సాయి చంద్ పాటలు అందరినీ కదిలిస్తాయ్: మంత్రి తలసాని ► సాయి చంద్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కంట తడి పెట్టారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ‘‘తమ్ముడు సాయి చంద్ లేడని ఊహించుకుంటేనే బాధ గా ఉంది. చిన్న వయసు లో చనిపోవడం దురదృష్టం. నిజాయితీ గల సైనికుడు సాయి చంద్. తన పాట ఖండాంతరాలు దాటాయి. నా మనుసుకు దగ్గర వ్యక్తి కూడా. చాలా సార్లు మా ఇంటికి వచ్చాడు. సీఎం కెసీఆర్ కూడా తనను ఇంకా ఎక్కువ గౌరవించుకోవాలి అనేవారు. సాయిను మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ► తెలంగాణ ఉద్యమ గాయకుడు, బీఆర్ఎస్ నేత.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. సీఎం కేసీఆర్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. గుర్రంగూడలో ఉన్న ఆయన భౌతికకాయానికి ప్రముఖులు వెళ్లి నివాళులు అర్పించి.. ఆయన కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. కన్నీటితో నివాళులర్పిస్తున్నారంతా. ► తెలంగాణ కళాకారుడు, మలిదశ ఉద్యమ సమయంలో తన గాత్రంతో ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రాజేసిన గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం.. యావత్ తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. కేవలం 39 ఏళ్ల వయసులో.. అదీ ఉన్నపళంగా గుండెపోటుతో కన్నుమూయడాన్ని కుటుంబ సభ్యులు, అతన్ని అభిమానించేవాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఇదీ చదవండి: ఉద్యమ పాట.. ఆగింది -
ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం
-
తెలంగాణ కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పాట ఊపిరి వదిలింది. తెలంగాణ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. గత అర్ధరాత్రి గుండెపోటుకి గురైన ఆయన్ని ఆస్పత్రులకు తరలించగా.. చివరకు ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్‌హౌజ్‌కు నిన్న ఆయన తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అయితే.. అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురికాగా.. స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి విషమించడంతో.. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అప్పటికే ఆలస్యం అయ్యిందని.. సాయిచంద్ మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. వనపర్తి జిల్లా అమరచింత సాయిచంద్ స్వస్థలం. విద్యార్థి దశ నుంచే గాయకుడిగా మంచి పేరుంది ఆయనకు. ఉద్యమ సమయంలో తన పాటలతో స్ఫూర్తిని రగిల్చారు ఆయన. జానపద పాటలతో సాగే పలు టీవీషోలలోనూ ఆయన సందడి చేశారు. ఉద్యమ కళాకారుడి గుర్తింపు పొందిన సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ పదవితో గౌరవించింది తెలంగాణ సర్కార్. తాజాగా అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన కనిపించారు. చిన్నవయసులోనే సాయిచంద్ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ పలువురు కళాకారులు, ఉద్యమకారులు, నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. గతంలో ఆయనకు గుండెపోటు ఏమీ రాలేదని.. అనారోగ్య సమస్యలేవీ లేదని.. అర్ధరాత్రి భోజనం దాకా కూడా బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు రాజకీయ గురువు ఈయనే! -
దసరా సినిమా డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు: సింగర్, నటుడు
