Guntur Kaaram Movie
-
రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్!
టాలీవుడ్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజే వేరు. అగ్రహీరోల సినిమాలన్నీ ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాయి. పొంగల్ బాక్సాఫీస్ పోటీకి థియేటర్లు దొరకడం అంతా ఆషామాషీ కాదు. అందుకే పెద్ద హీరోలంతా ముందుగానే కర్చీఫ్ వేసేస్తారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ చిత్రం రెడీ అయిపోయాయి. త్వరలోనే మరిన్నీ చిత్రాలు పొంగల్ బాక్సాఫీస్ పోటీకి సై అంటున్నాయి.అయితే ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలే సందడి చేశాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్‌తో పాటు ప్రశాంత్ వర్మ హనుమాన్ పోటీలో నిలిచాయి. తేజ సజ్జా నటించిన ఈ చిత్రం ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలకు గట్టి పోటీనిచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సీక్వెల్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో తేజ సజ్జా కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించారు. వేదికపై వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. తేజను రానా పొగుడుతూ మాట్లాడారు. అయితే ఆ తర్వాత వెంటనే నేను మహేశ్ బాబు గురించి మాట్లాడనంటూ రానా ఫన్నీగా చెప్పారు. ఇదేంటి ఇది నాకు కూడా సింక్ అయిందేంటని తేజ సజ్జా అన్నారు. ఆ తర్వాత రానా అతను సూపర్ స్టార్, మీరు ఒక సూపర్ హీరో మీరిద్దరూ సంక్రాంతికి వచ్చారు. సంక్రాంతి మ్యాటర్ ఇప్పుడు మాట్లాడవద్దంటూ తేజ సరదాగా అనడంతో.. దానికి ఎందుకు.. అదంతా సెన్సిటివ్ టాపిక్ హా' అని రానా బదులిచ్చాడు.అయితే ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి సంభాషణ మహేశ్ బాబును కించపరిచేలా ఉందంటూ నెట్టింట మండిపడుతున్నారు. తమ అభిమాన హీరో మహేశ్ బాబును ఎగతాళి చేశారని తేజ సజ్జా, రానాపై ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. 25 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న మహేష్ మీద సెటైర్ వేయడం కరెక్ట్ కాదంటున్నారు ఫ్యాన్స్. మహేష్ సినిమాను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. గుంటూరు కారం సినిమాపై మాట్లాడినందుకు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు రానా, తేజ సజ్జా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Context 😤pic.twitter.com/PBTuhvgD3W— Cinderella🦋 (@GlamGirl_Geetha) November 6, 2024 U had one success man, one! Daniki 25 yrs ga ace filmography unna Mahesh meedha satireUnless you come up with a sequel for Hanuman, aa collections thechkolev and yk why @tejasajja123 Inka Rana gurinchi enduku, shelved project adhi— Jimhalpert (@satvikdhfm) November 5, 2024 Dear @tejasajja123 ,Need apology to superstar @urstrulyMahesh garu and his fans You and rana degrade comments about 2024 sankranthi films , in this sankranthi one of my beloved superstar film also there you know also,Please try to understand this situation.Thanks and…— Sagar MB (@dhfmbabu4005) November 5, 2024 -
కుర్చీ మడతపెట్టి సాంగ్.. నా లుక్ చూసి ట్రోల్ చేస్తారనుకున్నా!
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బొద్దుగా తయారవుతుంటారు. ముందు ఎలా ఉన్నా సరే తల్లయ్యాక మాత్రం శరీర సౌష్ఠవమే మారిపోతుంది. సమయమే కొందరిని మళ్లీ మామూలు స్థితికి తీసుకొస్తే మరికొందరు మాత్రం జిమ్, డైటింగ్‌తో సన్నబడి నాజూకుగా అవుతుంటారు. అందరిలాగే డెలివరీ తర్వాత హీరోయిన్ పూర్ణ కూడా బొద్దుగా అయిపోయింది. లావయ్యా.. సాంగ్ చేయగలనా?సరిగ్గా అదే సమయంలో తనకు గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి పాటలో నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో తన రియాక్షన్ ఎలా ఉందనేది తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. పూర్ణ మాట్లాడుతూ.. శేఖర్ మాస్టర్ నాకు ఫోన్ చేసి కుర్చీమడతపెట్టి పాట ఆఫర్ చేశారు. మాస్టర్, నేనిప్పుడు దున్నపోతులా తయారయ్యాను, ఈ అవతారంలో నేను చేయగలను అనుకుంటున్నారా? అని అడిగాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత చాలా బరువు పెరిగిపోయాను.అదే హైలైట్ చేస్తామనడంతో..నాపై నేనే అపనమ్మకంతో ఉన్నాను. కానీ సినిమా టీమ్, డైరెక్టర్ నా డ్యాన్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ హైలైట్ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. షూటింగ్‌కు ఒకరోజు ముందు కూడా నేను రావాల్సిందేనా? అని అడిగాను. అందుకు అవునన్నారు. అయితే సోషల్ మీడియాలో నా ఫోటోలు చూసినవాళ్లు పూర్ణ ఏంటి? పందిలా తయారైంది.. అని చులకనగా కామెంట్లు చేసేవాళ్లు. మీరు తిట్టేది తల్లినేఅవి చూసి చాలా బాధపడ్డాను. ఇలా నోటికి ఏదొస్తే అది వాగేవాళ్లు ఒక తల్లిని తిడుతున్నామని ఎందుకు గ్రహించరో? ఈ నెగెటివిటీని దృష్టిలో పెట్టుకునే ఆ సాంగ్‌లో కనిపించేందుకు అంగీకరించాను. ఆశ్చర్యమేంటంటే.. నా పర్ఫామెన్స్ మెచ్చుకున్నవాళ్లే ఎక్కువ. ఇది నా కెరీర్లోనే బెస్ట్‌గా నిలిచిపోయింది' అని పూర్ణ చెప్పుకొచ్చింది. చదవండి: బిగ్‌బాస్ షోలో 'మహారాజ' నటి ఎంట్రీ? -
హనుమాన్ టు కల్కి.. టాలీవుడ్ ఫస్టాప్ ఎలా ఉందంటే..
