Harvey Weinstein
-
నటిపై అత్యాచారం.. హలీవుడ్ మొఘల్కు 16 ఏళ్ల జైలు శిక్ష
హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్(70) లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలపాటు హాలీవుడ్లో నిర్మాతగా వెలిగిన హార్వేకు మరో 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. పదేళ్ల కిత్రం యూరోయపిన్ నటిపై బెవర్లీ హిల్స్ హోటల్ గదిలో అఘాయిత్యానికి పాల్పడినందుకు లాస్ ఏంజెల్స్ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. ఇప్పటికే లైంగిక వేధింపుల తరహా కేసుల్లో న్యూయార్క్‌లో 23 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న వేన్‌స్టీన్ తాజా తీర్పుతో మరో 16 ఏళ్లపాటు అంటే తన జీవితకాలం జైల్లో ఊచలు లెక్కిస్తూ గడపాల్సిందే. వీల్‌చైర్‌లో కోర్టుకు హాజరైన 70 ఏళ్ల ఆస్కార్ అవార్డు గ్రహీత.. దయచేసి తనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించవద్దని వేడుకున్నాడు. దానికి తాను అర్హుడిని కాదని.. ఈ కేసులో చాలా లోసుగులు ఉన్నాయని కోర్టుకు విన్నపించాడు. అయితే అతన్ని వాదనలు పట్టించుకొని న్యాయమూర్తి లిసా లెంచ్.. అత్యాచారానిక పాల్పడినందుకు మొత్తం 16 సంవత్సరాల పాటు మరో మూడు శిక్షలు విధించారు. కాగా 2013లో నటి, మోడల్‌పై హార్వే వేన్‌స్టీన్ అత్యాచారానికి పాల్పడినట్లు గత డిసెంబర్లోనే లాస్ ఏంజెల్స్ కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. బాధితురాలైన నటి వైన్‌స్టీన్‌ను వీలైనంత గరిష్ట శిక్ష విధించాలని కన్నీళ్లతో జడ్జి ముందు వేడుకుంది. అతని స్వార్థపూరితమైన, అసహ్యకరమైన చర్యలు కారణంగా తన జీవితం నాశనం అయ్యిందని తెలిపింది. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు అతను జీవితాంతం జైల్లోనే ఉన్నా సరిపోదని అన్నారు. ఇదిలా ఉండగా హాలీవుడ్లో అగ్రనిర్మాతగా గుర్తింపు పొందిన హార్వే వేన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది హాలీవుడ్ నటీమణులు, మహిళలు అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏంజెలీనా జోలీ, సల్మా హయక్, జెన్నిఫర్ ఐన్‌స్టన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2017లో ఆయనపై ఈ ఆరోపణలే మీటూ ఉద్యమానికి దారితీశాయి. -
నటిపై అత్యాచారం.. నిర్మాతకు 24 ఏళ్ల జైలు శిక్ష..!
ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్ తాజాగా మరో అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. 2013లో ఇటాలియన్ నటి, మోడల్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లాస్ఏంజెల్స్ కోర్టు తేల్చింది. 12 మంది సభ్యుల జ్యూరీ అత్యాచారం, లైంగిక దాడిలో అతన్ని దోషిగా తేల్చింది. ఇప్పటికే ఇతర లైంగిక కేసుల్లో నేరం చేసినట్లు రుజువు కావడంతో అతను న్యూయార్క్‌లో 23 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ తీర్పుతో అతనికి మరో 24 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మొత్తం నలుగురు బాధితుల కేసులను కోర్టు విచారణ చేపట్టింది. 2010లో ఓ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మసాజ్ థెరపిస్ట్ చేసిన ఆరోపణల కేసులో అతన్ని నిర్దోషిగా తేల్చింది. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ భార్య, డాక్యుమెంటరీ చిత్రనిర్మాత జెన్నిఫర్ సిబెల్ న్యూసోమ్‌కు సంబంధించిన అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుతోపాటు మరో మహిళ కేసులో జ్యూరీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. అయితే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు హార్వే తన న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు అతని తరఫు ప్రతినిధులు తెలిపారు. దశాబ్దాలపాటు హాలీవుడ్లో నిర్మాతగా వెలిగిన హార్వే వేన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది హాలీవుడ్ నటీమణులు, మహిళలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏంజెలీనా జోలీ, సల్మా హయక్, జెన్నిఫర్ ఐన్‌స్టన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2017లో ఆయనపై ఆరోపణలే మీటూ ఉద్యమానికి దారితీసిన సంగతి తెలిసిందే. అతను జీవితాంతం జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నా అని తీర్పు అనంతరం ఆ ఇటాలియన్ నటి ప్రకటన విడుదల చేశారు. -
బాలీవుడ్లో కామాంధుడిని బయటపెడతా: సల్మాన్ మాజీ ప్రేయసి
సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సోమీ అలి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి సంచలనంగా మారింది. బాలీవుడ్‌లోని ఓ కామాంధుడిని బయటపెడతానంటూ కీలక వ్యాఖ్యలు చేసిందీ బ్యూటీ. 'హార్వే వెన్‌స్టన్ ఆఫ్ బాలీవుడ్. నీ గురించి ఈ ప్రపంచానికి తప్పకుండా తెలుస్తుంది. ఐశ్వర్యరాయ్ ఎలాగైతే ధైర్యాన్ని ప్రదర్శించిందో అదే విధంగా నువ్వు వేధించిన మహిళలందరూ ఏదో ఒకరోజు నిజాన్ని నిర్భయంగా బయటపెడతారు' అని రాసుకొచ్చింది. దీనికి సల్మాన్ ఖాన్ 'ఆతే జాతే హస్తే గాతే' సాంగ్ స్టిల్‌ను జత చేసింది. కానీ వేధింపులకు గురి చేసిన వ్యక్తి పేరును వెల్లడించకుండానే కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడం గమనార్హం. చదవండి: సూర్యతో సినిమా, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న బేబమ్మ కాగా హాలీవుడ్ స్టార్ హార్వే వెన్‌స్టన్ సుమారు 200కు పైగా సినిమాలు నిర్మించాడు. మీటూ ఉద్యమంలో ఎంతోమంది మహిళలు హార్వే తమను లైంగికంగా వేధించాడని, అత్యాచారానికి యత్నించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం 2020 మార్చి 11న అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పిన హాలీవుడ్ స్టార్ -
కరోనా నెగటివ్: నిర్మాత క్వారంటైన్ పూర్తి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ భయానకంగా మారుతోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీయ నిర్భందంలో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. మరికొంత మంది కోవిడ్ లక్షణాలతో క్వారంటైన్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా బారిన పడిన కొందరు సినీ ప్రముఖులు ప్రాణాలు కొల్పోగా మరికొంతమంది చికిత్స అనంతరం నెగటివ్ రావడంతో క్వారంటైన్ నుంచి ఇంటికి పయనమవుతున్నారు. (కరోనా: అగ్రరాజ్యంలో ఒక్కరోజే 2108 మంది మృతి) తాజాగా హాలీవుడ్ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్ కూడా 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. న్యూయార్క్ జైల్లో ఉన్న హార్వే వెయిన్‌స్టీన్ కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ని జైలులోనే ప్రత్యేక నిర్భందంలో ఉంచారు. ‘మెడికల్ ఐసోలేషన్ (క్వారంటైన్) నుంచి హార్వీ విడుదలయ్యారు. ఇప్పడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని హార్వే అధికార ప్రతినిధి జుడా ఎంగెల్మేయర్ తెలిపారు. మీ టూ ఉద్యమంలో భాగంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు గురయ్యారు. అందులో భాగంగానే ఆయనకు మార్చి 11న అత్యాచారం, లైంగిక వేధింపులకుగాను 23 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. రైకర్స్ ద్వీపంలోని జైలులో ఆయన వారం రోజలు తర్వాత వెండేలోని జైలుకు తరలించబడ్డారు. అనంతరం అతనికి కోవిడ్-19 పాజిటివ్ నిర్దారణ కావటంతో క్వారంటైన్‌కి తరలించారు. వెయిన్‌స్టీన్ జైలు అధికారి క్రెయిగ్ రోత్ఫెల్డ్ మాట్లాడుతూ.. కొన్ని ప్రత్యేకమైన చట్టాల ప్రకారం వెయిన్‌స్టీన్ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేము. అతని గోప్యతను భంగం కలిగించలేము. ఇప్పటికీ ఆయన వెండే సిఎఫ్ లోని రీజనల్ మెడికల్ యూనిట్లో వైద్య పర్యవేక్షణలో ఉన్నారు’ అని తెలిపారు. ఇక వెయిన్‌స్టీన్‌కి ప్రత్యేకమైన సౌకర్యాలను జైలు అధికారులు కల్పించటం లేదని పలు విమర్శలు వస్తున్నాయి. -
