Giriraj Singh
-
‘అలా అయితే.. బంగ్లాకు పెట్టుబడిదారులు వెళ్లరు’
ఢిల్లీ: రాజకీయ సంక్షోభాలతో బంగ్లాదేశ్.. పాకిస్తాన్లా మారితే పొరుగుదేశానికి పెట్టుబడిదారులు వెళ్లకుండా దూరంగా ఉంటారని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఆయన బుధవారం భారత్ టెక్స్-2025 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘భారతదేశానికి పెద్ద కార్మిక మార్కెట్ ఉన్నందున బంగ్లాదేశ్ లేదా వియత్నాం నుంచి భారతీయ వస్త్ర పరిశ్రమ ఎటువంటి సవాలును ఎదుర్కోవడం లేదు. బంగ్లాదేశ్ పాకిస్థాన్‌లా మారితే పెట్టుబడిదారులు అక్కడికి వెళ్లే ముందు ఆలోచిస్తారు. ప్రతి రంగాన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అనుసంధానం చేసే యోచనలో ఉన్నాం. మేము మరిన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు. భారత్ టెక్స్-2025 కార్యక్రమాలు ఫిబ్రవరి 14 నుంచి 17 తేదీ వరకు భారత్ మైదాన్‌లో జరగనున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి 15 తేదీల్లో ఇండియా ఎక్స్పో సెంటర్, మార్ట్‌లో వస్త్రాలు, హస్తకళలు, గార్మెంట్ మెషినరీ, దుస్తులకు సంబంధించిన ఎగ్జిబిషన్ జరగనుంది. -
కేంద్ర మంత్రికి నిరసన సెగ.. కాన్వాయ్ వదిలి బైక్‌పై పరార్
పట్నా: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్‌కు సొంత నియోజకవర్గమైన బీహార్‌లోని బెగుసరాయ్‌లో నిససన సెగ తగిలింది. తీవ్ర నిరసన నేపథ్యంలో ఆయన తన కాన్వాయ్‌ను దిగి ఆ ప్రాంతం నుంచి ఒక బైక్‌పై వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక దాక్ బంగ్లా రోడ్లో ఆదివారం ఓ పార్క్ శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర మంత్రిని ఏఎన్ఎం కార్యకర్తలు అడ్డుకొని నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి కారును చుట్టుముట్టి ఆందోళన చేశారు. దీంతో అక్కడి కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకింది.ఈక్రమంలో వారు తమ డిమాండ్లతో కూడిన ఒక వినతిపత్రాన్ని మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆయన వారిని ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే తన కాన్వాయ్ దిగి ఓ వ్యక్తి బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించాలనుకొన్నామని, కేంద్ర మంత్రి పట్టించుకోకుండా పరారు అయ్యారని ఏఎన్ఎం కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.Giriraj Singh को Asha workers ने Begusarai में ही घेर लिया, गाड़ी छोड़ Bike से भागे...#GirirajSingh #Begusarai #AshaWorkers #Bihar #BiharNews #बिहार_न्यूज़ #बिहार #LiveCities pic.twitter.com/qUFAnSAw34— Live Cities (@Live_Cities) August 4, 2024 -
కేంద్ర మంత్రికి నిరసన సెగ! నల్లజెండాలతో ‘గో బ్యాక్’ నినాదాలు
బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు నిరసన సెగ తగిలింది. బిహార్‌లోని తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన బెగుసరాయ్‌లో పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. బచ్వాడాలో ఒక కార్యక్రమానికి వెళుతుండగా సొంత పార్టీ కార్యకర్తలే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండాలను ప్రదర్శించారు. గిరిరాజ్ సింగ్ ఇటీవల తన బెగుసరాయ్ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు నిరంతరం చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆదివారం బరౌని డెయిరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని బచ్వాడలో మరో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఎన్‌హెచ్-28లోని రాణి గ్రామ సమీపంలో సొంత పార్టీ కార్యకర్తలే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు నల్లజెండాలు చూపించారు. కాన్వాయ్‌ను చుట్టుముట్టిన వారు, బీజేపీ జెండాలతో పాటు నల్ల జెండాలను పట్టుకుని, ఆయన వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో గిరిరాజ్ సింగ్ కాన్వాయ్ కొద్దిసేపు నిలిచిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నల్లజెండాలు చూపుతున్న వారిని చెదరగొట్టి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పెప్సీ ప్లాంట్‌లో బెగుసరాయ్ వాసులెవరికీ ఉపాధి కల్పించలేదని నిరసనకారులు చెబుతున్నారు. ఆయనకు డబ్బులిచ్చినవారికి మాత్రమే ఉపాధి కల్పించారని ఆరోపించారు. అయితే తమ కార్యకర్తలు కేంద్ర మంత్రికి స్వాగతం పలికేందుకే వచ్చారని బీజేపీ చెబుతోంది. నల్ల జెండాలు ప్రదర్శించినవారు సీపీఐ మద్దతుదారులని పేర్కొంది. बीजेपी सांसद गिरिराज सिंह को उनके संसदीय क्षेत्र में बीजेपी कार्यकर्ताओं ने काले झंडे दिखाए। pic.twitter.com/j7OmTGtg9U — Lutyens Media (@LutyensMediaIN) March 10, 2024 -
అమేథీ ప్రజల్ని రాహుల్ గాంధీ నమ్మడం లేదు
బెగుసరాయ్, బీహార్: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచే మళ్లీ పోటీ చేయనున్నారు. అయితే రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. రాహుల్ గాంధీ అమేథీ ప్రజలను విశ్వసించడం లేదు. అమేథీ ప్రజలు ఇందిరా గాంధీకి, వారి కుటుంబాన్ని గౌరవిస్తూ వస్తున్నారు. #WATCH | Begusarai, Bihar: On the Congress' first list of candidates for Lok Sabha Polls 2024 and Rahul Gandhi's Wayanad candidature, Union Minister Giriraj Singh says, "He does not trust the people of Amethi. This place has always given respect to Indira Gandhi and her family,… pic.twitter.com/46dqwWj18l — ANI (@ANI) March 9, 2024 కానీ గత 5 సంవత్సరాలలో, వారు (కాంగ్రెస్ పార్టీ) అమేథీ ప్రజలను అగౌరవపరిచారు. కాబట్టే మైనారిటీ ప్రజలు ఎక్కువ మంది వాయనాడ్‌ను నమ్ముతున్నారు. రాహుల్ గాంధీ అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. -
కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ విలీనం!
