hanged
-
నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి..దంపతుల ఆత్మహత్య
బౌద్ధనగర్: ‘మేము చావడానికి కారణం ఆ నలుగు రే. వారిని విడిచిపెట్టకండి’అని సూసైడ్ నోట్ రాసి నాలుగేళ్ల కూతురుతో సహా దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా లక్ష్మీపురానికి చెందిన కొప్పుల సాయికృష్ణ (37), చిత్రకళ(30) దంపతులు. వీరికి తేజస్వి అనే నాలుగేళ్ల పాప ఉంది. ఏడాది నుంచి ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో నివసిస్తున్నారు. సాయికృష్ణ గతంలో ర్యాపిడో బైక్ నడిపేవాడు. ఏడాదిగా ఉద్యోగానికి వెళ్లడం లేదు. భార్య చిత్రకళ నాంపల్లి బిర్లా సైన్స్ సెంటర్లోని టికెట్ కౌంటర్లో ఉద్యో గం చేస్తుండేది. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్, పే స్లిప్ అడిగిన నేపథ్యంలో నెలక్రితం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. భర్తకు పని లేకపోవడం, తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేని చిత్రకళ తీవ్ర మనోవేదనకు గురైంది. లేనిపోని కారణాలు చూపి తనను ఉద్యోగం నుంచి తొలగించిన నలుగురు ఉద్యోగులు శ్యాం కొటారి, గాతా, హరిబాబు, సంతోష్ రెడ్డిలను వదిలిపెట్టవద్దని సూసైడ్ నోట్లో రాసి ఆ నోట్‌ను గోడకు అతికించింది. ముందుగా కూతురుకి ఉరేసి.. ఆ తర్వాత భార్య, భర్త కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి వారున్న ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పక్కింటి వాళ్లు తలుపులు కొట్టారు. అయినా తీయలేదు. శుక్రవారం ఉదయం ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి తలుపులు బద్దలుగొట్టి చూడగా ముగ్గురూ విగతజీవులై కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. మృతిపై అనుమానాలు: బిర్లా సైన్స్ సెంటర్లో పలు అవకతవకలు జరిగాయని, వాటి గురించి తనకు తెలియడం వల్లనే శ్యామ్ కొఠారి, గీతారావు, హరిబాబు, సంతోష్ రెడ్డిలు కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేసి ఉద్యోగం నుంచి తొలగించారని సూసైడ్ నోట్లో పేర్కొంది. తాను పని చేసిన కార్యాలయంలో రూ.కోట్లలో మోసం జరిగిందని పేర్కొంటూ 12 పాయింట్లతో సూసైడ్ నోట్ రాసి గోడకు అతికించింది. ‘‘ఓ మంత్రితో మాట్లాడేందుకు యత్నించినా కుదరలేదు. ఓ టీవీకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా స్పందించ లేదు.’’ అని అందులో పేర్కొంది. అయితే ఆఫీసులో జరిగిన దానికి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రపంచ చరిత్రలో అత్యంత క్రూరమైన శిక్ష.. ఏనుగును క్రేన్‌కు బిగించి..
ప్రపంచంలోని పలు దేశాల్లో క్రూరమైన రాజుల పాలన సాగిందనే విషయం మనం చరిత్రలో చూసివుంటాం. వారు విధించే శిక్షలు వెన్నులో వణుకుపుట్టించేవని కూడా వినివుంటాం. అయితే అంతకన్నా అత్యంత క్రూరమైన యజమాని గురించి, అతను విధించిన హేయమైన శిక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏనుగును క్రేన్‌కు బిగించి, అందరి ముందు దానికి శిక్ష విధించాడంటే.. అతను ఎంత క్రూరమైనవాడో ఇట్టే గ్రహించవచ్చు. ఏనుగు ఏం తప్పు చేసిందని.. అత్యంత సాధు జంతువుగా పేరొందిన ఏనుగుకు శిక్ష విధించాడంటే అతని నిర్దయ ఏపాటితో ఇట్టే అర్థమవుతుంది. అది 1816, సెప్టెంబరు 13.. అమెరికాలో అత్యంత హేయంగా ఒక ఏనుగును క్రేన్‌కు వేలాడదీసి మరణశిక్ష విధించారు. ఆ ఏనుగు పేరు మేరీ. అది తన మావటివాడిని కాలితో తొక్కి చంపేసిందని దానికి ఇంత దారుణమైన శిక్ష విధించాడు. చరిత్ర అందించిన సమాచారం ప్రకారం ఆ ఏనుగు ఆకలితో అల్లాడిపోతూ అదుపుతప్పింది. దానిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన మావటివాడు దాని చెవిపై గట్టిగా కొట్టాడు. అంతే.. ఆ ఏనుగు కోపంతో.. ఒక్కసారిగా తన పాదంతో ఆ మావటివాడిని తొక్కి చంపేసింది. ఆ ఏనుగు ఒక సర్కస్‌లో పనిచేస్తుండేది. మావటివాడిని తొక్కి చంపేయడంతో ఆ ఏనుగుపై స్థానికులకు ఆగ్రహం కలిగింది. క్రేన్‌కు వేలాడదీసి.. జనాగ్రహాన్ని చూసిన సర్కస్ యజమాని అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఏనుగుకు మరణశిక్ష విధించాలనుకున్నాడు. దానిని చంపివేస్తున్నట్లు వెంటనే ప్రకటించాడు. ఇందుకోసం 100 టన్నుల బరువు ఎత్తగల ఒక ప్రత్యేకమైన క్రేన్ తెప్పించాడు. ఏనుగు మెడను తాడుతో కట్టేందుకు ఒక ప్రత్యేకమైన తాడును కూడా తెప్పించాడు. క్రేన్ సాయంతో ఏనుగు మెడకు ఉరితాడు బిగించి, దానికి బహిరంగంగా జనసమూహం మధ్యలో మరణశిక్ష విధించాడు. ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి.. -