సింగర్ శ్రీను శ్రీకాకుళం 3,200కు పైగా పాటలు పాడాడు.. అవన్నీ జానపద గీతాలే! శ్రీకాకుళంలోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన ఆయన తనే సొంతంగా పాటలు రాసి పాడతాడు కూడా! అలా ఆయన రాసిన ఓ గీతాన్ని కాస్త అటూఇటుగా మార్చి అల వైకుంఠపురములో చిత్రంలో సిత్తరాల సిరపడుగా తీసుకొచ్చారు. సినిమాల్లోకి రావాలన్న ఆసక్తితో చిన్నతనంలోనే చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వచ్చేశాడు శ్రీను. తాజాగా ఆయన తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు . '11 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి వెళ్లిపోయాను. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక సిద్దిపేట బస్టాండ్‌లోనే మూడు రోజులు తిండి లేకుండా గడిపాను. అప్పుడు ఉద్యమం జరుగుతున్న సమయం.. రసమయి బాలకిషన్ పరిచయం కావడంతో ఆయనతో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. చాలా సీరియల్స్, సినిమాలకు కూడా పని చేశాను. భీమ్లా నాయక్, సరిలేరు నీకెవ్వడు సినిమాలకు బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్‌గానూ పని చేశాను. కానీ చాలామంది షూటింగ్ పూర్తయ్యాక డబ్బులివ్వకుండా మోసం చేసేవారు. ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ దసరా సినిమా డబ్బులు నాకింతవరకు ఇవ్వలేదు. 23 మంది ఆర్టిస్టులను గోదావరిఖని తీసుకెళ్లి వారం రోజులు అక్కడే ఉన్నాం. షూటింగ్ అయిపోక తిరిగొచ్చాం. కానీ చిత్రయూనిట్ పైసా ఇవ్వకపోవడంతో నేనే ఆర్టిస్టులకు సగం సగం డబ్బులిచ్చాను. దాదాపు రూ.70వేల దాకా ఖర్చయింది. నేను కూడా మొదట్లో జూనియర్ ఆర్టిస్టుగా, సెట్ బాయ్‌గా పని చేశాను. జూనియర్ ఆర్టిస్టులను చాలా చీప్‌గా చూస్తారు. చాలామంది క్యాస్టింగ్ డైరెక్టర్లు వారికిచ్చిన డబ్బులను ఆర్టిస్టులకు సమంగా పంచరు. ఐడీ కార్డు ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు రూ.900, ఆ కార్డు లేని వాళ్లకు ఐదారు వందలు, ఒక్కోసారైతే మూడు వందలు కూడా ఇస్తారు. నేను మాత్రం అందరికీ రూ.900 ఇస్తాను' అని చెప్పుకొచ్చాడు సింగర్ శ్రీను. చదవండి: అవును, నేను తండ్రినయ్యా.. ఇకపై కుటుంబానికే సమయం కేటాయిస్తా: ప్రభు దేవా -
కష్టాల్లో ‘బలగం’ మొగిలయ్య.. డబ్బుల్లేక దీనంగా వేడుకోలు
బలగం సినిమా చివరాంకంలో ‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొంరయ్యా..’అంటూ పాటపాడి అందరినీ కదిలించిన గాయకులు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. ఇప్పుడు మొగిలయ్య రెండు కిడ్నీలు చెడిపోయి.. రెండు కళ్లు కనిపించక మంచానికే పరిమితమయ్యాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులైన ఈ దంపతులకు వారసత్వంగా వచ్చిన తంబూర, దిమ్మస తప్ప మరే ఇతర ఆస్తిపాస్తులు లేవు. (చదవండి: తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డ సింగర్..స్పందించిన మంత్రి) రెండేళ్ల క్రితం కరోనా బారిన పడ్డ మొగిలయ్య ఏడాది క్రితం ఉన్నట్టుండి ఓరోజు కళ్లు తిరిగి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. అప్పటినుంచి వారానికి మూడు రోజులు వరంగల్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. వైద్యం కోసం ఇప్పటివరకు రూ.14 లక్షల వరకు ఖర్చయ్యాయి. రూ.10 లక్షల వరకు అప్పు చేశారు. బలగం డైరెక్టర్ వేణు కొంత సాయం చేసినా సరిపోని పరిస్థితి. మొగిలయ్య డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలోనే బలగం సినిమాలో అవకాశం వచ్చింది. ‘బీపీ, షుగర్ పెరగడంతో రెండు కళ్లు కనిపించడంలేదు. ఆపరేషన్ చేయాలని, రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. కానీ, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. మనసున్న మారాజులు ఆదుకోవాలి’అని కొమురమ్మ వేడుకుంటోంది. – వరంగల్ డెస్క్ ఆర్థికసాయం చేయదల్చిన వారు పస్తం కొమురమ్మ బ్యాంక్ అకౌంట్ నంబర్: 62306309034 స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, దుగ్గొండి, వరంగల్ జిల్లా ఐఎఫ్ఎస్సీ కోడ్ : SBIN0020655 గూగుల్‌పే నంబర్: 90590 98236 ఫోన్‌పే నంబర్ : 91772 54408 -
అభిమానం అంటే ఇదే.. గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం
-
జానపద గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం.. వీడియో వైరల్..