జనతాదళ్ యునైటెడ్ జేడీ(యూ), రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీలు త్వరలో విలీనం అవుతాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(యూ)అధినేత, సీఎం నితీష్ కుమార్.. ఇండియా కూటమిలో భాగంగా సీట్ల పంపిణీపై పట్టబడుతున్నారన్న మీడియా ప్రశ్నకు కేంద్రమంత్రి ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పలు వ్యక్తిగత సమీకరణాలు పంచుకున్నా. ఆయన కూడా చాలా విషయాలు నాకు చెప్పారు. అయితే వాటిని మీడియా ముందు ప్రజలకు వెల్లడించడం సరికాదు. కానీ, మీకు నేను ఒకటి చెప్పగలను. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ పార్టీలు విలీనం అవుతాయి. అప్పడు ఇండియా కూటమిలో సీట్ల పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు’ అని అన్నారు. అయితే గురవారం పార్లమెంట్ సమావేశాలు ముగించుకొని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఇడియా కూటమి సమావేశం అనంతరం లలూ ప్రసాద్ ఇరువురు ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పట్నాకు ప్రయాణం చేశారు. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎం ఉన్న తన కుమారు తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసే సమయం ఆసన్నమైందని లాలూప్రసాద్.. తనతో చెప్పాడని కేంద్ర మంత్రి గిరిరాజ్ అన్నారు. కేంద్ర మంత్రి ‘విలీనం’ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అసాధారణమైన వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకి ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలవాలని ఉంటుంది. ఆయన్ను ఎవరు గుర్తించరు కావును అసాధారణ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు’ అని మండిపడ్డారు. చదవండి: Alcohol Ban Exemption: గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్ -
‘హలాల్ మాంసం’పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
బెగూసరాయ్: ‘సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో జంతు బలి ఉంది. ముస్లింలను నేను గౌరవిస్తాను. వాళ్లు వారి మత ఆచారం ప్రకారం హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. హిందువులు వెంటనే హలాల్ మాంసాన్ని తినడం ఆపేయాలి. హిందువులు జట్కా మాంసాన్ని మాత్రమే తినాలి’అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ఈ విషయమై సింగ్ సోమవారం బీహార్‌లోని బెగూసరాయ్‌లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కుట్ర వెనుక ఉన్నదెవరో త్వరలో బయటపడుతుందని సింగ్ తెలిపారు. పార్లమెంట్లో జరిగిన దాడి రైతుల ఉద్యమం లాంటిదేనని, ఇందులో కూడా టూల్‌కిట్ గ్యాంగ్ హస్తం ఉందని ఆరోపించారు. ‘పార్లమెంట్లో దాడి ఘటనపై విచారణ జరుపుతున్నాం.దీనికి కారణమైన వాళ్లు ఎవరో త్వరలో తేలుతుంది. రైతుల ఉద్యమ సమయంలో టూల్‌కిట్ గ్యాంగ్ ఎలా బయటపడిందో అలాగే పార్లమెంట్ ఘటన వెనుక ఉన్నదెవరో త్వరలో తెలుస్తుంది’అని గిరిరాజ్ అన్నారు. ఇదీచదవండి..పార్లమెంట్ సమావేశాల అప్డేట్స్. -
లోక్‌సభలో అలజడి ఘటన: ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి ఫైర్
ఢిల్లీ: పార్లమెంట్ అలజడి ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తప్పుబట్టారు. మహ్మద్ అలీ జిన్నా భావజాలంతో ఓవైసీ ప్రభావితమయ్యారని విమర్శించారు. జిన్నా ఆత్మ ఓవైసీలోకి చొరబడిందని వ్యగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ఆయన ఓ వర్గం కోసమే పనిచేస్తారని అన్నారు. నేరస్థుల్లో కూడా మతకోణం చూడటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యం కేసుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాదుల మతం, కులం, విశ్వాసాలతో పట్టింపులేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మతపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఉగ్రవాదులను ఉగ్రవాదులుగానే గుర్తించామని తెలిపారు. పార్లమెంట్లో అలజడి కేసులో నిందితులు ముస్లింలు అయితే పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు అడగడంపై ఆయన ఆక్షేపించారు. ఉగ్రవాద అంశంలో ప్రతిపక్షాలు మత కోణాన్ని చూస్తున్నారు.. ఈ అంశంపై హోమంత్రి అమిత్ షా స్పందించాలని పట్టుబడుతున్నారు.. ఇలాంటి విషయాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పారిపోయేవారు కాదు అని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. దృఢ సంకల్పంతో ప్రతిస్పందించే వ్యక్తి అని తెలిపారు. పార్లమెంటు చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఏఐఎంఐఎం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
‘దిగజారుడు వ్యాఖ్యలంటూ.. టీఎంసీ కౌంటర్’
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలకు టీఎంసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ.. ‘తమ అధికారానికి సవాలు విసురుతున్న మహిళను బీజేపీ ఓర్చుకోలేకపోతుందని తెలిపడానికి ఇలాంటి వ్యాఖ్యలే నిదర్శం. లింగ పక్షవాతంతో కూడిన పాతకాలపు మనస్తత్వాన్ని బీజేపీ బహిరంగంగా వ్యక్త పరుస్తోంది’ అని ‘ఎక్స్’లో విరుచుకుపడింది. After PM @narendramodi's "didi o didi" catcall, Union Minister @girirajsinghbjp now joins the list of @BJP4India leaders who made degrading comments about Smt. @MamataOfficial. It's evident that the BJP leaders find it incredibly hard to fathom a woman in power challenging their… pic.twitter.com/ZCM8GehdIC — All India Trinamool Congress (@AITCofficial) December 6, 2023 కాగా, 29వ విడత కోల్‌కత్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న సీఎం మమతా.. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మహేష్ భట్ల కోరిక మేరకు వేదికపై కాలు కదిపారు. దీనిపై బీజేపీ కేంద్రమంత్రి గిరిరాజ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మమతా డాన్స్ చేస్తూ.. వేడుక చేసుకుంటోంది. ఫిల్మ్ ఫెస్టివల్లో డాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది’ అని విమర్శించారు. దీంతో ఆయన మాటాలు.. దిగజారుడు తనానికి ప్రతీక అని టీఎంసీ మండిపడింది. ఇదికూడా చదవండి: వారి తర్వాత.. కాంగ్రెస్‌లో బీసీ సీఎం లేరు: నిశికాంత్ దుబే -
'ప్రతిపక్షాల భేటీ ఓ ఫొటో సెషన్..' కేంద్ర మంత్రి వ్యంగ్యాస్త్రాలు..