ఇద్దరు హిజాబ్ ఆందోళనకారులను ఉరి తీసిన ఇరాన్ ప్రభుత్వం
టెహ్రాన్: కొద్ది రోజుల క్రితం ఇరాన్లో హిజాబ్ ఆందోళనలు ఉద్ధృతంగా మారిన విషయం తెలిసిందే. చాలా చోట్ల ఘర్షణలు చెలరేగి హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ క్రమంలోనే నిరసనకారుల దాడిలో ఓ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇతడి మృతికి కారణమైన ఇద్దరు ఆందోళనకారులకు ఇరాన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. శనివారం ఉదయం వీరికి ఉరిశిక్ష అమలు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురికి మరణ శిక్ష అమలు చేయాల్సి ఉంది. అలాగే మరో 11 మందికి జైలు శిక్ష విధించింది. హిజాబ్ ఆందోళనల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం నలుగురికి మరణశిక్ష అమలు చేసింది ఇరాన్ ప్రభుత్వం. మొత్తం 26 మందికి ఇదే శిక్ష విధించాలని ఇరాన్ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ ఇంకా పూర్తికావాల్సి ఉంది. చదవండి: 25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్.. -
ఉరి సమయంలో గాడ్సే గొంతు జీరబోయింది!
స్వతంత్ర భారతి 1949/2022 ఘట్టంలో.. పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ గురిపెట్టి గాంధీజీపై నాథూరామ్ గాడ్సే మూడుసార్లు కాల్పులు జరిపాక అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా గాడ్సేపై దాడి చేశారు. అయితే పోలీసులు రావడంతో వారి నుంచి గాడ్సే తప్పించుకున్నాడు. గాడ్సేను అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ హత్యలో అతడికి సహకరించిన నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. గాంధీ హత్య ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత జడ్జి ఆత్మ చరణ్ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. ఏడాది తర్వాత 1949, ఫిబ్రవరి 10న కోర్టు తన తీర్పు వెలువరించింది. హిందూ మహాసభ నాయకుడు వీర్ సావర్కర్‌కు కూడా ఈ కుట్రలో భాగం ఉందని తేల్చింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా ఆయన బయటపడ్డారు. అనంతరం నాథూరామ్ గాడ్సే, అతడి స్నేహితుడు నారాయణ ఆప్టేలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో నిందితులు పంజాబ్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. ముగ్గురు న్యాయవాదులతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. ఇక్కడ కూడా గాడ్సే, ఆప్టేలకు ఉరిశిక్ష విధించాలనే కోర్టు తీర్పునిచ్చింది. ఆ ప్రకారం 1949, నవంబరు 15న వారిద్దరిని అంబాలా జైలులో ఉరితీశారు. ‘‘శిక్ష అమలు కావడానికి ముందు బతికేందుకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా గాడ్సే కోరాడు. శాంతి గురించి ప్రచారం చేసుకుంటూ దేశ సేవలో తన శేష జీవితాన్ని గడుపుతానని పేర్కొన్నాడు. కానీ గాడ్సేకు ఆ అవకాశం లభించలేదు. ఉరిశిక్ష అమలయ్యే రోజున ఆ ఇద్దరు ఖైదీల చేతులు వెనక్కి మడిచి అధికారులు ఉరికంబం దగ్గరికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో తడబడుతూనే గాడ్సే ముందుకు నడిచాడు. విషణ్ణ వదనంతో, భయంతో ఆయన ముఖకవళికల్లో పూర్తి మార్పు కనిపించింది. ఉరికంబం ముందు నిల్చుని గాడ్సే మానసిక యుద్ధం చేశాడు. ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించాడు. ఉరి తీయడానికి కొన్ని క్షణాల ముందు అఖండ భారత్ అంటూ నినదించిన గాడ్సే గొంతు జీరబోయింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ వాదించినప్పుడు ఉన్నంత ధైర్యం అప్పుడు ఆ గొంతులో ప్రతిధ్వనించలేదు’’ అని చరిత్రకారులు కొందరు రాశారు. -
కనికరించలేదు.. నాగేంద్రన్‌కు ఉరిశిక్ష అమలు