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. ఇక్కడి సినిమాలను ప్రపంచం మొత్తం ఆదరిస్తోంది. వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఇక్కడ సక్సెస్ ఎంత శాతం ఉందో ఫెయిల్యూర్ అంతే ఉంది. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబడితే.. మరికొన్ని దారుణమైన అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ ఆరు నెలల్లో టాలీవుడ్ రిపోర్ట్ ఎలా ఉందో చూసేద్దాం.ఓపెనింగ్ అదిరింది!టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ చాలా పెద్దది. ప్రతి సంక్రాంతికి ఒకటి రెండు పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’తో పాటు కుర్రహీరో తేజ సజ్జ ‘హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిల్లో హనుమాన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులు ‘హనుమాన్’కే ఓటేశారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. గుంటూరుకారం, నా సామిరంగ చిత్రాలకి మిశ్రమ టాక్ వచ్చినా.. మంచి వసూళ్లనే రాబట్టాయి. సైంధవ్ మాత్రం దారుణంగా బోల్తాపడింది. అంతకు ముందు జనవరి 1న వచ్చిన సర్కారు నౌకరి, రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’, ‘బిఫోర్ మ్యారేజ్’ సినిమాలు ప్లాప్ టాక్‌నే మూటగట్టుకున్నాయి.బ్యాండ్ మోగింది..ఇక ఫిబ్రవరి తొలివారంలో సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. అదేవారంలో వచ్చిన ‘కిస్మత్’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘బూట్‌కట్ బాలరాజు’, ‘గేమ్ ఆన్’ చిత్రాలు మాత్రం సందడి చేయలేకపోయాయి. ఇక రెండో వారంలో వచ్చిన రవితేజ ఈగల్, మమ్ముట్టి, జీవా ల‘యాత్ర 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపంచాయి. మూడోవారంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ప్రేక్షకలను కొంతమేర భయపెట్టేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక చివరివారంలో వచ్చిన ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘రాజధాని ఫైల్స్’, ‘సిద్ధార్థ్ రాయ్’, ‘సుందరం మాస్టర్’ చిత్రాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయితే ఫిబ్రవరిలో ఈగల్, యాత్ర 2 తప్పితే మిగతావన్నీ అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిన్న చిత్రాలే రిలీజ్ కావడం గమనార్హం.అలరించని సమ్మర్సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ టాలీవుడ్‌కి చాలా ముఖ్యమైనది. దాదాపు మూడు నాలుగు పెద్ద సినిమాలైనా వేసవిలో విడుదలయ్యేవి. కానీ ఈ ఏడాది సమ్మర్లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు. మార్చి తొలివారం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదేవారం భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్ 13’లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏ ఒక్కటి అలరించలేదు. (చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?)రెండోవారం గోపిచంద్ ‘భీమా’తో విశ్వక్ సేన్ ‘గామి’తో వచ్చాడు. వీటిల్లో భీమాకి ప్లాప్ టాక్ రాగా.. ‘గామి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలో బోల్తా పడ్డాయి. ఇక మూడో వారంలో రజాకార్, లంబసింగి, షరతులు వర్తిసాయి’తో పాటు అరడజనుకు పైగా చిన్న సినిమాలు రిలీజ్ అయినా..ఒక్కటి కూడా హిట్ కాలేదు. మూడో వారంలో రిలీజైన శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ థియేటర్లలో నవ్వులు పూయించింది. ఇక చివరి వారంలో వచ్చిన ‘టిల్లు స్వ్కేర్’ సూపర్ హిట్ కొట్టేసింది. బాక్సాపీస్ వద్ద దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ‘టిల్లుగాడు’ సత్తా చాటాడు.ఏప్రిల్‌లో భారీ అంచనాలతో వచ్చిన విజయదేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదేవారంలో రిలీజైన భరతనాట్యం’, ‘బహుముఖం’ చిత్రాలు ప్లాప్ టాక్ని సంపాదించుకున్నాయి. రెండోవారంలో రిజీలైన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం యావరేజ్ టాక్ని సంపాదించుకుంది. ఇక చివరి రెండు వారాల్లో ‘శ్రీరంగనీతులు’ ‘పారిజాతపర్వం’, ‘మార్కెట్ మహాలక్ష్మీ, తెప్ప సముద్రం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు.(చదవండి: పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు)మేలో తొలివారం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ అల్లరి నరేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత నరేశ్ నటించిన కామెడీ చిత్రమిది. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌నే సంపాదించుకుంది. ఈ మూవీతో పాటు రిలీజైన సుహాస్ ‘ప్రసన్నవదనం’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఒక సెకండ్ వీక్‌లో సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో పాటు ‘ఆరంభం’ అనే చిన్న చిత్రం విడుదలైన..తొలిరోజే నెగెటివ్ టాక్ని సంపాదించుకున్నాయి. ఇక నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ థియేటర్స్‌కి వచ్చిన విషయమే తెలియదు. ఆ తర్వాత వారంలో ‘నట రత్నాలు’, ‘బిగ్ బ్రదర్’, ‘సీడీ’ ‘సిల్క్ శారీ’, ‘డర్టీ ఫెలో’, ‘బ్రహ్మచారి’తో పాటు మొత్తం అరడజను చిత్రాలు విడుదలైన ప్లాప్ టాక్ని మూటగట్టుకున్నాయి. గెటప్ శ్రీను తొలిసారి హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక చివరివారం భజేవాయు వేగం, గం..గం..గణేశా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు రిలీజ్ కాగా.. వీటిల్లో ‘భజే వాయు వేగం’ హిట్ టాక్‌కి సంపాదించుకుంది. ఇక జూన్ తొలివారం ‘సత్యభామ’ అంటూ కాజల్.. ‘మనమే’ అంటూ శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయాయి. అదేవారంలో లవ్ మౌళితో పాటు మరో రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏది హిట్ కాలేదు. రెండో వారంలో సుధీర్ బాబు ‘హరోం హర’తో పాటు ‘మ్యూజిక్ షాప్ మూర్తి, నీ దారే నీ కథ, యేవమ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో మ్యూజిక్ షాప్ మూర్తి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. మూడోవారంలో నింద, ‘ఓ మంచి ఘోస్ట్’, ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’, ‘అంతిమ తీర్పు’ లాంటి పలు చిన్న సినిమాలు విడుదలైనా..ఏ ఒక్కటి అలరించలేదు. ఇక చివరి వారం మాత్రం టాలీవుడ్‌కి గుర్తిండిపోయే విజయాన్ని అందించింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 415 కోట్లను వసూళ్లు చేసి రికార్డ్ సృష్టిస్తోంది. మొత్తంగా ఈ ఆరు నెలల్లో హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. అయితే హనుమాన్, కల్కి 2898 చిత్రాలు మాత్రం చారిత్రాత్మక విజయాలను అందుకున్నాయి. -
