Health cards
-
30 రోజుల్లో డిజిటల్ హెల్త్‌కార్డులు
నల్లకుంట: రాష్ట్రంలోని తమ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మరో 30 రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (ఎఫ్డీహెచ్పీ) కార్డులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నల్లకుంట ఓయూ రోడ్డులోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి ఆవరణలో కొత్తగా నిర్మించిన రెనోవా కేన్సర్ సెంటర్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ గురువారం ప్రారంభించారు. అనంతరం అక్కడి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటైజ్ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్ కార్డులో రోగి గత చికిత్సల వివరాలన్నీ ఉంటాయని.. తద్వారా భవిష్యత్తులో ఆ వ్యక్తి ఏదైనా జబ్బు బారినపడితే పూర్వ చికిత్సలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల వివరాలను వైద్యులు కేవలం ఒక క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుందని వివరించారు. పేదలకు అతితక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చును రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. సమర్థుడైన వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని.. ప్రజలకు సేవ చేసేందుకు గుర్తింపు పొందిన ఎన్జీవోలతో త్వరలో మంత్రి దామోదర సమావేశం ఏర్పాటు చేస్తారన్నా రు. పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేయడం అభినందనీయమని కొనియాడారు. కేన్సర్ వ్యాధికి వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని.. రెనోవా గ్రూప్ ఆఫ్ ఆసుపత్రులు ప్రజాసేవ చేసేందుకు ముందడుగు వేయడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని సీఎం కోరారు. డీడీఎంఎస్ స్పోర్ట్స్ స్కూల్‌కు అనుమతి ఇస్తాం.. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాగే ఓయూ ఆవరణలోని డీడీఎంఎస్ విద్యాసంస్థ స్థలంలో కొంతభాగం రోడ్డు విస్తరణలో పోయిందని ట్రస్ట్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని.. ఆ పక్కనే ఓయూ స్థలం ఉంటే డీడీఎంఎస్‌కు ఇవ్వడానికి వీలవుతోందో లేదో అధికారులతో మాట్లాడతానని చెప్పారు. గతంలో కాసు బ్రహా్మనందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డీడీఎంఎస్‌కు నాటి ఎంసీహెచ్ ద్వారా ఇచి్చన పన్ను మినహాయింపులను తిరిగి కొనసాగించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. జిల్లాల్లో త్వరలో కేన్సర్ సెంటర్లు: దామోదర రాష్ట్రంలో కేన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని.. కానీ చివరి దశలోనే కేసులు బయటపడుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. తొలి దశలోనే కేన్సర్ వ్యాధిని నిర్ధారించి చికిత్సలు అందించేందుకు వీలుగా త్వరలో జిల్లా స్థాయిలో దశలవారీగా కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ శ్రీధర్‌రెడ్డి పెద్దిరెడ్డి, డీడీఎంఎస్ చైర్మన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
రేషన్.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డుల అంశం ప్రజల్లో పరేషాన్ రేపుతోంది. లక్షలాది మంది కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన అంశాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నా యి. రేషన్‌కార్డులకు కోత పెడతారా? పెళ్లిళ్లు అయి కొత్తగా ఏర్పడిన కుటుంబాలన్నింటికీ కొత్తకార్డులు జారీ చేస్తారా? పాతవాటిలో మార్పు చేర్పులపై ఏం చేస్తారు? రేషన్‌కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు అందడం ఎలా? అర్హతల పునః సమీక్ష అంటే ఎలాంటి నిబంధనలు పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి.వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు వెల్లడించారు. రేషన్‌కార్డులను విభజించి, స్మార్ట్ రేషన్‌కార్డులు, స్మార్ట్ హెల్త్‌కార్డులు ఇస్తామని.. రేషన్‌కార్డులకు అర్హతలపై పునః సమీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు.. ప్రస్తుతం మంత్రులు వెల్లడించిన అంశాలు.. ఇటీవలి పరిణామాలను బేరీజు వేసుకుంటూ.. రేషన్‌కార్డుల అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు మొదలయ్యాయి. రేషన్ కార్డుల్లో కోత పడుతుందా? అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే అర్హు లను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా కార్డుల కోసం ఏడెనిమిది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల దరఖాస్తులతోపాటు కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దరఖాస్తుల డేటాపై స్పష్టత లేదు. దీంతో మరోసారి ప్రజాపాలన నిర్వహించి రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.కొత్త రేషన్‌కార్డుల జారీకి విధి విధానాలేమిటనే విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సి ఉంది. వార్షికాదాయం ప్రాతిపదికన జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్తగా ఇచ్చే రేషన్‌కార్డులకే పరిమితి అమలు చేస్తారా? పాతకార్డులకూ వర్తింపజేస్తూ.. అధికాదాయం ఉన్నవారికి రద్దు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో అడ్డగోలుగా రేషన్‌కార్డులు జారీ చేశారని, అధికాదాయం ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్నవారికి కూడా రేషన్‌కార్డులు ఉన్నాయని సీఎం రేవంత్ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్డులకు కోతపడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందేది ఎలా? రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులే ప్రామాణికమని సీఎం రేవంత్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పటికే రేషన్‌కార్డు సమస్యలతో చాలా మంది రైతులకు ‘రుణమాఫీ’ అందలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందనివారూ ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలకూ రేషన్‌కార్డుల లింకు ఉండనుంది. దీనివల్ల ఉన్న రేషన్‌కార్డులు రద్దయినా, కొత్త రేషన్‌కార్డులు మంజూరుకాకున్నా.. తమకు పథకాలు అందేది ఎలాగని పేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని.. అర్హతకోసం పరిగణించే వార్షికాదాయ పరిమితిని దానికి అనుగుణంగా పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక రేషన్‌కార్డులను విభజించి బియ్యం వద్దనుకునే వారికి స్మార్ట్ హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్న మంత్రుల ప్రకటనతోనూ సందేహాలు మొదలయ్యాయి. అలా స్మార్ట్ హెల్త్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా, లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ నెల 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం రేషన్‌కార్డుల అంశంపై స్పష్టత రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
డిజిటల్ హెల్త్ ఖాతాల్లో రెండో స్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి: ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలందేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. ఓ పక్క గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతూనే, రాష్ట్ర వ్యాప్తంగా నూతన వైద్య కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నారు. మరోపక్క ప్రజలకు డిజిటల్ వైద్య సేవలందించే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ఆభా)ల సృష్టిలోనూ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. దీంతో డిజిటల్ హెల్త్ అకౌంట్ల సృష్టిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్‌లోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 43.01 కోట్ల మందికి ఆభా రిజి్రస్టేషన్లు చేశారు. రాష్ట్రాలవారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ 4.29 కోట్ల అకౌంట్లతో మొదటి స్థానంలో ఉంది. 4,10,49,333 ఖాతాలతో ఏపీ రెండో స్థానంలోఉంది. 4.04 కోట్లతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. దక్షిణాదికి చెందిన మరే రాష్ట్రం టాప్–5లో లేదు. కర్ణాటక 2.35 కోట్ల ఖాతాలతో 8వ స్థానంలో, 98 లక్షల ఖాతాలతో తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి. ఇదీ డిజిటల్ ఖాతా ఆభా అకౌంట్లో ప్రతి పౌరుడికి 14 అంకెల డిజిటల్ ఆరోగ్య ఐడీ ఇస్తారు. వ్యక్తి ఆరోగ్య చరిత్ర మొత్తం ఇందులో నమోదు చేస్తారు. ఎప్పటికప్పు డు ఇది అప్డేట్ అవుతుంటుంది. ఓపీ, ఐపీ స్లి ప్పులు, వైద్య పరీక్షల ఫలితాలు, పాత చికిత్స తా లూకూ ఫైళ్లు వంటి మోతబరువు లేకుండా దేశంలో ఎక్కడి నుంచి అయినా ఒక్క క్లిక్‌తో ఆరోగ్య చరిత్ర అందుబాటులోకి తేవడానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం)ను కేంద్రం ప్రవేశపెట్టింది. పేపర్ రహిత సేవలు అందించడానికి వీలుగా ఈ–హాస్పిటల్ విధానాన్ని అమలు చేస్తోంది. చదవండి: మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా.. ఏబీడీఎం అమలులో ఏపీ తొలి నుంచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 4.81 కోట్ల మందికి ఆభాలు రిజిస్టర్ చేయడం లక్ష్యం కాగా, ఇప్పటికి 85% మందికి రిజి్రస్టేషన్ పూర్తి చేశారు. మొత్తం జనాభాలో ఆభా రిజిస్టర్ కవరేజ్ పరంగా దేశంలోనే తొలిస్థానంలో ఏపీ నిలుస్తోంది. రాష్ట్రంలోని 14,368 ఆసుపత్రులు, 20,467 మంది వై ద్యులు, వైద్య సిబ్బంది ఏబీడీఎంలో రిజిస్టర్ అ య్యారు. పీహెచ్సీ నుంచి బోధనాస్పత్రి వరకు అ న్ని స్థాయిల్లో ఈ–హెచ్ఆర్ విధానాన్ని ప్రశేపెట్టి ప్ర జలకు డిజిటల్ వైద్య సేవలను వైద్య శాఖ అంది స్తోంది. ఏపీ విధానాలను అవలంబించాలని నేషన ల్ హెల్త్ అథారిటీ అన్ని రాష్ట్రాలకు సూచించింది. మహారాష్ట్ర, తమిళనాడు అధికారులు ఏపీకి వచ్చి ఇక్కడి విధానాలను తెలుసుకుని వెళ్లారు. ఆరోగ్య రికార్డులు పదిలం డిజిటల్ హెల్త్ అకౌంట్ ద్వారా ప్రతి వ్యక్తి ఆ రోగ్య రికార్డులు ఆన్లైన్లో పదిలంగా ఉంటా యి. వంద శాతం పౌరులందరికీ ఆభా రిజిస్ట్రేషన్ త్వరలోనే పూర్తి అవుతుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఈ–హెచ్ఆర్ అమలు చేస్తున్నాం. ఈ విధానంపై ఆస్పత్రుల్లో అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