సింగపూర్ సిటీ: పదేళ్లుగా మరణ శిక్ష నుంచి తప్పించాలంటూ చేసుకున్న అభ్యర్థనలు, పిటిషన్లు వ్యర్థం అయ్యాయి. డగ్ర్స్ కేసులో పట్టుబడ్డ భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ ధర్మలింగంను ఎట్టకేలకు సింగపూర్‌లో ఉరి తీశారు. ఇవాళ(బుధవారం) ఉదయం ఉరిశిక్షను అమలు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. పదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ధర్మలింగంను.. మానసిక వికలాంగుడనే కారణంతో విడిచిపెట్టాలంటూ విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరి కోరిక తీర్చి.. నాగేంద్రన్న్ ఉరిని అతని కుటుంబ సభ్యులు సైతం ధృవీకరించారు. ఉరికి ముందు నాగేంద్రన్ చివరి కోరికను అధికారులు తీర్చినట్లు తెలుస్తోంది. చివరిసారిగా తన కుటుంబ సభ్యులను ఒకసారి కలుసుకోవాలని ఉందని చెప్పడంతో అధికారులు ఆ ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపిన తర్వాత అతడికి మరణశిక్షను అమలు చేశారు. కేసు వివరాలు.. మలేసియాకు చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం అనే భారత సంతతి వ్యక్తి 2009లో సింగపూర్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద 42.72 గ్రాముల హెరాయిన్ దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగంపై దోషిగా తేలిన నాగేంద్రన్‌కు 2010లో సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో గతేడాది నవంబరు 10న నాగేంద్రన్‌కు మరణశిక్షను అమలు చేసేందుకు అక్కడి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే.. విమర్శలు..నిరసనలు మానసిక వికలాంగుడైన(హైపర్ యాక్టివిటీ డిజార్డర్) నాగేంద్రన్‌కు మరణశిక్ష అమలు విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సింగపూర్‌లో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. యూరోపియన్ యూనియన్ సహా బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అతడి తల్లి తరపున న్యాయవాదులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నాగేంద్రన్ పిటిషన్‌ను గత బుధవారం కొట్టేసింది. ఇది కోర్టు ప్రక్రియలను దుర్వినియోగం చేయడానికి, నాగేంద్రన్‌కు విధించిన చట్టబద్ధమైన శిక్ష అమలులో అన్యాయంగా ఆలస్యం చేయడానికి తాజా ప్రయత్నం అంటూ సింగపూర్ అటార్నీ జనరల్ చాంబర్స్ అభిప్రాయపడింది. దీంతో న్యాయమూర్తులు ఆండ్రూ ఫాంగ్, జుడిత్ ప్రకాష్, బెలిండా ఆంగ్ చివరి నిమిషంలో అతడి దరఖాస్తును తోసిపుచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ‘‘కోర్టు చివరి మాట అంటే చివరి మాటే..’’ అని అన్నారు. అలాగే బుధవారం(ఏప్రిల్ 27) ఉదయం ఉరిశిక్షను అమలు చేయాల్సిందిగా న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. మలేషియాలోని ఇపో పట్టణంలో నాగేంద్రన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అతని సోదరుడు నవీన్ కుమార్ మీడియాతో చెప్పాడు. చదవండి: హద్దు మీరితే.. ఏడాదికి 560 విపత్తులు, 2030 దాకా! -
విషాదం: రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల క్షణికావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఢిల్లీ యూనివర్సిటీకి రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులు బలవంతంగా ఊపిరి తీసుకున్నారు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేర్‌టేకర్ అజిత్ వారి ఇంటి బెల్ మోగించినపుడు వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాధిత దంపతుల కుమార్తె అంకితకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. (Covid-19: టీకా తీసుకున్నా, రెండోసారి కరోనా బారిన మహారాష్ట్ర హోంమంత్రి) పోలీసులు అందించిన సమాచారం ప్రకారం గోవింద్‌పురిలోని కల్కాజీ ఎక్స్‌టెన్షన్‌లోని తమ నివాసంలో రాకేష్ కుమార్ జైన్ (74), అతని భార్య ఉషా రాకేష్ కుమార్ జైన్ (69) స్టీల్ పైపునకు ఉరివేసుకుని కనిపించారు. అనారోగ్యం కారణంగా ఎక్కువ సమయం మంచానికే పరిమితమై ఉండడంతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసు కున్నట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీనికి సంబంధించిన సూసైడ్ నోట్‌నుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా గతేడాది యూపీలోని గోండాకు వెళ్తుండగా జైన్ దంపతులు ప్రమాదానికి గురయ్యారు. ఈ సమయంలో రాకేష్ జైన్‌కు వెన్నులో తీవ్ర గాయం కాగా, ఉషాకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. దీంతో ఇద్దరూ మంచాన పడ్డారు. అయితే చికిత్స అనంతరం కేర్ టేకర్ సాయంతో కోలుకుని ఇపుడిపుడే కొద్దిగా నడుస్తున్న తరుణంలో ఈ దంపతులు తీసుకున్న నిర్ణయం వారి కుటుంబ సభ్యులకు ఆవేదన మిగిల్చింది. -
‘హలో.. హిల్లరీ క్లింటన్‌ను ఉరి తీశారా?’
