Godse
-
గాడ్సే భరతమాత ముద్దుబిడ్డ.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కొల్హాపూర్ అల్లర్ల తర్వాత అక్కడ పరిస్థితి సద్దుమణిగేలా ఉన్నా కానీ రాజకీయ నేతలు మాత్రం ఆ చిచ్చును ఆరనీయడం లేదు. అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన "గాడ్సే వారసులు" వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో గాంధీని చంపిన నాథూరాం గాడ్సే భరతమాత ముద్దుబిడ్డే అన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. టిప్పు సుల్తాన్, ఔరంగజేబులకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల నేపథ్యంలో కొల్హాపూర్ అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రజలు భయాందోళనతో ఉంటే అవేమీ పట్టని రాజకీయ నాయకులు మాత్రం పరస్పర విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి తెరతీశారు. కొల్హాపూర్ అల్లర్ల తర్వాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ "ఔరంగజేబు వారసులు" అంటూ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ఔరంగజేబు వారసుల గురించి అంతా తెలిసిన మీకు గాడ్సే, ఆప్టేల వారసులు గురించి కూడా తెలిసి ఉండాలని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో బీజేపీ మంత్రి గిరిరాజ్ సింగ్ నాథూరాం గాడ్సేను భరతమాత ముద్దుబిడ్డగా వర్ణించారు. మంత్రి ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గాడ్సే గాంధీ హంతకుడయితే గాడ్సే కూడా భరతమాత ముద్దుబిడ్డే కదా. ఆయన భారత దేశంలోనే పుట్టాడు. బాబర్, ఔరంగజేబుల మాదిరిగా పరాయి దేశం నుండి వచ్చినవాడు కాదు. బాబర్ వారసులుగా పిలవబడటానికి ఇష్టపడేవారు ఎప్పటికీ భరతమాత బిడ్డలు కాలేరని అన్నారు. #WATCH | Chhattisgarh: If Godse is Gandhi's killer, he is also the nation's son. He was born in India, and he was not an invader like Aurangzeb & Babar. Whosoever feels happy to be called the son of Babar, that person can't be the son of Bharat Mata: Union Minister Giriraj Singh pic.twitter.com/7GIS3z7noM — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 9, 2023 ఇది కూడా చదవండి: రాసి పెట్టుకోండి.. బీజేపీ ఓడిపోతుంది.. -
ఓటీటీకి వచ్చేస్తున్న గాడ్సే.. ఎప్పుడు, ఎక్కడంటే!
విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సత్యదేవ్. నటన ప్రాధాన్యమున్ను పాత్రలను ఎంచుకుంటూ సహా నటుడి పాత్రలు సైతం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఆయన గాడ్సే మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. గోపీ గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుదలై ప్రేక్షకులను పెద్ద ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ చిత్రం పరాజయం పొందింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్స్రీన్పై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. త్వరలోనే గాడ్సే ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 17న నుంచి గాడ్సే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్.. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా మలయాళ కుట్టి ఐశ్వర్య హీరోయిన్గా నటించింది. నాగబాబు కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో సత్యదేవ్ విశ్వనాథ రామచంద్ర పాత్రలో కనిపించాడు. సామాజిక అంశాలు, వ్యవస్థ తీరు వంటి తదితర విషయాల కథాంశంగా గాడ్సే మూవీ తెరకెక్కింది. ఇదిలా ఉంటే సత్యదేవ్ నటించిన మరో చిత్రం గుర్తుందా శీతాకాలం కూడా థియేటర్లో విడుదలకు రెడీ అయ్యింది. ప్రస్తుతం సత్యదేవ్ చిరంజీవి గాడ్ ఫాదర్లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆయన అక్షయ్ కుమార్ రామ్‌సేతు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించానున్నాడు. -
ఇండియన్ సినిమాలను హాలీవుడ్ కాపీ కొడుతోంది : ప్రకాశ్ నాగ్
మన ఇండియన్ సినిమా స్థాయి పెరిగింది. మన చిత్రాలను ఇప్పుడు హలీవుడ్ వారు సైతం కాపీ కొడుతున్నారు. మన సినిమాలో ఫైట్స్ , ఇంటెన్సిటీ, లుక్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి’అని అన్నారు నటుడు ప్రకాశ్ నాగ్. గోపి గణేశ్ పట్టాభి దర్శకత్వంలో సత్యదేశ్ హీరోగా నటించిన ‘గాడ్సే’ చిత్రంలో విలన్ పాత్రలో నటించాడు ప్రకాశ్ నాగ్. ఇటీవల థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. విలన్‌గా ప్రకాశ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రకాశ్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మాది వైజాగ్ నేను అక్కడే పుట్టాను. మా ఫాదర్ ఆర్మీ లో ఉన్నందున నేను చాలా రాష్ట్రాలు తిరగవలసి వచ్చేది. అయితే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన తరువాత ఫైవ్ స్టార్ హోటల్ లో జనరల్ మేనేజర్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్ హోటల్స్ లో వర్క్ చేయడం జరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం నేను దుబాయ్ కి వెళ్లడం జరిగింది అక్కడ కొంతకాలం మల్టీ నేషనల్ కంపెనీలో వర్క్ చేశాను. అయితే నా లైఫ్ స్టైల్ చాలా ట్రెండీగా ఉండేది. ఇక్కడ మ్యూచివల్ ఫ్రెండ్ ద్వారా దర్శకుడు గోపి పరిచయమయ్యారు. ► గోపికి నా వర్కింగ్ స్టైల్ నచ్చి మేము సోషల్ మెసేజ్ ఉన్న ఒక సినిమా తీస్తున్నాము ఈ సినిమాలో నెగిటివ్ రోల్ ఉంది,మిమ్మల్ని చూడగానే మా సినిమాలో నేను అనుకున్న క్యారెక్టర్ కు మీరు సూట్ అవుతారు మీకు సినిమా చేసే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు.నేను తెలుగు వాడిని అయినందున నాకు చిన్నప్పటి నుండి నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం.అందుకే నాకు మొదటి చిత్రానికే ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన చిత్ర దర్శక, నిర్మాతలు దొరకడం నా అదృష్టం. అందుకే వారికి నా ధన్యవాదములు ► ఈ సినిమాలో సమాజంలో జరిగే చాలా విషయాలను చర్చించాం. ముఖ్యంగా మన వ్యవస్థలో భాగమైన ప్రభుత్వం.. ఎలా పని చేస్తుంది. అందులో లోపాలేంటి? అనే విషయాలను చూపించాం. ఈ సినిమాలో నా పాత్ర చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. నేను గాడ్సే వంటి చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది . ► ప్రస్తుతం నేఏను కొన్ని కంపెనీ ల కు అడ్వైసరి రోల్ లో ఉన్నాను. ఆ కంపెనీ ల బిజినెస్ గ్రోత్ కోసం వారు నా సలహాలు తీసుకుంటారు.అటు బిజినెస్ ఇటు యాక్టింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నా జర్నీని ఇక కొనసాగిస్తాను . ► నాకు తెలుగులో గాని బాలీవుడ్ లో గాని హాలీవుడ్ లో ఎక్కడైనా మంచి క్యారెక్టర్ దొరికితే నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను .ఇప్పుడిప్పుడే కొన్ని కథలు వింటున్నాను అవి ఏంటనేది త్వరలో తెలియజేస్తాను. -
బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. సత్యదేవ్ 'గాడ్సే' రివ్యూ
టైటిల్: గాడ్సే నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, జియా ఖాన్, షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, నోయెల్ తదితరులు స్వరాలు (రెండు పాటలు): సునీల్ కశ్యప్ సంగీతం: శాండీ అద్దంకి నిర్మాత: సి. కల్యాణ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం విడుదల తేది: జూన్ 17, 2022 విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ తాజాగా 'గాడ్సే'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో సత్యదేవ్‌తో 'బ్లఫ్ మాస్టర్' సినిమా తెరకెక్కించిన గోపీ గణేష్ పట్టాభి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నటించింది. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి. కల్యాణ్ నిర్మించిన 'గాడ్సే' శుక్రవారం అంటే జూన్ 17న విడుదల అయింది. సామాజిక అంశాలు, వ్యవస్థ తీరు వంటి తదితర విషయాలు కథాంశంగా తెరకెక్కిన 'గాడ్సే' ప్రేక్షకులను ఏ విధంగా అలరించాడో రివ్యూలో చూద్దాం. కథ: పోలీసు అధికారులు, మంత్రులు, బినామీలతోపాటు కొందరు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు వరుసగా కిడ్నాప్ అవుతుంటారు. ఈ విషయం ప్రజలకు తెలిస్తే ఆందోళనకు గురవుతారని, ఇతర సమస్యలు ఏర్పడతాయని ప్రభుత్వం రహస్యంగా హ్యాండిల్ చేస్తుంది. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఒక పోలీసు బృందాన్ని ఆదేశిస్తుంది. ఆ టీమ్‌లో ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) ఉంటుంది. వీళ్లందరని రాష్ట్రానికి వచ్చిన వ్యాపారవేత్త విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటుంది. వారందరినీ విశ్వనాథ్ రామచంద్ర ఎందుకు కిడ్నాప్ చేశాడు ? అతను ఏం చెప్పాలనుకున్నాడు ? బిజినెస్‌మేన్ కిడ్నాపర్ గాడ్సేగా ఎందుకు మారాడు? అనే తదితర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ: రాజకీయ నాయకులు చేసే అవినీతి, డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, వేలమంది గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు వంటి విషయాలను సినిమాలో చూపించారు దర్శకుడు. సినిమా కాన్సెప్ట్ నిజానికి బాగుంది. కానీ ఆ కథను వెండితెరపై ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయినట్లే అని చెప్పుకోవచ్చు. కిడ్నాప్ ఎందుకు చేశారో చెప్పేది కొంతవరకు బాగున్నా తర్వాత ఆసక్తిగా ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. అంతా ఎక్స్పెక్టెడ్ సీన్లతో బోరింగ్‌గా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అంతగా కనెక్ట్ కాలేదనే చెప్పొచ్చు. కానీ చివరిలో వచ్చే క్లైమాక్స్ మాత్రం సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సత్యదేవ్ చెప్పే ఒక్కో డైలాగ్ అందరనీ ఆలోచింపజేసేలా ఉంటాయి. ఎవరెలా చేశారంటే ? సత్యదేవ్ ఇప్పటికే మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో కూడా ఆయన నటన ఇంటెన్సివ్‌గా ఉండి అందరినీ కట్టిపడేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన ఒంటిచేత్తో నడిపించాడు. ఆయన చెప్పే ఒక్కో డైలాగ్ క్లాప్ కొట్టించేలా ఉంది. ఇక పోలీసు అధికారి పాత్రలో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి చక్కగా నటించింది. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. పోలీసు పాత్రకు తగిన ఆహార్యం, డ్రెస్సింగ్ స్టైల్, యాక్టింగ్ సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఇక షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, జియా ఖాన్, పృథ్వీరాజ్, నోయెల్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, నాగబాబు, ప్రియదర్శి తమ పాత్రల పరిధి మేర నటించారు. చివరిగా చెప్పాలంటే మరోసారి వృథా అయిన సత్యదేవ్ యాక్టింగ్ కోసం తప్పకుండా చూడొచ్చు. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
నా నిజ జీవితానికి ‘గాడ్సే’ కథ దగ్గర, అందుకే: సత్యదేవ్
‘‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ‘గాడ్సే’లో నిర్భయంగా చూపిస్తున్నాం. ప్రీ క్లైమాక్స్‌కి ముందు వచ్చే ఎపిసోడ్ భావోద్వేగంగా ఉంటుంది. సినిమా చూసి బయటికొచ్చిన ప్రేక్షకులు మా మూవీలో చర్చించిన సమస్యల గురించి ఆలోచిస్తారు’’ అని హీరో సత్యదేవ్ అన్నారు. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘గాడ్సే’. చదవండి: ‘విరాటపర్వం’ మూవీ రివ్యూ సి.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సత్యదేవ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కళాశాలలో చదివేటప్పటి నుంచే నాకు సామాజిక బాధ్యత ఎక్కువ. అందరూ నిబంధనలు పాటించాలనుకునేవాన్ని. నా నిజ జీవితానికి ‘గాడ్సే’ కథ దగ్గరగా ఉండటంతో వెంటనే కనెక్ట్ అయ్యాను. ఈ చిత్రంలో నేను విశ్వనాథ రామచంద్ర అనే పాత్రలో కనిపిస్తా. విద్యావ్యవస్థలో మార్పులు రావాలని, యువత ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే సమాజం పురోగమిస్తుందనే సందేశాన్ని ఇస్తున్నాం. చదవండి: 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ ఫైట్ రీ క్రియేట్.. నెట్టింట వైరల్ వాస్తవానికి దగ్గరగా ఉన్న ఈ చిత్ర కథ ప్రేక్షకులను వెంటాడుతుంది. ఎవరైనా స్టార్డమ్ కోసమే సినిమా ఇండస్ట్రీకి వస్తారు.. అయితే అది రావడానికి కష్ట పడటంతో పాటు ఓపిక అవసరం. వైశాలి అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఐశ్వర్య లక్ష్మీ బాగా చేశారు. పట్టాభిగారు ఈ సినిమాని అద్భుతంగా తీశారు. సి.కల్యాణ్‌గారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ‘గాడ్సే’ మూవీతో నా కెరీర్ ఊపందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
అదే విషయాన్ని ‘గాడ్సే’తో సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం: డైరెక్టర్