రష్మిక చేతుల మీదుగా జర్నలిస్ట్ లకు ఐ.డి, హెల్త్ కార్డ్ ల పంపిణీ
‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీఎఫ్జేఏ)’ జర్నలిస్టుల అందరి క్షేమం కోసం ఆలోచించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా సినిమాకు సంబంధించి ఎలాంటి ఫంక్షన్ జరిగినా మీరంతా(ఫిల్మ్ జర్నలిస్టులు)వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు పిలవగానే నేను రావడం హ్యాపీగా ఉంది. మీరంతా బాగుండాలి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి’ అని ప్రముఖ నటి రష్మిక మందన్నా అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ‘టీఎఫ్‌జే’ నూతన ఐడీ కార్డ్స్, హెల్త్ కార్డ్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య అతిథిగా హాజరు కాగా.. గౌరవ అతిథులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి తో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి, ఏసియన్ సినిమాస్ సిఎమ్ఓ జాన్వీ నారంగ్ గారు హాజరయ్యారు. టిఎఫ్‌జేఏ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు మాట్లాడుతూ.. జర్నలిస్టుల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఎంతో సహాయం చేస్తున్నారు. మరి మనం వారికి ఏం చేస్తున్నాం అనిపించినప్పుడు రీసెంట్ గా దిల్ రాజు, చిరంజీవిగారితో అసోసియేషన్ తరఫున సినిమా కోసం ఏం చేయాలి అని మాట్లాడటం జరిగింది. మన జర్నలిస్ట్ లకు వాళ్లు అంత సాయం చేస్తున్నప్పుడు.. వారికి సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్ట్ లుగా మనం సహాయం చేయాలని అని చర్చించడం జరిగింది. కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా చూసుకుని ఈ కమిట్ స్టార్ట్ చేయబోతున్నాం ఇక టిఎఫ్‌జేఏ అసోసియేషన్ కోసం మూడు రకాల ఇన్సూరెన్స్ లు చేశాం. ఒకటి నలుగురు కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీకి 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. మిగతావి టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీ. వీటిలో మొదటిది ఎవరికైనా జరిగితే.. ఆ కుటుంబానికి ఈ మొత్తం అందించడం జరుగుతుంది. యాక్సిడెంటల్ పాలసీలో ఎవరైనా ప్రమాదం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉంటే.. వారానికి పదివేల చొప్పున.. అసవరమైతే ఐదేళ్ల వరకూ ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ మూడు ఇన్సూరెన్స్ ల కోసం చాలా పెద్ద కంపెనీలను సంప్రదించాం. వారిలో మనకు నచ్చేలా యతిక ఇన్సూరెన్స్ వాళ్లు ముందుకు వచ్చారు. వారి తరఫున, మన తరఫున ఇద్దరు ప్రతినిధులను పెట్టాం. వీరిలో ఎవరిని సంప్రదించినా.. 24 గంటలూ అందుబాటులో ఉండబోతున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించబోతోన్న మన టిఎఫ్‌జేఏ కు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. టిఎఫ్‌జేఏ ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. టిఎఫ్‌జేఏ నుంచి ఇప్పటి వరకూ ఈ ఐదేళ్లలో మనం ఇన్సూరెన్స్ సంస్థకు కట్టిన డబ్బులు 1 కోటి 10 లక్షలు 84వేల 626 రూపాయలు. ఈ మొత్తంలో మనం చేసుకున్న క్లెయిమ్ చేసుకున్న అమౌంట్ 90 లక్షల 76 వేల 614 రూపాయలు. ఈ మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి 60లక్షల 26 వేల 614 రూపాయలు క్లెయిమ్ చేశాం. టర్మ్ ఇన్సూరెన్స్ 30 లక్షలు క్లెయిమ్ చేశాం. ఎవరికీ ఏ ప్రాబ్లమ్ రాకూడదు. సంతోషంగా ఉండాలనే కోరుకుందాం. కానీ ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు 24 గంటలూ ఎంతో మద్ధతుగా నిలుస్తున్నాం’ అన్నారు. ‘మేం సినిమాలు తీసిన తర్వాత వాటిని జనాల్లోకి తీసుకువెళ్లేది జర్నలిస్ట్ లే. ఆ విషయంలో మీరెప్పుడూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. మా వైపు నుంచి వారికి ఏ సహాయం కావాలన్నా ఉంటాం’అని అన్నారు నిర్మాత నవీన్ యొర్నేని. ‘టిఎఫ్‌జేఏ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సపోర్ట్ గా ఉంటుందని నిర్మాత టిజి విశ్వప్రసాద్ అన్నారు. -
మత్స్యకారులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: తమకు రూ.10 లక్షల కవరేజీతో హెల్త్‌కార్డులు ఇవ్వాలని మత్స్యకారులు చేపట్టిన ఆందోళన అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తతకు దారి తీసింది. మత్స్యకారులను ఆదుకోవాలంటూ టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు ముందుగా అంచనా వేయలేకపోయారని చెపుతున్నారు. అనూహ్యంగా ఆటోలో అసెంబ్లీ ముందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, మత్స్యకారులు ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, రూ.10 లక్షల కవరేజీతో హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
Andhra Pradesh: ఆరోగ్యానికి భరోసా ‘కార్డు’
2023 జూలై 1.. సుబ్బారావుకు జ్వరమొచ్చింది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌కు వెళ్లి హెల్త్ కార్డు ఇచ్చాడు. అందులో ఉన్న నంబరును హెల్త్ ప్రొవైడర్ కంప్యూటర్లో ఎంటర్ చేశాడు. ‘ప్రతి ఏటా ఇదే సీజన్లో మీకు జ్వరం వస్తోంది. మీకు కొన్ని మందులు బాగా పనిచేస్తున్నాయి. యాంటీబయాటిక్స్ మీ ఒంటికి పడటంలేదు. అందువల్ల ఇతర మందులు వాడాలి. మీ వయసు పెరుగుతున్నందున ఆహారంలో మార్పులు చేసుకోవాలి’ అంటూ హెల్త్ ప్రొవైడర్ చెబుతున్న వివరాలతో సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాలన్నీ కొత్తగా వచ్చిన ఈయనకు ఎలా తెలిశాయబ్బా అనుకుని అదేమాట అడిగేశాడు. మీ హెల్త్ అకౌంటులో మీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. మీరు గతంలో ఏ జబ్బులకు గురయ్యారు, వాటికి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? మీకు ఏ మందులు బాగా పనిచేస్తాయి? ఇలాంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేయటం వల్ల సకాలంలో సరైన చికిత్స చేసేందుకు వీలవుతోంది అని ఆయన వివరించాడు. – సాక్షి ప్రతినిధి, అమరావతి ఆరోగ్య రంగంలో వినూత్న పథకాలతో దూసుకుపోతున్న మన రాష్ట్రం డిజిటల్ హెల్త్ మిషన్ అమలుకు చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్ళి నిర్దిష్ట ఫార్మాట్లో వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఈ నమోదు ప్రక్రియ 66.8 శాతం పూర్తయింది. హెల్త్ మిషన్‌కు ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేయడంలోనూ ఏపీ ముందంజలో ఉంది. రాష్ట్రం నుంచి 69,683 హెల్త్ రికార్డులను డిజిటల్ హెల్త్ అకౌంట్స్‌తో అనుసంధానం చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మిషన్ ద్వారా ప్రోగ్రామ్ మేనేజర్లు, నియంత్రణాధికారులు, అసొసియేషన్లు, ఎన్జీవోలు, వైద్యులు, మందుల, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు, ల్యాబ్‌లు, మందుల దుకాణాలు, థెరపీ సెంటర్లు, హాస్పిటల్స్, క్లినిక్స్.. అన్నింటినీ అనుసంధానం చేయటం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించటం ముఖ్య ఉద్దేశం. డిజిటల్ హెల్త్ కార్డు ఆధార్ కార్డులానే ప్రతి ఒక్కరికీ 14 అంకెలతో ఉన్న డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఇది రెఫరల్ సిస్టంలో బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు పీహెచ్సీలో ఒక డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు టెస్టులు చేసి కొన్ని లక్షణాలు కనుక్కుంటారు. దీన్ని సాధారణంగా ప్రిస్క్రిప్షన్‌లో రాస్తారు. అదే హెల్త్ అకౌంటు ఉంటే.. అందులో వివరాలన్నీ పొందుపరుస్తారు. మరో డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు రక్త పరీక్షలు, స్కానింగ్, ఇతరత్రా పరీక్షలు మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. రోగి ఐడీ నంబర్ కంప్యూటర్లో నమోదు చేయగానే వివరాలన్నీ వస్తాయి. టెలి–కన్సల్టేషన్ ద్వారా ఆరోగ్య సేవలను పొందేందుకు సైతం ఇది అనుకూలం. ఇతర వైద్య నిపుణుల సలహా సంప్రదింపులకు, బీమా క్లియరెన్సు, క్లెయిముల పరిష్కారం, అత్యవసర సమయాల్లో పేషెంటును ఆధునిక వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులకు తక్షణమే తరలించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఆరోగ్య డేటా, ల్యాబ్ రిపోర్టులు, చికిత్స