Mother's Day 2024: బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘అమ్మ’
నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. తొమ్మిది నెలలు కడుపున మోసి, ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి, ప్రాణం పోసిన తర్వాత బిడ్డ కోసం తల్లి చేసే త్యాగాలు అన్ని ఇన్ని కాదు. మన ఎదుగుదలలో అడుగడుగునా తోడుండే ఏకైక వ్యక్తి అమ్మ. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా..విలవిలలాడి పోయేది మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన కొన్ని టాలీవుడ్ సినిమాలపై లుక్కేద్దాం.గుంటూరు కారం(2024)మహేశ్‌బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం చిత్రం మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కినదే. ఇందులో మహేశ్‌కు తల్లిగా రమ్యకృష్ణ నటించింది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ- మహేశ్‌బాబు మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి.ఒకే ఒక జీవితం(2022)శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతని తల్లిగా సీనియర్ హీరోయిన్ అక్కినేని అమల నటించింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కి మదర్ సెంటిమెంట్‌ని యాడ్ చేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకార్తిక్. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు.'బిచ్చగాడు'తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(2012)2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మ చెప్పింది2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ప్రభాస్ 'ఛత్రపతి'(2005)రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి.యోగి: ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో 'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు.అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(2003)2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.నిజంకొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. వీటితో పాటు అమ్మ, యమలీల, మాతృదేవోభవ, లోఫర్, చిరుత, అమ్మ రాజీనామా, సింహరాశి, పెదబాబు లాంటి సినిమాలు కూడా మదర్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. -
గ్లోబల్ రేంజ్లో మహేశ్.. ఆఫ్రికాలో 'కుర్చీని మడతపెట్టి'న చిన్నారులు
త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం 'గుంటూరు కారం'. సినిమా విషయంలో మొదట నెగటివ్ టాక్ వచ్చినా లాంగ్ రన్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. తెలుగులో మాత్రమే విడుదలైన ఈ సినిమా రూ. 175 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులోని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా 'కుర్చీని మడతపెట్టి' సాంగ్ లక్షల వ్యూస్‌తో రికార్డులు సృష్టించడమే కాకుండా సోషల్ మీడియాను షేక్ చేసింది. మహేశ్ బాబు, శ్రీలీల, పూర్ణ ఈ పాటకు డ్యాన్స్‌తో అలరించారు. ఇది విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రీల్స్‌లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ పాటకు ఆఫ్రికన్ పిల్లలు స్టెప్పులు వేశారు. కొద్దిరోజుల క్రితం అమెరికాలో నేషనల్ బాస్కెట్‌బాల్ గేమ్స్ జరుగుతుండగా.. ఆట మధ్యలో ఏర్పాటుచేసిన వినోద కార్యక్రమంలో కొందరు అమెరికన్స్ ఈ పాటకు డ్యాన్స్ వేశారు. దానిని చూసిన ఉగాండాకు చెందిన ఈ ఆఫ్రికన్ పిల్లల అదిరిపోయే డ్యాన్స్‌తో తాజాగా కుర్చీ మడతపెట్టేశారు. స్మాష్ టాలెంట్ ఫౌండేషన్ వారు ఈ వీడియోను షేర్ చేశారు. ఈ పాటకు థమన్ అందించిన మ్యూజిక్కు తమదైన శైలిలో చక్కగా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. From “Smash Talent Foundation Kids”, AFRICA 😯🔥#KurchiMadathapetti goes Global 🌍 #MaheshBabu | #GunturKaaram My Hero @urstrulymahesh 👑 pic.twitter.com/rzkgxzQcCr — VardhanDHFM (@_VardhanDHFM_) April 13, 2024 Dancing to #KurchiMadathapetti on stage - Done ✅🤩🤩🤪 #Goals2024 pic.twitter.com/cuursWK1Ec — Sou😇 (@theChicaCuriosa) April 15, 2024 #KurchiMadathaPetti song at at Pune Ugaadi celebrations 🔥🔥#GunturKaaram pic.twitter.com/slaaxtoQYI — Charan (@charantweetz) April 9, 2024 Em rasika raajuvo mari 💃😻#KurchiMadathapetti pic.twitter.com/KvL4Tx44om — ︎ ︎ (@VamsiPrince_) April 10, 2024 #MaheshBabu𓃵 craze in Orissa#KurchiMadathapetti pic.twitter.com/VCVeH4Oa9U — varapanakoushik Reddy (@varapanakoushik) April 12, 2024 🕋 రంజాన్ పండగా సందర్భంగా 🕋 🪑 #kurchimadathapetti 🪑 Song singing 🎤@shamna_kkasim dance 🔥🪑@urstrulyMahesh #MaheshBabu #GunturKaaram @MusicThaman @Kkdtalkies #SSMB29 pic.twitter.com/JZoclaAZnu — ⭐ god of tollywood ⭐ ssmb ⭐ (@kiranprinc31148) April 14, 2024 #KurchiMadathaPettiGoesGlobal 🌏🎵🔥#KurchiMadathaPetti 💥 pic.twitter.com/VM9okKzJ4v — thaman S (@MusicThaman) April 1, 2024 -