ఇక్కడైతే బతికిపోయేవాడు
హాలీవుడ్ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్‌కి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. లైంగిక వేధింపులు, అత్యాచారం చేసిన నేరానికి జైలు పాలయ్యారు హార్వీ. పలువురు నటీమణులను ఇబ్బంది పెట్టిన కారణంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు గురయ్యారు. ఆ తర్వాతే ‘మీటూ ఉద్యమం’ ఊపందుకుంది. ఇటీవల జరిగిన కేసు విచారణలో హార్వీకు 23 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. కోర్టు నిర్ణయంపై పలువురు హాలీవుడ్ హీరోయిన్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హార్వీ వయసు 67 ఏళ్లు. ఇదిలా ఉంటే... ఇండియన్ ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం బాగా ఊపందుకోవడానికి కారణం బాలీవుడ్లో నటి తనుశ్రీ దత్తా, సౌత్‌లో సింగర్ చిన్మయి. ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేశారు చిన్మయి. ఇప్పుడు హార్వీకి శిక్ష పడిన విషయాన్ని ఉద్దేశించి ‘‘ఇండియాలో పుట్టి ఉండాల్సింది అని హార్వీ అనుకునే వాడేమో. ముఖ్యంగా తమిళ నాడులో. ఇక్కడ ఉండి ఉంటే పార్టీలు చేసుకునేవాడు. తనకి పొలిటికల్ పార్టీలు సపోర్ట్ చేసుండేవి’’ అని ఇక్కడైతే హార్వీ బతికిపోయేవాడనే అర్థం వచ్చేట్లు చిన్మయి ట్వీట్ చేశారు. -
హార్వీ భారత్‌లో పుట్టి ఉంటేనా: చిన్మయి
చెన్నై: అత్యాచార ఆరోపణల కేసులో ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ జైలుపాలు కావడంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. అనేక మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ హార్వీకి 23 ఏళ్ల శిక్ష పడిందన్న చిన్మయి.. భారత రాజకీయ పార్టీలపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ మేరకు... ‘‘ప్రస్తుతం తాను భారత్‌లో జన్మించి ఉంటే బాగుండేదని హార్వీ కోరుకుని ఉంటాడు. ముఖ్యంగా తమిళనాడులో పుట్టాలని బలంగా అనుకుని ఉంటాడు. ఇక్కడైతే తను స్టార్లు, రాజకీయ నాయకులతో సంతోషంగా పార్టీలు చేసుకునేవాడు. పద్యాలు, కవితలు రాసుకునేవాడు. నువ్వు గనుక ఇక్కడ ఉండి ఉంటే 100 శాతం రాజకీయపార్టీలు నీకే మద్దతుగా నిలిచేవి’’ అని ట్విటర్లో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.(లైంగిక వేధింపుల కేసు.. బడా నిర్మాతకు భారీ షాక్!) కాగా లైంగిక వేధింపుల కేసులో హార్వీ వెయిన్‌స్టీన్‌కు 23ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యూయార్క్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా హార్వీ మాట్లాడుతూ.. ‘‘నాకు అంతా అయోమయంగా ఉంది. నేను దేశం గురించి బాధపడుతున్నా’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో చిన్మయి పైవిధంగా ట్వీట్ చేశారు. అదే విధంగా హార్వీ వర్సెస్ వైరముత్తు అంటూ హార్వీ వెయిన్‌స్టీన్, ప్రముఖ పాటల రచయిత వైరముత్తుకు సంబంధించిన వార్తా కథనాల ఫొటోలను షేర్ చేశారు.('ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి') కాగా హార్వీ ఉదంతంతో హాలీవుడ్లో మొదలైన మీటూ ఉద్యమాన్ని భారత్‌లో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించగా... దక్షిణాదిన చిన్మయి ముందుండి నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన ఆరోపణలు చేశారు. తను ఇచ్చిన స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపపెట్టారు. అయితే సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా.. చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగి ఆమె కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక చిన్మయిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. Harvey Weinstein sentenced to 23 years in Prison. This is the time he’d wish he were born in India. Especially in Tamilnadu. He’d have been partying with stars, politicians and have odes written. You’d actually be supported by political parties 100% pic.twitter.com/TKfQKZxhtj — Chinmayi Sripaada (@Chinmayi) March 11, 2020 Harvey Weinstein vs Vairamuthu That’s how we roll, baby! pic.twitter.com/A2viTUUcEJ — Chinmayi Sripaada (@Chinmayi) March 11, 2020 -
లైంగిక వేధింపుల కేసు.. బడా నిర్మాతకు భారీ షాక్!
న్యూయార్క్ : లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌కు 23ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యూయార్క్ కోర్టు. ఈ మేరకు న్యాయమూర్తి జేమ్స్ బుర్కే తుది తీర్పును బుధవారం వెల్లడించారు. హార్వీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించాలని ఆయన తరపు న్యాయవాదుల బృందం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన బుర్కే ఈ నిర్ణయం తీసుకున్నారు. హార్వేపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై గత ఫిబ్రవరిలో 12మంది సభ్యుల జ్యూరీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల పాటు సమీక్ష జరిపిన జ్యూరీ ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చింది. ఈ కేసులో హార్వీకి దాదాపు 29 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని భావించినప్పటికి న్యాయమూర్తి 23 ఏళ్ల జైలు శిక్షను మాత్రమే ఖరారు చేశారు. ( ఐదేళ్లే శిక్ష వేయండి.. లేదంటే చచ్చిపోతాడు! ) కారు ప్రమాదంలో గాయపడి వీల్ ఛైర్లో ఉన్న హార్వీ మొదటిసారి కోర్టుకు హాజరయ్యారు. తీర్పు వెలువడిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ అంతా అయోమయంగా ఉంది. నేనీ దేశం గురించి బాధపడుతున్నా’నని అన్నారు. కాగా, హార్వీ లైంగిక వేధింపులకు పాల్పడిన దాదాపు 90 మంది నటీమణుల్లో ఏంజెలినా జోలీ, సాల్మా హయాక్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ( 'అతను నన్ను దారుణంగా రేప్ చేశాడు' ) చదవండి : 80 మందిని వేధించాడు.. జైలుకు వెళ్లాల్సిందే -
ఐదేళ్లే శిక్ష వేయండి.. లేదంటే చచ్చిపోతాడు!