వివరాలు, అందించిన ఆరోగ్య సదుపాయాలు, డిశ్చార్జి సమ్మరీలను అకౌంటులో ఎప్పటికప్పుడు జత చేస్తుంటారు. రోగి తన ఆరోగ్య సమాచారం రహస్యంగా ఉంచాలని భావిస్తే.. అకౌంటును బ్లాక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అవసరమైనప్పుడు మళ్లీ ఓపెన్ చేసుకోవచ్చు. ఆస్పత్రుల అనుసంధానమూ ముఖ్యమే ప్రజలందరికీ హెల్త్ ఐడీలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను, అక్కడ పనిచేసే డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సులను కూడా డిజిటల్ మిషన్ పరిధిలోకి తేవాలి. ప్రతి డాక్టరుకూ ప్రత్యేక లాగిన్ ఐడీ ఉంటుంది. ఆ ఐడీ ద్వారా పేషెంట్ ఐడీని కంప్యూటర్లో నమోదు చేస్తే అతని ఆరోగ్య వివరాలు వస్తాయి. మన రాష్ట్రంలో 13,346 ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు డిజిటల్ హెల్త్ మిషన్‌లో చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ఉత్తరప్రదేశ్ తర్వాత మన రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఆసుపత్రులు ఈ పథకంతో అనుసంధానమైనట్లు వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను పూర్తిస్థాయిలో దీని పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రంలో లేదా దేశంలో ఎక్కడికి వెళ్లినా రోగికి అత్యంత మెరుగైన, కచ్చితమైన వైద్యం సత్వరమే అందుతుంది. మన ఆరోగ్య విధానం ఇలా.. మన రాష్ట్రంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్.. అంటే ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రాథమిక వైద్యం లభిస్తుంది. అక్కడి నుంచి పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కు రెఫర్ చేస్తారు. పీహెచ్సీ నుంచి సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్య కేంద్రం)కు, అక్కడి నుంచి ఏరియా ఆస్పత్రికి, జిల్లా ఆస్పత్రికి.. చివరగా బోధనాసుపత్రికి రెఫరల్ సిస్టం పనిచేస్తుంది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లో మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్, పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, సీహెచ్‌సీలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా బృందం, ఏరియా ఆస్పత్రిలో వీటికి అదనంగా ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ వంటివి, జిల్లా ఆస్పత్రిలో సుమారు 16 రకాల స్పెషాలిటీ డాక్టర్లు, బోధనాసుపత్రిలో 32 విభాగాల స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు. రాష్ట్రంలో దాదాపు 95 శాతం మందికి ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉంది. హెల్త్ డేటాలో మనమే నం.1 ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించటం, వాటిని డిజిటలైజ్ చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉంది. ఇదంతా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతోనే సాధ్యమైంది. ప్రజల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటం వల్ల వారికి వైద్యం అందించే విషయంలో ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయం తెలుసు కాబట్టే మన ముఖ్యమంత్రి గ్రామగ్రామానికి హెల్త్ క్లినిక్‌లు తీసుకొచ్చారు. కొత్తగా పీహెచ్‌సీలు, యూపీహెచ్సీలూ నిర్మిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే వైద్యానికి సంబంధించిన అన్ని దశలనూ పటిష్టపరుస్తున్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ హెల్త్ ఐడీలు, రికార్డులు భద్రపరిచేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల ద్వారానూ క్షేత్రస్థాయిలో అందరి హెల్త్ డేటా సేకరిస్తున్నారు. మనకు సరిపడా వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఉన్నారు. వీరందరి సహకారంతో మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయగలుగుతున్నాం. ఈ విభాగంలో మనమే ముందున్నామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అభినందనలు తెలిపింది. ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఈ విషయంలో మన ప్రభుత్వానికి అవార్డులు కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఎకనమిక్స్ టైమ్స్ ప్రకటించిన అవార్డు కూడా ఇలాంటిదే. – విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
కదం తొక్కిన కార్మికులు
హిమాయత్‌నగర్: ఔట్ సోర్సింగ్ కార్మికుల ధర్నాతో గురువారం బల్దియా ప్రధాన కార్యాలయం దద్దరిల్లింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఔట్సోర్సింగ్ కార్మికులను ఎన్‌ఎంఆర్‌లుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని, ఆరోగ్య భద్రతకు హెల్త్ కార్డు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని, బయోమెట్రిక్ మిషన్లను జీహెచ్ఎంసీనే నేరుగా కొనాలనే తదితర డిమాండ్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ (బీజేపీ) మజ్దూర్ సెల్ పిలుపు మేరకు ఉద్యోగ, పారిశుద్ధ్య, ఎంటమాలజీ, వెటర్నరీ, పార్క్ సెక్షన్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్ విభాగాల కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు గంటల పాటు కార్యాలయం లోపల కార్మికులు బైఠాయించారు. అవుట్ సోర్సింగ్ కమిషనర్ లోకేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ట్రాన్స్పోర్ట్ సెక్షన్ నుంచి తీసేసిన 700 మందిని విచారణ జరిపి వారిని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. బయోమెట్రిక్ కారణంగా కట్ అయిన డబ్బులు తిరిగి ఇస్తామన్నారు. ఎంటమాలజీ విభాగంలో ఉన్న ఖాళీలను నియమించేందుకు, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఉదిరి గోపాల్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, ఔట్ సోర్సింగ్ విభాగం అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు. (చదవండి: హైదరాబాద్‌కు పాడ్ కార్స్, రోప్‌వేస్) -
ఇండస్ట్రీకి పెద్దగా ఉండను, నాకిష్టం లేదు: చిరంజీవి
యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. సినీ పరిశ్రమలోని అందరికి 50 శాతం రాయితీతో టెస్టులు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో కార్డుల పంపిణీ జరగ్గా.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కరోనా ఎంతో మందిని బలి తీసుకుంది. ఎంతో మంది ఆప్తుల్ని, మిత్రుల్ని కోల్పోయాము. ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అందర్నీ కాపాడాలని ఆలోచన చేశాను. రోగం వచ్చాక బాధపడేకంటే రోగ నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం. హెల్త్ కార్డుల కోసం అడిగితే యోధ లైఫ్ లైన్ చైర్మన్ సుధాకర్ సానుకూలంగా స్పందించారు. కేవలం మెంబర్స్‌కు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు సైతం అవకాశం కల్పించారు. మేమిచ్చే హెల్త్ కార్డ్, దీని క్యూఆర్ కోడ్‌లో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. ఇప్పటివరకు 7,699 కార్డులు రెడీ అయ్యాయి. మిగతావన్నీ ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. ఒమిక్రాన్ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. షూటింగ్లో ఉన్నవాళ్లు అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్లో పాల్గొనాలి. ఆరోగ్య పరంగా అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రతి దాంట్లో పెద్దరికంగా ఉండను.. ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రాను. కానీ ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటా..' అని చెప్పుకొచ్చారు. అలాగే సినీ పరిశ్రమలోని వివాదాలపై స్పందిస్తూ.. 'పెద్దరికం చేయడం నాకిష్టం లేదు, నేను పెద్దగా ఉండను.. కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు నేనున్నాంటూ ముందుకు వస్తాను. కానీ అనవసరంగా తగుదునమ్మా అంటూ ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఇద్దరు వ్యక్తులో, రెండు యూనియన్‌లో కొట్టుకుంటుంటే మాత్రం ఆ పంచాయితీలు నేను చేయను. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు ఇబ్బంది. ఆ పెద్దరికమే నాకు వద్దు' అని చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. -
డిజిటల్ హెల్త్ కార్డులకు 60% మంది ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్(ఎన్డీహెచ్ఎం) కింద కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘డిజిటల్ హెల్త్ ఐడీ’కి సుమారు 60 శాతం మంది ప్రజలు సానుకూలంగా స్పందించారు. కానీ, వైద్య, ఆరోగ్య రికార్డులు కాకుండా సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతపరిచేందుకు నిరాకరించారు. లోకల్‌సర్కిల్స్ అనే సోషల్ మీడియా వేదిక ఇటీవల దేశవ్యాప్తంగా 9 వేల మంది నుంచి హెల్త్ ఐడీకి సంబంధించిన 4 ప్రశ్నలపై చేపట్టిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఈ సర్వే వివరాలను డిజిటల్ హెల్త్ ఐడీలో పాలు పంచుకునే విభాగాలకు అందజేయనున్నట్లు లోకల్‌సర్కిల్స్ జనరల్ మేనేజర్ అక్షయ్ గుప్తా వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎన్డీహెచ్ఎం పథకాన్ని ప్రకటించారు. చదవండి:కంగనా క్షమాపణ చెప్పాలి: శివసేన -
ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన!