వాషింగ్టన్: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ ప్రాణాలతో లేరా? ఆమెను ఉరి తీశారా?? ఈ మేరకు రెండు రోజుల క్రితం టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక వీడియో పోస్ట్ వైరల్ కావడం కలకలం రేపింది. ఇది నిజమో.. కాదో తెలుసుకునేందుకు నిన్నామొన్నా వైట్‌హౌజ్ హెల్ప్ లైన్‌కి వందల కొద్దీ కాల్స్ వచ్చాయి. హత్యా, పిల్లల అక్రమ రవాణా ఆరోపణలపై ఆమెను అమెరికా మిలిటరీ అరెస్ట్ చేసిందని, గువాంటనమో తీరంలోని జైల్లో రహస్యంగా ఆమెకు ఉరిశిక్షను అమలు చేశారని ఆ పోస్ట్ వెనుక సారాంశం. అదే నిజమైతే.. ఆ వార్త సెన్సేషన్ కావాలి కదా!. మరి ఎందుకు కాలేదు?.. ఫ్యాక్ట్‌చెక్.. 73 ఏళ్ల హిల్లరీ నిక్షేపంగా ఉన్నారు. ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.. ఎవరూ అరెస్ట్ చేయలేదు. చివరిసారిగా మార్చి 8న ఆమె లైవ్ ఛాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్ 11న ‘ఇన్ ది హైట్స్’ సినిమా స్క్రీనింగ్‌కు ఆమె హాజరైనప్పుడు.. నటుడు లిన్ మాన్యుయెల్‌తో దిగిన ఒక ఫొటో వైరల్ అయ్యింది కూడా. ఇక జూన్ 24 ది న్యూయార్క్ టైమ్స్ నిర్వహించబోయే ఈవెంట్లో ఆమె ప్రసంగించబోతున్నారని అక్కడి లోకల్ ఛానెల్స్ కథనాల్ని టెలికాస్ట్ చేశాయి. మరి ఉత్త పుకార్లతో వేలలో వ్యూస్ దక్కించుకున్న ఆ వీడియో ఎక్కడి నుంచి పుట్టింది?. ఆ ఫేక్ గ్రూప్ వల్లే.. ఫేక్ వార్తలను, నిరాధారణమైన ఆరోపణలు చేసే క్యూఏనన్(అతివాద గ్రూప్) కుట్రపూర్వితంగా కొన్ని కథనాల్ని పుట్టించి.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తోంది. దీంతో చాలాకాలం క్రితమే ఆ గ్రూప్‌ను బ్యాన్ చేసింది అమెరికా. అయినా కూడా ఆ థియరీలు ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 2017లో అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల ప్రకారం హిల్లరీని అమెరికా మిలిటరీ అరెస్ట్ చేసిందని ఓ ఫేక్ కథనాన్ని క్రియేట్ చేసింది క్యూఏనన్. ఆ కథనాన్ని బేస్ చేసుకుని రియల్ రా న్యూస్ ఇంతకు ముందు ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది కూడా. ఇప్పుడు ఏకంగా హిల్లరీని ఉరి తీశారంటూ కథనం ప్రచురించడంతో విమర్శలు మొదలయ్యాయి. నిజనిర్ధారణలతో పని లేకుండా ఫేక్ కథనాన్ని ప్రచురించిన రియల్ రా న్యూస్‌పై చర్యలు తీసుకోవాలని.. అక్కడి ప్రెస్ అసోషియేషన్ డిమాండ్ చేస్తోంది. చదవండి: వందేళ్ల నాటి శవం నవ్వుతోందా? -
ఈరోజు గెలిచాం : నిర్భయ తండ్రి
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన నిర్భయ హత్యాచార కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిర్భయ తండ్రి బద్రినాథ్ సింగ్ దోషులకు ఉరిశిక్ష అమలైన అనంతరం విజయ చిహ్నం చూపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఈరోజు మేం విజయం సాధించాం..సమాజం, మీడియా, ఢిల్లీ పోలీసుల వల్లే ఇది సాధ్యమైంది..నేను ఎంత సంతోషంతో ఉన్నాననేది నా నవ్వు మీకు చెబుతుంద’ని వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులను శుక్రవారం తెల్లవారుజామున జిల్లా మేజిస్ర్టేట్, అధికారుల సమక్షంలో ఉరి తీశారు. ఏడేళ్ల తర్వాత న్యాయం ఏడేళ్ల తర్వాత నిర్భయకు న్యాయం జరిగిన ఈ రోజు చారిత్రక దినమని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు. ఈ రోజు ఆమె ఆత్మకు శాంతి కలిగిందని, మహిళలపై నేరాలకు పాల్పడేవారికి ఇది గట్టి సందేశమని, మీరు ఈ తరహా నేరాలకు పాల్పడితే మీకు ఉరిశిక్ష పడుతుందనే హెచ్చరికను పంపిందని ఆమె వ్యాఖ్యానించారు. ఎప్పుడో జరగాల్సింది.. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో తీవ్ర జాప్యం చోటుచేసుకుందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. దోషులను ఉరితీయడంతో మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమనే గట్టి సందేశాన్ని పంపారని అన్నారు. నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదని ప్రజలు తెలుసుకుంటారని, శిక్ష అమలును వాయిదా వేసుకోగలరేమో కానీ, శిక్ష నుంచి తప్పించుకోలేరని వెల్లడైందని అన్నారు. చదవండి : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు -
‘ఈరోజు విజయం సాధించాం’
-