గుంటూరు కారం.. అంతా వేస్ట్ అయిపోయింది: జగపతిబాబు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతికి రిలీజైంది. సరిగ్గా అప్పుడే చిన్న చిత్రం హనుమాన్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుంటూరు కారం చిత్రాన్ని వెనక్కు నెడుతూ హనుమాన్ సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మహేశ్ సినిమాకు కలెక్షన్స్ అయితే చూపెట్టారు కానీ అదే సమయంలో నెగెటివిటీ కూడా వచ్చింది. ఈ మూవీలో జగపతిబాబు విలన్‌గా నటించాడు. నిజం చెప్తున్నా తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేశ్‌బాబుతో పని చేయడం నాకెంతో ఇష్టం. కానీ నిజాయితీగా చెప్తున్నా.. గుంటూరు కారం సినిమాను నేనైతే ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే మూవీ చాలా డిఫరెంట్‌గా ఉండాల్సింది. క్యారెక్టర్లను ఇంకా మెరుగ్గా రాసుకోవాల్సింది. కానీ కొంతకాలానికే అంతా గందరగోళంగా మారింది. దీంతో సినిమా పూర్తి చేయడం కష్టమైంది. వేస్ట్ నేను చేయాల్సింది చేశాను. కానీ.. మహేశ్‌తో నా కాంబినేషన్ ఎప్పుడూ గొప్పగా ఉండాలనుకుంటాను. ఇలాంటి సినిమాల కోసం మా కాంబినేషన్‌ను వేస్ట్ చేయాలనిపించదు' అని చెప్పుకొచ్చాడు. జగపతిబాబు ప్రస్తుతం మిస్టర్ బచ్చన్, పుష్ప 2 సినిమాలు చేస్తున్నాడు. అలాగే తమిళంలో కంగువా, హిందీలో రుస్లాన్ సినిమాల్లో కనిపించనున్నాడు. చదవండి: ఒకప్పుడు రూ.500 అద్దె.. ఇప్పుడదే ఇల్లు కోరుకుంటున్న హీరో -
పుకార్లకు చెక్.. 'పుష్ప 2' తర్వాత బన్నీ సినిమా ఫిక్స్
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఫిక్సయిపోయిందా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం 'పుష్ప 2'తో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మంచి హై ఇచ్చే విజువల్స్.. అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. ఇప్పుడు బన్నీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ 'పుష్ప' మూవీని 2021 చివర్లో కేవలం తెలుగు వరకే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ పెద్దగా ప్రమోషన్ లేకుండానే పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అయితే తెలుగులో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఉత్తరాదిలో మాత్రం ప్రేక్షకులు 'పుష్ప' దెబ్బకు మెంటలెక్కిపోయారు. ఫలితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) దీంతో 'పుష్ప 2' కాస్త లేట్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అయితే దీని తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా సస్పెన్స్ గానే ఉండిపోయింది. త్రివిక్రమ్, అట్లీ, బోయపాటి శ్రీను.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడనిపిస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ మూవీ క్యాన్సిల్ అయిందనే పుకార్లకు చెక్ పడినట్లయింది. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన త్రివిక్రమ్ ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. మరి అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా ఏం చేస్తాడోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) Wishing an amazing actor with great perseverance & dedication to achieve anything on and off screen, the stylish Icon Star of Indian cinema and National Award winner, Our @alluarjun garu a very Happy Birthday ❤️#HappyBirthdayAlluArjun 🌟 Can't wait to work with you again, sir.… pic.twitter.com/BhLfbaynwB — Haarika & Hassine Creations (@haarikahassine) April 8, 2024 -
కుర్చీ మడతపెట్టి పాట NBA గేమ్ హాఫ్‌టైమ్‌లో ప్లే చేసారు
-
సలార్ అయినా.. గుంటూరు కారం అయినా.. అదే చూడాల్సింది: నాగవంశీ కౌంటర్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమాపై ట్రోల్స్ వచ్చాయి. చాలా మంది గుంటూరు కారంపై విమర్శలు కూడా చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన సినిమా రిలీజ్ సమయంలో వచ్చిన విమర్శలకు కౌంటరిచ్చారు. పెద్ద హీరోల సినిమాలకు లాజిక్‌లతో పనిలేదని ఆయన అన్నారు. స్టార్ హీరోల ఎలివేషన్స్ చూసి సినిమాను ఎంజాయ్ చేయాలన్నారు. నాగవంశీ మాట్లాడుతూ.. 'సలార్‌లో ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. కొందరు మాత్రం కొన్ని సీన్స్‌లో లాజిక్ లేదని కామెంట్స్ చేశారు. మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా తరచుగా హీరో హైదరాబాద్ వెళ్లినట్లు చూపించారు. వెంటనే ఎలా వెళ్తాడని కొందరు కామెంట్స్ చేశారు. ఇలాంటి వారి కోసం గుంటూరు టూ హైదరాబాద్ మూడున్నర గంటల జర్నీని సినిమాలో చూపించలేం కదా. కొందరైతే గుంటూరు కారంలో మాస్ సీన్స్ లేవని, త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని అన్నారు. కానీ ఓటీటీలో రిలీజ్ తర్వాత సినిమా చాలా బాగుందని మెసేజ్‌లు పెట్టారు' అని అన్నారు. గతంలో మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాల్లో మాస్ సాంగ్స్ చేశారు. అందుకే గుంటూరు కారంలోనూ అలాంటి సాంగ్ ఉంటే బాగుంటుందని కుర్చినీ మడతపెట్టి పాటను పెట్టినట్లు నాగవంశీ తెలిపారు. ఇక్కడ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి కానీ.. ఆ టైమ్‌కు శ్రీలీల రావడం.. వెంటనే దుస్తులు మార్చుకోవడం లాంటి లాజిక్‌లు మాట్లాడకూడదని అన్నారు. సినిమాను కేవలం వినోదం రూపంలోనే చూడాలని.. ఇండస్ట్రీలోనే గొప్ప రచయిత అని పేరున్న ఆయనకు సినిమా ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదన్నారు. సినిమా బాగోలేదని కామెంట్ చేసే అర్హత ఎవరికైనా ఉంటుంది.. కానీ చిత్ర బృందంపై ఎవరు పడితే వారు మాట్లాడకూడదంటూ నాగవంశీ గట్టిగా బదులిచ్చారు. -
గుంటూరు కారం సాంగ్.. అంత భయంకరంగా ఉందన్న టీమిండియా స్టార్ క్రికెటర్!