సాక్షి, న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. దేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు ఈ పధకాన్ని చేపడుతున్నారు. ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకంలో భాగంగా వ్యక్తికి జరిగిన చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్ర అంతటినీ డిజిటలీకరించి ఈ కార్డులో భద్రపరుస్తారు. ఆస్పత్రులు, క్లినిక్‌లు, వైద్యులను కేంద్ర సర్వర్‌తో అనుసంధానిస్తారు. అయితే ఈ పధకాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనే నిర్ణయాన్ని పూర్తిగా ఆస్పత్రులు, పౌరులకే వదిలివేస్తారు. ఈ కార్డును కోరుకున్న వారికి ఓ యూనిక్ ఐడీని కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా వారు సిస్టమ్‌లోకి లాగిన్ అవుతారు. దశలవారీగా అమలు చేసే ఈ పధకానికి రూ 300 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఈ పథకం ప్రయోజనాల్లో కీలకమైనది ఏంటంటే దేశంలో ఏ వైద్యుడు, ఆస్పత్రిని సందర్శించే వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. యూనిక్ ఐడీ ద్వారా రోగికి సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులను వైద్యులు పరిశీలిస్తారు. ఆధార్ కార్డు తరహాలో హెల్త్ కార్డును జారీ చేస్తారు. దేశంలో వైద్యారోగ్య పరిస్ధితిని పూర్తిగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ పధకంలో పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేలా చర్యలు చేపడతారు. ఈ పధకాన్ని ఆపై మందుల షాపులు, వైద్య బీమా కంపెనీలకూ సర్వర్‌లో అనుసంధానిస్తారు. రోగి అనుమతితోనే వైద్యులు, ఆస్పత్రి వర్గాలు వ్యక్తి రికార్డులను పరిశీలించేందుకు అనుమతిస్తారు. చదవండి : మరో మైలురాయి అధిగమించిన మోదీ -
మూగ జీవాలకు హెల్త్ కార్డులు
పాలకొండ రూరల్: మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులు, యజమానులు, కాపలాదారులకు ఆసరాగా నిలిచేందుకు ‘వైఎస్సార్ పశుసంరక్షణ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. మూగజీవాలకు ఆరోగ్య రక్షణ కార్డులు మంజూరు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా... వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాలో పాడి పెంపకం ఆ తర్వాతి స్థానంలో ఉంటూ రైతులకు ఆసరాగా నిలుస్తుంది. ఈ క్రమంలో యానిమల్ కార్డుల ద్వారా దాదాపు లక్ష మంది పశు సంపద కలిగిన రైతులకు, పాడి పరిశ్రమల యజమానులకు, కాపరులకు ప్రయోజనం చేకూరనుంది. గ్రా మ సచివాలయాలకు అనుసంధానం చేసిన పశువైద్య సహాయకులు ఈ కార్డుల మంజూరుకు అర్హులైన రైతులకు సహకరిస్తారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో గల ( 085–00–00–1962, 1907) వంటి టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఈ పథకాన్ని పొందేందుకు అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా దాదాపు లక్షకు పైబడి మూగప్రాణులకు ఈ కార్డులు మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా పశువు ఆరోగ్య సంరక్షణకు చర్యలు, కృత్రిమ గర్భధారణ, సూడి పశువులు, దూడలు, పోషకాలు, పశుసంపద వివరాలు నమోదు చేస్తారు. ఆర్బీకే కేంద్రాల వద్ద పశువుల బోనులు ఏర్పాటుచేసి వాటి ఆరోగ్య తాజా స్థితిగతులు గుర్తిస్తారు. ఈ నేప థ్యంలో ఆవులు, మేకలు, గొర్రెలు, బర్రెలు కలిపి జిల్లావ్యాప్తంగా సుమారు 16 లక్షల 96వేల పైబడి ఉన్నట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీరంతా ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచిస్తున్నారు. పథకం తీరుతెన్నులు.. ఎలాంటి ముందస్తు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాన్ని అర్హులకు అందిస్తారు. జీవాల పునరుత్పాదక దశలో 2 నుంచి 10 ఏళ్ల వయసున్న ఆవులు, 3 నుంచి 12 ఏళ్ల వయసున్న బర్రెలకు వర్తింపజేస్తారు. పశువు మరణిస్తే మేలుజాతి స్వదేశీ ఆవు ఒక్కింటికి రూ.30 వేలు, దేశవాళీ బర్రె మరణిస్తే రూ.15వేలు పరిహారం అందిస్తారు. ఏడాదికి ఒక పాడి రైతు కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం ఉంది. ఆరు నెలల నుంచి ఆపై వయసున్న మేకలు, గొర్రెలకు ఈ పథకం వర్తింపజేస్తారు. ఒకేసారి మూడు నుంచి అంతకన్నా ఎక్కువ జీవాలు మరణిస్తే పథకం వర్తిస్తుంది. ఒక్కో జీవానికి రూ.6వేల వంతున ఏడాదిలో ఒక్కో కుటుంబం గరిష్టంగా రూ.1.20 లక్షలు పరిహారం పొందవచ్చు. ఏడాది కాలంలో రూ.1.35 కోట్లు గడిచిన ఏడాది కాలంలో పథకం ద్వారా రూ.1.35 కోట్ల నష్టపరిహారం పశువులు, జీవాలను నష్టపోయి న అర్హులకు అందించాం. మరో రెండు కోట్ల పరిహారానికి సంబంధించి నగదు త్వరలో లబ్ధిదారులకు అందించనున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా పా డి రైతులు, యజమానులు, కాపర్లు తమ వివరాలు నమోదు చేసుకుంటే సరి పోతుంది. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులకు కార్డులను ఆర్బీకేల ద్వారా అందిస్తాం. ఈ కార్డులు నాలుగేళ్లు పనిచేస్తాయి. లబ్ధి పొందేందుకు ఈ పథకాన్ని సది్వనియోగపర్చుకోవాలి. మా సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. – డాక్టర్ ఆరిక ఈశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ -
మూగప్రాణులకు హెల్త్‌కార్డులు
సాక్షి, కడప : మూగప్రాణులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల యజమానులు, పెంపకం దారులకు ఆసరాగా నిలిచేందుకు వైఎస్సార్ పశుసంరక్షణ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్య సంరక్షణ కార్డులు అందించి పశువులు, గొర్రెలు, మేకల ఆరోగ్యాన్ని సంరక్షించనుంది. జిల్లా వ్యాప్తంగా యానిమెల్ హెల్త్‌కార్డుల ద్వారా లక్షమంది పశుసంద కలిగిన రైతులకు, గొర్రెల యజమానులకు, కాపరులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో 75 వేల పెద్దపశువులు, 25 వేల మంది గొర్రెలు, మేకల యజమానులకు, కాపరులకు దీని ద్వారా కార్డులందించనున్నారు. గ్రామ సచివాలయానికి అనుసందానంగా పశువైద్య సహాయకులు ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం పశుసవర్ధకశాఖ 085–00–00–1962, రైతుభరోసా కేంద్రాల టోల్‌ఫ్రీ నంబరు 1907కు కాల్ చేయవచ్చు. 75వేల పెద్దపశువులకు.. 25వేల జీవాలకు కార్డులు జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష పశువులకు హెల్త్ కార్డులు అందించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ నిర్ణయించింది. కార్డుల్లో ప్రధానంగా పశువుల ఆరోగ్య సంరక్షణ కు చర్యలు, కృత్రిమ గర్భధారణ, సూడి పశువులు, దూడలు, టీకాలు, పశుపోషకాలు, పశుసంపద వివరాలను నమోదు చేస్తారు. రైతుభరసా కేంద్రాల వద్ద పశువుల బోనులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 620 కేంద్రాల వద్ద వీటిని ఈ బోన్లు నిర్మించారు. పశునష్ట పరిహార పథకం ఇలా.. వైఎస్సార్ పశు నష్టపరిహార పధకాన్ని పునరుత్పాదక దశలో 2 నుంచి 10 ఏళ్ల వయసున్న ఆవులు, 3 నుంచి 12 ఏళ్ల వయసున్న బర్రెలకు వర్తింప చేస్తారు. పశువు మరణిస్తే మేలుజాతి స్వదేశీ ఆవు ఒక్కింటికి రూ.30 వేలు, దేశవాళీ బర్రె మరణిస్తే రూ.15వేల పరిహారం అందిస్తారు. ఏడాదికి ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.1.50లక్షల వరకు పరిహారం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆరునెలల నుంచి ఆపై వయసున్న గొర్రెలు, మేకలకు పధకం వర్తింపచేశారు. ఒకేసారి మూడు నుంచి అంతకన్నా ఎక్కువ జీవాలు మరణించినప్పుడు పధకాన్ని అందిస్తారు. ప్రతి జీవానికి రూ.6వేలతో ఏడాది కుటుంబానికి గరిష్టంగా రూ.1.20లక్షల వరకు పరిహారం అందుతుంది. కార్డుల పంపిణీ చేపట్టాం పశువులకు, జీవాలకు హెల్త్‌కార్డులను రైతులకు పంపిణీ చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా వీటిని అందిస్తున్నాం. పశువుకు సంబంధించిన ప్రతి విషయం కార్డులో అసిస్టెంట్లు రాస్తారు. ఈ కార్డులు నాలుగేళ్లు పనిచేస్తాయి. జిల్లా వ్యాప్తంగా పాడిరైతులు, గొర్రెలు, మేకల పెంపకందార్లకు కార్డులు అందించేలా చర్యలు తీసుకున్నాం. ఒక కుటుంబానికి ఒక కార్డు చొప్పున అందిస్తారు. –వీఎల్ఎస్ సత్యప్రకాష్, సంయుక్త సంచాలకులు, జిల్లా పశుసంవర్ధకశాఖ, కడప -