'గత 15 ఏళ్లలో నలుగురికి మాత్రమే ఆ శిక్ష'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ ఖరారైంది. ఏడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మంగళవారం డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా కోర్టు హాలులో డెత్ వారెంట్‌ను చదివి వినిపించారు. ఈ నేపథ్యంలో గత 15 ఏళ్లలో దేశంలో మరణశిక్షలు అమలు చేసిన వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 400 మందికి కోర్టులు మరణశిక్షలు విధించగా అందులో కేవలం ఒక శాతం మందికి మాత్రమే శిక్షలు అమలైనట్టు జాతీయ నేర విభాగం (ఎన్సీఆర్బీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. చదవండి: నిర్భయ దోషులకు 22న ఉరి మరణశిక్ష కేసుల్లో దాదాపు 1200 మందికి అది ఆ తర్వాత జీవిత ఖైదుగా మారింది. నిర్భయ నిందితులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో ఎన్సీఆర్బీ గణాంకాలకు ప్రాధాన్యం ఏర్పడింది. కోర్టులో సుదీర్ఘకాల విచారణ, రాష్ట్రపతి అభ్యర్థనలు కారణంగానే శిక్షల అమలులో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత 15 ఏళ్లలో ఉరిశిక్ష అమలు పరిచింది నలుగురికి మాత్రమే. బాలికపై అత్యాచారం కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ధనుంజయ్, ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో కీలక పాత్రధారి పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్, పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన అఫ్జల్ గురు, 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబుదాడులకు కారకుడైన యాకూబ్ మెమన్‌లకు మాత్రమే గత 15 ఏళ్లలో ఉరిశిక్ష అమలు పరిచారు. ఈ నెల 22న నిర్భయ దోషులకు ఉరితీస్తే ఈ సంఖ్య 8కి పెరుగునుంది. -
కలాసీ ఆత్మహత్య
సాలూరు: పట్టణంలోని రైల్వేస్టేషన్ వద్ద మండలంలోని శివరాంపురం గ్రామానికి చెందిన ఎచ్చర్ల తిరుపతిరావు(45) బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున అటుగా వెళ్లేవారు రైల్వేస్టేషన్ పైకప్పు కమ్మికి కొబ్బరితాడుతో వేలాడుతున్న తిరుపతిరావు మృతదేహాన్ని చూసి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ ఎస్సై ఫకృద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి మృతుడు శివరాంపురం వాసిగా గుర్తించారు. కొంతకాలంగా పట్టణంలోని బోనువీధిలో నివాసముంటూ తోపుడుబండిని లాగుతూ జీవనం సాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున టీ తాగేందుకు వెళ్లాడనుకున్నామని, ఇలా ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదని భార్య, కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. మృతుడికి ముగ్గురు కుమారులున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘కోపర్డీ’ దోషులకు ఉరి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కోపర్డీ గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలికనురేప్ చేసి చంపేసిన కేసులో ముగ్గురు దోషులకు అహ్మద్‌నగర్ సెషన్స్ కోర్టు బుధవారం మరణశిక్ష విధించింది. ఈ దారుణానికి పాల్పడ్డ దోషులు జితేంద్ర బాబూలాల్ షిండే(25), సంతోష్ గోరఖ్ భావల్(30), నితిన్ గోపీనాథ్ భైలూమే(23)లకు మరణశిక్ష విధిస్తూ అదనపు ప్రత్యేక జడ్జి సువర్ణ కేవలే తీర్పునిచ్చారు. అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద న్యాయమూర్తి వీరిని నవంబర్ 18న దోషులుగా నిర్ధారించారు. కోర్టు తీర్పుతో తన కుమార్తెకు నిజమైన న్యాయం జరిగిందని మృతురాలి తల్లి వ్యాఖ్యానించారు. మరోవైపు ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి కోర్టు తాజా తీర్పు ఓ హెచ్చరిక అని ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తెలిపారు. మరణశిక్షతో పాటు దోషులకు కోర్టు యావజ్జీవ శిక్షను, మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించిందన్నారు. ఈ శిక్షలన్నీ ఒకేసారి అమలవుతాయన్నారు. అంతేకాకుండా దోషులకు ఒక్కొక్కరికి కోర్టు రూ.20 వేల జరిమానా విధించిందని వెల్లడించారు. మహారాష్ట్రలోని కోపర్డీ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక(15)ను 2016, జూలై 13న ఈ ముగ్గురు దుండగులు రేప్‌చేసి చంపేశారు. ఆమెను తీవ్రంగా గాయపర్చిన అనంతరం కాళ్లు, చేతులు విరగ్గొట్టి కిరాతకంగా హత్యచేశారు. ఈ ఘటనతో మహారాష్ట్రలో తీవ్ర ప్రజాగ్రహం వెలువెత్తింది. తమ వర్గానికి చెందిన అమ్మాయి చనిపోవడంతో వేలాది మంది మరాఠాలు రాష్ట్రవ్యాప్తంగా మౌన ప్రదర్శన నిర్వహించారు. మరో నిర్భయ..! 2016 జూలై 13న