కొత్త ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన భామ శ్రీలీల. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌కు అభిమానులకు అయితే ఏకంగా పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్‌లో శ్రీలీల స్టెప్పులకు ఫిదా కానీ వారు ఉండరేమో. అంతలా తన డ్యాన్స్‌తో అదరగొట్టింది ఈ కన్నడ భామ. అయితే తాజాగా గుంటూరు కారం సాంగ్‌పై టీమిండియా క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా శ్రీలీల, మహేశ్‌బాబు డ్యాన్స్‌కు తాను ఫిదా అయ్యానని వెల్లడించారు. ఓ అభిమానితో మాట్లాడుతూ గుంటూరు కారం సాంగ్‌ను ప్రస్తావించారు. మహేశ్ బాబు మూవీ గుంటూరు కారం సాంగ్‌లో శ్రీలీల, మహేశ్ బాబు డ్యాన్స్ భయంకరంగా ఉందని అన్నారు. ఇప్పటికీ ఆ సాంగ్ చూడకపోతే యూట్యూబ్‌కు వెళ్లి గుంటూరు కారం శ్రీలీల డ్యాన్స్ టైప్ చూడమని అశ్విన్ సలహా కూడా ఇచ్చాడు. మహేశ్ బాబు ఎక్స్ట్రార్డినరీ డ్యాన్సర్ అని.. అతనితో పాటు శ్రీలీల అదరగొట్టిందని అశ్విన్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సాంగ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీమ్‌కు ఊపు తీసుకొస్తుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Cricketer @ashwinravi99 about #GunturKaaram 🔥@urstrulyMahesh @sreeleela14 pic.twitter.com/8mV2JNreU2 — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024 -
'గుంటూరు కారం' విషయంలో బాధంతా వాళ్లదే: నిర్మాత నాగవంశీ
ఈసారి సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజైన సినిమా 'గుంటూరు కారం'. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలోని హ్యాట్రిక్ మూవీ ఇది. విడుదలకు ముందు ఫ్యాన్స్.. ఓ రేంజు అంచనాలు పెంచేసుకున్నారు. కానీ టాక్ రివర్స్ అయిపోయింది. రూ.150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టుకుంది కానీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే విషయంలో నిరాశపరిచింది. తాజాగా ఓ ఈవెంట్లో 'గుంటూరు కారం' మూవీ గురించి ప్రశ్న ఎదురవగా.. నిర్మాత నాగవంశీ విచిత్రమైన సమాధానమిచ్చారు. (ఇదీ చదవండి: బోల్డ్నెస్ గురించి ప్రశ్న.. బిర్యానీ, పులిహోర అని అనుపమ కౌంటర్స్) 'గుంటూరు కారం సినిమా విషయంలో మాకు ఎలాంటి బాధలేదు. బాధంతా కూడా మీడియాదే' అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. ఈయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే పెట్టిన డబ్బులొచ్చేయని అన్నట్లే. కానీ రియాలిటీ చూసుకుంటే ఈ మూవీ మహేశ్ అభిమానులే చాలామందికి నచ్చలేదు. అలానే సినిమాని కొన్న చాలామంది బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోయారని సమాచారం. కానీ నాగవంశీ మాత్రం మీడియా బాధంతా అని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తోంది. అలానే త్రివిక్రమ్-అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అప్డేట్ గురించి అడగ్గా.. మరో ప్రెస్‌మీట్ లో చెబుతానని మాట దాటవేశారు. సితార సంస్థ నుంచి త్వరలో రాబోతున్న మూవీ 'టిల్లూ స్క్వేర్'. 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‌గా తీసిన ఈ మూవీలో సిద్ధు, అనుపమ హీరోహీరోయిన్లుగా నటించారు. మల్లిక్ రామ్ దర్శకుడు. తొలి భాగంతో పోలిస్తే ఇందులో గ్లామర్, రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మరి దీని ఫలితం ఫస్ట్ పార్ట్‌కి మించి ఉంటుందా? లేదా? అనేది చూడాలి. (ఇదీ చదవండి: సిల్క్ స్మిత చేసిన పెద్ద తప్పు అదే: నటి జయమాలిని) -
ఆ మూడు సినిమాలే నా కెరీర్‌ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు
సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరో ఐదేళ్ల బయట ఎక్కడా కనిపించడు. గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ మాట తెగ వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలో రాజమౌళితో మూవీ చేయబోతున్నాడు కాబట్టి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అందుకే తగ్గట్లే మహేశ్.. షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్, రాజమౌళితో మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నన్ను ప్రభావితం చేసి నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలు మురారి,పోకిరి,శ్రీమంతుడు. ఈ మూవీస్.. నన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. ఈ మూడింటిలానే ఆడియెన్స్‌కి నచ్చేలా, నైతిక అంశాలు ఉండేలాంటి కథల్ని ఎంపిక చేసకుంటూ వస్తున్నాను. అయితే ఇన్నేళ్ల ప్రయాణంలో సినిమా సక్సెస్ కావడంపై నా ఆలోచన విధాం కూడా మారింది. ఓ మూవీ హిట్ కావడానికి బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత ముఖ్యమో.. ఆ సినిమా ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది కూడా అంతే ముఖ్యం' (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) 'సినిమాలో కనిపించే ప్రతి పాత్రకు నెగిటివ్ ఛాయలు ఉంటాయి. కాబట్టి ప్రతి పాత్ర ఏదో ఓ నైతిక విషయాన్ని అంతర్లీనంగా చెబుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నేను ఓ సినిమాని అంగీకరించిన తర్వాత ఆ పాత్రకు లొంగిపోతాతను. దర్శకుడు చెప్పినట్లు ఆ పాత్ర చేసుకుంటూ వెళ్లిపోతాను. ఆ పాత్రకు గ్రే షేడ్స్ ఉన్నప్పటికీ.. ప్రస్తుత జనరేషన్ ప్రేక్షకులు.. ఏది తప్పో ఒప్పో గుర్తించేంత పరిణతి సాధించారని అనుకుంటున్నారు. అలానే రాజమౌళి సర్‌తో మూవీ ప్రీ ప్రొడక్షన్ మంచిగా సాగుతోంది. షూటింగ్లో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని మహేశ్ చెప్పుకొచ్చాడు. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన మహేశ్.. యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నాడు. కానీ సినిమా పూర్తిగా తేలిపోయింది. ఏ దశలోనూ అలరించలేకపోయింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ అందరూ కూడా రాజమౌళితో మూవీపైనే గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. జంగిల్ అడ్వంచర్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీ కోసం మహేశ్ దాదాపు మూడేళ్ల కేటాయించినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) -
పూజా హెగ్డే ఈజ్ బ్యాక్.. త్రివిక్రమ్‌పై మళ్లీ ట్రోల్స్!