ఢిల్లీ: ప్రతిపక్షాల భేటీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఈ సమావేశం కేవలం ఒక ఫొటో సెషన్ మాత్రమేనని అన్నారు. చాయ్ పార్టీ జరుపుకోవడానికి ప్రతిపక్ష నాయకులు ఒక చోట కూడారని చెప్పారు. ఈ సమావేశంతో ప్రతిపక్ష నాయకులు చేయగలిగేది ఏం ఉండదని జోస్యం చెప్పారు. గడ్డం కత్తిరించి, పెళ్లి చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్.. రాహుల్ గాంధీకి సమావేశంలో సలహా ఇవ్వడాన్ని ఆయన గుర్తు చేశారు. VIDEO | "This was actually a photo session. The first photo session was conducted by (Telangana CM) KCR in Bihar with Nitish Kumar a few months ago," says Union Minister Giriraj Singh on Patna opposition meeting.#OppositionMeeting pic.twitter.com/CPunJ1a50m — Press Trust of India (@PTI_News) June 24, 2023 'ఇది కేవలం ఓ ఫొటో సెషన్ మాత్రమే. నితీష్ కుమార్‌తో కొన్ని నెలల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఇది జరిగింది. చిన్న చిన్న గుంపులు కలిసి ప్రధాని పదవిపై కలలు కంటున్నాయి. వీటితో ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు.' అని గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రతిపక్షాల భేటీ.. పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు. అయితే.. ఇందులో ఎలాంటి ఏకాభిప్రాయానికి నాయకులు రాలేదు. మరో సమావేశాన్ని సిమ్లాలో వచ్చే నెలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: 'భారత్‌లో చాలా మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారు'.. అసోం సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ.. -
గర్వంగా ఉంది.. లాలూ కూతురిపై బీజేపీ ప్రశంసలు
ఢిల్లీ: మానవ సంబంధాల కంటే డబ్బుకి, సంఘంలో పేరుప్రతిష్టలు, పరపతికే ప్రాధాన్యం పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. అయినవాళ్లను కూడా దూరంగా పెడుతున్నారు కొంతమంది. అయితే.. కన్నవాళ్ల కోసం, వాళ్ల ఆరోగ్యం కోసం తాపత్రయ పడే పిల్లలకు సమాజంలోని తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అలా.. రాజకీయ దిగ్గజం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్యపై ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బీజేపీ ఫైర్‌బ్రాండ్, బీహార్ నేత గిరిరాజ్ సింగ్.. లాలూ యాదవ్‌పై మామూలుగా విరుచుకుపడరు. అలాంటి వ్యక్తి.. లాలూ కూతురిపై ఆశ్చర్యకరంగా ప్రశంసలు గుప్పించారు. ‘‘రోహిణి ఆచార్య.. కూతురు అంటే నీలా ఉండాలి. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. తర్వాతి తరాలకు నువ్వు(రోహిణిని ఉద్దేశిస్తూ..) ఒక ఆదర్శప్రాయంగా నిలిచావు అంటూ పోస్ట్ చేశారు. మరో బీజేపీ నేత నిషికాంత్ దుబే సైతం రోహిణిపై పొగడ్తలు గుప్పించారు. నాకు కూతురు లేదు. కానీ, ఇవాళ రోహిణిని చూశాక.. దేవుడితో పోరాడైన సరే నాకు ఓ కూతురిని ఇవ్వమని కోరాలని ఉంది అంటూ ట్వీట్ చేశారాయన. “बेटी हो तो रोहणी आचार्य जैसी” गर्व है आप पर… आप उदाहरण होंगी आने वाले पीढ़ियों के लिए । pic.twitter.com/jzg3CTSmht — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) December 5, 2022 मुझे भगवान ने बेटी नहीं दी,आज रोहिणी आचार्य को देखकर सचमुच भगवान से लड़ने का दिल कर रहा है है,मेरी नानी हमेशा कहती थी,बेटा से बेटी भली जो कुलवंती हो pic.twitter.com/j0WSMfckjL — Dr Nishikant Dubey (@nishikant_dubey) December 5, 2022 ఇదిలా ఉంటే.. లాలూ పెద్ద కూతురు మీసా భారతి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సైతం గత సాయంత్రం లాలూ సర్జరీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వయసున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో 40లో ఉన్న రోహిణి ఆచార్య.. తన కిడ్నీని తండ్రికి దానం ఇచ్చింది. సింగపూర్‌లో సోమవారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. Ready to rock and roll ✌️ Wish me a good luck 🤞 pic.twitter.com/R5AOmFMW0E — Rohini Acharya (@RohiniAcharya2) December 5, 2022 -
అత్యాచారం జరిగితే.. అది మీ సీఎం చేసినట్టా? బీజేపీపై తేజస్వీ ఫైర్
పాట్నా: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇటీవల బెగూసరాయ్‌లో జరిగిన కాల్పుల ఘటనకు సీఎం నితీశ్ కుమారే బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా సీఎంనే నిదించడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజూ ఎన్నో నేరాలు జరుగుతున్నాయని వాటికి బాధ్యత ఆయా సీఎంలదేనా? అని తేజస్వీ ప్రశ్నించారు. ఒకవేళ అక్కడ రేప్ జరిగితే అది వాళ్ల సీఎం చేసినట్లా? అని అడిగారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రేదశ్‌లో ప్రతి రోజు నేరాలు జరుగుతూనే ఉన్నాయని, రామరాజ్యమంటే అదేనా అని తేజస్వీ ధ్వజమెత్తారు. 'బెగూసరాయ్ కాల్పుల ఘటనకు కొత్త కోణం ఇవ్వాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. బీహార్‌లో ఉంది ప్రజా ప్రభుత్వం. బీజేపీ అంటేనే అతిపెద్ద అబద్దాల పార్టీ. వారు ఎప్పుడూ చెప్పింది చేయరు. ప్రజలను విభజించి సమాజంలో విషం నింపాలని చూస్తారు' అని తేజస్వీ తీవ్ర విమర్శలు చేశారు. బెగూసరాయ్‌లో మంగళవారం కాల్పుల ఘటన జరిగింది. ఇద్దరు నిందుతులు బైక్‌పై ప్రయాణించి పలు చోట్లు అరగంటపాటు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. దీనిపై స్పందిస్తూ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్.. నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్‌లో మహాఘట్బంధన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ప్రతిసారి ఆటవిక రాజ్యమే వస్తుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే స్పందిస్తూ తేజస్వీ బీజేపీపై మండిపడ్డారు. చదవండి: ఆటోలో ప్రయాణించి కేజ్రీవాల్ హల్చల్.. ఊహించని గిప్ట్ ఇచ్చిన బీజేపీ -