‘‘కొన్ని సినిమాలు చూసి ప్రజలు చెడిపోతున్నారని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ అదే సినిమాల్లో మంచి చెప్పినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ‘గాడ్సే’ ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రం’’ అన్నారు దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘గాడ్సే’. సి. కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు గోపీ గణేష్ విలేకర్ల సమావేశంలో చెప్పిన విశేషాలు. ⇔ ‘గాడ్సే’ సినిమా ఫ్లాష్‌బ్యాక్ సీన్లో ఓ డ్రామా ఉంటుంది. అదేంటంటే.. గాంధీ పాత్రధారిని గాడ్సే కాల్చాలి. కానీ గాడ్సే పాత్రధారి అయిన చిన్నపిల్లవాడు బొమ్మ తుపాకీతో కూడా గాంధీ పాత్రధారిని కాల్చి చంపడానికి అంగీకరించకుండా తుపాకీని కిందకు దించుతాడు. అలాంటి పిల్లవాడు పెద్దవాడు అయ్యాక రియల్ గన్స్‌తో ఎందుకు సహవాసం చేయాల్సి వస్తుంది? అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం వల్ల అతని వ్యక్తిత్వం, ఆలోచనా తీరు మారింది? అన్నదే కథాంశం. ⇔ ఈ కథను చెప్పేందుకు ఓ బ్యాచ్ రీ యూనియన్ అవుతున్నట్లుగా బ్యాక్‌డ్రాప్ తీసుకున్నాను. ఓ సర్వే ప్రకారం చదువుకున్న అర్హతకు తగ్గ ఉద్యోగం చేస్తున్నవారు కేవలం 6.37 శాతం మంది మాత్రమే అని, మిగిలినవారు చదువుకు తగ్గ ఉద్యోగం చేయడం లేదని తెలుసుకున్నాను. ఇదే విషయాన్ని కాస్త సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం. ఎవర్నీ టార్గెట్ చేసి తీసిన సినిమా కాదు. ఆలోచించాల్సిన అంశంగా తీసిన చిత్రం మాత్రమే. ⇔నిజానికి ‘గాడ్సే’ కథను పవన్ కల్యాణ్‌గారికి అనుకున్నాను. కానీ ఆయనతో చేయలేకపోయాను. ఈ కథను సత్యదేవ్గారికి చెప్పినప్పుడు సీరియస్ సబ్జెక్ట్ అన్నారు. కానీ ఓకే చేశారు. ఓ కామన్‌మేన్ పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు ప్రతి కామన్ మేన్ కనెక్ట్ అవుతాడనే నమ్మకం ఉంది. -
నెగటివ్ రోల్స్ చేయను: గాడ్సే హీరోయిన్
‘‘ఓ నటిగా విభిన్న పాత్రలు చేసేందుకు సిద్ధం. నేను నటించే పాత్రను త్వరగా అర్థం చేసుకుని వెంటనే ఆ పాత్రలోకి వెళ్లిపోగలను. అయితే ఇప్పుడే నెగటివ్ రోల్స్ మాత్రం చేయాలనుకోవడం లేదు. ఇంటెన్స్ అండ్ యాక్షన్ రోల్స్ చేయడానికి సిద్ధమే’’ అన్నారు హీరోయిన్ ఐశ్వర్యాలక్ష్మీ. సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్సే’. సి.కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన ఐశ్వర్యాలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘గాడ్సే’ చిత్రంతో తొలిసారి టాలీవుడ్‌కి రావడం సంతోషంగా ఉంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించే ఓ వ్యక్తి కథే ఈ చిత్రం. ప్రభుత్వంతో పౌరులకు ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి? వ్యవస్థలోని లోపాలపై ఓ యువకుడు ఎలా రియాక్ట్ అయ్యాడు? అనే అంశాల నేపథ్యంలో ‘గాడ్సే’ కథ సాగుతుంది. ఇందులో వైశాలి అనే సీరియస్ పోలీసాఫీసర్ పాత్రలో నటించాను. బ్యూటీ అండ్ బ్రెయిన్.. ఈ రెండూ ఉపయోగించే పాత్ర నాది. సత్యదేవ్ ఇంటెన్స్ అండ్ అమేజింగ్ యాక్టర్. తన నటనలో నిజాయితీ కనిపిస్తుంది. సి.కల్యాణ్‌గారు మంచి అభిరుచి గల నిర్మాత. గోపీ గణేష్‌గారు నన్ను నమ్మడంతో సెట్స్‌లో టెన్షన్లో లేకుండా నటించాను. మణిరత్నంగారి దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్’లో కీలక పాత్ర చేశాను. మరో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సాయిపల్లవి చేస్తున్న ‘గార్గి’కి ఓ నిర్మాతగా ఉన్నాను’’ అన్నారు. -
‘అందరి మనసుల్లోని ప్రశ్నలను గాడ్సే ప్రశ్నించబోతున్నాడు’
‘‘టి. కృష్ణగారితో నాకు మంచి అనుబంధం ఉండేది. ఆయనతో సినిమా చేయలేదనే ఫీలింగ్ ఉండేది. గోపీ గణేష్ తీసిన ‘గాడ్సే’ సినిమా ఆ లోటును తీర్చేసింది’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. సత్యదేవ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గాడ్సే’. గోపీ గణేష్ పట్టాభి దర్శకుడు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్. రామారావు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని గోపీ గణేష్ చక్కగా తెరకెక్కించాడు. అవినీతి రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులపై సత్యదేవ్ గాడ్సేలా పోరాటం చేస్తాడు’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘నేనిప్పటి వరకూ 83 సినిమాలు నిర్మించాను. చదవండి: అర్హత ఉన్నోడే అసెంబ్లీ..పద్దతి ఉన్నోడే పార్లమెంట్‌టో ఉండాలి అయితే ‘గాడ్సే’ సినిమా నిర్మించినందుకు హ్యాపీగా, గర్వంగా ఉంది. మరో సినిమాకి గోపీ గణేష్‌కి చెక్ కూడా ఇచ్చాను. ఎన్టీఆర్, శివాజీ గణేశన్గార్లలా క్యారెక్టర్లో షేడ్స్‌ను చూపించగల నటుడు సత్యదేవ్’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ముందు కె.ఎస్. రామారావుగారే ఆరంభించారు. ఆ తర్వాత కల్యాణ్‌గారు టేకప్ చేసి పూర్తి చేశారు. ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం తర్వాత మళ్లీ కల్యాణ్‌గారితో పని చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సత్యదేవ్. గోపీ గణేష్ మాట్లాడుతూ.. ‘‘ఈ దేశంలో 6.7 శాతం మంది మాత్రమే వారు చదివిన చదువుకి సరైన అర్హత ఉండే పోస్ట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్లు అలా చేయడం లేదు. అందరి మనసుల్లోని ప్రశ్నలను గాడ్సే ప్రశ్నించబోతున్నాడు’’ అన్నారు. -
పవర్ డైలాగ్స్‌తో సత్యదేవ్ ‘గాడ్సే’ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రం గాడ్సే. ఈ చిత్రానికి గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్నారు. సీకే స్క్రీన్స్ బ్యానర్ పై సీ కళ్యాణ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి మొదటి సారి తెలుగు లో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.‘సత్యమేవ జయతే అంటారు.. 'ధర్మో రక్షితి రక్షత: అంటారు.. కానీ సమాజంలో సత్యం,ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు’అనే పవర్ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. అవినీతిమయమైన రాజకీయ నాయకులను, వ్యవస్థను ఒంటి చేత్తో ధైర్యవంతుడి పాత్రలో సత్యదేవ్ నటించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతంది.‘పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చింది ఎంత? అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చింది ఎంత? గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టింది ఎంత? సూట్ కేసు కంపెనీలకు తరలించినది ఎంత?' 'ప్రశ్నిస్తే... మారణకాండ చేసేస్తారా?, ‘అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్దతి ఉన్నోడో పార్లమెంట్లో ఉండాలి. మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి.. సబ్జెక్ట్ ఉన్నో సర్పంచ్ కావాలి’, ‘సుజలాం సుఫలం మలయజ శీతలం’ లాంటి పవర్ఫుల్ డైలాగ్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. జూన్17న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఈ వేసవిలోనే సత్యదేవ్ గాడ్సే!