'గుంటూరు కారం' మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో డైరెక్టర్ త్రివిక్రమ్‌ని మహేశ్ ఫ్యాన్స్ మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకిలా చేశారు అని తెగ బాధపడుతున్నారు. అయితే ఇదంతా కూడా కేవలం రెండు ఫొటోల వల్లే వచ్చింది. మళ్లీ ఏమైంది? ఇప్పుడు ఏం జరుగుతోంది? మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమాగా 'గుంటూరు కారం' తీశారు. అప్పుడెప్పుడో 2021 మేలో లాంచ్ చేశారు. అప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్న పూజా హెగ్డేని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. కానీ షూటింగ్ లేటు అయ్యేకొద్ది స్టోరీ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్ ఒక్కొక్కరుగా మారుతూ వచ్చారు. మరి పూజా హెగ్డేని తప్పించారో, తప్పుకొందో తెలీదు గానీ సినిమా నుంచి సైడ్ అయిపోయింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది) దీంతో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. మొన్నీమధ్ సంక్రాంతికి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్‌ని మాములుగా ట్రోల్ చేయలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరో దఫా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు అప్పట్లో షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోల్ని ఎవరో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్‌తో పాటు పూజా హెగ్డే కూడా కనిపించింది. ఈ ఫొటోల బట్టి చూస్తే శ్రీలీల చేసిన అమ్మూ పాత్ర పూజా చేయాల్సింది. మీనాక్షి చేసిన బుజ్జి పాత్ర శ్రీలీల చేయాలి. తాజాగా రిలీజైన ఫొటోల్లో పూజా లుక్ బాగుంది. దీంతో ఇంత మంచిగా ఉన్న హీరోయిన్ని ఎందుకు తీసేశార్రా బాబు అని నెటిజన్స్ దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు. అదీ సంగతి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) -
శ్రీవారి సేవలో గుంటూరు కారం భామ.. వీడియో వైరల్!
కొత్త ఏడాదిలోనే హిట్ సినిమాతో బోణి కొట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరెకెక్కిన గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న ఈ కన్నడ బ్యూటీకి గుంటూరు కారంతో సక్సెస్ ట్రాక్‌లో వచ్చేసింది. తాజాగా ఈ పెళ్లిసందడి భామ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీలీలకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అమెకు ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ..' గతంలో పెళ్లి సందడి సినిమా తర్వాత తిరుమలకు వచ్చా. ఇప్పుడు మళ్లీ నా కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నా కొత్త ప్రాజెక్ట్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తారు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. తిరుమలకు రావడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అందుకే వచ్చా' అని చెప్పుకొచ్చింది. #Sreeleela, "#GunturKaaram," Actress visited the esteemed Tirumala Tirupati Venkateswara Temple. During her pilgrimage, she participated in the VIP break darshan & offered her सेवा to Lord Venkateswara. The warm reception from temple authorities & blessings from pundits. pic.twitter.com/EUHVCxkj8p — Informed Alerts (@InformedAlerts) February 19, 2024 -
ఇది మహేష్ బాబు సినిమా నా ? పరుచూరి సంచలన కామెంట్స్
-
డ్యాన్స్‌తో కుర్చీ మడత పెట్టేసిన 'మహేశ్ బాబు' అన్న కూతురు
మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం 'గుంటూరుకారం'. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం యూత్ నుంచి కుటుంబ ప్రేక్షకుల వరకు మెప్పించింది. మొదట ఈ సినిమా బాగాలేదని అన్నవారితోనే కొన్నిరోజుల తర్వాత మళ్లీ చూసి.. అరే సినిమా బాగుందే అనే కితాబు ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని భారీగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని కుర్చీ మడత పెట్టి అనే పాట ఒక రేంజ్లో హిట్ అయింది. ఈ పాట నుంచి మిలియన్ల కొద్ది రీల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కూతురు భారతి కూడా చేరింది. భారతి ఘట్టమనేని చేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన బాబాయ్ మహేశ్ పాటకు భారతి వేసిన స్టెప్పులు ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే ఇదే పాటకు మహేశ్ కూతురు సితార కూడా ఒక రీల్ చేసింది. అప్పుడు కూడా సితార వేసిన స్టెప్పులకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ తన అన్న కూతురు భారతి కూడా కుర్చీ మడత పెట్టేసింది. ప్రస్తుతం ఆమె ఫారిన్లో చదువుకుంటున్నట్లు సమాచారం. రమేశ్ బాబు కూడా తన తండ్రి కృష్ణతో కలిసి పలు సినిమాల్లో కనిపించారు. చివరిగా ఎన్కౌంటర్ అనే చిత్రంలో తండ్రితో కలిసి నటించిన రమేశ్‌బాబు తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ కొంత కాలం తర్వాత తన సోదరుడు అయిన మహేశ్‌తో కలిసి అర్జున్, అతిథి చిత్రాలను నిర్మించాడు. కానీ ఆయన పిల్లలు భారతి, జయ కృష్ణ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కానీ తాజాగా భారతి చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రీలీల రేంజ్లో దుమ్మురేపిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతలా ఆమెపై పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్న ఆ సాంగ్‌ను మీరూ చూసేయండి. View this post on Instagram A post shared by Bhar Ghats (@bharathighattamaneni) -
‘గుంటూరు కారం’లో అది మిస్ అయింది.. ఈ టైటిల్ పెడితే బాగుండేది: పరుచూరి
మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరుకారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇది మహేశ్ బాబు రేంజ్ సినిమా కాదని, త్రివిక్రమ్ బలమైన కథను రాసుకోలేకపాయడనే విమర్శలు కూడా వచ్చాయి. కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెటిఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న గుంటూరు కారం చిత్రంపై యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ. ఇది మహేశ్ బాబు స్థాయి సినిమా కాదని, టైటిల్ కూడా అలా పెట్టకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘350 చిత్రాలకు పైగా పని చేసిన నాకు ‘గుంటూరు కారం’ కథనం కాస్త కన్ఫ్యూజ్గా అనిపించింది.ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. రెండోసారి చూస్తే స్పష్టత ఉండొచ్చేమో. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లేతో ఆడుకున్నాడు. గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో ఇందులోని హీరో పాత్రను అలా క్రియేట్ చేశారు. త్రివిక్రమ్ మంచి టైటిల్స్ పెడతారు. ఆయన సినిమాన్నింటిలో ఇది కొంత తేడాగా అనిపించింది. తల్లి వద్దనుకుంటే.. సంబంధిత డాక్యుమెంట్స్‌పై హీరో సంతకం పెడతాడా, లేదా? అనే పాయింట్ చుట్టు ఈ కథ అల్లుకున్నాడు. అయితే ఇందులో తల్లి కొడుకుల సెంటిమెంట్ పండలేదు. అలాగే తాత మనవళ్ల సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. హీరో అమ్మను దైవంలా కొలుస్తాడు తప్ప టీజ్ చేయలేడు, ఇబ్బంది పెట్టలేడు. సెంటిమెంట్ ప్రధానంగా సినిమాని తీద్దామనుకుంటే ఈ టైటిలే తప్పు. ‘గుంటూరు వారి అబ్బాయి’ అని పెట్టి ఉంటే కుటుంబ కథా చిత్రం చూడబోతున్నామని ప్రేక్షకులు అనుకుని ఉండేవారు. గుంటూరు కారం.. పేరుకు సరిపోయేలా స్క్రీన్‌ప్లేని సెట్ చేశారు. సంతకం పెట్టించేందుకు హీరోయిన్.. హీరో ఇంటికొచ్చి, ప్రేమలో పడేయాలనుకుంటుంది. ఇది పాజిటివ్ దృక్పథం కాదు. రమ్యకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్‌నే డెవలప్ చేసుకుంటూ వెళ్లి ఉంటే ఈ సినిమా మరో విధంగా ఉండేది. అని పరుచూరి అభిప్రాయ పడ్డాడు. -