గాంధీనగర్: నటులు, గాయకులు, ఇతర కళాకారులపై కొందరు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తారు. గజరాత్ ప్రముఖ జానపద గాయకుడు కృతిన్ గాధ్వీకి సరిగ్గా ఇలాగే జరిగింది. ఆయన పాటలు పాడుతుండగా.. కొందరు కరెన్సీ నోట్ల వర్షం కురిపించి ఇష్టాన్ని చాటుకున్నారు. ఆయనపై రూ.10, 20, 50, 100 నోట్లు గుమ్మరించారు. 'వల్సాద్ అగ్నివీర్ గో సేవా దళ్' నిర్వహించిన భజన కార్యక్రమంలో ఇలా జరిగింది. మార్చి 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వందల మందిని కృతిన్ గాధ్వి తన గాత్రంలో అలరించి ఉత్సాహపరిచారు. అయితే గోవుల సేవ కోసం ఫండ్స్ సేకరించేందుకు ఈ భజన నిర్వహించారు నిర్వహకులు. దీంతో ఈ డబ్బునంతా ఛారిటీకే ఇస్తున్నట్లు గాధ్వీ తెలిపారు. #WATCH | People showered money on singer Kirtidan Gadhvi at an event organised in Valsad, Gujarat on 11th March pic.twitter.com/kH4G1KUcHo — ANI (@ANI) March 12, 2023 విరాళాల సేకరణ కోసం ఇలా భజనలు నిర్వహించడం గుజరాత్లో కొత్తేంకాదు. స్వామి వివేకానంద ఐ టెంపుల్ ట్రస్టు కూడా కొత్త కంటి ఆసుపత్రి కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహించి ఫండ్స్ సేకరించింది. చదవండి: ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు.. -
యోగి సర్కార్‌పై సెటైరికల్ సాంగ్.. సింగర్‌కు నోటీసులు
ప్రముఖ భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్‌కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాట పాడినందుకు ఆమెకు ఈ నోటీసులు అందాయి. కాగా ఇటీవల కాన్పూర్ అక్రమ ఇళ్లను తొలగిస్తుండగా తల్లీ కూతుళ్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ నేహా సింగ్ ఓ పాట పాడారు. ‘యూపీ మే కా బా సీజన్-2’ పేరుతో ఈ పాటను యూట్యూబ్, ఫేస్బుక్లో విడుదల చేశారు. ఈ క్రమంలోనే నేహా రాథోడ్ పాడిన పాటపై యోగి సర్కార్ సీరియస్ అయ్యింది. ఆ వెంటనే యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. గాయని తన పాట ద్వారా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. తనకు నోటీసులు రావడంపై గాయని స్పందిస్తూ.. మంగళవారం రాత్రి కాన్పూర్ పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారని పేర్కొంది. తన పాటల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇదేం తొలిసారి కాదని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరికి సమాధానాలు ఇవ్వదని.. కేవలం నోటీసులే జారీ చేస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘జానపద గాయకురాలిగా నా బాధ్యతను నిర్వర్తించడానికి ఎప్పుడూ ప్రయతిస్తాను. జానపద పాటల ద్వారా ప్రభుత్వాలపై ప్రశ్నలు లేవనెత్తాను. యూపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడానికి నేను 'కా బా' ఫార్మాట్‌ను ఉపయోగించడం ఇదేం తొలిసారి కాదు. ఎన్నికల సమయంలో కూడా నేను అనేక ప్రశ్నలు సంధించాను. దానిపై వారు ఇప్పటికీ సమాధానాలు చెప్పలేకపోయారు. వారు సమాధానాలు ఇవ్వలేరు.. కానీ నోటీసులు మాత్రమే జారీ చేస్తారు. యూపీలో ప్రస్తుత పరిస్థితిపై సమాజ్‌వాదీ పార్టీని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది.. కరెక్ట్ కాదు కదా. నేను ఏ ఒక్క పార్టీని టార్గెట్ చేయడం లేదు, కేవలం అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడమే నా పని’ అని