న్యూయార్క్: తమ క్లైంట్కు తక్కువ శిక్ష విధించాలని కోరుతూ హాలీవుడ్ ప్రముఖ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ తరఫు న్యాయవాదుల బృందం న్యూయార్క్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేమ్స్ బుర్కేకు లేఖ రాశారు. హార్వే ఇప్పటికే సర్వం కోల్పోయారని.. వృద్ధాప్యంలో ఆయన ఇబ్బందులకు గురికాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. హార్వీ చేపట్టిన సామాజిక కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని శిక్షను సడలించే అవకాశాలు పరిశీలించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన హార్వీపై నమోదైన అభియోగాలు నిజమేనని న్యూయార్క్ ప్రత్యేక జ్యూరీ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు 29 ఏళ్ల పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో హార్వీ బుధవారం(మార్చి 10) నాటి తీర్పు తర్వాత జైలు జీవితం గడపబోతున్నారు.(80 మందిని వేధించాడు.. జైలుకు వెళ్లాల్సిందే) ఈ సందర్భంగా హర్వీ తరఫు న్యాయవాదులు పలు కీలక డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు. ఇందులో.. హార్వీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. కారు ప్రమాదంలో గాయపడిన ఆయన ఇటీవలే సర్జరీ చేయించుకున్నారని పేర్కొన్నారు. గుండె సంబంధిత వ్యాధులు ఆయనను వెంటాడుతున్నాయని.. కాబట్టి ఐదేళ్ల జైలు శిక్షతోనే సరిపెట్టాలని కోరారు. హార్వీ వెన్నెముకకు గాయం అయ్యిందని.. కళ్లు కూడా సరిగా పనిచేయడం లేదని తెలిపారు. హాలీవుడ్ మూవీ మొఘల్‌గా ఎదిగిన క్రమంలో హార్వీ సమాజ సేవ చేశారని.. తుదితీర్పు వెలువరించే క్రమంలో దీనిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో జైలు జీవితం గడపలేక ఆయన అక్కడే మరణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి 67 ఏళ్ల వృద్ధుడైన, అనారోగ్యంతో బాధపడుతున్న హార్వీపై దయచూపాలని కోరారు. కాగా ఎంతో మంది నటీమణులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదర్కొంటున్న హార్వీ 2006, 2013లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్లు రుజువైన నేపథ్యంలో ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. -
జైలుకి హార్వీ వెయిన్‌స్టీన్
తమపై లెంగిక వేధింపులు జరిపాడు అంటూ హాలీవుడ్ బడా నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై ఆరోపణలు చేశారు పలువురు హాలీవుడ్ నటీమణులు. దాంతో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకుంది. తాజాగా హార్వీ వెయిన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమే అంటూ జ్యూరీ తేల్చింది. పన్నెండు మంది (ఏడుగురు మగవాళ్లు, ఐదుగురు ఆడవాళ్లు) సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ జ్యూరీ ఐదురోజులపాటు సమీక్షించి వెయిన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలోని నిజానిజాలు తేల్చారు. ఈ కేసులో వెయిన్‌స్టీన్‌కి ఐదేళ్ల నుంచి 25 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందట. మార్చి 11న వెయిన్‌స్టీన్ జైల్‌కి వెళ్లనున్నారు. అయితే ఆయన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ‘‘వెయిన్‌స్టీన్ గురించి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్లకి, ఇన్ని రోజులు ఆ బాధను అనుభవించిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మీ ధైర్యం ప్రపంచంలో ఎందరో మహిళలకు పబ్లిక్ సర్వీస్లాంటిది. మరోసారి అందరికీ థ్యాంక్స్’’ అన్నారు నటి ఆఫ్లే జూడ్. వెయిన్‌స్టీన్ గురించి తొలిసారి బాహాటంగా ఆరోపణ చేశారామె. ఆ తర్వాత మిగతావాళ్లు బయటికొచ్చారు. -
డెమొక్రాట్లు హార్వేను ప్రేమిస్తారు: ట్రంప్
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ బడా నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్‌ను న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. న్యూయార్క్ కోర్టు ఇచ్చిన తీర్పును మహిళలు సాధించిన గొప్ప విజయంగా ట్రంప్ అభివర్ణించారు. భారత పర్యటనలో భాగంగా.. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఈ విషయంపై స్పందించారు. ‘‘ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నందున ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోలేకపోయాను. బాధితుల పరంగా చూస్తే ఇది ఎంతో గొప్ప విజయం. ఈ తీర్పు శక్తిమంతమైన సందేశాన్ని అందిస్తుంది’’అని పేర్కొన్నారు. (విందు: ట్రంప్ మెనూలోని వంటకాలివే!) ఇక గతంలో హార్వే వెయిన్‌స్టీన్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చిన ట్రంప్... హార్వే తనకు అస్సలు నచ్చడని మంగళవారం పేర్కొన్నారు. ప్రతిపక్ష డెమొక్రాట్లకు మాత్రం అతడు అత్యంత ప్రీతిపాత్రుడని విమర్శలు గుప్పించారు. అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలి మహిళగా ఖ్యాతికెక్కిన హిల్లరీ క్లింటన్ హార్వేను ప్రేమిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ అందరికీ తెలుసు కదా.. నేను హార్వే వెయిన్‌స్టీన్‌కు చాలా దూరంగా ఉంటాను. అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటమి కోసం కృషి చేస్తానని అతడు అందరికీ చెప్పాడు. కాబట్టి తనతో నాకు సత్సంబంధాలు లేవు. తను నాకు నచ్చడు. అయితే డెమొక్రాట్లకు హార్వే చాలా డబ్బు ఇచ్చాడు. అందుకే వాళ్లకు అతడంటే ఇష్టం. ముఖ్యంగా మిచెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్లు అతడిని ప్రేమిస్తారు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. (ఇండియాలో టారిఫ్‌లు ఎక్కువ: ట్రంప్) కాగా హాలీవుడ్ మూవీ మొఘల్‌గా ప్రసిద్ధి గాంచిన హార్వే వెయిన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది నటీమణులు లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెయిన్‌స్టీన్ మీద కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ కేసులో వెయిన్‌స్టీన్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని తేలడంతో.. ఆయనను వెంటనే జైలుకు తరలించాలని జడ్జి సోమవారం ఆదేశించారు. ఇక హార్వే ఉదంతం ప్రపంచవ్యాప్తంగా...‘మీటూ’ ఉద్యమానికి నాంది పలికిన విషయం తెలిసిందే. మీటూ కారణంగా పెద్దమనుషుల ముసుగులో చెలామణీ అవుతున్న ఎంతో మంది నిజస్వరూపం బట్టబయలైంది.(80 మందిని వేధించాడు.. జైలుకు వెళ్లాల్సిందే) ట్రంప్ భారత పర్యటన: సమగ్ర కథనాల కోసం క్లిక్ చేయండి -
80 మందిని వేధించాడు.. జైలుకు వెళ్లాల్సిందే
న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్ (67) లైంగిక వేధింపులకి పాల్పడినట్లు ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.2006లో మీమీ హలేయిని, 2013లో జెస్సికా మన్ని లైంగికంగా వేధించాడనే పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు సభ్యులుగా ఉన్న న్యూయార్క్ జ్యూరీ తీర్పునిచ్చింది. వెయిన్‌స్టీన్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని, వెంటనే జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. మరో రెండు కేసుల్లో మాత్రం ఆయనను నిర్దోషిగా తేల్చారు. ఈ నేరాలు కూడా నిరూపణ జరిగి ఉంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. 80 మందికి పైగా ప్రముఖ నటీమణులని ఈ హాలీవుడ్ నిర్మాత వేధించాడని ప్రధాన ఆరోపణగా తెలుస్తుంది. ది ఇంగ్లీష్ పేషెంట్, షేక్స్పియర్ ఇన్ లవ్ చిత్రాల ద్వారా వెయిన్‌స్టీన్ చాలా పాపులర్ అయ్యాడు. కాగా జ్యూరీ తీర్పు అనంతరం వెయిన్‌స్టీన్ ఎలాంటి ఉద్వేగానికి లోనుకాలేదు. తన లాయర్ డోనా రోటునోతో మాట్లాడుతూ కనిపించారు. వెయిన్‌స్టీన్‌కు విధించే శిక్షను మార్చి 11న నిర్థరిస్తారు.17 ఏళ్ల లోపు బాలికలపై జరిగే అత్యాచారాన్ని న్యూయార్క్‌లో మొదటి డిగ్రీ రేప్ అంటారు. తన పలుకుబడిని ఉపయోగించుకుని వెయిన్‌స్టీన్ ఎంతోమంది మహిళలను లోబర్చుకున్నారని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే, ఆరోపణలు చేసినవారితో జరిగిన సెక్స్ వారి అంగీకారంతోనే జరిగిందని డిఫెన్స్ లాయర్ వాదించారు. ఈ సంబంధాన్ని వారు తమ కెరీర్లో ఎదగడానికి వాడుకున్నారని తెలిపారు. వారు ఇప్పుడు పశ్చాత్తాప పడుతూ దాన్ని రేప్ అని చిత్రీకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. (అతను నన్ను దారుణంగా రేప్ చేశాడు : హాలీవుడ్ నటి) -