గుంటూరు కారం సాంగ్.. అలాంటి వారిపై మండిపడ్డ యాంకర్ రష్మీ!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన చిత్రాల్లో మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో సీనియర్ నటి పూర్ణ సైతం స్టెప్పులతో అదరగొట్టింది. శ్రీలీల ఎక్కువగా హైలెట్ అయింది. అయితే ఈ పాటకు బుల్లితెర యాంకర్ రష్మీని ఎంపిక చేయాలనుకున్నట్లు ఓ వార్త నెట్టింట వైరలైంది. పూర్ణ ప్లేస్‌లో రష్మీ గౌతమ్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ అందుకు రష్మీ నో చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా వీటిపై రష్మీ స్పందించింది. ఇలాంటి ఫేక్ వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడింది. అంతే కాదు.. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని.. అందువల్లే తనను ఎవరు రిజెక్ట్ చేయలేదని తెలిపింది. అంతే కాదు.. ఆ పాత్రలో పూర్ణ అద్భుతంగా చేశారని కొనియాడింది. ఇలాంటి తప్పుడు వార్తలతో నెగెటివిటీని ప్రచారం చేయవద్దని కోరింది. ఎవరు కూడా ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రోత్సహించవద్దని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రష్మీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రష్మీ చివరసారిగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి పక్కన ఓ పాటలో అలా మెరిసింది. This news is absolutely baseless I was not approached so no scope for rejection Also poorna garu did an absolute fab job no one else could have done it better Fake news like these might bring unwanted negativity towards me kindly do not encourage such news pic.twitter.com/QywBUN76Te— rashmi gautam (@rashmigautam27) February 13, 2024 -
ఓటీటీలో గుంటూరు కారం.. ఆ విషయంలో ఆడియన్స్ ఫుల్ డిసప్పాయింట్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 9న ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం డబ్బింగ్ వర్షన్లోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. థియేటర్లలో రిలీజైన నెలలోపే గుంటూరు కారం స్ట్రీమింగ్కు వచ్చేసింది. దీంతో ఓటీటీలోనూ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. డబ్బింగ్ వర్షన్‌పై మాత్ర పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా శాండల్‌వుడ్ ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో గుంటూరు కారం సినిమా కన్నడ వర్షన్‌పై కన్నడ ప్రేక్షకులు అసంతృప్తి చేస్తున్నారు. ట్రాన్స్లేషన్తో పాటు వాయిస్ ఓవర్ కూడా అసలు బాగాలేదని సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ పోస్టులు పెడుతున్నారు. కన్నడ డబ్బింగ్ చాలా నాసిరకంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద సినిమా అయినప్పటికీ డబ్బింగ్‌ను తూతూ మంత్రంగా కానిచ్చేశారని మండిపడుతున్నారు. గుంటూరు కారం తమిళ డబ్బింగ్ వర్షన్లో కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ సినిమాలో ఆడియన్స్‌ను ఓ రేంజ్లో ఊపేసిన మాస్ సాంగ్ ‘కుర్చీ మడత పెట్టి’ ఫుల్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ డబ్బింగ్ వర్షన్లో పేలవంగా ఉందని మరికొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు. అన్ని భాషల్లో ఒరిజినల్ సాంగ్ ఉంటేనే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌లో గుంటూరు కారం నెట్‌ప్లిక్స్‌లో దూసుకెళ్తోంది. Guntur Kaaram has to be the worst Kannada dubbed movie recently in terms of both writing and voice artists selection. Absolutely pathetic. Original was movie was bad and this dubbing quality made it even worse.#GunturKaaram — Mal-Lee | ಮಲ್ಲಿ (@MallikarjunaNH) February 9, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన 'గుంటూరు కారం'.. ఆ వర్షన్లో మరింత క్రేజ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం సుమారు రూ. 280 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. మహేశ్ కెరీర్లోనే మూడోసారి రూ. 200 కోట్ల మార్క్‌ను ఈ చిత్రంతో అందుకున్నారు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా సూపర్ కొట్టి టాలీవుడ్లో తన రేంజ్ ఏంటో మరోసారి చూపించాడు ప్రిన్స్ మహేశ్.. ఆయన క్రేజ్‌కు తగ్గట్లే గుంటూరు కారం ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో నేడు ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. హిందీలో క్రేజ్ టాలీవుడ్ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్,తారక్,రామ్ చరణ్ వంటి స్టార్స్ బాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో మహేశ్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన SSMB29 చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళితో ప్లాన్ చేశారు. ఆ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఇలాంటి సమయంలో నెట్ ఫ్లిక్స్ ద్వారా 'గుంటూరు కారం' చిత్రాన్ని హిందీలో విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా చూసిన ఆయన అభిమానులు ఇప్పుడు హిందీలో మరోసారి రమణగాడిని చూస్తున్నారు. Hindi version of Kurchi madathapetti song from Guntur Kaaram ain’t bad 🪑🔥 @MusicThaman#GunturKaaramOnNetflix pic.twitter.com/76YumZyRCy — Satvik (@SatvikV1) February 8, 2024 Dum Masala Biryani Erra Kaaram Ara kodi ready ga pettukoni full ga enjoy chese Guntur Kaaram vacchesindhi 🤤 Guntur Kaaram, now streaming on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi.#GunturKaaramOnNetflix pic.twitter.com/ROm8FYyjcU — Netflix India South (@Netflix_INSouth) February 8, 2024 -
'గుంటూరు కారం' క్రేజీ సాంగ్.. ఇలా కూడా వాడేస్తున్నారా?