పేర్కొన్నారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా భయపడేది లేదని, సాధారణ ప్రజల సమస్యల మీద పాటలు పాడటం ఆపనని భోజ్‌పురి సింగర్ స్పష్టం చేశారు. కాగా గుజరాత్ ఎన్నికలకు ముందు మోర్బీ వంతెన కూలిపోవడం గురించి కూడా ఆమె 'గుజరాత్ మే కా బా' అంటూ పాట పాడారు అంతేగాక 2022 యూపీ ఎన్నికల ముందు కూడా నేహా సింగ్ రాథోడ్ ఇలాగే ‘‘యూపీ మే కాబా’’ అంటూ పాట పాడారుది. ప్రస్తుతం దీని రెండో వెర్షన్ ను రిలీజ్ చేశారు. 'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu — Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023 'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu — Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023 -
నేపాల్ విమాన ప్రమాదం.. జానపద గాయని మృతి
నేపాల్‌లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ సంఘటనలో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. రష్యా సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, అర్జెంటీనా దేశస్థులు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి ఇప్పటి వరకు ఎవరు ప్రాణాలతో బయటపడలేదు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలం వద్ద రెస్కూ చర్యలు సోమవారం తిరిగి ప్రారంభించారు. జానపద గాయని మృతి విమానం కుప్పకూలిన ప్రమాదంలో నేపాల్ ప్రముఖ జానపద గాయని నీరా ఛాంత్యల్ ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చనిపోయిందనే విషయాన్ని ఆమె సోదరి హీరా ఛాంత్యల్ షెర్చాన్ వెల్లడించింది. ‘పోఖారాకు విమానంలో బయలుదేరిన నీరా మరణించింది. ఆమె మాఘ్ సంక్రాంతి సందర్భంగా పోఖారరాలో నిర్వహిస్తున్న ఓ ఈవెంట్లో పాల్గొనడం కోసం వెళ్లింది. అంతకుముందు నీరా.. అభిమానులకు మాఘ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. అందులో రేపు పొఖారాలో చాలా ఎంజాయ్ చేస్తాను అంటూ రాసుకొచ్చింది. ఎవరీ నీరా? కాగా నేపాల్‌లోని బగ్లుండ్ ప్రాంతంలో పుట్టి పెరిగన నీరా.. కొంతకాలంగా రాజధాని ప్రాంతమైన ఖాట్మాండులో నివసిస్తోంది. జానపద పాటలలో పాపులారిటీ సాధించిన ఆమె గొంతుకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. జాతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వస్తధారణతో ఈవెంట్స్‌లో పాల్గొనే నీరా తన పాటలనుసోషల్ మీడియాలో పోస్టూ చేస్తూ ఉంటుంది. అయితే నీరా ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడంతో మాఘ్ సంక్రాంతి కార్యక్రమాన్ని రద్దు చేశామని నేపాల్ ఛంత్యాల్ యువజన సంఘం అధ్యక్షుడు నవీన్ ఘాత్రి ఛంత్యాల్ తెలిపారు. చదవండి: నేపాల్ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరిని ప్రాణాలతో గుర్తించలేదు.. బ్లాక్ బాక్స్ స్వాధీనం తాజాగా ఆర్మీ అధికారులు సంఘటన స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైందని ఖాట్మండు విమానాశ్రయ అధికారి షేర్ బాత్ ఠాకూర్ తెలిపారు. కాగా ఈ బ్లాక్ బాక్స్ ద్వారా కాక్‌పిట్‌లో పైలెట్ల మధ్య సంభాషణను రికార్డ్ చేస్తోంది. అంతేగాక ఫ్లైట్ డేటా ఇందులో రికార్డ్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్ సహాయంతో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: గాల్లో ఎగురుతున్నామని ఎంత ఉత్సాహం.. కానీ, గాల్లోనే కలిసిపోతామని..! -
ఆ రాష్ట్ర ఐకాన్‌గా ఫోక్ సింగర్.. 22 ఏళ్లకే అరుదైన ఘనత..