'అతను నన్ను దారుణంగా రేప్ చేశాడు'
న్యూయార్క్ : 25 ఏళ్ల క్రితం మూవీ డైరెక్టర్ హార్వే వెయిన్‌స్టీన్ తనను అతి దారుణంగా రేప్ చేశాడంటూ హాలీవుడ్ నటి అన్నాబెల్లా సియోరా గురువారం కోర్టు హాలులో భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టు హాలులో జడ్జి జోన్ లూజీ ఓర్బన్ ఎదుట తన వాదనను చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. నటి అన్నాబెల్లాను దారుణంగా రేప్ చేశాడన్న ఆరోపణలతో అప్పట్లోనే వెయిన్‌స్టీన్‌పై కేసు నమోదైంది. కానీ ఇంతవరకు ఈ కేసులో సరైన నిజాలు లేకపోవడంతో 25 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి వాదనకు వచ్చిన కేసులో అన్నా తన వాదనలు వినిపించారు. '1994లో సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో డైరెక్టర్ హార్వే తన కారులో దింపుతానని నన్ను ఎక్కించుకున్నాడు. న్యూయార్క్‌లోని మహట్టన్ అపార్ట్మెంట్ దగ్గర దింపేసి వెళ్లిపోయాడు. తర్వాత నేను పడుకోవడానికి సిద్దమవుతుండగా డోర్ తలుపును ఎవరో కొట్టినట్లు అనిపించింది. డోర్ తెలిచి చూడగానే డైరెక్టర్ హార్వే ఎదురుగా నిలబడి ఉన్నాడు. అతని ప్రవర్తన నాకు ఏదో అనుమానంగా కనిపించింది. ఆ సమయంలో నా శరీరం మొత్తం వణుకు పుట్టింది. అయినా దైర్యం తెచ్చుకొని ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేలోపే హార్వే నన్ను బలవంతం చేయబోయారు. నేను వద్దని వారించినా వినకుండా బెడ్రూంలోకి ఈడ్చుకెళ్లాడు. అతన్ని వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో నా చేతులను మంచానికి కట్టేసి దారుణంగా రేప్ చేశారు. నిజంగా ఆ రాత్రి నాకు కాళరాత్రిగా మిగిలిపోయింది. వెయిన్‌స్టీన చేసిన పని నా జీవితంలో ఒక చేదు ఘటనగా మిగిలిపోయింది. ఇన్ని సంవత్సరాలైనా ఆ రాత్రి జరిగిన ఘటన ఇప్పటికి గుర్తుందంటూ' 59 ఏళ్ల అన్నాబెల్లా సియోరా చెప్పుకొచ్చారు. అయితే అన్నా తన వాదనలు వినిపిస్తున్న సమయంలో హార్వే వెయిన్‌స్టీన్ కోర్టు హాలులోనే ఉండడం గమనార్హం. ఆ సమయంలో హార్వే మొహం ఎలాంటి ఆందోళన కనిపించలేదు. దీంతో పాటు వెయిన్‌స్టీన్ 80 మందిని లైంగికంగా వేదించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.అందులో హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ పేరు కూడా ఉండడం విశేషం. కాగా అన్నా వాదనల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది తేల్చడానికి శుక్రవారం సైకియాట్రిస్ట్ డాక్టర్‌ను రప్పించాలని కోర్టు ఆదేశించింది. -
రెడ్ పెయింట్
నియంత పాలన లో చెయ్యెత్తడమైనా అది చిన్న తిరుగుబాటు కాదు. పంగ చాపి కూర్చున్న మగవాడిని ‘సిట్ రైట్’ అని వేలెత్తి చూపడమైనా అది చిన్న హెచ్చరిక కాదు. కొమ్ములు తిరిగిన దేశమైనా, కండలు తిరిగిన మగవాడైనా మర్యాద నేర్చుకుని తీరవలసిందే. అయితే మర్యాదల్ని నేర్పించే తీరికలో లేరిప్పుడు మహిళలు. ‘టైమ్ ఈజ్ అప్’! నేర్పించే టైమ్ అయిపోయింది. ‘మర్యాదగా ఉండు’ అని చెప్పడమే ఇప్పుడు వాళ్ల చేతుల్లో.. చూపుల్లో.. మాటల్లో.. కనిపిస్తున్నది. మగవాళ్లు స్త్రీ దగ్గర మర్యాదగా ఎందుకు ఉండ రు?! ‘చేతుల దగ్గర బలమైన రెండు కండరములతో, ఛాతీ భాగమున ఫలకముల వంటి మరి రెండు కండరములతో నిన్ను నేను సృష్టించి ఉన్నాను కనుక నువ్వు పురుషుడివి. ఆలాగున నువ్వు పురుషుడివి అయి ఉన్నావు కనుక స్త్రీని వేధించుటకును, ఆమెను పొద్దుపోక పరిహసించుటకును నాచే నువ్వు సమ్మతిని పొంది ఉన్నా వు’ అని జేబులో చిన్న స్లిప్ పెట్టి భూమి మీదకు ‘వైల్డ్ కార్డ్’ ఎంట్రీ ఇప్పిస్తాడా దేవుడు! బాగా చదువుకుని, సంస్కారం నేర్చుకుని, మర్యాదస్తుల పీఠం మీద కూర్చొని ఉన్న పురుషుడు కూడా.. ఎవరూ లేకుండా చూసి జేబులో స్లిప్ కోసం వెతుక్కుంటాడెందుకని! ‘స్త్రీ పై పురుషుడికి ఉండే సహజమైన సృష్టి ఆకర్షణే తప్ప, ఆమెపై నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఏమీ లేదు’ అని సాక్ష్యంగా చూపించుకోడానికా ఆ స్లిప్పు?!దేవుడిచ్చిన కండలు ఉన్నాయి కదా అని స్త్రీ మీద పురుషుడు చెయ్యి వేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడేమో, స్త్రీ ఊరుకోదు. తనను పుట్టించిన బ్రహ్మనే చెయ్యి వెయ్యనివ్వలేదు ఆవిడ. బ్రహ్మకు తన మానస పుత్రికపై ‘ఫీలింగ్స్’ కలిగినప్పుడు మునీశ్వరులు పరుగున వచ్చి ఆయనపై కమండలంలోని నీళ్లు చల్లడంతో బ్రహ్మ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే పెను ముప్పు తప్పిపోయింది. ముప్పు తప్పిపోయింది ఆయన మానస పుత్రికకు కదా! కానీ ‘నైమిశారణ్యం’లో అలా లేదు. బ్రహ్మకే ముప్పు తప్పింది అని ఉంది. అంటే.. చెయ్యి వెయ్యడం పరువు తక్కువ పని కానీ, చెయ్యి పడడం పరువు తక్కువ కాదని అంతరార్థం. స్త్రీ మీద చెయ్యిపడగానే ‘అయ్యో.. ఆమె శీల ప్రతిష్టకు భంగం కలిగింది..’ అని మనం ఫ్రీక్వెంట్‌గా ఆక్రోశిస్తుంటాం. స్త్రీ మీద చెయ్యి వేసి శీల ప్రతిష్టకు భంగం కలిగించుకున్న వ్యక్తిని కదా చూసి ‘అయ్యో’ అనో, ‘ఏమయ్యో’ అనో అనాలి. కానీ ఆ నైమిశారణ్యపు నీతిసూత్రాలకు ఇప్పటి మగవాళ్లు ఎందుకు అప్డేట్ అవుతారు? పోనీ, స్త్రీ కన్నీళ్లు పెట్టుకుని.. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో.. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో..’ అంటేనన్నా వింటున్నారా? లేదు. చివరికేమైంది? ‘మీటూ’ని తెచ్చుకున్నారు నెత్తి మీదకు. మళ్లీ ఏడుపు. ‘ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడెందుకు మేడమ్‌జీ?’ అని! అక్కడి తో ఆగుతారా? ‘వాట్ హ్యాపెండ్ టు యువర్ మీటూ మూవ్మెంట్’ అని మళ్లొక వెక్కిరింపు. తప్పు చేసిన మగవాళ్లకు మాట్లాడే ధైర్యం ఎలా వస్తుంది?! ఎలా వస్తుందో చూడండి. హాలీవుడ్ దిగ్గజం హార్వీ వైన్‌స్టీన్ మీద అమెరికన్ నటి ఆష్లీ జూడ్ వేసిన లైంగిక వేధింపుల కేసును ఫెడరల్ కోర్టు కొట్టివేయడంతో యు.ఎస్. మగాళ్లకు ధైర్యం వచ్చింది. బాలీవుడ్లో నానాపటేకర్ మీద నటి తనుశ్రీ దత్తా వేసిన కేసులో ఆమెకు ‘ఎ–లిస్టర్స్’ నుంచి సపోర్ట్ లభించకపోవడంతో మనదేశంలోని మగాళ్లకు ధైర్యం వచ్చింది. యు.ఎస్.లో ఆష్లీ జూడ్, ఇండియాలో తనుశ్రీ దత్తా తొలి (మీటూ) తిరుగుబాటు సిపాయిలు. ‘టైమ్ ఈజ్ అప్’ ఇంకో మీటూ టైప్ ఉద్యమం. హాలీవుడ్ నటీమణులంతా కలసి నిర్మించుకున్నది. ‘టైమ్ ఈజ్ అప్’ సీఈవో లీసా బార్డర్స్. ఆమె సుపుత్రుడు చేసిన నిర్వాకానికి ఇటీవలే ఆమె సీఈవో గా రాజీనామా చేశారు. కొడుకుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపలే ఆమె ఆ పని చేశారు. ఇదిగో ఇలాంటి ‘ఓటములే’ మగవాళ్ల ధైర్యానికి భగ్గున ఉత్సాహాన్ని పోస్తుంటాయి. అయితే కొడుకు తప్పు చేశాడని, భర్త తప్పు చేశాడని ఒక స్త్రీ నైతిక బాధ్యతను స్వీకరించారంటే అర్థం.. తను చేస్తున్న పోరాటంలో ఆమె ఓడిపోయారని కాదు. పోరాటాన్ని గెలిపించుకున్నారని. అది అర్థమౌతుందా మన మగధీరులకు? అర్థమై ఉంటే మీటూ ఉద్యమం గత నెలలో తిరిగిన ఒక ‘మలుపు’ను కచ్చితంగా గమనించి ఉండేవాళ్లు. ఫ్లారిడాలోని ‘కిస్సింగ్ స్టాచ్యూ’లో.. ఒక నేవీ సైనికుడి మొరటు చుంబనం ధాటికి వెనక్కి ఒరిగిన నర్సు కాలిపై ఫిబ్రవరి పద్దెనిమిది రాత్రి ‘మీటూ’ అని ఎర్రటి పెయింట్‌తో రాసి నిరసన తెలిపారెవరో! ఆ రాసిన వాళ్ల కోసం ప్రస్తుతం యు.ఎస్.పోలీసులు వెతుకుతున్నారు. వెదకడం ఎందుకంటే శిక్షించడం కోసం! శిక్షించడం ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగుబాటుకు చిహ్నంగా యు.