Satyadev Godse Movie Releasing This April: సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్సే’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 20న విడుదల కానుంది. ‘‘సత్యదేవ్, గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ హిట్ కావడంతో ‘గాడ్సే’పై మంచి అంచనాలున్నాయి. అవినీతిమయమైన రాజకీయ నాయకుణ్ణి, వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారు. ఐశ్వర్యా లక్ష్మిది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ తీయాలని ఉంది
ఎన్ని జీవోలు వచ్చినా సరే ప్రేక్షకుడికి సినిమా కావాలని అఖండ నిరూపించింది. సినిమా అనేది చిన్న పరిశ్రమే కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అంటున్నారు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ దర్శకత్వంలో `గాడ్సే` సినిమా రూపొందుతుంది. డిసెంబరు 9 సి. కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ♦ టికెట్ రేట్లను మరీ ఇంతగా తగ్గించడం విచారించాల్సిన విషయం. ఏదేమైనా ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని అనుకుంటున్నాను. మేం అంతా కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో ఎవ్వరూ సంతోషంగా లేరు. మిర్యాల రవీందర్ రెడ్డి కాబట్టి రిలీజ్ చేయగలిగారు. అంతంత పర్సంటేజీలు తగ్గించుకుని రిలీజ్ చేశారు. ఈ రేట్ల మీద ఎంజీలు వేసుకోలేకపోతోన్నారు. అదనపు షోలు లేవు. బాలయ్య బాబు తన స్టామినా మీద కొట్టుకుని వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేశారంటే నిర్మాతకు హ్యాట్సాఫ్. ♦ ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలని మేమే అడిగాం. పారదర్శకత కోసం అడిగాం, కానీ మీడియా వక్రీకరించింది. అసలు విషయం తెలుసుకుని వార్తలు రాసేవారి కన్నా.. కొత్తగా క్రియేట్ చేసి రాసేవారు ఎక్కువయ్యారు. అందుకే ఇలా ఇగోలు హర్ట్ అయి ఇంత వరకు వచ్చిందని అనుకుంటున్నాను. అదనపు షోలు, మిడ్ నైట్ షోలను ప్రభుత్వమే అలవాటు చేసింది. ఇప్పుడు అవన్నీ ఆలోచించడం వేస్ట్. మనకు కావాల్సింది పరిశ్రమకు మంచి జరగడం. ♦ శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా మొదటగా మూడు థియేటర్లోనే విడుదలైంది. ఆ తర్వాత హిట్ అయింది. సినిమాలో స్టామినా ఉంటే ఇవన్నీ నథింగ్. ప్రభుత్వం మీద కామెంట్లు చేయడం కూడా అనవసరం. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్లు కాదు. ఇంతకు ముందు సినిమా వాళ్లంతా మనవాళ్లే. కానీ ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్‌లోకి రావడం, ఆ తరువాత సినిమా వాళ్లు కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో గ్రూపులు మొదలయ్యాయి. ♦ చిరంజీవి సినిమా విడుదల విషయంలో ఓ సారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా టికెట్ రేట్లను తగ్గించారు. అయితే మేం వెళ్లి ఆయన్ను రిక్వెస్ట్ చేశాం. ♦ ప్రస్తుతం సినీ పరిశ్రమకి ఒక తండ్రి ఇక్కడ ఉన్నారు.. మరో తండ్రి అక్కడ ఉన్నారు. ఏ కష్టం వచ్చినా ముందుగా ఈ తండ్రి వద్దకే వెళ్తున్నాం. సినిమా వాళ్లదంతా ఏ రోజు హడావిడి ఆ రోజుదే. ఇద్దరు సీఎంలను ఒకే చోటకు తీసుకొచ్చి సత్కరిద్దామని అనుకున్నాం. కానీ అది కుదర్లేదు. ముందుకు నడిపించే వ్యక్తి లేకుండాపోయారు. ♦ పరిశ్రమ మీద ఎలాంటి రూల్స్ తెచ్చినా సినిమా వాళ్లు ముందుకు రారు. ఈ రోజు 39డి అనే కొత్త సెక్షన్ రాబోతోంది. అందరూ కలిసి రండి పోరాడుదామంటే ఎవ్వరూ రావడం లేదు. ఎవ్వరి డబ్బులు వారికి వచ్చేస్తున్నాయ్..ఎటొచ్చి నిర్మాతలకే కదా? నష్టం. కష్టం వచ్చినప్పుడే దాసరి గారు లేని లోటు తెలుస్తోందని అంటున్నారు. ♦ ఒకప్పుడు నిర్మాతలు ఇలా ఉండేవారు కాదు. ఇప్పుడు మాత్రం హిట్ కాంబినేషన్‌కే డిమాండ్ ఉంది. ఇప్పుడంతా ఫిగర్స్ గేమ్. ♦ గాడ్సే సినిమా ఈ రోజు షూటింగ్ పూర్తయ్యింది. అలాగే మా బ్యానర్లో రానా నటిస్తున్న 1945 సినిమాకి సంబంధించి వారంలో టీజర్, రెండు మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ వస్తుంది. అది పీరియాడిక్ డ్రామా. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. ♦ రూలర్ సినిమా అయ్యాకే బాలయ్య బాబుతో సినిమా చేయాలి. కానీ అంతలోనే సొంత ప్రొడక్షన్ కంపెనీలో అనిల్ రావిపూడి సినిమాను ఓకే చేశారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని సినిమాను కూడా రెడీ చేశారు. ఈ మూడు కమిట్మెంట్లు ఉన్నాయి. ♦ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తీయాలని ఉంది. రామానుజాచార్య సినిమాను బాలయ్యతో తీయాలని ఉంది. ఆయన కూడా చేయాలనుకుంటున్నారు. బాలయ్య గారు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. నన్ను ఆయన సొంత మనిషిలా భావిస్తారు.. సొంత ప్రొడక్షన్‌లానే అనుకుంటారు. ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడే సినిమాను తీస్తాను. ♦ గాడ్సే సినిమాను జనవరి 26న ప్లాన్ చేస్తున్నాం. మళ్లీ అదే దర్శకుడు గోపీ గణేష్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక నా హీరో సత్యదేవ్‌తోనూ ఇంకో సినిమా చేస్తాను. గాడ్సే తరువాత సత్యదేవ్‌కు చాలా మంచి పేరు వస్తుంది. సినిమా చూశాను. మంచి సినిమాకు నిర్మాతగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అందరినీ మేల్కొలిపే చిత్రం. ఇందులో అందరి సమస్యలు చూపిస్తాం. అమ్మనాన్నలు కష్టపడి చదివిస్తే.. చదువుకుని ఏదో చేద్దామని అనుకుని ఏం చేయకుండా స్ట్రగుల్ అయ్యే ప్రతీ ఒక్కడి సమస్య. ప్రభుత్వాలు ఎలా ఆడుకుంటున్నాయ్..నిరుద్యోగం ఏంటి? ప్రభుత్వాలను ప్రశ్నించే పాయింట్ మీద వస్తుంది. దర్శకుడు ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశాడో.. హీరో అంత అద్భుతంగా చేశాడు. ఇద్దరికీ మంచి పేరు వస్తుంది. గాడ్సే క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. ♦ తమిళనాడు నాకు ఓ మంచి బహుమతి ఇచ్చింది. ఆ గిఫ్ట్ మీ అందరితో పంచుకుంటాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన కళ్యాణ్ ఏం చేయబోతున్నాడో చూపిస్తాను అంటూ ఆ గిఫ్ట్ ఏంటో చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచాడు నిర్మాత కళ్యాణ్. -
గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారు: మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ: పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలకులు గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారని మండిపడ్డారు. గాడ్సే కశ్మీర్‌ను కూడా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆమె శనివారం అజెండా ఆజ్‌తక్ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన తండ్రి మెహబూబా ముఫ్తీ సయ్యద్ సీఎంగా ఉన్న సమయంలో కశ్మీరీ పండిట్లకు సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఆర్టికల్ 370ని రద్దుచేసి, కొత్త కశ్మీర్‌ను నిర్మించామని బీజేపీ పాలకులు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి కూతురు తన తండ్రి మృతదేహం ఎక్కడని అడుగుతోంది. ఓ చెల్లి తన అన్న మృతదేహం కోసం ఎందురు చూస్తోందని అన్నారు. ఈ పరిస్థతులను ప్రశ్నించినవారిపైనే నిందలువేస్తూ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇన్ని జరుగుతున్నా.. పాలకులు మాత్రం ప్రతీసారీ కొత్త కశ్మీర్ అంటూ మాట్లాడుతారని.. కొత్త హిందూస్తాన్ గురించి ఎందుకు మాట్లాడరని సూటిగా ప్రశ్నించారు. ఆర్టికల్ 370 అంటే బయటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేయలేరని తెలిపారు. ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తారని, ఇటువంటి నిబంధనలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన కాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసిందని మెహబూబా ముఫ్తీ గుర్తుచేశారు. -
గాడ్సే అన్నది మంచి పేరా? దుర్మార్గమైన పేరా?