కేంద్ర నిధులతో కేసీఆర్ ప్రచారం: గిరిరాజ్‌సింగ్
గచ్చిబౌలి: కేంద్రం నిధులతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రి గిరిరాజ్‌సింగ్ విమర్శించారు. శనివారం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో బిహర్, జార్ఖండ్ రాష్ట్రాల సమ్మేళనంలో భాగంగా ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామ పంచాయతీల్లో శ్మశానవాటికల అభివృద్ధి, మొక్కలు నాటారని తెలిపారు. నిధులు ఇచ్చిన విషయం నిజం కాదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో బిహార్, జార్ఖండ్‌తో పాటు ఉత్తర భారతీయుల పాత్ర ఉందన్నారు. ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌లో అనేక మంది ఉత్తరాది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. బడ్జెట్‌తో పాటు ఆదాయ వనరులను పెంచడంలో కేంద్ర ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు గోపాల్ జీ ఠాకూర్, మనోజ్ తివారీ, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి యోగానంద్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ నిరుపేదల పక్కాఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక
ఏజీవర్సిటీ: గ్రామీణ ప్రాంత నిరుపేదలకు తక్కువ ఖర్చుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద నాణ్యమైన పక్కాఇళ్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీపీఆర్లోని రూరల్ టెక్నాలజీ పార్క్‌లో నిర్మించిన మోడల్‌హౌస్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం రూరల్ పార్క్ వద్ద ఉన్న కంప్రెస్డ్ మడ్ బ్లాక్ ప్రొడక్షన్ యూనిట్‌ని సందర్శించి ఉత్పత్తి చేసే ప్రక్రియ, నాణ్యత గురించి ఆరా తీశారు. మంత్రి సమక్షంలో ఎన్ఐఆర్డీపీఆర్, నేషనల్ స్మాల్ ఇండ్లస్ట్రీస్ కార్పొరేషన్ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకం (నరేగా) కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పని దినాలను 26 కోట్లకు పెంచాలని వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌సభా పక్ష నాయకుడు పి.వి. మిధున్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ఎంపీల బృందం మంత్రితో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో పెండింగ్‌లో ఉన్న పలు అంశాల పరిష్కారం కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించింది. అపరిష్కృతంగా ఉన్న అంశాలను విజయసాయిరెడ్డి మంత్రికి స్వయంగా వివరించారు. చదవండి: AP: కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పందించిన మంత్రి బొత్స బడ్జెట్లో గణనీయంగా తగ్గిన ఉపాధి నిధులు ఉపాధి హామీ పథకం కోసం బడ్జెట్ కేటాయింపులను క్రమేపీ తగ్గించడం పట్ల శ్రీ విజయసాయి రెడ్డి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. 2020-21 బడ్జెట్లో 1 లక్షా 10 వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనులకు కేటాయిస్తే 2021-22 బడ్జెట్లో అది 98 వేల కోట్లకు కుదించారు. 2022-23 బడ్జెట్లో ఉపాధి నిధులు 73 వేల కోట్ల రూపాయలకు కుదించారు. ఈ మొత్తంలో పెండింగ్ బకాయిలు 18,350 కోట్ల రూపాయలు తీసేసే మిగిలింది కేవలం 54,650 కోట్ల రూపాయలే...అంటే 2021-22 బడ్జెట్‌తో పోల్చుకుంటే నరేగాకు నిధుల కేటాయింపు 50 శాతానికి కంటే తగ్గిపోవడం శోచనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 2021-22లో 23.68 కోట్ల పని దినాలు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 24 కోట్ల పని దినాలను కల్పించినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. 26 కోట్ల పనిదినాలు అడిగితే 14 కోట్లే ఇచ్చారు.. ఉపాధి హామీ పని దినాల కేటాయింపుపై గత ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమీక్షలో 26 కోట్ల పనిదినాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం కేవలం 14 కోట్ల పని దినాలే కేటాయించారని విజయసాయి రెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే 9.68 కోట్ల పని దినాలు తగ్గిపోయాయని అన్నారు. ఇది గ్రామీణ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సుమారు ఒక కోటి మంది పేదలకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు 26 కోట్ల పని దినాలు కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. 2,828 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయండి.. ఉపాధి హామీ పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో మెటీరియల్ కాస్ట్, అడ్మిన్ కాస్ట్ కింద రెండో విడత విడుదల చేయవలసిన 2,888.64 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేసి రాష్ట్రంలో ఈ పథకం నిరాటంకంగా అమలు చేయడానికి సహకరించాలని కోరారు. కాఫీ తోటల పనులను నరేగా కింద చేర్చండి... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009 -10 నుంచి గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమల్లో కాఫీ తోటల పెంపకం వలన అక్కడి గిరిజన కుటంబాల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. కాఫీ తోటల పెంపకంలో భాగంగా నరేగా కింద వేతనానికి సంబంధించిన గుంతల తవ్వకం, మొక్కలు నాటడం వంటి పనులు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చులను ఐటీడీఏ, కాఫీ బోర్డు భరిస్తున్నాయి. అయితే నరేగా పనులు కాఫీ తోటల పెంపకంలో నిమగ్నమయ్యే రైతులకు వర్తించవంటూ 2020లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. కాఫీ రైతులకు వేతనాల చెల్లింపును ఉపసంహరించడం వలన అరకు కాఫీ సాగు కష్టసాధ్యంగా మారింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన అరకు కాఫీ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. కాఫీని ప్రభుత్వం వాణిజ్య పంటగా మాత్రమే గుర్తించి నరేగా కింద దానిని పరిగణించడానికి నిరాకరిస్తోంది. కాఫీ తోటలు విరివిగా ఉండే కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీ సాగు వాణిజ్య పంటగా ఎస్టేట్లలో సాగవుతుంది. కానీ గిరిజన ప్రాంతమైన పాడేరు వంటి ప్రాంతాల్లో కాఫీ సాగు కేవలం గిరిజనుల జీవనోపాధిగా మాత్రమే సాగవుతున్నందున దీనిని ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పనులను నరేగా కింద పరిగణించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన సాగును అనుమతించాలి కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లో అధిక శాతం రైతులను వారికున్న భూముల విస్తీర్ణాన్ని బట్టి పెద్ద రైతులుగా వర్గీకరించడం జరిగింది. వాస్తవానికి నిరంతర కరవు పరిస్థితులు, నీటి కొరత ఎద్దడి కారణంగా ఆర్థికంగా వెనుకబడిన వారే. సాగు నీరు కొరత, కరువు కారణంగా వారి వ్యవసాయ భూములు నిస్సారంగా మారిపోయాయి. అందువలన కరువు పీడిత ప్రాంతాల్లో భూమి విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా 5 ఎకరాలు సాగుకు వీలైన భూమి కలిగి ఉన్న రైతులు నరేగా కింద ఉద్యాన పంటలు సాగు చేసుకోడానికి అనుమతించాలని కోరుతున్నామని చెప్పారు. శ్మశానవాటికల్లో ప్రహరీ నిర్మాణాన్ని నరేగా కింద చేర్చాలి... గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన విపరీతమైన నిర్లక్ష్యానికి గురవుతున్న వాటిలో శ్మశానవాటికలు. శ్మశానాలే అయినప్పటికీ ఈ ప్రదేశాలు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటాయి. పశువులు, పందులు ఇతర జంతువులు యధేచ్ఛగా శ్మశానాల్లో సంచరిస్తున్నందు వలన అవి ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రంగా, అపవిత్రంగా మారుస్తుంటాయి. శ్మశానాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలంటే ఆయా జంతువుల ప్రవేశాన్ని అరికట్టాలి. అందుకోసం వాటి చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించాల్సిన తక్షణ అవసరం ఉంది. ప్రహరీ గోడల నిర్మాణం వలన శ్మశాన భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించవచ్చు. కాబట్టి శ్మశానాల్లో ప్రహరీ గోడ నిర్మాణాన్ని నరేగా కింద అనుమతించాలని కోరారు. పీఎంఏవై(జీ) కింద 90 రోజులు పని దినాలు కల్పించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న మూడేళ్ళలో 30 లక్షల ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి అవాస్ యోజన (గ్రామీణ) కింద లబ్ధిదారులు తమ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా 90 రోజుల పనిదినాలు పొందడానికి అర్హులు. నరేగా కింద పొందే 100 రోజుల పని హామీకి అదనంగా లబ్ధిదారులకు 90 రోజులు పని దినాలను కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. పీఎంఏవై (జీ) కింద కేంద్ర సాయం పెంచాలి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి కేంద్ర ఇచ్చే ఆర్థిక సహాయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం, ముడి సరుకుల ధరలు, రవాణా, లేబర్ ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నిరుపేద లభ్దిదారులు ఇళ్ళు కట్టుకోవడం సవాలుగా మారింది. అందరికీ ఇళ్ళు అనేది నెరవేరని కలగా మారే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇంటికి ఇంతని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు డ్రిప్, స్ప్రింక్లర్లు కేటాయించాలి. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు తరచుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటూ కరువు బారిన పడుతుంటాయి. ఈ కారణంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యాలు లేక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కాబట్టి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద ఈ రెండు ప్రాంతాలకు చెందిన ఏడు జిల్లాలకు డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్స్‌ను కేటాయించి ఆయా జిల్లాల్లో సాగు నీటిని సమర్ధవంతంగా వినియోగించేందుకు సహకరించవలసిందిగా మంత్రిని కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందంలో మార్గాని భరత్, పిల్లి సుభాష్ చంద్ర బోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్ర శేఖర్, తలారి రంగయ్య, ఆదాల ప్రభాకర రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, ఎన్.రెడ్డప్ప, గోరంట్ల మాధవ్, వైఎస్ అవినాష్ రెడ్డి, మద్దెల గురుమూర్తి, గొడ్డేటి మాధవి, బి.సత్యవతి, వంగా గీత, చింతా అనురాధ ఉన్నారు. -
T20 WC 2021: భారత్-పాక్ మ్యాచ్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Union Minister Giriraj Singh Sensational Comments Over IND Vs PAK T20 WC Match: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య ఈ నెల 24న జరగనున్న హై ఓల్టేజ్ పోరు నేపథ్యంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా భారత్-పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో దాయాదుల పోరు జరగడం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరిగే ఆస్కారముందని అభిప్రాయపడ్డాడు. కాగా, దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం సాయంత్రం ముష్కరులు కాల్పులకు తెగబడి ఇద్దరిని పొట్టనబెట్టుకున్నారు. ఈ నెలలో ఇప్పటి దాకా ఉగ్రదాడులకు 11 మంది బలయ్యారు. ఈ నేపథ్యంలోనే పాక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. చదవండి: శ్రీలంక క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ మృతి.. -
శభాష్ గాడ్గే మీనాక్షి.. ముఖరా(కె) పచ్చదనం భేష్..