ఎస్. ప్రతిష్ఠించుకున్న స్టాచ్యూ అది. ‘అన్‌కండిషనల్ సరెండర్’ అని ఆ స్టాచ్యూకి అమెరికా పేరు కూడా పెట్టుకుంది. జపాన్ లొంగిపోయిందన్న వార్త తెలిసి, ఒళ్లు తెలియని ఆ సంతోషంలో న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ఒక నేవీ సోల్జర్.. రోడ్డు మీద వెళ్తున్న ఒక నర్సు మీద పడి, ఆమె విడిపించుకోడానికి కూడా వీల్లేకుండా తన కండబలంతో ఆమెను ఆక్రమించుకుని, ముద్దు పెట్టుకున్నప్పుడు ఎవరో తీసిన ఫొటోకి విగ్రహ రూపమే ‘అన్‌కండిషనల్ సరెండర్’ స్టాచ్యూ. ఆ ఫొటో నకళ్లు విగ్రహాలు విగ్రహాలుగా అమెరికా అంతటా ఇప్పటికీ ఉన్నాయి. ఉండటమేంటి.. ఉంచుకున్నారు గొప్ప హిస్టారిక్ ప్రతిష్టలా!‘మీటూ’ తిరుగుబాటును యు.ఎస్. కనుక రెస్పెక్ట్ చేసి ఉంటే ఇప్పటికే ఆరో ఏడో ఉన్న ఈ స్టాచ్యూలన్నిటినీ కూలగొట్టి ఉండాలి. అలాంటిదేమీ జరగలేదు! స్త్రీ దేహంపై దురాక్రమణలా స్పష్టంగా కనిపిస్తున్న ఆ కిస్సింగ్ స్టాచ్యూలు దేశప్రతిష్టకు చిహ్నాలను అనుకోవడంలో ఉన్నది ఆ దేశ భావ దౌర్భాగ్యమే కానీ, మరొకటి కాదు. ఆ సంగతి చెప్పడానికే అజ్ఞాత మహిళలెవరో నర్స్ కాళ్లకు ‘మీటూ’ను పెయింట్ చేసి వెళ్లారు. ఏడాదిన్నరగా జరుగుతున్న మీటూ ఉద్యమంలో.. పురుషుడి దురహంకారంపై, దురాక్రమణపై తొలి శక్తిమంతమైన ప్రతిఘటన ఆ రెడ్ పెయింట్. ‘రాసేసి పారిపోతే సరిపోతుందా, అదేం సాధికారత’ అంటున్నారు! మరి.. కండబలంతో మీద పడిపోయి, ‘అన్‌కండిషనల్ సరెండర్’ అంటే సరిపోతుందా? అదేం సావరినిటీ!! అమెరికన్ రివల్యూషన్, ఫ్రెంచి రివల్యూషన్, రష్యన్ రివల్యూషన్.. చరిత్రలో ఏ దేశానిదా రివల్యూషన్. దేశాలు, సామ్రాజ్యాలు పుట్టి బుద్ధెరిగాక ఇన్ని శకాలకు ఇప్పుడు ప్రపంచమంతటా ఏకకాలంలో నడుస్తున్న రివల్యూషన్లు మీటూ, టైమ్ ఈజ్ అప్. అంటే చూడండి.. ఆడవాళ్లు ఎన్ని యుగాలుగా ఓపికపట్టి ఉన్నారో! ఎన్ని యుగాలుగా మగవాడిని తప్పించుకుంటూ వస్తూ.. వస్తూ.. ఒక్కసారిగా ఎదురు తిరిగి నిలబడ్డారో! మగవాడికి మర్యాద నేర్పే టైమ్ అయిపోయింది. ‘మర్యాదగా ఉండు’ అని చెప్పే టైమ్ ఇది. ‘రెడ్ పెయింట్’ టైమ్. మాధవ్ శింగరాజు -
కేసు కొట్టేశారు కానీ...
హాలీవుడ్ బడా నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు నటి యాష్లీ జడ్. ‘‘అవకాశం కావాలంటే అడిగినవాటికి అంగీకరించాలని పెట్టిన కండీషన్‌కి ఒప్పుకోలేదని తన స్టేటస్‌ని ఉపయోగించి జూడ్ ఇమేజ్‌ని చెడగొట్టి, హార్వీ అవకాశాలు తగ్గేలా చేశాడు’ అన్నది ఆ ఆరోపణల సారాంశం. ఈ ఆరోపణ తర్వాత దాదాపు 80 మంది నటీమణులు వెయిన్‌స్టీన్ మీద లైంగిక ఆరోపణలు చేశారు. వెయిన్‌స్టీన్ పై కేసులు కూడా నమోదు అయ్యాయి. ‘అడ్జస్ట్ మెంట్స్’ అన్నీ పరస్పర అంగీకారంతోనే జరిగాయని, ఎవ్వర్నీ కావాలని ఇబ్బందికి గురి చేయలేదని వెయిన్‌స్టీన్ వాదించారు. ఈ ఆరోపణలే ‘మీటూ’ ఉద్యమానికి కారణమయ్యాయి. 2017 చివరి నుంచి నడుస్తున్న ఓ కేసు తీర్పు ఇటీవల వెలువడింది. సరైన ఆధారాలను పొందుపరచని కారణంగా వెయిన్‌స్టీన్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది కాలిఫోర్నియా న్యాయస్థానం. లైంగిక వేధింపుల కేసు కొట్టిపారేసినా పరువు నష్టం దావా విషయంలో లీగల్‌గా ముందు వెళ్లొచ్చని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇంకా పలు కేసుల నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వెయిన్‌స్టీన్. -
ఆ నీచుడు నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు..
న్యూయార్క్ : సినీ అవకాశాల కోసం తనను ఆశ్రయించే మహిళలు, నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని హాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ హార్వీ వెయిన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలు పెనుదుమారం రేపగా, తాజాగా మరో మహిళ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ముందుకొచ్చారు. తాను పదహారేళ్ల వయసులో ఉండగా వెయిన్‌స్టీన్ తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించాడని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో మాజీ మోడల్ జేన్ డో ఆరోపించారు. 2002లో తాను ఓ బిజినెస్ లంచ్ సందర్భంగా వెయిన్‌స్టీన్‌ను కలిశానని అనంతరం సోహోలోని తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లిన ఫిల్మ్‌మేకర్ తనకు శారీరకంగా దగ్గరవ్వాలని బలవంతపెట్టాడన్నారు. నటిగా ఎదగాలని కోరకుంటే తన కోరికలు తీర్చాల్సిందేనని వెయిన్‌స్టీన్ తనను బెదిరించినట్టు కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తనకు సహకరించిన ఎంతోమంది నటీమణులకు మంచి కెరీర్‌ను ఇచ్చానని ప్రలోభపెట్టాడని వెల్లడించారు. ఆపై జేన్ డోను తన దగ్గరికి తీసుకుని అమర్యాదకరంగా వ్యవహరించాడని కోర్టుకు సమర్పించిన దావాలో పేర్కొన్నారు. ఇక 2008లో మరోసారి జేన్ డోను కలిసిన వెయిన్‌స్టీన్ ఆమెకు సాయపడతానని తన కార్యాలయానికి రావాలని కోరాడు. తన కార్యాలయానికి వచ్చిన జేన్ డో పట్ల మరోసారి లైంగిక దాడికి యత్నించడంతో భయంతో అక్కడి నుంచి పరుగు తీసినట్టు మాజీ మోడల్ పేర్కొన్నారు. ఏంజెలినా జోలీ, పాల్ట్రో, మెక్గొవన్ సహా 80 మందికి పైగా మహిళలు వెయిన్‌స్టీన్ లైంగిక ఆగడాలపై మీటూ పేరుతో గళమెత్తిన సంగతి తెలిసిందే. మహిళలను బెదిరించి లోబరుచుకోవడం, సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ నటీమణులపై లైంగిక దాడికి పాల్పడటం ఆయనకు పరిపాటి అంటూ పలువురు బాధితులు పెద్దసంఖ్యలో వెయిన్‌స్టీన్‌పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనకు లైంగికంగా సహకరించకుంటే వారి కెరీర్లను నాశనం చేస్తానంటూ వెయిన్‌స్టీన్ బెదిరించేవారని కూడా బాధితులు వెల్లడించారు. -
వీన్స్టన్కు 25 ఏళ్ల శిక్ష..!
న్యూయార్క్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్ అరెస్టైన విషయం తెలిసిందే. ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు, మరో మహిళపై లైంగిక దాడికి యత్నించినట్లు కేసులు నమోదైన నేపథ్యంలో.. బుధవారం మన్హటన్ క్రిమినల్ కోర్టుకు వీన్‌స్టీన్ హాజరయ్యారు. ఆయన తరపు న్యాయవాది బ్రెఫ్మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం తన క్లైంట్ వద్ద లేదని.. తమకు సాక్ష్యాధారాలు సేకరించుకునేందుకు సమయం సరిపోనందున తమకు గడువు ఇవ్వాలని కోరామన్నారు. తన క్లైంట్‌పై నిరాధార ఆరోపణలు చేశారని, అందుకు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పిస్తామని బ్రెఫ్మాన్ తెలిపారు. త్వరలోనే వీన్‌స్టీన్ ఈ నేరారోపణల నుంచి బయటికి వస్తారని.. నిరాధారమైన ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలవవని ఆయన వ్యాఖ్యానించారు. వీన్‌స్టీన్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆరోపించిన తర్వాత కూడా ఆ మహిళ ఆయనతో 10 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారని, ఇప్పుడు కూడా ఆ బంధం కొనసాగుతోందంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే ‘తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయి.. తనపై మోపబడిన అభియోగాలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని’ మన్హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ సైరస్ వాన్స్ వ్యాఖ్యానించారు. కాగా, వీన్‌స్టీన్ దోషిగా తేలితే 25 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఆ నిర్మాత రాత్రిళ్లు మృగాడిగా మారేవాడు!