1.42 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇక డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేని దుస్థితి ఉండదు. రాష్ట్రంలోని 1.42 కోట్ల కుటుంబాలకు పైగా అంటే 95 శాతం కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య భరోసా కల్పించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తూ ఈ ఏడాది జనవరి 3వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుతో పాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే రోజు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.50 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అర్హులైన మిగతా 1.41 కోట్లకు పైగా కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింపచేసే కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నుంచి ప్రారంభించనున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లను లబ్ధిదారుల ఇళ్లకే పంపించి కార్డులు పంపిణీ చేసి, అవి అందినట్లు రశీదులను స్వీకరించనున్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే వలంటీర్ల ద్వారా లేదా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారికి కార్డును మంజూరు చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. కార్డుల పంపిణీ, ప్రత్యేకతలు ఇలా.. – తొలి దశలో శనివారం నుంచి కర్నూలు, వైఎస్సార్, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లో అర్హులైన 39 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నారు. – రెండో దశలో వచ్చే నెల 3వ తేదీ నుంచి అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అర్హులైన 59 లక్షల కుటుంబాలకు హెల్త్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తారు. – మూడో దశలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో అర్హులైన 43 లక్షల మంది కుటుంబాలకు వచ్చే నెల 25వ తేదీ నుంచి కార్డుల పంపిణీ ప్రారంభించి మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. – క్యూఆర్ కోడ్ బార్ కలిగిన కొత్త వైఎస్సార్ ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులపై రేషన్ కార్డు నంబర్‌కు బదులు యునిక్ హెల్త్ గుర్తింపు నంబర్ ఉంటుంది. తద్వారా వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు నమోదవుతుంది. కుటుంబ యజమాని పేరు తెలుగు, ఇంగ్లిష్ బాషల్లో ఉంటుంది. ఆ చిరునామాలో ఉంటున్న కుటుంబంలోని వారి పేర్లు కూడా ఉంటాయి. ఇంటి చిరునామా గుర్తింపు నంబర్‌ను కూడా ఇస్తున్నారు. – కొత్త ఆరోగ్య శ్రీ కార్డులపై గ్రామ, వార్డు సచివాలయ కోడ్లను ముద్రిస్తారు. – వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న కుటుంబాలకూ వర్తింపు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగించినా, ప్రాధాన్యతను తగ్గించేశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చింది. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందక పడుతున్న బాధలను వైఎస్ జగన్.. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో కళ్లారా చూశారు. యూనివర్సల్ ఆరోగ్య బీమా తీసుకువస్తానని, చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే వార్షిక ఆదాయాన్ని రూ.5 లక్షలకు పెంచడంతో మధ్య తరగతి వారికి సైతం లబ్ధి కలిగేలా ఈ పథకంలో విప్లవాత్మక మార్పులు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో సైతం వైద్య సేవలు పొందేలా వీలు కల్పించారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. లబ్ధిదారులను అత్యంత పారదర్శకంగా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి గుర్తించారు. -
అందరికీ ఆరోగ్య కార్డులు
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రం లోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన కార్డియాలజీ, యూరాలజీ విభాగాలను బుధవారం ఆయన ప్రారంభిం చారు. సంబంధిత విభాగాలను పరిశీలించి ఆస్పత్రి సూపరింటెండెంట్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు అందించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. త్వరలో ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుందని తెలిపారు. ప్రపంచంలోని ఒక్క అమెరికాలోనే ఈ తరహా హెల్త్ కార్డుల విధానం అమలులో ఉందని, తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నారని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలోనే కార్డియాలజీ, యూరాలజీ విభాగాల ఏర్పాటుతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్‌ల ప్రజలను హైదరాబాద్‌కు తరలించకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందించ్చవచ్చన్నారు. మరణాలు తగ్గి ప్రసవాలు పెరిగాయి.. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మాతా శిశు మరణాలు తగ్గాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో సాధారణ ప్రసవాలు 30 నుంచి 35% మాత్రమే జరిగేవని, ప్రస్తుతం అవి 65 నుంచి 70 శాతానికి పెరిగాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య భాగ్యం
బొబ్బిలి: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించింది. కొత్త మార్గ దర్శకాలతో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ జిల్లాలో ప్రారంభమయింది. జిల్లా వ్యాప్తంగా 7,14.389 కుటుంబాలకు విడతల వారీగా ఆరోగ్యశ్రీ కార్డులను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 28లోగా ఈ పంపిణీ పూర్తి చేయనున్నారు. ఆరోగ్యశ్రీ పథకం గత ప్రభుత్వ హయాంలోనూ ఉన్నప్పటికీనిధుల విడుదలలో కొర్రీలు వేసేది. వందల కోట్ల రూపాయలను పెండింగ్‌లో పెట్టి రోగుల సహనానికి పరీక్ష పెట్టేది. కొన్ని వ్యాధులను జాబితా నుంచి తొలగించింది. దీనివల్ల ఎంతోమంది నిరుపేదలకు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అదనంగా వెయ్యి వ్యాధులకు వైద్యం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ఉన్న వారికి గతంలోలా కొన్ని రకాల వ్యాధులకు మాత్రమే వైద్యం కాకుండా దాదాపు అన్ని రకాల వ్యాధులూ ఉచితంగా నయం చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది గతంలో 1059 రకాల వ్యాధులకు మాత్రమే పరిమితమయిన ఈ పథకాన్ని ఇప్పుడు 2059 రకాల వ్యాధులు, రోగాలకు వర్తింపజేస్తున్నారు. ఈ పథకం ద్వారా రూ.5 లక్షల వరకూ అయ్యే శస్త్రచికిత్సను ఉచితంగా చేస్తారు. మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో రూ.10లక్షల వరకూ అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఈ చెల్లింపులు రూ.3లక్షల వరకూ ఉన్నప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులకు నిధులు చెల్లించకపోవడంతో రోగ గ్రస్తులు ఆస్పత్రుల మెట్లు ఎక్కి దిగడం తప్ప మరే విధమైన ప్రయోజనం పొందలేదు. ఇప్పుడు రూ. 