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దిన తీరు అభినందనీయమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ శనివారం ట్వీట్ చేశారు. ఇందుకు కృషి చేసిన సర్పంచ్ గాడ్గే మీనాక్షిని అభినందించారు. అడవులు అంతరించిపోతున్న ఈ సమయంలో హరితహారం ద్వారా ఒకటిన్నర ఎకరంలో ఒకేచోట పెద్ద మొత్తంలో మొక్కలు నాటి సంరక్షించడం బాగుందన్నారు. గ్రామాల్లో మొక్కలునాటి పచ్చదనాన్ని పెంపొందించడానికి దేశంలో ఇతర పంచాయతీలకు ముఖరా(కె) ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌తో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ
సాక్షి, ఢిల్లీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన 6,750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి, పార్టీ లోక్ సభాపక్ష నాయకులు మిథున్ రెడ్డి సారథ్యంలో ఎంపీల బృందం మంత్రితో సమావేశమయ్యారు. ఉపాధి పనుల బకాయిల విడుదలతో పాటు ఈ పథకం కింద పని దినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరారు. ఈ మేరకు ఎంపీలందరూ సంతకాలు చేసిన వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల బృందం మంత్రితో జరిపిన భేటీలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 18.4 కోట్ల పని దినాలను కల్పించి దేశంలోనే అత్యధిక పని దినాలు కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పిందని తెలిపారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే 16.7 కోట్ల పని దినాలను కల్పించి కూలీల బడ్జెట్లో 83.5 శాతం వినియోగించుకుంది. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి అత్యధిక ఉపాధి కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. 2006లో దేశంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ పథకం కింద ఉపాధి కల్పించింది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నేపథ్యంలో ఉపాధి పనులకు ఏర్పడిన డిమాండ్ దృష్ట్యా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పేదలకు కనీసం ఒక కోటి పని దినాలు కల్పించాలని గత ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన లక్ష్యాన్ని తొమ్మిది జిల్లాల్లో విజయవంతగా చేరుకోగలిగినట్లు చెప్పారు. గ్రామీణ ఉపాధి పథకం అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ పథకాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి చొరవ తీసుకోవలసిందిగా విజయసాయి రెడ్డి మంత్రిని కోరారు. ఆ చర్యలలో భాగంగా పెండింగ్‌లో ఉన్న 6,750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పని దినాలను 100 నుంచి 150కి పెంచాలి. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ ఖర్చును 20 లక్షల రూపాయలకు పెంచాలి. దీని వలన ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఉపయుక్తంగా ఉండే టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగు నీరు, క్రీడా సౌకర్యాల కల్పిన కోసం ఉపాధి పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 15 లక్షలకు పెంచాలి. మిగిలిన 5 లక్షల రూపాయలు ఐసీడీఎస్ వాటా కింద చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమంలో భాగంగా సర్వే రాళ్ళు పాతే కూలీలకు వేతనాలను ఉపాధి పథకం కింద వినియోగించుకునేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పథకం కింద లేబర్ బడ్జెట్‌ను సవరించాలని కోరారు. కాఫీ తోటల పెంపకంతో గిరిజనులను ఆదుకోండి... ఉపాధి హామీ పథకం కింద గిరిజనులు కాఫీ తోటల పెంపకాన్ని చేపట్టేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీని వలన ప్రధానంగా విశాఖపట్నం జిల్లా పాడేరులోని నిరుపేద గిరిజనులకు ఎంతో మేలు చేసినట్లువుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాలలో రబ్బర్ తోటల పెంపకాన్ని ఉపాధి హామీ కింద చేర్చినట్లుగానే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు కాఫీ తోటల పెంపకాన్ని కూడా ఈ పథకం కింద చేర్చాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. -
‘షాహీన్ బాగ్.. సుసైడ్ బాంబర్ల శిక్షణ కేంద్రం’
న్యూఢిల్లీ : ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో సుపైడ్ బాంబర్లను(ఆత్మాహుతి దళాలు) తయారు చేసేందుకు శిక్షణ ఇస్తున్నారని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపణలు చేశారు. ‘‘షాహిన్‌బాగ్‌లో జరిగేది కేవలం ఉద్యమం కాదు. అక్కడ సూసైడ్ బాంబర్లు శిక్షణ పొందుతున్నారు. రాజధానిలో దేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది’’ అని గురువారం ట్విటర్లో తెలిపారు. షాహీన్‌బాగ్ ఆత్మాహుతి దళాలను పెంపొందిస్తున్న కేంద్రంగా మారిందని ఆరోపించారు. (‘కాల్చి వేయండి’ అన్నా చర్య తీసుకోరా!?) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్‌లో గత ఏడాది డిసెంబర్ 18 నుంచి ముస్లింలు తీవ్ర ఆందళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు దీనిని కీలక ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. అధికారం కోసం బీజేపీ షాహీన్బాగ్పై మురికి రాజకీయాలు చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దుయ్యబట్టారు. మరోవైపు కాంగ్రెస్, ఆప్ మద్దతుతోనే ఆందోళనకారులు రహదారులను అడ్డగించి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని తాము అధికారంలోకి వచ్చాక శిబిరాన్ని తొలగిస్తామని బీజేపీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. చదవండి : షహీన్ బాగ్‌పై మరో నకిలీ వీడియో! यह शाहीन बाग़ अब सिर्फ आंदोलन नही रह गया है ..यहाँ सूइसाइड बॉम्बर का जत्था बनाया जा रहा है। देश की राजधानी में देश के खिलाफ साजिश हो रही है। pic.twitter.com/NoD98Zfwpx — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) February 6, 2020 -
‘పిల్లలు బీఫ్ తినడం పెద్దల తప్పు’
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాలకు వెళుతున్న భారతీయ యువత మన సంస్కృతి, సంప్రదాయాల గురించి పెద్దలు వివరించకపోవడంతో అక్కడ బీఫ్ తినడం మొదలుపెడుతున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘స్కూల్స్‌లో భగవద్గీతను కచ్చితంగా బోధించేలా చర్యలు చేపట్టాలి..మన పిల్లలను మిషనరీ స్కూల్స్‌కు పంపితే అక్కడ ఐఐటీ శిక్షణతో ఇంజనీర్లవుతూ విదేశాలకు వెళుతున్నారు. వారిలో చాలా మంది బీఫ్ తినడానికి అలవాటుపడుతున్నార‘ని వ్యాఖ్యానించారు. వారికి మన సంస్కృతి, సంప్రదాయాల గురించి మనం బోధించకపోవడమే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత పిల్లలు తమను సరిగ్గా చూసుకోవడం లేదని పెద్దలు వాపోతున్నారని అన్నారు. బెగుసరైలో భగవద్గీతకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొంటూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో భగవద్గీతను చిన్నారులకు బోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాము చేపట్టిన సర్వేలో 100 ఇళ్లకు గాను కేవలం 15 ఇళ్లలోనే హనుమాన్ చాలీసా, భగవద్గీత, రామాయణ పుస్తకాలు ఉన్నాయని వెల్లడైందని చెబుతూ జరుగుతున్న పరిణామాలకు మనం పిల్లల్ని నిందించలేమని చెప్పుకొచ్చారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటేనే మన దేశం మనుగడ సాధిస్తుందని వ్యాఖ్యానించారు. -
రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ దేశాన్ని ముక్కలు చేసేందుకు పాకిస్తాన్ ముస్లింలు, రోహింగ్యాలు భారత్‌కు రావాలని కోరుకుంటూ పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. పాకిస్తాన్‌కు చెందిన గజ్వే హింద్ ఆకాంక్షలను ప్రధాని మోదీ భగ్నం చేస్తే, రాహుల్ గాంధీ గజ్వే హింద్‌కు బాసటగా నిలిచారని మండిపడ్డారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు పాక్ ముస్లింలు, రోహింగ్యాలు భారత్‌కు రావాలని కోరుకుంటున్న రాహుల్ పౌర చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్నాడని దుయ్యబ్టారు. కాగా విపక్షాలు దేశాన్ని చీల్చి అంతర్యుద్ధం జరగాలని కాంక్షిస్తున్నాయని గిరిరాజ్ సింగ్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. రాహుల్, కాంగ్రెస్, ఓవైసీ వంటి వారంతా భారత్‌ను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, దేశంలో అంతర్యుద్ధం జరగాలని ఆకాంక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓవైసీ పాక్ అజెండాను అమలు చేసేందుకు పూనుకున్నారని విమర్శించారు. -
రాహుల్‌కు అంత ప్రేముంటే ఇటలీ తీసుకెళ్లొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ చొరబాటుదారులపై కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అంత ప్రేమ ఉంటే వారందరినీ తన అమ్మమ్మ దేశమైన ఇటలీకి తీసుకెళ్లవచ్చని కేంద్ర పశు, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం రాంచీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న మంత్రి, అస్సాంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. దేశాన్ని కాంగ్రెస్ పార్టీయే మతం ఆధారంగా విభజించిందని విమర్శించారు. ఇప్పడు సీఏఏపై ద్వంద్వ విధానాలు పాటిస్తూ మరోసారి విభజించడానికి కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఏఏపై ఆ పార్టీ నాయకులు మాట్లాడిన వీడియోలు ఉన్నాయని, కానీ ఆ పార్టీ ఇప్పుడు ఓట్ల రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం విభజనకు గురైనప్పుడు పాకిస్తాన్లో ఉన్న మైనార్టీలు భవిష్యత్తులో పీడనకు గురైతే భారత్ వారిని సహృదయంతో ఆహ్వానించాలని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ వైఖరిని మంత్రి ఎండగట్టారు. అసద్ 2013లో చేసిన హిందూ ముక్త్ హిందూస్తాన్ వ్యాఖ్యలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు. చదవండి : సీఏఏ: అసోం మంత్రి కీలక వ్యాఖ్యలు -
తొలి విజయం; అది అతి ప్రమాదకరం!