న్యూయార్క్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన హాలీవుడ్ మూవీ మొఘల్, నిర్మాత హార్వీ వీన్‌స్టీన్‌ను కఠినంగా శిక్షించాలన్నారు నటి రోస్ మెక్‌గోవాన్. తాను ఇచ్చిన ఫిర్యాదుతో నిర్మాతపై పోలీసులు స్పందించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. వీన్‌స్టీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో నటి రోస్ టీవీ కార్యక్రమంలో స్పందించారు. అతడు మహిళలపై అత్యాచారాలకు పాల్పడేందుకు పగటి సమయాన్ని ఎంచుకునేవాడు కాదని, రాత్రిళ్లు అందుకు తగినదిగా వీన్‌స్టీన్ భావించేవాడని ఆరోపించారు. ‘చేతులకు బేడీలు, ఓ మహిళా డిటెక్టీవ్‌ను చూశాక హర్వీ వీన్‌స్టీన్ అరెస్ట్ అయ్యాడని నిర్దారించుకున్నాను. అరెస్ట్ ఒక్కటే నిందితుడికి తగిన శిక్షగా భావిస్తున్నారా అన్న ప్రశ్నకు.. ఇప్పుడే అతడి పతనం ఆరంభమైంది. ఇది శుభసూచకంగా భావిస్తున్నాను. అతడి నుంచి వేధింపులు ఎదుర్కొన్న మహిళా ఆర్టిస్టులకు ఇది సంతోషదాయకం. బెయిల్‌పై అప్పుడే బయటకు వచ్చేసిన వీన్‌స్టీన్‌కు త్వరలోనే కఠినశిక్ష పడాలని తాను కోరుకుంటున్నట్లు’ నటి రోస్ మెక్‌గోవాన్ తెలిపారు. పలు లైంగిక వేధింపుల కేసుల్లో నిందితుడుగా ఉన్న నిర్మాణ హార్వీ వీన్‌స్టీన్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీన్‌స్టీన్ తమను రేప్ చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏంజెలినా జోలీ, సల్మా హయక్ సహా 80 మందికిపైగా హాలీవుడ్ నటీమణులు ఆరోపించిన విషయం తెలిసిందే. ‘సరిగ్గా 21 ఏళ్ల క్రితం. అప్పుడు నా వయసు 21 ఏళ్లు. ఇదే కేన్స్ వేడుకల్లో పాల్గొన్న నాపై వెయిన్‌స్టీన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ’ వీన్‌స్టీన్‌పై ఇటలీ నటి ఏసియా అర్గెంటో ఇటీవల ఆరోపణలు చేశారు. -
హాలీవుడ్ నిర్మాత వీన్‌స్టీన్ అరెస్ట్
న్యూయార్క్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్‌ను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళను రేప్ చేయడంతో పాటు మరో మహిళపై లైంగికదాడికి యత్నించినట్లు కేసులు నమోదయ్యాయి. వీన్‌స్టీన్ తమను రేప్ చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏంజెలినా జోలీ, సల్మా హయక్సహా 80 మందికిపైగా హాలీవుడ్ నటీమణులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం లోయర్ మాన్‌హట్టన్‌లోని పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న వీన్‌స్టీన్.. అధికారులకు సరెండర్ అయ్యాడు. తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచగా రూ.6.7కోట్ల పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది. -
పోలీసులకు లొంగిపోయిన సినీ దిగ్గజం
న్యూయార్క్ : ఎందరో నటీమణులను లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ నిర్మాత, సినీ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్ న్యూయార్క్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం అధికారుల ఎదుట లొంగిపోయారు. ఉదయాన్నే స్టేసన్‌కు వచ్చిన వెయిన్‌స్టీన్ తెల్ల షర్ట్, డార్క్ డెనిమ్ జీన్స్ ధరించి, చేతిలో పుస్తకాలు పట్టుకుని ఉన్నారని అధికారులు చెప్పారు. పాత్రికేయులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని వెయిన్‌స్టీన్ స్పందన కోసం వేచిచూశారు. పోలీసు అధికారులు ఆయనకు ఎస్కార్ట్‌గా నిలిచారు. వెయిన్‌స్టీన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం. కాగా, హాలీవుడ్ సెలబ్రిటీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని వెయిన్‌స్టీన్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దశాబ్ధాలుగా వెయిన్‌స్టీన్ మహిళలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడ్డాడని 70 మందికి పైగా మహిళలు ఇప్పటికే బాహాటంగా వెల్లడించారు. న్యూయార్క్ టైమ్స్ లో తొలుత వెయిన్‌స్టీన్ నిర్వాకం వెలుగుచూసిన తర్వాత మీ టూ క్యాంపెయిన్ పేరిట వందలాదిగా మహిళలు సినీ, వాణిజ్య, అధికార, వినోద రంగాల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. -
21 ఏళ్ల క్రితం ఇక్కడే నన్ను చెరబట్టాడు
పారిస్: హాలీవుడ్ మూవీ మొఘల్ హార్వీ వెయిన్‌స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారం యావత్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కామాంధుడి వ్యవహారం వెలుగులోకి రావటానికి ప్రధాన కారణమైన వ్యక్తుల్లో ఒకరు ఇటాలియన్ నటి ఏసియా అర్గెంటో. 1997లో కేన్స్ చలనచిత్రోత్సవానికి హాజరైన తనపై వెయిన్‌స్టీన్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె అప్పట్లో ఆరోపించారు. తద్వారానే మరికొందరు సెలబ్రిటీలు ముందుకు రావటంతో ఆయన లీలలు బయటపడ్డాయి. అయితే తనపై జరిగిన దారుణంపై అర్గెంటో ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా స్పందించారు. భయానక అనుభవం... ‘సరిగ్గా 21 ఏళ్ల క్రితం. అప్పుడు నా వయసు 21 ఏళ్లు. ఇదే కేన్స్ వేడుకల్లో పాల్గొన్న నాపై వెయిన్‌స్టీన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహిళలను జీవితాలను నాశనం అతనికి కేన్స్ ఓ వేదికగా ఉండేది. అప్పట్లో నేను నటించిన ఓ చిత్రానికి వెయిన్‌స్టీన్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. అందుకే చిత్ర యూనిట్ మొత్తానికి ఓ పెద్ద హోటల్లో పార్టీ ఇస్తానంటూ ఆహ్వానించాడు. తీరా నేను అక్కడికి వెళ్లే సరికి పార్టీ వాతావరణం లేదు. హోటల్ గదిలో వెయిన్‌స్టీన్ ఒక్కడే ఉన్నాడు. తిరిగి నేను బయలుదేరుతున్న సమయంలో మసాజ్ చేయాలంటూ నన్ను బతిమిలాడాడు. నన్ను దగ్గరికి లాక్కుని మృగంలా ప్రవర్తించాడు. భయంతో వణికిపోయా. నన్ను చిత్రవధలకు గురిచేస్తూ అత్యాచారం చేశాడు’ అంటూ జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్లు ఆమె వివరించారు. ‘నాలాగే చాలా మంది బాధితులు ఉంటారని అప్పుడే భావించా. అందుకే ఆయన విషయాలను వెలుగులోకి తెచ్చా. కానీ, ఇప్పుడు ఒక్కటే చెప్పదల్చుకుంటున్నా. ఆ రాక్షసుడు ఇకపై ఇక్కడ కనిపించడు. అది నాకు సంతోషాన్ని ఇస్తోంది. అవకాశాల కోసం జీవితాలను నాశనం చేసుకోకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి’ అని ఆమె ప్రసంగించారు. అర్గెంటో భావోద్వేగ ప్రసంగంపై పలువురు సెలబ్రిటీలు అభినందనలు వ్యక్తం చేశారు. చాలా ధైర్యంగా మాట్లాడారంటూ ఆమెపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే అదే సమయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్లు లేకపోలేదు. అంతర్జాతీయ వేదికపై ఆ విషయాన్ని అంత వివరంగా ప్రస్తావించాల్సిన అవసరం ఏంటని? కొందరు ప్రశించగా, త్వరలో తాజాగా ఆమె ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేశారని.. దాని ప్రమోషన్ కోసం ఆమె ఇలా ప్రసంగం ఉంటారని మరికొందరు విమర్శిస్తున్నారు. నిర్మాత కమ్ దర్శకుడు అయిన వెయిన్‌స్టీన్ గురించి సుమారు 50 మంది నటీమణులు ఆరోపణలు గుప్పించగా, ఆ దెబ్బకు సొంత నిర్మాణ సంస్థ ‘ది వెయిన్‌స్టెయిన్’తోపాటు కీలక పదవులకు ఆయన దూరం కావాల్సి వచ్చింది. -