‘‘కరోనా తర్వాత మా ‘గాడ్సే’ సినిమా ఆరంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా బ్యానర్లో నిర్మిస్తోన్న 80వ చిత్రం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే వంద సినిమాలు పూర్తి చేస్తాం’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. సత్యదేవ్, ఐశ్వర్యా లక్ష్మీ జంటగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్సే’. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘తల్లితండ్రులు, యువకులు ఆలోచించే విధంగా చదువు నేపథ్యంలో ‘గాడ్సే’ చిత్రాన్ని గొప్పగా తెరకెక్కిస్తున్నాం. గాడ్సే అన్నది మంచి పేరా? దుర్మార్గమైన పేరా? అనేది మా చిత్రంలో చూపించబోతున్నాం. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేసి, జూన్ లేదా జూలై నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సత్యతో ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘గాడ్సే’ చేస్తున్నాను. ప్రతి దేశంలో ఉన్న, జరుగుతున్న పాయింట్‌ని టచ్ చేసి బిగ్ స్క్రీన్ పైకి తీసుకొస్తున్నాం’’ అన్నారు గోపీ గణేష్ పట్టాభి. ‘‘నా జీవితంలో ‘జ్యోతిలక్ష్మి’, ‘బ్లఫ్ మాస్టర్’ చాలా ముఖ్యమైన సినిమాలు. ‘బ్లఫ్ మాస్టర్ 2’ ఎప్పుడు చేస్తున్నారు? అని చాలామంది అడుగుతున్నారు. ఆ చిత్రానికి రెండింతలు గొప్పగా ఉండే సినిమా ‘గాడ్సే’’ అన్నారు సత్యదేవ్. హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మీ, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కేయస్ రామారావు, నటులు ప్రకాశ్ నాగ్, అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
సరైన ఎంట్రీ
‘బ్లఫ్ మాస్టర్’ వంటి హిట్ తర్వాత హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపీ గణేష్ పట్టాభి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్సే’. సి.కె. స్క్రీన్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో మలయాళ నటి ఐశ్వర్యా లక్ష్మి తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నారు. తెలుగులో ఎంట్రీకి ‘గాడ్సే’ సరైన చిత్రం అంటున్నారు ఐశ్వర్య. ‘‘యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటివరకూ చేయని భిన్న తరహా క్యారెక్టర్లో సత్యదేవ్ నటిస్తుండగా, ఐశ్వర్యా లక్ష్మి కూడా నటనకి మంచి ఆస్కారం ఉండే పాత్రలో నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి సహ నిర్మాత: సి.వి. రావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి. -
గాడ్సే యాక్షన్
హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపీ గణేష్ పట్టాభి కాంబినేషన్లో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ మంచి సినిమా అనిపించుకుంది. ఈ కాంబినేషన్లో తెరకెక్కనున్న మరో చిత్రం ‘గాడ్సే’. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో సత్యదేవ్ చాలా పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. విభిన్నమైన పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్యా మీనన్, కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాత: సీవీ రావు. -
‘గాడ్సే’గా మారబోతున్న సత్యదేవ్
‘బ్లఫ్ మాస్టర్’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన సినిమాల్లో నటించి టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాతో టాలీవుడ్లోకి ప్రవేశించిన సత్యదేవ్... పూరీ జగన్నాథ్ ‘జ్యోతి లక్ష్మీ’తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. (చదవండి : నితిన్ ‘చెక్’ ఫస్ట్ గింప్స్ వచ్చేసింది) తాజాగా సత్యదేవ్ నటించబోయే కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ‘బ్లఫ్ మాస్టర్’ లాంటి వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గోపీ గణేష్.. మరోసారి సత్యదేవ్‌తో సరికొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు ‘గాడ్సే’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. గతంలో సత్యదేవ్ ను తన జ్యోతిలక్ష్మి సినిమాలో విలక్షణ పాత్రలో చూపించిన నిర్మాత సి. కళ్యాణ్ నే ఈ సినిమానూ నిర్మిస్తున్నారు. సీరియస్ లుక్, గన్స్ బ్యాక్ గ్రవుండ్, గాడ్సే అనే టైటిల్ అన్నీ కలిసి సినిమా ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ గా వుండబోతోందని చెప్పకనే చెబుతున్నాయి. Happy to collaborate once again with 'bluffmaster' @MeGopiganesh anna. This time for an action packed thriller #GODSE. Shoot begins soon. Produced by C Kalyan garu. #GodseTitlePoster pic.twitter.com/pT3mG5CR5q — Satya Dev (@ActorSatyaDev) January 3, 2021 -
గాడ్సే మరణ వాంగ్మూలం
జాతి పిత మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ హంతకుడు గాడ్సే నేపథ్యంలో ‘మరణ వాంగ్మూలం’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రదర్శకుడు భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘గాడ్సే వెనకాల ఉన్న భావజాలాన్ని మా సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. దాదాపు రెండేళ్లు ఈ సినిమాపై పరిశోధన చేశాను. గాంధీ తమ్ముడు గోపాల్ గాడ్సే 19 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి, 2005లో మృతి చెందారు. గాంధీ హత్యలో గోపాల్ గాడ్సే ప్రమేయం ఏంటి? అనే అంశాల్ని కూడా చూపించనున్నాం’’ అన్నారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ–‘‘గాడ్సే రాసిన పుస్తకం అందర్నీ ఆలోచింపజేస్తుంది. గాడ్సే కోర్ట్‌లో తన వాంగ్మూలం ఇచ్చారు. దాన్ని పరిశీలిస్తే ఆయన ఎందుకు ఆ పని చేశారో అర్థం అవుతుంది’’ అన్నారు. ‘‘భరద్వాజ్‌గారు గాడ్సే మీద సినిమా గురించి చెప్పగానే ఆసక్తిగా అనిపించింది. సినిమాని డిసెంబర్లో ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు చిత్రనిర్మాత సూరజ్. -