మహారాష్ట్రలో జరిగిన ‘కోపర్డీ’ హత్యాచారం కేసు తీవ్రమైన రాజకీయ, కులపరమైన వివాదాన్ని పురిగొల్పి, దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అహ్మద్‌నగర్ జిల్లా కర్జాట్ తాలుకా కోపర్డీ గ్రామానికి చెందిన ఈ బాలిక(15) అదే ఊరిలోని తాత ఇంటి నుంచి సైకిల్‌పై తిరిగి వస్తుండగా ప్రధాన నిందితుడు జితేంద్ర షిండే అటకాయించాడు. అంతకు ముందు నుంచే ఆ అమ్మాయిని వేధిస్తున్న షిండే.. ఆమెను బలాత్కరించబోయాడు. స్వతహాగా కబడ్డీ క్రీడాకారిణి అయిన బాలిక అతని చర్యను తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ పరిణామంతో మరింతగా రెచ్చిపోయిన షిండే బాలికను తీవ్రంగా హింసించి మానభంగానికి పాల్పడ్డాడు. అనంతరం తన మిత్రులు నితిన్ భైలూమే, సంతోష్ భావల్లను అక్కడకు పిలిపించి వారితో కలిసి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత దుండగులు బాలికను తీవ్రంగా గాయపర్చడంతో పాటు ఆమె కాళ్లు, చేతులు విరిచేశారు. అనంతరం సదరు బాలికను గొంతునులిమి కిరాతకంగా హత్యచేశారు. ♦ 2016 జూలై 15న ప్రధాన నిందితుడు జితేంద్ర షిండే, 16న సంతోష్ భావల్, 17న నితిన్ భైలూమేల అరెస్ట్ ♦అక్టోబర్ 7న 350 పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు ♦2017 మే 24న 31 మంది సాక్ష్యాల పరిశీలన అనంతరం విచారణ ముగింపు ♦నవంబర్ 18న మైనర్ బాలికపై అత్యాచారం, హత్య ఆరోపణలపై ముగ్గురిని దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు ♦నవంబర్ 29న ముగ్గురికి మరణశిక్ష విధిస్తూ అహ్మద్‌నగర్ సెషన్స్ కోర్టు తీర్పు –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘వాళ్లను నడిరోడ్డుపై ఉరి తీయాలి’
భోపాల్ : ‘వాళ్లకు భూమ్మీద జీవించే హక్కు లేదు. అటువంటి వాళ్లను నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఉరితీయాలి. అటువంటి వ్యక్తులు సమాజంలో ఉండటానికి ఎటువంటి అర్హత లేద’ని భోపాల్ గ్యాంగ్‌రేప్ బాధితురాలు డిమాండ్ చేశారు. ఘటన మూడు రోజులు తరువాత ఆమె తొలిసారి మీడియాతో మాట్లాడారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థినిపై మంగళవారం నాడు నలుగురు యువకులు మూడు గంటలపాటు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఘటనా స్థలానికి దగ్గరలోనే హబీబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఉన్న పోలీసులు బాధితురాలిని కాపాడలేకపోయారు. తనను కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కళ్లు మూసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోలీస్ అధికారి కుమార్తెను అని చెప్పకపోయి ఉంటే.. అత్యాచారం తరువాత తనను హత్యచేసేవారని ఆమె చెప్పారు. హబీబ్‌గంజ్ పోలీస్ అధికారుల ప్రవర్తన అత్యంత హేయంగా ఉందని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కేసు విషయంలో అలసత్వం ప్రదర్శించిన 5 మంది పోలీసులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి తొలగించింది. అంతేకాక ఈ ఘటనపై విచారణ నిర్వహించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
ఐసిస్ ఉగ్రవాదుల ఘాతుకం
-
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
పార్వతీపురం : స్థానిక నర్శిపురం–పార్వతీపురంల మధ్య రైల్వేలైన్‌లోని విద్యుత్ స్తంభానికి గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెచ్‌సీ నిమ్మకాయల భాస్కరరావు తెలిపారు. ఆదివారం ఉదయం దాదాపు 40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. మతుడు చామనఛాయ రంగులో ఉన్నాడని తెలిపారు. గోధుమ రంగు షర్ట్, నీలం ఆకుపచ్చ తెలుపు గడుల లుంగీ ధరించాడని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మేళ్లచెర్వు: ఉరేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేళ్లచెరువులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ .రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన కాకునూరి శ్రీనివాసరెడ్డి(50) స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా భార్యతో గొడవలు వచ్చి విడిగా ఉంటున్నారు. దీంతో శ్రీనివాసరెడ్డి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ఆమె కూడా వెళ్లి పోవడంతో అసహనానికి గురై తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