లైంగిక స్కామ్‌కు నోబెల్ అవార్డుకు లింకేమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : ఈసారి అత్యంత ప్రపంచ ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డును సాహిత్యానికి ప్రకటించలేదు. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఈసారికి ఈ అవార్డును వాయిదా వేస్తున్నామని, వచ్చే ఏడాది 2018కి, 2019 సంవత్సరానికి నోబెల్ అవార్డులు ప్రకటిస్తామని స్వీడిష్ అకాడమి శుక్రవారం ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ అవార్డును వాయిదా వేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అంటే వాయిదా వేయడం ఇదే మొదటి సారి. ఇంతకు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎవరి మీద వచ్చాయి? ఎందుకొచ్చాయి? అవార్డు ఇవ్వకపోవడానికి లైంగిక వేధింపుల ఆరోపణలకు ఉన్న ప్రత్యక్ష సంబంధం ఏమిటీ? ఈప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే కాస్త లోతుగా అధ్యయనం చేయాల్సిందే. అలా చేస్తే ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ విన్‌స్టైన్ సెక్స్ స్కామ్‌కు, తద్వారా పుట్టిన ‘మీ టూ’ ఉద్యమానికి ప్రత్యక్ష సంబంధం, తెలుగు సినీ రంగంపై శ్రీరెడ్డి సాగిస్తున్న ప్రస్తుత పోరాటానికి పరోక్ష సంబంధం కనిపిస్తుంది. స్వీడిష్ భాష అభివృద్ధికి కృషి చేయడంతోపాటు వచనం, కవిత్వం సహా పలు భాషా ప్రక్రియలను ప్రోత్సహించడం కోసం 1786లో ఈ స్వీడిష్ అకాడమీ ఏర్పాటయింది. అప్పటి నుంచి ఈ అకాడమీ ఏటా స్వీడిష్ సాహిత్యంలో ఉత్తమ రచయిత లేదా కవికి అవార్డు ఇస్తూ వస్తోంది. ప్రధానంగా ఈ అకాడమిలో 18 మంది సభ్యులు ఉంటారు. వారిలో శాశ్వత సెక్రటరీ ఒకరు ఉంటారు. సాహిత్యంలో నిపుణులైన వారిని మాత్రమే సాధారణంగా సభ్యులుగా తీసుకుంటారు. వీరిలో ఒకరు స్వీడిష్ అకాడమీకి శాశ్వత కార్యదర్శిగా ఉంటారు. దాదాపు 230 సంవత్సరాల అకాడమీ చరిత్రలో తొలిసారిగా శాశ్వత కార్యదర్శి సారా డేనియస్ (మహిళ) ఏప్రిల్ 12వ తేదీన తన పదవికి రాజీనామా చేయడంలో అకాడమీలో సంక్షోభం మొదలైంది. అకాడమీ నియమ నిబంధనల ప్రకారం సభ్యులు మరణిస్తే లేదా తీవ్ర అనారోగ్యానికి గురైయితేనే వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకుంటారు. సభ్యులు అవినీతికి పాల్పడినప్పుడు వారిపై అభిశంసన తీర్మానం పెట్టి మెజారిటీ నిర్ణయంతో వారిని తొలగించవచ్చు. కానీ సభ్యులు తమంతట తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయడానికి వీల్లేదు. కాకపోతే అకాడమీ కార్యకలాపాలకు స్వచ్ఛందంగా దూరంగా ఉండొచ్చు. కొత్త సభ్యులను ఎన్నుకోవాలంటే కనీసం 12 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనాలి. 1895 ప్రముఖ సైంటిస్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ రాసిన వీలునామా వల్ల ఈ స్వీడిష్ అకాడమీ జాతకమే మారిపోయింది. కావాల్సినంత ధనం వచ్చి పడింది. నోబెల్ పేరిట సాహిత్యంలో మొట్టమొదటి అవార్డును 1901లో ఫ్రెంచ్ కవికి ఇచ్చారు. అప్పటి నుంచి ఈ అవార్డుకు ఎంతో విలువ పెరిగింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్ రంగాలతోపాటు శాంతి నోబెల్ అవార్డులను వేర్వేరు అకాడమీలు ఎంపిక చేసినట్లే సాహిత్య నోబెల్ అవార్డును ఈ స్వీడిష్ అకాడమీ ఎంపిక చేస్తోంది. స్వీడిష్ అకాడమీలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకు మూలాలు 1989 పరిణామాల్లోనే ఉన్నాయి. ప్రముఖ ప్రవాస భారతీయ రచయిత సల్మాన్ రష్దీ ‘శటానిక్ వర్సెస్’ రాసినందుకు ఆయనపై ఇరాన్ ప్రభుత్వం ఫత్వా జారీ చేసింది. ఆ ఫత్వాకు వ్యతిరేకంగా పోరాడలంటూ స్వీడిష్ ప్రభుత్వానికి ఓ మెమోరాండం సమర్పించాలని అకాడమీ మెజారిటీ సభ్యులు నిర్ణయించారు. అందుకు నిరసనగా కెరిస్టిన్ ఎక్మన్, లార్స్ జిల్లెస్టైన్లు తమ సభ్యత్వాన్ని వదులుకుంటున్నామని నోటిమాటగా చెప్పి వెళ్లిపోయారు. వారిలో లార్స్ జిల్లెస్టైన్ చనిపోవడంతో ఆయన స్థానంలో క్రిస్టినా లుగున్ అనే సాహిత్యవేత్తను ఎన్నుకున్నారు. 2015లో లొట్టా లొటాస్ అనే మహిళ కూడా వ్యక్తిగత కారణాలతో అకాడమీ నుంచి తప్పుకుంది. దీంతో అకాడమీ సభ్యుల సంఖ్య 18 నుంచి 16కు పడిపోయింది. వీరిలో ఐదుగురు మహిళలు ఉండగా వారిలో శాశ్వత కార్యదర్శి సారా డేనియస్ ఈ నెల 12న అకాడమీ నుంచి తప్పుకున్నారు. ఆమె బాటలోనే కవయిత్రి కతరినా ఫ్రోస్టెన్సన్ తన భర్త జీన్ క్లాడ్ ఆర్నాల్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అకాడమీ నుంచి తప్పుకున్నారు. భర్తపై ఆరోపణలు వస్తే భార్య ఎందుకు బలి కావాలన్న చర్చ అకాడమీలో కూడా జరిగింది. అయితే ఆర్నాల్ట్ నడుపుతున్న కళాకారుల క్లబ్‌కు ఆర్థిక సాయం అందిస్తున్నదే స్వీడిష్ అకాడమీ. పైగా ఈ లైంగిక ఆరోపణలు ఈ నాటివి కావు. 1996లో అన్నా కరీన్ బైలండ్ అనే యువ కళాకారిని తనను ఆర్నాల్ట్ లైంగికంగా వేధిస్తున్నారంటూ నాటి స్వీడిష్ అకాడమీ శ్వాశ్వత కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. 2017లో ప్రముఖ హాలివుడ్ నిర్మాత హార్వీ విన్‌స్టైన్ సెక్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన కారణంగా మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా ఆర్నాల్ట్‌కు వ్యతిరేకంగా 18 మంది యువతులు మీడియా ముందుకు వచ్చి తామూ లైంగిక వేధింపులకు గురయ్యామని వెల్లడించారు. దీంతో ఆర్నాల్ట్ భార్య కతరినా ప్రోస్టెన్సన్ను తొలగించాలంటూ అకాడమీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అకాడమీ సారా డేనియస్ ఏప్రిల్ 12న తన పదవికి గుడ్‌బై చెప్పగా, కతరినా రాజీనామా చేశారు. ఆమెకు మద్దతుగా నవలా రచయిత క్లాస్ ఆస్టర్ గ్రెన్, సాహితీవేత్త స్కాలర్ కేజెల్, చరిత్రకారులు పీటర్ ఎంగ్లండ్లు కూడా అకాడమీకి రాజీనామా చేశారు. దీంతో అకాడమీ సభ్యత్వం 11కు పడిపోయింది. అకాడమీ నిబంధనల ప్రకారం కొత్త సభ్యులను ఎన్నుకోవాలంటే 12 మంది సభ్యులు ఉండాలి. నిబంధనలను మార్చే హక్కు అకాడమీకి లేదు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో నోబెల్ అవార్డు ఎంపికను పక్కన పెట్టి మిగిలిన సభ్యులు స్వీడన్ రాజు వద్దకు సమస్యను తీసుకెళ్లారు. త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. -
హార్వీ వెయిన్స్టీన్లు బాలీవుడ్‌లోనూ ఉన్నారు!