గాడ్సే నిజమైన దేశభక్తుడు
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు వివాదాస్పద ట్వీట్‌తో వార్తల్లోకెక్కారు. మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేను పొగుడుతూ, గాంధీజీ హత్య గురించి చర్చించాలంటూ ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమవుతోంది. ‘ఈరోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశభక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది డిబేటబుల్. అతని వైపు వాదనని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు అంతే). గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఓసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ మంగళవారం ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఈ పోస్టు పట్ల నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం వల్లే జనసేనను ప్రజలు ఆదరించలేదని, కసబ్ కూడా తాను నమ్మిన సిద్ధాంతం కోసం యుద్ధం చేశాడని, ఆయన దేశభక్తిని శంకించలేమని చెప్పినట్లు ఉందని కొందరు ట్వీట్ చేశారు. మొత్తమ్మీద గాడ్సే పుట్టినరోజు పేరుతో నాగబాబు చేసిన ఈ ట్వీట్ వివాదాస్పదమవుతూనే అసలీ పోస్టు ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది.. ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. -
గాడ్సే పుట్టిన రోజు వేడుకలు.. 6గురు అరెస్ట్
గాంధీనగర్ : మహాత్మున్ని చంపిన గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సూరత్‌కు చెందిన హిందూ మహాసభ కార్యకర్తలు.. లింబాయత్ ప్రాంతంలోని సూర్యముఖి హనుమాన్ ఆలయంలో ఆదివారం గాడ్సే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గాడ్సే ఫోటో చుట్టూ దీపాలు వెలిగించి.. పూజలు చేశారు. స్వీట్లూ పంచుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాల్ని కూడా నిర్వహించారు. అంతటితో ఊరుకోక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘మహాత్మ గాంధీని చంపిన నేరస్థుడికి పుట్టిన రోజుల వేడుకలు నిర్వహిచండం నిజంగా చాలా విచారకరం. ఇలాంటి పనులు వల్ల దేశ ప్రజలు మనోభావాలు దెబ్బ తింటాయి. ఫలితంగా గొడవలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ చర్యలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేశామ’ని తెలిపారు. ఈ విషయం గురించి బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్య మాట్లాడుతూ.. ‘గాంధీజిని అవమానించడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడం లాంటిదే. బుద్ధి లేని వారే ఇలాంటి తలకు మాసిన పనులు చేస్తారు. వారికి మహాత్ముడి ఆదర్శాలు ఎన్నటికి అర్థం కావ’న్నారు. -
ఆమె గాంధీ ఆత్మనే చంపేసింది..
జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరం గాడ్సే నిజమైన దేశభక్తుడన్న బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై విమర్శల పరంపర కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీలతోపాటు, అధికార బీజేపీ సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే క్రికెట్, బిజినెస్ ఇలా వివిధ రంగాల ప్రముఖులు కూడా ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి చేరారు. గాడ్సే గాంధీ శరీరాన్ని మాత్రమే హత్య చేశాడు. కానీ ప్రజ్ఞాసింగ్ లాంటి వాళ్లు గాంధీ ఆత్మను, దానితో పాటు అహింస, శాంతి, సహనాలను చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విటర్లో ఘాటుగా స్పందించారు. చిన్న చిన్న స్వలాభాల కోసం బీజేపీ నాయకత్వం తాపత్రయ పడుతోందని మండిపడ్డారు. తక్షణమే ఆమెను బీజేపీ పార్టీనుంచి బహిష్కరించాలంటూ ట్వీట్ చేశారు. కాగా మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ను భోపాల్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీకి నిలపడమే సర్వత్రా పెద్ద చర్చకు దారి తీసింది. మరోవైపు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా గాంధీని హత్య చేసిన గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్నే రేపింది. గాడ్సే మొదటి హిందూ తీవ్రవాదిగా పేర్కొన్న సినీహీరో రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కౌంటరగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత, భోపాల్ బీజేపీ అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్, ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా కూడా సాధ్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన ప్రజ్ఞా సింగ్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. అటు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పిలిచిన ఆమెను ఎన్నటికి క్షమించనని వ్యాఖ్యానించడం విశేషం. गोडसे ने गांधी के शरीर की हत्या की थी, परंतु प्रज्ञा जैसे लोग उनकी आत्मा की हत्या के साथ, अहिंसा,शांति, सहिष्णुता और भारत की आत्मा की हत्या कर रहे हैं।गांधी हर सत्ता और राजनीति से ऊपर हैं।भाजपा नेतृत्व छोटे से फ़ायदे का मोह छोड़ कर उन्हें तत्काल पार्टी से निकाल कर राजधर्म निभाए। — Kailash Satyarthi (@k_satyarthi) May 18, 2019 -
గాంధీజీ భారత్, గాడ్సే భారత్