న్యూఢిల్లీ : బిహార్ ఉప ఎన్నికల్లో ఓటర్లు అతి ప్రమాదకరమైన తీర్పు వెలువరించారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కిషన్‌గంజ్‌లో ఎంఐఎం గెలవడం వల్ల జిన్నా భావజాలం వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. వందేమాతరాన్ని ద్వేషించే ఎంఐఎం పార్టీతో బిహార్‌లో సామాజిక సమగ్రతకు భంగం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బిహార్ ప్రజలు ఇక తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఆలోచించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా గిరిరాజ్ సింగ్ ట్వీట్‌పై స్పందించిన జేడీయూ సీనియర్ నేత, బిహార్ మంత్రి శ్యామ్ రజాక్ ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ‘ ఒకవేళ గిరిరాజ్ సింగ్‌కు నిజంగా బిహార్ ప్రజలపై అంత ప్రేమే ఉంటే తక్షణమే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ తాజా ఎన్నికల్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. బిహార్‌లో బోణీ కొట్టి... కిషన్‌గంజ్(ఉప ఎన్నిక) అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుని బీజేపీకి గట్టి షాకిచ్చింది. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ... ‘బిహార్‌లో మాకు దక్కిన తొలి విజయం ఎంతో కీలకమైంది. బీజేపీని ఓడించడమే కాదు.. కాంగ్రెస్‌ను కూడా మూడోస్థానానికే పరిమితం చేశాం. బిహార్ ఎంఐఎం అధ్యక్షుడు ఇమాన్ నాయకత్వం ఇలాగే కొనసాగాలి. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎంఐఎం కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చి.. ఔరంగాబాద్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. बिहार के उपचुनाव में सबसे ख़तरनाक परिणाम किशनगंज से उभर के आया है ..ओवैसी की पार्टी AIMIM जिन्ना की सोच वाले है ,यें वंदे मातरम से नफरत करते है ,इनसे बिहार की सामाजिक समरसता को खतरा हैं। बिहार वासियों को अपने भविष्य के बारे में सोचना चाहिए। — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) October 25, 2019 -
‘నా రాజకీయ జీవితం ముగియబోతోంది’
పట్నా : తాను పదవుల కోసం రాజకీయాల్లో ప్రవేశించలేదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. కశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయాలనే కలతోనే ఈ రంగంలో అడుగుపెట్టానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో తన కల పరిపూర్ణమైందని ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. మంగళవారం గిరిరాజ్ విలేకరులతో మాట్లాడుతూ..‘నరేంద్ర మోదీ లాంటి ప్రధాని ఉండటం నిజంగా మన అదృష్టం. కశ్మీర్ విషయంలో ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ పదవీ కాలం పూర్తి చేసుకునే లోపు అంటే 2024 నాటికి నా రాజకీయ జీవితం ముగిసే అవకాశం ఉంది. అయినా ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో పదవులు చేపట్టేందుకు నేను రాజకీయాల్లోకి రాలేదు. కశ్మీర్ పూర్తిగా భారత్‌లో విలీనమవడం నా కల. మా పార్టీ సిద్ధాంతకర్త శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేనికోసమే ప్రాణ త్యాగం చేశారో.. ఆర్టికల్ 370 రద్దుతో దానికి ప్రతిఫలం దక్కింది అని పేర్కొన్నారు. (చదవండి : ఆర్టికల్ 370 రద్దు; ఆయన కల నెరవేరింది!) ఇక 2020లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బరిలో దిగే అవకాశం ఉందా అన్న విలేకరుల ప్రశ్నకు బదులుగా..2024 నాటికి తాను రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో ఉన్నానని గిరిరాజ్ సమాధానమిచ్చారు. కాగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గిరిరాజ్ లోక్‌సభ ఎన్నికల్లో బెగుసరాయ్ నుంచి పోటీ చేశారు. సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాదాపు 4 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో మోదీ 2.0 కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇక గతంలో బీజేపీ నేతలు ఇఫ్తార్ విందులకు హాజరైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన గిరిరాజ్..‘నవరాత్రి రోజుల్లో ఫలాహారం ఏర్పాటు చేసి ఇలాంటి ఫొటోలు తీసుకుంటే అవి ఎంత అందంగా ఉండేవో!. మనం మన మతానికి సంబంధించిన కర్మ, ధర్మాలను ఆచరించడంలో నిరాసక్తంగా ఉంటాం కానీ వేరే మతంపై ప్రేమను నటించడంలో ముందుంటాం’ అంటూ ట్వీట్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. అదే విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా...మోదీని వ్యతిరేకించేవారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
పశుసంవర్థక కార్యక్రమాలు భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో అమలుచేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శనివారం సమీక్ష జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి తలసాని కేంద్ర మంత్రికి వివరించారు. గొర్రెల పంపిణీ ఎంతో గొప్ప కార్యక్రమమని, జీవాల ఆరోగ్య పరిరక్షణకు తీసుకున్న చర్యలు బాగున్నాయని గిరిరాజ్ కితాబిచ్చారు. సమావేశంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, పశుసం వర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సువర్ణ, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాటి కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదు
సాక్షి, విజయనగరం : కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో చేతల ప్రభుత్వం ఉందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన భోగాపురం మండలంలోని రొయ్య పిల్లల ఉత్పత్తి పరిశ్రమ వైశాఖీ బయో రిసోర్సెస్‌ను సందర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మత్స్య పరిశ్రమ ద్వారా ప్రస్తుతం 47 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయనీ, దీనిని లక్ష కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. అందుకోసం 25 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించామన్నారు. మత్స్య పరిశ్రమలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందంటూ, ఈ ఉత్పత్తుల్లో రసాయనాల వాడకం తగ్గించాలని సూచించారు. రాష్ట్రంలో సగటు రొయ్యల ఉత్పత్తి హెక్టారుకు మూడు టన్నులు కాగా, దీనిని 9 టన్నులకు పెంచాలని నిర్దేశించారు. రొయ్యలకు సర్టిఫికేషన్ కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఆ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలనే దృష్టితోనే వ్యవసాయ శాఖ నుంచి విడదీసి పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలను వేరే శాఖగా ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బాలాజీ, మత్స్య శాఖ కమిషనర్ రాం శంకర్ నాయక్ పాల్గొన్నారు.