5 లక్షల వరకూ ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చు. కోలుకునేవరకూ ఆర్థిక సాయం.. రోగులకు ఉచితంగా వైద్యం, శస్త్రచికిత్సలు చేయడంతో పాటు వారు డిశ్చార్జి అయిన తరువాత కోలుకునే వరకూ విశ్రాంతి సమయంలో అయ్యే ఖర్చులను భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోగికి డాక్టర్ సూచించే అవసరమయిన విశ్రాంతి దినాలను బట్టి రోజుకు రూ.250లు లేదా నెలకు గరిష్టంగా రూ.5వేలను రాష్ట్ర ప్రభుత్వం రోగి అకౌంట్లో నేరుగా జమ చేస్తుంది. అర్హతకు వెసులు బాటు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తించేందుకు కుటుంబానికి 12 ఎకరాల సాగు భూమి లేదా 35 ఎకరాలలోపు పంట భూములు, బీడు భూములు కలపి ఉన్నా అర్హత పొందుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే కారున్నా ఈ పథకం వర్తిస్తుంది. వార్షికాదాయం రూ.5 లక్షలున్నా, 3వేల చదరపు అడుగుల స్థలానికి మున్సిపాలిటీలకు ఆస్తిపన్ను కడుతున్నా అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ఆపరేషన్లూ ఇక ఉచితం గతంలో ప్యాకేజీలు ఉండేవి. ఎక్కువ మొత్తం ఖర్చయ్యే వాటికే వర్తించేవి. ఇప్పుడు వెయ్యి రూపాయల దగ్గర నుంచీ ఉచితంగా చేస్తారు. కోలుకునేందుకు కూడా డబ్బులు ఇస్తారు. – ఎస్.వి.రమణ కుమారి, డీఎంహెచ్ఓ ఆరోగ్యశ్రీ లేక మా అమ్మ చనిపోయింది మా అమ్మ రమణమ్మకు క్యాన్సర్ సోకడంతో వివిధ ఆస్పత్రులకు తిప్పాం. ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని గతేడాది వైజాగ్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాం. పథకం వర్తించాలంటే వేచి చూడాలని అక్కడి వైద్యులు చెప్పారు. సెల్‌కు మెసేజ్ వస్తుందనీ, ఆ తరువాత ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఈ లోగా రూ.లక్ష వరకూ ఖర్చు చేయించారు. రెండున్నర నెలల పాటు ఆస్పత్రిలో మెసేజ్ కోసం ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. చివరకు నా తల్లి చనిపోయింది. – లెంక అప్పారావు, ఇట్లామామిడిపల్లి, రామభద్రపురం మండలం -
గజ్వేల్ నుంచే హెల్త్ కార్డుల ప్రక్రియ
-
ఒక రోజంతా మీతోనే ఉంటా: కేసీఆర్
సాక్షి, గజ్వేల్ : గజ్వేల్ నియోజకవర్గం నుంచే హెల్త్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కంటి వెలుగు పథకం మాదిరే గజ్వేల్ నుంచే రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలనేది తన కోరిక అని ఆయన అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం మహితి ఆడిటోరియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ప్రొఫెల్ తయారు చేయిస్తాం. త్వరలోనే గజ్వేల్ నియోజకవర్గ ఆరోగ్య సూచిక వెంటనే రూపొందించాలి. హెల్త్ ప్రొఫైల్ ప్రజలందరికీ చాలా ఉపయోగకరం. ప్రజల వైద్య పరీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. 15-20 రోజుల్లో గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. త్వరలో ఒకరోజంతా మీతోనే ఉంటా. గజ్వేల్ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకుందాం. స్వయం సమృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం. హరితహారంలో దేశానికే ఆదర్శంగా గజ్వేల్ ఉండాలి. అలాగే గజ్వేల్‌లో ఇల్లులేని నిరు పేదలు ఉండకూడదు. నియోజకవర్గంలో పార్టీలు, పైరవీలు లేకుండా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందిస్తాం. ప్రతి కుటుంబానికి ఏదో ఒక పని కల్పించేలా చర్యలు’ చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. అంతకు ముందు ముఖ్యమంత్రి ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. -
మత్స్యకారులు కోరిన చోట జెట్టీలు
సాక్షి, అమరావతి: మత్స్యకారులు కోరుకున్న ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జెట్టీల నిర్మాణాలకు ఏ ప్రాంతాలు అనువుగా ఉన్నాయో తొలుత పరిశీలన చేయాలని సూచించారు. మరపడవల లంగరు కోసం అనువైన జెట్టీలు లేకపోవడంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మత్స్యకారులు చెన్నై, గుజరాత్‌కు తరలి వెళ్లిపోతున్నారని, వారంతా సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మత్స్య, పశు సంవర్ధక శాఖలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా వాడరేవుల్లో రెండు పెద్ద జెట్టీల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భీమిలి సమీపంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై అధికారులతో సీఎం సమీక్షించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా మరపడవలు కూడా చేరుకోవడంతో విశాఖ హార్బర్‌పై భారం పెరుగుతోందని, దీన్ని నివారించేందుకు తీరంలో అనువైన జట్టీలను నిరి్మంచాలని సూచించారు. బందరు పోర్టును మేజర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. నిజాంపట్నం హార్బర్ రెండోదశ విస్తరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్.. చేపలు, రొయ్యలు అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. చేపలు, రొయ్య పిల్లలు, మేతను పరీక్షించడానికి అనువుగా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సీడ్, ఫీడ్ కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో మత్స్యశాఖ అసిస్టెంట్ల సహాయంతో రైతులు ప్రభుత్వ పథకాలను సది్వనియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో హేచరీజోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇవ్వడంతో కాలుష్యం అంతా సముద్రంలోకి చేరుతోందన్నారు. ఇదే ప్రాంతం నుంచి తాను పాదయాత్ర చేసినట్టు సీఎం గుర్తు చేశారు. ఒక ప్రాంతాన్ని నిర్దిష్ట జోన్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ ఇతర పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం, పర్యావరణాన్ని కలుíÙతం చేయడం సరికాదన్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా పంట చేతికి వచ్చిన సమయంలో గిట్టుబాటు ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీన్ని సవాల్‌గా తీసుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారి బ్రాండ్ వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతిభావంతుల సహకారం తీసుకుంటే మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగై రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ప్రతి గ్రామానికి పశు వైద్యశాల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండేళ్లలో పశు వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రెండు వేల పశువులున్న చోట చికిత్స, దాణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. పశుపోషణ రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉండేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి పశువులున్న గ్రామాల్లో వైద్యశాల ఏర్పాటు చేయాలన్నారు. పశువులకు కూడా హెల్త్‌కార్డులను జారీ చేసి చెవులకు ట్యాగ్, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర నిధులను ఇందుకు వినియోగించాలని సూచించారు. పశువుల ఔషధాల కొనుగోలులో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలన్నారు. పులివెందులలోని ‘ఏపీకార్ల్’కు నేరుగా నీటిని సరఫరా చేసేలా నీటిపారుదలశాఖతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల పరిశోధనలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. అక్కడ ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరువు బాధిత ప్రాంతాల్లో పశువుల మేతకు కొరత లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు రూ.50 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. పశువుల వైద్యం కోసం వచ్చే ఏడాది నుంచి 102 వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. పశు సంవర్ధకశాఖలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలన్నారు. సీఎం సమీక్షలో మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్, పశు సంవర్థకశాఖ డైరెక్టర్ సోమశేఖరం తదితరులు పాల్గొన్నారు. ►రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండేళ్లలో పశు వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. రెండు వేల పశువులున్న చోట చికిత్స, దాణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి పశువులున్న గ్రామాల్లో వైద్యశాల ఏర్పాటు చేయాలి. – అధికారులకు సీఎం ఆదేశం -
పశువులకూ ‘ఆధార్’!