న్యూఢిల్లీ: ప్రేమను పంచే మహాత్మాగాంధీ భారత్, ద్వేషాన్ని నూరిపోసే గాడ్సే భారత్.. ఇందులో ఏది కావాలో నిర్ణయించుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజలను కోరారు. సోమవారం ఇక్కడ జరిగిన పార్టీ బూత్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గాంధీజీ భారత్ లేక గాడ్సే భారత్.. మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. ఒక వైపు ప్రేమ, సోదరభావం, మరో వైపు ద్వేషం, భయం. గాంధీజీకి భయం లేదు. ఎన్నో ఏళ్లు జైలు జీవితం గడిపారు. అయినప్పటికీ అప్పటి బ్రిటిష్ పాలకులతో ప్రేమగానే మాట్లాడారు. కానీ, వలస పాలకులపై ద్వేషాన్ని నూరిపోసిన వీర సావర్కర్ మాత్రం తనను క్షమించి వదిలేయాలంటూ బ్రిటిష్ వారిని ప్రాధేయపడ్డారు’ అని తెలిపారు. ‘మేకిన్ ఇండియా అంటూ తరచూ మాట్లాడే మోదీ.. ధరించే దుస్తులు, చెప్పులు, సెల్ఫీలు తీసుకునే ఫోన్..ఇవన్నీ చైనాలో తయారైనవే’ అంటూ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రైతు రుణ మాఫీ అమలు చేశామన్నారు. నేడు సీడబ్ల్యూసీ భేటీ అహ్మదాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ మంగళవారం అహ్మదాబాద్‌లో జరగనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రెండు రోజులకే ఈ భేటీ జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ల స్వరాష్ట్రమైన గుజరాత్ నుంచి దేశానికి గట్టి రాజకీయ సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుటోందని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం ముందుగా అహ్మదాబాద్‌లోని సబర్మతీ గాంధీ ఆశ్రమంలో ప్రార్థనా సమావేశం నిర్వహించి, ఆ తర్వాత సర్దార్ పటేల్ జాతీయ స్మారకంలో సీడబ్ల్యూసీ భేటీ అవనుంది. -
మహాత్ముని మరణం 30 జనవరి 1948
వడివడిగా, వేగంగా ప్రార్థనకు నడుస్తూ వస్తున్నారు గాంధీజీ. బిర్లాహౌస్ (ఢిల్లీ) మైదానంలోని జనం లేచి ‘బాపూజీ, బాపూజీ’ అని ఆరాధనతో తన్మయమౌతున్నారు. అచ్ఛాదన లేని ఆయన ఛాతీ ఎన్ని మృత్యువులనైనా చేరదీసి, సేదతీర్చే ప్రేమ మందిరంలా ఉంది. మళ్లొకసారి తుపాకీ సర్దుకున్నాడు గాడ్సే. గాంధీజీకి ఎదురు నడుస్తున్నాడు గాడ్సే. మృత్యువా? మహాత్ముడా? ఎవరు ఎవరిని గౌరవిస్తారో, ఎవరు ఎవరికి శిరస్సు వంచి నమస్కరిస్తారో, ఎవరు ఎవరిని అంతిమంగా ఒడిలోకి తీసుకుంటారో.... కొద్దిసేపట్లో తేలిపోతుంది. గాంధీజీకి ఇటు మనూ, అటు అభా ఉన్నారు. తృటిలో మృత్యువు అక్కడికి చేరుకుంది. గాంధీజీకి అతి దగ్గరగా వచ్చి, వంగి, చేతులు జోడించాడు గాడ్సే. ఆ చేతుల మధ్య తుపాకీ ఉంది! మృత్యువును జయించడమంటే... మృత్యువును వట్టి చేతులతో సాగనంపడం కాదని మహాత్ములు మాత్రమే అనగలరు. ఇవ్వడానికి గాంధీజీ దగ్గర నిండు ప్రాణాలున్నాయి. తృణప్రాయంగా వాటిని అర్పించగల గుండె ధైర్యం ఉంది. మహాత్ముని శరీరంలోకి మూడు గుండ్లు దూసుకెళ్లాయి. కోట్ల హృదయాలకు తూట్లు పడ్డాయి. బాపూజీ భౌతికంగా మరణించి నేటికి డెబ్భై ఏళ్లు. ఆయన అనుసరించి, మానవాళికి అందించి వెళ్లిన జీవిత సందేశాలు మాత్రం ఏనాటికీ మరణం లేనివి. -
గాడ్సేను అడ్డుకున్న భిలారే కన్నుమూత
పుణే: జాతిపిత మహాత్మాగాంధీని రక్షించిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంఎల్ఏ భికు దాజీ భిలారే (98) కన్ను మూశారు. గాంధీని నాధూరాం గాడ్సే నుంచి కాపాడిన బిలారే బుధవారం మహారాష్ట్రలో చనిపోయినట్టుగా కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో సహా ప్రముఖ కాంగ్రెస్ నాయకులు భిలారే మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ హత్యకు హత్యకు ముందు నాలుగు సంవత్సరాల ముందు 1944లో ఒక సమావేశంలో నాథూరామ్ గాడ్సే మరో ఇద్దరు సహచరులతో కలిసి గాంధీని కత్తితో పొడిచి హత్య చేయడానికి ప్రయత్నించినపుడు భిలారే వారిని ప్రతిఘటించి మరీ గాంధీని రక్షించినట్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. పలు స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు భిలారే అంత్యక్రియలకు హాజరై ఆయనకు నివాళులర్పించారు. ఎల్లప్పుడూ సామాజిక మరియు ప్రజా సేవలలో నిమగ్నమై ఉండే ఆయన మహాబలేశ్వర నియోజకవర్గం నుంచి శాసనసభంగా ఎన్నికయ్యారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధుల హక్కులు ప్రయోజనాల కోసం చాలా క్రియాశీలకంగా పనిచేశారనీ, చివరి శ్వాసవరకు చురుకుగా ఉన్నారని ఆయన సన్నిహిత స్నేహితులు, రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రత్నాకర్ మహాజన్ చెప్పారు. రాష్ట్ర సేవాదళ నాయకుడిగా ఉన్న బిలారేకి అప్పటికి పాతికేళ్లు అనీ, గాంధీపై జరిగిన 6 హత్యాయత్నాల్లో ఒకదానినుంచి కాపాడారని మహరాజన్ గుర్తు చేసుకున్నారు. కాగా స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్న భిలారే క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు. మహాబలేశ్వర నియోజకవర్గం నుంచి శాసనసభంగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యం అనంతరం 1948, జనవరి 30న గాడ్సే ఢిల్లీలోని బిర్లా హౌస్ వద్ద గాంధీని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. -
4వ బుల్లెట్ పేల్చిందెవరు?
గాంధీపై గాడ్సే కాకుండా మరో వ్యక్తి కాల్పులు జరిపాడా? న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ హత్య వెనక అసలు కారణమేంటి? 1948, జనవరి 30న గాంధీ హత్య సమయంలో గాడ్సే, ఆప్టేతోపాటుగా మరో హంతకుడూ అక్కడ ఉన్నాడా? జాతిపితను నాథూరామ్ గాడ్సే మూడుసార్లు కాల్చాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. అయితే నాలుగో బుల్లెట్ కూడా గాంధీ శరీరంలో ఉందని నాటి మీడియాలో కథనాలొచ్చాయి. గాడ్సే మూడుసార్లు కాలిస్తే.. నాలుగో బుల్లెట్ పేల్చిందెవరు? ఈ ప్రశ్నలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. గాంధీ హత్యకు సంబంధించి అసలు విషయాల్ని దాచిపెట్టేందుకు చరిత్రలోనే అతిపెద్ద కుట్ర జరిగిందనే అనుమానాలనూ పిటిషన్ లేవనెత్తింది. హత్యతో సంబంధం లేని వినాయక్ దామోదర్ సావర్కర్‌పై నిందమోపేందుకు ఆధారాలున్నాయా? అని పిటిషన్ ప్రశ్నించింది. ముంబైకి చెందిన చరిత్ర పరిశోధనకారుడు, అభినవ్ భారత్ సంస్థ ట్రస్టీ డాక్టర్ పంకజ్ ఫడ్నిస్ ఈ పిటిషన్ వేశారు. గాంధీ హత్యపై విచారణ జరపాలంటూ 1966లో అప్పటి ప్రభుత్వం వేసిన జస్టిస్ జేఎల్ కపూర్ కమిషన్ అసలు వాస్తవాలను, కుట్ర కోణాన్ని వెల్లడించడంలో పూర్తిగా విఫలమైందని, ఇందుకోసం కొత్త కమిషన్‌ను వేయాలని కోరారు. 