జ్యోతినగర్ : రామగుండంలోని అన్నపూర్ణకాలనీకి చెందిన దీటి శ్రీవాణి(25) బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రామగుండం మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన శ్రీవాణిని కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్‌కు చెందిన దీటి వెంకటేష్‌కిచ్చి పెళ్లి చేశారు. వీరికి కుమారుడు, కూతురు సంతానం. ఏమైందో తెలియదుగానీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరేసుకుంది. భర్త వెంకటేష్ ఇంటికొచ్చి చుట్టుపక్కలవారి సహాయంతో కిందకు దింపి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలు తండ్రి లగిశెట్టి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సాబీరొద్దిన్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
అప్పుల బెంగతో వ్యక్తి ఆత్మహత్య
తణుకు : చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తణుకులోని ఇరగవరం కాలనీకు చెందిన మహాశిభట్టు విద్యాసాగర్ (30) తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడికి చెందిన విద్యాసాగర్ తణుకు మునిసిపాలిటీలో కాంట్రాక్టు వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఇరగవరం కాలనీకు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి అయిదేళ్లు పాప ఉండగా ప్రస్తుతం భార్య తొమ్మిది నెలల గర్భిణి. ఇటీవలి కాలంలో మద్యానికి బానిసైన విద్యాసాగర్ అప్పులు చేశాడు. దీంతో కుటుంబ సభ్యులతో తగాదా పడుతున్నాడు. ఈ క్రమంలో ఇదే ప్రాంతంలో ఉన్న పుట్టింటికి భార్య వెళ్లింది. శుక్రవారం రాత్రి కనిపించిన విద్యాసాగర్ శనివారం ఉదయం నుంచి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వాకబు చేసి చివరికి ఇంటి తలుపులు తెరిచి చూసేసరికి ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పెషావర్ దాడి ముష్కరుల ఉరితీత
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పెషావర్ ఆర్మీ స్కూలు ఉగ్రదాడి ఘటనలో నలుగురు ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం ఉరితీసింది. కోహత్ జిల్లాలోని కారాగారంలో బుధవారం వీరికి ఈ శిక్ష అమలైంది. పెనువిషాదాన్ని నింపిన ఈ దారుణ మారణకాండలో అబ్దుల్ సలాం, హజ్రత్ అలీ, ముజీబ్ ఉర్ రెహమాన్, అలియాస్ నజీబ్ ఉల్లా, సబీల్లను దోషులుగా నిర్ధారించారు. ఈ నలుగురు ఉగ్రవాదులు తెహాద్వాల్ జిహాద్ గ్రూపు చెందినవారని గుర్తించింది. దీనికి సంబంధించిన పత్రాలపై సైనిక ప్రధానాధికారి జనరల్ రషీల్ షరీప్ సోమవారం సంతకం చేశారు. మరోవైపు ఈ ఘటన జరిగి సంవత్సరం కావస్తున్న సందర్భంగా, ఈ ఘటనలో అసువులు బాసిన చిన్నారులకు నివాళులర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దోషులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను దేశ అధ్యక్షుడు హుస్సేన్ ఆగస్టులో తిరస్కరించారు. వీరిపై వివిధ అభియోగాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం దోషులుగా తేల్చడంతో కోర్టు వారికి ఉరిశిక్షను ఖరారు చేసింది. గత ఏడాది డిసెంబర్ 16 న పెషావర్‌లోని ఓ ఆర్మీ స్కూలుపై దాడిచేసిన ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. పాక్ స్కూల్లో సైనికదుస్తుల్లో ప్రవేశించిన ముష్కరులు నేరుగా పిల్లలపై కాల్పులకు తెగబడ్డారు. పిల్లల్లో పెద్దవాళ్లని ఏరి మరీ కాల్చిచంపారు. ఈ ఘటనలో 150 మంది బలైన సంగతి తెలిసిందే. -
మరో ముగ్గురు ఖైదీలకు ఉరి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లాహోర్ నగరంలోని సెంట్రల్ జైలులో ముగ్గురు ఖైదీలకు ప్రభుత్వం శుక్రవారం ఉరిశిక్షను అమలు చేసింది. ఈ మేరకు స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈ ముగ్గురు హత్య కేసులో నిందితలను తెలిపింది. 1998లో చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసిన కేసులో నిందితులు సమర్ జాన్, నదీమ్ షెహజాద్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే ఇద్దరు వ్యక్తుల హత్య చేసిన కేసులో రియాజ్ యూసఫ్ నిందితడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో వారికి శుక్రవారం లాహోర్ సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు ఉరిశిక్షను అమలు చేశారు. -