మొయినాబాద్(చేవెళ్ల): ఇకనుంచి పశువుల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తామని.. ప్రతి పశువుకు 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య(ఆధార్ వంటిది), హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ జి.మంజులవాణి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో పశుగణన తీరు, వేసవిలో పశువుల పరిస్థితి , గొర్రెల పంపిణీ పథకం అమలు ఎలా ఉందనే విషయాలను మండల పశువైద్యాధికారి శ్రీలతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల వద్ద ఉన్న పశువుల సమగ్ర వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నామని అన్నారు. ప్రతి పశువుకు ఆధార్ నంబర్ మాదిరిగా 12 అంకెల గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నామని.. గుర్తింపు సంఖ్య ఉన్న పోగును పశువుల చెవులకు వేస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక గుర్తింపు సంఖ్యతోపాటు రైతు వివరాలు కూడా ఫీడ్ చేస్తామన్నారు. పశువు వివరాలతోపాటు దాని ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తున్నామని తెలిపారు. వాటికి హెల్త్‌కార్డులు సైతం ఇవ్వనున్నట్లు చెప్పారు. పశు సంపదను పెంచే చర్యలు ముమ్మరం చేసినట్లు తద్వారా పాలఉత్పత్తి పెంచి రైతుల ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. గొర్రెల పంపిణీ పథకం కింద అందజేసిన జీవాల ద్వారా రాష్ట్రంలో 50 లక్షల గొర్రెపిల్లలు ఉత్పత్తి అయ్యాయన్నారు. రెండో విడత పంపిణీ త్వరలోనే మొదలవుతుందని చెప్పారు. అనంతరం శ్రీరాంనగర్ గ్రామాన్ని సందర్శించి దూడలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్డీఓ ఈఓ కె.సింహరావు, పశువైద్యులు దేవేందర్‌రెడ్డి, శ్రీలత, గోపాలమిత్రలు శ్రీనివాస్, బాలకిష్టయ్య తదితరులు ఉన్నారు. -
కార్పొరేట్ వైద్యం కలేనా..?
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఆసుపత్రులకు వెళ్లితే ఉచితంగా నగదు రహిత విధానంలో వైద్యం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014 లో హైదరాబాదు రవీంద్రభారతిలో అట్టహాసంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి హెల్త్ కార్డులను కూడా జారీ చేశారు. అవన్నీ ఇచ్చి ఐదు సంవత్సరాలు కావస్తున్నా నేటికి పూర్తిస్థాయిలో కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్యానికి అమలుకు నోచుకోవడం లేదు. 2014కు ముందు రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు మెడికల్ రియింబర్స్‌మెంట్ విధానం కొనసాగుతుండేది. ఈ విధానం ద్వారా ఉద్యోగుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండా ముందుగా నగదు చెల్లించి వైద్యం చేయించుకున్న తరువాత ఆయా శాఖలకు బిల్లులు సమర్పించి గ రిష్టంగా రెండు లక్షల వరకూ బిల్లులను పొందేవా రు. అయితే ఈ విధానం కాదని ఆసుపత్రులకు వెళ్లి న వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత చికిత్సా వి«ధానంలో వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హెల్త్‌కార్డులను జారీ చేశారు. ఉద్యోగులు వేతనాల నుంచి రూ.350 కోట్లు జమ 2014 నవంబర్ నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతనాల నుంచి ప్రతి నెలా నాన్ గజిటెడ్ ఉద్యోగులకు రూ. 90, గజిటెడ్ స్థాయి ఉద్యోగులకు 120 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ రకంగా వసూలు చేసిన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి దాదాపు రూ. 350 కోట్లు ప్రభుత్వానికి జమ అవుతున్నట్లు సమాచారం. ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా నేటికి కార్పొరేట్, సూపర్ప్సెషాలిటీ వైద్యశాలల్లో హెల్త్‌కార్డుల ద్వారా వైద్యం అందించడానికి ఆయా యాజమాన్యాలు నిరాకరిస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. చిన్న చిన్న ఆసుపత్రుల్లో అమలు జిల్లా కేంద్రాల్లోని చిన్న చిన్న ఆసుపత్రుల్లో దంత, కంటి సమస్యలతోపాటు చిన్నచిన్న శస్త్ర చికిత్సిలకు మాత్రమే వైద్యం చేస్తున్నారు తప్ప పెద్దవాటికి చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. క్యానర్స్, గుండె జబ్బు, కిడ్నీ మార్పిడి, కాలేయ సంబంధిత వ్యాధులకు రూ.5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ వ్యాధులకు హైదరాబాదు, చెన్నైలోని కార్పొరేట్, సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలలల్లో హెల్త్‌కార్డులు చెల్లు బాటు కాకపోవడంతో ఉద్యోగులు ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ విధంగా ఖర్చు చేసుకున్న వారు మెడికల్ రియింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు బిల్లుల మంజూరుకు సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఆర్థికంగా చితికిపోయే çపరిస్థితి నెలకుంటోందని వారు వాపోతున్నారు. జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు జిల్లా వ్యాప్తంగా దాదాపు 35 వేల మంది దాగా ఉన్నారు. వీరందరూ నెలకు ఒకొక్కరు రూ. 90, 120 మేర ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలా ఐదేళ్ల ఏళ్ల నుంచి ప్రభుత్వానికి డబ్బులు చేస్తున్నా సరైన వైద్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల వ్యాధులకు.. అన్ని రకాల వ్యాధులకు నగదు లేకుండా వైద్య అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. క్యానర్స్, కిడ్ని, కాలేయ మార్పిడి వంటి పెద్ద పెద్ద వ్యాధులకు కూడా వైద్యం నిరాకరించకుండా ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా వెంటనే వైద్యం చేసేలా ఆదేశాలు ఇవ్వాలి. – ఎ. శ్యాసుందర్‌రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
రేషన్ డీలర్లకూ.. కుచ్చుటోపీ
రేషన్ డీలర్లకు ప్రభుత్వం కుచ్చుటోపీ పెట్టింది. నిరంతరం సేవలందిస్తోన్న రేషన్ డీలర్లను ఆదుకుంటామని ఇప్పటి వరకూ 5 జీవోలు జారీ చేసింది. అయితే ఇందులో కేవలం ఒక్క జీఓను మాత్రమే అమలు చేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా డీలర్లు 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు గత ఏడాది డిసెంబరు 16న వాటిలో ఐదు డిమాండ్లను సంబంధిత పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆమోదించి, ఆందోళనలు, నిరసనలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో డీలర్లు ఆందోళనల్ని విరమించారు. అయితే ఆమోదించిన డిమాండ్ల అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని డీలర్లు మండిపడుతున్నారు. డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు డీలర్ల అసోసియేషన్లు ఒకే వేదికపైకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. ఆయా సమస్యల్ని పరిష్కరించేందుకు జీఓను జారీ చేస్తామని మంత్రి ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కేశారని వాపోతున్నారు. ఐదు హామీలకూ ఐదు జీఓలు జారీ చేయాల్సి ఉండగా ఒక్క జీఓను మాత్రమే ప్రభుత్వం జారీ చేసింది. రేషన్ షాపుల ద్వారా విక్రయించే బియ్యానికి క్వింటాలుకు రూ.100 కమీషన్ చెల్లించే విధంగా జారీ చేసిన జీఓ ఎట్టకేలకు అమలు జరిపినప్పటికీ మిగిలిన నాలుగు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. రాష్ట్రంలో 28,935 మంది డీలర్లున్నారు. సుమారు 1.16 లక్షల కుటుంబాల వారు రేషన్ షాపులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. కనీస వేతనాలు కూడా దక్కని విధంగా రేషన్ షాపులలో పనిచేస్తున్న డీలర్లకు వేధింపులు కూడా ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయకీయ రొచ్చులోకి డీలర్లు ప్రజా పంపిణీలో విశిష్ట సేవలందించే డీలర్లను రాజకీయ రొచ్చులోకి ఆపద్ధర్మ టీడీపీ ప్రభుత్వం లాగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు, ఎన్నికల్లో డీలర్లు ప్రత్యక్షంగా పాల్గొనకూడదని చట్టం ఉన్నప్పటికీ డీలర్ల సంఘ రాష్ట్ర