3 బుల్లెట్ల సిద్ధాంతం తప్పు! గాంధీ హత్య కేసులో∙కోర్టులు 3 బుల్లెట్ల సిద్ధాంతంపైనే పూర్తిగా ఆధారపడటాన్ని ఫడ్నిస్ ప్రశ్నించారు. దీని ఆధారంగానే గాడ్సే, నారాయణ్ ఆప్టేలకు 1949లో ఉరిశిక్ష విధించారు. ‘నాటి మీడియా రిపోర్టులు, నా పరిశోధనల ప్రకారం గాంధీ శరీరంలో 4 బుల్లెట్లు దిగాయి. 7 బుల్లెట్లుండే గాడ్సే పిస్టల్ నుంచి 4 వినియోగించని బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే నాలుగో బుల్లెట్ గాడ్సే పిస్టల్ నుంచి వచ్చే అవకాశమే లేదు. అంటే కచ్చితంగా మరో హంతకుడు అక్కడే ఉన్నాడు. అతను ఎవరనేది ఇంతవరకు తేలలేద’దన్నారు. సరైన సాక్ష్యాల్లేవంటూ సావర్కర్‌ను సంశయలాభం కింద వదిలేసిన సంగతి తెలిసిందే. గాంధీ ఆలోచనను చంపేశారు! దేశ విభజన తప్పదని తెలిశాక..భారత్–పాక్ ప్రజల మధ్య సత్సంబంధాలుండేలా గాంధీ–జిన్నా చేసిన ప్రయత్నాన్ని అమలుకాకుండా చూసేందుకే మహాత్ముడి హత్య జరిగిందని ఫడ్నిస్ ఆరోపించారు. గాంధీ–జిన్నా ప్రయత్నం అమలుకాని కారణంగానే ఇప్పటికీ భారత్–పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు. -
అమరులకు వందనం
జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినం బ్రిటిష్ పతాకం పరిచిన చీకట్ల కింద మగ్గిపోతున్న భారతావనికి కొత్త సూర్యోదయాన్ని చూపించి తాను అస్తమించారు బాపూజీ. మాతృభూమికి స్వేచ్ఛావాయువుల నిచ్చి తుదిశ్వాస వదిలారాయన. జనవరి 30, 1948న గాడ్సే తుపాకి గుళ్లకు బలైనప్పటికీ చాలామంది ప్రపంచ ప్రజల గుండెల్లో ఆయన స్మృతి ఈనాటికీ పదిలమే. గాంధీజీ స్ఫూర్తి, ఆదర్శం ప్రపంచ చరిత్రలో అనంతమైన అధ్యాయాలుగా మిగిలాయి కూడా. అహింస అనే ఆయన ఆదర్శానికి కైమోడ్పులు ఘటిస్తూనే స్వాతంత్య్రోద్యమంలో జాతీయ కాంగ్రెస్‌కు దీటుగా తమవైన పంథాలలో ఉద్యమించి త్యాగాలు చేసిన వారినీ స్మరించుకోవడం ఇవాళ్టి తరాల బాధ్యత. మితవాదులైనా, అతివాదులైనా, తీవ్ర జాతీయవాదులైనా– దాస్య శృంఖలాలు తెగే వరకే ఆ దృష్టి. ఆ విభజన. మార్గం వేరైనా, వారందరి లక్ష్యం దేశ స్వాతంత్య్రమే. ఎవరి త్యాగమైనా స్వరాజ్య భారతికీ, కొత్త తరాల దృష్టిలోనూ విలువైనదే కావాలి. అందుకే గాంధీజీ వర్ధంతికే ఆ మృతవీరులనూ స్మరించుకునే సమున్నత ఆదర్శాన్ని ఈ దేశం పాటిçస్తున్నది. గాంధీజీ ప్రతి భారతీయుడి హృదయాన్ని కదిపారు. నిజమే! ఆయనకు ముందు జరిగిన పోరులలోనూ, అలనాటి వీరులలోనూ అలాంటి శక్తే కనిపిస్తుంది. ఇదీ నిజమే! కానీ..... రక్తదీపావళిని మరిపించే ఆ త్యాగమూర్తుల జీవితాలలో మనకు తెలిసినవి ఎన్ని? వారిలో ఎందరిని తలుచుకుంటున్నాం? ఎంతమంది గురించి మన తరం వాళ్లం చదువుకున్నాం? చరిత్ర పుటలలో ఓ చోటు కోసమనీ, స్వతంత్ర భారతంలో పదవులొస్తాయనీ వారు తమ సర్వస్వం అర్పించలేదు. కేవలం దేశం కోసం ప్రాణాలర్పించారు. నిస్వార్థంగా నిష్క్రమించారు. అందుకే ఆ హుతాత్మల త్యాగ నిరతిని గాలికి వదిలేయడం ఏ దేశమైనా చేయవలసిన పనికాదు. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో తొలి తూటా కాల్చిన మంగళ్ పాండే సాహసం, నానా సాహెబ్, లక్ష్మీబాయి, తాంతియా తోపే, తురేబాజ్ ఖాన్, వీరందరి వెనుక నిలిచిన సిపాయీల త్యాగాలు మరచిపోతామా! చిన్న ఉద్యమంతో పెద్ద త్యాగం చేసిన వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కేని తలచుకోవడం మన విధి. పంజాబ్‌లో కొన్ని క్షణాల పాటు ఆరో నదికి– నెత్తుటి నదికి జన్మనిచ్చిన జలియన్‌వాలాబాగ్ దురంతంలో నేలకూలిన వారిని స్మరించేందుకు రెండు నిమిషాలు కేటాయించలేమా? స్వరాజ్యం నా జన్మహక్కు అన్న తిలక్, లాఠీదెబ్బలకు బలైన లజ్‌పతిరాయ్, అండమాన్ జైలులో కఠోర శిక్షలు అనుభవించిన సావర్కర్, ఇంకా ఎందరో త్యాగధనులు... గదర్‌వీరులు లాలా హరదయాళ్, సోహన్‌సింగ్ భాక్నా, కర్తార్ సింగ్, పృథ్వీసింగ్ ఆజాద్, రాస్ బిహారీ బోస్, ఉద్దమ్‌సింగ్, మౌల్వీ బర్కతుల్లా, దర్శి చెంచయ్య వంటి వారి స్వాతంత్య్ర కాంక్ష సదా స్మరణీయమే. పదిహేనేళ్ల ప్రాయంలోనే ఉరికొయ్యకు వేలాడాడు ఖుదీరాం. అషఫుల్లా ఖాన్, మదన్‌లాల్ థింగ్రా చిన్నతనంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హిందుస్తాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ అసోసియేషన్ పేరు గుర్తుకు వస్తే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని దద్దరిల్ల చేసిన బాంబు పేలుడు చెవిని తాకడమే కాదు, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఉడుకు రక్తపు చుక్కలు కంటి ముందు కదులుతాయి. కొండకోనలలో సంతాల్ హూల్ అంటూ సంతాల్ తెగ ఆదివాసులు, ఉల్గులాన్ అంటూ బిర్సా ముండా నేతృత్వంలో ముండా తెగ గిరిజనులు; ఇంకా ఖోలీలు, ఖోందులు, రాణీ గ్లెయిడినీ నాయకత్వంలో పోరాడిన నాగా వీరులు, నల్లమల చెంచులు.. ఎందరో గిరిపుత్రులు బ్రిటిష్ దాష్టీకం మీద శర సంధానం చేశారు. ప్రాణాలు వదిలారు. ‘జైహింద్’ అంటూ... ‘చలో ఢిల్లీ’ అంటూ నినదించిన సుభాష్ బోస్, షానవాజ్ ఖాన్, మోహన్‌సింగ్ దేవ్ వంటి ఆజాద్ హింద్ ఫౌజు జవానులు; చిట్టగాంగ్ మహావీరుడు సూర్యసేన్... ఎందరని! ఎన్నెన్ని త్యాగాలని! ఎన్నెన్ని రక్త తర్పణలని! కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇలాంటి స్వేచ్ఛాకాంక్షతోనే దేశం ప్రతిధ్వనించింది. వీటి నడుమనే కనిపిస్తుంది విశాఖ మన్య పోరాటం. ఆ మహా యుద్ధానికి నాయకుడే అల్లూరి శ్రీరామరాజు అనే సీతారామరాజు. ఇది తెలుగు గడ్డ మీద జరిగిన పోరు. అయినా ఇప్పటికీ తెలుగువారికి తెలియని సత్యాలెన్నో! ఈ వారం నుంచి మొదలయ్యే ‘ఆకుపచ్చని సూర్యోదయం’ సీరియల్ ఆ లోటును పూరిస్తుందని మా నమ్మకం.