హార్వీ వెయిన్‌స్టీన్ ఎవరో తెలుసా? తెలియకుండా ఎలా ఉంటాడు? నటీమణుల పట్ల రాక్షసుడిలాంటి వాడని హాలీవుడ్ కోడై కూస్తోంది. అది అన్ని వుడ్స్కీ పాకింది. అంతే.. ఇక్కడ కూడా ఇలాంటి కిరాతకులు ఉన్నారని కొందరు నటీమణులు బాహాటంగా ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడుతున్నారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ టీవీ, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ చేరారు. ‘మీటూ’ అంటూ ప్రతి ఇండస్ట్రీలోని నటీమణులు బడా బడా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ బండారం బయటపెడుతున్న ఈ ఉద్యమం నేపథ్యంలో ఏక్తా కపూర్ కూడా తన గళం విప్పారు. ‘‘కాయిన్‌కి ఒకవైపే కాదు రెండో వైపు కూడా చూడాలి’’ అంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారామె. ‘‘బాలీవుడ్లో కూడా హార్వీ వెయిన్స్టీన్లు ఉన్నారు. కానీ వారితో పాటు అంతే సమానంగానే కథకు మరోవైపు కూడా హార్వీ వెయిన్‌స్టీన్ (బాధితులు)లు ఉన్నారు. కానీ వారి గురించి మనం ఎవ్వరం మాట్లాడం. అవును పవర్లో ఉన్న కొద్దిమంది నిర్మాతలు వాళ్ల పలుకుబడిని ఉపయోగించి అడ్వాంటేజ్ తీసుకొని ఉండొచ్చు. సేమ్ టైమ్ అవకాశం కోసం చూస్తున్న కొందరు యాక్టర్స్ దిగజారి, తమ పనులు జరిగేలా చూసుకుంటున్నారు. నేను నమ్మేదేంటంటే ‘పదవి, పవర్ ఉన్నవాళ్లనే ఎప్పుడూ దోషులుగా చిత్రీకరించకూడదు. అలాగే పవర్లో లేనివాళ్లను బాధితులుగా పరిగణించకూడదు’’ అని పేర్కొన్నారు ఏక్తా కపూర్. కేవలం నటీమణులకే కాదు.. ఓ ప్రొడ్యూసర్‌గా నాకూ కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కొంతమంది మగాళ్లు చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాళ్లు. మరి అలాంటి సిచ్యువేషన్స్‌లో నిందితులు ఎవరు? పవర్లో ఉన్న ప్రొడ్యూసరా? లేక పవర్ లేనివాళ్లా? -
‘మీటూ’ టు ‘టైమ్ ఈజ్ అప్’!
మీటూ.. నాలుగు నెలలుగా ప్రపంచాన్ని ఊపేస్తోన్న ఉద్యమం. హార్వీ వెయిన్‌స్టీన్ అనే నిర్మాత తమపై చేసిన లైంగిక వేధింపులను ఒక్కొక్కరుగా హాలీవుడ్ నటీమణులు బయటపెట్టడంతో ఈ ఉద్యమం మొదలైంది. ఈ నాలుగు నెలల్లో ఈ ఉద్యమం హాలీవుడ్ స్టార్స్ దగ్గర్నుంచి ఇండియాలోని సాధారణ యువతి వరకూ చేరింది. ఆడవాళ్లు తమపై జరిగిన లైంగిక దాడులను బయటకొచ్చి చెప్పుకునేందుకు ఈ ఉద్యమం తోడుగా నిలిచింది. అలాంటి ఉద్యమానికి కొనసాగింపుగా హాలీవుడ్లో తాజాగా ‘టైమ్ ఈజ్ అప్’ అనే ఉద్యమం ఊపందుకుంటోంది. లైంగిక వేధింపులకు గురై బయటకు చెప్పుకోలేకపోతున్న అమ్మాయిల కోసం, వాళ్లు చేసే పోరాటాలకు అండగా నిలబడ్డం కోసం ౖ‘టెమ్ ఈజ్ అప్’ పనిచేస్తుంది. ఈ టైమ్ ఈజ్ అప్ కోసం నెల రోజులుగా భారీ ఎత్తున ఫండ్స్ వచ్చిపడుతున్నాయి. అయితే ఆ ఫండ్స్ అన్నీ కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డ దర్శకులు, నిర్మాతల సినిమాలకు పనిచేసిన నటులు తాము ఆయా సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్‌ను వెనక్కి ఇచ్చే క్రమంలో పుట్టినవే! ‘‘మేం ఆ దర్శకుడి/నిర్మాత సినిమాకు పనిచేసి తప్పు చేశాం. ఆ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ అంతా టైమ్ ఈజ్ అప్‌కు డొనేట్ చేస్తున్నాం’’ అని అన్నది ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోన్న, చాలామంది స్టార్స్ చేస్తోన్న ఓ పోస్ట్. హార్వీ వెయిన్‌స్టీన్ -
బ్లాక్ డ్రెస్‌కు రెడ్ కార్పెట్
‘మీ టూ’ హాష్ ట్యాగ్ ఉద్యమం వృ«థా కాలేదు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఫలితం కనిపించింది. రెడ్ కార్పెట్ ఆహ్వానాన్ని నలుపు దుస్తుల వస్త్రధారణ నిరసనగా మార్చింది. ప్రపంచాన్ని మొత్తం తనవైపు తిప్పుకునే íసినిమా అవార్డులు రెండే రెండు. ఒకటి ఆస్కార్, రెండు గోల్డెన్ గ్లోబ్! ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపుల గురించి మొదట ఓ బాధితురాలు ‘మీ టూ’ ఆన్లైన్ ఉద్యమంలో వెళ్లబోసుకుంది. అప్పటి నుంచి అతని మీదా, హాలీవుడ్ పరిశ్రమలో ఉన్న ఇలాంటి వేధింపుల మీదా మాట్లాడే ధైర్యాన్ని తెచ్చుకున్నారు బాధితులు. ఈ అరాచకాలను ఖండించడానికి, అణచివేయడానికి ఎలాంటి అవకాశం దొరికినా జారవిడుచుకోకూడదని ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోని మహిళలు ఒక ప్రమాణం చేసుకున్నట్టుంది! అందుకే హాలీవుడ్‌తో పాటు మొత్తం ఎంటర్టైన్మెంట్ మీడియాలో జరుగుతున్న ఈ అకృత్యాలకు.. హార్వీ వైన్‌స్టీన్, ఇంకా హాలీవుడ్‌లోని అలాంటి ప్రబుద్ధులకు వ్యతిరేకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి విచ్చేసిన ప్రముఖులంతా నల్ల దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఇది మంచి పరిణామం! ‘మీ టూ’ ఉద్యమం బలహీనపడకుండా ఊపిరిపోసే శుభ సంకేతం. -
అతనికి అంత సీన్ లేదు!
2009... ‘ది రీడర్’ సినిమాకు హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ ఉత్తమ నటిగా ఆస్కార్‌కు ఎంపికయింది. ఆస్కార్ అందుకునే రోజు స్పీచ్‌లో హార్వీ వెయిన్‌స్టీన్ గురించి మాట్లాడమని ఆమెపై అందరూ ఒత్తిడి తెచ్చారు. హార్వీ ఆ సినిమాకు ఫైనాన్స్ అందించడంతో పాటు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించాడు. అయితే, కేట్ మాత్రం అతని గురించి మాట్లాడనంటే మాట్లాడను అని చెప్పింది. నిజంగానే స్పీచ్‌లో హార్వీకి కేట్ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఎనిమిదేళ్లు గడిచాయి. ఇప్పుడు హార్వీ వెయిన్‌స్టీన్ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి.. ఎక్కడ చూసినా! కారణం, అవకాశాల కోసం తన వద్దకు వచ్చిన అమ్మాయిలపై హార్వీ లైంగిక దాడికి పాల్పడడమే! 2009లో ఆస్కార్ అవార్డు అందుకుంటూ తాను హార్వీ పేరు ఎందుకు ఎత్తలేదన్న విషయాన్ని కేట్ విన్స్లెట్ ఇప్పుడు బయటపెట్టింది. అందరూ కంప్లైంట్ చేస్తున్నట్లే హార్వీ లాంటి వాడిని భరించడం కష్టం అంది కేట్. కేట్ మొదటి సినిమా ‘హెవెన్లీ క్రియేచర్స్’కు హార్వీ ఓ నిర్మాత. ‘‘ఆ సినిమా అప్పట్నుంచి ఎప్పుడు నన్ను కలిసినా ‘నీకు మొదటి అవకాశం నేనే ఇచ్చా!’ అంటూండేవాడు. వాడు నాకు ఆఫర్ ఇవ్వడమేంటి? నేను ఆడిషన్లో సెలెక్ట్ అయ్యా. అదే సినిమాకు మూడు సార్లు ఆడిషన్ ఇచ్చా. ఎప్పుడు కలిసినా రూడ్‌గా మాట్లాడేవాడు. అయితే నాతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే సీన్ లేదతనికి. కావాలనే పట్టుబట్టి ఆస్కార్ వేడుకలో హార్వీ గురించి మాట్లాడలేదు..’’ అని చెప్పుకొచ్చింది కేట్.