నాయకుల్ని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని రాష్ట్ర సంఘ నాయకుడికి ఎర వేయడంతో అతను తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని పలువురు డీలర్లు వాపోతున్నారు. రాష్ట్రస్థాయి డీలర్ల సంఘాలు నాలుగు ఉండగా వీటిలో ఒక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ అధ్యక్షుడుగా కొనసాగుతున్న లీలా మాధవరావు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల డీలర్ల అవగాహన సదస్సులు నిర్వహించిన ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలనే సందేశాల్ని ఇవ్వడంపై çపలువురు డీలర్లు తీవ్రంగా మథనపడుతున్నారు. సదస్సుకు ‘పశ్చిమ’ వ్యతిరేకం రాష్ట్రస్థాయిలో డీలర్ల సంఘ అధ్యక్షుడు మాధవరావు నిర్వహిస్తున్న సదస్సులకు జిల్లా డీలర్లు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలిసింది. ఒక పార్టీకి కొమ్ము కాయడం వల్ల వచ్చే ఎన్నికల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, తదనంతరం ఏఏ ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందోనని జిల్లా డీలర్లు ఆందోళన చెందుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం రాష్ట్రవ్యాప్తంగా డీలర్లను ఒక పార్టీకి తాకట్టు పెట్టడం దారుణమని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు డిమాండ్లు ఆమోదించిన ఐదు డిమాండ్లు ఆర్థికంగా ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదని డీలర్లు పేర్కొంటున్నారు. ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించినా వాటిని అమలు చేయడంలేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా బియ్యానికి కమీషన్ రూ.70 నుంచి 100కు పెంచాలి. సరుకుల దిగుమతి చార్జీలను ప్రభుత్వమే భరించాలి. డీలర్లకు ఆరేళ్లుగా రావలసిన బకాయిలు రూ.100 కోట్లను వెంటనే చెల్లించాలి. డీలర్ చనిపోతే మట్టి ఖర్చులకు గాను రూ.20 వేలు చెల్లించాలి. డీలర్లకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలి. ఆదేశాలిచ్చాం రేషన్ డీలర్లు రాజకీయ కార్యక్రమాల్లోనూ, ఓటు ప్రభావిత కార్యక్రమాల్లోనూ, పార్టీల ప్రచారంలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేశాం. సభలు, సమావేశాలు డీలర్లు నిర్వహిస్తే కోడ్ ఉల్లంఘన అవుతుంది. కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు. –జి.మోహనబాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఏలూరు -
వాళ్లకు వేళకు తిండి, నిద్ర ఉండవు..
సాక్షి, జమ్మికుంట : రాజకీయ నాయకులకు, జర్నలిస్టులకు సమయానికి తిండి, నిద్ర ఉండవని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చామని, జర్నలిస్టులకు కనీస వేతనం ఇచ్చేలా మా తరపున తప్పక కృషి చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆదివారం రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో మంత్రి ఈటల పాల్గొన్నారు. మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న నిరుపేద జర్నలిస్టులకు తప్పక ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తాం. హెల్త్ కార్డుల విషయంలో జరిగిన పొరపాట్లను తప్పక సవరిస్తాం. జర్నలిస్టుల కుటుంబాలలో ఎన్ని బాధలు, కష్టాలుంటాయో నాకు తెలుసు. అలాంటి కుటుంబాలకు వాళ్ల ఇంట్లో సభ్యుడిగా ఉండి ఆదుకుంటాం. ఎవ్వరికైనా ఎక్కడైనా ఏం ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి. వాటి పరిష్కారానికి తప్పకుండా కృషిచేస్తా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాలను ఆదుకుంటున్నాం. తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతిబిడ్డకి ఏదో ఓ రూపంలో సమాయం అందుతుంది. రానున్న రోజుల్లో కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయబోతున్నామని’ ఆయన వివరించారు. -
‘ప్రత్యేక రాష్ట్రంలో 17 వేల అక్రిడేషన్లు’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో 12 వేల అక్రిడేషన్లు ఉండేవని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 17 వేల అక్రిడేషన్లు ఇచ్చామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు అంతస్తుల్లో 15 కోట్లతో మీడియా అకాడమీ నిర్మిస్తున్నామన్నారు. పైసా కట్టకుండా జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇచ్చామని.. అక్రిడేషన్ లేని వాళ్లకు కూడా కమిటీ వేసి హెల్త్ కార్డులు అందేలా చేశామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని హర్షం వ్యక్తం చేశారు. అందులో 34 కోట్ల రూపాయలను మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అందజేసినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు మరణించిన 150 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల నిధులను జర్నలిస్టుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్త్ కార్డులు చెల్లడం లేదని చెప్పాడాన్నిఆయన ఖండించారు. హెల్త్ కార్డులు తీసుకోకపోవడం ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఆలోచనలో ఉందని.. ఆటంకాల కారణంగా ఆలస్యం జరుగుతోందని తెలిపారు. సీఎం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారనే నమ్మకం ఉందన్నారు. జర్నలిస్టులకు పెన్షన్‌పై కూడా ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. -
రైల్వే ఉద్యోగులకు హెల్త్ కార్డులు
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుతం ఇస్తున్న మెడికల్ కార్డులకు బదులుగా హెల్త్‌కార్డులను జారీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. విశిష్ట గుర్తింపు సంఖ్యతో దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా క్రెడిట్ కార్డు తరహాలో అందజేయనుంది. రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం.. యూనిక్ ఐడీ నంబర్ ఉన్న హెల్త్ కార్డులను ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ‘ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులకు హెల్త్ కార్డులను అందజేయాలని నిర్ణయించాం. ఇవి డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలో ఉంటాయి. కేటగిరీని బట్టి కలర్ ఉంటుంది. వీటి కాల పరిమితి ఐదేళ్లు’అని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
రైల్వేల్లో క్రెడిట్ కార్డుల తరహాలో మెడికల్ కార్డులు..
సాక్షి, న్యూఢిల్లీ : విశిష్ట గుర్తింపు సంఖ్యతో దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా క్రెడిట్ కార్డు తరహా మెడికల్ కార్డులను ఉద్యోగులు, పెన్షనర్లకు జారీ చేయాలని రైల్వేలు నిర్ణయించాయి. ప్రస్తుతం జోనల్ రైల్వేలు రేషన్ కార్డులను తలపించేలా బుక్లెట్స్ రూపంలో మెడికల్ కార్డులను ఉద్యోగులకు అందచేస్తున్నాయి. వీటి స్ధానంలో ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు విశిష్ట గుర్తింపు సంఖ్యతో వైద్య గుర్తింపు కార్డును జారీ చేయాలని రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే సిబ్బంది, ఉద్యోగులందరికీ వైద్య గుర్తింపు కార్డులను ఒకే గొడుగుకిందకు తీసకువచ్చేలా ఉద్యోగులు, వారిపై ఆధారపడినవారందరికీ మెడికల్ కార్డులు జారీ చేయాలని ఈ ఉత్తర్వుల్లో రైల్వే బోర్డు పేర్కొంది. ప్లాస్టిక్‌తో రూపొందించే ఈ కార్డులు బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలో ఉంటాయని ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రతి కార్డుపైనా కలర్ స్ర్టిప్ ఉంటుంది. దీనిపై కార్డుదారుని ప్రస్తుత స్టేటస్ ప్రస్తావిస్తూ సర్వీస్‌లో ఉన్నారా, పదవీవిరమణ చేశారా అనే వివరాలు పొందుపరుస్తారు. 15 ఏళ్ల పైబడిన లబ్ధిదారులకు జారీ అయ్యే ఈ కార్డులు ఐదేళ్ల గడువు వరకూ వర్తిస్తాయని ఆ తర్వాత రెన్యూవల్ చేయించుకోవాలని ఉత్తర్వులు పేర్కొన్నాయి.ప్రస్తుతం రైల్వేల్లో 13 లక్షల మంది ఉద్యోగులుండగా, దాదాపు అదే సంఖ్యలో పెన్షనర్లు వారిపై ఆధారపడిన వారు ఈ మెడికల్ కార్డులను ఉపయోగించుకోవచ్చు.