పాట్నా: బిహార్ రాష్ట్ర ఐకాన్‌గా ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్‌ను(22) నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి సోమవారం వెల్లడించారు. బిహార్ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా మైథిలి ఉండనున్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. 22 ఏళ్ల మైథిలి ఠాకూర్ ఇండియన్ క్లాసికల్, ఫోక్ మ్యూజిక్‌లో శిక్షణ పొందారు. 2021లో బిహార్ జానపద సంగీతానికి తనవంతు భాగస్వామ్యం అందించినందుకు సంగీత్ నాటక్ అకాడెమీ ఆమెను 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్'తో సన్మానించింది. బిహార్ మధుబనిలో జన్మించిన మైథిలికి ఆమె తండ్రి, తాత చిన్నతనం నుంచే జానపదం, హిందుస్తానీ క్లాసికల్ సంగీతం, హార్మోనియం, తబ్లాలో శిక్షణ ఇచ్చారు. దీంతో ఆమె ఫోక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తర బిహార్ ప్రాంతీయ భాష అయిన మైథిలితో పాటు హిందీ, భోజ్‌పురిలో జానపద పాటలు పాడి పాపులర్ అయ్యారు. తన కూతురుకు ఈ అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందని మైథిలి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేసి ఓటింగ్ శాతం పెంచేందుకు తన కూతురు కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
బతుకమ్మ, జానపద సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న సింగర్స్
సాక్షి, కరీంనగర్: బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే పండుగ. ఇందులో ప్రధానంగా పువ్వులను పూజిస్తారు. ఆడబిడ్డలు అందంగా బతుకమ్మలు పేర్చి, ఒక్కచోట ఆడిపాడతారు. బతుకమ్మ అంటే అందరికీ గుర్తొచ్చేవి బతుకులోంచి పుట్టిన బతుకమ్మ పాటలు. పండుగ సమయంలో 9 రోజులు ఈ పాటలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి. కాలానికనుగుణంగా తెలంగాణలో సంప్రదాయ బతుకమ్మ పాటలు సరికొత్త సొబగులు అద్దుకొని, సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. వీటికి ఎంతోమంది గాయనీగాయకులు కొత్త రెక్కలు తొడిగారు. తమ ప్రతిభతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. కరీంనగర్లో బతుకమ్మ మ్యూజిక్ చానల్ ద్వారా గేయ రచయిత పొద్దుపొడుపు శంకర్ ‘పూతాపూలన్ని పూచే లేత కొమ్మలు అక్కాసెల్లేలు తల్లిగారిల్లు’ అంటూ కొత్త పాటను విడుదల చేశారు. ఉయ్యాలో రామ ఉయ్యాలో అంటూ కరీంనగర్‌కు చెందిన అమూల్య కోటి కొత్త పాటను యూట్యూబ్‌లో సోమవారం విడుదల చేయగా ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. తమ పాటలతో ప్రజాదరణ పొందుతున్న ఇలాంటి పలువురు గాయకులపై ప్రత్యేక కథనం. చిన్నీ మా బతుకమ్మ : తేలు విజయ కరీంనగర్‌కు చెందిన దంపతులు తేలు వెంకటరాజం–నర్సమ్మ దంపతులకు 1980లో జూన్ 21న తేలు విజయ జన్మించింది. చిన్ననాటి నుంచే తన కుటుంబసభ్యులు పాడే జానపదాలు వింటూ పెరిగింది. 1998లో ‘తండాకు వోతాండు గుడుంబా తాగుతాండు..’ అంటూ పాడి, తొలి పాటతోనే గుర్తింపు తెచ్చుకుంది. 