చాంద్రాయణ గుట్టలో వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ : నగరంలోని చాంద్రాయణ గుట్టలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. స్తానిక మహమ్మద్ నగర్ కు చెందిన రహేమత్ అలీ(40) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబకలహాలతో అలీ తన భార్యకు విడాకులు ఇచ్చి ఒక్కడే మహమ్మద్ నగర్ లో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కాగా ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన అలీ యజమానితో మాట్లడాడు. సోమవారం ఎంతకీ గది తలుపులు తీయకపోవడాన్ని యజమాని గమనించాడు. తలుపులు పగలకొట్టి చూడగా అలీ ఉరివేసుకుని కనిపించాడు. దీంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చాంద్రాయణగుట్ట) -
మరో నలుగురిని ఉరి తీసిన పాక్
ఇస్లామాబాద్: 12 మందికి ఉరి వేసి... 24 గంటలు గడిచిందో లేదో మరో నలుగురికి పాక్ ప్రభుత్వం గురువారం ఉరిశిక్ష అమలు చేసింది. రావల్పిండి నగరంలో సోదరులు మహమ్మద్ అస్గర్, గులాం మహ్మమద్లతోపాటు గులిస్తాన్ జమన్లను ఈ రోజు అడియాల జైల్లో ఉన్నతాధికారుల సమక్షంలో ఉరి తీశారు. సోదరులు అస్గర్, గులాంలు ఇద్దరు బంధువులను హత్య చేశారు. జమాన్ 1997లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. అలాగే అబ్దుల్ సత్తార్ మెయిన్వాలి జైలులో ఉరి తీశారు. 1992లో సత్తార్ వ్యక్తిగత కక్ష్యతో హత్య చేశాడు. 2014 డిసెంబర్ 16న పెషావర్‌లో తీవ్రవాదులు ఆర్మీ స్కూల్‌పై దాడి చేసి 150 మందిని అంతమొందించారు. ఈ నేపథ్యంలో ఉరిశిక్షపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో నాటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 54 మంది నిందితులకు పాక్ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. -
ప్రియురాలు మరణించిందని...
పాపన్నపేట: ప్రేమించిన యువతి మరణాన్ని భరించలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం తుమ్మలపల్లిలో జరిగింది. కొత్తపల్లికి చెందిన భూమేశ్ (23)కు తల్లిదండ్రులు లేరు. ఎంబీఏ వరకు చదివిన అతడు అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినిని ప్రేమించాడు. అయితే ఫిబ్రవరి 27న ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకుంది. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు యువతి సెల్‌ఫోన్ కాల్ లిస్టులో ఎక్కువ కాల్స్ భూమేశ్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అతడికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం తుమ్మలపల్లిలోని అక్క హిమబిందు ఇంటికి వెళ్లిన భూమేశ్, ఇంట్లో ఉరేసుకున్నాడు. -
పర్వేజ్ ముషారఫ్ పై దాడి కేసు:నలుగురి ఉరితీత
ఇస్లామాబాద్:పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పై దాడి కేసులో నలుగురి నిందితుల్ని ఆదివారం ఉరితీశారు. ఉరిశిక్ష అమలులో భాగంగా ఫైసలాబాద్ సెంట్రల్ జైల్ శిక్ష అనుభవిస్తున్నఆ నిందితుల్ని శనివారం రాత్రి జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో ఉబర్ అహ్మద్, రషీద్ ఖురేషీ, గులామ్ సర్వార్ భట్టి మరియ రష్యా వాసి అక్విలేక్యూ అహ్మద్ ల నిందితులుగా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నిందితులను ఉరితీసే క్రమంలో కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం జిల్లా జైలు మార్గంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి వారిని ఉరితీసినట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కోట్ లాక్ పేట్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మరో ఇద్దర్ని ఉరితీసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ ఇద్దరి నిందితుల్ని మరో ఒకటి రెండు రోజుల్లో ఉరితీసే అవకాశం ఉంది. -
ఇద్దరు ఉగ్రవాదులను ఉరి తీసిన పాకిస్థాన్
ఇస్లామాబాద్: మరణశిక్ష పడిన ఇద్దరు ఉగ్రవాదులను పాకిస్థాన్ ఉరి తీసింది. శ్రీలంక బృందంపై దాడి కేసులో మరణశిక్ష పడిన అర్షద్, ఉస్మాన్ అనే ఇద్దరు ఉగ్రవాదులకు శుక్రవారం ఉరిశిక్ష అమలు చేసింది. ఉగ్రవాద సంబంధిత దాడుల కేసుల్లో మరణశిక్ష అమలుపై ఉన్న నిలుపుదలను పాకిస్థాన్ బుధవారం ఎత్తేసింది. పెషావర్ లో సైనిక స్కూల్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రధాని నవాజ్‌షరీఫ్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. పెషావర్ దాడిలో132 మంది విద్యార్థులు సహా 148 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఇద్దరు ఉగ్రవాదులకు ఉరిశిక్ష అమలుచేయడంతో లాహోర్ లో అప్రమత్తత ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.