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు కాంబోలో కొత్త ఏడాదిలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఫ్యాన్స్ భారీ అంచనాల నడుమ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. తమన్ సంగీతమందించారు. అమెరికాలోనూ తగ్గని క్రేజ్.. అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. 'కుర్చీని మడతబెట్టి' అనే పాట చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరు ఈ సాంగ్‌కు స్టెప్పులు వేయని వారు ఉండరేమో. అంతలా వైరలైంది గుంటూరు కారం సినిమాలోని పాట. ఇప్పుడు ఇండియాలోనే కాదండోయ్.. కుర్చీ సాంగ్ ఫీవర్ కాస్తా అమెరికాకు చేరింది. ఏకంగా ఈ పాటకు స్టెప్పులు వేయడమే కాదు.. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్ ప్లే అవుతుండగా ట్యూన్‌కు తగ్గట్టుగా వర్కవుట్ చేస్తూ కనిపించారు. కుర్చీని మడతపెట్టి.. వార్మప్ అంటూ ఎంజాయ్ చేస్తోన్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్ బాబుగారి "గుంటూరు కారం" సినిమా హిట్ అయ్యిందో లేదో నాకు తెలియదు, కానీ అమెరికాలో మాత్రం ఇదీ పరిస్థితి ఇప్పుడు 👇😊#GunturKaaram #GunturKaaramCelebrations pic.twitter.com/TF9XtYr87y — Prakash Arige (@prakasharige) February 7, 2024 -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం వస్తోందంటే చాలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న దానిపై ఆసక్తితో ఉంటారు ఆడియన్స్. అలాగే ఓటీటీలోనూ ఏయే సినిమాలు వస్తున్నాయో అని ఎదురు చూస్తుంటారు. అయితే ఈ వారంలో పెద్ద సినిమాల సందడి చేయనున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలు ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైపోయాయి. సంక్రాంతి రిలీజైన సినిమాల్లో ఇప్పటికే సైంధవ్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మహేశ్ బాబు గుంటూరు కారం, ధనుశ్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ ఈ వీకెండ్లో అలరించనున్నాయి. వీటితో పాటు భూమి పెడ్నేకర్ భక్షక్ క్రైమ్ థ్రిల్లర్, సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. మరీ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఓ లుక్కేయండి. అంతే కాకుండా ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు మాస్ మహారాజా రవితేజ ఈగల్ వచ్చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న యాత్ర-2 ఈ వారంలోనే థియేటర్లకు రానుంది. ఈనెల 8న యాత్ర-2 థియేటర్లలో విడుదలవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08 గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09 భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09 లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09 యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09 ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09 ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09 హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10 బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 అమెజాన్ ప్రైమ్ కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-09 జీ5 కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09 జియో సినిమా హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8 సన్ నెక్ట్స్ అయలాన్- (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి 09 -
మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీ.. ఎక్కడ తేడా కొట్టిందంటే!
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు కాంబోలో కొత్త ఏడాదిలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోనూ సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. తమన్ సంగీతమందించారు. (ఇది చదవండి: ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి) అయితే ఇదిలా ఉండగా.. టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది బిగ్‌బాస్ సోహెల్ హీరోగా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన చిత్రాలు ఫ్లాఫ్ కావడంపై స్పందించారు. అదే క్రమంలో ఇటీవలే రిలీజైన మహేశ్ బాబు గుంటూరు కారం సక్సెస్ కాకపోవడంపై తనదైన శైలిలో మాట్లాడారు. ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో.. అక్కడే తేడా కొడుతుందని అన్నారు. అప్పటి టాప్ హీరోల చిత్రమైనా.. గుంటూరు కారం సినిమా అయిన ఇదే జరుగుతుందన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు స్టార్డమ్కు తగినట్లుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ భావించారు. కానీ ఎప్పుడు అలా చేయకూడదు. కథను బేస్ చేసుకునే సినిమాలు తీయాలి. అంతేకానీ స్టార్‌డమ్‌ను నమ్ముకుంటే అక్కడే తేడా కొడుతుంది. నా సినిమా యమలీల అందుకే పెద్ద హిట్ అయింది. కానీ మిగతా సినిమాలకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.' అని అన్నారు. -
ఓటీటీలోకి గుంటూరు కారం..స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
-
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు.. ఆ మూడు మాత్రం స్పెషల్!
మరోవారం రానే వచ్చింది. వీకెండ్ ముగియడంతో సినీ ఆడియన్స్ ఎప్పటిలాగే వర్క్ మోడ్‌లోకి వెళ్లిపోతారు. దీంతో ఓటీటీల్లో వచ్చే సినిమాల కోసం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. కాగా.. గతవారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఒకటి, రెండు చిత్రాలు మినహా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వచ్చేవారంలో ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో అన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వారంలో ముఖ్యంగా సంక్రాంతికి సందడి చేసిన సినిమాలు వచ్చేస్తున్నాయి. అందులో మహేశ్ బాబు గుంటూరు కారం, కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ కెప్టెన్ మిల్లర్, కన్నడ స్టార్ దర్శన నటించిన కాటేరా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. వీటితో భూమి ఫెడ్నేకర్ క్రైమ్ థ్రిల్లర్ భక్షక్, సుస్మితా సేన్ ఆర్య-3 వెబ్ సిరీస్ ఆసక్తి పెంచుతున్నాయి. అంతే కాకుండా ఈ వారంలో మాస్ మహారాజా నటించిన ఈగల్ థియేటర్ల వద్ద సందడి చేయనుంది. మరీ ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్)- ఫిబ్రవరి 05 ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్డమ్ - ఫిబ్రవరి 05 మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్)- ఫిబ్రవరి 05 మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్)-ఫిబ్రవరి 05 ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్)-ఫిబ్రవరి 05 లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్)- ఫిబ్రవరి 07 రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 07 లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07 వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08 గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09 భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09 లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09 యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09 ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09 ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09 హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10 బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 అమెజాన్ ప్రైమ్ కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-0 9 జీ5 కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09 జియో సినిమా ది ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్) - ఫిబ్రవరి 6 ది నన్ 2 - ఫిబ్రవరి 7 హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8