2007లో ‘బతుకమ్మ’ సినిమాలో ‘ఊరికి ఉత్తరానా వలలో..’ అనే పాట పాడింది. 2015లో ‘చిన్నీ మా బతుకమ్మ’ పాటకు 8 లక్షల వ్యూస్ వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ ఉద్యమ గాయనిగా’ అవార్డు అందుకుంది. ఈ ఏడాది పువ్వుల బతుకమ్మతోపాటు మరో 6 బతుకమ్మ పాటలు పాడింది. బతుకమ్మా.. బతుకమ్మా : చిలివేరు శ్రీకాంత్ కరీంనగర్‌లోని సాయినగర్ చెందిన చిలివేరు పోచమ్మ–విజయ్ దంపతులకు శ్రీకాంత్ 1985 నవంబర్ 24న జన్మించారు. నాన్న స్వయంగా భజనలు, కీర్తనలు, అక్క భక్తి పాటలు పాటడంతో వాటిపై ఇతనికి మక్కువ ఏర్పడింది. ఇంటర్మీడియట్ నుంచే ప్రముఖ టెలివిజన్ షోలో గాయకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. పాడుతా తీయగా, వన్స్‌మోర్ ప్లీజ్, స్టార్ అంత్యాక్షరీ షోలో పాల్గొని, పేరు తెచ్చుకున్నాడు. గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యంపై పాటలు రాసి, పాడాడు. బతుకమ్మా.. బతుకమ్మా.. మా తల్లీ బతుకమ్మ పాటను శ్రీకాంత్ స్టూడియో యూట్యూబ్ చానల్ ద్వారా గత సోమవారం సాయంత్రం విడుదల చేయగా 19 గంటల్లో 4,500 వ్యూస్ వచ్చాయి. ఓ నిర్మలా.. : వొల్లాల వాణి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన వొల్లాల వాణి 2016లో పాడిన ఘల్లు ఘల్లునా.. ఓ నిర్మలా అనే బతుకమ్మ పాటతో గుర్తింపు పొందింది. దీనికి ఇప్పటివరకు 72 లక్షల వ్యూస్ వచ్చాయి. ఏటా బతుకమ్మ పండుగకు ఏ గ్రామంలో చూసినా ఇదే పాట మారుమోగుతోంది. ఆస్ట్రేలియా, దుబాయ్, ఖతర్ దేశాల్లో జరిగిన వేడుకల్లో తన పాటలతో హోరెత్తించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లా ఉత్తమ గాయనిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది. ఈ నెల 24న విడుదలైన కోడి కూత వెట్టగానే రాంభజన అనే పాటకు 2 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. నల్లమద్ది చెట్టు కింద.. : సుంకోజు నాగలక్ష్మి సుంకోజు నాగలక్ష్మిది రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బందనకల్. బతుకుదెరువు కోసం సిరిసిల్లకు వచ్చిన ఈమె కుటుంబం తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్థిరపడింది. చిన్నతనం నుంచే నాగలక్ష్మికి పాటలన్నా, పాడటం అన్నా ఇష్టం. అర్కమిత్ర ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో గెల్చుకున్న బహుమతి ఆమెకు స్ఫూర్తినిచ్చింది. బొజ్జ రేవతి దగ్గర కర్నాటక సంగీతాన్ని సాధన చేసి, తన పాటకు శాస్త్రీయతను జోడించింది. మొదటి రెండేళ్లలోనే సుమారు 80 జానపద గీతాలను ఆలపించింది. నల్లమద్ది చెట్టు కింద అనే పాటతో పేరు తెచ్చుకుంది. యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ 30 మిలియన్లకు పైగా వ్యూయర్షిప్ సంపాదించింది. ఇటీవల బతుకమ్మ కోసం ఆలపించిన పాటలూ జనాదరణ పొందాయి. ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. : శిరీష రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డినగర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అశోక్ కూతురు శిరీష. పాటల ప్రయాణంలో దూసుకుపోతోంది. చిన్ననాడు దసరా ఉత్సవాల్లో పాడాలని ప్రోత్సహించిన నాన్న మాటలే ఆ తర్వాత కాలంలో తనకో కెరీర్‌ను సృష్టించాయి. పసితనంలో అక్కడే ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్న ప్రదీప్ శిరీష స్వర మాధుర్యం, లయ జ్ఞానాన్ని గుర్తించాడు. శిక్షణ ఇస్తే మంచి గాయని అవుతుందని ఆమె తండ్రిని ఒప్పించాడు. ఫలితంగా ఆర్కెస్ట్రా సింగర్‌గా చాలాచోట్ల కచేరీలు చేసింది. తర్వాత యూట్యూబ్ స్టార్ అయ్యింది.నాలుగేళ్లలోనే వెయ్యి పాటలు ఆలపించిన శిరీష, పాటలు, వాటి షూటింగ్‌లతో బిజీ అయిపోయింది. ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. అనే జానపద పాటతో ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంది. సినీ తారలు సైతం ఈ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో శిరీష పాటలకు లక్షల సంఖ్యలో వ్యూయర్స్ ఉన్నారు. ఇటీవల రూపొందించిన బతుకమ్మ పాటలు కూడా మంచి గుర్తింపు పొందాయి. -
'భీమ్లా నాయక్' సినిమాలో పాట కోసం దుర్గవ్వకు ఎంతిచ్చారంటే?
భీమ్లా నాయక్ సినిమా ఇద్దరు జానపద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మొగిలయ్య పాడిన టైటిల్ సాంగ్, సాహితి చాగంటితో కలిసి కుమ్మరి దుర్గవ్వ పాడిన అడవితల్లి మాట ఎంతగా మార్మోగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కూలీ పనులు చేసుకుంటూ ఫోక్ సాంగ్స్ పాడే దుర్గవ్వ అడవితల్లి సాంగ్‌లో అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెగొంతును వినిపించింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గవ్వ తనకు పాట పాడే అవకాశం ఎలా వచ్చింది? పాడినందుకు ఎంత పారితోషికం ఇచ్చారనే విషయాలను వెల్లడించింది. 'సిరిసిల్ల సిన్నది, ఉంగురము పాటలు పాడాను. అవి హిట్ అయ్యాయి. అది విని భీమ్లానాయక్లో పాట పాడమని ఆఫర్ వచ్చింది. ఐదారు నిమిషాల్లో పాడేశాను. ఈ పాట పాడినందుకు రూ.10 వేలు ఇచ్చారు. తర్వాత మిగిలిన డబ్బును నా కూతురుకు ఇచ్చి పంపించారు' అని చెప్పుకొచ్చింది దుర్గవ్వ. -
వెయ్యి రూపాయలు లేక భార్య, కొడుకు చనిపోయారు: మొగులయ్య
మొగులయ్య.. 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే అందరూ మైమరచిపోవాల్సిందే.. ప్రాచీన సంగీత వాయిద్యం కిన్నెరనే బతుకుదెరువుగా మలుచుకున్న కళాకారుడు మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు వరించింది. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అందుకోబోతున్న ఆయన జీవితం పూలపాన్పు కాదు.. ముళ్ల దారి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీవితంలో చవిచూసిన ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చాడు. 'నేను చాలా బీదవాడిని. వెయ్యి రూపాయలు లేక నా భార్య చనిపోయింది. ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చి నేను ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆమె బస్టాండ్లల్ల డబ్బులు అడుక్కుంటూ సరిగా తిండి లేక చివరాఖరికి చేనిపోయింది. ఆమె చనిపోయాక కూడా శవాన్ని ఊరు తీసుకెళ్లేందుకు రూపాయి గతి లేదు. విషయం తెలుసుకుని కేవీ రమణాచారి గారు 10 వేల రూపాయలు ఇస్తే అప్పుడు బండి కిరాయి కట్టుకుని ఇంటికి తీసుకెళ్లాను. సరిగా తిండి లేక మూడేండ్ల కిందట చనిపోయింది. నాకు తొమ్మిది మంది పిల్లలు. మొన్న మా కొడుకు గుండెలో నీరొచ్చింది. హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు. కానీ రూ.500 లేక అతడు చనిపోయాడు. నాకు ఇల్లు లేదు, ఆధారం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే కూడా ఎవరో ఒకరు డబ్బులిచ్చి సాయం చేసేవారు. ఈ కళను బతికించాలన్నదే నా కోరిక' అని మొగులయ్య పేర్కొన్నాడు. -
జానపద దిగ్గజం కన్నుమూత
సాక్షి, బనశంకరి (కర్ణాటక): నాటక కళాకారుడు, జానపద గాయకుడు బసవలింగయ్య హిరేమఠ (63) బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో ఆదివారం కన్నుమూశారు. బెళగావిలోని బైలూరు గ్రామానికి చెందిన ఆయన జానపద కళాకారునిగా ప్రసిద్ధి చెందారు. భార్య విశ్వేశ్వరి కూడా జానపద కళాకారిణి. ఈ దంపతులు అనేక జానపద ప్రదర్శనలు నిర్వహించారు. -
సమంత ఐటమ్ సాంగ్ పాడిన సింగర్.. మంగ్లీకి ఏమవుతుందో తెలుసా!
Did You Know Singer Who Sing Item Song From Pushpa Samantha: ఎక్కడ చూసినా ప్రస్తుతం పుష్ప సినిమా హవా నడుస్తోంది. రిలీజ్‌కు ముందే పాటలు, ట్రైలర్, డైలాగులు అభిమానులకు పూనకం తెప్పిస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన కలిసి నటించిన ఈ సినిమాను సుకుమార్ తెరకెకిస్తున్న విషయం తెలసిందే. డిసెంబర్ 17న మొదటి భాగం విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్లను వేగం చేసింది చిత్ర యూనిట్. మూడు పాటలు, ట్రైలర్‌ను విడుదల చేయడగా.. తాజాగా పుష్ప నుంచి ఐటమ్ సాంగ్‌ను ప్రజల్లోకి వదిలింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి ఆడిపాడిన ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అనే ఐటమ్ సాంగ్ లిరికల్ సాంగ్‌ను శుక్రవారం రిలీజ్ చేసింది. మత్తు వాయిస్‌తో సాగే ఈ పాటలో సమంత తన మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. సామ్ కాస్ట్యూమ్, స్టైల్, లుకింగ్ అన్నీ పాటకు పర్ఫెక్ట్ సెట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి మార్మోగించడంతో సాంగ్ బ్లాక్బాస్టర్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. చదవండి: మీ మగబుద్ధే వంకరబుద్ధి అంటున్న సమంత! కాగా చంద్రబోస్ రాసిన ఈ ఐటమ్ పాటను పాడింది ఇంద్రావతి చౌహాన్. తన గొంతుతో ఈ పాటను మరో మెట్టు ఎక్కించింది. దీంతో ఈ సింగర్ ఎవరని వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. ఇంద్రావతి చౌహన్ ప్రముఖ ఫోక్ సింగర్, సినీ నేపథ్య గాయని మంగ్లీ చెల్లెలు. ఈమె కూడా జానపద పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. జార్జిరెడ్డి సినిమాలో జాజిమొగులాలి అనే పాట కూడా పాడారు. అంతేగాక కోటి న్యాయ నిర్ణేతగా ‘బోల్ బేబీ బోల్’ రియాలిటీ షోలో కూడా పాడారు.